Activities calendar

17 October 2015

పోలీసుల నిర్లక్ష్యానికి విద్యార్థిని బలి

గ్రేటర్ నోయిడా : పోలీసుల నిర్లక్ష్యం ఓ ఇంటర్ విద్యార్థిని ఉసురు తీసుకున్న ఘటన.. గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. తన ఇంటి పక్కన ఉండే ముగ్గురు వ్యక్తులు లైంగిక వేధిస్తున్నారని.. కిడ్నాప్ చేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెందిన విద్యార్థిని ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

22:14 - October 17, 2015

గ్రేటర్ నోయిడా : పోలీసుల నిర్లక్ష్యం ఓ ఇంటర్ విద్యార్థిని ఉసురు తీసుకున్న ఘటన.. గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. తన ఇంటి పక్కన ఉండే ముగ్గురు వ్యక్తులు లైంగిక వేధిస్తున్నారని.. కిడ్నాప్ చేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెందిన విద్యార్థిని ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 'తమ కోర్కెను తీర్చాలని.. లేదంటే కిడ్నాప్ చేసి.. రేప్ చేస్తామని బెదరించారని సూసైడ్ నోట్ లో పేర్కొందని' విద్యార్థిని సోదరుడు తెలిపారు. అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని విద్యార్థిని తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

22:00 - October 17, 2015

వర్షాకాలంలో ఆకాశంలో కనిపించిన హరివిల్లును చూసి చూసి భూమికి కన్ను కుట్టిందట. తనపైనా రంగురంగుల ఇంధ్రధనస్సు ఎందుకు విరియదంటూ అసూయపడిందట... బాగా ఆలోచించింది. అంతే మరి వర్షాకాలం అయిపోయి శరదృతువు రాగానే.. హరివిల్లును తలదన్నే వేల రంగులు భూమినంతా ఆవరించాయి. హరివిల్లులో ఏడు రంగులుంటే.. అంతకు వంద రెట్ల రంగులతో.. పూల దుప్పటి కప్పుకొని గర్వంగా ఆకాశాన్ని చూసి పరిహసించింది. నేలంతా పరచుకున్న విరిపూలతో భూమి పరవశించిపోయింది. పూల పుప్పొడి సువాసనలు ఆకాశాన్ని తాకుతుంటే.. ఆకాశం ఆనందంతో సన్నటి నీటి తుంపరలు రాల్చింది. అపురూపమైన సమాగమం ఇది. ప్రపంచంలో మరెక్కడా కానరాని అద్భుతమైన సంబరం ఇది. ప్రకృతిలోని సమస్త పూబోణులతో కాంతలు ఆడుకునే పండుగ... ఆటపాటల్లో అంతరాలు తెలియవు.. ఇచ్చిపుచ్చుకోవటాల్లో ఇబ్బందులు లేవు.. కులం లేదు.. మతం లేదు.. ధనం లేదు.. చిన్నా.. పెద్దా.. పిల్లా.. పాపా.. అమ్మలు.. అమ్మాయిలు... అంతా కలిసి.. అన్నింటిలో కలగలిసి.. నీటిగట్టున చలువ వెన్నెల తిన్నెలపై పుట్టతేనంత చిక్కగా.. చక్కగా సాగే పూల పుప్పొడుల జాతర బతుకమ్మ.
బతుకమ్మ పాటలతో పులకించిపోతోన్న తెలంగాణ
ఒక్కేసి..పూవ్వేసి చందమామ అంటూ ఆడబిడ్డలు ఆలపిస్తున్న బతుకమ్మ పాటలతో తెలంగాణమంతా పులకించిపోతోంది. రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరిస్తూ ఆడపడచులంతా ఆటలాడుతున్నారు. రాష్ట్రమంతా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.
పూల పండగ
పూల పండగని చెప్పుకునే ఈ బతుకమ్మ ఉత్సవంలో.. రంగురంగుల పూలు హరివిల్లుల్లా అందంగా అలకరించబడుతున్నాయి. రకరకాల పూలతో బతుకమ్మను మహిళలంతా సింగారిస్తున్నారు. పాటలు పాడుతూ.. పూలు అల్లుతూ బతుకమ్మను కీర్తిస్తూ.. వారంతా మైమరిచిపోతున్నారు. కొత్త బట్టల్లో మెరిసి.. మురిసిపోతూ.. గాజుల గలగలతో, పట్టీల సవ్వడులతో ఎంతో చూడముచ్చటగా మగువలు ముచ్చట్లాడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. అందరూ కలిసి మెలిసి ఆడుతూ ఆటపాటల్లో మునిగి తేలుతున్నారు. బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ అని అర్థం. అందుకే ఆ అమ్మలు.. అమ్మాయిలు ఎంతో ఇష్టంగా చేసుకునే పండుగిది.
తెలంగాణ జాగృతి సంస్థ
తెలంగాణ జాగృతి సంస్థ అన్ని జిల్లాల్లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఆ సంస్థ వ్యవస్ధాపకురాలు, ప్రస్తుతం నిజామాబాద్‌ ఎంపీ అయిన కవిత రోజుకో జిల్లాకు వెళుతూ బతుకమ్మ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆయా జిల్లాల నేతలు కుటుంబసభ్యులతో సహా బతుకమ్మ సంబరాల్లో ఆడిపాడుతున్నారు.
గతంలో గ్రామాల్లోనే అధికంగా జరుపుకునేవారు
బతుకమ్మ ఉత్సవాలు గతంలో గ్రామాల్లోనే అధికంగా జరుపుకునేవారు. నగరాల్లో జరుపుకున్నా అందరూ పాల్గొనేవారు కాదు. కాని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నగరాల్లోనూ బతుకమ్మ సందడి కనిపిస్తోంది. ప్రతి వీధిలో.. ప్రతి ఇంటి ముందు ఇప్పుడు బతుకమ్మ చప్పట్ల సందడి వినిపిస్తోంది. బతుకమ్మ ఆసాంతం పూలతో ముడిపడి ఉన్న పండుగ పూలతో మొదలై.. పూల చుట్టూ తిరుగుతూ.. పూలే మట్టై.. పూలే అమ్మై.. పూలే పాటలై.. పరవశించే పూదోట బతుకమ్మ. సాయం సంధ్య వేళ, మసక చీకటిలో ఉయ్యాల పాటలతో మగువలు ఈ పూల వల్లే తమను తాము మైమరచిపోతున్నారు. తెలంగాణలో ఎంతో ఘనంగా జరుగుతున్న బతుకమ్మ ఉత్సవాలు 21వ తేదీ వరకు జరగనున్నాయి.

 

21:55 - October 17, 2015

వ్యవసాయాన్ని గౌరవించాలని.. పాఠ్యాంశంగా చేర్చాలని ప్రముఖ సామాజిక శాస్త్ర వేత్త కంచె ఐలయ్య అన్నారు. రైతులను గౌరవించాలన్నారు. భూమిని ఉత్పత్తి సాధనంగా గుర్తించింది శూద్రులే అని స్పష్టం చేశారు. సొమ్మొకడిది సోకొకడిది అన్న సామెత మనం వింటూనే ఉన్నాం. భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థలో ఒక కులం బ్రహ్మతలనుండి పుట్టిందని చెప్పుకుని శూద్రుల శ్రమను దోచుకుంది. భూమిని ఉత్పత్తి సాధనంగా గుర్తించి ఆహార ఉత్పత్తిలో గణనీయమైన అభివృద్ధి సాధించిన కాపువర్గాన్ని శూద్రులుగా ముద్రవేసి చారిత్రక ద్రోహానికి ఒడిగట్టింది. ఆ వర్ణవ్యవస్థ దాష్టీకంపై కంచె ఐలయ్య మాట్లాడారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే.. 'భూమిని ఉత్పత్తి సాధనంగా గుర్తించింది శూద్రులే. కాపులను శూద్రకులంలోకి చేర్చింది బ్రాహ్మణవర్గం. సామాజిక గౌరవాన్ని ఇవ్వలేదు. దేవుడి పాదాల దగ్గర పుట్టిందెవరు? భూమిని దున్నే శాస్త్రీయ ప్రక్రియను అభివృద్ధి చేసిందెవరు. సాంకేతిక పనిముట్లు శూద్రులు సాధించిన ఒక చారిత్రక విజయం. పశువుల కాడిని లాగడం ఒక ఆధ్యాత్మిక విజయానికి ప్రతీక. దేవుళ్ళంతా ఆయుధాల గురించే చర్చించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:42 - October 17, 2015

సొమ్మొకడిది సోకొకడిది అన్న సామెత మనం వింటూనే ఉన్నాం. భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థలో ఒక కులం బ్రహ్మతలనుండి పుట్టిందని చెప్పుకుని శూద్రుల శ్రమను దోచుకుంది. భూమిని ఉత్పత్తి సాధనంగా గుర్తించి ఆహార ఉత్పత్తిలో గణనీయమైన అభివృద్ధి సాధించిన కాపువర్గాన్ని శూద్రులుగా ముద్రవేసి చారిత్రక ద్రోహానికి ఒడిగట్టింది. భూమిని ఉత్పత్తి సాధనంగా గుర్తించింది శూద్రులే. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:35 - October 17, 2015

నల్గొండ: వేతనాలు పెంచాలని నినదించిన ఆశా వర్కర్లపై తెలంగాణ విద్యుత్‌ శాఖామంత్రి జగదీష్‌రెడ్డి తీవ్ర స్ధాయిలో ఫైరయ్యారు. 'ఎక్కువ సేపు డ్రామాలు ఆడొద్దు.. కార్యకర్తలకు కోపం వచ్చే పరిస్థితి తెస్తే బాగుండదు.. కార్యకర్తలు రెచ్చిపోతే బాధ్యత తమది కాదు.. మీరు నాటకాలు చేస్తే కార్యకర్తలు.. తిరుగుబాటు చేస్తారు.. చప్పుడు చేయకుండా కూర్చొండి'.. అని వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లాలోని పానగల్ లో వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభ ఏర్పాటు చేశారు. తమస్యలను పరిష్కారించాలని, తమకు వేతనాలు పెంచాలని కోరిన ఆశావర్కర్లపై చిందులు వేశారు. నిరసన తెలుపుతున్న ఆశావర్కర్ల వైపు వేలు చూపుతూ అల్లరి చేయడానికి వచ్చిండ్రు అంటే మిమ్మల్ని వేరే పార్టీ వారు పంపించి ఉంటారని అనుకోవాల్సి వస్తుందన్నారు. సప్పుడు చేయకుండా కూర్చొండని వారిని హెచ్చరించారు. ఎవరో పంపిస్తే వచ్చి పార్టీ కార్యక్రమాల్లో నిరసనలు చేస్తున్నారని, సభలో ఉండే ఉద్దేశం లేకుంటే బయటికి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలావుంటే ఆశావర్కర్లు మంత్రి ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వేతనాలు పెంచాలని అడిన పాపానికి తమను హెచ్చరించడమేంటని వాపోయారు.

 

పంటలను కాపాడేందుకు 'రేయిన్ గన్స్'

విజయవాడ : వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పంటలను కాపాడేందుకు రేయిన్ గన్స్ ను ఉపయోగిస్తామని ఎపి వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. పంటలను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

 

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు 1500 క్యూసెక్కుల నీరు విడుదల

నల్లగొండ : సాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాలువకు 1500 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. వారం పాటు నీటి విడుదల కొనసాగుతోంది.

 

ఈ నెలాఖరులోగా ఉప ఎన్నిక నోటిఫికేషన్ : భన్వర్ లాల్

వరంగల్ : ఈ నెలాఖరులోగా ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. హైదరాబాద్ లో అక్రమ ఓటర్లను తొలగించినట్లే.. వరంగల్ లోనూ తొలగిస్తామని చెప్పారు. 

