Activities calendar

23 November 2015

పీఎస్‌యూ బ్యాంకుల చీఫ్‌లతో అరుణ్ జైట్లీ సమావేశం

ఢిల్లీ: ఉద్దేశపూర్వకంగా డబ్బులు ఎగవేస్తున్న వారితో ఎలా వ్యవహరించాలనే అంశంలో బ్యాంకులకు పూర్తి స్వేచ్ఛ ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఇవాళ ఆయన పీఎస్‌యూ బ్యాంకుల చీఫ్‌లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెరిగిపోతున్న నిరర్థక ఆస్తుల అంశంపై వారితో చర్చించారు. ఈ సమావేశంలో ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్యతోపాటు ఇతర బ్యాంకుల చీఫ్‌లు, ఆర్‌బీఐ అధికారులు పాల్గొన్నారు.

22:42 - November 23, 2015

సముద్రం లోపల నివసించాలని ఉందా...? జలచరాల సమీపంలో విలాసవంతంగా విహరించాలని ఉందా..? నీలి సంద్రం అందాలను వీక్షిస్తూ.. రోజులు అలా.. అలా గడిపేయాలనుందా..?? ఆకాశహార్మ్యాలను నిర్మిస్తూ... గగనాన్ని తాకే ఎత్తైనే భవనాలు విదిలి.. సముద్రంలో గర్భంలో నివసించడం సాధ్యమేనా..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికేసంది...! కడలిని కౌగిలించుకునే బతికే మహత్తరమైన కల.. సాకారమవుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఆ విశేషాలను చూద్దాం.. మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూడండి...

 

22:33 - November 23, 2015

హైదరాబాద్ : కార్మికులు, ఉద్యోగులకు చైతన్యం అందించేందుకు కొత్త మార్గాలను ఎంచుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి.రాఘువులు పేర్కొన్నారు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన జాతీయ ఉమెన్ టీచర్స్ కన్వెన్షన్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గతంలో సమావేశాలకు కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చే వారని గుర్తు చేశారు. గతంతో పోల్చితే ప్రస్తుతం సమావేశాలకు కార్మికులు, ఉద్యోగులు హాజరయ్యే అవకాశం తక్కువగా ఉందన్నారు. కార్మికులు రోజువారి పని చేసుకుంటూ... కుటుంబానికి సమయం ఇచ్చి... ఇలాంటి సమావేశాలకు హాజరుకావడం తక్కువ అయిందని తెలిపారు. కొత్త పద్ధతులతో విజ్ఞానం తెలసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. తీరుబడి ఉన్నపుడు... చదువుకోవడానికి పత్రికలు అనువుగా ఉంటాయని తెలిపారు. అలాగే ప్రస్తుతం ట్విట్టర్, బ్లాగ్ లు, ఫేస్ బుక్ లో జ్ఞానం, విజ్ఞానం, సమాచారం తెలుసుకుంటున్నారని చెప్పారు. కాబట్టి కార్మికులు, ఉద్యోగులకు చైతన్యం అందించే కొత్త మార్గాలను ఎంచుకోవాలని సూంచించారు.

 

22:23 - November 23, 2015

హన్మకొండ : వరంగల్ బైపోల్ కు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని వామపక్షాల అభ్యర్థి గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. బైపోల్ ఎన్నికల్లో అధికార, కొన్ని ప్రతిపక్ష పార్టీలు డబ్బులు, బీరు, బిరియానీలను పంపణి చేసి ఓటర్లను ప్రలోభపెట్టారని.. కాబట్టి ఈ ఎన్నికలను రద్దు చేసి... ప్రజాస్వామ్యయుతమైన ఎన్నికలను నిర్వహించాలని కోరారు. ఈ ఎన్నికలను ఈసీ రద్దు చేసి... మళ్లీ ప్రజాస్వామ్యయుతమైన ఎన్నికలు నిర్వహిచాలని డిమాండ్ చేశారు. బూటకపు ఎన్నికలను భహిష్కరించడంటూ మావోయిస్టులు చేసిన ప్రకటన సరైనదని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికలు డబ్బులతో కూడుకున్న ఎన్నికలన్నారు. ప్రజాస్వామ్యయుత ఎన్నికల్లేనా..? ఎన్నికలలో ప్రజల భాగస్వామ్యం ఉందా అని ఆలోచించాల్సిన అవసరముందన్నారు. అధికార, ప్రతిఫక్ష పార్టీలు లక్షలు, కోట్ల రూపాయల డబ్బులు పంచారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. ఇలాంటి ఎన్నికలతో ప్రజలకు ఉపయోగం లేదన్నారు.

22:05 - November 23, 2015

హైదరాబాద్ : బాధితులకు హైకోర్టు శుభవార్త అందించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకానికి సంబంధించి కోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. అగ్రిగోల్డ్‌ బాదితుల సంఘం ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ..వచ్చే ఏడాది ఫిబ్రవరి 20వ తేదీనుంచి ఆస్తుల వేలం ప్రక్రియ ప్రారంభిస్తామని సీ-1 కంపెనీ.. కోర్టుకు నివేదిక ఇచ్చింది. వేలం ప్రక్రియ పూర్తి చేయడానికి తమకు 0.5 శాతం కమిషన్‌ వచ్చే విధంగా ఆదేశివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కోర్టు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆస్తుల వేలం ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశించింది. 0.5 శాతానికి బదులుగా 0.2 శాతం కమిషన్‌ మాత్రమే తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. వివిధ ప్రాంతాల్లో అగ్రిగోల్డ్‌ సంస్థకు ఉన్న కోట్లాది రూపాయల విలువైన బినామీ ఆస్తుల వివరాలను బాధితుల తరపు న్యాయవాది శ్రవణ్‌కుమార్‌ కోర్టుకు అందచేశారు. తదుపరి కేసు విచారణ ఈనెల 26కు వాయిదా వేసిన కోర్టు...ఆరోజు బినామీ ఆస్తుల వివరాలు పరిశీలిస్తామని పేర్కొంది.

 

22:02 - November 23, 2015

మహబూబ్ నగర్ : తెలంగాణలో బీజేపీకి మరో షాక్ తగిలింది మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బీజేపీని వీడారు. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెల్చిన యెన్నం రెండేళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగారు. 2014 ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ చేతిలో ఓడిపోయారు. కొంతకాలంగా పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న యెన్నం శ్రీనివాస్ రెడ్డి.. పార్టీ కార్యక్రమాలన్నింటికీ దూరంగా ఉన్నారు.
బీజేపీతో సంబంధం లేకుండా నాగంతో కార్యక్రమాలు
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ సందర్భంగా బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడిపై యెన్నం శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. సమైక్యాంధ్రకు వెంకయ్య అనుకూలంగా వ్యవహరించడం తగదని యెన్నం విమర్శించడం బీజేపీలో చర్చనీయాంశమైంది. అప్పటినుంచే ఈయనకు పార్టీలో ఆదరణ కరువైంది. ఎన్నికల సందర్భంగానూ పార్టీ నుంచి పూర్తిస్థాయి మద్దతు అందలేదని శ్రీనివాస్ రెడ్డి తన అనుచరుల వద్ద వాపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నాలుగైదు నెలలు మాత్రమే పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీతో సంబంధం లేకుండా నాగంతో కలిసి కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. నాగం ఏర్పాటు చేసిన తెలంగాణ బచావో మిషన్ లో చురుకుగా పాల్గొన్నారు.
2007లో టీఆర్ఎస్‌లో చేరిక
కేంద్ర కస్టమ్స్ విభాగంలో పనిచేసిన యెన్నం శ్రీనివాస్ రెడ్డి 2002లో ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2007లో టీఆర్ఎస్ లో చేరి మహబూబ్ నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2009లో కేసీఆర్ తో విభేదించి గులాబీ గూటిని వీడారు. ఆ తర్వాత యువ తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. 2012లో మహబూబ్ నగర్ కు ఉపఎన్నికలు రావడంతో బీజేపీలో చేరి కాషాయజెండాపై శాసనసభ్యుడిగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్న నాగం, యెన్నం... రెండు నెలల క్రితం కలిసి కేంద్ర హోంశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ దగ్గరికి వెళ్లి రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించారు. ఆయన నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ప్రత్యేక వేదిక కోసం సిద్ధమవుతున్నారు. గత ఏడాది కాలంగా నాగంతో కలిసి వివిధ కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతున్న యెన్నం.. ఆయనతో పాటే రాజకీయ నిర్ణయం తీసుకుంటారని అంతా భావించినా ఉన్న ఫలంగా పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు.
యెన్నం కాంగ్రెస్ గూటికి చేరుతారా?
కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని ఆయన అనుచరులు భావించినప్పటికీ కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ లపై గతంలో యెన్నం పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం కొత్త వేదిక ఏర్పాటు చేస్తారా లేకా మనసు మార్చుకొని ఉన్న పార్టీల్లోనే ఏదో ఒకదాన్ని ఎంచుకుంటారా అనేది చూడాలి.

