Activities calendar

19 October 2015

21:56 - October 19, 2015

గుంటూరు : రాజధాని శంకుస్ధాపన ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. మరోవైపు.. ఈ కార్యక్రమానికి తరలివచ్చే అతిథులు.. సభాస్థలికి చేరాల్సిన రూట్ మ్యాప్‌ను ఆధికారులు సిద్దం చేశారు.. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు నిర్దిష్ట రహదారులను కేటాయించారు. అదేవిధంగా.. విజయవాడలోని వివిధ ప్రాంతాల నుండి సభాస్దలికి చేరుకునే వారికీ ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు.
శంకుస్థాపనకు దేశ విదేశీ ప్రతినిధులు
నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు ఎందరో వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చే అతిథులయినా.. బెజవాడకు చేరుకోవాల్సిందే. ఇక్కడి నుంచే శంకుస్థాపన సభాస్థలికి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో.. విజయవాడ చేరుకున్న అతిథులు శంకుస్దాపన జరిగే ఉద్దండారాయని పాలెం చేరుకునే దారులతో అధికారులు ఓ రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు.
అతిథుల స్థాయిని బట్టి వాహన పాస్‌లు
విజయవాడ నుంచి రాజధాని ప్రాంతానికి చేరే అతిథులకు.. వారి స్థాయిని బట్టి పాస్‌లను జారీ చేయనున్నారు. వీటిని మూడు శ్రేణులుగా వర్గీకరించారు. ఈ పాస్‌లే.. అతిథుల వాహనాలు వెళ్లాల్సిన మార్గాలను నిర్దేశిస్తాయి. ట్రిపుల్‌ ఏ పాస్‌లు ఉన్న వారు.. గన్నవరం విమానాశ్రం నుంచి కేసరపల్లి, నిడమానూరు, రామర్ప్పాడు రింగ్‌, బెంజి సర్కిల్‌, పాత టోల్‌గేట్‌, కృష్ణానది కరకట్ట, మంతెన ప్రకృతి ఆశ్రమం మీదుగా శంకుస్థాపన సభాస్థలికి చేరాల్సి ఉంటుంది. డబుల్‌ ఏ డాట్‌ ఏ పాసులున్న వారు.. గన్నవరం విమానాశ్రం నుంచి పాత టోల్‌ గేట్‌ వద్ద రూటు మారాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఉండవల్ల గుహలు, కొండవీటి వాగు వంతెన, తాళ్లాయిపాలెం ఫార్మేషన్‌ రోడ్డు ద్వారా ఉద్ధండరాయని పాలెం చేరుకోవాల్సి ఉంటుంది. అతిథులకు కేటాయించిన మార్గాల్లోనే వారు సభాస్థలికి వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. వాహనదారులు ఎక్కడా ఇబ్బంది పడకుండా.. సైన్‌ బోర్డులనూ ఏర్పాటు చేస్తున్నారు.
మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి వద్ద యు-టర్న్‌
హైదరాబాద్‌, ఉత్తరాంధ్రల నుంచి విజయవాడ మీదుగా వచ్చే వాహనాలు.. మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి వద్ద యు టర్న్‌ తీసుకొని మంగళగిరి టౌన్‌ బస్‌స్టాండ్‌, కురగల్లు, మందడం, వెలగపూడి మీదుగా ఉద్ధండరాయుని పాలెం చేరుకోవాలి. భారీ వాహనాలైతే.. మంగళగిరి రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, ఎర్రబాలెం, మందడం మీదుగా సభాస్థలికి చేరాలి. హైదరాబాద్‌ మిర్యాలగూడ మీదుగా వచ్చే వాహనాలు.. పిడుగురాళ్ల, సత్తెనపల్లి మీదుగా అమరావతి రోడ్డు చేరి.. మండిపూడి, పొన్నేకళ్లు, తాడికొండ అడ్డరోడ్డు, పెదపరిమి, తుళ్లూరు మీదుగా ఉద్ధండరాయుని పాలెం చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
సీమ వాహనాలకు వినుకొండ, నరసరావుపేటల మీదుగా దారి రాయలసీమ నుంచి వచ్చే వాహనాలు గుంటూరు జిల్లాలోని వినుకొండ, నరసరావుపేట, సత్తెనపల్లి, అమరావతి, ఓరుపాలెం, దొండపాడు, రాయపూడి, వెలగపూడి మీదుగా సభాస్థలి చేరుకోవాలి. దీంతో పాటు.. పేరచర్ల జంక్షన్‌, పలకలూరు, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, చిల్లీస్‌ దాబా నుంచి అమరావతి రోడ్డు చేరేలా మరో దారినీ ఏర్పాటు చేశారు. ఒంగోలు వైపు నుంచి వాహనాలు, చిలకూరిపేట, గుంటూరు బైపాస్‌, రెయిన్‌ ట్రీపార్క్‌, కంతేరు, తాడికొండ, తుళ్లూరు మీదుగా ఉద్ధండరాయని పాలెం చేరేలా ఏర్పాట్లు చేశారు. గుంటూరు, విజయవాడ ప్రాంత ప్రజలకూ ప్రత్యేక మార్గాలు సూచించారు.
విజయవాడలో 3 హెలీప్యాడ్‌లు ఏర్పాటు
విజయవాడలో 3 హెలీప్యాడ్‌లు ఏర్పాటు చేశారు. గన్నవరంలో మరో 4 హెలీప్యాడ్‌లు సిద్ధమయ్యాయి. ఈనెల 22న ప్రకాశం బ్యారేజీపై ఇతర వాహనాలేవీ సంచరించకుండా ఆంక్షలు విధించారు. అంతేకాదు.. ఆరోజు అన్ని రహదారులను వన్‌వేగా మార్చేశారు.

 

21:52 - October 19, 2015

ఢిల్లీ : శివసేన మళ్లి శివమెత్తింది. ఈసారి బిసిసిఐ కార్యాలయంపై దాడికి దిగింది. భారత్‌-పాకిస్తాన్‌ క్రికెట్‌ సిరీస్‌కు వ్యతిరేకంగా సమావేశాన్ని అడ్డుకుంది. దీంతో బిసిసిఐ-పిసిబిల సమావేశం రద్దయ్యింది. శివసేన తీరుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
బిసిసిఐ-పిసిబి సమవేశాన్ని అడ్డుకున్న శివసేన
భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్‌ సంబంధాలను మెరగు పరచే దిశగా చేస్తున్న కృషికి రాజకీయాలు అడ్డు తగులుతున్నాయి. ముంబైలో బిసిసిఐ- పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుల మధ్య జరగాల్సిన సమావేశాన్ని శివసేన అడ్డుకుంది. భారత్‌-పాకిస్తాన్‌ క్రికెట్‌ సిరీస్‌ను వ్యతిరేకిస్తూ శివసేన కార్యకర్తలు బిసిసిఐ కార్యాలయంలోకి చొరబడ్డారు. బిసిసిఐ చీఫ్‌ శశాంక్‌ మనోహర్‌ పిసిబి అధ్యక్షుడు షహర్యార్‌ ఖాన్‌ ల మధ్య మరికొద్దిసేపట్లో చర్చలు ప్రారంభమవుతాయన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా శశాంక్‌ మనోహర్ క్యాబిన్‌లోకి చొరబడి నల్లజెండాలు ప్రదర్శించారు. పాకిస్తాన్‌ ముర్దాబాద్‌ అంటూ శశాంక్‌ మనోహర్, షహర్యార్‌ ఖాన్‌లకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. పాకిస్తాన్‌తో క్రికెట్‌ సంబంధాలు పెట్టుకోవద్దని శివసేన డిమాండ్‌ చేసింది.
బిసిసిఐ-పిసిబి సమావేశం రద్దు
ఈ ఘటనతో బిసిసిఐ-పిసిబి సమావేశం రద్దయ్యింది. సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేశారు. ఈ సమావేశంలో ఐపిఎల్‌ కమిషనర్ రాజీవ్‌ శుక్లాతో పాటు బిసిసిఐ కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ కూడా పాల్గోనున్నారు. శివసేన తీరును తీవ్రంగా ఖండించారు. క్రికెట్‌కు రాజకీయాలతో ముడిపెట్టొద్దని, ఇది బిసిసిఐకి సంబంధించిన విషయమన్నారు.
కాంగ్రెస్‌ మండిపాటు
మొన్న గులాం అలీ, నిన్న కసూరి, నేడు షహర్యార్‌ఖాన్‌లపై జరిగిన దాడులు సభ్యసమాజానికి తలవంపులు తెస్తోందని కాంగ్రెస్‌ మండిపడింది. ముంబైలో శాంతిభద్రతలు క్షీణించాయని రాష్ట్రపతి జోక్యం చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. భారత్‌-పాకిస్తాన్‌ ల మధ్య ఈ ఏడాది డిసెంబర్‌లో క్రికెస్‌ సిరీస్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. అయితే దీనిపై ఇంకా ఫైనల్‌ కాలేదు.
దాడులను సమర్థించుకుంటున్న శివసేన
ఇటీవల ముంబైలో గులాం అలీ కచేరీని అడ్డుకున్న శివసేన, పాక్‌ మాజీ మంత్రి కసూరి పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా కులకర్ణిపై ఇంక్‌ చల్లింది. పైగా పాకిస్తాన్‌ వ్యతిరేకంగా చేస్తున్న దాడులను శివసేన సమర్థించుకుంటోంది.

 

21:48 - October 19, 2015

హైదరాబాద్: బ‌తుక‌మ్మ ముగింపు ఉత్సవాల‌ను ఘ‌నంగా నిర్వహించేందుకు స‌ర్కార్ రెడీ అవుతోంది. తెలంగాణ చ‌రిత్ర, సంస్కృతి, క‌ళ‌లను చాటేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎల్బీ స్టేడియం నుంచి రేపు సాయంత్రం నాలుగున్నరకు బతుకమ్మ యాత్ర ప్రారంభం కానుంది. ఆరున్నర నుంచి ట్యాంక్ బండ్‌పై బతుకమ్మ సంబురాలు జరగనున్నాయి.
బ‌తుక‌మ్మ వేడుకలు... ప్రభుత్వ ప్రణాళిక
తెలంగాణ బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను దూం దాంగా ముగించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మంగ‌ళ‌వారం ట్యాంక్‌ బండ్ పై ముగింపు వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వేడుక‌ల‌ను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ముగింపు వేడుకల‌కు భారీ ఎత్తున మ‌హిళ‌లు, గ‌వ‌ర్నర్‌ దంప‌తులు, సీఎం దంప‌తుల‌తోపాటు వీఐపీలు త‌ర‌లి రానున్నారు. దీంతో ఎక్కడా ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. బ‌తుక‌మ్మను రాష్ట్ర పండుగ‌గా గుర్తించినందున... తెలంగాణ చ‌రిత్రను ద‌శ దిశ‌లా చాటేలా క‌ళారూపాల ప్రద‌ర్శనను సైతం ఏర్పాటు చేస్తోంది. బ‌తుక‌మ్మ ముగింపు వేడుకలు జ‌రిగే వ‌రకు త‌గెండు పూల పరిమ‌ళాలు, కీర్తిని వెదజెల్లేలా క‌స‌ర‌త్తులు ముమ్మరం చేసింది.
వేల బ‌తుక‌మ్మల‌తో ఎల్‌బీ స్టేడియం నుంచి మ‌హిళ‌లు ర్యాలీ
మంగ‌ళ‌వారం సాయంత్రం నాలుగున్నరకు వేల బ‌తుక‌మ్మల‌తో ఎల్‌బీ స్టేడియం నుంచి మ‌హిళ‌లు ర్యాలీగా టాంక్ బండ్‌పైకి త‌ర‌లి రానున్నారు. తెలంగాణ క‌ళారూపాల‌తో శ‌క‌టాల ప్రద‌ర్శన సైతం ఉండ‌నుంది. ఆ వెనకాలే కళాకారుల దూందాం సాగనుంది. పండ‌గ నేప‌థ్యంలో ఇప్పటికే సీరియ‌ల్‌, ఎల్‌ఈడీ లైట్ల వెలుతురులో హైదరాబాద్ మెరిసిపోతుంది. అన్ని కూడ‌ల‌్లలో పెద్ద పెద్ద బ‌తుకమ్మలు ద‌ర్శన‌మిస్తున్నాయి. టాంక్‌బండ్ ప‌రిస‌ర ప్రాంతాల‌న్నీ స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబయ్యాయి. బతుకమ్మ వేడుకల సందర్భంగా లైట్లతో కూడిన బెలూన్లు ఎగుర వేయనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు
బతుకమ్మ ముగింపు వేడుకల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మహిళలు అత్యంత ఉత్సాహంతో, భక్తి శ్రద్దలతో బతుకమ్మ ఉత్సవాలను రెట్టించిన ఉత్సహంతో నిర్వహించాలని కోరారు. బతుకమ్మ ఆటలు ఆడటానికి అనువుగా చెరువు పరిసరాలను సిద్ధం చేయాలని, లైటింగ్, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సై నుంచి డీజీపీ వరకు, గ్రామ కార్యదర్శి నుంచి ప్రధాన కార్యదర్శి వరకు అందరూ బతుకమ్మ ఉత్సవాలను పర్యవేక్షించాలని సూచించారు. ఎల్‌బీ స్టేడియం, టాంక్ బండ్‌పై ఏర్పాట్లను మంత్రులు స్వయంగా పర్యవేక్షించారు.

 

 

టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపుకు చివరి తేది నవంబర్ 16

హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల రుసుం చెల్లింపునకు నవంబర్‌ 16 తుదిగడువని అధికారులు తెలిపారు. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్‌ వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 3 వరకు రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 10 వరకు ఫీజు చెల్లింపునకు తుది గడువుగా నిర్ణయించారు.

 

వైద్యుల నిర్లక్ష్యానికి తల్లీ, శిశవు మృతి

నల్గొండ : జిల్లాలోని సూర్యపేట ఏరియా ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యానికి తల్లీ, శిశువు మృతి చెందారు.

21:36 - October 19, 2015

నల్గొండ : జిల్లాలోని సూర్యపేట ఏరియా ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యానికి తల్లీ, శిశువు మృతి చెందారు. నిన్న సాయంత్రం ఓ గర్భిణీ ప్రసవ నిమిత్తం సూర్యపేట ఏరియా ఆస్పత్రికి వచ్చింది. అయితే వైద్యులు ఆమెను పట్టించుకోలేదు. ఆమె నొప్పులు వచ్చాయి. మహిళ బంధువులు వైద్యులకు చెప్పినా.... వారు పట్టించుకోలేదు. డాక్టర్లు తీవ్ర నిర్లక్యం చేశారు. గర్భిణీకి నొప్పులు వచ్చినా.. వైద్యులు పట్టించుకోలేదు. గర్భిణీకి నొప్పులు రావడంతోపాటు తీవ్ర రక్తస్రావం అయింది. రక్తస్రావం తర్వాత వైద్యులు ఆమెకు కాన్పు చేశారు. దీంతో తల్లీ మృతి చెందింది. కొద్దిసేపటికి శిశువు కూడా మృతి చెందింది. దీంతో ఆగ్రహించన మహిళ బంధువుల ఆస్పత్రిలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మహిళ, శిశువు మృతి చెందారని ఆరోపించారు. అయితే డ్యూటీలో మమత అనే వైద్యురాలు ఉందని...ఆమె తీవ్రం నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహించారు.

