Activities calendar

11 November 2015

21:35 - November 11, 2015

హర్యానా : గుర్ గావ్ లో ఓ వ్యక్తిని నలుగురు దుండగులు అతి దారుణంగా కాల్చి చంపారు. కాల్చి చంపిన దృశ్యాలు సీసీ కెమెరాలో రిక్డారయ్యాయి. గుర్ గావ్ సెక్టార్ 5 సమీపంలో ఉన్న ఓ పెట్రోల్ బంక్ లో మంగళవారం రాత్రి పదిన్నర సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు బైక్ లపై గుర్తు తెలియని నలుగురు దుండగులు ప్రవేశించారు. ఒక బైక్ పై కూర్చొన్న వ్యక్తి మొదట కాల్పులు పెట్రోల్ బంక్ దగ్గరున్న వ్యక్తిపై కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన ఆ వ్యక్తి ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీశారు. మరో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా కాల్పులు జరిపారు. దీనితో సదరు వ్యక్తి అక్కడికక్కడనే కుప్పకూలిపోయాడు. కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు అని పోలీసులు గుర్తించారు. వ్యాపార గొడవలే ఈ హత్యకు గల కారణం అని తెలుస్తోంది. పరారీలో ఉన్న దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

21:26 - November 11, 2015

విజయవాడ : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రిజర్యాయర్లకు నీరు వచ్చి చేరుతోంది. తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. తిరుమల జలాశయాల్లోకి భారీగా నీరు చేరింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత మూడు రోజులుగా నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు కాలువలకు గండ్లు పడ్డాయి. అనేక గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక వర్షాలతో నెల్లూరు జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. కలువాయి మండలంలో ఎనిమిది మంది గల్లంతయ్యారు. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 11.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

తిరుమల జలాశయాల్లోకి భారీ నీరు...
వర్షాల తాకిడికి తిరుమల జలాశయాల్లోకి భారీగా నీరు చేరింది. ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. లింక్‌రోడ్డు మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించారు. తిరుమలలోని ఆకాశగంగ ధార, కుమార ధార, పసుపు ధార నిండాయి. తిరుమల కొండపైకి ద్విచక్రవాహనాల అనుమతిని రద్దు చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కురిసిన భారీ వర్షంతో స్వర్ణముఖి నది పొంగి ప్రవహిస్తోంది. కేవీపీపురం మండలం రాజుగకండ్రిగ వద్ద ఉన్న కల్వర్టు తెగిపోయింది. దీంతో పలు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కాళంగి రిజర్వాయర్‌లోకి వరదనీరు భారీగా చేరింది. స్వర్ణముఖి నదిలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాలకు చిత్తూరు జిల్లాలోని నదులు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో కొర్లగుంటవారి పల్లె ప్రాజెక్టు, తిలకవాటివారి పలెల్ల ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది.

కడపలో...
కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో రాజంపేట దగ్గర ఉన్న చక్రాలమడుగు వాగులో ఆరుగురు యువకులు చిక్కుకోగా.. స్థానికులు రక్షించారు. కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలో కురిసిన భారీ వర్షాల వర్షాల వల్ల ముత్తేరు, గున్నేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి. చిట్వేలు బ్రిడ్జి మునిగిపోవడంతో రైల్వేకోడూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. రాజంపేటలోని ఊటుకూరు చెరువుకు గండి పడింది. చక్రాలమడుగు వాగు పొంగిపొర్లడంతో కడప- తిరుపతి రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. గూడూరులో కురిసిన భారీ వర్షాలతో చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరా లేక గూడూరు డివిజన్‌లో అంధకారం అలముకుంది. ఆత్మకూరు తహసీల్దారు ఆఫీసు, కోర్టు, పోలీసుస్టేషన్‌లలోకి వర్షపునీరు చేరింది.

రాయలసీమలో...
కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామం వద్ద హంద్రీనీవా కాలువకు భారీగా గండి పడింది. దీంతో వరదనీరు గ్రామంలోకి ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ఉధృతికి పంటపొలాలు మునిగిపోయాయి. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కె. ప్రభాకర్‌ రెడ్డి కాలువ గండి పడిన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. రాయలసీమ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వందలాది ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. వరి, మినుము, శెనగ, అరటి పంటలు నీట మునిగాయి. ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. 

21:21 - November 11, 2015

హైదరాబాద్ : తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముందుగా టెట్ నిర్వహించి రానున్న విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేసేందుకు విద్యా శాఖ ప్లాన్ చేస్తోంది. వచ్చే జనవరిలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 16న వెలువడుతున్నట్లు తెలుస్తోంది. 18నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పరీక్షను జనవరి 24న జరిపేందుకు టెట్ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. టెట్ నిర్వహణకు సంబంధించి విధివిధానాలు తేదిల ప్రకటన అధికారికంగా రెండు మూడు రోజుల్లో వెలువడనుంది.

పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం..
తెలంగాణలో తొలిసారిగా , మూడేళ్ల విరామం తరువాత నిర్వహిస్తున్న టెట్ ఈ సారి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఐదు లక్షల మందికి పైగా అభ్యర్దులు దరఖాస్తు చేసుకుంటారని ఓ అంచనా. ఇదిలా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో టెట్ రాసి అర్హత పొందిన వారి విషయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన టెట్ కమిటి ఏ నిర్ణయాన్ని వెలువరించలేదు. ప్రతి పరీక్షలో తెలంగాణ చరిత్రకు ప్రాధాన్యత కల్పిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో టెట్ అర్హత పొందిన వారి విషయంలో కమిటి ఓ నిర్ణయం తీసుకోనుంది. దాంతో పాటు సైన్స్ గ్రూపులను ఎంచుకొని డిగ్రీ, బిఈడిలు పూర్తి చేసిన అభ్యర్థులకు టెట్ సోషల్ సబ్జెక్ట్ విషయంలో సైతం ఓ నిర్ణయాన్ని తీసుకోనుంది. మరో వైపు ఎన్‌సిఈఆర్‌టీఇ ఆదేశాల ప్రకారం టెట్‌ పరీక్షలను పాత పద్ధతిలోనే నిర్వహిస్తున్నట్లు సమాచారం. డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టుల భర్తికి విద్యాశాఖ సిద్ధమవుతున్న తరుణంలో టెట్ కు ప్రాధాన్యత తో పాటు అభ్యర్థులు కూడా గణనీయంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

21:17 - November 11, 2015

హైదరాబాద్ : చీకటి వెలుగుల రంగేళి.. నింగినంటే సొబగుల కేళి.. దీపావళితో తెలుగు నేల పులకరించింది. బాణాసంచా వెలుగులలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దేదీవ్యమానంగా వెలిగిపోతున్నాయి. పల్లెల నుంచి పట్టణాల వరకు పూలవనమైన వీధులు.. టపాకాయల మోతలతో మార్మోగిపోతున్నాయి. దీపాల వెలుగులో నగరాలు సరికొత్త శోభను సంతరించుకుని మరింత దేదీప్యమానంగా వెలుగిపోతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ దీపావళి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇళ్లు, షాపుల్లో ధనలక్ష్మికి ప్రత్యేక పూజలు చేశారు.

జ్యూట్ ఫ్యాక్టరీపై పడిన రాకెట్..

పశ్చిమ బెంగాల్ : బాణా సంచా కాలుస్తుండగా ప్రమాదవశాత్తు ఓ రాకెట్ నార్త్ 24 ప్రగనాస్ ప్రాంతంలోని ఓ జ్యూట్ ఫ్యాక్టరీపై పడడంతో మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

లాభాలతో ముగిసిన మూరత్ ట్రేడింగ్...

ముంబై : దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించిన మూరత్ ట్రేడింగ్ లో భారత స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. 123.69 పాయింట్లతో 25866.95 వద్ద సెన్సెక్స్ ముగియగా 41 పాయింట్ల లాభంతో 7,825 నిఫ్టీ ముగిసింది.

గద్వాల మేళ్ల చెరువు వద్ద అగ్నిప్రమాదం..

మహబూబ్ నగర్ : గద్వాల మేళ్ల చెరువు వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ వైర్లు తెగిపడడంతో పత్తి లోడుతో వెళుతున్న లారీ దగ్ధమైంది. రూ. పది లక్షల మేర ఆస్తినష్టం కలిగింది. 

కొనలకుదురులో భోజనం కోసం గ్రామస్తుల అవస్థలు..

నెల్లూరు : మనుబోలు (మం) కొలనకుదురులో భోజనం లేక గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే కటువపల్లి రొయ్యలగుడంట వద్ద వ్యక్తి గల్లంతయ్యాడు. 

కోలగట్లలో భారీ వర్షం..

నెల్లూరు : సంగం (మం) కోలగట్లలో భారీ వర్షం కురిసింది. ఎస్టీ కాలనీ జలదిగ్భందనం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోకి మోకాళ్ల లోతులో నీరు చేరినా అధికారులు స్పందించలేదు. 

ఎన్నికల్లో గెలుపుపై నితీష్ స్పందన..

పాట్నా : బీహార్ లో ఎన్నికల్లో గెలవడంపై నితీష్ కుమార్ స్పందించారు. ఎన్నికల ప్రచారంలో కార్పొరేట్ స్థాయిలో నిర్వహించిందని, సామాన్య ప్రజలను పట్టించుకోకపోవడం వల్లే బీజేపీ ఓటమి చెందిందన్నారు. బీజేపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. 

గల్లా..కన్నాలపై ఎంపీ రాయపాటి ఫైర్..

గుంటూరు : ఎంపీ గల్లా జయ్ దేవ్, కన్నాలపై ఎంపీ రాయపాటి ఫైర్ అయ్యారు. తెనాలి కేంద్రీయ విశ్వవిద్యాలయం తానే తీసుకొచ్చానని గల్లా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఏపీకి రూ.60వేల కోట్లు ఎలా వచ్చాయో కన్నా చెప్పాలని ప్రశ్నించారు. బీహార్ ఓటమితోనైనా బీజేపీ విధానాలు మార్చుకోవాలని హితవు పలికారు. అలాగే గ్రామకంఠాల పట్ల చంద్రబాబు ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. నామినేటెడ్ పదవుల భర్తీపై తిరుపతి సమావేశాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

 

శ్రీకాకుళంలో బాణాసంచా పేలి మూడిళ్లు దగ్ధం..

శ్రీకాకుళం : ఇచ్చాపురం (మం) లొద్దపుట్టిలో బాణాసంచా పేలి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మూడిళ్లు దగ్ధమయ్యాయి.

తిరుమల డ్యామ్ లకు జలకళ..

చిత్తూరు : తిరుమలలో భారీ వర్షాల కారణంగా ఆకాశగంగ, గోగర్భం డ్యామ్ లు పూర్తిగా నిండిపోయాయి. కుమారధార, పసుపు ధార, పాప వినాశనం డ్యామ్ లలో 70 శాతానికి నీరు చేరింది. ప్రస్తుత నీటి నిల్వలు ఏడాదికి సరిపోతాయని అధికారులు పేర్కొంటున్నారు. గోగర్భం డ్యామ్ రెండు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. 

బంగ్లాదేశ్ ప్రధానితో మాట్లాడిన మోడీ..

ఢిల్లీ : బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఉల్ఫా నేత అనూప్ చెతియాను భారత్ కు అప్పగించినందుకు హసినాకు కృతజ్ఞతలు తెలిపారు. 

దేశ వ్యాప్తంగా మిన్నంటిన దీపావళి సంబరాలు..

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు మిన్నంటాయి. పంజాబ్ వద్ద దేశ సరిహద్దు వద్ద జవాన్లు పటాసులు కాల్చారు. 

18:44 - November 11, 2015

అక్కినేని నట వారసత్వానికి మూడో తరం ప్రతినిధిగా తెరపైకి వచ్చాడు అఖిల్. ఇన్నాళ్ల అభిమానుల నిరీక్షణ ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోలతో ముగిసింది. సినిమా చూశాక ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కారణం...అఖిల్...సినిమాలో పాటలు, ఫైట్లు ఇరగదీశాడన్నది వాళ్ల సంతోషానికి కారణం. మరి అభిమానులను మెప్పించిన అఖిల్....సక్సెస్ ఫుల్ సినిమాతో లాంఛ్ అయ్యాడా అంటే ముక్తకంఠంతో లేదనే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకో వివరాలు చూద్దాం.

సినిమాకు కథ లేకుంటే ?
వారసుడి సినిమా గ్రాండ్ గా తీయాలనుకోవడం తప్పు లేదు. ఆ గ్రాండియర్ కు తగ్గ కథను ఎంచుకున్నారా లేదా అన్నదే అసలు విషయం. ప్రాణం లేని బొమ్మకు ఎన్ని మేకప్ లు వేసినా...ఏం లాభం. సినిమాకు కథ లేకున్నా అంతే. అఖిల్ సినిమాకు అదే జరిగింది. భారీ బడ్జెట్, టాప్ టెక్నీషియన్స్, ముగ్గురు సంగీత దర్శకులు, ఇండస్ట్రీలో పేరున్న నటీనటులు, దేశ విదేశాల్లో అద్భుతమైన లొకేషన్స్ లో షూటింగ్ లు...ఇలా ఎన్ని చేస్తే ఏం లాభం....కథలో అందముంటేనే కదా...ఇవన్నీ అదనపు హంగులు అయ్యేవి. ఇంత గ్రాండ్ గా సినిమా తీయాలని ప్లాన్ చేసిన దర్శకుడు వినాయక్ మరి కథ తయారు చేయడంలో ఆ శ్రద్ధ తీసుకోకుకండా...అశ్రద్ధ చేశాడు.

