Activities calendar

18 October 2015

ఫైనల్ లో సింధు ఓటమి...

హైదరాబాద్ : డెన్మార్క్ ఓపెన్ టోర్నీలో పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఫైనల్ లో ఓటమి పాలయింది. 21-19, 21-12 తేడాతో చైనా షట్లర్ జురుయ్ విజయం సాధించింది.

 

21:56 - October 18, 2015

హన్మకొండ : వరంగల్ జిల్లా పోరాటాకు పురిటిగడ్డ అని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గతంలో ముగ్గురు సీఎంలను ఉరికిచ్చిన చరిత్ర వరంగల్ జిల్లా ప్రజలకు ఉందని గుర్తు చేశారు. ఒక సీఎంకు చెప్పులు చూపించారు, మరో సీఎంకు చుక్కలు చూపించారని చమత్కరించారు. గతంలో ఓ రైతు చంద్రబాబుకు తిరుగులేని సమాధానం చెప్పారని పేర్కొన్నారు.

 

21:45 - October 18, 2015

ఖమ్మం : రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ఉన్న హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తోందని ఎంపీ రేణుకాచౌదరి ధ్వజమెత్తారు. బీఫ్‌ తినేవారి పట్ల బీజేపీ అనుసరిస్తున్న తీరుపై ఆమె మండిపడ్డారు. మంత్రులు, పార్టీ నేతలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నా.. మోదీ మౌనంగా ఉండటం తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆమె అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో విఫలమయ్యారని రేణుకా అన్నారు. ఖమ్మంలో తనను కలిసిన గిరిజన మహిళలతో ఆమె సాంప్రదాయ నృత్యం చేశారు. 

భారత్ ఓటమి..

రాజ్ కోట్ వన్డే : భారత్, సౌతాఫ్రికాల మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో భారత్ ఓటమి పాలయింది. 18 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది. ఐదు వన్డే సరీస్ లో 2-1 తేడాతో సౌతాఫ్రికా ఆధిక్యంలో ఉంది. దక్షిణాఫ్రికా నిర్ణీత వోవర్లలో 7 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. 271 విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత వోవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. 

21:30 - October 18, 2015

తూర్పుగోదావరి : సాగరసంగమం సాక్షిగా తూర్పుతీరంలో ప్రపంచ తెలుగు కవితోత్సవాలు రెట్టించిన ఉత్సాహంతో జరుగుతున్నాయి. 30గంటల..30నిమిషాల..30సెకన్ల పాటు ఏకబిగిన జరుగుతున్న కవితోత్సవాలు గిన్నిస్ బుక్ ఆఫ్‌ రికార్డు నెలకొల్పే దిశగా సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేదిలో ప్రపంచ తెలుగు కవితోత్సవాలు అట్టహసంగా ప్రారంభమయ్యాయి. కువైట్ ప్రవాసాంధ్రుల సౌజన్యంతో జరుగుతున్న ఈ వేడుకలను రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చేపట్టిన 30గంటల.. 30నిమిషాల.. 30సెకన్లు పాటు ఏకబిగిన జరుగుతున్న కవితోత్సవాలను తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, ఆంధ్రాబుక్ ఆఫ్ రికార్డు, స్టేట్ బుక్ఆఫ్ రికార్డులు నమోదు చేస్తున్నారు. ఈ ప్రపంచ తెలుగు కవితోత్సవాల కార్యక్రమంలో ప్రముఖ కవులు శివారెడ్డి, అద్దేపల్లి రామ్మోహన్, శిఖామణి, కొప్పర్తితో పాటు 1500 మంది ఔత్సాహిక కవులు, రచయితలు పాల్గొన్నారు.

 

21:24 - October 18, 2015

కడప : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమను పూర్తిగా నిర్లక్ష్యం చేసి.. రాజధాని అభివృద్ధి కోసం నిధులన్నీ ఖర్చు చేస్తున్నారని రాయలసీమ మేధావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జడ్పీ హాల్‌లో రాయలసీమ అభివృద్ధి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో.. రాయలసీమకు రావాల్సిన నిధులపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపేందుకు పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు పలువురు ప్రముఖులు తెలిపారు. 

21:15 - October 18, 2015

విశాఖ : ప్రత్యేక హోదా కోసం విపక్షాలు ఏకమయ్యాయి. కేంద్రం వెంటనే ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ.. విశాఖలో వైసిపి, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నేతలు స్థానిక సరస్వతి పార్క్ నుంచి జీవీఎంసీ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. కేంద్రం ప్యాకేజీతో రాష్ట్రానికి ఓరిగేదేమి లేదన్నారు. సీపీఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ విభజన బిల్లులోని అంశాలను అమలు చేయాలన్నారు. ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నరసింగరావు మాట్లాడుతూ ఎపికి ప్రత్యేకహోదా ముఖ్యమని.. ప్యాకేజీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. ప్రత్యేకోహోదా ఇచ్చి తీరాలని... లేదంటే ప్రజలను మోసం చేసినట్లే అవుతుందన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, సీమ జిల్లాలకు హోదా వస్తేనే లాభం చేకూరుతుందని చెప్పారు. ప్రత్యేకహోదా ఇచ్చేవరకు పోరాటం అగదన్నారు.

 

20:57 - October 18, 2015

గుంటూరు : ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లో ఎలుక కళేబరం దర్శనమిచ్చింది. ఈ ఘటన గుంటూరు తెనాలిలో వెలుగు చూసింది. ఓ మహిళ షాపులో ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ ను కొనుగోలు చేసింది. అయితే ఇంటికెళ్లి చూసే సరికి ఆయిల్ ప్యాకెట్ లో ఎలుక కళేభరం బయటపడింది. దీంతో అవాక్కై అయిన మహిళ మీడియాకు సమాచారం ఇచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆయిల్ ప్యాకెట్లు కొనుగోలు చేయాలంటేనే జనం జంకుతున్నారు. నకిలీ ప్యాకెట్ గా అనుమానిస్తున్నారు. ఫుడ్ కంట్రోల్ అధికారుల నిర్లక్ష్యం.. స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో థమ్సప్ బాటిల్ లో బల్లులు, పాముల కళేభరాలు బయటపడిన సంగతి తెలిసిందే. ఎముకలతోపాటు పలు జంతువుల కొవ్వు నుంచి తీసిన ఆయిల్ ను నూనేలో కలిపి విక్రయించడం గమనార్హంం.

 

20:37 - October 18, 2015

హైదరాబాద్ : సీనియర్ పాత్రికేయులు, సాక్షి ఎడిటర్ రామచంద్రమూర్తి వ్యాసాల సంపుటి....'అన్‌వీలింగ్ తెలంగాణ స్టేట్' పుస్తకావిష్కరణ కార్యక్రమం తెలుగు యూనివర్శిటిలో జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు, చుక్కా రామయ్య, ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ , జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ లు పాల్గొన్నారు. వర్తమాన తెలంగాణ చరిత్ర ఈ పుస్తకంలో నిక్షిప్తమై ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. 22 ఎడిటోరియల్స్‌ను కాంటెక్ట్స్‌లతో సహా పొందుపరిచి మనకందిస్తున్నారని,.. దీన్ని ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవశ్యకత ఉందని పలువురు పేర్కొన్నారు.

 

20:21 - October 18, 2015

ఖమ్మం : జిల్లాలో ఎంపీ రేణుకాచౌదరిని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. గతంలో వైరా ఎమ్మెల్యే టిక్కెట్టును ఆశించిన డాక్టర్ రాంజీ మృతికి రేణుకాచౌదరి కారణమంటూ ఆయన సతీమణి చంద్రకళ మరోసారి నిరసనకు దిగారు. జిల్లాలో రేణుక పర్యటన సందర్భంగా కలెక్టరేట్ ఎదుట రేణుకాచౌదరిని అరెస్టు చేయాలని చంద్రకళ నిరహార దీక్షకు దిగారు. తన భర్త నుంచి టిక్కెట్టు కోసం కోటి 20 లక్షలు రేణుకాచౌదరి తీసుకున్నారని ఆరోపించారు. తన భర్తలను మోసం చేసిందన్నారు. అయితే నిరసన దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు...వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. 

20:00 - October 18, 2015

హైదరాబాద్ : ఎపి రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఎపి సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఈమేరకు సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీఎం కేసీఆర్ ను సీఎం చంద్రబాబు దంపతులు కలిశారు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాలని చంద్రబాబు దంపతులు ఆహ్వానించారు. ఈమేరకు ఆహ్వాన పత్రికను కేసీఆర్ కు అందజేశారు. కేసీఆర్ తోపాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిలు చంద్రబాబును సాదరనంగా ఆహ్వానించారు. చంద్రబాబుతోపాటు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. చంద్రబాబు... కేసీఆర్ కు శాలువ కప్పి.. పుష్ప గుచ్చం ఇచ్చారు. అనంతరం తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కేసీఆర్ కు అందజేశారు. రాజధాని శంకుస్థాపన మహోన్నత కార్యక్రమానికి తప్పకుండా వస్తానని కేసీఆర్ చెప్పారు. ఇరువురు దాదాపు 50 నిమిషాలు సమావేశం అయ్యారు. పలు విషయాలను చర్చించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి.. కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. అలాగే క్యాంప్ ఆఫీస్, మంత్రుల నివాసాలు, అసెంబ్లీ, అధికారుల నివాసాలు ఎక్కడెక్కడ నిర్మిస్తున్నారని చంద్రబాబును కేసీఆర్ అడిగినట్లు సమాచారం. 30 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని ఏ విధంగా నిర్మిస్తున్నారని అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. రాజధాని నిర్మాణానికి కేసీఆర్ పలు సలహాలు, సూచనలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా ఇరు రాష్ట్రాల మధ్య పొరపచ్చాలున్నా... ప్రజా సంక్షేమం కోసం.. వ్యక్తి గత విమర్శలు చేసుకోవడం మంచిది కాదని మాట్లాడుకున్నట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అయితే 8 నెలల తర్వాత కేసీఆర్, చంద్రబాబు ముఖాముఖిగా భేటీ అయ్యారు. ఇదిలావుంటే నీటి పంపకాలు, ఓటుకు నోటు విషయంలో ఇరు రాష్ట్రాల మంత్రులు, సీఎంలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. పలు విషాయాలపై నిత్యం ఒకరిపైమరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈక్రమంలో శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించేందుకు స్వయంగా చంద్రబాబు రావడం, 50 నిమిషాలపాటు భేటీ కావడం ప్రాధాన్యత ను సందరించుకుంది. ఈభేటీలో మొత్తంగా అమరావతి నిర్మాణంపైనే చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇది ఒక శుభపరిణామంగానే చెప్పుకోవచ్చు. భవిష్యతో పలు సమసల్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీరి కలయిక ఉపయోగపడుతుందని భావించవచ్చు.

