Activities calendar

31 October 2015

ట్రిపుల్ ఐటి విద్యార్థిని ఆత్మహత్య

కడప : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఉమాజ్యోతి అనే విద్యార్థిని తను ఉంటున్న హాస్టలో గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.  

22:03 - October 31, 2015

ఈజిప్టు : గగనతలంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈజిప్టు నుంచి రష్యా బయలుదేరిన ఎయిర్‌బస్ 321 విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న 224 మంది మృతి చెందారు. అధికారులు ఇప్పటివరకు వందకు పైగా మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణీకుల్లో అధికశాతం రష్యాకు చెందిన టూరిస్టులు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రష్యా విమానాన్ని తామే కూల్చినట్టు ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
కూలిన రష్యా విమానం... 224 మంది మృతి
రష్యా ఎయిర్‌లైన్స్ కు చెందిన ఎయిర్‌బస్‌ 321 విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 224 మంది ప్రయాణికులు మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రమాద స్థలం నుంచి ఇప్పటివరకు వందకు పైగా మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఐదుగురు పిల్లల మృతదేహాలు ఉన్నాయి.
ప్రమాదం జరిగిన తీరు...
రష్యా కోగ్‌లీమావియా ఎయిర్‌లైన్స్ కు చెందిన ఎయిర్‌బస్‌ 321 విమానం -ఈజిప్టులోని షామ్ అల్ షేక్ నుంచి రష్యాలోని పీటర్స్ బర్గ్ కు బయలుదేరింది. సినాయ్ ద్వీపకల్పం చేరుకోగానే 31 వేల అడుగుల ఎత్తులో ఉండగా విమానానికి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యను గుర్తించిన పైలట్ విమానాన్ని కైరోలో అత్యవసర ల్యాండింగ్ కోసం ప్రయత్నించారు. విమానం టేకాఫ్ తీసుకున్న 23 నిమిషాలకే ఈజిప్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ సిగ్నల్ పరిధి నుంచి దాటిపోయింది. ఆ తర్వాత అది సినాయ్ ద్వీపకల్పంలోని కొండల ప్రాంతంలో కూలిందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రమాదంలో విమానం రెండు ముక్కలుగా చీలిపోయింది.
రంగంలోకి దిగిన ఈజిప్టు సహాయక బృందాలు
ప్రమాదం జరిగిన వెంటనే ఈజిప్టు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాద స్థలానికి 45 అంబులెన్స్‌లను పంపినట్టు ఈజిప్టు ప్రభుత్వం పేర్కొంది. రష్యా బలగాలు కూడా ప్రమాద స్థలికి బయలుదేరాయి. ఈజిప్టులోని సినాయి పర్వతం వద్ద కూలిపోయిన రష్యా విమానం బ్లాక్ బాక్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం వెనుక ఎలాంటి విద్రోహ చర్య లేదని, సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే విమానం కూలిపోయిందని నిపుణులు చెబుతున్నారు. అయితే విమానం బయల్దేరడానికి ముందే సమస్యను గుర్తించినప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యం చేశారని, అతి విశ్వాసంతో టేకాఫ్ తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఈజిప్టు ప్రధాన మంత్రి ఇస్మాయిల్ షరీఫ్ ఓ క్యాబినెట్ స్థాయి కమిటీ వేశారు. విమాన ప్రమాదానికి గల కారణాలపై ఈ కమిటీ సమీక్షించనుంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి
విమాన ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఎయిర్ బస్ ఏ-321ను ఆపరేట్ చేస్తున్న కొగ్‌లీమావియా ఎయిర్‌లైన్స్‌పై రష్యా ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యం వల్లే సిబ్బందితోపాటు 224 ప్రాణాలు పోయినట్లు నిర్ధారించింది. ఎర్ర సముద్ర తీరంలోని షార్మ్ అల్ షేక్ కు పర్యటనకు వచ్చిన రష్యన్లకు తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన సంభవించింది. విమానంలో 200మంది పెద్దలు, 17 మంది పిల్లలు, ఏడుగురు విమాన సిబ్బంది కలిపి మొత్తం 224 మంది ప్రయాణించారు.

 

21:55 - October 31, 2015

ఢిల్లీ : సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకంగా వ్యవహరించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఈ విషయంతో అత్యునత ప్రమాణాలు పాటించాలని కోరారు. న్యాయవ్యవస్థలో ఉన్నత పదవులను ప్రాధాన్యత ఆధారంగానే భర్తీ చేయాలని కోరారు. న్యాయవ్యవస్థ క్రియాశీలత కారణంగా రాజ్యాంగం కల్పించిన అధికార వికేంద్రీకరణ నీరుగారి పోకూడదని పేర్కొన్నారు. మన ప్రజాస్వామ్యానికి చెందిన ప్రతి అంగం తనకు నిర్దేశించిన పరిధిలోనే పనిచేయాలి కానీ, ఇతర వ్యవస్థలకు కేటాయించిన వాటిలోకి చొరబడకూడదని చెప్పారు. జాతీయ న్యాయనియమకాల కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పును ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఢిల్లీ హైకోర్టు స్వర్ణోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు.

 

21:50 - October 31, 2015

తరతరాలుగా సమాజంలో శ్రమ దోపిడి కొనసాగుతోందని ప్రముఖ సామాజికి విశ్లేషకులు కంచె ఐలయ్య అన్నారు. అందుకు భారతీయ వర్ణవ్యవస్థ బాగా తోడ్పడిందని తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన జనచరిత విశ్లేషణ కార్యక్రమంలో ఆయన పాల్గొని, పలు విషయాలను వివరించారు. 
ఆ వివరాలను ఆయన మాటల్లోనే...
జీవించడం కోసం శ్రమ
మానవజాతి బతికి ఉండటానికి ప్రథమ ప్రక్రియ శ్రమం. తాత్విక రంగంలో శ్రమను రెండు రకాలుగా విభజించారు. శరీరక శ్రమ, మానసిక శ్రమగా విభజించారు. తాత్వికరంగంలో చాలా మోసపూరిత సిద్ధాంతాన్ని చేశారు. గ్రంథాలు రాయడం పుస్తకాలు చదవడం మానసిక శ్రమ అన్నారు. కానీ ప్రతి పనిలో మానసిక, శారీరక శ్రమ ఉంటుంది. శ్రమకు గౌరవం లేకుండా పోయింది. శ్రమతోనే భాష, మానవ సంబంధాలు సృష్టించుకున్నారు. శ్రమే జీవనం.. అది లేకుండా మరో జీవనం లేదు. శ్రమతో సంఘర్షణ పడుతూ ప్రకృతితో యుద్ధం చేశారు. పుస్తకాలు శ్రమజీవితాన్ని శాసించాయనేది తప్పు. ఆడమ్ స్మిత్ శ్రమ రోల్ ను గుర్తించారు. పాలీలో మొదలుగా రచనలు వచ్చాయి. ఆ తర్వాత సంస్కృతంలో రచనలు చేశారు. అయితే శ్రమ పాత్ర ఆధారంగా గ్రంథ రచన చేయలేదు. శ్రమ జీవితం యొక్క పాత్రను కారల్ మార్క్స్ గ్రంథం చేశారు. వర్గదృక్పథం గురించి వివరించారు. శ్రమను అర్థం చేసుకుని పుస్తకాలు రాశారు. దోపిడీ చేసుకునే వర్గం, దోపిడీకిగురయ్యే వర్గం రెండు ఉంటాయని... వాటి గురించి వివరించారు. అంబేద్కర్.. కులాల పుట్టుకను, మతాలను చర్చించారు. అగ్రకులాలకు చెందిన అందరూ... ఆర్థికంగా కాకుండా... సమాజికంగా దోచుకుంటారు. కొంతమంది శ్రమకు దూరంగా ఉంటున్నారు. అధికసంఖ్యాకులు శ్రమలో పాల్గొంటున్నారు. అంటరాని వారు ఎక్కువగా శ్రమ చేస్తున్నారు. మనుధర్మ శాస్త్రం, బౌద్ధమతం వచ్చినప్పుడు కూడా అంటరానితనం లేదు. సమాజంలో మార్పు కోసం.. విప్లవశక్తులు, కమ్యూనిస్టులు పని చేస్తున్నారు. సమాజం మారుతుంది. సమానత్వం వస్తుంది'. అని కంచె ఐలయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. 
కింది కులాపై పైకులాల పెత్తనం 
'తరతరాలుగా సమాజంలో శ్రమ దోపిడి కొనసాగుతోంది. అందుకు భారతీయ వర్ణవ్యవస్థ బాగా తోడ్పడింది. శ్రమించే కింది కులాల వారిపై పనిచేయని పైకులాల వారు పెత్తనం చెలాయించారు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి మొదలైన కులవృత్తుల వారిని అవమానించారు. అగౌరవంగా చూశారు. ఉత్పత్తిలో ఎలాంటి భాగస్వామ్యంలేని సోమరులే దర్జాగా బతికేశారు. ఈ నేపథ్యంలో శ్రమించు కులాలవాళ్లు ఎలాంటి వివక్షను ఎదుర్కొన్నారో. ఎలాంటి చారిత్రక విద్రోహానికి బలై పోయారో.. వంటి అంశాలపై ఐలయ్య విశ్లేషణ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:40 - October 31, 2015

లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కేబినెట్ ను విస్తరించారు. అఖిలేష్ కొత్తగా 12 మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. యూపీ గవర్నర్ రామ్ నాయక్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అకాలీదళ్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బల్వంత్ సింగ్ రామ్వాలియా పార్టీకి గుడ్ బై చెప్పి.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కేబినెట్లో మంత్రిగా చేరారు. బల్వంత్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ అనుచరుడిగా చాలా రోజులపాటు కొనసాగారు. కొత్త మంత్రులు, కేబినెట్ ర్యాంక్ పొందిన వారితో సహా మొత్తం 21 మంది ప్రమాణం చేశారు. 2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అఖిలేష్ కేబినెట్లో భారీ మార్పులు చేశారు.

 

21:36 - October 31, 2015

హైదరాబాద్ : మావోయిస్టులు, తీవ్రవాద గ్రూపుల చేతిలో మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చనిపోయిన పోలీసులు, సాధారణ పౌరులకు అందించే నష్టపరిహారాన్ని భారీగా పెంచింది. దాడుల్లో చనిపోయే హోంగార్డుల కుటుంబాలకు 30 లక్షలు, హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ స్థాయి వరకు 45 లక్షలు, ఇన్‌స్పెక్టర్, డీఎస్సీ, ఏఎస్పీ స్థాయి అధికారులకు 50 లక్షలు, ఎస్పీ, ఐపీఎస్ అధికారుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం లభించనుంది. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆయా స్థాయిలను బట్టి పరిహారం అందిస్తారు. అదే సాధారణ పౌరులు చనిపోతే వారి కుటుంబానికి 25 లక్షలు అందజేయనున్నారు. 

21:18 - October 31, 2015

హన్మకొండ : వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో హన్మకొండలో పోలీసులు కార్డెన్ సెర్చ్‌ నిర్వహించారు. నాలుగు బృందాలుగా ఏర్పడిన సుబేదారి పోలీసులు పలు ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టారు.

వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో అసంతృప్త జ్వాలలు

హైదరాబాద్ : వరంగల్ జిల్లా కాంగ్రెస్ లోనూ అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. స్టేషన్ ఘన్ పూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ రాజారపు ప్రతాప్.. రాజయ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కార్యకర్తలతో సమావేశమయ్యారు. మూడేళ్లు కాంగ్రెస్ కు దూరంగా ఉండేందుకు ప్రతాప్ నిర్ణయం తీసుకున్నారు.

 

20:55 - October 31, 2015

హైదరాబాద్ : తన ఎంపికతో గెలుపు ఖాయమైందని వరంగల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్య అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. కార్యకర్తల అభిప్రాయాల మేరకు ఎంపిక జరిగిందని చెప్పారు. చిన్న చిన్న అసంతృప్తులు పార్టీలో సహజమన్నారు. అన్ని వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు. అవే తమ విజయానికి బాటలు వేస్తాయన్నారు. టీఆర్ ఎస్ నిజస్వరూపం ప్రజలు గుర్తించారని తెలిపారు. సూట్ కేసులకు టికెట్ ఇచ్చే సంస్కృతి కాంగ్రెస్ ది కాదన్నారు. 

నా ఎంపికతో గెలుపు ఖాయమైంది: రాజయ్య

హైదరాబాద్ : తన ఎంపికతో గెలుపు ఖాయమైందని వరంగల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్య అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. కార్యకర్తల అభిప్రాయాల మేరకు ఎంపిక జరిగిందని చెప్పారు. చిన్న చిన్న అసంతృప్తులు పార్టీలో సహజమన్నారు. 

