Activities calendar

28 October 2015

'జనసేన'కు రాజకీయ పార్టీగా గుర్తింపు

హైదరాబాద్ : పవన్ కల్యాన్ 'జనసేన'కు రాజకీయ పార్టీగా గుర్తింపు లభించింది. జనసేన పార్టీని నమోదు చేసుకున్నట్లు తెలంగాణ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

17:31 - October 28, 2015

హైదరాబాద్ : దీపావళి పండగ సందర్భంగా పటాకులు కాల్చడంపై నిషేధం విధించడాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే టపాసులు కాల్చడం వల్ల పర్యవరణానికి ముప్పు కలిగే అంశంపై ప్రజలను జాగృతి చేయాలని సూచించింది. రాత్రి పది గంటల తర్వాత పటాకులు కాల్చకుండా చూడాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 12 వరకు పటాకుల వల్ల జరిగే అగ్నిప్రమాదాల్లాంటి నష్టాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఢిల్లీలో పటాకులు కాల్చడం వల్ల పలు వ్యాధులు సంభవిస్తున్నాయంటూ దీనిపై నిషేధం విధించాలని కోరుతూ ముగ్గురు పిల్లలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

17:29 - October 28, 2015

విజయవాడ :తల్లిదండ్రుల వేధింపులతో మృతిచెందిన కృపారాణి కుటుంబాన్ని పరామర్శించారు మంత్రి పీతల సుజాత.. కృపామణి ఆత్మహత్య కేసు సీఎం దృష్టికివెళ్లిందని ఆమె భర్త పవన్‌ కుమార్‌కు వివరించారు.. ఆత్మహత్యకు కారణమైనవారిని పట్టుకుని కఠినంగా శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.. అటు ఈ కేసును తణుకులోనేఉండి కేసును ఎస్‌పీ భాస్కర్ భూషణ్ పర్యవేక్షిస్తున్నారు .. 

17:26 - October 28, 2015

హైదరాబాద్ : ఏపీలో కేవలం 196 మండలాలను కరువు మండలాలుగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ.. ఎన్నడూలేనివిధంగా కృష్ణా డెల్టా జిల్లాల్లో నీరులేక రైతులు రోడ్డెక్కుతున్నారని ఆరోపించారు.. 365మండలాల్లో కరవుందని గతంలో మంత్రి ప్రత్తిపాటి ప్రకటించారని గుర్తుచేశారు.. ఇప్పుడు ఆ సంఖ్య 196కు ఎలా వస్తుందని మండిపడ్డారు..

17:24 - October 28, 2015

పశ్చిమగోదావరి : తుందుర్రు గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఫుడ్‌పార్క్‌వల్ల 70 గ్రామాల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. భీమవరంలో జరుగుతున్న ఏపీ కౌలు రైతుల సంఘం ప్రథమ మహాసభలో అన్నారు. భీమవరం వేదికగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలు రెండో రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలకు పెద్ద సంఖ్యలో కౌలురైతులు తరలివచ్చారు.  ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..పచ్చని పంటపొలాలతో పాటు జంతువులకు నష్టం వాటిల్లే ప్రమాదముందని... వెంటనే ఫుడ్‌పార్క్‌ నిర్మాణాన్ని ఆపాలని మధు డిమాండ్ చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించకపోతే... నవంబర్‌ 20 తర్వాత ప్రత్యక్షంగా అడ్డుకుంటామని. హెచ్చరించారు.

17:20 - October 28, 2015

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలకిచ్చిన వాగ్దానాలనే తమ ప్రచారాస్త్రాలుగా వాడుకుంటామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి అన్నారు. నవంబర్‌2న తమ ఉమ్మడి అభ్యర్థి గాలి వినోద్‌కుమార్‌ నామినేషన్‌ వేస్తారని చాడా ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన గాలి వినోద్‌కుమార్‌..ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారని చాడా అన్నారు. 

టి.సర్కార్ పై దత్తన్న విమర్శలు..

వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ పలు విమర్శలు చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పుతోందని..కేసీఆర్ కు రైతు కుటుంబాలను పరామర్శించే తీరిక లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో టీఆర్ఎస్ విఫలం చెందిందని, కేంద్రం నిధులను ఎలా వాడుకోవాలో కేసీఆర్ కు తెలియదని దత్తాత్రేయ విమర్శించారు. 

బంగాళాఖాతంలో అల్పపీడనం..

విశాఖపట్టణం : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో దక్షిణ కోస్తా జిల్లాలోని చాలా చోట్ల..ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

ఆటో బోల్తా : ఇద్దరి మృతి

కర్నూలు :ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించడానికి ప్రయత్నించిన ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఓ వ్యక్తితో పాటు చిన్నారి మృతిచెందింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా అవుకు మండలం మెట్టుపల్లి గ్రామ సమీపంలో బుధవారం జరిగింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న బాల చెన్నారెడ్డి(55)తో పాటు రెండేళ్ల చిన్నారి మృతిచెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రెవెన్యూ అధికారులతో బాబు సమీక్ష..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మీ ఇంటికి - మీ భూమి కార్యక్రమంపై చర్చ జరిగింది.

 

జగిత్యాలలో వ్యక్తి దారుణ హత్య

కరీంనగర్ : జగిత్యాల మండలం చల్ గల్ బస్టాండ్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బస్టాండ్ వద్ద నిలిచి వున్న వ్యక్తిని కారులో వచ్చిన దుండగులు గొంతు కోసం పరారయ్యారు. మృతుడిని జగిత్యాల గోవిందపల్లికి చెందిన రాకేష్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి,విచారణ చేపట్టారు.

సీఎం చంద్రబాబు ను కలిసిన ఐసీసీ ఛైర్మన్

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ భేటీ అయ్యారు. విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో వీరి సమావేశం జరిగింది. అనంతరం శ్రీనివాసన్ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు తనను ఆహ్వానించారని తెలిపారు. మర్యాద పూర్వకంగానే చంద్రబాబును కలిశానని చెప్పారు. ఏపీలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీని తెలిపారు. నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. 

గార్లలో భారీగా పేలుడు పదార్థాల పట్టివేత

ఖమ్మం: జిల్లాలోని గార్లలో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు పట్టుకున్నారు. ఓ ట్రాక్టర్‌లో తరలిస్తున్న 137 జిలెటిన్ స్టిక్స్, 152 డిటోనేటర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఏపీలో పారిశుధ్యంపై దృష్టి - స్పీకర్ కోడెల..

విజయవాడ : ఏపీలో పారిశుధ్యంపై దృష్టి కేంద్రీకరించడం జరిగిందని ఏపీ స్పీకర్ కోడెల తెలిపారు. సామాజిక అభివృద్దికి వ్యాపార, పారిశ్రామిక వేత్తలు సహకరించాలని, రాష్ట్రాన్ని స్వచ్చ ఆంధ్రగా తయారు చేస్తామని హామీనిచ్చారు. 

ఎస్టీ సబ్ ప్లాన్ వెబ్ సైట్ ప్రారంభించిన రావెల..

హైదరాబాద్ : ఎస్టీ సబ్ ప్లాన్ వెబ్ సైట్ ను ఏపీ మంత్రి రావెల ప్రారంభించారు. రాజధాని నిర్మాణం వల్ల ఉపాధి కోల్పోతున్న ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపుతున్నామని రావెల పేర్కొన్నారు. మురికివాడల్లో సమస్యల పరిష్కారానికి రూ.600 కోట్లు అవసరమౌతాయని అంచనా వేసినట్లు తెలిపారు.

 

మాడ అంత్యక్రియలు పూర్తి..

హైదరాబాద్ : అనారోగ్యంతో కన్నుమూసిన హాస్యనటుడు మాడ వెంకటేశ్వరరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. రాయదుర్గంలోని మహాప్రస్తానంలో ఆయన నలుగురు కుమార్తెలు అంత్యక్రియలు నిర్వహించారు. వారం కిందట ఆయన తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉన్న ఆయన కుటుంబసభ్యులు రాక ఆలస్యం కావడంతో మాడ భౌతికకాయాన్ని అపోలో ఆసుపత్రిలో భద్రపరిచారు. 

ఆందోళన విరమించిన పూణే విద్యార్థులు..

పూణే : గత 139 రోజులుగా ఆందోళన చేస్తున్న పూణే విద్యార్థులు బుధవారం శాంతించారు. ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఫిలిం ఇనిస్టిట్యూట్ ఛైర్మన్ గా నియమితులైన గజేంద్ర చౌహాన్, మరో నలుగురికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

 

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ లు..

ముంబై : బుధవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 213 పాయింట్లు నష్టపోయి 27,040 పాయింట్ వద్ద ముగియగా నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 2,171 వద్ద ముగిసింది. 

హైదరాబాద్ బయలుదేరిన సీఎం కేసీఆర్..

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. కొద్దిసేపటి క్రితం ఆయన హైదరాబాద్ కు బయలుదేరారు. 

16:04 - October 28, 2015

హైదరాబాద్: డయాబెటిస్ వ్యాధితో తీవ్ర బాధను అనుభవిస్తున్న ఓ బాలికను తెలంగాణ సి.ఎం.ఓ కార్యదర్శి స్మిత సబర్వాల్ పరామర్శించారు. కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన సిగిరి కళావతి, ప్రమోద్ కుమార్తె నిహారిక అతి చిన్నవయస్సులోనే డయాబెటిస్‌ వ్యాధి సోకడంతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటోంది. నిహారిక ఇంటర్ లో 908 మార్కులను సాధించింది. తల్లిదండ్రులు పేదవారు కావడంతో పాటు తీవ్రమైన ఆరోగ్యసమస్యలు ఎదురవ్వడంతో నిహారిక చదువు అపివేయించారు. ఈ నేపథ్యంలోనే సి.ఎం.ఓ కార్యదర్శి స్మిత సబర్వాల్ ను చూడాలని ఉందని నీహారిక మేక్ ఎ విష్ స్వచ్ఛంద సంస్థను కోరింది. దీంతో సదరు సంస్థ సి.ఎం.ఓ కార్యదర్శి ని పెగడపల్లి లో ఉంటున్న నిహారిక ఇంటికి ఆహ్వానించారు. పెగడపల్లికి చేరుకున్న స్మిత సబర్వాల్ కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు... సుమారు గంట పాటు నిహారికతో గడిపిన స్మిత సబర్వాల్ ఆ బాలికను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకునేల చూస్తాం అని హామీ ఇచ్చారు.

16:02 - October 28, 2015

విశాఖ : ముగ్గురు పిల్లలకు విషమిచ్చి.. తానూ ఆత్మహత్యకు పాల్పడ్డ గౌరీ శంకర్ అనే తండ్రిఆత్మహత్యకు పాల్పడ్డాడు ముగ్గురు పిల్లలు సహా తండ్రి గౌరీ శంకర్ మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందువల్లే ఈఘటనకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాధ ఛాయలు అలముకున్నాయి.

15:58 - October 28, 2015

హైదరాబాద్‌ : కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలో గుడిసెల కూల్చివేత ఉద్రిక్తంగా మారింది.. మూడో ఫేజ్‌లో కొన్నేళ్లుగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు స్థానికులు.. వీటిని జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసుల సహాయంతో కూల్చివేశారు.. దీంతో ఆగ్రహించిన స్థానికులు అధికారుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు.. ఇరవై ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని.. తమకు ఇళ్లు కట్టిస్తామని నేతలు హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు.. ఉన్నఫళంగా వెళ్లిపోమంటే తాము ఎక్కడివెళ్లాలని వాపోయారు..

15:57 - October 28, 2015

మహబూబ్‌నగర్‌ :అత్యాధునిక టెక్నాలజీతో మాస్‌ కాపీయింగ్ చేస్తూ అడ్డంగాదొరికిపోయాడు ఓ విద్యార్థి.. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌కుచెందిన విద్యార్థి స్మార్ట్ వాచీతో పరీక్షాకేంద్రానికి వచ్చాడు.. పదే పదే వాచీ చూడటంతో సందేహంవచ్చిన అధికారులు ఆ గడియారాన్ని పూర్తిగా పరిశీలించి ఆశ్చర్యపోయారు.. మామూలు వాచీలాగేఉన్నా అందులో సమాధానాలు స్పష్టంగా కనిపించడంచూసి అవాక్కయ్యారు.. ఈ కాపీయింగ్ విషయాన్ని అధికారులు యూనివర్శిటీ దృష్టికి తీసుకెళ్లారు..

బాలకృష్ణపై బీజేపీ ఎమ్మెల్సీ విమర్శలు..

కాకినాడ : హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పలు విమర్శలు చేశారు. ప్రత్యేక హోదాపై అవగాహన లేకుండా బాలకృష్ణ మాట్లాడుతున్నారని, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని సూచించారు. 

బాబుతో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు…

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో క్యాంపు కార్యాలయంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులపై సీఎంతో చర్చించడం జరిగిందని శ్రీనివాసన్ పేర్కొన్నారు.

 

15:54 - October 28, 2015

నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యల కలకలం మొదలైంది. తాజాగా నల్గండ జిల్లా మోత్కూరు మండల కేంద్రానికి చెందిన జోగు భాస్కర్‌ అనే చేనేత కార్మికుడు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేనేత వృత్తినే నమ్ముకున్న భాస్కర్‌ ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గం లేక మానసిక ఆందోళనతో ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.

హబ్సిగూడలో హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు..

హైదరాబాద్: నగరంలోని హబ్సిగూడలో హుక్కాసెంటర్లపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు దాడులు చేశారు. ఈ సోదాల్లో పోలీసులు 15 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.

15:49 - October 28, 2015

ఢిల్లీ : వరంగల్ జిల్లా అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్‌ను కలిశానని టీటీడీపీ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి తెలిపారు. ఆమె బుధవరం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను గుండు సుధారాణి కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మా భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు నన్ను ఆకర్షించాయి. వరంగల్‌ను స్మార్ట్‌సిటీగా చేస్తానన్నందుకు కేసీఆర్‌కు మా ధన్యవాదాలు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాలతో రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.  టీఆర్‌ఎస్‌లో చేరే విషయంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేస్తూ..త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.  అయితే గుండు సుధారాణి టీఆర్ఎస్ లో చేరబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అరగంట పాటు కేసీఆర్ తో భేటీ అయ్యారు. తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని చెబుతున్నప్పటికీ అనధికారికంగా టిఆర్ ఎస్ లో చేరినట్లు గుస గుసలు వినపడుతున్నాయి.

15:33 - October 28, 2015

హైదరాబాద్ : 2016 సంవత్సరానికి గాను వ్యాపార అనుకూల దేశాల ర్యాంకింగ్‌ లిస్ట్‌ను వరల్డ్‌బ్యాంక్‌ విడుదల చేసింది. మొత్తం 189 దేశాలను ఇందులో తీసుకోగా.. భారత్‌ 12 స్థానాలు ఎగబాకి 130వ స్థానానికి చేరింది. 2015లో భారత్‌ 142వ స్థానంలో నిలిచింది. వ్యాపార అనుకూల దేశాల్లో సింగపూర్‌ మొదటి స్థానంలో ఉండగా.. న్యూజిల్యాండ్‌ రెండవస్థానంలో .. డెన్మార్క్‌ మూడవ స్థానంలో.. సౌత్‌ కొరియా నాలుగో స్థానంలో.. హాంగ్‌కాంగ్‌ ఐదో స్థానంలో నిలిచాయి. ఇక ఆరోస్థానంలో బ్రిటన్‌, ఏడవ స్థానంలో యూఎస్‌ ఉన్నాయి. చైనా 84వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 90వ స్థానంలో ఉన్న చైనా 6 స్థానాలు మెరుగుబరుచుకుని 84వ స్థానానికి చేరింది. పాకిస్తాన్‌ 138వ స్థానంలో ఉంది. గత ఏడాది 128 స్థానంలో ఉన్న పాక్‌ 10 స్థానాలు వెనక్కి వెళ్లింది. వ్యాపార అనుకూల దేశాలలో భారత్‌ మెరుగుపడుతుందని ప్రపంచబ్యాంకు ప్రధాన ఆర్థిక వేత్త కౌషిక్‌ బసు అభిప్రాయపడ్డారు.

