Activities calendar

05 November 2015

ప.గో జిల్లాలో దారుణం...

పశ్చిమగోదావరి : జిల్లాలోని కామరపు కోట మండలం రావికంపాడులో దారుణం జరిగింది. ఇంటికి దొంగతనానికి వచ్చి దంపతులపై దొంగ దాడికి చేశాడు. అడ్డుకున్న భర్తపైనా దొంగ దాడి చేశాడు. భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ద్విచక్ర వాహనంపై పారిపోతూ డివైడర్ ను ఢీకొని దొంగ మృతి చెందాడు.

 

సిరిసిల్ల రాజయ్యకు వైద్య పరీక్షలు

వరంగల్ : ఎంజిఎంలో సిరిసిల్ల రాజయ్యకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో రాజయ్య కుటుంబసభ్యులను పోలీసులు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుచనున్నారు.

 

22:03 - November 5, 2015

వరంగల్: అంతులేని ఆవేదన కన్నీటి సిరాగా మారింది. నరాలు చిట్లిపోయే యాతన అక్షరాల్లోకి పరకాయ ప్రవేశం చేసింది. మాటల్లో వర్ణించలేని గుండె కోత , హృదయాంతరాల్లో గూడుకట్టుకున్న కన్నీటి గాధ.. తెల్లటి కాగితంపై మౌనంగా రోదిస్తూ ఒదిగిపోయాయి. అన్నీ కలిసి అత్తింటి ఆరళ్లకు బలైపోయిన ఓ అభాగ్యురాలి నిస్సహాయతను కళ్లకు కట్టినట్లు చూపాయి.
అక్షరాల్లో ఆవేదన
అక్షరాల్లో ఆవేదన. సూటి పోటి మాటలతో తూట్లు పొడుస్తున్నారు. సొంతింటిలోనే పనిమనిషి కన్నా ఘోరంగా చూస్తున్నారు. అండగా ఉంటానన్న వారే నరకం చూపిస్తున్నారు. పాలు తాగే పసి పిల్లాడిని సైతం పస్తులు పెడుతున్నారు. కట్టుకున్న వాడే కాలదన్ని పోతోంటే, కన్నతల్లిలా చూసుకోవల్సిన వాళ్లే కడుపు మీద తంతోంటే.... ఎన్నో అంచనాలు పెట్టుకున్న భవిష్యత్తు, నరకానికి నకలుగా మారింది. బంధాలే సంకెళ్లు వేసిన జీవితం చెరసాలను తలపిస్తోంది. ఈ ప్రత్యక్ష నరకాన్ని భరిస్తూ కూడా ఇంకా ఎందుకు బతికున్నానో తెలుసా.. బాబు కోసం. కేవలం నా బాబు కోసమే.
తాను అనుభవించిన నరకయాతనకు అక్షర రూపం
అక్షరాలకు అంతో ఇంతో అందిన ఈ ఆవేదన, అనుమానాస్పద స్ధితిలో మరణించిన రాజయ్య కోడలు సారికది. ఇంకా చెప్పాలంటే ధన దాహానికి, వివాహేతర సంబంధం రగిల్చిన చిచ్చుకి బలైపోయిన ఓ అభాగ్యురాలిది. సరిగ్గా ఏప్రిల్ 16, 2011 నాడు మహిళా కమిషన్‌కు రాజయ్య కోడలు సారిక రాసిన లేఖ ఇది. ఇదే ఆమె రాసిన చివరి లేఖ కూడా. పెళ్లి నాటి నుంచి రెండోసారి గర్భవతి అయ్యేంత వరకు తాను అనుభవించిన నరకయాతనకు అక్షర రూపమిచ్చింది సారిక. తన్నుకొస్తున్న కన్నీళ్లకు అడ్డుకట్ట కట్టి, టన్నుల కొద్ది బాధను పంటి బిగువున అదిమిపట్టి, తన గోడు వెళ్లబోసుకుంది.
ఇంట్లోంచి వెళ్లిపోమ్మని చిత్రహింసలు పెట్టారు..
లేఖ ప్రారంభం నుంచి ముగింపు వరకు రాజయ్య కుటుంబం తనకు చూపించిన వేధింపులను వివరించింది సారిక. ఆ ఆవేదనను ఆమె మాటల్లోనే ఓ సారి చూస్తే..... అనిల్‌ను ప్రేమించిన నన్ను ఇంట్లోనుంచి వచ్చేయమని మా అత్తయ్య ఎంతో బతిమిలాడింది. ఇంట్లో నుంచి వచ్చేస్తే కంటికి రెప్పలా కాపాడుకుంటామని మాట ఇచ్చింది. అది నమ్మి ఇంట్లోనుంచి వచ్చేసిన నాకు నరకం చూపారు. చెప్పుకోలేని మాటలతో నన్ను తీవ్రంగా వేధించారు. అన్నం పెట్టకుండా మాడ్చేసారు. కనీసం నా వారితో మాట్లాడుకునేందుకు కూడా అనుమతించలేదు. ఇంట్లోంచి రమ్మని ప్రోత్సహించిన మా అత్తగారే ఇంట్లోంచి వెళ్లిపోమ్మని చిత్రహింసలు పెట్టారని లేఖలో వివరించింది.
తాళి కట్టిన అనిల్ నన్ను కాదని వేరే మహిళతో సంబంధం
కడదాకా తోడుంటానని తాళి కట్టిన అనిల్ నన్ను కాదని వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. నాతో అవసరం ఉన్నప్పుడు, ఇంకా చెప్పాలంటే నేను కావాలనుకున్నప్పుడే వచ్చేవాడు. పిల్లాడితో నానా తంటాలు పడుతున్నా పట్టించుకునే వాడు కాదు. ఉద్యోగం కోసం సీరియస్‌గా ట్రై చేయడు. పిల్లాడిని నన్ను పట్టించుకోడు. అదేమని అడిగితే కొడతాడు. నా జీతం మొత్తం తనకే కావాలంటాడు. ఎటిఎం కార్డ్ కూడా తనే తీసుకుని లక్షలకు లక్షలు వాడుకున్నాడు. ఉద్యోగ నిమిత్తం, పూనే, ముంబాయిల్లో ఉన్నా చుట్టపు చూపుగా వచ్చేవాడే కానీ భర్తగా బాధ్యత తీసుకోలేదు. పిల్లాడు డాడీ,డాడీ అంటూ ఏడుస్తున్నా డోంట్‌ కేర్‌ అనే రీతిలో వెళ్లి పోయేవాడు. అనిల్ కొట్టిన దెబ్బలకు, వేధింపులకు అక్షరాలు చాలవు అంటూ సారిక తన ఆవేదనను వెలిబుచ్చింది.
కష్టాల కడలిని మహిళా కమిషన్‌కు లేఖ రూపంలో
రాజయ్య గురించి కూడా సారిక తన లేఖలో పూస గుచ్చినట్లు వివరించింది. అనిల్‌ను మార్చండి. మీరు చెబితే ఖచ్చితంగా వింటాడు. దయచేసి కూర్చోబెట్టి చెప్పండి అని ఎన్నోసార్లు బతిమిలాడాను. పట్టించుకోలేదు సరికదా త్యాగం చేసి సర్దుకుపోవల్సింది నువ్వే అంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఆకలిగా ఉంది అన్నం పెట్టమని, పిల్లాడికి పాలు పట్టేందుకు కూడా డబ్బులివ్వమని కాళ్లు పట్టుకుని బతిమిలాడాను. అయినా కరగలేదు. పైగా మామగారు రాజయ్య పాకెట్ మనీ కోసం నా జీతాన్ని వాడుకునే వారు. డబ్బులిస్తేనే వారి కళ్లలో సంతోషం కన్పించేది. లేకుంటే చీటికి మాటికి ఏదో ఒక సాకుతో తిట్టేవారు. పనిమనిషులు, పరాయి వారి ముందు అనరాని మాటలు అనే వారు. ఆ మాటలు ఎలా ఉండేవంటే అప్పటికప్పుడు చచ్చిపోవాలన్పించేది అంటూ సారిక తన కష్టాల కడలిని మహిళా కమిషన్‌కు లేఖ రూపంలో చెప్పుకుంది.
సారికలా మరో ఆడపిల్ల ఇలా బలి కాకూడదు
ఇలా చెప్పుకుంటూ పోతే సారిక పడ్డ కష్టాన్ని చెప్పేందుకు అక్షరాలు కాదు కోట్లాది అశ్రువులు కావాలి. నింపాదిగా వినేందుకు కొండంత గుండె ధైర్యం కావాలి. సారిక చివరిసారిగా రాసిన ఈ లేఖను చదివితే మరణం కూడా సిగ్గుతో తలదించుకుంటుంది. అందుకే కాబోలు నీకు, నీ బిడ్డలకు ఇంత వేదన ఎందుకమ్మా అంటూ మృత్యుదేవత కౌగిలించుకుందేమో అనే అనుమానం జనిస్తుంది. ఒక్కటి మాత్రం నిజం పరాయి వాడికి కాదు కనీసం పగ వాడికి కూడా ఈ కష్టం రాకూడదు. సారికలా మరో ఆడపిల్ల ఇలా బలి కాకూడదు.

 

 

21:55 - November 5, 2015

పాట్నా : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పర్వం ముగిసింది. రాష్ట్రంలోని 243 స్థానాలకు ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. తుది విడత గురువారం 57 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం మీద 59.46 శాతంపైగా పోలింగ్‌ నమోదయ్యింది. ఐదు విడతలుగా జరిగిన పోలింగ్‌లో ఇదే అత్యధికం. ఈనెల 8న ఓట్లు లెక్కిస్తారు.
అక్టోబర్‌ 12 తో ప్రారంభం, నవంబర్‌ 5 తో ముగింపు
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ఐదు విడతలుగా పోలింగ్‌ నిర్వంచారు. గతనెల 12 తో ప్రారంభమైన పోలింగ్‌ నవంబర్ 5 తో ముగిసింది. తొలి విడత గత నెల 12న 49 స్థానాలాకు ఎన్నికలు జరిపారు. మలిదశలో అక్టోబర్‌ 16న 32 సీట్లకు పోలింగ్‌ నిర్వహించారు. గతనెల 28న మూడో విడత 50 సీట్లకు ఎన్నికలు జరిగాయి. నాల్గవ విడత ఈనెల 5న 55 సీట్లకు తుది దశలో గురువారం 57 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. మొత్తంమీద బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
ప్రధాన పార్టీల అభ్యర్ధులు.. గెలుపుపై ధీమా
ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని ప్రధాన పార్టీల అభ్యర్ధులు గెలుపుపై ధీమాతో ఉన్నారు. రాష్ట్రంలోనీ 243 సీట్లకు గాను ఎన్డీయేలో కీలకమైన బీజేపీ అత్యధికంగా 159 సీట్లకు పోటీ చేసింది. ఆపార్టీతో పొత్తు పెట్టుకున్న లోక్‌జన్ శక్తి పార్టీ 40, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ 23, హిందూస్థాన్‌ ఆవామ్‌ మోర్చ 21 స్థానాలకు అభ్యర్ధులను నిలబెట్టాయి. మహాకూటమికి నేతృత్వం వహిస్తున్న జేడీయూ 101, ఆర్జేడీ 101 సీట్లకు పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ 40 స్థానాలకు అభ్యర్ధులను నిలబెట్టింది. స్వంతంత్రులతోపాటు మరికొన్ని పార్టీలు తమ అభ్యర్ధులు బరిలో ఉన్నప్పటికీ పోటీ ప్రధానా ఎన్డీయే, మహాకూటమి అభ్యర్ధుల మధ్యే ఉంది.  
2005, 2010లలో జేడీయూ-బీజేపీ కూటమి విజయం 
2005, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ-బీజేపీ కూటమి విజయం సాధించింది. 2014 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీతో జేడీయూ తెగతెంపులు చేసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా పోటీచేసి కేలం 2 సీట్లలోనే విజయం సాధించింది. బీజేపీ 22, ఎల్‌జేపీ 6, ఆర్జేడీ 4, ఆర్‌ఎల్‌ఎస్‌పీ 3 సీట్లు దక్కించుకున్నాయి. కాంగ్రెస్‌ రెండు సీట్లతో నెగ్గింది. ఎన్‌సీపీ ఒక స్థానాన్ని దక్కించకుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో దిమ్మెరపోయిన నితీష్‌ కుమార్‌ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సరికి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. మూడోసారి ముఖ్యమంత్రి అయ్యే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  

21:47 - November 5, 2015

అసహనం.. అడుగడుగునా.. అసహనం... పక్కవాడి నీడను కూడా సహించలేని తనం... పొరుగువాడి అలవాట్లను భరించలేని తనం... భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్న దేశంలో శాంతి, సామరస్య వాతావరణాలను దెబ్బతీసే ఘటనలు నిత్యం ఎన్నో జరుగుతున్నాయి. ఈ పెరుగుతున్న అసహనం.. దేశ లౌకిక, ప్రజాస్వామ్య వాతావరాణానికి విఘాతం కలుగుతుందనే అందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే దేశంలో కవులు, కళాకారులు, నటులు ఇప్పుడు ముక్తకంఠంతో తాజా పరిణామాల పట్ల తమ నిరసన గళాలను వినిపిస్తున్నారు. ఇప్పుడు కనిపిస్తున్న అసహన భారతమే ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.... ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:34 - November 5, 2015

