Activities calendar

13 November 2015

డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీ..

హైదరాబాద్‌ : తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలో వరుస సెంచరీలతో న్యూజిలాండ్ పై విరుచుకుపడ్డ ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి చెలరేగిపోయాడు. శుక్రవారం ఆరంభమైన రెండో టెస్టులో వార్నర్(244 బ్యాటింగ్బీ 272 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లు) డబుల్ సెంచరీతో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వార్నర్ కు జతగా తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టిన ఉస్మాన్ ఖాజా( 121) మరో శతకం నమోదు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 416 పరుగులు చేసింది.

 

ముగ్గురు టిడిపి నేతలకు ఆరు నెలల జైలు శిక్ష

హైదరాబాద్‌ : ఒక పోలీసు అధికారి విధులకు ఆటంకం కల్గించిన కేసులో విశాఖ పట్టణం జిల్లాకు చెందిన టీడీపీ నాయకులకు అనకాపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో పరవాడ టీడీపీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు, టీడీపీ నాయకులు వెంకట్రావు, రవికుమార్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అనకాపల్లి 5వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం ఈ మేరకు తీర్పు ప్రకటించింది. కాగా, 2006 వ సంవత్సరంలో ఒక పోలీసు అధికారి విధులకు ఈ ముగ్గురు నాయకులు ఆటంకం కల్గించారని గతంలో కేసు నమోదు చేశారు.

 

22:01 - November 13, 2015

హన్మకొండ : వరంగల్ ఎన్నికల ప్రచారంలో వామపక్షలు స్పీడ్ ను పెంచాయి. ఓటర్లను ఆకర్షించేందుకు.. ఓవైపు ర్యాలీలు.. మరోవైపు.. ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. దీంతో పాటే.. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలను కూడా నిర్వహిస్తున్నారు. అందరి కంటే ముందే అభ్యర్థిని ప్రకటించి అందరి దృష్టినీ ఆకర్షించిన వామపక్ష పార్టీలు.. ఇప్పుడు ప్రచారాన్నీ మరింత ముమ్మరం చేశాయి. పది వామపక్ష పార్టీలూ.. తమ మద్దతుతో బరిలో నిలిచిన గాలి వినోద్‌కుమార్‌ గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ స్థాయి సమావేశాలను పూర్తి చేసి.. మండల స్థాయి సభలను నిర్వహిస్తున్నారు.
అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు
వామపక్షాలు మద్దతుతో పోటీలో ఉన్న గాలి వినోద్ కుమార్.. అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కార్మికులు, కర్షకుల చెంతకు వెళ్లి వారి సాదక బాధకాలను తెలుసుకుంటున్నారు. దీంతో పాటు సామాజిక సంఘాలు, కుల సంఘాలు నిర్వహిస్తున్న సదస్సులకూ హాజరవుతున్నారు. తనను గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి చేపట్టబోయేదీ సదస్సుల్లో వివరిస్తున్నారు.
రోడ్ షోలు
వరంగల్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వామపక్షాలు... రోడ్ షోలూ నిర్వహిస్తున్నాయి. ఇంటింటికీ తిరిగి ఓటర్ల మద్దతునూ కూడగడుతున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కేసీఆర్‌ తీరునూ ఎండగడుతూ.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.. లెఫ్ట్‌ నేతలు. అన్ని వర్గాలనూ కలుపుకు పోతున్న వామపక్షాల అభ్యర్థి ప్రచార శైలి.. ఇతర పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది.

 

21:55 - November 13, 2015

ఢిల్లీ : ఎప్పుడూ సంయమనం పాటించే క్రికెటర్‌ సచిన్ టెండుల్కర్ బ్రిటీష్ ఎయిర్‌వేస్ తీరుతో అసహనానికి గురయ్యారు. ఫ్యామిలీతో ఫ్లయిట్ ఎక్కిన సచిన్‌కు చేదు అనుభవం ఎదురైంది. కొందరు కుటుంబసభ్యులకు ఫ్లయిట్లో సీట్లు దొరకలేదు. అదొక్కటే కాదు లగేజీ కూడా మిస్సయింది. అసలే లగేజీ రాలేదన్న టెన్షన్‌తో ఉంటే- సచిన్ ఎవరు ? పూర్తి పేరు ఏంటి ? అడ్రస్ ఎక్కడ ? బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ అధికారులు ప్రశ్నలతో మాస్టర్ బ్లాస్టర్న్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో చిర్రెత్తిపోయి సచిన్- ట్విట్టర్‌లో బ్రిటీష్ ఎయిర్‌వేస్‌పై విరుచుకుపడ్డారు. ఫ్లయిట్‌లో సీట్లు ఖాళీగా ఉన్న వెయిటింగ్ లిస్ట్ టికెట్లను కన్ఫార్మ్ చేయలేదని, పూర్తి అడ్రస్ ఉన్న లగేజీ కూడా తప్పుడు అడ్రస్‌కు చేర్చారని సచిన్‌ ట్విట్టర్‌లో ఆగ్రహించాడు. పట్టింపులేనట్టుగా బ్రిటీష్ ఎయిర్‌వేస్ వ్యవహరించిందని ట్వీట్ చేశాడు. సచిన్ ట్వీట్‌కు సారీ చెప్పిన ఎయిర్‌వేస్ సంస్థ.. బ్యాగేజ్ రిఫరెన్స్ నెంబర్, పూర్తి పేరు, అడ్రస్ పంపాలంటూ రీట్వీట్ చేసింది.

 

 

21:51 - November 13, 2015

పిల్లలు మన ఆశల అకాశాలు. పిల్లలు మన ఊహాల . పిల్లలు మన కళల పరిమళాలు. కురిసే వాన, మెరిసే మెరుపు. విరిసే పువ్వు. తమ సొంతమేనని మురిసిపోతారు. వారు మన రేపేటి జ్ఞాపకాలు. మన తియ్యటి జ్ఞాపకాలు. ఆ పసిమొగ్గలను కాపాడుకునే బాధ్యత పెద్దలందరిది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:45 - November 13, 2015

విశాఖ :  మళ్లీ బాక్సైట్ కలకలం మొదలైంది. తాను ప్రతిపక్షంలో వున్నప్పుడు బాక్సైట్ తవ్వకాలను తీవ్ర స్వరంతో వ్యతిరేకించిన చంద్రబాబునాయుడే ఇప్పుడు రూటు మార్చారు. మరోవైపు బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ ఇప్పుడు నిరసన స్వరం వినిపిస్తున్నారు.
వైఎస్‌ హయాంలో గ్రీన్‌ సిగ్నల్‌
విశాఖ మన్యం బాక్సైట్ నిక్షేపాల గని. చింతపల్లి, అరకు, గాలికొండ, సప్పర్ల, కొయ్యూరు, జర్రెల ఇదంతా బాక్సైట్ నిక్షేపాలున్న ప్రాంతం. బ్రిటీషోళ్ల కాలంలోనే ఇక్కడ ఈ నిక్షేపాలున్నట్టు గుర్తించారు. వీటిని జుర్రుకోవాలని నాటి తెల్లదొరలు ప్రయత్నించారు. ఏజెన్సీలో జీవ వైవిధ్యం దెబ్బతింటుందన్న కారణంతో కొంత, దానిని తవ్వి మైదాన ప్రాంతానికి తరలించడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నదన్న భావనతో మరికొంత ఆనాటి ఆంగ్లేయులు ఆ ప్రయత్నం విరమించుకున్నారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో బాక్సైట్ తవ్వకాల అంశాన్ని నాటి టీడీపీ ప్రభుత్వం తెర మీదకు తెచ్చింది. అయితే, బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా సమతా స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రావడంతో తెర మీదకు
అయితే ఇటు రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రావడంతో మరోసారి బాక్సైట్ తవ్వకాలు తెర మీదకు వచ్చాయి. జర్రల బ్లాక్ లో 6, 277 ఎకరాలలోనూ, రక్తకొండ బ్లాక్ లో 12,209 ఎకరాల్లోనూ బాక్సైట్ వున్నట్టు గుర్తించారు. నాటి యూపీఏ ప్రభుత్వం బాక్సైట్ తవ్వేందుకు వేదాంత కంపెనీతో ఒప్పందం చేసుకుంది. అయితే, సమతా వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు మైనింగ్ అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. దీంతో వైఎస్ ప్రభుత్వం ఏపీఎండీసీని తెర మీదకు తెచ్చింది. బాక్సైట్ వెలికి తీసేందుకు అన్ రాక్ కంపెనీతో ఏపీఎండీసీ ఒప్పందం చేసుకుంది. దీంతో విశాఖ మన్యం భగ్గుమంది. బాక్సైట్ వెలికితీతకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడింది. వామపక్షాలతో పాటు నాటి ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు కూడా బాక్సైట్ తవ్వకాల మీద కన్నెర్ర చేశారు. ఏజెన్సీలో బాక్సైట్ ను వెలికితీస్తే సహించేది లేదన్నారు. గిరిజనుల బతుకులు నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ చంద్రబాబు ఏజెన్సీలో ప్రసంగించారు.
చంద్రబాబునాయుడు గవర్నర్ కి రెండు పేజీల లేఖ
2012 ఏప్రిల్ 27న చంద్రబాబునాయుడు గవర్నర్ కి రెండు పేజీల లేఖ రాశారు. అన్ రాక్ కంపెనీకి విశాఖ ఏజెన్సీలో భూములు కేటాయించడాన్ని 2011 కాగ్ రిపోర్ట్ లో తప్పుపట్టిన విషయాన్ని ఆ లేఖలో చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను కార్పొరేట్ కంపెనీలకు కారుచౌకగా ఇచ్చేశారంటూ ఆ లేఖలో వాపోయారాయన. అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారనీ, గ్రామ పంచాయతీల, గిరిజన సలహా సంఘాల అభిప్రాయాలు కూడా తీసుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. గిరిజనులకు 13 కోట్లు, ప్రభుత్వానికి 65 కోట్ల రూపాయలు రాయల్టీలు ఇచ్చి , కార్పొరేట్ కంపెనీలు ఏడాదికి 3,500 కోట్లు తన్నుకుపోతాయంటూ చంద్రబాబు లెక్కలేసి మరీ ఆ లేఖ రాశారు. ప్రతిపక్ష నాయకుడిగా వున్నప్పుడు గవర్నర్ కి ఇన్ని వివరాలతో, ఇంత లేఖ రాసిన చంద్రబాబే అధికారంలోకి వచ్చిన తర్వాత స్వరం మార్చారు. గిరిజనుల అభివ్రుద్ధి కోసం బాక్సైట్ వెలికితీయక తప్పదంటూ కొత్త పాట అందుకున్నారు. నర్సీపట్నం డివిజన్ లోని చింతపల్లి, జెర్రీల ఫారెస్ట్ డివిజన్ లో 1212 హెక్టార్ల అటవీ భూమిని ఏపీ ఎండీసీకి కేటాయిస్తూ జీవో జారీ చేశారు. ఈ జీవోకు వ్యతిరేకంగా ఇప్పుడు మన్యం భగ్గుమంటోంది. ప్రతిపక్షం నుంచి అధికారపక్షంలోకి మారిన తర్వాత చంద్రబాబు మైండ్ సెట్ ఇలా మారితే, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా వున్న జగన్ చలో చింతపల్లికి సిద్ధమవుతున్నారు. బాక్సైట్ తవ్వకాలపై గిరిజనుల మనోభావాలు తెలుసుకునేందుకు పార్టీ కమిటీని ఏర్పాటు చేశారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. మరి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని జగన్ తప్పుపడుతున్నారా? నాటి వైఎస్ మార్గంలోనే ఇప్పుడు చంద్రబాబు ప్రయాణిస్తున్నారా? విశాఖ మన్యం మరోసారి రగులుతోంది. 

21:39 - November 13, 2015

జీనియస్ ఆదిత్య టీంతో టెన్ టివి ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈసంరద్భంగా ప్రొడ్యూసర్ కం డెరెక్టర్ బి.సుధాకర్ గౌడ్,,, చిత్రంలో నటించిన చిన్న పిల్లలు ప్రేమ్ బాబు, రోహిత్ లు తమ సినిమా అనుభవాలను వివరించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:24 - November 13, 2015

సినీ నటుడు కౌషిక్ బాబుతో టెన్ టివి ఇంటర్వ్యూ నిర్వహించింది. బాలనటుడిగా అనేక చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. తెరపై అయ్యప్పస్వామి అంటే కౌశిక్ బాబే గుర్తుకొస్తాడు. ఈ సందర్భంగా కౌషిక్ తన సినిమాల అనుభవాలను తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:17 - November 13, 2015

పాట్నా : పంజాబీ పుత్తర్‌..సిక్సర్ల కింగ్ యువరాజ్‌ సింగ్....ఓ ఇంటివాడు కోబుతున్నాడు. బాలీవుడ్‌ బ్యూటీ హేజిల్‌ కీచ్‌తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న యువీ...బ్యాచ్‌లర్‌ లైఫ్‌కు ఫుల్‌ స్టాప్‌ పెట్టి..... పెళ్లికి సిద్ధమయ్యాడు. ఎటువంటి హడావుడి లేకుండా ఇండోనేషియా రాజధాని బాలిలోని హేజిల్‌తో యువరాజ్‌ సింగ్‌ నిశ్చితార్ధం జరిగింది. సల్మాన్‌ ఖాన్‌ సూపర్‌ హిట్‌ మూవీ బాడీగార్డ్ లో కీలక పాత్ర పోషించిన హేజిల్‌వుడ్‌ అప్పటినుండి బాలీవుడ్‌లో చిన్న చిన్న సినిమాలు, ఐటమ్‌ సాంగ్స్ చేస్తోంది.భారత క్రికెట్‌లో సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌కు ఉన్న ప్రత్యేకతే వేరు. భారత జట్టు 2007లో టీ20 వరల్డ్‌ కప్‌ ,2011 వన్డే ప్రపంచకప్‌ సాధించడంలో యువరాజ్ సింగ్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. భారత క్రికెటర్లు బాలీవుడ్‌ బ్యూటీలతో రిలేషన్‌షిప్‌ మెయిన్ టెయిన్ చేయడం ఇదే తొలి సారి కాదు. విరాట్‌ కొహ్లీ, అనుష్కశర్మ, హర్భజన్‌ సింగ్‌, గీతా బస్రా, అజారుద్దీన్‌, సంగీతా బిజిలానీ ఇలా చాలా మందే ఉన్నారు. ఇప్పుడు తాజాగా యువీ-హేజిల్‌ ఈ లిస్ట్ లో చేరిపోయారు.

 

21:14 - November 13, 2015

ఉత్తరప్రదేశ్‌ : వారణాసిలో దారుణం చోటుచేసుకుంది. బల్గేరియాకు చెందిన 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి జరిగింది. వారణాసిలోని ననద్ నగర్‌లో ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో విదేశీ యువతి పేయింగ్ గెస్ట్ గా ఉంటోంది. ఆమె రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోండగా ఇద్దరు వ్యక్తులు యాసిడ్ దాడి చేసి పారిపోయారు. స్థానికులు వెంటనే ఆ విదేశీ యువతిని బనారస్‌ హిందూ యూనివర్సిటీలోని సుందర్‌లాల్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వార్డులో వైద్యులు ఆమెకు చికిత్స జరిపిస్తున్నారు. ఆమె ముఖంతో పాటు శరీరంలోని ఇతర భాగాలపై గాయాలయ్యాయి. విషయం తెలియగానే స్థానిక పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాధితురాలు బల్గేరియాలోని వర్నాకు చెందినవారు.

 

21:09 - November 13, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కార్మికుల ప‌ట్ల ప‌క్షపాత‌వైఖరి ప్రద‌ర్శిస్తుంద‌ని కార్మిక సంఘాలు మండిప‌డ్డాయి. కార్మికులు చేస్తున్న స‌మ్మెల‌ను అప‌హాస్యం చేస్తూ.. క‌ష్టజీవుల‌ను ప్రభుత్వ పెద్దలు గుర్తించడం లేద‌ని విమ‌ర్శిస్తున్నాయి. జీహెచ్ఎంసీ కార్మికుల నుంచి బలవంతంగా తీసుకున్న బాండ్లను వెనక్కి ఇవ్వాలని.. కార్మిక సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్ణయించింది.
తొలగించిన కార్మికులు మళ్లీ విధుల్లోకి..
సమ్మె చేసి ఉద్యోగాలు కోల్పోయిన 1600 మంది జీహెచ్ఎంసీ కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నారు అధికారులు. అయితే అండర్ టేకింగ్ పేరుతో కార్మికుల వద్దనుండి బాండ్ పేపర్లు రాయించుకోవడం సర్వత్రా విమర్శలకు కారణం అవుతోంది. ఈ చర్య కార్మిక హక్కులను కాలరాసే విధంగా ఉందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రంలో మున్సిపల్‌ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ స‌మావేశం అండ‌ర్ టేకింగ్ తీసుకోవ‌డం స‌రైంది కాద‌ని ఏక‌గ్రీవంగా తీర్మానించింది.
హ‌క్కుల‌ను కాల‌రాయ‌డం...
అయితే విధుల్లోకి తీసుకునే ముందు కార్మికుల నుంచి బాండ్ పేప‌ర్‌పై తాము మళ్లీ స‌మ్మెల్లో, ధర్నాల్లో పాల్గొన‌మ‌ని...త‌మ‌కు ఏరాజ‌కీయ పార్టీతో సంబంధం లేద‌ని.. విధుల‌కు ఎట్టిప‌రిస్థితుల్లో గైర్హజ‌రుకామ‌ని కార్మికుల నుంచి రాయించుకుంటున్నారు అధికారులు. ఈ చ‌ర్య రాజ్యాంగ విరుద్ధమని.. హ‌క్కుల‌ను కాల‌రాయ‌డ‌మే అవుతుందని కార్మిక సంఘాలు అంటున్నాయి. తొల‌గించిన‌ప్పటి నుంచీ కార్మికులు విధులకు హాజ‌రౌతున్నార‌ని.. వారంద‌రికీ వేత‌నాలు చెల్లించాల‌ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హైద‌రాబాద్ లో మాత్రమే వేత‌నాలు పెంచిన ప్రభుత్వం మిగిలిన మున్సిపాలిటీలు. కార్పొరేష‌న్లలోనూ జీతాలు పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పోరాట‌ ఫ‌లితంగానే ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల‌ను విధుల్లోకి తీసుకుంద‌ని ... ఇది కార్మికుల విజయమని మున్సిపల్‌ జేఏసీ అభిప్రాయపడింది.

 

21:02 - November 13, 2015

హన్మకొండ : వరంగల్ ఉప ఎన్నికలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి రెఫరెండమ్ గానే తీసుకుంటామని వాణిజ్య పన్నుల శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మరి బీజేపీ కూడా రెఫరెండమ్ గా తీసుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు. కేసిఆర్ పాలనపై నమ్మకంతో ఓటెయ్యాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఉప ఎన్నికతో టిడిపి నేత దయాకర్ రావు కథ ముగిసినట్లే నని, తమ పార్టీ గెలుపుతో టీఆర్ఎస్ దయాకరే రాజకీయాల్లో మిగులుతాడని తలసాని అన్నారు.

 

20:55 - November 13, 2015

హైదరాబాద్ : వరంగల్ బైపోల్ లో.. కాంగ్రెస్ ఓడిపోతే ఉత్తమ్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్న హరీష్ రావు.. టిఆర్ఎస్ ఒడిపోతే కేసీఆర్ తో రాజీనామా చేయిస్తారా అన్ని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల అభిప్రాయలు పట్టించుకోకుండా.. ఇష్టానుసారం వ్యవహరిస్తున్న కేసీఆర్ కు.. వరంగల్ బైపోల్ లో చావుదెబ్బ తప్పదన్నారు. రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

20:51 - November 13, 2015

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రిటైర్మెంట్ గ్రాట్యుటీ రూ.8లక్షల నుంచి 10లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

సినీ నటుడు ప్రశాంత్ మృతి

హైదరాబాద్ : సినీ నటుడు ప్రశాంత్ మృతి చెందాడు. కూకట్ పల్లిలోని భవనం పై నుంచి కిందికి పడి చనిపోయారు. మహిళతో వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తున్నారు. ప్రశాంత్ స్వస్థలం అనంతపురం జిల్లా గుంతకల్. 