20:25 - October 31, 2015

విశాఖ : వాహదారులకు హెల్మెట్‌పై అవగాహనకోసం కాకినాడలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు.... భారీ హెల్మెట్ తయారుచేసి ప్రదర్శన నిర్వహించారు.. హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

20:14 - October 31, 2015

విజయవాడ : చెరకు రైతులను ఏపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని రైతుసంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణన్ ఆరోపించారు. విజయవాడలోని ఎంబీ భవన్‌లో జరిగిన రైతుసంఘం ప్రథమ మహాసభకు ఆయన హాజరై, మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లో సలహా ధర ఇచ్చి ప్రోత్సహిస్తుంటే.. ఏపీ సర్కారు ఇప్పటివరకూ మద్దతు ధరకు సలహా ధర ప్రకటించలేదని విమర్శించారు. మహాసభలో రైతుల సమస్యలపై నిపుణులు చర్చించారు.

 

19:43 - October 31, 2015

చిత్తూరు : తిరుపతి పర్యటనలో ఉన్న ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత... నగరంలో కందిపప్పు అమ్మకాలను పరిశీలించారు. కందిపప్పు అమ్మకాలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించినట్లు ఆమె తెలిపారు. ఇటీవలే కందిపప్పు డీలర్లతోనూ సమావేశమై కిలో కందిపప్పు 140 రూపాయలకు మించికుండా విక్రయించాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు. వచ్చే 15 రోజుల వరకు ఇదే ధరకు విక్రయాలు జరుగుతాయని మంత్రి తెలిపారు.

 

19:39 - October 31, 2015

రంగారెడ్డి : జిల్లాలోని జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో మంటలు అంటుకున్నాయి. మంటలు వేగంగా చుట్టుపక్కలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు.

19:36 - October 31, 2015

నిజామాబాద్‌ : జిల్లా జెడ్పీ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధికారుల తీరుపై ఫైరయ్యారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 శాతం అట్టడుగు వర్గాలకు లబ్ధి చేకూర్చేందుకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి అవకతవకలు జరిగినా ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. బడుగు బలహీన వర్గాలను పేదరికం నుంచి విముక్తి చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

 

19:32 - October 31, 2015

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన షేర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సక్సెస్ కంటే టాలెంట్ ను నమ్ముతానని చెబుతాడు కళ్యాణ్ రామ్. అందుకే తానకు అభిమన్యు, కత్తి సినిమాల రూపంలో రెండు ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన దర్శకుడు మల్లికార్జున్ కు మరో అవకాశం ఇచ్చాడు. మరి అతని నమ్మకం నిలబడిందా లేదా చూడాలి. పదేళ్ల ప్లాపుల తర్వాత 'పటాస్'తో  కళ్యాణ్ రామ్ కు సక్సెస్ వచ్చింది. దీని తర్వాత వస్తున్న సినిమా 'షేర్'. కాబట్టి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ విషయంలో అంచనాలుంటాయి. మరి 'షేర్' బాక్సాఫీసు దగ్గర నిజంగానే పంజా విసిరిందా లేదా?. సినిమా చూసిన ప్రేక్షకుల అభిప్రాయలు.. 10టీవీ విశ్లేషణ.. మరియు రేటింగ్ వీడియోలో చూడండి. 

19:05 - October 31, 2015

హైదరాబాద్ : రెండున్నర ఏళ్లలో ప్రతి ఇంటికి మంచినీటి నల్లా ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ టీఆర్ ఎస్ ఎంపి అభ్యర్థి పసునూరి దయాకర్ ను అభినందించిన కేసీఆర్... ఆయనకు ఎ ఫామ్, బి ఫామ్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఉన్న పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి కాలేజీ హాస్టల్ లో సన్న బియ్యం భోజనం పెడతామని చెప్పారు. సంక్షేమ పథకాలే టీఆర్ ఎస్ ను గెలిపిస్తాయన్నారు. సంక్షేమరంగంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. తెలంగాణలో విద్యుత్ సమస్యల లేకుండా చేస్తామని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నిక సీటుకు చాలా మంది ఆశించారని సీఎం తెలిపారు. దయాకర్ కు రెండు, మూడు సార్లు అవకాశం వచ్చిపోయిందన్నారు. ఉద్యమంలో ముందు నుంచి ఉన్నవారికి అవకాశాలిస్తున్నామని చెప్పారు. అభ్యర్థి ఎవరైనా అంతా కలిసి పని చేయాలని విజ్ఞప్తి చేశారు. 
పేద ప్రజలు ఆత్మగౌరవంతో గొప్పగా బతకాలి... 
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ఎవరు డిమాండ్ చేయకపోయినా.. ఎన్నికల మ్యానిపెస్టోలో పెట్టకపోయినా... ప్రవేశపెట్టామని చెప్పారు. అయితే వచ్చే సంవత్సరం నుంచి బిసిలందరికీ వర్తింపచేస్తామని చెప్పారు. ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించామని తెలిపారు. గతం ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇల్లు డబ్బాల లాగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈ సంవత్సరం 60 వేల ఇళ్లు మంజూరు చేశామని.. ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్తామన్నారు. పేద ప్రజలు ఆత్మగౌరవంతో గొప్పగా బతకాలని కాంక్షించారు. ఇళ్ల నిర్మాణం నిమిత్తం గ్రామాల్లో రూ.5లక్షల 4 వేలు, పట్టణాల్లో రూ.5 లక్షల 30 వేలు ఇస్తునట్లు తెలిపారు. తాము నిర్మించబోయే ఒక్కొక్క ఇల్లు ఏడు ఇళ్లలతో సమానంగా ఉంటుందని పేర్కొన్నారు. రూ.60 వేల ఇళ్లు.. ఆరు లక్షల 20 వేల ఇళ్లకు సమానమన్నారు. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు తెచ్చుకున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు మార్కెట్ కమిటీ చైర్మన్ లు అయ్యే అవకాశం లభించిందన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తండాలను గ్రామ పంచాయతీ చేయాలని కేబనెట్ లో నిర్ణయించామని గుర్తు చేశారు. రంజాన్, దసరా, బతుకమ్మ పండుగలను ప్రభుత్వం పరంగా ఘనంగా జరిపినట్లు తెలిపారు. 25 వేల మెగావాట్ల పవర్ ఉండే విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. 16 నెలల కాలంలో కేజీ టు పీజీ వ్యిద మినిహా.. మిగిలిన హామీలన్నింటినీ అమలు చేశామని తెలిపారు. బీహార్ లో అఖిలేష్ యాదవ్ తనను గెలిపిస్తే... తెలంగాణలో అమలు చేసిన విధంగా వాటర్ గ్రిడ్ ను ప్రవేశపెడతామని చెప్పిడం గర్వకారణమన్నారు. సర్వేల ప్రకారం.. వరంగల్ లో గెలుపు తమదే అని స్పష్టం చేశారు. వరంగల్ అద్భుతంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉందన్నారు. 

 

 

రెండున్నరేళ్లలో ప్రతి ఇంటికి మంచినీరు : సీఏం కేసీఆర్

హైదరాబాద్ : రెండున్నర ఏళ్లలో ప్రతి ఇంటికి మంచినీటి నల్లా ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఉన్న పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు.

 

గాలి వినోద్ కుమార్ కు మద్దతు ఇవ్వాలి : తమ్మినేని

హైదరాబాద్ : గాలి వినోద్ కుమార్ ఇండిపెండెంట్ అభ్యర్థి అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వినోద్ కు వామపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయని చెప్పారు. టీఆర్ ఎస్ ను ఓడించాలంటే.. అన్ని పార్టీలు వినోద్ కుమార్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. 

18:52 - October 31, 2015

వరంగల్ : గుండు సుధారాణి చేరికపై వరంగల్ టీఆర్ ఎస్ లో అసంతృప్తి సెగలు రేగాయి. సుధారాణి చేరికను ఆ పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. కొండా సురేఖ దంపతులు అలకబూనారు. మాట మాత్రం చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారని ఆవేదన చెందారు. ఈమేరకు రాంనగర్ లోని కొండా దంపతుల ఇంట్లో పార్టీ కార్యకర్తలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. 

గుండు సుధారాణి చేరికపై వరంగల్ టీఆర్ ఎస్ లో అసంతృప్తి

వరంగల్ : గుండు సుధారాణి చేరికపై వరంగల్ టీఆర్ ఎస్ లో అసంతృప్తి సెగలు రేగాయి. సుధారాణి చేరికను ఆ పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. కొండా సురేఖ దంపతులు అలకబూనారు. 

స్వతంత్ర అభ్యర్థిగా రేపాక ప్రేమ్ కుమార్ నామినేషన్ దాఖలు

హన్మకొండ : వరంగల్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రేపాక ప్రేమ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు.

వాట్సాప్ లో యువతికి అశ్లీల చిత్రాలు, మెస్సేజ్ లు

హైదరాబాద్ : యువతిని ఓ యువకుడు వేధింపులకు గురి చేశాడు. చైతన్య అనే యువకుడు కాచిగూడకు చెందిన యువతికి వాట్సాప్ లో అశ్లీల చిత్రాలు, మెస్సేజ్ లు పంపించాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చైతన్యను అరెస్టు చేశారు. అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. 

17:47 - October 31, 2015

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి కిరణ్ పై బెదిరింపు ఆరోపణలు వచ్చాయి. సాయికిరణ్ చేతిలో తనకు ప్రాణహాని ఉందంటూ... అభినవ్ అనే యువకుడు మీడియా ముందుకొచ్చాడు. తన భార్య భువనారెడ్డిని తన నుంచి వేరు చేసేందుకు మంత్రి కుమారుడు సాయి కిరణ్, అతని అనుచరులు వేధిస్తున్నారని ఆరోపించాడు. కొట్టడమే కాకుండా ... తనను చంపేస్తామని బెదిరించినట్టు చెప్పాడు. తమ పెళ్లి.... అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేదని.. వారి ప్రమేయంతో సాయికిరణ్ తనపై దాడి చేశాడని అభినవ్ ఆరోపించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి 4రోజులు అవుతున్నా.. ఇంతవరకు అతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని వాపోయాడు. 

17:43 - October 31, 2015

హైదరాబాద్ : కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి కన్నబిడ్డను అత్యంత దారుణంగా కొట్టి చంపేసింది. ఈ ఘటన హైదరాబాద్‌ మైలర్దేవ్‌పల్లి పీఎస్‌ పరిధిలో జరిగింది. ఉడంగట్టలో ఉంటున్న జయమ్మకు కూతురుంది. పదిరోజులక్రితం ఈ చిన్నారి బాత్‌రూంలో జారిపడి చేయి విరిగింది. అయినా తల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లలేదు. నొప్పితో బాధపడుతూ పాపా తరచూ ఏడుస్తూఉండేది. దీంతో ఆగ్రహించిన జయమ్మ చిన్నారిని చితకబాదింది. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మి అక్కడే ప్రాణాలు విడిచింది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జయమ్మకు ఓ వ్యక్తితో సంబంధం ఉందని.. దీనికి పాప అడ్డుగా ఉందని ఇద్దరూ కలిసి చంపేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

 

17:33 - October 31, 2015

హైదరాబాద్‌ : శివరాంపల్లి సర్దార్‌వల్లభాయి నేషనల్‌ పోలీస్ అకాడమీలో ఐపీఎస్‌ పాసింగ్‌ అవుట్ పరేడ్ జరిగింది.. 67 బ్యాచ్‌కింద 156మంది పరేడ్‌ పూర్తిచేశారు.. ఇందులో 28మంది మహిళలు.. నేపాల్‌, భూటాన్‌, మల్దీవులు దేశాలకుచెందిన 15మంది పోలీసులున్నారు.. శిక్షణ పూర్తిచేసుకున్న ట్రైనీ ఐపీఎస్‌ అధికారులనుండి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గౌరవ వందనం స్వీకరించారు..

 

17:28 - October 31, 2015

హైదరాబాద్ : తాము ఓడిపోతామన్న భయంతోనే గులాబీ పార్టీ నేతలు ఓట్లను తొలగించారని టీడీపీ నేత వివేకానంద రెడ్డి విమర్శించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కావాలనే 34 లక్షల ఓట్లు తొలగించారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో టీఆర్ ఎస్ కు పట్టులేదని.. అందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశామని వివరించారు.

