Activities calendar

20 October 2015

రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించిన చంద్రబాబు

విజయవాడ : రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించానని.. ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ట్రాఫిక్ కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయన్నారు. దుష్ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు

22:04 - October 20, 2015

విజయవాడ : రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించానని.. ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ట్రాఫిక్ కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయన్నారు. దుష్ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 16 వేల గ్రామాల నుంచి నీరు, మట్టిని సేకరించామని తెలిపారు. రాజధాని శంకుస్థాపనకు అందరి దేవుళ్ల ఆశీస్సులు కావాలని కోరారు. 

21:57 - October 20, 2015

ఢిల్లీ : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. ఓ చోట పోలింగ్‌ ముగిసిన రోజే ప్రధాని మరోచోట ప్రచారం చేయడం ద్వారా లైవ్‌ టీవీలో ప్రసారం అవుతుందని, అది ఓటర్లపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడడం సరి కాదని ఏచూరి పేర్కొన్నారు. ఈవీఎం యంత్రాల్లో లోపాలున్నాయంటూ ఎలక్షన్‌ కమిషన్‌కు సిపిఎం ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌, కేరళలలో ఇలాంటి సమస్యలు వచ్చాయని, ఈసీ సానుకూలంగా స్పందించిందని తెలిపారు.

21:54 - October 20, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణాలు భయాందోళన కలిగిస్తున్నాయి. వేర్వేరు చోట్ల ఈరోజు జరిగిన ప్రమాదాల్లో 9 మంది మృత్యువాతపడ్డారు. డ్రైవర్ల మితిమీరిన వేగం.. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని.. తర్వాత పట్టించుకోకపోవడమే దీనికి కారణమని పలువురంటున్నారు.
బయటకు వెళ్లిన వారు ఇంటికి క్షేమంగా వస్తారా?
బయటకు వెళ్లిన వారు ఇంటికి క్షేమంగా వస్తారా? రారా అనే సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృత్యువాతపడగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి.
గుంటూరు జిల్లాలో ఒకరి మృతి
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం అలంకార్‌ థియేటర్‌ వద్ద బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాల మధ్య బైక్‌ చిక్కుకోవడంతో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. లారీకి నిప్పు అంటుకొని వాహనం మొత్తం దగ్ధమైంది. బస్సులో ప్రయాణిస్తున్న వారికి స్వల్పగాయాలయ్యాయి.
నల్లగొండలో మహిళ మృతి
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పక్కనే పెట్రోలింగ్‌ పోలీసులు ఉండడంతో క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
మహబూబ్‌నగర్‌ జిల్లాలో ముగ్గురి మృతి
మహబూబ్‌నగర్‌ జిల్లా వెల్దండ మండలంలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీశైలం వెళ్లే రహదారిపై మరో ప్రమాదం జరిగింది. అదుపుతప్పి లారీ బోల్తాపడడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి.
వరంగల్‌ జిల్లాలో ఇద్దరి మృతి
వరంగల్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. శాయంపేట మండలం మందారిపేట సమీపంలో లారీ-బైక్‌ ఢీకొనడంతో భూపాలపల్లికి చెందిన మనుపట్ల కిరణ్‌,.. మందారిపేటకు చెందిన ప్రేమసాగర్‌ మృతిచెందాడు. రెండు వాహనాలు మితిమీరిన వేగంతో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 9 మది మృత్యువాతపడ్డారు. దీంతో పండుగ రోజున పలువురి ఇళ్లలో విషాదచాయలు నెలకొన్నాయి.

 

రాజధాని శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి : డీజీపీ రాముడు

విజయవాడ : రాజధాని శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఎపి డీజీపీ రాముడు తెలిపారు. శంకుస్థాపన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించున్నట్లు చెప్పారు. ఆహ్వానితుల కోసం ఏడు మార్గాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 11.30 వరకే వాహనాలకు సభా స్థలి వద్దకు అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు రాజధాని శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు.

 

అమరావతి శంకుస్థాపనకు హాజరవుతాం : వైవి

విజయవాడ : ఈనెల 22న అమరావతి శంకుస్థాపనకు హాజరవుతామని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.  

స్పిన్నర్ అమిత్ మిశ్రాకు నోటీసులు

హైదరాబాద్ : స్పిన్నర్ అమిత్ మిశ్రాకు బెంగళూరు పోలీసుల నోటీసులు జారీ చేశారు. మహిళపై దాడి చేశాడని అమిత్ మిశ్రాపై ఆరోపణలు ఉన్నాయి.  

నకిలీ పోలీసుల అరెస్టు

హైదరాబాద్ : మైత్రివనం వద్ద ఇద్దరు నకిలీ పోలీసులను అరెస్టు చేశారు. పోలీసులమంటూ వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

 

మెదక్ నర్సన్నపేట గ్రామస్తులతో సీఎం కేసీఆర్ ముఖాముఖి

మెదక్ : జగదేవ్ పూర్ మండలం నర్సన్నపేటలో గ్రామస్తులతో సీఎం కేసీఆర్ ముఖాముఖి నిర్వహించారు. దేశానికే ఆర్శంగా ఎర్రవెల్లి, నర్సన్నపేటలను తీర్చిదిద్దుతానని సీఎం కేసీఆర్ చెప్పారు. కొండపాక మండలం నాగిరెడ్డిపల్లిని దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. 

21:39 - October 20, 2015

సింగపూర్ : బతుకమ్మ సంబరాలను సింగపూర్ లో ఘనంగా నిర్వహించుకున్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో సంబవాంగ్ పార్కులో బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ వేడుకలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందినవారు పాల్గొన్నారు.

 

 

21:24 - October 20, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. అత్యంత ఆకర్షణీయంగా తయారు చేసిన బతుకమ్మలను నెత్తులపై పెట్టుకుని బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ ఆటా పాటలతో మహిళలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలో బతుకమ్మ పండుగను మహిళలు అంత్యంతవైభంగా నిర్వహించుకుంటున్నారు. ప్రభుత్వం బతుకమ్మ సంబరాలకు భారీగా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. ఎల్ బి స్టేడియంలో దాదాపు 15 వేల బతుకమ్మను తయారు చేశారు. ఎల్ బి స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ కు మహిళలు ర్యాలీగా బయలుదేరారు. బతుకమ్మ కన్నులపండువగా జరుగుతోంది. చిన్నారులు, అమ్మాయిలు, మహిళలు బతుకమ్మ ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. 
అలరిస్తున్న లేజర్ షో...
హుస్సేన్ సాగర్ లో ఏర్పాటు చేసిన లేజర్ షోలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. విద్యుత్ దీపాల కాంతులు మిరిమిట్లుగొలుపుతున్నాయి. పది జిల్లాల నుంచి వచ్చిన అలంకృత శకటాలు శకటాలను అందరినీ కనువిందు చేస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం.. మూడింటిని ఉత్తమ శకటాలు గుర్తించింది. వాటికి బహుమతులను కూడా ఇచ్చింది. ప్రథమ బహుమతి.. లక్ష , ద్వితీయ బహుమతికి.. 75 వేలు, తృతీయ బహుమతి 50 వేల రూపాయలను బహుమతులను ప్రకటించింది. మెదక్ జిల్లా మంజీరా శకటానికి ప్రథమ బహుమతి, నిజామాబాద్ జిల్లా అలంకృత శకటానికి ద్వితీయ బహుమతి, ఆదిలాబాద్ జిల్లా అలంకృత శకటానికి తృతీయ బహుమతులు అందించారు.

 

22న ఎర్రవల్లిలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన

మెదక్ : 22న ఎర్రవల్లిలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరుగనుంది. కేసీఆర్ చేతుల మీదుగా డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన కానుంది. 5 నెలల్లో ఇళ్లను నిర్మించి గ్రామస్తులకు అదిస్తామని సీఎం చెప్పారు. 6 నెలల్లో గజ్వేల్ నియోజకవర్గానికి సుజల స్రవంతి తాగునీరు అందిస్తామని చెప్పారు. ఎర్రవల్లి దసరా ఉత్సవాల్లో పాల్గొంటానని సీఎం చెప్పారు.  

20:16 - October 20, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. అత్యంత ఆకర్షణీయంగా తయారు చేసిన బతుకమ్మలను నెత్తులపై పెట్టుకుని బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ ఆటా పాటలతో మహిళలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలో బతుకమ్మ పండుగను మహిళలు అంత్యంతవైభంగా నిర్వహించుకుంటున్నారు. ప్రభుత్వం బతుకమ్మ సంబరాలకు భారీగా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. ఎల్ బి స్టేడియంలో దాదాపు 15 వేల బతుకమ్మను తయారు చేశారు. ఎల్ బి స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ కు మహిళలు ర్యాలీగా బయలుదేరారు. బతుకమ్మ కన్నులపండువగా జరుగుతోంది. చిన్నారులు, అమ్మాయిలు, మహిళలు బతుకమ్మ ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు.
ఎల్ బి స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ కు బతుకమ్మ ర్యాలీ
ఎల్ బి స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ కు బతుకమ్మ ర్యాలీ కొనసాగుతోంది. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపీ కవిత పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మహిళలు, కళాకారులు ట్యాంక్ బండ్ కు తరలివచ్చారు. అధికారులు భారీ లైటింగ్ ఏర్పాటు చేశారు. మహిళలను బ్రతకనివ్వండి.. ఎదగనివ్వండి.. చదవనివ్వండి అనే నినాదాలతో ప్రభుత్వం ఉత్సవాలను నిర్వహిస్తుంది. తెలంగాణ ఊటి అనంతరగిరి అంటూ ఆడవారు చక్కగా బతుకమ్మలను అంగరంగ వైభవంగా తయారు చేశారు. గిరిజన మహిళలు నృత్యాలు చేస్తున్నారు.
మహిళలందనీ.. ఏకం చేసిన పండుగ బతుకమ్మ : ఎంపీ కవిత
మహిళలందనీ.. ఏకం చేసిన పండుగ బతుకమ్మ అని నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. ఈ సంస్కృతీ సంప్రదాయాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. బంగారు తెలంగాణగా ఉండాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ, సంస్కృతి, సంప్రదాయాలు, బతుకమ్మను భవిష్యత్ తరాలకు అందిచాలి.
వరంగల్....
వరంగల్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకుంటున్నారు. హన్మకొండలోని పద్మాక్షమ్మ దేవాలయం ప్రాంగణంలో అత్యంత వైభవంగా బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నారు. బతుకమ్మ ఆడితే.. ఉత్సాహంగా.. ఉల్లాసంగా... ఉంటుందని.. శక్తినిస్తుందని మహిళలు చెబుతున్నారు. స్త్రీ జాతికి.. బతుకమ్మ గర్వకారణమన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని చెబుతున్నారు.

 

 

19:45 - October 20, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పై తంగేడివనం పుస్తకాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపీ కవతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. 

19:35 - October 20, 2015

సరోగసీ విధానం అంతా ప్రభుత్వ నియంత్రణలో ఉండాలని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన మానవి వేదిక చర్చా కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ప్రతినిధి రమ, అడ్వకేట్ శ్యాంసుందరి పాల్గొని, మాట్లాడారు. చట్టం పరిధిలో లేని కారణంగా మానవ పిండాల రవాణా జరుగుతోందన్నారు. అద్దె గర్భం పద్ధతి అంతా పారదర్శకంగా జరగాలని చెప్పారు. ఆ వివరాలను వారి మాటల్లోనే....
'సరోగసీకి ఒప్పుకునే తల్లుల హక్కులను కాపాడాలి. అనేక మంది సరోగసీ తల్లులు మానసిక వేదనకు గురవుతున్నారు. సరోగసీ తల్లులు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. సరోగసీ తల్లులకు చెల్లించే మూల్యం భారీగా ఉండాలి. సరోగసీపై సమాజంలో అవగాహన రావలసిన అవసరముందన్నారు. సరోగసీకి సంబంధించి స్పష్టమైన విధానాల రూపకల్పన జరగాలి. సరోగసీ విధానం అంతా ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి' అని వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

ఎల్ బి స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ కు బతుకమ్మ ర్యాలీ

హైదరాబాద్ : ఎల్ బి స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ కు బతుకమ్మ ర్యాలీ కొనసాగుతోంది. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపీ కవిత పాల్గొన్నారు. 

19:17 - October 20, 2015

శ్రీకాకుళం : పార్టీలకతీతంగా సాగుతున్న ప్రత్యేక హోదా ఉద్యమానికి సీఎం చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. విభజన చట్టంలోని అంశాలన్నీ సాధించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలో సీపీఐ ఆధ్వర్యంలో కొనసాగిన పాదయాత్ర శ్రీకాకుళంలో ముగిసింది. విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదాను సాధించాల్సిన ప్రభుత్వం.. ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారంటూ బీజేపీని వెనకేసుకొస్తుందన్నారు. ఈనెల 22లోగా ప్రత్యేక హోదా ప్రకటించకపోతే.. అన్ని ప్రాంతాల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

19:11 - October 20, 2015

విజయవాడ : అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సంకల్ప జ్యోతిని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాజధాని నిర్మాణ పనులు నిర్విజ్ఞంగా కొనసాగాలని సంకల్పిస్తూ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడి నుంచి అమరావతి వరకు సంకల్పజ్యోతి యాత్ర నిర్వహించారు. 22వ తేదీ వరకు సంకల్పజ్యోతి నిరంతరాయంగా వెలగనుంది.