20:33 - November 13, 2015

విశాఖ : చుట్టూ పరుచుకున్న మంచు దుప్పటి, చక్కిలిగింతలు పెట్టే చలి, రంగుల కుంచెతో స్వయంగా ప్రకృతి గీసిన రమణీయ అందాలు. వీటన్నింటిని ఆస్వాదిస్తూ వేడి వేడి కాఫీ తాగితే, అది కూడా విష రసాయనాల జాడే తెలియని విత్తనాలతో తయారైన కాఫీని ఓ గుటకేస్తే... వింటుంటేనే ఆహ్లాదకరంగా ఉంది కదూ. ఏ మాత్రం లేట్ చేయకుండా టేస్ట్ చేయాలని ఉంది కదూ... మరి ఇంకెందుకు ఆలస్యం చలో విశాఖ.
కాలుష్యాన్ని వెలివేసిన ప్రకృతి రమణీయ
కాలుష్యాన్ని వెలివేసిన ప్రకృతి రమణీయత. మనసుకు సాంత్వన ఇచ్చే సహజసిద్ధమైన అందాలు. ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖ మన్యం అందాలు అక్షరాలకు అందవు. సమస్యల సుడిగుండాల్లో కొట్టుమిట్టాడుతున్న జీవితాలు, ప్రకృతిని పిచ్చిగా ప్రేమించే హృదయాలు విశాఖ మన్యానికి వస్తే చాలు టన్నుల కొద్ది ప్రశాంతత లభిస్తుంది. కలకాలం గుర్తుండిపోయే ఎన్నో మధుర జ్ధాపకాలను మన్యం ముడుపుగా ఇస్తుంది.
ఏళ్ల నుంచి విశాఖలో మన్యం కాఫీ సాగు
విశాఖ మన్యం మదిపై చెరగని ముద్ర వేసే దృశ్యాలనే కాదు కమ్మని కాఫీని కూడా కానుకగా ఇస్తోంది. అడవి అంటే అమ్మ ఒడి లాంటింది. అందుకే అమూల్యమైన వనమూలికలు, కాలుష్యం జాడ అంటని ఫలాలు ఇక్కడ ఏపుగా పెరుగుతాయి. ఇది తెలుసుకునే ఎన్నో ఏళ్లనుంచి విశాఖ మన్యంలో కాఫీని సాగు చేస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో లభించే కాఫీ గింజలకు అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు ఉంది. 2003 నుంచి 2012 మధ్య కాలంలో విశాఖ కాఫీ సార్లు పదేళ్లలో ఏడు సార్లు రీజినల్‌స్థాయి అవార్డులు పొందింది. జీకే వీధి, చింతపల్లి, పెదబయలు, మినుములూరు, అనంతగిరి, అరకులోయ తోటల్లో సాగయిన కాఫీ గింజలు నాణ్యమైనవని ఎఫ్ డిసి అధికారులు తేల్చారు. ఇక ఇక్కడ సాగయ్యే అరబిక్‌ కాఫీ గింజలు అయితే ఇంటర్నేషనల్ రేంజ్‌లో అభిమానులను సంపాదించుకున్నాయి.
మన్యంలోనే కాఫీ విక్రయ కేంద్రాలు
అరకులోయ జోన్‌లో సాగవుతున్న నాణ్యమైన కాఫీ రుచిని అందరూ ఆస్వాదించాలనే లక్ష్యంతో ఇక్కడే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. విశాఖ మన్యం అందాలను తిలకించేందుకు వచ్చిన వారు కాఫీ పొడిని కొనుగోలు చేసి తీసుకెళ్లేందుకు విక్రయ కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పుడు ఓ అడుగు ముందు వేసి కాఫీ అమ్మకాలను ప్రారంభించారు. ఇది కాఫీ ప్రేమికులను అమితంగా ఆకర్షిస్తోంది. కమ్మని వాసనలు అందించే కాఫీ తోటల మధ్య, సాంత్వన కలిగించే ప్రకృతి అందాల మధ్య కాఫీని టేస్ట్ చేయటం ఓ మధురానుభూతిని మిగులుస్తోంది.
కోలుకోలేని దెబ్బ తీసిన హుదూద్‌
హుదూద్‌ తుఫాను కాఫీ తోటలను నాశనం చేసింది. ఆ మాయదారి తుఫాను దెబ్బకు కాఫీ రైతులు, వ్యాపారులపై కోలుకోలేని దెబ్బ పడింది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. అరకు కాఫీకి ఇంత పేరున్నా గిట్టుబాటుధర కల్పించలేక ప్రభుత్వం విఫలమవుతోంది. వరల్డ్ వైడ్ కాఫీ లవర్స్ కు కమ్మని అనుభూతిని అందిస్తున్న అరకు కాఫీ కీర్తి మరికొంత కాలం అలాగే ఉండాలంటే... కాఫీ తోటలనే నమ్ముకుని బతుకుతున్న గిరిజనులకు, సాగుదారులకు ఏపి సర్కార్‌ సరైన సదుపాయాలు కల్పించాలి.

20:26 - November 13, 2015

అనంతపురం : మోడీ ప్రభుత్వం ప్రత్యేకహోదాపై ఆంధ్రప్రదేశ్ ప్రజలని మోసం చేసిందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మండిపడ్డారు. మడకశిరలో జరిగిన మట్టి సత్యాగ్రహంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ప్రాణ వాయువవులాంటిదన్నారు. సీఎం చంద్రబాబు చేతకాని తనం వల్లే ప్రత్యేక హోదా ఇంకా రాలేదని ఆయన ధ్వజమెత్తారు. ఉప్పు సత్యాగ్రహం, స్వాతంత్య్ర పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ఏపీలోని 47వేల గ్రామాలు, 3వేల వార్డుల నుంచి సేకరించిన లక్ష పిడికిళ్ల మట్టిని ప్రధాని మోడీకి పంపుతున్నట్లు చెప్పారు.

20:20 - November 13, 2015

మచిలీపట్నం : మచిలీపట్నం పోర్టు భూసేకరణను వెంటనే విరమించుకోవాలని భూ హక్కుల పరిరక్షణ కమిటీ నేతలు డిమాండ్ చేశారు. ఏపీ సర్కార్ భూసేకరణకు వ్యతిరేకంగా మచిలీపట్నంలో సదస్సు జరిగింది. అభివృద్ధి పేరుతో పేదల భూములు లాక్కొనే.. ప్రభుత్వంపై తమ పోరాటాలు సాగుతూనే ఉంటాయన్నారు. ప్రభుత్వానికి రైతుల భూములు కావాలంటే.. మార్కెట్ రేటు కట్టి తీసుకోవాలి కానీ.. బలవంతంగా సేకరించడం సరికాదన్నారు. మచిలీపట్నం పోర్టుకు 50వేల ఎకరాల భూమిని సేకరించే విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వక్తలు డిమాండ్ చేశారు.

 

20:14 - November 13, 2015

అనంతపురం : జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ కారు రాప్తాడు మండలం మామిళ్లపల్లిలో డివైడర్‌ను ఢీకొని బోల్తాకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్ కు చెందిన చైతన్య చంద్ర, దీప్తి, సీతగా గుర్తించారు.

 

20:07 - November 13, 2015

హైదరాబాద్ : మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని పదే పదే విమర్శించడం ప్రతిపక్షాలకు సరికాదని ఆయన నెల్లూరులో అన్నారు. ప్రభుత్వాన్ని సందర్భానుసారంగానే విమర్శించాలని చెప్పారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు దోషిగా తేల్చారన్నారు. ప్రస్తుతం రఘువీరారెడ్డి చేపట్టే మట్టి సత్యాగ్రహం అధిష్టానం ఆదేశాలతోనే జరుగుతుందన్న ఆయన.. కాంగ్రెస్‌ అధిష్టానం తమపై మట్టేసి కప్పేసింది అన్నారు. ఇలాంటి మట్టి సత్యాగ్రహాలతో ప్రయోజనం లేదని ఆనం అభిప్రాయపడ్డారు. పవన్‌, చంద్రబాబు పదేపదే ఎందుకు కలుస్తున్నారో దానివల్ల ఏం ప్రయోజనమో అర్థం కావడం లేదని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

 

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

అనంతపురం : రాప్తాడు మండలం మామిళ్లపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ ను ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు చైతన్యచంద్ర, దీప్తి, సీతగా గుర్తించారు.

విజయనగరం జిల్లాలో అగ్నిప్రమాదం

విజయనగరం : గజపతినగరం మండలం మరుపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 పూరిళ్లు దగ్ధం అయ్యాయి. రూ.10 లక్షల ఆస్తినష్టం అయింది. 

ఓయూ పెండింగ్ మెస్ ఛార్జీల కోసం రూ.7 కోట్ల విడుదల

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో పెండింగ్ మెస్ ఛార్జీల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7 కోట్లు విడుదల చేసింది. వచ్చే ఏడాది నుంచి అన్ని కాలేజీలు, యూనివర్సిటీ హాస్టళ్లలో సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీగా బి.కరుణాకర్ రెడ్డి

హైదరాబాద్ : కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీగా బి.కరుణాకర్ రెడ్డిని నియమించారు.ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

 

రాష్ట్రపతి, ప్రధాని విశాఖ పర్యటన ఖరారు : ఎపి డిజిపి

విశాఖ : ఎపిలో రాష్ట్రపతి, ప్రధాని విశాఖ పర్యటన ఖరారు అయిందని ఎపి డిజిపి రాముడు తెలిపారు. ఫ్రిబ్రవరి 5 నుంచి మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు జరగనున్న అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలకు భారీ భద్రత కల్పించనున్నట్లు తెలిపారు.

 

19:02 - November 13, 2015

ఇంట్లో వృథాగా పడేసే అనేక వస్తువులతో ముచ్చటైన రూపాలను తయారు చేస్తోంది ఒక అతివ. పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ బాటిల్స్ ను కళారూపాలుగా మారుస్తోంది. అవేంటో ఇవాళ్టి సొగసులో చూద్దాం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

19:00 - November 13, 2015

ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ యువతకి కొత్త ఉపాధి మార్గాలను చూపిస్తుందని సంబరపడిపోతున్న తరుణంలోనే, వారిని పెడదోవ పట్టించే వీకెండ్ పార్టీల సంస్కృతి కూడా వారిపై దాడి చేస్తోంది. మరి ఈ పార్టీలు ఏ మేరకు వారి కెరీర్ ను ప్రభావితం చేస్తున్నాయి? యువతలో ఎటువంటి మార్పులకు దారితీస్తున్నాయనే అంశాలను ఇవాళ్టి నిర్భయలో తెలుసుకుందాం.

 

18:57 - November 13, 2015

చిన్నారుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనుంది. అందుకోసం పటిష్టమైన చట్టాలను రూపొందించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం అంటే మూడుముళ్లు, ఏడడుగులు, సప్తపది... ఇలా అనేక రకాల తంతులు సర్వసాధారణం. కానీ ఇవేవీ లేకుండా జరిగే వివాహం కూడా చెల్లుబాటవుతుందంటోంది మద్రాసు హైకోర్టు.
శక్తిమంతమైన మహిళా వ్యాపార వేత్తల జాబితా విడుదల
ప్రతిష్టాత్మకమైన ఫార్చ్యూన్ సంస్థ ప్రస్తుత సంవత్సరానికి గాను శక్తిమంతమైన మహిళా వ్యాపార వేత్తల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఒక తెలుగు వనిత మొదటి పదిస్థానాలలోనే తన స్థానాన్ని పదిల పరుచుకుని ప్రత్యేక గౌరవాన్ని దక్కించుకుంది.
అమ్మతనాన్ని వ్యాపారంగా మలుచుకుంటున్న సంస్థలకు ధీటైన సమాధానం
అమ్మతనాన్ని వ్యాపారంగా మలుచుకుంటున్న సంస్థలకు కేంద్రం ధీటైన సమాధానం చెప్పింది. విదేశీయులను అందుకు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మహిళా న్యాయవాది అరుదైన ఘనత
భారత సంతతికి చెందిన మహిళా న్యాయవాది బ్రిటన్ లో అరుదైన ఘనత సాధించింది.  ఎంచుకున్న వృత్తిలో రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోంది.


 

18:24 - November 13, 2015

ఖమ్మం : జిల్లాలోని కొత్త గూడెంలో బాలోత్సవ్ సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడురోజులపాటు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. భారతీయ కళలకు ప్రావీణ్యం కల్పిస్తూ చిన్నారుల్లో నైపుణ్యం పెంచేందుకు 23 ఏళ్లక్రితం ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. 36 అంశాల్లో జరగబోయే ఈ సంబరాల్లో దాదాపు 20వేలమంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు.

 

18:14 - November 13, 2015

రంగారెడ్డి : మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి దేశంలోనే తొలిసారిగా షీ క్యాబ్ సేవలు ప్రారంభమయ్యాయి. సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ జెండా ఊపి షీ క్యాబ్స్ ను లాంఛనంగా ప్రారంభించారు. మహిళలపై దాడులు తగ్గించడం, వారికి సేఫ్ డ్రైవింగ్ అందించడం కోసం వీటిని ప్రారంభించినట్టు సీవీ ఆనంద్ తెలిపారు. తొలి విడతగా పది మందికి శిక్షణ ఇచ్చి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.

 

 

18:09 - November 13, 2015

హైదరాబాద్ : ప్రేమపేరుతో యువకుడు ఓ యువతిని మోసం చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన నల్గొండ జిల్లా దేవరకొండలో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన రణధీర్ రెడ్డి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఓ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ యూసుఫ్ గూడకు చెందిన కీర్తి అనే యువతిని ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని స్వగ్రామం దేవరకొండకు తీసుకువెళ్లాడు. అక్కడ రణధీర్‌రెడ్డి తల్లి రత్నమ్మ, సోదరుడు సుధీర్‌రెడ్డిలతో కలిసి ఆమెపై దాడి చేసి గాయపరిచారు. పెళ్లి జరగాలంటే రూ. 8 కోట్లు కట్నంగా ఇవ్వాలని హెచ్చరించారు. తనను మోసం చేసిన డాక్టర్ రణధీర్‌రెడ్డి, అతడి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే.. ఇంతవరకు రణధీర్ రెడ్డిపై చర్య ఎందుకు తీసుకోలేదంటూ బాధిత యువతి కుటుంబ సభ్యులు, మహిళా సంఘాల దేవరకొండలోని రణధీర్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. రణధీర్ కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. తనకు న్యాయం చేయాలంటూ.. బాధిత యువతి దేవరకొండ పోలీసులను ఆశ్రయిచింది. బాధితురాలికి.. కుటుంబ సభ్యులతోపాటు.. మహిళా సంఘాలు మద్దతు పలికాయి.

 

17:47 - November 13, 2015

గుంటూరు : ఎపి రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర పర్యావరణశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు పర్యావరణ క్లియరెన్స్ ను పర్యావరణ శాఖ జారీ చేసినట్లు సమాచారం. సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో ఇదే విషయమై వివరాలనను రాష్ట్రప్రభుత్వం పొందుపరిచింది.

చారిత్రక భవనం కూల్చివేతయత్నం.. హైకోర్టులో పిటిషన్ దాఖలు

హైదరాబాద్ : పంజాగుట్ట ఐఎఎస్ క్వార్టర్స్ లోని చారిత్రక భవనం కూల్చివేత ప్రయత్నాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిటిషన్ దాఖలు చేసింది. హెరిటేట్ కు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని హైకోర్టు పిటిషనర్ కు సూచించింది. విచారణ సోమవారానికి వాయిదా పడింది.

 

సీఎం కేసీఆర్ పాలనకు ఎమ్మెస్సార్ ప్రశంసలు

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పాలనపై ఎమ్మెస్సార్ ప్రశంసలు జల్లు కురిపించారు. కేసీఆర్ పాలన బాగుందని పొగిడారు మిషన్ కాకతీయ, గ్రామజ్యోతి పథకాల వల్ల గ్రామాలకు మేలు జరుగుతుందని చెప్పారు. ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మా వాళ్లు విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

మైనార్టీ-సంక్షేమశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : మైనార్టీ, సంక్షేమశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

 

 

ఒకే కాన్పులో నలుగురు చిన్నారులు జననం

హైదరాబాద్ : నాచారం ఈఎస్ ఐ ఆస్పత్రిలో ఒకే కాన్పులో నలుగురు చిన్నారులకు తల్లి జన్మనిచ్చింది. ముగ్గురు మగ, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

 

ఆంగ్ సాన్ సూకీకి ఏచూరీ శుభాకాంక్షలు

ఢిల్లీ : మయన్మార్ ఎన్నికల్లో విజయం సాధించిన ఆంగ్ సాన్ సూకీకి సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో లౌకిక ప్రజాస్వామాన్ని బలపరచడానికి బీహార్ లో బీజేపీ ఓటమి ఉపయోగపడుతుందని చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను దేశంలోని అన్ని రంగాల్లోకి అనుమతించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఎఫ్ డిఐలను అనుమతించడమంటే సామ్రాజ్యవాదానికి లొంగి మన దేశంలో ఇతర దేశాల విధానాలను సాగించడమే అవుతుందన్నారు. విదేశాల నుంచి నల్లధనం కాదు.. ప్రధానిని తీసుకురావాలని ఎద్దేవా చేశారు.

 

16:48 - November 13, 2015

కృష్ణా : ఆంధ్రా క్రికెట్‌ సంఘం నుంచి తనకు సంపూర్ణ మద్దతు లభించిందని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ సభ్యుడు ఎంఎస్ కె ప్రసాద్‌ అన్నారు. ఇబ్రహీంపట్నం మూలపాడులోని క్రికెట్‌ స్టేడియంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంత్రి దేవినేని ఉమా, బీసీసీఐ ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు.. ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా ఎంఎస్ కె ప్రసాద్‌ తెలిపారు.

 

16:42 - November 13, 2015

హైదరాబాద్‌ : నగరంలో వేల కోట్లు పెట్టి నిర్మించబోయే స్కైలెవల్‌ ఫ్లైఓవర్లకు అశించిన మేర ఆదరణ లేకుండాపోయింది. అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు వస్తాయని భావించినా.. పెద్దగా రెస్పాన్స్‌ లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్యాకేజీలన్నింటికి రెండు టెండర్లు మాత్రమే దాఖలయ్యాయంటే.. మల్టీ లెవల్‌ ఫ్లైఓవర్ల నిర్మాణానికి కంపెనీలు ఎంత ఆసక్తి చూపిస్తున్నాయో దీన్ని బట్టే తెలుస్తోంది.
మూడు ఏజెన్సీల నుంచే టెండర్లు
భాగ్యనగరంలో నిర్మించబోయే స్కై లెవల్‌ ఫ్లైఓవర్లకు ఏజెన్సీల నుంచి రెస్పాన్స్‌ కరువైంది. గ్లోబల్‌ టెండర్లు పిలిచినా మూడు ఏజెన్సీలు మాత్రమే ముందుకు రావడంతో.. జీహెచ్‌ఎంసీకి పెద్ద షాక్‌ తగిలింది.
రూ.1,096 కోట్లతో మల్టీ లెవల్‌ ఫ్లైఓవర్లు
తొలిదశలో 1,096 కోట్ల రూపాయలతో నగరంలో మల్టీ లెవల్‌ ఫ్లైఓవర్లను నిర్మించాలని సర్కార్‌ యోచించింది. ఇందులో కోర్‌సిటీతో పాటు.. శివారు ప్రాంతాల్లో రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. అధికారులు మొత్తం 18 జంక్షన్లను ఐదు ప్యాకేజీలుగా విభజించారు. మొదటి ప్యాకేజీలో కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఆరు జంక్షన్లలో ఫ్లైఓవర్లు నిర్మించనునున్నారు. రెండో ప్యాకేజీలో ఎల్బీనగర్‌ ప్రాంతంలో నాలుగు జంక్షన్లను డెవలప్‌ చేయనున్నారు. మూడో ప్యాకేజీలో బయో డైవర్సిటీ పార్క్‌ వద్ద గల మూడు జంక్షన్లు,.. నాలుగో ప్యాకేజీలో బహదూర్‌పురా, మైండ్‌స్పేస్‌, ఉప్పల్‌,.. ఐదో ప్యాకేజీలో రసూల్‌పురాలో ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. అయితే.. వీటికి కేవలం మూడు సంస్థల నుంచి మాత్రమే టెండర్లు వచ్చాయి. ఒకటి, నాలుగు, ఐదు ప్యాకేజీలకు రెండేసి ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేస్తే.. రెండు, మూడు ప్యాకేజీలకు ఒక్కొక్క టెండర్‌ మాత్రమే వచ్చింది.
నిరాశలో జీహెచ్‌ఎంసీ
గ్రేటర్‌లో నిర్మించబోయే ఈ భారీ ప్రాజెక్టులకు అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు వస్తాయనుకున్న జీహెచ్‌ఎంసీకి నిరాశే ఎదురైంది. ప్రీబిడ్డింగ్‌లో వచ్చిన స్పందన.. టెండర్ల దాఖలులో లేకపోవడంతో ఏం చేయాలనే ఆలోచనలో పడింది బల్దియా. ఇక ఇప్పటికే ఫైనాన్సియల్స్‌ బిడ్స్‌ ఓపెన్‌ చేసి కంపెనీలతో టెండర్‌ అగ్రిమెంట్‌ చేసుకోవాల్సి ఉన్నప్పటికీ.. అది ఇంకా కార్యరూపం దాల్చలేదు.
టెక్నికల్‌ అంశాలను పరిశీలిస్తున్న అధికారులు
ఇక ఇప్పటికే టెండర్లు ఓపెన్‌ చేసిన అధికారులు.. టెక్నికల్‌ అంశాలను స్టడీ చేస్తున్నారు. టెండర్లు దాఖలు చేసిన కంపెనీల గత పనితీరును అధ్యయనం చేస్తున్నారు. అయితే గతంలో ఒకే టెండర్‌ వస్తే మళ్లీ టెండర్లు పిలిచే అధికారులు.. ఆన్‌లైన్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరోసారి టెండర్లు కాల్‌ ఫర్‌ చేస్తే ఎలా ఉంటుందా ? అని అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు
మరోవైపు ప్రభుత్వ తీరును ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే సర్కార్‌ ఆగమేఘాల మీద పనులు చేపట్టిందని.. అందుకే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద మొదటి నుంచి ఎన్నో మలుపులు తిరిగిన మల్టీ లెవల్‌ ఫ్లైఓవర్ల వ్యవహారం.. ఇప్పుడు టెండర్లు కూడా భారీగా దాఖలు కాకపోవడంతో ఏం చేయాలోనన్న దిక్కుతోచని స్థితిలో పడింది ప్రభుత్వం.

