Activities calendar

01 November 2015

విద్యార్థి జేఏసీ నేతలపై బిజెపి దాడి చేయడం దారుణం : పి.మధు

విజయవాడ : విద్యార్థి జేఏసీ నేతలపై బిజెపి నేతలు దాడి చేయడం దారుణమని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ప్రత్యేకహోదా కోసం నిరసన తెలపడం తప్పా.. అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనకు దిగిన విద్యార్థులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. అరెస్టు చేసిన విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలన్నారు. విద్యార్థులపై దాడి చేసిన బిజెపి నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

21:45 - November 1, 2015

అహ్మదాబాద్ : పటేళ్ల సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న హార్దిక్ పటేల్ పోలీస్ కస్టడీని నవంబర్ 3వరకు కోర్టు పొడిగించింది. ఈ మేరకు అహ్మదాబాద్ కోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. దేశద్రోహం కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.

 

21:42 - November 1, 2015

ఢిల్లీ : విపక్షాలపై కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ విరుచుకుపడ్డారు. బీజేపీపై విపక్షాలు.. లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని విమర్శించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌, వామపక్షాలు పనిచేస్తున్నాయన్నారు. మోదీ ప్రభావం రోజురోజుకు పెరుగుతుండడంతో.. పని కట్టుకొని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. విపక్షాలు పార్లమెంట్‌ సమావేశాలు జరగకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయన్నారు. పార్లమెంట్‌ సమావేశాలు సక్రమంగా జరిగితే.. ఎక్కడ మోదీకి మంచి పేరు వస్తుందేమోనని విపక్షాలు భయపడుతున్నాయని అరుణ్‌జైట్లీ అన్నారు.

21:28 - November 1, 2015

బీహార్ : చెదురు మదురు ఘటనలు మినహా బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఏడు జిల్లాలోని 55 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 58శాతం పైగా పోలింగ్‌ నమోదయ్యింది. ఈసారి 776 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
ఏడు జిల్లాల్లో 55 సీట్లకు పోలింగ్‌
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్‌ ముగిసింది. ఏడు జిల్లాలోని 55 శాసనసభా స్థానాలకు భారీ బందోబస్తు మధ్య పోలింగ్‌ నిర్వహించారు. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌, పది గంటల నుంచి ఊపందుకుంది. గత నెల 12, 16, 28 తేదీల్లో జరిగిన మూడు విడతల పోలింగ్‌ కంటే ఈ సారి ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. 58 శాతం పైగా ఓట్లు పోలైనట్టు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. పూర్తి సమాచారం అందితన తర్వాత ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
మొరాయించిన ఓటింగ్ యంత్రాలు
సాంతకేతిక లోపాలతో కొన్ని కేంద్రాల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు పనిచేయలేదు. వీటి స్థానంలో కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేసి, పోలింగ్‌ నిర్వహించారు. ఇటువంటి కేంద్రాల్లో పోలింగ్‌ కొద్దిగా ఆలస్యంగా ప్రారంభమయ్యింది. దీంతో చివర్లో అదనపు సమయం కేటాయించారు.
185 సీట్లకు ముగిసిన ఎన్నికలు
ఈసారి 776 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పోలింగ్‌ పూర్తైన తర్వాత ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను స్ట్రాంగ్‌రూములకు తరలించి భద్రపరిచారు. బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఇంతవరకు నాలుగు దశల్లో నిర్వహించిన పోలింగ్‌లో 185 సీట్లకు ఎన్నికలు ముగిశాయి. తుది దశలో ఐదో విడత నెల 5న 57 స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తారు. నవంబర్‌ 8న ఓట్లు లెక్కిస్తారు. గెలుపుపై ఎన్డీయే, మహాకూటమి నాయకులు ఎవరికి వారు ధీమాతో ఉన్నారు.

 

 

21:21 - November 1, 2015

నిజామాబాద్ : అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఓ పోలీసు అధికారి ఆటలకు అడ్డుకట్టపడింది. అందినకాడికి దోచుకుంటూ ప్రజలు, క్రిందిస్థాయి సిబ్బందిని వేధిస్తున్న ఆయనపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఆయన అవినీతి భాగోతాలు 10 టీవీలో ప్రసారం కావడంతో.. వాటిపై స్పందించిన అధికారులు ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. రాంకుమార్‌... నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ డీఎస్పీ. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు కొదవే లేదు. అన్యాయం జరిగిందని ఎవరైనా పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే.. లంచం లేనిదే ఏ పని చేయడనే ఆరోపణలున్నాయి. అంతేగాక ఈయన వ్యవహార శైలిపై అనేక విమర్శలున్నాయి.
దంపతుల దారుణహత్య
గత ఏప్రిల్‌లో ఎడవల్లి మండలం జానకంపేట శివారులోని దర్గాలో జరిగిన దంపతుల హత్య కేసు బాధ్యతలను ఉన్నతాధికారులు రాంకుమార్‌కు అప్పగించారు. విచారణ చేపట్టిన పోలీసులు ఫారూఖ్‌ అనే యువకుడిని తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇది పోలీసులు చేసిన హత్యేనని మృతుడి కుటుంబీకులు ఆందోళనలకు దిగారు. మరోవైపు ఏడు నెలలు కావస్తున్నా.. దంపతుల హత్య కేసును రాంకుమార్‌ చేధించలేదనే ఆరోపణలున్నాయి. బాధిత కుటుంబసభ్యులు కేసు విషయాన్ని అడిగితే బెదిరింపులకు పాల్పడేవాడని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇసుక మాఫియాలో కూడా రాంకుమార్‌ పాత్ర ఉందని.. ఉన్నతాధికారులకు స్థానికులు అనేకసార్లు ఫిర్యాదులు చేశారు. వీటిపై విచారణ కొనసాగుతోంది.
10 టీవీలో రాంకుమార్‌పై వరుస కథనాలు
ఇక రాంకుమార్‌పై వచ్చిన ఆరోపణలపై 10 టీవీలో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. స్పందించిన ఉన్నతాధికారులు ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించి.. బదిలీ వేటు వేశారు. రాంకుమార్‌ను బదిలీ చేయడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 10 టీవీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా వచ్చే డీఎస్పీ తమ తల్లిదండ్రుల హత్య కేసును త్వరగా ఛేదించి.. హంతకులకు శిక్ష పడేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.
10 టీవీకి స్థానికుల కృతజ్ఞతలు
10 టీవీలో ప్రసారమైన కథనాలపై ఉన్నతాధికారులు స్పందించినందుకు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న డీఎస్పీ రాంకుమార్‌ను బదిలీ చేయించిన 10 టీవీకి పలువురు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

 

అమ్మవారి జాతరలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

రాజమండ్రి : కొత్తపేట మండలం మండలం వాడపాలెంలో అమ్మవారి జాతరలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణ పడుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నంలో ఎస్సై విజయ్ కుమార్ కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అయన్ను ఆస్పత్రికి తరలించారు. 

21:06 - November 1, 2015

హైదరాబాద్ : నగరంలో విమలక్క ఆధ్వర్యంలో ప్రజా కళాకారుల ఐక్య వేదిక ఆవిర్భవించింది. గిరిజన, దళిత, శ్రామికుల పక్షాన.. వారి హక్కుల కోసం పాటుపడటమే ఈ వేదిక లక్ష్యమని విమలక్క అన్నారు. కళాకారులు, రచయితలందూ ఐక్యం కావాల్సిన అవసరముందన్నారు. సోమవారం నుంచి ఈనెల 11 వరకు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి.. 16వ తేదీన 'తిరుగుబాటు పాట' కార్యక్రమం నిర్వహిస్తామని విమలక్క ప్రకటించారు.

 

21:03 - November 1, 2015

హన్మకొండ : వరంగల్ జిల్లా టిఆర్ ఎస్ లో వర్గ విబేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఉప ఎన్నిక నేపధ్యంలో స్టేషన్‌ ఘన్‌పూర్‌లో నిర్వహించిన సర్వసభ్యసమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, ప్రస్తుత డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వర్గాలు బాహాబాహీకి దిగాయి. మా నేత పదవి పోయేందుకు నువ్వే కారణమంటూ కడియం పై రాజయ్య వర్గీయులు మాటల తూటాలు పేల్చారు. దీంతో రెచ్చిపోయిన కడియం వర్గీయులు రాజయ్య అనుచరులపై దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్ధితి కాసేపు ఉద్రిక్తంగా మారింది.

 

21:01 - November 1, 2015

కృష్ణా : ఎపికి ప్రత్యేకహోదా కావాలని నినదించినందుకు విజయవాడలో విద్యార్ధి జేఏసి నేతలు కాషాయ కార్యకర్తలు చితక్కొట్టారు. ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ నిరసన ప్రదర్శించినందుకు, ప్రధాని దిష్ఠిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించినందుకు కర్రలతో బిజెపి కార్యకర్తలు తరిమికొట్టారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శిస్తున్న విద్యార్ధులపై బిజెపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. విద్యార్థులను బిజెపి నేతలు తరిమికొడుతుంటే.. పోలీసులు చోధ్యం చూశారు. బిజెపి నేతలకు వంతపాడారు. బిజెపి నేతలను దాడిని అడ్డుకోలేదు. కనీసం వారించడానికి కూడా ప్రయత్నం చేయలేదు. పైగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా.... ఉద్యమం చేస్తున్న విద్యార్థులను పీఎస్ కు తీసుకెళ్లారు. విద్యార్థి నేతలను పరామర్శించేందుకు వెళ్లిన పలువురిని అడ్డుకున్నారు. ఇదిలావుంటే బిజెపి కార్యకర్తలు వ్యవహరించిన తీరుపై పలువురు ప్రజాస్వామిక వాదులు మండిపడుతున్నారు.

 

ప్రత్యేకహోదాపై ప్రశ్నిస్తే బీజేపీ దాడులు : రఘువీరా

కృష్ణా : విజయవాడలో విద్యార్థి జేఏసీ నేతలపై బీజేపీ దాడిని ఎపిసిసి చీఫ్ రఘువీరారెడ్డి ఖండించారు. ప్రత్యేకహోదాపై ప్రశ్నిస్తే బీజేపీ దాడులు చేస్తోందని.. దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

 

20:23 - November 1, 2015

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని మస్తంగ్ జిల్లాలో రైలు పట్టాలపై బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారు. దాష్ట్ ప్రాంతంలో రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తులు బాంబును అమర్చారు. దీనిపై ఓ ప్యాసెంజరు రైలు ప్రయాణిస్తున్నప్పుడు బాంబు పేలింది. దీంతో ఓ బోగీ పక్కకు ఒరిగిపోయింది. కెట్టా నుంచి పంజాబ్ ప్రావిన్స్ లోని రావల్పిండి ప్రాంతానికి రైలు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఈ పేలుడుకు ఎవరూ బాధ్యత తీసుకోలేదు.

