Activities calendar

15 October 2015

రేపు చైనా కంపెనీల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం

హైదరాబాద్ : రేపు చైనా కంపెనీల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకోసం ఉన్న అవకాశాలను చైనా ప్రతినిధులకు వివరించనున్నారు. ఈ సమావేశానికి 45 మంది చైనా కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు. 

21:34 - October 15, 2015

ఫేస్ బుక్ వ్యసనం.. ఓ చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. మహిళలకు పిల్లలు పుట్టాక వారు తమ చిన్నారులతో ఆడుతూ.... పాడుతూ ఆనందంతో కాలం గడుపుతుంటారు. కానీ ఓ మహిళ మాత్రం తమ గారాల కుమారుడిని పట్టించుకోకుండా.. ఫేస్ బుక్ లో షేర్లు, లైక్ లతో బిజీ బిజీ అయిపోయింది. దీంతో ఆ పిల్లాడు స్విమ్మింగ్ పూల్ పడి ప్రాణాలు విడిచాడు. అమెరికాలోని తూర్పు యార్క్ షేర్ లో నివసించే క్లెయిర్ బార్నెట్ అనే 31 ఏళ్ల మహిళ నిర్లక్ష్యానికి రెండేళ్ళ కన్న కొడుకు ప్రాణాలు విడిచాడు.
వివరాల్లోకి వెళితే...
బార్నెట్ కి సోషల్ మీడియా అంటే తెగ మోజు.. ఇది ఆమెను వరకు తీసుకెళ్లిందంటే.. అసలు ఇంట్లో ఏమి జరుగుతుందో తెలుసుకోలేనంతగా… ఆమెకు జాషువా అనే రెండేళ్ళ కుమారుడు ఉన్నాడు. కొడుకుని స్విమ్మింగ్ పూల్ వద్ద వదిలేసి ఆమె ఫేస్ బుక్ ఓపెన్ చేసింది. అంతే తానూ ఎక్కడున్నానో, పిల్లాడు ఏమి చేస్తున్నాడో అన్నీ మర్చిపోయింది. స్విమ్మింగ్ పూల్ లో కొడుకు పడిపోయాడు. ఆమె మాత్రం షేర్లు, లైకులు అంటూ టైం వృధా చేసేసింది. చివరికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కుమారుడు చనిపోయిన కారణంతో ఆమె నిర్లక్ష్యమే ప్రధాన కారణమని గుర్తించిన కోర్టు ఆమెకి ఐదేళ్ళ శిక్ష విధించింది.

ఇక్కడ ఆసక్తి కరమైన విషయం మరోటి ఉంది. ఇది ఆమెకు మొదటి ఘటన కాదు. అంతకుముందు ఆమె ఫేస్ బుక్ మోజు వల్ల కొడుకుని మరిచిపోతే అతను రోడ్డు మీదకు వెళ్ళిపోయాడు. అటుగా వస్తున్నా ఓ కారు అతన్ని ఢీకొట్టబోయింది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల అతను అప్పుడు బతికాడు. చివరికి తల్లి మాత్రం ఫేస్ బుక్ వ్యసనంలో పడి కుమారున్ని కోల్పోయింది. 


 

21:20 - October 15, 2015

గుంటూరు : తుళ్లూరు... కొన్ని రోజుల క్రితం దాకా.. రాష్ట్రానికి ఓ మారుమూలన విసిరేసినట్లుండేది. కానీ ఇప్పుడు ఈ గ్రామం కీలక నిర్మాణాలతో కళకళలాడుతోంది. త్వరలోనే రాష్ట్ర శాసనసభ సమావేశాలకూ ఈ గ్రామం వేదిక కానుంది. ఈ పరిణామాల పట్ల స్థానికులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం అక్కడ చేపట్టాల్సిన నిర్మాణాలపైనా ప్రత్యేక దృష్టి సారించింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ నుంచి వీలైనంత త్వరగా సొంత రాజధానికి తరలి వెళ్లేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. అధికారుల తరలింపు.. ప్రజలకు స్థానికత అంశాలపై కసరత్తును ముమ్మరం చేసింది.

శాసనసభకు తాత్కాలికం..
ఏపీ రాజధాని ప్రాంతంలోనే శాసనసభ తాత్కాలిక భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే లాంఛనంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే సమావేశాలు తుళ్లూరు కేంద్రంగా నిర్మించే భవనంలోనే జరపాలని యోచిస్తోంది. డిసెంబర్‌లో ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నిర్ణయం తుళ్లూరు వాసుల్లో ఆనందాన్ని నింపుతోంది.

సంబరాల్లో స్థానికులు..
శాసనసభ భవనంతో పాటు.. మంత్రులు, ఎమ్మెల్యేలకు వసతి కల్పన బాధ్యతను ఓ కన్సల్టెన్సీకి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న తమ ప్రదేశం ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని సముపార్జించుకోనుండడం వ్యక్తిగతంగా తమకు లాభాలను తెచ్చి పెడుతుండడంతో స్థానికులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మరోవైపు, రాజధాని అమరావతికి శంకుస్థాపన పూర్తి కాగానే నిర్మాణ కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. 

21:16 - October 15, 2015

హైదరాబాద్ : కేసీఆర్‌ సర్కారు... గ్రేటర్‌ ఎన్నికల తాయిలాలు ఇవ్వడం మొదలు పెట్టింది. నగరంలోని పేదలు చెల్లిస్తోన్న ఆస్తిపన్నును గణనీయంగా కుదించింది. అంతేనా.. ఎన్నికల నాటికి రహదారులు తళతళలాడేలా చూడాలని అధికారులను ఆదేశించింది. రాజధాని పేదలకు కేసీఆర్‌ గ్రేటర్‌ తాయిలాన్ని ప్రకటించారు. ఆస్తి పన్నును భారీగా తగ్గించారు. ఇప్పటివరకూ 12 వందల రూపాయల లోపు ఆస్తి పన్ను చెల్లిస్తున్న వారు ఇకపై నూటొక్క రూపాయలకే కుదిస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల సుమారు ఐదు లక్షల మంది పేదలకు లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వస్తోంది. అయితే ఈ నిర్ణయం అమలు కావాలంటే ముందుగా జీహెచ్‌ఎంసీ చట్టంలో మార్పులు జరగాలి. ఆ ప్రక్రియను సత్వరమే పూర్తిచేయాలని ప్రభుత్వం జీహెచ్‌ఎంసీని ఆదేశించింది.

రహదారుల మరమ్మత్తు...
రాజధాని రహదారుల మరమ్మతు పనుల పైనా కేసీఆర్‌ సర్కారు దృష్టి సారించింది. ఇటీవలి వర్షాలకు పాడైన రోడ్ల జాబితాను వారంలోగా రూపొందించి. టెండర్లు పిలిచి.. నెలలోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. 500 కోట్ల రూపాయల ఖర్చుతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రత్యేక డ్రైవ్‌ కింద రహదారులను రిపేరీ చేయాలని సీఎం సూచించారు. వేయి కిలోమీటర్ల తారు రోడ్లు, 400 కిలోమీటర్ల మేర సిమెంట్‌ రోడ్లను వేయాలని సూచించారు. జంటనగరాల్లో పెండింగ్ లో ఉన్న భూములు, భవనాల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలు లేకుండా ప్రణాళిక రూపొందించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ పర్యవేక్షణలో స్పెషల్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.

21:04 - October 15, 2015

ఒక్క చట్టం..ఒకే ఒక చట్టం..స్వతంత్ర భారతావనిలో చీకటి కోణాలను బయటకు లాగిన చట్టం..అవినీతి పాలకులు..అధికారుల నుండి..ధన దాహంతో ఉన్న స్వార్థపరులేకాక అందరి భరతం పట్టే చట్టం. సమాచార హక్కు చట్టం. అదే ఆర్టీఐ. అమల్లోకి వచ్చి పదేళ్లు అయ్యింది. ఈ చట్టం ఏం చేసింది ? ఏం సాధించింది ? ఎవరికి బలాన్ని ఇచ్చింది. ? ఎవరి బలాన్ని దెబ్బతీసింది ? దీనిపై ప్రత్యేక కతనం. ఎంతో రక్తం ప్రవహించింది. ఈ పదేళ్ల కాలంలో ఎందరో కార్యకర్తలు బలైపోయారు. నిజం తెలుసుకోవాలన్న ఆకాంక్ష కోసం నిజాలను వెలికి తీయాలన్న ఆశయం కోసం స్వార్థపరుల గుట్టు రట్టు చేయాలన్న ఆరాటం కోసం ఎందరో తమ ప్రాణాలను కోల్పోయారు. అయినా సమాచార చట్టం మరెందరికో ఆయుధంగా మారింది.

ఏం జరుగుతుందో తెలుసుకోండి..
ఏం జరగుతుందో తెలుసుకోండని సామాన్యుల నుండి అసామాన్యుల కార్యకర్తల దాక అందరినీ ప్రోత్సాహించింది. ఆర్టీఐ ఆయుధంతో మెడికల్ స్కాంను గుట్టు విప్పండి. పాలకుల కప్పి పుచ్చిన కుంభకోణాలను వెలికి తీశాడు. ఎందరో ఆర్టీఐ కార్యాకర్తలు ప్రాణాలకు తెగించి సమాచార చట్టంతో ఎన్నో సంచనాలను సృష్టించారు. ఇప్పటి వరకు ఆర్టీఐ చట్టం ద్వారా ఎన్ని కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో అవినీతి రాక్షసుల భరతం పట్టడానికి ఎవరు కంకణం కట్టుకుంటారో వారే నిజమైన దేశభక్తులు. అలాంటి వారు ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు. ప్రాణాలకు తెగించి అవినీతిని కడిగేశారు. సమాచార హక్కు చట్టం ఆయుధాన్ని తీసుకుని రాజకీయ రాబంధులను గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. ఈప్రయత్నంలో కొందరు అవినీతి పరుల చేతిలో బలయ్యారు.

అవినీతి పరుల పాలిట పాశుపతాస్త్రం..
అక్రమాలకు వెలుగెత్తినందుకు ఇంత మంది బలయ్యారు. సమాచార హక్కు చట్టం ఆధారంగా రుజువులు సంపాదించినందుకు కార్యకర్తలు దాడులను ఎదుర్కొన్నారు. అసలు ఈ సమాచార హక్కు చట్టం ఎలా ఉంటుంది ? దాని సాయంతో ఎలాంటి సమాచారం పొందవచ్చు ? సమాచారం అడిగితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ? వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చు ? సమాచార హక్కు చట్టం అవినీతి పరుల పాలిట పాశుపతాస్త్రం. ఇందులో మరో ప్రశ్నకు తావు లేదు. కానీ చట్టం మాత్రం ప్రజల చుట్టమే కావాలి. కానీ చట్టం వచ్చి పదేళ్లు అవుతున్నా ప్రజల్లో ఇంకా అలసత్వం పోలేదు. అధికారులను ప్రశ్నించడానికి చట్టానికి వాడుకోవడంలో విఫలమవుతున్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు..స్వచ్ఛం సంస్థలు..కృషి చేయాలి. ఆర్టీఐ కార్యాకర్తల చంపేసిన అవినీతి రాబందుల బోనెక్కించాలి. ఆర్టీఐ ఉద్యమకారులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి. 

20:30 - October 15, 2015

మెదక్ : గడీల బతుకమ్మ కాదు..బడుగుల బతుకమ్మ ఆడుదామని తెలంగాణ మహిళా, సాంస్కృతిక సంఘాల ఐక్య వేదిక చేపట్టిన యాత్ర మెదక్ లో ముగిసింది. ఈ కార్యక్రమానికి మహిళలు తరలివచ్చారు. మహిళా సంఘాల నేతృత్వంలో బతుకమ్మ ఆడారు. మహిళలు, చిన్నారులు సందడిగా ఆడి పాడారు. అత్యాచారాలు లేని సమాజాన్ని సాదిద్ధామని సంఘం నేతలు పేర్కొన్నారు. అక్టోబర్ 16 వికారాబాద్‌ రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 17 గద్వాల మహబూబ్‌నగర్ జిల్లా, అక్టోబర్ 18 ఖమ్మం, అక్టోబర్‌ 19 నల్గొండలో నిర్వహించి అక్టోబర్ 20న ట్యాంక్‌ బండ్‌ పై బతుకమ్మ యాత్ర ముగియనుంది.

20:26 - October 15, 2015

మెదక్ : జిల్లాలో డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కవితలు బతుకమ్మను ఆడారు. నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లిలో జరిగిన కార్యక్రమంలో వారు ఆడి పాడారు. బతుకమ్మల అలంకరణకు అవసరమైన పూలను పంచారు. ఎంపీ కవితతో పాటు డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ పూలతో బొడ్డెమ్మలను అలకరిస్తూ.. మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ బతుకమ్మ సంబరంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. 

20:17 - October 15, 2015

హైదరాబాద్ : ఆర్టీసీలో ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని.. ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ దివాకర్ రావు చెప్పారు. బస్‌స్టాండ్‌ల నిర్వహణ తీరుపై కమిటీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. అసెంబ్లీ, శాసనమండలి సభ్యులతో కూడిన ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ. గురువారం ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఆగస్టు తనిఖీల సందర్భంగా.. చేసిన సూచనల అమలుపై ఆరా తీసింది. బస్‌స్టాండ్‌లలో సీసీ కెమెరాల పనితీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. పరిసరాల్లోని అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంజీబీఎస్‌లో టాయిలెట్ల పునరుద్ధరణ పనులు, జేబీఎస్‌లో జరుగుతున్న మరమ్మతు పనుల పట్ల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. బస్‌స్టాండ్లను మరింత సౌకర్యంగా తీర్చిదిద్దేలా.. ప్రభుత్వానికి సూచిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.

19:43 - October 15, 2015

గుంటూరు : రాజధాని శంకుస్థాపన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గడువు దగ్గర పడుతుండటంతో త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు రూపొందించారు. శంకుస్థాపన వేదికను తీర్చిదిద్దే పనులు చెన్నైకు చెందిన సంస్థ దక్కించుకుంది. వేదిక డిజైన్, ఇతర అంశాలపై సంస్థ ప్రతినిధి వివరించారు. ఆ విశేషాలు వీడియోలో చూడండి.

19:41 - October 15, 2015

గుంటూరు : రాజధాని అమరావతి శంకుస్థాపన ఖర్చు కోట్లు దాటుతోంది..ప్రజాధానం వృదా చేస్తున్నారని విపక్షాలు ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రులు గురువారం స్పందించారు. ప్రభుత్వం పది కోట్లు మాత్రమే ఖర్చు చేస్తోందని ఏపీ మంత్రులు ప్రకటించారు. తామేదో 400 కోట్లు ఖర్చు చేస్తున్నామంటూ.. విపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని విమర్శించారు. 'మై బ్రిక్ - మై అమరావతి' వెబ్‌సైట్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు.. రాజధాని శంకుస్థాపన వ్యయంపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. శంకుస్థాపన కోసం కేవలం పది కోట్లే ఖర్చు చేస్తున్నామన్నారు. అతిథుల కోసం వినియోగించే హెలీకాప్టర్లు, విమానాలను కొందరు పారిశ్రామిక వేత్తలే స్వచ్ఛందంగా సమకూరుస్తున్నారని తెలిపారు. విపక్షాలు అనవసరంగా దుష్ర్పచారం చేస్తున్నాయని మంత్రులు విరుచుకు పడ్డారు.

మై బ్రిక్ - మై అమరావతి..
రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రపంచవ్యాప్త తెలుగు ప్రజలందరినీ భాగస్వాములను చేసే క్రమంలో.. మై బ్రిక్‌-మై అమరావతి అన్న వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. తెలుగు వారు రాజధాని నిర్మాణానికి ఓ ఇటుక గానీ.. దాని విలువ పది రూపాయలను కానీ.. వెబ్‌సైట్‌ ద్వారా పంపాలన్నది వెబ్‌సైట్‌ ఆవిష్కరణ ఉద్దేశం. సైట్‌ ప్రారంభమైన కొద్ది సేపటికే.. ఎన్నారైల నుంచి విరాళాల వెల్లువ ప్రారంభమైనట్లు సమాచారం. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా మనమట్టి-మన నీరు కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇప్పటికే 16వేల గ్రామాల నుంచి పుట్టమన్ను.. పవిత్ర జలాలను సేకరించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

ఇరిగేషన్ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

విజయవాడ : ఇరిగేషన్ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ప్రాజెక్టు పనుల వేగవంతంపై చర్చించారు. 

ప్రకాశం జిల్లా పొన్నూరులో విషాదం...

ప్రకాశం : పొన్నలూరు మండలం పొన్నలూరులో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వివాహిత తన 9 ఏళ్ల కుమారుడికి ఉరేసి తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

19:33 - October 15, 2015

హైదరాబాద్ : అవిభక్త కవలలైన వీణా-వాణిల పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌ నీలోఫర్ హాస్పిటల్‌లో ఘనంగా జరిగాయి. వీణా-వాణిల 13వ పుట్టినరోజు వేడుకలను నీలోఫర్ ఆస్పత్రి సిబ్బందే నిర్వహించారు. వీణా-వాణిలను అందంగా ముస్తాబు చేసి కేక్‌ కట్ చేయించారు. వీణా-వాణిల మోములో విరిసిన నవ్వులు చూసి ఆస్పత్రి సిబ్బందితో పాటు తల్లితండ్రులు సైతం మురిసిపోయారు. వీరికి ఆపరేషన్ చేస్తామని అందరూ ఆశ చూపిస్తున్నారే కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అవిభక్త కుటుంబ సభ్యులు వాపోయారు.

19:32 - October 15, 2015

గుంటూరు : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్ గా స్పందించారు. ఇటీవల కౌన్సెలింగ్ లో కొందరు విద్యార్థులు నకిలీ ధృవపత్రాలు, తప్పుడు ధ్రువపత్రాలతో సీట్లు సంపాదించరాని ఫిర్యాదులు అందాయి. దీనిపై యూనివర్సిటీ అధికారులు విచారణ జరిపారు. ఆరోపణలు నిజం కావడంతో ఆరుగురిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు.

19:29 - October 15, 2015

ఢిల్లీ : కరవు కోరల్లో చిక్కుకున్న తెలంగాణ రైతులను ఆదుకోవాలని కోరుతూ టి.టిడిపి నేతలు గురువారం కేంద్ర మంత్రులను కలిశారు. హస్తిన వెళ్లిన పార్టీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి, రావుల చంద్రశేఖర్... కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మోహన్ భాయ్ కలానియా, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. పత్తి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ఓసారి వరంగల్ కు రావాలని నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు.

19:28 - October 15, 2015

ఉత్తర్ ప్రదేశ్ : తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్‌ బృందం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌తో సమావేశమైంది. తెలంగాణలో ప్రారంభించిన వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పథకంపై ముగ్దుడైన అఖిలేష్‌ యాదవ్ ఆ పథకాన్ని యూపీలో అమలు చేసే దిశగా కేటీఆర్‌ను ఆహ్వానించారు. వాటర్‌గ్రిడ్‌ పథకం ద్వారా తెలంగాణలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని ట్యాప్‌ ద్వారా అందించనుండడంపై అఖిలేష్‌ అభినందించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం వాటర్‌ గ్రిడ్‌ పథకం చేపట్టడాన్ని ఆయన స్వాగతించారు. వాటర్‌గ్రిడ్‌ పథకంపై తొలిసారిగా స్పందించిన యుపీ సిఎం అఖిలేష్‌ యాదవ్‌కు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి రావాలని అఖిలేష్‌ను మంత్రి ఆహ్వానించారు.  

19:21 - October 15, 2015

'బ్రూస్ లీ' చిత్రం షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్ర షూటింగ్ సమయం లో మెగాస్టార్ లుక్ ని ఒకటి తీసి ఇంటర్నెట్ లో రిలీజ్ చేసారు. ఇక మెగా ఫాన్స్ మాత్రమే కాదు ప్రతి ఒక్కరు ఈ ఫస్ట్ లుక్ లో ని మెగాస్టార్ స్టైలిష్ లుక్ ని చూసి ఆశ్చర్యపోవాల్సిందే. గత 67 సంవత్సరాల నుండి మెగాస్టార్ ఫార్మల్స్ లో కనిపిస్తున్నాడు. ఇక ఈ షూటింగ్ లో అతను షేడెడ్ జీన్స్ తో, బ్లాక్ షర్టు వేసుకొని కనిపించాడు. ఇక దర్శకుడు శ్రీను వైట్ల ఈ ఫైట్ సీక్వెన్స్ ని సినిమాకి హై లైట్ గా నిలిచేలా చేసారు. ఇక ఈ సీన్స్ లో చిరు గుర్రాలతో కలిసి 3 నిముషాలు కనిపించనున్నాడు. 'బ్రూస్ లీ' చిత్ర ఆడియో అక్టోబర్ 2 న రిలీజ్ అయింది. ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు అక్టోబర్ 16 న ధియేటర్ లలో వచ్చేందుకు సిద్ధమవుతుంది.


 

19:19 - October 15, 2015

ఢిల్లీ : కృష్ణా జలాల వివాదం కేసును సుప్రీంకోర్టు డిసెంబర్‌ 3కు వాయిదా వేసింది. సర్వోన్నత న్యాయస్థానంలో తెలంగాణ తరపు లాయర్లు తమ వాదన వినిపించారు. తెలంగాణలో 26శాతం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉందని.. అయితే విభజనలో కేవలం 12.8శాతం నీటిని మాత్రమ కేటాయించారని న్యాయవాది వైద్యనాధన్ వాదించారు. తెలంగాణలో సాగు, త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే... మహారాష్ట్ర 150 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అరేబియా సముద్రంలో కలుపుతోందన్నారు. ఇక్కడ నీటి సమస్యను పరిష్కరించేందుకు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక మధ్య కృష్ణా జలాల కేటాయింపు మొదటి నుంచి జరపాలని న్యాయవాది వాదించారు.

జేఎన్ టీలో నిర్మించే కెమికల్ ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణ

కృష్ణా : జేఎన్ టీ గ్రామంలో రూ.10 వేల కోట్లతో నిర్మించే కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్, జాయింట్ కలెక్టర్ చంద్రుడు పాల్గొన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదిలావుంటే సహజవాయువు అందించటానికి అనుమతి లేకుండా ఫ్యాక్టరీ ఎలా నిర్మిస్తారని సీపీఎం నాయకులు ప్రశ్నించారు. కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు పేర్కొన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణంపై స్థానికుల్లో ఆందోళన నెలకొంది.  

