Activities calendar

22 November 2015

నాగార్జున వర్సిటీలో మళ్లీ ర్యాగింగ్

గుంటూరు : నాగార్జున వర్సిటీలో మళ్లీ ర్యాగింగ్ కలకలం రేగుతోంది. ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారన్న ఆరోపణ నేపథ్యంలో కొందరు విద్యార్థులపై వర్సిటీ యాజమాన్యం వేటు వేసింది. మరో ముగ్గురు విద్యార్థులపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. మరో ఇద్దరిపై వర్సిటీ అధికారులు రెండేళ్లపాటు సస్పెన్షన్ విధించారు.

22:06 - November 22, 2015

కరీంనగర్ : రవితేజ నటించిన బెంగాల్ టైగర్ మూవీ డిసెంబర్ 10న రిలీజ్ చేస్తామన్నారు డైరెక్టర్ సంపత్ నంది. తమన్నా, రాశి ఖన్నా నటించిన ఈ మూవీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. కరీంనగర్ లో ఓ కార్యక్రమం కోసం వచ్చిన సంపత్ నంది.. బెంగాల్ టైగర్.. తప్పకుండా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే మూవీ అభిమానులకు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. బెంగాల్ టైగర్ మూవీలోని పాటలను పాడి తనకు పంపిస్తే.. ఒకరికి తన నెక్ట్ సినిమాలో ఛాన్స్ ఇస్తామన్నారు. 

భారత అభివృద్ధిలో ఎన్ఆర్ఐల పాత్ర కీలకం: మోడీ

మలేషియా : భారత అభివృద్ధిలో ఎన్ఆర్ఐల పాత్ర కీలకమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మలేషియా పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం కౌలాలంపూర్‌లోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కేంద్రంలో నిర్వహించిన సదస్సులో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోని పలు దేశాల్లో భారత సంతతి ప్రజలు విశేషంగా రాణిస్తున్నారని అన్నారు. 2001లో గుజరాత్‌లో భూకంపం సంభవించినప్పుడు ఇక్కడి ప్రజలు అందించిన సాయం మర్చిపోలేనిదని ప్రశంసించారు. ఇరుదేశాల మధ్య చారిత్రక సంబంధాలు ఎన్నో ఉన్నాయన్నారు. వ్యాపార, వాణిజ్య సంబంధాలు మరింత పెరుగుపడాలని ఆకాంక్షించారు. 

22:03 - November 22, 2015

బర్మా : మయన్మార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కచిన్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడడంతో పెనునష్టం వాటిల్లింది. ఈ దుర్ఘటనలో 100 మంది మృతి చెందారు. 50మందికి పైగా గ్రామస్తులు గల్లంతయ్యారు. గనులపై చరియలు విరిగిపడడంతో ఈ ప్రమాదం జరిగింది. గనుల్లో పనిచేస్తున్న కార్మికులు కొందరు దుర్మరణం పాలయ్యారు. పెద్ద ఎత్తున మట్టిపెల్లలు విరిగిపడడంతో గల్లంతైనవారు బతికుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గల్లంతైనవారికోసం భద్రతాచర్యలు కొనసాగుతున్నాయి.

 

 

 

22:01 - November 22, 2015

మలేషియా : భారత అభివృద్ధిలో ఎన్ఆర్ఐల పాత్ర కీలకమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మలేషియా పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం కౌలాలంపూర్‌లోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కేంద్రంలో నిర్వహించిన సదస్సులో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోని పలు దేశాల్లో భారత సంతతి ప్రజలు విశేషంగా రాణిస్తున్నారని అన్నారు. 2001లో గుజరాత్‌లో భూకంపం సంభవించినప్పుడు ఇక్కడి ప్రజలు అందించిన సాయం మర్చిపోలేనిదని ప్రశంసించారు. ఇరుదేశాల మధ్య చారిత్రక సంబంధాలు ఎన్నో ఉన్నాయన్నారు. వ్యాపార, వాణిజ్య సంబంధాలు మరింత పెరుగుపడాలని ఆకాంక్షించారు. 

21:56 - November 22, 2015

గుంటూరు : ర్యాగింగ్ భూతం మళ్లీ పడగవిప్పింది. నాగార్జున వర్సిటీలో మళ్లీ ర్యాగింగ్ కలకలం రేగుతోంది. రిషితేశ్వరి ఘటన మరిచిపోకముందే తాజాగా మరో ర్యాగింగ్ ఘటన చోటుచేసుకుంది. ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారన్న ఆరోపణ నేపథ్యంలో కొందరు విద్యార్థులపై వర్సిటీ యాజమాన్యం వేటు వేసింది. ముగ్గురు విద్యార్థులపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. మరో ఇద్దరు విద్యార్థినిలపై వర్సిటీ అధికారులు రెండేళ్లపాటు సస్పెన్షన్ విధించారు. అయితే వర్సిటీలో వరుసగా ర్యాగింగ్ ఘటనలు చోటుచేసుకోవడంతో అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

 

21:51 - November 22, 2015

ఢిల్లీ : భారీ వర్షాలకు నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకుంటామన్నారు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు. కేంద్ర కమిటీ త్వరలోనే రాష్ట్రంలో పర్యటించి... నివేదిక అందిస్తుందని.. ఆ ప్రకారం నిధులు అందిస్తామన్నారు. ముందుగా స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు కేటాయిస్తామని ఆ తరువాత... కేంద్రం నివేదిక వచ్చాక... నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా సాయం అందిస్తామని వెంకయ్య నాయుడు అన్నారు.

 

21:48 - November 22, 2015

ఎపి మంత్రి కామినేని శ్రీనివాస్ తో టెన్ టివి ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈసందర్భంగా మంత్రి పలు అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వ వైద్యులకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. గవర్నమెంటు డాక్టర్లు ప్రైవేట్ ఆస్పత్రులు నడిపితే ఇంటికి పంపుతామని హెచ్చరించారు. ఆస్పత్రుల్లో 150 కోట్ల రూపాయలతో వైద్య పరికరాలు, ఏర్పాటు చేసి మరమ్మత్తులు చేస్తామని చెప్పారు.
సేవల మెరుగుదలే... ప్రయివేటీకరణ లేదు
సేవల మెరుగుదలే తప్ప... ప్రయివేటీకరణ లేదని స్పష్టం చేశారు. త్వరలో హెల్త్ కేర్ ఏటీఎంలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వెండింగ్ మెషిన్ల ద్వారా మందులు పొందే అవకాశం ఉందని చెప్పారు. విశాఖ కేజీహెచ్ లో నూతన భవనాలు నిర్మిస్తామన్నారు. కర్నూలు ఆస్పత్రిలో పడకల పెంపు చేస్తామని చెప్పారు. గుంటూరులో శస్త్ర చికిత్సలకు అధునాతన పరికరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాకినాడ డాక్టర్లపై వచ్చిన కంప్లయిట్లపై విచారణ చేపడతామన్నారు.
పవన్ కళ్యాణ్ మా కుటుంబ స్నేహితుడు
అసమ్మతిని అంతర్గత వేదికలపైనే చర్చించాలన్నారు. పవన్ కళ్యాణ్ తమ కుటుంబ స్నేహితుడని చెప్పారు. పవన్ ను సీఎం చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లడంలో రాజకీయం లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

భారీ వర్షాలకు తిరుపతి అతలాకుతలం...

చిత్తూరు : భారీ వర్షాలకు తిరుపతి నగరం అతలాకుతలం అయింది. ఇంద్రానగర్, గాలివీధిలో రెండు ఇళ్లు కూలాయి. నవోదయ కాలనీ, అశోక్ నగర్, చంద్రశేఖర్ రెడ్డి కాలనీ, రైల్వే కాలనీలు జలదిగ్బంధం అయ్యాయి. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

 

చత్తీస్ గఢ్ లో ఐఈడీ బాంబ్ వెలికితీత

చత్తీస్ గఢ్ : సుకుమా జిల్లా చింతల్ నార్ అటవీప్రాంతంలో 7 కిలోల ఐఈడీ బాంబ్ ను సీఆర్ పీఎఫ్ జవాన్లు వెలికి తీశారు. 

భారత్ కు కతజ్ఞతలు తెలిపిన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల

కొలంబో : శ్రీలంకలో వివిధ సంక్షేమ పథకాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చిన భారత్‌కు ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కృతజ్ఞతలు తెలిపారు. మాతలే టౌన్‌లోని మహాత్మా గాంధీ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ సంక్షేమ పథకాల అభివృద్ధికి భారత ప్రభుత్వం చేయూతనివ్వడంపై ధన్యవాదాలు తెలిపారు. భారత్‌- శ్రీలంక డెవలప్‌మెంట్‌ కోఆపరేషన్‌ భాగస్వామ్యంలో భాగంగా భారత ప్రభుత్వం ఈ సెంటర్‌ నిర్మాణానికి రూ.88.6 (శ్రీలంక రూపాయి) మిలియన్లను నిధులను సమకూర్చినట్లు భారత్‌ హైకమిషనర్‌ తెలిపారు.

 

ఎపిని కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుంది : వెంకయ్యనాయుడు

నెల్లూరు : ఎపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. జాతీయ రహదారుల పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. వరదలతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఏపీ పరిస్థితిని ప్రధాన మంత్రి కార్యాలయానికి, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వివరించానని చెప్పారు. వరదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించిన తర్వాత కేంద్ర బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తుందన్నారు. కేంద్ర బృందం పర్యటన తర్వాత ఏపీకి మరింత సాయం అందుతుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

 

రామగుండం ఎన్టీపీసీ ఐదోయూనిట్‌లో సాంకేతికలోపం

కరీంనగర్ : రామగుండం ఎన్టీపీసీ ఐదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్ ట్యూబ్ లీకేజీ వల్ల 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్మతులు చేపట్టారు.

20:57 - November 22, 2015

ఆదిలాబాద్ : జిల్లాలో మావోయిస్టు బక్కన్నను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 9 ఎంఎం తుపాకీ,3 రౌండ్ల బుల్లెట్లను బెల్లంపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రెండు ఇన్ ఫార్మర్ల హత్యకేసులో బక్కన్న నిందితుడు : ఎస్పీ
రెండు ఇన్ ఫార్మర్ల హత్య కేసులో మావోయిస్టు బక్కన్న నిందితుడని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ తరుణ్ జోషి తెలిపారు. ఖానాపూర్ ఎదురుకాల్పుల సమయంలో బక్కన్న తప్పించుకున్నాడని పేర్కొన్నారు. కూంబింగ్ నిర్వహిస్తుండగా బక్కన్న దోరికాడని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల అలజడి పెరిగిందన్నారు. 

రెండు ఇన్ ఫార్మర్ల హత్యకేసులో బక్కన్న నిందితుడు : ఎస్పీ

ఆదిలాబాద్ : రెండు ఇన్ ఫార్మర్ల హత్య కేసులో మావోయిస్టు బక్కన్న నిందితుడని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ తరుణ్ జోషి తెలిపారు. ఖానాపూర్ ఎదురుకాల్పుల సమయంలో బక్కన్న తప్పించుకున్నాడని పేర్కొన్నారు. కూంబింగ్ నిర్వహిస్తుండగా బక్కన్న దోరికాడని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల అలజడి పెరిగిందన్నారు.

 

మావోయిస్టు బక్కన్న అరెస్టు

ఆదిలాబాద్ : జిల్లాలో మావోయిస్టు బక్కన్నను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 9 ఎంఎం తుపాకీ,3 రౌండ్ల బుల్లెట్లను బెల్లంపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

తమిళనాడులో వర్షాలు.. 122కు చేరిన మృతుల సంఖ్య

చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలకు మృతిచెందిన వారి సంఖ్య 122కు పెరిగింది. తమిళనాడులోని పలు ప్రాంతాలతో పాటు కేంద్రపాలితప్రాంతమైన పుదుచ్చేరిలో ఆదివారం కూడా భారీ వర్షాలు కురిశాయి. రానున్న 24గంటల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు చెన్నై వాతావరణ శాఖ లోతట్టు ప్రాంతాలను హెచ్చరించింది. బంగాళాఖాతంలో అప్పపీడనంతో తమిళనాడు తీరప్రాంతాలతో పాటు కన్యాకుమారి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ వాఖ డైరెక్టర్‌ ఎస్‌ఆర్‌ రామన్‌ తెలిపారు.

 

'చనఖా - కొరట బ్యారేజీ' కి రూ.368 కోట్లు విడుదల

ఆదిలాబాద్  : జిల్లాలోని పెన్‌గంగా ప్రాజెక్టు కింద చేపట్టనున్న చనఖా - కొరట బ్యారేజీ పనులకు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. బ్యారేజీ పనుల కోసం రూ. 368 కోట్లు విడుదల చేస్తూ సంబంధిత దస్త్రంపై సీఎం సంతకం చేశారు. ఇక పరిపాలనాపరమైన అనుమతికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2016 జనవరిలో బ్యారేజీ పనులు ప్రారంభం కానున్నాయి. రెండేళ్లలో బ్యారేజీ పనులు పూర్తి చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

అప్పులబాధతో రైతు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో అప్పులబాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్దమందాడి మండలం కన్మనూరులో అప్పుల బాధ తాళేలేక రైతు ఉరివేసుకొని  ఆత్మహత్య చేసుకున్నాడు.

 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మెదక్‌ : జిల్లాలోని సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ ఖాన్‌ పేట వద్ద ద్విచక్ర వాహనం, డిసిఎం ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రున్ని సమీప ఆసుపత్రికి తరలించారు.

న్యూజిలాండ్ హెలికాప్టర్ కూలి ఏడుగురి మృతి

న్యూజిలాండ్ : హెలికాప్టర్ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. న్యూజిలాండ్‌లోని హిమానీనదం ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ కుప్పకూలిపోయినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల్లో నలుగురు బ్రిటీష్‌వారు, ఇద్దరు ఆస్ట్రేలియన్ యాత్రికులు,ఓ ఫైలట్ ఉన్నట్టు తెలిపారు.