ముగ్గురు చిన్నారులకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య..

విశాఖపట్టణం : కొయ్యూరు (మం) మట్టం భీమవరంలో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తండ్రి గౌరీశంకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి, దుర్గాప్రసాద్ (7), సాయి (5)లు ఉన్నారు. 

టిడిపిపై అసంతృప్తి లేదు - సుధారాణి..

ఢిల్లీ : టిడిపిపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, సీఎం కేసీఆర్ తో భేటీకి ఎలాంటి రాజకీయ కారణం లేదని టిడిపి రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి పేర్కొన్నారు. కేసీఆర్ తో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, అభినందనలు తెలిపేందుకు కేసీఆర్ ను కలిసినట్లు చెప్పారు. 

మోడీకి మమత లేఖ..

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బుధవారం లేఖ రాశారు. రాష్ట్ర అభివృద్ధికి రూ. 3000కోట్లు విడుదల చేయాలని కోరారు. 

రేపు నగరానికి దిగ్విజయ్ సింగ్..

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గురువారం నగరానికి రానున్నారు. రేపు మధ్యాహ్నాం 12గంటలకు గాంధీ భవన్ లో వరంగల్ జిల్లా నేతలతో భేటీ కానున్నారు. వరంగల్ లోక్ సభ అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నేతలతో దిగ్విజయ్ భేటీ కానున్నారు. 

ముగిసిన కేసీఆర్.. గుండు సుధారాణి భేటీ..

ఢిల్లీ : సీఎం కేసీఆర్ తో టిడిపి ఎంపీ గుండు సుధారాణి జరిపిన భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. టీఆర్ఎస్ లో చేరనున్న నేపథ్యంలో కేసీఆర్ తో సుధారాణి ఈ భేటీ జరిపారు. 

కేసీఆర్ హామీలు మరిచారు - సీపీఐ..

వరంగల్ : సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలను మరిచారని, ఇచ్చిన హామీలే తమకు ప్రచార అస్త్రాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తున్నారని, కమీషన్ల కోసమే ప్రాజెక్టుల డిజైన్ మారుస్తున్నారని విమర్శించారు. 

భార్యను గొడ్డలితితో నరికి చంపిన భర్త

అనంతపురం: రాయదుర్గం మండలం కెంచానపల్లిలో ఓ కుటుంబం నివాసముంటోంది. కుటుంబంలో రేగిన కలహాలతో భార్యపై భర్త కక్ష పెంచుకున్నాడు. మంగళవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో మద్యం మత్తుల్లో ఉన్న భర్త భార్యను విచక్షణరహితంగా గొడ్డలితో నరికి చంపాడు. పక్కనే నిద్రిస్తున్న కుమారుడు అరవింద్‌పైన కూడా దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

14:58 - October 28, 2015

కరీంనగర్‌ :నగరంలోని  బైపాస్‌రోడ్డులో దుండగులు రెచ్చిపోయారు.. తనిఖీలు చేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులపైనుంచి లారీ నడిపారు.. ఈ రోడ్డుపై ముగ్గురు అధికారుల తనిఖీలు చేస్తున్నారు.. వీరు ఆపమని చెప్పినా ఓ పత్తి లారీ డ్రైవర్ అలాగే వాహనం ముందుకు పోనిచ్చాడు.. ఈ వాహనాన్ని అధికారులు చేజ్ చేసి ముందుకువెళ్లి ఆగారు.. అయినా లారీ ఆపని డ్రైవర్ అదేవేగంతో పోనివ్వడంతో ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు.. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు..

బయ్యారం వద్ద పేలుడు పదార్థాలు..ఇద్దరు అరెస్టు..

ఖమ్మం : బయ్యారం వద్ద అక్రమంగా తరలిస్తున్న 100 జిలెటిన్ స్టిక్స్, 200 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని బయ్యారం పోలీసులు అరెస్టు చేశారు.

 

మంత్రి కామినేని కాన్వాయ్ ను అడ్డుకున్న ప్రజలు..

గుంటూరు : వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మంత్రి కామినేని కాన్వాయ్ ను ప్రజలు అడ్డుకున్నారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత తీర్చాలని సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో ప్రజలు అడ్డుకున్నారు.

14:54 - October 28, 2015

హైదరాబాద్ : రాబోయే కొత్త బడ్జెట్‌ కోసం తెలంగాణ ఆర్ధిక శాఖ కసరత్తు మొదలుపెట్టింది. గతేడాది టార్గెట్స్‌.. తాజా టార్గెట్స్‌పై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. పాత నిబంధనలన్నీ మార్చి.. కొత్త రూల్స్‌ అమలుచేయాలని ఆర్ధిక శాఖ భావిస్తోంది. మరోవైపు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అన్ని అకౌంట్లను ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ చేసేలా ఆర్ధికశాఖ దృష్టి సారించింది.

కొత్త బడ్జెట్‌పై ప్రతిపాదనలకు .....

కొత్త బడ్జెట్‌పై ప్రతిపాదనలకు తెలంగాణ సర్కార్‌ రెడీ అయ్యింది. సచివాలయంలోని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో ఆర్ధికశాఖ స్పెషల్‌ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర సమావేశమయ్యారు. రాబోయే బడ్జెట్‌ ప్రతిపాదనలన్నీ వాస్తవంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రతి శాఖలో అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు.

ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో రూల్స్‌ మార్పు .....

ఇక ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లోని రూల్స్‌ను మార్చాలని డిసైడ్‌ అయ్యారు. నిధుల విడుదలలో జాప్యం జరుగుతుందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా నవంబర్‌ 9 నుంచి ప్రభుత్వ పథకాల ఖాతాలన్నీ ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ చేయాలని నిర్ణయించారు.

ఉమ్మడి రాష్ట్రంలో అప్పులు రూ.1,66,512 కోట్లు ........

ఇక సమావేశంలో.. రాష్ట్రంలోని ఆస్తులు, అప్పులపై ప్రధానంగా చర్చ జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం లక్షా 66 వేల 512 కోట్ల అప్పులో.. లక్షా 48 వేల 60 కోట్ల అప్పులను విభజన చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా విభజించాల్సిన 18 వేల 462 కోట్ల అప్పులను త్వరలోనే విభజించనున్నట్లు తెలిపారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి 69 వేల కోట్ల అప్పులు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయం.......

రాబోయే బడ్జెట్‌ వాస్తవికంగా ఉండేలా ఆర్ధికశాఖ ప్లాన్‌ చేస్తోంది. ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయాలను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. గత ఐదేళ్ల నుంచి కొనసాగుతున్న పథకాలను కేంద్రం ఆదేశాల మేరకు ప్రణాళికేతర వ్యయం కింద చేర్చే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. ఇక బడ్జెట్‌ ప్రతిపాదనలకు ఇప్పటినుండే కసరత్తు మొదలుపెట్టాలని ఆర్ధికశాఖ అన్ని శాఖలకు సూచించింది. గతేడాది కంటే ఈసారి బడ్జెట్‌ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరిగేషన్‌, విద్య, డబుల్‌ బెడ్‌రూమ్‌, పంచాయతీరాజ్‌, రోడ్లు, భవనాలు, ఆరోగ్యం, వ్యవసాయంతో పాటు సంక్షేమ రంగాలకు సర్కార్‌ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇదిలా ఉంటే.. కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం చేసే ఆర్ధిక సాయం విషయంలో క్లారిటీ వస్తుందని.. దానిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ అంచనా వేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైనా గొప్పలకు పోయి కష్టాలు కొని తెచ్చుకోవద్దని ఆర్ధికశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

14:51 - October 28, 2015

హైదరాబాద్ : వరంగల్‌ ఉపఎన్నికలో గాలి వినోద్‌కుమార్‌ను గెలిపించడమంటే.. లౌకిక ప్రజాస్వామిక శక్తులను గెలిపించడమే అవుతుందన్నారు తమ్మినేని వీరభద్రం. 17 నెలలుగా కేసీఆర్‌ సాగిస్తున్న నిరంకుశ పాలనకు ఈ ఎన్నిక ఓ హెచ్చరిక అవుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కేసీఆర్‌ సర్కార్‌ అమలు పరచలేదని విమర్శించారు. 

14:49 - October 28, 2015

హైదరాబాద్ : ఎవరైతే విజయవాడ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారో వారినే అక్కడికి పంపాలన్నారు ఏపీ ఉద్యోగుల సంఘం నేత మురళికృష్ణ. మిగతా ఉద్యోగులు జూన్‌లో వస్తామని సీఎస్‌కు చెప్పినట్లు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఉద్యోగులతో సమావేశమై అందరి అభిప్రాయాలు సేకరించి..సీఎం చంద్రబాబుకు సమర్పిస్తామన్నారు. 

14:46 - October 28, 2015

హైదరాబాద్ : అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లివచ్చిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రవర్తనలో మార్పు వచ్చిందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఓటుకు నోటు, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అటకెక్కించారన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్‌ పోలవరం ప్రాజెక్టు ముంపు, బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి ఎందుకు మాట్లాడటం లేదని పొంగులేటి ప్రశ్నించారు. ఖమ్మం ప్రజల గురించి పట్టించుకోవడం లేదన్నారు. వరంగల్‌ ఉపఎన్నికల్లో అన్ని పార్టీలు ఒక్కటై కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేయాలని చూస్తున్నాయని పొంగులేటి ఆరోపించారు. 

14:44 - October 28, 2015

హైదరాబాద్ : పసి పిల్లలపై లైంగిక వేధింపులు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. లైగింక వేధింపులకు గురైన చిన్నారులకు ఎలాంటి చట్టాలు ఉన్నాయి. అంతే కాకుండా కుటుంబ పరమైన సమస్యలకు సలహాలు, సూచనలు - సమాధానాలను 'మై రైట్' కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పార్వతి తెలియజేశారు. శ్రోతలు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం తెలిపారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

13:58 - October 28, 2015

హైదరాబాద్ : పైరసీ భూతాన్ని అందరం కలిసి తరిమికొడదామని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. టాలీవుడ్‌ ప్రముఖులతో సమావేశమైన మంత్రి.. ఆన్‌లైన్‌ పైరసీ సమస్యపై చర్చించారు. పైరసీ జరుగుతున్న తీరును మంత్రికి.. సినీ పెద్దలు సురేష్‌బాబు తదితరులు వివరించారు.  

13:56 - October 28, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ర్టాల్లో సంచలనం కలిగించిన ఓటుకు నోటు కేసు, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులు ఇప్పుడు ఏమయ్యాయి. ఇద్దరు సీఎంలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు చట్టం ముందు నిందితులుగా విచారణ ఎదుర్కోవలసి వస్తుందన్న.. కేసుల దర్యాప్తు ఏమైంది. ఇద్దరు సీఎంల కలయికతో కేసులు మరుగునపడ్డాయా...? ఇద్దరు ఎమ్మెల్యేల అరెస్టుతోనే ఓటుకు నోటు కేసు మమ అనిపిస్తారా...? రాజకీయ సమీకరణలు మారిపోవడంతో దర్యాప్తు తీరు కూడా మరుగున పడిందా...? ప్రస్తుతం తెలుగు రాష్ర్టాల సీఎంల మధ్య కుదిరిన సయోధ్యతో కేసులు మరుగున పడినట్లుగానే కనిపిస్తోంది.
ఓటుకు నోటు కేసు సంచలనం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బు ఎరచూపి 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇస్తున్నారన్న ఆరోపణపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేయడంతో ఒక్కసారిగా సంచలనం రేగింది. దర్యాప్తులో భాగంగా ఖమ్మం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను కూడా అరెస్టు చేశారు. ఈకేసుతో సంబంధం ఉందని మరో ఐదుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. 5 కోట్లకు స్టీఫెన్‌సన్‌తో బేరం కుదుర్చుకుని 50 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చారని ఎసిబి ఛార్జిషీటులో స్పష్టం చేసింది. ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో పాటు ఓ కేంద్రమంత్రికి, మరికొందరు ఎంపీలకు నోటీసులు ఇచ్చి విచారిస్తారని ప్రచారం జరిగింది.
కౌంటర్‌గా ఏపీ సిఐడి ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నమోదు
ఓటుకు నోటు కేసుకు కౌంటర్‌గా ఏపీ సిఐడి ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును నమోదు చేసింది. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబునాయుడితో పాటు పలువురి ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్‌ చేసిందని సీఐడి అధికారులు కేసులు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో నమోదైన కేసులన్నీ ఒకేసారి పరిశోధించి పూర్తి స్థాయిలో కేసు నమోదు చేయడానికి వీలుగా సిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కేసులో తెలంగాణ సిఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా విచారించే అవకాశం ఉందని ఊహాగానాలు రేగాయి. దీంతో తెలుగురాష్ర్టాల మధ్య రాజకీయ వివాదాలు ముదిరిపోయాయి. రెండు ప్రభుత్వాలకు చెందిన దర్యాప్తు సంస్థలు దూకుడుగా దర్యాప్తును సాగించడంతో ఉత్కంఠతకు దారితీసింది. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరుగుతున్న వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం రంగంలోకి దిగిందని... కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నాలు చేశారని ప్రచారం జరిగింది.
స్థబ్దుగా ఉన్న దర్యాప్తు సంస్థలు
ఈ హంగామా జరిగి 5 నెలలు గడిచిపోయింది. రెండు నెలలుగా దర్యాప్తు సంస్థలు ఈ అంశాలపై స్థబ్దుగా ఉన్నాయి. కేంద్రం, రాష్ర్ట గవర్నర్‌ జోక్యంతో ఇద్దరు సీఎంలు ఒక అవగాహనకు వచ్చారని ప్రచారం జరిగింది. దీనికి అనుగుణంగానే ఏపీ ప్రతిపాదిత రాజధాని అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రాన్ని చంద్రబాబు స్వయంగా సీఎం కేసీఆర్‌ ఇంటికి వెళ్లి ఇచ్చి ఆహ్వానించారు. కేసిఆర్‌ కూడా అమరావతిలో జరిగిన కార్యక్రమానికి వెళ్లి వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరు సీఎంలు అప్యాయంగా పలకరించుకున్నారు. దర్యాప్తు సంస్థలు తమ దూకుడును తగ్గించడం, సీఎంలు ఇద్దరు ఒకరితో మరొకరు సన్నిహితంగా మెలగడంతో రాజకీయ వైరం తగ్గిందని రాజకీయ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ సమీకరణలు మారిపోవడంతో ఆ ప్రభావం ఓటుకు నోటు, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులపై చూపించిందని స్పష్టమవుతోంది. ఈ విషయంపై రెండు రాష్ర్టాల దర్యాప్తు సంస్థలు వివరణ ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఈ రెండు కేసులు మరుగున పడినట్లుగా భావిస్తున్నారు. ఇదే తరుణంలో ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉండి తెలంగాణ ఏసీబీ అధికారులకు కనిపించకుండా తిరుగుతున్న జెరుసలేం మత్తయ్య హైదరాబాద్‌కు తిరిగి చేరుకున్నారు. వరుసగా జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ఈ రెండు కేసులు ఇక మరుగున పడినట్లేనని తెలుస్తోంది.