 

21:20 - October 19, 2015

ఒకవైపు న్యాయ వ్యవస్థ... మరో వైపు శాసన వ్యవస్థ...రాజ్యాంగ సవరణలపై రెండు అత్యున్నత వ్యవస్థల మధ్య... ఎడతెగతని వివాదం... తాజాగా కొలీజియం, ఎన్ జిఎసీలపై సరికొత్త వైరుధ్యం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పార్లమెంట్ ఆమోదించిన ఎన్ జిఎసీ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడంతో రెండు వ్యసస్థల మధ్య ఆధిపత్య ధోరణి తారా స్థాయికి చేరిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దేశానికి రెండు కళ్లలాంటి ఈరెండింటి మధ్య ఏమిటీ సంవాదం... ఈ సంఘర్షణ... ఎలాంటి పరిణామాలాకు దారి తీస్తుంది. న్యాయమూర్తుల నియామకంపై ఏకాభిప్రాయం కుదరడం సాధ్యం కాదా... ఇదే ఇవాళ్లి వైడ్ యాంగిల్..ప్రత్యేక కథనం.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:02 - October 19, 2015

హైదరాబాద్ : రేపటి సద్దుల బతుకమ్మకు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. బతుకమ్మకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జీహెచ్ ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. సద్దుల బతుకమ్మకు ట్యాంక్ బండ్ తోపాటు నగర శివారులో ఉన్న చెరువుల బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. రోడ్లను పరిశుభ్రం చేసినట్లు పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ పై లైటింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. బతుకమ్మ నిర్వహించే ప్రాంతంలో టాయిలెట్స్ ఏర్పాటు చేశామన్నారు.

 

20:52 - October 19, 2015

విజయనగరం : జిల్లాలో సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. అంగన్వాడీలు, ఆశావర్కర్లు, మధ్యాహ్నభోజన నిర్వాహకులు, ఇతర సంఘాలకు చెందిన వేలాది మంది కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించారు. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు.. కలెక్టరేట్ గేట్లు మూసివేశారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు కాసేపు రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం కలెక్టరేట్ లోపలికి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ కార్మికులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. టీడీపీ ప్రభుత్వ తీరుపై సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

20:49 - October 19, 2015

విజయనగరం : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విజయనగరంలో సీపీఐ ఇతర విపక్షాల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. కలెక్టరేట్ జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర కొత్తపేట వరకు సాగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు ప్రత్యేక హోదా సాధన కమిటీ ప్రతినిధులు చలసాని ప్రసాద్, సీపీఎం నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తనకేమీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారని.. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన పాలకులు, ఇప్పుడు మాటమార్చడం సిగ్గుచేటని రామకృష్ణ మండిపడ్డారు.

 

20:45 - October 19, 2015

గుంటూరు : ఒకప్పుడు ఆ ప్రాంత యువకులకు పిల్లనిచ్చేవారు కాదు.. యవ్వనం తరిగిపోయినా.. వివాహాలు కాక.. ఇక్కడి యువత.. పెళ్లికాని ప్రసాదులుగా ఎగతాళి మాటలు ఎదుర్కొనేవారు. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. ఆ ప్రాంతంలో పెళ్లికాని యువకులు ఎవరున్నారా అని ఆరా తీస్తున్నారు. వరులున్నట్లు తెలియగానే వచ్చి.. సంబంధాలు కలిపేసుకుంటున్నారు. ఈ తతంగమంతా ఎక్కడనేగా మీ అనుమానం.. ఇంకెక్కడా.. అమరావతి పరిసర గ్రామాల్లోనే. అమెరికా వద్దు.. అమరావతి ముద్దు
ఆంధ్ర ప్రదేశ్‌ రాజధాని అమరావతి ప్రాంతంలో.. ఒక్కసారిగా పెళ్లికొడుకులకు డిమాండ్‌ వచ్చేసింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఇప్పటి వరకూ పెళ్లికాని ప్రసాదులు ఎవరున్నారా అంటూ.. అమ్మాయిల తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు. గతంలో సాఫ్ట్‌వేర్‌ అని.. అమెరికా సంబంధం అని వెతుకులాడిన.. తల్లిదండ్రులు.. ఇప్పుడు అమరావతి వరుల కోసం వేట మొదలు పెట్టారు. ఏపీలోని 13 జిల్లాలే కాదు.. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోని వధువుల తల్లిదండ్రులూ.. ఇప్పుడు రాజధాని ప్రాంత అవివాహిత యువకులపై దృష్టి సారిస్తున్నారు.
ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు
అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించక ముందు.. ఈ 29 గ్రామాల్లోని యువకులకు పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవించే ఇక్కడి యువకులకు పిల్లనిచ్చి వారి గొంతు కోయడమెందుకు అనేవారు. దీంతో నలభై ఏళ్లు వచ్చినా పెళ్లిళ్లు కాక.. యువకులు బ్రహ్మచారులుగా మిగిలిపోయేవారు. ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
ఎకరాకు 2 కోట్ల డిమాండ్
రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం ఎకరా భూమి రెండు కోట్ల వరకూ పలుకుతోంది. ల్యాండ్‌ పూలింగ్‌లో ఇచ్చిన భూమి పోగా.. మిగిలిన దాంట్లో కొంత పొలాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దాంతో కొత్త ఇళ్లు కట్టుకుంటూ.. వాహనాలు సమకూర్చుకుంటున్నారు. దీంతో.. ఈ ప్రాంత రైతు కుటుంబాలతో సంబంధాలు కలుపుకునేందుకు అమ్మాయిల తల్లిదండ్రులు ఆసక్తిని కనబరుస్తున్నారు.
అమ్మాయిలకూ డిమాండ్‌
అబ్బాయిలకే కాదు.. ఈ ప్రాంత అమ్మాయిలకూ డిమాండ్‌ పెరుగుతోంది. ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములిచ్చిన వారికి.. పరిహారంగా నూతన రాజధానిలో జాగా ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో.. ఈ ప్రాంత అమ్మాయిలను తమ కుమారులకు చేసుకుంటే.. ఆస్తి కలిసి వస్తుందన్న ఆశతో.. ఇరుగు పొరుగు ప్రాంతాల అబ్బాయిల తల్లిదండ్రులు అమరావతి అల్లుళ్ల కోసం ఆరాలు మొదలు పెట్టారు. స్థానికులు మాత్రం.. కాస్తంత భిన్నంగా ఆలోచిస్తున్నారు. తమ పిల్లలకు దూర ప్రాంతాల సంబంధాలు చేయడం కన్నా.. 29 గ్రామాల పరిధిలోనే పెళ్లిళ్లు కుదుర్చుకోవాలని అనుకుంటున్నారు. దీనివల్ల.. పిల్లలూ కళ్లెదుటే ఉంటారు.. ఆస్తులూ తమ చెంతే ఉంటాయని వీరు భావిస్తున్నారు. మొత్తానికి రాజధాని పుణ్యమా అని.. ఈ ప్రాంత యువతకు మంచి భవిష్యత్తు వరిస్తోందని చెప్పక తప్పదు.

 

20:37 - October 19, 2015

గుంటూరు : అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో దుర్గి శిల్ప కళ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఆహూతులను అలరించేందుకు.. ఇక్కడ 60 విశిష్ట శిల్పాలు రూపుదిద్దుకున్నాయి. శిల్ప తయారీని రాష్ట్ర పర్యాటక శాఖ పర్యవేక్షిస్తోంది.
విశిష్ట శిల్పాలు
ఆంధ్రుల రాజధాని అమరావతి శంకుస్థాపన వేడుకలో.. సుప్రసిద్ధ దుర్గి కళాకారుల కౌశలానికీ చోటు దక్కనుంది. వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖ విగ్రహాలను రూపొందించిన నేర్పరితనం దుర్గి కళాకారులది. వీరు రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం విశిష్ట శిల్పాలను రూపొందిస్తున్నారు.
విగ్రహాలను కళాకారులు 
ప్రభుత్వ శిల్ప కళాశాల ప్రాంగణంలో.. ఇప్పటికే వాస్తు గణపతి, బుద్ధుడు, తెలుగుతల్లి, నందికృష్ణుడు, సరస్వతి, కనకదుర్గ, నర్తకీమణులతో కూడిన దీపపు దిమ్మెలు, వేంకటేశ్వరుడు, నెమలి తదితర విగ్రహాలను కళాకారులు తీర్చిదిద్దారు. ఈనెల 21 నాటికి వీటిని అమరావతికి చేరుస్తారు. శంకుస్థాపన వేదిక చెంత కొన్ని విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. మరికొన్ని విగ్రహాలను.. లేపాక్షి, పర్యాటక శాఖలు ఏర్పాటు చేసే స్టాల్స్‌లో ప్రదర్శిస్తారు.

 

పత్తి రైతు ఆత్మహత్య

ఖమ్మం : జిల్లాలో పత్తి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టేకులపల్లి మండలంలోని గంగారం గ్రామ పంచాయతీలోని కిష్టారం గ్రామానికి చెందిన రమేశ్‌ అనే పత్తి రైతు తనకున్న ఎనిమిది ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. అయితే పంట ఎదుగుదల లేక దిగుబడి రాలేదు. దీంతో మనస్థాపానికి గురైన రమేశ్‌ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 

మెగా ఫ్యామిలీపై వర్మ కామెంట్ల దాడి

హైదరాబాద్ : మెగా ఫ్యామిలీపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కామెంట్ల దాడి కొనసాగుతూనే ఉంది. చిరంజీవి నివాసానికి వెళ్లి రామ్ చరణ్ తో కలసి పవన్ కల్యాణ్ దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి... నయాగరా జలపాతం తర్వాత అంతటి గొప్ప ఫొటో ఇదే అంటూ కామెంట్ చేశాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్ లు కలవడం కల అనుకున్నానని... తీరా లేచి చూశాక అది నిజమని నిర్ధారించుకున్నానని ట్వీట్ చేశాడు. బ్రూస్ లీ చిత్రాన్ని మళ్లీ చూశానని... రామ్ చరణ్ అద్భుతంగా ఉన్నాడని వర్మ చెప్పాడు.

 

డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్ : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వనపర్తి పట్టణంలో డీసీఎం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. రాజీవ్‌చౌక్‌లో సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన కె.చంద్రారెడ్డి (58)గా పోలీసులు గుర్తించారు. పని మీద వనపర్తి పట్టణానికి వచ్చినట్టు సమాచారం.

 

సిమెంట్ పరిశ్రమల ప్రతినిధులతో మంత్రుల సమావేశం

హైదరాబాద్: సిమెంట్ పరిశ్రమల ప్రతినిధులతో మంత్రులు ఈరోజు సచివాలయంలో సమావేశమయ్యారు. ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేతారకరామారావు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.

19:39 - October 19, 2015

ట్రెండ్స్ ను ఫాలో అవటంలో టీనేజర్స్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. అలాగే ప్రత్యేక సందర్భాలకు తగినట్లుగా డ్రెస్ చేసుకోవటంలోనూ వారే ముందుంటారు. అలాంటి వారి కోసం లాంగ్ ఫ్రాక్స్ లో లేటెస్ట్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చింది ఇవాళ్టి సొగసు.


 

19:38 - October 19, 2015

ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలో ఆమెది సరికొత్త శైలి. సంప్రదాయ చేనేత రంగంలో ప్రత్యేక ఒరవడి. రోజుకో కొత్త పుంతలు తొక్కే ఫ్యాషన్ ప్రపంచంలో, సంప్రదాయ చేనేతలకు, అందమైన ఆర్ట్ ను అద్ది వస్త్ర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకత చాటుకుంటున్న అతివ కథనంతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్ఫూర్తి. చేనేతలంటేనే ముతక బట్టలు, పెద్ద వయసు వారు మాత్రమే ఇష్టపడే వస్త్ర రాజసం అనే అభిప్రాయమే మనలో చాలా మందికి ఉంటుంది. కానీ, అటువంటి చేనేతలకు చిత్రకళను అద్ది, సరికొత్త అందాలను జోడించి, ‘సంప్రద’ బ్రాండ్ తో వ్యాపార రంగంలో ప్రత్యేకత స్థానాన్ని సంపాదించుకున్నారు విజయశీల.
విజయశీల కృషి అభినందనీయం
అనేక మల్టీనేషనల్ బ్రాండ్స్ మార్కెట్ ను శాసిస్తున్న తరుణంలో చేనేతకు కొత్త రూపునిస్తున్న విజయశీల కృషి అభినందనీయం. గృహిణులుగా స్థిరపడిన అనేక మహిళలకు స్పూర్తిదాయకం. ఆసక్తికి అభిరుచిని జోడించి స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలనుకునే వారికి అనుసరణీయం.


 

19:13 - October 19, 2015

గుంటూరు : ఏపీ రాజధాని శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించడం పట్ల రాజధాని ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య విబేధాలు తొలగించి.. అభివృద్ధికి కలిసి పని చేసేలా మార్గం సుగమం చేస్తుందని వారు భావిస్తున్నారు. అదే జరిగితే దేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని వారు అభిప్రాయపడుతున్నారు.

 

18:53 - October 19, 2015

నల్గొండ : బతుకమ్మ పేరుతో కూతురు కవితకు కోట్లు ఖర్చు చేస్తున్న సీఎం కేసీఆర్‌.. తమను మాత్రం పస్తులుంచుతున్నారని ఆశావర్కర్లు మండిపడుతున్నారు. ఇవాళ నల్లగొండ జిల్లా దేవరకొండలో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఎంపీ కవిత రానున్న నేపథ్యంలో.. ఆమె రాకను నిరసిస్తూ ఆశావర్కర్లు జిల్లా కేంద్రంలో 'కవిత గో బ్యాక్‌' అంటూ ప్రదర్శన చేపట్టారు. కవితలాగానే తాము కూడా ఓ తండ్రికి బిడ్డలేమనని.. తమ వినతులను పట్టించుకోకపోవడం దారుణమని ఆశాలు ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మకు కోట్లు ఖర్చు చేస్తున్న కేసీఆర్‌.. తమను పస్తులుంచడం దారుణమన్నారు.

 

18:49 - October 19, 2015

ఆదిలాబాద్ : ఇంటింటికి నల్లా ద్వారా నీరందిస్తామని మంత్రి కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. ఆదిలాబాద్‌ జిల్లా దిలావార్‌పూర్‌ మండలం న్యూవెల్మల్‌లో 1750 కోట్ల రూపాయలతో చేపట్టిన వాటర్‌ గ్రిడ్‌ పనులను డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌రెడ్డిలు పరిశీలించారు. అనంతరం మాడెగాం గ్రామంలో వాటర్‌గ్రిడ్‌ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏడాదిన్నరలోపే ఇంటింటికి నల్లా కనెక్షన్ అందిస్తామని అన్నారు.

 

 

18:31 - October 19, 2015

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే రషీద్‌పై మరోసారి ఇంకు దాడి జరిగింది. గత వారంలో బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించినందుకు కాశ్మీర్‌ అసెంబ్లీలోనే రషీద్‌పై దాడి చేశారు. ఆ దాడులపై ఢిల్లీలో ప్రెస్‌మీట్ నిర్వహించిన రషీద్‌పై కొందరు దుండగులు ఇంకు పోశారు. అయితే తనపై జరుగుతున్న దాడి ఘటనలపై రషీద్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశం ఎక్కడికి పోతుందన్నారు. ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని వాపోయారు. ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుందన్నారు.

 

18:08 - October 19, 2015

గుంటూరు : ప్రపంచంలోనే అతి గొప్ప రాజధానిని సీఎం చంద్రబాబు నిర్మిస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నరసింహస్వామి ఆలయంలో రాజధాని నిర్మాణం కోసం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని ఆలయాల నుంచి పవిత్రంగా సేకరించిన మట్టి, నీరును ఈరోజు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్‌కు తరలిస్తామని ఆయన అన్నారు. నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన కోసం రాష్ట్రంలోని నీరు-మట్టిని తీసుకురావడమే కాకుండా.. దేశంలోని 12 పవిత్ర నదిజలాలతో పాటు.. వాటి ఉపనదుల జలాలను, మట్టిని తీసుకురావడం జరిగిందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

 

17:44 - October 19, 2015

హైదరాబాద్ : ఎపి రాజధాని శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ హెలికాఫ్టర్‌లోనే అమరావతికి వెళ్లనున్నారు. మొదట శంకుస్థాపన కార్యక్రమానికి రోడ్డు మార్గానే వెళ్లాలనుకున్నా.. భద్రత, ట్రాఫిక్‌ రీత్యా హెలికాఫ్టర్‌లో వెళ్లడమే ఉత్తమమని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు. సీఎం అమరావతి టూర్‌పై డీజీపీ అనురాగ్‌శర్మ సమీక్ష నిర్వహించారు. రెండు ప్రత్యేక కాన్వాయ్‌లను సీఎం కోసం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

 

కొందరు మత విద్వేషాలు సృష్టిస్తున్నారు : గులాంనబీ ఆజాద్

హైదరాబాద్ : కొందరు మత విద్వేషాలు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఆరోపించారు. కానీ ప్రజలు లౌకికవాదులైనందున దేశం శాంతియుతంగా నడుస్తోందన్నారు.

