Activities calendar

30 October 2015

21:06 - October 30, 2015

హైదరాబాద్ :వరంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్‌ పేరు ఖరారు చేసినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. గుడిమళ్ల రవికుమార్ వైపు కేసీఆర్ మొగ్గు చూపినా, కులవివాదం కారణంగా చివరి నిమిషంలో తెరపైకి దయాకర్‌ పేరు వచ్చింది. పసునూరి తెలంగాణ తల్లి విగ్రహ సృష్టికర్త, 2001లో టిఆర్ ఎస్ చేరారు. వర్ధన్నపేట టిఆర్ ఎస్ ఇంచార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం టిఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు. 2009,14 ఎన్నికల్లో పసునూరికి అసెంబ్లీ టికెట్ తృటిలో చేజారింది.

40 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం..

హైదరాబాద్ : బంగ్లాదేశ్ నుండి భారత్కు తరలిస్తున్న 10 కిలోల కొకైన్ను సరిహద్దులో బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర పరగణాల జిల్లాలో భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులో బంగ్లాదేశ్ నుండి వచ్చిన ఓ ట్రక్కులో పౌడర్ను గుర్తించిన బీఎస్ఎఫ్ అధికారులు దానిని స్వాధీనం చేసుకొని, టెస్టింగ్ కోసం నార్కోటిక్ లాబొరేటరీకి పంపించారు. నార్కోటిక్ ఫలితాలలో ఆ పౌడర్ నిషిద్ద కోకైన్గా తేలిందనీ, దాని విలువ సుమారు 40 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

తెలంగాణ లో భారీగా ఐఏఎస్ ల బదిలీలు..

హైదరాబాద్ : తెలంగాణలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ .... దాదాపు ముఖ్యమైన శాఖల కార్యదర్శులందరినీ బదిలీ చేశారు. సీసీఎల్ఏగా రేమండ్ పీటర్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా ఎస్పీ సింగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా సురేష్ చందాలను బదిలీ చేశారు.

వారి వివరాలు..

వరంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్‌

 హైదరాబాద్ : వరంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్‌ పేరు ఖరారు చేసినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. గుడిమళ్ల రవికుమార్ వైపు కేసీఆర్ మొగ్గు చూపినా, కులవివాదం కారణంగా చివరి నిమిషంలో తెరపైకి దయాకర్‌ పేరు వచ్చింది. పసునూరి తెలంగాణ తల్లి విగ్రహ సృష్టికర్త, 2001లో టిఆర్ ఎస్ చేరారు. వర్ధన్నపేట టిఆర్ ఎస్ ఇంచార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం టిఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు. 2009,14 ఎన్నికల్లో పసునూరికి అసెంబ్లీ టికెట్ తృటిలో చేజారింది.

బైక్ ను ఢీకొన్న లారీ : ఇద్దరి మృతి

ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండలం వి.ఎం.బంజరలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

20:41 - October 30, 2015

హైదరాబాద్ :పోరుగల్లు గా మారిన ఓరుగల్ ఉప పోరులో ఎవరి వ్యూహాలు ఏంటి? కాకతీయ కోటపై జెండా ఎగరేసే రాజులు ఎవరు? కత్తులు నూరుతూనే పార్టీలు కలవరపడుతున్నాయా? ఈ అంశాలపై నేటి వైడాంగిల్ విశ్లేషణ చేశారు. మరి ఈ విశ్లేషణను మీరూ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:38 - October 30, 2015

హైదరాబాద్ : మహారాష్ట్రలో బిజెపి-శివసేనల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. డోంబివాలి మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో శివసేన-బిజెపిలు కత్తులు దూసుకుంటున్నాయి. ఇందిరా గాంధీ లాంటి నేతనే ప్రజలు గద్దె దింపారు.. బిజెపి ఎంత అంటూ శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు. దీపావళికు ముందు పప్పుల ధరలు తగ్గించాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. బిజెపి అతిగా ప్రవర్తిస్తే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని శివసేన హెచ్చరించింది. తమ అభ్యర్థులను శివసేన బెదిరిస్తోందంటూ ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ కూడా ధీటుగానే స్పందించారు. తమను కాంగ్రెస్‌, ఎన్సీపీలా భావించొద్దని, ఇక్కడ తాము గాజులు తొడుక్కోని లేమని శివసేనపై సిఎం ఘాటైన విమర్శలు చేశారు. ప్రజలను ఆకర్షించడానికి శివసేన డ్రామాలాడుతోందని ఫడ్నవిస్‌ మండిపడ్డారు.

20:36 - October 30, 2015

హైదరాబాద్ : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోది లాలూ, నితీష్‌లను టార్గెట్‌ చేశారు. మోది సభలకు ప్రజలను తరలించడానికి డబ్బులు చెల్లిస్తున్నారన్న నితీష్‌ ఆరోపణలపై ప్రధాని తీవ్రంగా స్పందించారు. ఇది బీహారీలను అవమానించడమేనని అన్నారు. తనని బయటవాడని నితీష్‌ సంబోదించడంపై కూడా ప్రధాని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌ ప్రజలు తనని గెలిపించారని, తానేమైనా పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌కు చెందిన ప్రధానినా అంటూ మండిపడ్డారు. ఢిల్లీలో ఉండే సోనియా బీహారీ ఎలా అవుతారని ప్రశ్నించారు. లాలూతో పాటు ఆయన కూటమిలోని నేతలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ప్రధాని విమర్శించారు.

20:33 - October 30, 2015

హైదరాబాద్ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను అవమానిస్తూ పాట రాశారనే ఆరోపణతో జానపద గాయకుడు ఎస్ శివదాస్ అలియాస్ కొవన్‌ను చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఉన్న లిక్కర్ షాపులను మూసివేయాలని కొవన్‌ పాట రాశాడు. ఆయన రాసిన పాటలో 'అమ్మ'ను అవమానించే పదాలున్నాయన్న ఆరోపణలతో శివదాస్ ను తిరుచ్చి సమీపంలోని మారుతంద కురిచిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విప్లవ సంస్థ 'మక్కల్ కళై ఇలక్కియ కజగమ్'తో కొవన్‌కు సంబంధాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. శివదాస్ పై రాజద్రోహంతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

20:31 - October 30, 2015

విజయవాడ : ప్రతి ఒక్కరూ తమ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు.. ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు.. నవంబర్ 3న నా నియోజకవర్గం, నా బాధ్యత అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నమని ప్రకటించారు.. దేశ, విదేశాల్లో స్థిరపడ్డ ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.. గుంటూరు జడ్పీ హాళ్లో ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి అధికారులతో సమీక్ష జరిపారు..

20:28 - October 30, 2015

హైదరాబాద్: తెలంగాణలో ప్రాక్టర్ అండ్ గాంబుల్ సంస్థ ప్లానింగ్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇవాళ సంస్థ ప్రతినిధులు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో ఉన్న తమ సంస్థను మరింత విస్తరిస్తామని కేసీఆర్‌కు తెలిపారు. 171 ఎకరాల్లోని తమ సంస్థలో పనిచేస్తోన్న ఉద్యోగుల సంఖ్యను 786 నుంచి 12 వందలకు పెంచుతామని వివరించారు. 80 శాతం ఉద్యోగాలు స్థానికులే ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

20:23 - October 30, 2015

హైదరాబాద్ : వరుడి నిర్వాకంతో పీటల మీద పెళ్లి నిలిచిపోయిన ఘటన సికింద్రాబాద్ లో వెలుగు చూసింది. పెళ్లి సమయానికి తాను రాలేనంటూ పెళ్లికొడుకు ఫోన్ చేయటంతో.. పెళ్లికూతురు తరపువారంతా అవాక్కయ్యారు. చిలకలగూడ పీఎస్ లో బాధిత బంధువులు ఫిర్యాదు చేశారు.

20:21 - October 30, 2015

హైదరాబాద్ : డిసెంబర్ 16 నుంచి హైదరాబాద్ ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రకటన వెలువడింది. దీపావళి తరువాత ఏపీ టీడీపీ మేథోమధన సదస్సు జరగుంది. మరోవైపు నవంబర్ 7న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగే టీటీడీపీ సర్వసభ్య సమావేశానికి చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ భేటీలోనే నారాయణ్ ఖేడ్ బైపోల్ పై కూడా చర్చించనున్నారు.

 

అక్రమ నిర్మాణాలను కూల్చేస్తాం:మహారాష్ట్ర సర్కార్

హైదరాబాద్ : దీపావళి పండుగ తర్వాత తమ రాష్ట్రంలో అక్రమంగా నిర్మించిన ఆలయాలను పడగొడతామని మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలిపింది. తొమ్మిది నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని వివరణ ఇచ్చింది. 2009 సెప్టెంబర్ 29 తర్వాత రాష్ట్రంలో చట్ట విరుద్ధంగా అక్రమంగా నిర్మించిన కట్టడాలను (ఆలయాలు, మసీదులు, చర్చిలు మరింకేమైనా) తొలగించాలని హైకోర్టు గతవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సీఎం కేసీఆర్ ను కలిసిన నెదర్లాండ్స్ బృందం

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నేడు నెదర్లాండ్స్ అంబాసిడర్ అల్‌ఫోన్సస్ స్టీలింగా ఆధ్వర్యంలోని బృందం కలిసింది. క్యాంపు ఆఫీసులో సీఎంను కలిసిన ఈ బృందం తెలంగాణలో వ్యవసాయం, ఆరోగ్యం, పర్యాటకం రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని పేర్కొంది.

బోయిన్‌పల్లిలో పోలీసుల కార్డన్ సర్చ్

 హైదరాబాద్ :నగరంలోని బోయిన్‌పల్లిలో పోలీసులు శుక్రవారం రాత్రి కార్డన్ సెర్చ్ ప్రారంభించారు. నందమూరి‌నగర్‌లో దాదాపు 100 మంది పోలీసులు ఈ సెర్చ్‌లో పాల్గొన్నారు. నార్త్ జోన్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలను సేకరిస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు.

డిసెంబర్ 16 నుండి 21 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 16 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనే ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి చివరి వరకు జరిగే బడ్జెట్‌ సమావేశాలు మంగళగిరిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. హాయ్‌లాండ్‌, మంగళగిరి సమీపంలోని అమరావతి టౌన్‌షిప్‌ ప్రాంతాలను పరిశీలించాలని అధికారుల బృందాన్ని ప్రభుత్వం పంపించింది. నివేదిక వచ్చిన వెంటనే బడ్జెట్‌ సమావేశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

 

19:08 - October 30, 2015

హైదరాబాద్ : న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్ల సమ్మె 59వ రోజుకు చేరుకుంది. వారి సమస్యలు పరిష్కరించక పోగా ఆశాల సమ్మె పై మంత్రులు అవహేళనగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆశా వర్కర్లపై చిన్న చూపు ఎందుకు? రూ.400 వేతనంతో ఎలా బతుకుతారు? న్యాయమైన డిమాండ్లు అయితే ఎందుకు పరిష్కరించడంలేదు? ఆశాలకు అండగా ఆశా వర్కర్లకు అండగా సీపీఎం నిధి సేకరణ చేపట్టాలని నిర్ణయంచింది. ఇదే అంశంపై హెడ్ లైన్ షో లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు, జయలక్ష్మి ఆశా వర్కర్ల రాష్ట్ర కార్యదర్శి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

సుజనా చౌదరికి కోర్టు ధిక్కరణ నోటీసులు

హైదరాబాద్ : కేంద్రమంత్రి సుజనా చౌదరికి కోర్టు ధిక్కారణ కింది హైకోర్టు నోటీసులు జా చేసింది. తమకు రుణం చెల్లించాలని మారిషన్ కమర్షియల్ బ్యాంక్ పిటిషన్ బకాయి పడ్డ డబ్బులు చెల్లించేందుకు లిక్విడేటర్ ను కేటాయించాలని కోరిన మారిషన్ బ్యాంక్ రూ.106కోట్లు చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది.