కలల సాకారానికి ఆహ్వానం. సరికొత్త ఆలోచనలకు శ్రీకారం. ప్రపంచ గతిని మార్చే ఆవిష్కరణల నిలయం. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీ హబ్‌ వైభవంగా లాంఛ్ అయ్యింది. దేశవిదేశాల పారిశ్రామికవేత్తల సమక్షంలో ప్రారంభమైంది. స్టార్టప్ లతో యువత ఆలోచలనకు ఊతమివ్వబోతోంది. యువత కలల సాకార సాధనకు ఊతమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన ప్రాజెక్టు టీ హబ్. దేశవ్యాప్తంగా స్టార్టప్ లను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు వేదిక ఇది. ఎన్నో రోజులుగా దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించి, యువతలో సరికొత్త ఉత్సాహం నింపిన టీ హబ్‌ గచ్చిబౌలిలో గ్రాండ్ గా లాంఛ్‌ అయ్యింది.
రతన్ టాటా చేతులమీదుగా..
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఐటీ మినిస్టర్ కేటీఆర్, ఎంతో మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు, యువ ఎంట్రప్రెన్యూర్లు, విద్యార్థుల సమక్షంలో టీ హబ్ ను లాంఛ్‌ చేశారు టాటా గ్రూపు సంస్థల అధినేత రతన్ టాటా. ఉత్తమ ఆలోచనలకు టీ హబ్ సరియైన వేదిక అని రతన్ టాటా అన్నారు. నవ భారత నిర్మాణానికి నూతన ఆలోచనలే ఆధారమని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, శాస్త్రవేత్తలను ప్రోత్సహించాలని అన్నారు.
స్టార్టప్‌లకు రాజధానిగా తెలంగాణ : కేటీఆర్
స్టార్టప్‌లకు రాజధానిగా తెలంగాణ రాష్ర్టాన్ని తీర్చి దిద్దుతామని ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. భారత్‌లో మేధోసంపత్తికి కొదవ లేదన్న కేటీఆర్ తయువభారత్ ప్రపంచానికి సవాలు విసురుతుందన్నారు. గూగుల్,ఫేస్‌బుక్ తర్వాత సంచలనం భారత్‌లోనేనని, అదీ హైదరాబాద్ నుంచే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. టీ హబ్ రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తుందన్నారు గవర్నర్ నరసింహన్. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉత్తమ ఆలోచనపరులున్నారని, టీ హబ్ సేవలు గ్రామీణ ప్రాంతం ఆలోచనపరులకు చేరేలా చూడాలని సూచించారు. నూతన ఆలోచనలకు టీ హబ్ ట్రెండ్‌సెట్టర్ అవుతుందని ఆకాంక్షించారు.
ఆలోచనతో రండి...ఆవిష్కరణతో వెళ్లండి.. 
ఆలోచనతో రండి...ఆవిష్కరణతో వెళ్లండి. ఇదీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టీ హబ్ నినాదం. ఐటీలో దేశానికే తలమానికమైన భాగ్యనగరం స్టార్టప్ ల రాజధానిగా మరో ప్రస్థానం దిశగా దూసుకుపోతోంది. సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో దూసుకుపోతున్న హైదరాబాద్ ప్రస్థానం మరో మేలి మలుపు దిశగా అడుగు వేస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సరికొత్త ఉత్తేజమైన స్టార్టప్‌ లకు ఇండియాలో ప్రధాన కేంద్రం కానుంది. స్టార్టప్. అంటే కొత్త కంపెనీలు. యువకుల మదిలోని పారిశ్రామిక ఆలోచనలకు కార్యరూపం. అందుకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. దీని కోసమే గచ్చిబౌలిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా టీ హబ్‌ ను ప్రారంభించింది.
హైదరాబాద్ లో ఇప్పటికే ఇంక్యుబేషన్ వ్యవస్థ అభివృద్ది
ఐటీతో పాటు అనేక రంగాల్లో పురోగమిస్తున్న హైదరాబాద్ లో ఇప్పటికే ఇంక్యుబేషన్ వ్యవస్థ అభివృద్ది చెందింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఐఐటీ, బిట్స్ పిలానీ, హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్, హైదరాబాద్ చాప్టర్, ద ఇండర్ ఎంటర్ ప్రైజెస్ వంటి సంస్థలు భాగ్యనగరంలో స్టార్టప్ లను ప్రోత్సహిస్తున్నాయి. స్టూడెంట్స్, ఔత్సాహికుల ఆకాంక్షలు, ఆలోచనలకు కార్యరూపం దాల్చేందుకు చేయూతనిస్తున్నాయి.
ఇంక్యుబేటర్లకే ఇంక్యుబేటర్‌గా టీ హబ్
దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్‌గా, ఇంక్యుబేటర్లకే ఇంక్యుబేటర్‌గా టీ హబ్ ను తీర్చిదిద్దుతోంది తెలంగాణ ప్రభుత్వం. స్టార్టప్‌లకు రాజధానిగా హైదరాబాద్ అవతరించబోతోంది. రూ.100 కోట్ల ఫండింగ్‌తో తొలి విడత స్టార్టప్‌లను ప్రారంభించి భవిష్యత్తులో దీన్ని రూ.600 కోట్లకు పెంచుతామని సర్కారు చెబుతోంది. ఇదే విషయమై మంత్రి కేటీఆర్ ఇప్పటికే అమెరికాలోని సిలికాన్ వ్యాలీని సందర్శించారు. అక్కడి పెట్టుబడిదారులతో మాట్లాడి టీ హబ్ గురించి వివరించారు.
ఇప్పటికే 20 కంపెనీలతో ఒప్పందాలు
టెక్నాలజీ హబ్‌లో సేవలందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 20 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, హూస్టన్, ఎంఐటీ మీడియా ల్యాబ్, ఇంక్యుబియో ఆఫ్ స్పెయిన్ వంటి దిగ్గజ విద్యాసంస్థలు, దేశవ్యాప్తంగా ఉన్న పేరుగాంచిన పరిశోధనశాలలు, విద్యాసంస్థలతోనూ ఎంవోయూల కోసం సర్కారు ప్రయత్నిస్తోంది. బెంగళూరుకు ధీటుగా కొత్త కంపెనీల ఏర్పాటు, అభివృద్దికి అన్ని విధాలా చేయూతనివ్వాలని టీ సర్కారు ప్రయత్నిస్తోంది.
మీ కలలకు కొత్త చూపు... వెలుగు దారి..
FOLLOW YOUR DREAMS అంటూ మీ కలలకు కొత్త చూపునిస్తుంది. LOOK AT THE BRIGHT SIDE అంటూ వెలుగుదారి చూపిస్తుంది. మది తలపును తట్టే ఏవేవో ఆలోచనలకు తుదిరూపునిస్తుంది. రంగు రంగుల గోడల మీద నినాదాలతో స్ఫూర్తినిస్తుంది. ఆలోచనకు పదును పెట్టే మార్గదర్శనం చేస్తుంది. సమావేశ మందిరాలు, పని ప్రదేశాలు, కెఫెటేరియా, లాంజ్ ఇలా ఎక్కడ చూసినా...టీ హబ్‌ బిల్డింగ్‌ నవ్యనూతనంగా, యువతను ఆకట్టుకునేలా తీర్చిద్దిద్దారు. ఎంత గొప్ప ఆవిష్కరణకైనా ఆలోచనే మూలం. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ఛాన్స్ ఇస్తే ఎన్నెన్నో అద్భుతాల ఆవిష్కారం. వినూత్న ఆలోచనకు ప్రతిరూపంగా రూపుదిద్దుకుంది టీ హబ్ బిల్డింగ్.
70వేల చదరపు అడుగుల విస్తీర్ణం..
వేలవేల ఆలోచనల సంఘర్షణక నిలయం టీ హబ్. దీంట్లో అడుగుపెడితే అదో సృజనా ప్రపంచంలా కనిపిస్తుంది. యువతలో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతుంది. సృజనాత్మకతకు పదునుపెట్టే వేదిక టీ హబ్. ఔత్సాహిక యువతకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది తెలంగాణ సర్కారు. ఒక్కరిద్దరు కాదు వేలమంది ఒకచోట చేరి వందలాది నూతన ఆవిష్కరణలకు పురుడుపోసే సదావకాశం టీ హబ్ రూపంలో అందివస్తోంది. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, మొబైల్, డేటా అనలిటిక్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ వంటి అనేక రంగాల్లో వినూత్న ఉత్పత్తుల అభవృద్దికి కృషి చేస్తున్న స్టూడెంట్స్, ఔత్సాహికులకు టీ హబ్ వేదిక అవుతుంది. టీ హబ్ లో కార్యకలాపాలు చేపట్టడానికి దాదాపు 500 స్టార్టప్ లు అప్లై చేసుకున్నాయి. అయితే వీటిలో 140 కంపెనీలను ప్రస్తుతానికి ఎంపిక చేశారు. ఇవి వెంటనే తమ కార్యకలాపాలను ప్రారంభిస్తాయి.
రాయదుర్గంలో మరో భవనం
రెండోదశలో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రాయదుర్గంలో మరో భవనాన్ని నిర్మించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే 3 సంవత్సరాల్లో అందుబాటులోకి రానున్న ఈ బిల్డింగ్ కోసం ప్రభుత్వం రూ. 150 కోట్లు వెచ్చించనుంది. ఇప్పటికే 15 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ప్రతిపాదనలో ఉంది. 2018లో హైదరాబాద్ లో ప్రపంచ ఐటీ కాంగ్రెస్ జరిగే నాటికి టీ హబ్ సెకండ్ ఫేజ్ ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ ను స్టార్టప్ లకు కేంద్రంగా మార్చడానికి టీ హబ్ వరమంటున్నారు పారిశ్రామికవేత్తలు. హైదరాబాద్ లో వ్యయం తక్కువ. దీంతో వెంచర్, ఏంజెల్ ఫండ్ లు ఇచ్చే నిధులు ఇతర సిటీల్లో కేవలం ఒక ఏడాదికే సరిపోతాయి. అయితే హైదరాబాద్ లో రెండు, మూడేళ్లకు సరిపోతాయి. అంతేకాదు రవాణా పరంగా కూడా హైదరాబాద్ కీలక ప్రాంతంలో ఉంది. బెంగళూరు, హైదరాబాద్, పూణే స్టార్టప్ ల గోల్డెగ్ ట్రయాంగిల్ గా అభివృద్ది చెందుతుంది. ఇలా ఎన్నో సానుకూలతలు హైదరాబాద్‌ కు ఉన్నాయి.
టీ హబ్ స్థాపనలో ఆయనదే కీలక పాత్ర
కొత్త ఆలోచనలకు చేయూతనివ్వాలనుకున్నారు. సాఫ్ట్ వేర్ లో దూసుకెళుతున్న భాగ్యనగరాన్ని మరో మెట్టు ఎక్కించాలనుకున్నారు. స్టార్టప్ ల రాజధానిగా తీర్చిదిద్దాలనుకున్నారు. యువ పారిశ్రామికవేత్తల భుజం తట్టాలనుకున్నారు. ప్రపంచం మెచ్చేలా, దేశం ముచ్చటపడేలా గ్రాండ్ గా లాంఛ్‌ చేయాలనుకున్నారు. లక్ష్యం దిశగా తొలి అడుగువేశారు. ఆయన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. టీ హబ్ స్థాపనలో ఆయనదే కీలక పాత్ర. తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మానస పుత్రిక టీ హబ్. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రభుత్వ పర్యవేక్షణలో ఇంక్యుబేటర్‌ టీ హబ్‌ ను స్టాపించడంలో ఆయనదే కీలక పాత్ర.
నిజాం కాలేజీలో మైక్రో బయాలజీ డిగ్రీ
నిజాం కాలేజీలో మైక్రో బయాలజీ డిగ్రీ చేశారు కేటీఆర్. తర్వాత పూణే యూనివర్సిటిలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదివారు. యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్ నుంచి మార్కెటింగ్ అండ్ ఈ-కామర్స్ పట్టా పొందారు. తర్వాత పలు కంపెనీల్లో వివిధ హోదాల్లో పని చేశారు. అయితే రాజకీయాలపై ఆసక్తితో పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక..కీలకమైన పంచాయతీ రాజ్, ఐటీ శాఖలను కేటీఆర్ కు అప్పగించారు కేసీఆర్. గతంలో ఏమాత్రం మంత్రిగా అనుభవం లేకపోయినా చాలా ప్రతిభావంతంగా రెండు శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. సాఫ్ట్ వేర్ రంగంలో హైదరాబాద్ మరింత అభివృద్దికి అహర్నిశలు పని చేస్తున్నారు. దీనిలో భాగంగానే టీ హబ్ ను ప్రారంభానికి కృషి చేశారు.
హైదరాబాద్... స్టార్టప్ ల రాజధాని...కేటీఆర్ ఆశయం.
హైదరాబాద్ ను స్టార్టప్ ల రాజధానిగా తీర్చిదిద్దడం కేటీఆర్ ఆశయం. అందుకోసం ఆయన సిలికాన్ వ్యాలీలోనూ పర్యటించారు. ఐటీ కంపెనీల అధినేతలను కలిశారు. స్టార్టప్ కేంద్రంగా హైదరాబాద్ నిలదొక్కుకోవడానికి ప్రణాళిక వేశారు. ప్రపంచంలో స్టార్టప్ లకు భారత్ నాలుగో అతిపెద్ద కేంద్రం. దేశంలో స్టార్టప్ లు స్ధాపిస్తున్న వారిలో 73 శాతం మంది 36 ఏళ్లలోపు వారే. 2020 నాటికి దేశంలో స్టార్టప్ ల సంఖ్య 11,500కి చేరే అవకాశముంది. ఈ కంపెనీలు 2 లక్షల 50 వేల మందికి ఉపాధి కల్పిస్తాయని అంచనా. 28 శాతం స్టార్టప్ లతో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది బెంగళూరు. ఢిల్లీతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో 24 శాతం ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్న స్టార్టప్ ల శాతం 8. అయితే ప్రపంచంలో మొదటి మూడు స్థానాల్లో 41,500 స్టార్టప్ లతో తొలి స్థానంలో అమెరికా, 3,500తో రెండో స్థానంలో బ్రిటన్, 3,300తో మూడో స్థానంలో ఇజ్రాయెల్ ఉంది. ఇలా ఎన్నో అంశాలపై అధ్యయనం చేశారు కేటీఆర్. అబ్బురపరిచే సౌకర్యాలతో టీ హబ్ బిల్డింగ్‌ ను డిజైన్ చేయడంలో ఆయన పాత్ర కూడా కీలకమైనదే. టీ హబ్‌ తో దేశంలో ఎంతోమంది ఔత్సాహిక యువతకు అవకాశాలు వెల్లువలా వస్తాయని ఆకాంక్షిస్తున్నారు కేటీఆర్. యంగ్ ఇండియా ప్రపంచానికి చాలెంజ్ చేస్తుందని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.

 

20:59 - November 5, 2015

వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సారిక ఘ‌ట‌న నాట‌కీయ ప‌రిణామ‌ల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. వ‌రంగ‌ల్ ఎంజీఎం మార్చురీ నుంచి మెద‌లైన అంతిమ యాత్రలో విశ్వబ్రాహ్మణసంఘం నేతల‌తో పాటు మ‌హిళ సంఘం నేత‌లు పెద్దసంఖ్యలో హ‌జ‌రయ్యారు. అంతిమయాత్రలో దారి పొడ‌వునా రాజ‌య్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిర‌స‌న వ్యక్తం చేశారు. కోడల్ని చంపిన రాజ‌య్య కుటుంబ‌న్ని క‌ఠినంగా శిక్షించాల‌ని మహిళాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. సారిక పార్థివ దేహ‌నికి ఆమె తల్లి సంప్రదాయ ప‌ద్దతిలో చితికి నిప్పంటించి అంత‌క్రియ‌ల్ని పూర్తిచేశారు. అంత‌కుముందు..ముగ్గురు చిన్నారుల పార్థివ దేహ‌ల‌కు కూడా సారిక తల్లే అంత్యక్రియల్ని నిర్వహించారు. కన్నబిడ్డ పార్థీవదేహాన్ని చూసిన తల్లి భోరున విలపించింది. అటు అంత్యక్రియలకు హాజరైన నగరవాసులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

 

 

20:56 - November 5, 2015

విజయవాడ : అతిలోక సుందరి.. శ్రీదేవి విజయవాడలో సందడి చేసింది. నగరంలో ఓ జ్యూవెలరీ షాపు ప్రారంభోత్సవానికి వచ్చిన శ్రీదేవి తనకు ఇష్టమైన నగరాల్లో విజయవాడ ఒకటి అంటూ చెప్పుకొచ్చింది. ఈ సంధర్భంగా విజయవాడతో తనకున్న అనుబంధాన్ని శ్రీదేవి నెమరు వేసుకుంది. ఇదిలా ఉంటే అతిలోక సుందరి నగరానికి రావడంతో ఆమెను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.

20:54 - November 5, 2015

వరంగల్ : హన్మకొండలోని మాక్స్ కేర్‌ ఆస్పత్రి ముందు మృతదేహంతో పెద్దమ్మ గడ్డ వాసులు ధర్నాకు దిగారు. తమ కుటుంబసభ్యురాలు అస్తమాతో బాధపడుతుండగా.. ఆపరేషన్‌తో తగ్గిస్తామని రూ. 5 లక్షలు వసూలు చేశారని.. అయితే ఆపరేషన్‌ జరిగాక పేషెంట్‌ చనిపోయిందని..వారు మండిపడుతున్నారు. ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

20:50 - November 5, 2015

హైదరాబాద్ : ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేస్తోందని రాయలసీమ అధ్యయన కమిటీ అధ్యక్షులు భూమన ఆరోపించారు. ఈ ప్రాంత హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. త్వరలో రాయలసీమ రాజకీయ ఐక్య వేదికను ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఈ నెల 21న తిరుపతిలో జరిగే సమావేశంలో దీనిపై ప్రకటన చేస్తామన్నారు.

 

20:46 - November 5, 2015

హైదరాబాద్ : 50 ఏళ్లకు పైగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీ, తెలంగాణకు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రెండు రాష్ట్రాలుగా విడగొట్టిన పాపం కాంగ్రెస్‌దేనని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. రాష్ట్ర విభజన పాపమంతా కాంగ్రెస్ నాయకులకే చెందుతుందన్నారు. 1972లోనే రెండు రాష్ట్రాలుగా విడగొట్టి ఉంటే..ఏపీ ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని గాలి అన్నారు.

 

బీహార్ ఎన్నికలు... ఎగ్జిట్ పోల్స్ అంచనాలు...

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్ ముగిసింది. పలు ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెలువరించాయి.
ఎబిపి నీల్సన్ ఎగ్జిట్ పోల్స్ : మహాకూటమికి 130 స్థానాలు, ఎన్ డిఎ కూటమికి 108 స్థానాలు, ఇతరులకు 5 స్థానాలు.
ఇండియా టీవీ-సీవోటర్ : ఎన్ డిఎ కూటమికి 101 నుంచి 121 మహాకూటమికి 112నుంచి 132, ఇతరులకు 6 నుంచి 14 స్థానాలు.
న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ : ఎన్ డిఎ కూటమికి 90-100 స్థానాలు, మహాకూటమికి 130-140 స్థానాలు. ఇతరులకు 13-23 స్థానాలు. 

20:15 - November 5, 2015

వరంగల్ : మాజీ ఎంపి రాజయ్య కోడలు సారిక, ముగ్గురి పిల్లల పోస్టుమార్టంలో పలు కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. మంటల ధాటికి వందశాతం మృతదేహాలు కాలిపోయాయని రిపోర్టులో వెల్లడైంది. మంటల్లో సుమారు గంటర్నరపాటు సారిక, ముగ్గురు పిల్లలు కాలిపోయారు. మంటల్లో ముందుగా...సారిక, అభినవ్‌లు కాలిపోయారు. మృతదేహాలపై ఉన్న బట్టలు, మూత్రపిండాలు, రక్త నమూనాలను ఎఫ్‌ఎస్‌ఎల్‌ పరీక్షకు అధికారులు పంపించారు. కెమికల్ పరీక్షల ఒపినీయన్‌ను వరంగల్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు కోరారు. అయితే బెడ్‌రూంలోకి గ్యాస్‌ సిలిండర్ల ఎలా వచ్చాయన్నదానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు అధికారులు తెలిపారు. 

సారిక, ముగ్గురు పిల్లల పోస్టుమార్టం.. వెలుగుచూసిన కీలకాంశాలు

వరంగల్ : సారిక, ముగ్గురు పిల్లల పోస్టుమార్టంలో కీలక అంశాలు వెలుగు చూశాయి. మృతదేహాలు మంటల్లో 100 శాతం కాలిపోయాయి. గంటన్నర పాటు మంటల్లో సారిక, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముందుగా సారిక, అభినవ్ లు మంటల్లో కాలిపోయినట్లు సమాచారం. అయితే మంటలు చెలరేగింది లోపలి నుంచా.. బయటి నుంచా అనేది తేలాల్సి ఉంది. మృతదేహాలపై ఉన్న బట్టలు, మూత్రపిండాలు, రక్త నమూనాలను ఎఫ్ ఎస్ ఎస్ కు తరలించారు.

 

19:43 - November 5, 2015

రంగారెడ్డి : ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇన్నాళ్లుఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మెట్ట ప్రాంత రైతుల ఆశలు ఎండమావిగా మారుతున్నాయి. ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలన్న ప్రభుత్వ ప్రతిపాదనతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నిధుల సమస్యకు తోడు..సర్కార్ భరోసా ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు సైతం ముందుకురాని పరిస్థితి నెలకొంది. 3 వేల 483 కోట్ల అంచనాతో చేపట్టిన ప్రాజెక్టు పనుల్లో.. ఇప్పటి వరకు 1,438 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి.
నిలిచిపోయిన పనులు
ప్రాణహిత చేవెళ్లకు అనుసంధానంగా ఎస్సారెస్పీ నుంచి నీటిని మళ్లించి ఈ ప్యాకేజీ పనులను చేపట్టారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 3 లక్షల 5 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో...2019 లోపు ప్యాకేజీ పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సుమారు 25 టీఎంసీల నీటిని వాడుకునేందుకు 20,21,22గా విభజించి ప్యాకేజీ పనులు చేపట్టారు. 2008లో అప్పటి సీఎం వైఎస్సార్ 3252 కోట్ల ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేశారు. నవీపేట మండలం పోతంగల్ గ్రామ శివార్లలో టన్నెల్ పనులకు శ్రీకారం చుట్టారు. 897 కోట్లతో చేపట్టిన 20వ ప్యాకేజీ పనుల్లో ఇప్పటి వరకు 280 కోట్లు ఖర్చుచేసి 31 శాతం పనులు పూర్తి చేసారు. ఇక 21 ప్యాకేజీ పనుల్లో 1133 కోట్లకు గాను 210 కోట్లు వెచ్చించి 18 శాతం పూర్తి చేశారు. 22వ ప్యాకేజీలో 1422 కోట్లకు గాను 170 కోట్లు ఖర్చుచేసి 12 శాతం పనులు చేశారు.
డిజైన్‌ మార్చవద్దని విపక్షాల ఉద్యమబాట
మరోవైపు 20,21 ప్యాకేజీల్లో భారీ టన్నెల్‌ తవ్వకాలు చేపట్టి అసంపూర్తిగా వదిలేశారు. దీంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని... బోరుబావుల్లో నీరు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ మార్పు ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని విపక్షాలు ఉద్యమిస్తున్నాయి. రైతులతో కలిసి కాంగ్రెస్‌ పలుమార్లు పాదయాత్రలు చేపట్టి నిరసన తెలిపింది. పెండింగ్‌ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని హస్తం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. అటు వామపక్ష నేతలు రైతులకు బాసటగా నిరసన గళమెత్తారు. టీడీపీ సైతం ఆందోళనలతో హోరెత్తించింది. ఇలా అన్ని పార్టీలు ప్రభుత్వ తీరుపై ప్రజాక్షేత్రంలో ఎండగట్టాయి. పలు రూపాల్లో నిరసన తెలిపాయి. మరోసారి ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు హస్తం పార్టీ నేతలు సమాయత్తమవుతున్నారు. ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించి పనులు చేపట్టకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాయి.

