Activities calendar

17 November 2015

దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

విజయవాడ : తమిళనాడు, ఏపీ రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు విశాఖ లోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది దక్షిణ కోస్తాంధ్ర తీరానికి ఆనుకుని ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీరం వెంబడి ఈశాన్య దిశ నుంచి గంటకు 50 -55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

 

21:38 - November 17, 2015

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఏడవ వేతన సంఘం నివేదికను నవంబర్‌ 19న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు అందజేయనుంది. ఈ రిపోర్టు ప్రకారం ఉద్యోగుల వేతనాల్లో 15 శాతం వృద్ధి అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఏడవ పే కమిషన్‌కు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపితే జనవరి 1, 2016 నుంచి అమలు కానుంది. పే కమిషన్‌ సిఫారసుల వల్ల 50 లక్షలకు పైగా ఉద్యోగులు, 55 లక్షల పెన్షనర్లకు లాభం చేకూరనుంది. ఏడవ వేతన సంఘాన్ని 2014 ఫిబ్రవరిలో యుపిఏ హయాంలో నియమించారు.

21:37 - November 17, 2015

హైదరాబాద్‌ :నగరంలో ప్రతిష్టాత్మక ఉస్మానియా ఆస్పత్రి తరలింపులో ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. పైగా ప్రభుత్వం గతంలో ఏం చెప్పిందో దానికి వ్యతిరేకంగా ఆర్డర్లు జారీ అవుతున్నాయి. దీని ద్వారా అసలు సిఎం కెసిఆర్‌ చెప్పేదేమిటి.? చేస్తున్నదేమిటి అన్న అనుమానం కొందరిలో కలుగుతోంది.. కానీ ఆస్పత్రి తరలింపు వెనక ఉన్న అసలు ఉద్దేశమేంటి.? వందల కోట్ల రూపాయల విలువ చేసే స్థలం రేపేం కాబోతోందన్నదే ఎవరికీ అంతుబట్టట్లేదు..

రోగులకు సేవలందిస్తున్న పెద్దాస్పత్రి....

ఎన్నో ఏళ్లనుంచి రోగులకు సేవలందిస్తున్న పెద్దాస్పత్రిది. అత్యంత విలువైన స్థలంలో నెలకొన్న, అందులోనూ చారిత్రకంగా గుర్తింపు పొందిన పెద్దాస్పత్రిది. దీన్ని ఇక్కడి నుంచి వేరొకచోటుకు తరలించడానికి జరుగుతున్న ప్రయత్నాలు మళ్లీ ముమ్మరమయ్యాయి.

వ్యతిరేకించిన ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు....

ఉస్మానియా ఆస్పత్రిని ప్రస్తుతమున్న చోటు నుంచి తరలిస్తామని మరోచోట ఆధునిక భవనాలు నిర్మించి అందులో ఏర్పాటుచేస్తామని తొలుత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించింది. అయితే దానివెనక ఎన్నో లొసుగులు ఉన్నాయని, ఈ ప్రక్రియ ద్వారా రోగులకన్నా ఇంకెవరికో ప్రయోజనం చేకూరబోతోందని ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. హెరిటేజ్‌ కట్టడాన్ని కాపాడాల్సింది పోయి.. పడేస్తాననటమేంటని వారు విమర్శించారు. వివాదం హైకోర్టుకు వెళ్లడంతో ఆస్పత్రి తరలింపుపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇలా చెప్పి మరెంతో కాలం కాకుండానే ఉస్మానియా తరలింపులో ఒక్కో చర్యా జరిగిపోతోంది.

తరలించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు...

ఉస్మానియాలోని ఆర్థోపెడిక్‌, మెటర్నటీ విభాగాలను పెట్ల బురుజు, నయాపూల్ ఆస్పత్రులకు తరలించాలని ఆదేశిస్తూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా వైద్య సామాగ్రికి 69 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అయితే ఉస్మానియా భవనం కూల్చివేత, నూతన భవన నిర్మాణంపై ఇంకా స్పష్టత రాలేదు. మొత్తమ్మీద ప్రభుత్వ చర్యలు చూస్తుంటే ఆస్పత్రి తరలింపుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో విభాగాన్ని తరలించి అసలు పని పూర్తి చేస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఉస్మానియా భవిష్యత్‌ ఎలా ఉండబోతోంది.. ఆస్పత్రి తాలూకు ఫలాలు ఏ రీతిలో ఎవరికి దక్కబోతున్నాయన్నదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారబోతోంది. 

21:34 - November 17, 2015

హైదరాబాద్ : వరంగల్‌లో టిఆర్‌ఎస్‌ నిర్వహించిన భారీ బహిరంగ సభలో నిరసనలు వెల్లువెత్తాయి. కెసిఆర్‌ ప్రసంగిస్తున్నంతసేపూ తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఇదే సమయంలో తమ రిజర్వేషన్లపై ఏం తేల్చారంటూ ముస్లిములు ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసన వ్యక్తం చేస్తున్న కొందరు యువకులను పోలీసులు బలవంతంగా సభ నుంచి వెలుపలకి లాక్కవెళ్లారు. కొందరు మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాళ్లను బయటకు తరలించాలని మహిళా పోలీసులు ప్రయత్నించగా అక్కడే బైఠాయించి ఆందోళన చేశారు. 

21:32 - November 17, 2015

వరంగల్ : ప్రతిపక్షాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిప్పులు చెరిగారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హన్మకొండలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలు తనపై ఏవిధంగా విమర్శలు గుప్పించాయో అదే రీతిలో వాటిపై ఫైరయ్యారు. 16 నెలల తమ పాలనలో ప్రభుత్వం ఏమేం చేసిందో ఆలోచించి ఓటేయమని ఓటర్లను కోరారు.

ఎప్పటిలాగే ఉధృతంగా సాగిన మాటల ప్రవాహం..

హనుమకొండ బహిరంగ సభలో కెసిఆర్‌ ప్రసంగం కొనసాగిన తీరిది. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ తనదైన శైలిలో ప్రశ్నలు సంధిస్తూ ఉప ఎన్నిక సభలో టిఆర్‌ఎస్‌ అధినేత ప్రసంగించారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, కాకతీయ మిషన్‌, రైతు రుణాల మాఫీ తదితర పథకాలను దృష్టిలో పెట్టుకుని తమకు ఓటేయమని కోరారు.

అన్ని పార్టీల పాలనను తన పాలనతో బేరీజు.....

కాంగ్రెస్‌, టిడిపిల హయాంలో కాకతీయ కాలువల పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో మీకు తెలుసని అన్నారు. కాంగ్రెస్‌ నేత జానారెడ్డి చరిత్ర వినండి అంటూ ఆయనపైనా విమర్శలు గుప్పించారు. బిజెపి నేతలకు తనపై విమర్శలు చేసే హక్కు ఎక్కడుందని ప్రశ్నిస్తూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఎలా విఫలమైందో ఒక ఉదాహరణ ద్వారా తెలియజెప్పారు. మొత్తంగా అన్ని పార్టీల పాలనను తన పాలనతో బేరీజు వేసుకుని ఆ తర్వాతే తమ పార్టీకి ఓటేయమని గులాబీ పార్టీ అధినేత ఓటర్లను కోరారు. 

21:30 - November 17, 2015

విజయవాడ : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టం సైతం సంభవించింది. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, కడప జిల్లాలో ఒకరు మృతిచెందారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు నీటిలో గల్లంతయ్యారు. 120 దాకా పశువులు చనిపోగా 80 ఇళ్లు కూలిపోయాయి. లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగింది.

నెల్లూరులో అత్యధికంగా 41 పునరావాస కేంద్రాలు.....

నెల్లూరులో అత్యధికంగా 41 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. చిత్తూరులో 37, కడపలో 20 ప్రాంతాల్లో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలకు అక్కడకు తరలిస్తున్నారు. రెండు హెలికాప్టర్లను సైతం రంగంలోకి దించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారి పలుచోట్ల ధ్వంసమైంది. దీంతో రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్సుల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులు నిద్రాహారాలు లేక విలవిల్లాడిపోతున్నారు.

కడప జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలతో....

కడప జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. రోజువారీ కూలికి వెళ్లే వాళ్లు పనులు లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు అవసాన దశకు చేరిన ఇళ్లతో అవెప్పుడు కూలుతాయోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో కనీసం వంట చేసుకునే పరిస్థితి కూడా కన్పించడం లేదు. జిల్లాలోని మంటపంపల్లి వద్ద రైల్వే ట్రాక్‌ పడిపోవడంతో చెన్నై నుంచి ముంబాయి వెళ్లాల్సిన ట్రైన్లు రైల్వే స్టేషన్లకే పరిమితమయ్యాయి. కడప మార్గం నుంచి వెళ్లాల్సిన రైళ్లు జోలార్‌పేట మీదుగా ముంబాయి వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రకాశం జిల్లా లింగ సముద్రం మండలంలో...

ప్రకాశం జిల్లా లింగ సముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్ట్‌ నిండిపోవడంతో మన్నేటికోట, ఆత్మకూరు వద్ద ఉన్న మున్నేరు వాగు ఉప్పొంగింది. దీంతో నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంపు బాధితులకు రక్షణగా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

శ్రీకాళహస్తి వద్ద స్వర్ణముఖి నది పరవళ్లు......

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వద్ద స్వర్ణముఖి నది పరవళ్లు తొక్కుతోంది. తొట్టంబేడు మండలం చిన్నకనపర్తి వద్ద తెలుగుగంగ కాలువకు నాలుగు గండ్లు పడడంతో నీరు పంటపొలాలను ముంచెత్తింది.

కడప జిల్లాలో....

కడప జిల్లా నాయనోరిపల్లె గ్రామంలో భూమి 30 అడుగుల వెడల్పుతో కుంగిపోయింది. వాటర్‌ ట్యాంక్‌, పాఠశాల ప్రహరీగోడ, చెట్లు సైతం నేలలోకి కుంగాయి. వర్షాల ధాటికి జనజీవనం స్తంభించడంతో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సిఎం చంద్రబాబు ఆదేశించారు. చెరువు కట్టల పటిష్టతకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోమని సూచించారు. మంత్రులు ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. 

శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి: చినరాజప్ప

చిత్తూరు : మేయర్ అనురాధ మృతదేహాన్ని ఏపీ హోం మంత్రి చిన్నరాజప్ప, మంత్రులు పత్తిపాటి, బొజ్జల కృష్ణారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మేయర్ హత్య ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోందన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు.

20:41 - November 17, 2015

హైదరాబాద్ : మొన్న ఐఎస్ఎ స్ తీవ్రవాదులు ప్యారిస్ నగరం పై విరుచుకుపడ్డారు. ఇప్పుడు సిరియా ఉగ్రస్థావరాలపై ఫ్రాన్స్ విరుచుకుపడుతుంది. ఎవరి కుట్రల ఫలితం ఈ ఉగ్రవాదం? ఏ అగ్రవాదంలో ఈ విధ్వంస మూలాలున్నాయి? దాడులు, ప్రతిదాడులే శాంతిని ప్రతిష్టిస్తాయా? ఏమిటి యుద్ధం? ఏ పరిష్కారం దిశగా ప్రపంచ దేశాలు కదులుతున్నాయి? ఎన్నాళ్లీ యుద్ధ?? ఉగ్రవాదం.. అగ్రవాదం మధ్య పోరు ప్రపంచానికి ఏమి మిగుల్చుతుంది? ఉగ్రవాదానికి అసలైన పరిష్కారం ఏమిటి? ఉగ్రవదం.. అగ్రవాదం పై విశ్లేషణత్మాక కథనం నేటి వైడాగిల్ లో పేర్కొన్నారు. మరి ఆ విశ్లేషణను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

మంచిర్యాలలో దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు..

ఆదిలాబాద్ : జిల్లాలోని మంచిర్యాలలో చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. దొంగ నుంచి రూ. 21 లక్షల విలువ చేసే బంగారం, రూ. 45 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఇంకా దొంగల ముఠా ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.

మేయర్ భర్త మోహన్ ను ప్రాణాపాయం లేదు : వైద్యులు

చిత్తూరు : మేయర్ అనురాధ భర్త మోహన్‌కు ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన మోహన్‌కు వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. ఇప్పటికే ఈయన శరీరం నుంచి వైద్యులు ఒక బుల్లెట్‌ను వెలికితీశారు. మరో బుల్లెట్‌ తీసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

బిజెపి చేసిన ఒక్క మంచి పని ఉందా: కేసీఆర్

వరంగల్ : ‘ఢిల్లీలో వచ్చిన మీ ప్రభుత్వం ఈ 16 నెలల్లో చేసిన ఒక్క మంచి పని ఉందా?’ అంటూ బీజేపీ నేత కిషన్ రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ‘రైతుల గురించా, దళితుల గురించా, గిరిజనుల గురించా, దేశంలోని పేదల గురించా, నిరుద్యోగ యువకుల గురించా... కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని గురించి కిషన్ రెడ్డి చెబితే నేను ఆయనకు జై కొడతాను’ అని కేసీఆర్ అన్నారు. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ దిమ్మ తిరిగి కింద పడింది...ఇటీవల బీహార్ ఎన్నికల్లో బిత్తిరి గత్తరి దెబ్బ తగిలిందంటూ బీజేపీ సర్కార్ పై కేసీఆర్ మండిపడ్డారు.

జపాన్ ఆర్మీ చీఫ్ తో భారత్ ఆర్వీ చీఫ్

హైదరాబాద్ : జపాన్ ప్రధాన సైనికాధికారిని ఇతర అధికారులను భారత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణకు సంబంధించిన ఆందోళనలపై పరస్పరం చర్చించుకున్నారు. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య భద్రతా పరమైన సహకారం ఎప్పటికీ కొనసాగేదిశగా వారి మధ్య చర్చలు జరిగినట్లు భారత ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది.

చిత్తూరు బంద్ కు పిలుపునిచ్చిన కాపునాడు...

చిత్తూరు : మేయర్ అనూరాధ హత్యకు నిరసనగా బుధవారం చిత్తూరు జిల్లా బంద్‌కు కాపునాడు పిలుపునిచ్చింది. రేపు జిల్లా వ్యాప్తంగా కాపునాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిసింది.

19:39 - November 17, 2015

వరంగల్ : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు, చెప్పింది చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం అని సీఎ కేసీఆర్ అన్నారు. వరంగల్ ఆర్ట్స్ కళాశాలలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు... వాస్తవాన్ని ప్రజలు గమనించాలని కోరారు. 30 ఏళ్లు కాంగ్రెస్, టీడీపీ మనల్ని ఏడిపించాయన్నారు. పేదల కోసమే టిఆర్ ఎస్ ప్రభుత్వం పని చేస్తోంది. టిఆర్ ఎస్ ప్రభుత్వం తప్పు చేస్తే శిక్ష విధించండని వేడుకున్నారు. ఒక్క పార్టీ వారు కూడా వజన్ చేసే మాటలు మాట్లడ లేని 16 నెలల్లో అంతా చెడిపోయినట్లు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని ఓట్ల రూపంలో నే వారికి బుద్ధి చెప్పాలని కేసీఆర్ తన ఆక్రోశాన్ని వెల్లగక్కాడు. కరెంట్ విషయంలో తెచ్చిన మార్పు తెలంగాణ ప్రజలు గమనించారు. 30 సంవత్సరాల్లో కరెంట్ అడిగితే లాఠీ ఛార్జీలు చేశారు. ఏడాదిలోగానే తెలంగాణలో విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామని, 2018 నాటికి రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ అందిస్తామని, వచ్చే మార్చి తర్వాత రైతులకు పగటి పూట 9 గంటల విద్యుత్ అందజేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. వృద్ధులకు రూ.1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. హోం గార్డులకు జీతాలు పెంచామని తెలిపారు.