20:31 - November 22, 2015

చిత్తూరు : కుండపోత వర్షాలు చిత్తూరు జిల్లాను ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేని వానలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అనేక చెరువులకు గండ్లు పడ్డాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు, కరెంటు సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్‌ లో కొండచరియలు విరిగిపడుతూనే ఉన్నాయి. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు నత్తనడక సాగుతుండటంతో బాధితులు ఆకలితో అల్లాడుతున్నారు.
జలదిగ్భంధంలో వందలాది గ్రామాలు
చిత్తూరు జిల్లాలో వర్షాలు కుండపోతగా కురుస్తూనే ఉన్నాయి. జిల్లాలో 64 చెరువులకు గండ్లు పడ్డాయి. MA రాజుల కండ్రిగ దగ్గర కాజ్‌వే కొట్టుకుపోయింది. ఆరువేల మంది వరదలో చిక్కుకున్నారు. స్వర్ణముఖి, కాలంగి, బాహుద నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో రబీ సాధారణ వర్షపాతం 569 మి.లీటర్లు కాగా..ఇప్పటికే 1384 మి. లీటర్ల వర్షపాతం నమోదయ్యింది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు 4100 హెక్టార్లలో పంట నష్టం జరిగింది.
రైతన్నకు కడగండ్లు
తంభాళ్లపల్లి తాలుకాలోని ఆరు మండలాల్లో భారీ వర్షాలకు వాగులు వంకలు, చెరువులు నిండి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. ఈ వర్షాలు రైతన్నకు కడగండ్లు మిగులుస్తున్నాయి. వందల ఎకరాల్లోని వరిపంటల్లో నీరు చేరింది. మరికొన్ని చోట్ల వేరు సెనగ రైతులు నష్టపోయారు. అప్పులు తెచ్చి పంటలు వేశామంటున్న రైతులు..ఆరుగాలం శ్రమ నీటిపాలైందని, ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు.
తిరుపతిలో భారీ వర్షం
ఇక తిరుమల, తిరుపతిలో భారీ వర్షం పడింది. తిరుమలలో మాఢవీధులు జలమయమయ్యాయి. తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండో కనుమదారి మరమ్మతులకు అంతరాయం ఏర్పడింది. చంద్రగిరి మండలంలోని భీమవరం, పులిట్టివారిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఉధృతంగా ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది
స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కణ్యాణిడ్యామ్‌కు భారీగా వరదనీరు చేరింది. ప్రస్తుతం నీటి మట్టం 896 అడుగులుకు చేరింది. డ్యామ్‌కు భారీగా వరద నీరు వస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద నీరు మరింత పెరిగితే గేట్లు ఎత్తేందుకు సిద్ధమవుతున్నారు. ముంపు ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
తిరుపతిలో వీధులు జలమయం
జిల్లాలోని పలు పట్టణాలతో పాటు తిరుపతిలో వీధులు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి భారీగా నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. కట్టుబట్టలతో రోడ్డు మీదపడ్డారు. తినడానికి తిండిలేక, మంచినీరు లేక, పిల్లలు, వృద్దులు పడరాని పాట్లుపడుతున్నారు. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు నత్తనడకన సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నడూలేనంతగా భారీ వర్షాలు : చంద్రబాబు
చిత్తూరు జిల్లా చరిత్రలో ఎన్నడూలేనంతగా భారీ వర్షాలు పడ్డాయని, అన్ని చెరువులు, డ్యాములు నిండాయన్నారు సీఎం చంద్రబాబు. అయితే సహాయ కార్యక్రమాలు మాత్రం ఆలస్యంగా సాగుతున్నాయి. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ప్రభుత్వ యంత్రాంగం చెబుతున్నా ఆచరణలో అంత వేగం కనిపించడం లేదని బాధితులంటున్నారు.
నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు
ఎడతెరిపి లేని వర్షాలు నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. వందలాది గ్రామాలు జలదిగ్భంధంలోచిక్కుకున్నాయి. వేలాది ఎకరాల పంట నీటమునిగింది. కట్టుబుట్టలతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. నిత్యావసరాలు లేక అల్లాడిపోతున్నారు. సీఎం చంద్రబాబు నెల్లూరులోనే ఉండి సహాయక కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు.
పొంగిపొర్లుతున్న కైవల్య నది
వెంకటగిరి వద్ద కైవల్యా నది పొంగిపొర్లుతోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో సోమశిలకు వరదనీరు పోటెత్తింది. జలాశయం నీటి మట్టం 54 టీఎంసీలకు చేరింది. మరోవైపు జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సహాయక చర్యల పర్యవేక్షణ కోసం 50 మంది డిప్యూటీ కలెక్టర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. విశాఖ నుంచి 70 మంది అధికారులతో బృందం జిల్లాకు చేరుకుంది.
సహాయక చర్యలపై అధికారులతో చంద్రబాబు సమీక్ష
నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించారు. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. పంట నష్టం, పునరావాసం, బాధితులకు నిత్యావసరాల పంపిణీపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు. సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు చంద్రబాబు. సోమశిల డ్యామ్ ను పరిశీలించారు.
జిల్లాలో 16 లక్షల ఎకరాలకు సాగు నీరిస్తాం-బాబు
సంగం, నెల్లూరు పెన్నా బ్యారేజీని పనులు పూర్తి చేస్తామన్నారు బాబు. కాంగ్రెస్‌ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణపు పనులు అస్తవ్యస్తంగా జరిగాయని చెప్పారు. నెల్లూరు జిల్లాలో 16 లక్షల ఎకరాలకు సాగు నీరిస్తామన్నారు. అలాగే జిల్లాలో రెండో పంటకు నీరిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
వందలాది ఎకరాల్లో నీటమునిగిన పంట
నెల్లూరు జిల్లాలో వందలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. చెరువులకు గండ్లు పడ్డంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పల్లెలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు పట్టణాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, నీరు దొరక్క బాధితులు అల్లాడిపోతున్నారు.

 

 

20:06 - November 22, 2015

పశ్చిమ గోదావరి : వ్యవసాయం చేసుకోమని భూమిలిచ్చింది....సాగునీటి కోసం బోరు లిచ్చింది... బీడు భూములను పంట భూములుగా మార్చేందుకు ప్రోత్సహం అందించింది... అంతా సవ్యంగా జరుగుతోందన్న సమయానికి సర్కార్‌ ప్లేట్‌ మార్చేసింది. భూములను లాగేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పేదలకు చెందిన ఎసైన్డ్ భూములను పరిశ్రమలకు అప్పగించేందుకు టీడీపీ ప్రభుత్వం పన్నాగం మొదలుపెట్టింది.
అసెన్డ్ భూముల సేకరణకు ప్రణాళికలు
జిల్లాలోని నల్లజర్ల, ద్వారకాతిరుమల మండలాల్లోని అసెన్డ్ భూములను సేకరించేందుకు సర్కార్‌ ప్రణాళికలు రచిస్తోంది. దూబచర్ల, పుల్లలపాడు, గాంధీనగర్‌ గ్రామాల్లోని దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందిన మూడు వేల ఎకరాలను పరిశ్రమల పేరుతో సేకరించేందుకు సిద్ధమవుతోంది. ఈ గ్రామాల్లోని అసైన్డ్ భూముల సర్వే కోసం అధికారులు పలు మార్లు అక్కడికి వెళ్లారు. స్థానికులు అడ్డుకోవడంతో బలవంతంగానైనా భూములను లాక్కొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బలగాలను మోహరించైనా సర్వే చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
అడ్డుకునేందుకు అన్నదాతలు రెడీ
అసైన్డ్ భూములను లాక్కొనే ప్రయత్నాలను అడ్డుకునేందుకు అన్నదాతలు రెడీ అవుతున్నారు. ఇప్పటికే భూపరిరక్షణ కమిటీలను ఏర్పాటుచేసుకున్న రైతులు...ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు పోరాటం చేస్తామంటున్నారు. పామాయిల్‌, నిమ్మ, జీడి మామిడి తోటలతో కళకళాడుతున్న పొలాలను పరిశ్రమలతో పేరుతో తీసేసుకోవడం సరికాదంటున్నారు ఆ ప్రాంత రైతులు. ప్రభుత్వం తన ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.
సర్వత్రా విమర్శలు
బడుగు, బలహీనవర్గాలకు చెందిన భూములను లాక్కొనే ప్రయత్నాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేసేందుకు ఆ ప్రాంత రైతులు సిద్ధమవుతున్నారు.

 

19:58 - November 22, 2015

విశాఖ : దేశంలోని ప్రఖ్యాతి గాంచిన భీమిలి ఎర్రమట్టి దిబ్బలకు మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందా ? ఎర్రమట్టి దిబ్బల ప్రాంతంలో సిమెంట్‌ మిక్సింగ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులివ్వడంతో ఓ బడా వ్యక్తి రెండు ఎకరాలను ఆక్రమించాడు.ఈమేరకు పర్యావరణవేత్త రాణిశర్మతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. భీమిలి ఎర్రమట్టి దిబ్బల ప్రాంతం కబ్జాలకు గురవడం దారుణమన్నారు.

19:53 - November 22, 2015

తూర్పుగోదావరి : కాకినాడ దుమ్ములపేటలో ఘోరం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి చనిపోయాడు. ఆదివారం సెలవు రోజు కావటంతో స్నేహితులతో కలిసి సరదాగా ఆరుబయట ఆడుకుంటున్న దుర్గాప్రసాద్ అకస్మాత్తుగా మురికి కాల్వలోపడి దుర్మరణం చెందినట్లు స్థానికులు తెలిపారు. బాలుడు మృతిపై కుటుంబసభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు డ్రైనేజీలో పడి చనిపోయాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలుడి మృతిపై పోర్టు సీఐ స్పందిస్తూ..ప్రమాదవశాత్తు డ్రైనేజీలోపడి చనిపోయినట్లు తెలిపారు.

 

19:49 - November 22, 2015

హైదరాబాద్ : ఏపీలో వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే..ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్‌ ఏం చేస్తున్నారని టిడిపి ఎంపీ రమేష్‌ ప్రశ్నించారు. వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు అహోరాత్రులు కష్టపడుతుంటే...జగన్‌ మాత్రం బై ఎలక్షన్‌ అంటూ వరంగల్‌లో తిరిగారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్‌కి ప్రజల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు.

 

గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

కృష్ణా : జిల్లాలో నిన్న గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలు ఇవాళ లభ్యమయ్యాయి. నిన్న సాయంత్రం వీరు బల్లకట్టుపై నుంచి నదిలో జారిపడ్డారు. మృతులను గోపీ, నర్సింహారావు, రమణగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రేపు నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు. 

19:45 - November 22, 2015

కృష్ణా : జిల్లాలో నిన్న గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలు ఇవాళ లభ్యమయ్యాయి. నిన్న సాయంత్రం వీరు బల్లకట్టుపై నుంచి నదిలో జారిపడ్డారు. మృతులను గోపీ, నర్సింహారావు, రమణగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రేపు నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.

 

19:31 - November 22, 2015

ఖమ్మం : అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఖమ్మం జిల్లాలో ఏకంగా ఓ కుటుంబమంతా ఆత్మహత్యకు ప్రయత్నించి అయినవారిని కన్నీటిసముద్రంలో ముంచింది. జిల్లాలోని వైర మండలం పాలడుగు గ్రామానికి చెందిన రైతు కుటుంబం అన్నంలో విష పదార్థం కలిపి భుజించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటనలో రైతు భార్య మరణించింది. విషయం తెలుసుకున్న బంధువులు కుటుంబ యజమానిని, అతని కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితీ ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

19:26 - November 22, 2015

ఆదిలాబాద్ : క్రికెట్‌ సరదా రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ పట్టణానికి చెందిన నోమన్‌, అబ్బు సోఫియన్‌లో క్రికెట్‌ ఆడుతుండగా పక్కనే ఉన్న చెరువులో బాల్‌ పడింది. దీంతో నోమన్‌, అబ్బు సోఫియన్‌లు బాల్‌ కోసం చెరువులోకి దిగగా ఈత రాకపోవడంతో మునిగిపోయి మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు వెలికితీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు.

 

రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

తిరుమల : రెండో ఘాట్ రోడ్డు 10 కి.మీ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు.  

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్

జమ్మూకాశ్మీర్ : కుప్వారాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో లెఫ్టినెంట్ కల్నల్ కు గాయాలయ్యాయి.

 

19:17 - November 22, 2015

హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రి అన్నారు. సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రంలో వుమెన్ టీచ‌ర్స్ నేష‌న‌ల్ క‌న్వెన్షన్ కు ముఖ్య అతిధిగా హ‌జ‌రై ఆయన ప్రసంగించారు. ఈ స‌ద‌స్సులో మ‌హిళా స‌మ‌స్యలు, మ‌హిళా ఉపాధ్యాయుల స‌మ‌స్యల‌పై చ‌ర్చ జ‌రిపి తీర్మానాలు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌కు అంద‌జేయాల‌ని సూచించారు. డిటెన్షన్ విధానాన్ని తెలంగాణ స‌ర్కారు పూర్తిగా వ్యతిరేకించింద‌న్నారు. ప్రయివేటు పాఠ‌శాల‌ల‌కు ధీటుగా ప్రభుత్వ పాఠ‌శాల‌ల‌ను బ‌లోపేతం చేసుకోవాల‌ని ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాల‌న్నారు.

19:05 - November 22, 2015

హైదరాబాద్ : భారీ మెజారిటీతో వరంగల్‌లో గెలుస్తామని వరంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సర్వే సత్యనారాయన ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీకి నూతన ఉత్తేజాన్ని ఇచ్చాయని సర్వే అన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరుగులెత్తించామని ఆయన తెలిపారు. అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బులు పంచిపెట్టిందని, ఓటర్లను ప్రలోభ పెట్టిందని సర్వే ఆరోపించారు.

 

19:00 - November 22, 2015

హైదరాబాద్ : నిధులు, ప్రాజెక్టుల మంజూరులో కేంద్రం.. ఏపీ, తెలంగాణల మధ్య పక్షపాత దోరణిని ప్రదర్శిస్తోందని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత అన్నారు. తెలంగాణకు రావాల్సిన ట్రైబల్‌ యూనివర్శిటీని ఇప్పటివరకు మంజూరు చేయలేదన్నారు. వరంగల్‌లో రైళ్ల కోచ్‌ ఫ్యాక్టరీని రద్దు చేశారని కవిత విమర్శించారు. ఖమ్మం జిల్లా బయ్యారంలో కేంద్రమే స్టీల్‌ ఫ్యాక్టరీని నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు. బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి దమ్ముంటే..తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టులను మంజూరయ్యేలా కేంద్రం వత్తిడి తేవాలని ఆమె సవాల్‌ విసరారు. 

