Activities calendar

12 November 2015

21:52 - November 12, 2015

ఒడిషా : రాష్ట్రంలోని పూరి రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న రైళ్లలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాట్‌ఫాంపై ఉన్న మూడు రైళ్లలోని బోగీల్లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లోని రెండు స్లీపర్‌ కోచ్‌లతో పాటు నందన్‌కనన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఒక స్లీపర్‌ కోచ్, పూరి-హౌరా ఎక్స్‌ప్రెస్‌లో జనరల్‌ కంపార్ట్‌మెంట్‌ దగ్ధమయ్యాయి. సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు గంటసేపు బోగీల్లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటల కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

21:50 - November 12, 2015

బెంగళూరు : ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా  బెంగలూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని గిరీష్‌ ఓ సభలో డిమాండ్‌ చేశారు. దీంతో కర్నాటక రచయిత కల్బుర్గి, మహారాష్ట్రలో పన్సారేకు పట్టిన గతే పడుతుందని ట్విట్టర్‌లో గిరీష్‌ కర్నాడ్‌ను కొందరు హెచ్చరించారు. 
'ఇన్‌టోలరెంట్ చంద్ర' అనే యూజర్ నేమ్‌తో...
తన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో.. 77 ఏళ్ల గిరీష్ కర్నాడ్ క్షమాపణలు చెప్పారు. ఎవరైనా తన వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడితే క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. దీంతో ట్వీట్‌లోని హెచ్చరికలను డిలీట్‌ చేశారు. 'ఇన్‌టోలరెంట్ చంద్ర' అనే యూజర్ నేమ్‌తో ట్విట్టర్‌లో గిరీష్ కర్నాడ్‌ను హెచ్చరిస్తూ పోస్టింగ్ వచ్చిందని, దీనిపై ఏమైనా ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. గిరీష్‌ కర్నాడ్‌ ఇంటివద్ద భద్రతను పెంచారు. 
టిప్పు జయంతి ఉత్సవాలు.. వివాదాస్పదం..
18 వ శతబ్దానికి చెందిన పరిపాలకుడు టిప్పుసుల్తాన్‌ జయంతి ఉత్సవాల నిర్వహణ కర్నాటకలో వివాదాస్పదమైంది. టిప్పు సుల్తాన్ వేడుకలను వ్యతిరేకిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి చేస్తున్న నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. పోలీసు లాఠీ చార్జీ, కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వీహెచ్‌పీ కార్యకర్తతో మరొకరు మృతి చెందారు. టిప్పు సుల్తాన్‌ జయంతి వేడుకలను రద్దు చేసే ప్రసక్తే లేదని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య స్పష్టం చేశారు. టిప్పు సుల్తాన్ హిందు, క్రైస్తవులను ఆదరించిన సెక్యులర్‌వాదిగా పేర్కొన్నారు.

21:07 - November 12, 2015

బీహార్ ఫలితం బీహార్ బీజేపీలో కల్లోలం రేపుతోంది. ఇద్దరు నేతల ఏక ఛత్రాధిపత్యంపై పార్టీలో వ్యతిరేకత చెలరేగుతోంది. సమిష్టి తత్వానికి పాతరేసిన నయా నాయకత్వంపై అసంతృప్తి సెగలు కక్కుతోంది. రాయీ రాయీ కూర్చి పేర్చిన పార్టీ సౌధం కళ్లెదుటే బీటలువారుతున్న దృశ్యాలు చూడలేక వృద్ధ సింహాలు జూలు విదిలుస్తున్నాయి. నియంతృత్వ పోకడలపై ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి స్వరాలు వీరికి మద్ధతుగా నిలుస్తున్నాయి. అసలు బీజేపీలో ఏం జరుగుతోంది? ఈ పరిణామాలు ఆ పార్టీలో అంతర్యుద్ధానికి దారితీస్తాయా? ఇదే అంశంపై నేటి వైడాంగిల్      ప్రత్యేక కథనం. 

20:54 - November 12, 2015

రోజూ పెరట్లో కనిపించే తులసి మొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. నోటిపూత, నోట్లో అల్సర్‌, ఇతర ఇన్‌ఫెక్షన్ల నివారణకు తులసి ఎంతో ఉపకరిస్తుంది. ప్రధానంగా చిన్నపిల్లల్లో తరచూ దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులు మొదలైనవాటిని నివారించేందుకు తులసి ఆకులు సహాయపడతాయి. రింగ్‌వార్మ్ లాంటి చర్మసంబంధ వ్యాధులకు తులసి ఆకుల రసం రాసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ల్యూకోడెర్లాలో ప్రకృతి వైద్యులు తులసికి మొదటి ప్రాధాన్యతనిస్తారు. తలనొప్పికి కూడా తులసి మంచి ఔషధంలా పనిచేస్తుంది. తులసి ఆకులను డికాషన్ గా తీసుకుంటే తలనొప్పిని దూరం చేయవచ్చు. అంతేకాదు ఈ ఆకులను ఎండబెట్టి, వాటిని పొడి చేసి, దాంతో పళ్ళు తోముకుంటే దంతాలకు చాలా మంచిది. దీన్ని ఆవనూనెలో కలిపి టూత్‌పేస్ట్ లా కూడా వాడుకోవచ్చు. అలా చేయడం వల్ల నోటి దుర్వాసన పోయి, పళ్ళను అందంగా మార్చుతుంది. గంధం అరగదీసి అందులో తులసి ఆకులను కలిపి ఆ మిశ్రమాన్ని నుదుటిమీద రాసుకుంటే వేడివల్ల వచ్చే తలనొప్పిని దూరం చేసి, ఎంతో చల్లదనం లభిస్తుంది. తులసి ఆకులు కలిపిన నీటిని తాగడం వల్ల గొంతులో కలిగే ఇబ్బందులను దూరం చేయొచ్చు.

20:52 - November 12, 2015

ఈ సంక్రాంతికి నందమూరి హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. సుకుమార్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'నాన్నకు ప్రేమతో' ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణ పూర్తయింది. బాలకృష్ణ, శ్రీవాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'డిక్టేటర్‌' కూడా సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్రం బృందం సన్నాహాలు చేస్తుంది.
'డిక్టేటర్‌' సిద్ధం..
బాలకృష్ణ హీరోగా ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా రూపొందిస్తోన్న చిత్రం 'డిక్టేటర్‌'. ఇది బాలకృష్ణ 99వ చిత్రం. శ్రీవాస్‌ దర్శకుడు. అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష హీరోయిన్స్‌. ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకొంటోంది. సినిమాను సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయాలని తమ సంకల్పానికి బాలయ్య పూర్తి సహాయ సహాకారాలందించారని సహ నిర్మాత, దర్శకుడు శ్రీవాస్‌ తెలిపారు. ఇప్పటికి సినిమా 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుందని, రెండు పాటలు, రెండు ఫైట్స్, ఢిల్లీలో చిత్రీకరించాల్సిన కొన్ని సన్నివేశాలు మినహా సినిమా చిత్రీకరణ పూర్తయిందన్నారు. డిసెంబర్‌లో ఆడియో విడుదల చేస్తామన్నారు.

'నాన్నకు ప్రేమతో..'
ఎన్టీఆర్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ దసరా కానుకగా విడుదల చేశారు. ఈ టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. దీపావళి కానుకగా మంగళవారం ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. లండన్‌లో ఈ చిత్రానికి సంబంధించి 60 రోజుల పాటు ఓ భారీ షెడ్యూల్‌ ఇటీవలే పూర్తి చేశామని నిర్మాత తెలిపారు. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కించామని, ప్రస్తుతం హైదరాబాద్‌లో షెడ్యూల్‌ జరుగుతోందన్నారు. సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. మరి ఈ హీరోల్లో ఏ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారో చూడాలి. 

20:49 - November 12, 2015

1958లో బాలీవుడ్‌లో విడుదలై సంచలన విజయం సాధించిన 'చల్తీ కా నామ్‌ గాడీ' చిత్రం రీమేక్‌లో హిట్‌ పెయిర్‌గా నిలిచిన షారూఖ్‌ఖాన్‌, ఐశ్వర్యరాయ్‌ నటించబోతున్నారని సమాచారం. 2000 సంవత్సరంలో షారూఖ్‌, ఐశ్వర్య జోడీగా నటించిన తొలి చిత్రం 'జోష్‌' బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అదే సంవత్సరం ఇదే జోడీ 'మొహబ్బతే' చిత్రంలో నటించింది. ఆ చిత్రం సైతం ప్రేక్షకుల విశేష ఆదరణతో ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత సంజయ్‌ లీలా భన్సాలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'దేవదాస్‌' చిత్రం ఎవర్‌గ్రీన్‌ హిట్‌గా బాలీవుడ్‌లో నిలిచింది. తాజాగా ఈ జోడీ 'చల్తీ కా నామ్‌ గాడీ' రీమేక్‌లో నటించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ చిత్రానికి రోహిత్‌శెట్టి దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్యరాయ్‌ నటించిన 'జజ్బా' ఇటీవల విడుదల కాగా, షారూఖ్‌ ప్రస్తుతం రోహిత్‌శెట్టి దర్శకత్వంలో 'దిల్‌వాలే' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 18న విడుదల కానుంది.

20:47 - November 12, 2015

తీపి పులుపూ కలగలిసిన ఎండు ద్రాక్షా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలోని పోషకాలను ఒకసారి చూద్దాం..

  • ఎండు ద్రాక్షల్ని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
  • శారీరక శ్రమ చేసే వారికీ, చిన్నారులకు ఎండు ద్రాక్షల్ని ఎంత తినిపిస్తే అంత మంచిది.
  • క్యాన్సర్‌ కారకాలతో పోరాడగలిగే గుణం వీటి సొంతం. ఎండు ద్రాక్షని తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతం అదుపులో ఉంటుంది.
  • వీటిని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరల్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. రక్తనాళాలు ఉత్తేజితమవుతాయి.
  • వంద గ్రాముల ఎండు ద్రాక్షలో 250 కెేలరీలున్నాయి. పదిశాతం పీచు ఉంటుంది. క్యాల్షియం, ఇనుము, మాంగనీసు, పొటాషియం, కాపర్‌, జింక్‌ వంటి పోషకాలు అధికం.
  • గుండె జబ్బులతో బాధపడేవారికి ఎంతో ఉపశమనం లభిస్తుంది. రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. రక్తం వృద్ధి చెందుతుంది.
  • ఇన్ని గుణాలున్న ఈ ఎండు ద్రాక్షని రెగ్యులర్‌గా తీసుకోవడం మహిళలకు ఎంతో మంచిది.
20:45 - November 12, 2015

సహజంగా మనం నారింజా, నిమ్మ పండ్లు తిని వాటిపై తొక్కను తీసి పడేస్తాం. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, చెత్త అనుకునే ఆ తొక్కలో మన చర్మాన్ని కాపాడే గుణం ఉంది. వీటిలోని విటమిన్‌ సి చర్మ సంరక్షణకు సహాయపడుతుంది. అయితే వీటిని నేరుగా ఉపయోగించడం కన్నా పొడిగా చేసి ఉపయోగించడం ఉత్తమం.
పొడి తయారీ
ముందుగా నారింజ, నిమ్మ తొక్కలని కొన్ని రోజులు ఎండపెట్టాలి. అవి గట్టి పడిన తర్వాత మెత్తగా పౌడరు లాగా చేసి ఒక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని కొద్దిగా తీసుకొని పేస్ట్ లా చేసుకొని ఉపయోగించుకోవచ్చు.
పేస్‌ ప్యాక్‌ తయారీ
ఒక స్పూను తొక్కల పొడి, కొద్దిగా పెరుగు, నీరు కలిపి ముఖానికి ముద్దలా చేసుకొని ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీళ్లతో కడిగితే చర్మంపై జిడ్డు తొలగిపోయి మిల మిల మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.
ఈ పొడికి కొంచెం పెసర పిండి, నిమ్మ రసం కలిపి ముఖానికి పట్టిస్తే.. మృదువైన, మచ్చలు లేని చర్మం మీ సొంతం.
ఈ పొడిని పసుపుతో కలిపి ఉపయోగించుకుంటే మొటిమలు, నల్లని మచ్చలు, చర్మం ముడతలు నుంచి కాపాడుతుంది.

20:43 - November 12, 2015

కడప : నరేంద్రమోడి ప్రభుత్వం వీహెచ్ పి, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపించారు పశ్చిమ బెంగాల్ ఎంపీ మహమ్మద్ సలీం. కడప కళాక్షేత్రంలో ఆవాజ్ కమిటీ నిర్వహించిన 'భిన్నత్వంలో ఏకత్వం - భారత విశిష్టత' అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మనం ఏం తినాలో, ఏం తాగాలో, ఏం ధరించాల్లో నియంత్రించే అధికారం ఎవర్వరికి లేదన్నారు. ఎన్.డి.ఏ. ప్రభుత్వం తాలిబాన్ లాగా వ్యవహరిస్తోందని మహమ్మద్ సలీం తీవ్రంగా విమర్శించారు. 

20:41 - November 12, 2015

నెల్లూరు : నగరంలోని జనార్దన్‌ రెడ్డి కాలనీలో మూడేళ్ల చిన్నారిపై పంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అంబులెన్సులో చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా పందుల దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

20:40 - November 12, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడిని మహాకవి గురజాడ అప్పారావు వారసులు కలుసుకున్నారు. పురావస్తుశాఖ స్వాధీనం చేసుకున్న గురజాడ నివాసగృహానికి ప్రత్యామ్నాయం చూపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. మరోవైపు ఈనెల 30న జరిగే గురజాడ శత వర్ధంతి కార్యక్రమానికి రావాలని కూడా వారు చంద్రబాబును కోరారు. 

20:39 - November 12, 2015

విజయవాడ : ఏపీ రాజధాని ప్రాంత రైతులతో మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీకాంత్‌ భేటీ అయ్యారు. మాస్టర్‌ప్లాన్‌పై మంత్రి రైతులతో చర్చించారు. రైతులు కోరిన చోట ఆయా గ్రామాల్లో వారికి ప్లాట్లను కేటాయిస్తామని చెప్పారు. రైతులు ప్లాట్లు ఎక్కడ కావాలో ప్రభుత్వానికి తెలపాలన్న గడువును ఈ నెలాఖరుకు పొడిగించామని నారాయణ చెప్పారు. రాజధాని ప్రాంతంలోని 27 గ్రామాల్లో 27 టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు కొత్త మాస్టర్‌ ప్లాన్‌ను త్వరలో విడుదల చేస్తామని నారాయణ తెలిపారు. 

18 నెలలైనా గిరిజనులకు ఒక్క ఉద్యోగం రాలేదు - తమ్మినేని..

వరంగల్ : జిల్లాలోని జాఫర్ గఢ్ మండలంలో వామపక్షాలు బలపరిచిన ఉప ఎన్నిక అభ్యర్థి గాలి వినోద్ కుమార్ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ వచ్చి 18 నెలలైనా గిరిజనులకు ఒక్క ఉద్యోగం రాలేదని, రైతుల బ్యాంకు అప్పులతో పాటు ప్రైవేటు వ్యాపారుల అప్పులను కూడా తీర్చాలని డిమాండ్ చేశారు. ఒకేసారి రుణమాఫీ అమలు చేయనందుకే రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని సీఎం మోసం చేశారని పేర్కొన్నారు. 

కందిపప్పు ధర నియంత్రణకు కేంద్రం చర్యలు..

ఢిల్లీ : కందిపప్పు ధర నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న కందిపప్పు నిల్వలను మార్కెట్ లోకి ప్రవేశ పెట్టింది. 4660 టన్నుల పప్పును అందుబాటులోకి ఉంచింది. 

బీసీ ఓటర్ల లెక్కింపు ప్రక్రియ వేగవంతం..

హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో బీసీ ఓటర్ల లెక్కింపు వేగవంతమైంది. రెండో శనివారం, ఆదివారాల్లోనూ బూత్ లెవల్ అధికారులు, విధులకు హాజరు కావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. 

ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు ఝులక్..

వరంగల్ : ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు ఝులక్ తగిలింది. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జీ రాజారపు ప్రతాప్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు లేఖను పంపారు. 

రెట్టింపైన రైల్వే టికెట్ల రద్దు ఛార్జీలు..