 

కేసీఆర్ ను ఆహ్వానించిన చంద్రబాబు

హైదరాబాద్ : ఎపి సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. రాజధాని శంకుస్థాపనకు చంద్రబాబు.. కేసీఆర్ ను ఆహ్వానించారు. 

18:59 - October 18, 2015

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్లారు. పవన్ కళ్యాణ్ చిరంజీవిని కలిశారు. రామ్ చరణ్ .. పవన్ కళ్యాణ్ ను సాదరంగా ఆహ్వానించారు. బ్రూస్ లీ సినిమాలో నటించినందుకు చిరంజీవికి పవన్ అభినందనలు తెలిపారు. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా షూటింగ్ నుంచి నేరుగా పవన్ కళ్యాణ్.. చిరంజీవికి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ నేను రాజకీయాల్లోకి వచ్చాక.. అన్నయ్య(చిరంజీవి)ని ప్రత్యేకంగా కలవడం ఇదే తొలిసారన్నారు. తమ మధ్య రాజకీయ విధానాలు వేరుగా ఉన్నా... సినిమా, కుటుంబ పరంగా తనకు అన్నయ్య అంటే గౌరవం, ఇష్టమని అన్నారు. అమరావతి శంకుస్థాపనకు హాజరుకావడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని జనసేన అధ్యక్షుడు స్పష్టం చేశారు. రాజధాని శంకుస్థాపనకు వెళ్లాలనే ఉందన్నారు. 

 

కేసీఆర్ తో చంద్రబాబు భేటీ...

హైదరాబాద్ : ఎపి సీఎం చంద్రబాబు.. తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. రాజధాని శంకుస్థాపనకు కేసీఆర్ ను ఆహ్వానించారు. చంద్రబాబుకు కేసీఆర్ సాదర స్వాగతం పలికారు.

 

కేసీఆర్ ఇంటికి చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్ : ఎపి సీఎం చంద్రబాబు... తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. ఎపి రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించనున్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావులతో కలిసి చంద్రబాబు కేసీఆర్ నివాసానికి వెళ్లారు.

కేసీఆర్ నివాసానికి బయల్దేరిన చంద్రబాబు

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నివాసానికి ఎపి సీఎం చంద్రబాబు బయల్దేరారు. ఎపి రాజధాని శంకుస్థాపనకు కేసీఆర్ ను స్వయంగా చంద్రబాబు ఆహ్వానించనున్నారు.

18:24 - October 18, 2015

కరీంనగర్ : రైతు ఆత్మహత్యలను నివారించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తీవ్రంగా విమర్శించారు. రైతాంగ సమస్యలపై సర్కార్‌ మొసలి కన్నీరు కారుస్తుందని.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు మంత్రులకు సమయం కూడా దొరకడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రత్తికి కనీస మద్దతు ధర ఐదు వేల రూపాయలు ప్రకటించి.. సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని ఆయన కోరారు. 

18:20 - October 18, 2015

యుపి : ఉత్తర ప్రదేశ్ నోయిడాలో ఓ తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు నల్గొండ జిల్లాకు చెందిన సందేశ్ భాస్కర్ గా గుర్తించారు. నోయిడాలోని అమేథీ యూనివర్సిటీలో మెరైన్ సైన్స్ ఇంజినీరింగ్ చదువుతున్న సందేష్... స్థానిక అపార్ట్ మెంట్లో తన మిత్రులైన నదీమ్, మధుర్ తో కలిసి ఉంటున్నాడు. శనివారం తెల్లవారుజామున్న ప్లాటుకు వచ్చిన మరో విద్యార్థి.. సందేష్ పై దాడి చేసి.. గన్ తో కాల్చాడు. ఫైర్ చేసిన వ్యక్తిని అమన్ గా గుర్తించారు. కాలేజీలో గొడవలు హత్యకు దారితీసి ఉంటాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భాస్కర్ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

18:17 - October 18, 2015

నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో నలుగురు ముఖ్యమంత్రులున్నారని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్, కవిత సీఎంలుగా అధికారం చెలాయిస్తున్నారన్నారు. అసలు దేశంలో ప్రజలతో కలవని ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుత్తా ఆరోపించారు. ఎవరికి అపాయిట్ మెంట్ ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే... ప్రజలు ఊరుకోరని.. తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

 

17:57 - October 18, 2015

తమిళనాడు : చెన్నైలో దక్షిణ భారత నటీనటుల నడిగర్‌ సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. శరత్‌కుమార్, విశాల్ వర్గాల మధ్య పోటీ నెలకొంది. అధ్యక్ష స్థానానికి శరత్‌కుమార్, నాజర్ పోటీపడుతున్నారు. సినీ నటులు రజనీకాంత్, విజయ్, ఖుష్బూతో పాటు పలువురు నటులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సాయంత్రం ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు.

17:56 - October 18, 2015

హైదరాబాద్ : ఎపి సీఎం చంద్రబాబు తిరుపతి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో తన నివాసంలో టీటీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. తెలంగాణలో చేపట్టబోయే పార్టీ కార్యక్రమాలపై చర్చించనున్నారు. అనంతరం గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ లను రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించనున్నారు.

 

17:53 - October 18, 2015

కర్నూలు : రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని.. రాజధాని మోజుతో రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. రాయలసీమ జిల్లాల్లోని రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా.. ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా అమరావతి పేరుతో నీరు-మట్టి సేకరణతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని మధు అన్నారు.

 

కారు బోల్తా... ఇద్దరు మృతి

నల్లగొండ : చిట్యాల మండలం పెదకాపర్తి సమీపంలో అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

భారత్ విజయలక్ష్యం 271 పరుగులు..

రాజ్ కోట్ : సౌతాఫ్రికా నిర్ణీత వోవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. భారత్ విజయలక్ష్యం 271 పరుగులుగా ఉంది. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ డీకాక్ 103 పరుగులు చేశాడు.

 

హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్ : ఎపి సీఎం చంద్రబాబు తిరుపతి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో తన నివాసంలో టీటీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. తెలంగాణలో చేపట్టబోయే పార్టీ కార్యక్రమాలపై చర్చించనున్నారు. అనంతరం గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ లను రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించనున్నారు.

 

కిడ్నాపైన చిన్నారుల అచూకీ లభ్యం..

హైదరాబాద్ : నగరంలో కిడ్నాపైన నలుగురు చిన్నారుల అచూకీ లభ్యం అయింది. ఎల్ బినగర్ లోని ఎస్ బిహెచ్ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న కార్తీక్ (8), తరుణ్ కుమార్ రెడ్డి(7), చింటు(6), జశ్వంత్ (3) అనే నలుగురు చిన్నారులు కిడ్నాప్ కు గురయ్యారు. అయితే చిన్నారులను దుండగులు మీర్ పేటలో వదిలి వెళ్లారు.

 

16:54 - October 18, 2015

ఢిల్లీ : దాద్రి ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సొంతపార్టీ నేతలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సీరియస్‌ అయ్యారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని మోడీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. మరోసారి ఇలా మాట్లాడకుండా నేతలను హెచ్చరించామని ప్రకటించారు. హరియానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, కేంద్రమంత్రి మహేశ్ శర్మ, సాక్షి మహరాజ్, సంగీత్‌ సోమ్‌కు సమన్లు పంపామని అమిత్ షా తెలిపారు.

 

16:49 - October 18, 2015

హైదరాబాద్ : నిరుపేదల శ్రేయస్సు కోసమే తెలంగాణ సర్కార్‌ పనిచేస్తోందని టీఎస్ మంత్రి కేటీఆర్‌ స్పష్ఠం చేశారు. హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న డబుల్ బెడ్‌ రూం ఇళ్లను ఆయన పరిశీలించారు. ఈసంద్భంగా టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. నమ్మి అధికారం ఇచ్చిన వారందరికి న్యాయం చేస్తామన్నారు. విమర్శలకు పని తీరుతోనే సమాధానం చెబుతామని చెప్పారు.

 

16:41 - October 18, 2015

హైదరాబాద్ : నగరంలో నలుగురు చిన్నారుల కిడ్నాప్ కలకలం రేపింది. ఎల్ బినగర్ లోని ఎస్ బిహెచ్ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న కార్తీక్ (8), తరుణ్ కుమార్ రెడ్డి(7), చింటు(6), జశ్వంత్ (3) అనే నలుగురు చిన్నారులు కిడ్నాప్ గురయ్యారు. ఎల్ బి నగర్ పీఎస్ లో చిన్నారుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి చిన్నారుల కోసం వెతుకుతున్నారు.

 

16:37 - October 18, 2015

హైదరాబాద్‌ : ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ యోధుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ పాతబస్తీ అలియాబాద్‌లో రెడ్డి జనసంఘం వజ్రోత్సవాలకు సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రెడ్డి హాస్టల్‌ విస్తరణ కోసం నగర పరిసరప్రాంతాల్లో పదెకరాల స్థలం కేటాయిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి, వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి, హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి హాజరయ్యారు.

నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా..

రాజ్ కోట్ : సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. 210 పరుగుల వద్ద మోహిత్ శర్మ బౌలింగ్ లో డీకాక్ (103) ఔట్ అయ్యాడు. 

ఎల్ బినగర్ లో నలుగురు చిన్నారుల అదృశ్యం...

హైదరాబాద్ : ఎల్ బినగర్ లో ఇంటి ముందు ఆడుకుంటున్న నలుగురు చిన్నారులు అదృశ్యమయ్యారు. కార్తీక్ (8), తరుణ్ కుమార్ రెడ్డి(7), చింటు(6), జశ్వంత్ (3)లు అదృశ్యమయ్యారు. ఎల్ బి నగర్ పీఎస్ లో చిన్నారుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 

హైదరాబాద్ టిడిపి అధ్యక్షుడిగా మాగంటి గోపినాథ్

హైదరాబాద్ : టీడీపీ నగర అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎల్.రమణ, రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. 

డ్రైనేజీలో పడ్డ ఇద్దరు కార్మికులు..

హైదరాబాద్ : నల్లకుంట డ్రైనేజీలో ఇద్దరు కార్మికులు పడ్డారు. సిబ్బంది ఒకర్ని రక్షించారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. 

