Activities calendar

15 November 2015

21:33 - November 15, 2015

బెంగళూరు : టెస్ట్ రెండో రోజు ఆటకు వాన దెబ్బ తగిలింది. ఒక్క బంతీ పడకుండా 90 ఓవర్ల ఆట రద్దయ్యింది. గత రాత్రి కురిసిన వర్షాలకు తోడు...ఈ రోజు ఉదయం నుంచి ఆగకుండా జల్లులు పడడంతో మ్యాచ్ రెండో రోజు ఆట రద్దు చేసినట్లు మ్యాచ్ రిఫరీ ప్రకటించారు. పిచ్ తో పాటు బౌలింగ్ రన్నప్, అవుట్ ఫీల్డ్ లోని కొన్ని కీలక ప్రాంతాలను కవర్లతో కప్పి ఉంచారు. గ్రౌండ్లోని నీటిని, తేమను తొలిగించడానికి సూపర్ సోపర్ యంత్రాలను వినియోగించినా ప్రయోజనం లేకపోయింది. రెండో రోజు ఆట కోసం గ్రౌండ్ ను సిద్ధం చేయటానికి తీవ్రంగా శ్రమించిన గ్రౌండ్ సిబ్బంది కష్టం...రెయిన్ గాడ్ దెబ్బకు ఆవిరైపోయింది. తొలి రోజు ఆటలో సౌతాఫ్రికాను 214 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా..వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

21:29 - November 15, 2015

మెదక్ : రాబోయే నాలుగు నెలల్లో తెలంగాణలో లక్ష ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్లు జారీచేస్తామని మంత్రి హరీష్‌రావు అన్నారు. మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో ఏర్పాటైన పోలీస్‌ నియామక ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు పోలీస్‌ నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని అన్నారు. అనంతరం విద్యార్థులకు సిలబస్‌ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.  

21:27 - November 15, 2015

గుడివాడ : వైసిపి కార్యాలయం విషయంలో మొదలైన రచ్చతో గుడివాడలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తొలుత వైసిపి ఎమ్మెల్యే నాని అరెస్టుతో మొదలైన వివాదం కార్యకర్తల ఆందోళనకు దారితీసింది. దీంతో ఒక్కసారిగా పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తర్వాత ఆయన బెయిల్‌పై బయటకొచ్చినా అలజడి మాత్రం కొనసాగుతూనే ఉంది.

అద్దె భవనంలో వైసిపి కార్యాలయం..
పట్టణంలోని వైసిపి కార్యాలయాన్ని గత కొంత కాలంగా అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. కాగా రెంట్‌ చెల్లింపు విషయంలో వివాదం ఏర్పడడంతో భవన యజమాని కార్యాలయానికి తాళం వేశారు. విషయం తెలుసుకున్న గుడివాడ ఎమ్మెల్యే నాని అక్కడికి చేరుకుని భవన యజమానిని ప్రశ్నించారు. ఇదికాస్తా గొడవకు దారితీయడంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఈ క్రమంలోనే నానీని అరెస్ట్ చేసి కైకలూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

భయపడేది లేదన్న నాని..
అరెస్ట్‌ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు, పార్టీ కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చారు. పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అయితే పోలీస్‌ స్టేషన్‌నుంచి నాని బెయిల్‌పై బయటకు రాగా కార్యకర్తలు బాణాసంచా పేల్చి హడావుడి చేశారు. అధికార పార్టీ ఉద్దేశ పూర్వకంగానే తనను అరెస్ట్‌ చేయించిందని నాని ఆరోపించారు. గత 12 ఏళ్లుగా ఆ భవనంలో పార్టీ కార్యాలయం నిర్వహిస్తున్నామని, అద్దె 2 వేల నుంచి 12 వేలకు చేరుకున్నా నిరాటంకంగా చెల్లిస్తున్నామని అన్నారు. అయినా భవన యజమాని ఖాళీ చేయాలని కోరగా రెండు నెలలు ఆగి ఖాళీ చేస్తామని చెప్పినట్లు నాని తెలిపారు. అయినా వారు వినకుండా వైఎస్‌ బొమ్మపై రంగులు వేయించారని తాను ప్రశ్నించినందుకు పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. చంద్రబాబు చేయిస్తున్న ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని నాని అన్నారు.

ఏది నిజమో ?
మాజీ మంత్రి ప్రస్తుత వైసిపి నాయకులు పార్థసారథి టిడిపిపై విమర్శలు గుప్పించారు. మోడీ బీహార్లో ఆటవిక పాలన నెలకొందని ఎన్నికల సమయంలో అన్నారని కానీ ఆటవిక పాలన ఎక్కడో లేదు గుడివాడలో ఉందని ఆరోపించారు. గుడివాడలో నెలకొన్న ఈ హైడ్రామా సామాన్య ప్రజలకు అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే నాని చెప్పేది కరెక్టో లేక భవన యజమాని చెప్పేది నిజమో ఎవరికీ అంతుబట్టట్లేదు. 

21:24 - November 15, 2015

వరంగల్ : బైపోల్ ప్రచారంలో భాగంగా బీజేపీ భూపాలపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, అన్సిరాం గంగారాం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టి.టిడిపి నేతలు హాజరయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. తెలంగాణ, ఏపీ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టిందని మరో కేంద్ర మంత్రి హన్సిరాం గంగారాం అన్నారు. ఈ ఉప ఎన్నికలో బిజేపికి ఓటేసి టీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇవ్వాలని ఓటర్లను కేంద్ర మంత్రులు కోరారు. 

21:23 - November 15, 2015

వరంగల్ : ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. జాతీయ నేతలను రంగంలోకి దింపింది. రాష్ట్ర స్థాయి నేతలతో పాటు నేషనల్‌ లీడర్లను కాంపెయిన్‌లో ఉంచాలన్న పార్టీ స్ట్రాటజీ మేరకు..మీరాకుమార్‌, దిగ్విజయ్‌సింగ్‌తో పాటు మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, రామచంద్ర కుంతియా, కొప్పుల రాజు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇవాళ వరంగల్‌ జిల్లాలోని భూపాలపల్లి, పరకాలల్లో ప్రచార సభలకు వీరంతా హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌, ఎన్‌డీఏ ప్రభుత్వాలపై కాంగ్రెస్‌ నేతలు విరుచుకుపడ్డారు. కేసీఆర్‌, మోడీలను టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించారు. అటు కేంద్రంలోనూ, ఇటూ రాష్ట్రంలో మాటల ప్రభుత్వాలే నడుస్తున్నాయని నేతలు ఆరోపించారు.

సకల జనుల సమ్మె..కేసీఆర్ ఎక్కడున్నారు ?
లోక్‌సభలో ఇద్దరు ఎంపీలు ఉన్న టీఆర్‌ఎస్‌తో తెలంగాణ రాలేదని, కాంగ్రెస్‌ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. తప్పుడు వాగ్దానాలతో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేయడంలేదని విమర్శించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు, సకల జనుల సమ్మె జరిగినప్పుడు కేసీఆర్‌ ఎక్కడున్నారని జైపాల్‌రెడ్డి ప్రశ్నించారు.

కాంగ్రెస్ కు కలిసి వస్తుందా ? 
బీహార్‌ ఎన్నికలతో ప్రధానమంత్రి మోదీకి బుద్ధి వచ్చిందని, వరంగల్‌ ఎన్నికలతో కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ అన్నారు. తెలంగాణ ప్రజలను టీఆర్‌ఎస్‌ మభ్యపెడుతోందని విమర్శించారు. తెలంగాణలో సామాజిక న్యాయం కరువైందన్న మీరాకుమార్‌, అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ చివరికి మాట తప్పారని ఆరోపించారు. మొత్తానికి నేషనల్‌ లీడర్లపై కాంగ్రెస్‌ పార్టీ గట్టి ఆశలే పెట్టుకుంది. మరి వారి హస్తవాసి హస్తానికి కలిసివస్తుందో లేదో వేచి చూడాల్సిందే. 

మహబూబాబాద్ లో అగ్నిప్రమాదం..

వరంగల్ : జిల్లా మహబూబాబాద్ పట్టణంలోని ఓ మందుల దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 

నిశ్చితార్థంపై పెదవి విప్పిన యూవీ..

ఢిల్లీ : తన నిశ్చితార్థానికి సంబంధించిన వార్తలపై భారత స్టార్ క్రికెటర్ యువ రాజ్ సింగ్ పెదవి విప్పాడు. తనకు నిశ్చితార్థం అయిన విషయం నిజమేనని ట్విట్టర్ ద్వారా అంగీకరించాడు. అమ్మలో ఉండే ఎన్నో పోలికలు స్నేహితురాలు హెజెల్ కీచ్ కనిపించాయని ట్వీట్ చేశారు. యువీ చేసిన ట్వీట్స్ పై సహచర క్రీడాకారులు, బాలీవుడ్, చిత్రసీమ ప్రముఖులు అభినందనలు తెలియచేశారు. 

నైరుతి బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం..

నెల్లూరు : నైరుతి బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం ఏర్పడింది. దీనితో నెల్లూరు జిల్లాలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లా వ్యాప్తం చెదురుముదురు వర్షాలు పడుతున్నాయి. 

20:56 - November 15, 2015

చైనా : సెంట్రల్ చైనా షాంగ్జీ ఫ్రావిన్స్ లోని జియాన్ ప్రాంతం..అక్కడ అన్ని భారీ భవంతులే..ఆకాశమే హద్దు అన్నట్లుగా భవంతులున్నాయి. అందులో 27 అంతస్తులున్న భవంతి అతి పెద్దది. ఈ భవంతిని అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా కూల్చివేశారు. ఇందుకు నిపుణులు టెక్నాలజీని ఉపయోగించారు. జియోన్ లో ఉన్న ఈ భవనం చాలా కాలంగా ఉపయోగంలో లేదు. ఈ ప్రాంతంలో కొత్త భవనం నిర్మించేందుకు కూల్చేయాలని స్థానిక ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అధికారులు నిపుణుల సాయంతో ఒకే సమయంలో మొత్తం భవనం కూల్చేశారు. చైనాలో ఇంత పెద్ద భవనం కూల్చేయడం ఇదే తొలిసారి. కూల్చివేత సమయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. 

20:50 - November 15, 2015

ఢిల్లీ : ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌ ప్రజలపై అదనపు భారాలు మోపుతోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. స్వచ్ఛ్‌ భారత్‌ సెస్‌, రైల్వే రిజర్వేషన్‌ రద్దు ఛార్జీల పెంపు ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. బడ్జెట్‌కు ముందే భారం మోపుతున్న ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో మరిన్ని వాతలు పెట్టే అవకాశం లేకపోలేదని సీతారాం ఏచూరి పేర్కొన్నారు. 

20:40 - November 15, 2015

ఢిల్లీ : భవిష్యత్‌లో జరిగే అన్ని ఎన్నికల్లో బీహార్‌ అసెంబ్లీ ఫలితాలే పునరావృతం అయ్యే అవకాశం ఉందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు చెప్పారు. వామపక్షాలు కూడా పుంజుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేరళ, బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని రాఘవులు చెబుతున్నారు. 

20:09 - November 15, 2015

విశాఖపట్టణం : బెంగళూరు - వైజాగ్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. పారిస్ ఘటన నేపథ్యంలో ప్రయాణీకుల బంధువులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బెంగళూరు...విశాఖ ఎయిర్ పోర్టులో భయాందోళన వాతావరణం నెలకొంది. ఆదివారం సాయంత్రం బెంగళూరు విమానాశ్రయం నుండి ఇండిగో విమానం విశాఖకు రావాల్సి ఉంది. కానీ విమానంలో బాంబు ఉన్నట్లు వార్తలు వచ్చాయని పేర్కొంటూ ప్రయాణికులను ఎయిర్ పోర్టు సిబ్బంది కిందకు దించివేశారు. గంటకు పైగా తనిఖీలు కొనసాగుతున్నాయి. బాంబు బెదిరింపా ? లేక సాంకేతిక కారణాలా ? అనేది తెలియరాలేదు. ప్రయాణీకులకు ప్రత్యేక విమానాన్ని కూడా ఏర్పాటు చేయడం లేదని తెలుస్తోంది. ఒకవైపు భయం..ఎయిర్ పోర్టు అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురవుతున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు నుండి బయలుదేరాల్సిన విమానం విశాఖకు చేరుకోకపోవడంతో ప్రయాణీకుల బంధువులు భయాందోళనలు చెందుతున్నారు.

బెంగళూరు - వైజాగ్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..

ఢిల్లీ : బెంగళూరు - వైజాగ్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను ఎయిర్ పోర్టు సిబ్బంది కిందకు దించివేశారు. గంటకు పైగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 

బీజేపీలోనే ఉన్నా..ఉంటా - శతృఘసిన్హా..

ఢిల్లీ : తాను బీజేపీలోనే ఉన్నానని..ఉంటానని శతృఘసిన్హా స్పష్ట చేశారు. బీహార్ ఎన్నికల ఫలితాల అనంతరం శతృఘసిన్హాపై పలు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన ఆదివారం ఘాటుగా సమాధానం చెప్పారు. తాను చెప్పాల్సిన విషయాలు చెప్పడం జరిగిందన్నారు. తాను ఏం తప్పు చేశానని తనలో సీనియార్టీ పరిపక్వత లేదా అని ప్రశ్నించారు. పప్పుల ధరలను అరికట్టాలని చెప్పడం కరెక్టు కాదా ?దీనివల్ల దేశానికి..ప్రజలకు, పార్టీ మంచి చేకూరుతుందని తెలిపారు. 

కేసీఆర్ పై రేవంత్ విమర్శలు..

వరంగల్ : కేసీఆర్ చేసే చండీయాగం ప్రజల కోసం కాదని, అమరవీరులను కేసీఆర్ పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఒకరూ అక్కరకు రారని, సమస్యలు పట్టని కేసీఆర్ ను మోకాళ్లపై నిలబెట్టాలన్నారు.

భూపాలపల్లిలో బీజేపీ బహిరంగసభ..

వరంగల్ : భూపాలపల్లిలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. కేంద్ర మంత్రులు హన్సరాజ్, దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు తదితరులు హాజరయ్యారు. ఉప ఎన్నికలో కేసీఆర్ కు ప్రజలు షాక్ ఇవ్వాలని, దేశంలో అన్ని సమస్యలకు కారణం కాంగ్రెస్సేనని దత్తాత్రేయ తెలిపారు. సింగరేణి కారిడార్ కు కేంద్ర కృషి చేస్తోందని చెప్పారు. 

19:37 - November 15, 2015

వరంగల్‌ : పార్లమెంటు ఉప ఎన్నికలో బావామరదులు హోరాహోరీ పోరుతున్నారు. నీకంటే నేనే ఎక్కువ మెజారిటీ తెచ్చుకుంటానంటూ.. తలపడుతున్నారు. మేథావులతో మంతనాలు.. వ్యాపారులతో చర్చలు.. ఓటర్లతో భేటీలు.. ఇలా వీలైనన్ని వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఇంతకీ ఎవరా బావామరదులు..?
వరంగల్‌ ఉప ఎన్నిక పర్వం.. టీఆర్ఎస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇక్కడి పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను గెలిపించే బాధ్యతను.. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మంత్రులకు అప్పగించారు. ఒక్కో నియోజకవర్గాన్ని ఒక్కొక్కరు ఎంపిక చేసుకొని.. మంత్రులు.. తమదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే క్రమంలో.. మంత్రులు.. స్వయానా బావామరదులు అయిన కేటీఆర్‌.. హరీశ్‌లూ.. పసునూరి గెలుపు కోసం రకరకాల వ్యూహాలు రచిస్తున్నారు.
వరంగల్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో... హన్మకొండ, కాజీపేట, వరంగల్ ఓటర్లే కీలకం. వీరే అభ్యర్థుల విజయావకాశాలను నిర్దేశించనున్నారు. మొత్తం ఓట్లలో 30.39 శాతం నగరవాసులవే. అందుకే.. నగరంపై కాస్త దృష్టి పెడితే విజయం సులువవుతుందన్న భావనతో.. బావామరదులు చెరో నియోజకవర్గం బాధ్యతను భుజానికెత్తుకున్నారు. వరంగల్‌ తూర్పులో హరీశ్‌ రావు, పశ్చిమలో కేటీఆర్‌ తమ సత్తా చాటేందుకు విశ్వ ప్రయత్నాలూ చేస్తున్నారు.

