Activities calendar

04 November 2015

21:31 - November 4, 2015

హైదరాబాద్ : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. గురువారం ఐదో దశ పోలింగ్‌ జరుగుతుంది. ఈ విడదలో 57 స్థానాలను పోలింగ్‌ నిర్వహించనున్నారు. వీటిలో మజ్లిస్‌ పోటీ చేస్తున్న ఆరు సీట్లు కూడా ఉన్నాయి. ఐదో దశ ఎన్నికలు ముగిస్తే బీహార్లోని 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ పూర్తియినట్టు అవుతుంది.

మధుబని, దర్భంగ, సుపాల్‌, సహర్స, మధేపురా....
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తుది విడత తొమ్మిది జిల్లాల్లో పోలింగ్‌ జరుగుతుంది. మధుబని, దర్భంగ, సుపాల్‌, సహర్స, మధేపురా, అరారియా, కిషన్‌గంజ్‌, పూర్ణియా, కతీహార్‌ జిల్లాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. పోలింగ్‌ జరిగే 57 స్థానాల్లో 24 సీట్లు పశ్చిమ బెంగాల్‌ సరిహద్దుల్లోని సీమాంచల్‌ ప్రాంతంలో ఉన్నాయి. మొత్తం 827 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 58 మంది మహిళలు కూడా ఉన్నారు. కోటి 55 లక్షల 43 వేల 594 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. 14,709 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 5,518 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వీటిలో నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో 276 పోలింగ్‌ కేంద్రాలు అతి సున్నితమైనవి. పోలింగ్‌ భద్రత కోసం 1033 కంపెనీల పోలీసు, పారామిలటరీ బలగాలను నియమించారు. స్వేచ్ఛగా, ప్రశాంతంగా పోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేసింది.

55 సీట్లకు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరుకు పోలింగ్‌ ......

పోలింగ్‌కు రెండు వేర్వేరు సమయాలు నిర్దేశించారు. 55 అసెంబ్లీ స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. సహర్స జిల్లాలోని నక్సల్స్‌ ప్రభావిత సిమ్రి భక్తియార్‌పూర్‌, మహిషి నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్‌ ముగుస్తుంది. ఎన్డీయేలో కీలకమైన బీజేపీ 38 సీట్లకు పోటీ చేస్తున్నది. కలమనాథులతో జట్టుకట్టిన ఎల్‌జేపీ 11, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ 5, హిందూస్థాన్‌ ఆవామ్‌ మోర్చ 3 స్థానాలకు అభ్యర్ధులను నిలబెట్టాయి. మహాకూటమిలో కీలకమైన జేడీయూ 25, ఆర్జేడీ 20, కాంగ్రెస్‌ 12 స్థానాలకు అభ్యర్ధలను నిలబెట్టాయి. తుది విడత ఎన్నికలు జరగుతున్న 57 సీట్లలో 2010 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 23 స్థానాలను సొంతం చేసుకుంది. జేడీయూ 20, ఆర్జేడీ 8, కాంగ్రెస్‌ 3 సీట్లలో విజయం సాధించింది. ఎల్‌జేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఇండిపెండెంట్‌ గెలిచారు. ఈనెల 8న ఓట్లు లెక్కిస్తారు. గెలుపుపై ఎన్డీయే, మహాకూటమి అభ్యర్ధులు ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. 

నిజాం కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం

హైదరాబాద్ : నిజాం కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం రేపింది. జూనియర్‌ విద్యార్థి ఆనంద్‌ను సీనియర్లు భరత్‌, శివలు వేధించారు. ఇటీవలే ఆనంద్‌ ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించారు. అతను ప్రస్తుతం నిజాం కాలేజీలో డిగ్రీ ఫస్టియర్‌ చదువుతున్నాడు. ర్యాగింగ్‌పై ఆనంద్ పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యంవహిస్తున్నారు.

న్యూఢిల్లీలోని శాస్త్రీ భవన్‌ క్యాంటీన్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : న్యూఢిల్లీలోని శాస్త్రీ భవన్‌ క్యాంటీన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసేందుకు యత్నిస్తున్నారు. మొత్తం ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేస్తున్నారు. 

రాజయ్య పై హత్యానేరం కేసు నమోదు...

హైదరాబాద్ : వరంగల్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు సిరిసిల్ల రాజయ్యపై పోలీసులు హత్యానేరం కేసును నమోదు చేశారు. రాజయ్య కోడలు సారిక ఆమె ముగ్గురు కొడుకులు నేడు ఉదయం అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. సారిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రాజయ్య సహా ఆయన భార్యను, కొడుకును అదుపులోకి తీసుకొని 498ఎ, 306, 176 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు.

ఖైరతాబాద్ చౌరస్తాలో ద్విచక్రవాహనం దగ్ధం

హైదరాబాద్: ఖైరతా బాద్ చౌరస్తా లో ద్విచక్రవాహనం దగ్ధమైంది. పాతబస్తీకి చెందిన యూసుఫ్ పంజాగుట్ట నుంచి తన ఇంటికి పల్సర్ వాహనంపై వెళ్తుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వాహనం ఇంజన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో యూసుఫ్ వాహనాన్ని నిలిపివేసి దూరంగా వెళ్లాడు. ఓనాల్లోనే వాహనం అగ్నికి ఆహుతైంది.

ముంబై సెంట్రల్ జైల్ కు చోటా రాజన్?

హైదరాబాద్ : మాఫియా డాన్ చోటా రాజన్ ను ముంబయి సెంట్రల్ జైలులో ఉంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇండోనేషియాలోని బాలిలో చోటా రాజన్ ఇటీవల పట్టుపడ్డ విషయం తెలిసిందే. అక్కడి నుంచి భారత్ కి తీసుకువచ్చి ముంబయి సెంట్రల్ జైలులో ఉంచుతారని తెలుస్తోంది. ఇక్కడి సెంట్రల్ జైల్ లోని అత్యధిక భద్రత గల సెల్ ను అధీనంలోకి తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం జైలు అధికారులను ఇప్పటికే ఆదేశించింది. జైలు పరిసరాల్లో పారామిలటరీ బలగాలను మోహరింపజేయాలని ‘మహా’ సర్కార్ కు పోలీసు అధికారులు విన్నవించుకున్నారు. వీటన్నింటిని చూస్తుంటే రాజన్ ను ఈ జైలుకు తరలిస్తారని తెలుస్తోంది.  

20:43 - November 4, 2015

హైదరాబాద్ : సుదూర తీరంలోంచి సమస్తం పరికిస్తోంది!... అంతరిక్ష రహస్యాల అంతుచూస్తోంది!!... శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు గీటురాయిగా నిలుస్తోంది!!! గగనపు వీధుల్లో విహరిస్తూ మనిషి జ్ఞాన తృష్టకు సంకేతంగా నిలుస్తోంది. అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఈ అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం నెలకొల్పి 15 యేళ్లు గడిచిన సందర్భంగా నేటి వైడాంగిల్ ప్రత్యేక కథనాన్ని విశ్లేషణ చేశారు. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.. 

20:33 - November 4, 2015

హైదరాబాద్: మన దేశంలోని చాలా మంది ఇళ్లలో బంగారం నిరుపయోగంగా పడి ఉంది. కొనుగోలు చేసిన బంగారాన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే ధరిస్తారు. మిగిలిన సమయాల్లో వృధాగా పడి ఉంటుంది. అటువంటి ఆదాయ మార్గంగా మలచుకునే గోల్డ్‌ మానెటైజేషన్‌ స్కీమును కేంద్ర ప్రభుత్వం 2015-16 వార్షిక బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది. దీనిని ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తున్నారు.

గ్రాఫిక్స్‌కనీసం 30 గ్రాముల బంగారం డిపాజిట్‌ .......

పసిడి నగదీకరణ పథకం ప్రకారం బంగారు నాణేలు, కడ్డీలు, ముత్యాలు, రాళ్లు లేని బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయవచ్చు. కనీసం 30 గ్రాములు ఉంటేను గోల్డ్‌ డిపాజిట్లను అంగీకరిస్తారు. గరిష్ఠంగా ఎంతైనా డిపాజిట్‌ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం తరుపున బ్యాంకులు ఈ బంగారాన్ని తీసుకుంటాయి. ఇలాంటి బంగారం స్వచ్ఛత, నాణ్యతను పరీక్షించి ధృవీకరించిన తర్వాత ప్రభుత్వం ఎంపిక చేసిన సంస్థలు విక్రయిస్తాయి. ఆ నిధులు ఖజానాకు చేరతాయి. గోల్డ్‌ డిపాజిట్‌ ఖాతాలను బ్యాంకుల తరుపున రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహిస్తుంది. డిపాజిట్‌దార్ల ఖాతాలో వడ్డీ జమ అవుతుంది. 5 నుంచి 7 ఏళ్లు కాలపరిమితి డిపాజిట్లపై 2.25 శాతం, 12 నుంచి 15 ఏళ్ల దీర్ఘకాల డిపాజిట్లపై 2.50 శాతం వడ్డీ చెల్లిస్తారు. అయితే నిర్ధిష్ట కాలపరిమితికి ముందే గోల్డ్‌ డిపాజిట్‌ ఉపసహంరించుకునే అవకాశంవుంది. ఇటువంటి సందర్భాల్లో పెనాల్టీ విధిస్తారు.

ఈనెల 5 నుంచి 20 వరకు దరఖాస్తుల స్వీకరణ .......

ఇక సావరెన్‌ గోల్డ్‌బాండ్‌ స్క్మీములో కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్బీఐ బాండ్లు జారీ చేస్తుంది. ఈపథకం కోసం ఈనెల 5 నుంచి 20 వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 26న బాండ్లు జారీ చేస్తారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఒక వ్యక్తి కనీసం 2 గ్రాములు బంగారంతో ఆరంభించి 500 గ్రాముల వరకు కొనుగోలు చేయవచ్చు. దీనిపై 2.75 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఇండియన్‌ బులియన్ అండ్‌ జువెలర్స్ అసోసియేషన్‌ గత నెల 26-30 తేదీ మధ్య బంగారు ముగింపు ధర సగటు ఆధారంగా గోల్డ్‌ బాండ్లకు గ్రాములకు 2,684 రూపాయలుగా నిర్ధారించారు. బ్యాంకులతోపాటు ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో వీటిని విక్రయిస్తారు. మన దేశంలో నివసించే వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, ధాతృత్వ సంస్థలు గోల్డ్‌ బాండ్లను కొగుగోలు చేయొచ్చు. పసిడి బాండ్ల కాలపరిమితి ఎనిదేళ్లుగా నిర్ణయించారు. ఈ బాండ్లను లోన్లకు కొల్లేటరల్‌ సెక్యూరిటీగా ఉపయోగించుకోవచ్చు. ఈ పథకం ద్వారా వచ్చే వడ్డీపై ఆదాయపన్ను మినహాయింపు ఉంటుంది.

అశోచక్రం ముంద్రతో ఉన్న....... గోల్డ్‌ కాయిన్స్‌

పసిడి నగదీకరణ పథకంలో మరొకటి గోల్డ్‌ కాయిన్‌ స్మీము. మన దేశంలో మొదటిసారిగా ఈపథకాన్ని ప్రవేశపెడుతున్నారు. అశోకచక్రం ముద్రతో ఉన్న బంగారు నాణేలను విక్రయిస్తారు. ఇప్పటి రకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న నాణేలను విక్రయిస్తూ వచ్చారు. ప్రారంభంలో 5, 10 గ్రాములు బంగారు నాణేలు, 20 బంగారు కడ్డీలను విక్రయిస్తారు. మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పరేషన్‌ ఆఫ్‌ ఇండియా సేల్స్‌ కౌంటర్లలో ఈ నాణేలను అమ్ముతారు. మొదటల్లో 5 గ్రాముల బరువున్న 15 వేల బంగారు నాణేలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 10 గ్రాముల బంగారు నాణేలు 20 వేలు విక్రయిస్తారు. 3,750 బంగార కడ్డీలు అందుబాటులో ఉంచుతారు. గురువారం నుంచి గోల్డ్‌ మానెటైజేషన్‌ స్కీము అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం అమల్లో ఉన్న 1999 గోల్డ్‌ డిపాజిట్‌ పథకం రద్దు అవుతుంది. 

జీహెచ్ ఎంసీలో ఓట్ల తొలగింపు పై సీఈసీ కీలక నిర్ణయం

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ లో ఓట్ల తొలగింపు పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా పునర్ పరిశీలన చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీహెచ్ ఎంసీ కమిషనర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లకు సీఈసీ ఆదేశించింది.

20:21 - November 4, 2015

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ లో ఓట్ల తొలగింపు పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా పునర్ పరిశీలన చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీహెచ్ ఎంసీ కమిషనర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లకు సీఈసీ ఆదేశించింది.

19:52 - November 4, 2015

హైదరాబాద్ : సీసం ప్రమాదకరస్థాయిలో ఉందంటూ చాలా రాష్ట్రాల్లో నిషేధానికి గురైన నెస్లే మ్యాగీ నూడుల్స్...మళ్లీ మార్కెట్లోకి ప్రవేశించబోతోంది. తాజాగా తయారు చేసిన నూడుల్స్ శాంపిల్స్ పరీక్షించిన ప్రభుత్వం...సురక్షితమని ధ్రువీకరించింది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ఇన్ స్టంట్ మసాలా నూడుల్స్ ను గుర్తింపు పొందిన ల్యాబ్స్ లో టెస్ట్ చేయించామని కంపెనీ తెలిపింది. ఈనెలలో రిటైల్ మార్కెట్లో నూడుల్స్ సేల్స్ మొదలవుతాయని వివరించింది.

