Activities calendar

06 November 2015

22:21 - November 6, 2015

ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్ని కొత్త ఫ్యాషన్ లు పుట్టుకొచ్చినా.. హ్యాండ్లూప్ ఎప్పటికీ ప్రత్యేకమే. అలాంటి హ్యాండ్లూమ్స్ పై హ్యాండ్ పెయింటింగ్ తో విశేషమైన కలెక్షన్లను అందిస్తుంది ఒక అతివ. ఆవేంటో ఇవాళ్టి సొగసులో చూసేద్దాం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం... 

22:12 - November 6, 2015

అస్సాం : ఎన్నికలు సమీపిస్తున్న వేళ అస్సాంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు బిజెపిలో చేరారు. కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి హిమంత బిస్వ శర్మ ఆధ్వర్యంలో బిజెపిలో చేరారు. హిమంత ఇంతకు ముందే బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ 9 మందిలో నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయగా, మరో ఐదుగురికి కాంగ్రెస్‌ షోకాజ్‌ నోటీసులు పంపింది. అస్సాంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం కాంగ్రెస్‌ను కంగు తినిపించింది. గొగోయ్‌ ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెందడం వల్లే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బిజెపిలే చేరారని, వచ్చే ఎన్నికల్లో అస్సాంలో బిజెపి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ప్రతినిధి రామ్‌మాధవ్‌ తెలిపారు.

 

22:09 - November 6, 2015

ఢిల్లీ : గల్ఫ్ దేశాల్లో తెలుగువారు దుర్బర పరిస్థితుల్లో ఉన్నారని తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గల్ఫ్ లో తెలుగు ప్రజల సమస్యలపై ఢిల్లీలో విదేశాంగశాఖ సమీక్ష జరిపింది. విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రధాన కార్యదర్శి అగర్వాల్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ నుంచి మంత్రులు రావెల కిశోర్‌బాబు, కేటీఆర్‌, గల్ఫ్ బాధిత కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే తెలుగు ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని మంత్రి కేటీఆర్‌ విదేశాంగశాఖను కోరారు. చట్టవిరుద్దంగా ఉన్న ఏజెంట్లను రద్దు చేయాలని ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు. 

22:06 - November 6, 2015

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఆశావర్కర్ల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. 66 రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగిస్తున్న ఆశాలు...అయినా ప్రభుత్వాలు స్పందించకపోవడంపై కదంతొక్కాయి. సీఐటీయూ ఆధ్వర్యంలో 48 గంటల డీఎంహెచ్‌వోల ముట్టడికి పిలుపునిచ్చాయి. పది జిల్లాల్లోనూ వందలాది మంది ఆశా కార్యకర్తలు నిరసనలు చేపట్టారు.
వ‌రంగ‌ల్ లో
తమ స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించాల‌ని డిమాండ్ చేస్తూ వ‌రంగ‌ల్ న‌గ‌రంలో ఆశ‌లు ఆందోళ‌న‌కు దిగారు. క‌నీస వేత‌నం 15వేల‌ రూపాయ‌లు చెల్లించాల‌ని డిమాండ్ చేస్తు వ‌రంగ‌ల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాల‌య‌న్ని భారీ సంఖ్యలో ముట్టడించారు. కనీస వేత‌నంతో పాటు ప్రమాద బీమా క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా త‌మ డిమాండ్లను ప‌రిష్కరించాల‌ని, లేని ప‌క్షంలో ఆందోళ‌న‌ను ఉదృతం చేస్తామ‌ని హెచ్చరించారు. కరీంనగర్‌ జిల్లాలో ఆశావర్కర్లు పెద్ద ఎత్తున డీఎంహెచ్‌వోల ముట్టడికి తరలివచ్చారు.
నల్గొండలో
నల్గొండ జిల్లాలోనూ డీఎంహెచ్‌వోలను ముట్టడించిన ఆశాలు వంటావార్పులు కూడా నిర్వహించారు. రెండు నెలలుగా ఆందోళనలు నిర్వహస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
నిజామాబాద్ లో
నిజామాబాద్ జిల్లాలో ఆశావర్కర్లు కదంతొక్కారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఖమ్మంలో
ఖమ్మంలో ఆశాలు మహాధర్నాతో హోరెత్తించారు. తమ డిమాండ్ల సాధనకు వంటావార్పులతో నిరసన తెలిపారు. మరోవైపు ఆశావర్కర్ల సమస్యలు, డిమాండ్ల పరిష్కారంపై రాష్ట్రమంత్రులు, ఎంపీలు కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ ను కలిశారు. కేంద్ర ప్రభుత్వం ఆశాల సమస్యలను పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తమకు న్యాయం జరిగే ఆందోళన ఆపేది లేదని ఆశాలు స్పష్టం చేశారు.

 

22:00 - November 6, 2015

ఢిల్లీ : భారతదేశంలో అసహన పరిస్థితులు పెరిగిపోతున్నాయని కొందరు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దుయ్యబట్టారు. భారత్‌లో పరమత సహనం అనేది ప్రతి పౌరుడికి నర నరాన జీర్ణించుకొని ఉందని, దీన్ని ఎవరూ వేరు చేయలేరన్నారు. 125 కోట్ల జనాభా గల దేశంలో ఎక్కడో జరిగే చిన్న చిన్న ఘటనలను దేశానికి ఆపాదించడం తగదన్నారు. ప్రపంచంలో భారత దేశ ప్రతిష్టను దిగజార్చడం సరికాదన్నారు. ఈ విషయంలో మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.

21:55 - November 6, 2015

ఈ రోజు నేడే విడుదలలో మనం మాట్లాడుకునే సినిమా స్వాతి నటించిన హార్రర్ థ్రిల్లర్ ఫిల్మ్ త్రిపుర... టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ లేరని అనుకుంటున్న టైంలో తెరపైకి వచ్చింది స్వాతి. కలర్స్ స్వాతిగా ప్రేక్షకులకు పరిచయమైన స్వాతిరెడ్డి....అష్టాచెమ్మా, డేంజర్, లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. రీసెంట్ గా స్వామిరారా, కార్తికేయ స్వాతిని ఫేమ్ లోకి తెచ్చాయి. రెండు సక్సెస్ ఫుల్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న స్వాతి...హార్రర్ థ్రిల్లర్ త్రిపురతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులో హార్రర్ జానర్ ఓ పెద్ద ట్రెండై పోయిన నేపథ్యంలో త్రిపురపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. మరి ఈ అంచనాలను త్రిపుర చేరుకుందా లేదా.. అంజలి డ్యూయెల్ రోల్ లో గీతాంజలి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రాజ్ కిరణ్...త్రిపురను ఆదే ఫార్మేట్ లో రూపొందించాడు. ఐతే గీతాంజలి లో వర్కవుట్ ఐన ఫార్ములా త్రిపురకు పనికొచ్చిందా లేదా అన్నది తేలాల్సిన విషయం...
ఫ్లస్ పాయింట్స్
స్వాతి
సినిమాటోగ్రఫీ
కొన్ని కామెడీ సీన్లు

మైనస్ పాయింట్స్
పాత కథ
ఆకట్టుకోని స్క్రీన్ ప్లే
సంగీతం
ప్రొడక్షన్ వ్యాల్యూస్

టెన్ టివి విశ్లేషణ, రివ్యూ మరియూ రేటింగ్  కు సంబంధించిన పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:46 - November 6, 2015

కొన్ని మరణాలు ఎందుకు మిస్టరీలుగా మిగిలిపోతుంటాయి. కొన్ని చావుల వెనుక రహస్యాలు ఎన్నటికీ వీడని చిక్కుముడిలాగా ఎందుకు ఉండిపోతాయి. హతులుంటారు... అనుమానితులుంటారు.. కానీ హంతకులెవరో తేల్చడానికి ఏళ్లు పడుతుంది. మరికొన్ని సందర్భాల్లో అది ఎప్పటికీ తేలదు కూడా. బడాబాబుల లోగిళ్లల్లో జరుగుతున్న అనుమానాస్పద మరణాలు ఈ జాబితాలో ఉంటున్నాయి. ఎందుకిలా జరుగుతోంది.. ఈ ఘటనల్లో దాగిన మర్మమే ఈరోజు వైడ్ యాంగిల్ స్టోరీ.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

21:43 - November 6, 2015

హన్మకొండ : వరంగల్ జిల్లాలో మణిదీప్ అనే విద్యార్థి అదృవ్యమైన ఘటనలో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబసభ్యులు, బంధవులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. శ్రీనివాస రామానుజం హైస్కూల్‌లో మణిదీప్‌ పదో తరగతి చదువుతున్నాడు. అయితే యాజమాన్యం పరీక్షలు రాయనివ్వకుండా మందలించడంతో.. మనస్తాపం చెందిన విద్యార్ధి స్నేహితులకు చెప్పి వెళ్లిపోయాడు. విద్యార్ధి ఇంటికి రాకపోవడం.. ఎక్కడా కనపడకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందరం మణిదీప్ కోసం వెతుకుతున్నామని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు. తోటి విద్యార్థులతో లాస్టు సప్పర్ అని చెప్పాడని చెప్పారు. ధర్మసాగర్ లో ఫిర్యాదు చేశామని అతని తండ్రి తెలిపారు. అయితే సీఐ చెప్పేంత వరకు యాజమాన్యం తన కుమారుని కోసం వెతక లేదని పేర్కొన్నారు. దసరా హాలిడేస్ కు తన కుమారుడు ఇంటికి వచ్చాడని... ఇప్పుడు తన కుమారుడు అదృశ్యమవ్వడంతో కాళ్లుజేతులు ఆడడం లేదని తండ్రి విలపించాడు. 

21:14 - November 6, 2015

ఎంబీసీల అభివృద్ధికి సబ్ ప్లాన్ లో ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టిఆర్ ఎస్ నేత శ్రీనివాస్, ఎంబిసి జేఏసీ జనరల్ సెక్రటరీ.. ఆశయ్య, బిసి యునైటెడ్ ఫ్రంట్ ప్రెసిడెంట్ రామకృష్ణయ్య, టి.కాంగ్రెస్ నేత వకుళాభరణం కృష్ణమోహన్ రావు పాల్గొని, మాట్లాడారు. ఎంబీసీలు రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోతున్నారని వాపోయారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తరహాలో ఎంబీసీలకు ప్రత్యేక సామాజిక రక్షణ చట్టం రూపొందించాలని కోరారు. సంచార కులాలకు సంచార కులదృవీకరణ పత్రాలను సరళీకృతం చేయాలన్నారు. ఎంబీసీ కుటుంబాలకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇవ్వాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ ను కలిసిన ఎపి ప్రతినిధి బృందం

ఢిల్లీ : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో ఎపి ప్రతినిధి బృందం నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ ను కలిసింది. ఎపిపై నీతిఆయోగ్ నివేదిక తుదిరూపం సంతరించుకుంటోందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియా చెప్పారు. విభజనచట్టంలోని అన్ని అంశాలను పరిశీలించాల్సిందిగా ప్రధానమంత్రి మోడీ సూచించారని తెలిపారు. ఏపీ డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎపి సమస్యలను వెంకయ్యనాయుడికి వివరించామని తెలిపారు. 

పోలీసుల అదుపులో ఇరిగేషన్ ఉద్యోగి

కృష్ణా : చల్లపల్లి పోలీసులు ఇరిగేషన్ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. పలు దొంగతనాల కేసుల్లో ఉద్యోగి నిందితుడిగా ఉన్నాడు.

 

ఆదర్శ సంస్థగా టీఎస్ ఆర్టీసీ : మహేందర్ రెడ్డి

మెదక్ : టీఎస్ ఆర్టీసీని ఆదర్శ సంస్థగా తయారు చేస్తామని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి వంద ఎసి బస్సులను హైదరాబాద్ కు నడిపేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికీ 1200 నుంచి 1500 గ్రామాలకు ఆర్టీసీ సర్వీసులు నడవడం లేదన్నారు. 45 డిపోలు నష్టాల నుంచి బయటపడుతున్నాయని... 6 డిపోలు నష్టాలతో కొనసాగుతున్నాయన్నారు.

 

దీపావళిలోగా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలుపై నోటిఫికేషన్

ఢిల్లీ : దీపావళిలోగా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలుపై నోటిఫికేషన్ వెలుడతుందని రక్షణ మంత్రి పారికర్ ప్రకటించారు.

కవితకు గల్ఫ్ బాధితులు గుర్తుకురాలేదా.. ? : షబ్బీర్ అలీ

హైదరాబాద్ : ఏడాదిన్నర పాలనలో గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బతుకమ్మ కోసం గల్ఫ్ కు వెళ్లిన కవితకు గల్ఫ్ బాధితులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రులను కలవడం డ్రామా ఎద్దేవా చేశారు. 

19:40 - November 6, 2015

అనంతపురం : ఆడదె ఆధారం.. మన కథ ఆడనె ఆరంభం.. అన్నాడో కవి... అనంతపురం జిల్లాలో ఓ ఇల్లాలు ఈ పాటకు నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తున్నారు.. భర్తకు కాళ్లు లేకపోయినా తన కాళ్లను ఆసరాగా అందించారు.. అంగవైకల్యం వెక్కిరిస్తున్నా ఏమాత్రం దిగులు చెందక సంసార నావ నడిచేందుకు అన్నీ తానై భారం మోస్తున్నారు.. భార్యాభర్తల బంధానికి... అనుబంధానికి నిలువెత్తు నిదర్శనంలా మన ముందుకొచ్చారు..
భర్తకు పోలియో... నడవలేడు
భర్తకు పోలియో... నడవలేడు.. అందుకే తన కాళ్లను ఆసరాగా అందించారు ఈ ఇల్లాలు.. భర్త ఏమాత్రం కుంగిపోకుండా.. అన్నీ తానై భారం మోస్తున్నారు.. ఎత్తుకొని వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి తల్లిలా సేవలు చేస్తున్నారు.. కార్యేషుదాసికి సరికొత్త నిర్వచనంలా నిలుస్తున్నారు..
సంసార నావను నడిపేందుకు శాయశక్తులా కృషి
పేరు వెంకటరాముడు.... ఈ ఇల్లాలి పేరు చౌడమ్మ... వీరిద్దరికీ 12ఏళ్లక్రితం వివాహమైంది.. అనంతపురం జిల్లా హిందూపురం వీవర్స్ కాలనీలో ఉండే ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు.. భర్తకు కాళ్లు లేవు.. ఉద్యోగం రాలేదు.. ఆర్థిక ఇబ్బందులు.. అయినా వీరిద్దరూ నిరాశ పడలేదు.. సంసార నావను నడిపేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు.. పోలియోతో రెండు కాళ్లు చచ్చుబడిపోయినా వెంకటరాముడు కుంగిపోలేదు.. కష్టపడి డిగ్రీ, బీఈడీ పూర్తిచేశారు... అయినా ఉపాది దొరకలేదు.. స్వయం ఉపాదిద్వారా కుటుంబసభ్యుల కడుపు నింపేందుకు నిర్ణయించుకున్నారు.. తహశిల్దార్ కార్యాలయం దగ్గర అర్జీలు రాసేపని మొదలుపెట్టాడు.
చేదోడువాదోడుగా నిలిచిన ఇల్లాలు
భర్తను పనికి వెళ్లాలంటే అంతకంటే ముందు చౌడమ్మ చాలా బాధ్యతలు పూర్తిచేయాలి.. ఇంటి, వంటపని చేసి పిల్లల్ని స్కూల్‌కు పంపాలి.. ఆ తర్వాత వెంకటరాముడికి ఇతర పనుల్లో సహాయం చేయాలి.. ఆయనకు భోజనం తినిపించి ఎత్తుకొని వీల్‌చెయిర్‌లో కూర్చొబెట్టాలి.. ఆ కుర్చీని నెట్టుకుంటూ ఐదుకిలోమీటర్ల దూరంలోఉన్న తహశీల్దార్ కార్యాలయం దగ్గరకు తీసుకువెళ్లాలి.. ఇలా భర్తకు తనవంతు సహాయం చేస్తూ చేదోడువాదోడుగా నిలిచారు ఈ ఇల్లాలు.
రోజుకు రూ. 80 ఆదాయం
ఇలా ఆరు నెలలపాటు పనిచేసినా రోజుకు 80రూపాయలే వచ్చేవి... అవి కుటుంబపోషణకు ఏమాత్రం సరిపోలేదు.. ఆర్థిక ఇబ్బందులతో నానాకష్టాలు పడ్డారు.. ఈ పని వదిలేసి విద్యావాలంటీర్‌గా చేరారు వెంకటరాముడు.. ఇలా మూడేళ్లపాటు చదువు చెప్పారు.. ప్రభుత్వం విద్యా వాలంటీర్లను తొలగించడంతో వీరికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.. తమ్ముడు రాఘవేంద్ర కట్టించిన ఇంట్లో ఉంటున్నా రోజుగడవడం కష్టంగా మారింది.. భార్యాభర్తలు ఇద్దరూకలిసి హిందూపురం, బెంగళూరు జాతీయ రహదారిపై పాన్‌షాప్ పెట్టారు.. ఎక్కడ ఏ పనిచేసానా చౌడమ్మ సహకారంలేనిదే వెంకటరాముడు ఒక్క అడుగుకూడా వేయలేని పరిస్థితి.. ఈ షాప్‌కూడా వీరి నివాసంనుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.. సరుకులతోపాటు భర్తను ఈ ట్రైసైకిల్‌పైకి ఎక్కించి అక్కడికివరకూ తీసుకువెళతారు చౌడమ్మ.. అక్కడ ఓ చెట్టుకింద అన్నీ అమ్ముకునేలా అన్నీ సిద్ధం చేస్తారు.. సాయంత్రం మళ్లీ అన్నీ తీసుకొని ఇంటికి తీసుకువస్తారు.. కుటుంబానికి ఇన్ని సేవలు చేస్తున్న చౌడమ్మ మాట్లాడలేదు.. చెవులుకూడా వినింపించవు.. సైగలద్వారా అన్నీ అర్థం చేసుకుంటారు. భార్యగా, తల్లిగా, సేవకురాలిగా ఇలా కుటుంబానికి వెన్నెముకలా నిలుస్తున్నారు.
పెళ్లికి సరికొత్త అర్థం చెబుతున్న దంపతులు
ఇన్ని ఇబ్బందులతో పోరాడుతూ అన్యోన్యంగా జీవిస్తూ పెళ్లికి సరికొత్త అర్థం చెబుతున్నారు ఈ భార్యాభర్తలు.. రోజుకు వందరూపాయలతో కుటుంబం గడపడం కష్టంగా ఉందని... ఎవరైనా సాయం చేస్తే చిన్న కొట్టు పెట్టుకుంటామని వీరు విజ్ఞప్తి చేస్తున్నారు..