 

17:00 - October 31, 2015

హైదరాబాద్‌ : గ్రేటర్ హైదరాబాద్ లో చట్ట విరుద్ధంగా ఓట్ల తొలగింపు జరిగిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పునాదినే పెకలించే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. ఈ స్థాయిలో ఓట్ల తొలగింపు ఎక్కడా జరగలేదన్నారు. భన్వర్‌లాల్, సోమేష్‌ కుమార్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వకపోయినా ఇచ్చినట్లు అధికారులు లెక్కలు చూపారని విమర్శించారు. ఇవేవీ పరిగణనలోకి తీసుకోవద్దని కేంద్ర ఎన్నికల విచారణ అధికారులకు తెలిపామన్నారు.

 

16:55 - October 31, 2015

హైదరాబాద్‌ : ఎల్ బి నగర్‌లో మైనర్‌ బాలిక వివాహాన్ని బాలల హక్కుల సంఘం అడ్డుకుంది. ఆత్మకూర్ మండలం పెద్దరాంపూర్ గ్రామానికి చెందిన ఆలపాటి నాగేశ్వరరావుకు మధురానగర్‌కు చెందిన అంబికతో వివాహం నిశ్చయమైంది. వరుడి వయసు 24ఏళ్లు కాగా... వధువు వయసు 16ఏళ్లు.. ఈ విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం చైర్మన్ అచ్యుతరావు పెళ్లిని ఆపారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వధూవరులు, వారి పెద్దలకు నచ్చజెప్పిన పోలీసులు రెండేళ్ల తరువాత వివాహం జరిపించాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే బాలికకు పెద్దలెవరకూ లేకపోవడంతో ఆర్థికంగా ఆదుకోవాలని కలెక్టర్‌కు అచ్యుతరావు విజ్ఞప్తి చేశారు..

 

16:51 - October 31, 2015

విశాఖ : కాలుష్యంతో మసకబారుతున్న పోర్టును కాపాడేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. గ్రీన్ పోర్టుగా మార్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. 60కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణంకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రెండేళ్లలో పోర్టు రూపురేఖలే మార్చేస్తామని చైర్మన్ కృష్ణబాబు ధీమాగా చెబుతున్నారు.

 

16:48 - October 31, 2015

నిజామాబాద్‌ : ఆశా వర్కర్ల సమ్మెకు మద్దతుగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఆశా కార్యకర్తలు నిరసన తెలపడానికి టెంట్లు సమకూర్చుకునేందుకు డబ్బులు లేవని..అందుకే వారికి సహాయం చేసేందుకు విరాళాల సేకరణ చేపట్టినట్లు సీపీఎం నేతలు తెలిపారు. ఆశా వర్కర్లకు తక్షణమే కనీస వేతనం 15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

 

16:46 - October 31, 2015

హైదరాబాద్ : ఈ అక్టోబర్‌ నుంచే ఏపీలో 75 శాతం లెవీ విధానం కొనసాగేలా కేంద్రప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. రైతు వ్యతిరేకిగా ముద్రపడ్డ చంద్రబాబు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని బొత్స విమర్శించారు. నిత్యవసర సరుకుల ధరలు పెరిగినందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్వో కార్యాలయాల ముందు వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేయనున్నట్లు బొత్స ప్రకటించారు.

 

16:40 - October 31, 2015

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ తుకారాంగేట్‌లో అర్ధరాత్రి ఓ కారు ఇళ్లపైకి దూసుకొచ్చింది. కరెంట్‌పోల్‌ను కూడా ఢీకొట్టి.. ముందుకు వెళ్లి ఓ ఇంట్లోకి దూసుకుపోయింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో.. ప్రాణనష్టం జరగలేదు. అయితే ఇప్పటివరకు పోలీసులు రాలేదని.. ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నెంబర్‌ను బట్టి కారు ఖమ్మంలో రిజిస్టర్‌ అయినట్లు తెలుస్తోంది.

 

16:35 - October 31, 2015

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ కొత్త కమిషనర్‌గా జనార్దన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌ఫ్రాస్టక్చర్‌ సదుపాయాలను మెరుగుపరుస్తానని జనార్దన్‌రెడ్డి అన్నారు. నగరాన్ని సుందర నగరంగా మార్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తానన్నారు.

16:32 - October 31, 2015

హైదరాబాద్‌ : నగరంలోని ఎంసిహెచ్ ఆర్ డిలో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు అఖిలపక్షం నేతలతో భేటీ అయ్యారు. గ్రేటర్‌ పరిధిలో ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘం సభ్యులు విచారణ చేపట్టారు.

16:28 - October 31, 2015

హైదరాబాద్: టీడీపీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు అరికెల నర్సారెడ్డి సుధారాణిని పార్టీ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పని చేసినందుకు సుధారాణిని పార్టీ నుంచి భహిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎంతటివారైన పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండాలని.. లేని ఎడల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ లో ఆమె రాజ్యసభ పదవికాలం పూర్తి కానుంది. కాసేపట్లో సుధారాణి టీఆర్ ఎస్ లో చేరనుంది.

 

టిడిపి నుంచి గుండు సుధారాణి తొలగింపు

హైదరాబాద్: టీడీపీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు  ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు అరికెల నర్సారెడ్డి ఆమెను పార్టీ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాసేపట్లో గుండు సుధారాణి టీఆర్ ఎస్ లో చేరనున్నారు. 

15:54 - October 31, 2015

హన్మకొండ : వరంగల్ ఎంపి కాంగ్రెస్ అభ్యర్థిగా రాజయ్య పేరు ఖరారు అయింది. కాసేపట్లో ఆ పార్టీ అధికారిక ప్రకటన చేయనుంది. రాజయ్య గతంలో వరంగల్ ఎంపీగా పని చేశారు. 

డిండి ఇరిగేషన్ ప్రాజెక్టుపై హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : డిండి ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి టీ.హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

జగద్గిరిగుట్టలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి : జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్ లోని ప్లాస్టిక్ గోదాములో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 

ఎన్నికల సంఘం నిబంధనల మేరకే ఓట్ల తొలగింపు : రాజేశ్వర్ రెడ్డి

హైదరాబాద్ : ఎన్నికల సంఘం నిబంధనల మేరకే ఓట్ల తొలగింపు జరిగిందని టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోనే కాదు ఎపిలో కూడా ఈసీ ఓట్లు తొలగించిందని చెప్పారు. ఒక వ్యక్తికి ఒకే ఓటన్న నినాదంతోనే ఓటర్ల జాబితా ఉండాలన్నారు. మతం, ప్రాంతం పేరుతో కొన్ని పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. 

కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులతో అఖిల పక్షనేతలు భేటీ..

హైదరాబాద్ : ఎంసీహెచ్ ఆర్డీలో వివిధ పార్టీల నేతలతో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు సమావేశం అయ్యారు. గ్రేటర్ పరిధిలో ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది.

 

వరంగల్ ఎంపి కాంగ్రెస్ అభ్యర్థిగా రాజయ్య

హన్మకొండ : వరంగల్ ఎంపి కాంగ్రెస్ అభ్యర్థిగా రాజయ్య పేరు ఖరారు అయింది. కాసేపట్లో ఆ పార్టీ అధికారిక ప్రకటన చేయనుంది. రాజయ్య గతంలో వరంగల్ ఎంపీగా పని చేశారు.

 

15:26 - October 31, 2015

కైరో : ఈజిప్టు సినాయ్ లో రష్యా విమానం కుప్పకూలింది. విమానం కూలినట్లు ఈజిప్టు ప్రధాని నిర్ధారించారు. విమానంలో 212 మంది ప్రయాణికులు ఉన్నారు. అధిక సంఖ్యలో రష్యా ప్రయాణికులు ఉన్నారు. ఉగ్రవాద చర్యగా ఈజిప్టు ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. 

ఈజిప్టు సినాయ్ లో కూలిన రష్యా విమానం

కైరో : ఈజిప్టు సినాయ్ లో రష్యా విమానం కుప్పకూలింది. విమానం కూలినట్లు ఈజిప్టు ప్రధాని నిర్ధారించారు. విమానంలో 212 మంది ప్రయాణికులు ఉన్నారు. అధిక సంఖ్యలో రష్యా ప్రయాణికులు ఉన్నారు. ఉగ్రవాద చర్యగా ఈజిప్టు ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. 

13:31 - October 31, 2015

ఢిల్లీ : అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అనుకుంటే.. వివాదాలతో వీకై పోతున్నాడే మన మోడీ అని మూడీ సంస్థ బాధపడిపోతోంది. బుల్లెట్‌ ట్రైన్‌లా దూసుకెళతాడనుకుంటే.. కనీసం ఫాస్ట్ ప్యాసింజర్‌లా కూడా పోవట్లేదే అని మదనపడుతోంది. బిజినెస్‌ చూడవయ్యా బాబూ అంటే రాజకీయంతో బిజీ అయిపోతున్నాడేంటని ప్రశ్నిస్తోంది. ఫీల్‌గుడ్‌ ఉంటేనే గాని పెట్టుబడులు రావు.. హోల్‌ బ్యాడ్‌ అయితే ఇంకేమొస్తాయని నిట్టూరిస్తుంది.

బిజెపికి బంపర్ మెజార్టీ..
యూపీఏ ఉన్నప్పుడు సంకీర్ణ రాజకీయాలతో సంస్కరణలు లేటయ్యేవి. అప్పటికీ పెదవి విప్పకుండా మన్మోహన్‌జీ పని కానిచ్చేసేవారు. వామపక్షాలు తప్పితే అడ్డు చెప్పేవారు లేరు కాబట్టి.. కాస్తో కూస్తో కథ నడిపించేశారు. అయినా స్పీడు లేదని విదేశీ పెట్టుబడులు పెట్టే పెద్దమనుషులకు అసంతృప్తిగా ఉండేది. బిజెపి అధికారంలోకి వచ్చింది. అది కూడా బంపర్‌ మెజారిటీతో. సంకీర్ణానికి సెలవు చెప్పి.. మిత్రులున్నప్పటికీ సోలో పాలనే వచ్చేసింది. పైగా అంతా మోడీ సాబ్‌ కనుసన్నల్లోనే. వచ్చీ రావడంతోనే విదేశీ పర్యటనలతో నరేంద్రుడు హల్‌చల్‌ చేసి.. లెక్కలేనన్ని హామీలు ఇచ్చేశారు. కాంగ్రెస్‌ తలుపులే తెరిచింది.. తాను కిటీకీలు కూడా తెరుస్తానంటూ ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చేశారు. దీంతో మల్టీ నేషనల్‌ కంపెనీలు సంబరపడ్డాయి. భారత్‌లో ఇక వడ్డించేవాడు మనోడేనని డిసైడయ్యాయి.

అసంతృప్తి వ్యక్తం చేసిన మూడీ సంస్థ..
సంస్కరణల అమలులో, ఆర్ధిక ప్రగతిలో రేటింగ్స్ ఇచ్చే మూడీ సంస్థ మాత్రం పరిస్ధితి ఏమీ బాగోలేదంటుంది. తాజాగా ఇచ్చిన నివేదికలో తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. లెక్కలేనన్ని వివాదాలతో మోడీ తన పాలనలో సంస్కరణల అమలును స్పీడప్‌ చేయలేకపోతున్నారంటోంది. కాషాయ నేతల కాలుదువ్వే ప్రకటనలతో భారత్‌లో బిజినెస్‌ వాతావరణం పాడైపోతుందని స్పష్టం చేస్తోంది. గోమాంసం.. దళితులపై దాడులు.. పాకిస్తాన్‌కు వెళ్లిపొమ్మంటూ బిజెపి మంత్రులే చేసే ప్రకటనలు.. ఇలా రకరకాల వివాదాలు చుట్టుముడుతున్నాయంటోంది.

రాజ్యసభలో మెజారిటీ లేకనే అంటున్న బిజెపి..
భూసేకరణ చట్టం సవరణను తేలేకపోయారు. జీఎస్‌టీ బిల్లు కూడా పాస్‌ చేసుకోలేకపోయారు. ఇక సంస్కరణలను ఎలా అమలు చేస్తారని మూడీ సంస్థ ప్రశ్నిస్తోంది. అయితే ప్రభుత్వవర్గాలు మాత్రం బిజెపికి రాజ్యసభలో మెజారిటీ లేనందువల్లే ఆలస్యమవుతుందని.. మరో సంవత్సరంలో రాజ్యసభలో పార్టీ సభ్యుల సంఖ్య పెరిగితే.. అప్పుడు స్పీడు చూపిస్తామని అంటున్నాయి. రాజకీయ లాభం కోసం కమలనాథులు వివాదాలను సృష్టిస్తున్నారని అవి దేశంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తాయనే విషయాన్ని గమనించడం లేదని మూడీ సంస్థ ప్రతిపక్షం కాదని.. కనీసం అది చెప్పిన మాటలనైనా పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలు కామెంట్‌ చేస్తున్నారు. 