 

ఇంద్రకీలాద్రి నుంచి అమరావతికి సంకల్ప జ్యోతి

విజయవాడ : సంకల్ప జ్యోతిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాజధాని నిర్మాణ పనులు నిర్విఘ్నంగా కొనసాగాలని ఇంద్రకీలాద్రి నుంచి అమరావతికి సంకల్ప జ్యోతి యాత్ర ప్రారంభం అయింది. 22 వ తేదీ వరకు సంకల్పజ్యోతి యాత్ర కొనసాగనుంది.  

18:42 - October 20, 2015

చిత్తూరు : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఏడవ రోజున ఉదయం శ్రీవారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవం చివరిరోజున ప్రధాని మోడీ రానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈరోజు నుంచి ఎల్లుండి వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నట్లు తెలిపారు. వచ్చే భక్తులకు అత్యంత నాణ్యమైన మంచినీరు, భోజనం సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. 15 వేల నుంచి 20 వరకు భక్తుల సముదాయాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.

 

18:30 - October 20, 2015

చిత్తూరు : తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి వద్ద ప్రపంచ ప్రఖ్యాత అట్లాస్ విగ్రహం తొలగింపు తీవ్ర వివాదం రేపుతోంది. అట్లాస్ విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించి, దాని స్థానంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విగ్రహం తొలగింపుపై అఖిలపక్ష నేతలు తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. స్విమ్స్ ముందర బైఠాయించి ఆందోళన చేశారు. విగ్రహల తొలగింపు నిర్ణయం ఏకపక్ష నిర్ణయమని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి అధికారంలో ఉన్నందున నేడు ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని..భవిష్యత్‌లో మరొకరు అధికారంలోకి వస్తే వాళ్ల విగ్రహాలు పెడతారా అంటూ మండిపడ్డారు. దీనిపనై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది.

 

18:28 - October 20, 2015

కరీంనగర్ : బతుకమ్మ అనగానే మనకు మహిళల ఆట-పాట గుర్తుకువస్తున్నాయి. కానీ.. కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో వెరైటీగా పురుషులు కూడా బతుకమ్మ ఆడటం ఆనవాయితి. ఆడవాళ్లతో పోటీ పడుతూ పురుషులు బతుకమ్మ ఆడుతుంటారు. 

18:21 - October 20, 2015

హైదరాబాద్ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, సీఎల్పీ లీడర్‌ జానారెడ్డిపై ఆ పార్టీకి చెందిన మరో సీనియర్‌ నేత పాల్వాయి గోవర్థన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జానారెడ్డిలో లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌ సరిగా లేవని అన్నారు. జానారెడ్డి మంత్రిగా సుధీర్ఘ అనుభవం ఉన్నా..ఆయనలో పోరాటపటిమ లేదన్నారు. పోరాట పటిమతోనే ఆనాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, చెన్నారెడ్డి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేగలిగారని పాల్వాయి అన్నారు.

 

18:17 - October 20, 2015

విజయవాడ : అమరావతి రాజధాని శంకుస్థాపనలో జర్నలిస్టులు కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 'మన మట్టి-మన నీరు' పిలుపులో భాగంగా 13 జిల్లాల్లో ఏపీయూడబ్ల్యూజే నేతలు ఆయా పవిత్ర స్థలాల నుంచి మట్టిని, పుణ్యజలాలను సేకరించడంతో కోడెల వారిని అభినందించారు. రాజధానిలో అందరూ భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపిచ్చిన నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తోందని ఆయన అన్నారు.

18:07 - October 20, 2015

మహారాష్ట్ర : ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వ హయాంలో పేదలు కనీసం పప్పన్నం తినే పరిస్థితి కూడా కరువైందని కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు నిరసనగా కాంగ్రెస్‌ ముంబైలో భారీ ర్యాలీ నిర్వహించింది. కందిపప్పు కేజీ 2 వందలు కాగా.. ఇతర పప్పుల ధరలన్నీ వంద మార్క్‌ దాటిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది. అచ్ఛేదిన్‌ అంటే ఇదేనా అంటూ కాంగ్రెస్‌ మోడీని నిలదీసింది. పక్కదేశాల్లో కిలో పప్పు 60 ఉంటే ఇక్కడ 2 వందలకు పెరగడానికి కారణం ప్రభుత్వ వైఫల్యమేనని ఆ పార్టీనేత సంజయ్‌ నిరుపమ్‌ పేర్కొన్నారు. వ్యాపారులతో ప్రభుత్వం కుమ్మక్కయ్యిందని, అక్రమ నిల్వలపై దాడులు నిర్వహించడం లేదని ఆరోపించారు.

 

18:03 - October 20, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వపాలన గాడితప్పిందని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన దిగ్విజయ్‌సింగ్‌...కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో టి పిసిసి నేతలతో సమావేశమయ్యారు. రైతుల ఆత్మహత్యలు, నారాయణఖేడ్‌ ఉప ఎన్నికలపై నేతలతో దిగ్విజయ్‌ సింగ్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం హెల్త్‌యూనివర్శిటీని నిర్మిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేదని దిగ్విజయ్‌ విమర్శించారు. నారాయణఖేడ్‌ ఉప ఎన్నికలపై విస్త్రతంగా చర్చించామని..స్థానికనేతల అభిప్రాయం మేరకే అభ్యర్థి ఎవరనేది నిర్ణయం తీసుకుంటామని టి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

 

18:00 - October 20, 2015

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ రాహుల్‌బొజ్జా తెలిపారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన మహిళలు.. ఇక్కడి నుంచి ట్యాంక్‌బండ్‌కు బతుకమ్మలను తీసుకెళ్తారని కలెక్టర్‌ తెలిపారు. 65 టన్నుల పూలతో 10 నుంచి 15 వేల బతుకమ్మలను తయారు చేసినట్లు చెప్పారు. భారీ లైటింగ్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

 

18:00 - October 20, 2015

షారుఖ్ ఖాన్..కాజల్..వీరు జంటగా నటించిన పలు చిత్రాలు విజయవంతమైన సంగతి తెలిసిందే. అందులో ప్రధాన చిత్రం 'దిల్ వాలే దుల్హానియా లేజాయింగే'. ఈ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 'దిల్ వాలే' దర్శకుడు రోహిత్ శెట్టి షారుఖ్ (రాజ్), కాజల్ (సిమ్రాన్) పాత్రలను మళ్లీ షూట్ చేశారు. అలా చేసిన వీడియోను సరదాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ వీడియోలో రాజ్, సిమ్రాన్ లు తాము ప్రేమలో ఉన్న రోజులను గుర్తు చేసుకుంటుంటారు. షారుఖ్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ఇదిలా ఉంటే రోహిత్ శెట్టి దర్శకత్వంలో షారుఖ్..కాజల్ లు జంటగా 'దిల్ వాలే' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

17:51 - October 20, 2015

గుంటూరు : జిల్లా మెడికల్ కళాశాల వెనుక ఉన్న పోలీస్ క్వార్టర్స్ స్థలంలో సీఐడీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి డీజీపీ రాముడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయనా మాట్లాడుతూ నవ్యాంధ్ర ప్రదేశ్‌లో సీఐడీ విభాగం పరిపాలన గుంటూరు నుంచి నిర్వహిస్తామని డీజీపీ తెలిపారు. 2500 చదరపు గజాల్లో మూడున్నర కోట్ల వ్యయంతో ఈ కార్యాలయం నిర్మిస్తున్నారు. రాజధాని శంకుస్థాపనకు భద్రతా పరంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు డీజీపీ తెలిపారు.

17:45 - October 20, 2015

గుజరాత్ : అదో ఆసుపత్రి..అందులో ఐసీయూ..ఇక్కడ ఆసుపత్రి సిబ్బంది స్టెప్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తోంది. ఇది ఎక్కడ జరిగింది ? అనేది తెలుసుకోవాలంటే ఇది చదవండి..
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సోలా సివిల్ ఆసుపత్రి. ఇక్కడ రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నితిన్ భాయ్ పటేల్ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ప్రారంభించారు. అనంతరం శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వైద్యులు తమ వృత్తిని కాసేపు పక్కన పెట్టారు. హాస్పిటల్‌లో పేషంట్ల మధ్య గార్బా నృత్యం చేస్తూ అలరించారు. అహ్మదాబాద్‌లోని సోలా సివిల్‌ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సుల గార్బా నృత్యంతో పేషంట్లు రిలాక్స్‌ అయ్యారు.

17:44 - October 20, 2015

హైదరాబాద్ : అసలు వెళ్లరని కొందరు, వెళ్తారని మరికొందరు. ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు. అన్నీ ఒక్కసారిగా పటాపంచలైపోయాయి. డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి. అసాధ్యం అనుకున్నది కాస్తా అరుదైన దృశ్యంలా మరో రెండు రోజుల్లో ఆవిష్కృతం కాబోతోంది. శుభముహూర్తాన చంద్రోదయం వికసించబోతోంది. రాజధాని శంకుస్ధాపనకు కేసీఆర్ ను స్వయంగా ఆహ్వానిస్తానని చెప్పిన ఏపి సీఎం చంద్రబాబు అన్నట్లుగానే రెండు రోజుల క్రితం టీఎస్ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు వెళ్లి ఆహ్వాన పత్రిక అందించారు. చంద్రబాబును సాదరంగా ఇంట్లోకి తీసుకెళ్లిన కేసీఆర్ రాజధాని శంకుస్ధాపనకు వస్తానని చెప్పారు.
కేసీఆర్‌ను ఆహ్వానించిన లగడపాటి, టీజి వెంకటేష్
ఇదిలా ఉంటే టీఎస్ సీఎం కేసీఆర్ దాదాపు 14 ఏళ్లుగా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అడుగు పెట్టినది లేదు. ఒకటి రెండు సార్లు ఓ సామాన్య భక్తుడిలా తిరుమలకు మాత్రమే వెళ్లారు. తెలంగాణ ఉద్యమం పతాక స్ధాయిలో జరుగుతున్నప్పుడు జై ఆంధ్ర మహా సభ ,దళిత మహాసభలు కేసీఆర్కు సంఘీభావం ప్రకటించాయి. తమ ప్రాంతంలో పర్యటించి తాము నిర్వహిస్తున్న ఉద్యమానికి కూడా మద్దతు తెలపాలని కోరాయి. కేసీఆర్ వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేసినప్పటికి బీభత్సం సృష్టించిన లైలా తుఫాను కారణంగా అది వాయిదా పడింది. ఇక కరడుగట్టిన సమైక్యవాదులుగా పేరున్న లగడపాటి, టీజి వెంకటేష్‌ వంటి నేతలు కూడా ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ఆవశ్యకతను వివరిస్తాననే కేసీఆర్ ప్రకటనను స్వాగతించారు. కానీ చివరికి అది కూడా కార్యరూపం దాల్చలేదు.
హెలికాప్టర్‌ ద్వారా వెళ్లనున్న కేసీఆర్‌
ఇప్పుడు రాజధాని శంకుస్ధాపన వేడుక కోసం కేసీఆర్ టూర్ ఖరారైంది. తొలుత సూర్యాపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని ఆయన డిసైడయ్యారు. కానీ భద్రతా బలగాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు రోడ్ జర్నీ సేఫ్‌ కాదని సూచించటంతో హెలికాప్టర్‌ ద్వారా వెళ్లనున్నారు. సూర్యాపేట నుంచి గన్నవరం వరకు కేసీఆర్ హెలికాప్టర్‌లో వెళ్తారు. ఇక గన్నవరం నుంచి శంకుస్ధాపన జరిగే స్థలానికి కేసీఆర్ను తీసుకెళ్లేందుకు ఓ ప్రత్యేక హెలికాప్టర్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే సమర్పించనుంది. ఆయన సెక్యూరిటీ అంతా ఏపి సర్కారే చూసుకోనుంది.
దుర్గమ్మ ఆలయానికి వెళ్లే ఛాన్స్
ఇదిలా ఉంటే తెలంగాణ సిద్ధిస్తే తిరుమల వెంకన్న, ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు మొక్కులు చెల్లిస్తానని కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. ఇందుకోసం నిధులు కూడా విడుదలయ్యాయి. దీంతో కేసీఆర్ బెజవాడ దుర్గమ్మ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మొక్కు చెల్లించుకునేందుకు తిరుమలకు కూడా కేసీఆర్ వెళ్తారని సమాచారం. ఏది ఏమైనప్పటికి రాజధాని శంకుస్ధాపనకు కేసీఆర్ వెళ్తుండటంతో ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

అమరావతి శంకుస్థాపనకు భద్రతా చర్యలు : డీజీపీ రాముడు

విజయవాడ : అమరావతి శంకుస్థాపనకు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టామని ఎపి డిజిపి రాముడు పేర్కొన్నారు. రేపు పోలీసు అమరుల సంస్మరణ కార్యక్రమానికి సీఎం హాజరవుతారని తెలిపారు. గతేడాది విధి నిర్వహణలో 14 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. పోలీసు సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసినట్లు పేర్కొన్నారు.

