Activities calendar

26 October 2015

21:32 - October 26, 2015

నల్గొండ : ప్రజాసమస్యలపై సమగ్ర పోరుకు సిద్ధం కావాలని సీపీఎం తెలంగాణ విభాగం నిర్వహించింది. నాగార్జున సాగర్‌లో జరుగుతున్న ప్లీనరీ సమావేశాల్లో రెండో రోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ వైఖరిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్లీనరీలో పలు తీర్మానాలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలోని కేసీఆర్‌ ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతోందని సమావేశాల్లో చర్చించారు. అలాగే సమ్మె చేసిన 1200 మంది మున్సిపల్‌ కార్మికులను విధుల్లోకి తీసుకునే వరకూ పోరాటం చేయాలని తీర్మానించారు. దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్లీనరీలో తీర్మానాలు చేశారు. అలాగే రైతుల ఆత్మహత్యలు, గిట్టుబాటు ధర, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సైతం తీర్మానాలు చేశారు. సామాజిక శక్తులను కలుపుకుని బలమైన శక్తిగా ఎదగాలని తీర్మానించారు.

నిర్ణయాలను వెల్లడించిన తమ్మినేని..
ఈ సందర్భంగా ప్లీనరీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. ఆశా వర్కర్ల సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని, వారికి ఆర్థికంగా అండగా నిలుస్తామన్నారు. ఆశాలకు ఆర్థిక సహాయం కోసం పిలుపునిచ్చిన వెంటనే ప్లీనరీ ప్రతినిధులు లక్షా 2వేల రూపాయలు విరాళం అందించారని తెలిపారు. ఇదే స్పూర్తితో ఈనెల 31న రాష్ట్ర వ్యాప్తంగా ఆశాల కోసం విరాళాలు సేకరించడం జరుగుతుందని, నవంబర్ 4వ తేదీన భూ సమస్యపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్య, వైద్య రంగంలో ఫీజుల నియంత్రణకు రెగ్యులేటరీ కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

సాగర్ ఎడమ కాల్వ నీటి విడుదలపై తీర్మానం..
సాగర్ ఎడమ కాల్వకు రోజుకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సమావేశంలో తీర్మానం చేశారు. తీర్మానాన్ని నల్గొండ జిల్లా కార్యదర్శి జూలకంటి ప్రవేశ పెట్టగా ఖమ్మం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ బలపరిచారు. దీనిని ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. చర్చలు, తీర్మానాలతో సీపీఎం రెండో రోజు ప్లీనరీ సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా కార్యకర్తలు, నేతలు నూతన మార్గనిర్దేశంతో కొత్త శక్తిని నింపుకున్నారు.  

21:28 - October 26, 2015

గుంటూరు: శంకుస్థాపన వరకూ కాస్త కామ్‌గాఉన్న ఉన్న వైసీపీ అధినేత... మళ్లీ మాటల యుద్ధం మొదలుపెట్టారు. టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు సేకరణ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి సోమవారం రాజధాని గ్రామాల్లోని మల్కాపురంలో మూడు రోజుల క్రితం కాలిపోయిన చెరకు పంటను పరిశీలించారు. ల్యాండ్‌పూలింగ్‌కు తమ భూమి ఇవ్వనందుకే పంట దగ్ధం చేశారని ఆ పొలం రైతు జగన్‌కు వివరించారు. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు జగన్‌. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన మంత్రులు ఇలాంటి పనులుచేస్తూ రైతుల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు.

ఉద్దండ్రాయుని పాలెంకు వెళ్లిన జగన్..
అక్కడినుంచి రాజధాని శంఖుస్థాపన జరిగిన ఉద్దండ్రాయుని పాలెంకు వెళ్లారు. అక్కడ ఎస్సీ, ఎస్టీ రైతులతో జగన్ మాట్లాడారు. అసైన్డ్ భూములిచ్చినవారిని శంఖుస్థాపనకు పిలవలేదని స్థానికులు జగన్‌కు తెలిపారు. భూములివ్వమన్నందుకు తమ పొలాల్లో కరెంట్ కట్‌ చేశారని మరికొందరు ఆరోపించారు. శంఖుస్థాపన కోసం తమ పూర్వికుల సమాధులను కూడా తవ్వేశారని వాపోయారు. ఈ అంశాలపై కూడా జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకివస్తే అసైన్డ్ భూములకు కొత్త చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అక్కడినుంచి శంఖుస్థాపన జరిగిన ప్రదేశాన్ని కాన్వాయ్‌నుంచి చూసిన జగన్‌.. కరకట్ట మార్గం నుంచి విజయవాడ వెళ్లిపోయారు.

21:21 - October 26, 2015

ఢిల్లీ : భారత్‌ మోస్ట్‌ వాంటెడ్‌ అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఛోటా రాజన్‌ ఎట్టకేలకు దొరికిపోయాడు. ఇండోనేషియాలోని బాలిలో రాజన్‌ను ఇంటర్‌పోల్‌ వర్గాలు అరెస్టు చేశాయి. రాజన్‌పై 17 హత్య కేసులున్నాయి. ఛోటా రాజన్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు మాజీ అనుచరుడు. ఇంతకీ ఛోటా రాజన్‌ ఎవరు? మాఫియా డాన్‌ స్థాయికి ఎలా ఎదిగాడు? దాదాపు రెండు దశాబ్దాలుగా భారత దేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలను వణికిస్తూ.. తప్పించుకు తిరుగుతున్న అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఆదివారం సిడ్నీ నుంచి బాలిలోని ఓ రిసార్ట్ కు రాజన్‌ వెళ్తున్నట్టు ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారం మేరకు ఇండోనేషియా ఇంటర్‌పోల్‌ వర్గాలు ఆయనను అరెస్ట్ చేశాయి. 1995 నుంచి తప్పించుకు తిరుగుతున్న ఛోటా రాజన్‌పై భారత్‌ ఇదివరకే రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ జారీ చేసింది. ఛోటా రాజన్‌పై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని కేంద్రం పేర్కొంది.

మొదట చిన్న చిన్న దొంగతనాలు..
చీకటి నేరసామ్రాజ్యపు డాన్‌గా ఎదిగిన ఛోటా రాజన్‌ ఒకప్పుడు మాములు దొంగ. రాజన్‌ అసలు పేరు రాజేంద్ర సదాశివ నికాల్జే. ముంబైలోని దిగువ మధ్య తరగతి కుంటుంబలో పుట్టిన అతన్ని అందరూ 'నానా' అని ముద్దుగా పిలుచుకునేవారు. ఛోటారాజన్‌కు భార్య అంకితా నికాల్జే, కూతుళ్లు నికిత, ఖుషి ఉన్నారు. మొదట చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడుతున్న రాజేంద్రకు.. బడా రాజన్‌గా పేరొందిన రాజన్ నాయర్ గ్యాంగ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ గ్యాంగ్‌ తరఫున రాజేంద్ర చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించాడు. బడా రాజన్ హత్యకు గురికావడంతో ఆ గ్యాంగ్‌కు లీడర్‌ అయ్యాడు. అప్పటి నుంచి ఛోటా రాజన్‌గా చలామణి అయ్యాడు.

దావూద్ - రాజన్ మధ్య విబేధాలు...
మొదట రాజన్ ముంబైలో చిన్నచిన్న నేరాలు చేస్తూ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు చేరువయ్యాడు. దావూద్ గ్యాంగ్‌లో ఛోటారాజన్ అనేక నేరాలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో రాజన్‌ దావూద్‌కు బద్ధ శత్రువుగా మారాడు. 1993లో జరిగిన ముంబై వరుస బాంబు పేలుళ్లతో దావూద్-ఛోటా రాజన్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఇద్దరి మధ్య వైరం పెరిగి ఇరు గ్యాంగ్‌లు పరస్పరం తలపడటం మొదలుపెట్టాయి. మత కారణాలతో జరిగిన ముంబై పేలుళ్లను వ్యతిరేకించిన ఛోటా రాజన్.. దావూద్‌ నుంచి ముప్పు పొంచి ఉందనే కారణంతో తన మకాం ముంబై నుంచి మొదట మలేషియాకు, ఆ తర్వాత దుబాయ్‌కి మార్చాడు.

రాజన్ పై హత్యాయత్నం..
2000 సంవత్సరం సెప్టెంబర్‌లో రాజన్‌పై హత్యాయత్నం జరిగింది. బ్యాంకాక్‌లోని ఓ హోటల్‌లో ఉన్న రాజన్‌పై దావూద్ అనుచరుడు ఛోటా షకీల్ దాడి చేశాడు. పిజ్జా డెలివరీ బాయ్‌గా వచ్చిన షకీల్ కాల్పుల్లో ఛోటారాజన్ అనుచరులు రోహిత్ వర్మ, అతని భార్య చనిపోయారు. ఛోటా రాజన్ మాత్రం ఈ దాడి నుంచి తప్పించుకున్నాడు. ఈ దాడికి ప్రతీకారంగా ఛోటా రాజన్ అనుచరులు 2001లో దావూద్ అనుచరులు వినోద్ షెట్టి, సునీల్ సోన్‌పై దాడిచేసి చంపేశారు. వినోద్ షెట్టి అంతంతో ముంబైలో నేర ప్రపంచంలో దావూద్ పట్టు సడలిపోయింది. ఛోటా రాజన్‌ బలవంతపు వసూళ్లు, హత్యలు, స్మగ్లింగ్, మాదక ద్రవ్యాల సరఫరా, సినిమాలకు ఫైనాన్సింగ్ వంటి నేరాలతో ముంబైతో పాటు ప్రపంచ దేశాలను హడలెత్తించాడు. రాజన్‌పై భారత్‌లో 17 హత్య కేసులున్నాయి.  

21:17 - October 26, 2015

ఢిల్లీ : భూకంపం మళ్లీ వణికించింది. ఈసారి పాకిస్తాన్‌పై విరుచుకు పడింది. భూకంపం ప్రభావానికి 180 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఉత్తర భారతంలో కూడా భూ ప్రకంపనలు జనాన్ని పరుగులు పెట్టించింది. ఆఫ్ఘనిస్థాన్‌-పాక్‌ సరిహద్దులో హిందూకుష్ పర్వత శ్రేణుల్లో ఏర్పడ్డ భారీ భూకంపం పెను విషాదాన్నే నింపింది.

పెను విషాదం..
భూకంపం కారణంగా పాకిస్తాన్‌, ఆఫ్గనిస్తాన్‌లలో 70 మందికి పైగా మృత్యువాత పడ్డారు. పాకిస్తాన్‌లో 52 మంది, ఆఫ్గనిస్తాన్‌లో 21 మంది మృతి చెందారు. 2 వందల మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆఫ్గనిస్తాన్‌ రాజధాని కాబూల్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న జరమ్‌ ప్రాంతంలో భూకంపం కేంద్రీకృతమైంది. రిక్టార్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైనట్టు, 213 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్టు అమెరికా జియాలాజికల్‌ సర్వే వెల్లడించింది.

పాఠశాలలో తొక్కిసలాట..
భూకంప ప్రభావం పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్, భారత్‌లపై పడింది. ఢిల్లీ, కాశ్మీర్‌, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌, హర్యానా, పంజాబ్‌లో భూప్రకంపనలు సంభవించాయి. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్, పెషావర్, కరాచి, రావల్పిండి, లాహోర్‌ తదితర ప్రాంతాల్లో భూమి తీవ్రంగా కంపించింది. భవనాలు, ఇళ్ల పైకప్పులు కూలి పడడంతో పలువురు మృత్యువాత పడ్డారు. స్వాత్‌ లోయలో 8 మంది మరణించారు. పెషావర్‌లోని ఓ ఆసుపత్రిలో వంద మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఆఫ్గనిస్తాన్‌లో భూకంపం కారణంగా జరిగిన తొక్కిసలాటలో 12 మంది పాఠశాల విద్యార్థినిలు మృతి చెందడం విషాదకరం. మరో 35 మంది బాలికలు గాయపడ్డారు. 

మధ్యాహ్నాం భూకంపం..
మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. ఒక్క నిమిషం పాటు భూమి కంపించడంతో కార్యాలయాలు, ఇళ్లలో ఉన్న ఉద్యోగులు, జనాలు బయటకు పరుగులు తీశారు. ముందు జాగ్రత్త చర్యగా కొన్ని రాష్ట్రాల్లో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఢిల్లీ మెట్రో రైల్ సేవలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. శ్రీనగర్‌లో లాల్‌చౌక్ ఫ్లైఓవర్‌పై బీటలు పడడంతో ట్రాఫిక్‌ను బ్రిడ్జిపై నుంచి వెళ్లకుండా దారి మళ్లించారు. జమ్మూకశ్మీర్‌లో టెలిఫోన్, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

ప్రధాని మోడీ దిగ్ర్భాంతి..
భూకంపంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూకంప బాధితులంతా క్షేమంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. అవసరమైతే భారీ భూకంపం సంభవించిన ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్‌కు భారత్‌ సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని మోడీ పేర్కొన్నారు.

హుక్కా కేంద్రాలపై పోలీసుల దాడులు...

హైదరాబాద్ : ఈస్ట్ జోన్ పరిధిలోని హుక్కా కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. డీసీపీ రవీందర్ నేతృత్వంలో 12 పోలీసు బృందాలు ఈ దాడులు చేపట్టాయి. మలక్‌పేట్, సైదాబాద్, అంబర్‌పేట్, ఓయూ, సుల్తాన్ బజార్ ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. 

రెండు ఆటోల ఢీ..15 మందికి గాయాలు..

కరీంనగర్ : చందుర్తి మండలం రుద్రంగి వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

మోడీని కలిసిన గీత..

న్యూఢిల్లీ : భారత సంతతికి చెందిన మూగ, చెవిటి యువతి గీత ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుంది. 15 ఏళ్ల క్రితం తప్పిపోయి రైలులో లాహోర్‌కు గీత వెళ్లింది. భారత ప్రభుత్వ సహకారంతో పాక్‌లో ఉన్న గీత సోమవారం మాతృభూమిలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీని గీత కలిశారు. పాక్ లో గీత సంరక్షణ బాధ్యతలను చూసిన ఈదీ ఫౌండేషన్ కు రూ. కోటి బహుమతిని మోడీ ప్రకటించారు. 

20:51 - October 26, 2015

హైదరాబాద్ : టి.టిడిపి నేత రేవంత్ ను రేపు రావాలని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. చంద్రబాబును కలవడానికని రేవంత్ సోమవారం విజయవాడకు వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ రేవంత్ తో భేటీ కావడానికి బాబు విముఖత చూపినట్లు తెలుస్తోంది. వరంగల్ ఉప ఎన్నికపై చర్చించేందుకు జరిపిన సమావేశంలో టిడిఎల్పీ నేత ఎర్రబెల్లి..రేవంత్ మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై సమాధానం చెప్పేందుకు రేవంత్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వరంగల్ ఉప ఎన్నిక అభ్యర్థితత్వంపై చర్చించేందుకు టి.టిడిపి నేతలు బాబు అపాయింట్ మెంట్ కోరారు. దీనికి సోమవారం ఇచ్చారు. కానీ తనకు పని ఉందని..వీలు కాదని మంగళవారానికి మార్చుకోవాలని రేవంత్ సూచించడంతో మంగళవారం మీటింగ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. వ్యూహాత్మకంగా రేవంత్ సోమవారమే విజయవాడకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడును కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. వచ్చిన సమాచారాన్ని బాబుకు తెలియచేశారు. రేపు అందరితో రావాలని బాబు సూచించినట్లు సమాచారం. బాబుతో జరిగే భేటీకి టిటిడిపి సీనియర్ నేతలు మంగళవారం విజయవాడకు రానున్నారు. రేపు జరిగే సమావేశంలో రేవంత్ వ్యవహారంపై బాబు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. 