18:43 - November 22, 2015

20 ఏళ్లపాటు మూడు రాష్ట్రాల పోలీసులను వీరప్పన్ వణికించించాడు. వందలాది మందిని చంపి అడవిని కొల్లగొట్టాడు. ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ కథతో ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ 'కిల్లింగ్ వీరప్పన్' అంటూ మరో సెన్సేషనల్ ఫిల్మ్ రూపొందించారు. డిసెంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల మందుకు రానుంది. వీరప్పన్ పాత్రలో సందీప్ భరద్వాజ్ నటించారు. పోలీస్ అధికారిగా శివరాజ్ కుమార్ నటించారు. ఈసందర్భంగా వర్మతో టెన్ టివి స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. కిల్లింగ్ వీరప్పన్ సినిమా విశేషాలను వివరించారు. తన అనుభవాలను తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

భారత్‌-దక్షిణాఫ్రికా చివరి టెస్టు మ్యాచ్‌కు ఉచితపాసులపై పరిమితి

హైదరాబాద్‌ : భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య ఫరోజ్‌షా కోట్ల మైదానంలో డిసెంబర్‌ 3న జరగనున్న చివరి టెస్టు మ్యాచ్‌కు ఉచిత పాసులపై ఢిల్లీ హైకోర్టు పరిమితి విధించింది. సుమారు 40 వేల సీట్ల సామర్థ్యం ఉన్న ఈ స్టేడియంలో 10వేలకు మించి ఉచిత టిక్కెట్లను జారీ చేయకూడదని ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్‌ అసోసియేషణ్ ను కోర్టు ఆదేశించింది. ఈ టిక్కెట్లను ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థులకు ఇవ్వనున్నట్లు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ముద్గల్‌ తెలిపారు. గ్రౌండ్‌ లెవల్‌లో ఉన్న స్టాండర్స్ ను వీరికి కేటాయించే అవకాశం ఉంది.

 

'సౌఖ్యం' ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్

హైదరాబాద్ : గోపీచంద్ హీరోగా, రెజీనా హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం 'సౌఖ్యం'. సౌఖ్యంగా ఉన్నారా? అంటున్నారు గోపీచంద్. నలుగురి క్షేమం కోరే వ్యక్తిగా, నలుగురి సౌఖ్యం కోసం ఏం చేయడానికైనా వెనకాడని వ్యక్తిగా గోపీచంద్ నటిస్తున్న చిత్రం 'సౌఖ్యం'. గోపీచంద్ కెరీర్ ఆరంభంలో 'యజ్ఞం' వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఎ.ఎస్‌.ర‌వికుమార్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలోని పాటలు మినహా టాకీ పూర్తయ్యింది. ఈ సంద్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేశారు.

కల్తీ కల్లు దొరక్క వ్యక్తి మృతి

రంగారెడ్డి : జిల్లాలోని వికారాబాద్‌లో కల్తీ కల్లు దొరక్క ఓ వ్యక్తి మృతి చెందాడు. కర్ణాటకకు చెందిన చిలకల సురేష్(35) గత ఐదేళ్లుగా చిలక జోస్యం చెప్పుకుంటూ ధారూర్‌లో నివాసముంటున్నాడు. ఈక్రమంలో అతను కల్తీ కల్లుకు బానిసయ్యాడు. కొంతకాలంగా కల్తీకల్లు దొరక్కపోవడంతో..తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

జపాన్‌లో హెలికాప్టర్‌ కూలి ఇద్దరు మృతి

టోక్యో : జపాన్‌లో ఓ హెలికాప్టర్‌ కూలి ఇద్దరు మృతి చెందారు. అధికారుతలు తెలిపిన వివరాల ప్రకారం జపాన్‌ రాజధాని టోక్యో నుంచి బయలుదేరిన ఓ ప్రయివేటు హెలికాప్టర్‌ టోక్యోకి 250 కిలో మీటర్ల దూరంలో ఉన్న కొమొరో ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. కొనవూపిరితో ఉన్న మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

 

17:23 - November 22, 2015

హైదరాబాద్ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదానే తమ పార్టీ ఎజెండా అని, దానిపై పార్లమెంట్‌ సమావేశాల్లో గట్టిగా నిలదీస్తామని వైసిపి నెల్లూరు ఎంపీ మేకపాటి అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆ పార్టీ అధ్యక్షులు జగన్‌ హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌ పార్టీ కార్యాలయంలో ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన పలు ప్రజా సమస్యలు, కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రానున్న నిధులు, పెండిగ్‌ ప్రాజెక్టులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటలకు మద్దతు ధర వంటి పలు అంశాలపై చర్చించారు. అనంతర మేకపాటి మీడియాతో మాట్లాడారు. సమావేశంలో చర్చించిన అంశాలను వివరించారు. పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

 

16:40 - November 22, 2015

శ్రీకాకుళం : గాంధీ, అంబేద్కర్‌, నెహ్రూ లాంటి ఎంతో మంది మహాత్ములు తమ జీవితాలను దేశానికి అంకితం చేశారు. జైళ్లలో గడిపారు... లాఠీ దెబ్బలు తిన్నారు... పోరాటాలు చేశారు. ప్రతిమదిలో నిలిచిపోయారు. జాతికి మార్గదర్శకులయ్యారు. అందుకే వారి స్ఫూర్తి పదికాలాల పాటు అందరికీ గుర్తుండే విధంగా విగ్రహాలు ఏర్పాటు చేశారు. చేస్తున్నారు. కానీ ఆ ఏర్పాటులో నిబంధనలకు నీళ్లు వదులుతుండడంతో మెచ్చుకోదగినవారు విమర్శలపాలవుతున్నారు.
విగ్రహాల రూపంలో మహనీయుల రూపాలు
అందుకే వీరి అడుగుజాడల్లో నడవాలని గుర్తుచేస్తూ మహనీయుల రూపాలను ఇలా విగ్రహాల రూపంలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆ ఏర్పాటే ఒక్కోసారి ప్రజల్లో అసహనాన్ని కలిగిస్తోంది. మంచివాళ్లకు చెడ్డపేరు తెస్తోంది. కారణం నిబంధనలు పాటించకపోవడమే. ఇందుకు ఆ ఊరూ ఈ ఊరు అనే తేడా లేకుండాపోయింది.
ఇష్టారాజ్యంగా విగ్రహాల ఏర్పాటు
నాయకుల విగ్రహాల ఏర్పాటు వేళ ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే ప్రజలకు ఇబ్బందులు ఉండవు...రాకపోకలకు ఆటంకాలుండవు అనే విషయాలు ఆలోచించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
రాజకీయ నేతల శిలా విగ్రహాలు
ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ముప్పై ఎనిమిది మండలాల్లో సుమారు 342 వరకూ వివిధ రకాల రాజకీయ నేతల శిలా విగ్రహాలు ఉన్నాయి. జాతీయస్థాయి నాయకులతోపాటు రాష్ట్రనేతలు ఎన్టీఆర్, వై.ఎస్, ఎర్రంనాయుడుల విగ్రహాలు నెలకొల్పుతున్నారు.అయితే వాటిని ఏర్పాటుచేసిన వర్గాలు నిబంధనలు పాటించడం లేదు. తద్వారా ఆ నాయకులకు మచ్చతెచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా అధికారుల అనుమతులు, పాలక సంఘాల తీర్మానాలు లేకుండానే జిల్లాలో తొంబై శాతం శిలా విగ్రహాలు వెలిసాయి. ఆయా విగ్రహాలతో ట్రాఫిక్‌ సమస్యలు, పలురకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు.
36 శిలా విగ్రహాలే నిబంధనల ప్రకారం ఏర్పాటు
శ్రీకాకుళం జిల్లాలో 340 విగ్రహాలు ఉండగా ముప్పైఆరు శిలా విగ్రహాలే నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశారు. మిగతా విగ్రహాలను పోటాపోటీగా కులసంఘాలు, రాజకీయ సంఘాలు ఏర్పాటుచేసుకుంటూ పోయాయి. అయితే ప్రజలకు ఇబ్బందికలిగించే విగ్రహాలను తొలగించాలని ఉన్నత న్యాయస్థానం సైతం తీర్పిచ్చింది. అయినా ఆ తీర్పు అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని అడ్డంకిగా ఉన్నవాటిని తొలగించకపోయినా కొత్త విగ్రహాలు ఏర్పాటు చేయకుండా చూడాలని ప్రజలు, సామాజికవేత్తలు కోరుతున్నారు.

 

16:20 - November 22, 2015

గుంటూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో నలుగురు మృతి చెందారు. జిల్లాలోని పిడుగురాళ్ల మండలం జనపాడులో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

 

15:47 - November 22, 2015

నెల్లూరు : నగరంలోని అక్రమ నిర్మాణాలపై ఎపి ప్రభుత్వం కన్నెర్రజేసింది. ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఊపందుకుంది. నగరంలో అడ్డగోలుగా కాల్వలపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీచేయడంతో తొలగింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈమేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాల్వలపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను ప్రొక్లేయినర్‌తో నారాయణ స్వయంగా కూల్చివేశారు. అలాగే కాల్వలపై అక్రమంగా ఇళ్లను నిర్మించిన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ అన్నారు. 

నెల్లూరులో అక్రమ నిర్మాణాల తొలగింపు

నెల్లూరు : నగరంలోని అక్రమ నిర్మాణాలపై ఎపి ప్రభుత్వం కన్నెర్రజేసింది. ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఊపందుకుంది. నగరంలో అడ్డగోలుగా కాల్వలపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీచేయడంతో తొలగింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈమేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

15:42 - November 22, 2015

ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మరో అంశం వెలుగు చూసింది. తనకు వరస సోదరుడైన రాహుల్‌తో షీనా డేటింగ్‌ చేసేది. ఇది ఇష్టంలేని షీనా తల్లి ఇంద్రాణి ముకర్జియా... రాహుల్‌తో సహజీనవం మానుకోమని చెప్పారు. కానీ ఇది నచ్చని షీనా... రాహుల్‌తో తన డేటింగ్‌ను మానుకోబోని తల్లి ఇంద్రాణికి లేఖ రాశారు. ఈ మెయిల్స్‌ పంపారు. షీనా హత్య కేసుపై దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు.. కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీటులో షీనా లేఖలు, ఈమెయిల్స్ ను పొందుపరిచారు.
రాహులతో షీనా డేటింగ్‌
షీనా బోరా హత్య కేసులో మలుపులు మీద ములుపులు తిరుగుతోంది. ఆమె రాహుల్‌లో డేటింగ్‌ చేసేవారు. రాహుల్‌ .... షీనా భర్త పీటర్‌ ముకర్జియా తనయుడు. షీనాకు వరసుకు సోదరుడు. రాహుల్‌తో సహజీనవం చేయడం నచ్చని షీనా తల్లి ఇంద్రాణికి నచ్చలేదు. రాహుల్‌తో డేటింగ్‌ మానుకోవాని ఆదేశించింది. షీనాకు ఇది నచ్చలేదు. రాహుల్‌తోనే తన జీవితం కొనసాగిస్తానని చెబుతూ తల్లికి లేఖ రాసింది. ఇదే విషయంపై ఈ మెయిల్స్‌ పంపింది. రాహుల్‌తో తన జీవితం ఆనందంగా, భద్రంగా ఉందని లేఖలో ప్రస్తావించారు. సహజీనవం విషయంలో సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని తల్లి ఇంద్రాణి ముకర్జియాకు రాసిన లేఖలో ఉంది. షీరా రాసిన లేఖలు, పంపిన ఈమెయిల్స్ ను సీబీఐ అధికారులు కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీటులో పొందుపరిచారు.
తల్లి చేసిందే చేశానన్న షీనా బోరా
షీనా తల్లి కూడా ముగ్గురుని పెళ్లి చేసుకుంది. సుఖం, ఆనందం కోసం ఇంద్రాణి ఏమి చేసిందో తానే అదే చేశానన్నది షీనా వాదన. ఇదే విషయాన్ని లేఖలో పొందుపరిచారు. తల్లి బాటలోనే పయనిస్తున్నట్టు చెప్పారు. తనకు కూడా తల్లి లక్షణాలో అబ్బాయని.... ఈ విషయంలో బాధపడొద్దని ఇంద్రాణికి చెప్పారు. తన జీవితాన్ని తాను ఎంచుకుంటున్నప్పుడు బాధపడొద్దని తల్లికి రాసిన లేఖలో షీనా కోరారు.
రాహుల్‌తో వేరుపడాలని షీనాపై ఇంద్రాణి ఒత్తిడి
రాహుల్‌తో షీనా డేటింగ్‌ నచ్చని ఇంద్రాణి ముకర్జియా.... ఇద్దరూ వేరుపడాలని షీనాపై ఒత్తిడి తెచ్చి ఉండొచ్చని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఈ కమ్రంలోనే లేఖ రాసి ఉంటారని చెబుతున్నారు. ఇంద్రాణి చిన్న కుమార్తె, తన సోదైరైన వైదేహితో షీనా సన్నిహితంగాఉండేది. దీంతో వైదీహి కూడా షీనా బాటలో నడుస్తుందేమోన్న బెంగ ఇంద్రాణికి పట్టుకుంది. మీడియా అధిపతి పీటర్‌ ముకర్జియాకు కూడా షీనా దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. దీనిని ఇంద్రాణి సహించలేకపోయింది. తన ఆస్తులను సొంతం చేసుకుంటేదేమోనన్న భయం పట్టుకుంది. వరుసకు తండ్రైన పీటర్‌ ముకర్జియా కూడా షీనా లేఖ రాసింది. రాహుల్‌తో డేటింగ్‌ విషయంలో ఇంద్రాణిని ఒప్పించాలని కోరారు. సహజీవనం విషయంలో తనను, రాహుల్‌ను తిట్టడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని లేఖలో రాశారు.
సంజీవ్‌ ఖన్నా, శ్యామ్‌వర్‌ రాయ్‌తో కలిసి హత్య
రాహుల్‌తో డేటింగ్‌ విషయంలో ఎంతచెప్పినా షీనా వినిపించుకోపోవడంతో ఆమె హత్యకు ఇంద్రాణి పథకం రచన చేశారు. తన మాజీ భర్త సంజీవ్‌ ఖన్నా, కారు డ్రైవర్‌ శ్యామ్‌వర్‌ రాయ్‌తో కలిసి, షీనాను మహారాష్ట్ర రాయగడ అడవుల్లోకి తీసుకెళ్లి హత్య చేశారు. ఇది ఏడాది తర్వాత వెలుగులోకి వచ్చింది.

 

 

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

గుంటూరు : పిడుగురాళ్ల మండలం జనాపాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. 