 

13:51 - October 28, 2015

కరీంనగర్ : వరకట్నం తీసుకోవడం నేరం..ఇది పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అన్న క్యాప్షన్‌లా మారిపోయింది. ప్రమాదమని తెలిసినా పొగరాయుళ్లు పొగ తాగడం మానరు. కట్నం తీసుకోవడం నేరమని తెలిసినా...ఆ భయం ఎక్కడా కనిపించదు. ఇప్పటివరకు కట్నం తీసుకోవడమే విన్నాం... కానీ వెనక్కి ఇచ్చేయడం ఎక్కడైనా చూశారా...? కరీంనగర్‌ జిల్లాలోని ఓ గ్రామం కట్నం వాపస్‌ చేసేందుకు ముందుకొచ్చింది.
మహిళ పాలిట శాపంగా మారిన వరకట్నం
ఆడపిల్లల బాగోగులు కోరే కన్నవారిచ్చే స్త్రీ ధనం వారి పాలిట శాపంగా మారుతోంది. కట్నం కోసమే కొడుకును కన్నామన్నట్లుగా ప్రవర్తించే అత్తామామలు.. కాసుల కోసమే నిన్ను కట్టుకున్నాననే మొగుళ్లు.. అమ్మాయిలను కాల్చుకుతింటున్నారు. ఫలితంగా మూడు ముళ్ల బంధం ముళ్లబాటగా మారుతోంది. మెట్టినింటి ఆరళ్లకు కాళ్ల పారాణి కూడా ఆరక ముందే ఆడపడుచులు కాటికి పయనమవుతున్నారు. ఇలా వరకట్న దాహానికి ఎందరో మహిళలు బలైపోతున్నారు. నిత్యం ఎక్కడో చోట వెలుగుచూస్తున్న దారుణాలు కన్నవారిలో కలవరం రేపుతున్నాయి. వరకట్నాన్ని నియంత్రించేందుకు చట్టాలేవా అంటే ఎందుకు లేవు చాలానే ఉన్నాయి. డబ్బున్న వాడికి అవి చుట్టాలుగా మారుతున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. వరకట్నాన్ని నిషేధించాలని నేతలు మైకుల తుప్పు వదిలేలా లెక్చర్లు దంచుతారు. కానీ ఆచరణలో మాత్రం మచ్చుకైనా కనిపించదు.
వరకట్న భూతాన్ని తరిమేసేందుకు యత్నం
కరీంనగర్ జిల్లాలో బుద్ధ పరిశోధన అభివృద్ధి సంస్థ... వరకట్నం నియంత్రించాలని అందరిలా మాటలు చెప్పలేదు. విజయానికైనా, అపజయానికైనా ఒక్క అడుగే తేడా ఉంటుంది. ఆ ఒక్క అడుగు బుద్ధ పరిశోధన అభివృద్ధి సంస్థ ముందుకు వేసింది. వరకట్న భూతాన్ని తరిమేసేందుకు తన వంతు ప్రయత్నం చేసింది. చిగురుమామిడి మండలం నవాబు పేట గ్రామంలో కట్నం వాపస్‌ కార్యక్రమాన్ని చేపట్టి స్థానికుల్లో చైతన్యం నింపింది. ఏడుగురి చేత 5 వేల చొప్పున తాము తీసుకున్న కట్నాన్ని అత్తమామలకు వెనక్కి ఇప్పించింది. మిగతా కట్నాన్ని విడతలవారీగా చెల్లించేందుకు వారి చేత ప్రమాణం చేయించింది.
తీసుకున్న కట్నం తిరిగి ఇచ్చేస్తున్న యువకులు
గతంలో తెలిసో తెలియకో కట్నం తీసుకున్నామని..ఆ చేసిన తప్పును డబ్బు తిరిగి ఇవ్వడం ద్వారా సరిదిద్దుకుంటున్నామని స్థానికులు చెబుతున్నారు. బుద్ధ పరిశోధన అభివృద్ధి సంస్థ అవగాహన కార్యక్రమం ద్వారా తమలో ఈ మార్పు వచ్చిందంటున్నారు. కరీంనగర్‌ జిల్లా నవబ్‌పేటలో మొదలైన కట్నం వాపస్‌ కార్యక్రమం రాష్ట్రం మొత్తం విస్తరించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.

 

 

13:45 - October 28, 2015

హైదరాబాద్‌ : నగరంలోని ఎల్బీనగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. చింతల్ కుంటలోని ఎస్‌ మార్ట్ షోరూం గోడకు దొంగలు.. కన్నం వేసి లోపలకి ప్రవేశించారు. విలవైన ఎలక్ట్రానిక్ వస్తులు అపహరించారు. సుమారు రూ.5 లక్షల విలువైన వస్తువులు చోరీ చేసినట్లు షాప్‌ నిర్వహకులు అంచనా వేస్తున్నారు. నిర్వహకులు పోలీస్ స్టేసన్ లో పిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

13:38 - October 28, 2015

హైదరాబాద్ : వరంగల్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. టీఆర్ ఎస్ ను ఓడించే అభ్యర్థిని నిలబెడతామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీరుపై సర్వత్రా వ్యతిరేకత వస్తుందని ఆయన అన్నారు. రోజురోజుకు టీసర్కార్ పతనం అవుతుంది.. తప్పా ముందుకు వెల్లే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. అమరవీరుల విధానాలకు వ్యతిరేకింగా ప్రభుత్వం వ్యవహిరిస్తుందని తెలిపారు. బిజెపి, టిడిపి ఉమ్మడి అభ్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థిల మధ్య ప్రధానమైన పోటీ ఉంటుందన్నారు. కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులని చెప్పారు. బిజెపిక అనుకూలంగా ప్రజలు ఓటు వేస్తారని తెలిపారు. బిజెపి పెద్ద కుటుంబమని.. కొత్తవారు తమ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు.

 

టపాకాయలు కాల్చడంపై పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం..

ఢిల్లీ : దీపావళి రోజున టపాకాయలు కాల్చకుండా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాత్రి పది గంటల వరకు మాత్రమే టపాకాయలు కాల్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

అంతర్జాతీయ నేవీ ప్రదర్శనపై సీఎస్ సమీక్ష..

విశాఖపట్టణం : అంతర్జాతీయ నేవీ ప్రదర్శనపై సీఎస్ కృష్ణా రావు సమీక్ష నిర్వహించారు. నేవీ ప్రదర్శనను సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. నేవీ ప్రదర్శన రివ్యూ కోసం హైలెవల్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. 

హోం శాఖ కార్యదర్శిని కలిసిన టి.సీఎస్, డీజీపీ..

ఢిల్లీ : హోం శాఖ కార్యదర్శిని తెలంగాణ సీఎస్, డీజీపీలు కలిశారు. రాష్ట్రంలోని పరిస్థితులను వారు వివరించినట్లు తెలుస్తోంది. 

13:28 - October 28, 2015

ఢిల్లీ : ఫేస్ బుక్ కు భారత్ ప్రధానమైన మార్కెట్ అని ఫేస్ బుక్ సీఈవో జుకెర్ బర్గ్ అన్నారు. ఢిల్లీలోని ఐఐటి విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. భారత్ లో పర్యటించడం సంతోషంగా ఉందన్నారు. ప్రపపంచ వ్యాప్తంగా 4 బిలియన్ల మంది ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్నారని తెలిపారు. భారత్ లో 13 కోట్ల మంది ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. ఫేస్ బుక్ ను ఉపయోగించడంలో భారత్ రెండో స్థానంలో ఉందన్నారు. సామాన్యులకు చేరువలో ఇంటర్నెట్ ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ వినియోగంతో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతాయన్నారు.

13:16 - October 28, 2015

విజయవాడ : రాబోయేది నిప్పులు కురిపించనున్న వేసవి. దీనికి తోడు చుట్టుముట్టి మరీ పగ తీర్చుకుంటున్న వర్షాభావ పరిస్ధితులు. ఈ విపరీత పరిస్ధితులు చాలవన్నట్లు రిజర్వాయర్లలో నీటి మట్టం ఇప్పటికే అడుగంటింది. పరిస్ధితులు చూస్తోంటే రానున్న వేసవిలో నీటికి కటకట అని అంగలార్చక తప్పేలా లేదు.
వచ్చే వేసవిలో తాగునీటి సమస్య తీవ్ర రూపం
వచ్చే వేసవిలో కృష్ణాడెల్టా ఆయకట్టు పరిధిలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చనుంది. ఇప్పటికే ఎగువనున్న రిజర్వాయర్లలో అవసరాలకంటే తక్కువగా ఉన్న నీటి నిల్వల గణాంకాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. రాబోయే వేసవిలో ఆయకట్టు పరిధిలో గుక్కెడు మంచినీళ్లు అందరికీ అందించడం గగనమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తీవ్రరూపం దాల్చడంతో కరువు రక్కసి విలయతాండవం చేస్తోంది. ప్రకాశం బ్యారేజ్ కి ఎగువనున్న రిజర్వాయర్లలో నీటి నిల్వలు అంతంతమాత్రమే.
శ్రీశైలం ప్రాజెక్టులో 75.97 టీఎంసీల నీటి నిల్వలు
శ్రీశైలం ప్రాజెక్టులో 848.1 అడుగులకు గాను కేవలం 75.97 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వలున్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 508.9 అడుగులకుగాను 129.81 టీఎంసీలు , పులిచింతల ప్రాజెక్టులో 105.0 అడుగులకుగానూ, 1.24 టీఎంసీ నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. పట్టిసీమ నుంచి 1500 క్యూసెక్కుల చొప్పున 60 రోజులు నీరు విడుదల చేయటం ద్వారా 7.77 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చని జలవనరుల శాఖ అధికారుల గణాంకాల ద్వారా అర్థమవుతోంది. తక్షణమే శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి 24.63 టీఎంసీల నీరు విడుదల కాని పక్షంలో కృష్ణాడెల్టా ఆయకట్టు పరిస్థితి ఊహించడం కష్టమవుతోంది. ఎగువ నుంచి నీరు రావడం లేదు. కొన్ని నెలల క్రితం సాగర్ వద్ద నీటి విడుదల కోసం రెండు రాష్ట్రాల పోలీసులు బాహాబాహీకి దిగారు. రాబోయే ఐదు నెలల కాలంలో మంచినీటి సమస్యను ఎదుర్కొవాలంటే జనవరిలో 5 టీఎంసీలు, మార్చిలో 5 టీఎంసీలు, మే నెలలో 4 టీఎంసీల నీరు తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అవసరం.
ఆగస్టులో 178.4 మిల్లీ మీటర్లు
2015 జులై నుంచి కృష్ణాజిల్లాలో వర్షపాతాన్ని పరిశీలిస్తే.. జులైలో సాధారణ వర్షపాతం 210.6 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా, 96.0 మిల్లీ మీటర్లుగా నమోదైంది. ఆగస్టులో 212.8 మిల్లీ మీటర్లకుగాను 178.4 మిల్లీ మీటర్లుగా నమోదైంది. సెప్టెంబర్ లో 163.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 131.0 మిల్లీ మీటర్లు మాత్రమే నమోదైంది. అక్టోబర్ నెలలో 146.0 మిల్లిమీటర్లకు గాను 62.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్ నుంచి అక్టోబర్ 24 వరకు సాధారణ వర్షపాతం 83.1 మిల్లీ మీటర్లు నమోదు కావాల్సి ఉండగా, 708.0 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతంగా అధికారిక గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.
సాగర్‌ నుంచి నీటిని విడుదల చేయాలి.. 
ఇటువంటి పరిణామాల నేపధ్యంలో ప్రకృతి నిండైన దయ చూపాలి లేదంటే సాగర్‌ నుంచి నీరు అయినా విడుదల అవ్వాలి. డెల్టా ఆయకట్టులో తాగునీటి సమస్య పరిష్కారానికి 14 టీఎంసీల నీటితో కలిపి 34 టీఎంసీల నీరు ఎగువ నుంచి విడుదలైతేనే ఆయకట్టులో తాగు, సాగునీటి అవసరాలు తీరుతాయి. లేకుంటే గడ్డు పరిస్ధితులు ఖాయమని సాగునీటి నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

పైరసీపై ప్రభుత్వం హామీ - సురేష్..

హైదరాబాద్ : పైరరీ నివారణకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీనిచ్చిందని నిర్మాత సురేష్ బాబు వెల్లడించారు. బుధవారం మంత్రి కేటీఆర్ ను సినీ ప్రముఖులు కలిశారు. ఈసందర్భంగా సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. పైరనీని అరికట్టేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని నియమిస్తామని, పైరసీ వల్ల టాలీవుడ్ కు దాదాపు ఏడాదికి రూ.350 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందన్నారు. 

13:09 - October 28, 2015

ముంబై : అండర్‌ వరల్డ్ డాన్‌లంటే అందరికీ ఆసక్తే...నేర ప్రపంచంలో గ్యాంగ్‌లీడర్లుగా చలామణి అవుతూ తప్పించుకు తిరుగుతుంటారు. వీరిపై ప్రజలకుండే ఆసక్తినే సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా బికినీ కిల్లర్‌గా పేరొందిన చార్లెస్‌ శోభరాజ్‌ జీవితం ఆధారంగా 'మై ఔర్‌ ఛార్లెస్‌' సినిమా రూపుదిద్దుకుంది. అక్టోబర్‌ 30న విడుదలకు సిద్ధమైంది.
'మై ఔర్ చార్లెస్' పై ఆసక్తి
చార్లెస్‌ శోభరాజ్‌.... నేర సామ్రాజ్యంలో ఇతడిదో స్పెషాలిటీ... బికినీ కిల్లర్ గా పేరు పొందిన చార్లెస్‌ 1986లో దేశంలోనే అత్యంత పటిష్ఠమైన తీహార్ జైలు నుంచి పారిపోవడం సంచలనం సృష్టించింది. ఇలాంటి నేరాలెన్నింటికో కేంద్ర బిందువైన చార్లెస్‌ శోభారాజ్‌పై తీసిన మై ఔర్‌ ఛార్లెస్‌ సినిమా ఇపుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.
ఛార్లెస్‌ శోభరాజ్‌గా రణదీప్‌ హుడా
బాలీవుడ్‌ నటుడు రణదీప్‌ హుడా ఛార్లెస్‌ శోభరాజ్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం రణదీప్‌ నేపాల్‌ రాజధాని ఖట్మాండు జైల్లో ఉన్న 72 ఏళ్ల ఛార్లెస్‌ శోభరాజ్‌ను స్వయంగా కలుసుకోవడం ద్వారా ఆ పాత్రకు జీవం పోసినట్టే కనిపిస్తోంది.
శోభరాజ్‌ సంతృప్తి
ఛార్లెస్‌ శోభరాజ్‌ను కలుసుకోవడం జరిగే పని కాదు...అలాంటిది జైల్లో అతడితో ఓ పదినిముషాలు గడపానని హీరో రణదీప్‌ హుడా చెప్పాడు. శోభరాజ్‌కు సన్నిహితంగా కాకుండా ఏడడుగుల దూరం నుంచే పోలీసులు అనుమతించారు. ఛార్లెస్‌ వేషధారణలో కాకుండా సాధారణ డ్రెస్‌లోనే వెళ్లానని, ఛార్లెస్‌ పాత్రలో తాను నటిస్తున్న విషయాన్ని తెలుపగా చాలా సేపటికి ఆయన థంబ్స్ ద్వారా ఓకే చెప్పారని ఓ ఇంటర్వూలో రణదీప్‌ పేర్కొన్నాడు. టీవీలో సినిమా ట్రయల్‌ చూసి శోభరాజ్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. పోస్టర్‌పై ఛార్లెస్‌ శోభరాజ్‌ సంతకం చేయడమే కాకుండా బెస్ట్‌ విషెస్‌ చెప్పినట్టు హీరో తెలిపాడు. సినిమా విడుదలయ్యాక ఆ సినిమాను తనతో పాటు 3 వేల ఖైదీలకు చూపాలని శోభరాజ్‌ హీరో రణదీప్‌ను కోరాడు. అధికారులు పర్మిషన్‌ ఇస్తే తప్పకుండా సినిమా చూపిస్తానని రణదీప్‌ హామీ ఇచ్చాడు.
జైలు నుంచి ఛార్లెస్‌ శోభరాజ్‌ కు విముక్తి..?
నవంబర్‌3న కోర్టు తీర్పు ఆధారంగా తనకు జైలు నుంచి విముక్తి కలిగే అవకాశం ఉందని ఛార్లెస్‌ శోభరాజ్‌ చెప్పారు. మండేలాపై రాసిన పుస్తకాన్ని ఛార్లెస్‌కు ఇచ్చినట్టు రణదీప్‌ చెప్పాడు. తాను లైఫ్‌లో ప్రతిదీ అనుభవించానని, తన చుట్టూ యువకులు భద్రతగా ఉండేవారని శోభరాజ్‌ వెల్లడించినట్టు రణదీప్‌ పేర్కొన్నారు.
నేరాల్లో ఛార్లెస్‌ శోభరాజ్ ఆరితేరాడు..
ఛార్లెస్‌ శోభరాజ్...ఆగ్నేయ ఆసియా కేంద్రంగా దాదాపు డజనుకు పైగా దేశాలకు చెందిన మహిళలను అతి క్రూరంగా హత్యచేయడంతోపాటు మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాల సరఫరా తదితర నేరాల్లో ఆరితేరాడు... ప్రస్తుతం కఠ్మాండు జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని పట్టుకునే క్రమంలో ఎదురైన అనుభవాలను వివరిస్తూ ఓ ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ రాసిన పుస్తకం ఆధారంగా దర్శకుడు ప్రవాల్ రమణ్ 'మై ఔర్ చార్లెస్' సినిమా తీశారు. చార్లెస్ శోభరాజ్ పాత్రలో రణదీప్ హుడా, రిచా చడ్డా, ఆదిల్ హుస్సేన్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 30న విడుదల కానుంది.