 

శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించిన ప్రధాని భద్రతా సిబ్బంది

గుంటూరు : అమరావతి గుంటూరు శంకుస్థాపన ప్రాంతాన్ని ప్రధాని భద్రతా సిబ్బంది పరిశీలించింది.  

16:11 - October 20, 2015

విజయవాడ : అమరావతి శంకుస్థాపన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎపి డీజీపీ రాముడు పేర్కొన్నారు. చాలా వరకు ట్రాఫిక్‌ను మళ్లించినట్లు తెలిపారు. నార్కట్‌పల్లి నుంచే దారిమళ్లింపు ఉంటుందని డీజీపీ చెప్పారు. విజయదశమి, అమరావతి శంకుస్థాపన రెండు కార్యక్రమాలకు వేర్వేరు భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశామన్నారు.

16:09 - October 20, 2015

విజయవాడ : అమరావతి నిర్మాణంలో అన్నివర్గాల ప్రజల్ని భాగస్వాముల్ని చేయడమే తమ సంకల్పమని ఏపీ మంత్రులు అన్నారు. బెజవాడ ఇంద్రకీలాద్రి నుంచి శాప్ ఆధ్వర్యంలో చేపట్టిన క్రీడాజ్యోతిని మంత్రులు దేవినేని ఉమ, పరిటాల సునీత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ ముఖ్యకార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి పాల్గొన్నారు.

 

16:08 - October 20, 2015

లావుగా వున్నవాళ్లు తమ శరీర బరువును తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి మందుల ద్వారా తమ బరువను కంట్రోల్ చేసుకోవడానికి సిద్ధపడతారు. అయితే.. వాటివల్ల ప్రమాదం వుండవచ్చు. సాధారణంగానే శరీర బరువు తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకు ఈ క్రింది చిట్కాలు పాటిస్తే చాలని, రెగ్యులర్ గా చేస్తే బరువు తగ్గవచ్చునని చెబుతున్నారు.
ప్రతి రోజు దాదాపు ఎనిమిది నుంచి పది లీటర్ల మేరకు నీటిని సేవించాలి. నీటిలో ఎలాంటి క్యాలరీలుండవు కాబట్టి.. శరీర బరువు కంట్రోల్ లోనే వుంటుంది.
ఉదయాన్నే అల్పాహారాన్ని సేవించాలి. ఇలా తినడం వల్ల.. రోజంతా ఉత్సాహంగా వుండటంతోపాటు అన్ని కార్యకలాపాల్లో ఉత్తేజంగా పాల్గొనేందుకు అవసరమైన శక్తి లభిస్తుంది.

 • పగటిపూట మధ్య-మధ్యలో ఆహారాన్ని తీసుకోవాలి. కాని ఇందులో వేపుడు పదార్థాలు ఉండకుండా చూసుకోండి.
 • నాజూకుగా లేదా బరువు తగ్గేందుకు మరీ విపరీతంగా వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. శారీరక వ్యాయామంలో భాగంగా సైకిలింగ్, జాగింగ్, స్విమ్మింగ్ చేయండి. దీంతో శరీరంలో పేరుకుపోయిన పనికిరాని కొవ్వు కరిగిపోతుంది.
 • కార్యాలయంలో లేదా అపార్ట్ మెంట్ లలో లిఫ్ట్ ఉపయోగించే కన్నా మెట్లు ఎక్కడమే ఉత్తమం. అలాగే ప్రతి రోజు వీలైనంత మేరకు నడక సాగించండి.
 • ముఖ్యంగా ఒత్తిడి నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఒత్తిడి కారణంగా కొందరు విపరీతంగా తినేస్తుంటారు. దీంతో బరువు పెరిగిపోవడం ఖాయం.
 • ఒత్తిడి దరిచేరనీయకుండా మితంగా ఆహారం సేవిస్తుంటే శరీర బరువును అదుపులో పెట్టుకోవచ్చు.
 • తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలుండేలా జాగ్రత్తలు వహించాలి. వీటీలో విటమిన్లు, ఖనిజపదార్థాలు పుష్కలంగా ఉంటాయి.  
15:35 - October 20, 2015

'శ్రీమంతుడు' తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న 'మహేష్ బాబు' ప్రస్తుతం 'బ్రహ్మోత్సవం' సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని పివిపి బ్యానక్ పై ప్రసాద్.వి.పోట్లూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే 'గజిని', 'తుపాకీ', 'కత్తి' వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన 'మురుగదాస్' దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు 'మహేష్' గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ప్రస్తుతం ఫైనల్ స్ర్కిప్ట్ పనుల్లో మురుగదాస్ బిజీగా వున్నారు. అయితే ఈ సినిమాకు స్టైలిష్ మ్యూజిక్ డైరెక్టర్ 'హారీష్ జయరాజ్' సంగీతం అందించనున్నాడని తెలిసింది. గతంలో 'మహేష్' నటించిన 'సైనికుడు' సినిమాకు 'హరీష్' సంగీతం అందించారు. అలాగే మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'గజిని' చిత్రానికి హరీష్ సంగీతం అందించారు. చాలా కాలం తర్వాత మళ్లీ వీరు ముగ్గురు ఈ సినిమాతో కలవనున్నారని తెలిసింది.

అంతర్జాతీయ క్రికెట్ కు సెహ్వాగ్ గుడ్ బై...

ఢిల్లీ : అంతర్జాతీయ క్రికెట్ కు సెహ్వాగ్ గుడ్ బై చెప్పాడు. ట్విట్టర్ లో తన రిటైర్మెంట్ ను ప్రకటించారు.

బెజవాడ దుర్గమ్మకు టిటిడి పట్టు వస్త్రాలు..

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం పట్టువస్త్రాలు సమర్పించింది.

 

జానాపై పాల్వాయి విమర్శలు..

హైదరాబాద్ : ప్రతిపక్ష నేత జానారెడ్డిపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పలు విమర్శలు చేశారు. ఆయనకు శాసనసభలో పోరాడేతత్వం లేదని, పోరాట స్పూర్తి లేకపోతే పార్టీ అధికారంలోకి రావడం కల్ల అంటూ కుండబద్దలు కొట్టారు. 

రేపు కేంద్ర మంత్రివర్గ సమావేశం..

ఢిల్లీ : ఈ నెల 21న కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనుంది. ఈ సందర్భంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. బీహార్ ఎన్నికలతో పాటు ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 

కేంద్రం మోసం చేస్తోంది - కడియం..

వరంగల్ : రైతాంగాన్ని కేంద్రం మోసం చేస్తోందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. పత్తికి మద్దతు ధర కల్పించాల్సింది కేంద్రమేనని, పత్తి కొనుగోలుకు మార్గదర్శకాలు లేకపోవడం దారుణమన్నారు. టీడీపీ, బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేకుండా రోడ్డెక్కి ఆందోళన చేయడం సరికాదన్నారు.

మంత్రి ఈటెల ఇంట్లో ఎంపీ కవిత..

హైదరాబాద్: బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి ఈటెల రాజేందర్ ఇంట్లో సద్దుల బతుకమ్మ సందడి నెలకొంది. బతుకమ్మ తయారీ కార్యక్రమంలో ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత తదితరులు పాల్గొన్నారు.

అమరావతి చారిత్రక ప్రాంతం : చంద్రబాబు

గుంటూరు : అమరావతి చారిత్రక ప్రాంతమని సీఎం చంద్రబాబు అన్నారు. దసరాతోపాటు మనకు అమరావతి పండుగ వచ్చిందని సీఎం అన్నారు. అందరికీ అందుబాటులో ఉంటుందనే అమరావతిని రాజధానిగా నిర్ణయించామని చెప్పారు. లండన్ మ్యూజియంలో అమరావతి గ్యాలరీ ఉండడం విశేషమన్నారు. ప్రపంచ స్థాయిలోనే అమరావతిని మేటిగా నిలిపేలా నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు.  

ఎఎన్ యూలో 'మన మట్టి..మన నీరుకు' సర్వమత ప్రార్థనలు...

గుంటూరు : నాగార్జున యూనివర్సిటీల్లో మన మట్టి..మన నీరుకు సర్వమత ప్రార్థనలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన మట్టి, నీటికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.  

తెలంగాణలో నిజాం పాలన : దిగ్విజయ్ సింగ్

హైదరాబాద్ : తెలంగాణలో నిజాం పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికొదిలేసిందని ఎద్దేవా చేశారు. రైతు ఆత్మహత్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని పేర్కొన్నారు. రుణమాఫీ ఒకేదఫా పూర్తి చేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం పింఛను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 

14:58 - October 20, 2015

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భాయ్ జాన్’ చిత్రం ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ అమ్మాయి భారత్ లో తప్పిపోవడంతో.. ఆ అమ్మాయిని తిరిగి సల్మాన్ ఎలా తీసుకెళ్లాడు అనే కథాంశంతో ఈ చిత్ర కథ రూపొందింది. అయితే పాకిస్తాన్ లో 'గీత' యువతి కథ కూడా ఇలాగే ఉంది. పాకిస్థాన్ లో తప్పిపోయిన భారత్ కు చెందిన మూగ - చెవిటి యువతి 'గీత' కోరిక మేరకు ఈ చిత్రాన్ని సైగలతో రూపొందించనున్నారు. ఈ చిత్రం తన జీవితానికి దగ్గరగా వుందని, అందుకే ఈ చిత్రాన్ని మూగ భాషలో డబ్బింగ్ చేస్తే తనలాంటి చాలా మంది చూసి ఆనందిస్తారని గీత కోరినట్లుగా ఇండోర్ లోని మూగ పిల్లల సహాయ కేంద్రం పేర్కొంది. గీత కోరిక మేరకు ఈ సంస్థ డబ్బింగ్ పనులు చూస్తోందంట. మరి మూగ భాషలో విడుదలై ఎలాంటి స్పందనను రాబట్టనుందో త్వరలోనే తెలియనుంది.

14:58 - October 20, 2015

'జీనియస్' సినిమాతో దర్శకుడిగా మారిన ఓంకార్ ప్రస్తుతం ‘రాజుగారి గది’ సినిమాతో ముందుకు వస్తున్నాడు. అశ్విన్, ధన్య బాలకృష్ణన్, చేతన్ చీను, ఈశాన్య, పూర్ణ ప్రధాన పాత్రలలో నటించారు. హర్రర్ కామెడీ క్రైం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తక్కువ రన్ టైంలో, స్పీడ్ స్ర్కీన్ ప్లే ఈ సినిమాకు పెద్ద హెల్ప్ అవుతుందని ఓంకార్ అంటున్నారు. అంతే కాకుండా ఈ సినిమా సీక్వెల్ కోసం సెకండ్ పార్ట్ కథను కూడా సిద్ధం చేసాడట ఓంకార్. ఇదిలా వుంటే ఈ చిత్రాన్ని వారాహిచలన చిత్రం, అనిల్ సుంకర సమర్పణలో ఓఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ప్రై.లి. పతాకంపై రూపొందించారు. ఈ చిత్రాన్ని ఈనెల 22న దసరా కానుకగా విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

13:31 - October 20, 2015

చిత్తూరు : తిరుమలలో అర్చకుల మధ్య వివాదం ముదురుతోంది. సూర్య ప్రభ వాహనం విధుల కేటాయింపు‌పై వేణుగోపాల్ దీక్షితులు, రమణ దీక్షితుల మధ్య వాగ్వాదం జరిగింది. నెల రోజుల క్రితమే వేణుగోపాల్‌ దీక్షితులకు టీటీడీ విధులు కేటాయించింది. దీంతో రమణ దీక్షితులు టీటీడీ అధికారులపై ఒత్తిడి తెచ్చి వేణుగోపాల్ దీక్షితుల విధులను మార్పించారు. చివరి నిమిషంలో విధుల మారిపోవడంతో వేణుగోపాల్‌ దీక్షితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

13:29 - October 20, 2015

చిత్తూరు : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై తిరువీధుల్లో విహరించారు. వేలాదిమంది భక్తులు స్వామివారికి హారతులిచ్చి వాహనసేవలో పాల్గొన్నారు. రాత్రికి స్వామి వారికి చంద్రప్రభ వాహన సేవ జరగనుంది. 

13:28 - October 20, 2015

విజయవాడ : బెజవాడ దుర్గమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. ఇవాళ దుర్గాదేవిగా దర్శనమివ్వనున్నారు అమ్మవారు.. తెల్లారుజామున 3గంటలనుంచి భవానీ మాత దర్శనంకోసం భక్తులు తరలివస్తున్నారు.. దర్శనంకోసం 2గంటల సమయం పడుతోంది.. జగన్మాత నిజరూపదర్శనం చూసి భక్తులు పరవశించిపోతున్నారు..

 

13:26 - October 20, 2015

గుంటూరు : ప్రపంచంలో నే సుందరమైన నగరాల్లో అమరావతి మేటిగా నిలవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన నాగార్జున యూనివర్శిటీ వద్ద మన మట్టి- మన నీరు కి సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అందరికీ అందుబాటులో వుంటుంది కాబట్టి అమరావతిని ఏపీకి రాజధాని ప్రాంతంగా నిర్ణయించామని. చరిత్ర కలిగిన ప్రాంతం అమరావతి అన్నారు. దేశం, రాష్ట్రంలోని నలుమూలల నుంచి మట్టి, పవిత్ర జలాలు వచ్చాయని తెలిపారు.