స్నాప్ డీల్ కు టోకరా.. ముగ్గురి అరెస్టు

కరీంనగర్ : ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థ స్నాప్ డీల్ కు టోకరా పెట్టిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పార్సిల్ లో నకిలీ వస్తువులు వచ్చాయని తిప్పి పంపుతూ.. యువకులు రూ.9 లక్షల మేర మోసాలకు పాల్పడ్డారు. నిందితుల నుంచి రెండు ల్యాప్ టాపులు, ఆరు ఫోన్లు, రూ. 4 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

19:41 - October 17, 2015

హైదరాబాద్ : వైసీపీ ఈ దేశానికి సంబంధించింది కాదా.. అని టీడీపీ నేత జూపూడి ప్రభాకరరావు ప్రశ్నించారు. రాష్ట్రమంతటా పండగ వాతావరణం నెలకొంటే, జగన్‌ మాత్రం ఆహ్వానాన్ని తిరస్కరించడం బాధాకరమన్నారు. భూసమీకరణ విషయాలు తెలియకుండానే మోడీ కార్యక్రమానికి వస్తున్నారనుకుంటున్నారా అంటూ జూపూడి వైసీపీపై మండిపడ్డారు.

19:32 - October 17, 2015

విజయవాడ : కార్పోరేట్లకు కట్టబెట్టేందుకే చంద్రబాబు సర్కార్ భూసేకరణ చేస్తోందని సిపిఎం నేత బాబురావు ఆరోపించారు. ఈమేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వ భూ దాహానికి అంతు లేకుండా పోతుందని మండిపడ్డారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే లక్షా పదివేల ఎకరాలకు పైగా రైతుల వద్ద నుండి ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటుందని బాబురావు ఆరోపించారు. ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ ఈనెల 30 తేదిన జరగబోయే భూ సదస్సుకు సిపిఎం పూర్తి మద్దతు ఇస్తుందని బాబురావు తెలిపారు.

 

19:29 - October 17, 2015

హైదరాబాద్ : ఓ వైపు రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతుంటే మరో వైపు ఆహ్వాన పత్రికలు పంచే ప్రక్రియ కూడా అంతే వేగంగా కొనసాగుతోంది. రాజధాని శంకుస్థాపన ఆహ్వాన పత్రికలు పంచే బాధ్యత ఏపి మంత్రులు తీసుకున్నారు. మంత్రులు కామినేని శ్రీనివాస్‌, అయ్యన్న పాత్రుడుతో సహా పలువురు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందించారు. ఆహ్వాన పత్రిక తీసుకునేందుకు జగన్‌ నిరాకరించటంపై మంత్రులు మండిపడ్డారు. రాజధాని ఆహ్వాన పత్రిక జగన్ తీసుకోకపోవటం విచారకరమన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు.

 

19:24 - October 17, 2015

హైదరాబాద్ : రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ.. విభజన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని పీసీసీ చీఫ్‌ రఘువీరా డిమాండ్‌ చేశారు. ప్రత్యేకహోదా, వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధులపై స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు.

 

19:10 - October 17, 2015

బీహార్ : హిందూ-ముస్లింలు ఎప్పుడూ కొట్లాడుకోరని, వారిని కొట్లాడేలా రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ బిజెపిపై ధ్వజమెత్తారు. మతతత్వం లేకుంటే బిజెపి దుకాణం బంద్‌ అవుతుందని, అందుకే మతమనే ఆయుధాన్ని బయటకు తీశారని ఆరోపించారు. ప్రజా సంక్షేమంపై చర్చించకుండా మతం పేరిట సమాజాన్ని చీలుస్తున్నారని ప్రధానిపై మండిపడ్డారు. వీరీ రాజకీయ జిత్తులను బీహార్‌ ప్రజలు తిప్పికొడతారన్న నమ్మకం తనకుందని మాంఝీలో జరిగిన ఎన్నికల సభలో సోనియా పేర్కొన్నారు. బీహార్‌ ఎన్నికలపై ఇటీవల కొన్ని టీవీలు జరిపిన సర్వే ఫలితాలతో ఎన్డీయేకు దిమ్మ తిరిగింది. దీంతో తమ కూటమి ఓట్లను కొల్లగొట్టడాని బిజెపి అన్ని ప్రయత్నాలు చేస్తోందని సోనియా విమర్శించారు.

 

అమీర్‌పేటలో సిక్కుల బైఠాయింపు

హైదరాబాద్ : పంజాబ్ లో సిక్కు మత గురు గ్రంథ్ సాహెబ్‌ను అవమానపరిచినందుకు నిరసనగా నగరంలోని అమీర్‌పేటలోగల గురుద్వార్ ఎదుటగల రోడ్డుపై సిక్కులు బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

 

 

18:05 - October 17, 2015

ఆదిలాబాద్ : లక్షెట్టిపేట ఐసిడిఎస్ కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ పండుగ ఉద్దేశం అందరికి తెలియ చెప్పాలనే ఉద్దేశంతో ఐసిడిఎస్ కార్యాలయ సిబ్బంది బతుకమ్మను అందంగా పేర్చి ఆడామని ఐసిడిఎస్ ఉద్యోగులు చెబుతున్నారు.

 

17:50 - October 17, 2015

ఢిల్లీ : నిర్భయ లాంటి ఎన్ని చట్టాలొచ్చినా.. మహిళలపై అఘాయిత్యాలకు జరుగుతూనే ఉన్నాయి. మానవత్వం మంటగలసిన ఘటనలు దేశ రాజధానిలో చోటుచేసుకున్నాయి. ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారులపై సామూహిక అత్యాచారాలు జరిగాయి. పశ్చిమ ఢిల్లీలో మానవ మృగాలు ఇంటి బయట ఆడుకుంటున్న రెండున్నర ఏళ్ల పాపను అపహరించి, గ్యాంగ్ రేప్ చేశారు. ఇంటి సమీపంలోని పార్కు దగ్గర తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆ పసిమొగ్గను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో ఇంతవరకు నిందితులను అదుపులోకి తీసుకోలేదు. మరో దారుణం తూర్పు ఢిల్లీ ఆనంద్ విహార్ ప్రాంతంలో జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఐదేళ్ల పాపను, పొరుగున ఉండే వ్యక్తి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అనంతరం తన స్నేహితులతో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావంతో నిందితుడి ఇంటినుంచి ఏడుస్తూ వస్తుండగా పొరుగువారు గుర్తించి సోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారులను ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ పరామర్శించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు.

 

రేపు సా.5.30 గంటలకు చంద్రబాబుకు కేసీఆర్ అపాయింట్ మెంట్

హైదరాబాద్ : రేపు సాయంత్రం 5.30 గంటలకు సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ ను చంద్రబాబు దంపతులు కలవనున్నారు. రాజధాని శంకుస్థాపనకు కేసీఆర్ ను ఆహ్వానించనున్నారు. 

రేపు సా.5 గంటలకు గవర్నర్ ను కలవనున్న చంద్రబాబు

హైదరాబాద్ : రేపు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ నరసింహన్ ను ఎపి సీఎం చంద్రబాబు కలవనున్నారు. రాజధాని శంకుస్థాపన ఆహ్వాన పత్రికను గవర్నర్ కు అందించనున్నారు.

 

రేపు కేసీఆర్ ను కలవనున్న చంద్రబాబు దంపతులు

హైదరాబాద్ : రేపు సాయంత్రం 5.30 గంటలకు క్యాంప్ ఆఫీస్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఎపి చంద్రబాబు దంపతులు కలవనున్నారు. రాజధాని శంకుస్థాపన ఆహ్వాన పత్రికను కేసీఆర్ కు అందించనున్నారు.

 

16:35 - October 17, 2015

హైదరాబాద్ : యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా ఉపాధ్యాయులు హైదరాబాద్‌లో కదం తొక్కారు. హుజూర్‌నగర్‌లో ఎంఈవోను అక్రమంగా నియమించారంటూ... హైదరాబాద్‌ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. పలు అవినీతి ఆరోపణలున్న అబ్దుల్‌ లతీఫ్‌ను ఎంఈవోగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

 

16:27 - October 17, 2015

పశ్చిమగోదావరి : జిల్లాలోని చించినాడలో విషాదం చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని చిన్నారిని వదిలేసిన ఓ అభాగ్యురాలు గోదావరి బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి తేరుకునేలోపే ఆమె గోదావరిలో కొట్టుకుపోయింది. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఓ ఆటోలో వచ్చి దిగి.. పాపను బ్రిడ్జీపై పెట్టి.. మహిళ.. గోదావరి నదిలో దూకినట్లు తెలుస్తోంది. గజ ఈతగాళ్లు, నాటుపడవల సాయంతో జాలర్లు ఆమె కోసం గాలిస్తున్నారు. అయితే మృతదేహానికి సంబంధించన అనవాలు లభించలేదు.. సాయంత్రం వరకు ఆనవాలు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పాలకోసం ఏడ్చి ఏడ్చి అలసి పోయిన చిన్నారిని చూసి స్థానికుల కళ్లు చెమర్చాయి. పాపను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె హ్యాండ్ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు.

 

16:11 - October 17, 2015

ఆదిలాబాద్ : జిల్లాలోని మంచిర్యాల మండలం నస్పూర్‌లో ఇళ్ల కూల్చివేతకు నిరసనగా స్థానికులు ఆందోళనకు దిగారు. మూడు అంతస్థుల భవనం ఎక్కి తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్‌ను సంప్రదించి సమస్య పరిష్కరిస్తానని సీఐ హామి ఇవ్వడంతో నిరసనకారులు ఆందోళన విరమించారు. సర్వేనెం 42లో అన్ని అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్నా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు ఇళ్లను కూల్చివేయడం దారుణమన్నారు. తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

 

16:07 - October 17, 2015

వరంగల్ : కేంద్రంపై రచయితల నిరసన పరంపర కొనసాగుతోంది. మొన్న భూపాల్‌ రెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటిస్తే... ఈ జాబితాలో ఇప్పుడు వరంగల్‌ జిల్లా ప్రొఫెసర్‌ కాత్యాయనీ విద్మహే చేరిపోయింది. 2013లో సాహిత్యకాశంలో సగం అనే సాహిత్య విమర్శ వ్యాస సంపుటికి కేంద్ర ప్రభుత్వం...కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు ప్రదానం చేసింది. రచయితలపై దాడులకు నిరసనగా తాను అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

 

16:04 - October 17, 2015

విజయవాడ : బాధ్యత, స్థోమత కలిగిన ప్రతి ఒక్కరూ గ్రామాలను దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలని ఏపి సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడలో 'స్మార్ట్ విలేజ్‌-స్మార్ట్ వార్డ్' కార్యక్రమంలో పాల్గొని.. సీఎం సమీక్ష నిర్వహించారు. అనంతరం భాగస్వాముల పాత్రపై మాన్యువల్ రూపొందించామని.. ఇంటింటికీ టాయిలెట్ నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ప్రసూతి మరణాలు, స్కూల్లో డ్రాపవుట్స్ లేకుండా చూడాలని ఆదేశించారు.

 

16:00 - October 17, 2015

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్ కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ లేఖ రాశారు. ఈ నెల 22వ తేదీ లోపు కలవడానికి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన ప్రధానిని కోరారు. ప్రత్యేక హోదాపై ప్రధానితో చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన లేఖలో చెప్పారు. ఈ నెల 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఈ లోపలే తనకు సమయం కేటాయించాలని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కలిసే అవకాశం ఇవ్వాలని జగన్ ప్రధానిని కోరారు. గన్నవరంలో కానీ, తిరుపతిలో కానీ కలిసేందుకు అనుమతి నివ్వాలని జగన్‌ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు.

 

రోడ్డు ప్రమాద ఘటన.. 17కు చేరిన మృతుల సంఖ్య

ప్రకాశం : జిల్లాలోని వలేటివారిపాలెం మండలం చెర్లోపాలెం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 17 కు చేరింది. ఘటనలో గాయపడిన మరో ఇద్దరు మృతి చెందారు. ఒంగోలు సంఘమిత్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

15:33 - October 17, 2015

నల్గొండ : తెలంగాణ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పై త్రీవస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ విధానాల వల్లనే నేడు రైతులకు కష్టాలు వచ్చాయని ఆయన విమర్శించారు. నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని, మాట్లాడారు. కాంగ్రెస్ రైతు భోరోసా యాత్రలు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. తెలంగాణ.. కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఏమయ్యారని ప్రశ్నించారు. కట్టని గృహాలకు బిల్లులు.. చెల్లించిన చరిత్ర కాంగ్రెస్ నేతలదని ఎద్దేవా చేశారు. అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడడడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఎన్నికల సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కారులో నోట్ల కట్టలు దొరికాయని గుర్తు చేశారు. జానారెడ్డికి కేటీఆర్ చురకలంటించారు. ఉన్నది ఉన్నట్లుగా అంటే జానారెడ్డికి ఉలుకెందుకన్నారు. 

కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్...

 

నల్గొండ : తెలంగాణ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పై త్రీవస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ విధానాల వల్లనే నేడు రైతులకు కష్టాలు వచ్చాయని ఆయన విమర్శించారు. నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని, మాట్లాడారు. కాంగ్రెస్ రైతు భోరోసా యాత్రలు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. తెలంగాణ.. కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఏమయ్యారని ప్రశ్నించారు. 

15:07 - October 17, 2015

వరంగల్ : తొర్రూరు మండలం మడిపల్లి వద్ద కిరోసిన్ లారీ బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. పౌరసరఫరా శాఖ చెందిన ఓ లారీ కిరోసిన్ లోడ్ తో శనివారం సూర్యాపేట నుండి మహబూబాద్ కు వెళుతోంది. మడిపల్లి వద్ద క్రాస్ వద్దకు చేరుకోగానే లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. అందులో కిరోసిన్ ఉండడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీనితో లారీలో ఉన్న గుమస్తా సజీవదహనమయ్యాడు. డ్రైవర్, క్లీనర్ లకు తీవ్రగాయాలయ్యాయి. లారీ బ్రేక్ లు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో రాకపోకలు స్తంభించాయి. 

ఆశాలపై మంత్రి జగదీష్ తీవ్ర ఆగ్రహం..

నల్గొండ : మంత్రి లక్ష్మారెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో ఆశా వర్కర్లు నల్ల జెండాలు, ప్లకార్డులు ప్రదర్శించారు. ఆశాల నిరసనపై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశాలు సమస్య పరిష్కారానికి రాలేదని, ఓ రాజకీయ పక్షం రెచ్చగొట్టిదంటూ అసహనం వ్యక్తం చేశారు. మీ ఆటలు ఇక్కడ సాగవని, ఆశాలు ఎక్కువ చేస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. 

నర్సీపట్నంలో రెండు టన్నుల గంజాయి స్వాధీనం...

విశాఖపట్టణం : నర్సీపట్నంలో ఆయిల్ ట్యాంకర్ లో తరలిస్తున్న రెండు టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈఘటన లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 

కిరోసిన్ లారీ బోల్తా..డ్రైవర్ సజీవదహనం..

వరంగల్ : తొర్రూరు మండలం మడపల్లి వద్ద కిరోసిన్ ట్యాంకర్ బోల్తా పడింది. డ్రైవర్ సజీవదహనం కాగా క్లీనర్ ప్రమాదం నుండి బయటపడ్డాడు.

రేపు సాయంత్రం కేసీఆర్ ను కలువనున్న చంద్రబాబు..

హైదరాబాద్ : తెలంగాణ సీఎంఓకే ఏపీ సీఎంవో ఫోన్ చేశారు. అమరావతి శంకుస్తాపనకు సీఎం కేసీఆర్ ను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. రేపు సాయంత్రం కేసీఆర్ ను చంద్రబాబు కలువనున్నారు. 

తెలంగాణ వక్ఫ్ బోర్డు ఏర్పాటు..

హైదరాబాద్ : తెలంగాణ వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. బోర్డు సీఈవోగా అసదుల్లా వ్యవహరించనున్నారు. 

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 'చెకుముకి'...

గుంటూరు : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 'చెకుముకి' సంబరాలు జరుగనున్నాయి. రాష్ట్రమంతటా నవంబర్ 5 నుండి జనవరి 5 వరకు ఈ సంబరాలు కొనసాగనున్నాయి. జనవరి 3,4,5 తేదీల్లో గుంటూరులో రాష్ట్ర స్థాయి సంబరాలు ఉంటాయని వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.శంకరయ్య వెల్లడించారు. 

మడిపల్లి వద్ద తగలబడుతోన్న ఆయిల్ ట్యాంకర్

వరంగల్ : తొర్రూరు మండలం మడిపల్లి వద్ద ఆయిల్ ట్యాంకర్ తగలబడుతోంది. స్థానికులు భయాందోళనలో ఉన్నారు. 

కొత్త రాజధాని అందర్ని సంతోషపెడుతుందని కోరుకుంటున్నా : వపన్ కళ్యాణ్

హైదరాబాద్ : కొత్త రాజధాని అందర్ని సంతోషపెడుతుందని కోరుకుంటున్నానని హీరో వపన్ కళ్యాణ్ అన్నారు. కొత్త రాజధాని హైదరాబాద్ లా కాకూడదని చెప్పారు. ఎల్లప్పుడూ ద్వేషం సరికాదని హితవు పలికారు. సినిమా చిత్రీకరణకుర గుజరాత్ వెళ్తున్నానని తెలిపారు. కెమెరామెన్ పై దాడి దురదృష్టకరమన్నారు. ఇందులో తన తప్పుంటే క్షమాపణ కోరుతున్నానని పేర్కొన్నారు.  

సీఎం కేసీఆర్ ను ఆహ్వానించనున్న చంద్రబాబు

హైదరాబాద్ : తెలంగాణ సీఎంవోకు ఎపి సీఎంవో ఫోన్ చేశారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఎపి సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. 

14:08 - October 17, 2015

ఫొటోలో ఉన్న వ్యక్తిని చూశారా ? ఇతను ఎక్కువ కాలం బతకడంట. చూడటానికి ముసలివాడిగా కనిపిస్తున్న చిన్నారి వయస్సు 14 ఏళ్లే.  ఏ చిన్నారికి రాని వ్యాధి ఇతనికి సోకింది. ఇతని పేరు నిహాల్ భిట్లా. అందరిలాగానే అన్నింటిలోనూ ముందుంటున్నాడు. విద్య..సోషల్ యాక్టివిటీస్..తనకు వచ్చిన ప్రతి పనిలో ముందుంటున్నాడు. కానీ భిట్లా ఓ రకమైన జెనటిక్ వ్యాధితో బాధ పడుతున్నాడు. ఎక్కువ కాలం బతికే అవకాశాలు లేవని తెలుసుకున్న తల్లిదండ్రులు నిహాల్ చివరి కోరికలు తీర్చడానికి సిద్ధమయ్యారంట. తాను చనిపోయే లోపు 'హోండా' కంపెనీ తయారు చేసిన ఆసియా 'రోబో'..కాలిఫోర్నియా 'డిస్నీల్యాండ్' చూడాలని అనుకుంటున్నాడంట. ఇతని కోరికలను నెరవేర్చాలని తండ్రి భావిస్తున్నాడంట. నిహాల్ కోరికలు నెరవేరుతాయని ఆశిద్దాం. 

రేపు తిరుమలకు ఏపీ సీఎం

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రేపు(ఆదివారం) ఉదయం తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమలలో జరిగే మనవడి అన్నప్రాసన కార్యక్రమంలో బాబు పాల్గొంటారు. అనంతరం చంద్రబాబు తిరుపతి నేరుగా హైదరాబాద్‌కు రానున్నారు.

పర్యాటకులపై తేనెటీగల దాడి...

ఖమ్మం: జిల్లాలోని కిన్నెరసాని రిజర్వాయర్ దగ్గర పర్యాటకులపై తేనెటీగలు దాడి చేశాయి. తేనేటీగల దాడిలో 25 మంది పర్యాటకులకు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం బాధితులను పాల్వంచ ఆస్పత్రికి తరలించారు.

13:31 - October 17, 2015

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. దసరాకు ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి.. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ను ఆహ్వానించారు. తొలి విడతలో 60 వేల ఇళ్లను... ఒక్కో నియోజకవర్గంలో 400 ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.

ప్రభుత్వ మార్గదర్శకాలు ఖరారు.....

తెలంగాణలో నిర్మించతలపెట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. ముఖ్యమంత్రి కలల్లో ఒకటైన ఈ కార్యక్రమాన్ని ఈ దసరాకే ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ ఐడీహెచ్‌ కాలనీలో నిర్మించిన ఇళ్లను పేదలకు అందించడంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కో ఇంటి ఖర్చు రూ.5.04 లక్షలు.....

ఇక ఈ పథకం కింద ఇళ్లను గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల 4 వేల వ్యయంతో నిర్మించనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 4 లక్షల 69 వేలు కాగా,.. కేంద్రం తన వాటాగా ఒక్కో ఇంటికి 35 వేలు మంజూరు చేయనుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో ఒక్కో గృహానికి 5 లక్షల 30 వేలతో నిర్మించనున్నారు. ఇందులో రాష్ట్ర సర్కార్‌ వాటా 4 లక్షల 30 వేలు.. కేంద్ర ప్రభుత్వం వాటా లక్ష రూపాయలుగా నిర్ణయించారు.

560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు.....

ఇక ప్రభుత్వం ఒక్కో ఇంటిని 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనుంది. ఈ ఏడాది 60 వేల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించనున్నారు. గృహ నిర్మాణశాఖ రూపొందించిన డిజైన్‌కు కేసీఆర్‌ ఆమోదం తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 400 చొప్పున గ్రామీణ ప్రాంతాలో 36 వేల ఇళ్లు,.. పట్టణ ప్రాంతాల్లో 24 వేల ఇళ్లు నిర్మించనున్నారు. అదనపు రిజర్వ్‌ కోటా కింద 12,400 ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది.

ఫుడ్‌ సెక్యూరిటీ కార్డు తప్పనిసరి.....

దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. సంబంధిత వ్యక్తి పేరుతో ఫుడ్‌ సెక్యూరిటీ కార్డు తప్పనిసరి. కుటుంబంలోని మహిళ పేరు మీద ఇల్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం కచ్చా ఇల్లు, కిరాయి ఇళ్లలో నివసించేవారు దీనికి అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం,.. మైనారిటీలకు 7 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో ఎస్సీలకు 17,.. ఎస్టీలకు 6, మైనారిటీలకు 12 శాతం ఇళ్లను కేటాయిస్తారు. గ్రామ పంచాయతీలు, అర్బన్‌ లోకల్‌ బాడీలు ఎంపిక చేసినవారికే ఇళ్లను మంజూరు చేస్తారు. ఈ ప్రాజెక్ట్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జిల్లాస్థాయిలో కలెక్టర్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తారు.

గత ప్రభుత్వాల హయాంలో గృహ నిర్మాణ శాఖలో ....

గత ప్రభుత్వాల హయాంలో గృహ నిర్మాణ శాఖలో ఎన్నో అక్రమాలు జరిగాయని విమర్శలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఈసారి ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగితే సహించేది లేదన్నారు. ఇక ఇళ్ల కేటాయింపులో ఒక్కో నియోజకవర్గంలో కేటాయించిన మొత్తంలో సగానికి స్థానిక ఎమ్మెల్యేకు అధికారం ఉంటే.. మిగతా వాటిపై ఆ జిల్లా మంత్రికి అధికారం ఉంటుందని తెలిపారు. జిల్లాల్లో ఇళ్ల నిర్మాణ బాధ్యతలను ఆయా జిల్లా కలెక్టర్లకు,.. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. 

13:28 - October 17, 2015

హైదరాబాద్ : వక్ఫ్‌ భూములపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏళ్ళతరబడి అన్యాక్రాంతం అవుతూ వస్తున్న..వక్ఫ్ భూములను ఆదాయ వనరుగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని వేల ఎకరాల భూముని కమర్షియల్, ఇండస్ట్రీయల్ జోన్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్దంచేస్తోంది.

మైనారిటీల ఆస్తుల అభివృద్ధి.....

మైనారిటీల ఆస్తులు వారి అభివృద్ధికే అంటూ సరికొత్త విధానాన్ని తెరమీదకు తెస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అల్పసంఖ్యాక వర్గాల ఆస్తులన్నింటినీ అభివృద్ధి పరచడంద్వారా భారీగా అదాయం రాబట్టుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో లక్ష ఎకరాల భూమి ఉన్నట్లు ప్రభుత్వలెక్కలు చెపుతుండగా.. వాటిలో కేవలం 60వేల ఎకరాలు మాత్రమే ప్రభుత్వం దగ్గర ఉంది. ఈ భూమిని..ప్రైవేటు కంపెనీలకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూమిని కమర్షియల్ జోన్‌లకు లీజుకు అప్పగించి..భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

లీజు ద్వారా రూ. 400 కోట్ల ఆదాయం ....