ఢిల్లీ : రైలు టికెట్ల రద్దు ఛార్జీల నిబంధనల్లో మార్పులు గురువారం నుండి అమల్లోకి వచ్చాయి.
రైలు బయలుదేరే ముందు 48-12గంటల మధ్య రద్దు చేసుకుంటే 25 శాతం రుసుము విధించనున్నారు.
1ఏసీ / నాన్ ఎగ్జిక్టూయివ్ క్లాస్ టికెట్ కు రూ.240
2ఏసీ / 1వ క్లాస్ టికెట్ కు రూ.200
3ఏసీ / ఏసీసీ / 3ఎ ఎకానమి టికెట్ కు రూ.180
సెకండ్ స్లీపర్ క్లాస్ టికెట్ కు రూ.120
సెకండ్ క్లాస్ స్లీపర్ క్లాస్ టికెట్ రూ.60
12-4 గంటల మధ్య రద్దు చేసుకుంటే 50 శాతం రుసుము విధించనున్నారు. 

నెల్లూరులో రూ.18 కోట్ల ఆస్తి నష్టం..

నెల్లూరు: వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఇటీవల కురిసన భారీ వర్షాలపై ఏపీ మంత్రి శిద్ధా రాఘవరావు సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో రూ.18 కోట్ల నష్టం వాటిల్లినట్లు చెప్పారు.

 

20:20 - November 12, 2015

కరీంనగర్ : ఖాకి చొక్కామాటున వందల కోట్లు కూడబెట్టిన కరీంనగర్ క్రైం బ్రాంచ్ ఏఎస్‌ఐ మోహన్ రెడ్డి పై ఎట్టకేలకు వేటు పడింది. ఇటీవల మోహన్ రెడ్డి వేధింపులు భరించలేక కెన్ క్రెప్ట్ విద్యాసంస్థల డైరెక్టర్ ప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకోవడంతో ఈ గుట్టు రట్టైంది. రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించగా పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు సమాచారం. జిల్లా అడిషనల్ ఎస్పీ జనార్ధన్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారంలో జనార్దన్ రెడ్డి 90 లక్షలు పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. గతంలో జిల్లాలో పనిచేసిన డీఎస్పీలు రంగరావు, భాస్కరరాజులు చెరో 10 లక్షలు..ఇతర డీఎస్పీలు లక్షల్లో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.
ఎవరైనా సొమ్ము చెల్లించలేకపోతే కానిస్టేబుళ్లు, హోంగార్డులను తీసుకెళ్లి మోహన్ రెడ్డి బెదిరించే వాడని తెలుస్తోంది. తప్పుడు కేసులు పెట్టి వేధించే వాడని, ఉన్నతాధికారుల అండ కూడా ఉండడంతో మోహన్ రెడ్డి ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. మోహన్ రెడ్డి ఆస్తుల విలువ వందల కోట్లతో ఉన్నట్టు భావిస్తున్నారు. ఇంకా ఎంత మందిపై వేటు పడుతుందో వేచి చూడాలి. 

ఫైనాన్స్ కంపెనీ కేసులో సీఐడీ నివేదిక..

కరీంనగర్ : ఫైనాన్స్ కేసులో ఏఎస్ఐ మోహన్ రెడ్డిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. జిల్లా అడిషనల్ ఎస్పీ జనార్ధన్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మోహన్ రెడ్డి ఫైనాన్స్ లో జిల్లా అడిషనల్ ఎస్పీ రూ. 90 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది. 

19:27 - November 12, 2015

విజయవాడ : రాజధాని 'అమరావతి' నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కార్ అందుకనుగుణంగా వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా గురువారం మధ్యాహ్నాం మాస్టర్ ప్లాన్ పై అవగాహన కల్పించేందుకు రైతులతో మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం ఈ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి మీడియాను అనుమతించకపోవడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తూతూ మంత్రంగా ఈ సమావేశం నిర్వహించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూములిచ్చిన రైతులు వేలాదిగా ఉంటే వందల సంఖ్యలో ఈ సమావేశానికి పిలిచారని, అందులో పార్టీకి అనుకూలంగా ఉన్నవారినే సమావేశానికి పిలిచారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా ఈ సమావేశంలో రైతులకు ఏ విధమైన ఉపయోగమైన సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. మలేషియా, జపాన్ అందాలను చూపించారే కానీ నిర్మాణాలు ఎక్కడ జరుగుతాయి ? ఎలా జరుగుతాయి ? అనేది చూపించలేదని తెలుస్తోంది. కానీ మీటింగ్ అయిపోయిన అనంతరం రైతులు మాస్టర్ ప్లాన్ ఆమోదించారని అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే తొలుత 9 ప్రాంతాల్లో టైన్ షిప్ లు వస్తాయని చెప్పిన అధికారులు తాజాగా 29 గ్రామాల్లో టౌన్ షిప్ లు వస్తాయని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. టౌన్ షిప్, స్విమ్మింగ్ ఫూల్, రైతులకు స్థలాలు ఎక్కడిస్తారనే దానిపై సందిగ్ధత నెలకొంది. 

19:06 - November 12, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో టి.టిడిపి నేతలు భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రమణ, ఇతర నేతలు గురువారం విజయవాడకు వచ్చారు. సాయంత్రం బాబుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే వరంగల్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అభ్యర్థిని గెలిపించుకోవాలని సూచించారు. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహంపై బాబుతో నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే త్వరలో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా మాట్లాడుకున్నట్లు సమాచారం.

లండన్ లో మోడీ..

లండన్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యూకే ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ ను కలుసుకున్నారు. టెన్ డౌనింగ్ స్ట్రీట్ లో వారు భేటీ అయ్యారు. 

పారికర్ కు సీఎం కేసీఆర్ లేఖ..

హైదరాబాద్ : కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. కంటోన్మెంట్ పరిధిలో గాఫ్ రోడ్డు మూసివేతను వాయిదా వేయాలని కోరారు. 

18:27 - November 12, 2015

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తాడని అనుకుంటే పవన్ కళ్యాణ్ ఆయనకు అధికార ప్రతినిధిగా మాట్లాడరని వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు - పవన్ కళ్యాణ్ భేటీపై ఆయన తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ప్రశ్నించడానికే పుట్టిందన్న పవన్ ప్రశ్నించడం మానేసి రాజీ ధోరణిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలను చంద్రబాబుకు ఎందుకు వివరించలేదని, వీరి భేటీ అంతా డ్రామా అని పేర్కొన్నారు. అనుబంధ సంస్థగా జనసేనను తీర్చిదిద్దడానికి ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రత్యేక హెలికాప్టర్ లో పవన్ వచ్చారని విమర్శించారు. అలా కాకపోతే సమాధానాలు చెప్పాల్సినవసరం ఉందన్నారు. 

మూడేళ్ల చిన్నారిపై పందుల దాడి..

నెల్లూరు : జనార్ధన్ రెడ్డి కాలనీలో మూడేళ్ల చిన్నారిపై పందులు దాడి చేశాయి. తీవ్రగాయాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. 

బాబు - పవన్ భేటీపై అంబటి విమర్శలు..

హైదరాబాద్ : టిడిపి అధికార ప్రతినిధిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడరని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. రైతుల సమస్యలపై పవన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు చిరంజీవి లొంగిపోయినట్లు టిడిపికి పవన్ లొంగిపోయారని ఆరోపించారు. భవిష్యత్ లో జనసేన టిడిపిలో విలీనం అవుతుందన్న అనుమానం కలుగుతోందన్నారు. 

జాఫర్ గఢ్ లో గాలి వినోద్ కుమార్ ప్రచారం..

వరంగల్ : జాఫర్ గఢ్ మండలంలో వామపక్షాలు బలపరిచిన ఉప ఎన్నిక అభ్యర్థి గాలి వినోద్ కుమార్ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పాల్గొన్నారు. 

18:14 - November 12, 2015

హైదరాబాద్ : వారం రోజుల క్రితం సికింద్రాబాద్ లో అదృశ్యమైన చిన్నారి ఆచూకి లభ్యమైంది. వ్యభిచార గృహంలో ఉన్న ఆ చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల ఐదో తేదీన రాజమండ్రికి చెందిన మహిళ శాతవాహన్ ఎక్స్ ప్రెస్ ఎక్కేందుకు చిన్నారి దుర్గ (5) తో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చింది. ఓ మహిళ తల్లి కళ్లుగప్పి దుర్గకు మాయమాటలు చెప్పి అక్కడి నుండి పరారైంది. ఈ దృశ్యాలన్నీ సీసీ టివి ఫుటేజ్ లో రికార్డయ్యాయి. ఫుటేజ్ ఆధారంగా మహిళను పోలీసులు గుర్తించారు. వరంగల్, నల్గొండ జిల్లాలో దుర్గ ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. చివరకు నల్గొండలోని ఓ వ్యభిచార గృహంలో ఉన్న దుర్గను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యభిచార గృహానికి రూ. పదివేల రూపాయలకు విక్రయించినట్లు సమాచారం. కిడ్నాప్ ఘటనకు సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో కిడ్నాప్ చేసిన మహిళ ఉన్నట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. రాజమండ్రిలో నివాసం ఉండే తల్లిదండ్రులకు దుర్గను పోలీసులు అప్పగించనున్నారు. 

బాబును కలిసిన రేవంత్..రమణ..

విజయవాడ : సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు నాయుడుని తెలంగాణ టిడిపి నేతలు ఎల్. రమణ, రేవంత్ రెడ్డిలు కలిశారు. వరంగల్ ఉప ఎన్నికలో టిడిపి బీజేపీ ప్రచార సరళిపై చర్చిస్తున్నారు. 

సకలజనుల సమ్మె కాలం సాధారణ సెలవు..

హైదరాబాద్ : 42 రోజుల సకల జనుల సమ్మె కాలాన్ని సాధారణ సెలవుగా అనుమతించే ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి.

వ్యభిచార గృహంలో అదృశ్యమైన చిన్నారి

హైదరాబాద్ : మూడు రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అదృశ్యమైన చిన్నారి దుర్గ ఆచూకి లభ్యమైంది. నల్గొండలోని ఓ వ్యభిచార గృహంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యభిచార నిర్వాహకులకు గుర్తు తెలియని మహిళ పాపను రూ. పదివేలకు విక్రయించింది. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు.

 

17:23 - November 12, 2015

టాలీవుడ్ మనసు కొత్తందం కోరుకుంటోంది. పాతందాల్ని కంటిన్యూ చేస్తున్నా…నయా నాజుకు సోయగాల్ని ఒడిసి పట్టేందుకు ప్రయత్నిస్తోంది. కాజల్, సమంత, శృతీహాసన్, తమన్నా, అనుష్క లాంటి సీనియర్లకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా…ఎన్ని హిట్స్ వీరి ఖాతాలో ఉన్నా… ఆడియన్స్ బోర్ ఫీలవుతున్నారు. దర్శక నిర్మాతల కంటే కూడా స్టార్ హీరోలు కూడా కొత్త హీరోయిన్ ని ట్రై చేద్దాం… అని డిసైడ్ అవుతున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు… కొత్త హీరోయిన్ల అవసరం టాలీవుడ్ కి ఎంతుందో. కొత్తందాల కోసం ఎంతగా తపిస్తున్నారో.

కొత్త హీరోయిన్ ను పరిచయం చేస్తున్న తివిక్రమ్...
హీరోయిన్స్ కు తన సినిమాల్లో ఎంతో ప్రిఫరెన్స్ ఇచ్చే దర్శకుడు త్రివిక్రమ్.ఈ దర్శకుడు సాధారణంగా ఒకో హీరోకు ఒకో హీరోయిన్ ను ఫిక్స్ చేస్తూ వాళ్లతోనే మరో సినిమాకు రిపీట్ చేస్తూ ఉంటాడు... కానీ అదేంటో గానీ.. త్రివిక్రమ్ తన లేటెస్ట్ మూవీకి మాత్రం ఓ మలయాళ ముద్దుగుమ్మను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు.

మాలీవుడ్ నుండి మంజిమా మోహన్..
టాలీవుడ్ వాకిట్లో అందాల విందు చేయబోతున్న మరో మలయాళ ముద్దుగుమ్మ మంజిమా మోహన్. మాలీవుడ్ లో అమ్మడి క్రేజే వేరు. అక్కడ బోలెడంత డిమాండ్ ఉన్నా ఈ అమ్మడు ప్రస్తుతం నాగ చైతన్య సరసన రొమాన్స్ కు సిద్ధపడుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో వార్తల్లో నిలిచిన మూవీ అఖిల్. అక్కినేని వారి అందాల వారసుడు అఖిల్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ కి ప్రత్యేక ఆకర్షణ అందులో హీరోయినే. అందంలోనూ అభినయంలోనూ మంచి మార్కులేయించుకున్న ఆ అమ్మడి పేరు సయేషా సైగల్.

ఆకట్టుకున్న కంచె హీరోయిన్..
రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్ తో .. సందేశాత్మక చిత్రాల దర్శకుడు క్ర్రిష్ తెరకెక్కించిన చిత్రం కంచె. వరుణ్ తేజ్ రెండో చిత్రంగా రూపొందిన ఈ మూవీలో కూడా ఓ కొత్త ముద్దుగుమ్మ అందరినీ ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. మొదటి సినిమాకే మెగా వారసుడుతో రొమాన్స్ చేసిన ఆ అమ్మడు ప్రగ్య జైస్వాల్.

బ్యూటీని పరిచయం చేస్తున్న పూరీ..
అందంతో పాటు ఆకట్టుకునే అభినయం ఉంటే ఆమె ఏ భాషలో నటీ మణి అయినా... ఆమెను టాలీవుడ్ లోకి ఇంపోర్ట్ చేయడం పూరీ ప్రత్యేకత. అదే ఆచారాన్ని మరో సారి కంటిన్యూ చేస్తూ .. పూరీ లేటెస్ట్ మూవీ లోఫర్ లో ఓ బ్యూటీని లాంచ్ చేస్తున్నాడు.

అదృష్టాన్ని  పరీక్షించుకుంటున్న కీర్తి సురేష్..
మలయాళ వెటరన్ హీరోయిన్ మేనక గారాల పట్టి కీర్తి సురేష్ . మలయాళంలో చాలా మంది యంగ్ స్టర్స్ తో మంచి మంచి సినిమాలు చేసి పేరు తెచ్చుకుంది కీర్తి. ఆకట్టుకునే రూపం ఉండడంతో అమ్మడు యాజ్ యూజువల్ గానే టాలీవుడ్ డైరెక్టర్స్ ను ఆకట్టుకుంది. ఇప్పుడు కీర్తి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతోంది.

కుమారి 21 ఎఫ్ లో బ్యూటీ ఎంట్రీ...
డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వెరైటీ స్ర్కీన్ ప్లేతో సినిమాలు చేసే సుకుమార్ సమర్పిస్తున్న వెరైటీ మూవీ కుమారి 21 ఎఫ్. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నాడు. దర్శకుడు ప్రతాప్. ప్రేమకథా చిత్రం కావడంతో హీరోయిన్ ఫ్రెష్ ఫేస్ తో ఉండాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఈ మూవీ కోసం హెభా పటేల్ అనే బ్యూటీ ఎంట్రీ ఇస్తోంది.

అందం..అభినయంతో కట్టిపడేయాలి..
కొత్త హీరోయిన్స్ వస్తున్నారని సీనియర్ హీరోయిన్స్ ను ఇప్పటికిప్పుడు పక్కన పెట్టడం కుదరదు కదా.. పైగా వాళ్ల హవా ఇంకా కొనసాగుతునే ఉంది .. కాబట్టి.. వాళ్ల సినిమాలు వాళ్లకుంటాయి. ప్రస్తుతం మన సీనియర్ హీరోయిన్లు కొంత మంది స్టార్ హీరోస్ తో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే కొత్తగా పరిచయమౌతున్న హీరోయిన్స్ సీనియర్స్ ప్లేస్ ను రీప్లేస్ చేయాలంటే మాత్రం అందం అభినయంతో కట్టిపడేయాల్సిందే. భారీ బ్యానర్స్, క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకున్న అనుపమ పరమేశ్వరన్, మంజిమా మోహన్, సాయేషా సైగల్, ప్రగ్య జైస్వాల్, కీర్తి సురేష్, దిశా పటాని, హెభా పటేల్ లాంటి కొత్తందాలు తెలుగు ప్రేక్షకుల మదిని దోచేయాలంటే మాత్రం…మ్యాజికల్ ఎక్స్ ప్రెషన్స్ తో మతి పోగొట్టాల్సిందే. తమదైన అందచందాలతో యువ హృదయాల్ని కొల్లగొట్టాల్సిందే. టాలీవుడ్ లో పాగా వేయాలంటే ఆడియెన్స్ నోటి నుంచి వా..వ్… అనిపించాల్సిందే.