 

రాజ్ నాథ్ తో ముగిసిన కేసీఆర్ భేటీ..

ఢిల్లీ : కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపిన భేటీ కొద్దిసేపటిక్రితం ముగిసింది. విభజన చట్టంలోని హామీలు అమల చేయాలని కేసీఆర్ కోరడం జరిగిందని, హైకోర్టు విభజన త్వరలో పరిష్కారమౌతుందని రాజ్ నాథ్ సింగ్ హామీనిచ్చినట్లు ఎంపీ వినోద్ తెలిపారు. ఎఫ్ఆర్ బీఎం పెంచాలని జైట్లీని కోరినట్లు చెప్పారు. 

ఢిల్లీలో ఫేస్ బుక్ సీఈవో..

ఢిల్లీ : ఐఐటి విద్యార్థులతో ఫేస్ బుక్ సీఈవో జుకెర్ బర్గ్ ముఖాముఖి జరిపారు. భారత్ లో పర్యటించడం సంతోషంగా ఉందని, ఫేస్ బుక్ ను ఉపయోగించడంలో భారత్ రెండో స్థానంలో ఉందన్నారు. సామాన్యులకు చేరువలో ఇంటర్నెట్ ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ వినియోగంతో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతాయన్నారు.

లారీని ఆపిన మార్కెట్ యార్డు అధికారి..సెక్యూర్టీ గార్డుకు గాయాలు..

కరీంనగర్ : బొమ్మనకల్ వద్ద పత్తి లోడ్ తో వెళుతున్న లారీని ఆపేందుకు బైక్ పై వెంబడించిన మార్కెట్ యార్డు చెక్ పోస్టు సిబ్బంది వెళ్లారు. కానీ లారీని ఆపని డ్రైవర్ నేరుగా వారిపై పోనిచ్చాడు. దీనితో యార్డు అధికారులు, సెక్యూర్టీ గార్డుకు తీవ్రగాయాలయ్యాయి.

 

12:53 - October 28, 2015

ముంబై : స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 113 పాయింట్లు నష్టపోగా... నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు బలపడి ప్రస్తుతం 65 రూపాయల 7 పైసలుగా ఉంది. 

12:49 - October 28, 2015

ఢిల్లీ : సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. హర్యానాలో దళితులపై దాడులు, గోమాంసంపై జరుగుతున్న వివాదం, బీహార్‌ ఎన్నికలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

12:46 - October 28, 2015

హైదరాబాద్ : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఏపీ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు మళ్లీ పెరిగాయి. మావోయిస్టులను నియంత్రించేందుకు పోలీసులు కూంబింగు విస్తృతం చేయడంతో.. సరిహద్దు ప్రాంతంలో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. నిత్యం దండకారణ్యంలో ఏదో ఒక చోట కాల్పులతో దద్దరిల్లుతోంది. తాజాగా దుమ్ముగూడెం మండలం మారాయిగూడెంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జవాను మృతి చెందాడు. వాజేడు సమీపంలో లొట్టిపిట్ట గండి నుంచి భూపాలపట్ట్నం మధ్య రోడ్డు నిర్మాణ పనుల కోసం తీసుకొచ్చిన 37 వాహనాలను మావోయిస్టులు తగులబెట్టారు. చర్లకు చెందిన ఇద్దరు సంత వ్యాపారులను ఇటీవల కిడ్నాప్ చేసి కలకలం సృష్టించారు. దీంతోపాటు కూనవరం, వి.ఆర్.పురం, చింతూరు మండలాల్లో రెండు నెలల్లో నలుగురు గిరిజనులను ఇన్ఫార్మర్ల పేరుతో హత్య చేశారు. ఈ పరిణామాలు తెలంగాణ, ఆంధ్రలోకి మావోయిస్టులు తమ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నది స్పష్టమవుతోంది.
మావోయిస్టు కార్యకలాపాలు
చర్ల, వెంకటాపురం, వాజేడు, దుమ్ముగూడెం ప్రాంతాల్లోనూ మావోయిస్టు కార్యకలాపాలు అధికమయ్యాయి. రహదారి నిర్మాణ పనులను అడ్డుకోవటం, వాహనాలను దగ్ధం చేయడం.. రహదారులకు అడ్డంగా చెట్లు నరికి వేయడం.. బ్యానర్లు కట్టడం, కరపత్రాలు పంచడం వంటి చర్యలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
మావోయిస్టు పార్టీకి 2006 నుంచి మైదాన ప్రాంతాల్లో రిక్రూట్‌మెంట్
మావోయిస్టు పార్టీకి 2006 నుంచి మైదాన ప్రాంతాల్లో రిక్రూట్‌మెంట్ ఆగింది. ఇటీవలి కాలంలో కొన్ని సంఘాల ద్వారా మావోయిస్టు పార్టీ విద్యార్థులను రిక్రూట్ చేసుకుంది. ఉన్నత విద్యావంతులు మావోయిస్టు పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. వీరితో 1983 నాటి తరహాలో ఒక కమాండర్, ఇద్దరు సభ్యులతో దళాలను ఏర్పాటు చేశారు. ఏడాదిగా అన్ని రకాలుగా శిక్షణ తీసుకున్న ఈ కొత్త దళాలు అటవీ ప్రాంతాలకు సమీపంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోకి వస్తున్నాయి. వరంగల్‌ జిల్లా తాడ్వాయి ఎన్‌కౌంటర్లో మృతి చెందిన శృతి, సాగర్ లతోపాటు, గతంలో మరణించిన వివేక్ కూడా ఇదే తరహాలో మావోయిస్టు పార్టీలో చేరినట్లు పోలీసులు భావిస్తున్నారు.
పోలీసులు, మావోయిస్టుల మధ్య మైండ్ గేమ్
మరోవైపు పోలీసులు, మావోయిస్టుల మధ్య మైండ్ గేమ్ సాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల పట్ల పోలీసులు ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహించటం, కూంబింగ్‌ను విస్తృతం చేయటం తరహా విధానాలతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. గత ఏడాది కాలంగా ఛత్తీస్‌గఢ్‌లో 400పైగా మావోయిస్టులు లొంగిపోయారు. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే మావోయిస్టులు బలంగా ఉన్న బీజాపూర్, సుకుమా, కాంకేర్, నారాణపూర్, దంతెవాడ, కొండగావ్ జిల్లాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. బస్తర్ దండకారణ్యంగా పేరుమోసిన ఈ ప్రాంతంలో ప్రతి రోజూ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు కొద్ది రోజుల క్రితం ఖమ్మం జిల్లా మవోయిస్టు కార్యదర్శి శివారెడ్డి ఎలియాస్ కిరణ్ కూనవరం వద్ద చికిత్స పొందుతూ తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు పట్టుపడటంతో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏఓబీ ప్రాంతంలోనూ మావోల కదలికలు అధికమయ్యాయి. ఇటీవల విశాఖ జిల్లాలో ముగ్గురు టిడిపి నేతలను కిడ్నాప్ చేయటం కలకలం సృష్టించింది. దీంతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోనూ పట్టుకోసం మావోయిస్టులు ప్రయత్నిస్తుండటం పోలీసులకు సవాలుగా మారింది. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలతోపాటు, ఛత్తీస్‌గడ్ లో ఏడాది కాలంగా జరిగిన కాల్పుల్లో 80 మందికిపైగా సిఆర్పీఎఫ్ తోపాటు, స్థానిక పోలీసులు మృతి చెందటం భద్రతా బలగాలను కలవర పెడుతోంది.
పోలీసుల ప్రత్యేక దృష్టి
దండకారణ్యంలో పట్టుకోసం మావోయిస్టులు ప్రయత్నిస్తుంటే పోలీసులు ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేతలు పలువురు ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పర్యటించి పార్టీ విస్తరణకు పథకం రూపొందించినట్లు పోలీసులకు సమాచారం ఉంది. దీంతో వారి ప్రాబల్యం పెరగకుండా తెలుగు రాష్ట్రాల పోలీసులతోపాటు, గ్రేహౌండ్స్, కేంద్ర బలగాలు, ఎస్ఐబి బృందాలు మన్యాన్ని జల్లెడ పడుతున్నాయి. మరోవైపు సమాచారం అందించే కొరియర్ వ్యవస్థపై మావోయిస్టులు దృష్టి పెట్టారు. ఈ పరిణామాలు స్థానిక గిరిజనానికి ఇబ్బందిగా మారాయి. మావోయిస్టులు, పోలీసుల మధ్య గిరిజన గూడాలు నలిగిపోతున్నాయి.

 

12:38 - October 28, 2015

కరీంనగర్ : సంకల్పం ధృడమైనది అయితే సమున్నత ఆశయాలు సత్వరమే సిద్ధిస్తాయి. లక్ష్యం ఉన్నతమైనదే అయితే ధైర్యంతో వేసే ప్రతి ముందడుగుకు ప్రకృతి కూడా సహకరిస్తుంది. మార్పే ధ్యేయంగా పెల్లుబికే విప్లవం సమూల మార్పులు తీసుకొస్తుంది. కరీంగనర్ జిల్లాలోని కొన్ని గ్రామాలు ఇందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి . ధృడచిత్తం ఉండాలే కానీ అసాధ్యం సైతం సుసాధ్యమేననే నిజాన్ని నిరూపిస్తున్నాయి.
మద్య రహిత సమాజానికి అంకురార్పణ
సమిష్టిగా కదిలారు. సమున్నత ప్రగతికి ప్రతీకగా నిలిచారు. పల్లెలను మద్యానికి దూరంగా నిలిపి గొప్ప ఆశయబాటలో పయనిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దకల్వల, సుద్దాల, నిట్టూరు, బొంతకుంటపల్లె గ్రామాలు ఎన్నో ఏళ్ల నుంచి మద్యానికి దూరంగా ఉంటున్నాయి. మహిళలు, యువకుల్లో వచ్చిన సామాజిక చైతన్యం ఆ గ్రామాల రూపురేఖలనే మార్చింది. గ్రామస్తులు మద్యపానానికి వ్యతిరేకంగా సాగించిన పోరాట ఫలితంగా గ్రామాల్లో మద్యరహిత సమాజానికి అంకురార్పణ జరిగింది.
ముందుకు కదిలిన మహిళాలోకం
మద్యం మహమ్మారి పెట్టిన చిచ్చు మాటలకు అందనిది. అందుకే పచ్చని కుటుంబాల్లో మద్యం రగిల్చిన దావానలానికి వ్యతిరేకంగా మహిళాలోకం ముందుకు కదిలింది. ఆర్దికంగా, శారీరకంగా దెబ్బతీస్తున్న మాయదారి మద్యాన్ని పారద్రోలాలని నిశ్చయించుకున్నారు. పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామంలోని మహిళ స్వశక్తి సంఘాలు మద్యాన్ని నిర్మూలించేందుకు ఉద్యమించాయి. గ్రామంలో బెల్టుషాపులు, గుడుంబా , సారా విక్రయాలను నిషేధించాలని పోరాటం చేశాయి . 3 నెలల సుధీర్ఘ పోరాటం ఫలితంగా ఆయా గ్రామాల్లో 2006 నుంచి మద్య నిషేదం అమలులోకి వచ్చింది. నిట్టూరు గ్రామ మహిళల స్ఫూర్తితో ఇతర గ్రామాలు కూడా పోరు శంఖారావాన్ని పూరించాయి.
చిన్న కల్వలలో 9 ఏళ్లుగా మద్య నిషేధం
నిట్టూరు గ్రామ పోరాటతత్వాన్ని పుణికి పుచ్చుకున్న మరో గ్రామం సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామం. ఈ గ్రామంలో మద్యం నిషేదం 9ఏళ్లుగా అమలవుతోంది. నవచైతన్య యువజన సంఘం సభ్యులు ఆధ్వర్యంలో ప్రజలంతా మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడారు. మద్యపానం వల్ల కలిగే అనర్ధాలు ఒక్కొక్కటిగా వివరించటంతో ప్రజా చైతన్యం సునామీలా వచ్చింది. మద్యం అమ్మినా, తాగినా జరిమానాలు విధించటంతో మద్యపాన నిషేధం సంపూర్ణంగా అమలవుతోంది.
మద్యాన్ని తరిమేసిన బొంతకుంటపల్లి, సుద్దాల
సుల్తానాబాద్ మండలంలోని మరో రెండు గ్రామాలైన బొంతకుంటపల్లి, సుద్దాల గ్రామాలు కూడా మద్యం మహమ్మారిని తరిమేసాయి. అందరూ కలిసి సమిష్ఠిగా ఉద్యమించారు. మద్యం తెచ్చే అనర్ధాలను ఒక్కొక్కటిగా వివరించారు. అవమానాలు ఎదురైనా, అవహేళనలు రాజ్యమేలినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. చివరికి సంపూర్ణ మద్య నిషేధం సాధించారు. మద్యాన్ని తరిమి కొట్టి ఆదర్శంగా నిలుస్తున్న సంపూర్ణ మద్య నిషేధ గ్రామాలు రాష్ట్రం మొత్తం స్ఫూర్తిగా నిలవాలని కోరుకుందాం.

 

12:31 - October 28, 2015

విశాఖ : నగరంలోని అక్కయ్యపాలెం అబిద్‌నగర్‌ పార్క్‌ వద్ద ఓ యువకుడు హల్‌చల్‌ సృష్టించాడు. ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు అపార్ట్ మెంట్‌ పైకి ఎక్కి దూకుతానంటూ బెదిరించాడు. విశాఖలోని సాగర్ నగర్ కు చెందిన అజయ్ అనే యువకుడు అక్కయ్యపాలెంకు చెందిన ఓ యుతిని ప్రేమించాడు. అయితే ఆ అమ్మాయికి రేపు వేరే అతనితో వివాహం జరుపునున్నారు. దీంతో అజయ్.. ఆ యువతి ఇంటికి వెళ్లి అపార్ట్ మెంట్‌ పైకి ఎక్కి దూకుతానంటూ బెదిరించాడు. ప్రేమించిన యువతితో తనకు వివాహం జరిపించాలని డిమాండ్‌ చేశాడు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఆ యువకున్ని కిందకి దింపి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే అతను నిజంగానే అమ్మాయిని ప్రేమించాడా లేదా అనే విషయంపై దృష్టి సారించారు. మొత్తానికి అతన్ని ప్రాణాలతో రక్షించామని పోలీసులు తెలిపారు. అందరం కలిసి అతినికి బుద్ధి చెప్పామని చెప్పారు.
అజయ్...
యువతిని నేను ప్రేమించాను. అమ్మాయి లేకుండా నేను బతకలేను. వారి ఇంట్లో ఒప్పుకోవడం లేదని అమ్మాయి నాకు సపోర్టు చేయడం లేదు. 