హిందూ, ముస్లీంల ఐక్యతకు కార్యకర్తలు పని చేయాలి : దిగ్విజయ్ సింగ్

హైదరాబాద్ : హిందూ, ముస్లీంల ఐక్యతను నిలబెట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.   

16:57 - October 19, 2015

ఢిల్లీ : భారత్‌లో కాలు మోపేందుకు వాల్‌మార్ట్‌ అడ్డదారులను ఆశ్రయించింది. భారత్‌లో తన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు వేలాదిమందికి కోట్లాది రూపాయల ముడుపులు చెల్లించిట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో వచ్చిన ప్రత్యేక కథనం వాల్‌మార్ట్‌ ముడుపుల బాగోతాన్ని బయటపెట్టింది. 2013 నుంచి కనీసం 2 వందల డాలర్ల చొప్పున అత్యధికులకు ముడుపులు ముట్టాయని పేర్కొంది.

 

16:56 - October 19, 2015

కర్నాటక : బెంగలూరులో ఆస్ట్రేలియా దేశస్థుడు టాటూ వేసుకుని తిరగడంపై బిజెపి కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఆ యువకుడు దుర్గామాత టాటూను కాళ్లపై వేసుకున్నాడు. ఆయన షాట్‌పై తిరగడంతో కాలిమీద ఉన్న దుర్గాదేవి బొమ్మ స్పష్టంగా కనిపిస్తోంది. నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న వేళ కాలు మీద అమ్మవారి టాటూ వేసుకుని తిరగడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని, ఎవరైనా దాడి చేసే అవకాశముంటుందని ఆస్ట్రేలియా దేశస్తుడికి బిజెపి కార్యకర్తలు హెచ్చరించారు. దీంతో ఆస్ట్రేలియా దేశస్థుడు పోలీసులను ఆశ్రయించాడు. దుర్గామాత ఇక్కడ పూజించే దేవత అని ఆయనకు తెలియక పోవచ్చని, ఆస్ట్రేలియా యువకుడి స్నేహితుడైనా ఈ విషయం చెప్పాల్సిందని వారు అభిప్రాయపడ్డారు.

16:45 - October 19, 2015

కరీంనగర్‌ : మానవత్వం మంటగలిసింది. అభంశుభం తెలియని పసికందులను చిదిమేస్తున్నారు. జిల్లాలో దారుణం జరిగింది. గోదావరిఖనిలో ఓ పసికందు మృతదేహం చెత్తకుప్పలో పడేసిన ఘటన కలకలం సృష్టించింది. అడ్డగుంటపల్లిలో గుర్తుతెలియని వ్యక్తులు పసికందు మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేసి వెళ్లారు. అయితే పసికందు చనిపోయిన తర్వాత పడేశారా... లేక బతికి ఉండగానే పడేశారా అనేది తెలియదు. స్థానికులు మాత్రం.. ఘటనపై తీవ్రంగా మండిపడుతున్నారు. పసిపిల్లలను ఇలా చెత్తకుప్పలో పడేయవద్దని.. చంపవ్దదని... పసిపిల్లను పడేసేవారు ఎవరైనా ఉంటే... ఆనాధాశ్రమాలకైనా పిల్లలను ఇవ్వండి..కానీ పడేయకండని.. హత మార్చవద్దని హితవుపలికారు.

 

16:40 - October 19, 2015

వరంగల్‌ : ఎంజిఎం మార్చురీ ప్రాంగణంలోని బావిలో గుర్తుతెలియని ఓ పసికందు మృతదేహం లభ్యమైంది. మార్చురీ వద్ద బావిలో మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది స్థానిక మట్టెవాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమాజంలో ఎంతో మంది పిల్లలు లేనివారు ఉన్నారని.. వారికి ఇచ్చినా ప్రేమతో చేరదీస్తారని.. ఇలా చిన్నారులను చిదిమేయడం బాధాకరమని స్థానికులు అన్నారు.

 

16:35 - October 19, 2015

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ రాహుల్‌గాంధీ నరేంద్రమోడీకి లేఖ రాశారు. విభజన సందర్భంగా ఏపీకి ఆర్ధిక సాయం చేసేందుకు చట్టంలోనే ప్యాకేజీలు ఇవ్వాలని పొందుపర్చామన్నారు. అలాగే అప్పటి ప్రధాని మన్మోహన్‌ ప్రత్యేకహోదాపై ప్రకటన చేశారని రాహుల్‌ మోడీకి గుర్తు చేశారు. అమరావతి శంకుస్థాపన వేదికపై హోదాపై ప్రకటన చేయాలని మోడీని రాహుల్‌ కోరారు.

 

అమరావతి శంకుస్థాపనకు భద్రత కట్టుదిట్టం

గుంటూరు : అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి 3 వేల మందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. సభా ప్రాంగణానికి 500 మీటర్ల దూరంలో మీడియా, సంరదర్శకుల వాహనాలను నిలిపివేయనున్నారు. ఈ సాయంత్రానికి ప్రధాన వేదిక ప్రాంతాన్ని ప్రధాని సెక్యూరిటీ తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది. 

ఈనెల 22న రాయలసీమకు బ్లాక్ డే : బైరెడ్డి

 

హైదరాబాద్ : ఈనెల 22న రాయలసీమకు బ్లాక్ డే అని రాయలసీమ హక్కుల పరిరక్షణ వేదిక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రాయలసీమలో నెలకొల్పాల్సిన రాజధానిని ఆంధ్రకు తరలించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

 

16:16 - October 19, 2015

ఢిల్లీ : దక్షిణాఫ్రికాతో చివరి రెండు వన్డేలకు..మొదటి రెండు టెస్టు మ్యాచ్ లకు భారత జట్టును సెలక్షన్ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. మొత్తం మూడు వన్డేల్లో సౌతాఫ్రికా రెండు మ్యాచ్ ల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో చివరి రెండు వన్డేలకు జట్టులో ఒక మార్పు చేశారు. బౌలర్ ఉమేష్ యాదవ్ స్థానంలో ఎస్.అరవింద్ కు స్థానం కల్పించారు. తొలి రెండు టెస్టులకు రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు. అశ్విన్ గాయపడడంతో జడేజాకు అవకాశం దక్కింది. అలాగే మురళీ విజయ్, సాహాలు ఎంపికయ్యారు. తొలి రెండు టెస్టులకు 16 మందిని సెలక్ట్ చేశారు. టెస్టు జట్టుకు కోహ్లీ సారథ్యం వహించనున్నారు.

టెస్టు జట్టు : కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, ధావన్, పుజారా, రహానే, రోహిత్ శర్మ, రాహుల్, సాహా (కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, రాహుల్, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ అరోన్, ఇషాంత్ శర్మ.

వన్డే జట్టు : ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, విరాట్ కోహ్లీ, రైనా, అక్షర్ పటేల్, హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రా, మోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, అరవింద్, బిన్నీ, అంబటి రాయుడు, గురుకీరత్.

చివరి రెండు వన్డేలు..తొలి రెండు టెస్టులకు భారత జట్టు..

ఢిల్లీ : దక్షిణాఫ్రికాతో చివరి రెండు వన్డేలకు..మొదటి రెండు టెస్టు మ్యాచ్ లకు భారత జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికాతో చివరి రెండు వన్డేలకు జట్టులో ఒక మార్పు చేశారు. బౌలర్ ఉమేష్ యాదవ్ స్థానంలో ఎస్.అరవింద్ కు స్థానం కల్పించారు. తొలి రెండు టెస్టులకు రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు. అశ్విన్ గాయపడడంతో జడేజాకు అవకాశం దక్కింది. అలాగే మురళీ విజయ్, సాహాలు ఎంపికయ్యారు. తొలి రెండు టెస్టులకు 16 మందిని సెలక్ట్ చేశారు. టెస్టు జట్టుకు కోహ్లీ సారథ్యం వహించనున్నారు.

హార్దిక్ పటేల్ అరెస్టు..

గుజరాత్ : జాతీయ పతాకాన్ని అవమానించినందుకు హార్దిక్ పటేల్ ను పోలీసులు అరెస్టు చేశారు. పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ గుజరాత్ లో పటీదార్ అనామత్ ఆందోళన సమితీ కన్వీనర్ హార్దిక్ పటేల్ ఉద్యమం లేవనెత్తిన సంగతి తెలిసిందే. 

త్వరలో 10వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ - హరీష్ రావు..

మెదక్ : త్వరలోనే 10 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడుతుందని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. 9,200 కానిస్టేబుళ్లు, 800 ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్ వస్తుందని వెల్లడించారు. 

అన్నదాతను ఆదుకుంటాం - జోగుల..

ఆదిలాబాద్ : అన్నదాతను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. దివాలపూర్ మండలం మోడేగాంలో వాటర్‌గ్రిడ్ పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు జోగు రామన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగు మాట్లాడుతూ.. రైతు ఆత్మహత్యలకు కాంగ్రెస్సే కారణమని, రైతు ఆత్మహత్యల నివారణకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

'వాటర్ గ్రిడ్ లో అవినీతి నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా'

ఆదిలాబాద్ : వాటర్‌గ్రిడ్‌లో అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. దివాలపూర్ మండలం మోడేగాంలో వాటర్‌గ్రిడ్ పైలాన్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వాటర్‌గ్రిడ్‌లో అవినీతి జరిగిందని ఓ నేత విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు.

 

సద్దుల బతుకమ్మ ఏర్పాట్లపై సీఎం సమీక్ష..

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళలు ఉత్సాహంతో, భక్తి శ్రద్ధలతో పాల్గొనాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. సద్దుల బతుకమ్మకు అన్ని ఏర్పాట్లు చేయాలని, హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ నిర్వహించాలని సూచించారు. కళాకారులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు ఎల్బీ స్టేడియం చేరుకుని అక్కడే బతుకమ్మలు పేర్చుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం 4.30 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి సద్దుల బతుకమ్మ ర్యాలీ ట్యాంక్‌బండ్‌కు ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీలో సుమారు 20 వేల మంది మహిళలు పాల్గొంటారని అంచనా. 

రేపు సెలవు..

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా ఈ నెల 20న సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

15:37 - October 19, 2015

హైదరాబాద్ : ఇండోర్ గేమ్ క్యారమ్ లో...తెలుగుతేజం హుస్నా సమీరా సరికొత్త రికార్డు నెలకొల్పింది. 20 గంటల 20 నిముషాల 20 సెకన్ల సమయంలో ..20 మంది ప్రత్యర్థులతో నిర్విరామంగా క్యారమ్ ఆడి..తన రికార్డును తానే తెరమరుగు చేసింది. హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియం యోగా హాల్ లో జరిగిన..నాన్ స్టాప్ క్యారమ్ ఫీట్ పై 10 స్పోర్ట్స్ స్పెషల్ ఫోకస్‌.....
క్యారమ్స్...కళాత్మక క్రీడ
క్యారమ్...ఇంటిపట్టునే హాయిగా కూర్చొని ఆడుకొనే ఆట అనుకొంటే అంతకు మించిన పొరపాటు మరొకటి లేదు. క్యారమ్స్ అంటే కళాత్మక క్రీడ. ఎనలేని ఏకాగ్రతతో ..అత్యున్నత నైపుణ్యంతో ఆడే ఆట. నేర్పు, ఓర్పుకు పరీక్షగా నిలిచే క్యారమ్ ను..గంటా..రెండు గంటలు కాదు..ఏకంగా 20 గంటలపాటు ఆడటమంటే మాటలు కాదు. అదీ 14 ఏళ్ల ఓ చిన్నారి ఆడిందంటే ఆశ్చర్యపోవడం మనవంతే అవుతుంది. హైదరాబాద్ లాల్ బహదూర్ ఇండోర్ స్టేడియంలోని యోగా హాల్ లోని క్యారమ్ బోర్డ్ పై ఎక్కడలేని ఏకాగ్రత, ఏదో సాధించాలన్న తపనతో ఆడుతున్న చిన్నారి పేరు షేక్ హుస్నా సమీరా. క్యారమ్ క్రీడలో ప్రపంచ రికార్డులు నెలకొల్పడానికే పుట్టిన బాలిక సమీరా.
గుర్తింపు తెచ్చుకొన్న సమీర
స్టీల్ సిటీ విశాఖపట్నంలో జన్మించి...క్యారమ్ క్రీడ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్న సమీర...గత ఏడాది 18 గంటల 18 నిముషాల 18 సెకన్ల సమయంలో..18 మంది ప్రత్యర్థులతో నాన్ స్టాప్ క్యారమ్ ఆడి...సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏకకాలంలో లిమ్కా, ఇండియా, ప్రపంచ, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించి ..వారేవా అనిపించుకొంది. జాతీయ క్యారమ్ సబ్ జూనియర్ విభాగంలో నెంబర్ వన్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకొన్న సమీర..హైదరాబాద్ వేదికగా జరిగిన మరో నాన్ స్టాప్ క్యారమ్ షోలో..తన రికార్డును తానే మెరుగుపరచుకొంది. లాల్ బహదూర్ స్టేడియం వేదికగా ..20 గంటల..20 నిముషాల..20 సెకన్ల సమయం పాటు...20 మంది ప్రత్యర్థులతో నాన్ స్టాప్ క్యారమ్ ఆడి...తన పేరుతో గత ఏడాది నెలకొల్పిన రికార్డును తానే తెరమరుగు చేసింది. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ ఫీట్ ను అంతర్జాతీయ క్యారమ్ సమాఖ్యకు చెందిన రిఫరీలు, గిన్నెస్ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కు చెందిన పలువు ప్రతినిధులు, ప్రముఖుల సమక్షంలో నిర్వహించారు. 14 ఏళ్ల చిరుప్రాయంలోనే ఇంతటి ఘనత సాధించిన సమీరాను పలువురు ప్రముఖులు అభినందించారు. ప్రపంచస్థాయిలో క్యారమ్ కు గుర్తింపు తీసుకురావడంతో పాటు...మరిన్ని రికార్డులు నెలకొల్పడమే తన లక్ష్యమని సమీరా చెబుతోంది. అప్పారావు, అపూర్వ, నిర్మల లాంటి ఎందరో ప్రపంచ చాంపియన్లను అందించిన తెలుగు గడ్డ నుంచే షేక్ హుస్నా సమీరా లాంటి...క్యారమ్ కిడ్ దూసుకురావడం, రికార్డుల మీద రికార్డులు నెలకొల్పడం...తెలుగు రాష్ట్రాలకే గర్వకారణమనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

15:31 - October 19, 2015

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో వేర్పాటు వాదుల బంద్ ఉద్రిక్తంగా మారింది. పలుచోట్ల ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా దక్షిణ కశ్మీర్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఉధంపూర్ లో జరిగిన ఈ హత్యకు నిరసనగా వేర్పాటు వాదులు బంద్ కు పిలుపునిచ్చారు.

 

ప్రధాని మోడీకి రాహుల్ లేఖ

ఢిల్లీ : ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రత్యేకహోదా ప్రకటించాలని ప్రధాని నరేంద్రమోడీకి రాహుల్ లేఖ రాశారు. 

15:09 - October 19, 2015

విజయవాడ : అభివృద్ధి జరగాలంటే త్యాగాలు చేయకతప్పదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనులను ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్య, అశోక్‌గజపతిరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గన్నవరం విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. రైతులను ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందన్నారు. అమరావతి నగరానికి ప్రపంచపటంలో ప్రముఖ స్థానం రానుందని తెలిపారు. అభివృద్ధి పథంలో పయనించాలంటే కొంతమంది త్యాగాలు చేయకతప్పదన్నారు. భూముల్వికపోతే అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యం కాదన్నారు.

