Activities calendar

21 November 2015

వరంగల్ ఓటర్లకు కేసీఆర్ కృతజ్ఞతలు

హన్మకొండ : వరంగల్‌ లోక్‌సభ ఉపఎన్నికలో ఓటేసిన ఓటర్లకు టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఉప ఎన్నిక అయినప్పటికీ ప్రజలు ఆసక్తిగా ఓటింగ్‌కు తరలిరావడం అభినందనీయమన్నారు. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారని పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందుకు సహకరించిన అధికారులకు, భద్రతా సిబ్బందిని ఆయన అభినందించారు.

స్వైన్ ఫ్లూతో మహిళ మృతి...

హైదరాబాద్ : నగరంలో ఓ మహిళ స్వైన్ ఫ్లూతో బాధపడుతూ మృతి చెందింది. మహబూబ్‌నగర్ జిల్లా కొండాపూర్‌ కు చెందిన ఓ మహిళ స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ చికిత్స నిమ్తితం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేరింది. మహిళ పరిస్థితి విషమించి ఇవాళా మృతి చెందింది. స్వైన్‌ఫ్లూ భారిన పడ్డ మరో ముగ్గురు వ్యక్తులు వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా జనసమర్థ ప్రదేశాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు.

 

21:58 - November 21, 2015

ముంబై : బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న బాజీరావు మస్తానీ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. మరాఠా సామ్రాజ్య యోధుడు పీష్వా బాజీరావు-1 జీవిత కథ ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రణ్‌వీర్‌సింగ్‌, దీపికాపదుకొణే, ప్రియాంకా చోప్రా తదితరులు ప్రధాన ప్రాతధారులు. డిసెంబర్‌ 18న బాజీరావ్‌ మస్తానీ ప్రేక్షకుల ముందుకొస్తోంది. రణ్‌వీర్‌సింగ్‌ ఈ చిత్రంలో సరికొత్త లుక్‌లో కనిపిస్తారు. 

21:55 - November 21, 2015

హైదరాబాద్ : ఒకరు పార్టీ అధినేత అయ్యుండి రాష్ట్రానికి సిఎంగా ఉంటే ఏం చేస్తారు. సహజంగానే కొడుకులను లేదా కూతుళ్లను ఫైల్‌లోకి తేవడానికి ట్రై చేస్తారంటారా.? ఇందుకు ఉద్యమ పార్టీ టిఆర్‌ఎస్‌ కూడా మినహాయింపు కాదేమో. ఇన్నాళ్లూ ఆ పార్టీలో నెంబర్‌ టూగా చెప్పుకోబడుతున్న నేత పరిస్థితే ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం ఆయన్ను సెకండ్‌ ప్లేస్‌లోంచి సైడ్‌ చేసే యత్నాలు జరుగుతున్నట్లు పొలిటికల్‌ ఇండస్ట్రీ టాక్. టిఆర్‌ఎస్‌లో కేసిఆర్‌ తర్వాత మాటల్లోనూ, చేతల్లోనూ ఫుల్‌ జోష్‌ ఉండే వ్యక్తి హరీష్ రావు. ఇతని స్టామినా చూసి కేసిఆర్‌ తర్వాత స్థానం ఈయనదే అనుకున్నారు. కానీ సెకండ్ ప్లేస్‌ కాదని తాజా పరిస్థితులు ప్రూవ్‌ చేస్తున్నాయి.
హరీష్ కు పొజీషన్‌ దక్కడం లేదనే ప్రచారం
హరీష్‌రావు... తెలంగాణలో ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా ముందుండి అన్ని పనులు చక్కబెట్టేవారు. టిఆర్ఎస్‌ అధికారంలోకొచ్చాక అత్యంత కీలకమైన నీటిపారుదల మంత్రిత్వ శాఖతోపాటు అసెంబ్లీ వ్యవహారాల బాధ్యతలనూ చేపట్టారు. మంత్రివర్గ ఉపసంఘాల్లోనూ ఆయనకే ప్రాధాన్యత దక్కేది. కానీ ఇప్పుడా పొజీషన్‌ దక్కడం లేదనే ప్రచారం జరుగుతోంది.
ఒక్క సెగ్మెంట్‌కే పరిమితమైన హరీష్
ఏ ఎన్నిక వచ్చినా అంతా ముందుండి నడిపించే హరీష్‌.. ఇప్పుడు వరంగల్ బై ఎలక్షన్‌లో కేవలం ఒక్క సెగ్మెంట్‌కే పరిమితమయ్యారు. ముఖ్యంగా తాను బాధ్యత వహిస్తున్న నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశాల్లో కనిపించడం లేదు. గత నెల రోజులుగా...ప్రాజెక్టు రీడిజైనింగ్‌పై జరుగుతున్న సీఎం సమీక్షల్లో హరీష్‌రావు జాడే ఉండడంలేదు. లైడార్ సర్వే రిపోర్టు, ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయించే సమావేశాలు... ఇలా వేటిలోనూ కనిపించకపోవటం చర్చనీయాంశమైంది. పైగా ఆ శాఖతో సంబంధం లేని మంత్రులు... జగదీష్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరైన సందర్భాలూ వున్నాయి. ఆఖరుకు సెక్రటేరియట్‌లో జరిగిన బడ్జెట్ కేటాయింపు మీటింగ్‌కూ హరీష్‌రావు హాజరు కాలేదు. ఆ సమయంలో ఆయన సిద్ధిపేటలో ప్రజలతో వున్నారు.
హరీష్‌ వర్గీయుల ఆందోళన
కావాలనే మంత్రికి సమాచారం ఇవ్వటం లేదని టాక్. సీఎం సమీక్షల తర్వాత మరుసటి రోజు నీటి పారుదల శాఖ అధికారులతో హరీష్‌రావు మీటవుతూ సమాచారం తెలుసుకుంటున్నారు. హరీష్‌ను పక్కనబెట్టి సీఎం కేసిఆర్‌ రివ్యూ చేస్తుండటంతో హరీష్‌ వర్గీయులు ఆందోళనకు గురవుతున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో నెం.2 హరీష్‌రావు కాదనే సంకేతాలు పంపేందుకే సీఎం అలా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సిఎం కేసిఆర్‌ తనయుడు, మంత్రి అయిన కేటిఆర్‌, కూతురు కవిత రాజకీయాల్లో పుంజుకుంటున్నారు. వారిని తన తర్వాత స్థానానికి చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో హరీష్‌రావు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది చూడాలి.

 

21:46 - November 21, 2015

అధికార, విపక్షాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన వరంగల్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా సాగింది. దాదాపు 65 శాతం ఓటింగ్ నమోదైంది. ఉప ఎన్నిక పట్ల ఓటర్లు ఆసక్తి చూపలేదని ఓటింగ్ శాతం తగ్గడాన్ని బట్టి అర్థమవుతోంది. ఈనెల 24 కౌంటింగ్ జరగనుంది.
ముగిసిన వరంగల్ ఉపఎన్నిక
తెలంగాణ వ్యాప్తంగా అత్యంత ఆసక్తి కలిగించిన వరంగల పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి అన్ని పార్టీలు పోటీపడ్డాయి. స్థానం దక్కించుకుని పరువు నిలబెట్టుకోవాలని ఇటు అధికారపక్షం, ప్రభుత్వ వ్యతిరేకత ఎంత బలంగా ఉందో చాటడానికి విపక్షాలు పోటాపోటీగా ప్రచారం సాగించాయి. మొత్తం 23 మంది అభ్యర్థులు పోటీపడగా, 1778 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఉదయం నుంచే మందకోడిగా ఓటింగ్ మొదలైనా మధ్యాహ్నానికి పుంజుకుంది. అక్కడక్కడా ఈవీఎలుం మొరాయించడం మినహా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. సాయంత్రం ఐదు వరకు క్యూలో ఉన్న ఓటర్లందరికీ అవకాశం కల్పించారు.
గణనీయంగా తగ్గిన ఓటింగ్ శాతం
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గింది. గతంలో 75.47 శాతం ఓటింగ్ నమోదు కాగా..ఈసారి అది దాదాపు 65 శాతానికి పడిపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే 10 శాతం తగ్గింది. పట్టణాల కన్నా పల్లెల్లోనూ ఓటింగ్ బాగా నమోదైంది. ఇక నియోజకవర్గాల వారీగా పోలింగ్ పరిశీలిస్తే...పాలకుర్తి 65 శాతం,వర్థన్నపేట 61 శాతం, స్టేషన్ గన్‌పూర్ 60 శాతం, పరకాల 61 శాతం, భూపాలపల్లి 60 శాతం, వరంగల్ ఈస్ట్ 55 శాతం, అత్యంత తక్కువగా వరంగల్ వెస్ట్ లో కేవలం 39 శాతంగా ఓటింగ్ నమోదైంది.
అధికారులు, గ్రామస్థుల మధ్య రాజీ కుదిర్చిన 10టీవీ
అయితే తొర్రూరు మండలం వేలికట్ట గ్రామ శివారు టీక్యతండా వాసులు మొదట పోలింగ్ ను బహిష్కరించారు. తమ గ్రామానికి ఈసారైనా మౌలికసదుపాయాలు కల్పిస్తామని హామి ఇస్తేనే ఓటు వేస్తామని ఏకతాటిపై నిలిచారు. ఇదే సమయంలో టెన్ టీవీ చొరవ తీసుకుంది. అధికారులు, గ్రామస్థుల మధ్య రాజీ కుదిర్చి వారిని ఓటింగ్ కు ఒప్పించింది. దాదాపు సాయంత్రం 4 గంటల నుంచి అక్కడ ఓటింగ్ మొదలైంది. అయితే 2014 ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే ఈసారి గణనీయంగా ఓటింగ్ శాతం తగ్గడాన్ని పరశీలిస్తే..ఉప ఎన్నిక పట్ల ఓటర్లు ఆసక్తి కనబరచలేదని తెలుస్తోంది. ఈనెల 24న ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది.
జోరుజోరుగా ఉప ఎన్నికల ప్రచారం
ఓరుగల్లు ఉప ఎన్నికల ప్రచారం జోరుజోరుగా సాగింది. నాయకుల మాటలు తూటాల్లా పేలాయి. చివరిక్షణం వరకు వాడీవేడీగా ప్రచారపర్వం సాగింది. అన్ని పార్టీల ముఖ్యనేతలు ఇక్కడే ఉండి ప్రచారం నిర్వహించడంతో ఓరుగల్లు పోరుగల్లైంది. బహిరంగ సభలు.. రోడ్ షోలు.. మార్నింగ్ వాక్ లతో క్యాంపెన్ హీటెక్కింది.
అన్ని పార్టీలు సర్వ శక్తులూ ఒడ్డాయి
వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు సర్వ శక్తులూ ఒడ్డాయి. గెలుపు కాదు.. మంచి మెజార్టీతో తమ సీటును తామే దక్కించుకోవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ పట్టు మీదుంటే.. కాంగ్రెస్, బీజేపీలు ఈ సీటును ప్రతిష్టాత్మకంగా భావించి గెలుపే లక్ష్యంగా పని చేశాయి. ప్రకటన వెలువడిననాటి^నుంచి ప్రచారానికి తక్కువ సమయమే ఉండడంతో అన్ని పార్టీలు బహిరంగసభలు, రోడ్ షోలపైనే దృష్టి సారించాయి. ఓటరును వ్యక్తిగతంగా కలుసుకోవడం కంటే గ్రామగ్రామాన పర్యటించడమే లక్ష్యంగా పనిచేశాయి. నియోజకవర్గ పరిధిలోని ఇరవై నాలుగు మండలాల్లో ప్రచారాన్ని హోరెత్తించాయి.
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు
పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 15,09,671 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ తరపున పసునూరి దయాకర్, కాంగ్రెస్ తరపున సర్వే సత్యనారాయణ, ఎన్డీఏ అభ్యర్థిగా డా.దేవయ్య, వైసీపీ నుంచి నల్లా సూర్యప్రకాశ్, వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రొ.గాలి వినోద్ కుమార్ బరిలో ఉన్నారు. వీరితో సహా మొత్తం 23 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. తమ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీలన్నీ అగ్రనేతలను రంగంలోకి దింపి ఓటరును ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గంలో నగర ఓట్లే 30 శాతం ఉండడంతో అన్ని పార్టీలు వరంగల్ నగరంపైనే దృష్టి సారించాయి. చివరి రెండు రోజులు నగరంలోనే బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించడంతో ప్రచారం హోరెత్తింది. అన్ని పార్టీల అభ్యర్థులు, ముఖ్యనేతలంతా మార్నింగ్ వాక్ తో మొదలు పెట్టి రాత్రి వరకు ప్రచార జోరు సాగించారు. పత్తిధరలు, రైతుల ఆత్మహత్యలు, స్థానిక సమస్యలతో పాటు ఎన్నికల హామీల అమలు తీరు ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రచారాస్త్రాలు కాగా.. అధికార పార్టీ తమ ప్రభుత్వ పథకాలను ప్రచారాస్త్రంగా వాడుకుంటూనే తమదైన శైలిలో విపక్షాలను ఎండగట్టే ప్రయత్నం చేసింది.
టీఆర్ఎస్ సభల్లో ప్రజల నుంచి నిరసనల వెల్లువ
టీఆర్ఎస్ పార్టీ తన సీటును తానే దక్కించుకోవాలన్న లక్ష్యంతో సగానికి పైగా కేబినెట్ ను ఇక్కడే ఉంచింది. నియోజకవర్గాల వారీగా ఏడుగురు మంత్రులను ఇంచార్జిలుగా నియమించి ఉప ముఖ్యమంత్రి కడియంకు సమన్వయ బాధ్యతలను అప్పగించింది. ఇద్దరు డిప్యూటీ సీఎంలు, డిప్యూటీ స్పీకర్, హరీశ్ రావు, కేటీఆర్, ఈటెల వంటి మంత్రులంతా నగరంలోనే మకాం వేసి ప్రచారం జోరుగా సాగించారు. అభ్యర్థి పసునూరి దయాకర్ తరపున ప్రచారం చేయడానికి సీఎం కేసీఆర్ నగరానికి వచ్చి ఆర్ట్స్ కాలేజి గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఘాటైన కామెంట్లతో ప్రచారపర్వం చివర్లో కాక రేపారు. అయితే ఈ సభ పేలవంగా సాగడంతో టీఆర్ఎస్ శ్రేణులన్నీ నిరుత్సాహంతో కూరుకుపోయాయి. ముఖ్యంగా ప్రచారంలో పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులకు స్థానిక ప్రజలనుంచి నిరసనలు వెల్లువెత్తాయి.
కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన గులాబీ దండు
అయితే గులాబీ దండు మాత్రం అడుగడుగునా తమ సత్తా చాటుకునేందుకు ఎన్నో సార్లు కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతూనే ప్రచారం కొనసాగించింది. టీఆర్ఎస్ బహిరంగసభలతో పాటు రోడ్ షోలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ పథకాలతో పాటు తెలంగాణ సెంటిమెంట్ ను అస్త్రంగా చేసుకుని తమ ప్రచారాన్ని కొనసాగించారు. మొదట్లో మెజార్టీపై దృష్టి సారించిన నేతలు క్రమక్రమంగా ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి నేపథ్యంలో గెలుపుకోసం ప్రయత్నించారు.
ప్రచారం మొదట్లో కొంత తడబడిన కాంగ్రెస్
కాంగ్రెస్ అగ్రనేతలంతా వరంగల్ నగరంలో మకాం వేశారు. ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. కాంగ్రెస్ దిగ్గజాలు మాజీ కేంద్ర మంత్రులతో ఉప ఎన్నిక ప్రచారం కొనసాగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్, మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, మాజీ కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ , జైపాల్ రెడ్డి, సచిన్ పైలట్, రోజాజానీ వంటి నేతలతో వరుసగా మూడురోజుల సభలు నిర్వహించి తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది తామే నంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య వంటి నేతలు వరంగల్ జిల్లాలోనే ఉంటూ ఎప్పటికప్పుడు ఏడు నియోజకవర్గాల్లో ప్రచార సరళిని గమనిస్తూ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు సూచనలిస్తూ.. అధికార పక్షం తీరును ఎండగడుతూ.. విస్త్రృతంగా ప్రచారం చేశారు. అన్ని పార్టీల కంటే ముందునుంచే ప్రచారం మొదలు పెట్టినా.. అభ్యర్థి ఎంపిక విషయంలో ఎదురైన అనేక పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కొంత తడబడింది. చివరి వారం రోజులు మాత్రం సుడి గాలి పర్యటనలు,, అడుగడుగునా బహిరంగసభలు.. అగ్రనేతల ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును ఎండగట్టిన టీడీపీ,బీజేపీ
బీజేపీ అభ్యర్థి డా.పగిడిపాటి దేవయ్య తరపున టీడీపీ, బీజేపీ అగ్రనేతలంతా ప్రచారంలోకి దిగారు. మొదట్లో ప్రచారం కొంత మందకొడిగా సాగినా.. చివరి వారం రోజులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం,, నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించడంతో ప్రచారం ముందు సాగింది. బీజేపీ తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, హన్స్ రాజ్ గంగారామ్ లు ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ తరపున రేవంత్ రెడ్డి, ఎల్ రమణ, ఎర్రబెల్లి, గరికపాటిలతో పాటు తెలంగాణ టీడీపీ అగ్ర నేతలంతా ప్రచారం చేశారు. ప్రధానంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును ఎండగట్టడంతో పాటు కేసీఆర్ హామీలన్నీ నీటిమూటలేనన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే.. రాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలుతీరులోని లోపాలను ప్రచారాస్త్రాలుగా సభల్లో హోరెత్తించారు.
ఉనికి చాటుకోవడం కోసం వైసీపీ ఆరాటం
రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఉప ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది. అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ తరపున ప్రచార బాధ్యతలన్నీ ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. సినీనటి , వైసీపీ ఎమ్మెల్యే రోజా వారం రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించగా.. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నాలుగురోజుల పాటు నియోజకవర్గాల్లో పర్యటించి రోడ్ షోలు నిర్వహించారు. గెలవకపోయినా పర్వాలేదు కానీ తమ ఉనికి చాటుకోవాలని ఆ పార్టీ నేతలు భావించారు.
వాపమక్షాల అభ్యర్థిగా ప్రొ.వినోద్ కుమార్
వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి గాలి వినోద్ కుమార్ తరపున సీపీఎం, సీపీఐ నేతలు తమ్మినేని వీరభద్రం, చాడా వెంకటరెడ్డిలు నగరంలోనే ఉండి ప్రచారాన్ని నిర్వహించారు. వామపక్షాల ఓట్లను కూడగట్టే దిశగా స్వతంత్ర అభ్యర్థిగా తన గుర్తు సిలిండర్ ను ప్రచారం చేయడంలోనే వినోద్ కుమార్ పనిచేశారు.
ఓరుగల్లు కోటలో పాగా వేసేదెవరు
ఓరుగల్లు కోటలో పాగా వేసేదెవరు...కాకతీయుల సామ్రాజ్యంలో విజేతగా నిలిచేదెవరు....ఓటరు ఎవరికి పట్టాభిషేకం చేశాడు...అధికార పార్టీదే విజయమా...లేదంటే ప్రతిపక్షాలు షాకివ్వబోతున్నాయా....ఓటింగ్ ట్రెండ్ ఏమని చెబుతోంది...
ప్రత్యేక ఆకర్షణగా వరంగల్ ఉప ఎన్నిక
వరంగల్ ఉప ఎన్నిక జాతీయస్థాయిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే టీఆర్ఎస్ అధికారం చేపట్టాక ఇది రెండో ఉప ఎన్నిక. మొదట సీఎం కేసీఆర్ మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో బైపోల్ జరిగింది. అయితే సార్వత్రిక ఎన్నికలకు మెదక్ పోరుకు పెద్దగా గ్యాప్ లేకపోవడం, అందులోనూ కేసీఆర్ నియోజకవర్గం కావడంతో సునాయాస విజయం దక్కింది. కానీ ఇప్పుడలా కాదు. గులాబీ సర్కారు గద్దెనెక్కి 18 నెలలైంది. ఈ ఏడాదిన్నర కాలంలో ఎన్నో పరిణామాలు, ఆందోళనలు ఉద్యమస్థాయిలో సాగాయి. ఎన్నికల హామీల అమలుపై ప్రతిపక్షాలు రచ్చరచ్చ చేశాయి. నియంత పాలనంటూ కేసీఆర్ ను విమర్శించాయి. ఇలాంటి సమయంలో కడియం శ్రీహరి రాజీనామాతో వచ్చిన వరంగల్ ఉప ఎన్నిక ప్రభుత్వానికీ, ఇటు ప్రతిపక్షాలకు కీలకం, ప్రతిష్టాత్మకం. అందుకే పార్టీలు హోరాహోరిగా ప్రచారం నిర్వహించాయి. కాంగ్రెస్ , బీజేపీలు అగ్రనేతలతో క్యాంపెన్ నిర్వహించాయి. ఇంత ప్రతిష్టాత్మకంగా సాగిన వరంగల్ బైపోల్ లో విజయం ఎవరిదన్నది అత్యంత ఆసక్తి కలిగిస్తోంది.
భారీగా చీలిపోయిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు
అధికార టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు మిగతా కాంగ్రెస్, టీడీపీ బీజేపీ, వామపక్షాలు, ఇతర స్వతంత్ర అభ్యర్థులూ ఒకవైపు. ఇది తమకు కలిసి వస్తుందని అధికారపక్షం చెబుతోంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇక్కడ భారీగా చీలిపోయింది. కానీ ప్రభుత్వ అనుకూల ఓటు మాత్రం చెక్కుచెదరలేదు. ప్రభుత్వంపై జనం ఆగ్రహంగా ఉన్న మాట వాస్తవమే కానీ అది పూర్తిస్థాయిలో ఓట్లుగా మారలేదని విశ్లేషకులు చెబుతున్నారు. చీలికలు, పేలికలుగా విపక్షాలు ఉండటంతో సర్కారుకు వ్యతిరేకంగా ఓటేద్దామనుకున్నా ఎవరికి ఓటు వేయాలన్న సందిగ్ధంలో ఓటర్లు పడ్డారంటున్నారు. వీరిలో ఎక్కువమంది ఓట్లు వేయడానికి బయటకు రాలేదు. ఇందుకు పోలింగ్ శాతమే నిదర్శనం. పోలింగ్ శాతం తగ్గడం కూడా పవర్‌లో ఉన్న పార్టీకి ప్లస్సే.
గత ఎన్నికల్లో వరంగల్‌లో 77 శాతం ఓటింగ్
గత ఎన్నికల్లో వరంగల్‌ లో 77 శాతం పోలింగ్ నమోదైతే...ఈసారి అది దాదాపు 65 నుంచి 68లోపే. గ్రామాల్లో కాస్త మెరుగనిపించినా...గ్రేటర్ వరంగల్ లో మందకొడీగా ఓటింగ్ సాగింది. విద్యావంతులు, ఉద్యోగులు అధికంగా ఉండే వరంగల్ పశ్చిమలో ఓటింగ్ పర్సంటేజ్ భారీగా పడిపోయింది. ఇది అధికార పార్టీకి లాభించనున్నది. ఇక వరంగల్ తూర్పులో దాదాపు ఓటింగ్ శాతం బాగుంది. ఇక్కడ మంత్రి హరీష్‌ రావు శ్రేణుల్లో ఉత్సాహం తీసుకురావడలో సక్సెస్ అయ్యారనే చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ అనుకూల ఓటును పెంచుకున్నట్టు ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. పోలింగ్ సరళిని బట్టి టీఆర్ఎస్సే మళ్లీ కాకతీయుల కోటలో పాగావేస్తుందని గులాబీశ్రేణులు గట్టిగా చెబుతున్నారు. అయితే మెజార్టీ ఎంతన్నదే ప్రశ్నంటున్నారు.
విపక్షాల అనైక్యతే అధికార పార్టీకి ప్లస్
నిజానికి ప్రభుత్వ అనుకూలత కంటే విపక్షాల అనైక్యతే వరంగల్ లో అధికార పార్టీకి ఉపయోగపడుతుందని అంచనాలు వేస్తున్నారు. కాంగ్రెస్‌ లో అభ్యర్థి ఎంపికపై చివరి వరకు సందిగ్దత నెలకొనడం, తర్వాత రాజయ్యను అభ్యర్థిగా నిలబెట్టినా ఆయన ఇంట్లో అనుకోని ఘటన చోటు చేసుకోవడం తర్వాత హడావుడిగా సర్వే సత్యనారాయణను తెరపైకి తేవడం జరిగిపోయాయి. మొదట్లో కాంగ్రెస్ ప్రచారం కాస్త డల్ గా సాగినా...జాతీయస్థాయి నాయకులు రంగంలోకి దిగడంతో ఖద్దరు కార్యకర్తల్లో కాస్త జోష్ పెరిగింది. అయితే సర్వే స్థానికత మైనస్ అయ్యింది. దీనికి తోడు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారు. ముఠాతగాదాలు కూడా స్థానికంగా కొంపముంచాయి.
వర్కౌట్ కాని బీజేపీ, టీడీపీ బంధం
ఇక బీజేపీ, టీడీపీ బంధం ఏమాత్రం వర్కౌట్ కాలేకపోయిందనే టాక్‌ వినిపిస్తోంది. పేరుకు మిత్రపక్షాలుగా బరిలోకి దిగినా రెండు పార్టీలు ఏమాత్రం కలివిడిగా అభ్యర్థి గెలుపు కోసం పని చేయలేదు. టీఆర్ఎస్ విమర్శలకు ధీటుగా జవాబు చెప్పలేకపోయారు. పత్తి రైతుల సంక్షోభానికి కేంద్రమే కారణమన్న టీఆర్ఎస్ ప్రచారం జనంలోకి బాగా వెళ్లిందన్నది విశ్లేషకుల మాట. దీనికి తోడు తెలంగాణాకు మోదీ ఏమీ చేయలేదన్న గులాబీ నేతల విమర్శలను కూడా ఓటర్లు బాగానే రిసీవ్‌ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఎక్కడా అభ్యర్థి దొరక్క సడన్ గా అమెరికా ఎన్‌ఆర్‌ఐని తెరపైకి తేవడం బీజేపీకి మైనస్ అనే చెప్పాలి. గత ఎన్నికల్లో మూడు లక్షల ఓట్ల దాకా గెలుచుకున్న ఈ మిత్రద్వయానికి ఈసారి లక్షన్నర నుంచి రెండు లక్షలే వస్తాయని ఓటింగ్ సరళిని బట్టి అర్థమవుతోంది.
ఓట్లు చీల్చడానికి, ఉనికి చాటుకోవడానికే వైసీపీ ఆరాటం
వైసీపీ కూడా తమ అభ్యర్థిని రంగంలోకి దింపినా ఓట్లను చీల్చడానికి, ఉనికి చాటుకోవడానికే ఉపయోగపడింది. ఇక వామపక్షాల అభ్యర్థి గాలి వినోద్ కుమార్ గెలుపు కోసం అహర్నిశ్నలు కృషి చేశారు. దాదాపు వాపమక్షాల ముఖ్యనేతలంతా ప్రచారంలో పాల్గొన్నారు. గెలుపోటములు పక్కనపెడితే...ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లామని నేతలంటున్నారు.