వరంగల్ నగరాన్నిఅద్భుతంగా తీర్చిదిద్దుతా...

వరంగల్ నగరాన్నిఅద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత స్వయంగా తానే తీసుకుంటానని, వరంగల్ లో టెక్స్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ వరంగల్ ప్రజలకు హామీ యిచ్చారు. ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. వరంగల్ జిల్లాలో ఇంటింటికి నల్లఇచ్చి... మంచినీటిని అందించి ఆడ బిడ్డ పాదాలు కడుతామని తెలిపారు. అలా చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయొద్దని తెలిపారు. పేదల కోసం డబల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామన్నారు. పించన్ అందని బీడీ కార్మికులకు ఎన్నికల తర్వాత అందిస్తాం. హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం ఇచ్చిన ఘనత టిఆర్ ఎస్ దేనని తెలిపారు. సీఐఐ పత్తి కొనుగోళ్లు చేసే వారకు పోరాడతామని తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలే బుద్ధి చెప్పాలని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు త్వరలో ప్రారంభిస్తాం. బిజెపి నేత కిషన్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని. ఢిల్లీ, బీహార్ లో బిజెపికి ప్రజలు షాకిచ్చిన సంగతి గుర్తు చేసుకోవాలన్నారు.

ఆశా, సింగరేణి కార్మికుల ఆందోళన....

సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రసంగాన్ని ఆశ వర్కర్లు, సింగరేణి కార్మికులు అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.

19:15 - November 17, 2015

చెన్నై : భారీ వర్షా లకారణంగా చెన్నైలో రైళ్లను రద్దు చేశారు. దీంతో నగరంలోని పలు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. అధికారులు కనీస సౌకర్యాలు ఏర్పాటుచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

19:13 - November 17, 2015

నెల్లూరు : నైరుతి బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మూలంగా కురుస్తున్న వర్షాలతో నెల్లూరు జిల్లాలో జనజీవనం స్తంభించింది. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. కొన్ని ప్రాంతాల్లో రైలు పట్టాలు కుంగిపోయి రైళ్ల రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. 

19:11 - November 17, 2015

హైదరాబాద్‌ : నగరంలో చారిత్రక ఉస్మానియా ఆస్పత్రి తరలింపుకే ప్రభుత్వం మొగ్గుచూపింది. ఆస్పత్రి తరలింపుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతమున్న స్థలం నుంచి పేట్లబురుజు, నయాపూల్‌ ఆస్పత్రులకు తరలించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

19:10 - November 17, 2015

ఢిల్లీ : భారత మార్కెట్‌ను కొల్లగొట్టడానికే విదేశీ పెట్టుబడులకు ప్రధాని ఆహ్వానిస్తున్నారని సిపిఎం పేర్కొంది. పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చడానికే ప్రభుత్వం ఎఫ్‌డిఐలకు లైసెన్స్‌ ఇచ్చిందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో దేశంలోని పేదలకు దినసరి జీవనం గడవడమే గగనమైందని, ఈ విషయంలో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. సామాన్యుల కొనుగోలు శక్తి పెరిగినపుడే ఆర్థికవృద్ధి సాధ్యమవుతుందన్నారు. దేశంలో నెలకొన్న అసహన పరిస్థితులు, మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా డిసెంబర్‌ మొదటి వారంలో ఇతర వామపక్షాలను కలుపుకుని దేశ వ్యాప్తంగా పోరాడాలని సిపిఎం కేంద్ర కమిటి నిర్ణయించినట్టు ఏచూరి పేర్కొన్నారు.

 

19:09 - November 17, 2015

హైదరాబాద్ : ఈజిప్టులో రష్యన్‌ విమానాన్ని కూల్చిన టెర్రరిస్టులకు తగిన బుద్ధి చెబుతామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టం చేశారు. ఉగ్రవాదులు ప్రపంచంలో ఏ మూలన దాగున్నా వారిని వెతికి పట్టుకుని శిక్షిస్తామని పుతిన్‌ పేర్కొన్నారు. గత నెల అక్టోబర్‌ 31న ఈజిప్టులోని సినాయ్‌ వద్ద 224 మంది ప్రయాణీకులతో వెళ్తున్న రష్యా విమానం ఎ 321 ఎం కూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 224 మంది మృతి చెందారు. విమానాన్ని ఉగ్రవాదులే కూల్చారని రష్యా సెక్యూరిటీ చీఫ్‌ అలెగ్జాండర్‌ బోర్నికోవ్ నిర్ధారించారు. ఈ ఘటనకు పాల్పడ్డ వారి ఆచూకి తెలిపితే 330 కోట్లు రివార్డును ఇస్తామని పుతిన్‌ ప్రకటించారు. రష్యా విమానాన్ని తామే కూల్చామని ఐఎస్‌ఐఎస్‌ ప్రకటించింది. సిరియాలో ఐఎస్‌ఐఎస్‌ శిబిరాలపై రష్యా వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ దాడి జరిపినట్టు పేర్కొంది. 

19:06 - November 17, 2015

హైదరాబాద్ : ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు భారత్‌లోనూ దాడులు జరిపే అవకాశముందని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదంవైపు యువత ఆకర్షితులవుతుండడంతో పారిస్‌ లాంటి ఘటనలు భారత్‌లోనూ జరిగే అవకాశం లేకపోలేదని హోంశాఖ పేర్కొంది. విదేశీ రాయబార కార్యాలయాలు, టూరిస్ట్‌ స్పాట్‌ల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు ఏర్పాటు చేసినట్టు హోంశాఖ తెలిపింది. పారిస్‌లో ఇస్లామిక్‌ టెర్రరిస్టులు జరిపిన దాడిలో 129 మంది మృతి చెందారు.

19:04 - November 17, 2015

హైదరాబాద్ : టునీషియాలో బాంబుదాడులకు ఐఎస్‌ ఉగ్రవాదులు చేసిన పన్నాగాన్ని భద్రతా దళాలు తిప్పికొట్టాయి. ఆ దేశంలోని పర్యాటక కేంద్రం సౌసేలోని కీలక ప్రదేశాలు, హోటళ్లు, భద్రతా కేంద్రాలపై బాంబాబు దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు వ్యూహాన్ని రచించారు. రాజకీయ నాయకులను హత్య చేయడం ద్వారా కల్లోలం సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఫ్రాన్స్‌, టర్కీల్లో ఉగ్రవాదుల దాడుల తర్వాత టునీషియాలో ముష్కరు మూకల ఏరివేత కోసం భద్రతా దళాలు సోదాలు, గాలింపు చర్యలు చేపట్టాయి. 17 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరి నుంచి బెల్టుబాంబులు, పేలుడు పదార్ధాలు, ఎకే-47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఉగ్రవాదులు సిరియా, లిబియాల్లో శిక్షణ పొందారు. ఈ ఏడాది మార్చిలో టునీషియాలోని బార్డో మ్యూజియంలో దాడులకు పాల్పడిన ఘటనలో 21 మంది పర్యాటకులు మరణించారు. జూన్‌లో సౌసే బీచ్‌లో ఐఎస్‌ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 38 మంది విదేశీ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. సౌసేలో మళ్లీ దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదు చేసిన పన్నాగాన్ని భద్రతా దళాలు తిప్పికొట్టడం ద్వారా పెద్ద ప్రమాదాన్ని నివారించినట్టు అయ్యింది. 

19:03 - November 17, 2015

గుంటూరు : బిటెక్‌ కోర్సుల్లో ప్రవేశం నిమిత్తం విజ్ఞాన్‌ యూనివర్శిటీ విశాట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రియల్‌ 23 నుంచి 27 వరకు పరీక్షలు జరుగుతాయని యూనివర్శిటీ రెక్టార్‌ బి. రామూర్తి గుంటూరులో తెలిపారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. వీశాట్‌ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి ఫీజు రాయితీ ఉంటుందని ప్రకటించారు. 

వరంగల్ సీఎం సభలో గందరగోళం

హైదరాబాద్ :వరం గల్ ఆర్ట్స్ కళాశాలలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ఆశ వర్కర్లు, సింగరేణి కార్మికులు అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.

చెన్నై ఎయిర్ పోర్టు లో రూ.5కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం

హైదరాబాద్ : విదేశాల నుంచి అక్రమంగా కొకైన్ తరలిస్తు ఓ మహిళను చెన్నై విమానాశ్రయంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఆమె నుంచి 990 గ్రాముల కొకైన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పాలమూరుజిల్లాలో మెడికల్ కళాశాల

హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎదిరెలో కొత్తగా మెడికల్ కళాశాల ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి రూ. 450 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాలమూరు జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావడంతో ఆ జిల్లా ప్రజలు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

భారీ వర్షాలతో కోనసీమ రైతుల్లో ఆందోళన

తూ.గో : జిల్లా వ్యాప్తంగా మంగళవారం వేకువజాము నుంచి భారీ వర్షాలు కురిశాయిది. దీంతో కోనసీమ ప్రాంతాల్లో వరిపంటకు అపారమైన నష్టం వాటిల్లింది. దాదాపు లక్ష ఎకరాల మేర పంట నష్టపోయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కలెక్టర్ ఆదేశాల తో అప్రమత్తమైన రెవెన్యూశాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టారు.

మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ ఇంటి పై ఏసీబీ సోదాలు..

హైదరాబాద్ : విశాఖలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సంపత్‌రావు రమేష్‌ ఇంట్లో మంగళవారం ఏసీబీ సోదాలు చేసింది. ఈ సోదాల్లో రూ.25 కోట్లు విలువచేసే అక్రమాస్తులను సంపత్‌రావు రమేష్‌ కలిగిఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఏసీబీ సోదాల్లో భాగంగా..1.1 కేజీల బంగారం, 2.5 కేజీల వెండి సహా కీలక పత్రాలు, ద్వారకనగర్‌లో 28 గదుల దినేష్‌ లాడ్జి, సెవెన్‌హిల్స్‌, మధురవాడ దగ్గర విలువైన ఇళ్లు కలిగి ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లాలో భారీ భవనం ఉన్నట్లు గుర్తించారు. 11 బృందాలతో బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ అనురాధ మీడియాకు తెలిపారు.

మెప్మా పీఆర్ పీ అధికారిని నిర్బంధించిన మహిళలు

కరీంనగర్: రామగుండం నగరపాలక కార్యాలయంలో ఓ అధికారిని మహిళలు నిర్బంధించారు. మెప్మా పీఆర్‌పీ అధికారి రాజయ్యను మహిళా గ్రూప్ సభ్యులు నిర్బంధించారు. గ్రూప్ ఖాతాలోని సొమ్మును రాజయ్య మళ్లించారంటూ ఆరోపిస్తూ మహిళలు ఆందోళన చేపట్టారు.

గోడ కూలి నలుగురు చిన్నారుల మృతి

కడప: అకాల వర్షాల కారణంగా సంబేపల్లి మండలం బోయపల్లిలో గోడకూలి నలుగురు చిన్నారులు మృతి చెందారు. తమ ముందు ఇన్నాళ్లూ ఆడిపాడిన చిన్నారులు మృతి చెందడంతో బోయపల్లిలో గ్రామంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

17:46 - November 17, 2015

విజయవాడ : నెల్లూరు జిల్లాలో కన్నెగంటి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మనుబోలు మండలం కొలనకుదురులో 20 మంది మహిళా కూలీలు నది ఒడ్డుపైనే ఉండిపోయారు. నిన్నటి నుంచి ఒడ్డుపైనే ఉండి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. 

17:45 - November 17, 2015

చిత్తూరు : మేయర్ అనురాధ హత్య కేసులో ప్రధాన నిందితుడుగా అనుమానిస్తున్న చింటూ కార్యాలయం పై కటారి అనుచురులు దాడి చేశారు. అంతే కాకుండా చింటూ తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిపై కటారి అనుచరులు దాడి చేశారు. ఆ ఇంటిని ధ్వంసం చేశారు. అప్రమత్తమైన పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

17:42 - November 17, 2015

చిత్తూరు : మేయర్‌ అనురాధాపై దాడిలో ఆమె అనుచరుడు సతీష్‌ గాయపడ్డాడు. దాడి జరిగిన సమయంలో సతీష్‌ అక్కడే ఉన్నాడు. దుండగులు దాడి చేస్తున్న సమయంలో వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అతనిపైనా దాడి చేశారు. 

17:40 - November 17, 2015

హైదరాబాద్ : చిత్తూరు మేయర్ కఠారి అనురాధ హత్య కేసులో నిందితులను త్వరలో పట్టుకుంటామని, హత్య ప్లాన్‌ ప్రకారమే జరిగిందని.. మొత్తం ఐదుగురు పాల్గొన్నట్లు తెలుస్తుందని జిల్లా ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నారని చెప్పారు. చిత్తూరు నగర మేయర్ ఛాంబర్ లో కాల్పులు జరిగాయని, ఘటనా స్థలంలో రైఫిల్, 3.2 వెపన్, కత్తులు, కొడవళ్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. కఠారి మోహన్ పై రెండు రౌండ్ల కాల్పులు, వీపు భాగంపై కత్తులతో పొడిచారని తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఎస్పీ ఈ వివరాలు వెల్లడించారు. 

17:36 - November 17, 2015

కరీంనగర్ : కుదిరితే అమాంతం..కుదరకపోతే కొంచెం..ఏదైనా కబ్జాకు మాత్రం కాదు ఆటంకం. స్థల యజమాని ఎంతటి పెద్దవాడైనా డోంట్‌ కేర్‌. కోర్టు ససేమిరా అన్నా భయం లేదు భక్తి లేదు. ఉన్నదల్లా భూ భుక్తి మాత్రమే. ఈ భూ దాహానికి అధికార పార్టీ అండ తోడైంది. ఇంకేముంది గుడిసె పీకి బంగ్లాకడుతున్నారు. ఇదీ కరీంనగర్ జిల్లాలో రాజకీయ నేతల, అధికారుల కబ్జా భాగోతం.

968లో 39 గుంటల భూమిని కొనుగోలు చేసిన సింగరేణి యాజమాన్యం.........

కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణం ప్రధాన చౌరస్తాలోని పోచమ్మ మైదానం. ఈ మైదానానికి సర్వహక్కులు ఉన్న యజమాని సింగరేణి సంస్థ. 1968లోనే భవిష్యత్ అవసరాల కోసం 639 సర్వే నెంబర్‌లోని 39 గుంటల భూమిని సింగరేణి యాజమాన్యం భద్రోద్దీన్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసింది. అప్పటి మార్కెట్ ధర ప్రకారం రూ.438 చొప్పున రూ.23,392 కోనుగోలు చేసింది. 1975లో కొంతమంది ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో సింగరేణి యాజమాన్యం కోర్టుకెక్కింది. అప్పటి సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టు ఈ స్థలానికి సింగరేణి సంస్థే యజమానిగా ధృవీకరిస్తు తీర్పును వెలువరించింది. అప్పటి నుంచి ఈ స్థలం సింగరేణి సంస్థ ఆధీనంలోనే ఉంటూ వచ్చింది.

రోడ్డునపడ్డ 110 మంది చిరువ్యాపారులు ..............

ఈ స్థలంలో స్థానికంగా వ్యాపారులు వ్యాపారం చేసుకోవడానికి వీలు కల్పిస్తూ అద్దె ప్రాతిపదికన అనుమతులనిచ్చింది సింగరేణి సంస్థ. దాదాపు 110 మంది చిరు వ్యాపారులు చిన్నచిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా 2006లో రామగుండం మున్సిపాలిటీ చిరు వ్యాపారులను రోడ్డున పడేసింది.

చిరు వ్యాపారుల దుకాణాలు కూల్చేసిన రామగుండం మున్సిపాలిటీ.....

పోచమ్మ మైదానం స్థలంలో అధునాతన షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించడానికి సింగరేణి నుంచి అనుమతి తీసుకుంది రామగుండం మున్సిపాలిటీ. అప్పటి వరకు ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చేసింది. రోడ్డునపడ్డ చిరువ్యాపారులు ఆందోళనలు, నిరసనలు చేసినా ఫలితం లేకపోవడంతో కోర్టు మెట్లెక్కారు. 2015లో హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ను జారీ చేసి ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. రామగుండం మున్సిపాలిటీ ఈ స్థలంలో అనుకున్న సమయానికి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టకపోవడంతో కొన్ని నెలల పాటు స్థలం ఖాళీగా ఉంటూ వచ్చింది. ఆ తరువాత అధికార పార్టీ ఎంట్రీ ఇవ్వడంతో అక్రమార్కులకు ఎక్కడలేని బలం వచ్చింది.

అక్రమార్కులకు అండగా మున్సిపల్ అధికారులు.....

సింగరేణి సంస్థకు చెందిన 39 గుంటల స్థలాన్ని రామగుండం మున్సిపాలిటీ తీసుకున్న తరువాత మున్సిపల్ అధికారులే అక్రమార్కులకు అండగా నిలిచారు. అప్పటి కమిషనర్ రవీంద్ర అక్రమంగా అనుమతులు ఇవ్వడంతో పాటు వివాదాస్పద స్థలంలో తన బంధువు పేరున కొంత భూమిని రిజిస్ర్టేషన్ చేయించారు. నిర్మాణాలు కూడా చకచకా జరిగాయి. దీనిపై తీవ్రస్థాయిలోనే ఆరోపణలు వచ్చాయి.

స్థల స్వాధీనానికి ముందుకు రాని సింగరేణి యాజమాన్యం..

ఇంత జరుగుతున్నా స్థల స్వాధీనానికి సింగరేణి సంస్థ ముందుకు రావడం లేదు. స్థల వివాదంలో చిరు వ్యాపారులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా ఆర్డీవో విచారణకు ఆదేశించారు. ఆర్డీవో విచారణలో స్థలం సింగరేణి సంస్థదేనంటూ నివేదిక కూడా ఇచ్చింది. అయినా సింగరేణి ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

39 గుంటల స్థలం విలువ రూ.20 కోట్లు...

మార్కెట్ వ్యాల్యూ ప్రకారం 39 గుంటల స్థలం విలువ ఇప్పుడు 20 కోట్ల వరకు పెరిగింది. అక్రమార్కులు హడావిడిగా నిర్మాణాలు చేపట్టారు. చిన్న గుడిసె వేస్తేనే సింగరేణి యాజమాన్యం వారిపై విరుచుకుపడి కూల్చివేస్తుంది. సంస్థ భవిష్యత్ అవసరాల కోసం కొనుగోలు చేసిన కోట్ల రూపాయల భూమిని కబ్జా చేసినా చూస్తూ కాలయాపన చేయడం అనుమానాలకు తావిస్తోంది. రామగుండం కార్పొరేషన్ అధికారులు ఆక్రమణలో కీలకపాత్ర పోషించారని తెలిసినప్పటికీ అధికారులు వారిపై చర్యలు తీసుకోలేదు. పోచమ్మ మైదానం ఆక్రమించిన వారిలో అధికార పార్టీ, పలు రాజకీయ పార్టీలకు చెందిన కార్పొరేటర్లే ఎక్కువ మంది ఉన్నారని స్థానికులంటున్నారు.  రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు మిలాఖత్ అయి కోట్ల రూపాయల విలువ చేసే భూమిని తమ కబంద హస్తాల్లో పెట్టుకున్నారు. వీరు చేసిన భూభాగోతంలో చిరువ్యాపారులే సమిధలయ్యారు. భవిష్యత్ అవసరాల కోసం స్థలాన్ని కొనుగోలు చేసిన సింగరేణి సంస్థ ప్రస్తుతం దానివంకే చూడకపోవడం గమనార్హం.

17:30 - November 17, 2015

విజయవాడ : రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగు పొర్లుతున్నాయి. నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దుచేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశ మార్చుకుంది. అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ కోస్తాలో ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు ప్రకటించారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

వరంగల్ కు సీఎం కేసీఆర్

హైదరాబాద్: కాసేపట్లో ఆయన హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించేందుకు సీఎం చంద్రశేఖర్‌రావు వరంగల్‌కు చేరుకున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ శ్రేణులు సభా మైదానంకు చేరుకున్నారు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ గెలుపు కోసం పార్టీ శ్రేణులు తరలి వస్తున్నాయి.

సరిహద్దుల్లో ఎదురు కాల్పులు....ఆర్మీ కల్నల్ మృతి

హైదరాబాద్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకాశ్మీర్‌లోని కుప్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇండియన్ ఆర్మీ కల్నల్ అమరుడయ్యారు. కల్నల్ కమాండింగ్ రెజిమెంట్‌కు చెందినవారని తెలిసింది. ఈ స్థాయి అధికారి చనిపోవడం ఈ ఏడాది ఇది రెండోసారి. లష్కర్ ఎ తొయిబాకు చెందిన ఉగ్రవాదులతో జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఓ జవాను కూడా గాయపడ్డారని తెలిసింది. కాల్పులు కొనసాగుతున్నాయి.

భారత్‌పై ఐఎస్ దాడులు జరగవచ్చు : రాజ్ నాథ్ సింగ్

న్యూఢిల్లీ :భారత్‌పై ఐఎస్ దాడులు జరగవచ్చని, దీన్ని అంత తేలిగ్గా తీసుకోలేమని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. ఆసియా లీడర్స్ సదస్సు ప్రారంభం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియాపై ఐఎస్ దాడులు జరిగే అవకాశముందని, మరింత జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం ఏ ఒక్క దేశ సమస్య కాదన్న రాజ్ నాథ్‌సింగ్, గ్లోబల్ ఛాలెంజ్‌గా దీన్ని అభివర్ణించారు. ఉగ్రభూతాన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

మామిడి కాలువకు భారీగా వరద నీరు...

నెల్లూరు : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాయుడుపేట మం. పండ్లూరు దగ్గర మామిడి కాలువకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. అటు స్టీల్‌, షుగర్‌ ఫ్యాక్టరీల్లోకి వరద నీరు ప్రవహిస్తోంది. మరోవైపు వర్షాల కారణంగా పండ్లూరు దగ్గర రహదారికి గండి పడింది.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 104 పాయింట్లు లాభపడి 25,864 వద్ద ముగిసింది. నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 7,837 వద్ద ముగిసింది. 

ఎస్జీఎస్ ఆర్ట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ ఇంటి పై ఏసీబీ దాడులు...

తిరుపతి : ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఎస్జీఎస్ ఆర్ట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ రెడ్డప్ప రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు చేస్తోంది. కంప్యూటర్ సైన్స్ హెచ్ వోడీ గానూ రెడ్డప్ప రెడ్డి కొనసాగుతున్నారు.

ఓయూలో చైన్ స్నాచింగ్ నిందితుల అరెస్ట్...

 ఓయూలో జరిగిన చైన్‌స్నాచింగ్ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఒక మహిళ కొద్ది రోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది చివరకు కోమాలోకి వెళ్లి మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 25 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.

అశోక్‌ సింఘాల్‌ మృతి దేశానికి తీరనిలోటు : ప్రధాని

న్యూఢిల్లీ : అశోక్‌ సింఘాల్‌ మృతి దేశానికి తీరనిలోటు అని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సింఘాల్‌ మృతిపట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేశ సేవ కోసమే సింఘాల్‌ జీవితాన్ని ధార పోశారని కొనియాడారు. సింఘాల్‌ ఎల్లప్పుడూ తనకు మార్గదర్శనం చేస్తుండేవారని గుర్తుచేస్తుకున్నారు. అశోక్‌సింఘాల్‌ ఓ వ్యక్తి కాదు... శక్తి అని తెలిపారు. కొన్ని తరాలకు అశోక్‌సింఘాల్‌ స్ఫూర్తిగా నిలుస్తారని నరేంద్రమోదీ పేర్కొన్నారు.

కడప జిల్లాలో ప్రాజెక్టులకు జలకళ

హైదరాబాద్ : భారీ వర్షాలతో కడప జిల్లాలో జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. జలాశయాలు దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత పూర్తిగా నిండటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

15:59 - November 17, 2015

చిత్తూరు : మేయర్ అనురాధ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. అనురాధ భర్త మేనల్లుడు చింటూ గంధన పల్లిలో ఉన్న చింటూ కార్యాలయం వద్ద పోలీసు జాగిలాలు ఆగాయి. మరో వైపు ముగ్గురు నిందితులు పోలీసుల వద్ద లొంగిపోయినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఈ అంశాన్ని నిర్ధారించలేదు.

చిత్తూరు జిల్లాలో హై అలర్ట్...

చిత్తూరు మొత్తం హై అలర్ట్‌ ప్రకటించారు. జాతీయ రహదారులతో సహా సరిహద్దులు మూసేసి మరీ పోలీసులు గాలింపు చేస్తున్నారు. మరోవైపు కటారి అనుచరులు విధ్వంసానికి దిగుతుండటంతో.. పరిస్ధితి దిగజారకుండా అదనపు దళాలను రప్పిస్తున్నారు. మరి కాసేపట్లో హోంమంత్రి చినరాజప్ప కూడా ఇక్కడకు రానున్నారు. మొత్తం మీద చిత్తూరులో అప్రకటిత బంద్‌ నడుస్తోంది. రేపు కూడా బంద్‌ పాటించాలని కటారి అనుచరులు పిలుపు ఇచ్చే అవకాశం కనపడుతోంది.

15:58 - November 17, 2015

చిత్తూరు : ఓ కేసు రాజీ విషయంలో కటారి మోహన్‌కు, మేనల్లుడు చింటూకు విబేధాలు తలెత్తినట్లు తెలుస్తోంది. మోహన్‌తో గొడవపడ్డ చింటూ.. బహిరంగంగానే హత్య చేస్తానని అన్నట్లు కటారి అనుచరులు చెబుతున్నారు. హత్య చేసిన నిందితులు లొంగిపోవడంతో.. ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మొదట అనుమానించినట్లుగా కిరాయి హంతకులు కాదని.. వేసుకొచ్చిన బురఖాలు, గన్‌ అన్నీ పడేసి వెళ్లడంతో.. వీరు స్థానికులేననే అనుమానం వస్తోంది. అయితే టార్గెట్‌ కటారి మోహన్‌ అయినా.. ఆ సమయంలో అక్కడే ఉన్న కటారి అనూరాధ కూడా దాడికి గురై చనిపోయారని భావిస్తున్నారు. ఈ క్రమంలో, ఘటన జరిగిన వెంటనే మోహన్ అనుచరులు చిత్తూరులో ప్రతి దాడులకు దిగారు. చింటూకు చెందిన ఆఫీసును పెట్రోలు పోసి తగలబెట్టారు. అంతేకాకుండా, ఆఫీసు ముందు ఉన్న రెండు బైక్ లు, ఒక జీపును దగ్ధం చేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. నిందితులు ఇద్దరు పోలీసుల అదుపులో వున్నట్లు సమాచారం. అయితే ఇంత వరకు పోలీసులు ఈ అంశాన్ని ధృవీకరించలేదు. చింటూ పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. బుర్ఖాలతో హత్యకు పాల్పడింది కర్ణాటక వాసులుగా స్తానికులు అనుమానిస్తున్నారు.

సుంకేశుల జలాశయానికి వరదనీరు

మహబూబ్‌నగర్: జిల్లాలోని సుంకేశుల జలాశయానికి వరదనీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా డ్యాంకు నీరు వచ్చిచేరుతోంది. ఎగువ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు 3,600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం జలాశయంలో 292 అడుగుల నీమి మట్టం ఉంది.

15:43 - November 17, 2015

హైదరాబాద్ : విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) అధినేత అశోక్ సింఘాల్ (89) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గుర్గావ్ లోని మేదాంత ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నెల 14వ తేదీన న్యుమోనియాతో బాధపుడుతున్న సింఘాల్ ను మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. అశోక్ సింఘాల్ మరణ వార్తను ప్రవీణ్ తొగాడియా నిర్ధారించారు. 20 ఏళ్ల పాటు వీహెచ్ పీ అధ్యక్షుడుగా పని చేశారు.

చింటూ కార్యాలయం ముందు ఆగిన పోలీసు జాగిలం

చిత్తూరు : మేయర్ అనురాధ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. అనురాధ భర్త మేనల్లుడు చింటూ గంధన పల్లిలో ఉన్న చింటూ కార్యాలయం వద్ద పోలీసు జాగిలాలు ఆగాయి. మరో వైపు ముగ్గురు నిందితులు పోలీసుల వద్ద లొంగిపోయినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఈ అంశాన్ని నిర్ధారించలేదు. 

కాంగ్రెస్ ను వీడుతున్న వారు ఈగల కంటే హీనం : రఘువీరా

విజయవాడ :కాంగ్రెస్ పార్టీని వీడుతున్నవారు ఈగల కంటే హీనం అని ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. కేబినెట్‌లో చర్చించిన 99 ఏళ్ల లీజు వివరాలను అఖిలపక్షం నేతలకు అందజేయాలని రఘువీరా డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా ప్రత్యేక హోదా కోసం మట్టిసత్యాగ్రహ కార్యక్రమాన్ని రఘువీరా ప్రారంభించారు.