13:25 - October 31, 2015

హైదరాబాద్ : నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాని అంటున్నాయి. ఏం కొనేట్టు లేదు..ఏం తినేట్టు లేదనే చందంగా తయారైంది. నిన్న ఉల్లిగడ్డ ధర మండిపోయి కన్నీళ్లు తెప్పిస్తే తాజాగా ఆ లిస్టులోకి కందిపప్పు చేరింది. రెండు వందల రూపాయలకు పైగా ధర పలుకుతుండడంతో సామాన్యుడు కళ్లు తేలేస్తున్నాడు. కనీసం పప్పుతోనైనా తిందామనుకుంటే ధర మాత్రం దిగి రానంటోంది. దీనితో తెలంగాణ ప్రభుత్వం ఉల్లిగడ్డలను విక్రయించినట్లుగానే కందిపప్పు విక్రయాలు చేపట్టింది. తెలంగాణ సచివాలయంలో కందిపప్పు విక్రయ కేంద్రాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. కిలో కందిపప్పును ఇక్కడి కౌంటర్‌లో రూ.135 రూపాయలకు విక్రయించనున్నారు. సామాన్యులకు కందిపప్పును తక్కువ ధరకు అందించాలనే సదుద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కందిపప్పు కౌంటర్లను ఏర్పాటు చేశారని తలసాని అన్నారు. పది కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, 3,100 మంది ఉద్యోగులు ఇక్కడున్నారని తెలిపారు. 

13:20 - October 31, 2015

హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత నడుస్తున్న అప్రజాస్వామిక, నియంతృత్వ పాలనను అడ్డుకోవటానికి అన్ని పక్షాలు తమతో కలిసి రావాలని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. వరంగల్ ఉప ఎన్నికలో ఆ విధమైన సహకారం కాంగ్రెస్‌ అభ్యర్ధికి అందించాలని ఆయన కోరారు. వామపక్షాలు, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక, ఉస్మానియా, కాకతీయ జేఏసీలు అందరూ కలిసిరావాలని ఉత్తమ్‌ విన్నవించారు.

13:18 - October 31, 2015

వరంగల్ : తెలంగాణ ఉద్యమంలో వాల్‌ రైటింగ్స్ దగ్గర నుంచి పాటలు, ఫోటోల వరకు పని చేసిన తనకు కేసీఆర్‌ ఎంపీ అభ్యర్ధిగా అవకాశమివ్వడం అదృష్టంగా భావిస్తున్నానని టీఆర్‌ఎస్‌ వరంగల్‌ అభ్యర్ధి పసునూరి దయాకర్‌ చెప్పారు. సామాన్యులకు టీఆర్‌ఎస్‌లో గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. కానీ అవకాశం వస్తుందని ఆశించలేదని, గతంలో రెండు సార్లు అవకాశం వచ్చినా కొన్ని పరిస్థితుల్లో తీరలేదని చెప్పుకొచ్చారు. 

12:55 - October 31, 2015

న్యూఢిల్లీ : భూగ్రహం వైపు ఓ భారీ గ్రహశకలం దూసుకువస్తోంది. 2015 టీబీ 145 అనే గ్రహశకలం ఇవాళ భూమికి చేరువగా వస్తుందని ఖగోళ శాస్ర్తవేత్తలు చెప్తున్నారు. దాదాపు 13 వందల అడుగుల వ్యాసం ఉండే ఈ గ్రహశకలం సెకనుకు 35 కిలోమీటర్ల వేగంతో భూమికి పక్కగా వెళ్తుందని అంటున్నారు. గ్రహశకలాల గురించి మరించి సమాచారం సేకరించడానికి ఇది సరైన సమయమని శాస్ర్తవేత్తలు భావిస్తున్నారు.

12:48 - October 31, 2015

హైదరాబాద్: అర్ధరాత్రి ఆపరేషన్ నైట్ రోమియోతో టెన్షన్ పుట్టించారు పోలీసులు.. అర్ధరాత్రి రోడ్లపై తిరిగే జులాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు.. ఈసారి మళ్లీ రాత్రి రోడ్డెక్కితే వారి తల్లిదండ్రులపైకూడా కేసులు పెడతామని హెచ్చరించారు. రోడ్లపై బలాదూర్‌గా తిరుగుతూ హల్‌చల్‌ చేసే నైట్ రోమియోల పనిపడుతున్నారు పోలీసులు.. తాజాగా 181మంది మైనర్లను అదుపులోకితీసుకొని... 200బైక్‌లను సీజ్ చేశారు.. వీరంతా పాతబస్తీలోని వివిధ ప్రాంతాలకుచెందినవారు.

పలువురు ఫిర్యాదులు..
అర్థరాత్రి పూట బైక్ రేసులతో దడ పుట్టించడం వీరికి చాలా రోజులుగా అలవాటుగా మారింది. పలువురి నుంచి ఫిర్యాదులు అందడంతో.. పోలీసులు రాత్రి ఒక్కసారిగా ఓ నైట్ రోమియోలను టార్గెట్ చేశారు. ఒక్కాసారే 181 మందిని పట్టుకొని తల్లిదండ్రులను పిలిపించి అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు పిల్లల్ని అదుపులో పెట్టుకోవాలని లేకపోతే పేరంట్స్ పై కూడా క్రిమినల్ కేసులు పెడతామని డీసీపీ సత్యనారాయణ హెచ్చరించారు.

కౌన్సిలింగ్ తో మార్పు...​
మైనర్లకు వాహనాలు ఇవ్వడంవల్ల చాలా అనర్ధాలు జరుగుతున్నాయని పోలీసులు చెప్పుకొచ్చారు. జులాయిలంతా రాత్రుళ్లు ఇష్టారాజ్యంగా తిరుగుతూ రోడ్లపై మీటింగ్‌లు పెట్టడం సరికాదని తెలిపారు. ఇకపై బైక్‌ రేసింగ్‌లు చేసినా ఊరుకోమని తేల్చిచెప్పారు. మొత్తానికి ఆపరేషన్ నైట్ రోమియో పాతబస్తీలో అలజడిరేపింది. కౌన్సిలింగ్‌తో మైనర్లలో తప్పకుండా మార్పు వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. 

12:38 - October 31, 2015

హైదరాబాద్‌ : హెల్మెట్ ఒకతని ప్రాణాలు కాపాడలేకపోయింది. హెల్మెట్ పెట్టుకున్నా అతని ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. జీడిమెట్లలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఐడీపీఎల్‌ ఉద్యోగి ప్రసాద్‌ చనిపోయారు. ప్రసాద్‌ బైక్‌పై వెళ్తుండగా బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రసాద్‌ హెల్మెట్‌ పెట్టుకున్నప్పటికీ.. బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే చనిపోయారు.

12:34 - October 31, 2015

వరంగల్ : కులాన్ని మార్చేసి ఆఖరివరకు టీఆర్‌ఎస్‌ టిక్కెట్టుకోసం ప్రయత్నం చేసిన గుడిమల్ల రవికుమార్ బండారం బయటపడిందని, ఆయన ఎస్సీ కాకపోయినా అతనికి మద్దతు తెలిపిన కడియం శ్రీహరిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. ఈ తతంగమంతా కేసీఆర్‌కు తెలిసే జరిగిందని విమర్శించారు. మాదిగలకు..మాలలకు ఆ పేరు లేదని, పద్మశాలిలో ఎక్కువ ఉంటుందన్నారు. ఇద్దరు పన్నిన కుట్రను సీఎం కేసీఆర్ చేధించారని తెలిపారు. 

సాయంత్రం వరంగల్ జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ..

హైదరాబాద్ : సాయంత్రం నాలుగు గంటలకు వరంగల్ జిల్లా నేతతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా సమావేశానికి ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ భారీ ర్యాలీతో రానున్నారు. అభ్యర్థికి కేసీఆర్ బీ ఫాం అందచేయనున్నారు. 

పెంబర్తిలో తనిఖీలు..పది లక్షలు స్వాధీనం..

వరంగల్ : పెంబర్తి చెక్ పోస్టు వద్ద వాహనాలను పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ కారులో రూ. పది లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుండి కారు కరీంనగర్ కు వెళుతోంది.

ధరలు తగ్గించేందుకు చర్యలు - ఈటెల..

హైదరాబాద్ : రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటోందని తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కందిపప్పు ధరలు సామాన్యులకు అందుబాటులోకి తెస్తామని హామీనిచ్చారు. 

లాలూపై పాట్నా పీఎస్ లో కేసు నమోదు..

బీహార్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను నరమాంస భక్షకుడు అంటూ వ్యాఖ్యానించిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పై పాట్నా పీఎస్ లో కేసు నమోదైంది. 

గాయకుడి అరెస్టును ఖండించిన కరుణానిధి..

చెన్నై : తమిళనాడు సీఎం జయలలితకు వ్యతిరేకంగా పాటలు రాసి పాడిన జానపద గాయకుడు ఎస్.శివదాస్ అలియాస్ కోవన్ అరెస్టును డీఎంకే అధినేత కరుణానిధి ఖండించారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతుందనడానికి ఇదొక ఉదహారణ అని తెలిపారు. 

11:17 - October 31, 2015

హైదరాబాద్ : నిధుల కొరత లేదు.. ఎవరినీ సంచి పట్టుకొని అడగాల్సిన పని లేదు.. ఇది ఇన్నాళ్లూగా తెలంగాణ సర్కార్‌ పెద్దలు చెబుతున్న మాటలు. అంతేగాక త్రైమాసిక రిపోర్టులు సైతం ఘనంగా ప్రకటించి అందరితో శభాష్‌ అనిపించుకుంది. కానీ.. ఇప్పుడే అసలు వ్యవహారం మొదలైంది. ప్రకటించిన భారీ పథకాల్లో ఏ ఒక్క దానికి కూడా పూర్తిస్థాయిలో నిధులు కేటాయించ లేదు. ఇప్పటివరకు ప్రభుత్వం ఏదో గుడ్డిలో మెల్లలా నెట్టుకొచ్చినా.. ఇప్పుడు నిధుల కోసం వెతుక్కోవాల్సి పరిస్థితి ఏర్పడింది.

భూములు అమ్మాలని నిర్ణయించిన సర్కార్‌..
ఈ మధ్యే సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి ఆ ప్రయత్నాలు కొనసాగించారు. కానీ.. కేంద్రం మాత్రం తెలంగాణకు ఇస్తే ఏపీకి కోపమొస్తుందని.. ఏపీకి ఇస్తే తెలంగాణ నుంచి తలనొప్పులు వస్తాయని ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే వాటర్‌ గ్రిడ్‌, మిషన్‌ కాకతీయకు జైకా నుంచి సర్కార్‌ నిధులు తీసుకుంటోంది. అయినా మరిన్ని నిధులు కావాల్సిన అవసరం ఉంది. దీంతో అమ్ముల పొదిలో ఉన్న భూముల అమ్మకాన్ని సర్కార్‌ సంధించబోతోంది.

నవంబర్‌ 17న ఈ-వేలం, 24న బిడ్డర్లు..
రంగారెడ్డి, హైదరాబాద్‌లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను వేలం వేయాలని సర్కార్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ-టెండర్‌ నోటీసులు జారీ చేసింది. నవంబర్‌ 17న ఈ-వేలం, 24న బిడ్డర్లను ప్రకటించనున్నారు. హైదరాబాద్‌లో 10,.. రంగారెడ్డి జిల్లాలో 22 స్థలాల వేలానికి ధర నిర్ణయించనున్నారు. అయితే.. గతంలోనే జిల్లాల నుంచి భూముల వివరాలను సేకరించిన సర్కార్‌.. భూముల వేలంపై కొంతకాలంగా వెనక్కి తగ్గింది.

