Activities calendar

09 November 2015

విజయవాడలో ఘరానా మోసం

కృష్ణా : విజయవాడలో ఘరానా మోసం జరిగింది. ఉద్యోగాల పేరుతో రూ.6 కోట్లకు టోకరా పెట్టారు. ఐవోసీలో ఉద్యోగాల పేరుతో ముగ్గురు వ్యక్తులు మోసాలకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. 

హార్టికల్చర్ హబ్ గా రాయలసీమ : చంద్రబాబు

కడప : రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మారుస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. కడప జిల్లా నుంచే ప్రారంభిస్తామని చెప్పారు. ఇక్కడి నాయకుడు రాజకీయ నిరుద్యోగి అని ఎద్దేవా చేశారు.

 

రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

తిరుమల : రెండో ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కొండచరియలు విరిగిపడుతుండటంతో టిటిడి.. రాత్రి 10 గంటలకే రెండు ఘాట్ రోడ్లను మూసేయనుంది.

 

21:59 - November 9, 2015

ఢిల్లీ : బీహార్‌ ఎన్నికల్లో విపక్షాల ఐక్యతే బిజెపి ఓటమికి కారణమని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. బీహార్‌లో మహాకూటమిని తాము తక్కువ అంచనా వేశామని చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జెడియు, ఆర్జేడి, కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేయడం వల్ల బిజెపికి లాభం చేకూరిందని, మూడు పార్టీలు కలవడం వల్లే మేం ఓడిపోయామన్నారు. ప్రజాతీర్పును గౌరవిస్తామని, అక్కడ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమికి మోహన్‌ భగవత్‌ చేసిన రిజర్వేషన్ల అంశం కారణం కాదని, పార్టీ నేతలు హుందాగా మాట్లాడాలని సూచించారు. బీహార్‌ అభివృద్ధికి కేంద్రం సహాయం చేస్తుందని జైట్లీ తెలిపారు. బీహార్‌ ఎన్నికల ఫలితాలపై బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధాని మోది, బిజెపి చీఫ్‌ అమిత్‌షాతో పాటు 12 మంది సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

 

 

21:57 - November 9, 2015

పాట్నా : బీహార్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి తన పేరు సూచిస్తే ఫలితాలు వేరే విధంగా ఉండేవని బిజెపి నేత, బీహారీ బాబు శత్రుఘ్న సిన్హా అన్నారు. ఇండియా టీవీతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ బిజెపికి ఇంతకన్నా ఎక్కువ సీట్లు వచ్చేవన్నారు. పార్టీ తన సేవలు కోరితే ఎప్పుడు సిద్ధంగానే ఉంటానన్నారు. అంతకుముందు పాట్నాలో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను కలిసి పొగడ్తలతో ముంచెత్తారు. నితీష్‌ గొప్ప నేత అని, బీహార్‌ అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై బిజెపి చర్యలు తీసుకుంటే ఏం చేయలేనని చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న శత్రుఘ్న సిన్హా పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ఉమాభారతి పార్టీ పెద్దలను కోరారు.

21:54 - November 9, 2015

త్రివేండ్రం : బార్‌ స్కాం కేసులో కేరళ ఆర్థికమంత్రి కె ఎం మణికి ఉచ్చు బిగుసుకుంటోంది. బార్‌ స్కాంలో కె ఎం మణి పాత్రపై విచారణ జరిపించాలని కేరళ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. బార్‌ స్కాం కేసులో కెఎం మణికి విజిలెన్స్‌ కోర్టు ఇచ్చిన స్టేను హైకోర్టు తిరస్కరించింది. బార్‌ లైసెన్స్‌లకు రెనివల్‌ చేయడానికి ఆర్థిక మంత్రి కెఎం మణి కోటి రూపాయలు డిమాండ్‌ చేశారని హోటల్ యజమాని బిజు రమేష్‌ ఆరోపించారు. కెఎం మణి రాజీనామా చేయాలంటూ వామపక్షాలు డిమాండ్‌ చేశాయి. విపక్షాలు రాజకీయం చేస్తున్నాయంటూ సిఎం ఊమెన్‌ చండీ ఆర్థికమంత్రి రాజీనామాను తిరస్కరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్షాలు బార్‌స్కాం అస్త్రాన్ని ప్రయోగించడంతో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడిఎఫ్‌ రెండో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో కెఎం మణి రాజీనామా చేయాల్సిందేనంటూ కాంగ్రెస్‌ హైకమాండ్‌ ముఖ్యమంత్రి ఊమెన్‌ చండీని ఆదేశించినట్టు సమాచారం.

 

 

21:49 - November 9, 2015

సర్వేలు బోల్తా కొట్టాయి. ప్రచార ఆర్భాటాలు పేలయ్యాయి. బీహారీలెవరో... బాహారీలెవరో తేల్చేశారు. అసహనం అవసరం లేదని ఓటు గుద్ది చెప్పేశారు. ఫలితం బీహార్ మహా విజయం. లౌకిక విలువలకు పట్టం కట్టిన బీహార్ ఎన్నికల ఫలితాలు..., దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది. ఇదే ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం. ఆ.. వివరాలను వీడియోలో చూద్దాం...

21:36 - November 9, 2015

వండర్ కిడ్, అపార జ్ఞాపకశక్తి కలిగిన నల్గొండ జిల్లాకు చెందిన చిన్నారి స్ఫూర్తితో టెన్ టివి ఇంటర్వ్యూ నిర్వహించింది. రెండు ఏళ్ల వయసున్న స్ఫూర్తికి... ప్రతిభ మెండుగా ఉంది. చిన్న వయసు నుంచే జ్ఞాపకశక్తి మెండుగా ఉంది. 196 దేశాలు, వాటి రాజధానుల పేర్లు చెప్పింది. పలువురు రాజకీయనేతలు, హీరోలను ఇమిటేట్ చేసి చూపించింది. పలు సినిమాల్లోని డైలాగ్స్ వినిపించింది. అడిగిన పలు ప్రశ్నలకు టక టకా సమాధానం చెప్పింది. ఆ చిన్నారి తెలిపిన మరిన్ని ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

21:19 - November 9, 2015

ఖమ్మం : రైతుల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా భద్రాచలం సరిహద్దుల్లో సీపీఎం నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజయ్య మాట్లాడారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని, తక్షణమే వారు తీసుకున్న లోన్లను బేషరతుగా రుణమాఫీ చేయాలని కోరారు. ఈ సందర్భంగా 'రైతుల ఆత్మహత్యలను నిలపాలని' డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. అదే విధంగా భద్రాచలంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 

21:13 - November 9, 2015

నెల్లూరు : జిల్లాలో భారీ అవినీతి చేప ఏసీబీ గాలానికి చిక్కింది. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బిల్డింగ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న కోట్ల కృష్ణయ్య ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. హైదరాబాద్ మల్కాజ్ గిరీ, బెంగళూరులోని గోగనహళ్లి, నెల్లూరు నేతాజీ నగర్ లో కృష్ణయ్యకు సంబంధించిన ఆస్తులపై ఏకకాలంపై తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆదాయానికి మించి 2కోట్ల ఆస్తులున్నట్టు అధికారులు గుర్తించారు. కృష్ణయ్యను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు బ్యాంకుల్లో ఉన్న 2 లాకర్ల గురించి ప్రశ్నిస్తున్నారు.

 

21:04 - November 9, 2015

హైదరాబాద్ : విద్వేషంపై అసహనం, విభజనపై ఐక్యత. బీహార్ ఎన్నికలు తీర్పు సారాంశమిది. మహాకూటమి విజయం, బీజేపీ ఓటమి మన తెలుగు రాష్ట్రాల పాలకులకు నేర్పుతున్న పాఠమేంటి. బీహార్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలకు , ప్రస్తుత రాజకీయాలకు పలు సంకేతాలు పంపాయి. అహంపై అణకువ సాధించిన విజయంగా చాలా మంది అభివర్ణిస్తున్నారు. స్పష్టమైన మెజార్టీ, మిత్రపక్షాలు అవసరం లేకపోయినా నెగ్గుకురాగలమనే ధీమా, హిందుత్వ ఎజెండాతో తాను అనే భావనే మోదీ, అమిత్ షాలను గట్టి దెబ్బ తీసిందనేది విశ్లేషకులు చెబుతున్నమాట. నియంతృత్వ పోకడలు, దేశాన్ని ప్రభావితం చేసేలా సంచలన ఘటనలు చోటుచేసుకున్నా...ప్రధాని స్థానంలో ఉండి స్పందించ లేదు. అలాగే క్యాబినెట్ ఏ ఒక్క విషయంపై విచారం వ్యక్తం చేయలేదు. మెజార్టీ ఉందనే తలబిరుసుతో ప్రతి ఒక్కరు మనం చెప్పిందే వినాలి, మనం ఇచ్చిన దాంతోనే ఎంతటి వాడైనా సంతృప్తి పడాలనే ఆలోచనతో ముందుకెళ్లారు. రాష్ట్రపతి నుంచి సామాన్యుడి వరకు మీరు వెళ్తున్న దారి అడ్డదారి అని చెప్పినా పట్టించుకోని వైనం, వెరసి బీహార్ రూపంలో ప్రజలు మోదీ- అమిత్ షాలకు బుద్ది చెప్పారనేది సుస్పష్టం.
కేసీఆర్ నియంతృత్వ పోకడపై విమర్శలు
మన రెండు తెలుగు రాష్ట్రాలకు బీహార్ ఫలితం గుణపాఠమే నేర్పుతోంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడతో పోతున్నారనేది విపక్షాలు మండిపడుతున్న అంశం. సెక్రటేరియట్ మార్పు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, ఉస్మానియా తరలింపు వంటి నిర్ణయాలు, మళ్లీ వెనక్కి తీసుకోవడం, వరంగల్ ఎన్ కౌంటర్ లాంటి ఘటనలపై ఇప్పటి వరకు సీఎం స్థాయి వ్యక్తి రెస్పాండ్ కాలేదు. జీహెచ్ ఎంసీ సమ్మె కార్మికులను విధులను నుంచి తొలగించడం, యూనియన్లు, లెప్ట్ పార్టీలు, ప్రతిపక్షాలపై నోటికొచ్చినట్లు దురుసుగా ప్రవర్తిస్తుండటంపై జనసామాన్యంలో చర్చ జరుగుతోంది. మంత్రుల నోరు జోరు, ప్రభుత్వ పథకాల అమలులో ఎమ్మెల్యేల దుందుడుకు చర్యలు, లోకల్ సెటిల్ మెంట్లు ఇలా కేసీఆర్ పాలనపై ప్రజల్లో ఒక రకమైన భావన నెలకొంది. ప్రజలు అధికారం ఇచ్చారు కదా అని తమకు నచ్చినట్లు వ్యవహరిస్తే.. అహం ప్రదర్శిస్తే మోదీకి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో చూశాం. ప్రజలు తెలివైన వారు. అభిమానిస్తారు అలాగే ఓటుతో తాట తీస్తారు కూడా.
ఇసుక మాఫియా దందాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు?
ఇక ఏపీ సీఎం చంద్రబాబు పాలనే చూద్దాం. టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుక ర్యాంప్ లు, ఇసుక మాఫియా దందాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. కృష్ణా జిల్లాలో చింతమనేని ప్రభాకర్ వనజాక్షి అనే మహిళపై చేయి చేసుకున్నారు. అయినా సదరు నేతపై చర్యల్లేవు. భోగాపురం ఎయిర్ పోర్టు బాధితుల గోడు పట్టకుండా ముందుకెళుతున్నారు. రాజధాని విషయంలో రైతుల ఆందోళన పట్టించుకోకపోవడం లేదు. బందరు పోర్టు నిర్వాసితుల గోడు వినడం లేదు. అలాగే విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతినివ్వడం, ఎమ్మెల్యేలు లోకల్ సెటిల్ మెంట్లలో తలదూర్చడం ఇలాంటి వ్యవహారాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ముందుకెళుతోంది. అధికారం ఇచ్చారు కదా ఎలాగైనా వ్యవహరిస్తామనే భావనతో ముందుకెళుతున్నట్టు కనిపిస్తోంది. బీహార్ ఫలితాల తర్వాతైనా బాబు పాలనా తీరు, ఎమ్మెల్యేల ఆలోచనాతీరులో మార్పు వస్తుందని భావిద్దాం. లేకపోతే ఇక్కడ కూడా బీహారే రిపీట్ అవుతుంది.

 

20:58 - November 9, 2015

నల్గొండ : దేశంలో అభద్రతా భావం సృష్టించడం వల్లే బీహార్‌లో బీజేపీ ఓటమి పాలయ్యిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి విమర్శించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ లో సిపిఎం జిల్లా ప్లీనరీ సమావేశాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ దేశాన్ని ఒక మతరాజ్యంగా మార్చేందుకు ప్రయత్నించారని, చివరకు అహారపు అలవాట్లకు మతాన్ని అంటకట్టారని పేర్కొన్నారు. దేశంలో అభద్రతాభావం పెరుగుదలకు సహకరించారని తమ్మినేని మండిపడ్డారు. కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్షాల గెలుపు, బీహార్ ఎన్నికల్లో లౌకికశక్తుల విజయం ఆహ్వానించదగిన పరిణామాలని తమ్మినేని అన్నారు. 

తిరుమలలో మళ్లీ విరిగిపడిన కొండచరియలు

చిత్తూరు : తిరుమలలో కొండ చరియలు మళ్లీ విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులోని 8వ కిమీ వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టిటిడి సిబ్బంది బండరాళ్లను తొలగిస్తోంది.  