 

21:57 - November 23, 2015

ఢిల్లీ : భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న తమిళనాడుకు కేంద్రం తక్షణ సాయంగా 924 కోట్లు ప్రకటించింది. ప్రస్తుతం మలేషియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ తమిళనాడుకు వరద సాయం విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. వరదల కారణంగా తమిళనాడులో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను ఆదుకునేందుకు తక్షణమే2 వేల కోట్లు విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి జయలలిత ...ప్రధాని మోదీకి లేఖ రాశారు. వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి నివేదిక అందాకే కేంద్రం మిగతా సాయాన్ని అందజేసే అవకాశముంది. వరదల కారణంగా తమిళనాడులో కడలూరు, కాంచీపురం, చెన్నై, తిరువెల్లూరు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణనష్టం చోటుచేసుకోగా, పలు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ జలమయమై ఉన్నాయి.

 

21:54 - November 23, 2015

హైదరాబాద్ : అంగన్‌వాడీ కార్యకర్తలు పోరుబాట పట్టారు. తమ సమస్యల పరిష్కారం.. జీతాల పెంపు జీవో విడుదలను కోరుతూ.. అంగన్‌వాడీలు నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోనూ వీరి నిరసనలు కొనసాగుతున్నాయి.
విజయవాడ
విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.. డిమాండ్ల సాధనకోసం నిరాహారదీక్ష చేపట్టారు.. సిఐటియు ఏపీ ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎమ్‌డి గఫూర్‌ ఈ దీక్షలను ప్రారంభించారు.. అంగన్‌వాడీల సమస్యలు తీర్చాలని... లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు..
గుంటూరు
గుంటూరులోకూడా అంగన్‌వాడీలు సామూహిక దీక్షలు చేపట్టారు.. పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.. మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణ్ ఈ దీక్షలకు సంఘీభావం ప్రకటించారు.
శ్రీకాకుళం
శ్రీకాకుళం కలెక్టరేట్‌ ఎదుటా.. అంగన్‌వాడీ వర్కర్లు ఆందోళనకు దిగారు.. పెంచిన జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు..
అనంతపురం
అనంతపురం జిల్లాలోనూ అంగన్‌వాడీల నిరసనలు కొనసాగాయి.. ఆర్డీవో కార్యాలయం ఎదుట కార్యకర్తలు నిరవధిక దీక్షలు చేపట్టారు.. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబులు వీరికి మద్దతు ప్రకటించారు..
ఒంగోలు
ఒంగోలులోకూడా అంగన్‌వాడీ కార్యకర్తలు దీక్షలకు దిగారు.. చాలీ చాలని జీతాలతో ఎలా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు... తమ సమస్యలు పరిష్కరించేవరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
విశాఖ
విశాఖ జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసన నినాదాలతో హోరెత్తించారు.. పెంచిన జీతాల జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.. కలెక్టరేట్‌ దగ్గర దీక్షలు చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్సీ శర్మ మద్దతు ప్రకటించారు.
కాకినాడ
కాకినాడలో కూడా కలెక్టర్‌ కార్యాలయం ముందు అంగన్‌వాడీ కార్యకర్తలు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు.. 8 నెలల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.. తమ సమస్యలు తీర్చకపోతే ఆందోళనను కలెక్టర్ కార్యాలయాలన్నీ ముట్టడిస్తామని హెచ్చరించారు..

 

21:51 - November 23, 2015

హైదరాబాద్ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతవిద్వేషాలు పెరిగిపోయాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 27న బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా తమ్మినేని వీరభద్రంను ఆహ్వానించారు. దీనికి ఆయన మద్దతు ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతవిద్వేషాలు పెరిగిపోయాయని తమ్మినేని విమర్శించారు. ఆహార స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

 

21:44 - November 23, 2015

హైదరాబాద్ : తెలంగాణలో క్రిస్టమస్‌ వేడుకల నిర్వహణపై సమావేశం రసాభాసగా మారింది.. ఈ పండుగ ఏర్పాట్లపై వివిధ క్రైస్తవ సంఘాలు, చర్చి పాస్టర్లతో రేమండ్‌ పీటర్‌ కమిటీ సమావేశమైంది.. వివిధ చర్చిల దగ్గర తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించారు.. అయితే ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే దుస్తులు, బియ్యం పంపిణీపై కొందరు క్రైస్తవ సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.. ఇతర వర్గాలతోపోలిస్తే క్రిస్టియన్లకు నిధులు తక్కువ కేటాయించారని ఆరోపించారు.. సీఎం కేసీఆర్‌ క్రైస్తవులను బిచ్చగాళ్లుగా చూస్తున్నారని మండిపడ్డారు.. తమపై ఇలాగే నిర్లక్ష్యం చూపితే కేసీఆర్‌ కుటుంబానికి తాము చీర, బిర్యానీ ప్యాకెట్‌ పంపి నిరసన తెలుపుతామని హెచ్చరించారు.. సీమాంధ్ర క్రైస్తవ సంఘాలకే కేసీఆర్‌ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని క్రిస్టియన్‌ సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు..

 

21:40 - November 23, 2015

ఉత్తరప్రదేశ్ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై మళ్లీ ఫైరయ్యారు. 'మాకు కావాల్సింది సూట్‌ బూట్‌ హిందుస్థాన్‌ కాదు, రైతులు, కార్మికుల హిందుస్థాన్‌ కావాలి' అని రాహుల్‌ ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్‌ సరసవలో రాహుల్‌ పాదయాత్ర చేశారు. అచ్ఛేదిన్ పేరు చెబితేనే ప్రజలు నవ్వుతున్నారని, మంచి రోజులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. రైతులకు కాంగ్రెస్‌ ఎప్పుడూ అండగానే నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు. చెరకు రైతుల సమస్యలను అఖిలేష్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. చక్కెర కర్మాగారాలు మూతపడుతుండడంతో చెరకు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.

21:36 - November 23, 2015

ఢిల్లీ : ఈ-లాల ద్వారా ఆన్‌లైన్‌ లో వ్యాపారం చేయొచ్చని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. చిన్న వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ-పోర్టల్‌ ఏర్పాటు చేసింది. ఈ-లాల పేరుతో ఏర్పాటు చేసిన దీనిని కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. వ్యాపారులు, వినియోగదారులకు అనుకూలంగా ఉంటుందన్నారు. ఏ షాపులోల ఏ వస్తువులు అందుబాటులో ఉన్నాయన్న అంశంతోపాటు వాటి ధరల వివరాలు తెలుసుకునే వీలుకలుగుందని చెప్పారు. అఖిల భారత వ్యాపారుల సంఘం ఏర్పాటు చేసిన ఈ-లాల పోర్టల్‌ ద్వారా స్థానికంగా విక్రయించే వస్తువులకు, వ్యాపారులకు మంచి గుర్తింపు వస్తుందని చెబుతున్నారు.

