Activities calendar

03 November 2015

కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఇద్దరి మృతి

కర్నూలు : అవుకు రిజర్వాయర్ లో దూకి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరు మృతి చెందారు. ముగ్గురిని స్థానికులు కాపాడారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. మృతులు వెంకటేశ్వర్లు, రుక్మిణీదేవి దొర్లిపాడు మండలం క్రిష్ణగిరికి చెందిన వాసులుగా గుర్తించారు.   

భారీగా బాణాసంచా సీజ్..

చిత్తూరు : పుత్తూరులో భారీగా బాణాసంచాను అధికారులు సీజ్ చేశారు. రూ.10 లక్షల విలువైన లారీ బాణాసంచా సీజ్ చేశారు. బాణాసంచాను తమిళనాడు శివకాశి నుంచి తీసుకొచ్చారు.

 

మాకు ఎవరితోనూ పోటీలేదు : వినోద్

హైదరాబాద్ : వరంగల్ లో తమకు ఎవరితోనూ పోటీలేదని టీఆర్ ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. రెండో స్థానం కోసం కాంగ్రెస్, టిడిపి పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు. టీఆర్ ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోతుందని చెప్పారు.

 

21:59 - November 3, 2015

ఢిల్లీ : 2జి స్పెక్ట్రమ్ కోసులో డీఎంకే ఎంపి కనిమొళికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రెండున్నర ఏళ్ల నుంచి కొనసాగుతున్న కేసు నుంచి తప్పించాలని ఆమె అత్యవసరంగా పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2జి స్పెక్ట్రమ్ కేసు విచారణ ట్రయల్ కోర్టులో తుది దశకు చేరుకున్న సమయంలో కేసు నుంచి తప్పించలేమని కోర్టు తెలిపింది. 2జి స్పెక్ట్రమ్ కేసులో కనిమొళి హస్తం ఉందని వచ్చిన ఆరోపణలపై ఆధారాలన్నింటినీ ట్రయల్ కోర్టుకు సమర్పించామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి హెచ్ ఎల్ దత్తు.. కనిమొళి పెట్టుకున్న అత్యవసర పిటిషన్ ను కొట్టివేశారు. 

196 కరవు మండలాలను గుర్తించాం : చినరాజప్ప

విజయవాడ : రాష్ట్రంలో కరవు మండలాలపై కలెక్టర్లతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారని మంత్రి చినరాజప్ప తెలిపారు. 196 కరవు మండలాలను గుర్తించామని చెప్పారు. వారం రోజుల్లో పూర్థిస్తాయి నిదేదిక వస్తుందన్నారు. కరవు మండలాలపై కేంద్రానికి నివేదిక పంపిస్తామన్నారు. కేంద్రం కరవు సాయం కింద రూ.440 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. రూ.330 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. 

21:41 - November 3, 2015

హైదరాబాద్ : మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శనాస్త్రాలు దూసుకుపోతున్నాయి. అప్పుడు చెప్పటం చేతకాని వాళ్లు ఇప్పుడెందుకు రాతలతో విరుచుకుపడుతున్నారు అంటూ నిరసన గళాలు ఒక్కటయ్యాయి. అయినవారికి ప్రయోజనాలు చేకూర్చేందుకు అధికారంలో ఉన్నవారిపై నిందలు వేయటం సరికాదంటూ హితవు పలుకుతున్నాయి.
హరిరామజోగయ్య రాసిన పుస్తకంపై వివాదం
రంగా మర్డర్ ఎపిసోడ్‌ను ఉటంకిస్తూ హరిరామజోగయ్య రాసిన పుస్తకంపై వివాదం చెలరేగుతోంది. రంగాను హతమార్చేందుకు చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారని సీనియర్ నేత తన పుస్తకంలో రాయటంపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. కాపులను టిడిపికి దూరం చేసేందుకే రామజోగయ్య పన్నాగం పన్నారని, చంద్రబాబును దోషిగా నిలబెట్టేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నారని విజయవాడ టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేసారు.
వాస్తవాలను వక్రీకరిస్తున్న హరిరామజోగయ్య : గాలి 
చనిపోయిన వాళ్ల పేరు చెప్పి హరిరామజోగయ్య వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ టిడిపి సీనియర్‌ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు విమర్శించారు. రంగా హత్య జరిగినప్పుడే సిబిఐ విచారణ జరిగిందని అప్పుడు తేలని నిజం ఇప్పుడెలా తేలుతుందని ఆయన ఫైరయ్యారు.
కాపు ఓటర్లకు చంద్రబాబు గాలం : అంబటి
ఇదిలా ఉంటే కాపు ఓటర్లకు గాలం వేసేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని వైసిపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. కాపుల్ని బీసీల్లో చేర్చుతామన్న ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు..ఇప్పటికీ ఆహామీని నెరవేర్చలేకపోయారని ఎద్దేవా చేసారు. చంద్రబాబుకు దమ్ముంటే వంగవీటి రంగా హత్యకేసులో వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి హరిరామజోగయ్య రాసిన పుస్తకం రాజకీయాలను వేడెక్కించింది. మరి నేతలంతా ఒక్కటై వేస్తున్న కామెంట్స్‌కు రామజోగయ్య బదులిస్తారో లేదో చూడాలి.

 

21:35 - November 3, 2015

విశాఖ : చంద్రబాబు ప్రభుత్వంపై జిల్లా సీపీఎం నేతలు విమర్శలు గుప్పించారు. భూసేకరణ పేరుతో భూమాఫియాను ప్రభుత్వం తయారు చేస్తుందని మండిపడ్డారు. 2005లో నావెల్‌ బెస్‌ స్పెషల్‌ ఆపరేషన్ పేరుతో 4,100 ఎకరాలు సేకరించి 10 ఏళ్లవుతున్నా నేటికి 5 లక్షల పరిహారం చెల్లించలేదని ధ్వజమెత్తారు. మత్స్యకారుల సంపదను దోపిడి చేస్తూ కోస్టల్‌ తీరాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. 

21:28 - November 3, 2015

ఢిల్లీ : రాష్ట్రపతి రాజ్యాంగ అధికారాల్ని ఉపయోగించి అసహన వాతావరణాన్ని సరిదిద్దాలని కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిశారు. దేశంలో పెరిగిపోతున్న అసహనపూరిత వాతావరణంపై కేంద్రానికి దిశానిర్దేశం చేయాలని వారు రాష్ట్రపతిని కోరారు. అంతకుముందు దేశంలో పెరిగిపోతున్న మత విద్వేషాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ మార్చ్‌ నిర్వహించింది. సోనియా, రాహుల్ నాయకత్వంలో పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు మార్చ్ చేపట్టారు. ఇందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. 

21:22 - November 3, 2015

హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం..రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ఇంకా విభజన సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. ఉద్యోగుల విభజన మొదలుకొని..యూనివర్శిటీలు, విద్యుత్‌ డిపార్ట్‌మెంటుల్లో విభజన ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో రెండు రాష్ట్రాల చీఫ్‌సెక్రటరీలు ఓ అడుగు ముందుకేశారు. విభజనతో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి మార్గాల్ని అన్వేషించే పనిలో నిమగ్నమయ్యారు.
ఇరు రాష్ట్రాల సీఎస్ ల భేటీ...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయి ఏడాదిన్నర కావొస్తుంది. అయినా విభజన సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దీనికి చెక్‌ పెట్టేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తెలంగాణ సచివాలయంలో సమావేశమయ్యారు. వీరితో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన విద్య, విద్యుత్‌ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. ఏపి జెన్‌కోకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన వెయ్యికోట్ల రూపాయలు, అలాగే తెలంగాణకు ఏపీ ఇవ్వాల్సిన 1100 కోట్ల బాండ్స్ చెల్లింపులపై ప్రధానంగా చర్చించారు. ఏపీకి ఇవ్వాల్సిన బకాయిలను విడతల వారిగా చెల్లించేందుకు తెలంగాణ సీఎస్‌ ఒప్పుకోగా..త్వరలోనే బాండ్స్ బకాయిలను చెల్లిస్తామని ఏపీ సీఎస్‌ తెలిపారు. ఇక ఏపీకి బదిలీ అయి తిరిగి తెలంగాణలో చేరిన ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల వేతనాల చెల్లింపులపై కూడా ఇరు రాష్ట్రాల సీఎస్‌లు చర్చించారు.
ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం పరీక్షల నిర్వహించాలని ఒప్పందం
ఇక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటి, అంబేద్కర్ ఓపెన్‌ యూనివర్శిటీల అడ్మిషన్ల నిర్వహణపై ఏపీ, తెలంగాణ సీఎస్‌లు చర్చించారు. రెండు యూనివర్శిటీల హెడ్ క్వార్టర్స్ తెలంగాణలో ఉన్నందున..ఇరు రాష్ట్రాల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహణపై చర్చించారు. ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వమే పరీక్షల్ని నిర్వహించేటట్లుగా ఒప్పందం కుదిరింది. అయితే రానున్న రోజుల్లో ఎవరు నిర్వహించాలనే దానిపై కొంత సందిగ్ధత నెలకొంది. పరీక్షల నిర్వహణ ఎవరి పరిధిలో ఉండాలన్న దానిపై మరోసారి భేటీ అయి చర్చించాలని ఇరు రాష్ట్ర సీఎస్‌లు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
అనేక అంశాలు పెండింగ్‌లో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌..రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఏడాదిన్నర కావొస్తున్నా..ఇంకా అనేక అంశాలు పెండింగ్‌లో ఉండడం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకే కాకుండా ప్రజలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే అన్ని అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేందుకు రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ముందుకు రావడం సంతోషంగా ఉందని ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

21:12 - November 3, 2015

అనంతపురం : సీఎం చంద్రబాబుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. మంత్రులు, టీడీపీ నేతలే ఇసుక మాఫియా వెనుక ఉన్నారని ఆయన ఆరోపించారు. ఇసుక మాఫియాలో ప్రభుత్వం చెబుతున్న దానికి.. చేస్తున్న దానికి పొంతన లేదన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టి.. అక్రమాలను నిలదీసిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన అన్నారు. అనంతపురం జిల్లాలో సీపీఐ నేతలపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. మరోవైపు విజయవాడలో విద్యార్ధి జేఏసీ నేతలపై దాడి చేసిన బీజేపీ నేతలపై ఎందుకు కేసులు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.

 

21:10 - November 3, 2015

హైదరాబాద్ : ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు బిజీబిజీగా గడిపారు. కేంద్రమంత్రి ఉమాభారతితో పాటు పలు శాఖల ఉన్నతాధికారులను ఆయన కలిశారు. మొక్కజొన్నకు సబ్సిడీ, పౌరసరఫరాలకు సంబంధించిన అనేక అంశాలపై ఆయన చర్చించారు. పత్తికి కనీస మద్దతు ధర ఐదు వేల రూపాయలకు పెంచాలని కోరామని చెప్పారు. పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరినట్లు హరీష్‌రావు తెలిపారు.

 

21:06 - November 3, 2015

కడప : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చేందుకు బీసీ కమిషన్‌కు అధ్యాయన బాధ్యత అప్పగించటంపై బీసీల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అగ్రవర్ణ కాపులను తమలో కలిపితే రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా తమ వాటాలో ఎక్కువ శాతం దక్కించుకుంటారని ఆదోళన వ్యక్తం చేస్తున్నారు. కాపులను బి.సి.ల్లో చేర్చేందుకు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటాన్ని వ్యతిరేకిస్తూ..కడప కలెక్టరేట్ వద్ద బి.సి.లు ఆందోళనకు దిగారు. కాపుల ఓట్లకోసం చంద్రబాబు..బి.సిలకు ద్రోహం చేస్తున్నాడని వారు ఆరోపించారు. అగ్రవర్ణ కాపులను బీసీల్లో కలిపితే బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. కాపులను బీసీల్లో చేరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

 

21:01 - November 3, 2015

ప్రకాశం : జిల్లాలోని ఆర్లుపాడులో తల్లీకొడుకులు అనుమానాస్పందంగా మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మార్కాపురం పట్టాణానికి చెందిన పూజారి లక్ష్మీ దేవి, సురేష్‌ ఇద్దరు తల్లి కొడుకులు. కొన్నేళ్ల క్రితం వీరు పొట్టకూటి కోసం వలస వచ్చారు. జీవనాధారం కోసం ఇద్దరు నీటి శుద్ధి కేంద్రంలో పని చేస్తున్నారు. వారం రోజుల నుంచి వీరి ఆచూకీ తెలియకపోవడంతో సన్నిహితులు గాలింపు చేపట్టారు. నీటి సంపులో ఇద్దరి మృతదేహాలు ఉన్నాయని తెలియటంతో వెలికితీయగా అవి వీరిద్దరివేనని తేలింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

20:58 - November 3, 2015

గుంటూరు : సింగపూల్ లాంటి రాజధానిని నిర్మిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దానికి సంబంధించి మాస్టర్ ప్లాన్, నమూనాను కూడా విడుదల చేసింది. మొత్తం 9 నగరాలుగా ఏపీ రాజధాని నిర్మాణం కాబోతుందని, ఒక్కో రంగానికి ఒక్కో ప్రత్యేకత కలిగి ఉండేలా నిర్మాణాలు చేయబోతున్నామని ప్రకటించింది. మరి ఆ 9నగరాలు ఏంటి? రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఏ ఏ నగరం ఎక్కెడెక్కడ రాబోతుంది? ఇదే ఇప్పుడు రాజధాని ప్రాంతంలో నడుస్తున్న చర్చ. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

 

20:54 - November 3, 2015

హైదరాబాద్ : ఉపాధ్యాయుల సమస్యపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయులు యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉద్యమబాట పట్టారు. ఇందిరాపార్క్‌ దగ్గర చేపట్టిన ధర్నాకు.. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు హాజరయ్యారు. వీరి ఆందోళనకు సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. అనంతరం సున్నం రాజయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధనకు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తానని రాజయ్య తెలిపారు. తనను గెలిపించిన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి అన్నారు.

 

20:49 - November 3, 2015

నిజామాబాద్ : ఆగిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ పనులు వెంటనే చేపట్టాలని నిజామాబాద్‌ జిల్లాలోని మోపాల్‌ నుంచి మంచిప్ప వరకు కాంగ్రెస్‌ నేతలు పాదయాత్ర చేపట్టారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో.. సీఎం కేసీఆర్‌ ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదని ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు బడ్జెట్‌లో కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే.. కేసీఆర్‌ ఆ ప్రాజెక్ట్‌ డిజైన్‌ మారుస్తానని నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు.

 

బేగంబజార్ లో పోలీసుల కార్డెన్ సెర్చ్

హైదరాబాద్ : బేగంబజార్ లో పోలీసుల కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 44 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 

పైడిపాలెం ప్రాజెక్టును సందర్శించిన జగన్

కడప : సింహాద్రిపురం మండలం పైడిపాలెం ప్రాజెక్టును వైసిపి అధినేత జగన్ సందర్శించారు. విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలం నుంచి నీరు విడుదల చేయడంతో రాయలసీమ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. పులివెందుల నియోజకవర్గంలో ఒక్క మండలాన్నే కరవు మండలంగా ప్రకటించడం పక్షపాత ధోరణికి నిదర్శనమన్నారు. 

వారానికి ఐదు రోజులు పత్తి కొనుగోలు : హరీష్ రావు

హైదరాబాద్ : వారానికి ఐదు రోజులు పత్తి కొనుగోలు చేయాలని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా మూడో సీసీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర కార్యదర్శికి విజ్ఞప్తికి చేసినట్లు పేర్కొన్నారు. సీసీఐ ప్రిన్సిపల్ సెక్రటరీని హైదరాబాద్ రావాలని కోరామని చెప్పారు. తెలంగాణలో రైతుల పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. కేంద్రం 84 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 48 సీసీఐ కేంద్రాలనే ప్రారంభించిందన్నారు. గోదాముల నిర్మాణానికి ప్రైవేట్ వ్యక్తులకు 25 శాతం రాయితీ ఇస్తున్నామని

 

పార్లమెంట్ వద్ద సిక్కుల ఆందోళన

ఢిల్లీ : 1984 లో సిక్కుల ఊచకోత ఘటనను నిరసిస్తూ… పార్లమెంట్ వద్ద సిక్కులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకునేందుకు సిక్కులు యత్నించారు. సోనియాగాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు సిక్కులను అడ్డుకుని.. వారిని పీఎస్ కు తరలించారు.