13:56 - October 18, 2015

ముసలి ఆకాశాన్ని వదిలి కొండ ఒడిలోకి సూర్యకుమారుడు..కొమ్మ రెక్కల కిందకు పక్షి సమూహం..ఇప్పుడా ఆకాశం ఒంటరి..దాని నిండా చీకటి. అంటూ మంచి భావుకతతో కవిత్వం రాసిన అభ్యుదయ కవి ఏనుగు నరసింహరెడ్డి. ఏ ఆడంబరాలు..అట్టహాసాలు..శబ్ధ డాంభీకాలు లేకుండా విదేశీ కవితల అనుకరణలు లేకుండా స్వచ్చమైన కవిత్వం రాస్తున్న అచ్చమైన పల్లె కవి ఏనుగునరసింహరెడ్డి. రైతు కోసం కవిత్వమై ధ్వనించారు. ఆయనపై పరిచయ కథనం..

అమరావతి శంకుస్థాపనకు వెళ్లడం లేదు - తమ్మినేని..

వరంగల్ : అమరావతి శంకుస్థాపనకు వెళ్లడం లేదని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. 25, 26,27వ తేదీల్లో నాగార్జున సాగర్ లో పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్లీనరీలో చర్చిస్తామన్నారు. 

దుర్గగుడి ఈవో పీఏ అత్యుత్సాహం..

విజయవాడ : దుర్గగుడి ఈవో పీఏ అత్యుత్సాహం ప్రదర్శించారు. గేట్లకు తాళాలు వేయడంతో అరగంటకు పైగా అమ్మవారి మహా నివేదిక నిలిచిపోయింది.

 

13:46 - October 18, 2015

వరంగల్ : తెలంగాణ సర్కార్‌ అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇళ్ల కేటాయింపులో బీసీలకు కోటా పెంచాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని, రైతుల విషయంలో మంత్రులు అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. కార్మికులపై ప్రభుత్వం వ్యతిరేక ధోరణితో ఉందని, అమరావతి శంకుస్థాపనకు వెళ్లడం లేదని తెలిపారు. 25, 26,27వ తేదీల్లో నాగార్జున సాగర్ లో పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్లీనరీలో చర్చిస్తామని, ఆశాల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్దిలేదని తెలిపారు. సాగర్‌లో జరగబోయే ప్లీనరీలో తుదినిర్ణయం తీసుకుంటామని తమ్మినేని పేర్కొన్నారు. 

13:36 - October 18, 2015

ఢిల్లీ : ఉత్తర భారతదేశంలో దేవీనవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు పోటీలు పడుతున్నారు. యావత్ భక్త కోటి అతి పవిత్రంగా భావించే నవరాత్రుల కోసం కటక్‌లో వెండితో తయారు చేసిన అమ్మవారి విగ్రహం అమితంగా ఆకర్షిస్తోంది. వెండి రేకులతో తయారు చేసిన దేవిమూర్తిని దర్శించుకునేందుకు భక్తజనం తండోపతండాలుగా వస్తున్నారు.

13:36 - October 18, 2015

చెన్నై : దక్షిణ భారత నటీనటుల నడిగర్‌ సంఘం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. శరత్‌కుమార్, విశాల్ వర్గాల మధ్య పోటీ నెలకొంది. అధ్యక్ష స్థానానికి శరత్‌కుమార్, నాజర్ పోటీపడుతున్నారు. సినీ నటులు రజనీకాంత్, విజయ్, ఖుష్బూతో పాటు పలువురు నటులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సాయంత్రం ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు.

13:34 - October 18, 2015

చిత్తూరు: తిరుమలలో సెక్యూరిటీ గార్డు, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ లు ఘర్షణ పడ్డారు. శ్రీవారి ఆలయం ముందే జరిగిన ఈ ఘటనలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శివానందం తలకు గాయమైంది. తాను డ్యూటి కోసమని మహాద్వారం గుండా వెళుతున్నానని, కానీ అక్కడున్న అతను తనతో బెదిరింపు ధోరణిలో మాట్లాడడం జరిగిందన్నారు. డ్యూటి కోసం వెళుతున్నానని, కొద్దిగా గౌరవంగా మాట్లాడాలని తాను సూచించడం జరిగిందన్నారు. ఇంతలో హోం గార్డు బాలాజీ అక్కడకు వచ్చి తనపై వాకిటాకీతో దాడి చేయడం జరిగిందన్నాడు. గాయపడిన బాధితున్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

13:22 - October 18, 2015

కవులు గుర్తింపు లేని శాసనకర్తలని శెల్లి మహాకవి అన్నారు. కవులే కాదు సృజనకారులు కూడా సామాజిక చైతన్యం కోసం నిరంతరం శ్రమిస్తుంటారు. ఏవో లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని అక్షరాల చుట్టూ పరిభ్రమిస్తుంటారు. ప్రజా సమూహాలను కదిలిస్తుంటారు. ఉద్యమాలై ఎగిసి పడుతుంటారు. అలాంటి సృజనకారులకు నేడు దేశంలో రక్షణ కరువైంది. సంఘ విద్రోహ శక్తులు కలంపై జులుం ప్రదర్శిస్తున్నాయి. సృజనకారులను హతమారిస్తే చైతన్య దీపాలు ఆరిపోతాయని భ్రమిస్తున్నాయి. ఈ మారణ హోమాలను నిరసిస్తూ ఎందరో సృజనకారులు తమ పురస్కారాలను తిరిగి ఇచ్చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలై ఎగిసిపడుతున్నారు. రగులుతున్న ఆ కలం యోధుల గుండె చప్పుళ్లపై ప్రత్యేక కథనం..

13:15 - October 18, 2015

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'అమరావతి' శంకుస్థాపన కార్యక్రమాలు జెట్ స్పీడ్ అందుకున్నాయి. ఇందుకు ఆహ్వానపత్రికలను పలువురు మంత్రులు అందచేస్తున్నారు. అందులో భాగంగా సీఎం కేసీఆర్ కు ఆహ్వానపత్రికను అందచేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా రానున్నారు. సాయంత్రం 5.30గంటలకు పత్రికను అందచేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారా ? లేదా ? అన్నది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన విషయాలపై మంత్రి కేటీఆర్ నర్బగర్భంగా వ్యాఖ్యానాలు చేశారు. ఐడీహెచ్ కాలనీ ప్రారంభోత్సవం దసరా తెల్లవారి జరుగుతుందా ? లేక రెండు రోజుల తరువాత జరుగుతందా అనేది తెలియాల్సి ఉందన్నారు. ఈ రోజున సీఎం కేసీఆర్ కు పలు కార్యక్రమాలున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనితో ఆయన శంకుస్థాపనకు హాజరౌతారని ఊహాగానాలు ఊపందుకున్నాయి.

కేసీఆర్ హాజరు కావడానికి ప్రధాన కారణాలు..
అమరావతి శంకుస్థాపనకు హాజరు కావాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తానికి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానమైన కారణాలున్నాయని సమాచారం. శంకుస్థాపన కార్యక్రమానికి దేశ ప్రధాని మోడీ హాజరు కావడం అంతేగాక విదేశీ రాయబారులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరౌతుండడమే కారణమని తెలుస్తోంది. హాజరు కాకపోతే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలున్నాయని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి హాజరు కావడం ద్వారా తెలుగు రాష్ట్రాలు కలిసే ఉన్నాయని, ఎలాంటి విబేధాలు లేవని చెప్పవచ్చని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆయన హాజరౌతారా ? లేదా ? అన్నది రానున్న రోజుల్లో తేలిపోతుంది. 

నెల్లూరులో డెంగీతో ఇద్దరు మృతి..

నెల్లూరు : గూడురు (మం) చెన్నూరులో డెంగీతో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఓ వైద్యురాలు కూడా ఉంది. డాక్టర్ దివ్య (24), సౌజన్య (12) మృతి చెందారు. 

లింగాయపాలెంలో రైతులకు ఆహ్వానపత్రికల అందవేత..

గుంటూరు : లింగాయపాలెంలో రైతులకు అమరావతి శంకుస్థాపన ఆహ్వానపత్రికలను మంత్రులు సునీత, మృణాళినిలు అందచేశారు. పట్టువస్త్రాలతో పత్రికలను రైతులకు అందచేశారు. 

రెడ్డి జనసంఘం వజ్రోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్...

హైదరాబాద్ : అలియాబాద్ లో రెడ్డి జనసంఘం వజ్రోత్సవ వేడుకలకు సీఎం కేసీఆర్
హాజరయ్యారు. గోల్డెన్ జూబ్లి స్థూపాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. రెడ్డి హాస్టల్ విస్తరణకు స్థలాన్ని కేటాయించి రూ.10 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ట్యాంక్ బండ్ పై సురవరం ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర బహదూర్ వెంకట్రామిరెడ్డి విగ్రహాలను ప్రతిష్టిస్తామన్నారు. 

నాగార్జున సాగర్ లో 25-27 వరకు టి.సీపీఎం ప్లీనరీ సమావేశాలు..

హైదరాబాద్ : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో 25,26,27వ తేదీల్లో తెలంగాణ సీపీఎం ప్లీనరీ సమావేశాలు జరుగుతాయని, 600 మంది ప్రతినిధులు హాజరవుతురని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి, జూలకంటి రంగారెడ్డిలు తెలిపారు. పాలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు సమావేశాలను, ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రముఖ విద్యా వేత్త చుక్కా రామయ్య ప్రారంభిస్తారని తెలిపారు. పార్టీ పరిస్థితి, ప్రజా సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. కరవు, రైతు ఆత్మహత్యలు నివారించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని, పత్తికి మద్దతు ధర లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు.

12:31 - October 18, 2015

వరంగల్ : కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన చారిత్రాత్మక వారసత్వ నేపథ్యం గల 12 నగరాల్లో రెండు తెలుగు నగరాలు చోటు దక్కగా ఓరుగల్లు వేదికగా తెలంగాణ రాష్ట్రం లో తొలి అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అమరావతి ఎంపికైన సంగతి తెలిసిందే. కేంద్రం తలపెట్టిన హెరిఏట్ సిటీ డెవలప్ మెంట్ అగ్మెంటేషన్ యోజన (హృదయ్) పథకాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం ఉదయం వరంగల్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా వేయి మండపాల ఆవరణలో పైలాన్ ను వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వెంకయ్య ప్రసంగించారు. పట్టణాల్లో పరిపాలన మెరుగుపరచాలని, ఆధునీకరించాలని..సుందరీకరించాలని సదుపాయాలు కల్పించాలనే దానిపై ప్రధాన మంత్రి మోడీ దృష్టి సారించి పథకాలు ప్రారంభించడం జరిగిందన్నారు. అందులో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందరికీ ఇళ్లు కట్టించే పథకం ప్రారంభించడం జరిగిందని, కానీ ఈ పథకం అమలు సులువు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం..రాష్ట్రం కలిసి పనిచేసే సాధ్యం అవుతుందని, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం పనిచేస్తోందని, 2022 నాటికి ఇళ్లు పూర్తి చేసే చర్యలు ప్రారంభించినందుకు కేసీఆర్ ను అభినందిస్తున్నట్లు వెంకయ్య పేర్కొన్నారు.

అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ ?

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమరావతి శంకుస్థాపనకు వెళ్లేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వెళితే ఐడీహెచ్ కాలనీ ప్రారంభోత్సవం వాయిదా పడే అవకాశాలున్నాయి. 

నేటి మధ్యాహ్నానికి స్వరాజ్ మైదానానికి కలశాలు..

విజయవాడ : మధ్యాహ్నానికి మన మట్టి, మన నీరు కలశాలు స్వరాజ్ మైదానానికి చేరుకోనున్నాయి. స్వరాజ్ మైదానానికి చేరుకునే కలశాలను అమరావతికి తరలిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. 

ఓరుగల్లులో కేంద్ర మంత్రి వెంకయ్య...

వరంగల్ : ఓరుగల్లులో హృదయ్ పథకాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించినట్లు, స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వరంగల్‌ను ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దితే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందన్నారు. 

ఓరుగల్లులో కేంద్ర మంత్రి వెంకయ్య...

వరంగల్ : ఓరుగల్లులో హృదయ్ పథకాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించినట్లు, స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వరంగల్‌ను ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దితే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందన్నారు. 

వరంగల్ లో పిచ్చికుక్కల దాడి..

వరంగల్: పిచ్చి కుక్కలు దాడి చేసిన ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని దేవరుప్పల మండలం నీర్మాల గ్రామంలో చోటుచేసుకుంది. 

నలుగురు నేతలకు అమీత్ షా నోటీసులు..

ఢిల్లీ : నలుగురు నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నోటీసులు జారీ చేశారు. దేశ వ్యాప్తంగా బీఫ్ విషయంలో బీజేపీ నేతలపై విమర్శలు వెలువెత్తుతున్న విషయం విదితమే. ఈ విషయంలో విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న పార్టీ నేతలపై ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. 

నోయిడాలో నల్గొండ విద్యార్థి దారుణ హత్య..

నోయిడా : నల్గొండ విద్యార్థి సందేశ్ దారుణ హత్యకు గురయ్యాడు. అమేరి యూనివర్సిటీలో బీఎస్సీ మెరైన్ సైన్స్ చదువుతున్న సందేశ్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. 

తిరుమలలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్..సెక్యూర్టీ గార్డు ఘర్షణ..

చిత్తూరు : తిరుమలలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్..ప్రైవేటు సెక్యూర్టీ గార్డుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ తల పగిలింది. 

మోహిని అవతారంలో శ్రీవారు..

చిత్తూరు : తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారికి మోహిని అవతార సేవ జరిగింది. 

దుర్గమ్మను దర్శించుకున్న చిన రాజప్ప..యనమల..

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఏపీ మంత్రులు చిన రాజప్ప, యనమలలు దర్శించుకున్నారు. రాజధాని శంకుస్థాపనకు 11వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చిన రాజప్ప పేర్కొన్నారు.

 

తిరుమలకు చేరుకున్న బాబు..

చిత్తూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులు తిరుమలకు చేరుకున్నారు. నారాలోకేష్ దంపతులకు జన్మించిన దేవాన్ష్ కు అన్నప్రాసన జరుగుతున్న సంగతి తెలిసిందే. 

హామీలు నెరవేర్చకుంటే తప్పుకోవాలి - రజనీ..

చెన్నై : ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే పదవులకు రాజీనామా చేయాలని సినీ నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. నడిగర్ సంఘం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఓటు వేసిన అనంతరం రజనీ మీడియాతో మాట్లాడారు.

 

ఎడ్లపాడులో వ్యక్తి ఆత్మహత్య...

గుంటూరు : ఎడ్లపాడు (మం) జగ్గాపురంలో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన స్థలం కబ్జా విషయంలో పోలీసులు కబ్జాదారులకు వత్తాసు పలకడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.
 

10:08 - October 18, 2015

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం వచ్చిన ప్రభుత్వం వినూత్న జల విధానం ఏర్పాటు చేయడం లేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే జల విధానం ఏ విధంగా ఉంది. సాగు, తాగు నీటిని తెలంగాణలోని పది జిల్లాలకు సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరిపోతుందా ? విధానంలో లోపాలున్నాయా ? లోపాలు ఉంటే ఏ విధంగా సరిదిద్దుకోవాలనే దానిపై టెన్ టివిలో 'ఫర్ ద పీపుల్ టాక్ షో విత్ రాఘవులు' కార్యక్రమంలో రాఘవులు విశ్లేషించారు. ఆయన మాటల్లోనే...

గోదావరి నది జలాలపై పిల్లిమొగ్గలు...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నీటి పారుదల శాఖ ప్రధాన పాత్ర పోషించింది. అన్యాయం జరుగుతోందనే ముఖ్య సమస్యగా ముందుకొచ్చింది. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత నూతన జలవిధానం ఏర్పాటు చేయాల్సినవసరం ఉంది. కానీ రూపొందించలేదు. ఒకటి రెండు జిల్లాలు...కొన్ని ప్రాంతాల్లో మినహా అత్యధిక ప్రాంతాల్లో వర్షాభావం ప్రాంతాలున్నాయి. ముఖ్యంగా గోదావరి నది జలాల వినియోగం.. ఈ విషయంలో ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తోంది. ప్రాణహిత చేవెళ్ల కాళేశ్వరం నుండి చేస్తామన్నారు. మళ్లీ తుమ్మిడిహెట్టు అంటోంది. గందరగోళానికి తెరతేసింది. కాంతానపల్లిని ఆలోచలిస్తామంటున్నారు. ఇచ్చంపల్లి, కాంతానపల్లి, ప్రాణహిత చేవెళ్ల..ఇవన్నీ ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉందని పేర్కొంటోంది. సత్వరం పూర్తి చేయడం కోసం కొన్ని చిన్న చిన్న బ్యారేజీలు కడుతామని పేర్కొంటోంది. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి ఎలా ? నష్టం ఎంత ఉంటుంది ? చాలా అంశాలు ఆలోచించాల్సి ఉంటుంది.

ఏకకాలంలో ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారు ? 
అందరితో చర్చిస్తామని, అఖిలపక్షంతో సమావేశం జరుపుతామని ప్రభుత్వం పేర్కొంటోంది. కానీ కాలం గడిచిపోతోంది. టీఆర్ఎస్ కొత్త విధానం ఏదైనా ప్రకటిస్తుందా ? గోదావరి, కృష్ణా ప్రాజెక్టులపై తీవ్రమైన సమస్యలున్నాయి. విద్యుత్ ఎక్కడి నుండి వస్తుంది ? దీనికి ఖర్చు ఎలా ? నీటిని నిల్వ ఎలా చేస్తారని గతంలో ప్రశ్నించడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ కూడా ఉంది. దీనికి ఆ ప్రభుత్వం సమాధానాలు చెప్పలేదు. కల్వకుర్తి, బీమా, దేవాదులా చాలా భారీ ప్రాజెక్టులు పూర్తి చేస్తామంటున్నారు. ఎప్పుడు పూర్తి చేస్తారు ? ఏకకాలంలో పూర్తి చేస్తామంటే ఏ ప్రాజెక్టు పూర్తి కాకుండా ఉండిపోతుంది.

ఒక ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధాన అంశాలు ఆలోచించాలి..
కల్వకుర్తి..నెట్టెంపాడు ప్రారంభించారు. ఇక్కడ ఉన్న డబ్బునంతా ఖర్చు పెట్టి నీటిని తెచ్చే విధంగా పూర్తి చేయండి. తరువాత ఇంకో ప్రాజెక్టు చేపడితే బాగుంటుంది. ఇందులో కొన్ని అంశాలు ప్రధానంగా ఆలోచించాల్సి ఉంటుంది. అతి తక్కువ వర్షపాతం...ఫోరైడ్ ప్రాంతం..ఎక్కువ రైతులు ఆత్మహత్యలు..ఇలా కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టులు చేపట్టాలి. ప్రాజెక్టులు పూర్తి చేసే డబ్బు తమ దగ్గరుందని ఆనాడు వైఎస్ చెప్పారు. కానీ ఆనాడు మేము నమ్మలేదు.

బోర్ వెల్స్ పై ఆలోచించాలి..
రాష్ట్రంలో చాలా ప్రాధాన్యత అంశాలున్నాయి. 25 వేల కోట్లు ఇరిగేషన్ పై పెడుతున్నామంటే ఎలా నమ్ముతారు ? వాటర్ గ్రిడ్ కు రూ.40వేల కోట్లు కేటాయిస్తున్నారు. ప్రతి గ్రామాన్ని ఎందుకు అనుసంధానం చేస్తున్నారు. ఫ్లోరైడ్ ప్రాంతాలను మ్యాప్ చేసి వారికి ముందు ఇవ్వాలి. తెలంగాణ, రాయలసీమలో పెద్ద చెరువులు ఉండేవి. దీనిపై వ్యవసాయం జరిగేది. 1980 తరువాత చెరువులు పాడైపోయాయి. బోర్ వెల్స్ తవ్వడం వల్ల చెరువులు పాడైపోయాయి. చెరువులకు..బోర్లకు అనుసంధానం ఎలా ? బోర్ వెల్స్ పై కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడిన వెంటనే భూగర్భ జలాలు పెరగవు. శాస్త్రీయమైన పద్ధతిలో రీచార్జింగ్ చేయాలి. భూగర్భ జలాలు..చెరువులు..పంటల విధానం..బోర్లపై విధానం ఉండాలి. వృధాగా పోతున్న నీటిని ఎలా కాపాడుకోవాలో ఆలోచించాలి' అని రాఘవులు పేర్కొన్నారు. మరిన్ని విషయాల కోసం వీడియో చూడండి.

యాదాద్రికి పోటెత్తిన భక్తులు..

