Activities calendar

19 November 2015

21:31 - November 19, 2015

హైదరాబాద్ : పారిస్‌ దాడుల సూత్రధారిగా అనుమానిస్తున్న ఐఎస్‌ ఉగ్రవాది అబ్దెల్‌ హమీద్‌ అబ్బేద్‌ హతమైనట్టు ఫ్రాన్స్‌ ప్రభుత్వం ప్రకటించింది. బెల్జియంకు చెందిన అబ్బేద్‌ గత శుక్రవారం పారిస్‌ లో జరిగిన దాడులు, కాల్పుల కేసులో కీలక నిందితుడు. పారిస్‌ శివార్లలోని ఒక అపార్ట్‌మెంట్‌లో తలదాచుకున్న అబ్బేద్‌ ముఠాపై ఫ్రాన్స్‌ పోలీసులు బుధవారం దాడి చేశారు. భద్రతా దళాలకు చిక్కకుండా అబ్బేద్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. చనిపోయింది అబ్బేదా... కాదా.. అన్న విషయంలో అనుమానాలు తలెత్తాయి. అయితే పోలీసు దాడుల్లో మృతి చెందిందని అబ్బేదేనని ఫ్రాన్స్‌ ప్రాసిక్యూటర్‌ ప్రకటించారు. పోలీసులు కాల్పుల్లోనే అబ్బేద్‌ హతమయ్యాడని... అతని దేహంనిండా బుల్లెట్‌ గాయాలున్నాయని చెప్పారు. 

21:29 - November 19, 2015

హైదరాబాద్ : విశాఖపట్నం నగరం రెండవ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ వరల్డ్ కాంగ్రెస్‌కు వేదికగా నిలిచింది. విపత్తు నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేసిన ఈ ప్రపంచ సదస్సుకు దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు హాజరయ్యారు. నేటి నుంచి ఈ నెల 22 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. విపత్తు నిర్వహణకు సంబంధించి చంద్రబాబు మాట్లాడుతూ హుద్‌ హుద్ పెను తుఫాన్‌ను తాము ఎలా ఎదుర్కొన్నది ఉదహరించారు. ఈ సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడే కాకతాళీయంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో తుఫాన్‌ విరుచుకుపడడం బాధాకరంగా ఉందని బాబు అన్నారు.  

21:27 - November 19, 2015

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి సెవెన్త్‌ పే కమిషన్‌ తన నివేదికను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి సమర్పించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 16 శాతం పెంపును కమిషన్‌ సిఫార్సు చేసింది. అన్ని రకాల అలవెన్సులు కలిపి ఈ పెంపు 23.55 శాతంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం 18 వేలు ఇవ్వాలని తన నివేదికలో పేర్కొంది. గరిష్ట వేతనం 2 లక్షల 24 వేల రూపాయలుగా నిర్ణయించింది. కేబినెట్‌ సెక్రటరీ వేతనాన్ని రెండున్నర లక్షలకు పెంచింది. కమిషన్‌ నివేదికను కేంద్రమంత్రి వర్గం ఆమోదించిన తరువాత 2016, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. 

హైకోర్టును ఆశ్రయించిన 54 మంది ఏపీ రైతులు

హైదరాబాద్ :భూ సమీకరణలో పరిహారం అందలేదని 54 మంది ఏపీ రైతులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్ ను స్వీకరించిన హైకోర్టు రైతు నమ్మకంతో భూమిలిస్తే పరిహారం ఇవ్వారా అని ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

21:14 - November 19, 2015

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో మావోయిస్టులు అలజడి సృష్టించాలని భావిస్తున్నారా.? శృతి, సాగర్ ఎన్ కౌంటర్ల తర్వాత హెచ్చరికలు చేసిన మావోయిస్టులు.. ప్రతీకార చర్యగా ఓటింగ్ రోజును ఎంచుకున్నారా.? ఎలక్షన్స్ కు ఒక్క రోజు ముందు ఖమ్మంలో టీ.ఆర్.ఎస్ నాయకుల కిడ్నాప్...స్థానిక అగ్రనేత గాజర్ల అశోక్ అరెస్ట్, సుకుమా లో భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఏం జరుగుతుందోనని ప్రభావిత ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఖమ్మంలో ఆరుగురు టీఆర్ఎస్ నేతల కిడ్నాప్...

అన్ని పార్టీలు ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వరంగల్ ఉప ఎన్నికకు ఒక్క రోజు ముందు ముందు మావోయిస్టుల యాక్టివిటీ పెరిగింది. ఖమ్మంలో ఆరుగురు టీ.ఆర్.ఎస్ నాయకులను బందీలుగా పట్టుకున్నారు. తమ డిమాండ్స్ నెరవేర్చకుంటే ఖతం చేస్తామని హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా ఉత్తర తెలంగాణలో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఇటు ప్రభుత్వం, పార్టీ వర్గాల్లోనూ అలజడి పెరిగింది.

పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల అశోక్ ..........

భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల అశోక్ పోలీసులకు లొంగిపోయారు. అనారోగ్య కారణాలతో అశోక్‌ లొంగిపోయినట్లు సమాచారం. చిట్యాల మండలం వెలిశాల గ్రామానికి చెందిన అశోక్..దండకారణ్యం కార్యదర్శిగా పని చేస్తున్నాడు. మహారాష్ట్ర రాష్ట్ర కమిటి సభ్యుడిగా ఉన్నారు. ఆయన సోదరుడు గణేష్ కేంద్ర కమిటిలో సభ్యుడు. గతంలో మరో సోదరుడు సారయ్య ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. చిట్యాల, భూపాలపల్లి, ఘణపూర్, మండలాల్లో మావోయిస్టుల ప్రభావం ఉంటుందని పోలీసుల అంచనా.

ఎస్‌ఐబీ అదుపులో మావోయిస్టు అగ్రనేత జనార్దన్‌..........

ఇదిలా ఉంటే...మావోయిస్టు పార్టీ మరో అగ్రనేత జనార్ధన్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. వరంగల్ జిల్లా వెలిశాల జనార్ధన్ స్వస్థలం. జనార్దన్‌ను విడుదల చేయాలని విరసం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లా కొత్తగూడెం పోలీసులు ఎంటెక్‌ విద్యార్థి విజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌ కేసీఆర్‌ సభలో నిరసన తెలిపాడన్న కారణంతో విజయ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. విజయ్‌కు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు పోలీసులు. విజయ్‌ది కరీంనగర్‌ జిల్లా వేములవాడ. అతని తల్లిదండ్రులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయ్‌ను విడుదల చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

వరంగల్ ఎన్నికకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు-పోలీసులు................

వరంగల్ ఉప ఎన్నికకు ఒక్కరోజు ముందు తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై సర్వత్రా అలజడి రేకెత్తుతోంది. టీఆర్ఎస్ నేతల అరెస్టు, ఆదిలాబాద్ లో కాల్పులు, మావోయిస్టుల కీలక నేతల లొంగుబాట్లు, అంతు చూస్తామంటూ లేఖల విడుదల...వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వరంగల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మావోయిస్టుల అలికిడి పెరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. అయితే వరంగల్ ఎన్నికకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్టు పోలీసులు తెలిపారు. మావోయస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని వెల్లడించారు. ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని కొన్ని మండలాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఖమ్మం, వరంగల్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశారు.

తిరుపతి రైల్వేస్టేషన్‌లో బాంబు బెదిరింపు...

చిత్తూరు : తిరుపతి రైల్వేస్టేషన్‌లో బాంబు పెట్టినట్లు ఓ దుండగుడు డయల్ 100కు ఫోన్ చేసి చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్ స్కాడ్ సిబ్బందితో రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. కాగా మరోవైపు తిరుపతిలో మళ్లీ కుండపోత వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోలనలో ఉన్నారు.

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ : ముంబై నగరంలోని కాండివిలీ మురికి వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు అగ్నిప్రమాద యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త...

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు. వారి జీతభత్యాలు అమాంతంగా పెరగనున్నాయి. ఏకంగా 16శాతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచాలని ప్రతిపాదిస్తూ ఏడో వేతన సంఘం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి నివేదిక ఇచ్చింది. దీంతో 50 లక్షల మంది ఉద్యోగులకు, 54 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధిచేకూరనుంది. కొత్త వేతనం జనవరి 1, 2016 నుంచి అమలుకానుంది. మొత్తం 23.5శాతం జీతభత్యాలు పెరగనున్నాయి. కనీస వేతనం రూ.18 వేలు ఉండాలని కూడా వేతన సంఘం సిఫార్సు చేసింది.

చింటూ పాస్ పోర్టు సీజ్

చిత్తూరు : చిత్తూరు మేయర్ దంపతుల హత్యలో దర్యాప్తు వేగవంతం అయ్యింది. ఈ ఘటనలో కీలక నిందితుడు చింటూ పాస్ పోర్ట్ సీజ్ చేశారు. చింటూ బ్యాంక్ లావాదేవీలపై పోలీసులు నిఘా పెట్టారు. చింటూ కోసం ముంబై, బెంగళూరులో పోలీసులు గాంలిపు చేపట్టారు.

20:38 - November 19, 2015

హైదరాబాద్ : ఎవరిని నిందించాలి?... ఎవరిని శిక్షించాలి?..ఆ గుండె కోతకు ఎవరిని బాధ్యుల్ని చేయాలి? ప్రభుత్వాలనా?... అధికారులనా? లేక స్కూల్ యాజమాన్యాన్నా? స్కూల్ బస్ నుండి లిఫ్ట్ వరకు అడుగడుగునా చిన్నారులను రక్షస హస్తాలతో కలబళిస్తోంటే దానికి పరిష్కారం ఏమిటి? చిన్నారుల పట్ల విషవలయాలుగా మారుతున్న విద్యాలయాలపై నేటి వైడాంగిల్ లో ప్రత్యేక కథనం. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:33 - November 19, 2015

తూ.గో : ప్రాఫిట్‌ షూ కంపెనీ తన నూతన షోరూమ్‌ను కాకినాడలో ప్రారంభించింది. నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఈ షోరూం ను ప్రారంభించారు. ప్రాపిట్ షూ కంపెనీకి మొత్తం 101 బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటిల్లో కాకినాడ బ్రాంచ్‌కు ప్రత్యేకత ఉందని యాజమాన్యం తెలిపింది. కస్టమర్లు కోరుకున్న విధంగా డిజైన్లు తయారు చేస్తున్నామని తెలిపింది.

20:32 - November 19, 2015

హైదరాబాద్ : ఫాల్కన్‌ పంప్స్‌ తన నూతన షోరూమ్‌ను కూకట్‌పల్లిలో ప్రారంభించింది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు షోరూమ్‌ను ప్రారంభించారు. కూకట్‌పల్లిలో ఫాల్కన్‌ పంప్స్‌ షోరూమ్‌ను ఏర్పాటుచేయడం సంతోషకరమని కృష్ణారావు అన్నారు. వినియోగదారులకు నాణ్యమైన పంపుసెట్లను అందిస్తామని సంస్థ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్‌ వసంత్‌ తెలిపారు.

 

20:32 - November 19, 2015

హైదరాబాద్ : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య కుమారుడు దివంగత కాపు రఘు ఛాయా చిత్ర ప్రదర్శనను రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రభుత్వ సలహాదారులు రమణాచారి ప్రారంభించారు.రఘు జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు ఈ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటుచేయడం ఆనందంగా ఉందని రమణాచారి అన్నారు. రఘు ఆశయాలను ఆయన కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్లాలని, అందుకు అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 

20:31 - November 19, 2015

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె హత్యకు గురైనట్టు ఫోరెన్సిక్‌ పరీక్షల్లో తేలింది. ముంబై సరిహద్దులోని రాయ్‌గడలో అడవుల్లో లభ్యమైన మృదదేహం షీనా బోరాదేని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఫోరెన్సిక్‌ నిపుణులు నిర్ధారించారు. ఫోరెన్సిక్‌ నివేదికను ఎయిమ్స్‌ డాక్టర్లు సీబీఐ అధికారులకు అందజేశారు. దీని ఆధారంగా షీనా హత్య కేసులో ప్రధాన నిందితులైన ఆమె తల్లి ఇంద్రాణి ముకర్జియా, కారు డ్రైవర్‌ శ్యామ్‌వర్‌సింగ్‌ రాయ్‌, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్‌ ఖన్నాలపై ఛార్జిషీటు దాఖలు చేయాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు. దక్షిణ ముంబైలోని మెట్రోపాలిటన్‌ కోర్డులో నేరాభియోగపత్రం దాఖలు చేస్తారు. షీనా బోరా హత్య కేసుకు సంబంధించిన అన్ని వివరాలు, సాక్ష్యాలను దీనిలో పొందుపరుస్తారు. షీనా బోరాను హత్య చేయించినట్టు ఇంద్రాణి ముకర్జియా పోలీసులు విచారణలో గతంలోనే ఒప్పుకున్నారు. 

20:18 - November 19, 2015

హైదరాబాద్ : చిత్తూరు కార్పొరేషన్‌ మేయర్‌ అనూరాధ, ఆమె భర్త కటారి మోహన్‌ల అంత్యక్రియలు ముగిశాయి. జిల్లా టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున అంత్యక్రియలకు హాజరయ్యారు. కన్నీటితో తమ నేతలకు వీడ్కోలు పలికారు.

20:17 - November 19, 2015

గుంటూరు : అటు అధికార పార్టీ నేతలు దురుసుగా మాట్లాడతారు. ఇటు ప్రతిపక్ష పార్టీ నాయకులు...తామేంటో నిరూపించుకోవాలనుకుంటారు. ఇరు వర్గాల మధ్య నలిగిపోయేది మాత్రం అధికారులే. ఇరు పక్షాల నేతలు బాహాబాహీకి దిగి తిట్టుకుని చివరకు ఆ కోపాన్ని అధికారుల మీద చూపిస్తుండడంతో వాళ్లు తల్లడిల్లుతున్నారు. ఇందుకు గుంటూరు జడ్పీ సమావేశం వేదిక కాగా వైద్య శాఖకు చెందిన అధికారిణి ఒకరు కంటతడిపెట్టాల్సొచ్చింది. నేతలు వివిధ శాఖలపై సమీక్షిస్తున్న సమయంలో ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ బాపట్ల ఏరియా హాస్పిటల్‌ను వైసిపి నాయకులు తమ పార్టీ కార్యాలయంగా మార్చుకున్నారని ఆరోపించారు. దీంతో వైసిపి నేతలు తీవ్రంగా స్పందించారు. ఇలా వాగ్వాదం చిలికిచిలికి గాలివానలా మారి వైద్య అధికారిపై విరుచుకుపడడంతో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. 

రేపు నెల్లూరుకు చంద్రబాబు

విజయవాడ : నెల్లూరు లోని వరదలకు గురైన ముంపు మండలాల్లో, గ్రామాల్లో ఏపీ సీఎం చంద్రబాబు రేపు, ఎల్లుండి పర్యటించనున్నారు. వరద బాధితులను పరామర్శిస్తారు. అంతేకాకుండా భారీ వర్షాలకు నష్టపోయిన రైతన్నల పంటలను పరిశీలిస్తారు. ఎన్ని హెక్టార్లో పంట నష్టపోయింది. రైతన్నలు ఎంత మేరకు పంటలు నష్టపోయారనే విషయాన్ని జిల్లా అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. రేపు ఉదయం విజయవాడ నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరి వెళతారు.

నేపాల్ లో కంపించిన భూమి

నేపాల్ : ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపాల్ లో మరోసారి భూకంపం సంభవించింది. ఇవాళ సాయంత్రం సమయంలో నేపాల్ లోని పలు ప్రాంతాలు కంపిచినట్లు తెలిసింది. దీంతో ఒక్కసారిగా జనాలు అందరూ రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్టార్ స్కేలు పై భూకంప తీవ్రత 5.0 గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నాగర్ కోట్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు సమాచారం.

నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష...

హైదరాబాద్: రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల విధివిధానాల రూపకల్పన, అదేవిధంగా వాటర్‌గ్రిడ్‌పై సీఎం కేసీఆర్ పలువురు ఉన్నతాధికారులతో నేడు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వాటర్‌గ్రిడ్ పనుల్లో వేగం పెంచాలి. నీటి పారుదల ప్రాజెక్టుల రీడిజైన్ దాదాపు పూర్తయిందని, లైడార్ సర్వే నివేదిక వచ్చినందున కార్యాచరణతో ముందుకెళ్లాలని తెలిపారు. భూసేకరణ బిల్లుల చెల్లింపులో సరళ పద్ధతులు అవలంభించాలి. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం చేయొద్దని... వాటర్‌గ్రిడ్‌కు బడ్జెట్‌లో ఏటా రూ. 25 వేల కోట్లు కేటాయించనున్నట్లు సీఎం పేర్కొన్నారు.

7వ వేతన సంఘం నివేదిక సమర్పణ

ఢిల్లీ : 7వ వేతన సవరణ నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి జస్టిస్ మాథూర్ అందజేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనం 23% పెంపునకు ప్రతిపానదన, అలవెన్సులు 63శాతం పెంచాలని సిఫారసు, కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలని సిఫార్సు లు ఆ నివేదికలో ఉన్నాయి.

రాహుల్ గాంధీపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించండి'

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాన నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. బ్రిటన్ లో కార్పొరేట్ కంపెనీ పెట్టిన రాహుల్ అసలు భారతీయుడే కాదని ఇటీవల ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. బ్రిటన్ లోని కార్పొరేట్ కంపెనీ షెల్ కు రాహుల్ సెక్రటరీగా, డైరైక్టరుగా ఉండిఉండవచ్చని, ఈ నేపథ్యంలోనే ఆయనపై దర్యాప్తునకు ఆదేశించాలని ఆ లేఖలో కోరారు. రాహుల్ పై సీబీై లేదా ఈడీతో దర్యాప్తునకు ఆదేశించేందుకు తాను పొందుపరిచిన వివరాలు చాలని ప్రధానికి రాసిన ఆ లేఖలో సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు.  

19:50 - November 19, 2015

హైదరాబాద్ : వరంగల్‌లో అసలు కథ మొదలైంది. అలా ప్రచారం ముగిసిందో లేదో ఇలా మొదలెట్టేశారు. కరప్రతాలు పారేశారు. కరెన్సీ నోట్లు తెచ్చేశారు. అప్పుడే పంపకాలు ప్రారంభించారు. ఓటుకు రేటు కట్టేస్తున్నారు. ఓటరుకు గాలమేస్తున్నారు. అన్ని వ్యవహారాలు టెన్‌ టీవీ కెమెరాకు చిక్కాయి. ఓటరుకు డబ్బులు పంచుతుండగా టెన్‌ టీవీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

19:49 - November 19, 2015

హైదరాబాద్ : దేశంలోనే మావోయిస్టులకు కీలక ప్రాంతమైన ఛత్తీస్ గఢ్‌లో మరోసారి కాల్పులు హోరెత్తాయి. పచ్చని అడవుల్లో నెత్తురు పారింది. సుకుమా జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పుల్లో 15 మంది మావోయిస్టుల మృతి చెందారు.

బస్తర్ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం....

సుకుమా జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీస్థాయిలో కాల్పులు జరిగాయి. బస్తర్ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బీజీ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంలో పోలీసులు, కోబ్రాదళాలు గాలింపు చేపట్టాయి. ఇదే సమయంలో పోలీసు దళాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరువురి మధ్య ఫైరింగ్ ఓపెనైంది. భీకరంగా సాగిన కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు చనిపోయారు. మరికొందరు తప్పించుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలంలో భారీ ఎత్తున ఆయుధాలు, సాహిత్యం, డైరీలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నట్టు తెలిపారు.

19:46 - November 19, 2015

ఖమ్మం : జిల్లాలో టీఆర్ఎస్ నేతల కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. ఆరురుగు టీఆర్ఎస్ నేతలను మావోయిస్టులు కిడ్నాప్ చేయడంతో అలజడి రేగుతోంది. బూటకపు ఎన్ కౌంటర్లు నిలిపివేయాలని, దండకారణ్యంలో కూంబింగ్ ఆపాలని మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే టీఆర్ఎస్ నేతలను చంపేస్తామని హెచ్చరిస్తున్నారు. బందీలను ఎలా విడిపించాలన్న దానిపై ఇటు పోలీసులు, అటు ప్రభుత్వం తర్జనభర్జనపడుతున్నాయి. ఇటు బందీల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

చర్ల మండలం పూసుగుప్ప దగ్గర ఆరుగురు టీఆర్ఎస్ నేతల కిడ్నాప్ ....

కొంతకాలంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్య సాగుతున్న ఘర్షణాపూరిత వాతావరణం తీవ్రమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వివేక్, శ్రుతి,సాగర్ ల ఎన్ కౌంటర్ తో రగులుతున్న మావోయిస్టులు ప్రతీకార చర్యలు మొదలుపెట్టారు. నిన్న ఆదిలాబాద్ లో కాల్పులతో అలజడి సృష్టిస్తే....తాజాగా ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతలను బందీలుగా పట్టుకున్నారు. భద్రాచలం సమీపంలోని చర్ల మండలం పూసుగుప్ప దగ్గర ఆరుగురు టీఆర్ఎస్ నేతలను కిడ్నాప్ చేశారు మావోయిస్టులు. భద్రాచలం టీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్ మానె రామకృష్ణతో సహా ఆరుగురు నేతలను బందీలను చేసుకున్నారు. అంతా వరంగల్ ఎన్నికల హడావుడిలో ఉన్న నేపథ్యంలో ఈ కిడ్నాప్ వ్యవహారంతో ఒక్కసారిగా తెలంగాణలో కలకలం రేగింది.

టీఆర్ఎస్ నేతల కిడ్నాపును ధ్రువీకరిస్తూ లేఖ విడుదల చేసిన మావోయిస్టులు.....

టీఆర్ఎస్ నేతల కిడ్నాపును ధ్రువీకరిస్తూ లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి జగన్ పేరుతో విడుదలైన ఈ లేఖలో..టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మావోయిస్టు అజెండా అని ఎన్నికల్లో చెప్పుకున్న కేసీఆర్...అధికారంలోకి వచ్చాక బహుళజాతి కంపెనీలు, బూర్జువా, భూస్వామ్య వర్గాలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ పోలీసు రాజ్యం కొనసాగిస్తున్నారని విమర్శించారు.

మావోయిస్టుల డిమాండ్స్..........