20:49 - November 9, 2015

విశాఖ : జిల్లా ఏజెన్సీలో వైసిపికి చేదు అనుభవం ఎదురైంది. బాక్సైట్ ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్లిన వైసిపి బందాన్ని గిరిజునులు అడ్డుకున్నారు. వైసిపి కార్యకర్తలను, మీడియా ప్రతినిధులను అడ్డుకుని, నిర్బంధించారు. తమ అనుమతి లేకుండా ఎవరూ రావొద్దంటూ హెచ్చరించారు. తమ అనుమతిలేకుండా ఎవరొచ్చినా అడ్డుకుంటామని చెప్పారు. 'మీ సమస్యలు పరిష్కరించడానికే వచ్చాం' అని ఎమ్మేల్యే ఈశ్వరి గిరిజనులకు సర్ది చెప్పారు. బాక్సైట్ తవ్వకాలను వైసిపి అడ్డుకుంటుందని ఈశ్వరీ హామీ ఇచ్చారు. జగన్ ను ఈ ప్రాంతంలో పర్యటించే ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.

 

ముగిసిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ఢిల్లీ : బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. బీహార్ ఓటమిపై సమీక్ష చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, పలువురు మంత్రులు, నేతలు హాజరయ్యారు. 

విశాఖ ఏజెన్సీలో వైసిపికి చేదు అనుభవం

విశాఖ : జిల్లా ఏజెన్సీలో వైసిపికి చేదు అనుభవం ఎదురైంది. వైసిపి కార్యకర్తలను గిరిజనులు అడ్డుకుని, నిర్బంధించారు. 'మా అనుమతిలేకుండా ఎవరొచ్చినా అడ్డుకుంటాం' అని చెప్పారు.

 

ప్రణబ్ ముఖర్జీతో మోహన్ భగవత్ భేటీ..

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భేటీ అయ్యారు. ఈమేరకు ఇవాళ ఆర్‌ఎస్‌ఎస్ ట్విట్టర్‌లో అధికారికంగా పేర్కొన్నారు. ఇవాళ భగవత్ రాష్ట్రపతిని కలిశారని అరగంటపాటు చర్చించారని వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి భగవత్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

 

ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి

పశ్చిమ గోదావరి : జిల్లాలోని నిడదవోలు మండలం సూరాపురం గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ద్విచక్రవాహనంపై వస్తుండగా వెనుక నుండి వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొనడంతో అంజనేయులు (26)అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

 

తిరుమల రెండోఘాట్‌లో విరిగిపడిన కొండచరియలు

చిత్తూరు : తిరుమల రెండోఘాట్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. మోకాళ్లమిట్ట సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. బండరాళ్లను తొలగించేందుకు టీటీడీ సిబ్బంది యత్నం చేస్తున్నారు. లింక్‌ రోడ్డు ద్వారా వాహనాలు తిరుమలకు మళ్లిస్తున్నారు. 

20:02 - November 9, 2015

గుంటూరు : రాజధాని అమరావతి నిర్మాణం కోసం అవసరమైన భూసమీకరణ కోసం రైతులతో రేపు సీఆర్‌డీఏ అధికారులు సమావేశం కానున్నారు. అమరావతి శంకుస్థాపన తర్వాత ఇదే మొట్టమొదటి సమావేశం. ఇప్పటికే 33 వేల ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం తాజాగా భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతులను టార్గెట్‌ చేసింది. ఉండవల్లి, పెనుమాక వంటి గ్రామాల్లో భూములను ఇచ్చేందుకు రైతులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో భూసేకరణ అస్త్రాన్ని ప్రయోగించి వీరి భూములను సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఇదే అస్త్రాన్ని ప్రభుత్వం ప్రయోగించినప్పటికీ దానికి ఎటువంటి ప్రాముఖ్యం లేకుండా పోయింది. రేపు జరగనున్న ఈ సమావేశంలో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సి ఉంది.

 

19:59 - November 9, 2015

హైదరాబాద్ : ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు... వీధి రౌడీలా మాట్లాడుతున్నారని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. కర్నూలు జిల్లాలో ఇవాళ బాబు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాయలసీమకు అన్యాయం చేసింది చంద్రబాబే అన్నారు. అసలు బాబు ఈ ప్రాంతంలో ఏ ప్రాజెక్ట్ పూర్తి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

 

19:56 - November 9, 2015

కర్నూలు : ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు ఓర్వకల్లు దగ్గర 120 ఎకరాలలో 20 కోట్లతో ఉర్దూ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. యూనివర్సిటీ పేరును అబ్దుల్ హక్ గా నామకరణం చేశారు. ఓర్వకల్లులో 900 ఎకరాలలో ఎడ్యుకేషన్ హబ్ ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. సీమ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. రాయలసీమ అభివృద్ధి కోసం చివరి రక్తపు బొట్టు వరకూ పాటుపడతానని చెప్పారు. 'నేను రాయలసీమ వాడినేనని.. కర్నూలులోనే తిష్ట వేసి అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు.

 

19:45 - November 9, 2015

విజయవాడ : గోవింద్‌ పన్సారే హత్య వెనుక ఆర్ఎస్‌ఎస్‌ హస్తం ఉందని ఆయన కుమార్తె స్మితా పన్సారే ఆరోపించారు. ఎపియుడబ్ల్యుజె రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కంచల జయరాజ్ అధ్యక్షతన విజయవాడలో జరిగిన మీట్ ది ప్రెస్ లో స్మితా పన్సారే పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడిన కారణంగానే గోవింద్‌ పన్సారేని హత్య చేశారని తెలిపారు. ఈ హత్య వెనుక సనాతన సంస్ధతో పాటు ఆర్ ఎస్ ఎస్ కు సంబంధాలున్నాయని ఆరోపించారు. దభోల్కర్, గోవింద్ పన్సారే, కల్బుర్గి హత్యల వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. ఈ హత్యల వెనుకుండి నడిపిసున్న సంస్ధలను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

19:36 - November 9, 2015

హైదరాబాద్ : కరీంనగర్ క్రైం బ్రాంచ్ ఏఎస్ఐ మోహన్ రెడ్డిని నాలుగు రోజుల పాటు విచారించిన సీబీసీఐడీ అధికారులు... ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఫైనాన్స్ వ్యాపారంతో పలువురిని వేధించినట్టు మోహన్ రెడ్డిపై ఆరోపణలొచ్చాయి. కెన్ క్రిస్ట్ విద్యాసంస్థల అధినేత ప్రసాదరావు ఆత్మహత్యతో... మోహన్ రెడ్డి ఫైనాన్స్ వ్యాపార ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. మోహన్ రెడ్డి ఫైనాన్స్ వ్యాపారంలో ఐదుగురు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు కూడా ఉన్నట్టు సమాచారం. ఐదుగురు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు కూడా ఫైనాన్స్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడైంది. 42మంది బినామీలతో పాటు బంధువులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో మరింత మంది పోలీస్ అధికారుల పేర్లు గుట్టురట్టయ్యే అవకాశం ఉంది. 

19:34 - November 9, 2015

గుంటూరు : జిల్లాలోని వెల్దుర్తి మండలానికి చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థిని రాపోలు తిరుపతమ్మ ఆత్మహత్యకు నిరసనగా మాచర్ల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని విద్యార్థి సంఘాలు, వందలాది మంది విద్యార్థులు సంఘీభావంగా ర్యాలీలో పాల్గొన్నారు. తిరుపతమ్మ మృతికి సంతాపం తెలియజేసి వారి తల్లిదండ్రులను పరామర్శించారు. తిరుపతమ్మ మృతికి కారణమైన ఆరుగురు యువకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

 

19:28 - November 9, 2015

హైదరాబాద్ : తెలంగాణ డీజీపీగా నియమించుకోవడానికి యుపీఎస్‌సీ పానల్‌ కమిటీ మూడు పేర్లను ఖారారు చేసింది. ప్రస్తుతం తాత్కాలిక డీజీపీగా ఉన్న అనురాగశర్మతో పాటు ఆరుణాబహుగుణ, ఎకె ఖాన్‌ పేర్లకు క్లియరెన్స్‌ లభించింది. ఈ పేర్లను పరిశీలించిన అనంతరం వీరిలో ఎవరినైనా డీజీపీగా నియమించుకునే అధికారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం ఒకసారి డీజీపీగా నియమితులైన అధికారి రెండేళ్లు కొనసాగాల్సి ఉంటుంది. 

తెలంగాణ డీజీపీ నియామకం కోసం ముగ్గురి పేర్లతో జాబితా

హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ నియామకం కోసం ముగ్గురి పేర్లతో యూపీఎస్సీ జాబితాను ఖరారు చేసింది. ఆ లిస్ట్‌లో అనురాగ్‌శర్మ, అరుణా బహుగుణ, ఏకే ఖాన్‌ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. 

బీహార్ ఫలితాలు బీజేపీ, మోడీలకు చెంపపెట్టు : వీరయ్య

నల్గొండ : బీహార్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి, మోడీలకు చెంపపెట్టు అని సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు అన్నారు. నకిరేకల్ లో సీపీఎం జిల్లా ప్లీనరీ సమావేశాలు జరిగాయి. నల్గొండను కరవు జిల్లాగా ప్రకటించాలని తీర్మానం చేశారు. ఈ సమావేశాలకు హాజరైన వీరయ్య మాట్లాడుతూ ఆర్ ఎస్ ఎస్, మోడీ విచ్ఛిన్నకర ఎత్తుగడలను బీహార్ ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు. బీహార్ లో మోడీది ప్రత్యక్ష ఓటమన్నారు.

 

18:37 - November 9, 2015

మహిళల వస్త్రధారణలో ఆల్ టైం ఫేవరేట్ చీర. పండుగ, వివాహం లాంటి ప్రత్యేక సందర్భాలకు అయితే పట్టుచీరలే స్పెషల్ అట్రాక్షన్. అలాంటి లేటెస్ట్ పట్టుచీరలతో ఇవాళ్టి సొగసు ముస్తాబయి వచ్చింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...


 

18:35 - November 9, 2015

ఒకప్పటి అభిరుచి ఆమెకు వ్యాపారంలో అడుగుపెట్టేందుకు సహకరించింది. ఆమె ఆసక్తి అందుకు మార్గాన్ని సుగమం చేసింది. ఆధునిక యువతకు సన్నిహితమైన ఫేస్ బుక్ ను వేదికగా మార్చుకుంది. అలా వ్యాపకాన్ని వ్యాపారంగా మలుచుకుంటూ ముందుకు సాగుతున్న అతివ కథనంతో ఇవాళ్టి స్ఫూర్తి మీ ముందుకు వచ్చింది. ఊహ తెలిసిన నాటి నుండే ఎంతో మంది ఎన్నో కలలు కంటారు. భవిష్యత్ జీవితం గురించి ఎన్నో లక్ష్యాలను నిర్ధేశించుకుంటారు. ఎంచుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు, కలలను సాకారం చేసుకునేందుకు శ్రమిస్తారు. ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా ఎంచుకున్న రంగంలో కృషి చేసేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి వారిలో ఒకరు నృత్య. చిన్ననాటి ఆసక్తే ఆమె ఆలోచనలకు ప్రాణం పోసింది. కాలానికి తగ్గట్లు కళలో మార్పుకు ఆహ్వానం పలికింది. అద్భుత కళాఖండాలను సృష్టిస్తోంది. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎంచుకున్న రంగంలో విశిష్ట కృషి చేసి ప్రత్యేకత చాటుతున్న నృత్యను మానవి అభినందిస్తోంది.

అవినీతికి అడ్డాగా కేసీఆర్ ఫాంహౌస్ : మధుయాష్కీ

హైదరాబాద్ : కేసీఆర్ ఫాంహౌస్ అవినీతికి అడ్డాగా మారిందని కాంగ్రెస్ నేత మధుయాష్కీ విమర్శించారు. ఓట్లను చీల్చి కేసీఆర్ కు సహకరించేందుకే వరంగల్ ఉప ఎన్నికల్లో వైసిపి పోటీ చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు బిజెపి, వైసిపితో కేసీఆర్ తెరచాటు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ దోపిడీని అడ్డుకోవాలంటే వరంగల్ లో టీఆర్ ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ లో వామపక్షాలతో కలిసి పని చేస్తామని తెలిపారు.

 

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి : రామకృష్ణ

విజయవాడ : అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని సీపీఐ ఎపి కార్యదర్శి రామకృష్ణ అన్నారు. నిత్యవసర ధరలు తగ్గేవరకు పోరాటం చేస్తామని చెప్పారు. 1400 మెట్రిక్ టన్నుల కందిపప్పును ఎపికి పంపుతామన్నారు. వెంకయ్య మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు.

17:24 - November 9, 2015

కర్నూలు : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల మనోభావాలతో పనిలేకుండా ముందుకు వెళ్తే.. బీహార్ లో పట్టిన గతే రేపు చంద్రబాబుతో సహా అందరు ముఖ్యమంత్రులకు పడుతుందని జేసీ అన్నారు. ప్రజల్లో మోడీ, చంద్రబాబుపై భారీ ఆశలే ఉన్నాయని.. వాటిని నెరవేర్చకపోతే.. బీహార్ ఫలితాలు మరోసారి రిపీట్ అవుతాయన్నారు.

 

17:18 - November 9, 2015

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీలో సమ్మె చేసి ఉద్యోగాలు కోల్పోయిన పారిశుధ్య కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లో ఇంటింటికీ రెండు బుట్టలు.. స్వచ్ఛ ఆటో టిప్పర్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. సఫాయి కార్మికులపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు. జంటనగరాలు పరిశుభ్రంగా ఉండాలన్నదే తన ధ్యేయమని సీఎం అన్నారు. పారిశుధ్య కార్మికుల జీతాల పెంపు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు.

 

17:11 - November 9, 2015

హైదరాబాద్ : ఎస్ ఎఫ్ ఐ, ఏఐఎస్ ఎఫ్, పిడిఎస్ యూ ఆధ్వర్యంలో ఓయూ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించారు. వరంగల్‌ స్వతంత్ర అభ్యర్థి గాలి వినోద్‌కుమార్‌కు ఓయూ రిజిస్ట్రార్‌ నోటీసులు ఇవ్వడంపై ఆందోళనకు దిగారు. వెంటనే నోటీసులు ఉపసంహరించుకోవాలని విద్యార్థుల డిమాండ్‌ చేశారు.