నల్లగొండ: తెలంగాణ ప్రసిద్ధక్షేత్రం యాదాద్రికి భక్తులు పోటెత్తారు. లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామి ధర్మ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట, వీఐపీ దర్శనానికి అర గంట సమయం పడుతోంది.

సదాశివపేటలో అగ్నిప్రమాదం..

మెదక్: జిల్లా సదాశివపేటలోని హీరో షోరూంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. 

చిన్నారిపై అత్యాచారం ఘటనలో ఇద్దరు అరెస్టు..

ఢిల్లీ : పశ్చిమ ఢిల్లీలో చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వీరు కూడా బాలలని తెలుస్తోంది. 

ప్రారంభమైన నడిగర్ సంఘం ఎన్నికలు..

చెన్నై : తమిళ సినీ నటుల అసోసియేషన్ 'నడిగర్' సంఘం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఓటు వేసేందుకు సినీ నటులు రజనీకాంత్, విజయ్ చేరుకున్నారు. 

 

యాదాద్రికి పోటెత్తిన భక్తులు..

నల్లగొండ: తెలంగాణ ప్రసిద్ధక్షేత్రం యాదాద్రికి భక్తులు పోటెత్తారు. లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామి ధర్మ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట, వీఐపీ దర్శనానికి అర గంట సమయం పడుతోంది.

సదాశివపేటలో అగ్నిప్రమాదం..

మెదక్: జిల్లా సదాశివపేటలోని హీరో షోరూంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. 

08:11 - October 18, 2015

ఏంటీ ట్విట్టర్..అంటున్నారు..ట్వీట్ అంటున్నారు..ఇంకా కోడీ అంటున్నారు. ఏమీ అర్థం కావడం లేదు అంటున్నారా..సింపుల్ అండి..ఓ కోడి..ట్విట్టర్ లో ట్వీట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోందంట. మనదేశంలో కాదు లేండీ..ఎందుకిలా చేస్తున్నారు ? అనేగా మీ సందేహం ? అయితే దీనిపై ఓ లుక్కేయండి..
ఫేస్ బుక్..ట్విట్టర్..ఇలా సామాజిక్య మాధ్యమం ఎంత సంచలనం సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. కానీ ఆస్ట్రేలియాలో 'చికెన్ ట్రీట్' ఉన్న ఓ చికెన్ ఉత్పత్తుల విక్రయ సంస్థ దుకాణం వారికి ఓ ఆలోచన వచ్చింది. సోషల్ మీడియాను మనుషులే ఉపయోగిస్తారా ? ఏం జంతువులు ఉపయోగించకూడాదా అని ప్రశ్నించుకుని తమ దగ్గరున్న కోడి చేత ట్విట్టర్ లో శిక్షణనిప్పిస్తున్నారు. దీనివల్ల తమ వ్యాపారం కూడా బాగా సాగుతుందని ఈ ప్లాన్ వేశారు. 'బెట్టీ' అనే ఓ కోడిని ప్రత్యేకంగా ఓ గదిలో పెట్టి.. అక్కడ కంప్యూటరు, కీ బోర్డు కూడా అందుబాటులో ఉంచారు. అది అడపాదడపా కీబోర్డును ముక్కుతో పొడుస్తుంటే ట్విట్టర్ లో పోస్టయ్యేలా ఏర్పాటు చేశారు. అయితే, దీని యజమానులు ఆశించినట్లుగా ఇది ఇంతవరకు ఒక్కటి కూడా అర్థవంతమైన పదం ట్వీట్ చేయలేదు. కానీ.. కొన్నాళ్లు అలాగే ఉంచితే ఏదో ఒకరోజు అర్థమంతమైన పదం ట్వీట్ చేయగలుగుతుందని.. అప్పుడు బెట్టీ పేరు గిన్నిస్ బుక్ లో నమోదవుతుందని చెబుతున్నారు. మరి వారి ఆశలు ఫలిస్తాయా ? లేదా ? అనేది చూద్దాం.

07:59 - October 18, 2015

మద్యం..ఎన్నో కుటుంబాలను బలి తీసుకొంటోంది. మరెన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. మందుకు దాసోహం అయిన భర్తలతో భార్యలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కాపురాలు కూలిపోతున్నాయి. మందు తాగవద్దని ఎంత చెప్పినా ఆ భర్తలు పెడచెవిన పెడుతుంటారు. కానీ ఓ భార్య మాత్రం సాహసం చేసేసింది. తన భర్త చేత ఎలా మద్యం మానిపించాలా అని ఓ ప్లాన్ వేసింది. ఏంటా ప్లాన్ ? అది వర్కవుట్ అయ్యిందా ? లేదా ? అనేది తెలుసుకోవాలంటే చదవండి..
తమిళనాడు..కోయంబత్తూరు..జయరామ్..ఆమెకు ఓ భార్య ఉంది. ఇతను మద్యానికి బానిసయ్యాడు. మందు మానేయాలని ఎన్నోసార్లు భార్య చెప్పింది. అయినా జయరామ్ వినిపించుకోలేదు. చివరకు ఆ భర్త ఎక్కడకు వెళుతున్నాడో గమనించింది. రహస్యంగా ఫాలో అయ్యింది. సాయంత్రం కాగానే ఏ బార్ కు వెళుతున్నాడో కనుక్కొంది. ఓ రోజున భర్త కంటే ముందుగానే 'టస్మాక్' అనే బార్ కు వెళ్లి కూర్చొంది. అక్కడున్న వారు అదో రకంగా చూడడం మొదలు పెట్టారు. ఇక్కడి నుండి వెళ్లిపోవాలని బార్ సిబ్బంది చెప్పారు. కానీ ఆమె ససేమిరా అంది. ఇంతలోనే జయరామ్ వచ్చాడు. భార్యను చూసి హతాశులయ్యాడు. ఇక్కడి నుండి వెళ్లిపోవాలని అరిచాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇంకేముంది..మద్యం తాగనని భర్త చేత ప్రమాణం చేయించుకుని ఇంటికి పంపారు. అదండి సంగతి..

07:55 - October 18, 2015

వేకువ జామునే నిద్రలేస్తే ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటామని అందిరికీ తెలిసిన విషయమే. కానీ అలా నిద్ర లేవడం అంటే చాలా కష్టమైన పనిగా భావిస్తారు చాలామంది. నిద్ర నుండి బయటపడలేక, ఆ బద్దకాన్ని వదల్లేక ఇబ్బందులు పడుతుంటారు. రాత్రి సమయంలో ఎంత ఆలస్యంగానైనా పడుకుంటాం కానీ, ఉదయం మాత్రం లేవలేం బాబూ అనేవారూ ఉంటుంటారు. మరి అలాంటప్పుడు ఉత్సాహవంత మైన ఉదయానికి స్వాగతం పలకడానికి ఏం చేయాలి.

  • రాత్రిపూట టీవీ ఎక్కువసేపు చూడటం వల్ల రాత్రంతా నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. పడుకునేముందు టీవీ చూడటం వల్ల ఆ వెలుతురు కళ్ళపై ప్రభావం చూపుతుంది.
  • కావాల్సినంత సేపు నిద్రపోకపోవడం వల్ల ఆ రోజంతా మూడీగా ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఓ నియమం ప్రకారం నిద్ర పోవాలి.
  • ప్రతిరోజూ ఉదయాన్ని యాక్టీవ్‌గా ప్రారంభించాలంటే ముందుగా స్నానం చేయాలి. అలా నిద్రలేవగానే స్నానం చేయడం వల్ల బద్ధకాన్ని దూరం చేయవచ్చు.
  • నిద్ర మత్తు వదలాలంటే లేచిన వెంటనే సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోవాలి. దీనివల్ల నిద్రమత్తు వదిలి, శరీరం నూతనోత్సాహాన్ని పొందుతుంది. అంతేకాదు శరీరానికి సహజమైన ఎనర్జీ అందుతుంది.
  • ఉదయాన్నే జాగింగ్‌, వాకింగ్‌లాంటివి చేయడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది. నిద్రలేవగానే గ్లాసు మంచినీళ్ళు తాగాలి. దీనివల్ల డీహైడ్రేషన్‌ కాకుండా శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.
07:51 - October 18, 2015

బాలీవుడ్‌ కండల వీరుడు 'సల్మాన్‌ ఖాన్‌' తాజా చిత్రం 'సుల్తాన్‌' కోసం గుర్రపు స్వారీలో పట్టు సాధిస్తున్నారట. ఈ విషయాన్ని ఆయన సోదరి అర్పితఖాన్‌ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫొటోల్ని పోస్ట్ చేశారు. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సల్మాన్‌కి తల్లిగా అలనాటి అందాల తార 'రేఖ' నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ విశేష ప్రేక్షకాదరణ లభించిందని, ప్రస్తుతం షూటింగ్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని నిర్మాత ఆదిత్య చోప్రా తెలిపారు. అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసి 2016 రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

07:49 - October 18, 2015

రవితేజ హీరోగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించబోతున్న 'ఎవడో ఒకడు' చిత్రం పూజా కార్యక్రమం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రారంభం కానుంది. 'రవితేజతో 'భద్ర' సూపర్‌హిట్‌ చిత్రాన్ని తీయడం జరిగిందని, మళ్ళీ ఆయనతో ఈ 'ఎవడో ఒకడు' చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉందని 'దిల్' రాజు పేర్కొన్నారు. అలాగే 'ఓ మై ఫ్రైండ్‌' చిత్రంతో వేణు శ్రీరామ్‌ని మా బ్యానర్‌ ద్వారానే దర్శకుడిగా పరిచయం చేసినట్లు, ఈ చిత్రంతో వేణు శ్రీరామ్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌తో పని చేయడం కూడా హ్యాపీగా ఉందన్నారు. ఈ చిత్రంలో రవితేజని సరికొత్త కోణంలో చూపించబోతున్నామని, యువత ఆశయాలకు అద్దం పట్టే కథతో రూపొందుతున్న చిత్రమిదన్నారు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలన్నీ ఈచిత్రంలో ఉంటాయని దర్శకుడు వేణుశ్రీరామ్‌ చెప్పారు. ప్రకాష్‌రాజ్‌, నాజర్‌, రావురమేష్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

గచ్చిబౌలిలో కార్డన్ సెర్చ్..

హైదరాబాద్ : గచ్చిబౌలి అంజయ్యనగర్ లో సైబరాబాద్ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 300 మంది పోలీసులతో ఇంటింటా సోదాలు నిర్వహించారు. 20 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 40 బైక్ లు, 7ఆటోలు, 13 గ్యాస్ సిలిండర్లు, బాణాసంచాను స్వాధీనం చేసుకున్నారు. 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోవడంతో క్యూ లైన్లు బయటకు వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతుండగా నడకదారి వచ్చే భక్తులకు 10గంటల సమయం పడుతోంది.