 

14:58 - October 19, 2015

కృష్ణా : జిల్లాలోని తీర ప్రాంత భూములకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు సీపీఎం నేతలు, రైతులు అవనిగడ్డలో ధర్నాకు దిగారు. చాలా ఏళ్లుగా ప్రభుత్వం తమ హామీని అమలు చేయడం లేదని... ఇకనైనా దిగిరావాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ధర్నా ఉద్రిక్తంగా మారడంతో... పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి అవనిగడ్డ పీఎస్ కు తరలించారు.

 

14:54 - October 19, 2015

హైదరాబాద్ : గన్ ఫ్రౌండీలోని ఎస్ బిహెచ్ వద్ద టీటీడీపీ, బీజేపీ ధర్నాకు దిగాయి. కేసీఆర్ సర్కార్.. రైతు రుణమాఫీని ఒకేసారి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇరు పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. కేసీఆర్ ప్రభుత్వం మాటలు ఆపి.. చేతల ద్వారా రైతులపై ప్రేమ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యం చెందిందన్నారు. ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు ఇరు పార్టీల నేతలను అరెస్ట్ చేసి గోషామహల్ పీఎస్ కు తరలించారు. అరెస్టు అయిన వారిలో ఎల్.రమణ, మాగంటి, బీజేఎస్ పీ నేత లక్ష్మణ్ లున్నారు. 

ఎంఐఎంతో పొత్తు లేదు : ఉత్తమ్ కుమార్

హైదరాబాద్ : భవిష్యత్తులో ఏ ఎన్నికల్లోనూ ఎంఐఎంతో పొత్తు పెట్టుకోమని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన యాత్ర సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ఉత్తమ్ మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికలకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గాంధీ, నెహ్రూ కుటుంబాలను అప్రతిష్టపాలు చేసేందుకు మోడీ సర్కార్ కుట్రం చేస్తుందని మండిపడ్డారు.

టీఎస్ సచివాలయంలో చోరీ

హైదరాబాద్ : సచివాలయంలో చోరీ జరిగింది. సచివాలయంలోని జనరేటర్ బ్యాటరీని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బ్యాటరీ అపహరణపై పోలీసులు విచారణ చేపట్టారు. సచివాలయంలోని సమీప ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తున్నారు.

13:30 - October 19, 2015

విజయవాడ :శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తింది. శ్రీ సరస్వతీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఇక జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజు కావడంతో అమ్మవారిని దర్శనభాగ్యం కోసం భక్తులు బారులు తీరారు.

13:26 - October 19, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకరిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.గన్నవరంలోని విమానాశ్రయ కొత్త టెర్మినల్‌కు ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాబోయే ఐదేళ్లలో నెంబర్ రాష్ట్రంగా చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధా నిర్మాణానికి భూములిచ్చి రైతులకు పాదాభివందనాలు తెలిపారు. కేంద్రం అందిస్తున్న సహకారానికి మనస్పూర్తిగా అభినందించినట్లు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి కావడం ప్రతిపక్షానికి లేక అడుగడుగునా అడ్డు పడుతోందని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ఆగిపోయిందని, ప్రధాని నరేంద్ర మోడీ అధికారం చేపట్టాక ప్రపంచంలో భారత్ కు గుర్తింపు వచ్చిందని తెలిపారు. అభివృద్ధి ఏదన్నా జరిగితే భారత్ లోనేనని.. అందులో ఏపీ ఒకటి అని చెప్పడానికి గర్వ పడుతున్నట్లు చెప్పారు. 2018 లోపు పోలవరం పూర్తి చేసి గ్రావిటితో గోదావరినీరు.. కృష్ణా నదికి అనుసంధానం చేస్తాం అని పేర్కొన్నారు. గన్నవరంలోని విమానాశ్రయంలో రూ. 135 కోట్లతో 9,525 చదరపు అడుగుల్లో టెర్మినల్‌ నిర్మాణం చేపట్టనున్నారు. కార్‌ పార్కింగ్‌, ఇతర మౌలిక సదుపాయాల కల్పన చేసేలా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం రూ. 137 కోట్లను ఇటీవలే మంజూ రు చేసింది. నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌ స్టీల్‌,గ్లాస్‌ స్ట్రక్చర్‌తో ఉంటుంది. ప్రయాణికుల స్నేహ పూర్వక వసతులతో బ్యాగేజీ హ్యాండ్లింగ్‌ , ఇన్‌ క్లైండ్‌ అరైవల్‌ బ్యాగేజి, క్లైమ్‌ కరౌసల్స్‌తో పాటు గా ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ బిల్డింగ్‌ అంతా సెం ట్రలైజ్డ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ సదుపాయం ఉం ది. పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌, ఫైర్‌ అ లారం సిస్టమ్‌, ప్లయిట్‌ ఇన్ఫర్మేషన్‌ డిస్‌ప్లే సిస్టమ్‌, సీసీ టీవీ, వాచ్‌ వ్యవస్థ, కామన్‌ యూజ్‌ టెర్మినల్‌ ఎక్విప్‌ మెంట్‌ (సీయూటీఈ) ద్వారా చెక్‌ ఇన్‌ కౌంటర్లు , కార్‌ పార్కింగ్‌ వస తులు ఉంటాయి. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఏసీబీకి వలలో ములుగు ట్రాన్స్ ఏఈ

వరంగల్ : ములుగులో ట్రాన్స్ కో ఏఈ ఏసీబీ అధికారులకు చిక్కిరు. విద్యుత్ కనెక్షన్ విషయంలో కట్టయ్య అనే రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

12:40 - October 19, 2015

ప్రస్తుత సమాజంలో సామాజిక మాధ్యమాలు కీలకంగా మారాయి. కూర్చొని ఆన్ లైన్ లో ఒక క్లిక్ చేస్తే అది మీ ఇంటికి వచ్చే సదుపాయాలు వస్తున్నాయి. బట్టలు..షూలు..గృహ సామాగ్రీ..ఇలా ఒకటేమిటీ అన్ని ఆన్ లైన్ లో దొరుకుతున్నాయి. చివరకు ఇందులో 'ఆవు పేడ' కూడా దూరింది. అవునండి ఒక్క క్లిక్ చేస్తే ఆన్ లైన్ లో 'పిడకలు' పంపించనున్నారంట. ఎందుకంటే ప్రస్తుతం పేడ దొరకడం లేదని భావించిన కొంతమంది ఈ కొత్త పనికి శ్రీకారం చుట్టారు. ఈ కామర్స్ వెబ్ సైట్లలో పేడ కూడా దొరుకుతోంది. అమెజాన్, బిగ్ బాస్కెట్, షాప్ క్లూస్, హోమ్ షాప్18 లాంటి పెద్ద వెబ్ సైట్లు కూడా రకరకాల పూజా వస్తువులు, సామాగ్రితోపాటు ఆవుపేడ అమ్మకాలు చేస్తున్నాయి. పండగల వేళ ఆవు పేడ అమ్మకాలు రెట్టింపు అవుతున్నాయంట. ఆవు పేడ పిడకలున్న ఒక్కో ప్యాకెట్ (నాలుగు పిడకలు) ధర రూ. 40 నిర్ణయించారు. అలాగే 24 పిడకలున్న ప్యాకెట్ రూ. 150 వరకు ఉంటుంది. అన్నట్లు వీటిపై డిస్కౌంట్ ఆఫర్లుకూడా ఉన్నాయండోయ్. పట్టణ ప్రాంతాల్లో ఆవు పేడ దొరకడం కనాకష్టంగా మారిపోయిందని, ఆన్ లైన్ వ్యాపార సైట్ల పుణ్యమా అంటూ ఆ లోటు తీరిందని కొందరు పేర్కొంటున్నారంట.

12:40 - October 19, 2015

హైదరాబాద్ : బీహార్ లో బీజేపీ అధికారంలోకి వస్తోందన్న భయంతోనే... విపక్షాలు కేంద్రంపై కొత్తకొత్త ఆరోపణలు చేస్తున్నాయన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఓటమి భయంతోనే.. గో మాంసం వంటి అంశాలను తెరపైకి తెచ్చి వివాదం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన ఏ హక్కులను ఎన్ డీఏ ప్రభుత్వం కాలరాయబోదన్నారు అమిత్ షా. 

12:33 - October 19, 2015

గుంటూరు : రాజధాని అమరావతి.. ప్రపంచాన్ని ఆకర్షిస్తోంటే.. ఈ ప్రాంత యువకులు.. అమ్మాయిల తల్లిదండ్రులను అమితంగా ఆకర్షిస్తున్నారు. రాజధాని ప్రతిపాదిత ప్రాంతాల రైతు కుటుంబాలతో సంబంధాన్ని కలుపుకునేందుకు ఇప్పుడు చాలామంది తహతహ లాడుతున్నారు. గతంలో అమెరికా సంబంధాల కోసం వెంపర్లాడిన అమ్మాయిల తల్లిదండ్రులు.. ఇప్పుడు రాజధాని ప్రాంత వాసుల వైపు మొగ్గు చూపుతున్నారు. 

12:30 - October 19, 2015

హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపు దారులపై వేటు వేసేంత వరకు వదిలిపెట్టేది లేదని ఎర్రబెల్లి స్పష్ఠం చేశారు. ఇందులో భాగంగానే పార్టీ ఫిరాయింపుదారులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాల్ చేయాలని టీటిడిపి నిర్ణయించింది. ఎల్లుండి సుప్రీంలో ఎర్రబెల్లి పిటిషన్ దాఖలు చేయనున్నారు.

 

12:29 - October 19, 2015

కరాచీ : గీత..గత 14 ఏళ్లుగా అజ్ఞాత వాసం.. తన కన్నతల్లిదండ్రుల కోసం 'గీత' ఆరాటం..తన కుటుంబసభ్యులు ఎక్కడున్నారో గుర్తింపు..త్వరలోనే భారత్ కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు..ఇంతలోనే కొత్త మలుపు తిరిగింది. ఆమె తన కుటుంబం సభ్యులను గుర్తుపట్టిందని, త్వరలో భారత్ వస్తోందని అనుకుంటున్న తరుణంలో కొత్త వివాదం ముందుకొచ్చింది. గీత తన కుటుంబంగా గుర్తు పట్టినవారు బీహార్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే వారిప్పుడు గీతకు సంబంధించి కొత్త విషయాలని బయటపెట్టారు. గీత మైనర్ గా ఉన్నప్పుడే ఉమేశ్ అనే వ్యక్తితో పెళ్లి చేసినట్టు వారు చెబుతున్నారు. అంతే కాదు గీతకి ఒక బాబు కూడా ఉన్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గీత తప్పిపోక ముందు ఫోటోగా ఒక బాలిక ఫోటోని వారు చూపించారు. అయితే అది తనది కాదని చెప్పింది గీత. తనకు అసలు పెళ్లే కాలేదని తెగేసి చెప్పింది. దీంతో మళ్లీ కథ మొదటికి వస్తోందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అక్టోబర్ 26న గీతను తీసుకుని ఫైజల్ ఈది(కరాచీలో గీతకు ఆశ్రయమిచ్చిన ఈది ఫౌండేషన్ నిర్వాహకుడు) అతని భార్య భారత్ కి వస్తున్నారు. డీఎన్ ఏ పరీక్షలు నిర్వహించాక, గీత ఆ కుటుంబానికే చెందిందని పరీక్షల్లో నిరూపణ అయితే అప్పుడు ఆ అమ్మాయిని బీహార్ కుటుంబానికి అప్పచెపుతామని పాకిస్తాన్‌లో ఉన్న భారత హై కమిషనర్ టీసీఏ రాఘవన్ పేర్కొంటున్నారు. మరి గీత కథ సుఖాంతం..అవుతుందా ? లేదా అనేది వేచి చూడాలి. 

ఏకకాలంలో రుణమాఫీ చేయాలంటూ బిజెపి, టిడిపి ధర్నా

హైదరాబాద్‌: ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిమాండు చేస్తూ బీజేపీ, టీడీపీ నేతలు గన్‌ఫౌండ్రిలోని ఎస్‌బీహెచ్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ధర్నా చేస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేశారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ ఆరోపించారు.జిల్లాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలను అరెస్టులు చేయడాన్ని రమణ ఖండించారు.

12:14 - October 19, 2015

ప్రపంచ ప్రఖ్యాత లండన్ 'బిగ్ బెన్' గడియారం మూగబోనుంది. అయ్యో.. అనుకోకండి. ఇది తాత్కాలికమే. మరమ్మతుల దృష్ట్యా బ్రిటన్ ప్రభుత్వం బిగ్ బెన్ గడియారాన్ని కొద్ది రోజుల పాటు మూగబోయేలా చేయనుంది. ఇందుకోసం 40 మిలియన్ పౌండ్లు వెచ్చిస్తున్నారు. లండన్ నగరానికి గుండెకాయలాంటి వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ వద్ద బిగ్ బెన్ గడియారాన్ని 1859లో నిర్మించారు. ప్రతీ ఏటా కొత్త సంవత్సరాదికి గుర్తుగా బిగ్ బెన్ గడియారం ఆనవాయితీగా మోగించే గంటలు చెవులకింపుగా ఉంటాయి. మరమ్మతుల్లో భాగంగా నాలుగు నెలల వరకు దాని గంటలు మోగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. గడియారాన్ని నెలకొల్పిన ఈ 156 ఏళ్ల కాలంలో ఇన్ని నెలలు అది మోగకుండా ఉండటం ఇదే ప్రధమం. గతంలో 1976లో కూడా దీనికి మరమ్మతులు చేసినప్పుడు 26 రోజుల పాటు గంటలు మోగలేదు. గడియారపు లోహ లోలకంలో చిన్నపాటి పగుళ్లను నిపుణులు ఇటీవలి కాలంలో కనిపెట్టారు. వీటిని ఇలాగే నిర్లక్ష్యం చేస్తే రానున్న కాలంలో అది విరిగి పడిపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించిన నేపథ్యంలో ఈ మరమ్మతులు చేపట్టారు. అందండి సంగతి.

పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకు వెళతాం :ఎర్రబెల్లి

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుదారులపై హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయనున్నట్లు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి తెలిపారు.బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న చెప్పారు. పార్టీ ఫిరాయింపు దారులపై చర్యలు తీసుకునేంత వరకూ పోరడతామని హెచ్చరించారు.

జమ్మూకాశ్మీరలో కర్ఫ్యూ వాతావరణం

హైదరాబాద్: జమ్మూకాశ్మీర్ లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ట్రక్క్ డ్రైవర్ జాహిద్ అహ్మద్ అంత్యక్రియలకు విభజన వాదులు భారీగా హాజరయ్యారు. అనంత నాగ్ లో ఆందోలనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళన కారులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.

11:32 - October 19, 2015

హైదరాబాద్ : అమరావతి రాజధాని నిర్మాణానికి సంఘీభావం ప్రకటించేందుకు ఐటీ ఉద్యోగులు సైకిల్ యాత్ర చేపట్టారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ నుంచి అమరావతి వరకు సాగే ఈ సైకిల్ యాత్రను తెదేపా నేతలు పయ్యావుల కేశవ్, మాగంటి గోపీనాథ్, వేం నరేందర్‌రెడ్డి తదితరులు ఉదయం జెండా వూపి ప్రారంభించారు. చంద్రబాబు అధికారం చేపట్టి 502 రోజులైన సందర్భంగా 502 మంది ఐటీ ఉద్యోగులు.. 502 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ఈనెల 21న అమరావతికి చేరుకుంటుంది.