20:43 - October 26, 2015

హైదరాబాద్ : తెలుగు ప్రజలకు సుపరిచతుడైన 'శ్రీను వైట్ల' కుటుంబం బజారున పడింది. సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు సాధించుకున్న శ్రీనువైట్ల పై భార్య సంతోషి రూప పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ బంజారా హిల్స్ పీఎస్ లో సోమవారం ఫిర్యాదు చేసింది. డబ్బు విషయంలో తనను తరచూ వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన విషయాలను పోలీసులు వెల్లడించలేదు. 498ఏ వరకట్న వేధింపుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 164 ఏ కింద శ్రీను వైట్ల కు నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. శ్రీను వైట్ల, సంతోషి రూప దంపతుల మధ్య గత కొంతకాలంగా వివాదాలున్నట్లు, కొంతమంది రాజీ కూడా కుదుర్చారని తెలుస్తోంది. ఇటీవలే 'రాంచరణ్ తేజ' నటించిన 'బ్రూస్ లీ' చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే దూకుడు, ఆగడు, దుబాయి శ్రీను, కింగ్ తదితర సినిమాలకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. 

20:39 - October 26, 2015

విజయవాడ : ఏపీ రాధానికి గ్రీన్‌ ఫీల్డ్ ట్రిబ్యునల్‌ అనుమతి రాలేదన్న వార్తలు నిజం కాదని ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు పేర్కొన్నారు. సోమవారం సంక్షేమ రంగానికి సంబంధించిన ముఖ్య అధికారులతో మంత్రి రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. ఐటిడిఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో రావెల పాల్గొన్నారు. రాష్ట్రంలో చేపట్టే ప్రతి ప్రాజెక్టుకు ప్రభుత్వం కేవలం భూములు మాత్రమే ఇస్తుందని మంత్రి రావెల స్పష్టం చేశారు. పనులన్నీ పీపీపీ మోడ్‌లోనే సాగుతాయని తెలిపారు. 

 

20:36 - October 26, 2015

హైదరాబాద్ : తెల్ల రేషన్ కార్డుదారులకు తెలంగాణలో కిలో కందిపప్పు 50 రూపాయలకే అందిస్తున్నామని మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఈ పప్పు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. అక్రమంగా కందిపప్పు నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదిహేను వేల మెట్రిక్ టన్నుల కందిపప్పును కార్డుల ద్వారా కిలో చొప్పున సరఫరా చేస్తున్నామన్నారు. బ్లాక్ మార్కెట్ తరలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి శాఖ ఆధ్వర్యంలో తరలించకుండా మానిటరింగ్ చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి ఈటెల తెలిపారు. 

20:30 - October 26, 2015

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో రైతులు, యువత తీవ్ర నిరాశలో ఉన్నారని చెప్పుకొచ్చారు. శృతి, సాగర్‌ ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదని ఆరోపించారు. వరంగల్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై అభిప్రాయ సేకరణ జరిపారు కాంగ్రెస్ నేతలు.. పార్టీ ముఖ్య నేతలు, అనుబంధ సంఘాల అభిప్రాయాలు తీసుకున్నారు.. ఈనెల 28న అధిష్ఠానంతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు.

 

20:26 - October 26, 2015

హైదరాబాద్ : ప్రాణహిత ప్రాజెక్టు వివాదం తిరిగి తెరపైకి వచ్చింది. ఆనకట్ట ప్రస్తుత డిజైన్ కు అంగీకరించేది లేదని తేల్చిచెప్పింది మహారాష్ట్ర ప్రభుత్వం. ప్రాణహిత నదిపై తుమ్మిడి హెట్టి వద్ద తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఆనకట్ట నిర్మాణంపై రెండు రాష్ట్రాల సాగునీటి శాఖ అధికారులు జలసౌధలో సమావేశమయ్యారు. ఆనకట్ట నిర్మాణం ముంపు తదితర అంశాలపై తెలంగాణ ప్రభుత్వం తాము చేపట్టిన సర్వే వివరాలను మహారాష్ట్ర అధికారులకు అందజేసింది. నివేదికను పరిశీలించిన మహారాష్ట్ర అధికారులు ఆనకట్ట ఎత్తుపై అభ్యంతరం తెలిపారు. ఈ డిజైన్ ప్రకారం తమ భూభాగంలో ముంపు ఏర్పడుతుందని తెలంగాణ అధికారులు మహా అధికారులు స్పష్టం చేశారు.

నిర్మాణ ఎత్తుపై సందిగ్ధత..
ఆనకట్టను 152 మీటర్ల ఎత్తులో నిర్మించబోతున్నామని తెలంగాణ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ ఎత్తులో ఆనకట్టను నిర్మిస్తే తమ రాష్ట్రంలో 18వందల 52 ఎకరాలు ముంపునకు గురవుతాయని.. 148 మీటర్ల ఎత్తులో అయితే తమకు అభ్యంతరం లేదని మహారాష్ట్ర అధికారులు తమ అభిప్రాయాన్ని చెప్పారు.

ఉమ్మడి సర్వే చేపడుతామన్న మహారాష్ట్ర..
తమ భూభాగం ఒక్క అడుగు మంపునకు గురయినా అంగీకరించేది లేదన్నారు మహా అధికారులు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్వే రిపోర్టు అధ్యయనం కోసం తాము కూడా ఉమ్మడి సర్వే చేపడతామన్నారు. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఓ రాజకీయ నిర్ణయానికి వస్తేనే ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయే అవకాశముంది.

19:31 - October 26, 2015

వరంగల్ : కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అసలే మూలుగుతున్న నక్కలా ఉంటే నాయకుల మధ్య కొట్లాటలు..గ్రూపు తగదాలు పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. గ్రూపు తగాదాలు పక్కన పెట్టి..సమన్వయంతో ముందుకు కదలాలని..పార్టీ పరిస్థితిని మెరుగుపరచాలని బడా నేతలు చెబుతున్న మాటలను కిందిస్థాయి నాయకులు పట్టించుకోవడం లేదు. ఒకరిపై ఒకరు ఘర్షణలకు దిగుతున్నారు. మరో కొద్ది రోజుల్లో వరంగల్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగబోతోంది. కానీ కాంగ్రెస్ లో నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. ఏకంగా టిపిసిసి చీఫ్ ఉత్తమ్ ఎదుటే ఘర్షణకు దిగారు. ఉప ఎన్నిక నేపథ్యంలో అభ్యర్థి విషయంలో అభిప్రాయ సేకరణ జరపాలని టి.కాంగ్రెస్ నిర్ణయించింది. డీసీసీ భవన్ లో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి టిపిసిసి చీఫ్ ఉత్తమ్..వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క..ఇతర నేతలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస్, డీసీసీబీ ఛైర్మన్ రాఘవరెడ్డి వర్గీయులు ఒకరిపైకొకరు ఆరోపణలు చేసుకున్నారు. జడ్పీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారని, దుగ్యాల గో బ్యాక్ అంటూ రాఘవరెడ్డి వర్గీయులు నినాదాలు చేశారు. దీనిపై దుగ్యాల వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాలు ఒకరినొకరు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో ఓ కాంగ్రెస్ నేత గాయపడినట్లు తెలుస్తోంది. దీనిపై పీఎస్ లో ఫిర్యాదు చేశారు. 

19:22 - October 26, 2015

నల్గొండ : ప్రేమించాలి అంటూ వేధింపులను తట్టుకోలేక ఓ విద్యార్థిని తనువు చాలించింది. ఈ దారుణ ఘటన పెన్ పహాడ్ మండలం లింగాల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో శ్రావణి పదో తరగతి చదువుతోంది. అదే గ్రామంలో నివాసం ఉంటున్న మేకల వినోద్ గత కొన్ని రోజులుగా ప్రేమించాలంటూ శ్రావణిని వేధించడం ప్రారంభించారు. స్కూల్ కు వెళ్లి..వచ్చే సమయంలో వేధించసాగాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు శ్రావణి చెప్పింది. వెంటనే యువకుడి తల్లిదండ్రులతో శ్రావణి కుటుంబసభ్యులు మాట్లాడారు. వినోద్ కు సర్దిచెబుతామని వారు హామీనిచ్చారు. సమస్య సద్దుమణుగుతుందని శ్రావణి తల్లిదండ్రులు భావించారు. కానీ అప్పటి నుండి వేధింపులు అధికమయ్యాయి. తాను చనిపోతేనే సమస్య పరిష్కారమౌతుందని భావించిన శ్రావణి సోమవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే శ్రావణిని కుటుంబసభ్యులు సూర్యాటపే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రావణి మృతి చెందింది. దీనితో తల్లిదండ్రులు..కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషయాన్ని పీఎస్ లో శ్రావణి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న వినోద్ కోసం గాలింపులు చేపట్టారు. వినోద్ ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని శ్రావణి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. 

వరంగల్ నేతల మధ్య విబేధాలు...

వరంగల్ : డీసీసీ భవన్ లో నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే దుగ్యాలను కార్యకర్తలు అడ్డుకున్నారు. దుగ్యాల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దుగ్గాల వర్గీయులకు..కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈఘటనతో దుగ్యాల డీసీసీ భవన్ నుండి వెనుదిరిగారు. 

కాంగ్రెస్ అభ్యర్థిపై అభిప్రాయ సేకరణ - ఉత్తమ్..

వరంగల్ : కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై అభిప్రాయ సేకరణ చేపట్టినట్లు టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు, అనుబంధ సంఘాల అభిప్రాయాలు సేకరించడం జరిగిందన్నారు. 28వ తేదీన అధిష్టానంతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు.

కీసర టూరిజం గెస్ట్ హౌస్ పై ఎస్ వోటి పోలీసుల దాడులు..

రంగారెడ్డి : కీసర టూరిజం గెస్ట్ హౌస్ పై ఎస్ వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. దంపతుల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న 5 జంటలను అదుపులోకి తీసుకున్నారు. 

కేసీఆర్ బాధ్యతను విస్మరిస్తున్నారు - తమ్మినేని...

నల్గొండ : గత ప్రభుత్వాలను సాకుగా చూపి కేసీఆర్ తన బాధ్యతను విస్మరిస్తున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. అస్మదీయుల కోసమే డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టారనే అనుమానం కలుగుతోందని, ప్రాజెక్టుల డిజైన్ మార్పు ఎవరి కోసమని ప్రశ్నించారు. వచ్చే ఫిబ్రవరిలో హైదరాబాద్ లో మహా ప్రదర్శన చేపట్టనున్నట్లు, రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు. ఆకలి వేస్తే కేకలు వేసే హక్కు కూడా లేకుండా చేస్తున్నారని, సమ్మె చేశారని 1,200 మంది మున్సిపల్ కార్మికులను తొలగించడం అప్రజాస్వామికమన్నారు. 

పాక్ లో పెరుగుతున్న మృతుల సంఖ్య..

పాకిస్తాన్ : ఆఫ్ఘనిస్థాన్‌ హిందూకుష్ పర్వతాల్లో 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపంతో పాక్, ఆఫ్ఘనిస్థాన్‌లో పలువురు మృత్యువాత పడ్డారు. పాక్ లో సుమారు 80 మందికిపై గా మృతి చెందారని తెలుస్తోంది. దీనితో పాకిస్థాన్‌లో అలర్ట్ ప్రకటించి సహాయక చర్యలు చేపట్టారు.

 

తఖార్ లోని పాఠశాలలో తొక్కిసలాట..12 మంది మృతి..

అప్ఘనిస్తాన్ : అఫ్ఘనిస్థాన్‌ హిందూకుష్ పర్వతాల్లో వచ్చిన భూకంపంతో తఖార్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12 మంది విద్యార్ధులు చనిపోయారు. దీంతో తఖార్ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

18:32 - October 26, 2015

హైదరాబాద్ : తెలంగాణలో త్వరలోనే కరువు మండలాలను ప్రకటిస్తామని రాష్ట్ర మంత్రి పోచారం పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి రుణమాఫీ ప్రకటిస్తామని, మిగతా 8వేల కోట్ల రూపాయలను త్వరలో మాఫీ చేయడం జరుగుతుందన్నారు. ఎఫ్ఆర్ బిఎం నిబంధనల పేరిట ఒకేసారి రుణమాఫీ చేయడం కుదరదని ఆర్బీఐ చెప్పిన నేపథ్యంలో ఆలస్యం జరుగుతోందన్నారు. రేపటి నుండి ప్రారంభమయ్యే విత్తన సదస్సుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు, ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రాన్ని విత్తనభాండాగారంగా తయారు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

18:03 - October 26, 2015

ఢిల్లీ : గత 15 ఏళ్ల క్రితం తప్పిపోయి పాకిస్థాన్ నుండి భారత్ కు చేరిన 'గీత' విషయంలో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. బీహార్ కు చెందిన మహతో కుటుంబంతో తమకు సంబంధం లేదని గీత పేర్కొంది. మహతో కుటుంబం చూపించిన ఫొటోలు తనవి కావని తెలిపింది. చిన్న వయస్సుల్లోనే తప్పిపోయాయని, తనకు ఇంకా పెళ్లి కాలేదని స్పష్టం చేసింది. గీత తమ బిడ్డ అంటూ నాలుగు కుటుంబాలు వచ్చినట్లు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. గీత తన కుటుంబసభ్యులును గుర్తించలేక పోయిందని, నాలుగు కుటుంబాలకు వారికి డీఎన్ఏ టెస్టులను నిర్వహిస్తామని వెల్లడించారు. కుటుంబసభ్యులను గుర్తించకపోయినా గీతకు సంబంధించిన సంరక్షణ బాధ్యతలు తామే చూసుకుంటామని మంత్రి సుష్మా స్పష్టం చేశారు.

కరాచీలో ఆశ్రయం..
ఇప్పటివరకూ గీత.. కరాచీలోని ఈద్‌ ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందింది. చెవిటి, మూగ యువతి అయిన గీత.. తన కుటుంబం భారత్‌ లో ఉందంటూ సైగలతో చెప్పింది.. గీత బాధను అర్థం చేసుకున్న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తల్లిదండ్రులను కలిపేందుకు ఏర్పాట్లు చేసింది. గీత తల్లిదండ్రులు బీహార్‌లో ఉన్నట్లుగా గుర్తించారు. తల్లి దండ్రుల డీఎన్‌ఏతో సరిపోలితే.. గీతను వారి కుటుంబానికి ప్రభుత్వం అప్పగించనుంది. ఇప్పటికే బీహార్‌లో ఉన్న గీత తల్లిదండ్రులు ఢిల్లీ చేరుకున్నారు. అయితే గీత మళ్లీ స్వదేశానికి చేరుకోవడంతో ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఎనిమిదేళ్ల వయస్సు..
మూగు, చెవుడుతో కేవలం సైగల ద్వారానే తన హావాభావాలను తెలిపే గీత.. భారత్‌ నుంచి పాక్‌కు వెళ్లినప్పుడు ఎనిమిదేళ్ల వయసు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన గీత.. పాకిస్తాన్‌లోని లాహోర్‌ రైల్వేస్టేషన్‌లో దిగింది. అనాథగా తిరుగుతున్న గీతను కరాచీలోని ఈదీ ఫౌండేషన్‌ చేరదీసింది. అప్పటినుంచి గీత అక్కడే ఉంటోంది.

17:59 - October 26, 2015

బీహార్ : నిత్యావసర ధరలు అదుపులో పెట్టడంలో కేంద్రం విఫలమైందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మోతి హరి ఎన్నికల సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కందిపప్పు కిలో ధర రూ.200 కు చేరుకోవడంతో పేదలకు పప్పు..రొట్టె తినే పరిస్థితి లేదని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు..నల్లదనం వెలికి తీత..యువతకు ఉపాధి లాంటి హామీల్లో ఏ ఒక్కటి కూడా ప్రధాన మంత్రి మోడీ నెరవేర్చలేదన్నారు. 