ముగిసిన కళ్లు చిదంబరం అంత్యక్రియలు

హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు కళ్లు చిదంబరం అంత్యక్రియలు ముగిశాయి. విశాఖ అక్కయ్యపాలెంలో స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర జ్ఞానాపురం వరకూ సాగి, అక్కడి స్మశాన వాటికలో అంత్యక్రియలు, కళాకారులు, అభిమానుల మధ్య ముగిశాయి.

12:57 - October 20, 2015

గుంటూరు : నవ్యాంధ్ర ప్రదేశ్‌లో సీఐడీ విభాగం పరిపాలన గుంటూరు నుంచి నిర్వహిస్తామని ఏపీ డీజీపీ రాముడు తెలిపారు. మంగళవారం గుంటూరు మెడికల్ కళాశాల వెనుక ఉన్న పోలీస్ క్వార్టర్స్ స్థలంలో సీఐడీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి డీజీపీ రాముడు శంకుస్థాపన చేశారు. 2500 చదరపు గజాల్లో మూడున్నర కోట్ల వ్యయంతో ఈ కార్యాలయం నిర్మిస్తున్నారు. రాజధాని శంకుస్థాపనకు భద్రతా పరంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు డీజీపీ తెలిపారు.

12:55 - October 20, 2015

గుంటూరు : ఏపీ రాజధాని శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించడం పట్ల రాజధాని ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్య్రకమం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య విబేధాలు తొలగించి.. అభివృద్ధికి కలిసి పని చేసేలా మార్గం సుగమం చేస్తుందని వారు భావిస్తున్నారు. అదే జరిగితే దేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని వారు అభిప్రాయపడుతున్నారు.

సాంస్కృతిక శాఖ మనోల్లాస కార్యక్రమాలు...

అమరావతి శంకుస్థాపన సందర్భంగా.. సాంస్కృతిక శాఖ మనోల్లాస కార్యక్రమాలని రూపొందిస్తోంది. కూచిపూడికి జన్మస్థలమైన ప్రాంతంలోనే.. రాజధాని ఏర్పాటు కానుండడంతో.. ఆరోజు సాయంత్రం ప్రత్యేకంగా కూచిపూడి నృత్య రూపకాలను ఏర్పాటు చేసింది. 

12:53 - October 20, 2015

గుంటూరు: అమరావతి పట్టణమే ఓ చరిత్ర. క్రీస్తు పూర్వం 2, 3 శతాబ్దాలకు క్రితమే ఇక్కడ బౌద్ధం విరాజిల్లిందన్న ఆనవాళ్లు నేటికీ కనిపిస్తాయి. బౌద్ధంలో ధాన్యకటకానిది విశిష్ట స్థానం. నేటి అమరావతి కూడా ధాన్యకటకంలో అంతర్భాగమే. బౌద్ధుల తరువాతి కాలంలో శాతవాహనులు, చాళుక్యులు, ఇలా అనేకమంది ఈ ప్రాంతాన్ని వేదికగా చేసుకొని తమ రాజ్యాలను పాలించారు.

అలనాటి బౌద్ధ శిల్ప కళా సంపద.....

అమరావతి పట్టణ సమీపంలోని అలనాటి బౌద్ధ శిల్ప కళా సంపద.. బుద్ధుడు నిర్వహించిన కాలచక్ర.. ప్రాచీన నాగరికత, సంప్రదాయాలను నేటి తరానికి చాటి చెబుతోంది. అత్యద్భుతంగా నిర్మించి బౌద్ధ స్తూపం ఇప్పటికీ కనువిందు చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడా కానరాని విశిష్ట శైలిలో శిల్పసంపదను రూపొందించారు. ప్రాచీన శిలాయుగాలతో పాటు.. మధ్య, నవీన శిలాయుగం వరకూ చారిత్రక అవశేషాలు నేటికీ ఇక్కడ భద్రంగా ఉన్నాయి.

అమరావతి తవ్వకాల్లో లభించిన ప్రాచీన సంపద....

అమరావతి తవ్వకాల్లో లభించిన ప్రాచీన సంపదను ఇక్కడి మ్యూజియంలో భద్ర పరిచారు. దీంతో పాటు.. నాగార్జున సాగర్‌ సమీపంలోని నాగార్జున కొండ మ్యూజియంలో.. బుద్ధుడి విగ్రహాలు, నాణేలు, పాత్రలు పదిలపరిచారు. దేశం నలుమూలల నుంచి వచ్చే బౌద్ధులు, ఇతర యాత్రికులు ఈ మ్యూజియాల్లోని సంపదను తిలకిస్తుంటారు. అలనాటి చరిత్రకు ఆధారాలైన శిల్ప సంపదను బ్రిటిష్‌ పాలకులు.. అక్కడికి తరలించుకు పోయారు. ప్రస్తుతం ఈ విగ్రహ సంపద.. లండన్‌లోని మ్యూజియంలో ఉంది. బుద్ధుని పాదాలు, సింహాల విగ్రహాలు, నాణేలు, పురాతన పాత్రలు అక్కడి మ్యూజియంలో ఉన్నాయని సమాచారం. వాటిని తిరిగి రాష్ట్రానికి రప్పిస్తే.. అమరావతి వైభవం ఇనుమడిస్తుందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.

అమరావతి నవ్య రాజధానిగా .....

అమరావతి నవ్య రాజధానిగా రూపాంతరం చెందుతున్న ప్రస్తుత తరుణంలో దేశ విదేశాలకు తరలిపోయిన అమరావతి సంపదను రప్పిస్తే... వాటికీ విశిష్ట గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నించి సఫలమైతే.. వారసత్వ సంపదను భవిష్యత్‌ తరాలకు పదిలంగా అందించిన వారవుతాము.

12:49 - October 20, 2015

హైదరాబాద్ : హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఫరిదాబాద్లో ఒక కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులకు బతికుండగానే నిప్పంటించారు. వీరిలో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. మంగళవారం వేకువ జామున 4గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు చెప్తున్నారు. నలుగురు బాధితులను ఢిల్లీలోని సప్థర్ జంగ్ ఆస్పత్రికి చికిత్స కోసం అత్యవసరంగా తరలించారు.

12:47 - October 20, 2015

హైదరాబాద్ : ఢిల్లీలో మహిళా ఎగ్జిక్యూటివ్ పై అత్యాచారానికి పాల్పడిన కేసులో 'ఉబర్' క్యాబ్‌ డ్రైవర్ శివకుమార్ యాదవ్‌ ను స్థానిక కోర్టు దోషిగా తేల్చింది. ఈనెల 23న అతడికి శిక్ష ఖరారు చేయనుంది. అతడిపై మోపిన అన్ని అభియోగాలు కోర్టులో నిరూపితం అయ్యాయని అతడి తరపు న్యాయవాది ధర్మేంద్ర కుమార్ మిశ్రా తెలిపారు. గతేడాది డిసెంబర్ 5న రాత్రి బాధితురాలిని ఇంటికొచ్చే క్రమంలో కారులోనే ఆమెపై శివకుమార్ లైంగికదాడికి పాల్పడినట్టు కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో పోలీసులు 100 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేశారు. 44 మందిని సాక్షులను విచారించారు. 

అత్యాచారం కేసులో ఉబర్ క్యాబ్ డ్రైవర్ నిందితుడే...

హైదరాబాద్ : ఢిల్లీలో మహిళా ఎగ్జిక్యూటివ్ పై అత్యాచారానికి పాల్పడిన కేసులో 'ఉబర్' క్యాబ్‌ డ్రైవర్ శివకుమార్ యాదవ్‌ ను స్థానిక కోర్టు దోషిగా తేల్చింది. ఈనెల 23న అతడికి శిక్ష ఖరారు చేయనుంది. అతడిపై మోపిన అన్ని అభియోగాలు కోర్టులో నిరూపితం అయ్యాయని అతడి తరపు న్యాయవాది ధర్మేంద్ర కుమార్ మిశ్రా తెలిపారు. గతేడాది డిసెంబర్ 5న రాత్రి బాధితురాలిని ఇంటికొచ్చే క్రమంలో కారులోనే ఆమెపై శివకుమార్ లైంగికదాడికి పాల్పడినట్టు కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో పోలీసులు 100 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేశారు. 44 మందిని సాక్షులను విచారించారు. 

మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయ్ :పాకిస్థాన్

హైదరాబాద్ : అణు సామర్థ్యంపై పాకిస్థాన్ తొలిసారిగా బహిరంగ వ్యాఖ్యలు చేసింది. తమ వద్ద తక్కువ శక్తిని విడుదల చేసే అణ్వాయుధాలు ఉన్నాయని, ఒకవేళ ఇండియాతో యుద్ధం చేయాల్సి వస్తే వీటిని వాడతామని పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఐజాజ్ చౌధురి స్పష్టం చేసినట్టు 'డాన్' పత్రిక వెల్లడించింది. పాకిస్థాన్ కు చెందిన సీనియర్ అధికారి ఒకరు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి. తమ యుద్ధ వ్యూహాల్లో భాగంగానే వీటిని తయారు చేశామని ఆయన తెలిపారు. నవాజ్ షరీఫ్ ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా యూఎస్ తో ఎటువంటి అణు ఒప్పందాన్ని చేసుకోలదని ఆయన వివరించారు.

మన మట్టి - మన నీరు కి సర్వమత ప్రార్థనలు...

గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన కలశాల వద్ద సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి. వివిధ మతాలకు చెందిన పెద్దలు తమ మత విధానాల ప్రకారం పూజలు చేస్తున్నారు. అమరావతి నిర్మాణం దిగ్విజయంగా జరగాలని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలాంటి ఆటంకాలు కలగరాదని ఈ సందర్భంగా ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కోడెల శివప్రసాదరావు, యనమల, అచ్చెన్నాయుడు, నారాయణ, పీతల సుజాత, తెలంగాణ ఎంపీ మల్లారెడ్డి తదితరులు హాజరయ్యారు. 

సూర్యప్రభ వాహనం పై దర్శినమిచ్చిన శ్రీవారు..

హైదరాబాద్ : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సర్వాలంకార భూషితుడైన స్వామివారు మంగళవారం సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారి వాహనసేవలో పాల్గొని హారతులిచ్చారు.

పార్శీగుట్ట ఎన్‌సీఎస్ కాలనీలో చైన్ స్నాచింగ్

సికింద్రాబాద్: నగరంలోని ముషీరాబాద్‌లోని పార్శీగుట్ట ఎన్‌సీఎస్ కాలనీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. మహిళ మెడలో నుంచి దుండగులు గొలుసు, మంగళసూత్రం లాక్కెళ్లారు. గొలుసులు ఆరు తులాలు ఉన్నట్లు సమాచారం. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

లారీని ఢీకొట్టి ఇద్దరు మెకానిక్ లు మృతి

నల్లగొండ: లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మెకానిక్‌లు మృతిచెందారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మేళ్లచెరువు మండలం యతిరాజపురంలో చోటుచేసుకుంది. చెడిపోయిన లారీకి మరమ్మతులు చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరమ్మతులు చేస్తున్న మెకానిక్‌లు ఇద్దరూ ఘటనాస్థలంలోనే మృతిచెందారు.

 

లోయలో పడ్డ బస్సు : 14 మంది మృతి

హైదరాబాద్ : జమ్మూలో ఈ రోజు ఉదయం మినీ బస్సు లోయపడింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా, 17 మందికి గాయాలయ్యాయి. ఉధంపూర్ జిల్లాలో ఘోర్డి గ్రామం నుంచి రామనగర్ కి వెళ్తున్న బస్సు దల్సర్ వద్ద అదుపు తప్పి లోయలో పడింది.

11:28 - October 20, 2015

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని చాటిచెప్పే బతుకమ్మ సంబరాలకు హుసేన్‌ సాగర్‌ ముస్తాబైంది.. కొన్ని గంటల్లో లక్షలాదిమంది రాకతో ఈ ప్రాంతమంతా సందడిగా మారబోతోంది.. ఇక్కడికివచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. ఇవాళ సాయంత్రం 4 నుంచి రాత్రి పదకొండున్నర గంటల వరకు ఆంక్షలు అమలుకానున్నాయి.. సికింద్రాబాద్, కట్ట మైసమ్మ గుడి, కవాడీ గూడ, ఇక్బాల్ మినార్, ఏఆర్ పెట్రోల్ పంప్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ , పోలీసు కంట్రోల్ రూమ్, నాంపల్లి,హిమాయత్ నగర్ వై జంక్షన్, పంజాగుట్ట, రాజ్ భవన్, బుద్ద భవన్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.. ఇటు వైపు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి కోరారు. 