 

16:36 - November 13, 2015

విశాఖ : ఆంధ్రయూనివర్సిటీ మరోసారి వివాదాలకు కేంద్రమైంది. యూనివర్సిటీ పెద్దలు చేసిన తప్పుడు పనులు మరోసారి మచ్చతెచ్చాయి. ఒక తప్పును కప్పి పుచ్చుకోవడానికి మరికొన్ని తప్పులు చేస్తూ యూనివర్సిటీ పరువు తీస్తోంది యాజమాన్యం.
ఏయూలో అవకతవకలు
చరిత్ర కలిగిన ఆంధ్రయూనివర్సిటీలో అవకతవకలకు కొదవ లేదు. ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రమోషన్‌ విషయంలో తలెత్తిన వివాదం వర్సిటీ పరువును బజారుకీడ్చింది. చివరకు సమాచార హక్కు కమిషన్‌ ఎదుట దోషిగా నిలబడ్డారు రిజిస్ర్టార్‌ ఉమామహేశ్వరరావు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉన్న జాన్ అనే వ్యక్తిని అనర్హునిగా భావిస్తూ 2002లో ఉద్యోగం నుంచి తొలగించారు. అదే వ్యక్తికి 2006లో తిరిగి ఉద్యోగం ఇచ్చారు అప్పటి విసి. పైగా ఫ్రొఫెసర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ఈ విషయమై ఆర్టీఐలో ఉత్తరాంధ్ర సమాచారహక్కు సంఘం కన్వీనర్‌ రమణ ఫిర్యాదు చేశారు. అనర్హునిగా ఉద్యోగమివ్వడమే కాకుండా ప్రమోషన్‌ కూడా ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
రిజిస్ట్రార్‌పై ఆర్టీఐ మండిపాటు
ఫిర్యాదుదారుడు రెండుసార్లు అప్పీలుకు వెళ్లినా అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యం చేశారు. ఈ విషయమై ఏయూ రిజిస్ట్రార్‌పై ఆర్టీఐ మండిపడింది. సరైన సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న రిజిస్ట్రార్‌కు షోకాజ్‌ నోటీసులు ఇచ్చేందుకు ఆర్టీఐ సిద్ధమైంది. మరోవైపు జరిగిందంతా నిజమే అయినా ప్రొఫెసర్‌ జాన్‌ నియామకంలో తప్పేమిటని రిజిస్ట్రార్‌ ఉమామహేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. సర్వీస్‌ రిజిస్టర్‌, మరికొన్ని పత్రాలను ఆర్టీఐ అడిగినా ఇవ్వలేమంటున్నారు. ఇదిలా ఉంటే తన నియామకంలో ఏమైనా అవకతవకలు జరిగుంటే రాజీనామా చేస్తానని ప్రొఫెసర్‌ జాన్‌ అన్నారు. నిబంధనల ప్రకారం తన నియామకం, ప్రమోషన్‌ జరిగిందని చెప్తున్నారు.
వర్సిటీ యాజమాన్యంపై అనుమానాలు
ఈ మొత్తం వ్యవహారంలో వర్సిటీ యాజమాన్యంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. సమాచార హక్కు కమిషన్‌ ఆదేశాలను పక్కన పెట్టి, తగిన సమాచారం ఇవ్వకుండా ఎందుకు దాటవేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రొఫెసర్‌ను తిరిగి నియమించడంలో జరిగిన తప్పిదంపై విచారణ జరిపించడానికి ఏయు విసి ఎందుకు దృష్టి సారించడంలేదనేది మరో ప్రశ్న తలెత్తుతోంది.

 

16:23 - November 13, 2015

హైదరాబాద్ : నవ్యాంధ్ర వైతాళికుడు గురజాడ అప్పారావు శతవర్ధంతి ఉత్సవాలను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తామని సాహితీ స్రవంతి కన్వీనర్‌ తెలకపల్లి రవి తెలిపారు. గురజాడ అప్పారావు పేరుతో మహాసభలు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. గురజాడ వారసత్వాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం లేదని విమర్శించారు. గురజాడపై సమగ్రంగా గ్రంధాలు ప్రచురిస్తామని చెప్పారు. 

16:14 - November 13, 2015

ఢిల్లీ : దేశవ్యాప్తంగా, రాష్ర్టవ్యాప్తంగా కార్మిక సమస్యలపై, బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఏపీ సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధు చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలకు మధు హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా నిర్వహించే ఉద్యమాలపై కేంద్ర కమిటీలో చర్చించామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వ్యాట్ రూపంలో ప్రజలపై భారాలు మోపుతున్నారని, దీనికి వ్యతిరేకంగా పోరాడుతామని అన్నారు.

 

16:10 - November 13, 2015

ఢిల్లీ : దేశంలో గాడ్సేను పొగిడిన ప్రధాని మోడీ... లండన్‌ పార్లమెంట్ ఆవరణలో గాంధీని పొగడటం బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి విమర్శించారు. దేశంలో మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్న మోడీకి బీహార్‌ ఎన్నికలు చావుదెబ్బవంటివని అన్నారు. మోడీ చేస్తున్న విదేశి పర్యటనలన్నీ మన దేశంలోకి విదేశీ పెట్టుబడుదారులకు రెడ్‌ కార్పెట్‌ వేసేందుకేనని చెప్పారు.

15:58 - November 13, 2015

కాకినాడ : ఫోన్‌లో లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఆకతాయికి చెప్పుతో బుద్ధి చెప్పింది ఓ మహిళ. ఈ సంఘటన కాకినాడ కలెక్టరేట్ ఎదుట జరిగింది. కాకినాడ సంజీవ్‌నగర్‌కు చెందిన మేరుగు చిన్న అనే ఆకతాయి దుమ్ములపేటకు చెందిన ఓ మహిళపై రెండు నెలలుగా ఫోన్‌లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో విసిగిపోయిన ఆ మహిళ మరో మహిళ సాయంతో ఆకతాయి ఫోన్‌ చేసి కలెక్టరేట్ వద్దకు రప్పించింది. ఫోన్‌లో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు చెప్పుతో చెంప చెళ్లుమనిపించింది. పోలీసులు ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు.

 

15:56 - November 13, 2015

మెదక్ : జిల్లాలో అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కోహిర్‌ మండలం చింతల్‌ఘాట్‌లో అనిత్‌ తన పొలంలో వేసిన పంట ఎండిపోవడం.. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ పెద్ద ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

 

15:54 - November 13, 2015

ఛత్తీస్‌ఘడ్‌ : దండకారణ్యం మళ్లీ ఉలిక్కిపడింది. ఎర్రటి నెత్తురుతో పచ్చని అడవిలో భయానక వాతావరణం నెలకొంది. ఛత్తీస్‌ఘడ్‌ బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో మావోయిస్టు యాక్షన్‌ టీం కమాండర్‌ రైనా ఉన్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. భారీ ఎత్తున ఆయుధాలతో పాటు డంప్‌ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని విప్లవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మావోయిస్టులే మృతి చెందటం, పోలీసులకు కనీస గాయాలు కూడా కాకపోవటం ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.

 

15:45 - November 13, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పూర్తిస్థాయి డిజిపిగా అనురాగ్ శర్మ నియామకమయ్యారు. తాత్కాలిక డిజిపిగా కొనసాగుతున్న అనురాగ్ శర్మను శాశ్వత డిజిపిగా నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే డిజిపి నియామకానికి అరుణ బహుగుణ, ఎకేఖాన్, అనురాగ్ శర్మ పేర్లతో కూడిన జాబితా వచ్చింది. పరిశీలించిన అనంతరం తాత్కాలిక డిజిపిగా కొనసాగుతున్న అనురాగ్ శర్మ ను పూర్తిస్థాయి డిజిపిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ నెలలో అనురాగ్ శర్మ తాత్కాలిక డిజిపిగా బాధ్యతలు స్వీకరించారు.

 

ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయంలో హీరో రామ్ చరణ్

హైదరాబాద్ : ప్రముఖ నటుడు రామ్ చరణ్ తేజ్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఫేస్ బుక్ ఉద్యోగులతో కాసే సరదాగా ముచ్చటించారు. ఫేస్ బుక్ ఉద్యోగులతో కలిసి తీసుకున్న ఫోటోలను తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా విడుదల చేస్తే తనకు బహుమతులు ఇచ్చిన ఫేస్ బుక్ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.

తొలి రోజే రూ.40 కోట్లు వసూలు చేసిన ప్రేమ్ రతన్ ధన్ పాయే

హైదరాబాద్: బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ లు జంటగా నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయే చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైంది. తొలి రోజే బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.40 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు సినీ వాణిజ్య విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపారు. సూరజ్ బర్ జాత్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ప్రేమ లీల పేరుతో విడుదలైంది.

పోలీసుల ఎదురు కాల్పుల్లో నాలుగురు మావోల హతం..

ఛత్తీస్ గఢ్ : బీజాపూర్ జిల్లా హల్లూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ కమాండర్ సహా నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. సంఘటన స్థలి వద్ద భారీగా మందుగుండు సామాగ్రి పోలీసులకు లభ్యమైంది. దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

మియన్మార్ లో ఆంగ్ శాన్ సూచీ పార్టీ చారిత్రక విజయం

విజయవాడ : మియన్మార్ లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ శాన్ సూచీ నేతృత్వంలోని ఎన్ ఎల్ డీ పార్టీ పూర్తి ఆధిక్యం సాధించి ఘన విజయాన్ని దక్కించుకుంది. ఆ దేశ ఎన్నికలసం ఘం వెల్లడించిన వివరాల ప్రకారం మియన్మార్ ఎగువ, దిగువ సభల్లో కలిపి ఇప్పటి వరకు మొత్తం 348 స్థానాల్ని సూచీ పార్టీ దక్కించుకోగలిగింది.

ఏఎస్ఐ మోహన్ రెడ్డి పిటిషన్ విచారణ వాయిదా...

 కరీంనగర్ : ఫైనాన్స్ దందాలో ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి అరెస్టు అయిన విషయం విదితమే. మోహన్‌రెడ్డి బెయిల్ కోసం కరీంనగర్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. మోహన్‌రెడ్డికి ఈ నెల 27 వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది. మోహన్‌రెడ్డి ఫైనాన్స్ దందాపై సీఐడీ విచారణ చేస్తుంది. ఇక తన దందాకు జిల్లా అదనపు ఎస్పీ జనార్ధన్‌రెడ్డి రూ. 90 లక్షల పెట్టుబడి పెట్టడమే గాక, తనకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాడని సీఐడీ విచారణలో మోహన్‌రెడ్డి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో జనార్ధన్‌రెడ్డిపై కూడా వేటు పడింది.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..

హైదరాబాద్ : అప్పుల బాధ తాళలేక కోహిర్ మండలం చింతలఘట్టుకు చెందిన అనిల్ అనే రైతు ఉరివేసుకుని చనిపోయాడు. అనిల్ తనకున్న 4 ఎకరాలతో పాటు మరో 4 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. వర్షాభావం వల్ల సేద్యం సరిగా సాగకపోవడంతో అప్పులపాలు అయ్యాడు. బాకీలు తీర్చే దారిలేక ఉసురు తీసుకున్నాడు.

కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

హైదరాబాద్ : ఐఏఎస్ క్వార్టర్ల కూల్చివేతపై కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఐఏఎస్ క్వార్టర్లను కూల్చివేయాలన్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది.

13:28 - November 13, 2015

హైదరాబాద్ : గిరిగూడేలు కొత్త కళను సంతరించుకున్నాయి. గిరిజన సంప్రదాయిక సంగీతానికి అనుగుణంగా లయబద్ధంగా.. ఆదివాసీ యువకుల గుస్సాడీ నృత్యం.. మహిళల రేల నృత్యగీతాలు.. కొండ కోనలను హోరెత్తిస్తున్నాయి. ఇప్పుడు ఏజెన్సీలోని ఏ గిరి గూడేన్నిచూసినా.. గుస్సాడీ సందడి కనిపిస్తోంది.

దీపావళికి కొన్ని రోజుల ముందే....

దీపావళికి కొన్ని రోజుల ముందే గుస్సాడీ సంబరాలు మొదలవుతాయి. దీపావళి అమావాస్య తర్వాత పక్షం రోజులకు.. అంటే కార్తీక పౌర్ణమి నాటికి ఈ సంబరాలు ముగుస్తాయి. గిరి తనయులు.. ప్రతి రోజూ కోలాటాలు ఆడుతూ.. సంప్రదాయ నృత్యాలు చేస్తూ.. స్వీయానందం పొందుతూ.. చూపరులకూ సంతోషాన్ని పంచుతారు.

తరాల సంప్రదాయాన్ని పాటిస్తోన్న గోండులు.....

గుస్సాడీ నృత్యం ఎంతగా రంజింపచేస్తుందో.. వారి ఆహార్యమూ అంతగానే పులకరింప చేస్తుంది. గుస్సాడీల మేని అణువణువునా ఆదివాసీ సంప్రదాయం ఉట్టిపడుతుంటుంది. ఆపాదమస్తకమూ గిరిజన తెగల సంస్కృతి ప్రతిబింబిస్తుంటుంది. తలలపై రంగు రంగుల పూజలు, చెమ్కీలతో అలంకరించిన.. నెమలి పింఛాల కిరీటం.. ఎడమ భుజంపై జింకతోలు.. మెడలో గవ్వలు.. తుంగ గడ్డల పూసలతో చేసిన హారాలు.. నడుముకు ఆచ్ఛాదన వస్త్రం.. దానికి అమర్చిన గంట..

మణికట్టుకు మువ్వలు..

చేతిలో చిన్న పొన్నుకర్ర.. కాళ్ళకు గజ్జెలు.. నలుపు రంగు పులుముకున్న మోముపై.. కళ్ల దగ్గర చారికల్లా చర్మం చూచాయగా కనిపిస్తుంటే.. కృత్రిమ గడ్డాలు.. మీసాలు ధరించిన గిరిజనులు.. గొండుల సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తారు. గుస్సాడీలు నృత్యం చేసే సమయంలో శరీరానికి ఆముదం నూనె, నల్ల నూనె పూసుకుంటారు. గోండు భాషలో వెట్టి పర్రా, గూమేలా, కోడల్‌, డప్పులుగా పిలిచే వాయిద్యాల శబ్దాలకు లయబద్ధంగా నృత్యాలు చేస్తారు.

మొదట మంద్రంగాను..

క్రమంగా ఉత్తేజభరితంగానూ.. సాగే సంగీతానికి తగ్గట్లుగా గిరిజనులు చేసే గుస్సాడీ నృత్యం.. నయన మనోహరమే. మెడలో వేసుకున్న రకరకాల హారాలు.. లయబద్ధంగా కదులుతూ.. సరికొత్త లయను సృష్టిస్తూ.. డప్పు, కొమ్ముబూరలతో పోటీ పడుతుంటే.. దానికి అనుగుణంగా.. గిరిజనులు సాగించే నృత్యాలు అనుభవైకవేద్యమే కానీ.. వర్ణనలకు అతీతం. గుస్సాడీ ఉత్సవంలో స్త్రీ వేషధారులు.. కోలాటాలు హైలెట్‌గా నిలుస్తాయి.

గుస్సాడీ వేషధారణ ఆషామాషీ వ్యవహారం కాదు.

గుస్సాడీ..! ఇది సాదాసీదా వేషధారణ కాదు. గోండుల దృష్టిలో మహా మహిమాన్వితం. గొండులు పూనే దండారీ దీక్షలే గుస్సాడీ.దండారీ గజ్జ అంటే శంకరుడి ప్రతిరూపమేనని గిరిజనులు విశ్వసిస్తారు. ఆత్మ, పరమాత్మల అనుసంధానానికి గుస్సాడీ ఒక రూపమని నమ్ముతారు. గుస్సాడీ వేషధారులు.. పాడి పంటలు, పశువులు, ఆరోగ్యం బాగుండాలని అభిలషిస్తూ... ఉపవాస దీక్షలు చేపడుతారు. తాము వినియోగించే సాంప్రదాయిక వాయిద్యాలకు, నెమలీకల కిరీటాలకు.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తి ప్రపత్తులతో వండివార్చిన నైవేద్యాన్ని సమర్పిస్తారు.

గుస్సాడీ వేషం ధరించగానే..

వారికి మహత్తర మహత్తు సిద్ధిస్తుందన్నది గిరిజనుల నమ్మకం. గుస్సాడీల చేతుల్లోని పొన్నుకర్రను తాకితే దీర్ఘకాలిక వ్యాధులూ నయమవుతాయని.. కష్టాలు దూరమవుతాయనీ విశ్వసిస్తారు. ఆదివాసీ గిరిజనులు.. ఎత్మసార్‌ అనే దేవతకు మొక్కు తీర్చుకునేందుకు దీక్షను చేపడతారు. ఎత్మసార్‌ అవతారమే గుస్సాడీ అని వారు నమ్ముతారు. తమ కుల వేలుపు... అకాడి దేవతను ఆరాధిస్తూ గుస్సాడి సంబరాలు జరుపుకుంటారు.

దీక్ష స్వీకరణ.. విరమణల మధ్య..

దీక్ష స్వీకరణ.. విరమణల మధ్య.. గోండులు సంప్రదాయాలను.. ఏర్పాటు చేసుకున్న నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తారు. గుస్సాడీ వేషధారణకు సిద్ధపడ్డవారు.. స్నానానంతరం.. ఊరి బయట దొరికే తెల్లటి మట్టిని తెచ్చి ఒళ్లంతా పూసుకుంటారు. దీక్ష కొనసాగినన్నాళ్లూ.. వీరీ మట్టిని తొలగించరు. వారం పదిరోజుల పాటు.. స్నానాలూ చేయరు. అంతేకాదు.. ఇళ్లకూ వెళ్లరు. బయటే వంటలు వండుకుని తింటారు. గుస్సాడీ వేషధారణ కేవలం దీపావళి సందర్భంలో మాత్రమే చేయాలి. మధ్యరోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వేషం వేయడానికి వీల్లేదని చెబుతారు. దీపావళి అనంతరం మరుసటి రోజు కొలాంబోడి అనే పండుగను జరుపుకొని గుస్సాడి దీక్షను విరమిస్తారు. దీక్ష విరమించే సమయంలో గూడెం వెలుపల ఉన్న ఆముదం చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం వస్త్రాలు, టోపి, దుడ్డు లాంటి నృత్య వస్తువులను భద్రపరిచి స్నానం చేస్తారు. దీక్ష సాగినన్ని రోజులూ.. సుఖభోగాలకు వీరు దూరంగా ఉంటారు. దీక్ష విరమించే రోజున.. నెమలి ఈకలతో చేసిన టోపీలను ధరించి.. ఆదివాసీ గిరిజనులు.. చేసే గుస్సాడీ నృత్యం అమితంగా ఆకట్టుకుంటుంది.

ఇరుగు పొరుగు ఆదివాసీ గూడేలను సందర్శిస్తూ...

గుస్సాడీలు ప్రతిరోజూ... ఇరుగు పొరుగు ఆదివాసీ గూడేలను సందర్శిస్తూ సాగుతారు. శరీరంపై చర్మం కప్పుకొని, నెమలి ఈకలతో తయారు చేసిన కిరీటం ధరించి, చేతిలో పొన్నుకర్ర, డప్పు వాయిద్యాలతో, కాళ్లకు గజ్జలు కట్టుకొని అడులో అడుగేస్తూ.. తమకు ఆశ్రయం ఇచ్చే గ్రామాలకు చేరుకొని గుస్సాడి నృత్యాలు చేస్తారు.

రాత్రికి ఆ గిరిజన గూడేల్లోనే బస...