 

19:32 - November 6, 2015

హైదరాబాద్ : క్షణికావేశం నిండు జీవితాలను మింగేస్తోంది. కట్టలు తెంచుకున్న ఆగ్రహం బంగారు భవిష్యత్తును చిదిమేస్తోంది. తప్పు ఒప్పుల తర్కంలో, నువ్వెంత, నేనేంత అని ఎంచుకునే సమరంలో లోకాన్ని చూడని కనుపాపలు కమిలిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారి జీవితాలు చేయని పాపానికి ఫలితాన్ని అనుభవిస్తున్నాయి. వెలుగులు పంచకుండానే కొండెక్కుతున్న దీపాలవుతున్నాయి. కలిసిన మనసులు ప్రారంభించిన ప్రయాణాలు కొన్ని.. పెద్దలు ముడి వేయటంతో ఆరంభమైన సరికొత్త జీవితాలు మరికొన్ని ఏవైతేనేం.... జీవితపు మాధుర్యాన్ని రుచి చూడకుండానే, చేసుకున్న బాసలకు వాస్తవ రూపమివ్వకుండానే అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. వేదమంత్రాల మధ్య నడుమ నిర్వహించిన పెళ్లి ప్రమాణాలకు, ఊహాల పల్లకిలో, హృదయాల లోగిలిలో చేసుకున్న ఒప్పందాలను సమాధి చేస్తున్నాయి.
నిట్టనిలువునా కూలిపోతున్న బంధాలు
కడదాకా సాగుతుందనుకున్న పయనం మధ్యలోనే ఆగిపోతోంది. తుది శ్వాస వరకు ఒక్కటై నిలుస్తుందనుకున్న బంధం నిట్టనిలువునా కూలిపోతోంది. ఈ దుష్పరిణామం ముక్కుపచ్చలారని చిన్నారులను చిదిమేస్తోంది. దంపతుల మధ్య మనస్పర్ధలకు, పొడసూపిన విబేధాలకు అమాయకులు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇంకా లోకాన్ని చూడని పసివారు, లోకం పోకడ తెలియని చిన్నారులు కుటుంబ కలహాలకు సమిధలవుతున్నారు. ఎవరో చేసిన నేరానికి తప్పేదో, ఒప్పేదో తెలుసుకోలేని అమాయకులు కొడిగడుతున్న దీపాలవుతున్నారు.
కనుమరుగవుతున్న సహనం 
ఇన్‌స్టంట్ ప్రేమలు, హద్దులు దాటుతున్న పరిచయాలు, అవివేకవంతమైన నిర్ణయాలు రాజ్యమేలుతున్న రోజుల్లో సహనం చచ్చిపోతోంది. ఓపిక పడితే సమస్యలు సరిహద్దులు దాటిపోతాయనే ఆలోచన కనుమరుగైపోతోంది. విరక్తి రూపంలోకి ఒదిగిపోయిన మహమ్మారి బంధాలు, అనుబంధాలు అంతెందుకు చివరికి కడుపుతీపిని సైతం కన్నపేగే హతమార్చేలా చేస్తోంది. మాయమైపోతున్న మనిషితనాన్ని మరింతగా దిగజార్చుతోంది.
పంతాలకు బలవుతున్న పసివారు
చేజేతులా ఏ ఒక్కరూ నేరం చేయరు. తెలిసెవరూ దోషులు కారు. కానీ ఫలితం మాత్రం మోస్తున్నారు. చేయని నేరానికి చిన్నారులను కాలగర్భంలో కలిపేస్తున్నారు. పరాయి వాడైనా, పగ వాడైనా, ప్రాణ స్నేహితుడైనా చివరికి రక్తం పంచుకు బిడ్డనైనా చంపేసే హక్కు ఎవరికి లేదు. కానీ విచక్షణ మరిచిన దంపతులు చిన్నారులనే బలి తీసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే తమ అభిప్రాయ బేధాలకు, పంతాలకు కడుపుతీపిని హత్య చేస్తున్నారు. ఇకనైనా ఈ దారుణాలకు తెరపడాలి. తాము చేసిన తప్పులకు పసివాళ్లను బలిపశువులు చేస్తున్న అరాచకానికి ముగింపు కావాలి.

 

19:24 - November 6, 2015

హైదరాబాద్ : ఆయన.. విలువలకు మారుపేరు. నమ్మిన సిద్దాంతానికి కట్టుబడిన రాజకీయ భీష్ముడు. రైతు సంక్షేమానికే జీవితాన్ని అంకితం చేసిన నిత్య కృషీవలుడు. పేదల అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి. ఆయనే ఆచార్య ఎన్జీ రంగా. నవంబర్ ఏడున ఆయన జయంతి. ఆ రైతు బాంధవుని 115వ జయంతిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అగ్రికల్చర్ డేగా జరపాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా...ఎన్జీ రంగా జీవితంపై టెన్ టీవీ స్పెషల్ స్టోరి.
రైతుల పక్షాన పోరాడిన ఆచార్య ఎన్జీ రంగా
భారత రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఆచార్య ఎన్జీరంగా. స్వాతంత్ర్య ఉద్యమంలోనూ, రైతు సంక్షేమ పోరాటంలోనూ ఆయన మడమ తిప్పని యోధుడు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం రంగాది. 1900 సంవత్సరం నవంబర్ 7న గుంటూరు జిల్లా నిడుబ్రోలులో జన్మించిన రంగా..ఇంగ్లాండ్ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక, రాజకీయ, సాంఘిక శాస్త్రాల్లో పట్టభద్రత సాధించారు. విద్యార్థి దశలో కారల్ మార్క్స్ రచించిన దాస్ క్యాపిటల్ గ్రంథాన్ని అధ్యయనం చేసిన రంగా... మార్క్సిజంపై అభిమానం పెంచుకున్నారు. చేనేత, వలస జాతుల ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేయడంతో పాటు రైతు సమస్యల పరిష్కారం కోసం పోరాడారు. 1924లో భారతీదేవిని వివాహమాడిన ఎన్జీరంగా...1927లో మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో ఆర్థిక శాస్త్ర ప్రధానాచార్యునిగా చేరారు.
జమిందారీ రద్దు రైతు సంఘం స్థాపన
1929 ఆగస్టు 14న జమిందారీ రద్దు రైతు సంఘం స్థాపించటం ద్వారా రైతాంగాన్ని చైతన్యం చేశారు రంగా. మహాత్మాగాంధీతో సన్నిహితంగా మెలుగుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్ ల తరహాలో జాతీయ నేతగా ఎదిగారు. భూమిశిస్తును వ్యతిరేకిస్తూ ఉద్యమం చేసిన సమయంలో రంగాను జైల్లో పెట్టింది బ్రిటీష్ ప్రభుత్వం. 1934 జులై 11న రైతుల ప్రతినిధిగా పార్లమెంట్లో అడుగు పెట్టిన రంగా.... 1991 వరకు పార్లమెంట్ ఎగువ, దిగువ సభల్లో సుదీర్ఘ కాలం ఎంపీగా కొనసాగి గిన్నిస్ రికార్డు సృష్టించారు. గుంటూరు, చిత్తూరు, శ్రీకాకుళంల నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
1995 జూన్ 8న ఎన్జీరంగా మరణం
ప్రజల్లో రాజకీయ చైతన్యం కోసం దేశంలోనే ప్రప్రథమంగా నిడుబ్రోలులో రామినీడు రాజకీయ పాఠశాలను 1933లో స్థాపించారు ఎన్జీ రంగా. మాజీ సీఎం, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య లాంటి రాజకీయ ఉద్దండులెందరో ఈ పాఠశాలలో చదివిన వారే. అభిప్రాయ భేదాల కారణంగా కాంగ్రెస్ కు రాజీనామా చేసిన రంగా... తర్వాత కృషికార్ లోక్ పార్టీ, ఆ తర్వాత స్వతంత్ర పార్టీలను స్థాపించారు. పద్మవిభూషణ్‌ తో పాటు అనేక అవార్డులు పొందిన రంగా ఎప్పుడూ ప్రతిపక్ష నేత పాత్రనే పోషించారు. రైతుల పక్షాన అలుపెరుగని పోరాటం చేసిన ఎన్జీరంగా పేరు మీద అగ్రికల్చర్ యూనివర్సిటీని స్థాపించారు. 1995 జూన్ 8న నిడుబ్రోలులో తుదిశ్వాస విడిచారు ఎన్జీరంగా.
అగ్రికల్చర్ టెక్నాలజీ డేగా రంగా జయంతి
ప్రస్తుతం రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్జీరంగాకు ప్రత్యేక గుర్తింపునిచ్చేలా కార్యక్రమాలు చేపడుతోంది. ఎన్జీరంగా పేరు మీద గుంటూరు లాం ఫాంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుడుతోంది. అదే సమయంలో 115వ జయంతిని అగ్రికల్చర్ టెక్నాలజీ డేగా నిర్వహించాలని నిర్ణయించింది. రైతు బాంధవుడిగా పేరు తెచ్చుకున్న ఎన్జీ రంగా జయంతిని అగ్రికల్చర్ టెక్నాలజీ డేగా ప్రకటించడంపై రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అన్నదాతలకు అండగా నిలబడ్డమే ఎన్జీరంగాకు అసలైన నివాళి అని చెబుతున్నాయి.

 

19:09 - November 6, 2015

హైదరాబాద్ : ఢిల్లీలో జరిగిన నీతిఆయోగ్‌ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. నీతిఆయోగ్‌ ఉపాధ్యక్షుడు పనగారియాతో చంద్రబాబు భేటీ విభజన చట్టంలోని పలు ఆర్ధిక అంశాలపై చర్చించారు. చంద్రబాబుతో పాటు..కేంద్రమంత్రులు అశోక్‌గజపతిరాజు, మిగతా ఏపీ సలహాదారు పరకాల ప్రభాకర్‌ తదితరులు పనగారియాతో సమావేశమైన వారిలో ఉన్నారు. 

18:59 - November 6, 2015

కరీంనగర్ : సీఎం కేసీఆర్‌ మాటలను గుడ్డిగా నమ్మారు. ఆయన భరోసాతో ఉన్న ఇళ్లు కూలగొట్టుకున్నారు. ఇది జరిగి మూడు నెలలైంది.. ప్రభుత్వాధినేతను గుడ్డిగా నమ్మినందుకు.. నిలువ నీడ కూడా లేకుండా రోడ్డుపాలయ్యారు. సీఎం దత్తత తీసుకున్న ముల్కనూరు గ్రామస్థుల దీనగాథపై టెన్‌ టీవీ స్పెషల్‌ ఫోకస్‌..
కేసీఆర్‌ ఇచ్చిన వినసొంపైన హామీ
సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన వినసొంపైన హామీ. హరిత హారంలో భాగంగా హుస్నాబాద్‌ నియోజకవర్గానికి గత ఆగస్టులో వచ్చిన సీఎం కేసీఆర్‌.. చిగురుమామిడి మండలం... ముల్కనూరు గ్రామాన్ని దత్తత తీసుకుంటామన్నారు. దీనికి తగినట్లుగానే.. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం నుంచి 50 లక్షలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్‌ల నిధుల నుంచి మరో రెండు కోట్ల రూపాయలనూ సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారు. ఇంకేముందీ.. తమ గ్రామం రూపురేఖలే మారిపోయాయని ముల్కనూరు వాసులు భావించారు. ముల్కనూరును దత్తత తీసుకుంటానన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, కమ్యూనిటీ భవనాలు, రోడ్ల వెడల్పు, విద్యుదీకరణ, చెరువుల పునరుద్ధరణ లాంటి పనులను చేపడతామన్నారు. ముల్కనూరులోని అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామన్న సీఎం.. పాత ఇళ్లను కూల్చేయాలని సూచించారు. సీఎం హామీతో దాదాపు 247 మంది ప్రజలు యుద్ధప్రాతిపదికన పాత ఇళ్లను కూల్చేసుకున్నారు. చూస్తుండగానే.. మూడు నెలలు గడిచిపోయాయి. ఇప్పటి వరకూ వీరిని పట్టించున్న నాథుడే లేడు. దీంతో గడచిన మూడు నెలలుగా వీరు నడిబజారులోనే కాపురం చేస్తున్నారు.
ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న స్థానికులు
అధికారులు నేటికీ అర్హుల గుర్తింపు సర్వేతోనే కాలం వెళ్లదీస్తున్నారు. సీఎం హామీతో నిలువ నీడను కోల్పోయిన ముల్కనూరు గ్రామస్థులు.. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
అడుగైనా ముందుకు పడలేదు
సీఎం ఇచ్చిన హామీల్లో... విద్యుదీకరణ, రోడ్లు, కమ్యూనిటీ భవన నిర్మాణం తదితరాలూ అడుగైనా ముందుకు పడలేదు. మొట్టమొదట దత్తత తీసుకున్న ముల్కనూర్‌పై ఫోకస్‌ చేయకుండా.. మెదక్‌ జిల్లాలోని రెండు దత్తత గ్రామాలపైనే సీఎం కేసీఆర్‌ దృష్టి పెట్టడం పట్ల ముల్కనూరు ప్రజలు మండిపడుతున్నారు. తమ గోడును సీఎం దృష్టికి తీసుకు వెళ్లాలంటూ... స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. వారూ ఎవరికీ చెప్పుకోలేక సతమతమై పోతున్నారు.
సీఎం హామీతో కుటుంబ కలహాలు
మరోవైపు... కొత్త ఇళ్లు కట్టించి ఇస్తామన్న సీఎం హామీ.. ప్రశాంత ముల్కనూరులో.. కుటుంబ కలహాలకు కారణమవుతోంది. డబుల్ బెడ్ రూం ఇళ్ళ కోసం.. కొద్దిపాటి స్థలంపై ఆధిపత్యం కోసం.. కుటుంబ సభ్యులు తగవులు పడుతున్నారు. ఇంకోవైపు... ఊళ్ళోని ఇళ్లు, స్థలాలను వదిలేసి.. పట్టణాలకు వలసెళ్లిన వారూ... సీఎం దత్తత ప్రకటనతో తిరిగి ఊరు చేరారు. ఇప్పుడు ఇళ్ల నిర్మాణంతో పాటు.. ఉపాధి కల్పించాలన్న డిమాండ్‌ కూడా ఊపందుకుంది. గ్రామసభ సాక్షిగా డబుల్ బెడ్ రూం ఇళ్ళకు కొబ్బరికాయ కొడుతానన్న ముఖ్యమంత్రి హామీని నమ్మి.. రెంటికి చెడ్డ రేవడిలా మారామని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.