అయితే..పిపిపి పద్దతిలో లేదంటే లీజుపద్దతిన భూములను ఇచ్చి దాని ద్వారా 400కోట్ల రూపాయాల ఆదాయాన్ని రాబట్టుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖ అంచనా వేస్తోంది. భూముల లీజు ద్వారా వచ్చే నిధులను వారి సంక్షేమం కోసం ఉపయోగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరో రెండురోజుల్లో వక్ఫ్ భూముల విభజన ప్రక్రియ పూర్తవుతున్న నేపధ్యంలో..ఇప్పటివరకూ అన్యాక్రాంతం అయిన భూమిని గుర్తించేందుకు ప్లాన్ అఫ్ యాక్షన్‌ను సిద్ధం చేస్తోంది. భూముల్ని అక్రమంగా కబ్జాచేసిన అక్రమదారులపై కఠిన చర్యలు తీసుకొని.ఆక్రమణకు గురైన భూముల్ని స్వాధీనం చేసుకోవాలని మైనారిటీ సంక్షేమశాఖ అధికారులను ఆదేశించింది. మొత్తానికి వక్ఫ్‌ భూముల అన్యాక్రాంతంపై ఇన్నాళ్ల తర్వాత ప్రభుత్వం మేల్కొనడంపై మైనారిటీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

13:22 - October 17, 2015

హైదరాబాద్ : బెజవాడ హోటళ్లకు మహర్దశ పట్టింది. మొన్నటిదాకా.. ఒడిదుడుకులతో నష్టాలతో సాగుతున్న హోటళ్ల స్టార్‌ తిరిగింది. వీఐపీల రాకపోకలతో.. బెజవాడ హోటళ్లు సందడిగా మారిపోయాయి. శంకుస్థాపన సందర్భంగా.. వచ్చే వారం రోజుల పాటు.. ఏ హోటల్‌లోనూ గది దొరకని పరిస్థితి. రాబోయే రోజుల్లోనూ ఇదే హవా కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. 

హోటల్‌ ఇండస్ట్రీకి మంచిరోజులు......

విజయవాడలో హోటల్‌ ఇండస్ట్రీకి మంచిరోజులు వచ్చాయి. నష్టాల ఊబిలో కూరుకు పోయి.. సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలోని హోటళ్లకు ఇప్పుడు స్టార్‌ తిరిగింది. వచ్చే వారం రోజుల్లో నగరంలో ఏ హోటల్‌లోనూ గది దొరకని పరిస్థితి. 22న రాజధాని శంకుస్థాపనకు వచ్చే అతిథుల కోసం ఇప్పటికే అన్ని హోటళ్ల గదులూ బుక్‌ అయిపోయాయి. రెవిన్యూ అధికారులు నగరంలోని అన్ని ప్రధాన హోటళ్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతే కాదు.. గదులను ఎవరికీ కేటాయించ రాదంటూ లిఖిత పూర్వక ఆదేశాలూ జారీ చేశారు.

10 త్రీస్టార్‌ హోటళ్లు.. 4 ఫోర్‌ స్టార్‌ హోటళ్లు 50 టూ స్టార్‌ హోటళ్లు.....

శంకుస్థాపనకు వచ్చే అతిథుల కోసం.. బెజవాడలోని మున్సిపల్‌, అర్‌ అండ్‌ బీ, ప్రభుత్వ అతిథి గృహాలను సిద్ధం చేశారు. వీటితో పాటు.. నగరంలోని అన్ని హోటళ్లు, లాడ్జిలను అధికారులు కబ్జా పెట్టేశారు. విజయవాడలో పది త్రీస్టార్‌, నాలుగు ఫోర్‌ స్టార్‌, ఓ యాభై టూస్టార్‌ హోటళ్లున్నాయి. ఇవి కాక, చిన్నా చితకా లాడ్జీలు మరో 70 దాకా ఉన్నాయి. అన్నింటా కలిపి రెండువేల దాకా గదులు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటినీ అధికారులు బ్లాక్‌ చేసేశారు. అయితే వచ్చే అతిథులకు ఇవి ఏమూలకూ చాలవని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.  శంకుస్థాపనకు తరలి వచ్చే ప్రజాప్రతినిధులు కూడా తమ పరపతిని ఉపయోగించి.. బెజవాడ హోటల్‌ గదులను అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకుంటున్నారు. మరికొంత మంది స్థానిక నేతలతో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకొని.. గదుల కోసం పైరవీలు చేసుకుంటున్నారు.

శంకుస్థాపన తర్వాత కూడా డిమాండ్‌ కొనసాగే పరిస్థితి ....

బెజవాడ హోటళ్లకు శంకుస్థాపన తర్వాత కూడా డిమాండ్‌ కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. రాజధాని నిర్మాణ ప్రక్రియలో భాగంగా.. పలువురు దేశ, విదేశీ ప్రముఖులు నగరానికి తరచూ రావాల్సి ఉంటుంది. అదీకాక.. ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యధిక కాలం.. విజయవాడలోనే మకాం వేయనున్నారు. దీంతో మంత్రులు, ఇతర కీలక అధికారులూ ఇక్కడే బస చేస్తున్నారు. వీరికి తోడు ప్రభుత్వ స్థాయిలో పనులు చేయించుకోవాలనుకునే వారూ విజయవాడకు తరలి వస్తున్నారు. దీంతో.. ఈ నాలుగు రోజులే కాకుండా.. రాబోయే రోజుల్లోనూ బెజవాడలో హోటళ్లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడి.. కొత్తగా మరిన్ని హోటళ్లూ నిర్మితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

13:20 - October 17, 2015

హైదరాబాద్ : ఈనెల 22న జరిగే అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి హాజరుకావాల్సిందిగా పలువురు నేతలు, ప్రముఖులకు ఏపీ మంత్రుల బృందం ఆహ్వానపత్రికలను అందజేస్తోంది. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీని అమరావతి శంకస్థాపనకు రావాల్సిందిగా మంత్రులు ఆహ్వానించారు. అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమానికి తాను హాజరవుతానని తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి చెప్పారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు ఆమె ఆంధ్రప్రదేశ్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

12:48 - October 17, 2015

హైదరాబాద్ : సంచలనాల వర్మ మరో సంచలనం సృష్టించారు. మెగాస్టార్ చిరంజీవిని ఏకిపారేశారు. సినిమా రంగంలో నిజమైన బ్రూస్ లీ రాజమౌళీనే అన్నారు. చిరంజీవి 150వ సినిమాగా బ్రూస్ లీ ఎంచుకోవడం, 'ప్రజారాజ్యం' లాంటి తప్పుడు నిర్ణయం అన్నారు. రాజమౌళి తెలుగువారి సత్తా చాటుతుంటే చిరంజీవి తన 151వ సినిమాగా తమిళ సినిమాను ఎంచుకోవడం తెలుగు ప్రజలను అవమాన పర్చడమే అని వర్మ తన ట్విట్టర్ లో కామెంట్స్ చేశారు. బ్రూస్ లీ యూనిట్ చెబుతున్న లెక్కలు ఎలా ఉన్నా, తను మాత్రం చిరంజీవిని 150వ సారి వెండితెర మీద చూశానని, ఇదే చిరు 150వ సినిమా అంటూ తేల్చేశాడు వర్మ. అయితే ఆయన 151వ సినిమా మాత్రం ఎంటర్ ద డ్రాగన్ లాంటి మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నానన్నాడు. చిరు 151వ సినిమాగా ఓ తమిళ రీమేక్ సినిమాను చేస్తున్నాడని వస్తున్న వార్తలు అవాస్తమని భావిస్తున్నా, ఆ సినిమా బాహుబలిలా ఒరిజినల్ సినిమా అయి ఉండాలని కోరుకుంటున్నా. రాజమౌళి ఎంత గొప్ప అన్నది విషయం కాదు, మెగాస్టార్ అన్నది అన్నింటికంటే పెద్ద విషయం, అందుకే తమిళ సినిమా రీమేక్ లో నటించి తెలుగు వారి గౌరవాన్ని దెబ్బతీయోద్దు, రాజమౌళిలా తెలుగు వారి గౌరవాన్ని మరింతగా పెంచాలి. మెగా ఫ్యామిలీ అభిమానిగా చెబుతున్నా.. చిరు 151వ సినిమాగా రీమేక్ సినిమాను చేయొద్దు, ఒరిజినల్ సినిమానే చేయాలి. అది కూడా బాహుబలిని మించే భారీ సినిమా చేయాలి. మిగతా మెగా అభిమానులు కూడా చిరంజీవి రీమేక్ సినిమా చేయొద్దని కోరాలి. చిరంజీవి లాంటి మెగాస్టార్ తమిళ కాపీ సినిమా చేయటం అనేది తెలుగు వారికి అవమానం, అందుకే చిరంజీవి తమిళ రీమేక్ లో నటిస్తున్నాడన్న వార్త రూమర్ అనుకుంటున్నా'. అంటూ ట్వీట్ చేశాడు.

12:41 - October 17, 2015

హైదరాబాద్ : తెలంగాణ సీఎంవోకు ఏపీ సీఎంవో ఫోన్‌ చేశారు. విషయం ఏమంటే అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించబోతున్నారు. స్వంయగా కలిసి ఆహ్వానించేందుకు తెలంగాణ సీఎంవో కు ఫోన్ చేసిఅపాయింట్‌మెంట్‌ ఖరారు చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం ఇద్దరు చంద్రులు కలవబోతున్నారన్నమాట.

12:38 - October 17, 2015

హైదరాబాద్ : దాద్రి ఘటన మరవకముందే.. మరో విషాదం చోటుచేసుకుంది. ఓ వైపు గొడ్డుమాంసం వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. ఆవుల్ని ట్రక్కులో తరలిస్తున్నాడని ఆరోపిస్తూ.. ఓ యువకుడిని హిమాచల్ ప్రదేశ్‌లో కొట్టి చంపేశారు. దాద్రీ ఘటన దేశవ్యాప్తంగా ఇప్పటికే పెను సంచలనం రేపింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సోదరులు నోమన్, ఇమ్రాన్ అస్గర్‌లు హిమాచల్ ప్రదేశ్ నుంచి కొన్ని ఆవులను లారీలో తీసుకువెళ్తుండగా, గుర్తించిన కొందరు వ్యక్తులు లారీని ఆపి, వీటిని చంపేందుకే తీసుకెళ్తున్నారని ఆరోపిస్తూ, వారిపై దాడికి చేశారు. ఈ ఘటనలో తీవ్రగాయాలకు గురైన నోమన్‌ను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని అనుమానిస్తున్నారు. హత్యానేరం కింద కేసు పెట్టిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

హస్తినలో చిన్నారులపై గ్యాంగ్ రేప్..పరిస్థితి విషమం

న్యూఢిల్లీ: ఇద్దరు చిన్నారులపై సామూహిక లైంగిక దాడి ఘటనలతో దేశ రాజధాని నిద్ర లేచింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారులపై సామూహిక అత్యాచారాలు జరిగాయి. తీవ్ర గాయాలతో ఇద్దరు చిన్నారులు ఆస్పత్రులలో ప్రాణాపాయ స్థితిలో ఉండటం పలువురిని ఆవేదనకు గురిచేసింది. పశ్చిమఢిల్లీలో ఇంటి బయట ఆడుకుంటున్న రెండున్నర ఏళ్ల పాపను అపహరించి, గ్యాంగ్ రేప్ చేశారు. ఆమె ఇంటి సమీపంలోని పార్కు దగ్గర తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆ చిన్నారిని ఇరుగుపొరుగు వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరిన చంద్రబాబు

హైదరాబాద్ : ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానపత్రం స్వయంగా అందించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలని చంద్రబాబు కోరారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కార్యాలయానికి ఏపీ సీఎం కార్యాలయం సిబ్బంది ఫోన్ చేశారు. ఆదివారం సాయంత్రం తమకు కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలని సిబ్బంది చెప్పారు. రాజధాని శంకుస్థాపనకు కేసీఆర్ను ఆహ్వానించేందుకు తాను స్వయంగా వెళ్తానని చంద్రబాబు ఇంతకుముందు చెప్పిన విషయం తెలిసిందే. సమయం దగ్గర పడుతున్నందున ఈ ఆహ్వాన కార్యక్రమాలను చంద్రబాబు, మంత్రులు వేగవంతం చేశారు.