18:53 - October 30, 2015

విజయనగరం : మాస్టర్ సచిన్ టెండుల్కర్ వారసుడు అర్జున్ టెండుల్కర్ ...విజయనగరంలో జరుగుతున్న అండర్ -16 క్రికెట్ మ్యాచ్ లో సందడి సందడి చేశాడు. ఇక్కడి సర్ విజ్జీ స్టేడియం వేదికగా బరోడాతో జరుగుతున్న మూడురోజులమ్యాచ్ లో ముంబైజట్టు సభ్యుడిగా అర్జున్ వరుస బౌండ్రీలతో అలరించాడు. అర్జున్ ను చూడటానికి అభిమానులు భారీసంఖ్యలో తరలి వచ్చారు. అయితే ..నిర్వాహక సంఘం మాత్రం అభిమానులను స్టేడియంలోకి అనుమతించకపోడంతో నిరాశతో వెనుదిరిగాల్సి వచ్చింది.

రేణిగుంట విమానాశ్రయంలో ఎమ్మెల్యే బాలయ్య సందడి

చిత్తూరు : రేణిగుంట విమానాశ్రయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ సందడి చేశారు. నెల్లూరులో ఓ వివాహానికి హాజరయ్యేందుకు రేణిగుంట విమానాశ్రయం దిగిన బాలకృష్ణను అభిమానులు గజమాలతో సత్కరించారు. బాలయ్య నినాదాలతో విమానాశ్రయంల హోరెత్తింది. తన కొత్త సినిమా డిక్టేటర్‌ సంక్రాంతి విడుదల అవుతుందని బాలకృష్ణ తెలిపారు.

శోభనాద్రిపురం వద్ద ట్రాక్టర్ బోల్తా: ఒకరి మృతి

కృష్ణా : బాపులపాడు మండలం శోభనాద్రిపురం వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాక్టరు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

18:49 - October 30, 2015

విజయవాడ : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనూష హత్యకేసు తీర్పుపై సంతోషం వ్యక్తంచేశారు ఏపీ మంత్రి చినరాజప్ప.. కాస్త ఆలస్యమైనా కోర్టు మంచి తీర్పు ఇచ్చిందన్నారు.. ఈ శిక్ష వెంటనే అమలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు..

18:46 - October 30, 2015

హైదరాబాద్ : కేంద్రమంత్రి సుజనా చౌదరి చిక్కుల్లో పడ్డారు. కేంద్ర మంత్రి సృజన చౌదరికి హైకోర్టు దిక్కరణ నోటీసులు జారీ చేసింది. సృజనా చౌదరీతో పాటు మరో ఆరుగురి డైరెక్టర్లకు దిక్కరణ నోటీసులు ఇచ్చింది. 2010 లో హెస్టియా హోల్డింగ్ కంపెనీ తీసుకున్న రుణానికి సృజన చౌదరీకి చెందిన కంపనీ సృజనా యూనివర్సల్ ఇండ్రస్టీ షూరీటిగా ఉంది. అయితే గతంలో లండన్ కోర్టు, సిటి సివిల్ కోర్టు హైదరాబాద్ లో డబ్బులు చెల్లించేందుకు విచారణ జరిగింది. హైకోర్టు గతంలో 106 కోట్లు చెల్లించాలని అదేశించింది. అయితే ఈ అదేశాలను బేఖాతరు చేయడంతో హై కోర్టు దిక్కారణ నోటీసులు జారీ చేసింది.

18:41 - October 30, 2015

ప.గో :సంచలనం సృష్టించిన కృపామణి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కృపామణి తల్లి లక్ష్మి, సోదరుడు రాజ్‌కుమార్‌‌, మరదలు కళ్యాణిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దెందులూరు మండలం చల్లచింతలపూడిలో నిందితులు పట్టుబడ్డారు. ప్రధాన నిందితుడు గుడాల సాయిశ్రీనివాస్, కృపామణి తండ్రి రామలింగేశ్వరరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఢిల్లీలో శ్రీవారి వైభోత్సోవాలకు అంకురార్పణ

ఢిల్లీ : కలియువ దైవం శ్రీ వెంకటేశ్వరరాస్వామికి తిరుమలలో జరిగే నిత్య కైంకర్యాలను ఢిల్లీ వాసులు ప్రత్యక్షంగా తిలకించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న శ్రీవారి వైభవోత్సవాలకు అంకురార్పణ జరిగింది. టిటిడి, స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు బిజెపి అగ్రనేత అద్వానీ చేతుల మీదుగా అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి తలసాని కుమారుడపై కేసు నమోదు..

 హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుమారుడు సాయికిరణ్‌పై మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మారేడ్‌పల్లికి చెందిన భువన అనే యువతి, అదే ప్రాంతానికి చెందిన అభినవ్ అనే యువకుడు ఈ ఏడాది మే నెలలో వివాహం చేసుకున్నారు. అయితే... ఈ వివాహం భువన తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో వీరిద్దరినీ విడదీయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుమారుడు సాయికిరణ్‌ను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన సాయికిరణ్... తన అనుచరులతో అభినవ్‌పై దాడి చేయించాడు.

మురికి కాలువలో కొట్టుకొచ్చిన ఆడశిశువు..

రంగారెడ్డి : ఆడపిల్లను వదిలించుకోవాలనుకున్న తల్లిదండ్రులు చిన్నారిని మురికి కాలువలో వదిలేసి వెళ్లారు. దీంతో చిన్నారి మృతిచెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం సీతారాంపేట గ్రామ శివారులో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామంలో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికులకి మురికి కాలువలో కొట్టుకొస్తున్న పసికందు కనిపించింది. రక్షించి చూడగా అప్పటికే మృతిచెందింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఐదో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నం

అనంతపురం :పాఠశాల ముందు ఉన్న దుకాణంలో తినుబండారాలు కొనుక్కోవడానికి వెళ్లిన విద్యార్థినిని గుర్తుతెలియని యువకుడు బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఇది గుర్తించిన తోటి విద్యార్థినులు ఉపాధ్యాయులను అప్రమత్తం చేయడంతో.. దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం గుత్తిఆర్‌ఎస్‌లో శుక్రవారం జరిగింది.

17:54 - October 30, 2015

కరీంనగర్ : జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.. పగడపల్లి మండలం తిరుమలాపూర్‌కుచెందిన రైతు వర్షాభావంతో ఆర్థికంగా నష్టపోయాడు.. అప్పులుతీర్చలేక మానసికంగా కుంగిపోయాడు.. చివరికి మనస్తాపంతో బావిలోకిదూకి ఆత్మహత్య చేసుకున్నాడు.. చుట్టుపక్కలవాళ్లు గమనించి బయటకు తీసేలోపే ప్రాణాలు కోల్పోయాడు..

17:53 - October 30, 2015

హైదరాబాద్ : ఆశాలపట్ల మంత్రులు చులకనగా మాట్లాడటం సరికాదన్నారు మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్.. 4వందల రూపాయల జీతంతో ఈ కార్యకర్తలు ఎలా బతుకుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆశాల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.. జస్టిస్ చంద్రకుమార్, విద్యావేత్త చుక్కారామయ్య, నాగేశ్వర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

17:51 - October 30, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీహబ్ ని వచ్చేనెల 5న ప్రారంభించనున్నట్టు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. టీ హబ్ ను ప్రారంభించేందుకు టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా వస్తున్నట్టుగా తెలిపారు. టీ హబ్ కోసం ఆలోచనలతో రండి... ఆవిష్కరణలతో వెళ్లండంటున్న కేటీఆర్ తెలిపారు.

17:48 - October 30, 2015

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వంపై ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీపీసీసీ ఏ విషయంలోనూ తనను సంప్రదించడం లేదన్నారు. ఆత్మాభిమానం దెబ్బతినేలా క్షోభపెడుతున్నారని రాపోలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించానన్న రాపోలు..తనపట్ల టీపీసీసీ తిరస్కార ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. వరంగల్‌ ఉపఎన్నికలో తనతో సంప్రదించడం లేదని చెప్పారు. అయినా కాంగ్రెస్‌ విజయానికి కృషి చేస్తానని రాపోలు తెలిపారు. ఎవరిపైనా ఫిర్యాదు చేయనన్న రాపోలు అన్నీ పార్టీ అధినేత్రి సోనియా చూస్తారన్నారు. మరి కొన్ని వివరాలు 'టెన్ టివి'తో పంచుకున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

సౌత్ జోన్ పరిధిలో బౌక్ రేసింగ్

హైదరాబాద్ : నగరంలోని సౌత్‌జోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం కొందరు యవకులు బైక్ రేసింగ్‌లు నిర్వహించారు. అయితే... సమాచారాన్ని అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని 202 బైక్‌లను సీజ్ చేయడమేగాక బైక్ రేసింగ్‌లకు నిర్వహిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యువకుల తల్లిదండ్రులను పిలిపించిన డీసీపీ సత్యనారాయణ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

'కృపామణి' కేసులో నిందితుల అరెస్ట్

 ప.గో :సంచలనం సృష్టించిన కృపామణి ఆత్మహత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కృపామణి తల్లి లక్ష్మి,సోదరుడు రాజ్‌కుమార్‌‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దెందులూరుమం.చల్లచింతలపూడిలో నిందితులు పట్టుబడ్డారు. ప్రధాన నిందితుడు గుడాల సాయిశ్రీనివాస్, కృపామణి తండ్రి రామలింగేశ్వరరావు కోసం పోలీసుల గాలిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ద తీసుకుని నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించిన విషయం విదితమే.

దొంగ నోట్లు చెలామణి చేస్తున్న వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ : నగరంలో ఉప్పల్ పరిధి చిలుకానగర్ లో దొంగనోట్లు చెలామణి చేస్తున్న వ్యక్తిని పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. రూ. 25 వేల విలువైన దొంగనోట్లను మార్చేందుకు యత్నిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులున్నట్లు పోలీసులు గుర్తించారు.

17:00 - October 30, 2015

హైదరాబాద్ : ఢిల్లీలో సిక్కుల ఊచకోతకు నిరసనగా రచయితలు 5 వందల పుస్తకాలను తగలబెట్టారు. ఇందిరాగాంధీ హత్య అనంతరం ఈ ఘటన జరిగి 32 ఏళ్లు గడచినా న్యాయం జరగలేదన్నారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం పోయిందని ఇందుకు నిరసనగా తాము రాసిన పుస్తకాలను అగ్నికి ఆహుతి చేస్తున్నట్టు తెలిపారు. పుస్తకాలు తగలబడకుండా పోలీసులు నీళ్లు చల్లి మంటలు ఆర్పారు.

16:44 - October 30, 2015

హైదరాబాద్‌ : మలక్‌పేట్‌లో దొంగలు ప్రతాపం చూపారు.. గోడకు కన్నంవేసి షాపులోని ఖరీదైన సెల్‌ఫోన్‌లన్నీ ఎత్తుకెళ్లారు.. ఈ ఫోన్ల విలవ 10లక్షల రూపాయలవరకూ ఉంటుందని షాప్ యజమాని ఇబ్రహీంఖాన్‌ చెబుతున్నారు.. చాదర్‌ఘాట్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు... క్లూస్‌ టీం అక్కడి ఆధారాలు సేకరించింది..