టీఆర్ఎస్ నేతలను విడిచిపెట్టాలంటే తమ డిమాండ్లు నెరవేర్చాలని స్పష్టం చేశారు మావోయిస్టులు. అందులో ప్రధానంగా మూడు డిమాండ్లను ప్రస్తావించారు. మొదటి డిమాండ్...బూటకపు ఎన్ కౌంటర్లకు పాల్పడిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని వెంటనే ప్రకటన చేయాలి. రెండోది...ఖమ్మం నుంచి ఆదిలాబాద్ జిల్లా వరకు కూంబింగ్ ఆపాలి. మూడోది ఇక నుంచి ఎన్‌కౌంటర్లు, బూటకపు ఎన్‌కౌంటర్లలో ప్రజలను, మావోయిస్టు సభ్యులను, నాయకులను హత్య చేస్తే టీఆర్ఎస్ మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఒకరికి ఇద్దర్ని ఖతం చేస్తాం. ఇదీ మావోయిస్టుల చివరి హెచ్చరిక. ఈ డిమాండ్స్ కు ఒప్పుకోకపోతే తమ దగ్గర బందీలుగా ఉన్న వారిని ఖతం చేస్తామని హెచ్చరించారు మావోయిస్టులు.

కుటుంబ సభ్యుల ఆందోళన...........

టీఆర్ఎస్ నేతల కిడ్నాప్ తో తెలంగాణలో కలకలం రేగుతోంది. తమ వారి భద్రత పట్ల ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అటు బందీలను ఎలా విడిపించాలో తెలియక ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తర్జనభర్జనపడుతోంది. దూకుడిగా వెళితే బందీల ప్రాణాలకు ముప్పుందని భావిస్తున్నాయి. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. మొత్తానికి టీఆర్ఎస్ సర్కారుకు, మావోయిస్టులకు సాగుతున్న యుద్దం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆందోళన పెరుగుతోంది.

సాంస్కృతిక ప్రదర్శన శాలను ప్రారంభించిన ఏపీ సీఎం

విశాఖ : నగరంలో కైలాసగిరిపై నిర్మించిన తెలుగు సాంస్కృతిక ప్రదర్శన శాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉందని అన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరాదత్‌కు ఆయన అభినందనలు తెలిపారు. రాజధానిలోనూ మ్యూజియంకు స్థలం కేటాయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

చెన్నై మెట్రో ప్రయాణీకుల కోసం స్మార్ట్ కార్డులు

హైదరాబాద్ : తమిళనాడు రాజధాని చెన్నై లో మెట్రో రైళ్లలో ప్రయాణాలను ప్రోత్సహించేందకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ ఎల్) స్మార్ట్ కార్డుల్ని విడుదల చేసింది. తరచూ ప్రయాణాలు చేసే వారు ఈ కార్డులను వినియోగిస్తే సాధారణ ధర కంటే 20 శాతం తగ్గింపు ధరకే టిక్కెట్లు లభిస్తాయని తెలిపింది. అందూర్ - కోయంటేడు మార్గ మధ్యంలో ఉన్న ఏడు స్టేషన్లకూ ఇవి వర్తిస్తాయని చెప్పారు.

వేములవాడకు 100 పడకల ఆస్పత్రి మంజూరు..

కరీంనగర్ : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడలోగల ప్రభుత్వాసుపత్రి సామార్ధ్యాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు 30 పడకల ఆసుపత్రిగా ఉన్న వైద్యశాలను 100 పడకల ఆసుపత్రిగా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆసుపత్రి అభివృద్ధికి రూ. 22 కోట్లను కేటాయించింది. వీటితో ఆసుపత్రిలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌తోపాటు మైక్రో బయాలజీ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

పారిస్ దాడుల సూత్రదారి అబౌద్ హతం

హైదరాబాద్ : పారిస్ ఉగ్రదాడుల సూత్రధారి అబ్దుల్ అమీద్ అబౌద్ హతమైయ్యాడు. భద్రతా దళాలు చేపట్టిన నిన్నటి దాడుల్లో అబౌద్ మరణించాడు. సెయింట్ డెన్నిస్ అపార్ట్‌మెంట్‌లో అబౌద్ మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు అబౌద్ మృతిని ఫ్రాన్స్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

18:45 - November 19, 2015

హైదరాబాద్ : గొలుసు దొంగలపై హైదరాబాద్‌ పోలీసులు పట్టు బిగిస్తున్నారా? యాంటీ చైన్‌ స్నాచింగ్‌ టీమ్‌ ముప్పేట దాడితో స్నాచర్లు హడలెత్తిపోతున్నారా? బైకులపై దూసుకెళ్లే చైన్‌ స్నాచర్ల స్పీడ్‌కు రాజధాని పోలీసులు బ్రేకులు వేస్తున్నారా? గొలుసు దొంగలపై వరుస దాడులు, అరెస్ట్‌లు చూస్తే ఔననే అనిపిస్తోంది. చైన్లు తెంపి క్షణాల్లో మాయమయ్యే కేటుగాళ్ల తాట తీస్తున్నారు. కలుగుల్లో దాకున్నా వెతికి మరి పట్టుకుంటున్నారు. పకడ్బంధీ ఆధారాలతో కటకటాల్లోకి నెడుతున్నారు.

ఫలితాన్ని ఇస్తున్న పోలీస్‌ యాక్షన్‌ ......

హైదరాబాద్ ను వణికిస్తున్న చైన్ స్నాచర్లపై తీసుకుంటున్న పోలీస్ యాక్షన్ ఇప్పుడిప్పుడే ఫలితాలను ఇస్తుంది. ఎంతోకాలంగా సిటీలో పేట్రేగిపోతున్న ఫరూఖ్ గ్యాంగ్, ఇరానీ గ్యాంగ్స్ లోని నలుగురు సభ్యులను పట్టుకున్నారు. కూకట్ పల్లి, మల్కాజిగిరి ఏరియాల్లో వీళ్లు 46 చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడ్డారు. ఈ నలుగురు స్నాచర్స్ నుంచి కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

స్నాచర్లకు సహయపడ్డ పోలీస్‌ కటకటాల్లోకి .....

అరెస్టయిన వారిలో ఇద్దరు చైన్‌స్నాచర్లు, వారికి సహకరించిన ఓ కానిస్టేబుల్‌ ఉన్నాడు. నారాయణగూడ పీఎస్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌..2015 జూన్‌లో స్నాచర్లు మహ్మద్ అహ్మద్, మహ్మద్ ఫరూక్‌తో జతకట్టాడు. నారాయణగూడ పీఎస్‌లో అన్‌క్లైమ్‌డ్‌ బైక్‌ను వారికి అందించి చైన్‌స్నాచింగ్‌కు ఉసిగొల్పాడు. ఇద్దరు చైన్‌స్నాచర్లపై పలు కేసులు ఉన్నాయి. కానిస్టేబుల్ సహకారంతో సైబరాబాద్‌ పీఎస్‌పరిధిలో రెచ్చిపోయినట్లు విచారణలో తేలింది.

అంతర్‌ రాష్ట్ర ముఠాలపై నజర్‌ .....

అంతర్‌ రాష్ట్ర ముఠాలపై కన్నేసిన పోలీసులు వారికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. నిందితులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో పాటు బంధువుల వివరాలతో డేటాబేస్‌ తయారు చేస్తున్నారు. అదే సమయంలో లోకల్‌ గ్యాంగ్స్‌ వివరాలు రాబడుతున్నారు. యాంటీ చైన్‌ స్నాచింగ్‌ టీమ్‌ దాడులతో స్నాచర్లు వణుకుతున్నట్లు పోలీస్‌ బాసులు చెబుతున్నారు. ఈ విషయాన్నే నేరగాళ్లే అంగీకరిస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే 49 మంది స్నాచర్లపై పీడీ యాక్ట్‌ నమోదు చేసినట్లు చెబుతున్నారు. అదే సమయంలో దొంగ బంగారాన్ని కొనే ప్రైవేట్‌ ఫైనాన్స్ సంస్థలపైనా దృష్టిపెడుతున్నారు. వారిపై కూడా కఠినమైన కేసులు నమోదు చేస్తామని సిటీ కాప్స్‌ హెచ్చరిస్తున్నారు.  

18:42 - November 19, 2015

ఆదిలాబాద్‌ : జిల్లాలో ఆశ కార్యకర్తల సమ్మె ఉధృతంగా సాగుతోంది. గత రెండు నెలలుగా సమ్మెచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆశా కార్యకర్తలు కలెక్టరేట్‌ ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించేవరకు దీక్ష ఆపబోమని ఆశా కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. 

18:41 - November 19, 2015

విజయవాడ : వచ్చే నెల నుంచి పోలీస్‌శాఖ కార్యకలాపాలను మంగళగిరి నుంచి కొనసాగిస్తామని ఏపీ డీజీపీ రాముడు తెలిపారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్‌లో టెక్నోటవర్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ నెలాఖరుకు బెటాలియన్ ఆవరణలో డీజీపీ క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. 

18:39 - November 19, 2015

నల్గొండ : పేదోడి బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నవారి అంతు తేలుస్తున్నారు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అధికారులు.. ఏ ఒక్కరూ జారిపోకుండా పక్కా ప్లానింగ్‌ వేసి ఆధారాలతో సహా పట్టుకుంటున్నారు.. నల్లగొండ జిల్లాలో అవినీతి అధికారుల భరతం పడుతూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు..

టాస్క్‌ఫోర్స్ దాడులు అధికారుల్లో గుబులు.....

నల్లగొండ జిల్లాలో టాస్క్‌ఫోర్స్ దాడులు ప్రజా పంపిణీ అధికారుల్లో గుబులు పుట్టిస్తున్నాయి.. ఐదురోజులపాటు చేసిన తనిఖీల్లో అంతులేని అక్రమాలు బయటకొచ్చాయి.. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా అక్రమార్కుల అంతు తేలుస్తున్నారు ఈ అధికారులు.. రూపాయికి కిలో బియ్యం రీసైక్లింగ్‌పై 20రోజులక్రితం సమావేశం ఏర్పాటుచేశారు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సత్యనారాయణ... అక్రమార్కుల దుమ్ము దులిపేందుకు పక్కా స్కెచ్‌ వేశారు..

9మంది తహశీల్దార్లలో టాస్క్‌ఫోర్స్..

ఈ అక్రమ దందాల గుట్టు తేల్చేందుకు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు జాయింట్‌ కలెక్టర్... జిల్లాలో ఉత్తమ అధికారులుగా గుర్తింపు పొందిన 9మంది తహశీల్దార్లను లీడర్లుగా నియమించారు.. మరికొందరు డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్ఐలతో బృందాలు ఏర్పాటు చేశారు.. దాడుల సమయంలో ఎవ్వరూ తప్పించుకోకుండా ఆధారాలతో సహా ఎలా పట్టుకోవాలో వీరికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.. క్రిమినల్‌ కేసుల నమోదు.... మెటీరియల్‌ సీజ్‌పై నిపుణులతో సూచనలు ఇప్పించారు.. ఇలా అన్ని అంశాలపై రాటుతేలిన బృందాలు  ఎలా ముందుకు వెళ్లాలో పక్కా ప్లాన్ వేసుకున్నాయి..

రైస్‌మిల్లులు, రేషన్‌షాపులు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్లపై దాడులు....

ఏ రోజు, ఎక్కడ దాడులు చేస్తున్నారన్న సమచారాన్ని చాలా రహస్యంగా ఉంచాయి బృందాలు.. ఇలా రైస్‌మిల్లులు, రేషన్‌షాపులు, ఎంఎల్ ఎస్ పాయింట్లపై హఠాత్తుగా దాడులు చేశారు.. 50 మిల్లుల్లో తనఖీలు చేయగా ఐదింటిలో అక్రమ నిల్వలున్నాయని తేలింది.. ఇందులో మూడున్నల కోట్ల విలువైన బియ్యం సీజ్‌ చేశారు.. తిరుమలగిరిలోని సంతోష్ రైస్‌ మిల్లు, భువనగిరిలో కన్యకాపరమేశ్వరి రైస్‌ మిల్లు, నాంపల్లిలోని రామలింగేశ్వర రైస్‌ మిల్లు, మాడ్గులపల్లి ధనలక్ష్మి మిల్లు, గుమ్మడవల్లి వెంకటేశ్వర మిల్లులో అక్రమాలు జరిగాయని గుర్తించారు..

నాలుగు గోదాముల్లో సరుకులు, బియ్యం రికార్డుల్లో తేడాలు......

ప్రభుత్వం చౌకధర దుకాణాలకు సరుకులు సరఫరాచేసే మండలస్థాయి ప్లేస్‌లను ఎంఎల్ ఎస్ పాయింట్లు అంటారు.. ఇక్కడే సరుకులు పక్కదారి పడుతున్నాయని అధికారులు భావించారు..అకస్మికంగా అన్ని మండల గోదాములను తనిఖీలు చేశారు.. నాలుగు గోదాముల్లో సరుకులు, బియ్యం రికార్డుల్లో తేడాలున్నాయని నిర్ధారించారు.. వెంటనే ఇంచార్జ్‌లను సస్పెండ్ చేశారు.. ఇలా నల్లగొండ గోదాం ఇంచార్జ్ మత్రూ నాయక్‌, నాంపల్లిలో ఆంజనేయులు, మిర్యాలగూడలో దేవదాస్‌, కోదాడ గోదాం ఇంచార్జ్ జ్యోతిలపై సస్పెన్షన్ వేటుపడింది.. మిగిలినవారికి మెమోలు జారీచేశారు..

13 షాపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించిన అధికారులు.....

సాధారణంగా ప్రభుత్వ రేషన్‌ షాపుల్లో సరుకులను ప్రతి నెలా 13లోపు వినియోగదారులకు పంపిణీ చేయాలి.. ఆ తర్వాత మిగిలినవాటి వివరాలను పౌరసరఫరాల శాఖకు తెలియజేయాలి.. దీనిపైకూడా టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక దృష్టిపెట్టింది.. డైరెక్టుగా చౌకధర దుకాణాలపై దాడులు జరిపింది.. 13 షాపుల్లో వివరాలు తేడాగా ఉన్నాయంటూ.. డీలర్లపై కేసులు నమోదుచేశారు.. ఇలా జిల్లావ్యాప్తంగా 21మందిపై కేసులు పెట్టారు.. ఇక నిత్యావసరవస్తువులు అక్రమంగా నిల్వచేస్తున్న ఓ వ్యాపారసంస్థలో తనిఖీలు చేశారు.. 85వేల రూపాయల విలువైన సరుకులు సీజ్ చేశారు.. ఈ తనిఖీలు ముందు ముందుకూడా కొనసాగుతాయని జిల్లా అధికారులు చెబుతున్నారు.. ఇలా వరుస దాడులతో అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు టాస్క్‌ఫోర్స్ అధికారులు.. ఈ బృందంపై జిల్లావ్యాప్తంగా ప్రశంసలొస్తున్నాయి..

18:35 - November 19, 2015

హైదరాబాద్ : బీహార్‌ ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం నితీశ్‌ ప్రమాణస్వీకారానికి దూరంగా ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తరుపున పార్లమెంటురీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్‌ప్రతాప్‌ రూడీ హాజరు కానున్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.... నితీశ్‌ ప్రమాణ స్వీకారానికి రానునున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు పాట్నా గాంధీ మైదానంలో ప్రమాణం ..

బీహర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జేడీయూ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమయ్యింది. ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌ శుక్రవారం ప్రమాణస్వీకారం చేస్తారు. పాట్నాలోని గాంధీ మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి మానెక్‌ సర్కార్‌ను కూడా నితీష్‌ ఆహ్వానించారు.

నితీశ్‌ను అభినందించిన ప్రధాని మోదీ.......

నితీశ్‌ కుమార్‌... స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్‌ చేసి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని కోరారు. అయితే మోదీ మాత్రం ఏ విషయం చెప్పకుండా అభినందనలతో ముంచెత్తారు. ఈనెల 8న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా మోదీ.... జేడీయూ నేత నితీశ్‌ ను అభినందించారు. కేంద్ర ప్రభుత్వం తరుపున మంత్రి వెంకయ్యనాయుడు, రాజీవ్‌ప్రతాప్‌ రూడీ హాజరుకానున్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌లను కూడా నితీష్‌ ఆహ్వానించారు.

వివిధ పార్టీల నేతలకు ఫోన్‌ చేసి ఆహ్వానించిన నితీశ్‌ ....

ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలంటూ నితీష్‌కుమార్‌ చాలామంది ముఖ్యమంత్రులతోపాటు, వివిధ పార్టీల నేతలకు స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, అసోం సీఎం తరుణ్‌ గొగోయ్‌, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.... నితీశ్‌ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖలేష్‌ యాదవ్‌, ఉత్తరాఖండ్‌ సీఎం హరీష్‌ రావత్‌ కూడా హాజరయ్యే అకాశం ఉందని భావిస్తున్నారు.

ఎస్‌పీ ఎంపీ, లాలూ అల్లుడు తేజ్‌ ప్రతావ్‌ యాదవ్‌.......

సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌, ఆ పార్టీ ఎంపీ... ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌యాదవ్‌ అల్లుడు తేజ్‌ ప్రతాప్‌ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు, పంజాబ్‌ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌, ఎన్డీయే మంత్రిపక్షమైన శివసేన అధినేత ఉద్దవ్‌ థాకరే తురుపున ఆయన ప్రతినిధులు సుభాష్‌ దేశాయ్‌, రాందాస్‌ కదమ్‌ హాజరు కానున్నారు. పాట్నా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ అసంతృప్తి ఎంపీ షాట్‌గన్‌ శతృఘ్న సిన్హా ... కూడా నితీశ్‌ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశం ఉంది.

 

కిడ్నాప్ కు గురైన బాలుడు క్షేమం

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బుధవారం కిడ్నాప్ కు గురైన బాలుడు నాగచైతన్య సురక్షితంగా బయటపడ్డాడరు. కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి కాసేపట్లో నిందితుడిని మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం.

రాబోయే 24 గంటల్లో కోస్తాకు వర్ష సూచన...

విజయవాడ : రాబోయే 24 గంటల్లో కృష్ణా జిల్లా నాగాయలంక, గుంటూరు జిల్లా రేపల్లె పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరుగా, రాయలసీమ, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విప్తత్తు నిర్వహణ శాఖ తెలిపింది. రక్షణ, సహాయ చర్యల కోసం 41 నెల్లూరుకు బోట్లను పంపామని, నెల్లూరులో 8, చిత్తూరులో రెండు ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయని ఆ శాఖ తెలిపింది.

ఫ్రాన్స్ లో ఎమర్జెన్సీ మూడు నెలలు పొడిగింపు..

హైదరాబాద్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఎమర్జెన్సీని మరో మూడు నెలలు పొడిగించారు. అదే సమయంలో ఫ్రాన్స్‌పై జీవ రసాయన ఆయుధాలతో దాడులు జరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమర్జెన్సీని పొడిగించారు. ఫ్రాన్స్‌కు ప్రమాదం ఇంకా తొలగిపోలేదని హొలాందే ప్రభుత్వం భావిస్తోంది.

బీహార్ డిప్యూటీ సీఎంగా లాలూ కుమారుడు!

హైదరాబాద్ : బీహార్ డిప్యూటీ సీఎం గా లాలూ కుమారుడు తేజస్వీ నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

17:44 - November 19, 2015

కమల్‌హాసన్‌ హీరోగా నటించిన 'చీకటి రాజ్యం' చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రం విజయవంతం కావాలని కమల్ ఆశిస్తున్నారు. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై... కమల్ సోదరుడు చంద్రహసన్ నిర్మిస్తున్నారు. కమల్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న రాజేశ్.ఎమ్.సెల్వ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మరో కీలకపాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తుండగా.. గతంలో 'మన్మథ బాణం' చిత్రంలో కమల్ తో కలసి నటించిన త్రిష.. మరోసారి ఈ సినిమాలో కమల్ కు జంటగా కనిపించబోతోంది. కిషోర్, సంపత్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ నార్కొటిక్స్ సెంట్రల్ బ్యూరో వింగ్ కు చెందిన ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నార్కోటిక్స్ ప్రపంచంలోని కొందరు వ్యక్తులు తన కుమారుడుని కిడ్నాప్ చేస్తే ఎలా వారిని ఎదుర్కొని, వెనక్కి తెచ్చుకున్నాడనే కథాంశంతో నడుస్తుందని టాక్. కమల్ విలక్షణ శైలికి అనుగుణంగా అద్భుతంగా ట్రైలర్ ఉందని కమల్ అభిమానులు పేర్కొంటున్నారు. సస్పెన్స్‌తో కూడిన ఓ థ్రిల్లర్‌లా ఈ మూవీ ఉండనున్నట్లు ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. మరి ఈ చిత్రం విజయవంతమైందా ? లేదా ? అనేది కొద్ది గంటల్లో తెలిసిపోతుంది. 

17:40 - November 19, 2015

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ను 150 మున్సిపల్ డివిజన్లు గా విభజిస్తూ తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వార్డుల పునర్విభజన ముసాయిదాపై 635 ఫిర్యాదులు, 65 సలహాలను స్వీకరించింది. ఫిర్యాదులు, సలహాలను పరిగణలోకి తీసుకుని వార్డులు, సరిహద్దులను మార్పు చేసింది. 38 సలహాలు, ఫిర్యాదుల్ని పాక్షికంగా పరిగణలోకి తీసుకుంది.

17:40 - November 19, 2015

హీరోలు..హీరోయిన్ ల వివాహాలపై అభిమానులు ఆసక్తి కనబరుస్తుంటారు. ఇటీవలే ప్రభాస్ వివాహానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అక్కినేని నాగార్జున తనయుడు 'నాగ చైతన్య' వివాహానికి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్‌ లో తనకంటూ ఓ స్టైల్‌ ని ఏర్పరచుకుని తనదైన గుర్తింపుతో వరుస సినిమాలు చేస్తున్న యంగ్ హీరో నాగచైతన్య. దాదాపు 10 సినిమాలలో నటించిన నాగచైతన్య ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంభందించిన అధికారిక ప్రకటన నాగ చైతన్య బర్త్ డే (నవంబర్ 23న ) రోజున ప్రకటన చేయనున్నారని సమాచారం. ఇంతకీ ఎవరా అమ్మాయని ఫిల్మ్ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

150 మున్సిపల్ డివిజన్లుగా జీహెచ్ ఎంసీ

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ను 150 మున్సిపల్ డివిజన్లు గా విభజిస్తూ తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

17:39 - November 19, 2015

భారీ బడ్జెట్ సినిమాలు ఎవరు తీస్తారు ? అంటే ఠక్కున 'శంకర్' పేరు చెబుతారు. తాజాగా ఆయన 'రోబో -2' సినిమాను తీయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకి బడ్జెట్ రూ.260 కోట్లు గా నిర్ణయించినట్లు టాక్. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ ని కూడా ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో 'రజనీకాంత్' హీరోగా నటిస్తున్నారు. హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ విలన్ పాత్రలో నటింప చేయాలని 'శంకర్' ప్రయత్నాలు చేస్తున్నారంట. ఆయనకు పారితోషికంగా 100 కోట్లు కూడా ఇచ్చేందుకు అంగీకరించారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

17:38 - November 19, 2015

ముఖంపై మచ్చలు తొలగించుకోవడానికి ఏవోవే క్రీమ్స్ వాడుతూ ముఖాన్ని కొంతమంది పాడు చేసుకుంటుంటారు. వీటిని తొలగించడానికి కొన్ని టిప్స్...
అరకప్పు పాలు తీసుకుని అందులో రెండు చెంచాల ఓట్స్ వేసి బాగా మరిగించాలి, చల్లారాక మెత్తని ముద్దగా చేసి, కొంచెం పెరుగు కలిపి ఒక అరగంట ఫ్రిజ్ లో పెట్టాలి. తరువాత ముఖానికి పూతలా వేసుకుని, కొంచెంసేపయ్యాక చన్నీళ్ళ తో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం పై మచ్చల సమస్య తగ్గుతుంది. పుదీనా ఆకుల్ని మెత్తగా చేసి దానిలో అర టీ స్పూను నిమ్మరసం, టీ స్పూను ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించి మర్దన చేసుకుని, తరువాత నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే నల్ల మచ్చలు దూరమవుతాయి. దాల్చిన చెక్క పొడిలో కొంచెం తేనె కలిపి రాత్రి పడుకునే ముందు ముఖం పై మొటిమలు, మచ్చలూ ఉన్న చోట రాసి, మర్నాడు ఉదయం గోరు వెచ్చటి నీటితో కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది. పచ్చి పాలలో కాస్త నిమ్మరసం కలిపి రాత్రి పడుకునే ముందు ముఖం తుడుచుకోవాలి. తరువాత ఐదు నిమిషాలు ఆగి, ఎర్ర చందనం పొడిలో నాలుగు చుక్కల రోజ్ వాటర్ కలిపి ముఖానికి పూతలా వేసుకుని ఉదయాన్నే చల్లటి నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మ సమస్యలు తగ్గుతాయి.