17:14 - November 12, 2015

ఢిల్లీ : తల్లిదండ్రులు, టీచర్లు, బంధువులు.. ఇలా ఎవ్వరైనా సరే... చిన్నారుల్ని వేధించారా, జైల్లో కూర్చోవాల్సిందే.. నేరం రుజువైతే భారీగా జరిమానా కూడా తప్పదు.. కేసు విచారణలో సహకరించకపోతే స్కూల్‌ ప్రిన్సిపల్‌ కూడా శిక్ష పడుతుంది. ఇలా సరికొత్త నిబంధనలతో బాలబాలికల రక్షణ కోసం చట్టాన్ని తెస్తోంది కేంద్రం. బాలబాలికలపై వేధింపులను సీరియస్‌గా తీసుకుంది కేంద్రం.. ఇకపై ఇలాంటివి జరగకుండా చూడాలని నిర్ణయించింది. బాలబాలికల రక్షణకోసం చట్టాలకు పదునుపెడుతోంది. పిల్లల్ని వేధిస్తే భారీ జరిమానా, జైలుశిక్ష విధించేలా బాలల రక్షణ చట్టానికి సవరణలు తేబోతోంది. తల్లిదండ్రులు, టీచర్లు ఇలా ఎవ్వరైనాసరే చిన్నారుల్ని వేధిస్తే కఠినంగా శిక్షించేలా చట్టంలో మార్పులు చేస్తోంది.

65 శాతం శారీరక హింస..
65 శాతం మంది బాలలు పాఠశాలల్లో శారీరక హింసకు గురవుతున్నారు. దేశంలో ప్రతి రోజూ ఏదో ఒక కీచక టీచర్‌ వ్యవహారం బయటకొస్తోంది. ఇక తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్ని దండించడం సాధారణంగా మారింది. ఈ వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో ఎన్నో సర్వేలు బయటపెట్టాయి. యూనిసెఫ్‌ ఇతర ఎన్జీవోలతో కలిసి నిర్వహించిన అధ్యయనంలో 65 శాతం మంది బాలలు పాఠశాలల్లో శారీక హింసకు గురవుతున్నారని బయటపడింది. చిన్నారులపై శారీరక, లైంగిక, మానసిక హింసల్లో ఎక్కువశాతం ఇంట్లోనో, పాఠశాలల్లోనో తెలిసిన వ్యక్తులవల్లే జరుగుతోందని ఈ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇటువంటి హింసను అరికట్టేందుకు అనేక చట్టాలున్నా అవి సరిగా అమలు కావడంలేదు.

రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టబోతున్న ప్రభుత్వం..
ఢిల్లీ నిర్భయ ఘటనలో మైనర్‌ అరెస్టుతో ప్రభుత్వం చట్టంలో అనేక మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పులతో కూడిన చట్టాన్ని కేబినెట్‌ ఆమోదించింది. లోక్‌సభలో బిల్లు ఆమోదం కూడా పొందింది. ఈ నెల 26నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ చట్టంలో విద్యార్థుల రక్షణకు సంబంధించిన అంశాలు, శారీరక హింస జరగకుండా చాలా మార్పులు తీసుకొచ్చారు. బాలల్ని శారీరకంగా, మానసికంగా, లైంగికంగా, మాటలు, చేతలతో ఎలా వేధించినట్లు రుజువైనా తీవ్రమైన శిక్ష విధించేలా చట్టంలో నిబంధనలు పొందుపరిచారు. ఈ బిల్లు ఆమోదం పొందితే మొదటిసారి నేరానికి ఆరు నెలల జైలుశిక్ష, జరిమానా రెండోసారైతే మూడేళ్ల జైలు, జరిమానా... పిల్లల్ని తీవ్రంగా హింసిస్తే మూడేళ్ల జైలు, 50వేల రూపాయల జరిమానా.. మూడోసారి హింసిస్తే ఐదేళ్లు జైలు, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు.. ఇక స్కూళ్లలో చిన్నారులపై హింస కేసులో పాఠశాల యాజమాన్యం సహకరించకపోతే స్కూల్‌ ప్రిన్సిపల్‌, డైరెక్టర్‌కు మూడేళ్ల జైలు, లక్ష రూపాయల ఫైన్ వేసేలా చట్టంలో శిక్షలను కేంద్రం ఖరారు చేసింది.

17:11 - November 12, 2015

ఢిల్లీ : 15 రంగాల్లో ఎఫ్‌డీఐలకు అనుమతిలిస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీపీఎం పొలిట్‌బ్యూరో తీవ్రంగా వ్యతిరేకించింది. మరో 15 రోజుల్లో పార్లమెంట్‌ సమావేశాలుండగా.. కేబినెట్‌ ఆమోదం కూడా లేకుండా ఈ నిర్ణయాలను తీసుకోవడానికి సీపీఎం తీవ్రంగా తప్పుబట్టింది. మోడీ విదేశీ పర్యటనలకు ముందు ప్రకటించాలనే హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని మండిపడింది. ఇప్పటికే నిత్యావసర ధరలతో ప్రజలు, గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. వాటిని మరింత పెంచేవిధంగా మోడీ నిర్ణయాలున్నాయని సీపీఎం విమర్శించింది.

పోలీసు శాఖలో పోస్టుల భర్తీకి టి.సర్కార్ గ్రీన్ సిగ్నల్..

హైదరాబాద్ : పోలీసు శాఖలో 2,904 ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు రాష్ట్ర పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

రోడ్డు ప్రమాదంలో చివ్వెంల హెడ్ కానిస్టేబుల్ మృతి..

నల్గొండ : సూర్యాపేట ఎండీవో కార్యాలయం వద్ద బైక్ ఢీకొనడంతో చివ్వెంల హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. 

తమిళనాడులో రోడ్డు ప్రమాదం..

తమిళనాడు : కరూర్ వద్ద రెండు కార్లు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.

 

గాంధీనగర్ బట్టల మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం..

ఢిల్లీ : గాంధీ నగర్ బట్టల మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. 

హిందూపురంలో మట్టి సత్యాగ్రహం..

అనంతపురం : హిందూపురంలో కాంగ్రెస్ మట్టి సత్యాగ్రహం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ రఘవీరా రెడ్డి పలువురు నేతలు హాజరయ్యారు. 

షార్ట్ సర్క్యూట్ తో ఐదిళ్లు దగ్ధం..

తూర్పుగోదావరి : సామర్ల కోటలో షార్ట్ సర్క్యూట్ తో ఐదు ఇళ్లు కాలిపోయాయి. సుమారు పది లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. 

ప్రభుత్వ పనితీరుపై ప్రజలు తిరగబడుతున్నారు - లక్ష్మణ్...

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు తిరగబడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. వరంగల్ కు ఇచ్చిన హామీలను సీఎం గాలికొదిలేశారని విమర్శించారు. 

16:37 - November 12, 2015

చిత్తూరు : తిరుమలలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీనితో ఘాట్ రోడ్డులోని కొండచరియలు విరిగిపడుతుండడంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రెండో ఘాట్ రోడ్డులో భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం టిటిడి నడుం బిగించింది. ఎల్ అండ్ టి, ఐటి నిపుణులతో టిటిడి చర్చించింది. ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా టిటిడి జేఈఓ టెన్ టివితో ముచ్చటించారు. ఎల్ అండ్ టి, ఐటీ నిపుణులు పలు సూచనలు అందచేశారని తెలిపారు. కొండ చరియలు విరిగి పడడం సర్వసాధారణమే కానీ ఈస్థాయిలో విరిగి పడలేదన్నారు. రెండో ఘాట్ రోడ్డును మూసివేసి లింక రోడ్డు ద్వారా వాహనాలను పంపిస్తున్నామన్నారు. మరమ్మత్తుల కోసం ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేమని, నిపుణులు ఇచ్చిన నివేదికను ఈవో కు అందచేస్తామన్నారు. అనంతరం టైం నిర్ణయించి పనులు పూర్తి చేస్తామన్నారు.

16:34 - November 12, 2015

వరంగల్ : ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవాలని అధికార పక్ష ప్రయత్నాలు..ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్న ప్రతిపక్షాలు..హోరాహోరీ ప్రచారంతో వరంగల్ వేడేక్కిపోతోంది. అధికార పక్షం భారీ స్థాయిలో మంత్రులు మోహరించారు. ఒక్కో ప్రాంతంలో మంత్రులు పర్యటిస్తున్నారు. వీరికి ఆయా గ్రామ ప్రజల నుండి నిరసన వ్యక్తమౌతోంది. ఇటీవలే డిప్యూటి సీఎం కడియం శ్రీహరిని ప్రజలు నిలదీసిన ఘటన మరిచి పోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. జిల్లాలో దమ్మన్నపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి పోచారాన్ని స్థానిక మహిళలు నిలదీశారు. తమ ఇందిరమ్మ ఇళ్లు డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. తమకు డబుల్ బెడ్ రూం ఇళ్లు వద్దని మంత్రికి మొరపెట్టుకున్నారు. ఇళ్లను కొంతమంది గద్దలు తన్నుకపోయారు..అందుకే ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని మంత్రి పోచారం శాంతింప చేసే ప్రయత్నం చేశారు. రేషన్ వస్తుంది..సన్నబియ్యం వస్తుంది కదా..అన్ని చేస్తాం అని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తమకు దొడ్డు బియ్యం సరఫరా వద్దు అని ఓ మహిళ పేర్కొంది. పిల్లలకైతే సన్నబియ్యం వస్తున్నాయి కదా అని మంత్రి తెలిపారు. చివరకు ఏదో ఒక విధంగా మహిళను శాంతిపచేసి మంత్రి పోచారం అక్కడి నుండి నిష్క్రమించారు. 

16:24 - November 12, 2015

ఒంగోలు : సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు హెల్మెట్ల నిబంధన విధించడం జరిగిందని ఏపీ మంత్రి శిద్ధా రాఘవరావు వెల్లడించారు. ఇటీవలే ఏపీలో శిరస్త్రాణం తప్పని సరి అని ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. వెంటనే దీనిపై ప్రభుత్వం వెనుకడగు వేసింది. 12వ తేదీ నుండి తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని గడువు విధించింది. గురువారం ఒంగోలులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శిద్ధా జర్నలిస్టులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ప్రజలకు అవగాహన కలిగేంత వరకు చలాన్లు విధించవద్దని ట్రాఫిక్ అధికారులకు మంత్రి శిద్ధా ఆదేశాలు జారీ చేశారు. 

16:15 - November 12, 2015

ఏలూరు : కార్పొరేట్ స్కూళ్లపై ఏపీ మంత్రి రావెల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ కోళ్ల ఫారాలు తలపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఏలూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో క్రీడోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి రావెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కార్పొరేట్ స్కూల్స్ కన్నా ప్రభుత్వ పాటశాలలే నయమని తెలిపారు. కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో ఆట లేదు..పాట లేదు..కళలు..లేవు. బాహ్యా ప్రపంచానికి సంబంధాల ఉండవు..కేవలం ర్యాంకుల కోసం పని చేస్తున్నాయని విమర్శించారు. అన్ని రకాల అవకాశాలు..సంపూర్ణ అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
మంత్రి రావెల చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. హేతుబద్ధీకరణ పేరిట ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే విధానాలను ప్రభుత్వం అవలింబిస్తోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మరి రావెల వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన వ్యక్తమౌతుందో వేచి చూడాలి. 

కార్పొరేట్ స్కూళ్లు కోళ్ల ఫారాలు తలపిస్తున్నాయి - రావెల..

ఏలూరు : కార్పొరేట్ సూళ్లు కోళ్ల ఫారాలను తలపిస్తున్నాయని ఏపీ మంత్రి రావెల వ్యాఖ్యానించారు.

 

జలమండలికి రూ.40 కోట్లు..

హైదరాబాద్ : నగరంలోని జలమండలికి రూ. 40 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జంటనగరాలు, శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్యను తీర్చేందుకు, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది. 

15:46 - November 12, 2015

అనంతపురం : కుటుంబ కలహాలు ఓ వ్యక్తి ప్రాణాలు తీశాయి. ఈ ఘటన జిల్లా కూడేరు మండలం శివరామ్‌పేటలో చోటు చేసుకుంది. తన కాపురంలో గొడవల పరిష్కారంకోసం జనార్ధన్ అనే వ్యక్తి తన అన్నతో కలిసి అత్తవారింటికి వెళ్లాడు. తన భార్యను ఇంటికి పంపాలని పెద్దమనుషులను కోరాడు. భార్యాభర్తల గొడవలపై పంచాయితీలో మాటామాటా పెరిగింది. జనార్ధన్‌ భార్య బావ ఆవేశంతో అతని అన్న వెంకట్రాముడిపై కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన వెంకట్రాముడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. పరారీలో ఉన్న నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

15:44 - November 12, 2015

వరంగల్‌ : కాశిబుగ్గలోని ఓ లేడీస్‌ ఎంపోరియంలో మంటలంటుకున్నాయి.. షాప్‌లోని వస్తువులన్నీ మంటల్లో కాలి బూడిదయ్యాయి..దాదాపు 5లక్షల రూపాయలవరకూ నష్టం జరిగిందని దుకాణం యజమాని రమేశ్ చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్‌వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

15:43 - November 12, 2015

మహబూబ్ నగర్ : తెలంగాణ ఏర్పాటయ్యాక మొదటి సారి రూ. 2వేల కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి తుమ్మల ప్రకటించారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో 8 రోడ్లను డబుల్‌ రోడ్లుగా మార్చే పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి పాల్గొన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు సమాచారం ఇవ్వకుండా రోడ్ల పనులు ఎలా ప్రారంభిస్తారంటూ కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు.

15:42 - November 12, 2015

వరంగల్ : సారిక, ముగ్గురు పిల్లల మృతి కేసులో మాజీ ఎంపీ రాజయ్య బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈ నెల 16కు వాయిదా పడింది. తమకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ వరంగల్‌ కోర్టులో రాజయ్య పిటిషన్ వేశారు. ఈ నెల 4న హన్మకొండలోని ఇంట్లో ముగ్గురు మనవలతో సహా రాజయ్య కోడలు సారిక సజీవదహనమైంది. ఈ కేసులో రాజయ్య, అతని భార్య మాధవి, కొడుకు అనిల్‌కు వరంగల్‌ జైల్లో ఉన్నారు.

15:41 - November 12, 2015

హైదరాబాద్ : తెలంగాణ ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్ ను భాగ్యనగర్ టీ-ఎన్టీవో ప్రతినిధులు కలిశారు. గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీలో ఏపీ ఎన్జీవోలు 18కోట్ల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపించాలని కోరారు. ఉమ్మడిగా ఉన్నప్పుడు 36 కోట్లు రూపాయలతో పాటు 6300 సభ్యులు ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తమకు వాటా ఇవ్వడం లేదని ఇటీవలే విజిలెన్స్ వారికి టీఎన్జీవో ప్రతనిధులు ఫిర్యాదు చేశారు. దీనిపై నియమించబడిన కమిటీ పూర్తిస్థాయి దర్యాప్తు చేసి అవకతవకలు జరిగినట్లు నివేదిక అందించారు. కానీ ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఏకే ఖాన్ ను ప్రతినిధులు కలిశారు. పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతామని ఏకే ఖాన్ హామీనిచ్చిటన్లు సమాచారం. 

15:36 - November 12, 2015

విశాఖపట్టణం : డిసెంబర్‌ 25, 26, 27 తేదీల్లో విశాఖ ఉత్సవ్‌ నిర్వహిస్తామని, అదే రోజుల్లో అరకు ఉత్సవ్ కూడా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఈనెల 19న సీఎం చంద్రబాబు పర్యటన ఉంటుందన్నారు. ఈ నెల 16న జరిగే కేబినెట్‌ సమావేశంలో బాక్సైట్‌ తవ్వకాలపై చర్చిస్తామని తెలిపారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఇచ్చే సూచనలను గౌరవిస్తామని తెలిపారు గంటా.

ఏకే ఖాన్ ను కలిసిన భాగ్యనగర్ టిఎన్జీవో ప్రతినిధులు...

