Activities calendar

18 November 2015

ధర్మపురి కూరగాయల మార్కెట్ లో అగ్నిప్రమాదం..

కరీంనగర్ : ధర్మపురి కూరగాయల మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో 14 దుకాణాలు దగ్ధమయ్యాయి. సుమారు రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. 

21:33 - November 18, 2015

హైదరాబాద్ : టెస్ట్ క్రికెట్ నెంబర్ వన్ సౌతాఫ్రికా, 5వ ర్యాంకర్ టీమిండియా మధ్య జరుగుతున్న ఫ్రీడం సిరీస్ ..రెండోటెస్ట్ వానదెబ్బతో పూర్తిగా రద్దయ్యింది. ఆటఆఖరిరోజున సైతం మ్యాచ్ నిర్వహించడానికి ఎలాంటి అవకాశమూ లేకపోడంతో....టెస్ట్ ను రద్దు చేసినట్లు మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ప్రకటించారు. నాలుగుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈనెల 14న ప్రారంభమైన ఈటెస్ట్ మొదటిరోజు మాత్రమే 81 ఓవర్ల ఆట సాధ్యపడింది.

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ...

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ...ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొని...సఫారీటీమ్ కు గట్టిసవాలే విసిరాడు. టీమిండియా స్పిన్ జోడీ అశ్విన్, రవీంద్ర జడేజా దూకుడుతో...సౌతాఫ్రికా 59 ఓవర్లలో 214 పరుగుల స్కోరుకే కుప్పకూలిపోయింది. సఫారీ స్టార్ హిట్టర్ ఏబీ డివిలియర్స్ కు ఇది 100వ టెస్ట్ మ్యాచ్ కావడంతో అభిమానులు భారీసంఖ్యలో తరలి వచ్చారు. తొలిరోజుఆటలో వందటెస్టుల హీరో డివిలియర్స్ ను భారత క్రికెట్ బోర్డు, కర్నాటక క్రికెట్ సంఘం ప్రత్యేక జ్ఞాపికలతో సత్కరించాయి. ఈ మ్యాచ్ లో డివిలియర్స్ 85 పరుగుల చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

తొలిఇన్నింగ్స్ స్కోరు 214 పరుగులకు...

సౌతాఫ్రికా తొలిఇన్నింగ్స్ స్కోరు 214 పరుగులకు సమాధానంగా శిఖర్ ధావన్, మురళీ విజయ్ లతో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా..22 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 80 పరుగుల స్కోరు సాధించడంతో...తొలిరోజుఆట ముగిసింది. విజయ్ 28, ధావన్ 45 స్కోర్లతో నాటౌట్ గా నిలిచారు. అయితే...ఆట రెండోరోజు నుంచి 5వ రోజువరకూ కురిసిన భారీవర్షాలతో ..కనీసం ఒక్కబంతీ పడకుండా మ్యాచ్ రద్దయ్యింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ..ఓ టెస్ట్ మ్యాచ్ ఆఖరినాలగురోజుల ఆట..వానదెబ్బతో రద్దు కావడం ఇదే మొదటిసారి.

1995 సిరీస్ లో భాగంగా ....

1995 సిరీస్ లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ కేవలం 71.1 ఓవర్లు మాత్రమే సాధ్యపడింది. ఆ తర్వాత...వానదెబ్బతో ఆఖరి నాలుగురోజులఆట రద్దుకావడం ..బెంగళూరు టెస్ట్ ద్వారానే జరిగింది. బెంగళూరుటెస్ట్..ఆఖరి నాలుగురోజులఆట వానదెబ్బతో రద్దు కావడం తమను నిరాశకు గురి చేసిందని సౌతాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా, టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ చెప్పారు.

వర్షం కారణంగా రద్దుకావడం దురదృష్టకరమే అయినా...

బెంగళూరుటెస్ట్ వర్షం కారణంగా రద్దుకావడం దురదృష్టకరమే అయినా...శిఖర్ ధావన్ లాంటి కీలక ఆటగాడు ఫామ్ లోకి రావడం తమజట్టుకు జరిగిన మేలుగా భావిస్తామని...నాగపూర్ లో ఈనెల 25న ప్రారంభమయ్యే మూడోటెస్ట్ కు ఎలాంటి అవాంతరాలు ఉండరాదని కోరుకొంటున్నట్లు టీమిండియా కెప్టెన్ కొహ్లీ అన్నాడు.

రెండోటెస్ట్ ఆఖరినాలుగురోజులఆట రద్దుతో..

రెండోటెస్ట్ ఆఖరినాలుగురోజులఆట రద్దుతో...లభించిన విరామాన్ని తమజట్టు చక్కగా ఉపయోగించుకొని..నాగపూర్ టెస్ట్ కు పూర్తిస్థాయిలో సిద్ధంకావడానికి ఉపయోగపడుతుందని...సఫారీ సారథి హషీం ఆమ్లా చెప్పాడు. సిరీస్ లో భాగంగా...మొహాలీలో ముగిసిన తొలిటెస్ట్ ను టీమిండియా..మొదటి మూడురోజుల్లోనే 108 పరుగుల తేడాతో నెగ్గి 1-0 ఆధిక్యంతో నిలిచిన సంగతి తెలిసిందే.

21:22 - November 18, 2015

చిత్తూరు : కటారి దంపతుల హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో మంగళవారం లొంగిపోయిన ఇద్దరితో పాటు.. మరో వ్యక్తిని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. మరోవైపు కటారి దంపతుల అంత్యక్రియలు రేపు జరుగనున్నాయి. కటారి దంపతులకు నివాళులర్పించిన సీఏం చంద్రబాబు.. నిందితులను వదలబోమని స్పష్టం చేశారు.

గురువారం అంత్యక్రియలు...

చిత్తూరు మేయర్‌ అనురాధా, ఆమె భర్త మోహన్‌ అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. మేయర్‌ దంపతుల భౌతిక కాయాలకు ఉదయం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టమ్ పూర్తి అయ్యింది. అనురాధ ఎడమకంటి నుంచి మెదడులోకి బుల్లెట్ దూసుకెల్లిందని దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు పోస్ట్‌మార్టమ్ నివేదకలో వెల్లడైంది. అనంతరం ప్రజల సందర్శనార్థం అనురాధ భౌతికకాయాన్ని మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లారు. తమ నేతలను కడసారిగా చూసేందుకు అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు.

అనురాధ దంపతులకు చంద్రబాబు నివాళులు...

చిత్తూరు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేయర్ అనురాధ దంపతులకు నివాళులర్పించారు. హత్యకు గల కారణాలపై ఆయన పోలీసులతో చర్చించారు. అనంతరం కాల్పుల ఘటన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని చంద్రబాబు చెప్పారు. అనురాధ అదనపు భద్రత కోరారన్న విషయం తన దృష్టికి రాలేదని చంద్రబాబు చెప్పారు.

హత్యకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా బంద్....

అనురాధ దంపతుల హత్యకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా బంద్ జరిగింది. కొన్ని చోట్ల కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. ఆర్టీసీ బస్సుల అద్దాలను పగులగొట్టారు. మరోపక్క కటారి దంపతుల హత్య కేసు దర్యాప్తులో పురోగతి కనిపిస్తోంది. కటారి దంపతుల హత్య కేసులో చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం లొంగిపోయిన ఇద్దరు నిందితులను రెడ్డప్ప, మంజునాథ్‌లుగా గుర్తించారు. వెంకటేష్‌ అనే మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరిని జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రంలో రహస్యంగా విచారిస్తున్నారు. ఈ కేసుతో సంబంధమున్న మరో ఇద్దరి కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. 

21:19 - November 18, 2015

హైదరాబాద్ : తెలంగాణలో కరవు మండలాల ఎంపిక కసరత్తు కొనసాగుతూనే ఉంది. కలెక్టర్లు సమర్పించిన ప్రాథమిక నివేదికలపై.. సీఎం కేసీఆర్‌.. ఈరోజు క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు. సుమారు రెండు వందల మండలాలు కరవు బారిన పడ్డట్లు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు.

కరువు మండలాల ఎంపికను....

కరువు మండలాల ఎంపికను... తెలంగాణ ప్రభుత్వం ఈసారి సీరియస్‌గా తీసుకుంది. నిరుడు ప్రభుత్వం సరిగా స్పందించలేదన్న విపక్షాల ఆరోపణల నేపథ్యంలో.. ప్రభుత్వం ఈసారి కరువు మండలాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈరోజు సిఎం క్యాంపు కార్యాలయంలో దీనిపై సమీక్ష జరిపారు. జిల్లా కలెక్టర్లు సమర్పించిన నివేదికల మేరకు దాదాపు 200 మండలాలు కరువు బారిన పడ్డట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

కేంద్ర ప్రభుత్వ కఠిన నిబంధనలు అడ్డంకిగా ....

కరువు మండలాల ఎంపికలో కేంద్ర ప్రభుత్వ కఠిన నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయని అధికారులు సీఎంకు నివేదించారు. వరుసగా 21 రోజులు వర్షం పడని ప్రాంతాలనే కరువు మండలాలుగా ప్రకటించాలన్నది కేంద్ర నిబంధన. ఈ నిబంధనను పాటిస్తే.. కరువు పీడిత ప్రాంతాలనూ జాబితాలో చేర్చలేమని వారు సీఎంకు తెలిపారు. నిబంధనలను పాటిస్తూనే... నాలుగైదు రోజుల్లోగా తుది నివేదికను సమర్పించాలని సిఎం అధికారులను ఆదేశించారు.

వీలైనంత త్వరగా తెమల్చాలని .....

కరవు మండలాల ఎంపికలో గత ఏడాది లాగానే.. ఇప్పుడు కూడా కేసీఆర్‌ సర్కారు జాప్యం చేస్తోందంటూ విపక్షాలు ఇప్పటికే దుమ్మెత్తి పోస్తున్నాయి. దీంతో.. ఈ అంశాన్ని వీలైనంత త్వరగా తెమల్చాలని సర్కారు భావిస్తోంది. 

21:16 - November 18, 2015

హైదరాబాద్ : రాళ్లతో కొట్టండి.. తలను బండతో కొట్టుకోవాల్నా... కాంగ్రెసోళ్లు తెలంగాణను నాశనం చేసిపోయిండ్రు... అంటూ కెసిఆర్‌.. హన్మకొండ బహిరంగ సభలో... కొట్టిన డైలాగ్‌ కొట్టకుండా సెటైర్లు పేల్చారు. ఆ మాటల ఘాటుకు ఠారెత్తిపోయిన టి కాంగ్‌ నేతలు గులాబీ అధినేతపై వరుసబెట్టి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పెద్ద మనిషి జైపాల్‌రెడ్డి అయితే... ఉద్యమం పీక్స్‌లో ఉండగా నీవెందుకు నిరాహార దీక్షను విరమించినవ్‌... అంటూ వీడియో క్లిప్పింగ్‌ చూపి మరీ కొశ్చన్‌ చేశారు.

అంతకు మించిన భీకర విమర్శలతో....

ఇలాంటి ఆకట్టుకునే డైలాగులు.. అంతకు మించిన భీకర విమర్శలతో మంగళవారం హనుమకొండలో కెసిఆర్‌ ప్రసంగం ఉధృతంగా సాగింది. టిఆర్‌ఎస్‌ తన ప్రధాన ప్రత్యర్థిగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌పై వీలైనన్ని విమర్శలు చేశారు. దీంతో షాక్‌తిన్న టికాంగ్‌ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ప్రభుత్వ పాలన నుండి తెలంగాణ అంశం వరకు అన్నింటిలో కెసిఆర్‌ వైఫల్యాన్ని ఎండగట్టారు. రాష్ట్రాభివృద్ధికి ఏం చేశారంటూ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.

కెసిఆర్‌ దీక్ష విరమించిన ఫుటేజీని చూపించిన జైపాల్ రెడ్డి...

తెలంగాణ ఉద్యమ సమయంలో జైపాల్‌రెడ్డి ఎక్కడున్నారని గులాబీ బాస్‌ కామెంట్లు చేశారు. దీంతో తెలంగాణ ఏర్పాటులో తన పాత్ర ఏ స్థాయిలో ఉందో జైపాల్‌ వివరించారు. తాను క్యాబినెట్‌లో లేకపోతే తెలంగాణ వచ్చుండేది కాదని, కెసిఆర్‌ తనతో ఆ మాట ఎన్నిసార్లు అన్నారో గుర్తు తెచ్చుకోవాలని నిలదీశారు. అలా చెప్తూనే ఖమ్మంలో కెసిఆర్‌ దీక్ష విరమించిన ఫుటేజీని చూపారు.

కేసీఆర్ పై మండి పడ్డ దామోదర...

మాజీ డిప్యూటీ సియం దామోదర రాజనర్సింహ కూడా కెసిఆర్‌పై మండిపడ్డారు. టిఆర్‌ఎస్‌ పాలన అవినీతిలో కూరుకుపోయిందని, వాటర్‌ గ్రిడ్‌లో రెండువేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ అవినీతిని నిరూపిస్తానని.. ప్రతిగా కేసిఆర్ తన కుటుంబంతో సహా పదవులకు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.

కేసీఆర్ జానారెడ్డి ఆగ్రహం...

తనను విమర్శించిన కెసిఆర్‌పై జానారెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అహంకార పూరిత పాలన చేస్తున్నారంటూనే... అబద్దాలకోరులెవరో ప్రజలకు తెలుసని విమర్శించారు. మూడేళ్లలో కోటి ఎకరాలకు నీరిస్తే తాను టిఆర్‌ఎస్‌ తరపున ప్రచారం చేస్తానని... అది జరగకపోతే కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తావా అంటూ గులాబీ బాస్‌కు సవాలు విసిరారు. కెసిఆర్ తాను సరైన పాలన అందించకపోతే రాళ్లతో కొట్టమన్నారని అలా అనడం బదులు కొడితే కేసులు పెట్టబోమని చెబితే బాగుండేదని విహెచ్‌ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో రాళ్లకు బదులు ఓట్లతో కొట్టి ఓటర్లు ఆయనకు కనువిప్పు కలిగిస్తారని చమత్కరించారు. ఇప్పటికే ఓరుగల్లు ప్రచార పోరు క్లైమాక్స్‌కు చేరింది. ఇలాంటి వేళ కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. 

20:57 - November 18, 2015

ఢిల్లీ : బీహార్‌లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదిని ఆహ్వానించారు. నవంబర్‌ 20న పాట్నాలోని గాంధీ మైదాన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నితీష్‌ మోదికి ఫోన్‌ చేశారని సిఎం కార్యాలయం పేర్కొంది. మోదితో పాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌లకు కూడా నితీష్‌ ఫోన్‌ చేసి ఆహ్వానించారు. అయితే కేంద్రం తరపున మంత్రులు వెంకయ్యనాయుడు, రాజీవ్‌ ప్రతాప్‌ రూఢి హాజరయ్యే అవకాశముంది. నితీష్‌ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు ముఖ్యమంత్రులు కేజ్రీవాల్‌, మమతా బెనర్జీ, తరుణ్‌ గోగోయ్, అఖిలేష్‌ యాదవ్‌ హాజరయ్యే అవకాశముంది. 

20:55 - November 18, 2015

ఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలుసుకున్నారు. వచ్చే నెలలో తన కూతురు పెళ్లి ఉన్నందున రాహుల్‌ను ఆహ్వానించడానికి జైట్లీ వచ్చారు. నవంబర్‌ 26న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జైట్లీ రాహుల్‌ను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా మోది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జిఎస్‌టి బిల్లును పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుకు సహకరించాలని జైట్లీ రాహుల్‌ను కోరనున్నట్టు సమాచారం. అయితే రాహుల్‌-జైట్లీల మధ్య జిఎస్‌టి బిల్లుపై ఎలాంటి చర్చ జరగలేదని కాంగ్రెస్‌ వర్గాలు స్పష్టం చేశాయి. రాజ్యసభలో ఎన్డీయేకు బలం లేకపోవడంతో కీలక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

20:54 - November 18, 2015

హైదరాబాద్ : మాగీ నూడుల్స్‌ తర్వాత ఇపుడు బాబా రాందేవ్ నూడుల్స్‌పై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా - ఎఫ్ ఎస్ ఎస్ ఎఐ అప్రూవల్‌ లేకుండానే పతంజలి ఉత్పత్తికి చెందిన నూడుల్స్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. పతంజలి నూడుల్స్‌ పాకెట్‌పై లైసెన్స్‌ నెంబర్‌ మంజూరు చేసినట్టు ఎఫ్ ఎస్ ఎస్ ఎఐ పేర్కొంది. పతంజలి ప్రోడక్ట్‌ నూడుల్స్‌ను ఇంకా నిర్ధారించలేదని, దీనిపై విచారణ జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. లైసెన్స్‌ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఉత్పత్తులకు మాత్రం ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.

20:52 - November 18, 2015

హైదరాబాద్ : రిన్‌ నిర్వహిస్తున్న కెరీర్‌ రెడీ అకాడెమీ ప్రచార కార్యక్రమంలో భారత మాజీ కెప్టెన్‌ క్రిష్టమచారీ శ్రీకాంత్, టాలీవుడ్‌ బ్యూటీ క్యాథరీన్‌ తెరీసా సందడి చేశారు. ఆర్ధికంగా వెనుకబడిన మహిళా విధ్యార్ధుల కోసం రిన్‌ సంస్థ నిర్వహిస్తున్న కెరీర్‌ డెవలెప్‌మెంట్‌ క్యాంపెయిన్‌లో భాగంగా బ్రిటీష్‌ కౌన్సిల్‌తో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తోంది. ఈ క్యాంపెయిన్‌కు క్రిష్టమచారీ శ్రీకాంత్, క్యాథరీన్‌ తెరీసాలను ప్రచారకర్తలుగా నియమించింది. ఓ మంచి లక్ష్యం కోసం రిన్‌ నిర్వహిస్తున్న క్యాంపెయిన్‌లో భాగమవ్వడం ఆనందంగా ఉందని శ్రీకాంత్‌ చెప్పారు.

 

చైన్ స్నాచింగ్ కు పాల్పడుతూ పట్టుబడ్డ దుండగుడు

హైదరాబాద్ : వనస్థలీపురం సాయినగర్ కాలనీలో మహిళ మెడలో గొలుసు అపహరణకు యత్నించారు. గొలుసు లాక్కెళ్లే ప్రయత్నంలో దుండగుడు కిందపడ్డాడు. దుండగుడిని పట్టుకుని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆ దుండగుడి వద్ద నుండి పోలీసులు కత్తి స్వాధీనం చేసుకున్నారు.

బాబా రాందేవ్‌ బాబా నూడుల్స్ కు కష్టాలు...

న్యూఢిల్లీ : యోగా గురువు బాబా రాందేవ్‌ ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసిన న్యూడిల్స్‌కు అనుమతి ఇవ్వలేదని ఆహారభద్రతా సంస్థ తెలిపింది. ఏవైనా ఇన్‌స్టెంట్‌ న్యూడిల్స్‌ మార్కెట్‌లోకి రావాలంటే ఆహార భద్రతా సంస్థ అనుమతి అవసరం. అయితే రాందేవ్‌ కంపెనీ విడుదల చేసిన న్యూడిల్స్‌ మాత్రం ఎలాంటి అనుమతి లేకుండానే మార్కెట్‌లోకి వచ్చాయి. పతంజలి ఆయుర్వేదిక్‌ మందులకు పర్మిషన్‌ ఉన్నా... న్యూడిల్స్‌కు మాత్రం లేదని అదికారులు తెలిపారు. తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే రాందేవ్‌ కంపెనీ నిర్వాహకులు మాత్రం ఆహారభద్రతా సంస్థ అనుమతి తీసుకున్నామని అన్నారు.

20:37 - November 18, 2015

హైదరాబాద్ : బియ్యం బాంబ్ పేలబోతోంది!నిన్నటి దాకా ఉల్లి పెట్టించిన కన్నీళ్లు మరవక ముందే..బియ్యం ధరలు మండిపోబోతున్నాయి. ఓ పక్క పప్పుల ధరలు ఆకాశం నుండి దిగిరావడం లేదు. మరో పక్క కూరగాయలు గాయాలు చేస్తూనే వున్నాయి. వెరసి నిత్యావసరాలన్నీ సామాన్యుడిని వెక్కిరిస్తున్నాయి. ఏం కొనాలో.. ఎలా బతకాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. అమాంతం పెరిగిన నిత్యావసరాల ధరలపై నేటి వైడాంగిల్ లో విశ్లేషణ చేశారు. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

శ్రీనగర్‌లో పలు చోట్ల భూప్రకంపనలు

హైదరాబాద్ : జమ్మూకశ్మీర్, శ్రీనగర్‌లో పలు చోట్ల భూప్రకంపనలు సంభవించాయి. భూమి కంపించడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. శ్రీనగర్ ప్రజలు భయానక వాతావరణంలో ఉన్నారు. 

రాజయ్య దంపతుల బెయిల్ పిటిషన్ కొట్టివేత...

వరంగల్ : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య మాధవి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కోడలు సారిక, ముగ్గురు మనువళ్ల అనుమానాస్పద మృతి కేసులో రాజయ్య దంపతులు బెయిల్ కోసం రెండో అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సారిక భర్త అనిల్ పోలీసు కస్టడీలో ఉండగా.. రాజయ్య దంపతులు వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్నారు.