19:51 - November 4, 2015

హైదరాబాద్ : ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియా కూడా దీపావళి ఆఫర్ ప్రకటించింది. 17 వందల 77 రూపాయలకే డొమెస్టిక్ ప్రయాణం ధరలు మొదలవుతాయని తెలిపింది. ఈనెల 7 వరకు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించింది. ఇప్పుడు బుక్ చేసుకుంటే వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు ప్రయాణించవచ్చని తెలిపింది.

19:50 - November 4, 2015

హైదరాబాద్ : వరంగల్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా సర్వే సత్యనారాయణ నామినేషన్‌ దాఖలు చేశారు. రాజయ్య కుటుంబంలో జరిగిన ఘటనతో.. సోనియా, రాహుల్‌ సూచన మేరకు తాను పోటీకి దిగినట్లు సర్వే తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయం ఖాయమని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ను కాదని కేసీఆర్‌ను నమ్మి ప్రజలు అధికారం ఇస్తే ప్రజలను నట్టేట ముంచాడని తీవ్రంగా విమర్శించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలంటే కాంగ్రెస్‌ అభ్యర్ధిని భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్‌ నేతలు కోరారు. 

అంత్యక్రియలు రాజయ్య కుటుంబమే నిర్వహించాలి:సారిక తల్లి

వరంగల్ : తన కూతురు, మనవళ్ల అంత్యక్రియలను రాజయ్య కుటుంబమే నిర్వహించాలని సారిక తల్లి తెలిపింది. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని చెప్పింది. ఈ దారుణానికి పాల్పడిన వారిని శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది.

19:36 - November 4, 2015

హైదరాబాద్: మరో ప్రాంతీయ ఉద్యమానికి రంగం సిద్ధమైంది. మైసూరారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధన సమితి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం మైసూరా నివాసంలో రాయలసీమకు చెందిన కాంగ్రెస్‌, వైసీపీ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో విశ్రాంత న్యాయవాదులు, ప్రొపెసర్లు ప్రముఖులు పాల్గొన్నారు. ఈనెల 21న రాయలసీమ రాష్ట్ర సాధన సమితి పేరుతో తిరుపతిలో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. రాయలసీ ఉద్యమానికి మైసూరా కన్వీనర్ గా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 20న మైసూరా వైసీపీకి రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు టీడీపీ నేతలను సంప్రదించినట్లు తెలుస్తోంది. 9 అంశాలతో సీమసాధన సమితి తెరపైకి వస్తోంది. నల్గొండ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలుపుకుని ఏడు జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు పోరాడాలని ఈ సమితి నిర్ణయించింది. కోస్తా జిల్లాలకు చేస్తున్న లబ్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని నేతలు తెలిపారు. 

వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో మైసూరా...

హైదరాబాద్:మైసూరారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధన సమితి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం మైసూరా నివాసంలో రాయలసీమకు చెందిన కాంగ్రెస్‌, వైసీపీ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో శ్రీకాంత్‌రెడ్డి, శైలజానాథ్‌, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈనెల 21న రాయలసీమ రాష్ట్ర సాధన సమితిని ఆయన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో 20న మైసూరా వైసీపీకి రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు టీడీపీ నేతలను సంప్రదించినట్లు తెలుస్తోంది. 9 అంశాలతో సీమసాధన సమితి తెరపైకి వస్తోంది.

19:03 - November 4, 2015

హైదరాబాద్ : రకరకాల ఆఫర్లతో అమ్మకాల జోరు కొనసాగిస్తున్న ఈ-కామర్స్ సైట్లకు పన్ను పోటు తగలనుంది. భారీగా పన్నులు వసూలు చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించాయి. అమ్మకాలు ఒకచోట ట్యాక్స్ మరోచోట చెల్లిస్తున్న ఈ-కామర్స్ సంస్థల నుంచి ట్యాక్స్ రాబట్టేందుకు కసరత్తు చేస్తున్నాయి.

ప్రతిరోజు కోట్లాది రూపాయల ఆన్ లైన్ బిజినెస్....

ఈ-కామర్స్ వ్యాపారం దేశ వ్యాప్తంగా భారీగా సాగుతోంది. రోజురోజుకు ఆన్‌ లైన్ వాణిజ్యం పెరుగుతోంది. ఒక క్లిక్ తో కోరిన వస్తువు ఒల్లో వచ్చి వాలిపోతోంది. ప్రతిరోజు కోట్లాది రూపాయల బిజినెస్ జరుగుతోంది. అయితే అమ్మకాలు జోరుగా సాగుతున్నా రాష్ట్రాలకు మాత్రం వీటి నుంచి ఏమాత్రం ఆదాయం రావడం లేదు.

కేంద్ర ప్రభుత్వానికే ప‌న్ను చెల్లిస్తున్న ఈ-కామర్స్ సంస్థలు

ఈ కామర్స్ వ్యాపారం దేశవ్యాప్తంగా జరుగుతోంది కాబట్టి ఇప్పటి వ‌ర‌కూ కేవ‌లం కేంద్ర ప్రభుత్వానికే ప‌న్ను చెల్లిస్తున్నాయి ఈ- కామర్స్ సంస్థలు. వీరి వ్యాపారం ముఖ్యంగా వ‌ర్తకుల‌కు, కొనుగోలుదారుల‌కు మ‌ధ్య లావాదేవీల‌కు మ‌ధ్యవర్తిత్వం వహించడం. అంటే హైద‌రాబాద్ లో ఉన్న వ్యక్తి , ఢిల్లీలో ఉన్న ఒక డీల‌ర్ ద‌గ్గర మొబైల్ కొంటే కొన్నందుకు సీఎస్టీ కింద‌ ఢిల్లీకి టాక్స్ క‌ట్టాలి. అదే అబిడ్స్ లోని మామూలు రిటైల్ మార్కెట్ లో కొంటే తెలంగాణ రాష్ట్రానికి ప‌న్ను క‌ట్టాలి. ఈ విధంగా తమకు రావాల్సిన ప‌న్ను ఇత‌ర రాష్ట్రాలకు వెళుతుండటంతో తెలుగు రాష్ట్రాలు న‌ష్టపోతున్నాయి.

జీఎస్టీ అమలు......

ఆర్ధిక లోటుతో ఇబ్బందిపడుతున్న ఏపీ ప్రభుత్వం ఈ- కామ‌ర్స్ పై ప‌న్నులు మోపాల‌ని ప్రయ‌త్నిస్తోంది. దీనికి ముఖ్యంగా రెండు విధానాల‌ను ప‌రిశీలిస్తోంది. ఒక‌టి జీఎస్టీని అమ‌లులోకి తీసుకొస్తే ఇత‌ర రాష్ట్రాలకు క‌డుతున్న ప‌న్నును మ‌న రాష్ట్టానికి త‌ర‌లించవ‌చ్చు. ఇక రెండోది రవాణా మార్గంలో ఎంట్రీ టాక్స్ ప్రవేశ‌పెట్టడం. వీటితో పాటు స‌రుకుల‌ను ర‌వాణా చేస్తున్న కొరియ‌ర్ సంస్థల‌ను రిజిస్టర్ చేయడం. ఇప్పటికే మ‌న పొరుగు రాష్ట్రమైన కేర‌ళ గతేడాది నుంచి ఈ కామ‌ర్స్ వ్యాపారాలను పూర్తిగా నిషేధించింది. ఇక కర్ణాటక అయితే అదనంగా 1-2% ప‌న్నుల‌ను వ‌సూలు చూస్తోంది.

పన్నులు వసూలు చేస్తే వస్తువుల ధరలు పెరుగుతాయి...

ఈకామ‌ర్స్ వ‌ల్ల ఇప్పటికే న‌ష్టపోతున్నామ‌ని స్థానిక వ‌ర్తకులు గ‌గ్గోలు పెడుతున్నారు. గ‌త మూడు సంవ‌త్సరాల‌లో స్థానిక రిటైల్ వ‌ర్గాలు అమ్మకాల్లో గ‌ణనీయ‌మైన క్షీణత‌ను న‌మోదు చేసుకున్నాయి. ఇటు కొనుగోళ్లు త‌గ్గిపోయి అటు అమ్మకాలపై ప‌న్నులు రాక రాష్ట్ర ఆర్దిక వ్యవ‌స్థ కుంటుబ‌డుతోంద‌ని అధికారులు చెప్పుకొస్తున్నారు. ఒకవేళ ఆన్ లైన్ అమ్మకాలపై రాష్ట్రాలు కూడా పన్నులు వసూలు చేస్తే వస్తువుల ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

18:59 - November 4, 2015

వరంగల్: తనకు ఎన్ని కష్టాలు ఉన్నా పరిష్కరించుకుంటాననే ధైర్యంతో సారిక ఉండేదని ఆమె సోదరుడు చెబుతున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. మల్టీ నేషనల్‌ కంపెనీలో ఉద్యోగం చేసిన మహిళ అని.. ఆమె అలా చేసుకునే అవకాశం లేదంటున్నారు. ఒకవేళ ఆమె ఆత్మహత్య చేసుకుంటే అందుకు గల కారణాలు ఏంటి ? అనేది పరిశీలించాల్సిన అవసరముందన్నారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది అనేది పోలీసులు విచారించి త్వరగా బయటపెట్టాలని ఆయన కోరారు. 

18:57 - November 4, 2015

వరంగల్: తన కూతురు, మనవళ్లను.. అత్తామామలు, అల్లుడే చంపారని సారిక తల్లి అంటోంది. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. వారం రోజుల క్రితం ఫోన్‌ చేసి బాగానే ఉన్నట్లు చెప్పిందని ఆమె అంటున్నారు. తన సమస్యను తానే పరిష్కరించుకుంటానని.. మీరేవరూ రానవసరం లేదని తెలిపినట్లు ఆమె ఆంటోంది. ప్రేమ వివాహం కావడం.. అత్తమామలకు డబ్బు ఆశ వల్లే తన కూతురిని పొట్టన పెట్టుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

రాజధాని రైతులకు ఫ్లాట్ల కేటాయింపుల పై నిబంధనలు ఖరారు

విజయవాడ :రాజధాని రైతులకు ఫ్లాట్ల కేటాయింపులపై ఏపీ ప్రభుత్వం నిబంధనలు ఖరారు చేసింది. కుటుంబసభ్యులకు ఒకే చోట ప్లాట్లు కావాలనుకుంటే ఈనెల 15లోపు సీఆర్డీఏ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఆధార్‌కార్డు, సీఆర్డీఏ రసీదులతో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

41 నామినేషన్లు దాఖలయ్యాయి: ఈసీ

హైదరాబాద్ : వరంగల్ లోక్ సభ ఉపఎన్నికకు నామినేషన్లు దాఖలుకు గడువు నేటితో ముగిసింది. ఈ ఎన్నికకు మొత్తం 31 నామినేషన్లు దాఖలైన్టు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఈ నామినేషన్లను రేపు వారు పరిశీలించనున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఈ నెల 7వరకు గడువుంది. ఈ నెల 21న పోలింగ్ జరగనుండగా, 24న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

ఢిల్లీలో ముగిసిన చంద్రబాబు పర్యటన

హైదరాబాద్ :ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన ముగిసింది. ఆయన విశాఖపట్నం బయల్దేరి వెళ్లారు. తన ఢిల్లీ పర్యటన విజయవంతమైందని చంద్రబాబు మీడియాకు తెలిపారు. కరువుతో అల్లాడుతున్న ఏపీని కేంద్రం ఆదుకుంటుందనే నమ్మకం తనకుందని ఆయన తెలిపారు.

టీచర్ మందలించాడని విద్యార్థి ఆత్మహత్య

రంగారెడ్డి:  జవహర్‌నగర్ గల కృష్ణవేణి పాఠశాలలో దారుణం ఘటన చోటుచేసుకుంది. యూనిఫామ్ వేసుకోలేదని తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని టీచర్ మందలించారు. టీచర్ మందలింపుతో మనస్థాపంతో చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నాడు.

17:43 - November 4, 2015

హైదరాబాద్ : దక్షిణ సూడాన్లో కార్గో విమానం కుప్ప కూలింది. ఈ ఘటనలో దాదాపు 41 మంది చనిపోయారు. దక్షిణ సూడాన్ రాజధాని జుబా విమానాశ్రయం నుంచి అపర్ నైల్ స్టేట్లోని పాలోచ్కు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జుబా ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన తర్వాత కేవలం 800 మీటర్ల దూరంలో ఓ చిన్న ద్వీపంలో విమానం కూలిపోయిందని అధికారులు చెప్పారు. విమానంలో ప్రయాణిస్తున్న 20 మందితో పాటు విమానం కుప్పకూలిన ప్రాంతంలో నివసిస్తున్న మరో 21 మంది చనిపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి కారణాలపై విచారణకు ఆదేశించినట్టు సూడాన్ ప్రభుత్వం ప్రకటించింది. 