 

ప్రమాదవశాత్తూ రైలు కిందపడి వ్యక్తి మృతి

నల్గొండ : జిల్లాలోని మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో ప్రమాదవశాత్తూ డెల్లా రైలు కిందపడి ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. మృతుడు తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన అబ్బులు(40)గా గుర్తించారు. మిర్యాలగూడలోని బంధువుల ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ లో న్యాయవాది దారుణ హత్య

హైదరాబాద్‌ : నగర శివారు రాజేంద్రనగర్‌లో షేక్‌ ఆజామ్‌ అనే న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. కుటుంబ కలహాలే ఆయన హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

21:27 - November 23, 2015

సింగపూర్ : చైనా ఆర్థిక విజన్‌ భారత్‌కు స్ఫూర్తి అని ప్రధాని నరంద్రమోడీ పేర్కొన్నారు. 37వ సింగపూర్‌ లెక్చర్‌లో ఆయన ప్రసంగించారు. ఇండియా-చైనా ప్రపంచంలోనే ఆర్థికంగా అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలని మోడీ అభివర్ణించారు. నూతన ఆవిష్కరణలకు వనరుల లేమి ఆటంకం కాబోదని తెలిపారు. అభివృద్ధితో పాటు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్ఛ భారత్‌ కేవలం నగరాల స్వచ్ఛత కోసం చేపట్టిన కార్యక్రమం కాదు... మన ఆలోచనలు, కార్యాచరణలో మార్పు రావల్సి ఉందని, ఈ విషయంలో సింగపూర్‌ నుంచి చాలా నేర్చుకుంటున్నామని ప్రధాని పేర్కొన్నారు. 

21:22 - November 23, 2015

హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌ లో వ్యాపమ్ స్కాం గుర్తుందా...అధికారులకు లంచాలిచ్చి మెడికల్ సీట్లు పొంది కటకటాలపాలైన నకిలీల బాగోతం జ్ఞప్తికి వస్తోందా...సరిగ్గా అలాంటి మెడికల్ కుంభకోణమే మన తెలుగు రాష్ట్రాల్లోనూ వెలుగు చూసింది. ఇందుకోసం అక్రమార్కులు ఏకంగా ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో గెస్ట్ క్యాడెట్ల అవతారమెత్తారు. ప్రీ రిపబ్లిక్ డే టెస్టుల్లో ఒక్క చెమట చుక్కా చిందకుండా మెడికల్ కాలేజీల్లో ఉచితంగా సీట్లు కొల్లగొట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్సీసీ గెస్ట్ క్యాడెట్ల మెడికల్ కుంభకోణంపై టెన్‌ టీవీ స్పెషల్ స్టోరి.
ఎంబీబీఎస్ సీట్ల కౌన్సెలింగ్‌లో గోల్‌మాల్
ఎన్సీసీ... నేషనల్ క్యాడెట్ కార్ప్స్. స్కూలు స్థాయి నుంచి డిగ్రీ వరకు కొందరు మెరికల్లాంటి విద్యార్థులను ఎంపిక చేసి..వారికి ఆర్మీ అధికారులు కఠోర శిక్షణ ఇస్తారు. డ్రిల్,ఫైరింగ్,కల్చరల్ ఈవెంట్స్ లో సానబెడతారు. ఎన్సీసీలో చేరే విద్యార్థుల ఆశయం ఢిల్లీలో వైభవంగా జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనడం. ఇందుకోసం అనేక దశల్లో జరిగే పోటీల్లో గెలిచి చివరికి పరేడ్‌ కు సెలక్ట్ అవుతారు. పరేడ్‌లో పాల్గొంటే గౌరవం, ఆనందమే కాదు వారి భవిష్యత్తుకు భరోసా కూడా ఉంటుంది. ఎందుకంటే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కిన క్యాడెట్లకు ఇంజనీరింగ్,మెడికల్ తో పాటు ఉద్యోగాలు, ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్‌ ఉంటుంది. అయితే ఈ రిజర్వేషన్‌ ప్రక్రియలో ఉన్న లొసుగులే ఆసరాగా కొందరు గెస్ట్ క్యాడెట్ల అవతారమెత్తి ఏకంగా ఎంబీబీఎస్ సీట్లను దక్కించుకుంటున్న బాగోతం బయటపడింది.
మెడికల్ సీట్ల భర్తీపై ఆర్టీఐ పిటిషన్
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ఎన్సీసీ క్యాడెట్ల పేరుతో కొందరు అత్యంత సులభంగా సీట్లు సంపాదించుకున్నారు. ఓ మెడికల్ కాలేజీలో సీట్ల భర్తీపై ఓ న్యాయవాది వేసిన ఆర్టీఐ పిటిషన్ ద్వారా వెలుగులోకి వచ్చిన వాస్తవాలు విస్మయపరుస్తున్నాయి. అన్ని దశల్లో పోటీపడి రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న క్యాడెట్ల కంటే ఎలాంటి శ్రమా పడకుండా రికమెండేషన్లతో పరేడ్‌లో పార్టిసిపేట్ చేసిన గెస్ట్ క్యాడెట్లకే సీట్లు దక్కుతున్నాయని ఆర్టీఐ ద్వారా తెలిసింది.
నిజమైన క్యాడెట్స్ కు సీటు రాదు
రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న క్యాడెట్లకు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరేందుకు సెక్షన్ బీ ప్రకారం ప్రాధాన్యత ఇవ్వాలని సెప్టెంబర్ 8, 2015 తేదీతో జీవో నెంబర్ 75 విడుదల చేశారు. అయితే అప్లై చేసుకున్న మొత్తం క్యాడెట్లలో గెస్ట్ క్యాడెట్లే టాప్‌ ర్యాంకర్స్ అని తేలింది. అంటే వీరికే సీట్లు వచ్చేస్తాయి. పోటీలో పాల్గొని పరేడ్‌ లో పార్టిసిపేట్ చేసిన నిజమైన క్యాడెట్స్‌ కు సీటు రాదన్న మాట. ఎన్సీసీ డ్రిల్ భాషలో చెప్పాలంటే...అసలు క్యాడెట్లు పీఛేముడ్...నకిలీలు ఆగేచల్.
తెలంగాణ నుంచి ఏడుగురు గెస్ట్ క్యాడెట్స్
2011 నుంచి 2015 వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి రిపబ్లిక్ డే వేడుకల్లో పార్టిసిపేట్ చేసిన వారిలో ఏడుగురు గెస్ట్ క్యాడెట్సే. అలాగే ఏపీలో మొత్తం 11 మందిలో 10 మంది అతిథిగా వెళ్లొచ్చిన క్యాడెట్లే. సాధారణంగా ఢిల్లీ గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనాలంటే ఐదు దశల్లో ఎన్సీసీ క్యాడెట్లు పాసవ్వాల్సి ఉంటుంది. అందులో ఇంటర్ యూనిట్ కాంపిటీషన్, ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్, రాతపరీక్ష, అలాగే ప్రీ రిపబ్లిక్ డే పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి.
రూ.80 లక్షల నుంచి కోటి 50 లక్షల వరకు లంచాలు
అయితే మెడికల్ కౌన్సెలింగ్‌లో టాప్‌ ర్యాంకర్స్ గా నిలిచిన ఎన్సీసీ క్యాడెట్లో ఎంతమంది ప్రీ రిపబ్లిక్ డే టెస్టుల్లో పాసయ్యారని ఆర్టీఐ ద్వారా తెలుసుకుంటే దిమ్మతిరిగే సమాచారం తెలిసింది. అసలు టాప్‌ ర్యాంకర్స్ లో ఉన్నవారు సాధారణ పోటీలో, ప్రక్రియలో పాల్గొనలేదని తేలింది. బాగా డబ్బు, పలుకుబడి ఉన్న తల్లిదండ్రులు రక్షణ శాఖతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులకు భారీగా లంచాలు ముట్టజెప్పారు. దాదాపు 80 లక్షల నుంచి కోటి 50 లక్షల వరకు లంచాలిచ్చి తమ కుమారులు, కుమార్తెలు గెస్ట్ క్యాడెట్లుగా వెళ్లేందుకు హై రికమెండేషన్ తెచ్చుకున్నారు. రిపబ్లిక్ డే పార్టిసిపేట్‌ గా సర్టిఫికెట్ తెచ్చుకుని వారికి నచ్చిన మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందుతున్నారు. కనీసం ఈ విద్యార్థులు మామూలు ఎన్సీసీ క్యాంపుల్లో కూడా శిక్షణ తీసుకోలేదు. మెడికల్ కౌన్సెలింగ్‌లో ఇదొక పెద్ద స్కామని చెప్పారు...ఆర్టీఐ ద్వారా ఈ వివరాలన్నీ రాబట్టిన హైదరాబాద్ లాయర్ ఆర్.గోపాల స్వామి.
దొంగచాటుగా మెడికల్ సీటు
ఒక్క 2014లోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 130 కాంటిజెంట్ల నుంచి రిపబ్లిక్ డే వేడుకల్లో పార్టిసిపేట్ చేసినవారిలో దాదాపు 14 మంది గెస్ట్ క్యాడెట్లేనని తేలింది. మెడికల్ లాంటి ఉన్నత వృత్తి విద్యాంసంస్థల్లో దొంగచాటుగా సీటు కొల్లగొట్టేందుకు కొందరు బడాబాబులు తెగబడుతున్నారని అర్థమవుతోంది. ఉన్నతాధికారులకు లంచాల మేత వేసి అప్పనంగా వైద్య సీట్లను పొందుతున్నారు. అన్ని దశల్లో కష్టపడి, గెలిచి, రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులు అన్యాయమైపోతున్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి మెడికల్ సీట్ల కౌన్సెలింగ్ స్కాము దొంగలను బోనులో నిలబెట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