11:27 - October 20, 2015

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సల్మాన్ ఖాన్ పెళ్లికొడుకు కానున్నాడని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 'సల్మాన్ ఖాన్' సినీ ప్రయాణం మొదలైనప్పటి నుండి చాలా వరకు ప్రేమ వ్యవహారాలు నడిపారని గుసగుసలు వినిపించిన సంగతి తెలిసిందే. 'సంగీతా బిజలానీ', 'ఐశ్వర్య రాయ్', 'కత్రినా కైఫ్' ఇలా చాలా మందితో 'సల్లూ' ప్రేమాయణం సాగించాడనే బాలీవుడ్ టాక్. తాజాగా సల్మాన్ రొమెనియాకు చెందిన టీవీ నటి 'లులియా వాంతర్' తో ఎఫైర్ నడుపుతున్నాడనే వార్తలు గత కొంత కాలంగా చక్కర్లు కొడుతున్నాయి. అంతేగాక పెళ్లి చెసుకోబోతున్నాడనే వార్త బాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. వీరిద్దరూ గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నారని... త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. వచ్చే ఏడాది పెళ్లి చేసుకొంటారని వార్తలు చోటు చేసుకొన్నాయి. సల్మాన్ సోదరి అర్పిత వివాహ సమయంలో లులియాను తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడంట. కాగా ఇప్పుడు ఈ పెళ్లి వార్తలు పుకార్లేనా ? లేక నిజమా ? అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారంట. 

11:26 - October 20, 2015

గుంటూరు : అమరావతి శంకుస్థాపనను అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి పత్తిపాటి.. ముఖ్యమైన వివిధ ప్రాంతాలనుంచి సేకరించిన మట్టిని ఈ కార్యక్రమంలో వాడతామని తెలిపారు.. ఈ మట్టి, నీరుతో అమరావతి అతి శక్తివంతంగా మారుతుందని చెప్పారు..

11:24 - October 20, 2015

హైదరాబాద్ : రంగు రంగుల విద్యుత్ దీపాలమధ్య పూలవనంలా మారబోతోంది హుసేన్‌ సాగర్‌.. వేలాదిమంది మహిళలు బతుకమ్మ ఆడుతూ సందడిచేయబోతున్నారు.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే శకటాలు, కళారూపాలతో అత్యంత ఘనంగా ర్యాలీకి ఏర్పాట్లు పూర్తిచేశారు అధికారులు..

జీహెచ్ ఎంసీ భారీగా ఏర్పాట్లు......

బతుకమ్మ ముగింపు ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమైంది.. ట్యాంక్‌బండ్‌పై సద్దులబతుకమ్మకు జీహెచ్ ఎంసీ భారీగా ఏర్పాట్లు చేసింది.. ట్యాంక్‌బండ్‌ రంగు రంగుల విద్యుత్ దీప కాంతులతో నిండిపోయింది.. వివిధ ప్రదేశాల్లో జరిగే బతుకమ్మ సంబురాలను చూసేలా భారీ ఎఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.. సాగర్‌లో బతుకమ్మ నిమజ్జనంకోసం రెండుప్రాంతాల్లో ఘాట్‌లు రెడీ చేశారు.. రోటరీ పార్క్ దగ్గర వేలాది బతుకమ్మలు నిమజ్జనం చేసేలా ప్రత్యేక ఘాట్‌ను తయారుచేయించారు. మిగతా ప్రాంతాల్లో సరూర్‌ నగర్‌, ఐడీఎల్ ట్యాంక్, హస్మత్‌పేట్‌, ప్రగతి నగర్‌ ట్యాంక్ తదితర చెరువుల దగ్గర భారీఎత్తున ఏర్పాట్లు చేపట్టారు గ్రేటర్ అధికారులు.. ఎలక్ట్రికల్, హార్టికల్చర్, హెల్త్ శానిటేషన్ విభాగాలకుచెందిన వేలాదిమంది కార్మికులు ఈ ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు.. డిప్యూటీ కమిషనర్‌లు ఈ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు..

ఎల్బీ స్టేడియంనుంచి ట్యాంక్‌బండ్‌వరకూ.....

బతుకమ్మ సంబరాల్లోభాగంగా ఎల్బీ స్టేడియంనుంచి ట్యాంక్‌బండ్‌వరకూ శోభాయాత్ర నిర్వహించబోతున్నారు.. సాయంత్రం నాలుగు గంటలకు ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది.. తెలంగాణ కళారూపాలు, శకటాలను ఇందులో ప్రదర్శించబోతున్నారు..

ఈ ఉత్సవాలకు గవర్నర్, సీఎం దంపతులు,...

ఈ ఉత్సవాలకు గవర్నర్, సీఎం దంపతులు, మంత్రులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరు కాబోతున్నారు.. ఈ కార్యక్రమానికి వస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.. భారీగా భద్రతను మోహరించారు.. 

11:07 - October 20, 2015

ఏదైనా కొత్త విషయం తెలియగానే స్మార్ట్ఫోన్లో వేసుకున్న న్యూస్ యాప్ల నుంచి నోటిఫికేషన్లు వస్తుంటాయి. వీటికి వస్తున్న ఆదరణ చూసి 'ఫేస్బుక్' కూడా ఈ తరహా బ్రేకింగ్ న్యూస్ యాప్ను ప్రారంభించనుంది. ఇది అక్టోబర్ నెలాఖరుకల్లా ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఇన్నాళ్లూ కేవలం సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫారంగానే ఉన్న ఫేస్బుక్.. తన పరిధిని మరింత విస్తృతం చేసుకోవాలని చూస్తోంది. అందుకోసమే ఈ బ్రేకింగ్ న్యూస్ నోటిఫికేషన్లు ఇవ్వాలనే ఆలోచన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ యాప్ వేసుకున్న యూజర్లు తమకు నచ్చిన కంటెంటుకు సంబంధించిన రియల్ టైమ్ నోటిఫికేషన్లు పొందే అవకాశం ఉంది. అయితే ఫేస్బుక్ నేరుగా ఈ యాప్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా వివిధ ప్రచురణ సంస్థలు ఫేస్బుక్ తరఫున ఈ మొబైల్ నోటిఫికేషన్లు ఇస్తాయని తెలుస్తోంది. ఇవి ట్వీట్ల కంటే కొంచెం ఎక్కువగానే ఉంటాయని టాక్. ఆ నోటిఫికేషన్ను టచ్ చేస్తే దాని ద్వారా సంబంధిత ప్రచురణ సంస్థ వెబ్సైట్కు యూజర్లు రీడైరెక్ట్ అవుతారు. దీనివల్ల ఫేస్బుక్ ఒక మల్టీ ఫంక్షనింగ్ ప్లాట్ఫారంగా మారుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ వార్తాసంస్థలకు సంబంధించిన న్యూస్ యాప్లు ఉన్నా.. వాటిలో వేటికీ ఫేస్బుక్కు ఉన్నంత ప్రపంచవ్యాప్త విస్తృతి లేదని, అందుకే వాటికి కావల్సిన విస్తృతి కల్పించడం, అదే సమయంలో తమ ప్రాముఖ్యాన్ని కూడా పెంచుకోవడం అనే రెండు లక్ష్యాలపై ఫేస్బుక్ గురిపెట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు

ఖమ్మం : వినుకొండ మండలం బాణాపురం పరిసర గ్రామాలకు చెందిన రైతులు విద్యుత్ కోతలకు నిరసనగా బాణాపురం విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంగళవారం ఉదయం ముట్టడించారు. ఇష్టమొచ్చినట్లుగా విద్యుత్ కోతల కారణంగా తమ పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖాధికారులు జోక్యం చేసుకుని సక్ర మ విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

గుంటూరులో సీఐడీ కార్యాలయ భవనానికి శంకుస్థాపన

గుంటూరు: ఏపీ సీఐడీ కార్యాలయ భవనానికి డీజీపీ రాముడు చేతుల మీదు గా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. గుంటూరు మెడికల్ కళాశాల వెనుక ఉన్న పీఎస్ క్వార్టర్స్ స్థలంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.... 2500 చ.గ ల్లో రూ.3.50 కోట్లతో సీఐడీ కార్యాలయం భవన నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. కార్యాల నిర్మాణం పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచే సీఐడీ కార్యకలాపాలు కొనసాగిస్తామని చెప్పారు.

10:39 - October 20, 2015

నందమూరి 'కళ్యాణ్‌రామ్‌' హీరోగా 'సాయి నిహారిక', శరత్‌చంద్‌ సమర్పణలో విజయలకక్ష్మి పిక్చర్స్‌ పతాకంపై మల్లికార్జున్‌ దర్శకత్వంలో కొమర వెంకటేష్‌ నిర్మిస్తున్న 'షేర్‌' చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అతి త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ''షేర్‌' సెన్సార్‌ పూర్తయిందని, యు/ఎ సర్టిఫికెట్‌ వచ్చిందని నిర్మాత కొమర వెంకటేష్‌ పేర్కొన్నారు. మంచి సినిమా తీశారని సినిమా చూసిన సెన్సార్‌ సభ్యులు అభినందించారని తెలిపారు. కళ్యాణ్‌రామ్‌ కు 'పటాస్‌' తర్వాత 'షేర్‌' మరో సూపర్‌ హిట్‌ మూవీ అవుతుందన్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ కొత్త డైమెన్షన్‌లో కనిపిస్తారన్నారు. అతి త్వరలోనే
ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌ చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తామన్నారు. నందమూరి కళ్యాణ్‌రామ్‌, సోనాల్‌చౌహాన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రావు రమేష్‌, రోహిణి, షాయాజీ షిండే, ఆలీ, ఎం.ఎస్‌.నారాయణ, ముఖేష్‌ రుషి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

మన నీరు - మన మట్టి కళశాలకు ప్రత్యేక పూజలు

విజయవాడ : స్వరాజ్‌ మైదానంలో మన నీరు-మన మట్టి కలశాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి అశోక గజపతి రాజు, సుజనాచౌదరి, రాష్ట్రమంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.

10:36 - October 20, 2015

ఐదేళ్ళ వయసులోనే ప్రమాదకరమైన క్యాన్సర్‌ వ్యాధి బారిన పడిన కన్న కొడుకు పరిస్థితి చూసి చలించిపోయిన బాలీవుడ్‌ నటుడు 'ఇమ్రాన్‌ హష్మి' ఓ పుస్తకాన్ని రాసేందుకు సిద్ధమవుతున్నారు. ఇమ్రాన్‌డ హష్మి తొమ్మిదేళ్ళ క్రితం పర్వీన్‌ షాహానీని పెళ్ళి చేసుకున్నారు. ఐదేళ్ళ వీరి కుమారుడు క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. 'గడిచిన రెండేళ్ళలో నేనెంతో నేర్చుకున్నాను. క్యాన్సర్‌, నా కుమారుడు నాకు గురువులు.. జీవితమంటే ఏంటో నాకు తెలియజేశారు' అని ఇమ్రాన్‌ ట్విట్టర్‌లో ట్వీట్‌ పెట్టారు. 'క్యాన్సర్‌ఫై తనయుడు చేస్తున్న పోరాటాన్ని అక్షర రూపంలో పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ పుస్తకాన్ని ప్రచురించేందుకు అంగీకరించిన పెంగ్విన్‌ బుక్స్ ఆఫ్‌ ఇండియా వారికి కృతజ్ఞతలు' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్ఫూర్తి చెందేలా రూపొందే ఈ పుస్తకాన్ని పెంగ్విన్‌ బుక్స్ ఆఫ్‌ ఇండియా బృందం 2016లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇమ్రాన్‌హష్మి తీసుకున్న నిర్ణయాన్ని బాలీవుడ్‌ ప్రముఖులంతా సమర్థించారు.

 

10:36 - October 20, 2015

గూంటురు : దాచేపల్లి మండలం అలంకార్‌ థియేటర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.. గుంటూరునుంచి హైదరాబాద్‌ వెళుతున్న బొగ్గులారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.. ఈ మధ్యలో చిక్కుకున్న బైక్‌పై వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు.. లారీకి వెంటనే మంటలు అంటుకోని వాహనం మొత్తం దగ్ధమైంది.. బస్సులో ప్రయాణిస్తున్నవారికి స్వల్పంగా గాయాలయ్యాయి.. 

10:35 - October 20, 2015

సినిమాలోన్లే కాకుండా వ్యాపార ప్రకటనల్లో సైతం శ్రుతిహాసన్‌ రాణిస్తోంది. నటిగా, సింగర్‌గా, సంగీత దర్శకురాలిగా భిన్న బాధ్యతల్ని సైతం బెస్ట్ గా చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇటీవల విడుదలైన శీతల పానీయం 'పాంటా యాడ్‌'లో శ్రుతి వేసిన డాన్స్ కు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారంట. ఈ యాడ్‌కి సంబంధించి క్లిప్స్ సామాజిక మీడియాలో విపరీతంగా హల్‌చల్‌ చేస్తున్నాయి. అంతేకాదు బెస్ట్‌ డాన్సర్‌గా శ్రుతిని పొగుడుతూ వేల సంఖ్యలో కామెంట్స్ సైతం వస్తున్నాయట. ఇదిలా ఉంటే తాజాగా మరో వ్యాపార ప్రకటనలో నటించేందుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చిందంట. ఓ ప్రముఖ ఆయుర్వేదిక్‌ ఆయిల్‌కి సంబంధించి ప్రకటనలో నటించేందుకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్‌ని అడిగినట్లు గుసగుసలు వినపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆ సంస్థ ప్రొడక్ట్ కు జూహీచావ్లా ప్రచారకర్తగా ఉన్నారు. ఇప్పుడామె ప్లేస్‌లోకి శ్రుతిని తీసుకోబోతున్నారట. ఏదిఏమైనా మూడు యాడ్స్.. ఆరు సినిమాల చందనా శ్రుతి కెరీర్‌ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతోంది.