17:36 - October 26, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యాదరిగుట్టను అభివృద్ధి చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు టిటిడిపి నేత మోత్కుపల్లి పేర్కొన్నారు. కానీ సిద్ధిపేటలో యాదగిరిగుట్టను కలుపుతున్నారంటూ వార్తలు రావడం బాధాకరమన్నారు. ఈ ఆలోచన విరమించుకోవాలని సూచించారు. యాదాద్రిపై ఏమాత్రం చిత్తశుద్ది..భక్తి ఉన్నా ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. 

17:33 - October 26, 2015

హైదరాబాద్ : విత్తన చట్టాల్లో మార్పులు..అక్రమాల నియంత్రణకు కొత్త చట్టాలు..విత్తన విధానాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఎనిమిదో జాతీయ విత్తన కాంగ్రెస్ సదస్సు ప్రారంభం కానుంది. రేపటి నుండి తెలంగాణ రాష్ట్రం లో ఈ సదస్సు ప్రారంభం కానుంది. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో బహుళ జాతి విత్తన సంస్థలు రూపొందించిన నూతన విత్తన వంగడాలు..సాంకేతిక పరిజ్ఞాన ప్రరికరాలను సదస్సులో ప్రదర్శించనున్నారు. వీటితో పాటు ప్రముఖ జాతీయ, రాష్ట్రాల పరిశోధన సంస్థల ఉత్పత్తులను సదస్సులో ఏర్పాటు చేయనున్నారు. అంతేగాకుండా రైతులు కూడా స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.
చాలా సంతోషం - పోచారం..
దీనికి సంబంధించిన వివరాలను తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం విలేకరులకు వెల్లడించారు. 8వ జాతీయ విత్తన సదస్సు తెలంగాణ రాష్ట్రంలో జరుపుకోవడం చాలా మంచి పరిణామమన్నారు. ఏడు సార్లు కేంద్ర ప్రభుత్వం ఏడు రాష్ట్రాలకు అనుమతినివ్వడం జరిగిందని, ఈసారి నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి అనుమతినిచ్చిందన్నారు. మూడు రోజుల జరిగే ఈ సదస్సుకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలు, ఇతరులు హాజరౌతారని మంత్రి పోచారం తెలిపారు. 

17:24 - October 26, 2015

కరీంనగర్ : తమ కుమారుడు వికలాంగుడని..ఇతనికి ప్రభుత్వం ఇచ్చే పథకాలు వర్తింప చేయాలని ఆ తల్లిదండ్రులు అధికారులను కోరారు. చెప్పులరిగేలా మండల కార్యాలయం చుట్టూ తిరిగారు. కానీ ఆ అధికారులు కనికరించలేదు. దీనితో ఆ తల్లిదండ్రులు వికలాంగ కుమారుడిని కార్యాలయం ఎదుట వదిలేసి వెళ్లిపోయారు. ఈ సంఘటన జిల్లాలోని జగిత్యాలలోని తిమ్మాపూర్ లో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో నివాసం ఉండే లక్ష్మారెడ్డికి కాళ్లు..చేతులు పని చేయవు. దీనితో ఇతడికి వచ్చే పథకాలు..పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను కోరారు. కానీ వారు దీనికి అంగీకరించలేదు. వికలాంగ విషయంలో సంబంధించిన పత్రాలన్నీ చూపించారు. అయినా అధికారులు కనికరించలేదు. తీవ్ర ఆగ్రహానికి గురైన వారు లక్ష్మారెడ్డిని తీసుకుని మండల కార్యాలయానికి సోమవారం ఉదయం వచ్చారు. అక్కడనే కుమారుడు లక్ష్మారెడ్డిని వదిలేసి వెళ్లిపోయారు. ఇదంతా చూస్తున్న స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన లబ్ధిదారులకు ఇవ్వడం లేదని, అనర్హులకు ఇస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. చివరకు లక్ష్మారెడ్డికి పెన్షన్ ఇవ్వడానికి అధికారులు అంగీకరించారు. 

సిద్ధిపేటలో యాదగిరిగుట్టను కలపొద్దు - మోత్కుపల్లి..

హైదరాబాద్ : యాదరిగుట్ట అభివృద్దిపై సీఎం కేసీఆర్ కృషి అభినందనీయమని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి పేర్కొన్నారు. యాదగిరిగుట్టను ప్రత్యేక జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. సిద్ధిపేటలో యాదగిరిగుట్టను కలపొద్దని సూచించారు. 

భద్రత విషయంలో వివక్ష - టి.టిడిపి..

హైదరాబాద్ : భద్రత విషయంలో తమ నేతల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని టి.టిడిపి నేత రావుల చంద్రశేఖర్ విమర్శించారు. ఎల్.రమణ, ఎర్రబెల్లికి భద్రత కుదించారని, టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణకు ఎస్కార్ట్ తొలగించారని తెలిపారు. అధికార పార్టీ నేతలకే భద్రత కల్పిస్తున్నారని, ప్రభుత్వ వివక్షపై త్వరలో సీఎం, డీజీపీలకు లేఖ రాస్తామన్నారు. 

ప్రత్యామ్నాయ రాజకీయాల కోసమే పోటీ - గాలి వినోద్ కుమార్...

వరంగల్ : ప్రత్యామ్నాయ రాజకీయాల కోసమే వరంగల్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేయడం జరుగుతోందని వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి ప్రొ.గాలి వినోద్ కుమార్ తెలిపారు. కేసీఆర్ ను ఓడించాలనే చిత్తశుద్ధి ఉంటే టిడిపి, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తనకు మద్దతివ్వాలని కోరారు. 

ఏపీలో మూడు యూనివర్సిటీలకు వీసీల నియామకం..

విజయవాడ : ఏపీలో మూడు యూనివర్సిటీలకు వీసీలను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్టీయూ అనంతపురం వీసీగా మహ్మద్ మౌలానా మొహిద్దీన్ సర్కార్..పద్మావతి మహిళా వర్సిటీకి వీసీగా వీరమాచినేని దుర్గాభవాని..ద్రవిడ యూనివర్సిటీ వీసీగా సత్యనారాయణలు నియమితులయ్యారు.

సీపీఎం ప్లీనరీ నిర్ణయాలు..

నల్గొండ : సీపీఎం రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. ఆశాల సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని, ఆశా వర్కర్లకు ఆర్థికంగా అండగా నిలుస్తామన్నారు. ఆశాలకు ఆర్థిక సహాయం కోసం పిలుపునిచ్చిన వెంటనే ప్లీనరీ ప్రతినిధులు రూ.1.2 లక్షల విరాళం అందించారని తెలిపారు. ఇదే స్పూర్తితో ఈనెల 31న రాష్ట్ర వ్యాప్తంగా ఆశాల కోసం విరాళాలు సేకరించడం జరుగుతుందని, నవంబర్ 4వ తేదీన భూ సమస్యపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

నాగార్జున సాగర్ లో సీపీఎం రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు..

నల్గొండ : సీపీఎం రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాల్లో సాగర్ ఎడమ కాల్వకు రోజుకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సమావేశంలో తీర్మానం చేశారు. తీర్మానాన్ని నల్గొండ జిల్లా కార్యదర్శి జూలకంటి ప్రవేశ పెట్టగా ఖమ్మం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ బలపరిచారు. దీనిని ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సాగర్ ఎడమకాల్వకు రోజుకు 5వేల క్యూసెక్కుల చొప్పున నవంబర్ 10 వరకు నీటిని విడుదల చేయాలని జూలకంటి డిమాండ్ చేశారు. పొట్ట దశలో ఉన్న లక్ష ఎకరాల పంటను కాపాడుకోగలుగుతారని, ఏఎంఆర్ పి ద్వారా 250 చెరువులను నింపి తాగునీటి సమస్యను తీర్చాలన్నారు. 

16:32 - October 26, 2015

ఖమ్మం : జిల్లా కొణిర్ల మండలం తనికెళ్ల గ్రామంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు రెండున్నర కోట్లతో సబ్‌ స్టేషన్‌ నిర్మణ పనులకు శంకుస్థాపన చేశారు. బడుగు బలహీన వర్గాల కళ్లలో ఆనందం చూడటమే రాష్ట్ర ప్రభుత్వ లక్షమని మంత్రి తుమ్మల తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలు అందే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. 

16:31 - October 26, 2015

కర్నూలు : తప్పుడు ధృవీకరణ పత్రాలతో మెడికల్‌ సీట్లు పొందిన విద్యార్థులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సర్టిఫికేట్లు తయారు చేసిన బాల్‌రెడ్డి, సమీర్‌తోపాటు మొత్తం 12మందిని వలవేసి పట్టుకున్నారు. పరారీలోఉన్న మరో విద్యార్థిని బొర్ర మౌనిక, కల్లూరు తహసిల్దార్ శివరాముడుకోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

16:29 - October 26, 2015

నల్గొండ : ప్రజాసమస్యలపై సమరశంఖం పూరించాలని ప్లీనరీ సమావేశంలో సమావేశంలో నిర్ణయించామని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. నాగార్జున సాగర్ లో సీపీఎం రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాల్లో రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగాల్లోంచి తొలగించిన మున్సిపల్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే 55రోజులనుంచి సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లను పట్టించుకోవడంలేదని విమర్శించారు. వారికి మద్దతుగా ఈనెల 31న రాష్ట్రంలో ఉన్నటు వంటి వేలాది మంది సీపీఎం కార్యకర్తలు విరాళాలు..బిక్షాటన చేస్తారని, వచ్చిన డబ్బును ఆశ కార్యకర్తలకు ఇస్తామని తమ్మినేని తెలిపారు. సీపీఎం కార్మిక పక్షపాతి అని..కార్మికులు ఎక్కడ ఆందోళన చేసినా అండగా ఉండడం బాధ్యత సీపీఎం భావిస్తుందని తమ్మినేని తెలిపారు.

పాక్ ను ఆదుకుంటాం - మోడీ..

ఢిల్లీ : భూకంప ప్రభావిత పాకిస్థాన్ ను ఆదుకుంటామని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. పాక్ తో పాటు అప్ఘనిస్తాన్ ను కూడా ఆదుకుంటామన్నారు. సోమవారం మధ్యాహ్నాం పాక్, అప్ఘనిస్తాన్, ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. భూకంపం అనంతరం ప్రధాన మంత్రి ట్విట్టర్ ద్వారా ట్వీట్స్ చేశారు. 

వివాహం కాలేదు - గీత..

ఢిల్లీ : తనకు వివాహం కాలేదని పిల్లలు కూడా లేరని గీత ఈఎఎంతో పేర్కొంది. గత 15 ఏళ్ల క్రితం గీత తప్పిపోయి పాక్ నుండి భారత్ కు సోమవారం చేరుకున్న సంగతి తెలిసిందే. 

భూకంపంతో నలుగురు మృతి..

ఢిల్లీ : హిందూకుష్ పర్వతాల్లో 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపంతో పాకిస్థాన్‌లో నలుగురు చనిపోయారు. పాక్ - అఫ్ఘన్ సరిహద్దులో సోమవారం మధ్యాహ్నాం భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. భూకంప ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయి. రోడ్లు చీలిపోయాయి. 

కుటుంబసభ్యులను గీత గుర్తు పట్టలేదు - సుష్మా..

ఢిల్లీ : గీత తన కుటుంబసభ్యులను గుర్తు పట్టలేదని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. గత 15 సంవత్సరాల క్రితం తప్పిపోయిన గీత పాక్ నుండి భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. బీహార్ రాష్ట్రంలో ఉన్న ఓ కుటుంబం గీత తమ కుమార్తె అని పేర్కొంది. డీఎన్ టెస్టు నిర్వహిస్తామని మంత్రి సుష్మా తెలిపారు. 

15:39 - October 26, 2015

పండుగలు, వివాహం లాంటి ప్రత్యేక సందర్భాలలో అతివలు ఆడంబరంగా రెడీ అవటానికి ఇష్టపడతారు. అందుకోసం మార్కెట్ లో అనేక రకాల ఫ్యాబ్రిక్స్ పై అందమైన హ్యాండ్ వర్క్ తో చక్కటి కలెక్షన్ అందుబాటులో ఉంటోంది. అలాంటి లేటెస్ట్ కలెక్షన్ మీ కోసం..

15:37 - October 26, 2015

ప్లాస్టిక్ ఆధునిక మనిషి నిత్య జీవితంలో భాగంగా మారింది. ప్లాస్టిక్ కాలుష్యానికి కారణమని తెలిసినా, వాడకుండా ఉండలేని స్థితి. అయితే ఇదే ప్లాస్టిక్ ను రీసైకిల్ చేయటంతో కాలుష్యం కొంతైనా తగ్గే అవకాశముందని కొంతమంది నిపుణుల వాదన. ఈ అంశాన్నే వ్యాపారానికి పునాదిగా చేసుకున్న ఓ అతివ కథనం..

అద్భుత ఫలితాలు...
కెరీర్ స్టార్టింగ్ లో మనకు ఉద్యోగం బెటరా? లేక ఏదైనా వ్యాపారం మొదలు పెట్టటం బెస్టా? ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటే విజయం సాధిస్తాం? అనే సందేహాలు తలెత్తడం సహజం. కొంత కాలం పాటు ఉద్యోగం చేసి ఆ తరువాత వ్యాపారం మొదలుపెట్టే ప్రయత్నం చేస్తారు కొందరు. అలాంటి ప్రయత్నమే చేసి అద్భుత ఫలితాలు సాధిస్తున్న వారిలో గాయత్రి ఒకరు.

ప్రణాళిక ఉంటే విజయం సాధ్యం..
సాధించాలనే తపన, చేసే పని పట్ల నిబద్ధత, కష్టనష్టాలను బేరీజు వేసుకోదగిన ప్రణాళిక ఉంటే విజయం సాధ్యం. మార్కెట్ పై సరియైన అవగాహనను కల్పించుకుంటూ ఎంచుకున్న రంగంలో మార్పులను స్వాగతిస్తూ ముందుకెళ్ళటమే సక్సెస్ కు మార్గం అని గుర్తించిన గాయత్రి వ్యాపార పథంలో తనదైన ముద్ర చాటాలని మానవి కోరుకుంటోంది. 

15:31 - October 26, 2015

ఢిల్లీ : మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ చోటా రాజన్ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. ఇండోనేషియాలోని బాలిలో అతడిని ఇంటర్ పోల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 1995 నుండి 55 ఏళ్ల రాజన్ పరారీలో ఉన్నాడు. ముంబైలో జరుగుతున్న ఘటనలతో ఇతనికి సంబంధాలున్నాయనే ఆరోపణలున్నాయి. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహిత సహచరుడైన రాజన్..తరువాత అతనికే గట్టి ప్రత్యర్థిగా మారాడు. భారత నిఘా ఏజెన్సీలు దాదాపు రెండు దశాబ్దాల నుండి అతని కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇతనిపై 17 మర్డర్ కేసులతో పాటు వందలాది కేసులున్నాయి. 

చిరస్మరణీయమైన రోజు - సుష్మా..

ఢిల్లీ : ఈ రోజు చిరస్మరణీయమైన రోజని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. 15ఏళ్ల క్రితం తప్పిపోయిన గీత పాక్ నుండి భారత్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుష్మా స్వరాజ్ మాట్లాడారు. గీత తమ కుమార్తె అని వివిధ రాష్ట్రాలకు చెందిన నాలుగు కుటుంబాలు పేర్కొనడం జరిగిందని, దీనికి సంబంధించిన విషయమై విచారణ జరిపించాలని సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించడం జరిగిందన్నారు. 