20:18 - November 1, 2015

పాట్నా : లాలూ ప్రసాద్‌ యాదవ్‌, నితీష్‌ కుమార్‌ పాలనలో బీహార్‌లో అభివృద్ధి కుంటుపడిందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఈనెల 5 న తుది విడత పోలింగ్‌ జరుగున్న మధేపురా లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన లాలూ, నితీష్‌పై విరుచుకుపడ్డారు. మహాకూటమి గెలిస్తే బీహార్‌లో ఆటవిక పాలన వస్తుందని మోడీ దుయ్యబట్టారు.

 

20:15 - November 1, 2015

పాట్నా : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నోరు పారేసుకుంటున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ విమర్శించారు. గతంలో ఏ ప్రధాన మంత్రి కూడా ప్రతిపక్షాలను దుర్భాషలాడిన సందర్భాలులేవని ఆయన పాట్నాలో చెప్పారు. మహాకూటమిలోని జేడీయు, ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీలను త్రీ ఇడియట్స్ అనడం మోడీ కుసంస్కారానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. 

19:58 - November 1, 2015

ఢిల్లీ : దేశంలో అసహనం పెరిగిపోదంటూ ప్రభుత్వం ప్రదానం చేసిన అవార్డులను కొందరు ప్రముఖులు తిరిగి ఇవ్వడాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తప్పుపట్టారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని వారణాసిలో ఆయన విమర్శించారు. మోడీ సుపరిపాలనలో అసహనానికి తావులేదన్నారు. 

19:55 - November 1, 2015

హైదరాబాద్ : నాచారంలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ నిర్వహిస్తున్న పరీక్షాకేంద్రంలో ఓ అభ్యర్ధిని మాస్‌ కాపీయింగ్‌ పాల్పడినా.. అధికారులు చర్య తీసుకోవడం లేదని ఇతర అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. రెండో పేపర్‌ రాయకుండా పరీక్షను బహిష్కరించి పరీక్షా కేంద్రం ఎదుట బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మాస్‌ కాపీయింగ్‌పై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అభ్యర్ధులు పరీక్షా కేంద్రంలోకి వెళ్లారు. 

19:52 - November 1, 2015

శ్రీకాకుళం : ఇద్దరూ వికలాంగులు..! ఒకరిది దృష్టి లోపం.. మరొకరిది కుబ్జత్వం..! కానీ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించారు.. వారి సమక్షంలోనే ఒక్కటయ్యారు.. తమలాంటి వారికి స్ఫూర్తిగా నిలిచారు. ఈ ఆదర్శవివాహం శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన మజ్జి చంద్రరావు పుట్టుకతో అంధుడు. శివశంకర్‌ కాలనీలోని శాంతతో అతనికి స్నేహం ఏర్పడింది. ఆకారంలో పొట్టిగా ఉన్న శాంతతో పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించారు. ఇరుపక్షాల పెద్దలూ దగ్గరుండి ఈ జంటను ఒక్కటి చేశారు. ఈ వివాహం పట్ల వధూవరులు సంతోషంగా ఉన్నారు. ఒకరికొకరు తోడుగా సాగుతామని ప్రమాణాలు చేసుకున్నారు. పెళ్ళికి హాజరైన వారు.. ఈ ఆదర్శ జంటను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

 

19:43 - November 1, 2015

గుంటూరు : నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరాతి లంక భూముల్లో రాజకీయ రాబందులు వాలిపోతున్నాయి. రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలను బెదిరించి బినామీ పేర్లతో భూములు రాయించుకుంటున్నారు. కొనుగోలు చేసిన భూములకు అక్రమంగా రిజస్ట్రేషన్లు కూడా చేయించుకుంటున్నారు. లంక భూములు కొన్న వారిని జైలుకు పంపుతామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన హెచ్చరికలు ఉత్తుత్తి మాటలుగానే మిగిలిపోతున్నాయి.
ఇప్పటివరకు 30 వేల ఎకరాలకు పైగా సేకరణ
నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 30 వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించింది. ఏడాదికి మూడు పంటలు పండే 13 లంక గ్రామాల్లో మరో 2159 ఎకరాలు సమీకరించాల్సి ఉంది. నేలను నమ్ముకుని జీవనాధారం సాగిస్తున్న బడుగుజీవులు ఈ భూములు ఇవ్వడం నిరాకరించడంతో ఇప్పుడు వారిని పై భూ సేకరణ అస్త్రం ప్రయోగిస్తున్నారు.
బినామీ పేర్లతో భూముల కొనుగోలు
భూసేకరణకు ప్రభుత్వం సమాయత్తం కావడంతో కృష్ణానది చెంతనే ఉన్న లంక భూముల్లో రాజకీయ నాయకులు రాబందుల్లా వాలిపోతున్నారు. భూయజమానులను నయానో, భయానో బెదిరించి వారి నుంచి బినామీ పేర్లతో వాటిని కొనుగోలు చేస్తున్నారు. తక్కువ డబ్బు ముట్టచెబుతూ సొంతం చేసుకుంటున్నారు. సేకరణకు ఉద్దేశించిన భూముల్లో జరీబు, అసైన్డ్‌ భూములున్నాయి. జరీబు భూములకు రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. అసైన్డ్‌ భూములకు బినామీ పేర్లలో పెండింగ్‌ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఈ లావాదేవీల్లో అధికార పార్టీ నాయకులే ఎక్కువగా ఉన్నారు. నోటిఫికేషన్‌ ద్వారా భూ సమీకరణకు ప్రభుత్వ సిద్ధం కావడంతో ఎకరం 5 లక్షల రూపాయల విలువ ఉన్న భూములకు 25 లక్షలు వెచ్చించి సొంతం చేసుకున్నారు. పట్టా భూములను ఎకరం 45 నుంచి 50 లక్షల రూపాయకలు కొనుగోలు చేశారు. భూములు అమ్మిన రైతులు భవిష్యత్‌లో ఎదురు తిరుగుతారేమోన్న అనుమానంతో వీడియో చిత్రీకరణ కూడా చేశారు. అమరావతి ప్రాంతంలో లంక భూములు కొన్న వారిలో మంత్రులు, వారి అనుచరగణం ఉన్నట్టు వినిపిస్తోంది. లంక భూములు కొంటే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన హెచ్చరికలు నోటి మాటలుగా మిగిలిపోయాయని ప్రతిపక్షనాయులు విమర్శిస్తున్నారు.
నోటిఫికేషన్‌ ద్వారా 2159 ఎకరాల సేకరణ
మరోవైపు రాజధాని కోసం నోటిఫికేషన్‌ ద్వారా 2159 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములను కూడా సమీకరణ పద్ధతిలోనే తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెబుతున్నారు. లంక భూముల కొనుగోలు వ్యవహారంపై మంత్రులు నోరు మెదపకపోవడాన్ని రైతులు, రాజకీయ నాయకులు తప్పుపడుతున్నారు.

 

 

19:19 - November 1, 2015

హైదరాబాద్ : సికింద్రాబాద్ భువన, అభినవ్ వివాదంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఈ ఘటనతో తమ కుటుంబానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. అభినవ్ ఎవరో తనకు తెలియదన్నారు. కొన్ని పత్రికలు కావాలని తనపై ఆరోపణలు చేస్తున్నాయని.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వివరణ తీసుకొని వార్తలు రాస్తే బాగుంటుందని తలసాని అన్నారు. భువన కుటుంబ సభ్యులను అభినవ్‌ బెదిరించాడని తెలిపారు. జరిగిన విషయాన్ని చెప్పేందుకే భువన, ఆమె తండ్రి తన ఇంటికి వచ్చారని తెలిపారు. 

19:13 - November 1, 2015

హైదరాబాద్ : ఇంటర్నేషనల్‌ టెన్నీస్‌ ప్లేయర్‌ భువన-అభినవ్‌ల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అభినవ్‌ తనను వేధిస్తున్నాడని భువన ఆరోపించారు. ఈమేరకు బేగంపేట మహిళా పీఎస్ లో భువనారెడ్డి అభినవ్ పై ఫిర్యాదు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిమ్ కు వెళ్తుండగా అభినవ్ తో తనకు పరిచయం ఏర్పడిందని తెలిపారు. నాన్న మందలించాడనే ఒత్తిడిలో అతన్ని పెళ్లి చేసుకున్నానని ఆమె పేర్కొన్నారు. పెళ్లి తర్వాత అభివన్‌ ఒత్తిడితో టెన్నీస్‌ మానేశానని భువన ఆరోపించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు అభినవ్‌ తనను.. ఇంట్లో ఉంచి లాక్‌ చేసుకొని వెళ్లేవాడని పేర్కొన్నారు. అభినవ్‌ తన క్యారెక్టర్‌ గురించి తప్పుగా ప్రచారం చేశాడని తెలిపారు. తనకు సంబంధించిన ప్రాపర్టీస్‌ ఆయన పేరిట ట్రాన్స్ ఫర్‌ చేయాలని.. అభినవ్‌ తన తండ్రిని డిమాండ్‌ చేశాడని.. ఒప్పుకోనందుకు తీవ్రంగా కొట్టాడని భువన ఆరోపించారు. రూ.3 కోట్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడని చెప్పారు. తనను వేధింపులకు గురి చేశాడని కన్నీంటి పర్యంతమయింది. ఇక అతనితో ఉండలేనని స్పష్టం చేశారు. 

విద్యార్థి జేఏసీ నేతలపై బీజేపీ నేతల దాడి

విజయవాడ : బీజేపీ ఆఫీసు వద్ద విద్యార్థి జేఏసీ ఆందోళన చేపట్టింది. ప్రత్యేకహోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ నేతలు విద్యార్థి జేఏసీ నేతలపై కర్రలతో దాడి చేశారు. 

భువన-అభినవ్ ఘటనతో నాకు సంబంధం లేదు: తలసాని

హైదరాబాద్ : సికింద్రాబాద్ భువన, అభినవ్ ల వివాదంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఈ ఘటనతో తన కుటుంబానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అభినవ్ ఎవరో తనకు తెలియదన్నారు. తన కుటుంబంపై కొందరు లేనిపోని నిందలు మోపుతున్నారు. జరిగిన విషయాన్ని చెప్పేందుకే భువన, ఆమె తండ్రి తన ఇంటికి వచ్చారని తెలిపారు. 

భర్త అభినవ్ పై టెన్నిస్ ప్లేయర్ భువనారెడ్డి ఫిర్యాదు

సికింద్రాబాద్ : భర్త అభినవ్ పై టెన్నిస్ ప్లేయర్ భువనారెడ్డి ఫిర్యాదు చేశారు. బేగంపేట మహిళా పీఎస్ లో భువనారెడ్డి ఫిర్యాదు చేశారు. అభినవ్ నన్ను వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. రూ.3 కోట్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపించారు. ఇక అతనితో ఉండలేనని స్పష్టం చేశారు.

జిమ్ కు వెళ్తుండగా అభినవ్ తో పరిచయం ఏర్పడిందని తెలిపారు. నాన్న మందలించాడనే ఒత్తిడిలో పెళ్లి చేసుకున్నానని పేర్కొన్నారు.