11:31 - October 19, 2015

హైదరాబాద్ : ముంబైలో బిసిసిఐ హెడ్ క్వార్టర్ వద్ద శివసేన కార్యకర్తల వీరంగం సృష్టించారు. ఇవాళ పాక్ క్రికెట్ సభ్యులతో భారత క్రికెట్ బోర్డ్ చర్చలు జరపనున్న నేపథ్యంలో.. శివసైనికులు.. బిసిసిఐ హెడ్ క్వార్టర్స్ లోకి దూసుకెళ్లారు. బిసిసిఐ ఛైర్మన్ శశాంక్ మనోహర్ ఛాంబర్ లోకి వెళ్లి బీభత్సం సృష్టించారు. 

11:29 - October 19, 2015

విశాఖ : ప్రముఖ హాస్యటుడు కళ్లు చిదంబరం(70) ఈ రోజు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో చిదంబరం సోమవారం ఉదయం విశాఖలో కన్నుమూసారు. 1945 అక్టోబర్ 10న జన్మించిన "కళ్లు" చిదంబరం 1988లో రిలీజైన కళ్లు సినిమాతో అరంగేట్రం చేశారు. ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన "కళ్లు" చిదంబరం ఆ ఒక్కటీ అడక్కు, అమ్మోరు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.  

11:11 - October 19, 2015

మెగస్టార్ 'చిరంజీవి'పై 'రామ్ గోపాల్ వర్మ' చేసిన కామెంట్స్ పై 'రాంచరణ్ తేజ స్పందించారు. చిరంజీవి గెస్ట్ గా కనిపించిన బ్రూస్ లీ నే 150 సినిమా అని... 'కత్తి' సినిమా రీమేక్ చెసి తన స్థాయిని తగ్గించుకోవద్దు అని రామ్ ట్వీట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'రామ్ చరణ్' 'బ్రూస్ లీ' ప్రమోషన్ నిమిత్తం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక భాషలో సూపర్ హిట్ సినిమాలను మరో భాషలో రీమేక్ చేయకూడదని ఎందుకు విమర్శలు చేస్తున్నారో నాకు అర్ధం కావడం లేదని పేర్కొన్నారు. రీమేక్ చేయడం నేరమా...? అయినా 'చిరంజీవి' ఏ రీమేక్ సినిమాలో నటించినా... 'ఠాగూర్', 'శంకర్ దాదా ఎం బి బి ఎస్', 'హిట్లర్' వంటి సినిమాలు మన నేటివిటికి అనుగుణంగానే మార్చారే కానీ ఎప్పుడూ కాపీ సినిమాగా తీయలేదని తెలిపారు. 

ముంబై బీసీసీఐ కార్యాలయం పై శివసేన దాడి...

ముంబై: శివసేన కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. పాకిస్థాన్ తో సిరీస్ నిర్వహించే ప్రయత్నాలు చేస్తామని అధ్యక్షుడు శశాంక్ మనోహర్ వ్యాఖ్యానించడాన్ని నిరసిస్తూ, వందలాది మంది కార్యకర్తలు ఈ ఉదయం ఒక్కసారిగా బీసీసీఐ ఆఫీసులోకి దూసుకెళ్లారు. అక్కడ వీరంగం సృష్టించారు. శశాంక్ మనోహర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ తో సిరీస్ కు అంగీకరించబోమని తెలిపారు. శివసేన ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

ముంబై : నేడు స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 40 పాయింట్ల లాభాల్లో ట్రేడవుతున్నాయి.

కళ్లు చిదంబరం కన్నుమూత

విశాఖ : సీనియర్ హాస్య నటుడు, తన కళ్లతోనే నవ్విస్తూ, వందలాది చిత్రాలలో సినీ ప్రేక్షకులను నవ్వించిన కళ్లు చిదంబరం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండగా, విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు.

10:37 - October 19, 2015

హైదరాబాద్ : భారీ తుపాన్ ఫిలిప్పీన్ ను కుదిపేసింది. ఆదివారం తీరం దాటిన తుపాన్ దాటికి ఇప్పటివరకు 15వేల మంది నిరాశ్రయులయ్యారు. సుమారు 200కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి. కొన్నిచోట్ల కొండ చరియలు విరిగిపడటంతో.. ఆస్తినష్టం కూడా భారీగానే ఉంది. 

10:34 - October 19, 2015

హైదరాబాద్ : ఉప ఎన్నికలను గులాబి పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. గెలుపే ధ్యేయంగా గులాబి దళపతి ఇప్పటి నుంచే విపక్షాలపై ఆధిపత్యం సాధించే దిశగా పావులు కదుపుతున్నారు. ఎన్నికలు ఏకపక్షంగా జరిగేలా అధికార పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. పార్టీ కీలక నేతలను ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే మోహరిస్తున్నారు. నారాయణఖేడ్ అసెంబ్లీ పరిస్థితి ఎలా ఉన్నా...... వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని.. అధికార పార్టీ యత్నిస్తోంది. ఈక్రమంలో జిల్లాలో వలసలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు స్కెచ్ వేస్తోంది. అందులో భాగంగానే గత ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి మిత్ర పక్షాల అభ్యర్థిగా పోటీ చేసిన పరమేశ్వర్ ను ఆదివారం కారెక్కించుకుంది. ఎన్నికల నాటికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలను మరింత మందికి గులాబి తీర్థం ఇచ్చేందుకు టిఆర్ ఎస్ స్కెచ్ వేసింది. దీంతో పాటే.. వరంగల్‌ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా.. ఎన్నికల నోటిఫికేషన్ లోపే.. జిల్లాకు చెందిన ఓ యువ నేతకు మంత్రి పదవి కట్టబెడతారనే ప్రచారం కూడా ఉంది. ప్రస్తుతం గిరిజన శాఖ మంత్రిగా ఉన్న చందూలాల్ ఆరోగ్య కారణాలతో చురుగ్గా లేకపోవడంతో..... ఆయన స్థానంలో మరో నేతకు మంత్రి పదవి అప్పగించనున్నట్లు సమాచారం. పార్టీ పరంగా కూడా వరంగల్ ఎంపీ స్థానం గెలుపు బాధ్యతలను ఓ ఎమ్మెల్సీ కి అప్పగించినట్లు తెలుస్తోంది. వరంగల్ పార్లమెంట్ స్థానంలో గతంలో సాధించిన మెజార్టీని ఉప ఎన్నికల్లో కూడా దక్కించుకుంటామని కార్యకర్తల్లో ధీమా కల్పించే యత్నం అధికార పార్టీ కీలక నేతలు చేస్తున్నారు.త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవుల్లో కూడా వరంగల్ కు ప్రాధాన్యం ఉంటుందనే సంకేతాలను అధికార పార్టీ నేతలు ఇస్తున్నారు.

10:32 - October 19, 2015

గుంటూరు :రాజధానికి భూములిచ్చిన రైతుల గ్రామాలు.. కోలాహలంగా మారాయి. అమరావతి నిర్మాణానికి స్వచ్ఛందంగా సహకరించిన రైతులను స్వయంగా కలిసేందుకు.. మంత్రులు బృందాలుగా గ్రామాలకు తరలి వస్తున్నారు. దీంతో.. తుళ్లూరు పరిసర గ్రామసీమలు సరికొత్త సందడిని సంతరించుకున్నాయి. మహిళా మంత్రులు పరిటాల సునీత, కిమిడి మృణాళినిలు.. ఈరోజు తుళ్లూరు పరిసర గ్రామాల రైతులకు ఆహ్వన పత్రికలు అందించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి లభించిన స్పందన పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. ప్రముఖులు, రాజధాని పరిసర గ్రామాల రైతులకు మంత్రులు స్వయంగా ఆహ్వాన పత్రికలను అందిస్తున్నారు. దూర ప్రాంతంలో ఉన్న ప్రముఖులు.. ఇతర ముఖ్యులకు పోస్టు ద్వారా ఆహ్వాన పత్రికలను పంపుతున్నారు. ఈ ఆహ్వాన పత్రికలపై చిరునామా స్టిక్కర్లు అతికించడంలో.. సిబ్బంది నిమగ్నమై ఉంది. ఈ నెల 21 లోగా అందరికీ ఆహ్వాన పత్రికలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

10:26 - October 19, 2015

హైదరాబాద్ : నోయిడాలో సహ విద్యార్థి చేతిలో దారుణంగా హత్యకు గురైన నల్గొండ విద్యార్థి సందేశ్ భాస్కర్ మృతదేహం ఎల్బీనగర్ లోని ఆయన నివాసానికి తరలించారు. దీపావళికి వస్తానని చెప్పిన కొడుకు.. ఇలా శవమై వచ్చాడని తల్లి బోరున విలపించింది. ఇలాంటి పరిస్థితి మరెవరికి రాకూడదని కోరుకుంది. నోయిడాలోని అమేధీ యూనివర్సిటీలో చదువుతున్న సందేశ్ ను మరో విద్యార్థి అమన్ శనివారం తుపాకీతో కాల్చిచంపాడు. ప్రస్తుతం అమన్ ను నోయిడా పోలీసులు విచారిస్తున్నారు.

10:22 - October 19, 2015

హైదరాబాద్ : ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్లకు కేటుగాళ్లు చుక్కలు చూపిస్తున్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. ప్లిప్కార్ట్‌కు ఓ వ్యక్తి 20 లక్షలకు కుచ్చుటోపీ పెట్టిన ఘటన మరవక ముందే ...ఈసారి స్నాప్ డీల్ కు అదే తరహాలో కుచ్చుటోపి పెట్టారో ముగ్గురు యువకులు. అందినకాడికి దండుకున్నామని సంబరపడుతున్న తరుణంలో పోలీసులు వచ్చి మోసగాళ్లకు ఝలక్‌ ఇచ్చారు.

4 నెలల క్రితం స్నాప్‌డీల్‌లో వస్తువు ఆర్డర్‌ చేసిన మహేష్‌.....

కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనికి చెందిన రాపెల్లి మహేష్, బండి యాదస్వామి, మంథని రమాకాంత్ స్నేహితులు. 4 నెలల క్రితం మహేష్ స్నాప్‌డీల్‌లో ఓ వస్తువును ఆర్డర్ చేశాడు. అయితే మరో వస్తువును అతడు అందుకున్నాడు. అప్పుడే అతనికి ఓ ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఆ ఆలోచనలను మిగతా ఇద్దరికీ చెప్పాడు. అంతా సరేననుకుని రంగంలోకి దిగారు. అప్పటి నుంచి వస్తువులను ఆర్డర్ చేయటం, ఆ పార్శిల్ రాకముందే సంస్థ ప్రతినిధులకు ఫోన్ చేసి.. తనకు మరో వస్తువు వచ్చిందంటూ అబద్ధం చెప్పి చెల్లించిన డబ్బును వెనక్కి తీసుకోవటం పనిగా పెట్టుకున్నారు.

స్నాప్‌డీల్ మార్కెటింగ్ సంస్థకు శఠగోపం....

స్నాప్‌డీల్ మార్కెటింగ్ సంస్థను బురిడీ కొట్టించి తమ బ్యాంక్ ఖాతాల్లోకి 9.20 లక్షలు జమ చేయించుకున్నారు. స్నాప్‌డీల్ సంస్థకు మొబైళ్లు, బట్టలు, ల్యాప్‌టాప్‌లు, సెల్ కవర్లు, చీరలు కావాలంటూ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశారు. మూడు రోజుల్లో వస్తువులను పంపుతామని మెసేజ్‌ రాగా.. రెండు రోజులకే మీరు పంపిన వస్తువులు నాసిరకంగా ఉన్నాయంటూ...పనికిరాని వస్తువులను ప్యాక్‌ చేసి వెనక్కి పంపారు. ఇలా ముగ్గురు గతేడాది నుంచి 63 ఒరిజినల్ వస్తువులను తీసుకొని వీటి స్థానంలో నకిలీ వస్తువులను పంపి 9.20 లక్షలకు కుచ్చుటోపీ పెట్టారు. గోదావరిఖని ప్రాంతం నుంచే ఇలా వస్తువులు తిరిగి రావడంపై అనుమానం వచ్చిన స్నాప్‌డీల్ ప్రతినిధి వివరాలు సేకరించి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుల డొంక కదిలింది. ముగ్గురు జాదూగాళ్లను కటకటాల్లోకి నెట్టిన పోలీసులు వారి నుంచి 2 ల్యాప్‌టాప్‌లు, 5 మొబైళ్లు, బట్టలు స్వాధీనం చేసుకున్నారు. 

10:18 - October 19, 2015

హైదరాబాద్ : ఢిల్లీ శివారు ప్రాంతంలో రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ స్క్రాప్ గోడౌన్ లో మంటలు భారీగా వ్యాపించడంతో.. చుట్టుపక్కల వారు భయబ్రాంతులకు గురయ్యారు. సుమారు 20 అగ్ని మాపక వాహనాలతో.. 4గంటల పాటు శ్రమించి అధికారులు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఆస్తినష్టం మాత్రం భారీగా జరిగినట్టు తెలుస్తోంది.

10:17 - October 19, 2015

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' కు ఎంతో అభిమానులున్నారు. ఆయన గురించి ఎప్పుడు ఏ వార్త తెలుస్తుందా ? ఏ చిత్రంలో నటిస్తున్నారు ? ఎవరిని కలిశారు ? అనే దానిపై ఆయన అభిమానులే కాక ఇతరులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇందుకు సోషల్ మీడియాను విరివిగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఇదే బాట పట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా తొందరలోనే యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించనున్నారని వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఛానల్ డిజైనర్స్ తో 'పవన్' సీరియస్‌గా మంతనాలు సాగిస్తున్నట్లు టాక్. ఇందులో 'పవర్' స్టార్ సినిమాలతో పాటు ఇతరత్రా విషయాలు అందుబాటులో ఉంటున్నట్లు తెలుస్తోంది. పవన్‌పై వ్యతిరేకంగా ప్రచారం చేసేవాళ్లకు ఈ యూట్యూబ్‌ ద్వారా కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్ని రూపొందించి పంచ్ డైలాగ్ విసరనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

10:10 - October 19, 2015

అల్లు అర్జున్ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అందాల తార 'అనుష్క' ప్రత్యేక పాటలో కనిపించనుందని ప్రచారం జరుగుతోంది. 'రుద్రమదేవి' సినిమాలో ప్రధాన పాత్రలో 'అనుష్క' నటించినా.. ఆ సినిమాను ఆదుకొన్న రియల్ హీరో బన్నీనే టాక్స్ వినిపిస్తున్నాయి. పైగా 'అల్లు అర్జునే' లేకుంటే 'రుద్రమదేవి' సినిమా త్వరగా పూర్తయ్యేది కాదని 'అనుష్క' పలుమార్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం 'బన్నీ'కి 'అనుష్క' స్పెషల్ థాంక్స్ కూడా చెప్పింది. ఇదిలా ఉంటే 'బన్నీ' చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నర్తించడానికి ఓ హీరోయిన్ కోసం చిత్ర బృందం వెదుకుతోంది. 'ప్రియమణి'ని ఎంపిక చేసినట్టు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు 'ప్రియమణి' స్థానంలో 'అనుష్క' ఐటెం సాంగ్‌లో చేయనుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే 'అనుష్క', 'బన్నీ'లు 'వేదం', 'రుద్రమదేవి' సినిమాల్లో కీలక పాత్రల్లో మాత్రమే కనిపించారు. దీంతో ఇద్దరూ కలిసి డాన్స్ చేసే సందర్భం రాలేదు. కానీ ఇప్పుడు ఈ తాజా సినిమాలో అనుష్క, బన్నీలు కలిసి డాన్స్ చేసే రాబోతుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. మరి ఈ వార్త నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాలి. 