15:25 - October 26, 2015

ఢిల్లీ : దేశ రాజధానితో సహా సోమవారం మధ్యాహ్నాం ఉత్తర భారతంలోని పలు ప్రాంతంలో భూమి కంపించింది. సుమారు నిమిషం పాటు భూ ప్రకంపనాలు రావడంతో జనాలు బెంబేలెత్తిపోయారు. నివాసాలు..కార్యాలయాల నుండి పరుగులు తీశారు. భూ ప్రకంపనాలతో తీవ్ర ఆందోళన చెందామని పలువురు పేర్కొన్నారు. ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీయాల్సి వచ్చిందన్నారు. ఐదు..ఆరు సార్లు భూమి కంపించిందన్నారు. దీనితో ఢిల్లీలో మెట్రో రైలు సర్వీసులన్నీ నిలిపివేశారు.

హిందూకుష్ పర్వత ప్రాంతాల్లో కేంద్రం...
అప్ఘనిస్తాన్ లోని హిందూకుష్ పర్వతాలలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. పాకిస్తాన్ లోనూ భారీ ప్రకంపనాలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై 7.5గా నమోదైంది. కాశ్మీర్ నుండి ఢిల్లీ వరకు భూకంప తీవ్ర ప్రభావం చూపించింది. ఢిల్లీ, హార్యనా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, షిమ్లా, శ్రీనగర్, చండీఘడ్ ప్రాంతాల్లో భూమి కంపించింది. భూ ప్రకంపనాలతో జమ్మూ కాశ్మీర్ లో కమ్యూనికేషన్ వ్యవస్థ స్థంభించింది. మరో 24గంటల పాటు భూ ప్రకంపనాలు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

గత ఏడాది నేపాల్ లో భూకంపం..
గత ఏడాది ఎప్రిల్ 25వ తేదీన 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి నేపాల్ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన 7.5తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ఎంత నష్టం కలిగిందో తెలియడం లేదు.

మళ్లీ రాదు - శాస్త్రవేత్త నగేష్..
ఢిల్లీలో భూకంపం సంభవించలేదని శాస్త్రవేత్త నగేష్ టెన్ టివికి తెలిపారు. హిందూకుష్ పర్వతాల్లో 195 కిలోమీటర్ల వెలుపల సంభవించిందన్నారు. మరో 24గంటల్లో భూకంపం వస్తుందనే వార్తలు నమ్మవద్దని సూచించారు. ఎక్కడైతే కేంద్రీకృతమైందో ఆ క్రేంద్రం నుండి భూ తరంగాలు వెలువడుతాయన్నారు. ఉత్తర భారతం చాలా దగ్గరగా ఉంది కనుక అక్కడ భూ ప్రకంపనాలు వచ్చాయన్నారు. 

ప్రశాంతంగా ఉండాలి - కేజ్రీవాల్..

ఢిల్లీ : రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలని సీఎం కేజ్రీవాల్ సూచించారు. మధ్యాహ్నాం ఢిల్లీతో సహా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఎలాంటి ఇబ్బంది లేదని విపత్తు నిర్వాహణ సిబ్బంది రెడీగా ఉన్నారని కేజ్రీవాల్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

రైతులతో ఎప్పుడన్నా మోడీ మాట్లాడారా - రాహుల్..

బీహార్ : రైతులతో ఎప్పుడన్నా ప్రధాన మంత్రి మోడీ మాట్లాడారా అని ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. బీహార్ లోని మోతిహరి ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. బ్యూరోక్రాట్స్ తో మోడీ సమావేశమవుతుంటారని రాహుల్ విమర్శించారు. 

తెలంగాణ, మహారాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారుల భేటీ..

హైదరాబాద్ : జలసౌధలో తెలంగాణ, మహారాష్ట్ర నీటి పారుదలశాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ఎత్తు అంశానికి సంబంధించి చర్చ జరిగింది. 

ఉత్తర భారతంలో భూ ప్రకంపనలు..

ఢిల్లీ : ఉత్తర భారతంలో సోమవారం మధ్యాహ్నాం భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. శ్రీనగర్, న్యూఢిల్లీలో ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి.

శివాన్ ర్యాలీలో మోడీ ప్రసంగం..

బీహార్ : భారత ప్రధాన మంత్రి బీహార్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. శివాన్ ప్రాంతంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. 

అండర్ వరల్డ్ డాన్ చోట రాజన్ అరెస్టు..

ఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్ చోట రాజన్ అరెస్టు అయ్యారు. ఇండోనేషియాలోని బాలిలో ఇతడిని అరెస్టు చేశారు. రెండు దశబ్దాలుగా ఇతను పరారీలో ఉన్నాడు. చోటా రాజన్ అరెస్టును కేంద్ర మంత్రి కిరణ్ ధృవీకరించారు. 

14:20 - October 26, 2015

వరంగల్ : తెలంగాణ టిడిఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కు భధ్రత కుదించాలని వరంగల్ పోలీసులు నిర్ణయించారు. ఆర్మ్ డ్ ఎస్కార్ట్ ఉపసంహరించాలని భద్రత వ్యవహారాల సమీక్ష కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆయనకున్న 1+3 విధానాన్ని రద్దు చేసి 1+1 కేటాయించారు. ఈ మేరకు సోమవారం నగర పోలీసు కమిషనర్ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన నోటీసును ఎర్రబెల్లికి పంపించారు. ఉప ఎన్నికల నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయంపై టిడిపి శ్రేణులు భగ్గుమనే అవకాశాలున్నాయి. కక్ష పూరితంగానే సర్కార్ ఈ విధంగా వ్యవహరిస్తోందనే విమర్శలు చేసే అవకాశం ఉంది. తనకు ప్రాణభయం ఉందని..సెక్యూర్టీ కల్పించాలని వైఎస్ హాయం నుండి ఎర్రబెల్లి కోరుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై నేత ఎర్రబెల్లి ఎలా స్పందిస్తారో చూడాలి. 

వివిధ రకాల బాధితులకు సీఎం చంద్రబాబు సహాయం..

విజయవాడ : వివిధ రకాల బాధితులకు సీఎం చంద్రబాబు సహాయం అందించారు. చిత్తూరు జిల్లా నారాయణవనం (మం) ఎరుకమట్టకు చెందిన ఏడాదిన్నర బాలుడు తరుణ్ కు తక్షణ సహాయం కింద రూ. 3 లక్షలు మంజూరు చేయాలని సీఎంఓ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంజుల భర్త ఆరోగ్యం కోసం రూ. పది వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. మదనపల్లికి చెందిన క్యాన్సర్ వ్యాధి గ్రస్తుడు అల్లావుద్దీన్ వైద్య సహాయం కోసం రూ. లక్ష ప్రకటించారు. అప్పుల పాలైన కృష్ణా జిల్లాకు చెందిన కౌలు రైతు చింతయ్యకు రూ.50వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

అనాథ పిల్లలపై హైకోర్టు విచారణ..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అనాథ పిల్లల పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. అనాథలను బీసీ-ఎగా గుర్తిస్తూ జీవో నెంబర్ 28 విడుదల చేశామని తెలంగాణ సర్కార్ పేర్కొంది. అనాథ పిల్లల పట్ల ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనాథ పిల్లల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారో రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సాధ్యం కాకపోతే సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అనాథలను బీసీ - ఏ కేటగిరిలో చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఏపీ పార్టీ జనరల్ సెక్రటరీలకు జిల్లాల బాధ్యతలు..

విజయవాడ : ఏపీ టిడిపి జనరల్ సెక్రటరీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీ జనరల్ సెక్రటరీలకు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. విశాఖ, తూ.గో, కృష్ణా జిల్లాల ఇన్ ఛార్జీలగా రామానాయుడు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు బుచ్చయ్య చౌదరి, శ్రీకాకుళం, విజయనగరం, ప.గో జిల్లాలకు రెడ్డి సుబ్రమణ్యం, కర్నూలు, చిత్తూరు జిల్లాల ఇన్ చార్జీగా వర్ల రామయ్య, కడప, అనంతపురం జిల్లాల ఇన్ ఛార్జీగా జయ నాగేశ్వరరెడ్డి లను నియమించారు. 

కల్లుగీత కార్మికుల ఆందోళన..దిగొచ్చిన సర్కార్..

విశాఖపట్టణం : కల్లుగీత కార్మికుల ఆందోళనతో ప్రభుత్వం దిగి వచ్చింది. పది రోజుల్లోగా హుదూద్ తుపాన్ నష్టపరిహారం చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ యువరాజ్ హామీనిచ్చారు. జిల్లా వ్యాప్తంగా 6,600 మంది గీత కార్మికులకు పరిహారం అందనుంది. 

13:51 - October 26, 2015

బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ మళ్లీ లెక్కలు చూసుకోవాల్సిన టైమొచ్చేసింది. కుర్రకారు దిల్‌ దోచుకోవడానికి కలువల్లాంటి కళ్లతో కాజూ బర్ఫీ మళ్లీ వచ్చేస్తోంది. తన ఎనర్జీని డబుల్‌ చేసి చూపించడానికి అమ్మాయిల కలల రాకుమారుడు రాజ్‌ మరో రికార్డుకు రెడీ అయిపోయాడు. తెరపై లేటు వయసులోనూ తమ ఘాటు ప్రేమను చూపించడానికి జంటగా వచ్చేస్తున్నారు. సిల్వర్‌ స్క్రీన్‌ మరో రొమాంటిక్‌ పిజ్జాను టేస్ట్‌ చేయడానికి సిద్ధమైపోయింది.
ఆ పాట వింటే చాలు..
'తుజే దేఖాతోయే...జానాసనం'.. అనే పాట వింటే చాలు.. ఆ జంట కళ్ల ముందు కనపడతారు. ఏదైనా సినిమా పేరు చెబితే.. హీరోనో..హీరోయిన్‌నో గుర్తు చేసుకుంటారు. కాని దిల్‌వాలే దుల్హనియా లే జాయింగే పేరు వినగానే గుర్తొచ్చేది ఇద్దరు. తమ నటనతో అమర ప్రేమికుల్లా కెమెరా ముందు జీవించేసిన జంట. షారూఖ్‌ అండ్‌ కాజోల్‌. ఇప్పుడీ రొమాంటిక్‌ పెయిర్‌ మళ్లీ రొమాన్స్‌ తెరపై పండించేందుకు వస్తున్నారు. దిల్‌వాలే పేరుతో రోహిత్‌శెట్టి షారూఖ్‌, కాజోల్‌లు జంటగా రూపొందించిన రొమాంటిక్‌ సినిమా విడుదలకు సిద్ధమైపోయింది. చాలా రోజుల తర్వాత షారూఖ్‌, కాజోల్‌ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఈ హిట్‌ పెయిర్‌ మళ్లీ హిట్‌ కొట్టడం ఖాయమని సినీ పండితులు అంచనాలు వేస్తున్నారు. అభిమానుల సంగతైతే ఇక చెప్పనక్కర్లేదు. వెండితెరపై ప్యార్‌ కీ హోలీ ఆడుకోవడానికి సిద్ధమైపోయారు.
బాజీగర్‌ సినిమాతో కాజోల్ ఎంట్రీ..
బాజీగర్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన బాడీ లాంగ్వేజ్‌తో బాక్సాఫీసును బద్దలుగొట్టేసింది. పెద్ద పెద్ద కళ్లు.. అందమైన నవ్వులతో.. తాను కాకుండా తన పాత్రే కనపడేలా చేసే కాజోల్‌.. అజయ్‌దేవగన్‌తో పెళ్లయ్యాక వెండితెరకు దూరమైనా.. అప్పుడప్పుడు తళుక్కుమంటోంది. ఫనాలో అమీర్‌ఖాన్‌తో నటించి మంచి మార్కులు కొట్టేసింది. షారూఖ్‌తో మైనేమ్‌ ఈజ్‌ ఖాన్‌లోనూ నటించి.. అభిమానులను ఫిదా చేసేసింది. ఇప్పుడు దిల్‌వాలేతో మళ్లీ అభిమానుల మనసుల దోచుకోవడానికి వచ్చేస్తోంది.
ఎంటర్‌టైన్‌మెంట్‌తో సినిమాతో వస్తున్న షారూఖ్‌
చెన్నై ఎక్స్‌ప్రెస్‌తో దూసుకెళ్లిన షారూఖ్‌కు హ్యాపీ న్యూ ఇయర్‌ సినిమా బ్రేకేసింది. ఇప్పుడు మళ్లీ రోహిత్‌శెట్టితోనే మరో బ్లాక్‌బస్టర్‌ అందించడానికి ఖాన్‌ రెడీ అయిపోయాడు. ఒకవైపు సల్మాన్‌ భజరంగీ భాయీ జాన్‌తో ఫుల్‌ ఫామ్‌లో ఉంటే.. అమీర్‌ఖాన్‌ ... సినిమాతో వచ్చేస్తున్నాడు. అందుకే షారూఖ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తోనే తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని దిల్‌వాలేతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.
దిల్‌వాలేపై బోలెడు ఆశలు...
డిసెంబర్‌ 18న విడుదల కానున్న దిల్‌వాలే సినిమాలో మరో జంటగా వరుణ్‌ధావన్‌, కృతిసనన్‌ నటిస్తున్నారు. నవంబర్‌ 11న ఈ సినిమా పాటలు విడుదల చేయనున్నారు. మొత్తం మీద భారీ అంచనాలతో వస్తున్న దిల్‌వాలేపై షారూఖ్‌-కాజోల్‌ అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.

 

 

13:42 - October 26, 2015

కడప : జిల్లాలో ఓ విద్యార్థి చదువు వత్తిడి భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జయసాయి కృష్ణ అనే విద్యార్థి రిమ్స్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే హాస్టల్‌ ఉంటున్నాడు. అయితే చదువు వత్తిడి భరించలేక హాస్టలో తను ఉంటున్న గదిలో ఫ్యాన్ కు ఉరిపోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన సహచర విద్యార్థులు జయసాయి కృష్ణను కాపాడి.. రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. చదువుల ఒత్తిడి భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ జయసాయికృష్ణ రాసిన లేఖను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. విషయాన్ని జయసాయికృష్ణ తల్లిదండ్రులకు తెలిపారు.

 

13:36 - October 26, 2015

హైదరాబాద్ : ఎపి నూతన రాజధాని అమరావతిలో నెలన్నరలో తాత్కాలిక అసెంబ్లీ నిర్మించాలన్న స్పీకర్‌ కోడెల శివప్రసాద్ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు నుంచి తిరస్కారం ఎదురైంది. త్వరలోనే శాశ్వత అసెంబ్లీ అందుబాటులోకి రానున్నందున తాత్కాలిక భవనాల పేరిట వృథా ఖర్చు ఎందుకంటూ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రతిపాదనను చంద్రబాబు తిరస్కరించారు. ఈ మేరకు తనను కలిసిన స్పీకర్‌తో చంద్రబాబు తాత్కాలిక భవన నిర్మాణాన్ని విరమించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తుళ్లూరు సమీపంలో ఉన్న హాయ్ ల్యాండ్‌లో ఏపీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించుకునే విషయాన్ని పరిశీలించాలని చంద్రబాబు సూచించారు. సమావేశాల నిర్వహణ, సభ్యులకు వసతి తదితరాలకు హాయ్ ల్యాండ్ సరిగ్గా సరిపోతుందని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. కేవలం రెండేళ్ల కాల పరిమితి కోసం తాత్కాలిక భవనాల నిర్మాణం అంటే, ప్రజా ధనం వృథా అయినట్లే కదా? అన్న ధోరణిలో చంద్రబాబు ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం.

 

13:28 - October 26, 2015

హైదరాబాద్‌ : శివారు ప్రాంతం శంషాబాద్‌లో దారుణం జరిగింది. కుటుంబతగాలతో విసుగెత్తిన ఓ తల్లి తన 5ఏళ్ల కొడుకుతో సహా రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. తొండుపల్లి రైల్వేగేటు వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఉపాధి కోసం తొండుపల్లి గ్రామానికి వచ్చిన దంపతులు తరుచుగా గొడవులు పడుతుండేవారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండడంతో..విసుగు చెందిన భార్య తన కొడుకుతో సహా రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే మృతురాలి భర్త మరో ఇద్దరు పిల్లలు ఇంట్లో లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు...పరారీలో ఉన్న భర్త కోసం గాలిస్తున్నారు.