17:37 - November 19, 2015

శీతాకాలం వచ్చేసింది. ఈ చలికాలంలో ప్రధానంగా జలుబు సమస్యను ఎదుర్కొంటుంటారు. ఇందుకు ఏవోవో మందులు వాడుతుంటారు. కానీ ఇంట్లోనే సామాన్యంగా దొరికే చిన్న చిన్న వాటితోనే జలుబును తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు..

 • జలుబును తగ్గించడంలో తులసి చాలా బాగా పనిచేస్తుంది. గుప్పెడు తులసి ఆకులు, చిటికెడు రాళ్ల ఉప్పును కలపాలి. ఇది నమిలి మింగాలి. తులసి టీ తాగినా కూడా జలుబును తగ్గించుకోవచ్చు.
 • వేడిపాలల్లో చిటికెడు పసుపును వేసికుని త్రాగాలి. రాత్రి పడుకొనే ముందు తాగితే ఉపయోగం.
 • రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క..మారి దాల్చిం చెక్క వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడగట్టి దీనికి కొద్దిగా తేనేను కలిపి త్రాగితే మంచిది.
 • ప్రతి రోజు నీటిని బాగా మరగబెట్టి చల్లార్చి తాగితే జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
 • పాలలో జాజికాయ, అల్లం, కుంకుమ పువ్వు కలుపుకుని ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత నీరు సగానికి వస్తే గోరువెచ్చగా ఉన్నప్పుడే సేవించండి. దీంతో జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.
 • ఏడు- ఎనిమిది మిరియాలు నెయ్యిలో వెంచుకుని తినాలి. ఆ తర్వాత గోరు వెచ్చని పాలను సేవించాలి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గుముఖం పడుతుంది.
 • తమలపాకు రసంలో లవంగాలు, అల్లం రసాన్ని తేనెలో కలుపుకోవాలి. 
   
17:36 - November 19, 2015

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'సర్ధార్ గబ్బర్ సింగ్' వేగంగా షూటింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కట్టుదిట్టంగా షూటింగ్ ను జరుపుతున్నారు. చిత్రానికి సంబంధించిన విషయాలు బయటకు పొక్కనీయడం లేదు. కానీ 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి సంబంధించిన డైలాగ్స్ కొన్ని బయటకు లీకైనట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ డైలాగ్ లు…

 • మీలాంటి బంది పోట్లకు లెక్కతో చెబితే తలకి ఎక్కదురా..అందుకే నా తిక్కతో చెప్పాలని వచ్చా.
 • రేయ్..నేను స్కై లోని స్టార్ ను కాదురా..రాత్రి వచ్చి వెళ్లి పోవడానికి..ఫ్యాన్స్ లోని ఫైర్..గబ్బర్ సింగ్ 24 గంటలు ఫుల్ పవర్..ఆ..
 • రేయ్ హౌలే..నేను ఏమైనా గుర్రాన్ని అనుకున్నావా బే..సవాల్ చేయడానికి సింహాన్ని..
 • నా తిక్కకు ఓ లెక్కుంది..కానీ నా స్టామినాకు కాదు రోయ్..
 • పవర్ ని వాడుకో బాగుపడుతావ్..ముట్టుకోవాలనుకోకు చచ్చిపోతావ్..
 • నన్ను అందరూ టార్గెట్ చేసినా...నా టార్గెట్ మాత్రం జనం. వాళ్లను నవ్వించాలని అన్నా..నడిపించాలని అన్నా..నేనే ముందుకు వస్తా..
 • నేను అందరితో కలువ..అందరినీ నాతో కలుపుకుంటా..

నిజంగా ఈ డైలాగ్ లు ఆ చిత్రంలోనివా ? కాదా ? అనేది తెలియాలయంటే చిత్రం విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.....

 

17:35 - November 19, 2015

కోలీవుడ్ స్టార్ 'ధనుష్' తాజా చిత్రం 'తంగ మగన్' ఫస్ట్ లుక్ విడుదలైంది. వేల్‌రాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు. ధనుష్‌ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. 'సమంత', 'అమీ జాక్సన్' హీరోయిన్స్ గా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇద్దరు భామలతో 'ధనుష్' రొమాంటిక్ మూడ్ లో ఉన్న స్టిల్స్ తో పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో నటి రాధిక, దర్శకుడు కె.ఎస్‌ రవికుమార్‌ ధనుష్‌కు తల్లిదండ్రులుగా నటిస్తున్నారు. ఈనెల 26వ తేదీన పాటలు విడుదల కానున్నాయి. ఇప్పటివరకు తాను నటించిన చిత్రాల్లో 'తంగ మగన్‌' చాలా ప్రత్యేకమని అంటున్నారు సమంత. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో ఓ మంచి పాత్రను పోషించాను. నా పాత్రతోపాటు ధనుష్‌, అమీజాక్సన్‌ల పాత్రలు సైతం వైవిధ్యంగా ఉంటాయి. కథలో భాగంగా పాత్రల తీరు తెన్నులు సహజత్వానికి దగ్గరగా ఉంటాయని సమంత తెలిపింది. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈచిత్రం క్రిస్మస్‌ కానుకగా విడుదల కానుందని సమాచారం. ఇదిలా ఉంటే, ధనుష్‌ సరసన సమంత మరో చిత్రంలో నటించేందుకు అంగీకరించింది. వెట్రిమారన్‌ దర్శకత్వంలో రూపొందబోయే 'వడ చెన్నై'లో సమంత స్లమ్‌ ఏరియాకి చెందిన డిగ్లామర్‌ పాత్రలో నటించనుంది.

17:34 - November 19, 2015

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర ఎన్ జేసీఏ ఆధ్వర్యంలో మహా ధర్నా జరిగింది. రైల్వే, రక్షణ, బ్యాంకింగ్, తపాల శాఖలకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలలో ఎఫ్‌డీఐలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల డిమాండ్లకు సానుకూలంగా స్పందించకపోతే నిరవధిక సమ్మె చేపడతామని ఎన్ ఎఫ్ ఐఆర్ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య హెచ్చరించారు. 

17:33 - November 19, 2015

సల్మాన్ ఖాన్....బాలీవుడ్ కండల వీరుడు. ఆయన నటించే చిత్రం వందల కోట్ల క్లబ్ లో చేరిపోవాల్సిందే. స్టార్స్ అందరూ వందల కోట్ల క్లబ్ లో చేరాలని ఆతృత పడుతుంటే సల్లూ భాయ్ మాత్రం మంచినీళ్లు తాగినంత సులువుగా వందల కోట్ల క్లబ్ లో చేరిపోతున్నాడు. బాలీవుడ్ బాక్స్ ఆఫ్ కింగ్ ఎవరు అని బాలీవుడ్ ప్రేక్షకులను ప్రశ్నిస్తే ఠక్కున 'సల్మాన్' అని అంటున్నారంట. మొదటిసారిగా 'దబాంగ్' చిత్రంతో 100 కోట్ల క్లబ్ లో చేరిన సల్మాన్ ఆ తరువాత ఏకంగా తాను నటించిన తొమ్మిది సినిమాలను వరుసగా వంద కోట్ల క్లబ్ లో చేర్చాడు. తాజాగా విడుదలైన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రం కూడా కేవలం నాలుగు రోజుల్లోనే 180 కోట్లు వసూలు చేసిందంట. ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లలో దూసుకపోతోంది. తెలుగులో కూడా ఈ సినిమాను 'ప్రేమలీల'గా విడుదల చేశారు. సల్మాన్ పాత్రకు మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పాడు. 

17:32 - November 19, 2015

అవును మీరు వింటుంది నిజమే. ఆ స్కూళ్లో ఆమె వండితే కొంతమంది విద్యార్థులు తింటున్నారు. ఆమె వండుతోంది తినమని కొందరు..కొంతమంది విద్యార్థులైతే ఇతర బడుల్లోకి వెళ్లిపోయారంట. దీనికి కారణమేంటో తెలుసా ? దళిత మహిళ కాబట్టి. విద్యార్థులు ఇలా వ్యవహరించడానికి తల్లిదండ్రులే కారణమంట. ఓ జాతీయ ఛానెల్ లో ఈ కథనం ప్రసారమైంది. దీని గురించి తెలుసుకోవాలంటే ఇది చదవండి. కర్ణాటక లోని కోలార్ జిల్లా కగ్గనహళ్లి గ్రామంలోని మాధ్యమిక ప్రభుత్వ పాఠశాలలో రాధమ్మ కుక్ గా విధులు నిర్వహిస్తోంది. 18 మంది బడిలో విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఆమె వండిన ఆహారాన్ని తింటున్నారు. 2014 ఫిబ్రవరి పాఠశాలలో చేరినప్పటి నుండి ఇదే పరిస్థితి ఉందని, కనీసం పాలు కూడా తాగరని రాధమ్మ వాపోయింది. వాళ్ల తల్లిదండ్రులే తాను వండిన వంట తినొద్దని విద్యార్థులకు నూరిపోస్తున్నారని తెలిపింది. ఈ పరిస్థితిలో మార్పు రావడానికి విద్యార్థులు..వారి తల్లిదండ్రులతో విద్యాధికారులు సమావేశాన్ని నిర్వహించారు. గత నెలలో విద్యార్థులు..వారి తల్లిదండ్రులతో కలిసి అధికారులు పాఠశాలలో సామూహిక భోజనాలు చేశారు. అయినా లాభం లేదు. సేమ్ అదే పరిస్థితి పునారవృతమైంది. దళిత మహిళ కుక్ ను మారిస్తేనే తమ పిల్లలను తిరిగి పాఠశాలలో చేరిపిస్తామని తల్లిదండ్రులు పేర్కొంటున్నారంట.

 

17:31 - November 19, 2015

విజయవాడ : రాష్ట్రంలో భారీ వర్షాలకు జరిగిన నష్టంపై కేంద్రప్రభుత్వానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. 3 వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. తక్షణ సహాయంగా వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరారు. నెల్లూరు జిల్లాలో అపార నష్టం జరిగిందని తెలిపారు. చిత్తూరు, కడప జిల్లాల్లోనూ భారీ నష్టం సంభవించిందని లేఖలో ప్రస్తావించారు. ఉభయ గోదావరి, ప్రకాశం, కృష్ణా జిల్లాలు కూడా వర్షాల కారణంగా నష్టపోయాయని చంద్రబాబు కేంద్రానికి తెలిపారు.  

17:29 - November 19, 2015

హైదరాబాద్ : మావోయిస్టు నేత గాజర్ల అశోక్‌ పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. అశోక్‌ ప్రస్తుతం దండకారణ్య కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అనారోగ్య కారణాలతో అశోక్‌ లొంగిపోయినట్లు సమాచారం. 

17:25 - November 19, 2015

హైదరాబాద్ : ఛత్తీస్‌గడ్‌ సుకుమా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. 15 మంది మావోయిస్టులను ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసులు హతమార్చారు. ఈ మధ్య కాలంలో ఇదే పెద్ద ఎన్‌కౌంటర్‌గా చెప్పుకోవచ్చు. నిన్న జరిగిన మరో ఘటనలో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చారు. ఛత్తీస్‌గడ్‌ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున కూంబింగ్‌ జరుగుతున్నట్లు పోలీసులు ఇప్పటికే ప్రకటించారు.

 

17:23 - November 19, 2015

వరంగల్ : హోరు తగ్గింది. పోరు ముగిసింది. ఓరుగల్లు చల్లబడింది. ప్రచారంతో హోరెత్తించిన మైకులు మూగబోయాయి. ఉపన్యాసాలు దంచికొట్టిన నేతలు ఇక మౌనవ్రతంలోకి దిగిపోయారు. ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో.. వరంగల్‌ను గత పది రోజులుగా దడదడలాడించిన ఎన్నికల హడావుడి ముగిసిపోయింది. ఇక పోలింగ్‌.. ఆ పై కౌంటింగ్‌ మాత్రమే మిగిలి ఉంది. విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల తూటాలు విసురుకున్నారు. ఇక ఓటరన్న టైమ్‌ స్టార్టయింది. ఆయనెటు వేస్తే అటే గెలుపు. 21న జరగనున్న పోలింగ్‌లో ఓరుగల్లు ఓటరు ఘల్లుమనిపించబోతున్నాడు. 24న జరగబోయే కౌంటింగ్‌లోనే ఓటరు ఎటు ఘల్లుమనిపించాడో తెలియబోతుంది. 

17:18 - November 19, 2015

హైదరాబాద్ : టిఆర్‌ఎస్‌ మంత్రి హరీష్‌రావు ఆంధ్రప్రదేశ్‌ జలదోపిడీ చేస్తోందంటూ టిడిపిపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని టిటిడిపి నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. అదే నిజమైతే గతంలో నీవు మంత్రిగా ఉన్నప్పుడు ఆ జలదోపిడీని ఎందుకు అడ్డుకోలేకపోయావని రేవంత్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాళ్లతో కొట్టమంటున్న కెసిఆర్‌ అలా కొట్టిన కొమురయ్యని ఎందుకు అరెస్ట్‌ చేయించాడని ప్రశ్నించారు. 

17:16 - November 19, 2015

చిత్తూరు : మేయర్‌ దంపతుల హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మరోపక్క చింటూ తల్లిదండ్రులను పోలీసులు తీసుకెళ్లి విచారిస్తున్నారు. 

ముగిసిన వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక ప్రచార గడువు

వరంగల్ : పార్లమెంట్ ఉప ఎన్నిక ప్రచార గడువు కాసేపటి క్రితం ముగిసింది. 21వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 24వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. వరంగల్ పార్లమెంట్ పరిధిలో 15,09,671 మంది ఓటర్లు ఉన్నారు. ఉపెన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

కూకట్ పల్లి ఏసీపీగా భుజంగరావు

హైదరాబాద్ : కూకట్ పల్లి ఏసీపీగా భుజంగరావు నియమితులయ్యారు. అంతకముందు ఏసీపీ గా పనిచేసిన సంజీవరావు అక్రమాస్తుల కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే.

మేయర్ అనురాధ దంపతుల అంత్యక్రియలు పూర్తి

చిత్తూరు : దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అనురాధ, మోహన్ లను కడసారి చూసేందుకు అభిమానులు, టిడిపి శ్రేణులు భారీగా తరలి వచ్చారు.

తాండూరులో రైతుల ఆందోళన

రంగారెడ్డి : తాండూరు మార్కెట్ యార్డులో గురువారం రైతులు ఆందోళనకు దిగడంతో కందుల విక్రయాలు నిలిచిపోయాయి. క్వింటాలుకు రూ.12 వేలు చెల్లించాలంటూ రైతులు అధికారులు, వ్యాపారులు చర్చలు జరిపారు. బుధవారం క్వింటాలుకు మోడల్ ధర 11,600 కాగా గురువారం రూ.11,300 మాత్రమే ఇచ్చేందుకు వ్యాపారులు ముందుకు రావటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుల ధర పెరగటానికి బదులు తగ్గడంపై రైతులు వ్యాపారులతో గొడవకు దిగారు. రూ.12వేలు చెల్లించాల్సిందేనంటూ రైతులు విక్రయాలను నిలిపివేసి నిరసన తెలిపారు.

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ :15 మంది మావోల మృతి

ఛత్తీస్ గఢ్ : సుకుమా జిల్లా బెజ్జి వద్ద భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం. వారిలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మీతుల్లో ఓ మహిళా మావోయిస్టు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

16:48 - November 19, 2015

హైదరాబాద్ : వరంగల్ పార్లమెంట్ పరిధిలో అనుకున్నంత అభివృద్ధి జరగలేదని వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి గాలి వినోద్ కుమార్ అన్నారు. ఆయన వరంగల్ లో గురువారం మీడియాతో మాట్లాడుతూ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే... దేశానికే ఆదర్శవంతమైన నగరంగా వరంగల్ ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, దళితులకు 3 ఎకరాల భూమి ఇప్పిస్తానని, స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్శిటీ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తానని తెలిపారు. సరైన విజన్, చిత్తశుద్ధి లేకపోవడం వల్లే పేదవాడికి న్యాయం జరగడం లేదన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ

విజయవాడ : రాష్ట్రానికి వరద సాయం కింద రూ. వెయ్యి కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తాత్కాలిక అంచనాల ప్రకారం తుపాను వల్ల రూ. మూడు వేల కోట్ల నష్టం సంభవించినట్లు చంద్రబాబు ఆ లేఖ లో పేర్కొన్నారు. తుది నివేదిక తర్వాత పంపుతామని వెల్లడించారు. వరద సాయం కోసం ప్రధాని మోదీ తో పాటు హో, వ్యవసాయ శాఖ మంత్రులకు కూడా బాబు లేక రాశారు.

గొలుసు దొంగలపై పీడీ యాక్ట్ : సీవీ ఆనంద్

హైదరాబాద్ : గొలుసు దొంగలపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గొలుసు దొంగలకు సహకరించిన కానిస్టేబుల్ మోహన్ పై చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో నేరస్థుల ఇళ్లకు వెళ్లి సమగ్ర సర్వే నిర్వహిస్తామన్నారు. నేరస్థులకు సంబందించిన డేటాబేస్ రూపొందిస్తామని పేర్కొన్నారు.

లొంగిపోయిన మావోయిస్టు నేత గాజర్ల అశోక్

హైదరాబాద్:తెలంగాణలో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత గణపతి సోదరుడు, పార్టీ దండకారణ్య కమిటీ కార్యదర్శి గాజర్ల అశోక్ హైదరాబాద్‌లో గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయారని తెలుస్తోంది. ఆయన అనేక ఎన్కౌంటర్లతో పాటు, పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ప్రభుత్వం.. అశోక్పై రూ.20 లక్షల రివార్డు ప్రకటించి ఉంది.

16:28 - November 19, 2015

హైదరాబాద్ : ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని...ప్రతిపక్షాలు చిల్ల రాజకీయాలు మానుకోవాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. ఆయన గురువారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్, బిజెపి పై విరుచుకుపడ్డారు. పింఛన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగకుండా వారి ఖాతాల్లోనే డబ్బులు ఇస్తున్నామన్నారు. ఆశా వర్కర్ల అంశం కేంద్ర ప్రభుత్వానికి చెందిన అంశమని దీని పై బిజెపి ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం పై బిజెపి నాయకులకు మాట్లాడే అర్హత లేదన్నారు. రైతు రుణ మాఫీ చేసేందుకు కేంద్రం నుండి నిధులు ఇప్పించమని బిజెపి ని అడిగాం. దానికి ఎవరూ మాట్లాడలేదు. ఢిల్లీ, బిజెపి ల్లో బిజెపికి ప్రజలు బుద్ధి చెప్పినా... ఇంకా బుద్ధిరాలేదన్నారు.  

'పనికి ఆహార పథకం పనిదినాలను 150 కు పెంచుతాం'

మహబూబ్‌నగర్: కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ నేడు జిల్లాలోని షాద్‌నగర్ మండలంలో పర్యటించారు. అన్నారంలోని ఎన్‌ఆర్‌ఎఫ్‌సీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనికి ఆహారం పథకం కింద పని దినాలను నూటాయాబై రోజులకు పెంచుతామని హామీ ఇచ్చారు. నీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు రైళ్ల ద్వారా నీటిని సరఫరా చేయిస్తామన్నారు. నాలుగేళ్లలో 2.46 లక్షల గ్రామాలకు రూ.2 లక్షల కోట్లు కేటాయిస్తామన్నారు.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై : నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ ఈ సెన్సెక్స్ 359 పాయింట్లు, నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో ముగిశాయి.

మతాలు వేరైతే పెళ్లి చెల్లదు : మద్రాస్ హైకోర్ట్...

చెన్నై : వేర్వేరు మతాలకు చెందిన స్రీ, పురుషులు పెళ్లిచేసుకుంటే ఆ వివాహం చట్టప్రకారం చెల్లదని ఓ కేసులో మద్రాసు హైకోర్టు నేడు తీర్పును వెలువరించింది. ఒకవేళ ఆ వివాహం చెల్లుబాటు కావాలంటే ఇరువురిలో ఏవరైనా ఒకరు ఇతర మతంలోకి మారాల్సి ఉంటుందని పేర్కొంది. 

మేం ఆత్మహత్య చేసుకోలేదు : చింటూ తల్లిదండ్రులు..

చిత్తూరు : తాము ఆత్మహత్య చేసుకోలేదని... ఎవరో కావాలనే పుకార్లు సృష్టించారని చింటూ అలియాస్ చంద్రశేఖర్ తల్లిదండ్రులు తెలిపారు. మేయర్‌ దంపతుల హత్యతో తమ కుమారుడికి సంబంధం లేదన్నారు. తమ కుమారుడిని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇంటి దగ్గర రక్షణ లేదని అందకే పోలీసులను ఆశ్రయించామన్నారు.

ప్రత్యేక సీమ ఉద్యమంతో నష్టమే : రామకృష్ణ

తిరుపతి : ప్రత్యేక సీమ ఉద్యమంతో నష్టమే తప్ప లాభం లేదని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అధికారం కోల్పోయాక విభజనవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో డిసెంబర్‌ 7న నిరసన తెలుపనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు.

'జీవ, రసాయన ఆయుధాలతో దాడులకు దిగే అవకాశం'

హైదరాబాద్ : ఉగ్రవాదులు జీవ, రసాయన ఆయుధాలతో దాడులకు దిగే అవకాశం ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ హెచ్చరించారు. పారిస్ లో అత్యవసర పరిస్థితి పొడిగింపు అనే విషయమై గురువారం జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాడులకు తెగబడే ముష్కరులు రసాయనిక, బయోలాజికల్ ఆయుధాలను ఉపయోగించే ప్రమాదముందన్నారు. పారిస్ లో జరిగిన ‘ఉగ్ర’ దాడులపై యూరోప్ అంతటా దర్యాప్తు, విచారణ జరుగుతోందన్నారు. ఎయిర్ లైన్ ప్రయాణికుల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అవసరమైన చర్యలను తక్షణం తీసుకోవాలని యూరోపియన్ యూనియన్ (ఈయూ)ను కోరారు.

