Activities calendar

02 November 2015

ప్రముఖ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు కన్నుమూత

హైదరాబాద్ : ప్రముఖ హాస్య నటుడు కొండవలస లక్ష్మణరావు కన్నుమూశారు. ఆగస్టు 10, 1946లో ఆయన జన్మించారు. కొండవలస స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కొండవలస గ్రామం. 'ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు' సినిమాతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపు 200 సినిమాల్లో కొండవలస నటించారు. సినిమాల్లోకి రాకముందు విశాఖ పోర్టు ట్రస్టులో..గుమాస్తాగా పని చేశారు. ఉద్యోగం చేస్తూనే కొండవలస.. నాటక రంగంలో రాణించారు. నాటకరంగంలో రెండు సార్లు నంది అవార్డు అందుకున్నారు.

 

22:09 - November 2, 2015

మహారాష్ట్ర : ముంబై స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ బిజెపికి షాక్ తగిలింది. కల్యాణ్ -డోంబివలీ పౌర ఎన్నికల్లో శివసేన విజయం సాధించింది. 120 సీట్లకు గాను శివసేన 52, బిజెపి 41 సీట్లు కైవసం చేసుకున్నాయి. స్థానిక ఎన్నికల్లోబిజెపి, శివసేన మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

 


 

 

22:00 - November 2, 2015

విజయవాడ : ఎపి కేబినెట్ సమావేశం విజయవాడలో జరుగుతోంది. దాదాపుగా మూడుగంటలపాటు కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చిస్తున్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకొనున్నారు. జూన్ 2 కల్లా ఉద్యోగులంతా విజయవాడకు రావాల్సిందే నిర్ణయించారు. వారికి విజయవాడలో తాత్కాలిక వసతి ఏర్పాట్ల కల్పనకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆధర్యంలో నడుస్తున్న మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులక అప్పగించాలని నిర్ణయించారు. అలాగే ఇసుక రీచ్ లను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు, అమరావతి శంకుస్థాపన అనంతరం జరిగిన పరిణామాలు, అమరావతి లంక భూములపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే సరేసరి.. లేని ఎడల భూసేకరణ చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సీఆర్ డిఎ పరిధిలో రాజధాని నిర్మాణం నిమ్తితం 29 వేల ఎకరాల భూములిచ్చిన రైతుల బాగోగులు, సహాయం వంటి అంశాపై చర్చిస్తున్నట్లు సమాచారం.

 

21:50 - November 2, 2015

బీహార్ పోరు చివరి అంకానికి చేరింది. మాటల యుద్ధం కూడా తారాస్థాయికి చేరింది. కానీ ఈ మాటల వెనుక ఏ అర్థాలు దాగున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు.. కమలదళం నిస్పృహలకు అద్దం పడుతున్నాయా..? బీహార్ పోరులో బిజెపి నీరసపడుతుందా...? ఓవరాల్ గా బీహార్ ఈక్వెషన్స్ దేశానికి కొత్త దారి చూపనున్నాయా..? బీహార్ వార్ ఫీల్డ్ పై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:41 - November 2, 2015

హైదరాబాద్ : ఉత్తరాంధ్ర వెనుకబాటులో ధర్మాన ప్రసాదరావు పాత్ర ఉందని టిడిపి నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. రాజధాని ప్రాంతంలో రైతులను రెచ్చగొట్టాలని చూసి.. వైసిసి నేతలు విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రాంతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి అంతా రాజధాని ప్రాంతంలోనే అంటూ వైసిపి అర్థంలేని విమర్శలు చేస్తోందన్నారు. ఈ విమర్శలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వైసిపి నేతలు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. 

21:31 - November 2, 2015

ఢిల్లీ : భారత్‌- నేపాల్‌ లను కలిపే గేట్‌ వే చెక్‌ పాయింట్‌ వద్ద మాదేసియ వర్గం చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు నేపాల్‌ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయుడు మృతి చెందగా, చాలా మంది గాయపడ్డారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీ చార్జీ జరిపి భాష్పవాయువు ప్రయోగించారు. నేపాల్‌ నూతన రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్న మాదేసియులు భారత-నేపాల్‌ సరిహద్దులో గత 40 రోజులుగా ఆందోళన జరుపుతున్నారు. నేపాల్‌ పార్లమెంట్‌లో రాజ్యాంగం ఆమోదం పొందాక జరిగిన అల్లర్లలో ఇప్పటివరకు 40 మంది మృతి చెందారు. మాదేసియులకు భారత్‌ మద్దతిస్తోందని నేపాల్‌ ఆరోపిస్తోంది. గత నెలరోజులుగా జరుగుతున్న ఆందోళన కారణంగా ఇరుదేశాల మధ్య ఒక్క ట్రక్కు కూడా నడవడం లేదు. దీంతో నేపాల్‌ 73.5 మెట్రిక్‌ టన్నుల పెట్రోల్‌ను చైనా నుంచి దిగుమతి చేసుకుంది.

 

 

21:27 - November 2, 2015

ముంబై : బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ తన 50 వ జన్మదినాన్ని మీడియా మధ్య ఘనంగా జరుపుకున్నారు. దేశంలో పెరుగుతున్న అసహన పరిస్థితులపై షారుఖ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రచయితలు, కళాకారులు ఏ రంగానికి చెందిన వారైనా సరే వారికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండాలని షారుఖ్‌ పేర్కొన్నారు. ఎవరు ఏది ఇష్టపడితే దాన్ని ఆస్వాదించ గలిగే స్వేచ్ఛ ఉండాలన్నారు. కొందరు వెనకా ముందు ఆలోచించకుండా మాట్లాడుతున్నారు...ఇది ఓ లౌకిక దేశమని మరచిపోతున్నారని షారుఖ్‌ అన్నారు. అవార్డులు వెనక్కి ఇచ్చేస్తున్న మేధావులు, రచయితలు, కళాకారులను గౌరవిస్తున్నానని తెలిపారు. ఒక కళాకారుడిగా నైతికత అంశంపై తన భావాలను వెల్లడించడం ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. ఏదైనా మాట్లాడితే తన ఇంటిపై రాళ్లు విసిరినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.

 

21:24 - November 2, 2015

కోల్ కతా : ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ హషీమ్‌ అబ్దుల్‌ హలీమ్‌ కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. హలీమ్‌ ఆకస్మిక మరణం పట్ల సీపీఎం పొలిట్‌ బ్యూరో త్రీవ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతికి సంతాపం ప్రకటించింది. 1964లో కమ్యూనిస్టు పార్టీలో చేరిన హలీమ్‌ చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేశారు. 1985లో సీపీఎం పశ్చిమ బెంగాల్‌ కార్యదర్శిగా ఎన్నికైన హషీమ్‌ అబ్దుల్‌ హలీమ్‌ గత సమావేశాల వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత ప్రత్యేక ఆహ్వానితుడుగా ఉన్నారు. 1982 నుంచి 2011 వరకు 29 ఏళ్లపాటు పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ స్పీకర్‌గా పని చేశారు. 1977 నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా సీపీఎం ప్రభుత్వం ఏర్పడినప్పుడు న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ అసోసియేషన్‌ కార్యదర్శిగా పనిచేశారు. అఖిలభారత న్యాయవాదులు సంఘం వ్యవస్థాపక సభ్యుల్లో హలీమ్‌ కూడా ఒకరు.

 

21:20 - November 2, 2015

హైదరాబాద్ : ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్ లేకుండా ఇప్పుడు జీవితాన్ని ఊహించడమే కష్టమైపోయింది కదూ... ఆధునిక జన జీవితంలో భాగమైపోయిన గూగుల్... ప్రముఖుల పుట్టిన రోజులను, కీలకమైన చారిత్రక సందర్భాలను తన లోగో డిజైన్ తోనే అద్భుతంగా గుర్తు చేస్తుంటుంది. గూగుల్ లోగోను ఆరోజుకున్న ప్రాముఖ్యాన్ని బట్టి రూపొందించడాన్ని గూగుల్ డూడిల్ గా అభివర్ణిస్తారు. ఇలా ఎన్నో ఆసక్తికరమైన డూడిల్స్ ను ఆవిష్కరించిన గూగుల్ ఈరోజు జార్జ్ బూల్ అనే 19వ శతాబ్దపు గణిత మేధావిని సగౌరవంగా స్మరించుకుంది. ఇంతకీ ఎవరా.. జార్జ్ బూల్?
200 ఏళ్ల క్రితం జన్మించిన జార్జ్‌బూల్
ఇదీ.. ఈరోజు మనకు గూగుల్ సైట్ ల కనిపిస్తున్న జార్జ్ బూల్ డూడిల్. ఎక్స్.. వై.. జడ్ అంటూ బీజ గణిత సంకేతాలతో నేటి గూగుల్ డూడిల్, సరిగ్గా రెండు వందల ఏళ్ళ కిందట ఈరోజునే జన్మించిన బ్రిటిష్ మేధావి జార్జ్ బూల్ ను స్మరించుకుంటోంది. ఆధునిక మానవుడి జీవితంలో భాగమైపోయిన కంప్యూటర్లకు ఆధారమైన మేథమేటికల్ లాజిక్ సృష్టికర్తే జార్జ్ బూల్. ఒక్క మాటలో కంప్యూటర్ శకానికి ఊపిరిపోసిన మహా మేధావి జార్జ్ బూల్.
లాజికల్‌ క్రోడీకరణకు ఆధారం బూల్ బీజ గణితమే
కంప్యూటర్ ప్రోగ్రామర్లకు కూడా బూల్ పేరు తెలియకపోవచ్చు. కానీ, బూలియన్ అన్న పదాన్ని వాడకుండా ఉండడం ఏ ప్రోగ్రామర్ కూ సాధ్యం కాదు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పూర్తిగా బూల్ బీజగణితం మీదే ఆధారపడి అభివృద్ది చెందింది. ప్రోగ్రామర్లే కాదు... ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ తమకు తెలియకుండానే బూల్ బీజ గణితాన్ని ఉపయోగిస్తున్నారు. నెట్ లో దేన్నయినా సెర్చ్ చేస్తున్నప్పుడు.. ఆ పదానికి సంబంధించిన సమాచారాన్ని లాజికల్ గా క్రోడీకరించే వ్యవస్థకు ఆధారం బూల్ బీజగణితమే.
తండ్రి చెప్పులు కుట్టేవాడు
జార్జ్ బూల్ చాలా పేద కుటుంబం నుంచి మహా మేధావిగా ఎదిగాడు. ఆయన తండ్రి జాన్ బూల్ చెప్పులు తయారు చేసుకుని బతికేవాడు. ఆయన తన కొడుకును చర్చిలో ప్రీస్ట్ గా పెడదామనుకున్నారు. కానీ, బడికి వెళ్ళాలనే కోరిక బలంగా ఉన్న జార్జ్ బూల్.. తక్కువ ధరకు దొరికే లెక్కల పుస్తకాలు కొనుక్కుని చదువుతూ గణితం పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. పద్దెనిమిదేళ్ళ వయసులో ఆయనకు వచ్చిన గొప్ప ఆలోచనే మానవ జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. తర్కానికీ, బీజ గణితానికీ సంబంధాన్ని సృష్టించవచ్చన్నదే ఆ ఆలోచన. జీవితమంతా లాజిక్ కు, ఆల్జీబ్రాకు మధ్య బంధాన్ని నిర్మించడంపైనే కృషి చేసి.. ఒక కొత్త ప్రపంచానికి ద్వారాలు తెరిచిన మహనీయుడు జార్జ్ బూల్. ఆయన స్మృతికి గూగుల్ ఇలా డూడిల్ తో నీరాజనం పలికింది.

 

21:14 - November 2, 2015

బీహార్ : తాము అధికారంలోకి వస్తే మంచి రోజులు వస్తాయంటూ లోక్‌సభ ఎన్నికల్లో మోడీ ఊదరగొట్టారని, ఇప్పుడు అచ్చేదిన్‌ ఏమైపోయాయని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ఓవైపు కందిపప్పు ధర రెండు వందలకు చేరుకుంటే ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. పప్పు రొట్టె తినకూడదు...కానీ తన గుణగణాలను మాత్రం కీర్తించాలన్న కొత్త స్లోగన్‌ను మోది తెరపైకి తెచ్చారని రాహుల్‌ ఎద్దేవా చేశారు. మేక్‌ ఇన్‌ ఇండియా ద్వారా మోది స్నేహితులకే లాభం చేకూరుతుందే తప్ప -ఎవరికి ఉపాధి లభించడం లేదన్నారు. అరరియా ఎన్నికల సభలో రాహుల్‌ ప్రధానిని టార్గెట్‌ చేశారు.