 

 

18:47 - November 6, 2015

హన్మకొండ : వరంగల్‌ టీఆర్‌ఎస్‌ ఎన్నికల సభలో కలకలం చోటు చేసుకుంది. శాయంపేట సభలో డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రసంగిస్తుండగా.. ఓ రైతు చెప్పు విసిరాడు. గిట్టుబాటు ధర రావటం లేదంటూ కొంతమంది రైతులు ఆందోళన చేస్తుండగా.. వేదిక వెనక వైపు నుంచి ఓ రైతు కడియం మీదకు చెప్పు విసిరాడు. ఆ రైతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

18:31 - November 6, 2015

విజయవాడ : సీనియర్ కామ్రెడ్ అనసూయ మృతదేహానికి సీపీఎం ఏపీ కార్యదర్శి మధు నివాళులు అర్పించారు. విజయవాడ మొగల్రాజపురం సమీపంలో అనసూయ కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. పార్టీ ఉద్యమాల్లో అనసూయ చురుగ్గా పాల్గొనేవారని ఆయన గుర్తుచేసుకున్నారు.

18:01 - November 6, 2015

ఢిల్లీ : పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి నేత హార్దిక్‌ పటేల్‌కు సుప్రీంకోర్టులోను చుక్కెదురైంది. గుజరాత్‌ పోలీసులు నమోదు చేసిన దేశ ద్రోహానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించలేదు. పోలీసుల దర్యాప్తు పూర్తయ్యాకే ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఆరు వారాల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని గుజరాత్‌ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటివరకు హార్దిక్‌ పటేల్‌ సూరత్‌ జైలులోనే ఉండాల్సి ఉంటుంది. తదుపరి తీర్పును జనవరి 5కు వాయిదా వేసింది. దేశ ద్రోహం కేసులో గుజరాత్‌ హైకోర్టు బెయిల్‌ నిరాకరించడంతో హార్దిక్‌ పటేల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పటేల్‌ ఉద్యమం సందర్భంగా యువకులు ఆత్మహత్యకు పాల్పడవద్దని, అవసరమైతే ఇద్దరు పోలీసులను చంపాలని హార్దిక్‌ వ్యాఖ్యానించడంతో ఆయనపై దేశ ద్రోహం కింద కేసు నమోదైంది.

 

ముగిసిన కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం

విజయవాడ : కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం ముగిసింది. బాక్సైట్ తవ్వకాల జీవోకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఈనెల 9 నుంచి 30 వరకు మట్టి సత్యాగ్రహ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. 9, 10 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో, 15 నుంచి 20 వరకు మండల కేంద్రాల్లో, 21 నుంచి 30 వరకు గ్రామాల్లో మట్టి సత్యాగ్రహ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. సేకరించిన మట్టిని ప్రధానికి పంపాలని నిర్ణయించారు.

రెండో రోజు ముగిసిన ఆట

పంజాబ్ : మొహాలి వేదికగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. ఆట నిలిచిపోయే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. పుజారా 63, కోహ్లీ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. 142 పరుగుల ఆధిక్యంలో భారత్ కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 184 పరుగులకే ఆలౌట్ అయింది. 

పతకాలను వెనక్కి ఇచ్చేయనున్న మాజీ సైనికులు

ఢిల్లీ : వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం అమలు ఆలస్యంపై మాజీ సైనికులు ఆందోళన వ్యక్తుం చేస్తున్నారు. పతకాలను వెనక్కి ఇచ్చేయాలని మాజీ సైనికులు నిర్ణయించారు. 10, 11 తేదీల్లో మాజీ సైనికులు తమ పతకాలను వెనక్కి ఇవ్వనున్నారు. 

17:41 - November 6, 2015

హైదరాబాద్ : దొరికినోళ్లు దొరికినంత దోచుకున్నారు. నీకింత నాకంత అంటూ లెక్కలేసుకుని పంచుకున్నారు. రోగులు లేకుండానే రోగులను.. వారికి రోగాలను సృష్టించారు. బడాబాబుల దగ్గర్నుంచి చోటామోటాల దాకా రిలీఫ్‌ ఫండ్‌లను రిలీఫ్‌ లేకుండా నొక్కేశారు. ఇప్పుడాబాగోతంలో తవ్వేకొద్దీ కొత్తకొత్త విషయాలు బయటపడుతున్నాయి. మరికొందరు నిధుల మాయంలోనూ తాము కార్పొరేట్లమేనని నిరూపించుకున్నారు. దొరలే దొంగలై దోచుకున్న ఆ వ్యవహారంలో ఇప్పుడు తీగలాగుతుంటే డొంకంతా కదులుతోంది.
6 నెలల క్రితం 25 ఆస్పత్రులకు నోటీసులు
వివిధ రీతుల్లో సిఎం రిలీఫ్‌ ఫండ్‌ను కాజేసిన బాగోతంపై పరిశోధిస్తున్న సిబిసిఐడి తన దర్యాప్తులో మరింత దూకుడును పెంచింది. ఆరు నెలల క్రితం 25 కార్పొరేట్ ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చిన ఆ సంస్థ తాజాగా జిల్లాల్లోని బాధిత కుటుంబాలను నేరుగా కలుసుకుంటోంది. ఎవరెవరు బోగస్‌ బిల్లలతో డబ్బులు దండుకున్నారు.. వారి వెనుక ఎవరున్నారన్న అంశంపై దృష్టి పెట్టింది. ఈ కోణంలో అనారోగ్యం పేరుతో 30 కోట్ల రూపాయలు కాజేసి వాటి కోసం తయారుచేసిన 7 వేల బిల్లులను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు.
వివిధ కోణాల్లో పరిశీలన
సీఎం రిలీఫ్ ఫండ్‌ను అక్రమ మార్గాల్లో కాజేసిన కార్పొరేటర్ల అవినీతి బాగోతాన్ని బయటపెట్టిన సి.ఐ.డి. ఇప్పుడు బాధితుల కుటుంబాల వివరాలపై దృష్టి పెట్టింది. అధికారులు కరీంనగర్, అదిలాబాద్‌కు 7 టీంలుగా వెళ్లి విచారిస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లోనే 2 వేల బిల్లులు కొద్ది కాలం వ్యవధిలోనే రిలీజ్ అయ్యాయి. నిజానికి బాధితులకు ఈ డబ్బులు చేరాయా.. లేక ఎవరైనా దళారులు వీటిని కాజేశారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. వ్యాధి వివరాలు ఆస్పత్రి పేరుతో పాటు.. సి.ఎం. రిలీఫ్ ఫండ్ కోసం మొదట ఎవరిని ఆశ్రయించారనే అంశాలు పరిశీలిస్తున్నారు.
డబ్బుల స్వాహా
బోగసు బిల్లులు పెట్టి కమీషన్ల కక్కుర్తితో అటు అస్పత్రులు, ఇటు ప్రజాప్రతినిధులు కుమ్మక్కై దోచుకున్నట్లు ఇప్పటికే రూఢీ అయింది. చిన్నచిన్న నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు ఎమ్మెల్యేల వద్ద నుంచి ఫైల్ రిఫర్ చేసుకున్నారు. కొంత మంది మళ్లీ మళ్లీ అప్లై చేసుకొని డబ్బులు తీసుకున్నట్లు సి.ఐ.డి. విచారణలో తేలింది. అసలు పేషెంట్లే లేకుండా లక్షల్లో బిల్లులు దండుకున్నట్లు సిఐడి అధికారులు గుర్తించారు.
45 ఆస్పత్రుల్లో అవకతవకలు
ఇప్పటికే సీఐడీ అధికారులు తమ దర్యాప్తులో పలు ఆస్పత్రుల నుంచి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. 45 ఆస్పత్రులలో అవకతవకలు జరిగాయని తేలింది. ఇందులో ప్రాథమికంగా 25 హాస్పిటల్స్‌కు నోటీసులు జారీ చేశారు. కరీంనగర్‌లో చొప్పదండి, మానుకొండూరు, జగిత్యాల, కోరుట్ల, రామగుండం, మండలాల్లో 30 మందిని విచారించి దర్యాప్తు పూర్తి చేశారు. అదిలాబాద్‌లో తిమ్మాపూర్, గంగాధర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో 110 మందిని స్థానిక పోలీస్ స్టేషన్లకు పిలిపించి విచారించారు. అయితే ఇందులో స్థానిక నేతల హస్తం ఉన్నట్లు తేలింది. సిఐడి ఇప్పటికే ఆస్పత్రుల వివరాలను ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పూర్తి దర్యాప్తు చేసి మరో రెండు నెలల్లో సమగ్ర నివేదిక అందజేయనున్నారు. ఆ దర్యాప్తు ద్వారా ఎవరెవరి పేర్లు బయటకొస్తాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.

 

17:31 - November 6, 2015

నిజామాబాద్ : అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డను..తానే నిప్పుల్లోకి నెట్టేశాడు. అవును తానే పెంచుకున్న పంట నీరు లేక ఎండిపోతే.. నిస్సహాయంగా నిలబడ్డ రైతన్న మంటల్లో వేసేశాడు. ఖరీఫ్‌ సీజన్‌ రైతు కంట నీరు తెప్పిస్తోంది. వర్షాభావం కారణంగా పంటపోగా.. ఇప్పుడు బోరు బావుల ఆధారంగా వేసుకున్న పంట కూడా ఎండిపోయింది. వేలాది రూపాయల అప్పు తెచ్చి.. సేద్యం చేసిన రైతన్నకు... ఫలితం దక్కకుండా పోయింది. పంటను తొలగించేందుకూ డబ్బులు లేక.. చాలామంది రైతులు పైర్లకు నిప్పు పెట్టేస్తున్నారు.
ప్రకృతి దగా
నిజామాబాద్‌ జిల్లా రైతులను ఈసారీ ప్రకృతి దగా చేసింది. వరుణుడు కరుణించకున్నా.. పాతాళ గంగ ఆదుకుంటుందన్న వారి ఆశ నిరాశే అయింది. భూగర్భ జలాలు అడుగంటడంతో.... జిల్లాలో చాలా చోట్ల బోర్లు వట్టిపోయాయి. దీంతో చేతికి వచ్చిన పంటకు నీరు అందక ఎండిపోయింది. ఇప్పటికే నాట్లు, కలుపు, పురుగు మందుల కోసం.. ఎకరాకు కనీసం 30వలే దాకా పెట్టుబడి పెట్టిన రైతు.. ఇప్పుడు ఆ పంటను తొలగించే శక్తి లేక.. నిప్పు పెట్టేస్తున్నాడు.
పూర్తిగా దెబ్బతిన్న వరి సేద్యం
నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్ డివిజన్ పరిధిలోని వర్ని, కోటగిరి, బీర్కూర్, బోధన్, రెంజల్, ఎడపల్లి, నవీపేట్ మండలాల్లో వరి సేద్యం పూర్తిగా దెబ్బతింది. ఎండిన పంట పశుగ్రాసంగా కూడా పనికి రాని పరిస్థితుల్లో.. చాలామంది పైర్లను అలాగే వదిలేస్తున్నారు.
రైతుల్లో బెంగ
తిండిగింజల కోసం బోర్లనే నమ్మి ఎకరా, అరెకరం నేలలో వరి సాగు చేసిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఉన్న బోర్లకు తోడు కొత్త బోర్లు వేసినా.. పాతాళ గంగ పైకి రాకపోవడంతో.. పంటలు పూర్తిగా ఎండిపోయి.. భవిష్యత్తుపై బెంగతో రైతులు మదనపడుతున్నారు. జిల్లాలో బోరు బావులను నమ్ముకున్న ప్రతి రైతు పరిస్థితీ దాదాపు ఇలాగే ఉంది. ఎండిన పంటను అలాగే వదిలేయడమో... లేక తగులబెట్టేయడమో చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

 

17:19 - November 6, 2015

కృష్ణా : విజయవాడలో ఆహారపదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నగరంలో ఏ హోటల్‌లో చూసినా..రేట్లు హైరేంజ్‌లో ఉన్నాయి. టిఫిన్స్ నుంచి భోజనం వరుకు అన్ని పదార్థాల రేట్లు బెదరగొడుతున్నాయి.
షాక్‌ ఇస్తున్న ఆహారపదార్థాల రేట్లు
నగరంలో 350కు పైగా పెద్ద, చిన్న హోటల్స్, మరో 20 స్టార్ హోటల్స్ ఉన్నాయి. 100 కుపైగా మెస్ లు ఉన్నాయి. తోపుడు బండ్లు, కర్రీ పాయింట్లు వీటికి అదనం. నగరానికి రోజూ లక్షల మంది వివిధ పనుల మీద వస్తూ ఉంటారు. వారికి ఈ హోటల్స్‌, తోపుడుబండ్లే దిక్కు. ఐతే ఆహార పదార్థాల రేట్లు వచ్చినవారికి షాక్‌ ఇస్తున్నాయి.
భారీగా పెరిగిన భోజన ధరలు
ప్లేట్‌ ఇడ్లీ ధర రూ.15 నుంచి రూ.20లకు పెరిగింది. మినప, పెసర అట్టు ధర ఏకంగా రూ.20 నుంచి రూ.35కు చేరింది.ఇంతకుముందు సాంబరు టిఫిన్‌, భోజనంతోపాటే ఇచ్చేవారు. ప్రస్తుతం 5రూపాయల స్పెషల్‌ ఫీజు పిండుతున్నారు. మరోపక్క భోజన ధరలు కూడా పెరిగిపోయాయి. ప్లేట్‌ మీల్స్‌ మీద పది రూపాయల వరకు, ఫుల్‌ మీల్స్ అయితే 30 రూపాయల వరకు పెంచేశారు. ఇక కర్రీ పాయింట్లలోనూ ఇదే పరిస్థితి.
అందనంత ఎత్తులో పప్పు ధాన్యాల ధరలు
ప్రస్తుతం పప్పు ధాన్యాల ధరలు అందనంత ఎత్తులో ఉన్నాయి. మార్కెట్లో కందిపప్పును కిలో 200 రూపాయలకు, మినపప్పు కిలో 190 రూపాయలకు విక్రయిస్తున్నారు. పెసర పప్పు ధర కూడా కిలో 140 రూపాయలకు చేరింది.దీంతో హోటల్‌ నిర్వాహకులు కూడా ఆహారపదార్థాల రేట్లును పెంచేశారు.

 

16:52 - November 6, 2015

హన్మకొండ : వరంగల్‌లో ఓ విద్యార్ధి అదృశ్యం కలకలం రేపుతోంది. శ్రీనివాస రామానుజం హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న మణిదీప్‌ అనే విద్యార్ధిని యాజమాన్యం పరీక్షలు రాయకుండా మందలించడంతో.. మనస్తాపం చెందిన విద్యార్ధి స్నేహితులకు చెప్పి వెళ్లిపోయాడు. విద్యార్ధి ఇంటికి రాకపోవడం.. ఎక్కడా కనపడకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

16:49 - November 6, 2015

ఖమ్మం : సీపీఐ అడ్డగోలు నిబంధనలే పత్తి రైతులను నిండా ముంచుతున్నాయని తెలంగాణ రైతు జేఏసీ సంఘాల నేతలు మండిపడ్డారు. ఖమ్మం పత్తి మార్కెట్‌ను సందర్శించిన రైతు జేఏసీ నేతలు క్వింటా పత్తికి వెయ్యి రుపాయలు బోనస్‌గా ప్రకటించాలని డిమాండ్ చేసారు. తేమ శాతం అధికంగా ఉందనే సాకుతో కొనుగోలుకు నిరాకరించటం,మద్దతు ధర చెల్లించకపోవటాన్ని జేఏసీ నేతలు తీవ్రంగా తప్పు పట్టారు.

 

16:46 - November 6, 2015

విజయవాడ : దుర్గగుడి ఫ్లై ఓవర్‌ పనులను సోమా కన్‌స్ట్రక్షన్స్ దక్కించుకోవటంతో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జోరందుకున్నాయి. ఇందుకోసం విజయవాడ కెఎల్ రావు నగర్‌లో ఇళ్ల తొలగింపు ఉద్రిక్తతలకు దారి తీసింది. కేవలం కొన్ని ఇళ్లకు మాత్రమే స్లిప్పులు ఇచ్చి మరికొన్ని ఇళ్లకు స్లిప్పులు ఇవ్వకపోవడంపై స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రొక్లైయిన్లను అడ్డుకునే ప్రయత్నం చేసారు. చివరికి నిర్వాసితులుందరికి జెఎన్ యుఆర్ ఎం పధకం కింద ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పటంతో పరిస్ధితి కాస్త సద్దుమణిగింది. అయినా ఓటేసి గెలిపించినందుకు ప్రభుత్వం ఇచ్చే బహుమానం ఇదేనా, అభివృద్ధి అంటే విధ్వంసమేనా అని బాధితులు ఏపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

16:44 - November 6, 2015

కృష్ణా : విజయవాడ దుర్గగుడి వద్ద ఫ్లైఒవర్ నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. రెండొవ రోజు కుమ్మరిపాలెం సెంటర్‌లో రోడ్డుకిరువైపుల ఉన్న ఇళ్ళను జేసీబీలతో తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 ఇళ్ళను కూల్చివేయగా..మరో 70 ఇళ్ళ తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ఫ్లైఒవర్ నిర్మాణంలో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో..ఇళ్ళను తొలగించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఇందుకోసం ఒక్కో విభాగానికి ఒక్కో అధికారిని నియమించి మరీ పనులను వేగవంతం చేస్తున్నారు. వచ్చే పుష్కరాల నాటికి ఫ్లైఓవర్ నిర్మించాలనే సంకల్పంతో పనుల్ని చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు.