 

21:31 - November 21, 2015

ఇస్లామిక్ స్టేట్...ఐఎస్‌ఐఎస్‌...ఈ పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఎప్పుడు...ఎలా విరుచుకుపడతారో తెలియని పరిస్థితి. ప్రపంచ దేశాలకు సవాల్‌ విసురుతూ తమ ఉనికి చాటుకుంటోంది. అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాల వెన్నుల్లో సైతం వణుకు పుట్టిస్తోంది. ఐఎస్‌ఐఎస్‌ ఎలా పుట్టింది? దాని లక్ష్యమేంటి?
ఇస్లామిక్‌ స్టేట్‌ ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు
ఇస్లామిక్‌ స్టేట్‌ ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు.. ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్ ఇరాక్ అండ్ సిరియాగా, ఐఎస్‌ఐఎల్‌గా, దాయెష్‌గా, ఇస్లామిక్ స్టేట్‌గా ఈ ఉగ్రవాద సంస్థ ప్రాచుర్యం పొందింది. 1999లో ఇరాక్‌లో జమాత్‌ అల్-తాహిద్ వల్-జిహాద్ పేరిట ఈ సంస్థ ఆవిర్భవించింది. ఈ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో చేతులు కలిపి అల్-ఖైదా ఇన్ ఇరాన్ అని పేరు మార్చుకుని 2003 వరకూ కొనసాగింది. 2006లో మరికొన్ని సున్నీ తీవ్రవాద సంస్థలతో కలిసి ముజాహిదీన్ షురా కౌన్సిల్ గా పేరు మార్చుకుంది. సిరియా అంతర్యుద్ధం నేపథ్యంలో 2013లో ఏప్రిల్ నెలలో అక్కడి అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ జభాట్ అల్-సుస్రా ఫ్రంటును విలీనం చేసుకుని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా...ఐఎస్ఐఎస్‌గా పేరును మార్చేసుకుంది. 2014 ఫిబ్రవరిలో ఆధిపత్య పోరుతో అల్ ఖైదా ఐఎస్ఐఎస్ నుంచి తెగతెంపులు చేసుకుంది. సిరియాలో, ఇరాక్‌లో పలు ప్రాంతాలను స్వాధీనంలోకి తెచ్చుకుని ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించినట్లు ప్రకటించింది.
పవిత్ర యుద్ధం పేరుతో మారణహోమం
అబుబకర్ అల్-బగ్ధాదీని ఖాలిఫ్‌గా ప్రకటించి.. తమ ఇస్లామిక్ రాజ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తామంటూ మ్యాప్‌ను కూడా విడుదల చేసింది. పవిత్ర యుద్ధం పేరుతో హింసకు పాల్పడుతూ మారణహోమం సృష్టిస్తోంది. ఇరాక్, సిరియా ప్రభుత్వాలతో యుద్ధం చేస్తూ ఎన్నో ప్రాంతాలను ఆక్రమించింది. యుద్ధాల్లో 20 వేల మందికి పైగా చనిపోయారు. గత ఏడాది 117 ఆత్మాహుతి దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో వెయ్యి మందికి పైగా బలి తీసుకుంది.
ఒకప్పుడు అరబ్ దేశాలన్నీ ఖలీఫా పాలనలో
ఒకప్పుడు అరబ్ దేశాలన్నీ ఖలీఫా పాలనలో ఉండేవి. దాదాపు వందల ఏళ్ల పాటు ఒకే ఛత్రం కింద కొనసాగాయి. కానీ పశ్చిమ దేశాల ప్రభావం, ప్రపంచ యుద్ధాల్లో దెబ్బతినడంతో, ఇప్పుడున్న రూపంలో స్వతంత్ర దేశాలుగా రూపొందాయి. శతాబ్దాల పాటు కొనసాగిన తమ ఖలీఫా విచ్ఛిన్నం కావడానికి కారణం పశ్చిమ దేశాలేనన్న ఆలోచన ఇస్లాం ప్రపంచంలో బలంగా నాటుకుపోయింది. ప్రపంచంలో అత్యంత ప్రాణాంతక ఉగ్రవాద సంస్థగా ఐసిస్ అగ్రస్థానంలో ఉంది.
ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకున్న ఐఎస్‌ఐఎస్‌
ఐఎస్‌ఐఎస్‌ ఆధునిక టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటోంది. ముఖ్యంగా యువత ఐసిస్‌ వైపు ఆకర్షితులవుతున్నారు. ఒక అంచనా ప్రకారం ఐఎస్ఐఎస్ దళాల్లో భారత్ సహా దాదాపు 100 దేశాలకు చెందిన 20 వేల మంది విదేశీ ఫైటర్లు ఉన్నారని సమాచారం. ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు, అరబ్ దేశాల నుంచేకాదు, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా వంటి పాశ్చాత్య దేశాల నుంచీ, భారత్ నుంచీ గణనీయమైన సంఖ్యలో యువత ప్రయాణమవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం, ఇస్లాం రాజ్యాన్ని విస్తరించేందుకు జిహాద్ (పవిత్రయుద్ధం)లో బాధ్యతగా పాల్గొనాలని ఐఎస్‌ఐఎస్ ఇస్తున్న పిలుపు ఒకటైతే, ఇరాక్, సిరియాల్లో తాను ఇస్లాం రాజ్యాన్ని స్థాపించానంటూ సాధించిన విజయం పై చేసుకుంటున్న ప్రచారం మరొకటి.
ఐఎస్ఐఎస్ కు రూ200 కోట్ల డాలర్లుకు పైగా నిధులు
ఐఎస్ఐఎస్ సంస్థకు 2 వందల కోట్ల డాలర్లుకు పైగా నిధులు కూడా ఉన్నట్లు ఇరాక్ నిఘా విభాగం గత ఏడాది గుర్తించింది. భారత కరెన్సీలో చూస్తే ఈ నిధులు రూ. 12వేల కోట్లకు పైగానే ఉన్నట్లు. ఇరాక్ దేశంలో ప్రస్తుతం 3 వందల చమురు బావులు ఈ సంస్థ చేతిలో ఉన్నాయి. అంతేకాదు సిరియా చమురు ఉత్పత్తిలో 60 శాతం ఈ సంస్థ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇలా అంగ, అర్థ బలాన్ని సమకూర్చుకుని ప్రపంచ దేశాలకు పెను సవాల్‌ విసురుతున్నాయి.
ఐఎస్‌ఐఎస్‌పై రష్యా వైమానిక దాడులు
సిరియా అధ్యక్షుడు అసాద్‌ను తొలగించాలని, అతని అసమర్థత వల్లే ఐఎస్‌ఐఎస్ విస్తరిస్తోందని అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు వాదిస్తున్నాయి. అసాద్ తప్పితే మరొకరు ఐఎస్‌ఐఎస్‌ను నిలువరించలేరని రష్యా అధ్యక్షుడు పుతిన్ వాదన. అసాద్ బలగాలకు మద్దతు తమ వైమానిక దళాలతో రష్యా ఐఎస్‌ఐఎస్‌పై వైమానిక దాడులు మొదలుపెట్టింది. మరోవైపు అమెరికా ఐఎస్‌ఐఎస్ ఆధీనంలోని చమురు బావులు, ఇతర కీలక స్థావరాలపై దాడులను ముమ్మరం చేసింది. ఈ దాడుల క్రమంలో ఐసిస్‌ కాస్తా వెనకంజ వేయాల్సి వచ్చింది. అయితే పాశ్చాత్యదేశాల్లో వణుకు పుట్టించడం ద్వారా తామింకా బలంగానే ఉన్నామని చాటడమే లక్ష్యంగా ఐఎస్‌ఐఎస్ భారీదాడికి వ్యూహరచన చేసి పారిస్‌పై విరుచుకుపడినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. పారిస్‌ ఉగ్రదాడిలో 129 మంది మృతి చెందారు. అంతకుముందు రష్యా విమానం ఈజిప్టులో కూలిపోవడానికి ఇస్లామిక్‌ స్టేట్‌ కారణమని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ కూడా ధృవీకరించారు. విమాన దుర్ఘటనలో 224 మంది మృతి చెందారు. ఈ ఘటన అనంతరం రష్యా, ఫ్రాన్స్‌లు సిరియాలోని ఐసిస్‌ శిబిరాలపై వైమానిక దాడులను ముమ్మరం చేసింది. మరోవైపు సిరియాలో తమపై వైమానిక దాడులు చేస్తున్న ఇతర దేశాలకూ ఫ్రాన్స్ కు పట్టిన గతే పడుతుందని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ఓ వీడియోలో హెచ్చరించింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో సైతం భారీ దాడులకు పాల్పడతామని ప్రకటించింది.
ఐఎస్‌ఐఎస్‌ కు నిధులు ఇస్తున్న అగ్రరాజ్యాలు : పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అగ్రరాజ్యాలే ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థకు నిధులు ఇస్తున్నాయంటూ టర్కీలో జరుగిన జీ 20 సమావేశాల్లో ఆరోపించారు. మొత్తం 40 దేశాలు ఇస్లామిక్ ఉగ్రవాదులకు ఆర్ధికంగానూ, ఇతర రకాలుగానూ సహకరిస్తున్నారని ఆరోపించారు. అమెరికా సహా ఇతర అగ్రరాజ్యాలపై పుతిన్‌ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో అమెరికా సహా నాటో దేశాలు అవలంబిస్తున్న తీరును రష్యా సహా చైనా దేశాలు ఎండగట్టాయి.
భారత్‌ పై ఐఎస్‌ఐఎస్‌ దాడులు
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ భారత దేశం మీద కూడా దాడులు చేసేందుకు పాకిస్థానీ, అఫ్ఘాన్ తాలిబన్ వర్గాలను కలిపేసుకుని అతిపెద్ద ఉగ్రవాద సంస్థగా మారేందుకు సన్నాహాలు చేస్తోందని ఇటీవల 'యూఎస్ఏ టుడే' పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. పారిస్‌ దాడుల నేపథ్యంలో భారత్‌ పై ఐఎస్‌ఐఎస్‌ దాడులు జరిగే అవకాశం ఉందని, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా ప్రకటించారు. భారత్‌లో ఐఎస్‌ఐఎస్‌కు ఉనికి లేకపోయినప్పటికీ, కొంతమంది యువకులను అతివాదులుగా తీర్చిదిద్దడంలో, దేశంలోని కొన్ని వర్గాలను, లేదా విదేశాల్లోని భారత సంతతివారిని ఆకర్షించి, వ్యక్తిగతంగా తన కార్యకలాపాల్లో పాల్గనేలా చేయడంలో ఆ సంస్థ సఫలమైందని, దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న తీవ్రవాద బృందాలతో కలసి ఐఎస్‌ఐఎస్‌ తీవ్రవాద దాడికి పాల్పడవచ్చని హౌమ్‌ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ప్రపంచాన్ని గఢగఢలాడించిన తాలిబన్‌ ఉగ్రవాదులు
ప్రపంచాన్ని గఢగఢలాడించిన ఉగ్రవాదుల్లో తాలిబన్లు ముందున్నారు. అఫ్గనిస్థాన్‌లో పుట్టిన ఈ సంస్థ ఆ దేశంతోపాటు, పాకిస్థాన్‌లో బాగా వేళ్లూనుకుంది. అమెరికా నేతృత్వంలోని మిత్రదేశాల సేనుల అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ను హతమార్చిన తర్వాత ఈ సంస్థ కార్యక్రమాలు కొద్దిగా తగ్గాయి. అయితే పాకిస్థాన్‌, అఫ్గనిస్థాన్‌లో మాత్రం ఇంకా బలంగానే ఉంది. అప్పుడప్పుడు దాడులకు తెగబడుతూ నరమేధం సృష్టిస్తున్నారు.
1994లో తాలిబన్‌ ఉగ్రవాద సంస్థ స్థాపన
అఫ్గనిస్థాన్‌లో రష్యా ఆధిపత్యానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఉగ్రవాద సంస్థ తాలిబన్. 1980లో సోనియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా పోరాడిన ముజాహిదీన్లు, వస్థూన్‌ గిరిజనులతో కలిపి 1994లో మహ్మద్‌ ఒమర్‌ ఈ ఉగ్రవాద సంస్థను స్థాపించారు. 1992 వరకు నజీబుల్లా అఫ్గన్‌ అధ్యక్షుడుగా ఉండేవారు. ఆయన్ను కీలుబొమ్మగా చేసుకుని రష్యా పెత్తనం సాగించేంది. ఇది నచ్చని తాలిబన్లు వరుసదాడులతో 1996లో దేశాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అఫ్గన్‌ నుంచి రష్యా సేనలు వైదొలగిన తర్వాత దేశం వారి ఏలుబడిలోకి వెళ్లింది. రష్యా సేనలకు ఆశ్రయం కల్పించిన నజీబుల్లాను 1996 సెప్టెంబర్‌ 28న కాబూల్‌లో ట్రక్కుకట్టి లాగించి హత్య చేసినప్పటి నుంచి 2001 వరకు అఫ్గన్‌ను పాలించారు.
డబ్ల్యూటీసీపై ఉగ్రవాదులు దాడి