 

నేడు ఐదో రోజు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

చిత్తూరు : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. మోహిని అవతరాంలో స్వామివారు ఊరేగనున్నారు. రాత్రి గరుడ సేవ సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. తిరుమల - తిరుపతి మధ్య ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించారు.

 

నేడు భారత్ - సౌతాఫ్రికా మూడో వన్డే..

రాజ్ కోట్ : నేడు భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర మైదానంలో మధ్యాహ్నాం 1.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

నేడు సాయంత్రం కేసీఆర్ ను కలువనున్న బాబు..

హైదరాబాద్ : అమరావతి శంకుస్థాపన ఆహ్వానపత్రికను ఉభయ రాష్ట్రాల గవర్నర్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అందచేయనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. అనంతరం 5.30గంటలకు సీఎం కేసీఆర్ ను బాబు కలువనున్నారు. 

ఏపీ మున్సిపాల్టీలు..నగర పంచాయితీల్లో 5కే రన్..

విజయవాడ : మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో నేడు 5కే అమరావతి రన్ నిర్వహించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. 

06:50 - October 18, 2015

రాజ్ కోట్ : టీమిండియా- సౌతాఫ్రికాజట్ల మూడోవన్డేకి రాజ్ కోట్ లోని సౌరాష్ట్రక్రికెట్ సంఘం స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. మ్యాచ్ ను స్తంభింపచేస్తామంటూ పటేల్ ల పోరాట కమిటీ ఓ వైపు బెదిరిస్తుంటే...ఆరునూరైనా మ్యాచ్ ను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ నిర్వహించి తీరుతామని నిర్వాహక సంఘం చెబుతోంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ కే కీలకంగా మారిన ఈ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 1-30 గంటలకు ప్రారంభమవుతుంది. మహాత్మాగాంధీ- నెల్సన్ మండేలా ట్రోఫీ కోసం... టీమిండియా, సౌతాఫ్రికాజట్ల మధ్య జరుగుతున్న ఫ్రీడం సిరీస్ షో....కాన్పూర్, ఇండోర్ నగరాల మీదుగా రాజ్ కోటలోని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియానికి చేరింది. ఐదుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా...కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో ముగిసిన తొలివన్డేలో సౌతాఫ్రికా 5 పరుగుల తేడాతో టీమిండియాకు షాకిస్తే ఇండోర్ హోల్కార్ స్టేడియంలో జరిగిన రెండోవన్డేలో సఫారీలను 22 పరుగులతో చిత్తు చేయడం ద్వారా ధోనీసేన దెబ్బకు దెబ్బ తీయడంతో రెండు జట్లు 1-1తో సమ ఉజ్జీలుగా నిలవడంతో ఈ మూడో వన్డే రెండు జట్లకూ కీలకంగా మారింది. సిరీస్ పై పట్టు బిగించాలంటే ఈ మ్యాచ్ లో రెండు జట్లూ నెగ్గి తీరాల్సి ఉంది. దీంతో ఈ మ్యాచ్ రెండుజట్లకూ ప్రతిష్టాత్మకంగా మారింది.

పటేల్ నిరసనలు..
అయితే...భారత్, దక్షిణాఫ్రికా దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు...ఈ సూపర్ సండే ఫైట్ కోసం ఎక్కడలేని ఆసక్తితో ఓవైపు ఎదురు చూస్తుంటే మరోవైపు ..హార్థిక్ పటేల్ నాయకత్వంలోని ఆందోళనకారులు ఈ మ్యాచ్ ఎలా జరుగుతుందో చూస్తామంటూ బెదిరిస్తున్నారు. నిర్వాహక సౌరాష్ట్ర క్రికెట్ సంఘం మాత్రం 2100 మంది పోలీసులు, 90 సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రెండుజట్ల సభ్యులూ...స్టేడియానికి చేరి ..నెట్ ప్రాక్టీస్ కార్యక్రమాన్ని సైతం విజయవంతంగా ముగించారు.

టీమిండియా లోపాలు..
బ్యాట్స్ మన్ స్వర్గం, బౌలర్ల పాలిట నరకంలా ఉండే రాజ్ కోట్ స్టేడియంలో...ఇప్పటి వరకూ నిర్వహించిన ఒకే ఒక్క వన్డే మ్యాచ్ లో...పరుగుల వర్షమే కురిసింది. అయితే ఈ భారీ స్కోరింగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ 9 పరుగుల తేడాతో ఆతిథ్య టీమిండియాను కంగు తినిపించింది. మొదటి రెండు వన్డేల్లో తమ జట్టు చేసిన పొరపాట్లను పునరావృతం కానివ్వబోమని...టాపార్డర్ రనౌట్ల లోపాలను సైతం సరిదిద్దుకోవాల్సి ఉందని కెప్టెన్ ధోనీ, టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి గట్టిగా చెబుతున్నారు.

టీమిండియా అంతంతమాత్రంగా ఫామ్..
టాపార్డర్లో ఓపెనర్ శిఖర్ ధావన్, రెండోడౌన్ విరాట్ కొహ్లీ, 6వ నెంబర్ ఆటగాడు సురేశ్ రైనాల అంతంత మాత్రం ఫామ్ ..భారత టీమ్ మేనేజ్ మెంట్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే బ్యాటింగ్ కు అనువుగా ఉండే రాజ్ కోట్ స్టేడియం పిచ్ పై ఆడటం కొహ్లీకి, రైనాకు చక్కటి అవకాశమని టీమిండియా బ్యాటింగ్ కోచ్ భావిస్తున్నారు. బౌలింగ్ లో మాత్రం..స్టార్ స్పిన్నర్ అశ్విన్ గాయంతో అందుబాటులో లేకున్నా... పేస్ జోడీ భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, స్పిన్ ద్వయం హర్భజన్ సింగ్, అక్షర్ పటేల్ అంచనాలకు తగ్గట్టుగా రాణించడంతో టీమ్ మేనేజ్ మెంట్ ఊపిరిపీల్చుకోగలుగుతోంది.

సౌతాఫ్రికా అయోమయం..
ఇక...పవర్ ఫుల్ సౌతాఫ్రికాజట్టు మాత్రం..రెండోవన్డే ఓటమితో అయోమయంలో చిక్కుకొంది. తొలివన్డేలో 303 పరుగుల భారీస్కోరు సాధించిన తమ జట్టు రెండోవన్డేలో మాత్రం 238 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఎందుకు అందుకోలేకపోయిందో అర్థంకాక సపారీ టీమ్ మేనేజ్ మెంట్ తలపట్టుకొంటోంది. రెండుజట్లకూ బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండడంతో...సౌరాష్ట్ర స్టేడియంలో పరుగులు వెల్లువెత్తడం ఖాయమనే చెప్పాలి. బౌలర్ల సత్తాపైనే రెండు జట్ల జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.

పేస్ టు పేస్ రికార్డ్స్..
భారత గడ్డపై రెండుజట్ల పేస్ టు పేస్ రికార్డు చూస్తే...మొత్తం 25 వన్డేల్లో టీమిండియా 14 విజయాలు, సౌతాఫ్రికా 11 విజయాలు సాధించాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ డే-నైట్ మ్యాచ్ లో..టాస్ తో పాటు..ఫ్లడ్ లైట్ల వెలుగులో పడే మంచుప్రభావం కూడా కీలకం కానుంది. రెండోవన్డే విజయంతో ఫుల్ జోష్ తో ఉన్న టీమిండియా, ఇండోర్ దెబ్బతో కసితో రగిలిపోతున్న సౌతాఫ్రికా జట్ల ఈ పోటీ ఫలితం సిరీస్ కే కీలకమలుపుకానుంది.

06:43 - October 18, 2015

హైదరాబాద్ : ఇన్నాళ్లూ ఏదో ఒక కొలువు వస్తుందని ఆశపడ్డారు. కానీ ఎన్నాళ్లు ఎదురుచూస్తున్నా..పదవుల జాతర ఊసేలేదు. దీంతో వారంతా ఇప్పుడు నిరాశలో ఉన్నారు. ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ల పరిస్థితి. 9ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇప్పుడు అధికారంలోకి రావడంతో..ఏదో ఒక నామినేటెడ్‌ కొలువు దక్కుతుందని తమ్ముళ్లు ఆశపడ్డారు. కానీ..ఎన్ని పండలొచ్చినా..నామినేటెడ్‌ కొలువులు దక్కకపోవడంతో తమ్ముళ్లంతా తీవ్ర నైరాశ్యాంలోకి వెళ్లిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు శ్రావణమాసంలో అని, వినాయకచవితి నాటికి పదవులు వస్తాయని ఎదురు చూసిన తమ్ముళ్లకు ఈ దసరాకు కూడా నిరాశే ఎదురవుతోంది.

పదవులు కోసం ఎదురుచూపులు..
అయితే పార్టీ అధినేత చంద్రబాబు నామినేటెడ్‌ పదవుల భర్తీ దిశగా కనీసం ప్రయత్నాలు కూడా ప్రారంభించడకపోవడంతో తెలుగు తమ్ముళ్లలో రోజు రోజుకు నిరాశ రోజుకు పెరిగిపోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బెర్తులు ఆశించి ఆఖరు నిమిషంలో భంగపడ్డ నాయకులకు అప్పట్లో కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇస్తామని చంద్రబాబు హమీ ఇచ్చారు. దీంతో ఈ పదవులు కోసం టిడిపి నేతలు చకోర పక్షుల్లా ఎదురుచూసారు. కనీసం ఈ విజయదశమికి అయినా పదవులు వస్తాయనుకంటే ఆ ఆశలు కూడా ఆవిరి అయిపోయాయి.

కార్పొరేషన్ పదవులు ఇస్తామన్న అధినేత..
ఇప్పటి వరకు శాప్ ఛైర్మన్, వికలాంగ కార్పొరేషన్‌ ఛైర్మన్ లాంటి ఒకటి రెండు పదవులు తప్ప ఇంత వరకూ ఇతర పదవుల జోలికి అధినేత పోకపోవడంపై తమ్ముళ్లు ఓకింత ఆగ్రహంతోనే ఉన్నారు. గత ఎమ్మెల్సి ఎన్నికల సమయంలో సీనియర్ నేత పుష్పరాజ్, వర్లరామయ్య, సత్యనారాయణ రాజు లాంటి వారు తమకు ఇచ్చిన హమీని ఆచరణలో పెట్టాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో పూర్తి స్ధాయిలో నిమగ్నం అయిన పార్టీ అధినేత చంద్రబాబు..ఇప్పట్లో నామనేటెడ్ పదవుల గురించి ఆలోచిస్తారా అన్న సందేహం పార్టీ నేతల్లో మొదలైంది. కనీసం దీపావళికయినా నామినేటెడ్‌ పదవులను కట్టబెట్టాలని తమ్ముళ్లంతా ఒక్కటై కోరుతున్నారు. 