 

16:43 - November 6, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృతస్థాయి సమావేశం విజయవాడలో జరిగింది. రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చేపట్టాల్సిన విధివిధానాలు, ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డితో పాటు ఏఐసీసీ నేత తిరువక్కనరుసు, రాజ్యసభ సభ్యులు కేవీపీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించేందుకు మట్టి సత్యాగ్రహం ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. గతంలోకంటే కాంగ్రెస్ పార్టీ 40 నుంచి 50 నియోజకవర్గాల్లో పట్టు సాధించిందని ఏపీసిసి అధ్యక్షులు రఘువీరా అన్నారు.

16:40 - November 6, 2015

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చిన్నారి కిడ్నాప్‌ సంచలనం సృష్టించింది. నిన్న సాయంత్రం కాకినాడకు చెందిన ఓ మహిళ నుంచి పాపను మరో మహిళ ఎత్తుకెళ్లింది. వెంటనే రైల్వే పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కిడ్నాపర్‌ వివరాల కోసం సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

 

కేసీఆర్ త్యాగం కోడి ఈకతో సమానం : రేవంత్ రెడ్డి

మెదక్ : తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల త్యాగం ముందు కేసీఆర్ త్యాగం కోడి ఈకతో సమానమని టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి తొలి సీఎం వ్యవనపరుడు కావడం దురదృష్టకరమన్నారు. కేబినెట్ లో మహిళలకు చోటు దక్కకపోవడం.. కేసీఆర్ పక్షపాత ధోరణికి నిదర్శనమన్నారు. పటాన్ చెరులో టిడిపి బహిరంగసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 

చంద్రబాబుకు సీపీఎం ఎపి రాష్ట్ర కమిటీ లేఖ

విజయవాడ : సీఎం చంద్రబాబుకు సీపీఎం ఎపి రాష్ట్ర కమిటీ లేఖ రాసింది. బాక్సైట్ తవ్వకాలకు అనుమతి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. బాక్సైట్ తవ్వకాలను గిరిజనులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.

 

 

15:54 - November 6, 2015

ముదిమి వయస్సులో ఒక వృద్ధురాలు ప్రజాసేవ చేస్తానంటోంది. అందుకు పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసి ఘన విజయం సాధించి ప్రత్యేకతను సొంతం చేసుకుంది.
ఉబర్ క్యాబ్ అత్యాచారం కేసు.. నిందితునికి జీవిత ఖైదు
దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన ఉబర్ క్యాబ్ అత్యాచారం కేసులో తీర్పు వెలువడింది. ట్యాక్సీలో ప్రయాణిస్తున్న మహిళా ఉద్యోగినిపై అత్యాచారం చేసిన ఈ నిందితునికి కోర్టు జరిమానా కూడా విధించింది.
నిర్భయ కేసు.. పూర్తి కానున్న మైనర్ దోషి శిక్షా కాలం 
ప్రపంచమంతా ఉలిక్కిపడిన నిర్భయ కేసులో మైనర్ దోషి శిక్షా కాలం పూర్తి కానుంది. నేరం చేసినప్పుడు మైనర్ అయినప్పటికీ 20 ఏళ్ల వయస్సులో శిక్షను పూర్తి చేసుకుని బయటకు రానున్నాడు.
అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. దేశంలో మహిళలకు భద్రత కరువైన నేపథ్యంలో అత్యాచార బాధితుల పక్షాన నిలుస్తూ వారికి పుట్టిన బిడ్డకు ఆస్తిపై హక్కులను కల్పించాలని సూచించింది.
మహిళల రక్షణ కోసం రైల్వే శాఖ కొత్త సాంకేతికత 
మహిళల రక్షణ కోసం రైల్వే శాఖ కొత్త సాంకేతికతను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందుకోసం ప్రత్యేక యాప్ ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తోంది.
సానియా మీర్జా మరో ప్రత్యేకత
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా మరో ప్రత్యేకతను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో వరుసగా రెండో టైటిల్ ను గెలుచుకుని విజయ భావుటా ఎగురవేసింది.
లూకాకు మరో అవార్డు 
స్పింటర్ టింటూ లూకా మరో అవార్డుకు అవార్డును అందుకోనుంది. ఒలంపిక్స్ లో ప్రత్యేకత చాటిన ఆమె కెరీర్ లో విజయ పథంలో పయనిస్తోంది.

 

15:47 - November 6, 2015

అమ్మానాన్నలిద్దరూ ఉద్యోగస్థులుగా మారుతున్న ఈ కాలంలో పిల్లలు ఒంటరి వారవుతున్నారు. దీంతో పిల్లలు ఒక్కోసారి హింసాత్మకంగా ప్రవర్తిస్తుంటారు. చదువుపై దృష్టి నిలపలేని పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. మరి ఈ స్థితిలో వారిపై ఎలాంటి శ్రద్ద తీసుకోవాలో ఇవాళ్టి నిర్భయలో తెలుసుకుందాం. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం

నెల్లూరు : జిల్లాలో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. వెంకటగిరి ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌లో ఉంటున్న సురేఖ, నాగమ్మ ఐదురోజుల నుంచి కనిపించడం లేదు. సురేఖ స్థానిక జెడ్పీ హైస్కూల్లో ఏడో తరగతి, నాగమ్మ తొమ్మిదో తరగతి చదువుతోంది. సురేఖ దుస్తులు ఎందోడు రైల్వేస్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో బాలికల అదృశ్యంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

 

15:12 - November 6, 2015

నెల్లూరు : జిల్లాలో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. వెంకటగిరి ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌లో ఉంటున్న సురేఖ, నాగమ్మ ఐదురోజుల నుంచి కనిపించడం లేదు. సురేఖ స్థానిక జెడ్పీ హైస్కూల్లో ఏడో తరగతి, నాగమ్మ తొమ్మిదో తరగతి చదువుతోంది. సురేఖ దుస్తులు ఎందోడు రైల్వేస్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో బాలికల అదృశ్యంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

 

 

15:08 - November 6, 2015

హన్మకొండ : వరంగల్‌ జిల్లా నుంచి తనను ఎంపీగా గెలిపిస్తే..ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని బీజేపీ అభ్యర్థి దేవయ్య అన్నారు. టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి తరహాలో వరంగల్‌లో హాస్పటల్‌ నిర్మిస్తామని చెప్పారు. జిల్లాను అభివృద్ధి చేసేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తానని పేర్కొన్నారు.

 

15:07 - November 6, 2015

బాహుబలి బంపర్ హిట్ అవ్వడంతో ప్రేక్షకుల్లో బాహుబలి-2పైన అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో అందలో నటించబోయే స్టార్ క్యాస్టింగ్ పై కూడా వివిధ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా బాహుబలి-2లో మాధురి దీక్షిత్ నటిస్తున్నట్లు చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే దీనిపై మాధురి దీక్షిత్ స్పందించారు. తాను నటిస్తున్నట్లు వచ్చిన వార్తలో నిజం లేదని తాను ఆ చిత్రంలో నటించడం లేదని మాధురి చెప్పినట్టు తెలిసింది. తాను ఆ సినిమా చేస్తున్నట్టు ప్రసార మాధ్యామాల్లో ఎక్కువగా ప్రచారం అవుతుందని తనను ఎవరూ సంప్రదించలేదని ఆమె చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ సంప్రదిస్తే మాత్రం తప్పకుండా ఆలోచిస్తానని మాధురి తెలిపినట్లు సమాచారం. ఈ చిత్రం కోసం రాజమౌళి సృష్టించిన అనుష్క అక్క పాత్రలో ఎవరు నటిస్తారన్నది తేలాల్సి ఉంది.

15:02 - November 6, 2015

హైదరాబాద్ : తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మను టిడిపి, బిజెపి నేతలు కలిశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు ప్రొటోకాల్‌ ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో హోంమంత్రిని పక్కనబెట్టి మంత్రి తలసాని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కాదని టిఆర్ ఎస్ కార్యకర్తలతో కార్యక్రమాలు మొదలు పెడుతున్నారని విమర్శించారు. శిలాఫలకాలపై కార్యకర్తల పేర్లు పెడుతున్నారని సీఎస్‌ దృష్టికి తెచ్చారు. ఈ అంశంపై గవర్నర్‌, స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని ఇరు పార్టీల నేతలు అన్నారు.

14:56 - November 6, 2015

వరంగల్ : సారిక, ఆమె ముగ్గురు కొడుకుల సజీవదహనం కేసులో మాజీ ఎంపీ రాజయ్య కుటుంబసభ్యులను వరంగల్‌ కేంద్ర కారాగారానికి తరలించారు.. ముగ్గురికి ఖైదీ నెంబర్లు కేటాయించారు.. రాజయ్యకు ఖైదీ నెంబర్‌ 2971, కుమారుడు అనిల్‌కు 2970, రాజయ్య భార్య మాధవిని మహిళా కారాగారానికి తరలించి 7856 నంబర్ కేటాయించారు.

 

14:53 - November 6, 2015

అనంతపురం : 2016లోపు హంద్రీనీవాను పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. అనంతపురంలో ఆయన హంద్రీనీవా కాలువ పనులపై ఇరిగేషన్‌ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తోటపల్లి, గుండ్లకమ్మ రిజర్వాయర్లను పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. అధికారుల పనితీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని ఆదేశించారు.

 

 

14:46 - November 6, 2015

హైదరాబాద్‌ : మొహాలి టెస్టు రసపట్టుగా కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 184 పరుగులకే ఆలౌటైంది. రెండు వికెట్లు కోల్పోయి 20 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆ జట్టు.. మరో 8 వికెట్లు కోల్పోయి కేవలం 164 పరుగులు మాత్రమే చేసింది. తొలుత ఎల్గర్‌ (37), ఆమ్లా (43)ను అశ్విన్‌ ఔట్‌ చేయడంతో సఫారీ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఎబి డివిలియర్స్ 83 బంతుల్లో 63 పరుగులు చేసి మళ్లీ సెంచరీ దిశగా సాగాడు. భారత బౌలర్లపై ఎదురుదాడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ప్రమాదకరంగా కనిపిస్తున్న ఎబిని మిశ్రా బౌల్డ్ చేయడంతో ఇక సఫారీల పని ముగిసింది. టెయిలెండర్లెవరూ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. అశ్విన్‌ 5, జడేజా 3, మిశ్రా 2 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు. రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్‌ ప్రస్తుతం 26 పరుగుల ఆధిక్యంలో ఉంది. శిఖర్ ధావన్‌ డకౌట్ అయ్యాడు. మురళీ విజయ్‌ క్రీజులో ఉన్నాడు. 

మొదటి వికెట్ కోల్పోయిన భారత్..

మొహాలి : భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగుల వద్ద శిఖర్ ధావన్ డకౌట్ అయ్యాడు. 

ఛత్తీస్ గఢ్ లో ఎదురు కాల్పులు..

ఛత్తీస్గఢ్: కొండగాం జిల్లా బెడ్మా అటవీ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టులు - పోలీసులకు మధ్య హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఆ క్రమంలో మావోయిస్టులకు పోలీసులు తారసపడ్డారు. దీంతో పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ... మావోయిస్టులపై ఎదురు కాల్పులకు దిగారు. దీంతో ఇరువైపులా కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే కాల్పులు కొనసాగుతున్నాయి.

13:31 - November 6, 2015

ఢిల్లీ : దేశంలో సంస్కరణల అమలు మారథాన్ లా నిరంతరం జరగాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఏకకాలంలో స్వల్ప సమయంలో సంస్కరణల అమలు సరికాదన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో... ఆర్థిక సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక గ్రోత్ రేట్, విదేశీ పెట్టుబడులు పెరిగాయని.. ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటు తగ్గిందన్నారు. 

ఏపీ సచివాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : ఏపీ సచివాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఉండే ఎల్‌ బ్లాక్‌లోని నాల్గొ అంతస్తులో రెవెన్యూ శాఖలోని షార్ట్‌ సర్య్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సచివాలయానికి చేరుకుంది. 

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

కర్నూలు : నంద్యాల మండలం పాండురంగాపురంలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలూ మృతి చెందారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

13:25 - November 6, 2015

కర్నూలు : నంద్యాల మండలం పాండురంగాపురంలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలూ మృతి చెందారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

13:23 - November 6, 2015

నెల్లూరు :నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.. మల్లాం కూడిలి దగ్గర లారీ... స్కూటీని ఢీకొట్టింది.. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు.. లారీ చెన్నైనుంచి నెల్లూరు వెళుతోంది.. స్కూటీ తమిళనాడులో రిజిస్ట్రేషన్ అయింది..

చేతులకు సంకెళ్లతో రైతుల వినూత్న నిరసన

హైదరాబాద్ : ఆదిలాబాద్‌లో రైతులు చేతులకు సంకెళ్లతో వినూత్నంగా నిరసన తెలిపారు. మార్కెట్‌ యార్డులో ఆందోళన చేపట్టిన రైతుల అరెస్ట్‌కు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. పోలీసులతో విచారణ జరిపించి కేసులు ఎత్తివేయిస్తామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు ఆందోళన విరమించారు. 

13:21 - November 6, 2015

హైదరాబాద్ : ఆన్‌లైన్లో శ్రీవారి దర్శనం టికెట్లు కొన్నరోజే దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని... టిటిడి ఈవో సాంబశివరావు తెలిపారు.. ప్రస్తుతం ముందురోజు కొనుగోలు చేసిన భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.. భక్తులు హుండీలు కానుకల సమర్పణ, లడ్డూల కొనుగోలుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టెక్నాలజీ రూపొందించామని ప్రకటించారు..

13:20 - November 6, 2015

హైదరాబాద్ : ఆదిలాబాద్‌లో రైతులు చేతులకు సంకెళ్లతో వినూత్నంగా నిరసన తెలిపారు. మార్కెట్‌ యార్డులో ఆందోళన చేపట్టిన రైతుల అరెస్ట్‌కు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. పోలీసులతో విచారణ జరిపించి కేసులు ఎత్తివేయిస్తామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు ఆందోళన విరమించారు. 

రేపు ఏజెన్సీ బంద్ కు అఖిలపక్షం పిలుపు

హైదరాబాద్ : విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను ఏపీ సర్కార్ అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ.. పోరాటానికి విపక్షాలు సిద్ధమయ్యాయి. సీపీఎం ఆధ్వర్యంలో ఇవాళ పాడేరులో అఖిలపక్షం సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న నేతలు.. రేపు ఏజెన్సీ బంద్ కు పిలుపు నిచ్చారు.

 

13:17 - November 6, 2015

హైదరాబాద్ : విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను ఏపీ సర్కార్ అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ.. పోరాటానికి విపక్షాలు సిద్ధమయ్యాయి. సీపీఎం ఆధ్వర్యంలో ఇవాళ పాడేరులో అఖిలపక్షం సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న నేతలు.. రేపు ఏజెన్సీ బంద్ కు పిలుపు నిచ్చారు. 

తీవ్రవాదం, మాఫియాపై కఠినంగా ఉంటాం:వెంకయ్యనాయుడు

ఢిల్లీ : దేశంలో తీవ్రవాదం, మాఫియాలపై కఠినంగా వ్యవహరిస్తామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఢిల్లీలో వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు. చోటారాజన్‌, దావూద్‌ ఇబ్రహీంల వల్ల దేశంలో వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. దావూద్‌ పాకిస్థాన్‌లో ఉన్నాడని ప్రపంచమంతా తెలుసునని, వారి పట్ల కేంద్రం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు, పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని తాను కోరారనన్నారు. ప్రకృతి వైపరీత్యాలపై నవంబరు 19 నుంచి విశాఖలో జరగనున్న అంతర్జాతీయ సదస్సులో కేంద్రమంత్రి వెంకయ్యనాయడు పాల్గొనాలని ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప ఆహ్వానించారు.