17:42 - November 4, 2015

హైదరాబాద్ : భారత్‌-పాక్‌ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ గజల్‌ కళాకారుడు గులాం అలీ భారత్‌కు రావడానికి నిరాకరించారు. భారత్‌లో నెలకొన్న అసహన పరిస్థితుల కారణంగా భద్రతా దృష్ట్యా తాను భారత్‌కు రాలేనని పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత్‌లో జరిగే తన కార్యక్రమాలన్నింటిని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. భారత్‌లో తన పర్యటనకు రాజకీయ రంగు పులమడంతో గులాం అలీ తీవ్ర ఆవేదన చెందారు. భారత్‌లో పరిస్థితులు బాగుపడ్డాకే తాను అక్కడ కచేరి చేస్తానని గులాం అలీ ప్రకటించారు. దీంతో నవంబర్‌ 25న లక్నోలో, డిసెంబర్3 న ఢిల్లీలో గులాం అలీ ఇవ్వాల్సిన కచేరీలు రద్దయ్యాయి. శివసేన హెచ్చరికల నేపథ్యంలో ముంబైలో గులాం అలీ కార్యక్రమం రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీలో కచేరీ చేసేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ గులాం అలీని ఒప్పించారు. అయితే అక్కడ కూడా గులాం అలీ కచేరిని అడ్డుకుంటామని శివసేన హెచ్చరించింది.

17:40 - November 4, 2015

హైదరాబాద్ : సెక్యులరిజం పేరిట వామపక్ష ధోరణితో కొందరు రచయితలు, కళాకారులు భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆ సరసన బాలీవుడ్‌ నటుడు షారుక్‌ఖాన్‌ కూడా చేరారని బిజెపి ఎంపి ఆదిత్యనాథ్‌ అన్నారు. మెజారిటీ హిందువులు షారూఖ్‌ఖాన్‌ సినిమాలను బహిష్కరిస్తే అతడు కూడా ఓ సాధారణ ముస్లిం వలె రోడ్డుపై ఉండేవాడన్నారు. హిందూ సమాజాన్ని ప్రత్యేకంగా ఓ వ్యక్తిని, పార్టీని బద్‌నాం చేసే కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు. దేశభక్తుడిగా ఉండడం కన్నా లౌకికవాదిగా ఉండడమే మిన్న అని తన బర్త్‌డే సందర్భంగా బాలీవుడ్‌ నటుడు షారూఖ్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు.

17:38 - November 4, 2015

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ నియమితులుకానున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు నేతృత్వంలోని కోలీజిం ఠాకూర్‌ పేరును సిఫారస్తూ కేంద్రానికి నివేదించింది. కేంద్రం దీనిని ఆమోదించిన ఈ ఫైలును రాష్ట్రపతికి పంపుతుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఠాకూర్‌ నియామక నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు వచ్చే నెల 2న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ఠాకూర్‌ బాధ్యతలు చేపడతారు. జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ 2009లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంతకుముందు పంజాబ్‌, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2017 జనవరి 3 వరకు ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిలో కొనసాగుతారు. 

17:37 - November 4, 2015

రంగారెడ్డి: జిల్లాలో కల్తీ పాల గుట్టురట్టయ్యింది. ఘట్‌కేసర్‌ మండలం ఏదులాబాద్‌లో ఓ పాడుబడిన ఇంట్లో కల్తీ పాలను తయారుచేస్తున్న రషీద్‌, రవి అనే ఇద్దరు వ్యక్తులను ఎస్.ఓ.టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల తయారీ కోసం ఉపయోగిస్తున్న యూరియా, పాల పౌడర్‌తో పాటు పలు యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా రోజుకు 700 లీటర్ల నుంచి వెయ్యి లీటర్ల పాలను ఇళ్లు, స్వీట్‌షాపులు, హోటళ్లకు విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలోనూ రషీద్‌ కల్తీ పాలు విక్రయిస్తూ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. 

జడ్పీ ఛైర్మన్ గా ఈదర కొనసాగాలి: జిల్లా కోర్టు తీర్పు

ఒంగోలు : జడ్పీ వ్యవహారంలో జిల్లా కోర్టు తుది తీర్పు ప్రకటించింది. జడ్పీ సభ్యుడిగా ఈదర హరిబాబును అనర్హుడిగా ప్రకటించిన జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. జడ్పీ చైర్మన్‌గా ఈదర కొనసాగాలని కోర్టు ఆదేశించింది. ఈ ప్రకటనతో ఈదర వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. న్యాయవ్యవస్థ ఎవరికీ అన్యాయం చేయదని ఈ తీర్పుతో నిరూపితమైందని ఈదర అభిప్రాయపడ్డారు. 

లాలూ, నితీష్ పాక్ కు వెళ్లాల్సిందే: బిజెపి ఎంపి

హైదరాబాద్ :లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ లపై బీజేపీ ఎంపీ అశ్వినీ కుమార్ చౌబే ధ్వజమెత్తారు. బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక వారిద్దరూ పాకిస్థాన్ కు వెళ్లాలని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు బీహార్ కు చెందిన బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ కూడా లాలు, నితీష్ లపై ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. వారిద్దరూ బీహార్ ను పాక్ లా మార్చాలని భావిస్తున్నారని ఆరోపించారు. రేపు జరగనున్న ఐదో దశ పోలింగ్ తో అసెంబ్లీ ఎన్నికలు ముగియనున్నాయి. నవంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.

షారుఖ్ ఖాన్ పై విరుచుకుపడ్డ బిజెపి ఎంపి ఆధిత్యానాథ్

న్యూఢిల్లీ : ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయిద్‌తో షారుక్ సమానమని బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ తాజాగా విమర్శలు చేశారు. దేశంలో అసహనం ఉందని షారుక్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. షారుక్ మాటలను విమర్శిస్తూ బీజేపీ నేత విజయ్‌వర్గియా ఈమధ్యే ఓ ట్వీట్ చేశారు. ఒకవేళ దేశంలో అసహనం ఉంటే..షారుక్ అంత గొప్ప నటుడు అయ్యేవాడు కాదని విజయ్‌వర్గియా అన్నాడు. అది మరవకముందే మరో నేత ట్వీట్లతో రచ్చ చేశాడు. షారుక్ అభిప్రాయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా సంపూర్ణంగా ఖండించారు.

ఏపీలో బియ్యం సేకరణకు మార్గదర్శకాలు విడుదల

హైదరాబాద్ : 2015-16 ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం, బియ్యం సేకరణకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. గ్రేడ్‌-ఏ రకానికి కనీస మద్దతు ధర రూ. 1450గా నిర్ణయించారు. సాధారణ రకానికి క్వింటా ధర రూ. 1410గా నిర్ణయించారు.

16:30 - November 4, 2015

హైదరాబాద్ : ముంబై పోలీసుల ఓవరాక్షన్ మరోసారి వెలుగుచూసింది. అంధేరీలో అర్ధరాత్రి రోడ్డు మీద కనపడిన ఓ యువజంటను స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులు... వారిని తీవ్రంగా కొట్టారు. తాము స్నేహితులమని చెప్పినా వినిపించుకోకుండా అకారణంగా వారిపై పిడిగుద్దులు కురిపించారు. అక్కడే ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ కార్యకర్త ఈ ఘటనను వీడియో తీయడంతో.. విషయం వెలుగు చూసింది. 

16:24 - November 4, 2015

విజయవాడ: బీజేపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం రోజురోజుకు తారాస్థాయికి చేరుతోంది. పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణలు.. చంద్రబాబుపై చేస్తున్న విమర్శలను టీడీపీ విజయవాడ అర్బన్‌ అధ్యక్షులు బుద్దా వెంకన్న తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి వలస వచ్చిన వీళ్లు.. కాంగ్రెస్‌ ఏజెంట్లుగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇకనైనా వారు నోరు అదుపులో పెట్టుకోకపోతే.. భవిష్యత్‌లో వారిని విజయవాడలో కాలు పెట్టనీయబోమని హెచ్చరించారు. 

16:22 - November 4, 2015

.గో : ఆస్పత్రిలో చెక్‌అప్‌కోసం బయలుదేరిన ఓ గర్భిణి బస్టాండ్‌లో ప్రసవించింది.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం బస్టాండ్‌లో ఇది జరిగింది.. గొల్లలకోడేరు గ్రామానికిచెందిన నాగవల్లి కైకలూరు ఆస్పత్రికి బయలుదేరింది.. భీమవరం బస్టాండ్‌కువచ్చాక ఆమెకు నొప్పులు వచ్చాయి.. బాత్‌రూంలోనే ఆమె బిడ్డను ప్రసవించింది.. వెంటనే తోటి ప్రయాణికులు ఆమెను భీమవరం ఆస్పత్రికి తరలించారు.. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు..

16:21 - November 4, 2015

హైదరాబాద్ : కరీంనగర్‌ జిల్లాలో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ తాళలేక మల్యాల మండలం మనాలలో జోగినిపెల్లి లక్ష్మణ్‌ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన రెండెకరాల పొలంలో పంటలు ఎండిపోవడం.. బోరు వేసినా నీళ్లు పడకపోవడంతో మనస్తాపం చెందిన లక్ష్మణ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

16:19 - November 4, 2015

వరంగల్ : రాజయ్య కుటుంబసభ్యులను అరెస్ట్‌ చేసిన తర్వాత సీపీ మీడియాతో మాట్లాడారు. సారిక, చిన్నారుల మృతదేహాలను ఎంజీఎంకు తరలించామని వరంగల్‌ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఘటన విచారణ నిమిత్తం రాజయ్య కుటుంబ సభ్యులను స్టేషన్‌కు తరలించామన్నారు. పూర్తి విచారణ తర్వాత.. చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

16:17 - November 4, 2015

హైదరాబాద్ :వరంగల్‌ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్‌ పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారు. 498ఎ, 306 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సారిక పుట్టింటివారు మాత్రం విషాదంలో మునిగిపోయారు. సారికతో పాటు చిన్నారులు కూడా చనిపోవటంతో అందరూ కన్నీటి పర్యంతమవుతున్నారు. బెడ్‌రూమ్‌లోకి గ్యాస్‌ సిలిండర్‌ ఎలా వచ్చింది? గ్యాస్‌ లీకై ప్రమాదం జరిగితే సిలిండర్‌ ఎందుకు పేలలేదు? మామతోను, భర్తతోను గొడవపడ్డ సారిక ఆవేశంలో ఆత్మహత్య చేసుకుందా? మాట వినని సారికను భర్త అనిల్‌ హత్య చేశాడా? అన్నీ ప్రశ్నలే. పోలీసులు ఆధారాలన్ని సేకరిస్తూ ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. 

'గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రైతు ఆత్మహత్యలు'

మెదక్: గత పాలకుల నిర్లక్ష్యం వల్లే... రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి కె. లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మెదక్ జిల్లాకు విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. అలాగే అరవై ఏళ్లలో సాధించని ప్రగతి అరవై నెలల్లో సాధిస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వేలాది కోట్లతో ఆయా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అయినప్పటికీ విపక్షాలు అర్ధం పర్ధం లేని విమర్శలు చేయడం తగదన్నారు.

రోడ్డు ప్రమాదంలో జవాను మృతి

మహబూబ్ నగర్ : పాలమూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ జవాను మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అచ్చంపేట మండలం శేఖరయ్య తోట వద్ద బుధవారం రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బల్మూరు మండలం తోడేళ్లగట్ట గ్రామానికి చెందిన కొనమోని ఈశ్వర్(26) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈశ్వర్ ఆర్మీలో జవానుగా పనిచేస్తున్నాడు. దసరా సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన ఈశ్వర్ తిరిగి రేపు జార్ఖండ్ వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిలో రామస్వామి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు.

సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఠాకూర్

ఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఠాకూర్ బాధ్యతలు స్కీరించనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దత్తు డిసెంబర్ 2న పదవీవిరమణ చేయనున్నారు. ఠాకూర్ పేరును హెచ్‌ఎల్ దత్తు ప్రతిపాదించారు. జస్టిస్ ఠాకూర్ 13 నెలల పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా కొనసాగనున్నారు.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై : స్టాక్‌మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 37 పాయింట్లు నష్టపోయి 26,553 సూచీ వద్ద అదేవిధంగా నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 8,040 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 65.54గా కొనసాగుతుంది.

'బోడో' నాయకుడు డింగా అరెస్ట్

హైదరాబాద్ : నిషేధిత బోడోల్యాండ్‌ ఉగ్రవాద సంస్థ ఎన్డీఎఫ్‌బీ నాయకుడిని కేరళ పోలీసులు కోళీకోడ్‌లో అరెస్టు చేశారు. అసోం నుంచి పరిపోయి వచ్చిన డింగా నెలరోజులుగా కోళీకోడ్‌లో ఉంటున్నాడు. కేరళ ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారులు నిఘా పెట్టి నిర్ధారించుకున్నతర్వాత డింగాను అదుపులోకి తీసుకున్నారు. అసోంలోని కోక్రాఝార్‌ జిల్లా బాలాపారా గ్రామానికి చెందిన డింగా ఎన్డీఎఫ్‌బీకి నిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. బోడోల్యాండ్‌ ఉద్యమం బలహీన పడడంతో పోలీసుల నుంచి తప్పించుకుని నెల రోజుల క్రితం కేరళ వచ్చాడు. అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు.

సీఎస్ లతో ప్రధాని మోదీ టెలీ కాన్ఫరెన్స్

ఢిల్లీ :వివిధ రాష్ట్రాల సీఎస్‌లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

మాల్దీవుల్లో ఎమర్జెన్సీ

హైదరాబాద్ :మాల్దీవుల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తడంతో ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ ఎమెర్జెన్సీ విధించారు. నిరసనకారులను అరెస్టు చేయాలంటూ భద్రతాదళాలకు అధ్యక్షుడు పూర్తి ఆదేశాలు జారీ చేశారు. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 30 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారని అధ్యక్షుడి అధికార ప్రతినిధి తెలిపారు. 