పారిన్ దాడుల సూత్రదారి అబ్దుల్ హమీద్ ఆత్మహత్య

హైదరాబాద్ : ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని సెయింట్ డెనిస్‌లో ఆ దేశ కమెండో ఆపరేషన్ సమయంలో పారిస్ దాడుల ప్రధాన సూత్రధారి అబ్దుల్ హమీద్ ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల క్రితం పారిస్ దాడుల్లో 132 మంది చనిపోయారు. 350 మంది గాయపడ్డారు. వీరిలో 99 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పారిస్ దాడుల నాటి నుంచీ పారిస్ అబ్దుల్ హమీద్‌ను వెంటాడింది. పారిస్‌లోనే దాక్కున్న అబ్దుల్ హమీద్ మొత్తం దాడులను దగ్గరుండి జరిపించాడు. బెల్జియం పౌరుడైన హమీద్ తన 13 సంవత్సరాల తమ్ముడిని కూడా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిగా మార్చాడు.

మేఘాలయలో నీలం రంగులోకి మారిన రెండు నదులు

హైదరాబాద్ : మేఘాలయ తూర్పు ప్రాంతంలో రెండు నదులు మళ్లీ నీలం రంగులోకి మారాయి. వీటిలో అధిక మోతాదులో యాసిడ్ ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీని వల్ల నదుల్లో చేపలు కూడా చనిపోతున్నాయి. తూర్పు జైంతియా జిల్లాలోని లుఖా నది, పశ్చిమ జైంతియా జిల్లాలోని మైంటుడు నదిలో ప్రాంతాలు నీలం రంగులోకి మారిపోయాయి. గత కొన్ని రోజులుగా నదుల్లో నీళ్ళు నీలం రంగంలోకి మారిపోతున్నాయని అధికారులు తెలిపారు. కాలుష్యం, యాసిడ్ వల్ల ఇలా జరుగుతోందని భావిస్తున్నారు.

19:47 - November 18, 2015

హైదరాబాద్ : అమెరికా ఫెడ్ రిజర్వ్ మీటింగ్ నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్న ఊగిసలాట భారత మార్కెట్లను తాకింది. దీంతో సెన్సెక్స్ ఇవాళ 382 పాయింట్లు క్షీణించి 25వేల 482 వద్ద ముగిసింది. అటు 106 పాయింట్ల నష్టంతో 7వేల 732 వద్ద క్లోజైంది. BSEలో 16వందల 19 షేర్లు నష్టాలు చూశాయి. ఒక్క కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీ మినహా.. మిగతా అన్ని ఇండెక్సులు నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ, మెటల్, టెక్నాలజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీలో హిండాల్కో, ఇన్ఫోసిస్, టాటాస్టీల్, PNB, వేదాంత 3 నుంచి 5శాతం వరకు నష్టపోయాయి. 

19:45 - November 18, 2015

హైదరాబాద్ : పుత్తడి వెలుగులకు గ్రహణం పడుతోంది. అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ లో డాలర్ డిమాండ్ పుంజుకోవడంతో బంగారం దాదాపు ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఈ డిసెంబర్లో పెరగనున్నాయనే వార్తల నేపథ్యంలో బంగారంపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఎంసీఎక్స్ లో ఈ ధర 25వేల 110రూపాయలకు పరిమితమైంది. బహిరంగ మార్కెట్లో ధర 25వేల 625 రూపాయలు. పసిడితో పాటు ప్లాటినం, వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇదే ఈ క్షీణత కొనసాగితే , పుత్తడి ధర ఇంకా దిగి వచ్చే అవకాశాలున్నాయని ఎనలిస్టులు సూచిస్తున్నారు. 

19:43 - November 18, 2015

చిత్తూరు : తిరుమల శ్రీనివాసునికి శ్రీవారి ఆలయంలో పుష్పయాగం అత్యంత వేడుకగా జరిగింది.12 రకాల పుష్పలు, ఆరురకాల పత్రాలు మొత్తం కలిపి ఏడుటన్నుల పూలతో ఉత్సవ మూర్తులను అర్చించారు. ఉదయం టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యలో పుష్పాలు ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. తొలుత శ్రీదేవి, భూదేవీ సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఘనంగా పుష్పయాగం జరిగింది. రాష్ట్రగవర్నర్ నరసింహన్, టిటిడి చైర్మెన్ చదలవాడ క్రిష్ణమూర్తి, ఈఓ సాంబశివరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

19:41 - November 18, 2015

హైదరాబాద్ : వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు కొత్త పథకాలు ప్రకటించొద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలంగాణ సర్కార్‌ను ఆదేశించారు. కొత్త స్కీముల ప్రకటన ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. క్రిస్మస్‌ వేడుకలు, బీసీ హాస్టళ్లకు సన్నబియ్యం, కల్యాణ లక్ష్మి పథకాలపై సీఎం కేసీఆర్‌, మంత్రులు కొన్ని ప్రకటనలు చేశారు. దీనిపై ఎన్నికల కమిషన్‌ తెలంగాణ సర్కార్‌ నుంచి వివరణ కోరిందని భన్వర్‌లాల్‌ చెబుతున్నారు. 

19:39 - November 18, 2015

విజయవాడ : ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ప్రపంచబ్యాంకు ముందుకొచ్చింది. ఏపీకి దాదాపు రూ.5వేల కోట్ల రుణం మంజూరు చేయనున్నట్లు ప్రపంచబ్యాంకు ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి తోడ్పాడును అందిస్తామన్న వరల్డ్ బ్యాంక్.. తొలి విడతగా 5వేల కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ సాయంతో.. రాజధాని నిర్మాణం మరింత వేగవంతం అవుతుందని మంత్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

19:35 - November 18, 2015

వరంగల్ : ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. వరంగల్ లోక్ సభ ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థి తరపున ఇస్లామిక్ గ్రౌండ్స్ జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితులకు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన కేసీఆర్... మంగళవారం వరంగల్ లో తన ప్రసంగంలో దాని గురించి ప్రస్తావన ఎందుకు తేలేదని ప్రశ్నించారు. పైగా హరితహారం పేరుతో గిరజనుల నుండి భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. గిరిజనుల తరుపున పోరాడిన జెండా ఎర్రజెండా. ఇది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రైతు అప్పులన్నీ మాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్ ఎందుకు మాఫీ చేయలేదు.. అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలో 1800 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దీని గురించి సమాధానం చెప్పకుండా టిడిపి, కాంగ్రెస్ పేరు చెప్పి తప్పుకోవడం మంచి కాదని హెచ్చరించారు. తెలంగాణ లో కమ్యూనిస్టుల ఐక్యత ప్రారంభం మాత్రమేనని... కమ్యూనిస్టులు ఒక బలమైన సంఘటిత శక్తి తయారవుతుందని తెలిపారు. ఒక కొత్త ఆలోచనతో ఆత్మవిమర్శనతో కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా ముందుకు వస్తున్నాయి. దీనికి మద్దతు కావాలి కోరారు.

19:26 - November 18, 2015

హైదరాబాద్ : కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు అస్వస్థతకు గురయ్యారు. వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల సందర్భంగా కాళోజీ కళాక్షేత్రంలో బిజెపి సభలో దత్తాత్రేయకు ముక్కు నుండి రక్తం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన నేతలు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

కేంద్ర మంత్రి దత్తాత్రేయకు అస్వస్థత

హైదరాబాద్ : కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు అస్వస్థతకు గురయ్యారు. వరంగల్ లో ఉప ఎన్నికల సందర్భంగా కాళోజీ కళాక్షేత్రంలో బిజెపి సభలో దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన నేతలు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

కొపెన్‌హాగన్ ఎయిర్‌పోర్ట్ ను ఖాళీ చేయించిన అధికారులు

డెన్మార్క్ : కొపెన్‌హాగన్ ఎయిర్‌పోర్ట్ ను ఖాళీ చేయించారు. ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పద స్థితిలో సంచి కనపడటంతో ఎయిర్‌పోర్ట్ ను ఖాళీ చేయించారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. పారిస్ దాడుల నేపథ్యంలో అప్రమత్తత కొనసాగుతోంది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా టీఎస్ ఠాకూర్

న్యూఢిల్లీ : భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా టీఎస్ ఠాకూర్ నియామకం కానున్నారు. ఠాకూర్ నియామకంపై అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తు డిసెంబర్ 2న పదవీ విరమణ చేయనున్నారు. దత్తు స్థానంలో ఠాకూర్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. జస్టిస్ ఠాకూర్ సర్వోన్నత న్యాయస్థానం 43వ చీఫ్ జస్టిస్ కానున్నారు. అయితే స్వల్పకాలమే ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. 2017 జనవరి 4 ఆయన పదవీ విరమణ తేదీ. 1952 జనవరి 4న జన్మించిన ఠాకూర్.. 1972లో న్యాయవాదిగా జమ్ముకశ్మీర్ హైకోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు.

18:50 - November 18, 2015

విజయవాడ : అత్త సొమ్మును అల్లుడు దానం చేశాడన్నది సామెత. ఏపీ సీఎం చంద్రబాబు కూడా.. అచ్చంగా ఇదే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. పేదల భూములను.. అప్పనంగా కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టేస్తున్నారు. అంతేకాదు.. సదరు భూములపై సుదీర్ఘ కాలపు హక్కు భుక్తాన్నీ కల్పిస్తోంది. ఈ నిర్ణయానికి అడ్డు వచ్చే చట్టాలనూ సవరించి పారేయాలని నిర్ణయించింది... చంద్రబాబు సర్కారు.

కార్పొరేట్‌ సంస్థలకు అప్పనంగా పేదల భూములు...

చంద్రబాబు సర్కారుకు ముందు నుంచీ.. కార్పొరేట్‌ శక్తులంటే అపరిమితమైన ప్రేమ. వీరిని సంతృప్తి పరిచేందుకు.. దేన్ని సమర్పించుకునేందుకైనా బాబు సర్కారు వెనుకాడడం లేదు. పేదల నుంచి సేకరించిన భూమిని.. కార్పొరేట్‌ సంస్థలకు అప్పనంగా కట్టబెడుతోంది. అంతటితో ఆగకుండా.. ఇప్పుడు కార్పొరేట్‌ శక్తులకు అప్పగించే భూముల లీజు పరిమితిని 99 ఏళ్లకు పెంచాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం.. ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఎనేబ్లింగ్‌ యాక్ట్‌ నూ సవరించాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయించింది.

ఏపీఐడీఏ చట్టం ప్రకారం లీజు గడువు 33 ఏళ్లే.....

ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఎనేబ్లింగ్‌ యాక్ట్‌ ప్రకారం.. ప్రభుత్వ భూమిని 33 సంవత్సరాలకు మాత్రమే లీజుకు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ లీజు పరిమితి పెంచాలన్నా.. గరిష్ఠంగా 11 సంవత్సరాలు చొప్పున ఓ రెండుసార్లు మాత్రమే పొడిగించ వచ్చు. అంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ 55 సంవత్సరాలకు మించి... ఏ ప్రభుత్వ భూమినీ ఏ సంస్థకూ లీజుకు ఇవ్వడానికి వీలు లేదు. కానీ.. కార్పొరేట్‌ శక్తుల ప్రేమలో తలదాకా కూరుకు పోయిన చంద్రబాబు సర్కారు.. లీజు గడువును ఏకంగా 99 సంవత్సరాలకు పెంచేసింది.

ఏపీలో కజఖ్‌స్థాన్‌ నమూనా...

కజఖ్‌స్థాన్‌ రాజధాని ఏస్తానా మోడల్‌లో ఏపీ సర్కారు లీజు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఏస్తానాలో ఖజానాను నింపుకునేందుకు అక్కడి ప్రభుత్వం.. కార్పొరేట్‌ శక్తులకు లీజు కాలాన్ని 99 సంవత్సరాలకు పెంచింది. ఇటీవల అక్కడ పర్యటించిన రాష్ట్ర అధికారులు.. ఈ అంశాన్ని గుర్తించారు. వెంటనే వారీ విషయాన్ని సీఎంకు నివేదించారు. ఇంకేముందీ.. ఒట్టిపోయిన ఖజానాకు తోడు.. కార్పొరేట్‌ శక్తులంటే తన్మయులయ్యే చంద్రబాబు.. ఇక్కడా ఎస్తానా విధానాన్నే అమలు చేసేందుకు ఆమోదం తెలిపారు.

కార్పొరేట్‌ శక్తుల ఒత్తిళ్లే కారణమన్న వాదన...

లీజు పరిమితిని 99 సంవత్సరాలకు పెంచాలన్న నిర్ణయానికి.. కార్పొరేట్‌ సంస్థల ఒత్తిళ్లే కారణమన్న వాదన వినిపిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన కోసం చేసిన పెట్టుబడులు.. 33 సంవత్సరాల్లో లాభాలతో సహా రాబట్టుకోలేమని.. కాబట్టి లీజును 99 సంవత్సరాలకు పెంచాలని వారు ఒత్తిడి చేయడం వల్లే.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.

అంతర్జాతీయ సంస్థలను దృష్టిలో ఉంచుకొని..

రాజధాని ప్రాంతంలో వచ్చే అంతర్జాతీయ సంస్థలను దృష్టిలో ఉంచుకొని.. చంద్రబాబు సర్కారు లీజు పరిమితిని పెంచిందని అంటున్నారు. రాజధాని నిర్మాణం నిరంతర ప్రక్రియ కాబట్టి.. 33 సంవత్సరాల్లోగా పనులు పూర్తయ్యే వీలు లేదు కాబట్టి.. సుదీర్ఘ కాలం తాము లబ్ది పొందాలన్న భావనతోనే కార్పొరేట్‌ శక్తులు.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయన్న ఆరోపణలున్నాయి.

విమానాశ్రయాలు, పరిశ్రమలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలకు లీజు వెసులుబాటు.....

ప్రస్తుతమున్నచట్టం ప్రకారం.. 99 ఏళ్ల లీజు పద్ధతిని పోర్టులకే వర్తింప చేసేవారు. ఇకమీదట.. విమానాశ్రయాలు, పరిశ్రమలు, మౌలిక వసతుల ప్రాజెక్టులన్నింటికీ 99 ఏళ్ల లీజు వర్తిస్తుంది. నిజానికి ప్రభుత్వం దగ్గర కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేంత భారీ స్థాయిలో భూమి లేదు. అలా భూమిని సమకూర్చలేకే.. కృష్ణపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల పనులు నిలిచిపోయాయి. రాజధానికి కూడా రైతుల పుణ్యాన 30వేల ఎకరాలు సమకూరింది. ఈ దశలో.. ప్రభుత్వం లక్షల ఎకరాల్లో రైతుల భూములను సేకరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అర్థమవుతోంది. సర్కారు ఆలోచనా తీరుపై.. ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

18:47 - November 18, 2015

నెల్లూరు : ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. మంత్రులు నారాయణ, శిద్ధారాఘవరావు జిల్లాలో పర్యటించారు. వరద పరిస్థితిని సమీక్షించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి నారాయణ చెప్పారు. జిల్లాలో సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నామంటున్న నారాయణ తెలిపారు. ఇంకా ఏఏ అంశాలను నారాయణ ప్రస్తావించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:44 - November 18, 2015

కృష్ణా : జిల్లా గుడివాడలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యాలయాన్ని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన అధికారులు... కార్యాలయ తలుపులు, కిటికీలు పగులగొట్టిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలను, మీడియాను కార్యాలయ దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదు. 

లొంగిపోయారు. వీరిని రెడ్డప్ప, మంజునాథ్ గా గుర్తింపు

హైదరాబాద్ : చిత్తూరు మేయర్ దంపతుల హత్యకేసులో ఇద్దరు నిందితుల వివరాలు టెన్ టీవీ సంపాదించింది. నిన్న హత్య చేసిన అనంతరం.. .నిందితులు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. వీరిని రెడ్డప్ప, మంజునాథ్ గా గుర్తించారు. మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురిని ప్రస్తుతం జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో రహస్యంగా విచారిస్తున్నారు. ఈ కేసులో మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

ప్రభుత్వ వైఫల్యం వల్లే మేయర్ హత్య : వైసీపీ

గుంటూరు : ప్రభుత్వ వైఫల్యం వల్లే చిత్తూరు మేయర్ హత్యకు గురయిందని వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు శాంతిభద్రతలను కాపాడలేని స్థితిలో ఉన్నారన్నారు. వరంగల్ లో అన్ని పార్టీలు నాయకులు ప్రచారం చేస్తుంటే చంద్రబాబు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

కరువు మండలాల నిర్ధారణ పై కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : కరువు మండలాల నిర్ధారణ పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ లో 200 పైగా కరువు మండలాలు ఉన్నట్లు అధికారులు సీఎంకి తెలిపారు. కచ్చితమైన సంఖ్య తెలపాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 3,4 రోజుల్లో కరువు మండలాలను గుర్తించి కేంద్రానికి పంపాలని సీఎం ఆదేశించారు.

కారు బోల్తా పడి ఒకరు మృతి

నల్లగొండ : కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామశివారులో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం కారు అదుపు తప్పి పల్టీలు కొట్టిడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆరెగూడెం గ్రామానికి చెందిన రఘునందన్‌రెడ్డి (46) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఆయన భార్యతోపాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి ఆరెగూడెం గ్రామం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

రాజకీయ నేతలు వరంగల్ వదిలి వెళ్లాలి : భన్వర్ లాల్...

హైదరాబాద్ : వరంగల్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలో ఓటు హక్కులేని రాజకీయ నేతలు వరంగల్‌ వదిలి వెళ్లాలని ఈసీ భన్వర్‌లాల్‌ కోరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి 21వ తేదీ వరకు మద్యం దుకాణాలు బంద్‌ చేసేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. కోడ్‌ ఉల్లంఘించిన కేసీఆర్‌ హామీలపై సీఎస్‌ను నివేదిక పంపాలని ఆదేశించినట్లు ఈసీ భన్వర్‌లాల్‌ తెలిపారు. వరంగల్‌ జిల్లాలో ఇప్పటివరకూ రూ.1.79 కోట్లు, 4314 లీటర్ల మద్యం సీజ్ చేసామన్నారు. రేపు సా. 5 గంటలకు ప్రచారం గడువు ముగియనున్నట్లు చెప్పారు.

5రాష్ట్రాల్లో పేదలకు గృహాల నిర్మాణానికి కేంద్రం ఆమోదం...

ఢిల్లీ : పట్టణ పేదల గృహాల పథకం కింద ఐదు రాష్ట్రాల్లో ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 2,28,204 ఇళ్లను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్మించనుంది. వీటి కోసం రూ. 3,231 కోట్ల నిధులను మంజూరు చేయనుంది. వీటిలో అత్యధికంగా ఏపీలో 37 పట్టనాల్లో, 1,93,147 గృహాలను నిర్మించనున్నారు. తెలంగాణ లో 10 పట్టనాల్లో 10,290 గృహాలకు కేంద్రం ఆమోదం తెలిపింది.

గుడివాడలో ఉద్రిక్తత

కృష్ణా: గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కొడాలి నాని కార్యాలయ తలుపులు, కిటికీలు సిబ్బంది పగలకొడుతున్నారు. వైసీపీ కార్యాలయాన్ని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. పోలీసుల సమక్షంలోనే సిబ్బంది తాళాలు పగలకొట్టారు. వైసీపీ కార్యకర్తలను, మీడియాను పోలీసులు అనుమతించడం లేదు.

ఖైదీల నుంచి సెల్ ఫోన్లు, గంజాయి స్వాధీనం..

కడప: సెంట్రల్ జైలులో ఖైదీలు శ్రీను, వీరయ్య నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, గంజాయిని బుధవారం జైలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జైలు అధికారులు సాధారణంగా జరిపే తనిఖీలలో భాగంగా ఇవి లభ్యమైనట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మరింత విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది.

పేర్ని నానికి బెయిల్ మంజూరు...

మచిలీపట్నం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నానికి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఎక్సైజ్ అధికారుల వేధింపులకు నిరసనగా ధర్నా చేపట్టిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బందరు పోర్టు భూసేకరణ, మద్యం దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల వేధింపులకు నిరసనగా సోమవారం మచిలీపట్నంలో పేర్ని నాని ధర్నా నిర్వహించారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

బిజెపి -టీడీపీని ఓడించండి : అసదుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికలో మతతత్వ పార్టీతో కలిసి పోటీ చేస్తున్న టీడీపీని ఓడించాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వరంగల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. వరంగల్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా నేడు ఆయన మాట్లాడుతూ.. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. పత్తికి కనీస మద్దతు ధర కల్పించేలా పార్లమెంట్‌లో పోరాడుతం. మతతత్వ పార్టీతో కలిసి పోటీచేస్తున్న టీడీపీని ఓడించాలని ఆయన పేర్కొన్నారు.

ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు : మంత్రి మహేందర్ రెడ్డి

రంగారెడ్డి: రాష్ట్రంలోని ప్రతీ గ్రామానికి ఆర్టీసీ బస్సులు నడుపుతమని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీ నిర్వహణ తీరుపై మంత్రి స్పందిస్తూ.. రూ. 23 వేల కోట్లతో 95 ఆర్టీసీ డిపోలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని... నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొన్నామన్నారు. ఆర్టీసీ కార్మికులందరూ మా కుటుంబ సభ్యులే అని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో రూ. 3 కోట్ల 74 లక్షలతో బస్టాండ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

హాంకాంగ్ ఓపెన్ నుంచి సింధు ఔట్

హైదరాబాద్ : హాంకాంగ్ ఓపెన్ నుంచి భారత క్రీడాకారిణి పీవీ సింధు వెనుదిరిగింది. తొలిరౌండ్‌లో భాగంగా టాప్‌సీడ్ కరోలినా మారిన్‌‌తో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో 17-21, 9-21 తేడాతో సింధు ఓటమిపాలయ్యింది.

17:34 - November 18, 2015

హైదారాబాద్ : వరంగల్ బైపోల్ ప్రచారంలో భాగంగా... వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గీసుకొండలో ప్రచారం నిర్వహించారు. వైఎస్ హయాంలో పేదలకు 20 లక్షల 60వేల ఎకరాల భూములు పంచారని... అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఎంత భూమిని పంచారని ఆయన ప్రశ్నించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కేసీఆర్ కు.. పత్తికి మద్దతు ధర ఎందుకు పెంచలేదన్నారు. వైఎస్ చేపట్టిన అన్ని పథకాలను తుంగలో తొక్కారని జగన్ మండిపడ్డారు. 