 

13:16 - October 26, 2015

ఎక్కడో ఏదో వస్తువు పెడతాం. మరిచిపోతాం. ఇంటి తాళం చెవులు..లాక్స్..ఇతర వస్తువులను పెట్టి మరిచిపోతుంటాం. అలాగే జేబులో నుండి కొన్ని వస్తువులు కూడా జారిపోతుంటాయి. మన వస్తువులు కూడా చోరీకి గురవుతుంటాయి. ఇవన్నీ ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చంట. ఎలా అంటారా??
'టెయిల్' అనే ఓ హార్డ్ వేర్ పరికరంతో కని పెట్టవచ్చంట. జస్ట్ తెల్లటి ఓ చతురస్రంగా ఉంటుంది. దీని మూలలు మాత్రం కాస్త రౌండ్‌గా ఉంటాయి. మీరు ఏదైనా వస్తువుని భద్రంగా కాపాడుకోవాలంటే దాంతో పాటు ఈ టెయిల్‌ని జత చేసి ఉంచాలి. అంటే ఉదాహరణకి ప్రయాణంలో మీరు మీతోపాటు తీసికెళ్లే బ్యాగ్‌లో ఓ టెయిల్ పడేశారనుకోండి. ఆ బ్యాగ్ ఎక్కడున్నా మీరు కనుక్కోవచ్చు.
ఇది ఎలా పని చేస్తుంది.
ఇందుకోసం మీ మొబైల్‌లో 'ది టెయిల్' అనే యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ప్రతీ టెయిల్‌కీ ఓ ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. అది దగ్గర్లో ఉండే వైఫై ద్వారా పనిచేస్తుంది. దాని ద్వారా మీ యాప్ లోంచే మీ వస్తువు ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఆన్‌లైన్ కనెక్టివిటీ ఉన్న ప్రదేశాల్లో ఇది ఎంతో సౌకర్యవంతమైన టూల్. కానీ ఈ 'టెయిల్స్' కొంచెం ఖరీదైనవేనండోయ్. ఒక్కో టెయిల్ ఖరీదు ప్రస్తుతం 25 డాలర్లుంది. ఫ్యూచర్లో రేట్ తగ్గే అవకాశం ఉందంట.

13:15 - October 26, 2015

'గోపీచంద్‌', 'రెజీనా' జంటగా, 'ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి' దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రానికి 'సౌఖ్యం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంట్లో వాళ్ళు మాత్రమే కాదు, తన చుట్టుపక్కల వాళ్ళు కూడా సౌఖ్యంగా ఉండాలనుకునే తత్వం హీరోదని నిర్మాత వి.ఆనంద్ తెలిపారు. అందుకోసం యాక్షన్‌ బరిలోకైనా, ఎంటర్‌టైన్‌ చేయడానికైనా సిద్ధంగా ఉండే హీరో కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నామన్నారు. మనుషుల మధ్య ఉండే అనుబంధాలు, ఆప్యాయతలకు పెద్ద పీట వేసిన చిత్రమిదని, టాకీపార్ట్‌ పూర్తయ్యిందని తెలిపారు. అనూప్‌ రూబెన్స్ సంగీతమందించిన పాటలు చాలా హుషారెత్తిస్తాయని, క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న సినిమాను విడుదల చేస్తున్నామన్నారు. ఎదుటి వారి క్షేమ సమాచారాన్ని కనుక్కోవడం మనకున్న సంస్కారమని, అలాంటి సంస్కారం తెలిసిన హీరో నలుగురి 'సౌఖ్యం' కోసం ఏం చేశాడనేది ప్రధానాంశమని దర్శకుడు ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి పేర్కొన్నారు. 'గోపీచంద్‌', 'రెజీనా' జంట చూడ్డానికి చాలా ప్రెష్‌గా ఉంటుందన్నారు.

జీడిమెట్ల ఆర్టీసీ ఉద్యోగుల అకౌంట్లు లూటీ

హైదరాబాద్ : జీడిమెట్ల ఆర్టీసీ ఉద్యోగుల అకౌంట్లను దుండగులు లూటీ చేశారు. 20 మంది డ్రైవర్లు, కండక్టర్ల అకౌంట్లలో రూ.3 లక్షలను చోరీ చేశారు. ఆధార్ అనుసంధానం పేరుతో సైబర్ నేరాగాళ్లు.. ఆర్టీసీ ఉద్యోగుల నుంచి ఖాతాల వివరాలను సేకరించారు. దీంతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పోలీసులను ఆశ్రయించారు.

 

13:14 - October 26, 2015

'ఎన్టీఆర్‌' హీరోగా 'కొరటాల శివ' దర్శకత్వంలో మైత్రీ మూవీస్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఆదివారం సంస్థ కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. ముహూర్తపు సన్నివేశానికి 'ఎన్టీఆర్‌' క్లాప్‌ కొట్టగా, ఆయన తనయుడు మాస్టర్‌ అభయ్ రామ్‌తో కెమెరా స్విచాన్‌ చేయించారు. ఈ సందర్భంగా 'ఎన్టీఆర్‌' మాట్లాడారు. 'కొరటాల శివ' అద్భుతమైన రచయితే కాదు, అభిరుచిగల దర్శకుడని పేర్కొన్నారు. క్లాస్‌, మాస్‌ అంశాలను ఆయన బ్యాలెన్స్ చేసే తీరు నన్నెంతగానో ఆకట్టుకుందని తెలిపారు. ఎన్టీఆర్‌లో ఉన్న నటుడికి, ఆయన మాస్‌ ఇమేజ్‌కి సరిపడే కథ ఇదని, ఎన్నో ఏళ్ళుగా ఎన్టీఆర్‌ను ఎలా చూడాలనుకుంటున్నానో, ఆ తీరులోనే ఆయన క్యారెక్టర్‌ని తీర్చిదిద్దడం జరిగిందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రంలో 'ఎన్టీఆర్‌' సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నుంచి షూటింగ్‌ను ప్రారంభించి, ఆగస్ట్‌ 12 కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు నవీన్‌ యేర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎం) తెలిపారు.

13:12 - October 26, 2015

ఎట్టకేలకు 'వెంకటేష్‌' చేయబోయే తాజా ప్రాజెక్ట్‌ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు మారుతి, క్రాంతిమాధవ్‌ వంటి దర్శకులతో 'వెంకీ' సినిమాలు చేస్తారంటూ అనేక వార్తలొచ్చాయి. అయితే పోలీస్‌ బ్యాక్‌డ్రాప్‌తో ఇటీవల రచయిత వక్కంతం వంశీ చెప్పిన కథ నచ్చడంతో ఆ ఇద్దరి దర్శకుల ప్రాజెక్టుల్ని పక్కన పెట్టి, డాలీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు 'వెంకటేష్‌' ఆసక్తి చూపుతున్నారని సమాచారం. 'తడాఖా', 'గోపాల గోపాల' వంటి చిత్రాలతో మంచి దర్శకుడిగా ప్రేక్షకులకు సుపరిచితుడే. ఈ చిత్రాన్ని పరుచూరి ప్రసాద్‌ నిర్మించనున్నట్టు తెలుస్తోంది. గౌతమ్‌ మీనన్‌ 'ఘర్షణ' తర్వాత 'వెంకటేష్‌' పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న చిత్రమిదని టాక్.

13:10 - October 26, 2015

ముఖాన్ని అందవిహీనంగా మార్చేవాటిలో బ్లాక్‌హెడ్స్ ముఖ్యమైనవి. సెబాషియస్‌ అనే గ్రంథి నూనె పదార్థాన్ని(సెబమ్‌) అధికంగా విడుదల చేయడం వల్ల ఇవి ఏర్పడతాయి. చర్మానికి రంగునిచ్చే పిగ్మెంట్‌ ఎక్కువైనా బ్లాక్‌ హెడ్స్‌ సమస్య వస్తుంది. వాతావరణంలోని కాలుష్యం, దుమ్ముధూళి కూడా ఇందుకు కారణం అవుతాయి. బ్లాక్‌హెడ్స్ ను గిల్లడం వల్ల చర్మంపై ఉన్న బ్యాక్టీరియా చర్మంలోపలికి చొచ్చుకుపోయి మరింత హాని చేస్తుంది. ఇంట్లో అందుబాటులో ఉండేవాటితో బ్లాక్‌హెడ్స్ ను నివారించవచ్చు.

  • ముల్లంగి విత్తనాలను పేస్టులా చేసుకుని దాన్ని నీళ్లతో కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలపాటు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
  • ఒక స్పూన్‌ పెరుగులో ఒక టీ స్పూన్‌ బియ్యం పిండిని కలుపుకుని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట రుద్దుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగే స్తేసరి.
  • గంధపు చెక్క పొడికి రోజ్‌వాటర్‌ కలిపి ఆ పేస్టుతో ముఖానికి ప్యాక్‌ వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ విధంగా చేయడం వల్ల బ్లాక్‌హెడ్స్ తో తగ్గడంతోపాటు చర్మం చల్లగా ఉంటుంది.
13:09 - October 26, 2015

మీరు స్మార్ట్‌గా యాక్టివ్‌గా ఉండాలనుకుంటున్నారా? అయితే దానిమ్మ జ్యూస్‌ తాగండి అంటున్నారు వైద్య నిపుణులు. ఈ రసం తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. యాంటీయాక్సిడెంట్స్‌ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దానిమ్మ జ్యూస్‌ను రోజూ మీ డైట్‌లో చేర్చుకుంటే నిద్రలేమి, నీరసం, అలసటను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

టిఫిన్ బాక్స్ బాంబు కేసు కొట్టివేత...

హైదరాబాద్ : లాల్ దర్వాజ కాకతీయ హోటల్ టిఫిన్ బాక్స్ బాంబు కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. సాక్ష్యాలు లేకపోవడంతో కేసును కొట్టి వేసింది. 1999లో లాల్ దర్వాజలో జరిగిన టిఫిన్ బాక్స్ బాంబు కేసును 16 ఏళ్లుగా విచారించింది. 

12:53 - October 26, 2015

గుంటూరు : ఎపి సీఎం చంద్రబాబు రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నాడని వైసిపి అధినేత జగన్ త్రీవంగా విమర్శించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని మల్కాపురం గ్రామంలో జగన్‌ పర్యటించారు. ఇటీవల గద్దె చంద్రశేఖర్‌ అనే రైతుకు చెందిన చెరుకు తోటకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో...ఆ పంటపొలాన్ని జగన్‌ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని కోసం భూములు ఇవ్వకపోతే దాడులకు పాల్పడుతూ.. పంటలను దగ్ధం చేయడం దారుణమన్నారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని కోసం బలవంతంగా భూములు లాక్కోవడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు మానవత్వాన్ని మరిచాడని విమర్శించారు. అధికారంలో ఉన్నామని బలవంతంగా భమూలు లాక్కొవడం సరికాదన్నారు. చంద్రబాబు రాక్షసుడు అయిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తించాలన్నాడు. రాజధానికి భూములివ్వని రైతులను చంద్రబాబు సర్కార్‌ ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. భూములివ్వని రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేస్తూ..అక్రమపద్దతిలో భూములను లాక్కొంటున్నారని జగన్ మండిపడ్డారు. రాక్షసత్వం వీడి మానవత్వాన్ని ప్రదర్శించాలని హితవు పలికారు.

 

మల్కాపురంలో వైఎస్ జగన్ పర్యటన..

గుంటూరు : జిల్లాలోని మల్కాపురంలో వైఎస్ జగన్ పర్యటించారు. దగ్ధమైన పంటను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని కోసం బలవంతంగా భూములు లాక్కోవడం, ఇవ్వకపోతే దాడులకు పాల్పడుతూ.. పంటను దగ్ధం చేయడం దారుణమన్నారు.

 

12:35 - October 26, 2015

ఢిల్లీ : 15 ఏళ్ల క్రితం లాహోర్‌కు ట్రైన్‌లో పొరపాటున వెళ్లిపోయిన గీత.. స్వదేశమైన భారత్ కు తిరిగి చేరుకుంది. పాకిస్తాన్ నుంచి ప్రత్యేక విమానంలో గీతం ఢిల్లీ చేరుకుంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో గీతకుర ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ను గీత కలవనుంది. గీతకు డీఎన్ ఏ పరీక్షలు నిర్వహించన తర్వాత తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. గీత స్వరాష్ట్రం బీహార్. అయితే భజ్రంగీ భాయిజాన్ చిత్రంతో గీత తప్పిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ చిత్రం తర్వాత భారత్, పాక్ విదేశాంగ శాఖలు చొరవ తీసుకున్నాయి. గీత పదిహేనేళ్ల ఏళ్ల క్రితం ట్రైన్‌లో పొరపాటున లాహోర్‌కు వెళ్లిపోయింది. ఇప్పటివరకూ గీత.. కరాచీలోని ఈద్‌ ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందింది. చెవిటి, మూగ యువతి అయిన గీత.. తన కుటుంబం భారత్‌ ఉందంటూ సైగలతో చెప్పేది. గీత బాధను అర్థం చేసుకున్న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తల్లిదండ్రులను కలిపేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే మొదటగా గీత తమ కూతురని ఐదు కుటుంబాలు ముందుకు వచ్చాయి. కానీ చివరికి గీతా తల్లిదండ్రులు బీహార్‌లో ఉన్నట్లుగా గుర్తించారు. తల్లి దండ్రుల డీఎన్‌ఏతో సరిపోలితే.. గీతను వారి కుటుంబానికి ప్రభుత్వం అప్పగించనుంది. ఇప్పటికే బీహార్‌లో ఉన్న గీత తల్లిదండ్రులు ఢిల్లీ చేరుకున్నారు. తమ కూతురు తిరిగి వారి వద్దకు చేరుకోవడం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిర్ధారణ కోసమే డీఎన్ ఏ టెస్టు చేస్తున్నామని... ప్రజలందరికీ తెలియజేసేందకు పరీక్ష చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. గీతతోపాటు ఈధి ఫౌండేషన్ సభ్యులు భారత్ వచ్చారు.
ఎనిమిదేళ్ల వయస్సు..
మూగు, చెవుడుతో కేవలం సైగల ద్వారానే తన హావాభావాలను తెలిపే గీత.. భారత్‌ నుంచి పాక్‌కు వెళ్లినప్పుడు ఎనిమిదేళ్ల వయసు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన గీత.. పాకిస్తాన్‌లోని లాహోర్‌ రైల్వేస్టేషన్‌లో దిగింది. అనాథగా తిరుగుతున్న గీతను కరాచీలోని ఈదీ ఫౌండేషన్‌ చేరదీసింది. అప్పటినుంచి గీత అక్కడే ఉంటోంది.
కరాచీలో ఆశ్రయం..
ఇప్పటివరకూ గీత.. కరాచీలోని ఈద్‌ ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందింది. చెవిటి, మూగ యువతి అయిన గీత.. తన కుటుంబం భారత్‌ లో ఉందంటూ సైగలతో చెప్పింది.. గీత బాధను అర్థం చేసుకున్న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తల్లిదండ్రులను కలిపేందుకు ఏర్పాట్లు చేసింది. గీత తల్లిదండ్రులు బీహార్‌లో ఉన్నట్లుగా గుర్తించారు. తల్లి దండ్రుల డీఎన్‌ఏతో సరిపోలితే.. గీతను వారి కుటుంబానికి ప్రభుత్వం అప్పగించనుంది. ఇప్పటికే బీహార్‌లో ఉన్న గీత తల్లిదండ్రులు ఢిల్లీ చేరుకున్నారు. అయితే గీత మళ్లీ స్వదేశానికి చేరుకోవడంతో ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
తండ్రి, సవతి తల్లి, తోబుట్టువులను గుర్తించిన గీత
గీత కుటుంబసభ్యులు భారత్‌కు చెందినవారని తెలియడంతో.. వారి ఆచూకీ కోసం దీర్ఘకాలంగా అన్వేషణ కొనసాగింది. బీహార్‌లో ఆమె కుటుంబాన్నిగుర్తించిన అధికారులు వారి ఫొటోను బాలికకు పంపించారు. తన తండ్రి, సవతి తల్లి, తోబుట్టువులను గీత గుర్తించింది. వారు తన కుటుంబసభ్యులేనని గీత సైగలతో తెలిపింది.
డీఎన్ఏ పరీక్షలు...
కుటుంబ సభ్యులను నిర్ధారించేందుకు భారత్‌ అధికారులు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తారు. వారే ఆమె కుటుంబ సభ్యులని పరీక్షల్లో స్పష్టమైతేనే.. వారికి అప్పగిస్తారు. లేదంటే గీత బాధ్యతను భారత ప్రభుత్వమే ఏదైనా స్వచ్చంద సంస్ధకు అప్పగించనుంది.