15:24 - November 22, 2015

హైదరాబాద్ : సైంటిఫిక్‌ ఎంక్వైరీ అంటే ఏమిటన్న విషయంపై అవగాహన కల్పించడానికి టిహబ్‌ ఒక కొత్తరకమైన సైన్స్ క్విజ్‌ ప్రోగ్రాంను... నవంబర్‌ 14న నెహ్రూ జయంతి సందర్భంగా నిర్వహించారు. ఈ క్విజ్‌ ప్రోగ్రాం నిర్వహణ వెనుక ముఖ్యమైన కారణముంది. భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ... సైంటిఫిక్ టెంపర్‌ అన్న పదాన్ని సృష్టించారు. ఈ నేపథ్యంలో సైంటిఫిక్‌ టెంపర్‌ అంటే ఏంటి అనే విషయాన్ని పిల్లలు ఈ క్విజ్‌ ప్రోగ్రాం ద్వారా తెలుసుకున్నారు. స్టూడెంట్స్ వాళ్ల స్వంత థియరీ ద్వారా సైంటిఫిక్‌ టెంపర్‌ అంటే ఏంటో తెలుసుకున్నారు. దాన్ని పరిశోధించడానికి చేసిన ప్రయోగాలను క్విజ్‌ సందర్భంగా జడ్జీలకు వివరించారు. ఈ క్విజ్‌ ప్రోగ్రాంలో సీనియర్‌ రౌండ్‌ తరపున మంతన్‌ స్కూల్ విన్నయ్యింది. జూనియర్ రౌండ్‌లో భవన్స్ స్కూల్ విద్యార్థులు గెలుపొందారు. విద్యార్థులకు టెన్‌ టివి ఎండి బహుమతులు అందించారు. 

తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం

చిత్తూరు : తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. 15 రోజుల్లో రికార్డుస్థాయిలో 105 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. 

14:37 - November 22, 2015

తూర్పుగోదావరి : వాకలపూడిలోని కోరమాండల్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వాకలపూడిలోని కోరమాండల్ కెమికల్ ఫ్యాక్టరీలో ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో పేలుడు భారీ సంభవించింది. ఈప్రమాదంలో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. భారీ పేలుడు కావడంతో మృతుని శరీరం తునాతునకలైంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది. ఫ్యాక్టరీలో వందలమంది కార్మికులు పని చేస్తుంటారు. వందలాదిమంది షిప్టులు మారుతుంటారు. అయితే పేలుడు సంభవించిన వెంటనే ఫ్యాక్టరీ యాజమాన్యం మంటలను అదపుచేయగల్గింది. దీంతో పెను ప్రమాదం నుంచి బయటపడినట్లు చెప్పవచ్చు. పేలుడు తర్వాత మంటలు వ్యాపించి ఉంటే పెను ప్రమాదం జరిగివుండేది. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను యాజమాన్యం గోప్యంగా ఉంచింది. ఇంకా ఎవరైనా మృతి చెంది ఉన్నారా.. లేదా.... మరెవరెవరైనా గాయపడ్డారా... అన్న విషయం తెలియడం లేదు. పేలుడు జరిగినప్పుడు యాజమాన్యం కనీస బాధ్యతలు పాటించనట్లు తెలుస్తోంది. అయితే జరిగిన నష్టాన్ని పూర్తిగా యాజమాన్యం పూరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. 

పిజ్జాను వివాహమాడిన యువకుడు

హైదరాబాద్ : ఓ యువకుడు పిజ్జాను పెళ్ళి చేసుకున్నాడు. అందంగా ముస్తామై వచ్చాడు. చేతిలో పిజ్జా. దానికి అందమైన తెల్లని మేలిముసుగు కప్పి ఉంది. చుట్టూ బంధువులు, సన్నిహితులు. అంగరంగ వైభవంగా అతడి వివాహం జరిగింది. రష్యాకు చెందిన ఓ యువకుడు అచ్చంగా పిజ్జాను పెళ్లి చేసుకున్నాడు. 

కోరమాండల్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం

తూర్పుగోదావరి : వాకలపూడిలోని కోరమాండల్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

13:24 - November 22, 2015

హైదరాబాద్ : పాతబస్తీలో దారుణం జరిగింది. ఆర్ఎంపీ డాక్టర్‌ ఇచ్చిన ఇంజక్షన్‌ వికటించి రోగి మృతి చెందాడు. అయితే గుట్టుచప్పుడు రోగి మృతదేహాన్ని శంషాబాద్‌ ప్రాంతంలో తగులబెట్టేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  

13:22 - November 22, 2015

కడప : జిల్లాలో పెళ్లి బస్సు బోల్తాపడింది. ముద్దనూరు ఘాట్‌రోడ్‌లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని జమ్మలమడుగు ప్రభుత్వాసుప్రతికి తరలించారు. 

13:20 - November 22, 2015

హైదరాబాద్ : శాంతిభద్రతల బాధ్యత కేవలం పోలీసులది మాత్రమే కాదని.. ప్రజలకూ భాగస్వామ్యం ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతల విషయంలో అందరూ సహకరించాలని ఆయన అన్నారు. బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెం. 12లో ఏడెకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న పోలీస్‌ కమాండ్‌, కంట్రోల్‌ కేంద్ర భవనానికి సీఎం భూమిపూజ చేశారు. గతంలో పోలీసులంటే వేరే భావం ఉండేదని, మారుతున్న కాలానికి తగినట్టుగా  ప్రజలు కూడా మారాలని సీఎం అన్నారు. కమాండ్‌, కంట్రోల్‌ కేంద్రానికి ప్రస్తుతం రూ. 320 కోట్లు ఇచ్చామని, వచ్చే బడ్జెట్‌లో మరో రూ.700 కోట్లు ఇస్తామని చెప్పారు. పోలీస్ వ్యవస్థలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు నియామకాల్లో 33 శాతం కోటా ఇస్తున్నామని హోంమంత్రి నాయిని అన్నారు. 

కరాటే మాస్టర్ నాగేశ్వరరావు మృతి..

హైదరాబాద్ : కరాటే మాస్టర్ నాగేశ్వరరావు చికిత్స పొందుతూ మృతి చెందారు. మూడు రోజుల కిందట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. 

సోమశిల జలాశయాన్ని సందర్శించిన బాబు..

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆదివారం సోమశిల జలాశయాన్ని సందర్శించారు. బ్యారేజీలో నీటిమట్టాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

ఉగ్రవాద ప్రభావం ప్రపంచమంతా ఉంది - మోడీ..

మలేషియా : ఉగ్రవాద ప్రభావం ప్రపంచమంతటా ఉందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రధాని మలేషియా రాజధాని నగరం కౌలాలంపూర్‌లో జరిగిన 10వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదం ఏ ఒక్కదేశానికి సంబంధించిన అంశం కాదన్నారు.

12:47 - November 22, 2015

జయధీర్ తిరుమల రావు..ఈ పేరు వింటేనే అట్టడుగు వర్గాల సాహిత్యానికి అక్షర రూపం ఇచ్చిన ఒక పరిశోధకుడు. ఒక సృజన శీలి. ఒక కవి. ఆయన వివిధ ప్రాంతాల్లో అధ్యాపకుడిగా పనిచేస్తూనే గిరిజన సంస్కృతి...జానపద కళారూపాలు తెలంగాణ పోరాట ఉద్యమాల నేపథ్యంలో వచ్చిన సాహిత్యాన్ని వెలుగులోకి తె చ్చారు. అలాంటి నిబద్ధత కలిగిన రచయిత..పరిశోధకులు..కవి..సాహితి విమర్శకులు జయదేవ్ తిరుమల రావుపై ప్రత్యేక కథనం..

బల్లిపడిన చికెన్ తిని మహిళ మృతి..

ఖమ్మం : వైరా మండలం పాలడుగులో విషాదం చోటు చేసుకుంది. బల్లిపడిన చికెన్ తిన మహిళ మృతి చెందగా తండ్రి, కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఆసుపత్రికి తరలించారు. 

12:26 - November 22, 2015

రాయలసీమను రతనాల సీమ అంటారు. రాయల సీమను రాళ్ల సీమ అని కూడా అంటారు. రాయలసీమలో ఖనిజ సంపద కోసం దేశం అంతా చర్చిస్తుంది. అలాగే రాయలసీమలో కరవుపై దేశమంతటా మాట్లాడుకొంటోంది. శ్రీ బాగ్ ఒప్పందం నుండి మొన్నటి ఏపీ పునర్ విభజన చట్టం వరకు అడుగడుగునా పాలకుల హామీలు వైఫల్యాల చరిత్ర అని ఇక్కడి ప్రజల్లో బాగా నాటుకపోయింది. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందని భావించాం కాని పరిపాలన ఏకీకేంద్రీకరణ జరుగుతుందనే అంశాన్ని ప్రజలు లేవనెత్తుతున్నారు. ఇందులో వాస్తవం ఎంత ? రాయలసీమ వెనుకబాటుకు గురవుతుందా ? రాష్ట్ర విభజన అనంతరం పరిస్థితులు అలాగే ఉన్నాయా ? ఈ అంశంపై టెన్ టివి బిగ్ డిబెట్ చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో కాల్వ శ్రీనివాసులు (ప్రభుత్వ చీప్ విప్, టిడిపి సీనియర్ నేత), రమణ (సీపీఐ సీనియర్ నేత), గేయానంద్ (పీడీఎఫ్ ఎమ్మెల్సీ), గుర్నాథ్ రెడ్డి (వైసీపీ), విష్ణువర్ధన్ రెడ్డి (బీజేవైఎం), ఓబుల్ (సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు), రాజశేఖర్ రెడ్డి (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అలాగే రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ చర్చలో పాల్గొని అభిప్రాయాలు..సూచనలు చేశారు. 

శాంతిభద్రతల బాధ్యతలో ప్రజలూ భాగస్వామ్యం - కేసీఆర్..

హైదరాబాద్ : శాంతి భద్రతల బాధ్యత కేవలం పోలీసులదే మాత్రమే కాదని, ప్రజలకూ భాగస్వామ్యం ఉండాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బంజారాహిల్స్ లో ఏడెకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న పోలీసు కమాండ్, కంట్రోల్ కేంద్రం భవానినికి ఆదివారం ఉదయం సీఎం భూమి పూజ చేశారు. ఈసందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. వ్యాపారులు, వర్తకులు సీఎస్ఆర్ కింద సీసీ కెమెరాలు సమకూర్చుకోవాలని సూచించారు. నగరాన్ని మనం కాపాడుకోవాలని, సమాజం నుండి సహకారం కావాలన్నారు. కమాండ్, కంట్రోల్ కేంద్రానికి ప్రస్తుతం రూ.320 కోట్లు ఇచ్చామని, వచ్చే బడ్జెట్ లో మరో రూ.700 కోట్లు కేటాయిస్తామన్నారు. 

ఘనంగా ములాయం జన్మదిన వేడుకలు..

ఉత్తర్ ప్రదేశ్ : ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సుమారు 76 కేజీల బర్త్ డే కేక్ ను ములాయం కట్ చేశారు. 

పాతబస్తీలో ఆర్ఎంపీ నిర్వాకం..

హైదరాబాద్ : పాతబస్తీలో ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ వికటించి రోగి మృతి చెందాడు. శంషాబాద్ లో మృతదేహాన్ని తగులబెట్టేందుకు ప్రయత్నం చేసిన ఆర్ఎంపీని స్థానికులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.

 

పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యత - నాయినీ..

హైదరాబాద్ : పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నట్లు, పోలీసు వ్యవస్థను ఆధునీకరించేందుకు సీఎం కృషి చేస్తున్నారని హోం మంత్రి నాయినీ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ వ్యవస్థను కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం, నిఘా కోసం నగరమంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

పోలీసులు నిష్పక్షపాతికంగా..నిజాయితీతో పనిచేయాలి - సీపీ..

హైదరాబాద్ : గ్లోబల్ సిటీ కావాలంటే శాంతిభద్రతలు పోలీసులు నిష్ఫక్షపాతంగా, నిజాయితీతో పనిచేయాలని సీపీ పేర్కొన్నారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, టెక్నాలజీతో నేరస్తులను కచ్చితంగా గుర్తించవచ్చన్నారు. నేరాలను పూర్తిస్థాయిలో అదుపు చేసేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ దోహద పడుతుందన్నారు.

 

మయన్మార్ లో మృతులు 90 మంది..

మయన్మార్ : కచిన్ జిల్లా జడెమైన్ లో కొండచరియలు విరిగిపడడంతో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 90 మంది దుర్మరణం చెందినట్లు సమాచారం. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. శిథిలాల కింద వంద మంది దాక చిక్కుకుని ఉంటారని అంచనా. 

చిత్తూరును ముంచెత్తిన వర్షాలు..

చిత్తూరు : జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. జనజీవనం స్తంభించింది. వర్షాలతో శనివారం ఇద్దరు మృతి చెందారు. 64 చెరువులకు గండ్లు పడ్డాయి. 4100 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లింది. కేవీబీపురంలో రాజులకండ్రిగ కాజ్ వే కొట్టుకపోయింది. స్వర్ణముఖి, కాలంగి, బహుద నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తక్షణ సహాయక చర్యల కోసం రూ.3.77 కోట్లు విడుదల చేశారు. రబీ సాధారణ వర్షపాతం 569 మి.లీటర్లు కాగా ఇప్పటికే 1384 మి.లీటర్లు వర్షపాతం నమోదైంది.

 

ముళ్లపొదల్లో పసికందు..

విశాఖపట్టణం : గోపాలపట్నం లక్ష్మీనగర్ లో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును ముళ్లపొదల్లో దుండగులు వదిలిపెట్టి వెళ్లారు.

 

నెల్లూరుకు 50 మంది డిప్యూటి కలెక్టర్లు..

నెల్లూరు : సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు 50 డిప్యూటి కలెక్టర్లు జిల్లాకు రానున్నారు. విశాఖ నుండి 70 మంది అధికారుల బృందం రానుంది. 

గుజరాత్ లో కొనసాగుతున్న స్థానిక సంస్థల పోలింగ్..

గుజరాత్ : ఆరు మున్సిపాల్టీలకు పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

10:29 - November 22, 2015

హైదరాబాద్ : గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన పెంచేందుకు నగరంలో సైక్లాథాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ నటుడు దగ్గుబాటి రానా పాల్గొన్నారు. కిమ్స్ ఆసుపత్రి ఈ ప్రచారం నిర్వహిస్తోంది. ఐమ్యాక్స్ థియేటర్ నుండి నెక్లెస్ రోడ్డు వరకు సైక్లాథాన్ జరిగింది. సుమారు 500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మానవుడి శరీరంలో అత్యంత సున్నితమవడమే కాక అతి కీలకమైన అవయవం గుండె అని రానా పేర్కొన్నారు. దాని పనితీరును మెరుగుపరిచేందుకు క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం మంచిదని రానా పేర్కొన్నారు. 