భిన్నంగా తూర్పు..పశ్చిమ నియోజకవర్గాలు..
వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోనూ రాజకీయంగా, సామాజికంగా పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. వరంగల్ తూర్పు వ్యూహం, పశ్చిమకు వర్కౌట్ కాదు. పైగా వరంగల్ తూర్పులో ముందు నుంచీ టీఆర్ఎస్ శ్రేణులున్నాయి. తూర్పు నియోజకవర్గానికి కొండా సురేఖ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కొండా దంపతులకు ఇతర నేతలకు పొసగడం లేదు. కొండా దంపతుల భిన్నమైన పోకడలు తొలినాళ్లలో పని చేసిన నేతలకు రుచించడం లేదు. వీరందరిని సమన్వయం చేయడం కోసం పార్టీ మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు.

తూర్పు నియోజకవర్గం..
వరంగల్‌ అసెంబ్లీ తూర్పు నియోజకవర్గం పరిధిలోని నేతలతో సమన్వయం ఒక ఎత్తయితే.. ఇక్కడ అధికంగా ఉండే.. కార్మికులు, వ్యాపారులు, దినసరి కూలీలను మంచి చేసుకోవడం మరో ఎత్తు. అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని ఓటర్లను ఆకట్టుకునే ఎత్తుగడతో... అక్కడి వ్యాపారులు, కార్మికులతో గ్రూపులవారీగా మంతనాలు సాగిస్తున్నారు. ఇదంతా కోర్డినేట్ చేసుకుంటూనే.. బావమరిది కేటీఆర్ ఇన్ చార్జ్ గా ఉన్న వరంగల్‌ పశ్చిమ కంటే అధిక మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

పశ్చిమలో బాధ్యతను చేపట్టిన కేటీఆర్...
అటు వరంగల్‌ పశ్చిమ బాధ్యతను చేపట్టిన కేటీఆర్‌ కూడా బావగారికన్నా మంచి మెజారిటీ సాధించాలన్న పట్టుదలతో సాగుతున్నారు. ముందునుంచీ హన్మకొండగా ఉన్న వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో విద్యావంతులు అధికం. కాజీపేట లాంటి ప్రాంతంలో కొంత మాస్ ఓటింగ్ ఉన్నా హన్మకొండ ఓట్లే మెజారిటీని నిర్దేశిస్తాయి. మాస్ ప్రభావిత ప్రాంతాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు స్వీకరించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

చర్చలు జరుపుతున్న కేటీఆర్...
ఎన్నికల్లో ప్రభావం చూపే వర్గాలను కేటీఆర్ స్వయంగా కలుస్తూ చర్చలు సాగిస్తున్నారు. కేయూలో వ్యతిరేకత నేపథ్యంలో విద్యార్థి నేతలతో చర్చలు జరిపారు. ఉద్యోగులతో గ్రూప్ మీటింగ్ లు నిర్వహిస్తూ ప్రచారంలో కదులుతున్నారు. మార్నింగ్ వాక్ పేరుతో అన్ని ప్రాంతాల్లో కలియ తిరుగుతూ ఓటర్లను వ్యక్తిగతంగా కలుసుకోవడానికి కేటీఆర్ ప్రాధాన్యత నిస్తున్నారు. అన్ని వర్గాలతో సమన్వయం సాధించడం కోసం చెమటోడుస్తున్న మంత్రి కేటీఆర్ బావ హరీష్ రావు కంటే మెజారిటీ సాధించాలనే టార్గెట్ తో కదులుతున్నారు.

ఎవరి శ్రమకు ఎక్కువ ఫలితం దక్కుతుందో ?
వరంగల్ నగరానికి చెందిన తెదేపా రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి ఈ మధ్యే తెరాసలోకి రావడం వెనుక.. నగర ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నమేననే వాదనలు వినిపిస్తున్నాయి. బావ బావమరుదులైన హరీష్ రావు, కేటీఆర్‌లు అత్యధిక మెజారిటీ ద్వారా పార్టీలో పైచేయి సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటు శాతం పెంచడం ద్వారా.. లాభం పొందాలనే దిశగా మంత్రులు ఆలోచనలు చేస్తున్నారు. మరి బావామరుదుల్లో ఎవరి శ్రమకు ఎక్కువ ఫలితం దక్కుతుందో తేలాలంటే.. 24 దాకా వేచి చూడాల్సిందే. 

19:26 - November 15, 2015

వరంగల్ : దేవయ్య..! ఓరుగల్లు పోరులో ఎన్‌డీయే అభ్యర్థి.. నిజానికి టీడీపీ-బీజేపీ నేతలు ఆయనతో కలిసి సాగాలి. ఆయన గెలుపు కోసం గల్లీగల్లీలోనూ ప్రచారం చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి భిన్నం. సొంతపార్టీ వారు కలసి రారు.. తెలుగుదేశం శ్రేణులు సహకరించరు..! జరిగే తంతు చూస్తే.. టీడీపీ శ్రేణుల ఓట్లు చీలిపోతాయేమోనన్న అనుమానం.. దీంతో దేవయ్య కి....దేవుడే దిక్కు అన్నట్లుంది. వరంగల్‌ పార్లమెంటు ఉప ఎన్నిక బరిలో.. తమ అభ్యర్థిని నిలుపుతామని ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ప్రకటించాయి బీజేపీ-టీడీపీలు. అయితే ఎంత వెతికినా సరైన అభ్యర్థి దొరక్కపోవడంతో.. చివరకు దేవయ్యను తెరపైకి తెచ్చారు. అభ్యర్థి పేరు ప్రకటించాక.. ఉభయ పార్టీల నేతలూ.. హన్మకొండలో భేటీ అయి.. సమన్వయంతో సాగాలని.. ప్రచారాన్ని హోరెత్తించాలనీ.. దేవయ్య విజయానికి కలిసికట్టుగా కృషి చేయాలనీ నిర్ణయించారు.
ఎన్డీయే అభ్యర్థి విజయానికి అవసరమైన వ్యూహాలు సిద్ధమయ్యాయి.. కానీ అమలులోనే పడకేశాయి. దేవయ్యకు మద్దతుగా ఉభయ పార్టీల నేతలు సంయుక్తంగా ప్రచారం నిర్వహించిందే లేదు. వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో తప్ప.. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో.. బీజేపీకి పెద్దగా క్యాడర్‌ లేదు. పూర్తిగా తెలుగుదేశం పార్టీ మద్దతుపైనే ఆధారపడింది. అయితే.. తమ్ముళ్లు ఎక్కడా కలిసి వచ్చే పరిస్థితే కనిపించడం లేదు.

మందకొడిగా ప్రచారం...
అభ్యర్థినయితే ఉమ్మడిగా నిలిపాయి కానీ.. బీజేపీ-టీడీపీలు.. కలిసికట్టుగా దేవయ్య విజయం కోసం పాటుపడిందే లేదు. అదేంట్రా అంటే.. కమలనాథులు.. తమను పిలవలేదని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. కలిసి కట్టుగా సాగుదామని సమన్వయ భేటీలో అనుకున్నాక.. మళ్లీ బొట్టుపెట్టి పిలవాలంటే ఎలా అన్నది కాషాయదళం ప్రశ్న. ఇలా ఎవరికి వారు భీష్మించుకు కూర్చోవడంతో.. ఎన్డీయే అభ్యర్థి ప్రచారం మందకొడిగా సాగింది.

పార్టీల మధ్య లేని సమన్వయం..
బీజేపీ అభ్యర్థి గెలుపు సంగతేమో కానీ.. మంచి మెజారిటీ రావాలన్నా తెలుగు దేశం శ్రేణుల మద్దతు తప్పనిసరి. వరంగల్‌ నగరంలో తప్ప.. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో టీడీపీకి గట్టి పట్టుంది. పైగా పార్టీకి నిర్దిష్టమైన ఓటు బ్యాంకూ ఉంది. ఈ తరుణంలో... టీడీపీ నాయకులు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించి.. ఓటర్లను కదిలిస్తేనే ఎన్డీయే అభ్యర్థికి పాజిటివ్‌ వేవ్‌ వస్తుందనడంలో అతిశయోక్తి లేదు. కానీ ముందు నుంచీ ఇరు పార్టీల మధ్య సమన్వయం లేకపోవడంతో.. టీడీపీ శ్రేణులు.. బీజేపీకి దూరంగా ఉంటున్నారు.

మూడో స్థానంలో నిలుస్తుందా ? 
తమని ప్రచారంలో నిర్లక్ష్యం చేసిన బీజేపీకి బుద్ధి చెప్పాలన్న భావనలో టీడీపీ శ్రేణులు ఉన్నట్లు వారి తీరును బట్టి అర్థమవుతోంది. ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ.. బీజేపీ నేతలు బేజారైపోతున్నారు. తెలుగు తమ్ముళ్లను నిర్లక్ష్యం చేసిన ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమోనన్న అనుమానమూ వ్యక్తమవుతోంది. 2014లో ఓరుగల్లు పార్లమెంటు స్థానానికి పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచిన బీజేపీ.. ఈసారీ తమ్ముళ్ల సహాయ నిరాకరణ పుణ్యాన అదే స్థానంలో నిలవాల్సి వస్తుందేమోనన్న భావనా వ్యక్తమవుతోంది. 

19:22 - November 15, 2015

వరంగల్‌ : ఉప ఎన్నికల్లో.. ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా.. పాలక టీఆర్ఎస్‌.. వ్యూహలు రచిస్తోంది. గ్రామం అభివృద్ధి చెందాలంటే.. టీఆర్ఎస్‌ అభ్యర్థికే మద్దతు పలకాలంటూ ఒత్తిళ్లు పెంచుతోంది. ఆమేరకు మద్దతిస్తామంటూ.. ప్రజలతో ప్రమాణాలూ చేయిస్తోంది. వరంగల్‌ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌ విజయం కోసం.. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు నానా ఎత్తులూ వేస్తున్నారు. చతుర్విధ ఉపాయాలనూ ప్రయోగిస్తూ.. ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. గ్రామాభివృద్ధి అన్న అంశాన్నీ ఒక అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామస్థులను ఈ అస్త్రంతోనే తమవైపు తిప్పుకున్నారు. ఇచ్చిన మాట తప్పబోమంటూ.. ప్రమాణమూ చేయించారు. కరీంనగర్‌ జెడ్పీ చైర్‌ఉమన్‌ తుల ఉమ ఆధ్వర్యంలో.. స్థానిక నాయకులు.. వెంకటాపురం గ్రామ పెద్దలతో మంతనాలు సాగించారు. పార్టీలకు అతీతంగా అందరూ టీఆర్ఎస్‌ అభ్యర్థికే ఓట్లేస్తే.. వెంకటాపురాన్ని బంగారు గ్రామంగా మారుస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో.. ప్రజలు వారిని నమ్మి.. మాటిచ్చేశారు. పంచాయతీ కార్యాలయం ఎదుట.. గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఓటర్లను ఇలా ప్రలోభ పెట్టడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. 

19:20 - November 15, 2015

వరంగల్ : వారు చట్టాలు చేస్తారు. కానీ అమలునే పట్టించుకోరు. బాలల చాచా నెహ్రూ గారి వారసులమంటారు.. కానీ ఆ బాల్యాన్నే చిదిమేస్తారు. ఇదీ... ఓరుగల్లు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ నాయకుల తీరుపై జనం భాష్యం. ఇంతకీ కాంగ్రెస్‌ నాయకులపై జనాగ్రహానికి కారణమేంటంటారా..? ఓరుగల్లు పార్లమెంటు ఉప ఎన్నిక బరిలో.. కాంగ్రెస్‌ అభ్యర్థి సర్వే సత్యనారాయణ ప్రచారం జోరును పెంచారు. తోడుగా వచ్చిన మాజీ మంత్రులు... పార్టీ శ్రేణులతో కలిసి వీధివీధీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అయితే.. పాంప్లెట్స్ పంచేందుకు.. కార్యకర్తలు కొరవడ్డారో ఏమో గానీ.. ఆయన ఆపనికి బాలలను ఉపయోగించుకున్నారు. పలకాబలపం పట్టుకొని.. బడిబాట పట్టాల్సిన చిన్నారులను.. ఇలా పార్టీ జెండాలు మోయిస్తూ.. ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రచారంలో బడి ఈడు పిల్లలతో.. పని చేయించుకుంటున్న కాంగ్రెస్‌ నేతలపై ఎన్నికల సంఘం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

18:29 - November 15, 2015

కృష్ణా : గుడివాడ రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. కొడాలి నాని..టిడిపి నేతల మధ్య వార్ తారాస్థాయికి చేరుకొంటోంది. వైసీపీ పార్టీ కార్యాలయం వివాదం విషయంలో ఎమ్మెల్యే కొడాలి నానిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కొడాలి నాని తీవ్రస్థాయిలో స్పందించారు. తనను రాజకీయంగా ఎదుర్కొనలేక, తనను అణగదొక్కడం కోసం ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారని టిడిపినిద్ధేశించి పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో గుడివాడ నుండి గెలుస్తానని..దమ్ముంటే తనపై చంద్రబాబు గెలువాలని సవాల్ విసిరారు. బాబు గెలిస్తే తాను గుడివాడ..రాష్ట్రం విడిచి పెట్టి వెళ్లిపోతానని..తాను గెలిస్తే బాబు ఇదే చేస్తారా అని సవాల్ విసిరారు.
కొడాలి నాని..గతంలో టిడిపి పార్టీ నుండి గెలిచారు. అనంతరం ఆయన వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో ఉన్న భవనంలోనే వైసీపీ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. సరిగ్గా అద్దె చెల్లించడం లేదంటూ భవన యజమాని కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు. కార్యాలయానికి తాళం వేయడంతో సమాచారం అందుకున్న కొడాలి నాని అక్కడకు చేరుకున్నారు. ఈ దశలో పోలీసులు అక్కడకు చేరుకుని నాని అరెస్టు చేసి కైకలూరు పీఎస్ కు తరలించారు. తాను న్యాయబద్ధంగా అద్దె చెల్లిస్తున్నామ, తనను రాజకీయంగా ఎదుర్కొనలేక చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. దీనిపై టిడిపి నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

 

అక్వా ఫుడ్ పార్కు కు రైతులు భూములివ్వాలి - పీతల సుజాత..

పశ్చిమగోదావరి : తుందుర్రులో సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్వా ఫుడ్ పార్కు కోసం భూమిలివ్వడానికి రైతులు ముందుకు రావాలని మంత్రి పీతల సుజాత కోరారు. స్థానికుల ఉపాధి కల్పన కోసమే అక్వా ఫుడ్ పార్కు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు.

 

రాష్ట్రంలో కరవు మండలాలను ప్రకటించాలి - సీపీఎం...

విజయవాడ : రాష్ట్రంలో కరవు మండలాలను వెంటనే ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో తాగునీటికి, పశుగ్రాసానికి కొరత ఏర్పడిందని తెలిపారు. ఉపాధి కోసం పేద రైతులు వలస పోతున్నారని, ప్రభుత్వం 196 మండాలనే కరవు ప్రాంతాలుగా గుర్తించడం అశాస్త్రీయమన్నారు. 352 మండలాలను కరవు ప్రాంతాలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 

సీఎంకు రాజధాని సమన్వయ కమిటీ లేఖ..

కృష్ణా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి సీపీఎం రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ లేఖ రాసింది. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ముగిసినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కమిటీ కన్వీనర్ సీహెచ్ బాబురావు విమర్శించారు. ఇప్పటికైనా హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బలవంతపు భూ సేకరణనను నిలిపివేయాలని, భూ సేకరణలో రైతులకు ప్యాకేజీ ప్రకారం ఇచ్చే భూములను సీడ్ కేపిటల్ సమీపంలోనే ఇవ్వాలని కోరారు. 

