Activities calendar

16 November 2015

21:30 - November 16, 2015

హైదరాబాద్ : సిరియాలో వైమానిక దాడుల్లో పాలుపంచుకుంటున్న దేశాలకు ఫ్రాన్స్‌కు పట్టిన గతే పడుతుందని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ హెచ్చరించింది. ఫ్రాన్స్‌ సెంటర్‌ పారిస్‌లో జరిగిన విధంగానే అమెరికా సెంటర్‌ వాషింగ్టన్‌లోనూ దాడులు జరుపుతామని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఓ కొత్త వీడియోను ఐఎస్‌ఐఎస్‌ విడుదల చేసింది. యూరప్‌లో మరిన్ని దాడులు జరుపుతామని కూడా పేర్కొంది. సైలెన్సర్‌ గన్స్, పేలుడు బెల్టులతో రకరకాల పద్ధతుల్లో విరుచుకుపడ్తాం...మమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు...ఇంతకు ముందుకన్నా మేమిపుడు బలవంతులమని ఇస్లామిక్‌ స్టేట్‌ స్పష్టం చేసింది. 

21:27 - November 16, 2015

హైదరాబాద్: గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. డబుల్‌బెడ్‌ రూం పథకాన్ని ప్రారంభించిన తర్వాత కేసీఆర్‌ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. పలు యూనివర్శిటీల్లోని వైస్‌ఛాన్సలర్ల నియామకంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పత్తి రైతుల సమస్యలపై కేంద్రమంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్న అంశాన్ని కూడా సీఎం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వీటితో పాటు తాజా రాజకీయాలపైనా గవర్నర్‌, సీఎం చర్చించినట్లు తెలుస్తోంది.

21:25 - November 16, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ స్వైన్‌ప్లూ పంజా విసురుతోంది. గత సంవత్సరం గడగడలాడించిన ఆ వైరస్‌ ఇప్పుడు మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా సికింద్రాబాద్‌ గాంధి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు స్వైన్ ప్లూ మహమ్మారి మూలంగా మృతి చెందారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన గోపయ్య, అంబర్‌పేట గోల్నాకకు చెందిన వెంకటయ్య గత వారం రోజులుగా ఇక్కడ చికిత్స పొందుతున్నారు. కాగా వారి పరిస్థితి విషమించి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం గాంధి ఆస్పత్రిలో ముగ్గురు చికిత్స పొందుతుండగా మరో 11 మందికి ఆ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఆగస్ట్ నుండి ఇప్పటివరకూ గాంధి ఆస్పత్రిలోనే స్వైన్‌ప్లూతో 15 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. చలికాలం కావడంతో ఆ వైరస్‌ మరింత పుంజుకుంటుందని, ప్రజలు మాస్క్‌లు ధరిస్తూ ఆరోగ్యరీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

21:23 - November 16, 2015

హైదరాబాద్ : ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ల మతోన్మాదం, నియంతృత్వ విధానాలు ఒక్కటేనని ప్రజా కళాకారుల ఐక్యవేదిక చైర్మన్‌ విమలక్క అన్నారు. వీరిద్దరి విధానాలకు నిరసనగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచచారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కళాకారుల సంఘాలన్నీ కలిసి ప్రజా కళాకారుల ఐక్యవేధిక ఆవిర్భవించిది. ఈ వేదికకు చైర్మన్‌గా విమలక్కను ఎన్నుకున్నారు. ఈ వేదిక ఆధ్వర్యంలో ప్రజల్ని చైతన్యం చేసేలా పల్లెపల్లెకు ఉద్యమాన్ని చేపడుతామని విమలక్క అన్నారు. ఈ సందర్బంగా ఐక్య కళాకారుల నిర్వహించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి.

21:21 - November 16, 2015

విజయవాడ : మాజీ ఎంపీ, సినీనటి జయప్రద ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. తన కుమారుడు హీరో సిద్ధార్ద్‌ వివాహానికి రావాల్సిందిగా సీఎం చంద్రబాబును ఆహ్వానించానని జయప్రద తెలిపారు. ఈనెల 27న తన కుమారుడు వివాహం ఉందని..29న హైదరాబాద్‌ శిల్పారామంలో విందు వేడక ఉందని ఆమె తెలిపారు.  

21:19 - November 16, 2015

హైదరాబాద్ : ప్రముఖ విప్లవవీరుడు, గదర్‌ పార్టీ నేతల్లో ఒకరైన కర్తార్‌సింగ్‌ సరభ శతవర్ధంతిని పంజాబ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆ మహనీయునికి నివాళులర్పించారు. లూధియానాతో పాటు పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న కర్తార్‌సింగ్‌ విగ్రహాలకు పూలమాలలువేసి, స్వాతంత్ర్యోద్యంలో ఆయన చేసిన వీరోచిత పోరాటాలను

ఒడిశాలో కాలేజీ విద్యపూర్తి ....

బ్రిటీష్‌ వలస పాలకులకు వ్యతిరేకంగా పోరాటిన కర్తార్‌సింగ్‌ 1896లో లూధియానాలోని సరభా గ్రామంలో జన్మించారు. లూధియానాలోని మాల్వా ఖల్సా హై స్కూల్లో మెట్రిక్యులేషన్‌ వరకు చదివారు. ఆ తర్వాత ఒడిశాలోఉన్న తన మేనమామ ఇంటికివెళ్లి అక్కడ కాలేజీలో చేశారు. పదహారేళ్ల వయసులో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కో వెళ్లి బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ క్యాలిఫోర్నియాలో కెమిస్ట్రీని ప్రధానాంశంగా తీసుకుని డిగ్రీలో చేశారు. అమెరికా వెళ్లిన తర్వాత ఒక్కసారిగా ఆయనలో దేశభక్తిభావాలు పెరిగిపోయి. అమెరికాకు వలస వచ్చిన భారతీయులు... ముఖ్యంగా కూలీల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తూ, వివక్షచూపుతున్న యూఎస్‌ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. అమెరికా ప్రజలతో సమాన హక్కుల కోసం పోరాడారు.

డిగ్రీ చదువుకు మధ్యలోనే స్వస్తి .....

బ్రిటీష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా 1913లో అమెరికాలో గదర్‌ పార్టీ ప్రారంభించినప్పుడు కర్తార్‌సింగ్‌ ఆ పార్టీలో క్రియాశీలక సభ్యుడుగా చేశారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేశారు. గదర్‌ వార్తా పత్రిక గురుముఖి ఎడిషన్‌కు కవితలు, వ్యాసాలు రాశారు. అమెరికాలో పంజాబీయులతో సమావేశాలు నిర్వహించిన విప్లపభావాలు నూరిపోసేవారు. 1913 అక్టోబర్‌ 31న కాలిఫోర్నియాలో జరిగిన ఓ సభలో భారత్‌లో బ్రిటీష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు అందరూ కలిసి రావాలని పిలపు ఇచ్చిన కర్తార్‌సింగ్‌... ప్రజల దృష్టిని ఆకర్షించారు.

1914 సెప్టెంబర్‌ 15న భారత్‌ తిరిగిరాక ........

స్వాతంత్ర్యోద్యమం కోసం పారాడాలని అనుకున్న వెంటనే భారత్‌ తిరగి వచ్చేందుకు కర్తార్‌సింగ్‌ ఏర్పాట్లు చేసుకున్నారు. 1914 సెప్టెంబర్‌ 15 న కర్తార్‌సింగ్‌తో కలిసి గదర్‌ పార్టీ వ్యవస్థాపకులంతా ఇండియా గతిరిగొచ్చారు. 1914 డిసెంబర్‌లో లూధియానా కేంద్రంగా గదర్‌ పార్టీ కార్యక్రమాలు ప్రారంభించారు. విష్ణుగణేష్‌ పింగళే, సచ్ఛీంద్రనాథ్‌ సన్యాల్‌, రస్‌ బిహారీ బోస్‌ వంటి విప్లవనాయకులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. పింగళేతో కలిసి ఆగ్రా, మీరట్‌, బెనారస్‌, అలహాబాద్‌, అంబాలా, లాహోర్‌, రావల్పిండి... కంటోన్మెంట్లలో పర్యటించి.... బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు కోసం ప్రయత్నించారు. చిన్నిచిన్న బాంబుల తయారీ నేర్చుకున్న కర్తార్‌సింగ్‌... గదర్‌ పార్టీ నిధుల కోసం 1915 జనవరిలో లూధియానా జిల్లాలోని సహ్నేవాల్‌, మన్సూర్‌ గ్రామాల్లో దాడులకు పాల్పడ్డారు.

1915 ఫిబ్రవరిలో గదర్‌ పార్టీ నేతల మూకుమ్మడి అరెస్ట్‌లు ....

బ్రిటీషర్లకు వ్యతిరేకంగా గదర్‌ పార్టీ నేతలు తిరుబాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం అందుకున్న వలస పాలకులు... 1915 ఫిబ్రవరిలో ఆ పార్టీ నేతలను మూకుమ్మడిగా అరెస్టులు ప్రారంభించినప్పుడు కర్తార్‌సింగ్‌ కాబూల్‌ పారిపోయారు. బ్రిటీషర్ల నుంచి భారతమాతకు బంధవిముక్తి కల్పించాలనుకుని మళ్లీ పంజాబ్‌ తిరిగి వచ్చిన కర్తార్‌సింగ్‌ను 1915 మార్చి 2న పోలీసులు అరెస్టు చేశారు. కర్తార్‌సింగ్‌ పై లాహోర్‌ కుట్రకేసు బనాయించారు. 1915 సెప్టెంబర్‌ 13న న్యాయస్థానం కర్తార్‌సింగ్‌కు మరణశిక్ష విధించింది. 1915 నవంబర్‌ 16న కర్తార్‌సింగ్‌ను లాహోర్‌ సెంట్రల్‌ జైల్లో ఉరితీశారు. కర్తార్‌సింగ్‌తోపాటు మరో ఆరుగురికి కూడా ఉరిశిక్ష విధించారు. 

రాష్ట్రపతి శీతాకాల విడిది పర్యటన ఖరారు

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది పర్యటన ఖరారైంది. వచ్చే నెల 18న ఆయన హైదరాబాద్కు చేరుకుంటారు. అప్పటి నుంచి డిసెంబర్ 31 వరకు హైదరాబాద్లోనే ఉంటారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించే మహాచండీయాగానికి ప్రణబ్ హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది.

భారత్ బయలు దేరిన ప్రధాని మోదీ

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ ఐదు రోజుల విదేశీ పర్యటన ముగించుకొని స్వదేశానికి బయలుదేరారు. బ్రిటన్, టర్కీలలో పర్యటించిన ఆయన ఈ రోజు రాత్రి టర్కీ నుంచి భారత్ కు బయలుదేరారు.

ఫ్రాన్స్ దాడి కీలక సూత్రదారి అరెస్ట్....

హైదరాబాద్: ఫ్రాన్స్ మారణహోమం సృష్టించి 129 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులకు అన్ని సహాయ సహకారాలు అందించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది అబ్దెస్లామ్‌ను అరెస్ట్ చేశారు. రెండు రోజులుగా అబ్దెస్లామ్‌‌ కోసం ఫ్రాన్స్ పోలీసులు వెతుకుతున్నారు. ఫ్రాన్స్ దాటి బెల్జియంలోకి ప్రవేశించాడని తెలిసినప్పటినుంచీ ఫ్రాన్స్ పోలీసులు నిఘా పెట్టారు. 26 ఏళ్ల అబ్దెస్లామ్‌‌ ఉంటోన్న ఇంటిని గుర్తించారు. ఆ తర్వాత బెల్జియం పోలీసుల సాయంతో బ్రస్సెల్స్‌లో ఆ ఇంటిపై దాడి చేశారు. సజీవంగా పట్టుకున్నారు. అబ్దెస్లామ్‌‌నుంచి కూపీలన్నీ లాగుతున్నారు. ఎవరెవరు సహకరించారు? దాడులు ఎవరెవరు చేశారు? పథకం ఎక్కడ రచించారు.

ఏ ఎస్సై మోహన్ కేసులో ఇద్దరు సిఐలపై బదిలీ వేటు

కరీంనగర్ : ఏ ఎస్సై మోహన్ కేసులో ఇద్దరు సిఐలపై బదిలీ వేటు పడింది. కోరుట్ల సీఐ సురేందర్, ఆదిలాబాద్ జిల్లా ముథోల్ సీఐ గణపతి జాదవ్ లను డీఐజీకి అటాచ్ చేస్తూ ఐజీ నవీన్ చంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

20:37 - November 16, 2015

హైదరాబాద్ : అధికారంలో లేనపుడు వ్యతిరేకించారు? అందలం ఎక్కాక అడ్డం తిరిగారు? గిరి పుత్రుల బతుకుల్లో మట్టి కొట్టడానికి రెడీ అయ్యారు. ఏపీ సర్కార్ కు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్ర మవుతున్నాయి. గిరిజనులంతా ఏకమై సర్కార్ పై పోరాటానికి సై అంటున్నారు. విశాఖ మన్యంలో రేగుతున్న బాక్సైట్ మంటలపై నేటి వైడాంగిల్ లో విశ్లేషణ చేశారు. మరి ఏఏ అంశాలు అందులో పొందుపరిచారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

లారీ - కారు ఢీ : ఆరుగురికి తీవ్ర గాయాలు

మహబూబ్ నగర్ : బాలా నగర్ మండలం రంగారెడ్డి గూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ - కారు ఢీకొనడంతో కర్నూలుకు చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

19:50 - November 16, 2015

హైదరాబాద్ : పాకిస్తాన్‌నుంచి భారతదేశానికి వచ్చిన బధిర యువతి గీత కథ మరో మలుపు తిరిగింది. ఆమె తమ కూతురే అని ఇప్పటిదాకా చెప్పుకుంటున్న జనార్దన్‌ మెహతా వాదనలో పస లేకుండాపోయింది. గీతకు సంబంధించి చేసిన డీఎన్ ఏ టెస్ట్‌లో ఆమె జనార్దన్‌ కూతురు కాదని తేలిపోయింది. జనార్దన్‌ కుటుంబాన్ని గీత మొదట తన కుటుంబంగా గుర్తించింది. 15 ఏళ్ళ తరువాత అక్టోబర్ 26న ఆమె పాకిస్తాన్‌లోని కరాచీ నుండి ఢిల్లీకి వచ్చింది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోనే ఉంది. తను ఎక్కడ ఉండాలనేది ఆమె నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ఈదీ ఫౌండేషన్‌ నిర్వాహకులు అన్నారు. ఆమె భారత్‌లోనే ఉండాలనుకుంటోందని ఫౌండేషన్‌ నిర్వాహకులే మరో సందర్భంలో అన్నారు. 