10:25 - November 22, 2015

నెల్లూరు : జిల్లాను వరుణుడు వీడడం లేదు. జిల్లాపై పగబట్టినట్లుగా గత కొన్ని రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో జనజీవనం స్తంభించిపోతోంది. పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు..ఆకలికి అలమటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆత్మకూరు, మర్రిపాడు, ఇతర మండలాలు..వెంకటగిరి, అనంతసాగరంలో శనివారం రాత్రి నుండి భారీ వర్షం కురుస్తోంది. కాలనీల్లో నడుం లోతు వరకు నీళ్లు ప్రవహిస్తుండడంతో వాహనదారులు..పాదచారులు అష్టకష్టాలు పడుతున్నారు. సోమశిలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 54 టీఎంసీలకు చేరుకుంది. వెంకటగిరిలోని కైవల్యానది పొంగిపొర్లుతోంది.

జిల్లాలోనే బాబు...
మరోవైపు ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. విశాఖ నుండి 70 మందితో కూడిన అధికారుల బృందం నెల్లూరుకు పయనమైంది. 50 మంది డిప్యూటి కలెక్టర్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఇప్పటికే మూడు రోజుల నుండి సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటిస్తున్నారు. సహాయక చర్యల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని బాబు హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ నాయకులు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోవడంపై బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. 

10:13 - November 22, 2015

హైదరాబాద్ : సురక్షిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా..ప్రభుత్వం నిర్మించతలపెట్టిన సరికొత్త కమాండ్‌ కంట్రోల్‌ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నిర్మించబోతుంది. ప్రపంచస్థాయి పోలీసింగ్‌ వ్యవస్థను నగరానికి అందించడం కోసం భారీ భవంతులు సిద్ధం కాబోతున్నాయి. ఈ బహుళ అంతస్తుల భవనాన్ని వందశాతం వాస్తుతో రెండు టవర్లుగా నిర్మిస్తున్నారు. నైరుతి దిశగా ఉండే టవర్‌లో 24 అంతస్తులుంటాయి. ఈశాన్యం టవర్‌లో 17 అంతస్తులు నిర్మిస్తారు. ఇందుకు రూ.240 కోట్ల వ్యయాన్ని వెచ్చించనున్నారు.

లక్ష కెమెరాలు...
ఇక్కడినుంచే కమాండ్ కంట్రోల్‌, ట్రాఫిక్‌ మూవ్‌మెంట్‌ మానిటరింగ్‌, అత్యవసర పరిస్థితుల్లో కో ఆర్డినేషన్‌, రోజువారీ కార్యకలాపాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.. నగరంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే నిఘా వ్యవస్థకూడా ఈ భవనంలోనే ఉంటుంది. ఈ బిల్డింగ్‌లో బేస్‌మెంట్‌నుంచి పై అంతస్తువరకూ అధునాతన టెక్నాలజీ వినియోగించబోతున్నారు.. దాదాపు లక్ష కెమెరాలనుంచి లైవ్‌ ఫీడ్ చూసేందుకు వీడియో వాల్‌ రూపొందిస్తున్నారు. పదిహేడో ఫ్లోర్‌లో రెండు టవర్లను కలుపుతూ మెగా సోలార్‌ రూఫ్ ఉంటుంది. అలాగే పద్దెనిమిదో అంతస్తు దగ్గర లింకు బ్రిడ్జి ఏర్పాటుచేస్తారు. సౌత్‌ వెస్ట్ టవర్‌మీద హెలిపాడ్‌తోపాటు రెండు టవర్లకు సోలార్‌ ప్యానళ్లను అమరుస్తారు. భవనాలకు ధృఢమైన అద్దాలను బిగించబోతున్నారు. మొదటి మూడు అంతస్తులు గ్రానైట్‌, గ్లాస్‌తో కట్టబోతున్నారు.

బంజారాహిల్స్ లో కేసీఆర్..

హైదరాబాద్ : బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 12లో ఏడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టిన పోలీసు టవర్స్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 24 అంతస్తులతో నిర్మాణమయ్యే ఈ భవనాలకు రూ.240 కోట్లను ఖర్చు పెట్టనున్నారు.

ఉగ్రవాదులకు..భారత దళాల మధ్య కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : భారత సరిహద్దులోని హంద్వారా ప్రాంతంలో ఉగ్రవాదులకు, భారత దళాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. 

అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య..

నల్గొండ : జిల్లాలోని వేములపల్లి మండలం తోపుచర్లలో పత్తి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

నెల్లూరులో మళ్లీ కురుస్తున్న వర్షం..

నెల్లూరు : జిల్లా వెంకటగిరిలో రాత్రి నుండి భారీ వర్షం కురుస్తోంది. వెంకటగిరిలో 5, బాలాయపల్లి డక్కిలిలో 2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. 

మయన్మార్ లో విరిగిపడిన కొండచరియలు..

మయన్మార్ : కచిన్ జిల్లా జడెమైన్ లో కొండచరియలు విరిగిపడడంతో 60 మంది దుర్మరణం చెందారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. శిథిలాల కింద వంద మంది దాక చిక్కుకుని ఉంటారని అంచనా. 

09:27 - November 22, 2015

2014 మే 16లో ప్ర‌ధాన‌మంత్రి బాధ్యత‌లు చేప‌ట్టిన‌ప్పటి నుంచి 17 నెల‌లు పూర్తి చేసుకున్న న‌రేంద్ర మోడీ విదేశాల్లో సుడిగాలి ప‌ర్యట‌ల‌ను చేస్తూనే వున్నారు. 2014 జూన్ 16 భూటాన్ ప‌ర్యటన‌తో ప్రారంభ‌మైన మోడీ ప‌ర్యట‌న‌లు నేటికి కొన‌సాగుతూనే వున్నాయి. బాధ్యత‌లు చేప‌ట్టిన గ‌తేడాది బ్రెజిల్‌, నేపాల్‌, జ‌పాన్,అమెరికా దేశాల్లో పర్యటించారు. ఇక 2014 సంవత్సంలోనే సెప్టెంబ‌ర్, న‌వంబ‌రు మాసాల్లో మ‌య‌న్మార్ , ఆస్ట్రేలియా, ఫిజీ, నేపాల్ వెళ్లారు.

2015 మార్చిలో నాలుగుదేశాలు..
ఇక 2015 మార్చి నెల‌లో న‌రేంద్ర మోడీ నాలుగు దేశాల్లో ప‌ర్యటించారు. అందులో మారిష‌స్, శ్రీలంక, సింగ‌పూర్‌ పర్యటనలు ఉన్నాయి. ఇక ఇదే ఏడాది ఏప్రిల్ నెలలో యూర‌ప్ ప‌ర్యట‌న‌లో భాగంగా మేక్ ఇన్ ఇండియా నినాదంతో ఫ్రాన్స్, జ‌ర్మనీ, కెన‌డాలో ప‌ర్యటించారు. ఆసియా ప‌ర్యట‌న‌లో భాగంగా చైనా, మంగోలియా, సౌత్ కొరియా, బంగ్లాదేశ్ లలో పర్యటించారు.

జులై నెలలో ఆరు దేశాల పర్యటన..
ఇక ఒక్క జూలై నెల‌లోనే ఆరు దేశాల్లో మోడీ ప‌ర్యటించారు. వాటిలో ఉజ్బెకిస్తాన్, క‌జ‌కిస్తాన్‌, రష్యా, తుర్కమెనిస్తాన్, కిర్గిస్తాన్‌, త‌జ‌కిస్తాన్‌ల్లో మోడీ పర్యటించారు. అలాగే ఆగ‌ష్టు 15 సంబ‌రాల్లో పాల్గోన్న వెంట‌నే 16-17 తేదీల్లో దుబాయిలో ప‌ర్యటించారు. సెప్టెంబ‌ర్ లో మ‌రోసారి అమెరికా ప‌ర్యట‌న‌కు వెళ్లి ఐక్యరాజ్యసమితి స‌మావేశాల్లో ప్రసంగించారు.

మోడీ విదేశీ టూర్లకు బ్రేక్...
అలాగే న‌వంబ‌ర్ నెలలో బ్రిట‌న్‌, ట‌ర్కీపర్యటనలు ముగించుకొని ప్రస్తుతం మ‌లేషియాలో మోడీ ఉన్నారు. ఆ త‌ర్వాత సింగ‌పూర్ లో బ‌స చేయ‌నున్నారు. 2015 ఏడాదిలో చివ‌రిగా డిసెంబ‌రులో ర‌ష్యా ప‌ర్యట‌న‌తో న‌రేంద్ర మోడీ విదేశీ ప‌ర్యట‌న‌ల‌కు తాత్కాలికంగా బ్రేకులు ప‌డ‌నున్నాయి. ఎందుకంటే వ‌చ్చే ఏడాది 2016లో బెంగాల్ ఎన్నిక‌ల‌తో పాటు 2017లో ఉత్తర‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లుండ‌ట‌మే కాకుండా అంత‌ర్జాతీయ స్థాయిలో ఎలాంటి స‌ద‌స్సులు కూడా సెప్టెంబ‌ర్ 20 వ‌రకు లేవు. 2016 సెప్టెంబ‌ర్ నెలలో మాత్రం చైనాలో జీ-20 సమావేశాలు, ఆ త‌ర్వాత పాకిస్తానులో 2016 చివ‌రిన సార్క్ స‌మావేశాలున్నాయి. ఇక 2017లో మాత్రం మోడీ చైనా, బ్రెజిల్ ఆఫ్రికా దేశాల్లో ప‌ర్యటించనున్నారు. 2018లో మాత్రం కేవ‌లం సౌత్ ఆఫ్రికాకు మాత్రమే ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ వెళ్లనున్నారు.


18 నెలల్లో
18 నెలల్లో మోడీ 40 దేశాల విదేశీ పర్యటనలలో ఇప్పటి వరకూ ప్రపంచ దేశాలతో ద్వైపాక్షిక సంభాధాలు మెరుగు పరచుకోవడం,మేకిన్ ఇండియా అంటూ విదేశాలలో ఉన్న భారతీయులనుద్దేశించి ప్రసంగాలు చేశారు. మరోవైపు దేశంలో రైతు ఆత్మహత్యలు, కరువు పరిస్ధితులు, మతోన్మాద ఘర్షణలు ,అసహనం, ధరల పెరుగుదలతో ప్రజలపై ఆర్థిక భారాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విపక్షాలు ప్రజాసమస్యలు చర్చించాలంటూ విమర్శిస్తున్నాయి. మరి ఇకనైనా మోడీ దేశ సమస్యలపై దృష్టి పెడతారో లేదా అన్నది చూడాలి. 

ఛత్తీస్ గఢ్ లో కాల్పులు..మహిళా నక్సలైట్ల మృతి..

చత్తీస్ గఢ్ :దంతెవాడ జిల్లా నాగల్ గూడలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. నలుగురు మహిళా నక్సలైట్లు మృతి చెందారు. 

09:14 - November 22, 2015

చిత్తూరు : గత పాతిక సంవత్సరాలుగా నిండిన కళ్యాణ్ డ్యామ్ నేడు వరదనీటితో నిండిపోతోంది. మొత్తం 900 అడుగులున్న ఈ డ్యామ్ లో ప్రస్తుతం నీటిమట్టం 896 అడుగులకు చేరింది. మరో నాలుగైదు అడుగులకు వరదనీరు చేరితే అధికారులు గేట్లు ఎత్తివేస్తారని తెలుస్తోంది. దీనిపై కొందరు సంతోషం వ్యక్తం చేస్తుంటే మరికొందరిలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. గేట్లు ఎత్తివేస్తే తమ ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోననని ముంపు ప్రాంతాల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అప్రమత్తమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రెండో ఘాట్ లో ప్రమాదకరస్థితి నెలకొంది. ఇప్పటికే విరిగిన కొండచరియల ప్రాంతాల్లో పనులు మొదలు పెట్టారు. కానీ కురుస్తున్న భారీ వర్షంతో పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మిగిలిన ఘాట్ రోడ్డులో కూడా కొండచరియలు..మట్టి పడుతుండడంపై భక్తులు తీవ్ర భయాందోళనలకు గురవతున్నారు. ఘాట్ రోడ్డు పరిస్థితిపై అధికారులు సమీక్షిస్తున్నారు. 

08:31 - November 22, 2015

ఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల స‌మావేశాలను సజావుగా జరిపేందుకు బీజేపీ వ్యూహాలను రచిస్తోంది. మిత్రపక్షాలు సభకు సహకరించాలని ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహణకు రంగం సిద్ధం చేసింది. ఈ నెల 24 న వెంకయ్యనాయుడు నివాసంలో అధికార పక్షం వ్యవహరించాల్సిన తీరుపై వెంకయ్య ఎన్డీఏ పక్ష పార్టీలకు దిశానిర్దేశం చేయనున్నారు. న‌వంబ‌ర్ 26 నుంచి డిసెంబ‌ర్ 23 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న స‌మావేశాలు ప్రతిప‌క్షాలు అధికార పార్టీ మ‌ధ్యలో వాడివేడిగా వాగ్వివాదం చోటు చేసుకోనుంది.

అంతర్గత చర్చలు..
ఈ స‌మావేశాల‌పై ఇప్పటికే అధికార బీజేపీ అంత‌ర్గత చ‌ర్చలు జ‌రుపుతోంది. ప్రతిప‌క్షాల వ్యూహాల‌ను ఎత్తుగ‌డ‌ల‌ను తిప్పికొట్టడ‌మే కాకుండా ప్రభుత్వం తీసుకురాబోతోన్న జిఎస్టీ బిల్లుతో పాటు లోక్ స‌భ‌లో ఇప్పటికే పెండింగులో ఉన్న ఎనిమిది బిల్లులు అలాగే రాజ్యస‌భ‌లో అట‌కెక్కిన 11 బిల్లులతో పాటు ఉభ‌య స‌భ‌లు స‌జావుగా జ‌రిపేందుకు మంత‌నాలు చేస్తోంది. సమావేశాల్లో ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు ఎన్‌డీఏ పక్ష నేతలు ఈ నెల 24న భేటీ కానున్నారు. ఆ త‌ర్వాత 25న ప్రధాని నివాసంలో ఎన్డీఏ పార్టీల నేత‌లంద‌రికి ప్రధాని న‌రేంద్ర మోడీ విందు ఇవ్వనున్నారు. ఇక సాంప్రదాయం ప్రకారం సభకు అన్ని పార్టీలు సహకరించాలని లోక్ స‌భ స్పీక‌ర్ 25న పార్లమెంటు సెంట్రల్ హాల్ లో అఖిల పక్ష స‌మావేశం నిర్వహించ‌నున్నారు.