17:32 - November 18, 2015

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగమని తనను సోనియాగాంధి, ఆజాద్‌ అడిగారని కానీ నేనా పదవిని స్వీకరించలేదని టి.కాంగ్రెస్‌ నేత జానారెడ్డి అన్నారు. తెలంగాణ ఇస్తే చాలంటూ వారిని సున్నితంగా తిరస్కరించాననీ జానారెడ్డి తెలిపారు. జానారెడ్డికి పదవీ కాంక్షే తప్ప తెలంగాణ కాంక్ష లేదంటూ మంగళవారం వరంగల్‌ సభలో కెసిఆర్ విమర్శించారు. ఈ నేపథ్యంలో వరంగల్‌ మీడియా సమావేశంలో జానారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టం : సీఎంచంద్రబాబు

చిత్తూరు : మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ దంపతుల హత్య పథకం ప్రకారమే జరిగిందని... ఈ హత్యల వెనుక ఎంతటి వారు ఉన్నా పట్టుకుని కఠినంగి శిక్షిస్తామనని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దుండగుల దాడిలో దారుణ హత్యకు గురైన మేయర్ దంపతుల భౌటిక కాయాలకు ఈరోజు చంద్రబాబు చిత్తూరులో నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హత్యా రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. 

ఏపీకి రూ.5వేల కోట్ల రుణం: ప్రపంచ బ్యాంకు

హైదరాబాద్ : ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్లాడుతున్న ఏపీ ని ఆదుకునేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. ఏపీకి దాదాపు రూ. 5వేల కోట్ల రుణ మంజూరు చేయనున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది.

నితీశ్ ప్రమాణ స్వీకారినికి మోదీకి ఆహ్వానం

హైదరాబాద్ : బీహార్ ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్న నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించారు.

డేవిడ్ హెడ్లీని విచారించనున్న కోర్టు

హైదరాబాద్ : ముంబై దాడుల కేసులో డేవిడ్ హెడ్లీని నిందితుడిగా చేర్చేందుకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు విచారణ చేపట్టింది. డిసెంబర్ 10న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాలని హెడ్లీని న్యాయస్థానం ఆదేశించింది.

16:50 - November 18, 2015

కరీంనగర్ : సెల్‌ ఫోన్‌ దొంగిలించాడన్న ఆరోపణ ఒక వ్యక్తి నిండు ప్రాణాన్ని హరించింది. మనస్తాపానికి గురైన యువకుడు క్షణికావేశంలో చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందాడు. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం లాలయ్యపల్లె ప్రాథమిక పాఠశాలలో కొల్లిపాక రాజయ్య స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన అనారోగ్యంతో బాధపడుతుండడంతో కొడుకు నాగరాజు కొద్దిరోజులుగా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా సోమవారం ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు స్వప్నరాణి సెల్‌ ఫోన్‌ పోయింది. ఆ సెల్‌ నాగరాజే అపహరించాడంటూ ఉపాధ్యాయులు ఆరోపించారు. సెల్‌ దొరికినా దాన్ని దొంగిలించింది నీవేనంటూ విమర్శించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితుడు పాఠశాల ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఎంఏ, బిఇడి వరకు అభ్యసించాడు. అతని మరణంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 

16:48 - November 18, 2015

తూ.గో : కుండపోత వర్షాలకు తూర్పు గోదావరి జిల్లాలో అపార పంట నష్టం జరిగింది. కోనసీమ ప్రాంతంలో లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఈదురుగాలులకు వరిచేలు నేలవాలాయి. అయినవిల్లి మండలం మాగాం దగ్గర నీట మునిగిన వరిచేలను కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ పరిశీలించారు. రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. డ్రైయిన్‌లలో నీటి ప్రవాహానికి అడ్డులేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరద నష్టంపై ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని చెప్పారు. 

16:46 - November 18, 2015

చిత్తూరు : పట్టణంలో కటారి అనుచరవర్గం మళ్లీ ఆందోళనలకు దిగింది. చిత్తూరు బస్టాండ్‌లో వీరంగం సృష్టించారు. రెండు ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేసి నినాదాలు చేశారు. తమ నాయకులను హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని గొడవ చేశారు. 

16:45 - November 18, 2015

చిత్తూరు : దుండగుల దాడిలో చనిపోయిన చిత్తూరు మేయర్ కటారి అనురాధ, మోహన్ దంపతుల భౌతిక కాయాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ నివాళులు అర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం... చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో ఘటనాస్థలాన్ని చంద్రబాబు, లోకేష్ పరిశీలించారు.

 

16:43 - November 18, 2015

హైదరాబాద్ : మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ స్పెషలిస్ట్‌ రోండా రౌసీ....క్రీడాభిమానులకు పరిచయమే అక్కర్లేని పేరు. ఎందుకంటే జూడో,రెజ్లింగ్‌, మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ఆరితేరిన రోండా రౌసీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.

చరిత్ర సృష్టించిన రోసీ.....

తొలి మహిళా అల్టిమేట్‌ ఫైటింగ్‌ చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన రోసీ.....ఓ స్టార్‌ రెజ్లర్‌,జూడో ఒలింపిక్‌ బ్రాంజ్‌ మెడలిస్ట్‌ మాత్రమే కాదు హాలీవుడ్‌ నటి కూడా. ప్రత్యర్ధి ఎవరైనా రోండా రౌసీ బరిలోకి దిగిందంటే విజయం ఖాయం. తాడిని తన్నేవాళ్లు ఒకరుంటే ....వారి తలదన్నేవారు ఇంకొకరుంటారు.....అన్న సామెత ప్రస్తుతం రోండా రౌసీకి సరిగ్గా సరిపోతుంది.ఎందుకంటే మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో తిరుగులేని రౌసీకి.... అమెరికన్‌ ఫైటింగ్‌ సెన్సేషన్‌ హోలీ హోమ్‌ షాకిచ్చింది. షాక్‌ అంటే అలాంటి ఇలాంటి షాక్‌ కూడా కాదు....నిజంగానే దిమ్మతిరిగిపోయె షాకిచ్చిందనే చెప్పాలి.

మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ విభాగంలో .....

మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ విభాగంలో వరుసగా 12 విజయాలతో రోండా రౌసీ చరిత్ర సృష్టించింది. తనకంటే ఎంతో అనుభవమున్న మహామహులను రోసీ....సునాయాసంగా చిత్తు చేసి తొలి మహిళా అల్టిమేట్‌ చాంపియన్‌గా నిలిచి అరుదైన రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. కానీ హోలీ హోమ్‌ను మాత్రం అధిగమించలేకపోయింది. మరో వైపు హోలీ హోమ్‌ కూడా ట్రాక్‌ రికార్డ్‌ ఘనంగానే ఉంది. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో హోమ్‌ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడలేదు. ఈ పోటీ ప్రారంభానికి ముందు పెద్ద ఎత్తున ప్రచారమే జరిగింది. ఇద్దరూ మాటలతోనే యుద్దానికి దిగారు. బౌట్‌కు ముందు విజయం నాదటే...నాది అంటూ ప్రకటించి పోటీని మరింత వేడిక్కించారు. తొలి ఓటమికి సిద్దంగా ఉండూ అని...ధీమాగా చెప్పిన హోలీహోమ్‌....ఎట్టకేలకు అనుకున్నది సాధించింది.

ఎన్నో అంచనాలు.....మరెన్నో ఊహాగానాలు....

ఎన్నో అంచనాలు.....మరెన్నో ఊహాగానాలు....హాట్‌ఫేవరెట్‌గా, డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన రోండా రౌసీకి ఊహించలేని షాక్‌. మెల్‌బోర్న్‌లోని ఇతిహాద్‌ ఇండోర్‌ స్టేడియం వేదికగా జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో.... ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడ్డారు. పోటీ ఆరంభంలో ఎప్పటిలానే రోండా రౌసీ ఆధిపత్యం ప్రదర్శించింది. సైడ్‌ కిక్‌, లెగ్‌ కిక్స్‌తో హాలీ హోమ్‌పై విరుచుకుపడింది.

బలహీనతలపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన హోలీ....

కానీ రోండా రౌసీ బలహీనతలపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన హోలీ....పవర్‌ ఫుల్‌ పంచ్‌లతో విరుచుకుపడింది. రౌసీకి అవకాశమివ్వకుండా పంచ్‌లతో ఊపిరాడనివ్వకుండా చేసింది. సెకండ్‌ రౌండ్‌లో రౌసీకి చాన్సే ఇవ్వలేదు. రెండో రౌండ్‌ ప్రారంభమైన 59 సెకన్లకే రౌసీని నాకౌట్‌ చేసింది. పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌తో పవర్‌ఫుల్‌ లెగ్‌ కిక్‌తో రౌసీని చిత్తు చేసింది. అక్కడికక్కడే కుప్పకూలిన రోసీ....హోలీ నాకౌట్‌ కిక్‌ నుంచి తేరుకోలేక చేతులెత్తేసింది.మిక్స్‌డా మార్షల్‌ ఆర్ట్స్‌లో రౌసీని తొలి సారిగా ఓడించిన ఆనందంలో హోలీ....గాల్లో ఎగురుతూ సంబరాలు జరుపుకుంది. ఒప్పందం ప్రకారం..ఈ ఇద్దరి మధ్య రీ మ్యాచ్‌కు కూడా జరుగనుంది. రీ మ్యాచ్‌లో రోండా రౌసీ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుందని అభిమానులు చెప్పుకుంటున్నారు. కానీ ప్రస్తుతం చికిత్స పొందుతున్న రౌసీ కోలుకోవడానికి ఇంకా రెండు నెలలు సమయం పడుతుందని డాక్టర్లు ప్రకటించారు. కెరీర్‌లో తొలి ఓటిమితో ఢీలా పడ్డ రోండా రౌసీ....రీ మ్యాచ్‌లో బదులు తీర్చుకుంటుందా....? అసలు రౌసీ మునుపటిలా ఫైటింగ్‌ చేయగలదో లేదో చూడాలి. ఏదీ ఏమైనా రోండా రౌసీ వరుస విజయాల రికార్డ్‌కు ఫుల్‌ స్టాప్‌ పెట్టి...హోలీ హోమ్‌ పెద్ద సంచలనమే సృష్టించిందని చెప్పాలి. 

16:38 - November 18, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ర్టాల్లో కార్తీక మాస సందడి మొదలైంది. శివారాధనతో పాటు వన సమారాధన చేయటం కూడా ఈ మాసం ప్రత్యేకత. ప్రకృతి మధ్య వన భోజనాలు చేయటమంటే అందరికీ ఎనలేని ఆనందం. కుటుంబ సభ్యులతో కలిసి కాస్త ఆటవిడుపుగా సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రణాళికలు వేస్తున్నారు పర్యాటకులు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్యాకేజీలతో స్వాగతం పలుకుతోంది. కార్తీకమాస వన సమారాధనకు వచ్చేవారిని ఆఫర్లతో ఆకట్టుకుంటోంది.

పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా....

కార్తీక మాసం.. పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా భక్తులు భావించే నెల ఇది. ఈ మాసమంటే తెలుగు ప్రజలకు ఇష్టమే. ఓ వైపు శైవక్షేత్రాలు శివనామస్మరణలతో మారుమోగుతుంటే...మరో వైపు ఆధ్యాత్మిక కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు వనసమారాధానలతో కళకళలాడుతుంటాయి.

ప్రత్యేక వన భోజన ప్యాకేజీలు....

కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక వన భోజన ప్యాకేజీలను పర్యాటకాభివృద్ధి సంస్థ ఏపీటిడిసి ప్రకటించింది. విజయవాడ భవానీద్వీపం, బాపట్ల సూర్యలంక హరిత బీచ్ రిసార్ట్స్ వేదికగా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 14 వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. కార్తీక మాసంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కృష్ణానదిలో బోటు విహారం, వన భోజనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉల్లాసంగా పలు రకాల ఆటలతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ గడిపేలా ఈ ప్యాకేజీలను రూపొందించారు.

ఆహ్లాదకరమైన బోటు షికారు..

ఆహ్లాదకరమైన బోటు షికారు.. నది మధ్యలో ఉన్న ఐలాండ్‌లో ఆటపాటలు.. మనసుకెంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని సంతోషాన్నినింపే కార్తీక వన సమారాధనకు పూర్తిస్థాయిలో భవానీ ఐలాండ్ ముస్తాబైంది. పిల్లల కోసం అడ్వంచర్ గేమ్స్, పెద్దల కోసం ప్రత్యేక ఆటపాటలతోపాటు సాంప్రదాయ ముఖ్య కార్యక్రమాలను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది.

మూడు రకాల ప్యాకేజీలు....

వన భోజనాలకు వెళ్లాలనుకునే వారికి మూడు రకాల ప్యాకేజీలను ఏపీటీడీసీ అందిస్తోంది. వీటిలో ఎవరికి నచ్చిన ప్యాకేజీని వారు ఎంచుకోవచ్చు. ప్రస్తుతం దుర్గగుడిపై వంతెన పనుల నేపథ్యంలో బరంపార్క్ కు అందరూ చేరుకోవడానికి ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నందున మూడు ప్రాంతాల నుంచి బోట్లను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ నుంచి వచ్చేవారు దుర్గాఘాట్ లోనూ, గుంటూరు వైపు నుంచి వచ్చేవారు సీతానగరం వద్ద ప్రకాశం బ్యారేజీకి ఆనుకుని ఉన్న కృష్ణవేణి మోటెల్ వద్ద, గొల్లపూడి వైపు నుంచి వచ్చేవారు బరం పార్క్ వద్ద నుంచి బోట్లలో భవానీద్వీపానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

భవానీ ఐలాండ్‌లో 3 స్పెషల్ ప్యాకేజీలు..............

భవానీ ఐలాండ్‌లో మూడు రకాల ప్యాకేజీలను ప్రవేశపెట్టారు. స్పెషల్‌ ప్యాకేజీ 1లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆంధ్రభోజనం, బోట్‌ ఛార్జీలకు గాను ఒకరికి 210 రూపాయలు, ఎనిమిదేళ్లలోపు వారికి 150 రూపాయలను చెల్లించాలి. స్పెషల్ ప్యాకేజ్ 2లో సాంస్కృతిక కార్యక్రమాలు, స్పెషల్ వెజిటేరియన్ ఫుడ్, బోట్ ఛార్జీలకుగాను ఒకరికి 310 రూపాయలు, ఎనిమిదేళ్లలోపువారికి 200ల రూపాయలు చెల్లించాలి. స్పెషల్ ప్యాకేజ్ 3లో బ్రేక్ ఫాస్ట్, ఆంధ్రా భోజనం, బోట్ ఛార్జీలకుగాను ఒకరికి 400ల రూపాయలు, ఎనిమిదేళ్లలోపు వారికి 260 రూపాయలు చెల్లించాలి.

హరిత బీచర్ రిసార్ట్స్‌లో 2 ప్రత్యేక ప్యాకేజీలు ............

హరిత బీచర్ రిసార్ట్స్, సూర్యలంక కూడా రెండు రకాల ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. స్పెషల్ ప్యాకేజ్ -1లోసాంస్కృతిక కార్యక్రమాలు,ఆంధ్రా భోజనం, బోట్‌ ఛార్జీలకు గాను ఒకరికి 175 రూపాయలు, ఎనిమిదేళ్లలోపు చిన్నారికి 123 రూపాయలు చెల్లించాలి. స్పెషల్ ప్యాకేజ్ -2 అయితే బ్రేక్ ఫాస్ట్, ఆంధ్రా భోజనం, బోట్ ఛార్జీలకు గాను ఒకరికి 225 రూపాయలు, ఎనిమిదేళ్లలోపు చిన్నారులకు 200ల రూపాయలను చెల్లించాలి.యి గొల్పే ప్రకృతి సౌందర్యాల నడుమ ఉదయం నుంచి సాయంత్రం వరకు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉల్లాసంగా గడుపుతున్నారు ప్రకృతి ఆరాధకులు. ప్రకృతి అందాలకు వినోదం కూడా తోడవడంతో ఉత్సాహంగా వనసమారాధనకు తరలివస్తున్నారు.

16:29 - November 18, 2015

హైదరాబాద్ : వరంగల్‌లో జరిగిన కెసిఆర్ సభ అట్టర్‌ప్లాఫ్‌ అయిందని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ...ఓటమి భయంతోనే కెసిఆర్‌ కాంగ్రెస్‌పైనా తమ నేతలపైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. వరంగల్‌కు వచ్చినప్పుడు ఒట్టి హామీలు ఇవ్వడమే తప్ప ఏం చేశారని అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రశ్నించారు.  

16:27 - November 18, 2015

కడప : జిల్లాలో వరద బాధితులకు సహాయసహకారాలు అందించడంలో అధికారుల విధి నిర్వహణ చాలా బాగుందని ఇన్‌ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కడప స్టేట్ గెస్ట్‌హౌస్‌లో వరదలపై మంత్రి గంటా అధికారులతో సమీక్ష నిర్వహించారు. నష్టాన్ని భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

16:25 - November 18, 2015

కడప : భారీ వర్షాలకు కడప జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నారు. చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. పలు నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. జిల్లాలో పాపాఘ్ని నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రాయచోటి నియోజకవర్గ పరిధిలోని అబ్బవరం సమీపంలో కంచాలమ్మచెరువుకు గండి పడింది. హింద్రీనీవా కాలువ నుంచి వరద నీరు చెరువులోకి భారీగా వచ్చి చేరడంతో గండి పడింది. చెరువు గండిని పూడ్చివేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

16:24 - November 18, 2015

విజయవాడ : రాష్ట్రంలోని వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాలో ఆయన ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం సహాయక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. 

16:22 - November 18, 2015

విజయవాడ :భారీ వర్షాల కారణంగా రద్దయిన గూడూరు-చెన్నై రైలును తిరిగి పునరుద్ధరించారు. అయితే మిగతా రైళ్ల రద్దు ఇవాళ కూడా కొనసాగుతోంది. కామాక్షి-బెంగలూరు కంటోన్మెంట్‌ సువిధ స్పెషల్, కాకినాడ పోర్ట్-చెన్నయ్‌ సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దయ్యాయి. తిరుపతి-ఆదిలాబాద్ ఎక్స్‌ప్రెస్, కామాఖ్య యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్, చెన్నాయ్‌-సెంట్రల్‌ హౌరా మెయిల్, హౌరా చెన్నయ్‌ సెంట్రల్, చెన్నయ్‌ సెంట్రల్‌ హౌరా కోరమండల్ ఎక్స్‌ప్రెస్, విల్లుపురం-ఖరగ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం- తిరుపతి తిరుమల ఎక్స్‌ప్రెస్‌ల రాకపోకలు నిలిచిపోయాయి. గౌహతి-త్రివేండ్రం, గౌహతి-కోచువెల్లి స్పెషల్, సంబల్‌పూర్‌-యశ్వంత్‌పూర్‌ స్పెషల్, హౌరా-యశ్వంత్‌పూర్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌, బెంగలూరు భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, హుబ్లీ-తిరుపతి పాసింజర్ తదితర రైళ్లను రద్దు చేశారు. వెందోడు- కొండగుంట, గూడూరు- రేణిగుంట సెక్షన్‌లో వరద నీరు రైలు పట్టాల పైనుంచి ప్రవహిస్తుండడంతో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. 

16:20 - November 18, 2015

హైదరాబాద్ : ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఫత్వా మన దేశంలో జారీ అయ్యింది. భారత్‌లోని వివిధ మసీదులకు చెందిన వెయ్యిమందికిపైగా ఇమామ్‌లు, ముఫ్తీలు ఈ ఫత్వాపై సంతకాలు చేశారు. ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉన్న అలయన్స్ ఆఫ్‌ సివిలైజేషన్‌ చేపట్టిన ఈ కార్యక్రమం ఇస్లాంకు ఏమాత్రం వ్యతిరేకంగా కాదని దీనిపై సంతకాలు చేసిన ముస్లింమత పెద్దలు చెబుతున్నారు. మానవాళి నాశనాన్ని కోరుకుంటున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాత్రమే ఈ ఫత్వా జారీ చేసినట్టు ఇస్లామిక్‌ సైబర్‌ డిఫెన్స్‌ సెల్‌ అధినేత అబ్దుల్ రెహ్మాన్‌ అంజారియా చెప్పారు. రెండు నెలల క్రితం ఈ ఆలోచన చేసిన ఆయన ... షరియా చట్టాలంటూ ఉగ్రవాదులు చేస్తున్న దారుణాలను మత పెద్దలకు వివరించడంలో సఫలీకృతులయ్యారు. ఖురాన్‌లో ఎక్కడా హింస గురించిన ప్రస్తావన లేదున్నారు. ఒక అమాయకున్ని చంపినా.. అది మానవాళి మొత్తాన్ని చంపినట్టేనని ఖురాన్‌లో పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

నెల్లూరులో హెలికాప్టర్ ద్వారా ఆహార పొట్లాల పంపిణీ

నెల్లూరు : వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలో వరద ప్రాంతాల్లో హెలికాఫ్టర్‌తో సహాయక చర్యలు చేపట్టారు. చిల్లకూరు, కోట, ముత్తుకూరు మండలాల్లో వరద బాధితులకు 50వేల ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.

కాల్పులు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

చిత్తూరు : మేయర్ అనురాధ దంపతులకు నివాళులర్పించారు. అనంతరం హత్యకు గల కారణాలపై ఆయన పోలీసులతో చర్చించారు. కాల్పుల ఘటన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఘటనకు సంబంధించి ఐజీతో మాట్లాడారు. కారకులు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని, హత్యా రాజకీయాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు ఐజీకి సూచించారు.