 

 

21:09 - November 23, 2015

వరంగల్ : అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వరంగల్‌ ఉప ఎన్నిక ఫలితాలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. అత్యంత రసవత్తరంగా సాగిన వరంగల్‌ పార్లమెంట్‌ ఎన్నికలో విజేత ఎవరు అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఉప ఎన్నిక ఫలితాల కోసం ఇప్పటికే జిల్లా కేంద్రం వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఫలితం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠతో.. అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ఉదయం 8గంటలకు ఓట్ల కౌంటింగ్‌
వరంగల్ ఉప ఎన్నికల ఫలితాల వెల్లడికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈవీఎంలను భద్ర పరిచిన ఏనుమామూలు వ్యవసాయ మార్కెట్‌లోనే..ఉదయం 8గంటలకు ఓట్ల కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. పార్లమెంట్‌ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్‌ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి కూడా అయిన.. కలెక్టర్‌ అరుణ, జిల్లా ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు.
7 కౌంటింగ్‌ హాళ్ల ఏర్పాటు
వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ నియెజకవర్గాలకు సంబంధించి మొత్తం 7 కౌంటింగ్‌ హాళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో కౌంటింగ్‌ హాల్లో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభయ్యే కౌంటింగ్‌లో తొలిరౌండ్‌ ఫలితం 9గంటలకల్లా వెలువడనుంది. భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి 22 రౌండ్లు, వరంగల్‌ ఈస్ట్‌ 16 రౌండ్లు, వరంగల్‌ వెస్ట్‌ 17రౌండ్లు, స్టేషన్‌ఘనపూర్‌ 20 రౌండ్లు, పరకాల 17 రౌండ్లు, పాలకుర్తి 19 రౌండ్లు, వర్థన్నపేట నియోజకవర్గానికి సంబంధించి 19రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి.
నగరంలో 144 సెక్షన్‌
ఉప ఎన్నిక ఫలితాల సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరంలో 144 సెక్షన్‌ విధించారు. ఇప్పటికే ఏనుమామూల మార్కెట్‌కు కేంద్ర పారామిలటరీ దళాలు, సీఆర్‌పీఫ్‌, ఏపీఎస్పీ బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఫలితాల వెల్లడి తర్వాత శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.
ఫలితం కోసం నిరీక్షిస్తున్న పార్టీల నేతలు, అభిమానులు
మంగళవారం వెలువడే ఫలితాల కోసం ఎన్నికల్లో పోటీచేసిన 23 మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అభ్యర్థులే కాదు..ఆయా పార్టీల అభిమానులు కూడా ఫలితం కోసం నిరీక్షిస్తున్నారు. అయితే ఈ ఉపపోరులో టీఆర్‌ఎస్ విజయం ఖాయమని ఎగ్జిట్‌పోల్‌ సర్వేలు చెప్తున్నాయి. ఈ ఉప ఎన్నికలో 69శాతంపైనే ఓట్లు పోలవడంతో...భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే కాంగ్రెస్, బీజేపీలు కూడా గెలుపు తమదంటే తమదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటరు మహాశయులు ఎవరిని పార్లమెంట్‌కు పంపుతారో రేపు మధ్యాహ్నం 3గంటలకల్లా తేలి పోనుంది.

 

21:01 - November 23, 2015

చెన్నై : నిర్భంద తమిళ విద్యపై తమిళనాడు సర్కారుకు చుక్కెదురైంది. ఈ ఏడాది పరీక్షలు యధావిధిగా నిర్వహించాలని మద్రాస్‌ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్భంద తమిళం చట్టంలో లోపాలున్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఈ చట్టంలో మార్పులు చేసి వచ్చే ఏడాది కొత్త పిటిషన్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తమిళంలోనే అందరూ పరీక్షలు రాయాలని గతంలో తమిళనాడు సర్కారు జీవో జారీ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ తెలుగు ప్రజలు కోర్టులో పిటిషన్‌ వేశారు.

 