సజావుగా జరుగుతాయా ?
మ‌రోవైపు బీహార్‌లో ఎన్‌డీఏ పరాజయం నేపథ్యంలో శీతాకాల‌ సమావేశాలు సజావుగా జరిగే అవకాశం లేదని పరిశీలకులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వ‌ర‌కు ప్రతిప‌క్షాల‌న్నీ కూడా ఐకమ‌త్యంతో లేక‌పోవ‌డంతో అధికార పార్టీ 17 నెల‌లు క‌లిసివ‌చ్చింది. ఐతే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి బాధ్యత‌లు చేప‌ట్టే రోజునే కాంగ్రెస్ తో పాటు ఆప్, జెడియూ, తృణ‌మూల్, క‌మ్యూనిస్టులతో ప‌లు రాష్ట్రాల్లో స్థానికంగా బ‌లంగా వున్న రాజ‌కీయ పార్టీలన్నీ ఏకమ‌వ్వడాన్ని చూస్తూంటే శీతాకాల స‌మావేశాల్లో క‌మ‌లం పార్టీని కంగు తినిపిస్తాయ‌ని అంద‌రూ భావిస్తున్నారు. గత వర్షాకాల సమావేశాలు అవినీతి మంత్రుల రాజీనామాలు చేయాలని అన్ని పార్టీలు పట్టుబట్టడంతో నిరుపయోగంగానే సమావేశాలు ముగిసాయి. ఇక ఈసారి అసహనం, మతపరమైన దాడులు, ధరల పెరుగుదల, ఎఫ్డీఐ, బీఫ్ వివాదాలతో మరోసారి పార్లమెంటు దద్దరిల్లనుంది.

నేడు పోలీసు ట్విన్ టవర్స్ కు శంకుస్థాపన..

హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో పోలీస్ ట్విన్ టవర్స్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరుగనుంది. ఈకార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. 

పుట్టపర్తి సత్యసాయి డీమ్డ్ వర్సిటీ స్నాతకోత్సవం..

అనంతపురం : నేడు పుట్టపర్తి సత్యసాయి డీమ్డ్ వర్సిటీలో 34వ స్నాతకోత్సవం జరుగనుంది. 

శబరిమలకు 132 ప్రత్యేక రైళ్లు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుండి శబరిమలకు 132 ప్రత్యేక రైళ్లు నడువనున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుండది రిజర్వేషన్లు చేపట్టనున్నారు. 

25 మంది ఎర్రచందనం కూలీల అరెస్టు...

నెల్లూరు : మర్రిపాడులో పోలీసులు, ఫారెస్టు అధికారులు తనిఖీలు నిర్వహించారు. తమిళనాడుకు చెందిన 25 మంది ఎర్రచందనం కూలీలను అరెస్టు చేశారు. 

08:13 - November 22, 2015

చిత్తూరు : తిరుమల తిరుపతి భారీ వర్షాలకు తడిసిముద్దవుతోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇప్పటికే జనాలు అష్టకష్టాలు పడుతున్నారు. తాజాగా గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మరింత కష్టాలను ఎదుర్కొంటున్నారు. మాడ వీధులన్నీ జలమయమయ్యాయి. తిరుమలలో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసాల్లోకి వర్షపు నీరు చేరింది. ఇప్పటికే విరిగి పడిన కొండచరియల ప్రాంతాల్లో మరమ్మత్తులు చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి పనులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గత పది రోజులుగా లింక్ రోడ్డు మార్గం గుండా వాహనాలను పంపిస్తున్నారు. చంద్రగిరి మండలంలోని స్వర్ణముఖి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. సమీప ప్రాంతాల్లోని పల్లెలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీనితో అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలకు తిరుమలలో ఉన్న నాలుగు జలాశయాలు నిండిపోవడంతో అధికారులు అప్రమత్తమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

07:46 - November 22, 2015

'చూస్తుండగానే వయసు పెరిగిపోతుంది' అంటారు చాలామంది. అయితే నాలుగు పదుల వయసు దాటిన వారు రోజూ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఇప్పటిదాకా ఏం తిన్నా, ఎలా తిన్నా, ఇకనుండి ఆరోగ్యం, ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఆహారంలో పోషక విలువలు, విటమిన్స్‌ సమృద్ధిగా ఉండేలా చూసుకోవడం మరీ మంచిది.
ఆరోగ్యకరమైన ఆహారం అంటే ముందుగా గుర్తుకొచ్చేవి పండ్లు. తాజా పండ్లలో శరీరానికి కావలసిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో సీజన్‌కి అనుగుణంగా పండ్లు తప్పనిసరిగా తీసుకోవడం మంచిది. కొన్ని రకాల పండ్లలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ రసాలుగా తీసుకునేటట్లయితే, వాటిలో పంచదార ఉపయోగించకపోవడం మంచిది. ఫ్రూట్‌ జ్యూస్‌లు తరచుగా తీసుకోవడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. తాజా ఆకుకూరలు, కూరగాయలు కాలానికి అనుగుణంగా తీసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి ఫైబర్‌ అందుతుంది. ముఖ్యంగా మాంసం కన్నా చేపలని వారానికి రెండుసార్లు తీసుకోవాలి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ వల్ల ఆరోగ్య ప్రయోజనాలెన్నో.

07:42 - November 22, 2015

ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ (ఐఫా) అవార్డుల వేడుక ఇప్పటి వరకు బాలీవుడ్‌లో మాత్రమే జరిగేది. మొదట సారి సౌత్‌ ఇండియా సినిమాను కూడా రిప్రజెంట్‌ చేస్తూ ఈ వేడుక హైదరాబాద్‌లో డిసెంబర్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు కేటగిరీకి హోస్ట్ గా నిర్వహించే బాధ్యతని అల్లు శిరీష్‌ తీసుకున్నాడు. ఈ ఐఫా ఉత్సవ ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నట్టు శిరీష్‌ చెప్పాడు.

 

07:38 - November 22, 2015

చిన్న చిన్న విషయాలకు ఆవేదన చెందే మనస్తత్వం ఉన్నవారు రోజూ బొప్పాయి తీసుకుంటే వారి మానసిక ఆందోళన తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన పరిశోధనల్లో బొప్పాయిలో ఎక్కువగా ఉంటే పొటాషియం మానసికశక్తిని పెంచుతోంది. బొప్పాయి ఎక్కువగా తింటే మనసుకీ, శరీరానికీ కూడా హాయి నిస్తుంది. రక్తప్రసరణలో వచ్చే లోపాలను ఇది నివారిస్తుంది. తక్కువ కెలొరీలు, ఎక్కువ ఫైబర్‌ ఉండే బొప్పాయిని తరచుగా తింటే కంటి చూపు బాగుంటుంది. చెవిలో వచ్చే ఇన్‌ఫెక్షన్స్‌ తగ్గుతాయి. జీర్ణశక్తి వేగవంతం కావడంతో పాటు మలబద్ధకం సమస్య తొలిగిపోతుంది. బరువు తగ్గాలి అనుకునేవారు రోజూ బొప్పాయి తింటే శరీరానికి కావాల్సిన పోషకాలన్ని అందుతాయి. రోగనిరోధక శక్తిని పెంచే బొప్పాయి వల్ల సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి చిన్నచిన్న అనారోగ్య సమస్యలను కూడా నివారించవచ్చు.

తిరుమలలో భారీ వర్షం..

చిత్తూరు : తిరుమల, తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది. మాడవీధులన్నీ జలమయమయ్యాయి. రెండో కనుమదారి మరమ్మత్తులకు అంతరయం ఏర్పడింది. ఎడెతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తిరుమతిలోని లోతట్టు ప్రాంత ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. 

సైకిల్ థాన్ ను ప్రారంభించిన రానా..

హైదరాబాద్ : కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నగరంలో నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన సైకిల్ థాన్ ను సినీ నటుడు దగ్గుబాటి రానా ప్రారంభించారు. గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం జరుగుతోంది. 

07:29 - November 22, 2015

రాయ్‌పూర్‌ : అవార్డులు వెనక్కి ఇవ్వడం వల్ల సమస్యలు పరిష్కారం కావని బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ అభిప్రాయపడ్డారు. దేశంలో పెరుగు తున్న అసహన ధోరణులకు వ్యతిరేకంగా అనేకమంది రచయితలు, సినీ రంగ ప్రముఖులు ఇటీవల తమ పురస్కా రాలను వెనక్కిచ్చిన విషయం తెలిసిందే. చత్తీస్‌గఢ్‌లో యునిసెఫ్‌, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిన్నారుల విద్యపై అవగాహనా కార్యక్రమంలో పాల్గొనేందుకు కరీనా కపూర్‌ శనివారం రాయ్ పూర్‌ వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులు 'పురస్కారాల తిరస్కరణల'పై ఆమెను ప్రశ్నించారు. 'అవార్డు వెనక్కి ఇవ్వడం వల్ల ఏ సమస్యా పరిష్కారం కాదు. ఇది ఎవరి వ్యక్తిగత సమస్యాకాదు ఇది యావత్‌ జాతికి సంబంధించినది' అన్నారు. తన పురస్కారాలను వెనక్కు ఇవ్వనని చెప్పారు. ప్రస్తుతం దేశంలో పలు సమస్యలపై యువకులు చేస్తున్న ఆందోళన తనను నిజంగా ఆకట్టుకుంది' అని కరీనా అన్నారు.

07:21 - November 22, 2015

అనుష్క, ఆర్య జంటగా ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో పివిపి బ్యానర్‌పై ప్రసాద్‌.వి.పొట్లూరి నిర్మించిన 'సైజ్‌ జీరో' చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమా కోసం అనుష్క చాలా రిస్క్ తీసుకుందని, ఏకంగా 20 కిలోలు పెరిగి సినిమాపై తనకున్న కమిట్‌మెంట్‌ను చాటుకుందని నిర్మాత తెలిపారు. అనుష్క ఇలాంటి డిఫరెంట్‌ రోల్స్ చేయడంతో సినిమాపై ప్రేక్షకుల్లో, ట్రేడ్‌ వర్గాల్లో ఆసక్తి పెరిగిందన్నారు. ఈ సినిమాకి సెన్సార్‌వారు 'యు/ఎ' సర్టిఫికేట్‌ ఇచ్చారని, తెలుగు, తమిళ భాషలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. తమిళంలో 'ఇంజి ఇడుపళగి' పేరుతో విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. సోనాల్‌ చౌహాన్‌, ప్రకాష్‌ రాజ్‌, బ్రహ్మానందం, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, అడవి శేష్‌, పోసాని కృష్ణమురళి, భరత్‌ తదితరులు నటిస్తున్నారు. 

07:20 - November 22, 2015

రవితేజ, తమన్నా, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా సంపత్‌ నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న చిత్రం 'బెంగాల్‌ టైగర్‌'. డిసెంబర్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానున్న నేపథ్యంలో ఓ ప్రత్యేకమైన సాంగ్‌ కాంటెస్ట్ ను యూనిట్‌ నిర్వహించబోతోంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత మాట్లాడారు. భీమ్స్ అందించిన ఈ చిత్రంలోని పాటలకు విశేష స్పందన వస్తోందని, ఎక్కడ విన్నా ఇప్పుడు బెంగాల్‌ టైగర్‌ పాటలే వినిపిస్తున్నాయన్నారు. గాయనీ గాయకులు కావాలని చాలా మంది కలలు కంటూ, అవకాశాలు రాక ఇబ్బంది పడుతుంటారని, అలాంటి వారి కోసం మేం ఈ సినిమా తరపుగా ఓ సాంగ్‌ కాంటెస్ట్ ను నిర్వహించబోతున్నట్లు చెప్పారు. అందులో భాగంగా 'బెంగాల్‌ టైగర్‌'లో ఉన్న ఐదు పాటల్లో నచ్చిన పాటకు సంబంధించిన పల్లవి గాని, చరణం గాని పాడి బయోడేటా, ఫోన్‌ నెంబర్‌తో సహ 'సౌండ్‌క్లౌడ్‌ డాట్‌ కమ్‌' వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఇది ఈ నెల 22నుంచి 28 వరకు ఉంటుందని, అప్‌లోడ్‌ చేసిన వారిలో ముగ్గురిని సెలక్ట్ చేసి, ఈ నెల 30న జరిగే ప్లాటినమ్‌ డిస్క్ ఫంక్షన్‌లో చిత్ర యూనిట్‌ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేస్తామన్నారు. అలాగే ఉత్తమ సింగర్‌కి మా తదుపరి చిత్రంలో పాట పాడే ఛాన్స్ కల్పిస్తామన్నారు. తన ప్రతి సినిమాలో కొత్త గాయకులకు ఛాన్స్ లిస్తున్నానని, ఛాన్స్ లిచ్చిన వారు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారని దర్శకుడు సంపత్‌ నంది తెలిపారు.

 

07:20 - November 22, 2015

రామ్‌, కీర్తి సురేష్‌ జంటగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత మీడియాకు తెలిపారు. 'రామ్‌ అంటేనే ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్స్ గుర్తుకొస్తాయని, సరిగ్గా ఇలాంటి కథాంశంతో తాజా సినిమాను రూపొందిస్తున్నట్లు తెలితపారు. సినిమా టాకీ పార్ట్ పూర్తయ్యిందని, ప్రస్తుతం చివరి పాటను గోవాలో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. రామ్‌ నటనను పూర్తి స్థాయిలో చూపించే కథ ఇదని, ఎనర్జిటిక్‌గా, ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందన్నారు. మాకిష్టమైన పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి చాలా రోజుల తర్వాత ఈ చిత్రానికి పాటలు రాస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందన్నారు. వచ్చే వారంలో చిత్ర టైటిల్‌ని ప్రకటించి జనవరి 1న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

 

07:18 - November 22, 2015

కమల్‌ హాసన్‌, త్రిష హీరోహీరోయిన్లుగా రాజేష్‌ ఎం.సెల్వ దర్శ కత్వంలో ఎన్‌.చంద్రహాసన్‌ నిర్మించిన చిత్రం 'చీకటి రాజ్యం'. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వస్తున్న నేపథ్యంలో శనివారం సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసిందీ యూనిట్‌. ఇదొక డిఫరెంట్‌ థ్రిల్లర్‌ కథ అని, అందరు బాగా రిసీవ్‌ చేసుకుంటున్నారని కమల్ హాసన్ పేర్కొన్నారు. 'మరో చరిత్ర' చిత్ర విజయానికి ఎంత సంతృప్తి పొందానో ఈ చిత్రానికి వస్తున్న స్పందన చూసి అంత సంతోషాన్ని అనుభవిస్తున్నట్లు చెప్పారు. తెలుగు ప్రేక్షకులు ప్రయోగాలు చేయడానికి ఈ చిత్రంతో అవకాశం కల్పించారని, ఈ ప్రోత్సాహంతో తెలుగులో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం 'చాణక్యన్‌' చిత్రాన్ని తెరకెక్కించిన రాజీవ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందనున్న 'అమ్మా నాన్న ఆట' చిత్రంలో నటించనున్నట్లు తెలిపారు. రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్కినేని అమల అతిథి పాత్రలో నటించనున్నట్లు తెలిపార. 'తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక కొత్త రకమైన చిత్రం 'చీకటి రాజ్యం'అని,మంచి కథ, కథనంతో కూడిన ఈ చిత్రం చాలా బాగుందని అమల తెలిపారు. ఇలాంటి చిత్రాలు మున్ముందు మరిన్ని రావాలని కోరుకుంటున్నానన్నారు.