రాత్రికి ఆ గిరిజన గూడేల్లోనే బసచేసి.. వారిచ్చే విందును స్వీకరిస్తారు. మర్నాటి ఉదయం పూజల అనంతరం.. భోజనం చేసి.. మరో గ్రామానికి వెళ్తారు. తమ గూడెపు గుస్సాడీలతో పాటు.. గిరిజనులూ ఇరుగు పొరుగు గూడేలకు దండుగా వెళతారు. అలా వచ్చిన వారిని అతిథిలుగా భావించి మర్యాదలు చేసి.. తమ గ్రామ యువతీ యువకులకు పెళ్లి సంబంధాలను కుదుర్చుకుంటారు. దీపావళి పండగ సందర్భంగా కుదుర్చుకున్న ఈ సంబంధాల పెళ్లిళ్లు వేసవిలో చేయాలని పెద్దలు నిర్ణయిస్తారు. ఇలా రెండు గ్రామాల మధ్య బంధుత్వం పెంచుకోవడమే దండారి పండగా అని ఆదివాసీ గిరిజన పెద్దలు చెబుతారు.

జీవన వ్యవహర శైలి ప్రత్యేకంగా ....

అటవీ పరిసర ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ గిరిజన జాతుల్లో జీవన వ్యవహర శైలి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆదివాసీల ఆచారవ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలూ ఆధునిక జనతకు విస్తుగొలుపుతాయి. అయితే వీరు తమదైన శైలిలో జీవించడానికి ఆసక్తిని కనబరుస్తారు. తరాల సంప్రదాయాన్ని గౌరవించడానికే కట్టుబడతారు. గుస్సాడీ వేషధారణలో భాగంగా కొందరు యువకులు మహిళల వేషాలనూ ధరిస్తారు. ఎందుకిలా అంటే.. ఆచారం అన్నదే వారి సమాధానం. ఆలింగనంతో ఆరంభమయ్యే పండుగ.. గుస్సాడిల నృత్యాలతో కోలాహలంగా మారుతోంది. సంప్రదాయ వాయిద్యాలు వారిని మరింత మైమరిపిస్తున్నాయి. ఆడ, మగ తేడాలేకుండా ఆడే నృత్యాలు గిరిజన సాంప్రదాయాన్ని కళ్లకు కడతున్నాయి. 

13:20 - November 13, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ను టూరిజం హబ్‌గా మార్చేంచుకు ఏపీ సర్కార్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. రాజధాని దగ్గురున్న టూరిజం ప్రాంతాలే కాకుండా బీచ్‌ రిస్సాట్స్‌, జంగిల్‌ రిస్సాట్స్‌ వంటిపైనా దృష్టి సారించింది. ప్రాంతాల వారిగా టూరిస్ట్‌ ప్రాంతాలను గుర్తించడంతో పాటు వాటి అభివృద్ధికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఆదాయవనరుగా ఏపి టూరిజం శాఖ....

రాష్ర్టానికి ఆదాయం రావాలి...అలా అని పెద్దగా ఖర్చు చేయకూడదు. ఈ ఫార్ములా పక్కగా అమలుకావాలంటే ఉన్న ఏకైక ఆదాయవనరు టూరిజం. అనుకున్నదే తడువుగా ఏపి ప్రభుత్వం సువిశాలమైన 900 కిలోమీటర్ల తీర రేఖ కలిగిన టూరిజాన్ని ఆదాయ వనరుగా ఉపయోగించుకోవాలనుకుంటోంది ఏపి ప్రభుత్వం.

చారిత్రక ప్రాధాన్యం ఉన్న కొండపల్లికోటతో.....

చారిత్రక ప్రాధాన్యం ఉన్న కొండపల్లికోటతో పాటు పెనుగొండ, గుత్తి, కొండవీడు, గండికోట, చంద్రగిరిలను టూరిజం ప్రాజెక్టుల కోసం సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడి వచ్చే విదేశి ప్రతినిధులు కూడా ఈ కోటను దర్శిస్తారని, దీని వల్ల ఆదాయం రావడంతో పాటు టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందని యోచిస్తోంది.

కొండపల్లి కోట అభివృద్ధికి అనుమతులు...

ఇప్పటికే కొండపల్లి కోట అభివృద్ధికి తొలి దశ అనుమతులు మంజూరు చేశారు. కొండపల్లి కోటలో పచ్చదనాన్ని పెంచడమే కాకుండా దర్బార్‌ హాల్స్‌, స్తంభాలు, తోరణాలు, డాన్సింగ్ హాల్‌తో పాటు కోటలోని చెరువుని ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోట చుట్టూ సోలార్‌ ఫెన్సింగ్‌ను వెయ్యడంతో పాటు విద్యుదీకరణకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే దాదాపు 11 కోట్ల రూపాయలను తొలి దశ కింద విడుదల చేసింది. చుట్టూ ఉన్న అటవీ ప్రాంతంలో రోప్‌వేను నిర్మించడానికి అవసరమైన స్థలాన్ని కూడా ఎంపిక చెయ్యాలని టూరిజం శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి.

బెంగళూరు నుంచి తిరుపతి మీదుగా హెరిటేజ్‌ సర్క్యూట్‌.....

అంతే కాదు విశాఖ జిల్లాలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను అభివృద్ధి చేయడంతో పాటు బెంగళూరు నుంచి తిరుపతి మీదుగా హెరిటేజ్‌ సర్క్యూట్‌, బెంగళూరు తిరుపతి మీదుగా విజయవాడ వరకు ఒక హెరిటేజ్‌ సర్క్యూట్‌, విశాఖ పరిధిలో ఉన్న వాటిని మరో టూరిజం సర్క్యూట్‌గా నిర్ణయించారు. ఇందుకోసం దాదాపు 70 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు.

గండికోటను అంతర్జాతీయ పూర్యాటక స్థలంగా...

కడప జిల్లాలోని గండికోటను అంతర్జాతీయ పూర్యాటక స్థలంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. 6 నెలల్లోపు గండికోట ప్రాజెక్టు తొలిదశ నిర్మాణాలు పూర్తికావాలన్నారు సీఎం చంద్రబాబు. రాతి శిలలు, పెన్నానది, రిజర్వాయర్లు తదితరాలపై జియలాజికల్ సర్వే చేయాలని కడప పర్యటన ముగించుకున్న వెంటనే నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం ఆదేశించారు.

అమెరికాలో ఉన్న కెన్నాయన్ ప్రాజెక్టుకు ధీటుగా ....

అమెరికాలో ఉన్న కెన్నాయన్ ప్రాజెక్టుకు ధీటుగా గాజు బాల్కనీ, రోప్‌వే, రాక్ క్లైబింగ్‌, బోటింగ్‌ పార్క్, షాపింగ్ ఏరియా, రిసార్ట్‌ తదితర నిర్మాణాలన్నీ గండికోటకు రావాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించాలని సీఎం ఆదేశించారు. తిరుపతి, గండికోట, కడప దర్గా, ఒంటిమిట్ట ఆలయాలను కలుపుతూ తిరుపతి కేంద్రంగా ప్యాకేజ్ టూర్‌ను ఏర్పాటు చేయనుంది ఏపీ సర్కార్‌.

నాగార్జునసాగర్‌ను బౌద్ధ పర్యాటక కేంద్రంగా...

నాగార్జునసాగర్‌ను బౌద్ధ పర్యాటక కేంద్రంగా, తిరుపతిలో 100 చెరువులను అభివృద్ధిలోకి తీసుకొచ్చి లేక్‌సిటీగా, విజయవాడను కెనాల్‌ సిటీగా, విశాఖను బీచ్‌ సిటీగా అభివృద్ధి చేసేందుకు ఏపి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. 

గంగిరెడ్డిని ఏపీకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు : డీజీపీ

విశాఖ : గంగిరెడ్డిని ఏపీకి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఏపీ డీజీపీ రాముడు చెప్పారు. ఫిబ్రవరిలో విశాఖలో జరిగే అంతర్జాతీయ నావికాదళ ప్రదర్శనకు భద్రతా ఏర్పాట్లను రాముడు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో ఫిబ్రవరి నెలలో జరిగే అంతర్జాతీయ నావికదళ ప్రదర్శనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఐఎఫ్‌ఆర్‌ సదస్సుకు ప్రధాని మోదీ, చంద్రబాబులతోపాటు 70 దేశాల ప్రతినిధులు, 15 వేల మంది వీఐపీలు పాల్గొంటారని చెప్పారు. బాక్సైట్‌ ఆందోళనలపై ప్రభుత్వ ఆదేశానుసారం చర్యలు తీసుకుంటామని డీజీపీ వివరించారు.

సిరిసిల్ల రాజయ్య రెండో కోడలు సన కాసేపట్లో కోర్టుకు

వరంగల్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక ఆత్మహత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. గతవారం సిరిసిల్ల రాజయ్య ఇంటిలోనే సారిక తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు (సారిక భర్త) అనిల్ కుమార్ లను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. విచారణలో భాగంగా అనిల్ రెండో భార్య సన పాత్ర కూడా కీలకమని తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. గతవారమే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న వార్తలు వినిపించాయి.

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి

హైదరాబాద్ : దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. అల్పపీడన ద్రోణికి అనుబంధంగా ఆవర్తనం కొనసాగుతోంది. 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

కేసీఆర్‌ పచ్చి అబద్ధాలకోరు: షబ్బీర్ అలీ

వరంగల్: కేసీఆర్‌ పచ్చి అబద్ధాలకోరని మాజీమంత్రి షబ్బీర్‌అలీ విమర్శించారు. వరంగల్‌ ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్‌పై జరిగిన సీబీఐ విచారణ వివరాలను బయటపెట్టాలని ఆయన కోరారు. కేసీఆర్‌ కుటుంబ పాలనపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం కేటీఆర్‌, కవితలకంటే మావోయిస్టు శృతి ఎక్కువగా పోరాడారని, కాని ఆమెను అన్యాయంగా హత్యచేశారని షబ్బీర్‌అలీ ఆరోపించారు.

12:39 - November 13, 2015

హైదరాబాద్ : వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ అభ్యర్ధి దేవయ్య ఏటికి ఎదురీదుతున్నారు. అభ్యర్ధిని ప్రకటించడంలో జాప్యం చేసిన కమలనాథులు... ప్రచారంలో కూడా వెనుకబడి పోయారు. బీజేపీ మిత్రమైన టీడీపీ కూడా ఈ ఎన్నికను అంత సీరియస్‌గా తీసుకోలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా రెండు పార్టీల నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇదంతా బీజేపీ అభ్యర్ధి దేవయ్య ప్రచారంపై ప్రభావం చూపుతోంది.

సమావేశాలకు హాజరుకాని బీజేపీ-టీడీపీ నేతలు ....

ఉమ్మడి అభ్యర్ధిని గెలిపించుకునేందుకు బీజేపీ-టీడీపీ నేతల సమన్వయ సమావేశం ఈనెల 3న జరిగింది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నిర్ణయించిన నేతల్లో ... ఇప్పుడు ఆ ఉత్సాహం కనిపించడంలేదు. అసెంబ్లీ నియోజవర్గాల వారీగా దేవయ్య నిర్వహిస్తున్న సమావేశాలకు కూడా బీజేపీ-టీడీపీ నేతలు హాజరు కావడంలేదు. ప్రచారంలో కూడా పెద్దగా పాల్గొనడంలేదు. దీంతో చిన్న, చితక నాయకులతోనే దేవయ్య ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ కొన్ని సభల్లో పాల్గొన్నారు. రెండు పార్టీల మధ్య సమన్వయలోపం ఉందని ఒప్పుకుంటున్న బీజేపీ నేతలు... అన్ని సర్దుకుపోతాయంటున్నారు.

రెండు పార్టీల మధ్య సమన్వయలోపం....

వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో రెండు పార్టీల మధ్య సమన్వయలోపం ఉన్న విషయాన్ని టీడీపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. అయినా అందరం కలిసి దేవయ్య గెలుపు కోసం కృషి చేస్తామంటున్నారు.

దేవయ్య గెలుపు పై ప్రభావం ప్రభావం.....

కమలనాథులు, టీడీపీ నాయకుల మధ్య సమన్వయంలోపం బీజేపీ అభ్యర్ధి దేవయ్య గెలుపు పై ప్రభావం ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

12:36 - November 13, 2015

హైదరాబాద్ : చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆన్ లైన్ సేల్స్ తో వరల్డ్ లోనే నెంబర్ వన్ గా నిలిచేందుకు సరికొత్త ప్రణాళికలతో దూసుకెళ్తున్న ఈ ఇ-కామర్స్ దిగ్గజం... ఒకేరోజు 13.8బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపి... ఇతర సంస్థలకు దిమ్మతిరిగేలా చేసింది.

తన రికార్డును తానే బద్ధలు కొట్టేసుకున్న ఆలీబాబా గ్రూప్....

ఈ కామర్స్ జైంట్ అలీబాబా గ్రూప్ తన రికార్డును తానే బద్ధలు కొట్టేసుకుంది. గత ఏడాది ఒక్క రోజు జరిపిన అమ్మకాలకన్నా ...ఈ ఏడాది ఒకే రోజు రికార్డు శాతంలో అమ్మకాలు జరిపి దాదాపు 50శాతం అధిక ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది ఈ సంస్థ ఒకరోజు ఆన్ లైన్ ద్వారా దాదాపు 9.3 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపి రికార్డు సృష్టించగా ఈసారి దానిని అధిగమించి 13.8 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను విక్రయించి చరిత్ర సృష్టించింది. మన కరెన్సీలో ఈ మొత్తం 9వేల వందకోట్ల రూపాయలకు సమానం.

చైనాకు చెందిన బీడీఏ అనే సంస్థ ధృవీకరణ....

అలీబాబా రికార్డును చైనాకు చెందిన బీడీఏ అనే సంస్థ ధృవీకరించింది. చైనా ఈ కామర్స్ మార్కెట్‌లో అలిబాబా నంబర్ వన్. కస్టమర్ల నుంచి లభించిన అపూర్వ స్పందనకు... కృతజ్ఞతలు తెలిపిన అలీబాబా ప్రతినిధులు... రాబోయే రోజుల్లో ఈ జోరును ఇలాగే కొనసాగించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటామని తెలిపారు. మరో ఐదేళ్లలోగా చైనా ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ సంస్థగా మారనుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం అలీబాబా ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల పరంగా రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో అమెరికాకు చెందిన అమేజాన్ ఇకామర్స్ నిలిచింది. అమేజాన్ తరహాలోనే అలీబాబా కూడా ఇతర దేశాల్లో పాగా వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అవే జరిగితే.. వచ్చే ఐదేళ్లలో ఈ సంస్థ అమేజాన్ ను మించిపోవడం ఖాయం. 

12:33 - November 13, 2015

విశాఖ : వైసీపీ మరో ఆందోళనకు సిద్ధమయ్యింది. విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిస్తూ టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. బాక్సైట్‌ జీవోను వెనక్కి తీసుకోవాలంటూ వచ్చే నెల 2న పాడేరు కేంద్రంగా ధర్నాకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమవుతున్నారు.

బాక్సైట్‌ తవ్వకాల జీవో 97 కు వ్యతిరేకంగా ఉద్యమం ....

ఏపీకి ప్రత్యేక హోదా కోసం గతనెలలో గుంటూరులో నిరాహార దీక్ష చేసిన వైసీపీ అధినేత జగన్‌... ఈసారి బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా ధర్నా చేయాలని నిర్ణయించారు. విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలను అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన 97వ నంబర్‌ జీవోను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌తో ఆందోళనకు ప్రణాళికలు రూపొందించారు. వచ్చే డిసెంబర్‌ మొదటి వారంలో విశాఖ జిల్లా పాడేరు కేంద్రంగా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ధర్నాకు ప్రభుత్వ అనుమతి తీసుకునే ప్రయత్నంలో వైసీపీ నేతలు ఉన్నారు. అనుమతి నిరాకరిస్తే కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు.

బాక్సైట్‌ తవ్వకాల కోసం వందలాది గ్రామాల తరలింపు.....

విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలను అనుమతిస్తూ టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో పై గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే వారు ఆందోళనలు ప్రారంభించారు. రెండు రోజుల క్రితం పాడేరు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే ఈశ్వరిని అడ్డుకొని తమ నిరసన తెలిపారు. ఈ ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించామని వారికి చెప్పిన ఈశ్వరి.. అవసరమైతే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు.

బాక్సైట్‌ జీవోపై చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు

మరోవైపు మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని గిరిజనులు తెగేసి చెబుతున్నారు. బాక్సైట్‌ జీవోకు వ్యతిరేంగా ఉద్యమాన్ని ఉధృతం చేసే విషయంలో భావసారూప్యత ఉన్న ఇతర పార్టీలను కూడా కలుపుకుపోవాలని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు. 

12:30 - November 13, 2015

హైదరాబాద్‌ : పాతబస్తీలో ప్రేమోన్మాదులు రెచ్చిపోయారు.ఫలక్‌నుమా ప్రెసిడెన్సీ జూనియర్‌ కాలేజ్‌లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న బాధితురాలిని అదే కాలేజ్‌లో ఓ సీనియర్‌ విద్యార్ధి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనకు వేరోకరితో ఎంగేజ్‌మెంట్ అయిందని బాధితురాలు చెప్తున్నా వినకుండా వేధింపులను తీవ్రతరం చేసాడు. బాధితురాలు వేధింపుల పర్వాన్ని కుటుంబసభ్యులకు చెప్పటంతో విషయం కనుక్కునేందుకు బాధితురాలి సోదరుడు కాలేజ్‌కు వెళ్లాడు. అక్కడ మాటా మాటా పెరిగి బాధితురాలి సోదరుడిపై పోకీరీల గుంపు దాడి చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

12:29 - November 13, 2015

చిత్తూరు :సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందించే కర్తవ్యం పార్టీ కార్యకర్తలదేనని టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుపతిలో టీడీపీ పార్టీ సదస్సును అధినేత చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విజయవాడకు వెళ్లినప్పుడు ఆఫీసు కూడా లేదని.. ఇప్పుడు అన్నీ సమకూర్చకుంటున్నామని.. అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని చంద్రబాబు చెప్పారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మించబోతున్నామని, విభజన హామీల సాధనకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజలు ప్రజాప్రతినిధులను గమనిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అధికారుల్లో జవాబుదారీతనం తీసుకువ చ్చి 2029 నాటికి దేశంలో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతానన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కరవు నివారణకు నీరు చెట్టు కార్యక్రమాన్ని రూపొందించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. జూన నాటికి హంద్రీనీవా ద్వారా చిత్తూరుకు నీరు అందిస్తామన్నారు. రెండేళ్లలో గాలేరు- నగరి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. రాయలసీమకు సాగు నీరందిస్తే గోదావరి జిల్లాలకు పోటీగా పంటలు పండిస్తారని చంద్రబాబు టీడీపీ కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

కృష్ణానగర్‌లో ఎనిమిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం...

హైదరాబాద్‌ : నగరంలోని కృష్ణానగర్‌లో ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారం జరిపాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

 

ఢిల్లీలో వృద్ధ దంపతుల హత్య...

న్యూఢిల్లీ : హస్తినలోని కైలాష్ ప్రాంతంలో దారుణం జరిగింది. ఇద్దరు వృద్ధ దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. అయితే దంపతులు నివసిస్తున్న ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దోపిడీకి వచ్చిన దుండగులు దంపతులను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతులను మనోహర్ లాల్ మదన్(84), విమల(80)గా పోలీసులు గుర్తించారు.

తిరుపతిలో ప్రారంభమైన టిడిపి దిశా నిర్దేశ సదస్సు

చిత్తూరు: తిరుపతిలోని జి.ఆర్.ఆర్ సమావేశ మందిరంలో టిడిపి దిశా నిర్దేశన సదస్సు ప్రారంభమైంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు ఆ పార్టీ నాయకులంతా పాల్గొన్నారు.

11:38 - November 13, 2015

విజయవాడ : హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపే వారిపై జరిమాన్ల కొరడా ఝళిపిస్తున్నారు బెజవాడ పోలీసులు. నవంబర్ 1 నుంచి హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపి రవాణా శాఖ తీవ్ర వ్యతిరేకత రావడంలో మధ్యలోనే హెల్మెట్ తప్పనిసరి నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది.అయినా ఇవేమి పట్టించుకోని బెజవాడ పోలీసులు హెల్మెట్ లేకుండా బైక్‌ నడుపుతున్న వారికి ఫైన్లు వేస్తున్నారు. దీంతో వాహన దారులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.

11:35 - November 13, 2015

హైదరాబాద్ : బిసీ ఓటర్ల గణనపై జీహెచ్ఎంసీ వేగం పెంచింది. గడువు దగ్గర పడుతుండటంతో అధికారులు పరుగులు పెడుతున్నారు. సెలవు దినాల్లో కూడా పనిచేయాలని బిఎల్ ఓ లకు ఆదేశాలు వెళ్లాయి.

ఓట్ల తొలగింపుపై అనుమానాల నివృత్తి......