 

17:00 - November 9, 2015

చెన్నై : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తమిళనాడులోని కడలూరు వద్ద తీరం తాకింది. చెన్నైకు ఆగ్నేయంగా 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం.. కొద్దిసేపటి క్రితం తీరం తాకింది. ఇది తీరం దాటేందుకు మరో 2 గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుమ్మలపెంట వద్ద సముద్రం 500 మీటర్లు ముందుకొచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

 

16:40 - November 9, 2015

హైదరాబాద్ : తెలంగాణకు బంగారు ఏనుగు మళ్లీ వస్తోంది. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో చిన్నారులను అలరించేందుకు వివిధ సినిమాలు రెడీగా ఉన్నాయి. ప్రారంభ, ముగింపు సమావేశాలు శిల్పకళావేదికలో జరగబోతున్నాయి.. ఈ వేడుకలకు బాలీవుడ్, టాలీవుడ్ తారలు హాజరై సందడి చేయబోతున్నారు.
హైదరాబాద్‌లోని బాలల చిత్రాల ప్రదర్శన
అంబరాన్ని తాకే చిన్నారుల రంగులవేడుకకు సర్వం సిద్ధమైంది.. ఈ నెల 14నుంచి 19వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతోంది... చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఇండియా, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించబోతోంది.. ఇందులో పాల్గొనేందుకు స్వీడన్, ఈజిప్ట్, రిపబ్లిక్ ఆఫ్ అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, స్విట్జర్లాండ్‌లాంటి దేశాలు ఉత్సాహం చూపిస్తున్నాయి.. ఈసారి తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వారంరోజులు హైదరాబాద్‌ ప్రసాద్ ఐమాక్స్‌తోపాటు.. నగరంలోని మరో 12 థియేటర్లలో బాలల చిత్రాలను ప్రదర్శించబోతున్నారు.. దేశ, విదేశాలకుచెందిన దాదాపు 300చిత్రాలను ఈ ఉత్సవాల్లో ప్రదర్శనకు రెడీ చేశారు. ఈ ఫెస్టివల్‌కోసం 12వందల 4 ఎంట్రీలు వచ్చాయి.. ఇందులో 19 తెలుగు చిత్రాలున్నాయి.
శిల్పారామంలో లిటరరీ ఫెస్టివల్
ఈ ఫిలిం ఈవెంట్‌లో దాదాపు 2లక్షలమంది పాల్గొంటారని అధికారులు అంచనావేస్తున్నారు.. ఈసారి డిజిటల్‌ ఇన్‌స్టాలేషన్ పేరిట వివిధ ఆకర్షణీయమైన కాన్సెప్ట్‌లను ప్రవేశపెడుతున్నారు అధికారులు.. క్రోమ్యాజిక్ కాన్సెప్ట్‌ ద్వారా పిల్లలు తమ సూపర్‌ హీరోలా గాలిలో ఎగిరే అనుభూతిని పొందొచ్చని ఫెస్టివల్‌ డైరెక్టర్ తెలిపారు.. ఇక చిన్నారులకు ప్రత్యేకంగా శిల్పారామంలో లిటరరీ ఫెస్టివల్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు.. దేశ, విదేశాలనుంచి వచ్చే అతిధులకు సోమాజిగూడ పార్క్‌ హొటల్‌లో విడిది ఏర్పాటుచేయబోతున్నారు.

16:34 - November 9, 2015

పాట్నా : బీహార్‌ ఎన్నికల్లో నితీష్‌ కూటమి మోది కూటమికి చెక్‌ పెట్టింది. ఈ ఎన్నికల్లో మోది ఇమేజ్‌ కన్నా నితీష్‌కుమార్‌కున్న పాపులారిటే పనిచేసింది. బిహార్‌ ఎన్నికల్లో నితీష్‌ విజయం వెనక గల 10 కారణాలను ఇపుడు చూద్దాం.
1. నితీష్‌ పాపులారిటీ
బీహార్‌లో తిరుగులేని నేతగా నితీష్‌కుమార్‌ పేరు సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్‌వైపే అన్ని సర్వేలు మొగ్గు చూపడమే ఇందుకు నిదర్శనం. గుజరాత్‌లో మోది, మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్, ఛత్తీస్‌గడ్‌లో రమన్‌సింగ్, ఒడిషాలో నవీన్‌ పట్నాయక్‌ మాదిరి నితీష్‌ కూడా బీహార్‌లో పాపులారిటీ సంపాదించారు. ఆయనకున్న ఇమేజే మూడోసారి నితీష్‌కు విజయం సాధించి పెట్టింది.
2. స్టేట్‌ వర్సెస్‌ లోక్‌సభ
ఎన్నికల్లో ఓటర్లు ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను వేరు వేరుగా చూస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఢిల్లీలో మొత్తం 7 ఎంపీ సీట్లను బిజెపి గెలుచుకోగా... అసెంబ్లీ ఎన్నికల్లో సిఎంగా కేజ్రీవాల్‌కు ఓటర్లు పట్టం కట్టారు. బీహార్‌లో కూడా అదే సీన్ రిపీట్‌ అయింది. లోక్‌సభ ఎన్నికల్లో మోది తరపున పనిచేసిన ప్రచార వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌- ఈసారి నితీష్‌కుమార్‌ కమ్యునికేషన్‌ టీంకు పనిచేయడం కూడా కలిసొచ్చింది. బిహారీ, బాహరీ అనే నినాదం ఓటర్లను ప్రభావితం చేసింది.
3. ఆర్‌ఎస్‌ఎస్‌ రిజర్వేషన్‌
కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసే అంశంపై ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందని ఆర్ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు బిజెపిని ఇరకాటంలో పెట్టాయి. అగ్రవర్ణాలు- వెనకబడ్డ తరగతుల మధ్య పోరాటంగా లాలూ అభివర్ణించారు. తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదంటూ బిజెపి చెప్పుకోవలసి వచ్చింది.
4. మైనారిటీల నమ్మకం కోల్పోయిన బిజెపి
బిజెపిని మొదటి నుంచి ముస్లింలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దాద్రీ ఘటన, బీఫ్‌ వివాదం బిజెపికి ముస్లిం ఓటర్లను మరింత దూరం చేశాయి. 2014 ఎన్నికల్లో బిజెపికి అండగా నిలిచిన ముస్లింలు ఇపుడు రివర్స్‌ అయ్యారు.15 శాతం ముస్లిం ఓటర్లు నితీష్‌ కూటమి విజయానికి కారణమయ్యారు.
5. పనిచేయని ఓవైసీ షో
మైనారీటిల తరపున వకాల్తా పుచ్చుకున్న ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీని ఓవైసీ బీహార్‌ బరిలోకి తమ పార్టీ అభ్యర్థులను దింపారు. ఎంఐఎం పోటీ వల్ల తమకు లాభం చేకూరుతుందని బిజెపి భావించింది. కాని ఓవైసీ బిహార్‌ ముస్లింలపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు.
6. మహాకూటమికి కలిసొచ్చిన కాంగ్రెస్‌ ఓట్లు
దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వీస్తున్న ఎదురు గాలిని బిజెపి ఓట్ల రూపంలో క్యాష్‌ చేసుకోలేకపోయింది. ఢిల్లీలో కాంగ్రెస్‌ ఓట్లు ఆప్‌కు మళ్లాయి. కానీ బీహార్‌ పరిస్థితి వేరు. జెడియు- ఆర్జేడితో కాంగ్రెస్‌ జత కూడడంతో హస్తం ఓట్లు మహాకూటమికి కలిసొచ్చాయి.
7. పనిచేయని మోది మంత్రం
భారత్‌లో పాపులర్‌ లీడర్‌గా పేరొందిన మోది 2014 ఎన్నికల్లో బిజెపికి ఘన విజయం సాధించి పెట్టారు. అధికారంలోకి వచ్చాక మతతత్వ శక్తుల ఆగడాలు మితిమీరాయి. పప్పల ధరలు పెరిగిపోయాయి. పలు సమస్యలపై మోది మౌనం వహించడం కూడా ఆయన పట్ల వ్యతిరేకత పెరిగింది.
8. బిజెపికి స్థానిక నేతల లేమి
ఒకప్పుడు బిజెపికి స్థానిక నేతలే బలం. గుజరాత్‌లో మోది, మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్‌ చౌహాన్, ఛత్తీస్‌గడ్‌లో రమన్‌సింగ్‌, రాజస్థాన్‌లో వసుంధరా రాజే స్థానికంగా పాపులర్‌ నేతలు. బీహార్‌లో పాపులర్‌ నేత లేకపోవడం బిజెపికి పెద్ద లాస్‌.
9. దళితులను కుక్కలతో పోల్చిన వికె సింగ్
ఫరిదాబాద్‌లో దళిత కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు సజీవదహనానికి గురైన ఘటనపై కేంద్ర మంత్రి వికె సింగ్‌ వారిని కుక్కలతో పోల్చుతూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కుక్కలపై రాళ్లు వేస్తే కూడా ప్రభుత్వానికేం సంబంధం అంటూ సింగ్‌ వ్యాఖ్యానించారు. దళిత ఓట్లపై ఇది ప్రభావం చూపింది. దీనిపై లాలూ, నితీష్‌ బిజెపి నేతలను టార్గెట్‌ చేశారు.
10. నో హెలిక్యాప్టర్‌
నితీష్‌ కుమార్‌ తన ప్రచారంలో ఎక్కడా హెలిక్యాప్టర్‌ ఉపయోగించలేదు. ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ నితీష్‌ కుమార్‌కు ప్రచారానికి సంబంధించిన టిప్స్‌ చెప్పాడు. ఇందులో భాగంగానే నితీష్ ' హర్‌ ఘర్‌ దస్తక్‌' ఇంటింటి ప్రచారం చేశారు. దీంతో ఓటర్లతో నితీష్‌కు మరింత సాన్నిహిత్యం పెరిగింది. పెద్ద ప్రచార సభల కన్నా చిన్న చిన్న సమూహాల్లో ప్రజలను కలిసేందుకే నితీష్ ప్రాధాన్యత నిచ్చారు.

 

ఓర్వకల్లులో ఉర్దూ వర్సిటీకి శంకుస్థాపన

కర్నూలు : ఓర్వకల్లులో ఉర్దూ వర్సిటీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది నుంచి క్లాసులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉర్దూకు ప్రత్యేక డీఎస్సీ వేస్తామని తెలిపారు. కర్నూలుకు రాజధాని వైభవం తీసుకొస్తామని పేర్కొన్నారు. రాయలసీమకు అన్యాయం చేయనని తేల్చిచెప్పారు.

 

భారత క్రికెట్ లో ఆంధ్రా సెలక్టర్

ఢిల్లీ : భారత క్రికెట్ సెలక్షన్ కమిటీలో ఆంధ్రా వ్యక్తికి చోటు దక్కింది. బిసిసిఐ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఎంఎస్ కె.ప్రసాద్ నియమితులయ్యారు. రోజర్ బిన్నీ స్థానంలో ప్రసాద్ కు అవకాశం లభించింది.

 

రోడ్డు ప్రమాదం..ఎస్ ఐకి గాయాలు

రంగారెడ్డి : అత్తాపూర్ జంక్షన్ వద్ద ఓ ఆర్ ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ ఎస్సై కారు అదుపు తప్పి మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్సై జానకిరాంతోపాటు నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. 

16:12 - November 9, 2015

ఢిల్లీ : రిజర్వేషన్లను సమీక్షించాలంటూ ఆర్ ఎస్ ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ చేసిన వ్యాఖ్యలే బీహార్‌లో కొంపముంచాయంటూ బిజెపీ ఎంపీ హుకుమ్‌దేవ్ మండిపడ్డారు. బీహార్‌లో ఎస్సీ,ఎస్టీల ఓట్లు రాకపోవడానికి ఇదే ప్రధానకారణమని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. బిజెపీ నేతల నోటిదురుసే ఓటర్లను దూరం చేసిందన్నారు.

 

16:10 - November 9, 2015

బర్మా : మయన్మార్‌ పార్లమెంట్‌కు తొలిసారిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రతిపక్ష నేత ఆంగ్‌ సాన్‌ సూకీ చరిత్ర సృష్టించబోతున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఆంగ్‌సాన్‌ సూకీ పార్టీ నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న యూనియన్‌ సాలిడారిటీ అండ్‌ డెవలప్‌మెంట్‌ పార్టీ నేత హిటె తమ ఓటమిని అంగీకరించారు. ప్రజా తీర్పుకు తలవంచుతామని పేర్కొన్నారు. ఎన్‌ఎల్‌డి అత్యధిక పార్లమెంట్‌ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. ఎన్నికల పూర్తి ఫలితాలు ఇంకా రావలసి ఉంది. పాతికేళ్ల తర్వత మయన్మార్‌లో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి.

 

16:01 - November 9, 2015

చిత్తూరు : తిరుమలలో ఈదురుగాలులలో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రెండో ఘాట్‌రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా భక్తులు భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది కొండచరియలను తొలగిస్తున్నారు. 

15:49 - November 9, 2015

కడప : జిల్లాలోని లింగాల మండలం చింతల గ్రామంలో దుండగులు విరుచుకుపడ్డారు. రామాంజనేయులు అనే రైతు పొలంలో ఐదెకరాల అరటి తోటను ధ్వంసం చేశారు. మరో నెల రోజుల్లో పంట చేతికి వస్తుందని ఆశిస్తున్న సమయంలో.. దుండగులు అరటి గెలలను నరికివేయడంతో తీవ్ర నష్టం సంభవించిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరటి సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న తమకు మరో ఆధారం లేదని.. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

 

 

ఆశాలకు మద్దతుగా సీపీఎం సంఘీభావ సభ..