16:43 - October 30, 2015

హైదరాబాద్ : 'రాజు గారి గది' సినిమా చూస్తూ ఓవ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. అమర్నాథ్ అనే 50ఏళ్ల వ్యక్తి... హైదరాబాద్ బహదూర్ పూరాలోని మెట్రో థియేటర్ లో సినిమా చూస్తూ చనిపోయాడు. గుండె పోటుతో చనిపోయినట్టుగా థియేటర్ యాజమాన్యం తెలిపింది.

16:41 - October 30, 2015

హైదరాబాద్ : వరంగల్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు.. టిపిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈ ఎన్నికపై జాతీయ సంస్థతో సర్వే చేయించామని తెలిపారు.. దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో తమ పార్టీ గెలుస్తుందని ఈ సర్వే తేల్చిందని స్పష్టం చేశారు.. రేపు ఉదయం అభ్యర్థి పేరును ప్రకటిస్తామని ఉత్తమ్ కుమార్ చెప్పారు..

సెమీస్ కు చేరిన సానియా జోడి

సింగపూర్: సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట వరుసగా మూడో విజయాన్ని సాధించి సెమీ ఫైనల్ కు చేరింది. శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో సానియా జోడి 6-4, 7-5 తేడాతో తిమియా బాబోస్(హంగేరి)-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)లపై విజయం సాధించింది.

రాజుగారి గది సినిమా చూస్తూ వ్యక్తి మృతి

హైదరాబాద్ : వినోదం కోసం థియేటర్కు వెళ్లిన ఓ వ్యక్తి హారర్ సినిమా చూస్తూ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రముఖ టీవీ యాంకర్ ఓంకార్ డైరెక్షన్లో తెరకెక్కిన తెలుగు హారర్ సినిమా 'రాజు గారి గది' చూస్తూ ప్రేక్షకుడు మృతి చెందాడు. నగరంలోని బహదూర్‌పురా పరిధిలోని మెట్రో థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న ఈ సినిమాకు వెళ్లిన అమర్‌నాథం(55) అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సైబరాబాద్‌లో యాంటీ చైన్ స్నాచింగ్ సెల్

 హైదరాబాద్ : సైబరాబాద్‌లో చైన్‌స్నాచింగ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటి ఆటకట్టించేందుకు పోలీసులు యాంటీ చైన్‌ స్నాచింగ్ సెల్‌ను ఏర్పాటు చేశారు. గొలుసు దొంగలను పట్టుకునేందుకు 60 బృందాలను రంగంలోకి దింపనున్నారు. వీరికి గత మూడు రోజులుగా గండిపేట చెరువు వద్ద ట్రైనింగ్ ఇస్తున్నారు.

కాగజ్ నగర్ లో గాయని మధు ప్రియ వివాహం...

ఆదిలాబాద్ : గాయని మధుప్రియ ప్రేమ వ్యవహారం చివరిదశకు చేరుకుంది. బంధుమిత్రుల సమక్షంలో ఆమె వివాహం కాగజ్‌నగర్‌కు చెందిన బంగి శ్రీకాంత్‌తో జరుగుతోంది. మధుప్రియ ప్రేమ వివాహానికి ఈ ఉదయం తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇద్దరూ మేజర్లు కావడంతో పెళ్లిని అడ్డుకోవద్దని మధుప్రియ తల్లిదండ్రులకు సూచించారు. కొంత సమయం ఇస్తే తామే వివాహం జరిపిస్తామని తల్లిదండ్రులు బదులిచ్చారు. ఇందుకు మధుప్రియ అంగీకరించలేదు. రెండు సంవత్సరాలుగా తనకు శ్రీకాంత్ తెలుసని చెప్పింది. నవంబర్ 2న హైదరాబాద్‌లో పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు మధుప్రియ తెలిపింది.

 

కూలిన కల్వర్ట్: లారీ బోల్తా..

గుంటూరు : రోడ్డుపైన ఉన్న కల్వర్ట్(చిన్న వంతెన) ఒక్కసారిగా కూలిపోవడంతో వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ మృతిచెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామ సమీపంలో శుక్రవారం జరిగింది.

వరంగల్ అభ్యర్థిని రేపు ప్రకటిస్తాం: ఉత్తమ్

 హైదరాబాద్ : అధిష్ఠానం రేపు వరంగల్‌ అభ్యర్థిని ప్రకటిస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు తీసుకున్నామని ఆయన చెప్పారు. నిన్నటి నివేదిక ఆధారంగా అభ్యర్థి ఎంపిక ఉంటుందని వ్యాఖ్యానించారు. ఓ జాతీయ సంస్థతో వరంగల్‌లో సర్వే చేయించామనీ, కాంగ్రెస్‌ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని సర్వేలో తేలిందని ఉత్తమ్ స్పష్టం చేశారు.

15:53 - October 30, 2015

న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వం రూపొందించిన పౌర విమానయాన ముసాయిదా-2015ను విమానయాన శాఖ మంత్రి అశోకగజపతిరాజు విడుదల చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు, అందుబాటు ధరల్లో విమాన సర్వీసులను అందించాలనేదే తమ లక్ష్యమని చెప్పారు. అన్ని స్వదేశీ, విదేశీ టికెట్లపై 2 శాతం సెస్‌ విధించేందుకు ప్రతిపాదించామన్నారు. గంటలోపు జరిగే దేశీయ విమాన ప్రయాణానికి టికెట్‌ ధర 2 వేల 500 ఉండేలా ముసాయిదాలో పొందుపరిచామన్నారు. తక్కువ ధరలో విమాన సేవలు అందించే విమానయాన సంస్థలకు ప్రోత్సాహకాలు ఇస్తామని అశోక గజపతిరాజు చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో 50 శాతానికి పైగా ఎఫ్‌డీఐలకు అనుమతించేందుకు ముసాయిదా ప్రతిపాదించింది. ముసాయిదాపై అభ్యంతరాలు, సలహాలు ఉంటే తెలియచేయవచ్చని.. సూచనల ఆధారంగా అవసరమైతే పాలసీలో మార్పులు చేస్తామని అశోక గజపతిరాజు చెప్పారు.

15:46 - October 30, 2015

హైదరాబాద్ : వరంగల్‌ టిఆర్ ఎస్ అభ్యర్థిగా గుడిమల్ల రవికుమార్‌ను ప్రకటిస్తే మాదిగలనుంచి ప్రతిఘటన తప్పదని...ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.. ఓరుగల్లులో 80శాతం మాదిగలున్నారని.... వారినికాదని రవికుమార్‌కు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.. కడియం శ్రీహరి తన కూతుకు టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తే ఎమ్మార్పీఎస్ వ్యతిరేకించిందని గుర్తు చేశారు..

15:43 - October 30, 2015

హైదరాబాద్ : వ‌రంగ‌ల్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్‌కే క‌ట్టబెడుతూ నిర్ణయం తీసుకున్న గులాబీ పార్టీ నేత‌లకు ఇప్పుడు కొత్త చిక్కులు వ‌చ్చి ప‌డుతున్నాయి. గురువారం నాటి స‌మావేశంలో అభ్యర్థిగా గుడిమ‌ళ్ల ర‌వికుమార్‌ పేరును కేసీఆర్‌ ఫైన‌ల్ చేశార‌నే ప్రచారం జ‌రిగింది. ఇక అధికారికంగా ప్రకటించ‌డమే త‌రువాయి అని పార్టీ వ‌ర్గాలు అంచ‌నా వేశాయి. ఉద్యమం మొద‌టి నుంచి ర‌వికుమార్ పార్టీలో ఉండ‌టంతో పాటు ఉన్నత విద్యావంతుడు కూడా కావ‌డంతో ఆయ‌నను రంగంలోకి దించ‌డం ఖాయ‌మ‌ని పార్టీ నేత‌లు కూడా ధీమా వ్యక్తం చేశారు.

తెరపైకి గుడిమ‌ళ్ల ర‌వికుమార్‌ సామాజిక వ‌ర్గం....

కానీ అంతలోనే సీన్ మారింది.....గుడిమ‌ళ్ల ర‌వికుమార్‌ సామాజిక వ‌ర్గం తెర‌పైకి వస్తోంది. వ‌రంగల్ పార్లమెంట్‌ స్థానం ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ స్థానం కావ‌డంతో....ర‌వికుమార్‌ బీసీ అనే వాద‌న పార్టీ హై క‌మాండ్ దృష్టికి వ‌చ్చింది. ఇందుకు సంబంధించి న్యాయనిపుణుల‌తో చ‌ర్చించి తుది నిర్ణయం తీసుకుందామ‌ని స‌మావేశంలోనే ముఖ్యమంత్రి అభిప్రాయప‌డ్డారు. ర‌వికుమార్ సామాజిక వ‌ర్గం కార‌ణంగానే ఆయ‌న అభ్యర్థిత్వంపై పార్టీలో పున‌రాలోచ‌న జ‌రుగుతోంద‌ని నేత‌లు అంటున్నారు. ఈ వ్యవ‌హారం ముదురుతుండ‌టంతో గులాబీ బాస్ కూడా తొంద‌రప‌డి నిర్ణయాన్ని ఎందుకు వెల్లడించాలంటూ మ‌రోసారి జిల్లాకు చెందిన శాస‌న‌స‌భ్యులు, మంత్రుల‌తో విడివిడిగా అభిప్రాయాల‌ను సేక‌రిస్తున్నట్లు తెలిసింది.

నేత‌ల్లో కూడా భిన్నాభిప్రాయాలు......

ర‌వి అభ్యర్థిత్వంపై జిల్లా నేత‌ల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్లు తెలిసింది. దీంతో ర‌వికుమార్ కాకుండా ప్రత్యామ్నాయంగా ఉన్న నేత‌ల పేర్లు కొత్తగా తెర‌పైకి వ‌స్తున్నాయి. గ‌తంలో శాస‌న‌స‌భ‌కు పోటీ చేయాల‌ని ప్రయ‌త్నించిన పసునూరి ద‌యాక‌ర్‌తో పాటు డాక్టర్స్‌ జేఏసీ నేత ర‌మేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.

ఉత్కంఠ‌గా మారిని అభ్యర్థి ఎంపిక...

అభ్యర్థిని ఖ‌రారు చేసిన‌ట్లు పార్టీఇంకా అధికారికంగా ప్రక‌టించ‌క‌పోవ‌డంతో......చివ‌రి నిమిషంలో ఎవ‌రిని ఎంపిక చేస్తార‌నేది పార్టీ నేత‌ల్లో ఉత్కంఠ‌గా మారింది. కొత్త నేత రంగంలో ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవ‌స‌రం లేద‌ని పార్టీ నేత‌లు అంటున్నారు. మొత్తం మీద ర‌వికుమార్...... అభ్యర్థిత్వం అయోమ‌యంలో ప‌డ‌టంతో.... ఆశావహులు మ‌రోసారి త‌మ ప్రయ‌త్నాల‌ను ముమ్మరం చేస్తున్నారు.

15:39 - October 30, 2015

హైదరాబాద్ : నగరంలో టోలి చౌకీలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తుండగా.. గ్యాస్ లీకేజీ జరిగింది. ఈ ఘటనలో 15మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు...

15:37 - October 30, 2015

నెల్లూరు :గూడురులో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఆదిశంకర ఇంజినీరింగ్ కాలేజ్ లో చదువుకుంటున్న అశోక్ అనే విద్యార్థి హాస్టల్ లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

15:36 - October 30, 2015

విజయవాడ : బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. విజయవాడలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ భూహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ నిర్వహించిన రాష్ట్ర సదస్సులో మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ పరిరక్షణ పోరాటంలో కలిసి వచ్చేవారితో ఆందోళనకు దిగుతామన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 14 లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉందని ఆ భూముల జోలికి వెళితే చంద్రబాబు ప్రభుత్వానికి రైతులు బుద్ధిచెబుతారని మధు హెచ్చరించారు.