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

హైదరాబాద్: స్టాక్‌మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 382 పాయింట్లు నష్టపోయి 25,482 సూచీ వద్ద అదేవిధంగా నిఫ్టీ 106 పాయింట్లు నష్టపోయి 7,732 సూచీ వద్ద ముగిశాయి. 

కటారి అనురాధ దంపతులకు చంద్రబాబు నివాళి

చిత్తూరు: కార్పొరేషన్ కార్యాలయంలో దారుణ హత్యకు గురైన మేయర్ కటారి అనురాధ, ఆమె భరత్ మోహన్ భౌతిక కాయం సీఎం చంద్రబాబు, లోకేష్ నివాళులర్పించారు. అనంతరం అనురాధ కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. మంగళవారం కటారి అనురాధ దంపతులను గుర్తు తెలియని దుండగులు కల్చి చంపిన విషయం తెలిసిందే.

చిత్తూరు జిల్లాలో ఆందోళనకు దిగిన కటారి అనుచరులు

చిత్తూరు : మేయర్ అనురాధ దంపతుల హత్యకు నిరసనకు జిల్లా వ్యాప్తంగా కటారి అనుచరులు ఆందోళనకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో వైపు ఈ రోజుసాయంత్రం మేయర్ కటారి అనురాధ దంపతుల అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, తనయుడు నారా లోకేష్ హాజరు కానున్నారు. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

తెలంగాణ కోసం సీఎం పదవిని త్యాగం చేశా : జానారెడ్డి

హైదరాబాద్ : కాంగ్రెస్ తోనే తెలంగాణ సిద్ధించిందని, కేసీఆర్ ఆందోళనలతో తెలంగాణ రాష్ట్రం రాలేదని, తెలంగాణ కోసం సీఎం పదివిని కూడా త్యాగం చేశానని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ వరంగల్ సభలో జానారెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గా ఉండమని సోనియా గాంధీ, ఆజాద్ తనను అడిగారని... తనకు ముఖ్యమంత్రి పదవి వద్దు.. తెలంగాణ ఇవ్వండి చాలు అన్నానని జానారెడ్డి తెలిపారు. తెలంగాణ ఇస్తాం - మీరు ఆందోళన చేయొద్దని సోనియా అందరి కంటే ముందే నాకు చెప్పారని తెలిపారు. 

డిసెంబర్‌ 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

విజయవాడ : డిసెంబర్‌ 17 నుంచి 22 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు రోజుల పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నట్లు తెలిసింది. గుంటూరు- విజయవాడ మధ్య బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 45 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరపాలని ప్రభుత్వం తీర్మానించింది.

అనురాధ అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు

చిత్తూరు : మేయర్‌ అనురాధ దంపతుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు బయలుదేరనున్నారు. అంత్యక్రియల్లో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా పాల్గొంటారు. మేయర్ అనురాధ దంపతులను కొందరు దుండగులు కార్పొరేషన్ ఆఫీస్‌లో కాల్పులు జరిపి హతమార్చిన సంగతి తెలిసిందే. అనురాధ దంపతుల మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీలో ఓ మంచి మహిళా నేతను కోల్పోయామని ఆయన చెప్పారు.

ఐర్లాండ్‌లో తొలి స్వలింగ సంపర్కుల వివాహం

హైదరాబాద్ : ఐర్లాండ్‌లో తొలి స్వలింగ సంపర్కుల వివాహం నమోదైంది. క్లాన్‌మెల్ సిటీలో ఇద్దరు గేలు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పురుషులు కార్‌మాక్ గొలోగ్లీ, రిచర్డ్ డౌలింగ్..కిస్సులతో భర్తలుగా మారారు. దక్షిణ టిప్పరరీ రాష్ట్ర రిజిస్ట్రార్ ఈ జంటను ఒక్కటి చేశారు. గత మే నెలలో ఐర్లాండ్ పార్లమెంట్ సేమ్ సెక్స్ మ్యారేజ్‌పై కొత్త చట్టాన్ని ఆమోదించింది. అది కూడా ఓటింగ్ ద్వారా స్వలింగ సంపర్కుల పెళ్లికి పచ్చజెండా ఊపారు. ఇప్పటివరకు 20 దేశాలు సేమ్ సెక్స్ మ్యారేజ్‌కు అంగీకారం తెలిపాయి.

ఏపీ టిడిపి జనచైతన్య యాత్రలు వాయిదా

విజయవాడ : దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఏపీ టిడిపి తలపెట్టిన జనచైతన్య యాత్రలు వాయిదా పడ్డాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

వ్యవసాయ సంక్షోభానికి కారణం కేసీఆర్ : ఉత్తమ్

వరంగల్ : వ్యవసాయ సంక్షోభానికి కారణం కేసీఆర్ అని టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ చెప్పిన అబద్ధాలనేమళ్లీ చెబుతున్నారని పేర్కొన్నారు. వరంగల్ లో కేసీఆర్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని తెలిపారు. వాటర్ గ్రిడ్ పథకం పెద్ద కుంభకోణం అని విమర్శించారు.

తిరుమల ఘాట్ రోడ్డులో పిట్టగోడను ఢీ కొట్టిన బస్సు

తిరుమల : మొదటి ఘాట్ రోడ్డులోని 32వ మలుపు వద్ద బ్రేక్ లు పని చేయకపోవడంతో పిట్టగోడను బస్సు ఢీ కొట్టింది. అయితే ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. మరో వైపు రెండో ఘాట్ రోడ్డులో బండరాళ్ల తొలగింపు ప్రక్రియను టిటిడీ జేఈవో పరిశీలించారు. మరో రెండు రోజుల్లో ఘాట్ రోడ్డును పునరుద్దరిస్తామని తెలిపారు.

14:45 - November 18, 2015

హైదరాబాద్ : 'ముస్లిం మహిళల వివాహాల రద్దు చట్టం' అంటే ఏమిటి అనే అంశాన్ని నేటి 'మై రైట్' కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పార్వతి వివరించారు. అంతే కాకుండా ప్రేక్షకులు అడిన న్యాయ సందేహాలకు సమాధానాలు తెలియపరిచారు. మరి వారు ఏఏ అంశాల గురించి మాట్లాడారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

14:41 - November 18, 2015

హైదరాబాద్ : పారిస్ ఉగ్రదాడి సూత్రధారి బెల్జియంకు చెందిన జిహాదీ అబ్దెల్ హమీద్ అబోద్ కోసం ప్రాన్స్ భద్రత దళాలు వేటాడుతున్నాయి. ఉత్తర పారిస్లో ప్రత్యేక సాయుధ బలగాలు సోదాలు చేస్తున్న సమయంలో అనుమానాస్పద వ్యక్తులు తారసపడటంతో పోలీసులు కాల్పులు జరిపారు. సెయింట్‌ డెనిస్‌ ప్రాంతంలో పోలీసులు జరిపిన ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఇందులో ఓ మహిళా ఉగ్రవాది తనని తాను పేల్చుకుని చనిపోయింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఫ్రెంచ్‌ పోలీసులు గాయపడ్డారు. మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పారిస్‌లో ఏడుచోట్ల పేలుళ్లు సంభవించాయి. సెయింట్‌ డెనిస్‌ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో అబ్దెల్ హమీద్ అబోద్ దాక్కున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు ఆ భవనాన్ని చుట్టుముట్టారు. పోలీసుల ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. పారిస్‌లో ఉదయం 4 గంటల నుంచి కాల్పులు జరుగుతున్నాయి. 

14:39 - November 18, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ఒక్కసారిగా ఉల్లిక్కి పడింది. సాక్షాత్తూ తెలుగుదేశం నేత, చిత్తూరు మేయ‌ర్ అనురాధ‌ దారుణ హ‌త్యతో ఏపీలో శాంతి భ‌ద్రత‌ల అంశంపై చ‌ర్చ మొద‌ల‌యింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో త‌మ‌కు తామే సాటి అని చెప్పుకునే టిడిపి స‌ర్కార్‌కు అనురాధ హ‌త్యోదంతం ఇబ్బందిక‌రంగా మారింది. చంద్రబాబు సొంత జిల్లాలో ప‌ట్టప‌గ‌లు పార్టీకి చెందిన మ‌హిళా మేయ‌ర్ హ‌త్యకు గురికావ‌డంతో టీడిపి వ‌ర్గాల్లోనే చ‌ర్చనీయాంశమైంది. ఇదే స‌మ‌యంలో ఒక వైపు కులం రంగు మ‌రో వైపు అధికార పార్టీ నేత‌ల అవ‌గాహ‌నా రాహిత్య వ్యాఖ్యలు టీడీపీ స‌ర్కార్ మ‌రింత ఇర‌కాటంలోకి నెడుతున్నాయి.

తెలుగుదేశం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా అనురాధ హత్య.......

ముఖ్యమంత్రి సొంత జిల్లా...ప‌ట్టప‌గ‌లు చిత్తూరు మేయ‌ర్ అనురాధ‌ దారుణ హ‌త్య రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించింది. ఈ హ‌త్య తెలుగుదేశం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. శాంతి భ‌ద్రత‌లు కాపాడ‌డంలో త‌మ‌కు సాటి వేరే ఎవ‌రూ లేర‌ని ప‌దే ప‌దే చెప్పుకునే ప్రభుత్వ పెద్దల‌కు ప్రస్తుతం ఎలాంటి స‌మాధానం చెప్పాలో అర్ధం కాని ప‌రిస్థితి ఏర్పడింది. స్వయంగా అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధి, ఆమె భ‌ర్తపై ప‌థ‌కం ప్రకారం దాడి చేయ‌డం, ఈ ఘ‌ట‌నలో అనురాధ‌ హ‌త్యకు గురికావ‌డం వంటివి రాష్ర్టంలో దిగ‌జారుతున్న శాంతి భద్రతలకు నిద‌ర్శనంగా క‌నిపిస్తోంది. ఎంత స‌ర్ది చెప్పుకున్నా ఈ సంఘ‌ట‌న ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండే ప‌రిస్థితులే క‌నిపిస్తున్నాయి.

ఎర్రచంద‌నం స్మగ్లర్ల కాల్పులు....

టీడిపి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప‌లు హ‌త్యలు రాజ‌కీయ ప్రేరేపితమేనన్న ఆరోపణలొచ్చినా ఈస్థాయిలో అలజడి రాలేదు. గ‌తంలో చిత్తూరు జిల్లాలో ఎర్రచంద‌నం స్మగ్లర్ల కాల్పులు, ,నారాయ‌ణ కాలేజీలో విద్యార్ధుల అనుమానాస్పద మృతి, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు వ‌చ్చినా ఇబ్బంది రాలేదు. కానీ తాజాగా జరిగిన మేయ‌ర్ అనురాధ హ‌త్య సంఘ‌టన మాత్రం తీవ్ర స్థాయిలో చ‌ర్చనీయాంశమవుతోంది. ఈ ఘ‌ట‌న‌తో రాష్టంలో శాంతి భ‌ద్రత‌లు స‌క్రమంగా లేవ‌ని ప్రతిప‌క్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇసుక అక్రమ స‌ర‌ఫ‌రా వ్యవ‌హారంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే చింత‌మ‌నేని ఎంఆర్వో పై దాడి చేసిన ఘ‌ట‌న‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌లో సైకో సూదిగాడు వీరంగం ఘ‌ట‌న‌లపై సర్కారు ఇప్పటి వరకు సమాధానం చెప్పుకోలేకపోతోంది. తాజాగా ఇప్పుడు సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో అధికార పార్టీ మేయ‌ర్ హ‌త్య జ‌ర‌గ‌డంతో శాంతి భ‌ద్రత‌లపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

మర్డర్ కు వైఎస్సార్సీపీ నేత‌లే కార‌ణ‌మ‌ని బోండా ఉమా ఆరోపణ...

ఇదే స‌మ‌యంలో కొంద‌రు నేత‌లు అవ‌గాహ‌నా రాహిత్యంతో కూడిన మాట‌లు కూడా ప్రభుత్వాన్ని మరింత అప్రదిష్టపాలు చేస్తున్నాయి. చిత్తూరు మేయ‌ర్ హ‌త్య కు సంబంధించి నిందితులు పోలీసుల‌కు లొంగిపోగా...మర్డర్ కు వైఎస్సార్సీపీ నేత‌లే కార‌ణ‌మ‌ని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోపించారు. మోహ‌న్ కి , సీకే బాబుకి ఉన్న వైర‌మే హ‌త్యకు కార‌ణంగా మారింద‌ని ఆయ‌న అనుమానం వ్యక్తం చేశారు. మ‌హిళ‌ను హ‌త్య చేయ‌డం ద్వారా వైఎస్సార్సీపీకి మ‌హిళ‌ల ప‌ట్ల ఉన్న చిత్తశుద్ది ఏంటో అర్థమ‌వుతోంద‌న్నారు. అంతేకాదు అటు కాపు సంఘం నేత‌లు,ఇటు బోండా ఉమా కులం రంగు పులిమే ప్రయ‌త్నం చేస్తున్నారు. టీడీపీలో కాపుల‌కు ప్రాధాన్యత పెరుగుతున్న త‌రుణంలో మోహ‌న్ లాంటి కాపు నేతపై జరిగిన దుర్మార్గం దారుణ‌మ‌న్నారు. కాపునాడు నేత‌లు బుధవారం చిత్తూరు జిల్లా బంద్ కు పిలుపు నిచ్చారు. ఇప్పటికే ఒకవైపు మేయ‌ర్ హ‌త్యకు నిర‌స‌న‌గా ఆమె వ‌ర్గీయులు ప‌లు ప్రతి దాడులకు పాల్పడుతున్నారు.

పార్టీకి ఇబ్బంది కరంగా హత్య...

హ‌త్యకు గుర‌యింది పార్టీ లీడ‌ర్ . జ‌రిగింది సీఎం సొంత జిల్లాలో ..దీంతో పార్టీ నేత‌లు..ప్రతిప‌క్షాల నేత‌లు ఇదే రీతిన‌ చ‌ర్చిస్తున్నారు. మేయ‌ర్ హ‌త్యకు పాత ప‌గ‌లే కారణమా.. ఆస్తి వివాదాలా,కుటుంబ క‌ల‌హాల లేదంటే రాజ‌కీయ కార‌ణాల అనేది ప‌క్కన పెడితే ప్రభుత్వానికి మాత్రం అనురాధ‌ హ‌త్య ఇబ్బందిగా మారుతోంది.

14:36 - November 18, 2015

విజయవాడ : తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. రానున్న 24 గంటల్లో మరింత బలహీనపడే అవకాశముందని వాతావరణ శాఖ చెప్తోంది. మరో వైపు దక్షిణ కోస్తాను భారీ వర్షాలు వీడటం లేదు. ఉత్తర కోస్తాలో చెదురుముదురుగా వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

14:35 - November 18, 2015

హైదరాబాద్‌ : బేగంబజారులో నకిలీ మసాలా ప్యాకెట్లు విక్రయిస్తున్న 11 మంది వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురిని కూడా అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి వెయ్యికి పైగా కల్తీ మసాలా సంచులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా ప్రమాదకర రసాయనాలతో కల్తీ మసాలాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

సాయంత్రం అనురాధ దంపతుల అంత్యక్రియలు..

చిత్తూరు : హత్యకు గురైన మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం జరుగనున్నాయి. పోస్టుమార్టం అనంతరం ఇద్దరి భౌతికకాయాలను చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయానికి తరలించారు. కడసారి చూపు కోసం పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు కార్యాలయానికి తరలివస్తున్నారు. మరికాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరుకు చేరుకుని మేయర్ అనురాధ దంపతులకు నివాళులర్పించనున్నారు.

కరువు మండలాలపై సీఎస్ రాజీవ్ శర్మ సమీక్ష....

హైదరాబాద్: కరువు మండలాలపై సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో కరువు మండలాల ప్రకటనకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు సమాచారం.

గంగిరెడ్డిని పట్టుకున్న పోలీసులకు ప్రభుత్వ అవార్డులు

విజయవాడ : మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని పట్టుకోవడంలో కృషి చేసిన ఏపీ పోలీసు అధికారులకు ఏపీ ప్రభుత్వం అవార్డులు ఇవ్వనుంది. ఇవాళ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వారికి నగదు రివార్డులు, జ్ఞాపికను ఇవ్వనున్నట్టు తెలిసింది. సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో పోలీసు అధికారుల బృందం గంగిరెడ్డిని మారిషస్ నుంచి రాష్ట్రానికి పట్టుకొచ్చింది. ఆ బృందంలో కడప డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్ బీ డీఎస్పీ రాజగోపాల్ రెడ్డిలు ఉన్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ రాముడు వారిని అభినందించారు.

'ప్రభుత్వం వద్ద వార్డుల విభజన ముసాయిదా జాబితా'

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ వార్డుల విభజన ముసాయిదా జాబితాను ప్రభుత్వానికి పంపినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సాయంత్రంలోగా బీసీ ఓట్ల గణన పూర్తవుతుందని, 24కు గ్రేటర్ వార్డుల్లో పోలింగ్ బూత్ ల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. 

తొలగించిన ఓట్లను చేర్చాలి - శశిధర్ రెడ్డి..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో తొలగించిన 6.5 లక్షల ఓట్లను చేర్చాలని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీసీ ఓటర్ల లెక్కింపు జరుగుతున్న సమయంలోనే తొలగించిన ఓట్లను మళ్లీ ఎన్ రోల్ చేయాలని కోరారు. నోటీసులు ఇవ్వకుండా ఓట్లు తొలగించారని, వార్డుల విభజనపై హైకోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి మద్దతుగా తీర్పు వస్తే సుప్రీంకు వెళుతామని స్పష్టం చేశారు. 

అంతర్జాతీయ వరి సదస్సు ప్రారంభం..

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లో అంతర్జాతీయ వరి సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. అంతర్జాతీయ వరి సదస్సు నేటి నుంచి 3 రోజులపాటు కొనసాగునుంది. 

రాహుల్ తో భేటీ కానున్న జైట్లీ..

ఢిల్లీ : జీఎస్ టీ బిల్లుపై ఏకాభిప్రాయ సాధనకు కేంద్రం నడుం బిగించింది. అందులో భాగంగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నేడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. 

పారిస్ లో ఆత్మాహుతికి పాల్పడిన మహిళా ఉగ్రవాది..

పారిస్ : సెయింట్ డేవిస్ లో బుధవారం మహిళా ఉగ్రవాది ఆత్మాహుతికి పాల్పడింది. పారిస్ లో ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం పోలీసులు పలు చోట్ల దాడులు చేస్తున్నారు. సెయింట్ డేవిస్ లో అనుమానిత ఉగ్రవాదులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

 

వర్ష బీభత్సంపై మంత్రుల సమీక్ష..

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై ఏపీ మంత్రులు చిన రాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అధికారులతో తిరుపతిలో సమీక్ష నిర్వహించారు. ధాన్యం తడిసినా, రంగు మారినా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి పుల్లారావు హామీనిచ్చారు. నెల్లూరు జిల్లాలో నాలుగు లక్షల హెక్టార్లు, చిత్తూరు జిల్లాలో మూడు వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. 

13:31 - November 18, 2015

విజయవాడ : ఆర్థిక కష్టాలతో అల్లాడిపోతున్న ఏపీ సర్కారుకు బీపీఎస్ స్కీం వరంగా మారింది.. భారీ ఆదాయం రావడంతో అధికారులు సంబరపడుతున్నారు.. ఈ పథకాన్ని మరింత వేగంగా అమలు చేసేందుకు ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న ఈ నిర్ణయం మున్సిపల్‌ శాఖను కష్టాల నుంచి కాస్త గట్టెక్కించింది.. ఏపీలోని 97 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పరిధిలో బీపీఎస్ రెగ్యులరైజేషన్‌ స్కీంద్వారా ఇప్పటివరకూ 60కోట్ల రూపాయల ఇన్‌కం వచ్చింది.. క్రమబద్దీకరణతర్వాత పన్నుల ద్వారా కూడా ఖజానా మరింత నిండుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

మే 25న మొదలైన స్థలాల క్రమబద్దీకరణ..
ఈ స్కీం మే 25న మొదలైంది.. క్రమబద్దీకరణకోసం లబ్దిదారుడు పదివేల రూపాయలతో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత స్థలాన్ని అధికారులు పరిశీలించి ఎంత డబ్బు కట్టాలో చెబుతారు. ఇప్పటివరకూ 60వేలమంది అప్లికేషన్లు పెట్టుకోగా 59వేల 871 దరఖాస్తులను పరిశీలించారు. ఈ స్థలాలకు ఇంకా అపరాధ రుసుమును అధికారులు నిర్ధారించలేదు. వచ్చిన దరఖాస్తుల్లో కార్పొరేషన్లకు 35వేల 318, మున్సిపాలిటీలకు 18వేల 151... ఉడాలో 785, సీఆర్డీఏ పరిధిలో 5వేల 617 ఉన్నాయి..

మరో 70వేల దరఖాస్తులు వచ్చే అవకాశం..
బీపీఎస్ స్కీంకింద కేవలం అప్లికేషన్లద్వారా సర్కారుకు 60 కోట్ల డబ్బు వచ్చింది. అపరాధ రుసుము నిర్ధారిస్తే ఆదాయం మరింత పెరుగుతుంది. ఈ స్కీంకు మరో 70 వేల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ క్రమబద్దీకరణపై ప్రజల్లో అవగాహన పెంచి మరింత డబ్బు ఆర్జించాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా అధికారులు శిక్షణ ఇస్తోంది. ప్రస్తుతం విశాఖ, గుంటూరు, అనంతపురం రీజియన్‌ అధికారులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. గుంటూరులో శిక్షణ ముగియగా మిగతా ప్రాంతాల్లో ఒక్కో రీజియన్‌నుంచి 120నుంచి 150మంది అధికారులు శిక్షణ తీసుకుంటున్నారు. మొత్తానికి ఈ స్థలాల క్రమబద్ధీకరణ... సర్కారుతో పాటు లబ్దిదారుల్లోనూ సంతోషం నింపుతోంది.