హైదరాబాద్ : ఆశాలకు మద్దతుగా సీపీఎం సంఘీభావ సభ నిర్వహించింది. సీపీఎం సేకరించిన రూ.17.66 లక్షల విరాళాలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆశాలకు అందచేశారు. పట్టుదలతో సమ్మె కొనసాగిస్తున్న ఆశాలకు అభినందనలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చర్చలు జరపకుండా మొండిగా వ్యవహరిస్తోందని, మోడీకి ఎదురైన పరిస్థితులే కేసీఆర్ కు ఎదురవుతుందన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆశాల వెంట ఉంటామని, పోరాడే వారికి ప్రజలు అధికారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. 

శంషాబాద్ వద్ద తుపాకీ కలకలం..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద తుపాకి కలకలం సృష్టించింది. పార్కింగ్ స్థలం వద్ద తుపాకితో తిరుగుతున్న నవీన్ ను సీఐఎస్ఎఫ్ పోలీసులు అరెస్టు చేసి ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. 

కర్నూలుకు రాజధాని వైభవం - బాబు..

కర్నూలు : కర్నూలుకు రాజధాని వైభవం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఓర్వకల్లులో పరిశ్రమలు ఏర్పాటు చేసి వలసలను నివారిస్తామని, ఓర్వకల్లులో ఉర్దూ వర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుండి ఉర్దూ వర్సిటీలో తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఉర్దూకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పారు.

ఏలూరు నిందితుడి ఇంటిపై దాడి..

పశ్చిమగోదావరి : ఏలూరులో నిన్న జరిగిన యువకుడి హత్య ఘటనలో నిందితుడి ఇంటిపై స్థానికులు దాడి చేశారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేసి ఇంటికి నిప్పు పెట్టారు. కుమారుడి హత్య వార్త విని తండ్రి గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. 

దీక్ష విరమించిన సోంపేట ఉద్యమకారులు..

శ్రీకాకుళం : సోంపేట ఉద్యమకారులు దీక్ష విరమించారు. సోంపేట థర్మల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2,165 రోజుల పాటు దీక్ష చేశారు. జీవో 1107 ను ప్రభుత్వం రద్దు చేయడంతో దీక్ష విరమించారు. ఈ దీక్షలను మంత్రి అచ్చెన్నాయుడు విరమింప చేశారు. అక్రమ కేసులు, ఎక్స్ గ్రేషియా, ఇతర సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళుతానని అచ్చెన్నాయుడు తెలిపారు. 

రెవెన్యూ శాఖలో ప్రక్షాళన - మహమూద్ ఆలీ..

నిజామాబాద్ : రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తున్నామని, గత ప్రభుత్వ హాయాంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వాటిని సరిదిద్దుతున్నామని డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ పేర్కొన్నారు. 

బీహార్ ఫలితాలపై ఎంపీ కవిత స్పందన..

నిజామాబాద్ : బీహార్ ఫలితాలు చూసైనా మోడీ కళ్లు తెరవాలని, ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎంపీ కవిత పేర్కొన్నారు.

 

మట్టి సత్యాగ్రహం ప్రారంభం..

గుంటూరు : మట్టి సత్యాగ్రహాన్ని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ప్రారంభించారు. అమరావతితో గౌతమ బుద్ధ ఘాట్ వద్ద మట్టి, నీటిని రఘువీరా సేకరించారు. 

13:36 - November 9, 2015

హైదరాబాద్ : సెన్సేషనల్ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్ మెగా అభిమానులకు దీపావళి కానుకనిచ్చారు. ఆయన డైరెక్షన్‌లోనే వరుణ్‌తేజ్‌, దిశా పటాని జంటగా నటించిన లోఫర్‌ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో రిలీజ్‌ చేసారు. ఇప్పుడు లోఫర్‌ ట్రైలర్‌ ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
తల్లి సెంటిమెంట్ తో సాగే ఎమోషనల్ డ్రామానే 'లోఫర్' కథ అని దర్శకుడు పూరి ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదల చేసిన స్టిల్స్ లోనూ అదే విషయం స్పష్టమవుతోంది. 'దిశా పఠానీ' హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, రేవతి హీరో తల్లి తండ్రులుగా నటిస్తున్నారు. పూరి హీరో అంటే అభిమానుల్లో ఎన్నో అంచనాలు నెలకొంటాయి. రఫ్ అండ్ టఫ్ పాత్రలో 'వరుణ్' ఎలా నటిస్తాడో అని మెగా అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 

13:33 - November 9, 2015

ఢిల్లీ : లోక్‌ అదాలత్‌తో సామాన్యులకు సత్యరన్యాయం లభించిదన్నారు ప్రధాని మోదీ. న్యాయసేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన న్యాయసేవా సదస్సుకు హాజరైన ప్రధాని కోర్టులకు రాలేని వారికి లోక్‌అదాలత్‌లు బాగా ఉపయోగపడతాయన్నారు. లోక్ అదాలత్ ద్వారా 8.50 లక్షల కేసులు పరిష్కారమయ్యాయని, దీనివల్ల 17 లక్షల మందికి న్యాయం చేకూరిందని తెలిపారు. లోక్ అదాలత్ పై పరిశోధన చేసేలా విద్యార్థులను ప్రోత్సాహించాల్సినవసరం ఉందని, వీటిని ప్రోత్సాహిస్తే కోర్టులపై భారం తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

13:30 - November 9, 2015

బీహార్ : రాష్ట్ర ఎన్నికల ఫలితాలతో బీజేపీ నేతలు ఆత్మావలోకనం చేసుకోవాల్సిందేనని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ యాదవ్‌ హితవు పలికారు. ప్రత్యేక ప్యాకేజ్‌లు, ఒంటెద్దు పోకడలతో ప్రజల మనసు గెల్చుకోలేమనే సత్యాన్ని గుర్తెరిగితే మంచిదన్నారు. మోడీ నాయకత్వం సురక్షితం కాదని బీహార్ ప్రజలు భావిస్తున్నారని ఆయన మాటలు చెప్పినంత గొప్పగా చేతలు లేవన్నారు. ప్రధాని మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని లాలూ స్పష్టం చేశారు.

13:28 - November 9, 2015

హైదరాబాద్ : ఇంటింటికి రెండు డస్ట్ బిన్స్ అందించే కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ఇళ్ల నుంచి చెత్తను సేకరించే వారికి కొత్త ఆటోలను ఆయన అందించనున్నారు. చెత్త సేకరణలో కొత్త తరహా కార్యక్రమాలను చేపడుతున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఇంటి దగ్గరనే చెత్తను వేరు చేసి ఇవ్వడం ద్వారా ఉపయోగం ఉంటుందన్నారు. అందులో భాగంగా రెండు బిన్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. 42 లక్షల డస్ట్ బిన్స్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు, శానిటేషన్ వర్కర్స్ కు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు.13 చెత్త సేకరణ కేంద్రాలున్నాయని ఇంకా 12 గుర్తించడం జరిగిందని జనార్ధన్ రెడ్డి తెలిపారు. 

13:25 - November 9, 2015

హైదరాబాద్ : పంజాగుట్టలోని నిమ్స్ లో ఫిజియోథెరపి వైద్యుడు విజయ్‌కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫిజియోథెరపిలో పీజీ పూర్తి చేసుకుని నిమ్స్ లో ఇంటర్న్ షిప్‌ చేస్తున్న విజయ్‌కుమార్.. ఆరో అంతస్తులోని గ్రిల్స్ కు ఉరేసుకున్నాడు. తోటి వైద్యుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. విజయ్‌కుమార్‌ పటాన్‌చెరు వాసిగా గుర్తించారు. ఇక విజయ్‌కుమార్‌ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
పటన్ చెరుకు చెందిన విజయ్ కుమార్ పీజీ పూర్తయ్యింది. మరో రెండు నెలల్లో పూర్తిస్తాయి పట్టా తీసుకొననున్నాడు. అంతలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత కొన్ని రోజులుగా మానసికంగా కృంగిపోయాడని తెలుస్తోంది. అందరిలో కలివిడిగా ఉండేవాడు కాదని, ఇంటి విషయాలు ఇతరులతో చర్చించే వాడు కాదని సమాచారం. మృతుడికి సంబంధించిన కుటుంబసభ్యులు వివరాలు వెల్లడిస్తే ఇతని ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. 

13:23 - November 9, 2015

పశ్చిమగోదావరి : జిల్లా శనివారపుపేటలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిన్న హత్యకు గురైన సంజీవరావు వ్యవహారంలో నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి ఇంటిపై స్థానికులు దాడి చేశారు. ఇంట్లోని సామాన్లను బయటపడేసి ధ్వంసం చేశారు. అనంతరం ఇంటికి నిప్పుపెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపుచేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అసలేం జరిగంది ? 
శనివారపు పేటలో దళిత వాడలో నివాసం ఉంటున్న తేరా నాగేశ్వరరావుకు ముగ్గురు సంతానం. రెండో కుమారుడు తేరా సంజీవరావు ట్రాక్టర్ డ్రైవర్. మరో కుమారుడు రాకేష్ సెంట్రింగ్ పనిచేస్తుంటాడు. రాకేష్ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న పెలిపే స్నేమితులు. ఆదివారం మధ్యాహ్నాం వీరిద్దరితో అదే ప్రాంతంలో నివాసం ఉంటూ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న లంకపల్లి శేఖర్ తో గొడవపడ్డాడు. ఈ వివాదాన్ని సర్దుబాటు చేసేందుకు రాకేష్ అన్న సంజీవరావు శేఖర్ ఇంటికి వెళ్లాడు. గొడవలు ఎందుకని సర్దిచెబుతుండగానే శేఖర్, అతని అన్న చింతారావు ఒక్కసారిగా సమ్మెటతో సంజీవరావు తలపై కొట్టారు. అక్కడికక్కడనే సంజీవరావు మృతి చెందారు. అనంతరం నిందితులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న తండ్రి నాగేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకుని కుమారుడి మృతదేహాన్ని చూసి గుండెపోటుతో కుప్పలికూలిపోయాడు. తండ్రి..కొడుకులు మృతి చెందడంతో శనివారపు పేట దళిత వాడలో విషాద చాయలు అలుముకున్నాయి. 

13:14 - November 9, 2015

హైదరాబాద్ : దీపావళి అనగానే సుందరంగా అమర్చిన దీపాలు.. టపాసుల చప్పుళ్లు, బాణాసంచా కాంతులు ప్రతి మదిలో మెదులుతాయి. ప్రతి ఏడాది ఎన్నో ఆనందోత్సాహాల మధ్య వెలుగుల పండుగను ఘనంగా జరుపుకుని ఉంటాము. ఈసారి మాత్రం బాణాసంచాలు పేలకుండానే పండగ ముగిసేలా కనిపిస్తోంది. పిల్లలకు కాసిన్ని మందులు ఇచ్చినా అదే గొప్ప అనుకునేలా పరిస్థితి తయారైంది.

గత ఏడాదికి భిన్నం..
ప్రతిఏటా దీపావళి పండగకు పది రోజుల ముందు నుంచే పండగ శోభ కనిపించేది. ఈసారి అలా లేదు. గతేడాదికి భిన్నంగా ఈ సంవత్సరం దుకాణాల్లో అమ్మకాల జోరు పెద్దగా కన్పించడంలేదు. పైగా ఒకే నెలలో దీపావళి, దసరా రాకపోయినా అమ్మకాలు మాత్రం అంతగా సాగడం లేదు. గతేడాదికి ఇప్పటికీ తేడా ఏంటని అలోచిస్తే.. నిత్యావసర వస్తువుల ధరలే కారణమని తెలుస్తోంది. టపాకాయల కొనుగోళ్లపై ఆ ప్రభావం కన్పిస్తోంది. ఇప్పటికే కందిపప్పు ధర కిలో 200 రూపాయలు పలుకుతోంది. ఇలాగే మిగిలిన నిత్యావసర వస్తువుల ధరలూ బెంబేలెత్తిస్తుండడంతో ప్రజలు ఇతరత్రా ఖర్చులకు వెనుకాడుతున్నారు. పైగా గ్రామాల్లో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతినడంతో పండగ వాతావరణం కన్పించడం లేదు. వీటన్నిటికితోడు తాత్కాలిక రిటైల్‌ షాపులకు పది రోజుల ముందే అనుమతి ఇవ్వాల్సి ఉండగా ఈ ఏడాది అనుమతులు లేటుగా ఇచ్చారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో షాపులు తెరుచుకోలేదు. ఇలాంటి అనేక కారణాలతో బాణాసంచా కొనుగోళ్లు సవ్యంగా సాగడం లేదని వ్యాపారులు అంటున్నారు. ఒకపక్క పెరిగిన నిత్యావసరవస్తువుల ధరలు.. మరోపక్క కరువు పరిస్థితులు.. మరి ఈ అన్ని ఇబ్బందులనూ దాటుకుని పండగ ముందురోజైనా బాణాసంచా అమ్మకాలు పెరుగుతాయేమో ఇళ్లల్లో పండుగ కళ సంతరించుకుంటుందేమో చూడాలి. 

నవంబర్ 26న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..

ఢిల్లీ : నవంబర్ 26వ తేదీ నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 23వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగనున్నాయి. 

తమిళనాడు తీర ప్రాంతంలో రెడ్ అలర్ట్..

చెన్నై : నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. వాయుగుండం చెన్నైకి ఆగ్నేయంగా 180 కిలోమీటర్ల దూరంలో ఏర్పడింది. బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సోమవారం రాత్రికి చెన్నై కరెకల్ వద్ద వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడంతో తమిళనాడు తీర ప్రాంతంలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు 

 

మళ్లీ మార్కెట్ లో మ్యాగీ నూడుల్స్..

ఢిల్లీ: సీసం ఎక్కువగా ఉన్నందుకు గాను 5 నెలల పాటు నిషేధం ఎదుర్కొన్న 'మ్యాగీ నూడుల్స్' మళ్లీ దేశీయ మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ-కామర్స్ సైట్ స్నాప్‌డీల్‌తో ఒప్పందం చేసుకున్న నెస్లీ ఇండియా సోమవారం నుంచి వీటి అమ్మకాలు జరపనున్నట్టు తెలిపింది.