20:57 - November 23, 2015

శ్రీకాకుళం : రాముడు దేవుడు.. రావణుడు రాక్షసుడు..! ఇదీ జనాంతికం. కానీ.. సిక్కోలులోని ఓ గ్రామం దీనికి భిన్నం. వారికి రాముడే కాదు.. రావణుడూ పూజనీయుడే. అందుకే.. రావణుడి ప్రతిమను ఏర్పాటు చేసి.. నిత్య పూజలు చేస్తున్నారు. ఎందుకిలా..? వారు రావణుణ్ణి ఆరాధించడానికి కారణం ఏమిటి..? వాచ్‌ దిస్ స్టోరీ.
రావణుడు.. మహనీయుడు..
రాముడు హీరో.. రావణుడు విలన్‌..! ఏ పురాణమైనా ఇదే భావాన్ని వ్యక్తీకరిస్తుంది. రాముడు మంచికి.. రావణుడు చెడుకు ప్రతీకలని భావిస్తారు. అందుకే ప్రజల్లో రాముడంటే భక్తి.. రావణుడంటే విరక్తి. పైగా సీతను అపహరించిన రావణుడు.. పరమ దుష్టుడన్న భావనా ప్రజల్లో ఉంది. కానీ శ్రీకాకుళం జిల్లా... మశాఖపురం వాసుల దృష్టిలో మాత్రం రావణుడు.. మహనీయుడు.. పూజనీయుడు.
ఆధ్యాత్మికతకు నిలయంగా మశఖాపురం..
ఇచ్చాపురం మండలం మశఖాపురం.. ఆధ్యాత్మికతకు నిలయంగా పేరు తెచ్చుకుంది. హిందూ దేవతలకు, పురాణాలకు గ్రామస్థులు ఎంతో విలువిస్తారు. అందుకే.. శివాలయ సమీపంలో.. రావణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సీతను ఎత్తుకెళుతున్న దృశ్యాన్ని కళ్లకు కట్టేలా ఈ విగ్రహాన్ని రూపొందించారు. శివరాత్రి, దీపావళి, పర్వదినాలతో పాటు.. కార్తీక మాసమంతటా.. రావణుడి విగ్రహానికి పూజలు నిర్వహిస్తారు.. మశాఖపురం గ్రామస్థులు.
రామాయణంలోని ముఖ్య ఘట్టాల చిత్రీకరణ
రావణుడి విగ్రహానికి అటూ ఇటూగా ఉన్న గోడలపై.. రామాయణ కథలోని ముఖ్య ఘట్టాలను చిత్రించారు. వానర సైన్యాన్ని ప్రతిబింబించే విగ్రహాలతో పాటు.. మారుతాత్మజుడి భారీ విగ్రహాన్నీ నెలకొల్పారు. ఓవైపు ఆంజనేయుడిని పూజిస్తూనే.. మరోవైపు రావణుడినీ ఆరాధించడం వెనుక ఆంతర్యం ఏంటి..?మశాఖపురంలో అత్యధికులు శివభక్తులే
మశాఖపురంలో అత్యధికులు శివభక్తులే. రావణుడి అచంచల శివభక్తికి ముగ్ధులై ఆయనను పూజ్యుడిగా భావిస్తున్నారు. పైగా రావణుడు లేనిదే రామాయణం లేదన్నది మశాఖపురం వాసుల నమ్మకం. అందుకే.. రావణుడిని అసురుడిగా కాక.. సురుడిగానే గుర్తించి పూజిస్తున్నారు. నిత్యపూజలతో పాటు.. ప్రతీ గురువారం రావణబ్రహ్మకు విశిష్ట పూజలూ నిర్వహిస్తున్నారు. మొత్తానికి మశాఖపురం వాసులు తమ విభిన్న ఆధ్యాత్మిక లక్షణంతో.. జిల్లా వాసులనే కాదు.. ఇరుగు పొరుగు ప్రాంతాల వారినీ అమితంగా ఆకట్టుకుంటున్నారు.

 

20:52 - November 23, 2015

కృష్ణా : అవి అల్లా భూములు..! పూర్తిగా పేదల సంక్షేమానికే ఉపయోగ పడాల్సిన స్థలాలు..!! వాటిని కొనడం.. అమ్మడం.. నిషిద్ధం..!!! ఇదీ.. వక్ఫ్‌ స్థలాలకు సంబంధించిన చట్టాల సారాంశం. కానీ వర్తమానం అందుకు భిన్నం. దాదాపు 80 శాతం వక్ఫ్‌ స్థలాలు.. అన్యాక్రాంతమయ్యాయి. రాజకీయుల అండతో.. కబ్జాకోరులు బరితెగించి.. వారసత్వపు ఆస్తి అన్నంత దర్జాగా వక్ఫ్‌ స్థలాలను అమ్మేసుకుంటున్నారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో.. అన్యాక్రాంతమైన వక్ఫ్‌ ఆస్తులపై టెన్‌ టీవీ ప్రత్యేక కథనం.
ఏపీలో ల్యాండ్‌ మాఫియా
ఏపీలో ల్యాండ్‌ మాఫియా చెలరేగి పోతోంది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. కబళించేస్తోంది. ఆలనాపాలనా కొరవడిన వక్ఫ్‌ ఆస్తులనైతే.. వారసత్వపు ఆస్తులు అన్నంత దర్జాగా కబ్జా చేసేస్తున్నారు... భూ బకాసురులు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల విలువైన వక్ఫ్‌ భూములు ఇలాగే అన్యాక్రాంతమై పోయాయి.
కృష్ణా జిల్లాలో 2,663 ఎకరాల వక్ఫ్‌ భూములు
కృష్ణా జిల్లాలోనే దాదాపు 3వేల కోట్ల రూపాయల విలువ చేసే వక్ఫ్‌ భూములను గద్దల్లాంటి పెద్దలు కబ్జా చేసి పారేశారు. జిల్లాలోని 2,663 ఎకరాల వక్ఫ్ భూముల్లో.. సుమారు 1500 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ఇటీవల మైనారిటీ శాఖ ముఖ్య కార్యదర్శి ఇక్బాల్‌ ఆదేశాలతో.. రాష్ట్రవ్యాప్తంగా జరిపించిన సర్వేలో ఈ విషయం వెలుగు చూసింది. కృష్ణా జిల్లా తాడిగడపలో 36 ఎకరాలు, ఇబ్రహీంపట్నంలో 46 ఎకరాలను ముగ్గురు వ్యక్తులు ఆక్రమించి.. దర్జాగా అనుభవిస్తున్నట్లు తేలింది. ఈ భూముల విలువ సుమారు మూడు వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అదే విధంగా గుంటూరులోని అంజుమన్‌ ఇస్లామియా పరిధిలోని 80 ఎకరాల భూమి కూడా కబ్జాకు గురైంది. దీని విలువ రెండు వందల కోట్ల రూపాయలని అంచనా.
ఆక్రమణదారులు రవీంద్రనాథ్‌, పూర్ణచంద్రరావులపై ఫిర్యాదు
ఏళ్ల తరబడి కొంతమంది పెద్దలు... ఆలనాపాలనా లేని వక్ఫ్ భూములను కబ్జాచేస్తూ దర్జాగా అనుభవిస్తున్నారు. వీరికి రాజకీయ పెద్దల అండదండలు ఉండటంతో... వారిని ఎవరూ నిలదీయ లేకున్నారు. తాడిగడపలో వక్ఫ్‌ భూములు ఆక్రమించారంటూ.. వల్లూరు రవీంద్రనాథ్‌, రాజా పూర్ణ చంద్రరావులపై.. మైనారిటీ శాఖ పెనమలూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. అలాగే.. ఇబ్రహీంపట్నంలో వక్ఫ్‌ ఆస్తులు కబళించిన చెరుకూరి సంజీవరావుపై ఇబ్రహీంపట్నం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై చర్యలు శూన్యం.
నిలదీసేందుకు జంకుతున్న వక్ఫ్ బోర్డు కమిటీలు
వక్ఫ్ బోర్డులకు కమిటీలు ఉన్నా.. వాటికున్న పవర్స్‌ నామమాత్రమే. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవడం మాట అటుంచి.. అవి తమ భూములే అని గట్టిగా నిలదీయడానికీ ఈ కమిటీలు జంకుతున్నాయి. ఎవరైనా వక్ఫ్‌ స్థలాల కబ్జా గురించి మాట్లాడితే.. బెదిరింపులు షురూ అవుతున్నాయి. పాలక పక్షం నేతల హస్తం ఉండడం వల్లే.. కబ్జా వ్యవహారంలో.. అందరూ మౌనం పాటిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పైగా... కబ్జా గురించి తెలిసినా.. వక్ఫ్‌ భూముల్ని స్వాధీనం చేసుకోవటం వక్ఫ్ బోర్డ్ కు తలకు మించిన పనే అవుతోంది.
వక్ఫ్‌ ఆస్తులు పేద ముస్లింల సంక్షేమానికి ఉద్దేశించినవి. వీటిని అమ్మే, కొనే అధికారం ఎవరికీ లేదు. కానీ కబ్జాదారులు యధేచ్ఛగా ఈ ఆస్తుల్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రభుత్వాల ఉదాసీనత
1954 చట్టంలో దొర్లిన తప్పులను సరిచేయడంలో ప్రభుత్వాలు ఉదాసీనతను కనబరుస్తున్నాయి. రెవిన్యూ రికార్డుల తరహాలో దీన్ని పట్టించుకోలేదు. అందుకే.. వక్ఫ్‌ ఆస్తుల అన్యాక్రాంతాన్ని అడ్డుకోలేక పోతున్నారన్నది ఓ వర్గం భావన. అందుకే.. వక్ఫ్‌ ఆస్తులపై రీసర్వే చేయిస్తే.. మైనారిటీలందరికీ మేలు జరుగుతుందని వారంటున్నారు.
వక్ఫ్ బోర్డ్ భూములను మైనార్టీ శాఖకు అప్పగించాలి డిమాండ్
రాష్ట్రంలో అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకొని.. కమిటీలకు అప్పగిస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంది. ఆ హామీని నెరవేరిస్తే.. మైనారిటీలందరూ పురోభివృద్ధి సాధిస్తారని మైనారిటీ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా.. విలువైన వక్ఫ్ బోర్డ్ భూముల కబ్జా ఆక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, విలువైన భూములను వక్ఫ్ బోర్డ్ భూములను మైనార్టీ శాఖకు అప్పగించాలని ముస్లిం సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