 

21:13 - November 2, 2015

బీహార్ : దేశంలో నెలకొన్న అసహన పరిస్థితులపై విపక్షాలు, మేధావులు తమ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోది తిప్పికొట్టారు. ఇందిరా గాంధీ హత్య అనంతరం1984లో దేశంలో జరిగిన సిక్కుల ఊచకోతపై ఊసెత్తని కాంగ్రెస్‌కు అసహన పరిస్థితులపై మాట్లాడే హక్కు లేదన్నారు. దేశంలో నెలకొన్న అసహన పరిస్థితులకు కాంగ్రెస్సే కారణమని ప్రధాని పేర్కొన్నారు. మహాకూటమి కాంగ్రెస్‌కు 40 సీట్లు కట్టబెట్టడం ద్వారా తమకు పోటీ లేకుండానే గెలుచుకునే అవకాశమిచ్చిన నితీష్‌-లాలులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. కరెంట్‌ ఇస్తానని చెప్పి నితీష్‌ మాట తప్పడం ద్వారా బీహార్‌ ప్రజలను మోసగించారని మోది విమర్శించారు. నితీష్‌ పనితీరుపై బీహార్‌ యువకులు నిలదీస్తారని, జంగల్‌ రాజ్‌పై మహిళలు ఆగ్రహంతో ఉన్నట్టు పూర్ణియా ఎన్నికల సభలో మోది అన్నారు.

 

21:07 - November 2, 2015

చిత్తూరు : జార్ఖండ్‌కు చెందిన మావోయిస్టు గోవింద్‌ యాదవ్‌ను చిత్తూరు జిల్లా మదనపల్లెలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. గోవింద్‌ యాదవ్‌పై 17కు పైగా కేసులు నమోదై ఉన్నాయి. మందుపాతరలతో పోలీసులను మట్టుబెట్టిన కేసుల్లోనూ గోవింద్‌ యాదవ్‌ నిందితుడుగా ఉన్నారు.

మావోయిస్టు నేత గోవింద్‌ యాదవ్‌ అరెస్ట్‌

చిత్తూరు : జార్ఖండ్‌కు చెందిన మావోయిస్టు గోవింద్‌ యాదవ్‌ను చిత్తూరు జిల్లా మదనపల్లెలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. గోవింద్‌ యాదవ్‌పై 17కు పైగా కేసులు నమోదై ఉన్నాయి. మందుపాతరలతో పోలీసులను మట్టుబెట్టిన కేసుల్లోనూ గోవింద్‌ యాదవ్‌ నిందితుడుగా ఉన్నారు.

21:03 - November 2, 2015

నెల్లూరు : సింహపురిలో నెమలి సందడి చేసింది. నెల్లూరుకు అవంతిక వచ్చింది. అవును నెల్లూరులో మిల్కీ బ్యూటీ తమన్నా అలరించింది. మలబార్‌ గోల్డ్‌ షోరూమ్‌ ఓపెనింగ్‌కు వచ్చిన తమన్నాను చూడటానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు.

21:00 - November 2, 2015

కడప : ఒకే ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి చెందిన విషాద ఘటన కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మంటపం పల్లెలో జరిగింది. రాజంపేట నుంచి కడపకు వెళ్తున్న టాటా మ్యాజిక్ ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమణ, సుబ్బయ్య అనే తండ్రి కొడుకులతో పాటు మరో హమీఉల్లా, ఉద్దిఉల్లా అనే తండ్రి కొడుకులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా ఒకే ప్రమాదంలో తండ్రి కొడుకులు మరణించటం మంటపంపల్లె పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

20:57 - November 2, 2015

విజయవాడ : రాష్ట్రంలో గనులు మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధికి సహకారం అందించేందుకు ఆస్ట్రేలియా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎనర్జీ, సిటిజన్‌ షిప్‌, మల్టీ కల్చరల్‌ మినిస్టర్‌ డా.మైక్‌ నహాన్‌ ఆధ్వర్యంలోని ఆస్ట్రేలియా బృందం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే మైనింగ్‌ యూనివర్సిటీకి ఆస్ట్రేలియన్‌ యూనివర్సిటీ భాగస్వామి కావాలని చంద్రబాబు కోరగా అందుకు అంగీకరిచినట్టు సీఎంవో తెలిపింది.

 

20:51 - November 2, 2015

విజయవాడ : ప్రత్యేక హోదా కావాలని అడిగితే విద్యార్ధులను కొట్టడం దారుణమని ప్రత్యేక హోదా సాధనా సమితి నేతలు మండిపడ్డారు. దిష్ఠిబొమ్మ దగ్ధానికి ప్రయత్నిస్తే చావకొట్టడం అమానుషమని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబురావు అన్నారు. కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఈ నెల 10నుంచి నెలాఖరు వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చలసాని శ్రీనివాస్ తెలిపారు. విద్యార్ధులపై పెట్టిన కేసులు ఎత్తివేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

విద్యార్థి జేఏసీ నేతలకు రిమాండ్..

కృష్ణా : బిజెపి కార్యాలయం వద్ద నిరసన తెలిపిన విద్యార్ధులకు విజయవాడ సెషన్స్‌ కోర్టు రిమాండ్‌ విధించింది. మొదట బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు పెట్టినా.. తర్వాత నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద మార్చారు. 14 రోజుల పాటు రిమాండ్‌ విధించారు. నలుగురు విద్యార్ధులు రవికిరణ్‌, దుర్గానాగరాజు, నిరంజన్‌, తేజలను పోలీసులు జైలుకు తరలించారు.

20:44 - November 2, 2015

కృష్ణా : బిజెపి కార్యాలయం వద్ద నిరసన తెలిపిన విద్యార్ధులకు విజయవాడ సెషన్స్‌ కోర్టు రిమాండ్‌ విధించింది. మొదట బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు పెట్టినా.. తర్వాత నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద మార్చారు. 14 రోజుల పాటు రిమాండ్‌ విధించారు. నలుగురు విద్యార్ధులు రవికిరణ్‌, దుర్గానాగరాజు, నిరంజన్‌, తేజలను పోలీసులు జైలుకు తరలించారు.

వరంగల్ ఉపఎన్నికకు టిడిపి, బిజెపి అభ్యర్థిగా పగిడిపాటి దేవయ్య

హన్మకొండ : వరంగల్ ఉప ఎన్నికకు టిడిపి, బిజెపి అభ్యర్థిగా పగిడిపాటి దేవయ్యను బిజెపి కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు.

 

అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్ : అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ అమలుకు అనుమతిచ్చింది. ఈమేరకు హైదరాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 28 వరకు నిర్మించిన భవనాలకు, రిజిస్టర్‌ అయిన డాక్యుమెంట్లకు మాత్రమే గుర్తింపు ఉంటుందని చెప్పారు.

అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్ : అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ అమలుకు అనుమతిచ్చింది. ఈమేరకు హైదరాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 28 వరకు నిర్మించిన భవనాలకు, రిజిస్టర్‌ అయిన డాక్యుమెంట్లకు మాత్రమే గుర్తింపు ఉంటుందని చెప్పారు.

17:58 - November 2, 2015

హైదరాబాద్ : అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ అమలుకు అనుమతిచ్చింది. ఈమేరకు హైదరాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 28 వరకు నిర్మించిన భవనాలకు, రిజిస్టర్‌ అయిన డాక్యుమెంట్లకు మాత్రమే గుర్తింపు ఉంటుందని చెప్పారు. దరఖాస్తు చేసుకోవడానికి 60 రోజుల గడువిస్తామని.. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు పది వేల ఫీజు చెల్లించాలని వివరించారు. అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని హెచ్చరించారు. ఆస్తిపన్ను, నీటి ఛార్జీలు, విద్యుత్‌ ఛార్జీలు మూడింతలు వసూలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.


 

17:53 - November 2, 2015

హన్మకొండ : వరంగల్‌ ఉప ఎన్నికల్లో నామినేషన్ల జోరు పెరిగింది. టీఆర్‌ఎస్‌ తరపున దయాకర్‌, కాంగ్రెస్‌ తరపున సిరిసిల్ల రాజయ్య, వామపక్షాల తరపున స్వతంత్ర అభ్యర్ధిగా గాలి వినోద్‌కుమార్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్క టీడీపీ బిజెపి అభ్యర్ధి మినహా ప్రధాన అభ్యర్ధులందరూ నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసినట్లయింది. ప్రతి అభ్యర్ధి భారీ ఊరేగింపులతో నామినేషన్ల కార్యక్రమానికి రావడంతో అక్కడ భారీ సందడి నెలకొంది.


 

17:51 - November 2, 2015

ప్రకాశం : అప్పుల బాధ భరించలేక మరో అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా వెలిగండ్లకు చెందిన సూరబోయిన బాలయ్య కొన్నాళ్ల క్రితం వరకు కూలీ పనులకు వెళ్లేవాడు. కానీ వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించుకోవాలనే లక్ష్యంతో 12 ఎకరాలు కౌలుకు తీసుకుని సేద్యం చేయటం ప్రారంభించాడు. కానీ కాలం కలిసి రాలేదు. వరుణుడు మొహం చాటేయడంతో పాటు అప్పు చేసే స్ధోమత లేకపోవటంతో గత్యంతరం లేని పరిస్ధితుల్లో పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలయ్య ఆత్మహత్యతో ఆయన కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.

17:42 - November 2, 2015

ఖమ్మం : జిల్లాలోని పాల్వంచ చాకలి బజార్‌లో కుటుంబరావు ఓ ఆవును పెంచుకుంటున్నాడు. ప్రతిరోజు సాయంత్రం ఇంటికి వచ్చే.. ఆ రోజు ఇంటికి రాలేదు. ఊరంతా వెతికాడు. చివరకు పాల్వంచ బస్టాండ్‌ సమీపంలో ఆవు దూడకు జన్మనిచ్చింది. దీంతో కుటుంబరావు దూడను ఆటోలో ఇంటికి తీసుకెళ్లబోయాడు. అంతే తల్లి ఆవు ఆటోను అడ్డుకుంది. ఇంటివరకు ఆటోను వెంబడిస్తూ తల్లి ప్రేమను చాటుకుంది. ఈ ఘటనను చూసిన స్థానికులు.. పిల్లలను కని చెత్తకుప్పలో పడేస్తున్న మనుషులు కళ్లు తెరవాలని చెప్పుకోవడం విశేషం.

 

17:40 - November 2, 2015

హైదరాబాద్ : క్షణికానందం కంటే నిండైన జీవితం వెలకట్టలేనిదన్నారు బాహుబలి డైరెక్టర్ రాజమౌళి. మనిషి తన బలహీనతలను జయించినప్పుడే జీవితాన్ని గెలిచినట్లవుతుందన్నారు. అమెరికన్‌ అంకాలజీ ఇనిస్ట్యూట్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఫైట్ ఎగెన్స్ట్‌ స్మోకింగ్‌ క్యాంపెయిన్‌కు హాజరైన ఆయన స్మోకింగ్‌ కారణంగా వచ్చే దుష్ఫలితాలను వివరించారు.