అనాథ..
అనాథ గా పెరుగుతూ...స్ట్రీట్ ఫైట్లు చేస్తూ....లైఫ్ లీడ్ చేస్తుంటాడు హీరో అఖిల్. నాయిక సాయేషాను చూసి...లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లా ప్రేమలో పడిపోతాడు. సాయేషా తండ్రి మహేష్ మంజ్రేకర్ మాఫియాతో లింకులున్న కోటీశ్వరుడు. కాంగో దేశంలో ఓ చిన్న గ్రామంలో ఉన్న శక్తివంతమైన జువాను దక్కించుకోవడం కోసం రష్యాలోని ఓ డాన్ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ డాన్ ప్లాన్స్ లో మహేష్ మంజ్రేకర్ కు భాగముంటుంది. సాయేషా పెళ్లి కుదిరిందని తెల్సుకున్న అఖిల్...ఆ పెళ్లిని జరగకుండా చేస్తాడు. పెళ్లి ఆగి సొసైటీలో పరువుపోయిందని బాధపుడుతున్న హీరోయిన్ యూరప్ వెళ్లిపోతుంది. ప్రేమించిన అమ్మాయి కోసం యూరప్ వెళ్తాడు అఖిల్. జువా కోసం వెతుకుతున్న మాఫియా సెర్చ్ లో ఓ సందర్భంలో సాయేషా ఇరుక్కుంటుంది. హీరోయిన్ ను కిడ్నాప్ చేసి కాంగోకు తీసుకెళ్తారు విలన్లు. వాళ్లను వెతుక్కుంటూ వెళ్లిన అఖిల్ జువా శక్తితో ప్రపంచాన్ని ఎలా కాపాడాడు. సాయేషాను ఎలా దక్కించుకున్నాడన్నది మిగిలిన కథ. అఖిల్ చూస్తే...శక్తి, ఢమరుకం లాంటి ఎన్నో కథలు గుర్తొస్తాయి. ప్రపంచాన్ని కాపాడే ఓ వస్తువును సంపాదించుకుని అఖండ శక్తిగా మారాలనుకునే విలన్లు...వాళ్లను చితక్కొట్టి...దాన్ని యథాస్థానంలో ఉంచే కథానాయకుడు. స్థూలంగా ఇలాంటి కథనే ఫాలోఅయ్యిందీ సినిమా. అరంగేట్రం సినిమాకే ఇంత భారీ సబ్జెక్ట్ అఖిల్ కు ఎంచుకోవడం పెద్ద మైనస్. ఓ ప్లెజంట్ లవ్ స్టోరీ ఐతే సరిపోయేది. సినిమాలోని ఇరవై నాలుగు క్రాఫ్టులు బలంగా ఉన్నాయి. వాటిలో వంక పెట్టేది లేదు. అయితే కథ నెరేషన్, స్క్రీన్ ప్లే, ప్రధాన పాత్రల చిత్రణ, రొటీన్ కామెడీ సినిమా కొంప ముంచింది.

ఆకట్టుకున్న అఖిల్..
తొలి సినిమాతోనే అఖిల్ ఆకట్టుకున్నాడు. డాన్సు చేయడంలో టాలీవుడ్ లో బెస్ట్ అరడజను మంది హీరోల్లో చేరిపోతాడు. ఫైట్లు బాగా చేశాడు. నటన, హావభావాల్లో మరింత పరిణితి చెందాలి. నాయిక సాయేషా పాత్రకు ఓ పర్ఫస్ అంటూ లేకుండా చేశారు. ఓ హీరోయిన్ వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్ ను చేసుకోవాలనుకోవడం ఏంటో అర్థం కాదు. మళ్లీ ఆ పెళ్లి చెడిపోయినందుకు బాధపడుతుంటుంది. ఫారిన్ లో ఎవరినో చూపించి...ఇతను బాయ్ ఫ్రెండ్ గా ఓకేనా అంటుంటుంది. అఖిల్ ను ఎందుకు లవ్ చేసిందో తెలీదు. బ్రహ్మానందం ఎలాగూ ఉన్నా....మాఫియా తో లింకులున్న మహేష్ మంజ్రేకర్ ను మరీ బఫూన్ ను చేశారు. క్లైమాక్స్ ఊహాతీతంగా పెట్టి ముగింపు నిరాశపర్చారు. మొత్తానికి ఈ సినిమా అఖిల్ ఎంట్రీకి పనికొచ్చేది మాత్రమే. కానీ దీంతో ఓ సక్సెస్ ఫుల్ సినిమాను ఆశించడం తప్పే.

ఫ్లస్ పాయింట్స్
అఖిల్ ఫర్మార్మెన్స్
మేకింగ్ గ్రాండియర్
టెక్నికల్ అంశాలు
కొన్ని కామెడీ సీన్స్

మైనస్ పాయింట్స్
కథ
బోరింగ్ స్క్రీన్ ప్లే
లాజిక్ లేని సన్నివేశాలు
అసందర్భంగా వచ్చే పాటలు
ప్రధాన పాత్రల చిత్రణ

టెన్ టివి విశ్లేషణ, రివ్యూ మరియూ రేటింగ్  కు సంబంధించిన పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

18:34 - November 11, 2015

హ్యూస్టన్‌ నగరం ప్రస్తుతం మాస్టర్‌ మేనియాతో ఊగిపోతోంది. యునైటెడ్‌ స్టేట్స్ లో సచిన్‌ ఎక్కడికెళ్లినా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆల్‌ స్టార్స్ క్రికెట్‌ లీగ్‌లో రెండో మ్యాచ్‌కు ఆతిధ్యమిస్తున్న హ్యూస్టన్‌లోని క్రీడాభిమానులు సచిన్‌ టెండుల్కర్‌ను చూసేందుకు క్యూ కడుతున్నారు. మినిట్‌ మెయిడ్‌ స్టేడియంలో మాస్టర్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలోనూ అభిమానులు భారీ సంఖ్యలో హాజరై..... సచిన్‌....సచిన్ అంటూ అరుపులతో సందడి చేశారు.

18:29 - November 11, 2015

ఇండియన్‌ క్రికెట్‌ గాడ్‌...మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ క్రికెట్‌ అభిమానులకు దీపావళీ శుభాకాంక్షలు తెలిపాడు. ఆల్‌ స్టార్స్ టీ 20 క్రికెట్‌ లీగ్‌ కోసం ప్రస్తుతం అమెరికాలో ఉన్న మాస్టర్‌....ట్విట్టర్‌లో దివాళీ శుభాకాంక్షలు తెలుపుతున్న వీడియోను పోస్ట్ చేశాడు.
టీమిండియా డాషింగ్‌ బ్యాట్స్ మెన్‌....ఢిల్లీ డైనమైట్‌ విరాట్‌ కొహ్లీ తనదైన స్టైల్‌లోనే దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. అభిమానులందరికి దీపావళీ ఘనంగా జరుపుకోవాలని ....కానీ టపాసులు మాత్రం కాల్చొద్దని చెబుతున్నాడు. శబ్ద కాలుష్యం మూగ జీవాలకు హానికరమని చెప్పి తన పెద్ద మనసు చాటుకున్నాడు.  

హల్వారా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో మోడీ..

పంజాబ్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హల్వారా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో గడిపారు. అక్కడున్న ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో కలిసి ఫొటోలు దిగారు. 

 

రాష్ట్రపతి అపాయింట్ ఇవ్వాలి - రిటైర్డ్ మేజర్ జనరల్

ఢిల్లీ : తమకు వెంటనే అపాయింట్ మెంట్ ఇవ్వాలని రిటైర్డ్ మేజర్ జనరల్ సత్ బిర్ సింగ్ కోరారు. వన్ ర్యాంకు వన్ పెన్షన్ కోసం మాజీ సైనికోద్యుగులు రాష్ట్రపతి భవన్ వరకు బుధవారం సాయంత్రం నిరసన మార్చ్ నిర్వహించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు.

17:42 - November 11, 2015

హైదరాబాద్ : ఎమ్మెల్యే వివేక్ పై ఆయన సమీప బంధువు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేశాడని అతను ఆరోపించారు. ఈ ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యే వివేక్ అతని సమీప బంధువైన విశాల్ కు మధ్య చింతల్ లో ఉన్న స్థలంపై వివాదం ఉంది. ఆ స్థలం తనదేనని విశాల్ వాదిస్తున్నాడు. ఇదిలా ఉంటే దీపావళి పండుగ సందర్భంగా ఆ స్థలంలో కొందరు టపాసుల దుకాణం ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న విశాల్ అక్కడకు చేరుకున్నాడు. తన అనుమతి తీసుకోకుండా దుకాణం ఎలా ఏర్పాటు చేస్తారని నిర్వాహకులను ప్రశ్నించాడు. తాము ఎమ్మెల్యే అనుమతి తీసుకుని ఇక్కడ ఏర్పాటు చేసినట్లు సదరు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సమాచారం ఎమ్మెల్యే వివేక్ కు తెలిసింది. వెంటనే అక్కడకు చేరుకున్నాడు. వివేక్..విశాల్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనితో తనపై దాడి చేశాడని విశాల్ జీడిమెట్ల పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. చికిత్సకు సంబంధించిన పేపర్లను కూడా నమోదు చేశాడు. ఘటన జరిగినప్పుడు వీడియో తీస్తున్న అతడిని కూడా ఎమ్మెల్యే కొట్టడం జరిగిందని, ఇష్టానుసారంగా దౌర్జన్యం చేస్తే సహించేది లేదని విశాల్ పేర్కొన్నాడు. 

17:36 - November 11, 2015

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ పలు విమర్శలు చేశారు. పత్తి రైతుల కళ్లలో మట్టి కొట్టిందని ఘాటుగా విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పత్తిని కొనుగోలు చేస్తున్న కేంద్రం కనీస మద్దతు ధర చెల్లించడం లేదని ఆక్షేపించారు. తేమ పేరిట రైతులను దగా చేస్తోందని, రైతుల సమస్యలపై టిడిపి, బిజెపి నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. 12 శాతం ఉన్న తేమను సడలించాలని కోరినా కేంద్రం స్పందించలేదన్నారు. రైతాంగం పట్ల మొసలి కన్నీరు కార్చడం తగదని, నిజాయితీ ఉంటే..ప్రేమ ఉంటే ఐదు వేల రూపాయలు..సీసీఐ ద్వారా కాటన్ కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఈటెల కోరారు. ఈ ప్రయత్నాలు చేయడం తప్పించి రాష్ట్ర నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని తెలిపారు. 

17:29 - November 11, 2015

వరంగల్ : చేసేది సాఫ్ట్ వేర్ ఉద్యోగం..కానీ మనస్సు మాత్రం వక్రం..ఒక మహిళను పెళ్లి చేసుకున్న సంగతి బయటకు తెలియకుండా మరొక మహిళకు మోసం చేయాలని ప్రవర్తించాడో ఓ సాఫ్ట్ వేర్. కొద్దిరోజుల్లో వివాహం జరుగుతుందనగా రెండో పెళ్లి విషయం బయటకు పొక్కడంతో ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగి పరారయ్యాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వర్ధన్నపేటలో నివాసం ఉండే సంకూరి యాదమ్మ, సత్యనారాయణ దంపతులకు చెందిన కుమార్తె వివాహం హన్మకొండలోని పద్మాక్షీ కాలనీకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాజ్ కుమార్ తో నిశ్చయమైంది. వివాహం కట్నం కింద రాజ్ కుమార్ కు రూ.11 లక్షలు ఇచ్చారు. బుధవారం వివాహ ముహూర్తం నిర్ణయించారు. బంధువులకు పత్రికలు పంచుతుండగా రాజ్ కుమార్ అసలు విషయం తెలిసివచ్చింది. ఇదివరకే ఓ మహిళతో వివాహం జరిగిందని, ప్రస్తుతం ఇద్దరు సంతానం కూడా ఉన్నారని సత్యనారాయణకు తెలిసిందే. దీనితో తాము మోస పోయామని గ్రహించి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తన విషయం బయపడడంతో రాజ్ కుమార్ పరారయ్యాడు. ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

16:35 - November 11, 2015

ముంబై : బాలీవుడ్ హీరో 'షారుఖ్ ఖాన్' ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి విచారించింది. దాదాపు మూడు గంటల పాటు షారుఖ్ ను ప్రశ్నించారు. తాను ఎలాంటి ఆర్థిక అక్రమాలకు పాల్పడలేదని షారుఖ్ పేర్కొన్నట్లు సమాచారం. కోల్ కతా నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రై.లి.షేర్లను మారిషస్ కు చెందిన జయ్ మెహతా కంపెనీకి విక్రయించడంల్ో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ షారుఖ్ కు మూడు సార్లు ఈడీ నోటీసులు జారీ చేసింది. 2008-09 సంవత్సరంలో జరిగిన ఐదు మిలియన్ల షేర్ల అమ్మకానికి సంబంధించి ఈడీ తొలిసారిగా 2011లో సమన్లు పంపగా కోలకతా నైట్ రైడర్స్ కు బాలీవుడ్ నటి జుహ్లీచావ్లా, ఆమె భర్త జయ్ మెహతాతో పాటు షారుఖ్ ఖాన్ ఓనర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరికి కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. షేర్ల అమ్మకంలో జయ్ మెహతాకు సంబంధించి సి ఐల్యాండ్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ విలువను 8 -9 రేట్లకు తక్కువగా అమ్మారని ఈడీ విచారణ జరుపుతోంది. 70-80 కోట్ల విలువగల ఈక్విటీ షేర్లను సి ఐల్యాండ్ కు కేవలం రూ.10లకే కేటాయించారని ఈడీ తన నివేదికలో పేర్కొంది. 

కేంద్రంపై ఈటెల విమర్శలు..

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. పత్తి రైతుల కళ్లల్లో కేంద్రం మట్టికొట్టిందని ధ్వజమెత్తారు. పత్తికి మద్దతు ధర పెంచాలని ఎన్నిసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని, పత్తికి మద్దతు ధర రూ. 5 వేలు ఇవ్వమంటే కేంద్రం ససేమిరా అంటుందోన్నారు. 