15:11 - November 17, 2015

క్రికెట్ ప్రపంచంలో ఇది అత్యత విషాదకరమైన వార్త. భారత సంతతికి చెందిన ఓ క్రికెటర్ నరబలికి గురవడం విషాదం. ప్రాణస్నేహితుడే అతడిని బలిచ్చారని టాక్. భారత సంతతికి చెందిన నవాజ్ ఖాన్(23) మంచి క్రికెటర్... అయితే అతనికి కొంత మానసిక వైకల్యం ఉన్నా క్రికెట్ లో మాత్రం అతను అద్భుతంగా రాణిస్తున్నాడు. నవాజ్ కు తండోవాఖే డుమా(21) అనే స్నేహితుడున్నాడు. డుమాను నవాజ్ ప్రాణ స్నేహితుడుగా భావిస్తాడు. నవాజ్ ఖాన్ ను తన ఇంటి సమీపంలోని అడవిలోకి డుమా తీసుకెళ్లాడు. అక్కడ కతులతో దాడి చేసి తల నరికేశాడు. తాము సమస్యల్లో నుండి బయటపడేందుకు ఓ భూత వైద్యుడు చెప్పిన సలహా మేరకు నరబలి ఇచ్చినట్లు డుమా పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఈ కేసులో మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా నవాజ్ ప్రతిభావంతుడైన క్రికెటర్. 2013 ఏడాదికి ఉత్తమ వికలాంగ క్రికెటర్ అవార్డు కూడా అందుకున్నాడు. హషీం ఆమ్లా చేతులు మీదుగా ఆ అవార్డు అందుకున్న నవాజ్ ఆ సంగతిని ఎప్పుడూ గొప్పగా చెప్పుకొనేవాడు. తొందర్లో విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా ఈ దారుణం జరగడం విచారకరమని స్పోర్ట్స్ అసోసియేషన్ అధికార ప్రతినిధి అల్బర్ట్ వార్నిక్ పేర్కొన్నాడు.

వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్ కన్నుమూత...

ఢిల్లీ:వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్(89) మంగళవారం మధ్యాహ్నం మృతి చెందారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుర్గావ్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అశోక్ సింఘాల్ కొంత కాలంగా శ్వాసకోశ సంబంధింత వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం.

హత్యాయత్నం కేసులో హీరో వినోద్ కుమార్ పై అరెస్ట్

హైదరాబాద్ : తెలుగు, తమిళ, కన్నడ భాషల సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వినోద్ కుమార్ ఓ హత్యాయత్నం కేసులో అరెస్టయ్యారు. వివరాల్లోకి వెళితే... వినోద్ కుమార్ ఆర్థిక వ్యవహారాలను వ్యక్తిగత మేనేజర్ సచ్చిదానంద చూసుకునేవాడు. ఈ క్రమంలోనే పలు లావా దేవీల్లో సచ్చిదానంద అవకతవకలకు పాల్పడ్డాడని అందుకే అతనిపై వినోద్ కుమార్ హత్యకు యత్నించినట్టు తెలిసింది. కాగా వినోద్ కుమార్ తనపై హత్యాయత్నం చేశాడంటూ సచ్చిదానంద పుత్తూరు పరిధిలోని సంప్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు దాడికి యత్నించిన విషయం నిజమేనని నిర్దారించారు.

చిత్తూరు నగరంలో 144 సెక్షన్

హైదరాబాద్ : చిత్తూరు నగర మేయర్ కటారి అనురాధ దంపతులపై ఘటన నేపథ్యంలో చిత్తూరులో ఉద్రిక్తత నెలకొంది. నగరంలో 144 సెక్షన్ విధించారు. పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. మేయర్ దంపతులపై జరిగిన సంఘటనా స్థలాన్ని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీలో ఉన్న రత్న పరిశీలించారు. జిల్లాలో హైఅలెర్ట్ ప్రకటించినట్టు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. కాగా ఈ ఘటనలో చిత్తూరుకు చెందిన ఓ కార్పోరేటర్ తమ్ముడికి కూడా తీవ్ర గాయాలయినట్టు తెలిసింది. ఇదిలా ఉంచితే, దుండగులు వేసుకున్న బురఖాలు, ఓ పిస్టల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు మేయర్ హత్య దారుణం : రామకృష్ణ

విజయవాడ : చిత్తూరు మేయర్ దంపతుల హత్యను సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. రాయలసీమలో ఫ్యాక్షన్ తగాదాలు పెరుగుతున్నాయన్నారు. హత్యకు పాల్పడిన పోలీసుల ఎదుట లొంగిపోవడం వెనుకున్న కుట్రను బయటికి తేవాలని డిమాండ్ చేశారు.

చింటూనే కాల్పులు జరిపినట్లు పోలీసుల అనుమానం

చిత్తూరు : మేయర్ అనురాధ దంపతుల పై కాల్పులు జరిపింది చింటూనే అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చింతూ స్వయాన అనురాధ భర్త మోహన్ అక్క కుమారుడు కావడం గమనార్హం. చింటూ, కటారి దంపతుల మధ్య కొంత కాలంగా విభేదాలు ఉన్నట్లు సమాచారం. దీంతో చిత్తూరులో కటారి అనుచరులు చింటూ కార్యాలయంలో రెండు బైక్ లు, కారు ధ్వసం చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళన కారులను అదపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

చిత్తూరు మేయర్ హత్య దారుణం : పి. మధు

విజయవాడ : చిత్తూరు మేయర్ దంపతుల హత్యను సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

14:41 - November 17, 2015

హైదరాబాద్ : మన సమాజంలో వివాహ బంధానికి ప్రత్యేక స్థానం వుంది. ఈ మధ్య కాలంలో కొన్ని పరిస్థితుల కారణంగా ఆ బంధం బీటలు వారుతోంది. తమ తమ భర్తలు ఇంటికి రావడం లేదంటూ పీఎస్ లలో బహుభార్యత్వ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులకు గల కారణాలు ఏమిటి? ఇదే అంశం పై 'వేదిక'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ న్యాయవాది జె.ఎల్.ఎన్ మూర్తి, సైకాలజిస్టు గిరిజారావు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.


 

14:24 - November 17, 2015

విజయవాడ : తిరుపతి మేయర్ అనురాధ హత్య చాలా బాధాకరం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన అనురాధ మృతి పై స్పందిస్తూ మీడియాతో మాట్లాడుతూ... కనీసం మహిళ అని కూడా చూడకుండా క్రూరంగా చంపేశారని అన్నారు. జరిగిన ఘటన అత్యంత దారుణమని, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని అన్నారు. కరుడుగట్టిన మనస్తత్వం గలిగిన వ్యక్తులు ఇలాంటి నీచాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ హత్య వెనుక ఎలాంటి వారున్నా, ఎంతటి వారున్నా ఉపేక్షించమని చెప్పారు. ఇలాంటి ఘటనల వల్ల సమాజంలో అలజడి చెలరేగుతుందని అన్నారు. నీచ రాజకీయాలను పాల్పడేవారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. ఘటనా స్థలంలో ఆధారాలను ఫోరెన్సిక్ నిపుణులు సంరక్షించాలని సూచించారు.

13:52 - November 17, 2015

హైదరాబాద్ : ఎపిలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప తదితర జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
నెల్లూరులో
నెల్లూరులో కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ కారణంగా నెల్లూరు నగరంలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ప్రధాన కూడళ్లు చెరవులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీరు ఇళ్లలోకి చేరుతుండటంతో.. ఎక్కడ విష పురుగులు వస్తాయోనని జనం భయపడుతున్నారు. మరోవైపు రోడ్ల పైన నీరు నిలవడంతో.. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. రైల్వే అండర్‌ బ్రిడ్జీ నీటితో నిండటంతో రాకపోకలు స్తంభించాయి. హరినాథపురంలోని అండర్‌ బ్రిడ్జీ వద్ద కర్నూలు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. ప్రయాణికులను సురక్షితంగా దించి ఇతర ప్రాంతాలకు తరలించారు.
కడప..
కడప నగరం సమీపంలోని బుగ్గవంక డ్యాం భారీ వర్షాలకు నిండటంతో ఎమ్మెల్యే అంజద్‌బాష, మేయర్‌ సురేష్‌ బాబు, కలెక్టర్‌ కెవి రమణ రెండు గేట్లు తెరిచి నీటిని బుగ్గవంకలోకి విడుదల చేశారు. అర టీఎంసీ సామర్థ్యం ఉన్న బుగ్గవంక డ్యాం దాదాపు పదేళ్ల తర్వాత నిండటం ఇదే ప్రధమం. డ్యాంలోకి 2 వేల 500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు రెండు గేట్లు తెరిచి 500 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. కడప నగరం సమీపంలోని బుగ్గవంక డ్యాం భారీ వర్షాలకు నిండటంతో ఎమ్మెల్యే అంజద్‌బాష, మేయర్‌ సురేష్‌ బాబు, కలెక్టర్‌ కెవి రమణ రెండు గేట్లు తెరిచి నీటిని బుగ్గవంకలోకి విడుదల చేశారు. అర టీఎంసీ సామర్థ్యం ఉన్న బుగ్గవంక డ్యాం దాదాపు పదేళ్ల తర్వాత నిండటం ఇదే ప్రధమం. డ్యాంలోకి 2 వేల 500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు రెండు గేట్లు తెరిచి 500 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం...
భారీవర్షాలకు కడప జిల్లా కమలాపురంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. రవాణా వ్యవస్థ స్థంభించింది. రైల్వే ట్రాక్‌ పైకి నీరు వచ్చి చేరడంతో పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఒంటిమిట్ట దగ్గర గౌహతి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో... రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కమలాపురం రైల్వేస్టేషన్‌లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ను మధ్యాహ్నం 12 గంటల వరకు నిలిపివేశారు. రైల్వే స్టేషన్‌లో సరైన వసతులు లేక పోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

13:47 - November 17, 2015

కడప : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడప ఓల్డ్‌ రిమ్స్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు కురుస్తున్నాయి. కంఫ్యూటర్లను, ఫైళ్లను రక్షించేందుకు ఉద్యోగులు పడరాని పాట్లుపడుతున్నారు. పెచ్చులూడిపడుతుండటంతో.. ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కడపలోని ఓల్డ్‌ రిమ్స్‌లో దాదాపు 50కి పైగా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఈ నిర్మాణాలను 30 ఏళ్ల క్రితం నిర్మించారు. నిర్మాణాల్లో నాణ్యతాలోపం వల్లే కురుస్తున్నాయని ఉద్యోగులు అంటున్నారు.

 

13:38 - November 17, 2015

హైదరాబాద్ : దిల్ సుఖ్ నగర్ లోని శ్రీచైతన్య ప్రైవేట్ స్కూల్ లో లిఫ్టులో చిక్కుకుని చిన్నారి మృతి చెందిన ఘటనను బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటో కేసుగా తీసుకుంది. ఈమేరకు ఘటన స్థలం వద్ద కమిషన్ అధ్యక్షుడు అచ్యుతానంద్ మీడియాతో మాట్లాడారు. చిన్నారి మృతి కేసును సుమోటోగా తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కలెక్టర్, డీఈవోకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. చిన్నారి మృతిపై నివేదికను ఈనెల 30 లోపు ఇవ్వాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. విద్యాహక్కు, నిబంధనలు ప్రకారం ప్రాథమిక పాఠశాలలో లిఫ్టులు ఉండకూడదని.. కానీ దానికి విదుద్ధంగా ఈ స్కూల్ లో లిఫ్టులున్నట్లు చెప్పారు. ఇదిలావుంటే లిఫ్టు కెపాసిటీకి మించి పిల్లలను ఎక్కించడం సరికాదు. రెండు, మూడు ఫ్లోర్ లలో చిన్నారులకు క్లాసులు నిర్వహించడం చట్టవిరుద్ధం. చిన్నపిల్లలను లిఫ్టులో తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధం.
ఘటన వివరాలు...
గడ్డిఅన్నారంకు చెందిన జోహానా పాతిమా అనే విద్యార్థిని దిల్ సుఖ్ నగర్ లోని శ్రీచైతన్య స్కూల్ లోని స్టార్ కిడ్స్ లో చదువుతోంది. రోజూలాగే మంగళవారం కూడా స్కూల్ కు వెళ్లింది. క్లాస్ రూమ్ రెండో ఫ్లోర్ లో ఉంది. దీనితో ఫాతిమా లిఫ్టులో వెళ్లింది. చిన్నారితో పాటు ఎనిమిది మంది పిల్లలు..ఆయా లిఫ్ట్ లో వెళుతున్నారు. రెండో ఫ్లోర్ లో ఆగగానే ఆయాతో పాటు మిగతా పిల్లలు దిగారు. జోహానా పాతిమా దిగే క్రమంలో లిఫ్టులో చిక్కుకుంది. కేకలు పెట్టింది. ఇతరులు లిఫ్టులో ఇరుక్కున్న ఫాతిమాను బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా లిఫ్ట్ కదిలి మూడో ఫ్లోర్ కు వెళ్లింది. దీనితో ఫాతిమా లిఫ్ట్ లో ఇరుక్కుని అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ ఘటనకు యాజమాన్యమే బాధ్యత వహించాలని చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు స్కూల్ ప్రిన్సిపల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నారి మృతి దేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమ్తితం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

 

 

13:23 - November 17, 2015

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ శీతాకాల విడిది పర్యటన ఖరారైంది. డిసెంబర్‌ 18 నుంచి 31 వరకు ప్రణబ్‌ హైదరాబాద్‌లో ఉండనున్నారు. ఇక రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్వహించే మహాచండీయాగానికి ప్రణబ్‌ హాజరయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

13:11 - November 17, 2015

చిత్తూరు : నగర మేయర్ కటారి అనురాధ దారుణ హత్య గావించబడ్డారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న అనురాధ, ఆమె భర్త మోహన్ లపై ముగ్గురు దుండగులు బుర్ఖాలో వచ్చి.. కత్తులతో దాడి చేసి.. ఆపై తుపాకీతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అనురాధ, మోహన్ లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అనురాధ మృతి చెందింది. మోహన్ పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరు సీఎంసీకి తరలించారు. ఈ దాడికి పాతకక్షలే కారణమని భావిస్తున్నారు. నిందితులు కర్ణాటకకు చెందిన వారుగా అనుమానిస్తున్నారు. జిల్లా ఎస్పీ, యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనురాధ, మోహన్ లకు బలమైన అనుచరగణం ఉండడంతో అల్లర్లు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే అనురాధ దంపతులపై దాడి చేసి హత్య చేసిన ముగ్గురు నిందితులు ఒన్ టౌన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. నిందితులను రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 

చిత్తూరు మేయర్ అనురాధ హత్య

చిత్తూరు : నగర మేయర్ కటారి అనురాధ దారుణ హత్య గావించబడ్డారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న అనురాధ, ఆమె భర్త మోహన్ లపై ఐదుమంది దుండుగులు కత్తులతో దాడి చేసి.. ఆపై వారిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వీరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా అనురాధ మృతి చెందారు. మోహన్ పరిస్థితి విషమంగాఉండడంతో వేలూరు సీఎంసీకి తరలించారు.  