అప్పటి వరకు అఫ్గన్‌కే పరిమితమైన తాలిబన్లు.... అమెరికాపై అల్‌ఖైదా దాడులతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. 2000వ సంవత్సరం సెస్టెంబర్‌ 11న న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్ర పై అల్‌ఖైదా దాడుల తర్వాత వారి కార్యకలాపాలతో ప్రపంచం వణికిపోయింది. చీమ చిటుకున్నా ఇట్టే పసికట్టే అమెరికా నిఘా సంస్థలు అల్‌ఖైదా దాడలను నివారించలేకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ వాణిజ్య కేంద్రం అల్‌ఖైదా ఉగ్రవాదుల విమాన దాడులతో తేరుకున్న అమెరికా... తాలిబన్లను తుదముట్టించకపోతే ఉగ్రవాదంతో ప్రపంచానికి ముప్పుతప్పదని గ్రహించింది. అనుకున్నదే తడువుగా అమెరికా నేతృత్వంలోని ఉత్తర అట్లాంటిక్‌ సంధి ఒప్పంద దేశాల సంస్థ ... నాటో సైనికులు అఫ్గన్‌ పంపింది. తాలిబన్లను తరిమికొట్టడమే పనిగా పెట్టుకున్నారు.
అఫ్గన్‌ ప్రభుత్వం, నాటో సేనలపై దాడులు
అమెరికా నేతృత్వంలోని నాటో చేసనలు... ముందుగా తాలిబన్లను తరిమేశాయి. అయినా మళ్లీ జట్టుకట్టిన కరుడుకట్టిన తాలిబన్‌ ఉగ్రవాదులు నాటో సేనలపై ప్రతీకరాం తీర్చుకోవాలనుకున్నారు. నాటో సైన్యాలు తమదేశంలో తిష్టవేసేందుకు అవకాశం కల్పించిన అప్గన్‌ ప్రభుత్వంతో పాటు... నాటో సైన్యాలపైఊ దాడులకు తెగబడ్డారు. అల్‌ఖైదా అగ్రనేత ఒసామా బిన్‌ లాడెన్‌ హతమయ్యే వరకు కూడా చాలా ప్రాంతాల్లో తాలిబన్ల ఆధిపత్యమే కొనసాగేది. 2002లో దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న నాటి నుంచి 2014 వరకు ఉగ్రవాద దాడుల్లో ఎక్కువ మందిని బలితీసుకుంది తాలిబన్లే.
కాబూల్‌లో భారత దౌత్య కార్యాలయంపై దాడి
ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు సర్కారీ సంస్థలు, దౌత్యకార్యాలయాలు, సైనిక స్థావరాలు, పోలీసులను ఎంచుకుని దాడులు చేశారు. ఆతర్వాత సాధారణ పౌరులపై దృష్టి పెట్టిన తాలిబన్లు... వారినీ హతమార్చారు. కాబూల్‌లోని భారతదౌత్య కార్యాలయంపై దాడులకు తెగబడ్డారు. గతేడాది నవంబర్‌లో బ్రిటీష్‌ రాయబార కార్యాలయంపై విరుచుకుపడ్డారు. ఆత్మాహుతి దాడులతో విధ్వంసం సృష్టించడమే తాలిబన్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది జనవరిలో సింద్‌బాద్‌లో గవర్నర్‌ వాహనశ్రేణిపై దాడి చేశారు. ఇది ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నదే. అఫ్గన్‌ సర్కార్‌తో తాలిబన్లు చేసిన యుద్ధంలో గతేడాది వరకు 15,675 మంది మరణించారు. తాలిబన్‌ ఉగ్రవాదుల దాడుల్లో ఈ ఏడాది ఇంతవరకు 891 దాడులకు పాల్పడ్డారు. వీరి ఘోరకృత్యాలకు 3,477 మంది చనిపోయారు. వీరిలో సాధారణ పౌరులు 20 శాతం వరకు ఉన్నారు. మరో 3,310 మంది క్షతగాత్రులయ్యారు. అఫ్గనిస్థాన్‌, పాకిస్థాన్‌లోని తాలిబన్లు ఎక్కువగా దాడులకు పాల్పడ్డారు.
ఉగ్రవాదుల పంజా
ఉగ్రవాదులు ప్రపంచమంతా పెట్రేగిపోతున్నారు. ఒక దేశానికో... లేక ఒక నగరానికో.... వీరి కార్యకలాలు పరిమితం కాలేదు. ఎప్పుడు ఎటువైపు నుంచి విరుచుకుపడతారో... ఎంతటి భారీ విధ్వంసాన్ని సృష్టిస్తారో తెలియని పరిస్థితి . పదిహనేళ్లలో లక్షన్నర మందిని బలి తీసుకున్నారు. దీనిని బట్టి పరిశీలిస్తే వీరి మారణకాండను అర్ధం చేసుకోవచ్చు.
మానవబాంబుల రూపంలో మారణహోమం
ఉగ్రవాదులు ప్రపంచమంతా పంజా విసురుతున్నారు. వీరి దాడులతో ప్రపంచం వణికిపోతోంది. ఒక ఉగ్రవాది వచ్చినా, ఇద్దరు విరుచుకుపడ్డా, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పంజావిసిరినా అందరి లక్ష్యం ఒక్కటే. అదే విధ్వంసం. తుపాకీ కాల్పులు, బాంబుదాడులేకాదు.... మానవబాంబుల రూపంలో కూడా మారణహోమం సృష్టిస్తున్నారు. ఈ మధ్య బెల్టుబాంబు, స్లీపర్‌సెల్స్ కూడా ఎక్కువ అయ్యాయి. సమాజంలో నలుగురి మధ్య నిద్రాణంగా ఉండే శక్తులు ఉగ్రవాదులకు సహకరిస్తున్న శక్తులే స్లీపర్‌ సెల్స్‌. ఉగ్రవాదులు ఎంత ప్రమాదకారులో... వీరు అంతకంటే ప్రమాదకారులు.
పదిరెట్లు పెరిగి ఉగ్రవాద దాడులు
గత పదిహేనేళ్లలో ఉగ్రవాదులు ఎంతమందిని బలిగొన్నారన్న అంశంపై అధికార గణాంకాలు లేకపోయినా...2000-2015 లక్షన్నర మందిని హతమార్చి ఉంటారని అంచనావేస్తున్నారు. వీరి దాడుల్లో బలిలైనవారి సంఖ్య గత పదేళ్లలో పదిరెట్టు పెరిగింది. అతంతకు ముందు ఉగ్రవాదం, ఉగ్రవాద దాడులు లేవా.... అంతే ఇంత విస్తృతంగా లేవని చెప్పొచ్చు. ఈ సహస్రాబ్ధి ప్రారంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు ఎక్కవ అయ్యాయి. దాడుల విషయంలో వీరికి కనిరం ఉండదు. నిష్కర్షంగా, దారుణంగా వ్యవహరిస్తారు. చిన్నపెద్ద, పిల్లాపాపలన్న తేడా ఉండదు. ఈ కసాయి గుండెల కరుకుకత్తులు ఎరిపైనా కరుణచూపవు. అయ్యో...పాపం.. అన్న ఆలోచేనే వీరికి ఉండదు. దారుణ మారణకాండకు పాల్పడమే లక్ష్యం.
ప్రపంచవ్యాప్తంగా 123 దేశాల్లో ఉగ్రవాదం
21వ శతాబ్ధం ప్రారంభం నుంచి ఉగ్రవాద దాడుల రూపురేఖలు మారిపోయాయి. 2000 సంవత్సరంలోఉ 3,329 మంది ముష్కరుల మూకలదాడుల్లో హతమయ్యారు. 2014లో ఈ సంఖ్య 32,658 కి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 123 దేశాలు ఉగ్రవాదం బారినపడ్డాయి. మధ్య ఆసియా, దక్షిణాసియా, ఉత్తర ఆఫ్రికా, సహారాఫ్రికా దేశాలు ఉగ్రవాద కోరల్లో చిక్కుని రక్తమోడుతున్నాయి. పాశ్చాత్య దేశాలకు కూడా ఇప్పుడు ఇది ఎగబాకింది. వారం రోజుల క్రితం ఫ్రాన్స్‌ పారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడే ఇందుకు నిదర్శనం.
ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఉగ్రవాద సంస్థలు
ప్రపంచవ్యాప్తంగా మారణహోమం సృష్టిస్తున్న ఉగ్రవాద సంస్థలు ఐదున్నాయి. వీటిలో ఐఎస్ఎస్‌ది అగ్రస్థానం. సిరియా కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పంజావిసురుతోంది. బోకోహారమ్‌, తాలిబన్‌, ఫులానీ, అల్‌ షహాబ్‌ వంటి ఉగ్రవాదు సంస్థలు ప్రాంతాల వారీగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు మాలి దాడులతో కొత్త సంస్థ అల్‌మౌరాబిటౌన్‌ వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త ఉగ్రవాద సంస్థలు పుట్టుకొస్తున్నాయి. మాలి రాజధాని బమాకోలో దాడులు చేయడం ద్వారా అల్‌మౌరాబిన్‌టౌన్‌ ఉగ్రవాద సంస్థ ఉనికి బయటపడింది. ఇది అల్‌ఖైదా అనుబంధ సంస్థ. 2012లో అప్పటి మాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలెత్తిన తిగుబాటు ఆదేశంలో ఉగ్రవాదానికి కారణమయ్యింది. త్వారెగ్‌ సంచార తెగకుచెందిన తిరుగుబాటుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. లిబియా మాజీ సైనికులతో ఏర్పాటైన నేషనల్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ ద లిబరేషన్‌ ఆప్‌ అజావద్‌ త్వారెగ్‌ సంచార తిరుగుబాటుదారులకు మద్దతు ఇస్తోంది. అల్‌మౌరాబిన్‌ ఈ ఏడాది మార్చి 6న బమాకోలోని ఓహోటల్‌పై దాడి చేసి ఐదుగుర్ని కాల్చిచంపింది. అప్పుడే ఈ సంస్థ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు రెండోదాడి ద్వారా అల్‌మౌరాబిన్‌ టౌన్‌ మళ్లీ తన ఉనికిని చాటుకుంది. ప్రపంచానికి తామూ ప్రమాదకరంగా మారామన్న సంకేతాలు పంపారు.
ప్రమాదకరంగా బోకోహారమ్‌ ఉగ్రవాదులు
ఇక నైజీరియా, కామెరూన్‌, చాద్‌ దేశాల్లో కార్యకాపాలు నిర్వహిస్తున్న బోకోహారమ్‌ ఉగ్రవాదులు కూడా ప్రమాదకరంగా మారారు. బోకోరాహమ్‌ పాశ్చాత్య విద్య నిషిద్ధం అని అర్ధం. 2009లో నైజీరియా ప్రభుత్వంతో వివాదంలో తమ నేత మొహ్మద్‌ యూసుఫ్‌ హత్యానంతరం బోకోహారమ్‌ హింసకు తెగబడింది. ఆ తర్వాత ఈ సంస్థ అధినేతగా బాధ్యతులు తీసుకున్న అబుబకర్‌ షెకావ్‌ 2010లో నైజీరియా, అమెరికా ప్రభుత్వాలపై జిహాద్‌ ప్రకటించి, దాడులకు పాల్పడుతున్నాడు. నైజీరియాను ఇస్లామిక్‌ దేశంగా మార్చాలన్నది ఈ సంస్థ లక్ష్యం. ఊచకోతులు, బాంబుదాడులతో నైజీరియాను అతలాకుతం చేస్తోంది.
నైజీరియా, సెంట్రల్‌ ఆఫ్రికా రిబ్లిక్‌లో ఉగ్రవాదుల కార్యక్రమాలు
ఇక ఫులాని ఉగ్రవాదులు నైజీరియా, సెంట్రల్‌ ఆఫ్రికా రిబ్లిక్‌లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నైజీరియాలోని సంచార జాతులతో ఈ సంస్థ ఏర్పాటయ్యింది. ఆఫ్రికాలోని ఏడు దేశాల్లో 2 కోట్ల మంది పులానీ జాతీయులున్నారు. నైజీరియాలోని వనరుల విషయంలో రైతులకు, ఫులానీలకు మధ్య ఏడేళ్ల నుంచి పోరు జరుగుతోంది. వీరి దాడులకు వేలాది మంది బలయ్యారు. ఆఫ్రికాలో ఉన్న ఉగ్రవాద సంస్థల్లో మరొకటి అల్‌ షబాబ్‌. సొమాలియా, కెన్యా, ఇథియోపియా కేంద్రాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హర్కత్‌ అల్‌ షబాబ్‌ అల్‌ ముజాహిదీన్‌ పేరులో సోమాలియాలో ఇస్లామిక్‌ రాజ్యస్థాపన దిశగా ఉగ్రవాద ఘాతుకు చర్యలకు పాల్పడుతోంది. కెనడా, బ్రిటన్‌, అమెరికాలోని షాపింగ్‌ మాల్స్‌లో దాడులకు తెగబడింది. వదంలాది మందిని బలికొంది. ఇలా చాలా సంస్థలు ఉగ్రవాద కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి పుట్టుకొస్తోంది. జనానికి తెలియని ఉగ్రవాద సంస్థలు ఇంకా ఎన్ని ఉన్నాయో చెప్పలేనిపరిస్థితి. ఎప్పటికప్పుడు కొత్త సంస్థలు పుట్టుకొస్తూ ప్రపంచాన్ని గఢగఢలాడిస్తున్నాయి.

 

గుండెపోటుతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి

అనంతపురం : రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి వద్ద గుండెపోటుతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి చెందారు. బస్సును రోడ్డు పక్కకు ఆపడంతో ప్రమాదం తప్పింది. 

ప్రశాంతంగా వరంగల్ బైపోల్ : భన్వర్ లాల్

హన్మకొండ : వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు. 67 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆయన తెలిపారు. గతంలో కంటే ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఓటింగ్ శాతం... పాలకుర్తి 77, పరకాల 71, భూపాలపల్లి 70, స్టేషన్ ఘన్ పూర్ 68, వరంగల్ పశ్చిమ, 48, వరంగల్ తూర్పు 62 శాతం ఓటింగ్ నమోదు అయింది.

 

163 కరవు మండాలను ప్రకటించిన ఎపి ప్రభుత్వం

హైదరాబాద్ : ఎపి ప్రభుత్వం 163 కరవు మండాలను ప్రకటించింది. ఒంగోలు 35, గుంటూరు 26, నెల్లూరు 19, కడప 18, చిత్తూరు 16, కృష్ణా 14, శ్రీకాకుళం 8, విజయనగరం 3 మండలాలను గుర్తించింది. గతంలో 196 కరవు మండలాను ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం 163 కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది.