16:18 - November 11, 2015

కర్నూలు : జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరం వద్ద హంద్రీనీవా కాల్వకు భారీ గండిపడింది. దీనితో వరదనీరు గ్రామంలోకి ప్రవేశించింది. నీటి ఉధృతికి పంట పొలాలు మునిగిపోగా..పలు జంతువులు కొట్టుకపోయాయి. ఈ విషయం తెలుసుకున్న సంబంధిత గ్రామ ప్రజలు అధికారులకు విషయం చెప్పారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి కాల్వ గండిపడిన ప్రాంతాన్ని సందర్శించారు. రెవెన్యూ సిబ్బంది పంటల నష్టాన్ని అంచనా వేసి నష్ట పోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. నాసిరకం పనుల వల్లే కాల్వకు గండి పడిందని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

16:12 - November 11, 2015

నెల్లూరు : జిల్లాలో ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలయ్యాయి. ఈ ఘటన ఇందుకూరుపేట మండలం పల్లిపాడులో చోటు చేసుకుంది. వెంకటేశ్వర్లు..సుజాత దంపతులకు శ్రీనివాసులు, చంద్రశేఖర్ కుమారులున్నారు. దీపావళి పండుగ సందర్భంగా స్కూళ్లకు సెలవు కావడంతో సమీపంలో ఉన్న డైట్ కళాశాల ఆవరణలో ఆడుకుంటున్నారు. కానీ అక్కడనే విద్యుత్ వైర్లు తెగిపడి ఉన్నాయి. దీనిని గమనించని ఆ చిన్నారులు వైర్లను తొక్కారు. విద్యుదాత్ఘాతం తగలడంతో అక్కడికిక్కడనే మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చిన్నారులు చనిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ విషయం తెలిసినా విద్యుత్ అధికారులు పట్టించుకోలేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

యూపీలో రోడ్డు ప్రమాదం..

ఉత్తర్ ప్రదేశ్ : బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో 24 మందికి గాయాలయ్యాయి. ఓ మినీ బస్సును ట్రకు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

 

నిరసన మార్చ్ ను అడ్డుకున్న పోలీసులు..

ఢిల్లీ : మాజీ సైనికోద్యుగులు నిరసన మార్చ్ నిర్వహించారు. వన్ ర్యాంకు వన్ పెన్షన్ గురించి పార్లమెంట్ హౌస్ వరకు ఈ మార్చ్ నిర్వహించగా మధ్యలో పోలీసులు కలుగ చేసుకుని అడ్డుకున్నారు. 

ప్రభుత్వ ఏర్పాటుపై 14న నిర్ణయం - నితీష్..

పాట్నా : బీహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ఈ నెల 14న నిర్ణయం తీసుకుంటామని జేడీయూ చీఫ్ నితీష్‌కుమార్ ప్రకటించారు. బుధవారం గవర్నర్ రామ్‌నాథ్ గోవింద్‌ను కలిసిన నితీష్ ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు.

వన్డే క్రికెట్ కు యూనిస్ ఖాన్ గుడ్ బై..

ఢిల్లీ : పాకిస్థాన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఈ రోజు ఇంగ్లండ్‌తో ఖాన్ చివరి వన్డే ఆడనున్నారు. ఖాన్ 264 వన్డేల్లో 7,240 పరుగులు చేశారు. తన కెరీర్‌లో 7 శతకాలు, 48 అర్ధ శతకాలు సాధించాడు ఖాన్. 

మాజీ సైనికోద్యుగుల నిరసన మార్చ్..

ఢిల్లీ : మాజీ సైనికోద్యుగులు నిరసన మార్చ్ నిర్వహించారు. వన్ ర్యాంకు వన్ పెన్షన్ గురించి పార్లమెంట్ హౌస్ వరకు ఈ మార్చ్ జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది తమకు వచ్చిన మెడల్స్ ను తగులబెట్టారు. దీనిని మరికొంత మంది అడ్డుకున్నారు. 

15:55 - November 11, 2015

అక్కినేని వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ అక్కినేని అఖిల్ తన పేరును సినిమా టైటిల్ గా మార్చుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీపావళి పండుగ సందర్భంగా టెన్ టివి 'అఖిల్'తో ముచ్చటించింది. చిత్ర విశేషాలతో పాటు ఇతర అంశాలపై 'అఖిల్' మాట్లాడారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే వీడియో చూడండి. 

15:39 - November 11, 2015

ఖమ్మం : జిల్లాలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. భారత ప్రభుత్వ సంస్థ పేరు మీద కుంభకోణం జరిగింది. ఈ స్కాంలో బ్యాంకు సిబ్బందే పాత్ర దారులు. కానీ సూత్రదారులు ఎవరో తెలియదు. వ్యవహారం బట్ట బయలు కావడంతో..బ్యాంకు మేనేజర్‌ను బదిలీ చేశారు. అయితే ఈ స్కాంలో బ్యాంకు సిబ్బంది పాత్ర మాత్రమే ఉందా.? ఇతరుల ప్రమేయం ఉందా అనేది తేలాల్సి ఉంది. జిల్లాలో 10కోట్ల రూపాయల గోల్ మాల్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. జిల్లా కేంద్రంలోని కవిరాజ్ నగర్‌లో తెలంగాణ నూతన పునరుద్దరణీయ ఇంధన వనరుల అభివృద్ది సంఘం కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం పేరుమీదే 10కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఈ కార్యాలయం పేరుతో ఈ నెల2న ఒక చెక్ బుక్ వచ్చింది. ఈ ఒక్క చెక్ బుక్ కోట్ల రూపాయల వ్యవహారాన్ని బట్ట బయలు చేసింది.

చేతులు మారిన రూ. 10కోట్లు..
కోట్ల రూపాయల ట్రాన్స్ శాక్షన్ జరిగిన ఈ వ్యవహారంలో భారీగా అక్రమాలు వెలుగుచూశాయి. పోలీసులకు కూడా బ్యాంకు సిబ్బంది తప్పుడు సమాచారం ఇవ్వడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇక ఈ స్కాం వివరాల్లోకి వెళితే..మేరుగుశ్రీనివాసరావు, భగవాన్ దాస్‌ల పేర్లో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక ఖాతా తెరిచారు. అకౌంట్‌ నెంబర్ 2112050000541 లో 10కోట్ల 67లక్షల 87వేల రూపాయలు జమ అయ్యాయి. ఇలా జమ అయిన డబ్బుల్లో మొత్తం 10కోట్ల 61లక్షల,35వేల 670రూపాయలను విత్‌డ్రా చేశారు. ఈ అకౌంట్‌కు చెందిన ఓ చెక్ బుక్ నెడ్‌క్యాప్ ఆఫీసుకు వచ్చింది. అప్పుడే ఈ వ్యవహారం మొత్తం లీక్ అయ్యింది. వాస్తవానికి ఈ నెడ్ క్యాప్‌కు చెందిన వ్యాపార లావాదేవీలన్నీ ఎస్‌బీహెచ్‌ జరుగుతుంటాయి. అయితే యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెక్ బుక్ ఆఫీసుకు రావడంతో ఆఫీస్‌ సిబ్బంది ఆశ్చర్యపోయారు. తమకు అకౌంట్ లేని బ్యాంకు నుంచి చెక్ బుక్ రావడంతో అనుమానం వచ్చి, ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. దీనిపై విచారణ సాగుతుండగానే నెడ్‌క్యాప్ మేనేజర్ రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదుచేశారు.

ఎస్‌బీహెచ్‌లో నెడ్‌క్యాప్‌ వ్యాపారలావాదేవీలు..
అయితే దీంట్లో యునైటెడ్‌ బ్యాంక్‌ ఇఫ్‌ ఇండియా మేనేజర్ శ్రీకాంత్ వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తోంది. ముందుగా తమ బ్యాంకు లావాదేవీల కోసం ఈ అకౌంట్‌ను నిర్వహించామని బ్యాంకు మేనేజర్ చెప్పినట్లు సమాచారం. బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 29న బ్యాంకులో అకౌంట్‌ ఓపెన్ చేశారని..అక్టోబర్ రెండో తేదీన బ్యాంకు అకౌంట్‌ క్లోజ్ చేశారని తెలిపారు. కానీ బ్యాంక్ మేనేజర్ అకౌంట్‌ క్లోజ్ చేశారని చెప్పిన తేదీ తర్వాత బ్యాంకు నుంచి డబ్బులు డ్రా అయ్యాయి. వాస్తవానికి విచారణకు వచ్చిన అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం ఈ ఏడాది మే 18వ తేదీన అకౌంట్‌ ఓపెన్ చేసి అక్టోబర్ 29న బ్యాంకు అకౌంట్‌ క్లోజ్ చేశారు. కానీ ఇక్కడ మేనేజర్‌గా ఉన్న శ్రీకాంత్ మాత్రం పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారని స్పష్టం అవుతోంది. మేనేజర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం బ్యాంకు అకౌంట్‌ క్లోజ్ చేసిన తరువాత కూడా మరో 3కోట్ల రూపాయలను అకౌంట్‌ నుంచి తరలించారు. ఈ వ్యవహారంలో అటు నెడ్‌క్యాప్ అధికారులు, ఇటు బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. అయితే విచారణలో అసలు విషయం బయటపడడంతో..బ్యాంకు మేనేజర్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో మరొకరిని నియమించారు.

బ్యాంక్‌ మేనేజర్‌ బదిలీ..
అయితే అకౌంట్‌ ఓపెన్‌ చేసిన మేరుగు శ్రీనివాసరావు, భగవాన్‌ దాస్‌లు ఇంతకీ ఎవరనే విషయం అంతుచిక్కడంలేదు. దాంతో పాటు..పాన్‌కార్డులో చూపించిన మమత కూడా ఎవరనే విషయం తెలియడంలేదు. ఉత్తర ప్రదేశ్ అడ్రస్‌తో ఉన్న మమత పాన్ కార్డును ఎందుకు పెట్టాల్సి వచ్చింది. అసలు ఖాతాలో జమైన నగదు ప్రభుత్వానిదా..లేక ప్రైవేటు వ్యక్తులు బినామీగా ఖాతాను నిర్వహిస్తున్నారా..అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడంలేదు. ఈ మొత్తం వ్యవహారంపై మాట్లాడడానికి బ్యాంకు సిబ్బంది, నెడ్ క్యాంప్ సిబ్బంది ఇష్టపడడం లేదు. ఇదిలా ఉంటే..మరో వైపు తమకు బ్యాంక్ ఖాతాపై ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనని పోలీసులు చెప్తున్నారు. 
మొత్తంమీద 10కోట్ల రూపాయల వ్యవహారం చేతులు మారడం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. ఈస్కాంకు సూత్ర దారులు ఖమ్మం జిల్లాకు చెందిన వారా, లేక ఎవరనేది ఇంకా స్పష్టం కాలేదు. ఈకేసు వ్యవహారాన్ని ఇప్పటి వరకు పోలీసు యంత్రాంగంగానీ..మరే అధికారి కానీ సీరియస్‌గా తీసుకోకపోవడం గమనర్హాం. 

15:32 - November 11, 2015

విజయవాడ : మన ఇటుక.. మన అమరావతి. అమరావతి నగర నిర్మాణంలో ప్రతిఒక్కరినీ భాగం చేయాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇది ప్రారంభమై చాలా రోజులవుతున్నా విజయవాడ అర్బన్‌ టిడిపి చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. దాని దెబ్బకు గతంలో చైనాలో నెలకొన్న రికార్డు కనుమరుగైంది.

ఆన్ లైన్ లో ఇటుకలు..
అమరావతి నగర నిర్మాణంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో అందరూ వీలైనన్ని ఇటుకలను పంపించమంటూ ఏపి సిఎం చంద్రబాబు రాజధాని ప్రారంభోత్సవ వేళ కోరారు. అలా పంపించడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఆన్‌లైన్‌లో ఇటుకలు కొనే ఏర్పాటు కూడా చేశారు. అయితే ఇదే కార్యక్రమంపై ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు విజయవాడ అర్బన్‌ టిడిపి నేతలు నడుంబిగించారు. అందులో భాగంగా వీలైనన్ని ఇటుకలు కొనమంటూ నగర ప్రజలకు మరోసారి పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగా ప్రజలు స్పందించడంతో ఈ ప్రక్రియ కాస్తా గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులకెక్కింది.

59 డివిజన్ల నుండి కొనుగోలు..
టిడిపి పిలుపు మేరకు విజయవాడ సిటీలోని 59 డివిజన్ల నుంచి ప్రజలు ఆన్‌లైన్ ఇటుకల కొనుగోలు ప్రక్రియలో పాల్గొన్నారు. ఇదే రీతిలో గతంలో చైనా పిలుపునివ్వగా 24 గంటల్లో 1 లక్షా 5 వేల ఇటుకలు అమ్ముడుపోవడంతో రికార్డు సృష్టించినట్లైంది. అయితే విజయవాడ ప్రజలు పది గంటల్లోనే లక్షా 5 వేల ఇటుకలు కొనుగోలు చేసి ఆ రికార్డును బద్దలు కొట్టారు. ఇది అందరి కృషితోనే సాధ్యమైందన్నారు విజయవాడ ఎంపి కేశినేని నాని. ఈ నేపథ్యంలో టిడిపి కార్యాలయం వద్ద సంబరాలు జరిపారు.

సందడి చేసిన నేతలు..
ఎంపి నాని తో పాటు టిడిపి నేతలు, కార్యకర్తలు భారీగా హాజరై కేక్ కట్ చేశారు. బాణాసంచా కాల్చి సందడి చేశారు. ఈ సందర్భంగా ఎంపి నాని మాట్లాడుతూ మన ఇటుక.. మన అమరావతి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చిందని అన్నారు. ఇంతటితోనే ఆగక మరిన్ని ఇటుకలు కొనుగోలు చేసి రాజధాని నగర నిర్మాణానికి తోడ్పడాలని, మరెవ్వరూ బద్దలుకొట్టలేని విధంగా రికార్డు నెలకొల్పాలని పిలుపునిచ్చారు. టిడిపి నేతలు బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న మాట్లాడుతూ మన ఇటుక.. మన అమరావతి కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ఈ కొనుగోళ్లను కొనసాగించాలని కోరారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం చేయడం మనందరి లక్ష్యమని ప్రజలకు సూచించారు. 