 

18:52 - November 5, 2015

బీహార్ : మోడీ ప్రధాని కాదని.. సంఘ్ ప్రచారక్ అని ఆర్ జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన నేపథ్యంలో లాలూ మీడియాతో మాట్లాడారు. వాతావరణమే సరిగ్గా చెప్పలేదు... ఎగ్జిట్ పోల్స్ ఎలా చెబుతారని వ్యాఖ్యానించారు. తాము 199 సీట్లు గెలువబోతున్నామని... అది మాకు తెలుసన్నారు. బిజెపి వాళ్లు ఊహాలోకంలో విహరిస్తున్నారని విమర్శించారు. ఈ ఫలితాల తర్వాత మోడీ రాజీనామా చేయాలన్నారు.

18:40 - November 5, 2015

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఎన్ డిఎ, మహా కూటమిలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో నువ్వా నేనా అంటున్నాయి. టైమ్స్ నౌ.. జెడియు 122, ఎన్ డిఎ 111. ఇండియా-టుడే... జెడియు.. 117, ఎన్ డిఎ 122. సీఎన్ ఎన్-ఐబీఎన్... జెడియు 117, ఎన్ డిఎ 121.

బీహార్ లో హోరాహోరీ పోరు

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఎన్ డిఎ, మహా కూటమిలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో నువ్వా నేనా అంటున్నాయి. టైమ్స్ నౌ.. జెడియు 122, ఎన్ డిఎ 111. ఇండియా-టుడే... జెడియు.. 117, ఎన్ డిఎ 122. సీఎన్ ఎన్-ఐబీఎన్... జెడియు 117, ఎన్ డిఎ 121.

18:35 - November 5, 2015

హైదరాబాద్ : త్వరలో టీహబ్ ఫేజ్-2 ను ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో టీహబ్ సెంటర్ ప్రారంభం అయింది. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా హబ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాయదుర్గం సమీపంలో 15 ఎకరాల్లో టీహబ్ రెండో దశను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఫేజ్-2 కోసం రూ. 150 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ టీహబ్ అని పేర్కొన్నారు. తెలంగాణను స్టార్టప్ రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర సీఎస్ రాజీవ్ శర్మ పాల్గొన్నారు. 

 

18:00 - November 5, 2015

వరంగల్ : సారిక, ఆమె ముగ్గురు పిల్లల సజీవదహనం కేసు హత్యా, ఆత్మహత్యా అనేది ఇంకా నిర్ధారణ కాలేదని డిసిపి తెలిపారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. మూడు రోజుల్లో కేసు ఓ కొలిక్కి వస్తుందని చెప్పారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు, రెవెన్యూ, పోలీసు బృందం కేసు విచారణలో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. నివేదికలు రాగానే కేసును ఛేదిస్తామని చెప్పారు.
పారదర్శంగా సారిక కేసు విచారణ : ఎసిపి
సారిక కేసు విచారణను పారదర్శంగా కొనసాగిస్తున్నామని ఎసిపి శోభన్ కుమార్ తెలిపారు. ఈమేరకు టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. సారిక ఇరుగు పొరుగు వారిని విచారించామని సారిక కుటుంబసభ్యులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. వారికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

 

అవార్డును తిరిగిచ్చేసిన అరుంధతిరాయ్..

ఢిల్లీ : అవార్డులను తిరిగి ఇచ్చేసిన వారి జాబితాలో ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతి రాయ్ చేరారు. తన జాతీయ అవార్డును తిరిగి ఇచ్చేసింది. అరుంధతి రాయ్.. 1989లో జాతీయ అవార్డు అందుకున్నారు.

 

సారిక కేసు విచారణను పారదర్శంగా కొనసాగిస్తున్నాం : ఎసిపి

వరంగల్ : సారిక కేసు విచారణను పారదర్శంగా కొనసాగిస్తున్నామని ఎసిపి శోభన్ కుమార్ తెలిపారు. ఈమేరకు టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. సారిక ఇరుగు పొరుగు వారిని విచారించామని సారిక కుటుంబసభ్యులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. వారికి రక్షణ కల్పిస్తానమి హామీఇచ్చారు.

మూడు రోజుల్లో సారిక కేసు ఓ కొలిక్కి వస్తుంది : డిసిపి

వరంగల్ : సారిక, ముగ్గురు పిల్లల సజీవదహనం కేసు హత్యా, ఆత్మహత్యా అనేది ఇంకా నిర్ధారణ కాలేదని డిసిపి తెలిపారు. మూడు రోజుల్లో కేసు ఓ కొలిక్కి వస్తుందని చెప్పారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు, రెవెన్యూ, పోలీసు బృందం కేసు విచారణలో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. నివేదికలు రాగానే కేసును ఛేదిస్తామని చెప్పారు.  

17:39 - November 5, 2015

రంగారెడ్డి జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పలువురి మహిళల మెడలో నుంచి చైన్ స్నాచర్లు గొలుసులు లాక్కెళ్లారు. కుషాయిగూడ హెచ్ బీకాలనీలో 3.5 తులాల బంగారం గొలుసు, మేడిపల్లి బాలాజీనగర్ లో 3 తులాల గొలుసు, సరూర్ నగర్ చంపాపేటలో 2.5 తులాల గొలుసు, మౌలాలీలో మంగళ సూత్రం లాక్కెళ్లారు. అయితే అనునిత్యం ఏదో ఒక మూలను చైన్ స్నాచింగ్ లు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో దొంగలను పట్టుకోవడంతో పోలీసులు తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని పలువురు అంటున్నారు. 

రంగారెడ్డి జిల్లాలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

రంగారెడ్డి : జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పలువురి మహిళల మెడలో నుంచి చైన్ స్నాచర్లు గొలుసులు లాక్కెళ్లారు. 

స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో సారిక అంత్యక్రియలు

వరంగల్ : స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో సారిక అంత్యక్రియలు జరుగనున్నాయి. అందుకు సారిక తల్లిదండ్రులు అంగీకరించారు. సారిక తల్లి లలితాబాయి ఆమెకు తలకొరివి పెట్టనుంది. పోతనగర్ శ్మశాన వాటికలో సారిక అంత్యక్రియలు జరుగున్నాయి.  

17:13 - November 5, 2015

విశాఖ : గిరిజనులు తమ జీవితాలను బుగ్గిపాలు చేయొద్దన్నారు. ప్రతిపక్షాలు వద్దంటే వద్దన్నారు. మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి అధికారపక్షమే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వద్దంది. అయినా అధికారపీఠం తన పని తాను చేసుకుపోతోంది. ప్రతిపక్షంలో ఉన్నవారు అధికారంలోకి వచ్చారు. పాత మాటలు మర్చిపోయారు. బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతి ఇచ్చేశారు. విశాఖ నర్సీపట్నం ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. 1212 హెక్టార్లలో తవ్వకాలు జరపటానికి మైనింగ్‌ సంస్థకు అనుమతి ఇచ్చేశారు.
ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోంయ : రావెల  
ఏపీ ప్రభుత్వం.. బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతి ఇచ్చిది. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా తాము ఏ నిర్ణయం తీసుకోమని మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ప్రస్తుతం అనుమతిచ్చిన ప్రాంతంలో ఎలాంటి అభ్యంతరాలు లేవంటున్నారు. 

17:08 - November 5, 2015

సర్వేంద్రియానాం, నయనం ప్రదానం అంటారు. వయసుతో పాటు పెరిగే అనేక అనారోగ్య సమస్యల్లో కంటి సమస్య కూడా ఒకటి. అందులో గ్లకోమా సాధారణంగా కనిపిస్తుంది. వృద్ధాప్యంలో కనిపించే గ్లకోమాకు పరిష్కార మార్గాలేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇవాళ్టి హెల్త్ కేర్ లో తెలుసుకుందాం.. ఆ వివరాలను వివరాలను వీడియోలో చూద్దాం...

17:03 - November 5, 2015

సర్వ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థ ఒక్కో సందర్భంలో అనూహ్యమైన తీర్పులు వెలువరిస్తోంది. ముఖ్యంగా చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన వారికి కఠిన శిక్షను విధించాలని మద్రాస్ హైకోర్ట్ ఇటీవలే సంచలనాత్మక వ్యాఖ్యాలు చేసింది. ఈ నేపథ్యంలో మానవి ప్రత్యేక కథనం.
అయిన వారే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు..
ఇక ఇదే సమయంలో చిన్నారులపై అయిన వారే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని జాతీయ నమూన సేకరణ నివేదిక తేల్చింది. ఒక వైపు పిల్లలపై అఘాయిత్యాలు, మరో వైపు మహిళలకు భద్రత కరువైన పరిస్థితి. మరి ఈ స్థితికి చట్టాల అమలులో జాప్యం కారణమా? వ్యవస్థలో లోపాలు నేరాలను ప్రోత్సహిస్తున్నాయా? ఏమిటి పరిష్కారం?
బాధితుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు..
10 మంది దోషులు తప్పించుకున్నా, ఫరవాలేదు.. కానీ, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకుండా ఉండాలంటారు.. ఇక్కడ దోషులు యథేచ్ఛగా తప్పించుకుంటున్నారు. చట్టాల్లోని లొసుగులను అడ్డుపెట్టుకుని బాధితుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. వారికి న్యాయం దక్కకుండా చేసి, వారిని మరోసారి బాధితులుగా మారుస్తున్నారు. ఈ స్థితి పోవాలంటే, పరిస్థితి మారాలంటే, చట్టం పకడ్బందీగా అమలవ్వాలి. న్యాయవ్యవస్థ వేగం పుంజుకోవాలి. తక్షణమే శిక్షలు అమలవ్వాలి.. అప్పుడే కొంతైనా మార్పు కనిపిస్తుందని, నేర స్వభావం కలిగిన వారు వెనక్కి తగ్గే అవకాశముంటుందని మానవి భావిస్తోంది. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుకుంటోంది.


 

 

16:54 - November 5, 2015

హైదరాబాద్ : తనను ప్రేమించాలని వెంటపడుతూ వేధించిన ఓ జులాయి ఆ అమ్మాయి తన ప్రపోజల్ను తిరస్కరించిందని దాడికి పాల్పడ్డాడు. మరికొందరు యువకులతో కలిసి ఆమెను అడ్డగించి దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. ముందు కళ్లల్లో కారంకొట్టి అనంతరం చావు దెబ్బలు కొట్టారు. దీంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. రెండు చేతులు, వేళ్లు చితికిపోయాయి. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్యం ప్రారంభించారు. రెండు చేతులకు కట్లు వేశారు. కళ్లల్లో కారంకొట్టడంతోపాటు తీవ్రంగా గాయాలయిన కారణంగా ఆ బాలిక తీవ్రంగా రోధిస్తోంది. తమ కూతురుకు జరిగిన ఘటన చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరులో చోటు చేసుకుంది. ప్రస్తుతం గాయపడిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

16:47 - November 5, 2015

సల్మాన్ ఖాన్ - సోనమ్ కపూర్ నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయోపై దేశవ్యాప్తంగా అనేక అంచనాలున్నాయి. సూరజ్ ఆర్ బరజాత్యా డైరెక్షన్ లో రాజశ్రీ ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందిన ఈ మూవీకోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. తెలుగులో ఈ సినిమా ప్రేమలీల పేరుతో రిలీజ్ కానుంది. ఈ కాంబినేషన్ లో ప్రేమపావురాలు - ప్రేమాలయం వంటి మూవీస్ గతంలో రావడంతో.. టాలీవుడ్ లోనూ ప్రేమలీల కలెక్షన్లను కొల్లగొడుతుందని భావిస్తున్నారు. అయితే.. ఈ మూవీ ఇప్పుడు సెన్సార్ చిక్కుల్లో పడింది. బాలీవుడ్ లో ఈ మూవీ పేరు ప్రేమ్ రతన్ పాయో. తెలుగులో ప్రేమలీల అనే టైటిల్ సెట్ చేశారు. అయితే.. సెన్సార్ రూల్స్ ప్రకారం ఒక సినిమాలు పలు భాషల్లో రిలీజ్ చేస్తుంటే.. ఒకే టైటిల్ అయినా ఉండాలి లేకపోతే ఒరిజినల్ కి పెట్టిన టైటిల్ అర్ధం వచ్చేలా అయినా ఉండాలి. కానీ ప్రేమలీలకు అలా జరగలేదు. డిఫరెంట్ టైటిల్ సెట్ చేశారు. ఇలా వేరే టైటిల్ పెట్టుకున్నపుడు ఆ మూవీకోసం ప్రత్యేకంగా సెన్సార్ బోర్డ్ అనుమతి తీసుకోవాలి. కానీ ప్రేమ్ రతన్ ధన్ పాయో మేకర్స్ అలా చేయలేదు. అందుకే ఇప్పుడు తెలుగు వెర్షన్ కి చిక్కులు ఎదురయ్యాయి. తమకు ఎలాంటి దరఖాస్తు అందలేదని సెన్సార్ బోర్డ్ తేల్చి చెప్పేసింది. దీంతో తెలుగులో ఈ మూవీ విడుదలపై సందిగ్ధం నెలకొంది.

16:43 - November 5, 2015

హైదరాబాద్ : టీ.హబ్ ప్రారంభం అయింది. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా టీహబ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీర్, సీఎస్ రాజీవ్ శర్మలు హాజరయ్యారు.  

టీ.హబ్ ను ప్రారంభించిన రతన్ టాటా

హైదరాబాద్ : టీ.హబ్ ప్రారంభం అయింది. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా టీహబ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీర్, సీఎస్ రాజీవ్ శర్మలు హాజరయ్యారు.  

న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీ : న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈనెల 13 వరకు న్యాయశాఖ వెబ్ సైట్ లో ప్రజాభిప్రాయ సేకరణ జరుగనుంది.

 

మొదటి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

p { margin-bottom: 0.25cm; line-height: 120%; }a:link { }

మొహాలీ :భారత్‌ - సౌత్‌ ఆఫ్రికా మధ్య ఇక్కడ జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న సౌత్‌ ఆఫ్రికా మొదటి వికెట్‌ కోల్పోయింది. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన టీంఇండియా మొదటి ఇన్నింగ్స్‌ 201 పరుగుల వద్ద అలౌట్ అయింది.

 

హైదరాబాద్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు...

హైదరాబాద్‌ : చైన్ స్నాచింగ్‌ దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. మౌలాలిలో మహిళ మెడలో నుంచి 3 తులాల గొలుసును చోరీ చేశారు. మేడిపల్లిలో 2 తులాలు, అదేవిదంగా దిల్‌సుఖ్‌నగర్‌లో 1.5 తులాల ఆబరణాలను దొంగిలించారు. జవహర్‌నగర్‌లో మహిళ మెడలో నుంచి బంగారు చైన్‌ అపహరణకు గురయ్యింది.

16:12 - November 5, 2015

హన్మకొండ : వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి వద్ద హైడ్రామా కొనసాగుతుంది. మాజీ ఎంపి రాజయ్య కోడలు సారిక, ముగ్గురు పిల్లలకు పోస్టుమార్టం పూర్తికావడంతో ఇప్పుడు అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై హైడ్రామా కొనసాగుతోంది. ఇప్పటికే సారిక అంత్యక్రియలను అత్తమామలే నిర్వహించాలని సారిక తల్లిదండ్రులు పట్టుబడుతున్నారు. అటు అత్తమామల వైపు నుంచి స్పందన వచ్చే అవకాశం లేకపోవడంతో.. అంత్యక్రియలు నిర్వహించేందుకు స్వర్ణకారుల సంఘం ముందుకొచ్చింది. వరంగల్‌లోని పోతనగర్‌ శ్మశాన వాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేశారు. సారిక అంత్యక్రియలకు రాజయ్య కుటుంబం హాజరయ్యే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. మరోవైపు సారిక,ముగ్గురు పిల్లల మృతదేహాలను బంధువులకు అప్పగించేందకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

 

16:03 - November 5, 2015

బ్రూస్లీ ఫ్లాప్ అవ్వ‌డంతో చ‌ర‌ణ్ కంటే చిరునే ఎక్కువ పీల‌వుతున్నాడే టాక్ ఫిల్మ్ నగర్ గుసగుసలు వినిపిస్తున్నాయి. త‌న 150 వ‌సినిమా క్రేజ్ తగ్గ‌డానికి బ్రూస్లీ ఓ కార‌ణ‌మ‌ని చిరు ఫీలౌతున్నాడ‌ట‌. అందుకే చ‌ర‌ణ్‌పై గుస్సాగా ఉన్నాడ‌ని టాక్‌. అస‌లు బ్రూస్లీ వ‌సూళ్ల గురించీ బాక్సాఫీసు రిపోర్ట్ గురించీ ఇప్ప‌టి వ‌ర‌కూ చ‌ర‌ణ్‌ని ఏమీ అడ‌గ‌లేద‌ట‌. 'అంతా నీ ఇష్టం వ‌చ్చిన‌ట్టు చేసుకొన్నావ్‌' అంటూ చ‌ర‌ణ్ నే త‌ప్పుప‌డుతున్నాడ‌ట చిరు. అంతేకాదు.. 'ఇక నుంచి నీ సినిమాల విష‌యంలో నేను జోక్యం చేసుకోను' అని తేల్చి చెప్పేశాడ‌ని టాక్‌. నిజానికి చర‌ణ్ సినిమాల విష‌యంలో చిరు విప‌రీత‌మైన జోక్యం చేసుకొంటుంటాడు. అయితే బ్రూస్లీ, త‌ని ఒరువ‌న్ సినిమాల విష‌యంలో చ‌ర‌ణ్ సొంత నిర్ణ‌యాలే న‌డిచాయి. అందుకే బ్రూస్లీ ఫ్లాప్ అయ్యింద‌ని చిరు భావిస్తున్నాడ‌ట‌. ఆ కోపంతోనే 'నీ క‌థ‌లు నువ్వే విను .. నువ్వే నిర్ణ‌యాలు తీసుకో' అంటూ తెగేసి చెప్పేశాడ‌ట‌. డాడీ కోపాన్ని అర్థం చేసుకొన్న చ‌ర‌ణ్‌.. చిరుని కూల్‌ చేసే ప్రయత్నం చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.

16:02 - November 5, 2015

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర బీజేపీ, టీడీపీ ఆందోళన చేపట్టాయి. గ్రేటర్‌లో ఓట్ల తొలగింపు, వార్డుల పునర్విభజన సక్రమంగా జరగలేదంటూ నిరసన వ్యక్తం చేశాయి. ఆందోళన నేపథ్యంలో కార్యాలయం దగ్గర పోలీసులను మోహరించారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్‌ కిందిపడిపోయారు. పోలీసుల వైఖరికి నిరసనగా బీజేపీ, టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై భైఠాయించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. 