పెండింగ్ ప్రాజెక్టులపై మంత్రి హరీష్ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : రాష్ట్రంలోని పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి హరీష్ రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ముగిసింది. 146 జీవో ప్రకారం పెండింగ్ లోని 25 భారీ, మధ్యతరహా, ప్రాజెక్టులపూర్తికి ప్రణాళికలను రంచించారు. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని పెండింగ్ ప్రాజెక్టులపై సుధీర్ఘంగా చర్చించారు. ఈసందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ 2016 జూన్ లోగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. 146 జీవో ప్రకారం పాలమూరు జిల్లాలోని కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులు పూర్తి చేయాలని మంత్రి అన్నారు.

18:49 - October 15, 2015

ఆఫర్లే ఆఫర్లు. డిస్కౌంట్లే డిస్కౌంట్లు. ఒక వెబ్ సైట్ 50 శాతం రాయితీ అంటే, మరో వెబ్ సైట్ 80 శాతమంటూ ఊరిస్తుంది. మరోటి వన్ ప్లప్ వన్ ఆఫరంటే, ఇంకోటి ఏకంగా బంగారం ఉచితమంటుంది. పొద్దున పేపర్ తిప్పినా ఫ్రంట్ పేజీలో అవే యాడ్స్. టీవీ ఆన్ చేసినా అమెజాన్, స్నాప్ డీల్, ఫ్లిప్ కార్ట్ ఫెస్టివల్ సీజన్ రాయితీల ప్రకటనలే. మంచి తరుణం మించిన దొరకదు. ఆలస్యమైతే ఆఫర్లంతే అంటూ ఊరించే యాడ్స్ చూసి అప్పు చేసైనా కొనాలనుకునే మధ్యతరగతి ఆత్రం. ఒక్క క్లిక్ తో వస్తువు ముంగిట నిలిపే ఆన్ లైన్ మార్కెట్ పై ప్రత్యేక కథనం.

ఆఫర్లే..ఆఫర్లు..
ట్రై కియాతో డీల్ మిలా..డీల్ మిలా త్యోహార్ కిలా. ఇది అమెజాన్ యాడ్. దివాళీ దిల్ కి డీల్ వాలీ. ఇది స్నాప్ డీల్ క్యాంపెన్. ఆఫర్ టు బ్రింగ్ జాయ్..టు యువర్ హోమ్. ఇదీ ఫ్లిప్ కార్ట్ ద బిగ్ బిలియన్ డేస్ కొటేషన్. ఇలా ఈ కామర్స్ దిగ్గజ పోర్టల్స్ అన్నీ రారమ్మంటూ ఆఫర్లతో ఊరిస్తున్నాయి. దసరా, దీపావళి రాయితీలతో ఆకట్టుకుంటున్నాయి. భారత్ లో ఆన్ లైన్ షాపింగ్ జెట్ స్పీడ్ లో దూసుకెళుతోందా? నిన్నమొన్నటి దాకా ఆన్ లైన్ షాపింగ్ అంటే పెద్దగా పట్టించుకునే వారు కాదు.. సరదాగానో, లేక ఓసారి ట్రై చేద్దామనో భావన ఉండేది.. కానీ, ఇప్పుడు కావాల్సి వస్తువు కోసం, రిలయబుల్ మార్కెట్ ప్లేస్ గా ఈ కామర్స్ సైట్లు మారుతున్నాయి.

భిన్నాభిప్రాయాలు..
ఆఫర్లమీద ఆఫర్లు గుప్పిస్తున్నారు. పేపర్లలో ఫుల్ లెంగ్త్ ప్రకటనలు గుప్పిస్తున్నారు. మొత్తంగా ఈ కామర్స్ సేల్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. వేల కోట్ల టర్నోవర్ రికార్డు చేస్తున్నాయి. సో, ఆన్ లైన్ సైట్స్ మాంచి లాభాల్లో ఉన్నట్టేనా? వందల కోట్లు వెనకేసుకుంటున్నాయా? సమయం ఆదా, షాపింగ్ ఈజీ. పైగా పది రకాల బ్రాండులు, పది సైట్లతో కంపేర్ చేసి కొనుక్కోవచ్చు. ఇదే అంశం కస్టమర్లను ఈ కామర్స్ వైపు మొగ్గు చూపేలా చేస్తోంది. కానీ, భారీ ఆఫర్లు, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అన్ని సందర్భాల్లో కస్టమర్లకు మేలు చేస్తాయా? దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

రాబోయే కాలం ఈ కామర్స్ దేనా ?
అన్ని ఆఫర్లు ఒకలా ఉండవు. కొన్ని నిజమైనవీ ఉంటాయి. మరికొన్ని బురిడీ కొట్టించేవీ ఉంటాయి. నిజమే. ఆన్ లైన్ షాపింగ్ సైట్స్ కి కూడా ఇది వర్తిస్తుంది. ప్రస్తుతానికైతే మార్కెట్ పెంచుకోవటానికే ఆన్ లైన్ సైట్స్ నానా తిప్పలూ పడుతున్నాయనే చెప్పాలి. కానీ, పెరుగుతున్న ఈ షాపింగ్, సంప్రదాయ మార్కెట్ ని దెబ్బకొడుతోందా? భవిష్యత్ లో షాపింగ్ ఇళ్లకే పరిమితం కానుందా.. అనే సందేహాలూ వ్యక్తమౌతున్నాయి. ఈ కామర్స్ వ్యాపారాన్ని సులువుగా మారుస్తోంది. ఉత్పత్తిని తేలిగ్గా వినియోగదారుణ్ని చేరుస్తోంది. వినియోగదారుడు, అమ్మకందారుడి మధ్య విన్ విన్ సిచ్యుయేషన్ ఉండాలి. అంటే, ఒక డీల్ తో ఇద్దరూ లాభపడాలి. అప్పుడే వ్యాపారం వర్ధిల్లుతుంది. వినియోగదారుడికి ప్రయోజనం ఉంటుంది. ట్రెండ్ ఇదే పద్ధతిలో నడిస్తే, రాబోయే కాలం అంతా ఈ కామర్స్ దే అనటంలో సందేహం లేదు.

నిర్మలా సీతారామన్ ను కలిసిన టీటీడీపీ నేతలు

ఢిల్లీ : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను తెలంగాణ టీడీపీ నేతలు కలిశారు. పలు విషయాలను ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

 

తహశీల్దార్ పై వీహెచ్ పీ, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల దాడి...

తూర్పుగోదావరి : వీహెచ్ పీ, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. రాజమండ్రి రూరల్ తహశీల్దార్ గారపాటి భీమారావుపై దాడికి పాల్పడ్డారు. దళితులకు చెందిన 5 ఎకరాల భూమిలో శివాలయం నిర్మాణం చేయాలని ఓ వర్గం అనుకుంది. అయితే అందుకు అనుమతించలేదనే సాకుతో తహశీల్దార్ కార్యాలయం చట్టుముట్టి.. తహశీల్దార్ భీమారావుపై దాడి చేశారు. దీంతో తహశీల్దార్ భీమారావు స్పృహ కోల్పోయాడు. చికిత్స నిమిత్తం అయన్ను ఆస్పత్రికి తరలించారు. కాగా భీమారావుపై డాడిని దళిత సంఘాలు ఖండిస్తున్నాయి.  

18:35 - October 15, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. గత వారం రోజులుగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అక్టోబర్‌ నెలలో శీతల గాలులతో పాటు.. సాయంత్రం చిరుజల్లులు కురవాల్సి ఉన్నప్పటికీ.. పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక పక్క వేడి.. మరోపక్క చల్లని గాలితో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాల్సిన చక్కని సమయమిది. ప్రతి ఏడాది ఈ రోజుల్లో ఉన్న వాతావారణానికి.. తాజాగా నెలకొన్న పరిస్థితులకు చాలా వ్యత్యాసముంది. గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

మండుతున్న ఎండలు..
సాధారణంగా అక్టోబర్‌ నెలలో అప్పుడప్పుడు వర్షాలు కురుస్తూ.. రాత్రివేళలో శీతల గాలులు వీస్తుంటాయి. మరోవైపు బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడి వాటి ప్రభావం రాష్ట్రాలపై ఉంటుంది. కానీ.. ఈ ఏడాది అలాంటి పరిస్థితులేవీ కనిపించడం లేదు. దీంతో ఎండలు మండిపోతున్నాయి.

3 నుంచి 6 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు..
తెలంగాణలో గత ఐదు రోజులుగా సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్‌లో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతేకాకుండా ఆదిలాబాద్‌, ఖమ్మం, మెదక్‌, నల్లగొండలలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులంటున్నారు.

వర్షాలు లేక మండుతున్న ఎండలు..
మరోవైపు ఏపీలోనూ ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా వర్షాలు కురియకపోవడంతో ఎండలు మండిపోతున్నాయి. ఇక రాష్ట్రంలో తుని, ఒంగోలులో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. నైరుతి రుతుపవనాలు బలహీనపడటం.. పడమర నుండి వీస్తున్న పొడి గాలుల వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ నిపుణులంటున్నారు. మరి ఈ వింత కాలం పోవాలంటే మరెన్ని రోజులు పడుతుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. 

18:33 - October 15, 2015

విశాఖపట్టణం : ఎక్కడా లేనట్టుగా విశాఖ బీచ్‌లోనే ఎందుకు మృత్యు ఘోష వినిపిస్తోంది..? పర్యాటకుల అవగాహనా లోపమా..? లేక అధికారుల అలసత్వమా..? ఇవేమి కాకుండా అలల వెనుక దాగున్న మరో అనర్ధమా..? అసలు విశాఖ బీచ్‌లు పర్యాటకులకు అనువైనవేనా అన్న ప్రశ్నకు కాదనే సమాధానాలు వస్తున్నాయి. విశాఖలో తుపాన్లలో, పడవ ప్రమాదాల్లో మరణించినవారి సంఖ్య కంటే బీచ్‌లో స్నానాలకు దిగి చనిపోతున్నవారి సంఖ్యే అధికంగా ఉంది. దీనికి రిప్‌ అనే సముద్ర కెరటాల ప్రభావమేనని నిపుణులంటున్నారు.

విశాఖ బీచ్‌ల్లో రిప్‌ కరెంటు ప్రవాహం..
విశాఖ బీచ్‌ల్లో తరచూ రిప్‌ కరెంటు ప్రవాహం కనిపిస్తోందని అధ్యాయనాలు చెబుతున్నాయి. రిప్ కరెంటనేది కెరటాలతో సంబంధం లేనిది. ఇది రెండు పక్కల నుంచి వచ్చి మధ్యలో నుంచి లోపలికి తిరిగి వెళ్లే ఓ ప్రవాహం. ఈ సమయంలో ఆ మధ్యలో ఉన్న వారంతా ఎంత తీరానికి సమీపానున్నా సరే కొట్టుకుపోతారు. గజ ఈతగాళ్లు సైతం దాని నుంచి బయటపడటానికి గిజగిజలాడుతారు.

రిప్‌ నుంచి తప్పించుకునేందుకు రక్షణ చర్యలు..
అమెరికా వంటి దేశాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏటా వందలమంది ఈ రిప్‌ కరెంటులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. విదేశి బీచ్‌లలో ఈ రిప్‌ కరెంటు గురించి అధ్యయనాలు, ఎప్పటికప్పడు బీచ్‌లో పబ్లిక్ అడ్రస్‌సిస్టంలో హెచ్చరికలు వంటివి ఉంటాయి. లైఫ్‌ బోట్లు, లైఫ్‌ జాకెట్లు ధరించిన లైఫ్‌ గార్డులు సిద్ధంగా ఉండి బైనాక్యులర్స్‌తో పరిశీలిస్తూ ఎవరన్నా మునిగిపోతుంటే తక్షణమే పరుగెత్తుకెళ్లి రక్షిస్తారు.

విశాఖ బీచ్‌లో రక్షణ చర్యలు కరవు..
ఈ ఏర్పాట్లేవి విశాఖ బీచ్‌లో లేవు. పైగా ఇక్కడ మేజరు పోర్టు ఉన్నందున ఏటా బీచ్‌లో డ్రెడ్జింగ్‌ చేసి ఆ తవ్విన ఇసుకను బీచ్‌ నరిష్మెంటు పేరిట ఒడ్డున పోస్తారు. దీని వల్ల మళ్లీ ఆ ఇసుక సముద్రంలోకి కొట్టుకుపోతూ నీటి లోపల మేటలు వేస్తుంది. అలా రెండు మేటల మధ్య రిప్ కరెంటు ఉంటుంది. పైకి ప్రశాంతంగా కనిపించినా దిగిన వారిన తనతో లాక్కెళ్లిపోతోంది ఈ రిప్ ప్రవాహం. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు హడావుడి చేసి బీచ్‌లో హెచ్చరికల బోర్డులు, కర్రలతో నెట్ వలలో ఏర్పాటు చేస్తున్నారు. కాని అవి మరుసటి రోజుకే కొట్టుకుపోతున్నాయి. ఏదేతేనేం అందమైన సాగర తీరం రానురాను మృత్యు తీరంగా మారడం పర్యాటకులను భయాందోళనకు గురి చేస్తోంది. విశాఖ బీచ్‌లు సముద్ర స్నానానికి అనువు కావు అన్న నిజం ప్రకృతి ఆరాదకులను ఆందోళనకు గురి చేస్తోంది.

18:31 - October 15, 2015

విశాఖపట్టణం : ఎగిసిపడే కెరటాలను చూస్తే ఆనందం... లయగా వచ్చే అలల ఘోషను వింటే ఆహ్లాదం. అలతో పాటు ఎగిరిగంతేయాలనే తాపత్రయం. కాని ఆ ఆనందం వెనుక.. ఆ ఆహ్లాదం వెనుక ఓ మృత్యుగీతం వినిపిస్తోంది. తెలియక జనం వెళ్తుంటే... తెలిసీ అధికారులు వారిని మృత్యుకెరటాలకు బలిచేస్తున్నారు. సువిశాల సాగర తీరం విశాఖ సిగలో మణిమకుటం. పాల నురగల్లాంటి అలలు ఎగిసిపడుతుంటే ఆ ఆనందమే వేరు. కష్టాలన్నింటినీ పటాపంచలు చేసి ప్రకృతి ఒడిలో సేదతీరుస్తుంది ఇక్కడి సాగర సోయగం. ఈ ఆనందమంతా నాణానికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు అంతా విషాదం. తల్లుల గర్భశోకం. అనుజుల కోసం తోబుట్టువులు గుండలవిసేలా రోదించే హృదయ విదారక దృశ్యం. ఈ సాగరం. ఆహ్లాదకర అలల ఘోష వినిపించిన చోటే మృత్యు ఘోష వినిపిస్తోంది. విశాఖ బీచ్‌ ప్రమాదాలకు నెలవుగా మారింది. నిత్యం ఎవరో ఒకరిని సాగర తీరం బలి తీసుకుంటోంది. ఏడాదికేడాది బీచ్‌లో మరణాల సంఖ్య పెరుగుతోంది. 

175 ప్రమాదాలు..
గడచిన ఐదేళ్లలో బీచ్‌లో 175 ప్రమాదాలు జరిగితే 195 మంది ప్రాణాలు కోల్పోయారు. 2011లో జరిగిన 36 ప్రమాదాల్లో 39 మంది, 2012లో జరిగిన 30 ప్రమాదాల్లో 37 మంది చనిపోయారు. 2013లో 33 ప్రమాదాలు జరిగితే 39 మంది, 2014లో 43 ప్రమాదాలకుగాను 45 మంది, 2015లో ఇప్పటిదాకా 28 ప్రమాదాలకు జరగ్గా 35 మంది కడలి అలలకు బలయ్యారు.

30 కి.మీటర్ల విస్తీర్ణం..
విశాఖ సాగర తీరం 30 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఎవరు ఎక్కడ బీచ్‌లో ఆడుకోవడానికి దిగుతున్నారో తెలియని పరిస్థితి. ముఖ్యంగా యువత ఎవరూ లేని ప్రదేశాన్ని ఎంచుకుంటోంది. దీంతో అక్కడ ఏ ప్రమాదం జరిగినా ఇతరులకు తెలియని పరిస్థితి. తాజాగా జరిగిన ప్రమాదంలో కూడా ఇదే జరిగింది. ఆర్కే బీచ్‌లో సరదాగా గడిపేందుకు వచ్చిన 10వ తరగతి విద్యార్థులు బండరాళ్లపై ఆడుకుంటూ అలల ధాటికి సముద్రంలోకి కొట్టుకుపోయారు.

ఆర్కేబీచ్‌లో కేవలం 6గురు గజ ఈతగాళ్లు..
బీచ్‌లో మరణాలను నివారించేందుకు ప్రభుత్వం గతంలో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసింది. కాకుంటే వారికి వేతనాలు సరిగ్గా చెల్లించకపోవడంతో వారు అరకొరగా పని చేస్తున్నారు. పర్యాటకులు ఎక్కువగా వచ్చే ఆర్కే బీచ్‌లాంటి ప్రదేశాల్లో కనీసం 30 మంది గజ ఈతగాళ్లైనా ఉండాలి. కాని ఇక్కడ కేవలం ఆరుగురు మాత్రమే ఉంటున్నారు. వీళ్లు కూడా సముద్రంలో కొంత దూరం మాత్రమే వెళ్లగలుగుతున్నారు. గజ ఈతగాళ్లకు స్విమ్‌ సూట్స్‌, లైఫ్‌ కిట్‌ వంటి రక్షణ కవచాలు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. కళ్ల ముందే బీచ్‌లో స్నానానికని వెళ్లి మృత్యుఒడిలోకి చేరుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.  

18:26 - October 15, 2015

గుంటూరు : ఏపీ కొత్త రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొంటోంది. ప్రజలను భాగస్వాములను చేస్తామని..భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు నాయులు పలు మార్లు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇటుకలను సేకరించేందుకు ప్రభుత్వం కొత్త వెబ్ సైట్ ప్రారంభించింది. గురువారం ఉదయం తన కార్యాలయంలో చంద్రబాబు 'మై బ్రిక్‌-మై అమరావతి' వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ప్రపంచ నలుమూలల ఉండే తెలుగు వారందరూ రాజధాని నిర్మాణం కోసం 10 రూపాయలు విలువ చేసే ఇటుక గానీ లేనిపక్షంలో 10 విలువగల విరాళం ఈ వెబ్‌సైట్‌ ద్వారా పంపవచ్చునని పేర్కొన్నారు. 5కోట్ల మంది ఒక్కొక్క ఇటుకనైనా కొనుగోలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

18:23 - October 15, 2015

రాజమండ్రి : జిల్లాలో ఆర్ఎస్ఎస్..వీహెచ్ పీ కార్యకకర్తలు రెచ్చిపోయారు. ఏకంగా ఓ అధికారిపై దాడి చేశారు. సృహ కోల్పోయిన ఆ అధికారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రూరల్ తహసిల్ధార్ గారపాటి భీమారావు పై గురువారం విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు దాడిచేసారు. రూరల్ మండలంలోని పిడింగొయ్యి గ్రామపంచాయితీ పరిధిలో దళితులకు చెందిన 5ఎకరాల భూవివాదం గత 3నెలలుగా కొనసాగుతోంది. దళితులకు చెందిన భూమిలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు శివాలయాన్ని నిర్మించేందుకు ప్రయత్నించారు. కానీ అది కాస్తా వివాదం కావటంతో ఆలయ నిర్మాణ పనులు శంకుస్ధాపన దశలోనే ఆగిపోయాయి. దీంతో కోపోద్రిక్తులైన విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్డడించి తహశీల్దార్‌ భీమారావుపై దాడి చేయడంతో స్పృహ కోల్పోయారు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న తహశీల్దార్‌ భీమారావును ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పరామర్శించారు.

రాజధాని శంకుస్థాపనకు రూ.10 కోట్లు మాత్రమే ఖర్చు : నారాయణ

విజయవాడ : సీఆర్ డీఏ సమావేశం ముగిసింది. రాజధాని శంకుస్థాపనకు పది కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నామని మంత్రి నారాయణ చెప్పారు. గుంటూరు కలెక్టర్ కు రూ.7 కోట్లు, కృష్ణా కలెక్టర్ కు రూ.3 కోట్లు విడుదల చేశామని తెలిపారు.

ఎపి వాణిజ్యశాఖపై సమీక్ష..

హైదరాబాద్ : ఎపి వాణిజ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ జె.శ్యామలరావు హాజరయ్యారు. లక్ష్యాల్లో 9 శాతం తక్కువ వసూళ్లు చేయడం పట్ల యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే సమావేశం నాటికి లక్ష్యాలను పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లక్ష్యాలు సాధించని ఉద్యోగులకు బదిలీ వేటు తప్పదని యనమల హెచ్చరించారు.

 

కృష్ణానది జలాల కేసు విచారణ వాయిదా

ఢిల్లీ : కృష్ణానది జలాల కేసు విచారణ డిసెంబర్ 3 వ తేదీకి వాయిదా పడింది. తెలంగాణలో 26 శాతం పరివాహక ప్రాంతం ఉండగా.... 12.8 శాతం నీటిని కేటాయించారని న్యాయవాది వైద్యనాథన్ పేర్కొన్నారు. సాగు, తాగు నీరు లేక తెలంగాణ ఇబ్బంది పడుతుంటే విద్యుత్ ఉత్పత్తి కోసం మహారాష్ట్ర 150 టీఎంసీల నీటిని వృధా చేస్తోందని వాపోయారు.