రెండు రాష్ట్రాలకు చంద్రగ్రహణం - లక్ష్మీ పార్వతి..

వరంగల్ : రెండు రాష్ట్రాలకు చంద్రగ్రహణం పట్టిందని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. అసమర్థులకు ఓటేయడం వల్ల లాభం లేదని, రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలం చెందారని విమర్శించారు. బాబు అసమర్థత వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిందన్నారు. 

అద్దె భవనంలో వైసీపీ కార్యాలయం - కొడాలి నాని..

విజయవాడ : వైసీపీ కార్యాలయ భవనాన్ని అద్దెకు తీసుకుని నిర్వహించడం జరిగిందని, ఎవరి వద్ద బలవంతంగా లాక్కోలేదని కొడాలి నాని పేర్కొన్నారు. అద్దె భవనాన్ని ఖాళీ చేయాలని ఎవరో నోటీసు ఇవ్వలేదని, 2019 ఎన్నికల్లో గుడివాడ నుండి పోటీ చేస్తానని తెలిపారు. చంద్రబాబుకు దమ్ముంటే తనపై గెలవాలని కొడాలి నాని సవాల్ విసిరారు. 

17:34 - November 15, 2015

హైదరాబాద్ : బాలీవుడ్ సోదరీమణులు కరీనా కపూర్, కరిష్మాకపూర్ లు నగరంలోని ప్రసాద్ ఐ మ్యాక్స్ ను సందర్శించారు. 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సావాలను పురస్కరించుకుని కరిష్మా కుమార్తె సమైరా దర్శకత్వం వహించిన 'బీ హ్యాపీ' చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సందర్భంగా కుమార్తె సమైరా, సోదరి కరీనా కపూర్ లతో కరిష్మా చిత్రాన్ని వీక్షించింది. 

17:25 - November 15, 2015

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఈనెల ఆరో తేదీన చిన్నారి దుర్గను కిడ్నాప్ చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వీరిని మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. వీరిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు మగవారున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి కేసుకు సంబంధించిన వివరాలు తెలియచేశారు. పిల్లలను అపహరించడంతో పాటు వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దొమ్మరి కులానికి చెందిన వీరంతా ఒక ముఠాగా ఏర్పడి ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, వరంగల్ లోని వంగపాడు, యాదగిరిగుట్ట తదితర ప్రాంతాల్లో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా బ్రోకర్ శంకర్ వ్యవహరిస్తాడని, అతని భార్య దివ్య సహకరించేదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే దివ్యను కిడ్నాప్ చేసిన కుమార్..సునీత దంపతులు శంకర్ కు అమ్మాడని పేర్కొన్నారు. అనంతరం బంధువైన భాగమ్మకు శంకర్ చిన్నారి దుర్గను అప్పగించాడు. ఈ సమయంలో దుర్గకు వెంట్రుకలు తీసివేయించడంతో గుర్తు పట్టడం కష్టమైందన్నారు. విచారణలో ఇక్కడ ఉన్నట్లు తెలియడంతో చిన్నారి దుర్గను తీసుకరావడం జరిగిందని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి లతను, రాణి అనే అమ్మాయిని ట్రాప్ చేసి ఇలా చేశారని తెలిపారు. సిరిసిల్ల, వంగపాడు, ధర్మపూరి, యాదగిరిగుట్ట పలు ప్రాంతాల్లో వీరి కార్యకలపాలు కొనసాగించారని పోలీసు అధికారి తెలిపారు. 

17:17 - November 15, 2015

హైదరాబాద్ : టైం బాగాలేకపోయేసరికి తాను దొరికిపోయానని ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి పేర్కొన్నాడు. మూడు రాష్ట్రాలకు ముచ్చెమటలు పోయించిన మోస్ట్ వాంటెండ్ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని ఏపీ డీజీపీ కార్యాలయానికి తీసుకొచ్చారు. మారిషస్‌లో పట్టుబడిన గంగిరెడ్డిని సీఐడీ చీఫ్‌ ద్వారకా తిరుమలరావు నేతృత్వంలోని బృందం ఆదివారం ఉదయం ఢిల్లీకి తీసుకొచ్చింది. అక్కడ నుంచి మధ్యాహ్నం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టకు తరలించారు. ఎయిర్‌పోర్టులోని వీఐపీ మార్గం ద్వారా బయటకు తీసుకొచ్చి డీజీపీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయంలో గంగిరెడ్డి మీడియాతో మాట్లాడాడు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానమిచ్చాడు. తనకు తెలియని ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలని ఎదురు ప్రశ్నించాడు. తాను బిజినెస్ పని మీద వెళ్లడం జరిగిందని, తాను ఎందుకు పారిపోతానని ప్రశ్నించాడు. మినరల్ వాటర్ వ్యాపారం చేయాలని దుబాయ్ కు వెళ్లినట్లు, తనకు వివాహం జరిగిందని, ముగ్గురు పిల్లలనున్నారని గంగిరెడ్డి చెప్పుకొచ్చాడు. అలాగే తనకు ఏ ప్రభుత్వంతో కాని ప్రాణహాని లేదని, ఏ పాపం తెలియదని గంగిరెడ్డి పేర్కొన్నాడు. 

నాకెలాంటి ప్రాణహాని లేదు - గంగిరెడ్డి..

హైదరాబాద్ : తనకెలాంటి ప్రాణహాని లేదని ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి పేర్కొన్నాడు. తన టైమ్ బాగోలేకనే దొరికిపోయానని, వ్యాపారం కోసం దుబాయ్ వెళ్లడం జరిగిందని తెలిపాడు. 

చిన్నారి కిడ్నాప్ లో ఎనిమిది మంది అరెస్టు..

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈనెల ఆరో తేదీన దుర్గ అనే చిన్నారి అపహరణ కేసులో పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. 

ప్లీనం సమావేశాల తేదీలను ప్రకటించిన సీపీఎం.

ఢిల్లీ : ప్లీనం సమావేశాల తేదీలను సీపీఎం కేంద్ర కమిటీ ప్రకటించింది. కోల్ కతాలో డిసెంబర్ 27-31 వరకు ప్లీనం సమావేశాలు ఉంటాయని, ఈ సమావేశాలకు 436 మంది ప్రతినిధులు హాజరౌతారని తెలిపింది. ప్లీనం సమవేశాలను గంలో కంటే ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 27వ తేదీన కోల్ కతా లో బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో పది లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేంద్ర కమిటీ వెల్లడించింది. 

వాణజ్య పన్నుల అధికారులతో యనమల సమీక్ష..

తిరుపతి : వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో మంత్రి యనమల సమీక్ష నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.33వేల కోట్ల పన్ను వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు యనమల తెలిపారు. ఇప్పటి వరకు రూ.15వేల కోట్ల పన్నులు వసూలు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను బలోపేతం చేస్తామని, చెక్ పోస్టుల వద్ద అవినీతి తావులేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పన్ను ఎగవేతదారులపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. 

16:40 - November 15, 2015

కృష్ణా : అప్పుల బాధతో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా కొండూరు మండలం రేపూడ తండాలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన భానావత్‌ గోపి మూడున్నర ఎకరాల్లో పత్తి పంట వేశాడు. మరో ఎకరంలో వరి పంట వేశాడు. సాగు నిమిత్తం లక్షల్లో అప్పులు చేశాడు. గత కొన్నేళ్లగా పంట నష్టం వస్తోంది. దీంతో అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. దిక్కుతోచని గోపి హైపవర్‌ కరెంట్‌ స్తంభం ఎక్కి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

 

16:38 - November 15, 2015

నల్గొండ : జిల్లా సూర్యాపేటలో అర్ధరాత్రి వేళ దొంగలు స్థానికులపై దాడికి తెగబడ్డారు. కొత్త బస్టాండ్ సమీపంలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఎటిఎమ్‌లో ఇద్దరు దొంగలు చొరబడి చోరీకి ప్రయత్నించారు. ఎటిఎమ్ మిషన్‌ను ధ్వంసం చేయడానికి ప్రయత్నించగా స్థానికులు కొందరు వారిని అడ్డుకున్నారు. దీంతో దొంగలు వారిపై దాడి చేయగా ఒకరికి చేయి విరిగింది. అక్కడి నుంచి దొంగలు పారిపోతుండగా వారిలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

 

 

16:36 - November 15, 2015

ఢిల్లీ : వచ్చే నెల 27 నుంచి 31 వరకు కోల్‌కతాలో సీపీఎం ప్లీనమ్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు 436 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సమావేశాల ప్రారంభం రోజు... డిసెంబర్‌ 27న కోల్‌కతాలోని చారిత్రక బ్రిగేడ్‌ పెరేడ్‌ మైదానంలో పది లక్షల మందికి పైగా ప్రజలతో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. కోల్‌కతా ప్లీనమ్‌ సమావేశాల కోసం బెంగాల్‌ వ్యాప్తంగా ప్రచార జాతాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ప్రారంభమైన ఈ జాతాలు ఈనెల 22 వరకు కొనసాగుతాయి. 11,269 జాతాల్లో 17 లక్షల మంది కార్యకర్తలు పాల్గొంటున్నారు. బెంగాల్‌లో 77,242 పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి. మొదటి దశలో 64,222 పోలింగ్‌ బూత్‌ పరిధిలో జాతాలు నిర్వహిస్తున్నారు.

ప్రజా స్వామ్య పునరుద్ధరణ కోసం..
బెంగాల్‌లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ లక్ష్యంగా సీపీఎం ప్లీనమ్‌ సమావేశాలను నిర్వహిస్తున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెబుతున్నారు. ఇటీవలి కాలంలో తృణముల్ కాంగ్రెస్ ప్రజాస్వామ్యం..పౌర హక్కుల మీద దాడి జరిగిందని, తిరిగి ప్రజాస్వామ్యాన్ని పునస్థాపన చేయడం కోసం జాతాలు కృషి చేస్తాయని చెప్పారు. 

16:35 - November 15, 2015

విజయవాడ : బిజెపి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక కమ్యూనిస్టులు, ప్రగతిశీల భావాలు కలిగిన వారిపై దాడులు పెరిగాయని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ప్రజానాట్యమండలి, అరసం ఆధ్వర్యంలో విజయవాడలో మతోన్మాదుల అసహనంపై లౌకిక ప్రజాశక్తుల సమరం పేరుతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సురవరం... బిజెపి, సంఘ్‌ పరివార్‌ దాడుల వలన హిందూమతం, దాని ఆచారాలకు నష్టం వాటిల్లోతోందన్నారు. రచయితలు, హేతువాదులపై దాడుల నేపథ్యంలో అవార్డులు వెనక్కి ఇవ్వడం శుభపరిణామమన్నారు. సంఘ్‌ శక్తులకు అండగా నిలుస్తున్న మోడీ చర్యలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సురవరం సూచించారు. 

16:32 - November 15, 2015

విశాఖపట్టణం : జిల్లా ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిస్తూ టీడీపీ ప్రభుత్వం జారీ చేసీ జీవోను వెంటనే ఉపసంహరిచుకోవాలని ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ డిమాండ్‌ చేశారు. ఈ జీవోను వ్యతిరేకించాలని కోరుతూ ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి లేఖ రాశారు. గిరిజన సలహా మండలి ఆమోదం లేకుండా బాక్సైట్‌ తవ్వకాలను 97వ నంబర్‌ జీవో జారీ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది గిరిజనుల హక్కులను కాలరాయడమే అవుతుందని శర్మ విమర్శించారు. గిరిజన సలహా మండలిలో వైసీపీ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారన్నారు. గిరిజన సలహా మండలి సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ ఆదేశాలు వెలువడుతాయని, ఇక్కడ గవర్నర్ ఆదేశాలు ఉన్నా రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అని పేర్కొన్నారు.మండలి సమావేశం కోసం ప్రతిపక్ష నేత జగన్‌... ప్రభుత్వంపై ఒత్తిడి తేకపోవడాన్ని శర్మ తప్పుపట్టారు.

16:29 - November 15, 2015

మెదక్ : గజ్వేల్‌, సిద్ధిపేటను అభివృద్ధి చేస్తామంటున్న కేసీఆర్‌, హరీష్‌రావులు మాటాలకే పరిమితమవుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం కోసం పేదల భూములను లాక్కొంటున్నారని విమర్శించారు. తగిన నష్టపరిహారం ఇవ్వకుండానే భూములను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. 

16:26 - November 15, 2015

ఢిల్లీ : ట్రేడ్‌ఫేర్‌లో ఆంధ్రా పెవిలియన్‌ను ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహాన్ ప్రారంభించారు. ఉత్పత్తి అయిన వస్తువుల అమ్మకం ద్వారా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ పెరుగుతుందన్నారు. వెబ్‌ పోర్టల్‌ ద్వారా ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు 3,050 దరఖాస్తుల వచ్చాయన్నారు. ఇప్పటివరకు వీటిలో 2,875 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేశామన్నారు.


 

16:23 - November 15, 2015

హైదరాబాద్ : ఐడిహెచ్‌ కాలనీలో లబ్ధిదారులకు సీఎం కెసిఆర్‌ చేతులు మీదుగా సోమవారం డబల్‌ బెడ్‌ రూం ఇళ్లను అందజేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ఐడిహెచ్ కాలనీలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను జీహెచ్ఎంసీ కమిషనర్‌, అధికారులతో కలిసి తలసాని పరిశీలించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తెలంగాణ ప్రభుత్వం హామీలను నెరవేరుస్తోందని మంత్రి ప్రకటించారు. వివిధ ప్రభుత్వ విభాగాలు చాలా కష్టపడి అనుకున్న సమయానికి ఇళ్ల నిర్మాణం పూర్తిచేశారని తలసాని ప్రశంసించారు. 

సైనా ఓటమి..

చైనా : ఓపెన్ టైటిల్ పోరులో భారత స్టార్ బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. ఫైనల్ మ్యాచ్ లో చైనా క్రీడాకారిణి లీ జురుయ్ చేతిలో 12-21, 15-21 తేడాతో సైనా ఓడిపోయింది. 

వరంగల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మీరా కుమార్..

వరంగల్ : ఆంధ్రలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చామని లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఊహించిది ఒకటి..జరిగింది మరొకటని తెలిపారు. టీఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టడం తప్ప తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమి లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో సామాజిక న్యాయం కరువైందని, తెలంగాణలో 1500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. 

ఉగ్రవాదంపై పోరుకు ప్రపంచ దేశాలు ఏకం కావాలి - మోడీ...