విజయ్ ను వదిలిపెట్టిన పోలీసులు

ఖమ్మం : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ సభలో నిరసన తెలిపిన ఉస్మానియా ఎంటెక్ విద్యార్థి మనువాడ విజయ్ని పోలీసులు ఎట్టకేలకు విడుదల చేశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం వద్ద అతడిని గురువారం పోలీసులు విడిచిపెట్టారు. మావోయిస్టులతో విజయ్ కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. విజయ్ వద్ద హామీ పత్రం తీసుకుని, విజయ్, అతని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలి పెట్టారు. కాగా విజయ్ స్వస్థలం కరీంనగర్ జిల్లా వేములవాడ.

బెంగాల్ మాజీ మంత్రి మదన్ మిత్రా బెయిల్ రద్దు..

కోల్ కతా : శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో కీలక నిందితుడైన బెంగాల్ మాజీ మంత్రి మదన్ మిత్రా బెయిల్‌ను కొల్‌కతా హైకోర్టు రద్దు చేసింది. ఈ స్కాంలో 2014 డిసెంబర్ 12న ఆయన అరెస్ట్ కాగా ఈ ఏడాది అక్టోబరు 31న దిగువ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గృహ నిర్బంధంలోనే ఉండాలని ఆదేశించింది. దీనిపై సీబీఐ కొల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. మదన్ మిత్రా మంత్రివర్గంలో కొనసాగడంతో దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని సీబీఐ వాదించింది. ఏకీభవించిన కొల్‌కతా హైకోర్టు మదన్ మిత్రా బెయిల్‌ను రద్దు చేసింది. వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది.

కేంద్ర సాయం కోరిన తమిళనాడు సీఎం

హైదరాబాద్ : తమిళనాడులో వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలనుఆదుకోవాలని ఆ రాష్ట్ర సీఎం జయలలిత కేంద్రాన్ని కోరారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఫోన్ లో వరద పరిస్థితిని జయ వివరించారు. సహాయ చర్యల కోసం కేంద్ర బలగాలను పంపాలని అభ్యర్థించారు.

16 మంది భారత జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక

హైదరాబాద్ : శ్రీలంక నావికాదళం 16 మంది భారత జాలర్లను అరెస్ట్ చేసింది. అంతర్జాతీయ సరిహద్దుల్ని దాటి లంక సముద్ర జలాల్లో చేపలు వేటాడుతున్నారన్న ఆరోపణలతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3 పడవల్ని కూడా స్వాధీనం చేసుకున్రాని జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ సుబ్బరాజ్ తెలిపారు.

14:56 - November 19, 2015

ఖమ్మం : పోలీసుల అదుపులో వున్న విజయ్, అతని తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్‌ కేసీఆర్‌ సభలో నిరసన తెలిపాడన్న కారణంతో విజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయ్‌కు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. విజయ్‌ది కరీంనగర్‌ జిల్లా వేములవాడ. విజయ్‌ తల్లిదండ్రులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయ్‌ను విడుదల చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

పోలీసుల అదుపులో మావోయిస్టు నేత జనార్థన్

హైదరాబాద్ :మావోయిస్టు అగ్రనేత అయిన గణేష్ సోదరుడైన జనార్ధన్‌ను మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా... జనార్ధన్‌ది వరంగల్ జిల్లా వెలిశాల గ్రామం. ఇదిలా ఉండగా... జనార్థన్‌ను వెంటనే కోర్టులో హాజరుపరచాలని విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడు వరవరరావు డిమాండ్ చేశారు.

14:51 - November 19, 2015

హైదరాబాద్ : నీళ్లు, నిధులు నియామకాల కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ఉద్యమ పార్టీ టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చింది. ఉద్యమ సమయంలో తెలంగాణ నిధులు, వనరులను దోచిన వారి భరతం పడతామని సీఎం కేసీఆర్ పలు మార్లు హెచ్చరించారు. హైదరాబాద్ చూట్టూరా వేల ఎకరాల భూములు సీమాంధ్ర పెట్టుబడిదారులు కొల్లగొట్టారని..వాటిని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. అన్యాక్రాంతమైన లక్షల కోట్ల విలువైన వేల ఎకరాల భూములు తెలంగాణ పరమవుతాయని ఇక్కడి ప్రజలు బలంగా నమ్మారు. దీంతో భూమి భుక్తి లేని ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు.

అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా....

అయితే టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా నేటీకీ భూముల స్వాధీనంపై చర్యలు తీసుకోలేదు. అసెంబ్లీ వేదికగా హడావుడి చేసిన ప్రభుత్వం భూ అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక చర్చచేపట్టింది. రియల్ ఎస్టేట్ భూతానికి బలైన వక్ఫ్ భూములు, సినీ మీడియా పెద్దల గుప్పిట్లో చిక్కుకున్న ఫిల్మ్‌నగర్ హౌసింగ్ సోసైటీల్లో జరుగుతున్న అక్రమాలను బట్టబయలు చేసి.. భూములను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. అనుగుణంగా జనవరి 18న అధికార పార్టీ ఎమ్మెల్యే లు చైర్మన్లుగా మూడు సభా సంఘాలు వేసారు. వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ , హౌసింగ్ సోసైటీల అక్రమాలపై వర్దన్న పేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ... తెలంగాణ వ్యాప్తంగా భూముల అక్రమ అమ్మకాలు, ఆక్రమణలపై మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి నేతృత్వంలో సభా సంఘాలు వేసారు.

రిటైర్డ్ ఐఏఎస్ శ్యామ్ కుమార్‌సిన్హా అధ్యక్షతన టాస్క్ ఫోర్స్....

అంతకుముందే భూముల సమగ్ర విచారణపై రిటైర్డ్ ఐఏఎస్ శ్యామ్ కుమార్‌సిన్హా అధ్యక్షతన టాస్క్ ఫోర్స్‌ను నియమించింది. తెలంగాణలో గత ప్రభుత్వాల హయాంలో జరిగిన భూ కేటాయింపులు.. బదలాయింపులు, విక్రయాలు, దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని డిసెంబర్ 5న 2014న టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. రెండు సంవత్సరాల్లో సమగ్ర విచారణ జరిపి....అక్రమాలను వెలికి తీయాలని టార్గెట్ పెట్టింది. అయితే అటు సభాసంఘాలు, ఇటు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికీ అసలు పనులే ప్రారంభించ లేదు. హైదరాబాద్ నడి బోడ్డున వందల ఎకరాలు సీమాంధ్ర పెట్టుబడి దారుల ఆక్రమణలో ఉన్నాయన్న ప్రభుత్వ పెద్దలు.. కొత్త సచివాలయం కోసం పట్టుమని పది ఎకరాల భూములను గుర్తించ లేకపోతున్నారంటే ప్రభుత్వ పనితీరు ఎంత వేగంగా ఉందో తెలుస్తుంది.

భూ అక్రమాలపై విచరాణను వేగవంతం చేసి.....

ఇప్పటికైనా ప్రభుత్వం భూ అక్రమాలపై విచరాణను వేగవంతం చేసి..అక్రమార్కుల భరతం పట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఉద్యమ సమయంలో చెప్పినట్లు లక్షల కోట్ల విలువైన వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

14:48 - November 19, 2015

విజయవాడ : రెయిన్‌ ట్రీ..!! అన్నీ అనుకన్నట్లే జరిగితే.. ఈ ప్రాంగణం.. ఏపీ మంత్రుల నివాస సముదాయం కానుంది. రెయిన్‌ట్రీ పార్కులో ఖాళీగా ఉన్న అపార్ట్‌మెంట్‌లు, విల్లాలను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు ప్రభుత్వం సుముఖతను వ్యక్తం చేసింది. చదరపు అడుగు స్థలానికి ఏడు రూపాయల వంతున అద్దె చెల్లించేందుకు సిద్ధమైంది. మరి ఈ విల్లాలు నిజంగానే నివాసయోగ్యంగా ఉన్నాయా...? రెయిన్‌ట్రీతో సర్కారు ఒప్పందం వెనుక మతలబేంటి..?

మొత్తం అపార్ట్‌మెంట్‌లు 964.. విల్లాలు 150......

ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల తరలింపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఏపీ ప్రభుత్వం.. మంత్రులు, అధికారులకు నివాస సముదాయంగా.. రెయిన్‌ట్రీ పార్క్‌ను ఫిక్స్‌ చేసింది. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా రెయిన్‌ ట్రీ పార్క్‌ ఉంది. ఇందులోని 964 అపార్ట్‌మెంట్లు, 150 విల్లాలలో.. 256 ప్లాట్లు.. 26 విల్లాలు ఖాళీగా ఉన్నాయి. మిగిలినవి వాటి యజమానులు స్వాధీనం చేసుకున్నారు. ఖాళీగా ఉన్న విల్లాలను మంత్రులకు, అపార్ట్‌మెంట్లను అధికారులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విల్లాల చదరపు అడుగు ధర రూ.11.............

రెయిన్‌ ట్రీ విల్లాలకు చదరపు అడుగు పదకొండు రూపాయలు, అపార్ట్‌మెంట్లకు చదరపు అడుగు ఏడు రూపాయలు చొప్పున అద్దె చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం వెలువడగానే.. కొందరు మంత్రులు, అధికారులు రెయిన్‌ట్రీ పార్క్‌కు వచ్చి ఇళ్లను, అందులోని వాస్తును పరిశీలించారు. నిర్మాణం జరిగి చాలా ఏళ్లయిందని.. మెయింటెనెన్స్‌ లేక చాలా ఇళ్లు పాడుబడ్డాయని గుర్తించారు. ఓవైపు స్లాబ్‌ నుంచి నీరు కారుతుంటే.. మరోవైపు గోడలు పెచ్చులూడి కనిపిస్తున్నాయి. పైగా ఇక్కడ తాగునీటికీ ఇబ్బందులున్నాయని గుర్తించారు. మొత్తానికి ఈ గృహాలు నివాసయోగ్యంగా లేవన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు.

ప్రతి ఇంటి మరమ్మతుకు రూ 5 లక్షలు ఖర్చు..........

చాలా మంది అధికారులు రెయిన్‌ ట్రీ పార్క్‌ను నివాస స్థలాలుగా ఇష్ట పడడం లేదు. ఇక్కడి ఇళ్లకు ఇప్పటికిప్పుడు రిపేర్లు చేయించాలంటే కనీసం ఐదారు లక్షలు అవుతుందని వారు అంచనా వేస్తున్నారు. పైగా తాము విధులు నిర్వహించాల్సిన మేధా టవర్స్‌కు.. ఇక్కడి నుంచి నలభై కిలోమీటర్ల దూరం ఉందని.. రోజూ ప్రయాణానికే ఎక్కువ సమయం పడుతుందని.. ఇక విధుల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇన్ని ఇబ్బందులు పడే కన్నా.. దగ్గర్లోనే హెచ్‌ఆర్‌ఏ కి సరిపడా ఇంటిని అద్దెకు తీసుకుంటే బెటరని వారు అభిప్రాయపడుతున్నారు.

లింగమనేని ఎస్టేట్స్‌కు చెందిన రెయిన్‌ట్రీ పార్క్‌..............

మంత్రులు, అధికారులు ఇన్ని ఇక్కట్లు ఏకరువు పెడుతున్నా.. ప్రభుత్వం.. రెయిన్‌ట్రీ పార్క్‌నే ఓకే చేయడం వెనుక పెద్ద కారణమే ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని లింగమనేని ఎస్టేట్స్‌ సంస్థ నిర్మించింది. ఏపీలో సొంతంగా విమాన సర్వీసులను ప్రారంభించిన మొదటి సంస్థ ఇదే. వారికి లబ్ది చేకూర్చేందుకే ప్రభుత్వం రెయిన్‌ట్రీ అపార్ట్‌మెంట్ల వైపు మొగ్గు చూపుతోందన్న వాదనలు ఉన్నాయి.

 

14:44 - November 19, 2015

ఖమ్మం : నేలకొండపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 18మంది గాయపడ్డారు. పత్తి కూలీలను తీసుకెళ్తున్న ఆటోను.. ట్రాక్టర్ ఢీకొనడంతో.. ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

14:41 - November 19, 2015

హైదరాబాద్ : సైబరాబాద్‌ పరిధిలో నలుగురు చైన్‌ స్నాచర్లను పోలీసులు పట్టుకున్నారు.. 46 గొలుగు దొంగతనాల్లో వీరు నిందితులుగా ఉన్నారు.. ఈ దొంగలనుంచి కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్నట్టు సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. కొంతకాలంగా ఈ నలుగురు మోస్ట్ వాంటెడ్‌ లిస్టులో ఉన్నారు..

14:38 - November 19, 2015

హైదరాబాద్ : ఆధునిక స్త్రీ చరిత్రను పునర్ లిఖిస్తుందని ఘంటాపథంగా చెప్పిన నవయుగ వైతాళికుడు గురజాడ. సమాజంలో వేళ్ళూనుకుపోయిన దురాచారాలను, మహిళల అభ్యున్నతిని ఆటంకపరిచే సాంప్రదాయాలను కూకటి వేళ్లతో సహా పెకిళించకపోతే సమాజ మనుగడ తిరోగమనంలో పయనిస్తుందని చెప్పిన సంఘసంస్కర్త గురజాడ. గురజాడ వర్థంతి సందర్భంగా మానవి ప్రత్యేక కథనం 'గురజాడ జాడలు' ఈ అంశం పై మానవి కార్యక్రమంలో విశ్లేషణ చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

ఎఫ్ డీఐలకు వ్యతిరేకంగా ఆందోళన

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లను ఆహ్వానించడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈమేరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ధర్నాకు దిగాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, దేశంలోకి ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ఈ నిరసన ప్రదర్శనలో రైల్వే, రక్షణ, తపాల, ఆదాయపన్ను శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

గోదావరి ఎక్స్ ప్రెస్ లోప్రయాణికులకు మత్తు మందు ఇచ్చి దోపిడీ

హైదరాబాద్: విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వస్తోన్న రైలులో దొంగలు ప్రయాణికులకు మత్తు మంది ఇచ్చి దోచుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలులో అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ముగ్గురికి నగరంలోని లక్డీకాపూల్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. తాడేపల్లిగూడెం- ఏలూరు మధ్య మత్తు మందు ప్రయోగం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

14:11 - November 19, 2015

హైదరాబాద్ : టీడీపీ సర్కార్ పై వైసిపి నేత బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఈమేరకు ఆయన మీడియాతో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర, వాతావరణ పరిస్థితులపై ప్రభుత్వానికి దృష్టి లేదన్నారు. అధికారుల్లో సమన్వయం లేదని చెప్పారు. ప్రజాప్రతినిధి, అధికారుల మధ్య సమన్వయం లోపించిందని తెలిపారు. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తామని పేర్కొన్నారు.

14:06 - November 19, 2015

చిత్తూరు : నగర మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో కీలక నిందితుడు చింటూ తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈఘటనలో తండ్రి మృతి చెందాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  

14:03 - November 19, 2015

హైదరాబాద్‌ : మావోయిస్టు అగ్రనేత జనార్దన్‌ ఎస్‌ఐబీ అదుపులోకి తీసుకున్నారు. జనార్దన్‌ను విడుదల చేయాలని విరసం నేతల డిమాండ్‌ చేశారు. జనార్దన్‌ వరంగల్‌ జిల్లా వెలిశాల వాసి.

14:00 - November 19, 2015

ఖమ్మం : జిల్లా భద్రాచలంలో టీఆర్‌ఎస్‌ నేతల కిడ్నాప్‌ కలకలం సృష్టిస్తోంది. మానె రామకృష్ణతో సహా ఆరుగురు నేతలను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. చర్ల మండలం పూసుగుప్ప వద్ద కిడ్నాప్‌ జరిగింది. మరోవైపు ఈ కిడ్నాప్‌ను పోలీసులు ధృవీకరించలేదు.

13:59 - November 19, 2015

రంగారెడ్డి : జిల్లాలో కల్తీ కల్లు మరణాలు కొనసాగుతున్నయి. తాండూరు మండలంలో కల్తీకల్లు దొరకక ముగ్గురు మృతి చెందారు. మూడురోజుల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. కల్తీకల్లు బాధితులు దాదాపు 175 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

13:57 - November 19, 2015

హైదరాబాద్‌ : ఆర్థిక ఇబ్బందులు..కష్టాలు...బాధలు భరించలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అభం..శుభం తెలియని చిన్నారులను కూడా చంపేసి తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా సూరారంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సూరారం కాలనీలో రవీందర్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి అపర్ణ, జయశ్రీ కూతుర్లున్నారు. రవీందర్ బంగారం వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారం సరిగ్గా లేకపోవడంతో అప్పులు పేరుకపోయాయి. తీవ్ర వత్తిళ్లు రావడంతో రవీంద్ర భరించలేకపోయాడు. ఆత్మహత్య శరణ్యమని భావించిన రవీందర్ భార్య ఇంట్లో లేని సమయంలో తన ఇద్దరు పిల్లలు అపర్ణ, జయశ్రీలకు విషమిచ్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో అపర్ణ, జయశ్రీలను మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. రవీందర్ కు సుమారు ఐదు లక్షల రూపాయల మేర అప్పులున్నట్లు తెలుస్తోంది. 

 

13:50 - November 19, 2015

హైదరాబాద్ : రిజర్వ్ బ్యాంకును రక్షించుకునేందుకే ఇవాళ సామూహిక సెలవులు పెట్టినట్టు ఆర్బీఐ ఉద్యోగులు తెలిపారు. దేశవ్యాప్తంగా చేపట్టిన 'సేవ్ ఆర్బీఐ-సేవ్ నేషన్' ధర్నాలో భాగంగా హైదరాబాద్ లో ఉద్యోగులు రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పెన్షన్ విధానంలో మార్పులు, ఆర్బీఐలో సంస్కరణలకు వ్యతిరేకంగా తమ పోరాటం రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుందని ఉద్యోగులు తెలిపారు.

 

13:48 - November 19, 2015

ఖమ్మం : జిల్లా కొత్తగూడెం పోలీసులు ఎంటెక్‌ విద్యార్థి విజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌ కేసీఆర్‌ సభలో నిరసన తెలిపాడన్న కారణంతో విజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయ్‌కు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. విజయ్‌ది కరీంనగర్‌ జిల్లా వేములవాడ. విజయ్‌ తల్లిదండ్రులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయ్‌ను విడుదల చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

 

 

 

13:46 - November 19, 2015

వరంగల్ : కాంగ్రెస్‌ నేతలు అనవసరంగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామన్నారు. వరంగల్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిపెట్టారని చెప్పుకొచ్చారు.

13:42 - November 19, 2015

గుంటూరు : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులు తోడు దొంగలని సీపీఐ జాతీయ నేత నారాయణ విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంపై ఏపీ ప్రజలను మోసం చేస్తూ చెవిలో పువ్వులు పెడుతున్నారని పేర్కొన్నారు. గుంటూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై డిసెంబర్‌ 7న ఢిల్లీలో ఆందోళన చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య తోడు దొంగలని... ఇద్దరూ కలిసి ఏపీకి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతి ఎమ్మెల్యేలను ఏపీ సీఎం చంద్రబాబు కట్టడి చేయలేకపోతున్నారని ఆరోపించారు. ఏపీలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని.. ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. కుటుంబ కలహాల వల్లే మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య గావించబడ్డారని, జనవరి 7, 8, 9 తేదీల్లో సీపీఐ జాతీయ సమావేశాలు జరుగనున్నాయని తెలిపారు. 

13:38 - November 19, 2015

హైదరాబాద్ : ఏపీ రాజధాని నిర్మాణంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో విచారణ డిసెంబర్‌ 9కి వాయిదా పడింది. గతంలో గ్రీన్‌ ట్రిబ్యునల్‌ జారీ చేసిన కోర్టు ధిక్కారణ నోటీసులపై ఏపీ ప్రభుత్వం, సీఆర్ డీఏ, పర్యావరణశాఖ స్పందించాయి. రైతుల కోరిక మేరకే భూమి చదును, పంటల తొలగింపు కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొన్నారని కౌంటర్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. పర్యావరణ అనుమతులు ఉన్నాయని.. కౌంటర్‌ ద్వారా గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు తెలిపింది. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం నిర్మాణం కిందికి రాదని కేవలం శంకుస్థాపన మాత్రమే జరిగిందని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పూర్తిస్థాయి ఆర్డర్‌ కాపీ లేనందున పర్యావరణ అనుమతులు ఉన్నట్లు అక్టోబర్‌9న కోర్టుకు తెలపలేకపోయామని ఏపీ సర్కార్‌ తెలిపింది.

 

13:35 - November 19, 2015

నెల్లూరు : భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా అతలాకుతలమైంది. వరద నీటితో నెల్లూరు నగరం మొత్తం జలమయమైంది. ఎన్ డిఆర్ ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బోట్ల సాయంతో వరద బాతులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. 3 బోట్ల ద్వారా ఇప్పటికే 700 మందిని రక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మంత్రి నారాయణ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

 

చింటూ తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నం.... తండ్రి మృతి

చిత్తూరు : నగర మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో కీలక నిందితుడు చింటూ తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈఘటనలో తండ్రి మృతి చెందాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  

13:26 - November 19, 2015

హైదరాబాద్ : దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన సెల్యులాయిడ్‌ వండర్‌ బాహుబలి ది బిగినింగ్‌ ప్రపంచవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. ఇప్పటికే దేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా ముందు సరికొత్త రికార్డులు సృష్టించిన బాహుబలి. ఇప్పడు తాజాగా టెలివిజన్‌ స్క్రీన్‌ల మీద కూడా తన సత్తా చాటింది.
బుల్లితెరపై బాహుబలి సందడి
ఇండియన్ సినిమాను షేక్ చేసి టాప్ త్రీలో చోటు సంపాదించుకున్న జక్కన్న విజువల్ క్రియేషన్ బాహుబలి ది బిగినింగ్ బుల్లితెరపై కూడా ఆ రేంజ్‌లోనే సందడి చేస్తోంది. హిందీ వెర్షన్‌లో ఇటీవలే టెలివిజన్‌లో ప్రసారమైన బాహుబలి సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేసేసింది. ఈ ఏడాది హిందీ ఛానెళ్లలో ప్రసార‌మైన సినిమాల‌న్నింటిలో బాహుబ‌లే టాప్ ప్లేస్ ద‌క్కించుకుంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ న్యూస్‌తో రాజ‌మౌళి టీం ఫుల్ ఖుషీ అయ్యింది.
కరణ్ జోహార్‌ను పొగడ్తలతో ముంచెత్తిన రానా
రానా అయితే కరణ్ జోహార్‌ను పొగడ్తలతో ముంచెత్తేశాడు. నార్త్ లో బాహుబలి విక్టరీకి కరణ్ మెయిన్ రీజన్ అంటూ ట్వీట్ కూడా చేశాడు. ఈ ఏడాది టీఆర్పీ రేటింగ్స్ లో హిందీ బాహుబలి 6.9 పాయింట్స్ సాధిస్తే బజరంగీ భాయిజాన్, పీ.కే సినిమాలు ఈ సినిమా కంటే త‌క్కువ రేటింగ్స్ సాధించాయి. సల్మాన్ ఖాన్ బజరంగీ భాయిజాన్ 6.8 పాయింట్స్ తో అమీర్‌ ఖాన్ పీ.కే 6.6 పాయింట్స్ తో బాహుబలి కంటే వెనుకంజలోనే ఉన్నాయి.
ఆరో ప్లేస్లో బాహుబ‌లి
ఇక గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా టాప్ టీఆర్పీ రేటింగ్ సాధించి రికార్డు క్రియేట్ చేసిన చిత్రాల్లో బాహుబ‌లి ఓవర్ ఆల్ గా ఆరో ప్లేస్ సొంతం చేసుకుంది.. అమీర్‌ ఖాన్ నటించిన త్రీ ఇడియట్స్ 10.8 పాయింట్స్ తో టాప్ లో ఉండగా, బాడీగార్డ్, చెన్నై ఎక్స్ ప్రెస్, దబాంగ్ , సింగం సినిమాలు బాహుబలి కంటే ముందు స్థానాల్లో ఉన్నాయి.. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రాబోతున్న బాహుబలి రెండో భాగం ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

 

 

హైదరాబాద్ లో విషాదం..

