Activities calendar

14 November 2015

గ్వాటిక్ ఎయిర్ పోర్టులో బాంబు కలకలం

హైదరాబాద్‌ : ఇంగ్లండ్ లోని గ్వాటిక్ ఎయిర్ పోర్టులో బాంబు కలకలం రేగింది. ఫ్రాన్స్ లో ఉగ్రదాడులతో అన్ని విమానాశ్రాయాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ క్రమంలో బ్రిటన్ లోని గ్వాటిక్ ఎయిర్ పోర్టులో ఓ టెర్మినల్ వద్ద అనుమానాస్పదంగా ఓ బ్యాగు కనిపించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను, ప్రజలను ఖాళీ చేయించారు. ప్రత్యేక పోలీసు బలగాలు, బాంబ్ స్క్వాడ్, దర్యాప్తు బృందాలు సంఘటనా స్థలికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ బ్యాగులో బాంబు దొరకలేదు కానీ, తుపాకీ లభ్యమవ్వడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

'కథాకళి' ఫస్ట్ లుక్ విడుదల...

హైదరాబాద్ : తమిళ హీరో విశాల్, కేథరిన్ జంటగా నటించిన కథాకళి మూవీ పోస్టర్‌ను చిత్ర యూనిట్ నేడు విడుదల చేసింది. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర పస్ట్ లుక్ పోస్టర్‌ని నటుడు విశాల్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, పసంగా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.

 

బాలలకు అండగా ఉంటాం : దత్తాత్రేయ

హైదరాబాద్‌ : విద్యార్థినులకు, యువతులకు కేంద్ర కార్మికశాఖ తరపున వృత్తి నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు ఆ శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని రవీంద్రభారతీలో నేడు జరిగిన ఓ కార్యక్రమంలో దత్తాత్రేయ పాల్గొన్నారు. నిరుపేద, మైనార్టీ పిల్లలు పౌష్టికాహారం అందక, విద్యావకాశాలు అభించక నిరాదరణకు గురవుతున్నారు. అలాంటి బాలలందరికీ కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. అమ్మాయిల పట్ల వివక్ష తగదని, వారికీ అన్నింట్లోనూ సమాన అవకాశాలు కల్పించాలన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లల్ని బరువుగా కాకుండా ఆది లక్ష్మిలా చూడాలన్నారు. భ్రూణహత్యలు జాతికే ప్రమాదకరం.

21:45 - November 14, 2015

ఢిల్లీ : టెస్ట్ క్రికెట్ నెంబర్ వన్ సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫ్రీడం సిరీస్ రెండోటెస్ట్...మొదటిరోజు ఆట ముగిసేసమయానికి ఆతిథ్య టీమిండియా పటిష్టమైన స్థితిలో ఉంది. సౌతాఫ్రికాను తొలిఇన్నింగ్స్ లో 214 పరుగులకు కుప్పకూల్చిన టీమిండియా...తొలిరోజుఆట ముగిసేసమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్ మొదటి వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. మొహాలీ టెస్ట్ లో ఘోరంగా విఫలమైన శిఖర్ ధావన్...బెంగళూరు టెస్ట్ తొలిఇన్నింగ్స్ లో స్ట్రోక్ ఫుల్ బ్యాటింగ్ తో ఆకట్టుకొన్నాడు. ఏడు బౌండ్రీలతో సఫారీబౌలింగ్ ఎటాక్ ను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నాడు. మురళీ విజయ్ 28, శిఖర్ ధావన్ 45 స్కోర్లతో నాటౌట్ గా ఉన్నారు. అంతకుముందు...వందటెస్టుల మొనగాడు ఏబీ డివిలియర్స్ ఫైటింగ్ హాఫ్ సెంచరీ సాధించినా...సఫారీటీమ్ తక్కువ స్కోరుకే కుప్పకూలక తప్పలేదు.

 

21:42 - November 14, 2015

పాట్నా : బీహార్‌ మహాకూటమి శాసనసభాపక్ష నేతగా నితీష్‌ కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా ఆయన్ను జేడీయూ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత మహాకూటమిలోని మూడు పార్టీల ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కలిసి నితీష్‌కు శాసనసభా పక్షనేతగా ఎన్నుకున్నారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి 178 సీట్లు సాధించింది. జేడీయూకు 71 స్థానాలు, ఆర్జేడీకి 80 సీట్లు, కాంగ్రెస్‌కు 27 స్థానాలు వచ్చాయి. ముందుగా నితీష్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేశారు. ఆ తర్వాత నితీష్‌ కుమార్‌ గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌కు కలిసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ లేఖ అందజేశారు.

 

21:38 - November 14, 2015

హైదరాబాద్ : మోస్ట్ వాంటెడ్‌ ఎర్రచందనం స్మగ్లర్‌ కొల్లం గంగిరెడ్డిని మారిషస్‌ పోలీసులు ఏపీ సీఐడీకి అప్పగించారు. మారిషస్‌ కోర్టు అనుమతితో గంగిరెడ్డిని అదుపులోకి తీసుకోనున్నారు. ఇప్పటికే మారిషస్‌ వెళ్లిన ఏపీ పోలీసుల ప్రత్యేక బృందం అన్ని లాంఛనాలను పూర్తి చేసే పనిలో ఉంది. సీఐడీ డీజీ ద్వారకా తిరుమలరావు ఇప్పటికే ఢిల్లీ బయలు దేరారు. ఢిల్లీ మీదుగా గంగిరెడ్డిని హైదరాబాద్‌ తరలించనున్నారు. గత 8 నెలలుగా మారిషస్‌ జైలులోనే గంగిరెడ్డి కస్టడీలో ఉన్నారు. అలిపిరి వద్ద సీఎం చంద్రబాబుపై హత్యాయత్నం కేసులోనూ గంగిరెడ్డి నిందితుడుగా ఉన్నారు.

 

 

గంగిరెడ్డిని ఎపి సీఐడీకి అప్పగించిన మారిషస్ పోలీసులు

హైదరాబాద్ : మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని మారిషస్ పోలీసులు ఎపి సీఐడీకి అప్పగించారు. మారిషస్ కోర్టు అనుమతితో గంగిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి, కడప ఎస్పీలు ఢిల్లీ బయల్దేరారు. రేపు సాయంత్రానికి గంగిరెడ్డిని హైదరాబాద్ తీసుకురానున్నారు.  

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

మెదక్ : అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అల్లాదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. గడిపెద్దాపూర్‌ లో మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో శనివారం గ్రామానికి చెందిన మర్పల్లీ యాదిరెడ్డి, కెరూర్‌ సత్యనారాయణ గౌడ్‌ దుకాణాలపై పోలీసులు దాడి చేశారు. యాదిరెడ్డి వద్ద 43 క్వార్టర్లు, 26 బీర్లు , సత్యనారాయణ వద్ద 16 బీర్లు, 29 క్వార్టర్లు స్వాదీనం చేసుకున్నారు. గ్రామాలలో బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ సత్యనారాయణ హెచ్చరించారు.

21:21 - November 14, 2015

కరీంనగర్ : వడ్డీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ఏఎస్సై మోహన్‌రెడ్డికి సహకరించిన ఆఫీసర్లపై వేటు మొదలయింది..ఏఎస్పీతో మొదలయిన వేటుతో ఉన్నతాధికారుల వేట ఆరంభంతో అధికారుల్లో గుబులు రేపుతోంది..కోట్లు కొల్లగొట్టిన పోలీసుల లెక్కలు తేలుతున్నాయి. గుట్టుగా సాగిన వారి అక్రమదందా వ్యవహారంలో డొంక కదులుతోంది....ఇంకా ఎంతమంది అధికారులున్నారని ఆరా తీస్తుండగానే...బయటకు వచ్చిన పేర్లున్న ఆఫీసర్లను లూప్‌లైన్‌లోకి పంపించేస్తున్నారు...
ఏఎస్సై వెల్లడించిన అధికారులపై వేటు...
కదులుతోంది...డొంక కదులుతోంది... కరీంనగర్ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్ వ్యాపారం..దందాలు..సెటిల్‌మెంట్లకు ఇథోధికంగా సహకరించిన అధికారులపై వేటుపడుతోంది...ఇప్పటికే ఏఎస్పీ జనార్థన్‌రెడ్డిపై వేటు వేసిన పోలీస్‌ బాస్‌ ఇప్పుడు మరో ఇద్దరు డీఎస్పీలను బదిలీ చేశారు...డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు...ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి అక్రమ దందాలో పెట్టుబడులు పెట్టినట్లు విచారణలో వెల్లయినవారిలో హుజూరాబాద్‌ డీఎస్పీ సంజీవ్‌కుమార్, డీఎస్పీ రంగరాజు భాస్కర్‌రావులపై వేటుపడింది..ఇంకా విచారణలో బయటపడ్డ పేర్లున్న అధికారుల్లో గుబులు మొదలయింది...మరోవైపు ఏఎస్సై ఫైనాన్స్‌లో పెట్టుబడులు పెట్టి కోట్లు దండుకున్న అధికారుల్లో వణుకు మొదలైంది. తమను కూడా బదిలీ చేస్తారన్న భయంతో హడలెత్తిపోతున్నారు. మరోవైపు ఈ వ్యాపారంతో ఏ మాత్రం సంబంధం లేని అధికారుల పేర్లను సీఐడీ విచారణలో మోహన్‌రెడ్డి చెప్పడంపై..సదరు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాధితులకు భరోసా ఇస్తున్న బాస్‌లు..
మోహన్‌ రెడ్డి వడ్డీ వ్యాపార బాధితుల ఫిర్యాదులు ఠాణాలకు పోటెత్తుతున్నాయి. పదుల సంఖ్యలో పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. బాధితులు ఒక సంఘంగా ఏర్పడి జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్‌కు తమ గోడు చెప్పుకున్నారు. సానుకూలంగా స్పందించిన ఆయన బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు...వారి పేర్లను బయటపెట్టమని..అవసరమైతే బాధితులకు రక్షణగా ఉంటామని ఎస్పీ కార్యాలయం చెబుతోంది..దీంతో పెరిగుతున్న ఫిర్యాదులు చూసి పోలీసుల్లో ఆందోళన మొదలయింది... ఎన్ని అక్రమాలు చేశాడాని ముక్కుమీద వేలువేసుకునే పరిస్థితి ఏర్పడింది.
ఏఎస్సై అక్రమాల నిగ్గు తేల్చుతున్న సీఐడీ
ఓ ఏఎస్సై స్థాయి నుంచి వడ్డీ వ్యాపారంతో కోట్లకు పడగలెత్తిన మోహన్‌ రెడ్డి అక్రమాల డొంక కదులుతోంది. వడ్డీ వ్యాపారంలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు? పోలీస్‌ ఉద్యోగులు, నేతలు, బీనామీలెంతమంది ? ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి. వారి వాటలెంత తేల్చే పనిలో పడ్డారు పోలీస్‌ అధికారులు. డీజీపీ ఆదేశాలతో సీఐడీ అధికారులు దర్యాప్తు స్పీడ్‌ పెంచారు. బాధితులను రహస్యంగా విచారిస్తూ మోహన్ రెడ్డి బినామీలను తెలుసుకునే పనిలో పడ్డారు.
పోలీసుల అదుపులో ప్రధాన బినామీలు..
ఇప్పటికే బినామీ శ్రీధర్ రెడ్డి, హోంగార్డ్‌ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న సీఐడీ బృందం వారిని ఆరా తీస్తున్నారు. అక్రమ వడ్డీ వ్యాపారంలో కీలకంగా వ్యవహరించిన ఎనిమిది మంది బినామీలు ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసి ఎస్కేప్‌ అయ్యారు. మోహన్ రెడ్డిని మరోసారి విచారించేందుకు కోర్టు అనుమతి కోరారు. తనకేం తెలియదంటూ తప్పించుకుంటున్న అతని నుంచి ఎలాగైన వివరాలు రాబట్టాలని ప్లాన్‌ చేస్తున్నారు.
పోలీస్‌ అధికారుల్లో ఆందోళన
ఇక సిఐడి విచారణలో ఏఎస్సై చెప్పిన పోలీస్‌ అధికారుల్లో ఆందోళన పెరిగింది. ఇన్నాళ్లు ఏఎస్సైకి అండదండగా నిలిచిన అధికారులు స్వీయ రక్షణలో పడ్డారు....తమ పేర్లు బయటకి రాకుండా ఉండేందుకు కటకటాల్లో ఉన్న మోహన్‌రెడ్డికి సందేశాలు పంపుతున్నారట. కొందరు సీనియర్ ఆఫీసర్ల వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటున్నారు... తమను కాపాడాలని కోరుకుంటున్నారు... మొత్తం మీద ఏఎస్‌ఐ అక్రమ దందా కేసులో మొదలయిన వేట చివరకు ఎంతమంది ఆఫీసర్లను లూప్‌లైన్లో...జైళ్లో పెట్టిస్తుందో చూడాలి. 

21:14 - November 14, 2015

దుబాయ్ : గల్ఫ్ దేశాల్లోనే తొలిసారిగా బాలల దినోత్సవాన్ని దుబాయ్ లోని భారత రాయబార కార్యాలయం ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. వేవ్ రెస్పాన్స్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో ముంబాయికి చెందిన చిల్డ్రన్ ధియేటర్ సంస్థ నుండి 17 మంది విద్యార్ధులు ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారులంతా తమ తమ ప్రతిభను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. దుబాయ్ లో తొలిసారి జరిగిన ఈ వేడుకలను చిన్నారులు బాగా ఎంజాయ్ చేశారు. వేడుకలో దుబాయ్ దేశపు పురస్కారాలు అందుకున్న చిన్నారులను నిర్వాహకులు సన్మానించారు.

 

21:12 - November 14, 2015

విశాఖ : మన్యంలో బాక్సైట్ తవ్వకాల వల్ల కార్పొరేట్‌ సంస్థలు భారీగా లాభాలు దండుకోబోతున్నాయి. నాలుగేళ్ల క్రితం వేసిన అంచనాల ప్రకారం ఆన్‌రాక్‌, జిందాల్‌ కంపెనీలు ఏటా దాదాపు 3,500 కోట్ల రూపాయలు ఆరంగించబోతున్నాయి. కానీ, ప్రభుత్వానికీ, గిరిజనులకు రాయల్టీల రూపంలో దక్కే వాటా 70 కోట్లకు మించదు. దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు బాక్సైట్‌ తవ్వకాల్లో ఎంత దోపిడీ జరుతున్నదో.
1212 హెక్టార్లలో బాక్సైట్ తవ్వకాలు
బాక్సైట్ తవ్వకాల వ్యవహారం ఇప్పుడు విశాఖ మన్యాన్ని కుదిపేస్తోంది. 1212 హెక్టార్లలో ఏపీఎండీసీ ద్వారా బాక్సైట్ తవ్వకాలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ వ్యవహారం మరోసారి హీటెక్కింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలలో బాక్సైట్ తవ్వకాలను తీవ్ర స్వరంతో వ్యతిరేకించిన చంద్రబాబునాయుడే ఇప్పుడు బాక్సైట్ తవ్వకాలకు అనుమతులివ్వడం పట్ల గిరిజనం రగిలిపోతున్నారు. చివరకు తమ ప్రాంత పర్యటనకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే పాడేరు ఈశ్వరిని సైతం అడ్డుకున్నారు. బాక్సైట్ తవ్వకాల విషయంలో ఏపీఎండీసీతో ఒప్పందం చేసుకున్న ఆన్ రాక్ సంస్థ యజమాని జగన్ కుటుంబానికి బంధువు కావడమే ఇందుకు కారణం.
బాక్సైట్ అత్యంత విలువైన ఖనిజం
బాక్సైట్ తవ్వకాల వల్ల వచ్చే ఆదాయాన్ని గిరిజనుల అభివృద్ధికి వినియోగిస్తామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలను అడవిబిడ్డలెవ్వరూ నమ్మడం లేదు. బాక్సైట్ అనేది అత్యంత విలువైన ఖనిజం. అధునాతన ఆయుధాలు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు, వ్యోమనౌకలు ఇలాంటివాటన్నింటికీ వాడే అల్యూమినియం తయారయ్యేది బాక్సైట్ నుంచే. అంటే విశాఖ మన్యం పొత్తికడుపులో గుణపాలు దింపి, తవ్వితీసే బాక్సైట్ అంతా ప్రపంచ యుద్ధ పిపాసులకు మన ప్రభుత్వాలు అందించే కానుకగా మారబోతుందన్నది జగమెరిగిన సత్యం.
అల్యూమినియం కోసం ఎక్కువగా ఎగబడే దేశం అమెరికా
అల్యూమినియం కోసం ఎక్కువగా ఎగబడే దేశం అమెరికా. తనకు అవసరమైన అల్యూమినియంలో మూడింత రెండొంతులు ఇతర దేశాల నుంచే అమెరికా దిగుమతి చేసుకుంటోంది. అమెరికా ఏడాదికి కోటీ 20 లక్షల టన్నుల అల్యూమినియం వినియోగిస్తోంది. ఒక టన్ను అల్యూమినియం ఉత్పత్తి కావాలంటే అయిదు టన్నుల బాక్సైట్ అవసరం. ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బాక్సైట్ నిల్వలు అపారంగా వున్నాయి. విశాఖ, తూర్పుగోదావరి అటవీ ప్రాంతంలో 31 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 55 కోట్ల టన్నుల బాక్సైట్ నిల్వలున్నాయి. అరకు ఏరియాలోని 2446 హెక్టార్లలోని 24 కోట్ల టన్నుల నిల్వలను జిందాల్ కంపెనీకి, చింతపల్లి గ్రూపులో 1162 హెక్టార్లలోని 22 కోట్ల 40 లక్షల టన్నుల నిల్వలను ఆన్ రాక్ కంపెనీకి కేటాయించేలా 2007లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం వల్ల ఆన్ రాక్ కంపెనీకి ఏటా 2,350 కోట్లు, జిందాల్ కంపెనీకి 1260 కోట్ల రూపాయల నికర లాభం వస్తుందని పాట్రిక్ ఆస్కార్సన్ పరిశోధన పత్రం అప్పట్లోనే అంచనా వేసింది.
తెర మీదకు ఏపీఎండీసీ 
అయితే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గిరిజనేతరులకు బాక్సైట్ తవ్వకాలు జరిపే అవకాశం లేకపోవడంతో ఏపీఎండీసీని తెర మీదకు తెచ్చారన్నది నిర్వివాదాంశం. ఆన్ రాక్ కు అవసరమైన పర్యావరణ అనుమతులు సాధించిపెట్టడంలో ఏపీఎండీసీ చేసిన క్రుషి అంతా ఇంతా కాదు. ఆన్ రాక్ కంపెనీ అధినేత ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి బంధువు కావడమే ఏపీఎండీసీ చొరవకు కారణమన్నది వాస్తవం. ఇక ఇప్పుడు చంద్రబాబునాయుడికి కార్పొరేట్ సంస్థలంటే వల్లమాలిన ప్రేమ. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం ఆయన ఏమైనా చేయగలరు. ప్రజల నుంచి ఏదైనా, ఎంతైనా సేకరించగలరు. జనం బతుకులేమైనా, పర్యావరణం ఏమైపోయినా, సాంస్క్రుతిక విధ్వంసం జరిగినా, నదులు, నీటి వనరులు విషతుల్యమైపోయినా ఆయనకు పట్టింపు వుండదు. అవును. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు మొదలైతే గిరిజనుల బతులు ధ్వంసమైపోవడమే కాకుండా, సీలేరు, శారద, చంపావతి, గోస్తనీ నదులన్నీ కలుషితమైపోతాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూనే వున్నారు. బాక్సైట్ శుద్ధి కర్మాగారం పనిచేసే సమయంలో వెలువడే ఫ్లోరైడ్ వాయువులు, ధూళికణాలు, ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయన్న హెచ్చరికలు ప్రభుత్వాల తలకెక్కడం లేదు.
విశాఖవాసులకు తాగునీటి కష్టాలు
బాక్సైట్ తవ్వకాల వల్ల ఏటా వేల కోట్ల రూపాయలు తన్నుకుపోయే ఆన్ రాక్ లాంటి సంస్థలకు, అవి నెలకొల్పే బాక్సైట్ శుద్ధి కర్మాగారాలకు అవసరమైనన్ని నీళ్లను సరఫరా చేయాల్సిన బాధ్యత విశాఖ నగరపాలక సంస్థ మీద పడబోతున్నది. అంటే, ఆ మేరకు విశాఖవాసులకు తాగునీటి కష్టాలు కూడా రాబోతున్నాయన్నమాట. బాక్సైట్ తవ్వకాల వల్ల జరిగే జీవన విధ్వంసం ఒక్క గిరిజన ప్రాంతాలకే పరిమితం కాదనీ, దాని ప్రభావం చుట్టుపక్కల పట్టణాల, మీద నగరాల మీద కూడా వుండబోతున్నదన్నది అందరూ అంగీకరిస్తున్న వాస్తవం. మరి బాక్సైట్ తవ్వకాల మీద చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ?