12:06 - October 17, 2015

ఏటీఎం కార్డు…ఎనీ టైం మనీ..కానీ ఇప్పుడు ఎనీ టైమ్ లోన్ గా మారిపోతోంది. అవును. ఏటీఎం ద్వారా మీరు లోన్ తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. కానీ అన్నీ బ్యాంకులు మాత్రం కావండి సుమా. కేవలం హెచ్.డి.ఎఫ్.సి ద్వారా ఈ లోన్ తీసుకోవచ్చు. ఈ మేరకు ఆ బ్యాంకు సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతో గత మూడు ఎనీ టైం లోన్ తో ఏటీఎం కార్డు ద్వారా చిన్న మొత్తంలో రుణాలు తీసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తోంది. వ్యక్తిగత రుణాల వ్యవస్థను బలోపేతం చేసిన హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు తమ దగ్గర ఉన్న వినియోగదారుల ఖాతాకు సంబంధించిన వివరాలు తదితరాలను పరిశీలించి అప్పటికప్పుడు రుణం తీసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ వివరాలను పరిశీలించేందుకు బ్యాంకుకు సంబంధించిన ఆన్ లైన్ పోర్టల్ లో లాగిన్ అయిన తర్వాత కేవలం పది నిమిషాలు సరిపోతుందని బ్యాంక్ పేర్కొంటోంది. ఈ పద్ధతి ద్వారా వినియోగదారులను, ఖాతాదారులను పెంచుకునేందుకు బ్యాంక్ ప్లాన్ చేస్తోంది. 

12:04 - October 17, 2015

ఎర్రని మందార పూలు..పూలే కాదు మందార ఆకులు సైతం మహిళల అందానికి ఉపయోగపడుతాయి. మందార ఆకులను నానిన మెంతులతో కలిపి మెత్తగా నూరి తలకు ప్యాక్‌గా వేసి ఆరిన తర్వాత కుంకుడు కాయలతో తల స్నానం చేస్తే జట్టు మృదువుగా మారుతుంది. అంతేకాదు జుట్టు రాలడం తగ్గుతుంది. కొబ్బరినూనెలో మందాల పూలను వేసి మరిగించి.. చల్లారిన తర్వాత తలకు రాసుకుంటే జట్టు వొత్తుగా పెరుగుతుంది. మందార మొక్కలోని ఔషధగుణాలను ఉపయోగించి ఆయుర్వేదంలో ఎన్నో మందులను తయారుచేస్తారు. బరువు తగ్గడానికి మందార ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా రక్తలేమికి మందార పువ్వులను ఉపయోగిస్తారు. మందాల పువ్వులే కాకుండా ఆకులు కూడా వైద్యంలో
ఉపయోగిస్తారు. గర్భాశయ సమస్యలను మందార సహాయంతో నివారిస్తారు.
మందాల పూలతో తయారుచేసే టీ శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. పసుపు, గులాబీ, తెలుపు రంగుల్లోనూ మందారాలు విరబూసినా.. ఎర్రమందాలకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. అన్ని రంగుల మందార ఆకుల్లోనూ ఔషధగుణాలు సమానంగానే ఉంటాయి.

12:03 - October 17, 2015

ఇంట్లో పని, ఆఫీసు పనితో ఎప్పుడూ తీరిక లేకుండా ఉండే మహిళల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. దీనికి ప్రధాన కారణం తమ ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోకపోవడమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎప్పుడూ ఇంట్లో పిల్లలకు, భర్తకు ఎలాంటి వంటకాలు చేసి పెట్టాలా ? ఇతరత్రా విషయాలపై ఆలోచిస్తారు గానీ స్త్రీలు తమ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. నివల్ల తొందరగా నీరసించడం, రక్తహీనత, రోగ నిరోధక శక్తి తగ్గడం లాంటి సమస్యలు. అందుకే వీటికి చెక్‌ పెట్టాలంటే బొప్పాయి, దానిమ్మ, బీట్‌రూట్‌లను ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకు ?

  • హిమోగ్లోబిన్‌ను పెంచడానికి బొప్పాయి ఎంతో ఉపయోగపడుతుంది. బొప్పాయిని జ్యూస్‌గా కాని, పండుగా కాని తినవచ్చు. దీన్ని వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకొని రక్తహీనతను దూరం చేసుకోవచ్చు.
  • దానిమ్మ..ఈ పండులో రోగ నిరోధక శక్తిని, ప్లేట్‌ లెట్స్ ను పెంచే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు, డెంగ్యూ జ్వరంతో పోరాడే లక్షణాలు దానిమ్మలో ఉన్నాయి.
  • ప్లేట్‌లెట్స్ పెంపుదలకు ఉపయోగపడే మరో పండు బీట్‌రూట్‌. రక్తహీనతతో బాధపడే వారు తప్పకుండా బీట్‌రూట్‌, క్యారెట్‌ను వారానికి కనీసం రెండు సార్లైనా తినడం మంచిది. 

గవర్నర్ తో భేటీ అయిన ఏపీ కాంగ్రెస్ నేతలు..

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను ఏపీసీసీ చీఫ్‌ రఘువీరా, కేవీపీ, తులసిరెడ్డి శనివారం ఉదయం సమావేశమయ్యారు. ప్రత్యేక హోదాపై మాట తప్పిన ప్రధాని, కేంద్రమంత్రులు, సీఎంపై చీటింగ్‌ కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని గవర్నర్‌కు నేతలు విజ్ఞప్తి చేశారు.

అన్నపూర్ణాదేవిగా బెజవాడ కనకదుర్గమ్మ

విజయవాడ : పవిత్ర పుణ్యక్షేత్రం కననదుర్గమ్మ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు.

11:38 - October 17, 2015

చిత్తూరు : తిరుపతిలోని ఎర్రచందనం స్మగ్లర్ల రెచ్చిపోయారు. ఎర్రచందనం టాస్క్‌ ఫోర్స్‌ ఎస్సై అశోక్‌కుమార్‌ కళ్లల్లో కారం చల్లి స్మగ్లర్లు పరారయ్యారు. పద్మావతి పురంలో ఇంట్లో ఉన్న ఎస్సై అశోక్‌ కుమార్ ను దుండగులు అడ్డుకొని కారం చల్లినట్లు సమాచారం. ఈ ఘటనతో వెంటనే తేరుకున్న ఇన్స్‌ పెక్టర్‌ అశోక్‌కుమార్‌ దుండగులను ప్రతిఘటించారు. దీంతో ఎస్సై రివాల్వర్‌ ఓపెన్‌ చేసే ప్రయత్నం చేయగా దుండగులు పరారయ్యారు. 

11:35 - October 17, 2015

హైదరాబాద్ : పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' రక్షణ సిబ్బంది దూకుడుగా ప్రవర్తించారు. ఏకంగా మీడియాపైనే దాడికి దిగారు. ఇదంతా ఏపీ మంత్రులు అమరావతి శంకుస్థాపన ఆహ్వానపత్రిక అందచేసే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 22వ తేదీన రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఏపీ సర్కార్ కనీవినీరీతిలో ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ, దేశీయ, రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులకు ఆహ్వానాలు పలుకుతోంది. అందులో భాగంగా ఏపీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, కామినేని శ్రీనివాస్, ఇతరులు హీరో 'పవన్ కళ్యాణ్' కు ఆహ్వానపత్రికను అందచేసేందుకు శనివారం నగరానికి వచ్చారు. 'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ జరుగుతున్న ప్రాంతం వద్దకు మంత్రులు చేరుకున్నారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున మీడియా కూడా అక్కడకు చేరుకుంది. కానీ 'పవన్' రక్షణ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. మీడియాను లోనికి అనుమతించడం జరగదని స్పష్టం చేశారు. తాము లోనికి వెళ్లమని..ఇక్కడి నుండే వీడియో..ఫొటోలు తీసుకుంటామని మీడియా సిబ్బంది చెప్పినా వారు వినిపించుకోలేదు. చివరకు చేయి చేసుకున్నారు. దీనితో కెమెరాలు ధ్వంసం కాగా మీడియా సిబ్బందికి గాయాలయ్యాయి. దీనిపై మీడియా తీవ్ర నిరసన తెలిపింది. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి 'సారీ' చెప్పారు.

సీరియస్ యాక్షన్ తీసుకుంటా - పవన్..
మీడియాకు ఇబ్బంది కలిగే విధంగా తాను చూడనని, దెబ్బలు తగిలిన వారికి క్షమాపణలు చెబుతున్నట్లు పవన్ పేర్కొన్నారు. ఈవిషయంపై తాను తరువాత మాట్లాడుతానని, ఘటన చేసిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటానని హామీనిచ్చారు. అనంతరం రాజధానిపై పవన్ మాట్లాడారు. అందరూ సంతోషంగా ఉండే రాజధాని కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కొత్త రాజధాని అభివృద్ధి చెందాలని తాను ఆకాక్షిస్తున్నట్లు హైదరాబాద్ లాగా రాజధాని కావద్దన్నారు. తాను షూటింగ్ కోసం గుజరాత్ కు వెళ్లడం జరుగుతోందని, రాజధాని శంకుస్థాపనకు రావాలనే ఉందని పవన్ తెలిపారు. తాను సలహాలు ఇచ్చేంత అనుభవం లేదని, ఒక ముఖ్యమంత్రి మరొక ముఖ్యమంత్రికి ఆహ్వానం పలకవచ్చని, తన దగ్గరకు సీఎం రావడం ప్రోటోకాల్ ప్రకారం పద్ధతి కాదని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

మీడియా ప్రతినిధులకు క్షమాపణలుచెప్పిన పవన్ కల్యాణ్

హైదరాబాద్ : మీడియా ప్రతినిధులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పారు. షూటింగ్ సమయంలో బయటి వ్యక్తుల కూడా వస్తుంటారు. వారిని అడ్డుకునే క్రమంలోనే ఘటన జరిగింది. అమరావతి శంకుస్థాపనకు వెళ్లాలని ఉన్నా షూటింగ్ లో బిజీలో కుదరకపోవచ్చని తెలిపారు. రాజధాని ప్రజలు కన్నీరు పెట్టే విధంగా ఉండకూడదని, అమరావతి మరో హైదరాబాద్ కాకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. పవన్ కల్యాణ్ కు ఏపీ మంత్రులు ఆహ్వాన ప్రతికను అందించే దృశ్యాలను చిత్రీకరించేందుకు ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన కెమెరామెన్లతో పాటు ప్రింట్ మీడియా ఫొటోగ్రాఫర్లు కూడా స్టూడియో లోపలికి వెళ్లారు.

మీడియా ప్రతినిధులపై పవన్ కల్యాణ్ బౌన్సర్ల దాడి...

హైదరాబాద్ : నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రికను పవన్ కల్యాణ్ కు అందజేసేందుకు ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, చింతకాయల అయ్యన్నపాత్రులు, టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ లు కొద్దిసేపటి క్రితం అక్కడకు చేరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు కూడా అక్కడకు చేరుకున్నారు. పవన్ కల్యాణ్ కు ఏపీ మంత్రులు ఆహ్వాన ప్రతికను అందించే దృశ్యాలను చిత్రీకరించేందుకు ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన కెమెరామెన్లతో పాటు ప్రింట్ మీడియా ఫొటోగ్రాఫర్లు కూడా స్టూడియో లోపలికి వెళ్లారు.

'వ్యాపం' మరో అనుమానాస్పద మరణం...

హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లో సంచలనాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన 'వ్యాపం' కేసులో మరో మరణం నమోదైంది. ఒడిషాకు చెందిన రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ విజయ్ బహదూర్ (ఐఎఫ్ఎస్) అనుమానాస్పదంగా శవమై తేలారు. భోపాల్ సమీపంలోని రాయఘడ్కు వెళ్లిన ఆయన మృతదేహాన్ని అక్టోబర్ 15 ఉదయం ఝార్సుగూడ రైల్వే ట్రాక్పై పోలీసులు కనుగొన్నారు. దీంతో ఈ కుంభకోణంలో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన వారి సంఖ్య 51కి చేరింది. 1978 బ్యాచ్కి చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ల సమావేశానికి హాజరయ్యేందుకు విజయ్ బహదూర్, భార్య నీతాసింగ్తో కలిసి పూరీ వెళ్లారు. తర్వాత తిరిగి భోపాల్ వస్తుండగా ఈ మరణం సంభవించింది.