12:29 - November 17, 2015

నల్గొండ : జిల్లాలో విషాదం నెలకొంది. నీటిసంపులో పడి బాలుడు మృతి చెందాడు. యాదగిరిగుట్టలోని బిసి కాలనీలో విజయ్ అనే మూడేళ్ల బాలుడు ఉదయం బ్రెష్ చేసుకుంటూ ఇంటి ఆవరణలో తిరుగాడుతున్నాడు. ఇంటికి సమీపంలో ఓ ఇల్లు నిర్మాణంలో ఉంది. ఆ ఇంటి వద్ద ఉన్న నీటి సంపులో ప్రమాదవశాత్తు పడి బాలుడు మృతి చెందాడు. ఎంతకీ బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఇంటి చుట్టుపక్కల వెతికారు. అర్ధగంట తర్వాత నీటిసంపులో బాలుడి మృతి దేహాన్ని గుర్తించారు. కుమారుని మృతితో తల్లీదండ్రులు, బంధువుల కన్నీరుమున్నీరవుతున్నారు.

 

11:45 - November 17, 2015

హన్మకొండ : వరంగల్‌ ఉపఎన్నిక ప్రచారం ఊపందుకుంది. నేడు వరంగల్‌లో సీఎం కేసీఆర్‌ భారీ బహిరంగసభలో పాల్గొననున్నారు. ఏడు నియోజకవర్గాల నుంచి దాదాపు లక్ష మందిని సేకరించాలని టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా టీఆర్ ఎస్ పార్టీ అధినేత టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి లక్ష మందికి పైగా వస్తారని తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు వేదిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

 

11:39 - November 17, 2015

హైదరాబాద్ : ఏపీలో భారీవర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రివ్యూ నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రాంతాలకు 2 ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే చేరుకున్నాయి. మరోవైపు చెన్నై నుంచి వస్తున్న రెండు హెలికాఫ్టర్ల ద్వారా...బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు నెల్లూరులో 10వేల మందిని, చిత్తూరులో 4వేల మందిని...పునరావాస కేంద్రాలకు తరలించారు.

11:32 - November 17, 2015

హైదరాబాద్ : ఉదయం ఆడుతూ..పాడుతూ స్కూల్ కు వెళ్లిన చిట్టి తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఉదయం బై..బై చెప్పి తమ బిడ్డ తిరిగి రాదని తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. చదువుల కోసం అని పంపిస్తే శవాన్ని చూడాల్సి వస్తుందా అని ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్కూల్ లో పిల్లల పట్ల యాజమాన్యం, టీచర్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలుస్తోంది. చదువుల తల్లి ప్రాంతంగా పేరొందిన దిల్ సుఖ్ నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్ లో ఇరుక్కుని నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు వదిలింది.
 గడ్డిఅన్నారంకు చెందిన జోహానా పాతిమా అనే విద్యార్థిని దిల్ సుఖ్ నగర్ లోని శ్రీచైతన్య స్కూల్ లోని స్టార్ కిడ్స్ లో చదువుతోంది. రోజూలాగే మంగళవారం కూడా స్కూల్ కు వెళ్లింది. క్లాస్ రూమ్ రెండో ఫ్లోర్ లో ఉంది. దీనితో ఫాతిమా లిఫ్టులో వెళ్లింది. చిన్నారితో పాటు ఎనిమిది మంది పిల్లలు..ఆయా లిఫ్ట్ లో వెళుతున్నారు. రెండో ఫ్లోర్ లో ఆగగానే ఆయాతో పాటు మిగతా పిల్లలు దిగారు. జోహానా పాతిమా దిగే క్రమంలో లిఫ్టులో చిక్కుకుంది. కేకలు పెట్టింది. దీనితో ఇతరులు ఇరుక్కున్న ఫాతిమాను బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా లిఫ్ట్ కదిలి మూడో ఫ్లోర్ కు వెళ్లింది. దీనితో ఫాతిమా లిఫ్ట్ లో ఇరుక్కుని అక్కడికక్కడనే ప్రాణాలు వదిలింది. ఈ ఘటనకు యాజమాన్యమే బాధ్యత వహించాలని చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు స్కూల్ ప్రిన్సిపల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నారి మృతి దేహాన్ని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమ్తితం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

11:28 - November 17, 2015

తెలుగు రాష్ట్రాల్లో ధరలు మండిపోతున్నాయి. ఏం కొనేటట్టు లేదు..ఏం తినేటట్టు లేదు అనే చందంగా తయారైంది. మొన్నటి వరకు ఉల్లిగడ్డ ధరలు కన్నీళ్లు తెప్పిస్తే కందిపప్పు ధర ఆకాశానికి ఎగబాకింది. తాజాగా ఈ జాబితాలో 'టమోటా' చేరింది. తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధర సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో వంద రూపాయలకు ఎగబాకింది. తెలంగాణలో కిలో టమాట ధర రూ.80కి చేరగా ఏపీలో ఏకంగా కిలో టమాట వంద రూపాయల ధర పలుకుతోంది. రైతు బజార్లలో ఏపీలో కిలో టమాట రూ.92 పలుకుతుండగా రిటైల్ మార్కెట్ లో రూ.105 నుండి రూ.110కి చేరింది.
చీప్ గా దొరికే కూరగాయాల్లో ఒకటి టమాటా..చాలా సందర్భాల్లో సరైన ధర లేకపోవడంతో రైతులు టమోటాను రోడ్లపైనే పారేసి వెళ్లిపోవడం చూశాం. అలాంటి టమోటాలు ఒక్కసారిగా ఇంత ప్రియం కావడానికి వర్షాభావం కారణమని పలువురు పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టమోటా దిగుబడి గణనీయంగా తగ్గిందని..ఈ కారణంగానే ధర భారీగా పెరిగిపోయి ఉండవచ్చునంటున్నారు. మరోవైపు కొరత సృష్టించడం వల్లే ధరలు పెరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఉల్లిగడ్డ..కందిపప్పు ధరలు పెరిగినప్పుడు ప్రత్యేక విక్రయ కేంద్రాలు ఏర్పాట్లు చేసి విక్రయించారో అదే విధంగా టమోటా విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

11:18 - November 17, 2015

ఈ కాలంలో కమలాపండ్లు విరివిగా దొరుకుతాయి. సీజన్‌ ప్రకారం దొరికే పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి కమలాపండ్లు తినండి.. క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేయండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కమలా పండ్లలో సిట్రస్‌ పాళ్లు ఎక్కువ. వీటిని తినడం వల్ల చర్మం, ఊపిరితిత్తులు, కడుపు, పేగుల్లో క్యాన్సర్‌ రాకుండా మనల్ని కాపాడుతుంది. అలాగే కమలా పండ్లను రసం తీసి తాగడం వల్ల కిడ్నీ జబ్బులు కూడా రావు.

  • కిడ్నీల్లో రాళ్లు చేరే అవకాశం ఉంటే కమలాపండ్లు దాన్ని నిరోధిస్తాయి. అలాగే కాలేయ క్యాన్సర్‌ను అరికడుతుంది. ఇంకా శరీరంలో కొవ్వు పేరుకోవడాన్ని ఇది అరికడుతుంది. కొవ్వు పెరుగుదలను నిరోధించడంలో కమలాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి.
  • కమలాపండ్లలో ఉండే ఫైబర్‌ జీర్ణశక్తిని మెరుగుపరిచి, ఆకలిని పుట్టిస్తుంది. హృదయ స్పందనలకు అవసరమైన పొటాషియం, మెగ్నీషియం కమలాపండ్లలో పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లు రక్తపోటును అదుపులోవుంచి, పల్స్‌ రేటులో హెచ్చు తగ్గులు రాకుండా చూస్తాయి.
  • ఇందులో ఎక్కువగా ఉండే విటమిన్‌ సి వల్ల చర్మానికి కావలసిన జీవశక్తి లభిస్తుంది. చర్మకణాలు పాడవకుండా సి విటమిన్‌ కాపాడుతుందని వైద్యులు చెబుతారు. అలాగే వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ రాకుండా కమలాలు కాపాడతాయి.
  • శరీరంలోని మలినాలను శుద్ధిచేసి మనల్ని ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంచే కమలాపండ్లను చక్కగా రోజూ తినడం వల్ల మనం చక్కగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
11:18 - November 17, 2015

పారిస్ పై ఐఎస్ ఐఎస్ చేసిన దాడి మానవ నాగరికతపై దాడి అని ది హన్స్ చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ విశ్లేషణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఐఎస్ ఐఎస్ పై ఎవరు దాడి చేసినా సంతోషించాల్సిందేనని పేర్కొన్నారు. కానీ చాందసవాద ఉన్మాదులను ప్రోత్సహించిన అమెరికా...ఇప్పుడు ఐఎస్ ఐఎస్ పై పోరాటం చేస్తామంటే ఎవరు నమ్ముతారని చెప్పారు. ఇరాక్ లో సద్దాం హుస్సేన్ ఉన్నంతకాలం ఐఎస్ ఐఎస్ రాలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా తీవ్రవాదం పట్ల, అది సృష్టిస్తున్న దుర్మార్గంపై ప్రపంచదేశాలు దృష్టి సారించాలని సూచించారు. అమెరికా, ఫ్రాన్స్ దేశాలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టినా తీవ్రవాదాన్ని రూపుమాపలేరని.... తీవ్రవాదానికి కారణాలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తే తీవ్రవాదం అంతం అవుతుందన్నారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే...
అమెరికాకు నచ్చితే ఎంతటి తీవ్రవాది అయినా పర్వాలేదు...
తీవ్రవాదం ప్రపంచవ్యాప్తమైంది. కానీ కానీ తీవ్రవాద వ్యతిరేకపోరాటం ప్రపంచవ్యాప్తంగా లేదు. అమెరికా నాయకత్వంలోని నాటో యుద్ధం జరుగుతుంది. అమెరికాకు నచ్చితే ఎంతటి ఉన్మాది అయినా... తీవ్రవాది అయినా పర్వాలేదు. కాశ్మీర్ లోని తీవ్రవాది అమెరికాకు తీవ్రావాదిగా కనిపంచడు. కానీ కాబూల్ లోని తీవ్రవాదిగా ఉన్మాదిగా కనబడతాడు. తీవ్రవాదానికి పురిటిగడ్డగా ఉన్న పాకిస్తాన్ అమెరికాకు మిత్రుడు. కాబట్టి అమెరికాకు నచ్చని వారు, వారికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని తీవ్రవాడులు, ఉన్మాదులుగా చిత్రీకరిస్తారు. వారిపై దాడులు, యుద్ధాలు చేస్తారు. తన వ్యూహాత్మక విధానాలను వ్యతిరేకిస్తున్న వారిని తీవ్రంగా ఖండిస్తారు. సద్దాం హుస్సేన్ అమెరికా ప్రయోజనాలను కాపాడినంత కాలం అమెరికాకు మిపారిస్ పై ఐఎస్ ఐఎస్ దాడి మానవ నాగరితకపై దాడి : ప్రొ.నాగేశ్వర్త్రుడుగానే ఉన్నాడు. వారి విధానాలను వ్యతిరేకిస్తే.. సద్దాంహుస్సేన్ ను ఉన్మాది, తీవ్రవాదిగా చిత్రీకరించి, హత మార్చారు. సిరియాలోని మూడో వంతు బాగం ఐఎస్ ఐఎస్ చేతిలో ఉంది. ఐఎస్ ఐఎస్.... ఆల్ ఖైదా కంటే ప్రమాదమైన సంస్థ. అల్ ఖైదా సంస్థ అధినాయకుడిని చంపినంత మాత్రాన ఆ సంస్థం అంతం కాదు. అల్ ఖైదా పుట్టకు కారణమైన పరిస్థితితులు ఇంకా మిగిలే ఉన్నాయి. తీవ్రవాదం అన్యాయమే కానీ వాటికి కారణమేంటనేది తెలుసుకోవాలి. వారి సమస్యలకు పరిష్కారాలు చూపాలి.
అగ్రరాజ్యాల దోపిడీ, నియంతృత్వంతోనే తీవ్రవాదం..
అగ్రరాజ్యాల దోపిడీ, నియంతృత్వ పోకడల వల్లనే తీవ్రవాదం లాంటి పరిస్థితులు దాపురించాయి. లిబియా, ఇరాక్ అధ్యక్షుళ్లను అమెరికా సైన్యం చంపింది. చాందవాస పోకడలను మొదటగా సమర్థించి.. ఇప్పుడు మొసలికన్నీరు కార్చడంలో అర్థం లేదు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదం పోవాలంటే అమెరికా, పశ్చిమదేశాలు తమ విదేశాంగ విధానాన్ని మార్చుకోవాలి. ప్రపంచంలోని 190 దేశాల్లో తీవ్రవాదం లేదు. ప్రపంచంలోని అన్ని దేశాలకు తీవ్రవాద సమస్య లేదు. అమెరికా మిత్రదేశాలపైనే తీవ్రవాదులు దాడులు జరుగుతున్నాయి. అమెరికా, ఫ్రాన్స్ లు లక్షల కోట్లు ఖర్చులు పెట్టినా తీవ్రవాదాన్ని రూపుమాపలేరు. తీవ్రవాదానికి కారణాలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తే తీవ్రవాదం అంతం అవుతుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలతో తీవ్రవాదం పుట్టుకొస్తుంది. తీవ్రవాదాన్ని సృష్టించిన పరిస్థితులను తెలుసుకొని... వాటి పరిష్కారానికి కృష్టి చేయాలి. అయితే ఐఎస్ ఐఎస్ వాడుతున్న ఆయుధాల్లో 90 శాతం అమెరికావి కావడం గమనార్హం. అమెరికా సృష్టించిన తీవ్రవాదమే ఇప్పుడు ఆ దేశంపై దాడులకు పాల్పడుతోంది. తీవ్రవాదం సృష్టించిన దారుణాలపైన అధ్యయం చేయడానికైనా పూనుకోవాలి.. అని నాగేశ్వర్ తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

11:14 - November 17, 2015

మీ పాదాలు అందంగా ఆకర్షణీయంగా ఉండాలా? అయితే ఈ చిట్కాలు పాటించండి. వారానికి ఒక్కసారి శుభ్రంగా పాదాలను సబ్బుతో కడగాలి. ఒక చెంచా క్యుటికల్‌ క్రిము లేదా రెండు చెంచాలా ఆలివ్‌ ఆయిల్‌, రెండు చెంచాల నిమ్మరసం లేదా ఐదు చుక్కల గ్లిజరిన్‌ బాగా కలిపి చేతులకు, పాదాలకు రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటిలో హెర్బల్‌ షాంపు వేసి 15 నిమిషాల పాటు నాన బెట్టాలి. ఇలా చేయడం ద్వారా పాదాలమీద వున్న మురికి అంతా మెత్తబడి తొలగిపోతుంది. పాదాలను నీళ్ళలోనే ఉంచి ప్యూమిక్‌స్టోన్‌తో పాదాలమీద, మడమల మీద ఏర్పడిన పగుళ్ళపై మూడు-నాలుగు నిమిషాల పాటు రుద్దండి. దీనివలన పాదాలపై పేరుకున్న మట్టి వచ్చేస్తుంది. మంచినీళ్ళతో పాదాలను సబ్బుతో కడిగిన తర్వాత మరోసారి బాగా రుద్దుతూ కడగాలి. రోజూ రాత్రి పూట హ్యాండ్‌క్రీమ్‌ కొద్దిగా నిమ్మరసంతో కలిపి పాదాలకు రాసుకుంటే మృదువుగా నునుపుగా ఉంటాయి. కాలి మడమలో తీవ్రమైన పగుళ్ళు ఉంటే రాత్రి పూట పెట్రోలియం జెల్లీ రాసుకుని పాదాలకు సాక్సు ధరించి నిద్రించడం మంచిది. కాలి వేళ్ళ గోళ్ళను ఎప్పటికప్పుడు కత్తిరించడం మంచిది. పొడిచర్మం గలవారు వారానికి ఒకసారి గోరువెచ్చటి నూనెలో పాదాల్ని కాసేపు వుంచాలి. ఇలా చేస్తే మీ పాదాలు మృదువుగా తయారవుతాయి.