 

21:00 - November 14, 2015

ఢిల్లీ : ఎన్డీయే సర్కార్‌ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని సీపీఎం కేంద్ర కమిటీ నిర్ణయించినట్లు ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు తెలిపారు. ఈమేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 1 నుంచి 6 వరకు దేశ వ్యాప్తంగా ప్రచారోద్యమం నిర్వహిస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్‌ పర్యటనకు బయలుదేరే ముందు 15 రంగాల్లో ఎఫ్‌డీఐలకు అనుమతి ఇవ్వడాన్ని కేంద్ర కమిటీ సమావేశాలు తప్పుపట్టాయన్నారు. పార్లమెంటులో చర్చించకుండా ఎఫ్‌ఐడీలకు అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినట్లు తెలిపారు.

 

20:56 - November 14, 2015

హైదరాబాద్ : వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక రావడానికి ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. అవినీతి పేరుతో ఉప ముఖ్యమంత్రి రాజయ్యను బర్తరఫ్‌ చేయడంతోనే ఈ ఎన్నికల వచ్చిందన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ సహార ఉద్యోగుల పీఎఫ్‌ సొమ్మును మాఫీ చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరుగుతోందన్నారు. రాజయ్యను బర్తరఫ్‌ చేసినప్పడు కేసీఆర్‌ను ఎందుకు బర్తరఫ్‌ చేయకూడదని తమ్మినేని ప్రశ్నించారు.

 

20:50 - November 14, 2015

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశంలో నిరంకుశపాలన కొనసాగుతోందని సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ పీఎం భార్గవ విమర్శించారు. సీపీఐ కార్యాలయంలో జరిగిన ఓ సెమినార్‌ లో ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో ఎన్డీయే సర్కార్‌ నడుస్తోందన్నారు. బీజేపీ అధికారాన్ని అడ్డుంపెట్టుకుని సంఘ్‌ పరివార్‌ శక్తులు రెచ్చిపోతున్నాయని డాక్టర్‌ భార్గవ మండిపడ్డారు.

 

 

20:44 - November 14, 2015

హైదరాబాద్ : 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి రాజ్యవర్థన్‌సింగ్, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సినీ ప్రముఖులు ముఖేష్ ఖన్నా, టబు, కరీనాకపూర్, కరిష్మాకపూర్ తదితరులు హాజరయ్యారు. ఈ నెల 20వరకు ఈ చిత్రో త్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో మొదటి సినిమాగా 'హ్యాపీ మదర్స్ డే' ప్రదర్శించనున్నారు. నగరంలోని చిన్నారులు చిత్రాలు చూసేందుకు అనువుగా 12 థియేటర్లను కేటాయించారు. ఈ చిత్రోత్సవాల్లో 283 సినిమాలు ప్రదర్శనకు సిద్ధం కాగా... వీటిలో ఆరు తెలుగు చిత్రాలున్నాయి.

 

అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు ప్రారంభం

హైదరాబాద్ : అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు ప్రారంభం అయ్యాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బాలీవుడ్ నటీమణులు టటు, కరీనా కపూర్, కరిష్మా కపూర్ జ్యోతి ప్రజ్వలన చేసి.. ప్రారంభించారు. చిన్నారుల పాటలు, డ్యాన్సులు అందరినీ అలరించాయి. కరీనా, కరిష్మా స్టేజీపై స్టెప్పులేసి... అందరినీ ఆకర్షించారు.

 

20:19 - November 14, 2015

శ్రీకాకుళం : జిల్లాలో గన్ కల్చర్ భయాందోళనలకు గురిచేస్తోంది. ఆధార్ కార్డు అనుసంధానం చేస్తామంటూ ఒక ఇంట్లోకి ప్రవేశించిన ముగ్గురు యువకులు వృద్ధదంపతులకు తుపాకీ చూపించి బెదిరించి కత్తులతో దాడి చేశారు . శ్రీకాకుళం పట్టణం లో సాయిబుల తోటలో నివాసం ఉంటున్న రిటైర్డ్ విద్యుత్ శాఖా ఉద్యోగి అందవరపు భూషణ్ రాజు దంపతులను ముగ్గురు యువకులు గన్ చూపించి బెదిరించారు. భూషణ్‌ రాజును తీవ్రంగా గాయపరిచారు. ఈలోగా చుట్టుపక్కల వారు గుమిగూడటంతో దోపిడి ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు. తీవ్ర గాయాలైన భూషణ్ రాజు ను శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు శ్రీకాకుళంలో ఈ తరహా దోపిడీ, గన్ తో బెదిరించడం తొలిసారని పోలీసులు తెలిపారు.

 

పేకాటస్థావరంపై పోలీసుల దాడులు

హైదరాబాద్ : నగరంలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో గల మారుతినగర్‌లో పోలీసులు పేకాటస్థావరంపై దాడులు చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఎనిమిదిమంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 30 వేల నగదుతో పాటు 10 సెల్‌ఫోన్లు, పలు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కరీంనగర్ లో దారుణ హత్య

కరీంనగర్ : వేములవాడలో ఓ వ్యక్తి దారుణ హ్యతకు గురయ్యాడు. జాత్రా గ్రౌండ్‌లోని లాడ్జి గదిలో వ్యక్తి (40) మృతదేహాన్ని శనివారం మధ్యాహ్నం గుర్తించారు. మృతుడి తలపై బలమైన గాయాలతోపాటు కారంపొడి జల్లి ఉండడంతో హత్య జరిగినట్టు భావిస్తున్నారు. మృతుడు సిద్ధిపేట ప్రాంతానికి చెందిన రవిగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

వచ్చే నెలలో ఇండో-పాక్‌ సిరీస్‌..?

హైదరాబాద్‌ : క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండో పాక్‌ సిరీస్‌ వచ్చే నెలలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు షహర్‌యార్‌ వెల్లడించిన వివరాలను బట్టి చూస్తే....వచ్చే నెలలో పాక్‌ జట్టు భారత్ పర్యటనకు రానుంది. బీసీసీఐ చీఫ్‌ శశాంక్‌ మనోహర్‌ పీసీబీ చీఫ్‌కు ఫోన్‌ చేసి ఆహ్వానించారు. జట్లు సభ్యులకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. మొహాలీ, కోల్‌కత్తాలో మ్యాచ్‌లు ఏర్పాటు చేసేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు కూడా షహర్‌యార్‌ తెలిపారు.

ఈసీ భన్వర్ లాల్ పై మర్రి శశీధర్ రెడ్డి అగ్రహం

హైదరాబాద్ : ఈసీ భన్వర్ లాల్ పై మర్రి శశీధర్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. భన్వర్ లాల్ టీవీ ఇంటర్వ్యూల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వానికి తలొగ్గి సీఈసీ పని చేస్తుందని విమర్శించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన భన్వర్ లాల్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈసీ గౌరవం తగ్గేలా భన్వర్ లాల్ వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఎన్ని ఓట్లు తొలగించారో ఆధారాలతో నిరూపిస్తానని చెప్పారు.

 

వైసిపి నేత వీర రాఘవరెడ్డి అరెస్టు..

కడప : చాపాడు మండలం పెదచియ్యపాడులో వైసిపి నేత వీర రాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బాలికపై మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడి.. వీర రాఘవరెడ్డి పారిపోయాడు. పీఎస్ లో అతనికి రాచ మర్యాదలు అందుతున్నాయి.

 

టీఆర్‌ఎస్‌ ఓడిపోతే నేను రాజీనామా చేస్తా : కేటీఆర్

హైదరాబాద్ : 'వరంగల్‌ లో టీఆర్‌ఎస్‌ ఓడిపోతే కెసిఆర్‌ కాదు నేను రాజీనామా చేస్తాను' అని మంత్రి కేటిఆర్ అన్నారు. మరి కాంగ్రెస్‌ ఓడిపోతే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేస్తారా అని కాంగ్రెస్‌ నాయకులను మంత్రి ప్రశ్నించారు. హరిష్ రావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. వరంగల్‌ లోకసభ ఎన్నికలో ప్రజలు ఇచ్చే తీర్పు 16 నెలలు టిఆర్‌ఎస్‌ పాలనకు అద్దం పడుతుందని కేటీఆర్ తెలిపారు.ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్లపై తమకు అవగాహన ఉందని హామీలను తప్పక నెరవేరుస్తామని చెప్పారు. తాను అమెరికా నుంచి నేరుగా వచ్చి రాజకీయ పదవులు ఆశించలేదన్నారు.

18:59 - November 14, 2015

హైదరాబాద్ : గీతం విశ్వవిద్యాలయంలో పలు కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ప్రవేశ పరీక్ష గ్యాట్‌-2016 నోటిఫికేషన్‌ విడుదలైంది. గీతం యూనివర్సిటీకి చెందిన వైజాగ్‌, హైదరాబాద్‌, బెంగుళూరు క్యాంపస్ లకు సంబంధించిన ఇంజనీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ జీ.సుబ్రహ్మణ్యం తెలిపారు. దరఖాస్తులను దేశవ్యాప్తంగా ఉన్న యూనియన్‌ బ్యాంకు, ఇండియన్‌ బ్యాంక్‌, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌లలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 19 నుంచి మే8 వరకు ప్రవేశ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 44 పరీక్షా కేంద్రాల్లో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు చెప్పారు.

 

చైనాలో కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి

చైనా : ఈస్ట్ చైనా జియాంగ్స్ ప్రావిన్స్ లోని లిండాంగ్‌ గ్రామంలో కొండచరియలు విరిగిపడి 9 మంది మృతిచెందారు. 28 ఆచూకీ గల్లంతైంది. శుక్రవారం రాత్రి నుండి కొండచరియలు విరిగిపడుతున్నాయని చైనా ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రమాదంలో 20 భవనాలు బురదలో కూరుకుపోయాయి. 300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీనిపై గల కారణాలు తెలుసుకునేందుకు రెస్క్యూ సిబ్బంది దర్యాప్తు కొనసాగిస్తోంది.

 

భారతీయులంతా క్షేమం : సుష్మాస్వరాజ్..

హైదరాబాద్‌ : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉగ్రవాద దాడి జరిగిన నేపథ్యంలో అక్కడి భారతీయులంతా క్షేమంగా ఉన్నారని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో ట్వీట్‌ చేశారు. ఫ్రాన్స్లఓని భారత రాయబారి ఈ విషయాన్ని తనకు తెలియజేశారని తెలిపారు.

 

జపాన్‌లో భూకంపం..

హైదరాబాద్ : జపాన్‌లో భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం సంభవించిన భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనలతో ఇండ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 8.3గా నమోదైనట్టు భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. కగోషిమా, సత్సునన్‌లలో సుననామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే సునామీ తీవ్రత పెద్దగా ఉండపోవచ్చని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం అందలేదని అక్కడి అధికారులు వెల్లడించారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

నల్లగొండ : జిల్లాలోని భువనగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బీబీనగర్ మండలం మగ్దుంపల్లికి చెందిన బాలయ్య (43) బైక్‌పై తన స్వగ్రామానికి వెళ్తుండగా మార్గంమధ్యలో భువనగిరిలోని టీచర్ కాలనీ చౌరస్తాలో వేగంగా వస్తున్న ఆటో అతడిని ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన బాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

ఉత్తరప్రదేశ్‌లో దారుణం

పాట్నా : ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. భూమి కోసం వితంతువైన తమ అక్కను కొట్టిచంపిన ఘటన సంబాల్‌ జిల్లాలో జరిగింది. వితంతువైన జులేఖా అనే 45 ఏళ్ల మహిళను అస్మోలీ ప్రాంతంలో ఉన్న భూమి కోసం తీవ్రంగా కొట్టారు. దీంతో ఆమె మృతిచెందింది. దాడి చేసిన ఆమె సోదరైన చున్ను, అన్వర్‌తో పాటు మరదలైన సల్మాపై పోలీసులు కేసు నమోదు చేశారు.

18:42 - November 14, 2015

ప్రకాశం : దేశంలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా అవార్డులు వెనక్కి ఇస్తున్న వారిపై ప్రభుత్వం దాడులు చేయడం సరికాదని ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌, వామపక్షాలకు అనుకూలంగా ఉన్నవారే అవార్డులు వెనక్కి ఇస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విమర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదరైనా ఎఫ్‌డీఐ నిబంధనలు సడలించడం సరైన చర్య కాదన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఒక పంథా కపించడంలేదని పేర్కొన్నారు. రాజకీయాల్లో అతిధి పాత్రలు పనికిరావని రవి హితవు పలికారు. అమరావతి నిర్మాణం సింగపూర్‌ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్‌ అని ఎద్దేవా చేశారు.

 

 

18:35 - November 14, 2015

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ న్యాయవాదుల అసంతృప్తి తెలంగాణ న్యాయవాదులు ఆందోళనకు సిద్ధమయ్యారు. అయితే ఈసారి టిఆర్ఎస్ ప్రభుత్వంపై గురిపెట్టారు. తమ సంక్షేమానికి కేటాయించిన రూ.100 కోట్లు విడుదల చేయడంతో పాటు.. 41 (ఎ) సీఆర్పీసీపై రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేయాలని ప్రెసిడెంట్ కొండారెడ్డి డిమాండ్ చేశారు. సంక్షేమనిధిని రూ.500 కోట్లకు పెంచాలని కోరారు. న్యాయవాదులకు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం అన్ని రంగాలవారికి ఇప్పటికే 30 లక్షల ఆరోగ్య కార్డులు ఇచ్చారని.. 30 వేల మంది ఉన్న న్యాయవాదులకు కూడా ఆరోగ్యకార్డులు ఇవ్వాలని అన్నారు. జూనియర్ న్యాయవాదులకు స్టైపండ్ ఇవ్వాలని చెప్పారు. న్యాయవాదులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27 న ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

 

18:33 - November 14, 2015

హైదరాబాద్ : చంద్రబాబు తనకు కావల్సిన వారికి భూములు కేటాయిస్తూ అదే అభివృద్ధి అని చెబుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. కృష్ణా జిల్లాలో బాలయ్య వియ్యంకుడికి, చిత్తూరులో గల్లా కుటుంబానికి, విశాఖలో లోకేష్ స్నేహితుడికి వందల కోట్ల రూపాయల భూములు దారాదత్తం చేశారన్నారు. బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 700 రహస్య జీవోలు జారీచేశారని వాటిపై విచారణ జరపాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.

 

18:31 - November 14, 2015

తిరుపతి : ప్రజలకిచ్చిన హామీల అమలుకు కార్యకర్తలు కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. తిరుపతిలో రెండోరోజు జరుగుతున్న మేధోమథన సదస్సులో తమ్ముళ్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, జిల్లా అధ్యక్షుడి మధ్య సమన్వయం అవసరమని చంద్రబాబు సూచించారు. టీడీపీలో అందరూ కుటుంబ సభ్యుల్లా ఉండాలని...నేతల మధ్య భేషజాలు లేకుండా ఉండాలని సూచించారు.

 

ఎల్లుండి డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభానికి ముహూర్తం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ లోని ఐడిహెచ్ లో సీఎం కేసీఆర్ ఇళ్లను ప్రారంభించనున్నారు. 

17:54 - November 14, 2015

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఓటర్ల తొలగింపు అంశంలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్‌ నేత మర్రిశశిధర్‌ రెడ్డి స్పందించారు. ఓటర్ల తొలగింపులో రాజకీయ ప్రమేయం ఉందన్నారు. ఆధార్‌ నెంబర్‌, ఓటర్ కార్డుల అనుసంధానాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఎందుకు పర్యవేక్షించిందని ప్రశ్నించారు. కేవలం గ్రేటర్ ఎన్నికల్లో గెలిచేందుకే లక్షల మంది ఓట్లను తొలగించాలని మర్రి ఆరోపించారు.

 

17:50 - November 14, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ లోని ఐడిహెచ్ లో సీఎం కేసీఆర్ ఇళ్లను ప్రారంభించనున్నారు. తొలిదశలో 396 మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేశారు. లబ్ధిదారుల కాంట్రిబ్యూషన్ లేకుండా 396 ఇళ్లు నిర్మించారు. అయితే ఇంతకముందు జీప్లస్ 2 ఇళ్లను నిర్మించారు. ఇప్పుడు బహుళ అంతస్తులను నిర్మించనున్నారు. విశాలమైన పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయనున్నారు. నియోజవర్గానికి 400 వందల ఇళ్లు ఇవ్వనున్నారు.

 

వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ డబ్బుల పంపిణీ

హన్మకొండ : వరంగల్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ అధికార టీఆర్ ఎస్ అడ్డంగా బుక్కైంది. జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ మండలం చిన్నపెండ్యాలలో టీఆర్ ఎస్ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. చిన్నపెండ్యాలలో టీఆర్ఎస్ గ్రామ సభ అధ్యక్షుడు గజ్జెల దామోదర్, ఆ పార్టీ కార్యకర్తలు రూ. 500 నోట్లు పంచుతూ టెన్ టివికి చిక్కారు.

17:43 - November 14, 2015

హన్మకొండ : వరంగల్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ అధికార టీఆర్ ఎస్ పార్టీ అడ్డంగా బుక్కైంది. జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ మండలం చిన్నపెండ్యాలలో టీఆర్ ఎస్ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. చిన్నపెండ్యాలలో టీఆర్ఎస్ గ్రామ సభ అధ్యక్షుడు గజ్జెల దామోదర్, ఆ పార్టీ కార్యకర్తలు రూ. 500 నోట్లు పంచుతూ టెన్ టివికి చిక్కారు. వరంగల్ లో ఉప ఎన్నికల పోరు ఊపందుకుంది. ఈనేపథ్యంలో ఓటర్లను ఆకర్షించడానికి ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు తెలుస్తోంది. ఓటర్లను డబ్బులతో ఆకట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితిని ఎన్నికల అధికారులు పరిశీలించాల్సిన అసవరం ఉంది.

 

17:21 - November 14, 2015

ఢిల్లీ : చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్స్ కు టాప్ సీడ్, భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ చేరుకుంది. ఫుజోవూ వేదికగా జరుగుతున్న 2015 చైనా ఓపెన్ సెమీస్ లో...7వ సీడ్ వాంగ్ ఈ హాన్ ను రెండోర్యాంకర్ సైనా వరుస గేమ్ ల్లో చిత్తు చేసింది. తొలిగేమ్ ను 21-13తో అలవోకగా గెలుచుకొన్న సైనాకు ఆ తర్వాత..వాంగ్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. రెండో గేమ్ ను సైతం 21-18తో సొంతం చేసుకోడం ద్వారా...సైనా తన కెరియర్ లో రెండోసారి చైనా ఓపెన్ ఫైనల్స్ చేరగలిగింది. 2014లో తొలిసారిగా చైనా ఓపెన్ టైటిల్ నెగ్గిన సైనాను..ఇదే టైటిల్ మరోసారి ఊరిస్తోంది.