ఎస్‌బీహెచ్‌లో చోరీకి విఫలయత్నం...

హైదరాబాద్‌: నగరంలోని హయత్‌నగర్‌ పరిధిలోని ఎస్‌బీహెచ్‌లో గుర్తు తెలియని దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. బ్యాంకుకు కన్నం వేసి లోపలకు ప్రవేశించిన దొంగలు లాకర్‌ ఓపెన్‌కాక పోవడంతో వెనుతిరిగారు. పోలీసులు వచ్చి దర్యాప్తు ఆరంభించారు.

11:07 - October 17, 2015

హైదరాబాద్ : నాలుగు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా హయత్‌ నగర్‌లో కిడ్నాప్‌కు గురైన బాలుడు క్షేమంగా ఇంటికి చేరకున్నాడు. కిడ్నాపర్లు బాలుడిని హయత్‌నగర్‌ శివార్లలో వదిలివెళ్లినట్లు సమాచారం. బాలుడు తిరిగిరావడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

 

నల్గొండ జిల్లాలో పిచ్చి కుక్క స్వైర విహారం...

నల్లగొండ : జిల్లాలోని పెద్దఅవుర మండలం తిప్పలమడుగులో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. పిచ్చికుక్కల దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు బాలికలు ఉన్నారు. అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి రక్షించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కల్పవృక్ష వాహనంపై విహరించిన మలయప్పస్వామి

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై వూరేగారు. 

10:17 - October 17, 2015

ఉద్యోగులకు శుభవార్త. ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) సొమ్ముల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులకు త్వరలోనే తెర పడనుంది. పీఎఫ్‌ సొమ్ముల కోసం దరఖాస్తు అందిన మూడు గంటల్లో క్లైమ్‌లను సెటిల్‌ చేసే విధంగా 'ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌' (ఈపీఎఫ్‌ఓ) త్వరలో అన్‌లైన్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఆధార్‌ వాడకాన్ని స్వచ్ఛందం చేస్తూ సుప్రీకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈపీఎఫ్‌ఓ ఈ దిశగా మరింత ముందుకు సాగాలని నిర్ణయింది. ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తే ఈఫీఎఫ్‌ఓ ఖాతాదారు పీఎఫ్‌ సొమ్ము వెనక్కి తీసుకొనేందుకు నేరుగా కాకుండా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. సదరు సొమ్ము ఇక నేరుగా ఆ ఖాతాదారు బ్యాంకు అకౌంట్‌లో జమ చేయబడుతుంది. ఈ కొత్త విధానం అమలునకు అనుమతించాల్సిందిగా తాము కార్మిక శాఖకు అభ్యర్థనను పంపినట్లు కేంద్ర ప్రావిడెంట్‌ ఫండ్‌ కమీషనర్‌ కె.కె.జలానీ తెలిపారు. ఈ వ్యవస్థకు అనుమతులు లభించేకంటే ముందే పీఎఫ్‌ సోమ్ము ఉపసంహరణ కేసుల సత్వర పరిష్కారానికి అవసరమైన వ్యవస్థను అభివృద్ధి పరిచేలా తాము కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఆధార్‌ సంఖ్యతో కూడిన విత్‌డ్రా అభ్యర్థలను కేవలం మూడు రోజుల్లోనే సెటిల్‌ చేసేలా పని చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం ప్రస్తుతం 20 రోజుల సమయాన్ని ఈపీఎఫ్‌ఓ అధికారులు తీసుకుంటున్నారు. పీఎఫ్‌ ఖాతాను, బ్యాంక్‌ ఖాతాను ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేసుకున్న వారు మాత్రమే ఈ ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా లబ్దిపొందేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. ఎప్రిల్ నుండి అందుబాటులోకి తీసుకరావడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు అయిదు కోట్ల మంది ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు గాను కేవలం 40 శాతం మంది మాత్రమే ఇలా తమ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు.

మరో కల్తీ కల్లు బాధితుడి మృతి

నల్గొండ : చింతపల్లి మండలంలో కల్తీకల్లు మహమ్మారి బారిన పడిన ఓ బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. తక్కెళ్ల గ్రామానికి చెందిన ఏడుగురు కల్తీకల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరికీ వారం రోజుల నుంచి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో షాహుకారు అనే వ్యక్తి శనివారం ఉదయం మృతి చెందాడు. దీంతో షాహుకారు కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

10:02 - October 17, 2015

యాక్షన్ సినిమా 'ధూమ్' సిరీస్ అంతమవ్వలేదు. ఇప్పటికే 'ధూమ్' సినిమాకి సీక్వెల్ గా 'ధూమ్-2', 'ధూమ్-3' వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 'ధూమ్-3' కి సీక్వెల్ గా 'ధూమ్-4' సినిమా నిర్మించేందుకు రంగం సిద్దమవుతోంది. ఆదిత్యచోప్రా 'ధూమ్‌4' చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాల్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే బాలీవుడ్‌ 'అమితాబ్‌', 'హృతిక్‌ రోషన్‌'లకు పూర్తి స్క్రిప్ట్ చెప్పి, వారి డేట్స్ ను తీసుకున్నట్లు టాక్. తాజాగా ఈ చిత్రం కోసం 'షారూఖ్‌ ఖాన్‌', 'ఐశ్వర్యరాయ్'లను కూడా ఆదిత్యచోప్రా సంప్రదించినట్లు తెలుస్తోంది. వాళ్ళు సైతం నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆదిత్య చోప్రా పేర్కొన్నారు. 'ధూమ్‌' సిరీస్‌కి ఏమాత్రం ఆదరణ తగ్గలేదని, 'ధూమ్‌3'కి సీక్వెల్‌గా 'ధూమ్‌4'ను భారీ బడ్జెట్‌తో నిర్మించాలనుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే అమితాబ్‌ జీ, హృతిక్‌రోషన్‌లు నటించేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు. అలాగే షారూఖ్‌, ఐశ్వర్యలు కూడా నటిస్తారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

09:56 - October 17, 2015

'వరుణ్‌ తేజ్‌', 'ప్రగ్యా జైస్వాల్‌' జంటగా 'క్రిష్‌' దర్శకత్వంలో రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించిన 'కంచె' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తొలుత నవంబర్‌ 6న చిత్రాన్ని విడుదల చేయాలని భావించామని, అనుహ్యంగా 'అఖిల్‌' సినిమా వాయిదా పడడంతో ఈ నెల 22 ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతల్లో ఒకరైన రాజీవ్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ఫస్ట్ కాపీ రెడీగా ఉందని, సెన్సార్‌ బోర్డు నుంచి 'యు/ఎ' సర్టిఫికేట్‌ పొందినట్లు చెప్పారు. 'కంచె' రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ఓ అందమైన ప్రేమ కథా చిత్రమన్నారు. అన్ని కమర్షియల్‌ హంగులకు తన మార్కు విలువలను మేళవించి దర్శకుడు 'క్రిష్‌' ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. మరి ఈ సినిమా ఎంతవరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి. 

09:52 - October 17, 2015

'కరీష్మా కపూర్‌'.. 'ప్రేమ్‌ఖైదీ' చిత్రంతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసి, ఆ తర్వాత 'అనారి', 'రాజాబాబు',' 'రాజా హిందూస్తానీ', 'దిల్‌తో పాగల్‌ హై', 'జుబేదా', 'కూలీనెం.1' వంటి తదితర చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. పెళ్ళి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ వ్యాపార ప్రకటనల్లోను, కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గాను బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరగానే ఉంది. ఇటీవల ముంబైలోని ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి అతిథిగా విచ్చేసిన కరీష్మా మీడియాతో మాట్లాడుతూ,'మళ్ళీ సినిమాల్లోకి రావాలన్న విషయం గురించి ఇంకా ఆలోచించ లేదు. ప్రస్తుతం పిల్లల బాధ్యతలపైనే దృష్టి పెట్టాను. మంచి కథలు, ప్రాధాన్యత గల పాత్రలుంటే సినిమాల్లో సైతం నటించేందుకు రెడీగా ఉన్నాను' అని చెప్పింది.

బస్సు ప్రమాదం పై సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి

ప్రకాశం : కందుకూరు మండలం చెర్లోపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేటి తెల్లవారుజామున చోటుచేసుకున్న ప్రమాదంపై సమాచారం అందుకున్న చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు వదిలిన మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ఆయన మంత్రులకు సూచించారు.  

09:48 - October 17, 2015

'అఖిల్‌ అక్కినేని', 'సయేషా' జంటగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో హీరో నితిన్‌ నిర్మించిన 'అఖిల్‌' చిత్రం విడుదలను వాయిదా పడింది. దీనికి సంబంధించిన విషయాలను 'అఖిల్' తండ్రి 'నాగార్జున' మీడియాకు తెలిపారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 22న విడుదల చేయాలనుకున్నామని, కాని ఇందులో గ్రాఫిక్‌ వర్క్ సరిగ్గా లేకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. అఖిల్‌ను తెరపై చూడాలని అభిమానులు, ప్రేక్షకుల మాదిరిగానే ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. సినిమా వాయిదా పడుతున్నందుకు చాలా బాధగా ఉందని, గ్రాఫిక్స్ విషయంలో ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉంటాయన్నారు. 'అఖిల్‌' సినిమాలోని సీక్వెన్స్ గ్రాఫిక్స్ బాగా అనిపించలేదని, సినిమా అంతా బాగుండి గ్రాఫిక్స్ బాగోలేదని ప్రేక్షకులు అనుకోవడం నాకిష్టం లేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అక్కినేని అభిమానులు నిరాశ చెందినా అఖిల్‌ను తెరపై చూశాక అవన్ని మర్చిపోతారని, వారం రోజుల తర్వాత గ్రాఫిక్స్ షాట్స్ పొజిషన్‌ చూసి సినిమాను ఎప్పుడు విడుదల చేస్తామనేది తెలియజేస్తాం అని దర్శకుడు వినాయక్‌ తెలిపారు. ఇప్పటికే చిత్రమంతా కంప్లీట్‌ అయ్యిందని, సినిమా పెద్ద హిట్‌ అవుతుందనే నమ్మకంతో ఉన్నామని నిర్మాత ఎన్‌.సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. 

ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పితృవియోగం

విజయవాడ : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనివంశీకి పితృవియోగం కలిగింది. వల్లభనేని వంశీ తండ్రి రమేష్‌చంద్‌ (67) అనారోగ్యంతో మృతి చెందారు. రమేష్‌చంద్‌ యూటీఎఫ్‌ నేతగా, వ్యవస్థాపక సభ్యుడిగా గన్నవరంలో మంచిపేరు సంపాదించుకున్నారు.