15:35 - October 30, 2015

హైదరాబాద్ : జగన్ రాజీనామా చేస్తేనే ప్రత్యేక హోదా వస్తుందంటే... అందుకు తాము సిద్ధమన్నారు వైసీపీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ. అయితే మాతో పాటు టీడీపీ నేతలు కూడా రాజీనామాకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు చంద్రబాబే అడ్డుగా ఉన్నారని ఆయన ఆరోపించారు. హోదా కోసం వైసీపీ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని జ్యోతుల నెహ్రూ అన్నారు.

బైక్ బోల్తా... అర్చకుడు మృతి

వరంగల్ : జిల్లాలో బైక్ అదుపుతప్పి బోల్తా పడడంతో ఓ పూజారి ప్రాణాలు కోల్పోయాడు. లింగాల ఘన్‌పూర్ మండలం కల్లెం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు జీడికల్ రామాలయంలో అర్చకునిగా పనిచేసే పవనకుమారాచార్యులుగా గుర్తించారు. పవన్ గురువారం రాత్రి బైక్పై జనగామకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కల్లం వద్ద బైక్ బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

15:15 - October 30, 2015

అనంతపురం :కరువుతో రాయలసీమ అల్లాడిపోతుంటే..సీఎం చంద్రబాబు మాత్రం నీరోచక్రవర్తిలాగా అమరావతిలో ఫిడేలు వాయించుకుంటు కూర్చున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. రాయలసీమను ఆదుకునేందుకు సీఎం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

15:07 - October 30, 2015

హైదరాబాద్ : తమ కూతురిని తమకు కాకుండా చేసిన దుర్మార్గుడికి శిక్ష పడటంతో అనూహ్య తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనూహ్యపై అత్యాచారం జరిపి.. దారుణంగా హత్య చేసిన క్యాబ్‌ డ్రైవర్‌ చంద్రభానుకు ముంబై సెషన్స్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది. జనవరి 5, 2014న మచిలీపట్నం నుంచి ముంబైకి వెళ్లిన అనూహ్యను డ్రాపింగ్‌ నెపంతో తన ట్యాక్సీలో ఎక్కించుకెళ్లాడు చంద్రభాను. మార్గమధ్యంలో ఆమెపై అత్యాచారం జరిపి.. నేరం బయటపడకుండా ఉండటానికి దారుణంగా హత్య చేశాడు. ముంబైలో దిగిన తర్వాత కాంటాక్ట్‌లో లేని అనూహ్య కోసం ఆమె తండ్రి ఆందోళన చెంది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నత్తనడకన నడిచిన దర్యాప్తుపై అనూహ్య తండ్రి అలుపెరగని పోరాటం చేశారు. ఎట్టకేలకు సీసీ ఫుటేజి ఆధారంగా చంద్రభానును పోలీసులు పట్టుకున్నారు. విచారణ జరిపిన తర్వాత నిందితుడుగా కేసు నమోదు చేశారు. 22 నెలల అనంతరం కోర్టు విచారణ పూర్తయి దోషి చంద్రభానుకు ఉరిశిక్ష పడింది.

15:04 - October 30, 2015

హైదరాబాద్ : పాపం.. పుణ్యం.. ప్రపంచ మార్గం తెలియని చిన్నారులపై జరుగుతున్న దాడులు సభ్య సమాజాన్ని కలిచివేస్తున్నాయి. చిన్నారులే లక్ష్యంగా అయిన వారే కామంతో కాటేస్తున్నారు.. ఈ నేపథ్యంలో చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన వారికి కఠిన శిక్షను విధించాలని మద్రాస్ హైకోర్ట్ సంచాలనాత్మక వ్యాఖ్యాలు చేసింది.

చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి అనేక విస్మయకర వాస్తవాలు వెలుగు చూసాయి. కేంద్ర ప్రభుత్వ తాజా సర్వే తేల్చిన నిజాలు సమాజానికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

జిమ్నాస్టిక్స్ లో భారత క్రీడాకారిణి ప్రత్యేకత చాటుతోంది. ప్రపంచ జిమ్నాస్టిక్స్ చాంపియన్ షిప్ ఫైనల్స్ కు అర్హత సాధించిన మొదటి ఇండియన్ గా రికార్డు సాధించింది.

ప్రస్తుత సమాజంలో ఏ వర్గంలోనైనా ఏ మతంలోనైనా మహిళల పట్ల వివక్ష కొనసాగుతున్న తీరే కన్పిస్తోంది. అయితే విడాకుల సందర్భాల్లో మహిళలు నిస్సహాయ స్థితిలోకి జారిపోతున్నారు. ఈ స్థితి ముస్లిం మహిళలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో అధ్యయనం జరగనుంది.

విదేశీయుల కోసం అమ్మతనాన్ని వ్యాపార పరం చేస్తున్న సరోగసీ పద్ధతికి చెక్ పెట్టాలంటూ అత్యున్నత న్యాయస్థానం తేల్చింది. అద్దె గర్భంతో పిల్లలను పొందే విషయంలో స్పష్టమైన విధానాలు లేకపోవటంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

15:02 - October 30, 2015

హైదరాబాద్ : మోడ్రన్ డ్రెస్సెస్ తర్వాత టీనేజర్స్ ను ఎక్కువగా ఆకర్షించే వస్త్రధారణ గాగ్రాస్. ప్రత్యేక సందర్భాలలో కలర్ ఫుల్ గా కన్పించేందుకు గాగ్రాస్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తాయి. అలాంటి గాగ్రాస్ లో లేటెస్ట్ కలెక్షన్ ను మీ ముందుకు తెస్తోంది ఇవాళ్టి సొగసు. మరి పూర్తి వివరాలు చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

14:59 - October 30, 2015

పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య ఒత్తిడి. దీంతో మానసికంగా క్రుంగిపోవటంతో పాటు ఒక్కోసారి ఎంతో మంది తీవ్ర నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. ఇలాంటి విపరీత నిర్ణయాలు తీసుకునే వారిని గుర్తించి వారికి సమయానికి చేయూతనివ్వాల్సిన బాధ్యత మనందరిది. మరి వారిని గుర్తించటమెలా? ఇంటా బయటా శక్తిసామర్థ్యాలు నిరూపించుకుంటున్న మహిళలు అనేక వేధింపులనెదుర్కొంటున్నారు. పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు వారి పనితనాన్ని దెబ్బతీస్తున్నాయి. మరి ఈ స్థితిని ఎలా అధిగమించాలో ఇవాళ్టి నిర్భయలో ప్రముఖ సైక్రియాటిస్టు పూర్ణిమా నాగరాజు వివరించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:52 - October 30, 2015

నెల్లూరు : జిల్లాలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. ముందువెళ్తున్న లారీని గ్రానైట్‌ లోడ్‌ లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్రానైట్‌ రాళ్లు పడి నలుగురు మహిళలు మృతి చెందారు. వెంకటాచలం మండలం చెముడుగుంట రహదారిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

14:50 - October 30, 2015

హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. కాంకేర్‌ జిల్లా చార్‌ధామ్‌లో నికో ఐరన్‌ ఓర్‌ ఫ్యాక్టరీకి నిప్పు పెట్టారు. చావర్‌గామ్‌లో ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని కిరాతకంగా గొంతుకోసి హతమార్చారు. బీజాపూర్‌ జిల్లా భూపాలపట్నం సమీపంలో ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సును దహనం చేశారు. దంతెవాడ జిల్లాలో రైల్వే ట్రాక్‌ పనులకు వినియోగిస్తున్న 5 వాహనాలకు నిప్పుపెట్టారు.

14:49 - October 30, 2015

హైదరాబాద్ : సీబీఐ కేసుల నుంచి తప్పించుకునేందుకే ఇద్దరు ముఖ్యమంత్రులు కుమ్మక్కయ్యారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అలాంటి అవినీతికి పాల్పడిన వ్యక్తి ప్రజలను ఓట్లు అడిగే హక్కులేదన్నారు. వాస్తవాలేమిటో ప్రజలకు చెప్పాలని తమ్మినేని డిమాండ్ చేశారు.

14:47 - October 30, 2015

హైదరాబాద్ : ఆంధ్రాకు బద్దశత్రువైన కేసీఆర్‌ అమరావతి శంకుస్దాపనకు వస్తే..ప్రతిపక్ష నేత జగన్‌ మాత్రం రానని చెప్పడం విడ్డూరంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో కండలేరు ఎడమకాలువ ఎత్తిపోతల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు..ప్రతిపక్ష నేత జగన్‌పై ఫైర్‌ అయ్యారు. 2050నాటికి ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని చంద్రబాబు ప్రకటించారు.

14:44 - October 30, 2015

హైదరాబాద్ : బీహార్‌ ఎన్నికల్లో బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేస్తోందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. బీహార్‌ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్‌లో దీపావళి సంబరాలు హోరెత్తుతాయని ప్రచారం చేయడం దారుణమన్నారు. నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నా ఎన్నికల కమిషన్‌ ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదన్నారు. మైనార్టీలకు రిజర్వేషన్లు తగ్గించి ఓబీసీలకు ప్రయోజనాలు కల్పించే విధంగా ప్రధాని సహా బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

14:42 - October 30, 2015

హైదరాబాద్ : ఒకరు మల్లెతీగ అయితే మరొకరు మెరుపుతీగ. ఈ తీగల మధ్య కరెంటు షాకు తగిలినంత ఫీల్ కలిగే కలువపూలలాంటి అమ్మాయిలు. ఫ్యాషన్‌ ప్రియులకు మతిపోగొట్టేంత పని చేసింది లఖోటియా ఫ్యాషన్‌ షో. విభిన్న దేశాల్లోని ఫ్యాషన్‌లను నగర ఫ్యాషన్ ప్రియులను పరిచయం చేసేందుకు లఖోటియా ఫ్యాషన్‌ డిజైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ హైదరాబాద్‌ సోమాజిగూడ పార్క్‌ హోటల్లో ఫ్యాషన్‌ షో నిర్వహించింది. లఖోటియాలో డిజైనింగ్ కోర్సు పూర్తి చేసుకున్న 30 మంది విద్యార్థులు ఈ షోలో తమ ప్రతిభను కనబరిచారు. మొత్తం 16 సీక్వెన్సీలుగా సాగిన ఈ షోలో భారత్‌, చైనా, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా వంటి దేశాలకు చెందిన ఫ్యాషన్‌ డిజైన్లను ఆవిష్కరించారు.