 

 

17:47 - October 15, 2015

ప్రముఖ దర్శకుడు శంకర్‌... అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'రోబో2' చిత్రంలో రజనీకాంత్‌ సరసన నటించే అరుదైన లక్కీఛాన్స్‌ను ఎమీజాక్సన్‌ కొట్టేసింది. 'ఐ' సినిమా ఘోర పరాజయం తర్వాత శంకర్.. అత్యంత ప్రతిష్టాత్మకంగా రోబో2 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'రోబో' చిత్రంలో రజనీ సరసన ఐశ్వర్యరాయ్ నటించిన సంగతి తెలిసిందే. 'రోబో2'లో తొలుత రజనీ సరసన ఐశ్వర్యరాయ్ నే తీసుకోవాలనుకున్నారు. కారణాలు ఏవైనప్పటికీ చివరిగా ఎమీజాక్సన్‌ను దర్శకుడు ఎంపిక చేశాడు. అంతేకాదు ఎమీ బాడీలాంగ్వేజ్‌కి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్‌ కూడా శంకర్‌ ప్రత్యేకంగా డిజైన్‌ చేయిస్తున్నారట. విక్రమ్‌ హీరోగా శంకర్‌ తెరకెక్కించిన 'ఐ' చిత్రంలోనూ ఎమీ నటించింది. తాజాగా 'రోబో2'లో నటిస్తుందనే వార్తలు ప్రస్తుతం సామాజిక మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 'రోబో2' చిత్రానికి సంబంధించి ఇటీవలే ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శంకర్‌ ప్రారంభించారు. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం 2డి, 3డిల్లో రూపొందనుందని సమాచారం. అక్షరకుమార్‌ హీరోగా ఇటీవల విడుదలైన 'సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌' చిత్రంలో ఎమీ మెరిసిన విషయం విదితమే.

 

పొత్తును ఉపసంహరించుకుంటున్నాం - ఎన్సీపీ..

బీహార్ : సమాజ్ వాదీ చీఫ్ ములాయం చేసిన వ్యాఖ్యలు బీజేపీ అనుకూలంగా ఉన్నాయని అందుకనే తాము పొత్తును ఉపసంహరించుకుంటున్నట్లు ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్ వెల్లడించారు. మొత్తం 45 సీట్లలో పోటీ చేయనున్నట్లు ఆయన ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. 

కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆఫీస్ లో ఏసీబీ దాడులు

వరంగల్ : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ఆఫీస్ లో ఏసీబీ దాడులకు పాల్పడింది. కాంట్రాక్టర్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి వెంకటేశ్వర్లును ఎసిబి అధికారులు పట్టుకున్నారు.

 

అఖిలేష్ తో కేటీఆర్ భేటీ..

ఉత్తర్ ప్రదేశ్ : యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. టి. సర్కార్ చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు గురించి అఖిలేష్ కు కేటీఆర్ వివరించారు. 

17:15 - October 15, 2015

హైదరాబాద్ : బ్రూస్ లీ సినిమా యూనిట్ ఇళ్లపై ఆదాయపున్ను శాఖ(ఐటీ) శాఖ దాడి చేసింది. సినిమా దర్శకుడు శ్రీనువైట్ల, నిర్మాత దానయ్య, దిల్ రాజు, సంగీత దర్శకుడు తమన్ ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇటు హైదరాబాద్, అటు చెన్నైలోని వారి ఇళ్లపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. భారీ బడ్జెట్ తో బ్రూస్ లీ చిత్రాన్ని నిర్మించారు. అయితే సినిమా నిర్మాణ వ్యయానికి సంబంధించిన సరైన లెక్కలు ఐటీ శాఖకు చిత్ర యూనిట్ చూపించ లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఐటీ శాఖ ఆ చిత్ర యూనిట్ పై దాడులకు పాల్పడింది. రెండు గంటలుగా సోదాలు కొనసాగుతున్నాయి. మరో మూడు గంటలు ఐటీ దాడులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో చిత్రం యూనిట్ పై జరుగుతున్న ఐటీ దాడుల ప్రభావం రేపు రిలీజ్ కానున్న బ్రూస్ లీ సినిమాపై ఎలాంటి ప్రభావం పడే అవకాశముందో వేచి చూడాలి. కాగా సినిమాకు సంబంధించి భారీ ఎత్తున్న అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వంద కోట్ల రూపాయల వరకు బ్రూస్ లీ సినిమా అమ్మకాలు జరిగినట్లు సమాచారం. అందుకు సంబంధించిన లెక్కలను మాత్రం చిత్ర యూనిట్ ఐటీ శాఖకు తెలపలేదని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు, ఇటీవల పులి చిత్రం రిలీజ్ అయిన సందర్భంగా సరైన లెక్కలు చూపించలేదనే కారణంతో ఐటీ శాఖ ఆ చిత్రాల యూనిట్ సభ్యుల ఇళ్లపై సోదాలు నిర్వహించిన సంగతి తెలిసింది. ఇదిలావుంటే గతంలో 10 లేదా 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాలను నిర్మించే వారు. కానీ ఇటీవల భారీ బడ్జెట్ తో...దాదాపు 80, 100 కోట్ల రూపాయలతో సినిమాలను నిర్మిస్తున్నారు. వాటికి సంబంధించి ఆదాయ, వ్యయాల లెక్కలు సక్రమంగా ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు దాడులకు పాల్పడుతున్నారు.

 

దేశం గర్వించదగిన వ్యక్తి కలాం - కేసీఆర్..

హైదరాబాద్ : దేశం గర్వించదగిన వ్యక్తి కలాం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నగరంలోని డీఆర్ డీఎల్ ప్రాంగణంలో అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కలాం దేశం గర్వించదగిన వ్యక్తి అని కొనియాడారు. ఇతరుల స్వాతంత్ర్యాన్ని హరించకూడదన్న సిద్ధాంతాన్ని కలాం నమ్మేవారని కేసీఆర్ పేర్కొన్నారు. 

అమరావతికి శంకుస్థాపనకు రూ.9కోట్లు - ఏపీ మంత్రులు..

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం లేదని, కేవలం రూ.9 కోట్లు మాత్రమే వెచ్చిస్తున్నట్లు ఏపీ మంత్రులు ప్రత్తిపాటి, నారాయణలు వెల్లడించారు. 

టి.అసెంబ్లీలో బతుకమ్మ..

హైదరాబాద్ : నాలుగో రోజు తెలంగాణ మహిళలు బంగారు బతుకమ్మను భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. రాష్ట్ర శాసన సభ ఆవరణలో బతుకమ్మ ఉత్సవాలను ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలను స్పీకర్ మధుసూదనాచారి ప్రారంభించారు. అనంతరం శాసనసభ ఉద్యోగిణులు బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సవాలు జరుపుకున్నారు. 

గ్రేటర్ అధికారులతో సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : గ్రేటర్ అధికారులతో సీఎం కేసీఆర్ జరిపిన భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రూ. 1,200 ఆస్తిపన్ను కడుతున్న ఇంటి యజమానులకు ఆస్తిపన్నును రూ. 101కి తగ్గించేందుకు సీఎం కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. అదే విధంగా నగరంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సీఎం అధికారులను హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ తనిఖీలు చేపట్టి అక్రమ నిర్మాణాలను నిలువరించేందుకు వ్యూహరచన చేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ పర్యవేక్షణలో ఒక స్పెషల్ ఫ్లయింగ్ స్కాడ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 

'బ్రూస్ లీ' చిత్ర యూనిట్ పై ఐటీ దాడులు..

హైదరాబాద్ : బ్రూస్ లీ సినిమా యూనిట్ ఇళ్లపై ఆదాయపున్ను శాఖ(ఐటీ) శాఖ దాడి చేసింది. సినిమా దర్శకుడు శ్రీనువైట్ల, నిర్మాత దానయ్య, దిల్ రాజు, సంగీత దర్శకుడు తమన్ ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇటు హైదరాబాద్, అటు చెన్నైలోని వారి ఇళ్లపై ఏకకాలంలో అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.  

16:39 - October 15, 2015

మహబూబ్ నగర్ : జిల్లాలో మరో రైతు తనువు చాలించాడు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కరవు జిల్లాగా పేరుగడించిన మహబూబ్ నగర్ జిల్లాల్లో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా మక్కల్ మండలం దాసరదొడ్డి గ్రామానికి చెందిన బాలకిష్టన్న అనే రైతు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇతను మూడు ఎకరాల్లో పత్తి..వరి పంట వేశాడు. కానీ బ్యాంకు రుణం కోసం చూశాడు. రుణం రాకపోయేసరికి అధిక వడ్డీ కింద ప్రైవేటు అప్పు తీసుకున్నాడు. కానీ వర్షాలు పడకపోవడం పంటలు సాగు కాలేదు. ఈ నేపథ్యంలో అప్పులిచ్చిన వారి నుండి వత్తిడి అధికం కావడం..పంట చేతికి రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. గురువారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

16:32 - October 15, 2015

అభివృద్ధి చెందుతున్న దేశాలలో దాదాపు 75 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తోంది. వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత వృత్తులే ప్రధాన జీవనాధారంగా పనిచేస్తున్న ఈ గ్రామీణ జనాభా ప్రపంచానికి ఆహార భద్రత కల్పిస్తోంది. వీరిలో సగ భాగంగా ఉన్న మహిళలు వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి సేవలను గుర్తిస్తూ అక్టోబర్ 15 ను ప్రపంచ గ్రామీణ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా మానవి ఫోకస్..

ఆహార ఉత్పత్తిలతో మహిళల ప్రధాన పాత్ర..
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మహిళలే వెన్నెముకగా వున్నారు. వ్యవసాయం, ఇతర వ్యవసాయ అనుబంధ పరిశ్రమలలో వారి సేవలే కీలకం. అయినప్పటికీ వారికి జీవనోపాధులలో నిర్ణయాధికారం, ఆదాయ వ్యయాలపై నియంత్రణాధికారాలు లేని దుస్థితి. అడుగడుగునా వివక్షే నెలకొన్న సమాజంలో భద్రత లేని పరిస్థితులలో బతుకులు వెళ్ళదీస్తున్న మహిళా లోకం ఆహార ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. 

వారి హక్కులు కాపాడాలి..
ప్రపంచమంతా ఆధునికత, సాంకేతికతల చుట్టూ పరిభ్రమిస్తోంది. కానీ మనిషి కనీస అవసరమైన ఆహార లభ్యత ఇప్పటికీ గ్రామాల నుండే జరుగుతోంది. అందునా మహిళల శ్రమ లేకుండా ఏ ఉత్పత్తి వ్యవస్థ సమగ్రంగా పనిచేయట్లేదు. క్షేత్రస్థాయిలో మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ పరిశ్రమ అయినా మనుగడ సాధించటం అసాధ్యం అని సమాజం, పాలకులు గుర్తించాలి. వారి శ్రమను గుర్తించాలి, వారికి భూమి పై హక్కులు కల్పించాలి, నిర్ణయాధికారంలో వారిని భాగస్వాములను చేయాలి, మొత్తంగా వారి హక్కులను కాపాడాలని ఈ సందర్భంగా మానవి కోరుకుంటోంది.

16:26 - October 15, 2015

వరంగల్ : ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతూ డబ్బుల గురించి జలగల్లా పీడిస్తూ ప్రజల రక్తాన్ని తాగుతున్నారు. ప్రభుత్వ రంగ వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉన్నతాధికారులు పనులు చేయాల్సింది ఉండగా లంచం పేరుతో అధికారులు వేధిస్తుండడంతో తట్టుకోలేక అవినీతిశాఖ అధికారులను ఆశ్రయించడం జరుగుతుంది. తాజాగా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) లో పనిచేసే డిప్యూటి ఎగ్జిక్యూటివ్ అధికారిని ఏసీబీ పట్టుకుంది. వివరాల్లోకి వెళితే...కుడా పరిధిలో ఓ కాంట్రాక్టర్ పనులు చేస్తున్నాడు. పనికి సంబంధించిన బిల్లులను చెల్లించాలని కోరుతూ సదరు కాంట్రాక్టర్ డిప్యూటి ఎగ్జిక్యూటివ్ అధికారి వెంకటేశ్వర్లను కోరాడు. బిల్లులో తనకు పర్సంటేజ్ ఇవ్వాలని..అందుకు రూ.25వేలు చెల్లించాలని అధికారి డిమాండ్ చేసినట్లు కాంట్రాక్టర్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీనితో ఏసీబీ అధికారులు వల పన్నారు. గురువారం రూ.25వేలు తీసుకుంటుండగా అధికారి వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. తనకు లంచం ఇస్తే బిల్లు పాస్ చేస్తానని చెప్పాడని, ఇవ్వడానికి ఇష్టం లేని సదరు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడని ఏసీబీ అధికారి పేర్కొన్నారు. అధికారి వెంకటేశ్వరరావును రిమాండ్ తరలిస్తామన్నారు. ఇదిలా ఉంటే తనను కావాలనే కేసులో ఇరికించారని డిప్యూటి ఎగ్జిక్యూటివ్ అధికారి వెంకటేశ్వరరావు పేర్కొన్నాడు. 

మహిళలపై వడ్డీ వ్యాపారి లైంగికవేధింపులు..

హైదరాబాద్ : నగరంలోని మియాపూర్ లో ఓ వడ్డీ వ్యాపారి కామాంధుడి అవతారమెత్తాడు. మియాపూర్ లో నివాసముంటున్న సంగరాజు అనే వడ్డీ వ్యాపారి సంగరాజు తన వద్ద అప్పు తీసుకున్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అప్పు పూర్తిగా కట్టినా చెక్కులు, ప్రామీసరి నోట్లు ఇవ్వకుండా మహిళలను వేధిస్తున్నాడు. చెక్కులు కావాలంటే తనతో గడపాలంటూ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో విసిగివేసారిన బాధితులు మియాపూర్ పోలీసులను ఆశ్రయించారు. సంగరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. 

16:13 - October 15, 2015

హైదరాబాద్ : వడ్డీ వ్యాపారి కామాంధుడయ్యాడు. చెక్కులు..ప్రామసరీ నోట్లు కావాలంటే తనతో గడపాలని మహిళలను వేధిస్తున్నాడు. తీవ్ర మనస్థాపానికి గురైన ఆ మహిళలు చివరకు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. వివరాల్లోకి వెళితే..కూకట్ పల్లి మియాపూర్ లో వడ్డీ వ్యాపారి సంగరాజు దగ్గర లక్ష రూపాయలను ఐదు రూపాయల వడ్డీకి అప్పు తీసుకుంది. అనంతరం వడ్డీతో సహా డబ్బులను పూర్తిగా కట్టేసింది. కానీ అతను తీసుకున్న చెక్కులు..ప్రామసరీ నోట్లు ఇవ్వాలని బాధిత మహిళ కోరింది. కానీ దీనికి అతను నిరాకరించి లైంగికంగ వేధించసాగాడు. విసిగివేసారిపోయిన ఆ మహిళ మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని కోరింది. సంగరాజు ఐదు..పది రూపాయలతో వడ్డీలకు ఇస్తున్నాడని, తనకు డబ్బులు అవసరం లేదంటూ లైంగికంగా వేధిస్తున్నాడని పేర్కొంది. 

 

తగ్గిన ఉల్లి ధర..

హైదరాబాద్ : ఉల్లి ధర తగ్గింది. ప్రాంతాలను బట్టి కిలో ఉల్లి ధర రూ.15 నుంచి 35 పలుకుతోంది. నిన్నటి దాకా ఉల్లి ధర రూ.80 నుంచి 50 వరకు పలికింది. కర్నూలు మార్కెట్ లో రైతుల నుంచి కిలో రూ.3కు దళారులు కొంటున్నారు. దళారుల దెబ్బకు రైతులు ఆందోళనకు దిగారు.

 

సామర్లకోటలో ఉన్మాది వీరంగం

తూర్పుగోదావరి : జిల్లాలోని సామర్లకోటలో ఉన్మాది వీరంగం సృష్టించాడు. కర్రతో ఐదుగురిపై దాడి చేశాడు. పోలీసులు ఉన్మాదిని అరెస్టు చేశారు. 

పెట్రోల్ ధర తగ్గింపు..?

ఢిల్లీ : దేశంలో పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. పెట్రోల్ ధర తగ్గింపుకు సంబంధించి నేడో, రేపో కేంద్రప్రభుత్వ ప్రకటన రానుంది. అంతర్జాతీయంగా పెట్రో ధర తగ్గిన ఫలితంగా మన దేశంలో కూడా పెట్రోల్ ధర తగ్గే అవకాశం ఉంది.

15:52 - October 15, 2015

బెంగళూరు : వెళ్లే దారిలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఇదంతా మనకెందుకెలే అనుకుంటూ ఎన్ని ఇబ్బందులు పడుతున్నా వెళుతూనే ఉంటుంటాం. కానీ సమస్య పరిష్కారం కోసం దారి వెతకం. కానీ ఓ ఎనిమిదేళ్ల బుడతడు మాత్రం ఏకంగా తాను ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశాడు. ఇందుకు తాత సహయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
అభినవ్..బెంగళూరులోని యశ్వంత్ పూర్ లోని నేషనల్ పబ్లిక్ స్కూల్ లో మూడో తరగతి చదువుతున్నాడు. కానీ స్కూల్ కు వెళ్లే సమయంలో ప్రధాన సమస్యను ఎదుర్కొంటున్నానని పేర్కొన్నాడు. తన నివాసం నుండి స్కూల్ కేవలం మూడు కిలో మీటర్లు మాత్రమే ఉందని తెలిపాడు. స్కూల్ కు ఐదు నిమిషాలు లేట్ గా వస్తే శిక్ష విధిస్తారని, స్కూల్ బస్ వెళ్లడానికి 40-45 సమయం పడుతోందని తెలిపాడు. దీనికి కారణం యశ్వంత్ పూర్ వద్ద రైల్వే గేట్ మూసివేయడమే కారణమని, దీనివల్ల తమ ఆరోగ్యాలు, చదువుపై పెను ప్రభావం పడుతోందన్నాడు. అంతేగాకుండా రైల్వే గేట్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం చేస్తున్నారని, ప్రస్తుతం పనులు ఆగిపోయాయని పేర్కొన్నాడు. దీనికి డిఫెన్స్ శాఖ అనుమతినివ్వడం లేదని, సమస్య అంతటికీ ప్రధాన కారణమని లేఖలో తెలిపాడు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరాడు. దీనికి పీఎంఓ కార్యాలయం స్పందించింది. సమస్యను తెలుసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించింది. 

'మై బ్రిక్.. మై అమరావతి' వెబ్ సైట్ ప్రారంభం...

గుంటూరు : 'మై బ్రిక్ మై అమరావతి' వెబ్ సైట్ ప్రారంభం అయింది. వెబ్ సైట్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రభుత్వం ఇటుక ఖరీదు రూ. 10గా నిర్ణయించింది. 5 కోట్ల మంది ఒక్కొక్క ఇటుకనైనా కొనాలని సీఎం పిలుపునిచ్చారు. సింగపూర్ ప్రవాసాంధ్రుడు శ్రీనివాస్ తొలుత 108 ఇటుకలను కొన్నారు.  

15:42 - October 15, 2015

విశాఖపట్టణం : బీమా సంస్థలకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం స్కీం ఆఫ్ ఇన్సూరెన్స్ సమావేశం జరిగింది. బీమా దారుల సమస్యల పరిష్కారం దిశగా అంబుడ్స్ మెన్స్ నిర్ణయం తీసుకుంది. ఈసమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు యానాంకు చెందిన ఫిర్యాదు దారులు పాల్గొన్నారు. క్లెయిమ్స్ పరిష్కారం కోసం ఇచ్చే ఫిర్యాదులపై వేగంగా తక్కువ ఖర్చుతో నిష్పక్షపాతికంగా ప్రవర్తించడమే అంబుడ్స్ మెన్స్ ముఖ్య ఉద్ధేశ్యమని బీమా పరిరక్షణాధికారి బి.రాజేశ్వరరావు పేర్కొన్నారు. 

గ్రేటర్ హైదరాబాద్ పై సీఎం కేసీర్ సమీక్ష

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పై సీఎం కేసీర్ సమీక్ష చేపట్టారు. రోడ్ల మరమ్మత్తులను నెల రోజుల్లో పూర్తి చేయాలని సీఎం అన్నారు. రూ. 500 కోట్ల వ్యయంతో రోడ్లను పునరుద్ధరించాలని పేర్కొన్నారు. నగరంలోని మూడు జాతీయ రహదారుల మరమ్మత్తులను పూర్తి చేయాలని కోరారు.

 

యూపీలోని గనిలో పేలుడు.. ఐదుగురి మృతి

ఉత్తరప్రదేశ్ : సోన్ భద్ర జిల్లాలోని ఓ గనిలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి.  

జీహెచ్ ఎంసీ పరిధిలో ఆస్తిపనున్న తగ్గింపు..?

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ పరిధిలో ఆస్తిపనున్న తగ్గించే అవకాశం ఉంది. రూ.1200 లోపు పన్ను చెల్లింపుదారులకు ఉపయోగం కానుంది. రూ. 1200 నుంచి రూ. 101 తగ్గించే ఆలోచనలో ఉంది. 5 లక్షల మంది గృహస్తులకు ఉపయోగమని అంచనా వేశారు. త్వరలో ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 

15:30 - October 15, 2015

హైదరాబాద్ : మీ దగ్గర ఏపీ నెంబర్ తో కూడిన వాహన ప్లేట్ ఉందా ? అయితే మార్చుకోవడానికి సిద్ధం కండి. ఎందుకుంటే టి.సర్కార్ గురువారం దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని వాహనాల నెంబర్ ప్లేట్లను వచ్చే నాలుగు నెలల్లోగా మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వాహనానికి ఉన్న నాలుగు అంకెల సంఖ్య కొనసాగుతోందని ఉత్వరుల్లో స్పష్టం చేసింది. ఏపీ అని ఉన్న చోట టీఎస్ జిల్లా కోడ్ లు మారుతాయని, కోడ్ లు కూడా ఏర్పాటు చేసుకోవాలని అన్ని జిల్లాల ఆర్టీఏ కార్యాలయాలను ఆదేశించింది. ఆన్ లైన్ ద్వారా కూడా వాహన రిజిస్ట్రేషన్ సంఖ్యను మార్చుకొనే సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొంది.

ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించొద్దని అధికారులకు క్లాస్‌..
తెలంగాణ ఏర్పడిన తొలి రోజుల్లోనే ఈ అంశం తెరపైకి వచ్చింది. తక్షణమే ఏపీ నంబర్‌ ప్లేట్లను మార్చేయాలంటూ కొందరు రవాణా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ప్రజల్లో ఆందోళన వ్యక్తం కావడంతో.. సీఎం కేసీఆర్‌ జోక్యం చేసుకున్నారు. ప్రజలను గందరగోళ పరిచే నిర్ణయాలతో ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించ వద్దంటూ అధికారులకు క్లాస్‌ తీసుకున్నారు.