15:29 - November 11, 2015

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గురువారం ఉదయం విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ కానున్నారు. అమరావతి శంకుస్థాపనకు హాజరుకాలేక పోయిన పవన్‌...సీఎంను కలవాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకారం, భూములు ఇచ్చిన రైతుల స్థితిగతులపై ఇద్దరూ చర్చించే అవకాశం ఉంది. వీరి భేటీపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
ఇటీవల అమరావతి రాజధాని కోసం రైతుల నుండి ప్రభుత్వం భూ సేకరణ జరిపిన సంగతి తెలిసిందే. భూములు ఇవ్వని రైతులపై భూ సేకణ చట్టాన్ని ప్రయోగించేందుకు సర్కార్ సిద్ధమైన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ తీవ్ర అభ్యంతరం తెలిపి రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులతో మాట్లాడారు. రైతుల తరపున తాను పోరాడటం జరుగుతుందని స్పష్టం చేశారు. దీనిపై టిడిపి మంత్రులు విమర్శలు చేయడం..దానికి పవన్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇటీవలే రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగింది. ఇందుకు పవన్ ను కూడా ఆహ్వానించారు. కానీ 'సర్ధార్ గబ్బర్ సింగ్' చిత్రం షూటింగ్ లో బిజీ ఉండడం వల్ల తాను హాజరు కాలేకపోతున్నట్లు పవన్ చెప్పారు. చంద్రబాబుతో జరిగే భేటీలో పలు అంశాలపై పవన్ ఆరా తీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. పలు పరిణామాల తర్వాత పవన్‌ కల్యాణ్‌... ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకోవాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

15:22 - November 11, 2015

హైదరాబాద్ : నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంగా పేరుగాంచిన సుల్తాన్ బజార్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీపావళి పండుగ రోజు ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. శ్యామ్ ఎన్ క్లేవ్ లోని నాలుగో అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకుంది. దుకాణం కింద నిర్వహిస్తూ నాలుగో అంతస్తును గోదాంగా ఉపయోగిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నాం ఒక్కసారిగా గోదాంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన దుకాణ సిబ్బంది..స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. దుకాణంలో ఉన్న ఫర్నీచర్ మంటలకు ఆహుతై పోయింది. ప్రమాదం ఎలా జరిగిందో తెలియరాలేదు. కానీ గోదాంలో టపాసులు ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. 

శుక్రవారం ఆర్జేడీ ఎమ్మెల్యేల భేటీ..

పాట్నా : ఆర్జేడీ నేతలు ఈనెల 13వ తేదీన భేటీ కానున్నారు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ అత్యధిక స్థానాలు గెలిచిన సంగతి తెలిసిందే.

సుల్తాన్ బజార్ లో ఫైర్ ఆక్సిడెంట్..

హైదరాబాద్ : సుల్తాన్ బజార్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ అపార్ట్ మెంట్ లోని నాలుగో అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఇంట్లో టపాసులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

14:42 - November 11, 2015

సన్నివేశం ఎలాంటిదైనా పదాల అల్లికతో పాటలు పాడేయగల దిట్ట..పేరడీ పాటల్లో పేరడీ క్వీన్..ఆమెనే అరుణా సుబ్బారావు. సందర్భాణానికి అనుగుణంగా క్షణాల్లో పాటలు రాసి వెంటనే ట్యూన్ చేసి గానం చేయడం ఒక ప్రత్యేక కళ. అలాంటి కళను అలవోకగా ప్రదర్శిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా 'మానవి' కార్యక్రమంలో అరుణా సుబ్బారావుతో టెన్ టివి ముచ్చటించింది. పేరడీ అనేది జీవితంలో నుండి వచ్చింది..కష్టసుఖాల్లో నుండి వచ్చిందని అరుణా సుబ్బారావు వివరించారు. ఎలాంటి పేరడీ పాటలు పాడారో చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

సునంద మృతి కేసులో కీలక పురోగతి..

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో కీలక పురోగతి చోటు చేసుకుంది. ఢిల్లీ పోలీసులకు ఎఫ్ బీఐ నివేదిక అందింది. తొమ్మిది నెలల తరువాత ఫోరెన్సిక్ రిపోర్టు వివరాలను నివేదికలో ఎఫ్ బీఐ పొందుపరిచింది. సునంత మృతికి రేడియో ధార్మిక పదార్థం కారణం కాదని ఎఫ్ బిఐ నివేదిక స్పష్టం చేసింది. ఎయిమ్స్ వైద్యుల నివేదికకు భిన్నంగా నివేదిక ఉన్నట్లు తెలుస్తోంది. సునంత మృతికి పొలీనియం కారణం కాదని, మృతికి కారణమైన విష పదార్థం పేరును నివేదికలో ఎఫ్ బీఐ పొందుపరిచినట్లు సమాచారం. 

టమోట లారీ బోల్తా..

ప్రకాశం : బేస్తవారిపేట (మం) చిన్న ఓబుళాపల్లి వద్ద టమోటా లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. రూ.2లక్షల విలువైన టమోటాలు రోడ్డు పాలయ్యాయి. 

మునుబోలులో రెండు చెరువులకు గండ్లు..

నెల్లూరు : మనుబోలు మండలంలో రెండు చెరువులకు గండ్లు పడడంతో ఐదు గ్రామాలు నీట మునిగాయి. వరద నీటిలో పది మంది గిరిజనులు చిక్కుకున్నారు. 

విద్యుత్ వైర్లు పట్టుకుని ఇద్దరు చిన్నారులు మృతి..

నెల్లూరు : ఇందుకూరి పేట (మం) పల్లిపాడులో విషాదం చోటు చేసుకుంది. డైట్ కళాశాలలో తెగిపడిన విద్యుత్ వైర్లు పట్టుకుని ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

 

కాశిపెంట వద్ద ఆక్సిడెంట్..నలుగురు మృతి..

చిత్తూరు : చంద్రగిరి (మం) కాశిపెంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. 

రాజ్ భవన్ లో ఘనంగా దీపావళి వేడుకలు..

హైదరాబాద్ : రాజ్ భవన్ లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ దంపతులకు పలువురు ప్రముఖులు, అధికారులు, రాజకీయ నేతలు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ప్రజలు దీపావళి కాంతులు నిండాలని గవర్నర్ ఆకాంక్షించారు. విద్యా ప్రమాణాలు పెంచాల్సినవసరం ఉందని ఆకాంక్షించారు. 

దుబాయ్ కు వెళ్లేందుకు యత్నించిన ముగ్గురి అరెస్టు...

హైదరాబాద్ : నకిలీ వీసాలతో దుబాయ్ కు వెళ్లేందుకు యత్నించిన ముగ్గురిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు పట్టుకున్నారు. 

13:37 - November 11, 2015

శ్రీకాకుళం: కళ్యాణ్‌ అనురాగ్‌ నిలయం ఆధ్వర్యంలో అనాధ పిల్లలకు దీపావళి సంబరాలు నిర్వహించారు. పిల్లలతో కేక్‌ కట్‌ చేయించి.. టపాసులు అందజేశారు. చిన్నారులు ఎంతో సంతోషంగా టపాసులు కాల్చారు. తమకు ఎవరూ లేరన్న భావన నుంచి చిన్నారులను బయటకు తీసుకువచ్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని.. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు తెలిపారు. 

13:34 - November 11, 2015

హైదరాబాద్ : చిలీ సమీపంలోని సముద్రంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 6.6గా నమోదైంది. అయితే సునామీ వచ్చే అవకాశమేమీ లేదని హవాయిలోని పసిఫిక్‌ సునామీ సెంటర్‌ అధికారులు ప్రకటించారు. 

13:33 - November 11, 2015

ఢిల్లీ : బంగ్లాదేశ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఉల్ఫా నేత అనుప్ చెటియాను బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధానమంత్రి వ్యక్తిగత దర్యాప్తు బృందానికి చెటియాను అప్పగించారు. ఉగ్రవాద సంస్థ ఉల్ఫా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన చెటియా మీద హత్యలు, కిడ్నాప్‌ల లాంటి ఎన్నో కేసులు ఉన్నాయి. 1997లో చెటియాను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. 

13:31 - November 11, 2015

ఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ భార్య సునందాపుష్కర్‌ అనుమానాస్పద మృతి కేసులో.. అమెరికా ఫెడరల్‌ బ్యూరో ఇన్వేస్టిగేషన్‌ ఢిల్లీ పోలీసులకు మెయిల్‌ ద్వారా నివేదికను పంపించింది. ఆమె శరీరంలో ఎలాంటి విష పదార్థాలు లేవని ఎఫ్‌బీఐ తెలిపింది. అయితే పూర్తిస్థాయి ఫోరెన్సిక్‌ నివేదిక మాత్రం ఇంకా అందించలేదని తెలుస్తోంది. ఇక ఈ కేసును తొలుత ఆత్మహత్యగా భావించిన పోలీసులు.. ఆ తర్వాత హత్య అంటూ కేసు నమోదు చేశారు. దీంతో ఎఫ్‌బీఐ ఈ కేసు విచారణను చేపట్టింది. 

13:28 - November 11, 2015

చిత్తూరు : చంద్రగిరి మండలం కాచిపెంట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు ఓ లారీని ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మృతులంతా కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు.

13:24 - November 11, 2015

తిరుమల : వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమల ఏడుకొండలు కొత్త కళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కొండపైన జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. ఆకాశగంగ ధార, కుమార ధారలు నిండి ప్రవహిస్తున్నాయి. కపిలతీర్ధం నిండుకుండను తలపిస్తోంది. ప్రకృతి అందాలను చూసి భక్తులు పులకించిపోతున్నారు. 

డివైడర్ ను ఢీ కొట్టిన కారు : ఒకరు మృతి

ప్రకాశం :సంతమాగులూరు మండలం ఎల్చూరు దగ్గర వేగంగా వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువతి మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు చిన్నారుల మృతి

నెల్లూరు :ఇందుకూరు పేట మండలం పల్లెపాడులో విషాదం నెలకొంది. డైట్ కళాశాల ఆవరణలో విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గాలివానకు విద్యుత్ తీగలు తెగిపడటంలో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

 

12:33 - November 11, 2015

ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతులలో ఔషధగుణాలనున్నాయని చాలా మందికి తెలుసు. అయితే ఇటీవల జరిగిన పరిశోధనల్లో మధుమేహ వ్యాధి నియంత్రణకు మెంతులు ఉపయోగపడతాయని నిర్ధారణ అయ్యింది. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెంతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. ఇది శరీరంలో వేడిని ఉత్పన్నం చేసే ఒక చక్కని ఓషధి. కఫాన్ని వాతాన్ని తగ్గిస్తుంది. ప్రత్యేకమైన వాసన, శరీరాన్ని పోషించే తత్వం ఈ లక్షణాల వల్ల ఇది అతి ప్రభావవంతమైన, విలువైన ఓషధిగా ప్రసిద్ధి గాంచింది. మెంతుల్లో ఫైబర్ 50 శాతం వరకూ ఉంటుంది.

మెంతులు, నల్ల మిరియాలతోనూ...

డయాబెటిక్స్‌ను తగ్గించుకోవాలంటే.. మెంతులు, బ్లాక్ పెప్పర్‌ను ఆహారంలో చేర్చుకోవాలి. మెంతులు ప్యాక్రిస్‌లో ఇన్సులిన్‌ను క్రమబద్ధం చేస్తుంది. వీటిలో ఆల్కనాయిడ్స్ కూడా ఉంటాయి. ఇవి బ్లడ్ గ్లూకోజ్‌ను తగ్గిస్తాయి. ఇంకా కార్బోహైడ్రేట్స్ షోషణను కూడా తగ్గిస్తాయి. డయాబెటిక్ వారికి కోసం మరో అద్భుతమైన హేర్బల్ ట్రీట్మెంట్ బ్లాక్ పెప్పర్. గ్యాంగరీన్ ను నయం చేయడంలో చాలా మేలు చేస్తుంది.

వాడుకలో మెంతులు ...

మెంతి ఆకులను నేరుగా లేక చపాతీలోకి కర్రీగా తీసుకోవచ్ఛును. ఇది లాలాజల గ్రంధులు పనితీరును పెంచుతుంది.

రోజూ రెండు చెంచాల మెంతి పొడిని నీటితో గానీ, పాలతో గానీ తీసుకోవడంవల్ల చక్కెరవ్యాధి, కొలెస్టరాల్ తగ్గుతాయి.

నీటిలో నానబెట్టిన మెంతులను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తీసుకుంటే అధికంగా ఉన్న కొవ్వు తగ్గుతుంది.

శ్వాస సంబంధిత సమస్యలకు తొలిదశలోనే మెంతులు ఉపయోగించినట్లయితే సులభంగా తగ్గించుకోవచ్చును. బ్రాంకైటిస్, సైనసైటిస్, ఇన్‌ఫ్లుయంజా, న్యూమొనియా, వంటి జబ్బులకు మంచి మందుగా మెంతులు పనిచేస్తాయి.

మెంతి టీ (మెంతులతో తయారుచేసిన తేనీరు)తీసుకోవడంవల్ల శ్వాస సంబంధ సమస్యలను అడ్డుకోవచ్చును.

మెంతులతో చేసిన పానీయాన్ని, నీటితో పుక్కిలిస్తే, గొంతులో ఉన్న గర గర తగ్గిపోతుంది. పాటలు పాడేవారికి, ఉపాధ్యాయులకు, ఉపన్యాసకులకు ఈ మెంతుల పానీయం వర ప్రసాదమే. చాలా తక్కువ సమయంలో, మెంతి పానీయాన్ని తయారుచేసుకోవచ్చును. మిరియాలు వేసి, కాచి తాగుతారు గాత్ర శుద్ధికి. కానీ దీనిక్ చాలా సమయం పడుతుంది.

కిడ్నీ, మూత్రనాళ సంబంధిత సమస్యలకు మెంతులు చక్కని మందు. రక్తనాళాలను, శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో వీటికివే సాటి. అందుకని మెంతికూర రోజూ మన ఆహారంతో పాటు తీసుకుంటే, మన ఆరోగ్యానికి తిరుగులేదు.

కడుపు, కడుపులోని పేగులను మెంతులు శుద్ధి చేస్తాయి.

సైనికులతో కలిసి మోడీ దీపావళి

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ సైనికులతో కలిసి దీపావళి పండుగ జరుపుకోనున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని దేశ సరిహద్దుల్లో పర్యటిస్తానని మోడీ తెలిపారు. ఏ ప్రాంతానికి వెళ్తారన్న సమాచారం మాత్రం లేదు. గతేడాది సరిహద్దు ప్రాంతమైన సియాచిన్ వద్ద సైనికులతో కలిసి మోడీ దీపావళి పండుగలో పాల్గొన్నారు.