తొలి విడతలో 27 చోట్ల భూముల వేలం..
ఇక తొలి విడతలో 27 చోట్ల భూములను వేలం వేయాలని సర్కార్‌ నిర్ణయించింది. కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు భూములను వేలం వేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. 240 గజాల నుంచి 30 ఎకరాల భూములను అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇదిలాఉంటే ప్రభుత్వం సేకరించిన నిరుపయోగమైన భూముల వివరాల్లో కొన్ని తప్ప.. చాలా భూములు ఉపయోగపడేవేనని తేలింది. అయినా ప్రభుత్వం మాత్రం భూముల విక్రయం ద్వారా 1544 కోట్ల రూపాయలు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక భూములను విక్రయించాలని సర్కార్‌ నిర్ణయించడంతో.. ఇన్నాళ్లు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగానే ఉందని నేతలు చెప్పిన వ్యాఖ్యలు అంతా ఉట్టివేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

11:14 - October 31, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న వక్ఫ్ బోర్డు విభజనకు రంగం సిద్ధమయ్యింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేర్వేరుగా వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులు, ఉద్యోగులను రెండు రాష్ట్రాలు పంచుకోనున్నాయి. ఏపీలో ఏర్పాటయ్యే వక్ఫ్ బోర్దు ద్వారా మైనారిటీలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. ఆర్టీసీ విభజనను సవ్యంగా పూర్తి చేసుకున్న తెలుగు రాష్ట్రాలు.. ఇప్పుడు వక్ఫ్ ఆస్తులపై దృష్టి పెట్టాయి. వక్ఫ్ బోర్డు విభజన ద్వారా ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపిణీకి చర్యలు చేపట్టాయి.

రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా వక్ఫ్ బోర్డులు..
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్‌ కేంద్రగా పనిచేస్తున్న వక్ఫ్ బోర్డు విభజనకు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం రెండు రాష్ట్రాలకు వేర్వేరు వక్ఫ్ బోర్డులు ఏర్పాటవుతాయి. జనాభా ప్రాతిపదికన వక్ఫ్ ఆస్తులు, అప్పులు, సిబ్బందిని రెండు రాష్ట్రాలు పంచుకోనున్నాయి. ప్రస్తుతం ఉన్న వక్ఫ్ బోర్డు నుంచి ఏపీకి 40 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. హైదరాబాద్‌ హజ్‌హౌస్‌ ఆస్తుల నుంచి 23 కోట్ల రూపాయలు ఏపీకి ఇస్తారు. నవ్యాంధ్రలో కొత్తగా హజ్‌హౌన్‌ నిర్మాణానికి తెలంగాణ సర్కార్‌ 3 కోట్ల రూపాయలు ఇవ్వనుంది. ఏ రాష్ట్రంలో ఉన్న వక్ఫ్‌ ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయి.

ఐఏఎస్ అధికారికి బాధ్యతలు..
ఏపీలో ఏర్పాటయ్యే కొత్త వక్ఫ్ బోర్డు ద్వారా మైనారిటీలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. బోర్డును లాభదాయక సంస్థగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఇందుకోసం ఐఏఎస్‌ అధికారి మహ్మద్‌ ఇక్బాల్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. సకలసౌకర్యాలతో కడపలో కొత్త హజ్‌ హౌస్‌ నిర్మిస్తారు. దీనికి అనుబంధంగా రాష్ట్రంలోని అన్ని ముఖ్యనగరాల్లో అనుబంధ హజ్‌ హౌస్‌ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు.

వక్ఫ్ స్థలాల్లో షాదీఖానాలు, షాపింగ్‌ కాంప్లెక్స్ లు..
ఏపీలో ఉన్న వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నది గుర్తిస్తారు. విశాఖ జిల్లాలో నాలుగువేల ఎకరాల వక్ఫ్‌ భూములు ఉన్నట్టు లెక్కతేల్చారు. ఇతర జిల్లాలో ఉన్న భూముల వివరాలు సేకరిస్తున్నారు. అన్యాక్రాంతమైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు చేపడతారు. వీటిని గుర్తించేపనిలో అధికారులు ఉన్నారు. వక్ఫ్‌బోర్డు స్థలాల్లో షాదీఖానాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మిస్తారు. తద్వారా వచ్చే ఆదాయాన్ని మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చిస్తారు. వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు అవసరమైతే చట్టాలను సవరించాలన్న ఆలోచనలో ఏపీ సర్కార్‌ ఉంది. 

హయత్ నగర్ లో రైతు ఆత్మహత్య...

రంగారెడ్డి : హయత్ నగర్ (మం) అనాస్ పూర్ లో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో రైతు మల్లేష్ (40) శనివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

పొడవైన వ్యక్తి గట్టయ్య మృతి..

కరీంనగర్ : ఆసియా ఖండంలో అతి పొడవైన వ్యక్తిగా గుర్తింపు పొందిన గట్టయ్య మృతి చెందాడు. అనారోగ్యంతో శుక్రవారం అర్ధరాత్రి గట్టయ్య కన్నుమూశాడు. 

మూడేళ్ల చిన్నారిని చంపేసిన తల్లి..

రంగారెడ్డి : మైలార్ దేవులపల్లిలో ఓ కన్నతల్లి మూడేళ్ల చిన్నారిని లక్ష్మిని సంపులో పడేసి చంపేసింది. తల్లి జయమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఎస్వీపీలో ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్..

హైదరాబాద్ : నేషనల్ పోలీసు అకాడమీలో 67వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్ ప్రారంభమైంది. నేషనల్ సెక్యూర్టీ అడ్వైజర్ అజిత్ జోవట్ పరేడ్ కు హాజరయ్యారు. 156 మంది ఐపీఎస్ లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 28 మంది మహిళా ఐపీఎస్ లున్నారు. 

ఎర్రగడ్డలో సబ్సిడీ కందిపప్పు..

హైదరాబాద్ : ఎర్రగడ్డ రైతు బజారులో సబ్సిడీ కందిపప్పు విక్రయ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. కిలో కందిపప్పు రూ.135కి తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. 

09:49 - October 31, 2015

కరీంనగర్ : ఆసియాలోనే రెండో పొడవైన వ్యక్తిగా నిలిచిన 'పొలిపాక గట్టయ్య' అనారోగ్యంతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందాడు. కరీంనగర్‌నగర్‌ జిల్లా రామగుండం మండలం ఉట్నూర్‌ గ్రామానికి చెందిన పొడగరి గట్టయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గట్టయ్య గతకొంత కాలం నుంచి హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి గుండెపోటుతో గట్టయ్య మృతి చెందినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. గట్టయ్య మృతదేహాన్ని స్వగ్రామం ఉట్నూరుకు తరలించారు. శనివారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు.

శిల్పారామంలో ఉద్యోగం..
గట్టయ్య‌ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పలువురు సెలబ్రిటీలతో పాటు పిల్లలు, పెద్దలు కూడా గట్టయ్యతో కలిసి ఫొటో దిగేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. సినీనటులు కూడా ఫొటోలు తీయించుకున్నారు. ఏడున్నర అడుగుల ఎత్తు ఉండే కొలిపాక గట్టయ్య గట్టయ్యకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో శిల్పారామంలో ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. ఆయన కొన్ని రోజులుగా ఆస్తమాతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 15 రోజుల క్రితమే స్వగ్రామానికి వెళ్లి, తిరిగి హైదరాబాద్ వచ్చారు. గట్టయ్యకు తల్లి లక్ష్మి, అన్న చంద్రయ్య ఉన్నారు. 

09:19 - October 31, 2015

ప్రకాశం : జిల్లాలో దొంగతనాలు అధికమౌతున్నాయి. దొంగతనం చేయడమే కాకుండా దుండగులు దాడులకు తెగబడుతున్నారు. దీనితో జిల్లా వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ నగర్ లో నివాసం ఉంటున్న భారతి ఇంట్లో శనివారం తెల్లవారుజామన చొరబడ్డారు. భారతి..మరొక వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. సుమారు మూడున్నర తులాల బంగారం..రెండు విలువైన సెల్ ఫోన్ లను అపహరించారు. దాడిలో గాయపడిన భారతి కేకలు వేయడంతో స్థానికులు చేరుకున్నారు. వెంటనే వారిని అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బయటి ప్రాంతాల నుండి దుండగులు జిల్లాలోకి ప్రవేశిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. 

09:14 - October 31, 2015

నెల్లూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత రోజులను గుర్తుకు తెస్తున్నారు. ఉభయ రాష్ట్రంలో సీఎంగా ఉన్న సమయంలో ఎక్కడో ఒక దగ్గర బాబు అకస్మిక తనిఖీలు జరిపేవారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబు అలాగే వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు శనివారం పలు ప్రాంతాల్లో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నగరంలో విష జ్వరాలు అధికమౌతున్నాయి. దీనితో పారిశుధ్య పనులు ఏ విధంగా ఉన్నాయి ? జ్వరాలు వ్యాపించడానికి గల కారణాలు ఏంటీ ? అనే విషయంపై బాబు దృష్టి సారించారు. పోలీసు పరేడ్ మైదానం నుండి బాబు తనిఖీలు నిర్వహించారు. అక్కడున్న బ్రహ్మానందపురం డ్రైనేజీ కాలువను పరిశీలించారు. అస్త్యవస్థంగా ఉండడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ రోడ్డుపై ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు బాబు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రాంనగర్ ప్రాంతాన్ని సందర్శించారు. ఆ ప్రాంతంలో డెంగ్యూ వ్యాధితో ఓ వ్యక్తి మృతి చెందడాన్ని గుర్తించారు. వారిని బాబు పరామర్శించారు. ఇంట్లో ఉన్న ఓ విద్యార్థికి రూ.25వేల ఆర్థిక సహాయం అందించింది సంబంధిత ఏర్పాట్లు చేయాలని బాబు ఆదేశాలు జారీ చేశారు. వెంగళరావు నగర్ లో కూడా బాబు పర్యటించారు. ఈ పర్యటనలో సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. 

09:00 - October 31, 2015

ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేయానుకుంటున్నారా..? ఒకసారి ఈ సూచనలను పాటించండి.
ఇంటి అవసరాలకైతే కోర్‌ ఐ3, కాలేజ్‌ చదువులకైతే కోర్‌ ఐ3 లేదా యూఎల్‌వీ, ఆఫీస్‌ పనుల నిమిత్తమైతే కోర్‌ ఐ5 యూఎల్‌వీ లేదా కోర్‌ ఐ7 యూఎల్‌వీ ప్రాసెసర్‌ కలిగి ఉండేటట్లు ఎంపిక చేసుకోండి. మ్యాక్‌, విండోస్‌, క్రోమ్‌ ఓఎస్‌పై స్పందించే ల్యాప్‌టాప్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. మ్యాక్‌ ఓఎస్‌ను యాపిల్‌ ఆపర్‌ చేస్తుండగా, విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టంను మైక్రోసాఫ్ట్‌, క్రోమ్‌ ఓఎస్‌ను గూగుల్‌ ఆఫర్‌ చేస్తోంది. మీ వినియోగం అలానే అభిరుచిని బట్టి నచ్చిన ఆపరేటింగ్‌ సిస్టంతో కూడిన ల్యాప్‌టాప్‌ను ఎంపిక చేసుకోండి.

 • సైజ్‌ 13 నుంచి 14, 15 అంగుళాలు, 17 నుంచి 18 అంగుళాల స్క్రీన్‌ సైజు వేరియంట్లలో ల్యాప్‌టాప్‌లు లభ్యమవుతున్నాయి. వినియోగాన్నిబట్టి సైజును ఎంపిక చేసుకోవాలి.
 • మీరు ఎంపిక చేసుకునే ల్యాప్‌టాప్‌కు సంబంధించి కీబోర్డ్‌, టచ్‌ప్యాడ్‌ పని తీరును చెక్‌ చేసుకోండి.
 • ల్యాప్‌టాప్‌కు సంబంధించి ప్రాసెసర్‌, ర్యామ్‌, హార్డ్ డ్రైవ్‌, ఫ్లాష్‌ క్యాచీ, సాలీడ్‌ స్టేట్‌ డ్రైవ్‌, డిస్‌ప్లే రిసల్యూషన్‌, టచ్‌స్క్రీన్‌, గ్రాఫిక్స్‌ చిప్‌, డీవీడీ/బ్లూ-రే డ్రైవ్‌ వంటి స్పెసిఫికేషన్లు మీ అవసరాలకు తగ్గట్టుగా ఉన్నాయో లేవో చెక్‌ చేసుకోండి.
 • ల్యాప్‌టాప్‌ మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉండాలి.
 • మీరు ఎంపిక చేసుకునే బ్రాండ్‌నుబట్టే ల్యాప్‌టాప్‌ పనితీరు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ల్యాప్‌టాప్‌ ఎంపిక విషయంలో బ్రాండ్‌ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
 • ల్యాప్‌టాప్‌ ఇంటి అవసరాల నిమిత్తమైతే 15.6 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉండాలి. బరువు 2.5కిలోగ్రాములు అంతకన్నా తక్కువ ఉండాలి.
 • కాలేజ్‌ అవసరాల నిమిత్తమైతే 14 అంగుళాల స్క్రీన్‌ సైజును కలిగి ఉండాలి. బరువు 2 కిలోలు అంతకన్నా తక్కువ.ఉండాలి.
 • ఆఫీస్‌ అవసరాల నిమిత్తమైతే 13 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉండాలి. బరువు 1.7 కిలో లు అంతకన్నా తక్కువ ఉండాలి.
 • మల్టీ మీడియా అవసరాల నిమిత్తమైతే 15.6 అంగుళాల అంతకన్నా పెద్ద స్క్రీన్‌ హైడెఫినిషన్‌ రిసల్యూషన్‌తో ఉండాలి. బరువు 2.7కిలోలు ఉండాలి.
 • గేమింగ్‌ అవసరాల నిమత్తమైతే 15.6 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉండాలి. బరువు 2.7కిలోలు ఉండాలి.
08:56 - October 31, 2015

మీ స్మార్ట్ ఫోన్‌ లేదా టాట్లెట్‌ను వై-ఫై హాట్‌ స్పాట్‌లా మార్చుకోవాలని ఉందా..మీ ఫోన్‌లోని మొబైల్‌ డేటాను మిగతా ఫోన్లతో లేదా మీ ల్యాప్‌టాప్‌తో షేర్‌ చేసుకోవాలనుకుంటున్నారా..? మామూలుగా వై-ఫై టెట్రింగ్‌ను మీ స్మార్ట్ ఫోన్‌, టాబ్లెట్‌ ద్వారా ఎలా చేస్తారో మీకు తెలిసే ఉంటుంది. సరికొత్త అండ్రాయిడ్‌ లాలిపాప్‌ తో వైఫై హాట్‌ స్పాట్‌ ఎలా పనిచేయించాలో చూద్దాం..