 

07:03 - November 22, 2015

ఏదీ నీ కోసం వెతుక్కుంటూ రాదు.. నువ్వే దాని కోసం వెళ్లాలి.. చెమట చిందించాలి.. నీ స్వయం కృషితోనే దాన్ని సాదించుకోవాలి.. వాడే హీరో అవుతాడు.. ఈ మాటలే జీవన వేదంగా తన కష్టమే సోపానాలుగా వెండితెర మీద విలక్షణ నటుడిగా కలెక్షన్ల సునామీ సృష్టించిన యాక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 40 ఏళ్లైన సందర్భంగా ఆయన సినీ నట ప్రస్తానంపై కథనం..

500 పైగా చిత్రాల్లో..
క్రమశిక్షణకు మారుపేరుగా... కార్యదీక్షకు మరోరూపుగా.. ముక్కుసూటి తనానికి నిదర్శనంగా, తప్పును తప్పులా ఖండించే ధైర్యశాలి మోహన్ బాబు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై అనేక చిత్రాలను నిర్మించిన ఆయన 500 పైగా చిత్రాలలో నటుడిగా.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. ఇప్పటికీ మెప్పిస్తూనే ఉన్నారు. దర్శకరత్న దాసరికి ప్రియశిష్యుడిగా పేరుపొంది.. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల దిట్టగా ప్రశంసలందుకున్న మేటి నటుడు డాక్టర్ మోహన్ బాబు.

పద్మశ్రీ అవార్డు..
100 కు పైగా సినిమాల్లో హీరోగా నటించిన మోహన్ బాబు.. సినీరంగానికి ఆయన చేసిన సేవలకు గానూ.. రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. బెస్ట్ యాక్టర్ గా పెద్దరాయుడు సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా అందుకున్నారు. ఆయన సొంత బ్యానర్ లో హీరోగా నటించిన చిత్రాలు ..ప్రొడ్యూసర్ గా ఆయనలోని అభిరుచిని చాటాయి. హీరోగా ఆయన స్టామినాను నిరూపించాయి. ఇలా తన సినీనట ప్రస్తానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు మోహన్ బాబు. ఏ పాత్రకైనా న్యాయం చెయ్యగలగడం ఆయన ప్రత్యేకత. తన కెరీర్ లో చేసిన ప్రతి క్యారెక్టర్ కు మోహన్ బాబును తప్ప వేరే ఎవ్వరినీ ఊహించుకోలేనంతగా తన నట వైవిధ్యాన్ని ప్రదర్శించారు. ఆరు పదుల వయసులో కూడా.. తన కొడుకులతో పోటీ పడుతూ.. ఇంకా సినిమాలు చేస్తున్నారు. ఇలా ఎన్నో పాత్రలను చేసిన , చేస్తున్న ..మోహన్ బాబు తన నటనతో ప్రేక్షకులను ఇంకా అలరించాలని కోరుకుందాం.

06:59 - November 22, 2015

వారు బాలీవుడ్ బంగారు భామలు . అంతేనా బీటౌన్ బడా బాబులకు గోల్డెన్ లెగ్ బ్యూటీస్. తమ అందచందాలతో పాటు యాక్టింగ్ స్కిల్ తో బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేస్తున్నారు. వందల కోట్లు కలెక్ట్ చేస్తున్న సినిమాల్లో హీరోయిన్స్ గా నటిస్తూ... బిలియన్ బ్యూటీస్ అనే బిరుదును సంపాదించుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్స్ పక్కన కో స్టార్స్ గా నటిస్తూ. మూవీకి ఎక్స్ ట్రా కలర్ తెస్తున్నారు. బీటౌన్ లో స్టార్ హీరోయిన్స్ గా హవా సాగిస్తున్న బిలియన్ బ్యూటీస్ పై కథనం..

కత్రినా...ప్రియాంక జోరు..
తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసిన కత్రినాకైఫ్ బాలీవుడ్ బిలియన్ బ్యూటీ ఓ వెలుగు వెలుగుతోంది. కెరీర్ ఆరంభంలో బర్బీ డాల్ అనే విమర్శల పాలైన కత్రినా.... ప్రస్తుతం వందకోట్ల హీరోయిన్ గా స్తా చాటుతోంది. వందకోట్ల క్లబ్ లో హల్ చల్ చేస్తున్న మరో బ్యూటీ ప్రియాంక చోప్రా. బాలీవుడ్ లో మంచి నటిగా దూసుకుపోతున్న ఈ బ్యూటీ 13ఏళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్న కూడా ప్రియాంక చేతిలో మాత్రం క్రేజీ సినిమాలే ఉండడం విశేషం.

ఊపేస్తున్న దీపికా..షాక్ ఇస్తున్న సోనాక్షి..
ప్రజెంట్ బాలీవుడ్ ని ఊపేస్తున్న బ్యూటీ దీపికపడుకోనే. బాలీవుడ్ ప్రస్తుతం ఈ బ్యూటీ మ్యానియా ఊగిపోతోంది. ప్రతి స్టార్ హీరో దీపికతో నటించడానికి తెగ ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. నెంబర్ వన్ హీరోయిన్ గా చక్రం తిపుతున్న ఈ కన్నడ బ్యూటీ ఖాతాలో వందకోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. హీరోయిన్ గా అడుగుపెడుతునే బాలీవుడ్ ని మెస్మరైజ్ చేసిన బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. గోల్డెన్ లెగ్ బ్యూటీగా ఫేం అయిన ఈ బ్యూటీ హ్యట్రిక్ సక్సెస్ లతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి షాక్ ల మీద షాక్ లు ఇచ్చింది. షార్ట్ టైంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

సక్సెస్ బాట పట్టిన సోనమ్...విజయాలు అందుకున్న ఆసిన్..
లేట్ అయిన కూడా లేటేస్ట్ గా బిలియన్ క్లబ్ హీరోయిన్ అనిపించుకుంటుంది సోనమ్ కపూర్. అనిల్ కపూర్ తనయగా ఏంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం సక్సెస్ ల బాట పట్టింది. బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ గా దూసుకుపోతున్నా సోనామ్ కపూర్ కెరీర్ ఇప్పుడిప్పుడే కొత్త టర్న్ తీసుకుంటుంది. కేరళ కట్టి అసిన్ కూడా వందకోట్ల హీరోయిన్ అనిపించుకుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఈ భామ బాలీవుడ్ లో కూడా వరుస విజయాలు అందుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచింది. వరుస వచ్చిన కూడా కేరళ కుట్టి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ చక్రం తిప్పలేకపోయింది.

ఇంకెంత మందో ?
నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్ హీరోయిన్స్ బిలియన్ క్లబ్ బ్యూటీస్ గా హంగామా చేస్తున్నారు. దీపికపడుకోనే, ప్రియాంకచోప్రా లాంటి హీరోయిన్స్ అయితే లేడి ఒరియెంటెడ్ మూవీస్ తో కూడా బాక్సఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. ప్యూచర్ లో ఇంకెంత మంది హీరోయిన్ బిలియన్ క్లబ్ బ్యూటీస్ అనిపించుకుంటారో చూడాలి.

06:38 - November 22, 2015

కడప: జిల్లాలో భారీ వర్షాలకు పలుచోట్ల ఉన్నట్లుండి భూమి అమాంతం కృంగిపోతుంది. రెండు రోజుల క్రితమే నాగిరెడ్డిపల్లెలో వృత్తాకారంలో భూమి 20నుంచి 30 అడుగుల లోతుకు కృంగిపోవడంతో..జనం భయాందోళనలకు గురయ్యారు. తాజాగా...నాయనోరిపల్లెలో కూడా ఇలాంటి ఘటనలే చోటుచేసుకోవడంతో..ఆయా గ్రామాలను పోలీసులు ఖాళీ చేయించారు. ఈ వింత సంఘటనను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇలా ఒకటి కాదు...రెండు కాదు ఏకంగా..20 చోట్ల ఇలాగే జరిగింది. చూస్తుండగానే భూమి ఇలా లోపలికి కృంగిపోవడం చూసిన జనం ఆశ్చర్యపోయారు. అంతేకాదు తీవ్ర భయాందోళన చెందారు.

నాగిరెడ్డి పల్లెలో..
కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని నాగిరెడ్డి పల్లె బుగ్గమల్లేశ్వర ఆలయం సమీపంలో రెండు రోజుల క్రితం ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. ప్రకృతి వైపరీత్యం వల్ల కళ్లముందే ఇలా భారీ గోతులు పడుతుండడాన్ని చూసిన గ్రామస్తులు..ఆశ్చర్యపోయారు. భూమి లోపలికి కృంగిపోతున్నప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో...గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. ఈ గోతులు వృత్తాకారంలో ఉన్నట్లుండి 25 అడుగుల వెడల్పు,.25 అడుగుల లోతులో ఏర్పడడాన్ని గ్రామస్తులు గమనించారు.

భారీగా సుడిగుండాలు...
శనివారం నాడు కూడా జిల్లాలోని నాయనోరి పల్లె, నాగిరెడ్డిపల్లె గ్రామాల్లో పలు చోట్ల పెద్ద ఎత్తున భూమి కృంగిపోయింది. దీంతో గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో మరిన్ని గుంతలు ఏర్పడే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగకుండా రెవిన్యూ, పోలీస్ అధికారులు అలెర్ట్‌ అయి గ్రామాన్ని ఖాళీ చేయించారు. అంతేకాదు వాగులు, వంకల్లో కూడా భూమి లోపలికి కృంగిపోవటంతో పలు చోట్ల భారీ సుడిగుండాలు ఏర్పడుతున్నాయి. పలు చోట్ల నీరు సుడులు తిరుగుతూ పారుతోంది. వంకల్లో దాదాపు 30 అడుగుల లోతున భూమి దిగబడిపోయినట్లు ఇక్కడి గ్రామస్తులు భావిస్తున్నారు. అయితే తెలియక ఎవరైనా వంకల్లో దిగితే ఘోర ప్రమాదం జరుగుతుందేమోనని ఈ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అధికారుల పరిశీలన...
అయితే ఇలా భూమి అమాంతం కృంగిపోవడంపై గ్రౌండ్ వాటర్, మైనింగ్ శాఖ అధికారులు పరిశీలన జరిపారు. భూమిలోని లైమ్‌స్టోన్ పొరల్లోకి వర్షపు నీరు భారీ ఎత్తున చేరినందున పొరలు కదలటంతో భూమిపై ఉన్న మట్టి లోనికి దిగబడిపోతుందని వారు తెలిపారు. మరిన్నిచోట్ల భూమి దిగబడి పోయే అవకాశం ఉందన్న వారి సూచనతో గ్రామంలో ఉండే 80 కుటుంబాలను పోలీస్, రెవిన్యూ సిబ్బంది ఖాళీచేయించారు. దాదాపు 300మంది గ్రామస్తులు కడపలోని తమ బంధువుల ఇళ్లకు వెళ్లి ఆశ్రయం పొందుతున్నారు. ఇక మిగిలినవారిని గాంధీనగర్ స్కూల్, పద్మావతి ఓల్డేజ్ హోం, పెద్ద ముసలిరెడ్డి పల్లె పాఠశాలలలో 3 పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే గ్రామం మొత్తం ఖాళీకావడంతో దొంగతనాలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. నిపుణులు పరిశోధనలు చేసిన తరువాత నాయనోరి పల్లె గ్రామం ను అక్కడే ఉంచాలా ? లేక మరొక చోటికి తరలించాలా ? అన్న నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

06:35 - November 22, 2015

హైదరాబాద్‌ : పోలీస్‌ వ్యవస్థలో భారీ మార్పులు రాబోతున్నాయి.. హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా..ప్రభుత్వం సరికొత్త కమాండ్‌ కంట్రోల్‌ భవనాన్ని నిర్మించబోతుంది. ప్రపంచస్థాయి పోలీసింగ్‌ వ్యవస్థను నగరానికి అందించడం కోసం భారీ భవంతులు సిద్ధం కాబోతున్నాయి.. దేశంలోనే అత్యంత ఆధునికమైన టవర్ల నిర్మాణానికి నేడు భూమి పూజ చేయబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ప్రపంచస్థాయిలో ఈ కమిషనరేట్‌ నిలిచిపోయేలా భవనాలను కట్టబోతున్నారు.. ఇక్కడినుంచే కమాండ్ కంట్రోల్‌, ట్రాఫిక్‌ మూవ్‌మెంట్‌ మానిటరింగ్‌, అత్యవసర పరిస్థితుల్లో కో ఆర్డినేషన్‌, రోజువారీ కార్యకలాపాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.. నగరంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే నిఘా వ్యవస్థకూడా ఈ భవనంలోనే ఉంటుంది. ఈ బిల్డింగ్‌లో బేస్‌మెంట్‌నుంచి పై అంతస్తువరకూ అధునాతన టెక్నాలజీ వినియోగించబోతున్నారు.. దాదాపు లక్ష కెమెరాలనుంచి లైవ్‌ ఫీడ్ చూసేందుకు వీడియో వాల్‌ రూపొందిస్తున్నారు.