హైదరాబాద్ : నగరంలోని సూరారం కాలనీలో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులతో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో పిల్లల కూడా మృతి చెందారు.

 

12:59 - November 19, 2015

హన్మకొండ : వరంగల్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ..వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రచార పర్వం మొదలైన నాటి నుంచి పూర్తయ్యే వరకు ఓ వైపు ప్రచారం చేస్తూనే మరో వైపు ఆపరేషన్ ఆకర్ష్‌ను నిర్వహిస్తోంది. మరోవైపు మంత్రులంతా అక్కడే మకాం వేసి ఇతర పార్టీల నేతలను పెద్ద ఎత్తున కారెక్కిస్తున్నారు.
టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా అడుగులు
వరంగల్‌ ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఓరుగల్లులో భారీ మెజార్టీ సాధించి విపక్షాలకు ధీటైన సమాధానం చెప్పాలని గులాబీ బాస్‌ కేసీఆర్‌ ఈ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పక్కా వ్యూహాన్ని అమలు చేశారు. నోటిఫికేషన్ వచ్చేంత వరకు పార్టీలో ఈ ఊసే ఎత్తని కేసీఆర్‌..వెంటనే ఎన్నికలకు శ్రేణులు సిద్ధం అయ్యేలా పావులు కదిపారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర గడిచిన తర్వాత వస్తున్న ఎన్నికలు కావడంతో ప్రజా వ్యతిరేకత ఎన్నికల్లో ఏ మాత్రం కనిపించకుండా చూడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
మంత్రులంతా ఓరుగల్లులోనే మకాం
దీంతో తెలంగాణ మంత్రివర్గంలో మెజార్టీ మంత్రులంతా ఓరుగల్లులోనే మకాం వేశారు. ఓ పక్క ప్రచారం నిర్వహిస్తూనే..మరోపక్క ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తున్నారు. అందులో భాగంగానే వరంగల్‌కు చెందిన టిడిపి రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణిని పక్కా వ్యూహాంతో కారెక్కించుకున్నారు. ఆ తర్వాత స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ రాజారపు ప్రతాప్‌ను కూడా పార్టీలో చేర్చుకున్నారు. వీరితో పాటు మంత్రులు మకాం వేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ఎంపీటీసిలు, సర్పంచ్‌లతో పాటు చిన్నా చితక నేతలను కూడా కారెక్కించుకునేలా పావులు కదుపుతున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వలసలను ప్రోత్సహించేందుకు పార్టీలో కీలక నేతలైన మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌లు కూడా ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి జిల్లా కేంద్రంలోనే మకాం వేశారు. భారీ మెజార్టీ లక్ష్యంగా ఓ వైపు ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు..విపక్ష పార్టీల నేతలను కారెక్కించుకుంటూ ఎన్నికల్లో తమ బలం నిరూపించుకుంటామనే సంకేతాలను పార్టీ నేతలు ఇస్తున్నారు
గులాబీ బాస్‌ ఎత్తులకు పై ఎత్తులు వరంగల్‌లో వేడెక్కిన రాజకీయం
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రధాన పోటీ ఎదురౌతుందని అంచనా వేసుకుంటున్న గులాబీపార్టీ అందుకు అనుగుణంగా పావులు కదుపుతూ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇవాల్టితో ప్రచారానికి తెరపడనుండడంతో...తెరవెనుక ప్రచారాన్ని ఇప్పటికే ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ...వరంగల్ ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో దక్కించుకొని ప్రతిపక్షాల నోరు మూయించేందుకు గులాబీ బాస్‌ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు.

 

 

12:53 - November 19, 2015

రష్యా : మాస్కోకు వెళ్తున్న రష్యా విమానాన్ని ఎలా పేల్చామన్న విషయమై ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులు తమ ఆన్ లైన్ మ్యాగజైన్ 'దబీఖ్'లో ప్రత్యేక కథనం ప్రచురించింది. పేలుడు పదార్థాలను ఓ సోడా క్యాన్‌లో పెట్టి విమానంలోకి చేర్చామని ఉగ్రవాదులు తెలిపారు. తొలుత ఓ అమెరికా విమానాన్ని టార్గెట్ చేయాలని భావించామని, అయితే.. రష్యా సైతం తమపై దాడులు చేస్తుండటంతో ఆ దేశపు విమానాన్ని పేల్చామని స్పష్టం చేసింది. గత నెల 31న ఈజిప్టులోని రెడ్‌ సీ రిసార్ట్‌ నుంచి రష్యాలోని సెయింట్‌ పీటర్‌బర్గ్ వెళుతున్న ఈ విమానం.. సినాయ్ పెనిన్సులాలో గాల్లో పేలిపోయింది. ఈ ఘటనలో 224 మంది మృతి చెందారు. కాగా.. విమానాన్ని ఉగ్రవాదులే పేల్చారని అంగీకరించిన రష్యా, అందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది.

 

12:50 - November 19, 2015

హైదరాబాద్ : స్పెషల్ ఆఫర్లు అన్నారు.. జనాన్ని బుట్టలో పడేశారు. కార్లు పెడితే అద్దెతో పాటు డబుల్ మనీ అంటూ మాయమాటలు చెప్పారు. ఆర్నేళ్లు తిరగకుండానే మాట మార్చారు. ఆన్‌లైన్‌ క్యాబ్‌ కంపెనీల ఉచ్చులో పడి లక్షలు పోసి కార్లు కొన్న బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఫైనాన్స్‌ కూడా చెల్లించే ఫోజిషన్‌ లేక చావే శరణ్యమంటున్నారు.
అద్దె కార్ల పేరుతో మోసం
ఓబెర్‌, ఓలా ఆన్‌లైన్‌ క్యాబ్స్....ఆకర్షణీయమైన ప్రకటనలతో జనాలకు మస్కా కొట్టారు. నెలకు లక్ష రూపాయల సంపాదన అంటూ కోతలు కోశారు. ప్రతి ట్రిప్‌కు ప్రోత్సాహాకాలు ఇస్తామన్నారు. ఓవర్‌ టైమ్‌ చేస్తే ట్వంటీ తౌజండ్‌ ఎక్స్ ట్రా ఎర్న్ చేయొచ్చన్నారు. వేర్వేరు సంస్థల్లో పనిచేస్తున్న డ్రైవర్లు, ఈ ఆకర్షణీయమైన ప్రకటలు చూసి ఉప్పొంగిపోయారు. తమ లైఫ్‌ టర్న్‌ అవుతుందని సంతోషపడ్డారు. భార్యల నగలు అమ్మి కొందరు...అప్పు చేసి మరికొందరు ఎగబడి మరి కార్లు కొన్నారు. మొదట్లో ప్రతి ట్రిప్‌కు 300 బోనస్‌గా చెల్లించారు. కొన్నాళ్లకే ఆ మొత్తాన్ని రెండు వందలకు తగ్గించారు. ఆ తర్వాత వంద రూపాయలతో సరిపెట్టారు. ఇప్పుడు అది కూడా ఇవ్వడం మానేశారు.
ఒక్కో కారుకు ఒక్కో రేట్‌ ఫిక్స్
లగ్జరీని బట్టి ఒక్కో కారుకు ఒక్కో విధంగా పేమెంట్‌ చెల్లిస్తామన్న ఓబెర్‌, ఓలా సంస్థలు కొన్ని రోజులకే ప్లేట్‌ పిరాయించాయి. ఇన్నోవాకు, ఇండికాకు తేడా లేకుండా ఒకే అద్దెను చెల్లించారు. ట్రావెల్‌ సంస్థలు ఎసి కారుకు కిలోమీటరుకు 14 నుంచి 15 రూపాయలు ఇస్తుండగా.. ఈ సంస్థలు మాత్రం 7 రూపాయలకే పరిమితం చేశాయి. మూడేళ్ల పాటు చెల్లింపులో ఏ మాత్రం తేడా ఉండదని వాగ్దానాలు చేసి..ఆ తర్వాత మాట మార్చారు. మేమింతే.. ఇచ్చేది తీసుకోండి... లేదంటే మీ దారి మీరు చూసుకోండి...అంటూ దౌర్జన్యానికి తెగబడుతున్నారని బాధితులు వాపోతున్నారు.
నమ్మేవాళ్లుంటే మోసం చేసేవాళ్లకు కొదవ వుండదు
నమ్మేవాళ్లుంటే మోసం చేసేవాళ్లకు కొదవ వుండదు. ఎన్ని అబద్దాలైన ఆడుతారు. ఓబెర్‌, ఓలా సంస్థలు కూడా నమ్మిన వారిని నట్టేటా ముంచుతున్నారు. బతకడానికి దారి చూపిస్తామంటూ వారి బతుకులతో ఆడుకుంటున్నారు.
లబోదిబోమంటున్న బాధితులుఓబెర్‌, ఓలా ఆన్‌లైన్‌ క్యాబ్స్ మోసాలు
ఒబేర్‌, ఓలా సంస్థల ఉచ్చులో పడిన బాధితులు లబోదిబోమంటున్నారు. లక్ష కాదు కదా 10 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు. డిజీల్‌ ఖర్చులు కూడా రావడం లేదని...ఇలాగైతే వాహనాలు నడపలేమంటున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ బాధితుడు...బలవన్మరణం చేసుకోవడం కలకలం రేపుతోంది. అంతా అయిపోయింది. పచ్చని కుటుంబం వీధిన పడింది...ఇప్పుడెలా బతకాలో అర్థం కాని పరిస్థితి...భవిష్యత్‌ తలుచుకున్న ఆమెలో భయం పుడుతుంది... ఇది ఈ ఒక్క ఇల్లాలి కన్నీటి కథ కాదు.. ఒబేర్‌, ఓలా సంస్థల బాధితుల కళ్లలో కన్నీటి చెలిమలు ఉబికి వస్తున్నాయి.
సంస్థల మోసాలకు వ్యక్తి ఆత్మహత్య...
అంబర్‌పేటకు చెందిన జహీర్‌...8 నెలల క్రితం ఫైనాన్స్ లో ఇండికా కారు కొన్నాడు. ఆ కారును ఓబెర్ ఆన్‌లైన్‌ క్యాబ్స్‌లో పెట్టాడు. మొదట్లో చెప్పిన ప్రకారం చెల్లింపులు చేసిన సంస్థ... ఆ తర్వాత వాటికి కోతలు పెట్టింది. లక్ష సంపాదనతో పాటు బోనస్‌ అంటూ ఊదరగొట్టిన సంస్థ...మాటతప్పింది. చివరకు నెల నెలా ఫైనాన్స్‌ డబ్బులు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో జహీర్‌ను ఒక్కసారిగా అప్పులు చుట్టుముట్టాయి. వెహికల్‌ ఫైనాన్స్‌ చెల్లించేందుకు కూడా మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చింది. ప్రతినెలా అప్పుల కోసం పరుగులు తీసి అలసిపోయాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన జహీర్‌ భార్యను బంధువుల ఇంటికి పంపించి... ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రోడ్డున పడుతున్న ఒబేర్‌,ఓలా సంస్థల డ్రైవర్లు
ఇలా ఒక్క కుటుంబంలోనే కాదు...ఒబేర్‌, ఓలా సంస్థలను నమ్ముకున్న కుటుంబాల్లో ఇదే దయనీయ స్థితి. చేసిన అప్పులు ఎలా కట్టాలో... పూట ఎలా గడుస్తుందోనన్న భయం బాధితులను వెంటాడుతోంది.
డబ్బులు అడిగితే బౌన్సర్లతో దాడులు
ఆన్‌లైన్‌ సంస్థ కావడంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియని పరిస్థితి. హైటెక్స్‌లో ఉన్న సంస్థ తాళం పడటంతో.. జూబ్లీహిల్స్‌ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. డబ్బులు అడిగితే బౌన్సర్లతో దాడులు చేయిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే మాకు శరణ్యమంటున్నారు.
ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్న అధికారులు
ఒబేర్‌, ఓలా సంస్థలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. మంత్రి దగ్గరకు వెళ్లినా తమకు న్యాయం జరగలేదని బాధితులు వాపోతున్నారు. ఒబేర్‌, ఓలా సంస్థల వైఖరితో హైదరాబాద్‌లో సుమారు 30 వేల మంది డ్రైవర్లు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. డ్రైవర్ల జీవితాలతో ఆడుకుంటున్న ఒబేర్‌, ఓలా సంస్థలపై పోలీసులు, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

 

 

 

12:39 - November 19, 2015

కృష్ణా : నవంబర్‌ 19. దివిసీమ చరిత్రలో చీకటి అధ్యాయం నెలకొన్న రోజు. 10 వేల మంది ఊపిరి తీసిన ఉప్పెనకు నేటితో 38 ఏళ్లు నిండాయి. దివిసీమను నేటికీ ఆనాటి పీడకల వెంటాడుతూనే ఉంది. ఈ రోజును తలచుకుంటేనే దివిసీమవాసుల గుండెల్లో భయం మొదలవుతుంది. 38 ఏళ్ల క్రితం. . . 1977 నవంబర్‌ 19వ తేదీన ప్రశాంతంగా ఉన్న దివిసీమపై సముద్రుడు విరుచుకుపడ్డాడు. తుపానుపై రేడియోలలో హెచ్చరికలు వచ్చినా అంత ప్రభావం ఉండదేమోనన్న మొండి ధైర్యం అనేకమంది చావుకు కారణమైంది. నాటి చేదు జ్ఞాపకాలు నేటికి దివిసీమ వాసులను వెంటాడుతూనే ఉన్నాయి.
సొర్లగొంది తీరప్రాంత గ్రామాన్ని ముంచెత్తిన సముద్రుడు
ముఖ్యంగా నాగాయలంక మండలం సొర్లగొంది తీరప్రాంత గ్రామాన్ని సముద్రుడు ముంచెత్తాడు. అర్ధరాత్రి పూట కట్టలు తెంచుకున్న ప్రవాహం గ్రామాలపై విరుచుకుపడ్డాడు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే 714 మంది మృత్యువాతపడ్డారు. చిమ్మ చీకట్లో ఉధృతంగా విరుచుకుపడ్డ వరదలో అనేకమంది కొట్టుకుపోతూ.. తుమ్మ ముళ్ల కంపలకు చిక్కుకుని వేలాదిమంది ప్రాణాలు వదిలారు. పశుపక్ష్యాదులు సైతం మృత్యువాతపడ్డాయి. 200 కిలోమీటర్ల వేగంతో వీసిన ప్రచండ గాలులకు భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. విద్యుత్‌ స్తంభాలు విల్లుల్లా వంగిపోయాయి. గ్రామం మొత్తాన్ని శ్మశానంగా మార్చింది. శవాల గుట్టల మధ్య తమవారి ఆనవాళ్లను వెతికేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. రామాలయం, పంచాయతీ కార్యాలయంలో తలదాచుకున్న 200 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
అండగా స్వచ్ఛంద సంస్థలు
ఆనాటి ఉప్పెనలో అన్ని కోల్పోయినవారికి అండగా నిలిచేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకువచ్చాయి. శవాల గుట్టగా మారిన మృతదేహాలకు పోలీసులు సామూహిక దహన సంస్కారాలు నిర్వహించారు. ఆ చేదు అనుభవాలను తలచుకొని ఇంకా ఆ గ్రామస్తులు వెక్కివెక్కి రోదిస్తూనే ఉన్నారు.
దివిసీమపై ప్రభుత్వ నిర్లక్ష్యం
ఇంత ఘోరం జరిగినా ప్రభుత్వం దివిసీమపై నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. మరోసారి ఇలాంటి ఘోర విపత్తు జరగకుండా చూడాల్సిన సర్కార్‌.. కరకట్ట ఏర్పాటు చేసినా అది కాంట్రాక్టర్‌ కాసుల కక్కుర్తిలో నలిగి బలహీనపడిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. డ్రయిన్లపై ఏర్పాటు చేసిన క్రస్ట్‌ గేట్లు తుప్పుపట్టిపోయాయి. మరోవైపు తీరప్రాంతంలో సహజ రక్షణ కోసం ఉండే చెట్లను నరికేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు.
మృతుల కోసం పులిగడ్డలో పైలాన్‌
ఈ ఘోర విపత్తులో మరణించిన వారికోసం పులిగడ్డలో పైలాన్‌ను నిర్మించారు. అయితే ఏడాదికి ఒకనాడు తమవారిని స్మరించుకునేందుకు పైలాన్‌ వద్దకు వెళ్దామంటే అదికాస్తా ఆక్రమణదారుల కోరల్లో చిక్కుకుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఉప్పెనలు విరుచుకుపడుతున్నా పాలకులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. ఏది ఏమైనా పాలకులు, అధికారులు ఏనాడైతే నిర్లక్ష్యం వీడుతారో అప్పుడే దివిసీమ దివ్యసీమగా మారుతుంది.

 

12:12 - November 19, 2015

హైదరాబాద్‌ : కాదేదీ కల్తీకి అనర్హం అంటున్నారు.. హైదరాబాద్‌లోని కొందరు వ్యాపారాలు. పాల నుంచి గరం మసాల వరకు అన్నింటినీ కల్తీ చేస్తూ.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పాతబస్తీ కేంద్రంగా సాగుతున్న కల్తీ మసాలాల దందా బట్టబయలైంది. దేశంలోని చాలా ప్రాంతాలకు నకిలీ సరుకులను సరఫరా చేసే ముఠాను.. బేగంబజార్‌లో పోలీసులు పట్టుకున్నారు.
గొల్లకిడికీ ప్రాంతంలో కల్తీమసాలా తయారీ
హైదరాబాద్‌ పాతబస్తీలోని హుస్సేనీ ఆలం పోలీసు స్టేషన్‌ పరిధిలోని గొల్లకిడికీ ప్రాంతంలో నాలుగు గోడౌన్‌లు ఉన్నాయి. రోజూ 20 నుంచి 30 మంది వరకూ పని చేస్తుంటారు. అంత మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ కార్ఖానాల్లో.. జరుగుతున్నదంతా గలీజు దందానే.. గొల్లకిడికీలోని నాలుగు గోడౌన్‌లలో.. ఓ ముఠా.. కల్తీ మసాలా దినుసులు తయారు చేస్తోంది. గసగసాలు, మిరియాలు, జీలకర, వాము, సోంపు... ఇలా ఒకటేమిటి... అన్ని సరుకులనూ కల్తీ చేయడమే ఈ కార్ఖానాల్లో జరిగే తంతు. చూసేందుకు అసలు కంటే.. ఈ కల్తీ సరుకులే నాణ్యమైనవిగా కనిపిస్తాయి. కానీ వీటిలో ఉండేది ఇనుప రజను, బండరాళ్ల పొడి, పెయింట్స్ కలర్స్.
కల్తీ మసాలాలతో జీర్ణకోశ వ్యాధులు, గుండెజబ్బులు
గొల్లకిడికీలోని గోడౌన్‌లు నాలుగింటిలోనూ.. కల్తీ మసాలాలు తయారు చేసేందుకు వాడే పెయింట్ డబ్బాలు, రసాయనాల బస్తాలు, గడ్డి విత్తనాలు, రాతిపొడి బస్తాలను నింపేశారు. ఇక్కడ తయారు చేస్తున్న కల్తీమసాలను... ప్రముఖ బ్రాండ్‌ల లేబుల్‌ తగిలించి.. హైదరాబాద్‌ బేగంబజార్‌లో హోల్‌సేల్‌ డీలర్లకు తరలిస్తున్నారు. అలాగే.. దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. కేవలం 30 నుంచి 50 రూపాయల ఖర్చుతో తయారయ్యే డూప్లికేట్‌ జీలకర, గసగసాలను మార్కెట్‌లో... 500 నుంచి 700 రూపాయలకు విక్రయిస్తున్నారు. కల్తీ మసాలా దినుసులను తింటే జీర్ణకోశ వ్యాధులు, గుండె జబ్బులే కాదు.. మెదుడులోని నరాలూ దెబ్బతింటాయని, కేన్సర్‌కు దారితీసే ప్రమాదమూ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కల్తీ దందాతో సంబంధం ఉన్న 11 మంది అరెస్ట్
కల్తీ, నకిలీ మసాల తయారీ సూత్రధారి యూపీలోని షాజహాన్‌పూర్‌కు చెందిన రాజేష్‌గుప్తా. అక్కడ నుంచి ఇక్కడకు వచ్చి పాతబస్తీని అడ్డాగా చేసుకని నకిలీ మసాలాల తయారీ దందా సాగిస్తున్నారు. ఎనిమిది నెలలుగా ఈ వ్యాపారం సాగిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి ఆన్‌లైన్‌లో పోలీసులకు సమాచారం అందించడంలో రాజేష్‌గుప్తా మోసాలు బయటపడ్డాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. దందాతో సంబంధం ఉన్న 11 మందిని అరెస్ట్ చేశారు. గోదాములతోపాటు, సరుకునూ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వారికోసం గాలిస్తున్నారు.
అన్ని కోణాల్లోనూ పోలీసుల విచారణ
ఈ కల్తీ మసాలాల దందాతో దేశంలోని ఏయే ప్రాంతాల వ్యాపారులతో సంబంధం ఏర్పరచుకున్నారు..? వీరికి సహకరిస్తున్న ప్రముఖులు ఎవరు..? అన్న కోణాల్లోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీంతోపాటే.. నగరంలో ఇలాంటి దందాలు ఇంకా ఎక్కడెక్కడ కొనసాగుతున్నాయోనన్న సమాచారం కోసమూ ఆరా తీస్తున్నారు. మొత్తానికి తామున్న ప్రాంతంలోనే మసాలాల కల్తీ దందా బయటపడ్డంతో.. నగరవాసులు అవాక్కవుతున్నారు.