 

19:44 - November 3, 2015

హైదరాబాద్ : తనకు వచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చే ఉద్దేశం లేదని ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు. తన లేటెస్ట్ మూవీ 'చీకటిరాజ్యం' ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో కమల్‌హాసన్ మీడియాతో మాట్లాడారు. పలువురు సినీ ప్రముఖులు, రచయితలు, సైంటిస్టులు తమకు వచ్చిన జాతీయ అవార్డులను వెనక్కి ఇవ్వడాన్ని తాను సమర్థించబోనని చెప్పారు. అవార్డులను తిప్పి పంపే బదులు పోరాటం చేయాలని సూచించారు. భారత దేశంలో అసహన పరిస్థితులు 1947లో ఏర్పడి భారత్‌, పాకిస్తాన్‌గా విడిపోయిందని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితులు మళ్లీ రావద్దని కోరారు. దీనిపై ఐదేళ్లకోసారి చర్చ జరపాల్సిన అవసరం ఉందని కమల్‌ పేర్కొన్నారు.

 

చిన్నారిని కాపాడిన శునకం..

హైదరాబాద్ : ఓ చిన్నారిని శునకం కాపాడిందంటే నమ్మకలేకపోతున్నారా.. ఇది నిజం. కుక్క తన విశ్వాసాన్ని చాటుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన చిన్నారిని చెత్తకుండిలో పడేశారు. అక్కడికి వచ్చిన శునకం చెత్తకుండిలో ఏడుస్తున్న చిన్నారిని తన నోటితో పట్టుకొని దగ్గర ఉన్న ఇంటి దగ్గరకు తీసుకెళ్లి వాళ్లు వచ్చేవరకు మొరిగింది. కుక్క అరుపులు విన్న ఇంటి యజమాని బయటకు వచ్చి శిశువును చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ శిశువును స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. 

ఆటో-కారు ఢీ.. ఎనిమిది మందికి గాయాలు

నల్లగొండ : జిల్లాలోని నకిరేకల్ మండలం మందలాపురం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటో-కారు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను నార్కెట్‌పల్లి కామినేని, నకిరేకల్ ఆస్పత్రులకు తరలించారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

పాక్ విమానానికి తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌ : పాక్‌కు చెందిన షాహీన్‌ ఎయిర్‌ లైన్స్ విమానానికి మంగళవారం ఉదయం పెద్ద ప్రమాదమే తప్పింది. సాంకేతిక లోపం కారణంగా లాహోర్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేసే సమయంలో విమానం టైర్‌ పేలిపోయింది. దీంతో రన్‌ వే మీద నుండి విమానం పక్కకు వెళ్లిపోయింది. 276 మంది ప్రయాణికులున్న ఆ విమానంలో నుండి బిగ్గరగా కేకలు వినిపించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. విమానాశ్రయం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను వెంటనే కిందకు దించారు. ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

19:00 - November 3, 2015

విజయవాడ : విద్యుత్ బిల్లుల చెల్లింపులో వినియోగదారులకు మేలు చేకూర్చేందుకు ఈస్ట్రన్‌ పవర్‌ అనే ఓ మొబైల్ యాప్‌ను ఎపిఈపిడిసిఎల్ రూపొందించింది. ఎపిఈపిడిసిఎల్ సీఎండీ ముత్యాల రాజు యాప్‌ విడుదల చేశారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే ఏడాది క్రితం నుంచి విద్యుత్ వినియోగంతో పాటు బిల్లుల చెల్లింపు వివరాలన్నింటిని ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఇక ఫిర్యాదులను కూడా యాప్‌ ద్వారా చేయొచ్చని సీఎండీ తెలిపారు.

 

18:37 - November 3, 2015

ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన ఉబెర్‌ క్యాబ్‌ రేప్‌ కేసులో ఢిల్లీ న్యాయస్ధానం తీర్పు ఇచ్చింది. డ్రైవర్‌ శివ్‌కుమార్‌ యాదవ్‌ను దోషిగా తేల్చిన న్యాయస్ధానం అతనికి యావజ్జీవ ఖైదు విధించింది. 2014 సంవత్సరంలో ఢిల్లీలో ఉబెర్‌ క్యాబ్‌ ఎక్కిన ఓ మహిళపై డ్రైవర్ శివ్‌కుమార్‌ యాదవ్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈకేసును విచారించిన న్యాయస్థానం నిందితునికి యావజ్జీవ ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.
అత్యాచారం ఆపై హత్యాయత్నం..
ఓ ఫైనాన్స్‌ కంపెనీలో పని ముగించుకుని ఉబర్‌ క్యాబ్‌లో ఇంటికి బయలుదేరిన మహిళా ఉద్యోగిపై ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్‌ శివకుమార్‌ యాదవ్‌ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను తీవ్రంగా గాయపరచడమేకాకుండా గొంతునులిమి చంపేందుకు ప్రయత్నిచాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేసిన పోలీసులు... ఘటన జరిన రెండు రోజుల తర్వాత గతేడాది డిసెంబర్‌ 7న నిందితుడు శివకుమార్‌ యాదవ్‌ను మథురలో అరెస్టు చేశారు. దర్యాపుతో నిందితుడు నిజం ఒప్పుకున్నాడు. దీంతో అతనిపై ఢిల్లీలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణ జరిపిన న్యాయస్థానం గత నెల 20న శివకుమార్‌ యాదవ్‌ను దోషిగా తేలుస్తూ తీర్పు చెప్పింది. ఇప్పుడు అతడికి జీవిత ఖైదు విధించింది.
మహిళల జీవితాలను బలితీసుకుంటున్న లైంగిక నేరాలు
శివకుమార్‌ యాదవ్‌కు శిక్ష విధించిన ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు.... నిర్భయ కేసును ఉదహరించింది. 2012 డిసెంబర్‌ 16న నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచారం తర్వాత మహిళా ఉద్యోగిపై జరిగిన ఈ రేప్‌ కేసు తీవ్రసంచలనం సృష్టించిన విషయాన్ని ప్రస్తావించింది. లైంగిక నేరాలు మహిళల జీవితాలను బలితీసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో తీర్పు వెలువరించినప్పుడు శివకుమార్‌ యాదవ్‌ భార్యతోపాటు అతని ఇద్దరు కుమార్తెలు కూడా కోర్టులోనే ఉన్నారు.

 

 

18:16 - November 3, 2015

హైదరాబాద్ : ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కేసీఆర్‌ విఫలమయ్యారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ వస్తే న్యాయం జరుగుతుందని ఆశపడ్డ యువత.. ఉద్యోగ ప్రకటనలు లేకపోవడంతో వారు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారన్నారు. యువత, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. వరంగల్‌ ఉప ఎన్నిక ద్వారా టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పే అవకాశం వచ్చిందన్నారు.

17:49 - November 3, 2015

హైదరాబాద్ : చంద్రబాబుకు దమ్ముంటే వంగవీటి రంగా హత్యకేసులో వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు సీబీఐ దర్యాప్తు చేయించాలని వైసిపి నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. కాపుల్ని బీసీల్లో చేర్చుతామన్న ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు..ఇప్పటికీ ఆహామీని నెరవేర్చలేకపోయారని విమర్శించారు. కాపునేత ముద్రగడ పద్మనాభం కాపులను బీసీల్లో చేర్చాలని ఉద్యమానికి సిద్ధమవుతున్న వేళ...హఠాత్తుగా వందకోట్లతో కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ హడావుడి చేస్తున్నారని అంబటి ఎద్దేవా చేశారు.

 

17:40 - November 3, 2015

విజయవాడ : రంగా హత్యపై హరిరామజోగయ్య లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విజయవాడ టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్రావు మండిపడ్డారు. తనకు కావల్సిన వారికి ప్రయోజనం చేకూర్చేందుకే ఆయన పుస్తకం రాసినట్లు బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపై బురద జల్లేందుకే హరిరామజోగయ్య ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బిజెపి నేతలు కూడా చంద్రబాబును విమర్శించడం దారుణమన్నారు.

 

17:31 - November 3, 2015

పిల్లలకు భద్రమైన బాల్యాన్ని అందించాలని వక్తలు పేర్కొన్నారు. పిల్లలకు ప్రేమపూర్వకమైన స్పర్శను అందించాలని కోరారు. ఇదే అంశంపై నిర్వహించిన మావని వేదిక చర్చా కార్యక్రమంలో సాధన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మురళీమోహన్, సైకాలజిస్టు విజయేంద్ర పాల్గొని, మాట్లాడారు. బాల్యంలోని చేదు అనుభవాల ఫలితాలు జీవితాంతం వెంటాడుతాయన్నారు. అబ్యూజ్ కు గురైన పిల్లలకు మానిసిక చికిత్స అవసరమని అభిప్రాయపడ్డారు. పిల్లల ప్రవర్తనలో మార్పును గమనిస్తే మానసిక వైద్యుల సలహా తీసుకోవాలన్నారు. పిల్లలకు ఇష్టం లేని వారిని వారి దరి చేరనీయొద్దని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల కోసం వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించాలన్నారు. పిల్లల పట్ల అమర్యాదగా ప్రవర్తించే వారిలో స్నేహితులు, సన్నిహితులు, బంధువులే ఎక్కువగా ఉన్నారని గుర్తు చేశారు. క్రమశిక్షణ పేరుతో పిల్లలను దూషించడం, శిక్షించడం తప్పు అని పేర్కొన్నారు. ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు అబ్యూజ్ కు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించాలన్నారు. పిల్లల బాధ్యతను పరాయి వారికి అప్పగించకపోవటమే మేలు అని తెలిపారు. పిల్లలకు ఇష్టం లేకుండా వారిని దగ్గరికి తీసుకోవడం తప్పు అని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఉబెర్ క్యాబ్ రేప్ కేసులో నిందితునికి జీవిత ఖైదు

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన ఉబెర్ క్యాబ్ రేప్ కేసులో తీర్పు వెలువడింది. ఉబెర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్ ను ఢిల్లీ న్యాయస్థానం దోషిగా తేల్చింది. అతనికి యావజ్జీవ ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. 2014 లో ఉబెర్ క్యాబ్ లో ఎక్కిన ఓ మహిళపై శివకుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. డ్రైవర్ శివకుమార్ యాదవ్ ను దోషిగా తేల్చిన న్యాయంస్థానం అతనికి యావజ్జీవ ఖైదును విధించింది.

 

 

16:46 - November 3, 2015

నల్లగొండ : జిల్లాలోని సూర్యాపేటలో ఆశా వర్కర్ల ఆందోళన రసాభాసాగా మారింది. ఉద్యోగ భద్రతతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు కల్పించాలని గత 40 రోజులుగా ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లు.. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్ డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులు, ఆశావర్కర్ల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఆశావర్కర్లు సొమ్మసిల్లి పడిపోయారు. పలువురు ఆశావర్కర్లు, సీఐటీయూ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

16:44 - November 3, 2015

హన్మకొండ : వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో ఖచ్చితంగా విజయం సాధిస్తానని టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి దేవయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. టీడీపీ-బీజేపీ నేతలు, కార్యకర్తల ప్రచారం తనకు కలిసి వస్తుందని ఆయన అంటున్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే వరంగల్‌ను మరింతగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. యువతకు కేంద్ర పథకాలు చేరువయ్యేలా చూస్తామని తెలిపారు. ఉద్యోగాలు పొందే విధంగా యువతకు శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు.  

16:39 - November 3, 2015

నెల్లూరు : జిల్లా నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. నెల్లూరు నగరంలో పారిశుద్ధ్యం పడకేసింది, విషజ్వరాలు రాజ్యమేలుతున్నాయంటూ వైసిపీ కార్పోరేటర్లు టిడిపి సభ్యులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సహనం కోల్పోయిన టిడిపి కార్పోరేటర్లు వైసిపీ కార్పోరేటర్లపై జులుం ప్రదర్శించారు.

 

16:36 - November 3, 2015

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న అతి కొద్దిమంది నటుల్లో పవన్‌కళ్యాణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినీరంగ ప్రవేశం చేసినా ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుని అగ్ర కథానాయకుల స్థానానికి చేరడం పవన్‌కళ్యాణ్ ప్రత్యేకత. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా వెలిగిన పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకు బై.. బై చెప్పేయబోతున్నాడా..? కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నా.. ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నాడు.? అంటే.. జనసేన పార్టీనే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. 2014ఎన్నికలకు ముందు పవన్ జనసేన పార్టీని ప్రకటించాడు. ఎన్నికల్లో కూడా పోటీచేయాలని భావించి, చివర్లో తన నిర్ణయాన్ని మార్చుకుని టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించాడు. అప్పటినుంచి అడపాతడపా.. అక్కడక్కడా తప్ప చురుగ్గా పార్టీ కార్యక్రమాలేవీచేసింది లేదు. సినిమాల బిజీలో పడి పాలిటిక్స్‌‌కు టైం కేటాయించలేకపోతున్నానంటూ కొన్ని విషయాలపై ట్వీట్స్ ఇస్తూ తన గళం వినిపిస్తున్నప్పటికీ అది పార్టీమనుగడకు పూర్తిగా ఉపయోగపడని నేపథ్యం. దీంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాలని పవన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇప్పటి నుంచి పొలిటికల్ బరిలో జనసేన పార్టీని పటిష్టంచేయాల్సిన అవసరం ఉందని పవన్ ఉద్దేశ్యం. అలాచేస్తేనే 2019 ఎన్నికల నాటికి బలమైన జనసేనను నిర్మించవచ్చన్న ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, కొన్ని సర్కిల్స్‌‌‌లో పవన్ సినిమాలకు దూరం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పడమే జరిగితే అది ఎప్పుడు? అనేది కాలమే డిసైడ్ చేయాలి.

పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ ర్యాలీ ప్రారంభం

ఢిల్లీ : పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ ర్యాలీ ప్రారంభం అయింది. రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ కొనసాగునుంది. ఈ కార్యక్రమంలో సోనియా, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, ఎకె.అంటోనీ, షిండే తదితరులు పాల్గొన్నారు. దేశంలో నెలకొన్న మతవిద్వేష వావాతారణాన్ని తొలగించాలని రాష్ట్రపతిని కోరనున్నారు.

 

16:22 - November 3, 2015

బ్రిటన్ లోనే అత్యధిక వయస్సు కలిగిన ఓ వృక్షం తనంతతానుగా లింగమార్పిడికి లోనవుతున్నది. దాదాపు మూడు వేల నుంచి ఐదు వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఫార్టింగాల్ య్యూ వృక్షం.. పురుషుడి నుంచి స్త్రీగా పరిణామం చెందుతున్నది. పెర్త్షైర్ లోని ఈ ప్రాచీన చెట్టు పుప్పొడిని వెదజల్లేది. దీంతో దీనిని పురుష జాతి చెట్టుగా ఇన్నాళ్లు పరిశోధకులు భావిస్తూ వచ్చారు. అయితే ఇటీవల స్త్రీ జాతి చెట్టు మాదిరిగా ఫార్టింగాల్ య్యూ కూడా విత్తనాలకు ఉపయోగపడే రెడ్ బెర్రీస్ గుత్తులను కాస్తున్నది. య్యూ చెందిన ఓ కొమ్మకు ఇటీవల మూడు రెడ్ బెర్రీస్ గుత్తులను వృక్షశాస్త్రవేత్తలు గుర్తించారు. దీనినిబట్టి చెట్టులోని కొంతభాగం స్త్రీజాతిగా మారిందని నిర్ధారణకు వచ్చారు.