హైదరాబాద్ : తెలంగాణ ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్ ను భాగ్యనగర్ టీ ఎన్జీవో ప్రతినిధులు కలిశారు. గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీలో ఏపీ ఎన్జీవోలు రూ.18 కోట్ల దుర్వినియోగానికి పాల్పాడ్డారని ఫిర్యాదు చేశారు.

ఎన్నికల ప్రచారంలో మంత్రి పోచారానికి షాక్..

వరంగల్ : ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి పోచారానికి షాక్ తగిలింది. దమ్మన్నపేటలో మంత్రిని గ్రామస్తులు నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపు..రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని జనాలు నిలదీశారు. 

బాబును కలిసిన అశోక్ బాబు, రవాణా శాఖ ఉద్యోగులు...

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడును ఏపీ ఎన్జీవో నేత అశోక్ బాబు, రవాణాశాఖ ఉద్యోగ సంఘం నేతలు కలిశారు. రవాణా శాఖ సిబ్బందిని వేధిస్తున్నారని బాబు దృష్టికి తీసుకొచ్చారు. 

19న విశాఖలో బాబు పర్యటన - గంటా..

విశాఖపట్టణం : ఈనెల 19వ తేదీన జిల్లాలో చంద్రబాబు పర్యటన ఉంటుందని మంత్రి గంటా శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. 16న జరిగే కేబినెట్ భేటీలో బాక్సైట్ తవ్వకాలపై చర్చిస్తామని, పవన్ కళ్యాణ్ సూచనలను గౌరవిస్తామన్నారు. డిసెంబర్ 25,26,27 తేదీల్లో విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

 

ఇద్దరు యువకులపై పోలీసుల దౌర్జన్యం..

విజయవాడ : ఇద్దరు యువకులపై పోలీసులు దౌర్జన్యం చేశారు. టైరు పేలిపోవడంతో పక్కనున్న వెళుతున్న బైక్ ను పవన్ కళ్యాణ్ లోని పైలట్ వాహనం ఢీకొంది. తమ వాహనం బాగు చేయించి వెళ్లాలని పోలీసులు యువకులపై వత్తిడి తెచ్చారు. 

రాజయ్య కుటుంబ సభ్యులు బెయిల్ పిటిషన్...

వరంగల్ : మాజీ ఎంపీ రాజయ్య కోడలు, ముగ్గురు పిల్లల మృతి కేసులో జిల్లా కోర్టులో రాజయ్య కుటుంబ సభ్యులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణ ఈనెల 16కి వాయిదా పడింది. 

దేవరకొండ తహశీల్దార్ ఆఫీసుపై ఏసీబీ దాడులు...

నల్గొండ : దేవరకొండ తహశీల్దార్ ఆఫీస్ పై ఏసీబీ దాడులు నిర్వహించింది. రూ.18వేలు లంచం తీసుకుంటున్న గొటిముక్కల వీఆర్వో రామ్మోహన్ రావు ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. 

 

గుంటూరులో ఏపీ రైతు సంఘం రాష్ట్ర సదస్సు...

గుంటూరు : ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పత్తి రైతుల రాష్ట్ర సదస్సు జరిగింది. పత్తి రైతులు మద్దతు ధరలేక ఇబ్బందులు పడుతున్నారని, సీసీఐ బోగస్ సంస్థగా మారిందని కేఎస్ లక్ష్మణ్ రావు విమర్శించారు. పత్తి రైతుల సమస్యలు ప్రజాప్రతినిధులకు పట్టడం లేదని, మద్దతు ధర..రైతు సంక్షేమం బీజేపీ, టిడిపి ప్రభుత్వాల ఎజెండాలో లేకుండా పోయాయన్నారు.

 

15:02 - November 12, 2015

ఈ తరం పిల్లల్ని పట్టి పీడిస్తున్న సమస్య ఒబెసిటీ. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో ఒబెసిటీని కారణాలేంటి? నివారించేందుకున్న మార్గాలను 'మానవి' హెల్త్ కేర్ లో డా.హరి అనుపమ (ఎండి, గాంధీ హాస్పిటల్) తెలిపారు. 

14:58 - November 12, 2015

శ్రమే మనిషికి మాట నేర్పింది. శ్రమే మనిషి వికాసానికి దోహదపడింది. శ్రమే నాగరికతకు నాంది పలికింది. శ్రమ ఫలితంగా రూపుదిద్దుకున్న ఉత్పత్తి సాధనాలు అనేక చారిత్రక, సామాజిక పరిణామాలకు దారితీసాయి. స్త్రీ, పురుషుల పనిలో శ్రమ విభజన జరిగింది. అదే సమయంలో ఉత్పత్తి సాధనాలపై పురుషాధిపత్యం కూడా బలపడుతూ వచ్చింది. ఈ క్రమంలో మహిళల శ్రమకు గుర్తింపు లేకుండా పోయింది. ఆ శ్రమకు వేతనం కూడా దక్కని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సంరక్షణా పనిభారం తగ్గేదెలా అనే అంశంపై 'మానవి' ప్రత్యేక కథనం.

మహిళల భాగస్వామ్యమే ప్రధానం..
నేటికీ అన్ని రకాల ఉత్పత్తిలో మహిళల భాగస్వామ్యమే ప్రధానంగా ఉంది. పైగా ఆమె ప్రాధాన్యం ఎప్పుడూ తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే, ఆమె శ్రమకు సరైన గుర్తింపు దక్కకపోగా, ఆమె మోస్తున్న సంరక్షణా పనిభారం మాత్రం మరింతగా పెరిగింది. ఈ సంరక్షణా పని భారం మహిళల ఉత్పత్తి సామర్థ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వారు మోస్తున్న పని భారానికి ఎటువంటి గుర్తింపూ లేకపోగా, వారి శ్రమను తక్కువ చూపే ప్రయత్నం జరుగుతోంది. అందుకే, ఆమె చేసే పనికి విలువివ్వాలి. ఆమె హక్కును గుర్తించాలి. ఆమె మోస్తున్న సంరక్షణా భారాన్ని తగ్గించాలి. సంరక్షణా భారాన్ని కుటుంబం, సముదాయం, ప్రభుత్వం, ప్రైవేట్ రంగం పంచుకోవాలి. తన హక్కుల కోసం పోరాడేలా ఆమె సామర్థ్యాన్ని పెంచాలనే డిమాండ్స్ ను, మహిళా ఉద్యమాలు తమ ఎజెండాలో చేర్చాల్సిన అవసరముందని 'మానవి' భావిస్తోంది. 

14:41 - November 12, 2015

విజయవాడ : ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలకు కట్టుబడకపోతే బీజేపీ పార్టీకి నష్టం జరుగుతుందని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఈ హామీలను చేయలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినప్పుడు తన రియాక్షన్ వేరేగా ఉంటుందని పేర్కొన్నారు. గురువారం విజయవాడకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. అనంతరం భేటీకి సంబంధించిన అంశాలను పవన్ మీడియాకు వివరించారు. ఆయన మాటల్లోనే...

నా రియాక్షన్ వేరేగా ఉంటుంది..
''సీమాంధ్ర ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోతే దెబ్బ తగిలే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇచ్చి తీరాలి. వెనక్కి తీసుకుంటే బీజేపీ నష్టపోయే అవకాశం ఉంది. చెడు జరుగుతున్నప్పుడు మాట్లాడానికి భయపడను. మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడుతా. మేము చేయమని అని చెప్పినప్పుడు నా రియాక్షన్ వేరేగా ఉంటుంది. నిరసనలు తెలియచేస్తే కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా ఉండదు. ఢిల్లీలో ఏదైనా జరగాలంటే అసాధ్యంగా ఉంటుంది.

ఇక బాబుతో ఏం చర్చించానంటే..
రాజధాని 'అమరావతి' నిర్మాణ కార్యక్రమానికి రాలేకపోయాను. అందుకు తొలుత శుభాకాంక్షలు తెలియచేశాను. క్యాపిటల్ కు సంబంధించిన సమస్యలున్నాయి. దానిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. భూ సేకరణ విషయంలో బలవంతంగా చేయడం జరిగిందని బాబు చెప్పారు. ప్రధానంగా బాక్సైట్ విషయంపై చర్చించాను. వైఎస్ హాయాంలో బాక్సైట్ తవ్వకాలు వచ్చాయి. ఇది కొత్తగా క్రియేట్ చేయలేదు. గిరిజనుల ఆరోగ్యం..ఇతర అంశాలపై ఆలోచించి ముందుకెళుతామని బాబు చెప్పారు. బాక్సైట్ తవ్వకాలపై చర్చించి నిర్ణయానికి రావాలని చెప్పడం జరిగింది. దీనిని బాబు సుముఖంగా ఉన్నారు. గిరిజనుల బతుకులు దెబ్బతినకుండా ఉండాలని చెప్పడం జరిగింది. గిరిజనుల సమ్మతిస్తే ముందుకు వెళుతామని, బలవంతంగా ముందుకు వెళ్లమని ఎవరికీ ఏలాంటి ఇబ్బంది రాకుండా చేస్తామని బాబు చెప్పారు.

ప్రత్యేక హోదా ఆరోజుకు చూద్దాం..
ప్రత్యేక హోదాపై చర్చించడం జరిగింది. ఏది చెప్పామో అది తు.చ తప్పకుండా పాటిస్తామని ప్రధాని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో..? ఏ విధంగా ఆర్థికంగా ఆదుకుంటారో ? చూద్దాం. ఆ రోజుకు ఆలోచిద్దాం. అనంతరం స్పందన తెలియచేద్దామని అనుకుంటున్నట్లు బాబుకు తెలియచేశా.

ఆశా జనకంగా చర్చలు..
రాజధాని విషయంలో కొన్ని ప్రాంతాల అసమానతలు..భయాందోళనలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంపై చర్చించాం. చర్చలు ఆశాజనకంగా సాగాయి. బీహార్ ఫలితాలపై ఈ క్షణంలో స్పందించడానికి ఇష్టం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికలు..ఇతర ఎన్నికల అంశాలు చర్చకు రాలేదు''. అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

శుభాకాంక్షలు తెలిపా - పవన్..

విజయవాడ : రాజధాని నిర్మాణ శంకుస్థాపనానికి రాలేకపోయానని, చంద్రబాబు నాయుడును కలిసి శుభాకాంక్షలు తెలియచేసినట్లు సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 

మీడియాతో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్..

విజయవాడ : సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుల భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. భేటీకి సంబంధించిన విషయాలను పవన్ మీడియాకు తెలియచేస్తున్నారు. 

ముగిసిన చంద్రబాబు - పవన్ భేటీ..

విజయవాడ : సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్..సీఎం చంద్రబాబు నాయుడు ల భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. రైతుల నుండి వచ్చిన వినతులు, రైతు సమస్యలను పవన్ ..బాబుకు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించిన విషయాలను బాబు ..పవన్ కు తెలియచేస్తున్నట్లు సమాచారం. 

కొనసాగుతున్న బాబు - పవన్ భేటీ..

విజయవాడ : సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్..సీఎం చంద్రబాబు నాయుడు ల భేటీ కొనసాగుతోంది. రైతుల నుండి వచ్చిన వినతులు, రైతు సమస్యలను పవన్ ..బాబుకు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించిన విషయాలను బాబు ..పవన్ కు తెలియచేస్తున్నట్లు సమాచారం. 

మంత్రి తలసానికి హైకోర్టు నోటీసులు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టిడిపి నుండి గెలిచి మంత్రిగా కొనసాగడంపై సీనియర్ జర్నలిస్టు శివప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సీఎస్, తలసాని, టిడిపి పార్టీని ప్రతివాదులుగా చేర్చింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

13:35 - November 12, 2015

హైదరాబాద్ : టిఆర్ ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డ ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు పుస్తకం విడుదల చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారింలోకి వచ్చే 18 నెలలు పూర్తయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ...కేసీఆర్ దళితులను మోసం చేశారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రచారంకోసమే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు.. 18 నెలల పాలనలో గులాబీ సర్కారు పాలన, 50 ప్రశ్నలతోకూడిన బుక్‌లెట్‌ను ఉత్తమ్ విడుదల చేశారు.. ఈ పుస్తకాన్ని వరంగల్‌లో ప్రజలకు పంపిణీ చేస్తామని తెలిపారు.

13:29 - November 12, 2015

వరంగల్ : దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే మాపార్టీని గెలిపిస్తాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ ఎంపి స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైసీపీ పార్టీ అభ్యర్థి తరపున ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురువారం రోజా 'టెన్ టివి'తో మాట్లాడుతూ వయసు తో నిమిత్తం లేకుండా వైఎస్ పేరు ఎత్తితేనే ప్రజల్లో సంతోషం కనిపిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేదని బిజెపికి బీహార్ ఎన్నికలతో పాలు పోవడం లేదని ఎద్దేవా చేశారు. టిడిపి వెన్ను పోటు రాజకీయాలే తప్ప తమకు పోటీ కూడా ఇవ్వలేదని తెలిపారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా టిఆర్ ఎస్... వైసీపీకి పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటామని రోజా తెలిపారు.

సీఎం కేసీఆర్ పాలన పై టి.కాంగ్రెస్ పుస్తకం విడుదల...

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు పుస్తకం విడుదల చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారింలోకి వచ్చే 18 నెలలు పూర్తయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పుస్తకాన్ని విడుదల చేశారు. కేసీఆర్ దళితులను మోసం చేశారని ఈ సందర్భంగా ఉత్తమ్ విమర్శించారు. కేసీఆర్ పాలనపై పుస్తకంలో 50 ప్రశ్నలు సంధించినట్టు చెప్పారు. ఈ పుస్తకాన్ని వరంగల్ ప్రజలకు పంపిణీ చేయనున్నామని తెలిపారు.

ఆర్టీఐని అమలు చేయకపోతే చర్యలు : తాంతియాకుమారి

విశాఖ : ఆర్టీఐని అమలు చేయకపోతే చర్యలు తప్పవని సమాచార కమిషనర్‌ తాంతియా కుమారి హెచ్చరించారు. విశాఖలోని సర్క్యూట్‌హౌస్‌లో సమాచార కమిషనర్‌ అధికారులతో సమీక్షించారు. అడిగిన సమాచారం ఇవ్వని అధికారులను పిలిచి కమిషనర్‌ ప్రశ్నించారు.

12:48 - November 12, 2015

అనంతపురం : గోరంట్ల మండలం మల్లాపల్లి గ్రామంలో ఘోరవిషాదం జరిగింది. చికెన్‌ షాపు నడిపించే యజమాని అతని కుమారుడు ఇద్దరూ కరెంట్‌ షాక్‌కు గురై చనిపోయారు. ఉదయాన్నే షాపు తెరవడానికి వచ్చిన చికెన్‌ షాపు యజమాని ముస్తఫా కరెంట్‌ పాసవుతున్న ఓ పైపును పట్టుకుని షాక్‌కు గురై పడిపోయాడు. కరెంట్‌ షాక్‌ విషయం తెలియని కొడుకు దారావీర్‌ తండ్రిని పట్టుకోవడంతో అతడికి కూడా షాక్‌ తగిలి చనిపోయాడు. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు గోడలు నానిపోయి.. పైన ఓపెన్‌గా ఉన్న కరెంట్‌ వైర్ల నుంచి కరెంట్‌ పాసయిందని స్థానికులు చెబుతున్నారు. కరెంట్‌షాక్‌ తండ్రి కొడుకులిద్దరూ చనిపోవడంతో కుటుంబంతో పాటు, స్థానికులంతా విషాదంలో మునిగిపోయారు.

12:46 - November 12, 2015

విజయవాడ : దేశ ఆర్ధిక వ్యవస్ధకు ఎఫ్‌డీఐలు చిచ్చు పెడతాయని సీపీఎం విమర్శించింది. విజయవాడలో సీపీఎం నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. మోదీ ప్రభుత్వం వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం కార్యాలయం నుంచి బీసెంట్‌ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి.. ఎఫ్‌డీఐ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత బాబూరావు,తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

12:44 - November 12, 2015

వరంగల్: టీఆర్‌ఎస్‌ అహంకారపూరిత వైఖరికి ప్రజలు కచ్చితంగా బుద్ది చెబుతారన్నారు కాంగ్రెస్ నేత జైపాల్‌ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వంలో జవాబుదారీతనం లేదని ఆరోపించారు.. కాంగ్రెస్ ఎంపీలో పోరాటంవల్లే హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం కాలేదని గుర్తుచేశారు..తెలంగాణాలో డిప్యూటీ సీఎం పదవికి విలువ లేదని, రాజయ్యను బర్తరఫ్‌ చేసి దళితులను కేసీఆర్‌ అవమానించారని జైపాల్‌రెడ్డి ఆరోపించారు. మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణాను 18 నెలల్లో కేసీఆర్‌ దివాలా తీయించారని ఆయన విమర్శించారు. ఎన్నికల హామీల అమలులో విఫలమయ్యాడని ఆయన దుయ్యబట్టారు.