 

పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ : జూపల్లి

హైదరాబాద్ : నూతన పారిశ్రామిక విధానం కింద మరో 16 పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణను మార్చడమే టీసర్కార్ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణకు కంపెనీలు క్యూ కడుతున్నాయిని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక 1013 పరిశ్రమలు వచ్చాయన్నారు. ఇప్పటి వరకు 68 కంపెనీలకు అనుమతులిచ్చామని వివరించారు. దీంతో రూ.1570 కోట్ల పెట్టుబడులు రానున్నాయని పేర్కొన్నారు. 1812 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

 

ముగిసిన ఎపి మంత్రివర్గ ఉసంసంఘం భేటీ

హైదరాబాద్ : కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సమావేశమైన ఎపి మంత్రివర్గం ఉసంసంఘం భేటీ ముగిసింది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపునకు మంత్రివర్గం ఉససంఘం సానుకూలత వ్యక్తం చేసింది. ఈమేరకు మంత్రి గంటా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. 30 న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించామని గంటా తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ లో ఉన్న సాంకేతిక సమస్యలను అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. 1994కు ముందు నియమితులైన అడ్ హక్ ఉద్యోగల రెగ్యులరైజేషన్ కు సానుకూలంగా ఉన్నామని పేర్కొన్నారు.

విశాఖ టూటౌన్ సీఐ భార్య ఆత్మహత్య

విశాఖ : నగర టూటౌన్ సీఐ రమణ భార్య సునీత ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఉరివేసుకుని సునీత ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి అనారోగ్యకారణాలే కారణమని అనుమానిస్తున్నారు. 

కులవ్యవస్థను నిర్మూలించేవరకు రిజర్వేషన్లు : బివి.రాఘవులు

విజయవాడ : కులవ్యవస్థను నిర్మూలించే వరకు రిజర్వేషన్లు అవసరమే అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి.రాఘవులు స్పష్టం చేశారు. విజయవాడాలో 'ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల' అనే అంశంపై నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఎక్కడ కూడా ఆర్థిక అసమానతలపై రిజర్వేషన్లు లేవని.. సామాజిక అంశాలపైనే రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని తెలిపారు. దళితులు ఐక్యంగా ఉద్యమిస్తే.. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు సాధ్యమన్నారు. పెండింగ్ లో ఉన్న దళితుల బిల్లులను ఆమోదించాలని డిమాండ్ చేశారు.

 

19:35 - November 21, 2015

విజయవాడ : తన రచనల ద్వారా ప్రజల్లో దేశభక్తి భావాలను పెంపొందించిన గురజాడ అప్పారావు శతవర్ధంతి కార్యక్రమం విజయవాడలో జరిగింది. సింగ్‌నగర్‌లోని ఎంబీపీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు గురజాడ వర్ధంతిలో పొల్గొన్నారు. ముందుగా గురజాడ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన బొడ్డు నాగేశర్వరావు.... ఆ తర్వాత విద్యార్ధులతో కలిసి గురజాడ రచించిన దేశభక్తి గీతాలు అలపించారు. సాంఘిక దురాచారాలపై తన కళం ద్వారా పోరాడిన వ్యక్తి గురజాడ అని కొనియాడారు. ప్రతి విద్యార్ధి చిన్నతనం నుంచే దేశక్తి భావాలు పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే నాగేశ్వరావు కోరారు.

 

 

18:54 - November 21, 2015

హైదరాబాద్ : ఏపీ అధికారుల నుంచి తన భర్తకు హాని ఉందని.. రక్షణ కల్పించాలని ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసు నిందితుడు గంగిరెడ్డి భార్య మాళవిక గవర్నర్‌ను కోరారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆమె టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. కడప సెంట్రల్‌ జైలులో తన భర్త గంగిరెడ్డికి ప్రాణహాని ఉందని.. హైదరాబాద్‌కు తరలించాలని కోరారు. మరిన్ని వివరాలను ఆమె మాటల్లోనే...
'కొంతకాలం క్రితం బస్సులో వెళ్తున్న కొందరు కూలీలను తీసుకొచ్చి అడవిలో వదిలేసి.. ఎర్రచందనం కొడుతున్నారని వారిని ఎన్ కౌంటర్ చేశారు. నా భర్త మారిషస్ నుంచి వచ్చేటప్పుడు మార్గంమధ్యలో ఆయనపై పిస్తోల్ పెట్టి ఆయన గాని వారికి ఫేవర్ గా చెప్పకపోతే తమ నుంచి ప్రాణహాని లేదని తెలపకపోతే ఇండియాకు వెళ్లి మీ భార్య, పిల్లలను చూసుకోలేరని పోలీసులు చెప్పినట్లు చెప్పారు. నేను జైలుకెళ్లి నా భర్తతో ఇంటర్వ్యూ పెట్టుకుంటే ఈ విషయాలను నా భర్త నాకు చెప్పారు. నా భర్త ఎక్కడి పారిపోడు. పారిపోయే ఉద్ధేశం కూడా అయనకు లేదు. ఆయన ఇక్కడే ఉండి గవర్నమెంట్ విధించే శిక్షను అనుభవించడానికి రెడీగా ఉన్నారు. నాభర్తకు ఎలాంటి హాని జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గవర్నర్ మా విజ్ఞప్తులను తీసుకుని నా భర్తకు తగిన రక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. కస్టడీ పేరుతో ఆయన్ను హింసకు గురి చేస్తారేమోనని భయంగా ఉంది. లాయర్ సమక్షంలో ఆయన్ను కస్టడీకి తీసుకుని, ఇంటరాగేషన్ చేయాలని కోరుతున్నాను. మా ఆస్తులన్ని ఈడీలో ఉన్నాయి. మా ఆస్తులన్ని కలిపి మూడు కోట్లు ఉండవు. మాపై కక్ష్య పూరితంతోనే ఈవిధంగా చేస్తున్నారు. అలిపిరి ఘటన జరిగినప్పుడు నా భర్త పేరు లేదు. కానీ ఇప్పుడు మా ఆయన పేరును ముందుకు తీసుకొస్తున్నారు. హైప్ క్రియేట్ చేయగలిగారు. ఇది కేవలం కక్ష్య సాధింపు చర్య. మా ఆయన పారిపోలేదు'. అని వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నెల్లూరు జిల్లాను అన్ని విధాలా ఆదుకుంటాం : వెంకయ్యనాయుడు

నెల్లూరు : వరదల మూలంగా నష్టపోయిన నెల్లూరు జిల్లాను ఆదుకుంటామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అయితే ప్రాథమిక నివేదికల ద్వారా వచ్చే నష్టం వివరాలను బట్టి సాయం అందించడం సాధ్యం కాదని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే బృందం పరిశీలించి ఇచ్చిన నివేదికల ఆధారంగా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. 

నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించి ప్రభుత్వ సహాయ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. చరిత్రలో ఎన్నడూ ఎరుగని రీతిలో వర్షపాతం నమోదైందన్న బాబు...అందరినీ ఆదుకుంటామన్నారు.

18:46 - November 21, 2015

నెల్లూరు : వరదల మూలంగా నష్టపోయిన నెల్లూరు జిల్లాను ఆదుకుంటామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అయితే ప్రాథమిక నివేదికల ద్వారా వచ్చే నష్టం వివరాలను బట్టి సాయం అందించడం సాధ్యం కాదని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే బృందం పరిశీలించి ఇచ్చిన నివేదికల ఆధారంగా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు.

 

18:44 - November 21, 2015

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించి ప్రభుత్వ సహాయ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. చరిత్రలో ఎన్నడూ ఎరుగని రీతిలో వర్షపాతం నమోదైందన్న బాబు...అందరినీ ఆదుకుంటామన్నారు.

18:38 - November 21, 2015

కృష్ణా : జిల్లాలోని చందర్లపాడు దగ్గర రామన్నపేట దగ్గర ప్రమాదం జరిగింది. బల్లకట్టుపై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడి గల్లంతయ్యారు. వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గల్లంతమైన ముగ్గురు రామన్నపేటకు చెందినవారు. ఇక్కడ ప్రతినిత్యం ప్రజలు బల్లకట్టుపై రామన్నపేట నుంచి గుంటూరుకు వెళతారు. నదికి ఇవతలి ఒడ్డు కృష్ణాజిల్లా అయితే.. అవతలి ఒడ్డు గుంటూరు జిల్లా. రామన్నపేటకు చెందిన గోపి, నర్సింహారావు, రమణలు గుంటూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

 

కృష్ణా జిల్లాలో విషాదం..

కృష్ణా : జిల్లాలోని చందర్లపాడు దగ్గర రామన్నపేట దగ్గర ప్రమాదం జరిగింది. బల్లకట్టుపై వెళుతున్న ముగ్గురు కృష్ణానదిలో పడిపోవటంతో.. గల్లంతయ్యారు. వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 

18:29 - November 21, 2015

హైదరాబాద్ : వారం రోజుల పాటు బాలలను అలరించిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలు ఘనంగా ముగిసాయి. హైదరాబాద్ శిల్పకళావేదికలో అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ , రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, తెలంగాణా ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, కేఎఫ్ఎస్ఐ ఛైర్మన్ ముఖేష్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు.
నవంబర్ 14న ప్రారంభం
అంతర్జాతీయ 19వ బాలల చిత్రోత్సవాలు నవంబర్ 14న ప్రారంభమైన ఈ చిత్రోత్సవం చిన్నారుల సందడితో ఉత్సాహంగా ముగిసింది. ఈ చిత్రోత్సవంలో పలుదేశాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ బాలల చిత్రాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన చిత్రాలను ఎంపిక చేసి బహుమతులు ప్రదానం చేసారు. ఈ చిత్రోత్సవంలో రష్యాకు చెందిన సెలషియన్ కేమేల్, బెల్జియంకు చెందిన సాంగ్ ఆఫ్ ద సీ, కొరియాకు చెందిన హై టూ స్టీల్ ఏ డాగ్, మన దేశానికి చెందిన 'హౌ ఆయామ్ ఐ' చిత్రాలకు బంగారు ఏనుగు పురస్కారాలు లభించింది.
బాలల చిత్రోత్సవాలు జరుపుకోవడం గర్వకారణం : గవర్నర్ నరసింహన్
ఈ సందర్భంగా హైదరాబాద్ వేదికగా 19 వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలు జరుపుకోవడం గర్వకారణమని గవర్నర్ నరసింహన్ అన్నారు. అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన చిత్రాలు చిన్నారులకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
భవిష్యత్ లో నిర్వహించేందుకు కూడా తాము సిద్ధం : తలసాని
ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ ని భవిష్యత్తులో కూడా హైదరాబాద్ వేదికగా నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణా ప్రభుత్వంపై నమ్మకం ఉంచి చిల్డ్రన్ ఫిలిం పెస్టివల్ ని హైదరాబాద్ ని శాశ్వత వేదికగా గుర్తించిన కేంద్ర మంత్రి రాజవర్ధన్ రాధోడ్ ని ప్రత్యేక అభినందనలు తెలిపారు తలసాని శ్రీనివాస్ యాదవ్. వారం రోజుల పాటు ఉత్సాహంగా సాగిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం, ఈ ఏడాది కూడా ఘనంగా ముగింపు వేడుకలు చేసుకుంది.

 

18:15 - November 21, 2015

హైదరాబాద్ : పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఏపి సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన ప్రాజెక్టే బీచ్ కారిడార్. ప్రస్తుత పరిస్థితుల్లో బీచ్‌ కారిడార్‌ తూచ్‌ అయ్యేలా ఉంది. అభివృద్ధి ఏమో గాని అంచనాలకు మించి ఖర్చు కనిపించడంతో సర్కారు సందిగ్ధంలో పడింది.
ఏపీలో 970 కి.మీ తీర ప్రాంతం
దేశంలోనే పొడ‌వైన స‌ముద్ర తీరం ఉన్న రాష్ర్టాల్లో ఆంధ్రప్రదేశ్‌ది రెండో స్థానం. దాదాపు 970 కిలోమీట‌ర్ల మేర తీర ప్రాంతం ఉంది. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి పెద్దపీట వేయాలని సంకల్పించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బీచ్‌ కారిడార్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఆశించిన ఆదాయం రాదంటున్న కంపెనీలు
పర్యాట‌క రంగ అభివృద్ది కోసం అధ్యయ‌నం చేసేందుకు విదేశీ పర్యటనలు కూడా చేశారు ఏపి అధికారులు. ఈ క్రమంలో ఆశించిన విధంగా రెవెన్యూ రాదంటూ పెట్టుబ‌డులు పెట్టే కంపెనీలు చెప్పడంతో ఇక ఏంచేయాలో, ఎలా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలో తెలియ‌క అధికారులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

వ్యయంతో కూడుకున్న కోస్టల్‌ కారిడార్‌ ఏర్పాటు
కోస్టల్‌ కారిడార్‌ ఏపీ రాష్ర్టానికి వస్తోంది అంటే అంద‌రూ ఆశ్చర్యపోయారు. కార‌ణం ఇది దేశంలోనే మొట్టమొద‌టి కారిడార్ ప్రాజెక్ట్ కావ‌డం. కాని ఇది సాధ్యపడుతుందా అంటే అధికారులు కాసేపు అవునంటూ, మరికాసేపు కాదంటూ త‌లాడిస్తున్నారు. కోస్టల్‌ ప్రాజెక్ట్ న‌మూనా చూసేందుకు విదేశాల‌కు వెళ్లిన బృదం ఇది కుదిరే ప‌ని కాదంటూ తేల్చేసింది. చికాగో కోస్టల్‌ కారిడార్ నిర్మించ‌డానికి 19 సంవత్సరాలు పట్టిందని, ఒక అగ్రరాజ్యానికి అందులోను ఎటువంటి నిధుల కొర‌తా లేని దేశానికే అంత వ్యవధి ప‌డితే ఇక మ‌న‌కు 25 సంవత్సరాలైనా పడుతుందని అధికారులు తేల్చేశారు. అమెరికా వంటి దేశానికి కేవ‌లం 600 మైళ్ల కారిడార్ నిర్మించ‌డానికి 19 ఏళ్లు ప‌ట్టిందంటే అది ఎంత శ్రమతో కూడుకున్నదో అర్ధం చేసుకోవొచ్చు.
ఇచ్ఛాపురం-తడ వరకు 1010 కి.మీ. తీర ప్రాంతం
ఇక బీచ్‌ కారిడార్‌ పరిస్థితి మరోలా ఉంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు ఉన్న 1010 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని నాలుగు ప్యాకేజీలుగా విభజించి మూడు ఏజెన్సీలకు సర్వే బాధ్యత అప్పగించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఇన్‌క్యాప్ ద్వారా ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం వరకు 250 కిలో మీటర్ల దూరాన్ని ఒక ప్యాకేజీగా చేసి దాని సర్వేను మెస్సర్స్‌ ఫీడ్‌బ్యాక్‌ ఇన్‌ఫ్రా సంస్థకు ఇచ్చింది. విశాఖ నుంచి నరసాపురం వరకు 260 కిలో మీటర్ల దూరాన్ని రెండవ ప్యాకేజీగా చేసి ఆర్వీన్‌ అసోసియేట్స్‌కు అప్పగించింది. నర్సాపురం నుంచి ఒంగోలు వరకు 260 కిలోమీటర్ల దూరాన్ని మూడవ ప్యాకేజీగా చేసి ఆర్వీన్‌ అసోసియేట్స్‌కు ఇచ్చింది. అలాగే ఒంగోలు నుంచి తడ వరకు గల 240 కిలోమీటర్ల దూరాన్ని నాలుగో ప్యాకేజీగా చేసి మెస్సర్స్‌ ఎకామ్‌ సంస్థకు అప్పగించింది ఏపీ ప్రభుత్వం.
ఆశించిన ఆదాయం రాదంటున్న సర్వే ఏజెన్సీలు
ఇలా వివిధ ద‌శ‌ల్లో స‌ర్వేలు నిర్వహించిన ఏజెన్సీలు ప్రభుత్వానికి షాకిచ్చే విష‌యాల‌ను అధికారుల ముందుంచాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాల‌నుకున్న ఈ ప్రాజెక్టుకు ప్రైవేటు రంగం నుంచి పెట్టుబ‌డులు క‌రువ‌య్యాయి. కేవ‌లం రోడ్డు నిర్మాణానికి పెట్టే పెట్టుబ‌డుల‌కు ఏ విధ‌మైన రెవెన్యూ ఆదాయం ఉండ‌దంటూ ప్రైవేటు కంపెనీలు వెనుక‌డుగు వేస్తున్నాయి. ఒక్క ప్రైవేటు కంపెనీలే కాదు ఆ మార్గంలో ఎటువంటి ఆదాయం ఉండ‌దంటూ ప్రభుత్వాధికారులు చెప్తున్నారు.
మొదటి దశ బీచ్‌ రోడ్‌ 170-180 కి.మీ
భోగాపురం నుంచి కాకినాడ వ‌ర‌కు ప్రతిపాదించిన మొద‌టి ద‌శ బీచ్ రోడ్ 170 నుంచి 180 కిలోమీట‌ర్లు ఉంటుంది. స‌ముద్ర తీరం కావ‌డంతో ప్రతీ కిలోమీట‌రు నిర్మాణానికి 5 కోట్ల మేర ఖర్చవుతుంది. ఈ విధంగా చూస్తే 180 కిలోమిట‌ర్ల బీచ్‌ రోడ్ నిర్మాణానికి 900కోట్లు ఖర్చవుతుంది. ఇంత భారీ స్థాయిలో పెట్టుబ‌డి పెట్టినా అంత మొత్తం తిరిగి రావ‌డం క‌ష్టం. పర్యాట‌క ప‌రంగా కొత్త కొత్త హంగులు ఏర్పాటు చేసినప్పటికీ ప్రభుత్వానికి రెవెన్యూ లోటు మిగలడం ఖాయమంటున్నారు అధికారులు. మ‌రి ఈ ప్రాజెక్ట్‌ ముందుకి క‌దులుతుందా లేదా అనేది ఇక ప్రభుత్వం చేతుల్లోనే ఉంది.

 

ఉగ్రదాడిలో భారత మహిళమృతి

మాలి : పశ్చిమాఫ్రికా దేశమైన మాలి రాజధాని బమాకోలో ఉగ్రవాదులు 27 మందిని బలి తీసుకున్న విషయం విదితమే. 27 మందిలో భారత సంతతికి చెందిన అమెరికా మహిళ ఉన్నారు. మృతి చెందిన మహిళను అనిత అశోక్ దతార్(41)గా పోలీసులు గుర్తించారు. అనిత మృతికి విచారం వ్యక్తం చేస్తున్నామని యూఎస్ సెక్రటరీ జాన్ కెర్రీ పేర్కొన్నారు.

సర్వే సత్యనారాయణ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

వరంగల్: కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. మాజీ ఎంపీ అయి ఉండి కూడా ఎన్నికల నియమావళి తెలియనట్టు ప్రవర్తించారు. ఏకంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి నేరుగా ఓటర్లను కలుస్తూ తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూశారు.