భారీ వర్షాలపై చంద్రబాబు

విజయవాడ : తుపాను వల్ల కురిసిన భారీ వర్షాల వల్ల చంద్రబాబు అధికారులతో టెలీకాన్ఫరెన్సలో సమీక్షించారు. నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షపాతం, పంటనష్టం, ఉపశమన చర్యలపై కలెక్టర్లతో సీఎం ఆరా తీశారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన ఫార్మ్‌పాండ్స్‌ కాన్సెప్ట్‌ను కడప, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా అమలు చేయాలని సీఎం కోరారు. ప్రతి వర్షపు చినుకు వృధాకారాదని చంద్రబాబు సూచించారు. పంటపొలాల్లో చెరువులను నింపాలని చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు.

 

11:56 - November 11, 2015

తూ.గో : ఒక చిన్న చేప.. పట్టుకుంటే జారిపోయే చిట్టిచేప. తనను తాను రక్షించుకోవాలనుకుంది. ఒక వ్యక్తి ప్రాణాలు హరించబోయింది. అలా అని అది విషపూరితమూ కాదు. ప్రమాదకరమైనది అంతకన్నా కాదు. కానీ అలజడి సృష్టించింది. అందర్నీ హడలెత్తించింది..ఇంతకి అదేం చేసిందో ఒకింత నిర్లక్ష్యం ఎంత పెద్ద సమస్యను తెచ్చిపెట్టిందో ఈ ఫిష్‌ హంట్‌లో మీరూ చూడండి.

కాకతాళీయంగా జరిగినా....

రెండు ముక్కలుగా చచ్చి పడి ఉన్న ఈ మత్స్యం ఈ వ్యక్తి నిండు ప్రాణాలను కబళించబోయింది. కాకతాళీయంగా జరిగినా ఆ సంఘటన బహుశా గతంలో ఎప్పుడూ జరిగి ఉండదు. నోటికి ప్లాస్టర్‌తో, స్పృహ కోల్పోయి హాస్పిటల్‌ బెడ్‌పై ఉన్న ఇతను పెనుబల్లి వెంకటేష్‌. ఇతనికి చేపలు పట్టడం సరదా. ఆ సరదానే ప్రాణాలమీదకు తెచ్చింది.

కొండిపల్లి గ్రామానికి చెందిన గిరిజన యువకుడు.....

వెంకటేష్‌ తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం పాత కొండిపల్లి గ్రామానికి చెందిన గిరిజన యువకుడు. చేపల్ని పట్టడమంటే వెంకటేశ్‌కు మహాసరదా. ఆ క్రమంలోనే తన బావమరిదితో కలిసి స్థానికంగా ఉన్న చెరువు వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లాడు. గట్టున కూర్చుని రెండు గాలాలతో పని మొదలుపెట్టాడు. రెండింటికీ రెండు చేప పిల్లలు పడగా ఒక దాన్ని గాలం నుంచి వేరు చేసి నోట్లో పెట్టుకుని రెండోదాన్ని గాలం నుంచి విడిపించబోయాడు. ఇంతలోనే ఊహించని ప్రమాదం జరిగిపోయింది.

నోట్లో పెట్టుకున్న చేప తప్పించుకోబోయి గొంతులోకి....

వెంకటేష్‌ నోట్లో పెట్టుకున్న చేప తప్పించుకోబోయి గొంతులోకి జారిపోయింది. దీంతో అతనికి ఊపిరాడక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇది గమనించిన బావమరిది వెంటనే వెంకటేశ్‌ను భద్రాచలంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే వెంకటేష్‌ స్పృహకోల్పోయాడు. వైద్యులు ప్రత్యేక గొట్టంతో శ్వాస ఆడేలా చేసి ఆ తర్వాత..చాకచక్యంగా చేప పిల్లను గొంతులోంచి తీసి వెంకటేష్‌ను కాపాడారు. ఏదేమైనా ఒక చిన్న చేప ఇంత సమస్యను క్రియేట్‌ చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. సమయానికి ఆస్పత్రికి తీసుకురావడం, వైద్యులు అందుబాటులో ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంకటేష్‌ తిరిగి స్పృహలోకి రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

11:52 - November 11, 2015

విజయవాడ: రాజ‌ధాని మాస్టర్ ప్లాన్ త‌యారీలో రైతుల‌ను కూడా భాగ‌స్వామ్యం చేసేందుకు ప్రభుత్వం రడీ అవుతోంది. మాస్టర్ ప్లాన్‌పై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు వారి నుంచి స‌ల‌హాలు తీసుకోనుంది ప్రభుత్వం. అవ‌స‌ర‌మైతే రైతుల స‌ల‌హాల‌తో మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేసేందుకు కూడా సిద్ధం అవుతోంది. ఈనెల 12న రాజ‌ధాని గ్రామాల రైతుల‌తో ప్రత్యేకంగా ఓ స‌మావేశం ఏర్పాటుచేస్తోంది సీఆర్డీఏ.

12 మీటింగ్ .......

రాజధాని గ్రామాల రైతులతో సీఆర్డీఏ కీల‌క స‌మావేశం నిర్వహించనుంది. ఈనెల 12న ఈ మీటింగ్ జ‌ర‌గ‌నుంది. రాజధాని మాస్టర్ ప్లాన్ పై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సీఆర్డీఏ గ్రామాల్లోని రైతు క‌మిటీల నుంచి ఇద్దరు లేదా ముగ్గురిని ఎంపిక చేస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో ఏ గ్రామంలో ఏయే నిర్మాణాలు వ‌స్తాయి...ప్రభుత్వం ప్రతిపాదించిన న‌వ నగ‌రాల భావన ఎలా ఉండేది అధికారులు వివరిస్తారు. రోడ్లు, నివాసప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు ఎక్కడ వ‌స్తాయ‌న్న అంశంపై రైతుల‌కు స్పష్టత ఇస్తారు.

మాస్టర్ ప్లాన్ రూపొందించిన సింగ‌పూర్‌ కంపెనీ....

మాస్టర్ ప్లాన్ రూపొందించిన సింగ‌పూర్‌కు చెందిన సుర్బానా కంపెనీ ప్రతినిధులు.... రైతుల‌కు, క్షేత్రస్థాయిలో ప‌నిచేస్తున్న అధికారులకు ప్లాన్ పై వివ‌రించ‌నున్నారు. ఇదే స‌మ‌యంలో రైతుల నుంచి వ‌చ్చే స‌ల‌హాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు...ఇప్పటికే మాస్టర్ ప్లాన్ పై తుది క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. రైతుల నుంచి వ‌చ్చే స‌ల‌హాల‌ను కూడా చేర్చి తుది ప్లాన్ ను ఈనెలాఖ‌రులోగా రూపొందించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ...ఈ ప్రణాళిక వ‌చ్చాక కూడా మ‌రో నెల రోజుల పాటు ప్రజ‌లు, రాజ‌ధాని గ్రామాల రైతుల నుంచి స‌ల‌హాలు స్వీక‌రిస్తారు.

రైతుల‌కు తిరిగి ఇచ్చే భూముల‌పై స్పష్టత...

రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల‌కు తిరిగి ఇచ్చే భూముల‌పైనా ఈస‌మావేశంలో స్పష్టత రానుంది...ఇప్పటికే ఒక‌టికంటే ఎక్కువ‌చోట భూములిచ్చిన వేర్వేరు రైతులు కావాల‌నుకుంటే ఒకేచోట భూములు ఇవ్వాల‌ని స‌ర్కార్ నిర్ణయించింది...దీనిపై కూడా రైతుల అభిప్రాయాలు తీసుకుంటారు. ప్రతి విష‌యంలోనూ రాజ‌ధాని గ్రామాల ప్రజ‌ల‌ను, రైతుల‌ను భాగ‌స్వామ్యం చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. 

11:49 - November 11, 2015

చిత్తూరు/నెల్లూరు, కడప : అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి... వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. పలు గ్రామాలకు స్తంభించిన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద ఉధృతిలో చిక్కుకున్న నెల్లూరు గూడూరు ఎస్‌ఐ కొట్టుకుపోయారు. 

అమెరికాలో కూలి విమానం:9 మంది మృతి

వాషింగ్టన్: ఓ విమానం అపార్ట్ మెంట్ పైకి కుప్పకూలిపోయిన ఘటన అమెరికాలోని అక్రోన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఫైలట్లు, ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారు. ఒహియోలో విమానం ల్యాండయ్యే ముందు ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు.

పటాన్ చెరువు లో అగ్ని ప్రఆమదం...

మెదక్ : పటాన్‌చెరులోని ఓ ఫ్యాక్టరీలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. భారీగా ఆస్తి నష్టం జరిగింది.

నదిలో బాలిక మృతదేహం

చిత్తూరు :గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సోమల మండలం గార్గేయ నదిలో గల్లంతైన బాలిక మృతదేహం బుధవారం లభ్యమైంది. పట్రపల్లి దగ్గర మృతదేహం లభించింది. బాలికతోపాటు గల్లంతైన తండ్రి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.

ఉల్ఫా నేతను భారత్ కు అప్పగించిన బంగ్లాదేశ్

హైదరాబాద్ : గత కొన్నేళ్లుగా బంగ్లాదేశ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఉల్ఫా నేత అనువ్ చెటియాను బంగ్లాదేశ్ ప్రభుత్వం నేడు భారత్ కు అప్పగించింది. ఉగ్రవాద సంస్థ ఉల్ఫా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన చెటియా మీద హత్యలు, కిడ్నాప్ లు వంటి ఎన్నో కేసులు ఉన్నాయి. 1997 నుండి బంగ్లాదేశ్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

సునంద పుష్కర కేసులో మరో ట్విస్ట్....

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన కాంగ్రెస్ నేత శశిథరూర్ భార్య సునంద పుష్కర్ కేసులో కీలక పురోగతి సాధించింది. ఢిల్లీ పోలీసులు ఎదురు చూస్తున్న ఎఫ్ బీ ఐ ఫోరెన్సిక్ రిపోర్టు ఎట్టకేలకు వారి చేతికి అందింది. అయితే.. ఢిల్లీ పోలీసులు భావించినట్లు సునంద మరణానికి రేడియో ధార్మిక పదార్థం కారణం కాదని ఎఫ్ బీ ఐ రిపోర్టు స్పష్టం చేసింది. సునంద పుష్కర్ మృతికి కారణాలు తెలుసుకోవడానికి ఢిల్లీ పోలీసులు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారుల సాయం కోరిన సంగతి తెలిసిందే. తొమ్మిది నెలల తర్వాత ఫోరెన్సిక్ రిపోర్టు వివరాలు ఎఫ్ బీఐ సీల్డ్ కవర్ లో ఢిల్లీ పోలీసులకు అందింది.

రేవాను తుఫాను తిరుమలకు వరమే : టిటిడీ ఈవో

తిరుమల: బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం రేవాను తుఫానుగా మారి తమిళనాడు, పుదుచ్ఛేరిలతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పెను విధ్వంసాన్ని సృష్టించింది. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో రేవాను తుఫాను బీభత్సం సృష్టించింది. అయితే రేవాను తుఫాను తిరుమల వెంకన్న భక్తులకు వరమేనని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో) సాంబశివరావు పేర్కంటున్నారు. తిరుమల పరిధిలోని జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టంతో కనిపించి చాలా కాలం అవుతోంది. దీంతో కొండపై ఎప్పటికప్పుడు తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

గూడూరు వద్ద పొంగిపొర్లుతున్న పంబలేరు..

నెల్లూరు : గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గూడూరు దగ్గర పంబలేరు పొంగిపొర్లుతుంది. పెట్రోల్‌బంక్‌ జలదిగ్బంధంలో చిక్కుకుంది. పెట్రోలుబంకులో పది మంది స్థానికులు, ఎస్‌ఐ చిక్కుకున్నారు. పంబలేరులో గల్లంతైన ఓ వ్యక్తిని స్థానికులు రక్షించారు. కలువాయి మండలం చీపినాపి దగ్గర కందువాగులో బైక్‌పై వెళుతున్న ఇద్దరు గల్లంతయ్యారు. మనుబోలు మండలంలోని తీరప్రాంతంలో ఉన్న అయిదు గ్రామాల్లోని ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

అరగంట ముందు రైలు టికెట్ బుకింగ్...

న్యూఢిల్లీ: రైలు బయలుదేరటానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ అమల్లోకి తేనుంది. నవంబర్ 12 నుంచి ఇది అమల్లోకి రానుంది. అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా ఇంటర్నెట్ వినియోగదారులకు మాత్రమే ఈ సదుపాయం వర్తించనుంది. దీంతో..ఇప్పటి వరకు ఒకసారే చార్ట్ సిద్ధం చేసే రైల్వే ఇక రెండుసార్లు చార్ట్ సిద్ధం చేయాల్సి వస్తుంది. రైలు బయలుదేరే ముందు టీటీఈలకు ఈ చార్ట్ అందజేస్తారు.

దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని దీపావళి శుభాకాంక్షలు

హైదరాబాద్: దీపావళి పర్యదినం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలంటూ ప్రధాని, రాష్ట్రపతి ట్వీట్ చేశారు.

09:24 - November 11, 2015

విశాఖ : చలి గిలిగింతలు మొదలయ్యాయి...శ్వేతవర్ణపు మంచు తెరలు చక్కిలిగింతలు పెడుతున్నాయి. ఇంతటి ప్రకృతి అందాల్లో తన భాగస్వామ్యం లేకపోతే బాగుండదనుకున్నాయో ఏమో పూలు అరవిచ్చుకున్నాయి. మల్లెపవ్వులాంటి మంచు సొగసులకు...పసుపురంగు తోడైంది. అంతే అడవి అప్సరస అయింది. ఆలస్యం చేస్తే అరకు అందాలన్నీ మిస్‌ అయిపోతాయనుకుంటున్నారు పర్యాటకులు. పరుగు పరుగున వెళ్లి అందాల అడవిలో పరవశించిపోతున్నారు.

సూర్యుడికి కూడా ప్రకృతి అందాలపై కూసింత మక్కువే.....