టర్కి : జి 20 సదస్సు జరుగుతోంది. అందులో భాగంగా బ్రిక్స్ దేశాలు సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో ఉగ్రవాదం అంశాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లేవనెత్తారు. పారిస్ లో ఉగ్రదాడిని మోడీ ఖండించారు. ఉగ్రవాదంపై పోరుకు ప్రపంచ దేశాలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 

15:32 - November 15, 2015

హైదరాబాద్ : మూడు రాష్ట్రాలకు ముచ్చెమటలు పోయించిన మోస్ట్ వాంటెండ్ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని ఏపీ డీజీపీ కార్యాలయానికి తీసుకొచ్చారు. మారిషస్‌లో పట్టుబడిన గంగిరెడ్డిని సీఐడీ చీఫ్‌ ద్వారకా తిరుమలరావు నేతృత్వంలోని బృందం ఆదివారం ఉదయం ఢిల్లీకి తీసుకొచ్చింది. అక్కడ నుంచి మధ్యాహ్నం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టకు తరలించారు. ఎయిర్‌పోర్టులోని వీఐపీ మార్గం ద్వారా బయటకు తీసుకొచ్చి డీజీపీ కార్యాలయానికి తరలించారు. ఈసందర్భంగా ఏపీ డీజీపీ రాముడు మీడియాతో మాట్లాడారు. ఇతని అరెస్టు విషయంలో మారిషల్ ఉన్న ఇంటర్ పోల్, ఇతర అధికారులు చాలా సహకరించారని తెలిపారు.
2014లో ఎన్నికల సమయంలో ఓ చిన్న కేసులో కొంతమంది పట్టుబడడం జరిగిందని, ఆ సమయంలో గంగిరెడ్డిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు. విచారణలో రెడ్ స్మగ్లింగ్ బయటపడిందని కానీ హై కోర్టుకు వెళ్లి గంగిరెడ్డి బెయిల్ తెచ్చుకున్నాడని పేర్కొన్నారు. నకిలీ పత్రాలతో పాస్ పోర్టు సంపాదించి చాలా దేశాలు తిరిగాడన్నారు. ఆ సమయంలో తమకు సమచారం వచ్చేదన్నారు. ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్లే సమయంలో అడ్రసు ఇచ్చే వాడని కానీ సూచించిన అడ్రసులో నివాసం ఉండేవాడు కాదన్నారు. మొరాకో నుండి గంగిరెడ్డి బుక్ చేసుకున్నట్లు సమాచారం వచ్చిందని, వెంటనే ఇంటర్ పోల్ అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. వెంటనే అక్కడ అరెస్టు చేసి జైలులో పెట్టారని పేర్కొన్నారు. పాస్ పోర్టు క్యాన్సిల్ చేయడం కోసం టైం పట్టిందని, ఇతనికి 300-400 కోట్ల వరకు ఆస్తులున్నట్లు అంచనా వేస్తున్నట్లు, ఆస్తులకు సంబంధించిన దానిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు విచారణ చేపడుతున్నారని తెలిపారు. కొన్ని కొన్ని కారణాల వల్ల గంగిరెడ్డిని తీసుకొచ్చేందుకు ఆలస్యమైందని తెలిపారు. కానీ తక్కువ సమయంలోనే ఇతడిని నగరానికి తీసుకరావడం జరిగిందన్నారు. మారిషస్‌లో గంగిరెడ్డికి ఎవరు సహకరించారో విచారణలో తేలుతుందని, వీరిలో ఎవరినీ వదిలిపెట్టమన్నారు. ప్రస్తుతం తమ పరిధిలో 28 కేసులున్నాయని, ఫారెస్టు కేసులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేసులు తెలియదని, ఇతనికి ఎలాంటి ప్రాణహాని లేదని తెలిపారు. ఎర్రచందనం చెట్లను కొట్టడానికి ఎవరికీ అనుమతి లేదని, కడపలోని ప్రొద్దుటూరులో ఉన్న ఓ కేసులో హాజరుపరుస్తామని తెలిపారు. ప్రపంచంలో అత్యంత చెక్క విలువ ఏదన్నా ఉందంటే అది ఎర్రచందనం అని ఏపీ డీజీపీ తెలిపారు. 

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్..

వరంగల్ : తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది టీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. తప్పుడు హామీలతో ఒకరు ప్రధాన మంత్రి అయితే మరొకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. 

ఐ.పోలవరంలో రైతుల ఆందోళన...

తూర్పుగోదావరి : ఐ.పోలవరం (మం) పిల్లకుప్పలో రైతులు ఆందోళన నిర్వహించారు. నకిలీ విత్తనాలతో పంట నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసిన దుకాణం ఎదుట నిరసన నిర్వహించారు. ఆందోళనలో రైతులు ఆత్మహత్యయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. 

భూపాల పల్లిలో కాంగ్రెస్ బహిరంగసభ..

వరంగల్ : భూపాలపల్లిలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈసభలో దిగ్విజయ్ సింగ్, లోక్ సభ స్పీకర్ మీరా కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

14:48 - November 15, 2015

వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలయ్యాయా ? అని ప్రజలనుద్దేశించి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వరంగల్, భూపాల పల్లిలో ప్రచారం నిర్వహివంచారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తనదైన శైలిలో మాట్లాడారు. గత ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనేక హామీలిచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉన్న నల్లధనం వెనక్కి తెస్తామని, దీనివల్ల దేశంలో ఉన్న ప్రతొక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు జమ అవుతాయని వాగ్ధానం చేశారని తెలిపారు. అలాగే విద్యార్థులు..యువకులకు ఉద్యోగాలిస్తామని, ధరలు తగ్గిస్తామని ఎన్నో హామీలు గుప్పించారని విమర్శించారు. ఈ హామీల్లో ఏ ఒక్కటైనా అమలు జరిగిందా అని ప్రజలనుద్ధేశించి ప్రశ్నించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ ఎన్నో వాగ్ధానాలు ఇచ్చారని తెలిపారు. తప్పుడు మాటలు..తప్పుడు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చారని తీవ్రంగా విమర్శించారు. హామీలు అమలు చేయని వారికి బుద్ధి చెప్పాలా ? వద్దా ? అని ప్రశ్నించారు. రైతులకు వ్యవసాయ ఉత్పత్తులకు, పత్తికి మద్దతు ధర లభించడం లేదని, రైతులకు సమాయానికి ఎరువులు, విద్యుత్ సరఫరా కావడం లేదని చెప్పారు. ఎన్నికల్లో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ అమలు చేయలేదని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.

14:40 - November 15, 2015

కృష్ణా : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. జిల్లాలోని చల్లపల్లిలో జరిగిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛభారత్‌లో చల్లపల్లి దేశానికి ఆదర్శప్రాయమని వెంకయ్యనాయుడు అన్నారు. స్వచ్ఛ చల్లపల్లి కోసం కృషిచేస్తున్న డాక్టర్‌ డీఆర్కే ప్రసాద్‌, పద్మావతిలను ఆయన అభినందించారు. భారత్‌ అభివృద్ధి దిశగా పయనిస్తోందని, ప్రపంచమంతా ఇండియా వైపు చూస్తోందని వెంకయ్యనాయుడు అభివర్ణించారు.

14:38 - November 15, 2015

వరంగల్ : జిల్లాలో చైన్‌ స్నాచర్‌ను స్థానికులు పట్టుకున్నారు. మహిళ మెడలోనుంచి గొలుసు దొంగిలించిన స్నాచర్‌ వెంటనే అక్కడినుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతన్ని వెంబడించిన స్థానికులు చెన్నారావుపేట పాకాలవాగు దగ్గర పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

14:36 - November 15, 2015

కరీంనగర్ : ఏఎస్ఐ మోహన్ రెడ్డి అక్రమ ఫైనాన్స్ కేసులో విచారణ వేగవంతం చేసినట్లు సీఐడీ డీజీఐ రవివర్మ పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కేవలం రెండు, మూడు రోజుల్లో కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఏడు సీఐడీ బృందాలతో కేసు విచారణ చేయడం జరుగుతోందని తెలిపారు. ప్రధానంగా కెన్ క్రెస్ట్ విద్యా సంస్థల ఛైర్మన్, మోహన్ రెడ్డిలకు మధ్య సంబంధాలపై లోతుగా విచారణ చేపడుతున్నట్లు సమాచారం. అధికారులపై చర్యలు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

కెన్ క్రిస్ట్ విద్యా సంస్థల డైరెక్టర్ ఆత్మహత్య..
ఇటీవల మోహన్ రెడ్డి వేధింపులు భరించలేక కెన్ క్రెప్ట్ విద్యాసంస్థల డైరెక్టర్ ప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకోవడంతో ఈ గుట్టు రట్టైన విషయం తెలిసిందే. రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించగా పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు సమాచారం. జిల్లా అడిషనల్ ఎస్పీ జనార్ధన్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారంలో జనార్దన్ రెడ్డి 90 లక్షలు పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. గతంలో జిల్లాలో పనిచేసిన డీఎస్పీలు రంగరావు, భాస్కరరాజులు చెరో 10 లక్షలు..ఇతర డీఎస్పీలు లక్షల్లో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.
ఎవరైనా సొమ్ము చెల్లించలేకపోతే కానిస్టేబుళ్లు, హోంగార్డులను తీసుకెళ్లి మోహన్ రెడ్డి బెదిరించే వాడని..తప్పుడు కేసులు పెట్టి వేధించే వాడని, ఉన్నతాధికారుల అండ కూడా ఉండడంతో మోహన్ రెడ్డి ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. మోహన్ రెడ్డి ఆస్తుల విలువ వందల కోట్లతో ఉన్నట్టు భావిస్తున్నారు. 

14:29 - November 15, 2015

వరంగల్ : జిల్లా ఎంపి ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని అధికార పక్షం...ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని ప్రతిపక్షాలు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. అధికారం తమదేనని..ఎవరూ ఏమి చేయలేరని గులాబీ దళం విర్రవీగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘణ యదేచ్ఛగా సాగిస్తోందిన ప్రతిపక్షాల నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఏకంగా వ్యవసాయ మార్కెట్ లో టీఆర్ఎస్ నేతలు ప్రచారం నిర్వహించడం అందరూ విస్తుపోయారు. మార్కెట్ ఆవరణలో ఆ పార్టీ నేతలు జనసమీకరణ చేపట్టారు. ఈ వ్యవహారం అధికారుల దృష్టికి పోవడంతో కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. దీనిపై అధికారపక్షం ఏమి సమాధానం చెబుతుందో ? 

టర్కీలో ఆత్మహుతి దాడి..

టర్కీ : ఆత్మాహుతి దాడి చేయడంతో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ రోజు జి -20 సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. 

13:55 - November 15, 2015

వరంగల్ : టీఆర్ ఎస్ నేతలు ప్రజలను దోచుకుంటుందని వరంగల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ విమర్శించారు. ఈమేరకు ఈయన టెన్ టివితో మాట్లాడారు. టీఆర్ ఎస్ ను ప్రజలు తిరస్కరించే రోజు వచ్చిందన్నారు. హరీశ్ రావు కరీంనగర్ వాసి కాడని.. సిద్దిపేటలో ఎందుకు పోటీ చేశారని నిలదీశారు. తమను విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు. మెదక్ లో పుట్టిన కేటీఆర్ సిరిసిల్లలో ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. చెల్లని నోట్లంటూ కరెన్సీ అవమానిస్తున్నాని చెప్పారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గంగిరెడ్డి తరలింపు

హైదరాబాద్ : మోస్టు వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఎపి డిజిపి కార్యాలయానికి తరలించారు. ఎపి సీఐడీ పోలీసులు మీడియా కంట పడకుండా గంగిరెడ్డిని తరలించారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఐడీ గంగిరెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

 

12:55 - November 15, 2015

హైదరాబాద్ : ఏపీ, తమిళనాడు, కర్నాటక మూడు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని సిఐడీ పోలీసులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. మారిషస్‌లో పట్టుబడిన గంగిరెడ్డిని సీఐడీ చీఫ్‌ ద్వారకా తిరుమలరావు నేతృత్వంలోని బృందం ఇవాళ ఉదయం ఢిల్లీకి తీసుకొచ్చింది. అక్కడ నుంచి మధ్యాహ్నానికి హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టకు తరలించారు. ఎయిర్‌పోర్టులోని వీఐపీ మార్గం ద్వారా బయటకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి డీజీపీ కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది. గంగిరెడ్డి తరలింపు నేపథ్యంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎపి డిజిపి రాముడు వివరాలను మీడియాకు వివరించనున్నారు. గంగిరెడ్డిపై 28కి పైగా ఎర్రచందనం అక్రమ రవాణా కేసులున్నాయి. సారా వ్యాపారంతో మొదలు పెట్టి మావోయిస్టులతో పరిచయాలు పెంచుకున్న గంగిరెడ్డి,చంద్రబాబుపై అలిపిరి దాడికి సహకరించాడు.ఎర్రచందనం అక్రమ వ్యాపారంతో వందల కోట్లు సంపాదించాడు. శేషాచలం అడవుల నుంచి గల్ఫ్‌ దేశాలకు అవలీలగా ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసేవాడు. ఇప్పటికే సిఐడీ 200 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఈడీ కేసు నమోదు చేసి ఆస్తులను అటాచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 2014 ఎప్రిల్ 14న గంగిరెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం బెయిల్ పై విడుదల అయ్యాడు. ఆ తర్వాత దొంగపాసుపోర్టుతో మారిషస్ కు వెళ్లాడు. రూ. 240 కోట్ల ఆస్తులను గుర్తించారు. రేపు సాయంత్రం కోర్టులో గంగిరెడ్డిని హాజరుపర్చనున్నారు. గంగిరెడ్డిపై ఉన్న కేసుల వివరాలను ఈడీ సేకరిస్తోంది. గంగిరెడ్డి ఆస్తులకు సంబంధించిన వివరాలను సీఐడీ ఇప్పటికే అందించింది. మారిషస్‌, శ్రీలంక, సింగపూర్, దుబాయి దేశాల్లో వ్యాపారం, స్థిరాస్తుల కొనుగోలుపై ఈడీ విచారణ చేయడానికి సిద్ధమవుతోంది.
2014, ఏప్రిల్ 16న గంగిరెడ్డి
గంగిరెడ్డిని 2014,ఏప్రిల్ 16న ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో కర్నూల్‌లో అరెస్ట్ చేశారు. మే 16 న బెయిల్ మంజూరయ్యింది. రెండు రోజుల్లోనే తప్పుడు ధృవ పత్రాలతో విదేశాలకు పరారయ్యాడు. గంగిరెడ్డికి దొంగ పాస్‌పోర్టు రావడంలో కడప జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లోని జయానగర్‌కు బదులు మరో అడ్రస్ సృష్టించి పాస్‌పోర్టు పొందాడు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత గంగిరెడ్డితో తనకు ప్రాణహాని ఉందని గవర్నర్ కు వినతి పత్రం అందజేశారు. దీంతో రంగంలోకి దిగిన సిఐడి లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. సిఐడి అధికారులు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసి ఇంటర్‌పోల్ అధికారుల సహయం కోరారు. 9 నెలలు అజ్ఞాతంలో ఉన్న గంగిరెడ్డి దుబాయి నుంచి మారిషస్‌ వెళ్లాడు. అక్కడ నుంచి శ్రీలంకకు ప్రయాణం చేస్తున్న క్రమంలో ఇంటర్‌పోల్ అధికారులు మారిషస్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు గంగిరెడ్డి అరెస్ట్‌ చూపించి, ఆ తర్వాత కస్టడిలోకి తీసుకోనున్నారు. అనంతరం వివిధ కోణాలపై విచారణ జరపుతారు. ఎన్నికల ముందు గంగిరెడ్డి వందల కోట్లు ఓ పార్టీకి ఫండ్‌గా ఇచ్చారనే అరోపణలున్నాయి. అలాగే విదేశాలకు పారిపోయేందుకు ఎవరు సహకరించారు.? ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఎవరెవరి హస్తాలు ఉన్నాయనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. నేరస్తుల అప్పగింత ఒప్పందంలో భాగంగా ఏపీ సిఐడి పోలీసులు గంగిరెడ్డి ప్రాణానికి పూర్తి రక్షణ కల్పిస్తామని మారిషస్‌ కోర్టుకు హామీ ఇచ్చారు. అప్పగించే సమయంలో గంగిరెడ్డికి ప్రాణహాని ఉందని అతని తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చారు. గంగిరెడ్డిని మారిషస్‌లో 10-45 నిమిషాలకు అదుపులోకి తీసుకున్న సిఐడి బృందం న్యూఢిల్లీకి చేరుకుంది. అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు. 
ఘరానా కేటుగాడు గంగిరెడ్డి 
ఇండోనేషియాలో పట్టుబడ్డ మాఫియా డాన్‌ రాజన్‌కు ఏ మాత్రం తీసిపోని స్మగ్లర్‌ గంగిరెడ్డి. గత కొన్ని నెలలుగా వార్తల్లో కనిపిస్తున్న ఘరానా కేటుగాడు. పోలీసుల కన్నుగప్పి విదేశాలకు పారిపోయిన ఈ మోసగాడు మొత్తానికి దేశంలోకి అడుగుపెట్టాడు. కొల్లెం గంగిరెడ్డిగా ఘనమైన నేర చరిత్ర కలిగిన ఈ ప్రబుద్ధుడి గురించి పుంఖానుపుంఖాలుగా వార్తలు ప్రచురితమయ్యాయి. ఎర్రచందనం స్మగ్లర్‌గా వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టిన దొంగబాబును సిఐడి పోలీసులు పటిష్ట భద్రత మధ్య మారిషస్‌ నుంచి దేశానికి తీసుకొచ్చారు.
శేషాచల అడవుల నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌
గంగిరెడ్డి ఎన్నో ఏళ్లుగా శేషాచల అడవుల నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడు. రాజకీయ నాయకుల అండదండలుండడంతో ఇతని చీకటి వ్యాపారం దర్జాగా సాగిపోయింది. అయితే ఎర్రచందనం అక్రమ రవాణాపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో కొల్లెం గంగిరెడ్డి నిబంధనల గొల్లెం తెంపుకుని విదేశాలకు పారిపోయాడు.
ఇంటర్‌పోల్‌ సాయంతో గంగిరెడ్డి అరెస్టు
గంగిరెడ్డిని పట్టుకోవడం కోసం సిఐడి అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్‌పోల్‌ సాయం తీసుకుంది. దొంగ పాస్‌పోర్ట్ పై జంపైన గంగిరెడ్డి ఫిబ్రవరి 23న మారిషస్‌లో ఇంటర్‌ పోల్‌ అధికారులకు పట్టుబడ్డాడు. ఆ దేశంలోనే గంగిరెడ్డి బెయిల్‌కు పిటిషన్‌ దాఖలు చేయగా ఏపీ పోలీసుల కోరికపై పోర్ట్ లూయిస్‌ కోర్ట్‌ ఆ పిటిషన్‌ను కొట్టిపారేసింది. గంగిరెడ్డిని స్వదేశానికి తెచ్చేందుకు 8 నెలలుగా తీవ్రంగా శ్రమించిన సిఐడి అధికారుల కష్టానికి ఫలితం దక్కింది. ఏపీ సిఐడి చీఫ్‌ ద్వారకా తిరుమలరావు నేతృత్వంలోని బృందం గంగిరెడ్డిని అదుపులోకి తీసుకుని భారత్‌కు తీసుకొచ్చింది.
పలు కేసుల్లో గంగిరెడ్డి నిందితుడు
గంగిరెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులతో సహా పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. ఏపి సిఎం చంద్రబాబుపై అలిపిరి వద్ద హత్యాయత్నం చేసిన కేసులోనూ ఈ ఘనుడు నిందితుడుగా ఉన్నాడు. ఆ కేసులకు సంబంధించి జరగనున్న విచారణలో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో, తను తప్పించుకుపోవడానికి ఎవరెవరు సహకరించారో ఆ నిజాలు నిగ్గుతేలాల్సి ఉంది.