19:48 - November 16, 2015

విజయవాడ : సీఆర్‌డీఏ కార్యాలయంలోని అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. ఓ బిల్డర్‌ నుంచి 40 వేలు లంచం తీసుకుంటున్న ఆర్కిటెక్చర్‌ సాయికుమార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భవన క్రమబద్ధీకరణ కోసం సాయికుమార్‌ బిల్డర్‌ను లంచం అడిగారు. దీంతో బిల్డర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. 

తమిళనాడులో వర్షాలకు 105 మంది మృతి

చెన్నై : తమిళనాడులో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు 105 మంది మరణించారు. నగరంలో రోడ్లపై మోకాలు లోతు వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. చెన్నైలోని రోడ్లు మెరీనా బీచ్‌ను తలపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. నివాస ప్రాంతాల్లో నిలిచిన నీటి పవర్‌ పంపులతో సహాయంతో తొలగిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా వర్షప్రభావం ఎక్కువగా ఉన్న 16 జిల్లాల్లో తమిళనాడు ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. అన్నా యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ, లా యూనివర్సిటీ, ఎంజీఆర్‌ మెడికల్ యూనివర్సిటీలలో పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేశారు.

నిండు కుండలను తలపిస్తోన్న తిరుమల జలాశయాలు..

తిరుపతి : కుండపోతగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని జలాశయాలు నిండిపోయాయి.. గోగర్భం, పాపవినాశనం జలాశయాల నుంచి నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. కుమారధార డ్యాం నీటితో కళకళలాడుతోంది.. వర్షాలతో చెన్నై-తిరుపతి మార్గంలో వివిధ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.. తిరుపతిలోకూడా వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి.. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి.. భారీవర్షాలతో ముందుజాగ్రత్త చర్యగా జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్‌.. ఇక ఎస్వీ యూనివర్శిటీ పరీక్షలు కూడా వాయిదాపడ్డాయి.. శ్రీకాళహస్తిలో వర్షం జనాలకు చుక్కలు చూపించాయి..

నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు

నెల్లూరు : జిల్లాలో వానలు కుండపోతగా కురుస్తున్నాయి. జిల్లాలోని నదులు,వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి.వరదలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. నెల్లూరు నగరంలో లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. ఇళ్లల్లోకి వరదనీరు ప్రవేశించింది. వర్షాల కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేటలో కుండపోతను గుర్తుకుచేస్తున్నాయి.. వెంకటగిరిలో 24 సెంటీమీటర్ల వర్షపాతం, బాలాయపల్లిలో 14, డక్కిలిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కైవల్య, పంబలేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి... రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో చాలా ప్రాంతాలకు రాకపోకలు ఆగిపోయాయి..

నోకియా ఇండియా అధ్యక్షుడిగా సందీప్

హైదరాబాద్: నోకియా ఇండియా కంపెనీ అధ్యక్షుడిగా సందీప్ గిరోత్రాను నియామకమయ్యారు. ప్రస్తుతం నోకియా ఇండియా ఉపాధ్యక్షుడిగా, నోకియా నెట్‌వర్స్ హెడ్ ఆఫ్ ఇండియాగా ఉన్న సందీప్‌గిరోత్రాను కంపెనీ హెడ్‌గా నియమించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఉగ్రవాదంపై ఫ్రాన్స్ పోరాటానికి భారత్ మద్దతు

హైదరాబాద్ : ఉగ్రవాదం పై ఫ్రాన్స్ పోరాటానికి భారత్ అండగా ఉంటుందని మద్దతు రక్షణ శాఖ మంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు.

వాషింగ్టన్, రోమ్, బ్రిటన్ లకు 'ఐఎస్' తాజా హెచ్చరిక

హైదరాబాద్ : వాషింగ్టన్, రోమ్, బ్రిటన్ లకు ఐఎస్ ఐఎస్ తాజా గా హెచ్చరికలు జారీ చేసింది. ఫ్రాన్స్ లో కంటే భీకర దాడులు చేస్తామని వీడియో ను ఐఎస్ ఉగ్రవాదులు విడుదల చేశారు. వాషింగ్టన్, రోమ్ లలో వైమానిక దాడులు చేస్తామని హెచ్చరించారు. సరియా పై దాడులు చేస్తున్న ఏ దేశాన్ని విడిచి పెట్టమని ఆ వీడియోలో ఉగ్రవాదులు హెచ్చరించారు.

19:13 - November 16, 2015

కనుగుడ్డుకు పచ్చబొట్టు (టాటూ) పొడిపించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఈ ఫ్యాషన్... ఇప్పుడు ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలోని ఫ్యాషన్ ప్రియులు ఈ కొత్త పోకడకు విపరీతంగా ఆకర్షితులయ్యారు. 'ఐ బాల్' టాటూగా ప్రసిద్ధి చెందిన ఈ కొత్త ఫ్యాషన్ కు ఆద్యుడు అమెరికన్ బాడీ మాడిఫికేషన్ ప్రతిపాదకుడు లూనా కోబ్రా. ఈ ఫ్యాషన్ ను ఇష్టపడే వారు తమ తెల్లగుడ్డుకు రంగు రంగుల టాటూలు వేయించుకుంటున్నారు. అందరి కంటే భిన్నంగా ఉండాలనే తపనతో ఇటువంటి పనులు చేయడం కంటికే ప్రమాదమంటున్నారు వైద్యులు. ఐ బాల్ టాటూయింగ్ కారణంగా అంధత్వం, కేన్సర్ వచ్చే అవకాశముందని వారు హెచ్చరిస్తున్నారు.

పాక్ ఏజెంట్ జాఫర్ ఖాన్ అరెస్ట్

కోల్‌కతా: పాకిస్థాన్‌కు చెందిన ఏజెంట్ జాఫర్‌ఖాన్‌ను ఇవాళ పశ్చిమబెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాఫర్‌ఖాన్ కు ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధమున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఏసీబీ వలలో సీఆర్డీఏ ఆర్కిటెక్చర్

విజయవాడ : సీఆర్డీఏ కార్యాలయం పై ఏసీబీ దాడి చేసింది. ఓ బిల్డర్ నుంచి రూ. 40 వేలు లంచం తీసుకుంటూ సీఆర్డీఏ ఆర్కిటెక్చర్ సాయి కుమార్ ఏసీబీ కి చిక్కారు. భవనం క్రబద్ధీకరణ కోసం గుడివాకు చెందిన బిల్డర్ మధును 40వేలు లంచం అడగడంతో చేసేది లేక ఏసీబీని ఆశ్రయించారు.

ఐఏఎస్ బదిలీల్లో స్వల్ప మార్పులు...

హైదరాబాద్ : తెలంగాణ లో ఐఏఎస్ అధికారుల బదిలీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ గా అనితారామచంద్రన్ కొనసాగుతున్నారు. జీహెచ్ ఎంసీ అడిషనల్ కమిషనర్ గా ఆమె నియామక ఉత్తర్వుల రద్దు చేశారు. జీహెచ్ ఎంసీ అదనపు కమిషనర్ గా హైదరాబాద్ జేసీ సురేంద్ర మోహన్ ను నియమించారు.

ఏఎస్ఐ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ

కరీంనగర్ : ఏఎస్ఐ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురయ్యింది. మోహన్ రెడ్డిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ వేసింది. ఓ వ్యక్తి ఆత్మహత్యతో మోహన్ రెడ్డికి సంబంధం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని పిటీషన్ సీఐడీ పేర్కొంది.

'గాంధీ' స్వైన్ ఫ్లూతో ఇద్దరు మృతి : గాంధీ వైద్యులు

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం స్వైన్ ఫ్లూతో ఇద్దరు మృతి చెందినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వారిలో ఒకరు గోల్నాకకు చెందిన వ్యక్తి కాగా... మరొకరు నల్గొండకు చెందిన గోపయ్య(32) అని వైద్యులు తెలిపారు.

రాళ్లపాడు జలాశయానికి భారీగా వరద నీరు

ప్రకాశం: లింగ సముద్రం మండలంలోని రాళ్లపాడు జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో జలాశయం నీటి మట్టం 9.2 అడుగకులకు చేరింది.

తన కుమారుడు వివాహానికి బాబు ని ఆహ్వానించా: జయప్రద

విజయవాడ: సినీనటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద సోమవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని విజయవాడలోని క్యాంప్ ఆఫీస్‌లో కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29న జరగనున్న తన కుమారుడు సిద్దార్థ వివాహానికి ఆహ్వానించడానికే చంద్రబాబుని కలిశానని మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎలాంటి రాజకీయ అంశాలు చర్చించలేదని జయప్రద చెప్పారు.

వర్షాలతో పలు రైళ్ల రద్దు, మరికొన్ని దారి మళ్లింపు...

విజయవాడ: వారం రోజుల కురుస్తున్న వర్షాల కారణంగా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. చెన్నై సెంట్రల్‌- విజయవాడ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌‌ను, విజయవాడ-చెన్నై సెంట్రల్‌ పినాకిని ఎక్స్‌ప్రెస్‌‌‌‌ను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో పాటుగా బిట్రగుంట ప్యాసెంజర్‌ పాక్షికంగా రద్దు చేశారు. మధురై-డెహ్రాడూన్‌, చెన్నై-కాకినాడ ఎక్స్‌ప్రెస్‌‌లను కూడా రద్దు చేశారు. చెన్నై-కాత్రా, కావేరి ఎక్స్‌ప్రెస్‌‌ను, చెన్నై-పూరి ఎక్స్‌ప్రెస్‌‌లను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

18:25 - November 16, 2015

హైదరాబాద్ : రాష్ట్ర విభజన అనంతరం పాలన  ఏపీ రాజధాని అమరావతి నుండే కొనసాగించాలని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఉద్యోగం అక్కడ... పిల్లల చదువులు ఇక్కడ... ఇళ్ళు ఇక్కడ... పని చేయాల్సింది అక్కడ.. వెళ్లక తప్పదు... కాని వెళ్లేదెలా? ఇదే అంశం పై ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మురళీ కృష్ణ తన అభిప్రాయాలను 'టెన్ టివి'తో పంచుకున్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయంతో సానుకూలంగా స్పందిస్తూనే.. ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల డిమాండ్ల కార్యాచరణతో ముందుకు వెళతామని తెలిపారు. వారు ఇంకా ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

18:11 - November 16, 2015

హైదరాబాద్ : కొత్త సచివాలయం నిర్మించాలన్న టిఆర్‌ఎస్‌ సర్కార్‌ కల కల కలగానే మిగిలింది. అనువైన స్థలాల అన్వేషణలో అలిసిపోయిన ప్రభుత్వం ఇప్పుడు తన ప్రయత్నాలను మానుకుంది. ఇప్పుడున్న సచివాలయానికి భయంకర వీధి పోటు, వాస్తు దోషం ఉందని సీఎం కేసీఆర్ తొలుత భావించారు. చాలినంత స్థలంకూడా లేకపోవడం ఆటంకంగా మారిందని అన్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయాన్ని తరలించాలని నిర్ణయించారు.

ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రి స్థలాన్ని .....

సచివాలయ మార్పుకు ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రి స్థలాన్ని ఎంచుకున్నారు. రోగులు, సిబ్బంది, ప్రజా సంఘాలు, విపక్షాలు వ్యతిరేకించినా వెనక్కు తగ్గలేదు. ఆధునిక సచివాలయ నిర్మాణం కోసం బడ్జెట్‌లో ఏకంగా 150 కోట్లను కేటాయించారు. అయితే హైకోర్టు మొట్టికాయలు, ట్రాఫిక్ సమస్యల కారణాలతో నిర్ణయాన్ని మార్చుకున్న ప్రభుత్వం..మరో జాగా కోసం అన్వేషణ మొదలుపెట్టింది.

బైసన్ పోలో స్థలాన్ని ఎంపిక....

సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ దగ్గర్లోని బైసన్ పోలో స్థలాన్ని ఎంపిక చేసింది. అది మిలటరీ ఆధీనంలో ఉండటంతో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపారు. అయితే దీనిపై కేంద్రం ఏ విషయమూ తేల్చకుండా పెండింగ్‌లో పెట్టింది. దీంతో అధికారులు సైబరాబాద్ పరిధిలో మరో స్థలాన్ని గుర్తించే పనిలో పడ్డారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని మరింత పెంచే ఆలోచనతో హైటెక్ సిటీ దగ్గర్లో నిర్మించాలనే ప్రణాళికా చేశారు. ఎందుకో ఆ ప్లానూ ఫెయిలై బేగంపేట విమానాశ్రయం దగ్గరకు వచ్చారు. అయితే దీనికి కేంద్ర విమానయాన సంస్థ అంగీకరించ లేదు. ఇలా ప్రతియత్నమూ విఫలం కావడం, అనువైన స్థలం దొరక్కపోవడంతో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మనసు మార్చుకుంది..

ఇప్పుడున్న సచివాలయ ప్రాంతంలోనే కొత్త సచివాలయం నిర్మాణం...

తాజాగా ఇప్పుడున్న సచివాలయ ప్రాంతంలోనే కొత్త సచివాలయం నిర్మించాలని సర్కార్ యోచిస్తోంది. వాస్తుకు అనుగుణంగా ఓ భారీ భవంతిని నిర్మించాలని ప్రస్తుతమున్న సీఎం బ్లాక్ సమత, ఎ, బీ బ్లాకులను కూల్చి ఎల్‌ ఆకారంలో పది అంతస్తుల భవనాన్ని నిర్మించాలన్న ఆలోచనలో ఉంది. దీనితోపాటు గుడి నీడ పడితే అంత మంచిది కాదన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే గుడి నీడ పడకుండా..మూడు వేరు వేరు భవంతులు కాకుండా ఒకే భవంతిని నిర్మించడం ద్వారా వాస్తు లోపాలను సరిదిద్దవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. అందుకే నల్ల పోచమ్మ గుడి పక్క నుండి ప్రస్తుతమున్న సమతా బ్లాక్ వరకు ఒకే భవనాన్ని పది అంతస్తుల్లో నిర్మించాలన్నది ప్రభుత్వ ప్లాన్. ఈ మార్పులన్నిటి దృష్ట్యా మరోసారి ఆర్‌ అండ్ బీ అధికారులు, వాస్తు పండితులతో చర్చించి..సమగ్ర ప్లాన్‌ను తయారుచేయనున్నారు. అంతా వాస్తు ప్రకారం ముందుకెళ్తున్న ప్రభుత్వం ఈ నిర్ణయం మేరకే పనులు చేస్తుందా లేక హఠాత్తుగా ఏదైనా ఆలోచన మదిలో మెదులుతుందా అటువైపు మొగ్గుచూపుతుందా అన్నది కాలమే తేల్చాలి. 

18:09 - November 16, 2015

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐని నిర్వీర్యంచేసే ప్రయత్నం చేస్తుందని ఆర్‌బీఐ ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రత్యేక అధికారులను తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న ఆర్‌బీఐ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న 17వేల మంది ఆర్‌బిఐ ఉద్యోగులు నవంబర్ 19న మాస్ క్యాసువల్ లీవ్ చేపట్టనున్నారు. దీంతో ఆ ఒక్కరోజులోనే షేర్ మార్కెట్ లు, ఫోరెక్స్ ట్రాన్సెక్షన్‌లు, పేమెంట్ ఆండ్ సెటిల్ మెంట్ సిస్టమ్‌లు పూర్తిగా ఆగిపోనున్నాయి. దీని వలన దాదాపు 2లక్షల 50వేల కోట్ల లావాదేవీలు ఆగిపోనున్నాయి. కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న ఫెన్షన్ అప్‌డేషన్ కూడా వెంటనే అమలు పరచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాలను వెనక్కితీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు.

18:06 - November 16, 2015

హైదరాబాద్ : ప్రైవేటు, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవల్ని నిలిపేయాలని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఇప్పటివరకు ఆరోగ్య శ్రీ కార్డు కలిగిన రోగులకు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు ఉచితంగా వైద్యసేవల్ని అందిస్తున్నాయి. ఇందుకు అయ్యే బిల్లులను ఆస్పత్రులు ప్రభుత్వానికి సమర్పించిన తర్వాతే, వాటిని పరిశీలించి నిధులను విడుదల చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలో ఈ ప్రక్రియ మొదటి నుంచి కొనసాగుతోంది. ఈ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలో నిధులను ఎప్పటికప్పుడు సిద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది మొదటి నుంచి ఈ ప్రక్రియ సవ్యంగా జరగడంలేదని తెలుస్తోంది. ఆస్పత్రులు తమకు రావాల్సిన బిల్లులను సమర్పించిన తర్వాత ఎప్పటికోగానీ ప్రభుత్వం నిధులను విడుదల చేయడం లేదు. దీంతో ఆరోగ్యశ్రీ సేవల్ని అందించేందుకు ప్రైవేటు, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు..నిరాకరిస్తున్నాయి. ఇదే విషయంపై ఇంతకు ముందు కూడా ఆసుపత్రులు తమ నిరసనను వ్యక్తం చేశాయి. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో..సేవల్ని నిలిపేయాని తాజాగా నిర్ణయించాయి.

ఆరోగ్య శ్రీ సేవలకు రూ. 80కోట్ల బకాయిలు ...........

ఆరోగ్య శ్రీ వైద్య సేవలకు ప్రభుత్వం సుమారు 80 కోట్ల రూపాయల వరకు బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఇందులో కొంత మొత్తాన్ని రెండు రోజుల కింద విడుదల చేసినట్లు సమాచారం. అయితే ఈ నిధులు ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ఆయా ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉంది. ఈ నిధుల విడుదల తర్వాత కూడా ఇంకా బకాయిలు మిగిలి ఉంటాయి. బిల్లుల చెల్లింపుకు ఓ ప్రణాళిక లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆరోగ్య శ్రీ ట్రస్టు అధికారులు గానీ, వైద్య అధికారులు గానీ బడ్జెట్‌కు సంబంధించి కసరత్తు చేయకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతోంది. ఆరోగ్య శ్రీకి అవసరమైన నిధుల కేటాయింపులో అంచనాలను రూపొందించకపోవడంతో..ప్రతీసారి అదనపు బడ్జెట్‌ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపాల్సి వస్తోంది.

ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌కి నిధుల కొరత.....

ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌కి నిధుల కొరత వెంటాడుతోంది. దీంతో బిల్లుల చెల్లింపులు జరగక..ఆ ప్రభావం రోగులపై పడుతోంది. ఆరోగ్య శ్రీ బిల్లులను చెల్లించకపోతే వైద్య సేవల్ని నిలిపివేస్తామంటూ ప్రైవేట్‌ ఆస్పత్రులు ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం,..కొరవడిన ముందుచూపు ఫలితంగా పేద రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందక కొందరు రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆరోగ్య శ్రీ బిల్లుల్ని వెంటనే చెల్లించి రోగులకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. 

18:03 - November 16, 2015

హైదరాబాద్ : భాగ్యనగరంలో పేదల సొంతింటి కల సాకారమైంది. బస్తీవాలకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకుంది. సికింద్రాబాద్ ఐడీహెచ్‌ కాలనీలో డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవం ఉల్లాసభరితంగా సాగింది. సీఎం కేసీఆర్ ఇళ్లపట్టాలను లబ్దిదారులకు అందజేశారు.

ఐడీహెచ్‌ కాలనీ రూపురేఖలు....

ఒకప్పుడు శిథిలావస్థలో ఉన్న సికింద్రాబాద్ ఐడీహెచ్‌ కాలనీ రూపురేఖలు మారిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల వాగ్ధానం నెరవేర్చింది. వందలాది నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా నిర్మించింది. సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దిన ఐడీహెచ్ కాలనీలోని నూతన రెండుపడకల గదుల ఇండ్ల ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్,మంత్రుల, అధికారులు, లబ్దిదారుల సమక్షంలో ఘనంగా జరిగింది.

సీఎం చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు లబ్దిదారులు......

వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు కేసీఆర్. సీఎం కాలనీకి చేరుకోగానే వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కాలనీ మహిళలు అన్న వచ్చాడంటూ మేళతాళలతో, మంగళ హారతులు పట్టి ఆహ్వానించారు. సీఎం చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు లబ్దిదారులు.

స్వయంగా గవర్నరే ప్రశంసలు....

తెలంగాణ ప్రభుత్వం పేదలకిచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు సీఎం కేసీఆర్. ఐడీహెచ్‌ లో నిర్మించిన ఇళ్లు అధికారుల నివాసాల కంటే బాగున్నాయని స్వయంగా గవర్నరే ప్రశంసించారని చెప్పారు. ఐడీహెచ్‌ తరహాలోనే తెలంగాణ వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు.నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ.

580 చదరపు అడుగుల వైశాల్యంతో.....

ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను 580 చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మించారు. ఇందులో రెండు టాయిలెట్లు ఒక హాల్, వంటగది ఉంటాయి. మొత్తం 396 ఇండ్లను నిర్మించారు. పేదల గృహాలను ప్రారంభించిన కేసీఆర్‌ తర్వాత కాలనీ వాసులతో కలిసి భోజనం చేశారు. ఇళ్ల ప్రారంభోత్సవం రోజు బస్తీవాసులతో కలిసి భోజనం చేస్తానని ఆనాడు చెప్పానని..చెప్పినట్లుగానే ఇవాళ కలిసి భోజనం చేస్తున్నానని సీఎం కేసీఆర్‌ బస్తీవాసులతో అన్నారు.

మంత్రి తలసానిని చుట్టు ముట్టిన మహిళలు......

మరోవైపు ఇళ్ల కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ పెద్ద సంఖ్యలో మహిళలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను నిలదీశారు. పైరవీలు చేసిన వారికే ఇచ్చారంటూ మండిపడ్డారు. దీంతో స్పందించిన మంత్రి...ఇంకా ఇళ్లను ఎవరికీ కేటాయించలేదని, అందరికీ న్యాయం చేస్తామని, ఓపిక పట్టాలని కోరారు. మొత్తానికి నిరసనలు, హర్షాతిరేకాల మధ్య ఐడీహెచ్‌ కాలనీలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవం సాగింది. 

18:00 - November 16, 2015

వరంగల్ : వామపక్షాలు, సామాజిక శక్తులు బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి గాలి వినోద్‌కుమార్‌ ఉప ఎన్నిక ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. తెలంగాణ ప్రజలు ఏవైతే కోరి టిఆర్‌ఎస్‌కు ఓటేశారో ఆ ఫలాలు వారికి అందలేదని, అందుకే వారి మద్దతు తనకు లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

టిఆర్ ఎస్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

హైదరాబాద్ : అధికార టిఆర్ ఎస్ పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతుందని ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ కు ఫిర్యాదు చేశారు. కోడ్ అమల్లో ఉండగానే రూ.150 కోట్ల మేరకు బోధన ఫీజులను విడుదల చేశారన్నారు. ఓటమి భయంతోనే అధికార దుర్వినియోగా పాల్పడుతోందన్నారు.

అక్రమంగా తరలిస్తున్న 13 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ప్రకాశం : అక్రమంగా తరలిస్తున్న 13 ఇసుక ట్రాక్టర్లను దర్శి పోలీసులు సీజ్ చేశారు. వీరాయపాలెం వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న ఎస్‌ఐ సుబ్బారావు సిబ్బందితో కలసి సోమవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. 13 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు.

పారిస్ దాడుల కీలక సూత్రధారి గుర్తింపు...

హైదరాబాద్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన ఉగ్రవాద దాడులకు కీలక సూత్రధారిని గుర్తించారు. బెల్జియంకు చెందిన 26 సంవత్సరాల అబ్దుల్ హమీద్ అబౌద్ ఈ దాడులకు కుట్ర పన్నినట్టు ఫ్రాన్స్ అధికారులు భావిస్తున్నారు. అతను బెల్జియం వాసిగా గుర్తించారు. కొంతమంది యువకులను రెచ్చగొట్టి అతడు ఈ దాడులకు వ్యూహ రచన చేసినట్టు భావిస్తున్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న మరో ఇద్దరు ఉగ్రవాదులను కూడా పోలీసులు గుర్తించారు. వారిలో ఒకరు సిరియన్ కాగా, మరొకరు ఫ్రాన్స్ జాతియుడని, అతనిపై ఉగ్రవాదిగా గతంలో కేసు నమోదైందని నిర్ధారించారు.

16:46 - November 16, 2015

హైదరాబాద్ : విదేశీ విశ్వ విద్యాలయాల్లో అడ్మిషన్లు కల్పించేందుకు గుంటూరు, కృష్ణాజిల్లాల్లో వందకుపైగా కన్సల్టెన్సీలు పనిచేస్తున్నాయి. విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసుకుని వచ్చిన వారికి ఇక్కడ ఉన్నతస్థాయి వేతనంతో కూడిన ఉద్యోగావకాశాలు లభిస్తున్న దృష్ట్యా అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, న్యూజిలాండ్, సింగపూర్ వంటి దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఎంఎస్, డిప్లొమా కోర్సులకు డిమాండ్ పెరిగింది.

ఐఇఎల్ టీఎస్ , టోఫెల్ లో అర్హత సాధించాలి.....