 • ముందు మెనులోకి వెళ్లి 'సెట్టింగ్స్' ఓపెన్‌ చేయండి. అందులో మోర్‌ అనే అప్షన్‌ ను ప్రెస్‌ చేయండి.
 • తర్వాత 'టెట్రింగ్‌ ఆండ్‌ పోర్టబుల్‌ హాట్‌ స్పాట్‌' ఆప్షన్‌ ను ప్రెస్‌ చేయండి.
 • మీ ముందు కనిపిస్తున్న 'పోర్టబుల్‌ హాట్‌ స్పాట్‌' ను ప్రెస్‌ చేసి మీ డేటాను షేర్‌ చేసుకోవచ్చు.
 • ఆ తర్వాత ''సెటప్ వైఫై హాట్‌ స్పాట్‌'' ఆప్షన్‌ను ప్రెస్‌ చేసి వైఫై నెట్‌ వర్క్ ను నెలకొల్పొచ్చు.
 • ఒకసారి వై-ఫై నెట్‌ వర్క్ నెలకొల్పాక నెట్‌ వర్క్ పేరు సులభంగా మార్చుకోవచ్చు. ఒక వేళ మీ కనెక్షన్‌ను మరింత సురక్షితం చేయదలచుకుంటే మాత్రం పాస్‌వర్డ్ పెట్టుకోండి.
 • వె-ఫై హాట్‌ స్పాట్‌ ఆప్షన్‌ ప్రెస్‌ చేయడం వల్ల ఒక కొత్త టాగుల్‌ మీ మెనులో వచ్చి చేరుతుంది.
 • ఆండ్రాయిడ్‌ 5.1 లాలిపాప్‌లో మాత్రం ఈ టాగుల్‌ ను తొలగించుకోవచ్చు.
08:43 - October 31, 2015

హైదరాబాద్ : గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో పోటీకి జ‌న‌సేనాని ప‌వ‌న్‌ కళ్యాణ్‌ సిద్ధమ‌వుతున్నారా? గ్రేట‌ర్‌లో స‌త్తా చాటాల‌ని వ్యూహ‌ర‌చ‌న చేసున్నారా? తెలంగాణలో పార్టీని ఎన్నిక‌ల సంఘం ద‌గ్గర రిజిస్టర్‌ చేసుకోవ‌డం అందులో భాగ‌మేనా? గ్రేట‌ర్‌లో పోటీపై గ్రౌండ్ స్థాయిలో క‌స‌ర‌త్తు జ‌రుగుతుందా? అంటే అవున‌నే అంటున్నాయి జ‌న‌సేన వ‌ర్గాలు.. అయితే ప‌వ‌న్ ఒంట‌రిగా పోటీ చేస్తారా...లేక బీజేపీ-టీడీపీల‌తో క‌లిసి పోటీ చేస్తారా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

2014 ఎన్నికలకు ముందు,..
2014 ఎన్నిక‌ల ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ జ‌న‌సేన పార్టీని స్థాపించారు. అయితే ఆత‌ర్వాత జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో మాత్రం ఆయ‌న పోటీ చేయ‌కుండా టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్దతు తెలిపారు. అయితే తాజాగా ప‌వ‌న్‌ ఎన్నిక‌ల్లో పోటీచేయాల‌ని భావిస్తున్నారు. అనుభ‌వం కోస‌మైనా త‌మ పార్టీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుందంటూ గతంలో ప‌వ‌న్ చెప్పారు. దీంతో త్వర‌లో జ‌ర‌గ‌నున్న గ్రేట‌ర్‌ ఎన్నిక‌ల్లో పోటీకి ప‌వ‌న్‌ ఆస‌క్తిగా ఉన్నట్లు జ‌న‌సేన వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. తాజాగా జ‌న‌సేన పార్టీకి తెలంగాణ ఎన్నిక‌ల సంఘం నుండి గుర్తింపు కూడా రావ‌డంతో గ్రేట‌ర్‌లో పోటీ ఖాయమని అంటున్నారు. ఇప్పటికే గ్రేట‌ర్‌లో పార్టీకి ఉన్న బ‌ల‌బ‌లాల‌పై స‌మాచారాన్ని సేక‌రించేందుకు ప్రత్యేకంగా టీముల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. జ‌న‌సేన మెద‌టి సారిగా ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని భావిస్తున్న నేప‌ధ్యంలో పార్టీకి భ‌విష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే గెలుపు అవ‌కాశాలు ఉన్న డివిజ‌న్‌లను ఎంచుకోవాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నట్లు స‌మాచారం.

ఒంటరిగా పోటీ ?
అయితే గ్రేట‌ర్‌లో జ‌న‌సేన పోటీ చేయాల‌ని నిర్ణయించిన నేప‌ధ్యంలో పోటీ ఎలా ఉండ‌బోతుంది అని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. మొన్నటి సాధార‌ణ ఎన్నిక‌లకు ముందు పార్టీ స్థాపించినా.. ఆ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌ త‌న సొంత అభ్యర్ధుల‌ను నిలబెట్టలేదు.. బీజేపీ-టీడీపీ కూట‌మికి ప‌వ‌న్ ప్రచారం చేశారు. అయితే ప్రస్తుత గ్రేట‌ర్‌ ఎన్నికల్లో కూడా బీజేపీ-టీడీపీ కూట‌మితో క‌లిసి బ‌రిలో దిగుతారా.. లేదంటే ఒంట‌రిగానే పోటీ చేస్తారా అనేది చ‌ర్చినీయాంశం అయ్యింది. వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌తో పాటు గ్రేట‌ర్లోనూ బీజేపీ-టీడీపీలు క‌లిసి పోటీ చేయాల‌ని నిర్ణయించుకున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌ మిత్ర ధర్మాన్ని పాటిస్తారా లేక ఒంట‌రిగానే పోటీ చేస్తారా అనే అంశంపై జ‌న‌సేన వ‌ర్గాల్లో చర్చ జ‌రుగుతోంది. మొత్తానికి గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ప‌వ‌న్‌ క‌స‌ర‌త్తు చేస్తున్న నేప‌ధ్యంలో జనసేనకు గ్రేట‌ర్ వాసుల‌నుండి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి.

రాజ్ పథ్ లో రన్ ఫర్ యూనిటీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజ్ పథ్ లో రన్ ఫర్ యూనిటీని ప్రారంభించారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా యూనిటీ రన్ ను నిర్వహించింది. 

08:19 - October 31, 2015

ఢిల్లీ : త్వరలో ఏక్ భారత్..శ్రేష్ట్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. పటేల్ 140వ జయంతి వేడుకలను కేంద్రం జాతీయ సమైక్యత దినోత్సవ పేరిట కార్యక్రమాలను నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాన మంత్రి మోడీ ప్రసంగించారు. 2016లో ఏక్ భారత్..శ్రేష్ట్ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఒక రాజ్యం..మరొక రాజ్యంతో జోడీ కావాలన్నారు. తమిళనాడు..హర్యానా రాష్ట్రాలు జోడీ కావడం వల్ల ఇరు రాష్ట్రాల్లో ఉన్న భాష..సంస్కృతి తెలిసే అవకాశం ఉందని, ఇలా ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రం..మరొక రాష్ట్రంతో జోడీ కట్టాలని తెలిపారు. దీనివల్ల దేశం యొక్క శక్తి తెలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రైన్ లో ప్రయాణించే సమయంలో వివిధ ప్రాంతాల్లో భాష మాట్లాడే వారని..ఇదంతా భారత దేశ విశిష్టత అని దీనిని గౌరవించాలని స్వర్గీయ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆనాడు పేర్కొన్నారని గుర్తు చేశారు. చాణక్యుడిగా తరువాత దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన ఘతన పటేల్ కు దక్కుతుందని, అహ్మదాబాద్ లో స్వచ్ఛత కోసం 222 రోజులు పటేల్ ప్రచారం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు పాల్గొన్నారు. 

08:09 - October 31, 2015

తెలంగాణ రాష్ట్రంలో ఐఎఎస్ అధికారుల బదిలీలు భారీగా జరిగాయి. మొత్తం 22 మంది ఐఎఎస్ లకు స్థానభ్రంశం కలిగింది. అందులో జీహెచ్ఎంసీ కమిషనర్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. దీనిపై విపక్షాలు పలు విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ రావు ఎంపికయ్యారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), నరేందర్ గౌడ్ (టీఆర్ఎస్), సతీష్ మాదిగ (టిడిపి), రాకేష్ రెడ్డి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. 

వల్లభాయ్ పటేల్ కు మోడీ నివాళి..

ఢిల్లీ : సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి వేడుకల సందర్భంగా వల్లభాయ్ పటల్ కు ప్రధాని మోడీ నివాళులర్పించారు. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు పాల్గొన్నారు. ఏక్తా ర్యాలీలో సుమారు 15000 మంది యువత పాల్గొంది. 

అద్దంకిలో దోపిడి దొంగల బీభత్సం..

ప్రకాశం : అద్దంకిలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. తల్లి, కొడుకుపై కత్తులతో దుండగులు దాడి చేశారు. 3.5 తులాల బంగారం, రెండు సెల్ ఫోన్లు అపహరించారు. 

నెల్లూరులో బాబు రెండో రోజు పర్యటన...

నెల్లూరు : నేడు జిల్లాలో రెండో రోజు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. నగరంలోని దుర్గామిట్ట బ్రహ్మానందపురంలో పారిశుధ్య పనులను బాబు పరిశీలించారు. రోడ్డు మీద ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులకు సీఎం బాబు ఆదేశించారు. 

 

రాజ్ పథ్ లో రన్ ఫర్ యూనిటీ..

ఢిల్లీ : రాజ్ పథ్ లో 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా యూనిటీ రన్ ను ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించనున్నారు.

ఢిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు..

ఢిల్లీ : నేడు రెండో రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.

 

 

ఎర్రగడ్డ రైతు బజార్ లో కందిపప్పు విక్రయ కేంద్రం..

హైదరాబాద్ : నేడు ఎర్రగడ్డ రైతు బజార్ లో కందిపప్పు విక్రయ కేంద్రాన్ని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించనన్నారు.

 

నేడు, రేపు విశాఖలో ఇండియన్ రేడియాలజికల్..

విశాఖపట్టణం : నేడు, రేపు విశాఖలో ఇండియన్ రేడియాలజికల్ కార్యక్రమం జరుగనుంది. ఇందులో 500 మంది వైద్య నిపుణులు హాజరు కానున్నారు. 

06:46 - October 31, 2015

ఢిల్లీ : విభజించు-పాలించు అనే సూత్రం ఆధారంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని సిపిఎం విమర్శించింది. మత ప్రాతిపదికన దేశాన్ని రెండు ముక్కలు చేస్తోందని, బిజెపికి బీహార్‌లో ఓటమి తప్పదని చెప్పింది. ఆర్థిక దోపిడి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో నిర్ణయించింది. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం- దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించింది. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న మతోన్మాద చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. బీహార్‌ ఎన్నికల్లో బిజెపి మత ప్రాదిపదికన ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది. బీహార్‌లో బిజెపి ఓడిపోతే పాకిస్తాన్‌లో టపాకాయలు కాల్చుతారంటూ అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని తెలిపింది. బీహార్‌లో బిజెపికి ఓటమి తప్పదని తెలిసే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోందని సిపిఎం ధ్వజమెత్తింది.