నామినేషన్ దాఖలు చేసిన సర్వే సత్యనారాయణ..

హైదరాబాద్ : వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. సిరిసిల్ల రాజయ్య నివాసంలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఆయన కోడలు, మనవళ్లు ఆహుతి అయిపోయారు. ఈ నేపథ్యంలో, తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని రాజయ్య కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. ఈ క్రమంలో, రాజయ్య స్థానంలో సర్వే సత్యనారాయణను తమ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపిక చేసింది. దీంతో, సర్వే నామినేషన్ వేశారు.

రాజ్ భవన్ లో గవర్నర్ పుట్టిన రోజు వేడుకలు

హైదరాబాద్ : అమరావతికి శంకుస్థాపన తన హయాంలో జరగడం శుభపరిణామమని గవర్నర్ నరసింహన్ హర్షం వ్యక్తం చేశారు. అమరావతిలో ఇద్దరు సీఎంలు కలవడం అభినందనీయమన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలకు విజన్ ఉందన్న ఆయన రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా గవర్నర్ ఏబీఎన్‌తో మాట్లాడారు. అందరి సమక్షంలో జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని గవర్నర్ అన్నారు. 69వ పుట్టినరోజు జరుపుకుంటున్న గవర్నర్‌కు పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

పోలీసుల అదుపులో రాజయ్య కుటుంబ సభ్యులు

హైదరాబాద్ :వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజయ్య కోడలు సారికతోసహ ముగ్గురు కుమారులు బుధవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. రాజయ్య ఇంట్లోనే గ్యాస్ సిలిండర్ లీకై మృతిచెందినట్లు చెబుతున్నప్పటికీ వారి మృతి అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు రాజయ్యతోపాటు భార్య మాధవి, కొడుకు అనిల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే వీరిపై 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

భారత్ లో సంగీత కచేరీలు నిర్వహించను: గులాం అలీ

హైదరాబాద్: భారత్ లో ఇకపై ఎలాంటి సంగీత కచేరీలను నిర్వహించనని పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ గజల్ గాయకుడు గులాం అలీ స్పష్టం చేశారు. అంతేకాకుండా, భారత్ లో నిర్వహించే కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. భారత రాజకీయాలు తనను ఎంతో బాధించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు తన కచేరీలు భారత్ లో ఉండవని చెప్పారు. తన కచేరీలను అడ్డుకోవడం ద్వారా భారత్ లోని కొన్ని రాజకీయ పార్టీలు లబ్ధి పొందాలని భావిస్తున్నాయని ఆరోపించారు. దీనిపై సెన్సార్ బోర్డు సభ్యుడు అశోక్ పండిట్ స్పందిస్తూ, గులాం అలీ మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

సూడాన్ లో కూలిన కార్గో విమానం: 40 మంది మృతి

హైదరాబాద్ : దక్షిణ సూడాన్ రాజధాని జుబాలో కార్గో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది మృతి చెందినట్లు ఆ దేశ అధ్యక్షుడి అధికార ప్రతినిధి తెలిపారు. విమానం టేకాప్ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది. విమానంలో సిబ్బంది, ప్రయాణీకులు కలిపి20 మంది ఉండగా వీరిలో ముగ్గురు మాత్రమే క్షేమంగా బయటపడ్డారు. మిగిలినవారంతా విమానం కూలిన స్థలంఓ ఉన్న వారిగా అధికారులు భావిస్తున్నారు.

ముంబై పోలీసుల ఓవరాక్షన్

హైదరాబాద్ : ముంబై పోలీసుల ఓవరాక్షన్ మరోసారి వెలుగుచూసింది. అంధేరీలో అర్ధరాత్రి రోడ్డు మీద కనపడిన ఓ యువజంటను స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులు... వారిని తీవ్రంగా కొట్టారు. తాము స్నేహితులమని చెప్పినా వినిపించుకోకుండా అకారణంగా వారిపై పిడిగుద్దులు కురిపించారు. అక్కడే ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ కార్యకర్త ఈ ఘటనను వీడియో తీయడంతో.. విషయం వెలుగు చూసింది. 

భీమవరం బస్టాండ్‌లో మహిళ ప్రసవం

.గో : ఆస్పత్రిలో చెక్‌అప్‌కోసం బయలుదేరిన ఓ గర్భిణి బస్టాండ్‌లో ప్రసవించింది.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం బస్టాండ్‌లో ఇది జరిగింది.. గొల్లలకోడేరు గ్రామానికిచెందిన నాగవల్లి కైకలూరు ఆస్పత్రికి బయలుదేరింది.. భీమవరం బస్టాండ్‌కువచ్చాక ఆమెకు నొప్పులు వచ్చాయి.. బాత్‌రూంలోనే ఆమె బిడ్డను ప్రసవించింది.. వెంటనే తోటి ప్రయాణికులు ఆమెను భీమవరం ఆస్పత్రికి తరలించారు.. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు..

14:57 - November 4, 2015

ఆదిలాబాద్ : పత్తి మార్కెట్‌ దాడి ఘటనపై పోలీసులు సీరియస్‌ అయ్యారు.. రాళ్లు రువ్విన ఒక్కో రైతుపై కేసులు పెడుతున్నారు.. ఇప్పటికే 50మందిపై కేసులు నమోదుచేశారు.. మంగళవారం రాత్రి నలుగురిని అరెస్ట్ చేశారు.. మరో ఇద్దరిని మార్కెట్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.. ఈ అరెస్టులపై రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు.. 

14:55 - November 4, 2015

ఢిల్లీ : అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోడీ పిడికెడు మట్టి ఇచ్చి ఏపీ ప్రజలను అవమానపరిచారని పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదాపై ప్రధాని మాట మారుస్తున్నారని విమర్శించారు. స్పెషల్‌ స్టేటస్‌ సాధనకు మట్టి సత్యాగ్రహాన్ని చేపడుతున్నామని చెప్పారు. నవంబర్‌ 6న జరిగే పీసీసీ విస్తృత సమావేశంలో దీనికి సంబంధించి విధివిధానాలను తయారుచేస్తామని తెలిపారు. ఢిల్లీలో రాజ్‌ఘాట్‌ను సందర్శించిన కాంగ్రెస్‌ నేతలు మహాత్మగాంధీకి నివాళులర్పించారు. 

14:53 - November 4, 2015

వరంగల్ : సిరిసిల్ల రాజయ్య ఇంటికి సారిక తల్లి, సోదరి, బంధువులు చేరుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సారిక తండ్రి ఘటనా స్థలానికి రాలేకపోయారు. సారిక, చిన్నారుల మృతదేహాలను చూపి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోపక్క అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. క్లూస్‌టీం కీలక ఆధారాలను సేకరించింది. సారిక బెడ్‌రూమ్‌లోని మంచంమీద గ్యాస్‌ సిలిండర్‌ను పోలీసులు గుర్తించారు. రెగ్యులేటర్‌పై వేలిముద్రలను క్లూస్‌టీం తీసుకుంది. దర్యాప్తులో ఇవే కీలకం కానున్నాయి. రాజయ్య నివాసం దగ్గర మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశాయి. 

వరంగల్ ఎంజీఎంకు మృతదేహాలు

వరంగల్ : మాజీ ఎంపీ, ప్రస్తుత ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో అనుమానాస్పదంగా కాలిబూడిదైన రాజయ్య కోడలు, మనుమళ్ల మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించేందుకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు రాజయ్య భార్య ప్రొ. మాధవి, కుమారుడు అనిల్ ను పోలీసులు అదపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇండోనేషియాలో భూకంపం

హైదరాబాద్ : ఇండోనేషియా తూర్పు ప్రాంతంలో నేడు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.3గా నమోదు అయిందని ఇండోనేసియా ఉన్నతాధికారి వెల్లడించారు. భూకంపం సంభవించగానే నివాసాల నుంచి ప్రజుల బయటకు పరుగులు తీశారని చెప్పారు. అలోర్ ద్వీపంలోని తూర్పు నుష్టంగ్గర్ ప్రావిన్స్లోని భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వివరించింది.

14:39 - November 4, 2015

హైదరాబాద్ :కంపల్ సరీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ (వివాహాల తప్పని సరి రిజిస్ట్రేషన్ చట్టం) అంటే ఏమిటి? 2002 సంవత్సరంలో ఈ చట్టం రూపొందించబడంది. ఈ చట్ట ప్రకారం బాల్య వివాహాలు జరగకుండా ఆపుతుంది. మోసకారి పెళ్ళిళ్లను ఆపడం ఈ చట్టం ద్వారా సాధ్యం. ఇంకా ఈ చట్టంలో ఉన్న మరిన్ని వివరాలను కుటుంబ సంబంధిత సమస్యలకు చక్కటి పరిష్కారం చూపించే 'మైరట్ ' కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పార్వతి వివరించారు. పూర్తి వివరాలు కావాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

సారిక పడక గదిలో గ్యాస్ సిలిండర్ లభ్యం: ఐజీ

వరంగల్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంటిలో నేటి తెల్లవారుజామున చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంపై వరంగల్ రేంజీ ఐజీ నవీన్ చంద్ స్పందించారు. ఈ ప్రమాదంలో రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలు సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలాన్ని ఐజీ నవీన్ చంద్ పరిశీలించారు. సారిక పడక గదిలో గ్యాస్ సిలిండర్ లభ్యమైందని తెలిపారు. ప్రమాదం రాజయ్య ఇంటిలోనే జరిగిన నేపథ్యంలో రాజయ్య కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని నవీన్ చంద్ తెలిపారు. అంతేకాక ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఘటన హత్యా? ఆత్మహత్యా?

నకిలీ నోట్లు చలామణి చేస్తున్న వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ : నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న ఓ వ్యక్తిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 31వేల విలువైన 62 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ 500 రూపాయల నోట్లు కావడం విశేషం. నకిలీ నోట్లతో పాటు.. 4 తులాల బంగారు ఆభరణాలు, కలర్ ప్రింటర్ తో పాటు సెల్ ఫోన్ ను సీజ్ చేశారు.

సిటీలో మొత్తం 11 వేల మంది క్రిమినల్స్

హైదరాబాద్ : నగరంలో ఉన్న నేరస్తులపై పోలీసు శాఖ సర్వే ప్రారంభించింది. ఇవాళ, రేపు ఈ సర్వే నిర్వహించనున్నారు. సిటీలో మొత్తం 11 వేల మంది క్రిమినల్స్ ఉన్నారు. గత అయిదేళ్లలో జరిగిన నేర రికార్డుల ఆధారంగా పోలీసులు సర్వే కొనసాగిస్తున్నారు. కేవలం సిటీ కమిషనరేట్ పరిధిలోనే ఏడున్నర వేల నేరస్తులు ఉన్నారు. ఈ నిఘా ద్వారా క్రిమినల్స్‌కు సంబంధించిన అన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఆ నేరస్తులు ఏం చేస్తున్నారు. వాళ్లు అదే నేరం కంటిన్యూ చేస్తున్నారా. వాళ్ల నడవడిక మార్చుకున్నారా లేదా. వాళ్ల అడ్రస్, మొబైల్, ఆధార్ ఐడెంటిటీ అన్నీ సేకరిస్తున్నారు.

13:43 - November 4, 2015

హైదరాబాద్ : నగరంలోని శంషాబాద్‌ ఎయిర్ పోర్టు నుంచి కారులో తరలిస్తున్న 4.2కిలోల బంగారాన్ని చాంద్రాయణగుట్ట వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రూ.16లక్షలతో పాటు భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. దీనికి సబంధించిన విషయాలను నగర కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి మీడియాకు తెలిపారు. జకీర్, అరీఫ్, హసన్, వాజిద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులు దుబాయ్‌ నుంచి ఈ బంగారాన్ని తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనలో ఎయిర్ పోర్టు సెక్యూరిటీ సిబ్బంది హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలోనూ పెద్ద మొత్తంలో బంగారం స్మగ్లింగ్ చేసినట్టు విచారణలో వెల్లడయినట్లు తెలుస్తోంది. 

13:40 - November 4, 2015

హైదరాబాద్ : ఒక బాధ్యాతయుతమైన స్థానం..అందులో పోలీసు ఉద్యోగం..ఇతరులకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఆ పోలీసు తప్పుదారిపట్టాడు. ఏడు అడుగులు నడిచిన భార్యను మోసం చేశాడు. మరో భార్యతో సంబంధం పెట్టుకున్నాడు. ముప్పుతిప్పలు పెట్టిన ఈ పోలీసు వ్యవహారాన్ని బాహ్య ప్రపంచానికి తెలియచెప్పాలని అనుకుంది. అనుకున్న విధంగా సక్సెస్ అయ్యింది. తాను అతనితో జీవించనని విడాకలు తీసుకుంటానని..తనకు న్యాయం కావాలిన ఆ మహిళ వేడుకొంటోంది. వివరాల్లోకి వెళితే...
అఫ్జల్‌గంజ్ ఎస్ఐ కరుణాకర్‌కు నల్లగొండ జిల్లా హూజూర్‌నగర్‌కు చెందిన మహిళతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఓ పాప పుట్టాక కరుణాకర్ మరో మహిళతో సంబంధం ఏర్పాటుచేసుకున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోగా భార్యను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో ఆగ్రహించిన ఆ భార్య... భర్త వేరే కాపురం పెట్టిన డీడీ కాలనీ అపార్ట్ మెంట్ వద్దకు చేరుకుంది. పోలీసులకు తన భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించి ఇచ్చింది. 