 

12:01 - November 19, 2015

చిత్తూరు : నగర మేయర్‌ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులుగా భావిస్తున్న చింటు అలియస్‌ చంద్రశేఖర్‌, రెడ్డి అలియాస్‌ జయప్రకాశ్‌, వెంకటేశ్వర్‌రెడ్డి కోలం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. చెన్నై, హైదరాబాద్‌, ముంబై, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ అధికారులకు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి లేఖలు పంపారు. వీరు దేశం విడిచి పోకుండా అడ్డుకోవాలని ఎయిర్‌పోర్ట్ అధికారులను కోరారు.

 

 

కటారి అనురాధ దంపతుల హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం

చిత్తూరు : నగర మేయర్‌ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులుగా భావిస్తున్న చింటు అలియస్‌ చంద్రశేఖర్‌, రెడ్డి అలియాస్‌ జయప్రకాశ్‌, వెంకటేశ్వర్‌రెడ్డి కోలం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. చెన్నై, హైదరాబాద్‌, ముంబై, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ అధికారులకు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి లేఖలు పంపారు. వీరు దేశం విడిచి పోకుండా అడ్డుకోవాలని ఎయిర్‌పోర్ట్ అధికారులను కోరారు.

 

11:34 - November 19, 2015

ఛత్తీస్ గఢ్ : సుకుమా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ సరిహద్దుకు 60 కిలీమీటర్ల దూరంలో ఛత్తీస్ గఢ్ సుకుమా జిల్లాలో డోర్నపాల్ వద్ద పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరికొంత మంది మావోయిస్టులు తప్పించుకున్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనాస్థలం వద్ద రెండు రైఫిళ్లు, రెండు టిఫిన్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దంతెవాడ, బీర్జాపూర్ లలో మావోయిస్టు కార్యకలాపాలు అధికమ్యాయి. ఈనేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసి... కూంబింగ్ చేపట్టాయి. ఈక్రమంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

 

11:28 - November 19, 2015

సెల్ఫీ...ప్రస్తుతం దీని గురించి తెలియని వారుండరు. కూర్చొంటే సెల్ఫీ..లేస్తే సెల్ఫీ..పడుకొంటే సెల్ఫీ...ఇలా సెల్ఫీలు తీసుకుంటూ మురిసిపోతుంటారు. సామాజిక మాధ్యమాల్లో సెల్ఫీలు పెట్టి షేర్ చేసుకుంటుంటారు. అసలు సెల్ఫీ అంటే ఏమిటీ ? మొబైల్‌తో మన ఫొటో మనమే తీసుకోవడం... అలాంటి ఫొటోలు తీసుకోడానికో మ్యూజియం ఉంది. అవును నిజం. ఇది ప్రపంచంలోనే మొదటిది! ఫిలీప్పీన్స్‌ రాజధాని మనీలాకు వెళితే ఈ మ్యూజియాన్ని చూడొచ్చు. ఈ మ్యూజియం నిండా ఎక్కడ చూసినా అద్భుతమైన త్రీడీ చిత్రాలే కనిపిస్తాయి. అయితే ఈ బొమ్మల్లో మనమూ భాగమై సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవచ్చు. మిగతా అన్ని మ్యూజియాల్లో పర్యాటకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడి వస్తువులను వేటినీ తాకొద్దని బోర్డులు రాసి పెడుతారు. పైగా కొన్ని ప్రదేశాల్లో సెల్ఫీ స్టిక్‌లను కూడా నిషేధించారు. కానీ సెల్ఫీ మ్యూజియంలో అలా కాదు, ఇక్కడి త్రీడీ పెయింటింగ్‌లను తాకొచ్చు, సెల్ఫీలు తీసుకోవచ్చు. ఎంతో సందడి చేయొచ్చు. కేవలం బొమ్మలను తాకడానికి అనుమతిస్తే ఇది సెల్ఫీ మ్యూజియం ఎలా అవుతుంది అంటారా? ఈ త్రీడీ బొమ్మల ప్రత్యేకతేంటో తెలుసా? వీటిల్లో మనమూ భాగమయ్యేలా తీర్చిదిద్దారు. ఉదాహరణకు పరుగెడుతున్న గుర్రాల రథం ఉంటుంది. కానీ దాన్ని నడిపే వారు ఎవరూ ఉండరు. ఆ స్థానంలో మనం కూర్చుంటే మనమే. అంతేకాకుండా సెల్ఫీ తీసుకోవచ్చు. బాగుంది కదూ..

11:25 - November 19, 2015

బ్యాంకులో డబ్బులు తీయాలంటే ఒకప్పుడు పాసుబుక్‌ పట్టుకుని బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. దానికి తోడు డబ్బు డ్రా చేసుకుని గమ్యానికి చేరే దాకా దొంగల భయం. కానీ ఇప్పుడు మారిన కాలానికి అనుగుణంగా వీధికో ఎటిఎం వెలిసింది. ఎటిఎం కార్డు ఉంటే చాలు.. లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. కానీ వాటిని అదనుగా చేసుకుని ఎన్నో ఎటిఎం నేరాలు జరుగుతున్నాయి. ఒక్కోసారి ఎటిఎం కార్డు మర్చిపోవచ్చు లేదా ఎక్కడైనా పోగొట్టుకోవచ్చు. ఆ సమయంలో ఎటిఎం నుండి డబ్బులు తీయడానికి వీలుండదు. అయితే ఇలాంటి ఇబ్బందులకు చెక్‌ పెడుతూ చైనా శాస్త్రవేత్తలు సరికొత్త టెక్నాలజీని సృష్టించారు. ప్రతీ ఒక్కరు స్మార్ట్‌ వినియోగాన్ని కోరుకుంటున్న తరుణంలో ఖాతాదారులకు స్మార్ట్‌గా సేవలు అందించేందుకు ఓ ముందడుగేశారు. ముఖాన్ని గుర్తుపట్టి డబ్బులిచ్చే ఎటిఎం టెక్నాలజీని చైనా పరిశోధకులు దిగ్విజయంగా అభివృద్ధి చేశారు. సింఘువా యూనివర్సిటీ, జెక్‌వాన్‌ టెక్నాలజీ సంస్థ పరిశోధకులు సంయుక్తంగా దీన్ని తయారు చేశారు. దొంగల బెడద తగ్గించడానికి సరికొత్త టెక్నాలజీ చాలా బాగా ఉపయోగపడుతుందని చైనా అధికారులు పేర్కొంటున్నారు. లావాదేవాలకు ఇది భద్రతతో పాటు రక్షణ కూడా కల్పిస్తుందని చెప్పారు. ఎటిఎంకు సంబంధించిన నేరాలు అదుపు చేసేందుకు ఈ టెక్నాలజీ ఉపకరిస్తుందని జెక్‌వాన్‌ టెక్నాలజీ సంస్థ ఛైర్మన్‌, సాంకేతిక నిపుణుడు గు జికున్‌ తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును అధికారులు ఆమోదించారనీ, త్వరలోనే మార్కెట్‌లోకి వస్తుందని తెలిపారు. ఇప్పటివరకు ఎటిఎంల కోసం అంతర్జాతీయ టెక్నాలజీ వాడుకుంటున్న చైనా, సొంత పరిజ్ఞానంతో ఎటిఎంలు నిర్వహించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే దీనిపై చాలా సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. గోప్యం విషయంలో ఈ టెక్నాలజీపై కొంతమంది పరిశోధకులు సందేహపడుతున్నారు. ఒక వేళ ఎవరైనా మరో వ్యక్తిలా ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంటే ఎలా? అన్న ఆలోచనల్లో మునిగిపోయారు. కాగా ఈ టెక్నాలజీని రూపొందించిన వారి వివరాలు, ఎటిఎం ఫేషియల్‌ డేటా వివరాలను ఎలా సంగ్రహిస్తుంది అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్

ఛత్తీస్ గఢ్ : సుకుమా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. డోర్నపాల్ వద్ద పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

 

తీవ్ర జ్వరంతో విద్యార్థిని మృతి

ఆదిలాబాద్ : బెజ్జూరు బాలికల ఆశ్రమ పాఠశాలలో తీవ్ర జ్వరంతో మమత అనే 8 వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. 

11:01 - November 19, 2015

కృష్ణా : జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య వార్‌ మొదలైంది. నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీల నడుమ ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. రైతుల హితం కోసం.. వల్లభనేని వంశీ చేసిన ఓ పని.. దేవినేనికి ఆగ్రహం తెప్పించింది. ఉమ, వంశీల నడుమ వార్‌కు.. వాటరే కారణమంటే ఆశ్చర్యం కలగవచ్చు కానీ.. నిజం. పట్టిసీమ నీటిని తన ప్రాంత రైతులు వినియోగించుకునేందుకు.. వల్లభనేని సహకరించడం.. దేవినేనికి ఆగ్రహం తెప్పించింది. గన్నవరం మండలంలోని బీబీ గూడెం వాసుల దాహార్తిని తీర్చేందుకు.. వంశీ సొంత ఖర్చుతో ఓ మోటార్‌ను కొనిపెట్టారు. దీంతో.. వారు పోలవరం కుడి కాల్వ నుంచి నీటిని తోడి.. మంచినీటి చెరువును నింపుకుని ఉపశమనం పొందారు.
పోలవరం కుడి కాల్వ నీటిని చెరువులకు ఎత్తిపోత
బీబీ గూడెం వాసులు... తాగు నీటి ఎద్దడిని అధిగమించిన తీరు తెలిసి.. పోలవరం కుడికాల్వ ప్రవహించే ప్రాంతాల ప్రజలందరూ వంశీపై ఒత్తిడి తెచ్చారు. దీంతో.. ఆయన ఒక్కోటి నలభై వేలు ఖరీదు చేసే మోటార్లు 150 కొనుగోలు చేశారు. ఇందులో ఇప్పటికే వంద మోటార్లు రైతులకు అందాయి. మోటార్లు పనిచేసేందుకు అవసరమైన విద్యుత్‌ కనెక్షన్ల కోసమూ.. వంశీ కొంత మొత్తాన్ని విద్యుత్‌ శాఖకు డిపాజిట్‌ చేశారు. ఈ మోటార్ల సాయంతో.. పోలవరం కుడి కాల్వ పరీవాహక రైతులు.. నీటిని తమ చెరువులకు ఎత్తి పోసుకోవడం మొదలు పెట్టారు. గన్నవరం, విజయవాడ రూరల్‌, బావులపాడు తదితర మండలాల్లోని సుమారు 15 గ్రామాల రైతులు.. పోలవరం కుడికాల్వ నీటిని మోటార్ల ద్వారా తమ చెరువులకు తోడుకున్నారు. ఈ మోటార్లు గంటకు రెండు లక్షల లీటర్ల నీటిని ఎత్తి పోతస్తున్నాయి. ఫలితంగా గన్నవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల చెరువులన్నీ జలసిరిని సంతరించుకున్నాయి. ఈనీటిని, మోటార్లు ఏర్పాటు చేసిన గ్రామాలతో పాటు.. సమీపంలోని గ్రామాల రైతులూ వినియోగించుకుంటున్నారు.
నీటి ఎత్తిపోతలకు సహకరించిన ఇంజనీర్లు
గన్నవరం నియోజకవర్గంలోని.. పంటలు ఎండిపోయిన ప్రాంతాలు, నీటి అవసరాలున్న పొలాలను దృష్టిలో ఉంచుకొని... కాల్వలు తవ్వించి మరీ మోటార్లతో నీటిని పంప్‌ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి పొలం గట్టు వద్దకే నీరు వస్తోంది. దీంతో రైతులు మోటార్లు ఉపయోగించుకోకుండా చిన్నపాటి గండ్లు పెట్టుకుని తమ పొలాల్లోకి నీటిని మళ్లించుకుంటున్నారు. తొలినాళ్లలో ఈ నీటి ఎత్తిపోతలకు సాగునీటి పారుదల శాఖ ఇంజనీర్లు కూడా సహకరించారు.
మోటార్ల ద్వారా నీటిని పంప్‌ చేయటంపై ఉమ ఫైర్..
తొలి రోజుల్లో ఈ మోటార్ల విధానం బావుందని దేవినేని ఉమ కూడా ప్రశంసించారు. గొల్లపూడి రైతుల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఆయనే నీటిని మళ్లించారు. అయితే.. ఆ తర్వాతి రోజుల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులకు తీవ్రమైన నీటి కొరత ఏర్పడటంతో.. మోటార్ల ద్వారా నీటిని పంప్‌ చేయటంపై మంత్రి ఉమ.. ఇరిగేషన్ అధికారులపై సీరియస్ అయ్యారని తెలుస్తోంది. కరవు పరిస్థితుల్లో నీటిని ఇలా వినియోగించడం సబబు కాదని.. కృష్ణా, గుంటూరు డెల్టాలను దృష్టిలో ఉంచుకుని మోటార్లను తొలగించాలని ఉమ అధికారులను ఆదేశించారు. ఇది రైతులను తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. పక్కనుంచి వెళ్తున్న నీళ్లను రైతులు తోడుకుంటే తప్పేంటని విపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి.
అధికారులపై దేవినేని ఉమ ఆగ్రహం..
గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్ కూడా అధికార పార్టీకి చెందిన వ్యక్తే కావటంతో నేరుగా ఆయన దగ్గర విషయాన్ని చెప్పలేక, మోటార్లను తీయించలేక.. అధికారులు తమ కోపాన్ని రైతుల మీద చూపుతున్నారు. వంశీ సమకూర్చిన మోటార్ల ద్వారా నీటిని తోడుకుంటున్న కొందరు రైతులను బెదిరించారు. అయితే.. తాము వెనకడుగు వేసేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. అంతేకాదు.. ఇరిగేషన్ అధికారులతో వాగ్యుద్ధానికి దిగుతున్నారు. తమ కళ్లముందే.. పోలవరం కాల్వ ద్వారా నీళ్లు వెళ్తున్నా.. తమకు నీరివ్వరా అంటూ నిలదీస్తున్నారు.
మోటార్లన్నింటినీ తొలగించాలని దేవినేని అధికారులపై ఒత్తిడి
మరోవైపు... రైతులకు ఎమ్మెల్యే వల్లభనేని సమకూర్చిన మోటార్లన్నింటినీ తొలగించి తీరాల్సిందేనని మంత్రి ఉమ అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు. వంశీపై రాజకీయ కక్షతోనే ఉమామహేశ్వరరావు ఇలా వ్యవహరిస్తున్నారని.. గన్నవరం ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. వల్లభనేని వంశీ కూడా.. తన నియోజకవర్గ రైతుల పక్షాన నిలిచి మోటార్లు తొలగించకుండా అధికారులను నిలువరిస్తున్నారు. దీంతో.. ఇద్దరు అధికార పార్టీ నేతల నడుమ సాగునీటి అధికారులు సతమతమై పోతున్నారు. కృష్ణా జిల్లాలో ఇప్పుడీ వివాదం. .రైతులు, రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

 

 

10:46 - November 19, 2015

ఢిల్లీ : భారతీయ రిజర్వు బ్యాంకు కార్యకలాపాలు ఇవాళ ఒక్కరోజు స్తంభించనున్నాయి. ఆర్‌బీఐ సంస్కరణలను వ్యతిరేకిస్తూ...కార్మికులు ఒక్కరోజు సామూహిక సాధారణ సెలవు బాటపట్టారు. దీంతో ఇవాళ షేర్‌మార్కెట్లు సహా..నగదు చెల్లింపులన్నీ ఆగిపోనున్నాయి.
స్తంభించనున్న ఆర్ బిఐ సేవలు
రిజర్వ్ బ్యాంక్‌ సేవలు నేడు స్తంభించనున్నాయి. మెరుగైన పదవీ విరమణ ప్రయోజనాలను కల్పించాలని, కేంద్ర బ్యాంకు అధికారులకు కోత విధించేలా ప్రతిపాధించిన సంస్కరణలను వ్యతిరేకిస్తూ...దాదాపు 17వేలమంది ఉద్యోగులు ఇవాళ ఒక్కరోజు సామూహిక సాధారణ సెలవు బాటపట్టనున్నారు. ఉద్యోగుల నిరసన సామూహిక సెలవుతో కరెన్సీ కార్యాకలాపాలు, షేరు మార్కెట్లు, ఫారెక్స్‌ లావాదేవీలు, చెల్లింపులు, సెటిల్‌మెంట్‌ లావాదేవీలపై పెను ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రతిపాదిత సంస్కరణలు ఆర్‌బీఐ నియంత్రణ అధికారాలను పరిమితం చేయనున్నాయని...రుణ నిర్వహణ కార్యకలాపాలను కూడా కేంద్ర బ్యాంకు ఆధీనంలోంచి దూరం చేసే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
సంస్కరణలను వ్యతిరేకిస్తున్న 4 ప్రధాన సంఘాలు
నిరసన సామూహిక సెలవుకు పిలుపునిచ్చిన నాలుగు ప్రధాన సంఘాలు సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకస్తున్నాయి. ఆర్‌బీఐ నిరసన సైరన్‌ మోగడం ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2009లో మెరుగైన పెన్షన్‌ను కోరుతూ ఆర్‌బీఐలో సమ్మెకు దిగారు. సమ్మె నేపథ్యంలో ఆర్‌బీఐ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రకటించకపోతే చెల్లింపుల, బ్యాంకుల్లో సెంటిల్‌మెంట్లకు అంతరాయం కలిగే అవకాశ ఉంది. కాగా ఈ సామూహిక సాధారణ సెలవు తుది దశలో ఉన్న ఆర్‌బీఐ సంస్కరణలపై మాత్రం బాగా ప్రభావం చూపే అకాశం ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. ద్రవ్యపరపతి విధాన సమీక్ష కమిటీ ఏర్పాటును యూనియన్ల్లు వ్యతిరేస్తున్నాయి. దీని వల్ల ఆర్‌బీఐ గల విశిష్ట విధాన నిర్ణయ అధికారరాలకు విఘాతం కలిగిస్తుందని యూనియన్లు భావిస్తున్నాయి. 

10:43 - November 19, 2015

ప్రపంచంలోని సూపర్‌ హ్యూమన్లను వెతికే పని అప్పజెబుతాడు డానియేల్‌ స్మిత్‌కు కామిక్‌ హీరోల సృష్టికర్త స్టాన్‌లీ. డానియేల్‌ కూడా ఓ సూపర్‌ హ్యూమనే. కాంటార్షనిస్ట్‌గా శరీరాన్ని ఎలా పడితే అలా మెలికలు తిప్పే అతడు చిన్న పెట్టెలో ఇరుక్కుపోగలడు. అలాంటి వాడు మన దేశంలోను ఉన్నాడు. రబ్బర్‌ బాయ్ ఆఫ్‌ ఇండియాగా పేరు తెచ్చుకున్న ఆ బడి పిల్లాడు జస్‌ప్రీత్‌ సింగ్‌ కల్రా. ప్రపంచంలోనే అతి అనువైన దేహం కలిగిన వ్యక్తిగా డానియేల్‌ పేరిట ఉన్న రికార్డును కైవసం చేసుకోవాలనేది జస్‌ప్రీత్‌ లక్ష్యం. దీని కోసం బాగానే మెలికలు తిరుగుతున్నాడు. కాళ్లను బాగా మడిచి భుజాల మీదకు ఎక్కించుకుంటాడు. తలను 180 డిగ్రీల కోణంలో తిప్పగలడు. సాధారణంగా మనిషి 90 డిగ్రీల కోణం వరకు మాత్రమే తలను తిప్పగలడు. పూర్తిగా వెనక్కి తిప్పి చూడగలడు. ఎవడి వీపు వాడు చూడలేడనే మాట జస్‌ప్రీత్‌ విషయంలో చెల్లదు. చేతుల్ని 360 డిగ్రీల కోణంలో తిప్పేయగలడు. వెనక్కు వంగి నీళ్లు తాగేయగలడు. పాదాలు, ముఖం వ్యతిరేఖ దిశలో ఉంచగలడు.

15 ఏళ్లు...
ఇలా ఎన్నో విన్యాసాలతో గగుర్పాటుకు గురిచేసే జస్‌ప్రీత్‌కు ప్రస్తుతం 15 ఏళ్లు. తాను చదివే స్కూల్లో అతడో సూపర్‌స్టార్‌. ఉదయం వ్యాయామ సమయంలో పిల్లలంతా గుమికూడి జస్‌ప్రీత్‌ కసరత్తుల్ని ఫొటోలు తీసుకుంటారు. జస్‌ప్రీత్‌ ఆటోగ్రాఫ్‌లకు ఎగబడతారు. ఇక పండగకి, పబ్బానికి బంధువుల్ని తన ఒళ్లు తిప్పే కళతో ఆశ్చర్యపరుస్తారు. అతడి విన్యాసాలు చూసిన వారంతా జస్‌ప్రీత్‌కు ఎముకలు లేవేమో లేదా ఏదైనా ఇబ్బంది ఉందేమో అని వైద్యుల్ని సంప్రదించాలని సలహాలిస్తారట. కానీ అలా విన్యాసాలు చేస్తున్నపుడు జస్‌ప్రీత్‌కు అసలే ఇబ్బంది అనిపించదట. మనం మెటికలు విరిచినంత తేలిగ్గా శరీరాన్ని మెలితిప్పేస్తుంటాడు. ఏ రకమైన అనారోగ్య ఛాయలు కనిపించలేదు. చాలా ఆరోగ్యంగా ఉండే జస్‌ప్రీత్‌కు పది పదకొండేళ్లు వయసున్నపుడు అతడి తల్లి సురీందర్‌ కౌర్‌ కల్రా ఈ ప్రత్యేక దేహ తీరును గమనించింది. మొదట్లో భయపడినా ఆ తర్వాత వారికి జస్‌ప్రీత్‌ విన్యాసాలు అలవాటు అయిపోయాయి.