14:34 - October 30, 2015

హైదరాబాద్ : ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి వైద్యులు దేశంలోనే అరుదైన శస్త్రచికిత్సను చేశారు. నాగరాజు అనే 24 ఏళ్ళ యువకుడికి కాలేయ మార్పడి చేసి చరిత్ర సృష్టించారు. 30 లక్షలు ఖర్చయ్యే ఈ సర్జరీకి పేషెంట్ దగ్గర నుండి రూపాయికూడా తీసుకోకుండా చేసినట్టు వైద్యులు తెలిపారు.. వసతులు కల్పిస్తే ప్రైవేట్ హాస్పటల్ కు దీటుగా సేవలందిస్తామని ఈ సందర్భంగా వైద్యులు చెబుతున్నారు.
చిన్నతనం నుంచే కాలేయ సమస్య
ఖమ్మం జిల్లాకు చెందిన నాగరాజు పుట్టుకతోనే లివర్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నాడు. కాలేయం నుండి గుండెకు రక్తాన్ని సరపరాచేసే రక్తనాళాలు మూసుకు పోవడంతో చిన్నప్పటినుండి అలానే నెట్టుకు వస్తున్నాడు. గత మూడు నెలలుగా కాలేయం పనితీరు పూర్తిగా మందగించింది. దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు ఆశ్రయించారు. కాలేయ మార్పిడి చేయడమే ఒక్కటే మార్గమని దీనికి ఇరవై నుండి ముప్పై లక్షలు అవుతుందని ప్రైవేటు ఆసుపత్రి వర్గాలు తేల్చి చెప్పాయి.
ఉస్మానియా ధర్మాసుపత్రిలో చేరిన నాగరాజు
మరోవైపు నాగరాజుది పేద కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. దీంతో ఆర్థిక భారం మోయలేక ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రిని సంప్రదించారు. ఉస్మానియా డాక్టర్లు మొదట కాలేయ మార్పడి కోసం ప్రయత్నించారు. కానీ దాత దొరకలేదు. కెనడా లోని టోరంటో గ్రూప్ ఆసుపత్రి వైద్యులు స్వీయ కాలేయ మార్పిడి చేసి విజయవంత అయిన సమాచారాన్ని వారు సేకరించారు. సరిగ్గా అదే పద్ధతిలో నాగరాజు కు సర్జరీ చేసి ఉస్మానియా వైద్యులు విజయవంతం అయ్యారు. ఈ తరహా శస్త్ర చికిత్స ప్రపంచంలోనే రెండోది కావడం విశేషం. చనిపోతాడనుకున్న తమబిడ్డను ఉస్మానియా వైద్యులు బ్రతికించారని తల్లితండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత అరుదైన సర్జరీ చేసి తమ బిడ్డను పునర్జన్మ ప్రసాదించారని నాగరాజు తల్లితండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు మ‌రింత తోడ్పాటు అందిస్తే మరెన్నో అద్బుతాలు చేయగలమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

 

14:27 - October 30, 2015

హైదరాబాద్ : సామాజిక వ్యవస్ధ పుట్టుకను, కులాల ఏర్పాటు వెనుక చరిత్రను, ఆంతర్యాన్ని వివరిస్తూ టెన్‌టీవీలో ప్రసారమవుతున్న జనచరిత కార్యక్రమానికి పద్మమోహన అవార్డు లభించింది. ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య తరతరాలుగా కులం పేరుతో జరుగుతున్న అన్యాయాలను సైద్ధాంతికంగా శాస్త్రీయంగా వివరిస్తున్న జనచరితకు వచ్చిన ఈ అవార్డును టెన్‌ టీవీ అసిస్టెంట్‌ ఎడిటర్‌ తాడి సతీష్‌ అందుకున్నారు.

కెమికల్ గోడౌన్‌లో పేలుడు :10 మందికి గాయాలు..

 హైదరాబాద్ : నగరంలోని టోలీచౌక్‌లో ఓ కెమికల్ గోడౌన్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న స్కూల్‌లో పది మంది విద్యార్థులు గాయపడ్డారు. వెంటనే విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

14:20 - October 30, 2015

ప.గో : ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగటూరు మండలం చేబ్రోలుకు చెందిన సుందరపు దుర్గాప్రసాద్ ఆగస్టు 25న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ప్రత్యేకహోదా కల్పిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, వేలమందికి ఉపాధి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా ఆయన నినదించారు. కాగా అప్పటినుంచి ఆసుపత్రుల్లో దుర్గాప్రసాద్ చికిత్స పొందారు. మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఇవాళ ఉదయం ఆయన కన్నుమూశారు.

 

అమరావతిలో హైకోర్టు న్యాయమూర్తుల పర్యటన

 విజయవాడ : ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ దిలీప్‌భోసలే, మరో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు అమరావతిలో శుక్రవారం పర్యటించారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన జస్టిస్‌ సిటీ ప్రాంతాన్ని న్యాయమూర్తులు పరిశీలించనున్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం సీఆర్‌డీఏ అధికారులతో న్యాయమూర్తులు భేటి అయి సమీక్షిస్తారని అధికారులు తెలిపారు.

ఏసీబీ వలలో పీలేరు తహసీల్దార్

చిత్తూరు: పీలేరు తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు తనికీలు నిర్వహించారు. పాసు పుస్తకం మంజూరు నిమిత్తం ఓ రైతు నుంచి తహసీల్దార్ సురేశ్ బాబు రూ. 30 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

కళింగపట్నం బీచ్ లో గల్లంతైన విద్యార్థిని మృతి

విజయనగరం :కళింగపట్నం బీచ్లో స్నానానికి వెళ్లిన ఓ విద్యార్థిని మృతి చెందింది. గుమ్మలక్ష్మీపురం మండలం బెంగళ గ్రామానికి చెందిన ధనలక్ష్మి గురువారం స్నేహితులతో కలసి కళింగపట్నం బీచ్‌లో స్నానానికి దిగి గల్లంతైంది. ఆమె కోసం గ్రామస్థులు గురువారం ఎంత గాలించిన ఫలితం లేదు. కాగా, శుక్రవారం ఉదయం ఆమె మృతదేహం కళింగపట్నం తీరానికి కొట్టుకురావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ధనలక్ష్మీ మృతితో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది.

బోరు బావి నుండి వెలువడుతున్న గ్యాస్

 తూగో : జిల్లాలోని ఉప్పగుప్తం మండలం మునిపల్లె రొయ్యల చెరువు సమీపంలోని బోరుబావి నుంచి గ్యాస్ వెలువడుతోంది. ఆ ప్రాంతంలో మంటలు చెలరేగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఓఎన్జీసీ అధికారులు అక్కడు చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా గ్యాస్ లీకేజీ కొనసాగుతోంది.

13:54 - October 30, 2015

ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించి ఇస్తామన్నది టీఆర్ఎస్ ఎన్నికల వాగ్ధానం. తెలంగాణ సెంటిమెంట్ తో పాటు డబుల్ బెడ్ రూం, రైతు రుణమాఫీ లాంటి హామీలు కూడా ఆ పార్టీ అధికారంలోకి రావడానికి తోడ్పడ్డాయనడంలో సందేహం లేదు. అయితే, ఈ రెండు కార్యక్రమాలు అమలవుతున్న తీరు తెలంగాణ ప్రజలను సంత్రుప్తి పరచలేకపోతున్నాయన్నది మరో వాస్తవం.
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం మంచిదే...
మొన్న దసరా పండుగ రోజు డబుల్ బెడ్ రూం ఇళ్లకు ముగ్గులు పోశారు. 560 చదరపు గజాలలో రెండు బెడ్ రూమ్ లు, హాల్, కిచెన్ నిర్మిస్తామనడం మంచి నిర్ణయం. డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించి ఇవ్వడం వల్ల ఒకే గదిలో కుటుంబ సభ్యులంతా నిద్రించాల్సిన దురావస్థ తప్పుతుంది. భార్యాభర్తల ఏకాంతానికి భంగం వాటిల్లకుండా వుంటుందనడంలో సందేహం లేదు. ఒకే రూములో భార్యాభర్తలు, ఈడొచ్చిన పిల్లలు నిద్రించడం మంచిది కాదని, అది వారి ప్రవర్తనను ప్రభావితం చేస్తుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అది నిజం కూడా. డబుల్ బెడ్ రూం ఇళ్లలో నివసించే ఆర్థిక స్థోమత లేని కారణంగానే చాలామంది ఒకే ఒక గదిలో జీవనయానం సాగించాల్సి వస్తోంది. కాబట్టి, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ప్రదర్శిస్తే, లబ్ధిదారులకే కాకుండా, మొత్తం సమాజానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.
రాష్ట్రంలో 22 లక్షల కుటుంబాలకు ఇళ్లు లేవు
తెలంగాణ రాష్ట్రంలో 22 లక్షల కుటుంబాలకు ఇళ్లు లేవన్న చేదు నిజాన్ని మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమం కళ్లకు కట్టింది. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఓ బ్రుహత్ కార్యక్రమం. అత్యంత చిత్తశుద్ధితో కొనసాగించాల్సిన పథకం. అయితే, బడ్జెట్ కేటాయింపులే నిరాశపరుస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 60 వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రకటించిన ప్రభుత్వం సుమారు 874 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. లక్ష్యం పూర్తి చేయాలంటే నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా అవసరమని అంచనా. మరి మిగిలిన డబ్బులు ఎక్కడ నుంచి తెస్తారో తెలియదు. ప్రతి నియోజకవర్గానికి 400 ఇళ్లు కేటాయించిన ప్రభుత్వం మంత్రికీ, ఎమ్మెల్యేకీ చెరో రెండొందల చొప్పున కోటా కేటాయించింది. ఒక్కొక్క ఊరికి నాలుగు ఇళ్లకు మించి దక్కే అవకాశం లేదు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు
ఈ లెక్కన అందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి ఎన్ని దశాబ్ధాలు పడుతుందో చెప్పలేం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎన్నెన్నో అక్రమాలు జరిగాయి. కొత్త ఇళ్లు కట్టకుండా, పాత వాటికి రంగులేసి వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు స్కీమ్ కింద నిజంగా ఇళ్ల నిర్మించుకుంటున్నవారికి బిల్లులు మంజూరు కాకపోవడం మరో విచిత్రం. పెండింగ్ బిల్లుల సంగతి ఏమి చేయబోతున్నారో తెలియదు. అందుకే గత ప్రభుత్వాల హయాంలో ఎదురైన అనుభవాలను ద్రుష్టిలో పెట్టుకుని డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం విషయంలో అత్యంత జాగురూకత ప్రదర్శించాలి. నిజంగా ఇళ్లు లేక అవస్థపడుతున్న అసలైన లబ్ధిదారులకే సంపూర్ణ ప్రయోజనం చేకూరేలా జాగ్రత్తలు తీసుకోవాలి. చేతివాటం ప్రదర్శించకుండా సొంత పార్టీ కార్యకర్తలను, అధికార యంత్రాంగాన్ని కట్టడి చేయగలిగినప్పుడే తమ కంటూ ఓ ఇల్లు లేని నిరుపేదలకు మేలు జరుగుతుంది.