ఉగ్రదాడిలో 127 మంది హతం - హొలాండే..

ఫ్రాన్స్ : రాజధాని పారీస్ లో జరిగిన ఉగ్రదాడిలో 127 మంది మృతి చెందారని ఆ దేశాధ్యక్షుడు హొలాండే ప్రకటించారు. దేశ వ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఉగ్రదాడిలో 150 మంది మృతి చెందినట్లు వంద మందికిపైగా గాయాలపాలైనట్లు వార్తలు వచ్చాయి.

సీసీ కెమెరాలదే కీలక పాత్ర - మహేందర్ రెడ్డి..

హైదరాబాద్ : నేరాలను అదుపు చేయడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లోని పాట్ మార్కెట్ లో ఏర్పాటు చేసిన 27 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.

 

భన్వర్ లాల్ ను కలిసిన టిడిపి, బిజెపి నేతలు..

హైదరాబాద్ : ఉప ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘన జరగుతోదంటూ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్ లాల్ కు టి.టిడిపి, బిజెపి నేతలు ఫిర్యాదు చేశారు.

17:16 - November 14, 2015

హైదరాబాద్ : వెనకబడిన జిల్లాల అభివృద్ధిపై బహిరంగ చర్చకు చంద్రబాబు సిద్ధమైతే... తమ అధ్యక్షుడు జగన్ కూడా సిద్ధమేనని వైసీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కర్నూలు జిల్లా నేతలతో జగన్ ఇవాళ సమావేశమయ్యారు. జిల్లాలో ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతంపై జగన్ తగు సూచనలు చేసినట్టు మోహన్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు దృష్టంతా కృష్ణా, గుంటూరు జిల్లాలపైనే ఉందని.. సీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. 

ముగిసిన తొలి రోజు ఆట..

బెంగళూరు : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో తొలి రోజు ఆట ముగిసింది. తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ ను భారత స్పిన్నర్లు కట్టడి చేశారు. డివిలియర్స్ (85) ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 214 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ అయ్యింది. అనంతరం భారత్ ఆటను ఆరంభించింది. ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. క్రీజులో విజయ్ 28, ధావన్ 45 పరుగలతో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజాలు చెరో నాలుగు, అరోన్ ఒక వికెట్ తీశారు.

17:01 - November 14, 2015

హైదరాబాద్ : సినీ నటి రేణూదేశాయ్‌ తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నారు. ప్యారిస్‌లో జరిగిన ఉగ్రదాడి ముందు వరకు ఆమె అక్కడే ఉన్నారు. ఆమె బయల్దేరి ఇండియాకు వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరిగింది. తాను బతికే ఉన్నందుకు సంతోషపడుతున్నట్లుగా ట్విట్టర్‌లో రేణూదేశాయ్‌ ట్వీట్‌ చేశారు.

 

 

16:56 - November 14, 2015

హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో నకిలీ టమోటా, చిల్లీ సాస్‌ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. పూర్తిగా హానికరమైన పదార్థాలతో తయారు చేస్తున్న ఈ టమోటా సాస్‌ను నగరంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యాపారం వనస్థలిపురంలోని సాహెబ్‌ నగర్‌ సమీపంలో గ్రామశివారులో నడుస్తోంది. వివిధ కంపెనీల బ్రాండ్ల పేరిట తయారు చేస్తున్న భారీ ఎత్తున నకిలీ సాస్‌, కుళ్లిన గుమ్మడి కాయలు, మసాలా పేకెట్లు, 3 సిలిండర్లు, కెమికల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న ఇలాంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు మండిపడుతున్నారు.

 

ప్రజలతో మమేకం కావాలి - బాబు..

తిరుపతి : రాష్ట్ర ప్రజలతో మమేకం కావాలని నేతలు, కార్యకర్తలకు టిడిపి కేంద్ర కమిటీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తిరుపతిలో నిర్వహించిన పార్టీ సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని తిరిగి ప్రయోజనం పొందేల పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి సభలను ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించి పరిష్కారం కనుగొనాలని తెలిపారు.

బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ ను సందర్శించిన మోడీ..

లండన్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లండన్ లోని బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ ను సందర్శించారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆయనతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఉన్నారు.

16:51 - November 14, 2015

విశాఖ : ఏపీ ప్రభుత్వానికి ఏజెన్సీ టీడీపీ నేతలు అల్టిమేటం జారీ చేశారు. కేబినెట్ సమావేశంలో బాక్సైట్ తవ్వకాలపై స్పష్టమైన వైఖరికి ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఈనెల 20న పాడేరు ఐటీడీఏ ఎదుట నిరాహర దీక్షలు చేయాలని నిర్ణయించారు. అవసరమైతే రాజీనామాలకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు.

 

ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తాం : మంత్రి పల్లె

తిరుపతి : ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చెప్పారు. టిడిపి దిశానిర్ధేశ సదస్సు ముగిసింది. తిరుపతిలో రెండు రోజులుగా సదస్సు కొనసాగుతోంది. సదస్సు వివరాలను మంత్రి ప్రకటించారు. ఈనెల 30 లోగా ఖాళీగా ఉన్న గ్రామ, జన్మభూమి కమిటీల నియామకం పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ కార్యకలాపాలపై డాక్యుమెంటరీ రూపొందిస్తామని చెప్పారు. జిల్లాలో నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించే బాధ్యత ఇంఛార్జీ మంత్రులకు అప్పగించామని తెలిపారు. పార్టీ పని తీరుపై 3 నెలలోసారి మేధోమథనం కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

 

ఎపి ప్రభుత్వానికి ఏజెన్సీ టిడిపి నేతలు ఆల్టిమేటం

విశాఖ : ఎపి ప్రభుత్వానికి ఏజెన్సీ టిడిపి నేతలు ఆల్టిమేటం జారీ చేశారు. కేబినెట్ సమావేశంలో బాక్సైట్ తవ్వకాలపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలన్నారు. లేదంటే ఈనెల 20న పాడేరు ఐటీడీఏ ఎదుట నిరహారదీక్ష చేపట్టనున్నట్లు హెచ్చరించారు.

 

ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు..

ఢిల్లీ : భారత ప్రథమ ప్రధాన మంత్రి జవహార్‌లాల్ నెహ్రు 125వ జయంతి వేడుకలను దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని ఆయన సమాధి శాంతివన్ దగ్గరకు పలువురు నేతలు చేరుకుని సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు పలువురు నేతలు నెహ్రుకు శ్రద్దాంజలి ఘటించారు.

వనస్థలిపురంలో నకిలీ సాస్ కేంద్రాలు..

హైదరాబాద్ : వనస్థలిపురంలో సాహెబ్‌నగర్‌లో ఓ ప్రాంతంలో నకిలీ సాస్ తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. శనివారం సాస్ కేంద్రంపై దాడులు చేశారు. నకిలీ సాస్ తయారు చేస్తోన్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇండియా 54/0..

బెంగళూరు : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ మొదటి ఇన్నింగ్స్ ఆటను ఆరంభించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా కేవలం 214 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత ఓపెనర్లు విజయ్, ధావన్ లు సఫారీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఒక వికెట్ నష్టపోకుండా 54 పరుగులు చేశారు. విజయ్ 21, ధావన్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కూకట్ పల్లి ఎసిపి బినామీ అక్బర్ ఇంటిపైన ఎసిబి దాడులు

హైదరాబాద్ : కూకట్ పల్లి ఎసిపి సంజీవరావు బినామీ అక్బర్ ఇంటిపైనా ఎసిబి దాడులు నిర్వహిస్తోంది. హైదర్ గూడలోని అక్బర్ ఇంట్లో సోదాలు కొనసాతున్నాయి. 

15:29 - November 14, 2015

హైదరాబాద్  : విదేశాల్లో తెలంగాణ నృత్య కళలను ప్రదర్శించే గొప్ప అవకాశం హైదరాబాద్‌కు చెందిన డాన్స్ అకాడమీకి దక్కింది. 'నమస్తే ఇండియా-2015' పేరుతో రష్యాలో జరిగే కార్యక్రమానికి భారత్‌ ఫోక్‌ ఆర్ట్స్ అకాడమీ నుంచి కళాకారుల బృందం వెళ్లనుంది. విదేశాల్లో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు వెళ్తున్నందుకు కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భారత్‌ ఫోక్‌ ఆర్ట్స్ అకాడమీకి ఆహ్వానం
రష్యాలో 'నమస్తే ఇండియా-2015' పేరుతో నిర్వహించనున్న నృత్య ప్రదర్శనలకు హైదరాబాద్‌కు చెందిన భారత్‌ ఫోక్‌ ఆర్ట్స్‌ అకాడమీకి ఆహ్వానం లభించింది. రష్యాలో వివిధ వేదికలపై మన దేశంతో పాటు ముఖ్యంగా తెలంగాణ సంస్కృతికి చెందిన నృత్యాలను ప్రదర్శించనున్నారు.
రష్యా వెళ్లనున్న 25 మంది కళాకారుల బృందం
రష్యాలో ప్రదర్శనలు ఇచ్చేందుకు 25 కళాకారుల బృందం వెళ్తుందని అకాడమీ నిర్వాహకులు తెలిపారు. వారం రోజుల పాటు జరిగే ప్రదర్శనల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని నృత్యాలతో పాటు తెలంగాణకు చెందిన నృత్యాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. 60 ఏళ్లకు పైగా జానపద నృత్యాలకు తాము చేస్తున్న సేవలకు గుర్తింపు లభించినందుకు చాలా సంతోషంగా ఉందని అకాడమీ నిర్వాహకులు తెలిపారు. విదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందంటున్నారు.
కళాకారులు ఆసక్తి
రష్యాలో అత్యుత్తమైన ప్రతిభను కనబర్చేందుకు మరింత శిక్షణ చేస్తున్నామని కళాకారులు తెలిపారు. జానపద నృత్య ప్రదర్శన కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. విదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. రష్యాలో తమ నృత్యాలను ప్రదర్శించేందుకు కళాకారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

15:24 - November 14, 2015

తిరుమల : రాయలసీమలోని పెండింగ్‌ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు అయినా చేసి పూర్తి చేస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. వర్షాలతో తిరుమలలో నిండిన ప్రాజెక్టులను మంత్రి దేవినేని పరిశీలించారు. 2016 నాటికి హంద్రీనీవాను, 2017 నాటికి గాలేరు-నగరి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. 

రాజ్ ఘాట్ వద్ద మాజీ సైనికోద్యుగులు..

ఢిల్లీ : మాజీ సైనికోద్యుగులు రాజ్ ఘాట్ లోని మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. అనంతరం మహాత్మాగాంధీ సమాధికి నివాళులర్పించారు.

15:21 - November 14, 2015

హైదరాబాద్ : 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని జిల్లా కలెక్టర్‌ కరుణ.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని.. జెమిని థియేటర్‌లో చిన్నారుల చలన చిత్రాన్ని ప్రదర్శించారు. విద్యార్ధుల్లో చైతన్యం నింపే ఇలాంటి చిత్రాలు విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్‌ అన్నారు.

 

15:20 - November 14, 2015

బెంగళూరు : రెండో టెస్టు మ్యాచ్ లో భారత బౌలర్లు విశ్వరూపం చూపెట్టారు. దీనితో సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు. ఫలితంగా చినస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు కేవలం 214 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టులో రెండు మార్పులు చేసింది. మిశ్రా స్థానంలో బిన్నీ, ఉమేష్ స్థానంలో ఇశాంత్ శర్మలను తీసుకున్నారు. దక్షిణాఫ్రికా ఓపెనర్లు వాన్ జిల్, ఎల్గర్ లు బ్యాటింగ్ ఆరంభించారు. తొలుత భారత బౌలర్లను బాగానే ఎదుర్కొన్నారు. జట్టు స్కోరు 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు వాన్ జిల్ పెవిలియన్ దారి పట్టాడు. అనంతరం వచ్చిన డుప్లెసిస్ పరుగులు ఏమి చేయకుండానే వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు అశ్విన్ తీశాడు. అనంతరం వచ్చిన ఆమ్లా కూడా నిలదొక్కుకోలేకపోయాడు. కేవలం 7 పరుగులు చేసి ఆరోన్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడుతున్న ఎల్గర్ (38) ను జడేజా అవుట్ చేశాడు. అనంతరం డివిలియర్స్, డుమినిలు జాగ్రత్తగా ఆడారు. జట్టు స్కోరు 120 పరుగుల వద్ద ఉన్నప్పుడు డుమిని (15) వెనుదిరిగాడు. అనంతరం కొద్దిసేపటికి విలాస్ (15) వెనుదిరిగాడు. అప్పటికే అర్ధ సెంచరీ సాధించి మంచి ఊపు మీదున్న డివిలియర్స్ (85) ను జడేజా అవుట్ చేశాడు. అప్పటికీ జట్టు స్కోరు 177 పరుగులు. అనంతరం వచ్చిన రబడ పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. ఇక చివరిలో ఉన్న అబౌట్ 14 రన్లు సాధించి రనౌట్ అయ్యాడు. రబడ 0, మోర్కెల్ 22 పరుగులు చేసి వెనుదిరిగారు. తాహిర్ పరుగులు ఏమీ చేయకుండా నాటౌట్ గా మిగిలాడు. భారత బౌలర్లలో జడేజా నాలుగు, అశ్విన్ నాలుగు, అరోన్ ఒక ఒక వికెట్ తీశారు.

సౌతాఫ్రికా స్కోరు బోర్డు : వాన్ జిల్ (10, 2x4), ఎల్గర్ (38, 2x4 1x6), డుప్లెసిస్ (0), ఆమ్లా (7), డివిలియర్స్ (85 11x4 2x6), డుమిని (15, 2x4), విలాస్ (15, 1x4), అబౌట్ (14, 2x4), రబడ (0), మోర్కెల్ (22, 3x4), ఇమ్రాన్ తాహిర్ (0 నాటౌట్)

భారత బౌలింగ్ : ఇషాంత్ శర్మ (13-3-40-0), బిన్ని (3-2-1-0), అశ్విన్ (18-2-70-4), అరోన్ (9-0-51-1), జడేజా (16-2-50-4)

15:17 - November 14, 2015

విశాఖ : బాక్సైట్ తవ్వకాలతో గిరిజనులకు అన్యాయం జరుగుతుందని మాజీ ఐఎఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ అన్నారు. టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. బాక్సైట్‌ తవ్వకాలు కచ్చితంగా గిరిజనుల జీవితాలను నాశనం చేస్తాయని.. ప్రభుత్వం అన్నీ తెలిసే ముందుకు వెళుతుందని ఆయన విమర్శించారు. కార్పొరేట్‌ శక్తులకు సహకరించే విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకటేనని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం జీవోను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

15:10 - November 14, 2015

విశాఖ : నగరంలో గ్రంథాలయ స్థలాన్ని రక్షించుకునేందుకు గ్రంధాలయ సేవా సమితి నడుం బిగించింది. మంత్రి గంటా శ్రీనివాసరావు గ్రంధాలయ స్థలాన్ని కబ్జా చేసేందుకు చేస్తున్న కుట్రపై 'కంచె చేను మేస్తే' అనే బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఇక మంత్రి కబ్జా వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసేందుకు ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ప్రభుత్వం వెంటనే గ్రంధాలయ బిల్డింగ్‌ నిర్మించాలని కోరారు. స్థలం ఇవ్వకపోతే మంత్రి గంటా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

 

15:04 - November 14, 2015

హైదరాబాద్ : వరంగల్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. తమ అభ్యర్ధిని గెలిపించుకునేందుకు టీఆర్‌ఎస్‌ పత్రికలో ప్రధాన శీర్షికలో కథనాలు ప్రచురిస్తున్నాయన్నారు. వీటిని పెయిడ్‌ ఆర్టికల్స్ గా గుర్తించాలని రేవంత్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

ఫైనల్ లో సైనా నెహ్వాల్..

చైనా : స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ చైనా ఓపెన్ సూపర్ సిరీస్ లో ఫైనల్ కు చేరుకుంది. సెమీస్ లో యిహాన్ వాంగ్ ను 21-13, 21-18 తేడాతో సైనా విజయం సాధించింది. యిహాన్ వాంగ్ ఇప్పటి వరకు సైనాను 9సార్లు ఓడించింది. అయితే ఈ ఏడాది సైనా ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటెన్ చాంపియన్ షిప్ లో యిహాన్ ను రెండు సార్లు ఓడించింది.

రవీంద్రభారతిలో బాలల దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ : రవీంద్రభారతిలో బాలల దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. కేంద్రమంత్రి దత్తాత్రేయ, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ విద్యా, వైద్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం పిల్లల భవిష్యత్ భరోసా కల్సిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం లేనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. 

సౌతాఫ్రికా 177/8…

బెంగళూరు : భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 177పరుగుల వద్ద ఉన్నప్పుడు రబడ (0) డకౌట్ అయ్యాడు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్ వాన్ జిల్ (10) పెవిలియన్ దారి పట్టగా డుప్లెసిస్ డకౌట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లు అశ్విన్ తీశాడు. అనంతరం వచ్చిన ఆమ్లా నిలదొక్కుకోలేకపోయాడు. కేవలం 7 పరుగులు చేసి ఆరోన్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడుతున్న ఎల్గర్ (38) ను జడేజా అవుట్ చేశాడు. అనంతరం డివిలియర్స్, డుమినిలు జాగ్రత్తగా ఆడారు.

వరంగల్ లో టీఆర్ఎస్ గెలపు ఖాయం : జగదీష్ రెడ్డి

నల్లగొండ : వరంగల్ లో టీఆర్ఎస్ గెలపు ఖాయమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని ఎద్దేవా చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. తెలంగాణకు పరిపడ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను కేటాయించలేదన్నారు. మోడీకి విదేశీ పర్యటనలు తప్ప రాష్ట్రాల సమస్యలు పట్టడం లేదని విమర్శించారు.

 

డివిలియర్స్ అవుట్..

బెంగళూరు : భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 177పరుగుల వద్ద ఉన్నప్పుడు డివిలియర్స్ (85) ను జడేలా అవుట్ చేశాడు.