12:13 - October 28, 2015

వరంగల్ : ఉప పోరుకు ఓరుగల్లు సిద్ధమైంది. నోటిఫికేషన్‌ విడుదల చేసి అధికారులు నగారా మోగించారు. ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్ధుల వేటలో పడ్డాయి. జకారియా, గుడిమల్ల రవికుమార్‌, ప్రొఫెసర్‌ సాంబయ్యల పేర్లు టీఆర్‌ఎస్‌లో వినపడుతున్నా.. కేసీఆర్‌ మాత్రం ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు టిక్కెట్‌ ఖరారు చేసే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. కాంగ్రెస్‌ నేతలు మాత్రం వివేక్‌ను ఒప్పించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. వివేక్‌ ఒప్పుకోకపోతే సర్వే సత్యనారాయణకు అవకాశమివ్వొచ్చని సమాచారం. ఇక టీడీపీ బిజెపిల తరపున అభ్యర్ధిని.. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ల అభ్యర్ధుల పేర్లు వచ్చాకే ప్రకటిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. ఇప్పటికే వామపక్షాలు ప్రకటించిన ఉమ్మడి అభ్యర్ధి గాలి వినోద్‌కుమార్‌ ప్రచారంలో ఉన్నారు.

రాహుల్ తో ముగిసిన ఉత్తమ్ భేటీ..

ఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ తో టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ జరిపిన భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా ఉన్నారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏఐసీసీ కార్యాలయంలో దిగ్విజయ్ తో సమావేశమయ్యారు. వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో అభ్యర్థి విషయంపై చర్చించినట్లు సమాచారం. 

ప్రధానికి ఎంపీ వైవీ లేఖ..

ఢిల్లీ : పొగాకు సమస్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లేఖ రాశారు. పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించాలని లేఖలో కోరారు.

 

నల్గొండలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల ధర్నా..

నల్గొండ : నేరేడుచర్లలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన నిర్వహించారు. జిల్లాలోని చెరువులు నిండకుండానే సాగర్ ఎడుమ కాల్వ నీటిని ఖమ్మంకు తరలిస్తున్నారని ఆరోపించారు. 

లాడెన్..జవహరి..తాలిబన్లు హీరోలన్న ముషారఫ్..

పాకిస్థాన్ : మాజీ అధ్యక్షుడు ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశారు. బిన్ లాడెన్..జవహరి..తాలిబన్లు..తమకు హీరోలని అభివర్ణించారు. భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్ మద్దతిచ్చిందని, ఉగ్రవాదులకు శిక్షణనిచ్చి కాశ్మీర్ కు పంపించినట్లు తెలిపారు. హఫీజ్ సయీద్, లక్వీ వంటి ఉగ్రవాదులు హీరోలుగా చలామణి అయ్యారని తెలిపారు. 

11:58 - October 28, 2015

హన్మకొండ : వరంగల్‌ పార్లమెంట్ సీటు కోసం ఇప్పటివరకు 17 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కిషన్‌ రెడ్డి తెలిపారు. ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాతే తమ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. మిత్రపక్షంగా ఉన్న టీడీపీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వరంగల్‌ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. 

11:54 - October 28, 2015

ఢిల్లీ : 2016 సంవత్సరానికి గాను వ్యాపార అనుకూల దేశాల ర్యాంకింగ్‌ లిస్ట్ ను వరల్డ్ బ్యాంక్‌ విడుదల చేసింది. మొత్తం 189 దేశాలను ఇందులో తీసుకోగా.. భారత్‌ 12 స్థానాలు ఎగబాకి 130వ స్థానానికి చేరింది. 2015లో భారత్‌ 142వ స్థానంలో నిలిచింది. వ్యాపార అనుకూల దేశాల్లో సింగపూర్‌ మొదటి స్థానంలో ఉండగా.. న్యూజిల్యాండ్‌ రెండవస్థానంలో .. డెన్మార్క్‌ మూడవ స్థానంలో.. సౌత్‌ కొరియా నాలుగో స్థానంలో.. హాంగ్‌కాంగ్‌ ఐదో స్థానంలో నిలిచాయి. ఇక ఆరోస్థానంలో బ్రిటన్‌, ఏడవ స్థానంలో యూఎస్‌ ఉన్నాయి. చైనా 84వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 90వ స్థానంలో ఉన్న చైనా 6 స్థానాలు మెరుగుబరుచుకుని 84వ స్థానానికి చేరింది. పాకిస్తాన్‌ 138వ స్థానంలో ఉంది. గత ఏడాది 128 స్థానంలో ఉన్న పాక్‌ 10 స్థానాలు వెనక్కి వెళ్లింది. వ్యాపార అనుకూల దేశాలలో భారత్‌ మెరుగుపడుతుందని ప్రపంచబ్యాంకు ప్రధాన ఆర్థిక వేత్త కౌషిక్‌ బసు అభిప్రాయపడ్డారు.

 

పాకిస్తాన్ లో మళ్లీ భూప్రకంపనలు..

ఇస్లామాబాద్ :  ఇటీవలే సంభవించిన భూకంపం షాక్ నుంచి తేరుకోకముందే తాజాగా ఇవాళా పాకిస్తాన్ లో మళ్లీ భూప్రకంపనలు సంభవించాయి. ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, భారత్ లో మొన్న సంభవించిన భూకంప ధాటికి దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. 

11:48 - October 28, 2015

పాట్నా : బీహార్‌లో మూడో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు బారులు తీరారు. ఒక్కసారిగా అక్కడ అలజడి ప్రారంభమైంది. వారితో పాటు ఓ కోతి అక్కడకు వచ్చింది. కోతి ఎందుకు వచ్చిందబ్బా ? అని అందరూ అనుకున్నారు. ఒక్కసారిగా కోతికి ఏమైందో కాని ఓటర్లపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీనితో ఓటర్లు భయపడ్డారు. ఈ ఘటన భక్తియార్‌పూర్‌ నియోజకవర్గం పోలింగ్‌ బూత్‌లోకి వచ్చింది. అనంతరం అక్కడనే ఉన్న ఓటర్లపై దాడి చేసింది. ఇలా ఓటు హక్కు వినియోగించుకుందామని వచ్చిన ఆరేడు మందిని కరిచేసింది. పోలింగ్‌ బూత్‌లో కనీస సౌకర్యాలను కల్పించలేదని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

11:45 - October 28, 2015

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. నేడు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కల్వకుంట్ల కలవనున్నారు. అలాగే హోంశాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, పర్యావరణ శాఖా మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తోనూ కేసీఆర్‌ సమావేశమవనున్నారు.

 

11:42 - October 28, 2015

పాట్నా : బీహార్‌లో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. 6 జిల్లాల్లోని 50 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఈ దఫా ఎన్నికల్లో 808 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 71 మంది మహిళా అభ్యర్థులు సైతం ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. మూడో దశ పోలింగ్‌ కోసం 14 వేల 170 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. 6 వేల 747 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. మూడో దశ ఎన్నికల్లో లాలు కుమారులు తేజస్వీ యాదవ్‌, తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

 

మంత్రి కేటీఆర్ ను కలిసిన సినీ ప్రముఖులు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను బుధవారం ఉదయం టాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు కొందరు కలిశారు. పైరసీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. 

సీఎం ముఖ్యకార్యదర్శితో ఎంపీ గరికపాటి భేటీ..

హైదరాబాద్ : వరంగల్ జిల్లా బిల్ట్ కంపెనీ పున: ప్రారంభంపై సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావుతో ఎంపీ గరికపాటి భేటీ అయ్యారు. 

రాహుల్ తో ఉత్తమ్ భేటీ..

ఢిల్లీ : ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ భేటీ అయ్యారు. వరంగల్ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంపై చర్చిస్తున్నట్లు సమాచారం.

 

11:19 - October 28, 2015

గుంటూరు : రాజధాని శంకుస్ధాపన మహోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఏపి సర్కార్ రాజధాని నిర్మాణంపై దృష్టి పెట్టింది. క్యాపిటల్ కన్సస్ట్రక్షన్‌కు కావాల్సిన నిధుల సేకరణపైనే కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపులతో పాటు కేంద్ర సాయాన్ని కూడా కలుపుకుని, పబ్లిక్ ప్రయివేట్ పార్టనర్ షిప్ ద్వారా రాజధాని నిర్మాణం పై ఏకాగ్రత పెడుతోంది.క్యాపిటల్ కసరత్తులో భాగంగా రిసోర్ట్ మోబిలైజేషన్ కమిటీ సమావేశం జరిపేందుకు రెడీ అవుతోంది.
పిపిపి పద్ధతిలోనే అమరావతి నిర్మాణం
వరల్డ్ క్లాస్ క్యాపిటల్‌ నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం తొలి ద‌శ‌లో 18 శాతం నిర్మాణాలు పూర్తి చేయాలనే ఆలోచ‌న‌తో ఉంది. రహదార్లు, తాగునీటి వసతులు, రిజర్వాయర్లు నిర్మాణంతో పాటు పలు మౌలిక వసతులు సమకూర్చే విధంగా చర్యలు తీసుకుంటోంది. యుద్ధప్రాతిపదికన 70లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరపాలని చూస్తోంది. ఈ టార్గెట్‌కు 11 వేల కోట్లు అవసరం అవుతాయని సర్కార్‌ అంచనా వేస్తోంది. రాజధాని నిర్మాణానికి సుమారు లక్షా ఐదువేల కోట్లుపైనే ఖర్చవుతాయని ఏపి సర్కార్ కేంద్రానికి నివేదికలు పంపింది. తొలివిడతగా 1500 కోట్లు కేంద్రం నుండి రాబట్టుకోగలిగినా మరో 5వేల కోట్లు తక్షణ సాయం అందుతుందని భావిస్తోంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి అంతంత మాత్రమే ఉన్న తరుణంలో రాజధాని నిర్మాణానికి రాష్ట్రం తరపున ఎంత కేటాయించాలనే దానిపై దృష్టి పెట్టింది. అది వీలు కాని పక్షంలో పిపిపి ద్వారానే అమరావతిని నిర్మించాలని ఏపి సర్కార్ భావిస్తోంది. స్విస్ ఛాలెంజ్ విధానం ద్వారా ఇరు పక్షాలకు లాభం చేకూర్చుతూ రాజధాని నిర్మాణం జరిపేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఇప్పటికే సింగపూర్, జపాన్ దేశాలకు చెందిన పలు కంపెనీలు రాజధాని నిర్మాణం కోసం మందుకు రావడంతో పిపిపి మోడల్ కలిసి వస్తుందని ఏపి సర్కార్ భావిస్తోంది.
'మై బ్రిక్‌- మై అమరావతి'కి మంచి రెస్పాన్స్
ఇక రాజధాని నిర్మాణానికి ముందుకు వచ్చే దాతలకు భవన నిర్మాణ భాద్యతలు అప్పగించేదుకు సర్కార్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ప్రభుత్వ భవనం ఉచితంగా నిర్మించి ఇచ్చినందుకు గాను ఆ కట్టడానికి వారి పేరు పెడతామనీ బంపర్‌ ఆఫర్‌ ఇస్తోంది. దీనితో పాటు మై బ్రిక్‌- మై అమరావతికి కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 35 లక్షల ఇటుకలను దాతల ద్వారా సేకరించిన సర్కార్‌ రాజధాని నిర్మాణంపై ఏపి సర్కార్ దృష్టి భవిష్యత్తులోనూ ప్రజల నుంచి భారీగానే సాయాన్ని ఆశిస్తోంది.

 

11:17 - October 28, 2015

టీమిండియా టర్బోనేటర్‌ హర్భజన్‌ సింగ్‌-బాలీవుడ్‌ బ్యూటీ గీతా బస్రాల పెళ్లికి అంతా సిద్దమైంది. గీతా బస్రా నివాసంలో మెహిందీ వేడుక అట్టహాసంగా జరిగింది. మెహిందీ వేడుకలో గీతా బస్రా పింక్‌ కలర్‌ డిజైనర్‌ గాగ్రాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ తర్వాత జరిగిన సంగీత్‌ కార్యక్రమంలో భజ్జీ పింక్‌ కలర్‌ షేర్వాణీలో పంజాబీ పుత్తర్‌లా ముస్తాబవగా....గీతా బస్రా గ్రీన్‌ కలర్‌ డిజైనర్‌ గాగ్రాలో తళుక్కున మెరిసింది.

హాజరైన పలువురు క్రికేటర్లు..
ఈ వేడుకకు భారత క్రికెటర్లు పార్థీవ్‌ పటేల్‌, గురుకీరత్‌ సింగ్‌ మాన్‌, రుద్రప్రతాప్‌ సింగ్‌ హాజరయ్యారు. గతంలో ఈ ఇద్దరికి ఎప్పుడో పెళ్లి అయిపోయిందని, ఆ తర్వాత విడిపోవడం కూడా జరిగిపోయిందని పుకార్లు సైతం వచ్చాయి. 8 ఏళ్లుగా ప్రేమలో ఉన్న భజ్జీ-భస్రాల పెద్దలు అంగీకరించిన తరువాతే ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. జలందర్‌లోని హర్భజన్‌ సింగ్‌ నివాసంలో గురువారం సాయంత్రం వివాహ వేడుక జరుగనుంది. హర్భజన్‌ సింగ్‌కు అత్యంత సన్నిహితుడైన యువరాజ్‌ సింగ్‌, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌, ధోనీ, విరాట్‌ కొహ్లీ, సురేష్‌ రైనా, అశ్విన్‌, వీరేందర్ సెహ్వాగ్‌, జహీర్‌ ఖాన్‌తో పాటు ప్రస్తుత, మాజీ భారత క్రికెటర్లు వివాహానికి హాజరవుతారు. 

స్టెప్పులేసిన భజ్జీ..
మెహిందీ వేడుక ముగిసిన అనంతరం సంగీత్‌ కార్యక్రమంలో హర్భజన్‌ సింగ్‌ సందడి సందడి చేశాడు.వేడుకలో బస్రాతో కలిసి స్టెప్పులేసిన భజ్జీ....వేడుక ముగిసిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు జరుపుకున్నాడు. బంధుమిత్రులతో కలిసి బాంగ్రా స్టెప్పులేసి అలరించాడు.   

ఓరుగల్లులో ఉప ఎన్నికల నగారా..

వరంగల్ : లోక్ సభ ఉప ఎన్నికల నగారా మోగింది. జిల్లా కలెక్టర్ బుధవారం నోటిఫికేషన్ ను విడుదల చేశారు.
నవంబర్ 4 నామినేషన్ల స్వీకరణ..
నవంబర్ 5 నామినేషన్ల పరిశీలన..
నవంబర్ 7 వరకు నామినేషన్లకు ఉపసంహరణకు గడువు..
నవంబర్ 21 పోలింగ్..
నవంబర్ 24 ఓట్ల లెక్కింపు..

ఓటు వేసిన నితీష్..

బీహార్ : రాష్ట్రంలో జరుగుతున్న మూడో విడత ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ట్రాన్స్ కో ఇన్ క్యాప్ అధికారులతో బాబు టెలీకాన్ఫరెన్స్...

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో ట్రాన్స్ కో ఇన్ క్యాప్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫైబర్ గ్రిడ్ ను విజయంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో నష్టాన్ని సింగిల్ డిజిట్ కు తగ్గించాలని, విద్యుత్ సరఫరాలో అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. 

ట్రాన్స్ కో ఇన్ క్యాప్ అధికారులతో బాబు టెలీకాన్ఫరెన్స్...