13:32 - November 4, 2015

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పొలిటికల్ జేఏసీ ఛైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం రచించిన..తెలంగాణ రాష్ట్రోదయం పుస్తక ఆవిష్కరణ హైదరాబాద్‌ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, సీనియర్ పాత్రికేయులు మల్లేపల్లి లక్ష్మయ్యతో పాటు పలువురు ప్రముఖులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ఆవిర్భావంలో ప్రొఫెసర్ కోదండరాం పాత్ర గణనీయమైనదని వక్తలు కొనియాడారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాంసంఘాలు, ఉద్యోగ సంఘాలను ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేశారని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ తాను రాసిన ఎన్నో వ్యాసాలు పుస్తకంలో పొందుపర్చామని కోదండరాం అన్నారు. 

13:31 - November 4, 2015

హైదరాబాద్ : బీజేపీ నేత హరిరామ జోగయ్య పుస్తకం ప్రకంపనాలు సృష్టిస్తోంది. టిడిపి, బిజెపి నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా ఈ పుస్తకంపై టీడీపీ నేత కళా వెంకట్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన పుస్తకం ఎక్కువ అమ్ముడుపోవడానికే జోగయ్య ఇలాంటి కామెంట్స్ చేశారని ఆరోపించారు. ఇలాంటి అంశాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.

13:28 - November 4, 2015

ఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. మంగళవారం రాత్రి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఏపీ భవన్‌లో జరిగిన కీలక భేటీల్లో చంద్రబాబు పాల్గొన్నారు. బుధవారం ఉదయం సైన్స్ అండ్‌ టెక్నాలజీ, బయో టెక్నాలజీ శాఖ కార్యదర్శి విజయరాఘవన్‌, సీఎంను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో బయోటెక్నాలజీ సంస్థల ఏర్పాటుపై చంద్రబాబుతో చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర సైన్స్ అండ్‌ టెక్నాలజీ సహాయ మంత్రి సుజనాచౌదరి కూడా పాల్గొన్నారు. అనంతరం మాజీ డీజీపీ స్వరణ్‌జిత్‌ సేన్‌ ఆధ్వర్యంలో ఫిక్కి ప్రతినిధులు ఏపీ సీఎంతో సమావేశమయ్యారు. 

13:26 - November 4, 2015

వరంగల్ : పదేళ్లనుంచి కేసులు, విచారణలంటూ తిరుగుతూనే ఉన్నారు రాజయ్య కోడలు సారిక. 2005నుంచి గొడవలు నడుస్తున్నా చివరికి 2014లో కేసు నమోదైంది.. కోర్టులో కేసు నడుస్తుండగానే ముగ్గురు పిల్లలతో సహా అగ్నికి ఆహుతయ్యారు. తనకు న్యాయం చేయాలంటూ కొద్దినెలలుగా పోలీసులచుట్టూ తిరుగుతూనే ఉన్నారు సారిక.. భర్తతో కలిసి సికింద్రాబాద్ చిలకలగూడలో ఉండేవారు. అక్కడే తన భర్త వేరే మహిళతో సహజీవనం చేస్తున్నారని ఆరోపించారు. బేగంపేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు.. అయితే అప్పుడు రాజయ్య ఎంపీగా ఉన్నారు. రాజకీయ పలుకుబడితో పోలీసులను మేనేజ్‌ చేస్తున్నారని సారిక ఆరోపించారు. చివరికి పోలీసులు పట్టించుకోవడంలేదంటూ 2014లో నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు.

విచారణలో ఉన్న కేసు..
పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు కేసు నమోదు చేయాలని బేగంపేట్‌ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో 2014లో కేసు నమోదైంది. 87/2014 నెంబరుతో ఎఫ్‌ఐఆర్‌ చేశారు బేగంపేట పోలీసులు. IPC 498ఎ, 494, 406, 506 సెక్షన్లకింద కేసు నమోదు చేశారు. అనిల్‌ను విచారించాక కేసును కోర్టుకు దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉంది. తనకు అనిల్‌తో వివాహం జరిగిందని.. పిల్లలు పుట్టాక వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నారని సారిక ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటినుంచి తనను శారీరకంగా, మానసికంగా అనిల్‌ వేధిస్తున్నారని ఆరోపించారు. ముగ్గురు పిల్లల్ని పోషించడం కష్టంగా ఉందని చెప్పుకొచ్చారు. అత్తా, మామలనుంచి తనకు ఎలాంటి సపోర్ట్ లేదని వాపోయారు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.

13:21 - November 4, 2015

వరంగల్ : మాజీ ఎంపీ, ప్రస్తుత ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య కుటుంబాన్ని అరెస్టు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం తెల్లవారుజామున రాజయ్య కోడలు సారిక, అభినవ్ (7), అమోన్ (3), శ్రీయోన్ (3) అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఈమె మృతిపై బిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు భావిస్తుండగా ఆత్మహత్య చేసుకోలేదని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఐద్వా, ఇతర మహిళా సంఘాల నేతలు రాజయ్య నివాసానికి చేరుకున్నారు. నివాసం దగ్గర మహిళా సంఘాలు బైఠాయించి ధర్నాకు దిగాయి. కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశాయి. మరోవైపు సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. క్లూస్‌టీం కీలక ఆధారాలను సేకరించింది. సారిక బెడ్‌రూమ్‌లోని మంచంమీద గ్యాస్‌ సిలిండర్‌ను పోలీసులు గుర్తించారు. రెగ్యులేటర్‌పై వేలిముద్రలను క్లూస్‌టీం తీసుకుంది. దర్యాప్తులో ఇవే కీలకం కానున్నాయి. 

రాజయ్య ఇంటికి చేరుకున్న సారిక తల్లిదండ్రులు..

వరంగల్ : సిరిసిల్ల రాజయ్య ఇంటికి సారిక తల్లి, సోదరి కుటుంబసభ్యులు చేరుకున్నారు. సారిక, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. 

13:09 - November 4, 2015

ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తున్న 'బాహుబలి 2' చిత్రానికి సంబంధించిన వార్తలు రోజుకొకటి హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ అందాల నటి 'మాధురీ దీక్షిత్' నటించనునన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా 'లావణ్య త్రిపాఠి' నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మొదటి పార్టులో భల్లాల దేవుడి పాత్ర వేసిన రానాకు భార్య ఉన్నట్టు ఎక్కడా చూపించలేదు. ఇప్పుడు రెండో భాగం స్క్రిప్ట్ భారీ మార్పులు చేర్పులు చేసినట్టు తెలిసింది. ఈ మార్పుల్లో భాగంగా ఆ సినిమాలో 'లావణ్య త్రిపాఠి'కి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. భల్లా దేవుడికు భార్యగా లావణ్య నటించనుంది. ఇదిలా ఉంటే 'అనుష్క'కు సోదరిగా 'విద్యాబాలన్‌' గాని, 'మాధురి దీక్షిత్‌' గాని నటించే అవకాశాలు ఉన్నాయి. 'లావణ్య' నటించిన 'భలే భలే మగాడివోయి' చిత్రం విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

13:04 - November 4, 2015

దర్శకుడు శంకర్‌ రూపొందించనున్న చిత్రం 'రోబో 2'. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించేందుకు శంకర్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటులను కూడా నటింపజేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఈ చిత్రంలో నటించనున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందుకు 'అమితాబ్‌' కూడా గ్రీన్‌ సిగల్‌ ఇచ్చినట్లు సమాచారం. 1985లో అమితాబ్‌, రజనీకాంత్‌ కలసి 'జెరాఫ్టార్‌' చిత్రంలో నటించారు. ఇప్పుడు మళ్లీ ఈ చిత్రంలో కన్పించనున్నారు. రజనీతో కలసి పనిచేయడానికి తానేనెప్పుడూ సిద్ధమని అమితాబ్ పేర్కొన్నారు. దీనితో 'రోబో -2'లో అమితాబ్ నటిస్తారన్న వార్తలకు బలం చేకూరింది. భారీ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తామని శంకర్‌ ఇదివరకే ప్రకటన చేశారు. ఇంకా ఈ చిత్రానికి నిర్మాత ఎవరన్నది ఇంకా స్పష్టత రాలేదు.

12:57 - November 4, 2015

 

అవును మీరు చదువుతున్నది నిజమే. ఏకంగా 32 కిలోల డ్రెస్ ధరించి ఎలా యాక్టింగ్ చేస్తారు ? అనే ప్రశ్నలు తలెత్తడం సహజం. అసలు ఏ సినిమాలో నటిస్తోంది. తదితర వివరాలు తెలుసుకోవాలంటే ఇది చదవండి.
ఆర్ బాల్కీ దర్శకత్వంలో 'కీ అండ్ కా' సినిమాలో 'కరీనా' నటిస్తోంది. బాల్కీ తన మార్క్ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఓ భారీ సాంగ్‌ను ప్లాన్ చేశాడు. ఈ పాటలో 'కరీనా' లుక్ గ్రాండ్‌గా కనిపించాలన్న ఉద్దేశంతో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో డ్రెస్ డిజైన్ చేయించారంట. గ్రాండ్ లుక్ కోసం జర్దోసితో డిజైన్ చేసిన ఈ డ్రెస్ 32 కేజీల బరువుంది. సినిమా అంతా పూర్తి వ్రెస్టన్ లుక్‌లో 'కరీనా' మెరిపించనుందంట. మరి అంత బరువున్న డ్రెస్ తో 'కరీనా' ఎలా డ్యాన్స్ చేసిందో చూడాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాక వెయిట్ చేయాల్సిందే. 

నితీష్ కు ఓటు వేయాలన్న కేజ్రీ..

ఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు నితీష్ కుమార్ కు ఓటు వేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. బీహార్ లో బీజేపీ ఓడిపోతుందని, ప్రజలు ప్రేమ, శాంతిని మాత్రమే కోరుకుంటున్నారని తెలిపారు. 

రాజయ్య నివాసం వద్ద మహిళా సంఘాల ధర్నా..

వరంగల్ : మాజీ ఎంపీ, ప్రస్తుత ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య నివాసం ఎదుట మహిళా సంఘాలు ధర్నా నిర్వహించాయి. రాజయ్య కుటుంబ సభ్యులను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

గాలి వినోద్ కుమార్ కు ప్రతిపక్షాలు మద్దతివ్వాలి - సీపీఐ..

వరంగల్ : ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ అభ్యర్థులను ఉపసంహరించుకుని గాలి వినోద్ కుమార్ కు మద్దతు తెలుపాలని, ప్రతిపక్షాల ఓట్లు చీలకూడదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. పేదలకు మూడెకరాల భూమి పంపిణీ చేపట్టాలని, లేనిపక్షంలో మరో భూ పోరాటానికి సిద్ధమని ప్రకటించారు.

 

12:37 - November 4, 2015

వరంగల్ : మాజీ ఎంపీ, ప్రస్తుత ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన సంఘటనతో తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నివాసంలో కోడలు సారిక, అభినవ్ (7), అమోన్ (3), శ్రీయోన్ (3) అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఈమె మృతిపై బిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు భావిస్తుండగా ఆత్మహత్య చేసుకోలేదని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే సమాచారం తెలుసుకున్న క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందం రాజయ్య నివాసానికి చేరుకుని సాక్ష్యాలను సేకరించారు. సారిక ఉంటున్న బెడ్ రూంలో రెండు గ్యాస్ సిలిండర్లు ఉన్నట్లు తెలుస్తోంది. సిలిండర్ పై నున్న వేలి ముద్రలు సేకరించడం కష్టమని తెలుస్తోంది. కానీ గ్యాస్ రెగ్యులేటర్ పై నున్న ముద్రలను సేకరించారు. ఈ ముద్రలతో పాటు బెడ్ లో ఉన్న ఇతర సామాగ్రీపై వేలి ముద్రలను ఫోరెన్సిక్ బృందం సేకరించింది.
మరోవైపు సారిక మృతిపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంఘటన స్థలంలో సారిక భర్త అనీల్ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తలుపు వద్ద మృతదేహాలు పడి ఉండడం..గ్యాస్ లు లీక్ అయ్యాయా ? లేక ఇంకేదైనా జరిగిందా ? తలుపు గడియ ఎవరు తీసి ఉంటారు ? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. సారిక బహుశా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని తొలుత పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. దుర్ఘటన జరిగిన రూమ్ నుంచి క్లూస్‌టీమ్ అన్ని ఆధారాలను సేకరిస్తోంది.

పరిశ్రమలకు పవర్ హాలిడే లేకుండా విద్యుత్ - కేటీఆర్...

హైదరాబాద్ : పరిశ్రమలకు పవర్ హాలిడే లేకుండా ప్రభుత్వం విద్యుత్ అందిస్తోందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రూ.15వలే కోట్లతో గ్రామాల్లో రోడ్లు నిర్మాణం చేస్తున్నట్లు, నగరంలో రోడ్లన్నీ డిసెంబర్ లోపు పటిష్టం చేస్తామని హామీనిచ్చారు. నగరాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగిందని, కృష్ణా, గోదావరి, నీటిని అందిస్తున్నట్లు చెప్పారు. 