సినిమాల్లో బిజీ..
శ్రుతి ప్రస్తుతం తమిళంలో అజిత్‌ సరసన 'వేదాలమ్‌', సూర్యతో 'సింగమ్‌2' వంటి చిత్రాల్లోను, బాలీవుడ్‌లో 'యారా', 'రాకీ హ్యాండ్‌సమ్‌' చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. అలాగే తెలుగులో 'మహేష్‌బాబు' సరసన మరోసారి నటించే లక్కీఛాన్స్ కొట్టేసింది. 'శ్రీమంతుడు' చిత్రంతో హిట్‌ పెయిర్‌గా పేరొందిన మహేష్‌బాబు, 'శ్రుతిహాసన్‌' తాజాగా తమిళ దర్శకుడు మురుగదాస్‌ తెలుగు, తమిళ భాషల్లో రూపొందించే చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి షూటింగ్‌ జరుపుకునే ఈచిత్రాన్ని నిర్మాతలు ఎన్‌.వి.ప్రసాద్‌, 'ఠాగూర్‌'మధు నిర్మించనున్నట్టు సమాచారం.

10:34 - October 20, 2015

కృష్ణా : విజయవాడ నుంచి అమరావతి సంకల్పయాత్ర ఘనంగా మొదలైంది.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుంచి మన నీరు, మన మట్టి నగరానికి చేరుకుంది.. ప్రపంచంలో ఎక్కడా జరగనివిధంగా అంగరంగవైభవంగా శంకుస్థాపన జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు ఏపీ మంత్రులు తెలిపారు.

10:32 - October 20, 2015

గుంటూరు : రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లు దాదాపు పూర్తికావొచ్చాయి. ఎల్లుండి జరిగే శంకుస్థాపన కోసం వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన నీరు-మట్టిని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో ఉంచారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించి... ఉద్దండరాయని పాలెంకు తరలిస్తారు.

10:29 - October 20, 2015

న్యూఢిల్లీ : భారత టెన్నిస్‌ యువ కెరటం యూకీ బాంబ్రీ కెరీర్లో తొలిసారి వంద లోపు ర్యాంకు సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సోమవారం విడుదల చేసిన ర్యాంకుల్లో అతడు 99వ ర్యాంకులో నిలిచాడు. అంతే కాకుండా 2010 తర్వాత భారత్‌ నుంచి టాప్‌ 100లో ర్యాంకు పొందిన తొలి ఆటగాడిగా, దశాబ్దంలో మూడో ఆటగాడిగా కూడా యూకీ రికార్డుల్లోకి ఎక్కాడు. యుకీ చివరి మూడు టోర్నమెంట్లలో ప్రశంసాత్మకమై ఆటతీరు కనబర్చాడు. తష్కెంట్‌ ఓపెన్‌లో సెమీ ఫైనల్‌ వరకు వెళ్లగా తైవాన్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఇక షాంఘై ఓపెన్‌ సిరీస్‌లో విజయం సాధించాడు. టాప్‌-100 ర్యాంకు ఇచ్చిన ఆత్మవిశ్వా సంతో ఉన్న యూకీ అక్టోబర్‌ 26 నుంచి జరిగే పూణె చాలెం జర్‌ సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. మహిళల డబుల్స్‌లో సానియా ప్రపంచ నెంబర్‌ వన్‌ ర్యాంకుల్లో కొనసాగుతోంది.

హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు మంగళవారం ఘనంగా జరుగుతున్నాయి. అయితే నగరంలో బతుకమ్మలను బషీర్బాగ్ క్రాస్ రోడ్స్, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం... అప్పర్ ట్యాంక్ బండ్ మీదుగా ఊరేగించనున్నారు. ఈ నేపథ్యంలో కాచిగూడ, నారాయణగూడ, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మోండా మార్కెట్ వైపు వాహనాలను ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద దారి మళ్లించనున్నారు. అలాగే మాసబ్ ట్యాంక్, లక్డీకపూల్, అయకార్ భవన్ నుంచి వాహనాలు మళ్లిస్తారు. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలకు... లోయర్ ట్యాంక్ బండ్, లిబర్టీ, బషీర్బాగ్ వరకు అనుమతిస్తారు.

10:26 - October 20, 2015

ఎట్టకేలకు వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్ మెంట్ ప్రకటించాడు. రిటైర్ ప్రకటించారని..ప్రకటించలేదని సోమవారం చర్చ జరిగింది. మొత్తం మీద మంగళవారం తన ట్విట్టర్ ద్వారా రిటైర్ మెంట్ విషయాన్ని ప్రకటించాడు. ఫామ్ కోల్పోయిన భారత జట్టుకు దూరమైన సెహ్వాగ్ మంగళవారం 37వ పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. తన కెరీర్ లో 104 టెస్టుల్లో 8586 పరుగులు చేశాడు. 251 వన్డేల్లో 8273 పరుగులు సాధించాడు. 19 టీ20 మ్యాచ్ లు కూడా ఆడాడు. అతని కెరీర్ ను విశ్లేషిస్తే...
రెండున్నరేళ్లుగా జట్టులో స్థానం కోసం ఎదురు చూసిన సెహ్వాగ్‌ ఫామ్‌ కూడా అంతంత మాత్రంగానే ఉంది. కెరీర్‌ తొలి నాళ్లలో సెహ్వాగ్‌ బ్యాటింగ్‌ శైలి సచిన్‌ను పోలి ఉందంటూ వచ్చిన కామెంట్లకు బ్యాటుతోనే సమాధానం చెప్పి డేరింగ్‌, డాషింగ్‌ బ్యాట్స్ మెన్ తనకంటూ ఒక ఇమేజ్‌ ఏర్పర్చుకున్నాడు. బౌలర్‌ ఎవరైనా సరే బంతిని బౌండరీ దాటించడమొక్కటే ధ్యేయంగా సెహ్వాగ్‌ బ్యాటింగ్‌ సాగేది. వన్డేలు, టెస్టులు, విదేశం, స్వదేశం, పిచ్‌, బౌలర్‌....లాంటి వాటితో సంబంధం లేకుండా ఊచకోత కోసేవాడు. సెహ్వాగ్‌ ధాటికి బౌలర్లకు బంతిని ఎక్కడ వేయాలో అర్థం కాదంటే అతిశయోక్తి కాదేమో. ఫామ్‌లో ఉన్న బౌలర్లను ఉతికి ఆరేసి వారి లయను దెబ్బతీసే వాడు. దీని ఫలితంగా తర్వాత వచ్చే బ్యాట్స్ మెన్ కు పరుగులు చేయడం సులువయ్యేది. సెహ్వాగ్‌ క్రీజులో ఉంటే అవతలి ఎండ్‌లో ఉన్న బ్యాట్స్ మెన్ ప్రశాంతంగా ఉండొచ్చు. సెహ్వాగ్‌ టెస్టు జోడీ గౌతమ్‌ గంభీరే దీనిని వెల్లడించాడు. పుట్‌వర్క్ ను ఎక్కువగా వాడని సెహ్వాగ్‌ బలమంతా ఆఫ్‌ సైడే. సెహ్వాగ్‌ అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన తొలి మ్యాచ్‌ నుంచి చివరి మ్యాచ్‌ దాకా అదే దూకుడు. అయితే ఆ దూకుడే అతడికి జట్టులో స్థానం కోల్పోయేలా చేసింది. చాలా మ్యాచ్‌ల్లో తొలి రెండు ఓవర్లలోనే నిర్లక్ష్యంగా బ్యాట్‌ను ఊపి స్లిప్స్‌లో క్యాచ్‌ ఇచ్చి ఔటైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏది ఏమైనా అంతర్జాతీయ క్రికెట్లో సెహ్వాగ్‌ వేసిన ముద్ర చరిత్రలో ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు టి20 మ్యాచ్‌ల్లో వాడే ఊచకోత, వీరబాదుడు లాంటి పదాలను సెహ్వాగ్‌ పదేళ్ల క్రితమే పరిచయం చేశాడు. డబుల్‌ సెంచరీ ముందు కూడా సిక్సర్ కొట్టగలిగేంత ధైర్యం సెహ్వాగ్‌కు మాత్రమే ఉంది అని మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ చేత కితాబందుకున్నాడు సెహ్వాగ్‌.

2003-04 అత్యుత్తమ ఫామ్..
2003-04లో సెహ్వాగ్‌ అత్యుత్తమ ఫామ్‌లో ఆడాడు. 9 టెస్టుల్లో 1040 పరుగులు చేయగా వాటిలో పాకిస్తాన్‌పై ట్రిపుల్‌ సెంచరీ, మెల్‌బోర్న్‌లో ఆసీస్‌పై 195 పరుగులు వరదలా పారించాడు. 2003లో ఐసిసి వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరిన జట్టులో, 2011 వరల్డ్ కప్‌ సాధించిన జట్టులో, 2007 ఐసిసి టి20 వరల్డ్ కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా కీలకపాత్రను పోషించాడు. అంతేకాకుండా 12 వన్డేలు, 4 టెస్టుల్లో కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో సెహ్వాగ్‌ ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు. వాటిలో 2010లో పద్మశ్రీ అవార్డు, 2008, 2009లలో విజ్డెన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌, 2002లో అర్జున అవార్డు, 2010లో ఐసిసి టెస్టు ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్నాడు.

 • భారత్‌ తరఫున టెస్టుల్లో రెండు ట్రిపుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్ మెన్‌
 • అన్ని ఫార్మాట్లలో కలిపి సెహ్వాగ్‌ చేసిన మొత్తం పరుగులు 17,253
 • 104 టెస్టుల్లో 8586 పరుగులతో భారత్‌ ఆల్‌ టైమ్‌ లిస్ట్‌లో ఐదో స్థానం
 • తొలి మ్యాచ్‌ వన్డే 1999లో పాకిస్తాన్‌తో
 • చివరి వన్డే మ్యాచ్‌ 2013 జనవరిలో పాకిస్తాన్‌తో
   
  టెస్టులు వన్డేలు ఫస్ట్ క్లాస్‌
మ్యాచ్‌లు 104 251  178
పరుగులు 8,586 8,273 13,459
బ్యాటింగ్‌ సగటు 49.34 35.05 47.22
100/50 23/32 15/38 38/51
అత్యధిక స్కోరు 319 219 319
వికెట్లు 40 96  105

తిరుమలలో పాడైన లడ్డూలు...

తిరుమల: భక్తులు పరమ పవిత్రంగా భావించి ప్రసాదంగా స్వీకరించే స్వామివారి లడ్డూలను విక్రయించే కౌంటర్లో 150 లడ్డూలు పాడైపోయాయి. నిల్వ చేయడమే లడ్డూలు చెడిపోవడానికి కారణమని అధికారులు పేర్కొన్నారు. పాడైన లడ్డూలను టీటీడీ సిబ్బంది గోగర్భం ప్రదేశంలో పడేశారు. దీనిపై భక్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

సూర్యప్రభవాహనమెక్కిన రమణ దీక్షితులు

హైదరాబాద్ : తిరుమల శ్రీవెంకటేశ్వరుడి వాహన సేవలు అర్చకుల్లో వివాదాలను పెంచగా, ఈ ఉదయం సూర్యప్రభ వాహన సేవ జరుగుతున్న వేళ, వాహనంపై ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు స్వయంగా హారతులిస్తూ, స్వామివారి పక్కనే నిలబడ్డారు. సాధారణంగా ప్రధానార్చక హోదాలో వాహన సేవలు ప్రారంభమయ్యే వరకూ ఉండి, ఆపై దేవాలయంలోకి వెళ్లి నైవేద్యాది కైంకర్యాలను పర్యవేక్షించే రమణ దీక్షితులు నేడు వాహనంపై కనిపించడం భక్తుల్లో ఆసక్తిని పెంచింది. అంతకుముందు ఎవరు సూర్యప్రభ వాహనం ఎక్కాలన్న విషయమై వాగ్వాదం జరుగగా, తానే స్వయంగా చూసుకుంటానని వెల్లడించిన రమణ దీక్షితులు మాడ వీధుల ఊరేగింపు బాధ్యతలు స్వీకరించారు.

దుర్గ గుడి వద్ద సంకల్ప జ్యోతిని వెలిగించిన క్రీడాకారులు...

విజయవాడ: దుర్గ గుడి వద్ద క్రీడాకారులు సంకల్పజ్యోతిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమ, పరిటాల సునీత శాప్‌ చైర్మన్‌ మోహన్, వెయిట్‌ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంకల్పజ్యోతితో క్రీడాకారులు గుంటూరు బయలుదేరారు. అక్కడ సంకల్ప జ్యోతిని ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకుంటారు.

09:29 - October 20, 2015

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌ నేతలంతా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నేతలంతా కృషి చేస్తున్నారు. ఇప్పుడు నేతల దృష్టి అంతా వరంగల్‌ ఉప ఎన్నికపై పడింది. ఎలాగైనా టీఆర్‌ఎస్‌కు బుద్ది చెప్పి తమ సత్తా చాటాలని నేతలు వ్యూహం రచిస్తున్నారు.