మో చేయి ఫ్రాక్చర్...
12 ఏళ్లపుడు యోగాలో చేర్పించడంతో అతడి ఫ్లెక్సిబిలిటీ మరింత ఎక్కువయ్యింది. కానీ మితిమీరిన విన్యాసాలు ప్రయత్నించడంతో ఓ సారి మోచేయి ఫ్రాక్చర్‌ అయ్యింది. అప్పుడు యూట్యూబ్‌లో ఇతర కాంటార్షనిస్ట్‌ల విన్యాసాలు చూసిన జస్‌ప్రీత్‌కు ఓ విషయం బాగా అర్థమయ్యింది. తన కన్నా మెరుగ్గా ఇతరులెవరూ తలను తిప్పలేరని తెలుసుకున్నాడు. ఏడాదిన్నర తర్వాత పూర్తిగా కోలుకున్న జస్‌ప్రీత్‌ తిరిగి విన్యాసాలతో ప్రదర్శనలివ్వడం ప్రారంభించాడు. వీటిని చూసే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో అతడి పేరు చేర్చారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించి అనేక విదేశీ మీడియా కవరేజీ కూడా పొందాడు. ప్రస్తుతం బడి పాఠాల్లో తలమునకలై ఉన్న జస్‌ప్రీత్‌ యోగానే కెరీర్‌గా ఎంచుకుంటాడనంటున్నాడు. కాంటార్షనిస్ట్‌గా రికార్డులు బద్దలు కొట్టి డానియేల్‌ తరహాలో పేరు సంపాదించాలని అనుకుంటున్న జస్‌ప్రీత్‌ ఇప్పటికే ఆ దరికి చేరిపోయాడు. తల్లిదండ్రులు కాంక్ష కూడా అదే కావడంతో మెలికలకు బ్రేక్‌లు లేకుండా పోయాయి. 

10:41 - November 19, 2015

ఎన్ని భారీ హంగులతో సినిమాను తీర్చిదిద్దితే అంత బాగుంటుంది.... బిజినెస్‌ బాగా అవుతుంది అని నమ్ముతున్నారు ఈనాటి దర్శక నిర్మాతలు. అందుకే పాటలు, ఫైట్లపై కోట్లు కుమ్మరిస్తున్నారు. తాజాగా బాలకృష్ణ హీరోగా చేస్తున్న 'డిక్టేటర్‌'లోని ఓ పాట కోసం దర్శకుడు శ్రీవాస్‌ ఏకంగా కోటి రూపాయలకు పైగా వెచ్చించాడని టాక్. బాలకృష్ణ, వందల మంది డాన్సర్లతో ఈ పాటను హైదరాబాద్‌ చిత్రపురికాలనీలో వినాయక ఉత్సవాల సెట్‌వేసి తెరకెక్కిస్తున్నారు. రోజుకి 30లక్షల చొప్పున దాదాపుగా కోటి రూపాయలకు పైగా మొత్తాన్ని ఈ పాట కోసం కేటాయించినట్లు తెలుస్తోంది. సినిమా మొత్తానికి ఈ పాట ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందట. తమన్‌ సంగీతం అందించిన ఈ పాట సినిమాకు హైలైట్‌ కానుందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.

 

విశాఖలో ఎంవీఆర్‌ మాల్‌ను ప్రారంభించిన కాజల్‌ అగర్వాల్‌

విశాఖ : ప్రముఖ సినీనటి కాజల్‌ అగర్వాల్‌ విశాఖలో సందడి చేశారు. గాజువాక ప్రధాన రహదారిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఎంవీఆర్‌ మాల్‌ను ఆమె బుధవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన అభిమానులకు కాజల్‌ అభివాదం చేశారు. 

10:39 - November 19, 2015

మహేష్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ (సివిఎం) నిర్మించిన చిత్రం 'శ్రీమంతుడు'. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్‌ అయిన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లతో బిగ్గెస్ట్‌ గ్రాసర్‌గా ఈ చిత్రం నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్‌ ఉపయోగించిన సైకిల్‌కి సంబంధించి జరిగిన కాంటెస్ట్‌లో విజేతను ఇటీవల డ్రా ద్వారా మహేష్‌ ఎంపిక చేశారు. కరీంనగర్‌కు చెందిన జి.నాగేందర్‌రెడ్డి సైకిల్‌ విజేతగా నిలిచారు. విజేత జి.నాగేందర్‌రెడ్డికి బుధవారంనాడు మహేష్‌ సైకిల్‌ను ప్రధానం చేశారు.

10:38 - November 19, 2015

అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటేనే ఆరోగ్యం. లేకపోతే ఏదో ఒక రూపంలో అనారోగ్యం బయటపడుతుంది. ముఖ్యంగా శరీరంలో మెగ్నీషియం తగ్గితే చాలా ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో జరిగే 300 రకాల రసాయనిక చర్యల్లో దీనిపాత్ర ఉంటుంది. గుండె కొట్టుకోవడం నుండి కండరాలు, హార్మోన్ల పనితీరు వరకు మెగ్నీషియం పాత్ర ఉంటుంది. మెగ్నీషియం తగ్గితే తలెత్తే సమస్యల్లో ముఖ్యమైనవి ఆకలి లేకపోవడం, తల తిరుగుడు, ఒత్తిడి, తిమ్మిర్లు, ఒళ్లు మొద్దుబారడం, నొప్పులు మొదలైపవి. ఈ సమస్యలు కనిపించినా చాలాసార్లు దాన్ని వైద్యులు మెగ్నీషియం కొరతగా గుర్తించలేరు. అప్పుడు చికిత్స వేరుగా ఉంటుంది. మంచి ఆహారం ద్వారా శరీరానికి మెగ్నీషియం అందించడం తేలికే కానీ, మనం చేతులారా కొన్ని అలవాట్ల వలన మెగ్నీషియం లోపాన్ని కొని తెచ్చుకుంటున్నాం.

విటమిన్ డి లేకపోతే...
మితిమీరిన మోతాదులో కాఫీ, ఆల్కహాల్‌, సోడా తీసుకోవడం వలన శరీరానికి తగిన స్థాయిలో మెగ్నీషియం అందదు. అలాగే కూల్‌డ్రింకులు ఎక్కువగా తాగే అలవాటున్నా ఇదే పరిస్ధితి తలెత్తుతుంది. ఈ విషయాలను ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకున్నపుడు శరీరం విటమిన్‌ డిని శోషించుకోలేదు. విటమిన్‌ డి లేకపోతే శరీరం మెగ్నీషియంను ఎక్కువగా తీసుకోలేదు. తీపి పదార్థాలను అతిగా తీసుకున్నా కిడ్నీల ద్వారా మెగ్నీషియం బయటకు పోతుంది. అయితే ఈ కొరతని పూడ్చుకోవడానికి సప్లిమెంట్లు తీసుకోవచ్చు కానీ, అవి ఎక్కువైతే గుండెకు ప్రమాదం. అందుకే డాక్టర్‌ సలహా ప్రకారమే సప్లిమెంట్లు వాడాలి. ఆకుకూరలు, గింజలు, తృణ ధాన్యాలు, నట్స్‌, చేపలు, పెరుగు, అరటిపళ్లు, డార్క్‌ చాక్‌లెట్‌ మొదలైన పదార్థాల్లో మనకు మెగ్నీషియం ఎక్కువగా లభిస్తుంది.

విమాన తలుపు తెరవబోయిన మహిళకు జరిమానా

అమెరికా : విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఉన్నట్టుండి ఓ మహిళ విమాన తలుపు తెరవబోయింది. ఈ ఘటన అమెరికాలోని బోస్టన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌కి చెందిన ఓ విమానం లండన్‌ నుంచి అమెరికాలోని బోస్టన్‌ బయలుదేరింది. మరో అరగంటలో బోస్టన్‌లోని లోగన్‌ విమాశ్రయానికి విమానం చేరుకుంటుందనగా ఇంతలో పోలాండ్‌కి చెందిన కమీలా డోల్‌నియాక్‌ అనే 32 ఏళ్ల ప్రయాణికురాలు ఉన్నట్టుండి విమానం తలుపు తెరవడానికి యత్నించింది. ఇది గమనించిన తోటి ప్రయాణికులు సిబ్బంది సహాయంతో ఆమెని అదుపులోకి తీసుకున్నారు. విమానం ల్యాండ్‌ అయ్యాక సిబ్బంది అక్కడి అధికారులకు అప్పగించారు.

10:37 - November 19, 2015

1990-91లో జరిగిన ఇరాక్‌-కువైట్‌ యుద్ధం ఆధారంగా రూపొందిన చిత్రం 'ఎయిర్‌ లిఫ్ట్‌'. ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా అక్షయ్ కుమార్‌, నిమ్రత్‌కౌర్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను బుధవారం అక్షయ్ తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. కువైట్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే క్రమంలో ఎదురైన పరిస్థితులను దర్శకుడు రాజా కృష్ణ మీనన్‌ అత్యద్భుతంగా తెరకెక్కించారని అక్షయ్ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని 2016 జనవరి 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. 

10:37 - November 19, 2015

ఇషాన్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ రూపొందించబోయే చిత్రంలో నటించే అవకాశాన్ని 'అమైరా దస్తూర్‌' దక్కించుకుంది. కమర్షియల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కబోయే ఈచిత్రంతో అమైరా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అవుతోంది. దీంతోపాటు అమైరా ఇటీవల ఎన్టీఆర్‌తో కొరటాల శివ రూపొందిస్తున్న 'జనతా గ్యారేజ్‌' (వర్కింగ్‌ టైటిల్‌?) చిత్రం కోసం ఆడిషన్స్‌లో కూడా పాల్గొంది. అలాగే రామ్‌చరణ్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్న తమిళ చిత్రం 'తని ఒరువన్‌'లోను, రవితేజ తాజా చిత్రం 'ఎవడో ఒకడు'లోనూ అమైరా నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 'ఇషాక్‌' చిత్రం తో బాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమైన అమైరా ఆ తర్వాత తమిళంలో ధనుష్‌ సరసన 'అనేగన్‌' చిత్రంలో నటించింది.

10:36 - November 19, 2015

ఊరిని దత్తత తీసుకోవడమనే స్ఫూర్తిదాయక కాన్సెప్ట్‌తో రూపొందిన 'శ్రీమంతుడు' నిజ జీవితంలోనూ సమాజ సేవ చేయడంలో అందరికీ మార్గదర్శిగా నిలుస్తున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం శతదినోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో సినిమాలో మహేష్‌బాబు ఉపయోగించిన సైకిల్‌ని పొందడం కోసం కాంటెస్ట్‌ను నిర్వహించారు. ఈ కాంటెస్ట్‌ ద్వారా వచ్చిన 15 లక్షల రూపాయల మొత్తాన్ని సమాజ సేవకు వినియోగించాలనే ఉద్దేశ్యంతో బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌, హీల్‌ ఏ చైల్డ్‌ సంస్థలకు మహేష్ సతీమణి నమ్రతా చేతుల మీదుగా బుధవారం హైదరాబాద్‌లో విరాళంగా అందించారు. ఈ సందర్భంగా నిర్మాత రవిశంకర్‌ మాట్లాడారు. ఈ కాంటెస్ట్‌లో సుమారుగా 2200 మంది 999 రూపాయాలతో రిజిస్టర్‌ చేసుకోవడం జరిగిందని, దీని ద్వారా 15లక్షల రూపాయాలు వచ్చాయన్నారు. దీనిలో బసవతారకం కాన్సర్‌ హాస్పిటల్‌కు 5 లక్షలు, హిల్‌ ఏ ఛైల్డ్‌ సంస్థకు 10 లక్షల చొప్పున అందజేస్తున్నట్లు చెప్పారు. 'శ్రీమంతుడు' చిత్రానికి ఇంత పెద్ద విజయాన్నందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు దర్శకుడు కొరటాల శివ తెలిపారు. కొంత్తైనా సమాజానికి సహాయం చేయాలని భావించి 'శ్రీమంతుడు' సైకిల్‌ కాంటెస్ట్‌ను నిర్వహించినట్లు తెలిపారు. 

10:35 - November 19, 2015

నాగచైతన్య, శ్రుతిహాసన్‌ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ నిర్మించనున్న చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మీడియాతో మాట్లాడారు. మలయాళంలో సంచలన విజయం సాధించిన 'ప్రేమమ్‌' చిత్రానికి రీమేక్‌గా ఈచిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రమని, అంతేకాకుండా సంగీత భరిత వినోద దృశ్యకావ్యమని తెలిపారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన శ్రుతి హాసన్‌తోపాటు మరో ఇద్దరు కథానాయికలు నటిస్తున్నారని, వారిలో ఒకరిగా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తుండగా, మరో కథానాయికను ఎంపిక చేయాల్సి ఉందని చెప్పారు. డిసెంబర్‌ నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ను వైజాగ్‌లో నిర్వహించనున్నట్లు, సమ్మర్‌ స్పెషల్‌గా ఈచిత్రాన్ని విడుదల చేసే దిశగా నిర్మాణ కార్యక్రమాల రూపకల్పన జరుగుతోందన్నారు. 

10:34 - November 19, 2015

బాలకృష్ణ నటించబోయే 100వ చిత్రానికి 'గాడ్‌ఫాదర్‌' టైటిల్‌ని ఖరారు చేసినట్టు సమాచారం. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందిన 'సింహా', 'లెజెండ్‌' చిత్రాలు ఘనవిజయం సాధించిన సంగతి విదితమే. తాజాగా ఈ కాంబినేషన్‌ ఓ పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారట. సబ్జెక్ట్‌కి తగిన విధంగా 'గాడ్‌ఫాదర్‌' టైటిల్‌ని నిర్ణయించారని తెలుస్తోంది. బాలకృష్ణ ప్రస్తుతం శ్రీవాస్‌ దర్శకత్వంలో 'డిక్టేటర్‌' చిత్రంలో నటిస్తున్నారు. ఇది బాలకృష్ణ నటిస్తున్న 99వ చిత్రం. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉండగానే బాలకృష్ణ 100వ చిత్రానికి సంబంధించి కథా చర్చల్లో పాల్గొంటున్నట్టు సమాచారం.

 

10:34 - November 19, 2015

మహిళల్లో నిద్రలేమితో ఉత్పన్నమయ్యే అనారోగ్య సమస్యలు ప్రస్తుతం పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ప్రసవం తర్వాత వారంలో రెండు, మూడు రోజులు నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇక ఉద్యోగాలు చేసే మహిళలు... సగటున పనిదినాల్లో రోజూ ఏడుగంటల ఇరవై నిమిషాల పాటు, సెలవు దినాలలో ఎనిమిది గంటల ఇరవైనిమిషాల పాటు నిద్రపోతున్నారని ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. తక్కువ సమయం నిద్ర పోవడం వల్ల శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలు వస్తున్నాయి.  పని ఒత్తిడి, లైఫ్‌స్టైల్‌, డిప్రెషన్‌ నిద్రపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. నిద్ర సరిపోని వారు తిండి, పని వంటి విషయాలపై ఆసక్తిని కోల్పోతున్నారని తాజా అధ్యయనాల్లో తేలింది. అయితే సమయం తగ్గినా.. గాఢ నిద్రపోయే వారిలో ఇలాంటి సమస్యలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కంటినిండా. హాయిగా నిద్రపోవడానికి కొన్ని చిట్కాలు పాటించండి.

 • నిద్రకు ఉపక్రమించడానికి మూడు గంటల ముందు వ్యాయామం చేస్తే మంచి నిద్రపడుతుంది.
 • పడుకొనే ముందు కాఫీ, టీ లాంటివి తాగవద్దు. గోరువెచ్చని పాలు తాగితే మంచి నిద్ర పడుతుంది.
 • ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒకే సమయంలో పడుకోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.
 • పడకగదిలో మంచి సువాసన వచ్చే అగరవత్తులు, క్యాండిల్స్‌ వెలిగించుకోండి. పరిమళభరితమైన సువాసన మంచి నిద్ర పట్టేలా చేస్తుంది.
 • నిద్రించే ముందు మీకిష్టమైన మ్యూజిక్‌ను వినండి. తక్కువ సౌండ్‌తో సంగీతం వింటే అమ్మ పాడే జోల పాటలా ఉంటుంది. మిమ్ముల్ని ఇట్టే నిద్రలోకి జారుకునేలా చేస్తుంది.
 • రాత్రిపూట తీసుకునే ఆహారం నిద్రకు రెండు గంటల ముందే తీసుకోవడం మంచిది.

చెన్నైలో వరదల కారణంగా విద్యాసంస్థలకు సెలవు

హైదరాబాద్‌: ఉపరితల ఆవర్తనం కారణంగా చెన్నైలో చిరు జల్లులు, పశ్చిమ తమిళనాడు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కడలూరు జిల్లాలో 683 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. కడలూరు జిల్లా వ్యాప్తంగా నష్టం అంచనాపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నివేదిక కోరారు. కడలూరు జిల్లాలో వరద పరిస్థితి, సహాయక చర్యలను మంత్రి పన్నీర్‌ సెల్వం పర్యవేక్షిస్తున్నారు. చెన్నైలో వరదల కారణంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈనెల 22 వరకు పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

బలహీనపడిన అల్పపీడనం

హైదరాబాద్ : బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలహీనపడింది. రానున్న 24గంటల్లో దక్షిణ కోస్తాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. తీరం వెంబడి గంటకు 40-45కిలో మీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. 

10:25 - November 19, 2015

నెల్లూరు : జిల్లాలో వరద ఇప్పట్లో తగ్గుముఖం పట్టే అవకాశం కనిపించడం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద ముంపు అంతకంతకు పెరుగుతోంది. తాజాగా కొండాపురం మండలంలోని సాయిపేట చెరువుకు గండి పడింది. దీంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. 35వేల 717 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. జిల్లాల్లో ఇప్పటివరకు 450కిలో మీటర్ల మేర రోడ్లు ధ్వంసం కాగా సుమారు...350 చెరువులకు గండ్లు పడ్డాయి. అటు జిల్లాలోని కైవల్య, కాళంగి, స్వర్ణముఖి, పెన్నా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో సోమశిల జలాశయంలో నీటిమట్టం 40 టీఎంసీలకు చేరింది. గూడూరు-నెల్లూరు డివిజన్ లోని పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి.

 

10:21 - November 19, 2015

చిత్తూరు : నగర మేయర్ కటారి అనురాధ...కటారి మోహన్ దంపతుల హత్య వెనుక ప్రధాన సూత్రధారి చింటూయేనని పోలీసులు నిశ్చిత అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ నెల 17వ తేదీన మేయర్ కటారి అనురాధ..కటారి మోహన్ లపై నిందితులు కత్తులు..తుపాకులతో దాడి చేసిన సంగతి తెలిసిందే. అనురాధ అక్కడికక్కడనే మృతి చెందగా కటారి మోహన్ వేలూరులోని సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
సబ్ మెరైన్ ఇంజినీర్ గా పనిచేసిన చింటూ ముంబై ఓడరేవుల్లో పనిచేశాడు. కేవలం మేనమామ కోసం ఉద్యోగాన్ని వదిలి చిత్తూరుకు వచ్చి రాజకీయంగా..ఆర్థికంగా స్థిరపడ్డాడు. కానీ మేనమామ..అత్తయ్య హత్య తరువాత చింటూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. చింటూ కోసం నాలుగు బృందాలు గాలింపులు చేపడుతున్నాయి. రెండు బృందాలు ముంబై వెళ్లగా మరో రెండు బృందాలు బెంగళూరు సమీప ప్రాంతాల్లో గాలింపులు చేపట్టాయి. చింటూకు ఆర్థికపరమైన లావాదేవీలు..సన్నిహితులు ముంబై..కర్నాటకలో ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. చింటూ సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కటారి దంపతుల హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న సతీష్ ప్రస్తుతం వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 20 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇతని వద్దకు మీడియాను పోలీసులు అనుమతించడం లేదు. పూర్తిస్తాయిలో కోలుకున్న అనంతరం పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు చిత్తూరు బంద్ నేడు కూడా కొనసాగుతోంది. కాసేపట్లో కటారి దంపతుల అంత్యక్రియలు జరుగనున్నాయి. 

10:16 - November 19, 2015

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక నివాసం సమీపంలో ఓ పోలీసు తుపాకీ ప్రమాదవశాత్తూ పేలింది. రేస్‌ కోర్స్ రోడ్డు ఏడో నెంబర్ నివాసం దగ్గర డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ తుపాకి లోడ్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. కంట్రోల్‌ రూం సమీపంలో మూడుసార్లు బుల్లెట్ల శబ్దం వినిపించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక సమస్యతోనే పేలుడు జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

10:11 - November 19, 2015

కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచడం వల్ల దేశానికి వచ్చిన నష్టం, ప్రమాదం లేదని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ విశ్లేషణ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఉద్యోగులకు వేతనాలు పెంచితే... దేశ ఆర్థికపిరిస్థితి కుంటుపడుతుందనడం సరికాదన్నారు. ఉద్యోగుల వేతనాల పెంపుపై దేశ ఆర్థికపరిస్థితి ఆధారపడి లేదని.... ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. సామాన్యులకు జీవనోపాధి, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచడం వల్ల దేశ ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుందని.. నష్టం కలుగదని తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...
ఏడో పే కమిషన్... నో పే కమిషన్... 
'దేశ ఆర్థిక పిరిస్థితి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపుపై ఆధారపడి లేదు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానలపై ఆధారపడి ఉంటుంది.7 వ పే కమిషన్ లో 15 శాతం వేతనాలు పెంచుతామనడం సమంజసం కాదు. ఏడో పే కమిషన్... నో పే కమిషన్ లా మారే అవకాశం ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో 40 వేల మంది కేంద్రప్రభుత్వం ఉద్యోగులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఐదేళ్లకు ఒకసారి పే కమిషన్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదేళ్లకు ఒకసారి ఒకసారి పే కమిషన్ ఉంటుంది. 5వ పే కమిషన్ 50 శాతం వేతనాలు పెంచింది. 6వ పే కమిషన్.. 60 శాతం వేతనాలు పెంచింది. 7 వ కమిషన్ లో 15 శాతం వేతనాలు పెంచుతామనడం సమంజసం కాదు. ఉద్యోగుల వేతనాలు పెంచకపోతే దేశ పరిస్థితి మెరుగుపడతుందని, పేదరికం పోతుందని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే... ఉద్యోగులకు వేతనాలు పెంచాల్సిన అవసరం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు లక్షల రూపాయల వేతనాలు తీసుకుంటున్నారు. కానీ ఉద్యోగుల వేతనాల పెంపుకు వచ్చే సరికి ఆర్థిక పిరిస్థితి బాగోలేదని అనడం సరికాదు. ఆర్థికపరిస్థితి బాగలేనప్పుడు బడా పారిశ్రామికవేత్తలకు రూ.5లక్షల 79 వేల కోట్ల రూపాయలను రాయితీలుగా ఎలా ఇచ్చారు. సామాన్యులకు జీవనోపాధి, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంపుతో దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది...తప్ప.. కుంటుపడదు'. అని నాగేశ్వర్ వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:38 - November 19, 2015

సీఎం కేసీఆర్ రాజకీయ దిగజారుడు మాటలు మానుకోవాలని వక్తలు సూచించారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు నడింపల్లి సీతారామరాజు, టీటీడీపీ నేత విద్యాసాగర్, టీకాంగ్రెస్ నేత మల్లురవి, బిజెపి నేత ప్రకాశ్ రెడ్డి, టీఆర్ఎస్ నేత.. తాడూరి శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. నేతలు వ్యక్తి గత విమర్శలు చేసుకోవడం సరికాదన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు కరవు ప్రాంతాల నివేదికలు కేంద్రానికి పంపలేదని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

రోడ్డుప్రమాదంలో ఇద్దరి మృతి

నల్గొండ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆలేరు సమీపంలో హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై కారు టైర్‌ పంక్చర్‌ అవడంతో పక్కకు ఆపి మరమ్మతులు చేస్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. 