వాహనం నంబర్‌ యథాతథం..
అనేక తర్జన భర్జనల అనంతరం.. నంబర్‌ ప్లేట్ల మార్పిడికి సంబంధించిన జీవోను రవాణా శాఖ ఈరోజు జారీ చేసింది. వాహనం నంబరును యథాతథంగా ఉంచాలని.. ఏపీ బదులు టీఎస్‌ అని మార్చి ఆర్టీఏ కొత్త ఏరియా కోడ్‌ను చేర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ప్రాసెస్‌ను ఆన్‌లైన్‌లో కూడా చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ఈ ప్రక్రియకు ఎంత రుసుము వసూలు చేస్తారన్నది మాత్రం ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. 

వరంగల్ సెంట్రల్ జైలులో ఖైదీల ఘర్షణ

వరంగల్ : సెంట్రల్ జైలులో భోజన సమయంలో ఖైదీలు ఘర్షణ పడ్డారు. రెండు ముఠాలుగా విడిపోయి పరస్పరం దాడి చేసుకున్నారు. సాజిత్ అలీ, సురేష్ ముఠాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.

 

15:19 - October 15, 2015

వరంగల్ : జిల్లా సెంట్రల్ ఖైదీలు కొట్టుకున్నారు. భోజన సమయంలో ఘర్షణ పడడంతో వారికి గాయాలయ్యాయి. హైదరాబాద్ సెంట్రల్ జైలులో ఉన్న సాజీత్ ఆలీ, సురేష్ లు వరంగల్ సెంట్రల్ జైలుకు వచ్చారు. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా తరచూ గొడవకు దిగుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరినీ జైలు అధికారులు పలు మార్లు సర్దిచెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నాం భోజన సమయంలో సాజిత్, సురేష్ లు ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకున్నారు. అక్కడనే ఉన్న తోటి ఖైదీలు వారించారు. అయినా వినిపించుకోలేదు. చివరకు విషయం తెలుసుకున్న జైలు అధికారులు వచ్చి వారిని విడదీశారు. జైలు సూపరింటెండెంట్ వెంటనే అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించి నివేదికను తయారు చేశారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందచేయనున్నట్లు తెలుస్తోంది.

వాహన నెంబర్ ప్లేట్ల మార్పుపై ఉత్తర్వులు

హైదరాబాద్ : వాహన నెంబర్ ప్లేట్ల మార్పుపై తెలంగాణ రవాణా శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. 4 నెలల లోపు నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలని ఆదేశించింది. 

అంతర్జాతీయ క్రికెట్ కు జహీర్ వీడ్కోలు

ఢిల్లీ : అంతర్జాతీయ క్రికెట్ కు టీమిండియా క్రికెటర్ జహీర్ ఖాన్ వీడ్కోలు పలికాడు. జహీర్.. 200 వన్డేల్లో 282 వికెట్లు తీశాడు. 92 టెస్టుల్లో 311 వికెట్లు తీసుకున్నాడు. 17 టీ-20 మ్యాచ్ లో 17 వికెట్లు పడగొట్టాడు.  

15:10 - October 15, 2015

హైదరాబాద్ : అమరావతి శంకుస్థాపనకు ఏపీ సర్కార్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయ, దేశ, రాష్ట్రాల నుండి ప్రముఖులు విచ్చేస్తున్నారు. ఇందుకు ఆహ్వానపత్రికలు కూడా సిద్ధం చేసి ఆహ్వానిస్తోంది. కానీ తనకు మాత్రం ఆహ్వానం వద్దని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. ఆహ్వానం ఇచ్చినా జగన్ రాలేదని ఆ తరువాత తన మీద బండ విసురవద్దన్నారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. తాను రాకపోవడానికి ఎనిమిది కారణాలున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఓ జాతీయ ఛానెల్ తో ఆయన మాట్లాడారు. ఆ లేఖలో ఏమున్నాయో చూద్దాం..

  • రైతుల భూములు బలవంతంగా భూములు లాక్కొని వారి ఉసురు మీద రాజధాని కడుతున్నారు. దీనిపై పలు సందర్భాల్లో దీక్షలు చేసినా స్పందించలేదు.
  • రాజధాని ప్రాంతంలో సెక్షన్ 30, సెక్షన్ 144ని ఎందుకు అమలు చేస్తున్నారు. ప్రజలు ఆనందంగా ఉంటే ఈ సెక్షన్లు ఎందుకు అమలు చేస్తున్నారు ?
  • గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును బేఖాతర్ చేస్తూ కోర్టును, ప్రజల మనోభావాలను రెండిటినీ లెక్క చేయడం లేదు.
  • అసెన్డ్ భూములు, పేదల భూములును మీ ఇష్టం వచ్చినట్లు ఆక్రమించుకుంటున్నారు.
  • నచ్చిన ప్రైవేటు, విదేశీ సింగపూర్ కంపెనీలకు భూములు కేటాయిస్తున్నారు. కమీషన్ల కోసం..లంచాల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.
  • కేంద్రం రూ.1850 కోట్లు రాజధాని కోసం డబ్బులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా చేస్తామని పేర్కొంటోంది. రాష్ట్రానికి కేంద్రం సహాయం చేస్తుందని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు ప్రైవేటు సింగపూర్ కంపెనీలు..ప్రైవేటు విదేశీ కంపెనీలతో ఏం పని ?
  • కొంతమంది బినామీలు రాజధాని ప్రాంతంలో వందల ఎకరాలు కొనుగోలు చేయించి, వారి భూములు వదిలేసి పేదల భూములు మాత్రం ఇష్టం లేకపోయినా లాక్కొన్నారు.
  • ప్రజల డబ్బును దుబారా చేస్తూ ఒక్కరోజు తతంగాన్ని జరిపేందుకు దాదాపు రూ.400 కోట్లు బూడిదపాలు చేస్తున్నారు.

వీటన్నింటికీ నిరసనగా తాను రావడం లేదని లేఖలో స్పష్టం చేశారు. 

14:56 - October 15, 2015

మహారాష్ట్ర : ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆ రాష్ట్రంలో డాన్స్ బార్లపై ఉన్న నిషేధంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దాంతో డాన్స్ బార్లను తెరిపించేందుకు లైన్ క్లియరైంది. 2005లో తొలిసారిగా డాన్స్ బార్లపై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించగా, 2013లో దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ -ఎన్సీపీ ప్రభుత్వం మళ్లీ మహారాష్ట్ర పోలీసు చట్టాన్ని సవరించడం ద్వారా డాన్స్ బార్లను నిషేధించింది. ఇప్పుడు మళ్లీ సుప్రీంకోర్టు డాన్స్ బార్లపై ఉన్న నిషేధం మీద స్టే విధించడంతో వాటి యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

14:55 - October 15, 2015

ఢిల్లీ : తప్పిపోయిన పన్నెండేళ్ల తర్వాత తన తల్లిదండ్రులను చేరుకోబోతోంది గీత.. పుట్టుకతోనే మూగ, చెవిటి లక్షణాలున్న ఈ యువతి పదకొండేళ్ల వయసున్నప్పుడు దేశ సరిహద్దులో తప్పిపోయారు.. పాకిస్థాన్‌లోని కరాచీలో పెరిగి పెద్దయ్యారు.. కరాచీలోని ఈది ఫౌండేషన్‌ సంస్థ గీతకు ఆశ్రయం కల్పించింది. ప్రస్తుతం ఇరవైఏళ్ల వయసున్న ఈమె తన మాతృదేశానికి రావాలని కోరుకుంటున్నారు. భజరంగీ భాయిజాన్‌ సినిమా తర్వాత ఈ విషయం వెలుగులోకివచ్చింది. గీత తమ కూతురంటే తమ కూతురంటూ పంజాబ్‌, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌ రాష్ట్రాలకుచెందిన మూడు కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. వీరి ఫొటోలను పాక్‌లోని భారత హై కమిషన్‌కు పంపారు పోలీసులు. అక్కడి అధికారులు ఈ ఫొటోలను గీతకు చూపించారు. ఇందులో బీహార్‌లోని దంపతులను ఆమె గుర్తుపట్టారు. ఆ తర్వాత గీతను తన తల్లిదండ్రులతో కలిపేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వారం రోజుల్లో డాక్యుమెంట్ల ప్రక్రియ పూర్తిచేసి దేశానికి రప్పిస్తామని ఢిల్లీ అధికారులు చెబుతున్నారు.

రాజధాని శంకుస్థాపనకు నాకు ఆహ్వానం పంపొద్దు : జగన్

హైదరాబాద్ : సీఎం చంద్రబాబుకు వైసిపి అధినేత జగన్ బహిరంగ లేఖ రాశారు. రాజధాని శంకుస్థాపనకు తనకు ఆహ్వానం పంపవద్దని లేఖలో పేర్కొన్నారు. ఆహ్వానించినా తాను రాలేనని తేల్చి చెప్పారు. 

14:37 - October 15, 2015

విజయవాడ : ఒకప్పుడు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పేరు చెబితేనే ఆ ఇద్దరు మాజీ ఎంపీలు మండిపడేవారు. ఆయనపై విమర్శలు చేయాలంటే ఎప్పుడూ ముందుండేవారు. కానీ.. ఇప్పుడు సీన్‌ రివర్స్ అయ్యింది. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ జగన్‌ చేసిన నిరాహారదీక్షకు ఆ ఇద్దరు మాజీలు మద్దతు తెలిపారు. ఆ మాజీల్లో ఎందుకింత మార్పు? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ చేసిన నిరాహారదీక్షకు అన్నివర్గాల నుంచి మద్దతు లభించింది. ఒకప్పుడు జగన్‌ పేరు చెబితేనే తీవ్రస్థాయిలో విరుచుకుపడే నేతల నుంచి కూడా ఆయనకు మద్దతు లభించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో ముఖ్యంగా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌తో పాటు.. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు ఉన్నారు.

తాజాగా జగన్‌ దీక్షకు మద్దతు..
వైఎస్‌ జగన్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆ ఇద్దరు మాజీ ఎంపీలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే తాజాగా జగన్‌ దీక్షకు ఆ మాజీలిద్దరూ సంఘీభావం తెలపడంపై పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

జగన్‌కు దగ్గరయ్యేందుకు యత్నాలు..
రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీని వీడి,.. జై సమైక్యాంధ్ర పార్టీ ద్వారా పోటీ చేసి పరాజయం పాలైన ఆ ఇద్దరు మాజీలు.. దాదాపుగా ఏడాదిన్నర నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇంకా ఆలస్యమైతే ప్రజలు తమని మరిచిపోతారనే భావనకు వచ్చిన ఆ ఇద్దరు నేతలు.. జగన్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే వారిద్దరూ జగన్‌ దీక్షకు సంఘీభావం తెలిపినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు మొదట టీడీపీ వైపు చూసినా అక్కడ వీరికి ఎంట్రీ లేకపోవడంతో.. తాజాగా వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వైసీపీ నేత బొత్సతో వీరిద్దరూ టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

జగన్ ఎలా స్పందిస్తారో ?
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ ప్రత్యేక హోదా చుట్టూ తిరగడం.. జగన్‌ ప్రత్యేక హోదా కోసం దీక్ష చేయడం ఈ ఇరువురు నేతలకు కలిసొచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికైనా స్పందించకపోతే భవిష్యత్‌ ఉండదని భావించిన ఆ ఇద్దరు నేతలు.. జగన్‌ దీక్షకు మద్దతు తెలిపారు. మరి.. ఈ ఇద్దరు నేతల ప్లాన్‌పై జగన్‌ ఎంతవరకు స్పందిస్తాడో వేచి చూడాలి. 

14:34 - October 15, 2015

విశాఖపట్టణం : హుదూద్‌ బాధితులకు న్యాయం చేయకుండా సీఎం సంబరాలు చేసుకోవడం అన్యాయమని సీపీఎం నేత నరసింగరావు విమర్శించారు. హుదూద్‌ నిధుల వినియోగంలో గోల్‌మాల్‌ జరిగిందని ఆరోపించారు. దాతలు ఇచ్చిన 260కోట్ల రూపాయలకు లెక్కలు లేవని తెలిపారు. ఈ డబ్బు దుర్వినియోగం, బాధితులకు నష్టపరిహారంపై బహిరంగ విచారణకు సిద్ధమా? అంటూ సీఎం చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లిచంలేదన్నారు. సమాధానం చెప్పడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని నర్సింగరావు విమర్శించారు. 

14:31 - October 15, 2015

వరంగల్ : ఆశావర్కర్ల సమస్యలపై వరంగల్‌ లెఫ్ట్ ఎంపీ అభ్యర్ధి గాలి వినోద్‌కుమార్‌ నిరవధిక నిరాహారదీక్షకు దిగారు. వారి సమస్యలను పరిష్కరించేవరకు పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. గత 44 రోజులుగా ఆశా వర్కర్లు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. వాళ్లేమన్నా బ్రహ్మాండమైన కోరికలు కోరారా ? కేవలం రూ.15వేలు ఇవ్వాలని కోరుతున్నారని గుర్తు చేశారు. కేంద్రం దగ్గర కోట్ల రూపాయల నిధులున్నాయని, రాష్ట్రం దగ్గర రూ.450 కోట్లు ఉన్నా వాడలేదని ఆరోపించారు. కానీ బిడ్డ కోసం రూ. పది వేల కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. వీరంతా తెలంగాణ బిడ్డలు కాదా ? ఉద్యమం త్యాగం చేయలేదా ? ఆడబిడ్డలు తలుచుకుంటే నీ పతనం ప్రారంభమౌతుందని హెచ్చరించారు. కలెక్టర్..ఎమ్మెల్యే, మంత్రులను, ప్రజాప్రతినిధులను ఇక్కడకు రప్పిస్తామని గాలి వినోద్ కుమార్ పేర్కొన్నారు.

14:26 - October 15, 2015

హైదరాబాద్ : కేబీఆర్‌ పార్క్ ఎదుట కాల్పుల ఘటనలు గుర్తున్నాయి కదా..2014, నవంబర్ లో పారిశ్రామిక వేత్త నిత్యానందరెడ్డిపై గ్రేహౌండ్స్ మాజీ కానిస్టేబుల్‌ ఓబులేసు కాల్పులు జరపడం సంచలనం సృష్టిచింది. ఈ ఘటనపై తుది తీర్పును నాంపల్లి కోర్టు గురువారం వెల్లడించింది. ఈ కేసులో ప్రదాన నిందితుడు ఓబులేశుకు జీవిత ఖైదు విధించింది.
నవంబర్ 14వ తేదీన బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కులో ఉదయం నడకను ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు కారు ఎక్కుతున్న నిత్యానంద రెడ్డిపై ఓబులేశు ఏకే 47 తో కాల్పులు జరిపాడు. ఆ వెంటనే తేరుకున్న నిత్యానంద రెడ్డి తనవదనున్న తుపాకీతో ఎదురు కాల్పులు జరిపాడు. దీనితో ఆగంతకుడు ఏకే47 వదిలి కాళ్లకు పని చెప్పాడు. అనంతరం నిత్యానంద రెడ్డి చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తుపాకీ గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ ఓబులేశుదని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నేరం ఒప్పుకోవడంతో కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది.

14:17 - October 15, 2015

నల్గొండ : రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు..రైతులను ఆదుకుంటున్నాం..రుణమాఫీ అమలు చేస్తున్నాం..గత పాలకుల విధానాల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..నేతలు మాటలు చెబుతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. పంట ఎండిపోవడం..అప్పులు పేరుకపోవడం..వత్తిడిలు భరించలేని రైతన్న తనువు చాలిస్తున్నాడు. కానీ ఓ రైతు మాత్రం ఎండిపోయిన పంటకు నిప్పు పెట్టాడు. కళ్ల ఎదుట ఎండిపోయిన పంటను చూడలేకే ఆ రైతన్న ఈ నిర్ణయం తీసుకున్నాడు.
నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలం పాలచేడులో రైతు నరసయ్య వ్యవసాయం చేస్తున్నాడు. నీరు లేదు. అయినా పొలం పండించాలనుకున్నాడు. 2 లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేయించాడు. అయినా ఫలితం లేదు. వర్షాలు లేక.. నీరు అందక ఎండిపోతున్న వరిపొలాన్ని చూసి తట్టుకోలేకపోయిన రైతు నరసయ్య తన వరి పంటకు తానే నిప్పు పెట్టాడు.

 

ఎంజీబీఎస్, జేబీఎస్ లలో తనిఖీలు..

హైదరాబాద్ : ఎంజీబీఎస్, జేబీఎస్ లలో ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఛైర్మన్ దివాకర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం పాల్గొంది. బస్టాండులలో సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పన పరిశీలన చేయనున్నారు. 

ఆశా సమస్యలు పరిష్కారమయ్యే వరకు దీక్ష - గాలి వినోద్ కుమార్..

వరంగల్ : ఆశా వర్కర్లు సమస్యలను పరిష్కరించేంత వరకు నిరవధిక నిరహార దీక్షలను కొనసాగిస్తామని వరంగల్ ఉప ఎన్నిక వామపక్షాల అభ్యర్థి గాలి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. బతుకమ్మ పండుగకు రూ.10 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఆశౄ వర్కర్ల సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని సూటిగా ప్రశ్నించారు. 

 

స.హ.వార్షిక సమావేశాన్ని బహిష్కరించిన ఆర్టీఐ కార్యకర్తలు..

ఢిల్లీ : సమాచార హక్కు చట్టం వార్షిక సమావేశాన్ని ఆర్టీఐ కార్యకర్తలు బహిష్కరించనున్నారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో రేపు సమావేశం జరుగనుంది. కొందరికి మాత్రమే సమావేశానికి ఆహ్వానించడంపై ఆర్టీఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

13:51 - October 15, 2015

హైదరాబాద్ : ప్రముఖ జమైకా నవలా రచయిత మార్లన్‌ జేమ్స్ సరికొత్త రికార్డు సృష్టించారు.. ఈ ఏడాది ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్ అందుకున్నారు.. జమైకానుంచి తొలిసారి ఈ అవార్డు అందుకున్న వ్యక్తిగా నిలిచారు.. కాల్పనిక సాహిత్యరచనా విభాగంలో మన్‌బుకర్ సంస్థ ఈ అవార్డును అందిస్తుంది.. ఈసారి మొత్తం ఆరుగురి ఫిక్షన్ స్టోరీలు నామినీలుగా చోటు దక్కించుకున్నాయి... ఇందులో మార్లన్ రాసిన ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్‌ కిల్లింగ్స్ ఈ ప్రైజ్ దక్కించుకుంది.. 1970లో బాబ్‌ మార్లీలో జరిగిన మారణహోమాన్ని బేస్‌ చేసుకొని జేమ్స్ ఈ బుక్ రాశారు.. లండన్‌లోని గిల్డ్‌ హాల్‌లో ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది.. 

ఫైబర్ గ్రిడ్ పై సాయంత్రం బాబు సమీక్ష..

విజయవాడ : సాయంత్రం నాలుగు గంటలకు ఫైబర్ గ్రిడ్ పై..సాయంత్రం ఐదు గంటలకు జలవనరుల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. 

13:50 - October 15, 2015

హైదరాబాద్ : చైనా ఎయిర్‌ లైన్స్‌లో అద్భుతం చోటుచేసుకుంది. భూమికి సుమారు 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలోనే ఓ మహిళ శిశువును ప్రసవించింది. అత్యవసర పరిస్థితి తలెత్తినా విమానం ల్యాండయ్యేలోగానే తోటి ప్రయాణికులు, సిబ్బంది సహాయంతో శిశువుకు జన్మనిచ్చింది మహిళ. ఈ ఘటనను చిత్రించి యూట్యూబ్‌లో పెట్టడంతో సంచలనమై కూర్చుంది.

ఎగురుతున్న విమానంలోనే...

ఆసుపత్రిలో సుఖంగా ప్రసవించాల్సిన ఓ గర్భిణి..ఆకాశంలో ఎగురుతున్న విమానంలో అందులోనూ 30 వేల అడుగుల ఎత్తులో ప్రసవించాల్సిన వచ్చింది. ఈ ఘటన చైనా ఎయిర్‌లైన్స్ లో చోటు చేసుకుంది. బాలి నుంచి లాస్‌ ఏంజెల్స్‌ వెళుతున్న విమానంలో తైవాన్‌ చెందిన గర్భిణి ప్రయాణిస్తుండగా ప్రసవవేదన మొదలైంది. దీంతో విమానంలోని ఎయిర్‌ హోస్టెస్‌లు అప్రమత్తమయ్యారు. పైలెట్‌కు సమాచారం తెలియజేయగా ఎమర్జన్సీ ల్యాండింగ్‌ కోసం అమెరికాలోని అలాస్కా విమానశ్రయాన్ని అభ్యర్థించారు.

ల్యాండవడానికి మరో 30 నిమిషాల ముందే...

దీంతో ఎమర్జన్సీ ల్యాండింగ్‌కు అనుమతి లభించింది. కానీ ల్యాండవడానికి మరో 30 నిమిషాలు మిగిలి ఉండగానే మహిళ పరిస్థితి కాన్పుకు సిద్ధమైపోయింది. అదృష్టవశాత్తు విమానంలోనే ఒక డాక్టర్‌ కూడా ప్రయాణిస్తుండడంతో ఆమె సహాయంతో ఎయిర్‌ హోస్టెస్‌లు, తోటి ప్రయాణికులు కలిసి కాన్పు చేశారు. కాసేపటికే విమానంలో శిశువు కేర్‌మని శబ్దం వినిపించగానే అందరూ హర్షం వ్యక్తం చేశారు.

బిడ్డ పౌరసత్వంపైనే సందిగ్ధత.....

విమానం అలాస్కాలో ల్యాండవ్వగానే తల్లి బిడ్డను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తల్లిబిడ్డ క్షేమంగానే ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పుడు బిడ్డ పౌరసత్వంపైనే సందిగ్ధత నెలకొంది. ఆకాశంలోని ట్రాన్సిట్‌ జోన్‌లో జన్మనివ్వడం ఒక కారణంగా చెబుతున్నారు. చైనాకు చెందిన అధికార విమానంలో జన్మించడంతో చైనా పౌరసత్వం ఇవ్వాలా, లేక శిశువు తొలిసారి నేలపై అడుగుపెట్టిన అమెరికా పౌరసత్వం ఇవ్వాల్సి ఉంటుందా అని అధికారులు ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉంటే శిశువుకు బర్త్‌ సర్టిఫికేట్‌ జారిచేసేది అలాస్కా ఆసుపత్రి కాబట్టి అమెరికా పౌరసత్వం లభించే అవకాశం ఉందని తేలింది. శిశువుకు 18 ఏళ్లు వచ్చే వరకూ చైనా ఎయిర్‌ లైన్స్‌లో ఉచితంగా తిరిగే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు సదరు ఎయిర్ లైన్స్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.   