నిర్భయ చట్టాన్ని కఠినతరం చేస్తాం : దత్తాత్రేయ

హైదరాబాద్ : వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బాలలకు సంబంధించి కొత్త చట్టం తీసుకొస్తామని కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు. రవీంధ్రభారతిలో జరుగుతున్న బాలలదినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 14 ఏళ్లలో పిల్లలకు ఎటువంటి సంస్థలో పనిచేయడానికి వీలు లేకుండా చట్టం రూపొందిస్తామని తెలిపారు. ఈ చట్టం ఉల్లంఘించిన వారికి మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని తెలిపారు. నిర్భయ చట్టాన్ని మరింత కఠినతరం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం లేనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటామని తెలంగాణ మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

13:56 - November 14, 2015

మహిళలు 30 దాటినా తమ శరీరాన్ని నాజుగ్గా ఉంచుకోవాలనుకుంటారు. అయినా కొందరు ఒబిసిటీ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి మహిళలు దీర్ఘకాలం పాటు నాజూగ్గా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే.. సాధారణంగా మనం తీసుకునే ఆహారాన్నిబట్టే మన ఆరోగ్యం ఉంటుంది. కొవ్వు కేలరీలు తక్కువగా ఉండి ఖనిజాలు, విటమిన్లు, పీచు పదార్థాలు అత్యధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. పచ్చిబఠాణి, బీట్‌రూట్, బంగాళాదుంపలు తరచుగా తీసుకుంటూ వుండాలి.
డెయిరీ ఉత్పత్తులతో పాటు మాంసంకృతులను ఎక్కువగా తీసుకోవాలి. పూర్తి స్థాయిలో ఉండే పాలు, పెరుగు, పనీర్ కాకుండా స్కిమ్డ్ పాలు, పాల పదార్థాలు తీసుకోవాలి. ఈ పాలతో తయారయ్యే క్రీమ్, ఛీజ్, పనీర్, పెరుగు, మిల్క్, ఐస్‌క్రీమ్స్‌ను ఎక్కువగా తినాలి.
అలాగే, పండ్లలో యాపిల్స్, యాప్రికోట్స్, ఉసిరి, ద్రాక్ష, జామ, నిమ్మ, లిచి, అరెంజ్, స్ట్రాబెర్రీలతో పాటు.. పప్పు దినుసులైన బీన్స్, శనగలు, రాజ్‌మా మంటి వస్తువులు, కరిగి పోయే పదార్థాలు తీసుకోవాలని డైటీషియన్స్ సలహా ఇస్తున్నారు.

నేను క్షేమంగానే ఉన్నా : నటుడు నందూ

హైదరాబాద్ : టాలీవుడ్ నటుడు, ప్రముఖ గాయని గీతా మాధురి భర్త నందూ ఫ్రాన్స్ నగరం ఫ్రాంక్ ఫర్ట్ లో క్షేమంగా ఉన్నాని ఐఏఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీకి తెలిపాడు. గత రాత్రి హైదరాబాదు నుంచి ఫ్రాన్స్ బయలు దేరాడు. మరికాసేపట్లో ప్యారిస్ వెళ్లాల్సి ఉండగా అతడికి ఉగ్రవాద దాడుల గురించి తెలిసింది. దీంతో ప్యారిస్ ప్రయాణాన్ని విరమించుకున్న నందూ ఫ్రాంక్ ఫర్ట్ లోని తన మిత్రుడి వద్దే ఉండిపోయాడు. దాడులపై స్పందిస్తూనే తాను క్షేమంగా ఉన్నానని అతడు ప్రకటించాడు. ‘‘నేను క్షేమంగానే ఉన్నాను. ఫ్రాంక్ ఫర్ట్ లో ఉండగా ప్యారిస్ దాడుల విషయం తెలిసింది. ఆ దాడులు భయానకం.

13:54 - November 14, 2015

ఎన్టీఆర్‌, వి.వి.వినాయక్‌ కాంబినేషన్‌లో మళ్లీ ఓ చిత్రం తెరకెక్కనున్నట్లు టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'అదుర్స్‌' విజయవంతమైన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్‌ తీయాలని ఎప్పటి నుంచో వినాయక్‌ అనుకుంటున్నారని టాక్. ఇప్పటి వరకు 'అఖిల్‌' సినిమాతో బిజీగా ఉన్న వినాయక్‌ ఈనెల 11న ఆ చిత్రం విడుదలతో ఫ్రీ అయిపోయాడు. ఇక తన తర్వాత ప్రాజెక్టుపై దృష్టి సారించినట్టు తెలిసింది. ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్న 'అదుర్స్‌2' చిత్రాన్ని తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నాడట. ఎన్టీఆర్‌ కూడా ఈ కథ చేయడానికి ఆతృతతోనే ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్‌ చేస్తున్న 'నాన్నకు ప్రేమతో' చిత్రం పూర్తయ్యాక వినాయక్‌ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ముందు ఎన్టీఆర్‌.. కొరటాల శివతో ఓ సినిమా చేస్తాడని కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో ఎవరితో మొదట సినిమా తీస్తారన్నది తేలాల్సి ఉంది.

సౌతాఫ్రికా 159/6..

బెంగళూరు : భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 159పరుగుల వద్ద ఉన్నప్పుడు విలాస్ (15) పెవిలియన్ దారి పట్టాడు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్ వాన్ జిల్ (10) పెవిలియన్ దారి పట్టగా డుప్లెసిస్ డకౌట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లు అశ్విన్ తీశాడు. అనంతరం వచ్చిన ఆమ్లా నిలదొక్కుకోలేకపోయాడు. కేవలం 7 పరుగులు చేసి ఆరోన్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడుతున్న ఎల్గర్ (38) ను జడేజా అవుట్ చేశాడు. అనంతరం డివిలియర్స్, డుమినిలు జాగ్రత్తగా ఆడారు.

13:45 - November 14, 2015

'డయాబెటిస్‌ జబ్బు కాదు. కానీ ఎన్నో జబ్బులకు కారణం. ఇది ఒక శారీరక స్థితి.. డైజెస్టివ్‌ డిజార్డర్‌. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. 1985లో ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ల డయాబెటిస్‌ కేసులుంటే 2013 నాటికి 382 మిలి యన్లకు పెరిగాయి. 2035 నాటికి 592 మిలియన్‌ డయాబెటిస్‌ కేసులు నమోదయ్యే ప్రమాదముందని అంచనా. దాదాపుగా మన దేశంలో ప్రతీ కుటుంబంలో ఒక్కరైనా డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. ప్రతీ నలుగురిలో ఒకరు డయాబెటిస్‌ బాధితులు. ప్రపంచ వ్యాప్తంగా మనదేశమే డయాబెటిస్‌కి కేపిటల్‌ గా ఉంది. ప్రస్తుతం దేశంలో సుమారు 50 మిలియన్ల డయాబెటిస్‌ కేసులున్నాయని తెలుస్తోంది. 2025 నాటికి 60 మిలియన్లు దాటే అవకాశాలున్నాయి. సమయానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్‌గా డాక్టర్‌తో చెకప్‌ చేయిస్తూ, సూచనలు పాటిస్తే డయాబెటిస్‌ పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.

డయాబెటిస్‌ వ్యాధి కాదు...
డయాబెటిస్‌ వ్యాధి కాదు. జీర్ణమైన ఆహారం శరీరానికి సరిగ్గా వంట బట్టని స్థితి. మనం తీసుకున్న ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌గా మారుతుంది. ఈ గ్లూకోజ్‌ రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు వెళ్తుంది. కానీ కణాలు రక్తంలోని గ్లూకోజ్‌ని తీసుకోలేక, ఆహారం సరిగ్గా అందక బాధపడుతుంటాయి. కారణం ఇన్సులిన్‌ అనే ఎంజైమ్‌ కావలసినంతగా ఉత్పత్తి కాకపోవడమే.

మధుమేహ వ్యాధి లక్షణాలు..
ఎక్కువ దాహం, ఎక్కువగా మూత్ర విసర్జన కావడం, అలసట ఎక్కువగా ఉండడం, తగిలిన గాయం త్వరగా మానకపోవడం, చూపు మందగిం చడం వంటివి వ్యాధి లక్షణాలుగా గుర్తించవచ్చు. జీర్ణమవడం, మల విసర్జ నలో తేడాలు వస్తుంటాయి. సెక్స్‌ సామర్ధ్యం తగ్గుతుంది. కాళ్లు, చేతులు మొద్దుబారుతుంటాయి.

డయాబెటిస్‌లో టైప్‌1, టైప్‌ 2
ఎక్కువ కేలరీలున్న ఆహారం తీసుకున్నా శారీరక కదలికలు కావలసినంతగా లేకపోవడం వల్ల ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ శరీరంలో పెరిగి వచ్చే డయాబెటిస్‌ని టైప్‌2 డయాబెటిస్‌ అంటారు. ఎక్కువ కేలరీలున్న ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ అంటే వ్యాయామం పెంచడంతో టైప్‌2 డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.శరీరంలో తగినంత ఇన్సులిన్‌ ఉత్పత్తి కాకపోవడం వల్ల వచ్చే డయాబెటిస్‌ టైప్‌1 డయాబెటిస్‌. వీళ్లకి కృత్రిమ ఇన్సులిన్‌ని కండరాలలోకి తగిన మోతాదులో పంపడమే టైప్‌ 1 డయాబెటిస్‌ని అదుపులో ఉంచడానికి సరైన మార్గం.

'మోడీ ప్రధాని కావడం ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి'

హైదరాబాద్ : నరేంద్ర మోదీ ప్రధాని కావడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. దేశంలో అసహనం పెరిగిపోయిందనే పేరుతోనే అవార్డులను వెనక్కి ఇవ్వాలనేది వారి కోరిక అని ఆరోపించారు. దేశాభివృద్ధికి మోదీ సమర్థ నాయుడు వచ్చాడని తెలిపారు.

విశాఖ లో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు

హైదరాబాద్ : పారిస్ లో ఉగ్రదాడుల నేపథ్యంలో విశాఖ లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. లాడ్జీలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు.

ఢిల్లీలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు..

ఢిల్లీ : ఇందిరా గాంధీ స్టేడియంలో నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సోనియా, మన్మోహన్ సింగ్, రాహుల్, పలువురు ఎంపీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పారిస్ దుర్ఘటనపై నేతలు శ్రద్ధాంజలి ఘటించారు.

నెహ్రూ ప్రతిష్టను దిగజార్చే కుట్ర జరుగుతోంది : జైపాల్ రెడ్డి

హైదరాబాద్ : నెహ్రూ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రస్తుతం కుట్రలు జరుగుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి విమర్శించారు. నెహ్రూ బొమ్మ, ప్రస్తావన లేకుండా బాలల దినోత్సవాన్ని ఆరెస్సెస్ నిర్వహించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పేరుతో ఆరెస్సెస్ రాజ్యమేలుతోందని మండిపడ్డారు. నవభారత నిర్మాణానికి నెహ్రూనే ఆద్యుడని... ఆయన స్ఫూర్తిని విస్మరిస్తే దేశానికి మంచిది కాదని చెప్పారు.

టిడిపి నేతలతో ఆనం సోదరుల మంతనాలు..

నెల్లూరు : జిల్లాలో టీడీపీ నేతలతో ఆనం సోదరులు మంతనాలు జరుపుతున్నారని సమాచారం. జిల్లాలో అడ్రస్‌ లేని నేతలను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్‌ హైకమాండ్‌పై ఆనం సోదరులు అసహనంగా ఉన్నారు. టీడీపీలోకి వెళ్లే ఆలోచన లో ఆనం సోదరులున్నారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

వాణీ-వీణాల సంరక్షణ ప్రభుత్వానిదే: మంత్రి లక్ష్మారెడ్డి...

హైదరాబాద్: అవిభక్త జంట కవలలు వాణీ-వీణాల సంరక్షణకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, డాక్టర్లు ఇచ్చే నివేదిక ఆధారంగా వీణా-వాణీల వైద్యానికయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు. బాలల దినోత్సవం సందర్భంగా నగరంలో ఇవాళ నీలోఫర్ ఆస్పత్రిలో పెడియాట్రికల్ సర్జికల్ అవగాహనా సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. పిల్లలలందరికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సౌతాఫ్రికా 126/5

బెంగళూరు : భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 120పరుగుల వద్ద ఉన్నప్పుడు డుమిని (15) అవుట్ అయ్యాడు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్ వాన్ జిల్ (10) పెవిలియన్ దారి పట్టగా డుప్లెసిస్ డకౌట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లు అశ్విన్ తీశాడు. అనంతరం వచ్చిన ఆమ్లా నిలదొక్కుకోలేకపోయాడు. కేవలం 7 పరుగులు చేసి ఆరోన్ బౌలింగ్ లో పెవలియన్ చేరాడు. ప్రస్తుతం డివిలియర్స్ 50, విలాస్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ మూడు, అరోన్, జడేజా తలో ఒక వికెట్ తీశారు.

త్వరలో ప్రభుత్వ హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానం..

తిరుపతి: ప్రభుత్వ హాస్టళ్లకు నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు ఏడాదికి రూ. 80 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్బాబు తెలిపారు. శనివారం తిరుపతి ఆర్సీ రోడ్డులోని బాలిక హాస్టల్లో రావెల తనిఖీలు నిర్వహించారు. అనంతరం రావెల మాట్లాడుతూ.... హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

శాసనసభా పక్ష నేతగా నితీష్..

పాట్నా : శాసనసభా పక్ష నేతగా నితీష్ కుమార్ ఎన్నికయ్యారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మహా కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామ చేశారు.

12:54 - November 14, 2015

హైదరాబాద్ : అతనో రక్తం మరిగిన మృగం. తన దృష్టిలో మనిషికీ జంతువుకూ తేడా లేదు. నిర్దయగా పీకలు కోసేయగలడు. తలకు తుపాకీ గురిపెట్టి ముక్కలు ముక్కలుగా పేల్చేయగలడు. అతను కిరాతకానికి మారుపేరు. దారుణాలకు కేరాఫ్‌ అడ్రస్‌. పైగా తను చేసే మారణ కాండకు పవిత్ర యుద్ధం అని పేరు పెట్టి హుందాగా చేసేస్తుంటాడు. పాపాలను దేవుడి ఖాతాలో వేసేస్తుంటాడు. అమెరికా మొదలుకుని ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు కొరుకుడు పడని ఆ నరరూప రాక్షసుడు అంతమయ్యాడన్నది టాక్.

డ్రోన్‌ దాడిలో చనిపోయాడని ప్రచారం...

ఈఒక్క సన్నివేశం చాలు ఈ ముసుగు ధరించిన వ్యక్తి ఎంతటి దుర్మార్గుడో తేల్చి చెప్పడానికి..ఎన్నో దేశాలు వెతుకుతున్న ఈ హంతకుడు డ్రోన్‌ దాడిలో చనిపోయాడని ప్రచారం జరుగుతోంది. ఇసిస్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇతను మహ్మద్‌ ఎమ్వాజీ... అందరికీ జిహాదీ జాన్‌గా సుపరిచితుడు. బ్రిటిష్‌ పౌరుడైన జాన్‌ కరుడుగట్టిన ఉగ్రవాదిగా గుర్తింపుపొందాడు. కాగా ఇతన్ని లక్ష్యంగా చేసుకుని సిరియాలోని రెక్కాలో అమెరికా వైమానిక, డ్రోన్‌ దాడులు నిర్వహించింది. ఆ దాడుల్లో అతను మరణించినట్లు అమెరికా మిలటరీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని మిలటరీ ఉన్నతాధికారులు ఇంకా ధృవీకరించలేదు.

పశ్చిమ దేశాలకు చెందిన జర్నలిస్ట్‌లతో సహా .....

జాన్‌ గత కొద్దికాలంగా పశ్చిమ దేశాలకు చెందిన జర్నలిస్ట్‌లతో సహా పలువురిని దారుణంగా హింసించి చంపేశాడు. ఆ ఘటనలను వీడియోగా తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టేవాడు. తద్వారా తానెంతటి భయంకరమైన వ్యక్తో చాటుకోవాలనుకున్నాడు. అయితే జర్నలిస్ట్‌లను ఊచకోత కోయడం ద్వారా జిహాదీ జాన్‌ను అమెరికా, బ్రిటన్‌లు మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ జాబితాలో చేర్చాయి. కాగా రక్కాలో జాన్‌ వాహనం ఎక్కుతూ ఉండగా డ్రోన్‌ దాడులు జరిగాయి. ఆ దాడుల్లో మరణించాడని భావిస్తున్నారు.

1988లో జన్మించిన జిహాదీ జాన్‌.....

1988లో జన్మించిన జిహాదీ జాన్‌ గ్రాడ్యుయేట్‌ పూర్తిచేశాడు. కాలేజీలో చాలా సాదాసీదాగా గడిపిన వ్యక్తి షడన్‌గా తన రూట్‌ మార్చుకుని సోమాలియాకు చెందిన అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. అక్కడి నుంచి సిరియా వెళ్లి ఐఎస్‌లో చేరాడు. అయితే బ్రిటన్‌లో ఉంటున్న జాన్‌ తల్లిదండ్రులకు మాత్రం ఈ విషయాలేవీ తెలియవు. తమ కొడుకు కన్పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఎమ్వాజీ అలియాస్‌ జిహాదీ జాన్ ఐఎస్‌ ఉగ్రవాద సంస్థలో చేరాడని అతని తల్లిదండ్రులకు తెలిపారు. ఇంతకి జాన్ చనిపోయాడో లేదో అధికారికంగా తెలియదు. మరికొన్ని గంటలు లేదా రోజుల్లో నిజమేంటో నిగ్గుతేలే అవకాశముంది. 

12:47 - November 14, 2015

హైదరాబాద్ : సాగు చేయలేక అగచాట్లు పడుతున్న అన్నదాతను అడ్డంగా దోచుకుంటుంది ఓ విత్తన కంపెనీ. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తూంటే తన పని తాను చాపకింద నీరులా చక్కబెట్టుకుంటోంది. 8ఏళ్లుగా ఎడాపెడా రైతులనుంచి వందలాది కోట్ల రూపాయలు దోచుకున్న ఆ సంస్థ ఇంకా దోచుకోవాలని చూస్తోంది. దేశ దేశాల రైతులను కబలిస్తున్న ఆ కార్పోరేట్ గద్ద ఇంతకీ ఎవరు? వాచ్ దిస్ స్టోరీ

పత్తి రైతులకు కొత్తగా పరిచయమైన బోల్‌గార్డ్‌ పత్తి...

టీ..అంటే బోల్‌గార్డ్‌ పత్తి. షార్ట్‌కట్‌లో బీటీ కాటన్‌ పేరుతో దేశంలోకి ప్రవేశించిన ఈ పత్తివిత్తనాలు ఇప్పుడు పత్తి రైతుల పాలిట యమపాశాల్లాగా తయారయ్యాయి. దశాబ్దంన్నర క్రితం వరకు దేశవాలీ రకాలనే సాగు చేస్తున్న పత్తిరైతులకు కొత్తగా పరిచయమైంది బోల్‌గార్డ్ పత్తి. మోనోశాంటో కంపెనీ ఈ రకమైన విత్తనాలను తొలుత ప్రవేశపెట్టింది. ప్రారంభంలో ఈ విత్తనాల ధర సాధారణ విత్తనాల కంటే రెండు మూడు రెట్లు అధికంగా ఉండేది. తొలుత రెండు వేల ప్యాకెట్లతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించిన ఈ సంస్థ నేడు కోటి ఇరవై లక్షల ప్యాకెట్లకు విస్తరించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రెండు శాతంగా ఉన్న బోల్‌గార్డ్ పత్తి సాగు నేడు వందశాతానికి చేరింది. బోల్‌గార్డ్ పత్తితో అప్పటి దాకా రైతును పీల్చిన రసం పీల్చు పురుగు నశించడం కూడా ఈ విత్తనాలకు అంత క్రేజ్ రావడానికి ఓ కారణంగా మారింది.

వెయ్యి నుండి రూ. 1100 పత్తి విత్తనాల ధర...

2004 వరకు సాధారణ రైతులకు అందనంత దూరంలో ఉన్న విత్తనాల ధర ఒక్కసారిగా వెయ్యి నుండి 1100లకు పెరిగింది. అయితే అందనంత ఎత్తులో ఉన్న ధరలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ అందుబాటులోకి తెచ్చారు. 930 రూపాయలకు ఒక్క ప్యాకెట్ చొప్పున విక్రయించేందుకు అంగీకారం తెలిపాయి కంపెనీలు. అయితే విత్తనాలకు బోల్‌గార్డు ట్రీట్ మెంట్ చేసినందుకు రాయల్టీగా మోనోశాంటోకు సాధారణ కంపెనీలు 150 రూపాయలు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటి వరకూ ఇదే విధానం అమల్లో ఉంది. అయితే భారతదేశ రాయల్టీ చట్టం ప్రకారం 7సంవత్సరాలు మాత్రమే రాయల్టీ చెల్లించాలి. కానీ మోనోశాంటో మాత్రం 15 ఏళ్లుగా దాదాపు 850కోట్ల రూపాయల్ని దండుకుంది. రైతు సంఘాల ఆందోళనల నేపథ్యంలో రాయల్టీలో సగం అంటే ప్యాకెట్‌కి 90రూపాయలు విత్తన రైతులకు చెల్లించేందుకు అంగీకరించింది.