 

17:35 - November 2, 2015

కరీంనగర్‌ : జిల్లాలో శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. కొడిమ్యాల మండలం నగునూరు సమీపంలో వ్యవసాయ కూలీలను తీసుకెళ్తున్న ఆటోను పత్తి లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో వెళ్తున్న దురమ్మ అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందింది. మరో 10 మంది కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

17:26 - November 2, 2015

ప్రత్యేక సందర్భాలలో అతివలు చీరలను ధరించటానికి ఇష్టపడతారు. అయితే చీరలపై మ్యాచింగ్ బ్లౌజ్ ఒకప్పటి ట్రెండ్ అయితే హెవీ వర్క్ తో డిజైన్ చేసిన బ్లౌజెస్ ప్రస్తుత ట్రెండ్. అలాంటి లేటెస్ట్ బ్లౌజెస్ ను మీకు పరిచయం చేస్తోంది ఇవాళ్టి సొగసు. మరన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

17:23 - November 2, 2015

మనలో చిన్న సమస్యని కూడా పెద్దదిగా చేసుకుని బాధపడే వారు కొంతమంది. పెద్ద సమస్యను కూడా మౌనంగా భరించే వారు ఇంకొంత మంది. కానీ, జీవితంలో తాను ఎదుర్కుంటున్న సమస్యలు పెద్దవే అయినా ఆ బాధను పక్కకునెట్టి, ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతున్న ఓ అతివ స్ఫూర్తి దాయక కథనంలో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్పూర్తి.
సమస్యల వలయాన్ని చేధించిన శ్యామలదేవి
సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు స్వయం నిర్ణయాధికార శక్తి సన్నగిల్లుతుంది. సానుకూలంగా ఆలోచించే స్థితి నుండి దూరమవుతాం. ఆ స్థితి నుండి బైట పడే మార్గం కోసం అన్వేషిస్తాం. స్వయంగా ఇలాంటి స్థితిలోనే ఉన్నా, సమస్యల వలయాన్ని చేధించుకుని, తనలాంటి వారికి సాయపడేందుకు సిద్ధమయ్యారు శ్యామలాదేవి.
శ్యామలదేవి కృషి అభినందనీయం
నగర వాతావరణంలో ఒకరి సమస్యలు మరొకరికి పట్టని స్థితి. పోటీ ప్రపంచంలో మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితులు కరువైన స్థితి. ఇలాంటి స్థితి ఎంతో మందిపై ఎన్నో రకాలుగా దుష్ప్రభావం చూపుతోంది. అలాంటి వారెంతో మందికి భాసటగా నిలుస్తున్న శ్యామలదేవి కృషి అభినందనీయం. ఆమె సేవలు మరెంతో విస్తరించాలని, ఎంతో బాధితులకు ఆమె సేవలు చేరాలని మానవి ఆశిస్తోంది.


 

16:51 - November 2, 2015

నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడలోని అరాఫత్ బీఈడీ కాలేజీ యాజమాన్యం విద్యార్థులను వేధిస్తోంది. ఫీజులు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామంటూ ఛైర్మన్‌ వేధిస్తున్నారని విద్యార్థులు చెప్తున్నారు. అయితే గతంలోనే విద్యార్థులు కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫీజులు చెల్లించారు. ఛైర్మన్‌తో విభేదాల కారణంగా ప్రిన్సిపాల్ ఉద్యోగం మానేశాడు. అయితే ఫీజులు తనకు చెల్లించకుండా ప్రిన్సిపాల్‌కు ఎందుకు ఇచ్చారంటూ ఛైర్మన్‌ హాల్‌టిక్కెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్నారు. దీంతో విద్యార్థులు న్యాయం చేయాలంటూ కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు.

సీపీఎం నేత హషీమ్ అబ్దుల్ కలీమ్ కన్నుమూత

కోల్ కత్తా : సీపీఎం నేత హషీమ్ అబ్దుల్ కలీమ్ కన్నుమూశారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ స్పీకర్ గా సుదీర్ఘ కాలం పాటు పని చేశారు.

 

టిడిపి బలోపేతానికి ఎర్రన్నాయుడు ఎంతో కృషి చేశారు : చంద్రబాబు

విజయవాడ : టిడిపి బలోపేతానికి ఎర్రన్నాయుడు ఎంతో కృషి చేశారని ఎపి సీఎం చంద్రబాబు కొనియాడారు.. విజయవాడలో ఎసి కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. మంత్రి వర్గం ఎర్నన్నాయుడికి నివాళులర్పించారు. పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై గళం వినించారని గుర్తు చేశారు.

 

16:05 - November 2, 2015

హైదరాబాద్ : మరికాసేపట్లో ఎపి కేబినెట్ సమావేశం కానుంది. ఉద్యోగుల తరలింపు, రాజధాని భూసేకరణపైనే ప్రధానంగా చర్చించనున్నారు. వ్యాట్ చట్టానికి సవరణ ప్రతిపాదన చేయాలని సూంచించే అవకాశం ఉంది.  

16:00 - November 2, 2015

వరంగల్ : తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైంది. వరంగల్ ఉప ఎన్నికతో మొదలైన పొలిటికల్ హీట్ తెలంగాణలో రాజుకుంటుంది. త్వరలో స్థానిక సంస్థల మండలి ఎన్నికలతో పాటు పలు మున్సిపాల్టీలకు ఎన్నికలు రానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వేడి రగులుకుంటోంది. వరంగల్ ఉప ఎన్నికలతో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లగా....త్వరలో అన్ని జిల్లాలో పొలిటికల్ సెగ తగలనుంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పుడు.... రేపు అంటున్న స్థానిక సంస్థల మండలి ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల అవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
12 మండలి స్థానాల ఎన్నికలకు పార్టీలు సిద్ధం
వరంగల్ ఉప ఎన్నికతో పాటు నారాయణఖేడ్ అసెంబ్లీ ఎన్నికకు నోటిఫికేషన్ వస్తుందని భావించినా మొదటి విడతలో శాసనసభా స్థానానికి ఈసీ నోటిఫికేషన్ వెలువరించలేదు. అయితే....త్వరలో ఈ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు.. శాసనమండలికి కూడా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న ధీమా నేతల్లో కనిపిస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం స్థానిక సంస్థల కోటాలో మరో మూడు మండలి స్థానాలను పెంచాలనే ప్రతిపాదనకు అన్ని రాజకీయ పార్టీలు అంగీకారం తెలుపడంతో....అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ప్రస్తుతం 12 మండలి స్థానాల ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి.
మరో రెండు నెలల పాటు ఎన్నికల వాతావరణం
రాష్ట్రంలో మరో రెండు నెలల పాటు ఎన్నికల వాతావరణం కొనసాగనుంది....ఆ వెంటనే గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలను రాజకీయ పార్టీలు ఎదుర్కోనున్నాయి. మూడు కార్పొరేషన్ల ఎన్నికలతో పాటు తెలంగాణలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మున్సిపాల్టీలకు, నగర పంచాయతీలకు కూడా ఎన్నికల నగరా మోగనుందని తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికలు డిసెంబర్ 15లోపు పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలున్నా... ప్రభుత్వం మరో నెల రోజుల గడువు కోరింది. దీంతో జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో గ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనన్న అంచనాలు వేయడంలో రాజకీయ పార్టీలు తలమునకలవుతున్నాయి. మొత్తానికి ఎన్నికలతో ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునే పనిలో ప్రధాన రాజకీయ పార్టీలు పడ్డాయి.

 

15:53 - November 2, 2015

ఆదిలాబాద్‌ : జిల్లా మార్కెట్ యార్డు రణరంగంగా మారింది. పత్తి ధరను 75 రూపాయలు తగ్గించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మార్కెట్ యార్డుపై రాళ్లు రువ్వారు. వ్యాపారులు, సిపిఐ అధికారులు కలిసి తమను దోపిడీచేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ అధికారి కార్యాలయం తాళాలు బద్దలుకొట్టారు. ఘటనాస్థలానికి కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. తేమ శాతాన్ని 8నుంచి 12శాతం లోపల తీసుకోవాలన్న నిబంధనపై కూడా మండిపడుతున్నారు.

 

15:45 - November 2, 2015

తూర్పుగోదావరి : కాకినాడ ఏటీఎం చోరీ కేసు కొత్త మలుపు తిరిగింది. పదిలక్షలతో ఉడాయించినట్లు భావిస్తున్న భరణి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రెండురోజుల క్రితం కాకినాడ దేవాలయం వీధి ఎటిఎంలో డబ్బు వేసేందుకు సీఎంఎస్ సెక్యూరిటీ సిబ్బంది... భరణితోపాటు... మరో ఉద్యోగి, గన్‌మెన్‌, డ్రైవర్‌ వెళ్లారు. ఇంతలో తనకు అర్జెంట్ పనిఉందంటూ పదిలక్షల రూపాయలతో భరణి అక్కడినుంచి ఉడాయించాడు.

 

వరంగల్ ఉపఎన్నికకు టీఆర్ ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్

హన్మకొండ : వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికకు టీఆర్ ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ నామినేషన్ దాఖలు చేశారు.

 

 

మరికాసేపట్లో ఎపి కేబినెట్ సమావేశం

హైదరాబాద్ : మరికాసేపట్లో ఎపి కేబినెట్ సమావేశం కానుంది. ఉద్యోగుల తరలింపు, రాజధాని భూసేకరణపైనే ప్రధానంగా చర్చించనున్నారు. వ్యాట్ చట్టానికి సవరణ ప్రతిపాదన చేయాలని సూంచించే అవకాశం ఉంది.  

13:43 - November 2, 2015

విశాఖపట్టణం : హుదూద్ తుఫాన్ ఎవరు మరిచిపోరు. విశాఖ జిల్లాను అతలాకుతలం చేసిన తుఫాన్ కు కొంతమంది మృతి చెందగా మరెంతో మంది రోడ్డున పడ్డారు. తాజాగా మరో తుఫాన్ బారి నుండి విశాఖ బయటపడిందని వాతావరణ నిపుణులు రామకృష్ణ టెన్ టివికి తెలిపారు. ఇందుకు పలు కారణాలున్నాయన్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన చపల తుఫాన్ కూడా ఒక కారణమని, తుఫాన్ గా మారకముందే బలహీన పడి దిశ మార్చుకుందని వివరించారు. ఆ సమయంలో మోస్తారు వర్షాలు..ఈదురుగాలులు వీయడం జరిగిందని గుర్తు చేశారు. మరిని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:39 - November 2, 2015

హైదరాబాద్ : మొదటి దశ మిషన్ కాకతీయ పనులు విజయంతమైందని, అందరి సహకారం వల్లే ఫేజ్ 1 విజయంతమైందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. జేఎన్టీయూలో మిషన్ కాకతీయ రెండో దశపై సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు హరీష్ రావు, ఈటెల హాజరయ్యారు. జ్యోతి వెలిగించిన అనంతరం సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఒక్క ఖమ్మం జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చిందని, గత అనుభవాల నుండి మిషన్ కాకతీయ ఫేజ్ -2ను మరింత విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మైనర్ ఇరిగేషన్ కు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు, ఇందులో టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అత్యంత పారదర్శకంగా మిషన్ కాకతీయ పనులు చేపట్టడం జరుగుతోందని, భూగర్భ జలాలను సంరక్షించుకోవాలని అదే సందర్భంలో భూగర్భజలాలు ఎంత పెరిగాయో కూడా సమీక్షించుకోవాలని సూచించారు. 

13:37 - November 2, 2015

చిత్తూరు : తిరుపతి ప్రభుత్వాసుపత్రిలో రెండు రోజుల శిశువు అదృశ్యం కలకలం రేపింది. ఓ మహిళ శిశువును ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాలో రిక్డారైంది. తమ శిశువును అప్పగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పాపానాయుడు పేటకు చెందిన ఓ మహిళ రెండు రోజుల క్రితం ప్రభుత్వాసుపత్రిలో పాపకు జన్మనిచ్చింది. శిశువు అనారోగ్యంతో ఉండడంతో ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నారు. సోమవారం శిశువు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఓ మహిళ శిశువును ఎత్తుకెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అపహరించిన మహిళను పట్టుకోవడానికి పోలీసులు గాలింపులు చేపట్టారు. 