 

రాజయ్యను పదవి నుంచి ఎందుకు తొలగించారు : జీవన్ రెడ్డి

కరీంనగర్ : రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి కేసీఆర్ ఎందుకు తొలగించారని కాంగ్రెస్ ఎమ్మెల్మే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాజయ్య అవినీతికి పాల్పడితే చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. సీబీఐ విచారణ నేపథ్యంలో

కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలి

 

17:48 - November 1, 2015

హైదరాబాద్ : తెలంగాణకు చెందిన ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ రేపటినుంచి ఐదు రోజులపాటు లండన్‌లో పర్యటించబోతున్నారు. భారతదేశం నుంచి తొమ్మిది మంది ఎంపీలను లండన్‌కు ఆహ్వానించగా.. అందులో తనకు అవకాశం లభించిందని బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను బ్రిటీషర్లకు వివరిస్తానని బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు.

 

17:38 - November 1, 2015

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ పాలనపై ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోందని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. అధికారంలోకి వచ్చి16 నెలలైనా బీజేపీ సర్కార్‌.. ఎన్నికల హామీలను నెరవేర్చడం లేదన భావన ప్రజల్లో ఉందన్నారు. బీహార్‌ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని దూరదర్శన్‌లో చూపించకపోవడంపై వీహెచ్‌ మండిపడ్డారు. దీనిపై కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీకి వీహెచ్‌ లేఖ రాశారు. పార్లమెంట్‌లో ఈ అంశాన్ని నిలదీస్తానని.. డీడీ డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 

17:34 - November 1, 2015

హైదరాబాద్‌ : నగరంలోని బల్కంపేట-బాలానగర్ ఫ్లై ఓవర్‌ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావటంతో జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 13మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉంటే లారీ బీభత్సంలో 4 కార్లు, 2 ఆటోలు, ఒక బైకు ధ్వంసమయ్యాయి.

ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన పసునూరి

వరంగల్ : పరకాలలోని అమరదామం దగ్గర అమరవీరులకు వరంగల్ లోక్‌సభ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ నివాళులర్పించారు. నివాళి అనంతరం అక్కడినుంచి పసూనూరి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రచార కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

బిహార్‌ లో ముగిసిన నాలుగో విడత పోలింగ్‌

హైదరాబాద్‌ : బిహార్‌ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్‌ ముగిసింది. మొత్తం 7జిల్లాల పరిధిలో 55నియోజకవర్గాల్లో ఆదివారం పోలింగ్‌ జరిగింది. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్నవారికే ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ నెల 5న చివరి విడద పోలింగ్‌ జరగనుంది.

17:16 - November 1, 2015

కరీంనగర్ : ఎన్ డిఎ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై సిఐటియు నిరంతరం పోరాటం చేస్తుందని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎకె.పద్మనాభన్ తెలిపారు. కరీంనగర్‌లో కామ్రెడ్ ముకుందలాల్ మిశ్రా సిఐటియు భవనాన్ని పద్మనాభన్ ప్రారంభించారు. ఈందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ ఎస్ ప్రభుత్వం.. కార్మిక సంఘాలను పట్టించుకోకుండా నియంతలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్మికులకోసం నిరంతరం పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి సంఘం నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

 

17:10 - November 1, 2015

హైదరాబాద్ : రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరించాలని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రభుత్వ సంస్థలన్నింటిని ఒకే చోట ఏర్పాటు చేస్తే అనర్థమని టీడీపీ ప్రభుత్వానికి హెచ్చరించారు. దీనివల్ల భవిష్యత్‌లో వేర్పాటువాదానికి దారి తీసే అవకాశముందన్నారు. ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి .. రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరించాలన్నారు. అభివృద్ధి అంతా ఓ ప్రాంతంలోనే కేంద్రీకృతం చేస్తే... మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. 

17:00 - November 1, 2015

హైదరాబాద్ : అవయవదానంపై మార్గదర్శకాలు అమలుచేస్తామని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఈ విషయంలో కార్పొరేట్‌ ఆస్పత్రి యజమానుల సలహాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సామాన్య ప్రజలకు మేలైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కామినేని తెలిపారు. ఎవరుపడితే వారు అవయవదానం చేస్తే ప్రమాదమని చెప్పారు. విశాఖలో కిడ్నీల మార్పిడికే అనుమతులున్నాయన్నారు.

 

16:46 - November 1, 2015

విశాఖ : నగరంలో ఉదయం నుంచే అధికారులు... హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. మరోసారి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే బైక్ సీజ్ చేస్తామని రవాణాశాఖ డిప్యుటీ కమిషనర్ వెంకటేశ్వర్లు చెప్పారు. ఎంవిపి కాలనీ, పిఎం పాలెం, గాజువాక, సీతమ్మధార ప్రాంతాల్లో అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. 

16:42 - November 1, 2015

గుంటూరు : భూ వివాద రహిత రాష్ట్రమే లక్ష్యంగా ఏపీలో రెండో విడత "మీ ఇంటికి మీ భూమి" కార్యక్రమం మొదలైంది. గుంటూరు జిల్లా ములుకుదురులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం ప్రారంభించారు. గ్రామాల్లో ఉన్న సరిహద్దు సమస్యలపై అధికారులను పిలిపించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాను మూడు చోట్ల పాల్గొంటానని చంద్రబాబు వెల్లడించారు. ప్రతిరోజు ఈ కార్యక్రమంపై ఆన్‌లైన్‌ రిపోర్టు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

 

16:39 - November 1, 2015

విశాఖ : పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలపడింది. ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదలడంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 48 గంటల్లో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరునుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ అధికారులు ప్రకటించారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఇప్పటికే విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంటలకు 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. 

16:28 - November 1, 2015

సింగపూర్ : భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా ...డబ్ల్యుటిఎ సింగపూర్ ఓపెన్ ఫైనల్స్ డబుల్స్ విభాగంలో బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ సాధించి చరిత్ర సృష్టించింది. స్విస్ వెటరన్ మార్టీనా హింగిస్ తో జంటగా 2015 టోర్నీ విజేతగా నిలిచింది. రౌండ్ రాబిన్ లీగ్ లో వరుసగా నాలుగు విజయాలు సాధించిన టాప్ సీడింగ్ సానియా జోడీకి టైటిల్ సమరంలో సైతం పోటీనే లేకుండా పోయింది. ఈరోజు జరిగిన టైటిల్ సమరంలో ముగురుజా-నవారో జంటను సానియాజోడీ 6-0, 6-3తో వరుస సెట్లలో చిత్తు చేసి చాంపియన్లుగా నిలిచారు. ప్రస్తుత సీజన్లో సానియా-హింగిస్ జోడీ...ఫైనల్స్ చేరడం ఇది 10వ సారి. అంతేకాదు...వింబుల్డన్, అమెరికన్ ఓపెన్ టైటిల్స్ తో పాటు పలు టూర్ టైటిల్స్ ను సైతం సొంతం చేసుకొని తమకు తామే సాటిగా నిలిచారు.

 

15:48 - November 1, 2015

కర్నూలు : అదనపు కట్నం కోసం భార్యను హత్య చేసిన ఘటన కర్నూలు నగరంలో చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు, రేఖ దంపతులు. నగరంలోని వన్ టౌన్ పోలిస్టేషన్ సమీపంలో ఉంటున్నారు. వెంకటేశ్వర్లు.. భార్య రేఖను అదనపు కట్నం కోసం వేధిస్తూ.. నిన్న రాత్రి కిరోసిన్ పోసి నిప్పు అంటించి హత్య చేశాడు. రేఖ తండ్రి రిటైర్మెంట్ డబ్బులు తీసుకు రమ్మని గత కొంత కాలంగా రేఖను వేధిస్తుండేవాడని ఆమె తల్లి చెబుతున్నారు. ఈ విషయంలో నిన్న రాత్రి భార్యపై గొడవ పడి కిరోషన్ పోసి నిప్పు అంటించాడని ఆమె ఆరోపించారు. పరారీలో ఉన్న నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

15:43 - November 1, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరిస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఆశాల సమ్మెను పట్టించుకోవడంలేదన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో కార్మికులను అణిచివేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయలేదని పేర్కొన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ నిబంధనలకు విరుద్ధంగా పిఎఫ్ నిధులు మళ్లించారని ఆరోపించారు. 17 నెలల పాలనలో కార్మికులను అణచివేసేందుకు టీ సీఎం ప్రయత్నించారని మండిపడ్డారు. ఆశాల సమస్యలను ఇప్పటికీ పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఆశాలకు మద్దతుగా చేపట్టిన విరాళాల సేకరణలో తెలంగాణవ్యాప్తంగా రూ. 17,66,450 వసూలయ్యాయని ప్రకటించారు. ఈ డబ్బును ఆశాలకు చెల్లిస్తామని తెలిపారు.

 

డబ్ల్యుటిఎ ఫైనల్స్ టోర్నీ సానియా-హింగిస్ జోడీ కైవసం

సింగపూర్ : డబ్ల్యుటిఎ సింగపూర్ ఓపెన్లో సానియా-హింగిస్ జోడీ చరిత్ర సృష్టించారు. డబ్ల్యుటిఎ ఫైనల్స్ టోర్నీ సానియా-హింగిస్ జోడీ కైవసం చేసుకుంది. ఫైనల్లో ముగురజా-నవర్రో జోడీపై 6-0, 6-3 తేడాతో సానియా-హింగిస్ జోడీ విజయం సాధించింది. దీంతో సానియా, హింగిస్ లు 2015 సీజన్లో 10 టోర్నీల ఫైనల్స్ కు చేరారు. 

హైదరాబాద్ లో లారీ బీభత్సం...

హైదరాబాద్ : నగరంలోని బల్కంపేటలో లారీ బీభత్సం సృష్టించింది. జనంపైకి దూసుకెళ్లింది. ఈఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. 4 కార్లు, రెండు ఆటోలు, బైక్ ధ్వంసం అయింది.

15:09 - November 1, 2015

ఢిల్లీ : రష్యాకు చెందిన ఎయిర్‌బస్ విమానాన్ని ఈజిప్టులో తామే కూల్చేశాంటూ ఉగ్రవాద సంస్థ ఐఎస్ ఐఎస్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులు విడుదల చేశారు. అయితే ఈ వీడియో దృశ్యాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈజిఫ్టు అధికారులతో పాటు పాటు రక్షణ నిపుణులు ఐఎస్ ఐఎస్ ప్రకటనను ఖండిస్తున్నారు. వారి వద్ద 30వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమనాన్ని కూల్చివేసే ఆయుధాలు లేవని స్పష్టం చేస్తున్నారు.

రాజయ్యకు బీఫాం అందజేసిన ఉత్తమ్ కుమార్

హైదరాబాద్ : వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్యకు.. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఫాం అందజేశారు. 

టీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలి - ఎర్రబెల్లి..రమణ..