మోడీపై లాలు విమర్శలు...

పాట్నా : ప్రధాని నరేంద్రమోడీపై ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ విమర్శలు గుప్పించారు. మోడీ నాయకత్వం సురక్షితం కాదని బీహార్ ప్రజలు భావిస్తున్నారని ఆయన మాటలు చెప్పినంత గొప్పగా చేతలు లేవన్నారు. ప్రధాని మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని లాలూ స్పష్టం చేశారు.

 

12:53 - November 9, 2015

ముంబై : బాజీరావు మస్తానీ పోస్టర్ ను సినీ నటి దీపికా పదుకొనే ఆవిష్కరించారు. సోమవారం ముంబైలో జరిగిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దీపికా సినిమా విశేషాలను వివరించారు. బాహుబలికి..ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని, ఇదొక డిఫరెంట్ చిత్రమని స్పష్టం చేశారు. 'బాజీరావు మస్తాని' చిత్రం మహారాష్ట్ర పాలకులు పీష్వాల చరిత్రను ఆధారంగా చేసుకుని రూపొందింది. ఈ సినిమాలో రణవీర్‌సింగ్‌, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే నటించారు. బాజీరావు మస్తాని' చిత్రాన్ని సంజయ్ లీలా భన్సల్‌ రూపొందిస్తున్నాడు. మస్తానిగా దీపికా పదుకొనే నటిస్తోంది. మస్తాని బాజీరావు రెండో భార్య. ఆయనతో కొంత కాలం ఆమె పూణెలో నివసించింది. మస్తాని తన భర్త బాజీరావు చనిపోయాడన్న వార్త విన్న వెంటనే తన చేతి ఉంగరానికి ఉన్న విషాన్ని మింగి ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరిగింది. దానికి ఆధారాలు లేవు. అలాంటి కథను సినిమాటిక్‌గా బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 18న విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

12:28 - November 9, 2015

విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో ధరలు భగ భగ మండిపోతున్నాయని వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలని హితవు పలికారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు నిరసనగా వామపక్షాలు విశాఖ జిల్లాలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా సీపీఎం నేత సీహెచ్ నర్సింగరావు టెన్ టివితో మాట్లాడారు. 16 నెలల క్రితం ధరలు తగ్గిస్తామని అధికారంలోకి చంద్రబాబు వచ్చారని గుర్తు చేశారు. కానీ ధరలను విపరీతంగా పెంచేశారని, ఇందులో పోషకాహార సరుకులు కూడా ఉన్నాయన్నారు. పలు కంపెనీలు పప్పులు నిల్వ చేసుకుంటుంటే వాటిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. బీహార్ ఎన్నికల్లో మోడీకి చెంప చెళ్లుమనిపించారని, ప్రజలకు అనుగుణంగా పనిచేయకపోతే బీహార్ గుణపాఠం తప్పదన్నారు. ప్రభుత్వ విధానాల వల్లే ఇదంతా చోటు చేసుకుందని, సామాన్యుడు బతకలేని పరిస్థితి నెలకొందని సీపీఐ నేత తెలిపారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని వామపక్ష నేతలు హెచ్చరించారు. 

12:20 - November 9, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రజలకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. గత కొన్ని రోజులుగా ఆశా వర్కర్లు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అందులో భాగంగా ఇటీవల ఆశా వర్కర్లకు సంఘీభావంగా సీపీఎం విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎంబీ భవన్ లో ఆశాలకు మద్దతుగా సీపీఎం సంఘీభావ సభ నిర్వహించింది. సీపీఎం సేకరించిన రూ.17.66 లక్షల విరాళాలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆశాలకు అందచేశారు. ఈ సందర్భంగా తమ్మినేని ప్రసంగించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి, ఆరోగ్య, అంగన్ వాడీ, మున్సిపల్, ఆశా వర్కర్లు చేసిన సమ్మెలపై ప్రభుత్వం భూ స్వామ్య వైఖరి అవలింబించిందని విమర్శించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆశాల వెంట ఉంటామని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సూచించారు. పట్టుదలతో సమ్మె కొనసాగిస్తున్న ఆశాలకు అభినందనలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చర్చలు జరపకుండా మొండిగా వ్యవహరిస్తోందని, మోడీకి ఎదురైన పరిస్థితులే కేసీఆర్ కు ఎదురవుతుందన్నారు. పోరాడే వారికి ప్రజలు అధికారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తమ్మినేనితో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హాజరయ్యారు. 

నిమ్స్ లో మెడికో విద్యార్థి సూసైడ్..

హైదరాబాద్ : నిమ్స్ లో మెడికో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 6వ అంతస్తులో ఓ గదిలో విద్యార్థి విజయ్ కుమార్ ఉరి వేసుకున్నాడు. ఇతను పటన్ చెరుకు చెందిన వాడిగా తెలుస్తోంది. 

ఖమ్మంలో కొనసాగుతున్న సరిహద్దుల దిగ్భందం..

ఖమ్మం : సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా సరిహద్దుల దిగ్భందం జరుగుతోంది. రైతు సమస్యలను తీర్చాలని జిల్లా వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో సరిహద్దుల దిగ్భందనం కొనసాగుతోంది. నాయకన్ గూడెం వద్ద దిగ్భందనంలో జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ పాల్గొన్నారు. భద్రాచలం మండలం రాజుపేట వద్ద సరిహద్దు దిగ్భందనంలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య పాల్గొన్నారు.

 

దుర్గగుడి ఫ్లై ఓవర్..వాటర్ పైపులైన్ కు కేశినేని శంకుస్థాపన..

విజయవాడ : దుర్గగుడి వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం సందర్భంగా మంచినీటి పైపులైన్ మార్పు పనులకు ఎంపీ కేశినేని శంకుస్థాపన చేశారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణం విజయవాడ ప్రజల చిరకాల కోరిక, అత్యాధునికంగా నిర్మాణం చేస్తామని కేశినేని తెలిపారు. 

ఆశాలకు మద్దతుగా సీపీఎం సంఘీభావ సభ..

హైదరాబాద్ : ఆశాలకు మద్దతుగా సీపీఎం సంఘీభావ సభ నిర్వహించింది. ఎంబీ భవన్ లో నిర్వహించిన సభకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. 

11:48 - November 9, 2015

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాకుసుమాలు వాడిపోతున్నాయి. రిషితేశ్వరీ ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. మాచర్ల కృష్ణవేణి కాలేజీలో ఇంటర్ చదువుతున్న వెల్దుర్తికి చెందిన తిరుపతమ్మ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక్కసారిగా ఈ ఘటనతో జిల్లాలో కలకలం రేగింది. తిరుపతమ్మ రాసిన సూసైడ్ నోట్ ప్రకంపనాలు సృష్టిస్తోంది. ర్యాగింగ్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అందులో డిమాండ్ చేసింది. తిరుపతమ్మను ర్యాగింగ్ చేసింది ఇంటర్..డిగ్రీ విద్యార్థులేనని తేలింది. ప్రేమ్ రాజ్ నాయక్ అనే విద్యార్థి తనను తీవ్రంగా వేధించాడని అతడిని కఠినంగా శిక్షించాలని సూసైడ్ నోట్ లో పేర్కొంది. ప్రేమ్ రాజ్ తోపాటు గాబ్రియల్ నాయక్, పవన్, ఆది నారాయణ, వెంకటేష్, సురేష్ మొత్తం ఆరుగురు వ్యక్తులు తన మానసిక వేదనకు కారణమని తెలిపింది. ఏ విధంగా వేధింపులకు గురి చేశారో కూలంకుషంగా లేఖలో పేర్కొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే దీనిపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశాయి. 

11:39 - November 9, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు లేవని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు తీవ్రంగా విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై వామపక్షాలు లెనిన్ సెంటర్ లో ధర్నా నిర్వహించాయి. ఈ ధర్నానికి సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధు మాట్లాడారు. ప్రభుత్వం పన్నుల విధానంలో మార్పు తీసుకరావడం వల్ల ధరలు పెరిగిపోయాయన్నారు. రైతు దగ్గర నుండి తీసుకున్న ధరకు నిమిత్తం లేకుండా అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తయారు చేసిన జీఎస్టీ బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టే అవకాశం ఉందని, దీనిని తిప్పికొట్టాలన్నారు. 

11:32 - November 9, 2015

ముంబై : ఐసిసి ఛైర్మన్‌ ఎన్‌.శ్రీనివాసన్‌కు బిసిసిఐ చెక్‌ పెట్టింది. బిసిసిఐ ప్రతినిధిగా ఐసిసి ఛైర్మన్‌ పదవిలో కొనసాగుతున్న శ్రీనీని నేటి ఎజిఎంలో లాంఛనంగా తొలగించారు. నవంబర్‌ 9న ముంబై ప్రధాన కార్యాలయంలో జరిగే వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు.

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్..
2013 ఐపిఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌లో అల్లుడు గురునాథన్‌ మేయప్పన్‌ కారణంగా ఇప్పటికే చెన్నై సూపర్‌ కింగ్స్ ప్రాంఛైజీ హక్కులు (రెండేళ్ల రద్దు కూడా), బిసిసిఐ అధ్యక్ష పీఠం వదులుకున్న శ్రీనివాసన్‌ ఇప్పుడు ఐసిసి ఛైర్మన్‌గిరికీ గుడ్‌బై చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది. విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో బిసిసిఐ సమావేశాలకు శ్రీనివాసన్‌ను అనుమతించని బోర్డు..తమ ప్రతినిధిగా అతడిని ఐసిసి ఛైర్మన్‌ పదవిలో కూర్చోబెట్టడం సబబు కాదని భావించిన అధ్యక్ష కార్యదర్శులు తక్షణమే అతడిని దించేయాలని నిర్ణయించారు. శశాంక్‌ మనోహర్‌ రెండోమారు బిసిసిఐ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించాక శ్రీని వర్గంలోని దక్షిణాది క్రికెట్‌ అసోసియేషన్‌లు మాజీ బాస్‌తో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నాయి.

శ్రీని స్థానంలో శశాంక్ మనోహర్...?
2016 వరకూ ఐసిసి ఛైర్మన్‌ పదవి బిసిసిఐదే కావటంతో శ్రీనివాసన్‌ స్థానంలో బోర్డు అధ్యక్షుడు శశాంక్‌ మనోహరే..వరల్డ్ బాడీ బాధ్యతలు సైతం స్వీకరించనున్నారని సమాచారం. వాస్తవానికి షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 29న జరిగే ఎజిఎంలోనే శ్రీని ఛైర్మన్‌ పోస్టుకు శుభం కార్డు వేయాలని అనురాగ్‌ ఠాకూర్‌ భావించినా అప్పటి అధ్యక్షుడు జగ్‌మోహన్‌ దాల్మియా హఠాన్మరణంతో లాంఛనం కొంచెం ఆలస్యమైంది. ఐసిసి ఛైర్మన్‌ పదవి ఊడినా..తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా శ్రీనివాసన్‌ కొనసాగనున్నాడు. 

11:13 - November 9, 2015

విశాఖపట్టణం : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. చెన్నైకి ఆగ్నేయంగా 180 కిలోమీటర్ల దూరంలో..పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. వాయుగుండం మరింత బలపడి సోమవారం మధ్యాహ్నంకు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తీరం వెంబడి 40-60 ఈదురు గాలులు వీస్తున్నాయి. దక్షిణ కోస్తాపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. దీనితో ఏపీలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

నెల్లూరులో...
వాయుగుండం ప్రభావం కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచనలు చేశారు. ఇదిలా ఉంటే కావలి (మం) తుమ్మలపెంటలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. 50 మీటర్లు ముందుకు సముద్రం వచ్చింది. సముద్రంలో వేటకు వెళ్లిన ముగ్గురు మృత్స్యకారులు గల్లంతయ్యారు.

చిత్తూరులో..
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీనివాసుడిని దర్శించుకొనేందుకు వచ్చిన భక్తులు పలు ఇబ్బందులు పడుతున్నారు. మెట్ల మార్గంలో నీరు దిగువకు ప్రవహిస్తుండడంతో కాలినడకన వచ్చే భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగి పడ్డాయి. టిటిడి సిబ్బంది వాటిని తొలగించి రహదారిని పునరుద్ధరించారు. 

కావలిలో అల్లకల్లోలంగా సముద్రం..

నెల్లూరు : కావలి (మం) తుమ్మలపెంటలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. 50 మీటర్లు ముందుకు సముద్రం వచ్చింది. సముద్రంలో వేటకు వెళ్లిన ముగ్గురు మృత్స్యకారులు గల్లంతయ్యారు. 

ఐసీసీ అధ్యక్ష పదవి నుండి శ్రీనివాసన్ తొలగింపు..

ముంబై : ఐసీసీ అధ్యక్ష పదవి నుండి శ్రీనివాసన్ ను తొలగించారు. నేడు బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరుగుతోంది. 

10:39 - November 9, 2015

హైదరాబాద్ : అంబర్ పేట సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. తుపాకి మిస్ ఫైర్ వల్ల మృతి చెందాడా ? లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తెలియడం లేదు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఈస్ట్ జోన్ డీసీపీ రవీంద్ర ఘటనాస్థలిని సందర్శించారు.
నల్గొండ జిల్లా వలిగొండకు చెందిన షేక్ ఖాజా మొయినుద్దీన్ సీఏఆర్ హెడ్ క్వార్టర్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం 3.30గంటల ప్రాంతంలో తుపాకి పేలిన శబ్ధం వినిపించింది. ఈ శబ్ధం విన్న ఇతర పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మొయినుద్దీన్ మెడ నుండి తలలోకి బుల్లెట్ దూసుకపోయి రక్తపుమడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మొయినుద్దీన్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మిస్ ఫైరా ? వల్ల జరిగిందా లేక ఇతర సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇదిలా ఉంటే గత పది సంవత్సరాల క్రితం మొయినుద్దీన్ కు శస్త్ర చికిత్సలు జరిగినట్లు తెలుస్తోంది. వెన్నునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మరోవైపు కుటుంబ సమస్యలు.. ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక..ఆత్మహత్య చేసుకున్నాడా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఉన్నతాధికారుల విచారణలో ఏమి తేలుతుందో చూడాలి. 