13:27 - November 18, 2015

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం మరోకొద్ది గంటల్లో ముగియబోతోంది. ప్రధాన పక్షాలైన టి.కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనితో గులాబీ దళం జైపాల్ రెడ్డిని టార్గెట్ చేసింది. మంగళవారం రాత్రి వరంగల్ లో జరిగిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ పలు విమర్శలు గుప్పించారు. దీనిపై తీవ్రస్థాయిలో జైపాల్ రెడ్డి బుధవారం స్పందించారు. ఇందులో ప్రధానంగా కేసీఆర్ దీక్షను జైపాల్ రెడ్డి లేవనెత్తారు. ఖమ్మంలో కేసీఆర్ దీక్ష ఎందుకు మధ్యలో ఆపేశారని సూటిగా ప్రశ్నించారు. ఆయన నిరహార దీక్ష ఎలా చేశారో తనకు తెలుసని, ప్రజా సంఘాలు, విద్యార్థుల వత్తిడి మేరకే ఆయన దీక్ష కొనసాగించారని స్పష్టం చేశారు. కేసీఆర్ దీక్ష మర్మాన్ని త్వరలో తాను బయటపెడుతానని, కేసీఆర్ గెలిచింది తప్పుడు వాగ్ధానాలతోనని విమర్శించారు. దీక్ష విరమించిన వీడియోను మీడియా బయటపెట్టాలన్నారు. కేబినెట్ మంత్రిగా తాను రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చేది కాదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర చాలా ఉందని తెలిపారు. రాష్ట్రం కోసం కాంగ్రెస్ ఎంపీలను ఏకతాటిపై నడిపించానని జైపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. తాజాగా జైపాల్ రెడ్డి చేసిన విమర్శలపై గులాబీ దళం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

13:19 - November 18, 2015

ఫ్రాన్స్ : పారిస్‌లో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఈనెల 13వ తేదీన పారిస్ లో ఐఎస్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించి 129 మందిని పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఉగ్రవాదుల లక్ష్యంగా సైన్యం, పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పారిస్ ఉత్తర ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఒక్కసారిగా ఏడు చోట్ల పేలుళ్లు సంభవించాయి. పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. ఇందులో ఆత్మాహుతి దాడికి సంబంధించిన మహిళ కూడా ఉంది. ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. మరో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఉగ్రవాద ఆపరేషన్ చర్యల్లో భాగంగా సెయింట్‌ డెనిస్‌ ప్రాంతంలో గత మూడు గంటలుగా పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. పారిస్‌ మారణకాండ అనంతరం మాస్టర్‌మైండ్‌ అబ్దెల్‌ హమీద్‌ ఎబౌడ్‌ టార్గెట్‌గా ఫ్రెంచ్‌ పోలీసులు గాలింపుచర్యలు ముమ్మరం చేశారు.

విమానాలకు బాంబు బెదిరింపులు...
రెండు ఫ్రాన్స్ విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో భద్రతను మరింత పటిష్టం చేశారు. మంగళవారం ఎయిర్ ఫ్రాన్స్ విమానం -65 అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నుండి పారిస్ వెళ్లాల్సి ఉండగా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. తనిఖీలు నిర్వహించిన అనంతరం సాల్ట్ కేక్ సిటీ మీదుగా విమానాన్ని దారి మళ్లించారు. మరో విమానం వాషింగ్టన్ నుండి పారిస్ వెళ్లాల్సి ఉండగా దానిని నోవా స్కోటియా మీదుగా మళ్లించారు. రెండు విమానాలు సురక్షితంగా ఫ్రాన్స్ చేరుకున్నాయని తెలుస్తోంది. 

కేసీఆర్ ముందే ఓటమి అంగీకరించారు - షబ్బీర్ ఆలీ..

వరంగల్ : సీఎం కేసీఆర్ ముందుగానే ఓటమిని అంగీకరించారని అబద్ధాలు చెప్పిన కేసీఆర్ ను రాళ్లతో కొట్టాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ పేర్కొన్నారు. 90 శాతం బడ్జెట్ ముగ్గురి చేతుల్లో ఉందని, కేసీఆర్ పాలనలో ప్రతి మూడు గంటలకు ఒక రైతు చనిపోతున్నారని తెలిపారు. కేసీఆర్ కు బీజేపీతో రహస్య ఒప్పందం ఉందని, జానారెడ్డి పుణ్యం వల్లే కేసీఆర్ సీఎం అయ్యారని విమర్శించారు. జేఏసీ ఏర్పాటు అయ్యింది జానారెడ్డి ఇంట్లోనే అని గుర్తు చేశారు. జైపాల్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదని షబ్బీర్ తెలిపారు.

కేసీఆర్ పై జైపాల్ మరోసారి విమర్శలు...

వరంగల్ : కేసీఆర్ గెలిచింది తప్పుడు వాగ్ధానాలతోనని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణ వచ్చింది కేసీఆర్ ఒక్కడి వల్ల కాదని తెలిపారు. కేసీఆర్ ఖమ్మంలో దీక్ష విరమించింది నిజమా ? కాదా ? అని ప్రశ్నించారు. దీక్ష విరమించిన వీడియోను మీడియా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 

ప్యారిస్ లో ఏడు చోట్ల పేలుళ్లు..

ప్యారిస్ : మళ్లీ ప్యారీస్ లో పేలుళ్లు సంభవించాయి. సుమారు ఏడు ప్రాంతాల్లో ఈ పేలుళ్లు జరిగాయి. పోలీసులు తనిఖీలు చేస్తున్న ప్రదేశాల్లో కూడా పేలుళ్లు సంభవించాయి.

వరదలపై వెంకయ్య విచారం...

ఢిల్లీ : ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో వరద బీభత్సంపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలతో మాట్లాడి వర్షం నష్టం గురించి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. వర్షాల వల్ల దెబ్బతిన్న జాతీయ రహదారి పునరుద్ధరణకు నితిన్ గడ్కరితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని, పంట నష్టంపై పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రిని కోరినట్లు తెలిపారు. 

12:41 - November 18, 2015

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా ? ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టించిన ఆయన.. తాజాగా రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల షెడ్యూల్‌ను మార్చే అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది మార్చిలో జరిగే సమావేశాలను ఈసారి ముందుగానే నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బడ్జెట్‌. ఈ పదం వింటేనే అందరికీ ఫిబ్రవరి, మార్చి నెలలు గుర్తుకు వస్తాయి. కేంద్ర బడ్జెట్‌తో పాటు.. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెలలోనే బడ్జెట్‌లు ప్రవేశపెడతాయి. కేంద్రం నుంచి తమకు వచ్చే గ్రాంట్లు, రాబడులు తేలిన తర్వాత.. వాటిని బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌ను రూపొందించుకుంటాయి. కానీ.. ఈసారి ఆ ట్రెండ్‌ను తెలంగాణ సర్కార్‌ మార్చబోతుంది. కేంద్ర బడ్జెట్‌తో సంబంధం లేకుండానే ఈసారి ముందుగానే బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

ఫిబ్రవరిలో బడ్జెట్‌ ?
జనవరి చివరిలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి మూడో వారంలోనే బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని సర్కార్‌ యోచిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ శాఖలన్నీ బడ్జెట్‌ కసరత్తులు పూర్తి చేశాయి. మరోవైపు అన్ని శాఖల నుంచి లెక్కలు త్వరగా వచ్చేలా ఆర్ధికశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇక ఇప్పటికే అధికారులు ప్లానింగ్‌, నాన్‌ ప్లానింగ్‌కు సంబంధించి తుది కేటాయింపులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక బడ్జెట్‌ త్వరగా ప్రవేశపెట్టడం వల్ల ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకంతో పాటు.. వాటర్‌ గ్రిడ్‌, మిషన్‌ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఈ ఏడాది కేంద్రం నుంచి కొత్తగా కేటాయింపులు ఉండకపోవచ్చని సర్కార్‌ భావించడం వల్లే ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చునని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడూ కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాతే రాష్ట్రాలు బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఆనవాయితి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ సంప్రదాయానికి మంగళం పాడబోతుందని పలువురు విమర్శిస్తున్నారు. ఎవరి మీద ఆధారపడని సర్కార్‌ అని గొప్పలు చెప్పుకునేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు.

మళ్లీ ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ విచారణ..

ఢిల్లీ : ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో ఈకేసులో మరోమారు పూర్తిస్థాయిలో విచారణ జరుగనుంది. దీనితో టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్, చండీలా, అంకిత్ చవాన్ లపై ఎలాంటి నిర్ణయం వెలువడుతందనేది ఉత్కంఠగా మారింది. 

నగరంలో కల్తీ మసాలాల తయారీ గుట్టురట్టు...

హైదరాబాద్ : కల్తీ మసాలాలు తయారి ముఠా గుట్టురట్టైంది. 14 మందిని సౌత్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు యూపీ వాసులున్నారు. 1057 కల్తీ మసాల బస్తాలను సీజ్ చేశారు. 

టీఆర్ఎస్ పై వ్యతిరేకత లేదు - ఎంపీ సీతారాం నాయక్..

వరంగల్ : టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత లేదని, నిన్నటి సభలో ఎమ్మార్పీఎస్, ఆశా వర్కర్లు వారి హక్కుల కోసం నిరసన తెలిపారని ఎంపీ సీతారాం నాయక్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపట్ల సవతి తల్లి ప్రేమ చూపుతోందన్నారు. వక్ఫ్ బోర్డు ఆక్రమణలపై విచారణ చేయిస్తామని తెలిపారు.

 

12:27 - November 18, 2015

కరీంనగర్ : అతి వేగం ప్రమాదకరం...నిర్లక్ష్యంగా వాహనాలను నడుపకండి..నిండు జీవితాలను బలి తీసుకోకండి..అని అధికారులు సూచనలు చేస్తున్నా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడో తరగతి విద్యార్థిని దుర్మరణం చెందింది. తెలంగాణ మోడల్ స్కూల్ లో శిరీష ఏడో తరగతి చదువుతోంది. ఎప్పటిలాగానే బుధవారం ఉదయం స్కూల్ కు వెళ్లడానికి ఆటో ఎక్కింది. శిరీష తో పాటు మరికొంత మంది విద్యార్థినిలు, ఇతర ప్రయాణీకులు ఆటో ఎక్కారు. తిమ్మాపూర్ వద్దకు చేరుకోగానే ఆటో బోల్తా పడి కొద్దిదూరం వరకు దూసుకెళ్లింది. దీనితో శిరీషకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడనే దుర్మణం చెందింది. మరికొంత మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని మెట్ పల్లి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. కుమార్తె మృతి చెందిందన్న వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

12:17 - November 18, 2015

చిత్తూరు : నగర మేయర్ కఠారి అనురాధ దంపతులు జిల్లాకు చేసిన కృషి అమోఘమని టిడిపి నేతలు పేర్కొన్నారు. మంగళవారం దుండగులు జరిపిన దాడిలో కఠారి అనురాధ అక్కడికక్కడనే మృతి చెందగా వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కఠారి మోహన్ మృతి చెందాడు. ఈఘటనతో తిరుపతి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హత్యతో తీవ్ర ఆగ్రహానికి గురైన కఠారి అనుచరులు దాడికి పాల్పడినట్లు భావిస్తున్న చందు కార్యాలయంపై దాడులకు పాల్పడ్డారు. ఇదిలా ఉంటే కఠారి దంపతుల హత్యకు నిరసనగా బుధవారం బంద్ కొనసాగుతోంది.  కొద్దిసేపటి క్రితం కఠారి అనురాధ, కఠారి మోహన్ దంపతుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ప్రజల సందర్శనార్థం అనురాధ మృతదేహాన్ని మున్సిపల్ కార్యాలయానికి తరలించారు.

కఠారి దంపతుల కృషి అమోఘం..
ఈ సందర్భంగా పలువురు టిడిపి నేతలు టెన్ టివితో మాట్లాడారు. కఠారి దంపతుల హత్య తెలుగుదేశం పార్టీని కలిచి వేసిందన్నారు. ఇలాంటి హత్యా రాజకీయాలకు టిడిపి దూరంగా ఉంటుందని, ఇలాంటివి సహించదన్నారు. నగర పాలిక సంస్థకు మేయర్ గా మహిళా ఎన్నికైన అనంతరం అనురాధ సుందరనగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేసిందన్నారు. 30 కిలోమీటర్ల పాలసుముద్రంలో బోర్లు వేసి నీటిని తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2.30గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడకు రానున్నారని, అలాగే బాబు తనయుడు లోకేష్ కూడా వస్తారని పేర్కొన్నారు. ఏది ఏమైనా కఠారి దంపతులను హత్య చేయడం దిగ్ర్భాంతి కలిగించిందన్నారు. 

ఆటో బోల్తా..విద్యార్థిని మృతి..

కరీంనగర్ : జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ లో ఆటో బోల్తా పడడంతో విద్యార్థిని మృతి చెందింది. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

 

షబ్బీర్ ఆలీపై డిప్యూటి సీఎం ఆలీ విమర్శలు..

వరంగల్ : టిడిపి, కాంగ్రెస్ హాయాంలోనే ముస్లింలకు అన్యాయం జరిగిందని డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ విమర్శించారు. టీఆర్ఎస్ తోనే ముస్లింల అభివృద్ధి సాధ్యమని వొక్కాణించారు. వక్ఫ్ బోర్డు భూముల అక్రమాల్లో షబ్బీర్ ఆలీ పాత్ర ఉందని, షబ్బీర్ ఆలీకి ముస్లింల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై కేంద్రానికి ఏపీ సర్కార్ ఫిర్యాదు - హరీష్ రావు...

హైదరాబాద్ : కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసిందని తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. దీనిపై టి.టిడిపి నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ, తెలంగాణ రెండు కళ్లు అని నమ్మబలికే చంద్రబాబు మరోసారి తమ నిజస్వరూపం చాటుకున్నారని విమర్శించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలని ఏపీకి కృష్ణా బోర్డుకు నవంబర్ 7న ఫిర్యాదు చేసిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని అనుమతులు సాధించిన ఈ పథకం ఎలా అక్రమం అవుతుందని ప్రశ్నించారు.

సీఎం బాబు నెల్లూరు పర్యటన రద్దు..

విజయవాడ :ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నెల్లూరు పర్యటన రద్దయ్యింది. భారీ వర్షాల కారణంగా వాతావరణం అనుకూలించ పర్యటన రద్దు చేసుకున్నారు. 

పారిస్ కాల్పుల్లో ఒకరి మృతి..

పారిస్ : ఉత్తర ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందినట్లు వార్తలు వెలువడుతున్నాయి. పారిస్ ఉగ్రదాడిలో పాల్గొన్న తొమ్మిదో ఉగ్రవాది కోసం పారిస్ శివారులో పోలీసులు ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

11:33 - November 18, 2015

చిత్తూరు : నగర మేయర్ అనురాధ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. బుల్లెట్ గాయంతో మెదడు చిట్లి మృతి చెందినట్టు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. అనురాధ శరీరంపై కత్తిగాట్లు లేవని నివేదికలో ఉంది. ప్రజలు సందర్శనార్థం మేయర్‌ అనురాధ మృతదేహాన్ని మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. మరోవైపు వేలూరు సీఎంసీలో మేయర్ కఠారి అనురాధ భర్త కఠారి మోహన్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే అనురాధ దంపతుల అంత్యక్రియలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కఠారి దంపతుల హత్యకు నిరసనగా జిల్లా బంద్ కొనసాగుతోంది. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేశారు.
నగర మేయర్ కఠారి అనురాధ దంపతులపై దుండగులు మంగళవారం మధ్యాహ్నాం కత్తులు..తుపాకులతో దాడి చేశారు. ఈ దాడిలో అనురాధ అక్కడికక్కడనే మృతి చెందారు. కఠారి మోహన్ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. సమీప బంధువే ఈ హత్యలకు పాల్పడ్డాడరని తెలుస్తోంది. 

11:25 - November 18, 2015

నెల్లూరు: అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతూనే ఉన్నాయి. తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలు గ్రామాలు నీటమునిగాయి. దీంతో పునరావాస కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వెంకటగిరి, గూడూరు, నెల్లూరు ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కైవల్యానది, స్వర్ణముఖి, కాళంగి నదులకు వరద ఉద్ధృతి తగ్గలేదు. పరివాహన ప్రాంతాలన్నీ జలమయమయ్యాయ. పంబలేరు ఉద్ధృతంగా ప్రవహించడంతో జాతీయ రహదారిపై మనుబోలు వద్ద గండి పడింది. జాతీయ రహదారిపై వరుసగా మూడో రోజూ రాకపోకలు నిలిచిపోయాయి.

పొంగి ప్రవహిస్తున్న వాగులు..వంకలు...
తిరుపతి-వెంకటగిరి, శ్రీకాళహస్తి-నాయుడుపేట, వెంకటగిరి-గూడూరు, గూడూరు -రాపోలు మధ్య వాగులు పొంగి ప్రవహించడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. గూడూరు పట్టణం చుట్టూ వరదనీరు పోటెత్తింది. గూడూరు పెద్ద చెరువుకు భారీగా వరద రావడంతో లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. మూడో రోజు కూడా జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జిల్లాలో వరద బాధితుల కోసం అధికార యంత్రాంగం 61 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. దాదాపు 6వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ రోజు నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేసే అవకాశముంది. చిత్తూరు వెళ్లనున్న సీఎం మధ్యాహ్నం తర్వాత వాతావరణం అనుకూలిస్తే నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేయనున్నారు. 

11:22 - November 18, 2015

కరీంనగర్ : జిల్లా ధర్మపురి బస్టాండు సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి వ్యాపారస్తులు రోడ్డున పడ్డారు. కళ్లెదుటే దుకాణాలు కాలిపోతున్నా రక్షించుకోలేక పోయామని, నగదు..వ్యాపార వస్తువులున్నీ కాలిపోయాయని వ్యాపారస్తులు లబోదిబోమంటున్నారు. ఒక్కొక్కరి బాధ వర్ణనాతీతంగా ఉంది.
నందికూడలి వద్ద వివాదాస్పద భూమిలో ఉన్న దుకాణ సముదాయాల్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం 16 దుకాణాలు కాలి బూడిదయ్యాయి. సుమారు కోటి రూపాయలకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. 53 సర్వే నెంబరులో 50 సంవత్సరాలు 50కిపైగా కుటుంబాలు రేకులషెడ్లు, గుడిసెలు వేసుకొని వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. రాత్రి రెండు గంటల ప్రాంతంలో మంటలు రావడాన్ని గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు గమనించారు. దుకాణాల్లో నిద్రిస్తున్న వారిని అప్రమత్తం చేయడంతో వారు బయటకు పరుగులుతీసి ప్రాణాలు కాపాడుకున్నారు. మూడు వంటగ్యాసు సిలిండర్ల పేలడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. దుకాణాలు కాలి బూడిదవ్వడంతో వీరంతా రోడ్డుమీద పడ్డారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. 

జీహెచ్ఎంసీ కమిషనర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు...

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కమిషనర్ తో కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, బండా కార్తికరెడ్డిలు భేటీ అయ్యారు. ఓటర్ జాబితా సవరణ, వార్డుల పునర్ విభజనపై ఫిర్యాదు చేశారు. 

విమాన కూల్చివేతపై పుతిన్ భారీ బహుమతి ప్రకటన..

రష్యా : విమానం కూల్చివేసిన వారిని పట్టిస్తే రూ. 330 కోట్ల నగదు బహుమతి ఇస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. సివాయ్ పెవిన్సులా ప్రాంతంలో రష్యా విమానం కూల్చివేసి 224 మంది మృతికి కారణమైన వారిని పట్టుకుని శిక్షిస్తామన్నారు. ఐఎస్ఐఎస్ తో పాటు ఇతర ఉగ్రవాద సంస్థలపైనా దాడుల చేయనున్నట్లు, ఫ్రాన్స్ తో కలిసి సంయుక్తంగా యుద్ధం చేసేందుకు సన్నాహాలు రూపొందిస్తున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. 

అవినీతి నిరోధానికి చర్యలు - మోడీ...

ఢిల్లీ : అవినీతి నిరోధానికి కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అవినీతికి పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, ఓ పద్ధతి ప్రకారం అవినీతి నిరోధానికి కేంద్రం చర్యలు తీసుకొంటోందన్నారు. నల్లధనం వివరాలు సేకరించడం జరుగుతోందని, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిరోధించాలన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు చేరువ కావాలని ఆకాక్షించారు. 

జిల్లా కలెక్టర్లతో బాబు టెలికాన్ఫరెన్స్..

విజయవాడ : వర్షాలపై జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇతర జిల్లాలోని రెస్క్యూటీంలను నెల్లూరుకు తరలించాలని, పంట పొలాల్లోని వరదనీటిని బయటకు పంపే ఏర్పాటు చేయాలని సూచించారు. నిత్యావసర సరుకుల రవాణాకు రైల్వే ట్రాక్ ను ఉపయోగించుకొనేలా కేంద్రంతో మాట్లాడుతానని హామీనిచ్చారు. 

ఎల్ బినగర్ ఛైన్ స్నాచింగ్...