12:41 - November 12, 2015

హైదరాబాద్ : విభజన బిల్లులో ఏపీకి ఇచ్చిన హామీలన్నిటిని నెరవేరుస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళుతున్న మంత్రి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు. బిజెపి సీనియర్‌ నేతలు అలక వహించారనడం కరెక్ట్‌ కాదని.. వారు పార్టీ అగ్రనేతలని మంత్రి గుర్తు చేశారు. చంద్రబాబుతో పవన్‌ భేటీ కావడం సాధారణ విషయమేనని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

12:38 - November 12, 2015

విజయవాడ : టాలీవుడ్ అగ్ర హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ మర్యాదపూర్వకమేనని తెలిపారు. కొద్ది సేపటి క్రితం ఆయన చంద్రబాబు తో భేటీ అయ్యారు. హైదరాబాదు నుంచి మంత్రి కామినేని శ్రీనివాస్ తోక లిసి విమానంలో గన్నవరం చేరుకున్న పవన్ కల్యాణ్ అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అంతకుముందే తన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు అక్కడికి వచ్చిన పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. వెనువెంటనే వారిద్దరూ చర్చల్లో మునిగిపోయారు. పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్న నేపథ్యంలో వీరి భేటీ దాదాపు రెండు గంటలకు పైగా సాగే అవకాశాన్నట్లు సమాచారం. ప్రధానంగా సీఆర్ డీఏ పరిధిలో జరగనున్న కార్యక్రమాలు, అమరావతి నిర్మాణానికి సంబంధించి గతంలో పవన్ సూచనలపై చర్చించే అవకాశ ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా వరంగల్ ఉప ఎన్నిక, జీహెచ్ ఎంసీ ఎన్నికల అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

చైనా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సైనా

హైదరాబాద్ : భారత షెట్లర్ సైనా నెహ్వాల్ చైనా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మలేషియా షట్లర్‌ టిజంగ్‌యీపై 21-10, 19-21, 21-19 తేడాతో సైనా విజయం సాధించారు.

బాబుతో భేటీ మర్యాదపూర్వకమే: పవన్

విజయవాడ : టాలీవుడ్ అగ్ర హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ మర్యాదపూర్వకమేనని తెలిపారు. కొద్ది సేపటి క్రితం ఆయన చంద్రబాబు తో భేటీ అయ్యారు.

విషాహారం తిని 20 మేకల మృతి

వరంగల్ : జిల్లాలో విషాహారం తిని 20 మేకలు మృతి చెందాయి. ఈఘటన ఏటూరునాగారం మండలం కంతనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాంబాబు అనే రైతు తన వరి పంటను పందులు నాశనం చేస్తున్నాయని పొలం వద్ద విష గుళికలు పెట్టాడు. వాటిని పొరపాటున మేకలు తినడంతో మృతిచెందాయి. నష్టపరిహారం చెల్లించాలని మేకల యజమానులు కేసు పెట్టడానికి సిద్ధమైయ్యారు.

చంద్రబాబును కలవనున్న కమల్ హాసన్

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబును ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌ కలవనున్నారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కమల్‌ నేటి మధ్యాహ్నం రెండు గంటలకు చంద్రబాబుతో భేటీ కానున్నారు. గురువారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ టీ సుబ్బరామిరెడ్డి చంద్రబాబును కలిసి మాట్లాడారు.

పల్లవ గ్రానైట్స్ పేలుడు : ఒకరి మృతి

వరంగల్ : గూడూరు మండలం తాగలవేనిలోని పల్లవ గ్రానైట్స్ లో పేలుడు సంభవించింది. జిలెటిన్ స్టిక్స్ పేలి వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చిలకలూరి పేట.. మోడరన్ స్టెల్లార్ పాఠశాల్లో అగ్ని ప్రమాదం...

గుంటూరు :చిలకలూరి పేటలోని మోడరన్ స్టెల్లార్ పాఠశాలలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థిలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

పంచెకట్టుతో బెజవాడ పర్యటనకు పవన్ కల్యాణ్

హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు రైతు వేషధారణలోనే బెజవాడ పర్యటనకు వెళ్లారు. నేటి ఉదయం హైదరాబాదులోని తన ఇంటి నుంచి పంచెకట్టులోనే బయలుదేరిన పవన్ కల్యాణ్ గన్నవరం విమానాశ్రయంలో తనకోసం వేచి చూస్తున్న అభిమానులను హుషారెత్తించారు. పంచెకట్టులో పవన్ కల్యాణ్ వస్తారని ఊహించని ఆయన అభిమానులు తన అభిమాన నటుడిని రైతు వేషంలో చూసి కేరింతలు కొట్టారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ కోసం వెళ్లిన పవన్ కల్యాణ్ పంచెకట్టులో దర్శనమిచ్చి ఆసక్తికర చర్చకు తెర తీశారు.

బై పోల్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు..

హైదరాబాద్ :  వరంగల్ ఉప ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలను రంగంలోకి దించనుంది. ఈ నెల 15న భూపాలపల్లి, పరకాలలో దిగ్విజయ్‌సింగ్, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, 16న వర్థన్నపేటలో మాజీ హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, 17న స్టేషన్‌ఘన్‌పూర్‌లో సచిన్‌ఫైలట్‌లు ప్రచారం చేయనున్నారు.

'మీ ఇంటికి- మీభూమి' కార్యక్రమంలో ఉద్రిక్తత

కృష్ణా :మచిలీపట్నం మండలం పొట్లపాలెం గ్రామంలో పోర్టు అనుబంధ పరిశ్రమల కోసం విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను వెంటనే నిలిపివేయాలని ఆందోళన చేశారు. మీ ఇంటికి- మీ భూమి కార్యక్రమాన్ని రైతులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు కుర్చీలను తగలబెట్టి తమ నిరసనను తెలిపారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

11:33 - November 12, 2015

హైదరాబాద్ : విశాఖ మన్యాన్ని మంచు దుప్పటి కప్పేస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. లంబసింగి ప్రాంతంలో 9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చింతపల్లిలో 12, పాడేరు, ముంచుంగుపుట్టులో 10 డిగ్రీలు నమోదయ్యాయి. వాతావరణంలో మార్పులు, సముద్రంలో వాయుగుండం ప్రభావంతో చలి తీవ్రతలో హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది విశాఖ మన్యంలో చలిపులి తడాఖా చూపిస్తుందని నిపుణులు అంచనావేస్తున్నారు.

11:32 - November 12, 2015

నిజాబామాబాద్ : తాగేందుకు సరైన నీరు లభించక ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు నిర్మించిన యంచ ఢీ ఫ్లోరైడ్‌ ప్రాజెక్ట్‌ అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. దాహార్తి తీర్చండని ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. అధికారుల నిర్లక్ష్య వ్యవహారంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

1996లో డీ ఫ్లోరైడ్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం .....

నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలంలో ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలతో పాటు.. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామాలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో 1996లో యంచ ఢీ ఫ్లోరైడ్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. 16 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌.. ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యానికి గురైందని ప్రజలంటున్నారు.

35 గ్రామాలకే అందుతున్న నీరు .....

ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 77 గ్రామాలకు నీరు అందించాల్సి ఉన్నప్పటికీ కేవలం 35 గ్రామాలకే నీరందుతుందని పలువురంటున్నారు. మంచినీరు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఢీ ఫ్లోరైడ్‌ ప్రాజెక్ట్‌ నిర్వహణకు ప్రతి నెలా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం లేకుండాపోయిందంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌ నిర్వహణ బాధ్యతలు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చేపట్టినప్పటి నుండి ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు.

పైపులు పగిలిన నీరు కలుషితం ......

ఇక పైపులు పగిలి నీరు కలుషితమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైపులు పగలడంతో నిత్యం బురద నీళ్లు వస్తున్నాయని.. అందులో పురుగులు కూడా ఉంటున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఢీ ఫ్లోరైడ్‌ ప్రాజెక్ట్‌ వద్ద సరైన నిర్వహణ లేకపోవడంతో నీళ్లన్నీ పక్షుల రెట్టలతో కలుషితమై.. తీవ్ర దుర్గందభరితంగా మారుతున్నాయంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డీ ఫ్లోరైడ్‌ ప్రాజెక్ట్‌ పైపులు మరమ్మతులు చేసి.. సక్రమమైన నిర్వహణ చేపట్టి మంచినీరు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

11:29 - November 12, 2015

హైదరాబాద్ : టాప్ ట్వంటీలో చోటుకోసం పట్టుదలగా ప్రయత్నిస్తోంది బల్దియా... ఈసారి ఎలాగైన స్థానం దక్కించుకోవాలని ట్రై చేస్తున్నారు గ్రేటర్ అధికారులు.. కన్సల్టెన్సీ డ్రాఫ్ట్‌తోపాటు.. ప్రజాభిప్రాయానికి పెద్ద పీట వేస్తున్నారు..

కేంద్రం ప్రకటించబోయే టాప్ ట్వంటీ నగరాల్లో ...

కేంద్రం ప్రకటించబోయే టాప్ ట్వంటీ నగరాల్లో చోటుకోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది బల్దియా.. స్వచ్ఛ్ భారత్‌ ర్యాంకింగ్‌లో భారీగా వెనకబడ్డ నగరపాలకసంస్థ.. ఇప్పుడుమాత్రం ఆచితూచి అడుగులువేస్తోంది.. నైట్‌ ఫ్రాంక్‌ కన్సల్టెంట్‌ సంస్థకు ప్లానింగ్ బాధ్యతలు అప్పగించింది.. అందరికంటే ఆకర్షణీయమైన స్మార్ట్ సిటీ డ్రాఫ్ట్ తయారీలో ప్రజల్నికూడా భాగస్వాముల్ని చేస్తోంది.. ముసాయిదా రూపకల్పనలో బిజీబిజీగాఉన్నారు గ్రేటర్ అధికారులు..

కేంద్రం టాప్ 20 కాంటెస్ట్....

ఇప్పటికే వంద స్మార్ట్ సిటీలను ఎంపికచేసిన కేంద్రం టాప్ 20 కాంటెస్ట్ నిర్వహిస్తోంది.. అభివృద్ధిపై సమర్పించే నివేదికల ఆధారంగా ఈ నగరాలను ఎంపిక చేస్తారు.. మొదటి దశలో సెలక్ట్ చేసిన 20 నగరాలకు ఏటా వందకోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లకు 5వందల కోట్ల గ్రాంట్‌ అందిస్తారు... అలాగే వివిధ సంస్థలనుంచి పెట్టుబడులతోపాటు నగరానికి మంచిపేరు వచ్చే అవకాశం ఉంటుంది..

జీహెచ్ ఎంసీ రూపొందించిన వెబ్‌సైట్‌కు చాలా సూచనలు......

సిటీ డ్రాఫ్ట్ తయారీకోసం జీహెచ్ ఎంసీ రూపొందించిన వెబ్‌సైట్‌కు చాలా సూచనలు, సలహాలొచ్చాయి.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ప్రజల అభిప్రాయాలు స్వీకరించారు అధికారులు.. రోడ్లు, పార్కులు, శానిటేషన్‌ సమస్యలను కమిషనర్‌ దృష్టికితెచ్చారు నగరవాసులు.. అయితే ఆర్థికంగా బలంగాఉన్న నగరాలకుమాత్రమే ఈ ట్వంటీ కాంటెస్ట్ లో ఛాన్స్ ఉంటుందని కేంద్రం ప్రకటించింది.. ఏడాదికి కేవలం 300కోట్ల ఆదాయమున్న జీహెచ్ ఎంసీ టాప్ ట్వంటీలో చోటుకోసం ఎలా ప్లాన్‌ చేస్తుందో వేచి చూడాలి.. 

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు : ఇద్దరు మృతి

రంగారెడ్డి: జిల్లాలోని శామీర్‌పేట్ మండలం తుర్కపల్లి రాజీవ్ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం : పోచారం...

హైదరాబాద్ : రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయన వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి పోచారం మాట్లాడుతూ... రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. రూ.17వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేసినం. ఇప్పటికే రూ.8వేల కోట్లకు పైగా రుణాలను చెల్లించినం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నామని తెలిపారు.

మంచు దుప్పటిలో విశాఖ ఏజెన్సీ

విశాఖ: ఏజేన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పాడేరు, మినుమూలు ప్రాంతాల్లో 10 డిగ్రీలు, లంబసింగిలో 11 డిగ్రీలు, చింతపల్లిలో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. చలితీవ్రత మొదలవడంతో ఏజెన్సీ వాసులు ఇళ్ల నుంచి బయటకు రావడానికే బయపడుతున్నారు. చలి తీవ్రతకు వృద్ధులు, చిన్నారులు అల్లాడిపోతున్నారు.

గొలుసు చోరీకి యత్నంచి కింద పడ్డ దుండగుడు...

హైదరాబాద్ : నగరంలోని మీర్‌పేట్‌లో గుర్తుతెలియని దుండగుడు అనిత అనే మహిళ మెడలో గొలుసు చోరీకి యత్నించాడు. దుండగుడు బైక్‌ నుంచి కిందపడ్డాడు. స్థానికులు రావడంతో దుండగుడు గొలుసు వదిలి పరారయ్యాడు. ఈ సంఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

కేసీఆర్ చండీ యాగానికి చంద్రబాబు...

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించబోతున్న చండీయాగానికి వెళ్లే యోచనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. కేసీఆర్ నుంచి ఆహ్వానం అందితే తాను తప్పకుండా వెళ్లాల్సి ఉంటుందని తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు స్పష్టం చేశారట. మరోవైపు, చంద్రబాబును ఆహ్వానించాలనే యోచనలో కేసీఆర్ కూడా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. 

గ్రానైట్ క్వారీలో పేలుడు...

వరంగల్ : గూడూరు మండలం తీగలవేణి గ్రానైట్ క్వారీలో పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానికి ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను సోధించే పనిలో పోలీసులు ఉన్నారు.

10:33 - November 12, 2015

హైదరాబాద్ :జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం హైదరాబాదు నుంచి విజయవాడ బయలుదేరారు. నేటి మధ్యాహ్నం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పవన్ కల్యాణ్ భేటీ కానున్న సంగతి తెలిసిందే. నవ్యాంధ్ర రాజధాని, ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన పలు అంశాలకు సంబంధించి కీలక చర్చ జరగనున్నట్లు భావిస్తున్న ఈ భేటీపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. విజయవాడకు బయలుదేరే ముందు పవన్ కల్యాణ్ తో ఏపీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ అరగంట పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చంద్రబాబుతో భేటీ సందర్భంగా ప్రస్తావించాల్సిన అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీని ఖరారు చేయడంలో కీలకంగా వ్యవహరించిన కామినేని, భేటీలో చర్చించాల్సిన అంశాలపైనా దృష్టి సారించడంపై ఆసక్తి రేకెత్తుతోంది. విజయవాడకు చేరుకున్న తర్వాత చంద్రబాబుతో భేటీకి ముందు పనవ్ కల్యాణ్ అమరావతికి భూములిచ్చిన రైతులతో సమావేశం కానున్నారు. 

10:32 - November 12, 2015

హైదరాబాద్ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బంగారం వస్తూనే ఉంది. నేడు నాలుగున్నర కేజీల బంగారాన్ని అధికారులు సీజ్‌ చేశారు. కడప జిల్లాకు చెందిన మల్లీశ్వరి అనే మహిళ బ్యాంకాక్‌ నుంచి శంషాబాద్‌కు వచ్చింది. ఆమె దగ్గరే బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

కామినేనితో భేటీ అయిన పవన్

హైదరాబాద్ : జన సేన అధినత పవన్ కల్యాణ్ మంత్రి కామినేనితో 20 నిముషాలపాటు భేటీ అయ్యారు. ఈ రోజు సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న నేపథ్యంలో ఆ భేటీచర్చించాల్సిన అంశాలపై కామినేనితో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో తొలుత రాజధాని రైతులతో సమావేశమవనున్న పవన్‌.. ఆ తర్వాతే చంద్రబాబుతో భేటీ కానున్నారు. పవన్  హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలు దేరారు.