విదేశాల్లో చదవాలనే లక్ష్యం గల విద్యార్థులు ఐఇఎల్ టీఎస్,టోఫెల్ లో అర్హత సాధించాలి. అదే అమెరికాలో చదివేందుకు ఐఇఎల్ టీఎస్టో, టోఫెల్ తో పాటు అదనంగా జీఆర్ఈ లో అర్హత సాధించి ఉండాలి. ఇక్కడి వర్శిటీల్లో చదివేందుకు దరఖాస్తు చేసిన విద్యార్థులను ముందుగా అమెరికన్‌ ఎంబసీలోని అధికారులు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అ‌మెరికా తప్ప మిగతా దేశాల ఎంబసీలు విద్యార్థులకు ఇంటర్వ్యూతో పని లేకుండా నేరుగా అడ్మిషన్ కల్పిస్తున్నాయి.

కన్సల్టెన్సీ ద్వారా వెళితే పని సులువు.....

విద్యార్థులు నేరుగా కాకుండా కన్సల్టెన్సీ ద్వారా వెళితే ఈ పనులన్నింటినీ వారే పూర్తిచేస్తున్నారు. కన్సల్టెన్సీ నిర్వాహకులకు విద్యార్థులు ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. వర్శిటీలో అడ్మిషన్ ఖరారైన తర్వాత వర్శిటీ నిబంధనలకు మేరకు నిర్దేశిత ఫీజును వెస్ట్రన్ మనీ ట్రాన్స్ ఫర్, యూటీఐ ద్వారా ఆయా వర్శిటీలకు నేరుగా చెల్లించాలి. విదేశీ వర్శిటీలతో ఒప్పందం కుదుర్చుకున్న కన్సల్టెన్సీలకు ఆయా వర్శిటీలు కొంత మొత్తం మాత్రమే చెల్లిస్తాయి.

దరఖాస్తు చేయడం మొదలు ప్రతి అంశంలో కన్సల్టెన్సీదే బాధ్యత....

దరఖాస్తు చేయడం మొదలు సదరు విశ్వవిద్యాలయంలో చేరే వరకూ ప్రతి అంశాన్ని కన్సల్టెన్సీల నిర్వాహకులే పర్యవేక్షిస్తున్నాయి. ఇందుకు విద్యార్థులు చేయాల్సిందల్లా పేరొందిన కన్సల్టెన్సీని ఎన్నుకోవడమే.

గుంటూరు, కృష్ణాజిల్లాల నుంచే ఎక్కువగా విద్యార్థులు.......

ప్రతిభావంతులైన విద్యార్థులకు విదేశీ విశ్వ విద్యాలయాలు ఉపకార వేతనాలు మంజూరు చేసి, ప్రోత్సహిస్తున్నాయి. 20 ఏళ్ల క్రితం పరిస్థితులతో పోల్చితే విదేశాలకు వెళ్లి చదివే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గుంటూరు, కృష్ణాజిల్లాల నుంచే ప్రతి ఏటా 30 వేల నుంచి 50 వేల మంది వరకూ విద్యార్థులు విదేశాలకు క్యూ కడుతున్నారు. 

16:42 - November 16, 2015

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం మరింత ఊపందుకుంది. అగ్రనేతల రాకతో ఓరుగల్లు పోరుగల్లులా మారింది. టిఆర్ఎస్‌ ఎంపీలు బృందం వరంగల్ నగరంలో ప్రచారం నిర్వహిస్తూ తమ అభ్యర్థిని గెలిపించాలంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ బహిరంగ సభ, అధికార పార్టీపై ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడుల నేపథ్యంలో ఎంపీలు కేకే, జితేందర్‌రెడ్డి ని 'టెన్ టివి' పలుకరించింది. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

16:39 - November 16, 2015

హైదరాబాద్ : బాక్సైట్‌తవ్వకాలకు అనుమతివ్వడాన్ని వైసిపి పూర్తిగా వ్యతిరేకిస్తోందని, జి.వో నెం 97ను రద్దు చేయాలని వైసిపి నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి అని విమర్శించారు. ఎన్నికల ప్రణాళికలో బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకమని చెప్పిన ఆయన నేడు జి.వో విడుదల చేయడం ఏంటని ప్రశ్నించారు. బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వం వెనక్కు తగ్గేదాకా ఆందోళన నిర్వహిస్తామని ఆయన విశాఖపట్నంలో అన్నారు. 

ఐడీహెచ్‌ కాలనీ వాసులతో కలిసి భోజనం చేసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ ఐడీహెచ్‌ కాలనీలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించిన కేసీఆర్‌...సభానంతరం కాలనీ వాసులతో కలిసి భోజనం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు..కేంద్ర మంత్రి బండారు దత్తాత్తేయ, రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, పద్మారావు కూడా కాలనీవాసులతో కలిసి భోజనం చేశారు. డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల ప్రారంభోత్సవం రోజు బస్తీవాసులతో కలిసి భోజనం చేస్తానని ఆనాడు చెప్పానని..చెప్పినట్లుగానే ఇవాళ కలిసి భోజనం చేస్తున్నానని సీఎం కేసీఆర్‌ బస్తీవాసులతో అన్నారు. 

16:36 - November 16, 2015

హైదరాబాద్ :సికింద్రాబాద్‌ ఐడీహెచ్‌ కాలనీలో ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లల్లో తమకు ఇళ్లను కేటాయించలేదని బాధితులు ఆందోళన నిర్వహించారు. వందేళ్లుగా తాము ఐడీహెచ్‌ కాలనీలో ఉంటున్నామని..అయినా..సీఎం కేసీఆర్‌ తమకు ఎందుకు ఇళ్లను కేటాయించలేదని బాధితులు సర్కార్‌ను నిలదీశారు. తమకు ఇప్పటికైనా ఇళ్లను కేటాయించాలని వారు కోరారు. అయితే బాధితుల ఆందోళనపై మంత్రి తలసాని స్పందించి ఇళ్లు రానివారి దగ్గరనుంచి వినతిపత్రాల్ని స్వీకరించారు. తప్పకుండా అందరికి ఇళ్లను కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 

16:29 - November 16, 2015

హైదరాబాద్ : తమిళనాడును భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఏడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. చెన్నైకి దక్షిణాన బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన మరో అల్పపీడన ద్రోణి కారణంగా తమిళనాడులో మరో వారం రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే తీర ప్రాంతాల ప్రజలతోపాటు ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం చెరువుల్లా మారింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ప్రవహిస్తోంది. రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ప్రభుత్వం అప్రమత్తమైనా... సహాయ చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడటంతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. నిత్యవసర వస్తువుల కొనుగోలుకు కూడా వర్షం తెరపియ్యకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పటికే ప్రజలు అస్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ప్రభుత్వం ముందస్తుగానే పాఠశాలలు, కళాశాలలకు సోమవారం సెలవు ప్రకటించింది. గత పది రోజులుగా భారీ వర్షాల కారణంగా వ్యాధులు ప్రభలుతున్నాయి. ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.

బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి.....

మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణి ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైనా కనిపిస్తోంది. దీని ప్రభావంతో వచ్చే 24గంటల్లో దక్షిణ కోస్తాలో ఓ మోస్తరునుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.. గంటకు 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తారని విశాఖ వాతావరణ అధికారులు హెచ్చరించారు. మరో 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వారు అంచనావేస్తున్నారు. 

16:26 - November 16, 2015

హైదరాబాద్ : బాలీవుడ్ సీనియర్ నటుడు సయ్యద్ జాఫ్రీ కన్నుమూశారు. పంజాబ్ రాష్ట్రం మలేర్‌కోట్లాలో జన్మించిన సయ్యద్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జాఫ్రీ పలు భారతీయ, బ్రిటీష్ సినిమాల్లో నటించారు. అమితాబ్‌బచ్చన్, రిషికపూర్ వంటి నటులతో కూడా కలిసి పనిచేశారు. గాంధీ, మాసూమ్, పెన్నా, రామ్ తేరా గంగా మైలీ, చస్మేబద్దూర్, కైసే నా కెహనా, జుదాయి, అజుబా వంటి చిత్రాల్లో నటించారు. 1977లో జరిగిన ఫిలిం ఫేర్ అవార్డ్స్‌లో 'ది చెస్ ప్లేయర్స్' చిత్రంలో జాఫ్రీ నటనకు 'ఉత్తమ సహాయ నటుడు' పురస్కారం లభించింది. ఇదే చిత్రానికి సత్యజిత్ రే 'ఉత్తమ దర్శకుడు'గా పురస్కారం అందుకున్నారు. జాఫ్రీ మృతి పట్ల ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు పలువురు బాలీవుడ్, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

మాజీ ఎమ్మెల్యే పేర్నినానికి బెయిల్ తిరస్కరణ

కృష్ణా : మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్నినానికి జిల్లా కోర్టు బెయిల్ తిరస్కరించింది. పరిశ్రమలకు భూసేకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌కు నిరసనగా మచిలీపట్నంలో జరిగిన రెవెన్యూ సదస్సును అడ్డుకోవడంతోపాటు, ఎస్సైను దూషించాడన్న కారణంగా పేర్నినానిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇతడికి కోర్టు ఈ నెల 27తేదీ వరకు రిమాండ్ విధించింది. మరికొద్దిసేపట్లో పేర్నినానిని సబ్‌జైలుకు తరలించనున్నారు.

శ్రీకాళహస్తీశ్వరాలయంలోనికి భారీగా నీరు

చిత్తూరు : జిల్లాలో కురుస్తున్న వర్షాలకు శ్రీకాళహస్తి లోని శ్రీకాళహస్తీశ్వరాలయంలోనికి భారీగా నీరు చేరుతోంది. జిల్లాలో ఎడతెరిపి తెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి స్వర్ణముఖి నది పొంగి ప్రవహిస్తుండటంతో ఆలయంలోకి భారీగా నీరు చేరుతోంది. ఈ వర్షానికి పట్టణంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రయాణికులకు, భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

15:57 - November 16, 2015

హైదరాబాద్ : ఢిల్లీలో 4 నాలుగు రోజుల పాటు సుదీర్ఘం సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిశాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, దేశంలో నెలకొన్న సమస్యలపై కేంద్ర కమిటీ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల గురించి భవిష్యత్‌ కార్యాచరణ గురించి పొలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు'టెన్ టివి'కి వివరించారు. ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాటం ఎలా చేయాలి... ఎల్డీ ఎఫ్ ను బలోపేతం చేసేందుకు కావల్సిన మార్గదర్శకాలను చర్చించడం జరిగిందని తెలిపారు. ఈ అంశాలను ప్రతి రాష్ట్ర కమిటి చర్చించిన తరువాత కోల్ కతాలో జరిగే ప్లీనరీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

15:51 - November 16, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 400 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సికింద్రాబాద్‌ ఐడీహెచ్‌ కాలనీలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జరిగిందని సీఎం అన్నారు. ఇకనుంచి ప్రతిపేదవాడికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లను మాత్రమే నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 

15:49 - November 16, 2015

హైదరాబాద్ : వరంగల్‌లో వైఎస్సార్‌సిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రచారం మొదలైంది. నేటి నుంచి ఆయన నాలుగు రోజులపాటు నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు. వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయన ప్రచారం చేస్తారు. హైదరాబాద్ నుంచి జనగామ మీదుగా పాలకుర్తి చేరుకున్న జగన్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఓటర్లనుద్దేశించి ప్రసంగిస్తూ తమ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్‌ను గెలిపించాలని కోరారు. అన్ని పార్టీల సమావేశాలకు వచ్చినట్లే వైసిపి ప్రచారానికి కూడా జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

తమిళనాడులో ఆగని వర్షాలు

హైదరాబాద్ : తమిళనాడును భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఏడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. చెన్నైకి దక్షిణాన బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన మరో అల్పపీడన ద్రోణి కారణంగా తమిళనాడులో మరో వారం రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే తీర ప్రాంతాల ప్రజలతోపాటు ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం చెరువుల్లా మారింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ప్రవహిస్తోంది. రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ప్రభుత్వం అప్రమత్తమైనా...

కూకట్ పల్లిలో అక్రమంగా ఇళ్ల కూల్చివేత

హైదరాబాద్ : నగరంలోని కూకట్‌పల్లి ఎల్లమ్మబండలో దౌర్జన్యం జరిగింది. సర్వేనెం.57లోని ఇళ్లను గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా కూల్చివేశారు. 30 మంది ముసుగులతో వచ్చి దాడి చేసి ఇళ్లు కూల్చివేశారని ఇళ్ల యజమానుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు దుండగులను అరెస్ట్ చేసి జేసీబీని స్వాధీనం చేసుకున్నారు.

వరదల్లో చిక్కుకున్న 60 మంది కూలీలు..

నెల్లూరు: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కాలంగి నది, పాల కాలువ పొంగిపొర్లుతోంది. దొరవారిసత్రం మండలం వెదురుపట్టు దగ్గర పొలాల్లో 60 మంది కూలీలు చిక్కుకుపోయారు. కూలీలు పొలాల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరంతా కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన వారిగా గుర్తించారు. కూలీ పనుల నిమిత్తం వారు అక్కడికి వెళ్లినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.