10:33 - November 9, 2015

హైదరాబాద్ : నగరంలో లారీలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మొన్న బాలానగర్ లో బ్రేకులు ఫెయిలైన లారీ బీభత్సం సృష్టించిన ఘటన మరిచిపోకముందే మరో సంఘటన చోటు చేసుకుంది. మీర్ పేట చౌరాస్తాలో నల్గొండ నుండి వస్తున్న లారీ అదుపు తప్పింది. బ్రేకులు ఫేయిల్ కావడంతో ముందు వెళుతున్న బ్రిలియంట్ స్కూల్ బస్సును ఢీకొట్టింది. అతి స్పీడుగా ఢీకొట్టడంతో స్కూల్ బస్సు పక్కకు పడిపోయింది. దీనితో అందులో ఉన్న విద్యార్థుల్లో ఐదుగురికి గాయాలయ్యాయి. అక్కడితో ఆగకుండా లారీ రెండు ద్విచక్రవాహనాలను, ఓ ఆటోను ఢీకొట్టి ఆగిపోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తీవ్రగాయాలైన చిన్నారులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు భయకంపితులయ్యారు. తమ చిన్నారులకు ఏమైనా ప్రమాదం జరిగిందా ? అని పరుగు పరుగున ఆసుపత్రికి చేరుకున్నారు. గాయాలతో చిన్నారులు రోదించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు లారీని తొలగించే ప్రయత్నాలు చేపట్టారు. దీనితో ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ స్తంభించింది. ఇటీవల నగరంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు వాహనాల ఫిట్ నెస్ పై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

కర్నూలుకు బయలుదేరిన బాబు..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ జిల్లాలో పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కర్నూలులోని ఓర్వకల్లులో ఉర్దూ విశ్వ విద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

ముంబై : బీహార్ ఫలితాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 400, నిఫ్టీ 100 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

పోలీసుల అదుపులో ఉన్న దొంగల పరారీ..

కృష్ణా : పశ్చిమగోదావరి జిల్లా పోలీసుల అదుపులో ఉన్న దొంగలు పరారయ్యారు. నల్గొండ జిల్లాలో అరెస్టు చేసి తీసుకొస్తుండగా కీసర టోల్ గేట్ వద్ద పోలీసుల కళ్లు గప్పి పరారయ్యారు.

 

09:21 - November 9, 2015

కక్షల కుంపటిని ఆర్పిన ధీశాలి..అభివృద్ధి ఫలాలు అందించిన ఆదర్శ శైలి..
కర్నూలు : ఆయన జిల్లా పోలీసులకు బాస్..కరుడు గట్టిన నేరగాళ్లు..ఫ్యాక్షనిస్టులకు సింహస్వప్నం. ఇదంతా నాణానికి ఒక కోణం మాత్రమే. ఆయనలోని రెండో కోణం దీనికి పూర్తి భిన్నం. మూర్తిభవించిన మానవత్వం..గ్రామాభ్యుదయపథం..సమాజ హితం..ఆయన నైజం. ఫ్యాక్షన్ ను నిర్మూలించడంలో కానీ..విద్యార్థుల ఆత్మహత్యలు నివారించడంలో గాని..అనాథ శిశువులను అక్కున చేర్చుకోవడంలో ఆయన స్టైలే వేరు. ఆయనే కర్నూలు ఎస్పీ రవికృష్ణ ఐపీఎస్. విభిన్న శైలితో ప్రజల్లోనూ ప్రభుత్వాధినేతల్లోనూ విశేష గుర్తింపును సంపాదించుకున్న కర్నూలు ఎస్పీ రవికృష్ణ వర్కింగ్ స్టైల్ పై టెన్ టివి స్పెషల్ ఫోకస్...

09:10 - November 9, 2015

విశాఖపట్టణం : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. చెన్నైకి ఆగ్నేయంగా 325 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 345 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. వాయుగుండం మరింత బలపడి సోమవారం మధ్యాహ్నం వాయుగుండంగా..రాత్రికి తుపాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. చెన్నై కరెకల్ వద్ద ఇది తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దీని ప్రభావంతో తీరం వెంబడి 35-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏపీలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండడంతో అక్కడి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మరోవైపు తిరుమలలో సోమవారం ఉదయం ఈదురుగాలలుతో కూడిన భారీ వర్షం కురిసింది. దీనితో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

08:53 - November 9, 2015

బీజింగ్‌ : 90 ఏళ్ల వరకూ జీవించటమే గొప్పగా మారిన నేటి పరిస్థితుల్లో, అప్పటి వరకూ ఆరోగ్యంగా వుండటం మహా గొప్ప విషయం. ఆరోగ్యంగా వుండటమే కాదు...పూర్తి ఫిట్‌నెస్‌తో అన్ని రకాల వ్యాయామాలూ చేయటాన్ని ఏమనాలి ? ఓ చైనా తాత విషయంలో ఇది నిజమైంది. అతన్ని చూసిన వారు 'నువ్వు సూపర్‌ తాత' అంటూ ప్రశంసించకుండా వుండలేరు. ఈతాత పేరు షెన్‌ హు. వయస్సు 93 మాత్రమే ! ఈ వయస్సులో ఆరోగ్యకరమైన శరీర సౌష్టవాన్ని షెన్‌ హు కలిగివున్నందుకు 'లోకల్‌ సెలబ్రటీ'గా మారిపోయాడు. ఇంతకీ షెన్‌ హు ప్రతిరోజూ ఏం తింటాడు ? ఎలా గడుపుతాడు ? అని చైనా యువత తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతోంది. ఉదయం మూడు గంటలకు నిద్ర లేవటంతో షెన్‌ హు దినచర్య ప్రారంభమవుతుంది. ముందుగా గంటపాటు వ్యాయమాన్ని చేస్తాడు. ఇందులో కూడా ఎక్కువగా శరీర పైభాగానికి చెందినవే వుంటాయి. ఇదంతా కేవలం శారీరక ఆరోగ్యం కోసమే కానీ, కండబలాన్ని పెంచుకోవాలన్న విపరీతమైన కాంక్ష తనలో లేదని షెన్‌ హు తెలియజేస్తున్నాడు. నిజానికి అతను 70 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్‌ సెంటర్‌కు వెళ్లి వ్యాయాయం చేయటాన్ని ప్రారంభించాడు. గత 20 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఫిట్‌నెస్‌ సెంటర్‌కు వెళ్లటమే...అతని వయస్సు తెలియకుండా చేస్తోందని 'పీపుల్స్ డైలీ' వార్తా కథనం వెలువరించింది.

ఢిల్లీలో బస్సు దగ్ధం..

ఢిల్లీ: ఓ బస్సు నడిరోడ్డుపై కాలిపోయింది. పంజాబిభాగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న సిబ్బంది అగ్నిమాపక శకటంతో మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

అంబర్ పేటలో మిస్ ఫైర్..

హైదరాబాద్ : అంబర్ పేట సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో మిస్ ఫైర్ జరిగింది. షేక్ ఖాజా మొయినుద్దీన్ హెడ్ కానిస్టేబుల్ మృత్యువాత పడ్డాడు. ఇతను నల్గొండ జిల్లా వలిగొండకు చెందిన వాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఈస్ట్ జోన్ డీసీపీ రవీంద్ర ఘటనాస్థలిని సందర్శించారు. 

మీర్ పేటలో లారీ బీభత్సం..

హైదరాబాద్ : మీర్ పేటలో లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి స్కూల్ బస్సు..ఆటోను లారీ ఢీకొంది. ఐదురు విద్యార్థులు..ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు.
 

08:35 - November 9, 2015

బీజేపీ నినాదాలను ప్రజలు విశ్వసించడం లేదని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. బీహార్ లో మహా కూటమి విజయం సాధించడం.బీజేపీ పరాజయం చెందడానికి గల కారణాలు ? వంటి అంశాలపై టెన్ టివిలో 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లోనే...

దేశ ఎజెండాను మార్చింది..
''బీహార్ లో మహా కూటమి విజయం సాధించడం..బీజేపీ పరాజయం చెందడం వెనుక పలు కారణాలున్నాయి. ఇక్కడ బీజేపీ దేశ ఎజెండాను మార్చివేసింది. అభివృద్ధి..అవినీతి రహిత పాలన..స్కిల్ ఇండియా..ధరలు తగ్గిస్తాం..ఆర్థిక వృద్ధి రేటును పరుగులు తీయిస్తాం..అంటూ గతంలో మోడీ పేర్కొన్నారు. యూపీఏ హాయాంలో ఆర్థిక వృద్ధి రేటు పడిపోవడం..రెండో హాయాంలో కుంభకోణాల కంపు కొట్టడంతో మోడీపై కొన్ని ఆశలు పెట్టుకున్నారు. జార్ఖండ్..హార్యానాలో గెలిచిన అనంతరం నిజమైన ఎజెండా ప్రవేశ పెట్టారు. ఘర్ వాపసీ..బీఫ్ తినాల వద్దా..పది మంది కనలా వద్దా..అంటూ పనికి మాలిన ఎజెండాతో ముందుకు వచ్చింది.

మోడీ ఫెర్మామెన్స్ పై తీర్పు...
మోడీ ఫెర్మామెన్స్ పై బీహార్ ప్రజలు తీర్పు చెప్పారు. అంతేగాక అవకాశవాదులకు.. ములాయం వంటి మాయా గుర్రాలకు బీహార్ ప్రజలు బుద్ధి చెప్పారు. స్వచ్ఛ భారత్ అని చీపుర్లు పట్టారు. చివరకు ఏమైంది 0.5 టాక్స్ వచ్చింది. పప్పు ధరలు తగ్గిస్తామన్నారు. కకానీ కానీ ధరలు పెరిగాయి. ఈ స్లోగన్ కాదు పని చూపెట్టండి అని ప్రజలు అంటున్నారు. . బీజేపీ నినాదాలను ప్రజలు విశ్వసించడం లేదు. బీహార్ కు లక్షా 25వేల కోట్ల ప్యాకేజీ ఎప్పుడిస్తారు ? ఇస్తే మోడీ విశ్వసనీయత పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విశ్వసించి ఓటు వేశారు. కానీ ఆచరణలో జరుగుతున్నది ఏంటీ ? ప్రజల జీవితాలతో ఆడుకోకండి అని..శాంతి..సహనం దెబ్బతీసే చర్యలను ప్రజలు తిప్పికొట్టారు.

బీహార్ లో కులాంక గణితాలు..
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీహార్ ప్రజలు తీర్పు చెప్పారు. మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల్లో విజయం సాధిస్తే అది మోడీ విజయం. ఢిల్లీలో పరాజయం చెందితే మోడీకి సంబంధం లేదనడం ఏ తర్కం. విజయానికి గల కుల సమీకరణలు మహా కూటమి చేయడం వల్లే ఓడిపోయామని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. కులాంక గణితాలను మహా కూటమి, బీజేపీ రెండు పాటించాయి.

కులాలకతీతంగా బీజేపీని తిరస్కరించారు..
కానీ ఈ ఎన్నికల్లో కులాలకతీతంగా బీజేపీని తిరస్కరించారు. మతాంక గణితాన్ని బీజేపీ చేసింది. బీహార్ లో ఓడిపోతే పాక్ లో పటాకులు పేలుస్తారంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. ఎక్కడైనా పటాకులు పేల్చారా ? ఎక్కడైనా పేల్చారా అని చూస్తే ఎక్కడ కనిపించలేదు. మనోభావాలను వాడుకొనే ప్రయత్నాన్ని ప్రజలు తిరస్కరించారు. మతం కన్నా కులం బలమైందని రుజువు చేశారు.

ఆత్మవిశ్వాసంగా ప్రతిపక్షాలు...
శీతకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు మరింత ఆత్మవిశ్వాసంతో కేంద్రాన్ని ప్రశ్నిస్తాయి. ప్రతిపక్షాల ఐక్యత ఏంటో గత పార్లమెంట్ సమావేశాల్లో చూశాం. ఇది మరింత బలపడనుంది. కొత్త మిత్రులను తెచ్చుకునే పరిస్థితి బీజేపీ కోల్పోతుంది. గతంలో టీఆర్ఎస్ బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉండేది. ఈ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ ఆలోచన చేయవచ్చు. బీహార్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభావం చూపించే అవకాశం ఉంది.

నితీష్..లాలూ ఐక్యంగా ఉంటారా ?
నితీష్, లాలూ ఎంత కాలం ఐక్యంగా ఉంటారు ? మోడీ ప్రభంజనాన్ని అడ్డుకోవాలని వీరు కలిశారు. సిద్ధాంతాలు..విధానాలు ప్రాతిపాదిక కాదు గనుక ఎంతకాలం కొట్లాడకుండా ఉంటారో చూడాలి. ఈ ఐక్యత కాస్తా ప్రజల జీవన విధానాలు మార్చే విధంగా మారాలి''. అని నాగేశ్వర్ విశ్లేషించారు. 