తండ్రి మందలించాడని కూతురు ఆత్మహత్య

హైదరాబాద్ : కరీంనగర్‌లోని పీకే రామయ్య కాలనీలో తండ్రి మందలించాడనే మనస్థాపంతో కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. మృతురాలి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు.

శంషాబాద్ లో 4.5 కిలోల బంగారం పట్టివేత....

హైదరాబాద్ : బ్యాంకాక్‌ నుంచి వచ్చిన గంగుల మహేశ్వరి నుంచి 4.5 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. కడపకు చెందిన మహేశ్వరి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

09:43 - November 12, 2015

హైదరాబాద్ : హాకీ ప్రపంచ ర్యాంకింగ్స్ లో మాజీ చాంపియన్ భారత్ పురుషుల విభాగంలో తన స్థానాన్ని గణనీయంగా మెరుగు పరచుకొంది. గత రెండుదశాబ్దాల కాలంలో తొలిసారిగా ఆరో ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించింది. మహిళల విభాగంలో భారత్ 13వ ర్యాంక్ లో కొనసాగుతోంది.....అంతర్జాతీయ హాకీ ర్యాంకింగ్స్ లో...ప్రపంచ మాజీ చాంపియన్ భారత్ పుంజుకొంది. అంతర్జాతీయహాకీ సమాఖ్య ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం..పురుషుల విభాగంలో భారత్ ఆరవ స్థానానికి చేరింది.

అత్యుత్తమ ర్యాంకు ఇదే కావడం విశేషం....

గత రెండుదశాబ్దాల కాలంలో భారత్ సాధించిన అత్యుత్తమ ర్యాంకు ఇదే కావడం విశేషం. ఇప్పటి వరకూ 8వ ర్యాంకులో ఉన్న భారత్ ఈ మధ్యకాలంలో ఆడిన పోటీల్లో నిలకడగా రాణించడం ద్వారా..ర్యాంక్ ను గణనీయంగా మెరుగుపరచుకోగలిగింది. కెప్టెన్ సర్దార్ సింగ్, వైస్ కెప్టెన్ శ్రీజేష్ ల నేతృత్వంలోని భారత హాకీజట్టును ..టీమ్ హైపెర్ఫామెన్స్ డైరెక్టర్ ఓల్ట్ మన్ విజయపథంలో నడిపించగలుగుతున్నారు. పురుషుల విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ లో ఆస్ట్రేలియా ఎదురేలేకుండా కొనసాగుతోంది. నెదర్లాండ్స్ రెండు, జర్మనీ మూడు ర్యాంకుల్లో ఉన్నాయి. బెల్జియం ఏడు, న్యూజిలాండ్ ఎనిమిది ర్యాంకులకు పడిపోయాయి.

మహిళల ర్యాంకింగ్స్ లో...

మహిళల ర్యాంకింగ్స్ లో...ఎప్పటిలానే భారత్ 13వ ర్యాంకులో కొనసాగుతోంది. నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, అర్జెంటీనా జట్లు మొదటి మూడుర్యాంకుల్లో ఉన్నాయి. రాయ్ పూర్ వేదికగా ఈనెల 17 నుంచి డిసెంబర్ 9 వరకూ జరిగే ఎనిమిదిజట్ల హీరో వరల్డ్ హాకీ లీగ్ ఫైనల్స్ ముగిసిన తర్వాత..మరోసారి ప్రపంచ హాకీ ర్యాంకింగ్స్ లో మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు ఉన్నాయి..

09:40 - November 12, 2015

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం కృష్ణానది లంక భూముల సమీకరణకు రంగం సిద్ధమతోంది. భూ సమీకరణ నోటిఫికేషన్‌ జారీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతికి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెంలో 13 లంకల్లో రెండువేల ఎకరాలకు పైగా భూమి ఉంది. దీనిలో పట్టా భూముల అమ్మకాలు జరిగిపోగా, అసైన్డ్‌ భూములను కొందరు బడా నేతలు బినామీ పేర్లతో కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ బినామీ వ్యవహారంపై విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

రాబందుల్లా వాలిపోన్న రాజకీయ నాయకులు...

అమరావతి పరిధిలో కృష్ణానది లంకభూముల కొనుగోలుకు రాజకీయ నాయకులు రాబందుల్లా వాలిపోతున్నారు. ఇప్పటికే పట్టా భూములను కొని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న బడా బాబుల దృష్టి అసైన్డ్‌ భూములపై పడింది. లంక భూముల సమీకరణకు సర్కార్‌ సన్నద్దమవుతున్న తరుణంలో హక్కుదారులను నయనో భయానో లొంగదీసుకుని.... కొందరు నేతలు వాటిని సొంతం చేసుకుంటున్నారు.

అసైన్డ్‌ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నేరం.....

అసైన్డ్‌ భూములకు ఎకరానికి తక్కువ మొత్తం ముట్టచెబుతున్నారు. చట్టం ప్రకారం అసైన్డ్‌ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నేరం. అయినా అక్రమార్కులు అన్ని స్థాయిల్లో చక్రం తిప్పుతూ వీనిటి సొంతం చేసుకుంటున్నారు. రైతుల నుంచి సేకరించిన ప్యాకేజీనే అసైన్డ్‌ భూములకు కూడా ఇవ్వాలని సర్కార్‌ నిర్ణయించడంతో ఇదే అదునుగా భావించిన అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు వీటికి ఒప్పందాలు చేయించుకున్నారు. సమీకరించిన ఎకరం అసైన్డ్‌ భూమికి 800 గజాల నివాస స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం ఇవ్వడానికి సర్కార్‌ అంగీకరించడంతో అధికార పార్టీ నేతల పంట పండినట్టు అయ్యింది. ఎకరానికి 25 లక్షల రూపాయలు చెల్లించేలా అగ్రిమెంట్లు చేయించుకుంటున్నారు. ఈ అసైన్డ్‌ భూములు కొనుగోలు బాగోతంలో ఓ మంత్రితోపాటు, కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు సమాచారం. చట్ట ప్రకారం అసైన్డ్‌ భూములకు రిజిస్ట్రేషన్‌ చేయకూడదు. కానీ రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు అడ్డుగోలుగా వ్యవహిస్తూ, ఈ భూములకు కూడా రిజిస్ట్రేషన్లు చేస్తూ అడ్డంగా దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.

విచారణ జరిపించాలని వైసీపీ నాయకులు...

కృష్ణానది లంకల్లో అసైన్డ్‌ భూముల కొనుగోలు వ్యవహారంపై విచారణ జరిపించాలని వైసీపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు 2,159 ఎకరాల లంక భూములను నోటిఫికేషన్‌ ద్వారా సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి పరిధిలో లంకభూములు కొన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన హెచ్చరికలు నీటి మూటులుగా మిగిలిపోయాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

09:37 - November 12, 2015

గుంటూరు : నగర శివార్లలో యాక్సిడెంట్‌ జరిగింది. జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌ ఈ యాక్సిడెంట్‌లో చనిపోయారు. వడంపాడు వద్ద కారు, ఆటో ఢీకొనడంతో ఈ యాక్సిడెంట్‌ జరిగింది. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

గుంతకల్లు పిచ్చికుక్కల స్వైర విహారం...

అనంతపురం :గుంతకల్లు పట్టణంలోని రైల్వే మైదానంలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఈ సంఘటనలో 20 మంది గాయపడ్డారు. కుక్క కాటుతో గాయపడిన 20 మందిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో కుక్కల బెడదను నివారించాలని ప్రజలు మున్సిపల్‌ సిబ్బందిని డిమాండ్‌ చేశారు.

విద్యుత్ షాక్ తో తండ్రీ కొడుకుల మృతి

అనంతపురం : గోరంట్ల మండలం మల్లపల్లెలోని ఓ మాంసం దుకాణంలో విద్యుత్తు షాక్‌తో తండ్రీకొడుకు మరణించారు. ఓ కోడి తప్పించుకొని పోగా దాని పట్టుకునేందుకు ముస్తఫా వెళ్లి ఓ ఇనుపపైపు పట్టుకున్నారు. దీంతో కరెంటు షాక్‌ తగిలి చనిపోయాడు. తండ్రి ముస్తఫాను కాపాడేందుకు ప్రయత్నించిన కొడుకు దాదాపీర్‌ (28) కూడా కరెంటుషాక్‌తో మరణించాడు. తండ్రీకొడుకులు మరణించడంతో మల్లపల్లెలో విషాదం అలముకుంది.

ప్రత్యేక విమానంలో విజయవాకు పవన్ కల్యాణ్

విజయవాడ : ప్రముఖ సినీనటుడు,జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో భేటీ అయ్యేందుకు ప్రత్యేక విమానంలో విజయవాడకు రానున్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి రానున్న పవన్‌కల్యాణ్ నేటి ఉదయం 11 గంటలకు చంద్రబాబును కలవనున్నారు. కాగా చంద్రబాబును కలిసే ముందు పవన్‌కల్యాణ్ తమను కలవాలని రాజధాని రైతులు కోరుతున్నారు. రాజధానిలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితిని పవన్‌కల్యాణ్కు వివరిస్తామని జనసేన కార్యాలయానికి రైతులు సమాచారం పంపించారు.

సచిన్ బ్లాస్టర్స్ లక్ష్యం 263

హైదరాబాద్ : ఆల్‌స్టార్స్ రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన సచిన్స్ బ్లాస్టర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌కు దిగిన వార్న్స్ వారియర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. సచిన్స్ బ్లాస్టర్స్ ముందు విజయలక్ష్యం 263 పరుగులు నిలిపింది. వార్న్స్ వార్నియర్స్ జట్టులో సంగక్కర 70, కలిస్ 45, హెడన్ 30, వాన్ 30, పాటింగ్ 4, సైమండ్స్ 18, రోడ్స్ 18, క్లుసెనర్‌కు 2 వికెట్లు, సెహ్వాగ్, స్వాన్, మెక్‌గ్రాత్‌కు తలో వికెట్ లభించింది.

ఏపీలో బైకెక్కాలంటే ఇకపై హెల్మెట్ తప్పనిసరి

హైదరాబాద్ : ఏపీలో బైకెక్కాలంటే ఇకపై హెల్మెట్ తప్పనిసరి. హెల్మెట్ నిబంధన అమలుపై ఇటీవల కార్యరంగంలోకి దిగిన చంద్రబాబు సర్కారు, పోలీసుల వసూళ్ల దందాతో వెంటనే వెనకడుగు వేయాల్సి వచ్చింది. అయితే రోడ్డు ప్రమాదాల్లో మరణాల నివారణకు కంకణం కట్టుకున్న ఏపీ ప్రభుత్వం రోజుల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని మార్చుకుంది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా హెల్మెట్ నిబంధనను అమల్లోకి తెచ్చింది. 

09:03 - November 12, 2015

నెల్లూరు : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాఈలకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాసిలిలో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. భయాందోళనకు గురైన స్థానికులు నెల్లూరు-ముంబై జాతీయరహదారికి గండికొట్టారు. దీంతో జాతీయరహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.

 

కామెంటరీ బాక్స్ లో వీవీఎస్ లక్ష్మణ్

హైదరాబాద్ : రెండో టీ 20 మ్యాచ్ లో సచిన్ బ్లాస్టర్స్ తుది జట్టులో చోటు కోల్పోయిన వీవీఎస్ లక్ష్మణ్ స్టేడియంలోని కామెంటరీ బాక్స్ లో ప్రత్యక్షమై అభిమానులను ఆశ్చర్యపరిచాడు. మైదనాంలో క్రికెటర్ల గత అనుభావాలను గుర్తు చేస్తూ లక్ష్మన్ చేస్తున్న కామెంటరీ అభిమానుల్ని ఆటకట్టుకుంటోంది.

రోడ్డు ప్రమాదంలో సర్పంచ్‌ల సంఘం నేత మధుసూదన్ మృతి

గుంటూరు : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొసనా మధుసూదన్ రావు(40) మృతిచెందాడు. కాకుమాను మండలం బడుంపాడు వద్ద ఆటోలో వస్తుండగా కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇంటర్‌నెట్ లేకున్నా గూగుల్ మ్యాప్ సేవలు

హైదరాబాద్ : ఇకపై ఇంటర్‌నెట్ లేకున్నా గూగుల్ మ్యాప్ సేవలు లభించనున్నాయి. దీని కోసం గూగుల్ కంపెనీ కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీంతో ఆఫ్‌లైన్ లోనూ నావిగేషన్ సిస్టమ్ పనిచేయనుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఐవోఎస్ ఫోన్‌లో కూడా అందుబాటులోకి వస్తుందని గూగుల్ ప్రకటించింది.

హూస్టన్ స్టేడియంలో బౌండరీల వర్షం

హైదరాబాద్ : సచిన్ బ్లాస్టర్స్, వార్న్ వారియర్స్ జట్ల మధ్య అమెరికాలోని హూస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టీ 20 మ్యాచ్ లో బ్యాట్స్ మెన్లు వరుస బౌండరీలతో అభిమానుల్ని అలరిస్తున్నారు. తొలుత బ్యాటింగ్ చేస్తున్న వార్న్ వారియర్స్ జట్టు 10 ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. ఇప్పటికే ఈ ఇన్నింగ్స్ లో 7-6, 8-4 నమోదు కావడం విశేషం.

హంద్రీనీవాకు నిలిచిన నీటి ప్రవాహం....

కర్నూలు : కృష్ణగిరి మండలం లక్కసాగరం దగ్గర హంద్రీనీవాకు నీటిప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. బుధవారం రాత్రి ఆరు పంపులను అధికారులు ఆపేశారు. దీంతో గురువారం సాయంత్రంలోగా హంద్రీనీవా కాల్వకు పండిన గండి పూడుస్తామని అధికారులు చెప్పారు.

చాక్లెట్ అని టపాసులు తిని... చిన్నారి మృతి

మహారాష్ట్ర: రత్నగిరి జిల్లాలో దీపావళి పండుగ ఓ కుటుంబంలో విషాదం మిగిల్చింది. ఐదేళ్ల అమ్మాయి చాక్లెట్ అనుకుని టపాసులు తినేసి మరణించింది. ఖేడ్ తాలూకాలోని తిసాంగి గ్రామంలో ఉండే దామిని నికమ్ అనే చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండగా అక్కడ కొన్ని టపాసులు పడి ఉన్నాయి. వాటిని చాక్లెట్ అనుకుని పొరపాటున తినేసిందని ఖేడ్ పోలీసులు తెలిపారు. ఇది చూడగానే ఆ బాలిక తల్లి ఆమెను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినా, అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. దీనిపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

అనంతపురం జిల్లా శివరాంపేటలో దారుణం

అనంతపురం: కోడేరు మండలం శివరాంపేటలో దారుణ సంఘటన జరిగింది. గ్రామంలో భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగింది. గొడవను అడ్డుకునేందుకు యత్నించిన వ్యక్తిపై భర్త కొడవలితో దాడి చేశారు. తీవ్ర గాయాలతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భువన గిరిలో అగ్నిప్రమాదం

నల్లగొండ: భువనగిరిలోని కొత్త బస్టాండ్ సమీపంలో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో నాలుగు దుకాణాలు, కారు, బైక్ దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. పటాకుల నుంచి వెలువడ్డ నిప్పురవ్వలు పడి ఈ ప్రమాదం జరిగిందని, అగ్ని ప్రమాదంలో రూ.15లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని ఫైర్ సిబ్బంది వెల్లడించారు.

కారుబోల్తా : ఒకరి మృతి

విశాఖ:జిల్లాలోని రావికమతం దగ్గర వేగంగా వస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేపిస్తున్నారు. అతివేగమే ఈ కారు బోల్తాకు కారణమని పోలీసులు చెప్పారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమల: తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం, నడకదారి భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.

ఆత్మహత్య చేసుకున్న రాజ్యసభ మాజీ సభ్యుడు

చెన్నై : తమిళనాడులోని కోవిల్‌పట్టిలో ఘోరం జరిగింది. రాజ్యసభ సభ్యుడు ఎన్ రాజేంద్రన్ ఆత్మహత్య చేసుకుని తన కారులో విగతజీవిగా కనిపించారు. కోవిల్‌పట్టిలోని బస్టాండుకు చేరువలో ఉన్న ఏడవ నెంబర్ జాతీయ రహదారిపై ఆయన కారు కనిపించింది. పక్కనే రివాల్వర్ కూడా దొరికింది. కుటుంబ కలహాల వల్లే ఆయన ఈ చర్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.