 

 

17:57 - November 21, 2015

హన్మకొండ : వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 65 శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉటుందని అధికారులు తెలిపారు. గత ఎన్నికల్లో 77 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఈనెల 24న కౌంటింగ్ జరుగనున్నాయి. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. 
ప్రశాంతంగా ఉపఎన్నిక
తెలంగాణ వ్యాప్తంగా అత్యంత ఆసక్తి కలిగించిన వరంగల పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి అన్ని పార్టీలు పోటీపడ్డాయి. స్థానం దక్కించుకుని పరువు నిలబెట్టుకోవాలని ఇటు అధికారపక్షం, ప్రభుత్వ వ్యతిరేకత ఎంత బలంగా ఉందో చాటడానికి విపక్షాలు పోటాపోటీగా ప్రచారం సాగించాయి. మొత్తం 23 మంది అభ్యర్థులు పోటీపడగా, 1778 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఉదయం నుంచే మందకోడిగా ఓటింగ్ మొదలైనా మధ్యాహ్నానికి పుంజుకుంది. అక్కడక్కడా ఈవీఎలుం మొరాయించడం మినహా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. సాయంత్రం ఐదు వరకు క్యూలో ఉన్న ఓటర్లందరికీ అవకాశం కల్పించారు.
గణనీయంగా తగ్గిన ఓటింగ్ శాతం
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గింది. గతంలో 75.47 శాతం ఓటింగ్ నమోదు కాగా..ఈసారి అది దాదాపు 65 శాతానికి పడిపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే 10 శాతం తగ్గింది. పట్టణాల కన్నా పల్లెల్లోనూ ఓటింగ్ బాగా నమోదైంది. ఇక నియోజకవర్గాల వారీగా పోలింగ్ పరిశీలిస్తే...పాలకుర్తి 65 శాతం,వర్థన్నపేట 61 శాతం, స్టేషన్ గన్‌పూర్ 60 శాతం, పరకాల 61 శాతం, భూపాలపల్లి 60 శాతం, వరంగల్ ఈస్ట్ 55 శాతం, అత్యంత తక్కువగా వరంగల్ వెస్ట్ లో కేవలం 39 శాతంగా ఓటింగ్ నమోదైంది.
అధికారులు, గ్రామస్థుల మధ్య రాజీ కుదిర్చిన 10టీవీ
అయితే తొర్రూరు మండలం వేలికట్ట గ్రామ శివారు టీక్యతండా వాసులు మొదట పోలింగ్ ను బహిష్కరించారు. తమ గ్రామానికి ఈసారైనా మౌలికసదుపాయాలు కల్పిస్తామని హామి ఇస్తేనే ఓటు వేస్తామని ఏకతాటిపై నిలిచారు. ఇదే సమయంలో టెన్ టీవీ చొరవ తీసుకుంది. అధికారులు, గ్రామస్థుల మధ్య రాజీ కుదిర్చి వారిని ఓటింగ్ కు ఒప్పించింది. దాదాపు సాయంత్రం 4 గంటల నుంచి అక్కడ ఓటింగ్ మొదలైంది. అయితే 2014 ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే ఈసారి గణనీయంగా ఓటింగ్ శాతం తగ్గడాన్ని పరశీలిస్తే..ఉప ఎన్నిక పట్ల ఓటర్లు ఆసక్తి కనబరచలేదని తెలుస్తోంది. ఈనెల 24న ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది.

 

17:55 - November 21, 2015

శ్రీకాకుళం : జిల్లాలోని పలాస మండలం మొగిలిపాడులోని ఓ జీడి పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో వందలాది బస్తాల జీడీ నిల్వలు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు మూడు కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు.మందుగా స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. 

17:54 - November 21, 2015

ఖమ్మం : భద్రాచలంలోని టీఆర్ ఎస్ కు చెందిన ఆరుగురు నాయకులను మావోయిస్టులు విడుదల చేయగా వారు క్షేమంగా ఇళ్లకు చేరారు. వాళ్ల రాకకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. టిఆర్‌ఎస్‌ డివిజన్‌ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న మానే రామకృష్ణ భద్రాచలంలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన రాకతో కార్యకర్తలు పార్టీ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులు మంగళహారతులిచ్చి గృహంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టులు తమను హింసించలేదని ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తమను కిడ్నాప్ చేశారని తెలిపారు. తమను విడుదల చేయాలని కోరగా కొన్ని డిమాండ్స్‌ చెప్పి విడుదల చేశారన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్లు ఆపాలని, గ్రేహౌండ్స్‌, సిఆర్‌పిఎఫ్‌ దళాలను వెనక్కు పిలవాలని డిమాండ్‌ చేసినట్లు చెప్పారు.

 

 

17:26 - November 21, 2015

వరంగల్ : భూపాలపల్లిలో ఓటింగ్‌ సరళి మందకొడిగా సాగుతోంది. స్లిప్పులు సరిగ్గా ఇవ్వకపోవడం వల్లేనని కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రూరల్ ఏరియాలో ఓటింగ్‌ సరళి బాగుందని చెప్పారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దే విషయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 

ముగిసిన వరంగల్ ఉపఎన్నిక పోలింగ్

హన్మకొండ : వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 65 శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉటుందని అధికారులు తెలిపారు. గత ఎన్నికల్లో 77 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఈనెల 24న కౌంటింగ్ జరుగనున్నాయి. 

బ్రస్సెల్స్ లో హై అలర్ట్

బెల్జియం  : అటు ప్యారిస్‌.. ఇటు బకోమాలో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో కూడా శనివారం హై అలర్ట్ ప్రకటించారు. మెట్రో రైలు ప్రయాణాలను నిలిపివేశారు. ప్రజలను గుంపులుగుంపులుగా సంచరికుండా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బెల్జియంలో ఉగ్రదాడి పొంచివుందన్న ముందస్తు జాగ్రత్తతో పబ్లిక్‌ ప్రదేశాలు, మాల్స్, పలు స్టేషన్లలో ప్రజలు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. ప్రధాన ప్రదేశాల్లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.

 

16:29 - November 21, 2015

ఢిల్లీ : దేశంలో మతోన్మాద ఘర్షణలు పెరుగుతున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి తెలిపారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వం మతోన్మాదాన్ని ఖండించాలన్నారు. మతోన్మాద శక్తులను ఖండిస్తూ పార్లమెంట్‌లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాజ్యసభ ఛైర్మన్‌కు నోటీసులు ఇచ్చామని తెలిపారు. దేశంలో ఆర్థిక సంక్షోభం పెరుగుతోందని పేర్కొన్నారు. ప్రజాసమస్యలపై పార్లమెంట్‌లో ప్రశ్నిస్తామన్నారు. అలాగే ధరల పెరుగుదలపై కూడా ప్రశ్నిస్తామని చెప్పారు.

 

15:52 - November 21, 2015

నెల్లూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉమేశ్ చంద్ర సమావేశమందిరంలో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో వరద పరిస్థితులపై సమీక్షించారు. బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాలతో రూ. 3వేల కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. జిల్లాలో అక్వారైతులు భారీగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ లోపాలవల్లే రహదారి కొట్టుకుపోయిందని చెప్పారు. రెండురోజుల్లో పరిహారం, సహాయక చర్యలు అందుతాయన్నారు. ప్రతి మండలానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. మూడు రోజుల్లో వరద ప్రాంతాల్లో సర్వే చేస్తామని చెప్పారు. ఆక్రమణలవల్లే నెల్లూరు ముంపుకు గురైందన్నారు. సమావేశం అనంతరం చంద్రబాబు సర్వేపల్లికి వెళ్లారు. అక్కడి రిజర్వాయర్‌ను పరిశీలించారు. బాబుతోపాటు మంత్రులు నారాయణ, సిద్ధ రాఘవరావు, దేవినేని ఉమ, పరిటాల సునీత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

 

టీడీపీ నేత సోమిరెడ్డికి అస్వస్థత

నెల్లూరు : టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లాలోని వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సీఎంతో పాటు పర్యటనలో పాల్గొన్న సోమిరెడ్డి ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు ఎలాంటి అపాయం లేదని తెలిపారు. సోమిరెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులు

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని చిన్నచింతకుంట కురుమూర్తి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతున్న జాతరకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే కురుమూర్తి స్వామి, లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. మధ్యాహ్నం సమయానికి దాదాపు 50వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా. కూరుమూర్తి దేవస్థానం జాతర మైదానం భక్తులతో రద్దీగా మారింది.

రంగారెడ్డి జిల్లాలో గొనేసంచి కలకలం

రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్ మండలం బూర్కుంటతండాలో ఓ గోనెసంచి కలకలం రేపింది. గ్రామశివారులో ఉన్న మర్రిచెట్టుకు ఓ గోనెసంచి వేలాడదీసి ఉంది. సంచిలో నుంచి ద్రవం చుక్కులుగా కారుతుంది. దుర్వాసన వస్తుండటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సంచిని విప్పదీసే చర్యలు చేపట్టారు.

15:31 - November 21, 2015

గుంటూరు : జిల్లాలో దారుణం జరిగింది. రక్షక భటుడు భక్షకభటుడు అయ్యాడు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ అధికారి కామాంధుడయ్యాడు. ఆపదలో ఉన్న వారిని రక్షించాల్సిన పోలీసు అధికారి దారుణానికి ఒడిగట్టాడు. స్నేహితుడితో కలిసి ఏఎస్ఐ ఓ మహిళపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. గుంటూరు జిల్లా బెల్లంకొండ పీఎస్‌లో ఏఎస్ఐ గా పనిచేస్తున్న శ్రీనివాసరావు నెలరోజుల క్రితం ఓ యువతిపై కన్నేశాడు. ఆమెకు మత్తుమందు కలిపిన ఓ పానీయం తాగించాడు. బాధితురాలు స్పృహతప్పాక స్నేహితుడితో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. ఇదంతా వీడియో తీశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఈ వీడియో బయట పెడతానని ఆమెను బెదిరించాడు. పదే పదే తన లైంగిక వాంఛలు తీర్చాలని ఫోన్ లో వేధిస్తున్నాడు. అతని వేధింపులతో విసిగిపోయిన యువతి రూరల్‌ ఎస్పీని ఆశ్రయించింది. ఏ ఎస్‌ఐపై చర్య తీసుకోవాలని కోరింది.

 

 

15:21 - November 21, 2015

దశాబ్దాలుగా భిన్నమైన సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు కమల్ హాసన్. కమర్షియల్ ఫీట్లను వదిలేసి....కథలో కొత్తదనాన్ని ఎంచుకుంటూ తన బ్రాండ్ ను కాపాడుకుంటున్నాడు. ఇలా కమల్ చేసిన మరో ప్రయత్నమే చీకటి రాజ్యం. హాలీవుడ్ ఫిల్మ్ స్లీప్ లెస్ నైట్ కథకు రీమేక్ గా దర్శకుడు రాజేష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఐతే....రీమేక్ సినిమాల్లో సాధారణంగా ఎదురయ్యే నేటివిటీ సమస్య చీకటి రాజ్యానికి కొంత వరకు ఎదురైంది.
కథ...
నిజాయితీగా పనిచేసే నార్కోటిక్ బ్యూరో అధికారి కమల్ హాసన్. ఓ సందర్భంలో ప్రకాష్ రాజ్ స్మగుల్ చేస్తున్న డ్రగ్స్ పెద్ద మొత్తంలో పట్టుకుంటాడు. ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న ఈ విలన్ గ్యాంగ్...కమల్ కొడుకుని కిడ్నాప్ చేస్తారు. పట్టుకున్న డ్రగ్స్ తిరిగి ఇవ్వకుంటే వారసుడిని చంపేస్తామని బెదిరిస్తారు. స్మగ్లర్లకు తిరిగి డ్రగ్స్ ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు కమల్. ప్రకాష్ రాజ్ గ్యాంగ్ కు ఈ డ్రగ్స్ అందించే క్రమంలో అది ఎన్ని మలుపులు తిరిగిందన్నది కథలోని ట్విస్ట్. చీకటి రాజ్యంలో ఎలాంటి వ్యవస్థ పనిచేస్తుందో అన్న అంశాలతో ఆసక్తికరంగా ముగుస్తుంది చిత్ర కథ.
విశ్లేషణ..
భిన్నమైన క్యారెక్టర్లు కమల్ కోసం పుడతాయో...లేక కథను బాగా ఒంటబట్టించుకుని....అంతలా పాత్రలో ఒదిగిపోతాడో తెలీదు గానీ....చీకటి రాజ్యంలో కమల్ హాసన్ మరో సారి తన నటనా ప్రతిభను చూపాడు. అత్యంత సహజంగా దివాకర్ పాత్రను పోషించాడు. నార్కొటిక్ బ్యూరో ఆఫీసర్ గా త్రిష బాగా నటించింది. ఈ బ్యూటీ చేసిన కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకున్నాయి. ఇక కామెడీ విలనీ చేయడంలో ప్రకాష్ రాజ్ తన టాలెంట్ చూపించాడు. జిబ్రన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. హాలీవుడ్ ఫిల్మ్ స్లీప్ లెస్ నైట్స్...ఆధారంగా చీకటి రాజ్యం సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రాజేష్. చాలా రీమేక్ సినిమాల్లాగే చీకటి రాజ్యం సినిమాకు నేటివిటీ సమస్య ఎదురైంది. ఫ్యూర్ థ్రిల్లర్ కథకు...మనకు నచ్చేలా కామెడీ ఫ్లేవర్ కలపడంతో మూల కథలో ఏదో తేడా అనిపిస్తుంటుంది. ఐనా...క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్, ఆర్టిస్టుల ఫర్మార్మెన్స్ సినిమాను నిలబెట్టింది.
ఫ్లస్ పాయింట్స్
కమల్ హాసన్ ఫర్మార్మెన్స్
స్క్రీన్ ప్లే
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సస్పెన్స్ సీన్స్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
సెకండాఫ్ లోని స్లో నెరేషన్
ఎడిటింగ్
టెన్ టివి రేటింగ్.. 2.5/5


 

కొనసాగుతున్న వరంగల్‌ బైపోల్

హన్మకొండ : వరంగల్‌ బైపోల్ లో పోలింగ్‌ ఉత్సాహంగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 46 శాతం పోలింగ్ నమోదైంది. వర్ధన్నపేటలో 34 శాతం, పాలకుర్తిలో28.5 శాతం, పరకాలలో 30 శాతం, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 30.4 శాతం, భూపాలపల్లిలో 29.3 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

 

15:05 - November 21, 2015

హన్మకొండ : వరంగల్‌ బైపోల్ లో పోలింగ్‌ ఉత్సాహంగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 46 శాతం పోలింగ్ నమోదైంది. వర్ధన్నపేటలో 34 శాతం, పాలకుర్తిలో28.5 శాతం, పరకాలలో 30 శాతం, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 30.4 శాతం, భూపాలపల్లిలో 29.3 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
ఎన్నికను బహిష్కరించిన టీకే తండావాసులు
అయితే టీకే తండా వాసులు మాత్రం ఎన్నికను బహిష్కరించారు. తమ గ్రామంలో ఏ ఒక్క మౌలిక వసతీ లేదని అందుకే ఎన్నికను బహిష్కరించామని చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం అమలుకావడం లేదన్నారు. ఎన్నికలను బహిష్కరిస్తే.. కొన్ని డిమాండ్లన్న పరిష్కారం అవుతాయని చెబుతున్నారు. సర్పంచ్ ను మంచినీరు అడిగితే వెటకారంగా మాట్లాడుతున్నారని వాపోయారు. 'నా ఇంట్లో బోరు వేసుకున్న ఇక్కడి నుంచి వాటర్ తీసుకెళ్తారా అని అని సర్పంచ్ వెటకారంగా మాట్లాడారని చెప్పారు. ఎన్నికల్లో ఎనిమిది లక్షలు ఖర్చు చేసుకున్నానని సర్పంచ్ చెబుతున్నారని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి కుంటుపడిందన్నారు. సిసి రోడ్డు, మంచినీరు లేదని మండిపడ్డారు. మూడు నెలలుగా రేషన్ బియ్యం ఇవ్వడం లేదన్నారు. రేషన్ బియ్యం కోసం 6 కిమీలు వెళ్తున్నామని చెప్పారు. విద్యుత్ సౌకర్యం లేదని వాపోయారు.

 

14:55 - November 21, 2015

హైదరాబాద్ : గవర్నర్‌ నరసింహన్‌కు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ గంగిరెడ్డి భార్య మాళవిక లేఖ రాశారు. తన భర్తకు ఏపీ అధికారుల నుంచి ప్రాణహాని ఉందని లేఖలో తెలిపారు. గంగిరెడ్డికి రక్షణ కల్పించాలని కోరారు. ఏపీ ప్రభుత్వం తన భర్తపై తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు. ఈ కేసులను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు.. కడప సెంట్రల్‌ జైలులో గంగిరెడ్డికి ప్రాణహాని ఉందని... అందుకే హైదరాబాద్‌ సెంట్రల్‌ జైలుకు తరలించాలని లేఖలో కోరారు మాలవిక..

గవర్నర్‌ నరసింహన్‌కు గంగిరెడ్డి భార్య మాళవిక లేఖ

హైదరాబాద్ : గవర్నర్‌ నరసింహన్‌కు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ గంగిరెడ్డి భార్య మాళవిక లేఖ రాశారు. తన భర్తకు ఏపీ అధికారుల నుంచి ప్రాణహాని ఉందని లేఖలో తెలిపారు. గంగిరెడ్డికి రక్షణ కల్పించాలని కోరారు. ఏపీ ప్రభుత్వం తన భర్తపై తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు. 

14:48 - November 21, 2015

వరంగల్ : టీకే తండావాసులతో అధికారులు చర్చలు సఫలమయ్యాయి. ఓట్లు వేసేందుకు టీకే తండావాసులు అంగీకరించారు. తొర్రూరు మండలం వెలికట్టే గ్రామపంచాయతీ పరిధిలోని టీకే తండావాసులు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామంలో గత కొన్నియేళ్లుగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పట్టుబట్టారు. సమస్యల పరిష్కారించాకే ఓట్లు వేస్తామని భీష్మించుకకూర్చున్నారు. దీంతో 10 టివి రంగ ప్రవేశం చేసింది. తండావాసుల బాధలు, సమస్యలను తెలుసుకుని అధికారులకు వివరించింది. దీంతో అధికారులు... టీకే తండావాసులతో చర్చలు జరిపారు. తండాలో నెలకొన్న మంచినీరు, విద్యుత్ వంటి పలు సమస్యలను పరిష్కరించేందుకు హామినిచ్చారు. దీంతో తండా వాసులు ఓట్లు వేయడానికి అంగీకరించారు. సమస్యలు పరిష్కారమయ్యేలా 10 టివి కృషి చేసింది. తండావాసులు 10 టివికి ధన్యావాదాలు తెలిపారు.