13:32 - November 2, 2015

హైదరాబాద్ : గత కొంతకాలంగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై రేగుతున్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. జనవరి 31లోగా ఎన్నికలు నిర్వహిస్తామని హైకోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని గతంలో లాగా మాట తప్పవద్దని కోర్టు సూచించింది. ఎన్నికల నిర్వాహణకు ఎందుకు సమయం తీసుకుంటున్నారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆధార్ అనుసంధానం..వార్డుల సరిహద్దు..ఇతరత్రా కారణాల వల్ల ఎన్నికల నిర్వాహణ ఆలస్యం అవుతోందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో డిసెంబర్ 15వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ ఎన్నికలు నిర్వహించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎన్నికల్లో గెలవాలని పలు పథకాలు ప్రవేశ పెడుతోందని, నగర వాసులపై వరాలు కురిపిస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

జనవరి 31లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశం..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికలను జనవరి 31లోగా ఎన్నికలు నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 15వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని కోర్టులో జీహెచ్ఎంసీ కమిషనర్ అఫిడవిట్ దాఖలు చేశారు. 

చోటా రాజన్ తరలింపు..

ఇండోనేషియా : బాలిలో పోలీసుల అదుపులో ఉన్న అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ను ఓ రూంకు తరలించారు. అక్కడ ఇండోనేషియా..భారత్ కు చెందిన అధికారులున్నారు. 

మంత్రులు..అధికారుల వసతులపై కేబినెట్ లో చర్చ - యనమల..

విజయవాడ : మంత్రులు, అధికారులకు రెయిన్ ట్రీ పార్కులో వసతు కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి యనమల పేర్కొన్నారు. సీఎంతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని, కేబినెట్ సమావేశంలో చర్చిస్తామన్నారు.

 

కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలపై హైకోర్టు విచారణ..

కర్నూలు : కార్పొరేషన్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. 2010 నుండి ఇప్పటి వరకు ప్రత్యేక అధికారి పాలనలోనే కార్పొరేషన్ జరుగుతుందన్న పిటిషన్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి నాలుగు వారాల సమయం కావాలని ప్రభుత్వం కోర్టును కోరింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా పడింది. 

కేశవరెడ్డి స్కూల్ విద్యార్థి అదృశ్యం..

అనంతపురం : శివారులోని కేశవరెడ్డి స్కూల్ లో పదో తరగతి విద్యార్థి నీరజ్ అదృశ్యమయ్యాడు. ఉదయం నుండి కనిపించకుండా నీరజ్ విషయంలో తమకు ఏమీ తెలియదని స్కూల్ యాజమాన్యం పేర్కొంటోంది. తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

రచయితలను చర్చలకు ఆహ్వానించిన కేంద్రం..

ఢిల్లీ : పలు అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్న రచయితలను కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. దేశంలో మైనార్టీలు..ఇతరత్రా దాడులపై..పెరుగుతున్న మతోన్మాదాన్ని నిరసిస్తూ పలువురు రచయితలు..ప్రముఖులు గతంలో తాము తీసుకున్న అవార్డులు రచయితలు వెనక్కి ఇచ్చేస్తున్నారు. తమ అవార్డులను తిరిగి ఇవ్వవద్దని..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో చర్చలకు వచ్చి సలహాలు..సూచనలు చేయాలని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కోరారు. 

కేంద్రానికి సుప్రీం నోటీసులు..

ఢిల్లీ : ఉపాధి హామీ పథకం అమలు తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఉపాధి హామీ పథకం అమలుపై సామాజిక ఉద్యమ నేత అరుణారాయ్ పిటిషన్ వేశారు. కూలీలకు భత్యం చెల్లింపు..క్షేత్రస్థాయిలో తనిఖీలు..ఇతర అంశాలు సక్రమంగా అమలు కావడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు.  

సీఎస్ రాజీవ్ ను కలిసిన మోత్కుపల్లి..

హైదరాబాద్ : సీఎస్ రాజీవ్ ను మోత్కుపల్లి బృందం కలిసింది. యాదగిరిగుట్టను జిల్లా ఏర్పాటు చేయాలని విన్నపం చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి పేరిట జిల్లా ఏర్పాటు చేయాలని కోరారు. 

12:45 - November 2, 2015

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా దాదాపు దశాబ్దకాలంగా అమలులో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేడు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతోంది. ఎంతో ఉదాత్త ఆశయాలతో ప్రవేశ పెట్టిన ఈ పథకం క్రమేపీ అవినీతికి అలవాలమై దారి తప్పిన ఫలితంగా అసలుకే ఎసరొచ్చే దుస్థితి దాపురించింది. కానీ ఎన్డీయే ప్రభుత్వం ఈ పథకంపై అనుసరిస్తున్న వైఖరి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీనిపై సామాజికవేత్త అరుణారాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కూలీలకు భత్యం చెల్లింపు..క్షేత్రస్థాయిలో తనిఖీలు..ఇతర అంశాలు సక్రమంగా అమలు కావడం లేదని సుప్రీంకు విన్నవించారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా పథకం అమలుపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సమాధానం చెప్పాలని నోటీసులో ఆదేశాలు జారీ చేసింది.

2005 సంవత్సరంలో..
2005 సంవత్సరంలో తెరమీదకు వచ్చిన ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రజల్లో ఎన్నో ఆశలు రేకెత్తించింది. ఈ పథకాన్ని అనుసరించి గ్రామీణ సామాజిక వనరులు సృష్టించాలి..వలసలు నియంత్రించాలి..నివాస ప్రాంతాల పరిధిలోనే పని కల్పించాలి..నికరమైన కనీస వేతనాలు అందించాలి..కనీస పనిదినాలు నిర్ధేశించాలి..కనీస ఆదాయం లభించేలా చూడాలి..పని హక్కు కల్పించాలి..అనే ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద చాలా మంది ఉపాధి పొందుతున్నారు. కానీ ఇదంతా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదనే విమర్శలున్నాయి. చాలా రాష్ట్రాలకు ఎన్డీయే సర్కార్ నిధుల్లో కోత విధించడంపై వామపక్షాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఏ రాష్ట్రానికి ఎంత నిధులు కేటాయించాలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని అమలుకు సంబంధించి రెండు ముఖ్యమైన ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. దేశంలోని అత్యంత వెనుకబడిన బ్లాకుల్లో పథకాన్ని అమలు చేయడం మొదటిది కాగా మొత్త బడ్జెట్ లో శ్రమశక్తి వాటాను 60 శాతం నుండి 51 శాతానికి పరిమితం చేయడం..యంత్రాలు..సామాగ్రీ వాటా 40 శాతం నుండి 49 శాతానికి పెంచడం రెండోది. ఈ ప్రతిపాదనలపై విపక్షాలు భగ్గుమన్నాయి. భవిష్యత్ లో ఈ పథకానికి కేంద్రం పూర్తిగా తిలోదకాలు వదిలే దిశగా అడుగులు వేస్తోందని ఆరోపణలు గుప్పించారు. ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలయ్యే విధంగా చూడాలని పలువురు కోరుతున్నారు. 

12:30 - November 2, 2015

ఆదిలాబాద్ : ఎంతో వ్యయ..ప్రయాసాల కొర్చి పంట పండిస్తే మద్దతు ధర ఇవ్వరా ? తమ కష్టాలు ఎవరు తీర్చాలి ? సమస్యలు ఎవరు వినాలి ? తమ క్షేమం కోసం చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా ? ఎన్నాళ్లీ ఇబ్బందులు అంటూ పత్తి రైతు కన్నెర్ర చేశాడు. ఏకంగా వ్యవసాయ కార్యాలయంపై దాడికి యత్నించారు. ఈ ఘటన ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ లో చోటు చేసుకుంది. కార్యాలయం అద్దాలు పగులగొట్టారు. అక్కడి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. పత్తిలో తేమను 16 శాతానికి పెంచి క్వింటాలుకు రూ.6వేల ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. రైతులు చేపట్టిన ఆందోళనపై పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రైతులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
తెలంగాణ ఇతర జిల్లాల కంటే ఆదిలాబాద్ జిల్లాలో వర్షపాతం కొంచెం అధికంగా ఉండంతో పత్తి రైతులు సంతోషం వ్యక్తం చేశారు. తాము పండించిన పత్తికి అధిక ధర పలుకుతుందని ఆశించారు. కానీ వారి ఆశలను సీసీఐ అధికారులు, దళారులు నీళ్లు చల్లారు. మొత్తం జిల్లాల్లో ఉన్న 14 సీసీఐ కేంద్రాల్లో 400 క్వింటాళ్ల పత్తిని అధికారులు కొనుగోలు చేశారు. పంటకు సరియైన ధర పెట్టకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సీసీఐ అధికారులు..దళారులు రింగ్ గా ఏర్పడి తమను దోచేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. వ్యాపారులు మాత్రం 1.50 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తేమ విషయంలో అధికారులు తమను మోసం చేస్తున్నారని, వెంటనే తమకు న్యాయం చేయాలని పత్తి రైతులు డిమాండ్ చేశారు. 

12:11 - November 2, 2015

హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో కాల్పుల ఘటన కలకలం రేగింది. ఛైన్ లాక్కోవడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులపై యాంటీ స్నాచింగ్ టీం కాల్పులకు దిగింది. ఈ ఘటనలో ఛైన్ స్నాచర్లు తప్పించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే అల్వాల్ కూడా ఛైన్ స్నాచింగ్ జరిగింది.
వివరాల్లోకి వెళితే...సాయి అనురాధ అనే మహిళ సోమవారం ఓ బ్యాంకుకు వచ్చింది. అనంతరం బ్యాంకు నుండి తిరుగు ప్రయాణమైంది. ఆటోనగర్ సమీపంలోని రాజధాని హోటల్ వద్దకు చేరుకున్న అనురాధ మెడలో ఉన్న బంగారు గొలుసు తెంపుకోవడానికి ఇద్దరు దుండగులు ప్రయత్నించారు. అక్కడనే కొంత దూరంలో ఉన్న యాంటీ స్నాచింగ్ టీం గమనించి ఆపడానికి ప్రయత్నించారు. వెంటనే వారు పారిపోవడానికి ప్రయత్నించడంతో టీం కాల్పులకు దిగింది. కానీ వారు పారిపోయారు. సమాచారం అందుకున్న డీసీపీ స్వయంగా రంగంలోకి దిగారు. ఎల్ బినగర్, హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎలాగైనా నిందితులను పట్టుకుంటామని పోలీసులు స్పష్టంగా చెబుతున్నారు.

మహిళల్లో ఆందోళన..
హైదరాబాద్, సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఛైన్ స్నాచింగ్ లు జరుగుతుండడంపై మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట ఛైన్ స్నాచింగ్ లు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో మహిళలు మృతి చెందడమే కాకుండా పలువురు గాయపడుతున్నారు. దీనిపై సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు. ఛైన్ స్నాచింగ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి యాంటీ స్నాచింగ్ టీంలను ఏర్పాటు చేసింది. కొన్ని పరిస్థితుల్లో కాల్పులకు కూడా దిగాలని ఇరు కమీషనర్లు ఆదేశాలు జారీ చేశారు. బీహార్, కర్నాటక రాష్ట్రాల నుండి కొంతమంది నిందితులు ఇక్కడకు వచ్చి ఛైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎలాగైనా ఛైన్ స్నాచింగ్ లకు అడ్డుకట్ట వేయాలని మహిళలు కోరుతున్నారు. 

వనస్థలిపురంలో కాల్పులు..

హైదరాబాద్ : వనస్థలిపురంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఛైన్ స్నాచర్ లపై యాంటీ స్నాచింగ్ టీం కాల్పులకు దిగింది. ఈ ఘటనలో ఛైన్ స్నాచర్లు తప్పించుకున్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 

 

మొదటి దశ మిషన్ కాకతీయ పనులు విజయవంతం - హరీష్ రావు..

హైదరాబాద్ : మొదటి దశ మిషన్ కాకతీయ పనులు విజయంతమైందని, అందరి సహకారం వల్లే ఫేజ్ 1 విజయంతమైందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. జేఎన్టీయూలో మిషన్ కాకతీయ రెండో దశపై సమీక్ష జరిగింది. ఈసమావేశానికి మంత్రులు హరీష్ రావు, ఈటెల హాజరయ్యారు. ఒక్క ఖమ్మం జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చిందని మంత్రి హరీష్ తెలిపారు. గత అనుభవాల నుండి మిషన్ కాకతీయ ఫేజ్ -2ను మరింత విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మైనర్ ఇరిగేషన్ కు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు, ఇందులో టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.

తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అదృశ్యం..