చర్లపల్లిలో ఫైర్ స్టేషన్ ప్రారంభం

హైదరాబాద్ : చర్లపల్లిలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఫైర్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు మనందరం సహకరించాలని కోరారు. సింగిల్ విండో పారిశ్రామిక విధానం మిగతా రాష్ర్టాలకు ఆదర్శమని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల్లో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

రాజయ్య ఖైదీ నంబర్ 2971

వరంగల్ : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు, ముగ్గురు మనువల అనుమానాస్పద మృతి కేసులో ఆయన కుటుంబ సభ్యులకు వరంగల్ సెంట్రల్ జైలు అధికారులు ఖైదీ నంబర్లు కేటాయించారు. రాజయ్య -2971, భార్య మాధవి -7856, కుమారుడు అనిల్ -2970 ఖైదీ నంబర్లు కేటాయించడం జరిగింది. రెండు రోజుల క్రితం రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనువలు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన విషయం విదితమే. 

12:51 - November 6, 2015

మద్రాస్ : సమాజం చిన్న చూపు చూసింది. హిజ్రా అంటూ ఛీదరించుకుంది. అర్హత లేదంటూ ప్రభుత్వం కూడా పొమ్మంది. చివరికి కోర్టు మెట్లు ఎక్కడంతో న్యాయం దక్కింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఓ హిజ్రాకు ఎస్‌ఐగా అవకాశం వచ్చింది. హిజ్రా అయిన ప్రీతికా యాషినీని ఎస్ఐగా నియమించేందుకు తమిళనాడు పోలీసుశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్‌ఐ సెలక్షన్‌కు అన్ని అర్హతలూ సాధించిన యాషిని, మహిళా కోటాలో అనర్హురాలంటూ పోలీస్‌శాఖ మొదట డిస్‌క్వాలిఫై చేసింది. దీంతో ప్రీతికా మద్రాస్‌ హైకోర్టుకు వెళ్లింది. థర్డ్ జెండర్‌గా ఆమెకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రీతికాను ఎస్‌ఐగా నియమిస్తూ పోలీస్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

12:48 - November 6, 2015

విశాఖ : తూర్పు అరేబియా సముద్రంలో ఏర్పడిన మేఘ తుపాను మరింత బలపడుతోంది. ఇది పెను తుపానుగా మారే ఛాన్స్‌ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను పశ్చిమ, నైరుతి దిశగా కదిలి ఒమన్‌ తీరానికి చేరుతుందని అధికారులు వివరించారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండదని తెలిపారు. కోస్తా, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని చెప్పారు. 

12:46 - November 6, 2015

హైదరాబాద్ : బెంగుళూరు సిటీ శివారులో దారుణం చోటు చేసుకుంది. నిర్భయ తరహా ఘటన జరిగింది. మినీ బస్సులో నిర్సింగ్‌ విద్యార్థినిపై రవి అనే డ్రైవర్‌ అత్యాచారం చేశాడు. ఆ సమయంలో క్లీనర్‌ బస్సు నడుపుతున్నాడు. ఢిల్లీలో నిర్భయ ఘటనను తలపించేలా అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను ఒక నిర్మానుష్య ప్రాంతంలో వదిలివేశారు. అక్కడ స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యం అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సు డ్రైవర్‌, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హుస్కోట్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్‌, క్లినర్‌పై నిర్భయ కేసులు పెట్టామని, శుక్రవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో బస్సులో అందరూ దిగిపోగా విద్యార్థిని ఒక్కరే ఉన్నారు. దీంతో డ్రైవర్‌, క్లినర్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

అత్తాపూర్‌లో దారుణం

హైదరాబాద్‌ : అత్తాపూర్‌లో దారుణం జరగింది.. జీసెస్ షైన్‌ స్కూల్లో పదో తరగతి విద్యార్థి షేక్‌ అమీర్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు స్కూల్‌ ఎదుట ఆందోళనకు దిగారు.. 

మత అసహనంపై స్పందించిన మన్మోహన్ సింగ్

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రధాన చర్చల్లో ఒకటైన మత అసహనంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తొలిసారి స్పందించారు. జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా బాధిస్తున్నాయని, తనతో పాటు జాతి యావత్తూ బాధపడుతోందని ఆయన అన్నారు. మేధావులను హత్య చేయడాన్ని ఎవరూ హర్షించబోరని వ్యాఖ్యానించిన ఆయన, అభిప్రాయ బేధాల అణచివేత ఇండియాకు అత్యంత ప్రమాదకరమని మన్మోహన్ అభిప్రాయపడ్డారు. భారతీయులకు మతం వ్యక్తిగతమని వెల్లడించిన ఆయన, ఎవరి విశ్వాసాల్లోకీ వెళ్లే ప్రయత్నాలు చేయరాదని అన్నారు.

బస్సులో నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం

హైదరాబాద్ :కర్ణాటక రాష్ట్రంలోని హోస్కోట్‌లో మినీ బస్సులో నర్సింగ్‌ విద్యార్థినిపై డ్రైవరు అత్యాచారం జరిపాడు. డ్రైవరు, క్లీనర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్యపరీక్షకు పంపించి, నిందితులను ప్రశ్నిస్తున్నారు.

తుళ్లూరు వద్ద వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ

గుంటూరు :నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని పరిధిలోని ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి యత్నించారు. తుళ్లూరు మండలం అనంతవరం వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీకి యత్నించారు. ఇటీవల ఈ ఆలయాన్ని టీటీడీలో విలీనం చేశారు. చోరీయత్నంతో ఆలయ అధికారులు శుక్రవారం పరిశీలించారు.

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

కరీంనగర్ : కమాన్‌పూర్ మండలం కన్నాలలో విషాదం చోటు చేసుకుంది. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందాడు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు.

సంస్కరణలతో పేదలకు మేలు: ప్రధాని

న్యూఢిల్లీ:సంస్కరణలతో పేదలకు మేలు జరుగుతుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఇవాళ ఢిల్లీ లో ఆర్థిక సదస్సు-2015ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... ప్రపంచ దేశాలతో పోలిస్తే దేశంలో ఆర్థిక స్థితి మెరుగ్గా ఉందని, భారత్‌లో వ్యాపార సామర్థ్యం విస్తరించిందన్నారు.ఈ ఏడాది జీడీపీ వృద్ది రేటు అశాజనకంగా ఉందన్నారు. ద్రవ్యలోటు తగ్గిందన్న ప్రధాని రూపాయి మారకం విలువ స్థిరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

11:42 - November 6, 2015

హైదరాబాద్ : దేశంలో పెరిగిపోతున్న అసహన పరిస్థితులపై నిరసన పర్వం కొనసాగుతోంది. ప్రముఖ దర్శకులు రచయితలతో పాటు 24 మంది సినీ ప్రముఖులు తమ జాతీయ అవార్డులను వెనక్కి పంపుతున్నట్టు ప్రకటించారు. రాజకీయాలతో తమకు సంబంధం లేదని దేశంలోని అసహన పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.

అసహన పరిస్థితులను నిరసిస్తూ.....

దేశంలో పెరిగిపోతున్న అసహన పరిస్థితులను నిరసిస్తూ అవార్డులను వెనక్కి ఇస్తున్న రచయితలు, మేధావులు, కళాకారుల సరసన సినీ పరిశ్రమకు చెందిన మరో 24 మంది చేరారు. జాతీయ పురస్కాలను వెనక్కి పంపిన వారిలో ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ విజేత, ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్, ప్రముఖ దర్శకులు కుందన్‌ షా, సయీద్‌ మీర్జా, వీరేంద్ర సైనీ, రంజన్‌ పాలిత్‌, తపన్‌ బోస్ తదితరులున్నారు.

బాలీవుడ్ దర్శకుడు కుందన్ షా....

బాలీవుడ్ దర్శకుడు కుందన్ షా కు 'జానే బీ దో యారో' చిత్రానికిగాను జాతీయ అవార్డు వచ్చింది. ఇది కాంగ్రెస్-బీజేపీ మధ్య జరుగుతున్న యుద్ధం కాదని, ఆ పార్టీలు ఒకటేనని కుందన్‌ షా అన్నారు. తాను రూపొందించిన 'పోలీస్ స్టేషన్' అనే సీరియల్‌ను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నిషేధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అరుంధతీ రాయ్......

1989లో ఫీచర్ ఫిల్మ్‌కుగాను తనకు వచ్చిన జాతీయ అవార్డును వెనక్కి ఇస్తున్నట్టు అరుంధతీ రాయ్ వెల్లడించారు. `ఇన్ విచ్ అన్నీ గీవ్స్ అండ్ దోస్ వన్స్' అని చలనచిత్రానికి గాను అరుంధతీ రాయ్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డును అందుకున్నారు. మైనారిటీలపై దాడులు, హేతువాదుల హత్యలు, భావ ప్రకటనా స్వేచ్ఛకు బెదిరింపులు, గోమాంసంపై బలవంతపు నిషేధానికి వ్యతిరేకంగా మేధావులు, కళాకారులు, రచయితలు నేడు ఓ రాజకీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం అసాధారణం, అద్భుతమని వారికి తన మద్దతు ప్రకటించారు. ఇందులో రాజకీయం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2005లో తాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.

సినీ రంగానికి చెందిన ప్రముఖులు...

సినీ రంగానికి చెందిన దీపాంకర్ బెనర్జీ, ఆనంద్‌ పట్‌వర్ధన్, నిష్టా జైన్‌లతో పాటు 11 మంది దర్శకులు తమ అవార్డులను వెనక్కి తిప్పి పంపారు. అభ్యుదయ వాదుల హత్య, దాద్రీ ఘటన, బీఫ్‌ రూమర్స్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు ఊపందుకున్నాయి. 

తిరుమల ఆన్ లైన్ టికెట్ల బుకింగ్ లో మార్పులు...

తిరుపతి: తిరుమలలోని శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్‌ టికెట్ల బుకింగ్‌ వ్యవస్థలో మార్పులు చేసినట్లు టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడించారు. దర్శనానికి వెళ్లే రోజు ఉదయం 7 గంటల వరకు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌లోనే ఈ-హుండీ ద్వారా స్వామివారికి కానుకలను సమర్పించవచ్చన్నారు. అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ ద్వారా గదుల సంఖ్యను 700 నుంచి 1500కు పెంచామన్నారు. అలిపిరి కాలిబాట మార్గంలోని అన్నమయ్య మార్గాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.

11:36 - November 6, 2015

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చిన్నారి కిడ్నాప్‌ సంచలనం సృష్టించింది... కాకినాడకుచెందిన ఓ మహిళనుంచి పాపను ఎత్తుకెళ్లింది మరో మహిళ... వెంటనే రైల్వే పోలీసులకు బాధితురాలు ఫిర్యాదుచేసింది.. కిడ్నాపర్‌ వివరాలకోసం సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.. 

11:31 - November 6, 2015

ఢిల్లీ : ఛోటా రాజన్‌ కేసులు సీబీఐకి అప్పగించడంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజుజు స్పందించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... కేసులన్నీ ఒక సంస్థ విచారిస్తేనే ప్రయోజనం ఉంటుందన్నారు. ఛోటా రాజన్‌ కేసులు సీబీఐకి అప్పగించినందున... దర్యాప్తు వివరాలేవీ బయటకు చెప్పలేమన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజుజు. ముందే విషయాలు చెప్పి విచారణకు ఆటంకం కల్గించలేమన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది మంత్రుల బృందం భేటీ అయి నిర్ణయిస్తుందన్నారు. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఐదేళ్ల బాలిక కిడ్నాప్

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఐదేళ్ల బాలిక (దుర్గ)ను గుర్తు తెలియని మహిళ కిడ్నాప్‌ చేసింది. రాణి అనే 30 ఏళ్ల మహిళ తన కుమార్తెతో రెండు రోజుల క్రితం కాకినాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. తిరిగి కాకినాడ వెళ్లేందుకు స్టేషన్‌కు వచ్చింది. అక్కడ ఒక మాయలేడి ఆమెను పరిచయం చేసుకుని నేడు కూడా రాజమండ్రి వస్తున్నానని చెప్పి నమ్మించింది. ఇంతలో బాలిక ఏడుస్తుంటే ఆ మహిళ ఎత్తుకుంది. ఈ క్రమంలో పాపకోసం పళ్లు తీసుకుందామని తల్లి (రాణి) బాలికను మహిళకు అప్పగించింది. ఇదే అదునుగా భావించిన మాయలేడి బాలికను తీసుకుని పారిపోయింది. ఇది గమనించిన రాణి ఆ పరిసర ప్రాంతమంతా వెతికింది.

చార్మినార్ కు కెమికల్ ట్రీట్ మెంట్

హైదరాబాద్ : చార్మినార్ కు పూర్వవైభవం తెచ్చేందుకు పురావస్తు శాఖ సిద్ధమైంది. ఆ శాఖ ఆధ్వర్యంలో కెమికల్ ట్రీట్ మెంట్ పనులు ప్రారంభమయ్యాయి. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ చారిత్రక కట్టడానికి దుమ్మూ ధూళిని, కాలుష్య పొగతో ఏర్పడిన మరకలను శుద్ధి చేస్తున్నారు. ఇప్పటికే మొదలైన ఆ పనులు రెండు నెలలపాటు జరుగుతాయని కెమికల్ ట్రీట్ మెంట్ విభాగం అధికారులు చెప్పారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సైన్స్ బ్రాంచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వీఎస్ రాఘవేంద్రరావు ఆదేశాల మేరకు పనులు జరుగుతున్నాయని ఆర్కియలాజికల్ కెమిస్ట్రీ అసిస్టెంట్ తెలిపారు.

11:16 - November 6, 2015

హైదరాబాద్ : మనం ఓ వంద కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తే ఏం చేస్తాం. ఖర్చు తగ్గించుకునేందుకు మన వాహనాన్ని పక్కన పెట్టి అద్దె వాహనమో లేక ఆర్టీసీ బస్సునో ఆశ్రయిస్తాం. మనమే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అతిపెద్ద రవాణా సంస్థ అయిన ఆర్టీసీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి.? నిజానికైతే ఖర్చును తగ్గించుకునే పని చేయాలి. కానీ ఎప్పుడూ నష్టాల పాట పాడే ఆర్టీసీ పెద్దలు మాత్రం నష్టాలను పెంచే నిర్ణయాలనే కొనసాగిస్తున్నారు. ఇందుకు గుదిబండలా మారిన అద్దెబస్సుల వ్యవహారమే ఉదాహరణ. ఆ తీరేంటో మీరూ ఓ లుక్కేయండి.

కొత్త బస్సులు వద్దంటూ ప్రభుత్వ నిర్ణయం......

ఎప్పుడూ నష్టాల పాట పాడడం ఆర్టీసీ అధికారులకు అలవాటైపోయింది. కానీ అప్పులను తగ్గించుకునేందుకు తీసుకునే చర్యలు చూస్తుంటే మాత్రం హతవిధీ అనిపించకమానదు. ఆర్టీసీకి వస్తున్న నష్టాలను దృష్టిలో పెట్టుకుని కొత్త బస్సులు కొనుగోలు చేయకూడదని అద్దె బస్సులు ఏర్పాటు చేసుకోవాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది లాభసాటి అని అధికారులు పదేపదే చెప్పారు. నిర్వహణ విషయంలో సొంత బస్సులకంటే అద్దె బస్సుల విషయంలో ఒక రూపాయి తగ్గుతుందని చెప్పారు. వాస్తవంగా చూస్తే అది కరెక్ట్‌ కాదని అధికారులు విడుదల చేసిన లెక్కలే చెప్తున్నాయి.

ఆర్టీసీ బస్సుల ద్వారా కి.మీ.కు రూ.27.94 ఆదాయం.....

అద్దె బస్సులే లాభదాయకం అనే వాదన ఎంత అబద్ధమో రికార్డులు చూస్తే అర్థమవుతోంది. 2015 మొదటి త్రైమాసికంలో వచ్చిన ఆదాయం ఆర్టీసీ బస్సుల ద్వారా ఒక కిలోమీటర్‌కు 27 రూపాయల 94 పైసలైతే.. అద్దెబస్సుల ద్వారా 24 రూపాయల 43 పైసలు మాత్రమే వచ్చింది. అంటే అద్దె బస్సుల ద్వారా కిలోమీటరుకు సుమారు మూడున్నర రూపాయలు తక్కువ ఆదాయం వచ్చింది. ఈ లెక్కన అద్దె బస్సుల ద్వారా సుమారు 36 కోట్ల రూపాయలు తక్కువగా ఆదాయం వచ్చింది.

1999 నుంచి విధానం మొదలు......