భగభగ మండే సూర్యుడికి కూడా ప్రకృతి అందాలపై కూసింత మక్కువే. అందుకే గట్టిగా కాస్తే ఆ సోయగాలు పారిపోతాయని చూసీచూడనట్టు.. తాకీ తాకనట్టు నులివెచ్చగా తాకుతున్నాడు. ఇక తనకు తిరుగులేదనుకుంటూ మంచు దుప్పటి అడవిని కప్పేసింది. తెల్లారింది లేవండోయ్‌ అన్నా కూడా లేవనంతగా మంచుతో మసకేసింది అరకు.

విచ్చుకున్న వలిసె పూలు...

ఓ వైపు మంచు..మరో వైపు చలి అరకును చుట్టేయడంతో తాను వికసించే తరుణమాసన్నమైందనుకున్న వలిసె పూలు విచ్చుకున్నాయి. అరకు వనాన్నంతా పసుపువర్ణం చేసి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. సహజ అందాలతో విశాఖ మన్యం ముద్దమందారంలా మురిపిస్తోంది.

తుపాను తాకిడికి కకావికలమైనా.....

గత ఏడాది హుదుద్ తుపాను తాకిడికి కకావికలమైన అరకు వేగంగానే కోలుకొని పూర్వవైభవాన్ని సంతరించుకుంది. ఏడాది పాటు మిస్‌ అయిన అరకు అందాలు మళ్లీ ఆహ్లాదపరుస్తున్నాయి.

లిసె పూల కారణంగా పసుపువర్ణంగా...

అరకు అందాల్లో ప్రత్యేకమైనది..ముఖ్యమైనవి వలిసె పూల వనాలు. శీతాకాలంలో అరకు వలిసె పూల కారణంగా పసుపువర్ణమౌతుంది. శీతాకాలంలో మాత్రమే పూసే ఈ పూలు అరకు అందాలను మరింత పెంచుతాయి. ఈ పూలు అరకు పరసర ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. వలిసె పూలు అందానికే కాదు ఆర్థికంగాను గిరిజనులకు ఆసరాగా నిలుస్తున్నాయి. వీటి గింజల నుంచి వచ్చే నూనెను గిరిజనులు వంటలకు వినియోగిస్తారు. నూనెను విక్రయించి కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. వలిసె పూల వనాన్ని తనివి తీరా చూసి..ఫొటోలకు ఫోజులిచ్చి.. ఇష్టం లేకున్నా అక్కడి నుంచి కదులుతారు పర్యాటకులు. అరకు మన్యంలో మరో ప్రత్యేకమైనవి జలపాతాలు. ఒకటి కాదు రెండు కాదు... అరకులో ఆరు జలపాతాలున్నాయి. చాపరాయి, రణజిలడ, గత్తరజిలడ, కటిక, తాడిగూడ, దడదడ జలపాతాలు అరకులో హొయలుపోతున్నాయి.

పర్యాటకుల తాకిడి ఎక్కువగా....

ఇందులో చాపరాయి, కటికి వాటర్‌ ఫాల్స్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. యూత్‌ బైకులపై వచ్చి మరీ ఇక్కడ కేరింతలు కొడుతుంటారు. వలిసె పూలలో విహరించి, జలపాతాల్లో జలకాలాడి వచ్చిన టూరిస్టులను రారమ్మని పిలుస్తుంది బొంగు చికెన్‌. ఎదురు బొంగుల్లో కాల్చిన చికెన్‌ను టూరిస్టుల కోసం సిద్ధంగా ఉంచుతారు ఇక్కడి గిరిజనులు. ఎక్కడా దొరకని ఈ చికెన్‌ ఇక్కడే లభిస్తుండటంతో ఆవురావురుమంటూ ఆరగించి తమ అరకు టూరును హ్యాపీగా ముగిస్తారు.

శ్రీవారి నడక మార్గం మూసివేత...

తిరుమల : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రెండవ ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శ్రీవారి నడకమార్గాన్ని మూసివేశారు. కొండచరియలు విరిగిన ప్రాంతం పరిశీలనకు ప్రత్యేక బృందాన్ని రప్పించారు. ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్‌ కేఎస్‌రావు, చెన్నై ఐఐటీ ప్రొఫెసర్‌ నరసింహారావు, సాంకేతిక సలహాదారు కొండలరావును టీటీడీ రప్పించింది. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఈ నిపుణుల బృందం రేపు పరిశీలించనుంది.

09:17 - November 11, 2015

ఖమ్మం : వీలైనన్ని ప్రాజెక్టులు కట్టాలి.. ప్రతి ఎకరా నీటితో తడవాలన్న సీఎం కేసీఆర్‌..ఆ దిశగా పలు ప్రయత్నాల్ని వేగవంతం చేశారు. అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి సారించారు. జిల్లాలో ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న దుమ్ముగూడెం ప్రాజెక్ట్‌ దుమ్ము దులిపే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఎన్నో ఏళ్ల క్రితమే దుమ్ముగూడెం ఆలోచన.....

జలకళతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని కేసీఆర్‌ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దీంట్లో భాగంగా..భాగంగా గోదావరి జలాలను సంపూర్ణంగా వినియోగించుకోవాలని ఆయన ప్లాన్‌ చేస్తున్నారు. ఆ దిశగా అధికారులతో వరుస రివ్యూలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం ప్రాజెక్ట్‌పై దృష్టిసారించారు. నిజానికి ఈ ప్రాజెక్ట్‌ ఆలోచన ఎన్నో ఏళ్ల క్రితమే మొదలైనా పనులు ముందుకు సాగలేదు. పైగా అనేక వివాదాలు ఉండనే ఉన్నాయి.

ఐదు లక్షల ఎకరాలకు నీరివ్వాలని ఆలోచన.......

సత్వరమే దుమ్ముగూడెం ప్రాజెక్ట్‌ నిర్మించి 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. నాగార్జునసాగర్‌ కింద సాగయ్యే భూమిపోను ఖమ్మం జిల్లాలోని మిగతా పొలాలకు దుమ్ముగూడెం నీరు అందించాలన్నది సర్కార్ ఆలోచన. ఈమేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీనియర్‌ అధికారులు నర్సింగరావు, ఎంజి గోపాల్‌, ఇతర అధికారులతో సీఎం తన క్యాంపు ఆఫీసులో సమీక్ష జరిపారు. సాంకేతిక అంశాలను పరిశీలించి రిజర్వాయర్లు, కాలువలు, లిఫ్టు నిర్మాణానికి అవసరమైన సూచనలు చేస్తూ నివేదిక ఇవ్వాలని వ్యాప్కోస్‌ అధికారులను కేసిఆర్‌ ఆదేశించారు.

ఇందిరా, రాజీవ్‌సాగర్‌లుగా విభజన........

గతంలో దుమ్ముగూడెం ప్రాజెక్ట్‌ను ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్‌ ప్రాజెక్ట్‌లుగా విడగొట్టారు. ఇప్పుడు తెలంగాణ అవసరాలకు తగినట్లుగా ఆ రెండింటినీ కలిపి జిల్లాకు నీరందించే కార్యాచరణ రూపొందించాలని కేసిఆర్‌ భావిస్తున్నారు. దుమ్ముగూడెం వద్ద గోదావరి నదిలో ఏడాది పొడవునా నీటి లభ్యత సమృద్ధిగా ఉండే నేపథ్యంలో ఆ నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించాలని సూచించారు. దుమ్ముగూడెం నుంచి కిన్నెరసాని వరకు నీటిని గ్రావిటీ ద్వారా తెచ్చి అక్కడ లిఫ్టు పెట్టి జగన్నాథపురం తరలించాలన్నది ప్లాన్‌. జగన్నాథపురంలో రిజర్వాయర్‌ కట్టి సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇల్లందు, పాలేరు, ఖమ్మం, వైరా......

రోళ్లపాడు వద్ద భారీ రిజర్వాయర్‌ నిర్మించి ఇల్లందు, పాలేరు, ఖమ్మం, వైరా నియోజకవర్గాలకు నీరందించనున్నారు. బయ్యారం చెరువు సామర్థ్యాన్ని కూడా పెంచి ఇల్లందు, వైరా, పాలేరు, ఖమ్మం, వరంగల్‌ జిల్లా డోర్నకల్ నియోజకవర్గాలకు నీరందించనున్నారు. అయితే గోదావరిపై ఇప్పటికే పలు ప్రాజెక్ట్‌లు నిర్మించే ఆలోచన ఉంది. అవన్నీ నిర్మాణం జరిగితే దుమ్ముగూడెం వద్ద నీటి లభ్యత ఎంతమేర ఉంటుందన్నది ప్రధాన అంశంగా మారింది. 

09:12 - November 11, 2015

నెల్లూరు : తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత మూడు రోజులుగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు కాలువలకు గండ్లు పడ్డాయి. అనేక గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక వర్షాలతో జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. కలువాయి మండలంలో ఎనిమిది మంది గల్లంతయ్యారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 11.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

 

09:11 - November 11, 2015

హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.. ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి జీశాట్ 15 ఉపగ్రహాన్ని సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది.. తెల్లవారుజామున 3గంటలకు ఈ ప్రయోగాన్ని జరిపింది.. అరైన్ 5 అనే ఉపగ్రహ వాహకనౌక ద్వారా 3వేల 164 కిలోల బరువున్న జీ శాట్‌తోపాటు అరబ్‌శాట్‌ 6బీని రోదసీలోకి పంపారు.. జీ శాట్‌లో 24కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌పాండర్స్, రెండు గగన్‌ పేలోడ్స్ ఉపకరణాలను అమర్చారు.. 

09:09 - November 11, 2015

హైదరాబాద్ : తమిళనాడులో భారీవర్షాలకు దాదాపు 23మంది ప్రాణాలు కోల్పోయారు.. ఒక్క కడలూరు జిల్లాలోనే 17మంది మృత్యువాత పడ్డారు.. సేలం, ధర్మపురి, కోయంబత్తూర్, కడలూర్ జిల్లాల్లో వాగులు పొంగిప్రవహిస్తున్నాయి.. ఈ ప్రాంతాల్లో వెంటనే సహాయకచర్యలు చేపట్టాలని సీఎం జయలలిత అధికారులను ఆదేశించారు.. అటు ఏపీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి... నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి.. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి.. వివిధ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.. ఇక తిరుమలలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది.. వందేళ్లలో ఇంతటి వర్షపాతం నమోదు కాలేదని టీటీడీ అంచనావేస్తోంది.. కొద్దినెలలుగా నీరులేక ఇంకిపోయిన జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి.. పాప వినాశనం, గోగర్భం, కుమారధార పసుపుధార జంట ప్రాజెక్టుల్లోకి దాదాపు 70శాతం నీరు చేరింది.. 

శ్రీవారి సన్నిధిలో దీపావళి ఆస్థానం.. ఆర్జిత సేవలు రద్దు...

తిరుమల: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నేటి ఉదయం తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో దీపావళి ఆస్థానం జరుగుతోంది. నేటి తెల్లవారుజాముననే మొదలైన దీపావళి ఆస్థానం ఉదయం 9 గంటల వరకు ఆలయంలోని బంగారు వాకిలి వద్ద జరగనుంది. దీపావళి ఆస్థానం నేపథ్యంలో ఆలయంలో నేటి ఉదయం జరగాల్సిన పలు ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రద్దు చేసింది. దీపావళి ఆస్థానం ముగిసిన తర్వాత ఆలయంలో రోజువారీ కార్యక్రమాలు యథాతథంగా జరుగుతాయని ఇదివరకే టీటీడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

కారును ఢీకొన్న లారీ : నలుగురి మృతి

చిత్తూరు : చంద్రగిరి మండలం కాచిపెంట్ల వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీ కొట్టడంతో నలుగురు మృతి చెందారు. మృతులు కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారు, దంపతులు ఉన్నారు.

బొగ్గేరు వాగుకు గండి

నెల్లూరు: తుపాను ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బొగ్గేరువాగుకు గండి పడింది. దీంతో పదిగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటి ప్రవాహంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

చిలీలో భూకంపం

హైదరాబాద్: దక్షిణ అమెరికా తీర ప్రాంత దేశం చిలీలో కొద్దిసేపటి క్రితం పెను భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 6.9గా నమోదైనట్లు యూఎస్ జియలాజికల్ సర్వే వెల్లడించింది. చిలీలోని కాకింబో నగరానికి వంద కిలో మీటర్ల దూరంలో సంభవించిన ఈ భూకంప కేంద్రం భూ ఉపరితలానికి 10 కిలో మీటర్ల లోతున ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్ఠాలకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. 

మద్యం ద్వారా టీఎస్ ఖజానాకు భారీగా ఆదాయం

హైదరాబాద్ : మద్యం సేవించడం హానికరమేమో గాని తెలంగాణ ఖజానాకు మాత్రం ఆరోగ్యకరంగా మారింది. గలాగలా పారుతున్న వైన్‌తో గల్లాపెట్టె ఫుల్‌ అవుతోంది. మందుబాబులు తెగతాగేస్తుంటే...ఖజానా విందు చేసుకుంటోంది. కావాల్సినన్ని కాసులను పిండుకుంటోంది. అనుకున్నంత ఆదాయం అందుకుంటోంది. 

08:23 - November 11, 2015

హైదరాబాద్ : మద్యం సేవించడం హానికరమేమో గాని తెలంగాణ ఖజానాకు మాత్రం ఆరోగ్యకరంగా మారింది. గలాగలా పారుతున్న వైన్‌తో గల్లాపెట్టె ఫుల్‌ అవుతోంది. మందుబాబులు తెగతాగేస్తుంటే...ఖజానా విందు చేసుకుంటోంది. కావాల్సినన్ని కాసులను పిండుకుంటోంది. అనుకున్నంత ఆదాయం అందుకుంటోంది.

రికార్డు స్థాయిలో ఇన్‌కమ్‌.....

తెలంగాణకు వస్తున్న ఆదాయంలో సింహభాగం మద్యానిదే. మద్యం అమ్మకాలు, వ్యాట్‌ రూపంలో రికార్డు స్థాయిలో ఇన్‌కమ్‌ వస్తోంది. ఇతర శాఖల కన్నా ఎక్సైజ్‌ శాఖ ద్వారానే ఆదాయం అధికంగా ఖజానాలోకి చేరుతోంది.

రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత రూ.11వేల కోట్లు ఆదాయం.....

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు 11 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా రానంత ఆదాయం వచ్చి చేరింది. 2015-16 బడ్జెట్‌లో మద్యం ద్వారా రూ. 12,500 కోట్లను రాబట్టడమే లక్ష్యంగా అంచనాలు తయారుచేశారు. అందులో 8,511 కోట్ల రూపాయలను పన్నుల రూపంలో ఆర్జించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఐతే ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ 31 వరకు మద్యంపై పన్నుల రూపంలో రూ. 4244 కోట్ల రాబడి సమకూరింది. లైసెన్సులు, ఫీజులు రూపంలో 4వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. వార్షిక బడ్జెట్‌ ముగియడానికి ఐదు నెలలు ఉండగానే మద్యంపై ప్రభుత్వానికి రూ.8244 కోట్లు రాబడి సమకూరింది.

ఆదాయాన్ని పెంచే యోచన.....

మొత్తానికి మద్యం ద్వారా టీ ఖజానాకు అంచనాలకు మించి ఆదాయం వస్తోంది. ఈ ఉత్సాహంతో మరింత ఆదాయాన్ని సమకూర్చుకునే పనిలో టీ సర్కార్‌ పడింది. అందుకు అవసరమైన ప్రణాళికలనూ తయారుచేస్తోంది. పనిలో పనిగా మద్యం ధరను మళ్లీ పెంచేందుకు సిద్ధమవుతోంది. మూడు నెలల క్రితమే బీరు, విదేశీ మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం మరోసారి ధరల పెంచడానికి రంగం సిద్ధం చేసింది. ఇటీవల పెంచిన బీరు ధరతో పాటు అన్ని రకాల ధరలను పెంచనుంది. దీనికి సంబంధించి ఫైల్‌ సీఎం దగ్గర పెండింగ్‌లో ఉంది. సీఎం సంతకం చేయగానే ధరలను పెంచడానికి అబ్కారీ శాఖ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఉన్న చీప్‌ లిక్కర్‌ ధరను కూడా పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. 

లక్కసాగరం వద్ద హంద్రీనీవా కాల్వకు గండి

కర్నూలు : కృష్ణ గిరి మండలం లక్కసాగరం వద్ద హంద్రీనీవా కాల్వకు గండి పడింది. దీంతో సమీపంలోని పంట పొలాలు నీటమునిగాయి. మరో వైపు గ్రామంలోకి నీరు చేరడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 3 కపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

భారీ వర్షాలకు తమిళనాడులో 23 మంది మృతి

హైదరాబాద్ : తీవ్ర వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలకు 23 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఒక్క కడలూరు జిల్లాలోనే 17 మంది మృత్యువాత పడ్డారు. సేలం, ధర్మపురి, కోయంబత్తూరు, కడలూరు జిల్లాలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.

జీహెచ్ ఎంసీ కార్మికుల పట్ల సర్కార్ ద్వంద్వ నీతి

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ పారిశుధ్య కార్మికుల పట్ల టీ సర్కార్‌ ద్వంద్వ నీతిని అవలంభిస్తోంది. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకుంటూనే ప్రభుత్వం పలు షరతులు విధించింది. ఇక ముందు సమ్మెలు, ధర్నాలు చేయబోనంటూ కార్మికులతో పది రూపాయల బాండ్‌ పేపర్‌పై రాయించుకున్నారు. ధర్నాలోగానీ.. సమ్మెలోగానీ పాల్గొంటే విధులనుంచి తొలగించాలని అందులో బలవంతంగా రాయించుకున్నారు. ప్రభుత్వ తీరుపై కార్మికులు, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.   

ఖమ్మం జిల్లాలో భారీ స్కాం

ఖమ్మం : జిల్లాలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. భారత ప్రభుత్వ సంస్థ పేరు మీద కుంబకోణం జరిగింది. ఈస్కాంలో బ్యాంకు సిబ్బందే పాత్ర దారులు. కానీ సూత్రదారులు ఎవరో తెలియదు. వ్యవహారం బట్ట బయలు కావడంతో..బ్యాంకు మేనేజర్‌ను బదిలీ చేశారు. అయితే ఈ స్కాంలో బ్యాంకు సిబ్బంది పాత్ర మాత్రమే ఉందా.? ఇతరుల ప్రమేయం ఉందా అనేది తేలాల్సి ఉంది. జిల్లాలో 10కోట్ల రూపాయల గోల్ మాల్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. 

08:04 - November 11, 2015

హైదరాబాద్ : పరిశ్రమలు, ఉత్పత్తి రంగంల్లో ఎఫ్ డిఐ లకు అనుమతులు ఇస్తే దేశం బాగుపడుతుందని 'న్యూస్ మార్నింగ్2 లో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ యూనియన్ ఉపాధ్యక్షులు కె.వేణుగోపాల్ తెలిపారు. కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతిచ్చింది. 15 రంగాల్లో ఎఫ్‌డీఐలకు అనుమతులిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో మైనింగ్‌, రక్షణ రంగం, విమానయానం, వార్తా ప్రసారాలు, నిర్మాణరంగం, వ్యవసాయం, హోల్‌సేల్‌ ట్రేడింగ్‌, బ్యాంకింగ్‌, తదితర రంగాలు ఉన్నాయి. కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులివ్వడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఎఫ్ డిఐల పై కేంద్ర ప్రభుత్వం దుందుడుకుగా వ్యవహరిస్తోందా? ఆంధ్రా ప్రజల ఉసురు తగిలి బీహార్ లో బిజెపి ఓడిపోయిందా? బీహార్ ఓటమి ఏపీ కి లాభం చేకూరుతుందా? బీహార్ ఎన్నికల ఫలితాలు బిజెపి లో కలకలం రేపిందా? ఇదే అంశాలపై 'న్యూస్ మార్నింగ్' లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో వేణుగోపాల్ తో పాటు సీనియర్ విశ్లేషకులు నడింపల్లి సీతారామరాజు, వైసీపీ నేత లక్ష్మీపార్వతి, బిజెపి నేత ప్రకాష్ రెడ్డి,టిడిపి నేత రామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. వారి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ చర్చను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

07:42 - November 11, 2015

హైదరాబాద్ : ఓరుగల్లుపై పట్టు కోసం కాంగ్రెస్‌ కష్టపడుతోంది. ప్రచారాన్ని పరుగులు పెట్టించేందుకు గట్టి ప్రయత్నమే చేస్తోంది. రాష్ట్ర స్థాయి నేతలు ఇప్పటికే వరంగల్‌లో మకాం వేశారు. ఇప్పుడు జాతీయ నాయకులనూ రంగంలోకి దింపేందుకు ఆ పార్టీ రెడీ అవుతోంది. షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేసింది.

ప్రచారంలో వేగం పెంచిన కాంగ్రెస్‌....

వరంగల్‌ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్‌ వేగం పెంచింది. అనూహ్య పరిణామం నుంచి క్రమంగా కోలుకుంటున్న కాంగ్రెస్‌..ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. క్యాంపెయిన్‌లో ఆ పార్టీ నేతలు చురుగ్గా పాల్గొంటున్నారు. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఇంటి గడపా తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి , షబ్బీర్అలీతో పాటు ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇలా అందరూ ప్రచారంలో మునిగిపోయారు. నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు, పాదయాత్రలు చేపడుతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శల బాణాలను ఎక్కుపెడుతున్నారు.

ప్రచారంలో జాతీయ నాయకులు......

జాతీయ నాయకులను కూడా ప్రచార పర్వంలోకి దింపేందుకు కాంగ్రెస్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది.

లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, సుశీల్‌కుమార్ షిండే, సచిన్ పైలెట్,ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే తదితర నేషనల్‌ లీడర్లు వరంగల్‌ రానున్నారు. పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్‌ సింగ్‌ రెండు రోజుల పాటు ప్రచారంలో పాల్గొంటారు. నేషనల్‌ లీడర్లను ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలనే దానిపై కాంగ్రెస్‌ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. మైనార్టీలు ఎక్కువగా ఉండే చోట ఆజాద్‌ను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. విద్యాపరంగా ముందున్న ప్రాంతాల్లో దిగ్విజయ్, సచిన్ పైలెట్‌లతో ప్రచారం నిర్వహించాలనుకుంటున్నారు.

దళిత ప్రాంతాల్లో మీరాకుమార్‌, షిండే ఖర్గె ప్రచారం....

వరంగల్‌ ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో...దళితులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో మీరాకుమార్ , సుశీల్ కుమార్ షిండే, మల్లిఖార్జున ఖర్గె లాంటివారిని ప్రచారంలోకి దింపితే పార్టికి కలిసి వస్తుందని భావిస్తున్నారు. జాతీయ నేతల ప్రచారం కోసం వరంగల్‌లో ఎలక్షన్‌ కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటుచేశారు. 

07:39 - November 11, 2015

హైదరాబాద్ : సమ్మె సందర్భంగా జీహెచ్‌ఎంసీలో తొలగించిన పారిశుధ్య కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో అధికారుల్లో కదలిక వచ్చింది. సీఎం ఆదేశాలకు అనుగుణంగా కార్మికులను విధుల్లోకి తీసుకునే ప్రక్రియను చేపట్టారు. అయితే విధుల్లోకి తీసుకునేందుకు అధికారులు విధుస్తున్న షరతులుపై కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల నుంచి బాండ్లు తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఈ చర్యల హక్కులను కాలరాసేలా ఉందని కార్మిక నాయకులు మండిపడుతున్నారు.

విధుల్లోకి 1600 మంది కార్మికులు...

జీహెచ్‌ఎంసీలో సమ్మె సందర్భంగా తొలగించిన 1600 మంది కార్మికులను సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నారు. ఇదే సమయంలో అధికారులు విధిస్తున్న సవాలక్ష షరతులు కార్మికలను కలవరపెడుతున్నాయి. విధుల్లోకి తీసుకునే కార్మికుల నుంచి హామీ పత్రాలు తీసుకోవాలన్న ఆదేశాలు వివాదాస్పదంగా మారుతున్నాయి.

కార్మికుల నుంచి హామీ పత్రాలు ....

తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్న సమయంలో భవిష్యత్‌లో సమ్మె చేయబోమంటూ హామీ పత్రం తీసుకుంటున్నారు. ధర్నాల్లో పాల్గొనబోమంటూ 10రూపాయల బాండ్‌ పేరప్‌పై రాయించుకుంటున్నారు. విధులకు గైర్హాజరుకాబోమని అండర్‌టేకింగ్‌ తీసుకుంటున్నారు. కార్మికులను నేరస్థుల పరిగణిస్తూ దొమ్మీలకు పాల్పడమని హామీ పత్రం రాయించుకుటున్నారు.

తప్పుపడుతున్న కార్మిక సంఘాలు..

జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఈ చర్యను కార్మిక సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. ఇది కార్మిక హక్కులను కాలరాయడమే అవుతుందంటున్నారు. కార్మికుల నుంచి బాండ్లు తీసుకునే విధానాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతున్నారు. లేకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నారు. 

07:35 - November 11, 2015

హైదరాబాద్ : వరంగల్‌ కలెక్టరేట్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కారుణ్య నియామకం కోసం లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ జిల్లా పంచాయతీ అధికారి సోమ్లానాయక్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రూ. 3 వేలు లంచం తీసుకుంటూ సీనియర్‌ అసిస్టెంట్‌ అలీ, 2 వేల రూపాయలు లంచం తీసుకుంటూ అటెండర్‌ సారంగపాణి ఏసీబీకి పట్టుబడ్డారు.

07:34 - November 11, 2015

హైదరాబాద్ : ఏపీలో ఆర్థిక ఇబ్బందులు కొన‌సాగుతున్నాయి. ప్రస్తుత ఏడాది తొలి ఆర్థిక సంవ‌త్సరంలో ఏడు వేల కోట్ల ఆదాయపు లోటు క‌నిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌కు నిర్ధేశించిన ఆదాయ ల‌క్ష్యంలో 90 శాతం మాత్రమే రీచ్‌ అయ్యింది. దాదాపు ప‌ది వేల కోట్ల రూపాయాలు బడ్జెట్‌ కేటాయింపుల కంటే అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో..రానున్న రోజుల్లో అద‌న‌పు కేటాయింపులు కోర‌వ‌ద్దని.. ఖ‌ర్చులు త‌గ్గించుకోవాల‌ని ఆర్ధిక శాఖ అన్ని శాఖ‌ల ముఖ్య కార్యద‌ర్శుల‌కు లేఖ‌లు రాయాల‌ని నిర్ణయించింది.

రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత....

రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఏపీలో ఇంకా ఆర్ధిక ఇబ్బందులు కొన‌సాగుతూనే ఉన్నాయి. తొలి ఆర్ధిక సంవ‌త్సరంలో నిర్దేశించిన ల‌క్ష్యంలో ప‌లు ప్రధాన శాఖ‌లు 90 శాతం వ‌ర‌కు మాత్రమే లక్ష్యాన్ని చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్ధిక ప‌రిస్థితి..రాబోయే బ‌డ్జెట్ అంచ‌నాలపై ఆర్ధిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు సచివాలయ‌ంలో స‌మీక్ష నిర్వహించారు. ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో దాదాపు ఏడు వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఆదాయం త‌గ్గుద‌ల ఏర్పడినట్లు అంచ‌నా వేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్స్, మైన్స్ అండ్ జియాల‌జీ, అట‌వీ శాఖ‌లు నిర్ధేశించిన రెవిన్యూ ల‌క్ష్యాల‌ను వంద శాతం చేరుకున్నప్పటికీ ఎక్సైజ్, క‌మ‌ర్షియ‌ల్ టాక్సెస్‌ వ‌ల్ల రెవెన్యూ లోటు ఉంద‌ని మంత్రి య‌న‌మ‌ల చెప్పారు.

రెవెన్యూ లోటుకు ఎన్నో కారణాలు....