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో ట్రాన్స్ కో ఇన్ క్యాప్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫైబర్ గ్రిడ్ ను విజయంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో నష్టాన్ని సింగిల్ డిజిట్ కు తగ్గించాలని, విద్యుత్ సరఫరాలో అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. 

11:05 - October 28, 2015

ఏం పెళ్లయిన వారు నటించకూడదా అంటూ బాలీవుడ్ నటి లారా దత్త ప్రశ్నించింది. అలా అని బాలీవుడ్ లో ఏమైనా రూల్ ఉందా ? అంటూ మీడియాను ఎదురు ప్రశ్నించింది. మహేష్‌భూపతిని పెళ్ళి చేసుకున్న 'లారాదత్తా'కి ప్రస్తుతం మూడేళ్ళ కుమార్తె ఉంది. తాజాగా 'ఫితూర్‌' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్‌ మీట్‌లో విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా లారా పై విధంగా స్పందించింది.
కొత్తగా ఆలోచించండి.. మీలో ఉన్న నెగటివ్‌ థింకింగ్‌కి స్వస్తి చెప్పండి.. బాలీవుడ్‌కి చాలా ప్రత్యేకత ఉంది..ఇక్కడ పెళ్ళయిన వాళ్ళకే కాదు.. పెళ్ళయి పిల్లలున్న వాళ్ళకి సైతం అవకాశాలు దొరుకుతాయి. అంతేకాదు పెళ్ళయిన హీరోయిన్ల కోసం దర్శకులు ప్రత్యేకమైన కథల్ని కూడా సిద్ధం చేస్తున్నారంటూ చెప్పింది లారాదత్తా. పెళ్ళయిన తర్వాత కూడా అవకాశాలు రావడం ఆశ్చర్యంగా ఉందంటూ మీడియా వాళ్ళు అడుగుతున్న ప్రశ్న తననెంతో ఇరిటేట్‌ చేస్తోందని పేర్కొంది. పాత్ర చిన్నదే అయినా ఎంతో ప్రాముఖ్యత ఉండటంతో అంగీకరించాను అని చెప్పిందీ అమ్మడు. ఇక 'ఫితూర్‌' సినిమా విషయానికొస్తే, ఇందులో ఆదిత్యరాయ్ కపూర్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కత్రినాకైఫ్‌ కూడా నటిస్తోంది. దీంతోపాటు మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న 'అజహర్‌' చిత్రంలో లాయర్‌ పాత్రను పోషిస్తోంది లారా.

11:04 - October 28, 2015

చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ మెంబర్స్‌తో చేస్తున్న కెనడా ట్రిప్‌ అదుర్స్‌ అని అంటోంది హన్సిక. తెలుగు, తమిళ భాషల్లోని పలు చిత్రాల షూటింగ్‌లతో క్షణం తీరికలేకుండా బిజీగా ఉన్న తనకు ఈ ట్రిప్‌ ఎంతో ఎనర్జీనిచ్చిందని, ముఖ్యంగా టోరంటో వీధుల్లో తిరగటం మరింత హ్యాపినిచ్చిందని ట్వీట్‌ ద్వారా ఆనందాన్ని అభిమానులతో షేర్‌ చేసుకుంది. విజరు సరసన నటించిన 'పులి' చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జీవాకి జోడీగా 'పోకిరి రాజా' చిత్రంలో నటిస్తోంది. ఫ్యామిలీతో విహార యాత్ర కోసం ఈనెల 20న కెనడా వెళ్ళింది ఈ ముద్దుగుమ్మ. 

11:03 - October 28, 2015

ఈ రోజుల్లో చిన్నపిల్లలు, పెద్ద వాళ్లు అనే తేడా లేకుండా అందరూ ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో ముఖ్యమైనది జుట్టు రాలడం. ఇది కేవలం వాతావరణ కాలుష్యం వలన మాత్రమే రాదు. శారీరక, మానసిక సమస్యలు వచ్చినా కూడా జుట్టు రాలిపోతుంది. అది తగ్గాలంటే..ప్రతి రోజూ అల్లం టీ క్రమం తప్పకుండా తాగితే మాడుకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
కొందరి బుగ్గలు లోపలికి నొక్కుకుపోయి ఉంటాయి. అలాంటి వారు బుగ్గలు లావుగా అవ్వాలంటే ప్రతి రోజూ వెల్లుల్లిని నువ్వుల నూనెతో తీసుకుంటే చాలు. నెల రోజుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. ముఖం మీద మొటిమలతో బాధపడే వారు రోజూ నిద్రపోయే ముందు టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసంలో టీ స్పూన్‌ దాల్చిన చెక్క పొడి కలిపి ముఖానికి రాసుకొని, ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

11:02 - October 28, 2015

పిల్లలు..రుచికరం..ఆకర్షణీయంగా కనిపించే కూల్ డ్రింక్స్ అంటే మక్కువ పారేసుకుంటారు..అది కొనియి..ఇది కొనియి అంటూ మారం చేస్తుంటారు. మరి వారికి ఏ డ్రింక్స్ అవసరమో..వారికి ఆరోగ్యం కలిగించే డ్రింక్స్ ఏంటో కొందరికి తెలియదు. దీనితో పిల్లలకు తరచూ అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఇందుకు కొన్ని టిప్స్ చదవండి..
పిల్లల ఆరోగ్యానికి యాంటీఆక్సిడెంట్స్‌, పొటాషియం, ఎలకో్ట్రలైట్స్‌ అవసరం. వీటిలో చక్కెరపాళ్లు తక్కువ. శరీరంలో నీటిశాతం తగ్గిపోతే చర్మ, ఉదర సమస్యలు తలెత్తుతాయి. వీలైనంత వరకు ప్యాకేజ్డ్‌ డ్రింక్‌ పిల్లలకు అలవాటు చేయొద్దు. సహజ పదార్థాల నుంచి తీసిన పానీయాలను తీసుకోవడం మంచిది.
పిల్లలకు పుచ్చకాయ, మామిడి, బత్తాయి, ఆపిల్‌ జ్యూస్‌లు బెటర్‌. ఎండాకాలంలో పిల్లల దాహార్తి తీర్చేందుకు నిమ్మరసం ఇవ్వాలి.
కొందరు పిల్లలు బాదంపప్పు, జీడిపప్పు వంటి గింజల్ని తినడానికి ఇష్టపడరు. ఇలాంటి వారికి ఆల్మండ్‌ మిల్క్‌ బెస్ట్. ఇందులో ప్రొటీన్లు, న్యూట్రిన్లు అధికం. తక్కువ కొవ్వులు కలిగిన పీచుపదార్థం కూడా అందుతుంది.
ఎవరైతే పాలు తక్కువగా తాగుతారో వారికి లాక్టోజ్‌ లోపం తలెత్తుతుంది. పాలు తాగడానికి ఇష్టపడని పిల్లలు సోయామిల్క్‌ తాగాలి. సోయలో ఖనిజాలు, ప్రొటీన్లు అధికం. పిల్లల శారీరక ఎదుగుదల వేగవంతంగా వృద్ధి చెందుతుంది.
పిల్లలకు ఉదర ప్రశాంతత కావాలంటే పల్చటి మజ్జిగ తాగించాలి. కడుపులో ఎసిడిటీ తగ్గడంతో పాటు జీర్ణప్రక్రియ సుఖవంతంగా సాగుతుంది. అప్పుడప్పుడు లస్సీ కూడా తాగొచ్చు. ఇందులో పోషకవిలువలు ఎక్కువ. రుచికంటే ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇవ్వండి. చివరగా అన్నిటికంటే ముఖ్యమైనవి మంచినీళ్లు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్లెయిన్‌ ఫిల్టర్‌ వాటర్‌ తాగే విధంగా పిల్లలకు అలవాటు చేయాలి. నీటిలో ఎటువంటి క్యాలరీలు, ఎటువంటి హానికారక రసాయనాలు ఉండవు. అన్నివేళల ఆరోగ్యకరమైన డ్రింక్‌ ఏదంటే మంచినీళ్లేనని చెప్పొచ్చు. 

10:59 - October 28, 2015

నిత్యం ఆఫీసు పనులతో..బిజినెస్ లతో..ఇతర పనులు చేసే వారికి వారంలో ఒక రోజు లీవ్ దొరుకుతుంది. ఆ రోజుల్లో కూడా ఏదో ఒక పని చెబుతుంటారు. ఏసీ చెడిపోయింది..ఫ్యాన్ చెడిపోయింది..కార్..బైక్ రిపేర్..ఇలా ఎన్నో పనులు ఉంటాయి. అవన్నీ చేసుకొచ్చే వరకు ఆ ఒక్క రోజు సెలవు ఆవిరై పోతుంది. లేదా అర్జంట్ పని ఉంటే ఆఫీసుకు లీవ్ పెట్టాల్సిందే. కానీ మీ దగ్గర ఏ సమస్య ఉన్నా 'సింగిల్ క్లిక్' తో సమస్యలు పరిష్కారమౌతాయంట. మీరు చేయాల్సిందల్లా ఇండిక్రూ.కామ్‌ (www.indikrew.com) లోకి లాగిన్‌ అయితే సరిపోతుంది. హైదరాబాద్‌ జనాల కోసం తాజాగా వచ్చిన ఈ వెబ్‌పోర్టల్‌ సర్వీస్‌ సెక్టార్‌లో ట్రేడ్‌మార్క్‌గా నిలుస్తోంది. హోమ్‌ అప్లయన్స్‌ రిపేర్‌, కార్పెంటరీ, ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌, హోమ్‌ క్లీనింగ్‌, పెయింటింగ్‌, లాండ్రీ సర్వీస్‌ వంటి పనులను చిటికెలో చేసేస్తుంది. మీరు లాంగ్‌ ట్రిప్‌ వెళ్లాలనుకుంటే కారు నడపడానికి డ్రైవర్‌ కావాలన్నా పంపిస్తుంది.

ఇందుకు అనుసరించాల్సిన టిప్స్..
ఇండిక్రూ వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. మీ ప్రాబ్లమ్‌, మీ అడ్రస్‌ ఎంటర్‌ చేస్తే చాలు మీ సమస్య తీరిపోయినట్టే. టీవీ రిపేర్‌ కావొచ్చు, మరేదైనా కావొచ్చు.. మీరు కోరుకున్న సమయానికి ఆ పనిని చేయడానికి ప్రొఫెషనల్‌ వర్కర్లను పంపిస్తారు. పని పూర్తి చేసిన తర్వాత డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌ ద్వారా కూడా బిల్‌ కట్టే సదుపాయం ఉంటుంది. వెబ్‌పోర్టల్‌తో పాటు ఇండిక్రూ యాప్‌ కూడా అందుబాటులో ఉంది. ఫోన్‌లో క్లిక్‌ చేస్తే చాలు మీ ప్రాబ్లమ్‌ సాల్వ్‌ అయిపోతుంది. ప్రస్తుతానికి హైదరాబాద్‌ నగరానికి మాత్రమే పరిమితంగా ఉన్న ఈ ఆన్‌లైన్‌ సేవ.. రానున్న రోజుల్లో మరిన్ని పట్టణాలకు విస్తరించే దిశగా ప్లాన్‌ చేస్తున్నారు. 

10:58 - October 28, 2015

ఓటర్‌ జాబితాలో మీ పేరుందా ? లేదా ? తెల్సుకునేందుకు జీహెచ్‌ఎంసీ అవకాశం కల్పిస్తోంది. నవంబర్‌ 1వ తేదీన నిర్వహిస్తోన్న ప్రత్యేక ప్రచార దినోత్సవంలో భాగంగా మీ సమీపంలోని పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటు హక్కు వివరాలు తెల్సుకోవచ్చు. నూతన ఓటర్ల నమోదు, సవరణ, తొలగింపు, చిరునామా మార్పు, ఫొటోల సవరణకూ అవకాశం ఉంది. నగరంలోని 15 నియోజకవర్గాల పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఓటర్ల ముసాయిదా జాబితాతో పాటు ఫారం, 6, 7, 8, 8ఏలూ అందుబాటులో ఉంటాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఓటర్ల నమోదు, సవరణకు నవంబర్‌ 4వ తేదీని ఎన్నికల సంఘం చివరి గడువుగా నిర్ణయించిందని చెప్పారు.

తెలంగాణలో పాలన గాడి తప్పింది - కిషన్ రెడ్డి..

వరంగల్ : టీఆర్ఎస్ పాలన గాడి తప్పిందని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఎండగట్టారు. 139 హామీలిచ్చిన సర్కార్ అందులో కేవలం 34 అమలు చేసిందని దుయ్యబట్టారు. కేసీఆర్ మాటలకు..చేతలకు పొంతన లేదని, మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించడానికి కేసీఆర్ కు మనసొప్పడం లేదన్నారు. ఈ ప్రభుత్వానికి ట్రీట్ మెంట్ అవసరమని తెలిపారు. 

ఉప ఎన్నిక..రసకందాయంలో కాంగ్రెస్…

వరంగల్ : ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ ఏటూ తేల్చుకోలేకపోతోంది. స్థానిక నేతలకు టికెట్ ఇవ్వాలని అధిష్టానంపై పొన్నాల, గండ్ర, బస్వరాజులు వత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక కోటా రాజారపు ప్రతాప్, స్థానికేతర కోటాలో సర్వే పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేరును పరిశీలించాలని కాంగ్రెస్ మాజీ ఎంపీల బృందం సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను కోరినట్లు తెలుస్తోంది. 

బై పోల్..టీఆర్ఎస్ కసరత్తు మొదలు..

వరంగల్ : ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ కసరత్తును మొదలు పెట్టింది. స్థానిక కోటాలో జకార్యా, గుడిమల్ల రవికుమార్ పేర్లు..స్థానికేతర కోటాలో ఎర్రోళ్ల శ్రీనివాస్, జేఏసీ నుండి ప్రొ.సాంబయ్య పేర్లను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎర్రోళ్ల శ్రీనివాస్ వైపు కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 

ప్రారంభమైన సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశాలు..

ఢిల్లీ : సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అధ్యక్షతన జరిగే ఈ సమావేశాలు రెండు రోజుల పాటు జరుగనున్నాయి. 

10:51 - October 28, 2015

మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వాలని భారత రాజ్యాంగం చెప్పలేదని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ విశ్లేషణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముస్లీములకు మతపరమైన రిజర్వేషన్లు లేవని.. కేవలం వెనుకబాటుతనం వల్లే రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు. మరిన్ని వివరాలను అయన మాటల్లోనే..
మతం ఆధారితంగా రిజర్వేషన్లు సాధ్యం కాదు 
భారతరాజ్యాంగం ప్రకారం మతం ఆధారితంగా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. మతం ఆధారంగా కూడా రిజర్వేషన్లను తిరస్కరించరాదు.  సచార్ కమిటీ, రంగనాథ్ కమిటీల ప్రకారం.. ముస్లీంల్లో నిర్దిష్ట వెనుకబాటు తనాన్ని గుర్తించి వారికి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పింది. దేశంలో ముస్లీంలోని అనేక గ్రూపులు రిజర్వేషన్లు పొందుతున్నాయి. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వరాదు.. తొలగించరాదు. మండల్ కమిషన్ తర్వాత యుపిలో రిజర్వేషన్లు వచ్చాయి. బిసి రిజర్వేషన్ వ్యతిరేక పోరాటం నుంచి యుపిలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వచ్చింది.
ప్రజలను భ్రమల్లో పెట్టరాదు...
అనవసరంగా ప్రజల్లో ఆశలు పెంచరాదు. ప్రజలను భ్రమలో ఉంచరాదు. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం, సామాజిక అణచివేత.. ఉండడం వల్లే రిజర్వేషన్లు కల్పించారు. భారతదేశంలో ముస్లీం మతంపై అణచివేత లేదు. మతం ఆధారంగా రిజర్వేషన్లు అనే వివాదాలు.. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి దోహదం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, వెంకయ్యనాయుడు రాజ్యాంగం ప్రకారం మాట్లాడడం లేదు. రాజకీయంగా మాట్లాడుతున్నారు.
టీసర్కార్ పై అసంతృప్తి..
టీసర్కార్ పై ప్రజల్లో అసంతృప్తి ఉంది. కానీ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత రాలేదు. కేసీఆర్ కు తెలంగాణ తెచ్చిన ఇమేజ్ ఉంది. ప్రతిపక్షాలు ఇంకా ప్రజలకు విశ్వాసాన్ని ఇవ్వలేకపోతున్నాయి. కేసీఆర్ కు ఆల్టర్ నేటివ్ నాయకున్ని చూపించలేకపోతున్నాయి. కానీ ప్రభుత్వంపై పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. ప్రజల్లో ప్రశ్నలు మొదలయ్యాయి. నిరుద్యోగులు, రైతులు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు ఆసంతృప్తిగా ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. దళితులకు భూములు పంచ లేదు. అయితే అసంతృప్తి ఘనీభవంచి... దీనికి రాజకీయరూపం వస్తుందా లేదా చూడాలి. అయితే ఇప్పటికిప్పుడు టీసర్కార్ ను ఓడించే పరిస్థితి లేదు'. అని వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నగరానికి ప్లారమెంటరీ స్థాయి సంఘం..