వరంగల్ : ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో కేసీఆర్ చెప్పాలని టిటిడిపి నేతలు ఎర్రబెల్లి, రమణలు ప్రశ్నించారు. హామీలు నెరవేర్చకుండా ఎలా ఓట్లు అడుగుతారని, వరంగల్ లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఉప ఎన్నిక కోసం ఏడుగురు మంత్రులను ఎందుకు ఇన్ చార్జిగా నియమించారని తెలిపారు. టీఆర్ఎస్ కు అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తే సోమేష్ కుమార్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. 

నూతన ఆర్థిక విధానాల వల్ల ఇబ్బందులు - పద్మనాభన్..

కరీంనగర్ : నూతన ఆర్ధిక విధానాల వల్ల ప్రజలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు పద్మనాభన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో సీఐటీయూ నూతన భవనం ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆర్థిక వ్యతిరేక విధానాలను అవలింబిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని, టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. ఆశా వర్కర్లకు అండగా పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి సాయిబాబ పాల్గొన్నారు.

బీహార్ లో ఆటవిక పాలన - మోడీ..

బీహార్ : రాష్ట్రంలో అటవిక పాలనకు చరమగీతం పాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మధుబనిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీహార్ లో లాలూ, నితీష్ కుమార్ ఆటవిక పాలన కొనసాగించారని, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతుందని జోస్యం చెప్పారు. బీహార్ నుండి విడిపోయిన జార్ఖండ్ అభివృద్ధిలో దూసుకపోతోందన్నారు. 

మీ ఇంటికి - మీ భూమి కార్యక్రమం ప్రారంభం..

గుంటూరు : ములకుదురులో ' మీ ఇంటికి - మీ భూమి' రెండో విడత కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 

జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు..

విశాఖపట్టణం : జిల్లాలో నమోదైన వర్షపాతం ఈ విధంగా ఉన్నాయి. పెందుర్తి 18, విశాఖపట్టణం 14, గాజువాక 14, భీమిలి 13, ఆనందపురం 12 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.

 

ఎన్నికల హామీలను విస్మరిస్తోంది - తమ్మినేని..

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరిస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రెండు నెలలుగా ఆశా వర్కర్లు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కార్మికుల సమ్మెలను అణిచివేయాలని చూశారు కాని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయలేదన్నారు. ఆశాలను ఆదుకొనేందుకు విరాళాల ద్వారా రూ.17,66,450 వసూలయ్యాయని, వాటిని ఆశాలకు చెల్లిస్తామని తెలిపారు. 

ఆర్టీసీ బస్టాండులో మగ శిశువు మృతదేహం..

కడప : ఆర్టీసీ బస్టాండులో కలకలం రేగింది. బ్యాగ్ లో మగ శిశువు మృతదేహం లభ్యమైంది. శిశువు మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించేందుకు పర్మమాత్మ సేవా సంస్థ ముందుకొచ్చింది.

 

నిజామాబాద్..టెన్ టివి కథనానికి స్పందన..

నిజామాబాద్ : టెన్ టివి కథనానికి స్పందన వ్యక్తమైంది. దంపతుల హత్య కేసులో నిర్లక్ష్యం వహించిన బోధన్ డీఎస్పీ రామ్ కుమార్ పై బదిలీ వేటు పడింది.

11:24 - November 1, 2015

హైదరాబాద్ : సింగరేణి సంస్థ అక్టోబర్ నెలలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించింది. గత నెలలో 4.73 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకోగా 5.01 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేశారని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. కార్మికులు, ఉద్యోగులు 106 శాతం అధిక బొగ్గు ఉత్పత్తి చేశారని అభినందించారు. తెలంగాణలో ఏర్పాటైన బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గు సరఫరాకు తమ సంస్థ సిద్ధమవుతున్నదని శ్రీధర్ వివరించారు.

 

11:18 - November 1, 2015

కాకినాడ : ఎటీఎంలో పెట్టాల్సిన డబ్బుతో ఓ సెక్యూర్టీ ఉద్యోగి పరారయ్యాడు. ఈ ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. సీఎంఎస్ లో భరణి కుమార్ సెక్యూర్టీ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. దేవాలయ వీధిలో ఉన్న బ్యాంకు ఆఫ్ ఇండియా ఎటీఎంలో రూ. పది లక్షలు పెట్టడానికి భరణి కుమార్ వెళ్లాడు. అతనితో పాటు గన్ మెన్, ఉద్యోగి వెళ్లారు. ఎటిఎం బయటే ఉండాలని చెప్పిన భరణి కుమార్ పరారయ్యాడు. తరువాత విషయం తెలుసుకున్న ఇతర ఉద్యోగులు సమాచారాన్ని యాజమాన్యానికి తెలియచేశారు. డబ్బుతో పరారరైన భరణి కుమార్ కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. 

శ్రీవారిని దర్శించుకున్న రఘువీరా..

తిరుమల : ఏపి.పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు కృషి చేస్తామని మీడియాకు తెలిపారు. కోటి సంతకాలు..కోటి ఎస్ఎంఎస్ లు, ప్రతి ఊరులో మట్టిని సేకరించి ప్రత్యేక హోదా కోసం ప్రధానికి పంపుతామన్నారు. ప్రధాని ప్రత్యేక హోదా ఇస్తానన్న మాట నిలబెట్టుకోవాలని, ప్రత్యేక హోదా కోసం మట్టి సత్యాగ్రహం చేస్తామన్నారు.

 

సీఎంఎస్ సెక్యూర్టీ ఉద్యోగి చేతివాటం..

కాకినాడ : సీఎంఎస్ సెక్యూర్టీ భరణి చేతి వాటం ప్రదర్శించాడు. దేవాలయ వీధి బ్యాంకు ఆఫ్ ఇండియా ఏటీఎంలో పెట్టాల్సిన రూ. పది లక్షలతో ఉడాయించాడు. 

11:00 - November 1, 2015

ఆమె ను చూస్తే చాలు మనసుకు రెక్కలొచ్చేస్తాయి..అదెందుకో తెలియదు కవిత్వం పెల్లుబుకుతుంది..ఆమె యూత్ కలల రాణి.. నడిచే తాజ్ మహల్.. ఆమే బాలీవుడ్ నటి 'ఐశ్వర్య రాయ్'. నవంబర్ 1 ఆమె బర్త్ డే.

1996లో పరిచయం..
ఐశ్వర్యరాయ్.. ఈ పేరు తలిస్తే చాలు.. ప్రపంచంలోని అందమంతా వచ్చి కంటి ముందు సాక్షాత్కరిస్తుంది. తుళ్ళిపడని మనసు కూడా తుళ్ళి తుళ్ళి పడుతుంది. ఆమె వెండితెర మీద కాస్తున్న వెన్నెల. బాలీవుడ్ ఏమిటి... టాలీవుడ్, కోలీవుడ్ ఆఖరుకు హాలీవుడ్ కూడా ఆమె అందానికి దాసోహమంది. ఒక్కముక్కలో చెప్పాలంటే ప్రపంచ సినిమాతెరకు పట్టిన తేనెపట్టు ఐశ్వర్యరాయ్. 1996లో మణిరత్నం దర్శకత్వం నటించిన ఇరువర్ అనే తమిళ చిత్రం ఆమె తొలి తెర అడుగు. అక్కడి నుంచీ ఐష్ ఏనాడూ ప్రేక్షకులను మోసం చేసిందే లేదు. వెండితెర పై తన వెన్నెల సంతకంతో ప్రేక్షకులను అలరిస్తూనే వుంది ఇప్పటికి కూడా. కవల పిల్లల కాన్సెప్ట్ తో రూపొందిన ఆ చిత్రం లో ఐశ్వర్య రాయ్ నటన అందరిని ఆకట్టుకుంది. తెలుగులో కూడా ఐశ్వర్యరాయ్ ఓ సినిమా చేసింది. టాలీవుడ్ మన్మధుడు నాగార్జునతో రావోయి చందమామ చిత్రంలో ఒకే ఒక్క సాంగ్ లో స్టెప్పులేసి వావ్ అనిపించింది. ఆ తరువాత చెప్పేదేముందీ సినిమా సినిమాకీ చమక్కనే గ్లామర్ తో మెరుస్తూనే ఉంది.

ప్రేమ వ్యవహారాలు..
రీల్ లైఫ్ వండర్స్ తో పాటూ రియల్ లైఫ్ సన్సేషన్స్ కి కూడా కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తూ వచ్చింది ఐష్. హమ్ దిల్ దే చుఖే సనమ్ తో కలిసి నటించిన ఐశ్వర్యరాయ్ ఈ సినిమాలోనే సల్మాన్ ఖాన్ తో లవ్ లో పడింది. కొద్ది రోజులు ఈ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకు తిరిగి హాట్ టాపిగ్గా మారారు. తర్వాత్తరువాత అతనికి గుడ్ బై చెప్పింది. వీరు విడిపోవడం కూడా ఆ రోజుల్లో ఎక్కడ లేని ప్రచారం దక్కించుకుంది. ఐశ్వర్య నే కాదు ... ఐశ్వర్య లవ్ స్టోరీల్ని కూడా జనం ఇష్టపడ్డారు. సల్మాన్ ..వివేక్ ఒబెరాయ్...ల ప్రేమ వ్యవహారం ఆమెను కలవరపెట్టింది. ఆ తరువాత అభిషేక్ బచన్ తో ప్రేమ పెళ్లి పీటలకు చేరుకొని రియల్ లైఫ్ లవ్ స్టొరీ ని సుఖాంతం చేసింది. షారుఖ్ .. అమితాబ్ లతో కలిసి మొహబత్తేన్ లో నటించింది ఐష్.

ఐష్ రూటే సపరేట్..
ఆ సంవత్సరం బాలీవుడ్ బిగ్గెస్ట్ వసూళ్లు చేసిన చిత్రాల్లో మొహబత్తేన్ రెండో స్థానంలో నిలించింది. అంతే కాదు ఈ సినిమాకు గానూ ఐష్ ఫిలిం ఫేర్ బెస్ట్ సపోర్ట్ యాక్ట్రెస్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ధూమ్ 2 లో గ్ల్మార్ దుమ్ము రేపినా ..దేవదాస్ ...జోధ అక్బర్ లో అభినయం తో ఆకట్టుకున్నా ...ఐష్ రూటే సెపరేట్. అందాలా అభినయానికి సింబల్ ఎవరూ అని అడిగితే అందరూ తడుముకోకుండా చెప్పేది ఒకే ఒక్క పేరు.. ఐశ్వర్యారాయ్... ఏ రాయైతేనేం ... కళ్లే చెదిరిపోవడానికి? అని మిగిలిన అందగత్తెలతో ఆమెని పోల్చలేం. ఐశ్వర్య ఈజ్ యూనిక్ యూనివర్సల్. ఐశ్వర్య రాయ్ మరెన్నో సూపర్ హిట్స్ లో నటించి అలరించాలని ఆకాక్షిద్దాం.