కాలంగి రిజర్వాయర్ మూడు గేట్లు ఎత్తివేత

చిత్తూరు :జిల్లాలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి కాలంగి రిజర్వాయర్ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు రిజర్వాయర్ మూడు గేట్లు ఎత్తివేశారు. వరద ఉధృతికి బుచ్చినాయుడికండ్రిగ మండలంలోని సుద్దమిట్ట గిరిజన కాలనీ, సాహనగర్‌ కాలనీలు జలదిగ్భందంలోకి వెళ్లాయి. దీంతో వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

పత్రికలు, మీడియా ద్వారా రైతులకు భరోసా కల్పించాలి : హైకోర్టు

హైదరాబాద్ : రాష్ట్రంలో ఆత్మహత్యల నివారణకు రైతుల్లో భరోసా కల్పించేందుకు పత్రికల్లో, టీవీల్లో ప్రచారం నిర్వహించాలని హైకోర్టు సూచించింది. రైతుల ఆత్మహత్యలపై కోదండరాం వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై కౌంటర్ ఎందుకు దాఖలు చేయడం లేదని తెలంగాణ ప్రభుత్వ లాయర్‌ను ధర్మాసనం ప్రశ్నించించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు రైతు ఆత్మహత్యలపై ఏపీ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన సీఎం

హైదరాబాద్: ఐడీహెచ్ కాలనీలోని నూతన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఇవాళ ఆయన కాలనీలో ఏర్పాటు చేసిన వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్దిదారులకు పట్టాలు అందజేశారు. ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను 580 చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మించారు. 

14:51 - November 16, 2015

హైదరాబాద్ : పండుగలు, వివాహం లాంటి ప్రత్యేక సందర్భాలలో అతివలు ఆడంబరంగా రెడీ అవటానికి ఇష్టపడతారు. అందుకోసం మార్కెట్ లో అనేక రకాల ఫ్యాబ్రిక్స్ పై అందమైన హ్యాండ్ వర్క్ తో చక్కటి కలెక్షన్ అందుబాటులో ఉంటోంది. అలాంటి లేటెస్ట్ కలెక్షన్ తో ఇవాళ్టి సొగసు మీ ముందుకు వచ్చింది. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:49 - November 16, 2015

హైదరాబాద్ : మనిషి మనుగడ కోసం అనేక సౌకర్యాలను ఏర్పరచుకున్నాడు. అనేక ఆవిష్కరణలను సాధించాడు. కొత్త ఆవిష్కరణలతో ఒక వైపు ప్రకృతిలో విధ్వంసం సృష్టిస్తున్నప్పటికీ మరోవైపు ప్రకృతి సమతౌల్యత కోసం పరిశోధనలను వేగవంతం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ప్రక్రియను కనుగొన్నాడు. ఈ ప్రక్రియనే వ్యాపారానికి పెట్టుబడిగా చేసుకున్న వనిత సవితా సాయి. సవాళ్ళను స్వీకరించే ఆత్మవిశ్వాసం ఆమెను వ్యాపారం వైపు నడిపించింది. పర్యావరణ పరిరక్షణ కోసం.. ఉత్సాహం ఉరకలేసే వయసులో వ్యాపారంలోకి అడుగుపెట్టింది. లక్ష్యసాధన కోసం ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుని అలుపెరగని కృషి చేస్తోంది. ఆధునిక యువతకు భిన్నమైన రంగంలో కృషి చేస్తున్న సవిత సాయిని అభినందిస్తూ భవిష్యత్ లో మరెంతో మంది కస్టమర్స్ కు ఆమె సేవలు చేరాలని మానవి ఆశిస్తోంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

బస్సు - లారీ ఢీ : ఒకరి మృతి

ఖమ్మం : కల్లూరు మండలం హనుమ తండా వద్ద ఓ బస్సు, లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ శ్రీరాముల రమేష్(30) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ వాసిగా గుర్తించారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

14:01 - November 16, 2015

గుంటూరు : ఎపిని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లాలోని ల్యామ్ ఫామ్ లో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎపి అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్నారు. వ్యవసాయరంగంలో ఎపి ముందుందని పొగిడారు. ఎపి వ్యవసాయ విశ్వవిద్యాలయం సెంట్రల్ యూనివర్సిటీగా ఉంటుందని చెప్పారు. వాణిజ్య పంటలు పండిచడంలో గుంటూరు జిల్లా ముందుస్థానంలో ఉందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ ట్రెయినింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎపిని కేంద్రం పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విభజన హేతుబద్ధంగా జరగలేదని తెలిపారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేశారు. విశాఖలో ఐఐఎమ్ ఏర్పాటు, ప.గో జిల్లాలో ఎన్ ఐటి ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కర్నూలులో ఇప్పటికే ఉర్దూ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశామని తెలిపారు. అభివృద్ధికి విద్య దోహదం చేస్తుందని... పేదరికాన్ని నిర్మూలిస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయంరంగంలో సంక్షోభం రావడానికి వీల్లేదన్నారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలన్నారు.

 

13:51 - November 16, 2015

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. రైతు ఆత్మహత్యల నివారణకు ఏం చేస్తున్నారో చెప్పాలని రెండు ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారని తెలుగు ప్రభుత్వాలను కోర్టు ప్రశ్నించింది. మరో వైపు రైతు ఆత్మహత్యలపై ఏపీ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టామని ఏపీ తెలిపింది. కౌంటర్‌ దాఖలు చేయాలని టీ ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. టీ ప్రభుత్వం కరవు మండలాలు ప్రకటించలేదని పిటిషనర్‌ పేర్కొన్నారు. 

13:46 - November 16, 2015

హైదరాబాద్ : ఎపిలోని పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం కురుస్తుంది. చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తునాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి. పలు చెరువులు తెగిపోయాయి. ప్రధాన రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టాయి.
తిరుపతి జలమయం
అల్పపీడనం తాకిడికి తిరుపతి జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగాను ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు కలెక్టర్‌ సెలవు ప్రకటించారు.
శ్రీకాళహస్తిలో భారీ వర్షం
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వర్షం భీభత్సం సృష్టించింది.. రికార్డు స్థాయిలో ఇక్కడ 15.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.. భారీగా చేరిన వరదనీటితో స్వర్ణముఖి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.. ఈ స్థాయిలో నదీప్రవాహం పదేళ్లతర్వాత ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు.. ఇక కెవిబి పురం మండలంలోని కాళంగి రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయింది.. కరకట్టలమీదుగా నీరు ప్రవహిస్తోంది.. రిజర్వాయర్ గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తివేసేందుకు అధికారులు ప్రయత్నించారు.. అయితే కొన్ని గేట్లుమాత్రం ఓపెన్ చేయగలిగారు.. గేట్ల లాక్‌లు తెరచుకోకపోవడంతో వాటిని తెరవడం వీలుకాలేదు.. అప్పటికే వరద ఉధృతికి ఒక గేట్‌ కొట్టుకొని పోయింది..
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడం ప్రభావం.. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలను అతలాకుతలం చేస్తోంది. ఆదివారం నుంచీ కుండపోతగా.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి ఆలయం ముందుభాగం మొత్తం జలమయమైంది. తిరుమలేశుని దర్శనానికి వచ్చిన భక్తులు గదుల నుంచి బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. కుండపోత వర్షాల కారణంగా.. తిరుగిరుల్లో కొండ చరియలు విరిగి పడుతూనే ఉన్నాయి. కుండపోత వర్షాల కారణంగా.. రెండో ఘాట్‌లోని భాష్యకారి సన్నిధి వద్ద.. రాదారి కుంగిపోయింది. ఈ రహదారి మార్గం ప్రమాదకరంగా మారింది. పైగా తాజా వర్షాల వల్ల.. రహదారి మరమ్మతు పనులకు అంతరాయం కలుగుతోంది. లింక్‌ రోడ్డు ద్వారా వాహనాలను కొండపైకి పంపుతున్నారు. మరోవైపు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల.. తిరుమలలోని జలాశయాలన్నింటా... నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరింది. గోగర్భం, పాపవినాశనం జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఇంకోవైపు.. భారీ వర్షాల కారణంగా.. చెన్నై-తిరుపతి మార్గంలో రైళ్లు సుమారు రెండు నుంచి మూడు గంటల ఆలశ్యంగా నడుస్తున్నాయి.
నెల్లూరు జిల్లాలో వర్షాలు..
నైరుతి బంగాఖాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా.. నెల్లూరు జిల్లాలో.. ఆదివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. జిల్లాలో అత్యధికంగా వెంకటగిరిలో 24 సెంటీమీటర్ల వర్షపాతం, బాలాయపల్లిలో 14, డక్కిలిలో 10 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఎక్కడికక్కడ వరద నీటితో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. కైవల్య, పంబలేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదనీరు రహదారులపైకీ చేరడంతో.. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. గూడురు-విందూరు మార్గంలో వరద ఉధృతి కారణంగా.. రాకపోకలు స్తంభించి పోయాయి. అధికారులు ప్రత్యేకంగతా కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు చేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మూడు రోజుల క్రితం వరకూ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఇంతలోనే మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండడంతో.. ప్రజలు.. ముఖ్యంగా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రొయ్యల చెరువులు నీట మునిగాయి. తాజా వర్షాలు.. అక్వా రైతాంగాన్ని తీవ్రంగా కలవర పరుస్తున్నాయి.

 

 

13:39 - November 16, 2015

విశాఖ : బాక్సైట్‌ తవ్వకాలకోసం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. బాక్సైట్‌ తవ్వకాలపై ప్రభుత్వ కుట్రకు వ్యతిరేకంగా విశాఖలో వాల్‌పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి లోకనాథం టెన్ టివితో మాట్లాడారు. గిరిజన సలహామండలి ఏర్పాటు చేయాలన్నారు. బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పారు.

 

13:18 - November 16, 2015

గుంటూరు : ఎపి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సూచించారు. గుంటూరులో ఎపి వ్యవసాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఆయన ఉపన్యసించారు. ఎపికి అమరావతే రాజధాని అని స్పష్టం చేశారు. అభివృద్ధికిని పెంచాలి.. పంచాలి అన పిలుపునిచ్చారు. కొత్త రాజధానికి రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్ర సాయం చేస్తుందని చెప్పారు. ఎపికి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విజయవాడ దుర్గమ్మ వంతెన విస్తరణకు నిధుల మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎపికి సంబంధించి ప్రతి విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. గత పాలకులు పేదలకు మాటలు.. ధనికులకు మూటలు అందిచారని విమర్శించారు. విపక్షాలు వ్యంగ్య మాటలతో అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల గడ్డిబొమ్మలు తగలబెట్టే పార్టీలు వచ్చాయని ఎద్దేవా చేశారు. ప్రపంచం ఇండియా వైపు చూస్తుందన్నారు. మోడీ వెనుక ఉన్న భారత్ వైపు చూస్తోందని స్పష్టం చేశారు. మోడీ అంటే త్రిడి అని అభివర్ణించారు. 

వరంగల్‌ కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు

హన్మకొండ : వరంగల్‌ కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు భగ్గుమన్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ కేడర్‌ రెండుగా చీలింది. రాయపర్తి మండల కేంద్రంలో ప్రచారంలో కాంగ్రెస్‌ శ్రేణులు బాహాబాహీకి దిగారు.

 

13:03 - November 16, 2015

కోల్ కతా : సీపీఎం ప్లీనమ్ సమావేశాలకు వేదిక ఖరారైంది. డిసెంబర్ 27 నుంచి 31 వరకు కోల్‌కతాలో సమావేశాలు జరపాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయించారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణే లక్ష్యంగా కోల్‌కతాలోని చారిత్రక బ్రిగేడ్‌ పెరేడ్‌ మైదానంలో భారీ ర్యాలీకి కూడా పార్టీ అగ్రనేతలు ప్రణాళిక సిద్ధం చేశారు.
కేంద్ర కమిటీ సమావేశాల్లో నిర్ణయం
ఢిల్లీలో జరుగుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో కోల్‌కతాలో ప్లీనమ్‌ నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్‌ 27 నుంచి ఐదు రోజులు పాటు జరిగే సమావేశాల్లో దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. సమావేశాల్లో భాగంగా బెంగాల్‌లో ప్రజాస్వామ్యం పునరుద్ధణ లక్ష్యంగా వచ్చేనెల 27న కోల్‌కతాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.
ప్లీనమ్‌ కు 436 మంది ప్రతినిధులు
కోల్‌కతా ప్లీనమ్‌ కు 436 మంది ప్రతినిధులు హాజరవుతారు. ఈ సమావేశాల కోసం బెంగాల్‌ వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. వేలాది కళాజాతాలు పనిచేస్తున్నాయి. లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు పొల్గొంటున్నారు. రాష్ట్రంలోని టీఎంసీ సర్కార్‌, కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌ అవలంభిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. బెంగాల్‌ ఫ్లాట్‌ఫారమ్‌ ఆఫ్‌ మాస్‌ ఆర్గనైజేషన్స్‌ పేరుతో 113 వామపక్ష సంఘాలకు చెందిన కళాజాతాలు ప్రచారం నిర్వహించనున్నాయి. రాష్ట్రంలోని 77,242 పోలింగ్‌ బూత్‌లకు గాను.... మొదటిదశలో 64,222 బూత్‌ల పరిధిలో ప్రచారోద్యమం నిర్వహిస్తున్నారు. మొత్తం 11,269 కళాజాతాల్లో 17 లక్షల మంది కార్యకర్తలు పాల్గొంటున్నారు. కళాజాతాల్లో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో 11,313 సభలు, సమావేశాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నాలుగున్నరేళ్ల టీఎంసీ పాలనలో రాష్ట్రంలో హింస పెరిగిపోయిందని సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో ఆందోళన వ్యక్తమయ్యింది. సీపీఎం కార్యకర్తలు హత్యకు గురువుతున్నారని, కోల్‌కతా ప్లీనమ్‌ ర్యాలీ ద్వారా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కార్‌కు సమాధానం చెబుతామని పార్టీ ప్రధాన్య కార్యదర్శి సీతారాం ఏచూరి హెచ్చరిస్తున్నారు.
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం
వచ్చే ఏడాది జరిగే కేరళ, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలపై కూడా కోల్‌కతా ప్లీనమ్‌లో సీపీఎం నాయకులు చర్చిస్తారు. భవిష్యత్‌లో జరిగే అన్ని ఎన్నికల్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని, వామపక్షాలు పుంజుకుంటాయని పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు చెబుతున్నారు. కోల్‌కతా ప్లీనమ్‌ ద్వారా పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమరశంఖం పూరించాలన్న యోచనలో సీపీఎం నాయకులు ఉన్నారు.