15:54 - November 5, 2015

వరంగల్ : కాంగ్రెస్ మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలకు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ సాయంత్రం నిందితులను కోర్టు ఎదుట పోలీసులు హాజరుపరచనున్నారు. బుధవారం తెల్లవారుజామున రాజయ్య నివాసంలోని మొదటి అంతస్తులో సారిక, అభివన్ (7), కవలలు శ్రీయోన్ అయోన్ (3) సజీవ దహనమయ్యారు. ఇది హత్యేనని సారిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిరిసిల్ల రాజయ్య, భార్య, మాధవి, కొడుకు అనీల్ లను అదుపులోకి తీసుకుని విచారించారు. అనీల్ ను మొత్తం 11 సార్లు విచారించినట్లు సమాచారం. ఈ కేసును చేధించడానికి పోలీసులు కృషి చేస్తున్నారు. ఈ ఘటన వెనుక అనేక కోణాలు వెలుగు చూస్తున్నాయి. హత్యా ?..ఆత్మహత్యా ? అనే దానిపై పోలీసులు దృష్టి సారించి దర్యాప్తు చేపడుతున్నారు.
 

15:48 - November 5, 2015

రానా కథానాయకుడిగా సంకల్ప్ రెడ్డి అనే ఓ కొత్త దర్శకుడు తెలుగు - తమిళం - హిందీ భాషల్లో ఒక సినిమాని తీయబోతున్నాడు. సబ్ మెరైన్ ట్యాంకర్ నేపథ్యంలో సాగే కథ అది. 1971లో ఇండియా పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధం ఆధారంగా తెరకెక్కించబోతున్నారు. అందులో కథానాయికగా సమంతని ఎంపిక చేసుకోబోతున్నారని ఆమధ్య ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు రానా మనసు మార్చుకొని తాప్సికే ఓటేశాడని తెలుస్తోంది. తాప్సికి దక్షిణాదితోపాటు హిందీలోనూ మంచి గుర్తింపు ఉంది. అందుకే ఆమెతో కలిసి నటిస్తే హిందీ మార్కెట్ కి ప్లస్సవుతుందని రానా నిర్ణయించుకొన్నట్టు తెలిసింది. ఇదివరకు తాప్సితో కలిసి బేబిలో నటించాడాయన. తన సొంత సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ లోనే ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. గ్లామర్ విషయంలోనూ ఏమాత్రం లోటు చేయదని పేరుంది. అయినా సరే తెలుగు దర్శకనిర్మాతలు మాత్రం ఆమెని కనికరించలేదు. తప్పని పరిస్థితుల్లో తాప్సి హిందీపై దృష్టిపెట్టింది. అక్కడ అడపాదడపా సినిమాలు చేస్తోంది కానీ... దక్షిణాదిపై మాత్రం మమకారం చంపుకోలేదు. బాలీవుడ్ కి ధీటుగా ఇక్కడ కూడా పారితోషికం లభిస్తుండటంతో తెలుగు - తమిళంలో ఎలాగైనా మరిన్ని అవకాశాలు కొట్టేయాలని చూస్తోంది తాప్సి. అందుకే తనకి తెలిసిన దర్శకనిర్మాతలతో నిత్యం కమ్యూనికేషన్ మెంటైన్ చేస్తోంది. ఆ ప్రయత్నాలు వర్కవుట్ అయ్యేలాగే ఉన్నాయి.

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వద్ద కొనసాగుతున్న హైడ్రామా....

హన్మకొండ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వద్ద హైడ్రామా కొనసాగుతుంది. సారిక, ముగ్గురు పిల్లల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. దహన సంస్కారాల విషయంలో హైడ్రామా కొనసాగుతుంది. అంత్యక్రియలను పూర్తి చేసేందుకు స్వర్ణకార సంఘం ముందుకొచ్చిది. వరంగల్ లోని పోతనగర్ శ్మశాన వాటికలో వారి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే అంత్యక్రియలకు రాజయ్య కుటుంబం వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

 

15:16 - November 5, 2015

హైదరాబాద్ : బీహార్ ఎన్నికల్లో గోవు తోక పట్టుకుని గెలిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన జేడీయూ నేత శరద్‌యాదవ్‌ విమర్శించారు. మాధేపుర నియోజకవర్గ పరిధిలోని పోలింగ్‌ కేంద్రంలో గురువారం ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా శరద్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ గోవు తోక పట్టుకుని వైతరణీ నదిని ఈదేందుకు బీజేపి ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశంలో అసహనం ఉందని అరుణ్‌జైట్లీ అంటున్నారని... ఇదెక్కడి సహనం.. షారూక్‌ ఖాన్‌ను పాకిస్థానీగా ప్రకటించడం సహనమా అని ఆయన ప్రశ్నించారు. ప్రధాన కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు పార్టీ వ్యాఖ్యలు కాదా అని ఆయన అన్నారు. ప్రతిసారీ ఇదే జరుగుతోందని, ముందు ఒక మాట మాట్లాడతారని, తర్వాత పార్టీకి సంబంధం లేదంటారని ఆయన ఎద్దేవా చేశారు. షారూక్‌ ఖాన్‌ పాకిస్తాన్‌ వెళ్లిపోవాలంటూ బీజేపీ నేతల వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.

15:06 - November 5, 2015

హైదరాబాద్ : ముంబై సినిమా డైరెక్టర్ రాజేష్ మపుస్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై 465, 468, 471,498 ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారు. తనను రాజేష్ వేధిస్తున్నాడని, తనకు, తన ఇద్దరు కొడుకులకు ఎలాంటి సహాయం చేయడంలేదని అతని భార్య నిషా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లైయింట్‌తో పోలీసులు అతడ్ని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం జుడిషియల్ కస్టడీకి ఆదేశించింది. రాజేష్ మపుస్కర్‌ మున్నాభాయ్ సిరీస్ సినిమాలకు, త్రీ ఇడియట్స్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. తాజాగా ‘ఫెరారీకీ సవారీ’ అనే మూవీతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడు. నెలకు 65 వేల అద్దెతో పోష్ బంగ్లా తీసుకున్న ఈ దర్శకుడు, తనను ఏమాత్రం పట్టించుకోవడంలేదని, కొన్నినెలలుగా మెయింటెనెన్స్ కూడా ఇవ్వకుండా టార్చర్ పెడుతున్నాడని నిషా తన ఫిర్యాదులో పేర్కొంది.

కొనసాగుతున్న నామినేషన్ల పరిశీలన

హైదరాబాద్ : వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల కోసం మొత్తం 38 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిని వరంగల్ కలెక్టరేట్ లో ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. టిఆర్ ఎస్ తరపున పసునూరి దయాకర్, కాంగ్రెస్ తరపున సర్వే సత్యనారాయణ, టిడిపి- బిజెపిల ఉమ్మడి అబ్యర్థిగా దేవయ్య, వైసీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాష్ నామినేషన్ వేశారు. ఈ నెల 21వ తేదీన పోలింగ్ జరుగుతుంది. 24వ తేదీన ఓట్ల లెక్కింపు జరుపుతారు.

నకిరేకల్ లో మంత్రులు ఈటెల, జగదీశ్ పర్యటన

నల్లగొండ: జిల్లాలోని నకిరేకల్‌లో మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి పర్యటిస్తోన్నారు. మంత్రులకు నకిరేకల్‌లో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్బంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు రెండే వేల బైకులతో ర్యాలీ నిర్వహించారు. మంత్రులు దీపం పథకంలో భాగంగా నాలుగు వేల మందికి గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు.

వరంగల్ లోనే సారిక అంత్యక్రియలు....

వరంగల్: మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, మనవళ్లు నిన్న సజీవ దహనమైన విషయం తెలిసిందే. అయితే ఇవాళ పోలీసులు మృతదేహాలకు ఎంజీఎం ఆస్పత్రిలో పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. పోతననగర్ లోని స్మశాన వాటికలో సారిక ఆమె ముగ్గురు కుమారుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతుల బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. సారిక అంత్యక్రియలను వరంగల్‌లోనే నిర్వహిస్తామని ఆమె బంధువులు ప్రకటించిన విషయం తెలిసిందే.

కొండవలస అంత్యక్రియలు పూర్తి

హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు కొండ వలస లక్ష్మణరావు అంత్యక్రియలు హైదరాబాద్ లోని ఎర్రగడ్డ శ్మశాసన వాటికలో నిర్వహించారు. మూడు రోజుల క్రితం పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో కొండవలస కన్ను మూసిన విషయం తెలిసిందే.

ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు: సుజనా చౌదరి

విజయవాడ :ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. ప్రత్యేక హోదాను సాధించేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన స్పష్టం చేశారు. మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారన్న నమ్మకం ఉందని తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్ట్‌ ద్వారా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్ట్‌ వల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుందని సుజనా అన్నారు.

ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్వల్ప అస్వస్థత

విజయవాడ : ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. విశాఖ శారదా పీఠంలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న రఘువీరా మీడియాతో మాట్లాడుతుండగా అస్వస్థతకు లోనయ్యారు. ఆయన షుగర్‌ లెవెల్స్‌ తగ్గినట్లుగా అనుమానిస్తున్నారు. వెంటనే రఘువీరాను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

సారికది ముమ్మాటికీ హత్యే : సారిక సోదరి

హైదరాబాద్ : నా చెల్లి సారికది ముమ్మాటికీ హత్యేనని సోదరి అర్చన ఆరోపించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. సారిక చివరి వరకు అత్తమామలు, భర్తపై పోరాటం చేసిందన్నారు. ఆమెను చిత్రహింసలకు గురి చేసి ప్రాణాలు తీశారని విమర్శించారు. అనిల్ కు అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలున్నాయన్నారు. సారిక అంత్యక్రియలు వరంగల్ లోనే నిర్వహిస్తామని తెలిపారు.

13:30 - November 5, 2015

వరంగల్ : జిల్లా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక మృతిపై మద్దతుగా తాము పోరాటం కొనసాగిస్తామని మహిళా సంఘ నేతలు స్పష్టం చేస్తున్నారు. గురువారం సారిక రాసిన లేఖ బయపడింది. ఎంతో ఆడబిడ్డలు త్యాగం చేస్తున్నారు..నీవు నాకోసం ఎలాంటి త్యాగం చేస్తావు అని రాజయ్య అడిగాడని..ఇతరత్రా అంశాలు లేఖలో పేర్కొంది. బుధవారం తెల్లవారుజామున సారిక, అభివన్ (7), కవలలు శ్రీయోన్ అయోన్ (3) అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. సారికను మాజీ ఎంపీ కుటుంబసభ్యులే చంపేశారంటూ ఫిర్యాదు చేయడంతో రాజయ్య, భార్య మాధవి, కుమారుడు అనీల్ ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. గురువారం ఎంజిఎం ఆసుపత్రి వద్ద మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతోంది. ఈ సందర్భంగా టెన్ టివితో మహిళా సంఘ నేతలు మాట్లాడారు. సారిక మనోనిబ్బరం కలిగిన వ్యక్తి అని, న్యాయబద్ధమైన హక్కులు కావాలని అడిగిందన్నారు. ప్రతొక్కరూ ఆమెకు మద్దతు పలుకుతున్నారని, ఆత్మహత్య చేసుకొనేంత బలహీనురాలు కాదని తెలిపారు. తనను పట్టించుకోవడం లేదని..వ్యక్తిగతంగా పట్టించుకోవడం లేదని సారిక పేర్కొనేదని తెలిపారు. దీనితో సంఘాలు జోక్యం చేసుకోవడం జరిగిందని, న్యాయం కలిగేలా చూస్తామని హామీనిచ్చామని తెలిపారు. కానీ తనకు ఎలాంటి సహాయం అవసరం లేదని, న్యాయపరమైన హక్కులు కావాలని కోరడం జరిగిందన్నారు. పప్పులు..ఉప్పు..ఇతరత్రా సరుకులు ఇచ్చినట్లు సారిక తల్లి పేర్కొనడం జరిగిందని గుర్తు చేశారు. అనీల్ రెండో భార్యకు కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు. అప్పుడే చనిపోయే ఉండేదని, ఈ తరుణంలో ఎందుకు చనిపోయిందని ప్రశ్నించారు. 

సల్మాన్ ను కలుసుకోనున్న గీత

హైదరాబాద్ : పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన భారత ‘బిడ్డ’ గీత ఆకాంక్ష తీరనుంది. త్వరలో ఆమె బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ను కలుసుకోనుంది. దీనికి బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ రియాలిటీ షో ‘ఆజ్‌ కీ రాత్‌ హై జిందగీ’ వేదిక కానుంది. సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘బజరంగీ భాయిజాన్‌‘ సినిమా.. గీతను భారత్‌కు తీసుకురావడంలో దోహదపడటం తెలిసిందే. అమితాబ్‌ షోలో పాల్గొనేందుకు 8-10 తేదీల మధ్య గీతను ముంబై పంపాల్సిందిగా నిర్వాహకులు ఇండోర్‌ కలెక్టర్‌కు లేఖ రాశారు. అమితాబ్‌ నిర్వహణలో సాగే ‘ఆజ్‌ కీ రాత్‌ హై జిందగీ’ స్ఫూర్తినిచ్చే కథనాలకు వేదికగా నిలుస్తోంది.

13:00 - November 5, 2015

హైదరాబాద్ : రాజధాని అమరావతి నిర్మాణంలో గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసు ఇవ్వడం స్వాగతిస్తున్నట్లు సామాజిక వేత్త ప్రసాద్ పాటిల్ పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండానే అమరావతి శంకుస్థాపన ఏలా చేస్తారని ట్రిబ్యునల్ ప్రశ్నించింది. ఈ సందర్భంగా టెన్ టివితో ప్రసాద్ పాటిల్ మాట్లాడారు. రాజధాని పేరిట లక్షలాది ఎకరాల పొలాలు నాశనం చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. అత్యంత సారవంతమైన ఆహార భద్రతకు సంబంధించిన విషయమే కాకుండా ఎన్నో జంతుజాలాలు, పర్యావరణం దెబ్బతింటుందన్నారు. దీనివల్ల మానవాళికి వినాశనం కలుగబోతుందని, నిర్మాణంలో ఎన్నో హామీలు గుప్పిస్తున్నారని తెలిపారు. అక్టోబర్ పదో తేదీన గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇవ్వడం జరిగిందని, కానీ లెక్క చేయకుండా శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది వచ్చిన వారిని ఏపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని, ప్రజాస్వామ్యంలో ఆందోళన కలిగించే అంశమన్నారు. ఇలాంటి తరుణంలో ప్రజాస్వామ్యం మనుగడ సాధించదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శ్రీమన్నారయణ కంటెప్ట్ దాఖలు చేయడం జరిగిందని, ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసిందని తెలిపారు. ఇందుకు శ్రీమన్నారాయణకు అభినందనలు తెలియచేస్తున్నట్లు, ఆయనకు సపోర్టుగా ఉంటామన్నారు. దీనిపై మేధావులు, పర్యావరణ వేత్తలు ప్రతొక్కరూ స్పందించాలని పిలుపునిచ్చారు. 

12:55 - November 5, 2015

హైదరాబాద్ : రాజధాని అమరావతి నిర్మాణ విషయంలో గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేయడం సరైందేనని మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ పేర్కొన్నారు. స్టే ఇచ్చినా కూడా ఏ కార్యక్రమాలు జరుపకూడదని ఎన్ జిటి ఆదేశాలు ఇచ్చినా లేక్క చేయకుండా ప్రధాన మంత్రి, సీఎ చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. పర్యావరణ అనుమతికి సంబంధించిన పత్రాలు దాఖలు చేయలేదని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. సాంకేతిక కారణాలంటూ సాకుగా చెప్పడం కరెక్టు కాదన్నారు. మూడు పంటలు పండే భూములను నాశనం చేస్తున్నారని, హరిత సంహారం జరుగుతోందన్నారు. కోటి చెట్లు నరికేశారని కథనం బిబిసి కథనం పేర్కొందని తెలిపారు. పర్యావరణానికి పర్యావరణం తిరగబడితే మానవాళికి ముప్పు ఏర్పడుతుందన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు లెక్క చేయడం లేదని, ఇది ఆషామాషి ట్రిబ్యునల్ కాదని అంతార్జతీయ ఒప్పందంలో భాగమని అడుసుమిల్లి జయప్రకాశ్ పేర్కొన్నారు. 

12:51 - November 5, 2015

ఢిల్లీ : ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'అమరావతి' రాజధాని నిర్మాణంపై గ్రీన్ ట్రిబ్యునల్ కన్నెర్ర చేసింది. ఈ విషయంలో శ్రీమన్నారయణ న్యాయపోరాటం చేస్తున్నారు. తన చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం కొనసాగిస్తానని..లక్ష ఎకరాల భూమి కాంక్రింట్ జంగిల్ కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీమన్నరాయణ టెన్ టివితో మాట్లాడారు. పర్యావరణ అనుమతులు వచ్చాయని చెప్పడం జరిగిందని, దానికి సంబంధించిన అనుమతి పత్రాలు కోర్టుకు సమర్పించలేదన్నారు. వెబ్ లో కూడా అప్ లోడ్ చేయలేదని, సాంకేతిక కారణాల వల్ల వెబ్ సెట్ లో పెట్టలేదని పేర్కొనడం సహేతుకంగా లేదన్నారు. రేపటిలోగా వెబ్ సైట్ లో పెట్టాలని కోర్టు సూచించడం జరిగిందని, పెడుతారా ? లేదా ? అనేది చూడాలన్నారు. ఇందుకు ప్రభుత్వం తరపు న్యాయవాదులు రకరకాల సమయం అడిగారని, వారు పూర్తిగా కన్ఫ్యూజ్ లో ఉన్నారని తెలిపారు. తన రక్తపు చివరి బొట్టు వరకు న్యాయం కోసం పోరాడుతానని, పర్యావరణ రక్షణ కోసం ఇంతకుమించిన కోర్టు ఏదీ లేదన్నారు. రెండున్నర లక్షల ఎకరాల భూమి కాంక్రీట్ జంగిల్ కాకుండా కాపాడుతానని తెలిపారు. 260 మంది అఫిడవిట్ దాఖలు చేసి నోటరీ చేసి ఎన్ జిటిలో సమర్పిస్తే ఇదంతా బోగస్ అని, శ్రీమ్మన్నారాయణ తప్పు చేస్తున్నారని ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. ఇదంతా బోగస్ అని ఫ్రూప్ చేయమనండి..నిరూపిస్తే తాను శిక్షకు సిద్ధమేనని శ్రీమన్నారాయణ స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే నిర్మాణం విషయంలో పర్యావరణ అనుమతులు లేకుండానే అమరావతి శంకుస్థాపన ఏలా చేస్తారని ట్రిబ్యునల్ ప్రశ్నించింది. అనుమతులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన గ్రీన్ ట్రిబ్యునల్ 24 గంటల్లో అనుమతి పత్రాలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. ఇదివరకు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల్ని ఉల్లంఘించినందుకు వారంలోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 

12:41 - November 5, 2015

వరంగల్ : 'మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య నివాసంలో తాను ఎంతో బాధ పడ్డానని..ఎన్నో కష్టాలకు గురయ్యాయనని..నరకం అనుభవించాను' అంటూ కోడలు సారిక రాసిన లేఖ బయటపడింది. బుధవారం తెల్లవారుజామున సారిక, అభివన్ (7), కవలలు శ్రీయోన్ అయోన్ (3) అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. సారికను మాజీ ఎంపీ కుటుంబసభ్యులే చంపేశారంటూ ఫిర్యాదు చేయడంతో రాజయ్య, భార్య మాధవి, కుమారుడు అనీల్ ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే చనిపోక ముందు తాను నియమించుకున్న లాయర్ కు 20 పేజీల లేఖను మెయిల్ చేసింది. ఈ లేఖ ఇంగ్లీష్ లో ఉంది. ఈ లేఖ గురువారం పోలీసులు హ్యాక్ చేసి పరిశీలించారు. ఎలాంటి బాధలకు గురయ్యానో..ఎలాంటి క్షోభ..తదితర అనుభవాలను ఆవేదనతో లేఖలో సారిక పేర్కొంది. అత్తగారింట్లో మానసికంగా..శారీరకంగా హింసించారని, కనీసం టాయిలెట్ కు పోవాలంటే భయం..భయంగా ఉండేదని వాపోయింది. అందరూ ఉన్న లేనిదాని వలే జీవించిటన్లు, తనకు పిల్లలకు కొన్ని రోజుల పాటు ఆహారం కూడా పెట్టలేదని తెలిపింది. బియ్యం..పిల్లలకు పాల కోసం క్షోభ అనుభవించేదాని అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తనకు..పిల్లలకు హాల్ మాత్రమే కేటాయించారని, అత్త గారు సూటిపోటి మాటలతో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని పేర్కొంది. తన భర్తకు ఇతర మహిళలతో సంబంధాలు ఉండేవని, ఎక్కడకు వెళ్లావని అడిగితే చావ గొట్టారని పేర్కొంది. స్కూల్ ఫీజు కూడా కట్టడానికి కూడా డబ్బులు ఇచ్చేవారు కాదని వాపోయింది.
ఇదిలా ఉంటే సారిక మృతి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సారిక రూంలో ఉన్న ఆహార పదార్థాలను సీజ్ చేశారు. వంట గదిలో ఉండాల్సిన రెండు సిలిండర్ లు బెడ్ రూంలోకి ఎలా వచ్చాయి. ? ప్రమాదం జరిగే విధంగా ప్లాన్ చేశారా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ లీక్ అయినా ఎవరూ స్పందించకపోవడం అనుమానాలు తావిస్తోంది. 