ఓట్ల తొలగింపుపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే పనిలో జీహెచ్‌ఎంసీ పడింది. బూత్‌ లెవల్‌ అధికారులు ఇప్పటికే వివరాలు సేకరిస్తున్నారు. అదే సమయంలో బీసీ ఓటర్ల గణనను కూడా జీహెచ్‌ఎంసీ చేపట్టింది. ఈ నెల 3వ తేదీ నుంచి బీఎల్‌వోలు గణన ప్రారంభించారు. ఇప్పటివరకు కేవలం 35 శాతం ఓటర్ల వివరాలను మాత్రమే సేకరించగలిగారు. దీంతో ప్రక్రియను వేగవంతం చేసేందుకు గ్రేటర్‌ కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. అనుమానాల నివృత్తి, బీసీ ఓటర్ల గణన గడువు లోపు ముగించడానికి చర్యలు చేపట్టారు. రెండొ శనివారం, ఆదివారం కూడా విధులను నిర్వహించాలని బూత్‌ లెవెల్‌ అధికారులను ఆదేశించారు.

బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి....

బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి బీసీ ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. బిసి అయితే వారి నుంచి సంతకం తీసుకోవడంతో పాటు కాంటాక్ట్ నంబర్‌ కూడా తీసుకుంటున్నారు. ఓటర్‌ జాబితాపై గందరగోళం నెలకొనడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తొలగించిన ఓట్లను పునః పరిశీలన చేస్తున్నారు. ఇళ్లు మారిన వారిని, ఇంటికి తాళం వేసిన వారిని ఫోనులో సంప్రదించి వివరాలు తీసుకుంటున్నారు.

బిసి ఓటర్లపై లెక్కింపుపై.....

బిసి ఓటర్లపై లెక్కింపుపై జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి చర్చించారు.చాలాకాలం పెండింగ్‌లో ఉన్న బూత్‌లెవిల్‌ అధికారుల పారితోషికాన్ని వెంటనే విడుదల చేయాలని సూచించారు. వార్డుల విభజనపై అందిన అభ్యంతరాలను వెంటనే పరిష్కరించాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. 

11:30 - November 13, 2015

హైదరాబాద్ : ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్‌ క్రికెట్‌ అసోసియేషన్- డిడిసిఏ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఢిల్లీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన వినోదపు పన్నును డిడిసిఏ ఎగ్గొట్టడంతో కేజ్రీవాల్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇందుకోసం ఇద్దరు సభ్యులతో ఓ కమిటీని నియమించింది.

24 కోట్ల వినోదపు పన్ను చెల్లించాల్సి ఉంది...

డిడిసిఏ ఢిల్లీ ప్రభుత్వానికి 24 కోట్ల వినోదపు పన్ను చెల్లించాల్సి ఉంది. 1996 ఢిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ బెటింగ్‌ టాక్స్‌ యాక్ట్‌ ప్రకారం ఆప్‌ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ పన్ను చెల్లించడానికి 24 గంటల సమయమిచ్చింది.

భారత్‌-సౌతాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యే అవకాశం...

ఒకవేళ డిడిసిఏ పన్ను చెల్లించకపోతే ఫిరోజ్‌షాకోట్లలో భారత్‌-సౌతాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన నాలుగో క్రికెట్‌ టెస్ట్‌ రద్దయ్యే అవకాశం ఉంది. నాలుగో టెస్ట్‌ డిసెంబర్‌ 2న ప్రారంభం కానుంది. టాక్స్‌ కడితేనే మ్యాచ్‌కు అనుమతిస్తామని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

డిడిసిఏ ఆర్థిక పరిస్థితి దివాళా తీసినట్టు సమాచారం.....

డిడిసిఏ ఆర్థిక పరిస్థితి దివాళా తీసినట్టు సమాచారం. టెస్ట్‌ ప్రారంభానికి ముందు అడ్వాన్స్‌గా కోటి రూపాయల టాక్స్ మాత్రమే చెల్లించే అవకాశం కనిపిస్తోంది. మిగతా బకాయిలను టెస్ట్‌ మ్యాచ్‌ తర్వాత చెల్లిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో డిడిసిఏ మూడేళ్ల బ్యాలెన్స్‌ షీట్‌ను బిసిసిఐకి పంపింది. ఒకవేళ బిసిసిఐ అనుమతిస్తే డిడిసిఏకు 30 కోట్లు మంజూరు చేసే అవకాశముంది. ఢిల్లీ ప్రభుత్వం అనుమతివ్వకుంటే టెస్ట్‌ మ్యాచ్‌ను పుణెకు తరలిస్తామని డిడిసిఏకు బిసిసిఐ హెచ్చరించింది.

 

మోడీ మెడలు వంచుతాం : ఎంపీ వినోద్

వరంగల్ : ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనలు చేస్తూ ప్రజలను విస్మరిస్తున్నారు.. ఆయన మెడలు వంచుతామని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. వర్ధన్నపేట మండలం సింగారంలో ఉప ఎన్నికలో భాగంగా టీఆర్‌ఎస్ ప్రచారం చేస్తుంది. ప్రచారంలో పాల్గొన్న వినోద్ మాట్లాడుతూ.. పత్తికి గిట్టుబాటు ధర సాధించే వరకు టీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందని ఉద్ఘాటించారు. ప్రపంచ మార్కెట్లు పత్తి కొనుగోలు చేసేలా మోడీ ప్రయత్నం చేయాలని సూచించారు.

 

రామగుండం ఎన్టీపీసీలో సాంకేతిక లోపం

కరీంనగర్ : రామగుండం ఎన్టీపీసీలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఒకటో యూనిట్‌లో బాయిలర్ ట్యూబ్ లీకేజీతో 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్మతులు చేస్తున్నారు.

నేతల పనితీరును బట్టే పదవులు : కళా

తిరుపతి :నాయకుల పనితీరును బట్టే నామినేటెడ్‌ పదవులు ఇస్తామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు వెల్లడించారు. కాపుల రిజర్వేషనకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. వైసీపీ మాయ నుంచి దళితులు ఇప్పుడిప్పుడే బయటపడతున్నారన్నారు.

అవనిగడ్డలో చైన్ స్నాచర్లు అరెస్ట్

కృష్ణా :అవనిగడ్డలో పోలీసులు శుక్రవారం ముగ్గురు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 105 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. చైన్ స్నాచర్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా విచారణ నిమిత్తం పోలీసులు చైన్ స్నాచర్లను తమదైన శైలిలో విచారిస్తున్నారు. అవనిగడ్డలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. దీంతో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. అందులోభాగంగా శుక్రవారం పోలీసులు తనిఖీల్లో సదరు చైన్ స్నాచర్లు పట్టుబడ్డారు.

ఫలక్‌నుమా ప్రెసిడెన్సీ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం..

హైదరాబాద్ : ఫలక్‌నుమా ప్రెసిడెన్సీ కాలేజీలో ర్యాగింగ్‌ జరిగింది. ఓ విద్యార్థినితో సీనియర్లు అసభ్యంగా ప్రవర్తించారు. ప్రశ్నించిన విద్యార్థిని సోదరులపై దాడి చేశారు. విద్యార్థులు, విద్యార్థిని సోదరుల మధ్య ఘర్షణ జరిగింది. యువతిని వేధించిన నలుగురు యువకులపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. యువకుల ఫిర్యాదుతో యువతి సోదరుడిపై కేసు నమోదు చేశారు.

10:46 - November 13, 2015

హైదరాబాద్ : దేశంలో పెరుగుతున్న మత అసహానికి నిరసనగా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ పీఎం భార్గవ ప్రభుత్వం తనకు ప్రధానం చేసిన పద్మభూషణ్‌ అవార్డును తిరిగి ఇచ్చేశారు. అవార్డుతో పాటు, ప్రశంసా పత్రాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి పంపారు. అవార్డును తిరిగి ఇవ్వడానికి కారణాలను వివరిస్తూ ప్రణబ్‌కు లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో శాస్త్రీయ ధృక్పదాన్ని ప్రోత్సహించడానికి బదులు మూఢనమ్మకాలను పెంపొందిస్తోందని భార్గవ విమర్శించారు.

రాష్ట్రపతికి లేఖలో వివరణ.....

దేశంలో పెరుగున్న మత అసహానికి నిరసనగా అవార్డులు తిరిగి ఇస్తున్నవారి జాబితాలో ఇప్పుడు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త పీఎం భార్గవ కూడా చేశారు. ఈయన నగరంలోని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్కులర్‌ బయాలజీ.... సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్‌. జీవశాస్త్రరంగంలో ఆయన చేసిన పరిశోధలకు గుర్తింపుగా కేంద్రం 1986లో పద్మభూషణ్‌ అవార్డు ప్రదానం చేసింది. అప్పటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌ చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు. అటువంటి శాస్త్రవేత్త పీఎం భార్గవ ఇప్పుడు తన అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. పద్మభూషణ్‌ అవార్డులతోపాటు, ప్రశంసా పత్రాన్ని ఈనెల 6న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి పంపారు. అవార్డును తిరిగి ఇచ్చేయడానికి కారణాలు వివరిస్తూ రాష్ట్రపతికి ఓ లేఖ కూడా రాశారు.

సంఘ్‌ పరివార్ శక్తులు చెలరేగిపోతున్నాయి .....

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ సర్కార్‌ ఏర్పడిన తర్వాత దేశంలో మత అసహనం పెరిగిపోయిందన్న విషయాన్ని డాక్టర్‌ భార్గవ... రాష్ట్రపతికి రాసిన లేఖలో ప్రస్తావించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని సంఘ్‌ పరివార్‌ శక్తులు చెలరేగిపోతున్నాయని ఘాటుగా విమర్శించారు. కేంద్రంతో పాటు, కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజాస్వామ్యాన్ని బజారుకీడ్చిందన్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వెలిబుచ్చారు. సామాజిక, రాజకీయ పరిస్థితులు ఏమంత బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ పాలకులు తమ దేశాన్ని ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చిన తరహాలోనే బీజేపీ, సంఘ్‌ పరివార్‌ శక్తులు కూడా మన దేశాన్ని హిందూత్వ రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని డార్టక్‌ భార్గవ రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

విభజనవాద అజెండా అమలు చేస్తున్న సంఘ్‌ పరివార్‌ ......

బీజేపీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆర్ ఎస్ ఎస్ నాయకులు తమ సొంత భావజాలంతో ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తున్నారన్నది డాక్టర్‌ భార్గవ వాదన. సంఘ్‌ పరివార్‌ తమ విభజనవాద అజెండా అమలు చేయించుకుంటున్నారని లేఖలో ప్రస్తావించారు. ఇది ఆశాస్త్రీయం, అసమంజసమన్నారు. ప్రజల్లో శాస్త్రీయ భావాలను పెంపొందించాల్సిన పాలకులు, మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. పెళ్లి అన్నది స్త్రీ, పరుషుల మధ్య ఒక ఒడంబడికని, మహిళ ఎక్కడా పనిచేయకుండా గృహిణిగానే ఉండాలంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ చేసిన వ్యాఖ్యలను డాక్టర్‌ భార్గవ గుర్తు చేశారు.

బీజేపీ ముందస్తు ప్రణాళికతోనే దాద్రీ ఘటన......

ఉత్తర్‌ప్రదేశ్‌లోని దాద్రీ ఘటనను కూడా డాక్టర్‌ భార్గవ ప్రస్తావించారు. గోమాంసం తిన్నాడన్న వదంతులో మహ్మద్‌ ఇక్లాక్‌ అనే వ్యక్తికి ఓ ముఠా హత్య చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది బీజేపీ శక్తులు ముందస్తు ప్రణాళికలో భాగమే ఈ ఘటన అన్నది ఆయన ఆరోపణ. గోమాంసం తినొద్దని ఏ శాస్త్రం కూడా చెప్పలేదన్నారు. చాలా వైకల్యాల నివారణకు గోమాంసం పనిచేస్తుందని చక్ర సంహితలో రాసిన విషయాన్ని గుర్తు చేశారు. జలుబు, దగ్గు, జర్వం వంటి వ్యాధుల నివారణంతో పాటు... ఆకలి రగిల్చేందుకు దోహదం చేస్తుందని చక్ర సంహితలో ఉన్న అంశాన్ని ప్రస్తావించారు. శారీరక శ్రమ చేసేవారు ఆవు మాంసం కోరుకుంటారని చెప్పారు.

మోడీ పాలనలో మైనారిటీల్లో అభద్రతా భావం....

మోడీ పాలనలో మైనారిటీల్లో అభద్రతా భావం పెరిగిపోయిందని డాక్టర్‌ భార్గవ.. రాష్ట్రపతి ప్రణబ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. బీజేపీ పాలనతో తాము ద్వితీయ శ్రేణి పౌరులమన్న భావం ప్రబలిందని, దేశానికి ఇది మంచిదికాది ఆయన సూచించారు. 

10:42 - November 13, 2015

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ నష్టాలను తగ్గించుకుంటోంది. లాభాల్లో ఉన్న డిపోల సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం 95 డిపోలున్నాయి. విభజన నాటికి కేవలం ఆరు డిపోలు మాత్రమే లాభాల్లో ఉండేవి. విభజన తర్వాత వీటి సంఖ్య పన్నెండుకు చేరింది. 37 డిపోల్లో నష్టాలు తగ్గాయి. అధికారులు, కార్మికులు సమన్వయంతో పనిచేసి 49 డిపోల్లో సత్ఫలితాలను తీసుకొచ్చారు.

లాభాల్లోకి మరో ఆరు డిపోలు......

ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, మణుగూరు, సత్తుపల్లి, రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్-1 డిపోలు కొత్తగా లాభాల్లోకి వచ్చాయి. ఈ డిపోల్లో అనుసరించిన విధానాలనే అన్ని డిపోల్లోనూ అమలు చేస్తామంటున్నారు అధికారులు.

గుదిబండగా డీజీల్‌ భారం......

ప్రభుత్వం సహకారం అందిస్తే ఆర్టీసీ మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించే అవకాశముంది. చిత్తశుద్ధిగా తోడ్పాటు అందిస్తే సంస్థ లాభాల్లోకి రావడం కష్టమేమి కాదు. డీజిల్‌ ధరలే ఆర్టీసీకి గుదిబండగా మారాయి. ఏటా 60 కోట్ల లీటర్ల డీజిల్‌ను పెట్రోలియం శాఖ నుంచి ఆర్టీసీ కొనుగోలు చేస్తోంది. పెద్ద మొత్తంలో డీజిల్ కొనుగోలు చేస్తున్నా కేంద్రం ఎటువంటి మినహాయింపులు ఇవ్వడం లేదు. దీనికి తోడు డీజీల్‌ కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం 28 శాతం వ్యాట్ వసూల్ చేస్తోంది. దీంతో సంస్థపై డీజీల్‌ భారం అధికంగా ఉంటోంది. ఇంధనం వల్లే ఆర్టీసీకి 40 శాతం నష్టాలు వస్తున్నాయి. ఈ నష్టాల్లో నుంచి బయట పడేందుకు రవాణా సంస్థకు పూర్తి సహకారం అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

భారంగా మారిన విడిభాగాల కొనుగోలు......

మరోపక్క విడిభాగాల కొనుగోలు కూడా సంస్థకు భారంగా మారింది. వీటిపైనా రాష్ట్ర ప్రభుత్వం 14.5 శాతం వ్యాట్ వేస్తోంది. ఈ వ్యాట్‌ భారాన్ని తగ్గిస్తే ఆర్టీసీకి ఖర్చు తగ్గే అవకాశముంది. తద్వారా నష్టాల నుంచి బయటపడే మార్గం ఏర్పడుతుంది. 

10:40 - November 13, 2015

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా బయ్యారం ఉక్కు కర్మాగారం పై నజర్ వేసింది తెలంగాణ సర్కార్. ఇటీవల రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పురోగతి పై సమీక్ష జరిపిన సందర్భంగా బయ్యారం ఫ్యాక్టరీపై చర్చించారు. ప్రత్యేకంగా ఉక్కు కర్మాగారం పై చర్చించేందుకు సమావేశాన్ని సైతం సీఎస్ రాజీశ్ శర్మ ఏర్పాటు చేశారు. వీలైనంత త్వరగా బయ్యారం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది సర్కార్. దీనికోసం శుక్రవారం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులతోపాటు రాష్ట్ర భూగర్భ గనుల శాఖ, సింగరేణి అధికారులు సమావేశం కానున్నారు.

బయ్యారంలో ఉక్కు కర్మాగారం ప్రాథమిక పనులు మొదలు......

బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక పనులను స్టార్ట్ చేసింది. ఏయే ప్రాంతాల్లో ఎంత ఇనుప ఖనిజం లభ్యమవుతోంది, దాంట్లో నాణ్యత ఎంత అనే అంశాలను అధ్యయనం చేసేందుకు టెండర్ల ప్రక్రియ బాధ్యతను తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపట్టనుంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని సెయిల్ ఏర్పాటు చేస్తుందని కేంద్రం ప్రకటించింది. ఈమేరకు 2014 మేలో కేంద్ర బృందం బయ్యారంలో పర్యటించింది. శుక్రవారం జరిగే సమావేశంతో బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌పై ప్రభుత్వం కసరత్తు.......

ఇక ఎమ్మార్ ప్రాపర్టీస్ పై ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై కూడా సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన ప్రభుత్వ కార్యదర్శుల కమిటీ సమావేశం కానుంది. ఇప్పటికే 532 ఎకరాల ఎమ్మార్ స్థలంలో గోల్ప్ కోర్సు క్లబ్, విల్లాలు ఉన్నాయని గుర్తించింది ప్రభుత్వం. అయితే ఈ విషయమై కోర్టులో కేసున్నందున న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా.. ప్రభుత్వమే నిర్వహణ సాధ్యమా...ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా...తదితర అంశాలపై చర్చించనుంది. మొత్తానికి ఈ రెండు సమావేశాల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుందో వేచిచూడాలి.

10:38 - November 13, 2015

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లోని కాలా హనుమన్‌ దేవాలయం సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. డెకరేషన్‌ గోడౌన్‌ సెంటర్‌లో మంటలు చెలరేగడంతో.. గోడౌన్‌ యాజమాని అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేశారు.

 

10:37 - November 13, 2015

హైదరాబాద్ : ఏపీఎన్‌జీవోల హయాంలో సొసైటీ నిధుల కుంభకోణం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఉమ్మడి రాష్ర్టంగా ఉన్న సమయంలో 18 కోట్ల రూపాయలు గోల్‌మాల్‌ చేశారని, వీరిపై చర్యలు తీసుకుని డబ్బు రికవరీ చేయాలని కోరుతూ టీఎన్‌జీవోలు ఏసీబీ డైరెక్టర్‌ ఎకె ఖాన్‌కు ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి కాజేసిన వారిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేసినట్లు సంఘం ప్రతినిధులు ఏకే ఖాన్‌కు వివరించారు.

6వేల300 మంది సభ్యులతో.....

తెలుగు రాష్ర్టాలు ఉమ్మడిగా ఉన్న సమయంలో 6వేల300 మంది సభ్యులతో ఎపి ఎన్‌జివో హౌసింగ్‌ సొసైటీని ఏర్పాటుచేశారు. గచ్చిబౌలిలోని 192 ఎకరాలు కేటాయించడంతో అందులో 92 ఎకరాల అభివృద్దికి సభ్యుల నుంచి 30 వేల రూపాయల చొప్పున వసూలు చేశారు. మిగిలిన వంద ఎకరాలు కోర్టు కేసుల్లో ఉండటంతో ఆ స్థలాన్ని వదిలిపెట్టారు.

అభివృద్ధి కోసం మొత్తం 35 కోట్ల రూపాయలు వసూలు......

భూమి అభివృద్ది కోసం మొత్తం 35 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇందులో 23 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపించారు. అభివృద్ది పేరుతో కోట్లాది రూపాయలు గోల్‌మాల్‌ అయ్యాయని అనుమానం రావడంతో సభ్యులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. విజిలెన్స్‌ విభాగం అధికారులు పరిశీలన జరిపి 18 కోట్ల రూపాయలు గోల్‌మాల్‌ అయ్యాయని నిర్ధారించారు. దీంతో సిసిఎస్‌ పోలీసులు సొసైటీ ప్రతినిధులపై కేసులు నమోదు చేశారు.

2012లోనే పోలీసులను ఆశ్రయించిన టీఎన్‌జీవోలు.....

2012లోనే పోలీసులు కేసులు నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు కేసులో ఎటువంటి పురోగతి లేదు. దీంతో టిఎన్‌జివోలు ప్రస్తుతం ఎసిబి అధికారులను ఆశ్రయించారు. వాస్తవానికి ప్రభుత్వం తమకు కేటాయించిన స్థలం 192 ఎకరాలు అయినప్పటికీ వంద ఎకరాలు కోర్టు కేసుల్లో ఉందని వారు తెలిపారు. ఎసిబి పూర్తి స్థాయి పరిశీలన జరిపి బాధ్యుతలపై చర్యలు తీసుకుని డబ్బు రికవరీ చేయాలని ఎసిబి అధికారులను టిఎన్‌జివోలు కోరారు.