 

 

12:47 - November 15, 2015

కృష్ణా : గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ కార్యాలయం వివాదం విషయంలో ఆయనపై కైకలూరు పీఎస్‌లో కేసు నమోదయ్యింది. దీంతో నానిని అరెస్ట్‌ చేసి కైకలూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గుడివాడలోని పార్టీ కార్యాలయం అద్దె చెల్లింపు విషయంలో వివాదం ఏర్పడంతో భవన యాజమాని తాళం వేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్నారు. భవన యజమాని, పోలీసులతో గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు నానిని అరెస్ట్ చేశారు. అరెస్ట్‌ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు, పార్టీ కార్యాలయం దగ్గరకు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

 

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న గంగిరెడ్డి

హైదరాబాద్ : మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. ఎయిర్ పోర్టు దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎపి లా ఆండ్ ఆర్డర్ ఎడిజి ఆప్ పీఠాకూర్ ఎయిర్ పోర్టు వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 

గోదావరిఖనిలో జనశక్తి పోస్టర్ల కలకలం

కరీంనగర్ : గోదావరిఖనిలో జనశక్తి పోస్టర్ల కలకలం రేపాయి. ఈనెలలో అమరుల సంస్మరణ సభలు జరుపుతామంటూ పోస్టర్లు వెలిశాయి. పోస్టర్లను పోలీసులు తొలగించారు. 

విశాఖలో నైకాదళ మారథాన్ ప్రారంభం

విశాఖ : నౌకాదళ మారథాన్‌ అందరినీ ఆకట్టుకుంది. ఐఎన్ ఎస్ కురుసుర మ్యూజియం దగ్గర ఈ కార్యక్రమం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప ఈ మారథాన్‌ను ప్రారంభించారు. చిన్నా పెద్దా తేడాలేకుండా అందరూ ఉత్సాహంగా పరుగుతీశారు.

 

11:55 - November 15, 2015

హన్మకొండ : వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌లో పోటీ చేయ‌డ‌మే కాకుండా విస్తృత స్థాయిలో ప్రచారం చేసేందుకు వైసిపి రంగం సిద్ధం చేసింది. బై పోల్ లో గెలుపే ల‌క్ష్యంగా రెట్టింపు ఉత్సాహంతో ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన తెలంగాణ‌, ఏపి నేత‌ల‌ను రంగంలోకి దించ‌డ‌మే కాకుండా పార్టీ అధినేత జ‌గ‌న్ స్వయంగా ప్రచారంలో పాల్గొని వ‌రంగ‌ల్ ప్రజలను త‌మ‌వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నం చేయ‌బోతున్నారు.
వ‌రంగ‌ల్ లో జ‌గ‌న్ ఎన్నిక‌ల షెడ్యూల్ ఖరారు
వ‌రంగ‌ల్ లో జ‌గ‌న్ ఎన్నిక‌ల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 16 న జ‌గ‌న్ హైద‌రాబాద్ నుండి నేరుగా జ‌న‌గామ మీదుగా పాల‌కుర్తి చేరుకోని అక్కడి నుంచి ఎన్నిక‌ల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. మొద‌టి రోజు పాల‌కుర్తి, ద‌డ్డేపల్లి, కొండాపురం, వ‌గలాపూర్ జఫ‌ర్ ఘ‌డ్, వర్థన్న పేట‌, రాయ‌ప‌ర్తి, తొర్రూరు, హ‌న్మకొండలో జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్రచారం చేస్తారు.
రెండో రోజు హన్మకొండలో
రెండో రోజు హన్మకొండలో ప్రాంర‌భించి భూపాల‌ప‌ల్లి, ప‌ర‌కాల‌, నియోజ‌క‌వ‌ర్గాలకు చెందిన వివిధ గ్రామాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఇక‌ మూడో రోజు వ‌రంగ‌ల్ వెస్ట్, ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు ప‌లు చోట్ల రోడ్ షోలలో పాల్గొనేందుకు షెడ్యూల్ ఖరారైంది. నాల్గో రోజు స్టేష‌న్ ఘ‌న్ పూర్ నియోజ‌క‌ర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచారం జరగనుంది. వీటితో పాటు చివ‌ర‌గా హన్మకొండలో బారీ భ‌హిరంగ స‌భ‌ను కూడా నిర్వహించనున్నారు.
జ‌గ‌న్ స్వయంగా రంగంలోకి
వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌ల్లో అధికార టిఆర్ ఎస్ తో పాటు ప్రతిపక్షాలైన బిజెపి, కాంగ్రెస్, వామ‌ప‌క్షాల‌కు ధీటుగా వైసిపి సైతం ప్రచారం నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యే రోజాతో ప్రచారం చేయించారు. ఇక త‌దుప‌రి పార్టీ అధినేత జ‌గ‌న్ స్వయంగా రంగంలోకి దిగడంతో.... సంతోషంలో వరంగల్ వైసీపీ శ్రేణులు ఉన్నారు.

 

 

11:45 - November 15, 2015

అమెరికా : లాస్‌ ఏంజెల్స్ లో జరుగుతున్న ఆల్‌స్టార్స్ క్రికెట్‌ మూడో ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లో సచిన్‌, గుంగూలీ చెలరేగిపోయారు. సచిన్‌ 27 బంతుల్లో 56 పరుగులు చేశాడు. గంగూలీ 37 బాల్స్‌లో ఆఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో సచిన్ బ్లాస్టర్స్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. వార్న్ వారియర్స్ ముందు 220 పరుగుల లక్ష్యాన్ని బ్లాస్టర్స్ ఉంచగలిగింది.

11:41 - November 15, 2015

హైదరాబాద్ : టమోట ధరలకు రెక్కలు వచ్చాయి. సామాన్యుడికి అందుబాటులో లేనంతగా ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మొన్నటి వరకు ఉల్లిగడ్డ కన్నీళ్లు తెప్పిస్తే...ప్రస్తుతం టమోటా ధరలు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. కిలో టమోటాలు 50 నుంచి 60 రూపాయలకు చేరుకోవడంతో..సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. 
టమోటా పేరు చెబితే ఉలికిపాటు
ఇప్పుడు టమోటా పేరు చెబితేనే సామాన్యులు ఉలిక్కిపడుతున్నారు. అందులేదు..ఇందులేదన్నట్లుగా..ప్రతీ వంటలో తప్పనిసరిగా వాడే టమోటా ధర సామాన్యులకు అందుబాటులో లేనంతగా పెరిగిపోతోంది. రోజుకో రేటు మారుతూ మధ్యతరగతి ప్రజలను బెంబేలెత్తిస్తోంది. అసలు ఏ రోజు ఏ రేటు ఉంటుందో వ్యాపారులు సైతం చెప్పలేకపోతున్నారు. గత 15 రోజులుగా టమోటా మార్కెట్‌కు పూర్తి స్థాయిలో చేరకపోవడంతో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో ప్రస్తుతం టమోటా ధరలకు పగ్గాలు లేకుండా పోయాయి. రైతు బజార్లలోనే కిలో టమాట 40 నుంచి 50 రూపాయలు విక్రయిస్తుండటంతో కాలనీల్లో ఉన్న షాపుల్లో ఏకంగా 60 రూపాయలు వసూలు చేస్తున్నారు. 
రోజుకో రేటు చొప్పున వ్యాపారం 
టమోటా పంటకు వాతావరణం అనుకూలంగా లేకపోవడం, రాత్రి సమయాల్లో మంచు అధికంగా ఉండటంతో దిగుబడి తగ్గింది. పైగా గత నెలలో కిలో 8 నుంచి 10 రూపాయలకు పడిపోవడంతో రైతులు వేరే పంటల వైపు మొగ్గు చూపారు. దీంతో ఒక్కసారిగా డిమాండ్‌కు సరిపడా సరుకు అందుబాటులో లేకుండా పోయింది. ఇదే అదనుగా హోల్‌సేల్‌ వ్యాపారులు టమోటా ధరను ఒక్కసారిగా పెంచారు. రైతులకు కిలోకు 20 రూపాయలు చెల్లిస్తూ మార్కెట్‌లో మాత్రం 40 నుంచి 60 రూపాయలు విక్రయిస్తూ ఇటు రైతులను, అటు ప్రజలను హోల్‌సేల్‌ వ్యాపారులు దోచుకుంటున్నారు. 
ఆందోళనకు గురిచేస్తోన్న టమోటా రేట్లు 
మొన్నటి వరకు ఉల్లిగడ్డ ధరల పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు ప్రస్తుతం టమోటా రేట్లు ఆందోళనకు గురిచేస్తోంది. కందిపప్పు, పెసరపప్పు ధరలు 200రూపాయలకు చేరుకున్న తరుణంలో టమోటాలు కూడా అందుబాటులో లేకపోవడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతీ వంటకంలో టమాట మిక్స్ చేయందే ముద్ద దిగకపోవడంతో...పెరిగిన ధరలతో ఒక్కొక్కరు పావుకిలో, అరకిలో టమాటలను కొనుగోలు చేస్తూ సర్దుకుపోతున్నారు. అయితే పెరిగిన టమాట ధరలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో అని సామాన్యులు ఎదురుచూస్తున్నారు.

గుండెపోటుతో ఎస్‌ఐ మృతి

ఆదిలాబాద్‌ : జిల్లా ఖానాపూర్‌లో ఉమా మహేష్‌ అనే ఎస్‌ఐ గుండెపోటు గురై మృతి చెందాడు. 2012లో మహేష్‌ ఎస్‌ఐగా ఉద్యోగాం సాధించాడు. విధుల్లో భాగంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నివాసముంటున్నాడు. ఈక్రమంలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి ఖానాపూర్‌కు వచ్చాడు. ఈ రోజు ఉదయం గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు నిర్మల్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య ఒక పాప ఉంది.

 

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

11:27 - November 15, 2015

విశాఖ : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చే 24గంటల్లో దక్షిణ కోస్తాలో ఓ మోస్తరునుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తారని విశాఖ వాతావరణ అధికారులు హెచ్చరించారు. ఉత్తరకోస్తాలో చిరుజల్లులు కురిసే అవకాశముందని తెలిపారు.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖ : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చే 24గంటల్లో దక్షిణ కోస్తాలో ఓ మోస్తరునుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తారని విశాఖ వాతావరణ అధికారులు హెచ్చరించారు. ఉత్తరకోస్తాలో చిరుజల్లులు కురిసే అవకాశముందని తెలిపారు.

 

11:19 - November 15, 2015

గుంటూరు : జిల్లాలో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా హత్య చేసి ఆపై తగలబెట్టారు. ఈ ఘటనలో స్థానికంగా కలకలం రేపింది. పడమట బస్‌షెల్టర్‌లో గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేసి అనంతరం తగలబెట్టారు. కొన్ని శరీర భాగాలు తగలబడకుండా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే వేరే చోట అతన్ని హత్య చేసి... ఇక్కడి తీసుకొచ్చి తగలబెట్టినట్లు స్థానికులు భావిస్తున్నారు.

 

గుంటూరు జిల్లాలో దారుణం

గుంటూరు : జిల్లాలో దారుణం జరిగింది. పడమట బస్‌షెల్టర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హత్యచేసి ఆ తర్వాత మృతదేహాన్ని తగులబెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

వైసిపి నేత కొడాలి నాని అరెస్టు...

కృష్ణా : భూవివాదం కేసులో వైసిపి నేత కొడాలి నానిని పోలీసులు అరెస్టు చేశారు. నానిని అజ్ఞాత ప్రాంతంలోకి తీసుకెళ్లారు. వైసీపీ కార్యాలయం దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

ప్రియుడితో పెళ్లి చేయించాలని ప్రియురాలి ఆందోళన

నల్గొండ : తనను ప్రేమించి మోసం చేసిన డాక్టర్‌తో వివాహం జరిపించాలంటూ అతని ఇంటిముందు ప్రియురాలు ఆందోళన కొనసాగిస్తోంది. నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన డాక్టర్ రణధీర్‌, బాధితురాలు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత రణధీర్‌ ప్లేట్‌ ఫిరాయించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళా సంఘాల మద్దతుతో రెండు రోజులుగా నిరసన తెలుపుతోంది

10:51 - November 15, 2015

వరంగల్‌ : ఆరునూరైనా వరంగల్‌ ఉప పోరులో గులాబీ జెండా ఎగరేయాలి. ఇది అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ పార్టీ ఎత్తుగడ. ఎలాగైనా ఓరుగల్లు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునే లక్ష్యంతో..ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో తెలంగాణాలో ఇప్పుడు సగానికి పైగా మంత్రులు వరంగల్‌లోనే మకాం వేశారు. ఉప ఎన్నికల్లో విజయం మాట ఎలా ఉన్నా...పెద్ద ఎత్తున మెజార్టీ సాధించేందుకు గులాబీబాస్ పావులు కదుపుతున్నారు. అధినేత ఆదేశాలతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నా..మంత్రులు అక్కడ మకాం వేయక తప్పడం లేదు.
భారీ మెజార్టీ సాధించేందుకు అధికారపార్టీ పావులు
వరంగల్ ఉప ఎన్నిక తేదీ దగ్గరపడుతుండడంతో..ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది. ఉప ఎన్నికల్లో గెలుపు పై ముందు నుంచి ధీమాగా ఉన్న గులాబీ దళపతి..మెజార్టీ దక్కించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను చేపట్టారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ప్రచార వ్యూహాన్ని పార్టీ ఖరారు 
వరంగల్ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్‌..అందుకు నేతలను సిద్ధం చేసేందుకు ముందుగానే ప్రచార వ్యూహాన్ని పార్టీ ఖరారు చేసింది. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో మంత్రికి బాధ్యతలు అప్పగించి మండలాలకు ఎమ్మెల్యేలను ఇంచార్జ్ లుగా నియమించింది. నామినేషన్ల ఘట్టం పూర్తయిన వెంటనే అధినేత ఆదేశాలను పాటించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓరుగల్లులోనే మకాం వేశారు.
మెజార్టీ సాధించేందుకు అధికార పార్టీ నేతలు పావులు
నియోజకవర్గాల వారిగా గతంలో సాధించిన ఓట్లను పరిశీలించి..ఈ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువగా మెజార్టీ సాధించేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. సాధారణ ఎన్నికల్లో భారీగా మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా నేతలు దృష్టి పెట్టారు. పార్టీ పరంగా బలహీనంగా ఉందని అంచనా వేస్తున్న కొన్ని ప్రాంతాల్లో గులాబిబాస్ ఆపరేషన్ ఆకర్ష్ ను చేపట్టారు. ఆ ప్రాంతంలో బలమైన నేతలను కారెక్కించుకుంటూ నేతలు ఓట్లు సాధించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పోలింగ్‌కు తేదీ సమీపిస్తుండడంతో మంత్రులు, నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ..ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై విరుచుకుపడుతున్న గులాబీపార్టీ మరికొన్ని రోజులు కూడా అదే హీట్ కొనసాగించేందుకు స్కెచ్ వేసుకుంది. జిల్లాలో ప్రధానంగా పత్తి రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు విమర్శలు చేసుకుంటున్నాయి. ఉప ఎన్నికలను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండంతో నేతలు లేక తెలంగాణా భవన్, సచివాలయం వెలవెల బోతున్నాయి.