 

యువతిపై ఏఎస్ఐ, స్నేహితుడు గ్యాంగ్ రేప్...

గుంటూరు : యువతిపై ఏఎస్ఐ, అతని స్నేహితుడు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. బెల్లకొండ పీఎస్ లో ఏఎస్ఐగా శ్రీనివాసరావు పనిచేస్తున్నాడు. నెల రోజుల క్రితం యువతికి మందు ఇచ్చి శ్రీనివాస రావు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే వీడియో బయటపెడుతానని హెచ్చరించాడు. దీనితో బాధిత యువతి రూరల్ ఎస్పీని ఆశ్రయించింది. 

నాగాలాండ్ లో కాంగ్రెస్ కు భారీ దెబ్బ..

నాగాలాండ్ : కాంగ్రెస్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఎన్ పీఎఫ్ - బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 

ప్రకాశం జిల్లాలో రూ.8.19 కోట్ల నష్టం - రావెల..

ప్రకాశం : వర్షాల కారణంగా జిల్లాలో రూ.8.19 కోట్ల మేర నష్టం జరిగిందని మంత్రి రావెల పేర్కొన్నారు. వర్షాల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కేంద్రాన్ని రూ.1000 కోట్లు సాయం కోరినట్లు తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో అధిక వర్షాలు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

నెల్లూరులో బాబు..

నెల్లూరు : జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. వర్షాలకు రూ.మూడు వేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని తెలిపారు. వెయ్యి కోట్ల వరకు ఆక్వా రైతులకు నష్టం జరిగిందని, వీరికి ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని వెల్లడించారు. బ్రిటీష్ వాళ్లు ఉపయోగించిన టెక్నాలజీని ఇక్కడి ఇంజినీర్లు 20 శాతం కూడా ఉపయోగించలేదన్నారు. కృష్ణపట్నం పోర్టు నిర్మాణం వల్ల కూడా నష్టం జరిగినట్లు, రెండు రోజుల్లో పరిహారం, సహాయక చర్యలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారి..భారీ నష్టం జరిగిన మండలానికి ముగ్గురు ప్రత్యేక అధికారులను నియమించినట్లు చెప్పారు.

గణతంత్ర దినోత్సవ వేడుకులకు ఫ్రెంచ్ అధ్యక్షుడు..

ఢిల్లీ : గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడిని భారత్ ఆహ్వానించింది. ఈ మేరకు ఫ్రెంచ్ అధ్యక్షుడికి ఆహ్వానం పంపింది.

13:25 - November 21, 2015

వరంగల్ : జిల్లా లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం మందకొడిగా పోలింగ్ ప్రారంభమైనా మధ్యాహ్నంకు ఊపందుకొంది. యువకులు..మహిళలు..ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందులో సీనియర్స్ సిటిజన్స్ సైతం ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరి నిలుచుండడం విశేషం. ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో సీనియర్స్ సిటిజన్స్ మాట్లాడారు. గత 50ఏళ్లుగా తాము ఓటు వేస్తూ వస్తున్నామని, ఓటు వేయాలని ఇతరులకు చెబుతున్నట్లు తెలిపారు. గతంలో క్యూ లో నిలబడే వేసే వారమని, ఈ సారి లైన్ లో కాకుండా నేరుగా వెళ్లే సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. అభ్యర్థుల ఫొటోలను ఏర్పాటు చేయడం లాభంగా ఉందన్నారు. పోలీసులు..అధికారులు తమకు చక్కగా సహకరించారని పేర్కొన్నారు. 

13:19 - November 21, 2015

వరంగల్ : లోక్ సభ ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం మందకొడిగా సాగినా మధాహ్ననానికి పోలింగ్ ఊపందుకుంది. పలు ప్రాంతాల్లో ఓటు వేయడానికి ఓటర్లు బారులు తీరి నిలుచున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ పలు పోలింగ్ బూత్ లలో మొరాయించిన ఈవీఎంలను అధికారులు సరి చేశారు. ఇదిలా ఉంటే పోలింగ్ ను గ్రామస్తులు బహిష్కరించారు. మౌలిక సదుపాయాలు, రోడ్డు నిర్మాణం చేయలేదని తొర్రూరు (మం) టిక్కా తండాలో...వర్ధన్నపేట (మం) టేకులతండాలో పోలింగ్ ను గ్రామస్తులు బహిష్కరించారు.

ఓటు వేసిన ప్రముఖులు..
జిల్లా లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. వడ్డేపల్లిలో డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో ఏంపీ సీతారాం నాయక్, నక్కలగుట్టలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, సంగెం (మం) బొల్లికుంట పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్, వరంగల్ గ్రేన్ మార్కెట్ లో వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి గాలి వినోద్ కుమార్, పరకాల (మం) నర్సక్కపల్లిలో స్పీకర్ మధుసూధనాచారిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం..
వర్ధన్నపేట 34, పరకాల 30, భూపాలపల్లి 30, పాలకుర్తి 28.5, స్టేషన్ ఘన్ పూర్ 28.2 శాతం పోలింగ్ నమోదైంది. వరంగల్ ఈస్ట్ 29, వరంగల్ వెస్ట్ 23 శాతం పోలింగ్ నమోదైంది. 

13:13 - November 21, 2015

వరంగల్ : భూపాలపల్లి నియోజకవర్గంలోని అడవీ కమలాపూర్..మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. ఎన్నికలు ఇక్కడ నిర్వహించాలంటే అధికారులు పలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. తాజాగా లోక్ సభ కు జరుగుతున్న ఉపఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి టెన్ టివితో మాట్లాడారు. ఇప్పటి వరకు 58 శాతం పోలింగ్ నమోదైందని, సజావుగా పోలింగ్ జరుగుతోందన్నారు. ఎస్ఐ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారని తెలిపారు. ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. స్టేషన్ ఘన్ పూర్ వద్ద ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. రూరల్ ఎస్పీ ఆధ్వర్యంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ ను పర్యవేక్షిస్తున్నారు.

 

13:10 - November 21, 2015

అమ్మాయిలు ఇలాగే ఉండాలనే నిబంధనలు మన సమాజంలో చాలానే ఉన్నాయి. రోజు రోజుకు ఎన్ని మార్పులు వస్తున్నా...కాలం ఎంత మారినా...ఈ విషయంలో ఎదగలేకపోతున్నాం. ప్రేమలోనూ ఇంతే...లవ్ లో ఉన్న అబ్బాయి కంటే అమ్మాయికే రెస్ట్రిక్షన్స్ ఎక్కువ. మిగతా అబ్బాయిలతో స్నేహాలు చేయకూడదు. వేసుకునే డ్రెస్సులు పద్దతిగా ఉండాలి.....ఇలా ప్రతి దాంట్లోనూ రూల్సే. ఐతే వీటిని బ్రేక్ చేస్తూ...లవ్ కి కొత్త అర్థాన్నిచ్చే కథతో తెరకెక్కింది కుమారి 21ఎఫ్. మరి ఇంత బోల్డ్ కథను ఓన్ చేసుకోవాలంటే మన సొసైటీ ఇంకా ఎదగాలేమో?

కథ..
అపార్థాల కారణంగా చిన్నప్పుడే రాజ్ తరుణ్ అమ్మానాన్న విడిపోతారు. తల్లి నర్సుగా పనిచేస్తుంటుంది. చదువు ఒకవైపు, ఫ్రెండ్స్ తో షికార్లు మరోవైపు...ఇదీ రాజ్ తరుణ్ కామన్ లైఫ్ స్టైల్. ఇలాంటి కుర్రాడి జీవితంలోకి హెబ్బా పటేల్ వస్తుంది. ఫాస్ట్ కల్చర్ కు అలవాటు పడిన ఈ అమ్మాయి....ఆడ మగా తేడా లేకుండా స్నేహాలు పరిచయాలు చేసుకుంటుంది. అమ్మాయిలు అబ్బాయిలతో ఇలాగే ఉండాలన్న పట్టింపులేవీ హెబా పటేల్ కు ఉండవు. అంతమాత్రాన హద్దు మీరే అమ్మాయి కాదు. ఆలోచనల్లో తప్పు లేనంత వరకు, హద్దుల్లో ఉన్నంత వరకు అబ్బాయిలతో స్నేహంలో తప్పేం లేదన్నది నాయిక ఫిలాసఫీ. ఇలాంటి ఆటిట్యూడ్ ఉన్న హీరోయిన్ ఫస్ట్ క్రష్ లో పడిన రాజ్ తరుణ్ ప్రేమలో పడిపోతాడు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. హెబా పటేల్ వేరే అబ్బాయిలతో బైక్ ల పై తిరగడం చూసిన హీరో ఫ్రెండ్స్....అమ్మాయి లూజ్ క్యారెక్టర్ వదిలేయమంటారు. ఇదే అనుమానంతో రగిలిపోతాడు కథానాయకుడు. ఆ అమ్మాయి క్యారెక్టర్ టెస్ట్ చేయాలని ప్రయత్నిస్తుంటాడు. రాజ్ తరుణ్ ప్రయత్నాలు తెల్సుకున్న నాయిక...అతని ఆలోచనలు తప్పని చెప్పి...తనను ప్రేమించే అర్హత లేదని వెళ్లిపోతుంది. ఇలా ప్రేమించిన అమ్మాయికి దూరమైన హీరో సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాల తర్వాత వాస్తవాలు తెలుసుకుంటాడు. మధ్యలో ఊహించని కొన్ని పరిణామాలతో సినిమా ముగుస్తుంది.

న్యూ ఏజ్ ఫిల్మ్..
కథ పరంగా కుమారి 21ఎఫ్ న్యూ ఏజ్ ఫిల్మ్ అనడంలో సందేహం లేదు. అయితే...ఇలాంటి అమ్మాయిల ప్రవర్తనను మన సమాజం ఎంతవరకు స్వీకరిస్తుందన్నది సందేహమే. కథను కొంత వరకు కన్విన్సింగ్ గా రాసుకున్నాడు సుకుమార్. మాటలు ఆలోచించేలా ఉన్నాయి. దర్శకుడు సూర్య ప్రతాప్ సన్నివేశాలను కొత్తగా తెరకెక్కించాడు. ఫస్టాఫ్ లో కామెడీ పండలేదు. సెకండాఫ్ లో కొన్ని సీన్స్ రిపీట్ అయ్యాయి. సెంటిమెంట్ వర్కవుట్ అయ్యింది. రాజ్ తరుణ్ పాత్రను జస్టిఫై చేయగా...నాయిక హెబా పటేల్...సినిమాకు మెయిన్ అట్రాక్షన్ గా మారింది. నటనతో, గ్లామర్ తో ఆకట్టుకుంది. దేవీ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు బిగ్ అస్సెట్స్.

ఫ్లస్ పాయింట్స్
హెబ్బా పటేల్ నటన
సన్నివేశాల్లో కొత్తదనం
సంగీతం, మాటలు
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
పూర్తిగా కన్విన్స్ చేయని కథ
హాస్య సన్నివేశాలు
సెకండాఫ్ లో రిపీటెడ్ సీన్స్

బందర్ పోర్టు భూ సేకరణపై బీజేపీ ప్రజాభిప్రాయ సేకరణ..

విజయవాడ : బందర్ మండలం బొర్రపోతుపాలెంలో గ్రామస్తులతో బీజేపీ సమావేశం నిర్వహించింది. బలవంతపు భూ సేకరణ సహించేది లేదని గ్రామస్తులు తేల్చిచెప్పారు. 

కౌలు రౌతులను ప్రభుత్వం ఆదుకోవాలి - ఏపీ కౌలు రైతు సంఘం..

గుంటూరు : అకాల వర్షాలకు పంట నష్టపోయిన కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ కౌలు రౌతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జలమయ్య పేర్కొన్నారు. రంగుమారిన పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. 

టీ హబ్ ఇన్నో ఫెస్టును ప్రారంభించిన కేటీఆర్...

హైదరాబాద్ : గచ్చిబౌలిలోని టీ హబ్ లో ఇన్నోఫెస్టును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తొలి ఇన్నోఫెస్టును ప్రారంభించడం సంతోషంగా ఉందని కేటీఆర్ తెలిపారు. సామాన్యులకు ఉపయోగపడే చాలా రకాల పరికరాలను ప్రతినిధులు ఆవిష్కరించారని తెలిపారు. టీ హబ్ ద్వారా తెలంగాణ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. 

ప్రశాంతంగా పోలింగ్ - భన్వర్ లాల్..

వరంగల్ : లోక్ సభ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ఎన్నికల అధికారి భన్వర్ లాల్ పేర్కొన్నారు. మధ్యాహ్నం 12గంటల వరకు 40 శాతం పోలింగ్ నమోదైందన్నారు. అవకతవకలు జరగకుండా గట్టి నిఘా పెట్టడం జరిగిందని, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రత పెంచడం జరిగిందన్నారు. పలు చోట్ల మొరాయించిన ఈవీఎంలను మార్చినట్లు తెలిపారు. డి.కె.పండాలో ఓటర్లు ఎన్నికలు బహిష్కరించినట్లు తెలిసిందని, గ్రామస్తులు తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనాలని సూచించారు. ఎవరూ నచ్చకపోతే నోటా బటన్ నొక్కాలన్నారు.

 

వరంగల్ నియోజకవర్గాల వారీగా పోలింగ్ వివరాలు..

వరంగల్ : లోక్ సభ ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. వర్ధన్నపేట 34, పరకాల 30, భూపాలపల్లి 30, పాలకుర్తి 28.5, స్టేషన్ ఘన్ పూర్ 28.2 శాతం పోలింగ్ నమోదైంది. వరంగల్ ఈస్ట్ 29, వరంగల్ వెస్ట్ 23 శాతం పోలింగ్ నమోదైంది. 

12:46 - November 21, 2015

విజయవాడ : బందర్ పోర్టు నిర్మాణం ఆందోళనలో బీజేపీ పాల్గొంటోంది. ప్రభుత్వంపై ఆ పార్టీ నేతలు పలు విమర్శలు గుప్పించారు. పోర్టు పేరు చెప్పి రైతుల నుండి బలవంతంగా భూములు సేకరిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. ఈ నిర్మాణంపై గ్రామస్తులు..పలు పార్టీల నేతలు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ శనివారం ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. ఈసందర్భంగా ఆ పార్టీ నేత టెన్ టివితో మాట్లాడారు. 30వేల ఎకరాల భూమి సేకరించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. నాలుగు వేల ఎకరాలు రాజశేఖరరెడ్డి హాయాంలో, 5200 ఎకరాలు కిరణ్ కుమార్ రెడ్డి హాయాంలో సేకరించడం జరిగిందన్నారు. పోర్టు రావాలని, దీనివల్ల ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. దీనికి సంబంధించిన శిలాఫలకం వేశారని గుర్తు చేశారు. 22 గ్రామాలకు అధికారులు నొటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. పోర్టు కట్టకుండా పోర్టు ఆధారిత పరిశ్రమలు అంటూ నాటకాలడుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హాయాంలో తీసుకున్న భూముల్లో పరిశ్రమలు ఎందుకు కట్టుకోవడం లేదని ప్రశ్నించడం జరిగిందన్నారు. ఆ భూములన్నీ వివాదాస్పదంగా ఉన్నాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని తెలిపారు. గ్రామాల్లో కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 

12:34 - November 21, 2015

మలేషియా : భారతీయ జెండాకు అవమానం జరిగింది. కౌలాలంపూర్ ఏషియన్ సమ్మిట్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ఇది చోటు చేసుకోవడం గమనార్హం. నాలుగు రోజుల మలేషియా, సింగపూర్ దేశాల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం నాడు మలేషియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్న సంగతి తెలిసిందే. కౌలాలంపూర్ లో జరగనున్న 13వ ఆసియా దేశాల వ్యాపార సదస్సులో ఆయన పాల్గొన్నారు. భారత్ - జపాన్ ప్రధాన మంత్రులు ఒకరినొకరు నిలబడి కరచాలనం చేస్తూ ఫొటోలకు ఫొజులిచ్చారు. వారి వెనుకనే జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. దీనిపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. 

12:17 - November 21, 2015

నెల్లూరు : జిల్లాలో సంవత్సరకాలంలో పడే వర్షం నాలుగు రోజుల్లో కురిసిందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జిల్లాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీనితో భారీ నష్టం వాటిల్లింది. పంట పొలాలు నీటిలో మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం బాబు గత రెండు రోజుల నుండి జిల్లాలో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శనివారం ఉమేష్ చంద్ర సమావేశ మందిరిలో అధికారులతో బాబు సమీక్ష నిర్వహించారు. బాధితులను వెంటనే ఆదుకోవాలని ఆదేశించారు. జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైందని, 85 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. వర్షం వల్ల రహదారులు కొట్టుకపోయాయని, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని తెలిపారు. వీటిని బాగు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. బాబుతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. 

12:11 - November 21, 2015

నెల్లూరు : జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. రోడ్లపై భారీగా నీళ్లు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. పలు వాహనాలు నీటిలో నిలిచిపోయాయి. దీనితో వాహనదారులు, పాదాచారులు అష్టకష్టాలు పడ్డారు. మనుగోలు వద్ద దెబ్బతిన్న జాతీయ రహదారికి మరమ్మత్తులు చేపడుతున్నారు. 450 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, వీటిని రెండు రోజుల్లో బాగు చేయాలని సీఎం బాబు ఆదేశాలు జారీ చేశారు. త్వరతగతిన పూర్తి చేసేందుకు అధికారులు నడుం బిగించారు. మరోవైపు వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

న్యూజిలాండ్ లో కూలిన హెలికాప్టర్..ఏడుగురి మృతి..

న్యూజిలాండ్ : ఫాక్స్ గ్లేషియర్ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిన ఘటనలో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. 

11:31 - November 21, 2015

హైదరాబాద్ : ఎవరికి వారే యమునా తీరే.. అన్నట్లుగా ఉంది హైదరాబాద్‌లో ప్రభుత్వ శాఖల అధికారుల తీరు. జీహెచ్‌ఎంసీలోని ఒక శాఖ అధికారులు ఓ పక్క రోడ్లు వేస్తుంటారు. మరోపక్క మరో విభాగానికి చెందిన అధికారులు పైపులైన్‌ కోసమో.. విద్యుత్‌ లైన్ల కోసమో రోడ్లు తవ్వుతుంటారు. ఇది చాలదన్నట్లుగా ప్రజలు కూడా తమ ఇష్టమొచ్చినట్లు రోడ్లు తవ్వేస్తుంటారు. దీంతో ఎక్కడపడితే కటింగ్‌ చేసిన రోడ్లే దర్శనమిస్తుంటాయి. మరోవైపు తవ్విన రోడ్లను పూడ్చడం మర్చిపోతుంటారు. దీంతో ఇంకేముంది సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎవరెన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాధుడే ఉండడు.