13:47 - October 15, 2015

హైదరాబాద్ : సెల్‌ఫోన్ వ్యసనం ఓ మహిళ ప్రాణం తీసింది.. కేరళకుచెందిన ఓ మహిళ సెల్‌ఫోన్‌తో ఎక్కువ సమయం గడిపేది.. ఇలా గంటలకొద్దీ వాట్స్ యాప్, ఫేస్ బుక్‌ వాడటం మంచిదికాదని భర్త మందలించాడు.. ఇందులోంచి బయటకు రావాలంటూ హెచ్చరించాడు.. దీంతో ఇరవైఏళ్ల ఆ గృహిణి తీవ్ర ఆవేదనకు లోనైంది.. వెంటనే తన సోదరుడికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది.. కోయంబత్తూరు గౌండపాలయంలోని తన ఇంట్లో ఉరివేసుకుంది.. బంధువులు వచ్చి తలుపు తెరిచేవరకే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.. ఇల్లాలి మరణవార్తతో కుంగిపోయిన భర్త కుమార్‌ బిల్డింగ్‌పైనుంచి దూకి చనిపోయేందుకు ప్రయత్నించాడు.. స్థానికులు గమనించి రక్షించడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు.. అయితే ‌ఈ ఆత్మహత్య వెనక ఇతర కారణాలు కూడా ఉండొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.. 

13:45 - October 15, 2015

హైదరాబాద్ :కొందరు రచయితలు తమ అవార్డులను వెనక్కిపంపడంవెనక రాజకీయ దురుద్దేశం ఉందన్నారు.. హిందీ నటుడు అనుపమ్‌ ఖేర్... ప్రధాని మోడీ అంటే గిట్టనివారే ఇలాంటి పనులు చేస్తున్నారని విమర్శించారు.. దేశంలో హింసాత్మక ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదని గుర్తుచేశారు.. మిగతా అవార్డులుకూడా ఎందుకు వెనక్కి పంపడంలేదని ప్రశ్నించారు అనుపమ్‌ ఖేర్..

 

గీత త్వరలో వచ్చేస్తుంది - సుష్మా..

ఢిల్లీ : గీత త్వరలో వచ్చేస్తుందని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. బాలిక కుటుంసభ్యులను గుర్తించడం జరిగిందని, డీఎన్ఏ టెస్టు అనంతరం వారికి అందచేస్తామని ట్వీట్ చేశారు. 12 ఏళ్ల క్రితం దారితప్పిన గీత పాకిస్తాన్ కు చేరిన సంగతి తెలిసిందే. బీహార్ లో తన తల్లిదండ్రుల ఫొటోలను గీత గుర్తించింది. 

13:43 - October 15, 2015

హైదరాబాద్ : ముందు కర్చీఫ్‌ వేశారు. ఆ తర్వాత దుప్పటి వేశారు. లక్షల కోట్ల విలువైన సంపద పట్టేశారు. తామైతేనే ఖర్చు తగ్గుతుందంటూ తెలివిగా పోటీదారులను తప్పించేశారు. చేతిలోకి వచ్చాక గుప్పిట బిగించేశారు. రేటు పెంచితే తప్ప పని నడవదంటూ బ్లాక్‌మెయిలింగ్‌ చేశారు. లాబీయింగ్‌తో రేటు పెంచుకున్నారు. ఇవన్నీ చాలదన్నట్లు దొంగతనానికి కూడా దిగజారారు. బిలీయనర్లు కాబట్టి ఈ దొంగలు వాళ్ల రేంజ్‌లోనే 9 వేల కోట్లు దోచేశారు.

ఓఎన్‌జీసిని పక్కకు నెట్టి కేజీబేసిన్‌లోకి రిలయెన్స్‌ ఎంట్రీ....

రిలయెన్స్‌.. ప్రపంచ సంపన్నుల వరుసలో నిలిచిపోయారు ఈ కంపెనీ అధినేతలు. ఈ భారీ సామ్రాజ్య నిర్మాణం వెనుక వారు నడిపిన వ్యూహాలు తెలుసుకుంటే దిమ్మ తిరగాల్సిందే. అత్యంత విలువైన కేజీ బేసిన్‌ కాంట్రాక్ట్‌ను వారు సంపాదించిన తీరు.. ఆ తర్వాత రేటు పెంచుకోవడానికి చేసిన జిమ్మిక్కులు.. ఇప్పుడు కొత్తగా వేరే కంపెనీకి.. అది కూడా పోటీలో లేకుండా తప్పించేసిన ప్రభుత్వ రంగ సంస్థ ఓన్‌జీసీకి కేటాయించిన ప్రాంతంలో గ్యాస్‌ తోడేసుకోవడం.. ఇవన్నీ చూస్తే రిలయెన్స్‌ కంపెనీ రికార్డులు ఎలా బద్దలుకొడుతుందో అర్ధమైపోతుంది.

దబాయించి రేటు పెంచుకున్న రిలయెన్స్‌....

కేజీబేసిన్‌లోని గ్యాస్‌ నిక్షేపాలను వెలికి తీసే పని మొదట ఓఎన్‌జీసీ చేయాల్సి ఉన్నా.. వారు చేస్తే ఖర్చు ఎక్కువని, ప్రభుత్వానికి భారమని.. తామైతే తక్కువకు చేస్తామని.. పైగా బ్రిటన్‌ నుంచి అత్యాధునిక టెక్నాలజీని తెచ్చి వాడతామని బిల్డప్‌ ఇచ్చి రిలయెన్స్‌ ఆ కాంట్రాక్ట్‌ కొట్టేసింది. తీరా చేతిలోకి వచ్చాక.. ఖర్చు ఎక్కువవుతుందంటూ రేటు పెంచాల్సిందేనని డిమాండ్‌ చేసింది. కేంద్రంలో ఏ పార్టీ వచ్చినా.. అందరూ అస్మదీయులే కావడంతో వారి పని సులువుగా అయిపోయింది.

ఓఎన్‌జీసి క్షేత్రాల్లోనూ అక్రమంగా గ్యాస్‌ వెలికితీత.....

ఇప్పుడు కొత్తగా వారికి కేటాయించిన ప్రాంతం పక్కనే ఉన్న ఓఎన్‌జీసీ క్షేత్రాల్లోని గ్యాస్‌ను కూడా గుట్టుచప్పుడు కాకుండా లాగేశారు. ఈ విషయం ఓఎన్‌జీసీ ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపిన డీ అండ్‌ ఎం అనే కన్సల్టెన్సీ అది నిజమేనని తేల్చింది. 2009 నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు 9 వేల కోట్ల విలువైన గ్యాస్‌ రిలయెన్స్‌ తీసేసుకుందని లెక్క ఇచ్చింది.

కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది?....

ఇప్పుడు ఈ విచారణ రిపోర్టుపై కేంద్రం ఎలా రియాక్టవుతుందనేదే ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్‌ హయాంలో అడ్డగోలుగా రిలయెన్స్‌కు రేటు ఇచ్చారన్న బిజెపి.. తాము అధికారంలోకి రాగానే సకల మర్యాదలతో వారు అడిగిన రేటు ఇచ్చేసింది. ఇవ్వక తప్పదని వాదించింది కూడా. మరి అంత అభిమానం చూపించిన సర్కార్‌.. ఇప్పుడు ఈ రిపోర్టును పట్టించుకుంటుందా.. రిలయెన్స్‌ దగ్గర 9 వేల కోట్లు వసూలు చేస్తుందా లేదా అనేదే ప్రశ్న.

13:40 - October 15, 2015

హైదరాబాద్ : తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యేల దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తమ పార్టీ అధికారంలో వుంది కదా అని అధికారులపై ప్రతాపాన్ని చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆదిలాబాదు జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్వయంగా ఇరిగేషన్ ఇంజినీర్ ను భౌతిక దాడికి దిగినట్లు వార్తలు వస్తున్నాయి.

బిల్లుల మంజూరులో జాప్యం.....

మిషన్ కాకతీయ పనులకు సంబంధించిన బిల్లుల మంజూరులో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ.. సాగునీటి పారుదల శాఖకు చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వీరేందర్ ను ఆ ఎమ్మెల్యే తన ఇంటికి పిలిపించి బూతు పురాణం అందుకున్నారట. అంతేకాదు.. ఆయన ఇంజినీర్ పై భౌతిక దాడికి దిగినట్లు ఆరోపణలు వచ్చాయి.

మునిసిపల్‌ డీఈపై ఎమ్మెల్యే తిట్ల పురాణం...

ఇక ఈ సంగతి మరిచిపోక మునుపే ఇప్పుడు.. పిలవగానే ఇంటికి రాలేదంటూ మునిసిపల్‌ డీఈపై రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ ఎమ్మెల్యే తిట్ల పురాణం అందుకున్నారనే వార్త సంచలనం రేపింది. వికారాబాద్‌ ఎమ్మెల్యే సంజీవరావు ఆఫీసులో అందరి ముందు తీవ్ర పదజాలంతో దూషించారు. ఎమ్మెల్యే సంజీవరావు నేరుగా మునిసిపల్‌ కార్యాలయానికి వెళ్లి డీఈ గోపాల్‌ను పిలిపించాలని హుకుం జారీ చేశారు.

సంజీవరావు నిలబెట్టి ఎమ్మెల్యే తీవ్ర పదజాలంలో.....

అక్కడికి వచ్చిన గోపాల్‌ను సంజీవరావు నిలబెట్టి ఎమ్మెల్యే తీవ్ర పదజాలంలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే వెంట వచ్చిన అనుచరులూ డీఈ గోపాల్‌ను వదల్లేదు. ఆయనపై ఎమ్మెల్యేకు రకరకాల ఫిర్యాదులు చేశారు. ఎమ్మెల్యే వెళ్లిపోయిన తర్వాత... తనకు జరిగిన అవమానం తట్టుకోలేక కమిషనర్‌ చాంబర్‌లోనే గట్టిగా రోదించారు. తీవ్ర అభ్యంతరకమైన భాషలో డీఈ గోపాల్‌పై ఎమ్మెల్యే విరుచుకుపడినట్లు సమాచారం. కాగా ఎమ్మెల్యే తీరుపై సబ్ కలెక్టర్ కు ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఆందోళనకు దిగి నిరసన తెలియచేశారు. తాను ఇంజినీర్ ను దూషించలేదని, మందలించానని సంజీవరావు చెబుతున్నారు.

పరాకాష్టకు అధికార పార్టీ ఎమ్మెల్యేల జులుం....

ఇదిలా ఉంటే ఈ రెండు వరుస సంఘటనలతో అధికార పార్టీ ఎమ్మెల్యేల జులుం పరాకాష్టకు చేరిందని ఉద్యోగులు అంటున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారంపై మాత్రం ఉద్యోగులు సీరియస్‌ గా ఉన్నారు. ఈ రోజు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో పెన్‌డౌన్‌ నిర్వహించారు. జిల్లా పరిషత్‌ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.   

సాహిత్య అకాడమీ అవార్డును వెనకిచ్చేసిన కె.వీరభద్రప్ప..

ఢిల్లీ : కన్నడ రచయిత కె.వీరభద్రప్ప సాహిత్య అకాడమీ పురస్కారాన్ని వెనక్కి పంపించారు. తనకిచ్చిన చెక్ ను కూడా ఇచ్చేశారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయిత ఎం.ఎం.కల్బుర్గి హత్యకు నిరసనగా ఆయన అవార్డును వెనక్కి ఇచ్చేశారు. 

13:35 - October 15, 2015

హైదరాబాద్ : మెదక్‌లో గురువారం కవిత బతుకమ్మ ఆడుతున్నారు. బతుకమ్మల అలంకరణకు అవసరమైన పూలను పంచారు. ఎంపీ కవితతో పాటు డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ పూలతో బొడ్డెమ్మలను అలకరిస్తూ.. మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

జైట్లీని కలిసిన చౌహాన్..

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం. 

13:33 - October 15, 2015

హైదరాబాద్‌ : కూసింత ముందుకు కదిలితే బారెడంత వెనక్కి వెళ్లింది హైదరాబాద్‌ మెట్రో రైల్ పనులు. ఏడాది కాలం పాటు ఆగిన పనుల్లో తాజాగా మెట్రో అలైన్‌మెంట్‌ మార్పుపై సర్కారు తీసుకున్న యూటర్న్‌ కారణంగా చలనం వచ్చింది. కాకుంటే తెలంగాణ ప్రభుత్వపు అనాలోచిత నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం..

మెట్రోరైల్ అలైన్‌మెంట్‌ పాత పద్దతుల్లోనే ఉండబోతుందా..? అలైన్‌మెంట్ మార్చుతామని ముందునుంచి మంకుపట్టు పట్టిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుందా..? అని అంటే అవుననే సమాధానం వస్తోంది. లక్డీకాపుల్ - నాంపల్లి మార్గంలో అలైన్‌మెంట్‌ మార్పు పై ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

మెట్రోరైల్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు చెయ్యాలన్న ప్రభుత్వం......

మెట్రోరైల్‌ అలైన్‌మెంట్‌లో కొన్ని ప్రాంతాల్లో మార్పులు చెయ్యాలని టిఆర్ఎస్ ముందు నుంచి పట్టుబట్టింది. అధికారంలోకి రాగానే మార్పులు చెయ్యాల్సిందేనని నిర్ణయించింది. ప్రధానంగా చారిత్రక కట్టడాలను రక్షించేందుకు, ప్రార్థనా మందిరాలను కాపాడేందుకు, ఎక్కువ ఆస్తులను కూడగట్టేందుకు మెట్రో అలైన్‌మెంట్‌లో మార్పులు అనివార్యమని చెప్పింది.

ఎల్బీనగర్‌-మియాపూర్‌ రూట్లో అలైన్‌మెంట్‌ మార్పులు చేసిన ప్రభుత్వం.....

ఇందులో భాగంగా కారిడార్-1 ఎల్బీనగర్-మియాపూర్ రూట్లో అసెంబ్లీ ముందునుంచి కాకుండా.. లక్డీకపూల్ మెట్రో స్టేషన్ నుంచి పోలీస్ క్వార్టర్స్, డీజీపీ కార్యాలయం, అసెంబ్లీ, జూబ్లీహాల్‌ల వెనక నుంచి పబ్లిక్ గార్డెన్ ఓపెన్ గ్రౌండ్, తెలుగు విశ్వ విద్యాలయం వద్ద నాంపల్లి మెయిన్ రోడ్డు వరకు మార్పు చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏడాది కాలంగా నిలిచిపోయిన మెట్రో పనులు....

ఈ మార్పులకోసం పూర్తి స్థాయిలో స్టడీ కూడా చేసింది ఎల్ అండ్ టీ సంస్థ. ఆ నివేదికను ప్రభుత్వానికి అందించినట్టు సమాచారం. గత ఏడాది జూలైనుండి ఈ మార్గంలో పనులు కూడా నిలిపేశారు ఎల్ అండ్ టి అదికారులు. ఇంతవరకు బాగానే ఉన్నా ఏడాది దాటిన తరువాత పాతమార్గంలోనే మెట్రో పనులు చేపట్టాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు తగినట్టే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో గన్‌పార్క్ వద్దగల జంక్షన్లో పిల్లర్ నిర్మాణాలకు మార్కింగ్ చేశారు ఎల్ అండ్ టి అధికారులు. దీంతో ఈ మార్గంలో సంవత్సరంకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ మొదలు కానున్నాయి.

తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.....

ప్రభుత్వం తాజా నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒక సారి అలైన్ మెంట్ మార్పు ఉంటుందని, మరో సారి పాతమార్గంలోనే మెట్రోనిర్మిస్తామని ఇష్టంవచ్చిన నిర్ణయాలు చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఏడాది కాలం పాటు సమయాన్ని వృథా చేసి మళ్లీ అదే మార్గంలో నిర్మిస్తామనడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆలస్యం కారణంగా రోజు రోజుకు మెట్రో ప్రాజెక్టు వ్యయం కోట్లకు కోట్లు పెరుగుతుందని, ప్రభుత్వ నిర్ణయాలకారణంగా ప్రజలపై మరింత భారం పడుతుందని అంటున్నారు హైదరాబాద్ నేతలు.

ఆలస్యం అయితే ప్రాజెక్టు వ్యయం పెరిగి ప్రజలపై మరింత భారం....

అలైన్‌మెంట్ మార్పువల్ల ఇబ్బందులు వస్తాయని ఎల్ అండ్ టి అధికారులు, ఆలస్యం అయితే ప్రాజెక్టు వ్యయం పెరిగి ప్రజలపై మరింత భారం పడుతుందని నిపుణులు పదే పదే చెబుతున్నప్పటికి ప్రభుత్వం ముందుకెళ్లింది . అయితే మిగతా రెండు ప్రాంతాల్లో అలైన్‌మెంట్‌ మార్చుతారా, లేక పాత మార్గంలోనే నిర్మిస్తారా అనే అంశంపై మరికొన్ని రోజులు గడిస్తేగాని క్లారిటీ రాదు. 

13:33 - October 15, 2015

ముంబై : టీమిండియా ఆల్ టైమ్ గ్రేట్ ..లెఫ్టామ్ పేస్ బౌలర్ జహీర్ ఖాన్ ఐపీఎల్ మినహా మిగిలిన అన్ని క్రికెట్ ఫార్మాట్లకూ గుడ్ బై చెప్పినట్లు ప్రకటించాడు. తన రిటైర్మెంట్ వార్తను ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. టెస్ట్ క్రికెట్, వన్డే, టీ-20 ఫార్మాట్లలో మొత్తం 610 వికెట్లు పడగొట్టిన రికార్డు జహీర్ ఖాన్ కు ఉంది. మొత్తం 92 టెస్ట్ మ్యాచ్ ల్లో 311 వికెట్లతో కపిలే దేవ్ తర్వాతి స్థానంలో నిలిచాడు. 200 వన్డేల్లో 282 వికెట్లు, 17 టీ-20 మ్యాచ్ ల్లో 17 వికెట్లు పడగొట్టిన ఘనత కూడా జహీర్ ఖాన్ దే. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను ఎనలేని సంతృప్తితో నిష్క్రమిస్తున్నానని ఐపీఎల్ తొమ్మిదో సీజన్ కు సిద్ధమవుతున్నానని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. గత రెండుదశాబ్దాలుగా క్రికెట్టే ఊపిరిగా భావించిన తనకు ఎన్నో మధురస్మృతులు ఉన్నాయని జహీర్ తెలిపాడు.

తీపి జ్ఞాపకాలు...
అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను ఎంతో సంతృప్తి ఎన్నో అరుదైన విజయాలు తీపి జ్ఞాపకాలతో రిటైరవుతున్నట్లు టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ప్రకటించాడు. కుటుంబసభ్యులు, స్నేహితులతో చర్చించిన తర్వాతే ఈనిర్ణయం తీసుకొన్నట్లు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెటర్ గా తాను ఎదగడంలో ప్రధానపాత్ర వహించిన అందరికీ జహీర్ కృతజ్ఞతలు తెలిపాడు. గత రెండు దశాబ్దాల కాలం పాటు క్రికెట్టే ఊపిరిగా తాను జీవించానని గుర్తు చేశాడు.

మన నీరు - మన మట్టిపై బాబు టెలికాన్ఫరెన్స్..

విజయవాడ : మన నీరు - మన మట్టిపై సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మట్టి, నీరు, సంకల్ప పత్రాలను రాత్రికి మండల కేంద్రాలకు తరలించాలని బాబు ఆదేశాలు జారీ చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు, పేరొందిన సమాజ సేవకుల నివాసాల్లో నుండి కూడా మట్టి, నీరు సేకరించాలని సూచించారు. 

ప్రాజెక్టు నిర్మాణ పనులపై హరీశ్ రావు సమీక్ష

హైదరాబాద్ : తెలంగాణ లో భారీ, మధ్యతరహా ప్రాజెక్టు నిర్మాణ పనులపై రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతి పై అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాగునీటి శాఖ ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.

కడప కలెక్టరేట్ వద్ద సీపీఎం మహాధర్నా...

కడప : కలెక్టరేట్ వద్ద సీపీఎం మహాధర్నా నిర్వహించింది. రాయలసీమకుఏ రూ.50వేల కోట్ల ప్యాకేజీ, 200 టీఎంసీల సాగు నీరు, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ధర్నాలో కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ పాల్గొన్నారు. అభివృద్ధి విషయంలో రాయలసీమకు తొలి నుండి అన్యాయమే జరుగుతోందని, సీమ నుండి ముఖ్యమంత్రులున్నా ఉపయోగం లేదన్నారు. చంద్రబాబు కూడా కోస్తా అభివృద్ధికే కృషఙ చేస్తున్నారని, తీరు మారకపోతే టిడిపికి ప్రజలు బుద్ధి చెబుతారని గఫూర్ పేర్కొన్నారు.

 

డిసెంబర్ 15-20 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

గుంటూరు : డిసెంబర్ 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. అమరావతిలోనే సమావేశాలుంటాయని, త్వరలో శాసనసభా సమావేశాలకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.

నాగార్జున వర్సిటీలో కలాం కాంస్య విగ్రహావిష్కరణ..

గుంటూరు : నాగార్జున యూనివర్సిటీలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. కలాం కాంస్య విగ్రహాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ కోడెల, మంత్రులు పత్తిపాటి, రావెల, బొజ్జల హాజరయ్యారు. ఏఎన్యూలో సింథెటిక్ ట్రాక్ ఏర్పాటుకు కోడెల శంకుస్థాపన చేశారు.

 

గాలి వినోద్ కుమార్ నిరవధిక నిరహార దీక్ష ప్రారంభం..

వరంగల్ : హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద వరంగల్ ఉప ఎన్నికల వామపక్షాల అభ్యర్థి గాలి వినోద్ కుమార్ నిరవధిక నిరహార దీక్ష చేపట్టారు. ఆశాల సమ్మెను విరమింపచేయాలని, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఆయన ఈ దీక్ష చేపట్టారు. దీక్షలో ఆశాల జిల్లా గౌరవాధ్యక్షుడు చక్రపాణి పాల్గొన్నారు. వినోద్ కుమార్ చేపట్టిన దీక్షకు వామపక్షాల జిల్లా నేతలు మద్దతు ప్రకటించారు.

ఎంజీబీఎస్ లో అసెంబ్లీ కమిటీ పర్యటన..