 

10:45 - November 15, 2015

బెంగళూరు : టెస్ట్ క్రికెట్ నెంబర్ వన్ టీమ్ సౌతాఫ్రికా బెంగళూరు టెస్ట్ తొలిరోజుఆటలోనే కుప్పకూలింది. బ్యాటింగ్ కు అనువుగా ఉన్న చిన్నస్వామి స్టేడియం పిచ్ పై..టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన సఫారీటీమ్ 214 పరుగులకు ఆలౌటయ్యింది. మరోసారి టీమిండియా స్పిన్నర్లు చెలరేగి బౌల్ చేసి..సఫారీటాపార్డర్ ను ఓ ఆటాడుకొన్నారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది.
టీమిండియా దూకుడు
టెస్ట్ క్రికెట్ ఐదో ర్యాంకర్ టీమిండియా...బెంగళూరు టెస్ట్ ను సైతం దూకుడుగా ప్రారంభించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ప్రారంభమైన రెండోటెస్ట్ తొలిరోజుఆటలోనే టెస్ట్ టాప్ ర్యాంక్ టీమ్ సౌతాఫ్రికాను తొలిఇన్నింగ్స్ లో 214 పరుగులకే కుప్పకూల్చింది. వాన్ జిల్, ఎల్గర్ లతో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీటీమ్...టీమ్ స్కోరు 15 పరుగులకే ఓపెనర్ వాన్ జిల్, వన్ డౌన్ డూప్లెసీ వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది. వాన్ జిల్ 10 , వన్ డౌన్ డూప్లెసీ పరుగులేవీ లేకుండా ..ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్ లో అవుటయ్యారు. కెప్టెన్ హషీమ్ ఆమ్లా సైతం..వికెట్ పైన కుదురుకోలేకపోయాడు. ఏడు పరుగుల స్కోరుకే..ఆరోన్ కు బౌల్డయ్యాడు.
ఏబీ డివిలియర్స్ ఒంటిరిపోరు
అయితే...వంద టెస్టుల మొనగాడు, సఫారీ సూపర్ హిట్టర్ ఏబీ డివిలియర్స్ మాత్రం...టీమిండియా బౌలర్లను నిలువరిస్తూ ఒంటరి పోరాటం చేశాడు. ఓపెనర్ ఎల్గర్ తో కలసి కీలక భాగస్వామ్యం సాధించడానికి తనవంతుగా ప్రయత్నించాడు. ఎల్గర్ 38 పరుగుల స్కోరుకు...లెఫ్టామ్ స్పిన్నర్ జడేజాకు బౌల్డయ్యాడు. ఆ తర్వాత మిడిలార్డర్ ఆటగాళ్లు డుమ్నీ, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ విలాస్ చెరో 15 పరుగుల చొప్పున సాధించి వెనుదిరిగారు. ఓవైపు వికెట్లు పడుతున్నా...డివిలియర్స్ తన దూకుడు కొనసాగించి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 59 బాల్స్ లోనే 8 బౌండ్రీలతో...38వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. చివరకు..105 బాల్స్ లో 11 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 85 పరుగుల స్కోరుకు...స్పిన్నర్ జడేజా బౌలింగ్ లో...వికెట్ కీపర్ సాహా పట్టిన సూపర్ క్యాచ్ కు చిక్కాడు.
214 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఆలౌట్
లోయర్ ఆర్డర్ ఆటగాళ్లలో అబ్బోట్ 14, మోర్నీ మోర్కెల్ 22 పరుగులు చేయడంతో...59 ఓవర్లలో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ కు..214 పరుగుల స్కోరు వద్ద తెరపడింది. టీమిండియా బౌలర్లలో...ఆఫ్ స్పిన్నర్ అశ్విన్, లెఫ్టామ్ స్పిన్నర్ జడేజా చెరో నాలుగు వికెట్లు, ఫాస్ట్ బౌలర్ ఆరోన్ ఒక వికెట్ పడగొట్టారు. మొహాలీ టెస్ట్ తొలిఇన్నింగ్స్ లో 187 పరుగులు మాత్రమే చేసిన సౌతాఫ్రికా టీమ్..బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 214 పరుగులు చేయడం విశేషం.

 

10:37 - November 15, 2015

హన్మకొండ : వ‌రంగ‌ల్ వేడెక్కుతుంది. ప్రచారంతో మ‌రింత వెడెక్కించేందుకు కాంగ్రెస్..అతిర‌థ మ‌హార‌ధుల‌ను ఓరుగ‌ల్లులో దింపుతోంది. ఎన్నిక‌ల్లో విక్టరీ జెండా ఎగ‌రేయాలని కోటీ ఆశ‌ల‌తో ఉన్న హ‌స్తం పార్టీ...టీ సెంటిమెంట్‌ను రగిలించేందుకు ఏరికోరి ఎంచుకున్న ఢిల్లీ పెద్దలను గ్రౌండ్‌లోకి దించుతోంది.
ఉపఎన్నిక పోరు ఉధృతం
వ‌రంగ‌ల్ ఉపఎన్నిక పోరు ఉధృతం అవుతోంది. పోలింగ్‌ తేదీ దగ్గర ప‌డుతున్న కొద్దీ..పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఉప ఎన్నిక‌ల‌పై భారీ ఆశ‌లు పెట్టుకున్న కాంగ్రెస్..ఇప్పుడు ప్రచారంలోకి ఢిల్లీ పెద్ధల‌ను రంగంలోకి దించుతోంది. అయితే ఈ ప్రచారంలో టీ సెంటిమెంట్ ర‌గిలించే విధంగా నేత‌ల ఎంపిక చేసుకుంది హ‌స్తం
రంగంలోకి ఢిల్లీ పెద్దలు
ఇప్పటి వ‌ర‌కు రాష్ట్ర నేత‌ల‌తో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్..ఇవాల్టి నుంచి అగ్రనేత‌ల‌ను రంగంలోకి దింపుతోంది. అదీ..తెలంగాణ ఏర్పాటులో కీల‌క పాత్ర పోషించిన‌ నేత‌లు కావ‌డం విశేషం. దీనికోసం సుశీల్ కుమార్ షిండే, మీరాకుమార్‌తో పాటు..దిగ్విజ‌య్‌సింగ్‌, స‌చిన్ పైలెట్ ఉన్నారు. ఇవాళ మ‌ధ్యాహ్నం భూపాల‌ప‌ల్లి, సాయంత్రం ప‌ర‌కాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగే ప్రచారంలో మీరాకుమార్ పాల్గొన‌బోతున్నారు. విభ‌జ‌న బిల్లు ఆమోదం పొంద‌డంలో మీరా కుమార్ పాత్ర కీల‌కం. లోక్ స‌భ చ‌రిత్రలో లేని విధంగా స‌భ త‌లుపులు మూసేసి..గంద‌ర‌గోళం మ‌ధ్య బిల్లును ఆమోదించ‌డానికి ఎంత ఇబ్బందిప‌డ్డారో నాడు దేశ‌మంతా చూసింది. ఆమె పాత్రపై అప్పట్లోనే బాగా ప్రచారం జ‌రిగింది. ఒక ద‌శలో మీరాకుమార్‌ను వ‌రంగ‌ల్ బ‌రిలో దించాల‌నే ఆలోచ‌న‌లు కూడా వ‌చ్చాయి. ఆ సెంటిమెంట్‌ను జ‌నం గుర్తిస్తార‌ని న‌మ్ముతున్న కాంగ్రెస్..మీరా కుమార్‌ను ప్రచారానికి ఎంపిక చేసింది.
తెలంగాణ ఏర్పాటులో సుశీల్ కుమార్ షిండే కీలకపాత్ర
ఇక తెలంగాణ ఏర్పాటులో కీల‌కంగా వ్యవహరించిన అప్పటి కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే. ఆయ‌న‌కు ఈ ప్రాంతంతో సంబంధంలేకున్నా..టి సెంటిమెంట్ ను ర‌గిలించేందుకు షిండేని కూడా రంగంలోకి దించుతున్నారు. సోమ‌వారం వ‌ర్ధన్నపేట నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే ఎన్నిక‌ల ప్రచారంలో షిండే పాల్గొంటారు. రాహుల్‌కు స‌న్నిహితుడు రాజ‌స్థాన్ పీసీసీ అధ్యక్షుడు..ఓబీసీ నాయ‌కుడు స‌చిన్ పైలెట్ స్టేష‌న్ ఘ‌న్ పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్రచారం చేయ‌బోతున్నారు. ఓబీసీల‌ను దృష్టిలో పెట్టుకుని స‌చిన్ పైలెన్‌ను పిలిపిస్తున్నారు. ఈ ముగ్గురికి రాష్ట్రంతో సంభందం లేకున్నా..వారికి తెలంగాణ ఏర్పాటులో వారికున్న పాత్ ను దృష్టిలో ఉంచుకుని ప్రచారంలోకి దింపుతోంది కాంగ్రెస్.
సోమవారం వర్ధన్నపేటలో ఎన్నికల ప్రచారం
మొత్తానికి అగ్ర నేత‌లు.. ఆందులోనూ తెలంగాణ ఏర్పాటులో మ‌రువ‌లేని పాత్ర పోషించిన వారు కావ‌డంతో..వీరి ప్రచారం కొంతలో కొంతైనా ఓట్లు రాలుస్తుంద‌ని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. 

10:31 - November 15, 2015

నల్గొండ : తనను ప్రేమించి మోసం చేసిన డాక్టర్‌తో వివాహం జరిపించాలంటూ అతని ఇంటిముందు ప్రియురాలు ఆందోళన కొనసాగిస్తోంది. నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన డాక్టర్ రణధీర్‌, బాధితురాలు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత రణధీర్‌ ప్లేట్‌ ఫిరాయించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళా సంఘాల మద్దతుతో రెండు రోజులుగా నిరసన తెలుపుతోంది. తలంబ్రాలు, తాళిబొట్టుతో ఇవాళ దేవరకొండలోని రణధీర్‌ ఇంటి ముందు బాధితురాలు మౌన పోరాటం చేస్తోంది. రణధీర్‌ తనను ప్రేమించి మోసం చేశాడంటున్న యువతి వాపోయింది. రణధీర్‌తో తనకు పెళ్లి జరిపించాలని డిమాండ్ చేసింది.

 

10:24 - November 15, 2015

నిజామాబాద్‌ : జిల్లాలోని సారంగపూర్‌లో దారుణం జరిగింది. కుటుంబకలహాలు ఇద్దరి ప్రాణాలు తీశాయి. భార్యను కాపురానికి పంపడంలేదంటూ అత్తింటివారిపై అల్లుడు దాడి చేశాడు. నాలుగేళ్లక్రితం నర్సింహులుకు శివమ్మతో వివాహం జరిగింది. ఓ కేసు విషయంలో నర్సింహులు జైలుకు వెళ్లాడు. అనంతరం అతని భార్య పుట్టింటికి వెళ్లింది. నర్సింహులు బెయిల్‌పై బయటకు వచ్చాడు. భార్యను కాపురానికి పంపాలంటూ అత్తారింటిముందు గొడవకు దిగాడు. నేర చరిత్ర ఉన్న అతని ఇంటికి తమ కూతురునికి పంపమని శివమ్మ తల్లిదండ్రులు తేల్చిచెప్పారు. దీంతో ఆగ్రహించిన అల్లుడు వారిపై దాడి చేశాడు. కత్తితో ఐదుగురిని పొడిచాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుడు నర్సింహులును అదుపులోకి తీసుకున్నారు. 

09:51 - November 15, 2015

హైదరాబాద్‌ : అల్కాపూర్‌లో ఓ వ్యాపారి కిడ్నాప్‌ వ్యవహారం కలకలం సృష్టించింది. బషీర్‌బాగ్‌కు చెందిన ప్రమోద్ కుమార్, అతని బంధువు రమేశ్ కుమార్‌ బైక్‌పై వెళుతుండగా దుండగులు అడ్డుకున్నారు. రమేశ్‌ను తమ కారులోకి ఎక్కించుకొని పారిపోయారు. అడ్డువచ్చిన ప్రమోద్‌పై దాడిచేశారు. ఈ ఘటనలో గాయపడ్డ ప్రమోద్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దుండగులుకోసం గాలిస్తున్నారు.