10:06 - October 19, 2015

పంజాబ్ : దొంగతనం చేశాడన్న కోపంతో ఓ వలస కూలీని యజమాని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లోని పారిశ్రామిక వాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీ రాం సింగ్. ఈ వ్యక్తి అమృతసర్‌లోని పారిశ్రామికవాడలోని ఓ ఫ్యాక్టరీలో కూలీగా పని చేస్తున్నాడు. అయితే, ఈ కూలీ ఫ్యాక్టరీలో దొంగతనం చేశాడన్న అనుమానంతో రాం సింగ్‌ను ప్యాక్టరీ యజమాని జస్ప్రీత్ సింగ్ చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి ఇనుప రాడ్డుతో విచక్షణా రహితంగా కొట్టి చంపాడు. అయితే ఈ సంఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయడంతో బాహ్యా ప్రపంచానికి తెలిసింది. సంఘటన జరిగిన మరుసటి రోజే రాంసింగ్ మృతదేహం లభించింది. ఈ దారుణానికి సహకరించిన మరో ఇద్దరిపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

10:02 - October 19, 2015

నిన్న మొన్నటి వరకు తూర్పు, పడమరలా ఉన్న అన్నదమ్ములిద్దరూ ఆత్మీయంగా కలుసుకున్న వైనం మెగా అభిమానులకే కాదు ప్రేక్షకులకు సైతం సంతోషం కలిగించే సన్నివేశమే. వేర్వేరు విధానాలతో పొలిటికల్‌గా చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ దూరమైనప్పటికీ, సినిమా నేపథ్యమే ఈ ఇద్దరన్నదమ్ముల్ని ఆప్యాయంగా పలకరించుకునేలా చేసింది. ఓ అభిమానిగానే కాకుండా అన్నయ్య చిరంజీవిని అభినందించడానికి ఏకంగా 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' షూటింగ్‌లోని పోలీస్‌ డ్రస్‌ గెటప్‌తో పవన్‌కళ్యాణ్‌ రావడం విశేషం. ఈ ఇద్దరన్నదమ్ముల అనుబంధం మరింత బలపడేలా చేసిన క్రెడిట్‌ మొత్తం 'బ్రూస్‌లీ'గా తనయుడు రామ్‌చరణ్‌కే దక్కుతుందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చిరంజీవి పుట్టినరోజు తర్వాత మెగాబ్రదర్స్ మరోసారి కలుసుకుని ఆప్యాయంగా మాట్లాడుకున్న తీరు వారి వారి అభిమానుల్లోనేకాదు, సినీ వర్గాల్లో సైతం నూతనోత్సాహాన్ని నింపుతోంది. 

 

10:01 - October 19, 2015

ప్రతి ఏడాది దసరాకు 'బాలకృష్ణ' నటించిన చిత్రంలోని ఒక లుక్‌ను ఆయన ఆటోగ్రాఫ్‌తో విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని తాజాగా 'బాలకృష్ణ' ఆటోగ్రాఫ్‌తో ఉన్న 'డిక్టేటర్‌'లుక్‌ను ఆయన అభిమానుల కోసం చిత్ర యూనిట్‌ ఆదివారం విడుదల చేసింది. ఆనవాయితీలో భాగంగా అభిమానులకు, ప్రేక్షకులకు బాలకృష్ణ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతకం చేసిన 'డిక్టేటర్‌' చిత్ర లుక్‌ను రిలీజ్‌ చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. బాలకృష్ణ నటిస్తున్న 99వ చిత్రమని, ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌, మోషన్‌ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు. బాలకృష్ణ, అంజలి, సోనాల్‌ చౌహాన్‌ కాంబినేషన్‌లో శ్రీవాస్‌ దర్శకత్వంలో ఈరోస్‌ ఇంటర్నేష నల్‌, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా 'డిక్టేటర్‌' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రెవెన్యూ ఉద్యోగుల ప్రమోషన్ల పై దృష్టి పెట్టిన టి.సర్కార్

హైదరాబాద్: రెవెన్యూ ఉద్యోగుల భద్రత, సంక్షేమంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీర్‌ఏలకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని సర్కారు నిర్ణయానికి వచ్చింది. రెవెన్యూ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చే ఆలోచనను సర్కారు చేస్తుంది. అవినీతి ఉద్యోగుల పట్ల కఠనంగా వ్యవహరించాలని ప్రభుత్వ నిర్ణయించింది.

నేడు హైదరాబాద్ కు దిగ్విఇజయ్, ఆజాద్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ నేత గులాంనబీ ఆజాద్‌లు ఈ రోజు హైదరాబాద్‌కు రానున్నారు. చార్మినర్ దగ్గర రాజీవ్ సద్భావన సభలో వీరు పాల్గొంటారు. అనంతరం వరంగల్ పర్యటనకు వెళ్లి పార్లమెంట్ ఉప ఎన్నికల అభ్యర్థి ఎంపికపై అభిప్రాయ సేకరణ చేయనున్నారు. అనంతరం మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో కార్యకర్తలతో సమావేశమవుతారు.

హనుమంత వాహనంపై విహరిస్తున్న శ్రీవారు

హైదరాబాద్ : నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు తిరుమలేశుడు హనుమంతవాహనంపై వేరేగారు. శ్రీవారు వెంకటాద్రి రాముడుగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ వాహన దర్శనంతో మంచి స్నేహితులు లభ్యమవుతారని భక్తుల విశ్వాసం. స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి రావడంతో తిరుమల గిరులు గోవింద నామాలతో మార్మోగుతున్నాయి.

చంద్రబాబును కలిసిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ

హైదరాబాద్‌ : నగరంలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబును కేంద్రమంత్రి దత్తాత్రేయ సోమవారం ఉదయం కలిశారు. ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న అలయ్‌బలయ్‌కు చంద్రబాబును ఆహ్వానించారు.ఈ సందర్భంగా రాజధాని శంకుస్థాపనకు మరోసారి చంద్రబాబు దత్తన్నను ఆహ్వానించారు.

తిరుపతిలో రూ.50లక్షల ఎర్రచందనం స్వాధీనం..

హైదరాబాద్ : తిరుపతిలోని లక్ష్మీపురం చెరువు దగ్గర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జరిపిన కుంబింగ్‌ ఎర్రచందనం స్మగ్లర్లు ఎదురుపడ్డారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులపైకి స్మగ్లర్లు రాళ్లతో దాడి చేసి పరారయ్యారు. అనంతరం రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వెంటిలేటర్ పై కళ్లు చిదంబరం...

విశాఖ : సీనియర్ హాస్య నటుడు, తన కళ్లతోనే నవ్విస్తూ, వందలాది చిత్రాలలో సినీ ప్రేక్షకులను నవ్వించిన కళ్లు చిదంబరం అలియాస్ కొల్లూరు చిదంబరం ఆరోగ్యం మరింతగా విషమించినట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండగా, విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్ పై ఉంచిన వైద్యులు కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్టు తెలియజేశారు. కాగా, ఫొటోగ్రాఫర్‌ రఘు 'కళ్లు' అనే సినిమాను తలపెట్టి, అందులో పాత్రను పోషించాలని ప్రముఖ దర్శకుడు ఎల్‌ సత్యానంద్‌ చిదంబరాన్ని కోరడం, ఆయన అంగీకరించడం జరిగాయి.

బాసర ఆలయంలో మూల నక్షత్ర శోభ

హైదరాబాద్ : బాసర ఆలయం మూల నక్షత్ర శోభ సంతరించుకుంది. దుర్గాదేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా నేడు సరస్వతి మూలనక్షత్ర (అమ్మవారి జన్మనక్షత్రం) పూజలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల నుంచి ఒంటిగంట దాకా మూలనక్షత్ర సరస్వతి పూజతో పాటు సహస్రనామమం, గాయత్రీఅవహనం, సుహాసిని పూజ, నివేదన హారతి, మహామంత్ర పుష్పం, కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మూల నక్షత్ర ఘడియల్లో చిన్నారులకు అక్షరశ్రీకారం చేయిస్తే భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదుగుతారని భక్తుల నమ్మకం.

నిర్మల్ కు మంత్రి కేసీఆర్

ఆదిలాబాద్ : మంత్రి కేటీఆర్ నేడు నిర్మల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన హైదరాబాద్ నుంచి హెలీక్యాప్టర్‌లో బయలు దేరీ, ఉదయం 10 గంటలకు నేరుగా నిర్మల్‌లోని జూనియర్ కళాశాల మైదానంలో దిగుతారు. అక్కడ టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికిన తర్వాత, రోడ్డు మార్గంలో దిలావర్‌పూర్ మండలం లోకల్‌వెల్మల్ గ్రామానికి 10.30గంటలకు చేరుకుని, వాటర్‌గ్రిడ్ పనుల్లో భాగంగా చేపడుతున్న ఇక్‌టెక్‌వెల్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత అదే మండలంలోని మాడేగాంకు 11 గంటలకు వెళ్లి, అక్కడి గుట్టపై వాటర్‌గ్రిడ్ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు.

09:24 - October 19, 2015

హైదరాబాద్ : వాళ్లిద్దరూ మళ్లీ కలుస్తారా...! చేయి చేయి కలుపుతారా...! ఆప్యాయంగా పలకరించుకుంటారా...! తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిదే చర్చ.. దసరా పండగవేళ..అమరావతి శంకుస్థాపన సాక్షిగా ఇద్దరు చంద్రుల ములాఖాత్ ఉంటుందా ఉండదా..! చంద్రబాబు ఆహ్వానాన్ని స్వీకరించి...కేసీఆర్ బెజవాడ ఫ్లైట్ ఎక్కుతారా..

సుమారు ఎనిమిది నెలల తర్వాత......

సుమారు ఎనిమిది నెలల తర్వాత..ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో.. బేగంపేటలోని తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. అప్పటికే గుమ్మం వద్ద ఎదురు చూస్తున్న కేసీఆర్‌.. చంద్రబాబుకు సాదరంగా స్వాగతం పలికారు. ఆయనతో పాటు.. తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రులు కేటీఆర్‌, జగదీశ్వర్‌రెడ్డిలు కూడా ఏపీ సీఎంను స్వాగతించారు. అనంతరం.. ఇద్దరు ముఖ్యమంత్రులూ దాదాపు 45 నిమిషాల పాటు.. ఏకాంతంగా భేటీ అయి పలు విషయాలపై చర్చించారు.

కేసీఆర్‌ను కలిసిన చంద్రబాబు .....

రాష్ట్ర విభజన తర్వాత తారస్థాయికి రాజకీయ విభేదాలు....

అంతకుముందు వీళ్లిద్దరూ ఫేస్ టు ఫేస్ కలిసి చాలా నెలలే అయ్యింది. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ విభేదాలు ఓ స్థాయికి చేరుకోవడంతో ఇద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. రాష్ట్రపతి హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా... 2014 ఆగస్ట్‌లో బేగంపేటలో ఇద్దరు ఎదురుపడ్డారు. రాష్ట్రపతి ప్రణబ్‌కు ఘన స్వాగతం పలికి ఆత్మీయంగా పలకరించుకున్నారు. అదే ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఇచ్చిన తేనేటి విందులో ఇద్దరు సీఎంలు పాల్గొన్నారు. చేతులు కలిసి విష్‌ చేసుకున్నారు. గవర్నర్ సమక్షంలో తేనేటి విందు స్వీకరించారు. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబర్‌లో జలవిహార్‌లో బండారు దత్తాత్రేయ అలయ్‌ బలయ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ నరసింహన్‌తో పాటు ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు, కేసీఆర్‌ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించి కేసీఆర్‌ అమరావతి శంకుస్థాపనకు వెళ్తారా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. 

09:18 - October 19, 2015

హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో ఓ తెలుగు విద్యార్ధి దారుణహత్యకు గురయ్యాడు. అమేథీ యూనివర్సిటీలో బీఎస్సీ మెరైన్‌ సైన్స్‌ చదవుతున్న సందేశ్‌ను.. అతని స్నేహితుడు ఆమన్‌ కాల్చి చంపాడని తోటి మిత్రులు చెబుతున్నారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అమేథీ యూనివర్సిటీలో విద్యార్ధుల మధ్య ఘర్షణ......

ఉత్తరప్రదేశ్‌ నోయిడాలోని అమేథీ యూనివర్సిటీలో విద్యార్ధుల మధ్య ఘర్షణ నెలకొంది. బీఎస్సీ మెరైన్‌ సైన్స్‌ చదువుతున్న సందేశ్‌ను.. తోటి స్నేహితుడు టూరిజం విద్యార్ధి ఆమన్‌ గన్‌తో కాల్పులు జరిపినట్లు తోటి స్నేహితులు చెబుతున్నారు. శనివారం మధ్యాహ్నం అపార్ట్‌మెంట్‌లో నదీమ్‌, మధుర్‌తో కలిసి ఉన్న సందేశ్‌.. డోర్‌ బెల్‌ మోగడంతో.. వెళ్లి డోర్‌ తెరిచాడు. అంతే పథకం ప్రకారం వచ్చిన ఆమన్‌ సందేశ్‌పై గన్‌తో కాల్పులు జరిపాడు. ఆమన్‌తో పాటు వచ్చిన మరో వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు.

కాల్పుల శబ్ధంతో భయపడి డోర్‌ వేసుకున్న నదీమ్‌ .......

అదే సమయంలో సందేశ్‌తో ఉన్న నదీమ్‌.. కాల్పుల శబ్ధంతో భయపడి లోపలికి వెళ్లి డోర్‌ వేసుకున్నాడు. కాసేపటికి బయట నుంచి అరుపులు వినిపించడంతో తలుపులు తీశాడు. అప్పటికే సందేశ్‌ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నాడు. నదీమ్‌తో పాటు.. రూమ్‌ పక్కనే ఉన్న మరికొంతమంది కలిసి సందేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆలోపే సందేశ్‌ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో సందేశ్‌ కుటుంబసభ్యులకు సమాచారమందించారు.

సందేశ్‌ తల్లిదండ్రులకు స్నేహితులు సమాచారం .......

తమ కుమారుడిపై దాడి జరిగినట్లు స్నేహితులు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారని సందేశ్‌ తల్లిదండ్రులు చెబుతున్నారు. దాడి ఎవరు చేశారు,.. ఎందుకు చేశారో తెలియదని వారంటున్నారు.

గొడవలు తమకు తెలియదంటున్న నదీమ్‌ ......

అయితే.. సందేశ్‌, ఆమన్‌ మధ్య ఎలాంటి గొడవలు ఉన్నాయో తమకు తెలియదని సందేశ్‌ రూమ్‌మేట్‌ నదీమ్‌ అంటున్నాడు. గతంలో వీరిద్దరూ ఒకే రూమ్‌లో ఉండేవారని.. వారిద్దరి మధ్య ఉన్న విభేదాలు తమకు తెలియవంటున్నారు.

ప్రేమ లేదా మరే ఇతర కారణం ఉందా అనే వ్యవహారంలో దర్యాప్తు .....

ఇక సందేశ్‌, ఆమన్‌లు ఇద్దరూ గతంలో ఒకే రూమ్‌ మేట్స్‌ అని పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం లేదా.. మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఘటనపై యూనివర్సిటీ అధికారులు, విద్యార్దులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సందేశ్‌ మరణవార్త తెలుసుకుని నల్లగొండ శ్రీనగర్‌ కాలనీలో విషాదం నెలకొంది. సందేశ్‌ మృతిని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

తూర్పు ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం...

న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పాత సామాన్ల మార్కెట్లో మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంగోలిపురంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు దాదాపు 400 గుడిసెలు దగ్గమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు ప్రాధమిక అంచనాకు వచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 28 అగ్నిమాపక వాహనాలతో ఘటనా స్థలికి వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు భారీ ఎత్తున వ్యాపించడంతో చుట్టూ దట్టమైన పొగలు అలుముకున్నాయి. భారీ సంఖ్యలో ఆస్తినష్టం చోటు చేసుకున్నట్లు సమాచారం.

బైక్ ను ఢీ కొట్టిన లారీ: ఇద్దరు మృతి

నెల్లూరు : కావలి రూరల్‌ మండలం గౌరవరం దగ్గర బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. అతివేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు.