'య్యూలు మాములుగా పురుష లేదా స్త్రీ జాతి చెట్లుగా ఉండి.. శరత్కాలం, చలికాలంలో సులువుగా లైంగికోత్పత్తిలో పాల్గొంటాయి. మగజాతి చెట్లు గుండ్రని ఆకృతిలో ఉండి.. పుప్పొడిని వెదజల్లుతుంటాయి. వాటి ఆధారంగా శరత్కాలం, చలికాలంలో స్త్రీ జాతి య్యూ చెట్లు రెడ్ బెర్రీస్ ను కాస్తాయి' అని రాయల్ బొటానిక్ గార్డెన్ ఎడిన్ బర్గ్ కు చెందిన శాస్త్రవేత్త మాక్స్ కొలెమన్ తెలిపారు. 'అయితే, ఫార్టింగాల్ య్యూకు అక్టోబర్ లో మూడు రెడ్ బెర్రీస్ గుత్తులు కాయడం నన్ను ఆశ్చర్యపరిచింది. చెట్టు మొత్తం మగజాతిగానే ఉండగా.. ఒక కొమ్మకు మాత్రమే కాశాయి. ఇది చాలా విచిత్రం. య్యూలు, ఇతర శంఖాకార వృక్షాలు ఇలా స్వయంగా లింగమార్పిడికి లోనవ్వడంలో గతంలో ఎప్పుడూ వినలేదు' అని ఆయన వివరించారు. య్యూ చెట్టుకు వెలుపలిభాగంలో కాసిన ఒక కొమ్మ మాత్రమే ఇలా స్త్రీజాతిగా పరిణామం చెంది బెర్రీస్ ను కాస్తున్నదని ఆయన వివరించారు.

16:18 - November 3, 2015

రంగారెడ్డి : జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లీకొడుకు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. మైలార్ దేవ్ పల్లి కృష్ణారెడ్డినగర్ లోని పరుపుల ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తల్లీకొడుకులు సజీవదహనం అయ్యారు. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. మృతుల కుటంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

అగ్నిప్రమాదం.. తల్లీకొడుకు సజీవదహనం

రంగారెడ్డి : మైలార్ దేవ్ పల్లి కృష్ణారెడ్డినగర్ లో అగ్నిప్రమాదం జరిగింది. పరుపుల ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తల్లీకొడుకు సజీవదహనం అయ్యారు. సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు.  

15:55 - November 3, 2015

హైదరాబాద్‌ : హిందీ ఫిల్మ్‌ ఇండస్ట్రీకే పరిమితమైన ఐఫా అవార్డులు ఇప్పుడు దక్షిణాది సినిమారంగంలోనూ సందడి చేయనున్నాయి. ఇందుకు హైదరాబాద్‌ వేదికైంది. నాలుగు భాషా చిత్రాలకు గాను ఐఫా అవార్డులు ప్రకటించనుంది. హైదరాబాద్‌లోని గచ్చిఔలి స్టేడియంలో జరిగిన ఐఫా ఉత్సవ్‌ను సినీ దిగ్గజాలు లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఫా అడ్వైజరీ కమిటీ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఐఫా ఉత్సవ్‌కు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

 

15:54 - November 3, 2015

హైబీపీతో పాటు రక్తంలోని కొవ్వు కరిగించాలంటే వారానికి రెండుసార్లు మష్రూమ్స్ తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు. మష్రూమ్స్ మన శరరీ రక్తంలో కలిసిపోయిన కొవ్వును కరిగించి, రక్తాన్ని శుద్ధీకరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇతర కూరగాయల నుంచి పొందలేని పోషకాలు మష్రూమ్స్ నుంచి లభిస్తాయి. మష్రూమ్స్‌లో "డి" విటమిన్ అధికంగా ఉంటుంది. అందుచేత మష్రూమ్స్‌ను వారానికి రెండుసార్లైనా లేదా నాలుగు సార్లైనా తీసుకోవడం మంచిది. మష్రూమ్‌లోని లెంటిసైన్ (lentysine), ఎరిటడెనిన్ (eritadenin) అనేవి రక్తంలో కలిసిపోయిన కొవ్వును కరిగేలా చేస్తాయి. అంతేగాకుండా కరిగిన కొవ్వును ఇతర భాగాలను తరలించి మన శరీరానికి ఎలాంటి హాని కలగకుండా చేస్తుంది. ఇంకా శరీరంలోని అనవసర కొవ్వు శాతాన్ని బాగా తగ్గిస్తుంది. ఇంకా హై-బీపీ, గుండె జబ్బులకు కూడా చెక్ పెడుతుంది. వంద గ్రాముల మష్రూమ్స్‌లో పొటాషియం 447 మి.గ్రాములు, సోడియం 9 మి.గ్రాములు ఉన్నాయి. దీంతో మహిళలకు గర్భసంబంధిత రోగాలు, మోకాలి నొప్పులకు చెక్ పెట్టవచ్చు. అంతేకాదు.. రోజూ మష్రూమ్స్ సూప్ తీసుకునే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌ను నియంత్రించవచ్చునని ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. మష్రూమ్స్‌ను ఏరూపంలోనైనా తీసుకోవచ్చు. గ్రేవీతో కూడుకున్న వంటకాలను తయారుచేసుకోవచ్చు. లేదంటే సూప్ చేసుకోవచ్చు.

15:52 - November 3, 2015

హైదరాబాద్ :  ఆశాలు... ఈ పేరు వింటేనే చాలు తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడ లేని ఆక్రోషం.. కోపం ముంచుకొస్తుంది. సాక్షాత్తు మంత్రే ఆషా వర్కర్లపై తన నోటిదురుసును అందరిముందు ప్రదర్శించినా అదరకుండా బెదరకుండా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు ఆశా వర్కర్లు. అధికారులు అవహేళన చేసినా ఏ రోజుకైనా సర్కారు దిగివస్తుందనే ఆశతో ముందుకు కదులుతున్నారు.
ఆశాలది బండచాకిరి
ఒకటి కాదు రెండు కాదు ఏ సేవ చేయాలన్నా వారే గుర్తుకొస్తారు. ఏ కష్టమొచ్చినా గ్రామీణులకు వీళ్లే దేవుడిలా కనిపిస్తారు. తన కడుపులోని బిడ్డ క్షేమంగా బయటపడుతుందని ప్రతీ తల్లి ధైర్యంగా ఉందంటే అది ఆశా వర్కర్ల చలవే. అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన ప్రభుత్వ పథకం గ్రామీణ ప్రాంతాలకు చేరాలంటే సర్కారుకు మాద్యమ మార్గం ఆశావర్కర్లే. అలాంటి ఆశా వర్కర్లంటే ప్రభుత్వానికి, మంత్రులకు చిన్న చూపు. కనీస వేతనాలు కూడా చెల్లించకుండా ఆశాలతో బండచాకిరి చేయించుకుంటోంది. వేతనాలు పెంచాలని అడిగినందుకు నోరుపారేసుకుంటోంది.
ఆశా వర్కర్లకు నెల జీతం రూ.300-400
కేంద్ర ప్రభుత్వ పథకమైనా ఆశ వర్కర్లు చేయని సేవలు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు, సలహాలు, సూచనలు అందించడంలో వీరి పాత్ర కీలకమైనది. ప్రభుత్వ పథకాల సర్వేలు, బిఎల్ వో, పోలియో, ఇమ్యునైజేషన్, టీకాలు, ప్రభుత్వ హాస్పటల్‌లో ప్రసవం జరిగేలా చూడటం, గర్భిణులకు సలహాలు అందించటం ఇలా గ్రామాలను ఆరోగ్యవంతంగా తయారు చేయడంలో ఆశ వర్కర్ల సేవలు అమోఘమైనవి. ఇంత చేస్తున్నా వీరికి నెలకు ఇచ్చేది 300ల నుంచి 400ల రూపాయలు మాత్రమే.
డిఎంహెచ్ వో కార్యాలయాల ముట్టడి
సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి తెలంగాణలోని 25 వేల మంది ఆశ వర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం 62 రోజులుగా సీఐటియు ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నారు. రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, ధర్నాలు, చలో అసెంబ్లీ లాంటి వివిధ రూపాల్లో ఆశ వర్కర్లు తమ నిరసన తెలిపినా తెలంగాణ ప్రభుత్వం దిగిరాలేదు. అందుకే సర్కారు కొమ్ములు విరిచేందుకు సమ్మెను ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సీఐటియు ఆధ్వర్యంలో ఈ నెల 6, 7 తేదీల్లో అన్ని జిల్లాల్లో DMHO కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు.
లక్ష రూపాయల విరాళం ఇచ్చిన సీపీఎం
ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మెకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. వివిద రంగాల కార్మికులు, ఉద్యోగులు, మేధావులు, ప్రజాసంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. అనేక ఇబ్బందులు పడుతున్న ఆశాలకు ఆర్థికంగా సహాయం చేయాలని సీపీఎం.. ప్లీనరీ సమవేశాల్లో లక్ష రూపాయలకు పైగా విరాళం అదించింది. 31న పార్టీ శ్రేణులంతా విరాళాలు సేకరించగా 17 లక్షలకు పైగా వసూలయ్యాయి. వీటిని ఆశా వర్కర్లకు అందించారు పార్టీ నేతలు. ఆర్థికంగా...పోరాటపరంగా ఆశా వర్కర్లకు అండగా ఉంటున్న సీపీఎం, సిఐటీయు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ముందడుగు వేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు వెనుదిరిగి చూసేది లేదంటూ మరో ఉద్యమానికి సిద్ధమౌతున్నారు.

 

15:47 - November 3, 2015

హైదరాబాద్ : అల్లుఅర్జున్- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'సరైనోడు' దాదాపు 30శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. తాజాగా ఈ చిత్రం గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందులో బన్నీ పక్కన అనుష్క, ఇల్లీ స్పెషల్ అప్పీరియన్స్‌ ఇస్తారంటూ గాసిప్స్ వినిపించాయి. తాజాగా ఈ హీరో సరసన రాజోలు బ్యూటీ అంజలి స్పెషల్‌గా కనిపించనుందట. ఈ బ్యూటీకి వున్న క్రేజ్‌.. ఇటు క్లాస్, అటు మాస్‌ను ఎట్రాక్ట్ చేసుకోవచ్చని భావిస్తున్నాడు దర్శకుడు. ఈ మసాలా సాంగ్ కోసం భారీగా సెట్ కూడా రెడీ అయ్యింది. సరైన ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్న సీతకు ఇదో మంచి ఛాన్స్ అని యూనిట్ చెబుతోంది. ఇక ‘శంకరాభరణం’ చిత్రంలో డిఫరెంట్‌గా కనిపిస్తున్న ఈ అమ్మడికి ఇదో వెరైటీ ఛాన్స్. ఇవికాకుండా డిక్టేటర్, చిత్రాంగద వంటి మూవీస్‌లోనూ కనిపించనుంది. మొత్తానికి 2016 ఏడాది రాజోలు బ్యూటీ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అని అంటున్నారు.

15:33 - November 3, 2015

హైదరాబాద్ : కిడ్నాప్‌కు గురైన అమిత్‌ఖాన్‌ కుటుంబసభ్యులు క్షేమంగా ఉన్నారు. హైదరాబాద్ శివారు మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రైల్వే గుత్తేదారు కుటుంబాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేయడం కలకలం సృష్టించింది. కమలానగర్‌లో నివాసం ఉండే అమిత్‌ఖాన్‌ రైల్వే గుత్తేదారుగా పని చేస్తున్నాడు. సోమవారం ఇంట్లో ఉన్న భార్య అర్షియాబేగం, కొడుకులు రియాద్‌, హసన్‌లను గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. ఇంటి కాపలాదారుడు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాపైన వాళ్లు కరీంనగర్‌లో ఉన్నట్లు గుర్తించి క్షేమంగా తీసుకొచ్చారు. అయితే రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమిత్‌ఖాన్‌ నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేసి ఉడాయించాడు. బాధితులే అమిత్‌ఖాన్‌ కుటుంబసభ్యులను కిడ్నాప్‌ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

 

15:25 - November 3, 2015

హైదరాబాద్ : గిరిజనులకు జనాభా ప్రతిపాదికన విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు రాష్ట్ర సర్కార్‌ కల్పించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా వారికి కల్పించిన హక్కును ఇవ్వాలన్నారు. ప్రస్తుత జనాభా దృష్ట్యా 10 శాతం నుంచి 6 శాతానికి కుదించే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు.

15:22 - November 3, 2015

హైదరాబాద్ : షారూక్‌ ఖాన్‌ సోమవారం తన 50వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సృజనపరమైన, మతపరమైన అసహనం దేశంలో ఉండటం తగదనీ, అసహనం దేశానికి చేటంటూ వ్యాఖ్యానించారు. పైగా... అత్యంత అసహనతకు నిరసనగా రచయితలు అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని ఆయన స్వాగతించారు. ఈ నేపథ్యంలో షారూక్‌ చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ ప్రాచీ మంగళవారం విమర్శలు ఎక్కుపెట్టారు. ఆయనో పాకిస్తాన్ ఏజెంట్ అని, కావాలంటే పాక్‌కు వెళ్లిపోవచ్చని సూచించారు. అంతేగాక అనుచిత వ్యాఖ్యలు చేసిన షారుక్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా పద్మశ్రీ, ఇతర ప్రతిష్టాత్మక అవార్డులను వెనక్కిచ్చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సాధ్వీ డిమాండ్ చేశారు.

15:22 - November 3, 2015

హన్మకొండ : వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికకు వైసిపి అభ్యర్థి పేరు ఖరారైంది. జగన్ పార్టీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్‌ను బరిలోకి దించుతున్నట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోనే ప్రచారం చేపడతామని తెలిపారు. నల్లా సూర్యప్రకాశ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వరంగల్ ఓటర్లకు... పొంగులేటి విజ్ఞప్తి చేశారు.  

 

15:16 - November 3, 2015

హైదరాబాద్ : ఉద్యోగుల విభజనలో కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. ఉద్యోగుల విభజన, ప్రమోషన్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలో సీఎస్‌ రాజీవ్‌శర్మను కలిశారు. సీఎస్‌ విజ్ఞప్తి మేరకు రేపు ఇందిరాపార్క్‌ వద్ద ఉద్యోగ సంఘాలు తలపెట్టాల్సిన ధర్నాను వాయిదా వేసుకున్నట్లు శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.

 

15:09 - November 3, 2015

కరీంనగర్ : జిల్లాలోని విద్యానగర్‌లో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. మూడు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ లో ఆదివారం సాయంత్రం 3 గంటల సమయంలో సాయిలత అనే యువతి తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. వారి వెనుకాల నుంచి బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముందుకు వెళ్లి మళ్లీ వెనుదిరిగి యువతిపై యాసిడ్ పోశారు. అయితే సాయిలత తలను కిందికి వంచడంతో యాసిడ్ ఆమె ఉదరం, కాళ్లపై పడడంతో తీవ్రంగా గాయపడింది. యువతి బంధువులు టూటౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

15:04 - November 3, 2015

హైదరాబాద్ : ఎన్టీఆర్, సమంత ముచ్చటగా మూడుసార్లు జోడి కట్టారు. ఇప్పుడు నాలుగో సారి కూడా జతగా ఆడిపాడనున్నారని టాలీవుడ్ టాక్. నాన్నకు ప్రేమతో పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ తన తరువాతి సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ చెప్పాడు. కొరటాల శివ దర్శకత్వంలో ప్రారంభం కానున్న ఆ చిత్రానికి పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాలోనే సమంత మళ్లీ ఎన్టీఆర్‌తో జోడికట్టనుందని సమాచారం. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఓ హీరోయిన్‌గా నటిస్తుండంగా సమంత కూడా ఇందులో కనిపించనుందని టాక్.