09:43 - October 17, 2015

ముంబై: 'మ్యాగీ' ఈ పేరు తెలియని పిల్లలు ఉండరు. మ్యాగీ ప్యాకెట్ లేని వంటిల్లు కూడా ఉండదు. చిన్నారులు ఇష్టంగా తినే ఇన్‌స్టెంట్ ఫుడ్ ఏదైనా ఉందా అంటే అది మ్యాగీ నూడిల్సే. రెండే రెండు నిమిషాల్లో మ్యాగీ నూడిల్స్‌ను వండి వార్చితే... లొట్టలేసుకుంటూ లాగించేస్తారు పిల్లలు. బ్రేక్ ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్నాక్స్‌ వరకూ ఎప్పుడైనా సరే మ్యాగీ ఉంటే చాలు... పిల్లలే కాదు పెద్దలు కూడా మసాలా నూడిల్స్‌ను ఇష్టంగానే తింటారు. కానీ ఇటీవల ఇందులో హానీకర పదార్థాలు ఉన్నాయంటూ దీనిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు మ్యాగీ శాంపిల్స్ ను మూడు ప్రయోగశాలల్లో పరీక్షకు పంపగా సీసం ఉండాల్సిన మోతాదుకు లోపే ఉన్నట్టు వెల్లడైందని నెస్లే ఇండియా తెలిపింది. సీసం మోతాదుకు మించి ఉందన్న కారణంతో గత జూన్‌లో మ్యాగీ నూడుల్స్ పై భారత ఆహార రక్షణ, ప్రామాణికాల సాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిషేధం విధించడంతో పలు రాష్ట్రాల్లో అది అమలైంది. దీంతో రూ.400 కోట్ల విలువ చేసే మ్యాగీ నూడుల్స్ ను మార్కెట్‌ నుంచి నెస్లే ఉపసంహరించుకున్నది. ఆ సమయంలో మార్కెట్‌లో ఉన్న 20 కోట్ల మ్యాగీ ప్యాకెట్లకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ ల్యాబరేటరీల్లో 3500 పరీక్షలు నిర్వహించగా సానుకూల ఫలితాలొచ్చాయని నెస్లే తెలిపింది. అమెరికా, బ్రిటన్‌, సింగపూర్‌ దేశాల్లోని ప్రయోగశాలల్లో పరీక్షించి భారత్‌లో వినియోగిస్తున్న నూడుల్స్ సురక్షితమని తేల్చారని నెస్లే వివరించింది. తాజాగా దేశంలోని మూడు ప్రయోగశాలల్లో ఆరు రకాలకు చెందిన 90 మ్యాగీ శాంపిల్స్ ను పరీక్షించారు. ప్రయోగశాలల్లో పరీక్షించిన తర్వాతే మార్కెట్‌లోకి విడుదల చేస్తామని నెస్లే వెల్లడించింది. ఈ నేపథ్యంలో రెండు నిమిషాల్లో నూడుల్స్ పేరుతో మరోసారి మార్కెట్‌లోకి మ్యాగీ దూసుకు రానుంది.

డ్రైవర్ మద్యం తాగి బస్సు నడపడం వల్లే ప్రమాదం..

హైదరాబాద్ : ప్రకాశం జిల్లా కందుకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం డ్రైవరు మద్యం తాగి బస్సు నడపడం వల్లే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 45 మంది ఉన్నట్లు సమాచారం. చేవూరు నుంచి మాలకొండ వెళుతున్న పెళ్లిబృందం వ్యాన్‌ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులున్నారు. క్షతగాత్రులను కందుకూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

శంకుస్థాపనకు హాజరవుతా: పద్మాదేవందర్ రెడ్డి

హైదరాబాద్‌: అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమానికి తాను హాజరవుతానని తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి చెప్పారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు ఆమె ఆంధ్రా మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

09:36 - October 17, 2015

.గో :ఏపీలో స్వైన్‌ ఫ్లూ జనాలను వణికిస్తోంది... తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో మూడు స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదయ్యాయి... వీరిని చికిత్సకోసం రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు.. బాధితులు జంగారెడ్డిగూడెంకుచెందినవారు.. 

09:34 - October 17, 2015

హైదరాబాద్ : విశాఖలో లారీ బీభత్సం సృష్టించింది.. ఎన్ ఏడీ రోడ్డులో అదుపుతప్పి ఆటోలను ఢీ కొట్టింది... ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా... ముగ్గురికి గాయాలయ్యాయి... వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు..

తిరుపతిలో టాస్క్‌ఫోర్స్‌ సీఐ పై దుండగుల దాడి

చిత్తూరు : తిరుపతిలో టాస్క్‌ఫోర్స్‌ సీఐ అశోక్‌పై గుర్తుతెలియని దుండుగులు దాడి చేశారు. పద్మావతిపురం సమీపంలో సీఐ అశోక్‌ కళ్లల్లో కారం చల్లి దాడి చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధించే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ విభాగంలో సీఐగా పనిచేస్తున్న అశోక్‌ గతంలో శేషాచలం ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారు. గాయపడిని సీఐను ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బావమరిదిని గొడ్డలితో నరికి చంపిన బావ

హైదరాబాద్ : కుషాయిగూడలోని ప్రశాంత్ నగర్ లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శ్రీనివాస్ తన బావమరిదిని గొడ్డలితో నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇంజనీర్ కు క్షమాపణ చెప్పిన బెల్లం పల్లి ఎమ్మెల్యే

ఆదిలాబాద్ : బిల్లుల మంజూరులో జాప్యం చేశారంటూ ఇంజినీర్ గల్లా పట్టుకుని చెంపలు వాయించిన ఆదిలాబాదు జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎట్టకేలకు దిగిరాక తప్పలేదు. సాగు నీటి శాఖ ఏఈఈ దేవేందర్ ను తాను కొట్టలేదని, కేవలం దుర్భాషలాడానని ఎమ్మెల్యే ఇచ్చిన వివరణకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంతృప్తి చెందలేదు. దీంతో ఎమ్మెల్యే సారీ చెప్పక తప్పలేదు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత బంజారాహిల్స్ లోని మంత్రుల క్వార్టర్లలోని హరీశ్ నివాసంలో ఎమ్మెల్యే చిన్నయ్య ఇంజినీర్ దేవేందర్ కు క్షమాపణలు చెప్పారు.

ఆటోను ఢీ కొట్టిన లారీ :ఇద్దరి మృతి

విశాఖ : విశాఖలోని ఎన్‌ఏడీ జంక్షన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఆటోను మట్టి లోడు లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

బస్సు ప్రమాదం పై ఏపీ మంత్రి శిద్ధా దిగ్ర్భాంతి

ప్రకాశం : జిల్లాలోని చెర్లపాలెం వద్ద శనివారం ఉదయం మినీ లారీ, ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, దాదాపు మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద ఘటనపై ఏపీ రవాణా శాఖమంత్రి శిద్ధా రాఘవరావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన ఘటనాస్థలికి బయలుదేరారు.

08:20 - October 17, 2015

హైదరాబాద్ : కందుకూరు మండలం చెర్లోపాలెం శివారులో జరిగిన రోడ్డుప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రకాశం జిల్లా పుట్లూరు మండలం చేవూరు నుంచి పెళ్లి బృందం డీసీఎంలో మాలకొండ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న డీసీఎం ఎదురుగా వస్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సును ఢీకొంది. ఈ సంఘటనలో బస్సు క్యాబిన్‌లోకి డీసీఎం దూసుకుపోవడంతో మంటలు చెలరేగి బస్సు మొత్తం కాలిపోయింది. డీసీఎంలో వెళుతున్న పెళ్లి బృందంలో 12 మంది అక్కడికక్కడే మృతిచెందారని తెలుస్తోంది. బస్సులోని ప్రయాణికులు 10 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి మృతదేహాలను వెలికితీశారు. 

ఎద్దుల బండిని ఢీకొన్న లారీ : ఎద్దు మృతి

అనంతపురం : పామిడి మండలం రామారాజుపల్లి వద్ద లారీ ఎద్దుల బండిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎద్దు మృతి చెందగా, రైతుకు తీవ్ర గాయాలయ్యాయి.

అదృశ్యమైన బాలుడు సురక్షితం

హైదరాబాద్ : హయత్ నగర్ సూర్య నగర్ కాలనీలో అదృశ్యమైన బాలుడు సురక్షితంగా ఇంటికి చేరాడు. నాలుగు రోజుల క్రితం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న నవీన్ అనే ఏడేళ్ల బాలుడ్ని గుర్తు తెలియని దుండుగులు అపహరించారు. నవీన్ ను శుక్రవారం అర్థర్రాతి హయత్ నగర్ లో వదిలివెళ్లారు.

08:00 - October 17, 2015

హైదరాబాద్ : ఏపీ రాజధాని శంకుస్థాపనకు హాజరు కానని ప్రతిపక్ష నేత జగన్ చెప్పడం సరికాదని న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. రాజధాని, ప్రొకాల్, ప్రతిపక్ష నేత హాజరు కావడం పై చర్చ జరుగుతోంది. రాజధాని శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోదీ ఏదో ఒకటి ప్రకటించారని అందరూ ఆశిస్తున్నారు. ఎలాంటి ప్రకటన రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించేందుకు వచ్చిన మంత్రులకు ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు? ఏపీ రాజధాని ప్రజల రాజధానియేనా? జగన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారా? ప్రతిపక్షం బలహీన పడితే రాష్ట్రానికే నష్టమా? ప్రత్యేక హోదా పై చంద్రబాబు వైఫల్యం చెందారా? రాజధాని శంకుస్థాపనకు రూ.10కోట్లే ఖర్చు అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కాని రూ.400 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు కొన్ని పత్రికలు తెలిపాయి. ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చ జరిగింది. ఈర్చలో బిజెపి నేత సూర్యప్రకాష్ రెడ్డి, వైసీపీ నేత కరణం ధర్మశ్రీ, టిడిపి నేత పట్టాభిరామ్, రాజకీయ విశ్లేషకులు నడింపల్లి సీతారామ రాజు, కాంగ్రెస్ నేత ద్రోణం రాజు శ్రీనివాస్ పాల్గొన్నారు. వారి మధ్య ఎలాంటి చర్చ జరిగిందో మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

రేస్ క్లబ్ లో వాణిజ్య పన్నుల శాఖ దాడులు

హైదరాబాద్ :రేస్ క్లబ్‌లో బూకీలపై వాణిజ్య పన్నుల శాఖ కొనసాగుతున్నాయి. తక్కువ మొత్తంలో టర్నోవర్ చూపించి పన్ను ఎగవేతకు పాల్పడుతున్న బూకీల పై వాణిజ్య పన్నుల అధికారులు ఉక్కుపాదం మోపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు చార్మినార్ డివిజన్ అధికారులు బృందంగా ఏర్పడి ఒక్కో బూకీ కౌంటర్ దగ్గర అయిదుగురు చొప్పున అధికారులను నియమించారు. అధికారులు చేస్తున్న మెరుపు దాడుల వల్ల బూకీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

బోలక్ పూర్ లో ఎక్సైజ్ దాడులు

హైదరాబాద్ : ముషీరాబాద్ లో బోలక్ పూర్ లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ముషీరాబాద్ ఎక్సైజ్, పోలీసులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. బోలక్ పూర్ లోని రంగా నగర్, బొంతల బస్తీ, పద్మశాలి కాలనీ, బుసన్ నగర్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అనుమానాస్పద ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేయగా 200 గుడుంబా ప్యాకెట్లు లభించాయి. 

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ప్లాట్ ఫాం టిక్కెట్ ధర పెంపు...

సికింద్రాబాద్‌ : దసరా సెలవుల సందర్భంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రద్దీ పెరగనుండడంతో ప్లాట్‌ఫాం టిక్కెట్‌ రూ.10నుంచి రూ.20 వరకు పెంచాలని నిర్ణయించినట్టు సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు. ఈనెల 17 నుంచి 26వరకు... పది రోజులు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుందని చెప్పారు.

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం :12 మంది మృతి

ప్రకాశం : ప్రైవేటు బస్సు - డీసీఎం ఢీ కొని12 మంది  మృతి చెందారు. ఈ ఘటన కందుకూరు మండలం చెర్లోపల్లి వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో12 మృతి చెందగా... మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను దగ్గరల్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

శరవేగంగా సాగుతున్న శంకుస్థాపన పనులు

హైదరాబాద్ : ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు గడువు సమీపిస్తోంది. దీంతో పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన వేదికల నిర్మాణం ఓ రూపానికి వచ్చింది. యాగశాల కూడా సిద్ధమైపోయింది. శంకుస్థాపన ప్రదేశంలో.. ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన పనిని యంత్రంలా చేసుకు పోతున్నారు. 

హైదరాబాద్‌లో అమరావతి సందడి

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి..శంకుస్ధాపన సమయం దగ్గరపడుతుండటంతో..ఆహ్వానాలపై దృష్టిపెట్టింది ఇన్విటేషన్స్ కమిటీ. హైదరాబాద్‌లో ఉన్న వివిధ రాజకీయ పార్టీల నేతలకు, హైకోర్టు జడ్జీలకు ఆహ్వాన పత్రం అందించి..శంకుస్ధాపన మహోత్సవానికి రావాల్సిందిగా మంత్రులు కామినేని శ్రీనివాసరావు, అయన్న పాత్రుడు కోరారు. 