హైదరాబాద్ : తెలంగాణ,ఏపీ రాష్ర్టాల్లో విద్యావ్యవస్థ పరిస్థితిపై సమీక్ష నిర్వహించేందుకు ఇవాళ పార్లమెంటరీ స్థాయి సంఘం హైదరాబాద్‌కు రానుంది. హెచ్‌సీయూతోపాటు ఇతర యూనివర్సిటీల అధికారులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులతో 31మందితో కూడిన సభ్యుల బృందం సమావేశం కానుంది.

 

నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం..

ముంబై : స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 130 పాయింట్లకు పైగా నష్టంలో ప్రారంభమవగా.. నిఫ్టీ 30పాయింట్లకు పైగా నష్టంలో ప్రారంభమైంది.

 

వెంకటాపురంలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు ఈటెల శంకుస్థాపన..

హైదరాబాద్ : అల్వాల్‌లోని వెంకటాపురం హరిజన బస్తీలో మంత్రి ఈటల రాజేందర్ డబుల్ బెడ్‌రూం ఇళ్లకు శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కనకారెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

 

10:30 - October 28, 2015

తెలంగాణలోని వరంగల్ లో జరగనున్న ఉప ఎన్నికపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు నడింపల్లి సీతారామరాజు, టీఆర్ ఎస్ నేత తాడురు శ్రీనివాస్, టిడిపి నాయకురాలు సుజాత, కాంగ్రెస్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ రాజు, వైసిపి నేత గౌతంరెడ్డి పాల్గొని, మాట్లాడారు. ఎపి రాజధాని అమరావతి నిర్మాణం, భూసేకరణ, శంకుస్థాపన కార్యక్రమం వంటి పలు అంశాలపై వక్తలు మాట్లాడారు. ఆ వివవరాలను వీడియోలో చూద్దాం....

 

వరల్డ్ బ్యాంక్ ర్యాకింగ్ లో భారత్ మెరుగు..

ఢిల్లీ : ప్రపంచ బ్యాంకు ర్యాకింగ్ లో భారత్ ర్యాంకు మెరుగు పడింది. వ్యాపార అనుకూల దేశాల జాబితాలో ర్యాంకు మెరుగు పడింది. 142వ స్థానంలో ఉన్న భారత్ 130కి ఎగబాకింది. అగ్రస్థానంలో సింగపూర్ కొనసాగుతుండగా ద్వితీయ స్థానంలో న్యూజిలాండ్, మూడో స్థానంలో డెన్మార్క్ దేశాలు కొనసాగుతున్నాయి. భారత్ పొరుగు దేశమైన పాకిస్తాన్ పది స్థానాలు దిగజారింది. గత ఏడాది 128వ స్థానంలో ఉంది. 

నేడు పలువురు పెద్దలతో కేసీఆర్ భేటీ..

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఉదయం 11.30గంటలకు భేటీ కానున్నారు. అనంతరం ప్రకాశ్ జవదేకర్ తోనూ భేటీ కానున్నారు. అనంతరం మధ్యాహ్నాం 1.30గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలువనున్నారు. సాయంత్రం హైదరాబాద్ కు పయనం కానున్నారు.

 

భవనం ఎక్కిన ప్రేమ..

విశాఖపట్టణం : అక్కయ్యపాలెం అబిత్ నగర్ పార్కు వద్ద భవనం పై నుండి దూకుతానని యువకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రేమించిన అమ్మాయితో వివాహం జరిపించాలని యువకుడు డిమాండ్ చేస్తున్నాడు.

 

రూ.2కోట్లు మోసం చేసిన విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగి అరెస్టు..

విశాఖపట్టణం : చిట్టీల పేరిట రూ. 2 కోట్లు మోసం చేసిన విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగి కనకరాజును పోలీసులు అరెస్టు చేశారు. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుండగా నడక దారి భక్తుల దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. 

09:46 - October 28, 2015

దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ కేవీపీఎస్ నేత మాల్యాద్రి అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. దళితులపై వివక్ష కొనసాగుతోందని, అంటరానితనాన్ని పాటిస్తున్నారని పేర్కొన్నారు. దళితులపై కుల వివక్షత, అంటరాని తనాన్ని రూపుమాపాలని కోరారు. 'మన దేశంలో సామాజిక అశాంతి, సంఘర్షణలు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులు మన దేశం ఎటు వెళ్తోందన్న అనుమానం కలిగిస్తోంది. ప్రస్తుతం దళితులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? దళితులపై దాడులకు కారణం ఏమిటి? వీటికి బాధ్యులెవరు? ఈ దాడులు దళితుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి?' అనే పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:29 - October 28, 2015

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ ఇలా వివిధ రాష్ట్రాల్లో గత కొంతకాలంగా దళితులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తమ పార్టీ అధికారంలో వున్న రాష్ట్రాల్లోనూ, అత్యధిక ఎంపీ సీట్లు కట్టబెట్టిన రాష్ట్రాల్లోనూ దళితుల మీద వరుస దాడులు జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోడీ మౌనం వహించడం అనేక విమర్శలకు తావిస్తోంది.
దళితులను ఓటుబ్యాంక్ లుగా పరిగణిస్తున్న రాజకీయపార్టీలు
దళితులను చాలా రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంక్ లుగా పరిగణిస్తుంటాయి. ఎన్నికల సమయంలో దళితులను ఆకట్టుకునేందుకు అనేక వాగ్ధానాలు చేస్తుంటాయి. అధికారంలోకి వచ్చీ రాగానే తామిచ్చిన హామీలను అమలు చేయకపోవడం మనం చూస్తున్నదే. ఉదాహరణకు తెలంగాణనే తీసుకుంటే, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్నది టీఆర్ఎస్ ఎన్నికల వాగ్ధానం. కానీ, అది అమలుకునోచుకోవడం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ బ్యాంకింగ్ వ్యవహారం తమకున్న కొద్దిపాటి భూములకు కూడా ఎసరు పెడుతోందన్నది దళితుల ఆవేదన. ఓట్ల పండుగ ముగిసిన తర్వాత, తమకు దక్కాల్సిన ఓట్లు తమకు దక్కిన తర్వాత అధికార పార్టీలకు దళితులు కనీసం మనుషులుగా కనపడరన్న విమర్శలకు ఇలాంటి విధానాలు మరింత బలాన్నిస్తున్నాయి.
యుపి, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఘోర సంఘటనలు
ఎన్నికల ముందు దళితుల ఓట్ల కోసం ప్రాధేయపడ్డ రాజకీయ పార్టీలే ఎన్నికల ముగిసి, ఫలితాలు వచ్చిన మరుక్షణమే దళితుల మీద దాడులు చేసిన సంఘటనలు మన దేశంలో చాలా వున్నాయి. కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు జరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ఘోర సంఘటనలు మనం ఏ కాలంలో జీవిస్తున్నామన్న ఆవేదన కలిగిస్తున్నాయి. దళిత స్త్రీలను వివస్త్రలను చేయడం, మూత్రం తాగించడం లాంటి అనాగరిక, ఆటవిక చేష్టలు ఇటీవల కాలంలో మరింత పెరిగాయి. 2010లో దళిత మహిళలపై 511 అత్యాచారాల కేసులు నమోదైతే, 2014లో ఆ సంఖ్య రెండు వేల రెండు వందలు దాటింది. అంటే నాలుగేళ్లల్లో నాలుగు రెట్ల అత్యాచారాలు పెరిగాయి. ఒక అంచనా ప్రకారం మన దేశంలో ప్రతి రోజూ ముగ్గురు దళిత స్త్రీల మీద అత్యాచారం లాంటి తీవ్ర నేరం జరగుతోంది. వారానికి ముగ్గురు దళితులు హత్యలకు గురవుతున్నారు. 2014లో జరిగిన ఒక సర్వే ప్రకారం మన దేశంలో మధ్యలోనే స్కూలు మానేస్తున్న విద్యార్థుల్లో సగం మంది దళిత బిడ్డలే కావడం వారు ఎదుర్కొంటున్న దురావస్థకు నిదర్శనం. 35శాతం స్కూళ్లల్లో దళిత విద్యార్థులకు విడిగా భోజనం పెడుతున్నారన్నది మరో సర్వే సారాంశం.
అంటరానితనం సమస్యను ఎదుర్కొంటున్న 27శాతం మంది దళితులు
దాదాపు 27శాతం మంది దళితులు ఇప్పటికీ అంటరానితనం సమస్యను ఎదుర్కొంటున్నట్టు మరో సర్వే వెల్లడించింది. క్లాసు రూంలో 79శాతం మంది దళిత విద్యార్థులు వెనక్కి బెంచీలలోనే సర్దుకోవాల్సి వస్తోంది. ఇలాంటి సంఘటనలన్నీ దళిత చిన్నారులను ఎంతగా మానసిక వేదనకు గురిచేస్తున్నాయో, వారిలో ఎంతటి ఆత్మనూణ్యతా భావాన్ని పెంచుతున్నాయో. మరోవైపు దళితులను శారీరకంగా హింసించే ధోరణి పెరుగుతోంది.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దురాగతాలు
రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్ గఢ్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దురాగతాలు ఎక్కువగా జరుగుతున్నట్టు అధికారిక గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. నిజానికి నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న వాతావరణం ఏర్పడ్డ రోజుల్లోనే ఇలాంటి కీడును చాలామంది విజ్జులు ఊహించారు. దళితుల, ఆదివాసీల, మైనార్టీల జీవితాలు మరింత దుర్భరంగా మారుతాయోమనని కలవరపడ్డారు.
కేంద్రమంత్రులు అనుచిత వ్యాఖ్యలు
అలాంటి భయాలను నిజం చేస్తూ దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నా, వాటి కట్టడికి నరేంద్రమోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం, వీకే సింగ్ లాంటి కేంద్రమంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేస్తుండం అధికార పార్టీ శీలాన్నే శంకింపచేస్తున్నాయి. సంపూర్ణ మెజార్టీతో తొలిసారిగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, దాని మద్దతుదారులు దళితులు, మైనార్టీలు, స్త్రీల విషయంలో ప్రవర్తిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు తరచూ వివాదస్పదమవుతున్నాయి. తనకు అధికారమిస్తే అచ్చేదిన్ తీసుకొస్తానన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇలాంటి అమానవీయ సంఘటనల పట్ల ఎందుకు మౌనంగా వుంటున్నారన్నదే ప్రశ్న. అధికారంలో వున్నవారు రాజనీతజ్ఞతను ప్రదర్శించాలి తప్ప దురహంకారమూ, సామాజిక శాంతికి భగ్నం కలిగించేవారి పట్ల మౌనమూ ప్రదర్శించకూడదని ప్రధాని మోడీకి ఎవరు చెప్పాలి. కమలదళంలో అత్యంత సౌమ్యుడిగా పేరొందిన మాజీ ప్రధాని వాజ్ పేయి తాను అధికారంలో వున్న రోజుల్లో గుజరాత్ సీఎంగా వున్న మోడీకి చేసిన హెచ్చరిక కూడా ఇదే కదా.

 

బీహార్ లో కొనసాగుతున్న పోలింగ్

పాట్నా : బీహార్ లో మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. 14,170 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 50 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బరిలో 808 మంది అభ్యర్థులు ఉన్నారు.

09:10 - October 28, 2015

ముంబై : దాదాపు 22 నెలల తర్వాత సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అనూహ్య కేసులో నిందితుడిని న్యాయస్థానం దోషిగా తేల్చింది ...దోచుకునేందుకు తీసుకెళ్లి కిరాతకానికి పాల్పడ్డ చంద్రభాన్‌కు శిక్ష మరికొన్ని గంటల్లో ఖరారు చేయనుంది. క్రిస్మస్‌ సెలవులకు స్వగ్రామం కృష్ణాజిల్లాకు వచ్చి ఉద్యోగం కోసం ముంబాయి వెళ్లిన అనూహ్య దుర్మార్గుడి చేతికి చిక్కి బలయింది. ఈ కేసులో వాదోపవాదాలు విన్న కోర్టు దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేయనుంది.
అనూహ్య కేసులో చంద్రభాన్‌ దోషిగా తేల్చిన కోర్టు
సంచలనం సృష్టించిన సాఫ్ట్ వేర్‌ ఉద్యోగిని అనూహ్య కేసులో కోర్టు తీర్పును బుధవారం ఖరారు చేయనుంది. దాదాపు 22 నెలలపాటు జరిగిన విచారణలో వాదోపవాదాలు విన్న ముంబాయి సెషన్స్‌ కోర్టు అనూహ్య కేసులో నిందితుడు చంద్రభాన్‌ను దోషిగా తేల్చింది.
సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని కనుగొన్న పోలీసులు
కృష్ణా జిల్లా మచిలీపట్నం చెందిన ముంబాయిలోని టీసీఎస్‌లో సాఫ్ట్ వేర్‌ ఉద్యోగం చేస్తున్న ఎస్తేర్‌ అనూహ్య 2013 డిసెంబర్‌లో క్రిస్మస్‌ సంబరాలు జరుపుకునేందుకు స్వగ్రామం చేరింది. ఆ తర్వాత సెలవులు ముగియడంతో తిరిగి ముంబై బయల్దేరింది...2014 జనవరి 5న ముంబాయి చేరుకున్న అనూహ్య చంద్రభాన్‌ కంటపడి బలయింది...దాదాపు 11 రోజుల తర్వాత అనూహ్య జాడ తెలియక అప్పట్లో సంచలనం రేపింది. ముంబాయి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అనూహ్య దిగిన రైల్వే స్టేషన్‌లో సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని కనుగొన్నారు. ఈ కేసులో చంద్రభాన్ సనప్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. జరిగిన ఘటనపై ముంబాయి పోలీసులు అన్ని ఆధారాలతో కోర్టుకు సమర్పించారు. చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత జరిగిన వాదోపవాదాల అనంతరం ముంబయి సెషన్స్ కోర్టు చంద్రభాన్‌ను దోషిగా నిర్ధారించింది. పలు రకాల నేరాలకు పాల్పడినట్లు పోలీసులు కేసులు నమోదు చేశారు. వీటిన్నింటిని పరిశీలించిన ముంబయి సెషన్స్ కోర్టు ప్రత్యేక మహిళా న్యాయస్థానం న్యాయమూర్తి వృషాలి జోషీ చంద్రభాన్‌ను నేరగాడిగా నిర్ధారించారు.
దోషికి నేడు శిక్ష ఖరారు..
దోషికి బుధవారం శిక్షను ఖరారు చేయనుంది. ఎంతో కాలంగా అనూహ్య కన్నవారితో పాటు బంధుమిత్రులు ఈ కేసులో నిందితుడికి శిక్ష పడాలని ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో చంద్రభాన్‌కు శిక్ష ఖరారు కానుంది.