హైదరాబాద్ : ఎంజీబీఎస్ లో అసెంబ్లీ కమిటీ పర్యటించింది. బస్టాండ్ లో ఉన్న మరుగుదొడ్లు, తాగునీరు, వసతుల కల్పన, దుకాణాల నిర్వాహణ, వస్తు విక్రయాలను కమిటీ పరిశీలించింది. 

సీఎం వీరభద్రసింగ్ అరెస్టుకు పిటిషన్...

హిమాచల్ ప్రదేశ్ : సీఎం వీరభద్రసింగ్ అరెస్టుపై పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టులో సీబీఐ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. 26న విచారణకు కోర్టు స్వీకరించనుంది. అవినీతి వ్యవహారాంలో వీరభద్రసింగ్ పై సీబీఐ అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే.

జగన్ కు రాజకీయ పరిపక్వత లేదు - డొక్కా...

గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ కు రాజకీయ పరిపక్వత లేదని టిడిపి అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు జగన్ ఏడుసార్లు దీక్షలు చేశారని, ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

 

పాక్ నుంచి 'గీత' వచ్చేస్తోంది.

హైదరాబాద్: ఎట్టకేలకు గీత తిరిగి మాతృదేశం రాబోతుంది. పన్నేండేళ్ల తర్వాత తన తల్లిదండ్రుల ఒడిని చేరబోతుంది. పుట్టుకతోనే మూగ, చెవిటి లక్షణాలు ఉన్న గీత తన తల్లిదండ్రులను గుర్తించిందని, ఇక ఆమెను భారత్ రప్పించే ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలోనే డాక్యుమెంట్ల కార్యక్రమాలు పూర్తి చేసి వారి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తామని ఢిల్లీ అధికారులు తెలిపారు. ఆమె తల్లి దండ్రులు ప్రస్తుతం బీహార్లో ఉన్నారని చెప్పారు. 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు(2003లో) గీత పొరపాటున సరిహద్దులో తప్పిపోయి ప్రస్తుతం పాకిస్థాన్ లోని కరాచీలో చిక్కిపోయింది.

సీబీఐ డైరెక్టర్ కు షాకిచ్చిన ప్రత్యేక కోర్టు...

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అదనపు స్ప్రెక్ట్రం కేటాయింపు కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సీబీఐ అధికారులకు ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు షాకిచ్చింది. కేంద్ర టెలికాం శాఖ మాజీ కార్యదర్శి శ్యామల్ ఘోష్ పై సీబీఐ అధికారులు తప్పుడు కేసులు బనాయించారని ఆక్షేపించింది. ఈ మేరకు నేటి ఉదయం జరిగిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి సీబీఐ అధికారుల తీరును తప్పుబట్టారు. అంతేకాక తప్పుడు కేసులతో నానా తంటాలు పడుతున్న శ్యామల్ ఘోష్ కు ఈ కేసు నుంచి విముక్తి కల్పించారు. ఇక శ్యామల్ ఘోష్ పై తప్పుడు కేసులు బనాయించిన సీబీఐ అధికారులపై విచారణకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

డాన్స్ బార్లకు సుప్రీం గ్రీన్ సిగ్నల్...

హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆ రాష్ట్రంలో డాన్స్ బార్లపై ఉన్న నిషేధంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దాంతో డాన్స్ బార్లను తెరిపించేందుకు లైన్ క్లియరైంది. 2005లో తొలిసారిగా డాన్స్ బార్లపై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించగా, 2013లో దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ -ఎన్సీపీ ప్రభుత్వం మళ్లీ మహారాష్ట్ర పోలీసు చట్టాన్ని సవరించడం ద్వారా డాన్స్ బార్లను నిషేధించింది.దీనిపై ఇండియన్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

కానిస్టేబుల్ ఓబులేసుకు జీవిత ఖైదు

హైదరాబాదు : నగరంలోని కేబీఆర్ పార్క్ వద్ద ప్రముఖ పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డిపై కాల్పులకు తెగబడ్డ కానిస్టేబుల్ ఓటులేసుకు జీవిత ఖైదు శిక్ష పడింది. ఈ మేరకు నాంపల్లి కోర్టు కొద్దిసేపటి క్రితం తీర్పు వెలువరించింది. గతేడాది నవంబర్ 19న మార్నింగ్ వాక్ కు వచ్చిన నిత్యానందరెడ్డిపై అక్కడే మాటు వేసిన ఓబులేసు కాల్పులకు దిగాడు. అయితే వెనువెంటనే అప్రమత్తమైన నిత్యానందరెడ్డి బుల్లెట్ గాయాల నుంచి తప్పించుకోవడమే కాక ఓబులేసును పట్టుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో నిత్యానందరెడ్డి నుంచి తప్పించుకున్న ఓబులేసు పరారయ్యాడు.

రవీంధ్ర భారతి కలాం జయంతి వేడుకలు

హైదరాబాద్: వందేమాతరం ఫౌండేసన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం 84వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలాయం జయంతి వేడకులకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

12:49 - October 15, 2015

కర్నూలు : రాయలసీమ నుండి ఎంపికైన రాజకీయ నేతలందరూ ఆ ప్రాంతానికి పంగనామాలు పెట్టారని సీపీఎం నేత గఫూర్ విమర్శించారు. రాయలసీమకు 50 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.. సీపీఎం మహాధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడుతూ...విభజన చట్టంలో పేర్కొన్న హామీలే నెరవేరడం లేదని ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆది నుంచి సీమకు అన్యాయమే జరుగుతుందని వారు మండిపడుతున్నారు. 

12:47 - October 15, 2015

విజ్ఞానం ఆయన ఊపిరి...నిరాడంబరం ఆయన పెన్నిధి. సామాన్య ప్రజలే ఆయన ఉచ్ఛ్వాసనిశ్వాస. అతి సామాన్యుడిగా పుట్టి...అసామాన్యుడిగా ఎదిగి సామాన్యుల కోసమే నిరంతరం శ్రమించిన విజ్ఞాన గని డాక్టర్‌ అబ్దుల్‌ కలాం. రామేశ్వరంలో నిరుపేద కుటుంబంలో జన్మించి రాష్ర్టపతి స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి అబ్దుల్‌ కలాం. నేడు ఆ మహానుభావుడి జయంతి.

విద్యార్థులకు ఆయనొక దిక్సూచి...

విద్యార్థులకు ఆయనొక దిక్సూచి. వారికి కలలను కనడం నేర్పారు కలాం. అంతేకాదు కన్న కలలను ఎలా సాకారం చేసుకోవాలో కూడా చూపించారు. నిత్య విద్యార్థిగా విద్యార్థులతోనే గడుపుతూ అనంతమైన విజ్ఞానాన్ని ఆర్జించి భారతీయ మిస్సైల్‌ మ్యాన్‌గా చరిత్రపుటల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు కలాం.

నిరుపేదగా పుట్టి...నిప్పులుచిమ్ముతూ నింగికెగిరాడు.....

నిరుపేదగా పుట్టాడు...నిప్పులుచిమ్ముతూ నింగికెగిరాడు. విజ్ఞాన యోధుడై అంతరిక్షంలో భారతదేశపు అగ్నిని రగిల్చాడు. రక్షణరంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. విస్తృతమైన పరిశోధనలతో తన విలక్షణతను చాటుకున్నారు డాక్టర్‌ అబ్దుల్‌కలాం. దేశాభివృద్ధికి కులాలు, మతాలు కాదు విజ్ఞానం, స్వచ్ఛమైన పాలనొక్కటే మార్గమని నినదించిన స్ఫూర్తిప్రదాత కలాం.

మహోన్నత వ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరు....

భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరు. ప్రపంచ పటంలో త్రివర్ణపతాకాన్ని ఎగురవేసిన భరతమాత ముద్దుబిడ్డ ఆయన. శాస్ర్తసాంకేతిక రంగంలో కీలక మైలురాయి కలాం. ఓ శాస్ర్తవేత్తగా పరిశోధనలను.. రాష్ర్టపతిగా పాలనను సామాన్యుల దరికి చేర్చిన మహాజ్ఞాని అతను.

ప్రజల రాష్ర్టపతిగా పేరు.....

ప్రజల రాష్ర్టపతిగా పేరు గాంచిన అతిసామాన్యుల్లో ఒకరు అబ్దుల్‌ కలాం. అందుకే ఆయన్ని పీపుల్స్‌ ప్రెసిడెంట్ అని కూడా అంటారు. రాష్ర్టపతిగా ఉన్న సమయంలోను ఆయన నిత్య ఉపాధ్యాయునిగా పనిచేశారు. యువతను ఉత్తేజపరిచేందుకు పుస్తకాలు రచించారు. అనంతమైన విజ్ఞాన సముద్రంలో ఆణిముత్యమై నిలిచారు డాక్టర్‌ అబ్దుల్‌ కలాం.

12:43 - October 15, 2015

మహబూబ్‌నగర్‌ : జడ్చర్లలో శ్రీలక్ష్మి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులను ముప్పు తిప్పలు పెడుతోంది.... అర్ధరాత్రి హైవేపై ఈ బస్సు ఆగిపోయింది.. అప్పటినుంచి ప్రయాణికులు రోడ్డుపై పడిగాపులు పడుతున్నారు.. ఈ బస్సు హైదరాబాద్‌నుంచి పొద్దుటూరు వెళుతుండగా మధ్యలో నిలిచిపోయింది.. దీంతో మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు..

ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

హైదరాబాద్ :ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు ఢిల్లీ వాసులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. గ్లోబల్ ప్లేస్ మెంట్స్ పేరిట నిరుద్యోగుల నుంచి మోసగాల్లు రూ.2 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

మిస్టరీగా క్రికెటర్ దుర్గాభవాని ఆత్మహత్య

విజయవాడ: క్రికెటర్ దుర్గాభవాని ఆత్మహత్య మిస్టరీగా మారింది. దుర్గాభవాని సూసైడ్ నోట్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూసైడ్ నోట్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. సూసైడ్ నోట్‌లోని చేతిరాతపై అనుమానం వ్యక్తం చేశారు. పూర్తిగా స్పృహలో ఉండి ఆత్మహత్యకు పాల్పడినట్టు లేఖలో రాసి ఉంది. స్పృహలో ఉన్నట్లు పేర్కొనడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. న్యాయపరమైన రాతలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లలో ఉపయోగించే భాష సూసైడ్ నోట్‌లో ఉండటం ఈ అనుమానాలకు తావిస్తుంది.

క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్న జహీర్ ఖాన్!

హైదరాబాద్ : భారత ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడు. ఈ విషయాన్ని నేడు అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.. మొన్నటిదాకా టీమిండియా పేస్ బౌలింగ్ బాధ్యతలను భుజాన మోసిన జహీర్ ఖాన్ ఫిట్ నెస్ లేమి కారణంగా దాదాపుగా జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక జట్టులో తనకు స్థానం లభించదనుకున్నాడో, ఏమో తెలియదు కాని అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్లు నేడు అతడు అధికారికంగా ప్రకటించనున్నాడు. ఈ మేరకు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు.

ఏపీకి ప్రత్యేహోదా కావాలి : ఉండవల్లి...

రాజమండ్రి : ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా అడిగిన వెంకయ్యనాయుడు ఇప్పుడు ఏం చేస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ కావాలని కోరారు,. విభజన చట్టంలో అన్ని స్పష్టంగా ఉన్నాయన్నారు.

11:53 - October 15, 2015

హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ వెబ్‌సైట్‌ తెలుగులో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.. ఈ బాధ్యతను టీఎస్ పీఎస్సీ సభ్యుడు మంగారి రాజేందర్‌కు అప్పగించామని కమిషన్ ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు.. నిజామాబాద్‌లో సీనియర్ సివిల్‌ జడ్జిగా పనిచేసినప్పుడు రాజేందర్ తెలుగులో తీర్పు ఇచ్చి రికార్డు సృష్టించారు.. తెలుగు వెబ్‌సైట్‌ను రాజేందర్‌ అయితేనే బాగా చేయగలుగుతారని టీఎస్ పీఎస్సీ భావిస్తోంది.. 

11:50 - October 15, 2015

విశాఖ :ఏపీ రాజధాని శంకుస్థాపనకు ప్రధాని హాజరుకావడం రాజ్యాంగ విరుద్ధమంటున్నారు మాజీ ఐఏఎస్ అధికారి ఐఈఎస్ శర్మ. ఆయన గురువారం టెన్ టివి తో మాట్లాడుతూ...అమరావతి నిర్మాణంలో చట్టాల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపిస్తున్నారు.. చట్టాలమీద గౌరవం ఉంటే ఈ కార్యక్రమానికి ప్రధాని రాకూడదు తెలిపారు. సుప్రింకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ఢిల్లీ సీఎంకు లేఖలు రాశాని తెతలిపారు. 

11:46 - October 15, 2015

తుళ్లూరు : శంకుస్థాపన పనులు ఒక వంక..! సర్వేలు మరో వంక..!! ఇప్పుడు రాజధాని పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఒకటే సందడి. నిర్దేశించిన పనులను ఎవరికి వారు.. రోబోల్లా చేసుకు పోతున్నారు. సందడిని పరిశీలించేందుకు వచ్చే పరిసర ప్రాంతాల ప్రజలతో ఈ ప్రాంతం.. తిరునాళ్ళ సంరంభాన్ని తలపిస్తోంది.

వేంగం పుంజుకున్న శంకుస్థాపన పనులు...

రాజధాని శంకుస్థాపన పనులు వేగం పుంజుకున్నాయి. వీటితో పాటే.. అమరావతి నిర్మాణానికి అవసరమైన సర్వేలూ మొదలయ్యాయి. రాజధాని ప్రాంత భౌగోళిక స్థితిగతుల పరిశీలను సింగపూర్‌ బృందం డ్రోన్‌ సర్వేని చేపట్టింది. రాయపూడి గ్రామంలో మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుల సమక్షంలో.. సింగపూర్‌ బృందం సర్వేని ప్రారంభించింది.

సింగపూర్‌ బృందం వినియోగిస్తున్న డ్రోన్‌లో......

సింగపూర్‌ బృందం వినియోగిస్తున్న డ్రోన్‌లో.. అత్యంత శక్తిమంతమైన కెమెరాను అమర్చారు. భూమికి 350 మీటర్ల ఎత్తున ఎగురుతూ.. భూమిని ఫోటోలు తీస్తుంది. ఈ పరికరం ప్రతి విడతలో 900 చొప్పున ఫోటోలు తీస్తుంది. డ్రోన్‌ టెక్నాలజీ కారణంగా.. రాజధాని పరిధిలోని 54వేల ఎకరాలను పన్నెండు రోజుల్లో సర్వే చేయగలుగుతామని, దీనివల్ల రైతులకు ప్లాట్ల కేటాయింపులో వివాదాలు రాబోవని మంత్రులు తెలిపారు.

శంకుస్థాపన పనులు జరిగే ప్రదేశం.....

మరోవైపు.. శంకుస్థాపన పనులు జరిగే ప్రదేశం.. జాతరను తలపిస్తోంది. మొన్నటిదాకా పొలాలున్న ప్రాంతంలో ఇప్పుడు భారీ నిర్మాణాలు, వేదికలు, హెలీప్యాడ్‌లు, రోడ్లు వచ్చేస్తున్నాయి. అక్కడ జరుగుతున్న పనులను స్వయంగా చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో శంకుస్థాపన జరిగే ప్రదేశంలో తిరునాల వాతావరణం కనిపిస్తోంది. శంకుస్థాపన కోసం జరుగుతున్న పనుల పట్ల స్థానికులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 

సంప్రదాయబద్దంగా స్టేజీ నిర్మాణం...

మరావతి శంకుస్థాపనకు శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి... ముఖ్యంగా స్టేజీ నిర్మాణాన్ని అత్యంత భారీస్థాయిలో నిర్మిస్తున్నారు.. మెయిన్‌ స్టేజీ 11 అడుగులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు..

నాగార్జున యూనివర్శిటీలో కలాం విగ్రహావిష్కరణ

గుంటూరు : నాగార్జున విశ్వవిద్యాలంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, రావెల కిశోర్ బాబు కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. నాగార్జున వివ్వవిద్యాలయంలో సిథెటిక్ ట్రాక్ ఏర్పాటుకు స్పీకర్ శంకుస్థాపన చేశారు.

రామగుండం ఎన్టీపీసీలో సాంకేతిక లోపం

కరీంనగర్ : రామగుండం ఎన్టీపీసీ ఒకటో యూనిట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపం కారణంగా 200 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయమేర్పడింది.

11:28 - October 15, 2015

వయసు తో బాటు నాచురల్ గా పెరిగే ఛాతి పెరగకుండా వాటిని ఆటవిక పధ్ధతుల్లో అణిచి వేస్తారట. ఇది ఎక్కడా అనుకుంటున్నారా మన దేశంలో కాదులేండి... కేమరూన్, నైజీరియా, సౌత్ ఆఫ్రికాల్లో ఈ పద్ధతి అమల్లో వుందట. బ్రెస్ట్ ఐరనింగ్ అని పిలిచే ఈ ప్రక్రియలో ఛాతి కనపించకుండా అణచివేస్తే ఆడపిల్లల వయసు దాచిపెట్టడంతో బాటు, వారి మీద మగవాళ్ల కన్ను పడకుండా ఉండేందుకు ఈ ఆటవిక పద్దతిని అవలంబిస్తున్నారట. ఈ అనాగరిక మూఢ నమ్మకంలో తల్లులే ముఖ్య పాత్ర వహిస్తున్నట్టు యునైటెడ్ నేషన్స్ నివేదిక పేర్కొంది. తమ పిల్లలకు బ్రెస్ట్ ఐరనింగ్ చేస్తే లైంగిక వేధింపులు, అత్యాచారాలనుంచి రక్షణ కలుగుతుందన్న మూఢనమ్మకమేకారణమట. ఐరనింగ్ కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 3.8 మిలియన్ల మంది నానా హింస బారిన పడి నరకం చూస్తున్నట్టు యూ ఎన్ నివేదిక పేర్కొంది. ఆడతనాన్ని ప్రతిబింబించే ఛాతి పెరగనీయకుండా ఉండేందుకు తల్లులు ఆశ్రయిస్తున్న అనాగరిక పద్దతి దారుణంగా ఉంటుందట. పెద్ద పెద్ద రాళ్లు, లేదా వెడల్పాటి గరిటె లాంటి దాన్ని బొగ్గుల మీద కాల్చి వాటితో ఛాతిని అణుస్తారట. ఈ పద్ధతిలో బ్రెస్ట్ టిష్యూ దారుణంగా దెబ్బ తింనడం వల్ల ఆడతనం అణిగిపోతుందనేది తల్లుల భావనట.కామెరూన్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ఆనాగరిక ఆచారంలో 58 శాతం తల్లులే ప్రధానంగా ఉన్నారని పబ్లి్క్ హెల్త్ సర్వీస్ లెక్కలు చెబుతున్నాయి. డబ్బున్న కుటుంబాలకు చెందిన యువతులైతే వెడల్పాటి బెల్టు గట్టిగా చుట్టుకుంటారట. దీని కారణంగా ఛాతి పెరగవట. ముఖ్యంగా 11,15 సంవత్సరాల మధ్య వయసున్న ఆడపిల్లల్లో శరీర భాగాలు పురుషుల కంట బడనీయక పోతే మగాళ్ళ కళ్ళు తమ పిల్లల మీద పడవని ఆ తల్లుల నమ్మకమట. మహిళల మానసిక స్థితి మీద కూడా ప్రభావం చూపుతున్న ఈ అనాగరికపు ఆచారం మీద ఇప్పుడిప్పుడే చైతన్యం ప్రారంభమైంది.

కలాం కు నివాళులర్పించిన ప్రధాని, కేంద్ర మంత్రులు

హైదరాబాద్ : మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఢిల్లీలోని డీఆర్ డీవో భవన్ లో అబ్ధుల్ కలాంకు ప్రధాని నివాళుర్పించారు. రామేశ్వరంలో కలాం స్మార నిర్మాణానికి భూమి సేకరించామని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్ తదితరులు కలాంకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

హైదరాబాద్ : నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 160 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్, 50 పాయింట్లకు పైగా లాభాలో నిఫీ ట్రేడ్ అవుతున్నాయి.

తల్లి మందలించిందని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కృష్ణా: నందిగామ మండలం పెద్దవరం గ్రామంలో తల్లి మందలించిందని ఆరోతరగతి విద్యార్థిని ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో తీవ్ర గాయాల పాలైన విద్యార్థినిని నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

10:49 - October 15, 2015

హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో కరవు కారణంగా ఖరీఫ్‌లో వేసిన మొక్కజొన్న, వరి పంటలు పూర్తిగా ఎండిపోయాయి. తొలకరి వర్షాలకు సాగు చేసిన పత్తి కొన్నిచోట్ల చేతికొచ్చింది. పండిన కొద్దిపాటి పత్తినైనా అమ్ముకొందామని ఆశపడ్డ అన్నదాతకు దళారులు దగా చేస్తున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు కొంటూ,.తూకాల్లో మోసాలకు పాల్పడుతూ రైతును నిలువునా ముంచుతున్నారు. వీరికి కొంతమంది అక్రమార్కుల అండదండలు ఉండటంతో అడిగే నాధుడే లేకుండా పోయారు. దీనికి తోడు ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పత్తి కొనుగోలు కేంద్రాలను విచ్చలవిడిగా తెరుస్తున్నా..ఎవరూ పట్టించుకున్న పరిస్థితి లేదు.

జిల్లాలో 15 వ్యవసాయ మార్కెట్ కమిటీలు .....

వరంగల్ జిల్లాలో 15 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలున్నాయి. ఇక్కడ సీసీఐ కొనుగోలు కేంద్రాలున్నా ఇక్క ఏనుమామూలు మార్కెట్లో తప్ప మరెకర్కడా పత్తి కొనుగోళ్లు జరగలేదు. దీంతో రైతులు దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. దళారులు ఇష్టారాజ్యంగా నేరుగా రైతుల వద్ద నుంచే పత్తిని కొనుగోళ్లు చేస్తూ అక్రకమాలకు పాల్పడుతున్నారు. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన రైతు దళారుల చేతిలో నిలువు దోపిడికి గురువుతున్నాడు. ఇటు రైతులను దోపిడీ చేస్తూ, అటు మార్కెట్‌కూ, ప్రభుత్వ ఆదాయానికీ గండి కొడుతూ దళారులు లక్షల్లో సంపాదిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు 4,100 ఉండగా వ్యాపారులు, దళారులు 2600 నుంచి 3400 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల మద్దతు ధరపై రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినా..మద్దతు ధర అనేది కంటి తుడుపు ప్రకటనగా మారింది.