 

 

13:51 - October 30, 2015

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు.. అమలుకు నోచుకోవడం లేదని సీపీఎం నేత శ్రీనివాస్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. టీసర్కార్ చెపుతున్న మాటలు అధికంగా ఉన్నాయని.. చేతలు మాత్రం తక్కువగా ఉన్నాయన్నారు. 16 నెలల కాలంలో 396 డబుల్ ఇళ్లన నిర్మించారని.. అదీ కూడా జీహెచ్ ఎంసీ ఎన్నికల దృష్ట్యా హైదరాబాద్ లో పూర్తి చేశారని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన 60 వేల ఇళ్లు.. ప్రకటిస్తే.. అవి నియోజవర్గానికి 400 ఇళ్లు వస్తాయని అందులో గ్రామానికి మూడు లేదా నాలుగు ఇళ్లు వస్తాయని ఇవి ఏ విధంగా పేదలకు సరిపోతాయని ప్రశ్నించారు. కాబట్టి పెద్ద సంఖ్యలో ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. 'డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి మొన్న దసరా పండుగ రోజు ముగ్గులు పోసినా, ఇంకా గందరగోళం తొలగలేదు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి ప్రమాణాలు పాటించబోతున్నారో స్పష్టత రాలేదు. మరి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పక్కదారి పట్టకుండా వుండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలు మరోసారి తలెత్తకుండా వుండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం విషయంలో ఇప్పటికీ ప్రదర్శించిన వైఖరి ఎలా వుంది?' ఇలాంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

13:49 - October 30, 2015

పదవీకాంక్ష, డబ్బు ప్రధానమైనప్పుడు పోటీ చేయడానికి ఒక పార్టీ నుంచి అనేక మంది అభ్యర్థులు పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారని వక్తలు తెలిపారు. న్యూస్ మార్నింగ్ చర్చ కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య, బిజెపి నేత.. ఎస్ కుమార్, టిడిపి నేత శ్రీరాములు, టీకాంగ్రెస్ నేత మల్లురవి పాల్గొని, మాట్లాడారు. టికెట్ కోసం పార్టీ పిరాయించడం, అలగడం జరగుతుందన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రధానం అవుతుందని తెలిపారు. ఈ మధ్య కాలంలో ఎన్నికల్లో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా రాజకీయంగా దళితులకు న్యాయం జరగడం లేదని వాపోయారు. దళితులు, కవులు, రచయితలపై జరుగుతున్న దాడులపై బిజెపి ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొన్నారు. దేశ సమగ్రత, మతపరమైన రాజ్యాంగం ఏర్పడుతుందని రచయితలు భావిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని, ఆపు చేసే దిశలో ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నవారే మత ఘర్షణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రమాదకరమైన విషయాలను బిజెపి చిన్న విషయాలుగా పరిగణిస్తుందన్నారు. మత ఘర్షణలకు వ్యతిరేకంగా మేధావులు అవార్డులు వెనక్కి ఇస్తున్నారని తెలిపారు. ప్రజల్లో మార్పు వస్తే రాజకీయ పార్టీలే మంచి అభ్యర్థిని నియమిస్తాయన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:41 - October 30, 2015

ఆదిలాబాద్ : గాయని మధుప్రియ పెళ్లికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. ఇవాళ సాయంత్రం తను ప్రేమించిన యువకుడి శ్రీకాంత్ తో మధుప్రియ వివాహం జరుగనుంది. మధుప్రియ, తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఆమె తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకున్నారు. దీంతో ముధుప్రియ పెళ్లికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. వివరాల్లోకి వెళితే... మధుప్రియ, శ్రీకాంత్ అనే యువకుడు గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. మధుప్రియ అతన్ని వివాహం చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ఇవాళా తెల్లవారుజామున కాగజ్ నగర్ లో వివాహం చేసుకోవడానికి మధుప్రియ, శ్రీకాంత్ లు సిద్ధమయ్యారు. అయితే ఆమె తల్లిదండ్రులకు ప్రేమ వివాహం ఇష్టం లేకపోవడంతో మధుప్రియను నిన్న అర్ధరాత్రి కిడ్నాప్ చేయడానికి యత్నించారు. మధుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమె తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం తల్లిదండ్రులు తమ కూతురి వివాహానికి అంగీకరించారు. 

13:18 - October 30, 2015

భారత్-ఆఫ్రికా భాగస్వామ్యం ఇరు దేశాలకు లాభదాయకంగా ఉండాలని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ ఆన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. భారత్-ఆఫ్రికా భాగస్వామ్యం సమానత్వం ప్రాతిపదికపైన ఉండాలని చెప్పారు. ఆఫ్రికా ప్రజలు అభివృద్ధి చెందినా, చెందకపోయినా పర్వలేదనే వైఖరి మన వాళ్లు తీసుకుంటే మాత్రం పశ్చిమ దేశాల పట్ల ఎలాంటి వ్యతిరేకత వచ్చిందో.. మళ్లీ అలాంటి వ్యతిరేకతే భారత్ దేశం పట్ల వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. భారత భాగస్వామ్యం వల్ల ఆఫ్రికా ప్రజల జీవితాలు బాగుపడాలని.. అప్పుడు భారత్, ఆఫ్రికాలకు లాభం చేకూరుతుందని తెలిపారు. ఆఫ్రికా ప్రజలకు ఉపాధి పెరగాలన్నారు. యువతీయువకులకు ఉద్యోగాలు రావాలని... వారి ఆదాయం పెరగాలని చెప్పారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే...
 ఆఫ్రికాను దోచుకున్న పశ్చిమదేశాలు...
భారత్ , ఆఫ్రికా దేశాల మధ్య భాగస్వామ్యం పెంచాలనే ఉద్దేశ్యంతో మొదటిసారి 40 మంది దేశాధినేతలతో సమావేశం జరుగుతుంది. ఆఫ్రికాలో బ్రహ్మాండమైన ఖనిజ నిక్షేపాలు, అద్భుత సహజ వనరులు ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలో ఖనిజ వనరులు ఉన్నా.. ఇంకా వెనుకబడే ఉందన్నారు. అమెరికా, ఐరోపాల దేశాలు వాటిని వలసలుగా, నయా వలసలుగా మార్చుకుని అక్కడున్న అక్కడున్న ఖనిజ సంపదనుమొత్తాన్ని దోచుకోవడం మొదలు పెట్టారు. జైర్ అనే దేశంలో కోబాల్ట్ అనే ఖనిజం దొరుకుతుంది. కాపర్, గొల్డు, డైమండ్లు లాంటి ఖనిజాలు దొరుకుతాయి. అక్కడ దొరకని ఖనిజమంటూ లేదు. కానీ ఆ ఖండం ఇంకా చీకటి ఖండంగానే ఉంటుంది. ఆ వనరుల వల్ల వచ్చే అభవృద్ధిని అక్కడి ప్రజలకు రాకుండా చేశారు. పశ్చిమడేశాలు ఏళ్ల తరబడి అక్కడ నియంతలను పెంచి పోశించారు.
వలసవాద దోపిడీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత
ఆఫ్రికా ఖండలోనే అమెరికా జాతి అహంకారం పట్ల, పశ్చిమదేశాల నయా వలసవాద దోపిడీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దక్షిణ అమెరికాలో శ్వేతజాతి పాలన దురహంకారానికి వ్యతిరేకంగా నమీబియా,అంగోలా లాంటి అనేక దేశాల్లో పోరాటాలు చూశాము. ఆఫ్రికాదేశాలు .. పశ్చిమదేశాల దోపిడీని అరికట్టేందుకు భారతదేశం, చైనా లాంటి దేశాల వైపు చూస్తోంది. ఆఫ్రికాలో చైనా పెట్టుబడులు ఘననీయంగా పెరుతున్నాయి. భారతదేశ పెట్టుబడులకు కూడా ఘననీయమైన అవకాశాలన్నాయి. భారతదేశంలో ఉత్పత్తిరంగాన్ని, తయారీ రంగాన్ని, పారిశ్రామికరంగాన్ని పెంచుకోవాలి.. కానీ మన దగ్గరున్న ఖనిజ నిక్షేపాలు కాస్తా త్వరితగతిన అంతరించిపోతున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం 200 ఏళ్లు దాటితే భారతదేశంలో బొగ్గు ఉండదని అంటున్నారు. అందువల్ల భారత దేశ పారిశ్రామికీకరణకు సహజ వనరులు కావాలి. మనదగ్గర చమురు సహజ వాయువుగా ఉంది. కానీ మన దగ్గరున్న చమురు సహజ వాయువు మన అవరాలను తీర్చలేదు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురుక్షేత్రాల కోసం అన్వేషిస్తున్నాము. ఆఫ్రికాలోని చమురు క్షేత్రాలలో ఓఎన్ జీసీ లాంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. అందువల్ల ఆఫ్రికాలో ఉన్న సహజ వనరుల ద్వారా మన పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి మనం బాటలు వేసుకోగలం. కానీ ఇక్కడి మనం జాగ్రత్తపడాల్సిందేండంటే భారత్, ఆఫ్రికా భాగస్వామ్యం సమానత్వ ప్రాతిపదిక పైన ఉండేలా చూడాలి. ఎందుకంటే భారతదేశానికో చరిత్ర ఉంది. మనం వలసవాద దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి నిలిచిన దేశం. వర్ధమాన దేశాల తరపున నయావలసవాద దోపిడీకి వ్యతిరేకంగా నలబడ్డ చరిత్ర ఉన్న దేశం. మనం కూడా మరో అమెరికా లాగా, ఐరోపా లాగా ఆఫ్రికాలో ఉన్న వనరులను కొల్లగొట్టుకుంటాం, చౌకగా కొల్లగొట్టుకుంటాం. ఆఫ్రికా ప్రజలు అభివృద్ధి చెందిన, చెందకపోయినా పర్వలేదనే వైఖరి మన వాళ్లు తీసుకుంటే మాత్రం పశ్బిమదేశాల పట్ల ఎలాంటి వ్యతిరేకత వచ్చిందో.. మళ్లీ అలాంటి వ్యతిరేకత భారత్ దేశం పట్ల వచ్చే ప్రమాదం ఉంది.
భారత తొలిస్వాతంత్య్ర ఉద్యమ పాఠాలు దక్షిణాఫ్రికా నుంచే..
భారత తొలి స్వాతంత్య్ర ఉద్యమ పాఠాలు కూడా దక్షిణాఫ్రికా నుంచి వచ్చాయి. ఆఫ్రికాలో మనకు గడ్ విల్ ఉన్నమాట నిజం. కానీ మన కంపెనీలు అక్కడికి వెళ్లి అమెరికా, ఐరోపా దేశాలు చేసే పనినే చేస్తున్నాయి. తెలుగువారికి చెందిన కంపెనీలు కూడా ఆఫ్రికాలో భూములు కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికా భూములపై వేట మొదలైంది. భారతదేశానికి చెందిన కంపెనీలు ఆఫ్రికాలో వందలాది ఎకరాల భూములను కొనుగోలు చేస్తున్నారు. మన భాగస్వామ్యం వల్ల ఆఫ్రికా ప్రజల జీవితాలు బాగుపడాలి. అప్పుడు భారత్, ఆఫ్రికాలకు లాభం చేకూరుతుంది. భారత్ కు, ఆఫ్రికాకు లాభసాటిగా ఉండాలి. ఆఫ్రికా ప్రజలకు ఉపాధి పెరగాలి. యువతీయువకులకు ఉద్యోగాలు రావాలి.వారి ఆదాయం పెరగాలి. భారత్ మరో కొలోనలిస్టు కాకూడదు. వారి జీవన ప్రమాణాలు మార్చడానికి ఉపయోగపడాలి. మన భాగస్వామ్యం వల్ల ఆఫ్రికా ప్రజల జీవితాలు బాగుపడాలి. అక్కడి వనరులను కొల్లగొట్టవద్దు. భారత్, ఆఫ్రికాలకు లాభాదాయకంగా ఉండాలి. ఆఫ్రికాలో ప్రజల జీవన ప్రమాణాలను మార్చడానికి కృషి చేయాలి.
బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి...
చెరుకు రైతుల బ్రతుకులు తీపిగా లేవు. విధానాలను మార్చకుండా వారి జీవితాలను మార్చలేము. రైతులు బతికి ఉంటే అప్పులు మిగులుతున్నాయి.. చనిపోతే ఆరు లక్షల నష్టపరిహారం వస్తుంది. అయితే ఎక్స్ గ్రేషియా కోసం రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. డబ్బుల కోసం ఎవరూ అత్మహత్యలు చేసుకోరు. వ్యవసాయం నష్టదాయకమైన వనరుగా మారింది. పెట్టిన పెట్టుబడి రావడం లేదు. చెరకు ఉత్పత్తి ఖర్చు.. రూ.2600 అవుతుంది. ప్రభుత్వం కనీస మద్దతు ధర 1400 ప్రకటించింది. కానీ మార్కెట్ లో రైతు లభిస్తున్నది కేవలం రూ.1100 మాత్రమే. ఉత్పత్తి ధర కన్నా.. మద్దతు ధర తక్కువగా ఉంది. చనిపోయిన తర్వాత రైతులకు అంత్యక్రియలు చేయడం కాడు.. రైతు బతికేందుకు చర్యలు చేపట్టండి. రైతులు బతికేలా పరిస్థితులు సృష్టించండి. తెలంగాణ వచ్చిన తర్వాత రైతులు చేసుకున్న ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.
బిజెపి చర్యలకు వ్యతిరేకంగా అవార్డులు వెనక్కి...
బిజెపి చర్యలకు వ్యతిరేకంగా అవార్డులు వెనక్కి ఇస్తున్నారు. అవార్డులు వెనక్కి ఇస్తుంటే కేంద్ర సాహిత్య అకాడమీ పట్టించుకోవడం లేదు. దేశం గర్వించదగ్గ ప్రముఖులు బిజెపిని వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఏ ఒక్క రచయిత కూడా బిజెపికి వ్యతిరేక కార్యాకలాపాలు చేయలేదు. 1984 లో సిక్కులపై ఊచకోత, గోవింద్ పల్సారే హత్య సమయంల కూడా సమయంలో కూడా రచయితలు నిరసన తెలిపారు. కాల్బర్గిని హత్య చేసిన తర్వాత రచయితలు అవార్డులను వెనక్కిఇస్తున్నారు. కాల్బర్గి హత్య జరిగిన కొన్ని నెలల తర్వాత కేంద్రసాహిత్య అకాడమీ ఖండించింది. బిజెపి తనకు అనుకూలంగా ఉన్నవారిని మాత్రమే సంస్థలకు అధికారులను నియమిస్తున్నారు. దేశంలో ఎజెండా మారింది. దేశ అభివృద్ధి, నాణ్యత, నైఫుణ్యం లాంటివి కాకుండా... ఎంతమంది పిల్లలను కనాలి, ఏం తినాలి అనేవి ఎజెండాలుగా మారాయి. అయితే రచయితలు నిద్రపోరు.. సమాజంలో జరుగుత్ను అవినీతి, అక్రమాలు, దురాగతాలను ప్రశ్నిస్తారు. దానిని తప్పుగా భావించడం సరికాదు. గతంలో కూడా రచయితలు నిరసనలు తెలిపారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా రచయితలు దానికి వ్యతిరేకంగా గళమెత్తారు. రచయిత, కవులు,కళాకారుడు నిద్రపోరు. సమాజంలో జరుగుతున్న పరిణామాలపై రాజకీయాలకతీతంగా స్పందించకపోతే.. అతను మేధావి కాదు. అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