06:40 - October 18, 2015

విజయవాడ : రాజధాని శంకుస్థాపనకు గడువు సమీపిస్తున్న కొద్దీ.. రాష్ట్రంలో ప్రత్యేక హోదా డిమాండ్‌ కూడా ఊపందుకుంటోంది. శంకుస్థాపన వేదిక నుంచి ప్రత్యేక హోదాపై స్పష్టతనివ్వాలని విపక్షాలు ప్రధాని మోడీని డిమాండ్‌ చేస్తున్నాయి. లేకుంటే మోడీ మోసాన్ని గల్లీ గల్లీలో చాటుతామని హెచ్చరిస్తున్నాయి. అమరావతి శంకుస్థాపన వేదిక.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేదిగా మారాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీని కోసం ఎక్కడికక్కడ ఆందోళనలు ప్రారంభించాయి. శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రానికి రానున్న ప్రధాని మోడీ దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నాయి. లేకుంటే ఏపీకి మోడీ చేసిన మోసం గురించి బీహార్‌ ఎన్నికల్లో ప్రచారం చేస్తామని హెచ్చరిస్తున్నాయి.

22న అపాయింట్ మెంట్ కోరిన వైసీపీ..
ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఇప్పటికే కార్యాచరణ చేపట్టింది. జిల్లాల్లో వైసీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. మరోవైపు.. పార్టీ అధినేత జగన్‌ ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోసం లేఖ రాశారు. ఈనెల 22 లోపే తమకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని లేఖలో కోరారు. అటు సీపీఐ కూడా 22న ప్రధాని మోదీ ప్రత్యేక హోదాపై ప్రకటన చేయకుంటే.. 23 నుంచి ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది.
మరోవైపు.. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ.. హోదా సాధన సమితి శనివారం విజయనగరంలో పాదయాత్ర చేపట్టింది. విపక్షనాయకులతో పాటు.. ప్రజలూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 

06:36 - October 18, 2015

విజయవాడ : అమరావతి శంకుస్థాపన కార్యక్రమం.. గన్నవరం విమానాశ్రయానికి సరికొత్త అందాలను తెచ్చిపెడుతోంది... అతిరథ మహరథుల రాకతో గన్నవరాన్ని సర్వసుందరంగా ముస్తాబు చేస్తున్నారు అధికారులు.. కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నారు. డబుల్ లైన్ రోడ్డు పనులు, ఎదురుగా పార్కింగ్ స్థలం ఏర్పాటు, రహదారికి రెండువైపులా పచ్చదనంతో కళకళలాడేలా మొక్కలు నాటుతున్నారు.

శరవేగంగా కాలి నడక బాట ఆధునీకరణ పనులు..
విమానాశ్రయం నుండి జాతీయ రహదారికి రెండువైపులా పచ్చని సోయగాలు అతిథులకు ఆహ్వానం పలికేలా తీర్చిదిద్దుతున్నారు. ఇంద్ర ధనస్సులోని ఏడురంగులను ప్రతిబింబించేలా మొక్కలను నాటుతున్నారు.. ఇందులో పసుపు రంగు మొక్కలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక నిడమనూరు వరకూ 3లక్షల 98వేల 5వందల మొక్కలను నాటుతున్నారు. అమెరికా, సింగపూర్‌లో ఎక్కువగా దొరికే బోగన్‌విలా, ప్లమేరియా మొక్కలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. అలాగే విమానాశ్రయంనుంచి రామవరప్పాడు రింగువరకూ కాలినడకబాట ఆధునీకరణ వర్క్ జోరుగా సాగుతోంది. ఈ పనులు సీఆర్డీఏ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.. 12కిలోమీటర్ల పొడవునా వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థకు మరమ్మత్తులు చేస్తున్నారు.

ప్రత్యేక బలగాలతో భద్రత పర్యవేక్షణ..
రహదారి పక్కన మొక్కలే కాకుండా 4కోట్ల 78లక్షల రూపాయలతో పచ్చదనం తివాచీ పరుస్తున్నారు. ఈ పనుల్లో అధికారులు బిజీబీజీగా ఉన్నారు. బందోబస్తుపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ప్రత్యేక బలగాలు ఎయిర్‌పోర్టు పరిసరాల ప్రాంతాల్లో అణువణువునా గాలిస్తున్నాయి. ఈ నెల 25వరకూ ఈ ప్రాంతంలో సందర్శకుల రాకపోకలు ఆపేస్తున్నారు. ఈ నెల 20కల్లా అన్ని పనులు పూర్తయ్యేలా జిల్లా కలెక్టర్‌ దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు.

06:30 - October 18, 2015

చిత్తూరు : ఏపీ సీఎం చంద్రబాబు మనవడు నారా లోకేష్‌, బ్రహ్మణి దంపతుల తనయుడు దేవాన్ష్‌కు నేడు తిరుమల వేంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నప్రాసన కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు తిరుమలకు చేరుకున్నారు. 

06:25 - October 18, 2015

హైదరాబాద్ : ఆదివారం సరికొత్త చంద్రోదయం ఆవిష్కారం కాబోతోంది. చాలా కాలం తర్వాత ఇద్దరు చంద్రులు కలువబోతున్నారు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్‌, చంద్రబాబు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి శంకుస్థాపనకు హాజరుకావాలని స్వయంగా కేసీఆర్‌కు చంద్రబాబు ఆహ్వాన పత్రిక అందించనున్నారు. మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న ఇద్దరు చంద్రుల మిలాఖత్‌ ఆసక్తి రేపుతోంది. చంద్రబాబుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్ ఖరారైంది. ఈనెల 22న విజయవాడలో ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్‌ను ఆహ్వనించేందుకు బాబు అపాయింట్‌మెంట్ కోరారు. దీంతో టీఎస్ సీఎంవో అధికారులు ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోగా ఆదివారం సాయంత్రం 5:30కి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. సాయంత్రం 4 గంటలకు తిరుపతి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకోనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి కుటుంబ సభ్యులతో వెళ్లి అమరావతి శంఖుస్థాపనకు రావాలని ఆహ్వానించనున్నారు.

ఒకరిపై ఒకరు ఫిర్యాదులు...
ఇప్పటికే నీళ్లు, నిధులు, ఉద్యోగ కేటాయింపులపై ఇరు రాష్ట్రాల నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. మే నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ఇద్దరు సీఎంల మధ్య దూరం మరింత పెరిగింది. ఎన్నికల్లో తమ ఎమ్మెల్యేనే కొనుగోలు చేసే ప్రయత్నం చేశారన్నది టీఆర్ఎస్ ఆరోపణ. ఈ వివాదంలో టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య ఓటుకు నోటు కేసును ఎదుర్కొంటున్నారు. మరోవైపు తమ ఫోన్‌లు ట్యాప్‌ చేశారంటూ చంద్రబాబు ఆయన అనుచరులు టీఆర్‌ఎస్‌ నేతలపై కేసులు పెట్టారు. అప్పటి నుంచి కేసీఆర్‌- చంద్రబాబు ఉప్పు నిప్పుగా మారిపోయారు.

కేసీఆర్ వెళుతారా ?
ఈ ఆహ్వానాన్ని స్వీకరించి కేసీఆర్ శంకుస్థాపనకు వెళ్తారా లేదా అన్న చర్చలు నడుస్తున్నాయి..అయితే అదే రోజు తెలంగాణలో రెండు కీలకమైన కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని టి.ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా విజయదశమి రోజే యాదాద్రి శంకుస్థాపనతో పాటు డబుల్ బెడ్ రూమ్ స్కీమ్‌ ప్రారంభ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేసీఆర్‌ వెళ్లలేని పక్షంలో ఆయన తరఫున కేటీఆర్‌ను పంపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు వీరిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

06:23 - October 18, 2015

హైదరాబాద్ : నగరం నిద్రపోతున్న వేళ..ఏదో సినిమా విషయం చెప్పడం లేఉద. నగరం నిద్రపోతున్న వేళ అసాంఘీక శక్తులు లేస్తున్నాయి. పోలీసుల కళ్ళుగప్పి పలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పలుసార్లు ఖాకీలు జరిపినా కొన్ని రోజులు గప్ చప్ గా ఉన్నా తరువాత మళ్లీ అదే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తాజాగా నగరంలోని సౌత్‌జోన్‌ పరిధిలో పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. దీంతో గుట్టుగా సాగుతున్న అనేక చీకటి దందాలు వెలుగుచూశాయి. చంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా పీఎస్‌ పరిధిలోని హుక్కా సెంటర్లపై పోలీసులు దాడి చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా హుక్కా సెంటర్లు కొనసాగిస్తున్న 11 హుక్కా సెంటర్లను పోలీసులు సీజ్‌ చేశారు. 230 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా పహాడీషరీఫ్‌లో గుర్రాలు అద్దెకిచ్చే సెంటర్లపై పోలీసులు దాడి చేశారు. మొత్తం 11 గుర్రాలను సీజ్‌ చేశారు. గుర్రాలపై తిరుగుతూ యువతులను టీజ్‌ చేస్తున్న 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌత్‌జోన్‌ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. మొత్తం 300 మంది పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. అదుపులోకి తీసుకున్న యువకులను నేడు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. 