రైతుల ఆత్మహత్యలపై టి టిడిపి ఫైర్ .....

ఓ వైపు వర్షాలు పడక..మరోవైపు పండిన పంటకు మద్దతు ధర రాక రైతులు అప్పులపాలవుతున్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న ఆత్మహత్యలపై, ప్రభుత్వ బాధ్యతారాహిత్యంపై టీటీడీపీ తీవ్రంగా స్పందించింది. చేతగాన్ని ప్రభుత్వం వల్లే రైతులు నిండు ప్రాణాలను బలిపెడుతున్నారని విరుచుకు పడ్డారు. 17నెలల కాలంలో రైతుల కోసం ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు సీఎం కేసీఆర్ చెప్పాలని టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. రైతుల కష్టాలు తీర్చేందుకు బాధ్యతగా..తామంతా కేంద్రమంత్రులను కలుస్తామని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ ప్రకటించారు. దేశానికి వెన్నముక రైతన్న అంటున్న ప్రభుత్వం..రైతులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. రైతన్నల ఆత్మహత్యలను నివారణకు ప్రభుత్వం చిత్తశుద్దితో చర్యలు తీసుకొని వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలని సూచిస్తున్నారు. 

10:46 - October 15, 2015

హైదరాబాద్ : బాలీవుడ్‌ బ్యాడ్‌ బాయ్‌.. సంజయ్‌దత్‌ కోసం సీక్వెల్స్‌ను రెడీ చేస్తున్నారు.. బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు. సుభాష్‌ఘాయ్‌, వినోద్‌చోప్రాలు ఈ వరుసలో బాగా ముందున్నారు. వీరు సంజయ్‌తో తీయబోయే సినిమాలకు టైటిల్స్‌ కూడా ఖరారు చేసుకున్నారు.

అప్పట్లో సంచనాలే...

1993లో రిలీజ్‌ అయిన ఖల్‌నాయక్‌ సినిమా.. సంజయ్‌దత్‌కు విపరీతమైన క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. మాధురీ దీక్షిత్‌, జాకీష్రాఫ్‌ లీడ్‌ రోల్స్‌ పోషించిన ఖల్‌నాయక్‌.. అప్పట్లో ఓ సంచలనాన్ని సృష్టించింది.

ఖల్‌నాయక్‌ రిటర్న్స్‌ అన్న టైటిల్‌.....

ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ రూపొందించాలని బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులోనూ సంజయ్‌దత్‌నే నటింప చేసేందుకు.. సుభాష్‌ఘాయ్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఖల్‌నాయక్‌ రిటర్న్స్‌ అన్న టైటిల్‌ను కూడా ఆయన ఖరారు చేసినట్లు చెబుతున్నారు.

వినోద్‌చోప్రా, రాజ్‌కుమార్‌ హిరానీలను సంజయ్..

మరోవైపు.. మున్నాభాయ్‌కి సీక్వెల్‌ను రూపొందించే ప్రయత్నమూ జరుగుతోంది. ఇటీవల..కుమార్తె ఆపరేషన్‌ కోసం పెరోల్‌పై వచ్చిన సంజయ్.. వినోద్‌చోప్రా, రాజ్‌కుమార్‌ హిరానీలను కలిశాడు. వీరిమధ్య మున్నాభాయ్‌ సీక్వెల్‌పై చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. సంజయ్‌ ఖల్‌నాయక్‌ రిటర్న్స్‌ను అంగీకరిస్తాడా..? లేక తనపై ఉన్న బ్యాడ్‌ బాయ్‌ ఇమేజ్‌ను చెరిపేసుకునేందుకు.. మున్నాబాయ్‌ సీక్వెల్‌కి ఓకే చెబుతాడా..? వెయిట్‌ అండ్‌ సీ..

10:43 - October 15, 2015

హైదరాబాద్ : అబూదాబీ వేదికగా ఇంగ్లండ్ తో ప్రారంభమైన తొలిటెస్ట్ తొలిరోజుఆటలోనే...పాక్ మాజీ కెప్టెన్లు యూనిస్ ఖాన్, షోయబ్ మాలిక్ పలు అరుదైన రికార్డులు నెలకొల్పారు. షేక్ జాయేద్ స్టేడియంలో...నిప్పులు చెరిగే ఎండవేడి వాతావరణంలో ప్రారంభమైన ఈమ్యాచ్ తొలిరోజున..పరుగుల కోసం పాక్ ఆటగాళ్లు, వికెట్ల కోసం ఇంగ్లండ్ బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది.

ఐదేళ్ల విరామం తర్వాత...

పాక్ టెస్ట్ జట్టులో చోటు సంపాదించిన మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్..14 బౌండ్రీలతో కీలక సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ ప్రత్యర్థిగా మాలిక్ కు ఇదే తొలిసెంచరీ కాగా..టెస్ట్ క్రికెట్లో మూడో సెంచరీ కావడం విశేషం. ప్రపంచ టెన్నిస్ మహిళల డబుల్స్ లో తన భార్య సానియా సాధిస్తున్న విజయాల స్ఫూర్తితో..తానూ ఈ సెంచరీ సాధించగలిగానని తొలిరోజు ఆట ముగిసిన అనంతరం షోయబ్ మాలిక్ చెప్పాడు. ఇక..పాక్ క్రికెట్ చరిత్రలో 8 వేల 832 పరుగులతో అత్యధిక టెస్ట్ పరుగులు సాధించిన ఆటగాడిగా ..మాజీ కెప్టెన్ జావేద్ మియాదాద్ పేరుతో ఉన్న రికార్డును...

తొలిఇన్నింగ్స్ లో 38 పరుగుల స్కోరు

పాక్ వెటరన్ స్టార్ యూనిస్ ఖాన్ తిరగరాశాడు. తొలిఇన్నింగ్స్ లో 38 పరుగుల స్కోరు సాధించడం ద్వారా...యూనిస్ ఖాన్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. 102 టెస్ట్ ల్లో 8వేల 852 పరుగులు సాధించడం ద్వారా...జావేద్ మియాదాద్ పేరుతో ఉన్న రికార్డును యూనిస్ ఖాన్ తెరమరుగు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో యాండర్సన్ రెండు వికెట్లు, బ్రాడ్, స్టోక్స్ చెరో వికెట్ మాత్రమే పడగొట్టగలిగారు. స్పిన్ జోడీ మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ దారుణంగా విఫలమయ్యారు. స్వింగ్ బౌలింగ్ కు ఏమాత్రం అనువుకాని ఎడారి వాతావరణంలో జరుగుతున్న ఈ టెస్ట్ సిరీస్ ..ఇంగ్లండ్ సత్తాకు పరీక్షకానుంది

ఇద్దరు రైతుల ఆత్మహత్య

మహబూబ్ నగర్ : అప్పు చేసి వేసిన పంట పండకపోవడంతో మనస్థాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లోని తిరుమలపూర్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగింది. తిరుమలపూర్‌కు చెందిన కావలి కొండయ్య (45) తనకున్న నాలుగున్నర ఎకరాల్లో, కౌలుకు తీసుకున్న మరో నాలుగు ఎకరాల్లో మక్క, పత్తి పంటను అప్పులు చేసి వేశాడు. పంట పండకపోవడంతో మనస్థాపం చెందిన కొండయ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

నెల్లూరులో ఎర్రచందనం దుంగలు స్వాధీనం...

నెల్లూరు : నాయుడు పేట మండలం అరవపెరమిడిలో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ ఇంట్లో నిల్వ ఉంచిన రూ. లక్షల విలువైన ఎర్రచందనం దుగలను స్వాధీనం చేసుకున్నారు.

 

ఒడిశాలో మావోయిస్టుల ఘాతుకం...

ఒడిశా : మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ల నెపంతో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు కాల్చి చంపారు. కలిమెల పోలీసుస్టేషను పరిధిలోని కన్నగూడలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో రమామాడి, తోమా మాడిలున్నారు. ఈ సంఘటన ఒడిశాలో సంచలనం సృష్టించింది.

10:09 - October 15, 2015

హైదరాబాద్ : కరువు మండలాలు ప్రకటించి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అలవికాని లెక్కలతో కాలం గడిపేస్తోంది. వ్యవసాయ శాఖ, వాతావరణ శాఖ లెక్కలను పక్కనబెట్టి సరికొత్త నివేదిక తయారుచేయించింది. ఈ నివేదికలో ఏముంది? వాస్తవ పరిస్థితేంటి? స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం..

తెలంగాణలోని 60శాతం మండలాల్లో తీవ్ర వర్షాభావం .....

వాతావరణ శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఖరీఫ్ సమయంలో... తెలంగాణలోని దాదాపు 60శాతం మండలాల్లో తీవ్ర వర్షాభావం ఏర్పడింది.. జూన్‌ లో మురిపించిన వర్షాలు.. ఆ తరువాత మొహం చాటేయడంతో.. రైతులు భారీగా నష్టపోయారు. మొత్తంగా ఈసారి 217 మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం కురిసింది.

ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలు మినహా రాష్ట్రమంతా కరువు......

ఈసారి వర్షాభావంతో ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలు మినహా రాష్ట్రమంతా కరువు పరిస్థితులున్నాయని వ్యవసాయ శాఖ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.. మెట్ట పంటల పరిస్థితి దారుణంగా ఉందని అందులో తెలిపింది.. వర్షాలు సరైన సమయంలో ముఖం చాటేయడంతో దిగుబడిపై ప్రభావం పడుతోందని హెచ్చరించింది.. వ్యవసాయశాఖ లెక్కలప్రకారం మెదక్‌ జిల్లాలో 45 మండలాలు, నల్గొండలో 46, కరీంనగర్ జిల్లాలో 30, నిజామబాద్ జిల్లాలో 31, వరంగల్ జిల్లాలో 9మండలాల్లో కరువు ఉందని వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.. 304 మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయని స్పష్టం చేసింది.. అయితే ప్రభుత్వంమాత్రం కలెక్టర్లనుంచి నివేదిక తయారుచేయించి కరువు మండలాల సంఖ్యను దారుణంగా తగ్గించింది.

పాలమూరు జిల్లాలో 35 మండలాలు, మెదక్‌ జిల్లాలో 13 మండలాలు......

ప్రభుత్వ లెక్కల ప్రకారం పాలమూరు జిల్లాలో 35 మండలాలు, మెదక్‌ జిల్లాలో 13, నిజామాబాద్‌ జిల్లాలో ఒక్క మండలం, రంగారెడ్డి జిల్లాలో ఏడు మండలాలు, కరీంనగర్‌ జిల్లాలో 3, నల్లగొండ జిల్లాలో 5, ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు మండలాల్లో కరువు నెలకొందని సర్కారుకు నివేదిక ఇచ్చారు కలెక్టర్లు.. అయితే వరంగల్‌ జిల్లా జనగామ ప్రాంతంలోని 9 మండలాల్లో తీవ్ర వర్షాభావం ఉందని ప్రభుత్వం అసెంబ్లీకి ఇచ్చిన నోట్‌లో తెలిపింది.. తాజా నివేదికలోమాత్రం ఓరుగల్లులో కరువు మండలాలే లేవని స్పష్టం చేసింది.. దీంతో ఈ నివేదికపై నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు..

తెలంగాణలో వెయ్యికిపైగా రైతులు ఆత్మహత్య.....

వర్షాభావ పరిస్థితులున్నప్పుడు ప్రత్యేక ప్రణాళికతో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇప్పటివరకూ మాటలతోనే కాలం గడిపేసింది.. గత ఏడాదికూడా సగానికిపైగా మండలాలు కరువుబారినపడ్డాయి.. ప్రభుత్వం మారడం, రాజకీయ కారణాలతో అప్పుడు కరువు మండలాలు ప్రకటించలేదు.. ఏడాది గడిచినా ఇప్పుడుకూడా సర్కారునుంచి ఎలాంటి స్పందనా రాలేదు.. ఓవైపు వర్షాలులేక పంటలు పండక రైతులు కుంగిపోతున్నారు.. మరోవైపు అప్పులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. తెలంగాణలో ఈసారి వెయ్యికిపైగా ఆత్మహత్యలు నమోదయ్యాయి.. రోజురోజుకూ ఈ సంఖ్య మరింత పెరిగిపోతోంది.. వాస్తవపరిస్థితిని నివేదిక రూపంలో కేంద్రానికి పంపాలి

 

ఇలాంటి దుర్భర స్థితిలో ప్రభుత్వం వాస్తవ పరిస్థితిని కేంద్రానికి నివేదిక రూపంలో ఇవ్వాలి. అన్ని పార్టీలకతీతంగా నేతలంతా రైతులకు భరోసా కల్పించాలి. కరువు మండలాలు వెంటనే ప్రకటించాలి.. అప్పుడే రాబోయే వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది.

18న కేసీఆర్ ఇంటికి చంద్రబాబు !

హైదరాబాద్ : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 18న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లనున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరు కావాలని ఆయన కేసీఆర్ ను ఆహ్వానించనున్నారు. ఈ మేరకు అమరావతి ఆహ్వాన పత్రికను చంద్రబాబు, కేసీఆర్ కు అందించనున్నారు. అమరావతి శంకుస్థాపన ఆహ్వానాన్ని తెలంగాణ సీఎం కు తానే స్వయంగా అందజేస్తానని మొన్నటి కేబినెట్ భేటీ సందర్భంగా చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

వరంగల్ సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ

హైదరాబాద్ : వరంగల్‌ సెంట్రల్‌ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన జీవితఖైదీ సురేష్‌ను రౌడీషీటర్‌ సాజిద్‌ చితకబాదారు. జైలు అధికారుల సమక్షంలోనే గొడవ జరిగిందని, తనను చంపేందుకు యత్నించాడని జైలు అధికారులకు సురేష్‌ ఫిర్యాదు చేశారు. దీన్ని అధికారులు పట్టించుకోలేదు. రెండు రోజుల క్రితం ఘటన జరగ్గా సురేష్‌కు వైద్యం కూడా అందించలేదని సమాచారం. రౌడీషీటర్‌ సాజిద్‌పై చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకంజ వేస్తున్నారని తెలిసింది.

ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

హైదరాబాద్ : జమ్మూకశ్మీర్ లో దోడా జిల్లాలో భారత జవాన్లు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. భారత్ లోక ఇచొరబడేందుకు ఉగ్రవాదులు యత్నించడంతో అప్రమత్తమైన సైనికులు కాల్పులు జరిపారు.

లక్నో బయలుదేరిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఉదయం లక్నో బయలు దేరారు. జలహారం వివరాలను తెలిపేందుకు యూపీ రావాలని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆహ్వానం మేరకు కేటీఆర్ లక్నో బయలుదేరారు. కేటీఆర్ తో పాటు, రేమండ్ పీటర్, సురేందర్ రెడ్డి కూడా ఉన్నారు.

బ్లాక్ లిస్టులో పొగాకు కొనుగోలు చేయని కపెంనీలు...

విజయవాడ : వేలంలో పొగాకు కొనుగోలు చేయని ఏడు కంపెనీలను కేంద్రం బ్లాక్‌లిస్టులో పెట్టింది. ముందుగా ఇచ్చి హామీ మేర పొగాకు కొనుగోలు చేయకపోవడంపై కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో పొగాకు కొనుగోళ్లపై కేంద్రమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు.

ఇంద్ర కీలాద్రి పై గాయత్రీ దేవిగా దుర్గమ్మ

విజయవాడ : ఇంద్రకీలాద్రి పై శరన్నవర్రాతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహోత్సవాలలో మూడో రోజు గురువారం అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఎస్ బీ హెచ్ ఏటీఎంలో చోరికీ దుండగుల యత్నం

కరీంనగర్ : గంగాధర్ చౌరస్తాలోని ఎస్ బీహెచ్ ఏటీఎంలో చోరీకి దుండుగులు విఫలయత్నం చేశారు. ఎస్ బీ హెచ్ ఏటీఎం లో ఈనెల రెండోసారి చోరీకి దుండుగులు యత్నించారు.

07:57 - October 15, 2015

హైదరాబాద్ :ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎంత సమయం పడుతుందో కేంద్రం చెప్పాలి అని న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న సీపీఎం నేత రమాదేవి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్ తో బుధవారం విజయవాడలో వైసీపీ నిర్వహించిన ర్యాలీలో పోలీసులు వ్యవహరించిన తీరును వైసీపీ తప్పుపడుతోంది. ఒక ప్రత్యేక హోదా అనే అంశాన్ని అధికార పక్షంతో, ప్రతిపక్షాలు అందరూ కోరుకుంటుండగా ఎందుకీ నిర్బంధం అని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఈ అంవంపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో రమాదేవి తో పాటు వైసీపీ నేత నల్లా సూర్యప్రకాశ్, బిజెవైఎం నేత విష్ణువర్ధన్ రెడ్డి, టిడిపి నేత వర్ల రామయ్య పాల్గొన్నారు. మరి వారు ఎలాంటి విశ్లేషణ చేశారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

చైన్ స్నాచర్లు కనిపిస్తే కాల్చివేస్తాం: సైబరాబాద్ సీపీ

హైదరాబాద్: నగరంలో చైన్ స్నాచర్లపై పోలీసులు ఇకపై మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. చైన్ స్నాచర్లు కనిపిస్తే కాల్చివేస్తామంటూ సైబరాబాదు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నిన్న తేల్చిచెప్పారు. జంట నగరాల్లో బైకులపై దూసుకొస్తున్న చైన్ స్నాచర్లు మహిళలపై యథేచ్ఛగా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో నిన్న ఇరానీ గ్యాంగ్ కు చెందిన ముగ్గురు సభ్యులను సైబరాబాదు పోలీసులు పట్టేశారు. తప్పించుకున్న మరో ఇద్దరు గ్యాంగ్ సభ్యుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీవీ ఆనంద్ చైన్ స్నాచర్లపై మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు ప్రకటించారు.

ఆహ్వానం అందితే తప్పక వస్తాం : కేటీఆర్

హైదరాబాద్ : నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆహ్వానం అందితే తప్పనిసరిగా అమరావతి శంకుస్థాపనకు హాజరవుతామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కుండబద్దలు కొట్టారు. అమరావతి శంకుస్థాపనకు హాజరవ్వడమే కాక ఆ రాష్ట్రానికి శుభాకాంక్షలు కూడా తెలుపుతామని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న తెరాస భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన ఆయన అమరావతి ఆహ్వానాన్ని ప్రస్తావించారు. 

అదిరిపోయేలా రాజధాని అమరావతి శంకుస్ధాపన ఏర్పాట్లు

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం ఎలా ఉంటుందో తెలియదు కానీ..శంఖుస్థాపన కార్యక్రమం మాత్రం అధిరిపోయేలా చేస్తుంది ఏపీ ప్రభుత్వం. శంఖుస్థాపనకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలిస్తే..సభా ప్రాంగణం మొదలు, పార్కింగ్ వరకు వివిధ విభాగాలుగా కేటాయించి నిర్మిస్తున్నారు. ప్రధాన మంత్రులకు, ముఖ్యమంత్రులకు, గవర్నర్‌లకు, కేంద్ర మంత్రులకు ఇలా విడివిడిగా హెలిప్యాడ్‌ల నిర్మాణం, కాన్వాయ్ వెళ్లడానికి రోడ్లు, వేదికల్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్రమోడి వస్తుండడంతో..హెలిప్యాడ్‌ను ప్రధాన వేదిక వెనుక ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తున్నారు. 

అమరావతి శంకుస్థాపన ఏర్పాట్ల పర్యవేక్షణకు కమిటీలు

విజయవాడ : అమరావతి శంకుస్థాపనకు అతిరథ మహారథులు విచ్చేస్తుండటంతో...ఏపీ సర్కార్‌ భారీ ఏర్పాట్లు చేస్తోంది. మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ విజయవాడలో శంకుస్థాపన పనులు సాగుతున్న తీరును సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావుతో పాటు వివిధ శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాజధాని శంకుస్థాపన ఏర్పాట్ల పర్యవేక్షణకు.. మంత్రులతో కూడిన కమిటీలనూ ఖరారు చేశారు. 

వైసీపీ వైపు చూస్తున్న మాజీ ఎంపీలు ఉండవల్లి, హర్షకుమార్‌

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ చేసిన నిరాహారదీక్షకు అన్నివర్గాల నుంచి మద్దతు లభించింది. ఒకప్పుడు జగన్‌ పేరు చెబితేనే తీవ్రస్థాయిలో విరుచుకుపడే నేతల నుంచి కూడా ఆయనకు మద్దతు లభించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో ముఖ్యంగా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌తో పాటు.. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు ఉన్నారు. 

నామినేటెడ్‌ పదవులపై టీఆర్‌ఎస్‌ నేతల దృష్టి

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ నేతలను పదవులు ఊరిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర గడిచిన తర్వాత.. ఇప్పుడు పదవులు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం... పార్టీలో అందుకు అనుగుణంగా కసరత్తు జరుగుతుండటం నేతల్లో కొత్త ఆశలు నింపుతోంది. దసరా పండుగ నాటికి... మెజార్టీ పదవులు భర్తీ అవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మలి విడత రైతు భరోసా యాత్రకు టీపీసీసీ యోచన

హైదరాబాద్: టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై పోరును ఉధృతం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. తాము చేసిన ధర్నాలు.. బంద్‌లు.. అసెంబ్లీ స్తంభన కార్యక్రమాలేవీ ప్రభుత్వాన్ని కదిలించక పోయినా.. మడమ తిప్పరాదని కాంగ్రెస్‌ భావిస్తోంది. మలివిడత బస్‌ యాత్రలతో ఊరూ వాడలను ఏకం చేసి.. సర్కారుపై ఒత్తిడి పెంచాలని భావిస్తోంది.