విజయవాడలో దుర్గగుడి పై వంతెన పనులకు శ్రీకారం

విజయవాడ : నగరంలో దుర్గగుడి వంతెన పనుల ప్రారంభానికి రంగం సిద్ధమైంది. పరిహారం చెల్లించిన ఇళ్లు, భవనాల తొలగింపు పనులను అధికారులు ఈ రోజు చేపట్టారు. 7వ తేదీ నుంచి దుర్గ గుడి వంతెన నిర్మాణ పనుల నిమిత్తం గొల్లపూడి నుంచి వాహనాలను మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు.

టిటిడి సముదాయం విష్ణు నివాసంలో ఆరేళ్ల బాలుడు మృతి..

తిరుపతి : టిటిడి వసతి సుముదాయం విష్ణు నివాసంలో విద్యుత్ షాక్ తో ఆరేళ్ల బాలుడు రోషన్ మృతి చెందాడు. రోషన్ ముంబై వాసి కావడంతో ఆ ప్రాంతానికి మృతదేహాన్ని టిటిడి అధికారులు తరలించారు. 

రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే గోపినాథ్..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బిజెపి, టిడిపి ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. గ్రేటర్ లో ఓట్ల తొలగింపు, వార్డుల పునర్ విభజన సక్రమంగా లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు, నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపినాథ్ కిందపడ్డారు. నిరసనగా రోడ్డుపై బైఠాయించడంతో తీవ్రంగా ట్రాఫిక్ స్తంభించింది. 

కిరోసిన్ పోసుకొని నిప్పంటిచుకున్న మహిళా రైతు

హైదరాబాద్ : నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం మల్లాపూర్‌కు చెందిన మంగమ్మ అనే మహిళారైతు ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. 80 శాతం కాలిన గాయాలతో కొత్తపేటలోని ఇండస్‌ ఆసుపత్రిలో చేరారు. పత్తి సాగు కోసం వేసిన బోరులో నీళ్లు పడకపోవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు.

కుప్పకూలుతున్న టాప్ టార్డర్..

మొహలి : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలుతోంది. కేవలం 65 పరుగులకే మూడు వికెట్లు పతనమయ్యాయి. ధావన్ డకౌట్ కాగా, 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్గర్ బౌలింగ్ లో పుజారా వెనుదిరిగగా, కెప్టెన్ కోహ్లీ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. 

11:39 - November 5, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన రాజధాని 'అమరావతి' శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం పట్ల గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ జిటి ఆదేశాలను ఉల్లంఘించారంటూ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. దీనిపై వారంలోగా సమాధానం చెప్పాలని ఏపీ ప్రభుత్వం, సీఆర్డీఏ, పట్టణాభివృద్ధి, పర్యావరణ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.

గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు...
ఇటీవల అమరావతి నిర్మాణానికి సంబంధించి తుళ్లూరు పరిధిలో జరుగుతున్న భూమి చదును పనులను నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి రాజధాని ప్రాంతంలో తొలుత గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేసిన తర్వాతే పనులు ప్రారంభించాల్సి వుంది. ఈ మేరకు పర్యావరణ నిబంధనలను తప్పకుండా పాటిస్తామని ఏపీ సర్కారు హామీ ఇచ్చింది. కానీ, గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేయకుండానే ప్రభుత్వం పనులు మొదలుపెట్టిందంటూ ఒకరు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు. గ్రీన్ కారిడార్‌కు విరుద్ధంగా ఏపీ సర్కారు తోటలను తొలగిస్తోందని అందులో పేర్కొన్నారు. తన వాదనను బలంగా వినిపించేందుకు తోటల తొలగింపునకు సంబంధించిన ఫొటోలను కూడా జత చేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ తక్షణమే భూమి చదును పనులు నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను నవంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. 
మురుగు నీరు కృష్ణానదిలోకి వెళ్లకుండా చూడాలని సూచన
అమరావతి తాగునీటి అవసరాలకు కృష్ణానదే దిక్కు.. అలాగే వాడే నీరు, మురుగు నీరు మళ్లీ కృష్ణానదిలోకి వెళ్లకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని గ్రీన్ ట్రిబ్యునల్ సూచించింది.. వర్షాకాలంలో కొండవీటి వాగు పొంగి పొర్లకుండా చూసుకోవాలి. రాజధాని నిర్మాణంలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో చేపట్టే నిర్మాణాలకు ఖచ్చితంగా ప్లై యాష్ తో తయారు చేసిన ఇటుకలనే ఉపయోగించాలని చెబుతోంది.... థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ తయారీ తర్వాత ఈ ఫ్లై యాష్ వ్యర్థంగా విడుదలవుతుంది.. దీనికి పర్యావరణ అనుకూలత ఉంటుందని గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. వేసవి జీవ వైవిధ్యానికి విరుద్ధంగా ఎలాంటి నిర్ణయాలు జరగకూడదు.
సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు
అలాగే ఈ ప్రాంతంలో వచ్చే పరిశ్రమలు వాటి విద్యుత్, మిగతా అవసరాలకు ఖచ్చితంగా సోలార్ ప్యానెల్స్ నే ఉపయోగించుకోవాలి.. పై కప్పుల్లో మూడో వంతు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలి.. పరిశ్రమల నిర్మాణంలో జీవ వైవిధ్యానికి విరుద్ధంగా ఎలాంటి నిర్ణయాలు జరగకూడదు.. దీనిపై ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక కమిటీ పర్యవేక్షిస్తుంది. ఒక వైపు అంతర్జాతీయ రాజధానంటూ బాబు సర్కార్ హడావుడి చేస్తున్నా అనుకున్న స్థాయిలో పర్యావరణ ప్రమాణాలు పాటించడం లేదనే గ్రీన్ ట్రిబ్యునల్ అభిప్రాయం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

 

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

 ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 30 పాయింట్లకు పైగా నష్టాల్తో ట్రేడవుతున్నాయి.

మద్యం మత్తులో కన్న కొడుకును కడతేర్చేశాడు..

మెదక్ : మద్యం మత్తులో కన్నకొడుకునే కడతేర్చాడో కసాయితండ్రి. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం చేర్యాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. నందు-సంతోష దంపతులకు ముగ్గురు పిల్లలు. పన్నెండేళ్ల పెద్దకొడుకుకు చిన్నప్పుడు పోలియో సోకడంతో రెండుకాళ్లు చచ్చుబడిపోయాయి. మద్యానికి బానిసైన నందు..ఇంటికొచ్చి పోలియో వచ్చిన కొడుకును చితకబాదాడు. లేవలేనిస్థితిలో ఉన్న బాలుడు దెబ్బలకు తట్టుకోలేకపోయాడు. బంధువులు ఇంటికొచ్చి చూసేసరికి రక్తపు మడుగులో పడి ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశాడు.

11:17 - November 5, 2015

వరంగల్ : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, మనవళ్ల అనుమానాస్పద మృతి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. మృతి చెందకముందు తన సొంత ల్యాప్ టాప్ నుండి లాయర్ కు ఓ లేఖను పంపించినట్లు తెలుస్తోంది. పోలీసులు దీనిని గుర్తించి ల్యాప్ టాప్ నుండి లేఖను హ్యాక్ చేసి పరిశీలించినట్లు సమాచారం. తీవ్ర మనోవేదనతో చనిపోవాల్సి వస్తోందని ఇందుకు మాజీ ఎంపీ రాజయ్య కుటుంబం..అనీల్ రెండో భార్య కూడా కారణమని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. దీనితో అనీల్ భార్యను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎంజిఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం..
మరోవైపు సారిక, అభివన్ (7), కవలలు శ్రీయోన్ అయోన్ (3) మృతదేహాలకు ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడంపై సందిగ్ధత నెలకొంది. మృతదేహాలు తీసుకోవడానికి సారిక బంధువులు నిరాకరించారు. పోస్టుమార్టం నిమిత్తం అంత్యక్రియల కోసం పోలీసుల అదుపులో ఉన్న అనీల్ ను కొద్దిసేపు విరామం ఇచ్చే అవకాశం ఉంది.

పోలీసులకు ఫిర్యాదు చేసిన సారిక బంధువులు..
వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, అభివన్ (7), కవలలు శ్రీయోన్ అయోన్ (3) లు బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తనను రాజయ్య కుటుంబం వేధిస్తోందని, భర్త ఇతర మహిళతో సంబంధం పెట్టుకున్నాడని తనకు న్యాయం చేయాలని గతంలో సారిక పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

అవార్డును వెనక్కిచ్చేసిన కుందన్ షా..

ఢిల్లీ : ఫిల్మ్ మేకర్ కుందన్ షా తనకు వచ్చిన జాతీయ అవార్డును వెనక్కి ఇచ్చేశారు. దేశంలో పెరుగుతున్న అసహనానికి నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 

కేరళ, నాగాలాండ్ లో లాటరీపై నిషేధానికి సుప్రీం నిర్ణయం..?

ఢిల్లీ : కేరళ, నాగాలాండ్ లలో లాటరీపై నిషేధం విధించాలని సుప్రీం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

10:47 - November 5, 2015

హైదరాబాద్ : టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున సతీమణి అమలా అక్కినేని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్, లెజెండ్రీ యాక్టర్ కమల్ హాసన్‌తో అమల కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చీకటిరాజ్యంలో నటిస్తున్న కమల్ హాసన్.. టీకే రాజీవ్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న సినిమాలో కమల్ సరసన అమల 25 ఏళ్ల తర్వాత నటించనుందని తెలుస్తోంది. మరో లెజెండ్ నటీమణి జరీనా వహాబ్ కూడా ఈ మూవీలో హీరోయిన్‌గా కనిపించనుంది. ఇకపోతే.. ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న చీకటిరాజ్యం ఈ నెల 20వ తేదీన రిలీజ్ కానుంది. కాగా కమల్- అమల జంట పుష్పక విమానం, సత్య సినిమాల్లో 26 ఏళ్ల క్రితం కలిసిన నటించిన సంగతి తెలిసిందే. ఇక టీకే రాజీవ్ కుమార్ దర్శకత్వం వహించే చాణక్యన్ (1989) సినిమాలో కమల్ సరసన అమల, జరీనాలు కలిసి నటించనున్నారు.

సారిక మృతిపై కొత్త కోణం..

వరంగల్ : రాజయ్య కోడలు సారిక, ముగ్గురు పిల్లల సజీవదహనం కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. చనిపోయే ముందు తన లాయర్ కు 20 పేజీల లేఖను సారిక మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. తనను ఎవరెవరు చిత్రహింసలకు గురి చేస్తున్నారనే దానిపై మెయిల్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లేఖ కీలకంగా మారనుంది. 

కాసేపట్లో సారిక, చిన్నారుల మృతదేహాలకు పోస్టుమార్టం..

వరంగల్ : కాసేపట్లో ఏంజీఎం ఆసుపత్రిలో సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, మనవళ్ల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. 

మెదక్ లో గర్భిణి మృతి..ఆసుపత్రిపై బంధువుల దాడి..

మెదక్ : కౌడిపల్లి (మం) గౌతంపల్లి ప్రభుత్వాసుపత్రిలో వైద్యం అందక గర్భిణి రాధ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళన నిర్వహించారు. ఆసుపత్రి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. 

మీడియా ఎదుట కృపామణి తల్లిదండ్రులు..

పశ్చిమగోదావరి: కృపామణి హత్య కేసులో నిందితులు తల్లిదండ్రులు, సోదరుడిని పోలీసులు మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. 

10:24 - November 5, 2015

హైదరాబాద్ : నిమ్స్ ఆసుపత్రి మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించడం కలకలం సృష్టించింది. నిమ్స్ భవన నిర్మాణం..పరికరాల కొనుగోలు విషయంలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో బంజారాహిల్స్ లో ధర్మరక్షక్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో రూ. 9.5 నగదు, కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీలపై మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్ స్పందించారు. ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు. కేవలం కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు కక్ష గట్టి నిమ్స్ ఆసుపత్రిపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తాము పేద ప్రజల కోసం పనిచేస్తున్నామని, ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని తెలిపారు. అందరి సూచనల మేరకు పరికరాలు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ హాయాంలో తొందరగా నిర్మాణం చేయాలనే దానితో తొందర తొందరగా పరికరాలు కొనుగోలు చేయడం జరిగిందని, ఇందులో అవకతవకలు జరిగాయనే దానిపై చూడాలని తెలిపారు. ఎలాంటి తప్పు జరగలేదని, డబ్బులు తిన్నామా ? లేదా ? అనేది ప్రూప్ చేసుకుంటే సరిపోతుందన్నారు. కొత్త బిల్డింగ్ లో 500 బెడ్స్ ఉన్నాయని, ఇక్కడ నిర్మాణాంలో పరికాల కొనుగోలన్నీ సక్రమంగానే జరిగాయని ధర్మరక్షక్ తెలిపారు. 

10:16 - November 5, 2015

హైదరాబాద్ : బీహార్ ఎన్నికల్లో మరో కలకలం మొదలైంది. ఐదు విడతలుగా జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి విడత ఎన్నికలు గురువారం ప్రారంభమయ్యాయి. దీనికంటే ఒక రోజు ముందు బిహార్ దినపత్రికల్లో ఈ రోజు ప్రచురితమైన ఒక యాడ్ (ప్రకటన) తీవ్ర రాజకీయ కలకలాన్ని రేపుతోంది. ఐదో విడత పోలింగ్ ప్రత్యేకత ఏమిటంటే.. ఈ దఫా జరిగే 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లదే అధిపత్యం. మజ్లిస్ సైతం ఈ ప్రాంతాల్లో పోటీ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయాన్నే దినపత్రికల్లో వచ్చిన యాడ్ రాజకీయ సంచలనంగా మారింది.
పోలింగ్ పై తీవ్రప్రభావితం...
ఆవును అప్యాయంగా దగ్గరకు తీసుకున్న ఒక మహిళ ఫోటోను ప్రచురించి.. సీఎంగారు.. మీ మిత్రుడు గోమాతనూ.. హిందువులనూ అవమానిస్తూ ప్రకటనలు చేస్తుంటారు.. అతడిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి మీరు మౌనంగా ఉంటారు.. దీని భావం ఏమిటి? అన్న అర్థం వచ్చేలా వెలవడిన ప్రకటనపై బీజేపీయేతర రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. బీహార్ లోని అన్నిప్రధాన దినపత్రికల్లోనూ ఈ ప్రకటన ప్రచురితమైంది. దీంతో.. ఆవు యాడ్ పోలింగ్ పై తీవ్రప్రభావితం చూపిస్తుందని భావిస్తున్నారు. హిందూ ఓటు బ్యాంక్ మొత్తాన్ని ఏకీకరణ చేసే పనిలో భాగంగా బీజేపీ ఈ వ్యూహాన్ని ఎంచుకున్నదని రాజకీయ పార్టీలు అభిప్రాయ పడుతున్నాయి. బీజేపీ ఇచ్చిన ఈ తాజా ప్రకటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మిగిలిన రాజకీయ పక్షాలుహెచ్చరిస్తున్నాయి. మరి.. ఆవు యాడ్ తో చివరి విడత పోలింగ్ ముందు ప్రయోగించిన బీజేపీ.. తాను అనుకున్న ఫలితాన్ని సాధిస్తుందా? లేదా? అన్నది ఫలితాలే (నవంబరు 8న ఓట్ల లెక్కింపు) నిర్ణయించాలి. మరి.. ఆవుయాడ్ పై ఎన్నికల సంఘం ఎలా రియాక్ట్ అవుతుందో?

10:12 - November 5, 2015

వరంగల్ : జిల్లాలో కొద్ది రోజుల్లో ఎంపీ స్థానానికి ఎన్నికలు..ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు సమస్యలు..ఎంపీ స్థానంలో విజయం సాధించాలని భావించిన కాంగ్రెస్ కు ఆదిలోనే భారీ దెబ్బ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో కోడలు సారిక, అభివన్ (7), కవలలు శ్రీయోన్ అయోన్ (3) సజీవ దహనమైన సంగతి తెలిసిందే. సారిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు రాజయ్య, భార్య, కుమారుడు అనీల్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బరిలో నిలబడలేనని, ఇతర నాయకుడిని బరిలో నిలబెట్టాలని రాజయ్య అభ్యర్థన మేరకు సర్వేపల్లి సత్యనారాయణను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలో తెలియక టి. కాంగ్రెస్ తర్జనభర్జన పడుతోంది. రాజయ్యను సస్పెండ్ చేస్తే పార్టీకి మేలని, తద్వారా ప్రజల్లో తప్పుడు సమాచారం వెళ్లే అవకాశం లేదని కొందరు నేతలు కాంగ్రెస్ పెద్దలకు తెలియచేస్తున్నట్లు సమాచారం. కానీ ఇందులో రాజక్య హస్తం ఉందా ? లేదా ? అనేది పోలీసు విచారణలో తేలుందని అనంతరం నిర్ణయం తీసుకుందామని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. 