10:33 - November 13, 2015

హైదరాబాద్ : మంత్రి తలసాని మంత్రి పదవిపై హైకోర్టులో మరోసారి పిటీషన్‌ దాఖలైంది. ఎమ్మెల్యేగా రాజీనామ చేసి..మంత్రిగా కొనసాగటాన్ని సవాల్ చేస్తూ శివప్రసాద్ అనే వ్యక్తి కో వారెంట్ పిటీషన్ దాఖలు చేశాడు. అయితే హైకోర్టు న్యాయస్థానం ఆ పిటీషన్‌ను విచారణకు స్వీకరిస్తూ నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని తలసాని సహా ప్రతివాదులను ఆదేశించింది.

మంత్రి పదవికి అనర్హడంటూ పిటీషన్‌.....

టిడిపి నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన తలసాని మంత్రి పదవికి అనర్హుడని హైకోర్టులో మరోసారి పిటీషన్ దాఖలైంది. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై హైకోర్టులో పిటీషన్ దాఖలు కావటం ఇది రెండోసారి. గతంలో పార్టీఫిరాయింపులకు పాల్పడినందుకు అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని సనత్ నగర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే పలుమార్లు దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు...స్పీకర్‌కు కోర్టు నోటీసులిచ్చే అధికారం ఉందో లేదో తెలపాలని పిటీషనర్‌ను కోరింది. అయితే ఎక్కడా స్పీకర్‌కు నోటీసులిచ్చినట్టు నిరూపితం కాకపోవడంతో..పిటీషన్‌ను తిరస్కరిస్తూ తలసానికి హైకోర్టు ఊరటనిచ్చింది. వివరణ విషయంలో స్పీకర్‌కు నోటీసులు జారీ చేసే అధికారం తమకు లేదని పిటీషనర్‌కు కోర్టు తెలిపింది.

మంత్రి పదవికి అనర్హుడంటూ మరోసారి పిటీషన్‌

అయితే తాజాగా మరోసారి తలసాని మంత్రి పదవికి అనర్హుడంటూ పిటీషన్‌ దాఖలైంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మంత్రిగా కొనసాగటం ప్రజాప్రాతినిథ్య చట్టం ఉల్లంఘనే అవుతుందని తంగెళ్ల శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి కో వారెంట్ పిటీషన్‌ దాఖలు చేశాడు. అయితే ఈ పిటీషన్‌ను తొలుత విచారణకు స్వీకరించాలా వద్దా అన్న అంశంపైనే రెండు వారాలు వాయిదా కొనసాగింది. ఎట్టకేలకు పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్ధానం..నాలుగు వారాల్లోగా జవాబివ్వాలంటూ..మంత్రి తలసానికి నోటీసులిస్తూ విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది. మొత్తంమీద టిడిపి నుంచి వెళ్లి గులాబీ పార్టీ కండువ కప్పుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇప్పుడు హైకోర్టుకు ఏం సమాధానం చెప్తాడోఅన్నది ఆసక్తికరంగా మారింది. తలసాని చెప్పే సమాధానంపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది కూడా ఆసక్తిగా మారింది.

పాదచారులపైకి దూసుకెళ్లిన లారీ : నలుగురు మృతి

ప్రకాశం : సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్ద లారీ బీభత్సం సృష్టించింది. పాదచారులపైకి లారీ దూసుకెళ్లడంతో నలుగురు మృతి చెందారు.

 

ఎస్‌ఐ పేరుతో బెదిరింపులకు పాల్పడుతన్న కానిస్టేబుల్ అరెస్ట్...

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లో ఎస్‌ఐ పేరుతో ఓ కానిస్టేబుల్ పలువురిని బెదిరిస్తున్నాడు. బెదిరింపులకు పాల్పడుతున్న కానిస్టేబుల్‌పై పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సాంకేతిక లోపంతో నిలిచిన శాతవాహన ఎక్స్ ప్రెస్

వరంగల్ : శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌లో శాతవాహన ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

హెల్మెట్ లేకుంటే జరిమానా మాత్రమే....

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో తప్పనిసరి హెల్మెట్ అమలుపై చంద్రబాబు సర్కారు మరోసారి మెట్టుదిగింది. ప్రస్తుతానికి ఎవరినీ నొప్పించని రీతిలో ముందుకు సాగాలని, హెల్మెట్ లేనివారికి కేవలం జరిమానా మాత్రమే విధించి వదిలి వేయాలని పోలీసులకు రవాణా శాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. మొదటిసారి దొరికితే రూ. 100, రెండోసారి రూ.

09:49 - November 13, 2015

హైదరాబాద్ : అనుమతించిన పరిణామం కంటే సీసం ఎక్కువ పాళ్లు ఉందని తేలడంతో ఐదు నెలల కిందట మ్యాగీని భారత్ లో నిషేధించిన సంగతి తెలిసిందే. అన్ని పరీక్షలను దాటుకొని మార్కెట్ లోకి వచ్చిన మ్యాగీకి తీపికబురు దక్కింది. ఈ రోజు నుంచి భారత్ లో ఆన్ లైన్ లో మ్యాగీ విక్రయాలు మొదలవగా....ఆన్ లైన్ లో మ్యాగీ అందుబాటులోనికి వచ్చిన ఐదు నిముషాల వ్యవధిలోనే దాదాపు 60వేల వెల్ కమ్ మ్యాగీ కిట్లు అమ్ముడయ్యాయి. ఐదు నిముషాల వ్యవధిలో 60 వేల మ్యాగీ కిట్ లు అమ్ముడు కావడం మ్యాగీకి భారత్ లో ఉన్న డిమాండ్ కు నిదర్శనంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం నెస్లే ఇండియాకు పెద్ద ఉపశమనమని విశ్లేషిస్తున్నారు.

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

ముంబై : నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంబమయ్యాయి. 250 పాయింట్లకు పైగా సెన్సెక్స్, 80 పాయింట్లకు పై గా నిఫ్టీ నష్టాలలో ట్రేడ్ అవుతున్నాయి.

తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్‌ ప్రారంభం...

చిత్తూరు : తిరుమలలోని శ్రీనివాసం యాత్రికుల సముదాయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్‌ను టీటీడీ ఛైర్మన చదలవాడ కృష్ణమూర్తి ప్రారంభించారు. సోమ, మంగళ, బుధ, గురువారాల్లో 5వేల టికెట్లను విక్రయించారు. శుక్ర, శనివారాల్లో మరో 2,500 టికెట్లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు.

09:38 - November 13, 2015

హైదరాబాద్: కనీస వేతనం పెంపు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ దాదాపు 2నెలలుగా సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లు తమ ఆందోళనను ఉధృతం చేసారు. ఈరోజు తెలంగాణలోని అన్ని ఆర్టీసీ బస్‌ డిపోల ఎదుట బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. హైదరాబాద్‌, ఆదిలాబాద్‌,ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోని బస్‌ డిపోల వద్దకు తెల్లవారుఝామునే చేరుకున్న ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసారు. అక్రమ అరెస్ట్‌లపై మండిపడుతున్న ఆశా కార్యకర్తలు తమ సమస్యలు తీరేంతవరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్ఠం చేస్తున్నారు.

09:35 - November 13, 2015

విజయవాడ : పవన్‌ కల్యాణ్‌.. మళ్లీ స్టైల్‌ మార్చారు. ఈసారి రొటీన్‌కి భిన్నంగా దర్శనమిచ్చాడు. ఈ కొత్త లుక్‌ వెనుక రహస్యం ఏంటి..? ఈ డ్రెస్‌ ద్వారా తెలుగు ప్రజలకు ఏ మెసేజ్‌ ఇవ్వాలనుకుంటున్నారు..?

తెల్లటి చొక్కా..! మడత నలగని.. తెల్ల లుంగీ..!!....

తెల్లటి చొక్కా..! మడత నలగని.. తెల్ల లుంగీ..!! పవన్‌ కల్యాణ్‌ న్యూ లుక్‌ ఇది. చంద్రబాబుతో భేటీ సందర్భంగా పవన్‌ ధరించిన డ్రెస్‌.. సినీ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ సాగుతోంది. స్టైలిష్‌ లుక్స్‌ విషయంలో పవన్‌ కల్యాణ్‌ది ముందునుంచీ డిఫరెంట్‌ క్యారెక్టరే. ఎప్పటికప్పుడు.. తన స్టైల్‌కు పొలిటికల్‌ టచ్‌ ఇస్తూ వస్తున్నారు. జనసేన పార్టీ ఏర్పాటు సమయంలో.. కుర్తా, లాల్చీలతో దర్శనమిచ్చారు. ఎన్నికల ప్రచార సభల్లోనూ ఇదే రూపంలో కనిపించారు. ఇటీవలే.. 150వ సినిమాలో నటించిన చిరంజీవిని అభినందించేందుకు.. పవన్‌ సినిమా గెటప్‌తోనే అన్నయ్య ఇంటికి వెళ్లారు.

ప్రత్యేక కారణమైనా ఉందా?

ఇలా ఎప్పటికప్పుడు విభిన్నమైన గెటప్‌లతో కనిపించే పవన్‌.. గురువారం చంద్రబాబుతో భేటీ సందర్భంగా.. తెల్లటి చొక్కా.. పంచె ధరించి న్యూ లుక్‌తో కనిపించారు. దీని వెనుక ప్రత్యేక కారణమైనా ఉందా అన్న చర్చ.. తెలుగు రాష్ట్రాల్లో సాగుతోంది.

రైతులను ఆకట్టుకునేందుకే..

ఆంధ్ర ప్రదేశ్‌లో అత్యధిక శాతం ఉన్న రైతులను ఆకట్టుకునేందుకే.. పవన్‌ ఇలా పంచెకట్టుతో వచ్చారని భావిస్తున్నారు. మరోవైపు.. తెలంగాణలో జనసేన పార్టీకి ఎన్నికల కమీషన్‌ గుర్తింపు లభించిన నేపథ్యంలో.. ఓటర్లను ఆకట్టుకునేందుకు.. పవన్‌ ఇలాంటి న్యూ లుక్‌ను ఎంచుకుంటున్నారని అంటున్నారు. ఆయన ఇదే స్టైల్‌ను మరికొంత కాలం కొనసాగించే వీలుందనీ అంటున్నారు. కారణాలేవైనా.. పవన్‌ న్యూ లుక్‌ ఆయన అభిమానులను కిర్రెక్కించిందనే చెప్పాలి. 

09:30 - November 13, 2015

ప్రకృతి అందించిన ఆరోగ్యవరాలు… ఆకుకూరలు. ఇవి చేసే అద్భుతాలు అంతాయింతా కాదు. శరీరానికి కావలసిన అనేక రకాల ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లను అందిస్తూ… నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. ఈ కోవకు చెందిందే పుదీనా. ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన వాసనతో ఉంటుంది. ప్రయోగానంతరం చల్లదనాన్ని ప్రసాదిస్తుంది. దీని శాస్త్రీయనామం మిన్‌థా లామియేసి. ఇది మెంథా స్పైకాటా జాతికి చెందిన మొక్క. సంస్కృతంలో పూతిహ అంటారు. పూతి అంటే వాసన చూసేది అని అర్ధం. తెలుగులో పుదీనా అనీ, ఇంగ్లీష్‌లో మింట్‌ అని, లాటిన్‌లో మెంతా పైపరేటా అనీ పిలుస్తారు. మంచి వన్నె గల ఆకుపచ్చని రంగులో ఉండి, సంవత్సరమంతా ఆకుపచ్చ గానే ఉంటుంది.

ఆరోగ్యానికి ఇలా.....

పుదీనా ఆకుల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచే విన్తమిన్ ఎ , విటమిన్ సి గుణాలు అధికం. పొట్ట నొప్పిని తగ్గించి జీర్ణ వ్యవస్ధను మెరుగుపరుస్తుంది. పుదీనా చాయ్ తాగితే, మలబద్ధకం పోయి, పొట్ట శుభ్రపడటం, చర్మ సంబంధితమొటిమలు నివారించబడతాయి. పుదీనా ఆకులు చర్మానికి చల్లదనాన్నిచ్చి, చర్మ మంటలను పోగొడతాయి. పుదీనా శరీరంలోని మలినాలను విసర్జిస్తుంది. పుదీనా ఆకులను పేస్ట్ చేసి వాడితే దంతాలు తెల్లగా మెరిసిపోతాయి. చెడుశ్వాస నివారించబడుతుంది. పుదీనా శరీర రక్తాన్ని కూడా శుభ్రం చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న పుదీనా ఆకు ఆరోగ్యం బాగుండాలంటే తప్పక మన వంటకాలలోచేర్చాలి.

మాజీ ఎంపీటీసీ ఆత్మహత్య

గుంటూరు : రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో మర్రి శ్రీనివాస్(36) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం పొలంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పులపాలై మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. సుమారు రూ.6 లక్షలు అప్పుల అయినట్లు తెలిసింది. గతంలో ఆయన ఎంపీటీసీగా పనిచేశారు.

09:00 - November 13, 2015

బాలకృష్ణ హీరోగా ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం 'డిక్టేటర్‌'. బాలకృష్ణ 99వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీవాస్‌ దర్శకుడు. బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు ఏకధాటిగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి విడుదల చేయాలనే తమ సంకల్పానికి బాలయ్యగారు పేర్కొన్నారు. అనుక్షణం ఆయన అందించిన సపోర్ట్ తో ఎటువంటి ఆటంకం లేకుండా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోందన్నారు. రెండు పాటలు, రెండు ఫైట్స్, ఢిల్లీలో చిత్రీకరించాల్సి కొన్ని కీలక సన్నివేశాలు మినహా 80శాతం షూటింగ్‌ పూర్తయ్యిందని చెప్పారు. డిసెంబర్‌లో ఆడియోను విడుదల చేసి, సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 

ఏసీబీ వలలో దేవరకొండ వీఆర్వో

నల్గొండ :లంచం తీసుకుంటూ ఓ వీఆర్వో ఏసీబీకి చిక్కా డు. నల్లగొండ జిల్లా హాలియాకు చెందిన దేప సతీశ్‌రెడ్డికి దేవరకొండ మండలం గొట్టిముక్కలలో తన తండ్రి పేరిట ఐదు ఎకరాల భూమి ఉన్నది. తండ్రి మృతి చెందడంతో ఆ భూమిని తన పేరుమీదకు మార్చాలని వీఆర్వో ఆమనగంటి రాంమోహన్‌రావును ఆశ్రయించగా వీఆర్వో రూ.30వేలు డిమాండ్ చేశాడు. రెండు నెలల కిందట రూ.10 వేలు ఇచ్చిన బాధితుడు, మరో విడతలో రూ.18 వేలు ఇస్తానని ఒప్పందం చేసుకుని ఏసీబీని ఆశ్రయించాడు. పథకం ప్రకారం దేవరకొండ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోకు డబ్బులు ఇవ్వగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఆర్టీసీ బస్సు-ద్విచక్రవాహనం ఢీ : ఇద్దరి మృతి

ఖమ్మం:బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పశువుల సంతకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నేటి నుంచి అమెరికాలో ఏపీ సీఎస్ పర్యటన

విజయవాడ : ఏపీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు నేటినుంచి 19వతేదీ వరకు అమెరికాలో పర్యటిస్తున్నారు. ప్రవాసి భారతీయ దివస్‌తో సహా పలు కార్యక్రమాల్లో సీఎస్‌ పాల్గొంటారని అధికారులు చెప్పారు.

08:38 - November 13, 2015

హైదరాబాద్ :ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ ఎందుకు సర్దుబాటు ధోరణి లో వ్యహరిస్తున్నారని గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ద హన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ లో ప్రశ్నించారు. ఏపీ కి ప్రత్యేక హోదా విషయంలో గతంలో చెప్పిన మాటలకు ఇప్పటి మాటలకు తేడా ఏమిటి? రాజకీయ పార్టీల అవసరాల కోసం ప్రజలను రెచ్చగొడతారు? బాక్సైట్ తవ్వకాలపై పవన్ దోబూచులాటలు ఆడుతున్నాడా? నిర్ధిష్టంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత సమస్యలపై చంద్రబాబు నుండి స్పష్టమైన హామీ పవన్ కు వచ్చిందా? పరీక్షల కోసం చదివే విద్యార్థులు ఎలా ఫెయిల్ అవుతాడో ఎన్నికల కోసం పుట్టే పార్టీలు కూడా ఫెయిల్ అవుతాయని తెలిపారు.

దశాబ్ధాల పాటు మయన్మార్ ప్రజలు సాగించిన పోరాటం విజయం సాధించింది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి మయన్మార్ దేశం కీలకం. మయన్మార్ లో పౌర ప్రభుత్వం ఏర్పడినా... ఆ ప్రభుత్వంలో మిలటరీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంగ్ సాన్ సూకీ ని దేశాధ్యక్ష పదవి చేపట్టడానికి ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈ అంశాలపై ప్రొ.కె నాగేశ్వర్ విశ్లేషణ చేశారు? పూర్తి విశ్లేషణను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

08:00 - November 13, 2015

హైదరాబాద్ : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ భేటీ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రభావంతో టిడిపి గెలిచిందా? పవన్ కల్యాన్ సామాజిక వర్గం రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారా? పవన్ కల్యాణ్ మీద ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? టిడిపి, బిజెపితో రాజీ ధోరణితో పవన్ వ్యవహరిస్తున్నారా? ఎన్నికల సమయంలో ప్రజల ముందుకు వస్తానన్న పవన్ ఏ రాజకీయ పార్టీ పై పోరాటం చేస్తారు? పెయిడ్ ఆర్టిస్ట్ లా పవన్ ప్రవర్తిస్తున్నాడా? కరువు పై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సరైన విధంగా స్పందించలేదా? రైతు ఆత్మహత్యలపై కేంద్ర స్పందన ఎలా ఉంది? ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో సీనియర్ రాజకీయ విశ్లేషకులు వెంకట్రావ్,టిఆర్ ఎస్ నేత పాతూరు సుధాకర్ రెడ్డి, ఏపీసీసీ అధికార ప్రతినిధి తులసి రెడ్డి, టిడిపి అధికార ప్రతినిధి రాజారాం యాదవ్, వైసీపీ అధికార ప్రతినిధి గౌతం రెడ్డి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

లిబియాలో ఘర్షణలు : 16 మంది మృతి

హైదరాబాద్ : లిబియాలో సైనికులకు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రేరేపిత ఉగ్రవాదులకు మధ్య పోరాటం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 16మంది ప్రాణాలు కోల్పోయారు. బెంగాజీ వద్ద చోటు చేసుకున్న ఇరు వర్గాల మధ్య ఘర్షణల్లో ఈ ప్రాణనష్టం చోటుచేసుకున్నట్లు అక్కడి హక్కుల సంస్థ ఒకటి తెలిపింది.

నేటి నుంచి తిరుపతిలో టీడీపీ దిశా నిర్దేశ సదస్సు

తిరుపతి : ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లేలా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇవాల్టి నుంచి తిరుపతిలో జరగనున్న దిశా నిర్దేశ సదస్సులో.. ఈ వ్యూహాలకు రూపకల్పన చేయనున్నారు. ఈ సదస్సులో.. పార్టీ ప్రజాప్రతినిధుల పనితీరుపై నిర్వహించిన సర్వే ఫలితాలనూ చంద్రబాబు వెలువరించనున్నారు. దీంతో.. తిరుపతి సదస్సు కొందరు టీడీపీ నాయకుల్లో దడ పుట్టిస్తోంది. 

పలు చోట్ల బస్సులను అడ్డుకుంటున్న ఆశా వర్కర్లు...

హైదరాబాద్ : తెలంగాణ జిల్లాల్లో పలు చోట్ల ఆశా వర్కర్లు తమ ఆందోళన తెలియజేస్తున్నారు. అన్ని జిల్లాల్లోని ప్రముఖ బస్సు డిపోలముందు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడికి పోలీసులు కూడా చేరుకుంటున్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి బస్సు డిపో ముందు, మరోపక్క ఖమ్మం జిల్లాలోని భద్రాచలం బస్సు డిపో ముందు ఇతర బస్సు డిపోల ముందు బైఠాయించి బస్సులను అడ్డుకుంటున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద నేడు షీక్యాబ్స్ ప్రారంభం...

హైదరాబాద్ : నగరంలో షీక్యాబ్స్‌కు పునరుత్తేజం తెచ్చేందుకు సైబరాబాద్‌ పోలీసులు చేయూత నిస్తున్నారు. మహిళా ప్రయాణికులకు భద్రతతో కూడిన భరోసాను కల్పించేందుకు హైదరాబాద్‌లో షీ టాక్సీ ప్రవేశ పెట్టారు. అయితే ఆశించినంత ఫలితం రాక మహిళా డ్రైవర్లు నిరాశలో కూరుకుపోయారు. ఇటువంటి సమయంలో వారిని ప్రోత్సహించాలనే ఉన్నతాశయంతో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సి.వి.ఆనంద్‌, ట్రాఫిక్‌ డీసీపీ అవినాష్‌మహంతి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ఉన్న ప్రీపెయిడ్‌ ట్యాక్సీలో షీక్యాబ్స్‌కు ప్రవేశం కల్పించారు. శుక్రవారం ఉదయం దీన్ని సీపీ సీవీ ఆనంద్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

తిరుమల ప్రయాణం గుండెదడను తెప్పిస్తోంది

హైదరాబాద్ : తిరుమల ప్రయాణం గుండెదడను తెప్పిస్తోంది. వర్షం పడితే.. ఘాట్ రోడ్లో ఎక్కడ ఏ కొండ పడుతుందోనని భక్తులు ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. వర్షాకాలంలో నిత్యం చోటు చేసుకుంటున్న ఘటనలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

07:11 - November 13, 2015

హైదరాబాద్ : తిరుమల ప్రయాణం గుండెదడను తెప్పిస్తోంది. వర్షం పడితే.. ఘాట్ రోడ్లో ఎక్కడ ఏ కొండ పడుతుందోనని భక్తులు ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. వర్షాకాలంలో నిత్యం చోటు చేసుకుంటున్న ఘటనలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

రెండో ఘాట్‌రోడ్డులో 20 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం.....

తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో సుమారు ఇరవై ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా అలిపిరి నుంచి ఎనిమిది కిలోమీటర్ల తర్వాత రోడ్డుపై తిరుమలకు చేరే వరకు కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం తొమ్మిదో కిలోమీటర్ వద్ద రోడ్డుపై పడడానికి సిద్ధంగా ఉన్న కొండచరియలను గుర్తించి బలమైన గోడ నిర్మించారు. అంతేకాకుండా చివరి ఐదు మలుపుల వద్ద చాలా ప్రాంతాల్లో కొండ చరియలు కూలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇంజినీరింగ్ నిపుణులు గుర్తించారు.

గతంలో ఇంజనీరింగ్‌ నిపుణులచే ఇనుపకంచె నిర్మాణం....

గతంలో భాష్యకార్ల సన్నిధి సమీపంలోని మలుపు వద్ద భారీగా కొండచరియలు విరిగి పడడంతో అప్పట్లో ఇంజినీరింగ్ నిపుణులను రప్పించి వాటిని తొలగించి ఇనుప కంచె నిర్మించారు. చివరి మలుపు వద్ద భారీగా కొండ చరియలు విరిగి పడడంతో రెండేళ్లకు ముందు అక్కడా ఇనుప కంచె నిర్మించారు. దీనివల్ల బండరాళ్లు దొర్లినా ఇనుప కంచెలో పడుతుండడంతో ప్రమాదాలు తప్పుతున్నాయి.

సుమారు ఇరవై ప్రాంతాల్లో కొండచరియలు విరిగపడే అవకాశం...........

అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే సుమారు మరో ఇరవై ప్రాంతాల్లో వెలుగుచూస్తుండడం ఇంజినీరింగ్ ఉన్నతాధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఐదురోజులుగా కురుస్తున్న వర్షాలకు రెండో ఘాట్ రోడ్డులోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. 16వ కిలోమీటర్ వద్ద మాత్రం గతంలో ఎన్నడూలేని విధంగా ఎక్కువగానే ఈసారి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆరోడ్డుపై వాహనాలను లింక్ రోడ్డు ద్వారా ఒకటో ఘాట్ రోడ్డులోకి మళ్లించి తిరుమలకు పంపుతున్నారు.

ఎల్‌ఆండ్‌ టీ నిపుణులచే పరిష్కార మార్గం అన్వేషించే యత్నం...........

భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతంలో పక్కాగా సాంకేతిక పరి‌జ్ఞానంతో మరమ్మత్తులు చేయాలని టిటిడి భావిస్తోంది. ఈ కారణంగానే యల్అండ్ టీ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థతో టిటిడి చర్యలు తీసుకుంటోది. ఇక ఐఐటీ నిపుణులు ఇచ్చే సూచనలను సైతం పరిగణలోకి తీసుకోవాలని టీటీడీ భావిస్తోంది. ఈపనులు వీలైనంత త్వరగా పూర్తిచేసి మూసివేసిన రోడ్డును పునరుద్దరించాలని అధికారులు పట్టుదలతో ఉన్నారు.

07:08 - November 13, 2015

హైదరాబాద్ : మీ ఇంటికొస్తా.. మీన‌ట్టింటికొస్తా.. టైం , ప్లేస్ మీరు చెప్పినా స‌రే ... మ‌మ్మల్ని చెప్పమ‌న్నా స‌రే.. ఇవి ఇప్పుడు టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ సంధిస్తున్న ప్రశ్నలు. ఐదువంద‌ల రోజుల గులాబీ పాల‌న‌కు .. 50 ప్రశ్నలతో స‌వాల్ విసురుతోంది హ‌స్తం పార్టీ. వ‌రంగ‌ల్‌ ఎన్నిక‌ల వేల కాంగ్రెస్ తెచ్చిన ఈ ప్రశ్నలు పుస్తకం హాట్‌ హాట్‌గా మారింది.

టీఆర్ఎస్ ఏడాది పాల‌న‌లోని లోపాల‌ను ప్రజ‌ల్లోకి.....

తెలంగాణలో ప్రధాన ప్రతిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్‌... అధికార టీఆర్ఎస్‌పై కాలు దువ్వుతోంది. ప్రభుత్వ విధానాల‌ను అంశాల వారిగా ఏకి పారేస్తూ టీఆర్ఎస్ ఏడాది పాల‌న‌లోని లోపాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకువెళుతోంది. ఇప్పటికే రైతు రుణ‌మాఫీ, ఆత్మహ‌త్యలపై పాద‌య‌ాత్రలు, భరోసా య‌ాత్రల‌తో స‌ర్కార్‌పై ఒత్తిడి పెంచింది. ఇప్పుడు వ‌రంగల్‌ ఉప ఎన్నిక‌ల బ‌రిలో తాడో పేడో తేల్చుకోవాల‌ని హస్తం పార్టీ డిసైడ్ అయింది. అందుకే బైపోల్స్‌లో పోరును మరింత ఉధృతం చేసింది.

"ఒక కేసీఆర్‌- వంద అబద్దాల" పేరుతో .....

ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీల‌పై .. "ఒక కేసీఆర్‌- వంద అబద్దాల" పేరుతో గ‌తంలో ఓ పుస్తకాన్ని రీలీజ్ చేసిన కాంగ్రెస్.. గుల‌ాబీ బాస్ ఇచ్చిన హామీల‌ను ప్రజ‌ల ముందు ఉంచింది. తాజాగా కేసీఆర్ .. తాను ఇచ్చిన హామీల‌లో 99 శాతం పూర్తయ్యాయన్న కామెంట్స్‌తో మ‌రింత ర‌గిలిపోతోంది కాంగ్రెస్. టీఆర్ఎస్‌ అధికారంలోకి వ‌చ్చి 500 రోజులు పూర్తికావండ‌తో... 500 రోజుల పాల‌నా వైఫల్యంపై 50 ప్రశ్నల‌తో బుక్‌లెట్ విడుద‌ల చేసింది కాంగ్రెస్‌. శాస‌న‌ మండ‌లి ప‌క్షనేత ష‌బ్బీర్ అలీ రూపొందించిన ఈ పుస్తకాన్ని .. గాంధీభ‌వ‌న్‌లో పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్‌రెడ్డి విడుదల చేశారు. కేసీఆర్‌ పాలనా తీరును ఉత్తం ఎండగట్టారు.

బుక్‌లెట్ వార్‌కు తెర‌లేపిన కాంగ్రెస్..

బుక్‌లెట్ వార్‌కు తెర‌లేపిన కాంగ్రెస్.. కేసీఆర్‌ ఇచ్చిన హామీల‌పై ప్రశ్నల వ‌ర్షం కురిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్లు, ద‌ళిత‌ుల‌కు మూడెక‌రాల భూమి, పేద‌ల‌కు డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లపై.. ఇంత‌వ‌ర‌కు చేసిందేమిట‌ని ప్రశ్నిస్తున్నారు హ‌స్తం పార్టీ నేత‌లు. ద‌ళిత సీఎం హామీని కేసీఆర్ తుంగ‌లో తొక్కారంటున్న నేత‌లు.. తెలంగాణ అమ‌ర‌వీరులకు ఇచ్చిన హమీపై ఏం స‌మాధానం చెబుతారంటున్నారు. ఫీజు ప‌థ‌కం, కేజీ టూ పీజీ మొద‌లు కొని .. మొన్నటి వరంగల్‌ ఎన్‌కౌంట‌ర్‌ వ‌ర‌కు... కేసీఆర్ వైఫల్యాల‌ను ఎండగడుతూ.. యాబై ప్రశ్నలు సంధించారు. అంతేకాదు దీనిపై బ‌హిరంగ చ‌ర్చకు సై అంటూ టీఆర్ఎస్‌కు స‌వాల్ విసురుతున్నారు. మొత్తానికి వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌ ప్రచారం రోజు రోజుకూ వెడెక్కుత‌ున్న వేళ ... ఈ యాబై ప్రశ్నల‌ను ప్రజ‌ల్లోకి మ‌రింతగా తీసుకువెళ్ళి.. ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందాల‌ని కాంగ్రెస్‌ భావిస్తోంది. మ‌రి ఇది కాంగ్రెస్‌కు ఏ మేర‌కు వ‌ర్కవుట్‌ అవుతుందో చూడాలి.

07:05 - November 13, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పలు దఫాలుగా ఉద్యమాలు జరిగాయి. రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలమైనది. ఉద్యోగాలు వదిలిపెట్టి సకలజనుల సమ్మె నిర్వహించారు. దేశ చరిత్రలోనే 42 రోజలు సాగిన సకల జనుల ఉద్యమం చిరస్థాయిగా నిలిచింది. ఒక రాష్ట్ర సాధన కోసం దేశంలోనే ఇలాంటి సమ్మె జరగడం చారిత్రాత్మకం.

42రోజుల పాటు సాగిన ఉద్యమం ......

సకల జనుల సమ్మెలో 42 రోజుల పాటు అన్ని స్థాయిల ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011 సెప్టెంబర్ 13 నుంచి 2011 అక్టోబర్ 24 వరకు సకలజనుల సమ్మె కొనసాగింది. అటెండర్ స్థాయి నుంచి మొదలుకొని గెజిటెడ్ అధికారి వరకు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. అయితే అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఈ సమ్మె కాలాన్ని సాధారణ సెలువుగా పరిగణించడానికి అంగీకరించలేదు. ఉద్యోగుల సెలవుల్లోంచే వీటిని వాడుకోవాలని స్పష్టం చేసింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి సకలజనుల సమ్మె కాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు.

2011 సెప్టెంబర్‌ 13నుంచి అక్టోబర్‌ 24 వరకు.....

అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యోగులకు అనేక వరాలు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.,ఇప్పుడు సకలజనుల సమ్మెను స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా పరిగణిస్తూ ఫైలుపై సంతకం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతిస్తూ...హర్షం వ్యక్తం చేశారు. 

07:03 - November 13, 2015

హైదరాబాద్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహించే సదర్‌ ఉత్సవాలు ఖైరతాబాద్‌లో ఘనంగా జరిగాయి. యాదవ మహాసభ ఆధ్వర్వంలో నిర్వహించిన ఈ ఉత్సవాలను సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌లోని పాతబస్తీలో సదర్ మేళను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దున్నపోతల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

ఖైరతా బాద్ లో ఘనంగా సదర్ ఉత్సవాలు..

హైదరాబాద్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహించే సదర్‌ ఉత్సవాలు ఖైరతాబాద్‌లో ఘనంగా జరిగాయి. యాదవ మహాసభ ఆధ్వర్వంలో నిర్వహించిన ఈ ఉత్సవాలను సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 

07:01 - November 13, 2015

విజయవాడ : రాష్ట్రంలో 16 నెలల పాలనను సమీక్షించుకునేందుకు టీడీపీ నాయకత్వం సమాయత్తమవుతోంది. తిరుపతిలో 13, 14 తేదీల్లో జరిపే దిశా నిర్దేశ సదస్సును ఇందుకు వేదికగా మలచుకోనుంది. చంద్రబాబు, లోకేశ్‌ సహా.. పార్టీ జిల్లా స్థాయి నేతల వరకూ ఇందులో పాల్గొంటారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వెళ్లేలా చేయడం.. ఇప్పటి వరకూ జరిగిన తప్పులను సరిదిద్దుకోవడం.. ప్రధాన అజెండాగా ఈ సదస్సు జరుగనుంది.

నవంబర్‌ 20 నుంచి జన చైతన్య యాత్రలు....

ఈనెల 20 నుంచి చేపట్టే జనచైతన్య యాత్రలకు సన్నాహకంగానే ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. జనచైతన్యం పేరిట 175 నియోజకవర్గంల్లోని ప్రతి గడపనూ తట్టాలని టీడీపీ నిర్ణయించింది. ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండా ఎగురవేయడం.. ప్రభుత్వ పథకాలను వివరించడం.. గ్రామాల్లోనే రాత్రిబస.. లాంటి కార్యక్రమాలను రూపొందించారు. పథకాల లోటుపాట్లను ప్రజల నుంచే తెలుసుకోవాలన్న లోకేశ్‌ సూచన మేరకే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సదస్సులో పార్టీ నేతల సూచనలను స్వీకరించి.. పకడ్బందీ కార్యాచరణను రూపొందించాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది.

నేతల పనితీరుపై సర్వే ఫలితాలు వెల్లడించనున్న చంద్రబాబు..........

తిరుపతి సదస్సు కొందరు టీడీపీ నాయకుల్లో దడ పుట్టిస్తోంది. నియోజకవర్గాల స్థాయిలో నేతల పనితీరుపై నిర్వహించిన సర్వే ఫలితాలను.. అధినేత చంద్రబాబు ఈ సదస్సులో వెలువరించనున్నారు. గతంలో విజయవాడ వేదికగా పార్టీ నేతలకు ర్యాంకులను వెలువరించిన చంద్రబాబు.. పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని గట్టి హెచ్చరికలే చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి సర్వే ఫలితాలు ఎలా ఉంటాయో.. పాత నివేదికతో పోల్చితే తమ ర్యాంకు ఎక్కడుంటుందో.. దాని ఆధారంగా.. తమ భవిష్యత్తు ఎలాంటి మలుపులు తీసుకుంటుందోనని కొందరు టీడీపీ నేతలు కలవర పడుతున్నారు.

పాత-కొత్త నేతల మధ్య అంతరాలు తగ్గించడంపై దృష్టి............

పార్టీ బలోపేతానికీ ఈ సదస్సును వినియోంచుకోనున్నారు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికీ.. ముందునుంచీ కొనసాగుతున్న వారికీ మధ్య అంతరాలను తగ్గించడంపై తిరుపతి సదస్సులో దృష్టి పెట్టనున్నారు. అమరావతి నిర్మాణంపైనా చర్చించనున్నారు. అలాగే.. జిల్లాల వారీగా మంత్రులు, ముఖ్య నేతలతో చంద్రబాబు విడివిడిగా సమావేశమై.. స్థానిక పరిస్థితులు, రాజకీయ అంశాలపై చర్చలు జరుపుతారు. 

06:58 - November 13, 2015

విజయవాడ : ప్రశ్నించడమే పరమావధిగా పార్టీ పెట్టిన జనసేనాని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జరిపిన తాజా భేటీ రాజకీయ వర్గాల్లో శతసహస్ర సందేహాలను లేవనెత్తుతోంది. ఎన్నో సమస్యలు, సందేహాలు, ప్రభుత్వ విధానాలపై వివాదాలు ఉన్పప్పటికీ వాటి జోలికి వెళ్లకుండా కేవలం చుట్టపుచూపుగా ఈ నేతల సమావేశం సాగిపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. రెండు గంటల పాటు సాగిన ముఖాముఖిలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయనే విషయం అంతర్గతమే అయినప్పటికీ బహిరంగంగా పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన సైతం నిరాశ పరిచిందనేది విమర్శ.

ప్రభుత్వం తప్పు చేస్తుంటే ప్రశ్నిస్తానని.....

ఎన్నికల్లో తెలుగుదేశంతో జట్టు కట్టి ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహదం చేసిన పార్టీ జన సేన. ప్రభుత్వం తప్పు చేస్తుంటే ప్రశ్నిస్తానని పవన్‌ అప్పట్లోనే ప్రకటించారు. రాజకీయ విమర్శకులు సైతం ఈ ప్రకటనపై ఆనందం వ్యక్తం చేశారు. జనసేన వాచ్ డాగ్ గా పనిచేస్తుందని భావించారు. అయితే పార్టీ నిర్మాణం లేకపోవడం ..పవన్ కల్యాణ్ సినీ రంగానికే అంకితమై పోవడం వల్ల ఏడాదిన్నర కాలంలో రాజకీయంగా సాధించిందేమీ లేకుండా పోయింది. ట్విట్టర్ లో చిలక పలుకులకే పరిమితమై పోయారాయన. మధ్యలో ఒకసారి కొన్ని గ్రామాల రైతుల భూసేకరణ విషయంలో రాజధాని ప్రాంతంలో పర్యటించారు. అప్పటికే ఒక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం పవన్ సూచన మేరకే భూసేకరణ నుంచి విరమించుకుంటున్నామని మంత్రుల ద్వారా ప్రకటింపచేసింది. దీంతో సందడి సద్దుమణిగిపోయింది.

బాక్సైట్ తవ్వకాలపై పెగలని పవన్‌ నోరు.....

తాజాగా ప్రభుత్వం మరోసారి తన అజెండాను అమలు చేసేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు భూసేకరణ అస్త్రంతో మరిన్ని భూములను రాజధానికి సమీకరించాలని ప్రయత్నిస్తోంది. ఇంకో వైపు అమాయక గిరిజనులను నిరాశ్రయులను చేసేలా.. ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసే.. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని భూములను 99 ఏళ్ల వరకూ కార్పొరేట్ సంస్థలకు లీజు రూపంలో అప్పగించేందుకు సంసిద్ధమవుతోంది. ఇంతటి వివాదాస్పద అంశాల నేపథ్యంలో... సీఎం-పవన్‌ల భేటీపై రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తి వ్యక్తమయ్యింది. ప్రజల పక్షాన ప్రభుత్వం ముందు ఆయన ఎన్నో డిమాండ్లు పెడతారన్న అభిప్రాయం, ఆశ వ్యక్తమయ్యాయి. కానీ ఇద్దరి భేటీ తర్వాత ఈ నమ్మకం వమ్మయిపోయింది. ఆశ నిరాశగా మిగిలిపోయింది. రాజధాని శంకుస్థాపనకు రాలేకపోయానని, అందుకుగాను ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పడానికే వచ్చానని నీరుగార్చేశారు పవన్.

నిస్పహాయతలో పవన్ కల్యాణ్ .....

బాక్సైట్ తవ్వకాల వంటి కీలక నిర్ణయాల విషయంలోనూ సర్కారును నిలదీయలేని నిస్పహాయతలో పవన్ కల్యాణ్ చిక్కుకుపోయారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బాక్సైట్ విషయం ఈనాటిది కాదని వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలోనిదని ఆయన ముక్తాయించారు. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ప్రబుత్వ విధానాలను సమర్థిస్తున్నట్లుగానే మాట్టాడారు. గిరిజనులు నిరాశ్రయులు కాకుండా వారికి అన్యాయం జరగకుండా వారి సమ్మతితోనే తవ్వకాలు జరుపుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని జనసేనాని చెప్పుకొచ్చారు. అంటే తవ్వకాలు ఖాయం అన్న విషయం ఆయన మాటల్లోనే ధ్వనించింది.

పార్టీ నిర్మాణంపైనా సందేహాలే......

ఒక రాజకీయ పార్టీ నేతగా కీలక మైన అంశాలను పక్కన పెట్టి చుట్టం చూపుగా పర్యటనకు చాప చుట్టేయడం.. ఒక్క మాటంటే ఒక్క మాట కూడా తెలుగుదేశం పార్టీని విమర్శించక పోవడం, కనీసం సలహా, సూచన ఇచ్చే సాహసం కూడా చేయకపోవడం పై పార్టీ అభిమానుల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రప్రభుత్వాన్ని సైతం తొందరపడి విమర్శించదలుచుకోలేదని విస్పష్టంగా ప్రకటించడాన్ని బట్టి చూస్తుంటే .. .జన సేనాని ఇప్పట్లో జనం అజెండాను తన జెండా గా మార్చుకునే అవకాశం లేదని తేటతెల్లమవుతోంది.    

06:54 - November 13, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఏపీలో బీజేపీ దెబ్బతినడం ఖాయమని సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబుతో ఆయన సుమారు 3 గంటలపాటు భేటీ అయ్యారు. అనంతరం పవన్‌కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తాను హాజరు కాలేకపోయానని... అందుకే ఇప్పుడు చంద్రబాబును కలుసుకుని శుభాకాంక్షలు చెప్పినట్లు తెలిపారు. రాజధాని భూముల కోసం భూసేకరణ చేపట్టకూడదని తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపానన్నారు.

బాక్సైట్‌ గనుల తవ్వకాలతో ....

విశాఖ మన్యంలో బాక్సైట్‌ గనుల తవ్వకాలతో గిరిజనులకు అన్యాయం జరగకుండా చూడాలని సీఎంను కోరినట్లు పవన్‌కళ్యాణ్‌ చెప్పారు. అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. గిరిజనుల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపే చర్యలను వెనక్కి తీసుకోవాలని కోరానన్నారు. అలాగే ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందా.. లేక ప్యాకేజీ ఇస్తుందా అనే అంశంపై చర్చించామన్నారు.