రాజయ్య కుటుంబానికి సానుభూతి - జానారెడ్డి...

హైదరాబాద్ : రాజయ్య కుటుంబంలో జరిగిన ఘటన దురదృష్టకరమని కాంగ్రెస్ నేత జానారెడ్డి పేర్కొన్నారు. రాజయ్య కుటుంబానికి సానుభూతిని తెలియచేస్తున్నట్లు, ఈ ఘటనతో పార్టీ శ్రేణులు దిగ్ర్భాంతికి లోనయ్యారని తెలిపారు. ఈ విషాద పరిస్థితుల్లో కార్యకర్తలు మనోధైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. 

ఢిల్లీలో జౌళీ శాఖ మంత్రుల సదస్సు..

ఢిల్లీ : రాష్ట్రాల జౌళీశాఖ మంత్రుల సదస్సు జరుగుతోంది. కేంద్ర జౌళీశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్రం నుంచి పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు సదస్సుకు హాజరయ్యారు. పత్తికి మద్దతు ధర పెంచాలని కేంద్ర మంత్రిని జూపల్లి కోరారు.

12:13 - November 4, 2015

వరంగల్ : మాజీ ఎంపీ, ప్రస్తుత ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్లు మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఐద్వా డిమాండ్ చేసింది. బుధవారం తెల్లవారుజామన సారిక, అభినవ్ (7), అమోన్ (3), శ్రీయోన్ (3) అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఆత్మహత్య చేసుకున్నారా ? లేక హత్య చేశారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఐద్వా, మహిళా సంఘాలు రాజయ్య ఇంటికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఐద్వా నేతలు టెన్ టివితో మాట్లాడారు. సారిక మృతిని ఖండిస్తున్నట్లు చెప్పారు. ముగ్గురు పిల్లలతో సజీవ దహనం కావడం కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు దీనిపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో భర్త పై ఫిర్యాదు చేసి పోరాడిన సందర్భాలున్నాయని, కేసు నడుస్తున్నా ఆయనలో స్పందన లేదని, స్త్రీ జాతికి అవమానమని పేర్కొన్నారు. 

12:05 - November 4, 2015

గుంటూరు : ప్రేమ విఫలమైందని ఒకరు...ప్రేమ నిరాకరించిందని మరొకరు..పెద్దలు నిరాకరించారని జంటలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. తమ ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించలేదని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడు మృతి చెందగా..ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. ముపాళ్ల మండలం తొండపికి చెందిన శ్రీకాంత్, భువనేశ్వరీలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమ వివాహానికి పెద్దలు నో చెప్పారని తెలుస్తోంది. దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీకాంత్..భువనేశ్వరీలు బుధవారం ఉదయం రెంటపాళ్ల ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే తెచ్చుకున్న చాక్లెట్ లో పురుగుల మందు కలుపుకుని సేవించారు. దీనితో శ్రీకాంత్ అక్కడికక్కడనే చనిపోయాడు. స్థానికులు గమనించి భువనేశ్వరీని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తనకు బండి ఇచ్చిన వ్యక్తిని ఏమి అనవద్దని లేఖలో పేర్కొన్నారు. ఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బా..చాక్లెట్..ద్విచక్రవాహనాలు పడి ఉన్నాయి. విషయం తెలుసుకున్న శ్రీకాంత్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

11:42 - November 4, 2015

హైదరాబాద్ : క్షణికావేశంలో ఎంతో మంది నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు. మంచి చదువులు చదివి..ఉన్నతస్థానానికి ఎదిగి తమను చేరదీస్తాడని తల్లిదండ్రుల ఆశలు విద్యార్థులు కల్లలు చేస్తున్నారు. సీఎంఆర్ కళాశాలలో విద్యార్థి భార్గవ్ డీ ఫార్మసీ చదువుతున్నాడు. అయితే కాలేజీకి సరిగ్గా రావడం లేదని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేయడంతో మనస్థాపానికి గురైన భార్గవ్ నాంపల్లి స్టేషన్ లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రిన్స్ పాల్ డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. దీనిపై విచారణ చేపడుతామని, నిందితులు ఎవరైనా ఉంటే వారిని కఠినంగా శిక్షిస్తామని కాలేజీ యాజమాన్యం పేర్కొంది. దీనికి విద్యార్థులు సమ్మతించలేదు. ప్రిన్స్ పాల్ రావాలని..వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

11:34 - November 4, 2015

హైదరాబాద్ : వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ వైపు కాంగ్రెస్ హై కమాండ్ మొగ్గు చూపింది. జిల్లా ఎంపీ స్థానానికి అభ్యర్థిగా ఉన్న సిరిసిల్ల రాజయ్య నివాసంలో విషాదం నెలకొన్న సంగతి తెసింది. రాజయ్య కోడలు, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రస్తుత తరుణంలో తాను పోటీ చేయలేనని కాంగ్రెస్ అధిష్టానాన్ని రాజయ్య స్పష్టం చేశారు. వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించింది. సర్వే సత్యనారాయణ, కొండేటి శ్రీధర్, రాజరపు ప్రతాప్, అద్దంకి దయాకర్ పేర్లను పరిశీలిస్తున్నారు. కానీ మొదటి నుండి కాంగ్రెస్ హై కమాండ్ సర్వే వైపు మొగ్గు చూపినా పోటీ చేయడానికి అనాసక్తి చూపడంతోనే రాజయ్య పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాజయ్యతో కాంగ్రెస్ పెద్ద దిగ్విజయ్ సింగ్, టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ లు సర్వేతో మాట్లాడడంతో ఆయన బరిలో నిలవడానికి అంగీకరించినట్లు సమాచారం.
2009లో స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ మ‌ల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు. ఈ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో సెటిల‌ర్లు అధికంగా ఉంటారు. స‌ర్వే ఏనాడూ తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన‌లేని, నొప్పించ‌క తానొవ్వ‌క అన్న‌ట్లుగా త‌ట‌స్థంగా వ్య‌వ‌హ‌రించడంతో అత‌నికి కేంద్ర‌మంత్రి ప‌ద‌విని తెచ్చిపెట్టిందని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. 2014లో స‌ర్వే కూడా ఓడిపోయారు. వ‌రంగ‌ల్ స్థానానికి కడియం రాజీనామా చేయ‌గానే ఆ స్థానానికి ఇటీవలే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 

పాలకొల్లు కోర్టు వద్ద కలకలం..

పశ్చిమగోదావరి : జిల్లాలోని పాలకొల్లు కోర్టు ఆవరణలో భార్యను గొడ్డలితో భర్త నరికాడు. దీనితో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులు కోర్టుకు వచ్చారు. 

బయోటెక్నాలజీ కార్యదర్శితో బాబు భేటీ..

ఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు బయోటెక్నాలజీ కార్యదర్శితో చంద్రబాబు భేటీ అయ్యారు. 

రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య..

హైదరాబాద్ : నాంపల్లి వద్ద బీ ఫార్మసీ చదువుతున్న విద్యార్థి భార్గవ్ నాయుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను మేడ్చల్ సీఎంఆర్ కళాశాలలో డిఫార్మసీ భార్గవ చదువుతున్నాడు. కాలేజీకి సరిగ్గా రావడం లేదని తొలగించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. 

బయోటెక్నాలజీ కార్యదర్శితో బాబు భేటీ..

ఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు బయోటెక్నాలజీ కార్యదర్శితో చంద్రబాబు భేటీ అయ్యారు. 

10:52 - November 4, 2015

మీకు 'బావగారు బావున్నారా' సినిమాలో ఓ సీన్ గుర్తుందా ? ఈ సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ చనిపోయినట్లుగా రంభ భావించి శరీరం పాడవకుండా ఉండేందుకు ప్రిజ్ లో పెడుతుంది. ఆ సమయంలోనే బయటి నుండి వచ్చిన హీరో చిరంజీవి ఫ్రిజ్ తెరిచి చూస్తే బ్రహ్మానందం కనబడుతాడు. కొన్ని గంటల పాటు అందులో ఉన్నా బతుకుతాడు. నిజంగా బతుకుతారా ? చావరు అంటారు కదా. కానీ ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. న్యూయార్క్ లోని సబ్ వే ఫ్రాంచైజీలో కార్లీ అనే 20 ఏళ్ల యువతి పని చేస్తుంది. స్టోర్ కీపర్ గా పని చేస్తున్న ఆమె రాత్రి లేట్ నైట్ షిప్టుకు వచ్చింది. షాపు మూసే సమయంలో పాలను ఫ్రిజ్ లో పెట్టేందుకు వెళ్లిందిఏ. అసలే అతి పెద్ద ఫ్రిజర్. లోనికి వెళ్లింది. కానీ ఆమె బయటకు రాకముందే సెక్యూరిటీ వాళ్లు తలుపు వేశారు. దీనితో కార్లీ లోపల ఉండి ఎన్ని సార్లు అరిచినా బయటి వారికి వినపడలేదు. సున్నా డిగ్రీల ఉష్టోగ్రత...అసలు కాళ్లు, చేతులు పట్టుకపోయాయి. మరుసటి రోజు ఉదయం వచ్చిన ఓ వ్యక్తి ఫ్రిజ్ తలుపు తీసి భయపడిపోయాడంట. అతని అరుపులకు మిగతా వాళ్లు వచ్చి లోన గడ్డ కట్టుకపోయిన కార్లీని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుంది.

10:34 - November 4, 2015

నిజామాబాద్ : మాజీ ఎంపీ, వరంగల్ ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలని సారిక సోదరి అర్చన పేర్కొంది. వరంగల్ జిల్లాలోని రాజయ్య నివాసంలో బుధవారం కోడలు సారిక, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. జిల్లాలోని ఎల్లారెడ్డి గూడలో నివాసం ఉంటున్న సారిక తల్లిదండ్రులకు విషయం తెలిసి విషాదంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా సారిక మీడియాతో మాట్లాడారు. ఇంతకాలం పిల్లలను చూసి బతుకుతూ వస్తోందని, అత్త..మామ..భర్త వేధించారని, వాళ్లను వదిలేయవద్దని కోరింది. ఇంతకుముందు ఇలాగే ప్రాబ్లం వచ్చిందని, సూసైడ్ చేయవద్దని చెప్పడం జరిగిందన్నారు. కానీ ఇటీవలే ఇక్కడకు వచ్చిన సారిక వారం రోజుల్లో ఒక న్యూస్ వస్తుందని తనతో చెప్పడం జరిగిందని, ఇలాంటి న్యూస్ వస్తుందని ఊహించలేదని అర్చన వాపోయింది.

ప్రేమ వివాహం..
సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనీల్, సారికలు ప్రేమించుకుని 2006 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అనంతరం బాబు జన్మించిన అనంతరం వీరి మధ్య విబేధాలు బయటపడినట్లు సమాచారం. గత కొంతకాలం క్రితం సారిక.. భర్త అనీల్, రాజయ్య కుటుంబంపై గృహ హింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దసరా పండుగ సందర్భంగా సారిక పుట్టింటికి వచ్చి వచ్చి తన బాధను వ్యక్తం చేసినట్లు సమాచారం. తనకు ప్రాణహాని ఉందని పేర్కొందని తెలుస్తోంది. గతంలో కూడా తన చెల్లెల్ని ఎన్నోసార్లు వేధింపులకు గురి చేశారని, వేధించి హత్య చేశారని సారిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

విజయవాడలో డెంగ్యూతో బీటెక్ విద్యార్థిని మృతి..

విజయవాడ : పెదజోన్ పేటలో విష జ్వరాలు ప్రబలినాయి. డెంగ్యూతో బీటెక్ విద్యార్థి వై. తిరుమల మృతి చెందింది.

 

10:07 - November 4, 2015

నిజామాబాద్ : వరంగల్ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య కుటుంబమే తన సోదరిని హత్య చేసిందని సారిక సోదరి అర్చన ఆరోపించింది. బుధవారం తెల్లవారుజామున రాజయ్య నివాసంలో సారిక, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. జిల్లాలోని కామిరెడ్డి మండలం ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్న సారిక కుటుంసభ్యులకు ఈ విషయం తెలియడంతో విషాదవదనంలో మునిగిపోయారు. సారిక మృతిపై అనుమానాలున్నాయని, అత్తింటివారే తన చెల్లెల్ని హత్య చేశారని అర్చన ఆరోపించింది. తన చెల్లెలు ఆత్మహత్య చేసుకొనే పిరికిది కాదన్నారు.

2006లో వివాహం..
సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనీల్, సారికలు ప్రేమించుకుని 2006 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అనంతరం బాబు జన్మించిన అనంతరం వీరి మధ్య విబేధాలు బయటపడినట్లు సమాచారం. గత కొంతకాలం క్రితం సారిక.. భర్త అనీల్, రాజయ్య కుటుంబంపై గృహ హింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దసరా పండుగ సందర్భంగా సారిక పుట్టింటికి వచ్చి వచ్చి తన బాధను వ్యక్తం చేసినట్లు సమాచారం. తనకు ప్రాణహాని ఉందని పేర్కొందని తెలుస్తోంది. గతంలో కూడా తన చెల్లెల్ని ఎన్నోసార్లు వేధింపులకు గురి చేశారని, వేధించి హత్య చేశారని అక్క ఆరోపిస్తోంది. రాజకీయ పలుకుబడి ఉండడంతో తమను భయబ్రాంతులకు గురి చేశారని సారిక తల్లి ఆరోపిస్తోంది. 