రాయల్టీని ఎగ్గొట్టేందుకు హైకోర్టుకు వెళ్లిన మోనోశాంటో.....

ఆ తర్వాత రైతులకు రాయల్టీని ఎగ్గొట్టేందుకు మోనోశాంటో కంపెనీ కోర్టుకు వెళ్లింది.ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాయల్టీని నిలిపేస్తూ జీవో ఇచ్చింది. దీనిపై హైకోర్టుకు వెళ్లిన మోనోశాంటోకు చుక్కెదురైంది. అయితే అంతటితో ఆగని ఈ కంపెనీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. తాజాగా సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చి తుది తీర్పు వచ్చే వరకు పాత విధానాన్నే కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. సుప్రీం ఇచ్చిన తీర్పు పై రైతు సంఘాలు విచారం వ్యక్తం చేశాయి. ఇక్కడే విత్తనాల్ని ఉత్పత్తి చేస్తూ..ఇక్కడి రైతులకే అమ్ముతూ రైతుల నుండి భారతదేశ చట్టాలకు వ్యతిరేకంగా రాయల్టీ పేరుతో దోపిడీ చేయడాన్ని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

కంపెనీలకు కొమ్ముకాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.....

వందలు,..వేలకోట్లలో నడుస్తున్న ఈ సైన్సు దోపిడీని ఎవరు అడ్డుకుంటారు? ఉన్న చట్టాలను కూడా వాడుకోకుండా ప్రైవేటు కంపెనీలకు కొమ్ము కాస్తున్న సంస్ధలపై ఎవరు చర్య తీసుకుంటారు? ప్రభుత్వ ల్యాబ్‌ల్లోంచి కొట్టుకుపోతున్న వంగడాల వరదకు ఎవరు ఆనకట్ట వేస్తారు? తాము తయారు చేసిన విత్తనాలకే పేరు మార్చి అమ్ముతుంటే..డబ్బుతో కొనుక్కుంటున్న రైతు పరిస్ధితిని ఎవరు మారుస్తారు? 

12:40 - November 14, 2015

హైదరాబాద్ :పూటకో మాట.రోజుకో ప్రకటన. వారానికో సర్వే. నెలకో డిజైన్. ఇదీ ఉత్తర తెలంగాణ జల ప్రసాదినిగా భావిస్తున్న ప్రాణహిత ఎత్తిపోతల పథకం పరిస్థితి. ఇప్పటికే ప్రాజెక్టు డిజైన్‌ మార్పుచేసిన ప్రభుత్వం తాజాగా మరో ప్రతిపాదనకు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనతో లాభం కన్నా నష్టాలే అధికమని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాణహిత ఎత్తిపోతల పథకంపై స్పెషల్‌ ఫోకస్‌.

ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌పై మరో ప్రతిపాదన....

ప్రాణహిత చేవెళ్ల డిజైన్‌ ఓ ప్రహసనంగా మారుతోంది. గతంలో దీన్ని తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించే విధంగా డిజైన్‌ తయారుచేశారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రాజెక్టుల డిజైన్‌లపై దృష్టిసారించింది. ఈ క్రమంలోనే ప్రాణిహిత చేవెళ్ల డిజైన్‌ కూడా మార్చాలని నిర్ణయించింది. కాళేశ్వరం సమీపంలో మేడిగడ్డ దగ్గర దీన్ని నిర్మించాలని డిసైడ్‌ చేసింది. కాళేశ్వరం నుండి ఎత్తిపోతల పథకంగా ప్రకటించింది. తాజాగా ప్రభుత్వం మరో ప్రతిపాదన తీసుకొచ్చింది. గోదావరిలో ఐదు బ్యారేజీలు నిర్మించి నీటిని గోదావరిలో వెనక్కి తీసుకురావాలని నిర్ణయించింది.

కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి వరకు బ్యారేజీలు.....

మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి దాని గర్భంలోనే అంటే ఇరవై కిలోమీటర్ల పైన మరో బ్యారేజీ నిర్మించాలని తాజాగా ప్రతిపాదించారు. ఇలా కాళేశ్వరం నుండి ఎల్లంపల్లి వరకు 140 కిలో మీటర్ల దూరానికి ఐదు బ్యారేజీలు నిర్మించి.. నీటిని వెనక్కి ఎత్తిపోయాలనేది నూతన ప్రతిపాదన సారాంశం. ఈ తాజా డిజైన్ వల్ల అరవైవేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా.

కొత్త ప్రతిపాదనతో సమస్యలు.....

ఐతే ఈ ప్రతిపాదన వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజా డిజైన్‌ ప్రకారం అయిదు ప్రాంతాల్లో లిఫ్టులు ఏర్పాటుచేసి నీటిని ఎత్తిపోయాలి. దీని వల్ల నిర్వహణ వ్యయం అధికంగా ఉండే అవకాశం ఉంది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో నల్లరేగడి నేలలు అధికంగా ఉన్నాయి. ఈ నేలల వల్ల గోదావరి ప్రాజెక్టులకు సహజంగానే పూడిక ఎక్కువ. పూడిక వల్ల ఇప్పటికే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యాన్ని భారీగా కోల్పోయింది. ఐదు బ్యారేజీలూ నదీ గర్భంలో ఉండటం వల్ల భవిష్యత్ లో పూడికతో నిండిపోయే ప్రమాదముందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రాణహిత నీటిని వాడుకునే అవకాశం ఉండదు....

తాజా ప్రతిపాదన వల్ల మరో నష్టం కూడా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం ఒక నదికి చెందిన నీటిని ఆ నది బేసిన్ లోనే వాడుకోవాలి. కొత్త డిజైన్ ప్రకారం ప్రాణహిత నీరు గోదావరిలో కలిసాకే వినియోగిస్తారు కాబట్టి ఆ నీరు గోదావరి బేసిన్ లెక్కలోకి వస్తుంది. అందు వల్ల ప్రాణహిత నది నుండి రావాల్సిన నీటిని వాడుకోవడం కుదరదు. దీంతో దాదాపు 160టిఎంసిల నీరు తెలంగాణ కోల్పోయే ప్రమాదం ఉంది. 

2010, ఏప్రిల్ 16 ఆమోదం

ప్రాణహిత ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం 2010 ఏప్రిల్ 16న సూత్రప్రాయంగా ఆమోదించింది. 38,500 కోట్ల రూపాయల వ్యయానికి అనుమతి కూడా లభించింది. ఏడు లిఫ్టుల ద్వారా ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలి. ప్రాజెక్టు పనులతో మహారాష్ట్ర లోని కొన్ని గ్రామాలు కూడా ముంపుకు గురవుతాయి కాబట్టి అక్కడి ప్రభుత్వం అనుమతి కూడా అవసరమయ్యింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్య మంత్రి కేసిఆర్ మహారాష్ట్ర పర్యటన జరిపారు. సిఎం దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్ విద్యాసాగర్ రావులతో చర్చించారు. ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించిందని, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అడ్డంకులు తొలిగాయని అప్పట్లో కేసీఆర్‌ ప్రకటించారు. ఆ తరువాత డిజైన్ మార్పు పల్లవినందుకున్నారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని తుమ్మిడి హట్టి నుండి కాళేశ్వరం సమీపంలో మేడిగడ్డ సమీపానికి మార్చారు.

ప్రాణహిత డిజైన్‌ మార్పుపై వ్యాప్కోస్‌ సర్వే....

ప్రాణహిత డిజైన్ మార్పు కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ ఇంజనీర్లు ఓ ప్రాథమిక సర్వే చేశారు. మేడిగడ్డ దగ్గర ప్రతిపాదించిన కొత్త డిజైన వల్ల 17,400 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని అంచనా వేసింది. నీటిని కాళేశ్వరం నుండి ఎగువన 140 కిలోమీటర్ల దూరంలోని ఎల్లంపల్లి కి లిఫ్ట్ చేసే ప్రణాళికను తయారు చేసింది. కాని సింగరేణి గనులు, అటవీ భూములు సొరంగాలు తవ్వాల్సి రావడంతో ఈ ప్రతిపాదన విరమించుకున్నారు. మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మించి దాని గర్భంలోనే అంటే ఇరవై కిలో మీటర్ల పైన మరో బ్యారేజీ నిర్మించాలని తాజాగా మరో ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చారు. ఇలా కాళేశ్వరం నుండి ఎల్లంపల్లి వరకు 140 కిలో మీటర్ల దూరానికి ఐదు బ్యారేజీలు నిర్మించి నీటని వెనక్కి ఎత్తిపోయాలనేది ప్రతిపాదన సారాంశం. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై సాగునీటి రంగ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. 

12:33 - November 14, 2015

హైదరాబాద్‌ : అల్వాల్‌లో.. కూకట్‌పల్లి ఏసీపీ సంజీవరావు ఇంటిపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు నిర్వహించింది. సంజీవరావుకు చెందిన 10 కోట్ల రూపాయల అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. పలు విలువైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంజీవరావుకు శామీర్‌పేటలో ఫాంహౌస్‌, హైదరాబాద్‌లో షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ములుగులో 30 ఎకరాల తోట, వరంగల్‌ అడ్వకేట్స్‌ కాలనీలో భారీ భవనం ఉంది. ఇక దమ్మన్నపేటలో ఐదెకరాల పొలం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏసీపీ సంజీవరావుకు బినామీగా వ్యవహరిస్తున్న అక్బర్‌ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

ఎల్గర్ అవుట్..

బెంగళూరు : భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 78 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఎల్గర్ (38) అవుట్ అయ్యాడు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్ వాన్ జిల్ (10) పెవిలియన్ దారి పట్టగా డుప్లెసిస్ డకౌట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లు అశ్విన్ తీశాడు. అనంతరం వచ్చిన ఆమ్లా నిలదొక్కుకోలేకపోయాడు. కేవలం 7 పరుగులు చేసి ఆరోన్ బౌలింగ్ లో పెవలియన్ చేరాడు. ప్రస్తుతం డివిలియర్స్ 24, డుమిని 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు, అరోన్, జడేజా తలో ఒక వికెట్ తీశారు.

తృటిలో తప్పించుకున్న రేణుదేశాయ్

ముంబై:పారిస్ ఉగ్రదాడి నుంచి ప్రముఖ నటి రేణుదేశాయ్ తృటిలో తప్పించుకున్నారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి సమీపంలోనే గత కొన్ని రోజుల వరకు రేణుదేశాయ్ పర్యటించారు. పారిస్ ట్రిప్ ముగించుకొని శనివారం ఉదయం ముంబైలో దిగారు.'ఇప్పుడే ప్యారిస్ నుంచి ముంబైలో ల్యాండ్ అయ్యాను. దిగగానే పారిస్పై ఉగ్రదాడి విషయం తెలిసింది. నా క్షేమం కోసం మెసేజ్లు చేసిన వారికి కృతజ్జతలు' అంటూ రేణుదేశాయి ట్విట్ చేశారు.

కేసీఆర్ అబద్ధాల కోరు, మోసగాడు : సర్వే సత్యనారాయణ

వరంగల్ : తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేనని.. కేసీఆర్ అబద్ధాల కోరు, మోసగాడు అని కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ...ఉప ఎన్నికలతో కేసీఆర్ కుటుంబం పతనం ఖాయం అవుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల కష్టంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలిపారు. కేసీఆర్ దళితులను మోసం చేశారని ఆరోపించారు. రాజయ్యను బర్తరఫ్ చేసి దళితులను అవమానించారు. సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్ కో న్యాయం... రాజయ్యకో న్యాయమా అని మండి పడ్డారు. వరంగల్ కు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు.

విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్ : గవర్నర్

హైదరాబాద్ : విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు. చిన్నారులకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యను వ్యాపారం చేయడం వలన చాలా మంది నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏసీపీ సంజీవరావు బినామీ అక్బర్ ఇంటిపై ఏసీబీ దాడులు..

హైదరాబాద్ : కూకట్ పల్లి ఏసీపీ సంజీవరావు బినామీ అక్బర్ ఇంటిపైనా ఏసీబీ దాడులు చేపట్టింది. హైదర్ గూడలోని అక్బర్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.

పారిస్ ఉగ్రదాడిని ఖండించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: పారిస్‌లో ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు. లెవెన్త్ డిస్ట్రిక్‌లోని కన్సర్ట్ హాల్‌లో ప్రేక్షకులపై తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 153 మంది మృతిచెందారు. ఈ సంఘటనపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్రంగా స్పందించారు. తీవ్రవాదులది పిరికి చర్య అని ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

నితీష్ రాజీనామా..

పాట్నా : ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామ పత్రాన్ని గవర్నర్ కు సమర్పించినట్లు నితీష్ పేర్కొన్నారు. రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు తెలిపారు.

పారిస్ లో దాడి ....భారత్ లో హై అలర్ట్....

న్యూఢిల్లీ : పారిస్‌ నరమేధం నేపథ్యంలో భారత్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ వాహనాలను సోదాలు నిర్వహిస్తున్నారు. అటు అగ్రరాజ్యం అమెరికా సైతం పారిస్ ఘటనతో అప్రమత్తమైంది. ముఖ్యప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, ప్రధాన సెంటర్లలో పట్టిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పారిస్ నగరంలో పలు చోట్ల కాల్పులు, పేలుళ్లు జరిగిన ఘటనలో 170 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రపంచ దేశాల అధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ట్రాక్టర్ బోల్తా :18 మందికి గాయాలు..

ప్రకాశం : కొనకనమెట్ల దగ్గర ట్రాక్టరు బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

11:22 - November 14, 2015

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ 'ప్రభాస్'...ఇతను టాలీవుడ్ కు 2002 సంవత్సరంలో 'ఈశ్వర్' చిత్రం ద్వారా పరిచయమయ్యాడు. అనంతరం 2014 సంవత్సరంలో బాలీవుడ్ లో 'యాక్షన్ జాక్సన్' చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రానికి 'ప్రభుదేవ' దర్శకుడు. తాజాగా 'ప్రభాస్' 'బాహుబలి' చిత్రం ద్వారా పాపులర్ అయ్యాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకుంది. కానీ తనకు చిత్రంలో నటించడం..డబ్బులు సంపాదించడమే కాదు కొంత సహాయం చేయడమనేది తెలుసని ఇటీవల 'ప్రభాస్' చాటి చెప్పాడు. ఎలాంటి పబ్లిషిటీ లేకుండా ఓల్డ్ ఏజ్ హోమ్, ఇతర సంస్థలకు సహాయం అందచేశాడు. తాజాగా ఓ ఓల్డ్ ఏజ్ హోమ్ కు రూ.5లక్షల చెక్కును అందచేశాడు. దీనికి సంబంధించి ట్విట్టర్ లో ట్వీట్స్ చేరాయి. అంతేగాక ఇటీవలే నల్గొండ జిల్లాలోని ఓ అంధ పాఠశాలకు రూ. 10 లక్షలు అందించిన సంగతి తెలిసిందే. వారికి సహాయం చేయడమే కాకుండా అక్కడ కొద్దిసేపు ప్రభాస్ గడిపారు. ప్రస్తుతం 'బాహుబలి' రెండో పార్టుకు సంబంధించిన పనుల్లో ప్రభాస్ నిమగ్నమై ఉన్నారు. బాలీవుడ్ లో కూడా 'ప్రభాస్' ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది.

రైలు పట్టాలు తొలగించిన మావోయిస్టులు

ఛత్తీస్ గఢ్ : జగదల్ పూర్ సమీపంలో కుమ్హార - చోడేర వద్ద రైలు పట్టాలను మావోయిస్టులు తొలగించారు. దీంతో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.

ఢిల్లీలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు..

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పండిట్ జవర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శాంతివనంలో నెహ్రూకు యూపీఏ అధ్యక్షురాలు సోనియా, రాహుల్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

ఆమ్లా అవుట్..

బెంగళూరు : భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 47పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆమ్లా (7) అవుట్ అయ్యాడు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్ వాన్ జిల్ (10) పెవిలియన్ దారి పట్టగా డుప్లెసిస్ డకౌట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లు అశ్విన్ తీశాడు. అనంతరం వచ్చిన ఆమ్లా నిలదొక్కుకోలేకపోయాడు. కేవలం 7 పరుగులు చేసి ఆరోన్ బౌలింగ్ లో పెవలియన్ చేరాడు. ప్రస్తుతం డివిలియర్స్ 0, ఎల్గర్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రెండో రోజు ప్రారంభమైన టిడిపి సదస్సు

చిత్తూరు : తిరుపతిలో టీడీపీ దిశానిర్దేశ సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు వివిధ నియోజవర్గాలకు చెందిన 300 మంది కార్యకర్తల అభిప్రాయాలను సీఎం చంద్రబాబు, లోకేష్ తెలుసుకోనున్నారు. నిన్న జరిగిన సదస్సులో తాను రాష్ట్రానికి ఏం చేస్తున్నాననే దానిపై నేతలకు వివరించిన విషయం తెలిసిందే.

10:49 - November 14, 2015

ప్రభుత్వ ఉద్యోగ అన్వేషణలో ఉన్నారా.. ఏయే శాఖలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో తెలియడం లేదా? ఎప్పుడు ? ఎలా ? దరఖాస్తు చేయాలో తెలియడం లేదా..? డోంట్‌ వర్రీ. మీకు తోడ్పడేందుకు చక్కని అప్లికేషన్‌ అందుబాటులో ఉంది. గూగుల్‌ప్లే అందిస్తున్న Sarkari Naukri Updates యాప్‌ ద్వారా కేటగిరీల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలు తెలుసుకోవచ్చు. విద్యార్హత, వృత్తినైపుణ్యతను బట్టి ఉద్యోగాన్ని వెతుకోవచ్చు. పోలీస్‌, రైల్వే, రక్షణ, క్రీడా శాఖలతోపాటు బ్యాంకు, యూపీఎస్‌సీ, పీఎస్‌సీ తదితర ఉద్యోగాలు పొందేందుకు ఈ యాప్‌ ఓ వారధిగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తెలుసుకోవడమేకాకుండా ఇంటర్వ్యూ ప్రదేశాన్ని నావిగేషన్‌ ద్వారా సులభంగా వెతకొచ్చు. ఒకసారి రిజిస్టరైతే ఈ-మెయిల్‌ ఐడీని మరోసారి ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. 2జీ ఇంటర్నెట్‌తోనూ ఈ యాప్‌ను వేగంగా ఉపయోగించొచ్చు. సో ఆలస్యం ఎందుకు సెర్చ్ చేయండి..

లక్కపురం గ్రామంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

శ్రీకాకుళం : బూర్జ మండలం లక్కపురం గ్రామంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. లక్కపురానికి చెందిన ఎం.సౌజన్య(16) విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. సౌజన్య పాలకొండలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

మొన్న పోట్లపాలెం.. నేడు పోతేపల్లి..