 

09:33 - November 5, 2015

కడప : జిల్లాలోని సుండుపల్లి మండలం శేషాచలం అడవుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కూంబింగ్ లో 61 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 40 మంది తమిళ కూలీలను పోలీసులు అరెస్టు చేసి పీఎస్ లకు తరలించారు. ఇటీవల ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. తమిళనాడు రాష్ట్రానికి చెందిన కూలీలను ఏపీ భూభాగంలోకి కొంతమంది తరలిస్తూ ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. స్మగ్లింగ్ జరుగకుండా చూసేందుకు పోలీసులు పలు ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు కూలీల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. 

09:30 - November 5, 2015

వరంగల్ : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక..ముగ్గురు మనవళ్లది హత్యా..ఆత్మహత్యా ? అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. బుధవారం తెల్లవారుజామున రాజయ్య నివాసంలోని మొదటి అంతస్తులో సారిక, అభివన్ (7), కవలలు శ్రీయోన్ అయోన్ (3) సజీవ దహనమయ్యారు. ఇది హత్యేనని సారిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిరిసిల్ల రాజయ్య, భార్య, మాధవి, కొడుకు అనీల్ లను అదుపులోకి తీసుకుని విచారించారు. అనీల్ ను మొత్తం 11 సార్లు విచారించినట్లు సమాచారం. ఈ కేసును చేధించడానికి పోలీసులు కృషి చేస్తున్నారు. ఈ ఘటన వెనుక అనేక కోణాలు వెలుగు చూస్తున్నాయి. హత్యా ?..ఆత్మహత్యా ? అనే దానిపై పోలీసులు దృష్టి సారించి దర్యాప్తు చేపడుతున్నారు.

మామునూరు పీఎస్ లో రాజయ్య ఫ్యామిలీ..
సిరిసిల్ల రాజయ్యతో పాటు ఆయన భార్య మాధవి, కుమారుడు అనీల్ లను పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నట్లు సమాచారం. భార్య సారికతో విబేధాలున్నట్లు అనీల్ ఒప్పుకున్నట్లు సమాచారం. వివాహేతర సంబంధం విషయాన్ని అనీల్ దాచిపెడుతున్నట్లు తెలుస్తోంది.

సారిక, మనువళ్ల అంత్యక్రియలపై సందిగ్ధత..
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, మనువళ్ల అంత్యక్రియలపై సందిగ్ధత నెలకొంది. రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనీల్ లు పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. మృతదేహాలు తీసుకెళ్లేందుకు సారిక బంధువులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో అంత్యక్రియలో కోసం అనీల్ కొద్దిసేపు వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

09:24 - November 5, 2015

హైదరాబాద్ : నిమ్స్ మాజీ డైరెక్టర్ ధర్మభిక్షం నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. నిమ్స్ లో పరికరాల కొనుగోలు విషయంలో ఆరోపణలు రావడంతో ఏసీబీ జంజారాహిల్స్ లో ఉన్న ధర్మభిక్షం నివాసంలో ఈ సోదాలు నిర్వహించింది. సోదాల్లో నగదు, కొన్ని కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారి టెన్ టివితో మాట్లాడారు. నిమ్స్ భవనం, ఆసుపత్రి పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడం జరిగిందన్నారు. దీనిపై విచారణ చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఓ కమిటీకి సంబంధం లేకుండా కొన్ని కొనుగోలు చేయడం జరిగిందని, ఈ సోదాల్లో 9 లక్షల నగదు, ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్ లు స్వాధీనం చేసుకున్నట్లు సోదాలు ముగిసిన అనంతర ఇతర వివరాలు వెల్లడిస్తామన్నారు. ధర్మభిక్షంతో పాటు నిమ్స్ ఉద్యోగి ముకుందారెడ్డి నివాసంలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.

పలు ఆరోపణలు..
మూడు దశాబ్దాల్లో నిమ్స్ ఆస్పత్రి కొందరికి ఆదాయవనరుగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రి అభివృద్ధి నుంచి పరికరాల కొనుగోలు వరకు అక్రమపద్ధతిలో సాగినట్లు వార్తలు వచ్చాయి. నాటి పాలక ప్రభుత్వాలు నిమ్స్ కు కేటాయించిన అరకొర నిధులను కొందరు దారి మళ్లించికొని కోట్లకు పడగెత్తినట్లు సమాచారం.

బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

మొహాలీ : సౌతాఫ్రికాతో జరిగే తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ తప్పుకోవడంతో పుజారాకు చోటు కల్పించారు. 

సారిక, మనువళ్ల అంత్యక్రియలపై సందిగ్ధత..

వరంగల్ : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, మనువళ్ల అంత్యక్రియలపై సందిగ్ధత నెలకొంది. రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనీల్ లు పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. మృతదేహాలు తీసుకెళ్లేందుకు సారిక బంధువులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో అంత్యక్రియలో కోసం అనీల్ కొద్దిసేపు వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

కరీంనగర్ లో ఏఎస్ఐ..కానిస్టేబుళ్ల సస్పెండ్..

కరీంనగర్ : వడ్డీకి అప్పులిచ్చి ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన కేసులో ఏఎస్ఐ మోహన్ రెడ్డిని కరీంనగర్ ఇన్ ఛార్జ్ డీఐజీ మల్లారెడ్డి సస్పెన్షన్ చేశారు. గోదావరిఖనిలో కానిస్టేబుల్ పై దాడి చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లు నర్సయ్య, సతీష్ లను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు.

 

ఎలమంచిలిలో 80 కిలోల గంజాయి..

విశాఖపట్టణం : ఎలమంచిలిలో 80 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు మహిళల అరెస్టు చేసి రూ. 52వేలను స్వాధీనం చేసుకున్నారు. 

మామునూరు పీఎస్ లో రాజయ్య ఫ్యామిలీ..

వరంగల్ : సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల సజీవ దహనం కేసుకు సంబంధించిన చిక్కుముడి వీడడం లేదు. ఈ ఘటనలో రాజయ్యతో ఆపటు ఆయన భార్య మాధవి, కుమారుడు అనీల్ లను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిని పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. 

నిమ్స్ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

హైదరాబాద్ : నిమ్స్ మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఆరోపణలున్నాయి. బంజారాహిల్స్ లోని ధర్మరక్షక్ ఇంటితో పాటు నిమ్స్ ఉద్యోగి ముకుందారెడ్డి నివాసంలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. గతంలో నిమ్స్ లో పరికరాల కొనుగోలు విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. 

నేడు సత్యనాదెళ్లతో రవి శంకర్ ప్రసాద్ భేటీ..

ఢిల్లీ : నేడు మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ భేటీ కానున్నారు. 

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో గురువారం ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటలు..నడక దారి భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. 

శేషాచలం అటవీ ప్రాంతంలో కూంబింగ్..

కడప : శేషాచలం అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. 61 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 40 మంది తమిళ కూలీలను అరెస్టు చేశారు. 

మెదక్ లో నేడు హరీష్..పద్మా దేవేందర్ రెడ్డిల పర్యటన..

మెదక్ : నేడు జిల్లాలో మంత్రి హరీష్ రావు, డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డిలు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వీరు పాల్గొననున్నారు. 

 

08:10 - November 5, 2015

యేసుక్రీస్తు కథాంశంతో ఇప్పటివరకూ చాలా చిత్రాలు వచ్చాయి. కీస్తు సమాధి నుంచి తిరిగొచ్చిన తర్వాత నలభై రోజులు భూమ్మీద తిరిగారని ఓ టాక్ ఉంది. మరి క్రీస్తు 40 రోజులు ఏం చేశారు? ఎవరెవరిని కలిశారు? మానవాళికి ఏం సందేశం అందించారు? అనే కథాంశంతో మా చిత్రం తెరకెక్కిస్తున్నామని దర్శకుడు జె.జాన్‌ బాబు పేర్కొన్నారు. సువర్ణ క్రియేషన్స్‌ పతాకంపై జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్‌ నిర్మిస్తున్న చిత్రం 'తొలి కిరణం'. పి.డి.రాజు జీసస్‌ పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో చిత్రం తెరకెక్కుతోంది. త్వరలో క్రీస్తు జన్మించిన జెరూసలెంలో చిత్రీకరణ చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేశారు. క్రీస్తు మహిమలు చూపే చిత్రమిదని, మరణించిన తర్వాత సమాధి నుంచి తిరిగిరావడం, తర్వాత మూడు రోజులు మాత్రమే చూపించారని తెలిపారు. ఇంతవరకు ఎవరూ చేయని కథతో చిత్రం తెరకెక్కిస్తున్నామని, మొదటి షెడ్యూల్‌ పూర్తయిందని, త్వరలో రామోజీ ఫిల్మ్ సిటీలో రెండవ షెడ్యూల్‌ ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. మేరీమాత పాత్రలో అభినయ, ప్రత్యేక పాత్రలో బ్రహ్మానందం నటిస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న లేదా జనవరి మొదటివారంలో చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

08:06 - November 5, 2015

వైసీపీ నేత మైసురారెడ్డి పార్టీ మారనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పరిపాలన వికేంద్రీకరణ జరడం లేదని వైసీపీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో పెరుగుతున్న అసహన పరిస్థితులపై బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై కాషాయదళాలు కస్సుమంటున్నాయి. సెక్యులరిజం పేరిట వామపక్ష ధోరణితో కొందరు రచయితలు, కళాకారులు భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆ సరసన బాలీవుడ్‌ నటుడు షారుక్‌ఖాన్‌ కూడా చేరారని బిజెపి ఎంపి యోగి ఆదిత్యనాథ్‌ ధ్వజమెత్తారు. షారుక్ ఖాన్ను పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ తో పోల్చారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నగేష్ (విశ్లేషకులు), పట్టాభిరామ్ (టిడిపి), కోటేశ్వరరావు (బీజేపీ), మల్లు రవి (కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. 

07:58 - November 5, 2015

నేటి ఆధునిక జీవనంలో మనిషిపై ఒత్తిడి అధికమవుతోంది. దాని ప్రభావం జ్ఞాపకశక్తిపై పడుతోదంది. ఎంతలా అంటే ఇంట్లో ఒక దగ్గరపెట్టిన వస్తువు కోసం మరోచోట వెదికేంతగా అని చెప్పొచ్చు. ఆందోళన, ఒత్తిడి దీనికి ప్రధాన కారణాలు. అంతేకాదు యాంత్రిక జీవితంలో టెక్నాలజీపై ఎక్కువ ఆధారపడిపోవడంతో సొంత జ్ఞాపకశక్తిపై పట్టుకోల్పోతున్నాం. ఈ సమస్య పెద్దలకే పరిమితం కావడంలేదు. పిల్లలపై కూడా అధికంగానే ఉందనేది నిపుణుల అభిప్రాయం. అయితే జ్ఞాపకశక్తి పెంచేందుకు కొన్ని ఆహారపు అలవాట్లు, మరికొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

  • క్యారెట్‌, కాలీఫ్లవర్‌ను ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. 60గ్రాముల గోబీ, కొంచెం కొత్తిమీర తీసుకుని దానిపై కాస్త ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలుపుకుని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
  • రోజూ ఆహారంలో క్యాల్షియం, ఎక్కువగా తీసుకోవాలి. క్యాల్షియం అధికంగా ఉండే పాలు, చీజ్‌, బట్టర్‌, పెరుగు వంటివి మెదడు ఉత్సాహానికి తోడ్పడతాయి. ప్రత్యేకించి పెరుగులో ఉండే ఎమినో యాసిడ్స్‌ జ్ఞాపకశక్తిని ప్రేరేపించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • భోజనం తర్వాత గ్లాసు మజ్జిగ తీసుకోవాలి. దీనివల్ల కాస్త ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. జ్ఞాపకశక్తి పెరగడానికి ఇది కూడా ఉపయోగకరమైందే. 
  • పరీక్షల సమయంలో ఎక్కువ సమయం చదువుతూ ఉంటారు. అలాంటప్పుడు ప్రతి అరగంటకు ఒకసారి మంచి నీళ్ళు తాగడం మంచిది. 
  • పడుకునే సమయంలో కూర్చుని చదువుకుంటే విషయాలు మెదడుకు సులువుగా చేరతాయి. ఇలా నిటారుగా కూర్చుని చదివితే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా మెరగవుతుంది.
07:57 - November 5, 2015

ఇంట్లో దోమల దాడుల నుండి తప్పించుకునేందుకు నానాపాట్లు పడాల్సి వస్తుంది. అలా దోమలు విజృంభించి కొత్తకొత్త రోగాలను తెచ్చిపెడుతున్నాయి. అలాంటి సమయాల్లో దోమల నుండి రక్షణ పొందేందుకు కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

  • రోజ్‌మేరీ మొక్క కాడలను కాల్చితే ఆ వాసనకు దోమలు పారిపోతాయి. దోమ కుట్టినప్పుడు వచ్చే వాపు, నొప్పి తగ్గాలంటే ఆ ప్రదేశంలో ఐస్‌ప్యాక్‌ని ఉంచాలి.
  • కాఫీ చేశాక మిగిలిన పిప్పిని నిల్వ వున్న నీరు, మురుగునీరు ఉన్న ప్రాంతాల్లో వేస్తే దోమల నివారణగా పనిచేస్తుంది. కాఫీపొడి కారణంగా లోపల ఉన్న దోమ గుడ్లు బయటకు వచ్చి ఆక్సిజన్‌ అందక నిర్వీర్యమవుతాయి.
  • దోమలు మనం విడిచే కార్బన్‌ డై ఆక్సైడ్‌ కోసం ఎక్కువగా ఆకర్షితమవుతాయి. అందువల్ల డ్రై ఐస్‌, కార్బన్‌ డై ఆక్సైడ్‌ని ఎక్కువగా విడుదల చేస్తుంది కనుక కొన్ని డ్రై ఐస్‌ ముక్కలను ఒక డబ్బాలో వేసి, ఇంట్లో ఓ ప్రదేశంలో పెట్టాలి. దోమలు ఆ డబ్బాలోకి చేరగానే దానిని మూత పెట్టేస్తే దోమల బెడద కాస్త తగ్గుతుంది.
07:56 - November 5, 2015

ప్రముఖ హీరో నటించే చిత్రాల్లో బాలనటులుగా వారి కొడుకులు కుమార్తెలు నటించడం పరిపాటే. మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మోత్సవం' చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం విషయంలో ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ చిత్రంలో మహేష్‌బాబు కూతురు 'సితార' ఓ చిన్న సన్నివేశంలో కనిపించి వెండితెరపై ప్రత్యక్షం కానుందని సమాచారం. బాలనటునిగా 'మహేష్‌ బాబు' కూడా అప్పట్లో తన తండ్రి నటించిన చిత్రాల్లో నటించి ఆ తర్వాత హీరోగా మారాడు. ఇక '1' (నేనొక్కడినే) చిత్రంలో మహేష్‌ కుమారుడు గౌతమ్‌కృష్ణ ఓ చిన్న పాత్ర చేసి మెప్పించాడు. ఈ చిత్రం తర్వాత మహేష్‌బాబు మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎన్వీప్రసాద్‌తో కలిసి ఠాగూర్‌మధు నిర్మించనున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏప్రిల్‌ 12వ తేదీ లాంచింగ్‌ చేయడానికి ఏర్పాటు జరుగుతున్నాయని సమాచారం. ఇందులో ఓ హీరోయిన్‌గా శృతిహాసన్‌ నటిస్తోందని తెలుస్తోంది. మరో పాత్రకు హీరోయిన్‌ అన్వేషణలో ఉన్నారు.

07:54 - November 5, 2015

మెనోపాజ్‌ దశలో స్త్రీలు శారీరక సమస్యలతోపాటు మానసిక ఆందోళనకు గురవుతుంటారు. వీటన్నింటికి చెక్‌ పెట్టాలంటే... సోయా ఉన్న ఫుడ్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు పరిశోధకులు. లండన్‌లోని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీలో నవంబర్‌ 1న జరిగిన ఎండోక్రైనాలజీ యాన్యువల్‌ మీట్‌లో ఓ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇవి ఎముకలు బలహీనపడకుండా చూస్తాయని తేల్చి చెప్పింది. ఫైబర్‌, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండి... కొవ్వు తక్కువగా ఉండే ఈ సోయా అధికంగా తీసుకున్న మహిళలకు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తగ్గిందట. సోయాబీన్స్ లోని ఈస్ట్రోజెన్‌ వంటి రసాయనాలు ఎంతగానో మేలు చేస్తాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. వీటిల్లోని ఐసోఫ్లేవన్లతో ఈ వయసులో వచ్చే నిద్రలేమి సమస్యను కూడా నివారించవచ్చట. చిక్కుడుగింజలను కూరగా వండుకుంటూనే ఉంటాం. కానీ... సోయా గింజలు, సోయా పిండి, సోయా పాలు ఇలా రకరకాల రూపాల్లో మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఏ రూపంలో తీసుకున్నా.. ఇది శరీరానికి మేలు చేస్తుంది.

07:53 - November 5, 2015

ముంబైలో జరుగుతున్న 17వ మామీ ఫిలిం ఫెస్టివల్‌ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా 'సినిమాల్లో మహిళల పాత్ర' ఎంత మేరకు ఉంటుందనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ నటీమణులు షబానా అజ్మీ, విద్యాబాలన్‌, కంగనా రనౌత్‌, అమీర్‌ఖాన్‌ సతీమణి కిరణ్‌రావ్‌ తదితరులు పాల్గొన్నారు. సినిమాల్లో మహిళల పాత్రపై పలు ఆసక్తికర అంశాల గురించి చర్చలో మాట్లాడారు. అక్టోబర్‌ 29న ప్రారంభమైన ఈ ఫిలిం ఫెస్టివల్‌ నేటితో ముగియనుంది.
తమిళ చిత్రం 'విసారణై' ఒక మాస్టర్‌ పీస్‌ : తాప్సీ
జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వెట్రీమారన్‌ రూపొందిన తమిళ థ్రిల్లర్‌ చిత్రం 'విసారణై'. ఈచిత్రాన్ని మామీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం తాప్సీ మాట్లాడారు. సినిమా చూస్తున్నంత సేపు ఊపిరి బిగబట్టే ఉన్నానని, ఆద్యంతం ఓ ఫీల్‌తో ఈ సినిమా సాగిందని మెచ్చుకున్నారు. వాస్తవ సంఘట నలను స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ఆయా సన్నివేశాలను వెండితెర మీద చూస్తున్నప్పుడు స్పష్టంగా కనిపించిందన్నారు. దర్శకుడు వెట్రిమారన్‌ రూపొందించిన 'ఆడుకాలమ్‌' చిత్రంలో తాప్సీ నటించిన సంగతి తెలిసిందే.