07:59 - November 9, 2015

బీహార్ ఎన్నికల్లో మహా కూటమి విజయదుందభి మోగించింది. బీజేపీ మట్టికరిచింది. మూడోసారిగా నితీష్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారు. నితీష్, లాలూ, సోనియా పార్టీల కూటమి సృష్టించిన రాజకీయ సునామీ. దేశ రాజకీయాలపై సరికొత్త సమీకరణల్ని ఎన్నికల ఫలితాలు ఆవిష్కరించాయి. సర్వేల అంచనాల్ని తలకిందులు చేసిన విస్పష్ట తీర్పు నితీశ్ వికాస పాలనకు సగటు బీహారీ మూడోసారి జై కొట్టారు. మరోవైపు ఈ ఫలితాలపై మీడియా కథనాలపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తెలకపల్లిరవి (విశ్లేషకులు), ఉప్పల శారద (బిజెపి), కరణం ధర్మశ్రీ (వైసీపీ), నరసింహరావు (కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:39 - November 9, 2015

బాలీలో పోలీసులకు చిక్కిన మాఫియా డాన్ ఛోటా రాజన్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో ఓ చిత్రం రూపొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంజయ్ గుప్తా దర్శకత్వం హహించనున్న ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ కథానాయకుడిగా నటించనున్నారట. ఛోటారాజన్ జీవితంపై ఎస్.హుస్సేన్‌జైదీ రచించిన బైకుల్లా టూ బ్యాంకాక్ అనే రచన ఆధారంగా ఈ సినిమాను రూపొందించబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ కథానాయికగా నటించనుందని టాక్. సాధారణ పౌరులైన ముగ్గురు యువకులు ముంబయిని శాసించే మాఫియాడాన్‌లుగా ఏ విధంగా ఎదిగారు? ఆ క్రమంలో వారికి ఎదురైన పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది.

 

07:33 - November 9, 2015

సూపర్ స్టార్ 'రజనీకాంత్' నటిస్తున్న 'కబలి' పూర్తే కాలేదు. అప్పుడే మరో సినిమాకు 'రజనీ' ఒప్పుకున్నారా ? ఆ చిత్రానికి దర్శకుడు ఎవరు ? అంటూ ఏవోవో ఊహించుకోకండి. ఏంటో తెలుసుకోవాలంటే ఇది చదవండి..
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా తమిళ చిత్రం కబలి. కబాలీశ్వరన్ అనే పాత్ర పేరు ఆధారంగా తమిళ టైటిల్ ను 'కబలి'గా ఫిక్స్ చేసిన చిత్ర బృందం తెలుగు వెర్షన్ కి 'మహాదేవ' అనే టైటిల్ ని ఖరారు చేశారట. కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకశాముందంటూ చెన్నై సినీ వర్గాలు చెబుతున్నాయి. రంజిత్ దర్శకత్వంలో, కలైపులి థాను నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా మలేషియాలో జరుగుతోంది. రాధిక ఆప్టే, జేడీ చక్రవర్తి, కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న సంతోష్ నారాయణ్ సంగీతాన్నందిస్తున్నాడు. 

07:31 - November 9, 2015

అక్కినేని అఖిల్, సాయేషా సైగల్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం 'అఖిల్'. ఈనెల 11న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. 'అఖిల్' నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'అఖిల్' సినిమాలో మరో అక్కినేని హీరో సందడి చెయ్యనున్నాడుట. సినిమా విరామ సమయంలో 'నాగార్జున' నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా ట్రైలర్ ను ప్రదర్శితం కానున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై నితిన్, సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి వినాయక్ దర్శకుడు. 

తిరుమలలో విరిగిపడిన కొండచరియలు..

చిత్తూరు : తిరుమల రెండో ఘాట్ రోడ్డులోని 9వ కి.మీటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న టిటిడి సిబ్బంది కొండచరియలను తొలగిస్తున్నారు. 

నేరేడుచర్లలో టీఎస్ యూటీఎఫ్ ప్లీనరీ సమావేశాలు..

నల్గొండ : నేరేడుచర్లలో రెండో రోజు టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. 

నకిరేకల్ లో సీపీఎం జిల్లా ప్లీనరీ సమావేశాలు..

నల్గొండ : నేడు నకిరేకల్ లో సీపీఎం జిల్లా ప్లీనరీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహ రెడ్డి, జూలకంటి రంగారెడ్డి లు పాల్గొనున్నారు. 

ఆదిలాబాద్ లో మంత్రి నాయిని పర్యటన..

ఆదిలాబాద్ : హోం మంత్రి నాయిని నర్సింహ రెడ్డి జిల్లాలో రెండో రోజు పర్యటించనున్నారు. సిర్పూర్ (యు)లో పీఎస్ ను నాయిని ప్రారంభించనున్నారు. 

నిజామాబాద్ లో మహమూద్ ఆలీ పర్యటన..

నిజమాబాద్ : నేడు జిల్లాలో డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

 

నేడు ఆటో ట్రాలీలను పంపిణీ చేయనున్న కేసీఆర్..

హైదరాబాద్ : స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా నేడు తొలిదశలో 1005 ఆటో ట్రాలీలను సీఎం కేసీఆర్ లబ్దిదారులకు అందచేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రెండు చెత్త బుట్టలను కూడా పంపిణీ చేయనున్నారు.

నేడు బీసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం..

ముంబై : నేడు బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరుగనుంది. ఏజీఎంలో బోర్డు మాజీ శ్రీనివాసన్ భవితవ్యం తేలనుంది.

నేడు కర్నూలులో బాబు పర్యటన..

కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఓర్వకల్లులో ఉర్దు యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు.

06:59 - November 9, 2015

గ్రామ సౌభాగ్యమే దేశ సౌభాగ్యమంటారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందంటారు. భారతదేశ హృదయం గ్రామాల్లోనే వుందని మహాత్మాగాంధీజీ ఏనాడో చెప్పారు. గ్రామ స్వరాజ్యం గురించి ఆయన కలలు కన్నారు. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. మరి మన రాష్ట్రంలో గ్రామాల పరిస్థితి ఏమిటి? గ్రామాల్లో స్వయం పాలన ఎలా నడుస్తోంది? గ్రామ పంచాయితీల విధుల గురించి మాట్లాడే ప్రభుత్వాలు అందుకు తగ్గట్టుగా నిధులు, అధికారాలు బదలాయిస్తున్నాయా? గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? నిధుల సమీకరణలో అవి ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? గ్రామ పంచాయితీలు పరిపుష్టం కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సహకారం అందించాలి? పరిపాలనలో, ప్రభుత్వ నిర్ణయాల్లో, వివిధ సంక్షేమ పథకాల అమలులో గ్రామ పంచాయితీ వ్యవస్థకు ప్రాతినిధ్యం వుంటోందా? గ్రామ పంచాయితీలు చేసే తీర్మానాలకు విలువ వుంటోందా? ఈ అంశాలపై టెన్ టివి జనపథంలో తెలంగాణ సర్పంచ్‌ల సంఘం నేత మెంతేపల్లి పురుషోత్తమరెడ్డి విశ్లేషించారు. 

06:43 - November 9, 2015

ఒక కట్ట కొత్తిమీరను శుభ్రంగా కడిగి, కట్‌ చేసి పెట్టుకోవాలి, రెండు టీ స్పూన్ల నిమ్మరసం, అర టీ స్పూన్‌ ఉప్పు, ఒక గ్లాస్‌ వాటర్‌ తీసుకొని అన్నింటినీ మిక్సర్‌లో మెత్తగా గ్రైండ్‌ చేయాలి. వడ పోయకుండా అలానే తాగాలి. ప్రతిరోజూ ఉదయం పరగడుపున లేదా సాయంత్రం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. అరగంట ఏమీ తినకూడదు. దీనివల్ల షుగర్‌, కొలెస్ట్రాల్‌, బీపి కంట్రోల్‌లో ఉంటాయి.

  • మొటిమలు, మచ్చలు, చర్మ వ్యాధులు, స్కిన్‌ ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతాయి.
  • గ్యాస్‌ ప్రాబ్లం, కడుపునొప్పి, పొట్ట సమస్యలు, అల్సర్లు, అజీర్ణం, వాంతులు, వికారం తగ్గుతాయి.
  • నోటి అల్సర్లు, నోటి పూత, నోటి దుర్వాసన తగ్గుతుంది.
  • ఫైల్స్‌, మలబద్ధకం తగ్గుతుంది.
  • వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
  • కంటిచూపు మెరుగుపడుతుంది.

శరీరం నుండి విష పదార్థాలను బయటికి (toxins) రూపంలో పంపిస్తుంది.
శరీరం యొక్క సమగ్ర ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
క్యాన్సర్‌ సెల్స్‌ మీద పోరాడుతుంది. స్త్రీలో ఋతుచక్ర సమస్యలు పరిష్కరిస్తుంది.
ఒక్క జ్యూస్‌లో ఎన్నో లాభాలు, తక్కువ ఖర్చులో మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు.

06:42 - November 9, 2015

లడ్డూ, పాయసం, బర్ఫీ ఎలాంటి స్వీట్‌ కైనా మంచి సువాసనను, రుచిని అందిస్తాయి యాలకులు. ఏ తీపిపదార్థానికైనా.. కాసిన్ని యాలకులు జోడిస్తేనే అమోఘమైన రుచి వస్తుంది. తీపి వంటకాల్లో సుగంధ ద్రవ్యంగా వాడే యాలకుల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. యాలకుల్లో అధిక మొత్తంలో ఉండే ఐరన్‌ శరీరంలోని బీపిని అదుపులో ఉంచుతుంది. క్యాన్సర్‌ రాకుండా నివారిస్తుంది. భోజనం చేసిన తర్వాత యాలక్కాయ తీసుకుంటే ఈజీగా జీర్ణమవుతుంది. శరీరంలో వ్యర్థాలను తొలగించడంలో దీన్ని మించిన సుగంధ దినుసు మరొకటి లేవు. వీటిలో ఎంత సువాసన దాగి ఉందో అంతకు మించిన ఆరోగ్య రహస్యాలున్నాయి. ఇంకెందుకు ఆలస్యం యాలకుల్లో ఇమిడి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలెంటో చూడండి.
ఒత్తిడి తగ్గడానికి: ఒత్తిడిని తగ్గించడంలో యాలకులు బాగా సహకరిస్తాయి. యాలకులు వేసి మరిగించిన టీ తీసుకోవడం వల్ల వెంటనే ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యమూ మెరుగుపడుతుంది.
ఎసీడిటీ: శరీరానికి అవసరమయ్యే నూనెలు యాలకుల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎసిడిటీ బారి నుంచి కాపాడటానికి ఉపయోగపడతాయి. కాబట్టి రోజూ భోజనం చేసిన తర్వాత యాలకులు తింటే చక్కటి ప్రయోజనం ఉంటుంది.
శ్వాస సంబంధిత వ్యాధులు: యాలకులు తినడం వల్ల ఊపిరితిత్తుల్లో రక్తప్రసరణ సరిగా జరిగి ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు.
గుండె ఆరోగ్యానికి : యాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషీయం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహకరిస్తాయి.
మద్యం, ధూమపానానికి చెక్‌: కమ్మని సువాసన, రుచిని అందించే యాలకుల గింజలను తరచుగా నోట్లో వేసుకోవడం వల్ల మద్యపానం, దూమపానానికి దూరంగా ఉండవచ్చు. రోజూ తినడం అలవాటు చేసుకుంటే చెడు అలవాట్లను పక్కన పెట్టవచ్చు.
బీపి: యాలకుల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. బీపీ ఉన్నవాళ్లు వీటిని తీసుకుంటూ ఉండాలి.

06:40 - November 9, 2015

కుమార్‌బాబు సమర్పణలో ఎక్సెల్లా క్రియేషన్స్ పతాకంపై వి.సి.వడి ఉడయాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'శివగంగ'. శ్రీరామ్‌, రాయ్ లక్ష్మీ నాయకా నాయికలుగా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శనివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్ లో జరిగింది. ఈ చిత్రానికి సంబంధించి ఆడియో బిగ్‌ సీడీ, ఆడియో సీడీలను తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆవిష్కరించి, తొలి సీడీని మంత్రి జగదీశ్వర్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా నాయిని నరసింహారెడ్డి మాట్లాడారు. ట్రైలర్స్, పాటలు బాగున్నాయని, ఈ సినిమా మంచి విజయం సాధించి దర్శక, నిర్మాతలకు లాభాలు రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాలని అని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చెప్పారు. ఈ ఏడాది విడుదలైన చిన్న, పెద్ద సినిమాలన్నీ దాదాపుగా మంచి సక్సెస్‌ను సాధించాయని, ముఖ్యంగా చిన్న సినిమాలు మంచి మంచి విజయాల్ని సొంతం చేసుకుంటున్నాయని మంత్రి తలసాని పేర్కొన్నారు. అలాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని తెలిపారు. ఇదొక హర్రర్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అని, భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నామని చిత్ర సమర్పకుడు కుమార్ బాబు తెలిపారు. ఇంకా హీరో శ్రీరామ్‌, హీరోయిన్‌ రారులక్ష్మీ, దర్శకుడు వడి ఉడయాన్‌, సంగీత దర్శకుడు జాన్‌పీటర్‌ తదితరులు చిత్ర విశేషాలను తెలియజేశారు.

06:39 - November 9, 2015

నిఖిల్‌, నందిత జంటగా కోన వెంకట్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఉదరు నందన్‌ దర్శకత్వంలో ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం 'శంకరా భరణం' డిసెంబర్ 4న విడుదల కానుంది. ఆడియో ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఈనెల 15న వైజాగ్‌ బీచ్‌లో ఆడియో సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేయ బోతున్నారు. ఈ సందర్భంగా సమర్పకుడు కోన వెంకట్‌ మాట్లాడారు. ఈ చిత్రంలోని అన్ని పాటలకూ మంచి ఆదరణ లభిస్తోందని, హర్రర్‌కి కామెడీ మిక్స్ చేసి రూపొందించిన 'గీతాంజలి' ఘనవిజయం సాధించిందని గుర్తు చేశారు. ఇప్పుడు క్రైమ్‌ కామెడీని మిక్స్ చేసి 'శంకరాభరణం' చేసినట్లు చెప్పారు. కథ డిమాండ్‌ మేరకు రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించినట్లు నిర్మాత ఎం.వి.వి. సత్యనారాయణ చెప్పారు.