మాట్లాడిన అనంతరం వరంగల్ అభ్యర్థిని ప్రకటిస్తాం - ఉత్తమ్..

హైదరాబాద్ : స్థానిక నేతలతో మాట్లాడిన అనంతరం అభ్యర్థిని ప్రకటిస్తామని, పోటీ చేయమని సర్వేను కోరుతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఖాళీ బీ ఫాంలతో వరంగల్ కు బయలుదేరి వెళ్లారు. 

నగరంలో 4.2 కిలోల బంగారం స్వాధీనం..

హైదరాబాద్ : చాంద్రాయణగుట్ట వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన తనిఖీల్లో 4.2 కిలోల బంగారం బయటపడింది. ఎయిర్ పోర్టు నుండి కారులో తరలిస్తున్నారు. రూ.16 లక్షతో పాటు భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. జకీర్, ఆరీఫ్, హాసన్, వాజిద్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ పోర్టు సెక్యూర్టీ సిబ్బంది హస్తం ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గతంలోనూ పెద్దమొత్తంలో బంగారం స్మగ్లింగ్ చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. 

సారిక మృతిపై అనుమానాలు - సోదరి..

నిజామాబాద్ : సారిక మృతిపై అనుమానాలున్నాయని, అత్తింటివారే తన చెల్లెల్ని హత్య చేశారని సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక అక్క అర్చన ఆరోపించింది. తన చెల్లెలు ఆత్మహత్య చేసుకొనే పిరికిది కాదన్నారు. 

గోదావరిఖనిలో కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య..

కరీంనగర్ : గోదావరిఖనిలోని జవహార్ నగర్ లో ఇద్దరు పిల్లలతో కానిస్టేబుల్ భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. కుమారుడికి గాయాలు కావడం..తల్లి పరిస్థితి విషమంగా ఉంది. 

 

09:27 - November 4, 2015

వరంగల్ : జిల్లా ఎంపీ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ మళ్లీ తర్జనభర్జనలు పడుతోంది. మాజీ ఎంపీ, అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన కోడలు సారికతో పాటు మనవళ్లు అభివన్ (7), అమోన్ (3), శ్రీయోన్ (3)లు మృతి చెందారు. దీనితో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనని రాజయ్య కాంగ్రెస్ హై కమాండ్ కు చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో అభ్యర్థి విషయంపై పునారాలోచన చేస్తోంది. బుధవారం నామినేషన్ల ప్రక్రియ ఆఖరి తేదీ కావడంతో అభ్యర్థుల వేటలో పడ్డారు. అధిష్టానం నలుగురి పేర్లను పరిశీలిస్తోంది. సర్వే సత్యనారాయణ, కొండేటి శ్రీధర్, రాజరపు ప్రతాప్, అద్దంకి దయాకర్ పేర్లను పరిశీలిస్తున్నారు. నామినేషన్ పత్రాలు తయారు చేసుకుని ఉండాలని వీరికి సమాచారం అందచేసినట్లు తెలుస్తోంది. కొద్దిసేపట్లో అభ్యర్థి ఎవరో తేలిపోనుంది. 

రాజయ్య కుమారుడిని ప్రశ్నించిన పోలీసులు..

వరంగల్ : జిల్లా ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనీల్ ను పోలీసులు విచారించారు. బుధవారం రాజయ్య ఇంట్లో కోడలు, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజయ్యను రెండు దఫాలుగా విచారించారు. 

రెంటపాలలో ప్రేమ జంట ఆత్మహత్య..

గుంటూరు : సత్తెనపల్లి మండలం రెంటపాలెంలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఈ ఘటనకు పూనుకున్నట్లు సమాచారం. 

పోటీ చేయలేను - రాజయ్య..

వరంగల్ : ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయాలని, అభ్యర్థిని మార్చాలని వరంగల్ ఉప ఎన్నిక అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య కోరారు. బుధవారం తెల్లవారుజాన రాజయ్య ఇంట్లో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కోడలు, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. 

పోటీ చేయలేను - రాజయ్య..

వరంగల్ : ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయాలని, అభ్యర్థిని మార్చాలని వరంగల్ ఉప ఎన్నిక అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య కోరారు. బుధవారం తెల్లవారుజాన రాజయ్య ఇంట్లో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కోడలు, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. 

09:12 - November 4, 2015

వరంగల్ : జిల్లా ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన ప్రమాదంపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. బుధవారం తెల్లవారుజామున సిరిసిల్ల రాజయ్య కోడలు, మనువళ్లు ముగ్గురు అనుమానాస్పదస్థితిలో దుర్మరణం చెందారు. దీనితో రాజయ్యను పరామార్శించేందుకు కాంగ్రెస్ నేతలు వచ్చారు. ఈ సందర్భంగా టెన్ టివితో నేతలు మాట్లాడారు. సంఘటన జరగడం దురదృష్టకరమని, ఇలాంటి సమయంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. ఈ ఘటన దిగ్ర్భాంతిని కలుగ చేసిందని, పార్టీ శ్రేణులందరినీ రాజయ్య ఉత్తేజం కలిగించారని పేర్కొన్నారు. రాజయ్యను రాజకీయంగా నాశనం చేయాలనే ఉద్ధేశ్యంతో ఎవరైనా చేయించారా అనే ప్రశ్నలు కలుగుతున్నాయని తెలిపారు. సంఘటన జరగడం చాలా దురదృష్టకరమని, రాజయ్య గెలుస్తారని భావించిన కోడలు సారిక ఇలాంటి ఘటనకు పూనుకుందని రాజయ్య సన్నిహితుడు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గెలిస్తే ఇబ్బందులు వస్తాయమోనన్న భావనతో ఈ దారుణానికి ఒడిగట్టవచ్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో గొడవలు వచ్చాయని..దీనిపై సారికతో మాట్లాడడం జరిగిందని తెలిపారు. దురదృష్టకరమైన సంఘటన అని మాజీ మేయర్ స్వర్ణ తెలిపారు. 

08:47 - November 4, 2015

ప్రస్తుతం భారతదేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అసహనం కాదా ? అని ప్రొ.నాగేశ్వర్ ప్రశ్నించారు. దేశంలో అసహనం లేదని..ఎప్పటికీ రాదని ఆర్థిక మంత్రి జైట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. వరంగల్ ఎంపీ నివాసంలో జరిగిన విషాదం..అసహనం..హస్తినలో బుధవారం కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ..అవార్డుల రిటర్న్ పై కమల్ హాసన్ వ్యాఖ్యలు..ఏపీలో అవినీతి పెరిగిపోతోందని బీజేపీ నేతల వ్యాఖ్యలపై టెన్ టివిలో 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లోనే..

సిరిసిల్ల రాజయ్య ఇంట్లో విషాదం..
''వరంగల్ ఎంపీ అభ్యర్థి బరిలో నిలిచిన సిరిసిల్ల రాజయ్య నివాసంలో జరిగింది ప్రమాదమా ? హత్యా..ఆత్మహత్యా అనేది తేలాలి ? గతంలో కుటుంబం మధ్య ఘర్షణలున్నాయిని..పీఎస్ లో కేసు కూడా నమోదు పెట్టిందని..కలిసి ఉండడం లేదనే వార్తలు వస్తున్నాయి. హత్యా..ఆత్మహత్యా..ప్రమాదమా ? అనేది తేలాలి. హత్యా..ఆత్మహత్యా..అంటే ఎవరు బాధ్యులు అనేది తేలాల్సి ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి లింక్ చేయలేము. గతంలో వీరి కుటుంబంలో నెలకొన్న వివాదం హై కమాండ్ కు తెలుసు. ప్రస్తుతం అభ్యర్థిగా ఎందుకు పెట్టారనే ప్రశ్నలు వస్తుంటాయి. ఇందులో అభ్యర్థిని మార్చే విషయంపై కాంగ్రెస్ ఆలోచిస్తోందని వార్తలు వస్తున్నాయి.

అసహనం ఎక్కడుంది..
అసహనం ఎక్కడుంది ? ఎవరు కారణం అంటే దీనిపై వాదించవచ్చు..చర్చించవచ్చు. కానీ ప్రస్తుతం ఏమి జరుగుతుంది ? బీఫ్ ఇంట్లో పెట్టుకున్నాడని హత్య..బీఫ్ తింటే తల నరికివేస్తాం..సంగీత విద్యాంసుడిపై దాడి..పుస్తకావిష్కరణ సభలో ఇంక్ పోయడం..దళిత బిడ్డలను చంపేస్తే కుక్కలతో పోలుస్తారా ? పది మంది పిల్లలు కనాలి..రచయితలు చంపారు..అధికారంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు..బీజేపీకి అనుబంధంగా ఉన్న సామాజిక, రాజకీయ సంస్థలు ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా ? ఇదంతా అసహనం కాదా ? కాంగ్రెస్ కు హక్కు ఉందా అని ప్రశ్నిస్తున్నారు. కరెక్టే. సిక్కుల ఊచకోత కు కాంగ్రెస్ కారణం..ఎమర్జెన్సీకి కారణం..మత ఛాందస వాదులపై రాజీ పడింది..దీనిపై కాంగ్రెస్ ను ప్రశ్నించవచ్చు. కానీ ఏది ఏమైనా కాంగ్రెస్..బీజేపీ..ఇంకెవరైనా భారత రాజ్యాంగ విలువలను ఎవరైనా దెబ్బతీస్తే ప్రశ్నించాల్సిందే.

కమల్ హాసన్ వ్యాఖ్యలు..
కమల్ హాసన్ అసహనంపై పలు వ్యాఖ్యలు చేశారు. నిరసన ఎలాగైనా వ్యక్తం చేయవచ్చన్నారు. అవార్డులను రిటర్న్ ఇవ్వడం కాదని వ్యాఖ్యానించారు. అవార్డులు తిరిగి ఇవ్వడం కొంతమందికి రైట్ అనిపించవచ్చు..కొంతమందికి తప్పు అనిపించవచ్చు. ఎవరు ఇష్టమొచ్చిన రీతిలో నిరసన వ్యక్తం చేయవచ్చు.

బాబు పాలనలో అవినీతి లేదా ?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమాజానికి, దేశానికి ఎన్నో ఆశలు చూపించారు. అవినీతి పెరిగిందని సోము వీర్రాజు అంటున్నారు. మరి ఎందుకు ప్రభుత్వంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి ఉందా ? లేదా ? అనేది బీజేపీ నేతలు చెప్పాలి. మరోవైపు వెంకయ్య నాయుడు ఆకాశానికి ఎత్తేస్తుంటారు. మోడీ - బాబు నాయకత్వంలో అభివృద్ధి అవుతుందని మోడీ ఇటీవలే పేర్కొన్నారు. మరి కావూరి, సోము వీర్రాజు ఎవరు నాయకత్వంలో ఉన్నారు ? మొత్తానికి మాత్రం బాబు పాలనలో అనుకూల, వ్యతిరేక గ్రూపులున్నాయి. 

రాజయ్య అభ్యర్థిత్వంపై హై కమాండ్ పునరాలోచన..

ఢిల్లీ : వరంగల్ ఎంపీ స్థానానికి రాజయ్య అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ హై కమాండ్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. మరో వ్యక్తిని రంగంలోకి దింపే యోచనలో ఉన్నట్లు సమాచారం. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, సర్వే సత్యనారాయణ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

08:10 - November 4, 2015

వరంగల్ : జిల్లా ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచిన సిరిసిల్ల రాజయ్య ఇంట్లో చోటు చేసుకున్న పరిణామాలతో కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచనలో పడింది. బుధవారం ఉదయం సిరిసిల్ల రాజయ్య నివాసంలో జరిగిన అనుమానాస్పదస్థితిలో కోడలు, ముగ్గురు మనవళ్లు దుర్మరణం చెందారు. అగ్నిప్రమాదం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే వరంగల్ ఎంపీ స్థానానికి నామినేషన్ లు వేసేందుకు చివరి రోజు కావడంతో రాజయ్య కాకుండా ఇతర అభ్యర్థిని బరిలోకి దించాలని కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచిస్తోంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, సర్వే సత్యనారాయణ పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపటిలో ఎవరు బరిలో నిలుస్తారనే తేలిపోనుంది. 

07:58 - November 4, 2015

తన ఆత్మకథ పేరిట మాజీ ఎంపీ హరిరామ జోగయ్య రాసిన ఆత్మకథ తెలుగు నాట సంచలనం సృష్టిస్తోంది. వంగవీటి హత్యకు సీఎం చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని ఆయన రాయడమే ఇందుకు కారణం. కాపులను బీసీల్లోకి చేర్చి వారి ఓట్లు పోకుండా చూసేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నడింపల్లి సీతరామరాజు (విశ్లేషకులు), రామశర్మ (ఏపీ కాంగ్రెస్), అంబటి రాంబాబు (వైసీపీ), సూర్య ప్రకాష్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:50 - November 4, 2015

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ 'విద్యాబాలన్‌' చేయాల్సిన పాత్రను 'త్రిష' సొంతం చేసుకుంది. 'ధనుష్‌' హీరోగా ధురై సెంథిల్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌లో 'త్రిష' నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్ర కోసం తొలుత 'విద్యాబాలన్‌'ని సంప్రదించారు. 'నరసింహా' సినిమాలో నీలాంబరి పాత్ర తరహాలో నెగటివ్‌ షేడ్స్ ఉన్న ఈ పాత్ర సినిమాకు చాలా కీలకం కావడంతో, ఆ పాత్ర కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఈ క్యారెక్టర్‌లో నటించేందుకు 'విద్యాబాలన్‌' అంగీకరించినా, ప్రెగెన్సీ కారణంగా విద్యా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని టాక్. దీంతో ఈ డిఫరెంట్‌ రోల్‌ 'త్రిష'ని వరించింది. 'ధనుష్‌' ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో 'షామిలీ' హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటివరకు గ్లామర్‌ రోల్స్ లో మెప్పించిన 'త్రిష' నెగటివ్‌ రోల్‌తో ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసేందుకు రెడీ అవుతోంది.