కృష్ణా : బందరు మండలం పోతేపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోర్టు కోసం భూసేకరణను వ్యతిరేకిస్తూ... గ్రామస్తులు శనివారం మీ ఇంటికి - మీ భూమి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. పోర్టు కోసం తమ భూములు ఇచ్చేది లేదని... ఉన్నతాధికారులకు గ్రామస్తులు స్పష్టం చేశారు. ఆ క్రమంలో అధికారులు... గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

10:44 - November 14, 2015

తమిళనాడు : వెల్లూరులో 6.4 కిలోల బరువుతో భీమ సేనుడు (మగశిశువు) జన్మించాడు. వెల్లూరులోని సంధ్య ఆస్పత్రిలో 29 ఏళ్ల మహిళ ఈ బుడతకు జన్మనిచ్చింది. ఈమెకు ఇంతకు ముందు ఇద్దరు ఆడపిల్లలున్నారు. వారు వరుసగా 4.5, 3.5 కెజీల బరువుతో పుట్టారని ఆస్పత్రి డైరెక్టర్‌ సంధ్య బాబు చెప్పారు. 6.4 కిలోల బరువుతో పుట్టిన ఈ భీమసేను డు దేశంలోనే అత్యంత బరువైన రెండవ శిశువు అంట. 'ఇటీవలే 6.7 కిలోలతో ఉత్తరప్రదేశ్‌లో ఒక శిశువు పుట్టింది. కొన్నేళ్ల క్రితం రాజ స్థాన్‌లో 5.9 కిలోల బరువుతో మగశిశువు జన్మించాడు' అని వైద్యురాలు సంధ్య చెప్పారు. డయాబెటిక్‌ తల్లులకు బరువు ఎక్కువగా ఉన్న పిల్లలు పుట్టే అవకాశం ఉందని, అయితే ఈ కేసులో భీమసేనుడి తల్లి డయాబెటిక్‌ వ్యాధిగ్రస్తురాలు కాదని పేర్కొంది. తల్లి శరీరతత్వం కారణంగానే అత్యధిక బరువుతో పుట్టాడని, ప్రస్తుతం తల్లీ, కొడుకు చాలా ఆరోగ్యంగా ఉన్నారని ఆస్పత్రి డైరెక్టర్ సంధ్య పేర్కొన్నారు.

 

10:43 - November 14, 2015

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎవరో తెలియదంట. కానీ ఈ క్రికెట్ గాడ్ తెలియని వారుండరని ఈ ఘటనతో తెలుస్తోంది. క్రికెట్‌ ఆడే దేశాల్లో అయితే ఆయనను దేవుడిగా భావిస్తారు. అనితర సాధ్యమైన ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న అటువంటి ఆయనకు అమెరికాలోని ఎయిర్‌ పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది. సచిన్‌ అమెరికాలోని బ్రిటిష్‌ ఎయిర్‌ వేస్‌కు చెందిన విమానంలో ప్రయాణిస్తుండగా ఆయన లగేజీని తప్పుడు అడ్రస్‌కు పంపించారు. దీనిపై సచిన్‌ బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ను సంప్రదించగా వారు 'మీ పూర్తి చెప్పండి' అంటూ సచిన్‌ను ప్రశ్నించారు. దీనిపై సచిన్‌ ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'చాలా కోపం, విసుగ్గా ఉంది. విమానంలో సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ వెయిట్‌ లిస్టులో ఉన్న తన కుటుంబ సభ్యులకు సీట్లు కేటాయించ లేదు. లగేజీ విషయంలో కూడా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించింది' అని ట్వీట్‌ చేశారు. సచిన్ ట్వీట్లు వైరల్ కావడంతో బ్రిటీష్ ఎయిర్ లైన్స్ వెంటనే స్పందించింది. సచిన్ కుటుంబానికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. దీనిపై సచిన్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. కొందరు వ్యంగ్యంగా స్పందించగా మరికొందరు బ్రిటిష్‌ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. 'సచిన్‌ పూర్తి పేరు జీసస్‌ సచిన్‌ భగవాన్‌ టెండూల్కర్‌ అమృత్‌సర్‌, అడ్రస్‌ కాశీ, రోమ్‌, మక్కా' అని ఒకరు ట్వీట్‌ చేయగా మరొకరు 'బ్రిటిష్‌ వాళ్లు మొదట భారత్‌ కోహి నూర్‌ను ఎత్తుకెళ్లారు. ఇప్పుడు సచిన్‌ లగేజీని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు. ఇంకెంతకాలం సహించాలి' అని ప్రశ్నించారు.

సిరియా లో జోక్యం వల్లే దాడులు ....

హైదరాబాద్ : సిరియా విషయంలో జోక్యం చేసుకున్నందుకే ఈ దాడి చేశామని దాడిలో పాల్గొన్న ఓ ఉగ్రవాది చెప్పినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ''ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్‌దే తప్పని అతడు స్పష్టంగా చెప్పాడు.. నేను ఆ విషయం విన్నాను. సిరియా విషయంలో హోలండ్ జోక్యం చేసుకుని ఉండకూడదన్నాడు. ఇరాక్ గురించి కూడా మాట్లాడాడు'' అని పియెర్ జనాస్జక్ అనే రేడియో ప్రెజెంటర్ తెలిపారు. ద బటాక్లాన్ అనే సంగీత వేదిక వద్ద ఈ ఉగ్రవాది మాట్లాడుతుండగా తాను విన్నానని అన్నారు. 'అల్లాహో అక్బర్' అంటూ మరికొందరు ఉగ్రవాదులు నినాదాలు కూడా చేశారన్నారు.

10:41 - November 14, 2015

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ కోతలు లేని విద్యుత్ అందిస్తామని పదే పదే చెప్తోంది. వచ్చే ఏడాది మార్చి తర్వాత రైతులకు 9గంటల కరెంటును సరఫరా చేస్తామని సాక్షాత్తూ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అయితే విద్యుత్ కొనుగోలుకు చత్తీస్‌ఘడ్‌తో చేసుకున్న ఒప్పందం సంగతేంటని అడిగితే మాత్రం సర్కార్‌ కస్సు మంటోంది. అసలు చత్తీస్‌ఘఢ్‌తో విద్యుత్‌ ఒప్పందం లాభమా నష్టమా అనేది ఇప్పుడు వివాదస్పదం అవుతోంది.

కోతలు లేకుండా నిరంతర విద్యుత్‌ సరఫరా .......

తెలంగాణలో విద్యుత్ కొరతను అధిగమించి..వచ్చే ఏడాది నుంచి రెప్పపాటు సమయం కూడా కరెంటు కోతలు లేకుండా కరెంటును సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదే పదే ప్రకటించారు. పరిశ్రమలకు సైతం పవర్ హలీడే లేని విధంగా విద్యుత్‌ను సరఫరా చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త పవర్ ప్రాజెక్టుల నిర్మాణాలకు సైతం ప్రభుత్వం పచ్చజెండా ఊపి నిర్మాణాలను ప్రారంభించింది. దాంతో పాటు పలు ప్రయివేటు సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలుకు ఒప్పందాలు సైతం చేసుకుంది. అదే విధంగా చత్తీస్‌గఢ నుంచి విద్యుత్‌ను కొనేందుకు రంగం సిద్దం చేసుకొని ఒప్పందం కూడా చేసుకుంది. అయితే చత్తీస్‌ఘడ్‌తో చేసుకున్న విద్యుత్ ఒప్పందం అవినీతి మయంగా, రానున్న రోజుల్లో వినియోగదారులపై భారం మోపే విధంగా ఉందనే విషయం ఇప్పుడు వివాస్పదమవుతోంది.

వెయ్యిమెగావాట్ల విద్యుత్‌ సరఫరాకు ఒప్పందం .....

చత్తీస్‌గడ్ ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ వెయ్యి మెగావాట్ల విద్యుత్‌కు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ చేసుకుంది. అయితే ఈ అగ్రిమెంటులో ఎక్కడా యూనిట్ విద్యుత్‌ను ఎంత ధరకు కొనుగోలు చేస్తున్నారనేది చెప్పలేదు. పైగా చత్తీస్‌గడ్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసేందుకు 300 కిలో మీటర్ల మేర కారిడార్‌ నిర్మాణం జరగాల్సి ఉంది. ఈ నిర్మాణం జరగడానికి ఇంకా యేడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత విద్యుత్‌ను సరఫరా చేసేందుకు రెండేళ్లకుపైనే సమయం పడుతుంది. ఇంత చేసినా..విద్యుత్ కారిడార్ నిర్మాణం తరువాత సరఫరా అయ్యే విద్యుత్ యూనిట్ ధర అప్పటి వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో కారిడార్ నిర్మాణ వ్యయం, లైన్ లాసెస్‌ వంటి విషయంలో జరిగిన ఒప్పందంలో క్లారిటీ లేదనేది విద్యుత్ రంగ విశ్లేషకుల వాదన. ఒకవేళ విద్యుత్‌ను అధిక ధరకు కొని తక్కువ ధరకు విద్యుత్ అందిస్తారా లేక విద్యుత్ సబ్సిడీలను ప్రభుత్వం భరిస్తుందా అనేది స్పష్టతలేదు. వీటన్నంటికి ప్రపంచ బ్యాంకు అంగీకరిస్తుందా ? లేక వినియోగ దారులపై చార్జీల భారం మోపుతారా అన్న సందేహలు , అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇప్పటికే తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌ను ఆశ్రయించి విచారణ జరపాల్సిందిగా కోరారు.

ప్రభుత్వం దీనిపై స్పందించాలి....

చత్తీస్‌గఢ్‌తో జరిగిన విద్యుత్‌ ఒప్పందంపై వివాదం చెలరేగుతున్న తరుణంలో ప్రభుత్వం దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఒప్పందంలో పొందుపరిచిన అంశాలను బయటకు చెప్పి వివాదానికి తెరదించాల్సిన బాధ్యత సర్కార్‌పై ఉంది. కానీ ఇవేమి పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే మరో మారు విద్యుత్ ఉద్యమాలు తప్పవని ప్రజాసంఘాలు హెచ్చరిస్తున్నాయి. 

10:30 - November 14, 2015

'మహేష్‌' హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ (సివిఎం) నిర్మించిన చిత్రం 'శ్రీమంతుడు'. ఈ చిత్రం నవంబర్‌ 14కి 15 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకోబోతోంది. తమ మైత్రి మూవీ మేకర్స్‌ బేనర్‌లో రూపొందిన తొలి చిత్రం 'శ్రీమంతుడు' ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు సాధించడమే కాకుండా 15 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ 'మహేష్‌' ఉపయోగించిన సైకిల్‌కి సంబంధించి గత కొంతకాలంగా ఒక కాంటెస్ట్‌ రన్‌ అవుతోందని, ఈ కాంటెస్ట్‌కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. వేలాదిగా ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్నారని, నవంబర్‌ 13తో ఈ కాంటెస్ట్‌ ముగిసిందని తెలిపారు. నవంబర్‌ 14న సూపర్‌స్టార్‌ 'మహేష్‌' డ్రా తీసి ఈ కాంటెస్ట్‌లో విజేతను ఎంపిక చేయబోతున్నట్లు, గెలుపొందిన విజేతకు నవంబర్‌ 16న మహేష్‌ 'సైకిల్‌'ను అందజేయడం జరుగుతుందని నిర్మాతలు తెలిపారు. మరి ఆ లక్కి విజేత ఎవరో ?

10:28 - November 14, 2015

ఆశిష్‌ గాంధీ, వంశీకష్ణ కొండూరి, కునాల్‌ కౌశిక్‌, దీక్షాపంత్‌, శృతి మోల్‌, మనాలి రాథోడ్‌ ప్రధాన పాత్రధారులుగా రీడింగ్‌ లాంప్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై అశోక్‌ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'ఓ స్త్రీ రేపు రా'. 'కల్పితమా..కచ్చితమా' అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం ఆడియో త్వరలో విడుదల కానుంది. ఒకప్పుడు ఊళ్ళో దెయ్యం తిరుగుతుందని, ఇంటి గోడలపై 'ఓ స్త్రీ రేపు రా' అని రాసుకునేవారని దర్శక నిర్మాత అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. కొన్ని చోట్ల భయంతో చాలా మంది తమ గ్రామాలను విడిచి పెట్టి వెళ్ళిపోవడం కూడా జరిగిందని, ఇలాంటి డిఫరెంట్‌ హర్రర్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో 'ఓ స్త్రీ రేపు రా' చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. జి.వి. సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో వేడుకను సినీ ప్రముఖలు సమక్షంలో ఈ నెల 19న నిర్వహిస్తున్నామని, అలాగే సినిమాను డిసెంబర్‌ రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

10:27 - November 14, 2015

అనుష్క, ఆర్య ప్రధాన పాత్రల్లో ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో పివిపి బ్యాపర్‌పై ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మించిన చిత్రం 'సైజ్‌జీరో'. ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌ను వినూత్నంగా ప్లాన్‌ చేస్తున్నారు. 'ఈ చిత్రం కోసం అనుష్క 20కేజీలు బరువు పెరిగి మళ్ళీ తగ్గింది. అంత కమిట్‌మెంట్‌తో అనుష్క వర్క్‌ చేయడం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. కీరవాణి అందించిన సంగీతానికి ఇప్పటికే శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే టీజర్స్‌, ట్రైలర్స్‌ సినిమాపై అంచనాలను పెంచాయి. థియేట్రికల్‌ ట్రైలర్‌ రెండు మిలియన్స్‌ వ్యూస్‌ను పొందింది. ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని ఈ నెల 27న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేశాం. సౌత్‌ సెంట్రల్‌ నుంచి తెలంగాణ, ఎపి, తమిళనాడు సహా పలు నగరాలకు వెళ్ళే రైళ్ళ లోపల, బయట 'సైజ్‌ జీరో' పోస్టర్స్‌, డిజైన్స్‌ అంటిస్తున్నాం. దీంతోే ప్రయాణికులతోపాటు రైళ్ళు చూసే వారికి కూడా ఈ చిత్రం గురించి తెలుస్తుంది. వారిలో ఈ చిత్రం గురించి ప్రత్యేక మైన అటెన్షన్‌ ఏర్పడడానికి ఆస్కారముంటుంది' అని చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు.

10:26 - November 14, 2015

ఎప్పుడూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తన ఆత్మకథ 'గన్స్‌ అండ్‌ థైస్' పుస్తకాన్ని డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు. ఈ పుస్తక ముఖచిత్రాన్ని శుక్రవారం తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఆయన విడుదల చేశారు. పుస్తకంలోని విషయాల గురించి ప్రస్తావిస్తూ కొన్ని అధ్యాయాల పేర్లను ట్వీట్‌లో పేర్కొన్నారు. తాను బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ని ఇడియట్‌ అన్న విషయం.. తన సినీ జీవితంలో తనకు అండర్ వరల్డ్ తోనూ, మహిళలతోనూ ఉన్న సంబంధాల గురించి కూడా ఉంటుందంటూ టీజర్ వదిలేశారు. ఈ ఆసక్తికర ఛాప్టర్లలో వర్మ ఏం రాశారనేది తెలియాలంటే డిసెంబర్‌ వరకు ఆగాల్సిందే. వర్మ ప్రస్తుతం 'కిల్లింగ్‌ వీరప్పన్‌', 'ఎటాక్‌' చిత్రాలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

10:24 - November 14, 2015

'ష్‌... కోయి హై', 'గెట్‌ గార్జియస్‌', 'ప్యార్‌ కా బంధన్‌' వంటి హిందీ టీవీ సిరీస్‌తో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన లావణ్య త్రిపాఠి తెలుగు ప్రేక్షకులకు 'అందాల రాక్షసి'గా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళంలో సైతం పలు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అగ్రహీరో నాగార్జునతో నటించే లక్కీ ఛాన్స్‌ని కూడా అందిపుచ్చుకుంది. నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రంలో నటిస్తోంది. అలాగే ఇటీవల నానితో నటించిన 'భలే భలే మగాడివోయ్' చిత్రం కూడా విజయం సాధించి లావణ్యకు మరింత మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం 'సోగ్గాడే చిన్ని నాయనా'తో పాటు నవీన్‌చంద్రకి జోడీగా 'లచ్చిందేవీకి ఓ లెక్కుంది' చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాల్లోని పాత్రలు వేటికవే భిన్నంగా ఉంటాయని అంటోంది లావణ్య. ముఖ్యంగా 'లచ్చిందేవీకి ఓ లెక్కుంది' చిత్రంలో నా పాత్ర ఎలా ఉంటుందో డిఫరెంట్‌ పోస్టర్స్‌తో ఇప్పటికే దర్శక, నిర్మాతలు ప్రేక్షకులకు పరిచయం చేశారని, థియేటర్‌లో నా పాత్ర తప్పకుండా ఎంటర్‌టైన్‌ చేస్తుందనే నమ్మకం ఉందని చెప్పింది. మరి ఈ చిత్రం ఎలాం ఉంటుందో వేచి చూడాలి.

10:23 - November 14, 2015

అసలే చలికాలం. చలికి తట్టుకోలేక సూర్యరశ్మి తగిలితే బాగుండును అనిపిస్తుంది కదూ. అదే ఎండాకాలం అయితే వేడి తట్టుకోలేకపోతున్నాం. ఏసీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇలా కాలాన్ని బట్టి వాతావరణంలో మార్పులు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. ఏకాలంలో అయినా సూర్యరశ్మి ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే శరీరానికి కావలసిన విటమిన్‌ డి, కాల్షియం దీని నుంచే అందుతుంది కాబట్టి.
చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు. దాంతో కొంత ఉపశమనం కోసం సూర్యరశ్మిని కోరుకుంటాం. సూర్యోదయం అయ్యే సమయంలో సూర్యరశ్మిలో ఉండటం, సూర్యాస్తమయం సమయంలో సూర్యరశ్మిలో ఉండటం వల్ల ఎముకల పటుత్వానికి ఉపయోగపడే కాల్షియం, విటమిన్‌ డి శరీరానికి అందుతాయి. దీనివల్ల శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఎండలో ఉండటం ఎందుకు అనుకోకుండా ఉదయం, సాయంత్రం సూర్యరశ్మిని పొందడం మరిచిపోవద్దు.

జపాన్ లోని క్యుషు తీర ప్రాంతంలో భూకంపం

హైదరాబాద్ : జపాన్లోని క్యుషు తీర ప్రాంతంలో శనివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.0గా నమోదు అయిందని మీడియా వెల్లడించింది. సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. జపాన్కు నైరుతి ప్రాంతంలోని మకురాజ్కీ, కగోషిమాకు 160 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని కనుగొన్నట్లు జపాన్ వాతావరణ సంస్థ పేర్కొంది.

రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా..

బెంగళూరు : భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు డుప్లెసిస్ డకౌట్ అయ్యాడు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. తొలుత భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ జట్టులో రెండు మార్పులు చేశారు. మిశ్రా స్థానంలో బిన్నీ, ఉమేష్ స్థానంలో ఇశాంత్ శర్మలను తీసుకున్నారు.

కరీంనగర్ జిల్లాలో ఇద్దరు డీఎస్పీలపై బదిలీవేటు

హైదరాబాద్ : కరీంనగర్‌ ఏఎస్‌ఐ మోహనరెడ్డి కేసులో ఇద్దరు డీఎస్పీలపై ప్రభుత్వం బదిలీవేటు విధించింది. కొత్తగూడెం డీఎస్పీ భాస్కర్‌రావు, హుజురాబాద్‌ డీఎస్పీ సంజీవ్‌కుమార్‌లను బదిలీ చేస్తూ, వారిని డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై చర్యలకు సర్కారు సిద్ధమైంది. మోహనరెడ్డిని మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు.