వరంగల్ ఉపఎన్నిక ఎందుకొచ్చిందో కేసీఆర్ చెప్పాలి : జైపాల్ రెడ్డి

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక ఎందుకొచ్చిందో కేసీఆర్ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ప్రశ్నించారు. డిప్యూటీ సీఎంలను సీఎం దాసులుగా చూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక దళితులకు అన్యాయం జరిగిందన్నారు. 

 

పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

ఛత్తీస్ గఢ్ : సుకుమా జిల్లా పోలంపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.  

చంఢీయాగానికి స్థలాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్

మెదక్ : చంఢీయాగం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ సమీపంలో స్థలాన్ని పరిశీలించారు.

 

కాకినాడ నీటి సంఘాల సమావేశం రసాభాస..

కాకినాడ : జిల్లా నీటి సంఘాల సమావేశం రసాభాసగా జరిగింది. పిఠాపురం బ్రాంచ్ కెనాల్ కింద 32వేల ఎకరాలకు నీరివ్వాలని ఎంపీ తోట నర్సింహం, పిఠాపురం ఎమ్మెల్యే వర్మలు ఆందోళనకు దిగారు. దీనికి ఇతర ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. రబీ సీజన్ లో పట్టిసీమ ఎత్తిపోతల పనులు చేపట్టేందుకు వీలు లేదని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పట్టుబట్టారు. పిఠాపురం బ్రాంచ్ కెనాల్ తో సహా రబీకి 100 శాతం నీరు ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది. ఏలేరు కాలువ దిగువనున్న పంట పొలాలకు నీటి విడుదలపై సీఎంతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని హోం మంత్రి చిన రాజప్ప వెల్లడించారు. 

సొమ్మసిల్లి పడిపోయిన ముగ్గురు ఆశా వర్కర్లు..

నల్గొండ : . సీపీఎం ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల ఆందోళనతో సూర్యాపేట ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆశా వర్కర్లు..పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీనితో ముగ్గురు ఆశా వర్కర్లు సొమ్మ సిల్లి పడిపోయారు. సీపీఎం నేత గోపిపై సీఐ మొగిలయ్య చేయి చేసుకున్నారు. 

రెండు రాష్ట్రాల సీఎస్ ల సమావేశం ముగిసింది.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సచివాయంలో ఇరు రాష్ట్రాల సీఎస్ ల సమావేశం కొద్దిసేపటిక్రితం ముగిసింది. విద్య, విద్యుత్ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. 

రేవంత్ దొరికిన దొంగ - జోగు రామన్న..

ఆదిలాబాద్ : రేవంత్ రెడ్డి దొరికిన దొంగ అని, కేసీఆర్ పై విమర్శలు చేసే అర్హత రేవంత్ కు లేదని మంత్రి జోగు రామన్న విమర్శించారు. రేవంత్ పై పరువు నష్టం దావా వేస్తానని, పత్తి మార్కెట్ లో గొడవ చేసిన వారిలో రైతులు లేరని వ్యాఖ్యానించారు. రైతుల సమ్యలను పరిష్కరిస్తామన్నారు. 

కొలీజయం వ్యవస్థపై సుప్రీంలో విచారణ..

ఢిల్లీ : సుప్రీంకోర్టులో కొలీజయం వ్యవస్థపై విచారణ జరిగింది. మొత్తం కొలీజయం వ్యవస్థను మార్చాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. 

విద్యా వ్యవస్థ గాడి తప్పింది - సున్నం రాజయ్య..

హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యావ్యవస్థ గాడి తప్పిందని, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సంఘటిత పోరాటాల ద్వారానే డిమాండ్ల సాధించవచ్చన్నారు. 

ఇందిరాపార్కు వద్ద యూటీఎఫ్ మహాధర్నా..

హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం జరిగింది. సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ధర్నాకు సీపీఎం ఎమ్మెల్యే రాజయ్య, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ సంఘీభావం ప్రకటించారు. 

గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలి:జీవన్‌రెడ్డి

హైదరాబాద్ : గిరిజనులకు జనాభా ప్రతిపాదికన విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు రాష్ట్ర సర్కార్‌ కల్పించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా వారికి కల్పించిన హక్కును ఇవ్వాలన్నారు. ప్రస్తుత జనాభా దృష్ట్యా 10 శాతం నుంచి 6 శాతానికి కుదించే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు.

కరీంనగర్ లో యువతిపై యాసిడ్ దాడి..

కరీంనగర్ : విద్యానగర్ లో సాయిలతా అనే యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. యువతికి తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటన మూడు రోజుల క్రితం చోటు చేసుకుంది. టూ టౌన్ష పీఎస్ లో బంధువులు ఫిర్యాదు చేశారు. 

13:20 - November 3, 2015

విశాఖ : విద్యాసంస్థల్లో ర్యాంగింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. గతంలో లాగా కాలేజ్ నుంచి తొలగించడం కాకుండా... భవిష్యత్తులో ఎక్కడా చదవకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాంగింగ్ జరుగుతోందన్న వార్తలపై మంత్రి స్పందించారు. అధికారులతో రివ్యూ నిర్వహించిన గంటా.. బాధ్యులపై చర్యలపై తీసుకుంటామని హెచ్చరించారు.


 

నెల్లూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాస..

నెల్లూరు : నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. పారిశుధ్యం, డెంగ్యూ విష జ్వరాలపై మేయర్ ను టిడిపి - వైసిపి కార్పొరేటర్లు నిలదీశారు. దీనితో టిడిపి నేతలు - వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాలు తోపులాటకు దిగాయి. 

టి.సచివాలయంలో ఇరు రాష్ట్రాల సీఎస్ ల సమావేశం..

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో ఇరు రాష్ట్రాల సీఎస్ ల సమావేశం జరిగింది. విద్య, విద్యుత్ అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. 

సీఎస్ ను కలిసిన ఉద్యోగ సంఘ నేతలు..

హైదరాబాద్ : ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో సీఎస్ రాజీవ్ శర్మను ఉద్యోగ సంఘ నేతలు కలిశారు. సమ్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల విభజన, ప్రమోషన్లు తదితర అంశాలపై చర్చ జరిగింది. సీఎస్ విజ్ఞప్తి మేరకు రేపు ఇందిరాగాంధీ వద్ద తలపెట్టిన ధర్నాను వాయిదా పడింది.

 

మెట్రో ప్రాజెక్టు కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ నేతృత్వంలో మెట్రో ప్రాజెక్టు కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. 

వరంగల్ ఉప ఎన్నిక బరిలో వైసీపీ అభ్యర్థి..

హైదరాబాద్ : వరంగల్ ఎంపీ స్థానానికి వైసీపీ బరిలో నిలిచింది. ఆ పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్ ను బరిలో నిలుపుతున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. వైసీపీ పోటీ చేస్తే టిడిపి, కాంగ్రెస్ కు ఎందుకు భయమని, కేసీఆర్ తో కుమ్మక్కయ్యారన్న వార్తలు అవాస్తవమని పొంగులేటి స్ఫష్టం చేశారు. టిడిపి నేతలలే కేసీఆర్ తో కుమ్మక్కయ్యారని, తమ పోరాటం కేసీఆర్ పైనే జరుగుతుందని తెలిపారు. 

వరంగల్ బైపోల్ బరిలో వైసీపీ

హైదరాబాద్: వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థి పేరు ఖరారైంది. జగన్ పార్టీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్‌ను బరిలోకి దించుతున్నట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోనే ప్రచారం చేపడతామని తెలిపారు. నల్లా సూర్యప్రకాశ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వరంగల్ ఓటర్లకు... పొంగులేటి విజ్ఞప్తి చేశారు.

13:16 - November 3, 2015

హైదరాబాద్ :తెలంగాణ సచివాలయంలో ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు సమావేశమయ్యారు. సమావేశంలో విద్య,విద్యుత్ అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ భేటీకి ఇరు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు.

13:06 - November 3, 2015

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) సుందర రామన్ తన పదవికి రీజానామా చేశారు. సుందర రమాన్ రాజీనీమాను భారత క్రికెట్ కంట్రో బోర్టు (బీసీసీఐ) ఆమోదించింది. ఐపీఎల్ ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ లో సుందర రమాన్ పాత్ర పై ముగ్దల్ కమిటీ తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే..

13:03 - November 3, 2015

కృష్ణా : విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తంగా మారింది. కమిషనర్ లేనందున సమావేశం నాలుగు రోజుల పాటు వాయిదా వేయాలని వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. అయితే అందుకు మేయర్ అంగీకరించకపోవడంతో.. వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.

13:00 - November 3, 2015

హైదరాబాద్ : ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. పత్తి కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో... సిసిఐ ద్వారా కొనుగోలుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రైతులు ఆందోళనకు దిగకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న వారినే మార్కెట్ యార్డ్ లోకి అనుమతిస్తున్నారు.

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో రగడ

కృష్ణా : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. సభ మంగళవారం ఉదయం ప్రారంభమైన వెంటనే ప్రత్యేక హోదా కోసం పోరాడిన విద్యర్థులను అరెస్ట్ చేయడం అమానుషమని సభలో వైఎస్ఆర్ సీపీ కార్పోరేటర్లు స్పష్టం చేశారు. ఇంతలో సభ సజావుగా జరిగేలా చూడాలంటూ మేయర్ సదరు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దీంతో మేయర్ పోడియం వద్దకు చేరిన వైఎస్ఆర్ సీపీ కార్పోరేటర్లు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. అక్కడితో ఆగకుండా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇంతలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని...

ఏయూలో మంత్రి గంటా తనిఖీలు..

విశాఖ : ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ జరుగుతోందంటూ మీడియాలో ఆరోపణలు రావడంతో.. ఆంధ్ర ప్రధేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు క్యాంపస్ లో తనిఖీలు నిర్వహించారు. ర్యాగింగ్ ఆరోపణలపై వర్సిటీ అధికారులు, విద్యార్థుల వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... ర్యాగింగ్ చట్టాన్ని పటిష్టం చేశామని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ను ర్యాగింగ్ ఫ్రీ స్టేట్ గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కాగా.. సీనియర్ ల నుంచి వేధింపులు ఎదుర్కొన్న విధ్యార్థులు మీడియాను ఆశ్రయించినట్లు తెలిసిందని.. వారు తమకు ఫిర్యాదు చేస్తే..

12:40 - November 3, 2015

ఇలియానా చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగులో నటించబోతుంది. ఈ సారి రామ్‌ చరణ్‌తో జత కట్టనున్నట్లు టాక్. రామ్‌ చరణ్‌ 'బ్రూస్‌లీ' తర్వాత రీమేక్‌ చిత్రంలో పోలీస్‌ అధికారిగా కన్పించే పాత్రలో కన్పించబోతున్నారు. తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన 'తని వరువన్‌' చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయనున్నారు. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌కు జోడిగా 'కాజల్‌ అగర్వాల్‌'ను ఇప్పటికే ఎంపిక చేశారు. మరొక హీరోయిన్‌ కోసం అన్వేషిస్తున్నారు. కథను బట్టి ఆ పాత్రకు 'ఇలియానా' అయితే సరిగ్గా కుదురుతుందని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. ఈ చిత్రంలో నటించేందుకు ఇలియానా కూడా సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ హాలీడ్‌ ట్రిప్‌ కోసం అమెరికా వెళ్లారు.
ప్రతినాయకుడిగా అరవింద్‌ స్వామి
ఈ చిత్రంలో ప్రతి నాయకుడుగా అరవింద్‌ స్వామి నటించనున్నారట. ఈ పాత్ర కోసం చాలా మంది నటులను అనుకున్నారు కాని చివరకు అరవింద్‌ స్వామిని ఎంపిక చేసినట్టు తెలిసింది. దీనికి ఈయన అంగీకరించినట్టు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయి. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జనవరి నుంచి ఉంటుంది. దీనికి సురేంద్ర రెడ్డి దర్శకుడు. ఎన్‌.వి. ప్రసాద్‌, అల్లు అరవింద్‌ నిర్మాతలు.

కాంగ్రెస్ ర్యాలీ ప్రారంభం..

ఢిల్లీ : పార్లమెంట్ హౌస్ నుండి రాష్ట్రపతి భవన్ వరకు కాంగ్రెస్ ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర నేతలు పాల్గొన్నారు. 

ఐఎఫ్ఎఫ్ఐ కు చీఫ్ గెస్ట్ గా అనీల్ కపూర్ - జైట్లీ..

న్యూఢిల్లీ : ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015కు చీప్ గెస్ట్ గా నటుడు అనీల్ కపూర్ వ్యవహరిస్తారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు తెలిపారు.

 

ఏయూ విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి గంటా..

విశాఖపట్టణం : ఏయూ ర్యాగింగ్ ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఏయూలో విద్యార్థులతో మంగళవారం ముచ్చటించారు. విద్యాలయాల్లో ర్యాగింగ్ కు పాల్పడితే సహించేది లేదని, ర్యాగింగ్ కోసం చట్టాలు తెస్తున్నా అక్కడక్కడా ఇలాంటివి ఘటనలు పునరావృతమౌతున్నాయన్నారు. ర్యాగింగ్ కు పాల్పడినట్లు రుజువైతే భవిష్యత్ లో ఎక్కడా చదువుకోకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి గంటా హెచ్చరించారు. 

తెలంగాణ ట్రాన్స్ కో ఏఈ రాత పరీక్షకు హైకోర్టు పచ్చ జెండా..

హైదరాబాద్ : తెలంగాణ ట్రాన్స్ కో ఏఈ రాత పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 8వ తేదీన రాతపరీక్ష నిర్వహించుకోవచ్చని సూచించింది. కానీ తుది ఉత్తర్వులకే లోబడే నియామకాలు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఓపెన్ కోటా లేకుండా ఒక ప్రాంతానికి అవకాశం ఇవ్వడంపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 

గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతలు..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను బీజేపీ ఎల్పీ నేత లక్ష్మణ్, ఇతర నాయకులు కలిశారు. జీహెచ్ఎంసీ వార్డుల విభజన లోపభూయిష్టంగా ఉందని ఫిర్యాదు చేశారు.

అల్వాల్ లో కందిపప్పు విక్రయ కేంద్రం..

హైదరాబాద్ : అల్వాల్‌లోని రైతు బజార్‌లో కందిపప్పు విక్రయ కేంద్రాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. 

ఢిల్లీకి చేరుకున్న హరీష్ రావు..

న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రి హరీష్‌రావు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన కేంద్ర జౌళిశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ పాండాను కలువనున్నారు. సాయంత్రం 4 గంటలకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతిని కలువనున్నారు.

కృష్ణదాస్ ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు

విశాఖ : గాజువాక సబ్ రిజిస్ట్రార్ రమాకృష్ణ దాస్ న ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రూ.కోటి విలువైన ఆస్తుల్లుస్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిఆపరు.

ఐపీఎల్ సీఓఓ సుందర్ రామన్ రాజీనామా..

ఢిల్లీ : వివాదాస్పద ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) సుందర్ రామన్ రాజీనామా చేశారు. అతడిని రాజీనామాను బీసీసీఐ అంగీకరించనట్లు తెలుస్తోంది. 