1999 నుండి అద్దె బస్సులను తీసుకునే విధానం మొదలైంది. వీటికి ఒక కిలో మీటరుకు బస్సును బట్టి 19 నుండి 24 రూపాయల వరకు అద్దె చెల్లిస్తుంది యాజమాన్యం. పైగా వాటిని రోడ్లు బాగా ఉండే ప్రాంతాల్లోనే తిప్పుతుంటారు. తాజాగా డిపోల్లోనే డీజిల్ టాప్అప్ చేయించే యోచన చేస్తోంది ఆర్టీసి. అయితే అద్దె బస్సులను తగ్గిస్తామని గతంలో యాజమాన్యం కార్మిక సంఘాలకు హామీ ఇచ్చినా కొందరి కక్కుర్తి మూలంగా ఆ హామీ అమల్లోకి రాలేదు.

అమలు కాని రిజర్వేషన్లు.....

అద్దె బస్సులు పెరగడంతో ఆర్టీసీలో సామాజిక న్యాయమూ కొరవడుతోంది. రిజర్వేషన్లు అమలు కావడంలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న 560 బస్సులకు దాదాపు మూడు వేల ఉద్యోగాలు వచ్చేవి. ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది. పైగా అన్ని డిపోల్లో ఉన్న డ్రైవర్లను రిలీవ్ చేసి వారికి డ్యూటీలు ఇవ్వకుండా వేధిస్తున్న పరిస్థితి నెలకొంది. అద్దె బస్సుల వల్ల సిబ్బంది ఖర్చు తగ్గుతుందని వాదిస్తుంది యాజమాన్యం. అయితే డ్రైవర్, మెకానిక్ తప్ప మిగిలిన క్లరికల్ సిబ్బంది పని యథాతధంగా ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా అద్దె బస్సుల వల్ల లాభం లేదని స్పష్టంగా తెలుస్తున్నా అధికారులు, ప్రభుత్వం వాటికే ఎందుకు ప్రాధాన్యత ఇస్తోందో పాలకులే చెప్పాలి. 

11:13 - November 6, 2015

హైదరాబాద్ : వరంగల్‌ ఉప ఎన్నికలో గెలుపు తమదేనని ధీమాగా చెబుతున్నారు మంత్రి కడియం శ్రీహరి.... ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేస్తున్నారు. ఆయన శుక్రవారం ఉదయం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'టెన్ టివి'తో మాట్లాడుతూ...16 నెలల్లోనే హామీలన్నీ పూర్తిచేయడం వీలుకాదు కదన్నారు. ప్రజలు మాకు 5ఏళ్ల టైం ఇచ్చారని 16 నెలల్లో గ్రౌండ్‌ లెవల్ పని పూర్తయిందని..మిగతా మూడున్నరేళ్లలో అన్ని హామీలు నెరవేరుస్తాం అని తెలిపారు.

కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన చిన్నారులు

వరంగల్: కూల్‌డ్రింక్‌ అనుకుని పురుగుల మందు తాగి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన వరంగల్‌ జిల్లా డోర్నకల్‌లో జరిగింది. గొల్లచర్ల శివారు ప్రాంతానికి చెందిన రవీంద్రనాయక్‌, స్రవంతి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రణిత (5), ప్రణిత్‌ (3) కూల్‌ డ్రింక్‌ అనుకుని పురుగుల మందు తాగేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో ప్రణిత్‌ చనిపోయాడు. ఈ ఘటనతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు.

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

హైదరాబాద్ : నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ ఈ సెన్సెక్స్ 40 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్లకు పైగా లాభపడ్డాయి.

వెంకయ్య నాయుడుతో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పణగరియా భేటీ అయ్యారు. ఈ భేటీ ఏపీ రాష్ట్ర విభజన అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. 

నేడు హస్తినకు ఏపీ సీఎం చంద్రబాబు

విజయవాడ :ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో స్వచ్ఛభారత్‌పై జరిగే సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు.

10:37 - November 6, 2015

విజయవాడ : ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలని భావిస్తున్న హెల్మెట్ నిబంధనపై వాహనదారుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రమాదాలను నివారించేందుకు హెల్మెట్ వాడకం తప్పనిసరని చెబుతున్న ప్రభుత్వం, అధికారులు.. ఆ ప్రమాదాలు జరగకుండా చర్యలెందుకు తీసుకోవడంలేదని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. బలవంతంగా నిబంధనల పేరుతో హెల్మెట్ వాడకం తప్పనిసరంటూ ఆదేశాలు జారీ చేస్తే ఉద్యమబాటపడతామని హెచ్చరిస్తున్నారు.

వాహన దారుల నుండి తీవ్ర వ్యతిరేకత....

నవంబర్ ఒకటో తేదీ నుంచి ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ తప్పకుండా వాడాల్సిందేనంటూ ప్రభుత్వం నిబంధనలు విధించడంతోపాటు శిరస్త్రాణం ధరించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హుకుం జారీ చేసింది. అయితే దీనిపై వాహనదారుల నుంచి వ్యతిరేకత వస్తోంది. హెల్మెట్ ధరించడం తప్పనిసరని ప్రభుత్వం నిబంధనలు విధించటం సరికాదని విజయవాడలోని వాహనదారులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. హెల్మెట్ వ్యతిరేక పోరాట సమితి పేరుతో ఓ సమితిని ఏర్పాటుచేసి ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు.

హెల్మెట్ కంపెనీలతో చేసుకున్న వ్యాపార ఒప్పందాలే....

కేవలం ప్రభుత్వం హెల్మెట్ కంపెనీలతో చేసుకున్న వ్యాపార ఒప్పందాల కారణంగానే వాహనదారులపై పూర్తిస్థాయిలో అపరాధ రుసుములు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హెల్మెట్ ధరించడం వలన సంఘ విద్రోహ శక్తులు, చైన్ స్నాచింగ్ వంటి ఘటనలు కూడా ఎక్కువయ్యే ప్రమాదం ఉందంటున్నారు. మరోపక్క సక్రమంగా లేని రహదారుల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని.. సర్వేలో వెల్లడైనా వాటిపై ప్రభుత్వం దృష్టిపెట్టకుండా హెల్మెట్లు వాడకంపై బలవంతంగా అపాదించడం సరైందికాదంటున్నారు.

విజయవాడలాంటి పట్టణంలో సాధ్యంకాదని...

హెల్మెట్‌ నిబంధన విజయవాడలాంటి పట్టణంలో సాధ్యంకాదని, ఇక్కడి వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని నగరంలోని వాహనదారులకు కొంతమేర వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. ద్విచక్రవాహనదారుల్లో ఎక్కువమంది ప్రమాదాలకు గురైనవారంతా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారేనని.. తొలుత మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే ప్రమాదాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయని అంటున్నారు. అయితే ఇప్పటికే ఓ మెట్టు వెనక్కితగ్గి, తప్పనిసరి నిబంధనను కొన్ని రోజుల వరకు వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం.. 2016 జనవరి ఒకటో తేదీ నుంచి తప్పకుండా అమలు చేసి తీరుతామంటూ ప్రకటన చేసింది. ఈ ప్రకటన ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో చూడాల్సి ఉంది. 

10:34 - November 6, 2015

హైదరాబాద్ : విశాఖలో బాక్సైట్‌ తవ్వకాల అనుమతులకు వ్యతిరేకంగా పోరాడేందుకు సీపీఎం పార్టీ సిద్ధమైంది. ఇవాళ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన ఆ పార్టీ... ఉద్యమ కార్యాచరణను ప్రకటించనుంది. బాక్సైట్‌ తవ్వకాలపై టీడీపీ సర్కార్‌ మాట తప్పిందని జిల్లా సీపీఎం నేతలు నర్సింగరావు,లోకనాథ్‌ ఆరోపించారు. వీరు శుక్రవారం 'టెన్ టివి'తో మాట్లాడుతూ... గిరిజనుల నిరసనలు.. పర్యావరణవేత్తల ఆందోళనలు.. సొంతపార్టీ నేతల విన్నపాలను తోసిరాజంటూ..... చంద్రబాబు సర్కారు ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలకు ఆమోదం తెలిపిందని మండి పడ్డారు.. ఈమేరకు 97వ నంబరు జీవోను జారీ చేసింది. దీనిపై విపక్షాలు.. గిరిజన సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఏ ఉద్యమంలో అయినా ప్రజలే ఇంత వరకూ గెలుస్తూ వచ్చారని, జీఓ వల్ల ఒరిగేది ఏమీ లేదు. గిరిజనుల్లో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కోపాగ్నికి ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుంటుందని నర్శింగరావు స్పష్టం చేశారు. భూములపై గిరిజనులకే హక్కు ఉంటుందని... ఒక్క అడుగు కూడా ముందుపడకుండా గిరిజనులు అడ్డుకుంటారు. గిరిజనులు మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధమౌతున్నారు. 1212 ఎకరాల్లో బాక్సైట్‌ తవ్వకాలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా జీవోను జారీ చేయడం దారుణమని మండిపడ్డారు. జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తాగు, సాగునీటికి ఎద్దడి ఏర్పడుతుందని ధ్వజమెత్తారు. జీవోను వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో న్యాయపోరాటం తప్పదని హెచ్చరించారు. 

10:29 - November 6, 2015

విజయవాడ / గుంటూరు : చైన్ స్నాచింగ్‌ గ్యాంగ్స్ ఏపీలోనూ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు ప్రాంతాలను హడలెత్తిస్తున్నారు. ఒంటరిగా నడిచి వెళ్లే మహిళలనే టార్గెట్ చేసుకొని విజృంభిస్తున్నారు. పోలీసులు ఎన్ని తనిఖీలు చేసినా గొలుసు దొంగల ఆగడాలకు కళ్లెం వేయలేకపోతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో రెచ్చిపోతున్న గొలుసు దొంగలపై ప్రత్యేక కథనం.

అమరావతిలో గొలుసు దొంగలు స్వైరవిహారం.....

రాజధాని ప్రాంతాలైన విజయవాడ, గుంటూరు, అమరావతిలో గొలుసు దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. మహిళల మెడలో ఆభరణాలు కనబడితే చాలు చివరకు ఎటువంటి దాడికైనా తెగబడుతున్నారు. కొన్ని నెలలుగా ఈ తరహా సంఘటనలు పెచ్చుమీరిపోతున్నాయి. దీంతో పోలీసులు అసలేం చేస్తున్నారనే విమర్శలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి. రాజధానిని ప్రకటించినప్పటి నుంచి బందోబస్తు, వీవీఐపీల సేవలో తరిస్తున్న పోలీసులు ఈ చోరీలపై దృష్టిపెట్టకపోవడం వల్లే సమస్య తీవ్రతరం అయ్యిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

విజయవాడలో నెలకు 20 నుంచి 25 చైన్ స్నాచింగ్ లు......

విజయవాడలో నెలకు 20 నుంచి 25 చైన్ స్నాచింగ్ లు జరుగుతున్నాయి. గుంటూరులో వీటి సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. సీసీఎస్, బ్లూకోట్స్ టీమ్ లతోపాటు మఫ్టీల్లో నిఘా పెడుతున్నారు. చైన్ స్నాచింగ్ లు అధికంగా జరిగే ప్రాంతాల్లో కీలక సమయాల్లో పహారా కాస్తున్నారు. అయినా గుంటూరులో నెలకు 10 వరకు గొలుసు దొంగతనాలు జరుగుతున్నాయి. కొద్దినెలల క్రితం రోజుకూ 3 నుంచి 4 చైన్ స్నాచింగ్ సంఘటనలు జరిగేవి. ఇపుడు పెరుగుతున్న నేరాలతో పోలీసులకు కునుకు ఉండటంలేదు.

యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్ ల జాడలేదు...

చైన్ స్నాచింగ్ లు అధికంగా జరుగుతున్నా ఇంత వరకు యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్ లను ఏర్పాటు చేయలేదు. విజయవాడ నగరం కమిషనరేట్ గా ఉన్నప్పటికీ అక్కడ సైతం టీమ్ లు లేకపోవడం చైన్ స్నాచర్లకు బాగా కలిసివస్తోంది. గుంటూరులో కమిషనరేట్ ఏర్పాటు ఏడాదిగా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఉన్న సిబ్బంది చాలక నేరాల నియంత్రణ సవాల్ గా మారింది.

పోలీసులకు సవాల్ గా మారుతున్న చైన్ స్నాచర్స్......

ఇదికాక తాడేపల్లి మండలం ఉండవల్లి కరకట్ట ప్రాంతంలో సీఎం చంద్రబాబు నివసిస్తున్నారు. దీంతో అర్బన్ జిల్లా పరిధిలోని ఒక్కో స్టేషన్ సీఐ సీఎం ఇంటి వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం నగరంలో పోలీసులంతా బందోబస్తు హడావుడిలో ఉండగా, కేవలం గంట వ్యవధిలో ఆరు చైన్ స్నాచింగులు జరిగాయి. పోలీసులకు సవాల్ గా మారుతున్న చైన్ స్నాచర్స్ ఆగడాలకు ఫుల్ స్టాఫ్ పెట్టేందుకు పోలీసులు ఏ తరహా చర్యలు తీసుకుంటున్నారో, ఎలా అడ్డుకట్ట వేస్తారో వేచిచూడాల్సి ఉంది.

10:26 - November 6, 2015

హైదరాబాద్ : దొరికినోళ్లు దొరికినంత దోచుకున్నారు. నీకింత నాకంత అంటూ లెక్కలేసుకుని పంచుకున్నారు. రోగులు లేకుండానే రోగులను.. వారికి రోగాలను సృష్టించారు. బడాబాబుల దగ్గర్నుంచి చోటామోటాల దాకా రిలీఫ్‌ ఫండ్‌లను రిలీఫ్‌ లేకుండా నొక్కేశారు. ఇప్పుడాబాగోతంలో తవ్వేకొద్దీ కొత్తకొత్త విషయాలు బయటపడుతున్నాయి. మరికొందరు నిధుల మాయంలోనూ తాము కార్పొరేట్లమేనని నిరూపించుకున్నారు. దొరలే దొంగలై దోచుకున్న ఆ వ్యవహారంలో ఇప్పుడు తీగలాగుతుంటే డొంకంతా కదులుతోంది..

6 నెలల క్రితం 25 ఆస్పత్రులకు నోటీసులు....

వివిధ రీతుల్లో సిఎం రిలీఫ్‌ ఫండ్‌ను కాజేసిన బాగోతంపై పరిశోధిస్తున్న సిబిసిఐడి తన దర్యాప్తులో మరింత దూకుడును పెంచింది. ఆరు నెలల క్రితం 25 కార్పొరేట్ ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చిన ఆ సంస్థ తాజాగా జిల్లాల్లోని బాధిత కుటుంబాలను నేరుగా కలుసుకుంటోంది. ఎవరెవరు బోగస్‌ బిల్లలతో డబ్బులు దండుకున్నారు.. వారి వెనుక ఎవరున్నారన్న అంశంపై దృష్టి పెట్టింది. ఈ కోణంలో అనారోగ్యం పేరుతో 30 కోట్ల రూపాయలు కాజేసి వాటి కోసం తయారుచేసిన 7 వేల బిల్లులను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు.

కరీంనగర్‌, ఆదిలాబాద్‌లకు 7 టీంలు.......

సీఎం రిలీఫ్ ఫండ్‌ను అక్రమ మార్గాల్లో కాజేసిన కార్పొరేటర్ల అవినీతి బాగోతాన్ని బయటపెట్టిన సి.ఐ.డి. ఇప్పుడు బాధితుల కుటుంబాల వివరాలపై దృష్టి పెట్టింది. అధికారులు కరీంనగర్, అదిలాబాద్‌కు 7 టీంలుగా వెళ్లి విచారిస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లోనే 2 వేల బిల్లులు కొద్ది కాలం వ్యవధిలోనే రిలీజ్ అయ్యాయి. నిజానికి బాధితులకు ఈ డబ్బులు చేరాయా.. లేక ఎవరైనా దళారులు వీటిని కాజేశారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. వ్యాధి వివరాలు ఆస్పత్రి పేరుతో పాటు.. సి.ఎం. రిలీఫ్ ఫండ్ కోసం మొదట ఎవరిని ఆశ్రయించారనే అంశాలు పరిశీలిస్తున్నారు.

చిన్న నాయకుల మొదలు ఎమ్మెల్యేల దాకా హస్తం.....

బోగసు బిల్లులు పెట్టి కమీషన్ల కక్కుర్తితో అటు అస్పత్రులు, ఇటు ప్రజాప్రతినిధులు కుమ్మక్కై దోచుకున్నట్లు ఇప్పటికే రూఢీ అయింది. చిన్నచిన్న నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు ఎమ్మెల్యేల వద్ద నుంచి ఫైల్ రిఫర్ చేసుకున్నారు. కొంత మంది మళ్లీ మళ్లీ అప్లై చేసుకొని డబ్బులు తీసుకున్నట్లు సి.ఐ.డి. విచారణలో తేలింది. అసలు పేషెంట్లే లేకుండా లక్షల్లో బిల్లులు దండుకున్నట్లు సిఐడి అధికారులు గుర్తించారు.