 

హైదరాబాద్ లో బాలుడి కిడ్నాప్ .

హైదరాబాద్‌ : నగరంలో ఓ బాలుడి కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. పాతబస్తీలోని శంషీర్‌ గంజ్‌ పీఎస్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. శబరీష్‌ అనే విద్యార్ధి కిడ్నాప్‌కు గురైనట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఢిల్లీ చేరుకున్న గీత..

ఢిల్లీ : 15 ఏళ్ల క్రితం లాహోర్‌కు ట్రైన్‌లో పొరపాటున వెళ్లిపోయిన గీత.. తిరిగి స్వదేశానికి ఢిల్లీ చేరుకుంది. ఇప్పటివరకూ గీత.. కరాచీలోని ఈద్‌ ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందింది. చెవిటి, మూగ యువతి అయిన గీత.. తన కుటుంబం భారత్‌ ఉందంటూ సైగలతో చెప్పేది. గీత బాధను అర్థం చేసుకున్న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తల్లిదండ్రులను కలిపేందుకు ఏర్పాట్లు చేసింది. గీతా తల్లిదండ్రులు బీహార్‌లో ఉన్నట్లుగా గుర్తించారు. తల్లి దండ్రుల డీఎన్‌ఏతో సరిపోలితే.. గీతను వారి కుటుంబానికి ప్రభుత్వం అప్పగించనుంది. ఇప్పటికే బీహార్‌లో ఉన్న గీత తల్లిదండ్రులు ఢిల్లీ చేరుకున్నారు.  

12:06 - October 26, 2015

ఢిల్లీ : 15 ఏళ్ల క్రితం లాహోర్‌కు ట్రైన్‌లో పొరపాటున వెళ్లిపోయిన గీత.. తిరిగి స్వదేశానికి చేరుకుంది. కరాచీ నుంచి విమానంలో ఢిల్లీ చేరుకున్న గీతకు భారత విదేశాంగ శాఖ అధికారులు స్వాగతం పలికారు. ఇన్నేళ్ల తరువాత గీతను చూసిన కుటుంబసభ్యులు ఉద్వేగభరితులయ్యారు. కరాచీ నుంచి ప్రత్యేక విమానంలో ఈదీ ఫౌండేషన్ సభ్యులు గీతను భారత్‌కు తీసుకువచ్చారు. గీతను తీసుకువెళ్లేందుకు ఆమె కుటుంబసభ్యులుగా చెప్పుకుంటున్న జనార్దన్‌మహతో, ఆయన ఇద్దరు కుమారులు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం గీతను అధికారులు కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. 

కరాచీలో ఆశ్రయం..
ఇప్పటివరకూ గీత.. కరాచీలోని ఈద్‌ ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందింది. చెవిటి, మూగ యువతి అయిన గీత.. తన కుటుంబం భారత్‌ లో ఉందంటూ సైగలతో చెప్పింది.. గీత బాధను అర్థం చేసుకున్న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తల్లిదండ్రులను కలిపేందుకు ఏర్పాట్లు చేసింది. గీత తల్లిదండ్రులు బీహార్‌లో ఉన్నట్లుగా గుర్తించారు. తల్లి దండ్రుల డీఎన్‌ఏతో సరిపోలితే.. గీతను వారి కుటుంబానికి ప్రభుత్వం అప్పగించనుంది. ఇప్పటికే బీహార్‌లో ఉన్న గీత తల్లిదండ్రులు ఢిల్లీ చేరుకున్నారు. అయితే గీత మళ్లీ స్వదేశానికి చేరుకోవడంతో ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఎనిమిదేళ్ల వయస్సు..
మూగు, చెవుడుతో కేవలం సైగల ద్వారానే తన హావాభావాలను తెలిపే గీత.. భారత్‌ నుంచి పాక్‌కు వెళ్లినప్పుడు ఎనిమిదేళ్ల వయసు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన గీత.. పాకిస్తాన్‌లోని లాహోర్‌ రైల్వేస్టేషన్‌లో దిగింది. అనాథగా తిరుగుతున్న గీతను కరాచీలోని ఈదీ ఫౌండేషన్‌ చేరదీసింది. అప్పటినుంచి గీత అక్కడే ఉంటోంది.

తండ్రి, సవతి తల్లి, తోబుట్టువులను గుర్తించిన గీత
గీత కుటుంబసభ్యులు భారత్‌కు చెందినవారని తెలియడంతో.. వారి ఆచూకీ కోసం దీర్ఘకాలంగా అన్వేషణ కొనసాగింది. బీహార్‌లో ఆమె కుటుంబాన్నిగుర్తించిన అధికారులు వారి ఫొటోను బాలికకు పంపించారు. తన తండ్రి, సవతి తల్లి, తోబుట్టువులను గీత గుర్తించింది. వారు తన కుటుంబసభ్యులేనని గీత సైగలతో తెలిపింది.

డీఎన్ఏ పరీక్షలు...
కుటుంబ సభ్యులను నిర్ధారించేందుకు భారత్‌ అధికారులు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తారు. వారే ఆమె కుటుంబ సభ్యులని పరీక్షల్లో స్పష్టమైతేనే.. వారికి అప్పగిస్తారు. లేదంటే గీత బాధ్యతను భారత ప్రభుత్వమే ఏదైనా స్వచ్చంద సంస్ధకు అప్పగించనుంది.

11:59 - October 26, 2015

హైదరాబాద్‌ : నగరంలో ఓ బాలుడి కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. పాతబస్తీలోని శంషీర్‌ గంజ్‌ పీఎస్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. శబరీష్‌ అనే విద్యార్ధి కిడ్నాప్‌కు గురైనట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆలియాబాద్ దగ్గర ఇద్దరు మహిళలు బాలుడితో ముచ్చటించి, తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే పాతక్షక్ష్యల నేపథ్యంలో బాలుడిని కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు.

 

11:54 - October 26, 2015

పశ్చిమగోదావరి : జిల్లాలోని తణుకులో సంచలనం రేపిన కృపామణి ఆత్మహత్య కేసుపై విచారణ వేగవంతమైంది. అదనపు డీజీ సీపీ ఠాకూర్‌ను ఈ కేసుకు స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించారు. నిందితుల కోసం వేట మొదలైంది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మీడియాలో విడుదలైన కృపామణి సెల్ఫీ వీడియోతో కలకలం రేగింది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి పీతల సుజాత కూడా పోలీసులను ఈ కేసు గురించి అప్రమత్తం చేశారు.

 

11:35 - October 26, 2015

ఢిల్లీ : భారత్‌లో తొలి భారీ అంతర్జాతీయ కార్యక్రమానికి ఢిల్లీ వేదిక కానుంది. మూడొవ భారత-ఆఫ్రికా వేదిక సదస్సు 2015 ఇవాల్టి నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియం వేదికగా జరిగే ఈ సదస్సులో ఆఫ్రికా ఖండంలోని మొత్తం 54 దేశాలు పాల్గొనన్నాయి. 4రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సదస్సులో 40దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలు హాజరుకానున్నారు. ఆఫ్రికా బయట దేశాలన్నీ ఒక సమావేశంలో పాల్గొనడం ఇదే తొలిసారి. 1983లో ఢిల్లీలో 42 దేశాలు పాల్గొన్న కామన్వెల్త్‌ ప్రభుత్వాధినేతల సదస్సు తర్వాత మన దేశంలో ఇదే అతిపెద్ద అంతర్జాతీయ కార్యక్రమం కావడం విశేషం. ఇంధనం, ఇతర ప్రకృతి సహజ వనరులు అపారంగా ఉన్న ఆఫ్రికాతో స్నేహబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఉద్దేశించిన ఈ భేటీ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో రేపు విదేశాంగ మంత్రులు భేటీ ఉంటుంది. 29న శిఖరాగ్ర సమావేశం తర్వాత అదే రోజు రాష్ట్రపతి భవన్‌లో విందు కార్యక్రమం జరగనుంది.

 

 

11:32 - October 26, 2015

ఢిల్లీ : పాకిస్తాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్‌లోని 30 పోలీస్‌ఓట్‌పోస్టులపై పాక్‌ బలగాలు కాల్పులు జరిపాయి. గత అర్థరాత్రి నుంచి సాంబ జిల్లాలో పాక్‌ బలగాలు కాల్పులు జరుపుతుండడంతో...భారత్‌ బలగాలు కాల్పులను తిప్పికొట్టాయి. ఎదురుకాల్పుల్లో ఓ పౌరుడు మృతి చెందాడు. భారత్‌, పాక్‌ బలగాల కాల్పుల నేపథ్యంలో సాంబ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పులతో వణికిపోతున్న పలు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

 

11:13 - October 26, 2015

నల్గొండ : నాగార్జున సాగర్‌లో తెలంగాణ సీపీఎం రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. నిన్న ప్రారంభమైన సమావేశాల్లో రాష్ట్రంలోని రాజకీయ పరిస్ధితులు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరుగుతోంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ వైఖరిపై చర్చించి ఉద్యమ కర్తవ్యాలను రూపొందిస్తామని నేతలు చెబుతున్నారు. ప్లీనరీ సమావేశాలకు తెలంగాణలోని పది జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు, ముఖ్య నేతలకు హాజరయ్యారు. 
జూలకంటి రంగారెడ్డి..
చాలా ఉత్సాహకర వాతారణంలో ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, కేంద్రకమిటీ సభ్యులు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లుస్వరాజ్యం, పోరాటటయోధులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తీర్మాణాలు చేశాము. రైతుల ఆత్మహత్యలు, గిట్టుబాటు ధర, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తీర్మాణాలు చేశాము. భూ సమస్యలు, పేదలకు ఇళ్లు, సామాజిక శక్తులను కలుపుకుని బలమైన శక్తిగా ఎదుగుతాము. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయాలని తీర్మాణించాము. ఆశా వర్కర్ల కోసం నిధి వసూళు చేశాము. వామపక్ష ఉద్యమం, సీపీఎం బలపడేందుకు నిర్ణయాలు తీసుకొనున్నాము.

 

10:56 - October 26, 2015

విశాఖ : సీపీఐలో కీలకనేతగా పనిచేసిన చింతపల్లి మాజీ ఎమ్మెల్యే దేముడు ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతూ విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున చనిపోయారు. 1984, 2004లో విశాఖ జిల్లాలోని చింతపల్లి నియోజకవర్గంనుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీపీఐలో కీలకనేతగా ఎదిగిన ఎమ్మెల్యే దేముడు..చింతపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషిచేశారు.

 

10:54 - October 26, 2015

హైదరాబాద్ : అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో దారుణం జరిగింది. పోలీసులు అత్యుత్సాహాసం ప్రదర్శించారు. విచక్షణను కోల్పోయారు. ఓ కేసు విచారణ కోసం దళిత యువకుడిని అంబర్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకుని, చితకబాదారు. అంబర్‌పేట గోల్నాక లంకబస్తీకి చెందిన సాయికుమార్‌ను ఓ గొడవ విషయంలో అంబర్‌పేట పీఎఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయికుమార్ ను చావబాదారు. పోలీసుల దెబ్బలకు అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. సాయికుమార్‌ కు ఇప్పుడు నడవలేని పరిస్థితి నెలకొంది. పాతకక్షల్ని మనసులో పెట్టుకున్న పోలీసులు.. తనను 3గంటలపాటు పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని సాయికుమార్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. తనకు న్యాయం చేయాలని సాయికుమార్ డిమాండ్ చేస్తున్నాడు. తన కొడుక్కి న్యాయం చేయాలని బాధితుడి తల్లిదండ్రులు అంబర్‌పేట పీఎస్‌ ముందు ఆందోళనకు దిగారు. అయితే కేసు దర్యాప్తు చేస్తున్నామని..అన్ని విషయాలు త్వరలోనే బయటపడతాయని పోలీసులు తెలిపారు.
బాధితుడు సాయికుమార్...
'గొడవతో నాకు సంబంధం లేదు. నన్ను అరెస్టు చేశారు. 20 మంది పోలీసులు నన్ను మూడు గంటలపాటు కొట్టారు. ఆరు మంది పోలీసులు నాపై కూర్చుని కొట్టారు. సాయంత్రం 6 నుంచి 9 గంటలకు వరకు చిత్ర హింసలు పెట్టారు. బోనాల సందర్భంగా శివ అనే కానిస్టేబుల్ డబ్బులు అడిగాడు. నా దగ్గర లేకపోవడంతో ఇవ్వలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. శివ, దినేష్, సోయల్ అనే కానిస్టేబుల్స్ నన్ను త్రీవంగా చావబాదారు. ఎస్ ఐ మహిపాల్ చిత్రహింసలకు గురిచేశాడు. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను'.. అంటూ సాయికుమార్ తన మనోవేధనతో మీడియాకు వివరంచారు. ఇదిలావుంటే సాయికుమార్ ను చిత్ర హింసలకు గురి చేసిన మాట నిజమని తేలితే.. తమ పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు.

ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న గీత

ఢిల్లీ : పదిహేనేళ్ల క్రితం తప్పిపోయిన గీత.. ఇవాళా భారత్ వస్తుంది. కరాచీ నుంచి బయల్దేరిన గీత ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.

 

రిమ్స్ హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

కడప : రిమ్స్ హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తొటి విద్యార్థులు అతన్ని అడ్డుకున్నారు. చదువు వత్తిడి భరించలేకే ఆత్మహతకు పాల్పడినట్లు తెలుస్తోంది. 