పిచ్చికుక్క దాడి : 20 మందికి గాయాలు

శ్రీకాకుళం : పాలకొండ నగర పంచాయతీలోని మేదర వీధి, కోమటిపేట, గొల్లవీధి, రెల్లి వీధుల్లో మంగళవారం ఉదయం పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. కనిపించిన వారిని గాయపరిచింది. ఈ దాడిలో మహేశ్, కార్తిక్, సింహాచలం, నరేష్, మోహన్, అప్పలస్వామితో పాటు మరో 14 మంది గాయపడ్డారు. బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తెలుగు తమ్ముళ్లకు పెద్ద తలనొప్పిగా మారిన ఐడెంటికార్డు

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఐడీ కార్డు గుబులు రేపుతోంది. హైటెక్‌ పద్దతిలో ప్రవేశపెట్టిన సభ్యత్వ కార్డులతో నేతల ఆటలకు బ్రేక్‌ పడుతోంది. నేతలు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారనే సమాచారం కార్డుద్వారా తెలుస్తుండటంతో తెలుగుతమ్ముళ్లలో గుబులు మొదలైంది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా లేక సొంతపనుల్లో బిజీ అయిపోయారా అన్నది బట్టబయలు కావడంతో..నేతలకు కొత్త కష్టాలొచ్చిపడుతున్నాయి.

11:31 - November 3, 2015

హైదరాబాద్ : ప్యాసింజర్ విమానాల తయారీలో బోయింగ్, ఎయిర్ బస్ కంపెనీలకు చైనా పోటీకి రెడీ అవుతోంది. దేశీయ పరిజ్ఞానంతో ఆదేశం రూపొందించిన తొలి ప్యాసింజర్ విమానం సి 919 పరీక్షలకు సిద్ధమైంది. బోయింగ్ 737, ఎయిర్ బస్ 320 విమానాల తరహాలో ఇందులో కూడా 174 మంది దాకా ప్రయాణించే వీలుంది. 5వేల 5వందల 55 కిలోమీటర్ల దాకా ఎగిరే సామర్థ్యం ఉన్న ఈ విమానం తొలి టెస్ట్ ఫ్లెయిట్ ను వచ్చే ఏడాది నిర్వహించనున్నారు.

11:28 - November 3, 2015

హైదరాబాద్: దేశంలో పెరిగిపోతున్న అసహన పరిస్థితులకు కారణం నువ్వంటే నువ్వని కాంగ్రెస్‌-బిజెపిలు కత్తులు దూసుకుంటున్నాయి. ఈ అంశంపై మాట్లాడేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలుసుకున్నారు. రాష్ట్రపతితో సోనియా 40 నిముషాల సేపు ముఖా ముఖిగా సమావేశం జరిపారు. దేశంలో పెరుగుతున్న అసహన పరిస్థితులను ఆయనకు వివరించినట్టు సమాచారం. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలని సోనియా రాష్ట్రపతిని కోరినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై సోనియా నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ బృందం మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో సమావేశం కానుంది. బీఫ్‌ వివాదం, దాద్రీ ఘటన, అభ్యుదయ వాదుల హత్యలపై చర్చించనున్నారు.

అసహన పరిస్థితులపై విపక్షాలు, మేధావులు....

దేశంలో నెలకొన్న అసహన పరిస్థితులపై విపక్షాలు, మేధావులు తమ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోది తిప్పికొట్టారు. ఇందిరా గాంధీ హత్య అనంతరం1984లో దేశంలో జరిగిన సిక్కుల ఊచకోతపై ఊసెత్తని కాంగ్రెస్‌కు అసహన పరిస్థితులపై మాట్లాడే హక్కు లేదన్నారు. దేశంలో నెలకొన్న అసహన పరిస్థితులకు కాంగ్రెస్సే కారణమని ప్రధాని ఆరోపించారు.

బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ఖాన్‌ ఆందోళన ......

దేశంలో పెరుగుతున్న అసహన పరిస్థితులపై బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ఖాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రచయితలు, కళాకారులు ఏ రంగానికి చెందిన వారైనా సరే వారికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండాలని షారుఖ్‌ పేర్కొన్నారు. అవార్డులు వెనక్కి ఇచ్చేస్తున్న మేధావులు, రచయితలు, కళాకారులను గౌరవిస్తున్నానని తెలిపారు. ఒక కళాకారుడిగా నైతికత అంశంపై తన భావాలను వెల్లడించడం ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. ఏదైనా మాట్లాడితే తన ఇంటిపై రాళ్లు విసిరినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.

బీఫ్‌ వివాదం, దాద్రీ ఘటన....

బీఫ్‌ వివాదం, దాద్రీ ఘటన, అభ్యుదయ వాదులు కల్బుర్గి, పన్సారే, దబోల్కర్‌ హత్యలకు నిరసనగా దేశంలో అసహన పరిస్థితి నెలకొంది. గత కొన్ని వారాలుగా రచయితలు, కళాకారులు, సైంటిస్టులు తమ అవార్డులను వెనక్కి పంపడం ద్వారా నిరసన తెలుపుతున్నారు. భావ వ్యక్తీకరణపై జరుగుతున్న దాడికి మోది సర్కార్‌దే బాధ్యత అంటూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పరమత సహనం అనాదిగా వస్తున్న భారతీయ సాంప్రదాయమని, దీన్ని భావి తరాలు కాపాడాలని భారత్‌లో నెలకొన్న అసహన పరిస్థితులపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇటీవల ఘాటుగా స్పందించారు.

ఆదిలాబాద్ పత్తి మార్కెట్ లో ప్రారంభం కాని కొనుగోళ్లు..

అదిలాబాద్ : పత్తి మార్కెట్ లో ఇంకా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. తేమ విషయంలో అధికారులతో చర్చలు జరుగుతున్నాయి. పాస్ పుస్తకాలు ఉన్న రైతులకు మాత్రమే అనుమతులు ఇస్తున్నారు. 

కృష్ణా పుష్కరాల కోసం అధికారుల పరిశీలన...

హైదరాబాద్ : నల్గొండ - కృష్ణానది పరివాహక ప్రాంతంలో డీజీపీ అనురాగ్ శర్మ, జిల్లా కలెక్టర్, ఏస్పీ దుగ్గల్ ఏరియల్ వ్యూ నిర్వహించారు. కృష్ణా పుష్కరాలం కోసం ఘాట్ల ఏర్పాట్లను వారు పరిశీలిస్తున్నారు. 

విజయవాడ మునిస్పల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం..

విజయవాడ : మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. కమిషనర్ లేనందున సమావేశం నాలుగు రోజుల పాటు వాయిద వేయాలని వైసీపీ కార్పొరేటర్లు కోరారు. 

వరంగల్ వైసీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాష్..

వరంగల్ : ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థిగా పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యాప్రకాష్ పేరును ఖరారు చేశారు. కాసేపట్లో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

సబ్ రిజిస్ట్రార్ కృష్ణందాసు కు రూ. కోటి ఆస్తులు...

విశాఖపట్టణం : అక్కయపాలెం సబ్ రిజిస్ట్రార్ కృష్ణం దాసుపై ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో రూ. కోటి ఆస్తులున్నట్లు గుర్తించారు. కృష్ణందాసుకు చెందిన మూడు బ్యాంకు లాకర్లను అధికారులు సీజ్ చేశారు. ఏటికొప్పాక, నార్లపూడి ప్రాంతాల్లో ఏడు ఎకరాలు భూమి ఉన్నట్లు గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు.

గీతం వర్సిటీ విద్యార్థి అనుమానస్పదమృతి..

మెదక్ : ముత్తంగి విష్ణు లాడ్జిలో గీతం వర్సిటీ విద్యార్థి భాస్కర్ అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు.

 

జీహెచ్ఎంసీ కమిషనర్ తో టిటిడిపి నేతల భేటీ...

 హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డితో తెలంగాణ టీడీపీ నేతలు మంగళవారం సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పుతో ఎన్నికలకు బల్దియా సిద్ధమవుతున్న నేపథ్యంలో తమ అభ్యంతరాలను కమిషర్‌కు తెలిపారు. ఓటమి భయంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా గ్రేటర్ వార్డులను విభజించిందని టీటీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోపించారు. ప్రజలనే కాదు కోర్టును కూడా కేసీఆర్ తప్పుదోవ పట్టించారని విమర్శించారు.

11:19 - November 3, 2015

హైదరాబాద్ : పెండింగ్ వాటర్‌ ప్రాజెక్టులపై ఏపి సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేసి జోష్‌లో ఉన్న ఏపి సీఎం పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని భావిస్తున్నారు. నిర్మాణ స్ధలంలోనే బసచేసి ఏర్పాట్లతో పాటు పనితీరును పర్యవేక్షించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అనుకున్న లక్ష్యం పూర్తి కావాలంటే నిధులు విడుదల చేయాలి కనుక కొర్రీలు లేకుండా నిధులు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

త్వరితగతిన ఆధునీకరణ పనులు......

పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్న ఏపి సర్కార్ దూకుడుగా వెళ్లాలని డిసైడయింది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఆధునీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 2015-2016 వార్షిక బడ్జెట్ లో 4వేల678 కోట్ల నీటి పారుదల శాఖకు కేటాయింపులు జరిపారు. కానీ ప్రభుత్వ అంచనాలకు అవే రకంగాను సరిపోలేదు. దీంతో సీఎం చంద్రబాబు సూచన మేరకు మరో 3వేల కోట్ల అదనపు బడ్జెట్ నీటి పారుదల శాఖకు విడుదల చేసేందుకు ఏపి ఆర్ధిక శాఖ సుముఖత వ్యక్తం చేసింది.

9,10 తేదిల్లో ప్రాజెక్టుల వద్ద బస.....

పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఏకంగా సీఎం చంద్రబాబే రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 9,10 తేదిల్లో ప్రాజెక్టుల వద్ద బస చేసి నిర్మాణ పనులను పర్యవేక్షించాలని డిసైడయ్యారు. ఈ ఆపరేషన్‌ పెండింగ్ ప్రాజెక్ట్స్‌ కనుక సఫలమయితే రానున్న కాలంలో టిడిపికి తిరుగుండదని తెలుగు తమ్ముళ్లంటున్నారు. మరి ఇది ఎంత మేరకు సఫలీకృతమవుతుందో చూడాలి.

11:15 - November 3, 2015

హైదరాబాద్‌ : ఎర్రగడ్డలోని ఇఎస్‌ఐ ఆస్పత్రి అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. కార్మికులకు వైద్య సౌకర్యాలు అందించే ఆస్పత్రిలో అక్రమాలకు అంతేలేకుండా పోతోంది. ప్రధానంగా డయాగ్నస్టిక్స్‌ విభాగంలో పరికరాలు, ఎనలైజర్ల కొనుగోళ్లలో కోట్ల రూపాయలు పక్కదారి పడుతున్నాయి. రేట్‌ కాంట్రాక్ట్‌, ఈ ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా పరికరాలు కొనుగోలు చేయాలన్న నిబంధనలకు నీళ్లొదిలేస్తున్నారు. కాంట్రాక్టర్లు, ఆస్పత్రి అధికారులు కుమ్మక్కై అందినకాడికి దోచుకుంటున్నారు. మార్కెట్‌ ధరల కన్నా 200 నుంచి 300 రెట్లు అధికంగా రేట్లు కోట్‌ చేసి ఇఎస్‌ఐకి పంపిస్తున్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులు వాడే అత్యంత విలువైన కిట్లు, రీ ఏజెంట్లను కొనుగోలు చేస్తున్నారు.

టెండర్‌ లేకుండానే ఓ సంస్థకు......

టెండర్‌ లేకుండానే ఓ సంస్థకు హెమోక్యూ డబ్ల్యు ఇసి క్యూవెట్స్‌తో పాటు అల్బూమిన్‌, గ్లూకోజ్‌, హెచ్‌బి క్యూబెల్స్‌ సరఫరా కాంట్రాక్ట్‌ కట్టబెట్టారు. దీని కోసం ఏడున్నర కోట్లు వెచ్చించారు. అయితే ఈ క్యూవెట్లను ఉపయోగించే సామర్థ్యం ఇఎస్‌ఐ ఆధ్వర్యంలోని ఆస్పత్రులకు లేకపోవడం గమనార్హం. 12 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ఎనలైజర్స్‌నే నేటికీ వినియోగిస్తున్నారు. ఎనలైజర్లు సరఫరా చేసిన కంపెనీల నుంచే స్పేర్ పార్టులు మరమ్మతు నిర్వహణ సేవలు పొందవలసి ఉంటుంది. ఎనలైజర్ కొనుగోలు చేసిన ధర కంటే నాలుగైదు రెట్లు స్పేర్ పార్టు మరమ్మతుల కోసం వెచ్చించారు.

ఇఎస్‌ఐకి మూణ్నెళ్లకోసారి 45 కోట్లు మంజూరు......

తెలంగాణ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్‌కి ప్రతి మూణ్నెళ్లకోసారి ప్రభుత్వం 45 కోట్లు మంజూరు చేస్తోంది. 10 కోట్లు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు, 5 కోట్లు మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు, మరో 10 కోట్లు మందులకు, 5 కోట్లు సర్జికల్స్ కొనుగోలుకు వెచ్చిస్తున్నారు. మిగతా 15 కోట్లు డయాగ్నస్టిస్ పరికరాల కొనుగోళ్లకు ఖర్చు పెడుతున్నారు. ఈ వ్యవహారమంతా అవినీతి మయంగా మారింది. ఏటా 30 నుండి 40 కోట్లు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇఎస్ఐలో జరుగుతున్న అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించి...అవినీతి అధికారుల భరతం పట్టాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 104 పాయింట్ల లాభంలో, 25 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. 

విద్యుత్ సౌధ వద్ద ఏపీ విద్యుత్ కార్మికుల ఆందోళన..

హైదరాబాద్ : ఖైరతాబాద్ లోని విద్యుత్ సౌధ వద్ద ఏపీ విద్యుత్ ఒప్పంద కార్మికులు ఆందోళన చేపట్టారు. పెంచిన 15 శాతం వేతనాలను ఏకకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. 

లాడ్జిలో బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి

మెదక్ : పటాన్‌చెరు మండలం ముత్తంగిలోని విష్ణు లాడ్జీలో బీటెక్‌ విద్యార్థి ఉదయ్‌ అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థి ఉదయ్‌ రుద్రారంలోని గీతం యూనివర్శిటీ విద్యార్థిగా గుర్తించారు.

కాంట్రాక్టు విద్యుత్ కార్మికుల ఆందోళన

హైదరాబాద్: ఖైరతాబాద్ లోని విద్యుత్ సౌధ వద్ద ఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ధార్నా చేపట్టారు. పెంచిన 15 శాతం వేతనాలను ఏకకాలంలో చెల్లించడాలని డిమాండ్ చేశారు. 13 జిల్లాల నుంచి తరలివచ్చిన కాంట్రాక్టు కార్మికులు ధర్నా లో పాల్గొన్నారు.

గోడను ఢీ కొట్టిన లారీ: ఒకరి మృతి

హైదరాబాద్ : నగరంలోని చాదర్‌ఘాట్‌లో కాంటా దగ్గర వేగంగా వచ్చిన లారీ ఢీకొని గోడ కూలింది. దీంతో వాచ్‌మెన్‌ లింగయ్య మృతి చెందారు.

నిజామాబాద్ లో కాంగ్రెస్ నేతల పాదయాత్ర...

నిజామాబాద్ : జిల్లాలో కాంగ్రెస్ నేతలు పాదయాత్ర నిర్వహించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర నిర్వహించారు. ఈపాదయాత్రలో కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, సుదర్శన్ రెడ్డి, సురేష్ రెడ్డి పాల్గొన్నారు. 

ప్రత్యేక హోదాపై బీజేపీ నేతల వ్యాఖ్యలు...

అనంతపురం : ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఇబ్బందులున్నాయని ప్రత్యేక హోదా రాకపోయినా అంతకు సమానంగా నిధులు ఇచ్చి ఏపిని అభివృద్ధి చేస్తామని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, భవిష్యత్ బీజేపీదని కావూరి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఉన్న అస్సోంలో 30 ఏళ్లు అయినా అభివృద్ధి జరగడం లేదని సొమ్ము వీర్రాజు తెలిపారు. 

తిరుపతిలో ఎర్రచందనం పట్టివేత...