08:41 - October 19, 2015

హైదరాబాద్ : మన దేశంలో ఎవరైనా రాజ్యాంగానికి లోబడి ఉండాలని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ద హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.కె. నాగేశ్వర్ తెలిపారు. పాత కొలీజియం వ్యవస్థ నే కొనసాగించాలని సుప్రీం ఆదేశించింది. ఇది ఎంత వరకు కరెక్టు? జడ్జిలను జడ్జీలే నియమించే విధానం ప్రపంచలో ఎక్కడా లేదు. ప్రభుత్వం.. న్యాయవ్యవస్థ మధ్య ఘర్షణ ఉండకూడదు. న్యాయవ్యవస్థ విశాల ప్రాతిపదికపైన ఉండాలి. మన దేశంలో పార్లమెంట్ అత్యున్నతమైనది కాదు.. ఎవరైనా రాజ్యాంగానికి లోబడే ఉండాలి. బీప్ ను చంపిన వారిని చంపాలని ఆర్ ఎస్ ఎస్ పత్రికలో ప్రచురించింది?భారతదేశంలో మెజారిటీ ప్రజలు మాంసాహారులే. భారత దేశం వేదాల ప్రకారం నడవదు.. రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. ఎవరు ఏం తినాలనేది ఒకు శాసించలేదురు. సమస్య బీఫ్ ది కాదు. భారతదేశం భిన్నత్వం పై దాడి జరగడం అనేదే సమస్య. భారత దేశం వైవిద్యం పై జరుగుతున్న దాడిని దెబ్బతీసి.. ఏకీకృత సమాజాన్నిస్థాపించాలనే రాజకీయాలను వ్యతిరేకించాలి. భిన్నత్వంలో ఏకత్వం తో కూడిన సమాజానిక కూడా ప్రమాదమే. అమరావతి శంకుస్థాపన అంశలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చూపిన ఔధార్యాన్ని అందరూ ప్రశంసించాల్సిందే అని నాగేశ్వర్ తెలిపారు. మీడియా పై సిఐఐఏ కొన్ని అంశాలను తెలిపింది.. పై అంశాలపై మరింత విశ్లేషణను వినాలకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

 

07:58 - October 19, 2015

హైదరాబాద్ : కేసీఆర్ కు శాలువా కప్పి అమరావతి శంకుస్థాపనకు ఏపీ సీఎంచంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. దాని కి తగిన విధంగా కేసీఆర్ స్పందించడం సహీద్భావ వాతావరణం అని న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన నేతలు అభిప్రాయపడ్డారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కూడా కోరారు. రాజధాని ఖర్చు ఎంత? ఖర్చు పై ప్రభుత్వం అబద్ధాలు చెపుతోందా? విపక్షాలు కపుడు మంటతో మాట్లాడుతున్నాయని టిడిపి, బిజెపి ఎందుకు ఆరోపిస్తోంది? రాజధాని శంకుస్థాన ఆహ్వానాన్ని వైసీపీ నేత జగన్ ఎందుకు తిరస్కరిస్తున్నారు? అ పద్ధతి మంచిదేనా? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చించారు. ఈ చర్చలో టిడిపి నేత విజయకుమార్, బిజెపి నేత వెంకటేశ్వర్లు, వైసీపీ అధికార ప్రతినిధి కరణం ధర్మశ్రీ, సీనియర్ విశ్లేషకులు తెలకపల్లి రవి పాల్గొన్నారు. మరి ఆ చర్చను మీరూ చూడాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడికోను క్లిక్ చేయండి...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

చిత్తూరు: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 17 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక సర్వదర్శనానికి తొమ్మిది గంటల సమయం పడుతుండగా.. కాలిబాటలోని దర్శనానికి 6గంటలు పట్టనుంది. సర్వదర్శనానికి 17 కంపార్టుమెంట్లలో, కాలిబాట దర్శనానికి ఆరు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

ముళ్ల పొదల్లో ఏడాది చిన్నారి

రంగారెడ్డి : హైదరాబాద్‌ నగర శివార్లలోని మేడ్చల్‌ మండలం కిష్టాపూర్‌ రోడ్డులో ముళ్లపొదల్లో ఏడాది చిన్నారిను వదిలివెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు పసిపాపను వదిలివెళ్లారు. దీంతో స్థానికులు ఆ పాపను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వచ్చి పాప ఆచూకీ గురించి దర్యాప్తు ఆరంభించారు.

సరస్వతిదేవిగా బెజవాడ కనదుర్గమ్మ

విజయవాడ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారు నేడు సరస్వతి దేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్ష్రతం కూడా ఇదే రోజు కావడంతో దర్శనానికి భక్తులు పోటెత్తారు. సరస్వతి దేవి అలంకరణలో ఉన్న జగన్మాతను దర్శించుకుంటే సకల శుభాలు, బుద్ది ప్రసాదం కలుగుతుందని భక్తుల నమ్మం.

06:48 - October 19, 2015

హైదరాబాద్ : తాము పాలు, కూరగాయలు, కిరాణాసామాన్లు అమ్ముకుని బతుకుతున్నట్టు చంద్రబాబునాయుడు కుటుంబం చెబుతూ వుంటుంది. ఒక్క చంద్రబాబునాయుడు కుటుంబమే కాదు అంబానీలు, బిర్లాల లాంటి ఎన్నో ప్రముఖ కుటుంబాలు, బడా కార్పొరేట్ సంస్థలు ఈ వ్యాపారంలో పోటీపడుతూ, భారీ లాభాలు ఆర్జిస్తున్నాయి. ఎవరు ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు. ఎవరికీ ఏ అభ్యంతరం వుండదు. కానీ, సామాన్యుడి నిత్యావసరాలను కుప్పలుకుప్పలుగా సేకరించి, గోడౌన్లలో దాచిపెట్టి , క్రుత్రిమ కొరతలు స్రుష్టించి, , రోజురోజుకీ ధరలు పెంచేస్తూ వెళ్లడమే అభ్యంతరకరం. కానీ, ఇవాళ భారతదేశంలో అక్షరాలా ఇదే జరుగుతోంది. బడా కార్పొరేట్ సంస్థలు అనుసరిస్తున్న బిజినెస్ వ్యూహాలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. పప్పు, ఉప్పు, కారం, నూనె ఏదీ కొనలేని పరిస్థితిని స్రుష్టిస్తున్నాయి.

ఉల్లి కష్టాలు...

కొన్ని నెలల క్రితం కొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లిగడ్డల ధర వంద రూపాయలను టచ్ చేయడం మార్కెట్ శక్తుల దుర్మార్గానికి పరాకాష్ట. కానీ, గత వారం రోజులుగా ఉల్లి మార్కెట్ లో రైతులకు ఎదురవుతున్న అనుభవాలు విస్మయం కలిగిస్తున్నాయి. కర్నూలు మార్కెట్ లో ఉల్లి ధర దారుణంగా పడిపోయింది. మార్కెట్ లో అమ్మే రైతులకి కిలో అయిదారు రూపాయలు కూడా దక్కడం లేదు. కానీ, ఇప్పటికీ కిరాణా షాపుల్లో ఉల్లి ధర ఇప్పటికీ 40, 50 పలుకుతోంది. రైతుల దగ్గర కారుచౌకగా కొని, అదే సరుకుని వినియోగదారులకు ఏడెనిమిది రెట్లకు అమ్ముతున్నారంటే మార్కెట్ శక్తులు జనం జీవితాలతో ఎంతగా ఆడుకుంటున్నాయో అర్ధమవుతూనే వుంది.

పప్పుల విషయంలోనూ...

ఒక్క ఉల్లిగడ్డ విషయంలోనే కాదు పప్పుల విషయంలోనూ ఇదే దుర్మార్గం నడుస్తోంది. గత సీజన్ లో కందులు అమ్ముకున్న రైతులకు క్వింటాకు అత్యధికంగా లభించిన ధర 4500 రూపాయలు. క్వింటా కందుల నుంచి 80 కిలోల కందిపప్పు లభిస్తుంది. కానీ, ఇవాళ కిలో కందిపప్పు ధర 200 రూపాయలు దాటింది. అంటే క్వింటా ధర అక్షరాల పదహారు వేల రూపాయలు. అంటే కందులు కొని, కందిపప్పుగా మార్చి, అమ్ముకుంటున్నవారికి నాలుగు రెట్ల లాభం. పంటల పండించే రైతుల జీవితం ఆత్మహత్యల పాలవుతోంది. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకునే మధ్యతరగతి జీవితం అప్పుల వలయంలో చిక్కుకుంటోంది. కానీ, దళారీలు ఆస్తులు పెంచుకుంటూ ఖుషీ చేసుకుంటున్నారు. గల్లీగల్లీలో బడా సంస్థల బ్రాంచ్ లు వెలుస్తున్నాయి. చిన్నచిన్న కిరాణాదుకాణాలు మూతపడుతున్నాయి. హెరిటేజ్ , రిలయన్స్, మెట్రో, మోర్, బిగ్ బజార్ ఇలాంటి సంస్థలు కిరాణా వ్యాపారంలోకి ప్రవేశించి, పెద్ద పెద్ద మాల్స్ పెట్టకపూర్వం ఇంతటి వ్యత్యాసం వుండేదా? ఈ స్థాయిలో జీవన విధ్వంసం సాగిందా? ఇక ప్రపంచవ్యాపార దిగ్గజం వాల్ మార్ట్ కూడా విశ్వరూపం చూపిస్తే, పరిస్థితి ఇంకెంత ఘోరంగా తయారవుతుందో ఊహించుకుంటేనే భయం వేస్తోంది.

బడా వ్యాపార సంస్థలు, బ్లాక్ మార్కెట్ శక్తులు.....

బడా వ్యాపార సంస్థలు, బ్లాక్ మార్కెట్ శక్తులు ఇంతగా ధరలు పెంచి, సామాన్యులెవ్వరూ పప్పులు, ఉప్పులు, నూనెలు కొనలేని పరిస్థితి స్రుష్టిస్తుంటే, ధరలను అరికట్టాల్సిన ప్రభుత్వాలు ఏమి చేస్తున్నట్టు? ఎక్కడో నాలుగు చోట్ల ఉల్లి విక్రయ కేంద్రాలో, పప్పుల దుకాణాలో పెట్టి, చేతులు దులుపుకుంటే ప్రభుత్వాల బాధ్యత తీరుతుందా? నిజానికి మనదేశంలో పప్పు ధాన్యాల, నూనె గింజల దిగుబడి కొంత తగ్గినమాట నిజమే అయినా, వినియోగానికి మించి అనూహ్యమైన డిమాండేమీ లేదు. ఏ దుకాణంలో చూసినా టన్నుల కొద్ది పప్పులు, రవ్వలు కనిపిస్తూనే వున్నాయి. కార్పొరేట్ సంస్థల గోడౌన్లలో కొన్ని లక్షల టన్నుల నిల్వలున్న సంగతి నిఘా వ్యవస్థకు తెలియదంటే నమ్మలేం. కాకపోతే, బ్లాక్ మార్కెట్ అక్రమాలను అరికట్టాల్సిన నిఘా వ్యవస్థ నిద్రపోతోంది. కాదు కాదు ప్రభుత్వాలు వాటిని నిద్రపుచ్చుతున్నాయి. ఇంత అడ్డగోలుగా నిత్యావసరాల ధరలు పెంచడానికి ఇంతకు మించిన కారణాలేమీ కనిపించడం లేదు. ఈ ధరల పెరుగుదలకు పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణం.  

06:46 - October 19, 2015

హైదరాబాద్ : నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న ధరల మీద సామాన్యుడి ఆగ్రహం పెరుగుతోంది. మార్కెట్ శక్తుల భరతంపట్టి, ధరలు తగ్గించాలంటూ పోరాటాలకు సిద్ధమవుతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో నిత్యావసరాల ధరలను అరికట్టాలంటూ ఆందోళనలు చేసేందుకు ఐద్వా సిద్ధమవుతోంది. ఈ అంశాలపై జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో ఐద్వా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి పాల్గొన్నారు. ఆ చర్చను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

06:41 - October 19, 2015

తూర్పుగోదావరి : తెలుగు భాషకు మరింత వన్నె తెచ్చేందుకు ప్రపంచ తెలుగు కవులంతా ఏకమయి గొంతు కలిపారు. తెలుగు భాష ఔన్యత్యాన్ని ప్రపంచ నలు దిశలకు చాటిచెప్పేందుకు ఎందరో..కవులు కోనసీమ గడ్డకు చేరారు. తెలుగు భాష కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యంగా తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ప్రపంచ తెలుగు కవులంతా సమావేశమయ్యారు. పవిత్ర గోదావరి నదీమ తల్లి ఒడి అంతర్వేదిలో ప్రపంచ తెలుగు కవితోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

30గంటల,.30 నిమిషాల,.30 సెకన్లు ......

సాగరసంగమం సాక్షిగా..అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 30గంటల..30నిమిషాల..30సెకన్ల పాటు ఏకబిగిన జరుగుతున్న కవితోత్సవాలు గిన్నిస్ బుక్ ఆఫ్‌ రికార్డు నెలకొల్పే దిశగా సాగుతున్నాయి. కువైట్ ప్రవాసాంధ్రుల సౌజన్యంతో జరుగుతున్న ఈ వేడుకలను రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డ్స్‌, స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేస్తున్నారు.

ప్రపంచ నలుమూలల నుంచి రెండువేల మంది కవులు.....

అంతర్వేదిలో ప్రారంభమైన ఈ ప్రపంచ తెలుగు కవితోత్సవాలకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 2వేల మంది తెలుగు కవులు తరలివచ్చారు. ఈ కార్యక్రమయంలో ప్రముఖ కవులు శివారెడ్డి, అద్దేపల్లి రామ్మోహన్, శిఖామణి, కొప్పర్తితో పాటు వేలాది మంది మంది ఔత్సాహిక కవులు, రచయితలు పాల్గొన్నారు. ఈ కవి సమ్మేళనం మంగళవారం వరకు నిరంతరాయంగా సాగుతుంది. కోనసీమ గడ్డమీద ప్రపంచ కవితోత్సవం జరగడం అదృష్టంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు తెలిపారు.

తెలుగు భాషకు రోజు రోజుకి వన్నె తగ్గిపోతున్న....

ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాషకు రోజు రోజుకి వన్నె తగ్గిపోతున్న ఇలాంటి సమయంలో కవి సమ్మేళనాన్ని నిర్వహించడం నిజంగా గొప్ప విషయమని కార్యక్రమానికి హాజరైన కవులు అభిప్రాయపడ్డారు. తెలుగు భాష ఎన్నటికి.. ఎప్పటికి వన్నె తగ్గకుండా ఉండాలంటే ఇలాంటి కవి సమ్మేళనాలు చాలా అవసరమని వారు అభిప్రాయపడ్డారు. తెలుగు భాషను నలుదిశలా చాటిచెప్పిన భోయిభీమన్న, కృష్ణశాస్త్రిలాంటి కవులు పుట్టిన నేలసాక్షిగా జరుగుతున్న తెలుగు కవి సమ్మేళనం తీరుపై కవులు, కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

06:37 - October 19, 2015

హైదరాబాద్ : ప్రాణహిత - చేవెళ్ళ సుజల స్రవంతి పథకం పురోగతిపై మంత్రి హరీష్ రావు ఇంజనీర్లు , కాంట్రాక్టర్లతో సంయుక్త సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్యాకేజీల వారీగా జరిగిన సమీక్షలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ భూసేకరణ సమస్యలు , నిధుల సమస్యలు లేకుండా ప్రభుత్వం చూసుకుంటుందని హామీఇచ్చారు. జీ ఓ 146 విడుదల చేసినందున కాంట్రాక్టర్లకు ప్రైస్ ఎస్కలేషన్ కూడా ప్రభుత్వం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం జూన్ 2017 వరకు ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ఆయకట్టు నీరివ్వాలని సంకల్పించిందని, అందుకు కాంట్రాక్టర్లు పూర్తిగా సన్నద్ధమవ్వాలని మంత్రి హరీష్‌రావు తెలిపారు.