చార్మినార్‌ వద్ద రాజీవ్‌ యాత్ర ప్రారంభించి నేటికి 25 ఏళ్లు .......

రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలను కాంగ్రెస్‌ పార్టీ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించింది. 1990లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ హైదరాబాద్‌లోని చార్మినార్‌ వద్ద యాత్రను ప్రారంభించి.. నేటికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చార్మినార్‌ వద్ద సభను ఏర్పాటు చేశారు. హాజరైన పలువురు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక గులాంనబీ ఆజాద్‌ను రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డుతో నేతలు సత్కరించారు. వరంగల్‌లో కాంగ్రెస్‌ నేతలు కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దిగ్విజయ్‌సింగ్‌, టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సహా పలువురు నేతలు హాజరయ్యారు. వరంగల్‌ ఎంపీ ఉప ఎన్నికపై కార్యకర్తల మనోభావాలను నేతలు తెలుసుకున్నారు.

రైతుల సమస్యలను సర్కార్‌ పట్టించుకోవడం లేదు......

ఇక ఈ కార్యక్రమంలో తెలంగాణ సర్కార్‌పై నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని తీవ్రంగా ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్‌ కుటుంబ సభ్యులు భారీగా దోచుకుంటున్నారన్నారని పలువురు ఆరోపించారు. ఏదిఏమైనా కాంగ్రెస్‌ నేతలు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. 

09:25 - October 20, 2015

హైదరాబాద్ : ప్రపంచ టెస్ట్ నెంబర్ వన్ సౌతాఫ్రికాతో నవంబర్ 5 నుంచి ప్రారంభమయ్యే మూడుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో పాల్గొనే...మొదటి రెండుటెస్ట్ ల జట్టును ముంబైలో బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. మొత్తం 16 మంది సభ్యుల జట్టులో...సౌరాష్ట్ర ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు కల్పించినట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టులోని ఇతర ఆటగాళ్ళలో శిఖర్ ధావన్, రాహుల్, రోహిత్ శర్మ,మురళీ విజయ్, చతేశ్వర్ పూజారా, అజింక్యా రహానే, వృద్దిమాన్ సాహా, అమిత్ మిశ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, స్టువర్ట్ బిన్నీ,వరుణ్ ఆరోన్, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు.

వెటరన ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్థానంలో రవీంద్ర జడేజాకు....

వెటరన ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్థానంలో రవీంద్ర జడేజాకు స్థానం కల్పించారు. రంజీట్రోఫీ లీగ్ లో జడేజా ఆల్ రౌండ్ షోతో అదరగొట్టడం ద్వారా...తనజట్టుకు ఒంటిచేత్తో విజయాలు అందించడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. టీమ్ కెప్టెన్, డైరెక్టర్ సూచనలు, ప్రత్యర్థిజట్లను బట్టి తుదిజట్టు కూర్పు ఉంటుందని, కెప్టెన్ కోరిక మేరకే జట్టు ఎంపిక చేయడం తమ కర్తవ్యమని...చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ చెప్పారు. ఆఖరి రెండు వన్డేల్లో పాల్గొనే భారతజట్టు నుంచి ఫాస్ట్ బౌలర్ల ఉమేశ్ యాదవ్ కు విశ్రాంతి ఇచ్చి...యువపేసర్ అరవింద్ కు చోటు కల్పించారు. ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని చివరి రెండువన్డేలు అక్టోబర్ 22, 25 తేదీల్లో చెన్నై చెపాక్, ముంబై బ్రబోర్న్ స్టేడియాలు వేదికగా జరుగుతాయి.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

మహబూబ్ నగర్ : ఇటిక్యాల మండలం షాబాద గ్రామంలో భాస్కర్ రెడ్డి అనే రైతు ఆప్పుల బాధతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు.

తిరుమలలో అర్చకుల మధ్యముదిరిన వివాదం

హైదరాబాద్: తిరుమలలో అర్చకుల మధ్య వివాదం ముదురుతోంది. సూర్య ప్రభ వాహనం విధుల కేటాయింపు‌పై వేణుగోపాల్ దీక్షితులు, రమణ దీక్షితుల మధ్య వాగ్వాదం జరిగింది. నెల రోజుల క్రితమే వేణుగోపాల్‌ దీక్షితులకు టీటీడీ విధులు కేటాయించింది. దీంతో రమణ దీక్షితులు టీటీడీ అధికారులపై ఒత్తిడి తెచ్చి వేణుగోపాల్ దీక్షితుల విధులను మార్పించారు. చివరి నిమిషంలో విధుల మారిపోవడంతో వేణుగోపాల్‌ దీక్షితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లారీ బోల్తా : డ్రైవర్ మృతి

మహబూబ్ నగర్ : వెల్దండ మండలం పరిధిలో చెరుకూరు బస్టాండ్ సమీపంలో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. హైదరాబాద్ నుండి కల్వకుర్తి వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో అదుపు తప్పి బోల్తా పడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో డ్రైవర్ హాజీ (40) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులుసంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి.. సహాయకార్యక్రమాలు చేపట్టారు.

విజయవాడలో రౌడీషీటర్ దారుణ హత్య

విజయవాడ: నగరంలోని పాతబస్తీలో రౌడీషీటర్ చాంద్‌బాషా దారుణహత్యకు గురయ్యాడు. బాషాను అతడి స్నేహితుడు రామారావే కొట్టిచంపినట్టు తెలిసింది.ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తడంతో కోపం పట్టలేక రామారావు స్నేహితుడు బాషాను కొట్టి చంపినట్టు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రామారావును అదుపులోకి తీసుకున్నారు.

ఇజ్రాయిల్ లో ఫేస్ బుక్ ఆఫీసు ధ్వంసం

హైదరాబాద్ : సోషల్ నెట్ వర్కింగ్ లో కొత్త ఒరవడికి నాందీ పలికిన ‘ఫేస్ బుక్’పై దాడులు మొదలయ్యాయి. ఓ వర్గాన్ని కించపరుస్తూ ఫేస్ బుక్ లో ప్రత్యక్షమైన పోస్టులను తొలగించాలన్న డిమాండ్ ను పట్టించుకోని సదరు సంస్థ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఘటన ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లో చోటుచేసుకుంది. దాడిలో ఫేస్ బుక్ ఇజ్రాయెల్ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. యూదులు, ఇజ్రాయెలీలను చంపాలంటూ పోస్ట్ అయిన పేజీలను తొలంగిచాలన్న డిమాండ్ ను పట్టించుకోని కారణంగానే కొందరు దుండగులు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.  

08:31 - October 20, 2015

హైదరాబాద్ : అమరావతి శంకుస్థాపనకుఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మరో వైపు ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేపడుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన ఆహ్వానితుడుగా వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి శంకుస్థాపన నుండి వెళ్లి పోయే లోపు విభజన సందర్భంగా రాష్ట్ర పునర్వవ్యవస్థీకరణ చట్టంలో చేసిన హామీలు అమలు చేస్తారా? లేదా ? అని ప్రజలు, ప్రజా ప్రతినిధులు నిలదీయాల్సిన అవసరం వుందని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో దహన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ తెలిపారు. ఎస్సీలకు ఇచ్చే మూడెకరాల భూమిని ఎస్టీలకు కూడా ఇస్తామని తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఇది సాధ్యమేనా? కులాలు, మతాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. ముగింపు దశకు చేరుకున్న సద్దుల బతుమ్మ పండుగలో ప్రత్యేక పోయి ఆర్భాటాలు పెరిగిపోయాయి. బతుకమ్మ పండుగ విశష్టతను తెలిపే విధంగా ఉండాలని నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. పూర్తి విశ్లేషణ చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

08:01 - October 20, 2015

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా రచయితల పై దాడులు ఎందుకు జరుగుతున్నాయి? గో మాంసం రగడ, బిసిసిఐ చీఫ్ పై శిసేన కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయా? దాద్రి ఘటన, ప్రజా ప్రతినిధులపై దాడులు ఎందుకు పెరుగుతున్నాయి. దీని పై కేంద్ర ప్రభుత్వం స్పందించే తీరు సహేతుకంగా వ్యవహరిస్తోందా? మతతత్వ శక్తుల ఆగడాలకు హద్దుల లేకుండా పోతోందా? బిజెపి ఎంపిలు, ఎమ్మెల్యే లు ఎందుకు నిరంతరం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు? అవినీతిపరులపై కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇత్యాది అంశాలపై ఆసక్తి కరమైన చర్చ న్యూస్ మార్నింగ్ లో జరిగింది. ఈకార్యక్రమంలో సీనియర్ రాజకీయ విశ్లేషకులు వినయ్ కుమార్, బిజెపి నేత రఘునందన్ రావు, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ రావు, టిఆర్ ఎస్ నేత జీవన్ రెడ్డి పాల్గొన్నారు. వీరి మధ్య జరిగిన చర్చను మీరూ వినాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి...

 

నేడు సద్దుల బతుమ్మ ముగింపు సంబురాలు..

హైదరాబాద్: నేడు తెలంగాణలో సద్దుల బతుకమ్మ ముగింపు సంబరాలను ఘనంగా నిర్వహిచనున్నారు. ఇందుకోసం చెరువు గట్ల దగ్గర అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎల్బీస్టేడియం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు బతుకమ్మ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30కి ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ముగింపు సంబరాలను వైభవంగా నిర్వహిస్తారు.

లారీ-ఆర్టీసీబస్సు- బైక్ ఢీ

గుంటూరు : దాచేపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ- ఆర్టీసీ బస్సు - బైక్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో లారీ దగ్ధం కాగా... ఒకరు మృతి చెందారు.

06:59 - October 20, 2015

హైదరాబాద్ : బీహార్‌ అభివృద్ధి బిజెపితోనే సాధ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా స్పష్టం చేశారు. బీహార్‌ కోసం లక్షా 65 వేల కోట్ల ప్యాకేజీని ప్రధాని ప్రకటిస్తే... నితీష్‌ కుమార్‌ ప్యాకేజీ వద్దంటున్నారని ఆరోపించారు. అయితే ఈ ప్యాకేజీ నితీష్‌కు కాదని బీహార్‌ యువత, రైతులు, మహిళల కోసమని అన్నారు. నితీష్‌-లాలూ అధికారంలోకి వస్తే విద్యుత్‌, విద్య, ఉపాధి ఏవి రావని పాలిగంజ్‌ ఎన్నికల సభలో పేర్కొన్నారు. 

06:57 - October 20, 2015

నల్గొండ : చిట్యాల్ మండలం వెలిమినేడు గ్రామం వద్ద ఆగీవున్న యామినీ ట్రవేల్స్ బస్సును ఆర్ టి సి బస్సు వెనక నుండి ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళా అక్కడికక్కడే మృతి చెందింది. పది మంది ప్రయాణీకులు గాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్ పెట్రొలింగ్ వాహనం దగ్గరలో ఉండడంతో గాయపడిన ప్రయాణీకులను వెంటనే హాస్పిటల్ కి తరలించారు. 

06:55 - October 20, 2015

హైదరాబాద్‌ : నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. మలక్‌పేట కుత్వి వద్ద చైన్‌ స్నాచింగ్‌ మహిళ మెడలోంచి దుండగులు గొలుసు చోరీ యత్నం చేశారు. అయితే బంగారు గొలుసు తెంచడంలో దుండగుల విఫలమయ్యారు. కానీ బాధిత మహిళకు గాయాలు అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ ఘటనపై బాధితులు సుల్తాన్‌ బజార్‌ పీఎస్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. చైన్‌ స్నాచర్లు బైక్‌ వచ్చి పరారై పోయినట్లు సమాచారం

06:53 - October 20, 2015

హైదరాబాద్ :వాటర్‌గ్రిడ్‌లో అవినీతి జరిగిందని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తేల్చిచెప్పారు. ఆదిలాబాద్‌ జిల్లాలో వాటర్‌గ్రిడ్‌ పైలాన్‌ను ఆవిష్కరించిన మంత్రి.. విపక్షాల తీరుపై మండిపడ్డారు. 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని 60 నెలల్లో చేసి చూపిస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

వాటర్‌గ్రిడ్‌తో ప్రతి ఇంటికీ మంచినీరు.....

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్‌తో ప్రతి ఇంటికీ మంచినీరు ఇస్తామన్నారు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌. ఆదిలాబాద్‌ జిల్లా దివాలపూర్ మండలం మోడేగాంలో వాటర్‌గ్రిడ్ పైలాన్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. వాటర్‌గ్రిడ్‌కు రాష్ట్రప్రభుత్వం 35 వేల కోట్లు ఖర్చు చేస్తుంటే.. కేంద్రం పైసాకూడా ఇవ్వలేదన్నారు. వాటర్‌గ్రిడ్‌ను విమర్శిస్తున్న విపక్షాలపై కేటీఆర్‌ మండిపడ్డారు. ఓ పెద్దాయన వాటర్‌గ్రిడ్‌లో అవినీతి జరిగిందని అంటున్నాడని.. అవినీతిని బయటపెడితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కేటీఆర్‌ సవాల్ విసిరారు.