 

12:56 - November 16, 2015

కృష్ణా : జిల్లాలోని గుడివాడలో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు టీడీపీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న, గుడివాడ టీడీపీ ఇన్‌ఛార్జీ వెంకటేశ్వరరావు యత్నించారు. వీరిని పోలీసులు అడ్డగించారు. టీడీపీ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

 

వైసిపి నేత పేర్ని నాని అరెస్టు

కృష్ణా : జిల్లాలో వైసిపి నేతల అరెస్టు పర్వం కొనసాగుతోంది. వైసిపి నేత, మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నానిని పోలీసులు అరెస్టు చేశారు.

హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ

హైదరాబాద్ : హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ కొనసాగింది. రూ.570 కోట్ల డిపాజిట్లు, రూ.7 లక్షలు, రెండున్నర కిలోల బంగారాన్ని హైకోర్టు ప్రత్యేక అకౌంట్లలో జమచేయాలని కోర్టు ఆదేశించింది. సీఐడీ దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఆదేశించింది. అయితే గురువారం వరకు నివేదిక ఇస్తామని సీమన్‌ కమిటీ కోర్టుకు తెలిపింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. 

12:40 - November 16, 2015

హైదరాబాద్ : హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ కొనసాగింది. రూ.570 కోట్ల డిపాజిట్లు, రూ.7 లక్షలు, రెండున్నర కిలోల బంగారాన్ని హైకోర్టు ప్రత్యేక అకౌంట్లలో జమచేయాలని కోర్టు ఆదేశించింది. సీఐడీ దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఆదేశించింది. అయితే గురువారం వరకు నివేదిక ఇస్తామని సీమన్‌ కమిటీ కోర్టుకు తెలిపింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా

పడింది. 

12:36 - November 16, 2015

కృష్ణా : జిల్లాలో వైసిపి నేతల అరెస్టు పర్వం కొనసాగుతోంది. వైసిపి నేత, మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నానిని పోలీసులు అరెస్టు చేశారు. మద్యం షాపుల వద్ద లూజ్ అమ్మకాల విషయంలో నాని, అధికారుల మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులపై దురుసుగా ప్రవర్తించాడని ఆయనపై ఫిర్యాదు రావడంతో పోలీసులు నానిని అదుపులోకి తీసుకున్నారు. చిలకలపూడి పీఎస్ కు తరలించారు. పేర్ని నాని బందర్ వైసిపి ఇంచార్జీగా ఉన్నారు. నిన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నాని అరెస్టుపై ఆ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. వీరి అరెస్టులతో జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

 

12:21 - November 16, 2015

హన్మకొండ : వరంగల్‌ ఉప ఎన్నిక ప్రచారంలో మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ చేసిన వ్యాఖ్యలు సరికావని టీఆర్ ఎస్ నేత కే కేశవరావు అభిప్రాయపడ్డారు.ఈమేరకు వరంగల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది టీఆర్‌ఎస్‌ పార్టీయేనని మరోసారి తేల్చి చెప్పారు. ఎన్నో పోరాటాలు చేశాకే తెలంగాణ ఇచ్చారుని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీపై తమకు గౌరవముందన్నారు. అయితే హస్తం నేతలు అనవసర విమర్శలు మానుకోవాలని హితవుపలికారు.

 

12:12 - November 16, 2015

హైదరాబాద్ : ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆరు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, కట్టలు తెగుతున్న చెరువులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో రెండో పంట అవకాశంపై పరిశీలించాలని సూచించారు.

11:56 - November 16, 2015

నల్లగొండ : కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నకూతురిని కడతేర్చాడు ఓ కసాయి తండ్రి. చిన్నారి ఆలనాపాలన చూసుకోవాల్సిన నాన్నే ఆమెను చిదిమేశాడు. నెల వయసున్న పాపకు పురుగులమందు తాగించి హత మార్చాడు. ఈ దుర్ఘటన నల్లగొండ జిల్లా మట్టంపల్లి మండలం లాలీతండాలో జరిగింది. శిశువు పుట్టినప్పటి నుంచే ఆమెపై కోపం పెంచుకున్న తండ్రి తరచూ పాపను వేధించేవాడు. తల్లి లేని సమయం చూసి చిన్నారికి పురుగులమందు తాగించాడు. అసలే పసిప్రాణం... పైగా లేత పేగులు కావడంతో పురుగులమందు తాగిన కొద్ది నిమిషాల్లోనే పాప ప్రాణాలు విడిచింది. తర్వాత విషయం తెలుసుకున్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

 

11:46 - November 16, 2015

తూర్పుగోదావరి : కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో.. తూర్పుగోదావరి జిల్లాలో శివాలయాలు, పంచారామ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాజమండ్రి పుష్కరఘాట్‌, కోటిలింగాల రేవులతో పాటు తీర ప్రాంత్రంలో మహిళలు పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజామునుంచే మహిళలు కార్తీక దీపాలను నదిలో వదిలి పూజలు జరిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పోలీసులు, కార్పొరేషన్‌ సిబ్బంది చర్యలు చేపట్టారు.
భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు
కార్తీక తొలి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దక్షిణకాశీగా విరాజిల్లుతున్న తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని పాదగయ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. సూర్యోదయానికి ముందే పుష్కరిణిలో స్నానాలు చేసి కార్తీక దీపాలను వెలిగించారు.

 

11:42 - November 16, 2015

హన్మకొండ : వరంగల్‌ కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు భగ్గుమన్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ కేడర్‌ రెండుగా చీలింది. రాయపర్తి మండల కేంద్రంలో ప్రచారంలో కాంగ్రెస్‌ శ్రేణులు బాహాబాహీకి దిగారు. 

ఇండియాలో టైటానిక్ హీరో రహస్య పర్యటన

హైదరాబాద్‌ : టైటానిక్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్నాడు హీరో లియోనార్డో డికాప్రియో. ఇండియాలో కూడా ఈ హీరోను చాలామంది సినీ అభిమానులు గుర్తుపడతారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో చాలామంది భామలకు డికాప్రియా అంటే చాలా ఇష్టం. కరీనా కపూర్ నుంచి సోనమ్ కపూర్ వరకు ఎంతోమంది భామలకు లియోనార్డో కలల రాకుమారుడు. అలాంటి వరల్డ్ ఫేమస్ హీరో అత్యంత రహస్యంగా ఇండియాలో ప్రవేశించాడు. సీక్రెట్ గా తన పని తాను చేసుకోపోయాడు. ఇంతకీ భారత్ లో డికాప్రియో ఏం చేశాడు. ఓ డాక్యుమెంటరీలో నటించేందుకు ఇండియా వచ్చాడు లియోనార్డో.

రెండో అంతస్తు కిటికి పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్న గర్భిణీ

హైదరాబాద్ : పారిస్‌ దాడిలో 100 మంది పైగా కాల్పుల్లో మరణించారు. అయితే బాటాక్లన్‌ థియేటర్‌ వద్ద ఉగ్రవాదులు దారుణంగా కాల్పులతో దద్దరిల్లిపోయింది. ముష్కరులు విచక్షణరహితంగా తుటాల వర్షంతో జనాలను పోట్టనపెట్టుకున్నారు. మిగిలినవారు తప్పించకునేందుకు తలోదిక్కు పరుగులు పెట్టారు. ఆ సమయంలో ఓ మహిళ థియేటర్‌ రెండో అంతస్తు కిటికి అంచులను పట్టుకొని 'రక్షించండి నేను గర్భవతిని' అంటూ సాయం కోసం అరిచింది. ఉత్కంఠ పరిణామాల మధ్య ఆ గర్భిణీ ప్రాణాలను దక్కించుకుంది. ఓ సాహసి ఆమెను చూసి పైకి లాగడంతో బతికి బయటపడింది. థియేటర్‌కు దగ్గర భవనంలో ఉంటున్న జర్నలిస్టు ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీశారు.

వరంగల్ చేరుకున్న జగన్

హన్మకొండ : వరంగల్ లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయల్దేరివెళ్లారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరిన వైఎస్ జగన్ వరంగల్ జిల్లాకు వెళ్లారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఈ రోజు సాయంత్రం తొర్రూరులో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు.

 

శ్రీసోమేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

పశ్చిమగోదావరి : కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని శ్రీసోమేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈరోజు తెల్లవారుజామునుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. శివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

నాటి ఇండో-చైనా యుద్ధంలో పేలని బాంబు లభ్యం..

హైదరాబాద్ : 1969 ఇండో-చైనా యుద్ధం నాటి పేలని బాంబు ఒకటి బయటపడింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పశ్చిమ సియాంగ్ జిల్లాలో సైనిక స్థావరం విస్తరణలో భాగంగా తవ్వకాలు చేపట్టినప్పుడు ఈ బాంబును గుర్తించారు. ఇది 3.5 కేజీల బరువు ఉందని, 7.96 సెంటీమీటర్ల పొడువు ఉందని ప్రాజెక్టు మేనేజర్ కర్నల్ ఆర్ పార్థసారధి తెలిపారు. ఈ బాంబును సైన్యం స్వాధీనం చేసుకున్నది.

నేడు నిజామాబాద్‌ జిల్లాలో ఫుడ్‌పార్కుకు శంకుస్థాపన

నిజామాబాద్‌ : జిల్లాలోని లక్కంపల్లి సెజ్‌లో నేడు ఫుడ్‌పార్క్ ను శంకుస్థాపనకు ఇద్దరు కేంద్రమంత్రులు, ఎంపీ కవిత హాజరుకానున్నారు.

భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

హైదరాబాద్‌ : అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళా ఉదయం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సహాయచర్యలపై సూచనలు ఇచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కట్టలు తెగుతున్న చెరువులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని, నిండిన చెరువుల్లోని నీటిని వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

తమిళనాడులో భారీ వర్షాలు

హైదరాబాద్ : తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండటంతో నేడు రాష్ట్రం మొత్తం ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటిచింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిచింది.

10:16 - November 16, 2015

టర్కీ : ఐఎస్ ఐఎస్ తీవ్రవాదులు మళ్ళీ రెచ్చిపోయారు. టర్కీలో ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. టర్కీలోనే జీ-20 సమావేశాలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా, భారత ప్రధాని మోడీ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఒబామా, మోడీ ప్రస్తుతం టర్కీలోనే ఉన్నారు.

 

09:52 - November 16, 2015

ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని పారదర్శకంగా విచారిస్తే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చ కార్యక్రమంలో విశ్లేషకుడు తెలకపల్లిరవి, టిడిపి నేత సూర్యప్రకాశ్, బిజెపి నాయకురాలు పాదూరి కరుణ, టీఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకమర్రి నర్సింహ, వైసిపి నేత కరణం ధర్మశ్రీ పాల్గొని, మాట్లాడారు. గంగిరెడ్డి అరెస్టును రాజకీయంగా చూడడం మంచిది కాదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

09:43 - November 16, 2015

మహిళా టీచర్ల సమస్యలను పరిష్కరించాలని యూటీఎఫ్ నాయకురాలు లీలా డిమాండ్ చేశారు. ఇదే అంశంపై జనపథం చర్చ కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాటారు. పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రధానంగా మరుగుదొడ్లు, టాయిలెట్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21, 22 తేదీల్లో మహిళా టీచర్ల జాతీయ సదస్సు హైదరాబాద్‌లో జరగబోతోంది. ఈ సందర్భంగా మహిళా టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, బాలికా విద్య విషయంలో ఉన్న అవరోధాలు తదితర అంశాలపై లీలా మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

09:32 - November 16, 2015

చిత్తూరు : ఎపిలోని పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం కురుస్తుంది. చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తునాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి. పలు చెరువులు తెగిపోయాయి. ప్రధాన రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టాయి.
చిత్తూరులో...
చిత్తూరు జిల్లా వ్యాప్తంగాను ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు కలెక్టర్‌ సెలవు ప్రకటించారు. నేడు జరగాల్సిన ఎస్‌వీ వర్సిటీ పీజీ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.
తిరుమలలో
తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలుచోట్ల చెరువులు, జలాశయాలు పొంగుతున్నాయి. జలాశయాలన్ని నీటితో కళకళలాడుతున్నాయి. పాపవినాశం గేట్లను అధికారులు ఎత్తేశారు. కుమారధార డ్యాంకు భారీగా నీరు చేరుతోంది. ఘాట్‌రోడ్డు ప్రమాదకరంగా మారింది. అటు ఘాట్‌ రోడ్డులో మరమ్మతు పనులకు అంతరాయం ఏర్పడింది.
నెల్లూరులో
నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి... కావలి, సూళ్లూరుపేటలో భారీవర్షం ముంచెత్తింది.. దెగదర్తి మండలంలో రామన్న చెరువు పొంగిపొర్లుతోంది.. వరదనీరు రోడ్లపైకి చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.. కొండాపురం మండలం కుమ్మి అగ్రహారం దగ్గర వరికుంటవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది..