రెవెన్యూ లోటుకు ఎన్నో కారణాలు ఉన్నాయని యనమల చెప్పారు. ప్రధానంగా వ‌రిపై కేంద్రం తీసుకొచ్చిన మార్పులు.. ప్రభుత్వం మ‌ద్యం దుకాణాలు నిర్వహించ‌టం.. ఖర్చు పెర‌గ‌డం కార‌ణంగా ఈ తేడా వ‌చ్చిద‌ని చెప్పారు. ప్రభుత్వ మద్యం దుకాణాల వల్ల మ‌ద్యం పై వ‌చ్చే వ్యాట్ త‌గ్గిన‌ట్లు గుర్తించారు. దీంతో430 ప్రభుత్వ మ‌ద్యం దుకాణాల‌ను తిరిగి వేలం వేయాల‌ని నిర్ణయించారు. ఈ ర‌కంగా వ‌చ్చే త్రై మాసికంలో కొంత మేర‌కు కోలుకోవ‌చ్చని భావిస్తున్నారు.

ప‌ది వేల కోట్లు అద‌నంగా ఖ‌ర్చు......

ఇదే స‌మ‌యంలో బ‌డ్జెట్‌లో కేటాయింపుల కంటే.. దాదాపు ప‌ది వేల కోట్లు అద‌నంగా ఖ‌ర్చు చేసిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. రుణ‌మాఫీ కోసం బ‌డ్జెట్‌లో నాలుగు వేల కోట్లు కేటాయించ‌గా..ఏడు వేల కోట్లకు పైగా నిధులు విడుద‌ల చేసారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం.. డ్వాక్రా మ‌హిళ‌ల రుణ మాఫీ కోసం పెద్ద మొత్తంలో నిధులు విడుద‌ల చేయాల్సి వ‌చ్చింది. ఏపీకి అవ‌కాశం ఉన్న 17వేల కోట్ల రుణ సేక‌ర‌ణ‌కు గాను..ఇప్పటికే దాదాపు ప‌ది వేల కోట్ల మేర రుణం తెచ్చుకుంది ప్రభుత్వం. ఎర్రచంద‌నం ద్వారా ఆశించిన స్ధాయిలో తొలి విడ‌త‌లో ఆదాయం వ‌చ్చినా.. రెండో విడ‌త అమ్మకాలు జ‌ర‌గ‌లేదు. ఇక‌..రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత తొలి ఏడాది ఏర్పడిన రెవిన్యూ లోటు భ‌ర్తీ చేయాల్సిన కేంద్రం 14,409 కోట్లకు గాను కేవ‌లం 2,300 కోట్లు మాత్రమే భ‌ర్తీ చేసింది. బ‌డ్జెట్‌లో పొందుపర్చిన కేటాయింపులు మిన‌హా...అద‌న‌పు ఖ‌ర్చులు చేయ వ‌ద్దని..ఆర్ధిక శాఖ‌కు ఎటువంటి ప్రతిపాద‌న‌లు పంప‌వ‌ద్దంటూ.. అన్ని శాఖ‌ల ముఖ్యకార్యద‌ర్శుల‌కు లేఖ‌లు రాయాల‌ని నిర్ణయించిన‌ట్లు యనమల తెలిపారు.

ఇంకా కేంద్రం ఆదుకోవాలి.....

కేంద్రం నుంచి రావాల్సిన సాయం అందుతున్నా..ఇంకా ఆదుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆర్థిక మంత్రి యనమల అభిప్రాయ‌ప‌డ్డారు. 14వ ఆర్ధిక సంఘం నిధుల ద్వారా.. రాష్ట్ర రెవిన్యూ లోటు భ‌ర్తీ కాద‌నే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇదే స‌మ‌యంలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్‌సీ బ‌కాయిల‌ను విడుద‌ల చేయాల‌ని నిర్ణయించారు. ఇక‌.. జ‌వ‌న‌రి, జూన్ మాసాల్లో చెల్లించాల్సిన డీఏల్లో భాగంగా... త్వర‌లో ఒక డీఏ విడుద‌ల చేయాల‌ని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా.. ఉద్యోగి ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యంలో ఇచ్చే గ్రాట్యుటీ ప‌ది ల‌క్షలుగా నిర్ణయించిన‌ట్లు ఆర్ధిక మంత్రి య‌న‌మ‌ల స్పష్టం చేసారు. ప్రస్తుత ఆర్ధిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా.. ఆదాయం పెంచుకోవాల్సి ఉంటుంద‌ని.. రానున్న రోజుల్లో వాస్తవ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా బ‌డ్జెట్ మేనేజ్‌మెంట్ చేస్తామ‌ని యన‌మ‌ల స్పష్టం చేసారు.

మంత్రి అయ్యన్నపాత్రుడికి భద్రత పెంపు

హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి భద్రత మరింత పెరిగింది. అయ్యన్న సొంత జిల్లా విశాఖలో బాక్సైట్ తవ్వకాలకు చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో మావోయిస్టుల నుంచి అయ్యన్నకు బెదిరింపు లేఖ వచ్చినట్లు ప్రచారం సాగింది. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా మంత్రి పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేయాలని సదరు లేఖలో మావోయిస్టులు అయ్యన్నకు సూచించారని, తమ ఆదేశాలను పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. 

07:25 - November 11, 2015

ఢిల్లీ : బీహార్‌ ఓటమి బీజేపీలో చిచ్చు రేపుతోంది. పార్టీలో ఎదురులేని మనుషుల్లా చెలామణి అవుతున్న మోదీ, అమిత్‌షాలపై అసమ్మతి గళం ఆరంభమైంది. పెద్దల పాత్రకే పరిమితమైన నేతలు ఇప్పుడు నోరు విప్పుతున్నారు. అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు.

అద్వానీ, మురళీమనోహర్‌ జోషి..............

బీహార్‌ ఎన్నికల ఓటమిపై బీజేపీ అగ్రనేతలైన అద్వానీ, మురళీమనోహర్‌ జోషి, శాంతకుమార్‌, యశ్వంత్‌ సిన్హా విరుచుకుపడ్డారు. తొలిసారిగా తమ ఆగ్రహాన్ని పబ్లిక్‌గా ప్రకటించారు. స్వయంగా సొంత పార్టీ తీరునే తప్పుపట్టారు. ఢిల్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఎటువంటి పాఠం నేర్చుకోలేదని విమర్శించారు. గత కొంతకాలంగా పార్టీని బలహీనపర్చడం వల్లనే బీహార్‌లో ఓటమి ఎదురైందని ఆరోపించారు. ఈ ఓటమిపై సమీక్ష జరపాలని ఆ నలుగురు వెటరన్లు డిమాండ్‌ చేశారు.

మురళీమనోహర్‌ జోషి నివాసంలో సమావేశం....

మంగళవారం సాయంత్రం ఈ నలుగురు అగ్రనేతలు మురళీమనోహర్‌ జోషి నివాసంలో సమావేశమయ్యారు. అనంతరం సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతం పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని ఆ ప్రకటనలో విమర్శించారు. కొంతమంది ముందు పార్టీ ఎలా మోకరిల్లిందని, సర్వాంగీకార స్వభావాన్ని వారు ఎలా నాశనం చేశారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గెలిస్తే క్రెడిట్‌ తీసుకునేందుకు సిద్ధమయ్యే వారు ఈ అవమానకరమైన ఓటమికి బాధ్యత తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారని ఆ ప్రకటనలో విమర్శించారు. బీహార్‌ ఓటమికి ఎవరినీ బాధ్యులు చేయకపోవడం అంటే అర్థం, ఇందుకు ఎవ్వరూ బాధ్యులు కారని నిర్ధారించడమే అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

మోదీ, అమిత్‌షాలే టార్గెట్‌!......................

ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలను టార్గెట్‌ చేస్తూ అగ్రనేతలు ఈ ప్రకటన చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మోదీ, అమిత్‌షా చేతుల్లోనే పార్టీ నడుస్తోందనే విమర్శలు ఉన్నాయి. అద్వానీతో పాటు ఇతర అగ్ర నేతలకు పార్టీలో అంతగా ప్రాధ్యానత దక్కడం లేదనేది బహిరంగ రహస్యం. వెటరన్లను పట్టించుకునే పరిస్థితి పార్టీలో లేదనేది చాలా విషయాల్లో స్పష్టం కూడా అయ్యింది. మోదీ,అమిత్‌షాలు అన్నీ తామై నడిపిస్తున్నారనే అసంతృప్తి కూడా కొంతమంది నేతల్లో ఉంది. ఈ నేపథ్యంలో బీహార్‌ ఓటమిని బూచీగా చూపిస్తూ సీనియర్లు వీరిపై పరోక్షంగా దాడి మొదలుపెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

సీనియర్లు సంధించిన స్టేట్‌మెంట్‌ పార్టీలో కలకలం....

మరోపక్క ఆర్థిక మంత్రి జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వంటి వారు మోదీ, అమిత్‌షాలకు సపోర్టుగా మాట్లాడుతున్నారు. బీహార్‌ ఓటమికి మోదీ, అమిత్‌షాలను బాధ్యులు చేయలేమని చెప్పుకొస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పరోక్షంగా ప్రధానిని, పార్టీ అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ నలుగురు సీనియర్లు సంధించిన స్టేట్‌మెంట్‌ పార్టీలో కలకలం సృష్టిస్తోంది.  

భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఒబామా...

ఢిల్లీ : దీపావళి సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఒబామా భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి స్వయంగా ఫోన్ చేసి.. దీపావళి శుభాకాంక్షలు తెలియజేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. కాగా... అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్ లోనూ దీపావళి సంబరాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. రెండు రోజుల క్రితం వేద మంత్రాల మధ్య.. వైట్ హౌస్ లో దీపావళి ఒబామా పండగ సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చెడు మీద మంచి సాధించిన విజయమే దీపావళి అని పేర్కొన్నారు.

07:16 - November 11, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి మొదలైంది. బాణసంచా దుకాణాలు కొనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి. వెలుగుల దీపావళి పండుగలో ప్రమిదలు, బొమ్మలు, టపాసులే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. ప్రమిదలు, బొమ్మల కోసం ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. కొనుగోలుదారులతో ఈ షాపులన్నీ కళకళలాడుతున్నాయి. వివిధ దీపాలతో ఇళ్లను అందంగా అలంకరిస్తున్నారు. ఈ దీపాల కాంతుల్లో ఇళ్లు దగధగమంటున్నాయి.

బెంబేలెత్తిస్తున్న బాణ సంచా రేట్లు...

మరోపక్క బాణసంచా రేట్లను చూసి వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ధరలు చూసి దీపావళి ఆనందం సగం ఆవిరి అయిపోతోంది. గతేడాదితో పోల్చితే రేట్లు రెట్టింపు అయ్యాయి. పండగ రోజు కావడంతో రేట్లు మరింత ఆకాశాన్నంటుతున్నాయి.

తగ్గిన బాణాసంచా తయారీ...

ఇది ఇలా ఉంటే ఏపీలో కొన్ని ప్రాంతాల్లో బాణసంచా కొనుగోళ్లు తగ్గిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వీటి ప్రభావం కొనుగోళ్లపై పడింది. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో కురిసిన వర్షాల దెబ్బకు బాణసంచా అమ్మకాలు భారీగా దిగజారాయి. తిరుపతిలో అమ్మకం దారులు గొగ్గోలు పెడుతున్నారు. తమ పెట్టుబడులైనా తిరిగివస్తాయో రావో అని వ్యాపారుల్లో దిగులుమొదలైంది.

టపాసులు కాల్చవద్దంటున్న పర్యావరణ వేత్తలు..

మరోపక్క టపాసులు కాల్చకుండా దీపావళిని జరుపుకోవాలని పర్యావరణవేత్తలు పిలుపునిస్తున్నారు. క్రాకర్స్‌ విపరీతంగా కాల్చడం వల్ల శబ్ధ కాలుష్యంతో పాటు... పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో నూ....

వెలుగుల దీపావళి పండుగలో ప్రమిదలు, బొమ్మలకు, టపాకాయలే స్పెషల్ అట్రాక్షన్... గుమ్మంనుంచి ఇంటిఆవరణవరకూ అలంకరణతో ఇళ్లన్నీ మెరిసిపోతూ ఉంటాయి.. దీపాల కాంతులతో ధగధగమంటాయి.. అటు ప్రమిదలు, బొమ్మల తయారీదారులు, వ్యాపారులకు మంచి గిరాకీ ఉంటుంది.. హైదరాబాద్‌లో ఈ వస్తువులతో ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి.. కొనుగోలుదారులతో ఈ షాపులన్నీ కళకళలాడుతున్నాయి..

మట్టి ప్రమిదల్లో దీపాలు.....

దీపావళి రోజున మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు.. ఈమధ్య వివిధ రకాల వస్తువులు అందుబాటులోకివచ్చాయి.. సంప్రదాయ ప్రమిదలకుతోడు ఆకట్టుకునే డిజైన్లు ఇప్పుడు అందరినీ ఆకర్శిస్తున్నాయి.. ఇక అలంకరణలో దేవతామూర్తుల ప్రతిమలకు డిమాండ్ పెరుగుతోంది.. బొమ్మలకొలువుకోసం వివిధరకాల ప్రతిమలను కొనుగోలు చేస్తున్నారు మహిళలు.. పండుగరోజు రష్ ఎక్కువగా ఉంటుందంటూ ముందుగానే వస్తువులు కొనేస్తున్నారు జనాలు.. దీపావళిని మరింత సంతోషంగా గడిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు..

జీశాట్-15 ప్రయోగం విజయవంతం

హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) దీపావళి పర్వదినాన మరో ఘన విజయం నమోదు చేసింది. కమ్యూనికేషన్, నావిగేషన్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన జీశాట్-15 ప్రయోగం విజయవంతమైంది. ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి నేటి ఉదయం జరిగిన ఈ ప్రయోగం దిగ్విజయంగా ముగిసింది. జీశాట్-15తో పాటు అరబ్ శాట్-6లను ఉపగ్రహ వాహక నౌక విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాదాపు 3,164 కిలోల భారీ బరువున్న జీశాట్-15 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రోలో సందడి వాతావరణం నెలకొంది.

Don't Miss