11:05 - November 17, 2015

మహేష్‌ బాబు హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ (సివిఎం) నిర్మించిన చిత్రం 'శ్రీమంతుడు'. ఈ చిత్రం నవంబర్‌ 14కి 15 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ ఉపయోగించిన సైకిల్‌కి సంబంధించి గత కొంతకాలంగా ఒక కాంటెస్ట్‌ రన్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ కాంటెస్ట్‌కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. వేలాదిగా ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. నవంబర్‌ 13తో ఈ కాంటెస్ట్‌ ముగిసింది. నవంబర్‌ 14న సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు డ్రా తీసి ఈ కాంటెస్ట్‌లో విజేతను ఎంపిక చేసారు. చిత్ర దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సీవీ మోహన్ సమక్షంలో 'మహేశ్‌బాబు' స్వయంగా విజేతను ఎంపిక చేశారు. కరీంనగర్‌కు చెందిన జి. నాగేశ్వరరెడ్డి ఈ సైకిల్‌ను గెలుచుకున్నారు. ''మహేశ్‌బాబు చేతుల మీదగా నాగేశ్వరరెడ్డికి ఈ సైకిల్‌ను అందచేస్తాం''అని నిర్మాతలు తెలిపారు.

రాష్ట్రపతితో సమావేశం కానున్న రాహుల్..

ఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ కానున్నారు. ఫరీదాబాద్ లో జరిగిన కాల్పుల ఘటనను రాష్ట్రపతి దృష్టికి రాహుల్ తీసుకపోనున్నట్లు తెలుస్తోంది.

10:58 - November 17, 2015

ఓ సినిమా విజయం సాధిస్తే, ఆ ఉత్సాహంతో సదరు సినిమా నిర్మాత మరిన్ని చిత్రాల్ని నిర్మించేందుకు ఉత్సాహం చూపిస్తాడు. అదే సినిమా ప్లాప్‌ అయితే.. ఆ నిర్మాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టం. పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా ఘోర పరాజయం పాలైతే ఇక ఆ నిర్మాత రోడ్డున పడ్డట్టే. సరిగ్గా రెండో కోవకి చెందిన పరిస్థితినే తాజాగా విజయ్ తో 'పులి' నిర్మించిన నిర్మాతలు ఫేస్‌ చేస్తున్నారు. సినిమా డిజాస్టర్‌గా నిలిచి భారీ నష్టాలతో నిర్మాతలు సతమతమవుతుంటే, ఇందులో ప్రధాన పాత్ర పోషించిన శ్రీదేవి మాత్రం తనకు ఇచ్చిన లాస్ట్‌ చెక్‌ క్లియర్‌ కాలేదని, దీనికి పరిహారంగా 50 లక్షలు ఇవ్వాలంటూ సదరు నిర్మాతలపై ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి మీడియాలో సైతం కథనాలొచ్చాయి. ఇదిలా ఉంటే, సదరు నిర్మాతలను ఆదుకోవాలనే సదుద్దేశ్యంతో ఇందులో హీరోయిన్‌గా నటించిన శ్రుతిహాసన్‌ తనకు రావాల్సిన 20 లక్షల రూపాయల లాస్ట్‌ చెక్‌ను తిరిగి వెనక్కి పంపి, తన ఔదార్యాన్ని చాటుకుంది. అలాగే ఇందులో మరో ముఖ్యపాత్ర పోషించిన సుదీప్‌ సైతం శ్రుతిహాసన్‌లాగానే లాస్ట్‌ చెక్‌ను తిరిగి నిర్మాతకి పంపించేసి స్ఫూర్తిగా నిలిచారు. ఆపదలో ఉన్నప్పుడు నిర్మాతల్ని ఆదుకోవాలనే వీరి ఔదార్యాన్ని చూసి హ్యాట్సాఫ్‌ చెబుతున్నాయి తమిళ, తెలుగు సినిమా వర్గాలు.

10:53 - November 17, 2015

'క్షేమంగానే ఉన్నా.. అభిమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేద'ని అమీర్‌ ఖాన్‌ అన్నారు. 'దంగల్‌' షూటింగ్‌లో భాగంగా ఆదివారం అమీర్‌ భుజానికి గాయమైనట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా అమీర్‌ పై విధంగా స్పందించారు. తనకు పెద్దగా గాయాలేమీ కాలేదని వారం రోజులు విశ్రాంతి తీసుకున్నాక మళ్ళీ షూటింగ్‌లో పాల్గొంటానని పేర్కొన్నారు. మల్లయోధుడు మహవీర్‌ సింగ్‌ ఫోగత్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

10:52 - November 17, 2015

2000 సంవత్సరంలో విజయ్, ఎస్‌.జె.సూర్య కాంబినేషన్‌లో రూపొందిన 'ఖుషీ' చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇదే చిత్రాన్ని పవన్‌కళ్యాణ్‌తో ఎస్‌.జె.సూర్య తెరకెక్కించి తెలుగులోనూ సంచలన విజయం సాధించారు. తాజాగా దర్శకుడు ఎస్‌.జె.సూర్య చెప్పిన కథ విజయ్ కు బాగా నచ్చిందట. దీంతో ఈ కాంబినేషన్‌లో సినిమా చేసేందుకు విజయ్ గ్రీన్‌సిగల్‌ ఇచ్చారని టాక్. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్‌ మళ్ళీ రిపీట్‌ అవ్వబోతోందన్నమాట.

10:50 - November 17, 2015

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ సకుటుంబ సపరివార సమేతంగా దిగిన ఫొటో ప్రస్తుతం సామాజిక మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. సల్మాన్‌ నటించిన 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో'చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణతో వారంలోనే వందకోట్ల క్లబ్‌లోకి చేరి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ చిత్రంలో సల్మాన్‌ 'ప్రేమ్‌' పాత్రధారిగా కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. పూర్తి ఫ్యామిలీతో దిగిన ఫొటోను చిత్ర బృందానికి సల్మాన్‌ కానుకగా పంపించారు. 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రం కుటుంబ కథా చిత్రమని, ఈ చిత్రాన్ని మీ కుటుంబంతో కలిసి వీక్షించి, టిక్కెట్లతోపాటు మీ కుటుంబంతో కలిసి దిగిన ఫొటోని జత చేసి పంపించండి అంటూ చిత్ర యూనిట్‌ అభిమానులకు విజ్ఞప్తి చేసింది.
మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ హై కౌన్ చిత్రాలను భారతీయులు ఎప్పటికి మరిచిపోలేరు. ఆ చిత్రాల్లో ప్రేమ్ గా సల్మాన్ అందరి మనస్సులో గుర్తుండిపోయేలా లవ్ లీగా చేసేసి భారతావనని తన ప్రేమ కథలతో ఊపేసాడు. అయితే ఆ చిత్ర దర్శకుడుతో ఆయన మళ్లీ చిత్రం చేయలేదు. ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది.

10:45 - November 17, 2015

రవితేజ సరసన నటించిన 'బెంగాల్‌ టైగర్‌'పైనే ఆశలన్నీ ఉన్నాయని రాశిఖన్నా అంటోంది. బాలీవుడ్‌లో నిర్మితమైన 'మద్రాస్‌కేఫ్‌'తో వెండితెరంగేట్రం చేసిన రాశిఖన్నా 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైంది. ఆ తర్వాత 'మనం' చిత్రంలో అతిథి పాత్రలో నటించింది. 'జోరు' సినిమా తర్వాత గోపీచంద్‌ వంటి అగ్రహీరోతో 'జిల్‌'లో నటించే అవకాశాన్ని పొందింది. తాజాగా రామ్‌తో నటించిన 'శివమ్‌' విడుదలైంది. ప్రస్తుతం సాయిధరమ్‌తేజ సరసన 'సుప్రీమ్‌' చిత్రంలో నటిస్తోంది. రవితేజకి జోడీగా నటించిన 'బెంగాల్‌టైగర్‌' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని రాశిఖన్నా పై విధంగా స్పందించింది. 'కొన్ని చిత్రాల్లోని పాత్రలు మనకే కాదు చూసిన ప్రేక్షకులకు కూడా బాగా గుర్తిండిపోతాయి. 'బెంగాల్‌ టైగర్‌'లోని పాత్ర కూడా ఇలాంటిదే' అని రాశి చెప్పింది.

10:43 - November 17, 2015

దశాబ్ద కాలంపాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న స్టార్‌ హీరోయిన్‌ 'రోజా'. అగ్ర హీరోలకు ధీటుగా రాణించి సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లో సైతం తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న 'రోజా' పుట్టిన రోజు నేడు (మంగళవారం).
చిత్తూరు జిల్లాలో చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటలో రోజా జన్మించారు. తండ్రి కుమారస్వామి సారథి స్టూడియోలో సౌండ్‌ ఇంజనీర్‌గా పనిచేసేవారు. నాగార్జున యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందిన రోజాకు చిన్నప్పుడు డాక్టర్‌ కావాలనే కోరిక ఉండేది. కాని తండ్రి ప్రభావంతో సినిమా రంగంలోకి వచ్చారు. కెరీర్‌ మొదట్లో కూచి పూడి నృత్యాన్ని అభ్యసించారు. చిన్నతనంలో ఆమె స్వరం గంభీరంగా ఉండడంతో సినిమాలకు పనికి రావని హేళన చేశారంట. తనను నిరుత్సాహపర్చినప్పటికీ పట్టుదలతో ప్రయత్నం చేసి సినిమా అవకాశాలను సొంతం చేసుకున్నారు. మొదటగా ఛాయా గ్రహకుడు, దర్శకుడు ఆర్‌.కె. సెల్వమణి రూపొందించిన తమిళ చిత్రం 'చంబరతి'తో సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఇందులో హీరో ప్రశాంత్‌ సరసన నటించారు. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు రావడంతో రోజాకు సినిమా ఛాన్స్‌లు క్యూ కట్టాయి. ఆ చిత్రాన్ని తెలుగులో కూడా డబ్‌ చేశారు.

వైవిధ్యమైన పాత్రలు...
తమిళంలో వరుస చిత్రాలు చేస్తున్న క్రమంలో 'ప్రేమ తపస్సు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. రాజేంద్రప్రసాద్‌ సరసన నటించిన రోజా ఇక్కడ కూడా తన నటనతో అదరగొట్టారు. ఆ తర్వాత అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో కలిసి నటించి హీరోలతో సమానంగా ఎదిగారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇతర కథానాయికల హవా కొనసాగుతున్నప్పటికీ వారికి ధీటుగా అవకాశాల్ని దక్కించుకుని వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. పాత్ర ఎలాంటిదైనా అద్భుతంగా నటించి శభాష్‌ అనిపించుకున్నారు. '

అగ్రహీరోలతో...
బొబ్బిలి సింహాం', 'భైరవద్వీపం', 'శ్రీకృష్ణార్జున విజయం', 'గాండీవం', 'మాతో పెట్టుకోకు', 'ముఠామేస్త్రి', 'బిగ్‌బాస్‌', 'ముగ్గురు మొనగాళ్ళు', 'అన్న', 'శుభలగం', 'వజ్రం', 'సర్పయాగం', 'పోలీస్‌ బ్రదర్స్‌', 'ఘటోత్కచుడు', 'అడవిలో అన్న', 'సమరం', 'పెద్దన్నయ్య', 'స్వర్ణక్క', 'అన్నమయ్య', 'సమ్మక్క సారక్క' వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాల్లో నటించి పదేళ్ళపాటు టాలీవుడ్‌ ఇండిస్టీలో స్టార్‌ హీరోయిన్‌గా నిలిచారు. ముఖ్యంగా అప్పట్లో చిరంజీవి, రోజా జోడీకి మంచి పేరొచ్చింది. అంతేకాదు కొన్ని చిత్రాల్లో ప్రత్యేక పాటల్లోనూ ఆడిపాడారు. అలాగే మీనా, దేవయాని, ఖుష్బు, రంజిత, రమ్యకృష్ణ వంటి హీరోయిన్లతో కలిసి సహనటిగా నటించారు.

రాజకీయాల్లో...
2002లో తన మొదటి సినిమా దర్శకుడు ఆర్‌.కె. సెల్వమణిని పెళ్ళి చేసుకున్నారు. అనంతరం హీరోయిన్‌గా సినిమాలకు దూరంగా ఉన్న రోజా ఆ తర్వాత టీవీ షోస్‌ చేస్తూనే మరోవైపు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తూనే ఉన్నారు. టెలివిజన్‌ షోస్‌ 'మోడ్రన్‌ మహాలక్ష్మీ', 'జబర్దస్త్‌' లతో రోజా మంచి పేరు తెచ్చుకోవడంతోపాటు ఆయా కార్యక్రమాలకే ప్రత్యేకమైన ఆకర్షణను తెచ్చారు. సినిమా, టెలివిజన్‌ రంగాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోజా సీనియర్‌ నటి జయప్రదను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టి, తొలుత టిడిపిలో మహిళా విభాగంలో పనిచేశారు. అనంతరం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరి 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయాల్లోనూ చురుగ్గా రాణిస్తున్న రోజా అటు సినిమాలు, ఇటు రాజకీయాలను బ్యాలెన్స్‌ చేస్తూ తనదైన ప్రత్యేకతతో ఆకట్టుకుంటున్నారు.

10:38 - November 17, 2015

నెల్లూరు : ఎపిలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప తదితర జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు... 
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. స్వర్ణముఖి కాలువకు గండి పడటంతో గూడూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. కోట మండలంలో పెట్రోల్‌ బంక్‌ వద్ద రోడ్డు తెగిపోయింది. కలువాయి మండలం కనుపూరిపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కలువాయి- పొదలకూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఆత్మకూరులో బొగ్గేరు, పీతమన్నేరు, నక్కలవాగు, కొమ్మలేరు, బీరాపేరు, ఒడిశె వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సంగం వద్ద పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. సంగం-చేజర్లకు రాకపోకలు నిలిచిపోయాయి.
దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి 55 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు ఉత్తర కోస్తాలోనూ చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి.

 

 

ప్రారంభం కాని మ్యాచ్..

బెంగళూరు : సౌతాఫ్రికా - ఇండియా జట్ల మధ్య జరగాల్సిన రెండో టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ప్రారంభం కాలేదు. వర్షం కారణంగా పిచ్ తడిగా ఉండడంతో మ్యాచ్ ను ప్రారంభం చేయలేదు. సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 214 పరుగులకు ఆలౌట్ కాగా భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ నష్ట పోకుండా 80 పరుగులు చేసింది. ఓపెనర్లు విజయ్ 28, ధావన్ 45పరుగులతో క్రీజులో ఉన్నారు.