 

 

 

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

హైదరాబాద్ : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.. దీని ప్రభావంతో వచ్చే 24గంటల్లో దక్షిణకోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు. 

09:21 - November 16, 2015

హైదరాబాద్ : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.. దీని ప్రభావంతో వచ్చే 24గంటల్లో దక్షిణకోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు.. ఇప్పటికే తీరం వెంబడి గంటకు 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు..

 

09:15 - November 16, 2015

ఖమ్మం : జిల్లాలోని ఇల్లందులో దారుణం జరిగింది. కుటుంబకలహాలు ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నాయి. ఉద్యోగం కోసం సొంత అన్నావదినల్ని చంపేశాడో దుర్మార్గుడు. ఇల్లందులోని 13 వ బస్తీ లలితాకళా మందిర్‌లో ఉండే కమలమ్మకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు బిడ్డలున్నారు. భర్త చనిపోవడంతో అతని ఉద్యోగాన్ని సింగరేణి సంస్థ.. కమలమ్మకు ఇచ్చింది. కమలమ్మ తన డిపెండెంట్ ఉద్యోగం పెద్దకుమారునికి ఇచ్చేందుకు సిద్ధమయినట్లు సమాచారం. అయితే ఈ ఉద్యోగాన్ని తనకు ఇవ్వాలంటూ చిన్నకొడుకు విల్సన్‌బాబు తరచు తల్లితో ఘర్షణ పడేవాడు. ఈ గొడవకాస్తా ముదరడంతో ఆగ్రహించిన విల్సన్‌బాబు అన్నావదినలు నిద్రిస్తున్న సమయంలో వారిపై రోకలిబండతో దాడి చేశాడు. వదిన అక్కడిక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన అన్నను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విల్సన్ బాబు పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు

చిత్తూరు : జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, జలాశయాలు పలు చోట్ల పొంగుతున్నాయి. వరదయ్యపాలెం మండలం సంతవెల్లూరు వద్ద చెరువుకట్ట తెగింది. తిరుపతి, చెన్నై మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని స్వర్ణముఖి, పింఛా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కలవగుంట ఎన్ టిఆర్ జలాశయం నిండింది. కళ్యాణి డ్యామ్ కు భారీగా వర్షపు నీరు చేరింది. వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. పుత్తూరు మండలం గంగమాంబపురం జలదిగ్బంధంలో ఉంది. సాయం కోసం 80 కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. 

నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు

నెల్లూరు : జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కావలి, సూళ్లూరుపేటలో భారీ వర్షం కురిసింది. దగదర్తి మండలంలో రామన్నచెరువు పూర్తిగా నిండింది. రోడ్లపైకి నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కొండాపురం మండలం కుమ్మిఆగ్రహారం వద్ద వరికుంట వాగు పొంగి ప్రవహిస్తోంది.

 

ఇల్లెందులో దారుణం

ఖమ్మం : జిల్లాలోని ఇల్లెందులో దారుణం జరిగింది. కటుంబకలహాలు ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నాయి. అన్నావదినలను తమ్ముడు దారుణంగా హత మార్చాడు. నిద్రిస్తుండగా రోకలిబండతో మోది హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

 

గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

గుంటూరు : జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. 

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

ప్రకాశం : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జలాశయాల్లో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరింది. 

08:15 - November 16, 2015

హన్మకొండ : వరంగల్‌ బై పోల్‌లో డబ్బులు ఎరగా చూపెట్టి ఓటు వేయించుకునే పనిలో పడింది కాంగ్రెస్‌. ఆ పార్టీకి చెందిన నేతలు భూపాలపల్లిలో సభా ప్రాంగణం సమీపంలోనే డబ్బులు పంచిపెడుతూ కెమెరా కంటికి చిక్కారు. దీంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ సైతం డబ్బులు పంచే కార్యక్రమంలోకి దిగందనే సంగతి బయటపడింది.

 

08:02 - November 16, 2015

వరంగల్ : ఇంతకాలం ఇల్లిల్లు తిరిగారు.. వీధి వీధినా ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించారు.. కార్యకర్తలతో కలిసి.. ఊరూరా ప్రచారాన్ని హోరెత్తించారు. సమయం మరీ తక్కువగా ఉండడంతో ఇప్పుడు బహిరంగ వేదికలపైనే అభ్యర్థులు దృష్టి సారించారు. చరిష్మా కలిగిన నేతలను రప్పించి.. ఓట్లను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నాలుగు రోజులూ.. ఓరుగల్లులోని ప్రధాన కూడళ్లు.. బహిరంగ సభా వేదికలు కానున్నాయి.
ప్రచారానికి ఇక నాలుగు రోజులే
ఓరుగల్లు ఉప ఎన్నిక ప్రచారానికి ఇక నాలుగు రోజులే మిగిలింది. దీంతో అభ్యర్థులు వీలైనంత మంది ఓటర్లను కలుసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తొలినాళ్లలో నాయకులను సరిచేసుకోవడంలో బిజీగా గడిపిన నాయకులు.. ప్రస్తుతం ఇల్లిల్లూ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సమయం మరీ తక్కువగా ఉండడంతో.. వీరంతా బహిరంగ వేదికలపై దృష్టి సారిస్తున్నారు. ప్రచారం ఆఖరు రోజుల్లో పబ్లిక్‌ మీటింగుల్లో ప్రసంగించే ప్రముఖ నేతల చరిష్మాతో ఓటర్ల మనసు గెలవాలని సన్నాహాలు చేసుకుంటున్నారు.
బహిరంగ సభలపై టీఆర్ ఎస్ దృష్టి
ఓరుగల్లు ఉప ఎన్నికలో గెలుపు తప్పనిసరి అని భావిస్తున్న టీఆర్ఎస్‌ పార్టీ.. యంత్రాంగాన్ని భారీగా మోహరించింది. ఇప్పటికే నియోజకవర్గానికి ఓ మంత్రిని ఇంచార్జిగా పెట్టి.. తత్కాల్‌ వ్యూహరచనలతో దూసుకు వెళుతోంది. ఓవైపు.. ప్రచార సభల్లో పాల్గొంటూనే.. ఇతర పార్టీల నేతలపై ఆపరేషన్‌ ఆకర్ష్‌ అస్త్రాన్ని ప్రయోగిస్తూ.. బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ప్రచారానికి ఇక నాలుగు రోజులే గడువు ఉండడంతో.. ఇప్పుడు ఆ పార్టీ కూడా బహిరంగ సభలపై దృష్టి సారిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రప్పించి మరింత మంది ఓటర్లను ఆకట్టుకోవాలని సన్నాహాలు చేస్తోంది.
దేవయ్య ఒంటరి పోరు
ఎన్‌డీఏ అభ్యర్థి దేవయ్య.. బీజేపీ-టీడీపీల ఉమ్మడి అభ్యర్థే.. కానీ ప్రచారంలో.. ఆయన ఒంటరి పోరే సాగిస్తున్నారు. సొంతపార్టీ నేతలు, కలసిరాని మిత్రపక్షమూ.. ప్రచారంలో దేవయ్యను వెనుకబడేలా చేశాయి. దీంతో దేవయ్య ఇప్పుడిక బహిరంగ సభలపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. వచ్చే నాలుగు రోజులూ పూర్తిగా బహిరంగ సభల ద్వారానే ఓట్లు అభ్యర్థించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా.. ఏడు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలను ప్లాన్‌ చేశారు. కేంద్రమంత్రులను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రచారాన్ని హోరెత్తించిన గాలి వినోద్‌కుమార్‌
ఎన్నికల షెడ్యూల్‌ వెలువడగానే.. అభ్యర్థిని ఖరారు చేసిన వామపక్షాలు.. ఉమ్మడి అభ్యర్థి గాలి వినోద్‌కుమార్‌ తరఫున ప్రచారాన్ని హోరెత్తించాయి. నియోజకవర్గాల్లోని వామపక్ష నేతలతో కలిసి ప్రచారం ముగించారు. మండల స్థాయుల్లోనూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఎక్కడికక్కడ ఎన్నికల చిహ్నం.. గ్యాస్‌ సిలిండర్‌ను.. ప్రజల్లోకి చేర్చేందుకు వినూత్నంగా ప్రచారం చేశారు. ఇక ఇప్పుడు ప్రచారానికి గడువు ముగిస్తున్న తరుణంలో.. ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించేందుకు.. మరిన్ని బహిరంగ సభలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు.
జగన్ ప్రచారం...
అటు వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌ కూడా.. ఇప్పుడు బహిరంగ సభలపై దృష్టి సారించారు. ఇప్పటివరకూ పార్లమెంటు సెగ్మెంట్‌లోని ఏడు నియోజకవర్గాల్లో రోజాతో రోడ్‌షోలు నిర్వహింప చేశారు. సోమవారం నుంచి.. పార్లమెంటు సెగ్మెంట్‌లోని వీలైనన్ని మండలాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఓట్లు అభ్యర్థించాలని సూర్యప్రకాశ్‌ యోచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి బహిరంగసభలోనూ.. పార్టీ అధ్యక్షుడు జగన్‌తో మాట్లాడింప చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

 

07:52 - November 16, 2015

కడప : మోస్టు వాంటెడ్ ఎర్రచందన స్మగ్లర్‌ కొల్లం గంగిరెడ్డికి ప్రొద్దుటూరు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అంతకముందు ఇవాళ తెల్లవారుజామున గంగిరెడ్డికి రిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రొద్దుటూరు కోర్టు అదనపు జడ్జీ ఎదుట అతన్ని పోలీసులు హాజరుపర్చారు. గంగిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించాడు. అతన్ని కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
ఎట్టకేలకు చిక్కిన గంగిరెడ్డి
మోస్ట్ వాంటెడ్‌గా ఏపీ పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ కొల్లం గంగిరెడ్డిని ఏపీ సీఐడీ పోలీసులు ఎట్టకేలకు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మారిషస్‌ ఇంటర్‌పోల్ అధికారులు గంగిరెడ్డిని శనివారం ఢిల్లీకి తీసుకురాగా..అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత భారీ పోలీస్‌ బందోబస్త్‌ మధ్య గంగిరెడ్డిని హైదరాబాద్‌లోని ఏపీ డీజీపీ కార్యాలయానికి తరలించారు. అనంతరం కొల్లం గంగిరెడ్డిని ఏపి పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
సాధారణ కూలీ నుంచి అంతర్జాతీయ స్మగ్లర్‌
మారిషస్ నుండి కోర్టు ద్వారా తీసుకు రావడానికి విదేశీ నిబంధనలు అడ్డుస్తున్నాయని డీజీపీ రాముడు తెలిపారు. దీంతో గంగిరెడ్డి వద్ద ఉన్న దొంగ పాస్ పోర్టును రద్దు చేసి ఎక్సాడ్రిషన్ పేరుతో ఇక్కడికి తీసుకోచ్చేందుకు ఏపీ పోలీసులకు సుమారు ఎనిమిదిన్నర నెలలు పట్టింది. ఓ సాధారణ కూలీ స్థాయి నుంచి నేడు అంతర్జాతీయ స్మగ్లర్‌గా గంగిరెడ్డి ఎదిగాడని డిజిపి రాముడు తెలిపారు. అతనిపై చిన్నపాటి నేరాలు, హత్యలు, ఓ మర్డర్ కేసు కూడా ఉందన్నారు. ఓ హత్యాయత్నం కేసులో జైలు శిక్ష అనుభవించిన గంగిరెడ్డి,..ఆ తరువాత ఎర్రచందనం కేసులో కొంత కాలంపాటు జైలులో ఉన్నాడని తెలిపారు.
తన టైం బాగోలేక ఇలా జరిగిందన్న గంగిరెడ్డి
గంగిరెడ్డి మారిషస్‌లో ఉన్నాడని ఏపీ పోలీసులకు సమాచారం అందిన వెంటనే..పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే ఇంటర్ పోల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో మారిషస్‌ నుంచి మరో దేశానికి వెళ్తూ అడ్రస్‌ ఇచ్చే క్రమంలో గంగిరెడ్డి ఇంటర్‌పోల్ అధికారులకు దొరికిపోయాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ ద్వారా గంగిరెడ్డి ఇప్పటి వరకు సుమారు 400 కోట్ల రూపాయలు సంపాదించాడని డిజిపి రాముడు తెలిపారు. మరోవైపు గంగిరెడ్డి అక్రమాస్తులపై ఈడీ కూడా ఆస్తుల అటాచ్‌మెంట్‌పై దర్యాప్తును వేగవంతం చేస్తోందన్నారు. ఎర్రచందనం మాఫియా వెనుక గతంలో గంగిరెడ్డికి వివిధ రాజకీయపార్టీల నేతలు, పోలీసులు, అటవీశాఖ అధికారులు కూడా సహకారం అందించినట్లు తమవద్ద సమాచారం ఉందన్నారు. అయితే ఎర్రచందనం స్మగ్లింగ్‌లో గంగిరెడ్డి తనకు అత్యంత సన్నిహితంగా ఉండే..సాహుల్ అనే వ్యక్తితో కలిసి అనేక అక్రమాలకు పాల్పడ్డాడని డిజిపి తెలిపారు. అయితే సాహుల్ కూడా తమిళనాడు పోలీసుల సహకారంతో లొంగిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడని డీజీపి అంగీకరించారు. గంగిరెడ్డిని మొదట కడప జిల్లాలోని ప్రొద్దుటూరు కోర్టుకు సోమవారం ఉదయం తరలిస్తామని డిజిపి తెలిపారు. కోర్టులో హాజరుపర్చిన తర్వాత మిగతా కేసుల విషయపై గంగిరెడ్డిని ప్రశ్నిస్తామని డిజిపి తెలిపారు. డీజీపి ప్రెస్‌మీట్‌ తర్వాత...గంగిరెడ్డి కూడా మీడియాతో మాట్లాడాడు. అయితే తనకు ఏ పాపం తెలియదని..తన టైం బాగోలేక ఇలా జరిగిందని గంగిరెడ్డి అన్నారు. ఎర్రచందనం కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారని భావిస్తున్నానని గంగిరెడ్డి అన్నారు.
ఊపిరి పీల్చుకున్న ఏపీ పోలీసులు
మొత్తానికి మోస్ట్ వాంటెడ్‌గా పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన గంగిరెడ్డి ఎట్టకేలకు చిక్కడంతో ఏపీ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 2 కోట్ల ఖర్చుతో గంగిరెడ్డిని ఏపికి తీసుకోచ్చిన పోలీసులు..అతనికి సహాకరించిన వారిపై .. దృష్టి పెట్టింది. దీంతో ఈ వ్యవహారంలో చాలామందికి ఉచ్చు బిగుసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

 

 

గంగిరెడ్డికి 14 రోజుల రిమాండ్

కడప : ఎర్రచందన స్మగ్లర్‌ కొల్లం గంగిరెడ్డికి ప్రొద్దుటూరు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అంతకముందు ఇవాళ తెల్లవారుజామున గంగిరెడ్డికి రిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రొద్దుటూరు కోర్టు అదనపు జడ్జీల ఎదుట అతన్ని పోలీసులు హాజరుపర్చారు. గంగిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. అతన్ని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. 