 

20:45 - November 23, 2015

కడప : వరద బాధితులందరికీ తాము అండగా ఉంటామని వైసీపీ అధినేత జగన్‌ హామీ ఇచ్చారు. జిల్లాలో పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. రైల్వే కోడూరు, ఓబులవారిపల్లె మండలాల్లోని ప్రజలను కలుసుకున్నారు. సెట్టిగుంట చెరువు దగ్గర నీటమునిగిన అరటి తోటలను పరిశీలించారు. గోడకూలి చనిపోయిన బాలుని కుటుంబాన్ని ఓదార్చారు. తమకు ప్రభుత్వంనుంచి ఎలాంటి సహాయం అందలేదని చాలాచోట్ల జనాలు జగన్‌తో తమ బాధలు చెప్పుకున్నారు. ఫొటోలు తీసుకొని రిపోర్టు రాసుకొని వెళ్లారని... ఆ తర్వాత ఎవ్వరూ ఇటువైపు రాలేదని ఆరోపించారు.

20:37 - November 23, 2015

హైదరాబాద్ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచామని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. 9వేల 200మంది పాత నేరస్తులను గుర్తించామన్నారు. తాము చేపట్టిన ఇంటింటి సర్వే దాదాపు పూర్తికావొచ్చిందని తెలిపారు. మరో వారం రోజుల్లో మొత్తం సర్వే పూర్తవుతుందని కమిషనర్ చెప్పారు.

 

 

 

20:34 - November 23, 2015

రంగారెడ్డి : జిల్లాలోని తాండూర్‌లో జరిగిన మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. ఓ వైపు సాధారణ సర్వసభ్య సమావేశం జరుగుతుండగా...మరోవైపు ఎదురెదురుగా కూర్చున్న ఇద్దరు ఎంఐఎం సభ్యులు పరస్పరం వాగ్వావాదానికి దిగారు. ఎంఐఎం పార్టీకి చెందిన కౌన్సిలర్‌ సోఫియా..అదే పార్టీకి చెందిన మరో కౌన్సిలర్‌ ఫాసియుద్దీన్‌ వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ ఒకరిపై మరొకరు చెప్పులు విసురుకున్నారు. ఓవైపు ఎజెండా విషయంపై సీరియస్‌గా చర్చ జరుగుతుండగా..మరోవైపు ఇద్దరు కౌన్సిలర్లు చెప్పులు విసురుకోవడంతో...సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దీంతో సభను అర్థాంతరంగా ఆపేశారు.

 

బెజ్జూర్‌ ప్రభుత్వ ఆశ్రమపాఠశాలలో భయం భయం

ఆదిలాబాద్‌ : బెజ్జూర్‌లోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో దెయ్యం భయంతో విద్యార్థినిలు వణికిపోతున్నారు. 3 రోజులక్రితం జ్వరంతో మమత అనే విద్యార్థిని మృతి చెందింది. తోటి విద్యార్థిని మృతితో అందరూ టెన్షన్‌ పడుతున్నారు. చనిపోయేముందు మమత వింతగా ప్రవర్తించారు. ఆమె దయ్యం పట్టినట్లు ప్రవర్తించడంతో విద్యార్థినిలు అంతా వణికిపోయారు. హాస్టల్ లో దయ్యం ఉందంటూ విద్యార్థినిలు వణికిపోతున్నారు. దాదాపు 170 మంది చెప్పాపెట్టకుండా తమ సొంతూళ్లకు పారిపోయారు.

20:28 - November 23, 2015

ఆదిలాబాద్‌ : బెజ్జూర్‌లోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో దెయ్యం భయంతో విద్యార్థినిలు వణికిపోతున్నారు. 3 రోజులక్రితం జ్వరంతో మమత అనే విద్యార్థిని మృతి చెందింది. తోటి విద్యార్థిని మృతితో అందరూ టెన్షన్‌ పడుతున్నారు. చనిపోయేముందు మమత వింతగా ప్రవర్తించారు. ఆమె దయ్యం పట్టినట్లు ప్రవర్తించడంతో విద్యార్థినిలు అంతా వణికిపోయారు. హాస్టల్ లో దయ్యం ఉందంటూ విద్యార్థినిలు వణికిపోతున్నారు. దాదాపు 170 మంది చెప్పాపెట్టకుండా తమ సొంతూళ్లకు పారిపోయారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు వెళ్లిన మీడియాను పాఠశాల అధికారులు అడ్డుకున్నారు. లోపలికి ఎవ్వరూ వెళ్లొద్దంటూ గేటుకు తాళాలు వేశారు.

 

19:53 - November 23, 2015

బాలివుడ్‌ పుట్టుక నుంచి దశాబ్దాలుగా ఎన్నో ప్రేమకథలు వచ్చాయి. ఆల్‌ టైం హిట్స్ గా నిలిచాయి. ప్రేమకథలు తీయడంలో ఒక్కొక్క దర్శకుడిది ఒక్కో స్టైల్‌.. ఈ తరంలోనూ బాలివుడ్‌లో ప్రేమకథలు తీసే దర్శకుల్లో తనదైన మార్కును సంపాదించుకున్న దర్శకుడు ఇంతియాజ్‌ అలీ. తాజాగా రణబీర్‌కపూర్‌, దీపికాపదుకునే జంటగా నటిస్తున్న తమాషా చిత్రంతో మరోసారి బాలివుడ్‌లో తన మార్క్ వదలనున్నాడు.
ప్రతీ ఫ్రేంలోనూ ఇంతియాజ్‌ హృదయం
సినిమా చూస్తున్నంతసేపు ఆహా ఎంత గొప్పగా తీశాడు అని అనిపిస్తుంది. రాక్‌స్టార్‌ లాంటి ఓ భగ్నప్రేమికుడి కథలో రణ్‌బీర్ నటన చూసినప్పుడల్లా ఇతనిలో ఇంత గొప్ప నటుడున్నాడా అని ఆశ్చర్య మేస్తుంది. కథ, కథనం కొత్తగా కనిపిస్తుంది. అదే ఇంతియాజ్ అలీ డైరక్షన్‌ సిగ్నేచర్‌. సినిమా చూసిన ప్రతీ ఫ్రేంలోనూ ఇంతియాజ్‌ హృదయం కనిపిస్తుంది.
జబ్‌ వీ మెట్‌..కరీనా నటనలో కొత్త కోణం
ఇంతియాజ్‌ ప్రతిభ జబ్‌ వీ మెట్‌ చిత్రంలో కరీనా నటనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఇక లవ్‌ ఆజ్‌ కల్‌లో ప్రేమకథా చిత్రాల్లో కొత్త పంథా సృష్టించింది. ప్రేమ కథ అంటే భావోద్వేగాల సమాహారం. భావోద్వేగం పండించాలంటే నటీనటుల మూడ్‌ను సెట్‌ చేయగలగాలి అప్పుడే దర్శకుడు అనుకున్న భావం తెరపై కనిపిస్తుంది. ఫ్రేంలో లోతు కనిపిస్తుంది. ప్రేక్షకుడి హృదయం ద్రవిస్తుంది. ఇక ఆ నటీనటులు మాజీ ప్రేమికులైతే సీన్‌ ఎలా రక్తి కడుతుందో చూడాలంటే మాత్రం ఇంతియాజ్‌ తమాషా చూడాల్సిందే..
రణభీర్, దీపికా తీవ్ర భావోద్వేగానికిలోనయ్యారట
మాజీ ప్రేమికులైన రణబీర్‌కపూర్‌, దీపికాపదుకునే జంట ప్రస్తుతం తమాషా చిత్రంలో నాయకానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ ప్రేమగీతాన్ని తెరకెక్కించారు. అగర్ తుమ్ సాథ్‌హో అనే పల్లవితో సాగే ఈ గీతంలో నటించేటప్పుడు రణభీర్‌కపూర్, దీపికాపదుకునే తీవ్ర భావోద్వేగానికిలోనయ్యారట. గతించిన ప్రేమ జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకురావడంతో ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారట. భగ్న ప్రేమికుల హృదయాంతరంగాన్ని ఆవిష్కరించిన ఈ పాటలోని భావం మాజీ లవర్స్ దీపికా, రణబీర్‌లను ఇద్దరిని కలచివేసిందట. ఈ బ్రేక్‌అప్ పాటలో మాజీ ప్రేమికులిద్దరూ జీవించేశారని, సన్నివేశాలు చాలా సహజంగా వచ్చాయని దర్శకుడు ఇంతియాజ్ అలీ యూనిట్ సభ్యుల ముందు సంతోషాన్ని వ్యక్తం చేశారట. ఇటీవలే ఈ పాటను సోషల్‌మీడియాలో విడుదల చేయగా అద్భుతమైన స్పందన లభించిందని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