చిత్తూరు : తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం శిశువు అదృశ్యం కలకలం రేపింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. 

జనవరి 31లోగా జీహెచ్ఎంసీ ఎన్నికలు..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికలు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. వచ్చే జనవరి 31లోగా ఎన్నికలు నిర్వహిస్తామని కోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆ లోగా ఎన్నికలు నిర్వహిస్తామని అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. 

11:33 - November 2, 2015

వరంగల్ : ఎనుమాముల మార్కెట్ లో సీసీఐ ఎక్కడా కనిపించడం లేదని ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. రైతులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రొ.నాగేశ్వర్ టెన్ టివితో మాట్లాడారు. పత్తికి మద్దతు ధర రూ.4,030 అని నిర్ణయించారని ఇది చాలా దుర్మార్గమన్నారు. రూ.7,700 ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరడం జరిగిందని, కానీ కేంద్రం రూ.4,100 ధర నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం రూ. 3,900 ధర కన్నా ఎక్కువ రావడం లేదని, సీసీఐ కేంద్రాల విషయంలో మంత్రి హరీష్ రావు పలు వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఇక్కడ సీసీఐ కనబడడం లేదన్నారు. పత్తి తీసుకొచ్చిన వారితో రంగు మారిందని..ఇతరత్రా కారణాలతో నిరంతరం రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. మార్కెట్ యార్డులో ఉన్న వారితో దళారులతో కుమ్మక్కయ్యారు. మార్కెట్ యార్డుకు తెలియకుండా పత్తి కొనుగోలు అవుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమౌతుందన్నారు. తక్షణమే సీసీఐ రంగంలోకి దిగాలని ప్రొ.నాగేశ్వర్ డిమాండ్ చేశారు. 

11:08 - November 2, 2015

విజయనగరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూట్ మిల్లులు సంక్షోభంలో చిక్కుకున్నాయా ? అందులో పని చేసే కార్మికుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవలే గుంటూరు జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న భజరంగ్ జూట్ మిల్లు లాకౌట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కార్మికులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం దిగి వచ్చి యాజమాన్యంతో మాట్లాడుతామని పేర్కొంది. తాజగా విజయనగరం జిల్లాలోని వి.టి.అగ్రహారంలో ఉన్న అరుణ జూట్ మిల్లు మూతపడింది. ఉదయం షిఫ్ట్ కు వెళ్లిన కార్మికులు నోటీసు బోర్డులో ఉన్న నోటీసును చూసి హతాశులయ్యారు. లాకౌట్ ప్రకటించడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వెంటనే కంపెనీ తెరిపించాలని..కార్మికుల ఐక్యత వర్ధిల్లాల్లి అంటూ కార్మికులు నినాదాలు చేశారు. నారా కొరత ఉండడం..నష్టాల్లో ఉండడం వల్ల లాకౌట్ వేసినట్లు యాజమాన్యం పేర్కొంది. మిల్లు మూతపడంతో సుమారు రెండు వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. దీనితో ఆయా కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. 

ఆదిలాబాద్ పత్తి మార్కెట్ లో రైతుల ఆందోళన...

ఆదిలాబాద్ : పత్తి మార్కెట్ లో రైతులు ఆందోళన నిర్వహించారు. సీసీఐ అధికారులు తేమ పేరిట మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ కార్యాలయంపై రైతులు రాళ్లతో దాడి చేశారు. పత్తికి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. 

నిలిచిన గుంతకల్ - తిరుపతి ప్యాసింజర్..

అనంతపురం : సాంకేతికలోపంతో హనుమాన్ జంక్షన్ వద్ద గుంతకల్ తిరుపతి - ప్యాసింజర్ నిలిచిపోయింది. వేరొక ఇంజిన్ ద్వారా రైలును గుంతకల్ కు తరలించారు. 

నగరంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి - నరసింహన్..

హైదరాబాద్ : నగరంలో సైబర్ నేరాలు అధికమౌతున్నాయని ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. సైబర్ నేరాలపై దృష్టి సారించాలని సూచించారు. నేరాలు తగ్గించడానికి టెక్నాలజీ వాడకంలో పోలీసులు ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలని, సమాజంలో పోలీసులపై ఎక్కువ బాధ్యత ఉందన్నారు. 

 

ఏనుమాముల మార్కెట్ ను సందర్శించిన నాగేశ్వర్..

వరంగల్ : ఏనుమాముల మార్కెట్ ను ప్రొ.నాగేశ్వర్ సందర్శించారు. పత్తి రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

కూకట్ పల్లి రైతు బజార్ లో కందిపప్పు విక్రయ కేంద్రం..

హైదరాబాద్ : కూకట్ పల్లి రైతు బజార్ లో కందిపప్పు విక్రయ కేంద్రాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డిలు ప్రారంభించారు. 

నేడు మీడియా ఎదుట కృపామణి తల్లిదండ్రులు..

పశ్చిమగోదావరి : కృపామణి ఆత్మహత్య కేసులో తల్లిదండ్రులను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశ పెట్టనున్నారు. ప్రధాన నిందితుడు శ్రీనివాస్ కోర్టులో లొంగిపోయే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

10:37 - November 2, 2015

బాలీవుడ్ బాద్ షా 'షారుఖ్' 50వ వసంతంలోకి అడుగు పెట్టాడు. తన పుట్టిన రోజుల వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించే 'షారుఖ్' ఈసారి సింపుల్ గా నిర్వహించుకున్నాడు. కుటుంబసభ్యుల మధ్య రాత్రి 12.00 గంటలకు కేక్ కట్ చేశాడు. భార్య గౌరీ ఖాన్, పిల్లలు ఆర్యన్, సుహానా, ఆబ్ రామ్ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినం సందర్భంగా ఆయన నివాసం మన్నత్ వద్ద ఆదివారం రాత్రి పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. తనపై అంతులేని అభిమానాన్ని..ప్రేమను ప్రకటిస్తున్న అభిమానులకు 'షారుఖ్' కృతజ్ఞతలు తెలిపారు. జన్మదినం సందర్భంగా 'షారుఖ్' ద్విపాత్రాభినయం చేసిన 'ఫ్యాన్' చిత్ర ట్రైలర్ చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసింది. 

10:30 - November 2, 2015

బాలీవుడ్ బాద్ షా 'షారుఖ్ ఖాన్' 50వ వసంతంలోకి అడుగు పెట్టాడు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా 'ఫ్యాన్' చిత్ర ట్రైలర్ ను ట్విట్టర్ ద్వారా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో 'షారుఖ్' ద్విపాత్రభియనం పోషించారు. మనీశ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2016 ఏప్రిల్ 15వ తేదీన 'ఫ్యాన్' విడుదల కానుంది. 

10:12 - November 2, 2015

వరంగల్ : తమకు మద్దతు ధర కల్పించాలి..దోపిడి నివారించాలంటూ రైతులు నెత్తి నోరు మొత్తుకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాధికారులు స్పందించడం లేదు. ఎనుమాముల మార్కెట్ లో నెలకొన్న పరిస్థితులను వాస్తవంగా తెలుసుకోవాలని ప్రొ.నాగేశ్వర్ నడుం బిగించారు. సోమవారం ఉదయం మార్కెట్ ను సందర్శించారు. అక్కడ పత్తి రైతులతో నేరుగా మాట్లాడారు. వారు చెబుతున్న సమస్యలను సావధానంగా విన్నారు.
ఇటీవల ఎనుమాముల మార్కెట్ లో దోపిడి చేస్తున్నారని, పత్తి రైతులకు న్యాయం కలగడం లేదని విపక్ష నేతలు, రైతులు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. గిట్టుబాటు ధర..మద్దతు ధర కల్పించాలని రైతులు ఎన్నోమార్లు కోరుతూ వస్తున్నారు. మద్దతు ధర ఆరు వేలు కావాలని రైతులు ఆందోళన చేస్తున్నా అధికారులు స్పందించడంలేదు. సీసీఐని రంగంలోకి దించామని చెబుతున్నా ఒక్క అధికారి కూడా మార్కెట్ లో కనిపించడం లేదనే ఆరోపణలున్నాయి. 4,100 ప్రకటించినా ఒక్క సీసీఐ అధికారి కూడా పత్తిని కొనుగోలు చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, సమస్యలు తీర్చాలని పత్తి రైతులు కోరుతున్నారు. 

నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం..

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 100 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లకు పైగా నష్టపోయాయి. 

గోదావరిఖనిలో కానిస్టేబుళ్ల మధ్య గొడవ..

కరీంనగర్ : గోదావరిఖని వన్ టౌన్ పీఎస్ లో ముగ్గురు కానిస్టేబుళ్ల మధ్య గొడవ చెలరేగింది. తాగి విధులు నిర్వహిస్తున్నాడంటూ కానిస్టేబుల్ వేణుగోపాల్ పై ఇద్దరు కానిస్టేబుళ్లు దాడికి దిగారు. దీనితో బాధిత కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. 

త్రివేండ్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్..

కేరళ : త్రివేండ్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకోవడడానికి ఓటర్లు బారులు తీరారు. 

చెన్నైలో కుండపోత వర్షం..విద్యాలయాలకు సెలవు..

చెన్నై : ఏపీ పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాజధాని చెన్నైలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. 24గంటలకు పైగా చెన్నైలో కుండపోత వర్షం కురుస్తోంది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. 

ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నం..తల్లి మృతి..

గుంటూరు : కర్లపాలెం (మం) పాతనందాయపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 

రెండు లారీల ఢీ..లారీ డ్రైవర్ సజీవదహనం..

పశ్చిమగోదావరి : ద్వారకా తిరుమల (మం) బుట్టాయిగూడెంలో రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. 

ఎస్ఐల పాసింగ్ ఔట్ పరేడ్..

హైదరాబాద్ : రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో 492 మంది ఎస్ఐల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, విశిష్ట అతిథిగా డీజీపీ అనురాగ్ శర్మలు హాజరయ్యారు.

 

08:28 - November 2, 2015

దేశీయ పప్పు దినుసులను ప్రోత్సాహించాలని ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. పప్పుల ధరలు అధిక మౌతుండడంపై టెన్ టివి గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లోనే..

ఆహార ద్రవ్యోల్బణం పేదవాడిపై ప్రభావం..
''అధికారంలోకి రాకముందు ధరలు తగ్గిస్తాం..అవినీతిని నిర్మూలిస్తామని బీజేపీ ప్రధానంగా చెప్పింది. ఉల్లిగడ్డలు..బియ్యం..పప్పు దినుసులు..ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇక్కడ రైతులకు ఏమన్నా లాభం వస్తుందా ? ఒకవైపు ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు రైతులకు లాభం జరగడం లేదు.ఆహార ద్రవ్యోల్బణం పేదవాడిపై ప్రభావం చూపుతోంది. ద్రవ్యోల్బాణాన్ని లెక్కించడంలో లోపం ఉంది. పప్పుల దినుసుల ధరలు ద్రవ్యోల్బణంలో ఒక్క శాతం లోపే ఉంది. పేద వాడు 60 శాతం ఆహారంపై ఖర్చు పెడుతున్నాడు. ఈ రోజు చికెన్ కన్నా పప్పు అధిక ధరమైంది. పేదలకు పప్పుల దినుసులు మాంసంతో సమానం. ఆహార భద్రత కాదు. పౌష్టికాహార భద్రత. పౌష్టికాహారం..జీవన ప్రమణాలను దెబ్బతీసే పరిస్థితి ఉంది. మనిషికి 50-60 గ్రాముల పప్పు అవసరం ఉంటే అది 30 గ్రాములకి పడిపోయింది.

ఈ పంటల వల్ల ఎంతో మేలు...
మూడు నెలలు నుండి ఆరు నెలల లోపు ఈ పంట వస్తుంది. నీటి అవసరం తక్కువ. వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఈ పంట పడుతుంది. తక్కువ ఎరువు..పురుగు మందులు తక్కువగా అవసరం ఉంటాయి. భూ సారాన్ని పెంచుతుంది. ఇవన్నే కాక పౌష్టికాహారం ఇస్తుంది. పేదల జీవన ప్రమాణాన్ని పెంచుతుంది. ఇక్కడ పరిస్థితి దారుణంగా పడిపోయింది.