07:37 - November 16, 2015

గుంటూరు : వాణిజ్య పంటల ఖిల్లా గుంటూరు జిల్లాలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. లాం ఫామ్‌లో ఏర్పాటు చేస్తున్న అగ్రికల్చర్‌ యూనివర్సిటీకి నేడు శంకుస్థాపన జరుగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు, కేంద్ర వ్యవసాయం మంత్రి రాధామోహన్‌ సింగ్‌, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
కొత్తగా అగ్రికల్చర్‌ యూనివర్సీటీ ఏర్పాటు
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణకు కేటాయించడంతో ఏపీలో కొత్తగా అగ్రికల్చర్‌ యూనివర్సీటీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఇందుకు కోసం ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను పరిశీలించినా, చివరికి గుంటూరు శివార్లలోని లామ్‌లో ఉన్న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని యూనివర్సిటీకి ఎంపిక చేసింది. వ్యవసాయ పరిశోధనలకు లామ్‌ ఫామ్‌ అన్ని విధాలా అనుకూలంగా ఉండటంతో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు.
పరిశోధనలకు 490 ఎకరాల భూమి
లామ్‌ ఫామ్‌ నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో ఉంది. రవాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల పంటలపై విస్తృతంగా పరిశోధనలు చేసేందుకు వీలుగా 490 ఎకరాల భూమి ఉంది. చుట్టు పక్కల ఉన్న మరో 280 ఎకరాల అసైన్డ్‌ భూమిని కూడా యూనివర్సిటీ కోసం సమీకరించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అమరాతికి సమీపంలో లామ్‌ ఫామ్‌కు చెందిన మరో 142 ఎకరాల భూమి కూడా ఉంది. దీంతో ఏపీ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి లామ్‌ ఫామే అన్ని విధాల అనుకూలమని నిర్ణయించిన సర్కార్‌ శంకుస్థాపనకు ఏర్పాట్లు చేసింది.
కొత్త వంగడాలపై పరిశోధనలకు ప్రధాన్యత
ఏపీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొత్త వంగడాలపై పరిశోధనలకు ప్రధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. వ్యవసాయాధార పరిశ్రమల ఏర్పాటుకు ఈ విద్యాసంస్థ దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఏపీ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా చేపట్టే పరిశోధనల్లో రైతులను కూడా భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

07:28 - November 16, 2015

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీకి రెడీ అయ్యాయి. సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీలో జి ప్లస్ 2 మోడల్ లో 396ఇళ్లను నిర్మించింది. 33 బ్లాకుల్లో నిర్మించిన ఈ ఇళ్లకు మొత్తం 43కోట్లు ఖర్చు అయ్యింది. ఆరెకరాల పది గుంటల స్థలంలో వీటిని నిర్మించారు. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకుండా అత్యంత ఆధునిక హంగులతో ఐడీహెచ్‌ కాలనీ ఇళ్లను నిర్మించారు. ఫంక్షన్ల కోసం కమ్యూనిటీ హాల్‌ నిర్మాణంలో ఉంది.
580 చ‌ద‌ర‌పు అడుగుల స్థలంలో డబుట్ బెడ్ రూం ఇల్లు
ఇక్కడ నిర్మించిన ఒక్కో ఇంట్లో.. విశాల‌మైన హాలు రెండు బెడ్ రూంలు, ఒక‌ కిచెన్, రెండు టాయిలెట్స్ ఉన్నాయి. ఇందులో ఒక‌టి వెస్ట్రన్‌ టాయిలెట్ కావ‌డం విశేషం. మొత్తం 580 చ‌ద‌ర‌పు అడుగుల స్థలంలో ఈ ఇళ్లని నిర్మించారు. ప్రతి యూనిట్ కు 10లక్షల రూపాయలకు పైగా ఖర్చు అయ్యింది. నిర్మాణ ఖర్చునంతా ప్రభుత్వమే భరించింది. శిథిలావస్థకు చేరుకున్న తమ ఇళ్ల స్థానంలో ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇవ్వడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఐడీహెచ్‌ కాలనీలో నిర్మించిన ఇళ్ల పరిశీలన
ఐడీహెచ్‌ కాలనీలో నిర్మించిన ఇళ్లను పరిశీలించిన పలువురు ప్రముఖులు, ప్రభుత్వం చేపట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పధకాన్ని ప్రశంసించారు. ఈ కాలనీలో నిర్మించిన 396 ఇళ్లలో 276 షెడ్యూల్డు కులాల లబ్ధిదారులకు కేటాయించారు. 31 ఇళ్లను ఎస్టీలకు ఇస్తున్నారు. 79 ఇళ్లను బలహీన వర్గాలకు కేటాయించారు. మిగిలిన ఇళ్లను మైనారిటీలు, ఇతరులకు ఇస్తున్నారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.
సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారుల
2014 అక్టోబర్ లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన ప్రభుత్వం 6 నెలల్లో ఇళ్లను హ్యాండోవర్ చేస్తామంది. వివిధ కారణాల వల్ల ఆలస్యమైనప్పటికి 13 నెలల్లో ఇళ్లనిర్మాణం పూర్తి చెయ్యడంపై లబ్ధిదారుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అనుభవంతో ఇక ముందు హైదరాబాద్ లో 9 అంతస్తుల్లో ఇళ్లనిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

 

07:21 - November 16, 2015

కడప : మోస్ట్ వాంటెడ్‌ ఎర్రచందనం స్మగ్లర్‌ గంగిరెడ్డిని పోలీసులు ఎట్టకేలకు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మారిషస్‌లో అనూహ్య పరిణామాల మధ్య ఇంటర్‌పోల్‌ అధికారులకు చిక్కిన గంగిరెడ్డిని..ఏపీ సీఐడి పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీనుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చిన గంగిరెడ్డిని ఏపీ పోలీసులు నేడు ప్రొద్దుటూరు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఓ హత్య కేసుతో పాటు..దాదాపు 28 కేసుల్లో గంగిరెడ్డి నిందితుడిగా ఉన్నాడని ఏపీ డీజీపి రాముడు తెలిపారు.
ఎట్టకేలకు హైదరాబాద్‌కు గంగిరెడ్డి
మోస్ట్ వాంటెడ్‌గా ఏపీ పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ కొల్లం గంగిరెడ్డిని ఏపీ సీఐడీ పోలీసులు ఎట్టకేలకు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మారిషస్‌ ఇంటర్‌పోల్ అధికారులు గంగిరెడ్డిని శనివారం ఢిల్లీకి తీసుకురాగా..అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత భారీ పోలీస్‌ బందోబస్త్‌ మధ్య గంగిరెడ్డిని హైదరాబాద్‌లోని ఏపీ డీజీపీ కార్యాలయానికి తరలించారు. అనంతరం కొల్లం గంగిరెడ్డిని ఏపి పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
మారిషస్‌ పోలీసుల సహకారం
మారిషస్ నుండి కోర్టు ద్వారా తీసుకు రావడానికి విదేశీ నిబంధనలు అడ్డుస్తున్నాయని డీజీపీ రాముడు తెలిపారు. దీంతో గంగిరెడ్డి వద్ద ఉన్న దొంగ పాస్ పోర్టును రద్దు చేసి ఎక్సాడ్రిషన్ పేరుతో ఇక్కడికి తీసుకోచ్చేందుకు ఏపీ పోలీసులకు సుమారు ఎనిమిదిన్నర నెలలు పట్టింది. ఓ సాధారణ కూలీస్థాయినుంచి నేడు అంతర్జాతీయ స్మగ్లర్‌గా గంగిరెడ్డి ఎదిగాడని డిజిపి రాముడు తెలిపారు. అతనిపై చిన్నపాటి నేరాలు, హత్యలు, ఓ మర్డర్ కేసు కూడా ఉందన్నారు. ఓ హత్యాయత్నం కేసులో జైలు శిక్ష అనుభవించిన గంగిరెడ్డి,..ఆ తరువాత ఎర్రచందనం కేసులో కొంత కాలంపాటు జైలులో ఉన్నాడని తెలిపారు.
సాధారణ కూలీ నుంచి అంతర్జాతీయ స్మగ్లర్‌
గంగిరెడ్డి మారిషస్‌లో ఉన్నాడని ఏపీ పోలీసులకు సమాచారం అందిన వెంటనే..పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే ఇంటర్ పోల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో మారిషస్‌ నుంచి మరో దేశానికి వెళ్తూ అడ్రస్‌ ఇచ్చే క్రమంలో గంగిరెడ్డి ఇంటర్‌పోల్ అధికారులకు దొరికిపోయాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ ద్వారా గంగిరెడ్డి ఇప్పటి వరకు సుమారు 400 కోట్ల రూపాయలు సంపాదించాడని డిజిపి రాముడు తెలిపారు. మరోవైపు గంగిరెడ్డి అక్రమాస్తులపై ఈడీ కూడా ఆస్తుల అటాచ్‌మెంట్‌పై దర్యాప్తును వేగవంతం చేస్తోందన్నారు. ఎర్రచందనం మాఫియా వెనుక గతంలో గంగిరెడ్డికి వివిధ రాజకీయపార్టీల నేతలు, పోలీసులు, అటవీశాఖ అధికారులు కూడా సహకారం అందించినట్లు తమవద్ద సమాచారం ఉందన్నారు. అయితే ఎర్రచందనం స్మగ్లింగ్‌లో గంగిరెడ్డి తనకు అత్యంత సన్నిహితంగా ఉండే..సాహుల్ అనే వ్యక్తితో కలిసి అనేక అక్రమాలకు పాల్పడ్డాడని డిజిపి తెలిపారు. అయితే సాహుల్ కూడా తమిళనాడు పోలీసుల సహకారంతో లొంగిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడని డీజీపి అంగీకరించారు. గంగిరెడ్డిని మొదట కడప జిల్లాలోని ప్రొద్దుటూరు కోర్టుకు సోమవారం ఉదయం తరలిస్తామని డిజిపి తెలిపారు. కోర్టులో హాజరుపర్చిన తర్వాత మిగతా కేసుల విషయపై గంగిరెడ్డిని ప్రశ్నిస్తామని డిజిపి తెలిపారు. డీజీపి ప్రెస్‌మీట్‌ తర్వాత...గంగిరెడ్డి కూడా మీడియాతో మాట్లాడాడు. అయితే తనకు ఏ పాపం తెలియదని..తన టైం బాగోలేక ఇలా జరిగిందని గంగిరెడ్డి అన్నారు. ఎర్రచందనం కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారని భావిస్తున్నానని గంగిరెడ్డి అన్నారు.
ఊపిరి పీల్చుకున్న ఏపీ పోలీసులు
మొత్తానికి మోస్ట్ వాంటెడ్‌గా పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన గంగిరెడ్డి ఎట్టకేలకు చిక్కడంతో ఏపీ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 2 కోట్ల ఖర్చుతో గంగిరెడ్డిని ఏపికి తీసుకోచ్చిన పోలీసులు..అతనికి సహాకరించిన వారిపై .. దృష్టి పెట్టింది. దీంతో ఈ వ్యవహారంలో చాలామందికి ఉచ్చు బిగుసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

 

 

నేడు వరంగల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న జగన్

వరంగల్ :  నేడు వరంగల్ ఎన్నికల ప్రచారంలో వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ పాల్గొననున్నారు. 

నేడు ప్రొద్దుటూరు కోర్టుకు హాజరుకానున్న గంగిరెడ్డి

కడప : ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని నేడు ప్రొద్దుటూరు కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. 

 

Don't Miss