 

09:46 - November 15, 2015

హైదరాబాద్ : చిన్నారుల ముద్దు ముద్దు పలుకులు.. పిల్లల డాన్స్ లు, వివిధ చిత్రాలతో భాగ్య నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం అలరిస్తోంది. శిల్పకళా వేదికపై జరుగుతున్న ఈ వేడుకలకు తొలిరోజు కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్‌రాథోడ్‌, రాష్ట్ర మంత్రి తలసాని, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ దివా కరీనా.. తన సోదరితో కలిసి స్టెప్‌ లేసి ఆకట్టుకున్నారు.
ఫిల్మ్ ఫెస్టివల్‌ తో చిల్డ్రన్స్ డేకు మరింత శోభ
బాలల పండుగ చిల్డ్రన్స్ డేకు తీయ ఫిల్మ్ ఫెస్టివల్‌ మరింత శోభను అందించింది. హైదరాబాద్ శిల్పకళావేదికపై జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్‌కు పలువురు ప్రముఖులు విచ్చేసి సందడి చేశారు. బాలీవుడ్ ముద్దుగుమ్మలు తమ పలుకులతో.. డాన్స్‌లతో పిల్లలను ఆకట్టుకున్నారు. కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్ రాథోడ్‌, రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాసయాదవ్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
పిల్లల చలన చిత్రోత్సవానికి ఆతిథ్యం సంతోషకరం : టబూ
కార్యక్రమానికి విచ్చేసిన హీరోయిన్ టబూ మాట్లాడుతూ తన స్థానిక నగరం హైదరాబాద్ పిల్లల చలన చిత్రోత్సవానికి ఆతిథ్యం ఇవ్వడం సంతోషదాయకంగా ఉందన్నారు. తాను హైదరాబాద్‌లోనే కెరీర్‌ను ప్రారంభించానని, బాల్యం ఎంతో విలువైందని అన్నారు. అటువంటి బాల్యం ఎంతో సుందరంగా సాగాలని అభిప్రాయపడ్డారు.
కరిష్మా, కరీనా డాన్స్
బుల్లి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అక్షిత్‌తో తారలు కరిష్మా కపూర్‌, కరీనా కపూర్‌ డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. డిజిటల్ ఇండియా థీమ్‌తో సాగిన ఈ కార్యక్రమం అందరినీ ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా సౌండ్ ఆర్ట్, ఇల్యూమినేటెడ్‌ స్కిట్, ఎక్స్‌ఐఎక్స్ వారి డాన్స్ అందరినీ మంత్రముగ్ధులను చేసింది.
ఆరంభ వేడుకల్లో టాలీవుడ్‌ స్టార్స్ లేరనే వెలితి
ఇన్ని ఉన్నా ఆరంభ వేడుకల్లో టాలీవుడ్‌ స్టార్స్ లేరనే వెలితి మాత్రం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌ వేదికగా జరిగే కార్యక్రమానికి తెలుగు నటులను ఎవరినీ ఎంపిక చేయకపోవడం విమర్శలకు దారితీసింది. దీనితోపాటు కోఆర్డినేషన్ లోపం స్పష్టంగా కన్పించింది. కోఆర్డినేషన్‌ లోపం వల్ల పూర్తిస్థాయి షెడ్యూల్‌ విడుదల చేయలేకపోయారు. దీంతో ఎక్కడ ఏ బాలల చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారో తెలుసుకోలేక అతిథులు ఒకింత ఇబ్బందికి గురయ్యారు.
నల్గొండ జిల్లాలోనూ బాలల చలన చిత్రోత్సవాలు
బాలల చలన చిత్రోత్సవ వేడుకలు నల్గొండ జిల్లాలో కూడా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని తిరుమల థియేటర్‌లో ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు వివిధ వేషధారణలో ఆకట్టుకున్నారు. చిత్రోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు 9 గంటల నుంచి రెండు ఆటలు చిన్నారుల సినిమాలు ప్రదర్శించేలా అధికారులు ఏర్పాటు చేశారు. ఈ చిత్రాలను చిన్నారులతోపాటు పెద్దలు కూడా చూడాలని అప్పుడే వారి మనసు లోతులను తల్లిదండ్రులు అర్థం చేసుకోగలుగుతారని సుద్దాల అశోక్‌తేజ అభిప్రాయపడ్డారు. చిత్రోత్సవాల్లో భాగంగా పలు బాలల చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి చిత్రాల నిర్మాణానికి ప్రభుత్వాలు సాయమందించాలని.. సినీ ప్రముఖులు, నిర్మాతలు ముందుకు వచ్చి మరింత తోడ్పడాలని ఆహూతులు అభిలషించారు.

 

09:32 - November 15, 2015

ఢిల్లీ : ఎన్డీయే ప్రభుత్వ విధానాలపై.. పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని సీపీఎం కేంద్ర కమిటీ నిర్ణయించింది. పార్లమెంటు ఆమోదం లేకుండా.. 15 రంగాల్లో కొత్తగా ఎఫ్‌డీఐలకు అనుమతి ఇచ్చిన ప్రధాని మోదీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు పార్టీ సమాయత్తమవుతోంది. కేంద్ విధానాలకు వ్యతిరేకంగా వచ్చేనెల 1 నుంచి 6 వరకు దేశవ్యాప్తంగా ప్రచారోద్యమం , డిసెంబర్‌ 26 నుంచి 31 వరకు కోల్‌కతాలో ప్లీనరీ నిర్వహించాలని ఢిల్లీలో జరిగిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో నిర్ణయించారు.
ఢిల్లీలో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు
ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రవాద దాడిని సమావేశం ఖండించింది. ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో పశ్చిమ దేశాలు తమ రాజకీయ విధానాలను మార్చుకోవాలని సీపీఎం కోరింది.
అవినీతి, మతోన్మాదానికి వ్యతిరేంగా బీహార్‌ ప్రజల తీర్పు
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమిపై సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో చర్చించారు. అవినీతి, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఇది ప్రజలు ఇచ్చిన తీర్పుని, ఈ ఓటమి మంచి సంకేతమని సమావేశం అభిప్రాయపడింది. పార్లమెంటులో చర్చించకుండా మోదీ సర్కార్‌ 15 రంగాల్లో ఎఫ్‌డీఐలను అనుమతించడాన్ని సీపీఎం కేంద్ర కమిటీ తప్పుపట్టింది. ఎన్డీయే విధానాలకు వ్యతిరేంగా ఉద్యమించాలని సమావేశంలో తీర్మానించారు.
ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు
వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికతోపాటు, తెలంగాణలో పార్టీ నిర్మాణం, పటిష్టత, ప్రజా సమస్యలపై కూడా సీపీఎం కేంద్ర కమిటీలో చర్చించారు. ప్రైవేటురంగంలో రిజర్వేషన్లు, బీసీ ఉప ప్రణాళిక చట్టం, దళితుల సమస్యలపై సమీక్షించారు. తెలంగాణలో జరుగుతున్న ప్రజా పోరాటాలను సీపీఎం కేంద్ర కమిటీ ప్రశంసించింది. కార్యకర్తలను రాజకీయంగా మరింత చైతన్య పరిచేందుకు నిర్వహిస్తున్న అధ్యయన శిక్షణా తరగతులపైనా సమావేశంలో చర్చించారు. ఖమ్మంలో 500 వారాలుగా జరుగుతున్న స్టడీ సర్కిల్‌ కార్యక్రమాన్ని ప్రశంసించింది. వచ్చే నెలలో మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఈ సమావేశాలకు హారవుతారు.
టీప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం
వరంగల్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ నిర్ణయిచింది. కేసీఆర్‌ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉండగా 11 లక్షల మంది సహారా ఉద్యోగుల పీఎఫ్‌ను మాఫీ చేసిన అంశంపై కూడా చర్చించారు. వరంగల్‌ ఎన్నికల్లో దీన్ని ప్రచారాస్త్రంగా మార్చాలని నిర్ణయించారు. ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో నిర్ణయించారు.

 

నిజామాబాద్ జిల్లాలో దారుణం

నిజామాబాద్ : సారంగాపూర్ లో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో అత్తింటివారిపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు దంపతులు సాయిలు, రోజా.

 

రెండ్ వికెట్ కోల్పోయిన సచిన్‌ బ్లాస్టర్స్

హైదరాబాద్‌ : వార్న వారియర్స్ తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో సచిన్‌ బ్లాస్టర్స్ జట్టు 129 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. మెరుపు అర్ధ శతకంతో జోరుమీదున్న సచిన్‌ (56) వెటోరి బౌలింగ్‌లో క్రీజు వెలువపలికి వచ్చి షాట్‌ ఆడే ప్రయత్నంలో బంతి అందకపోవడంతో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.

వార్న్ వారియర్స్ సచిన్ దూకుడు...

హైదరాబాద్‌ : క్రికెట్‌ ఆల్‌స్టార్స్ మూడో టీ20 మ్యాచ్‌లో వార్న్ వారియర్స్ బౌలర్లకు సచిన్‌ వరుస సిక్సర్లతో చుక్కలు చూపిస్తున్నాడు. ప్రస్తుతం 18 బంతులాడిన సచిన్‌ రెండు ఫోర్లు, ఐదు సిక్సులతో ఏకంగా 45పరుగుల చేయడం విశేషం. దీంతో సచిన్‌ బ్లాస్టర్స్ 7 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోయి 103 పరుగులు చేసింది

08:49 - November 15, 2015

తిరుపతి : పాల నురుగుల జలపాతాలు.. పచ్చని చెట్లు.. తియ్యని పండ్లు.. పక్షులతో అలరారే ప్రకృతిని ఇష్టపడనిదెవరు.! అలాంటి దృశ్యాలను చూసి తన్మయం చెందాలేగాని మాటల్లో చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదేమో.! అవును అలాంటి సుందర దృశ్యాలు... మదిమదినీ పులకింపజేసే ఘట్టాలు ఇప్పుడు పవిత్ర తిరుమల గిరుల్లో ఆవిష్కృతమయ్యాయి. ఈ మధ్య కురిసిన వర్షాలతో కొత్త రూపు సంతరించుకున్న ప్రకృతి సోయగాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి.
తిరుమలగిరులే ఒక ప్రకృతి అద్భుతం
కనుచూపు మేర పచ్చని చెట్లు..అల్లంత ఎత్తున ఉండే పర్వత శిఖరాలు.. కుహుకుహూ రాగాలు ఆలపించే పక్షులు.. తియ్యదనాలతో మేనిని చల్లగా తాకే జలాలు..ఇవన్నీ ఇప్పుడు తిరుమల గిరులో కనిపిస్తున్న మనోహర దృశ్యాలు. తిరుమలగిరులే ఒక ప్రకృతి అద్భుతం. అరుదైన వృక్ష జాతులు, జంతువులు, సర్పాలకు ఇవి ఆవాసం. వీటితోపాటు ప్రతి చెట్టు, ప్రతి రాయి ఆధ్యాత్మిక భావాన్ని కల్పిస్తుంటాయి. ఇప్పుడివన్నీ మరింత సొబగులు అద్దుకుని భక్తులను పరవశింపజేస్తున్నాయి.
దారి పొడవునా జలపాతాలు, సెలయేర్లు
ఈ మధ్య కురిసిన వర్షాల కారణంగా దారి పొడవునా జలపాతాలు, సెలయేర్లు గలగల సవ్వడులు చేస్తూ ప్రవహిస్తున్నాయి. వర్షం నిలిచి నిలిచి వస్తుండడంతో మేఘాలు మంచుతెరలను తలపిస్తున్నాయి. రెండో ఘాట్‌ రోడ్‌లో కొండరాళ్లపై నుంచి పడుతున్న జలాల సోయగం భక్తులను కట్టిపడేస్తోంది. వాహనాల్లో వెళుతున్న యాత్రికులు దిగి ఆ దృశ్యాలను తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్లు, కెమెరాలతో బంధిస్తున్నారు. కొందరు ఎంచక్కా సెల్ఫీలు తీసుకుంటున్నారు. ధవళకాంతుల్లో మేఘాలు మరింత కిందగా వచ్చి పలకరిస్తున్నాయి. పొగమంచు కమ్ముకుని ఈ ప్రదేశమంతా ఆహ్లాదం కలిగిస్తోంది.
పచ్చని చెట్లు, రంగురంగుల పుష్పాలు
మల్వాడిగుండం, కపిలతీర్థంతోపాటు ఘంట తీర్థం, ముక్కుతీర్థంలలో నీళ్లు పెరిగి పొంగి పొర్లుతున్నాయి. మొదటి ఘాట్‌ రోడ్డులో చెక్‌ డ్యామ్‌లన్నీ నిండిపోయి సెలయేర్లు ప్రవహిస్తున్నాయి. అక్కగార్ల గుడి సమీపంలో అన్నమయ్య మార్గంలో బ్రిడ్జిపై వెళుతున్న భక్తులకు పచ్చని చెట్లు, రంగురంగుల పుష్పాలతో లోయలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఆ మనోహర వాతావరణాన్ని విడిచి దూరంగా వెళ్లడంలు అసలేమాత్రం ఇష్టం లేకపోయినా భారంగా సందర్శకులు ముందుకెళ్తున్నారు.

 

 

08:44 - November 15, 2015

ఖమ్మం : జిల్లాలోని ఇల్లెందులో విషాదం నెలకొంది. షార్ట్ సర్క్యూట్ తో తండ్రీకోడులు మృతి చెందారు. ఇల్లెందులో సత్యనారాయణ అనే వ్యక్తి కొత్తబస్టాండ్ సమీపంలో హరిప్రియ చికెన్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఈరోజు ఆదివారం కావడంతో రష్ అధికంగా ఉటుందన్న నేపథ్యంలో తన కుమారుడు సాయచందుతో కలిసి సత్యనారాయణ తెల్లవారుజాము 6 గంటలకు షాప్ కు వెళ్లాడు. చికెన్ వ్యర్థాలను తొలగించే గ్రైండర్ కు విద్యుత్ ప్రసరించింది. కోళ్లను గ్రైండర్ లో వేసి క్లీన్ చేసే క్రమంలో సత్యనారాయణకు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గమనించని కుమారుడు సాయిచందు తండ్రిని రక్షించే క్రమంలో అతనికి కూడా కరెంట్ షాక్ కొట్టడంతో సాయించందు కూడా మృతి చెందాడు. సాయిచందు పాలిటెక్నిక్ చదువుతున్నాడు. అయితే చికెన్ కోనుగోలుకు వచ్చిన స్థానికులు చూసేంతవరకు ప్రమాద ఘటన జరిగినట్లు తెలియరాలేదు. తండ్రీకొడుల మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. వీరి మృతితో కుటుంబం, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

బంజారాహిల్స్ లో పోలీసుల తనిఖీలు

హైదరాబాద్‌ : నగరంలోని బంజారాహిల్స్ లో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 16మందిపై కేసులు నమోదు చేశారు. ఐదు ద్విచకర్రవాహనాలు, 11కార్లను స్వాధనం చేసుకున్నారు.

 

గంగిరెడ్డిని ఢిల్లీకి తీసుకొచ్చిన ఎపి సిఐడి

హైదరాబాద్ : మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని మారిషెస్ నుంచి ఎపి సీఐడీ బృందం ఢిల్లీకి తీసుకొచ్చారు. ట్రాన్సిట్ వారెండ్ పై సాయంత్ర హైదరాబాద్ కు తీసుకొచ్చే అవకాశం ఉంది.

08:18 - November 15, 2015

హైదరాబాద్ : మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని మారిషెస్ నుంచి ఎపి సీఐడీ బృందం ఢిల్లీకి తీసుకొచ్చారు. ట్రాన్సిట్ వారెండ్ పై సాయంత్ర హైదరాబాద్ కు తీసుకొచ్చే అవకాశం ఉంది. నిన్న రాత్రి గంగిరెడ్డిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంగిరెడ్డిని మారిషస్‌ పోలీసులు నిన్న ఏపీ సీఐడీకి అప్పగించారు. మారిషస్‌ కోర్టు అనుమతితో గంగిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. గత 8 నెలలుగా మారిషస్‌ జైలులోనే గంగిరెడ్డి కస్టడీలో ఉన్నారు. అలిపిరి వద్ద సీఎం చంద్రబాబుపై హత్యాయత్నం కేసులోనూ గంగిరెడ్డి నిందితుడుగా ఉన్నారు.