10:53 - November 1, 2015

సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ జంటగా సూరజ్ బర్‌జాత్య దర్శకత్వంలో రూపొందిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్ర ట్రైలర్ అత్యధిక హిట్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఈ ట్రైలర్‌ను దాదాపు ఒక కోటి 57 లక్షల మంది వీక్షించారు. దాదాపు లక్ష పైనే లైక్స్ కూడా వచ్చాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో అధిక సంఖ్యలో నెటిజన్లు ఈ ట్రైలర్ గురించే మాట్లాడుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఇది ట్విట్టర్ ట్రెండింగ్స్ లో టాప్ టెన్ స్థానాల్లో చోటు సంపాదించుకుంది. ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. 

10:50 - November 1, 2015

జి.లక్ష్మీనర్సయ్య ..ఈ పేరు వింటేనే మనకు రెండు దశాబ్దాలక్రితం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కవితా నిర్మాణ పద్ధతులు,సామాజిక కళావిమర్శ వ్యాసపరంపరలే గుర్తొస్తాయి. ఆధునిక సాహిత్య విమర్శలో ఆయన ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధికారికమైన ఆయన విమర్శ తెలుగు సాహిత్యంలో పెను దుమారం రేపింది. అంతే కాదు దళిత బహుజన సృజన కారులను ఎందరినో వెలుగు లోనికి తెచ్చిన ఘనత లక్ష్మీనర్సయ్య గారికే దక్కుతుంది. ప్రముఖ సాహితీ విమర్శకులు,దళిత బహుజన సాహిత్య ఉద్యమకారుడు, సుప్రసిద్ధ సాహితీవేత్త జి.లక్ష్మీనర్సయ్యతో ఇంటర్వ్యూ..

10:39 - November 1, 2015

విజయవాడ : ఏపీ అవతరణ దినోత్సవం మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది. విజయవాడలో రివ్యూలు, మీటింగ్‌లంటూ హడావుడి చేస్తున్న చంద్రబాబు నవంబర్‌ ఒకటి ఉత్సవాలపై మాత్రం సైలెంట్‌గా సైడైపోతున్నారు. అసలు రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏరోజు అన్న దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు.  రాష్ట్రం ఏర్పాటైన రోజు... ఏ ప్రభుత్వానికైనా.. ప్రజలకైనా చాలా ప్రత్యేకమైన రోజు.. అవతరణ రోజును ఘనంగా జరుపుకునేందుకు ఏ సర్కారైనా ఏర్పాట్లు చేస్తుంది. ఏపీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. 2014లో వేడుకల విషయమే పట్టించుకోలేదు. ఈసారికూడా అదే బాటలో నడిచేందుకు ప్రయత్నిస్తోంది. తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణలో సంబరాలు అంబరాన్నంటగా. ఆంధ్రప్రదేశ్‌లో అవతరణ పేరే గుర్తు చేసుకోలేదు.

1956 నవంబర్‌ 1న ఏపీ ఏర్పాటైంది...
అసలు రాష్ట్ర అవతరణ దినం ఎప్పుడన్నది ఇప్పటికీ తేలలేదు. నవంబర్‌ 1న జరుపుకోవాలా? జూన్‌ 2న నిర్వహించాలా? అన్న అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. 1956 నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పాటుకాగా... 2014 జూన్‌ 2న తెలంగాణ విడిపోయింది. రెండు తేదీలు ఉండడంతో ఏ డేట్ ఫైనల్ చేయాలన్నది గందరగోళంగా మారింది. వేడుకలు నవంబర్ 1నే నిర్వహించాలని కొందరు.. జూన్‌ 2న జరపాలని మరికొందరు వాదనలు వినిపించారు. అసలు అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని అప్పుడే ఉత్సవాలు జరుపుకోవాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. దీనిపై ఎటూ తేల్చుకోని సర్కారు గత నవంబర్‌లో వేడుకలకు దూరంగా ఉంది. జూన్‌ 2న కూడా సైలంట్‌గా సైడైపోయింది.

మళ్లీ నవంబర్..
మళ్లీ నవంబర్‌ వచ్చేసింది. ఈసారికూడా ప్రభుత్వంనుంచి ఉత్సవాలపై ఎలాంటి స్పందనాలేదు. గత ఏడాది జూన్‌ 2న రెండు వారాలపాటు ఏపీలో నవ నిర్మాణ దీక్ష జరిపింది ప్రభుత్వం. అప్పుడు విజయవాడ కేంద్రంగా భారీ ఉత్సవాలు ఏర్పాటు చేశారు. అయితే ఇవి అవతరణ వేడుకలు కాదని సీఎం పేషీ అధికారులే ప్రకటించారు. ఈ ఏడాది కూడా నవ నిర్మాణం అంటూ హడావుడి చేశారు. అవతరణ వేడుకలపైమాత్రం పెదవి విప్పడంలేదు. అవతరణ దినోత్సవంపై దుమారం రేగక ముందే.. అవతరణ రోజుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రజలు కోరుతున్నారు..

10:30 - November 1, 2015

రొమేనియాలోని బుకారెస్ట్ లోని ఓ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం జరిగి 27 మంది చనిపోయారు. మరో 150 మంది గాయాపడ్డారు. రాత్రి క్రాకర్స్ తో రాక్ మ్యూజిక్ షో నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా క్రాకర్స్ పేలడంతో.. భారీగా మంటలు అంటుకొని దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో అంతా ఒకేసారి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఓవైపు మంటలు, మరోవైపు తొక్కిసలాట జరగడంతో 27మంది చనిపోయారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 

10:26 - November 1, 2015

కృష్ణా : కృష్ణా డెల్టా రైతాంగానికి సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి... ప్రస్తుతం ఒక విడత నీరు వదిలిపెడితేనే రబీకి పొలాలు సిద్ధం అయ్యే అవకాశం ఉంది.. ఇప్పటికే రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటాయి. ఖరీఫ్‌లో సగం ఆయకట్టుకూడా సాగుకు నోచుకోలేదు. పంటవేసిన ప్రాంతాల్లోనూ అరకొరగా నీరు సరఫరా చేశారు. ఈ నీటి బాధలతో పామర్రు మండలం కొరివిమిట్టలో రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటించారు. ఈ సమయానికి సాధారణంగా ప్రకాశం బ్యారేజీలో 12 అడుగుల నీటిమట్టం ఉండాలి. ఇప్పుడు 10.7 అడుగులకు పడిపోయింది. వరి పంట పొట్టదశకు చేరేదశలో నీటి కరవు ఏర్పడింది. ఏం చేయాలో అర్థంకాని రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు.

175.74 టీఎంసీల నీరు నిల్వ..
2011 ప్రారంభం నుంచి అక్టోబర్ 26 వరకు కృష్ణా డెల్టాలో 175.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 2014లో 156.15 టీఎంసీలు, 2015లో కేవలం 28.15 టీఎంసీలు ఉపయోగించుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ నవంబర్‌, డిసెంబర్‌లో మరో 20 టీఎంసీల నీరు అవసరమని అధికారులు అంచనావేస్తున్నారు. ఇక 2011నుంచి ఆయకట్టు సాగుకూడా తగ్గిపోతోంది. 2011లో 13.07 లక్షల ఎకరాల ఆయకట్టుకు 12 లక్షల ఎకరాలు సాగయ్యాయి. ఇందుకోసం 175.74 టీఎంసీల నీటిని ఉపయోగించారు. 2014లో 13.07 లక్షల ఎకరాల ఆయకట్టుకు 10.98 లక్షల ఎకరాలు పంట వేశారు. 2015లో 13.07 లక్షల ఎకరాల ఆయకట్టుకు కేవలం 8.06 లక్షల ఎకరాలు సాగులోకొచ్చాయి. ఈ పంటలకు 28.15 టీఎంసీల నీరు వాడుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

856.6 అడుగుల నీరు..
ఇక రిజర్వాయర్ల విషయానికొస్తే శ్రీశైలం డ్యామ్‌లో 856.6 అడుగుల నీరుండాలి. ప్రస్తుతం 848.1 అడుగుల నీటి నిల్వలున్నాయి. నాగార్జున సాగర్ డ్యామ్ లో 586 అడుగులకుగాను 508.9 అడుగులు మాత్రమే నీరుంది. సాధారణంగా రబీ సీజన్‌లో డెల్టా ఆయకట్టు ప్రాంతం వరి పంటతో కళకళలాడుతుంది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉండటం, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో పంట వేయాలా? వద్దా? అన్న సందిగ్ధంలో ఉన్నారు రైతులు. వ్యవసాయం వదిలేస్తే ఏం చేసుకొని బతకాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.. నీరు ఇస్తారో? ఇవ్వరో? ఏదో ఒక స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.. 

10:22 - November 1, 2015

విశాఖపట్టణం : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ద్రోణి బలపడి అల్పపీడనంగా మారే అవకాశముందని విశాలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తాలో వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో తెల్లవారు జాము నుంచి పలుచోట్ల వర్షం కురుస్తోంది.

10:21 - November 1, 2015

ఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్‌ను భారత్‌ను తీసుకువచ్చేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. భారత దౌత్యాధికారి సంజీవ్ అగర్వాల్ డెన్‌పసార్‌ పోలీస్‌ స్టేషన్‌లో రాజన్‌ను కలిశారు. చోటా రాజన్‌ను భారత్‌కు పంపాలని అధికారులకు సంజీవ్‌ విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఇండోనేషియా అధికారులు 20రోజుల్లో రాజన్‌ను ఇండియా పంపుతామని హామీ ఇచ్చారు. ఇటీవలే ఇండోనేషియాలో చోటా రాజన్ ను నిఘా బృందం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే నిందితులను ఇచ్చిపుచ్చుకునే ఒప్పందం అమలుపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. 2011లో భారత్, ఇండోనేషియా మధ్య దీనిపై సంతకాలు జరిగాయి. అయితే అది ఇంకా అమలులోకి రాలేదు. చోటా రాజన్ అరెస్ట్ నేపథ్యంలో ఇరు దేశాలు ఈ ప్రక్రియను వేగవంతం చేశాయి. భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆదివారం ఇండోనేషియాను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా నిందితులను ఇచ్చిపుచ్చుకోవడంతోపాటు పరస్పర న్యాయ సహకారానికి సంబంధించిన ఒప్పంద అమలు పత్రాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేస్తారు. అనంతరం వీటిని పరస్పరం మార్చుకుంటారు. దీంతో మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్‌ను ఇండియాకు తరలించేందుకు లైన్ క్లియర్ అవుతుంది.

10:04 - November 1, 2015

విశాఖపట్టణం : జిల్లాలో సంచలనం సృష్టించిన కృపామణి హత్య కేసులో ప్రధాన నిందితుడు గూడాల సాయి శ్రీనివాస్ విశాఖలో ఉన్నట్లు నిఘా బృందాలకు సమాచారం అందింది. దీనితో అతను ఉన్న ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు. ఇది ముందే తెలుసుకున్న శ్రీనివాస్ పోలీసుల నుండి తప్పించుకున్నాడు. ఆ ప్రాంతంలో కారును పోలీసులు స్వాధశీనం చేసుకున్నారు. సాయి శ్రీనివాస్ పలుమార్లు అత్యాచారం చేశాడని..వ్యభిచారం రొంపిలోకి దింపాలని తన తల్లిదండ్రులతో కలిసి కుట్ర పన్నాడని ఆరోపిస్తూ కృపామణి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. విషమంతా ఆమె వీడియోలో చెప్పి మరి ఆత్మహత్యకు పాల్పడడంతో ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 

తాళ్లపూడిలో వివాహిత అనుమానాస్పద మృతి..