12:51 - October 30, 2015

ముంబై: అనూహ్య కేసులో ముంబై సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు చంద్రబానుకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. జనవరి 4, 2015 న చంద్రభాను.. అనూహ్యపై అత్యాచారం చేసి... ఆపై ఆమెను హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే...కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన సాఫ్ట్ వేర్‌ ఉద్యోగిని అనూహ్య ముంబాయిలో చంద్రభాను చేతిలో అత్యాచారానికి గరై ఆపై దారుణహత్యగావించబడింది. దాదాపు 22 నెలల తర్వాత విచారణ పూర్తి చేసిన ముంబాయిలోని సెషన్స్ కోర్టు చంద్రభాన్‌ను దోషిగా నిర్ధారించింది. నిందితుడు చంద్రభాన్‌ కిరాతకానికి పాల్పడ్డాడని...ఘోరమైన నేరం చేశాడని వాదించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉరిశిక్ష వేయాలని కోర్టుకు విన్నవించారు. అయితే కోర్టులో జరిగిన వాదోపవాదనలు, విన్నపాలు విన్న న్యాయస్థానం.. శిక్షను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ కేసులో చివరి విచారణ పూర్తి చేసిన కోర్టు చంద్రభానుకు ఉరిశిక్ష ఖరారు చేసింది.

 

అనూహ్య కేసులో సంచలన తీర్పు..

ముంబై: అనూహ్య కేసులో ముంబై సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు చంద్రబానుకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. జనవరి 4, 2015 న చంద్రభాను.. అనూహ్యపై అత్యాచారం చేసి... ఆపై ఆమెను హత్య చేశాడు.

 

గుంటూరు జిల్లా నేతలతో జగన్ భేటీ

హైదరాబాద్ : లోటస్ పాండ్ లో గుంటూరు జిల్లా నేతలతో వైసిపి అధినేత జగన్ భేటీ అయ్యారు. రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణపై చర్చ జరుపనున్నారు. 

బస్సు-ట్రాక్టర్ ఢీ.. ఏడుగురి మృతి

మహారాష్ట్ర : బీడ్ జిల్లాలో బస్సు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి.

ఎపికి ప్రత్యేకహోదా కోసం వ్యక్తి ఆత్మహత్య...

పశ్చిమగోదావరి : ఎపికి ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉంగుటూరుకు చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఎపికి ప్రత్యేకహోదా కోసం రెండు నెలల క్రితం ఆత్మహత్యాయత్నం చేశాడు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

 

11:24 - October 30, 2015

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు.. అమలుకు నోచుకోవడం లేదని సీపీఎం నేత శ్రీనివాస్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. టీసర్కార్ చెపుతున్న మాటలు అధికంగా ఉన్నాయని.. చేతలు మాత్రం తక్కువగా ఉన్నాయన్నారు. 16 నెలల కాలంలో 396 డబుల్ ఇళ్లన నిర్మించారని.. అదీ కూడా జీహెచ్ ఎంసీ ఎన్నికల దృష్ట్యా హైదరాబాద్ లో పూర్తి చేశారని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన 60 వేల ఇళ్లు.. ప్రకటిస్తే.. అవి నియోజవర్గానికి 400 ఇళ్లు వస్తాయని అందులో గ్రామానికి మూడు లేదా నాలుగు ఇళ్లు వస్తాయని ఇవి ఏ విధంగా పేదలకు సరిపోతాయని ప్రశ్నించారు. కాబట్టి పెద్ద సంఖ్యలో ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. 'డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి మొన్న దసరా పండుగ రోజు ముగ్గులు పోసినా, ఇంకా గందరగోళం తొలగలేదు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి ప్రమాణాలు పాటించబోతున్నారో స్పష్టత రాలేదు. మరి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పక్కదారి పట్టకుండా వుండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలు మరోసారి తలెత్తకుండా వుండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం విషయంలో ఇప్పటికీ ప్రదర్శించిన వైఖరి ఎలా వుంది?' ఇలాంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:01 - October 30, 2015

ముంబై : క్రూరమైన నేరానికి పాల్పడ్డాడు కాబట్టి ఉరిశిక్ష వేయాల్సిందే...ఇది పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదన... ఆ మృగానికి వేసే శిక్ష నేరగాళ్లలో భయాన్ని పుట్టించాలి...ఇది బాధిత తండ్రి వేదన...మచిలీపట్నం చెందిన సాఫ్ట్ వేర్‌ ఉద్యోగిని అనూహ్య దారుణహత్య కేసులో ముంబాయి కోర్టు శిక్ష ఖరారు చేసే విషయమై దాదాపు గంటన్నరకు పైగా విచారించింది...చివరగా నేడు నిందితుడు చంద్రభాన్‌కు శిక్ష వేయాలని నిర్ణయించింది. ఇది ఒక్కరి సమస్య కాదు.. ఎందరిదో... ఎందరో కన్నవారు కన్నీటితోనే కాలం వెళ్లదీస్తున్నారు....అనూహ్య కేసులో న్యాయస్థానం ఇచ్చే తీర్పు నేరం చేసేవారిలో వణుకుపుట్టించేలా ఉండాలని కోరుకుంటున్నారు బాధిత తండ్రి.
మరో 48 గంటల్లో నిందితుడికి శిక్షను ప్రకటించనున్న కోర్టు
కృష్ణా జిల్లా మచిలీపట్నం చెందిన అనూహ్య ఓ రాక్షసుడి చేతిలో బలయిన విషయం తెలిసిందే...దాదాపు 22 నెలల తర్వాత విచారణ పూర్తి చేసిన ముంబాయిలోని సెషన్స్ కోర్టు చంద్రభాన్‌ను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో చివరి విచారణ పూర్తి చేసిన కోర్టు శిక్ష ఖరారు చేయనుంది... మరో 48 గంటల్లో నిందితుడికి శిక్షను ప్రకటించనుంది...నిందితుడు చంద్రభాన్‌ కిరాతకానికి పాల్పడ్డాడని...ఘోరమైన నేరం చేశాడని వాదించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉరిశిక్ష వేయాలని కోర్టుకు విన్నవించారు...అయితే కోర్టులో జరిగిన వాదోపవాదనలు..విన్నపాలు విన్న న్యాయస్థానం ఈ నెల 30న శిక్ష వేయనుంది.
చంద్రభాన్‌ను కఠినంగా శిక్షించాలి : బాధిత తండ్రి
ఇదిలా ఉంటే అనూహ్యను కిరాతకంగా చంపేసిన చంద్రభాన్‌ను కఠినంగా శిక్షించాలంటూ బాధిత తండ్రి కోరుతున్నారు...నేరగాళ్లలో భయాన్ని పుట్టించేలా ఉండాలంటున్నారు... తనలానే ఎందరో బాధితులున్నారని ...తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నవారి వల్ల ఎన్నో కుటుంబాలు కన్నీటిలో కాలం వెళ్లదీస్తుందంటున్నారు... చంద్రభాన్‌కు పడేశిక్ష నేరం చేయాలన్న ఆలోచన రాకుండా ఉండాలని వేడుకుంటున్నారు. మరికొన్ని గంటల్లోనే వెలువడనున్న తీర్పు కోసం ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. తీవ్రమైన నేరం చేసిన చంద్రభాన్‌కు ఎలాంటి శిక్ష విధిస్తారో చూడాల్సిందే.