షాద్‌నగర్‌ లో ఆర్టీసీ బస్సులో మంటలు

మహబూబ్ నగర్ : షాద్‌నగర్‌ సమీపంలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో నుంచి పొగ రావడంతో ప్రయాణికులు దిగిపోయారు, బైక్‌ను తప్పించబోయి ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఐఐఆర్ ఆర్ ఆర్ డైరెక్టర్ గా వీఆర్ బాబు

హైదరాబాద్ : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (ఐఐఆర్‌ఆర్) డైరెక్టర్‌గా డాక్టర్ వేమూరి రవీంద్రబాబు నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన పరిశోధనా సంస్థకు నిజామాబాద్ జిల్లాకు చెందిన వీఆర్‌బాబుకు డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించడంపై పలువురు శాస్త్రవేత్తలు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. నూతన వరి వంగడాల అభివృద్ధిలో సుదీర్ఘకాలంపాటు పరిశోధనలు చేసిన వీఆర్ బాబు బయోఫోర్టిఫికేషన్‌లో అనుభవజ్ఞుడు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ రాష్ర్టాల్లో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు.

09:41 - November 14, 2015

హైదరాబాద్ : ఉగ్రవాదం బరితెగించింది. టెర్రరిజం తెగబడింది. ఉన్మాదం తలకెక్కిన ఐఎస్‌ఐఎస్‌ ప్యారిస్‌ నగరంలో నరమేధం సాగించింది. ఫ్యాషన్‌ నగరం ప్యారిస్‌పై విషం కక్కింది. వందలాది అమాయక ప్రజలను చుట్టుముట్టి కాల్చి చంపేసింది. నరనరాన విద్వేష విషాన్ని నింపుకున్న ఉగ్రవాదులు బుల్లెట్ల జడివాన కురిపించారు. బాంబులు పేల్చి ప్యారిస్‌ వాసులను పొట్టన పెట్టుకున్నారు. కేవలం ఏడుగురు ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

గన్‌లు ఎక్కుపెట్టి బుల్లెట్ల వర్షం.....

బట్లకాన్‌ హాలులోకి వందలాదిమందిని తీసుకెళ్లి బంధించారు. నిర్దాక్షిణ్యంగా వారిపై గన్‌లు ఎక్కుపెట్టి బుల్లెట్ల వర్షం కురిపించారు. నాలుగుగోడల మధ్య వారిని కాల్చి చంపేశారు. తుపాకీ గుండ్ల జడివానలో రక్తంతో తడిసి ముద్దయిన వందమంది అమాయకులు ప్రాణాలు విడిచిపెట్టారు.

జాతీయ స్టేడియంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌....

ఫ్రాన్స్‌ జాతీయ స్టేడియంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతుండగా.. ఒక్కసారిగా బాంబు పేలింది. జనమంతా ఒక్కసారి గ్యాలరీలు వదిలి గ్రౌండ్‌లోకి పరుగులు పెట్టారు. అదే స్టేడియంలో మ్యాచ్‌ చూస్తున్న అధ్యక్షుడు హోలాండ్‌ను భద్రతాధికారులు వెంటనే సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లిపోయారు.

బాంబులు పేల్చి, కాల్పులు జరిపి....

ఒక షాపింగ్‌ మాల్‌, ఒక రెస్టారెంట్‌లలోనూ బాంబులు పేల్చిన ఉగ్రవాదులు.. కాల్పులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. బాంబు పేలుళ్లు, కాల్పుల్లో 70 మంది చనిపోయినట్లు.. సమాచారం. బటక్లాన్‌ థియేటర్‌లో వందమంది చనిపోయారు. ఉగ్రదాడితో ఉలిక్కిపడ్డ ఫ్రాన్స్‌ కాసేపటికే తేరుకుని.. ఎదురుదాడికి దిగింది. సుశిక్షితులైన భద్రతాదళాలు ప్యారిస్‌ నగరాన్ని జల్లెడ పట్టాయి. వేటాడి వెంటాడి ఐదుగురు ఉగ్రవాదులను కాల్చి చంపేశారు. సరిహద్దులను సైతం మూసివేసి.. గాలింపు కొనసాగిస్తున్నారు.

అంధకారంలో ఈఫిల్‌ టవర్‌......

ఎప్పుడూ లైట్లతో ధగధగలాడే ఈఫిల్‌ టవర్‌ ఒక్కసారిగా చీకట్లో కలిసిపోయింది. ఉగ్రదాడిలో చనిపోయినవారికి నివాళులు అర్పిస్తూ ఈఫిల్‌ టవర్‌ లైట్లు మొత్తాన్ని ఒక్కసారిగా ఆపేశారు. దీంతో ఈఫిల్‌ టవర్‌ విషాదానికి గుర్తుగా అంధకారంలో ఉండిపోయింది.

09:37 - November 14, 2015

రంగారెడ్డి :శామీర్‌పేట మండలం భాగ్యనగర్‌ కాలనీ వద్ద పాల వ్యాన్‌ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన బస్సు కోసం ఎదురుచూస్తున్న10 మందిపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 నెలల బాలుడు చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు.

ఢిల్లీలో కాంగ్రెస్ సేవా దళ్ మార్చ్..

ఢిల్లీ : నేడు దివంగత జవహార్ నెహ్రూ జయంతి దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు 'సేవా దళ్ మార్చ్' నిర్వహించింది. ఇండియా గేట్ వద్ద ప్రారంభమైన ఈ మార్చ్ ఇందిరా గాంధీ స్టేడియం కాంప్లెక్స్ వరకు జరుగనుంది.

09:35 - November 14, 2015

హైదరాబాద్ : కూకట్‌పల్లి ఏసీపీ సంజీవరావు ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. అల్వాల్‌లోని ఆయన నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. సంజీవరావుపై ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ఇళ్లు, కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 2 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు. ఇక సంజీవరావు టీ-టీడీపీ రాష్ట్ర స్థాయి నేతకు సమీప బంధువుగా తెలుస్తోంది. 

09:33 - November 14, 2015

రంగారెడ్డి :ఘట్‌కేసర్‌ సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. తొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 

పారిస్ ఉగ్రదాడిని ఖండించిన బాబు..

విజయవాడ : పారిస్ లో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో 140 మందికి పైగా మృతి చెందారు. పారిస్ లో ఉగ్రదాడిని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలియచేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

09:32 - November 14, 2015

వరంగల్‌ : హన్మకొండ హౌసింగ్‌బోర్డు కాలనీలో రోడ్డుపై ఇద్దరు కానిస్టేబుళ్లు బీభత్సం సృష్టించారు. బాధ్యతలను విస్మరించిన ఇద్దరు కానిస్టేబుళ్లు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కానిస్టేబుళ్ల దాడితో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న సుబేదారి పోలీసులు.. ఇద్దరిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. అయితే వారు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుపోయారు. ఇద్దరిలో ఒకరు మట్టేవాడ కోర్టు కానిస్టేబుల్‌ సంతోష్‌గా గుర్తించారు. 

ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్..

బెంగళూరు : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ జట్టులో రెండు మార్పులు చేశారు. మిశ్రా స్థానంలో బిన్నీ, ఉమేష్ స్థానంలో ఇశాంత్ శర్మలను తీసుకున్నారు.

ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చిన పోలీసులు

హైదరాబాద్ : పారిస్ లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదుల్లో ఐదుగురని కాల్చి చంపేశారు. మిగిలిన వారి కోసం 1500 మంది సైనికులు రంగంలోకి జల్లెడపడుతున్నారు.

కూకట్ పల్లి ఏసీపీ ఇంటి పై ఏసీబీ దాడులు..

హైదరాబాద్ : తెలంగాణ పోలీసు శాఖలో మరో లంచావతారం వెలుగులోకి వచ్చింది. కూకట్ పల్లి ఏసీపీగా పనిచేస్తున్న సంజీవరావు అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదుల నేపథ్యంలో అనినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయన ఇంటిపై నేటి తెల్లవారుజామున దాడి చేశారు. ఆల్వాల్ లోని సంజీవరావు ఇల్లు సహా మొత్తం ఐదు ప్రాంతాల్లో ప్రస్తుతం ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.ఇప్పటిదాకా సంజీవరావు ఇంటిలో రూ.2 కోట్ల మేర అక్రమాస్తులు బయటపడినట్లు సమాచారం. సోదాల్లో భాగంగా సంజీవరావు ఇంటిలో భారీ ఎత్తున నగదు, నగలు, ఆస్తి పత్రాలు లభించినట్లు తెలుస్తోంది.

పాదచారులపైకి దూసుకెళ్లిన పాల వ్యాన్ : ఒకరి మృతి

హైదరాబాద్ : మిల్క్ వ్యాన్ శనివారం ఉదయం బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన వ్యాన్ అదుపు తప్పి బస్టాండ్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన హైదరాబాద్లోని జవహర్ నగర్లో చోటు చేసుకుంది.

పారిస్ లో ఉగ్రదాడిని ఖండించిన రాష్ట్రపతి ప్రణబ్

హైదరాబాద్: పారిస్ లో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో 140 మందికి పైగా మృతి చెందారు. పారిన్ లో ఉగ్రదాడిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్రంగా ఖండించారు. ఈ కష్ట సమయంలో ఫ్రాన్స్ కు అండగా ఉంటామని ప్రకటించారు.

స్టేడియంలోనే తలదాచుకున్న ఫుట్ బాల్ ప్లేయర్లు...

హైదరాబాద్  : టెర్రరిస్టు దాడులతో ఉలిక్కిపడ్డ ఫుట్‌బాల్ ప్లేయర్లు ఇంకా స్టేడియంలోనే తలదాచుకున్నారు. స్టాడీ డీ ఫ్రాన్స్ స్టేడియంలోనే జర్మనీ జట్టు ఆటగాళ్లు ఉన్నారు. ప్లేయర్లంతా సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ చాంపియన్ జర్మనీతో ఫ్రాన్స్ తలపడుతున్న స్టేడియంపై ఉగ్రవాదులు ఆకస్మిక దాడులు చేశారు. స్టేడియంలోకి టెర్రరిస్టులు సుసైడ్ బాంబులతో ప్రవేశించారు. జిహాదీలు తమను తాము పేల్చుకోవడం వల్ల స్టేడియంలో ప్రేక్షకులంతా చెల్లాచెదురయ్యారు.

ఆ దాడులు చేసింది మేమే : ఐఎస్ ఉగ్రవాదుల ప్రకటన

హైదరాబాద్ : సుందర నగరం ప్యారిస్ ను రక్తసిక్తంగా మార్చిన దాడి తమపనేనని ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)’ ఉగ్రవాదులు ప్రకటించారు. ప్యారిస్ స్థానిక కాలమాన ప్రకారం నిన్న రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో నగరంలో మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఉగ్రవాదులు విరుచుకుపడ్దారు. ఆరు చోట్ల అత్యాధునిక తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులకు దిగిన ఉగ్రవాదులు మరో మూడు చోట్ల శక్తివంతమైన బాంబులను పేల్చారు. ఈ దాడుల్లో ఇప్పటిదాకా 170 మందికి పైగా అయామక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తమ పనేనని కొద్దిసేపటి క్రితం ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించారు.

అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసిన ఫ్రాన్స్

హైదరాబాద్ : పారిన్ నగరంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఉగ్రదాడుల్లో దాదాపు 170 మంది మృతి చెందగా, మరో వంద మంది గాయపడ్డట్లు సమాచారం. ఉగ్రదాడుల నేపథ్యంలో ఫ్రాన్్స అంతర్జాతీయ సరిమద్దులను మూసివేసింది. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. దాదాపు 1500 మంది పైగా పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారని సమాచారం.

07:59 - November 14, 2015

హైదరాబాద్ : తమ ఉనికిని చాటుకోవడానికి ఉగ్రవాదులు అమాయకులపై దాడి చేసి చంపడం అమానుషమైన చర్య అని న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడిలో 170 మంది పౌరులు చనిపోయారు. మరో 100 మందికి పైగా తీవ్ర గాయాలయినట్లు సమాచారం. ఉగ్రవాదాన్ని ప్రజాస్వామిక వాదులు అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. బ్రిటన్ లో కూడా ప్రధాని మోడీకి నిరసన వ్యక్తం అవుతోంది. భారత్ లో అసహన పరిస్థితుల పై మోడీ ని నిలదీయాలని ఆ దేశ ప్రధాని కెమరూన్ కి భారత మేధావులు మెసేజ్ చేశారు. దేశాన్ని అంచనా వేసేందుకు మీడియా, వార్తపత్రికలు కొలనమానం కాదని మోదీ ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటి? ఇతాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ రాజకీయ విశ్లేషకులు వినయ్ కుమార్, కాంగ్రెస్ నేత కమలాకర్, టి.టిడిపి నేత సతీష్ మాదిగ, బిజెపి నేత శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..


 

ప్యారిన్ దాడిపై ప్రపంచ దేశాల దిగ్ర్భాంతి

హైదరాబాద్ : ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో చోటుచేసుకున్న ఉగ్రవాదుల దాడిపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఉగ్రదాడి జరిగిన వెంటనే దేశంలో ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ ప్రకటించారు. దాడిపై సమాచారం తెలుసుకున్న వెంటనే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఘాటుగా స్పందించారు. ప్యారిస్ పై జరిగిన ఉగ్రవాదుల దాడిని ఆయన మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ కూడా ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఉగ్రవాద దాడులు తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని జర్మనీ చాన్సెలర్ ఎంజెలా మెర్కెల్ పేర్కొన్నారు. 

ఫ్రాన్స్ అండగా ఉంటాం : మోదీ

హైదరాబాద్ : ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడితో ఆ దేశం చిగురుటాకులా వణికిపోయింది. ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతున్న బటక్లాన్ థియేటర్ లో అసలేం జరుగుతుందో తెలియని క్రీడాభిమానులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ దాడిపై ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ వేగంగా స్పందించారు. ఉగ్రవాదుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. అంతేకాక కష్టకాలంలో ఉన్న ప్రాన్స్ కు అండగా ఉంటామని కూడా ఆయన ప్రకటించారు.

ఘట్ కేసర్ సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా

రంగారెడ్డి : ఘట్ కేసర్ సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మందికి గాయాలు కాగా... మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

06:53 - November 14, 2015

హైదరాబాద్ : అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి హైదరాబాద్‌ ముస్తాబయ్యింది. బంగారు ఏనుగు నగరానికి వచ్చేసింది. దేశ, విదేశాల నుంచి చిన్నారులు తరలివస్తున్నారు. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రారంభ వేడుక శిల్ప కళావేదికలో ఉదయం జరగనుంది. పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఈ వేడుకలకు హాజరుకానున్నారు.

నగరంలో సందడి వాతావరణం...

19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంతో హైదరాబాద్‌లో సందడి నెలకొంది. గుజ్జా ది గోల్డెన్‌ ఎలిఫాంట్‌ మళ్లీ సందడి చేయడానికి నగరానికి వచ్చింది. శనివారం నుంచి వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకలను, చిల్ర్డన్‌ ఫిల్మ్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. శిల్ప కళావేదిక, ప్రసాద్‌ ఐమాక్స్‌ ప్రధాన వేదికలు. చిత్రోత్సవంలో భాగంగా తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ బాలల చిత్రాలను ప్రదర్శించనున్నారు.

12 థియేటర్లలో బాలల చిత్రాలు.........

స్వీడన్‌, ఈజిప్ట్‌, అమెరికా, ఆఫ్ఘనిస్తాన్‌, స్విట్జర్లాండ్‌ నుంచి చిన్నారులు ఫిల్మ్ పెస్టివల్‌కు వస్తున్నారు. వారం రోజుల పాటు ప్రసాద్‌ ఐమాక్స్ తోపాటు నగరంలోని 12 థియేటర్లలో,దేశ, విదేశాలకు చెందిన 300 బాలల చిత్రాలను ప్రదర్శిస్తారు. ఫెస్టివల్‌ కోసం మొత్తం 1204 ఎంట్రీలు వచ్చాయి. వాటిలో 19 తెలుగు చిత్రాలు ఉన్నాయి.

చిన్నారులకు ఆకర్షణీయమైన కాన్సెప్ట్‌లు...............

ఈ ఫిల్మ్‌ ఈవెంట్‌లో దాదాపు 2 లక్షల మందిపైగా పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఈ సారి డిజిటల్‌ ఇన్‌స్టాలేషన్‌ పేరుతో పలు ఆకర్షణీయమైన కాన్సెప్ట్‌లను ప్రవేశపెడుతున్నారు. ఇక చిన్నారులకు ప్రత్యేకంగా శిల్పారామంలో లిటరరీ పెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే అతిథులకు సోమాజిగూడలోని పార్క్‌ హోటల్లో విడిది ఏర్పాటుచేశారు. 

నేటి నుంచి నగరంలో 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం

హైదరాబాద్ : అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి హైదరాబాద్‌ ముస్తాబయ్యింది. బంగారు ఏనుగు నగరానికి వచ్చేసింది. దేశ, విదేశాల నుంచి చిన్నారులు తరలివస్తున్నారు. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రారంభ వేడుక శిల్ప కళావేదికలో ఉదయం జరగనుంది. పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. 

06:49 - November 14, 2015

హైదరాబాద్‌: నగరంలో సదర్‌ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. యాదవ కులస్తులు పలు ప్రాంతాల్లో ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యువకులు చేసిన విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

ఖైరతాబాద్‌లో జరిగిన ఉత్సవాల్లో......

ఖైరతాబాద్‌లో జరిగిన ఉత్సవాల్లో సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్‌ పాల్గొన్నారు. నారాయణగూడలో జరిగిన సదర్‌ ముగింపు ఉత్సవాల్లో హోంమంత్రి నాయిని, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సదర్‌ ఉత్సవాలను వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వమే నిర్వహించేలా ముఖ్యమంత్రితో మాట్లాడుతామని మంత్రి నాయిని అన్నారు.

అందంగా ముస్తాబు కానున్న దున్నపోతులు ......

ఇక సదర్‌ ఉత్సవాల కోసం దున్నపోతులపై యాదవులు ప్రత్యేక శ్రద్ద చూపించారు. వీటిని అందంగా ముస్తాబు చేయడంతో పాటు అనేక విన్యాసాలు నేర్పించారు. అందరినీ ఆకట్టుకునే విధంగా వీటిని తీర్చిదిద్దారు. అంతేకాకుండా ప్రత్యేక ఆకర్షణ కోసం వీటిని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. డప్పు దరువుల మధ్య విన్యాసాలు చేయిస్తూ ఊరేగింపు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో దున్నపోతుల విన్యాసాలు చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబర్చారు.

ప్రత్యేక ఆకర్షణగా యువరాజ్‌ ...

నారాయణగూడలో జరిగిన సదర్‌ ముగింపు ఉత్సవాల్లోనూ,అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడలో జరిగిన ఉత్సవాల్లోనూ హర్యానాకు చెందిన యువరాజ్‌ దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటివరకు సదర్‌ ఉత్సవాల్లో పాల్గొన్న దున్నపోతుల ఖరీదు రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఉండగా.. ఈసారి ప్రదర్శనకు తీసుకువచ్చిన యువరాజ్‌ విలువ అక్షరాలా 7 కోట్ల రూపాయలు కావడం విశేషం. ఈ దున్నపోతును హర్యానాలోని కురుక్షేత్ర నుంచి నగరానికి తీసుకువచ్చారు.

బరువు 1600 కిలోలు ............

ఇక ఈ యువరాజ్‌ వయసు ఏడేళ్లు.. దీని బరువు 1600 కిలోలు. ఆరు అడుగుల ఎత్తు, 14 అడుగుల పొడువు ఉంది. దీనికి ఆహారంగా కాజూ, బాదం, పిస్తాలు అందిస్తారు. ఈ యువరాజ్‌ నిర్వహణ బాధ్యతలు చూసేందుకు పది మందిని నియమించామని యజమాని అంటున్నాడు. గత 130 ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. దీపావళి సందర్భంగా జరిగే ఈ వేడుకలు శుక్రవారంతో ముగిశాయి. 