చిత్తూరు : తిరుపతి నగరంలోని మంగళం దగ్గర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జరిపిన తనిఖీల్లో పదిలక్షల రూపాయల విలువ గల ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. స్కార్పియోలో ఎర్రచందనం స్మగ్లర్లు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. 15 మంది స్మగ్లర్లు పరారయ్యారు.

 

నిజామాబాద్ లో కాంగ్రెస్ నేతల పాదయాత్ర...

నిజామాబాద్ : జిల్లాలో కాంగ్రెస్ నేతలు పాదయాత్ర నిర్వహించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర నిర్వహించారు. ఈపాదయాత్రలో కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, సుదర్శన్ రెడ్డి, సురేష్ రెడ్డి పాల్గొన్నారు. 

20 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత...

ఖమ్మం: జిల్లాలోని అశ్వారావుపేటలో ఇవాళ పోలీసులు పలు దుకాణాల్లో సోదాలు నిర్వహించారు. పట్టణంలోని రెండు దుకాణాల్లో అక్రమంగా నిలువ ఉంచిన 20 క్వింటాళ్ల నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిలువు ఉంచిన ముగ్గురు షాపు యజమానులపై కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న నల్లబెల్లాన్ని పోలీసులు ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు.

 

10:39 - November 3, 2015

హైదరాబాద్: హస్తినలో అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అర్థరాత్రి శివారులో ఉన్న ఓక్లా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

10:35 - November 3, 2015

కృష్ణా : విజయవాడలో విద్యార్ధులపై జరిగిన దాడి ఘటనను విద్యార్ధి లోకంతో పాటు.. విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ప్రత్యేక హోదా అడిగిన పాపానికి విద్యార్ధులపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రత్యేక హోదా సాధన సమితి నేతలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్ధులు ఆందోళనలు.....

విద్యార్ధులపై దాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్ధులు ఆందోళనలు చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఈనెల 10 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు ప్రకటించారు. విద్యార్ధులపై పెట్టిన కేసులు ఎత్తివేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు.

ప్రజల ఆకాంక్ష కోసం పోరాటం....

ప్రజల ఆకాంక్ష కోసం పోరాటం చేస్తామని ప్రత్యేక హోదా సాధన సమితి నేత శ్రీనివాస్‌ తెలిపారు. నేతలకు ధైర్యం ఉంటే.. మోదీ, అమిత్‌షాను నిలదీయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రధాని దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన విద్యార్ధులపై దాడి చేయడం దారుణమని పలువురు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదాపై కేంద్రం స్పందించకపోతే ఆందోళనలు ఉదృతమయ్యే అవకాశం కనిపిస్తోంది.

10:32 - November 3, 2015

వ‌రంగ‌ల్ : ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్..అక్కడినుండే విక్టరీ కొట్టాల‌ని త‌హ‌తహలాడుతోంది. ఇప్పడికే అభ్యర్థి ఎంపిక‌లో ఆచీతూచి వ్యవ‌హ‌రించిన హ‌స్తం పార్టీ..సిరిసిల్ల రాజ‌య్యను రంగంలోకి దింపింది. ఇక ఆయ‌న గెలుపే ల‌క్ష్యంగా ప‌క్కా ప్రణాళిక‌తో ముందుకెళ్తూ..దానికి కావాల్సిన సరంజామాను రెడీ చేసుకుంది కాంగ్రెస్.

కాంగ్రెస్‌కు వ‌రంగ‌ల్ గెలుపు చావోరేవుగా .....

ప్రతిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్‌కు వ‌రంగ‌ల్ గెలుపు చావోరేవుగా మారింది. దీనికోసం కాంగ్రెస్‌ సర్వశ‌క్తులు ఒడ్డుతుంది. వరంగల్‌ గెలుపు కోసం గాంధీభ‌వ‌న్‌లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. దీనికి రాహుల్‌గాంధీ దూతగా కొప్పుల రాజు , ఉత్తంకుమార్‌రెడ్డి, భ‌ట్టి విక్రమార్క, జానారెడ్డి, ష‌బ్బీర్‌అలీ, పొన్నాల‌ లక్ష్మయ్య, దామోదర్‌రెడ్డిలతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీలు హాజ‌ర‌య్యారు. తెలంగాణ ఇచ్చినందుకు ఈఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ గెలిచి సోనియాకు కానుక ఇవ్వాల‌ని ఈ సందర్బంగా నేత‌లు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికోస‌ం తెలంగాణ సెంటిమెంట్‌ను సొంతం చేసుకునేలా అందరిని భాగ‌స్వామ్యం చేయాల‌ని పార్టీ నేతలు నిర్ణయించారు.

చావోరేవుగా మారిన వరంగల్ గెలుపు.......

వరంగల్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ..గెలుపు కోసం ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో సీనియర్‌ని ఇన్‌చార్జీగా బాధ్యతల్ని అప్పగించింది. భూపాల‌ప‌ల్లి నియోజ‌క వ‌ర్గానికి సీఎల్పీ నేత జానారెడ్డి, వర్ధన్నపేటకు టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ భ‌ట్టి విక్రమార్క, వ‌రంగ‌ల్ ఈస్ట్‌కు టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వ‌రంగ‌ల్ వెస్ట్‌కు షబ్బీర్‌అలీ, ప‌రకాలకు జీవ‌న్‌రెడ్డిల‌ను ఇంచార్జులుగా నియ‌మించారు. ఇక మండ‌ల స్థాయిలో కూడా ఇంచార్జీల‌ను నియ‌మించారు. ఇప్పటికే అభ్యర్థి రాజయ్య నామినేషన్‌ దాఖలు చేయడంతో..ఇక ప్రచారాన్ని హీటెక్కెంచేందుకు సీనియర్లు రెడీ అవుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల వారిగా పాద‌యాత్రలు, బ‌హిరంగ స‌భ‌ల‌తో ప్రచారంలో దూసుకుపోవాల‌ని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ..వరంగల్ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాల‌న‌కు రెఫ‌రెండ‌మ్ అని ఇప్పటికే ప్రకటించింది. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఇచ్చిన హామీలను ఎండ‌గ‌ట్టాలని నిర్ణయించారు హస్తం నేత‌లు.

40మందితో స్టార్‌క్యాంపెయిన్‌.....

మ‌రోవైపు ఇప్పడికే ఓరుగల్లు పోరు ప్రచారానికి 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయిన్ లిస్ట్‌ను ప్రకటించింది కాంగ్రెస్. మొత్తానికి అభ్యర్థి ఎంపిక‌లో ఆచితూచి వ్యవహరించిన కాంగ్రెస్‌,.ఇక ప్రచారంలో దూసుకెళ్లాల‌ని డిసైడ్ అయింది. దీనికోసం సీనియ‌ర్, జూనియ‌ర్ అనే తేడా లేకుండా ఓరుగ‌ల్లును కైవసం చేసుకోవాలని హస్తం పార్టీ ఉవ్వీళ్లూరుతుంది.

10:26 - November 3, 2015

అనంతపురం: భర్త ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలను నీటి తొట్టిలో వేసి అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా బెస్తరపల్లి గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పంచాయతి సెకెట్రరీ నరేష్ భార్య లక్ష్మి... తన ఇద్దరు కుమారులతో ఈ దారుణానికి ఒడిగట్టింది. గత కొన్ని రోజులుగా భర్త సరిగ్గా ఇంటికి రాకపోవడం, మరో యువతితో వివాహేతర సంబందాన్ని కొనసాగిస్తున్నాడని తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఎంత చెప్పిన భర్త తన తీరు మార్చుకోక పోవడంతో మనస్తాపం చెందిన లక్ష్మి ఇద్దరు పిల్లలను నీటి తొట్టిలో వేసి అనంతరం ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

10:24 - November 3, 2015

విశాఖ : ఏసీబీ అధికారుల వలలో మరో కట్టలపాము చిక్కింది. విశాఖ అక్కయ్యపాలెం సబ్ రిజస్ర్టార్‌ కృష్ణందాసు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఆదాయానికి మించి అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తించారు. అటు కృష్ణందాసు బంధువుల ఇళ్లలోను సోదాలు కొనసాగుతున్నాయి.

10:23 - November 3, 2015

విశాఖ : ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం మొదలైంది. ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్లు తమను వేధిస్తున్నారని జూనియర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రిజిస్ట్రార్ ఇంజినీరింగ్ విభాగం వసతి గృహాల్లో తనిఖీలు చేపట్టారు. ర్యాగింగ్ ఘటన సమాచారం తీలుసుకున్న మంత్రి గంటా... ర్యాగింగ్ పై అధికారులతో సమీక్షించాలని నిర్ణయించారు.

సంచలన వ్యాఖ్యలు చేసిన ఛోటా రాజన్

హైదరాబాద్ : చీకటి సామ్రాజ్యపు నేత ఛోటా రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై పోలీసుల్లో కొందరు మాఫియా డాన్ దావూద్ తో సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. గత రెండు వారాల క్రితం ఇండోనేషియాలోని బాలీలో పోలీసులకు చిక్కిన ఛోటా రాజన్ ను భారత్ తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛోటారాజన్ ఈ రోజు మీడితో మాట్లాడారు. తాను దావూద్ ఇబ్రహీంకి భయపడనని..... ఉగ్రవాదం, దావూద్ కు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడతానని స్పష్టం చేశారు.

దావూద్ విషయంపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు - చాకో..

ఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహింను వెనక్కి తీసుకొస్తామని ఆనాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారని కానీ ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదని కాంగ్రెస్ నేత పి.సి.చాకో ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. 

09:59 - November 3, 2015

ఆమే పేరు మార్గరేట్ థోమ్ బెకమా..వయస్సు 97. కానీ చదువుకోవాలని ఎంతో తపన. మధ్యలోనే ఆపేసిన చదువును ఎలాగైనా చదివి డిప్లామా సాధించాలని ఆసక్తి. ఎలాగైనా తన పంతాన్ని నెగ్గింది. హై స్కూల్ లో గౌరవ డిప్లామా సాధించింది. కాథలిక్ సెంట్రల్ హై స్కూల్ లో మార్గరేట్ థోమ్ బెకామా విద్యనభ్యసిస్తోంది. 1936 సంవత్సరంలో కేన్సర్ తో బాధ పడుతున్న తన తల్లి అనారోగ్యం కారణంగా ఆమెను చూసుకొనేందుకు బలవంతంగా మార్గరేట్ చదువును మానేసింది. తల్లి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు మార్గరేట్ పై పడ్డాయి. కానీ హై స్కూల్ గౌరవ డిప్లామా సాధించాలని ఆశ ఉండేది. చివరకు ఈ ఏడాది ఆమె కుటుంబసభ్యులు స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించారు. 1936 కథను వినిపించారు. చదువు పట్ల ఆమె శ్రద్ధ చూసి ముగ్ధులైన టీచర్లు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అక్టోబర్ 29వ తేదీన యార్క్ షైర్ లోని బ్రిడ్జ్ మానోర్ సీనియర్ కమ్యూనిటీ లో స్నేహితులు, కుటుంసభ్యుల సమక్షంలో గౌరవ డిప్లామా అందుకుంది. 

తనను లక్ష్యంగా చేసుకున్నారు - వాద్రా..

ఢిల్లీ: ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుందని సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

అక్కయ్యపాలెం సబ్ రిజిష్ట్రార్ పై ఐటీ దాడులు..

విశాఖపట్టణం : అక్కయ్యపాలెం సబ్ రిజిష్ట్ర్రార్ కృష్ణందాసు ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి నిర్వహించారు. కృష్ణందాసు బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. 

ఏయూలో ర్యాగింగ్ కలకలం..

విశాఖపట్టణం : ఆంధ్ర విశ్వ విద్యాలయం ఇంజినీరింగ్ విభాగం విద్యార్థినుల వసతి గృహంలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఇంజినీరింగ్ విభాగంలో జూనియర్లను సీనియర్లు వేధిస్తున్నారు. పార్కులకు..బయటకు రావాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ జూనియర్ విద్యార్థులు రిజిష్ట్రార్ కు ఫిర్యాదు చేశారు. ఘటనపై స్పందించిన ఏయూ రిజిష్ట్రార్ ఉమా మహేశ్వరరావు ఏయూ ఇంజినీరింగ్ విభాగం వసతి గృహాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై ఏయూ అధికారులతో విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్షించనున్నారు. 

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య..

అనంతపురం : కుందుర్తి (మం) బెస్తవారిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబకలహాలతో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. 

09:14 - November 3, 2015

ఇండోనేషియా : తాను మాఫియా డాన్ దావూద్ ఇబ్రహింతో భయపడడం లేదని అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ పేర్కొన్నాడు. బాలిలో పోలీసు కస్టడీలో ఉన్న రాజన్ తొలిసారిగా మీడియాతో మాట్లాడి పలు సంచలన విషయాలు పేర్కొన్నాడు. తాను దావూద్ కు ..ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతానని స్పష్టం చేశాడు. తనపై ముంబై పోలీసులు కక్ష గట్టారని, చాలా మంది పోలీసులు దావూద్ అనుచరులని ఆరోపించాడు. అందుకని తాను ముంబైకు వెళ్లాలని కోరుకోవడం లేదని, ఢిల్లీకి వెళ్లే విధంగా చూడాలని కోరాడు. రాజన్‌ను తీసుకొచ్చేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాజన్‌ను భారత్ తీసుకెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నామని, అయితే దీనికి ఎంత సమయం పడుతుందన్న విషయం చెప్పలేమని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.
చోటా రాజన్ అలియాస్ రాజేంద్ర సదాశివ నికల్జీ ఇండోనేషియాలోని బాలిలో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు దావూద్‌కు సన్నిహితుడిగా మెలిగిన రాజన్‌కు 1993లో ముంబై పేలుళ్ల తర్వాత దావూద్‌తో విభేదాలు వచ్చాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా వీరిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఇతడిపై దాదాపు 70కి పైగా కేసులున్నాయి. అత్యధికంగా కేసులు ముంబైలో ఉన్నాయి. అక్కడనే అతడిని విచారించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. కానీ ముంబై పోలీసులపై పలు ఆరోపణలు చేయడంతో రాజన్ ను ఎక్కడకు తీసుకెళుతారనే దానిపై స్పష్టత రావడం లేదు. 

తెగిపడిన విద్యుత్ వైర్లు..నలుగురి మృతి..

ఉత్తర్ ప్రదేశ్ : గోండా ప్రాంతంలో హై టెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. 

ముంబై పోలీసులపై నమ్మకం లేదు - రాజన్..

బాలి : ముంబై పోలీసులపై తనకు నమ్మకం లేదని, ముంబై పోలీసుల్లో చాలా మంది దావూద్ ను కలిశారని పేర్కొన్నారు. చాలా మంది పోలీసులు దావూద్ అనుచరులని, పలు సార్లు నాపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. తాను ఢిల్లీకి వెళ్లాలని అనుకుంటున్నట్లు, దావూద్ ఇబ్రహింకు భయపడడం లేదని పేర్కొన్నాడు. దావూద్ కు వ్యతిరేకంగా ఎప్పుడూ పోరాడుతూనే ఉంటానని రాజన్ స్పష్టం చేశాడు. 

రాధా గోవింద స్వామి ఆలయంలో చోరీ..

శ్రీకాకుళం : మిలియాపుట్టిలో రాధా గోవిందస్వామి ఆలయంలో చోరీ జరిగింది. మూడ పంచలోహ విగ్రహాలు, వెండి విగ్రహం అపహరణకు గురయ్యాయి. 

08:44 - November 3, 2015

పత్తికి మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయని ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. పత్తి ధరపై రైతన్న ఆక్రందన..కాపులకు బీసీలకు రిజర్వేషన్, తెలంగాణ రాష్ట్రంలో అక్రమ కట్టడాలకు క్రమబద్దీకరణకు పచ్చ జెండా ఊపడం..యూపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ షాక్ తగిలింది..ఈ అంశాలపై టెన్ టివిలో 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమలో ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లోనే..