ఆస్పత్రుల నుంచి డాక్యుమెంట్ల స్వాధీనం.....

ఇప్పటికే సీఐడీ అధికారులు తమ దర్యాప్తులో పలు ఆస్పత్రుల నుంచి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. 45 ఆస్పత్రులలో అవకతవకలు జరిగాయని తేలింది. ఇందులో ప్రాథమికంగా 25 హాస్పిటల్స్‌కు నోటీసులు జారీ చేశారు. కరీంనగర్‌లో చొప్పదండి, మానుకొండూరు, జగిత్యాల, కోరుట్ల, రామగుండం, మండలాల్లో 30 మందిని విచారించి దర్యాప్తు పూర్తి చేశారు. అదిలాబాద్‌లో తిమ్మాపూర్, గంగాధర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో 110 మందిని స్థానిక పోలీస్ స్టేషన్లకు పిలిపించి విచారించారు. అయితే ఇందులో స్థానిక నేతల హస్తం ఉన్నట్లు తేలింది. సిఐడి ఇప్పటికే ఆస్పత్రుల వివరాలను ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పూర్తి దర్యాప్తు చేసి మరో రెండు నెలల్లో సమగ్ర నివేదిక అందజేయనున్నారు. ఆ దర్యాప్తు ద్వారా ఎవరెవరి పేర్లు బయటకొస్తాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.

 

10:23 - November 6, 2015

హైదరాబాద్ : రాజయ్య కోడలు, మనవళ్ల మృతిపై పోలీసులు తమ విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 32మందిని విచారించిన పోలీసులు.. ప్రస్తుతంలో పరారీలో ఉన్న అనిల్ రెండో భార్య సనా కోసం వేట ప్రారంభించారు. మరోవైపు రాజయ్య భార్య మాధవిపై కేయూ అధికారులు వేటు వేయనున్నట్టు సమాచారం. 

10:21 - November 6, 2015

హైదరాబాద్ : సీబీఐ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఛోటా రాజన్ కు కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకొచ్చిన అధికారులు... సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తీసుకెళ్లారు. రాజన్ పై కేసులన్నీ ఇక నుంచి సీబీఐనే విచారించనుంది. ఎయిమ్స్ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత.. రాజన్ ను న్యాయమూర్తి ముందు హాజరుపర్చనున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా న్యాయమూర్తి సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.

 

ఒంగోలు రిమ్స్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్

ప్రకాశం : ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిని ప్రకాశం జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఈ రోజు ఉదయం సందర్శించారు. ఆస్పతిలో సౌకర్యాలు, వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది విధులకు గైర్హాజరీ అవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిత్తూరు జిల్లాలో నేతన్న ఆత్మహత్య

చిత్తూరు : అప్పుల బాధ తాళలేక నేతన్న ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కొల్లబైలు పంచాయతి గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బండి వెంకటరమణ(28) నేత పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పులు ఎక్కువ కావడంతో వాటిని తీర్చే దారి కానరాక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చే సుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నారాయణఖేడ్ లో మంత్రి హరీష్ పర్యటన

మెదక్: జిల్లాలోని నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో ఇవాళ మంత్రులు హరీష్‌రావు, మహేందర్‌రెడ్డి పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. మంత్రుల వెంట జిల్లాకు చెందిన నేతలు పాల్గొననున్నారు. 

అబిడ్స్ లో కారు బీభత్సం..

హైదరాబాద్ : అబిడ్స్ చర్మాస్ వద్ద శుక్రవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా చర్మాస్ బస్టాప్లోకి దూసుకెళ్లింది. దీంతో బారికేడ్లు ధ్వంసమైనాయి. అప్పటికే బస్టాప్లో బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. స్థానికులు వెంటనే స్పందించి... అబిడ్స్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని... స్టేషన్కి తరలించారు. కాగా డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

చిత్తూరు : తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి దర్శనం కోసం 6 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

బైక్ ను ఢీ కొట్టిన లారీ : ఇద్దరి మృతి

నెల్లూరు : నాయుడు పేట వద్ద జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం బైక్ ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌కు ఛోటా రాజన్

ఢిల్లీ : మాఫియా డాన్‌ చోటారాజన్‌ను ఇండోనేషియా నుంచి సీబీఐ అధికారులు ప్రత్యేక విమానంలో మన దేశానికి తీసుకువచ్చారు. ఇండోనేషియాలో ఇటీవల చోటారాజన్‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. మాఫియా డాన్‌గా పలు నేరాలకు పాల్పడిన చోటారాజన్‌పై ముంబైలో 75, ఢిల్లీలో పది కేసులున్నాయి. చోటారాజన్‌ను విచారించేందుకు వీలుగా ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. భారీ సాయుధ పోలీసు భద్రత మధ్య డాన్‌ను సీబీఐ ప్రత్యేక బృందం అధికారులు విచారిస్తున్నారు.

ఢిల్లీ హైకోర్టుకు వీరభద్ర సింగ్ కేసు

న్యూఢిల్లీ : హిమాచల్‌ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్ అక్రమాస్తుల కేసు విచారణను హిమాచల్ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. న్యాయవ్యవస్థను తలనొప్పుల నుంచి రక్షించుకొనేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జస్టిస్ ఎఫ్‌ఎంఐ కలీఫుల్లా, జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ?

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఇకపై మరో కొత్త పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. మరో రెండు, మూడు నెలల్లో గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి జరగనున్న ఎన్నికల్లోనే నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రారంభించిన జన సేన పార్టీ పోటీ చేయనున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ముందే జనసేన పార్టీని పవన్ కల్యాణ్ ప్రకటించినా, నాడు ఎన్నికలకు దూరంగా ఉన్న ఆ పార్టీ టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చింది. అయితే గ్రేటర్ లో జరగనున్న ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేస్తామని అర్థం వచ్చేలా నాడే పవన్ కల్యాణ్ ప్రకటన కూడా చేశారు. 

ర్యాగింగ్ నియంత్రణకు యాఫ్

హైదరాబాద్ : ర్యాగింగ్‌ను నియంత్రించేందుకు బాచుపల్లి వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌ జ్యోతి విద్యార్థులు యాంటిర్యాగింగ్‌ పేరుతో మొబైల్‌ యాప్‌ను తయారు చేశారు. ఇటీవల కళాశాలలో దుండిగల్‌ పోలీసులు నిర్వ హించిన యాంటీ ర్యాగింగ్‌ అవగాహన సదస్సులో సీఐ ప్రసంగానికి స్పందించి బీటెక్‌ మూడో సంవత్సవం సీఎస్సీ గ్రూప్‌కు చెందిన పృథ్వీ, సూర్య, భరత్‌, హర్షిత్‌ ముందుకొచ్చి కళాశాల యాజమాన్యం ప్రోత్సాహంతో యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఆండ్రాయిడ్‌ బేస్‌ చేసుకొని దీన్ని తయారు చేసినట్లు తెలిపారు.

07:59 - November 6, 2015

హైదరాబాద్ : బీహార్ లో మహాకూటమికే విజయావకాలు ఎక్కువ గా ఉన్నాయని ఎంవిఎస్ శర్మ న్యూస్ మార్నింగ్ చర్చలో తెలిపారు. దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న బిహార్ శాసనసభ ఎన్నికల్లో.. అధికార జేడీయూ సారథ్యంలోని మహాకూటమికి - ప్రతిపక్ష బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏకి మధ్య పోరాటం హోరాహోరీగా ఉంటుందని ఎగ్టిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజారిటీ 122 సీట్లు. మొత్తం ఏడు సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించగా.. ఐదు సంస్థలు ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సారథ్యంలోని జేడీయూ, ఆర్‌జేడీ, కాంగ్రెస్‌ల మహాకూటమి ఆ మెజారిటీ సాధిస్తుందని.. ఎన్‌డీఏ మెజారిటీకి కాస్త దూరంలో ఆగిపోతుందని అంచనా వేశాయి. మోదీ సర్కార్ బంగారం స్కీమ్ ప్రవేశ పెట్టింది. ఇవే అంశాల పై న్యూస్ మార్నింగ్ చర్చలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో శర్మతో పాటు కాంగ్రెస్ నేత జనక్ ప్రసాద్, బిజెపి నేత చారీ పాల్గొన్నారు. ఈ చర్చను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

07:01 - November 6, 2015

విజయవాడ : ఏపీ రాజధానికి అన్ని శాఖలను తరలించాలన్న సీఎం చంద్రబాబు... సెక్రటేరియట్‌ను ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అంశంపై మంత్రులతో చర్చించి.. ఓ నిర్ణయానికి వచ్చారు. గన్నవరంలోని మేథా టవర్స్‌ అయితే బాగుంటుందని డెసిషన్‌ తీసుకున్నారు. అయితే ఐటీ డెవలప్‌మెంట్‌ కోసం తాము విశేషంగా కృషిచేస్తున్నామంటున్న టిడిపి సర్కార్ చెప్తున్నదానికి చేస్తున్నదానికి పొంతన కుదరడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సెక్రటేరియట్‌కు ఉపయోగించుకోవాలని మంత్రివర్గం నిర్ణయం....

ఓ మహత్తర ఆశయంతో నిర్మించిన భవనమిది.. ఆశయం నీరుగారిపోయింది.. దాని తాలూకు సాక్ష్యంగా ఈ భవనం మిగిలిపోయింది. విజయవాడ సమీపంలోని గన్నవరంలో నిర్మించిన ఐటీ పార్క్ఇది. మేధా టవర్స్‌ పేరుతో తలపెట్టిన దీన్ని సెక్రటేరియట్‌కు ఉపయోగించుకోవాలని ఎపి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. వచ్చే ఏడాది జూన్ 2కల్లా సెక్రటేరియట్ ఉద్యోగులంతా రాజధాని అమరావతికి వచ్చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో తాత్కాలికంగా గన్నవరం ఐటీ పార్క్‌లో సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

10 వేల మందికి ఉపాధి అన్న పాలకులు.....

ఈ మేధా టవర్స్‌ నిర్మాణం వెనక అతిపెద్ద ఆశయమే ఉంది. కోస్తా ప్రాంతంలోనూ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో ఉపాధి కల్పించే ఉద్దేశంతో గన్నవరంలో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఇది పూర్తిస్థాయిలో నిర్మాణమైతే 10 వేల మందికిపైగా ఉపాధి లభిస్తుందని పాలకులు చెప్పుకొచ్చారు. కానీ ఆచరణలోకొచ్చాక 200 మందికి కూడా ఉద్యోగాలు రాలేదు. పరోక్షంగా 10 మందికే ఉపాధి లభిస్తోంది. ఇది ప్రారంభమై ఐదేళ్లు గడుస్తున్నా ఉద్యోగావకాశాలు పెరగలేదు. మొత్తం 5 టవర్లు నిర్మించాల్సి ఉండగా ఒక్క టవర్ మాత్రమే పూర్తయింది. ఇప్పటివరకూ నాలుగు కంపెనీలే వచ్చాయి. ఇంకా దానిలో 20 సంస్థలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

వైఎస్ హయాంలో అనుమతులు....

వైఎస్ హయాంలో గన్నవరంలో ఐటీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. 30.60 ఎకరాల స్థలం కేటాయించారు. ఎల్‌అండ్‌టీ హైటెక్ సిటీ సంస్థ కాంట్రాక్టు తీసుకుంది. అయితే ఒక భవనం నిర్మించి మౌలిక వసతులు కల్పించినా అనుకున్న స్థాయిలో లక్ష్యం నెరవేరలేదు. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేసే సంస్థలు మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేయాలని ఎస్‌ఇజడ్ నిబంధన పెట్టడంతో భారతదేశంలో ఐటీ వ్యాపారం చేసేవారికి అవకాశం లేకుండాపోయింది. మరోపక్క రాష్ట్రం నుంచి వేలాది మంది ఉద్యోగావకాశాలు వెతుక్కుంటూ వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు.

విక్రయించేందుకు ఎల్‌అండ్‌టి ఆలోచన.....

ఈ ఐటి పార్క్‌ మెయింటెనెన్స్‌ ఖర్చులు కూడా రాకపోవడంతో ఓ సమయంలో దీన్ని విక్రయించేందుకు ఎల్‌అండ్‌టీ రంగం సిద్ధం చేసినట్లు గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడీ పార్క్‌ విలువ 100 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా. కోస్తాంధ్రలో ఐటి డెవలప్‌మెంట్‌కు నాటి ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంతో ఆశయం ఇలా నీరుగారిపోయింది. టిడిపి ప్రభుత్వమన్నా లక్ష్యానికి తగ్గట్లు పనిచేస్తుందనుకుంటే దీనిలో తాత్కాలికంగా సెక్రటేరియట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉన్న వనరులను ఇలా వేరేవాటికి ఉపయోగించాలని నిర్ణయించుకుంటే ఇక ఐటి డెవలప్‌మెంట్‌కు ప్రయత్నాలు జరిగేదెలా.? కొత్త భవనాలు నిర్మించేదెప్పుడు.? కంపెనీలు వచ్చేదెప్పుడు? ఇలాంటి ప్రశ్నలెన్నో ఐటిని నమ్ముకున్న యువతను వేధిస్తున్నాయి. మరి చంద్రబాబు సర్కార్‌ ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతుందో చూడాలి.

06:58 - November 6, 2015

విజయవాడ : మన్యంలో మళ్లీ బాక్సైడ్‌ చిచ్చు రగిలింది. గిరిజనుల నిరసనలు.. పర్యావరణవేత్తల ఆందోళనలు.. సొంతపార్టీ నేతల విన్నపాలను తోసిరాజంటూ..... చంద్రబాబు సర్కారు ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలకు ఆమోదం తెలిపింది. ఈమేరకు 97వ నంబరు జీవోను జారీ చేసింది. దీనిపై విపక్షాలు.. గిరిజన సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఏరు దాటే వరకు ఏటి మల్లన్న.. ఏరు దాటాక ఓటి మల్లన్న......

ఏరు దాటేవరకు ఏటి మల్లన్న.. ఏరు దాటాక ఓటి మల్లన్న.. అన్నది సామెత. బాక్సైట్‌ తవ్వకాల విషయంలో తెలుగుదేశం పార్టీ ఈ సామెతను నిజం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిపిఐ, సిపిఎంతో కలిసి బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించింది. ప్రతిపక్ష నాయకుడి హోదాలో.. 2011లో బాక్సైట్‌ తవ్వకాలను నిలిపివేయాలంటూ గవర్నర్‌కు, కేంద్ర పర్యావరణ శాఖ కమిటీకి వినతిపత్రాలు సమర్పించి చంద్రబాబు గగ్గోలు పెట్టారు. కానీ.. ఇప్పుడు మాట మార్చి.. 1212 హెక్టార్లలో బాక్సైట్‌ తవ్వకాలకు తానే అనుమతి మంజూరు చేశారు.

విపక్షాల ఆందోళనతో దూకుడు తగ్గించిన అప్పటి ప్రభుత్వాలు.......

కాంగ్రెసేతర పక్షాల ఆందోళనల నేపథ్యంలో.. అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాక్సైట్‌ తవ్వకాలపై దూకుడును తగ్గించాయి. కానీ ఈసారి అధికారంలోకి వచ్చీ రాగానే చంద్రబాబు మళ్లీ బాక్సైట్‌ తవ్వకాలపై దృష్టి సారించారు. ఈ విషయంలో గిరిజనుల పరిరక్షణ చట్టం పీసానూ చంద్రబాబు తుంగలో తొక్కారు. పీసా చట్టం ప్రకారం.. గ్రామ సభల ఆమోదం లేకుండా తవ్వకాలు సాధ్యంకాదు. దీంతో మూడు నెలల క్రితమే.. చంద్రబాబు తమ పార్టీ నేతలు, సానుభూతిపరులతోనే గుట్టుగా గ్రామసభలు ఏర్పాటు చేసి.. తవ్వకాలకు ఆమోదం పొందారన్న ఆరోపణ ఉంది.

వైఎస్‌ జమానాలోనే బాక్సైట్‌ ఖనిజ తవ్వకాలకు శ్రీకారం......