ఢిల్లీ పోలీసులపై చర్యలు తీసుకోవాలి..
దేశంలో పెరుగుతున్న మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా సాహితీవేత్తలు, శాస్త్రవేత్తలు నిరసన వ్యక్తం చేయడం శుభ పరిణామంగా సిపిఎం పొలిట్‌బ్యూరో అభివర్ణించింది. సాహితీవేత్తలను వామపక్షానికి అంటగట్టడం ద్వారా పరోక్షంగా తమ పార్టీని విస్తరించేందుకు బిజెపి కృషి చేస్తోందని- వెంకయ్య చేసిన వ్యాఖ్యలను స్వాగతించింది. కేరళ భవన్‌లో బీఫ్‌ వివాదానికి కారణమైన ఢిల్లీ పోలీసులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం అభిప్రాయ పడింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా మోడీ సర్కార్‌ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని సిపిఎం, దేశంలో చాలా మంది దాల్‌ రోటీపైనే జీవిస్తున్నారని, అలాంటిది కందిపప్పు ధర 2 వందలకు చేరడం దారుణమని పేర్కొంది. దేశ వ్యవసాయ రంగంలో సంక్షోభం పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. 16 నెలల్లో ప్రధాని 32 సార్లు విదేశీ పర్యటనలు చేశారని, దేశంలో ఉన్నపుడు విదేశీ ప్రతినిధులతో సమావేశమవుతున్నారే తప్ప, దేశ ప్రజలపై దృష్టి పెట్టడం లేదని సిపిఎం ఆరోపించింది. గడచిన పదేళ్లలో ఎన్నికల పరంగా పార్టీ బలహీనపడిందని, పార్టీ నిర్మాణాన్ని బలపరచాల్సిన అవసరం ముందని సిపిఎం పొలిట్‌ బ్యూరో అభిప్రాయ పడింది. ప్రజా పోరాటాలను బలపరచాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. 

06:43 - October 31, 2015

హైదరాబాద్ : తెలంగాణలో ప్రాజెక్టుల పూర్తికి.. చైనా కంపెనీలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. తక్కువ ఖర్చుతో.. అనుకున్న సమయానికే ప్రాజెక్టులు పూర్తిచేస్తామంటూ ఈ కంపెనీలు హామీ ఇస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టులనూ ప్రభుత్వానికి సమర్పించాయి. ఇటీవలి చైనా పర్యటనలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపునకు.. అక్కడి కంపెనీల నుంచి సానుకూల స్పందన కనిపిస్తోంది. భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో అనుభవం ఉన్న చైనా కంపెనీల ప్రతినిధులు... శుక్రవారం సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.. ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరిస్తామని అన్నారు. ఇందుకు అవసరమైన డిజైన్లు, పనుల ప్రణాళికను కేసీఆర్‌కు అందజేశారు. సాగునీటి ప్రాజెక్టులు, మూసీ నదిపై వంతెన.. దుర్గం చెరువుపై వంతెన, హుసేన్ సాగర్‌ వద్ద ఎత్తైన టవర్‌ల నిర్మాణాలకు సంబంధించి ముఖ్యమంత్రి చైనా ప్రతినిధులతో చర్చించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా అవసరమైన టన్నెళ్లను.. తక్కువ సమయంలో, నాణ్యతతో పూర్తిచేస్తామని చైనా సంస్థల ప్రతినిధులు సీఎంకు హామీ ఇచ్చారు.

85శాతం ఖర్చు భరించేందుకు బ్యాంక్ ఆఫ్ చైనా సిద్ధం..
హుసేన్ సాగర్‌ సమీపంలో ఎత్తైన టవర్స్ నిర్మించాలని కేసీఆర్‌ చాలాకాలంగా భావిస్తున్నారు. దీని ద్వారా పర్యటక రంగానికి మంచి ఊపునివ్వాలని యోచిస్తున్నారు. దీనికి అవసరమయ్యే ఖర్చులో 85శాతం భరించేందుకు బ్యాంక్ ఆఫ్ చైనా ఓకే చెప్పింది.. మరోసారి చర్చించాక సర్కారు ఆయా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది.

మహబూబ్‌నగర్‌లో సంస్థను విస్తరిస్తామన్న ప్రాక్టర్ కంపెనీ..
మరోవైపు... ప్రాక్టర్ అండ్ గాంబుల్, నెదర్లాండ్ రాయబారి బృందంతో కూడా కేసీఆర్ చర్చలు జరిపారు.. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని.. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన ప్రాక్టర్‌ కంపెనీ.. మహబూబ్‌నగర్‌లో తమ శాఖను విస్తరిస్తామని హామీ ఇచ్చింది. ఇక వైద్యరంగంలో నైపుణ్యాన్ని పెంచడం.. ఆర్థిక, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులకు నెదర్లాండ్‌ సుముఖత వ్యక్తం చేసింది. 

06:40 - October 31, 2015

విజయవాడ : ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణలపై వామపక్ష ప్రజాస్వామ్య నేతలు ఐక్య ఉద్యమాలకు సిద్ధమౌతున్నారు. భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపడుతున్న భూ దందాను అడ్డుకునేందుకు రైతులు, రైతు కూలీలు, ప్రజలు కూడా ఐక్యమవ్వాలని కోరుతూ... సీపీఏం నేతలు కార్యాచరణ రూపొందించారు.

రాష్ట్ర సదస్సు..
విజయవాడలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఏర్పాటైంది. కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సును నిర్వహించారు. బలవంతపు భూసేకరణ వెంటనే నిలుపుదల చేయాలంటూ జరిగిన సదస్సులో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కోనేరు రంగారావు భూ కమిటీ సభ్యులు టి.గోపాలరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రాయలసీమ హక్కుల పోరాట సమితి నాయకులు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, రైతు సంఘాల నేతలు సదస్సులో పాల్గొన్నారు.

రైతులను భయపెడుతున్నారన్న గోపాలరావు..
చంద్రబాబు మారారని ప్రజలు నమ్మి గద్దెనెక్కిస్తే నేడు విశ్వరూపాన్ని చూపుతున్నారని గోపాలరావు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా దారుణమైన పద్ధతిలో రైతులను భయపెట్టి, బెదిరించి బలవంతంగా భూములు లాక్కోవటం మంచి పద్ధతికాదన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలలో 15 లక్షల ఎకరాల భూములను బలవంతంగా సేకరించి భూ బ్యాంకు ఏర్పాటు చేసే విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గాలని, లేనిపక్షంలో బాదిత రైతుల తరపున నిర్వహించే ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారని వారు తెలిపారు.

బాబుకు పిచ్చి - రామకృష్ణ..
చంద్రబాబుకు భూమి పిచ్చిపట్టడమే కాకుండా పిచ్చి రోజురోజుకు ముదురుతుందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రైతుల భూములను వారి పేరునే లేకుండా చేస్తూ పెట్టుబడిదారులకు ఊడిగడం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేందిలేదని హెచ్చరించారు.

భూ సేకరణపై విచారణ జరపాలన్న మధు..
భూ సమస్యలను తెలుసుకునేందుకు గ్రామాలకు వెళ్తున్న నాయకులను అరెస్టులుచేసి, భయకంపితులను చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా భూముల్లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా చట్టరీత్యా నేరమని, ఉరవకొల్లు, సకునాల, ఎంపికుంట తదితర ప్రాంతాలలో జరుగుతున్న భూ సేకరణపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఆరు తీర్మానాలు..
సదస్సులో ఆరు తీర్మానాలను ప్రవేశపెట్టగా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. భవిష్యత్తులో ల్యాండ్ బ్యాంకును వ్యతిరేకిస్తూ గవర్నర్, సీఎం చంద్రబాబుకు వినతి పత్రం ఇవ్వాలని, గ్రామాల్లో సత్యాగ్రహాలు, మండల కార్యాలయాల ముట్టడి, తదితర అంశాలపై చర్చించి పూర్తిగా అవగాహన కల్పిస్తామని, ప్రతిఒక్కరూ ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. 

 

06:34 - October 31, 2015

విజయవాడ : ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకోసం జనచైనత్య యాత్రలను మార్గంగా ఎంచుకుంది. గడప గడపకు టీడీపీ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, ఇన్‌ఛార్జ్‌లు పాల్గొంటారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజవర్గాల్లో జనచైతన్య యాత్రలు నిర్వహిస్తారు. గ్రామ గ్రామాన పార్టీ జెండాలు ఆవిష్కరిస్తారు. యాత్రల్లో పాల్గొనే నాయకులందరూ రాత్రులు గ్రామాల్లోనే బస చేయాలని పార్టీ నాయకత్వం సూచించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకొనే ప్రయత్నాల్లో భాగంగా ఈ యాత్రలు చేపట్టనున్నారు. ప్రజాభిప్రాయం ఆధారంగా సంక్షేమ పథకాల అమల్లో మార్పులు చేర్పులు చేస్తారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల విజయవాడలో నిర్వహించిన టీడీపీ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సూచన మేరకు జనచైతన్య యాత్రలకు ప్లాన్‌ చేశారు.

మేదోమథనం..
జనచైతన్య యాత్రలపై పార్టీ నాయలకు దిశానిర్ధేశం చేసేందుకు మేధోమథనం నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. నవంబర్‌ రెండోవారంలో ఏపీ తాత్కాలిక రాజధాని విజయవాడలో ఈ సదస్సు జరుపుతారు. ఎన్నికల ముందు పార్టీలో చేరినవారికి, ముందు నుంచి టీడీపీలో ఉన్న నాయకులను మధ్య ఉన్న అంతరాన్ని తొలగించి, సమన్వయంతో ఎలా ముందుకుసాలన్న అంశంపై చర్చిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు నారా లోకేష్‌, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు మేధోమథనానికి హాజరవుతారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు జిల్లాల వారీగా మంత్రులతో పత్యేకంగా భేటీ అవుతారు. ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితి గురించి తెలుసుకుంటారు. 

06:32 - October 31, 2015

నెల్లూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. కండలేరు ఎడమ కాలువపై 62 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. దీని ద్వారా.. పొదలకూరు మండలంలోని సుమారు పాతిక వేల ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తాయి. దీన్ని నాలుగు సంవత్సరాల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో.. తమ ప్రభుత్వం తాగు, సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు.

బ్లాక్ లిస్టులో పెడుతానన్న బాబు..
పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు సంగం బ్యారేజీ నిర్మాణాన్ని పరిశీలించారు. ఏడాదిలోగా బ్యారేజీని పూర్తి వినియోగంలోకి తేవాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లు ఆలసత్యం వహిస్తే బ్లాక్‌లిస్టులో పెడతామని ఆయన హెచ్చరించారు. గోదావరిని కృష్ణానదితో అనుసంధానించామని... త్వరలో కృష్ణను పెన్నాతో అనుసంధానిస్తామని సీఎం చెప్పారు. వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు.. రెయిన్‌గన్స్ విధానాన్ని అనుసరిస్తామని అన్నారు.

బ్యారేజీని పరిశీలించిన బాబు..
తర్వాత చంద్రబాబు నాయుడు నెల్లూరు బ్యారేజీని పరిశీలించారు. అక్కడి పనులు సాగుతున్న తీరు, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారేజీ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌పై హెచ్చరించారు. జిల్లాలోని డేగపూడి, గొట్లపాలెం గ్రామాల అభివృద్ధికి రూ.30 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం తెలిపారు. 

06:29 - October 31, 2015

వరంగల్ : ఎంపి నియోజకవర్గంలో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి వామపక్ష పార్టీలు. భూపాలపల్లిలో జరిగిన వామపక్ష పార్టీల సమావేశంలో ఆశా వర్కర్లు, వామపక్షాల కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యంగావుండి వరంగల్‌ ఉప ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి. ప్రజలను అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మోసం చేశాయని విమర్శించారు. ప్రజలను ఓట్లు అడిగే హక్కు వామపక్ష పార్టీలకు మాత్రమే వుందంటున్నారు చాడ.