07:56 - November 12, 2015

హైదరాబాద్: చెప్పిన మాటలకు కట్టుబడి పవన్ కల్యాణ్ వ్యవహరించాలని 'న్యూస్ మార్నింగ్' చర్చలో సీపీఎం నేత బాబూరావు అన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గురువారం విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం వంటి అంశాలపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది. అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానం, భూ సమీకరణ అంశాలపై మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై అసంతృప్తితో ఉన్న పవన్‌ కల్యాణ్‌.... ఈ విషయాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లొచ్చిన భావిస్తున్నారు. మరో వైపు తెలంగాణ లో గ్రేటర్ ఎన్నికల అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు నేతలు అభిప్రాయపడ్డారు. ఇవే అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో బాబూరావుతో పాటు టిడిపి నేత విజయకుమార్, కాంగ్రెస్ నేత వకుళాభరణం కృష్ణ మోహన్ పాల్గొన్నారు. వీరి మధ్య ఆసక్తి కరమైన చర్చ నడిచింది. ఆ చర్చను మీరూ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి...

సీఎం చంద్రబాబు తో భేటీ కానున్న పవన్ కల్యాణ్

విజయవాడ: జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్ నేడు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో భేటీ కానున్నారు. నిన్నటిదాకా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ నిన్న మధ్యాహ్నమే చంద్రబాబు అపాయింట్ మెంట్ కోరారు. పవన్ కల్యాణ్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎంఓ అధికారులు నేటి మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబుతో భేటీకి అపాయింట్ మెంట్ ఖరారు చేశారు. 

ముంబై - నెల్లూరు జాతీయ రహదారికి గండి కొట్టిన గ్రామస్థులు

నెల్లూరు: వర్షాల కారణంగా ఆత్మకూరు మండలంలోని వాసిలి, కొలగట్ల గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరింది. వాసిలి గ్రామస్థులు ముంబై - నెల్లూరు జాతీయ రహదారికి పొక్లెయిన్ తో గండి కొట్టారు. దీంతో జాతీయ రహదారిపై రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గూడూరు డివిజన్ లో కైవల్యానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

07:01 - November 12, 2015

హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రకరకాల హామీలివ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని గాలికొదిలేయడం చాలాపార్టీలకు అలవాటు. తెలంగాణలో ఇదే చరిత్ర పునరావృతం అవుతోంది. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న టీఆర్‌ఎస్‌ ఎన్నికల వాగ్ధానం నామమాత్రంగా కూడా అమలుకావడం లేదు.

భూమి లేకపోతే బతుకు దుర్భరం.......

పల్లె సీమల్లో భూమే జీవనాధారం. అది లేకపోతే గౌరత లేదు. మర్యాద లేదు. ఎంత భూమి వుంటే అంత విలువ. అంత పవర్‌. గ్రామాల్లో భూమి చుట్టూ పవర్‌ తిరుగుతుంది. సెంటు భూమిలేనివారు కూడా సర్పంచ్‌ కావొచ్చునేమో కానీ, అసలైన అధికారం అనుభవించేది మాత్రం భూమి వున్నవాడే. తనకున్న భూ విస్తీర్ణాన్ని బట్టి అధికార పరిధి , పరపతి విస్తరిస్తూ వుంటాయి. అదీ భూమికున్న శక్తి.

రెండు మూడెకరాల భూమిని నమ్ముకుని....

అఫ్‌కోర్స్. రెండు మూడెకరాల భూమిని నమ్ముకుని బాగుపడ్డవారెవ్వరూ లేకపోవచ్చునేమో కానీ, అది కూడా లేకపోతే బతకడం మరీ దుర్భరం. భూమిలేనివారికి సామాజిక మర్యాద దక్కదు. అందుకే భూమి కోసం ప్రతి ఒక్కరూ పరితపిస్తారు. తనకు భూమి లేకపోయినా, ఇతరుల భూమిని కౌలుకి తీసుకునైనా వ్యవసాయం చేస్తారు. సాగు చేస్తే తన సామాజిక హోదా పెరుగుతుందన్న చిన్న ఆశతో నష్టమొచ్చినా, కష్టమొచ్చినా సరే లెక్క చేయరు. లక్ష్య పెట్టరు. తలతాకట్టు పెట్టైనా, ప్రాణాలు ఫణంగా పెట్టైనా కౌలు రైతులు వ్యవసాయం చేస్తారు. ఇలా కౌలు చేసేవారిలో అత్యధికులు దళితులు, బలహీనవర్గాలవారే . వ్యవసాయంలో నష్టమొచ్చి, అప్పులపాలై ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్న అభాగ్యులూ వీరే.

వ్యవసాయమే జీవనాధారంగా......

వ్యవసాయమే జీవనాధారంగా సాగే గ్రామసీమల్లో భూమి వున్న వారికంటే లేనివారే ఎక్కువ. అసలు భూమిలేనివారిలో అత్యధికులు దళితులే. సెంటు భూమి కూడా లేని కటిక పేదల్లో 80శాతం మంది దళితులుంటే, 52శాతం మంది ఇతర కులాలవారు వుంటారని నేషనల్‌ శాంపిల్‌ సర్వే వెల్లడించింది. ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇస్తామన్నది టీఆర్‌ఎస్‌ ఎన్నికల వాగ్ధానం. కానీ , అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఈ హామీ అమలు కాలేదు. ముచ్చటగా మూడు వేల ఎకరాలు కూడా పంచలేదంటే ఎంత చిత్తశుద్ధి ప్రదర్శించారో అర్ధమవుతూనే వుంది. ఈ ఏడాదిన్నర కాలంలో 1112 మందికి 2, 973 ఎకరాల భూమిని పంచినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలో సెంటుభూమి లేని దళిత కుటుంబాలు 3 లక్షలకు పైగా వున్నాయని అధికారులే చెబుతున్నారు. భూ పంపిణీ వ్యవహారం ఇలా నత్తనడకన సాగుతుంటే 3 లక్షల కుటుంబాలకు భూమి ఇచ్చేదెప్పుడు? 

06:58 - November 12, 2015

హైదరాబాద్ : దళితులకు మూడు ఎకరాల భూమి పథకానికి తెలంగాణ ప్రభుత్వం మంగళం పాడబోతున్నదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇలాంటి అనుమానమే కలుగుతోంది. దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోంది? ఇప్పటికి ఎంత భూమి పంచారు? భూ పంపిణీలో ఎదురవుతున్న సమస్యలేమిటి? క్షేత్రస్థాయి వాస్తవాలేమిటిచర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలంగాణ కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:55 - November 12, 2015

ఢిల్లీ: బీహార్‌ ఎన్నికలు ఇచ్చిన షాక్‌ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీ తిరిగి విదేశీ పర్యటనలకు సిద్ధమయ్యారు. బ్రిటన్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలువురు నేతలు, అధికారులతో సమావేశం కానున్నారు. ఆయన ప్రధాని అయిన తర్వాత ఇంగ్లాండ్‌లో జరిగే మొట్టమొదటి ద్వైపాక్షిక సమావేశమిది.

తొమ్మిది సంవత్సరాల తర్వాత......

తొమ్మిది సంవత్సరాల తర్వాత భారత ప్రధాని ఇంగ్లాండ్‌తో ద్వైపాక్షిక జరిగే సమావేశాలకు వెళ్లడం ఇదే ప్రథమం. 2006లో మన్మోహన్‌సింగ్‌ బ్రిటన్‌లో పర్యటించారు. పెట్టుబడులు, రక్షణ రంగాలకు సంబంధించి మోడీ బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌తో సమావేశమవుతారు. సుమారు 18 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. లండన్‌లో పలువురు ప్రముఖులతోనూ మోడీ రౌండ్ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు. ఇంగ్లాండ్‌లోని ఎన్‌ఆర్‌ఐలతో సమావేశమై భారత్‌లో పెట్టుబడులు పెట్టమని స్వాగతించే అవకాశముంది.

రక్షణ పరంగా సాంప్రదాయకంగా.....

ఇరుదేశాల మధ్య రక్షణ పరంగా సాంప్రదాయకంగా కొనసాగుతున్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తామని, తయారీరంగంపై ప్రధానంగా దృష్టిపెడతామని మోడీ ఇప్పటికే ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు. జి-7 కంట్రీస్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న, బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం ఇంగ్లాండని వ్యాఖ్యానించారు. తన పర్యటన ద్వారా ఆర్థిక వ్యాపార రంగాల్లో ఇంగ్లాండ్‌తో బంధం బలోపేతమయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు.

మోడీ బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రసంగం....

ఇదే పర్యటనలో మోడీ బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు. ఒక ఇండియన్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ ఇంగ్లాండ్ చట్టసభలో ప్రసంగించడం ఇదే ప్రథమమవుతుందని విదేశీ కార్యదర్శి ఎస్‌.జైశంకర్‌ అభిప్రాయపడ్డారు. క్వీన్‌ ఎలిజెబెత్‌తో బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో మోడీ విందులో పాల్గొంటారు. ఆ దేశ పార్లమెంట్ వద్దనున్న మహాత్మాగాంధి విగ్రహానికి ప్రధాని నివాళులర్పించనున్నారు. దీనితోపాటు లండన్‌లో అంబేద్కర్‌ నివసించిన ఇంటిని మోడీ సందర్శిస్తారు. బ్రిటన్‌ పర్యటన అనంతరం ప్రధాని టర్కీలో జరిగే జి-20 సమావేశాలకు వెళ్తారు. నవంబర్‌ 14న ఆ సమావేశాల్లో పాల్గొంటారు. మొత్తంగా ప్రధాని ఇంగ్లాండ్‌ పర్యటనతో దేశానికి ఏరకమైన ప్రయోజనాలు కలగబోతున్నాయన్నది వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

06:52 - November 12, 2015

విజయవాడ : ప్రభుత్వ ప‌ధకాల‌ను ప్రజ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ళేందుకు టిడిపి వ్యూహ‌లు ర‌చిస్తోంది. ఏపీలో అధికారంలోకి వ‌చ్చి ఏడాదిన్నర పూర్తయినా ప్రభుత్వ ప‌ధ‌కాల‌పై ప్రచారం చేసుకోలేక‌పోయాం అనే భావ‌న‌లో టిడిపి హైకమాండ్ ఉంది. రుణ‌మాఫీ, ఫించ‌న్లు, ఇలా సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ప్రజ‌ల్లోకి తీసుకెళ్లి పాజిటీవ్ మూడ్‌ను తీసుకువ‌చ్చేందుకు టిడిపి స‌మాయాత్తమ‌వుతోంది. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా ప‌ధకాలు అమ‌లు చేస్తున్నాం అని చెప్పుకునేందుకు ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేస్తున్నారు టిడిపి ఛీప్ చంద్రబాబు.

టిడిపి అధికార ప‌గ్గాలు చేప‌ట్టి ఏడాదిన్నర పూర్తి......

ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి అధికార ప‌గ్గాలు చేప‌ట్టి ఏడాదిన్నర పూర్తయింది. ఈ సంవ‌త్సర‌న్నర కాలంలో రుణ‌మాఫీ, డ్వాక్వా రుణ‌మాఫీ, ఐదు రెట్ల ఫించ‌న్ పెంపు, 24 గంట‌ల నిరంత‌ర విద్యుత్ ఇలా ప్రభుత్వ ప‌ధ‌కాల‌ను తీసుకువ‌చ్చింది. అయితే ప్రభుత్వ పధ‌కాలను ప్రచారం చేసుకోవ‌డంలో మాత్రం విఫ‌లం అయ్యాం అనే భావ‌న‌లో చంద్రబాబు ఉన్నారు. దీంతో ఈ నెల 13నుంచి రెండు రోజుల పాటు తిరుప‌తిలో మేథోమ‌థన స‌ద‌స్సు ఏర్పాటు చేస్తున్నారు. ఈ స‌ద‌స్సులో క్యాడర్‌కు, నేత‌ల‌కు దిశానిర్దేశం చేయాల‌ని టిడిపి భావిస్తోంది. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా .. టిడిపి ఇచ్చిన హ‌మీల‌ను ఒక్కొక్కటిగా అమ‌లు చేన్నన్న తీరును ప్రజ‌ల‌కు వివ‌రించాల‌ని టిడిపి భావిస్తోంది. ప్రచారంలో వెన‌క‌బ‌డ్డాం అనే ఆలోచ‌న‌లో ఉన్న టిడిపి హైకమాండ్ మేథోమ‌థన స‌ద‌స్సు ద్వారా రాష్ట్రక‌మిటీల‌కు, కార్యవ‌ర్గానికి, క్యాడ‌ర్‌కు దిశానిర్దేశం చేసి ప్రజ‌ల్లో చైత‌న్యం తీసుకురావాలని భావిస్తోంది.

జ‌న‌చైత‌న్య యాత్రల పేరుతో ప్రజ‌ల్లోకి ....

ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కు జ‌న‌చైత‌న్య యాత్రల పేరుతో ప్రజ‌ల్లోకి వెళ్ళనుంది టిడిపి. ఈ కార్యక్రమంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వెళ్లి ప్రభుత్వ ప‌ధ‌కాల‌ను ప్రజ‌ల‌కు వివ‌రించ‌డంతో పాటు వారి స‌మ‌స్యల‌ను అడిగి తెలుసుకోనున్నారు. ప్రజల స‌మ‌స్యల‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకువ‌చ్చి వాటికి ప‌రిష్కారం చూపేలా ప్రయ‌త్నించనున్నారు.

నామినేటేడ్ ప‌ద‌వులు ఏవీ భ‌ర్తీ కాక‌పోవ‌డంతో ....

దీంతో పాటు టిడిపి క్యాడ‌ర్‌కూడా కొంత అసంతృప్తిగా ఉంది. ఇప్పటివ‌ర‌కు నామినేటేడ్ ప‌ద‌వులు ఏవీ భ‌ర్తీ కాక‌పోవ‌డంతో క్యాడ‌ర్ కూడా తీవ్ర నిరాశ‌లో ఉంది. త‌ద్వారా కూడా ప్రభుత్వ పధకాలను ప్రచారం చేసుకోవ‌డంలో న‌ష్టపోయాం అనే భావ‌న‌లో టిడిపి హైక‌మాండ్ ఉంది. క్యాడ‌ర్‌ను యాక్టీవ్ చేయాలంటే వీలైనంత త్వర‌గా నామినేటేడ్ ప‌ద‌వులు అన్నీ భ‌ర్తీ చేయాల‌ని యోచిస్తున్నారు. ఇలా నామినేటేడ్ ప‌ద‌వులు భ‌ర్తీ చేయ‌డం ద్వారా క్యాడ‌ర్‌ యాక్టీవ్ అయ్యి ప్రభుత్వ ప‌ధ‌కాల‌ను ప్రజ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లి ప్రచారం క‌ల్పిస్తార‌నే భావ‌న‌లో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు తిరుప‌తిలో జ‌రిగే మేథోమ‌థన స‌ద‌స్సులో క్యాడ‌ర్‌కు దిశానిర్దేశం చేసి పార్టీని యాక్టీవ్ చేయాల‌ని చంద్రబాబు భావిస్తున్నారు. తిరుపతిలో చంద్రబాబు అధ్యక్షతన జరిగే మేథోమ‌థన స‌ద‌స్సుకి ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియ‌ర్ నేత‌లు, టీడీపీ రాష్ట్ర కార్యవ‌ర్గం అంతా హ‌జరుకానుంది. 

06:50 - November 12, 2015

హైదరాబాద్ : సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడమే కాదు ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని సైతం తన శక్తితో హడలెత్తించగలిగిన పార్టీ టిడిపి. క్రమశిక్షణకు మారు పేరుగా ఉండే పార్టీ అది. అటువంటి ఘన చరిత్ర కలిగిన ఆ పార్టీ వలస నాయకుల దెబ్బకు ఖంగుతింటోంది. ఒక్కోసారి వాళ్లు అధినేత చంద్రబాబుని సైతం విమర్శల్లోకి లాగుతున్నారు. వాళ్ల కామెంట్స్‌ విని తెలుగు తమ్ముళ్లు షాక్‌ తింటున్నారు. అధినేత చూసుకుంటారులే అనే ఉద్దేశంతో నోరు మెదపడం లేదు. బ‌డ్జెట్ సైజు పత్రికలకు లీకైందని ఎన్టీఆర్ హయంలో ఏకంగా మంత్రి వర్గాన్ని రద్దు చేసిన పార్టీ టిడిపి. ఆ చర్యను దేశం యావత్తూ చర్చించింది. టిడిపి క్రమశిక్షణకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందనేదానికి ఇదో ఉదాహరణ.