07:46 - November 4, 2015

రోజు వారీగా మనం తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువ, పొటాషియం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. మనం రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలో ఏయే పదార్థాల్లో పొటాషియం పరిమాణం సమృద్ధిగా ఉంటుందో చెక్‌ చేసుకోవాలి.
ఎందుకంటే.. గుండెజబ్బులు, రక్తపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం తగ్గించుకోవాలంటే.. పొటాషియం ఎక్కువగా తీసుకోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఉప్పును కూడా బాగా తగ్గించాలంటున్నాయి.
కేవలం నాలుగువారాలు ఉప్పు వాడకం తగ్గించినా కూడా.. రక్తపోటు తగ్గుతుందని... పొటాషియం ఎక్కువ తీసుకోవడం ఇంకా మంచిదని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. అధికంగా ఉప్పు వినియోగంతో ప్రమాదాలు పెరుగుతుండగా, పొటాషియం రక్తపోటు తగ్గిస్తోందట. దీనివల్ల 23 శాతం పక్షవాతం ప్రమాదం కూడా తగ్గుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక మీ ఆరోగ్యానికి సరిపడా పొటాషియం లభించాలంటే తాజా పండ్లు, కూరగాయలు, పప్పులు తీసుకోవాలి.

 

07:43 - November 4, 2015

ప్రతిరోజు అలంకరించుకునే వాటిలో శిరోజాలు కూడా ముఖ్యమైనవి. శిరోజాలను బట్టి మన ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. అంతేకాదు చిన్నతనంలో జట్టు తెల్లబడుతుంది. అందుకే మనం తీసుకునే ఆహారంతోపాటు కొన్ని సహజ ఉత్పత్తులతో చిట్కాలను కూడా పాటిస్తే పట్టులాంటి కురులు సొంతమవుతాయి.

  • ఎండు ఉసిరి ఒక కప్పు, రెండు కప్పుల పెరుగు తీసుకొని ఒక ఇనుప గిన్నెలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. ఇలా వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది.
  • ఒక కప్పు ఎండు ఉసిరిని నాలుగు కప్పుల నీళ్లల్లో వేసి చిటికెడు పంచదార కలిపి మరిగించాలి. ఈ మిశ్రమం ఒక కప్పు మోతాదుకు వచ్చిన తర్వాత ఇందులో రెండు కప్పులహెన్నాపొడి, గుడ్డుసొన, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి.
  • సరిపడా హెన్నా, గుడ్డుసొన, అర చెక్క నిమ్మరసం, ఒక టేబుల్‌ స్పూను ఇన్‌స్టంట్‌ కాఫీపొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 45నిమిషాల తర్వాత కడిగేయాలి.

 

07:28 - November 4, 2015

వరంగల్ : మాజీ ఎంపీ, ప్రస్తుతం ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తరపున సిరిసిల్ల రాజయ్య బరిలో నిలుచున్నారు. బుధవారం సాయంత్రంతో ఎన్నికల నామినేషన్ ల గడువు ముగియనుంది. ఇప్పటికే ఒక సెట్ నామినేషన్ వేసిన రాజయ్య మరో సెట్ నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. కానీ బుధవారం తెల్లవారుజామున రాజయ్య ఇంట్లో అరుపులు..కేకలు..ఏడుపులు వినిపించడంతో కలకలం రేగింది. ఆయన ఇంట్లో కోడలు, మనవళ్లు మృత్యువాత పడడంతో జిల్లాలో కలకలం సృష్టించింది. స్థానికులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తమతో రాజయ్య కోడలు సారిక రాత్రి బాగానే మాట్లాడిందని, ఉదయం చూస్తే వారు మృతి చెందారని తెలుసుకోవడం జరిగిందని ఓ మహిళ తెలిపింది. రాజయ్య కుటుంబంతో విబేధాలున్నాయని, ఏడు సంవత్సరాలుగా కొట్లాటలు జరుగుతున్నాయని మరో మహిళ పేర్కొంది. తిండి కూడా పెట్టే వారు కాదని..ప్రేమ వివాహం చేసుకున్నా సుఖపడలేదని ఆరోపణలు గుప్పించింది. కాల్చారా..కాల్చుకున్నారా అనేది తెలియాల్సి ఉందని తెలిపింది. 

07:21 - November 4, 2015

కర్నూలు : ఉభయ రాష్ట్రాల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్థిక ఇబ్బందులు..తీవ్ర వత్తిడిలు..ఇతరత్రా కారణాలతో క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇందులో అభం..శుభయం తెలియని చిన్న పిల్లలను సైతం చంపేసి వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అవుకు జలాశయంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇందులో ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురిని స్థానికులు కాపాడ్డారు. ఈఘటన మంగళవారం మధ్యాహ్నాం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కిష్టిపాడుకు చెందిన రామయ్యకు ఇద్దరు కుమారులు వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణలున్నారు. వీరు కొంతకాలంగా శనగల వ్యాపారం చేస్తున్నారు. రైతుల నుండి కొనుగలు చేసిన శనగలు ఇతర వ్యాపారస్తులకు విక్రయాలు సాగిస్తుంటారు. కానీ విక్రయించిన తరువాత డబ్బులు రాకపోవడంతో వీరికి అప్పులు పెరిగినట్లు తెలుస్తోంది. రైతుల నుండి తీవ్ర వత్తిడి రాకపోవడంతో రామయ్య కుటుంబం తట్టుకోలేకపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రామయ్య కుమారుడు వెంకటేశ్వర్లు, ఆయన భార్య రుక్మిణి, పిల్లలు భవేష్ (5), సాహితి (3), మరో కుమారుడు లక్ష్మీనారాయణ, ఆయన భార్య భారతి, పిల్లలు మణిదీప్ (2) లు ఆవుకు రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. అనంతరం అందరూ కలిసి భోజనం చేసి నిద్రమాత్రలు మింగి జలాశయంలోకి దూకారు. అక్కడనే ఉన్న స్థానికులు ముగ్గురిని కాపాడారు. కడ్డీలు పట్టుకుని నీటిలో ఉన్న రామయ్య, లక్ష్మీనారాయణ, నంద్యాల భారతిని ప్రాణాలతో బయటకు తీశారు. వెంకటేశ్వర్లు, భావేష్ మృతదేహాలు బయటపడ్డాయి. రుక్మిణీదేవి, మణిదీప్, సాహితి మృతదేహాల కోసం గాలింపులు చేపట్టారు. 

06:26 - November 4, 2015

వరంగల్ : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన నివాసంలో కోడలు, మనవళ్లు సజీవ దహనమయ్యారు. వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియడం లేదు. మృతుల్లో సారిక, అభినవ్, అయోన్, శ్రీయోన్ లు గా గుర్తించారు. సమాచారం అందుకున్న కమిషనర్, అగ్నిమాపక సిబ్బంది, ఇతర అధికారులు సిరిసిల్ల రాజయ్య నివాసానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియరావడం లేదు. మొదటి అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని వినిపిస్తున్నా పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గతంలో కోడలు సారిక..రాజయ్య కుటుంబంపై వేధింపుల కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఘటనకు సంబంధించిన విషయాలపై పోలీసులు ఎలాంటి సమాచారాన్ని మీడియాకు ఇవ్వడం లేదు.

కాంగ్రెస్ లో ప్రకంపనాలు...
వరంగల్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా సిరిసిల్ల రాజయ్య బరిలో నిలుచున్నారు. ఇప్పటికే నామినేషన్ వేయగా మరో సొక సెట్ నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. బుధవారం మధ్యాహ్నాం మూడు గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో కాంగ్రెస్ లో ప్రకంపనాలు సృష్టించింది. మాజీగా ఎంపీగా ఉండడం..ప్రస్తుతం ఎంపీ స్థానానికి బరిలో నిలిచిన నేపథ్యంలో నలుగురు కుటుంబసభ్యులు సజీవ దహనం కావడం తెలంగాణలో సంచలనం సృష్టించింది.

గతంలో కేసు నమోదు..
భర్త, అత్తమామలు వేధింపులకు పాల్పడుతున్నారని వరంగల్ ఎంపి రాజయ్య కోడలు గతంలో కేసు పెట్టింది. 2006లో రాజయ్య కుమారుడు అనిల్ తో ఆమెకు వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. ఈ మధ్యకాలంలో అనిల్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, దీనితో అనిల్ కుటుంబసభ్యులు తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే ఈ కేసులో రాజయ్య, ఆయన భార్యకు ఊరట లభించింది. రాజయ్య దంపతులు ముందస్తు బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. రాజయ్య దంపతులకు బెయిల్ మంజూరైంది. 

సిరిసిల్ల రాజయ్య ఇంట్లో విషాదం..

వరంగల్ : జిల్లా ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రాజయ్య కోడలు, ముగ్గురు మనవళ్లు సజీవ దహనమయ్యారు. మృతుల్లో సారిక, అభినవ్, అయోన్, శ్రీయోన్ లు గా గుర్తించారు. 

ఆవు రిజర్వాయర్ పెరిగిన మృతుల సంఖ్య..

కర్నూలు : ఆవుకు రిజర్వాయర్ లో ఒకే కుటుంబానికి చెందిన 8మంది ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురిని స్థానికులు కాపాడారు. మృతుల్లో వెంకటేశ్వర్లు, రుక్మిణీదేవి, భవిష్, సాహితి, మణిదీప్ లున్నారు. దొర్లిపాడు (మం) కిష్టిపల్లెకు చెందిన వారుగా గుర్తించారు. 

ఫార్మా సిటీ రైతులకు నేడు చెక్కుల పంపిణీ..

రంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఫార్మాసిటీ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నారు. భూములిచ్చిన రైతులకు పరిహారాన్ని చెల్లించేందుకు బుధవారం చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగనుంది. బుధవారం ఉదయం 11గంటలకు మండల పరిషత్ సమావేశం హాలులో నిర్వహించే ఈ కార్యక్రమానికి మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితర అధికారులు హాజరు కానున్నారు. 

నేడు భారత్ కు రాజన్ ?

ఇండోనేషియా : ఇండోనేషియా పోలీసుల అదుపులో ఉన్న భారత మాఫియా డాన్ చోటా రాజన్ అప్పగింత వ్యవహారం వాయిదా పడింది. బాలీ సమీపంలోని లోంబాక్ ద్వీపంలోని రింజానీ అనే అగ్నిపరత్వం బద్దలు కావడం..పొగ, దుమ్ము ఆకాశాన్ని కప్పేసిన నేపథ్యంలో అక్కడి విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మంగళవారం రాత్రికి ప్రత్యేక విమానంలో అతడిని తీసుకుని సీబీఐ, ముంబై పోలీసు అధికారులు బయలుదేరాల్సి ఉంది. దీనితో రాజన్ ను భారత్ కు పంపించే కార్యక్రమాన్ని అక్కడి అధికారులు వాయిదా వేసుకున్నారు.

 

రేపు ముంబైకి సత్యనాదెళ్ల..

ముంబై : మైక్రో సాప్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెళ్ల భారత పర్యటనలో భాగంగా గురువారం ముంబైకి రానున్నారు. ఆయన ప్రముఖ పారిశ్రామిక వేత్త మహీంద్రా గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకు అధినేత శిఖా శర్మ, టాటా స్టార్ బక్స్ సీఈఓ ఆవని దవడతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. 

 

అగ్రిబిజినెస్ పై నేడు సదస్సు..

ఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో మూడు రోజుల పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగనుంది. తెలంగాణలో వ్యవసాయరంగంపై పెట్టుబడులకు గల అవకాశాలు, అగ్రిబిజినెస్ అనే అంశంపై వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారధి ప్రసంగించనున్నారు. 

అదనపు చెల్లింపులు..నేడు ఇంజినీర్లు..కాంట్రాక్టర్లతో సమావేశం..

హైదరాబాద్ : రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులను అమలు చేయడంపై యంత్రాంగం సమాయత్తమౌతోంది. దీని అమలు సాఫీగా ఉండేందుకు గాను నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు బుధవారం ప్రత్యేక సమావేశం కానున్నారు.

 

త్వరలో తెలంగాణలో సర్వేయర్ల పోస్టుల భర్తీ..

హైదరాబాద్ : త్వరలో తెలంగాణలో సర్వేయర్ల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమౌతోంది. దీర్ఘాకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న తహశీల్దార్లు, వీఆర్వోలు, ఆర్డీఓలకు త్వరలో శిక్షణ ఇప్పించేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. సచివాలయంలోని మంత్రి చాంబర్ లో ఫిర్యాదుల సెల్ ఏర్పాటు కానుంది. డిప్యూటి కలెక్టర్ హోదా వ్యక్తికి ఫిర్యాదుల విభాగం బాధ్యతలు అప్పగించనున్నారు. 

Don't Miss