09:51 - October 26, 2015

ఎపికి ప్రత్యేకహోదాపై క్లారిటీ రావాలని అందరం కోరుకుంటున్నామని వక్తలు పేర్కొన్నారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి, ఆధ్రమేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి, టిడిపి నేత చందు సాంబశివరావు పాల్గొని, మాట్లాడారు. ప్రత్యేకహోదా నిరసన భావన ప్రజల్లో ఉన్నప్పుడు దానిని అనగదొక్కడం కష్టమన్నారు. ప్రత్యేకహోదా... చంద్రబాబు, మోడీ సొంత విషయం కాదని.. ప్రజలందరి విషయమని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:42 - October 26, 2015

పిల్లలకు మాతృభాషతోపాటు ఇంగ్లీష్ విద్య చదివించాలని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ విశ్లేషణ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఆధునిక ప్రపంచంలో ఇంగ్లీష్ విద్య అవసరమని తెలిపారు. కాబట్టి ఇంగ్లీష్ లో చదువుకునే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. స్కూల్ లేవల్ లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం ఆహ్వానించదగిని విషయమన్నారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే..
ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న పిల్లల సంఖ్య తగ్గుదల
భారత దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల సంఖ్య తగ్గుతుంది. ప్రైవేట్ పాఠశాల్లో చదివే పిల్లల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఉపాధ్యాయులు, నాణ్యమైన విద్య ఉన్నారు. అయినా పిల్లల సంఖ్య తగ్గుంతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం లేదు. సౌకర్యాలు లేవు. అయితే ప్రైవేట్ పాఠశాలలు పిల్లలను ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంది. ఆర్థికంగా బలోపేతంగా ఉన్నవారు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలను చదివిస్తున్నారు. ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో ఆర్థికస్తోమత పెరిగి పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ లో చదివిస్తున్నారు.
పేదరికం ఉన్నంతకాలం ప్రభుత్వ పాఠశాలలు
పేదరికం వర్థిల్లినంత కాలం ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లేకపోవడంతో ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. కానీ టీచర్లను అపాయింట్ మెంట్ చేయలేదు. భాషా మీద గ్రిప్ ఉంటే తప్ప.. ఒక భావననను అర్థం చేయలేము. కాబట్టి మాతృభాషలో విద్యా భోదన అసవరం. అయితే ఆధునిక విద్యను పిల్లలకు దూరం చేయొద్దు. ఇంగ్లీష్ మీడియాన్ని ఆహ్వానించాలి. అలాగే తెలుగు మీడియం కూడా ఉండాలి. ఇంగ్లీష్ మీడియంను ఎఫెక్టివ్ గా చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలి. మాతృభాషలో విద్యా భోదన ఉండాలి. ప్రకృతికి, మనిషికి మధ్యలో ఉండే భావాన్ని మాతృభాష ద్వారా తెలుపుకుంటారు. మాతృభాషలో విద్యా భోదన అవసరమే. అయితే ఇంగ్లీష్ నేర్చుకోవడం అసాధ్యం కాదు. పిడివాదం ఉండకూడదు. నిర్ధిష్ట పరిస్థితిలో నిర్ధిష్ట అధ్యయమే శాస్త్రం. అనేక రంగాలు ఇంగ్లీష్ తో లింక్ అయి ఉన్నాయి. ఇంటర్నేషన్ బిజినెస్.. ఇంగ్లీష్ తో అనుసంధానం అయింది. ఇంగ్లీష్ నేర్చుకున్నవారు.. 30 శాతం అందనంగా సంపాదిస్తున్నారు.
భిన్నత్వాన్ని కాపాడాలి..
భారతదేశంలో ఉన్న భిన్నత్వాన్ని కాపాడాలి. ఒకవైపు నరేంద్ర మోడీ... మద్దతుదారులు.. భారత దేశ భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. మరోవైపు భిన్నత్వంలో ఏకత్వం భారత్ కు గర్వకారణం అని మోడీ అంటున్నారు. కాబట్టి మోడీ మద్దతుదారులు కనీసం ఆయన మాటైన వినాలి'. అని వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:30 - October 26, 2015

పాకిస్థాన్ : పదిహేనేళ్ల క్రింతం తప్పిపోయి పాకిస్థాన్ లో ఉంటున్న గీత ఇవాళా భారత్ కు రానుంది. గీత కరాచీ నుంచి ఢిల్లీ బయల్దేరింది. గీతకు డీఎన్ ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. పదిహేనేళ్ల క్రింతం గీత తప్పిపోయి.. రైలులో లాహోర్ వెళ్లింది. ఈదీ ఫౌండేషన్ గీతకు ఆశ్రయం కల్పించింది. ఫొటో ఆధారంగా గీత తన తల్లిదండ్రులను గుర్తించింది.

 

కరాచీ నుంచి ఢిల్లీకి బయల్దేరిన గీత..

పాకిస్థాన్ : పదిహేనేళ్ల క్రితం తప్పిపోయి పాకిస్థాన్ లో ఉంటున్న గీత ఇవాళ భారత్ వస్తుంది. గీత.. కరాచీ నుంచి ఢిల్లీ బయల్దేరింది. గీతకు డీఎన్ ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. పదిహేనేళ్ల క్రితం గీత తప్పిపోయి.. రైలులో లాహోర్ వెళ్లింది. ఈదీ ఫౌండేషన్ గీతకు ఆశ్రయం కల్పించింది. ఫొటో ఆధారంగా గీత తన తల్లిదండ్రులను గుర్తించింది.

 

08:34 - October 26, 2015

దేశ ఆర్థికాభివృద్ధిలో ఉత్తరాంధ్ర కీలకపాత్రే పోషిస్తోంది. భారతదేశానికి విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిపెట్టడంలోనూ ఉత్తరాంధ్ర మరే ప్రాంతానికీ తీసిపోవడం లేదు. కానీ, అభివృద్ధిలో మాత్రం అదొక శాపగ్రస్త ప్రాంతంగా మిగిలుతోంది.
నిరుత్సాహం మిగిల్చిన అమరావతి శంఖుస్థాపన
ఎంతో ఉత్సాహంగా మొదలైన అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం చివరకు నిరుత్సాహాన్నే మిగిల్చింది. ఎందరో దేశ విదేశీ ప్రముఖులతో పాటు సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్రమోడీయే ఈ కార్యక్రమానికి హాజరుకావడంతో ఆంధ్రప్రదేశ్ కి ఏదో ఒక వరాల జల్లు కురిపిస్తారనీ, ఉత్తరాంధ్ర, రాయలసీమ లాంటి ప్రాంతాలకు తీపి కబుర్లు చెబుతారని చాలామంది ఆశించారు. కానీ, చివరకు నిరాశే మిగిలింది. మోడీ ప్రసంగం ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ నిర్వేదమే కనిపించింది. పార్లమెంట్ నుంచి పిడికెడు మట్టి, యమునా నది నుంచి చెంబెడు నీళ్లు తెచ్చి, అదే తామిస్తున్న పెద్ద కానుకన్నట్టు దేశ ప్రధాని వ్యవహరించిన తీరు విస్మయం కలిగిస్తోంది. అవును. కేంద్రం నుంచి నిధులు రాబట్టాల్సిన ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వమూ మన మట్టి, మన నీళ్లు అంటూ ప్రచార ఆర్భాటం ప్రదర్శిస్తే, దేశ ప్రధాని కూడా అవే మట్టి, నీళ్లు మొహాన చల్లి వెళ్లిపోయారు. స్పెషల్ స్టేటస్, ప్రత్యేక ప్యాకేజీల లాంటి అంశాలేవీ ప్రస్తావించకపోవడం బీజేపీ వ్యూహమా? చంద్రబాబు వైఫల్యమా? అంటూ తీరుబడిగా విశ్లేషించుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కి జరిగే మేలేమీ వుండకపోవచ్చు.
ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల్లో, రాయలసీమలో ఆవేదన
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 13 జిల్లాలు వుంటే ఉత్తరాంధ్రలో మూడు, రాయలసీమలో నాలుగు జిల్లాలున్నాయి. ఇప్పుడు ఈ ఏడు జిల్లాల్లోనూ తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న బాధ, ఆవేదన వ్యక్తమవుతున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ మూడు జిల్లాలతో కూడిన ఉత్తరాంధ్ర ఈ దేశార్ధికభివృద్ధిలో పోషిస్తున్న పాత్ర చిన్నదేమీ కాదు. భారతదేశ జీడీపీలో అత్యధిక వాటాను అందిస్తున్న టాప్ 15 సిటీలలో విశాఖ ఒకటి కావడం విశేషం. ఇక అత్యధిక తీర ప్రాంతం వున్న జిల్లాలివి. ఉత్తరాంధ్ర మత్స్యకారులు విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిపెట్టడంలో మరెవరికీ తీసుపోరు. నాగావళి, వంశధార లాంటి నదులు, సింహాచలం, ఆర్సవల్లి, శ్రీముఖలింగం లాంటి ఎన్నో ప్రముఖ దివ్యక్షేత్రాలు, అరకు, రుషికొండ, భీమిలీ లాంటి ఎన్నో చూడముచ్చటైన పర్యాటక స్థలాలున్న ప్రాంతమిది. కానీ ఏం లాభం? ఈ ప్రాంత అభివ్రద్ధికి సమగ్ర ప్రణాళికలే లోపిస్తున్నాయి.
గనులు కేటాయించలేని దౌర్భాగ్యం
భారతదేశం గర్వించదగ్గ స్టీల్ ప్లాంట్ వున్నా గనులు కేటాయించలేని దౌర్భాగ్యం. బహుశా భారతదేశం మొత్తం మీద గనుల కేటాయింపులు లేని ఏకైక స్టీల్ పరిశ్రమ విశాఖ లోనే వుంది. ఉత్తరాంధ్ర అభివ్రుద్ధి పట్ల నిర్లక్ష్యానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది? ఉత్తరాంధ్రలోని జ్యూట్ మిల్లులు, ఫెల్లో అర్రాయిస్ పరిశ్రమలు మూతపడుతున్నా, సహకార చక్కెర కర్మాగారాలు దెబ్బతింటున్నా పట్టించుకుంటున్నవారే కరువయ్యారు. ప్రక్రుతి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన దైన్యం ఉత్తరాంధ్ర రైతులది. ఇక్కడ సాగుచేస్తున్న భూమిలో అత్యధికం వర్షాధారమే. ఎంతో పేరుప్రఖ్యాతులున్న ఆంధ్ర యూనివర్సిటీ లోటు బడ్జెట్ తో తల్లడిల్లుతోంది. ఇక రైల్వే జోన్ వ్యవహారం దశాబ్ధాల తరబడి సుదీర్ఘ స్వప్నంగానే మిగిలిపోతోంది. రాష్ట్ర విభజన సమయంలో ఉత్తరాంధ్రకు చేసిన వాగ్ధానాలు ఇంకా అమలుకు నోచుకోవడం లేదు. వాటి అమలు కోసం, ఉత్తరాంధ్ర సమగ్రాభివ్రుద్ధి కోసం ఇప్పుడు ఇక్కడ ఉద్యమ స్వరాలు వినిపిస్తున్నాయి. కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, విద్యావంతులు ఇలా విభిన్నరంగాలవారు ఒక్కటవుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తరాంధ్రవాసుల ఘోష వినేందుకు ప్రయత్నించాలి. ఈ ప్రాంత అభివ్రుద్ధి మీద ద్రుష్టి సారించాలి. అలాంటి ప్రయత్నిస్తామన్న సందేశాన్ని, సంకేతాన్ని ఇవ్వడంలో మొన్నటి అమరావతి శంఖుస్థాపన మహోత్సవం విఫలమైందన్నదే ఉత్తరాంధ్రవాసుల వేదన.

 

08:29 - October 26, 2015

ఉత్తరాంధ్రవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక నేత అజయ్ శర్మ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'కొద్ది రోజుల క్రితమే ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఏర్పాటయ్యింది. ఈ వేదిక లక్ష్యాలేమిటి? ఉత్తరాంధ్ర అభివృద్ధికి వున్న అవకాశాలేమిటి? ప్రస్తుతం ఉత్తరాంధ్రవాసులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి జరగాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేమిటి..?' అంశాలతోపాటు పలు విషయాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

ఖమ్మం జిల్లాలో ఎన్ కౌంటర్..జవాను మృతి

ఖమ్మం : చత్తీస్‌గడ్‌ సరిహద్దు ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం మారాయిగూడెం వద్ద సీఆర్పీఎఫ్‌ జవాన్లు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అశోక్‌జాట్‌ అనే జవాను మృతి చెందగా.. మరో జవాన్‌కు గాయాలయ్యాయి. హుటాహుటిన జవాన్‌ను భద్రాచలం ప్రభుత్వాస‌్పత్రికి తరలించారు. 

తుళ్లూరు మండలంలో నేడు జగన్‌ పర్యటన

గుంటూరు : నేడు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తుళ్లూరు మండలం మల్కాపురం, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లో పర్యటించనున్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వలేదనే కారణంతో.. మల్కాపురంలో దుండగులు దగ్ధం చేసిన చెరకు తోటను ఆయన పరిశీలించి.. రైతు చంద్రశేఖర్‌ను పరామర్శించనున్నారు. 

07:53 - October 26, 2015

ఢిల్లీ : దేశం కాని దేశంలో దశాబ్ధ కాలంగా మౌనవేదన అనుభవిస్తున్న గీతకు మంచి రోజులు వచ్చాయి. ఎన్నాళ్ల క్రితమో అయినవారికి దూరమైన ఆమెను తనవారి వద్దకు చేర్చేందుకు రంగం సిద్దమైంది. ఈరోజు గీతను పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు తీసుకువస్తున్నారు. డీఎన్‌ఏ పరీక్షల్లో స్పష్టమైతేనే కుటుంబ సభ్యులకు గీతను అప్పగించే అవకాశం ఉంది. సల్మాన్‌ఖాన్‌ సినిమా 'బజరంగీ బాయీజాన్‌' సినిమాతో వెలుగుచూసిన గీత కథ సుఖాంతం కాబోతుంది. 15 ఏళ్ల క్రితం తప్పిపోయి పాకిస్తాన్‌కు చేరిన గీత నేడు భారత్‌ చేరుకోనుంది.
తప్పిపోయినప్పుడు గీత ఎనిమిదేళ్లు
మూగు, చెవుడుతో కేవలం సైగల ద్వారానే తన హావాభావాలను తెలిపే గీత.. భారత్‌ నుంచి పాక్‌కు వెళ్లినప్పుడు ఎనిమిదేళ్ల వయసు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన గీత.. పాకిస్తాన్‌లోని లాహోర్‌ రైల్వేస్టేషన్‌లో దిగింది. అనాథగా తిరుగుతున్న గీతను కరాచీలోని ఈదీ ఫౌండేషన్‌ చేరదీసింది. అప్పటినుంచి గీత అక్కడే ఉంటోంది.
తండ్రి, సవతి తల్లి, తోబుట్టువులను గుర్తించిన గీత
గీత కుటుంబసభ్యులు భారత్‌కు చెందినవారని తెలియడంతో.. వారి ఆచూకీ కోసం దీర్ఘకాలంగా అన్వేషణ కొనసాగింది. బీహార్‌లో ఆమె కుటుంబాన్నిగుర్తించిన అధికారులు వారి ఫొటోను బాలికకు పంపించారు. తన తండ్రి, సవతి తల్లి, తోబుట్టువులను గీత గుర్తించింది. వారు తన కుటుంబసభ్యులేనని గీత సైగలతో తెలిపింది. దీంతో.. గీతను పాక్‌ నుంచి భారత్‌కు తీసుకువచ్చేందుకు అధికారులు అన్ని లాంఛనాలను పూర్తి చేశారు.
పాక్‌ నుంచి విమానంలో రానున్న గీత
ఈరోజు ఉదయం పాక్‌ నుంచి విమానంలో గీతను ఢిల్లీకి తీసుకురానున్నారు. గీతతో పాటు ఈదీ ఫౌండేషన్‌కు చెందిన నలుగురు సభ్యులు వస్తారు. ఆమె కుటుంబ సభ్యులను నిర్ధారించేందుకు భారత్‌ అధికారులు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తారు. వారే ఆమె కుటుంబ సభ్యులని పరీక్షల్లో స్పష్టమైతేనే.. వారికి అప్పగిస్తారు. లేదంటే గీత బాధ్యతను భారత ప్రభుత్వమే ఏదైనా స్వచ్చంద సంస్ధకు అప్పగించనుంది.
గీతకు డీఎన్‌ఏ పరీక్షలు
మరోవైపు గీత తమ కూతూరేనని డీఎన్‌ఏ పరీక్షల్లో స్పష్టంగా తేలుతుందని ఆమె తండ్రిగా భావిస్తున్న జనార్ధన్‌ మెహతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐదుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్న మెహతో.. గీతను తన మొదటి కూతురిగా చెబుతున్నారు. ఆమె అసలు పేరు హీరా అని.. ఓ జాతరకెళ్లినపుడు తన కూతురు తప్పిపోయిందంటున్నారు. ఇక పాక్‌ నుంచి వస్తున్న గీత.. తన తోబుట్టువులు, సవతి తల్లి కోసం గాజులు, దుస్తులు తీసుకువస్తోంది. ఎన్నాళ్లనుంచో అయినవారికి దూరంగా దేశం కాని దేశంలో బతుకుతున్న గీత.. కన్నవాళ్ల దగ్గరకు చేరుతుందో లేదో తేలాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. వాళ్లే గీత తల్లిదండ్రులైతే ఆమె కథ నిజంగా సుఖాంతమవుతుంది. 