 

10:52 - October 30, 2015

హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల్లో మళ్లీ స్వైన్ టెర్రర్ మొదలైంది. స్వైన్‌ ఫ్లూ విజృంభించి ప్రజల్ని గజగజ వణికిస్తోంది. వాతావరణం కాస్త చల్లబడటంతో మాయదారి రోగం కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో పంజా విసురుతోంది. స్వైన్‌ స్వైర విహారంతో జనాలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు.
పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు
తెలుగురాష్ట్రాల్లో రోజురోజుకు స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. స్వైన్ ఫ్లూ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో ఈ వ్యాధి బారిన పడి గాంధీ ఆసుపత్రిలో చేరుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే నలుగురు స్వైన్ మహమ్మారితో మృతి చెందారు. కుషాయిగూడకు చెందిన తల్లీకూతురు చనిపోగా...అడ్డగుట్టకు చెందిన మరో చిన్నారి మృతి చెందింది. నల్గొండకు చెందిన ఓ మహిళ గాంధీ ఆస్పత్రిలో కన్ను మూసింది. గాంధీ ఆస్పత్రిలో మరో పది మంది స్వైన్ ఫ్లూ వ్యాధితో చికిత్స పొందుతున్నారు. అందులో కొందరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని గాంధీ ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లోనూ స్వైన్ ఫ్లూ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. బాధితులంతా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలివస్తున్నారు. వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

 

 

10:49 - October 30, 2015

విజయవాడ : ఎపి సచివాలయ ఉద్యోగులు విజయవాడకు వెళ్లాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు హుకూం జారీ చేశారు. వచ్చే ఏడాది జూన్‌ వరకు హైదరాబాద్‌లో ఉండేందుకు సమయమిచ్చారు. విజయవాడలో వసతి సౌకర్యాలు ఉన్నా లేకున్నా ఉద్యోగులు కొన్ని త్యాగాలు చేయక తప్పదని స్పష్టం చేశారు.
విజయవాడకు ఎపి సచివాలయ ఉద్యోగులు...
ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగులు విజయవాడకు తరలి వెళ్లడానికి రంగం సిద్ధమైంది. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఏపి సెక్రటేరియట్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జరిపిన చర్చల్లో ఈ విషయం వెల్లడైంది. వచ్చే ఏడాది జూన్‌ తర్వాత ఏపి సచివాలయ ఉద్యోగులు విజయవాడకు రావాల్సిందేనని సిఎం వారికి స్పష్టం చేశారు.
విజయవాడలో తాత్కాలిక వసతి సదుపాయాలు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఉద్యోగులు అడిగినవన్నీ ఇచ్చేశామని సిఎం గుర్తు చేశారు. విజయవాడలో వసతుల మాట ఎలా ఉన్నా....నవ్యాంధ్ర నిర్మాణానికి ఉద్యోగులు కొంత త్యాగం చేయక తప్పదని చంద్రబాబు వారికి సూచించారు. విజయవాడలో ఉద్యోగులకు తాత్కాలిక వసతి సదుపాయాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. రెండు చోట్లా హెచ్‌ఆర్‌ఏ ఇప్పించాలన్న ఉద్యోగుల డిమాండ్‌ను సిఎం పరిశీలిస్తామన్నారు.
ఉద్యోగులు సహకరించాలన్న సీఎం చంద్రబాబు
కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు అందడం లేదని, ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు పరిస్థితిని అర్థం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా తాను ఇప్పటికే విజయవాడలో మకాం వేశానని... నేను ఇక్కడ, మీరు అక్కడ ఉంటే పరిపాలనలో ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. ఈ విషయంలో ఉద్యోగులు సహకరించాలని సిఎం విజ్ఞప్తి చేశారు.
మొదటి విడతలో 9 వేల మంది ఉద్యోగుల తరలింపు
ప్రస్తుతం ఏపీకి సంబంధించిన 15 వేల మంది ఉద్యోగులు హైదరాబాద్‌లో పని చేస్తున్నారు. వీరిలో 9 వేల మందిని తొలి విడతలో ఏపీకి తరలించాల్సి ఉంది. తర్వాత దశల్లో మిగిలిన వారిని తీసుకెళ్లాలని సర్కార్‌ నిర్ణయించింది. ఉద్యోగుల తరలింపుపై ఒత్తిడి తెస్తున్న ప్రభుత్వం.. ఈ దిశగా సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్‌ఆర్‌ఏ, పిల్లల స్థానికత వంటి పలు అంశాలపై క్లారిటీ లేకుండా హైదరాబాద్‌ నుంచి విజయవాడ, గుంటూరుకు తరలివెళ్తే తమ పిల్లల భవిష్యత్‌ ఏలా వుంటుందోనన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది.

 

10:43 - October 30, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ఆరు లక్షల రుపాయలకు పెంచింది ప్రభుత్వం. అయితే ఈ పెంచిన పరిహారాన్ని గతంలో ఈ సంవత్సరం సెప్టెంబర్ 19 అనంతరం ఆత్మహత్య చేసుకున్న రైతులకు వర్తింప చేస్తామని క్యాబినేట్‌ నిర్ణయించింది. అయితే దీని పై విపక్షాలు,ప్రజా సంఘాలతో పాటు అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జూన్ రెండు 2014 నుంచి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కూడా పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు.
రైతుల మరణాలను ధృవీకరించేందుకు త్రిసభ్య కమిటీ
ఇది ఇలా ఉంటే రైతుమరణాల పై క్షేత్ర స్ధాయిలో సర్టిఫై చేసేందుకు త్రిసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ఆర్డివో, ఎమ్మార్వో, డిఎస్పి స్ధాయి అధికారులు ఉంటారు. ఇలా త్రిసభ్య కమిటి నిర్ధారించిన తర్వాతే పరిహారం అమోదించడం జరగుతుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సెప్టెంబర్ 18, 2015 వరకు 627 మంది చనిపోయినట్లు గుర్తించగా ఇందులో నిజ నిర్ధారణ కమిటీ నిర్ధారించిన సంఖ్య 470. ఇందులో నిజమైన ఆత్మహత్యలు కేవలం 242 మంది అయితే ..ఇందులో కేవలం 176 మందికే పరిహారం వర్తింప చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
ప్రభుత్వ లెక్క ప్రకారం 760 రైతుల ఆత్మహత్యలు
ఇక గత నెల నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం రైతు ఆత్మహత్యల సంఖ్య 760 కాగా, త్రిసభ్య కమిటి విచారించి, వాస్తవంగా తేల్చిన సంఖ్య 338, ఇక పరిహారం అందిన కుటుంబాలు 300 వరకు ఉన్నట్లు రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే వీరందరికి పాత జీవో 421 ప్రకారమే లక్షా యాభై వేలు మాత్రమే అందించారు. గతంలో లక్షన్నర అందించిన వారితో పాటు.. కొత్తగా గుర్తించిన వారికి కలిపి పెంచిన ఆరు లక్షల పరిహారాన్ని త్వరలోనే అందిస్తామని అంటున్నారు అధికారులు.
1300 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు
మరోవైపు రైతులకు పరిహారం పెంపు పట్ల అన్ని పక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నా ..సంఖ్య విషయంలో ప్రభుత్వం లెక్క పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1300 మందికి పైగా రైతులు అత్మహత్యలు చేసుకున్నారని ఒక అంచనా ఉంది. ఇదే సమయంలో నేషనల్‌ క్రైం బ్యూరో రిపోర్టు ప్రకారం 800 మందికి పైగా రైతులు చనిపోయారని చెబుతుంటే ప్రభుత్వం మాత్రం వాటన్నింటిని కొట్టి పారేస్తుంది.

 

10:24 - October 30, 2015

ఆదిలాబాద్ : కాగజ్ నగర్ లో ధూంధాం కళాకారిణి మధు ప్రియను ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ కు యత్నించారు. మధుప్రియ, శ్రీకాంత్ అనే యువకుడు గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. మధుప్రియ అతన్ని వివాహం చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ఇవాళా తెల్లవారుజామున కాగజ్ నగర్ లో వివాహం చేసుకోవడానికి మధుప్రియ, శ్రీకాంత్ లు సిద్ధమయ్యారు. అయితే ఆమె తల్లిదండ్రులకు ప్రేమ వివాహం ఇష్టం లేకపోవడంతో మధుప్రియను నిన్న అర్ధరాత్రి కిడ్నాప్ చేయడానికి యత్నించారు. మధుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమె తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కాగజ్ నగర్ డిఎస్ పి కార్యాలయంలో మధుప్రియ ఉంది. ప్రేమ పెళ్లి ఇష్టంలేకనే తనను తీసుకెళ్లడానికి తమ తల్లిదండ్రులు ప్రయత్నించారని.... వారిని ఒప్పించే వివాహం చేసుకుంటానని మధుప్రియ చెప్పినట్లు తెలుస్తోంది. నేడు మధుప్రియ పెళ్లి కాగజ్ నగర్ లో జరుగనుంది.

 

నేడు ధూంధాం కళాకారిణి మధుప్రియ పెళ్లి..

ఆదిలాబాద్ : కాగజ్ నగర్ లో నేడు ధూంధాం కళాకారిణి మధుప్రియ పెళ్లి జరుగనుంది. అయితే అంకతకముందు కాగజ్ నగర్ లో మధు ప్రియను ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ కు యత్నించారు. ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకునేందుకు మధుప్రియ నిర్ణయం తీసుకుంది. అయితే తల్లిదండ్రులకు ప్రేమ వివాహం ఇష్టం లేకపోవడంతో మధుప్రియను కిడ్నాప్ కు చేయడానికి యత్నించారు. మధుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు.  

సింగర్ మధుప్రియను కిడ్నాపు యత్నం చేసిన తల్లిండ్రులు

ఆదిలాబాద్ : కాగజ్ నగర్ లో ధూంధాం కళాకారిణి మధు ప్రియను ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ కు యత్నించారు. ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకునేందుకు మధుప్రియ నిర్ణయం తీసుకుంది. అయితే తల్లిదండ్రులకు ప్రేమ వివాహం ఇష్టం లేకపోవడంతో మధుప్రియను కిడ్నాప్ కు చేయడానికి యత్నించారు. మధుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు.

 

నేడు మంత్రి నారాయణ కుమార్తె వివాహం

నెల్లూరు : నేడు ఎపి మంత్రి నారాయణ కుమార్తె వివాహం మంత్రి గంటా శ్రీనివాస్ కుమారుడితో నెల్లూరు జిల్లాలో జరుగనుంది. ఈ వివాహా మహోత్సవానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. 

నేడు హైదరాబాద్ కు డచ్ కంపెనీ వ్యాపారవేత్తలు

హైదరాబాద్ : డచ్ కంపెనీకి చెందిన 28 మంది వ్యాపారవేత్తలు నేడు హైదరాబాద్ రానున్నారు. తెలంగాణలో పెట్టుబడుల సానుకూలతపై అధ్యయనం చేయనున్నారు.

 

నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

నెల్లూరు : సీఎం చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..

విశాఖ : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ నేపథ్యంలోఈశాన్య రుతు పవనాలు బలపడనున్నాయి. ఈ రుతు పవనాల ప్రభావం తో ఉత్తర దక్షిణ కోస్తా లో వర్షాలు పడే అవకాశం ఉంది. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా ఉంది. భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, నడక దారి భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. 

తల్లిదండ్రులపై కిడ్నాప్ కేసు పెట్టిన మధు ప్రియ..

ఆదిలాబాద్ : తెలంగాణా ధూమ్ ధామ్ కళాకారిణి మధు ప్రియను కిడ్నాప్ చేయడానికి సొంత తల్లిదండ్రులే యత్నించినట్లు సమాచారం. కాగజ్ నగర్ కు చెందిన ఒక యువకుడిని ప్రేమ వివాహం చేసుకునేందుకు మధు ప్రియ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపద్యంలో ప్రేమ వివాహం ఇష్టం లేని తన తల్లిదండ్రులు తనను కిడ్నాప్ చేయడానికి యత్నించారని మధు ప్రియ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో మధు ప్రియ తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

నేడు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీలు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. నేడు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ తమ అభ్యర్థిని ప్రకటించనున్నారు.

ఐఐటీ-జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ 4న..

హైదరాబాద్ : వచ్చే ఏడాది ఏప్రిల్ 4న ఐఐటీ-జేఈఈ మెయిన్స్ పరీక్షలను, మే 22న అడ్వాన్స్ పరీక్షలను నిర్వహించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించినట్లు తెలిసింది. వీటిని గత ఏడాది మాదిరిగానే వేర్వేరుగా నిర్వహించనున్నట్లు సమాచారం. 

ఆసియా కప్ బంగ్లాలో..

ఢాకా: ఆసియా కప్ క్రికెట్ టోర్నీ ఆతిథ్యాన్నిమరోసారి  బంగ్లాదేశ్ దక్కించుకుంది. ఇప్పటికే వరుసగా రెండు సార్లు ఆసియా కప్ క్రికెట్ టోర్నీని నిర్వహించిన బంగ్లాదేశ్ మరోసారి ఈ టోర్నీ నిర్వహణకు సిద్ధమైంది.   

Don't Miss