ఉత్పత్తి తగ్గింది..ఏం చర్యలు తీసుకున్నారు ?
ఉత్పత్తి మాట తగ్గడం నిజం. వర్షాభావ పరిస్థితుల్లో 10 శాతం మేర ఉత్పత్తి తగ్గిపోయింది. 23 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అవసరం ఉంటే 17 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అయ్యింది. ధరలు పది శాతం పెరిగిందా ? వంద శాతం వరకు ధరలు పెరిగాయి. ఉత్పత్తి పడిపోయిందని ఆసరాగా తీసుకుని మార్కెట్ లో కొరత సృష్టించే అవకాశం ఉంది. ఇదంతా ముందే తెలిసినా ఎందుకు దిగుమతులు చేయలేదు ? ఇక్కడ ప్రభుత్వ ఘోర వైఫల్యం ఉంది. దిగుమతులు చేసుకోకపోవడం వెనుక నిల్వ చేసుకున్న కంపెనీలు..బహుళ జాతి కంపెనీలు వీరి వెనుక ఉన్నాయి. అవసరం మేరకు ఉత్పత్తి చేసుకోవడం లేదు. మియన్మార్ నుండి పప్పు దినుసులు దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతులను వెంటనే చేసుకోవాలి. మార్కెట్ లో కొరత లేకుండా జాగ్రత్త పడాలి. భారీ ఎత్తున నిల్వ తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి. మార్కెట్ కు వచ్చిన తరువాత నల్లబజార్ తరలకుండా పౌరసరఫరాల విక్రయ కేంద్రాల ద్వారా విక్రయాలు సాగించాలి.

పప్పు దినుసుల సాగుపై నిర్లక్ష్యం...
పప్పు దినుసుల సాగును నిర్లక్ష్యం చేశారు. 1961 నుండి 2014 వరకు లెక్కలను పరిశీలించాలి. ఇన్ని సంవత్సరాల్లో 45 శాతం మాత్రమే ఉత్పత్తి పెరిగింది. బియ్యం మాత్రం 140 శాతం పెరిగింది. పప్పు దినుసులకు బదులుగా ఇతర ఆహార ధాన్యాలు పెంచి పోషిస్తూ వచ్చారు. పప్పు దినుసుల మద్దతు ధర ఉంది కానీ సేకరణ లేదు. ప్రభుత్వం కొనుగోలు చేసి నిల్వ చేసి ప్రజా పంపిణీ ద్వారా విక్రయాలు చేస్తుంది. పప్పుల దిసుసులపై ఇదంతా ఉందా ? బియ్యం విషయంలో ప్రభుత్వం 28-30 శాతం వరకు కొనుగోలు చేస్తుంది. దేశీయ పప్పు దినుసులను ప్రోత్సాహించాలి. ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రజా పంపిణీ ద్వారా విక్రయాలు సాగించాలి. హరిత విప్లవం ద్వారా అధిక దిగుబడి వంగడాలు వచ్చాయి. సాగునీటి సదుపాయం ఉన్న చోట పప్పు దినుసుల ఉత్పత్తి పెంచితే దిగుబడి..ఉత్పత్తి గ్యారెంటీగా ఉంటుంది. ఇక్కడ రైతులను ప్రోత్సాహించాల్సి ఉంటుంది''. అని నాగేశ్వర్ పేర్కొన్నారు. 

07:59 - November 2, 2015

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన విద్యార్థులపై బీజేపీ నేతలు అమానుష దాడికి దిగారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులను పిడిగుద్దులు గుద్దారు. కాళ్లతో తన్నారు. ఈ దాడిపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఏపీలో పరిపాలన వికేంద్రీకరణ లేకపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమౌతున్నాని, ప్రత్యేక ఉద్యమాలు ఏపీలో కూడా రావచ్చని వైసీపీ పేర్కొంటోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా హత్యోదంతంపై సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య తన 'అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం' పుస్తకంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), విజయ్ కుమార్ (టిడిపి), గౌతమ్ రెడ్డి (వైసీపీ), అడారి కిశోర్ కుమార్ (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

ఏపీలో మరో జూట్ మిల్లు లాకౌట్..

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా వి.టి.అగ్రహారంలో అరుణ జూట్ మిల్లు మూతపడింది. ఇటీవలే గుంటూరు జిల్లాలో ఉన్న భజరంగ్ జూట్ మిల్లు మూత పడిన సంగతి తెలిసిందే. తాజాగా అరుణ్ జూట్ మిల్లు యాజమాన్యం లాకౌట్ ప్రకటించడంతో రెండు వేల మంది కార్మికులు రోడ్డుపై పడ్డారు. దీనిపై మిల్లు వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. 

నేడు వరంగల్ ఎంపీ స్థానానికి గాలి..సిరిసిల్ల రాజయ్య నామినేషన్..

వరంగల్ : జిల్లా ఎంపీ స్థానానికి వామపక్షాల అభ్యర్థిగా గాలి వినోద్ కుమార్.. కాంగ్రెస్ అభ్యర్థిగా సిరిసిల్ల రాజయ్యలు నామినేషన్ వేయనున్నారు.

 

నేడు ఏపీలో వైసీపీ ఆందోళనలు..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా నేడు తహశీల్దార్ కార్యాలయాల ఎదుట వైసీపీ ధర్నాలు నిర్వహించనుంది. 

బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం..

ఢిల్లీ : బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని, నిర్ధేశిత లక్ష్యాన్ని సునాయసంగా చేధించినట్లు రక్షణశాఖ ప్రకటించింది. అరేబియా సముద్రంలోని ఐఎన్ఎస్ కోచి నుండి క్షిపణి ప్రయోగం జరిగింది. 2005 నుండి భారత నావికాదళంలో బ్రహ్మోస్ సేవలందిస్తోంది. 

07:01 - November 2, 2015

తెలంగాణను విత్తనోత్పత్తి రాష్ట్రంగా, విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే విత్తనోత్పత్తి రాష్ట్రం ఏమిటి? తెలంగాణలో విత్తనోత్పత్తికి అనుకూలంగా వున్న అంశాలేమిటి? తెలంగాణలో ప్రస్తుతం విత్తన చట్టాలు ఎలా వున్నాయి? అవి రైతులకు అనుకూలంగా వున్నాయా? విత్తన కంపెనీలకు అనుకూలంగా వున్నాయా? తెలంగాణ రైతులకు మేలు జరగాలంటే విత్తన చట్టాలు ఎలా వుండాలి? ఇలాంటి అంశాలపై టెన్ టివి జనపథంలో రైతు సంఘం నేత సాగర్‌ విశ్లేషించారు. 

07:00 - November 2, 2015

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఆరు వందల విత్తన ప్రాసెసింగ్‌ కంపెనీలున్నాయంటే చాలా మందికి ఆశ్చర్యం కలగవచ్చు. విత్తనోత్పత్తిరంగంలో తెలంగాణకు వున్న అనుకూలతలకు ఇదొక నిదర్శనం. విత్తనోత్పత్తికి అవసరమైన సమ శీతోష్ణ పరిస్థితులు, వాతావరణంలో తగినంత తేమ వుండడం తెలంగాణకు అనుకూలాంశాలు. మరో విశేషం ఏమిటంటే, తెలంగాణలో ఉత్పత్తి అయిన విత్తనాలు ఎక్కడ సాగు చూసినా మంచి దిగుబడులను ఇస్తుండడం. విత్తనాలను నిల్వ చేయడానికి తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రాంతం. మన దేశంలో విత్తన ఉత్పత్తి రంగంలో తెలంగాణ వాటా 65శాతందాకా వుండడం మరో విశేషం. విత్తన కంపెనీల టర్నోవర్‌ ఎనిమిది వేల కోట్లు రూపాయల దాకా వుంది.

శాసిస్తున్న రెండు కంపెనీలు..
వందల సంఖ్యలో విత్తన కంపెనీలున్నప్పటికీ రెండే రెండు కంపెనీలు 75 శాతం మార్కెట్‌ను శాసిస్తున్నాయి. తెలంగాణలో విత్తనోత్పత్తి మీద ప్రయివేట్‌ రంగం గుత్తాధిపత్యం నడుస్తుండడం ఈ ప్రాంత రైతులకు శాపంగా మారుతోంది. విత్తనరంగంలో 88 శాతం ప్రయివేట్‌ రంగం చేతిలో వుంటే, 12శాతమే ప్రభుత్వ రంగం అజమాయిషీలో నడుస్తోంది. నిజానికి ఒకప్పుడు విత్తనోత్పత్తి మొత్తం ప్రభుత్వ రంగంలోనే వుండేది. తెలంగాణలో 8 విత్తన పరిశోధన, ఉత్పత్తి కేంద్రాలున్నాయి. హరిత విప్లవంలో భాగంగా ఏర్పాటైన ఈ కేంద్రాలు రెండు దశాబ్ధాల పాటు చక్కటి సేవలందించాయి. అయితే, ఆ తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహం లభించకపోవడం, ప్రయివేట్‌ కంపెనీలకు అనుకూల నిర్ణయాలు తీసుకోవడంతో ప్రభుత్వరంగంలో విత్తనోత్పత్తిని చావుదెబ్బ తీశాయి. దీంతో ప్రయివేట్‌ కంపెనీలు విజృంభించాయి. కొన్ని కంపెనీలు కల్తీ విత్తనాలతో మార్కెట్లను ముంచెత్తాయి. ఏది కల్తీయో ఏదీ నాణ్యమైనదో గుర్తించలేని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రపంచంలోనే శ్రేష్టమైన విత్తనాలను ఉత్పత్తి చేయగల శక్తి వున్న రాష్ట్రంలో నకిలీ విత్తనాల రైతులను చావుదెబ్బ తీస్తుండడం మరో విషాదకర పరిణామం.

రైతులకు మేలు కలిగే చర్యలు తీసుకోవాలి..
ఇప్పటికైనా ప్రభుత్వం తెలంగాణ రైతులకు మేలు కలిగే రీతిలో ఒక విత్తన విధానం రూపొందించాలి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి, ఆ తర్వాత నిర్వీర్యమైన ప్రభుత్వరంగ సంస్థల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి. వాటికి అవసరమైన ఆర్థిక సహకారం అందించాలి. ఆ పని చేయకపోతే, ప్రయివేట్‌ సంస్థలు లాభాలు జుర్రుకుంటాయి తప్ప రైతులకు జరిగే ప్రయోజనాలేమీ వుండవు. ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే. పంట పండించిన మూడు నెలలకు తమ విత్తనాలు తీసుకెళ్లి, మరో మూడు నెలలకో, ఆరు నెలలకో బిల్లులు చెల్లిస్తున్నారన్నది రైతుల ఫిర్యాదు. అంతకాలం నిరీక్షించలేని రైతులు నాణ్యమైన విత్తనాలను కూడా సాధారణ ధాన్యం కింద అమ్ముకోవాల్సిన పరిస్థితి తెలంగాణలో వుండడం ఓ బాధాకర వాస్తవం. 

06:41 - November 2, 2015

ఢిల్లీ : ఇండియన్‌ టెన్నిస్‌ డబుల్స్ క్వీన్ సానియా మీర్జా మరో ఘనత సొంతం చేసుకొంది. 2015 సీజన్ ను నెంబర్ వన్ ర్యాంక్ తో పాటు...సింగపూర్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ డబుల్స్ టైటిల్ తో ముగించింది.స్విస్ మిస్ మార్టీనా హింగిస్ తో జంటగా..22 వరుస విజయాలతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. గ్రాండ్‌ స్లామ్‌ ఉమెన్స్‌ డబుల్స్‌ మిక్సిడ్ డబుల్స్ టైటిల్‌ సొంతం చేసుకున్న తొలి భారతీయ మహిళా టెన్నిస్‌ ప్లేయర్‌గా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకస్థానం సంపాదించింది.