20 రోజుల్లో సీసీఐ వేయి క్వింటాళ్ల కొనుగోలు..
''పత్తి ధర అకస్మాత్తుగా పడలేదు. మొదటి నుండి ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడి తగ్గింది. పత్తి రూ. 5,100 క్వింటాళ్లకు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. రూ. 5,100 దీనికి 50 శాతం ఉత్పత్తి ఖర్చు వేసి రూ. 7,700 కనీస మద్దతు ధర ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. మార్కెట్ లో ధరలు పడిపోతే ప్రభుత్వ రంగ సంస్థల కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే సీసీఐ. నిబంధనల ప్రకారం పత్తిని కొనుగోలు చేస్తామని పేర్కొంటోంది. మరి కొనుగోలు ఎందుకు చేయడం లేదు. ఇక్కడ నిబంధనలు అడ్డుగా ఉన్నాయా ? మరి ఎందుకు సమస్యలు వస్తున్నాయి ? ఆసియా ఖండంలోనే పెద్ద మార్కెట్ గా పేరొందిన ఎనుమాముల మార్కెట్ కు సోమవారం వెళ్లడం జరిగింది. అక్కడ 25 వేల బస్తాల పత్తి వచ్చింది. కానీ సీసీఐ మాత్రం కేవలం 100 క్వింటాళ్లు మాత్రమే కొన్నది. కొనుగోలు ప్రారంభమైన నాటి నుండి ఇరవై రోజుల్లో సీసీఐ 1000 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేసింది.

సీసీఐ కొనుగోలు పెంచాలి..
ధరలు ఎలా స్థిరీకరించబడుతాయి ? మద్దతు ధరకు అర్థం ఏంటీ ? సీసీఐ అధికారులు, మార్కెట్ అధికారులు, ఇతరులకు కుమ్మక్కైవుతున్నారు. కొన్ని పరిస్థితుల్లో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముతున్నారు. నేతలు ఎందుకు ఇక్కడకు రావడం లేదు. పత్తి రైతు రోజకు రెండు కోట్ల రూపాయల మేర నష్టపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సీసీఐ కొనుగోలు పెంచాలి. మార్కెట్ లో చురుగ్గా జోక్యం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వేయి రూపాయలు బోనస్ ఇచ్చి ఆదుకోవాలి. నేతుల, ప్రజాప్రతినిధులు మార్కెట్ లో యార్డులో నిలబడండి. రైతుకు మద్దతు ధర వచ్చేలా చూడాలి.

కాపులు..బీసీలు..
ఏ వర్గమైన వెనుకబడిన వారమని ప్రకటిస్తే సరిపోదు. ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు బ్యాక్ వర్డ్ అనరాదు అని ఇందుకు రాజ్యాంగం ఒప్పుకోదని సుప్రీం చెప్పింది. ఇందిరా సహానీ కేసులో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని పేర్కొంది. కాపులకు బీసీ రిజర్వేషన్ లో వాటా ఇస్తారా ? అదనంగా వాటా ఇస్తారా ? దీనిపై ఏపీ ప్రభుత్వం ఏమి చెబుతుంది ? కొత్తగా ఇస్తే ఇందిరా సహానీ కేసు ఉల్లంఘన జరుగుతుంది. తమిళనాడులో రాజ్యాంగ చట్టంలో 9 వ షెడ్యూల్ లో చేర్చి రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ విషయంలో సుప్రీం కొన్ని విషయాలు చెప్పింది. 9వ షెడ్యూల్ లో చేర్చిస్తే ఆ చట్టాన్ని సమీక్షించలేమని తెలిపింది. అదే సందర్బంలో ఆ చట్టం రాజ్యాంగ మౌళిక స్పూర్తికి విరుద్ధంగా ఉంటే మాత్రం సమీక్షిస్తామని సుప్రీం తెలిపింది. అన్నీ కహానీలే'' అని నాగేశ్వర్ పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో క్రమబద్దీకరణ ఉత్తర్వులు..యూపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ షాక్ వంటి అంశాలపై కూడా ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. 

నేడు 11.30కు జైట్లీ మీడియా సమావేశం..

ఢిల్లీ : నేడు ఉదయం 11.30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015కు సంబంధించిన విషయాలను ఆయన వెల్లడించనున్నారు. 

ఆదిలాబాద్ కు మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి..

ఆదిలాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. రైతు సమస్యలు, వ్యవసాయ అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు.

 

 

 

నేడు సిరిసిల్లకు మంత్రి కేటీఆర్..

కరీంనగర్ : మంత్రి కేటీఆర్ జిల్లాలోని సిరిసిల్లలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. 

07:57 - November 3, 2015

వరంగల్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు సోమవారం నామినేషన్లు సమర్పించాయి. వామపక్ష, సామాజిక శక్తుల అభ్యర్థితో పాటు అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మరోవైపు యూపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నరసింహ (టీఆర్ఎస్), అద్దంకి దయాకర్ (కాంగ్రెస్), వేణుగోపాల్ (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

ముంబై చేరుకున్న సానియా..

ముంబై : టెన్నిస్ లో వరుస విజయాలతో రాణిస్తున్న సానియా మీర్జా ముంబైకు చేరుకుంది. క్రీడాభిమానులు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఒకప్పటి ప్రపంచ నెంబర్ వన్ మార్టినా హింగిస్ తో జతకట్టిన సానియా, ఈ ఏడాది ఏకంగా తొమ్మిది టైటిళ్లను గెలుచుకుంది. 

06:59 - November 3, 2015

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు పోరుబాట పట్టారు. ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించిన ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇవాళ చలో హైదరాబాద్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలేమిటి? వారు కోరిక లేమిటి? వర్కింగ్‌ ప్లేస్‌ లో వారి కష్టాలేమిటి? గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలేమిటి? కుదుర్చుకున్న ఒప్పందాలేమిటి? ఇలాంటి ఈ అంశాలపై టెన్ టివి జనపథంలో యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శి ఆర్‌ వి నరసింహారావు విశ్లేషించారు. 

తిరుపతిలో తగ్గిన భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటలు..నడక దారి వచ్చే భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. 

నేడు విశాఖలో మంత్రి అయ్యన్న పర్యటన..

విశాఖపట్టణం : నేడు విశాఖలో మంత్రి అయ్యన్న పాత్రుడు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు మంత్రి అయ్యన్న శంకుస్థాపన చేయనున్నారు.

 

నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీ..

ఢిల్లీ : నేడు పార్లమెంట్ హౌస్ నుండి రాష్ట్రపతి భవన్ వరకు కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర నేతలు పాల్గొననున్నారు. 

06:37 - November 3, 2015

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఐడీ కార్డు గుబులు రేపుతోంది. హైటెక్‌ పద్దతిలో ప్రవేశపెట్టిన సభ్యత్వ కార్డులతో నేతల ఆటలకు బ్రేక్‌ పడుతోంది. నేతలు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారనే సమాచారం కార్డుద్వారా తెలుస్తుండటంతో తెలుగుతమ్ముళ్లలో గుబులు మొదలైంది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా లేక సొంతపనుల్లో బిజీ అయిపోయారా అన్నది బట్టబయలు కావడంతో..నేతలకు కొత్త కష్టాలొచ్చిపడుతున్నాయి. నేతలు ఎక్కడున్నారు ఏంచేస్తున్నారు అనేది కార్డు ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందుతుండటంతో పార్డీ కార్యక్రమాలకు డుమ్మాకొట్టే నేతల ఆటల్ని కట్టిస్తోంది. కార్యాల‌యానికి వ‌స్తే కార్డు తప్పనిసరి అంటూ టిడిపి పెట్టిన గైడ్ లైన్‌..ఇప్పుడు దేశం నేతలను ఇరకున పెడుతోంది.

కార్డులో చిప్..
హైటెక్ హంగులతో సభ్యత్వ నమోదు కార్డులను తెలుగు తమ్ముళ్లకు అందచేసింది టిడిపి. ఇది కేవ‌లం స‌భ్యత్వ కార్డుల‌గానే కాకుండా చిప్‌ను కార్డులో అమర్చి పూర్తి డాటా ట్రాక్ అయ్యేలా చ‌ర్యలు తీసుకుంది. అయితే పార్టీ కార్యాల‌యానికి వ‌స్తున్న ప్రతి కార్యకర్త.. నేత ప్రధాన ద్వారం వ‌ద్ద కార్డును స్వైప్ చేసి లోప‌లికి రావాలని గైడ్‌లైన్ పెట్టింది. దీంతో కార్యకర్తగానీ..నేతగానీ కార్డును స్వైప్ చేస్తే ఆయ‌న రాక‌పోక‌ల వివరాల డాటా అంతా స్టోర్ అవుతోంది. సర్వర్‌లో నిక్షిప్తం అయ్యే ఈ డేటాను యాక్సెస్ చేయడం ద్వారా స‌ద‌రు వ్యక్తి కార్యాల‌యానికి వ‌చ్చి వెళ్లిన స‌మ‌యం, తేదీల వివరాలు తెలుస్తాయి. దీంతో ఎవ‌రు ఎప్పుడు పార్టీ కార్యాలయానికి వ‌స్తున్నారనేది సులభంగా తెలుస్తోంది. పార్టీప‌రంగా నేత‌ల‌కు జిల్లాల్లో కార్యక్రమాలను అప్పగించినప్పుడు వారు హైద‌రాబాద్‌లో ఉండి త‌ప్పుడు నివేదిక‌లు పంపితే వెంట‌నే తెలిసిపోతుంది.

హై టెక్ ప్లాన్ సక్సెస్ అవుతుందా ? 
కార‌ణం లేకుండా...చెప్పిన ప‌ని చేయకుండా పిచ్చాపాటిగా తిరిగే నేతలు కార్డు ద్వారా దొరికిపొయ్యే ప‌రిస్థితి ఉంది. అయితే ఈనెల 20నుండి 30 వరకు జరగనున్న జనచైతన్య యాత్రలలో నేతలందరూ పాల్గొనేలా చేసేందుకు ఈ టెక్నాలజీని వాడుకోవాలనీ పార్టీ భావిస్తోంది. కార్డుద్వారా మానిటరింగ్‌ చేసి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యేలా పార్టీ ఎత్తుగడ వేస్తోంది. అయితే పార్టీ వేస్తోన్న హైటెక్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి.

06:35 - November 3, 2015

వరంగల్ : జిల్లా పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని అందరికంటే ముందుగానే అధికార పార్టీ ప్రకటించినా... జిల్లా నేతల్లో గ్రూపు తగాదాలు అంతే ముందుగా బయటపడ్డాయి. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జిల్లా నేతలతో అంటీ ముట్టనట్లు వ్యవహరించి చర్చనీయాంశంగా మారారు. ఉపఎన్నికల సందర్భంగా.. కడియంకు సమన్వయ కమిటీలో పార్టీ అధినేత కేసీఆర్ స్థానం కల్పించారు.

ఆపరేషన్ ఆకర్ష్..
అయితే...... ఇతర నేతల్లో కూడా అసంతృప్తి కనిపిస్తోంది. పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో ఈ వ్యవహరం స్పష్టంగా బయటపడింది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం వర్గంతో ఎమ్మెల్యే రాజయ్య వర్గం బాహాబాహీకి సిద్ధమైంది. అదే విధంగా జిల్లాలో తమకంటూ ఓ గుర్తింపు ఉన్న కొండా దంపతులు కూడా పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై గుర్రుగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి చేరిక కొండా వర్గంలో అలజడి రేపింది. స్థానికంగా అందరి మద్దతు కూడగట్టాలనే ఉద్దేశంతో గులాబీ బాస్ వరంగల్ జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రోత్సహించి విపక్ష పార్టీలను మానసికంగా దెబ్బతీసేందుకు పావులు కదుపుతున్నారు. అదే సమయంలో సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి పెరుగుతుండటం చర్చనీయంశంగా మారుతోంది.

విజయం సాధిస్తామని ధీమా..
కడియం రాజీనామా చేసిన స్థానం కావడంతో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని కడియం వర్గం కూడా భావించింది. కాని పార్టీ పరంగా సమన్వయ కమిటీలో చోటు దక్కడంతో కడియం వర్గం నేతలు కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న వరంగల్ నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు ఒక్క సారిగా బయటపడడం పార్టీ అధిష్టానాన్ని సైతం అయోమయానికి గురి చేస్తున్నాయి. నేతల మధ్య ఉన్న అంతరాలను తొలగించే ప్రయత్నం జరుగకపోతే ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి ఊహించని విధంగా నష్టపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన కార్యకర్తల్లో మొదలవుతోంది. అయితే....విజయంపై మాత్రం గులాబీ నేతలు సంపూర్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

06:32 - November 3, 2015

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు టీఆర్‌ఎస్‌ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే స్వచ్చ హైదరాబాద్‌ పేరిట మురికివాడ్లలో అనేక కార్యక్రమాలకు వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. తాజాగా అక్రమంగా ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నవారికి రెగ్యులరైజ్‌ చేయాలని నిర్ణయించింది. క్రమబద్దీకరణకు రెండు నెలల్లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అక్టోబర్‌ 28 నాటికి ఉన్న భవనాలకే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ వర్తింపు ఉన్నట్లు మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.

పదివేల రూపాయల రుసుం..
భవనాల క్రమబద్ధీకరణకు 10 వేల రూపాయలు రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని.. ఇందుకోసం నేటి నుంచి రెండు నెలల సమయం ఇస్తామని మంత్రి తలసాని తెలిపారు. దరఖాస్తులు అందిన తర్వాత 6 నెలలలోపు ఆమోదిస్తామన్నారు. ఇకపై భవన నిర్మాణం, లేఔట్ల అనుమతుల సరళీకృతం కోసం సింగిల్‌ విండో విధానం అమలు చేస్తామన్నారు. భవిష్యత్‌లో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లు ఉండకూడదని.. ఇలా అక్రమంగా నిర్మించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని.. టౌన్‌ ప్లానింగ్‌కు ప్రత్యేక ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని తలసాని తెలిపారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్టి..
ఇక భూ క్రమబద్ధీకరణలో 100 చదరపు మీటర్ల వరకు ప్రతి చదరపు మీటర్‌కు 200 రూపాయలు,.. 300 చదరపు మీటర్లలోపు 400 రూపాయలు,.. 500 చదరపు మీటర్ల వరకు 600 రూపాయలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మురికివాడల్లో నివసించేవారయితే.. చదరపు మీటర్‌కు కేవలం ఐదు రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించారు. ఇక కనీస వసతుల కల్పన కోసం ప్రత్యేక చార్జీలు వసూలు చేయనున్నారు. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. సర్కార్‌ నిర్ణయంతో ఓట్లకు ఓట్లు.. ఖజానాకు కాసులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. 

06:29 - November 3, 2015

విజయవాడ : 6 గంటల పాటు కొనసాగిన క్యాబినెట్‌ సమాశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్యాబినెట్‌ సమావేశంలో ఇసుక మాఫియాపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇసుక అక్రమ రవాణాదారులపై కఠినంగా వ్యవహరించి వారిపై పీడీయాక్ట్‌ ప్రయోగించాలని ఏపీ క్యాబినెట్‌ నిర్ణయించింది. దాంతో పాటు ఒక సీనియర్‌ పోలీస్‌ అధికారిని నియమించి దీని పర్యవేక్షణ బాధ్యత అప్పగించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నవారు ఏ పార్టీ వారైనా వెనకాడకుండా అరెస్టు చేయాలని ఆదేశించారు. ఇక ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను ఎత్తివేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ప్రైవేటు వ్యాపారులు అడ్డగోలుగా ధరలు పెంచకుండా ఉండడం కోసం వీటిని ఏర్పాటుచేయగా..పెద్దగా అమ్మకాలు లేకపోవడంతో వాటిని ఎత్తివేయాలని క్యాబినెట్‌ నిర్ణయిచింది. అదే సమయంలో ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రభుత్వ దుకాణాలకూ టెండర్లు పిలిచి వేలం వేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది.