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 3 గంటలు సమయం పట్టగా నడకదారి భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. 

09:16 - November 19, 2015

నీళ్లలో ఎగిరే చేపలను చూసి పరవశించేవారు కొందరైతే, వాటి ని టేస్ట్‌ చూసి జిహ్వ చాపల్యం తీర్చుకునేవారు కొందరు. మన దేశంలో పాతిక కోట్ల మందికి చేపలు ఇష్టమైన ఆహారమైతే, కోటిన్నర మందికి జీవనాధారం. ఇంతటి ప్రాధాన్యతగల మత్స్యపరిశ్రమ భవిష్యత్‌ ఏమిటి? మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తోందా?
ప్రకృతి ప్రసాదించిన వరం చేప..
నీళ్లలో ఎగిరే చేపను చూస్తే మన మనస్సు పరవశిస్తుంది. అక్వేరియంలో ఈదుడులాడే చేప పిల్లలను చూస్తే పసిపిల్లలు కేరింతలు కొడతారు. ఇప్పటికీ చాలామంది తల్లులు చేప పిల్ల కథలు చెబుతూ తమ చిన్నారులను నిద్రపుచ్చుతారు. చేప మన సంతోషం. మన నెచ్చలి. మనకు ప్రకృతి ప్రసాదించిన వరం. అత్యంత పోషకాహార విలువల సమాహారం.
నిరుపేదలకు చేపే జీవితం
మన దేశంలో చాలామంది నిరుపేదలకు చేపే జీవితం. కోటిన్నర కుటుంబాలకు అదే జీవనాధారం. దాదాపు పాతిక కోట్ల మందికి చేప ఇష్టమైన ఆహారం. సీఫుడ్‌కి మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద మార్కెట్‌ వుంది. మత్స్యసంపద విషయంలో చైనా తర్వాతి స్థానం మనదే. ఏటా మన దేశం నుంచి 18, 856 కోట్ల రూపాయల విలువైన మత్స్య సంపద ఎగుమతి అవుతోంది. వ్యవసాయరంగం ఎగుమతుల్లో జలచరాలది 17శాతం వాటా. జీడీపీలో మత్స్యసంపద వాటా ఒక శాతానికి చేరింది.
మత్స్యకారులపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు
దేశానికి ఇన్ని రకాలుగా సేవలందిస్తున్న మత్స్యకారుల విషయంలో ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం లేదు. మన దేశంలో సముద్రాలు, నదులు, భారీ జలాశయాలతో పాటు చెరువులు, కుంటలు, చిన్నచిన్న తటాకాలు కూడా మత్స్యసంపదకు నిలయాలుగా విలసిల్లుతున్నాయి. సముద్రాలు, నదుల్లో చేపలు పట్టేవారికి ప్రతి దినమూ గండమే. కోస్తా తీరంలో ఎప్పుడు ఏ తుపాన్‌ వచ్చినా తొలి దెబ్బతినేది మత్స్యకారులే. సర్వంకోల్పోయేదీ వారే. ఒక్కొక్కసారి ప్రాణాలూ పోతాయి. చేపల వేటకు సముద్రం మీదకు వెళ్లినవారు తిరిగొచ్చేదాకా కుటుంబ సభ్యులంతా టెన్షన్‌ అనుభవిస్తూనే వుంటారు. సముద్రంలో చేపల వేట చాలామందికి మూడునాలుగు వారాల పాటు సాగే సుదీర్ఘ ప్రయాణం. ఎగిసెగిసిపడే అలల మధ్య తమ ప్రాణాలనే ఫణంగా పెడుతూ దేశానికి విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిపెడుతున్నారు మత్స్యకారులు.
చేపల మార్కెట్ లు ఏర్పాటు చేయడంలో అలసత్వం...
ఎంతో రిస్క్ తీసుకుని పట్టుకొచ్చిన జలచరాలను మార్కెట్‌ చేసుకోవడం మత్స్యకారులకు అంతకు మించిన ప్రయాసగా మారుతోంది. మన దేశంలో పాతిక కోట్ల మంది నికరంగా చేపల వినియోగదారులున్నా మార్కెట్‌ సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టడం లేదు. విదేశీ ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని, విదేశీ మారకద్రవ్యాన్ని ఆరగించడమే తప్ప వారి సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేవీ లేవు. చివరకు హైదరాబాద్‌ లాంటి మహానగరాల్లో సైతం ప్రభుత్వం నెలకొల్పిన చేపల మార్కెట్‌ లేకపోవడం మత్స్యకారుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న అశ్రద్ధకు నిదర్శనం. కార్పొరేట్ సంస్థలకు వేలాది ఎకరాలు ధారాదత్తం చేసే ప్రభుత్వాలకు చేపల మార్కెట్ లు ఏర్పాటు చేయడానికి ఎందుకు మనసొస్పదో ఎవరికీ అర్ధం కాదు.
కోల్డ్ స్టోరేజీలు అంతంతమాత్రమే..
సముద్రాల్లో జలాశయాల్లో చేపలు వేటాడడం ఒక ఎత్తయితే, వాటిని నిల్వ చేయడం మరో ఎత్తు. కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు విస్తరించకపోవడంతో మత్స్యకారులు పట్టుకొచ్చిన మత్స్యసంపదలో పాతిక శాతం వృధాగా పాడైపోతోంది. మనదేశంలో ఏటా దాదాపు 15వేల కోట్ల రూపాయల మత్స్యసంపద పాడైపోతోందంటే అంతకు మించిన దురదృష్టం మరొకటి వుంటుందా? మత్స్యకారులు ఎదుర్కొంటున్న మరో ముఖ్య సమస్య నాణ్యమైన, ఆరోగ్యవంతమైన సీడ్‌ దొరకకపోవడం. సీ ఫుడ్స్ కి మనదేశంలో గిరాకీ పెరుగుతున్నా, ప్రోసెసింగ్‌ పరిశ్రమ వేళ్లూనుకోకపోవడమూ మత్స్యకారులకు శాపంగా మారింది.
జలచరాల ఉత్పత్తులు పెంచడానికి అవకాశాలు
నిజానికి మనదేశంలో జలచరాల ఉత్పత్తులు పెంచడానికి చక్కటి అవకాశాలున్నాయి. మనదేశంలో దాదాపు 24 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో జలాశయాలుండగా చేపల ఉత్పత్తికి అందులో సగం మాత్రమే వినియోగించుకుంటున్నాం. పెద్ద పెద్ద రిజర్వాయర్‌లలో హెక్టార్‌కి మూడు నాలుగు టన్నుల చేపలను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ, కేవలం ఒక టన్ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. ఫిషరీస్‌లో సరైన శిక్షణ లేకపోవడం, వాటర్‌ బాడీస్‌ను సరిగా వినియోగించుకోలేని అసమర్ధతలే ఇందుకు కారణం. మరోవైపు అభివృద్ధి పేరుతో , ఎస్‌ఈజడ్‌ల పేరుతో కోస్తాతీరంలో జరుగుతున్న విధ్వంసం, తీరప్రాంతాల్లో ఫార్మాసిటీల ఏర్పాటు, పరిశ్రమలు వదిలే విషపదార్థాలు మత్స్యసంపదకు మరణశాసనం రాస్తున్నాయి.

 

 

08:47 - November 19, 2015

మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ మత్స్యకారుల సంఘం నేత ఎల్‌.బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జలవనరులపై మత్స్యకారులకు పూర్తి హక్కు కల్పించాలని కోరారు. బడ్జెట్ లో మత్స్యకారులకు నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. 'ఎల్లుండి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం. అదే రోజు తమ సమస్యలు పరిష్కరించాలంటూ హైదరాబాద్‌ లో మహాధర్నా నిర్వహించేందుకు మత్స్యకారులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మత్స్యపరిశ్రమ అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయి. అయితే, మత్స్యకారులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉభయ రాష్ట్రాల్లో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి వున్న అవకాశాలు, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల'పై బాలకృష్ణ మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:02 - November 19, 2015

వరంగల్ : 'గీత దాటితే వాత పడుతుంది. కొత్త స్కీమ్‌లు తీసుకొస్తే యాక్షన్‌ సీరియస్‌గా ఉంటుంది. తిష్ట వేసిన వాళ్లంతా తిరిగి రాకపోతే కొరడా ఝళిపించాల్సి వస్తుంది'. వరంగల్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఇచ్చిన వార్నింగ్‌ ఇది. మరోపక్క రూల్స్ క్రాస్‌ చేశారన్న ఆరోపణలపై టీఆర్‌ఎ స్‌ సర్కార్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది.
విపక్షాల ఆరోపణలపై స్పందించిన భన్వర్‌లాల్‌
ఉప ఎన్నిక షెడ్యూల్‌ వెలువడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని విపక్షాలు మొదటి నుంచీ మొత్తుకుంటానే ఉన్నాయి. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వచ్చాయి. విపక్షాల ఆరోపణలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ స్పందించారు.
రాజీవ్‌శర్మకు నోటీసులు
షెడ్యూల్‌ వెలువడిన తర్వాత కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని సీఎస్‌ రాజీవ్‌శర్మకు నోటీసులు ఇచ్చామని భన్వర్‌లాల్‌ తెలిపారు. కౌంటింగ్‌ పూర్తి అయ్యేంత వరకు ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టకూడదని ఆదేశాలు జారీ చేశామన్నారు.
కేసీఆర్‌ నిర్ణయాలపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు
విద్యార్థులకు సన్నబియ్యం, బిసీలకు కళ్యాణలక్ష్మీ, క్రైస్తవులకు వరాలు తదితర అంశాలకు సంబంధించి కేసీఆర్‌ నిర్ణయాలపై కాంగ్రెస్‌ ఈసీకి ఫిర్యాదు చేసింది. వీటిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఈసీ నోటీసులు ఇచ్చింది. దీంతో పాటు టీఆర్‌ఎస్‌, బీజేపీలు కూడా ఫిర్యాదు చేశాయని,..వాటిపై జిల్లా కలెక్టర్‌ వివరణ ఇవ్వాలని ఆదేశించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌ లాల్‌ చెప్పారు.
నేటితో ప్రచారానికి తెర
గురువారంతో వరంగల్‌ ఉప ఎన్నిక ప్రచారం ముగుస్తుంది. నియోజకవర్గానికి చెందని నేతలంతా అక్కడ నుంచి వచ్చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. నేతల కదలికలను పర్యవేక్షించేందుకు షాడో టీములను ఏర్పాటుచేశామని భన్వర్‌ లాల్‌ తెలిపారు.
ఉప ఎన్నిక ఏర్పాట్లు పూర్తి
ఉప ఎన్నిక కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 21న జరిగే ఈ ఎన్నిక కోసం 20 వేలమంది కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు. 1,778 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటుచేశారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నారు. అన్ని పోలింగ్‌ బూతుల్లోకి ఓటు వేయడానికి వచ్చిన మొదటి ఓటరుకు ఎన్నికల సిబ్బంది పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికేందుకు ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది.

 

07:46 - November 19, 2015

హన్మకొండ : వరంగల్‌ ఉప ఎన్నికల ప్రచారానికి మరి కొద్ది గంటల్లోనే తెరపడనుండడంతో అటు నేతలు జోరుగా గ్రామాలను, పట్టణాలను చుట్టేశారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణల డోసును పెంచాయి. మరో వైపు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెద్ద ఎత్తున నగదు, మద్యం కూడా పోలీసులు సీజ్‌ చేశారు. చివరి నిమిషం వరకూ తమ అదృష్టం పరీక్షించుకునేందుకు ఓటరు మహాశయుడిని కాళ్లవేళ్ల పడి మరీ బతిమాలేందుకు సైతం వెనకాడట్లేదు మన నేతలు.
రణరంగంగా ఉప ఎన్నికల ప్రచారం
వరంగల్ ఉప ఎన్నికల ప్రచారం రణరంగాన్ని తలపిస్తోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తూ జనంలోకి వెళ్తున్నారు. ప్రచారానికి కేవలం గంటల వ్యవధే మిగిలిఉండటంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. వరంగల్‌ వెస్ట్‌జోన్‌ కేటీఆర్‌ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఈస్ట్‌జోన్‌లో హరీష్‌రావ్, తొర్రూర్‌లో జగదీశ్వర్ రెడ్డి, సంగెంలో కవిత, రేగొండలో పోచారం ఇతర మంత్రులు ఏడు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీ,రోడ్ షో, ఇంటింట ప్రచారం చేశారు. పరకాలలో ఈటెల రాజేందర్‌ పలు సంఘాలతో సమావేశమయ్యారు. అలాగే కేసీఆర్‌ అభివృద్ధి సంక్షేమాలే తమను గెలిపిస్తాయని మంత్రి హరీశ్‌రావు చెప్పుకొచ్చారు.
బీజేపీ, టీడీపీలు భారీ బహిరంగసభ
ఇక వరంగల్ నగరంలో బీజేపీ, టీడీపీలు హన్మకోండ కాళోజి కళా క్షేత్రం గ్రౌండ్ లో భారీ బహిరంగసభ నిర్వహించింది. కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, టిడీపీ నుంచి ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి ఇతర నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. తమ అభ్యర్ధికే ఓటు వేయాలని ఇళ్లిళ్లు తిరిగి ప్రచారం చేశారు.
కాంగ్రెస్ తరపున జాతీయ నేతలు క్యాంపెయిన్‌
ఇక కాంగ్రెస్ తరపున జాతీయ నేతలు క్యాంపెయిన్‌ చేశారు. ఎంజీఎం సెంటర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మాజీ కేంద్రమంత్రి ఆజాద్‌ ప్రసంగించారు. అలాగే వరంగల్ ఇస్లామిక్ గ్రౌండ్ లో వామపక్షాల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఇందులో వామపక్షలు బలపరిచిన గాలి వినోద్ కుమార్ కు మద్దతుగా వామపక్ష రాష్ట్ర నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అధికార పార్టీకి ఈ ఎన్నికల ద్వారా బుద్ది చెప్పాలని కోరారు. అలాగే వారు బలపరిచిన ఎంపి అభ్యర్థి గాలి వినోద్ కుమార్ కు ఈ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని నేతలు కోరారు.
వైసీపీ భారీ బహిరంగసభ
ఇక ప్రచారం తుది అంకానికి చేరుకోవడంతో వైసీపీ భారీ బహిరంగసభ నిర్వహించింది. ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి హాజరై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు....ప్రతిపక్షాలకు డిపాజిట్‌ కూడా దక్కదని టీఆర్‌ఎస్‌ తేల్చేసింది. ఉదయం నుంచి రాత్రి వరకు నేతలంతా బిజీబిజీగా గడిపారు.
నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్‌ను ఆదేశించిన ఈసీ
అలాగే వరంగల్‌ ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్‌ కోడ్‌ ఉల్లంఘించారన్న ఫిర్యాదులపై ఈసీ స్పందించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్‌ను ఆదేశించింది. వరంగల్‌ ఉప ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌ ఇచ్చిన హామీలపైన వివిధ పార్టీలకు చెందిన నేతలంతా రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. నేడు సాయంత్రం ఐదు గంటలతో ప్రచారానికి తెరపడనుంది.
ఈ నెల 21న పాఠశాలలకు సెలవు
వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఒక కోటి 79 లక్షల నగదు, 4 వేల లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేసినట్లు ఈసీ భన్వర్‌లాల్‌ తెలిపారు. పోలీంగ్‌ సందర్భంగా ఈ నెల 21న పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వరంగల్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలో ఓటు హక్కులేని రాజకీయ నేతలు వరంగల్‌ వదిలి వెళ్లాలని ఈసీ భన్వర్‌ లాల్‌ ఆదేశించారు.

 

07:39 - November 19, 2015

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పట్టణ ప్రాంతాల్లో పేదలకు గృహ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు కేంద్ర గృహ నిర్మాణ శాఖ ఆమోదం తెలిపింది. మొత్తం రెండు కోట్ల గృహాలు నిర్మించాలనే లక్ష్యంగా కొనసాగుతున్న ఈ పథకంలో తొలి దఫాలో 2 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించాలని సంకల్పించింది. ఈ పథకంలో సింహభాగం గృహాల కేటాయింపు ఆంధ్రప్రదేశ్‌కే దక్కడం విశేషం.
ఎట్టకేలకు ముందడుగు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అందరికీ గృహాలు ప్రాజెక్టులో ఎట్టకేలకు ముందడుగు పడింది. మొదటి విడతలో భాగంగా ఐదు రాష్ట్రాల్లోని పట్టణ పేదలకు 2లక్షల,28 వేల,204 ఇళ్లు నిర్మించేందుకు కేంద్ర గృహ, పట్టణ, పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ నిర్మాణాలకు కేంద్రం సాయంగా 3వేల 231 కోట్లు అందించనుంది.
రాష్ట్ర ప్రభుత్వాలే స్థలం కేటాయించాలన్న కేంద్రం
పరిమిత ఖర్చులో ఇళ్ల నిర్మాణ భాగస్వామ్యం, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద చేపట్టనున్న ఈ నిర్మాణ ప్రాజెక్టులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే స్థలం కేటాయించాలని కేంద్రం స్పష్టం చేసింది. అందరికీ ఇళ్లు ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోని పది నగరాల్లో 10వేల 290 గృహాలు కేటాయించగా, ఆంధ్రప్రదేశ్‌కు 37 నగరాల్లో ఒకలక్షా 93 వేల 147 గృహాలను కేటాయించింది.
కేంద్ర మంజూరు పర్యవేక్షక కమిటీ
కేంద్ర గృహ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ కార్యదర్శి నందితా ఛటర్జీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం ఒక సమావేశం జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం ఆయా రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మంత్రిత్వ శాఖలోని కేంద్ర మంజూరు పర్యవేక్షక కమిటీ తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్‌, రాజస్థాన్‌, తమిళనాడులలో మొత్తం 2లక్షల28వేల204 గృహాలు నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం గృహాల్లో 2లక్షల17 వేల 748 గృహాలు ఆర్థికంగా బలహీన వర్గాలకు కేటాయించాలని నిర్ణయించింది.
ఆర్థిక సాయంగా రూ.లక్షన్నర
అత్యధికంగా గృహాలు ఆంధ్రప్రదేశ్‌ దక్కించుకోగా గుజరాత్‌ 15వేల580 గృహాలు, రాజస్థాన్‌ 6వేల 255 గృహాలు, తమిళనాడు 2వేల 932 గృహాలు దక్కించుకొని తరువాతి స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుతం ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి కేంద్రం తన వంతు ఆర్థిక సాయంగా లక్షన్నర రూపాయలను అందించనుంది. గృహాల ప్రాజెక్టుల నిర్మాణంలో గతంలో ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకొని ప్రస్తుత ప్రాజెక్టులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే స్థలం కేటాయించాలని కేంద్రం స్పష్టం చేసింది.
పట్టణ పేదలకు రెండు కోట్ల గృహాలు
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద 2022 వరకు పట్టణ పేదలకు రెండు కోట్ల గృహాలు నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. గృహాల నమూనాను బట్టి ఒక్కో ఇంటికి లక్ష నుంచి 2లక్షల 33వేల వరకు కేంద్రం సాయం అందించనున్నట్లు తెలిపింది.

 

07:31 - November 19, 2015

హైదరాబాద్ : ఎపిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలోచ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎపి జలమయం అయింది. చిత్తూరు, కడప జిల్లాల్లో.. భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. వర్షపునీటితో.. వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. అటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో వానల కారణంగా.. పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. వరిచేలు నేలకొరిగాయి.
చిత్తూరులో...
చిత్తూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆస్తి, ప్రాణ నష్టంతో భారీగా పంట నష్టం వాటిల్లింది. వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. వర్ష బీభత్సానికి జిల్లా మొత్తంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వేరుశెనగ, టమోటా, కంది, వరి, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో 35 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. 3 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది.
కడపలో
భారీ వర్షాలకు కడప జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నారు. చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. జిల్లాలో పాపాఘ్ని నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జిల్లాలో వరద ఉధృతికి చెరువులకు గండ్లు పడుతున్నాయి. రాయచోటి నియోజకవర్గ పరిధిలోని అబ్బవరం సమీపంలో కంచాలమ్మచెరువుకు గండి పడింది. హంద్రీనీవా కాలువ నుంచి వరద నీరు చెరువులోకి భారీగా వచ్చి చేరడంతో గండి పడింది.
గంటా శ్రీనివాసరావు అధికారులతో సమీక్ష
కడప జిల్లాలో వరద పరిస్థితిపై మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులతో సమీక్షించారు. వరద బాధితులకు వసతి, సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వర్షాలపై ముందుగానే అధికారులను అప్రమత్తం చేశామని గంటా అన్నారు.
తూర్పు గోదావరిలో
కుండపోత వర్షాలకు తూర్పు గోదావరి జిల్లాలో అపార పంట నష్టం జరిగింది. కోనసీమ ప్రాంతంలో లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఈదురుగాలులకు వరిచేలు నేలవాలాయి.
పశ్చిమగోదావరి, కృష్ణాలో
అయినవిల్లి మండలం మాగాం దగ్గర నీట మునిగిన వరిచేలను కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ పరిశీలించారు. రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ వరచేలు దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన వరిచేలు ఈదురుగాలుల తీవ్రతకు నేలకొరిగాయి.
తీవ్ర అల్పపీడనం
కోస్తాను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో క్రమంగా తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం క్రమంగా మరింత బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశముందుని అధికారులు ప్రకటించారు. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడొచ్చని తెలిపారు.

 

07:21 - November 19, 2015

ఆదిలాబాద్‌ : జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈఘటనలో పలువురు మావోయిస్టులు గాయపడ్డారు. పెంబీ అటవీ ప్రాంతంలో ఇంద్రవెల్లి దళానికి చెందిన 25 మంది మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు. అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. లొంగిపోవాలని హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో కొంతమంది మావోయిస్టులకు గాయాలయ్యాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

 

నేడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మహాధర్నా

ఢిల్లీ : నేడు దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మహాధర్నా చేపట్టనున్నారు. కేంద్రప్రభుత్వం 7వ వేతన సంఘం సిఫార్సులను ఆలస్యం చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేయనున్నారు. 

నెల్లూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

హైదరాబాద్‌ : నెల్లూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. వింజమూరు మండలం చాకలికొండ, గొల్లవారపల్లి, పత్తినివారిపల్లిలో బుధవారం రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. వింజమూరు మండలంలో ఏకంగా 5 సెకన్లపాటు ఈ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి తీవ్ర భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు.

 

నేడు చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల అంత్యక్రియలు

చిత్తూరు : జిల్లా నగర మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ అంత్యక్రియలు నేడు జరుగనున్నాయ. ఈనెల 17న అనురాధ దంపతులు దారుణ హత్య గావించబడ్డ సంగతి తెలిసిందే. 

Don't Miss