కాంగ్రెస్ నేతలు రైతులపై కపట ప్రేమ.....

కాంగ్రెస్ నేతలు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు భరోసా ఇచ్చి ఉంటే నేడు భరోసా యాత్రలు చేయాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. వచ్చే ఎండకాలం నుంచి పగటిపూట 9 గంటల కరెంట్ ఇస్తామని కేటీఆర్‌ చెప్పారు. 60 ఏండ్లలో చేయని అభివృద్ధిని.. 60 నెలల్లో చేసి చూపిస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. వాటర్‌గ్రిడ్‌ పైలాన్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న తదితర నేతలు పాల్గొన్నారు.

06:42 - October 20, 2015

గుంటూరు : అమరావతి శంకుస్థాపన ఉద్విగ్న క్షణాలు, ఉద్వేగ సమయాలు దగ్గరపడుతున్నాయి. ఎన్నో ఆశలు, కలలతో కూడిన రాజధాని నిర్మాణంపై యావత్‌ ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు. దేశమంతా ఆసక్తి నెలకొని ఉంది. శంకుస్థాపన ప్రదేశానికి ఇప్పటికే జనం తండోపతండాలుగా తరలివస్తుండడంతో ప్రజల్లో నెలకొన్న ఆసక్తి ఎంతో తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రణాళికకు స్ఫూర్తిగా నిలిచిన నగరాల గురించి తెలుసుకోవాల్సి ఉంది.

ఆసియాకే తలమానికంగా సింగపూర్ నగరం....

నవ్యాంధ్ర రాజధాని ఊహ పురుడు పోసుకున్నప్పటి నుంచి అందరి నోట ఒకటే మాట అదే సింగపూర్‌ సిటీ. ఈ నగరం అద్భుతంగా అభివృద్ధి చెంది, ఆసియాకే తలమాణికంగా నిలచింది. అందుకే మొదటి నుంచి అందరి దృష్టి సింగపూర్‌ లాంటి అభివృద్ధి ప్రణాళిక పైనే నెలకొంది.

సింగపూర్‌ 704 కిలోమీటర్ల విస్తీర్ణంలో .....

సింగపూర్‌ 704 కిలోమీటర్ల విస్తీర్ణంలో వెలసిన చిన్న దేశం. సింగపూర్‌ నగరానికి, నవ్యాంధ్ర కొన్ని సారూప్యతలు ఉన్నాయి. రెండు అభివృద్ధిని ఒడిదిడుకుల మధ్య మొదలు పెట్టాయి. మూడు దశాబ్దాల పాటు అకుంఠిత దీక్షతో సింగపూర్‌ ప్రపంచాన్ని ఆకర్షించే అభివృద్ధిని సాధించింది.

సింగపూర్ బాటలనే నవ్యాంధ్ర....

ఇప్పుడు సింగపూర్‌ బాటలోనే నవ్యాంధ్ర సైతం అమరావతి అంకురార్పణతో అభివృద్ధి పథంలో నడవాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం సింగపూర్‌ ప్రపంచంలోని అతిపెద్ద వాణిజ్య కేంద్రాలలో ఒకటి అలాగే ఎక్కువ వాణిజ్యం నడిచే ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది. తలసరి ఆదాయంలో 3వ అతిపెద్ద దేశం. పారిశ్రామిక రంగంలోనూ సింగపూర్‌ అభివృద్ధి సాధించింది. అమరావతి సైతం అవకాశాలను అందిపుచ్చుకొని సింగపూర్‌ బాటలోనే పయనించి అభివృద్ధిని సాధించాలనే తపన ఇప్పుడు ప్రజల్లో నెలకొని ఉంది. అందుకే శంకుస్థాపనపై ఉత్సాహంగా ప్రజలు అడుగువేస్తున్నారు. అమరావతి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ఆంధ్రుల కలల రాజధాని అయ్యే దిశగా పయనించేందుకు చాలా దూరం ప్రయాణించాల్సిఉంది. అందుకు తొలిఅడుగే శంకుస్థాపన అని ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. 

06:39 - October 20, 2015

గుంటూరు : ప్రపంచంలోనే అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దాలని సంకల్పిస్తున్న అమరావతి శంకుస్థాపన ఉత్సవం .. మొదలు కాకముందే రికార్డుల మోత మోగిస్తోంది. ఆహ్వానితుల సంఖ్య , అంతర్జాతీయ ప్రాతినిధ్యం , రాజకీయ ప్రాముఖ్యం, చారిత్రక పునరుత్థానం వంటి అంశాలు.. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్‌ బుక్‌లో నమోదు చేయాల్సిన అంశంగా అధికార వర్గాలు భావిస్తున్నాయి.

4,07,994 మందికి ఆహ్వానాలు.....

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి అక్షరాలా నాలుగు లక్షల ఏడువేల తొమ్మిది వందల తొంభై నాలుగు మందికి ఆహ్వానాలు పంపించారు. ఇందులో రాజకీయ, అదికార, విభిన్న రంగాల ప్రతినిధుల సంఖ్యే నలభై వేలకు పైగా ఉంది. వీరంతా వీఐపీ, వీవీఐపీ, మోస్టు ఇంపార్టెంటు వ్యక్తుల కేటగిరిలో ఉన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు వీవీఐపీ విభాగంలో ఉండగా, రాష్ట్రమంత్రులు, ఎంపీలు, కేబినెట్ ర్యాంకు కలిగిన ఇతరులు, శాసనసభ్యులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు వీఐపీ కేటగిరిలో ఉన్నారు.

వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులకూ ఆహ్వానం

అమరావతికి పెట్టుబడులు ఆకర్షించేందుకుగాను వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులను సైతం శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు. వీరి కోసం ఒక ప్రత్యేక విభాగాన్నే కొత్తగా సృష్టించారు. అదే మోస్టు ఇంపార్టెంటు కేటగిరి. టాటాలు, అంబానీలు, అదానీలతో పాటు స్థానికంగా తెలుగు రాష్ట్రాల్లోని వ్యాపార, వాణిజ్య ప్రముఖులకు సైతం ఇందులో చోటు కల్పించారు.

శంకుస్థాపన మహోత్సవానికి రికార్డు స్థాయి ఆహ్వానాలు పంపిణీ

సాధారణంగా బహిరంగ సభలు, సమావేశాలు జరిగినప్పుడు ప్రత్యేకంగా ఎవరికీ వ్యక్తిగత ఆహ్వానాలు ఉండవు. కానీ ఈ మహోత్సవానికి మాత్రం రికార్డు స్థాయి ఆహ్వానాలను అధికారికంగా రూపొందించి పంపిణీ చేశారు. అవి అతిధులకు కూడా చేరిపోయాయి. రాజధాని ప్రాంతానికి చెందిన స్థానికులందరికీ ప్రత్యేక అతిథులుగా పిలుపులివ్వడం మరో విశేషం. ఇక రాష్ట్రంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ ఆహ్వానితుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఇంతపెద్ద ఎత్తున ఓ కార్యక్రమంలో పాల్గొననుండటం ఒక రికార్డే.

ఆహ్వానితుల్లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన వారు 1353 మంది

దేశ,విదేశ ప్రముఖుల ఆహ్వానితుల చిట్టా కూడా అంకెల్లో అబ్బో అనిపిస్తోంది. కేంద్రప్రభుత్వానికి చెందిన 1353 మంది ఆహ్వానితుల్లో ఉన్నారు. విదేశీ ప్రముఖులు 245 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు 410 మంది, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖులు 658 మంది, కార్పొరేట్, వ్యాపార ప్రముఖులు 19,198మంది, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఒక వెయ్యీ డెబ్భైరెండు మంది, రాష్ట్రానికి చెందిన రాజకీయ ప్రముఖులు6550,రాష్ట్ర ప్రభుత్వంలోని అధికారులు 811 మంది, ప్రెస్ అండ్ మీడియాకు చెందిన 453 మంది ఆహ్వానితుల చిట్టాలో ఉన్నారు. ఇంతపెద్ద ఎత్తున ప్రముఖులకు పిలుపునంపడం తప్పనిసరిగా చరిత్రలో నమోదు చేయాల్సిన అంశమేననే భావన వ్యక్తమవుతోంది.

16వేల గ్రామాలు, పట్టణాల నుంచి మట్టి, నీరు

అతిథుల జాబితాను పక్కన పెడితే .. ఈ కార్యక్రమానికి ఒక పవిత్రతను, ఉదాత్తతను ఆపాదించడానికి చేపట్టిన భావోద్వేగ ఘట్టం కూడా రికార్డు గానే నిలుస్తోంది. మన మట్టి మన నీరు పేరిట 16 వేల గ్రామాలు, పట్టణాల నుంచి నీరు , మట్టి శంకుస్థాపనకు సేకరించడం ఒక బృహత్తర కార్యంగా నిలుస్తోంది. ఈ రూపంలో 16 మెట్రిక్ టన్నుల మట్టి రాజధానికి చేరుకుంటోంది. రాష్ట్రంలోని 150 ప్రముఖ దేవాలయాలు, 50 మసీదులు, 50 చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించి ఆయా ప్రాంతాల్లోని మట్టిని కూడా తీసుకుని వస్తున్నారు.

శృంగేరి పీఠం నుంచి శ్రీచక్రం

శృంగేరీ పీఠం నుంచి శ్రీచక్రం తెప్పిస్తున్నారు. అలాగే అష్టాదశ శక్తి పీఠాల నుంచి కూడా పూజాద్రవ్యాలు, మృత్తిక తెప్పిస్తున్నారు. ఇవన్నీ కూడా కార్యక్రమానికి ఆధ్యాత్మిక పరిమళం అద్దే ప్రయత్నంలో భాగంగా ఉన్నాయి. ప్రజాభాగస్వామ్యం, స్వచ్ఛంద సేవా నిర్వహణ అంశాల్లో ఎంతమేరకు ప్రభుత్వం కృతకృత్యమవుతుందనే విషయంలో సందేహాలున్నప్పటికీ రాజధాని శంకుస్థాపన మాత్రం ఒక రికార్డు బ్రేక్ ఈవెంట్ గా నిలిచిపోతుందనే అబిప్రాయం సర్వత్రా వినవస్తోంది.    

06:35 - October 20, 2015

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీకి తెలుగు వంటలు రుచి చూపించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అదరహో అనే రీతిలో సాంప్రదాయ వంటకాలను తయారు చేయనుంది. ప్రధాని కార్యాలయం సైతం.. ఆంధ్రా వంటకాలను సిద్ధం చేయాలంటూ సమాచారం ఇవ్వడంతో.. అదిరిపోయే మెనూను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.

చక్కెర పొంగలి, పులిహోర, గారెలు, వెజ్‌ బిర్యాని.....

చక్కెర పొంగలి, పులిహోర, గారెలు, వెజ్‌ బిర్యాని, ఉలవచారు, ఆవకాయ, దప్పళం, పుల్కా, రోటి, వెజ్‌కర్రీలు తయారు చేయనున్నారు. లంచ్‌లోకి ఆంధ్రా బ్రాండ్‌ మిఠాయిలు కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజాతో పాటు మరికొన్ని స్వీట్లను తెప్పిస్తున్నారు.

ఉపవాస దీక్షలో ఉన్న మోదీ .....

ఇక ప్రస‌్తుతం దేవీ శరన్నవరాత్రులు జరుగుతున్న నేపథ్యంలో.. మోదీ కఠిక ఉపవాసదీక్షలో ఉన్నారు. గతేడాది నవరాత్రుల రోజులలో మోదీ అమెరికాలో పర్యటించారు. ఆ సందర్భంలో కేవలం మంచినీళ్లు, పండ్లు, నిమ్మరసంతోనే గడిపారు. దీంతో ఇప్పుడు కూడా అదేవిధంగా మంచినీళ్లు, పండ్లు, నిమ్మరసమే తీసుకుంటారా ? అనే సందిగ్ధంలో అధికారులున్నారు. అయితే.. శంకుస్థాపన విజయదశమినాడు జరుగుతుంది కాబట్టి అప్పటికే మోదీ దీక్ష ముగుస్తుందని పీఎంవో.. రాష్ట్ర అధికారులకు సమాచారమందించింది. ఒకవేళ ఉపవాస దీక్ష విరమించకపోతే నిమ్మరసం,పండ్లు సిద్ధం చేయాలన్నారు.

వీఐపీల కోసం ప్రత్యేక మెనూ .......

ఇక వీఐపీల కోసం అధికారులు ప్రత్యేక మెనూను సిద్ధం చేశారు. సింగపూర్‌, జపాన్‌ల నుండి ప్రతినిధులు రానున్న నేపథ్యంలో ఐటీసీ హోటల్‌ సహకారంతో కెఎంకె ఈవెంట్‌ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక మెనూను సిద్ధం చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అంతే ప్రతిష్టాత్మకంగా అతిథులకు వంటల రుచి చూపించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

వెలిమినేడు వద్ద రోడ్డు ప్రమాదం :ఒకరి మృతి

నల్గొండ : విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి వెలిమినేడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఒకరు మృతి చెందగా.... మరో 14 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. అడవిపంది అడ్డురావడంతో యామిని ట్రావెల్స్ బస్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో యామిని ట్రావెల్స్ బస్సును వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Don't Miss