 

19:46 - November 23, 2015

విజయవాడ : సిల్క్ రూట్‌ను విశాఖ మీదుగా తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు చైనా బృందాన్ని కోరారు. అమరావతి నిర్మాణంలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడకు వచ్చిన చైనా ప్రతినిధులతో చంద్రబాబు... క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. చైనా మంత్రి చెన్‌ పెంగ్జిన్‌, మరో ఆరుగురు ప్రతినిధులు చంద్రబాబుతో సమావేశమయ్యారు. పెట్టుబడులకు షాంగై తర్వాత అమరావతిని సెకండ్ హోంగా భావించాలని సూచించారు. 

18:57 - November 23, 2015

ఢిల్లీ : వర్షాలు, వరదలతో నష్టపోయిన ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను కేంద్రం అన్ని విధాల ఆదుకుంటుందని పట్ణణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ దగ్గర ఉన్న ప్రకృతి వైపరీత్యాల నిధి నుంచి ఖర్చే చేయాలని కోరారు. ఆ తర్వాత కేంద్రం సాయం చేస్తుందని చెప్పారు. నిబంధనల ప్రకారం నిధుల విడుదల జరుగుతుందని వెంకయ్యనాయుడు చెబుతున్నారు.

 

18:52 - November 23, 2015

కర్నూలు : జిల్లాలోని ఆదోనిలో చెయిన్‌ స్నాచర్లు పెట్రేగిపోతున్నారు. పట్టణంలోని తిరుమలనగర్‌లో నివాసముంటున్న నారాయణమ్మ అనే మహిళ మెడలోని 4 తులాల బంగారు గొలుసును చెయిన్‌ స్నాచర్లు తెంపుకుపోయారు. ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై వచ్చి ఈ ఘటనకు పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న త్రీ టౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. త్రీటౌన్‌ పరిధిలో పదమూడు రోజుల వ్యవధిలో రెండో చెయిన్‌ స్నాచింగ్‌ కేసు నమోదయ్యింది. ఈనెల 10 న కూడా ఓ మహిళ మెడలోని గొలుసుకు దుండగులు తెంపుకుపోయారు. దీంతో శివారు ప్రాంతాల మహిళలు బయటకు రావాలంటనే భయపడుతున్నారు. కాలనీల్లో గస్తీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

18:47 - November 23, 2015

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో గెలుపుకోసం టీఆర్‌ఎస్‌ పార్టీ చాలా కుట్రలు చేస్తోందని టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపించారు.. వీటిని ఎదుర్కొనేందుకు రెండు పార్టీల కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.. తెలుగుదేశం పార్టీ గ్రేటర్‌ కార్యాలయంలో రెండు పార్టీల సంయుక్త సమావేశం జరిగింది.. ఈ భేటీలో టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

 

టీడీపీ, బీజేపీ సంయుక్త సమావేశం

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో గెలుపుకోసం టీఆర్‌ఎస్‌ పార్టీ చాలా కుట్రలు చేస్తోందని టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపించారు.. వీటిని ఎదుర్కొనేందుకు రెండు పార్టీల కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.. తెలుగుదేశం పార్టీ గ్రేటర్‌ కార్యాలయంలో రెండు పార్టీల సంయుక్త సమావేశం జరిగింది.. ఈ భేటీలో టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

మంత్రి పోచారంకు చుక్కెదురు

హైదరాబాద్ : కోర్సు పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు టీ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయడం లేదంటూ వెటర్నరీ సైన్స్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లోని పీవీ నరసింహారావు పశువైద్య కళాశాల తొలి వార్షికోత్సవానికి వచ్చిన మంత్రిని కాలేజ్ గేట్ వద్ద అడ్డుకున్నారు. వెంటనే నోటిఫికేషన్ జారీ చేయించాలని డిమాండ్ చేశారు. 

18:40 - November 23, 2015

హైదరాబాద్ : కోర్సు పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు టీ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయడం లేదంటూ వెటర్నరీ సైన్స్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లోని పీవీ నరసింహారావు పశువైద్య కళాశాల తొలి వార్షికోత్సవానికి వచ్చిన మంత్రిని కాలేజ్ గేట్ వద్ద అడ్డుకున్నారు. వెంటనే నోటిఫికేషన్ జారీ చేయించాలని డిమాండ్ చేశారు. దీంతో విద్యార్థులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెటర్నటీ విభాగంలో పోస్టుల భర్తీపై ఇప్పటికే సీఎంతో చర్చించానని.. రెండో విడత ఈ నోటిఫికేషన్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. 

18:36 - November 23, 2015

ఒకప్పుడు టీనేజర్స్ మొదలు పెద్ద వారి వరకు ప్రత్యేక సందర్భాలలో చీరలకు ప్రాధాన్యతనిచ్చేవారు. ఇప్పుడు అదే చీరల స్థానాన్ని లాంగ్ ఫ్రాక్స్ ఆక్రమించాయి. చక్కటి ఫ్యాబ్రిక్స్, అద్భుతమైన డిజైన్స్ తో రూపొందిన లాంగ్ ఫ్రాక్స్ అతివలను ఎంతో ఆకర్షిస్తున్నాయి. అలాంటి కలెక్షన్ ను పరిచయం చేసేందుకు ఇవాళ్టి సొగసు మీ ముందుకు వచ్చింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

18:34 - November 23, 2015

తరం మారింది. నవతరం కొత్తగా ఆలోచిస్తోంది. ఎలాంటి పనికైనా, కళకైనా తమ సృజనాత్మకతతో కొత్త హంగులద్దుతోంది. ఇదే పంథాతో అనేకమంది యువతీయువకులు తమకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారు. తామెంచుకున్న రంగాల్లో చెరగని సంతకం చేస్తున్నారు. అలాంటి ఓ కొత్తకెరటం అనుభవాలతో, అభిప్రాయాలతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి మానవి.
ఆదాయ మార్గానికి బాటలు
18 ఏళ్ల ప్రాయంలో ఏ ఆడపిల్లైనా, తన చదువు గురించో, తన కెరీర్ గురించో, లేదంటే అందమైన జీవితం గురించో ఆలోచిస్తుంది. కానీ వెన్నెల హరిత మాత్రం అందుకు భిన్నంగా తన అభిరుచికి పదును పెట్టుకుంటూ, ఆ అభిరుచికి సృజనాత్మక జోడిస్తూ, ఆదాయ మార్గానికి బాటలు వేసుకుంది. ఇతరుల కన్నా భిన్నంగా రాణిస్తోంది.
భవిష్యత్ పై హరిత భరోసా
హరిత భవిష్యత్ గురించి భరోసాగా ఉంది. తను ఎంచుకున్న రంగంలో రాణించడానికి మరింత కృషి చేస్తాననే ధీమా వ్యక్తం చేస్తోంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న వెన్నెల హరిత కు మానవి అభినందనలు తెలియచేస్తోంది. పోట్రేయిట్ పెయింటింగ్ లో ప్రత్యేకత సాధించాలని ఆశిస్తోంది.