చత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందంపై విమర్శలు

హైదరాబాద్ : తెలంగాణలో కరెంటు కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం.. చత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందం కుదుర్చుకుంది.. వెయ్యి మెగావాట్ల కరెంటు కొనుగోలుకు రెండు ప్రభుత్వాల మధ్య అగ్రిమెంట్‌ కుదిరింది.. ఇందుకోసం టీసర్కారు ప్రతి ఏడాది 13వందల 14కోట్లు చెల్లించాల్సిఉంటుంది. ఈ ఒప్పందంపై అభ్యంతరాలుంటే తెలపాలని టీ విద్యుత్ నియంత్రణమండలి బహిరంగ ప్రకటన జారీచేసింది.. దీనికి స్పందించిన విద్యుత్ రంగ నిపుణులు ఈ ఒప్పందంవల్ల జరిగే నష్టాలను వివరిస్తూ విద్యుత్ మండలికి లేఖ రాశారు.. 

మల్లారెడ్డి కాలేజ్ అక్రమాలపై విచారణ జరిపిన హైకోర్టు

హైదరాబాద్ : అదును దొరకాలే కానీ అందిన కాడికి దోచుకుంటారు. నిబంధనలకు తూట్లు పొడిచి మరీ కోట్లు దండుకుంటారు. పైరవీలు చేసి, లాబీయింగ్‌లు నెరిపి చట్టాన్ని సైతం చుట్టంగా మలుచుకుంటారు. న్యాయవ్యవస్ధ తీర్పు కొరడా ఝళిపించేంత వరకు తమకు ఎదురే లేదని విర్రవీగుతారు. సరిగ్గా ఇదే రీతిలో వ్యవహరించి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్‌ యాజమాన్యం. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు కేటాయించాల్సిన సీట్లను అక్రమంగా భర్తీ చేసింది హైదరాబాద్‌ మల్లారెడ్డి మెడికల్‌ కాలేజ్‌ మేనేజ్‌మెంట్.

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న విషజ్వరాలు

హైదరాబాద్ : మారిన వాతావరణ పరిస్థితులు,.. ఒక్కసారిగా కురుస్తున్న వర్షాలు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. జనాలను విషజ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. ఒక్కసారిగా శరీరంలో రక్తకణాలు పడిపోవడంతో బిక్కుబిక్కుమంటూ జనాలు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. వైద్యం అందక ఎంతోమంది మృత్యువాతపడుతున్నారు. 

ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన గాజువాక ఇనాం భూసమస్య

విశాఖ : గాజువాక ఇనాం భూముల సమస్యకు పరిష్కారం ఇప్పట్లో కనిపించేటట్లు లేదు. ఈ భూముల్లో ఉంటున్న ప్రజలకు ప్రభుత్వం ఎలా న్యాయం చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. స్థానిక ఎమ్మెల్యేకు కూడా ఈ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు క్రమబద్ధీకరణ పేరుతో ప్రభుత్వం భారీగా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామంటున్నారు ప్రజలు. దీంతో పిటిషన్‌ కమిటీ ఎదుట తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు ఎమ్మెల్యే శ్రీనివాస్‌. 

07:05 - October 15, 2015

హైదరాబాద్: తెలంగాణ ప్రజాఫ్రంట్‌ అధ్యక్షులు మద్దిలేటి ఇకలేరు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మద్దిలేటికి సాయంత్రం 4గంటలకు గుండెపోటు రావడంతో ఆకస్మికంగా మృతిచెందారు. 49 సంవత్సరాల మద్దిలేటి ఇకలేరన్న సమాచారం తెలుసుకున్న వామపక్షనేతలు, ప్రజాఫ్రంట్‌ నేతలు తీవ్ర దిగ్బాంత్రికి గురయ్యారు. ప్రజాఫ్రంట్‌ అధ్యక్షుడు మద్దిలేటికి విరసం నేత వరవరరావు, ప్రజాగాయకుడు గద్దర్‌, తెలంగాణ జేఏసి కన్వీనర్ కోదండరామ్‌, సీపీఎం తెలంగాణ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేతలు నారాయణ నివాళులర్పించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వచ్చిదంటే దానికి కారణం మద్దిలేటి అని జేఏసి కన్వీనర్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయన తిరగని గ్రామం లేదని..ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన మద్దిలేటికి విరసం నేత వరవరరావు జోహోర్లు అర్పించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌ తాలుకాలోని నంగనాయి గ్రామంలో జన్మించిన మద్దిలేటి..చిన్న వయసులోనే ప్రజాపోరాటాలు చేశారని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. మద్దిలేటి అంత్యక్రియలు గురువారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో ఉదయం 10 గంటలకు జరుగనున్నాయి. గురువారం ఉదయం మద్దిలేటి పార్ధీవదేహాన్ని హైదరాబాద్‌లోని బర్కత్‌పుర నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు.

07:01 - October 15, 2015

విజయవాడ : అమరావతిలో ప్రజా రాజధాని నిర్మిస్తున్నారా.... లేక ప్రయివేటు రాజధాని నిర్మిస్తున్నారా?... దసరాకు శంకుస్థాపన ఏవిధంగా జరపబోతున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరినీ సంప్రదించకపోవడం.. అఖిలపక్షం వేయక పోవడం, కనీసం సొంత పార్టీ నాయకులు, రాజధాని ప్రాంత ప్రజాప్రతినిధులతోనైనా చర్చిచక పోవడం అనుమానాలకు దారితీస్తోంది.

బంగారంలాంటి భూములను నాశనం......

నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం బంగారంలాంటి భూములను నాశనం చేస్తున్నారని సీపీఎం విమర్శించింది. విజయవాడలో రాజధానిపై అవగాహణ కల్పించేందుకు స్థానిక రైతులు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిధిగా పాల్గొన్న సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు చంద్రబాబు సర్కార్‌ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. రాజధాని అనేది ఏమతానికి చెందినది కాదన్నారు. బీజేపీ దేశాన్ని ఏవిధంగా ముక్కలు చేస్తుందో, మత మౌడ్యాన్ని రెచ్చగొడుతుందో అదేవిధంగా రాష్ట్రంలో టిడిపి ప్రవర్తిస్తూ ప్రజావ్యతిరేక రాజధానిని నిర్మిస్తుందన్నారు. రాజధానికోసం వేల ఎకరాల భూములు తీసుకుని సేధ్యం లేకుండా ఖాళీగా ఉంచడం దేశాన్ని నష్టపెట్టడమేనని రాఘవులు అన్నారు.

250 ఎకరాలు సరిపోతుందని నివేదికలు......

సీడ్ క్యాపిటల్‌లో 250 ఎకరాలు సరిపోతుందని నివేదికలు ఇచ్చారని.. తాము మొదటి నుంచి ఇదే చెప్పామని రాఘవులు అన్నారు. మిగిలిన వేల ఎకరాల భూములను చంద్రబాబు ప్రయివేటు కంపెనీలతో వ్యాపారం చేసుకోవడానికేనని విమర్శించారు. పెట్టబడులను రాబట్టడానికి ఉమ్మడి రాష్ట్రంలో ఏవిధమైన తప్పులను చేశారో అవే తప్పులను ఇప్పుడుకూడా చేస్తున్నారని రాఘవులు అన్నారు.

డబ్బున్నవారికి నష్టపరిహారాలను అందించి.....

రాజధాని ప్రాంతంలో డబ్బున్నవారికి నష్టపరిహారాలను అందించి. పేదలను విస్మరిస్తున్నారని రాఘవులు విమర్శించారు. రైతులకు ఇచ్చే భూములు ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలన్నారు. రాజధాని నిర్మాణంతో రైతులు, రైతు కూలీలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాఘవులు కోరారు. 

06:59 - October 15, 2015

శంకరాభరణం టీజర్ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' లొకేషన్‌లో పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఆవిష్కరించారు.  నిఖిల్‌, నందిత జంటగా కోనవెంకట్‌ సమర్పణలో ఉదయ్ నందనవనం దర్శకత్వంలో ఎం.వివి సత్యనారాయణ ఈ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. శంఖరాభరణం టీజర్ విడుదల సందర్భంగా పన్ మాట్లాడుతూ.. ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కోనవెంకట్‌ మాట్లాడుతూ.. మా 'గీతాంజలి' ఫస్ట్‌లుక్‌ పవన్‌ ఆవిష్కరించారు. ఆ సెంటిమెంట్‌తో శంకరాభరణం టీజర్‌ను ఆవిష్కరించాలని అడిగితే.. వెంటనే ఒప్పుకున్నారు. షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ మా కోసం టైం కేటాయించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు.
హీరో నిఖిల్‌ మాట్లాడుతూ... 'పట్టరానంత సంతోషంగా వుంది. పవన్‌కళ్యాణ్‌ అభిమానైన నేను ఆయన చేతులమీదుగా టీజర్‌ విడుదలయిందునకు గర్వపడుతున్నాను' ఆనందం వ్యక్తం చేశారు. 

06:55 - October 15, 2015

హైదరాబాద్ : ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాలని ఏపీ సీఎం చంద్రబాబు..ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సహా పలువురు కేంద్ర మంత్రులను క్యాపిటల్‌ ఫౌండేషన్‌ సెర్మనీకి ఇన్‌వైట్‌ చేశారు. పనిలో పనిగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌ అంశాలను పరిష్కరించాలని కేంద్ర మంత్రులకు విన్నవించారు.

కేజ్రీవాల్ కు ఆహ్వానం...

అమరావతి శంకుస్థాపన మూహుర్తం దగ్గరపడుతుండటంతో... ముఖ్య ఆహుతులను ఆహ్వానించేపనిలో పడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లిన ఆయన... వరుస భేటీలతో బిజీ బిజీగా గడిపారు. ముందుగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను కలిసి అమరావతి శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. ఏపీ భవన్‌లో ఢిల్లీ సీఎంతో భేటీ అయిన చంద్రబాబు... కేజ్రీవాల్‌కు ఆహ్వానపత్రిక అందజేశారు.

రాజ్‌నాథ్‌ సింగ్‌తో చంద్రబాబు....

అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు చంద్రబాబు. రాజధాని శంకుస్థాపనకు రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి ఏపీకి తరలివచ్చే వారికి స్థానికత కల్పించేందుకు వీలుగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేయాలని రాజ్‌నాథ్‌ను చంద్రబాబు కోరినట్లు సమాచారం.

ప్రధాని మోదీతో చంద్రబాబు....

ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంపై నివేదికను మోదీకి అందజేశారు. ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా చంద్రబాబు.. మోదీని ఆహ్వానించారు.

పలువురిని ఆహ్వానించిన బాబు...

రాజధాని శంకుస్థాపనకు అరుణ్‌జైట్లీ, సుప్రీంకోర్టు సీజే హెచ్‌ఎల్‌ దత్తును ఏపీ సిఎం చంద్రబాబు వేరువేరుగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జైట్లీ, బాబు మధ్య పోలవరం, పెండింగ్‌ అంశాలపై చర్చ జరిగింది. ఏపీని అన్నీ విదాలుగా ఆదుకుంటామని జైట్లీ చంద్రబాబుకు హామీ ఇచ్చారు.

06:50 - October 15, 2015

హైదరాబాద్ : యాదాద్రి పునర్నిర్మాణ లేఅవుట్‌కు ఆమోద ముద్రపడింది. వెయ్యి ఎకరాల్లో యాదాద్రిని అభివృద్ధి చేయాలని టీ సర్కార్‌ నిర్ణయించింది. గర్భగుడిని యథాతథంగా ఉంచి.. దక్షిణాభిముఖంగా 108 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దసరా నుంచి యాదిగిరిగుట్ట పనులు ప్రారంభించి ఏడాది లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

దసరా నుండి పనులు ప్రారంభం....

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని విస్తృతస్థాయిలో అభివృద్ధి చేసేందుకు టీ సర్కార్‌ నడుంబింగించింది. ఇందులో భాగంగా యాదాద్రి పునర్నిర్మాణ ప్రణాళికకు సీఎం కేసీఆర్‌ ఆమోదముద్ర వేశారు. దసరా నుంచి పనులు ప్రారంభించాలని.. వచ్చే దసరా నాటికి దాదాపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దశలవారీగా తిరుపతి స్థాయిలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేయాలని సర్కార్ భావిస్తోంది. నిపుణుల బృందం రూపొందించిన పునర్నిర్మాణ లేఅవుట్‌పై ముఖ్యమంత్రి సమీక్షించారు. అనంతరం లేఅవుట్‌కు ఆమోదముద్ర వేశారు.

ఆలయ గర్భగుడిని యథాతథంగా ఉంచి ..

యాదగిరిగుట్ట అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోనే పనులు చేపట్టనున్నారు. ఆలయ గర్భగుడిని యథాతథంగా ఉంచి .. ప్రధాన ఆలయం తూర్పు దిక్కున దక్షిణాభిముఖంగా 108 అడుగుల ఎత్తున ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. ప్రధాన ఆలయం చుట్టూ 2.3 ఎకరాల విస్తీర్ణంలో మాడవీధులు నిర్మిస్తారు. శివాలయానికి కూడా మాడవీధులు నిర్మించనున్నారు.

శ్రీచక్ర భవన ప్రాంగణాన్ని క్యూకాంప్లెక్స్‌గా......

గుట్టపైన అన్నదాన కాంప్లెక్స్, ప్రస్తుతంఉన్న శ్రీచక్ర భవన ప్రాంగణాన్ని క్యూకాంప్లెక్స్‌గా మార్చనున్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు తూర్పుభాగంలో ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తారు. అర్చకులు సేద తీరేందుకు స్థలం కేటాయించారు. గుట్టపై ప్రస్తుతం ఉన్న భవనాలన్నింటిని తొలగించి.. నూతన లేఅవుట్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం ఉన్న నీటి గుండాన్ని అలాగే ఉంచాలని నిర్ణయించారు. దాని విస్తీర్ణాన్ని పెంచనున్నారు. గుట్టకు తూర్పు భాగాన వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రెండు గుట్టలను కలుపుతూ యాదిగిరిగుట్టను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. విశాలమైన రహదారులు, ఉద్యానవనాలు, కాటేజీలు, సత్రాలు, కళ్యాణ మండపాలు, పార్కింగ్ స్థలాలను నిర్మించనున్నారు. గుట్ట పరిసరాల్లో సువాసనలు వెదజల్లే మొక్కలను పెంచుతారు. భక్తి గీతాలు, శ్లోకాలు నిరంతరం వినిపించేలా ఏర్పాట్లు చేయనున్నారు. గుట్టకు ఉత్తర భాగంలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తిరుపతి పద్మావతి అతిథిగృహం తరహాలో వీఐపీ వసతి సముదాయాన్ని నిర్మిస్తారు. వీటి నిర్మాణానికి రూ.రెండు వందల కోట్లు కేటాయించామని, భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయిస్తామని కేసీఆర్ ప్రకటించారు. యాదాద్రి మాస్టర్‌ ప్లాన్‌, యాదగిరిగుట్టకు సీఎం కేసీఆర్‌ వెళ్లిన విజువల్స్‌, అధికారులతో మీటింగ్‌ పెట్టిన విజువల్స్‌ వాడగలరు.

06:47 - October 15, 2015

కర్నూలు : జిల్లాలో ఫ్యాక్షన్‌ గొడవలు మరోసారి పడగవిప్పాయి. ఆళ్లగడ్డ మండలం చింతకుంటలో వైసీపీ నేత రాఘవరెడ్డిపై ప్రత్యర్ధులు దాడి చేశారు. సినీ ఫక్కీలో దాడి చేసిన దుండగులు.. రాఘవరెడ్డి వాహనాన్ని టిప్పర్‌తో ఢీకొట్టి.. అనంతరం వేటకొడవళ్లతో నరికారు. తీవ్రగాయాలైన రాఘవరెడ్డిని మెరుగైన వైద్యం కోసం పెద్దాస్పత్రికి తరలిస్తుండగా రాఘవరెడ్డి మృతి చెందాడు.

06:46 - October 15, 2015

హైదరాబాద్ :విశాఖలో మావోయిస్టుల చెరలో ఉన్న ముగ్గురు టీడీపీ నేతలకు విముక్తి లభించింది. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ.. మావోయిస్టులు వారం క్రితం ముగ్గురు టీడీపీ నేతలను అపహరించారు. వీరిని జీకేవీధి వద్ద మావోయిస్టులు వదిలిపెట్టి వెళ్లారు. గిరిజన ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు విడిచిపెడుతున్నట్లు మావోయిస్టులు వెల్లడించారు. అంతకుముందు చిత్రకొండ అటవీప్రాంతంలో మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించారు. టీడీపీ నేతలు పార్టీని వీడి బాక్సైట్‌ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలని మావోయిస్టులు హుకుం జారీ చేశారు.

బాక్సైట్‌ తవ్వకాలు జరపబోమని ప్రకటన చేయాలి....

మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలు జరపబోమని ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ మావోయిస్టులు గిరిజన నేతలు ముక్కలి మహేష్‌, మామిడి బాలయ్య, వండలం బాలయ్యలను ఈ నెల 6న కిడ్నాప్‌ చేశారు. హైడ్రామాగా సాగిన ఈ కిడ్నాప్‌ ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. కిడ్నాప్‌ చెర నుంచి ముగ్గురు గిరిజన నేతలను మావోలు విడిచిపెట్టారు.

ఒడిశాలోని చిత్రకొండ అటవీ ప్రాంతంలో....

ఒడిశాలోని చిత్రకొండ అటవీ ప్రాంతంలో గిరిజన ఉద్యోగ సంఘాల నేతలకు సదరు టీడీపీ నేతలను మావోయిస్టులు అప్పగించారు. గిరిజన ఉద్యోగ సంఘాల నేతలు సదరు టీడీపీ నేతలను తీసుకుని సీలేరు మీదగా స్వస్థలాలకు బయలుదేరారు. అయితే బాక్సైట్ తవ్వకాలకు మద్దతు ఇవ్వబోమని మావోయిస్టులు సదరు టీడీపీ నేతలతో ప్రమాణం చేయించిన తర్వాత వారిని విడుదల చేసినట్లు తెలిసింది.

ప్రభుత్వానికి మావోయిస్టుల హెచ్చరిక.....

అపహరణకు గురైన ముగ్గురు గిరిజన నేతలు అధికార పార్టీకి చెందిన వారు. కాగా వీరు పార్టీకి సంబంధించి జీకేవీధి మండలం టీడీపీ అధ్యక్షుడుగా మామిడి బాలయ్య, జిల్లా కార్యవర్గసభ్యుడుగా ముక్తల మహేష్, జన్మభూమి కమిటీ మండల అధ్యకుడుగా వందనం బాలయ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరిని జీకే వీధి మండలంలోని కొత్తగూడ వద్ద వీరిని కిడ్నాప్ చేశారు. బాక్సైట్ తవ్వకాలను రద్దు చేయకపోతే తగిన మూల్యం చెల్లించకతప్పదని మావోయిస్టులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 7 నుంచి 13 వరకు ఏఓబీ బంద్ పాటించాలని పిలుపునిచ్చారు.

బాక్సైట్‌ వ్యతిరేక పోరుతో జనంలోకి.....

గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసింది. కానీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన అనంతరం మరోసారి స్వయంగా టీడీపీ సర్కారే బాక్సైట్‌ కొలిమి రాజేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అటు గిరిజనుల్లో ఆందోళన కలిగిస్తుండగా, బాక్సైట్‌ వ్యతిరేక పోరుతో జనంలోకి వెళ్లాలని మావోయిస్టులు తీర్మానించుకున్నారు. దీంతో ఏవోబీలో మరోసారి కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. 

06:44 - October 15, 2015

హైదరాబాద్‌ : గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్‌ అప్పా ఔటర్‌రింగ్‌ రోడ్డుపై ఆగివున్న లారీని కంటైనర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు మెదక్‌ జిల్లా జోగిపేటవాసులుగా గుర్తించారు. 

టిడిపి నేతలను విడిచి పెట్టిన మావోయిస్టులు...

విశాఖ : మావోయిస్టుల చెర నుంచి ముగ్గురు టిడిపి నేతలకు విముక్తి లభించింది.జీకే వీధి వద్ద వారి మావోయిస్టులు వదిలి పెట్టారు. గిరిజన సంఘాల అభ్యంతరం మేరకు ముగ్గురు టిడిపి నేతలను విడిచిపెడుతున్నట్లు వెల్లడించారు. అంతకు ముందు చిత్ర కొండ అటవీ ప్రాంతంలో ప్రజా కోర్టు నిర్వహించిన మావోయిస్టులు బాక్సైట్ వ్యతిరేక ఉద్యమంలో టిడిపి నేతలు పాల్గొనాలని హుకుం జారీ చేశారు.

ఆగి వున్న రాలీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

కరీంనగర్ : తిమ్మాపూర్ మండలం రామకృష్టాపురం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఒక మహిళ మృతి చెందింది. మరో 12 మందికి గాయాలు అయ్యాయి. క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఆగి వున్న లారీని ఢీకొట్టిన కంటైనర్ : ముగ్గురు మృతి

హైదరాబాద్ : ఆగి వున్న లారీనీ కంటైనర్ ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన రాజేంద్రనగర్ అప్పా ఔటర్ రింగ్ రోడ్డు పై గురువారం వేకువ జామున చోటు చేసుకుంది. 

తోడేలు దాడిలో నలుగురికి గాయాలు...

ఆదిలాబాద్ : భైంసాలోని అగ్నిమాపక కేంద్రం వద్ద తోడేలు ప్రజలపై దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన తోడేలను స్థానికులు కొట్టి చంపేశారు.

కర్నూలు జిల్లాలో భగ్గుమన్న ఫ్యాక్షన్

కర్నూలు : ఆళ్లగడ్డ మండలం చింతకుంటలో ప్రత్యర్థుల దాడి గాయపడిన రాఘవరెడ్డి మృతి చెందారు. మెరుగైన చికిత్స నిమిత్తం పెద్దాసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ప్రత్యర్థులు టిప్పర్ తో ఢీ కొట్టి.. వేటకొడవళ్లతో దాడి చేశారు.

తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు మద్దిలేటి మృతి

హైదరాబాద్:తెలంగాణ ప్రజాఫ్రంట్‌ అధ్యక్షుడు మద్దిలేటి లక్ష్మయ్య మృతి చెందారు. హైదరాబాద్‌ కిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. గత కొంతకాలంగా మద్దిలేటి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రజాఫ్రంట్‌ ఏర్పాటులో మద్దిలేటి కీలకపాత్ర పోషించారు. రేపు మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాలలో మద్దిలేటి అంత్యక్రియలు జరగనున్నాయి. మద్దిలేటి భౌతికకాయానికి వరవరరావు, గద్దర్ , తమ్మినేని వీరభద్రం, పలువురు ప్రజాసంఘాల నేతలు నివాళులర్పించారు.

Don't Miss