కాంగ్రెస్ నుండి టిడిపిలోకి...

2014 సాధార‌ణ ఎన్నిక‌లకు ముందు కాంగ్రెస్‌లో భవిష్యత్‌లేదని ఊహించి కొందరు నేతలు టిడిపిలోకి జంపయ్యారు. టిడిపి తరపున పోటీ చేసి గెలుపొందారు. అలా కాంగ్రెస్ నుండి వ‌చ్చిన నేత‌లంతా ఈమధ్య వివిధ రకాల కామెంట్స్‌ చేస్తూ ఇప్పుడు తెలుగుదేశానికి తలనొప్పి తెప్పిన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీల విషయంలో మిత్రపక్షం బిజెపిని విమర్శించకుండా టిడిపి సంయమనంతో వ్యవహరిస్తోంది. అయితే అనంత‌పురం టిడిపి ఎంపి జెసి దివాక‌ర్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎలాగైతే ఆ పార్టీ హైక‌మాండ్‌ను విమ‌ర్శించేవారో సేమ్‌ అదేరీతిలో నేడు టిడిపిలోనూ వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పటికే జెసికి సంయమనం పాటించాలని చంద్రబాబు సూచించినా ఆయన తీరుమారలేదు. ఇటీవ‌ల టిడిపి యువ‌నేత లోకేష్ త‌న‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా గంట‌కు పైగా వెయిట్ చేయించార‌ని జెసి దివాకర్‌రెడ్డి మీడియా ముందు అసంతృప్తి వెల్లగక్కారు. నిన్నటికి నిన్న ఎపికి ప్రత్యేకహోదా రాదని ఇప్పటికైనా ప్రధాని మోడీ ప్యాకేజీ ప్రకటించకపోతే నష్టం తప్పదని తేల్చేశారు.

మిత్రపక్షం బిజెపి తీరును ఎండగడుతోన్న రాయపాటి...

గుంటూరు ఎంపి రాయపాటి సాంబ‌శివ‌రావు సైతం మిత్రపక్షం బిజెపి తీరును ఎండగట్టారు. ఏపిలో ఇచ్చిన హమీలు నిలబెట్టకోని బిజెపి బీహార్‌లో ప్యాకేజి ప్రకటించినా అక్కడి ప్రజలు నమ్మలేదన్నారు. రాజధాని శంఖుస్థాపనకు వచ్చిన మోడీ ఏపి ప్రజల నోట్లో మట్టి కొట్టినందునే ఆయనకు బీహార్ ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయన్నారు. సొంతపార్టీ టిడిపిపైనా ఆయన కామెంట్లు చేశారు. క‌ర్నూలు జిల్లాకు చెందిన టిజి వెంక‌టేష్ కూడా అప్పుడ‌ప్పుడు పార్టీపై తీరుపై సన్నాయి నొక్కులు నొక్కుతన్నారు.

చంద్రబాబు పై విమర్శలు చేస్తున్న బిజెపి నేతలు..

బిజెపిలో చేరిన మాజీ కాంగ్రెస్ నాయ‌కులు కూడా మిత్రపక్షం అయిన టిడిపిపైనా సియం చంద్రబాబుపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. కావూరి సాంబ‌శివ‌రావు, క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌, పురంధేశ్వరి వంటి సీనియ‌ర్లంతా సైకిల్‌కు ముళ్లు గుచ్చుతున్నారు. అయితే వీరి వ్యవహార శైలిలో మార్పురావాల్సి ఉందని టిడిపి నేతలు అంటున్నారు. వలస నేతల కామెంట్స్‌ దెబ్బకు టిడిపి నేతలు బిత్తరపోతున్నారు. ఇప్పటికైనా వీరిని కట్టడి చేయకపోతే పార్టీకి ఇబ్బందులు తప్పవనేది వారి అభిప్రాయం.

06:45 - November 12, 2015

హైదరాబాద్ : పర్యాటకరంగంలో పెట్టుబడులకు తెలంగాణ అనువైన రాష్ట్రమని ఆ రాష్ట్ర టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం అన్నారు. తెలంగాణ టూరిజం శాఖ, తెలంగాణా ఎన్నారై ఫోరమ్ సంయుక్తంగా లండన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణా టూరిజం అభివృద్ది - ఎన్నారైల పాత్ర అనే అంశంపై ఈ సమావేశం జరిగింది. ఫోరమ్ ప్రతినిధులు, స్థానిక ట్రావెల్ ఏజెంట్లు, తెలంగాణ ఎన్‌ఆర్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని బుర్ర వెంకటేశం అన్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడులను రాబట్టేందుకు తెలంగాణ ఎన్నారై ఫోరం సహకారం తీసుకుంటామని ఆయన చెప్పారు. 

06:44 - November 12, 2015

హైదరాబాద్ : ప్రత్యేక హోదాపై పోరాటాన్ని ఉధృతం చేయాలని వైసీపీ భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి మరోసారి పోరాటం చేపట్టాలని నిర్ణయించింది. టీడీపీ, బీజేపీల వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలకు ఆ పార్టీ రూపకల్పన చేస్తోంది.

బిహార్‌లో బీజేపీ ఓటమి వైసీపీకి అస్త్రంగా .....

బిహార్‌లో బీజేపీ ఓటమి వైసీపీకి అస్త్రంగా మారింది. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మోదీ ప్రకటించినా...అక్కడి ప్రజలు పట్టించుకోలేదు. కమలాన్ని కనికరించలేదు. ఆ పార్టీ అనుసరించిన ప్యాకేజీ పాచిక పారలేదు. బిహార్‌ సీఎం నితీష్‌ కూడా ప్యాకేజీని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. స్పెషల్‌ స్టేటస్‌ మాత్రమే కావాలని పట్టుపడుతున్నారు. ఇప్పుడు ఈ అంశాన్నే ఏపీలో హ్యాండిల్‌ చేయాలని వైసీపీ భావిస్తోంది. ప్యాకేజీ కాదు కావాల్సింది..స్టేటస్‌ ముఖ్యమంటూ మరోసారి ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు .....

ప్రత్యేక హోదాపై వైసీపీ ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు నిర్వహించింది. పార్టీ అధినేత జగన్‌ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టారు. బిహార్‌లో బిజేపీ ఓటమి తర్వాత మరోసారి ఈ ఉద్యమాన్ని చేపట్టాలని వైసీపీ భావిస్తోంది. ప్యాకేజీని బిహార్‌ ప్రజలు తిరస్కరించారని...ఏపీలోనూ అదే పరిస్థితి ఉందని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ప్యాకేజీ కన్నా ప్రత్యేక హోదాపై మిన్న అని నినదిస్తోంది. చంద్రబాబు ప్యాకేజీని మాత్రమే ప్రస్తావిస్తున్నారని...హోదా గురించి అడగడం లేదని ఆరోపిస్తున్న వైసీపీ, టీడీపీ, బిజేపీల వైఖరిని ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది. హోదా విషయంలో కమలనాథులు అనుసరిస్తున్న విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది.

ప్రత్యేకహోదాపై మరోసారి మోదీని కలవనున్న జగన్...

ప్రత్యేకహోదాపై మరోసారి మోదీని కలవాలని జగన్‌ యోచిస్తున్నారని తెలుస్తోంది. 67 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లి.. ప్రభుత్వంలోని పెద్దలను కలవాలని భావిస్తున్నారని సమాచారం. మొత్తానికి బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వనందునే అక్కడి ప్రజలు ఓడించారని భావిస్తున్న వైసీపీ..ఈ ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లాలని వ్యూహాలు రచిస్తోంది. 

06:39 - November 12, 2015

ఢిల్లీ : దేశవ్యాప్తంగా దీపావళి పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. బాణసంచాల వెలుగులు, మతాబుల మోతలతో సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్నా పెద్దా తేడాలేకుండా అందరూ ఈ దివ్వెల పండుగను ఆనందంగా జరుపుకున్నారు. పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇళ్లు, దుకాణాల ముందు ప్రమిదలువెలుగులు ముచ్చటగొలిపాయి. దేవాలయాల్లో దీపాలు వెలిగించి దీపాల పండగను జరుపుకున్నారు. పలు నగరరాల్లోని ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు విద్యుత్తు కాంతులతో ధగదఘలాడుతూ దర్శనమిచ్చాయి. విద్యుత్తు కాంతులతో సరికొత్త శోభ సంతరించుకున్నాయి.

భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో .....

భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో దీపావళి పండుగ వాతావరణం కనిపించింది. గత కొంతకాలంగా కాల్పుల మోతలతో దద్దరిల్లిన సరిహద్దు ప్రాంతాలు దీపావళి పండుగ శోభను సంతరించుకున్నాయి. సరిహద్దుల్లో భారత్‌, పాక్‌ సైనికులు మిఠాయిలు పంచుకున్నారు. ప్రధానమంత్రి మోదీ సరిహద్దు సైనికులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అమృత్‌సర్‌లోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ దగ్గర ఆయన జవాన్లతో ముచ్చటించారు. వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

రాజ్ భవన్ లో దీపావళి వేడుకలు......

రాజ్ భవన్ లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.. పండుగ సంధర్బంగా ప్రజాధర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు గవర్నర్ దంపతులు... రాష్ట్రప్రజల్ని కలుసుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటున్న దీపావళి... రాష్ట్ర ప్రజలందరికీ ఆనందోత్సాహాలు అందించాలన్నారు గవర్నర్ నరసింహన్.. ఇర రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు కలిసిమెలిసి ముందుకు సాగాలనీ ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసన మండలి చైర్మన్ చక్రపాణి, టిటిడిపి నేతలు ఎల్ రమణ, రావుల.. ఉన్నతాధికారులు ప్రజలు పాల్గొన్నారు.

శ్రీకాకుళంలో కళ్యాణ్‌ అనురాగ్‌ నిలయం ఆధ్వర్యంలో.....

శ్రీకాకుళంలో కళ్యాణ్‌ అనురాగ్‌ నిలయం ఆధ్వర్యంలో అనాధ పిల్లలకు దీపావళి సంబరాలు నిర్వహించారు. పిల్లలతో కేక్‌ కట్‌ చేయించి.. టపాసులు అందజేశారు. చిన్నారులు ఎంతో సంతోషంగా టపాసులు కాల్చారు. విజయవాడలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ రోడ్లపైకి చేరుకొని బాణసంచా కాల్చి సందడి చేశారు. మహిళలు, చిన్నారులు తారాజువ్వలను వెలిగించి కేరింతలు కొట్టారు. పాతబస్తీ, సత్యనారాయణపురం, పటమటతో పాటు నగర వ్యాప్తంగా టపాసుల మోత మోగింది. వ్యాపారులు తమ షాపులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పూజలు నిర్వహించారు. బాణసంచా కాలుస్తూ సందడిచేశారు. 

06:35 - November 12, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. పిల్లలు,పెద్దలు పండగను ఘనంగా జరుపుకున్నారు. కాని అక్కడక్కడా అపశృతులు చోటుచేసుకున్నాయి. చిన్నారులు గాయపడడం, అగ్నిప్రమాదాలు సంభవించడం వంటి ఘటనలు జరిగాయి.

దీపావళి పండుగ చిన్నారులకు...

దీపావళి పండుగ చిన్నారులకు మహదానందం కలిగిస్తుంది. చిచ్చుబుడ్డుల కాంతుల వెలుగులో వాళ్లు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. టపాసులు పేల్చేస్తూ..అమ్మ చేసిన కమ్మని వంటకాలను టేస్ట్‌ చేస్తూ.. ఇంటిల్లిపాదిని ఆనందోత్సహాలతో నింపేస్తారు. ఈ సందడిలో పిల్లలతో పెద్దలు కూడా పిల్లలయిపోతారు. వారితో ఈక్వల్‌గా ఎంజాయ్‌ చేస్తారు. కాని అలా సందడి..సందడిగా గడిపేస్తున్న సమయంలోనే ఊహించని సంఘటనలు జరిగిపోతాయి. కొద్ది పాటి నిర్లక్ష్యం కూడా వాటికి తోడవుతుంది. సంతోషాలు నింపాల్సిన పండగ రోజు విషాదానికి కారణమవుతుంది. ఈ దీపావళి పండగ రోజున కూడా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా అనుకోని ఘటనలు జరిగాయి. పలు చోట్ల చిన్నారులు గాయపడ్డారు. అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

దీపావళి వేడుకల్లో అపశ్రుతి .....

హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పలు చోట్ల చిన్నారులు గాయపడ్డారు. టపాసులు కాలుస్తుండగా నిప్పురవ్వలు కంటిలో పడడంతో కంటి సమస్యలు తలెత్తాయి. చికిత్స కోసం పదిమంది చిన్నారులను నగరంలోని సరోజనీ దేవీ కంటి ఆస్పత్రికి తరలించారు.

పదిచోట్ల అగ్ని ప్రమాదాలు....

హైదరాబాద్‌లో పదిచోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ దగ్గర బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షాపులోనూ, అబిడ్స్‌ లోని చర్మాస్‌ దగ్గర అగ్ని ప్రమాదాలు జరిగాయి. మహంకాళి స్ట్రీట్‌ సర్కిల్‌లోని వాణిజ్య పన్నుల శాఖ అధికారి కార్యాలయంలో జరిగిన ఫైర్‌ యాక్సిడెంట్‌లో కొన్ని ఫైళ్లు కాలిపోయాయి. వనస్థలిపురం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఆరు తోపుడుబళ్లు దగ్ధమయ్యాయి.

విజయవాడలోనూ...

విజయవాడ నగరంలోని మారుతీనగర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ ప్రైవేటు స్కూలుకు చెందిన మూడు బస్సులు దగ్ధమయ్యాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న కొంతమంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. దీపావళి మందుగుండు సామాగ్రి పేలడంతోనే ఈ ప్రమాదం జరగవచ్చని భావిస్తున్నారు.

ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలో....

విజయవాడలోనే సత్యనారాయణపురంలో ఆంధ్రాబ్యాంకు ఏటీఏంలో అగ్నిప్రమాదం జరిగింది. ఏటీఎం కౌంటర్‌ పాక్షికంగా దగ్ధం అయ్యింది. ఏటీఎంలోని నగదు సురక్షితంగానే ఉంది. బాణసంచా పేలుడు వల్లే ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. 

దీపావళి వేడుకల్లో అపశృతులు...

హైదరాబాద్ : దీపావళి వేడుకల్లో అపశృతులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లో టపాసులు కాలుస్తుండగా పలువురు చిన్నారులకు గాయాలయ్యాయి.నిప్పు రవ్వలు కంటిలో పడటంతో 10 మందికి గాయాలయ్యాయి.వీరు సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నగరంలో పది చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. వనస్థలిపురంలో ఏడు గుడిసెలు దగ్ధమయ్యాయి. విజయవాడలో మూడు స్కూలు బస్సులు దగ్ధమయ్యాయి.

06:29 - November 12, 2015

హైదరాబాద్ : దీపావళి వేడుకల్లో అపశృతులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లో టపాసులు కాలుస్తుండగా పలువురు చిన్నారులకు గాయాలయ్యాయి.నిప్పు రవ్వలు కంటిలో పడటంతో 10 మందికి గాయాలయ్యాయి.వీరు సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నగరంలో పది చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. వనస్థలిపురంలో ఏడు గుడిసెలు దగ్ధమయ్యాయి. విజయవాడలో మూడు స్కూలు బస్సులు దగ్ధమయ్యాయి.

వాగులో చిక్కుకున్న నలుగురు యువకులు..

నెల్లూరు: రీవాను తుపానుతో నెల్లూరు జిల్లాలో జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాజాగా పొట్టేపాలెం వద్ద వాగులో నలుగురు గ్రామస్థులు చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని అధికారులను బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారిని ఎలాగైనా రక్షించాలని అధికారులకు ఆదేశించారు.

Don't Miss