పనుల జాప్యానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న భూసేకరణ , అటవీ అనుమతులు

ప్రధానంగా ప్యాకేజీ పనుల్లో ఉన్న ప్రధాన అడ్డంకులు ఏమిటో తెలుసుకొని వాటిని పరిష్కరించాలని మంత్రి హరీష్‌ ఆదేశించారు. ప్యాకేజీ పనుల జాప్యానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న భూసేకరణ , అటవీ అనుమతులను ఆయా జిల్లాల కలెక్టర్లతో , అటవీ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని సూచించారు. భూసేకరణ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం జారీ చేసిన జీ ఓ 123 కింద భూమి కొనుగోలు షెడ్యూళ్ళను కలెక్టర్లకు సమర్పించి భూసేకరణ పూర్తి చేయాలని సూచించారు. మరోవైపు ఇసుక లభ్యతపై సమస్యలను కూడా కాంట్రాక్టర్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యను కరీంనగర్ కలెక్టర్‌ చెప్పి పని ప్రదేశానికి దగ్గరగా ఉన్న ఇసుక క్వారీలను కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ట్రాన్స్‌కో సమన్వయంతో కరెంటు సరఫరాలో లోటులేకుండా జాగ్రత్తలు

ట్రాన్స్‌ కోతో నిరంతరం సమన్వయంతో పని చేసి కరెంటు సరఫరాలో లోటు లేకుండా సకాలంలో ప్రాజెక్టులు నిర్మించాలని ఇంజనీర్లకు సూచించారు. ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్‌ మార్పులు చేర్పులను అధికారికంగా తమకు తెలపాలని మంత్రి హరీష్‌కు కాంట్రాక్టర్లు సూచించారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. 22000 క్యూసెక్కుల కెపాసిటీతో , 7 పంపులతో డిజైన్లను పూర్తి చేయాలని సమావేశంలో మంత్రి హరీష్‌ ఆదేశించారు.

06:35 - October 19, 2015

హైదరాబాద్ :ఓరుగల్లు సిగలో మరో కలికితురాయి ఆవిష్కృతమైంది. చారిత్రక నగరాలను ప్రపంచ చిత్రపటంలో ప్రత్యేక స్థానం కల్పించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హృదయ్‌ పథకం ప్రారంభానికి ఓరుగల్లు వేదిక అయ్యింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పథకం పురుడు పోసుకుంది. దీంతో మరోసారి కాకతీయ సామ్రాజ్య వైభవం ప్రపంచ పర్యాటకులకు కనువిందు

హృదయ్‌ పథకంలో భాగంగా 12 నగరాలు ఎంపిక .....

దేశవ్యాప్తంగా హృదయ్‌ పథకంలో భాగంగా 12 నగరాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో కాకతీయ వారసత్వ నగరమైన ఓరుగల్లు స్థానం సంపాదించుకుంది. వరంగల్‌లో హృదయ్‌ పథకాన్ని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అనంతరం నగరంలో అభివృద్ధి చేయనున్న పలు ప్రాంతాలను ఆయన సందర్శించారు.

రూ.40 కోట్లు మంజూరు ......

హృదయ్‌ పథకంలో భాగంగా వరంగల్‌కు కేంద్ర ప్రభుత్వం 40 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. తొలి విడతలో భద్రకాళి ఆలయ అభివృద్ధికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చారిత్రక భద్రకాళి, పద్మాక్షి ఆలయాలను 15 కోట్ల రూపాయలతో అనుసంధానం చేయనున్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఓరుగల్లు నగరాన్ని తీర్చిదిద్దేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. నగరంలోని సహజ సిద్ధమైన అందాలను పర్యాటకులను అబ్బురపరిచే విధంగా తీర్చిదిద్దబోతున్నారు. నగరవాసులకు ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా భద్రకాళి ఫోర్‌షోర్‌ బండ్‌ను అభివృద్ధి చేయనున్నారు.

వరంగల్‌ ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం...

ఇక వరంగల్‌ అభివృద్ధిపై దృష్టి సారించామని.. స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దుతామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. వరంగల్‌ను ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దితే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందన్నారు. హృదయ్‌ పథకం దేశానికి హృదయంలాంటిదని.. కేంద్రం, రాష్ట్రం కలిసి పని చేస్తే అభివృద్ధి సాధ్యమని వెంకయ్యనాయుడు అన్నారు.

పర్యాటక కేంద్రంగా...

తెలంగాణలో ఇప్పటికే హైదరాబాద్‌ తర్వాత రెండో నగరంగా పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న వరంగల్‌... రాబోయే రోజుల్లో పర్యాటక కేంద్రంగా కూడా మారుతుందన్న సమాచారంపై... నగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

బండ్లగూడలో దారుణహత్య

హైదరాబాద్‌: బండ్లగూడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బషీర్‌బాగ్ లో ట్రావెల్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్న కుతుబుద్దీన్‌ను దుండగులు చెట్టు మొద్దుతో తలపై మోది కత్తులతో పొడిచి చంపారు. పాత కక్షలు హత్యకు కారణం అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

06:31 - October 19, 2015

హైదరాబాద్‌: బండ్లగూడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బషీర్‌బాగ్ లో ట్రావెల్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్న కుతుబుద్దీన్‌ను దుండగులు చెట్టు మొద్దుతో తలపై మోది కత్తులతో పొడిచి చంపారు. పాత కక్షలు హత్యకు కారణం అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

06:28 - October 19, 2015

గుంటూరు : అమరావతి నగర నిర్మాణానికి శంకుస్థాపన వేదికలు, ప్రాంగణం ఏర్పాటు పనులు చకచకా సాగుతున్నాయి. ప్రధాన వేదికలపై షీట్లను పరచడం పూర్తి కావచ్చింది. ఫలితంగా ఇన్ని రోజులుగా సాగుతున్న పనులకు ఓ రూపం వచ్చింది. శంకుస్థాపన రోజున ప్రముఖులను అనుమతించే కరకట్ట రోడ్డులో శనివారం నుంచే రాకపోకలను నిషేధించారు. ప్రస్తుతం అక్కడ బీటీపనులు జరుగుతున్నాయి. 20నాటికి ఈ రాదారిని అందుబాటులోకి తేనున్నారు. మరోవైపు... కేటగిరీల వారీగా ప్రముఖుల వాహనాల పార్కింగ్‌ ఏర్పాట్లనూ అధికారులు ఓ కొలిక్కి తెచ్చారు. అటు యాగశాల పనులూ పూర్తయ్యాయి. గుంటూరుకు చెందిన భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్‌ ఆధ్వర్యంలో.. రెల్లుగడ్డితో యాగశాల నిర్మాణం పూర్తయింది. ఈనెల 22 ఉదయం నుంచి హోమాలు నిర్వహించనున్నారు.

వివిధ ప్రాంతాల నుంచి పోలీసు బలగాలు.....

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పోలీసు బలగాలు మంగళగిరి బెటాలియన్‌కు చేరుకుంటాయి. మూడు రోజుల పాటు ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో విధులల్లో వీరిని ఉపయోగించుకోనున్నారు. 21న ఉద్ధండ్రాయునిపాలెంలో హెలిప్యాడ్లు, సభావేదికల వద్ద రిహార్సల్స్ జరుగుతాయి. అత్యవసర వేళల్ని ఎదుర్కోవడం, తరలింపు, ట్రయల్‌రన్ వంటివి సాధన చేస్తారు. 12 మంది ఐపీఎస్‌లు, 15 మంది ఎస్పీ స్థాయి అధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

18 వరకూ వైద్య శిబిరాల ఏర్పాటు.....

శంకుస్థాపన వేదిక ప్రాంగణంలో 18 వరకూ వైద్య శిబిరాలనూ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి శిబిరం వద్దా కనీసం పది మంది వైద్యుల బృందం సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖులు చాలామంది ఈ ప్రాంతానికి తరలి వస్తుండడంతో.. అగ్నిమాపక శాఖ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సుశిక్షిత సిబ్బందితో.. ఆధునిక పరికరాలతో సిద్ధమైంది.

సిద్ధంగా 20 అగ్నిమాపక వాహనాలు ....

ఉద్ధండ్రాయునిపాలెంలో మొత్తం 20 అగ్నిమాపక వాహనాలు సిద్ధంగా ఉంచుతున్నారు. 9 హెలిప్యాడ్ల వద్ద ఒక్కో అగ్నిమాపక వాహనం ఉంచుతారు. సభా వేదిక వద్ద, జనం మధ్యలో, తాత్కాలిక విద్యుత్ కేంద్రాలు, ప్రధాన మార్గాల్లో మరో 11 వాహనాలను మోహరిస్తారు. విద్యుత్ ఉపకరణాల వద్ద రెండేసి ఫైర్‌ సేఫ్టీ సిలిండర్లతో అప్రమత్తంగా ఉంటారు. శంకుస్థాపన విధుల్లో సుమారు 80 మంది రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ సిబ్బందినీ వినియోగించుకోనున్నారు. 

06:25 - October 19, 2015

గుంటూరు :అమరావతి శంకుస్థాపన పనులు.. ప్రజల్లో అమితాసక్తిని పెంచుతున్నాయి. యుద్ధప్రాతిపదికన సాగుతున్న నిర్మాణాలను తిలకించేందుకు.. సమీప గ్రామాల వారితో పాటు.. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలూ తరలి వస్తున్నారు. పైగా పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు.. ప్రజలు కుటుంబ సమేతంగా శంకుస్థాపన ప్రాంగణానికి వస్తున్నారు. ఇక్కడి ఏర్పాట్లను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఎక్కువైన సెల్ఫీల మోజు....

ఇటీవలి కాలంలో ఎక్కువైన సెల్ఫీల మోజు ఇక్కడా కనిపిస్తోంది. పనులు జరుగుతున్న తీరు, భారీ ప్రాంగణాలు, ప్రధాన వేదికలతో పాటు.. ఆసక్తికరంగా కనిపించిన ప్రతి అంశాన్ని ఫోటోలు తీస్తున్నారు. సాయంత్రమైతే ప్రాంగణమంతా ఓ వైపు పనుల హడావుడి.. మరోవైపు సందర్శకుల సందడితో కళకళలాడుతోంది. ఈ ప్రాంతంలో సరియైన వసతులు లేని కారణంగా.. నిర్మాణ పనుల్లో పాల్గొనే కార్మికులు అల్పాహార, భోజనాల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. దీనికి తోడు.. పనులను పరిశీలించేందుకు వచ్చే సందర్శకుల సంఖ్యా పెరిగింది. దీంతో.. స్థానికులు కొందరు.. మొబైల్‌ హోటళ్లను ప్రారంభించేశారు. సందర్శకుల సంగతేమోకానీ.. ఈ చిరువ్యాపారుల ప్రయత్నం.. కార్మికులకు కడుపు నిండా కూడు దక్కేలా చేసింది.

శంకుస్థాపన ప్రాంతానికి తరలి వస్తోన్న వివిధ ప్రాంతాల ప్రజలకు.....

మరోవైపు.. శంకుస్థాపన ప్రాంతానికి తరలి వస్తోన్న వివిధ ప్రాంతాల ప్రజలకు.. రాజధాని గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా.. పోలీసులు సన్నాహాలు ప్రారంభించారు. గ్రామస్థులతో మైత్రీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

06:21 - October 19, 2015

హైదరాబాద్ : నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలలో హీరో విశాల్ వర్గం హవా కొనసాగింది. తీవ్ర ఉత్కంఠల మధ్య కొనసాగిన ఈ ఎన్నికల్లో చివరకు విశాల్‌ వర్గం విజయం సాధించింది. గత పదేళ్లుగా నడిగర్‌ సంఘంలో చక్రం తిప్పిన శరత్‌కుమార్‌ ప్యానెల్‌ విశాల్‌ బ్యాచ్‌ ఎంట్రీతో ఓటమి పాలయ్యింది. విశాల్ టీమ్ అనుకున్నది సాధించింది. దాదాపు రెండు మూడు నెలలుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ, నడిగర్ సంఘంలో పాగా వేయడానికి, శరత్ కుమార్ వర్గాన్ని చావుదెబ్బ కొట్టడానికి వేసుకున్న స్ట్రాటజీలు అన్నీ ఫలించాయి.

శరత్ కుమార్‌పై పూర్తి ఆధిక్యం.....

నాజర్ 113 ఓట్ల తేడాతో శరత్ కుమార్‌పై పూర్తి ఆధిక్యం ప్రదర్శించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. నాజర్‌కు 1344 ఓట్లు పోలవ్వగా, శరత్ కుమార్‌కు 1231 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా విశాల్, కోశాధికారిగా కార్తీ ఘన విజయం సాధించారు. విశాల్‌కు 1445 ఓట్లు రాగా మరో అభ్యర్థి రాధా రవికి 1138 ఓట్లు పోలయ్యాయి.

చివరి నిమిషం వరకు దోబూచులాట...

విజయం నాజర్, శరత్ కుమార్ ల నడుమ చివరి నిమిషం వరకు దోబూచులాడింది. విశాల్ తన ప్రత్యర్థి రాధారవిపై గెలుపొందాడు. సూర్య సోదరుడు హీరో కార్తీ కోశాధికారిగా కన్నన్ పై విజయం సాధించాడు. ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. చెన్నైలోనే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే హీరోగా ఎదిగిన విశాల్ ను ఒక దశలో తెలుగువాడంటూ, నాన్‌ లోకల్‌ అంటూ ప్రచారం కూడా జరిగింది. అయినా అవేమీ ఎవరూ పట్టించుకోలేదు.

మరోసారి పగ్గాలు చేపట్టాలని భావించి.....

మరోసారి పగ్గాలు చేపట్టాలని భావించిన శరత్‌కుమార్ టీమ్ ఈ ఎన్నికల ఫలితాలలో డీలా పడింది. గత పదేళ్లుగా నడిగర్ సంఘానికి ప్రముఖ నటుడు శరత్‌కుమార్ బృందం కార్య నిర్వాహకవర్గంగా కొనసాగారు. ఈ సారి నడిగర్ ఎన్నికలు చాలా రసవత్తరంగా మారాయి. ఓ విధంగా చెప్పాలంటే సీనియర్, జూనియర్ నటుల మధ్య పోటీగా మారింది. హీరో విశాల్ చాలా పద్దతిగా, ప్రణాళికా బద్ధంగా, మొదటి నుంచీ ఎన్నికల వ్యూహాన్ని రచించుకుంటూ వచ్చారు. కీలక వ్యక్తుల, నటుల మద్దతు సంపాదించడంతోనే విజయం సాధించాడు.

పందెం కోడి గెలిచింది.

హైదరాబాద్ : విశాల్ టీమ్ అనుకున్నది సాధించింది. దాదాపు రెండు మూడు నెలలుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ, నడిగర్ సంఘంలో పాగా వేయడానికి, శరత్ కుమార్ వర్గాన్ని చావుదెబ్బ కొట్టడానికి వేసుకున్న స్ట్రాటజీలు అన్నీ ఫలించాయి. 

ఆగివున్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ప్రకాశం : జిల్లాలోని పెదారవీడు మండలం మద్దలకట్ట వద్ద రోడ్డు పై ఆగి ఉన్న లారీని రాయచోటి డిపోకు చెందిన ఆర్టీసి బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 15 మంది కి గాయాలయ్యాయి. గాయాలయిన వారో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

శ్రీవారి గరుడ సేవకు పోటెత్తిన భక్తులు..

తిరుమల: తిరుమలలో శ్రీవారి గరుడసేవకు ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. రామ్ బగిచ అతిధి గృహం వద్ద భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. భక్తులు బారీకేడ్లను విరగ్గొట్టి తిరుమాడ వీధుల్లోకి ప్రవేశించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వారిని అదుపు చేయడానికి సిబ్బంది, పోలీసులు శ్రమించారు.

క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్టు

హైదరాబాద్ :క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని జీడిమెట్ల వీరప్ప నగర్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లగా భీమవరానికి చెందిన సతీష్ అనే వ్యక్తి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నాడని తెలిసింది. దీంతో ఆయనతోపాటు మరో ఆరుగురిని కూడా పోలీసులు అరెస్టు చేయగా వీరి వద్ద నుంచి రూ. 69 వేల నగదు, 14 సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Don't Miss