07:52 - November 5, 2015

రణ్‌వీర్‌సింగ్‌, దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'బాజీరావ్‌ మస్తానీ' చిత్రానికి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను బుధవారం చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరాఠా యోధుడు పేష్వా బాజీరావ్‌ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్‌ బాజీరావ్‌గా, దీపికా, ప్రియాంకలు ఆయనకు భార్యలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

07:51 - November 5, 2015

అవికాగోర్‌, ఈషా డియోల్‌ ప్రధాన పాత్రలో రాజ్‌ కందుకూరి సమర్పణలో గిరిధర్‌ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి నిర్మాతలుగా కిషన్‌ ఎస్‌.ఎస్‌ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న 'మాంజ' చిత్రం పాటల విడుదల వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ ఆడియో సిడిలను ఆవిష్కరించి తొలికాపీని నిర్మాత దామోదర ప్రసాద్‌కు అందజేశారు. కిషన్‌ తొమ్మిదవ ఏటనే 'ఫుట్‌పాత్‌' సినిమాను తెరకెక్కించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్ లో స్థానం సంపాదించారని తమ్మారెడ్డి తెలిపారు. తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందించిన 'మాంజ' చిత్రం ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యిందన్నారు. ఈ చిత్రాన్ని నవంబర్‌ చివరి వారంలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో అవికా గోర్‌, రాజ్‌ కందుకూరి, సురేష్‌ గంగుల, వీరశంకర్‌, డి.ఎస్‌.రావు, ప్రసన్నకుమార్‌, ప్రతాని రామకృష్ణగౌడ్‌, ఎన్‌.శంకర్‌, రఘుకుంచె, బాబా సెహగల్‌, మల్టీడైమెన్షన్‌ వాసు, సురేష్‌ కొండేటి, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

07:50 - November 5, 2015

మోహన్‌బాబు, అల్లరి నరేష్‌ హీరోలుగా రమ్యకృష్ణ, మీనా, పూర్ణ హీరోయిన్లుగా శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రం 'మామ మంచు - అల్లుడు కంచు'. నాన్నగారు ఇప్పటి వరకు 561 చిత్రాల్లో నటించి మెప్పించారని, ఇప్పుడు ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారని మంచు విష్ణు పేర్కొన్నారు. ఆయన హీరోగా నటిస్తున్న 181వ చిత్రమిదని, నరేష్‌కు యాభైవ చిత్రమన్నారు. డిఫరెంట్‌ కాంబినేషన్‌లో పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని, దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని తెలిపారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. 

07:47 - November 5, 2015

తినేటప్పుడు సెల్ఫీ..పడుకొనేటప్పుడు సెల్ఫీ..సెల్ఫీ..సెల్ఫీ..ఈ జాబితాలో సర్ధార్ గబ్బర్ సింగ్ చేరింది. సెల్ఫీ ఇచ్చేందుకు సెలబిట్రీలు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. ఒకప్పుడు షూటింగ్‌ టైంలో ఎవరైన అతిథులు, అభిమానులొస్తే నటీనటులు ఫొటో దిగేందుకు కొంచెం ఆలోచించేవారు. ఎందుకంటే ఆ సినిమాలో తన పాత్ర, గెటప్‌ తదితర విషయాలు సినిమా విడుదలకు ముందుగానే అందరికీ తెలిసిపోతాయేమోనని.. కాని ఇప్పుడు పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. సందర్భం ఏదైనా సరే సెల్ఫీలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' టీమ్‌ దిగిన సెల్ఫీ ప్రస్తుతం సామాజిక మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. పవన్‌కళ్యాణ్‌తో సహనటులు అలీ, బ్రహ్మాజీ తదితరులు సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీని బ్రహ్మాజీ తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. పవన్‌కళ్యాణ్‌ సరసన కాజల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో శరత్‌మారర్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించి షూటింగ్‌ ఏకధాటిగా జరుగుతోంది. 

నేడు మూడు బంగార అనుబంధ పథకాలు..

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ గురువారం మూడు బంగారు అనుబంధ పథకాలను ఆవిష్కరించనున్నారు. ఇందులో 'ఇండియా గోల్డ్ కాయిన్', 'గోల్డ్ మానిటైజేషన్‌', 'గోల్డ్ బాండ్‌' పథకాలున్నాయి. 

ఫరీద్ కోట్ కు చేరుకున్న రాహుల్..

పంజాబ్ : ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫరీద్ కోట్ కు చేరుకున్నారు. ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలో బాధితులతో ఆయన మాట్లాడనున్నారు. 

07:03 - November 5, 2015

మధ్యాహ్న భోజనం వర్కర్లు మరోసారి పోరుబాట పట్టారు. వీరి ఆందోళనకు కారణం ఏమిటి? మధ్యాహ్న భోజనం పథకం అమలులో ఎదురవుతున్న సమస్యలేమిటి? ఈ పథకానికి ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులు, సదుపాయాలు ఎలా వున్నాయి? ఈ పథకం మరింత సమర్ధవంతంగా పనిచేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలాంటి అంశాలపై టెన్ టివి జనపథంలో ఆంధ్రప్రదేశ్‌ మధ్యాహ్న భోజనం వర్కర్ల యూనియన్‌ కార్యదర్శి స్వరూపారాణి విశ్లేషించారు. 

07:01 - November 5, 2015

నానాటికి తీసికట్టు నాగంబొట్టులా తయారవుతోంది మధ్యాహ్న భోజనం పథకం పరిస్థితి. ఒకవైపు ధరలు దరువేస్తున్నాయ్‌. పప్పు, ఉప్పు, కోడిగుడ్డు, అరటిపండు ఇలా ప్రతిదీ మండిపోతున్నాయి. ఇలాంటి స్థితిలో సకాలంలో బిల్లులు చెల్లించకపోతే, తామెలా ఈ పథకాన్ని నిర్వహించగలం ? అంటున్నారు నిర్వాహకులు. బిల్లులు రాకపోవడంతో మధ్యాహ్న భోజనం వర్కర్ల పరిస్థితి దయనీయంగా మారుతోంది.

అత్యంత ప్రమాదకరంగా 12 కోట్ల మంది బడి పిల్లలు..
మన దేశంలో 12 కోట్ల మంది బడి పిల్లల బతుకులు అత్యంత ప్రమాదకరంగా వున్నాయి. వాళ్లంతా బలిపీఠం మీద వున్నారు. ఎప్పుడు ఏ రూపంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అర్ధం కాని పరిస్థితి. ఇంత భయానికి కారణం మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రభుత్వ అమలు చేస్తున్నతీరే. నిజానికి మధ్యాహ్న భోజన పథకం చాలా గొప్ప పథకం. ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ పథకం. దేశవ్యాప్తంగా దాదాపు పన్నెండు కోట్ల మంది బడిపిల్లలకు పోషకాహారం అందించడం, పేదరికం కారణంగా డ్రాపవుట్స్‌ లేకుండా చూడడం, బడి ఈడు పిల్లలందరినీ స్కూల్స్ కి వచ్చేలా చూడడం ఈ పథకం లక్ష్యం. అంత ఉదాత్త లక్ష్యాలతో ప్రారంభించిన ఈ పథకాన్ని నిర్వహణా వైఫల్యాలు వెక్కిరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు సమీక్షలు లేకపోవడం, లోపాలను సరిదిద్దే ప్రయత్నాలు చేయకపోవడం, మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పెంచే ప్రయత్నాలు చేయకపోవడం, వర్కర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిధులు సమకూర్చకపోవడం ఈ పథకానికి శాపాలు. అసలే ధరలు దరువేస్తున్నవేళ సక్రమంగా బిల్లులు చెల్లించకపోతే, తామెలా వండి వడ్డించగలమంటూ మధ్యాహ్న భోజనం నిర్వహకులు ఆవేదన చెందుతున్నారు.

కేంద్రం..రాష్ట్ర సంయుక్త ఆధ్వర్యంలో పథకం అమలు...
ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్న పథకం. కేంద్రం 75 శాతం నిధులిస్తే, రాష్ట్ర ప్రభుత్వాలు పాతిక శాతం నిధులు సమకూరుస్తాయి. సాంబారు, కూరగాయలు, పప్పు, గుడ్డు, అరటి పండు ఇలా చక్కటి మెనూ తయారు చేశారు. కానీ వీటికి కేటాయించిన నిధులు నామమాత్రం. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి నాలుగున్నర రూపాయలు, హైస్కూల్‌ విద్యార్థులకు ఒక్కొక్కరికి ఆరు రూపాయల చొప్పున కేటాయిస్తున్నారు. ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఇంత తక్కువ డబ్బులతో నాణ్యమైన భోజనం పెట్టడం సాధ్యమా? ఒక్కొక్క విద్యార్థికి కనీసం పది రూపాయల చొప్పున కేటాయించకపోతే, కాస్త నాణ్యమైన భోజనం పెట్టడం సాధ్యం కాదని చాలామంది చెబుతున్నారు.

కనిపించని వంట గదులు..
మధ్యాహ్న భోజన పథకంలో మరో కీలమైన అంశం వంటగదులు. కానీ మన రాష్ట్రంలోనే కాదు యావత్‌ భారతదేశంలో చాలా స్కూళ్లలో వంట గదులే కనిపించవు. ఆరు బయట చెట్ల కింద, సెప్టిక్‌ ట్యాంక్‌ల పక్కన, ముగురు కాలవల పక్కన ఇలా ఎక్కడపడితే అక్కడ భోజనం వండేస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో వండిన ఆహారం తింటే పిల్లల ఆరోగ్యానికి జరిగే హాని అంతాఇంతా కాదు. బడి పిల్లలు తరచూ వాంతులు, విరోచనాల బారిన పడడానికి అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేయడమే ప్రధాన కారణం. మన తెలుగు రాష్ట్రాల్లో 48వేల స్కూల్స్ లో వంట గదులు లేవు.

రక్షత మంచినీటి పథకాలు ఎక్కడ ? 
ఇక మధ్యాహ్న భోజన పథకంలో మరో ముఖ్యమైన అంశం వంటలకు వాడే నీళ్లు. అనేక పాఠశాలల్లో రక్షిత మంచినీటి పథకాలు లేవు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని దాదాపు 16 వేల స్కూళ్లలో అసలు మంచినీటి సౌకర్యం లేదు. ఉన్న చోట్ల కూడా నీళ్ల ట్యాంకులను సరిగా పరిశుభ్రం చేయడం లేదనే విమర్శలున్నాయి. వంటలకు స్వచ్ఛమైన నీరు వాడకపోతే, ఆ భోజనం తిన్నవారికి వచ్చేది రోగాలే. ఈ విషయం తెలిసీ మన ప్రభుత్వాలు స్కూళ్లకు రక్షిత మంచినీటి సరఫరా విషయంలో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయంటే ఏమనాలి?

సరుకులు నిల్వ చేయడానికి స్థలాలేవీ ? 
ఇక మధ్యాహ్న భోజన పథకంలో మరో ముఖ్యమైన విషయం సరుకులు , వండిన పదార్థాలు నిల్వ చేసే స్థలాలు. మన స్కూళ్లలో ఇవి ఎక్కడా కనిపించవు. సరుకులు నిల్వ చేయడానికి స్థలం లేకపోవడంతో చాలా చోట్ల ఆఫీసురూంలోనో, క్లాసు రూంలోనో ఓ మూలన పడేయాల్సి వస్తోంది. వండిన పదార్థాలను చెట్ల కింద, గోడల చాటు పెట్టాల్సి వస్తోంది. దీంతో ధుమ్మూ దూలి వండిన పదార్థాలలో పడి, అది తిన్న పిల్లలు తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. నిజానికి మధ్యాహ్న భోజన పథకాన్ని చక్కగా అమలు చేస్తే బలమైన, దృఢమైన విద్యార్థులున్న భారతావనిని నిర్మించుకోవచ్చు. మన పాలకులకు ఈ స్పృహే లోపిస్తోంది. దాన్నో ఖర్చుగా భావిస్తోంది తప్పా బలమైన జాతి నిర్మాణానికి పెడుతున్న పెట్టుబడిగా భావించడం లేదు.

నేటి నుండి రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడాత్సోవాలు..

ఆదిలాబాద్ : నేటి నుండి రాష్ట్రస్థాయి పోలీసు క్రీడాత్సోవాలు జరుగనున్నాయి. వివిధ జిల్లాల నుండి 1365 మంది పోలీసులు పాల్గొననున్నారు. 

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో..ముగ్గురి మృతి..

పశ్చిమగోదావరి : గొండు గొలసు సమీపంలో ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.

 

06:40 - November 5, 2015

మొహాలీ : టెస్ట్ టాప్‌ ర్యాంకర్‌ సౌతాఫ్రికా, 5 వ ర్యాంకర్‌ టీమిండియా జట్ల మధ్య నేడు మొహాలీలో టెస్ట్ సమరం మొదలవనుంది. పవర్‌ ప్యాకెడ్‌ సఫారీ టీమ్‌కు అందరూ కుర్రాళ్లతో కూడిన కొహ్లీ అండ్ కో సవాల్‌ విసురుతోంది. టీ 20, వన్డే సిరీస్‌ విజయాలతో సఫారీ టీమ్‌ జోరు మీదుంటే టెస్ట్ సిరీస్‌లో తమదైన ముద్ర వేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. టెస్టుల్లో భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల ఫేస్ టు ఫేస్‌ రికార్డ్ ప్రస్తుతం ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా జట్టు టాప్‌ ప్లేస్‌లో ఉండగా....భారత జట్టు 5వ స్థానంలో ఉంది. కానీ టెస్ట్ ఫార్మాట్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికాదే పై చేయిగా ఉంది.

29 టెస్టుల్లో పోటీ..
ఇప్పటివరకూ ఈ రెండు జట్లు ఓవరాల్‌గా 29 టెస్టుల్లో పోటీ పడ్డాయి. సఫారీ టీమ్‌ 13 టెస్టుల్లో విజయం సాధించగా భారత జట్టు కేవలం 7 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. 9 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. దక్షిణాఫ్రికా వేదికగా ఇరు జట్లు 17 మ్యాచ్‌ల్లో పోటీ పడగా ఆతిధ్య సఫారీ టీమ్‌ 8 మ్యాచ్‌ల్లో నెగ్గి..2 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది.  కానీ భారతగడ్డపై మాత్రం రెండు జట్లు సమాన ఆధిక్యంలో ఉన్నాయి. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా జట్టుతో 12 టెస్టులు ఆడిన టీమిండియా...5 మ్యాచ్‌ల్లో నెగ్గి మరో ఐదు మ్యాచ్‌ల్లో ఓడింది. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఓవరాల్‌గా టెస్టుల్లో దక్షిణాఫ్రికా జట్టు ప్రత్యర్ధిగా చెత్త ట్రాక్‌ రికార్డ్ ఉన్నా సొంత గడ్డపై భారత జట్టు ప్రదర్శన కాస్త మెరుగ్గా ఉండటం కొహ్లీ సేనకు కలిసొచ్చే అంశమే. మరి అందరూ మ్యాచ్‌ విన్నర్లతో నిండిన హషీమ్‌ఆమ్లా నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టును ఓడించాలంటే మాత్రం కొహ్లీ అండ్‌ కో అంచనాలకు మించి రాణించాల్సిందే.

06:35 - November 5, 2015

ముంబై : దేశంలో పెరుగుతున్న అసహన పరిస్థితులపై బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై కాషాయదళాలు కస్సుమంటున్నాయి. సెక్యులరిజం పేరిట వామపక్ష ధోరణితో కొందరు రచయితలు, కళాకారులు భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆ సరసన బాలీవుడ్‌ నటుడు షారుక్‌ఖాన్‌ కూడా చేరారని బిజెపి ఎంపి యోగి ఆదిత్యనాథ్‌ ధ్వజమెత్తారు. షారుక్ ఖాన్ను పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ తో పోల్చారు. వారిద్దరి భాష ఒకటేనంటూ ఆదిత్య నాథ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ మతం వాళ్లు షారూఖ్‌ఖాన్‌ సినిమాలను బహిష్కరిస్తే అతడు కూడా ఓ సాధారణ ముస్లిం వలె రోడ్డుపై ఉండేవాడన్నారు. షారుఖ్‌ఖాన్ భారత్ లో ఉంటున్నా ఆయన మనసంతా పాకిస్తాన్ మీదే ఉందని, ఆయన దేశ ద్రోహని మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కైలాశ్ విజయ్ వర్గియా వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద దుమారం రేగడంతో కైలాశ్‌ తన ట్వీట్‌లను ఉపసంహరించుకున్నారు. ఎవరినీ గాయపర్చడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

షారుఖ్ అండగా అనుపమ్ ఖేర్..
షారుఖ్‌ఖాన్‌కు బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌ అండగా నిలిచాడు. షారుఖ్‌ఖాన్‌ నేషనల్‌ ఐకాన్‌ అని, ఆయనపై తమకందరికి గౌరవం ఉందని పేర్కొన్నారు. షారుఖ్‌ విషయంలో బిజెపి నేతలు నాలుకను కంట్రోల్‌లో పెట్టుకోవాలని సూచించారు. అసహన అంశంపై మోదిని టార్గెట్‌ చేస్తూ అవార్డులు వెనక్కి ఇచ్చేయడాన్ని అనుపమ్‌ వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో అనుపమ్‌ఖేర్‌ నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం నవంబర్‌ 6న రాష్ట్రపతిని కలవనుంది.