హైదరాబాద్ : ఎల్ బినగర్ గ్రీన్ పార్కు కాలనీలో ఛైన్ స్నాచింగ్ జరిగింది. మహిళ మెడలో నుండి మూడు తులాల బంగారు గొలును దుండగులు లాక్కెళ్లారు. 

10:31 - November 18, 2015

ఢిల్లీ : భయంకర ఉగ్రదాడి ఘటన నుండి తేరుకోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. మరోమారు ఉగ్రవాదులు విరుచకపడ్డారనే వార్త తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు..ఉగ్రవాదుల మధ్య తీవ్ర కాల్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఉగ్రదాడి అనంతరం ఫ్రాన్స్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉగ్రవాదులను ఏరివేసేందుకు నడుం బిగించింది. ఆయా ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున తనిఖీల సమయంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. దీనితో పోలీసులు ధీటుగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.

రెండు ఫ్రాన్స్ విమానాలకు బాంబు బెదిరింపు..
మరోవైపు పారిస్ లో రెండు ఎయిర్ ఫ్రాన్స్ విమానాలకు బాంబు బెదిరింపు వచ్చింది. దీనితో ఎయిర్ ఫ్రాన్స్ విమానం 65 అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నుండి పారిస్ వెళ్లాల్సి ఉంది. వాషింగ్టన్ నుండి పారిస్ కు మరో విమానం వెళ్లాల్సి ఉంది. ఈ రెండు విమనాల్లో బాంబు ఉందంటూ బెదిరింపులు వచ్చాయి. దీనితో ఆ విమానాలను దారి మళ్లించారు. 

10:20 - November 18, 2015

విశాఖపట్టణం : జిల్లాలోని నక్కపల్లి మండలం గుడిచెర్ల వద్ద జాతీయ రహదారిప బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు హైవే పెట్రోలింగ్ పోలీసులు గాయపడ్డారు. ఎన్ హెచ్ 16 రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. దీనితో ఆ ప్రాంతంలో వాహనాలు బారులు తీరి నిలబడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు తమ వాహనంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ ను వీరు క్రమబద్ధీకరిస్తున్నారు. అదే సమయంలో విశాఖ నుండి తునికి వైపుకు వెళుతున్న ఐషర్ వాహనం పోలీసులను ఢీకొట్టింది. హెడ్ కానిస్టేబుల్ సన్యాసి నాయుడికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్ఐ ఆదిమూర్తికి భుజంపై గాయమైంది. హోంగార్డుకు స్వల్పగాయాలయ్యాయి. వీరిని ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్ కు తరలించారు. వీరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలుస్తోంది. 

10:11 - November 18, 2015

హైదరాబాద్ : నగరంలో చిన్నారుల కిడ్నాప్ ల పరంపర కొనసాగుతూనే ఉంది. రైల్వే స్టేషన్ ప్రధానంగా కిడ్నాప్ లు చేస్తున్నారు. ఇటీవలే చిన్నారి దుర్గ కిడ్నాప్ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా 27 రోజుల పసికందును దుండగులు కిడ్నాప్ చేశారు. వివరాల్లోకి వెళితే...ఖమ్మం జిల్లాకు చెందిన రమాదేవి, లక్ష్మణ్ దంపతులు ఐదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం సికింద్రాబాద్ కు వలస వచ్చారు. అయితే లక్ష్మణ్ అనారోగ్యంతో మృతి చెందడంతో రమాదేవి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటోంది. రమాదేవికి 27 రోజుల పసికందు ఉన్నాడు. ఇదిలా ఉంటే తన కొడుకు చనిపోవడంతో భార్య కోమాలోకి వెళ్లిపోయిందని, పసికందును చూపిస్తే తన భార్య కోలుకొనే అవకాశం ఉందని సురేష్ అనే వ్యక్తి తెలిపాడు. దీనికి రమాదేవి అంగీకరించలేదు. మంగళవారం రాత్రి పసికందును ఎత్తుకెళ్లారు. తన కొడుకును సురేష్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని రాంగోపాల్ పేట పీఎస్ లో రమాదేవి ఫిర్యాదు చేశారు. రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

రెండు ఫ్రాన్స్ విమానాలకు బాంబు బెదిరింపు..

ఫ్రాన్స్ : పారిస్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సృష్టిచిన మారణకాండాను మరువకముందే మరో కలకలం రేగింది. రెండు ఎయిర్ ఫ్రాన్స్ విమానాలకు బాంబు బెదిరింపు వచ్చింది. దీనితో ఎయిర్ ఫ్రాన్స్ విమానం 65 అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నుండి పారిస్ వెళ్లాల్సి ఉంది. వాషింగ్టన్ నుండి పారిస్ కు మరో విమానం వెళ్లాల్సి ఉంది. ఈ రెండు విమనాల్లో బాంబు ఉందంటూ బెదిరింపులు వచ్చాయి. దీనితో ఆ విమానాలను దారి మళ్లించారు. 

ఆర్మీ కల్నల్ సంతోష్ కు నివాళి..

జమ్మూ కాశ్మీర్ : కల్నల్ మహాదీక్ కు సైనిక అధికారులు ఘనంగా నివాళులర్పించారు. కుప్వార ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మహదీక్ వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మణిగావ్ అడవుల్లో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో కల్నల్ మహాదీక్ నేతృత్వంలోని సైనిక బలగాలు వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగాయి. అయితే నలుగురు ఉగ్రవాదులు జవాన్లకు ఎదురుపడ్డారు. దీనితో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆర్మీ కల్నల్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆర్మీ కల్నల్ చికిత్స పొందుతూ వీరమరణం పొందారు.

గోల్నాకలో కారు డ్రైవర్ ఆత్మహత్య...

హైదరాబాద్ : గోల్నాకలో కారు డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓబేర్ సంస్థ వేధింపులు తాళలేక డ్రైవర్ జహీర్ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పటించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి..

ప్రకాశం : ఇంకొల్లులో దారుణం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. తండ్రి మృతి చెందాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సోమశిల జలశయానికి పోటెత్తిన వరద నీరు...

నెల్లూరు : సోమశిల జలాశయానికి వరద నీరు పోటెత్తింది. ఇన్ ఫ్లో 92 వేల క్యూసెక్కుల నీరు ఉండగా నీటి మట్టం 39 టీఎంసీలుగా ఉంది.

 

మేయర్ అనురాధ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి...

చిత్తూరు : మేయర్ అనురాధ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. బుల్లెట్ గాయంతో మెదడు చిట్లి మృతి చెందారని, మేయర్ శరీరంపై కత్తిగాట్లు లేవని పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. 

సీఎం కేసీఆర్ పై ఎంపీ గుత్తా ఫైర్...

నల్గొండ : సీఎం కేసీఆర్ పై ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ సభలో కేసీఆర్ ప్రసంగం పచ్చి అబద్ధాలతో సాగిందని, తెలంగాణను సాధించడంలో జైపాల్ రెడ్డి కృషి మరువలేనిదన్నారు. తెలంగాణ బిల్లు పాస్ అయ్యాక సీఎం కావాలని జైపాల్ రెడ్డిని కేసీఆర్ అడిగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. టిడిపి, కాంగ్రెస్ లో కేసీఆర్ మంత్రిగా పనిచేసినప్పుడు తెలంగాణపై బాధ్యత గుర్తు రాలేదన్నారు. మొదటి పంటకే నీళ్లు ఇవ్వలేదు..రెండు పంటలకు నీళ్లు ఇస్తామని చెప్పడం సిగ్గు లేదా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

09:22 - November 18, 2015

హైదరాబాద్ : ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా హైదరాబాద్‌ పోలీసులు రౌడీషీటర్లకు కొత్త జీవితం ప్రసాదించారు. రెండేళ్లుగా ఎలాంటి నేరాలకు పాల్పడకుండా.. సత్ప్రవర్తనతో ఉన్న పలువురిపై రౌడీషీట్‌ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల నిర్ణయంతో రౌడీషీటర్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్షణికావేశంలోనో.. ఇతర కారణాలతో నేరాలకు పాల్పడినవారు. నిత్యం నేరాలకు పాల్పడుతుండడంతో వీరిపై పోలీసు కేసులతో పాటు రౌడీషీట్లు ఓపెన్‌ చేశారు. వీళ్లు ప్రతిరోజు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాల్సి ఉంటుంది. ఇక పండుగలు, ఉత్సవాలు, ఎన్నికల సమయంలో స్వచ్చందంగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోవాలి. లేకపోతే ఎక్కడ ఉన్నా పోలీసులు తీసుకువచ్చి బైండోవర్‌ చేస్తుంటారు. ఇక నగరంలో నేరం ఎక్కడ జరిగినా ముందుగా పోలీసుల కన్నుపడేది వీరిపైనే. అసలు నిందితులు దొరికేవరకు పోలీసుల నుంచి వీరికి ఇబ్బందులు తప్పవు. నిత్యం ఇది నగరంలో రౌడీషీట్ల పరిస్థితి.

92 మందిపై రౌడీషీట్‌ తొలగింపు..
పాత జీవితం మరిచిపోయి కొత్త జీవితం ప్రారంభిద్దామన్నా.. పోలీసులు నిత్యం వీరి చుట్టూ తిరుగుతూనే ఉంటారు. దీంతో సమాజంలో వీరికి చిన్నచూపే ఎదురవుతోంది. ఇలాంటి బాధలు ఎదుర్కొంటున్న చాలామంది రౌడీషీటర్లు.. ఇక తాము తప్పులు చేయమని.. తమపై ఉన్న రౌడీషీట్‌ తొలగిస్తే పనులు చేసుకుంటూ బతుకుతామని పోలీసు ఉన్నతాధికారులను ప్రాధేయపడ్డారు. దీంతో ఈ అంశంపై దృష్టి సారించిన పోలీసులు.. రౌడీషీటర్ల రెండేళ్ల ట్రాక్‌ రికార్డును గమనించారు. ఈ సమయంలో నేరాలు, గొడవలకు పాల్పడని 92 మందిపై రౌడీషీట్‌ తొలగిస్తున్నట్లు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. మిగతావాళ్లు కూడా సత్ప్రవర్తనతో ఉంటే రౌడీషీట్‌ తొలగిస్తామన్నారు. మళ్లీ నేరాలకు పాల్పడితే రౌడీషీట్‌ తెరిచేందుకు వెనకాడమని హెచ్చరించారు.

సంతోషం వ్యక్తం చేస్తున్న రౌడీ షీటర్లు...
తమపై రౌడీషీట్‌ ఎత్తివేయడం పట్ల రౌడీషీటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో క్షణికావేశంలో నేరాలు, గొడవలు చేసి ఇప్పటివరకు ఇబ్బందులు పడ్డామని.. మరోసారి అలాంటి తప్పులు చేయమంటున్నారు. ఇన్నాళ్లు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు కొత్త జీవితం ప్రసాదించిన పోలీసు ఉన్నతాధికారులకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల తాజా నిర్ణయంతో మిగతావారిలోనూ మార్పు వస్తుందని పలువురంటున్నారు. 

సికింద్రాబాద్ లో పసికందు అపహరణ..

హైదరాబాద్ : సికింద్రాబాల్ లో చిన్నారుల కిడ్నాప్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న చిన్నారి దుర్గ కిడ్నాప్ ఘటన మరిచిపోకముందే బుధవారం ఉదయం మరో ఘటన చోటు చేసుకుంది. 27 రోజుల పసికందు నాగచైతన్యను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడని తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సురేష్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి ఉండవచ్చునని తల్లి రమాదేవి ఫిర్యాదులో పేర్కొంది. 

09:11 - November 18, 2015

చిత్తూరు : నగరం అంతటా విషాద వాతావరణం అలుముకుంది. మేయర్ కఠారి అనురాధ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. మంగళవారం మేయర్ కఠారి అనురాధ, భర్త కఠారి మోహన్ లపై దుండగులు కత్తులు..తుపాకులతో విరుచుకపడిన సంగతి తెలిసిందే. ఈఘటనలో అనురాధ అక్కడికక్కడనే మృతి చెందగా మంగళవారం రాత్రి వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో కఠారి మోహన్ కన్నుమూశాడు. బుధవారం ఉదయం అనురాధ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అలాగే కఠారి మోహన్ మృతదేహాన్ని కూడా పోస్టుమార్గం గదిలోకి తీసుకొని వెళ్లినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం అనంతరం వీరి మృతదేహాలను చిత్తూరుకు తీసుకరానున్నారు. ప్రజల సందర్శనార్థం మున్సిపల్ కార్యాలయంలో ఉంచనున్నారు. అనంతరం కఠారి మోహన్ స్వగృహానికి వారి మృతదేహాలను తరలించనున్నారు. మధ్యాహ్నం నిర్వహించే కఠారి దంపతుల అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈసందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ముగ్గురు నిందితులు లొంగిపోయిన సంగతి తెలిసిందే. పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు మేయర్ కఠారి అనురాధ దంపతుల మృతికి నిరసనగా బంద్ కొనసాగుతోంది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగనీయకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సింఘాల్ కు నివాళి అర్పించనున్న మోడీ..

ఢిల్లీ : వీహెచ్ పి అధినేత అశోక్ సింఘాల్ భౌతికకాయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యాహ్నం నివాళి అర్పించనున్నారు. 

చిక్కుల్లో పతాంజలి ఆటా నూడుల్స్...

ఢిల్లీ : ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా కు చెందిన 'పతంజలి' ఆటా నూడుల్స్ చిక్కుల్లో చిక్కుకుంది. నూడుల్స్ విక్రయాలకు అనుమతి లేదని, ఈవిషయంపై దృష్టి సారించినట్లు ఎఫ్ఎస్ఎస్ఎఐ పేర్కొంది. 

08:38 - November 18, 2015

తెలంగాణ అస్థిత్వాన్ని టీఆర్ఎస్ పెంచి పోషిస్తోందని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. వరంగల్ ఉప పోరు..జన్యుమార్పిడి..టమాట ధర..మలక్ పేటలో చిన్నారి దుర్మరణం చెందడం పలు అంశాలపై టెన్ టివిలో 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లోనే....

ఓడించాలనే కసి లేదు...
''ఎన్నికల పోరులో రాజకీయ పార్టీల నేతలు తిట్టుకోవడం సహజమే. ఎన్నికలు ఎందుకు వచ్చాయో ఎవరికీ అర్థం కాదు. రాజకీయ అవసరాల కోసం ఎన్నికలు వచ్చాయి. ఇక్కడ ప్రభుత్వం పట్ల అసంతృప్తి మాత్రమే ఉంది. ఈ అసంతృప్తి రాజకీయంగా మారలేదు. ఇంకొక అవకాశం ఇద్దామనే ప్రజలు ఆశిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో ఉన్న హడావుడి ప్రజల్లో లేదు. ప్రభుత్వాన్ని ఓడించాలనే కసి లేదు. ఈ ఎన్నికలను రెఫరెండంగా మార్చారు. ప్రభుత్వాన్ని ఓడించండి..బుద్ధి చెప్పండి అని ప్రతిపక్షాలు నినాదాలు తీసుకున్నాయి. ఈ ఓటుతో మోడీ ప్రభుత్వం మారదు..కేసీఆర్ ప్రభుత్వం మారదని..ప్రజల పక్షాన నిలబడే నేతను ఓటు ద్వారా ఎన్నుకోవడం ద్వారా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందనే నినాదాన్ని విపక్షాలు ఎత్తుకుంటే బాగుండేది. ప్రభుత్వం మంచిగా చేయాలన్నా ఓ హెచ్చరిక ఉండాలి. స్థానిక నాయకత్వం ఉన్నచోట విపక్షాలు కొంత బెటర్ గా ఉన్నాయి. అర్బన్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలంగా ఉంది. ఏ పార్టీకి బలమైన అభ్యర్థులు కూడా లేరు. అభ్యర్థుల మధ్య పోటీ లేదు. పార్టీల మధ్య పోటీ ఉన్నట్లు ఉంది. తెలంగాణ అస్థిత్వాన్ని టీఆర్ఎస్ పెంచి పోషిస్తోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య విబేధాలు ఉన్నాయి. దీనిని క్యాష్ చేసుకుంది. ఇక్కడ సాంస్కృతి రాజకీయాలు బాగా చేసింది. మరోవైపు వివిధ వర్గాల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి ఉంది. పత్తి ధరలు తగ్గిపోయాయి. కందిపప్పు, టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. విద్యార్థులు..నిరుద్యోగుల్లో కూడా అసంతృప్తులున్నాయి.

టమాటా ధరలు ఎగబాకడం...
టమాటా ధరలు తగ్గిపోవడం వల్ల రోడ్లపై పారేసిన సందర్భాలున్నాయి. పొలంలోనే పంట నాశనం చేసే సందర్భాలున్నాయి. రైతులకు గిట్టుబాటు లేదు..వినియోగదారుడికి గిట్టుబాటు రాదు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. ? మధ్య దళారీలు లాభ పడుతున్నారు. వ్యవసాయ ప్రణాళిక లోపం, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి.

ఆవాలు..జన్యుమార్పిడి..
ఆవాలు వంట ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో జన్యుమార్పిడి పరీక్షలకు అనుమతులస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. 2010 లో దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైనప్పుడు బీటీ వంకాయపై వెనక్కి తగ్గారు. దీనిపై సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. జన్యుమార్పిడి ఆహార ఉత్పత్తి పెరుగుతుందని ఒక వాదన. విషతుల్యమయ్యే పరిస్థితి ఉంది. ఎలాంటి స్టడీ చేయకుండా పరీక్షలు చేయకూడదు. బీటీ కాటన్ విషయంలో వచ్చిన సమగ్ర సమచారం ప్రజల ఎదుట ఉంచాలి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న అనంతరం ముందుకు వెళ్లాలి.

మలక్ పేట ఘటన బాధాకరం...
మలక్ పేటలో జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరం. ప్రభుత్వ పాఠశాలలు ఎప్పుడు కూలుతాయో తెలియదు. వివిధ ప్రైవేటు స్కూళ్లలో ఫైర్ సదుపాయం ఉండదు. పాఠశాలలు పెట్టడం కాదు. ఇందులో బాధ్యత ఏంటీ ? అని ఆలోచించాలి. నిరంతరం బాలల హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. బాలల హక్కుల ఉద్యమం జరగాల్సినవసరం ఉంది. పౌర సమాజం నిలదీయాల్సినవసరం ఉంది'' అని ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు.

08:31 - November 18, 2015

విశాఖపట్టణం : దక్షిణ కోస్తా తీరంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల ఏపీ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దక్షిణ కోస్తాలో తీరం వెంబడి గంటకు 50-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ తరుణంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచనలు చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలతో తమిళనాడు చిగురుటాకులా వణికిపోతోంది. చెన్నై సహా కాంచీపురం, తిరువళ్లూరు, వేలూరు జిల్లాల పాఠశాలలకు అక్కడి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తమిళనాడులో కూరగాయల ధరలు పెరగడంతో ప్రభుత్వం వివిధ కౌంటర్లు ఏర్పాటు చేసింది. భారీ వర్షాల కారణంగా నేడు తమిళనాడు, పుదుచ్చేరిల నుండి ఉత్తరాదికి వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. పట్టాలు పాడైనందున ఏపీ మీదుగా ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే 27 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. 
నాలుగు రోజులుగా తమిళనాడు తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం తాజాగా దిశ మార్చుకుని పశ్చిమ బంగాళాఖాతానికి చేరుకుంది. స్థిరంగా అల్పపీడనం ఉండడం వల్ల భారీ వర్షాలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఎన్ని గంటల పాటు స్థిరంగా అల్పపీడనం ఉంటుందో అంచనా వేయలేమని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నట్లు సమాచారం. సముద్రంలో ఉంటూ స్థిరంగా ఉండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని, భూమికి చేరితే ప్రభావం తగ్గుతుందని అధికారులు తెలిపారు. 

కటారి దంపతులకు పోస్టుమార్టం ప్రారంభం..

చిత్తూరు : వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో నగర మేయర్ కటారి అనురాధ దంపతులకు పోస్టుమార్టం ప్రారంభమైంది. మంగళవారం దుండగులు జరిపిన దాడిలో మేయర్ అనురాధ అక్కడికక్కడనే మృతి చెందగా భర్త రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

కడపలో కూలిన ప్రహారీగోడ..నలుగురి మృతి..?

కడప : రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి కడప జిల్లాలోని ఓ ప్రాంతంలో ప్రహారీ గోడ కూలడంతో నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందినట్లు వార్తలు వస్తున్నాయి. 

07:56 - November 18, 2015

చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నగర మేయర్ అనురాధ దంపతులపై దుండగులు కత్తులు..తుపాకులతో దాడి చేశారు. దీనితో అక్కడికక్కడనే అనురాధ మృతి చెందగా ఆసుపత్రిలో అనురాధ భర్త కన్నుమూశారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఘటనతో నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో 144 సెక్షన్ అమలు చేశారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఏపీ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ప్రభుత్వం ముందుచూపు చర్యలు తీసుకోకపోవడం వల్ల భారీ నష్టం జరుగుతోందని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరో కీలకాంశం..బాక్సైట్ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం దోబూచులాడుతోందని నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో శైలజానాథ్ (కాంగ్రెస్), జూలకంటి రంగారెడ్డి (సీపీఎం), కుమార్ (బీజేపీ), రామకృష్ణ ప్రసాద్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

చిత్తూరు కు వెళ్లనున్న బాబు..

చిత్తూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు జిల్లాకు వెళ్లనున్నారు. మేయర్ అనురాధ దంపతులకు నివాళి అర్పించనున్నారు. మంగళవారం దుండగులు జరిపిన దాడిలో కఠారి అనురాధ అక్కడికక్కడనే మృతి చెందగా అదే రోజు రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనురాధ భర్త కన్నుమూశారు. 