వందశాతం వాస్తుతో రెండు టవర్లుగా నిర్మాణం...
ఈ బహుళ అంతస్తుల భవనాన్ని వందశాతం వాస్తుతో రెండు టవర్లుగా నిర్మిస్తున్నారు. నైరుతి దిశగా ఉండే టవర్‌లో 24 అంతస్తులుంటాయి. ఈశాన్యం టవర్‌లో 17 అంతస్తులు నిర్మిస్తారు. పదిహేడో ఫ్లోర్‌లో రెండు టవర్లను కలుపుతూ మెగా సోలార్‌ రూఫ్ ఉంటుంది. అలాగే పద్దెనిమిదో అంతస్తు దగ్గర లింకు బ్రిడ్జి ఏర్పాటుచేస్తారు. సౌత్‌ వెస్ట్ టవర్‌మీద హెలిపాడ్‌తోపాటు రెండు టవర్లకు సోలార్‌ ప్యానళ్లను అమరుస్తారు. భవనాలకు ధృఢమైన అద్దాలను బిగించబోతున్నారు. మొదటి మూడు అంతస్తులు గ్రానైట్‌, గ్లాస్‌తో కట్టబోతున్నారు.

టవర్లలో సౌకర్యాలు...
ఇక టవర్ల కింది అంతస్తుల్లో ఆడిటోరియం, కేఫ్, మల్టిపర్పస్ హాల్‌, మీడియా సెంటర్‌, రిసెప్షన్‌కు ప్లాన్ చేస్తున్నారు. వెయ్యిమంది కూర్చునేలా రెండు దశల్లో ఆడిటోరియం ప్రణాళిక రూపొందిస్తున్నారు. పదకొండో అంతస్తులో సోషల్‌ మీడియా మానిటరింగ్‌... పదిహేడో అంతస్తులో మ్యూజియం, అబ్జర్వేటరీ సిస్టమ్ ఉంటాయి.. పద్దెనమిదవ ఫ్లోర్‌లో పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం నిర్మిస్తారు.. 20వ అంతస్తులో సీనియర్‌ ఆఫీసర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, 23వ ఫ్లోర్‌లో సీఎంకోసం ప్రత్యేక కార్యాలయంను డిజైన్‌ చేశారు.. అలాగే 600 కార్లు ఒకేసారి పార్క్‌ చేసేలా మల్టిలెవర్‌ పార్కింగ్‌ సిస్టమ్‌ ఉంటుంది. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంకోసం భవనం చుట్టూ ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్‌, సుందరమైన వాటర్‌ ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడాలేనివిధంగా కనీవినీ ఎరుగని రీతిలో టవర్ల నిర్మాణంకోసం టీ ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి టవర్లు సింగపూర్‌, న్యూయార్క్‌లో మాత్రమే ఉన్నాయి.. వీటికంటే మరిన్ని అధునిక సౌకర్యాల కల్పించాలని చూస్తోంది.. ఈ భవనాలకు 22న భూమిపూజ చేయబోతున్నారు సీఎం కేసీఆర్‌..

06:28 - November 22, 2015

వరంగల్ : జిల్లా లోక్‌సభ సీటును టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోబోతుంది. నవ తెలంగాణ పత్రిక నిర్వహించిన సర్వే ఫలితాలతో గులాబీ పార్టీకి గెలుపు అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పోలింగ్‌ రోజున నిర్వహించిన ఎగ్జిట్‌పోల్‌ సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. 

రెండు వేల మంది ఓటర్ల అభిప్రాయాలు...
రెండు వేల మంది ఓటర్ల అభిప్రాయాలను కోరగా.. అందులో 50 శాతం మంది టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నారు. వరంగల్‌ నగర పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలతో పాటు ఐదు రూరల్‌ నియోజకవర్గాలో కూడా ఒకే రకమైన అభిప్రాయం వెల్లడైంది. ఇక సర్వేలో కాంగ్రెస్‌కు 502 మంది జైకొట్టగా టిడిపి, బిజెపి కూటమికి 301 మంది అనుకూల ఓటేశారు. వామపక్షాలు, సామాజిక తరగతుల తరపున నిలబడ్డ స్వతంత్ర అభ్యర్థికి 103 మంది ఓటేశారు. వైసిపికి కేవలం 35 మందే ఓటేశారు. నోటాకు 14 ఓట్లు పడ్డట్టు ఎగ్జిట్‌ పోల్‌లో తేలింది. మొత్తానికి టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికలో 50 శాతానికిపైగా ఓట్లు సంపాదించి విజయకేతనం ఎగురవేయబోతుంది. అయితే ఓరుగల్లు ఉప ఎన్నికలో ఏపార్టీ అధికారికంగా విజయకేతనం ఎగరేయబోతుందనేది ఈనెల 24వ తేదీన జరిగే కౌంటింగ్‌లో తేలనుంది. 

06:26 - November 22, 2015

హైదరాబాద్‌ : అర్ధరాత్రి 2 గంటల దాకా ఓ పబ్‌లో యువత మద్యం మత్తులో చిందులేశారు. జూబ్లీహిల్స్ లోని రోడ్‌నెంబర్‌ 7లో ఉన్న స్టోన్ వాటర్‌ పబ్‌లో నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామున 3గంటల వరకు మద్యం మత్తులో యువత చిందులేస్తున్నారన్న సమాచారం అందుకున్న మీడియా పబ్‌లోనికి వెళ్లింది. నిబంధనల ప్రకారం రాత్రి 12గంటల వరకే పబ్‌ను నిర్వహించాల్సి ఉన్నా తెల్లవారేదాకా పబ్‌ను నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమాచారాన్ని పోలీసులకు మీడియా తెలపడంతో...పోలీసులు వచ్చి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. సమయం దాటినా పబ్‌ను ఎందుకు నడుపుతున్నారని పబ్‌ మేనేజర్‌ను మీడియా ప్రశ్నించింది. అర్ధరాత్రి 12గంటలకు మూసివేయడం జరిగిందని, ఒక్కొక్కరిని బయటకు పంపించేందుకు సమయం పడుతుందన్నారు. ఇక్కడ మీడియాతో మాట్లాడడానికే తనకు గంటకు పైగా సమయం పట్టిందని మేనేజర్ పేర్కొన్నాడు. 

06:23 - November 22, 2015

వరంగల్ : లోక్‌సభ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం భన్వర్‌లాల్ మీడియాతో మాట్లాడారు. ఈ ఉప ఎన్నికలో 69.01 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. అత్యధికంగా పాలకుర్తి నియోజకవర్గంలో 77 శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. ఉదయం 7 గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు పెరిగింది. అయితే సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత 69 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల సమయానికి క్యూలో నిల్చున్న వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చామని భన్వర్‌ లాల్‌ తెలిపారు.

నియోజకవర్గాల వారీగా...
నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతాలు పరిశీలిస్తే.. స్టేషన్‌ఘన్‌పూర్‌లో 75.55, పాలకుర్తిలో 76.51, పరకాలలో 76.69, వరంగల్ పశ్చిమలో 48.03, వరంగల్ తూర్పులో 62.21, వర్థన్నపేటలో 74.04, భూపాలపల్లిలో 70.01 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.

2014లో 75.52 శాతం..
2014 సాధారణ ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ తగ్గడం గమనార్హం. 2014 సాధారణ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 75.52 శాతం పోలింగ్ నమోదైంది. ఆ ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 15.37 లక్షల మంది ఓటర్లు ఉండగా ఈసారి ఆ సంఖ్య కూడా స్వల్పంగా 15.09 లక్షలకు తగ్గింది. మొత్తం 23మంది అభ్యర్థుల పోటీపడిన ఈ ఉప ఎన్నిక కోసం 1,778 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. తొలిసారి ఈవీఎంలపై అభ్యర్థుల ముఖ చిత్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో మొదటి ఓటరుకు అధికారులు పువ్వులు అందజేశారు. ఇక ఈవీఎంల్లో నిక్షిప్తమైన అభ్యర్ధుల భవితవ్యం ఈనెల 24న బయటపడనుంది. 

06:20 - November 22, 2015

అనంతపురం : అకాల వర్షాలతో అనంతపురం జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా అనేక పంటలు నష్టపోయాయి. దాదాపు 12 హెక్టార్లలో వేరుశనగ, పెసర పంటలు నాశనమైనట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులో రంగంలోకి దిగారు. ఇక అకాల వర్షాలు తమ కొంప ముంచాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి సాగు చేస్తే.. పంట చేతికందే సమయానికి నేలపాలయ్యిందని వారంటున్నారు. నాశనమైన పంట కనీసం పశువులకు మేత కోసం కూడా పనికి రాకుండాపోయిందంటున్నారు.

మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం..
వేరుశనగతో పాటు మొక్కజొన్న పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. నల్లమాడ మండలంలోని చెరువువాండ్లపల్లిలో మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతింది. సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్ధం కావడం లేదని.. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇక జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పత్తిపాటి పుల్లారావు పర్యటించారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని వెంగళమ్మచెరువు, చెర్లోపల్లి, నల్లమాడ క్రాస్‌తోపాటు, ఓబుళదేవచెరువు, ఆమడుగూరు మండలాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతులు అధైర్యపడవద్దని.. రంగుమారిన, మొలకెత్తని విత్తనాలను పౌరసరఫరాల శాఖ, మార్క్ ఫెడ్‌ల ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. కౌలు రైతులను కూడా ఆదుకుంటామన్నారు. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

06:18 - November 22, 2015

నెల్లూరు : ఏపీలోని వరద ప్రభావిత జిల్లాలైన నెల్లూరు, చిత్తూరు, కడపలో నాయకులు పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పర్యటించి సర్వేలు నిర్వహించారు. బాధితులను కలుసుకుని అన్నిరకాలుగా ఆదుకుంటామని వాగ్దానం చేశారు. మంత్రులు కూడా వివిధ ప్రాంతాల్లో పర్యటించి బాధితులను కలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సాయమందేలా చూస్తామని హామీలిచ్చారు. అడుగడుగునా బాధితుల కన్నీటి కష్టాలే ఎదురవుతున్నాయి. తాము తీవ్రంగా నష్టపోయామని ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని విన్నవించుకుంటున్నారు. అధికారులతో సమావేశమైన బాబు తక్షణమే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రకృతి వైపరీత్యం మూలంగా ఎదురైన కష్టాల నుంచి బయటపడేందుకు తక్షణ సాయంగా కేంద్రాన్ని 3 వేల కోట్ల రూపాయలను అడిగినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలతోపాటు ఉభయగోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్క నెల్లూరు జిల్లాలోనే ఆక్వా రైతులు సుమారు వెయ్యి కోట్ల మేర నష్టపోయారని, ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షన్నర ఎకరాల్లో రైతులు పంట నష్టపోయినట్లు బాబు తెలిపారు. అధికారుల బృందంతో కలిసి ఆయన సర్వేపల్లి జలాశయాన్ని పరిశీలించారు.

ప్రజల్లో చైతన్యం రావాలన్న బాబు...
అనంతరం నెల్లూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. వర్షబీభత్సం సృష్టించిన నష్టాన్ని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు డ్రైన్లు కబ్జాకు గురికావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.  ప్రజల్లో సైతం చైతన్యం రావాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాబోయే రోజుల్లో నెల్లూరు నగరం సుందర నగరంగా మారబోతుందని..దానికి ప్రజల ప్రోత్సాహం కావాలన్నారు. నగరంలో అక్రమాలు స్వచ్చందంగా తొలగించాలన్నారు. ఇక్కడ పరిస్థితులు చక్కదిద్దేవరకు తాను ఇక్కడే ఉంటానని చంద్రబాబు అన్నారు. ఇక కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా నెల్లూరు జిల్లాలో పర్యటించారు. బాధితులను అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే కేంద్రమిచ్చే నష్టపరిహారంపై ఒక ప్రకటన చేశారు. ప్రాథమిక సర్వేలను బట్టి కేంద్రం సాయమందించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి వచ్చే బృందం ఇచ్చే నివేదికను బట్టి ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. నెల్లూరులో పర్యటించిన చంద్రబాబు.. పునరుద్దరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు పునరుద్దరణ పనుల్లో పాల్గొన్న బాబు.. స్వయంగా ప్రొక్లైన్‌ నడిపి డ్రైనేజీ పనులను చేపట్టారు. 

నెల్లూరులో మూడో రోజు బాబు పర్యటన..

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడో రోజు జిల్లాలో పర్యటించనున్నారు. సోమశిల జలశయాన్ని ఆయన పరిశీలించనున్నారు. 

ఆసియా కప్ జూనియర్ హాకీ టోర్నీలో నేడు..

మలేషియా : ఆసియా కప్ జూనియర్ హాకీ టోర్నీలో నేడు భారత్ - పాక్ జట్లు తలపడనున్నాయి. టోర్నీలో ఓటమి ఎరుగని టీమిండియా ట్రోఫీకి అడుగుదూరంలో నిలిచింది. 

పబ్ పై పోలీసుల దాడులు...

హైదరాబాద్ : జూబ్లి హిల్స్ రోడ్డు నెంబర్ 1లో స్టోన్ వాటర్ కిచెన్ లాంచ్ పబ్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పబ్ యజమాని ధీరజ్ పై కేసు నమోదు చేశారు. 

మార్చి 24 నుండి టెన్త్ పరీక్షలు..

హైదరాబాద్ : పదో తరగతి పరీక్షలను మార్చి 24వ తేదీ నుండి నిర్వహించాలని ఎస్సెస్సీ బోర్డు భావిస్తోంది. ఈ పరీక్షల నిర్వహాణకు ఒక విద్యా సంవత్సరంలో తప్పనిసరిగా 220 పనిదినాలు పూర్తి చేయాలనే నిబంధన ఉంది. ఆ నిబంధనకు అనుగుణంగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అంశంపై ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. 

వరద ప్రాంతాల్లో రేపటి నుండి జగన్ పర్యటన..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 23వ తేదీ నుండి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో చిత్తూరు, వైఎస్సార్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో బాధితులను జగన్ పరామర్శించనున్నారు.

నేడు టీఎస్ఎస్పీడీసీఎల్ ఏఈ రాత పరీక్ష..

హైదరాబాద్ : తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలోని 201 ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టు భర్తీకి ఆదివారం రాత పరీక్ష జరుగనుంది. ఈ పరీక్షలను ఉస్మానియా విశ్వ విద్యాలయం పరిధిలో నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుండి 12.30 గంటల వరకు రాత పరీక్ష ఉండనుంది. మొత్తం 35,442 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. 

నేడు ఎంపీలతో జగన్ భేటీ..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నేడు పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. ఉదయం 11గంటలకు లోటస్ పాండ్ లో ఈ సమావేశం జరుగనుంది. ఈనెల 26వ తేదీ నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర సమస్యలు, ప్రజలకు సంబంధించిన అంశాలపై అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ ఎంపీలతో చర్చించనున్నారు. 

Don't Miss