శాఖల మధ్య లేని సమన్వయం..
అయితే.. గ్రేటర్‌ పరిధిలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌, జలమండలి, ట్రాన్స్ కో, టెలికం, మెట్రోరైలు, పోలీసు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రజలంటున్నారు. జీహెచ్‌ఎంసీ కొత్తగా రోడ్లు వేస్తే.. పైపులైన్‌ వెయ్యాలంటూ వాటర్‌బోర్డు అధికారులు ఆ రోడ్డును తవ్వేస్తున్నారు. ప్లాన్‌ లేకుండా ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల ప్రజాధనం వృధా అవుతుందని గ్రేటర్‌ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

12 అంగుళాల సిమెంట్ రోడ్డును పగులగొట్టారు...
మెట్రో పనుల కోసం రోడ్డును వెడల్పు చేశారు. అక్కడ బలంగా ఉండేందుకు 12 అంగుళాల సిమెంట్‌ రోడ్డును వేశారు. కాని మూడు నెలలు తిరగకుండానే ఆ రోడ్డును పగలగొట్టారు. ఎందుకంటే.. మురుగునీటి సరఫరా కోసం అంటున్నారు. ఈ విధంగా అధికారులకు ప్లాన్‌ లేకపోవడంతో ప్రజాధనాన్ని ఇబ్బడిముబ్బడిగా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

1500 కిలో మీటర్ల వరకు రోడ్డు కటింగ్స్...
ఇక గ్రేటర్‌ పరిధిలో ఈ ఏడాదిలో వెయ్యి నుండి 1500 కిలోమీటర్ల వరకు రోడ్డు కటింగ్స్‌ జరిగాయి. రోడ్ల కటింగ్స్‌ అనుమతులతో జీహెచ్‌ఎంసీకి భారీగానే ఆదాయం సమకూరింది. బీటీ రోడ్డు ఫర్‌ మీటర్‌కు 3 వేలు,.. సీసీ రోడ్డుకు 1800, ఫుట్‌పాత్‌కు 950 రూపాయల చొప్పున జీహెచ్‌ఎంసీ వసూలు చేస్తోంది. అయితే.. ఇందుకోసం ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు.. ఆ తర్వాత గుంతలను పూడ్చడంపై శ్రద్ధ చూపడం లేదని ప్రజలంటున్నారు. ఇక కొత్తగా వచ్చిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సమన్వయంతో ముందుకెళ్తామంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కూడా ఇదే తీరుగా వ్యవహరిస్తామంటున్న బల్దియా బాస్‌.. ప్రజాధనం కాపాడటంలో ఎలా వ్యవహరిస్తారో చూడాలి. 

11:25 - November 21, 2015

వరంగల్ : భూపాలపల్లి మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భూపాలపల్లిలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. తమకు ఎలాంటి ఇబ్బదులు ఎదురు కాలేదని, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని కొంతమంది ఓటర్లు పేర్కొన్నారు. మావోయిస్టుల ప్రభావితం కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని, దీనితో తాము స్వేచ్ఛగా ఓటును వినియోగించుకుంటున్నామన్నారు. పరకాల, భూపాలపల్లిలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం ఈవీఎంలు మొరాయించాయి. 

 

11:23 - November 21, 2015

వరంగల్ : జిల్లా లోక్ సభ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో మందకొడిగా సాగుతోంది. ఇదిలా ఉంటే థర్డ్ జెండర్స్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. థర్డ్ జెండర్స్ అదే హిజ్రాలు. వీరుకూడ మనలో ఒక భాగమే అందుకే ఈ మధ్య సుప్రీం కోర్టు కూడా వీళ్లని మూడో లింగం(థర్డ్ జెండర్)గా గుర్తించింది. ఇప్పుడు మన సొసైటీలో మూడు లింగబేధాలున్నాయి అన్నది సుప్రీంకోర్టు గుర్తింపు వల్ల అధికారికమైపోయింది. శాంతినగర్ పోలింగ్ కేంద్రంలో 171 మంది థర్డ్ జెండర్స్ ఉన్నారు. వీరిలో కొంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు టెన్ టివితో మాట్లాడారు. తమను చిన్న చూపు చూస్తుంటారని, కానీ తాము కూడా మనుషులమేనన్నారు. తమలో కూడా ఉన్నత విద్య చదివిన వారు ఉన్నారని, ఎదో ఒక రంగంలో ప్రతిభ కనబరుస్తున్నామన్నారు. తమకు సమాజంలో తమకు గుర్తింపు చూపెట్టాలని, హక్కులు కల్పించాలని కోరారు. తాము కిరాయి ఇళ్లలో ఉంటున్నామని, తమకు ఇళ్లు కట్టివ్వాలని కోరారు. ఇటీవలే ఎస్ ఐ కూడా విధులు నిర్వహిస్తోందని, కేరళ ప్రభుత్వం మేయర్ గా నియమించిందని గుర్తు చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా తమ సమస్యలపై స్పందించాలని వేడుకున్నారు. ఇదిలా ఉంటే వరంగల్ ఈస్ట్ లో టీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించడం వివాదాస్పదమైంది. ఎర్రబెల్లి నియోజకవర్గమైన పాలకుర్తి నియోజకవర్గంలో ఆరు శాతం ఓటింగ్ నమోదైంది. శాయంపేటలో ఓటర్ల స్లిప్పులు లేకపోవడంతో ఓటర్లు పలు ఇబ్బందులు పడుతున్నారు. పరకాలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది. 

ముగిసిన బాబు సమీక్ష..

నెల్లూరు : వరద సహాయక చర్యలపై అన్ని శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష ముగిసింది. వరద సహాయక సహాకారాల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయని బాబు హెచ్చరించారు. రెండు రోజుల్లో పరిహారం ఇవ్వాలని బాబు ఆదేశాలు జారీ చేశారు. 

ముగిసిన బాబు సమీక్ష..

నెల్లూరు : వరద సహాయక చర్యలపై అన్ని శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష ముగిసింది. వరద సహాయక సహాకారాల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయని బాబు హెచ్చరించారు. రెండు రోజుల్లో పరిహారం ఇవ్వాలని బాబు ఆదేశాలు జారీ చేశారు. 

ఓటు వేసిన ప్రముఖులు..

వరంగల్ : జిల్లా లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. వడ్డేపల్లిలో డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో ఏంపీ సీతారాం నాయక్, నక్కలగుట్టలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, సంగెం (మం) బొల్లికుంట పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్, వరంగల్ గ్రేన్ మార్కెట్ లో వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి గాలి వినోద్ కుమార్, పరకాల (మం) నర్సక్కపల్లిలో స్పీకర్ మధుసూధనాచారిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

10:26 - November 21, 2015

వరంగల్ : జిల్లాలో లోక్ సభ స్థానానికి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మందకొడిగా పోలింగ్ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే తాము ఓటింగ్ ను బహిష్కరిస్తున్నట్లు తొర్రూరు మండలం పిక్యాతండాకు చెందిన ఓటర్లు తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రజాప్రతినిధులు..అధికారులకు ఎన్నిసార్లు మొత్తుకున్నా ఫలితం లేదని తండా వాసులు పేర్కొన్నారు. ఏళ్లు గడుస్తున్నా తండాలో సౌకర్యాలు కల్పించడం లేదని ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. మొత్తం ఇక్కడ 450 మంది ఓటర్లున్నారు. 

10:12 - November 21, 2015

ఖమ్మం : టీఆర్ఎస్ నేతల కిడ్నాప్ సుఖాంతం అయ్యింది. నాలుగు రోజుల క్రితం భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇనచార్జి మానె రామకృష్ణ, చర్ల మండల టీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్ష, కార్యదర్శులు పటేల్‌ వెంకటేశ్వర్లు, సంతపురి సురేశ్‌, మండలంలోని పూసుగుప్ప గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు ఉయికా రామకృష్ణ, వెంకటాపురం మండల టీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు డెక్కా సత్యనారాయణ, వాజేడు మండల టీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు దబ్బకట్ల జనార్దన్‌లను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. వీరిని విడిచిపెట్టాలంటే తమ డిమాండ్లు పరిష్కరించాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. దీనితో వారి వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎలాంటి హాని పెట్టవద్దని కుటుంబసభ్యులు కోరారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున ఛత్తీస్ గఢ్ సరిహద్దులో వదిలిపెట్టారు. వీరందరూ చర్లకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టుల చెర నుండి విడుదలైన మానే రామకృష్ణ టెన్ టివితో మాట్లాడారు. మావోయిస్టుల ఎజెండానే తమ నినాదం అని ఉద్యమం చేశారని, కేసీఆర్ సీఎం అయిన తరువాత తమను టార్గెట్ చేశారని మావోయిస్టులు పేర్కొన్నారని పేర్కొన్నారు. వెంటనే భౌతిక దాడులను ఆపాలని, గ్రీన్ హంట్ ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడైనా ఒక్క మావోయిస్టు హత్య జరిగితే మండల రాష్ట్ర నాయకుడి నుండి మొదలు కొని జిల్లా స్థాయి నాయకుడి వరకు హత్యలు చేయించడం జరుగుతుందని వారు హెచ్చరించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తమకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని, ఆదివాసీల జీవితాలు బాగు చేయాలనే ఉద్ధేశ్యంతో తాము రాజకీయాల్లో ఉన్నామని వారికి వేడుకోవడం జరిగిందన్నారు. రాత్రి 11-12గంటల మధ్య అటవీ ప్రాంతంలో వదిలిపెట్టి వెళ్లారని, తమను విడిచిపెట్టినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. 

టీఆర్ఎస్ నేతల విడుదల..

ఖమ్మం : కిడ్నాప్ చేసిన టీఆర్ఎస్ నేతలను మావోయిస్టులు విడుదల చేశారు. బూటకపు ఎన్ కౌంటర్లను ఆపు చేయాలని, గ్రీన్ హంట్ నిలిపివేయాలని మావోయిస్టులు హెచ్చరించారు. 

09:32 - November 21, 2015

వరంగల్ : జిల్లాలో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. చలికాలం కావడంతో ఉదయం పోలింగ్ మందకొడిగా సాగింది. ఉదయం 9గంటలకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఎన్నికల అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. అందులో భాగంగా తొలి ఓటు వేసిన వారికి పుష్పగుచ్చాలు ఇస్తున్నారు. పరకాల నియోజకవర్గంలో ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొగుళ్లపల్లి, శ్యాంపల్లి పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. సమాచారం అదుకున్న ఎన్నికల అధికారులు ఈవీఎంలను సరిచేసి పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న బీసీలు ప్రధాన పాత్ర పోషించనున్నారు. భూపాలపల్లిలో సింగరేణి కార్మికుల ఓటు కీలకంగా మారనుంది. మొత్తం 229 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. లైవ్ వెబ్ క్యాస్టింగ్ ల ప్రక్రియ ద్వారా ఓటింగ్ సరళిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

మొరాయిస్తున్న ఈవీఎంలు..

వరంగల్ : జిల్లాలో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 102 పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మొరాయించాయి. 

ఓటు వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి..

వరంగల్ : జిల్లా లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ సంగెం మండలం బొల్లికుంట పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

కర్నూలులో రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి..

కర్నూలు : జిల్లాల్లో శనివారం ఉదయం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

 

08:17 - November 21, 2015

వరంగల్ : జిల్లాలో లోక్ సభ ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. చలికాలం కావడంతో ఓటర్లు ఉదయానే పోలింగ్ కేంద్రాలకు రాలేదని, కొద్దిసేపు అనంతరం ఓటర్లు వచ్చే అవకాశం ఉందని పోలింగ్ అధికారులు పేర్కొంటున్నారు. పరకాలలో జూనియర్ కాలేజీలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ సంజీవరావు టెన్ టివితో మాట్లాడారు. నాలుగు మండలాల్లో అధిక భద్రతను ఏర్పాటు చేయడం జరిగిందని, అదనపు బలగాలు కూడా మోహరించినట్లు తెలిపారు. సమస్యత్మాక కేంద్రాలను ముందుగానే గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని తెలిపారు. 229 పోలింగ్ కేంద్రాల్లో వేయి మందికిపై గా సిబ్బంది ఉన్నారని పోలింగ్ అధికారి పేర్కొన్నారు. పోలింగ్ లో వెబ్ కెమెరాద్వారా ఓటింగ్ ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పరకాల బీసీ ఓట్లు కీలకంగా మారనున్నాయి. 

కర్నూలులో లారీ బీభత్సం..ఇద్దరు చిన్నారుల మృతి..

కర్నూలు : జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న చిన్నారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు. 

07:46 - November 21, 2015

తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆశా వర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదని కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేస్తుందని ప్రభుత్వం చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు వరంగల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. విజయంపై ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేశాయి. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), సతీష్ మాదిగ (టిడిపి), సుధాకర్ (టిఆర్ఎస్), వి.వాసుదేవరావు (బిజెపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

నేడు డీఎడ్ రెండో ఏడాది ఫలితాలు..

హైదరాబాద్ : డీఎడ్ రెండో సంవత్సరం పరీక్షా ఫలితాలను శనివారం విడుదల చేయనున్నారు. www.bsetelangana.org వెబ్ సైట్ లో ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. 

నెల్లూరులో వెంకయ్య పర్యటన..

నెల్లూరు : కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్నారు. 

పాతబస్తీలో పోలీసుల తనిఖీలు....

హైదరాబాద్ : పాతబస్తీలో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి బైక్ లపై తిరిగే వంద మంది ఆకతాయులను అరెస్టు చేశారు. తల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. 

07:26 - November 21, 2015

ఆదిలాబాద్ : తమ సమస్యలు పరిష్కరించాలి..వేతనాలు పెంచాలని గత కొన్ని రోజులుగా ఆశా వర్కర్లు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా పలు జిల్లాల్లో ఆశా వర్కర్లు ఆందోళనను ఉధృతం చేశారు. ఆదిలాబాద్ జిల్లాల్లో దీక్ష చేపట్టిన ఆశా వర్కర్లపై పోలీసులు జులుం ప్రదర్శించారు. నిరహార దీక్ష చేపట్టిన ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. దీక్షా టెంట్ ను కూల్చివేశారు. పోలీసుల వైఖరిని ఆశా వర్కర్లు తీవ్రంగా తప్పుపట్టారు. తమను శుక్రవారం రాత్రి వైద్యులు వచ్చి పరీక్షించారని, అందరీ ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు పేర్కొన్నారని ఆశా వర్కర్లు పేర్కొన్నారు. కానీ అర్ధరాత్రి వచ్చి పోలీసులు దాడి చేశారని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

07:21 - November 21, 2015

వరంగల్ : జిల్లాలో ఎంపీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. మొదటి ఓటు వేసిన వారికి ఎన్నికల అధికారులు పుష్పగుచ్చాలు ఇచ్చారు. 23 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 15 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హన్మకొండలో వెబ్ క్యాస్టింగ్ లో లైవ్ లో అధికారులు పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఉప ఎన్నిక కోసం 1778 పోలింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటుచేశారు. ఎనిమిది వేల మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. మొత్తం పదివేలమంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. వీరిలో రెండు వేల మంది కేంద్ర సాయుధ బలగాలున్నారు. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఈ బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. పోలింగ్‌ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు రికార్డు చేయడానికి 500 మంది వీడియో గ్రాఫర్లను రంగంలోకి దింపారు. 

వరంగల్ పోలింగ్ ప్రారంభం..

వరంగల్ : వరంగల్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు ఈసీ పూర్తి చేసింది. ఉదయం 7గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం ఐదు గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతినిచ్చారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో లైవ్ టెలికాస్టింగ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 5గంటల వరకు బల్క్ ఎస్ఎంఎస్ లపై నిషేధం విధించారు. 

06:43 - November 21, 2015

బీహార్ : సీఎంగా జేడీయూ నేత నితీష్ ప్రమాణం చేశారు.. ముచ్చటగా మూడోసారి పాలన అందించేందుకు సిద్దమయ్యారు.. కానీ ఇప్పుడు లాలూ ఎలా వ్యవహరిస్తారు.. దేశంలో లౌకిక శక్తుల ఐక్యతకు నాందిపలికిన బీహార్ ఫలితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు.. ఆలూ ఉన్నంత వరకు బీహార్ లో లాలూ ఉంటారు... ఇది ప్రతి సందర్బంలో లాలూ చెప్పే మాట.. గతంలో సీఎంగా పనిచేసి చక్రం తిప్పిన లాలూ యాదవ్ మధ్యలో పదేళ్ల పాటు దాదాపు కెరీర్ క్లోజ్ అయ్యిందా అన్నట్లుగా మూల పడిపోయారు.. పార్టీ ఫెరఫార్మెన్స్ కూడా అంతగా లేదు.. కానీ నితీష్ తో జత కట్టడం లాలూకే కాదు ఆ పార్టీకీ కలిసొచ్చింది.. ఏకంగా నితీష్ జెడీ యూ కంటే అత్యధిక సీట్లు కైవసం చేసుకున్నారు.. ముందు నుంచి మతతత్వ ఎజెండాలకు, బిజెపి పోకడలకు లాలూ వ్యతిరేకిస్తూ వచ్చారు.. ఈసారి అదే రాజకీయ నిబద్దతతో నితీష్ కు మద్దతిస్తూ పార్టీ సిద్దాంతానికి కట్టుబడ్డారు.. ఆయన లాభపడ్డారు.. అదే సందర్బంలో దేశంలో లౌకిక శక్తులకు ఊపిరినిచ్చారు.

నితీష్ ఎదుట సవాల్..
ఇల్లు అలకగానే పండుగ కాదనేది ఇప్పుడు లాలూ , నితీష్ ద్వయం ముందున్న సవాల్.. వీరిద్దరి జోడి కనబరిచే సమన్వయం, బీహార్ పాలనలో ప్రజా రంజక విధానాలు, పొరపొచ్చాలొచ్చినా.. బయటికి రాకుండా సామరస్య ధోరణితో పరిష్కరించుకోవడం పెద్ద సవాల్.. గతంలో చిన్న సమస్యలకి అలిగి కూటమిల నుంచి బయటికి వచ్చిన చరిత్ర లాలూకి ఉంది.. ఈ సారి లాలూ అలా చేస్తారని కాదు.. కానీ అలా చేస్తే దేశంలో కొత్త సమీకరణకు గండి కొట్టినవాళ్లే అవుతారనేది జాతీయ విశ్లేషకుల మాట.