06:35 - November 9, 2015

విశాఖపట్టణం : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారుతోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ వాయుగుండం మరింత బలపడుతోంది. పశ్చిమ వాయవ్యదిశగా పయనిస్తూ, తీవ్ర వాయుగుండంగా, ఆ తరువాత తుపానుగా మారనుంది. ఈ తుపానుకు రోవానుగా నామకరణం చేస్తూ ఐఎండీ అధికారికంగా ప్రకటించనుంది.

సోమవారం అర్ధరాత్రి తీరం దాటే అవకాశం..
రోవాను తుపాను సోమవారం అర్ధరాత్రికి కరైకల్, చెన్నైల మధ్య పుదుచ్చేరికి సమీపంలో తీరాన్ని దాటే అవకాశముందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ తుపాను తమిళనాడువైపుగా పయనిస్తోంది. దాని ప్రభావం తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలపై కూడా ఉండనుంది. రానున్న మూడురోజుల పాటు కోస్తాంధ్రలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

ప్రమాద హెచ్చరికలు..
తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో ఒకటో నంబర్‌ ప్రమాద సూచికను ఎగురవేశారు.

06:32 - November 9, 2015

రంగారెడ్డి : అవుటర్‌ రింగ్‌రోడ్డుపై ఓ కారు దగ్ధమైంది. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌ టోల్‌ప్లాజా ఈ ప్రమాదం జరిగింది. వికారాబాద్ ప్రాంతానికి చెందిన నలుగురు ఉప్పల్‌కు ఫోర్డ్ ఐకాన్ కారులో వెళుతున్నారు. టోల్ ప్లాజ్ సమీపంలోకి వచ్చేసరికి ఇంజన్ వేడెక్కి మంటలు చెలరేగాయి. కారు ఆపి అందులో ఉన్న నలుగురు కిందకు దిగిపోయారు. మంటలకు కారు పూర్తిగా దగ్ధం అయిపోయింది.

06:31 - November 9, 2015

హైదరాబాద్ : కొత్త జిల్లాలో ఏర్పాటుపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్పీడ్‌ పెంచుతోంది. ఇప్పటికే ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌ శర్మ ఆధ్వర్యంలో ఓ కమిటీని నియమించిన సర్కార్‌.. ఈ ప్రక్రియను మరింత వేగ వంతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనతో ముడి పడి ఉన్న సమస్య కావడంతో ముందుగా ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రకియ మొదలు పెట్టాలనే ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రం ముందు ఉంచింది. మరోపక్క ఏపీ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ లో నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని కోరుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్న ధీమాను గులాబి నేతలు వ్యక్తం చేస్తున్నారు.

24 జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు..
నియోజకవర్గాల విభజనపై కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించినా ఇబ్బంది రాకుండా ఉండేలా... కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణా ప్రభుత్వం దృష్టి పెట్టింది. నియోజకవర్గాలు, మండలాల మార్పులు, చేర్పులపై అధికార యంత్రాంగం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మొత్తం 24 జిల్లాలను చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వం సిద్ధం చేస్తున్నా.....మొదటి విడతలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండే పట్టణాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

బడ్జెట్‌ సమావేశాల నాటికి కొత్త జిల్లాలు!
వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికే కొత్త జిల్లాల ఏర్పాటుకు తుది రూపు ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. మార్చి నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు పావులు కదుపుతోంది. 

06:28 - November 9, 2015

హైదరాబాద్ : బీహార్‌ ఎన్నికల్లో ఎన్‌డీఏ ఓడిపోవడంతో టీఆర్‌ఎస్‌ నేతలు తెగ ఖుషీ అయిపోతున్నారు. వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో తమకు ఎదురే ఉండదని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌, టీడీపీ,బీజేపీ పార్టీలను ఈజీగా ఎదుర్కోవచ్చనే ధీమా అధికార పార్టీలో కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ ఉంటుందని టీఆర్‌ఎస్‌ మొదట భావించింది. హస్తాన్ని ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచించింది. సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన ఘటనతో కంగుతున్న తిన్న కాంగ్రెస్‌...సర్వేను రంగంలోకి దింపినా....ఆ అభ్యర్థి తమకు పోటీ ఇవ్వలేరని గులాబి పార్టీ అంచనా వేస్తోంది. మరోపక్క తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్‌ఆర్‌ఐ అయిన దేవయ్యను రంగంలోకి దింపాయి. ఆర్థికంగానూ బలంగా ఉన్న దేవయ్య టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇస్తారని మిత్రపక్షాలు భావించాయి. ఐతే బీహార్‌ ఫలితాలతో బీజేపీ, టీడీపీలు ఢీలా పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఓటమి ప్రభావం వరంగల్‌ ఉప ఎన్నికపై ఉంటుందని టీఆర్‌ఎస్‌ పార్టీ అంచనా వేస్తోంది. స్వయంగా ప్రధాని మోడీ సహా జాతీయ నేతలు బీహార్ పై దృష్టి పెట్టినా విజయం సాధించకపోవడం తమకు కలిసొచ్చే అంశమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వరంగల్‌ ఉప ఎన్నికలో తమకు తిరుగే ఉండదని భావిస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు...మెజార్టీ ఎంత సాధిస్తామన్న దానిపైనే లెక్కలు వేసుకుంటున్నారు. 

06:26 - November 9, 2015

కర్నూలు : చంద్రబాబు అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా కేవలం రెండే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయి.. ఇదీ కర్నూలు జిల్లాకు చెందిన ప్రతిపక్ష నేతల ఆరోపణ. రాయలసీమ పెండింగ్‌ ప్రాజెక్ట్‌లు, సీమ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం బలోపేతం చేస్తామని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. ఈ ఆరోపణలు హెచ్చరికలు కొనసాగుతుండగానే చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనకు సిద్ధమవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కర్నూలు జిల్లాను ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మారుస్తానన్న ఆయన ఆ దిశగా ఉర్దూ యూనివర్శిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10 గంటలకు పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లుకు వస్తారు. అక్కడ 10.10 గంటలకు ఉర్దూ యూనివర్శిటీకీ శంకుస్థాపన చేస్తారు. అనంతరం 10.20 నిమిషాల నుంచి 12 గంటల వరకు పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. మీటింగ్‌ అనంతరం హెలికాప్టర్‌ ద్వారా 12.15కు పాణ్యం మండలం గోరుకల్లు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ గోరుకల్లు రిజర్వాయర్‌ పనులను అధికారులతో కలసి బాబు పరిశీలిస్తారు. అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన మీ ఇంటికి మీ భూమి గ్రామ సభలో పాల్గొంటారు. అక్కడినుంచి రెండున్నర గంటలకల్లా హెలిప్యాడ్‌కు చేరుకుని గండికోట రిజర్వాయర్‌ టన్నెల్‌ పనులను పరిశీలించడానికి వెళ్తారు.

బాబు పర్యటనపై విమర్శలు..
బాబు పర్యటన నేపథ్యంలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్‌రెడ్డి పలు విమర్శలు చేశారు. ఓర్వకల్లు వద్ద పరిశ్రమల హబ్‌కు శంకుస్థాపన జరిగిందే కానీ ఒక్క పరిశ్రమకూ భూ కేటాయింపు జరగలేదని విమర్శించారు. కర్నూలును స్మార్ట్‌సిటీగా ప్రకటింపజేస్తానని చెప్పి విఫలమయ్యారని ఎద్దేవాచేశారు.

భారీ బందోబస్తు..
అమరావతి నవ్యంధ్రకు రాజధాని అయితే...పారిశ్రామిక రాజధానిగా కర్నూలును తయారుచేస్తామని డిప్యూటి సిఎం కృష్ణమూర్తి అన్నారు. సంక్రాంతి పండుగలోపు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడు పర్యటన నేపథ్యంలో పోలీసులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీ రవికృష్ణ నేతృత్వంలో ఈ ఏర్పాట్లు జరిగాయి. కాగా తమ అధినేత పర్యటనను సక్సెస్‌ఫుల్‌ చేయాలని టిడిపి నేతలు తెగ ఉత్సాహపడుతున్నారు. ఆ దిశగా వారూ తమతమ ప్రయత్నాలు చేశారు. 

06:22 - November 9, 2015

ఢిల్లీ : అభివృద్ధి ఆమడదూరం పోయిందన్నారు. ఆటవిక రాజ్యం నడుస్తోందన్నారు. షార్ట్ కట్‌లో చెప్పాలంటే మేముండగా మహా కూటమి దండగ అన్నారు. అంతటితో ఆగలేదు.. నైతిక విలువలు మరిచి వ్యక్తిగత విమర్శలు చేసారు. బీహార్‌ ఎన్నికల్లో నెగ్గాలనే పంతంతో కమలనాధులు ప్రత్యర్ధులపై గోబెల్స్ ప్రచారానికి దిగారు.గొంతు చించుకుని అరిచినా, సుడిగాలితో పోటి ఎన్నికల ప్రచారం నిర్వహించినా మోదీ, అమిత్‌ షా బీహారీల మది గెల్చుకోలేకపోయారు. ఊహాకు అందని రీతిలో తీర్పునిచ్చే బీహార్‌ ఓటర్ల నాడి పట్టుకోలేకపోయారు.

గోమాంసం తినే వారిపై సంఘ్‌ దాడులు..
అయితే బీహార్‌లో బిజెపీకి ఎదురైన ప్రతికూల ఫలితాలకు కారణాలు ఎన్నో ఉన్నప్పటికి అసహనం, బీఫ్‌ పాలిట్రిక్స్ మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. గోమాంసం తినేవారిపై బిజెపీ నేతలు, సంఘ్‌ కార్యకర్తలు, విశ్వహిందు పరిషత్‌ సభ్యులు మూకుమ్మడిగా చేసిన దాడులు, గోమాంసం విక్రేతలే టార్గెట్‌గా ఇచ్చిన వార్నింగ్‌లు చావుదెబ్బ కొట్టాయి.

మాటల గారడీ ఇక చెల్లదనే సత్యం..
బీఫ్‌ పాలిట్రిక్స్‌తో పాటే కేంద్రం తీరుకు వ్యతిరేకంగా మేధావులు, రచయితలు,అవార్డులు వెనక్కు ఇచ్చేసి ప్రదర్శించిన పతాకస్ధాయి నిరసన కూడా హైరేంజ్‌లో ఇంపాక్ట్‌ చూపింది. అవార్డులు రిటర్న్ పంపిన పర్వం విద్యావంతులు, ఎగువ మధ్యతరగతి వారిని ప్రభావితం చేసింది. అందుకే బీహార్‌లో బిజెపీకి కలలో కూడా ఊహించని ఫలితాలను కానుకగా ఇచ్చారు. మాటలతో కోటలు కట్టాలని చూసే టక్కు టమార విద్యలు ఇక చెల్లవనే సత్యాన్ని బ్యాలెట్‌తో చెప్పారు.

స్వీయ చికిత్సకు కమలనాధులు రెడీ...
ఓటర్లు ఇచ్చిన షాక్‌తో బీహార్‌ పీఠం మాదేనని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన అమిత్‌షా, మోదీ పోస్ట్ మార్టమ్‌కు రెడీ అయ్యారు. ఎక్కడ తప్పటడుగు వేసామోనని తెలుసుకునేందుకు స్వీయచికిత్సకు సిద్ధమయ్యారు. అధికారం చేతిలో ఉంది కదా అని విర్రవీగితే టైం... పర్ఫెక్ట్ టైమింగ్‌తో లాగి లెంపకాయ కొడుతుందనే సత్యాన్ని గ్రహించిన కమలనాధులు ఇప్పటికైనా రూటు మార్చుకుంటారో లేదో కాలమే సమాధానం చెప్పాలి.  

నేడు ఖమ్మంలో సరిహద్దుల దిగ్భందనం...

ఖమ్మం : నేడు సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా సరిహద్దుల దిగ్భందనం కార్యక్రమం జరుగనుంది. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నారు.

 

నేడు డీజీపీ ఎంపిక కమిటీ భేటీ..

హైదరాబాద్ : ఏడాదిన్నర కాలంగా నానుతూ వస్తున్న పూర్తిస్థాయి డీజీపీ నియామకం వ్యవహారం సోమవారం తుదిదశకు చేరుకునే అవకాశం ఉంది. ఢిల్లీలో సోమవారం యూపీఎస్సీ ఛైర్మన్ నేతృత్వంలో కమిటీ సమావేశమై ఈ ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 

ఏలూరులో ఘర్షణ..ఒకరి మృతి..

పశ్చిమగోదావరి : ఏలూరు శనివారపు పేటలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు యువకుల మధ్య ఘర్షణలో ఒకరు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి తండ్రి కుప్పకూలిపోయాడు. 

టిడిపి..బిజెపిలకు బీహార్ ఫలితాలు హెచ్చరిక - బోత్స..

గుంటూరు : మాయమాటలతో అధికారి దక్కించుకున్న బీజేపీ, టీడీపీలకు బీహార్ ఫలితాలు హెచ్చరికలాంటిదని వైసీపీ నేత బోత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

 

ప్రభుత్వం భయపడుతోంది - గాలి వినోద్ కుమార్...

వరంగల్ : ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తుండడంతో ప్రభుత్వం భయపడుతోందిన వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి గాలి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఉస్మానియా అధికారులపై ఒత్తిడి తెచ్చి పోటీ చేయకుండా కుట్రలు చేస్తున్నారని తెలిపారు. ఓయూ రిజిస్ట్రార్ లో చేరాలని పంపిన లేఖపై కోర్టుకు వెళుతామన్నారు.

 

బీహార్ లో బీజేపీ అంచనాలు తప్పాయి - మాణిక్యాలరావు..

పశ్చిమగోదావరి : బీహార్ ఎన్నికల్లో బీజేపీ అంచనాలు తప్పాయని, కులాధారిత రాజకీయాలను చేధించడంలో అధిష్టానం విఫలం చెందిందని మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యానించారు.

 

Don't Miss