కేసీఆర్ కు తమ్మినేని సూటి ప్రశ్నలు..
వరంగల్ ఎంపి ఉప ఎన్నికల నేపధ్యంలో సిపియం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. సియం కేసీఆర్‌కు కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసింది చండీయాగం కోసమా లేదంటే సీబీఐ కేసులను మాఫీ చేయమని కోరేందుకా? అన్నారు తమ్మినేని. కేసీఆర్ మాటలు నమ్మని ప్రజలు ఈ సారి వామపక్షాలు బలపరిచిన అభ్యర్థికి ఓట్లు వేయాలని కోరారు తమ్మినేని. నియంత పాలన చేస్తున్న కేసీఆర్ కు వరంగల్ ఉప ఎన్నిక నుంచే పతనం ప్రారంభమవుతుందన్నారు వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి గాలి వినోద్ కుమార్. ఉప ఎన్నికల్లో విస్త్రుత ప్రచారం చేపట్టిన వామపక్ష నేతలు ఎందుకు తమకే ఓటు వేయాలన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 

06:27 - October 31, 2015

వరంగల్ : లోక్‌సభ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖరారైంది. గులాబీ పార్టీ అభ్యర్థిగా పసునూరి దయాకర్ పేరును కేసీఆర్ ప్రకటించారు. నిన్నటివరకూ రేసులో ముందు ఉన్న రవికుమార్‌ను ...కుల వివాదం కారణంగా పక్కకు పెట్టినట్లు సమాచారం. దీంతో చివరి నిమిషంలో దయాకర్ పేరును ఖరారు చేశారు కేసీఆర్.

2001 నుండి...
టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం 2001 నుంచి క్రియాశీలకంగా పార్టీలోనూ, రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమంలో పాల్గొన్న దయాకర్ ... గతంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశించి భంగపడ్డారు. పసునూరి దయాకర్ గతంలో టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు. అరూరి రమేశ్ టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం దయాకర్‌ను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయన పెద్దగా బయటికి రానప్పటికీ పార్టీ పట్ల విధేయతతో ఉంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదట తయారు చేయించిన నేతగా పసునూరి దయాకర్‌కు టీఆర్‌ఎస్ అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది. పసునూరి దయాకర్‌ స్వయంగా చిత్రకారుడు, ఛాయా చిత్రకారుడు. స్వగ్రామం సంగెం మండలం బొల్లికుంట కాగా, వరంగల్‌ కాశీబుగ్గలో చాలాకాలం స్టూడియో నడిపారు. ప్రస్తుతం వర్ధన్నపేటలో గ్యాస్‌ డీలర్‌గా వ్యాపారం చేస్తున్నారు.

తెలంగాణ తల్లి విగ్రహాల రూపశిల్పి..
ఫైన్‌ ఆర్ట్స్ లో పట్టభద్రుడు. తెలంగాణ తల్లి విగ్రహాల రూపశిల్పి. విగ్రహ తయారీతో సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా మారారు. తెలంగాణ జిల్లాల్లో అనేక చోట్ల ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఈయనే తయారుచేశారు. 2009, 2014లోనూ శాసన సభకు పోటీ చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి దయాకర్‌ చేజారింది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. బయటి పార్టీల నుంచి వచ్చిన వారికే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని, మొదటి నుంచి కష్టపడ్డ వారికి అసలే మాత్రం పెద్దహోదాలు లేవనే అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో 2001 బ్యాచ్‌కే ప్రాధాన్యం దక్కినట్లయింది. ఈ పరిణామంతో క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలకు కొంత వూరట లభించింది.

06:25 - October 31, 2015

హైదరాబాద్ : పాలనలో పట్టు సాధించేందుకు టీ-సర్కార్ నడుం బిగించింది. అడ్మినిస్ట్రేషన్‌లో భారీగా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర పరిపాలన వ్యవస్థలో పలు కీలక మార్పులు చేపట్టింది. 22 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖల్లో పని చేస్తున్న ముఖ్య కార్యదర్శులతో పాటు హెచ్‌వోడీలు ట్రాన్స్ ఫర్ అయ్యారు.

సోమేశ్ బదిలీ..
జీహెచ్ఎంసీ కమిషనర్‌ సోమేశ్‌ కుమార్‌కు స్థానచలనం తప్పలేదు. గ్రేటర్ పరిధిలో ఓట్ల తొలగింపు వ్యవహరంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన్ను గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. అలాగే పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా సుదీర్ఘకాలం సేవలు అందించిన రేమండ్ పీటర్‌ను భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌గా నియమించారు. బల్దియా కొత్త బాస్‌గా జనార్ధన్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. పంచాయతీ రాజ్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శేఖర్ ప్రసాద్ సింగ్‌, హెచ్ఎండీఏ కమిషనర్‌గా చిరంజీవులు, అటవీశాఖ కమిషనర్‌గా వికాస్ రాజ్ బదిలీ అయ్యారు. 

జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ గా అనితా రామచంద్రన్..
ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా మహేశ్‌ దత్ ఎక్కా, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా అదర్‌ సిన్హా , బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా జీడీ అరుణ బదిలీ అయ్యారు. అలాగే ఐ అండ్ పీఆర్‌ కమిషనర్‌గా నవీన్ మిట్టల్‌, పురపాలక కమిషనర్‌గా దాన కిషోర్‌, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా అనితా రామచంద్రన్‌, బల్దియా స్పెషల్ కమిషనర్‌గా జి. కిషన్‌ నియమితులయ్యారు. పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఎండీగా కె. నిర్మల, పురపాలకశాఖ సంయుక్త కార్యదర్శిగా ఎ.శ్రీనివాస్, ఆయిల్ ఫెడ్‌ ఎండీగా ఎ.మురళి, ట్రైకార్‌ ఎండీగా లక్ష్మణ్‌కు స్థానచలనం కలిగింది.

సురేశ్ చందా బదిలీ..
ఇక ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన సురేశ్‌ చందా పశుసంవర్ధన శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు. గతంలో వైద్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయన పలు సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాల్ని తప్పుబట్టారు. అందుకే సురేశ్ చందాను అక్కడి నుంచి తప్పించింది కేసీఆర్ సర్కార్‌. వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా రాజేశ్వర్ తివారీని నియమించింది. అంతేకాకుండా సెర్ప్‌ సీఈవోగా వీరబ్రహ్మయ్యకు, సాంకేతిక శాఖ సంచాలకులుగా ఎంవీ రెడ్డికి అదనపు బాధ్యతలు దక్కాయి.

ప్రకంపనాలు..
ఇలా వివిధ శాఖల్లో సుదీర్ఘకాలంగా పనిచేసిన అధికారుల్ని టీ-సర్కార్ మార్చేసింది. అలాగే తమకు అంతగా సహకరించని ఉన్నతాధికారులను కీలక శాఖల నుంచి తప్పించింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా భారీ సంఖ్యలో జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీ సంచలనం సృష్టిస్తోంది.

06:08 - October 31, 2015

హీరోగా తానేమిటో నిరూపించుకున్న 'నందమూరి హరికృష్ణ' మళ్ళీ తనయుడు 'ఎన్టీఆర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని సమాచారం. 'ఎన్టీఆర్‌', 'కొరటాల శివ' కాంబినేషన్‌లో ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైన విషయం విదితమే. ఇందులో ఓ ముఖ్యపాత్రను 'హరికృష్ణ' పోషిస్తున్నారట. ఆయన బాడీ లాంగ్వేజ్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు 'కొరటాల శివ' ఈ పాత్రను డిజైన్‌ చేశారని తెలిసింది. దీనికి ముందు 'సుకుమార్‌', 'ఎన్టీఆర్‌' కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలోనే 'హరికృష్ణ' నటించాల్సి ఉండేనట. అనారోగ్యం కారణంగా ఆ సినిమాలో 'హరికృష్ణ' నటించలేకపోయారని టాక్. 

06:06 - October 31, 2015

మలయాళంలో ఘనవిజయం సాధించి ఇటీవల శతదినోత్సవం పూర్తి చేసుకున్న 'ప్రేమమ్‌' చిత్రాన్ని తెలుగులో 'మజ్ను'గా రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 'నాగ చైతన్య' హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి 'కార్తీకేయ'ఫేమ్‌ చందూమొండేడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో 'చైతూ' సరసన మలయాళ ముద్దుగుమ్మ 'అనుపరమా పరమేశ్వరన్‌' హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలోని రెండు కీలక అతిథి పాత్రల్లో 'నాగార్జున', 'వెంకటేష్‌' నటించనున్నారనే వార్త ప్రస్తుతం సామాజిక మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అయితే ఈ అతిథి కాంబినేషన్‌ గురించి చిత్ర యూనిట్‌ ఇంతవరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఏది ఏమైనా ఈ అతిథి కాంబినేషన్‌ సినిమాలో కనిపిస్తే సిల్వర్‌స్క్రీన్‌ వండర్‌ జరిగినట్టేనని అంటున్నారు నెటిజన్లు.

06:05 - October 31, 2015

'ఎట్టి పరిస్థితుల్లో 'పద్మశ్రీ' అవార్డుని వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదు. ఈ అవార్డును నాకు ప్రభుత్వాలు ఇవ్వలేదు. దేశం ఇచ్చింది. దేశమంటే నాకు ఎనలేని గౌరవం. ఆ గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది' అని 'విద్యాబాలన్‌' ఘాటుగా స్పందించింది. ఇండియన్‌ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టిఐఐ) విద్యార్ధుల సమ్మెకు మద్ధతుగా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పొంచి ఉన్న ముప్పునకు నిరసనగా సినీ ప్రముఖులు సైతం జాతీయ అవార్డులను, పురస్కారాలను వెనక్కి ఇచ్చేస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని ఓ ఇంగ్లీష్‌ ఛానెల్‌ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా విద్యాబాలన్‌ పై విధంగా సమాధానమిచ్చింది. 'చూడండి.. అవార్డులనేవి ప్రతిభకు నిదర్శనాలు. అంతేకాదు కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తినిచ్చే అంశం కూడా. అటువంటి అరుదైన గౌరవాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి ఇవ్వాలను కోవడం లేదు' అని విద్యా చెప్పింది. ఇదిలా ఉంటే, విద్యా మాదిరిగానే మరో సీనియర్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌ సైతం ఇలాగే స్పందించారు.

06:04 - October 31, 2015

మూడు చెంచాల పెరుగు, అరకప్పు ఓట్స్, రెండు టేబుల్‌ స్పూన్ల తేనె, కొద్దిగా నిమ్మ తొక్కల పొడి, కొద్దిగా బత్తాయి రసం... అన్నింటినీ కలిపి మెత్తని పేస్తులా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. దీనిలోని ఓట్స్‌ మృతకణాలను తొలగిస్తే, బత్తాయిరసం, నిమ్మ తొక్కల పొడి చర్మాన్ని గట్టిపరుస్తుంది. తేనె చర్మానికి తేమను అందిస్తుంది. మొత్తంగా ముఖం తాజాదనంతో మెరిసిపోతుంది.

 

నేడు ఆశా వర్కర్ల కోసం విరాళాలు..

హైదరాబాద్ : నేడు సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల కోసం విరాళాల సేకరణ జరుగనుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆశా వర్కర్లను ఆదుకుందామని, ఆశాల డిమాండ్లను సానుభూతితో చూడాల్సిన ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. హక్కుల కోసం పోరాడే ప్రతొక్కరూ అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. 

తాజ్ ప్యాలెస్ లో ఉగ్రవాదానికి వ్యతిరేక కార్యక్రమం...

ఢిల్లీ : హోటల్ తాజ్ ప్యాలెస్ లో ఇండియా - అరబ్ ప్రెండ్ షిప్ ఆధ్వర్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. 

బోయిన్ పల్లిలో కార్డన్ సెర్చ్..

సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈస్ట్ జోన్ డీజీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. దాదాపు 350 మందికి పైగా పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు.

 

లాలాగూడలో కార్డన్ సెర్చ్...

సికింద్రాబాద్ : లాలాగూడ చంద్రబాబు నగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 

మంత్రి కుమారుడిపై యువకుడి ఫిర్యాదు...

సికింద్రాబాద్ : మంత్రి కుమారుడు తనను మూడు గంటల పాటు నిర్భందించి హింసించాడని అభినవ్ అనే యువకుడు ఆరోపించాడు. ఈమేరకు మారేడ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రేమ పెళ్లి వ్యవహారంలో మంత్రి కుమారుడు జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

గజదొంగ దున్న కృష్ణ అరెస్టు..

విజయవాడ : గజదొంగ దున్న కృష్ణ అలియాస్ రాజును పోలీసులు అరెస్టు చేశారు. 2.5 కిలోల బంగారం, 15 కిలోల వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దున్న కృష్ణపై 150కి పైగా కేసులున్నాయి. 

నవంబర్ 7న టి.టిడిపి సర్వసభ్య సమావేశం..

హైదరాబాద్ : నవంబర్ 7వ తేదీన టి.టిడిపి సర్వసభ్య సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. 

Don't Miss