06:05 - October 18, 2015

సంజయ్ లీలా భన్సాలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'బాజీరావ్‌ మస్తానీ' చిత్రంలోని 'దివానీ మస్తానీ..' పాటలో నటించిన దీపికా పదుకొనె సరికొత్త స్టిల్‌ ప్రస్తుతం సామాజిక మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. డిసెంబర్‌ 18న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌సింగ్‌, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, భన్సాలీ భద్రతా సిబ్బంది తనపై దాడి చేశారంటూ పూణెకు చెందిన ఓ న్యాయవాది కేసు పెట్టారు. సరైన అనుమతి పత్రాలు లేని కారణంగా పూణెలో షూటింగ్‌ను అడ్డుకున్నందుకు భన్సాలీ భద్రతా సిబ్బంది తనపై దాడి చేశారని వాజిద్‌ఖాన్‌ అనే న్యాయవాది పోలీసులను ఆశ్రయించారు. దీంతో భన్సాలీ, రణ్‌వీర్‌సింగ్‌, సిబ్బందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

05:56 - October 18, 2015

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ను మెగస్టార్ తనయుడు 'రాంచరణ్ తేజ' కలిశారు. ఇటీవలే 'చెర్రీ' నటించిన 'బ్రూస్ లీ' చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సెట్‌కి విచ్చేసిన రామ్‌చరణ్‌ను పూలబొకేతో పవన్‌కళ్యాణ్‌ అభినందించారు. 'రామ్‌చరణ్‌' నటనను 'పవన్' ప్రశంసించారు. ఈ చిత్రం మరింత పెద్ద విజయం సాధించాలని 'పవన్‌కళ్యాణ్‌' ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే ఆడియో వేడుకకు ఎన్ని సార్లు పిలిచినా రాని 'పవన్' ను 'సర్దార్ గబ్బర్ సింగ్' సెట్లో 'రామ్ చరణ్' కలవడం వెనుక ఎదో ఒక రాజకీయం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

05:51 - October 18, 2015

ఢిల్లీ : శశాంక్‌ మనోహర్‌ బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారి భేటీ కానున్న వర్కింగ్‌ కమిటీ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. లోధా కమిటీ రెండేళ్ల నిషేధం విధించిన చెన్నై, రాజస్థాన్‌ ప్రాంఛైజీల భవితవ్యంపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు. ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సరర్‌ పెప్సీకోనా వర్కింగ్‌ కమిటీ చర్చించనుంది. ఈ ఏడాది ఎజీఎం తేది ఖరారు, వార్షిక నివేదకలు, పద్దులు ఆమోదించటం వంటి పలు అంశాలపై వర్కింగ్‌ కమిటీ భేటీలో చర్చకు రానున్నాయి. కానీ ఐపీఎల్‌-9 రోడ్‌ మ్యాప్‌ కోసం నియమించిన కమిటీ సిఫార్సులను వర్కింగ్‌ కమిటీ యథాతథంగా ఆమోదిస్తుందా లేదా అనే విషయంపై బిసిసిఐ ఏ నిర్ణయం తీసుకుంటుందా అని మార్కెట్‌ వర్గాలు వేచి చూస్తున్నాయి.

05:49 - October 18, 2015

తెలుగు తేజం, స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు డెన్మార్క్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదు చేసింది. వరల్డ్ చాంపియన్‌ కరొలినా మారిన్‌ (స్పెయిన్‌)పై సెమీఫైనల్లో అద్భుత విజయం సాధించిన సింధు ఈ ఏడాది తొలిసారి సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్ లో అడుగుపెట్టింది. హోరాహోరిగా సాగిన మూడు సెట్ల మ్యాచ్‌లో వరల్డ్ నం.2 మారిన్‌పై 21-15, 18-21, 21-17తో సింధు విజయఢంకా మోగించింది. వరల్డ్ బ్యాడ్మింటన్‌లో ఏస్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌కు కొరకరాని కొయ్యగా మారిన ఇద్దరు టాప్‌ షట్లర్స్ ను (క్వార్టర్స్ లో వాంగ్‌ ఇయాన్‌) మట్టికరిపించి సింధు సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ పోరులో నిలవటం విశేషం.
ఫిట్‌నెట్‌ సమస్య నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్న సింధుపై సెమీస్‌ మ్యాచ్‌లో పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. కానీ అద్భుత ఆట తీరుతో తెలుగు షట్లర్‌ వరల్డ్ చాంపియన్‌ను తెల్లబోయేలా చేసింది. 75 నిమిషాల హోరాహరి మ్యాచ్‌లో సింధు 2-1తో గెలుపొందింది. తొలి సెట్‌లో 8-3, 11-5తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచిన సింధు అదే జోరు కొనసాగించింది. 14-16తో మారిన్‌ పాయింట్ల అంతరాన్ని తగ్గించినా వరుసగా నాల్గు పాయింట్లు సాధించిన సింధు 20-14కు చేరుకుంది. మరో పాయింట్‌ సాధించగల్గిన మారిన్‌ 15-21తో తొలి సెట్‌ కోల్పోయింది. రెండో సెట్‌లో సింధుకు మారిన్‌ గట్టి పోటినిచ్చింది. ఆరంభంలో 6-6తో సమవుజ్జీలుగా ఉన్నా..11-6తో మారిన్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సింధు సెకండ్‌ హాఫ్‌లోనూ మారిన్‌ను నిలువరించలేదు. దీంతో 21-18తో మారిన్‌ రెండో సెట్‌ సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో సెట్‌ ఆరంభంలో మారిన్‌ దూకుడుగా ఆడింది. 5-5, 8-8, 9-9తో నువ్వా నేనా అన్నట్టు సాగినా..11-9తో విరామ సమయానికి మారిన్‌ ముందంజలో నిలిచింది. సెకండ్‌ హాఫ్‌లోనూ 14-16తో సింధు వెను కంజ వేసినా...కీలక తరుణంలో పుంజు కున్న సింధు 16-16తో స్కోరు సమం చేయటమే కాకుండా వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 20-16తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. మ్యాచ్‌ పాయింట్‌ అలవోకగా నెగ్గిన సింధు..మూడో సెట్‌తో పాటు ఫైనల్స్‌ బెర్త్‌ను సొంతం చేసుకుంది. చాన్నాళ్ల తర్వాత సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో అడుగుపెట్టిన సింధు ఉద్వేగ భరితంగా సంబరాలు చేసుకుంది. టైటిల్‌ విజేతను నిర్ణయించనున్న నేటి ఫైనల్స్‌లో చైనా చిన్నది లీ జురేరుతో సింధు తలపడనుంది. లీ జురేరుతో ముఖాముఖి రికార్డులో సింధు 2-2తో సమవుజ్జీగా ఉంది.

05:46 - October 18, 2015

వాషింగ్టన్‌ : టైటానిక్‌ నౌక మునకకు కారణమైన ఐస్‌బర్గ్ అరుదైన ఫోటోను వేలానికి పెట్టారని అమెరికా మీడియా వెల్లడించింది. 1912, ఏప్రిల్‌ 15న టైటానిక్‌ నౌకలోని ప్రిన్జ్‌ ఆడాల్‌బెర్ట్ సముద్రంలోని ఐస్‌బర్గ్ ఫొటోను తీశారు. కాగా ఈ ఫొటోను ఈనెల 24న వేలం వేయనున్నారు. వేలంలో 10 నుంచి 15 వేల పౌండ్ల ధర పలకొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫొటోను 2002 వరకు టైటానిక్‌ నౌక యజమానుల సంయుక్త వ్యాపార కార్యాల యమైన వైట్‌స్టార్‌ లైన్‌లో ఉంచారు. ఈ సంస్థ 2002లో మూతపడింది. దీంతో ఆ సంస్థకు చెందిన వ్యాపార భాగస్వాములు ఐస్‌బర్గ్ ఫొటోను వేలానికి పెట్టాలని నిర్ణయించుకున్నారు. 1912లో అట్లాంటిక్‌ మహాసముద్రంలో 2200 మంది ప్రయాణికులతో ప్రయాణించిన టైటానిక్‌ నౌక ఐస్‌బర్గ్ ఢొకొని మునిగిపోవడంతో 1517 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

సౌత్ జోన్ పోలీసుల కార్డన్ సెర్చ్..

హైదరాబాద్ : సౌత్ జోన్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఫలక్ నుమా, చాంద్రాయణగుట్ట, రాయదుర్గం పీఎస్ పరిధిలోని హుక్కా సెంటర్లపై దాడులు నిర్వహించారు. 14 మంది హార్స్ రైడర్స్ తో సహా 230 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 11 హుక్కా సెంటర్లను అధికారులు సీజ్ చేశారు. 

ఈనెలాఖరులోగా వరంగల్ ఉప ఎన్నిక..

హైదరాబాద్ : ఈనెలాఖరులోగా వరంగల్ ఉప ఎన్నిక నోటిపికేషన్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ వెల్లడించారు. నగరంలో అక్రమ ఓటర్లను తొలగించినట్లే వరంగల్ లోనూ తొలగించనున్నట్లు పేర్కొన్నారు. 

ఖమ్మంలో వ్యాపారులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు..

ఖమ్మం : చర్లకు చెందిన సతీష్, రామకృష్ణ వ్యాపారులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా యామాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

 

ఫైనల్ చేరిన సింధు..

ఢిల్లీ : డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటెన్ లో పీవీ సింధు పైనల్ చేరింది. కరోలినా మారిన్ పై సింధు సంచలన విజయం సాధించింది. 21-15, 18-21, 17-21 తేడాతో గెలుపొందింది.

 

నెల్లూరు జిల్లాలో భూకంపం..

నెల్లూరు : జిల్లాలోని దుత్తలూరు(మం) లక్ష్మీపురం, నందిపాడు, కాటేపల్లి వింజమూరు, సాకలికొండ, ఉదయగిరి, బాసరపల్లిలలో భూమి స్వల్పంగా కంపించింది. సుమారు నాలుగు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లాలోనూ స్వల్పంగా భూమి కంపించింది. పామూరు (మం) ఇనుమెళ్లలో భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. 

పార్లమెంట్ ఆవరణలో డ్రోన్ కలకలం..

ఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలో డ్రోన్ కలకలం సృష్టించింది. నార్త్, సౌత్ బ్లాక్, హోం శాఖ రక్షణ శాఖ కార్యాలయాల వద్ద డ్రోన్ సంచరించింది. నో ఫ్లై జోన్ లో డ్రోన్ సంచారంతో రక్షణ దళాలు అప్రమత్తమయ్యాయి. విజయ్ చౌక్ వద్ద సీసీ కెమెరా ఉన్న డ్రోన్ ను విదేశీయుడు ఏగరేసినట్లు తెలుస్తోంది. వీడియో ఫుటేజ్ ను అధికారులు పరిశీలిస్తున్నారు. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు న్యూఢిల్లీ డీసీపీ జతిన్ నర్వాల్ వెల్లడించారు.

 

నాదల్ కు షాక్..

ఢిల్లీ : షాంఘై మాస్టర్స్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ లో నాదల్ పరాజయం చెందాడు. నాదల్ పై 6-4, 0-6, 7-5 తేడాతో జోవిల్ ఫ్రెడ్ సోంగా విజయం సాధించాడు.

 

Don't Miss