నిజానికి బాక్సైట్‌ ఖనిజాల తవ్వకం ఆలోచన.. వైఎస్‌ హయాంలోనే శ్రీకారం చుట్టుకుంది. నర్సీపట్నం సమీపంలో.. బాక్సైట్‌ ఖనిజం ఆధారంగా... అల్యూమినియం ఉత్పత్తికి.. ఆన్‌రాక్‌ సంస్థ 2008లో ప్రాజెక్టును చేపట్టింది. దీనికి సంబంధించి బాక్సైట్‌ తవ్వి ఇచ్చేందుకు.. వైఎస్‌ సర్కారు... గల్ఫ్‌లోని రస్‌ అల్‌ కైమా దేశానికి చెందిన ప్రతినిధులతో 2007లోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. విశాఖ ఏజెన్సీలోని అరకు, చింతపల్లి ప్రాంతాల్లో దాదాపు 564.9మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నాయని అంచనా. వీటిని తవ్వేందుకు గిరిజనులతో పాటు.. అప్పటి కేంద్ర మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ కూడా తీవ్రంగా వ్యతిరేకించడంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దూకుడును తగ్గించాయి.

టన్ను అల్యూమినియం ఉత్పత్తితో 1.2 టన్నుల రెడ్‌మడ్‌ ఉత్పత్తి......

బాక్సైట్‌ ఖనిజ తవ్వకాలను గిరిజనులు వ్యతిరేకించడానికి బలమైన కారణాలే ఉన్నాయి. బాక్సైట్‌ను ఉపయోగించి టన్ను అల్యూమినియంను ఉత్పత్తి చేసే క్రమంలో 1.2 టన్నుల అత్యంత విషపూరితమైన రెడ్‌మడ్‌ ఉత్పత్తి అవుతుందని.. దీని వల్ల మన్యం మంచాన పడుతుందనీ గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. దీంతోపాటే.. బాక్సైట్‌ తవ్వకాల వల్ల.. ఇక్కడి మైదాన ప్రాంతాల్లోని నదుల్లో నీరు కనిపించదన్నది పర్యావరణవేత్తల ఆందోళన. పైగా తాము నిర్వాసితులవుతారనీ గిరిజనులు కలత చెందుతున్నారు.

గిరిజనుల ఆందోళనకు మద్దతిచ్చిన మావోయిస్టు పార్టీ......

బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులు చేస్తున్న ఆందోళనకు మావోయిస్టు పార్టీ కూడా మద్దతుగా నిలిచింది. బాక్సైట్‌ తవ్వకాలపై ప్రభుత్వ దూకుడుకు వ్యతిరేకంగా.. ఇటీవలే ఏజెన్సీలోని ముగ్గురు టీడీపీ మండల స్థాయి నేతలను కిడ్నాప్‌ చేసిన మావోయిస్టులు.. స్థానికుల విజ్ఞప్తి మేరకు వారిని వదిలేశారు. దీంతోపాటే.. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల ఇళ్లనూ పేల్చేశారు. బాక్సైట్ తవ్వకాలకు ఎవరు అనుకూలంగా వ్యవహరించినా వారిపై దాడులు తప్పని మావోయిస్టులు హెచ్చరించారు.

గతంలో నియోమగిరిలో బాక్సైట్‌ తవ్వకాలను అనుమతించిన ఒడిశా సర్కారు.....

గతంలో ఒడిశా సర్కారు కూడా నియోమగిరి పర్వతాల్లో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిని ఇచ్చింది. తమ పార్టీ సానుభూతిపరులతో గ్రామసభలు ఏర్పాటు చేసి అనుమతి మంజూరు చేసినట్లు సుప్రీంకోర్టు ఆదేశాలతో నియమితమైన కమిటీ విచారణలో తేలింది. దీంతో.. బాక్సైట్‌ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను ఒడిశా సర్కారు అప్పట్లో రద్దు చేసుకుంది. ఈ ఉదంతాన్ని దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు సర్కారు.. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఎపీఎండీసీ బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టాలని తాజా జీవోలో పేర్కొంది. బాక్సైట్‌ తవ్వకాల బాధ్యతను ఏపీఎండిసీకి అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొన్నా.. ప్రైవేటు కంపెనీలకు ఈ నిక్షేపాలు కట్టబెట్టడమే జీవో ఉద్దేశమని గిరిజన సంఘాల నాయకులు అనుమానిస్తున్నారు. సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమానికి సమాయత్తమవుతున్నారు. 

06:52 - November 6, 2015

హైదరాబాద్ : మాజీ ఎంపీ రాజయ్య, ఆయన కుటుంబసభ్యులను న్యాయస్థానం రిమాండ్‌కు ఆదేశించింది. వరంగల్ ఎంజీఎంలో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం రాజయ్యతోపాటు ఆయన భార్య, కుమారుడిని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా వారికి 15 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో నిందితులను కేంద్ర కారాగారానికి తరలించారు. కేసు విషయమై ఇప్పటికే పలు అనుమానాలు తావిస్తున్న నేపథ్యంలో విచారణలో మరిన్ని కొత్త కోణాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వరంగల్ సెంట్రల్ జైలుకు...

సంచలనం సృష్టించిన సారిక, ముగ్గురు మనవళ్ల సజీవ దహనం కేసులో వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్‌కు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వీరిని వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు. అంతకుముందు వారిని పోలీసులు మామూనూరు పోలీసు స్టేషన్‌లో ఏసీపీ మహేందర్, హన్మకొండ ఏసీపీ శోభన్‌కుమార్‌ల ఆధ్వర్యంలో సుదీర్ఘంగా విచారించారు. రాత్రి 10.30 సమయంలో వరంగల్ ఆరో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి జస్టీస్‌ అజేశ్‌కుమార్ ఎదుట హాజరుపరిచారు.

ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు...

కోర్టుకు తీసుకువచ్చే ముందు ఈ ముగ్గురికీ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సారిక, ముగ్గురు పిల్లల మృతి కేసులో ఆమె భర్త అనిల్, అత్త మాధవి, మామ రాజయ్య, అనిల్ రెండో భార్య సనాను నిందితులుగా పేర్కొన్నారు. వారిపై సుబేదారి పోలీసు స్టేషన్‌లో ఐపీసీ 306, 498ఏ, 174 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కాగా అనిల్ రెండో భార్యను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

పోస్టుమార్టం ప్రక్రియను వీడియోలో.......

ఇదిలా ఉంటే సారిక, ముగ్గురు పిల్లల మృతిపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో పోస్టుమార్టం ప్రక్రియను వీడియోలో చిత్రీకరించారు. రాజయ్య కుటుంబ సభ్యులు సారిక అంత్యక్రియలకు రాలేదు. మరో వైపు కేసు పురోగతి సాధించేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. 

06:50 - November 6, 2015

హైదరాబాద్ :మాఫియా డాన్ ఛోటా రాజన్‌ను సీబీఐ, ఢిల్లీ, ముంబై పోలీసు అధికారులతో కూడిన బృందం భారత్‌కు తీసుకువచ్చింది. రాజన్‌తో ఇండోనేసియాలోని బాలి నుంచి గురువారం రాత్రి 7.45 గంటలకు బయల్దేరిన ప్రత్యేక విమానం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకుంది. బాలిలో అగ్ని పర్వతం బద్ధలై, పొగ, బూడిద కమ్ముకోవడంతో అక్కడి విమానాశ్రయాన్ని మూసేయడంతో రాజన్ తరలింపు ఆలస్యమైంది.

1988లో దుబాయికి....

రాజన్‌ కోసం పోలీసుల వేట తీవ్రం కావడంతో 1988లో దుబాయి పారిపోయాడు. గత నెల 25న ఆస్ట్రేలియా నుంచి బాలికి వచ్చిన రాజన్‌ను ఇండోనేసియా పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. భారత్‌లో రాజన్‌పై హత్య, స్మగ్లింగ్, బలవంతపు వసూళ్లు తదితర 75కు పైగా కేసులున్నాయి. వాటిలో దాదాపు 70 ముంబైలోనే నమోదై ఉన్నాయి. టాడా, ఉగ్రవాద నిరోధక చట్టం, మోకా చట్టాల కింద ఆయనపై కేసులున్నాయి. కాగా, రాజన్‌పై ఉన్న అన్ని కేసులను సీబీఐకి అప్పగిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ నేరాల విచారణలో సీబీఐకి ఉన్న నైపుణ్యాన్ని, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి కేపీ బక్షి తెలిపారు. ఒకప్పుడు అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు ప్రధాన అనుచరుడైన చోటా రాజన్.. 1993 ముంబై పేలుళ్లను వ్యతిరేకించి దావుద్‌ గ్యాంగ్‌కు దూరమయ్యాడు. 

06:47 - November 6, 2015

అనంతపురం: జిల్లాలో గుత్తి సమీపంలో అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సిగ్నల్స్‌ కోసం 3 రైళ్లు ఆగి ఉన్న సమయంలో రాళ్లు కర్రలతో దాడి చేసి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. కత్తులతో బెదిరించి నగలు, డబ్బు చోరీ చేశారు. సుమారు 40 తులాల బంగారు నగలు చోరీకి గురైనట్లు తెలిసింది. 3 రైళ్లలో ఒకటి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా మిగిలిన రెండు బెంగళూరు నుంచి ముంబాయి వెళ్తున్న ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌. నాందేడ్ నుంచి బెంగళూరు వెళ్తున్న నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌.

06:43 - November 6, 2015

హైదరాబాద్ : తెలంగాణలో 64 రోజులుగా సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లు ఇప్పటికీ సమరోత్సాహమే ప్రదర్శిస్తున్నారు. ఈ 64 రోజుల్లో వారు ప్రదర్శించిన పోరాట రూపాలెన్నో. ర్యాలీలు తీశారు. ధర్నాలు చేశారు. కలెక్టర్ల దగ్గర బైఠాయించారు. మంత్రులను ఘోరావ్‌ చేశారు. కాన్వాయ్‌లకు ఎదురెళ్లి తమ గోడు వెళ్లబోసుకునే ప్రయత్నం చేశారు. బతుకమ్మలాడారు. ఎన్ని రూపాల్లో ఆందోళనలు చేసినా, ప్రభుత్వం నుంచి తగిన స్పందన రాలేదన్న ఆగ్రహంతో, ఆవేదనతో చివరకు చలో హైదరాబాద్‌ లాంటి కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ సంక్షేమ పథకాల ప్రచారం, వ్యాధి నిరోధక టీకాలు లాంటి అనేక ప్రభుత్వ పథకాల్లో విశేష సేవలందిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను సావధానంగా విని, కేబినెట్‌ ఎజెండాలో చేర్పించి, వారి సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సిన మంత్రులు సైతం సమ్మె చేస్తున్నవారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప సమస్య పరిష్కారానికి ఏ మాత్రం చొరవచూపడం లేదన్నది కళ్లెదుట కనిపిస్తున్న దృశ్యం. ధర్నాలు, రాస్తారోకోలు, ఘోరావ్‌లు, సమ్మెలు ఇవన్నీ ప్రజాస్వామ్యం ప్రసాదించిన హక్కులు. వీటిని కించపరుస్తూ మాట్లాడడం ఏ ప్రభుత్వానికీ, ఏ రాజకీయ పార్టీకీ మంచిది కాదు.

కష్టానికి తగ్గ ప్రతిఫలం కావాలి...

తాము ఎంత కష్టపడ్డా అందుకు తగిన ప్రతిఫలం దక్కన్నప్పుడు, తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపన్నప్పుడే ఏ యంత్రాంగమైనా సమ్మెకు సిద్ధమవుతుంది. ఆర్టీసీ కార్మికుల విషయంలోనూ, మున్సిపల్‌ కార్మికుల విషయంలోనూ, ఆశా వర్కర్ల విషయంలోనూ ఇదే జరిగింది. కడుపు మండినవాళ్లే ఉద్యమాలు చేస్తారన్న విషయం సుదీర్ఘకాలం తెలంగాణ ఉద్యమం నిర్వహించిన టీఆర్‌ఎస్‌కు తెలియంది కాదు. ప్రభుత్వ ఉద్యోగుల, ఆర్టీసీ కార్మికుల కోరికల విషయంలో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల, ఆశా వర్కర్ల విషయంలో అందుకు భిన్నమైన వైఖరిని ప్రదర్శించడం, వారి కష్టాలను పోగొట్టే మార్గాలు అన్వేషించకుండా సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించడం విస్మయం కలిగిస్తోంది. ఆశా వర్కర్లు చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సందర్భంలో ఎక్కడికెక్కడ అరెస్టులు చేయడం, మహిళలను రాత్రి పూట పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధించడం లాంటి సంఘటనలు తీవ్ర విమర్శల పాలయ్యాయి. ఈ పరిణామాన్ని ప్రజాస్వామికవాదులెవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. తమ సమస్యల విషయంలో ప్రభుత్వం ఎంత నిర్లప్తంగా ప్రవర్తిస్తున్నా, తమ సమ్మె విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా ఇప్పటిదాకా ఆశా వర్కర్లు సహనంగానే తమ పోరాటాన్ని కొనసాగిస్తుండడం అభినందించదగ్గది. రెండు నెలలుగా సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లకు ఆర్థిక సహాయం అందించేందుకు సీపీఎం చేసిన ప్రయత్నానికి ఒక్కరోజే 17 లక్షల రూపాయల దాకా వసూలవ్వడం, అదీ నెలాఖరునాడు అంత మొత్తంలో దాతలు విరాళాలివ్వడం సమాజంలో ఈ సమ్మె పట్ల వున్న సంఘీభావానికి నిదర్శనం. ఇప్పటికైనా ప్రభుత్వం వీరి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపాలి. 

06:41 - November 6, 2015

హైదరాబాద్ : తెలంగాణలో ఆశా వర్కర్లు సమ్మెకు దిగి 65 రోజులు దాటింది. కానీ, సమస్య పరిష్కారం కాలేదు. ఆశా వర్కర్ల కోరికల విషయంలో ప్రభుత్వం నుంచి ఇంతవరకు సహేతుకమైన ప్రతిపాదనలేవీ రాలేదు. మరోవైపు తమ డిమాండ్స్‌ తీరకుండా సమ్మె విరమించేందుకు ఆశా వర్కర్లు సిద్ధంగా లేరని తెలుస్తోంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఇలాంటి సమయంలో పౌర సమాజం పాత్ర ఏమిటి? ఆశాల డిమాండ్స్‌ విషయంలో ప్రభుత్వం ఎందుకింత ఉదాసీనంగా వ్యహరిస్తోంది? తమ సమ్మె విరమించాలంటే ఆశా వర్కర్లు ప్రభుత్వం నుంచి తక్షణం ఎలాంటి స్పందన కోరుతున్నారు? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నేత జయలక్ష్మి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలంటే ఈవీడియోను క్లిక్ చేయండి..

రాయలసీమ, నాందేడ్, ఉద్యానవన ఎక్స్ ప్రెస్ లలో చోరీ

అనంతపురం : గుత్తిలో దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. రాయలసీమ, నాందేడ్, ఉద్యానవన ఎక్స్ ప్రెస్ లలో చోరీ జరిగింది. కత్తులతో బెదిరించి ప్రయాణీకుల నుంచి 40 తులాల బంగారు నగలు దోచుకెళ్లారు. అనంతపురం వద్ద రైళ్ల పై రాళ్లతో దొంగలు దాడి చేశారు. పలువురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి.

రాజయ్య, కుటుంబ సభ్యులకు 14 రోజుల రిమాండ్

హైదరాబాద్ : మాజీ ఎంపి రాజయ్య, కుటుంబసభ్యులకు న్యాయమూర్తి అజేశ్ కుమార్ 14 రోజుల రిమాండ్ విధించారు. వరంగల్ ఎంజీఎంలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రాజయ్యతో పాటు ఆయన భార్య, కుమారుడిని న్యాయమూర్తి ఎదుట ప్రవేశ పెట్టారు. పోలీసులు వారిపై 498 ఏ, 306, 174 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను వరంగల్ సెంట్రల్ జైల్ కు తరలించారు.

భారత్ కు మాఫియా డాన్ ఛోటా రాజన్

హైదరాబాద్ : మాఫియా డాన్ ఛోటా రాజన్‌ను సీబీఐ, ఢిల్లీ, ముంబై పోలీసు అధికారులతో కూడిన బృందం భారత్‌కు తీసుకువచ్చింది. ఇండోనేసియాలోని బాలి నుంచి గురువారం(భారత కాలమానం ప్రకారం) రాత్రి 7.45 గంటలకు బయల్దేరిన ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం 5:50 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అయితే ఛోటా రాజన్‌ రాక నేపథ్యంలో పాలం విమానాశ్రయంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు, స్వాట్ టీమ్స్ ను విమానాశ్రయం వద్ద మోహరించారు. రెండు దశాబ్దాల తర్వాత ఛోటా రాజన్ భారత్కి రావడంతో ఒక్కసారిగా ముంబైలో వాతావరణం వేడెక్కినట్లు తెలుస్తోంది.

Don't Miss