ఎన్నో ఒడిదుడుకులు...
ప్రపంచ మహిళాటెన్నిస్ డబుల్స్ కే చిరునామాగా నిలిచిన పేరు. మిక్సిడ్ డబుల్స్, మహిళల డబుల్స్ లో గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో పాటు...నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన ఒకే ఒక్క భారత మహిళ సానియా మాత్రమే. మార్టినా హింగిస్‌ జోడీగా వింబుల్డన్‌, అమెరికన్ ఓపెన్ డబుల్స్ టైటిల్స్ నెగ్గిన తొలి భారతీయ మహిళా టెన్నిస్‌ ప్లేయర్‌గా సానియా రికార్డుల్లో చోటు సంపాదించింది. అయితే..ముంబైలో పుట్టి, హైదరాబాద్ లో టెన్నిస్ కెరియర్ ప్రారంభించిన సానియా రాత్రికి రాత్రే స్టార్ కాలేదు. కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. ఆటుపోట్లను అధిగమించి..ప్రపంచ నెంబర్ వన్ స్థాయికి చేరుకోగలిగింది.

జూనియర్ గా సంచలన విజయాలు..
జూనియర్‌ గా సంచలన విజయాలతో కెరీర్‌ ఆరంభించిన సానియా...2003లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌గా మారింది.కానీ సింగిల్స్‌లో కొన్ని అరుదైన విజయాలు నమోదు చేసిన సానియా అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో విఫలమైంది. గాయాలు, ఫిట్‌నెస్‌ సమస్యలతో సింగిల్స్ కు గుడ్ బై చెప్పడంతో సానియా కెరీర్‌ ఒకదశలో ముగిసినట్లే అనుకున్నారంతా. అయితే..ఆ తర్వాత నుంచి మిక్స్ డ్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్ కే పరిమితమైన సానియా మీర్జా....అరుదైన విజయాలతో పెద్ద సంచలనమే సృష్టించింది. మిక్స్ డ్ డబుల్స్ లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌ టైటిల్స్ నెగ్గిన సానియా...ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మాత్రం క్వార్టర్‌ఫైనల్స్ కే పరిమితమైంది. మహిళల డబుల్స్ లో.. జింబాబ్వే స్టార్‌ కారా బ్లాక్‌ జోడీగా.. 2014 డబ్ల్యూటీఏ సింగపూర్ ఫైనల్స్‌ టైటిల్‌ నెగ్గి సంచలనం సృష్టించింది. డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్‌ నెగ్గిన తొలి భారత మహిళా టెన్నిస్‌ ప్లేయర్‌గా రికార్డ్‌ నెలకొల్పింది.

ఐదుకు ఐదు విజయాలు..
ఇక స్విస్‌ వెటరన్‌...మార్టినా హింగిస్‌ జోడీగా 2015 వింబుల్డన్‌, యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్‌ టైటిల్స్ నెగ్గి .. తన కెరియర్ లోనే అత్యున్నత విజయాలు నమోదు చేసింది. 2015 సీజన్ ను ..సానియా కెరియర్ లోనే అత్యంత విజయవంతమైన సంవత్సరంగా చెప్పుకోవాలి. ఒకటికాదు..రెండు కాదు ఏకంగా పది టోర్నీల ఫైనల్స్ చేరి సంచలనమే సృష్టించింది. 2015 సీజన్ ముగింపుగా...సింగపూర్ లో జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో సానియా- హింగిస్ జోడీ హాట్ ఫేవరెట్లుగా, టాప్ సీడ్లుగా బరిలోకి దిగారు. టాప్ సీడింగ్ కు తగ్గట్టుగానే ఆడి..ఐదుకు ఐదు విజయాలు సాధించి ట్రోఫీ అందుకొన్నారు.

ఇదే జోరు కొనసాగించాలి..
2014 సీజన్ డబ్ల్యూటీఏ ఫైనల్ టోర్నీని క్లారా బ్లాక్ తో జంటగా సొంతం చేసుకొన్న సానియా...2015 సీజన్లో..సరికొత్త భాగస్వామి మార్టీనా హింగిస్ తో జోడీగా నిలుపుకోడం విశేషం. అంతేకాదు..ప్రస్తుత సీజన్ ను ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకుతోనే ముగించడం మరో విశేషం. 2015 సీజన్లో అసాధారణంగా రాణించిన సానియా జోడీ...2016 సీజన్లోను మరింత అత్యుత్తమ విజయాలు సాధించి...దేశానికి, తెలుగురాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచిపోవాలని...కోట్లాదిమంది అభిమానులతో పాటు...10 టీవీ సైతం కోరుకొంటోంది. హ్యాట్సాప్ సానియా...హిప్ హిప్ హుర్రే సానియా.

06:36 - November 2, 2015

పాకిస్తాన్ : పాకిస్థాన్ క్రికెటర్‌ షాహిద్ అఫ్రిదిపై అనుచిత వ్యాఖ్యలు చేసిందని ఆరోపిస్తూ, ప్రముఖ మోడల్‌, పాక్‌ నటి అర్షీ ఖాన్‌పై పాకిస్తాన్‌లోని ఓ ముస్లిం మతపెద్ద ఫత్వాను జారీ చేశారు. ఆమె ఇస్లాం మతాచారాలను అవమానించిందని ఫత్వాలో పేర్కొన్నారు. అఫ్రిదీతో డేటింగ్‌ చేయడం లేదంటూ ఒకసారి.. ఆయనతో శారీరక సంబంధం ఉందంటూ మరోసారి అర్షీఖాన్‌ ట్వీట్లు చేసింది. ఇది నా వ్యక్తిగత జీవితం అంటూ ట్విట్టర్లో కామెంట్లు పెట్టింది. ముస్లిం స్త్రీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ముస్లిం మతపెద్ద ఫత్వా జారీ చేశారు. అయితే దీనిపై న్యాయపోరాటం చేస్తానని అర్షీఖాన్‌ తెలిపింది. 

06:32 - November 2, 2015

 

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌ 1 నుంచి హెల్మెట్‌ తప్పనిసరి అనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గడువును మరింత పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వాహనదారులను హెల్మెట్‌ పేరుతో ఇబ్బంది పెట్టొద్దని పోలీసులకు రవాణాశాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ నిర్ణయంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే నవంబర్‌ 1నుంచి ద్విచక్ర వాహనదారులందరికీ హెల్మెట్ తప్పనిసరి అన్న ఆదేశాలతో పలు నగరాలు, పట్టణాల్లో పోలీసులు వసూళ్లను మొదలు పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో తొలిరోజు పట్టుబడిన పలువురి నుంచి జరిమానాగా 100 వసూలు చేయగా, మరికొన్ని చోట్ల కొందరు అక్రమార్కులు జేబులు నింపుకున్నారన్న వార్తలూ వెలువడ్డాయి. దీనిపై స్పందించిన మంత్రి శిద్ధా రాఘవరావు.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంప్రదించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. హెల్మెట్ వాడకంపై ప్రజలకు పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే హెల్మెట్‌ తప్పనిసరి అనే నిబంధన అమలవుతుందని మంత్రి శిద్ధా తెలిపారు.

ప్రజల్లో అవగాహన వచ్చిన తర్వాతే అమలు..
నవంబర్ 1 నుంచి ఏపీలో హెల్మెట్ తప్పనిసరి. నవంబర్‌ 1నుంచి హెల్మెట్ లేకుండా కనిపిస్తే తొలుత 100 రూపాయలు ఫైన్, ఆపై రెండోసారి పట్టుబడితే వాహనం సీజ్. గత నెల రోజులుగా పోలీసులు చేసిన ప్రచారమిది. అయితే ప్రజల్లో అవగాహన పెరిగిందో లేదో తెలియదుగానీ,.. పోలీసులు మాత్రం జరిమానాలు వసూలు చేయడం ప్రారంభించారు. రసీదు రాసి జరిమానాలు వసూలు చేయాల్సిన పోలీసులు ఆ పని చేయడం లేదన్న ఫిర్యాదులు కూడా అధికసంఖ్యలో వెల్లువెత్తాయి. హెల్మెట్ లేని వాహన దారుల నుంచి 50 రూపాయలు నొక్కేస్తున్నారని పలువురు ఆరోపించారు. ఉన్నతాధికారులు మాత్రం తాము ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, పోలీసులు రసీదులు రాయకుండా వసూలు చేసినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

విస్తృత చర్చ జరగాలన్న శిద్ధా...
ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌ వాడకంపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని మంత్రి శిద్ధారాఘవరావు ఒంగోలులో ప్రకటించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ మంది తలకు దెబ్బ తగలడం వల్లనే చనిపోతుండడంతో...హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేశామని..అయితే దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గుర్తించి గడువు పెంచామని మంత్రి తెలిపారు. మంత్రి నిర్ణయంపై ద్విచక్ర వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

06:29 - November 2, 2015

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైంది. వరంగల్ ఉప ఎన్నికతో మొదలైన పొలిటికల్ హీట్ తెలంగాణలో రాజుకుంటుంది. త్వరలో స్థానిక సంస్థల మండలి ఎన్నికలతో పాటు పలు మున్సిపాల్టీలకు ఎన్నికలు రానున్నాయి. వరంగల్ ఉప ఎన్నికలతో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లగా త్వరలో అన్ని జిల్లాలో పొలిటికల్ సెగ తగలనుంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పుడు.... రేపు అంటున్న స్థానిక సంస్థల మండలి ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల అవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

త్వరలో శాసన మండలికి నోటిఫికేషన్..
వరంగల్ ఉప ఎన్నికతో పాటు నారాయణఖేడ్ అసెంబ్లీ ఎన్నికకు నోటిఫికేషన్ వస్తుందని భావించినా మొదటి విడతలో శాసనసభా స్థానానికి ఈసీ నోటిఫికేషన్ వెలువరించలేదు. అయితే....త్వరలో ఈ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు.. శాసనమండలికి కూడా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న ధీమా నేతల్లో కనిపిస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం స్థానిక సంస్థల కోటాలో మరో మూడు మండలి స్థానాలను పెంచాలనే ప్రతిపాదనకు అన్ని రాజకీయ పార్టీలు అంగీకారం తెలుపడంతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ప్రస్తుతం 12 మండలి స్థానాల ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి.

ఓటర్ల వైపు నేతల చూపు..
రాష్ట్రంలో మరో రెండు నెలల పాటు ఎన్నికల వాతావరణం కొనసాగనుంది. ఆ వెంటనే గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలను రాజకీయ పార్టీలు ఎదుర్కోనున్నాయి. మూడు కార్పొరేషన్ల ఎన్నికలతో పాటు తెలంగాణలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మున్సిపాల్టీలకు, నగర పంచాయతీలకు కూడా ఎన్నికల నగరా మోగనుందని తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికలు డిసెంబర్ 15లోపు పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలున్నా... ప్రభుత్వం మరో నెల రోజుల గడువు కోరింది. దీంతో జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో గ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనన్న అంచనాలు వేయడంలో రాజకీయ పార్టీలు తలమునకలవుతున్నాయి. మొత్తానికి ఎన్నికలతో ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి ప్రధాన రాజకీయ పార్టీలు.

06:26 - November 2, 2015

విజయవాడ : ప్రత్యేక హోదా అడిగిన పాపానికి చితక్కొట్టారు. స్పెషల్‌ స్టేటస్‌ అంటే చంపేస్తాం అంటూ బెదిరించారు. ఈ బెదిరింపులకు తెగబడింది ఎవరో కాదు.. సాక్షాత్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపి నాయకులు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగిన పాపానికి విజయవాడలో విద్యార్థి జేఏసీ నేతలను చితక్కొట్టారు. బీజేపీ కార్యకర్తలు వ్యవహరించిన తీరుపై పలువురు ప్రజాస్వామిక వాదులు మండిపడుతున్నారు.
విజయవాడలోని బీజేపీ కార్యాలయం ఎదుట విద్యార్థి జేఏసీ నాయకులు ప్రత్యేక హోదా కోసం ఆందోళనకు దిగారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మను తగలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే అప్పుడే బయటికి దూసుకొచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు.. విద్యార్థుల ప్రయత్నాన్ని భగ్నం చేసి, వారిని ఇష్టారీతిగా చితకబాదారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ..తరిమి తరిమి కొట్టారు. అయినా సరే, విద్యార్థి నాయకులు మాత్రం ప్రత్యేక హోదా నినాదాలను ఆపలేదు. దీంతో బీజేపీ నాయకులు మరింత రెచ్చిపోయారు.