 

09:01 - October 28, 2015

నెల్లూరు : జిల్లాకు చెందిన సీనియర్ సిపిఐ నేత పి.దశరథ రామయ్యపై హత్యాయత్నం జరిగింది. సౌత్ మోపూరు గ్రామానికి చెందిన బట్టేపాక ప్రతాప్ అనే వ్యక్తి దశరధ రామయ్యపై గునపంతో దాడి చేశాడు. ఈ దాడిలో దశరథ రామయ్య చేతికి గాయమైంది. నిందితుడు పరారీలో ఉన్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

08:52 - October 28, 2015

చిత్తూరు : తిరుమల అన్నమయ్యభవన్‌లో సమావేశమైన టీటీడీ పాలకమండలి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతిలో శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్‌ ఏర్పాటు చేయాలని పాలకమండలి నిర్ణయించింది. మరోవైపు శ్రీవారి లడ్డూ ప్రసాదం, ఆర్జిత సేవలు, గదుల ధరల పెంపుపై దృష్టి సారించారు. సమగ్ర అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వచ్చే పాలకమండలి సమావేశం వరకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వీటిపై వచ్చే పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
హైదరాబాద్‌ బంజారాహిల్స్ లో శ్రీవారి ఆలయం
ఇక ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని టీటీడీ కళ్యాణ మండపాలకు ఏసీ సదుపాయం కల్పించాలని పాలకమండలి తీర్మానించింది. అలాగే హైదరాబాద్‌ బంజారాహిల్స్ లో 3.5 ఎకరాల విస్తీర్ణంలో 13.89 కోట్లతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు.
అరవింద్‌ కంటి ఆస్పత్రికి 7 ఎకరాల స్థలం
ఇక తమిళనాడులో పేరున్న అరవింద్‌ కంటి ఆస్పత్రికి చెందిన ఆస్పత్రి నిర్మాణం కోసం తిరుపతిలో ఏడెకరాల స్థలం కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకుగాను ఆస్పత్రి నిర్వాహకులు టీటీడీకి ప్రతి ఏటా ఎకరానికి లక్ష రూపాయలు చెల్లించే విధంగా షరతు విధించారు. అలాగే టీటీడీ ఉద్యోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించనున్నారు. ఇక టీటీడీకి అవసరమైన 41.43 లక్షల లీటర్ల పాల కొనుగోలు కోసం 12.1 కోట్ల రూపాయలు కేటాయిస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఆస్పత్రుల్లో మందుల కొనుగోలుకు 1.24 కోట్లు, తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో అదనపు క్వార్టర్ల నిర్మాణానికి పాలకమండలి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏది ఏమైనా త్వరలోనే లడ్డూ, ఆర్జిత సేవలు, గదుల అద్దెలు పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

 

08:43 - October 28, 2015

హైదరాబాద్ : కొత్త బడ్జెట్‌పై ప్రతిపాదనలకు తెలంగాణ సర్కార్‌ రెడీ అయ్యింది. సచివాలయంలోని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో ఆర్ధికశాఖ స్పెషల్‌ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర సమావేశమయ్యారు. రాబోయే బడ్జెట్‌ ప్రతిపాదనలన్నీ వాస్తవంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రతి శాఖలో అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు.
ఫైనాన్స్ డిపార్ట్ మెంట్‌లో రూల్స్ మార్పు
ఇక ఫైనాన్స్ డిపార్ట్ మెంట్‌లోని రూల్స్ మార్చాలని డిసైడ్‌ అయ్యారు. నిధుల విడుదలలో జాప్యం జరుగుతుందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా నవంబర్‌ 9 నుంచి ప్రభుత్వ పథకాల ఖాతాలన్నీ ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ చేయాలని నిర్ణయించారు.
తెలంగాణ అప్పు రూ.69 వేల కోట్లు
ఇక సమావేశంలో.. రాష్ట్రంలోని ఆస్తులు, అప్పులపై ప్రధానంగా చర్చ జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం లక్షా 66 వేల 512 కోట్ల అప్పులో.. లక్షా 48 వేల 60 కోట్ల అప్పులను విభజన చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా విభజించాల్సిన 18 వేల 462 కోట్ల అప్పులను త్వరలోనే విభజించనున్నట్లు తెలిపారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి 69 వేల కోట్ల అప్పులు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
ఈసారి పెరగనున్న బడ్జెట్‌
రాబోయే బడ్జెట్‌ వాస్తవికంగా ఉండేలా ఆర్ధికశాఖ ప్లాన్‌ చేస్తోంది. ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయాలను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. గత ఐదేళ్ల నుంచి కొనసాగుతున్న పథకాలను కేంద్రం ఆదేశాల మేరకు ప్రణాళికేతర వ్యయం కింద చేర్చే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. ఇక బడ్జెట్‌ ప్రతిపాదనలకు ఇప్పటినుండే కసరత్తు మొదలుపెట్టాలని ఆర్ధికశాఖ అన్ని శాఖలకు సూచించింది. గతేడాది కంటే ఈసారి బడ్జెట్‌ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరిగేషన్‌, విద్య, డబుల్‌ బెడ్‌రూమ్‌, పంచాయతీరాజ్‌, రోడ్లు, భవనాలు, ఆరోగ్యం, వ్యవసాయంతో పాటు సంక్షేమ రంగాలకు సర్కార్‌ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనుంది.
కేంద్ర ఆర్ధిక సాయం.. బడ్జెట్ అంచనా..
ఇదిలా ఉంటే.. కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం చేసే ఆర్ధిక సాయం విషయంలో క్లారిటీ వస్తుందని.. దానిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ అంచనా వేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైనా గొప్పలకు పోయి కష్టాలు కొని తెచ్చుకోవద్దని ఆర్ధికశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి

ఖమ్మం : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందాడు. కుంట నుంచి ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌కు వెళ్తుండగా మార్గంమధ్యలో తల్లాడ మండలం మంగాపురం వద్ద వేగంగా వస్తున్న లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవరు పాషా మృతి చెందాడు. మరో ఇద్దరు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

07:58 - October 28, 2015

గుంటూరు : ఏపీ కొత్త రాజధాని అమరావతి మరో పర్యావరణ విధ్వంసానికి చిరునామాగా మారబోతోందా? రాజధాని ప్రాంత ఎంపికకు ముందు పర్యావరణ అనుకూలతలపై ఏపీ సర్కార్ గ్రీన్ ట్రిబ్యునల్ కు సమాచారం ఇవ్వలేదా? రాజధానిలో అసలు ఏం జరుగుతోంది..? స్పెషల్ రిపోర్ట్..
రాజధాని పేరుతో అటవీ చట్టాల ఉల్లంఘిన
అంతర్జాతీయ స్థాయిలో అమరావతి నిర్మాణం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. ఆయన కోరికకు తగినట్లుగా నిర్మాణాల ప్లాన్ నడుస్తోంది. అయితే రాజధాని పేరుతో జరిగే ఈ విధ్వంసం.. అటవీ చట్టాలను ఉల్లంఘించడమవుతోందని పర్యావరణ వేత్తలు వాదిస్తున్నారు. నరికిన చెట్లకు బదులుగా చుట్టుపక్కల రెట్టింపుగా చెట్లు నాటడం చేయాలని సూచిస్తున్నారు.
అమరావతి నిర్మాణంలో కోటి చెట్ల నరికివేత
అమరావతి నిర్మాణంలో భాగంగా దాదాపు కోటి చెట్లను నరికేస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. అందులో టేకు, యూకలిప్టస్, చందనం, వేప చెట్లున్నాయి.. దానికి ప్రతిగా చుట్టుపక్కల మొక్కలు వేసినా అవి చెట్లయ్యే సరికి చాలా సమయం పడుతుంది.. ఈ మొక్కలపెంపకంపై ప్రభుత్వానికి శ్రద్ధలేదంటూ గ్రీన్ ట్రిబ్యునల్ లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. అందులోనూ విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాల్లో గాలిలో తేమశాతం ఎక్కువ.. దీంతో సంవత్సరంలో అధికభాగం వేడి, ఉక్కపోత ఉంటాయి.. ఇప్పుడు రాజధాని నిర్మాణం పేరుతో చెట్లను నరికేస్తే వాతావరణ సమతుల్యత దెబ్బతినడం ఖాయమన్న వాదనలొస్తున్నాయి. వీటితోపాటు జీవించే పక్షులు, జంతువులకు ఆసరా లేక జీవన సమతుల్యతకు పెను ముప్పనేది అంతర్జాతీయ మీడియాలో కథనాల సారాంశం.
ఏపీ ప్రభుత్వ విధానాలపై గ్రీన్ ట్రిబ్యునల్ అసంతృప్తి
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా రాజధాని ప్రాంత ఎంపిక, ఏపీ ప్రభుత్వ విధానాలపై అసంతృప్తిగా ఉందన్న వార్తలొస్తున్నాయి.. రాజధాని చుట్టుపక్కల నిర్మాణాలకు అదనంగా 20 వేల హెక్టార్లు అంటే దాదాపు 49 వేల ఎకరాల రిజర్వు ఫారెస్టు భూమి ఇవ్వాలని ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు.. మరో వైపు గ్రీన్ ట్రిబ్యునల్ కృష్ణానది కాలుష్యంపై ఆందోళన చెందుతోంది.. దీంతో నిర్మాణానికి పూర్తి స్థాయి పర్యావరణ అనుమతులు కావాలంటే 90 షరతులు పాటించాల్సిందేనంటూ ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.. ఈ షరతులకు లోబడే అమరావతి ఏరియా డెవలప్ మెంట్ ప్లాన్ అమలు పరచాలని గ్రీన్ ట్రిబ్యునలో భాగమైన స్టేట్ ఎన్విరాన్ మెంటల్ ఇంపాక్ట్ అసెస్స్ మెంట్ అథారటీ స్పష్టంగా చెప్పిందంటున్నారు.
మురుగు నీరు కృష్ణానదిలోకి వెళ్లకుండా చూడాలని సూచన
అమరావతి తాగునీటి అవసరాలకు కృష్ణానదే దిక్కు.. అలాగే వాడే నీరు, మురుగు నీరు మళ్లీ కృష్ణానదిలోకి వెళ్లకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని గ్రీన్ ట్రిబ్యునల్ సూచించింది.. వర్షాకాలంలో కొండవీటి వాగు పొంగి పొర్లకుండా చూసుకోవాలి. రాజధాని నిర్మాణంలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో చేపట్టే నిర్మాణాలకు ఖచ్చితంగా ప్లై యాష్ తో తయారు చేసిన ఇటుకలనే ఉపయోగించాలని చెబుతోంది.... థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ తయారీ తర్వాత ఈ ఫ్లై యాష్ వ్యర్థంగా విడుదలవుతుంది.. దీనికి పర్యావరణ అనుకూలత ఉంటుందని గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. వేసవి జీవ వైవిధ్యానికి విరుద్ధంగా ఎలాంటి నిర్ణయాలు జరగకూడదు.
సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు
అలాగే ఈ ప్రాంతంలో వచ్చే పరిశ్రమలు వాటి విద్యుత్, మిగతా అవసరాలకు ఖచ్చితంగా సోలార్ ప్యానెల్స్ నే ఉపయోగించుకోవాలి.. పై కప్పుల్లో మూడో వంతు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలి.. పరిశ్రమల నిర్మాణంలో జీవ వైవిధ్యానికి విరుద్ధంగా ఎలాంటి నిర్ణయాలు జరగకూడదు.. దీనిపై ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక కమిటీ పర్యవేక్షిస్తుంది. ఒక వైపు అంతర్జాతీయ రాజధానంటూ బాబు సర్కార్ హడావుడి చేస్తున్నా అనుకున్న స్థాయిలో పర్యావరణ ప్రమాణాలు పాటించడం లేదనే గ్రీన్ ట్రిబ్యునల్ అభిప్రాయం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

07:45 - October 28, 2015

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలకు తెలుగు ప్రభుత్వాల వైఫల్యమే కారణమని గ్రామీణ పరిశోధన పాత్రికేయులు పాలగుమ్మి సాయినాథ్ ఆరోపించారు. చెన్నై రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ సాయినాథ్‌ను 'ఫర్ ది సేక్ ఆఫ్ ఆనర్‌' అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా సాయినాథ్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడాలేనివిధంగా వేలాది ఎకరాలను రాజధానికోసం బలవంతంగా లాక్కోవడం అధికార దాహానికి నిదర్శనమని మండిపడ్డారు. రెండువేల ఎకరాల రాజధాని కోసం వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేట్ వ్యక్తుల సౌలభ్యం, సర్కారు లాభాపేక్షకోసమే ప్రభుత్వం ఇలా చేస్తుందన్నారు.

 

బీహార్ లో మూడో దశ పోలింగ్ ప్రారంభం..

పాట్నా : బీహార్ లో మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. 14,170 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 50 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బరిలో 808 మంది అభ్యర్థులు ఉన్నారు.

07:33 - October 28, 2015

హైదరాబాద్‌ : నగరంలో 8వ జాతీయ విత్తన సదస్సు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే సదస్సును తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. పలు కార్పొరేట్‌ విత్తన సంస్థలతో పాటు.. వివిధ రాష్ట్రాల్లో విత్తన రంగంలో కృషి చేస్తున్న సైంటిస్టులూ ఈ సదస్సుకు హాజరయ్యారు. విత్తన భాండాగారంగా మార్చేందుకు అనువైన వాతావరణం తెలంగాణలో ఉందని.. ఇటువంటి శీతోష్ణస్థితి ఆసియా ఖండంలో ఎక్కడా లేదని మంత్రి పోచారం చెప్పారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకుని రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మారుస్తామన్నారు. రైతుల ఆత్మహత్యలు విచారకరమన్న మంత్రి.. అరగంటకు ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకుంటున్నాడని చెప్పారు. ఇలాంటి కుటుంబాలకు పరిశోధన ఫలాలు చేరాలని.. వారిని అన్ని రకాలుగా ఆదుకోవాలని అన్నారు.
మెరుగైన పరిశోధనలు అవసరం : బ్రాడ్ ఫోర్డ్
అమెరికాలో పబ్లిక్‌, ప్రైవేటు రంగంలో విత్తన ఉత్పత్తి చేస్తున్నట్లు కాలిఫోర్నియా వర్శిటీ ప్రొఫెసర్‌ బ్రాడ్‌ ఫోర్డ్ తెలిపారు. తెలంగాణలోని పరిస్థితులతో అంతర్జాతీయ స్థాయికి చేరాలంటే.. మెరుగైన పరిశోధనలు అవసరమని అన్నారు.
కార్పొరేట్‌ విత్తన కంపెనీల సందడే
సదస్సును సీఎం కేసీఆర్‌, కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ ప్రారంభించాల్సి ఉంది. అయితే.. వివిధ కారణాల వల్ల వారిద్దరూ రాకపోవడంతో.. విత్తన సదస్సు మొక్కుబడిగా ప్రారంభమైంది. మరోవైపు నిర్వాహకులు.. రైతులను, రైతు సంఘాలను ఆహ్వానించనేలేదు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కార్పొరేట్‌ విత్తన కంపెనీల సందడే కనిపించింది. వేదికపైనా తెలుగు రాష్ట్రాలకు చెందిన విత్తన కంపెనీల అధినేతల హవాయే సాగింది. మొత్తమ్మీద సదస్సు... రైతుల కోసమా కార్పోరేట్ కంపెనీల కోసమా అనే గుసగుసలు వినిపించాయి.

 

వరంగల్ ఉపఎన్నిక అభ్యర్థుల నివేదికను నేడు సోనియా,రాహుల్ కు అందజేత

ఢిల్లీ : వరంగల్ ఉప ఎన్నిక అభ్యర్థుల నివేదికను నేడు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమారెడ్డి అందజేయనున్నారు. 

Don't Miss