 

భారీ వర్షాలు..పలు రైళ్లు రద్దు..

విజయవాడ : భారీ వర్షాల కారణంగా పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. విశాఖ పట్టణం మీదుగా పలు రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. యశ్వంత్ పూర్ - హతియా, యశ్వంత్ పూర్ - భువనేశ్వర్, ఎర్నాకులం - హౌరా, తిరుపతి - పూరి, యశ్వంత్ పూర్ - హౌరా, భువనేశ్వరి - పాండిచ్చేరి, భువనేశ్వర్ - బెంగళూరు, భువనేశ్వర్ - పాండిచ్చేరి, భువనేశ్వర్ - బెంగళూరు, హౌరా - చెన్నై, తిరుమల ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి.

విజయవాడలో భారీ వర్షం...

విజయవాడ : జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంటకు తీవ్ర నష్టం జరిగింది.

నెల్లూరు..చిత్తూరు అతలాకుతలం...

విజయవాడ : భారీ వర్షాలతో చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అతలాకతలమయ్యాయి. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. వరద ప్రాంతాలకు రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. చెన్నై నుండి వస్తున్న రెండు హెలికాప్టర్ల ద్వారా బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 

 

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం..

విశాఖపట్టణం : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 24గంటల్లో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. తీరం వెంబడి గంటకు 50-55 కి.మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తాలో చెదురుముదురు వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరించారు.

సోమశిల..కండలేరుకు భారీగా వరద నీరు...

నెల్లూరు : సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఇన్ ఫ్లో 1.56 లక్షల క్యూసెక్కులు ఉండగా 32 టీఎంసీలకు నీటి మట్టం చేరింది. కండలేరుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 10 టీఎంసీలకు నీటిమట్టం చేరింది.

దడ పుట్టిస్తున్న టమాట ధర..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో టమాట ధర దడ పుట్టిస్తోంది. తెలంగాణలో కిలో టమాట ధర రూ.80కి చేరగా ఏపీలో ఏకంగా కిలో టమాట వంద రూపాయల ధర పలుకుతోంది. రైతు బజార్లలో ఏపీలో కిలో టమాట రూ.92 పలుకుతుండగా రిటైల్ మార్కెట్ లో రూ.105 నుండి రూ.110కి చేరింది.

స్కూల్ లిఫ్ట్ లో ఇరుక్కుని ఐదేళ్ల చిన్నారి మృతి..

హైదరాబాద్ : దిల్ సుఖ్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రైవేటు స్కూల్ లిఫ్ట్ లో ఇరుక్కుని ఐదేళ్ల చిన్నారి జెహానా మృతి చెందింది.

మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు..

p { margin-bottom: 0.25cm; line-height: 120%; }

విశాఖపట్టణం : మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ రమేష్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. గాజువాక, సీతమ్మ ధారిలోని రమేష్ నివాసంలో సోదాలు జరిగాయి.

చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సహాయక చర్యలు..

హైదరాబాద్ : చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. రెండు హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాల పంపిణీకి ఏర్పాట్లు చేసింది. నెల్లూరులో పది వేల మంది, చిత్తూరులో నాలుగు వేల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

09:53 - November 17, 2015

కర్నూలు : జిల్లాలోని నంద్యాల మండలం చాకిరేవులలో దారుణం జరిగింది. భార్య కాపురానికి రావడం లేదని అత్తింటివారిపై భర్త కత్తితో దాడి చేశాడు. ఈదాడిలో భార్య మహాలక్ష్మి, మామ సుబ్బరాయుడు, అత్త సుంకమ్మ, బావమరిది నాగరాజు, కొడుకు సురేష్‌కు గాయాలయ్యాయి. ప్రతిదాడిలో బావ నాగశేషును బావమరిది నాగరాజు కొట్టి చంపాడు.

 

కర్నూలు జిల్లాలో దారుణం

కర్నూలు : జిల్లాలోని నంద్యాల మండలం చాకిరేవులలో దారుణం జరిగింది. భార్య కాపురానికి రావడం లేదని అత్తింటివారిపై భర్త కత్తితో దాడి చేశాడు. ఈదాడిలో భార్య మహాలక్ష్మి, మామ సుబ్బరాయుడు, అత్త సుంకమ్మ, బావమరిది నాగరాజు, కొడుకు సురేష్‌కు గాయాలయ్యాయి. ప్రతిదాడిలో బావ నాగశేషును బావమరిది నాగరాజు కొట్టి చంపాడు.

 

09:48 - November 17, 2015

రంగారెడ్డి : జిల్లాలో కల్తీ కల్లు కల్లోలం సృష్టిస్తోంది. కల్లు దొరకక ఇద్దరు మృతి చెందారు. తాండూరులో కల్తీ కల్లు దొరకక పలువురు అస్వస్థతకు గురయ్యారు. మల్‌రెడ్డిపల్లి, పాత తాండూరు, ఇందిరానగర్‌ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 40 మంది కల్తీ కల్లు దొరకక పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. బాధితులు ఆస్పత్రిలో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. పలువురికి పిడుస్తోంది. కళ్లు తిరిగి కిందపడిపోతున్నారు. వీరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఒకేసారి అరికట్టకుండా.. క్రమేణా కల్తీ కల్లును అరికట్టాలని చెబుతున్నారు. ప్రత్యామ్నాయం చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.

 

 

కల్తీ కల్లు దొరకక ఇద్దరి మృతి

రంగారెడ్డి : జిల్లాలోని తాండూరులో కల్తీ కల్లు దొరకక పలువురు అస్వస్థతకు గురయ్యారు. మల్‌రెడ్డిపల్లి, పాత తాండూరు, ఇందిరానగర్‌ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 40 మంది కల్తీ కల్లు దొరకక పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. వీరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కల్లు దొరకక ఇద్దరు మృతి చెందారు.

 

09:40 - November 17, 2015

తెలంగాణలో టీ.ప్రభుత్వం అధికారం దుర్వినియోగానికి పాల్పడుతోందని వక్తలు ఆరోపించారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో వైసిపి అధికార ప్రతినిధి మధన్ మోహన్ రెడ్డి, టీకాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, బిజెపి నేత ప్రకాశ్ రెడ్డి, టీఆర్ ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. టీఆర్ ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యపై ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

నేడు వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనున్న కేసీఆర్

హన్మకొండ : వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో ఇవాళ సాయంత్రం సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. 

08:50 - November 17, 2015

బాక్సైట్ తవ్వకాలతో పెను ప్రమాదం పొంచివుందని ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యులు ఎంవీఎస్ శర్మ తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన జననపథం చర్యా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. బాక్సైట్ తవ్వకాలు పర్యావరణానికి హారికరమన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గిరిజనుల జీవనం ప్రశ్నార్థకం అవుతుందని చెప్పారు. నదులు ఎండిపోతాయన్నారు. బాక్సైట్ తవ్వకాలతో గిరిజనుల ఉపయోగం లేదని తెలిపారు. బాక్సైట్ తవ్వకాలు జరపడం చట్ట విరుద్ధం, నిబంధనలకు వ్యతిరేకమైన చర్యన్నారు. 'విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిస్తూ జారీ చేసిన జీవోపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకిస్తూ వివిధ పార్టీలు, సంఘాలు, సంస్థలు ఆందోళనలు నిర్వహించిన నేపథ్యంలో సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అసలు విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాల విషయంలో ఎందుకింత వ్యతిరేకత వస్తోంది? బాక్సైట్‌ తవ్వకాల వెనక వున్న రాజకీయాలేమిటి? బాక్సైట్‌ తవ్వకాల వల్ల భారీగా లాభం పొందేదెవరు? బాక్సైట్‌ తవ్వకాలు పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? ఇలాంటి అంశాలపై శర్మ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..బాక్సైట్ తవ్వకాలతో పెను ప్రమాదం : ఎంవీఎస్ శర్మ

 

08:40 - November 17, 2015

అమెరికా : సిరియాలో తమపై వైమానిక దాడులు చేస్తున్న ఇతర దేశాలకూ ఫ్రాన్స్ కు పట్టిన గతే పడుతుందని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ఓ వీడియోలో హెచ్చరించింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో సైతం భారీ దాడులకు పాల్పడతామని ప్రకటించింది. మరోవైపు టర్కీలో జరుగుతున్న జీ 20 సమావేశాల్లో సైతం పారిస్‌ ఘటనపైనే వాడీ వేడి చర్చలు జరుగుతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అగ్రరాజ్యాలే ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థకు నిధులు ఇస్తున్నాయంటూ ఆరోపించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో అమెరికా సహా నాటో దేశాలు అవలంబిస్తున్న తీరును రష్యా సహా చైనా దేశాలు ఎండగట్టాయి.
ఐఎస్‌ఐఎస్‌ వీడియో విడుదల
ఇప్పటికే పారిస్‌ నడిబొడ్డున దాడి చేశాం. ఇక అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నడిబొడ్డునా దాడికి ప్రతిజ్ఞ చేస్తున్నాం అంటూ ఓ వ్యక్తి హెచ్చరిస్తున్న వీడియోను ఐఎస్‌ఐఎస్‌ విడుదల చేసింది. అతడి పేరు అల్‌ ఘరీబ్‌ ద అల్జీరియన్‌గా స్ర్కోలింగ్‌లో కనిపించింది. అయితే, ఈ వీడియోకు ఉన్న సాధికారత ఎంతో ఇంకా నిర్ధారణ కాలేదు. ఇదిలా ఉండగా, పారిస్‌లో నరమేధం సృష్టించిన ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ఫ్రాన్స్‌తోపాటు యూరోప్‌లోని ఇతర దేశాల్లోనూ తీవ్రదాడులకు సిద్ధమవుతున్నారని ఫ్రాన్స్‌ ప్రధాని మాన్యుయెల్‌ వాల్స్‌ వెల్లడించారు. ఉగ్రమూకలు మరిన్ని భయానక దాడులకు వ్యూహాలు పన్నుతున్నాయని, ఇకపైనా ఫ్రాన్స్‌కు ముప్పు పొంచి ఉంటుందన్నారు. వాషింగ్టన్‌ లోనూ దాడులు జరుపుతామంటూ ఐఎస్ ఐఎస్ వీడియో
పుతిన్ వ్యాఖ్యలతో దుమారం 
మరోవైపు టర్కీలోని అంటాల్యాలో జరిగిన జీ20 దేశాధినేతల సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన వ్యాఖ్యలతో దుమారం రేపారు. జీ20 దేశాలు కూడా ఐఎస్‌కు నిధులిస్తున్నాయని ఆరోపించి ప్రకంపనలు సృష్టించారు. మొత్తం 40 దేశాలు ఇస్లామిక్ ఉగ్రవాదులకు ఆర్ధికంగానూ, ఇతర రకాలుగానూ సహకరిస్తున్నారని ఆరోపించారు. అమెరికా సహా ఇతర అగ్రరాజ్యాలపై పుతిన్‌ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అయితే జి 20 దేశాల్లో ఏ దేశం ఐఎస్ ఉగ్రవాదులకు ఆర్ధికంగా సహకరిస్తుందనేది పుతిన్ వెల్లడించలేదు.
ఉగ్రవాదంపై పోరు కొనసాగించాల్సిందేనన్న చైనా
కాగా పారిస్‌ దాడుల నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరు కొనసాగించాల్సిందేనని చైనా పేర్కొంది. అయితే ఉగ్రవాదం పేరుతో ఇతర దేశాల సార్వభౌమత్వాలను కాలరాసే ఎలాంటి చర్యకు పాల్పడకూడదని చైనా పశ్చిమ దేశాలను హెచ్చరించింది. ఉగ్రవాదంపై పోరులో భాగస్వాములయ్యే దేశాలు ద్వంద్వ ప్రమాణాలు విడనాడి, ఉగ్రవాదానికి మూల కారణాలపై దృష్టి సారించాలని కోరింది. ఇదిలా ఉంటే ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఫ్రెంచ్‌ ప్రభుత్వం పారిస్‌ నగరమంతటా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది. ఫ్రాన్స్‌-బెల్జియమ్‌ సరిహద్దు, గ్రెనోబెల్‌, టులోస్‌, జ్యూమంట్‌ ప్రాంతాల్లో మొత్తంగా 150 దాడులు నిర్వహించినట్లు ఫ్రాన్స్‌ ప్రధాని మాన్యుయెల్‌ వాల్స్‌ మీడియాకు తెలిపారు.
ఫ్రెంచ్‌ ముస్లింల భయాందోళన 
కాగా పారిస్‌పై ఉగ్రవాద దాడుల ఫలితంగా తమ భద్రత ప్రమాదంలో పడిందని ఫ్రెంచ్‌ ముస్లింలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ కొనసాగిస్తున్న హింసాకాండను ఫ్రెంచ్‌ ముస్లింలు, రాజకీయ వేత్తలు తీవ్రంగా ఖండించారు. ముస్లింలా కన్పిస్తే ఇక కష్టకాలమే అంటూ వ్యాఖ్యలు వినిపించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరో వైపు సిరియా, ఇరాక్‌ దేశాల నుంచి వలస వచ్చిన శరణార్థులపై ఆంక్షల కొరడా ఝళిపించేందుకు యూరప్‌ దేశాలు అవుతున్నాయి. శరణు వేడుకుంటూ తరలి వస్తున్న ప్రజలను ఆంక్షల పేరిట అడ్డుకోవడం అర్థరహితమని, మానవత్వానికి మాయని మచ్చ అని యూరప్‌లోని విద్యావేత్తలు, మేధావులు మండిపడుతున్నారు.   

 

నేటి నుంచి రైతుబజారుల్లో టోకు ధరకే టమాటా

హైదరాబాద్‌ : రైతుబజార్లులో మంగళవారం నుంచి టోకు ధరకే టమాటాలను విక్రయిస్తామని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ సంచాలకు శరత్‌ తెలిపారు. నగర పరిధిలోని అన్ని రైతుబజార్లులోనే వీటి విక్రయాలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. రైతుబజార్లులో మార్కెటింగ్‌ శాఖకు చెందిన మన కూరగాయలుః విక్రయ కేంద్రంలో టోకు ధరకు విక్రయిస్తామని తెలిపారు. సోమవారం టోకు ధర కిలోకు మొదటి రకం రూ.48 ఉండగా దాని రవాణా, ఇతర ఖర్చులు కలిపి రూ. 51కి అమ్మారని, మంగళవారం నుంచి ఇతర ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించి టోకు ధరకు అమ్మాలని నిర్ణయించినట్లు అమన వెల్లడించారు. రెండో రకం టమాటా టోకు ధర కిలో రూ.