విజయనగరం : పార్వతీపురం (మం) తాళ్లపూడిలో వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెంది. అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

సాయి శ్రీనివాస్ కోసం పోలీసుల గాలింపు...

విజయవాడ : కృపామణి హత్య కేసులో ప్రధాన నిందితుడు సాయి శ్రీనివాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. టూ టౌన్ పరిధిలో నిందితుడి కారు లభ్యమైంది. 

బీహార్ పోలింగ్ లో పోలీసుల లాఠీఛార్జీ..

బీహార్ : రాష్ట్రంలో నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది. బూత్ నెంబర్ 50 వద్ద పోలీసులకు..ఓటర్లకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ సందర్భంగా పోలీసులు లాఠీఛార్జీ జరిపారు. 

09:13 - November 1, 2015

ఏంటీ టాలీవుడ్ నటుడు 'ప్రభాస్' ఇంట్లో పోలీసులా ? ఎందుకు ? ఏమైంది ? ఎందుకెళ్లారు ? అనే డౌట్స్ రావడం సహజమే. కానీ ఆయన ఇంట్లో ఏమి జరుగలేదు. మరి ఎందుకెళ్లారు అంటే ఇది చదవండి..
'బాహుబలి' చిత్రం అనంతరం 'ప్రభాస్' పేరు మారుమోగుతోంది. ఇటీవలే 'ప్రభాస్' విదేశీ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. టూర్ ముగించుకొని తిరిగి వచ్చిన 'ప్రభాస్' ను చూసేందుకు ఆయన ఫ్యాన్స్ వచ్చారు. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం హైటెక్ సిటీ, మాదాపూర్ లో పర్యటించారు. కెసిఆర్ బందోబస్తుకోసం పోలీసులు జూబ్లిహిల్స్ లో డ్యూటీ చేస్తున్నారు. వీరంతా 'ప్రభాస్' నివాసంలోకి దూరారు. ప్రభాస్ తో ఫోటోలు కూడా దిగారట. ఈ విషయం ఆలస్యంగా అధికారులకు తెలిసింది. దీనిపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం చేశారని టాక్. గట్టిగా సిబ్బంది మందలించారంట. 

08:13 - November 1, 2015

కడప : జిల్లాలోని ఇడుపాలపాయలో ఉన్న ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తూర్పుగోదావరి జిల్లా మామిడిగూడురు మండలం అప్పాస్ పల్లి గ్రామ నివాసి ఉమా జ్యోతి ట్రిపుల్ ఐటీలో విద్యనభ్యసిస్తోంది. శనివారం రాత్రి తన రూంలో ఉరి వేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన తోటి స్నేహితులు సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఉమాజ్యోతిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉమా జ్యోతి మృతి చెందింది. మృతురాలి గదిలో ఉన్న సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

08:06 - November 1, 2015

బీహార్ : నేడు నాలుగో దశ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. 55 స్థానాలకు 776 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 14,139 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 43 స్థానాల్లో ఉదయం 7నుండి సాయంత్రం 5గంటల వరకు..8 సమస్యత్మాక నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకు..4 అతి సమస్యత్మాక నియోజకవర్గాల్లో మధ్యాహ్నాం 3గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 1,46,93,294 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

14,139 పోలిగ్ స్టేషన్లు..
నాల్గవ విడత పోలింగ్‌ నిర్వహిస్తున్న జిల్లాల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 14,139 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 3043 వామపక్ష తీవ్రవాద ప్రభావిత కేంద్రాలున్నాయి. దీంతో భారీ పోలిసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు వీలుగా 1163 కంపెనీల కేంద్ర పారా మిలటరీ బలగాలతోపాటు రాష్ట్ర పోలీసులను నియమించారు. నదీతీర ప్రాంతాల్లో పోలింగ్‌ స్టేషన్ల ఉన్న చోట్ల 38 మోటార్‌ బోట్లతో గస్తీ నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ జరుగుతున్న ముజఫర్‌నగర్‌, తూర్పు చంపారన్‌, పశ్చిమ చంపారన్‌, సీతామరి జిల్లాలపై ఎన్డీయే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఆర్జేడీ అధినేత లాలూ సొంత జిల్లా గోపాల్‌గంజ్‌లో మహాకూటమికి నల్లేరు మీద నడకేమీకాదు. రెండు కూటముల్లో కూడా తిరుగుబాటు అభ్యర్ధుల బెడద ఉంది. దీంతో అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి.

మూడు దశల్లో 131 సీట్లు పోలింగ్‌ పూర్తి..
బీహార్‌లో ఇంతవరకు మూడు విడతలు పోలింగ్‌ పూర్తయ్యింది. నేడు నాల్గవ దఫా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మూడు దశల్లో 131 సీట్లకు పోలింగ్‌ ముగిసింది. నాల్గో విడత 55 స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌ ముగిస్తే 181 సీట్లు ఎన్నికలు పూర్తయినట్టు అవుతుంది. తుది విడతలో ఈనెల 5న 57 స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తారు. నవంబర్‌ 8న ఓట్లు లెక్కిస్తారు. గెలుపుపై ఎన్డీయే, మహాకూటమి నాయకులు ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. 

కరీంనగర్ లో సీఐటీయూ నూతన భవనం..

కరీంనగర్ : నేడు జిల్లా కేంద్రంలో సీఐటీయూ నూతన భవనం ప్రారంభం కానుంది. అనంతరం కార్మికుల ప్రదర్శన నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు పద్మనాభన్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి సాయిబాబ హాజరు కానున్నారు. 

07:36 - November 1, 2015

శీతాకాలం వచ్చిందంటే చాలు చర్మం తెల్లగా పొడిబారిపోతుంది. ఇది ఎంతో అసహనానికి గురిచేస్తుంది. అందుకే ఈ కాలంలో చర్మాన్ని పర్యవేక్షించుకోవటం చాలా కష్టమైన విషయమే. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక చోట లోటు ఏర్పడుతుంది. చర్మం పడే ఇబ్బంది నుండి కాపాడుకునేందుకు మీ కోసం కొన్ని చిట్కాలు..

  • నువ్వుల నూనె చలికాలంలో చక్కగా పనిచేస్తుంది. శరీరానికి నూనె పట్టించి సున్ని పిండితో గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. లేదా వేజలిన్‌ బాడీలోషన్‌ లేదా ఏ ఇతర బాడీ లోషన్‌ అయినా రాసుకొని స్నానం చేస్తే శరీరం మృదువుగా ఉంటుంది.
  • అంతేకాదు, స్నానం చేసే నీటిలో కొద్దిగ కొబ్బరి నూనె లేదా ఆలివ్‌ ఆయిల్‌ చుక్కలు వేసి వేడినీటితో స్నానం చేస్తే... ఇది శరీరం మొత్తానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది . స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ముఖానికి క్రీమ్‌ రాసుకోవాలి . ముఖ్యంగా విటమిన్‌ ఇ ఉన్న క్రీములు వాడడం మంచిది.
  • చలికాలంలో వచ్చే పగుళ్ళకు వేజలిన్‌ వాడటం ఉత్తమం. సాధారణ సబ్బుకు బదులు గ్లిజరిన్‌ సబ్బులు వాడటం మంచిది. రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా చేతులకు, కాళ్ళకు మాయిశ్చరైజర్‌ క్రీమ్‌ రాసుకోవాలి.
  • వారానికి ఒకసారైనా వేడి చేసిన కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెతో మసాజ్‌ చేసుకోవడం మంచిది. పాదాలు పగల కుండా సాక్స్ వేసుకోవడం ఉత్తమం.
  • చలికాలం పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి మంచినీళ్లు పదే పదే తాగాలనిపించదు. పైగా గాలిలో తేమ తక్కువ కాబట్టి శరీరం నుంచి బయటకు వెళ్లే నీటి శాతం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో చర్మం మరింతగా పొడిబారి పోవడమూ తప్పదు. చలికాలంలో మహిళలు ఎన్ని జాగ్రత్తలు పాటించినా, ఎన్ని క్రీములు రాసుకున్నా... తగిన మోతాదులో నీరు తాగకపోతే మాత్రం చర్మానికి ప్రమాదమేనని నిపుణులు సూచిస్తున్నారు. 
07:33 - November 1, 2015

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ 'ప్రియాంక చోప్రా'ను హాలీవుడ్‌ బుల్లితెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన టెలివిజన్‌ సిరీస్‌ 'క్వాంటికో'. భారీ అంచనాల మధ్య ఇటీవల ప్రసారమై బహుళాదరణ పొందిన ఈ సిరీస్‌ని కాపీ కొట్టారంటూ నిర్మాత మార్క్ గోర్డాన్‌పై కేసు నమోదైంది. 1999లో సీఎన్‌ఎన్‌లో ప్రసారమైన ఓ అమెరికన్‌ సిరీస్‌లోని ఐడియాను ఎలాంటి అనుమతి తీసుకోకుండా 'క్వాంటికో' సిరీస్‌ కోసం వినియోగించుకున్నారంటూ ఆ సిరీస్‌ నిర్మాణకర్తలు జెమ్మి హెల్మన్‌, బార్బరా లెబోవిట్జ్ లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 35 పేజీల ఫిర్యాదును లాస్‌ ఏంజిల్స్ లోని సుపీరియర్‌ కోర్టులో అందజేశారు.

07:29 - November 1, 2015

నిఖిల్‌, నందిత జంటగా ఉదరు నందనవనం దర్శకత్వంలో ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మిస్తున్న 'శంకరాభరణం' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన నిర్మాత అల్లు అరవింద్‌ ఆడియో సిడిలను విడుదల చేసి తొలికాపీని హీరోయిన్‌ సమంతకు అందజేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడారు. ఏ సినిమాకైనా మంచి ఓపెనింగ్స్ రావాలంటే ట్రైలర్‌ చాలా ముఖ్యమని, ఈ చిత్రంలోని పాటలు, ట్రైలర్‌ చూస్తుంటే, సినిమా చూడాలనే ఆత్రుత పెరిగిందన్నారు. 'ప్రవీణ్‌ అందించిన సంగీతంలో మంచి కిక్‌ ఉందని అలాగే ఫొటోగ్రఫీ చాలా బాగుందని మెచ్చుకున్నారు. కోన వెంకట్‌ కథ అందించిన ఈ చిత్రం 'గీతాంజలి' కంటే పెద్ద హిట్‌ కావాలని 'సమంత' తెలిపారు. 'కోన' ఏదైనా కొత్తగా చేయాలని ప్రయత్నిస్తుంటాడని, పోస్టర్స్ తోనే సినిమాపై ఆసక్తిని పెంచాడని దర్శకుడు వి.వి.వినాయక్‌ పేర్కొన్నారు. కచ్చితంగా ఇది పెద్ద హిట్టై అందరికీ మంచి లైఫ్‌నివ్వాలని కోరుకుంటున్నానన్నారు. 'హిందీలో వచ్చిన 'ఫన్‌ గయా రే ఒబామా' చిత్రం ఆధారంగా వచ్చిన ఒక ఐడియాతో ఈ కథ రాసినట్లు కోన వెంకట్‌ చెప్పారు. 