రాజధానికి భూములిచ్చిన రైతులకు ఆహ్వాన పత్రికలు

హైదరాబాద్ : రాజధానికి భూములిచ్చిన రైతులకు.. శంకుస్థాపనకు రావాల్సిందిగా ప్రభుత్వం ఆహ్వానం పలికింది. రాష్ట్ర మంత్రులు.. అత్యంత సంప్రదాయబద్ధంగా.. చీర, సారెలతో ఆహ్వాన పత్రికలు పంచారు. సర్కారు ఆహ్వనం తీరుపట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకానికి ముహుర్తం ఖరారు

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. దసరాకు ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి.. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ను ఆహ్వానించారు. తొలి విడతలో 60 వేల ఇళ్లను... ఒక్కో నియోజకవర్గంలో 400 ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. 

పవన్ కల్యాన్ ఆహ్వానించనున్న ఏపీ మంత్రులు...

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన ఆహ్వాన పత్రికను నేడు ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాసరావు, మంత్రి అయ్యన్న పాత్రుడు, టీడీపీ నేత టీడీ జనార్దన్ అందజేయనున్నారు. నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో పవన్ ని కలిసి ఆయనకు నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన ఆహ్వానపత్రికను అందజేయనున్నారు. 

మైనార్టీ న్యాయవాద పట్టభద్రులకు శిక్షణ

గుంటూరు: మైనార్టీ వర్గాలకు చెందిన న్యాయవాద పట్టభద్రులకు శిక్షణ నిమిత్తం ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సహాయ కార్యనిర్వాహక సంచాలకులు మొహమ్మద్‌ అంజాద్‌ అలి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు ఇద్దరు పట్టభద్రులకు అవకాశం కల్పిస్తారని, ఎంపికైన పట్టభద్రులకు సంవత్సరానికి రూ. వెయ్యి స్టైఫండ్‌, మొదటి సంవత్సరంలో రూ. 6 వేలు పుస్తకాలు, ఫర్నిచర్‌ కొనుగోలుకు, సెమినార్‌లు, వర్క్‌షాపులు, సింపోజియంలు ఏర్పాటుకు ఏడాదికి రూ.2వేలు, ప్రతి విద్యార్థికి ప్రారంభ ఫీజు కింద రూ. 585 మంజూరు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

06:34 - October 17, 2015

విశాఖ : చల్లని బీచ్‌ అంటే ఇష్టపడని వారెవరుంటూరు. పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే బీచ్‌లు ఇప్పుడు సర్కార్‌కు కాసులు కురిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం విశాఖ బీచ్‌ అందాలు రెట్టింపు చేస్తామని చెప్పి ప్రపంచబ్యాంకు రుణం కొట్టేస్తోంది. అభివృద్ది మాటేమోగాని.. బ్యాంకు అప్పునకు మాత్రం విశాఖవాసులు ష్యూరిటీగా మిగిలిపోతారని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ప్రకృతి సిద్ధమైన అందాలు...

విశాఖ సాగరతీరపు అందాలు ప్రకృతి సిద్ధమైనవి. చూస్తూనే ఉండాలనిపించే అందం విశాఖ సొంతం. అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రతి చర్యా ప్రకృతి అందాలను చెడగొట్టిందే తప్ప బాగుచేసింది కాదు. ఒక వైపు అలల ఉదృతి పెరిగి తీరం అంతా కోతకు గురవుతుంటే నెలల తరబడి పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కసారిగా బాధ్యత గుర్తుకొచ్చింది. విశాఖ బీచ్ అభివృద్దికి 240 కోట్లు, కోత నివారణకు 150 కోట్లు ఖర్చు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే పనులు కూడా ప్రారంభమయ్యాయి. విపత్తుల నివారణ ప్రాజెక్టు కింద 2220 కోట్లు ప్రపంచబ్యాంకు నుంచి రుణం పొందుతున్న సర్కారు వివిధ పనులకు టెండర్లు కూడా సిద్ధం చేస్తోంది.

ప్రపంచ బ్యాంకు రుణం మొత్తం విశాఖపైనే తీవ్ర ప్రభావం....

ప్రపంచ బ్యాంకు రుణం మొత్తం విశాఖపైనే తీవ్ర ప్రభావం చూపుతుందని సిపిఎం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిపిపి పద్ధతిన ప్రతి పనిలో వరల్డ్ బ్యాంకు సంస్కరణలు అమలు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. పౌరసేవలు వ్యాపారమవుతాయని విమర్శిస్తున్నారు. సముద్ర అందాలను రెట్టింపు చేస్తామని చెప్పి భారీ అవినీతికి పాల్పడబోతున్నారని ఆరోపిస్తున్నారు.

విశాఖలో పర్యటించనున్న ప్రపంచబ్యాంకు బృందం......

ప్రపంచబ్యాంకు బృందం కొద్ది రోజుల్లో విశాఖలో పర్యటించబోతోంది. ఎక్కడెక్కడ ఏయే పనులు చేయనున్నారనే అంశాన్ని పరిశీలించనున్నారు. వరల్డ్ బ్యాంకు రుణం అధికార పార్టీ నేతలకే లాభం చేకూర్చుతుందని.. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మన నగరం అనుకున్నపుడు సర్కారే బాధ్యతగా అభివృద్ధి చేయాలని.. ఇలా ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టడం ఏంటనే విపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ప్రపంచ బ్యాంకు రుణం వినియోగానికి ప్రణాళికలు తయారు చేస్తోంది. 

06:31 - October 17, 2015

హైదరాబాద్ : ఏపికి ప్రత్యేక హోదా అంశంలో వైసీపి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేసేందుకు రెడీ అయింది. ఇప్పటికే ప్రత్యేక హోదా కోరుతూ జగన్‌..వారం రోజుల పాటు నిర‌వ‌ధిక నిరాహార దీక్ష చేశారు. అయితే తాజాగా ప్రత్యేక హోదా కోసం మరో ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. దీనిలో భాగంగా ఇవాల్టి నుండి నెల 22 వ‌ర‌కూ రాష్ట్రవ్యాప్తంగా నిర‌స‌న కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమైంది.

6రోజుల పాటు నిరాహార దీక్ష ......

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తోంది. హోదా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మ‌రింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు భ‌విష్యత్‌ కార్యాచరణను ప్రకటించింది. ప్రత్యేక హోదా కోరుతూ గ‌తవారం గుంటూరులో జ‌గ‌న్ ఆరు రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత జగన్ ఆరోగ్యం క్షీణించడంతో..పోలీసులు దీక్షను భగ్నం చేశారు. దీనిపై వైసిపి నేతలు ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు. అయితే దీక్ష అనంత‌రం ఉద్యమాన్ని మ‌రింత ఉదృతం చేయాల‌ని వైసీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వ‌రుస నిర‌స‌నల‌కు దిగాలని పార్టీ నిర్ణయించింది. ప్రత్యేక హోదాపై ప్రభుత్వం తీరుకు నిర‌స‌న‌గా ఇవాల్టి నుండి ఈ నెల 21 వ‌ర‌కు అన్నినియోజ‌క‌వ‌ర్గాల్లో రిలే నిరాహారదీక్షలు చేయ‌నున్నారు.

18న నల్లపాడులోని దీక్షా శిబిరం వరకు ర్యాలీలు....

అయితే రిలే దీక్షలతో పాటు ఈ నెల 18న రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల‌నుండి గుంటూరు న‌ల్లపాడులోని జ‌గ‌న్ నిర‌హార దీక్ష శిబిరం వ‌ర‌కూ ర్యాలీలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా 19న నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాల‌యాల ముందు ధ‌ర్నాలతో పాటు, 20న సాయంత్రం జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన చేయ‌నున్నారు. ఇక చివ‌రిగా 21వ తేదీన 13 జిల్లాల్లోని బస్సు డిపోల ముందు ప్రత్యేక హోదా కోరుతూ ధ‌ర్నాలు చేస్తామ‌ని నేత‌లు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ నెల 22న అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌కు ప్రధాని మోడి రానున్న నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న కార్యక్రమాలు కొన‌సాగుతాయ‌ని వైసిపి నేత‌లు స్పష్టం చేస్తున్నారు. వీటితో పాటు ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరి ప్రత్యేక హోదా గురించి ప్రధానికి వివరించేందుకు వైసీపి నేత‌లు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి వ‌రుస‌ నిర‌స‌న కార్యక్రమాలతో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉదృతం చేయాలని వైసిపి భావిస్తోంది. అయితే ఈ ఫ్లాన్ ఎంత మేర‌కు విజయవంతం అవుతుందో వేచి చూడాలి..

06:28 - October 17, 2015

హైదరాబాద్‌ : నగరంలో చైన్‌స్నాచర్ల ఆగడాలకు అంతేలేకుండాపోతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. ఎంబీబీఎస్‌, పురానాపూల్‌, నారాయణగూడ, మాదాపూర్‌, బన్సీలాల్‌గూడలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. మహిళల మెడలో నుంచి విలువైన బంగారు ఆభరణాలను తస్కరించారు. రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య ఈ ఘటనలు జరిగినట్లుగా తెలుస్తోంది. వరుసగా జరుగుతున్న చైన్‌ స్నాచింగ్‌లతో మహిళలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. 

06:26 - October 17, 2015

హైదరాబాద్‌ : సనత్‌నగర్‌లోని దీన్‌దయాశ్‌ నగర్‌లో దారుణం జరిగింది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన నాలుగేళ్ల చిన్నారి లాస్య దారుణ హత్యకు గురైంది. పక్కింట్లో ఉంటున్న యాదమ్మ అనే మహిళే ఈ హత్యచేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. దీన్‌దయాళ్‌నగర్‌కు చెందిన నవీన్‌చారి, మయూరి దంపతులకు నాలుగేళ్ల కూతురు లాస్య ఉంది. అయితే ఇంటిపక్కనే ఉండే యాదమ్మ అనే మహిళ.. తరచుగా ఇంటిగోడ విషయంలో వీరితో గొడవపడేది. దీనిపై స్థానిక పీఎస్‌లో కేసు కూడా నమోదయింది. అయితే ఈనెల 14న యాదమ్మ చిన్నారి లాస్యను చాక్లెట్‌ ఇస్తానని చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లింది. అయితే రెండు రోజుల తర్వాత చిన్నారి గోనెసంచిలో శవమై కనిపించింది. చిన్నారిని యాదమ్మ చంపి లక్ష్మయ్య ఇంట్లో పెట్టినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. చుట్టుపక్కల వాళ్లకు దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరాతీయగా చిన్నారి శవం ఉన్న ఓ గోనెసంచి బయటపడింది. యాదమ్మనే చిన్నారిని హత్యచేసి ఉంటుందని స్థానికులు అనుమానించి ఆమెను చితకబాదారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు యాదమ్మను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెప్తున్నారు.  

చిన్నారి గొంతుకోసి గోనెసంచిలో కుక్కిన దుండగులు

హైదరాబాద్‌ : సనత్‌నగర్‌లోని దీన్‌దయాశ్‌ నగర్‌లో దారుణం జరిగింది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన నాలుగేళ్ల చిన్నారి లాస్య దారుణ హత్యకు గురైంది. పక్కింట్లో ఉంటున్న యాదమ్మ అనే మహిళే ఈ హత్యచేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. దీన్‌దయాళ్‌నగర్‌కు చెందిన నవీన్‌చారి, మయూరి దంపతులకు నాలుగేళ్ల కూతురు లాస్య ఉంది. అయితే ఇంటిపక్కనే ఉండే యాదమ్మ అనే మహిళ.. తరచుగా ఇంటిగోడ విషయంలో వీరితో గొడవపడేది. దీనిపై స్థానిక పీఎస్‌లో కేసు కూడా నమోదయింది. అయితే ఈనెల 14న యాదమ్మ చిన్నారి లాస్యను చాక్లెట్‌ ఇస్తానని చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లింది.

నగరంలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు..

హైదరాబాద్‌ : నగరంలో చైన్‌స్నాచర్ల ఆగడాలకు అంతేలేకుండాపోతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. ఎంబీబీఎస్‌, పురానాపూల్‌, నారాయణగూడ, మాదాపూర్‌, బన్సీలాల్‌గూడలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. మహిళల మెడలో నుంచి విలువైన బంగారు ఆభరణాలను తస్కరించారు. రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య ఈ ఘటనలు జరిగినట్లుగా తెలుస్తోంది. వరుసగా జరుగుతున్న చైన్‌ స్నాచింగ్‌లతో మహిళలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.

 

Don't Miss