ప్రాజెక్టుల వద్ద నిద్ర కార్యక్రమం...
ఇక సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచడానికి ప్రాజెక్టుల వద్ద నిద్ర కార్యక్రమాన్ని తిరిగి చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ నెల 9,10 తేదీల్లో హంద్రీనీవా పనుల పరిశీలనకు వెళ్లి అక్కడే నిద్రిస్తానన్నారు. రాష్ట్రంలో వాటర్‌ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు..జల వనరుల పరిస్ధితిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ నెల 13న శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయించారు. పోలవరం నిర్మాణానికి ఇప్పటివరకూ వెచ్చించిన 2వేల కోట్లను కేంద్రం నుంచి రాబట్టుకొని ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేయాలని సీఎం నిర్ణయించారు. ఇక కందిపప్పు, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ఆశాఖ అధికారులపై సీఎం సీరియస్‌ అయ్యారు. 230 కోట్లు వెచ్చించి కందిపప్పు కొని చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసినా అది మార్కెట్లో ధరల పెరుగుదలను ఆపలేకపోయిందన్నారు. ఇక 33 సంవత్సరాల భూమి లీజు విధానాన్ని ఎత్తివేస్తూ దానిని 99 ఏళ్ల వరకు అవకాశం కల్పిస్తూ క్యాబినెట్‌ నిర్ణయించింది. జనవరి నుంచి హెల్మెట్‌ నిబంధన వంద శాతం అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

పలు నిర్ణయాలు..
ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న 67 రకాల సర్టిఫికెట్లతో పని లేకుండా ఆధార్‌కార్డు ప్రామాణికంగా సరికొత్త గుర్తింపు విధానానికి క్యాబినెట్‌ నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న 110 మున్సిపాలిటీల్లో ఉన్న అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు 18 కోట్ల వ్యయంతో 299 నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతపురంలో మెగాసోలార్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చిన నెడ్‌క్యాప్‌కు ఎకరం లక్షన్నర రూపాయలకు 3,554 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్‌ గురై ఆత్మహత్యకు పాల్పడిన రిషితేశ్వరి కుటుంబానికి రాజమండ్రి సమీపంలోని మోరంపూడిలో 500 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ కేబినెట్‌ తీర్మానించింది. రాజధాని అమరావతిలో డిసెంబరు 31లోపు సర్వే పూర్తి చేసి రైతులకు స్థలాల్ని అప్పగించి ఏప్రిల్‌లోపు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. రబీ సీజన్‌లో మినుములు, పెసర్లకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర కంటే వేయి రూపాయిలు అదనంగా చెల్లింపు. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు సహా శాటిలైట్‌ వర్సిటీగా కడపలో మౌలానా అజాద్‌ ఉర్దూ యూనివర్సిటీ. పరిశ్రమలతో పాటు ఐటీ, టూరిజం రంగాల్లో కూడా సింగిల్‌ డెస్క్ పాలసీ. కార్తీకవన సమారాధనలో భాగంగా నవంబర్‌ 25న రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని క్యాబినెట్‌లో నిర్ణయించారు.

06:26 - November 3, 2015

హైదరాబాద్ : అయితే ఓకె..ఈ డైలాగ్‌ వినగానే మనకు గుర్తొచ్చే నటుడు కొండవలస లక్ష్మణ్‌రావు (69). నవ్వులు పూయించిన ఆ హాస్య నటుడు ఇక లేరు. రచనలే కాకుండా నటనతో వెండితెరపై రాణించిన కొండవలస కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన నిమ్స్‌ ఆస్పత్రిలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో చనిపోయారు. ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో అయితే ఓకె డైలాగ్‌తో చాలా పాపులర్‌ అయిన కొండవలస..ఆ తర్వాత కబడ్డీ కబడ్డీతో సహా దాదాపు 200 సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. తెలుగు చిత్రసీమలో మరో హాస్యనటుడు నింగికెగిశాడు. ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో కుటుంబసభ్యులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తుండగానే..మార్గమధ్యలోనే కొండవలస తుదిశ్వాసవిడిచారు. కొండవలస ఇకలేరన్న వార్త తెలుసుకున్న తెలుగు చిత్ర పరిశ్రమ శోకసద్రంలో మునిగిపోయింది. అయితే ఓకే డైలాగ్‌ ఇక వినిపించదన్న వార్తను తెలుగు చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. ఆయన నటించిన చిత్రాలను గుర్తుచేసుకుంటూ దు:ఖసాగరంలో మునిగిపోయారు.

1946లో జననం..
శ్రీకాకుళం జిల్లాలోని కొండవలస గ్రామంలో ఆగస్టు 10, 1946లో లక్ష్మణ్‌రావు జన్మించారు. ఆ తర్వాత కొండవలస గ్రామం ఆయన ఇంటిపేరుగా మారిపోయి కొండవలస లక్ష్మణరావుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. 9వ తరగతి వరకు శ్రీకాకుళంలో చదువుకున్న కొండవలస..1959లో విశాఖలోని AVN కాలేజీలో డిగ్రీ వరకు విద్యనభ్యసించారు. ఆ తర్వాత 1967 నుంచి విశాఖపట్నం పోర్టు ట్రస్టులో కొన్నాళ్లపాటు ఆఫీసు సూపరింటెండెంట్‌గా ఉద్యోగం చేశారు. అక్కడి నుంచి 2001 వరకు వైజాగ్‌లోనే ఉద్యోగం చేస్తూ..పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కళాశాల స్థాయినుంచే నాటకరంగం మీద ఆసక్తి ఉన్న కొండవలస 1961 నుంచి 2001 వరకు స్టేజ్ ఆర్టిస్ట్‌గా కొనసాగి 378 అవార్డులను సొంతం చేసుకున్నారు. అందులో రెండు నంది అవార్డులు కూడా ఉన్నాయి. నవరాగం అనే నాటకానికి ఉత్తమ నటుడు, కేళీ విలాసం అనే నాటకంలో ఉత్తమ విలన్‌గా నంది అవార్డులు లభించాయి.

అయితే ఒకే డైలాగ్ తో ఫేమస్..
ఆ తర్వాత 2002లో సినిమా రంగంలోకి ప్రవేశించిన కొండవలస..వంశీ డైరెక్షన్‌లో వచ్చిన ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రంలో తొలిసారిగా నటించి "అయితే ఓకే డైలాగ్‌తో" తెలుగుప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు చిత్రంలో నటించిన తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కొండవలస ఆతర్వాత ప్రముఖ చిత్రాల్లో నటించి అందరిని నవ్వించారు. కలెక్టర్‌గారి భార్య, భజంత్రీలు, ఆదివారం ఆడవాళ్లకు సెలవు, అత్తిలి సత్తిబాబు ఎల్.కే.జి, ఒక విచిత్రం,అందాల రాముడు, జై చిరంజీవ, 2005లో ఎవడి గోల వాడిది, కాంచనమాల కేబుల్ టివి, పందెం, కబడ్డి కబడ్డి, దొంగరాముడు అండ్‌ పార్టీ, దొంగ-దొంగది, సారీ..నాకు పెళ్ళైంది, సత్యం లాంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను నవ్వించారు కొండవలస. 

నేడు ఆంధ్రాబ్యాంకు ఎండీ రాక..?

హైదరాబాద్ : ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా సురేష్ ఎన్ పటేల్ నియామకం ఖరారయింది. ఆయన సోమవారం న్యూఢిల్లీలోని ఆంధ్రాబ్యాంకు శాఖలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో విధుల్లో చేరనున్నట్లు తెలుస్తోంది. 

నేడు టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ధర్నా..

హైదరాబాద్ : పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్ర ధర్నా నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సిరెడ్డి, రవి పేర్కొన్నారు. ఉదయం 10.30గంటలకు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ప్రారంభిస్తారని తెలిపారు. 

05:58 - November 3, 2015

'రుద్రమదేవి' జీవిత చరిత్ర ఆధారంగా ఇటీవల 'అనుష్క'తో దర్శక, నిర్మాత 'గుణశేఖర్‌' 'రుద్రమదేవి' చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. తాజాగా గుణశేఖర్‌ 'వీరాభిమాన్యు' అనే టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించారు. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడి పాత్రను ఇతివృత్తంగా తీసుకుని గుణశేఖర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఈ చిత్రంలో వీరాభిమన్యుడు గా 'ఎన్టీఆర్‌' నటిస్తున్నాడన్ టాక్ వినిపిస్తోంది. 'బాల రామాయణం' చిత్రంతో బాల నటుడిగా ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసింది గుణశేఖరే. మహాభారత నేపథ్యంలో గుణశేఖర్‌ రూపొందించబోయే చిత్రంలో ఎన్టీఆర్‌ నటించడానికి కారణం కూడా ఇదేనట. దీనికి ముందు 'రుద్రమదేవి'లో గోనగన్నారెడ్డి పాత్ర కోసం గుణశేఖర్‌ ఎన్టీఆర్‌ని సంప్రదించారు. పలు కారణాల వల్ల ఎన్టీఆర్‌ ఆ పాత్రను చేయలేకపోయారని సమాచారం. దీంతో పాటు దర్శకుడు గుణశేఖర్‌ 'రుద్రమదేవి'కి సీక్వెల్‌గా 'ప్రతాప రుద్రుడు' చిత్రాన్ని సైతం ట్రాక్‌లో పెట్టారు. త్వరలోనే ఎన్టీఆర్‌కు 'వీరాభిమన్యు' స్క్రిప్ట్ ను గుణశేఖర్‌ వినిపిస్తారంట. 

05:57 - November 3, 2015

తన పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాల్లోకి ప్రవేశించడానికి వీల్లేదంటూ ప్రముఖ హాలీవుడ్‌ అందాల సుందరి కేట్‌విన్‌స్లెట్‌ హుకుం జారీ చేసింది. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియాలోకి తన ఇద్దరు పిల్లలను అనుమతించకుండా కట్టడి చేసింది. దీనిపై కేట్‌ స్పందిస్తూ, 'సామాజిక మీడియాలోకి ప్రవేశించడం వల్ల పిల్లలు తమ అస్తిత్వాన్ని కోల్పోతారు. అంతేకాదు వారి సహజసిద్ధమైన లక్షణాలపై ప్రభావం పడకుండా ఉండేందుకే ఈ పరిమితులు విధించాను. ఈ రోజుల్లో యువతపై సోషల్‌ మీడియా ప్రభావం చాలా ఉంది. దాని మాయలో పడి వారికి అసలు ఏం కావాలో అనే విషయం మరచిపోతున్నారు. ఆహారపు అలవాట్లలో కూడా తీవ్రమైన మార్పులొస్తున్నాయి. ఈ కారణాలతో తన ఇంట్లో సోషల్‌ మీడియాను నిషేధించి, పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాను' అని చెప్పింది.

05:56 - November 3, 2015

పాకిస్థాన్‌కి చెందిన ఉద్యమకర్త, నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత మలాలా జీవితంపై రూపొం దించిన 'హి నేమ్డ్ మి మలాలా' అమెరికన్‌ డాక్యు మెంటరీని ఇటీవల 17వ జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. దర్శకుడు డవిస్‌ గుగ్గెన్‌హేమ్‌ మలాలా జీవితాన్ని ఒక గంట ముప్ఫై నిమిషాల డాక్యుమెంటరీగా మలిచారు. బాలికల విద్యపై ప్రచారం చేస్తున్న మలాలాపై 2012 అక్టోబర్‌లో తాలిబన్లు దాడిచేసి కాల్చిన విషయం విదితమే. తీవ్ర గాయాల పాలైన మలాలా కోలుకున్న తర్వాత సైతం బాలికల విద్యా ప్రచారాన్ని ఆపలేదు. 17 ఏళ్ళ వయసులో నోబెల్‌ శాంతి బహుమతిని అందుకున్నారు. మలాలాపై రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో వాస్తవంగా జరిగిన వీడియో క్లిప్‌లు, ఇంటర్వ్యూలను పొందుపరిచారు.

05:55 - November 3, 2015

'బాహుబలి' చిత్రాన్ని ఉత్తర భారతంలో విడుదల చేసిన ప్రముఖ బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌జోహార్‌ సూచన మేరకు అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్‌ను 'బాహుబలి2'లో తీసుకునేందుకు దర్శక, నిర్మాతలు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కరణ్‌జోహార్‌ రూపొందించిన పలు చిత్రాల్లో మాధురీ నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'బాహుబలి2' చిత్రంలో మాధురీ నటిస్తోందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అలాగే ఈసారి సెకండ్‌ పార్ట్ లో పలువురు బాలీవుడ్‌, కోలీవుడ్‌ తారల్ని సైతం ఎంపిక చేయనున్నారట. 'బాహుబలి'తో తెలుగు సినిమా మార్కెట్‌ విసృతమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌, కోలీవుడ్‌ నటీనటులతో సినిమా రూపొందడం వల్ల సినిమాకు జాతీయంగా, అంతర్జాతీయంగా మార్కెట్‌ రేంజ్‌ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే దర్శక, నిర్మాతలు పరభాషా నటీనటులను ఎంపిక చేస్తున్నట్టు సమాచారం.

 

05:54 - November 3, 2015

నేటి పోటీ ప్రపంచంలో చిన్న పెద్దా అన్న తేడా లేకుండా అందరూ కాలంతో పోటీ పడుతున్నారు. ఈ వేగంలో అనునిత్యం మానసిక ఆందోళనలు, ఒత్తిడికి గురవుతున్నారు. తద్వారా జ్ఞాపకశక్తి మందగిస్తోంది. విద్యార్థులు అయితే సబ్జెక్టుల మోతతో సతమతమైపోతున్నారు. కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే జ్ఞాపకశక్తి చాలా అవసరం. జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు బాదంపాలు ఎంతో ఉపకరిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పడుకునే ముందు తీసుకోవటం వల్ల అధిక ప్రయోజనం ఉంటుందట.
అంతే కాదండోయ్ బాదం పాలలో సోడియం తక్కువగా ఉండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉండటం వల్ల గుండె నొప్పి, బీపీ అవకాశాలను తగ్గిస్తుంది. మలబద్దకంతో బాధపడేవారు బాదంపాలు తాగితే ఉపశమనం లభిస్తుంది. బాదంలో ఉండే కాల్షియం ఎముకల పటుత్వానికి సహకరిస్తుంది. బాదంపప్పులో ఐరన్‌ ఇతర పోషకాలు ఉండటం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఇంతటి మేలు చేసే బాదం పాలను ప్రతిరోజూ సేవించడం ఎంతో శ్రేయస్కరం.

ఢిల్లీకి చేరిన బీజేపీ అభ్యర్థి ఎంపిక..

ఢిల్లీ : వరంగల్ ఉప ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎంపిక వ్యవహారం ఢిల్లీకి చేరింది. రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఎన్నారై డాక్టర్ దేవయ్య పేరును ఖరారు చేసి జాతీయ నాయకత్వం ఆమోదం కోసం పంపింది. అధ్యక్షుడు అమిత్ షా అభ్యర్థి పేరును మంగళవారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 

దాచేపల్లిలో ప్రైవేటు బస్సు - లారీ ఢీ..ఒకరు మృతి..

గుంటూరు : దాచేపల్లిలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు - లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి. మృతుడు నెల్లూరు వాసిగా గుర్తించారు. 

చండీగాయానికి స్థలాన్ని పరిశీలించిన కేసీఆర్..

మెదక్ : సీఎం కేసీఆర్ రెండు రోజులుగా ఫాం హౌస్ లోనే బస చేశారు. ఆయుత చండీయాగానికి స్థలాన్ని పరిశీలించారు.

 

Don't Miss