07:23 - November 1, 2015

హైదరాబాద్ : నగరంలోని షేక్ పేటలో శనివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పలువురికి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 'హైటెక్ లవ్' సినిమా హీరో 'శ్రీకాంత్' పాల్గొన్నారు. వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పై అవగాహన కల్పించేందుకు ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాల్గొని పలువురికి సూచనలు చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల జరిగే నష్టాలను 'శ్రీకాంత్' వివరించారు. తాను ట్రాఫిక్ పోలీసులకు హెల్ప్ ఫుల్ గా ఉంటానని, ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా తనను ఆహ్వానించడంపై ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు చెప్పారు. సెలబ్రిటీస్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా అవగాహన కల్పిస్తే మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గిపోతుందని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 9 కంపార్ట్ మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. నడకదారి భక్తుల దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.

బీహార్ లో నాలుగో దశ పోలింగ్ ప్రారంభం..

బీహార్ : నేడు నాలుగో దశ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. 55 స్థానాలకు 776 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 14,139 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 43 స్థానాల్లో ఉదయం 7నుండి సాయంత్రం 5గంటల వరకు..8 సమస్యత్మాక నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకు..4 అతి సమస్యత్మాక నియోజకవర్గాల్లో మధ్యాహ్నాం 3గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 1,46,93,294 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

06:51 - November 1, 2015

ఉత్తర్ ప్రదేశ్ : మొరదాబాద్‌ మహిళా పోలీసులు రెచ్చిపోయారు. రెచ్చిపోవడం అంటే ఏదో ఆందోళనకారులపై కాదు. విధి నిర్వహణను మరిచి పోలీసు స్టేషన్‌లోనే డాన్స్ లు వేశారు. ఆటపాటలతో ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ప్రజలు కూడా వీరితో కలిసిపోయారు. డాన్స్ చేస్తున్న మహిళా పోలీసులపై కరెన్సీ నోట్లు చల్లారు. రిటైరైన ఎస్‌ఐకి వీడ్కోలు పలికేందుకు ఏర్పాటు చేసిన పార్టీలో మహిళా పోలీసులు చిందులేశారు. ఉద్యోగ విరమణ చేసిన ఎస్‌ఐ అయితే కరెన్సీ నోట్లతో దండవేయించుకున్నాడు.

06:49 - November 1, 2015

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కేబినెట్ ను విస్తరించారు. అఖిలేష్ కొత్తగా 12 మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. యూపీ గవర్నర్ రామ్ నాయక్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అకాలీదళ్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బల్వంత్ సింగ్ రామ్వాలియా పార్టీకి గుడ్ బై చెప్పి.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కేబినెట్లో మంత్రిగా చేరారు. బల్వంత్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ అనుచరుడిగా చాలా రోజులపాటు కొనసాగారు. కొత్త మంత్రులు, కేబినెట్ ర్యాంక్ పొందిన వారితో సహా మొత్తం 21 మంది ప్రమాణం చేశారు. 2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అఖిలేష్ కేబినెట్లో భారీ మార్పులు చేశారు. 

06:48 - November 1, 2015

ఢిల్లీ : దేశంలో పెరుగిపోతున్న మతోన్మాద చర్యల పట్ల ఆర్బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని రాజన్‌ హెచ్చరించారు. పరస్పరం చర్చలు జరుపుకునే భారతీయ సాంప్రదాయం ఆర్థిక ప్రగతికి ఎంతో అవసరమన్నారు. ఉద్వేగ పూరిత చర్యలకు పాల్పడకుండా ప్రతిఒక్కరూ సహనం పాటించాలని కోరారు. ఓ సమూహానికి నష్టం కలిగించడం, దాడులు చేసే ఘటనలను అనుమతించకూడదని ఢిల్లీ ఐఐటి స్నాతకోత్సవంలో ఆయన విద్యార్థులకు ఉద్భోదించారు. 

06:46 - November 1, 2015

హైదరాబాద్ : తెలంగాణవ్యాప్తంగా బిక్షాటన చేశారు సీపీఎం నేతలు, కార్యకర్తలు. ఆశ కార్యకర్తలను ఆదుకునేందుకు విరాళాలు సేకరించారు. ఆశాలకు సంఘీభావంగా రోజుకో రకంగా నిరసన తెలుపుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. 60 రోజులుగా సమ్మె చేస్తున్న ఆశా కార్యకర్తలకు సీపీఎం మద్దతుగా నిలిచింది.. 2నెలలుగా ఆందోళన చేస్తున్న ఆశాలను ఆదుకునేందుకు తెలంగాణ వ్యాప్తంగా బిక్షాటన చేశారు నేతలు, కార్యకర్తలు.. ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్‌, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో విరాళాలు సేకరించారు.. జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న ఆశ కార్యకర్తలకు ఈ డబ్బు అందజేస్తామని ప్రకటించారు.

కరీంనగర్..
కరీంనగర్‌ కలెక్టరేట్ ఎదుట వినూత్న నిరసన తెలిపారు ఆశాలు.. ఉరితాళ్లు బిగించుకొని ఆందోళన వ్యక్తం చేశారు.. వేములవాడలో వాటర్‌ ట్యాంక్ ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. గోదావరిఖనిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఆదిలాబాద్..
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ప్రభుత్వాస్పత్రి భవనంఎక్కి ఆశా కార్యకర్తలు ఆందోళన చేశారు.. 60రోజులుగా సమ్మె చేస్తున్నా తమను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.. తమ సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు.. దాదాపు గంటసేపు పైనే ఉన్న కార్యకర్తలు పోలీసులు నచ్చజెప్పడంతో శాంతించారు. ఆశాల సమస్యలు తీర్చేవరకూ ఆందోళన కొనసాగిస్తూనేఉంటామని సీపీఎం ప్రకటించింది. రోజుకోరకంగా ఆందోళన తెలియజేస్తామని స్పష్టం చేసింది.

06:43 - November 1, 2015

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ ఇంటికి-మీ భూమి కార్యక్రమాన్ని రెండో విడత నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఆదివారం నుంచి 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. తొలివిడత దరఖాస్తు చేసుకోని 10 లక్షల మందికి ఈసారి అవకాశం కల్పిస్తోంది. ఏ రోజు ఎక్కడ కార్యక్రమం నిర్వహించేది ముందుగా ఆయా గ్రామాల ప్రజలకు తెలియజేయనుంది. ఈ కార్యక్రమం ద్వారా రెవెన్యూ అధికారులు తప్పులు సరిదిద్దేందుకు అన్ని గ్రామ పంచాయితీలలో గ్రామ స‌భ‌లు నిర్వహిస్తారు. అంతేకాదు ప్రజ‌ల‌కు వారి భూముల యాజ‌మాన్య హ‌క్కుల‌కు భ‌రోసా క‌ల్పిస్తారు.

గ్రామ సభలు నిర్వహించి తప్పుల సవరణ..
ప్రతి గ్రామంలో ఉన్న దేవాదాయ, అటవీ, వక్ఫ్ భూములను గుర్తించి వాటిని ప్రత్యేక క్యాటగిరీగా వర్గీకరించనున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక, మౌళిక వసతుల అభివృధ్ది కోసం ప్రతి జిల్లాలో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయునున్నందున‌, ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూములు గుర్తించి వాటిలో పొందుపరచ‌నున్నారు. మొదటి విడతలో మొత్తం 10.77 లక్షల దరఖాస్తులు రాగా... వాటిలో 8.95 లక్షల ఫిర్యాదులు పరిశీలించి రెవెన్యూ రికార్డులను సవరించారు అధికారులు. మీ ఇంటికి మీ భూమి మలి విడత కార్యక్రమంలో సవరించిన రికార్డులు ప్రజలకు అందజేయనుంది. మీ ఇంటికి-మీ భూమి కార్యక్రమంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా, పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టనుంది చంద్రబాబు ప్రభుత్వం. 

06:41 - November 1, 2015

హైదరాబాద్ : నగర పరిధిలో ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల బృందం విచారణ జరిపింది. గత మూడు రోజులుగా నగరంలో పర్యటిస్తున్న సభ్యులు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో ఫిర్యాదులు స్వీక‌రించింది. అన్ని రాజకీయ పక్షాల నేత‌లు క‌మిష‌న్ ముందు త‌మ త‌మ వాద‌నలు వినించారు. హైదరాబాద్ లో అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారని వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టింది కేంద్రం ఎన్నికల సంఘం. గత కొన్ని నెలలుగా హైదరాబాద్ పరిధిలో ఓటర్ల జాబితా సవరణ అంశంపై తీవ్ర విమర్శలు రావడంతో.... విచారణకు ఇతర రాష్ట్రాల అధికారులను నియమించింది ఈసీ. పశ్చిమ బెంగాల్‌ సీఈవో సునీల్‌ గుప్తా నేతృత్వంలో ఉత్తరప్రదేశ్‌ అదనపు సీఈవో, ఆరుగురు కార్యదర్శులు, ఆరుగురు సహాయ కార్యదర్శులతో కూడిన 14 మంది బృందాన్ని పంపించింది. నగరంలో ఈ బృందం క్షేత్రస్థాయిలో అక్క డక్కడా పరిశీలన జరిపింది. అనంతరం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది.

జీహెచ్ఎంసీ..పార్టీ నేతలతో సమావేశం..
నగరంలోని ఓ హోటల్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశమైంది. ఫిర్యాదులు అందిన అంశాల ఆధారంగా పరిశీలన చేపట్టింది. ఏ ప్రతిపాదికన జాబితా నుంచి ఓటర్ల పేర్లు తొలగించారు? ఇప్పటి వరకు ఎన్ని ఓట్లు తొలగించారు? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత వివిధ పార్టీల నేతలతో కూడా సమావేశమయ్యారు. గ్రేటర్ పరిధిలో ఓటర్ జాబితాను ప్రభుత్వ కనుసన్నల్లో జరిగిందని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిదర్ రెడ్డి విమర్శించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 22వేల ఓట్లు తొలగించాని ఆరోపించారు.