అన్ని ప్రాంతాలపై దృష్టిసారించాలని....

రాజధాని ప్రాంతంపైనే కాకుండా అన్ని ప్రాంతాలపై దృష్టిసారించాలని సీఎంకు సూచించినట్లు పవన్‌ చెప్పారు. రైతుల అంగీకారంతోనే భూ సమీకరణ చేపట్టాలని చంద్రబాబును కోరానన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలను నిలుపుకోకపోతే నష్టం తప్పదని పవన్‌కళ్యాణ్‌ అన్నారు.

రాష్ట్రానికి చెడు జరిగినా... ప్రజలకు అన్యాయం జరిగినా .....

రాష్ట్రానికి చెడు జరిగినా... ప్రజలకు అన్యాయం జరిగినా తాను చూస్తూ వూరుకోనన్న పవన్‌కల్యాణ్ .. కేంద్రం హామీలు నెరవేరుస్తానని చెప్పింది కాబట్టి వేచి చూస్తున్నామన్నారు. హామీలు అమలు చేయాలని రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడితే ఆశించిన ప్రయోజనం ఉండదన్న ఆయన... సమస్యల పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమన్నారు.

విస్తరించడానికి తన వద్ద తగిన ఆర్థిక స్తోమత లేదు....

జనసేన పార్టీని మరింత విస్తరించడానికి తన వద్ద తగిన ఆర్థిక స్తోమత లేదని పవన్‌కల్యాణ్ చెప్పారు. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై చంద్రబాబుతో చర్చించలేదని పవన్‌కల్యాణ్ చెప్పారు. తమ భేటీలో ఆ అంశం ప్రస్తావనకు రాలేదన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయానికి పార్టీని కచ్చితంగా విస్తరించి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తామని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు.

06:50 - November 13, 2015

హైదరాబాద్: టికెట్‌ రద్దు చార్జీలను రైల్వేశాఖ డబుల్‌ చేసేసింది. టికెట్‌ రద్దు నిబంధనల్లో పలు మార్పులు తీసుకొచ్చింది. ఇక నుంచి రైలు బయల్దేరాక టికెట్లు రద్దు చేస్తే నగదు వాపసు రాదు. రైలు బయల్దేరడానికి కనీసం నాలుగు గంటల ముందు టికెట్టు రద్దు చేసుకునే వారికే సొమ్ము వాపసు ఇచ్చే నిబంధన అమల్లోకి వచ్చింది.

ఫస్ట్ ఏసీ/ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ రద్దు చార్జీ రూ. 240...

ఫస్ట్ ఏసీ/ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ రద్దు చార్జీ 240కు పెంచేశారు. ఇంతకుముందు ఈ ఛార్జి 120 రూపాయలు ఉండేది. సెకండ్ ఏసీ/ఫస్ట్ క్లాస్ టికెట్ రద్దు చేసుకోవాలంటే 200 చెల్లించాల్సి ఉంటుంది. థర్డ్ ఏసీ/ఏసీసీ/3ఏ ఎకానమీ టికెట్ రద్దుకు 180, సెకండ్ స్లీపర్ క్లాస్ టికెట్ రద్దుకు 120 సమర్పించుకోవాలి. ఇక సెకండ్ క్లాస్ టికెట్ రద్దు చేసుకుంటే 60 ఎగిరిపోతాయి.

48-12 గంటల మధ్య కన్‌ఫం టికెట్ రద్దు చేస్తే 25 శాతం ఛార్జ్.....

రైలు బయల్దేరే ముందు 48-12 గంటల మధ్య కన్‌ఫం టికెట్ రద్దు చేస్తే 25 శాతం ఛార్జ్ పిండుతారు. 12-4 గంటల మధ్య కన్‌ఫం టికెట్ రద్దు చేస్తే 50 శాతం రుసులు చెల్లించాల్సి ఉంటుంది. 4 గంటల తర్వాత కన్‌ఫం టికెట్ రద్దు అవకాశం లేదు. వెయిట్ లిస్ట్/ఆర్‌ఏసీ టికెట్లు రైలు బయల్దేరే అరగంట ముందే రద్దు చేసుకోవాలి. ఐఆర్‌టీసీ ద్వారా తీసుకున్న టికెట్లకు కూడా రద్దు ఛార్జీలు, నిబంధనలు వర్తిస్తాయి. అన్‌ రిజర్వ్‌డ్‌, ఆర్‌ఏసి, వెయిట్‌ లిస్టెడ్‌ టికెట్ల రద్దు చేసుకోవడానికి చెల్లించాల్సిన ఛార్జీలు 15 నుంచి 30 కి పెరిగాయి. సెకండ్‌ క్లాస్‌ రిజర్వ్‌డ్‌, ఇతర తరగతుల్లో ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలంటే 60 రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. 

రైల్వే టికెట్‌ రద్దు ఛార్జీలు రెట్టింపు

హైదరాబాద్ : రైల్వే టికెట్‌ను రద్దు చేసుకోవాలంటే ఇక నుంచి వెనుకా ముందు ఆలోచించాల్సిందే. క్యాన్సిల్‌ మీద క్లిక్‌ చేయాలంటే పూర్తి కసరత్తు చేయాల్సిందే. టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకోవడానికి నేటి నుంచి రెట్టింపు కాసులు చెల్లించుకోవాలి. రద్దు ఛార్జీలను పెంచుతూ రైల్వే శాఖ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.

 

అమరావతి అభివృద్ధికి బ్రిటన్‌ సాయం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి అభివృద్ధికి సహకరించేందుకు బ్రిటన్‌ అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్‌ సిటీల్లో భాగంగా అమరావతికి సాయం అందించేందుకు ఆ దేశం ముందుకొచ్చింది. ఇండోర్‌, పుణె,అమరావతిలను ఐదేళ్లలో అభివృద్ధి చేస్తామని తెలిపింది. ప్రధానమంత్రి మోదీ బ్రిటన్‌లో పర్యటిస్తున్న సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. 

06:47 - November 13, 2015

హైదరాబాద్ : మూడు రోజుల బ్రిటన్‌ పర్యటన నిమిత్తం గురువారం లండన్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. గురువారం ఉదయం 10 గంటలకు ఎయిర్‌ఇండియా ప్రత్యేక విమానంలో ఇక్కడి ఈత్‌స్టిక్‌ విమానాశ్రయంలో దిగిన మోదీకి..బ్రిటన్‌ విదేశాంగశాఖ సహాయ మంత్రి హ్యూగో స్వైర్‌, ఉపాధి కల్పన మంత్రి ప్రీతి పటేల్‌ సాదర స్వాగతం పలికారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి బ్రిటన్‌ పర్యటనకు వచ్చిన మోదీకి విమానాశ్రయంలో బ్రిటన్‌ సాయుధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. ఈ పర్యటనతో దాదాపు దశాబ్ద కాలం తర్వాత లండన్‌ను సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ రికార్టులకెక్కారు.

బ్రిటన్‌ ఉన్నతస్థాయి బృందంతో భారత్‌ చర్చలు

అనంతరం ప్రధాని కామెరూన్‌ నివాసానికి చేరుకున్న భారత ప్రతినిధి బృందం బ్రిటన్‌ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో చర్చలు జరిపింది. ఆ తర్వాత ఇరువురు ప్రధానులూ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. దక్షిణాసియా, పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలు కలిసి పనిచేయనున్నట్లు మోదీ తెలిపారు. విద్య, విజ్ఞానం, సాంకేతిక అభివృద్ధిలో పరస్పర సహకారం కొనసాగుతుందని స్పష్టంచేశారు. భారత్‌లో ప్రతి పౌరుడి స్వేచ్ఛను కాపాడతామని ప్రధాని నరేంద్ర మోది అన్నారు. దేశంలో పెరిగిపోతున్న అసహన పరిస్థితులపై బ్రిటన్‌ మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ- బుద్ధుడు, గాంధీ జన్మించిన గడ్డపై అసహన పరిస్థితులకు ఆస్కారం లేదన్నారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కేమరూన్‌, భారత ప్రధాని మోది జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఇరు దేశాల మధ్య 90 వేల కోట్ల ఒప్పందం కుదిరింది. రక్షణ, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు బ్రిటన్‌ ముందుకు వచ్చింది. యుఎన్‌ఓ భద్రతాసమితిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి బ్రిటన్‌ మద్దతిస్తుందని కేమరూన్‌ ప్రకటించారు. పౌర అణు ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.

ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి దిక్చూచి....

అంతకుముందు...బ్రిటన్‌ పార్లమెంట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పంజలి ఘటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ..ఆ తర్వాత బ్రిటన్‌ పార్లమెంట్‌లో ప్రసంగించారు. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి దిక్చూచిగా నిలిచిన బ్రిటీష్‌ పార్లమెంటులో ప్రసంగించడం ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహాత్మాగాంధీ గొప్పదనం గుర్తించడంలో బ్రిటీషువారు విజ్ఞతను ప్రదర్శించారని మోదీ అన్నారు. భారత్‌లో ఎక్కువ పెట్టుబడులు పెట్టే దేశంగా బ్రిటన్‌ మూడోస్ధానంలో ఉందని మోదీ అన్నారు.

ప్రధాని కామెరూన్‌ కౌంటీ నివాసంలో బస....

మూడు రోజుల అధికారిక పర్యటన కోసం బ్రిటన్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తొలిరోజు...బ్రిటన్‌ ప్రధాని కామెరూన్‌ కౌంటీ నివాసంలో బస చేశారు. ఆ తర్వాత రెండోరోజైన శుక్రవారం ఉదయం బ్రిటన్‌ ఎలిజబెత్‌ రాణి విందు సమావేశంలో పాల్గొంటారు. అనంతరం లండన్‌ ఉత్తర ప్రాంతంలోని వెంబ్లీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయి బ్రిటన్‌లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 

06:42 - November 13, 2015

హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అనేక నగరాలు, పట్టణాలలో చైన్‌ స్నాచింగ్‌ కేసులు పెరుగుతున్నాయి. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట మహిళల మెడ నుంచి గొలుసులు తెంపుకుపోతున్న సంఘటనలు, మహిళలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలవుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైన్‌ స్నాచింగ్‌లకు కారణాలేమిటి? వాటిని నిరోధించాలంటే మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పోలీస్‌ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనివ్వకపోవడానికి కారణం ఏమిటి? తదితర అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టిం.ది. ఈ చర్చలో రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ రెడ్డన్న పాల్గొన్నారు. వారు ఏఏ అంవాలను సూచించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:40 - November 13, 2015

హైదరాబాద్ : చైన్‌ స్నాచింగ్‌ నేరాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. మహిళలు రోడ్డుపైకి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ప్రతి రోజు సగటున మూడు నుంచి నాలుగు చైన్‌ స్నాచింగ్‌లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ లో గడిచిన నాలుగేళ్లో చైన్‌ స్నాచింగ్‌ కేసులు నాలుగు రెట్లు పెరిగాయి. 2010లో హైదరాబాద్‌లో 428 కేసులు నమోదు కాగా, 2014లో వీటి సంఖ్య 1355కి చేరింది. ఇక ఈ సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే 750 కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

పీడీ యాక్ట్‌ చట్టం ప్రయోగించినా....

నగర శివార్లలోనే కాకుండా బస్తీల్లో సైతం నేరాలు జరుగుతున్నాయి. ద్విచక్రవాహనంపై వస్తున్న దొంగలు చైన్‌ స్నాచింగ్‌ చేసి పారిపోతున్నారు. బంగారం ధరలు పెరిగిపోవడంతో చైన్‌్ స్నాచింగ్‌ నేరాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. చైన్‌ స్నాచర్ల మీద పీడీ యాక్ట్‌ చట్టం ప్రయోగించి, జైలుకు పంపిస్తున్నా గొలుసు దొంగతనాలు మాత్రం తగ్గడం లేదు.

నాలుగేళ్లలో నాలుగు రెట్లు పెరిగిన చైన్‌ స్నాచింగ్‌ కేసులు....

బంగారం ధరలు పెరిగిపోవడంతో యువత చైన్‌ స్నాచింగ్‌లపై దృష్టి సారించారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్న నేరాల్లో 40 శాతం వరకు విద్యార్థులే ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రధానంగా తల్లి దండ్రులకు దూరంగా ఉంటూ నగరంలో నివాసం ఉంటున్న విద్యార్థులు, యువత జల్సాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. బిటెక్‌, మెడికల్‌, పాలిటెక్నిక్‌ కళాశాల్లలో చదువుతున్న విద్యార్థులు చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడి పోలీసులకు చిక్కారు. కాలనీల్లోను, రాత్రివేళల్లోను ఒంటరిగా వెళుతున్న మహిళలను వీరు టార్గెట్‌ చేస్తున్నారు. 220 సిసి పవర్‌ గల బైకులను ఉపయోగిస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడిన విద్యార్థులు, యువత ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నట్లు నేరపరిశోధన విభాగం పోలీసు అధికారులు చెబుతున్నారు.

పొరుగు రాష్ట్రాల నుంచి తరలివస్తున్న గొలుసు దొంగలు......

మరోపక్క బీదర్‌, మహారాష్ర్టల నుంచి వచ్చిన ముఠాలు నగరంలో చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాయి. నగరంలో వారం పది రోజులు మకాం వేసి ముందుగా ఒక ద్విచక్రవాహనాన్ని దొంగలిస్తున్నారు. ఆ వాహనంపై చోరీలకు పాల్పడుతున్నారు. సిసి కెమెరాల్లో చిక్కినప్పటికీ వాహనం కూడా దొంగలించిందే కావడంతో పోలీసులు వీరిని పట్టుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా నగరంలోనే నివాసం ఉంటూ చైన్‌ స్నాచింగ్‌లను పాల్పడుతున్న 200 మందిని పోలీసులు గుర్తించారు. వీరు జైల్లుకు వెళ్లినా మళ్లీ చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. వీరి హిస్టరీ షీట్‌లను పోలీసు స్టేషన్లలో తెరిచారు. వీరు సాధారణంగా తాము నివాసం ఉంటున్న ప్రాంతానికి దూరంగా వెళ్లి నేరాలు చేస్తున్నారు. దీనితో వారి నివాస ప్రాంతాల పరిధిలోని పోలీసు స్టేషన్లకు కూడా సమాచారాన్ని అందించి వారి కదిలికలపై నిఘా ఉంచుతున్నారు. 

గ్లోబల్ బిజినెస్ లీడర్ల జాబితాలో నాదెళ్ల

న్యూయార్క్ : ప్రపంచ వ్యాపార రంగంలోని అత్యుత్తమ నాయకుల జాబితాలో మొత్తం ముగ్గురు భారతీయులకు చోటు దక్కింది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, మాస్టర్‌కార్డ్ సీఈవో అజయ్ బంగా, కాగ్నిజెంట్ సీఈవో ఫెర్నాండెజ్ డిసౌజాకు ఈ గౌరవం దక్కింది. అమెరికాకు చెందిన ఫార్చ్యూన్ మ్యాగజైన్.. 50 మంది అత్యుత్తమ వ్యాపార నాయకుల వివరాలతో ఈ జాబితాను రూపొందించింది. ఇందులో బంగాకు 5వ స్థానం, డిసౌజాకు 16వ స్థానం, నాదెళ్లకు 47వ స్థానం లభించాయి.

మంత్రి తలసానికి హైకోర్టు నోటీసులు..

హైదరాబాద్: మంత్రి పదవి వివాదంలో చిక్కుకున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌కు హైకోర్టు నోటీసులిచ్చింది. నాలుగు వారాల్లోగా జవాబివ్వాలంటూ కోర్టు ఆదేశించింది. తలసాని మంత్రి పదవికి అనర్హుడంటూ తంగెళ్ల శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. గతంలో కూడా మంత్రి పదవికి తలసాని అనర్హుడంటూ టీడీపీ నేతలు గవర్నర్‌ను కలిసి విన్నవించిన సంగతి తెలిసిందే. ఈ తాజా పరిణామంపై తలసాని ఎలా స్పందిస్తారోనని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందపై హత్యాయత్నం కేసు నమోదైంది. హైదరాబాద్ శివారులోని చింతల్‌లో వివేకానంద్, తన బాబాయి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కె.ఎం.ప్రతాప్‌లకు సంబంధించిన స్థలం ఉంది. ఆ స్థలంలో ఎమ్మెల్యే వివేకానంద్ సూచన మేరకు హరికృష్ణ అనే వ్యక్తి టపాసుల దుకాణం ఏర్పాటు చేశాడు. వివాదాస్పద స్థలంలో దుకాణం ఎలా ఏర్పాటు చేశావని ప్రతాప్ తనయుడు కేపీ విశాల్ దుకాణదారుడిని నిలదీశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వివేకానంద్ అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. మాటామాటా పెరగడంతో వివేకానంద్ ఆగ్రహాంతో విశాల్‌పై చేయి చేసుకున్నారు.

ఒడిశాలో ఎన్ కౌంటర్ : ఇద్దరు మావోల మృతి

హైదరాబాద్ : ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. సుందర్‌గఢ్ జిల్లా అటవీప్రాంతంలో ఒడిశా పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు ఉమ్మడిగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు టాప్‌ర్యాంక్ నక్సల్స్ చనిపోయినట్లు డీజీపీ కేబీ సింగ్ గురువారం మీడియాకు తెలిపారు.

06:18 - November 13, 2015

                 డ్యాన్స్.. ఫైట్స్.. బాడీ ఫిట్నెస్ తో స్టయిలిస్‌ స్టార్‌ గా పేరు తెచ్చుకున్న వర్సటైల్ హీరో అల్లు అర్జున్‌ తాజాగా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. హీరోగా సినిమాల్లో బిజిగా నటిస్తూ వస్తున్న బన్ని ఇప్పుడు ప్రొడ్యూసర్ మారబోతున్నాడు. రీసెంట్ గా వచ్చిన 'రుద్రమదేవి' సినిమాలో 'గోన గన్నారెడ్డిగా అలరించి దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు బన్నీ. దీంతో ఇప్పుడు కన్నడలో రీమేక్‌ చేసే ఓ తెలుగు చిత్రానికో నిర్మాతగా మారబోతున్నాడు. చిన్న సినిమాగా వచ్చినా తెలుగులో విజయవంతమైన 'భలే భలే మగాడివోయ్' ఆర్ట్స్ బ్యానర్‌లోనే ఈ రూపొందింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని కన్నాడలో రీమేక్‌ రైట్స్ ను నిర్మాత రాక్లిన్‌ వెంకటేష్‌ దక్కించుకున్నారు. ఈయనతో పాటు అల్లు అర్జున్‌ కూడా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కాగా ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు. ఏదైతేనేం బన్నీలోని మరో కొత్త కోణం ఆవిష్కృతం కానుంది. 

అమిత్ షా వెనక్కి తగ్గుతున్నారా!

హైదరాబాద్: బీహార్ ఎన్నికల ఫలితాలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పీడకలను మిగిల్చాయి. తానే నిర్ణయం తీసుకున్నా నిన్న మొన్నటి వరకు సరే అని తల ఊపినవారంతా బీహార్ ఎన్నికల ఫలితాలతో విమర్శలు ఎక్కుపెడుతుండడంతో అమిత్ షా వెనక్కి తగ్గారు. ఇందులో భాగంగా ఈ నెలాఖరు నుంచే పశ్చిమ బెంగాల్ లో పార్టీ ప్రచారం ప్రారంభించాలని భావించిన అమిత్ షా వెనక్కి తగ్గారు. ఇప్పుడే ప్రచారం ప్రారంభిస్తే బీహార్ ఎన్నికల ఫలితాలే పునరావృతమయ్యే ప్రమాదం ఉందని గుర్తించారు. దీంతో వచ్చే ఏడు జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం డిసెంబర్ చివరి వారంలో మొదలు పెట్టాలని భావిస్తున్నారు.

ఐఎంఎఫ్ ఈడీగా సుబీర్ గోకర్న్

న్యూఢిల్లీ : రిజర్వుబ్యాంక్ మాజీ డిప్యూటీ గవర్నర్ సుబీర్ గోకర్న్.. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. వాషింగ్టన్ కేంద్రస్థానంగా ఆర్థిక సేవలు అందిస్తున్న ఐఎంఎఫ్.. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ దేశాలకు ఆయన బాధ్యతలు వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన అపాయింట్‌మెంట్ కమిటీ.. ఐఎంఎఫ్ ఈడీగా గోకర్న్ నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈడీగా వ్యవహరిస్తున్న రాకేష్ మోహన్ పదవీకాలం నెలాఖరుకల్లా ముగుస్తుండటంతో ఈ స్థానంలో గోకర్న్ నియమితులయ్యారు.

నేడు ఏయూ బంద్ కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు

విశాఖ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు గురువారం చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఏయూ విద్యార్థులను కేజీహెచ్కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు ఏయూ బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.

Don't Miss