బిజెపి వ్యాఖ్యలపై నిరసనలు..
పాకిస్తాన్‌ కళాకారులను వ్యతిరేకిస్తున్న శివసేన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్కు మాత్రం దన్నుగా నిలిచింది. ఒక ముస్లిం అయినందున షారుక్ ఖాన్ పై బిజెపి నేతలు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడం సరికాదని శివసేన ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ భక్తుడిగా ఉండడం కన్నా సెక్యులర్‌ వాదిగా ఉండడానికే తాను ఇష్టపడతానని తన బర్త్‌ డే సందర్భంగా షారుఖ్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. దేశంలో నెలకొన్న అసహన పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. అవార్డులు వెనక్కి ఇచ్చేస్తున్న మేధావులు, రచయితలు, కళాకారులకు షారుఖ్‌ మద్దతు తెలిపారు. షారూఖ్‌ఖాన్‌ విషయంలో బిజెపి నేతల వైఖరిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

06:32 - November 5, 2015

హైదరాబాద్ : నగరంలో జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు పాతనేరస్తులపై నిఘా వేశారు. 2011 నుంచి నగరంలో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో నేరాలు చేసి జైలుకు వెళ్లి విడుదలైన వారు ఏం చేస్తున్నారన్న అంశంపై దృష్టి సారించారు. నేరస్థుల ఇళ్లకు వెళ్లి వారి వివరాలను సేకరిస్తున్నారు. రెండు రోజుల పాటు నగరంలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో పాత నేరస్థుల సమగ్ర సర్వేను చేపట్టారు. చిన్న చిన్న నేరాలు.. దొంగతనాలు చేసి జైలుకు వెళ్లిన వారు నగరంలో 11 వేల 5 వందల మంది ఉన్నట్లు పోలీసు రికార్డుల్లో ఉన్నాయి. అరెస్టయిన సమయంలో వారిచ్చిన చిరునామాలను పోలీసులు సేకరించారు. గతంలో అరెస్టయిన వారిలో 7 వేల 5 వందల మంది నగరంలోనే నివాసం ఉంటున్నట్లు రికార్డుల్లో ఉంది. మిగిలిన వారు సైబరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నారు. అందుబాటులో ఉన్న వివరాలను బట్టి ప్రస్తుతం 7వేల 5 వందల మంది వాస్తవ పరిస్థితి ఏమిటన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు.

సమగ్ర సర్వే..
నగరంలోని అన్ని పోలీసు స్టేషన్‌లలో రెండు రోజుల పాటు పోలీసులు అందరూ పాత నేరస్థుల సమగ్ర సర్వేలో నిమగ్నమయ్యారు. బృందాలుగా ఏర్పడిన పోలీసులు తెల్లవారు జామునుంచే పాత నేరస్థుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం పాత నేరస్థులు అదే చిరుమానాలో ఉన్నారా లేదా అని తెలుసుకుంటున్నారు. లేకపోతే వారు ఎక్కడున్నారన్న విషయంపై ఆరా తీస్తున్నారు. పాతనేరస్థుల ఉపాధి.. వస్తున్న ఆదాయానికి అతని జీవనవిధానానికి వ్యత్యాసం ఉందా అని పరిశీలన జరుపుతున్నారు. ఆదాయానికి మించి ఖరీదైన.. జల్సా జీవితాన్ని గడుపుతుంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో అడిగి తెలుసుకుంటున్నారు. అనుమానాలు ఉంటే పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి బైండోవర్‌ చేస్తున్నారు.

కదలికలపై నిఘా..
పాత నేరస్తుడి కుటుంబ సభ్యులతో పాటు పొరుగువారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. పాత నేరస్థుడు ఇంకా నేరాలు చేస్తున్నాడా....? సామాన్య జీవితాన్ని గడుపుతున్నాడా అన్న అంశంపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అతని ప్రవర్తనపై ఏమాత్రం అనుమానం వచ్చినా నిఘా వేస్తున్నారు. రాత్రి వేళల్లో గస్తీ తిరిగే పోలీసు బృందాలతో పాటు ద్విచక్రవాహనాలపై కొందరు పోలీసులు వీరి కదలికలపై నిఘా వేస్తున్నారు. సాధారణంగా ఒక సారి నేరాలు చేసేందకు అలవాటు పడితే మళ్లీమళ్లీ అదే బాటలో పయనించే అవకాశాలు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. దీనితో ముందుగా పాతనేరస్తులను కట్టడి చేస్తే నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పాతనేరస్థుల సమగ్ర సర్వే అనంతరం వారి పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక తయారుచేయనున్నారు. సర్వే తరువాత పాత నేరస్థుల కదలికపై నిఘా వేసేందుకు కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసేందుకు సిటీ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

06:26 - November 5, 2015

వరంగల్ : జిల్లా ఉప ఎన్నికలో పోటీ చేయడమే అనుమానమనుకున్న తరుణంలో వైసీపీ తన అభ్యర్థిని బరిలో దింపింది. టీఆర్‌ఎస్‌ పాలనకు రెఫరెండంగా చెప్పుకుంటున్న ఈ పోల్‌లో విజయం సాధించేందుకు మిగతా పార్టీల్లానే జగన్‌ పార్టీ కూడా వివిధ వ్యూహాలు రచిస్తోంది. స్థానిక ప్రజల్లో జోష్ నింపేందుకు నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే తెలంగాణలో వైసీపీ ఎంత బలంగా ఉందనేందుకు ఈ ఎన్నిక రెఫరెండంగా నిలుస్తుందేమో.? స్థానిక ప్రజల్లో జోష్ నింపేందుకు వైసీపీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే తెలంగాణలో వైసీపీ ఎంత బలంగా ఉందనేందుకు ఈ ఎన్నిక రెఫరెండంగా నిలుస్తుందేమో.? పోటీ చేస్తే వచ్చే లాభమెంత.. పోటీ చేయకుంటే వచ్చే నష్టమేంటీ? ఇలాంటి అనేక తర్జనభర్జనలతో బరిలోకి దిగాలన్న జగన్‌ నిర్ణయంతో అభ్యర్థిని ఎంపిక చేశారు. నల్లా సూర్యప్రకాశ్‌ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. వైసీపీ గెలుపు కోసం పార్టీలోని ప్రజాదరణ ఉన్న నేతలతో వరంగల్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయించాలని ప్లాన్‌ చేస్తున్నారు.

ఓటర్లను ఆకర్షించేలా వ్యూహాలు..
అయితే ప్రాంతీయవాదం అడ్డురాని నేతలతో ప్రచారం చేయిస్తే కాస్తోకూస్తో ప్రయోజనం ఉంటుందని వైసీపీ భావిస్తోంది. అందులో భాగంగా తెలంగాణ ఏర్పాటుకు ముందు విభజన రాగం పాడిన నేతలపై దృష్టిపెట్టారు. దీంతో వరంగల్‌ ఓటర్లని ఆకర్షించొచ్చని ఆ దిశగా నేతలను ప్రచార బరిలో దింపాలని జగన్‌ పార్టీ కసరత్తు చేస్తోంది. గతంలో వైఎస్‌ చేపట్టి అమలుపరిచిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల సమగ్ర సమాచారాన్ని క్యాంపెయినర్లతో చెప్పించాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు..
క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న నేతలనే కాక పాపులారిటీ ఎక్కువున్న నేతలను రంగంలోకి దించనున్నారు. ఘాటుగా వ్యాఖ్యలు చేయగలిగి సినీగ్లామర్ ఉన్న ఎమ్మెల్యే రోజా, పిసిసి మాజీ చీఫ్‌ ప్రస్తుత వైసిపి నేత బొత్స సత్యనారాయణ, తదితరుల చేత ప్రచారం చేయించాలనుకుంటున్నారు. ఏడు నియోజకవర్గాల్లో వేరువేరుగా బహిరంగ సభలు ఏర్పాటు చేసి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రచారం చేసేలా, వరంగల్‌ నగరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జగన్మోహన్‌రెడ్డి పాల్గొనేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈ పోల్‌లో సర్వశక్తులూ ఒడ్డి పోరాడతామని ఆ పార్టీ నేతలంటున్నారు.

వైసీపీకి ఉన్న ప్రజాకర్షణ ఎంత?
వైఎస్‌ఆర్‌పై అభిమానం ఇప్పటికీ ప్రజల్లో సమూలంగా ఉందని వైసిపి భావిస్తోంది. అయితే అదెంతవరకు నిజమో... అసలు తెలంగాణలో వైసిపికి అభిమానులు ఉన్నారో లేరో ఈ ఎన్నిక రుజువు చేయబోతోంది. ఇప్పటికే ఆంధ్రాపార్టీగా ముద్రపడ్డ జగన్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసుల్లో ఉందో లేదో తేలనుంది. 

06:23 - November 5, 2015

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. పెరుగుతున్న పట్టణీకరణ అనేక సవాళ్లను విసురుతోందని ప్రపంచ ఆర్ధిక సదస్సులో బాబు అభిప్రాయపడ్డారు. విశాఖలో 15 వందల రూపాయల కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో కన్వెన్షన్స్‌ సెంటర్‌ నెలకొల్పేందుకు లులూ గ్రూప్‌ ముందుకొచ్చింది. బుధవారం ఉదయం ఏపీ భవన్‌లో కేంద్ర సైన్స్ అండ్‌ టెక్నాలజీ ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఎడ్యుకేషన్‌ సెంటర్లపై చర్చించారు. అనంతరం ఫిక్కీ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం జపాన్‌ ప్రతినిధులను చంద్రబాబు కలిశారు.

ప్రపంచ ఆర్ధిక సదస్సులో కీలకోపన్యాసం..
మధ్యాహ్నం ప్రపంచ ఆర్ధిక సదస్సులో చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు. పెరుగుతున్న పట్టణీకరణ అనేక సవాళ్లను విసురుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో నగరాలు ఎలా ఉండాలనే దానికి ఏపీ నమూనాగా నిలుస్తుందని.. ఆ విధంగా అమరావతిని నిర్మిస్తామని బాబు అన్నారు. ఇక స్వచ్చ భారత్‌ సబ్‌గ్రూప్‌ కన్వీనర్‌గా పట్టణాభివృద్ధి కోసం కొన్ని నిర్మాణాత్మక సూచనలు చేశానని బాబు తెలిపారు. జీడీపీలో అత్యధిక భాగం పట్టణాల నుంచే వస్తుందన్నారు చంద్రబాబు.

పలు సంస్థల ప్రతినిధులతో బాబు భేటీ..
ఇక ఈ సదస్సు సందర్భంగా చంద్రబాబు పలు సంస్థల ప్రతినిధులను కలిశారు. విశాఖలో 15 వందల కోట్ల రూపాయలతో అంతర్జాతీయ స్థాయిలో కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు లులూ గ్రూప్‌ సంస్థ ముందుకొచ్చింది. ఏపీలో పర్యటించి పెట్టుబడులకు గల అవకాశాలను పరిశీలించాలని ఆ సంస్థ చైర్మన్‌ యూసఫ్‌ అలీని చంద్రబాబు కోరారు. తన ఢిల్లీ పర్యటన విజయవంతమైందని చంద్రబాబు తెలిపారు. కరవుతో అల్లాడుతున్న ఏపీని కేంద్రం ఆదుకుంటుందనే నమ్మకం తనకుందన్నారు చంద్రబాబు. 

06:21 - November 5, 2015

హైదరాబాద్ : నవీన ఆవిష్కరణ కోసం అన్ని హంగులతో హైదరాబాద్‌లోని ట్రిపుల్‌ ఐటీలో నిర్మించిన ఐటీ హబ్‌ ప్రారంభానికి సిద్ధమయ్యింది. సర్వహంగులతో నిర్మించిన భారీ ఇంక్యుబేషన్‌ కేంద్రాన్ని టాటా గ్రూపు మాజీ ఛైర్మన్‌ రతన్‌ టాటా గురువారం సాయంత్రం ప్రారంభిస్తారు. గవర్నర్‌ నరసింహన్‌తోపాటు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హాజరవుతారు. స్టార్టప్‌ కంపెనీల కోసం టెక్నాలజీ హబ్‌ను నిర్మించారు. 70 వేల అడుగులు విస్తీర్ణంలో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటయ్యింది. ఇందు కోసం 40 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దారు. 200 స్టార్టప్‌ కంపెనీలు ఏర్పాటువుతాయి. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఆధునిక టెక్నాలజీని అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీనిని అభివృద్ధి చేశారు. స్టార్టప్‌ కంపెనీలను హైదరాబాద్‌ రప్పించే ఉద్దేశంతో టీ-హబ్‌ను ఏర్పాటు చేసినట్టు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చెబుతున్నారు. 

06:18 - November 5, 2015

హైదరాబాద్ : క్షణికావేశం నిండు జీవితాలను మింగేస్తోంది. కట్టలు తెంచుకున్న ఆగ్రహం బంగారు భవిష్యత్తును చిదిమేస్తోంది. తప్పు ఒప్పుల తర్కంలో, నువ్వెంత, నేనేంత అని ఎంచుకునే సమరంలో లోకాన్ని చూడని కనుపాపలు కమిలిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారి జీవితాలు చేయని పాపానికి ఫలితాన్ని అనుభవిస్తున్నాయి. వెలుగులు పంచకుండానే కొండెక్కుతున్న దీపాలవుతున్నాయి.

సమిధలవుతున్న చిన్నారులు..
ఏవైతేనేం.... జీవితపు మాధుర్యాన్ని రుచి చూడకుండానే, చేసుకున్న బాసలకు వాస్తవ రూపమివ్వకుండానే అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. వేదమంత్రాల మధ్య నడుమ నిర్వహించిన పెళ్లి ప్రమాణాలకు, ఊహాల పల్లకిలో, హృదయాల లోగిలిలో చేసుకున్న ఒప్పందాలను సమాధి చేస్తున్నాయి. కడదాకా సాగుతుందనుకున్న పయనం మధ్యలోనే ఆగిపోతోంది. తుది శ్వాస వరకు ఒక్కటై నిలుస్తుందనుకున్న బంధం నిట్టనిలువునా కూలిపోతోంది. ఈ దుష్పరిణామం ముక్కుపచ్చలారని చిన్నారులను చిదిమేస్తోంది. దంపతుల మధ్య మనస్పర్ధలకు, పొడసూపిన విబేధాలకు అమాయకులు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇంకా లోకాన్ని చూడని పసివారు, లోకం పోకడ తెలియని చిన్నారులు కుటుంబ కలహాలకు సమిధలవుతున్నారు. ఎవరో చేసిన నేరానికి తప్పేదో, ఒప్పేదో తెలుసుకోలేని అమాయకులు కొడిగడుతున్న దీపాలవుతున్నారు.

చచ్చిపోతున్న సహనం..
ఇన్‌స్టంట్ ప్రేమలు, హద్దులు దాటుతున్న పరిచయాలు, అవివేకవంతమైన నిర్ణయాలు రాజ్యమేలుతున్న రోజుల్లో సహనం చచ్చిపోతోంది. ఓపిక పడితే సమస్యలు సరిహద్దులు దాటిపోతాయనే ఆలోచన కనుమరుగైపోతోంది. విరక్తి రూపంలోకి ఒదిగిపోయిన మహమ్మారి బంధాలు, అనుబంధాలు అంతెందుకు చివరికి కడుపు తీపిని సైతం కన్నపేగే హతమార్చేలా చేస్తోంది. మాయమైపోతున్న మనిషితనాన్ని మరింతగా దిగజార్చుతోంది.

ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు...?
చేజేతులా ఏ ఒక్కరూ నేరం చేయరు. తెలిసెవరూ దోషులు కారు. కానీ ఫలితం మాత్రం మోస్తున్నారు. చేయని నేరానికి చిన్నారులను కాలగర్భంలో కలిపేస్తున్నారు. పరాయి వాడైనా, పగ వాడైనా, ప్రాణ స్నేహితుడైనా చివరికి రక్తం పంచుకు బిడ్డనైనా చంపేసే హక్కు ఎవరికి లేదు. కానీ విచక్షణ మరిచిన దంపతులు చిన్నారులనే బలి తీసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే తమ అభిప్రాయ బేధాలకు, పంతాలకు కడుపుతీపిని హత్య చేస్తున్నారు. ఇకనైనా ఈ దారుణాలకు తెరపడాలి. తాము చేసిన తప్పులకు పసివాళ్లను బలిపశువులు చేస్తున్న అరాచకానికి ముగింపు కావాలి. 

నేడు కృష్ణా పుష్కరాలపై ఇంద్రకరణ్ సమీక్ష..

హైదరాబాద్ : కృష్ణా పుష్కరాలపై టీఎస్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల కలెక్టర్లు హాజరు కానున్నారు. 

నేడు సిరిసిల్ల కోడలు సారిక, మనవళ్లకు పోస్టుమార్టం..

వరంగల్ : సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, మనవళ్లు అభినవ్, అయోన్, శ్రీయోన్ మృతదేహాలకు నేడు ఉదయం ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం జరుగనుంది. 

ఆశా వర్కర్లకు కోసం టీఎస్ఆర్టీసీ, ఎస్ డబ్ల్యూఎఫ్ విరాళాల సేకరణ

హైదరాబాద్ : ఆశా వర్కర్లకు సంఘీభావంగా నేడు అన్ని డిపోల్లో టీఎస్ఆర్టీసీ, ఎస్ డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ జరుగనుంది.

 

బీహార్ నేడు తుది దశ ఎన్నికలు..

బీహార్ : రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికలకు గురువారం తుది విడత పోలింగ్ జరుగనుంది. ఐదు దశల్లో 9 జిల్లాల్లోని 57 స్థానాలకు ఎన్నికలు జరుగున్నాయి. 

చిల్లకూరు పీఎస్ ఎదుట యువతి బైఠాయింపు..

నెల్లూరు : చిల్లకూరు పీఎస్ ఎదుట యువతి బైఠాయించింది. కానిస్టేబుల్ అర్షద్ ప్రేమ పేరిట మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని యువతి కోరుతోంది. 

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపుపై నిబంధనలు..

విజయవాడ : రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపుపై నిబంధనలు ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. కుటుంబసభ్యులందరికీ ఒకే చోట ప్లాట్లు కావాలంటే 15వ తేదీలోగా సీఆర్డీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

 

అనీల్ ను రెండుసార్లు విచారించిన పోలీసులు..

వరంగల్ : సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనీల్ ఇప్పటి వరకు రెండు దఫాలుగా పోలీసులు విచారించారు. భార్య సారికతో విబేధాలున్నట్లు అనీల్ ఒప్పుకున్నట్లు సమాచారం. వివాహేతర సంబంధం విషయాన్ని అనీల్ దాచిపెడుతున్నట్లు తెలుస్తోంది.

జెడ్పీ ఛైర్మన్ గా ఈదర హరిబాబు..

ప్రకాశం : జెడ్పీ ఛైర్మన్ గా ఈదర హరిబాబును కొనసాగించాలంటూ ఒంగోలు కోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు బుధవారం కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. 

టిడిపిపై బీజేపీ నేత కావూరి విమర్శలు..

కడప : జన్మభూమి కమిటీ పేరిట టిడిపి ప్రభుత్వం సర్పంచ్ ల హక్కులను కాలరాస్తోందని బీజేపీ నేత కావూరి సాంబశివరావు ధ్వజమెత్తారు. టిడిపి వర్గీయుల ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. సంక్షేమ పథకాలను బీజేపీ, వైసీపీ వర్గీయులకు అందకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. మిత్రపక్షమైన బీజేపీని అణిచివేసి ప్రయోజనం పొందాలనుకోవడం టిడిపి తగదన్నారు. కలిసి పని చేసి బలోపేతం కావాలని సీఎంకు సూచిస్తున్నట్లు చెప్పారు. 

Don't Miss