భగ్గుమన్న విపక్షాలు..
నగర బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు ఇంత పెద్ద గొడవ జరుగుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. చివర్లో రంగప్రవేశం చేసి..బాధితులైన విద్యార్థి నాయకులను స్టేషన్‌కు తరలించారు. దాడికి పాల్పడ్డ నాయకులను ప్రశ్నించలేదు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సైతం బీజేపీ నేతలు తగ్గలేదు. ఈ దాడి ఘటనతో అటు విద్యార్థి లోకంతో పాటు విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రత్యేక హోదా సాధన కోసం మరిన్ని ఉద్యమాలు చేస్తామని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. అటు విపక్షాలు కూడా విద్యార్థులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించాయి. దాడికి నిరసనగా ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు పాటించాలని విపక్షాలు నిర్ణయించాయి. ఇప్పటికైనా కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని లేనిపక్షంలో....పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని విపక్షాలు హెచ్చరించాయి. 

06:24 - November 2, 2015

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు దూకుడు పెంచారు. పని చేయని అధికారులపై తనదైన శైలిలో క్లాస్ తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితమే నెల్లూరులో మున్సిపల్, పారిశుద్ధ్య అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు..తాజాగా గుంటూరు జిల్లాలో రెవెన్యూ అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయని అధికారులను సస్పెండ్‌ చేస్తానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

మీ ఇంటికి - మీ భూమి..రెండో విడత 
గుంటూరు జిల్లాలో రెండవ విడత "మీ ఇంటికి- మీ భూమి" కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు.. ములకుదురు, చింతలపూడి గ్రామాల రైతులతో ముఖాముఖి నిర్వహించారు. పొలాలకు, భూములకు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో 1బి ఎంతమంది మార్చుకున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా గ్రామంలోని కొందరు రైతులు స్థానిక ఎమ్మార్వో, వీఆర్వోలు, సర్వేయర్లు పెడుతున్న ఇబ్బందులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సర్వే చేయడానికి, ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడానికి లంచాలు అడుగుతున్నారంటూ మరికొందరు చంద్రబాబుకు వివరించారు. ప్రజలు సమస్యలు చెప్పగానే చంద్రబాబు సదరు గ్రామానికి చెందిన అధికారులను స్టేజ్ మీదకు పిలిచి క్లాస్‌ తీసుకున్నారు. అధికారులు తప్పులు చేస్తే సస్పెండ్ చేస్తానంటూ హెచ్చరించారు.

అధికారులపై చంద్రబాబు ఆగ్రహం..
రెవెన్యూ శాఖకు సంబంధించి అన్నింటినీ ఆన్ లైన్‌లో పొందు పరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, దీని ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ భూముల వివరాలను ల్యాండ్ బ్యాంక్‌లో చూసుకోవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు మాత్రం అడ్డగోలు విమర్శలు చేస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. మొత్తానికి మీ ఇంటికి- మీ భూమి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని రెవెన్యూ సిబ్బందికి చంద్రబాబు గట్టి హెచ్చరికలు పంపారు. స్టేజీ పై ఎమ్మార్వోలను, వీఆర్వోలను మందలించడం అవసరం అయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో, అక్కడికి వచ్చిన రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

06:22 - November 2, 2015

విజయవాడ : రాజధాని భూసేరణే ప్రధాన అంశంగా ఇవాళ ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించిన తీరు, విజయవాడకు ఉద్యోగుల తరలింపు, ఇసుక పాలసీలో మార్పులు, పలు పరిశ్రమలకు భూముల కేటాయింపులపై ప్రధానంగా ఈ క్యాబినెట్‌ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

మధ్యాహ్నాం సమావేశం..
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ ద్వారా భూములివ్వని రైతులపై భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్న ఏపీ సర్కార్... భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల, దీని వల్ల క్షేత్ర స్థాయిలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయనే అంశాలపై ప్రధానంగా చర్చ జరపనుంది. అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా రాజధాని శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించిన తీరు, ప్రజల నుండి వచ్చిన స్పందనపై క్యాబినెట్‌లో చర్చకు రానుంది.

ఉద్యోగుల తరలింపు..వివిధ అంశాలపై చర్చ..
హైదరాబాద్‌లోని ఏపీ ఉద్యోగులు విజయవాడకు వచ్చే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ జూన్ లోపు ఉద్యోగులంతా విజయవాడకు తరలిరావాల్సిందేనని బాబు సర్కార్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలపై కూడా చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా ప్రస్తుత ఇసుక విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపధ్యంలో దీనిపై బాబు సర్కార్ దృష్టి పెట్టింది. ఇసుక విధానంలో లోపాలను తొలగించి మెరుగైన విధానాన్ని ప్రజలకు అందించే విధంగా ఈ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవవకాశం ఉంది. దీంతో పాటు పలు పరిశ్రమలకు భూముల కేటాయిపు, రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, బీజేపీ-టీడీపీ మధ్య సమన్వయం కోసం కమిటీ ఏర్పాటు, కాపులను బీసీల్లో చేర్చడంపై ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం, ఇంకా పలు అంశాలపై కేబినెట్‌ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని విజవంతంగా నిర్వహించిన ఏపీ ప్రభుత్వం... రాజధాని నిర్మాణానికి సంబంధించి వేగవంతంగా ముందుకు వెల్లడానికి ఈ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

నేటి నుండి హైదరాబాద్ - విశాఖ ఎయిర్ ఇండియా విమానం

హైదరాబాద్ : ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా నేటి నుండి హైదరాబాద్ - విశాఖ ఎయిర్ ఇండియా విమానం కొత్త సర్వీసు ప్రారంభం కానుంది. 

బీజేపీ నేతల దాడికి నిరసనగా నేడు ఆందోళనలు..

విజయవాడ : విద్యార్థి నేతలపై బీజేపీ నేతల దాడికి నిరసనగా నేడు వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగనున్నాయి. 

నేటి నుండి ప్రజా కళాకారుల ఐక్యవేదిక విస్తృత సమావేశాలు..

హైదరాబాద్ : నేటి నుండి ఉదయం 11గంటల వరకు ప్రజాకళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విస్తృత సమావేశాలు జరుగనున్నాయి.

 

కూకట్ పల్లిలో ఎస్ వోటీ పోలీసుల దాడి..

హైదరాబాద్ : కూకట్ పల్లి బాలకృష్ణనగర్ లో బాణాసంచా గోదాముపై ఎస్ వోటీ పోలీసులు దాడి నిర్వహించారు. రూ.4లక్షల విలువైన బాణాసంచా స్వాధీనం చేసుకున్నారు. 

06:03 - November 2, 2015

రవితేజ, తమన్నా, రాశిఖన్నా నాయకానాయికలుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై సంపత్‌నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న చిత్రం 'బెంగాల్‌ టైగర్‌'. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఓ డిఫరెంట్‌ స్టోరీతో మాస్‌రాజా రవితేజ ఎనర్జీ లెవల్‌కి ఏమాత్రం తగ్గ కుండా ఆద్యంతం వైవిధ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించామని నిర్మాత కె.కె.రాధామోహన్ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన పక్కా కమర్షియల్‌ హంగులున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈనెల 27న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. భీమ్స్ సంగీత దర్శకత్వం వహించిన ఈచిత్రంలోని పాటలు ఇటీవల విడుదలై విశేష ఆదరణ పొందాయని తెలిపారు.

 

06:02 - November 2, 2015

నాగార్జున తనయుడు అఖిల్‌ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో నితిన్‌ నిర్మిస్తున్న చిత్రం 'అఖిల్‌'. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది.
దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నామని నిర్మాత, నటుడు నితిన్‌ పేర్కొన్నారు. ఈ చిత్రంపై అటు ప్రేక్షకుల్లోను, ఇటు అక్కినేని అభిమానుల్లోను చాలా అంచనాలున్నాయని, అందుకు తగ్గట్టు గానే ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా చాలా భారీ ఎత్తున నిర్మించడం జరిగిందన్నారు. తొలి చిత్రం తోనే అఖిల్‌కి హీరోగా మంచి పేరు వస్తుందని నితిన్ తెలిపారు.

06:01 - November 2, 2015

ప్రతి ఇంట్లో ఉండే కలబంద ఎన్నో రకాల మేలు చేస్తుంది. అందానికే కాదు.. ఆరోగ్యానికి కలబంద ఉపయోగపడుతుంది. ఇది సన్‌స్క్రీన్‌ గానూ పనిచేస్తూ, స్కిన్‌ ఎలర్జీలను కూడా దూరం చేస్తుంది.

  • రోజ్‌ వాటర్‌, కలబంద రసం సమానంగా తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడిబారిన చర్మంపై పూస్తే చర్మం కళకళ లాడుతుంది.
  • కలబంద రసంలో కాస్తా కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. దీన్ని మోచేతులు, పాదాల వద్ద నల్లగా ఉన్న చోట పూస్తే నలుపు పోతుంది.
  • ఉదయం పరగడుపున కల బందను సేవిస్తే ఉదర సంబంధ సమస్యలు తొలగిపోతాయి.
  • కలబంద రసంలో అర స్పూన్‌ ముల్తానీ మట్టి , అర స్పూన్‌ చందనపు పొడి కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై ఫ్యాక్‌లా వేస్తే మొటిమలు మటు మాయమవు తాయి.
  • కలబంద రసాన్ని ముఖానికి పట్టిస్తే చర్మం ప్రకాశ వంతంగా మారుతుంది.
  • కాలిన గాయాలపై కలబంద రసాన్ని పూతలా పూస్తే గాయాలు మటుమాయం.
06:00 - November 2, 2015

రాత్రిపూట ద్రాక్ష పండ్లు తింటే హాయిగా నిద్రపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ద్రాక్షలో నిద్రకు సహాయపడే మెలటోనిన్‌ అనే హార్మోన్‌ ఉంటుంది. అలాగే ద్రాక్ష పండ్లలో గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు పాలీఫినోల్స్, ఫ్లేవనాయిడ్స్ అధిక మొత్తంలో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పాలకూరలో అధికంగా ఉండే పొటాషియం, క్యాల్షియం రాత్రిపూట హాయిగా నిద్రపోవడానికి సహకరిస్తాయి. అంతేకాదు, ప్రతిరోజూ పాలకూర తినే వాళ్లకు ఒత్తిడి, తలనొప్పి, కండరాలు, కీళ్లనొప్పి దరిచేరవు. దీంతో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖంగా నిద్రపోవచ్చు.
ఒక కప్పు నీటిలో రెండు పాలకూర ఆకులు వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. చల్లారేదాకా ఉంచి తర్వాత వడగట్టి చక్కెర కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నిద్రపోవడానికి అరగంట ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది. 

నేడు మిషన్ కాకతీయ ఫేజ్ - 2పై వర్క్ షాప్..

హైదరాబాద్ : మిషన్ కాకతీయ లక్ష్యాలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్లు, పథకం విధివిధానాల అమలు తదితర అంశాలపై మేదోమథనం నిర్వహించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఉదయం 10 నుండి సాయంత్రం 5.30గంటల వరకు జేఎన్టీయూ క్యాంపస్ లో మిషన్ కాకతీయ ఫేజ్ - 2 అమలుపై వర్క్ షాప్ జరుగనుంది. 

నేడు టి.తొలి బ్యాచ్ ఎస్సైల పరేడ్ పాసింగ్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పోలిస్ అకాడమీలో శిక్షణ పొందిన తొలి బ్యాచ్ ఎస్సైల పాసింగ్ ఔట్ పరేడ్ సోమవారం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, విశిష్ట అతిథిగా డీజీపీ అనురాగ్ శర్మలు హాజరు కానున్నారు.

డబ్ల్యూటీఎ ఫైనల్ విజేత రద్వాన్ స్కా..

సింగపూర్ : డబ్ల్యూటీఎ ఫైనల్ టోర్నీ సింగిల్స్ విజేతగా రద్వాన్ స్కా నిలిచాడు. ఫైనల్ మ్యాచ్ లో క్విట్జోవాపై వరుస సెట్లలో రద్వాన్ స్కా విజయం సాధించాడు. 

Don't Miss