07:43 - October 26, 2015

నెల్లూరు : బారాషాహిద్‌ దర్గా ఉత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం గంధమహోత్సవం. అర్ధరాత్రి ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవాన్ని చూడటానికి భక్తులు జాగారం చేశారు. ఊరేగింపుగా వచ్చిన ఈ గంధమహోత్సవాన్ని చూడటానికి అందరూ ఎదురు చూశారు. నెల్లూరు కోటమిట్టలోని అమినీయా మసీదులో పన్నెండు మంది ముస్లీం పెద్దలు కలిసి పన్నెండు బిందెలలో గంధాన్ని కలుపుకుని.. మేళతాళాల మధ్య కోలాహలంగా గంధాన్ని రాత్రి రెండు గంటల ప్రాంతంలో దర్గా దగ్గరకు తీసుకొచ్చారు.

 

07:40 - October 26, 2015

ఖమ్మం : చత్తీస్‌గడ్‌ సరిహద్దు ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం మారాయిగూడెం వద్ద సీఆర్పీఎఫ్‌ జవాన్లు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అశోక్‌జాట్‌ అనే జవాను మృతి చెందగా.. మరో జవాన్‌కు గాయాలయ్యాయి. హుటాహుటిన జవాన్‌ను భద్రాచలం ప్రభుత్వాస‌్పత్రికి తరలించారు. 

07:30 - October 26, 2015

గుంటూరు : నేడు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తుళ్లూరు మండలం మల్కాపురం, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లో పర్యటించనున్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వలేదనే కారణంతో.. మల్కాపురంలో దుండగులు దగ్ధం చేసిన చెరకు తోటను ఆయన పరిశీలించి.. రైతు చంద్రశేఖర్‌ను పరామర్శించనున్నారు. 

07:27 - October 26, 2015

విజయనగరం : జిల్లా ఇలవేల్పు, ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదేవత శ్రీపైడితల్లి అమ్మవారి సంబరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు రోజులపాటు జరిగే ఉత్సవాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో తొలిరోజు తొలేళ్ల ఉత్సవం జరగనుంది. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సిరిమాను ఉత్సవం రేపు నిర్వహించనున్నారు.
సిరిమాను ఉత్సవాలకు ముస్తాబైన విజయనగరం
విజయనగరం వాసుల కల్పవల్లి, చల్లని తల్లి పైడిమాంబ సిరిమాను ఉత్సవాలకు విజయనగరం ముస్తాబైంది. నేడు, రేపు జరిగే అమ్మవారి సంబరాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు తొలేళ్ల ఉత్సవం,.. రేపు ప్రధాన ఘట్టమైన సిరిమాను సంబరం జరగనుంది.
రైతులకు విత్తనాలు ఇవ్వనున్న పూజారి
ఇక అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల కోసం అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే, మంగళవారం జరిగే సిరిమాను సంబరాన్ని తిలకించేందుకు రోడ్డుకిరువైపులా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. తొలేళ్ల ఉత్సవంలో రాత్రి భక్తులు ఘటాలను ఊరేగింపుగా కోటకు తీసుకువెళ్తారు. అనంతరం వాటిని అమ్మవారి గుడికి ఎదురుగా ఉంచుతారు. అనంతరం ఆలయపూజారి రైతులకు విత్తనాలను పంచుతారు. భూమిని దున్నేటప్పుడు ఆ విత్తనాలను వేసి దున్నితో పంటలు బాగా పండుతాయని రైతుల విశ్వాసం.
మంగళవారం సిరిమాను ఉత్సవం
ఇక మంగళవారం అమ్మవారి సిరిమాను ఉత్సవం జరగనుంది. నెలరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో సిరిమాను ఉత్సవమే ప్రధాన ఘట్టం. సిరిమానుపై అమ్మవారి రూపంలో ఉన్న ప్రధాన పూజారి ఊరేగుతారు. సుమారు 40 అడుగులున్న చింతచెట్టును నిపుణులైన వడ్రంగిలు సిరిమానుగా మలుస్తారు. హుకుంపేటలో ఈ తంతును నిర్వహించారు. అమ్మవారి సిరిమాను ఉత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నుంచే కాకుండా, ఒడిశా, ఛత్తీస్‌గడ్‌, తెలంగాణల నుంచి భారీగా భక్తులు తరలివస్తారు.
నేటితో ముగియనున్న విజయనగర ఉత్సవ్‌ ఉత్సవాలు
మరోవైపు శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలకు తోడు.. ఈఏడాది విజయనగర ఉత్సవ్‌ కూడా నిర్వహిస్తుండటంతో పట్టణానికి మరింత శోభ వచ్చింది. ఈనెల 24 ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఇక అమ్మవారి సిరిమాను సంబరానికి మూడు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
పట్టణంలో సందడి
ఇక విజయనగరంలో రెండు ఉత్సవాలు ఒకేసారి రావడంతో పట్టణమంతా ఎక్కడా చూసినా సందడి వాతావరణం నెలకొంది. విద్యుద్ధీపాలంకరణలు, ఫ్లెక్సీలు, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పట్టణమంతా కోలాహలంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

 

07:19 - October 26, 2015

హన్మకొండ : వరంగల్ ఉప ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు ఆయన వైపే చూస్తున్నాయి. ఆయనతో సరే అనిపించేందుకు ఇరు పార్టీల్లో కీలక నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ ఉప ఎన్నిక రంగంలోకి దిగేందుకు ఆ నేత ఆసక్తి చూపకపోవడం... ఇరు పార్టీలకు తలనొప్పిగా మారింది. ఇంతకీ ఎవరా నేత... రాజకీయ పార్టీల వెంపర్లాట దేనికో తెలుసుకోవాలని ఉందా.. అయితే మీరే చూడండి.
పార్టీలకు సవాల్‌గా మారిన అభ్యర్ధి ఎంపిక
కడియం శ్రీహరి ప్రాతినిథ్యం వహించిన వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక రావడంతో.. ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని హంగులున్న నేతలను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. బరిలో ఉండాల్సిన నేతకు ఆర్ధికబలం.. అంగబలం ఉంటే చాలు.. పార్టీ పేరుతో విజయం సాధించడం సులువు అనే ఉంటుందన్న అభిప్రాయం అందరిలో ఉంటుంది. అయితే వరంగల్‌ ఉప ఎన్నికకు రంగంలోకి దించే అభ్యర్థులపై దృష్టి పెట్టిన రాజకీయ పార్టీలకు.. కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలకు అభ్యర్థి ఎంపిక సవాల్‌గా మారుతోంది.
ఇప్పటికే అభ్యర్ధిని ప్రకటించిన వామపక్షాలు
ఇప్పటికే వామపక్ష పార్టీలు తమ అభ్యర్థిని ప్రకటించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాయి. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తూ.. బలబలాలను బేరీజు వేస్తున్నాయి. ఎంపీ స్థానం కావడంతో.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేందుకు ఆ అభ్యర్థికి ఉన్న అర్హతలను పరిశీలిస్తున్నాయి.
ఒకే అభ్యర్ధి వైపు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ చూపు
అయితే.. తెలంగాణా రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఒకే అభ్యర్థిపై ఆశలు పెట్టుకున్నాయి. ఆయన సరే అంటే మిగిలిన తంతు పూర్తి చేయాలని భావిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎంపీ వివేక్‌పై అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వలవేసే పనిలో పడ్డాయి. వరంగల్ జిల్లా నేత కాకపోయినా.. వివేక్‌ను రంగంలోకి దించితే భారీ మెజార్టీతో స్థానాన్ని దక్కించుకోవచ్చని అధికార పక్షం భావిస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కూడా దాదాపు ఇదే అంచనాతో ఉంది. ఇటీవల జరిగిన దిగ్విజయ్‌సింగ్ పర్యటనలో కూడా ఇదే అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అధికార పక్షం తరపున పోటీ చేసేందుకు సై అనకపోతే.. కాంగ్రెస్ పార్టీ తరపున కూడా రంగంలోకి దిగరాదని గులాబి పార్టీ నేతలు వివేక్‌పై వత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
తప్పుడు సంకేతాలు వెళ్తాయని పోటీకి నిరాకరణ
తెలంగాణా కోసం కాంగ్రెస్‌ను వీడి కారెక్కిన వివేక్.. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తిరిగి సొంత గూటికి చేరారు. ఎన్నికల సమయంలో.. మరోసారి అధికార పార్టీ తీర్థం పుచ్చుకుని బరిలో దిగితే.. తప్పుడు సంకేతాలు వెళ్తాయనే యోచనతో ఆయన పోటీకి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతుండడంతో .. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇస్తున్నారే గానీ.. ఉపఎన్నికలో పోటీకి మాత్రం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలు రెండు వివేక్‌వైనే దృష్టి సారించడంతో.. జరిగే పరిణామాలపై అన్ని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

 

 

07:14 - October 26, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ చార్జీల‌ పెంపుపై రాష్ట్ర వ్యాప్త ఆందోళ‌న‌కు వైసీపీ సిద్ధమైంది. ఇటీవ‌ల కాలంలో ప్రజా స‌మ‌స్యల‌పై వ‌రుస‌ ఉద్యమాల‌తో హోరెత్తించిన జగన్ పార్టీ.. తాజాగా ఆర్టీసీ చార్జీల‌ పెంపుపై నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ముందు ఆందోళ‌న‌ల‌కు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాన ప్రతిప‌క్షం వ్యతిరేకిస్తోంది. పెంచిన చార్టీలు త‌గ్గించాలంటూ ఆందోళ‌న‌కు సిద్ధమ‌వుతున్నారు ఆ పార్టీ నేత‌లు. ఆర్టీసీ చార్జీల పెంపు తో సామాన్య ప్రజ‌ల న‌డ్డి విరిచే విధంగా ప్రభుత్వం వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని వైసీపి మండిప‌డుతుంది. త‌క్షణ‌మే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెన‌క్కు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తుంది వైసీపీ. లేక‌పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న కార్యక్రమాలు చేప‌డ‌తామ‌ని హెచ్చరించింది వైసీపి.
ఈనెల 26 న డిపోల ఎదుట ధర్నా
పెంచిన చార్జీలు వెంటనే త‌గ్గించాల‌ని వైసీపి ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. పెంచిన ఆర్టీసి చార్జీలు త‌క్షణ‌మే త‌గ్గించ‌క‌పోతే 26 న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి డిపోల మందు ఆందోళ‌న‌లు చేప‌డ‌తామ‌ని ఆ పార్టీ పిలుపునిచ్చింది. టిడిపి ప్రభుత్వం వ‌చ్చిన ప‌ద‌హారు నెల‌ల్లోనే చార్జీల పెంచ‌డం దారుణ‌మ‌న్నారు. ఎన్నిక‌ల ముందు చార్జీలు పెంచ‌మ‌ని ఆర్బాటంగా ప్రక‌టించిన చంద్రబాబు, ఇప్పుడు చార్జీలు పెంచ‌డం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మెత్తానికి ప్రత్యేక హోదా అంశంతో పాటు, సామాన్య ప్రజ‌ల‌కు సంబంధించిన ఆర్టీసి చార్జీల పెంపుద‌లపై ఆందోళ‌న‌లు ఉదృతం చేసేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. సోమ‌వారం ధ‌ర్నాల‌తో మెద‌ల‌య్యే ఈ ఆందోళ‌నా కార్యక్రమాలు మ‌రింత ఉదృతం చేసేలా ప్రణాళిక ర‌చిస్తోంది.

07:08 - October 26, 2015

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసిఆర్ మూడు రోజులు హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. పనిలో పనిగా రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల నిధుల మంజూరు విషయం పై ప్రధానితో పాటు.. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు.
మూడు రోజులపాటు పర్యటన
మూడు రోజుల పర్యటన నిమిత్తం సిఎం కేసిఆర్ ఢిల్లీ వెళ్ళనున్నారు. మూడు రోజు పాటు సాగే ఈ పర్యటనలో ప్రధానంగా నీతి ఆయోగ్ కార్యక్రమం లో పాల్గొననున్నారు. దీంతో పాటు ప్రధాని నరేంద్ర మోడిని కూడా కలసేందుకు ఆయన అపాయింట్ మెంట్ కూడా కోరారు. ఇతర కేంద్ర మంత్రులును సైతం సీఎం కలవనున్నారు.
గవర్నర్‌తో భేటీ అయిన సీఎం కేసీఆర్‌
ఢిల్లీ వెళ్లే ముందు సీఎం కేసిఆర్ రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన కొన్ని ముఖ్యమైన నామినేటేడ్ పోస్టుల భర్తికి గవర్నర్ అమోదం కోరినట్లు సమాచారం.
ఇరిగేషన్‌ పాలసీపై కేంద్ర మంత్రికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌
ఇది ఇలా ఉంటే ఢిల్లీ టూర్ లో ప్రధానంగా రాష్ట్రంలో ప్రకటించబోతున్న ఇరిగేషన్ పాలసీ పై కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి కి పవర్ ప్రాజెంటేషన్ సహాకారంతో వివరించాలని భావిస్తున్నారు. ఇక రాష్ట్రంలో నెలకొన్న కరువు, రైతు మరణాల పై కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలసి నిధులు కోరడంతో పాటు కరువు అంచాన వేసేందుకు బృందాలను పంపాలని కోరనున్నట్లు తెలిసింది. విభజన చట్టంలోని అంశాల పరిష్కారం, ఉద్యోగుల విభజన, తొమ్మిది, పదో షెడ్యుల్ లోని కార్పోరేషన్లు, సంస్ధలు వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోడిని కోరనున్నట్లు సమాచారం. చండీ యాగానికి కూడా ప్రధానిని ఆహ్వానించనున్నట్లు సమాచారం. మొత్తానికి మూడు రోజుల పర్యటనలో రాష్ట్రానికి రావాల్సిన వివిధ శాఖల గ్రాంట్స్ తో పాటు ఇతర రాజకీయ పరమైన అంశాల పై హస్తిన నేతలతో సమావేశం కానున్నారు సీఎం. అలగే వచ్చే నెలలో తాను చేపట్టనున్న చండీ యాగానికి కూడా ప్రధానిని ఆహ్వానించనున్నట్లు సమాచారం.

 

జమ్మూకాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులు

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు పాల్పడింది. హీరానగర్, కతువా, రాంఘర్ ప్రాంతాల్లో కాల్పులు జరిపింది. పాక్ బలగాల కాల్పుల్లో పులువురు గ్రామస్తులకు గాయాలు అయ్యాయి.  

నేటి నుంచి భారత్, ఆఫ్రికా సదస్సు

ఢిల్లీ : నేటి నుంచి భారత్, ఆఫ్రికా సదస్సు జరుగనుంది. భారత్ లో తొలి భారీ అంతర్జాతీయ కార్యక్రమం నాలుగు రోజులపాటు జరిగే సదస్సుకు 54 దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇంధనం, వాణిజ్య రంగాల్లో సహకారం పెంపునకు కృషి.

 

నేడు సీఎం కేసీఆర్ ఢిల్లీ పయనం

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో మకాం వేయనున్నారు. నీతి అయోగ్ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొననున్నారు. చండీయాగానికి ప్రధాని మోడీని ఆహ్వానించనున్నారు. 

Don't Miss