 

07:59 - November 15, 2015

హైదరాబాద్ : పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు అందించేందుకు.. ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. సికింద్రాబాద్‌లోని ఐడీహెచ్‌ కాలనీలో నిర్మించిన ఇళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం.. లబ్దిదారులకు అందించనున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటైన 16 నెలలకు.. ఈ పథకాన్ని అందుబాటులోకి తెస్తోంది సర్కారు.
396ఇళ్ల నిర్మాణం..
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు ఎట్టకేలకు పంపిణీకి రెడీ అయ్యాయి. సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీలో జి ప్లస్ 2 మోడల్ లో ప్రభుత్వం 396ఇళ్లు నిర్మించింది. 33 బ్లాకుల్లో చేపట్టిన ఈ ఇళ్ల నిర్మాణానికి మొత్తం 43కోట్లు ఖర్చు అయ్యింది.
580 చ‌ద‌ర‌పు అడుగుల స్థలంలో ఇళ్లు
ఇక్కడ నిర్మించిన ఒక్కో ఇంట్లో.. విశాల‌మైన హాలు రెండు బెడ్ రూంలు, ఒక‌ కిచెన్, రెండు టాయిలెట్స్ ఉన్నాయి. ఇందులో ఒక‌టి వెస్ట్రన్‌ టాయిలెట్ కావ‌డం విశేషం. మొత్తం 580 చ‌ద‌ర‌పు అడుగుల స్థలంలో ఈ ఇళ్లని నిర్మించారు. ప్రతి యూనిట్ కు 10లక్షల రూపాయలకు పైగా ఖర్చు అయ్యింది. గతంలో ఉన్న హౌజింగ్ విధానంలో కాకుండా నిర్మాణ ఖర్చునంతా ప్రభుత్వమే భరించింది. శిథిలావస్థకు చేరుకున్న తమ ఇళ్ల స్థానంలో ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇవ్వడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
2014 అక్టోబర్ లో ఇళ్లనిర్మాణం ప్రారంభం
2014 అక్టోబర్ లో ఇళ్లనిర్మాణం ప్రారంభించిన ప్రభుత్వం 6 నెలల్లో ఇళ్లను హ్యాండోవర్ చేస్తామంది. వివిధ కారణాల వల్ల ఆలస్యమైనప్పటికి 13 నెలల్లో ఇళ్లనిర్మాణం పూర్తి చెయ్యడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు లబ్దిదారులు. ఇదే అనుభవంతో ఇక ముందు హైదరాబాద్ లో 9 అంతస్తుల్లో ఇళ్లనిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

 

 

07:53 - November 15, 2015

హైదరాబాద్‌ : సోమాజీగూడలోని ది పార్క్ హోటల్‌ సిబ్బంది నిర్వాకం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసింది. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు వచ్చిన విద్యార్థులు ది పార్క్ హోటల్‌ లో బస చేశారు. వసతి గడువు ముగిసిందని హోటల్ నిర్వాహకులు విద్యార్థులను బయటకు పంపారు. రెండు గంటలపాటు వారు రోడ్డుపైనే నిలబడాల్సొచ్చింది. మీడియా చొరవతో హోటల్‌ యాజమాన్యం విద్యార్థులను వేరొక హోటల్‌కు తరలించింది. 

07:46 - November 15, 2015

తిరుపతి : టీడీపీలో అందరూ కుటుంబ సభ్యుల్లా ఉండాలని... నేతల మధ్య భేషజాలు రానీయరాదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు సూచించారు. తిరుపతిలో రెండోరోజు జరుగుతున్న మేధోమథన సదస్సులో ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రజలకిచ్చిన హామీల అమలుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, జిల్లా అధ్యక్షుల మధ్య సమన్వయం అవసరమని సీఎం సూచించారు.
తిరుపతిలో టిడిపి మేథోమధన సదస్సు
తిరుపతిలో రెండోరోజూ తెలుగుదేశం పార్టీ మేథోమధన సదస్సు జరిగింది. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు.. తనకున్న రెండు బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నానని చెప్పుకొచ్చారు. పార్టీ అధ్యక్షుడిగా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవడం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం.. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నానని తెలిపారు. టిడిపిలో అందరూ కుటుంబ సభ్యుల్లా ఉండాలని, నేతల మధ్య భేషజాలు లేకుండా ఉండాలని సూచించారు. ప్రజలకిచ్చిన హామీల అమలుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు.
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, జిల్లా అధ్యక్షుడి మధ్య సమన్వయం అవసరం
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, జిల్లా అధ్యక్షుడి మధ్య సమన్వయం అవసరమని సీఎం సూచించారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. పార్టీ జెండా మోసిన కార్యకర్తల మనోభావాలను గుర్తించాలని చెప్పారు. పటిష్ఠమైన యంత్రాంగమే టీడీపీ బలం అని చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది 40వేల మందికి నాయకత్వ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. నాయకులు పోయినా.. కార్యకర్తలు పార్టీ జెండాలను వదల్లేదని చెప్పారు. 35ఏళ్ల నుంచి కార్యక్రమ శిక్షణ కార్యక్రమాలు సాగుతున్నాయని తెలిపారు.
ఏడాదిలో రెండు రోజుల శిక్షణ అవసరం
ఏడాదిలో రెండు రోజుల శిక్షణ అవసరమని, ఈ రెండ్రోజుల్లోనే నాయకత్వ లక్షణాలను నేర్పడం జరుగుతుందని చెప్పారు. పాదయాత్రలో రైతుల కష్టాలను స్వయంగా చూశానన్న సీఎం ఇప్పటికీ ఆ దృశ్యాలు తన కళ్ల ముందు మెదులుతున్నాయని గుర్తుచేసుకున్నారు. ఆ ప్రభావం తన జీవితాంతం గుర్తుంటుందని అన్నారు. జనచైతన్య యాత్రలో భాగంగా ప్రజలతోనే ఉండాలని, ప్రజల కోసం పని చేయాలని కార్యకర్తలకు సూచించారు.
జిల్లాల్లో పార్టీ స్థితిగతులపై వివరాల సేకరణ
టిడిపి ప్రభుత్వం రైతులు, ప్రజల కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కరెంటు కోత లేకుండా చేసిన ఘనత తమదేనని చెప్పారు. అంతకు ముందు జిల్లాల వారీగా పార్టీ నేతలను వేర్వేరుగా పిలిపించుకుంటున్న చంద్రబాబు ఆయా జిల్లాల్లో పార్టీ స్థితిగతులపై వివరాలు సేకరించారు.

 

07:39 - November 15, 2015

ప్యారిస్‌ : ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌పై ఉగ్రవాదులు పంజా విసిరారు. ఈ పర్యాటక సుందర నగరం ఉగ్రదాడులతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఒకదాని వెంట ఒకటిగా మూడు చోట్ల ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డాడు. 129మందికి పైగా అమాయక పౌరులను ఉగ్రముష్కరులు పొట్టన పెట్టుకున్నారు. ప్యారిస్‌పై దాడులతో భారత్‌ సహా.. యావత్‌ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఉగ్రవాద నిర్మూలనలో ఫ్రాన్స్‌కు బాసటగా నిలుస్తామని అన్ని దేశాలూ ప్రకటించాయి.
అనూహ్యంగా స్టేడియం వెలుపల విస్ఫోటనం
ప్రపంచ ఛాంపియన్‌ జర్మనీ... ఫ్రాన్స్‌ హోం టీంల మధ్య సాకర్‌ మ్యాచ్‌... సెయింట్‌ డెన్నిస్‌ స్టేడియంలో వేలాదిగా అభిమానజనం.. స్టేడియం వెలుపల.. అంతకు మించిన సందోహం..! అనూహ్యంగా స్టేడియం వెలుపల విస్ఫోటనం.. దాని వెంటే.. కాల్పుల శబ్దం.. అంతటా కలకలం.. సర్వత్రా గందరగోళం.. ఏమి జరిగిందో తెలుసుకునేలోపే.. పదుల సంఖ్యలో ప్రజలు మృత్యు ఒడికి చేరారు.
ఏకే-47, బాంబులతో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు
స్టేడియం వద్దే కాదు... పారిస్‌లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాల్పులు పేలుళ్లు సంభవించాయి. భారత కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో.. ఉగ్రవాదులు... ఏకే-47 తుపాకులు, బాంబులతో విరుచుకుపడి.. విచక్షణ రహితంగా అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు.
బతాక్లాన్‌ ఆర్ట్‌ సెంటర్‌పై ముష్కరుల దాడి
ఇది జరిగిన కొద్దిసేపటికే.. బతాక్లాన్ ఆర్ట్ సెంటర్‌పై ముష్కరులు దాడికి తెగబడ్డారు. వరుస ఘటనల్లో మరణించిన వారిలో అత్యధికులు ఈ సెంటర్‌ వద్దే మరణించారు. నార్టె డేమ్‌ క్యాథడ్రల్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోని బతాక్లాన్‌లో.... కాలిఫోర్నియాకు చెందిన రాక్‌బృందం.. ఈగల్స్‌ ఆఫ్‌ డెత్‌ మెటల్‌ ఆధ్వర్యంలో కాన్సర్ట్‌ ఏర్పాటు చేశారు. వీకెండ్‌ కావడంతో.. చాలామంది ఈ కాన్సర్ట్‌కు హాజరయ్యారు. అదును చూసి.. ఉగ్రమూక వీరిపై విరుచుకు పడింది.
విచక్షణ రహితంగా కాల్పులు
ఉగ్రవాదుల దాడితో.. చాలామంది నేలపై పడుకున్నారు. అయితే.. క్రూరాత్ములు.. నేలపై పడుకున్న వారిపైనా విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. మరోవైపు.. కాన్సర్ట్‌ హాల్‌ వెలుపల.. ముగ్గురు ఉగ్రవాదులు ఆత్మాహుతికి పాల్పడ్డారు. బతాక్లాన్‌ సెంటర్‌ను సమీపిస్తున్న పోలీసులను నిలువరించేందుకు.. వీరు తమ దేహానికి అమర్చుకున్న పేలుడు పదార్థాన్ని పేల్చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దాడిలో పోలీసులతో పాటు.. సాధారణ పౌరులూ పెద్ద సంఖ్యలో మరణించారు.
ప్యారిస్‌ లెవెంత్‌ డిస్ట్రిక్ట్ లోని రెస్టారెంట్‌పై ఉగ్రదాడి
అటు ప్యారిస్‌ 11వ జిల్లాలోని లీ పెటిట్‌ కాంబోడ్జ్‌ రెస్టారెంట్ లోకి చొరబడ్డ ఉగ్రవాది.. విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. చిక్కటి కాఫీకి పెట్టింది పేరైన ఈ రెస్టారెంట్‌కు.. చాలామంది పౌరులు వస్తుంటారు. అందుకే ఉగ్రవాదులు ఈ రెస్టారెంట్‌ను వ్యూహాత్మకంగా ఎంచుకుని దాష్టీకానికి పాల్పడ్డారు. అనూహ్యంగా వచ్చిన పడిన ముప్పుతో.. హోటల్‌లోని పౌరులు హాహాకారాలు చేశారు. ముష్కరుల తూటాలు ఒకవంక.. తూటాల కారణంగా పగిలిన అద్దాలు మరోవంక.. అత్యధికులను క్షతగాత్రులను చేశాయి.

 

 

07:33 - November 15, 2015

ఢిల్లీ : అతడో పేరుమోసిన దొంగ. అతను రాష్ట్రం కాదు.. దేశం కాదు.. ఏకంగా అంతర్జాతీయ స్థాయి నేరగాడు. పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌, బడా రాజకీయ ప్రముఖుల అండదండలు పుష్కలంగా ఉన్న స్మగ్లర్‌. అయినవాళ్లు అధికారంలో ఉన్నంత కాలం అతను యథేచ్ఛగా చీకటి సామ్రాజ్యాన్ని ఏలాడు. కాలం మారిపోయింది. అతని నేర సామ్రాజ్య పునాదులు కూలిపోయాయి. దాంతో విదేశాలకు పారిపోయాడు. ఎక్కడో విదేశీ కలుగులో దాక్కున్న ఆ అంతర్జాతీయ ఎర్రదొంగను పోలీసులు అతికష్టమ్మీద స్వదేశానికి తీసుకొచ్చారు.
మారిషస్‌ నుంచి భారత్ కు గంగిరెడ్డి 
మొన్న ఇండోనేషియాలో పట్టుబడ్డ మాఫియా డాన్‌ రాజన్‌కు ఏ మాత్రం తీసిపోని స్మగ్లర్‌ గంగిరెడ్డి. గత కొన్ని నెలలుగా వార్తల్లో కనిపిస్తున్న ఘరానా కేటుగాడు. పోలీసుల కన్నుగప్పి విదేశాలకు పారిపోయిన ఈ మోసగాడు మొత్తానికి దేశంలోకి అడుగుపెట్టాడు. కొల్లెం గంగిరెడ్డిగా ఘనమైన నేర చరిత్ర కలిగిన ఈ ప్రబుద్ధుడి గురించి పుంఖానుపుంఖాలుగా వార్తలు ప్రచురితమయ్యాయి. ఎర్రచందనం స్మగ్లర్‌గా వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టిన దొంగబాబును సిఐడి పోలీసులు పటిష్ట భద్రత మధ్య మారిషస్‌ నుంచి దేశానికి తీసుకొచ్చారు.
శేషాచల అడవుల నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌
గంగిరెడ్డి ఎన్నో ఏళ్లుగా శేషాచల అడవుల నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడు. రాజకీయ నాయకుల అండదండలుండడంతో ఇతని చీకటి వ్యాపారం దర్జాగా సాగిపోయింది. అయితే ఎర్రచందనం అక్రమ రవాణాపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో కొల్లెం గంగిరెడ్డి నిబంధనల గొల్లెం తెంపుకుని విదేశాలకు పారిపోయాడు.
ఇంటర్‌పోల్‌ సాయంతో గంగిరెడ్డి అరెస్టు
గంగిరెడ్డిని పట్టుకోవడం కోసం సిఐడి అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్‌పోల్‌ సాయం తీసుకుంది. దొంగ పాస్‌పోర్ట్ పై జంపైన గంగిరెడ్డి ఫిబ్రవరి 23న మారిషస్‌లో ఇంటర్‌ పోల్‌ అధికారులకు పట్టుబడ్డాడు. ఆ దేశంలోనే గంగిరెడ్డి బెయిల్‌కు పిటిషన్‌ దాఖలు చేయగా ఏపీ పోలీసుల కోరికపై పోర్ట్ లూయిస్‌ కోర్ట్‌ ఆ పిటిషన్‌ను కొట్టిపారేసింది. అప్పటి నుంచి గంగిరెడ్డిని విచారిస్తున్నాభారత్ కు ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి..రు. ఇతన్ని స్వదేశానికి తెచ్చేందుకు 8 నెలలుగా తీవ్రంగా శ్రమించిన సిఐడి అధికారుల కష్టానికి ఫలితం దక్కింది. ఏపీ సిఐడి చీఫ్‌ ద్వారకా తిరుమలరావు నేతృత్వంలోని బృందం గంగిరెడ్డిని అదుపులోకి తీసుకుని భారత్‌కు తీసుకొచ్చింది.
పలు కేసుల్లో గంగిరెడ్డి నిందితుడు
గంగిరెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులతో సహా పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. ఏపి సిఎం చంద్రబాబుపై అలిపిరి వద్ద హత్యాయత్నం చేసిన కేసులోనూ ఈ ఘనుడు నిందితుడుగా ఉన్నాడు. ఆ కేసులకు సంబంధించి జరగనున్న విచారణలో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో, తను తప్పించుకుపోవడానికి ఎవరెవరు సహకరించారో ఆ నిజాలు నిగ్గుతేలాల్సి ఉంది.

 

షార్ట్ సర్క్యూట్ తో తండ్రీకోడుల మృతి

ఖమ్మం : జిల్లాలోని ఇల్లందులో విషాదం నెలకొంది. చికెన్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ తో తండ్రీకోడులు మృతి చెందారు. 

జెన్‌కో ఇంజినీరింగ్ పరీక్షలో మాల్‌ప్రాక్టీస్

హైదరాబాద్ : జెన్‌కో ఇంజినీరింగ్ పరీక్షలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతూ ఓ అభ్యర్థి పట్టుబడ్డాడు. రామాంతాపూర్‌లోని డిగ్రీ కాలేజీలో జరిగిన జెన్‌కో ఇంజినీరింగ్ పరీక్షకు అంబర్‌పేటకుచెందిన జీ అంజిబాబు హాజరయ్యాడు. లోదుస్తుల్లో బ్లూటూత్ పరికరం పెట్టుకొని పరీక్ష రాస్తుండగా, గమనించిన ఇన్విజిలేటర్ అభ్యర్థిని తనిఖీ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

బాల్‌బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అధ్యక్ష పదవికి రాజశేఖర్ రాజీనామా

హైదరాబాద్ : బాల్‌బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అధ్యక్ష పదవికి సీహెచ్ రాజశేఖర్ రాజీనామా చేశారు. ఇకపై ఫెడరేషన్ అధికార కార్యకలాపాల్లో పాల్గొననని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాలతోనే అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినట్లు వెల్లడించారు.

నేడు ఖాజీపేటలో ముస్లీం మతపెద్దలతో దిగ్విజయ్ సింగ్ భేటీ

వరంగల్ : నేడు ఖాజీపేటలో ముస్లీం మత పెద్దలతో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సమావేశం కానున్నారు. పలు విషయాలపై చర్చించనున్నారు.

 

Don't Miss