నేతల ఆరోపణలు...
హైదరాబాద్ లో ఓటర్ల జాబితా సవరణలో చాలా మందిని డోర్ లాక్ పేరుతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారని టిడిపి నేతలు ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు గోపినాధ్, వివేక్ , ఆరికెపూడి గాంధి త‌దిత‌రులు ఎన్నిక‌ల క‌మిష‌న్ కు త‌మ‌తమ పిర్యాదులు వినిపించారు. ఎన్నిక‌ల సంఘంపై వ‌చ్చిన అభియోగాల‌ను తొల‌గించాల్సిన భాధ్యత కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ పై ఉంద‌న్నారు సిపియం రాష్ట్ర వ‌ర్గ స‌భ్యులు డిజి న‌ర్జింగ్ రావు. ఎక్కువ ఓట‌ర్లు ఉండ‌ట‌మే నిజ‌మైతే అందుకు కార‌ణ‌మైన అధికారులపై చ‌ర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. గ్రేట‌ర్ ఎన్నిక‌లు ద‌గ్గర ప‌డుతున్న వేల‌ పెనుదుమారం రేపుతోన్న ఈ వ్యవహారం రానున్న రోజుల్లో మరింత వేడిపుట్టించే అవ‌కాశం ఉన్నట్లు విశ్లేష‌కులు చెబుతున్నారు.

06:39 - November 1, 2015

విజయవాడ : హెల్మెట్ లేకుండా రోడ్డెక్కుతున్నారా..? శిరస్త్రాణం కొనడం మర్చిపోయారా..? అయితే మీ ఆటలిక సాగవు. మీ కోసం కాదు..! మీ వాళ్ల కోసమైనా హెల్మెట్ ధరించండి. లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం జరగొచ్చు. అందుకే హెల్మెట్‌ లేకుండా రయ్‌ రయ్‌ మంటూ రోడ్లపై దూసుకెళ్లే వాహనదారులకు ఏపీ సర్కార్‌ స్పీడు బ్రేకులు వేస్తోంది. ఇవాళ్టి నుంచి శిరస్త్రాణాన్ని ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిత్యం ప్రమాదాలతో రహదారులు రక్తమోడుతున్నాయి. క్షణాల్లో వాహనదారులు మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం వల్లే 28 శాతం మంది చనిపోతున్నారు. అందుకే నష్టనివారణపై ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. రయ్‌ రయ్‌ మంటూ రోడ్లపై దూసుకెళ్లే... ద్విచక్ర వాహనదారులకు ఏపీ సర్కార్‌ స్పీడు బ్రేకులు వేస్తోంది.

నేటి నుండి అమలు..
రోడ్డు ప్రమాదాల నివారణకు బాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హెల్మెట్ ధరించాలన్న నిబంధనను ఖచ్చితంగా అమలు చేసేందుకు అడుగులు వేస్తోంది. నవంబర్‌ 1 నుంచి తప్పనిసరిగా హెల్మెట్‌ విధానాన్ని అమలు చేసి తీరాలని రవాణా, పోలీసుశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో రెండు శాఖల అధికారులు పెద్ద ఎత్తునే కసరత్తు చేశారు. హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే... జరిమానా తప్పదన్న హెచ్చరికలు చేస్తున్నారు. అంతేకాకుండా వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు, వివిధ రకాల ప్రకటనల ద్వారా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

వ్యతిరేకిస్తున్న పలువురు..
మరోవైపు హెల్మెట్‌ ధరించడాన్ని కొంతమంది వాహనదారులు వ్యతిరేకిస్తున్నారు. జుట్టు రాలిపోతుందని, తలకు చర్మవ్యాధులు వస్తున్నాయని, ఇరుకు రోడ్లపై హెల్మెట్‌ ఉంటే వాహనాలు నడపడం కస్టమని చెప్తున్నారు. అయినప్పటికీ హెల్మెట్‌ నిబంధనను ఖచ్చితంగా అమలు చేసి తీరతాం అని ప్రభుత్వం పట్టుదలతో చెబుతోంది. హెల్మెట్‌ ధరించడాన్ని బరువుగా చూడకుండా బాధ్యతగా చూడాల్సిన అవసరం ఉందని పోలీసులు, రవాణాశాఖ అధికారులు చెప్తున్నారు.

అధికమైన హెల్మెట్ ధరలు..
ఇక హెల్మెట్ ధరలు మార్కెట్లో ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి హెల్మెట్‌పై ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో ద్విచక్ర వాహనదారులు నిలువునా మోసపోతున్నారు. ఇంటినుండి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా తిరిగి ఇంటికి రావాలంటే..హెల్మెట్‌ తప్పకుండా పెట్టుకోవాలి. రెప్పపాటు జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి... కుటుంబసభ్యులకు దూరంకాకుండా ఉండాలంటే... శిరాస్త్రాణం తప్పనిసరి అని పోలీసులు, రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన హెల్మెట్ మస్ట్ విధానం సక్సెస్ కావాలని కోరుకుందాం.

06:35 - November 1, 2015

బీహార్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్‌కు సర్వసిద్ధమయ్యింది. ఏడు జిల్లాలోని 55 శాసనసభ స్థానాలకు నేడు పోలింగ్‌ జరుగుతుంది. మొత్తం 776 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. వీరిలో 46 మంది మహిళలు కూడా ఉన్నారు. కోటి 46 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది. పోలింగ్‌ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సొంత జిల్లా గోపాల్‌గంజ్‌లో నేడు పోలింగ్‌ జరుగుతుంది.

55 స్థానాలకు ఎన్నికలు..
యాభై ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగే పోలింగ్‌ కోసం మూడు సమయాలను నిర్దేశించారు. 43 సీట్లకు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. ఎనిమిది స్థానాలకు 7 నుంచి 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. నాలుగు సీట్లకు మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్‌ పూర్తవుందని ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. నాల్గవ దశలో 776 మంది అభ్యర్ధులు బరిలోఉన్నారు. వీరిలో 57 మంది మహిళలు. బీజేపీ 42 స్థానాలకు అభ్యర్ధులను నిలబెట్టింది. ఆ పార్టీ మిత్రపక్షాలైన ఎల్‌జేపీ 5, హిందూస్థాన్‌ ఆవామ్‌ మోర్చ 4, రాష్ట్రీ లోక్‌ సమతా పార్టీ 4 సీట్లకు పోటీ చేస్తున్నాయి. మహా కూటమిలోని ఆర్జేడీ ఈసారి ఎక్కువ సీట్లకు పోటీ చేస్తున్నది. రాష్ట్రీయ జనతాదళ్‌ 26 స్థానాలకు అభ్యర్ధులను నిలబెట్టింది. జేడీయూ 21 సీట్లకు, కాంగ్రెస్‌ 8 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. నేడు పోలింగ్‌ జరుగుతున్న 55 స్థానాల్లో 2010 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అప్పట్లో కమలనాథులు 26 స్థానాలు సొంతం చేసుకున్నారు. జేడీయూ 24 స్థానాలు దక్కించుకుంది. ఆర్జేడీ 2 సీట్లలో నెగ్గింది. ముగ్గురు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. కాంగ్రెస్‌ చేతిలో ఒక్క సీటు కూడా లేదు.

పోలింగ్‌ కేంద్రాలు 14,139..
నాల్గవ విడత పోలింగ్‌ నిర్వహిస్తున్న జిల్లాల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 14,139 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 3043 వామపక్ష తీవ్రవాద ప్రభావిత కేంద్రాలున్నాయి. దీంతో భారీ పోలిసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు వీలుగా 1163 కంపెనీల కేంద్ర పారా మిలటరీ బలగాలతోపాటు రాష్ట్ర పోలీసులను నియమించారు. నదీతీర ప్రాంతాల్లో పోలింగ్‌ స్టేషన్ల ఉన్న చోట్ల 38 మోటార్‌ బోట్లతో గస్తీ నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ జరుగుతున్న ముజఫర్‌నగర్‌, తూర్పు చంపారన్‌, పశ్చిమ చంపారన్‌, సీతామరి జిల్లాలపై ఎన్డీయే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఆర్జేడీ అధినేత లాలూ సొంత జిల్లా గోపాల్‌గంజ్‌లో మహాకూటమికి నల్లేరు మీద నడకేమీకాదు. రెండు కూటముల్లో కూడా తిరుగుబాటు అభ్యర్ధుల బెడద ఉంది. దీంతో అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి.

మూడు దశల్లో 131 సీట్లు పోలింగ్‌ పూర్తి..
బీహార్‌లో ఇంతవరకు మూడు విడతలు పోలింగ్‌ పూర్తయ్యింది. నేడు నాల్గవ దఫా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మూడు దశల్లో 131 సీట్లకు పోలింగ్‌ ముగిసింది. నాల్గో విడత 55 స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌ ముగిస్తే 181 సీట్లు ఎన్నికలు పూర్తయినట్టు అవుతుంది. తుది విడతలో ఈనెల 5న 57 స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తారు. నవంబర్‌ 8న ఓట్లు లెక్కిస్తారు. గెలుపుపై ఎన్డీయే, మహాకూటమి నాయకులు ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. 

06:32 - November 1, 2015

హైదరాబాద్ : హకీంపేటలో అర్ధరాత్రి పోలీసులు విరుచుకుపడ్డారు. డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్ నిర్వహించి తడాఖా చూపారు. 18 మంది రౌడీషీటర్లు, 17 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 48 బైక్‌లు, ఐదు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో 500 పోలీసులు పాల్గొన్నారు. మూడు బృందాలుగా ఏర్పడిన దాదాపు 500 మంది పోలీసులు కార్డన్‌సెర్చ్‌తో బెంబెలేత్తించారు.

మెదక్ లో కార్డన్ సెర్చ్...
మెదక్‌ జిల్లా రామచంద్రాపురంలోనూ కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు పోలీసులు. డీఎస్పీ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో 150 మంది ఖాకీలు శ్రీనివాసనగర్‌ కాలనీలో తనిఖీలు నిర్వహించారు. తరచూ ఇలాంటి తనిఖీలు నిర్వహించడం వల్ల అసాంఘిక కార్యకలాపాలు తగ్గుముఖం పడతాయని.. ప్రజల్లో ధైర్యం పెరుగుతుందని పోలీసులన్నారు. 

బీహార్ లో నేడు నాలుగో దశ ఎన్నికలు..

బీహార్ : నేడు నాలుగో దశ ఎన్నికలు జరుగనున్నాయి. 55 స్థానాలకు 776 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 14,139 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 43 స్థానాల్లో ఉదయం 7నుండి సాయంత్రం 5గంటల వరకు..8 సమస్యత్మాక నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకు..4 అతి సమస్యత్మాక నియోజకవర్గాల్లో మధ్యాహ్నాం 3గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 1,46,93,294 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

హకీంపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్..

హైదరాబాద్ : హకీంపేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 500 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 18 మంది రౌడీషీటర్లను..17 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

 

తూర్పుగోదావరిలో నేడు చిన రాజప్ప పర్యటన..

తూర్పుగోదావరి : జిల్లాలో నేడు డిప్యూటి సీఎం చిన రాజప్ప పర్యటించనున్నారు. పెద్దాపురం (మం) దివిలిలో మీ ఇంటికి - మీ భూమి కార్యక్రమంలో చిన రాజప్ప పాల్గొననున్నారు. 

నేటి నుండి రెండో విడత మీ ఇంటికి - మీ భూమి..

గుంటూరు : నేటి నుండి రెండో విడత 'మీ ఇంటికి - మీ భూమి' కార్యక్రమం జరుగనుంది. ములకుదురులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 

Don't Miss