లాలూ కుమారుడి ప్రమాణ స్వీకారం..
ఇప్పుడు లాలూ తనయుడు , క్రికెటర్ తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. పదో తరగతే చదివిన తేజస్వీని డిప్యూటీ సీఎంగా చేయడంపై పెదవి విరుపులున్నాయి. కానీ కూటమిలో పెద్ద పార్టీగా ఆవిర్బవించిన లాలూ మాట చెల్లు బాటు అవుతుందనేది ఇక్కడతోనే కనిపిస్తోంది... డిప్యూటీ సీఎంగా తేజస్వీ బాధ్యతగా వ్యవహరించేలా లాలూ దృష్టి పెట్టాలి.. లేదంటే నితీష్ జేడీయూ లాలూ ఆర్జెడీ ల మధ్య చిచ్చుకు
బిజెపి లాంటి పార్టీలు ఖచ్చితంగా ప్రయత్నిస్తాయి.

నితీష్ పాలనపై ప్రజల్లో సంతృప్తి..
నితీష్ పాలనపై ప్రజల్లో సంతృప్తి ఉంది.. ఈ సారి అదే తరహా పాలన అందించడం కత్తి మీద సామే అనేది విశ్లేషకుల మాట.. ఎందుకంటే లాలూ కూడా పాలనలో జోక్యం చేసుకుంటారు.. అయితే ఈ జోక్యం మితిమిరితే మొదటికే మోసం వచ్చి రాబోయో జాతీయ రాజకీయ పరిణామాలను ప్రభావితం చేస్తుందనేది విశ్లేషకుల అభిప్రాయం.. అందుకే నితీష్ కంటే లాలూ ప్రదర్శించే రాజకీయ పరిణితే కీలకమనేది అందరూ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా క్యాబినెట్ లో చోటు దక్కించుకొంది.. అయితే ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల నేపథ్యంలో వారి మాట చెల్లుబాటు కావడం కష్టమే.. కానీ జాతీయ పార్టీగా కొన్ని అంశాల్లో చేసే సూచనలను నితీష్ పాటించాల్సి రావోచ్చు..   

06:38 - November 21, 2015

బీహార్ : నితీష్‌కుమార్‌ ఐదవసారి బీహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు అతిరథ మహారథులు హాజరైన ఈ కార్యక్రమం ఆద్యంతం ఘనంగా జరిగింది. బీహార్‌ ఎన్నికల్లో మెజార్టీ పార్టీగా నిలిచిన, మహాకూటమిలో భాగస్వామి అయిన ఆర్జేడీ మంత్రుల కూర్పులోనూ తన హవా చాటుకుంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ కుమారులు జాక్‌పాట్‌ కొట్టినట్లు తొలి ప్రయత్నంలోనే మంత్రి పదవులను కొట్టేశారు. లాలూ పెద్ద కుమారుడు తేజస్వి యాదవ్‌ డిప్యూటీ సిఎం బాధ్యతలు స్వీకరించారు. 26 ఏళ్ల వయసులోనే ఈ పదవిని స్వీకరించి రికార్డ్ సృష్టించారు. తేజస్వి రోడ్లు, భవనాల శాఖను స్వీకరించగా అతని తమ్ముడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖను చేపట్టారు. నితీష్‌ హోం శాఖతోపాటు మరికొన్ని శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. అతనితోపాటు మొత్తం 28 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

ఆలస్యంగా వచ్చిన రాహుల్...
కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధి ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఆలస్యమైంది. దీంతో రాహుల్‌ రాకకూడా లేటైంది. కాంగ్రెస్‌ తరపున నలుగురికి నితీష్‌ మంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీకి ఆహ్వానం అందినా ఆయన హాజరుకాలేదు. ప్రధాని బదులు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విచ్చేశారు. బిజెపి మిత్రపక్షాలు శివసేన, అకాలీదళ్‌ నుంచి కూడా మంత్రులు హాజరయ్యారు. శివసేన తరుపున ఇద్దరు మినిస్టర్లు, అకాలీదళ్‌ నుంచి డిప్యూటీ చీఫ్‌ మినిస్టర్‌ సుఖ్‌బీర్ బాదల్‌ విచ్చేశారు.

డుమ్మా కొట్టిన అఖిలేష్ యాదవ్..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఢిల్లీ చీఫ్‌ మినిస్టర్‌ అరవింద్ కేజ్రీవాల్‌, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, అతని తండ్రి ఫరూక్‌ అబ్దుల్లా, పలువురు నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు ఈ వేడుకకు హాజరయ్యారు. కానీ పొరుగు రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఇక సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, తమిళనాడు నుంచి డిఎంకె నేత ఎంకె స్టాలిన్‌ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

06:36 - November 21, 2015

హైదరాబాద్ : అక్రమార్కుల భరతం పట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమయింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటూ రెండు చేతులా సంపాదిస్తున్న వారి లిస్టు రెడీ చేసుకుంది. సుమారు..4 వేలమంది..వారి రెండంకెలా సర్వీస్‌లో వందల కోట్లు సంపాదించినట్లు పక్కా ఆధారాలతో వివరాల్ని సేకరించారు. అయితే ఇదే విషయం తెలిసిన ఉద్యోగ నేతలు ముఖ్యమంత్రిని కలిసినా ఫలితం లేదని విశ్వసనీయ సమాచారం. అయితే ఇంతకి ఎవరెవరు ఆ అక్రమార్కుల లిస్టులో ఉన్నారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలు..రెండు చేతులా సంపాదించ వచ్చనే అలోచన ప్రతి ఉద్యోగికి ఉంటుంది. అందులో రెవెన్యూ, పోలీస్, విద్యుత్ శాఖ, జ్యూడీషియల్ అగ్రస్థానాల్లో ఉన్నాయి. అయితే ఇందులో ప్రభుత్వం ఎప్పుడు కిందిస్థాయి సిబ్బందినే టార్గెట్ చేస్తూ అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించేది. కానీ.. తాజాగా గ్రూఫ్ 1 అధికారులను సైతం కటకటాల వెనక్కు నెట్టేందుకు సిద్దమవుతోంది ప్రభుత్వం.

పోలీసు శాఖపై దృష్టి..
అయితే ఎవరెవరు ఎంత అక్రమంగా సంపాదించారో అన్న విషయంపై ఇప్పటికే లిస్ట్ రెడీ అయింది. తొలుత పోలీస్ డిపార్ట్ మెంట్‌పై రంగం సిద్దం చేసుకున్నారు. 3నెలల క్రితం వరంగల్ జిల్లా జనగాం డీఎస్పీని ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని దాడులు నిర్వహించి అరెస్ట్ చేశారు. తాజాగా కూకట్‌పల్లి ఏసీపీ సంజీవరావు ఏకంగా 300 కోట్లకు ఎగబాకాడని తెలుసుకొని నివ్వెరపోయారు. కరీంనగర్‌లో మోహన్‌రెడ్డి పోలీస్ ఫైనాన్స్ వ్యాపారం పెద్ద సంచలనానికి దారి తీసింది. దీంతో పోలీస్ శాఖలో 20 ఏళ్లకు పైగా ఉంటూ వారి సర్వీస్‌లో అక్రమంగా సంపాదించిన వారి లిస్టును తెప్పించుకొని వాటిని పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. అయితే ఇదే విషయాన్ని తెలుసుకొని కొంత మంది ఉద్యోగ సంఘాల నాయకులు సీఎంను కలిసినట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎవరిని వదిలేది లేదని..తన వారైనా విశ్వసించేది లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం.

టోల్ ఫ్రీ నెంబర్స్...
అయితే గ్రూప్‌-1 అధికారులపై ఇప్పటి వరకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎలాంటి దాడులు జరగలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌..వరంగల్‌లో తన ఫోన్ నెంబర్ ఇవ్వడంతో..ఉన్నాతాధికారుల అక్రమాలపై సమాచారం నేరుగా అందింది. ఇక రెవెన్యూ , మున్సిపాలిటి, విద్యుత్ శాఖ, జ్యూడీషీయల్‌లో చిన్న స్థాయి నుంచి ప్రమోషన్స్ ద్వారా వచ్చిన అధికారులపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరోవైపు లంచగొండి అధికారులపై అవగాహాన కల్పించేందుకు ఏసిబి ప్లాన్ చేస్తోంది. అందుకే టోల్ ఫ్రీనెంబర్స్ పబ్లిక్‌లోకి వెళ్లేందుకు మరింత ప్రచారం కల్పించనుంది. పట్టుకున్న నిందితులను ఇప్పటికే అత్యాధునిక టెక్నాలజీతో తప్పించుకోకుండా వారికి శిక్షలు పడేలా ప్రయత్నాలు చేస్తోంది ఏసిబి. మొత్తానికి మునుపెన్నడూ లేనివిధంగా ఓ వైపు ఏసీబీ, మరోవైపు ప్రభుత్వం రెండూ లంచావతారాలపై ఉక్కుపాదం మోపేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నాయి. 

06:32 - November 21, 2015

ఖమ్మం : ఖమ్మం, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఉలిక్కిపాటుకు గురిచేస్తున్నాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఆధిపత్య పోరు స్థానిక గిరిజనులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మరోపక్క మావోయిస్టుల హెచ్చరికలు రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. దండకారణ్యంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య పోరు కొనసాగుతోంది. దంతెవాడ జిల్లా జెడ్కాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మహిళా మావోయిస్టు చనిపోయింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో గురువారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 15 మంది మావోయిస్టులు మృతిచెందారు. వరుసగా చోటుచేసుకుంటున్న ఎదురుకాల్పులకు ఖమ్మం, ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజనులను బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

అధికార పార్టీ నాయకులే టార్గెట్‌..
ఇది ఇలా ఉంటే మావోయిస్టుల హెచ్చరికలు రాజకీయ నాయకుల్లో గుబులు రేపుతున్నాయి. అధికార పార్టీ నేతలకు కంటి మీద కునుకు కరువైంది. ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేతలను మావోయిస్టులు కిడ్నాప్‌ చేయడం కలకలం రేపింది. భద్రాచలం నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఇన్‌ఛార్జి మానె రామకృష్ణారావుతో పాటు మరో ఐదుగురు నేతలను మావోయిస్టులు అపహరించుకుపోయారు. అనంతరం మావోయిస్టుల పేరిట ఓ లేఖను విడుదల చేశారు. బూటకపు ఎన్‌కౌంటర్లు, కూబింగ్‌లను ఆపేయాలని లేఖలో డిమాండ్‌ చేశారు. డిమాండ్లను పరిష్కరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అధికార పార్టీ నేతలను అంతమొందిస్తామంటూ..ఆ పనిని కిడ్నాప్‌ అయిన నేతలతో ప్రారంభిస్తామంటూ లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టుల లేఖతో అధికార పార్టీ నేతల్లో ఆందోళనలు మొదలయ్యాయి.

విడిచి పెట్టాలని కుటుంబసభ్యుల వినతి..
చెరలో ఉన్న తమవారిని విడిచిపెట్టాలంటూ బాధితుల కుటుంబ సభ్యులు మావోయిస్టులను వేడుకుంటున్నారు. భద్రాచలం నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌ఛార్జి మానె రామకృష్ణారావు భార్య లక్ష్మీ పౌర హక్కుల సంఘం నేతలను ఆశ్రయించారు. హైదరాబాద్‌లో ఉన్న వరవరరావుకు ఆమె ఫోన్‌ చేశారు. చెరలో ఉన్న తన భర్తతో పాటు మిగతా వారిని కూడా విడిచిపెట్టేందుకు సహాయం చేయాలని కోరారు. విమలక్కకు కూడా లక్ష్మీ ఫోన్‌ చేసి మావోయిస్టుల చెరలో ఉన్న వారిని విడిచిపెట్టేందుకు సహకరించాలని వేడుకున్నారు. పోలీసులు, మావోయిస్టుల కాల్పులతో దండకారణ్యంలో యుద్ధవాతావరణం నెలకొంది. ఏ సమయానికి ఏమి జరుగుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క మావోయిస్టులు చెరలో ఉన్న విడిపించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

06:30 - November 21, 2015

నెల్లూరు : ఏపీ సీఎం చంద్రబాబు వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించారు. భారీ వర్షాలకు నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. వరద బాధితులతో మాట్లాడారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చంద్రబాబు చెప్పారు. నెల్లూరు, కడప జిల్లాల్లో బాబు పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన మొదట కడప వెళ్లారు. రాజంపేట రెవెన్యూ డివిజన్‌లో జరిగిన వరద నష్టాన్ని పరిశీలించారు. రైల్వే కోడూరు మండలంలో తీవ్ర వర్షాలకు దెబ్బతిన్న పంటలను, చెరువులను చంద్రబాబు పరిశీలించారు. రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఒబనపల్లె మండలం జి కమ్మపల్లిలో అరటి రైతులతో ముచ్చటించారు. అరటి పంటలకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఉద్యానవన పంటలను పరిశీలించిన చంద్రబాబు....ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు కోల్డ్‌ స్టోరేజీలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఉద్యానవన పంటలకు ఎకరాకు 10 వేల రూపాయలు చొప్పున చెల్లిస్తామని ప్రకటించారు.

నెల్లూరులో ఏరియల్ సర్వే..
కడప జిల్లా పర్యటన అనంతరం చంద్రబాబు నెల్లూరు జిల్లా వెళ్లారు. రైల్వే కోడూరు నుంచి నెల్లూరుకు హెలీకాప్టర్‌లో వెళ్లి ఏరియల్‌ సర్వే చేసిన చంద్రబాబు వాతావరణం అనుకూలించపోవడంతో కిందికి దిగకుండా తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వెంకటగిరి వెళ్లారు. వరదల వల్ల దెబ్బతిన్న ఇళ్లకు తక్షణ సాయంగా రూ. 50వేలు, పాక్షికంగా దెబ్బతింటే రూ. 20 వేలు, పూరి గుడిసెలకు రూ. 6,500 ఇస్తామని సీఎం ప్రకటించారు.

నేడు నెల్లూరులో బాబు పర్యటన..
అనంతరం నెల్లూరు జిల్లాలో భారీగా కురిసిన వర్షాలపై చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, నష్ట తీవ్రతపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. వరద బాధితులను ఆదుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిశారు. వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి తక్షణ సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నేడు కూడా నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వరద బాధిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. 

06:14 - November 21, 2015

వరంగల్ : లోక్ సభ స్థానానికి పోలింగ్ తేదీ రానే వచ్చింది. శనివారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. నియోజకవర్గంలో 1778 పోలింగ్ కేంద్రాల్లో 3556 ఈవీఎంలు ఉపయోగిస్తున్నారు. ఇందులో 1100 బూత్ లు సమస్యత్మాక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. శనివారంఉ దయం 6.15గంటలకు పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహించి ప్రతి ఈవీఎం పనిచేస్తుందా ? లేదా ? అని సరి చూసుకుంటారు. ఇదిలా ఉంటే ఎన్నికల కమిషన్ వినూత్నంగా ఓటర్లను ఆదరిస్తోంది. ఓటింగ్ ను పెంచేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. ఎవరైతే పోలింగ్ బూత్ లో శనివారం ఉదయం మొదటగా అడుగు పెట్టి ఓటు వేస్తారో వారిని పూలబోకేతో అభినందించాలని అధికారులు నిర్ణయించారు. ఓటర్లలో ఆసక్తి పెంచేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

నియోజకవర్గాల వారీగా ఓట్లు..
భూపాల పల్లి 2,30,063
వర్ధన్నపేట 2,12,959.
స్టేషన్ ఘన్ పూర్ 2,12,056
పాలకుర్తి 2,01,546
పరకాల 1,94,165
వరంగల్ తూర్పు 2,13,580
వరంగల్ పశ్చిమ 2,45,302

నేడు వరంగల్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక..

వరంగల్ : నేడు వరంగల్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు ఈసీ పూర్తి చేసింది. ఉదయం 7గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం ఐదు గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతినిచ్చారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో లైవ్ టెలికాస్టింగ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 5గంటల వరకు బల్క్ ఎస్ఎంఎస్ లపై నిషేధం విధించారు. 

బోమాకాలో ముగిసిన ఆపరేషన్..

మాలి : బోమాకోలో ఆపరేషన్ ముగిసింది. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. అమెరికా, ఫ్రాన్స్ దళాల సహయంతో ఈ ఆపరేషన్ జరిగింది. 18 మంది అతిథులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. మృతుల్లో బెల్జియం దౌత్యాధికారి డియాడిన్ ఉన్నారు. అల్ ఖైదా అనుబంధ సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. 20 మంది భారతీయులు క్షేమమని విదేశాంగ ప్రకటించింది. 

 

నేడు 16 పరిశ్రమలకు అనుమతిపత్రాలు..

హైదరాబాద్ : నేడు మరో 16 పరిశ్రమలకు అనుమతిపత్రాలు తెలంగాణ ప్రభుత్వం అందచేయనుంది. రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో రూ.1570 కోట్ల పెట్టుబడులను 16 కంపెనీలు పెట్టనున్నాయి. 

నిరుద్యోగ యువత కోసమే ఉద్యోగాల భర్తీ - కేసీఆర్...

హైదరాబాద్ : నిరుద్యోగ యువత కోసమే ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. రైతులకు సాగునీరు అందించాల్సిన బాధ్యత తమపై ఉందని, రెండు, మూడేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు కృష్ణా, గోదావరి నదులపై నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేసీఆర్ సూచించారు. కాంట్రాక్టర్లతో మూడు షిప్ట్ లు పనిచేయించాలని, గడువులోగా పని పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు ఒక శాతం ఇన్సెంటివ్ ఇవ్వాలని ఆదేశించారు. 

దంతెవాడ జిల్లా జెడ్కా వద్ద ఎన్ కౌంటర్...

చత్తీస్ గఢ్ : దంతెవాడ జిల్లా జెడ్కా వద్ద జరిగిన పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో మహిళా మావోయిస్టు మృతి చెందారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. 

రాళ్ల పాడు ప్రాజెక్టులో 18 అడుగులకు చేరిన నీరు..

ప్రకాశం : లింగసముద్రం మండలం రాళ్ల పాడులో ప్రాజెక్టులో 18 అడుగులకు నీరు చేరింది. రెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

 

Don't Miss