07:50 - November 18, 2015

తలనొప్పి అనేది ప్రస్తుతకాలంలో చాలా సాధారణ సమస్య అయిపోయింది. ఇలా తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే ఏదో మాత్ర మింగి, తక్షణం ఉపశనమం పొందాలనే ఆలోచన ఎక్కువగా కలుగుతుంది. పరిస్థితిలో దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాల్సి ఉంటుంది. నిరంతరం మాత్రలకు అలవాటుపడటం కంటే మనకు అందుబాటులో ఉండే హోం రెమెడీస్‌తో తలనొప్పిని తగ్గించుకోవచ్చు.

ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ : తలనొప్పి తగ్గించడంలో యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ బాగా సహాయపడుతుంది. ఒక టేబుల్‌స్పూను వెనిగర్‌ను ఒక కప్పు వేడినీటిలో కలిపి తాగాలి. ఈ వాటర్‌ తాగిన పదిహేను నిముషాల వరకూ ఏమీ తాగకుండా ఉండాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి తగ్గే అవకాశం ఉంది.

గ్రీన్‌ టీ : గ్రీన్‌ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది తలనొప్పి నివారించడానికి సహాయపడుతుంది. గ్రీన్‌ టీలో కొద్దిగా తేనె, దాల్చిన చెక్క కలుపుకొని తీసుకోవచ్చు.

గోరువెచ్చని నీరు : తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందడానికి రోజంతా కొద్దికొద్దిగా గోరువెచ్చని నీరు తాగితే తలనొప్పి తగ్గుతుంది.

పాదాలు వేడినీటిలో : వేడినీటిలో కొద్దిగా ఆవాలపొడివేసి పావుగంటసేపు పాదాలను ఉంచితే రక్తప్రసరణ బాగా జరిగి తలనొప్పి తగ్గుతుంది.

07:48 - November 18, 2015

గోళ్ళపై మచ్చలు, పగుళ్ళు, గోరు చుట్టూ చీముపట్టడం లాంటివి గోళ్ళకు సంబంధించిన వ్యాధులు. సహజంగా సొరియాసిస్‌, ఎగ్జిమా మొదలైన చర్మవ్యాధులతోపాటు ఫంగస్‌ ఇన్ఫెక్షన్ల వల్ల గోళ్ళు పాడవుతూ ఉంటాయి. చిన్నదే కదా అని అశ్రద్ధ చేయడం వల్ల గోళ్ళ సమస్య అధికమవుతుంది. ముఖ్యంగా అతి శుభ్రత కోసం ఎక్కువ సమయం డిటర్జెంట్‌ సబ్బులతో బట్టలు ఉతకడం, నీటిలో ఎక్కువగా గోళ్ళు నానడం, కడిగిన గిన్నెలనే పదేపదే కడగటం చేసేవారిలో గోళ్ళ సమస్యలు ఎక్కువ. గోళ్ళు ఆరోగ్యంగా పెరగాలన్నా, అందమైన ఆకృతిలో ఉండాలన్నా నెలకోసారి మెనిక్యూర్‌ చేయాలి. ప్రతిరోజూ చేతి, కాలి వేళ్ళ మీద పేరుకునే మృత కణాలను తొలగిస్తూ ఉండాలి.
మెత్తగా రుబ్బిన గోరింటాకు ముద్దలో కొద్దిగా పసుపు, నిమ్మరసం కలిపి గోళ్ళకు నెలలో ఒకసారైనా రాత్రిపూట పట్టించాలి. గోరింటాకు రాలిపోకుండా పలచని గుడ్డ చుట్టి పడుకుని ఉదయాన్నే కడిగేయాలి. దీనివల్ల ఫంగస్‌తో ఏర్పడిన పిచ్చు గోళ్ళు, పగుళ్ళు, ముడతలు, మచ్చలు మొదలైన సమస్యలు తగ్గిపోతాయి.
పై పొర తీసిన బంగాళదుంపను మెత్తగా చేయాలి. దానికి కొద్దిగా పసుపు కలుపుకొని రాత్రి పడుకునేముందు గోళ్ళకు రాసుకోవాలి. ఇలా చేస్తే ఫంగస్‌ వల్ల ఏర్పడే నలుపుదనం పోయి గోళ్ళు కాంతివంతంగా తయారవుతాయి.
రాత్రి పడుకునేముందు నిమ్మరసంలో ముంచిన వస్త్రాన్ని పాడయిన గోళ్ళకు చుట్టాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల మారిన గోళ్ళరంగు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది.
స్వచ్ఛమైన ఆలివ్‌ నూనె గోళ్ళ సంరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. చేతి, కాలి వేళ్ళ గోళ్ళకు రోజూ ఆలివ్‌ నూనె రాస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.
కొద్దిగా పసుపును తీసుకొని నీటిలోగానీ, నిమ్మరసంలో గానీ కలిపి ముద్దలా చేసుకొని ఒక వస్త్రంలో చుట్టి గోళ్లకు వ్యాధి సోకినభాగాల్లో రాత్రి పడుకునే ముందు చుట్టాలి. ఉదయన్నే స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేసుకుంటే గోళ్ల సమస్యలు త్వరగా తగ్గి, ఆరోగ్యంగా ఉంటాయి.

07:32 - November 18, 2015

జీలకర్రకు వంటల్లో చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అలాంటి జీలకర్ర రుచిలోనే కాదు ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. జీలకర్రలో క్యాల్షియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, సోడియం, పొటాషియం, విటమిన్‌ ఎ, సి ఎక్కువగా ఉన్నాయి. వీటిని నిత్యం ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. జీలకర్రలో ఐరన్‌ పుష్కలంగా లభించడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ తయారవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో ఐరన్‌ లోపం వల్ల వచ్చే రక్తహీనత తగ్గించుకోవడానికి జీరా బాగా సహాయపడుతుంది. ఇలాంటి వారు జీలకర్రను రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది.

  • జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో చేరిన మలినాలను తొలగించి ప్రీ రాడికల్స్ ను నివారించి, వ్యాధులను తట్టుకునేలా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
  • యాంటీ ఏజింగ్‌గా పనిచేసి చర్మంపై ముడతలు రాకుండా నివారిస్తుంది. ఇందుకు జీలకర్రలో విటమిన్‌ ఇ ఎక్కువగా ఉండటమే కారణం.
  • జీలకర్ర యాంటీ-సెప్టిక్‌ కారణాలను కలిగి ఉండటం వల్ల జలుబు, ఫ్లూను కలుగజేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఒక కప్పు కాచిన నీటిలో జీలకర్ర, అల్లం, తేనె, తులసి ఆకులు కలుపుకొని తాగడం వల్ల జలుబు నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.
  • ఫైల్స్ ఉన్నవాళ్ళకు జీలకర్ర చక్కటి పరిష్కారం. జీలకర్రలో ఎక్కువగా ఫైబర్‌, యాంటీ ఫంగల్‌, లాక్సైటీవ్స్‌, కార్మినేటివ్‌ గుణాలు ఉంటాయి. ఇవి మొలలు నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.
  • జీలకర్ర కాలేయంలో పైత్యరసం తయారవటాన్ని ప్రోత్సహిస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీలకర్ర కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలను దూరం చేస్తుంది.
  • రోజువారీ ఆహారంలో జీలకర్ర తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్‌ లెవెల్స్ తగ్గిస్తుంది. దీనివల్ల మధుమేహం తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి.
07:29 - November 18, 2015

నారా రోహిత్‌, నందిత హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'సావిత్రి'. పవన్‌ సాదినేని దర్శకత్వంలో, విజన్‌ ఫిలింమేకర్స్ పతాకంపై డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మొదటి షెడ్యుల్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత మీడియాతో మాట్లాడారు. ఇది ఒక పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని, రెండవ షెడ్యూల్‌ ఏలూరు పరిసర ప్రాంతాలలో ఈనెల 18 నుండి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రోహిత్‌, నందితల కాంబినేషన్‌ ఈ చిత్రానికి ఎంతో ప్లస్‌ అవుతుందని, ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. 'ప్రేమ ఇష్క్ కాదల్‌' చిత్రంతో మంచి గుర్తింపు లభించిందని, ఇప్పుడు నారా రోహిత్‌తో 'సావిత్రి' చిత్రాన్ని ఒక పూర్తి కమర్షియల్‌ ఫామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నట్లు దర్శకుడు పవన్‌ సాదినేని తెలిపారు. రోహిత్‌ పెర్ఫామెన్స్ లో, బాడీ లాంగ్వేజ్‌లో ఎంతో కొత్తదనం ఉంటుందన్నారు. 

07:28 - November 18, 2015

విషురెడ్డి, అభిరామ్‌, సంజన హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'త్రయం'. పంచాక్షరీ పిక్చర్స్ పతాకంపై గౌతమ్‌ నాయుడు దర్శకుడిగా పద్మజ నాయుడు నిర్మిస్తున్న చిత్రం చిత్రీకరణ పూర్తిచేసుకుని ఆడియో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలోని యాక్షన్‌ సన్నివేశాలను హీరో ఎటువంటి డూప్‌ లేకుండా చేశాడని దర్శకుడు పద్మజ నాయుడు పేర్కొన్నారు. పాత్ర కోసం మూడు నెలలుగా ఫిట్‌నెస్‌ ఏర్పాటు చేసుకున్నాడని, మంచి స్క్రిప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగిందన్నారు. త్వరలో ఈ చిత్రం విడుదల చేయనున్నామని తెలిపారు. 

నక్కపల్లి జాతీయ రహదారిపై లారీల బీభత్సం..

విశాఖపట్టణం : నక్కపల్లి జాతీయ రహదారిపై లారీలు బీభత్సం సృష్టించాయి. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొంది. దీనితో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు వెళ్లిన పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని మరో లారీ ఢీకొట్టింది. ఎస్ఐ ఆదిమూమర్తితో సహా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. వీరిని కేజీహెచ్ కు తరలించారు. 

07:17 - November 18, 2015

బాలీవుడ్‌లో నాకు ఆదరణ ఉన్నప్పుడు ఇక హాలీవుడ్‌కి ఎందుకెళ్తాను?, పైగా ఇన్నేళ్ళు హిందీలో డైలాగులు చెప్పి ఉన్నట్టుండి ఇంగ్లీష్‌లో డైలాగులు చెబితే అస్సలు బాగోద'ని బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ అంటున్నాడు. విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లోకి 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో' చిత్రం చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో సల్మాన్‌ పై విధంగా స్పందించారు. హాలీవుడ్‌ కంటే బాలీవుడ్‌ అంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడి ప్రేక్షకులు, అభిమానులు నన్ను అమితంగా ఇష్టపడుతున్నారని తెలిపారు. వారిని ఆనందం పరచడటం కోసం మరిన్ని మంచి చిత్రాల్లో నటిస్తానని సల్మాన్‌ చెప్పారు. ప్రస్తుతం సల్మాన్‌ 'సుల్తాన్‌' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

07:16 - November 18, 2015

'సుకుమార్‌ ప్రేమ కథలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఫీలింగ్స్, ఎమోషన్స్ రియాలిటీకి దగ్గరగా ఉంటాయి' అని హీరో రాజ్‌ తరుణ్‌ పేర్కొంటున్నారు. ఆయన హీరోగా నటించిన 'కుమారి 21 ఎఫ్‌' చిత్రం ఈనెల 20న విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం మీడియాతో ముచ్చటించారు. సుకుమార్‌ కథ అందించిన ఈ చిత్రం వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగ్గ చిత్రమిదని తెలిపారు. సెన్సార్‌ 'ఏ' సర్టిఫికేట్‌ ఇవ్వడంతో అడల్ట్ కంటెంట్‌ ఉన్న చిత్రమని చాలా మంది అంటున్నారని, ఇది అడల్ట్ చిత్రం కానే కాదు ఫ్యామిలీ అంతా చూడదగ్గ ఈ తరం ప్రేమకథా చిత్రమిదన్నారు. గత చిత్రాలతో పోల్చితే ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుందని, కథ, పాత్ర నాకు చాలా సంతృప్తినిచ్చాయన్నాడు. సినిమా అంతా హీరోయిన్‌ చుట్టూ తిరుగుతుందని, ని కథను హీరో నడిపిస్తాడన్నారని తెలిపారు. ఇందులో హీరోయిన్‌గా హేబా పటేల్‌ నటించిందని, ఆమె చాలా అద్భుతంగా యాక్ట్ చేసిందన్నారు. 

07:15 - November 18, 2015

'ఇప్పటివరకు సోనాక్షి సిన్హాను క్లాస్‌ పాత్రల్లోనే చూశారు. కాని 'ఫోర్స్ 2'లో మాత్రం క్లాస్‌కి భిన్నంగా రఫ్‌ అండ్‌ టఫ్‌గా కనిపించి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపర్చడం ఖాయమ'ని దర్శకుడు అభినయ్ దేవ్ పేర్కొంటున్నారు. ఇటీవల ఈ చిత్రం కోసం యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న తరుణంలో జాన్‌ అబ్రహంకి గాయలైన విషయం విదితమే. దీంతో కొంత కాలం షూటింగ్‌ వాయిదా పడింది. ఈ చిత్రానికి సంబంధించి ప్రోగ్రెస్‌ గురించి దర్శకుడు మీడియాకి వివరాలు తెలియచేశారు. 'ఫోర్స్ 2'లో డిఫరెంట్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నానని, ఇందులో జాన్‌ అబ్రహంకి పోటాపోటీగా సోనాక్షి పాత్ర ఉంటుందన్నారు. సోనాక్షి సైతం యాక్షన్‌ సన్నివేశాల్లో అద్భుతంగా నటించిందని కితాబిచ్చారు. ఇటువంటి యాక్షన్‌ సన్నివేశాల్లో సోనాక్షి ఇంత వరకు నటించలేదని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు జరిపిన షూటింగ్‌తో 70శాతం పూర్తయ్యిందని, మరో 30 శాతం షూటింగ్‌ను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అభినయ్ గతంలో 'ఢిల్లీ బెల్లి' చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. 'ఫోర్స్ 2' తర్వాత టెలివిజన్‌ సిరీస్‌ '24'కు దర్శకత్వం వహించనున్నారు.

07:14 - November 18, 2015

సహజత్వానికి దగ్గరగా వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించడంలో తమిళ దర్శకుడు బాలా తనకు తానే సాటి. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా బాలా తెరకెక్కించిన 'సేతు', 'నంద', 'పితామగన్‌', 'మాయావి', 'నాన్‌కడవల్‌', 'అవన్‌ ఇవన్‌', 'పరదేశీ', 'పిసాసు', 'చండివీరన్‌' తదితర చిత్రాలు విశేష ప్రేక్షకాదరణ పొందడంతోపాటు జాతీయ అవార్డుల్ని సైతం సొంతం చేసుకున్నాయి. బాలా ప్రస్తుతం శశికుమార్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన తారాగణంగా 'తరై తప్పట్టై' చిత్రాన్ని రూపొంది స్తున్నారు. దీని తర్వాత ఓ భారీ మల్టీస్టారర్‌ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ తాజా ప్రాజెక్ట్ కు సంబంధించి విశేషాలను ఆయనే స్వయంగా తెలియజేశారు. 'మన దేశాన్ని బ్రిటీష్‌ వాళ్ళు పరిపాలించిన నేపథ్యం ఇతివృత్తంతో అరవింద్‌స్వామి, ఆర్య, విశాల్‌, రానా దగ్గుబాటి, అథర్వ వంటి హేమాహేమీలతో ఓ చిత్రాన్ని త్వరలోనే రూపొందించబోతున్నాను. ఇంకా ఈ చిత్రానికి టైటిల్‌ నిర్ణయించలేదు' అని బాలా చెప్పారు.

 

07:13 - November 18, 2015

నయనానందకరం ఆమె రూపం. నటనానందకరం ఆమో నటన. అటు గ్లామర్ రోల్స్ లో నయా డ్రస్సులతో ఎట్రాక్ట్ చేసినా.... నార చీరలు కట్టి భక్తిపారవశ్యాన్ని ఒలికించినా..అమ్మడికే సొంతం. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నలిచిన ఈ కేరళ కుట్టి ఎవరో కాదు.. సౌత్ సూపర్ యాక్ట్రెస్ నయనతార. నేడు నయన్ బర్త్ డే.

కాంట్రవర్సీలతో డౌన్ ఫాల్..
కెరీర్ హిట్స్ వరకూ బాగానే ఉన్నాయి కానీ.. కాంట్రవర్సీలతో డౌన్ ఫాల్ మొదలైంది. అంతే కాదు.. సినిమా ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్ కూడా ఎప్పుడూ సిల్వర్ స్క్రీన్ కొత్తగా ఉండాలనే కోరుకుంటారు. అలా అప్ కమింగ్ హీరోయిన్లతో ఆఫర్లు తగ్గిపోతున్నప్పుడు తన కెరీర్ కు మళ్లీ బూస్టప్ తెచ్చుకుంది. 2010 లో నయన కెరీర్ సక్సెస్ పీక్స్ కు వెళ్లింది. సౌత్ మొత్తం హోల్ అండ్ సోల్ గా హిట్స్ తన అకౌంట్ లో వేసుకుంది. అబ్బాయ్ తో అదుర్స్ తో పాటు.. బాబాయ్ తో చేసిన సింహ.. బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో నయన ఫుల్ బిజీ అయిపోయింది. కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తున్నా.. తన క్రేజ్ తగ్గకుండా సినిమాలు చేస్తోంది. ఓన్లీ గ్లామర్ ఓరియంటెడ్ క్యారెక్టర్లే కాకుండా కెరీర్ లో నిలిచిపోయే పాత్రలతో ఆడియన్స్ ని అలరించింది నయనతార.

విఫలమైన ప్రేమలు..
శింబు, ఆర్య, ప్రభుదేవాలతో ప్రేమ.. ఆ తర్వాత పెళ్ళి వరకు వెళ్ళి ఆగిపోవడం జరిగాయి. ప్రభుదేవాతో సహజీవనం వివాదాస్పదంగా మారి కోర్టు వరకు వెళ్ళింది. తాజాగా దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమలోఉన్నట్టు ఇప్పటికే పలుమార్లు వార్తలొచ్చాయి. ప్రేమ, డేటింగ్‌, వివాహం తదితర అంశాల గురించి మీడియా నయనతారతో ప్రస్తావించినప్పుడు, 'ప్రేమ విఫలమైతేనే అసలు జీవితం ప్రారంభమవుతుంది' అని చెప్పారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో సార్లు ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఆత్మస్థయిర్యాన్నే ఆయుధంగా చేసుకుని ముందుకు సాగారు.
దాదాపు 12ఏళ్ళ కెరీర్‌లో 40కిపైగా చిత్రాల్లో నటించిన నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అరడజనుకి పైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపై కూడా మరిన్ని మంచి చిత్రాల్లో నటించి మరింత గొప్ప స్థాయికి నయనతార ఎదగాలని ఆశిద్దాం.

నెల్లూరు..కడప జిల్లాలో స్కూళ్లకు సెలవు..

హైదరాబాద్ : నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలక కారణంగా నేడు స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 

06:52 - November 18, 2015

ఆర్ బీఐ ని రక్షించండన్న నినాదంతో గురువారం 17వేల మంది భారత్ రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగులు సామూహికంగా సెలవుపెట్టబోతున్నారు. దీంతో రేపు ఒక్క రోజే దేశవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల విలువైన నగదు లావాదేవీలు నిలిచిపోయే అవకాశం వుంది. దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఇంత తీవ్ర ప్రభావం చూపే నిరసన కార్యక్రమానికి కారణం ఏమిటి? ఆర్ బీఐ కి ఇప్పుడు వస్తున్న ప్రమాదం ఏమిటి? భారత్ రిజర్వ్ బ్యాంక్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలేమిటి? అవి మన దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేయబోతున్నాయి? ఈ అంశాలపై జనపథంలో ఆల్ ఇండియా ఆర్ బీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి జి. క్రాంతి విశ్లేషించారు.

 

06:37 - November 18, 2015

భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో అత్యంత కీలక పాత్ర పోషించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహారాల్లో తలదూర్చేందుకు కేంద్రం వ్యూహరచన చేస్తోంది. ఆర్ బీ ఐ గవర్నర్ అధికారాలకు కత్తెర వేసే ప్రతిపాదనలకు తీవ్ర వ్యతిరేకత వస్తోంది. 1991, 1997, 2008, 2013 ఇవన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన మహా చెడ్డ సంవత్సరాలు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు చుట్టుముట్టిన గడ్డు రోజులు. కానీ , ప్రపంచాన్ని కుదిపేసిన ఇలాంటి ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొని నిలవగలింది మన భారత్. అగ్ర రాజ్యం అమెరికాలోని బ్యాంకింగ్ దిగ్గజాలే దివాలా తీసినా మన ప్రభుత్వరంగంలోని బ్యాంకింగ్ వ్యవస్థ చెక్కుచెదరలేదు. ఆయా సందర్భాలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాలే మనల్ని ఆర్థిక సంక్షోభాల నుంచి గట్టెక్కించాయంటూ అనేకమంది ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక నిపుణులు కితాబులిచ్చారు.