07:55 - November 17, 2015

హైదరాబాద్ : స్మార్ట్ ఏపీ కార్యక్రమం అటకెక్కబోతుందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్మార్ట్ ఏపీకి ఇప్పుడు ఎలాంటి స్పంద‌నా లేదు. ఏపీలో అన్ని వార్డుల‌ను, పంచాయతీల‌ను అధునాత‌నంగా తీర్చిదిద్దేందుకు ప్రారంభించిన కార్యక్రమం కాస్తా చ‌డీ చ‌ప్పుడు లేకుండా పోయింది. సెల‌బ్రిటీల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌నుకున్నా,.వారి నుంచి స్పంద‌న క‌రువైంది.
ప్రతిష్టాత్మకంగా స్మార్ట్ ఏపీ కార్యక్రమం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్మార్ట్ ఏపీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో ఉన్న అన్ని వార్డులు, మండలాలు, పంచాయతీలకు అధునాత‌న సౌక‌ర్యాలు ఏర్పాటు చేయ‌డంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అధికారులు, రాజ‌కీయ నాయ‌కులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు ఇలా ఎవ‌రైనా కానీ గ్రామాల్ని ద‌త్తత తీసుకుని అభివృద్ది చేయాల‌నేది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. మంత్రులంతా దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సంద‌ర్భాల్లో ఆదేశింన‌ప్పటికీ..ఈ కార్యక్రమానికి పెద్దగా స్పంద‌న రాలేదు. ఇప్పటి వర‌కు కేవ‌లం కొన్ని వంద‌ల గ్రామాలు మాత్రమే ఈ స్మార్ట్ ఏపీలో భాగ‌స్వాముల‌య్యాయి.
స్మార్ట్ ఏపీకి స్పందన కరువు
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వార్డుల‌పై దృష్టి పెట్టింది. క‌నీస సౌక‌ర్యాలు లేని వార్డుల‌లో విద్యుత్, మంచినీటి సౌకర్యంతో పాటు ర‌హ‌దారి నిర్మాణం కూడా చేయాల‌ని నిర్ణయించింది. ఆస‌క్తి ఉన్న వాళ్లు వార్డుల‌ను దత్తత తీసుకోవ‌చ్చని సూచించింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి సరైన మార్గదర్శకాలు రాలేదు. దీంతో కేవ‌లం కొంత‌మంది మాత్రమే ఈ ద‌త్తత కార్యకమంపై దృష్టి పెట్టి గ్రామాల్ని దత్తత తీసుకున్నారు. స్మార్ట్ ఏపీలో సెల‌బ్రిటీల‌ను ఎక్కువ సంఖ్యలో భాగ‌స్వాముల‌ను చేయాల‌ని ప్రభుత్వం భావించిప్పటికీ..వారినుంచి ఆశించిన స్థాయిలో స్పంద‌న రాలేదు. కేవ‌లం కొద్ది మంది సెలబ్రిటీలు మాత్రమే ముందుకొచ్చి గ్రామాల‌ను ద‌త్తత తీసుకున్నారు. వ‌చ్చే 5ఏళ్లలో ఏపీని స్మార్ట్‌ ఏపీగా మార్చాల‌ని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నా..దీనికి వ‌స్తున్న స్పంద‌న మాత్రం అంతంత మాత్రమే. అయితే అంద‌ర్నీ భాగ‌స్వాములు చేయాల‌నుకున్న ప్రభుత్వం దీనిపై మ‌రింత‌ స్పష్టత ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. ముఖ్యంగా అధికారులు, రాజ‌కీయ నేత‌లు చాలా త‌క్కువ మంది మాత్రమే ముందుకొచ్చి గ్రామాల్ని ద‌త్తత తీసుకున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన‌ కార్యక్రమం కాబ‌ట్టి ప్రభుత్వం మ‌రింత ఎక్కువ‌గా జాగ్రత్తలు తీసుకోవాల‌నే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

 

07:48 - November 17, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతల మరణ మృదంగం కొనసాగుతున్నా ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుల ఆత్మహత్యల నివారణకు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని నిలదీసింది. కౌంటర్ దాఖలు చేయకుండానే వాదనలు ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
రైతుల ఆత్మహత్యలపై హైకోర్టులో వాడీవేడీ వాదనలు
అన్నదాతల ఆత్మహత్యలపై హైకోర్టులో వాడీవేడీ వాదనలు జరిగాయి. టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం వేసిన పిటిషన్‌ ను కూడా విచారణకు స్వీకరించిన హైకోర్టు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల తీరుపై సీరియస్ అయ్యింది. రైతుల ఆత్మహత్యలకు కారణాలు ఏంటని నిలదీసింది. సూసైడ్స్ నివారణ చర్యల్లో భాగంగా ఎలాంటి పథకాలు ప్రవేశ పెట్టారో తెలపాలని అడిగింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకోవద్దని పత్రికా ప్రకటనలతో పాటు టీ.వి.లో, సినిమా థియేటర్స్ లో యాడ్స్ ఇస్తున్నామని తెలిపింది. కలెక్టర్,ఎమ్మార్వో ఆఫీసుల్లో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశామని కోర్టుకు నివేదించింది.
కౌంటర్ దాఖలు చేయాలని టీప్రభుత్వానికి ఆదేశం
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండానే వాదనలు వినిపించేందుకు ప్రత్యేక న్యాయవాధి శరత్ ప్రయత్నించారు. దీంతో రాతపూర్వకంగా లేని వాదనలు అవసరం లేదని తప్పకుండా కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది బాలాజీ ఇప్పటికీ దేశంలోనే అత్యధికంగా తెలంగాణలోనే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. సత్వర న్యాయం కోసం రైతులకు ఎన్ని అప్పులు ఉన్నాయో వాటిని అప్లికేషన్ రూపంలో ప్రభుత్వం తీసుకోవాలని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరుపు న్యాయవాధి తమను ఇంప్లిడ్ చేయాలని కోరారు. రైతులకు కనీసం ఇన్ పుట్ సబ్సిడి అందడం లేదని ఇప్పటికీ కరువు మండలాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించకపోవడంతో నష్టం జరుగుతోందని తెలిపారు.
69 జీవో అమలు చేయడం లేదని మరో పిల్ దాఖలు
రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 69 జీ.వో. అమలు కావడం లేదంటూ మరో పిల్ దాఖలయ్యింది. దీనిపై ఇప్పటికే నోటీసులు జారీ చేసిన హైకోర్టు రైతులన్నింటి సమస్యలను ఒకే ట్యాగ్ కిందికి తీసుకొచ్చి విచారణ జరపుతామని తెలిపింది. ఈ పిటిషన్స్ అన్నింటి పై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది ఉన్నత న్యాయస్థానం.

 

07:42 - November 17, 2015

గుంటూరు : ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ పురుడుపోసుకుంటోంది. సీఎం, కేందమంత్రుల సమక్షంలో అగ్రికల్చర్‌ యూనివర్శిటీకి శంకుస్థాపన జరిగింది. వ్యవసాయ యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాతక సంస్థకు పునాది రాయి పడింది. గుంటూరులోని లాంఫాంలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కేంద్రమంత్రి రాధామోహన్‌సింగ్ శంకుస్థాపన చేసి శిలాపలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి, మంత్రులు హాజరయ్యారు. రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు అనివార్యమైంది. ఆచార్య ఎన్జీ రంగా పేరుతోనే ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.విశ్వవిద్యాలయానికి కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసింది.
వ్యవసాయరంగానికి పెద్దపీట : చంద్రబాబు
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్జీ రంగా వర్సిటీని జాతీయ వ్యవసాయ వర్సిటీగా మార్చాలని కేంద్రానికి సూచించినట్లు తెలిపారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తామన్న చంద్రబాబు, వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ పెంచామని చెప్పుకొచ్చారు. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామని చంద్రబాబు అన్నారు. కరువు ప్రాంతాల్లో పంటలు ఎండిపోకుండా రెయిన్ గన్స్ అందిస్తున్నట్లు తెలిపారు. రైతులను ఆదుకునేందుకు వివిధ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. వ్యవసాయనికి పగటిపూటే కరెంట్‌ అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కొత్త రాష్ట్రంలో అనేక కష్టాలున్నాయన్న చంద్రబాబు...5 నుంచి 10 ఏళ్లు కష్టపడితే కష్టాలన్నీ తీరిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమరావతి చుట్టూ రింగ్‌రోడ్డు : వెంకయ్యనాయుడు
అమరావతి చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. దుర్గగుడి ప్లైఓవర్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. పోలవరాన్ని ఎందుకు నిర్మించిలేదో కాంగ్రెస్‌ నేతలు చెప్పాలని వెంకయ్యనాయుడు డిమాండ్‌ చేశారు.
హైలెట్‌గా నిలిచిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్
ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్ హైలెట్‌గా నిలిచాయి. సీఎంతో పాటు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర వీఐపీలు స్టాల్స్ ను తిలకించారు. వ్యవసాయ వర్సిటీ శంకుస్థాపన కోసం లాంఫాంలో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది.

 

07:37 - November 17, 2015

విజయవాడ : భారీ వర్షాల కారణంగా విజయవాడ-చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చెన్నై-విజయవాడ మధ్య నడిచే జనశతాబ్ధి సూపర్‌పాస్ట్‌ ఎక్స్ ప్రెస్‌ను అధికారులు రద్దు చేశారు. అదేవిధంగా చెన్నై వైపు వెళ్లే మరికొన్ని రైళ్లను రేణిగుంట మీదుగా మళ్లించారు. ఇక చెన్నైకు వెళ్లాల్సిన,.. చెన్నై నుంచి రావాల్సిన 12 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

 

07:33 - November 17, 2015

విశాఖపట్నం : జిల్లాలో బాక్సైట్ తవ్వకాల జీవోపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఆ జీవోను తాత్కాలికంగా పక్కకు పెడుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశ వివరాలను మంత్రులు పల్లెరఘునాథ్‌ రెడ్డి, కామినేని శ్రీనివాస్‌ మీడియాకు వెల్లడించారు.
విజయవాడలో ఏపి కేబినేట్
విజయవాడలో ఏపి కేబినేట్ దాదాపు 7గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగింది .కొన్ని కీలక నిర్ణయాలను ఈ కేబినేట్ లో తీసుకున్నారు... సోమవారం సాయంత్రం 4గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి 10గంటల వరకు కొనసాగింది.. కేబినేట్ అనంతరం సమాచార శాఖా మంత్రి పల్లే రఘనాధరెడ్డి మాట్లాడారు. మంత్రివర్గంలో జరిగిన నిర్ణయాలను వివరించారు .
చేనేత కార్మికులకు రుణమాఫీకి నిర్ణయం
25,567 మంది చేనేత కార్మికులకు 110కోట్ల 95 లక్షల రూపాయల రుణమాఫీకి నిర్ణయం తీసుకు న్నామని దీనిని జనవరిలో అమలు చేస్తామన్నారు. పరిశ్రమలకు సంభందించిన లీజువిషయంలో 99సంవత్సరాలు , ఫ్రీ లాండ్ హోల్ఢింగ్ కు అంగీకారం , విద్యుత్ డ్యూటీకి సంబంధించి కేటగిరీల వారీగా యూనిట్ రేట్లను నిర్ణయించాలని దీనిపై అసెంబ్లీలో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని మంత్రి పల్లె అన్నారు.
విండ్ పవర్ తయారీకి ఎంవోయుకి అనుమతికి అంగీకారం..
సుజ్లాన్‌ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ , యాక్సెస్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఏపి ప్రభుత్వంతో విండ్ పవర్ తయారుచేయడానికి ఎం.వో.యు కి అనుమతి ఇవ్వడానికి అంగీకారం, దీనిద్వారా 5సంవత్స రాలలో 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అనుమతులు , దీనికి సంబంధించిన భూమిని అనంతపురంలో సెకరించాలని నిర్ణయంతీసుకున్నట్లు మంత్రి అన్నారు.
ఏపీ మరిటైన్ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం
రాష్ట్రంలో పోర్టు అభివృద్ధికి ఏపీ మరిటైన్ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బావానాపాడు-కళింగపట్నం, విశాఖపట్నం-గంగవరం, కాకినాడ పరిసర ప్రాంతం, మచిలీపట్నం-ఓడరేవు, కృష్ణపట్నం-రామయపట్నం క్లస్టర్లను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
జీ.నెం 97పై వెనకడుగు
బాక్సైట్ గనుల తవ్వకాలకు సంబంధించిన జీవో నంబరు 97 పై కేబినేట్‌ వెనక్కి తగ్గింది. ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి తెలియకుండానే అటవీ శాఖ జీవో జారీ చేసిందని చెప్పారు. గిరిజనులతో చర్చలు విస్తృతంగా జరిపిన అనంతరం ప్రజాభిప్రాయం సేకరిస్తామని ఆ తర్వాతే నిర్ణయం ఉంటుందని తెలిపారు. కాగా, స్వపక్షం విపక్షం నుంచే కాకుండా ప్రజల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లుగా తెలుస్తోంది.

 

07:23 - November 17, 2015

చిత్తూరు : భారీ వర్షాలు చిత్తూరు జిల్లాను ముంచెత్తుతున్నాయి. వందలాది గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వీధులు నదులను తలపిస్తున్నాయి. తిరుమలలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. కరెంటు సరఫరా లేక అనేక గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
జనజీవనం అస్తవ్యస్తం
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చిత్తూరు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదలతో వాగులు వంకలు నదులు పోటెత్తుతున్నాయి. శ్రీకాళహస్తీలో ఎటుచూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. ఎగువన కాలువలకు గండిపడటంతో శ్రీకాళహస్తి తడ రహదారిపై పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తోంది. దీంతో గోవర్ధనపురం, కరూరు వద్ద రాకపోకలు స్తంభించిపోయాయి.పలు గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వందల ఎకరాల్లో పంట నీటమునిగింది. శ్రీకాళహస్తీ ఆలయం వర్షపు నీటితో తడిసిముద్దయ్యింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కాళంగి రిజర్వాయర్ నిండిపోయింది. వరద ప్రవాహానికి రిజర్వాయరు గేటు కొట్టుకుపోయింది.
తడిసిముద్దైన తిరుపతి
తిరుపతి నగరం భారీ వర్షాలతో తడిసిముద్దయ్యింది. రహదారులపై భారీగా నీరు ప్రవహిస్తోంది. కాలువలు, డ్రైనీజీలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. నగరి మండలాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. భవానీ నగర్ జలదిగ్భంధనంలో చిక్కుకుంది.
తిరుమలలో విరిగిపడుతున్న కొండచరియలు
భారీ వర్షాలకు తిరుమల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో కొండపైకి వెళ్లేందుకు వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. వరదల్లో పలువురు గల్లంతయ్యారు. వాగులు వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎమ్మార్వో ఆఫీసులు, కలెక్టరేట్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు, వరదలతో చిత్తూరు జిల్లాలో డ్యాంలు నిండిపోయాయి. దీంతో పలు డ్యాంల గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీటిని వదిలారు.

 

వరదనీటిలో చిక్కుకున్న కాలేజీ బస్సు

హైదరాబాద్‌ : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వద్ద జాతీయరహదారిపై వస్తున్న ఇంజనీరింగ్‌ కళాశాల బస్సు కాళంగి వరదనీటిలో చిక్కుకుంది. బస్సులోని విద్యార్థులను వారిని రక్షించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. రెవెన్యూఅధికారులతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలు వారిని బయటకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.

 

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

నెల్లూరు : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గూడూరులో చెరువు తెగింది. జాతీయ రహదారిపై ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

నేడు చిత్తూరు జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు

చిత్తూరు : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మూలంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈనేపథ్యంలో నేడు జిల్లాలోని విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.  

Don't Miss