06:47 - November 14, 2015

కృష్ణా : నెయ్యి లేనిదే ముద్ద దిగని వారు కొందరుంటారు. గుప్పుమంటూ కమ్మని నెయ్యి వాసన ముక్కుపుటాలను తాకితే వంట రుచి ఎలా ఉన్నా ఆవురావురుమంటూ లాగించేస్తారు. చిన్నపిల్లలకైతే బొద్దుగా బలంగా పెరగాలని నెయ్యి కలిపి బలవంతంగానైనా అన్నం పెడుతుంటారు. ఇంతకి వారు తినేది అసలైన నెయ్యేనా.? షాపుల్లో కనిపించే ప్యాకెట్లు కల్తీ లేనివేనా? ఏమో ఆ దొంగబాబులు చేసే మోసాలను చూస్తే ఘీ అంటేనే విరక్తి పుడుతుంది మరి.

ఆగిరిపల్లి మండలం కలసానిపల్లె గ్రామం...

కృష్ణా జిల్లా అగిరిపల్లి మండలంలో కలసానిపల్లె అనే గ్రామముంది. ఈ పల్లెలో సునీల్‌ ఆయిల్‌ ట్రేడర్స్‌ పేరుతో కొందరు ప్రబుద్ధులు నెయ్యి, ఆయిల్‌ వ్యాపారం చేస్తున్నారు. అయితే వాళ్లు చేసేదంతా కల్తీ ఉత్పత్తులే. హఠాత్తుగా విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు జరిపేసరికి అసలు నిజమేంటో బయటపడింది. వాస్తవానికి విజయవాడ పడమట ప్రాంతంలో నకిలీ నెయ్యి ప్యాకింగ్‌ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ లేబుళ్లను గుర్తించి తయారీ కేంద్రంపై దాడి చేశారు.

పోలీసుల దాడిలో భారీగా కల్తీ నెయ్యి.....

పోలీసుల దాడిలో భారీగా కల్తీ నెయ్యి నిల్వలు పట్టుబడ్డాయి. సుమారు 2,500 కిలోల కల్తీ నెయ్యి పట్టుబడింది. దాని తయారీకి వాడే 200 టిన్నుల నాసిరకం డాల్డా, రెండు టిన్నుల కలర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీ ఉత్పత్తులను విశాఖపట్నం, ఒడిశా, విజయనగరం, శ్రీకాకుళం, తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అందులోనూ దుర్గ, నవదుర్గ, శ్రీ దుర్గ, వనదుర్గ బ్రాండ్లతో అమ్మకాలు సాగిస్తున్నారు. పోలీసుల రాకతో ఈ వ్యవహారమంతా నడిపించే వ్యక్తి పరారీలో ఉండగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నెయ్యితోపాటు ఇతర సామాగ్రిని, ఆయిల్‌ ట్రేడర్స్‌ను సీజ్‌ చేశారు. పట్టుబడిన నకిలీ నెయ్యి విలువ 25 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ వ్యవహారమంతా చూస్తుంటే ఏది మంచి నెయ్యో ఏది కల్తీయో అంతుబట్టడంలేదు. కానీ ఇలాంటి దుర్మార్గుల నిర్వాకం మూలంగా ఎందరి ఆరోగ్యం దెబ్బతింటోందో.? ఎన్ని ఇళ్లు గుల్లవుతున్నాయో అంచనాలకు కూడా అందని పరిస్థితి ఏర్పడింది. 

06:44 - November 14, 2015

తిరుపతి : ఎన్నికలకు ఇంకా సమయం ఉందని ఏ మాత్రం అలసత్వం చూపకుండా.. ఇప్పటి నుంచే కష్టపడాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ క్యాడర్‌కు సూచించారు. 2019 ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలు లక్ష్యంగా పనిచేయాలని ఆయన కోరారు. ప్రభుత్వానికి, పార్టీకీ మధ్య ఎలాంటి గ్యాప్ ఉండకూడదని అన్నారు. వచ్చే సంక్రాంతి పండుగకు మళ్లీ చంద్రన్న కానుక ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలకు ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆయన పార్టీ నేతలకు దిశానిర్థేశం చేశారు.

రెండు రోజుల పాటు జరిగే టీడీపీ సదస్సు.....

తిరుపతిలోని జీఆర్ఆర్ ఫంక్షన్ హాలులో జనజాగృతి సన్నాహక యాత్ర పేరిట రెండు రోజుల పాటు జరిగే టీడీపీ సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, అందరు ఎమ్మెల్యేలతో పాటు 13 జిల్లాల నుంచి ఎంపిక చేసిన టీడీపీ నేతలు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ వివరించారు. అనంతరం చంద్రబాబు పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. ఏడాదిన్న పాలన తీరును ఆయన వివరించారు. విభజన తర్వాత రాష్ట్రం తీవ్ర ఆర్థిక సమస్యలతో కూరుకు పోయిందని, దానిని ఎలా అధిగమిస్తున్నది వివరించారు. రైతురుణమాఫీ, పింఛన్ల పెంపు వంటి పథకాలతో ప్రజల మన్ననలు పొందామని చెప్పుకొచ్చారు.

ఇంకా సమయం ఉందని క్యాడర్ అలసత్వం వద్దు....

అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉందని క్యాడర్ అలసత్వం చూపవద్దని, మరింతగా నేటి నుంచే కష్టపడాలని కోరారు. జిల్లాలో సమస్యల పరిష్కార బాధ్యత ఇన్ చార్జ్ మంత్రులదేనని తేల్చి చెప్పారు. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ వచ్చే ఏడాది కూడా ప్రజలకు సంక్రాంతి కానుక ఇవ్వనున్నట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలు మనవే కావాలని చంద్రబాబు క్యాడర్‌కు సూచించారు.

అమరావతి నిర్మాణం, నదుల అనుసంధానం గురించి.....

అమరావతి నిర్మాణం, నదుల అనుసంధానం గురించి చంద్రబాబు వివరించారు. గోదావరి - కృష్ణ నదులను అనుసంధానం చేసి చరిత్ర సృష్టించామని తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, మొండిగా ముందుకెళ్లి విజయం సాధించామన్నారు. విపక్షాలను చూస్తుంటే తనకు జాలేస్తుందని చెప్పుకొచ్చారు. నీరు-చెట్టు పథకం సత్ఫలితాలను ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య లాంటి గ్యాప్ ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతరం చంద్రబాబు జిల్లాల వారీగా, వేరు వేరుగా క్యాడర్ తో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

06:41 - November 14, 2015

హైదరాబాద్ : అనగనగా ఒక పుస్తకం. సహజంగా పుస్తకాలను కాలక్షేపానికో విజ్ఙానాభివృద్ధికో చదువుతారు. కానీ వారు మాత్రం యావద్దేశాన్ని హడలెత్తించిన జంట పేలుళ్ల కోసం ఉపయోగించుకున్నారు. ఆ పుస్తకం పోలీసుల చేతుల్లో బడడంతో దానిలో ఏదో మర్మముందని తీవ్రంగా పరిశోధించారు. ఏడాదిన్నర పరిశోధనలో ఒక్కొక్కటిగా బయటపడ్డ నిజాలు చూసి పోలీసులే నివ్వెరపోయారు. ప్రస్తుతం అదే దర్యాప్తుకు సహకరిస్తోంది.

రెండున్నరేళ్ల తర్వాత....

ఉగ్రవాదుల దుశ్చర్యకు సాక్ష్యమిది..భాగ్యనగరాన్ని హడలెత్తించిన ఘోర కలి ఇది..ఈ దృశ్యాలు దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లకు సంబంధించినవి. ఈ పేలుళ్ల కేసును దర్యాప్తు చేసిన ఎన్‌ఐఎ పోలీసులు ఉగ్రవాదులకు సంబంధించిన అనేక విషయాలను డీకోడ్‌ చేశారు. వారు వాడిన కోడ్ భాష, మెయిల్ ఐ.డీల గుట్టు విప్పారు. ఈ బ్లాస్ట్‌లకు రియాజ్ భత్కల్ ఎలా ప్లాన్ వేశాడో రెండున్నరేళ్ల తర్వాత కనిపెట్టారు. ఇంతజేసీ అది ఓ సెక్స్ పుస్తకం.

స్టఫ్‌ మై స్టాకింగ్‌..అనే పుస్తకం పేరుతో....

స్టఫ్‌ మై స్టాకింగ్‌..ఇదే ఆ పుస్తకం పేరు. దాన్ని ఆధారంగా చేసుకునే జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఇండియన్ ముజాహిద్ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్. ఈ పుస్తకానికి కోడ్‌ భాషను కూడా సృష్టించాడు. 2012లో దిల్‌సుక్‌నగర్‌ పేలుళ్ల పనిని యాసిన్ భత్కల్‌కు అప్పగించాడు. ఆపరేషన్ పూర్తి చేసేందుకు అసదుల్లా అక్తర్, తెహసీన్ అక్తర్, వఖాస్‌లను రంగంలోకి దింపాడు. సమాచారం, సంభాషణలు, ఫైల్స్ మార్పిడికి ఫోన్లు వాడితే దొరికిపోతామని ఇలా ప్లాన్ చేశారు.

నింబస్, పాల్ టాక్ వంటి సోషల్ మీడియాల ద్వారా...

కుట్ర అమలుకోసం ఈ మెయిల్స్‌తోపాటు నింబస్, పాల్ టాక్ వంటి సోషల్ మీడియాను ఉపయోగించుకున్నారు. చాటింగ్ చేయడానికి అవసరమైన ఐడీలను సృష్టించారు. తమ పేర్లను వినియోగించుకుంటే అనుమానాలు వస్తాయని సెక్స్ పుస్తకాన్ని పీడీఎఫ్ ఫార్మెట్‌లోకి మార్చారు. వాటిని తన మెయిల్ ఐడికి యాడ్ చేసి అందులో ప్రతి 10 పేజీలను ఒక్కో సభ్యుడికి ఇస్తూ..సమాచారం ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన వాటిలో మొదటి పేజీలోని మొదటి పదాన్ని ఐడిగా క్రియేట్ చేసుకోవాలి. అవసరమనుకుంటే ఆ పదం పక్కన పేజీ నెంబర్ లేదా ఏదైనా సంఖ్యను వాడుకోవచ్చని సూచించాడు. ప్రతినెల రోజులకు ఖచ్చితంగా ఐడీని మార్చేస్తూ వారికి కేటాయించిన పేజీల్లో రెండో పేజీలో ఉన్న మొదటి పదంతో మరో ఐడీ సృష్టించుకోవాలి.

సెక్స్ పుస్తకం స్టఫ్‌ మై స్టాకింగ్స్‌గా .......

ఈ పుస్తకం కాపీ ఉగ్రవాదుల అందరి వద్ద ఉండటంతో ఎవరు ఏ ఐడి ఉపయోగిస్తున్నారు..ఎవరెవరితో మాట్లాడుతున్నారో.. ఈజీగా అందరికీ తెలిసిపోయేది. ఇలా ఎవరికీ అనుమానం రాకుండా పక్కాగా ప్లాన్‌ చేశారు. 2013లో నేపాల్‌లో యాసిన్ భత్కల్ సహా ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి వద్ద నుంచి ఒక పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు. అ పుస్తకంలో ఏదో సమాచారం ఉందని భావించిన పరిశీలన బృందాలు లోతుగా అధ్యయనం చేసి అది ఇంటర్‌నెట్‌లో లభిస్తున్న సెక్స్ పుస్తకం స్టఫ్‌ మై స్టాకింగ్స్‌గా గుర్తించారు.

ఉదాహరణకు దిల్‌సుఖ్‌నగర్‌ బ్లాస్ట్‌కు నిందితులు వాడిన మెయిల్‌ ఐడీలు ఈ విధంగా ఉన్నాయి.

lovesam361@yahoo.com,patarasingh@yahoo.com,coolallz@yahoo.com,

dumzum@paltalk.com. ఇవేగాక Jamesusually10, menothing1 లాంటివి నింబస్‌లో వాడారు. ఈ సమాచారం ద్వారా నిందితులు దేశ ద్రోహం చేశారని బలమైన ఆధారాల్ని దర్యాప్తు సంస్థలు సంపాదించాయి. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసు విచారణ తుదిదశలో ఉండటంతో ఈ సాక్ష్యాధారాలు ఎంతో కీలకం కానున్నాయి. 

06:34 - November 14, 2015

హైదరాబాద్ : మూడు రోజుల బ్రిటన్‌ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ..రెండో రోజు శుక్రవారం బిజీ బిజీగా గడిపారు. రెండు రోజు ఉదయం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్‌తో ఆయన అధికారిక నివాసం చెకర్స్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూకేకు వెళ్లే భారత విద్యార్థుల వీసా సమస్యలను పరిష్కరించాలంటూ మోదీ కోరారు. విద్యారంగంలో భారత్, యూకే మధ్య పటిష్ఠమైన సత్సంబంధాలు ఉన్నాయని మోదీ అన్నారు. భారత విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా తర్వాత యూకేను ఎన్నుకొంటారన్నారు. అయితే యూకేకు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 50శాతానికి తగ్గిందని..వీసా తీసుకునే సమయంలో ఎదుర్కొనే సమస్యల వల్లే విద్యార్థులు యూకేలో చదవడానికి ఆసక్తి చూపడంలేదని మోదీ..బ్రిటన్ ప్రధానితో అన్నారు. మోదీ లేవనెత్తిన వీసా సమస్యలపై బ్రిటన్‌ ప్రధాని సానుకూలంగా స్పందించారని భారత విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే, ఒక్కసారితో సమస్య పరిష్కారం కాదని, ఈ అంశంపై మరింత చర్చ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారని వెల్లడించాయి. అంతకుముందు ప్రధాని మోదీ డేవిడ్ కామెరాన్‌కు స్వామి వివేకానంద చిత్రపటాన్ని బహుమతిగా అందించారు. వీటితోపాటు చెక్క, పాలరాయి, వెండితో తయారు చేసిన అరుదైన కానుకను కూడా అందించారు.

కామెరూన్‌తో మోదీ సమావేశం......

బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌తో భేటీ అయిన తర్వాత సీఈవోలతో రౌండ్‌టేబుల్ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. అనంతరం బ్రిటన్ రాణి ఎలిజబెత్‌ ఆతిథ్యాన్ని మోదీ స్వీకరించారు.ఈ సందర్భంగా క్వీన్ ఎలిజబెత్‌తో మోదీ కాసేపు ముచ్చటించారు. అనంతరం బ్రిటన్ రాణికి ప్రధాని మోదీ అరుదైన కానుకలు అందించారు. 54 ఏళ్ల క్రితం క్వీన్ ఎలిజబెత్ భారత్‌లో పర్యటించిన అరుదైన ఫొటోలను మోదీ క్వీన్ ఎలిజబెత్‌కు బహుమతిగా అందించారు.

వెంబ్లీ మైదానంలో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగం....

అనంతరం రాత్రి 9.45 నిమిషాలకు ప్రధాని మోదీ వెంబ్లీ మైదానంలో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి 60వేల మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ప్రధాని ప్రసంగానికి ముందు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తొలుత భారతీయుల ప్రసంగించిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్..వెంబ్లీ స్టేడియంలో ఇదొక చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. భారతీయుల పెట్టుబడులు బ్రిటన్‌లో పలువురికి ఉపాధి కల్పిస్తున్నాయన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలిసి పనిచేస్తామన్నారు. భారత్‌కు బ్రిటన్ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.

భిన్నత్వంలో ఏకత్వమే మన శక్తి .....

ఆ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. భిన్నత్వంలో ఏకత్వమే మన శక్తి అని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశంలో యువతకు కొదవలేదని..ఇక వెనుకబాటుతనం అన్న ప్రశ్నే రాదని వ్యాఖ్యానించారు. యువత కలలను సాకారం చేసే శక్తి దేశానికి ఉందన్నారు. 12 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చానని..భారత దేశ ప్రజలు నేడు తనకు కొత్త బాధ్యతను అప్పగించారన్నారు. తనకు లభించిన స్వాగతానికి కృతజ్ఞుడినన్నారు. భారత్‌లో కబీర్, రహీమ్‌ల మాటల అందరికీ ప్రేరణనిస్తాయని..సూఫీల సంస్కృతి అర్థం చేసుకుంటే ఎవరూ తుపాకి పట్టరని మోదీ అన్నారు.

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా.....

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ను అంతర్జాతీయ సంస్థలన్నీ గుర్తిస్తున్నాయని మోదీ అన్నారు. ఈ అభివృద్ధి ఫలాలు త్వరలోనే అందరికీ అందుతాయని..స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లయినా భారత్‌లోని 18 వేల గ్రామాల్లో ఇంకా విద్యుత్ సౌకర్యం లేదన్నారు. ఒక చాయ్ అమ్ముకున్న వ్యక్తి, ఓ పేదవాడి కొడుకు ఎర్రకోటపై నుంచి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయగలడని కలలో కూడా అనుకోలేదు. కానీ అది సాధ్యమైందన్నారు మోదీ. మొత్తానికి వెంబ్లీ స్టేడియంలో ప్రధాని మోదీ ప్రసంగానికి ప్రవాస భారతీయులు మంత్ర ముగ్దులయ్యారు. మోదీ ప్రసంగిస్తున్నంత సేపు మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. 

06:29 - November 14, 2015

హైదరాబాద్ : ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ ఉగ్రదాడితో అల్లాడిపోయింది. ఫ్రాన్స్‌ కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత.. ఉగ్రవాదులు నగరంలోని పలుచోట్ల అటాక్‌ చేశారు. 170 మందికి పైగా ఈ ఉగ్రదాడుల్లో చనిపోయారు. బాటక్లాన్‌ అనే థియేటర్‌లో టెర్రరిస్టులు వందమందిని బంధించి.. కాల్చి చంపారు. మూడుచోట్ల బాంబులు పేల్చారు. దాదాపు మరో ఆరు చోట్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో మరో 70 మంది చనిపోయినట్లు సమాచారం. ఫ్రాన్స్‌ సరిహద్దులను మూసేసి ఎమర్జెన్సీని విధించారు. మొత్తం సైన్యం రంగంలోకి దిగింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌కీ మూన్‌ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఈ ఉగ్రదాడిని ఖండించారు. జర్మనీ ఛాన్సెలర్‌ ఏంజెలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ముగ్గురు టెర్రరిస్టులను భద్రతా దళాలు కాల్చి చంపినట్లు సమాచారం. అయితే ఫ్రాన్స్‌ ప్రభుత్వం అధికారికంగా ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు.

ఫ్రాన్స్ లో అత్యవసర పరిస్థితి విధించిన అధ్యక్షుడు

హైదరాబాద్ : పారిన్ నగర వ్యాప్తంగా ఉగ్రవాదులు కాల్పుల కలకలంతో నగరం అట్టుడికి పోయింది. పలు చోట్ల సంభవించిన ఈ పేలుళ్ల ఘటనలో దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల ఘటన అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి.. నగరంలో అత్యవసర పరిస్థితిని విధించారు.

ఫ్రాన్స్ నగరంపై ఉగ్ర పంజా : 60 మంది మృతి

హైదరాబాద్ : పారిన్ నగర వ్యాప్తంగా ఉగ్రవాదులు కాల్పుల కలకలంతో నగరం అట్టుడికి పోయింది. పలు చోట్ల సంభవించిన ఈ పేలుళ్ల ఘటనలో దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మందికి పైగా గాయపడ్డారు. ఫ్రాన్్స జాతీయ స్టేడియం సహా పలు రెస్టారెంట్లు, సాపింగ్ మాల్ లలో పేలుళ్లు, కాల్పులు సంభవించినట్లు సమాచారం. కనీసం 6 చోట్ల కాల్పులు, 3 పేలుళ్లు జరిగిన తెలుస్తోంది. మరో వైపు 100 మందిని ఉగ్రవాదులు బందీలుగా తీసుకున్నట్లు సమాచారం.

Don't Miss