ఆర్ బీఐ కు కష్టకాలం..
అలాంటి ఆర్ బీఐ కే ఇప్పుడు కష్టకాలమొస్తోంది. దాని అధికారాలకు కత్తెరపడే ప్రమాదం ముంచుకొస్తోంది. ఇప్పటి దాకా స్వయం ప్రతిపత్తితో స్వతంత్రంగా వ్యవహరించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను తన గుప్పెట్లో పెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అధికారాలకు కత్తెర వేసేందుకు సిద్ధమవుతోంది. అసలు గవర్నర్ అనే పదాన్నే తొలగించి, చైర్ పర్సన్ అనే సంబోదించేందుకు వ్యూహరచన చేస్తోంది. ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి, అందులో నలుగురిని ప్రభుత్వమే నియమించుకుని, వారి ద్వారా ఆర్ బీఐని పూర్తిగా తన కంట్రోల్ లోకి తెచ్చుకునేందుకు పక్కాగా స్కెచ్ గీస్తోంది. ఆర్ బీఐ గవర్నర్ కున్న వీటో పవర్స్ ను కూడా రద్దు చేసేందుకు సిద్ధమవుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్వల్ప కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం తాను తీసుకునే నిర్ణయాలను బలపరిచే తోలుబొమ్మగా ఆర్ బీఐని మార్చేందుకు కేంద్రం పావులు కదుపుతోంది.

పలు నిర్ణయాల్లో కీలక పాత్ర...
కొన్నాళ్ల క్రితం కేంద్రం విడుదల చేసిన ఇండియన్ ఫైనాన్షియల్ కోడ్ ముసాయిదాలోని అసలు లక్ష్యం ఇదే. భారతదేశ పరపతి విధాన నిర్ణయాలలో రిజర్వ్ బ్యాంక్ దే కీలకపాత్ర. కరెన్సీలను ముద్రించడం, చలామణి చేయడం, అవసరాన్ని బట్టి నాశనం చేయడం, విదేశీ మార్కెట్ లో రూపాయి విలువను సురక్షితంగా వుంచడం లాంటి వ్యవహారాలు చక్కబెడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నగదు నిల్వలను డిపాజిట్ రూపంలో తన దగ్గర భద్రపరచడం, ప్రభుత్వం తరపున చెల్లింపులు చేయడం, రాబడులు వసూలు చేయడం, విదేశీ మారకద్రవ్య పత్రాలను నిల్వ చేయడం లాంటి కర్తవ్యాలను నిర్వర్తిస్తుంది. బ్యాంక్ లకు లైసెన్స్ లివ్వడం, వాటి వ్యవహారాల మీద ఓ కన్నేసి వుంచడం, నగదు నిల్వల నిష్పత్తులను నియంత్రించడం, వడ్డీ రేట్లను నిర్ణయించడం లాంటి బాధ్యతలన్నీ ఆర్ బీఐ చేతిలోనే వుంటాయి.

ఆర్ బీఐ స్వయం ప్రతిపత్తి..
తక్షణ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా భావించే ప్రభుత్వాధినేతలకు ఆర్ బీ ఐకుండే విస్తృత అధికారాలు మింగుడుపడకపోవడంలో ఆశ్చర్యం లేదు. ప్రభుత్వ ఒత్తిడికి ఆర్ బీఐ లొంగిపోయి, బాధ్యతారహితంగా నిర్ణయాలు తీసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలే ప్రమాదం వుంటుంది. స్వాతంత్ర్యానంతరం తొలితరం జాతీయ నాయకత్వం ప్రదర్శించిన విజ్ఞత ఆర్ బీఐ ని స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థగా తీర్చిదిద్దింది. దానిని కాపాడుకోవడానికే తాము సేవ్ ఆర్ బీఐ ఉద్యమం నిర్వహిస్తున్నట్టు ఆర్ బీఐ ఎంప్లాయీస్, ఆఫీసర్స్ అసోయేషన్స్ చెబుతున్నాయి. 

06:31 - November 18, 2015

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ జాతీయత, పౌరసత్వంపై రగడ జరుగుతోంది. రాహుల్‌ బ్రిటీష్‌ పౌరుడంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఆరోపణలపై కమలనాథులు, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు లండన్‌లో నమోదు చేసిన బ్యాకప్‌ కంపెనీకి ఇచ్చిన అడ్రస్ లో తన జాతీయతను బ్రిటీష్‌గా పేర్కొనడాన్ని బీజేపీ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీలో జరుగుతున్న తిరుగుబాటు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సుబ్రహ్మణ్యస్వామి.... రాహుల్‌ పౌరసత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులు విమర్శిస్తున్నారు.

బ్రిటీష్ పౌరుడన్న సుబ్రమణ్యం స్వామి...
రాహుల్‌ గాంధీ బ్రిటీష్‌ పౌరుడన్నది బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణ. దీనికి సంధించిన కొన్ని ఆధారాలను కూడా ఆయన సేకరించారు. రాహుల్‌గాంధీ లండన్‌లో రిజిస్టర్‌ చేసిన బ్యాకప్‌ లిమిటెడ్‌ కంపెనీకి ఇచ్చిన అడ్రస్‌లో బ్రిటీష్‌ జాతీయతను పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. బ్యాకప్‌ లిమిటెడ్‌ పేరుతో కంపెనీ రిజిస్ట్రేషన్‌ చేసిన కాపీని సేకరించిన సుబ్రహ్మణ్యస్వామి.... దీనిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పంపారు.

లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించలేదు...
తనను తాను బ్రిటీష్‌ జాతీయుడుగా ప్రకటించుకున్న రాహుల్‌గాంధీకి భారత్‌లో ఉన్న పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరారు. యూపీలోని అమేధీ నుంచి రాహుల్‌ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బ్రిటీష్‌ జాతీయుడుగా ఉన్న రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్‌ చేస్తున్నారు. 2003లో బ్రిటన్‌ లో నమోదు చేసిన బ్యాకప్‌ కంపెనీలో రాహుల్‌కు 65 శాతం వాటా ఉందన్నది ఆయన వాదన. అక్టోబర్‌ 31, 2006లో రాహుల్‌ దాఖలు చేసిన కంపెనీ ఆదాయ వ్యయ నివేదికలో కూడా బ్రిటీష్‌ జాతీయతను ప్రస్తావించిన విషయాన్ని ప్రధాని మోడీకి రాసిన లేఖలో సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేశారు. ప్రభుత్వ అనుమతిలేకుండా భారత ఎంపీలు విదేశాల్లో కంపెనీలు స్థాపించకూడదాన్నారు. లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో కూడా రాహుల్‌ ఈ వాస్తవాన్తని మరుగుపరిచారన్నది స్వామి వాదన. 2009లో కంపెనీ రద్దుకు రాహుల్‌ చేసిన దరఖాస్తులో కూడా బ్రిటీష్‌ జాతీయతను ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రాహుల్‌ భారత్‌లోనే పుట్టాడంటున్న కాంగ్రెస్‌..
అయితే రాహుల్‌ జాతీయత, పౌరసత్వంపై సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఆరోపణలు కాంగ్రెస్‌ తోసిపుచ్చింది. రాహుల్‌ భారత్‌లో పుట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బీహర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మతిపోయిన బీజేపీ నేతలు రాహుల్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నది కాంగ్రెస్‌ నాయకులు వాదన. ఈ పరాజయం తర్వాత బీజేపీలో మొదలైన తిరుగుబాటు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని చెబుతున్నారు. బీహార్‌ ఓటమి నిరాశ, నిస్పృహలతోనే బీజేపీ నాయకులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులు విమర్శిస్తున్నారు. 

06:27 - November 18, 2015

విశాఖపట్టణం : ఉద్యమం ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒత్తిడి తలవంచడానికి కారణమయ్యింది. ప్రాణభయం నిర్ణయాన్ని పక్కన పెట్టేలా పురిగొల్పింది. చివరికి నిర్ణయం మారే వరకు వచ్చింది. కాని అందులోనూ కన్నింగ్‌ కనబడుతోంది. మాటలతో మాయ చేసే వ్యూహం పురుడు పోసుకుంటోంది. బాక్సైట్‌పై టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న స్ట్రాటజీపై స్పెషల్‌ స్టోరీ...విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాల జీవోను నిలిపివేయాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటోంది. ఈ వార్త గిరిజనులకు ఏ మాత్రమూ సంతృప్తిని ఇవ్వడం లేదు. దీని వెనుక పెద్ద గూడు పుఠాణీయే ఉందని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి.

కొత్త వాదన...
జీవో అమలును నిలిపివేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రద్దు చేస్తామనే మాట మాత్రం చెప్పడం లేదు. దీని వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. గిరిజనులను ఒప్పించాలని సర్కార్‌ భావిస్తోంది. అభివృద్ధి అంటూ కొత్త వాదనను తెరమీదకు తెస్తోంది. బాక్సైట్‌ తవ్వకాలపై గిరిజనుల పెద్దలతోనూ, గిరిజన సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వన సంరక్షణ సంఘాలతోనూ అవగాహన కల్పించాలని నిర్ఱయించింది. ఈ చర్చల సారాంశాన్నే సాకుగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న గిరిజన సంఘాల వాయిస్‌నే వినిపించి...అదే అభిప్రాయాన్ని గిరిజనుల అందరికీ అంట గట్టే ప్రయత్నం జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఒప్పందాలన్నీ రద్దు చేయాలంటున్న గిరిజన సంఘాలు...
జీవో నిలిపివేస్తామంటూ ప్రభుత్వం ప్రకటన మాత్రం చేసింది. జీవో రద్దు విషయంలో పల్లెత్తు మాట అనడం లేదు. బాక్సైట్‌ రద్దు జీవోను విడుదల చేయడంతో పాటు గతంలో జరిగిన ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. బాక్సైట్‌ అంశంపై ప్రభుత్వం అంత ఈజీగా వెనక్కి తగ్గలేదు. గిరిజనులు పట్టు వదలకుండా పోరాటం చేశారు. విశాఖ మన్యంలోని టీడీపీ నేతలు అధినేతపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తామని బెదిరించారు. మావోయిస్టులతో ముప్పు ఉందని తమ గోడు చెప్పుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు అదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాటు బాక్సైట్‌ ఉద్యమాల వల్ల , వామపక్షాలు, వైసీపీలు బలపడతాయనే భయం టీడీపీ నేతలకు పట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

లేని క్లారిటీ...
ఇంటిలిజెన్స్ నివేదికలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. బాక్సైట్‌ తవ్వకాల వల్ల మావోయిస్టుల కార్యకలాపాలు పెరుగుతాయనే నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. గిరిజనుల మద్దతు మావోయిస్టులకు దొరికితే వారిని అదుపు చేయడం కష్టమని నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న సర్కార్‌...బాక్సైట్‌ తవ్వకాలపై చివరికి వెనక్కి తగ్గింది. జీవోను నిలపివేస్తామని ప్రకటించింది. కాని పూర్తి రద్దు విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. ఇదే ఇప్పుడు గిరిజనుల్లో పలు అనుమానాలను రేపుతోంది. 

06:23 - November 18, 2015

అనంతపురం : చిత్తూరు మేయర్‌ అనూరాధ హత్యోదంతం.. అనంతపురం జిల్లా పోలీసులను ఉలిక్కి పడేలా చేసింది. హత్యకు ఉపయోగించిన తుపాకిని... దుండగులు అనంతలోనే కొన్నట్లు చిత్తూరు పోలీసులు గుర్తించారు. దీంతో.. అనంతలో నాటు తుపాకుల తయారీదారుల గురించి జిల్లా పోలీసులు ఆరా తీయడం మొదలు పెట్టారు. ఫ్యాక్షన్‌ ప్రభావిత అనంతపురం జిల్లా.. ఇటీవలి కాలంలో... మారణాయుధాల తయారీ కేంద్రంగా మారింది. ఒకప్పుడు నాటు బాంబుల తయారీకే పరిమితమైన ముఠాలు.. ఇటీవలి కాలంలో.. తమ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ వస్తున్నాయి. కొద్ది కాలం క్రితం తపంచాలను విరివిగా తయారు చేసి.. విక్రయించిన ముఠాలు.. ఇప్పుడు అచ్చంగా కంపెనీ తయారీని తలదన్నే తుపాకులను తయారు చేయడం మొదలు పెట్టాయి.
అనంతపురం జిల్లాలో నాటు తుపాకుల తయారీ గురించి పోలీసుల వద్దా నిర్దిష్టమైన సమాచారం ఉంది. నెల క్రితమే.. జిల్లాకు చెందిన ఏడుగురు సభ్యుల ముఠాను.. పోలీసులు పక్కా సమాచారంతో అరెస్టు చేశారు. వారి నుంచి కొన్ని గన్స్ నూ స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ మేడ్‌ తుపాకులకు ఏమాత్రం తీసిపోని రీతిలో రూపొందించిన అక్రమాయుధాలను.. వాటి తయారీదారుల పనితనాన్ని చూసి పోలీసులే అబ్బుర పోయారు. శ్రీనివాసాచారి ముఠాను అరెస్టు చేయడంతో పోలీసులు రిలాక్స్ అయ్యారు. ఇదే తరహాలో మరెన్ని ముఠాలు ఆయుధాలను అక్రమంగా తయారు చేస్తున్నాయో ఆరా తీయలేక పోయారు. పైగా.. ముఠాల నుంచి ఆయుధాలు కొన్న వారి గురించిన సమాచారాన్నీ సేకరించలేక పోయారు. తాజాగా చిత్తూరు మేయర్‌ అనూరాధ హత్యకు వాడిన తుపాకిని... దుండగులు అనంతలోనే కొన్నట్లు తేలడంతో.. పోలీసులు హడావుడిగా అక్రమాయుధ తయారీ ముఠాల గురించి ఆరా తీస్తున్నారు. ఏదైనా ఘటనలు జరిగినప్పుడు హడావుడి చేయడం కాకుండా... ఇప్పటికైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. జిల్లాలో అసాంఘిక శక్తులను నిలువరించాలని అనంత వాసులు కోరుతున్నారు.

06:20 - November 18, 2015

చిత్తూరు : మేయర్ అనురాధ దంపతుల హత్యతో చిత్తూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అనుమానితులుగా భావిస్తున్న మేనల్లుడు చింటూ ఇళ్లు, ఆఫీసును తెలుగుదేశం కార్యకర్తలు ధ్వంసం చేశారు. జిల్లా అంతటా 144 సెక్షన్ విధించారు. మరోవైపు అనురాధా హత్యను సీఎం చంద్రబాబుతో సహా రాజకీయ పార్టీలన్నీ ఖండించాయి. ఇక కాపునాడు నేతలు నేడు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. మేయర్ మర్డర్ పట్ల ఆగ్రహంతో రగిలిపోయిన తెలుగుదేశం కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హత్యకు పథక రచన చేశాడని అనుమానిస్తున్న చింటూ ఆఫీసు, ఇంటిపై దాడి చేశారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.

జిల్లా అంతటా 144 సెక్షన్...
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జిల్లా అంతటా 144 సెక్షన్ విధించారు. ముఖ్యమైన సర్కిళ్లలో భారీగా పోలీసులు మోహరించారు.

ఖండించిన అన్ని రాజకీయ పార్టీలు..
అనురాధను హత్యను అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. మేయర్ దారుణ హత్య పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులు ఎంతటి వారైనా కఠిన శిక్ష తప్పదని అన్నారు. అనురాధా హత్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖండించింది. నిందితులను వెంటనే పట్టుకుని కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని కోరింది. అనురాధ హత్యను సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఖండించారు. హత్యపై పూర్తి విచారణ చేపట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇటువంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని మధు అన్నారు. చిత్తూరు మేయర్ హత్యను మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రత్యేక దర్యాప్తు బృందాలతో నిందితులను పట్టుకుని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

06:18 - November 18, 2015

చిత్తూరు : జిల్లాలో కాల్పుల కలకలం చెలరేగింది. పట్టపగలే దుండగులు చిత్తూరు నగర మేయర్, టీడీపీ నాయకురాలు కఠారి అనురాధను కాల్చి చంపారు. సందర్శకులతో పాటే కార్పొరేషన్‌ కార్యాలయంలోకి వచ్చిన దుండగులు.. తుపాకులతో పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన ఆమె భర్త మోహన్‌ వేలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
గ్రీవెన్స్ డే కావడంతో విజ్ఞానపత్రాలు ఇచ్చేందుకు జనంలో కలిసిపోయి.. బురఖాలు ధరించి వచ్చిన ముగ్గురు దుండగులు కత్తులు,తుపాకులతో అనురాధాతో పాటు ఆమె భర్త కఠారి మోహన్‌ లపై అటాక్ చేశారు. పాయింట్ రేంజ్‌ లో కాల్పులు జరిపారు. దీంతో అనురాధా అక్కడికక్కడే చనిపోయారు. అనురాధ భర్త మోహన్‌ను వేలూరు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మోహన్‌ కూడా మృతిచెందారు. కఠారి అనురాధ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నాయకురాలు. ఆమె భర్త మోహన్ కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. చంద్రబాబు ఆమె పార్టీ అభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తించి ఆమెకు నగర మేయర్‌గా అవకాశం ఇచ్చారు. అనురాధ హత్యతో చిత్తూరులో టీడీపీ శ్రేణులు శోక సంద్రంలో మునిగిపోయాయి. నేడు చిత్తూరు జిల్లా బంద్‌కు కాపునాడు నేతలు పిలుపునిచ్చారు.

06:08 - November 18, 2015

కరీంనగర్ : ధర్మపురి కూరగాయల మార్కెట్ లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మార్కెట్ లో ఉన్న దుకాణాల్లో 14 దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. భారీగా మంటలు ఎగిసిపడడంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. సుమారు రెండు గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ అప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దుకాణాల్లో ఉన్న వస్తు సామాగ్రీ పూర్తిగా కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న వ్యాపారస్తులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. తమ కళ్లెదుటే దుకాణాలు అగ్నికి ఆహుతై పోతుండడంతో తీవ్ర ఆవేదన చెందారు. సుమారు రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. పూర్తిగా నష్టపోయిన తమను సర్కార్ ఆదుకోవాలని వ్యాపారుస్తులు కోరుతున్నారు. 

భారీ వర్షాలతో ఉత్తరాదికి వెళ్లే 27 రైళ్ల రద్దు...

హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా నేడు తమిళనాడు, పుదుచ్చేరిల నుండి ఉత్తరాదికి వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. పట్టాలు పాడైనందున ఏపీ మీదుగా ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే 27 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. 

నేడు అంతర్జాతీయ వరి సదస్సు...

హైదరాబాద్ : వరిపై పరిశోధనలు, భవిష్యత్తు సవాళ్లు - వాటి పరిష్కారాలపై చర్చించేందుకు అంతర్జాతీయ వరి సదస్సును నిర్వహిస్తున్నట్లు ఐఐఆర్ఆర్ డైరెక్టర్ డాక్టర్. వి.రవీంద్ర బాబు పేర్కొన్నారు. ఐఐఆర్ఆర్ లో బుధవారం ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే సదస్సును కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించనున్నారు. 

నేటి నుండి హాంకాంగ్ ఓపెన్..

హాంకాంగ్ : నేటి నుండి హాంకాంగ్ ఓపెన్ జరుగనుంది. చైనా ఓపెన్ లో రన్నరప్ గా నిలిచిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ హాంకాంగ్ ఓపెన్ కు దూరమైంది. గాయం కారణంగా టోర్నమెంట్ నుండి వైదొలుగుతున్నట్లు సైనా ప్రకటించింది. దీనితో టోర్నీలో భారత ఆశలన్నీ యువ షట్లర్లు పీవీ సింధు, శ్రీకాంత్ లపైనే ఉన్నాయి.

నేడు కురుమూర్తి ఉద్దాల ఉత్సవం..

మహబూబ్ నగర్ : జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టానికి చేరుకున్నాయి. ఉద్దాల ఉత్సవం బుధవారం రాతిల్ర వైభవంగా జరుగనుంది. రెండువేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. 

నేడు కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్ రాక..

హైదరాబాద్ : పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనుంది. కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్ నేతృత్వంలోని కమిటీ బుధవారం ఉదయం హైదరాబాద్ కు రానుంది.

 

నేడు ట్రైబల్ సబ్ ప్లాన్ పై సమావేశం..

హైదరాబాద్ : ట్రైబల్ సబ్ ప్లాన్ పై బుధవారం సచివాలయంలో విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది. ఈసమావేశానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మిరా చందూలాల్ తో పాటు 36 శాఖల హెచ్ వోడీలు హాజరు కానున్నారు.

 

నేడు అశోక్ సింఘాల్ అంత్యక్రియలు...

ఢిల్లీ : విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) అధినేత అశోక్ సింఘాల్ అంత్యక్రియలు నేడు జరుగనున్నాయి. తీవ్ర అనారోగ్యం కారణంగా మూడు రోజులుగా గుర్గావ్ లోని వేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సింఘాల్ మంగళవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి సెంట్రల్ ఢిల్లీలోని ఆరెస్సెస్ కార్యాలయానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం బుధవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు అక్కడు ఉంచుతామని, ఆ తరువాత నిగంబోధ్ ఘాట్ లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని వీహెచ్ పీ నేత తొగాడియా పేర్కొన్నారు. 

మేయర్ అనురాధ భర్త మృతి..

చిత్తూరు: మేయర్ అనురాధ భర్త మోహన్ మృతి చెందారు. వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కన్నుమూశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు మేయర్ అనూరాధ మంగళవారం ఉదయం దారుణ హత్యకు గురైన విషయం విదితమే. అనూరాధను హత్య చేసిన దుండగులు ఆమె భర్త మోహన్ పై కూడా కత్తులతో దాడి చేసి పారిపోయారు. 

బందర్ రోడ్డులో మహిళా కానిస్టేబుళ్లను వేధించిన ఆకతాయిలు...

విజయవాడ : బందర్ రోడ్డులో మహిళా కానిస్టేబుళ్లను ఆకతాయిలు వేధించారు. వేధించిన ఆకతాయిలను పోలీసులకు మహిళా కానిస్టేబుళ్లు అప్పగించారు. కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

సహాయక చర్యలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన సీపీఎం...

విజయవాడ : వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కార్యకర్తలకు సీపీఎం పిలుపునిచ్చింది.

 

Don't Miss