 

సీఎం చంద్రబాబుతో చైనా బృందం భేటీ

విజయవాడ : ఎపి సీఎం చంద్రబాబుతో చైనా బృందం భేటీ అయింది. పెట్టుబడులకు షాంఘై తర్వాత అమరావతిని సెకండ్ హోమ్ గా భావించాలని చంద్రబాబు చైనా బృందాన్ని కోరారు. కోల్ కతా, చైన్నయ్ తో పోల్చితే.. ఎపి తూర్పు తీరానికి మధ్య భాగంలో ఉందని బృందానికి వివరించారు.

 

సీఎం కేసీఆర్ తో మంత్రి తుమ్మల భేటీ

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు భేటీ అయ్యారు. ఖమ్మం కార్పొరేషన్ కు అదనంగా 1600 డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు. మంత్రి వినతిపై సీఎం సానుకూలత వ్యక్తం చేశారు. 

యాదగిరిగుట్టను సిద్దిపేటలో కలిపేయోచన సరికాదు : మోత్కుపల్లి

హైదరాబాద్ : యాదగిరిగుట్టను జిల్లాగా ప్రకటించాలని స్థానికులు కోరుకుంటున్నారని టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. ఈ అంశాన్ని రాజకీయంగా చూడకూదన్నారు. సిద్దిపేటలో యాదగిరిగుట్టను కలపాలననుకోవడం సరికాదని హితవుపలికారు. నిరసగా గుట్టలో 25న వ్యాపార, విద్యా సంస్థలను బంద్ చేస్తున్నట్లు తెలిపారు. 27న ఆలేరు నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. 

17:44 - November 23, 2015

ఢిల్లీ : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్యోగుల విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం మరో కమిటీ వేసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో కమిటీని నియమించింది. మొత్తం ఐదుమంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఎపి, తెలంగాణ రెసిడెండ్ కమిషనర్లు, ఆర్థికశాఖ కార్యదర్శలు కమిటీ సభ్యులుగా ఉన్నారు. రెండు నెలల్లో విభజన సమస్యలను పరిష్కారం చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈనెల 26న తొలి సమావేశం జరుగనుంది. షెడ్యూల్ 9, 10లోని అంశాలు, ఉద్యోగుల విభజన అంశాలపై చర్చించనున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని చర్చించనున్నారు.

 

విభజన సమస్యల పరిష్కారానికి మరో కమిటీ

ఢిల్లీ : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్యోగుల విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం మరో కమిటీ వేసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో కమిటీని నియమించింది. మొత్తం ఐదుమంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. 

17:34 - November 23, 2015

ఢిల్లీ : ఐఎస్‌ చూపు భారత్‌పై పడిందా.. సౌత్‌ ఇండియాను టార్గెట్‌ చేసిందా....తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో యువకులు తీవ్రవాద సంస్థవైపు చూస్తున్నారా...అందులో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారా...? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి నిఘా సంస్థలు.
దక్షిణాదిపై ప్రత్యేక ఆసక్తి!
టెర్రర్‌ పుట్టిస్తున్న ఐఎస్‌ఐఎస్‌ తీవ్రవాద సంస్థ...ఇండియాను కూడా టార్గెట్‌ చేస్తోంది. భారత్‌ నుంచి ఎక్కువమంది యువకులను రిక్రూట్‌ చేసుకునే ప్రయత్నాల్లో ఐఎస్‌ ఉన్నట్లు నిఘా సంస్థలు పసిగట్టాయి. సౌత్‌ ఇండియాపై స్పెషల్‌ ఇంట్రస్ట్ చూపిస్తోందనే సమాచారం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
యువతే ఐఎస్‌ లక్ష్యం
సిరియా, ఇరాక్‌ వంటి దేశాల్లో గట్టి పట్టు సాధించిన ఐఎస్‌ తన మూలాలను విస్తరించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పలు దేశాల్లో సానుభూతిపరులను సృష్టించుకుంటోంది. యూత్‌ను టార్గెట్‌ చేస్తూ తమ భావజాలాన్ని విస్తరించేందుకు సామాజిక మాధ్యమాలను వాడుకుంటోంది. ఉద్రేకపూరితమైన ప్రసంగాలతో యువతను ఎట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. పాశ్చాత్య దేశాలతో పాటు యురోపియన్‌ కంట్రీస్‌లోనూ ఐఎస్‌ తన సానుభూతిపరులను తయారుచేసుకుంటోంది. ఏ దేశానికి చెందిన పౌరులను ఆదేశంపై దాడిచేసేలా ఐఎస్‌ కొత్త స్ట్రాటజీని అనుసరిస్తోంది. పారిస్‌లో జరిగిన ఊచకోతకు ఈ వ్యూహాన్నే ఐఎస్‌ ఫాలో అయ్యింది. ఆ దేశానికి చెందిన పౌరులనే దాడికి వాడుకుని నరమేథాన్ని సృష్టించింది.
దక్షిణ భారత్ లో 150 మంది సానుభూతిపరులు
భారత్‌పైనా ఐఎస్‌ దృష్టిసారించిందనే వార్తలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. దక్షిణాదిలో ఆ తీవ్రవాద సంస్థకు 150 మంది సానుభూతిపరులు ఉన్నట్లు నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. వీరిలో 18 మంది తెలంగాణకు చెందిన యువకులున్నారనే విషయం ఆందోళనకు గురిచేస్తోంది. తమిళనాడు నుంచి కూడా అధిక సంఖ్యలో యువకులు ఐఎస్‌ పట్ల ఆకర్షితులవుతున్నారని అధికారులు అనుమానిస్తున్నారు.
అప్రమత్తమైన నిఘా వర్గాలు
ఐఎస్‌కు ఇండియాలో సానుభూతిపరుల సంఖ్య పెరుగుతోందన్న సమాచారం నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఐఎస్‌ సానుభూతిపరులుగా భావిస్తున్న 150 మంది యువకులపైనా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ, తమిళనాడులతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాలపైనా నిఘా సంస్థలు దృష్టిసారించాయి.

 

17:29 - November 23, 2015

ముంబై : సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీలా సాగుతున్న ఈ ఎపిసోడ్‌లో కొత్త పాత్రలు ఎంటర్‌ అవుతున్నాయి. తాజాగా సీబీఐ విచారణలో అరెస్టు అయిన పీటర్‌ ముఖర్జియా నుంచి సరికొత్త విషయాలు బయట పడుతున్నాయి. షీనా హత్యలో తన ప్రమేయం ఉందనే విషయం బయటపడనుందని గ్రహించిన పీటర్‌ ముందు జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టారు. ఈ అతి జాగ్రత్తే సీబీఐకి పీటర్‌ చిక్కేలా చేసింది.
పీటర్‌ను అరెస్టు చేయడంతో కొత్త కోణం
షీనాబోరా హత్యకేసులో ఇంద్రాణీ భర్త పీటర్‌ను అరెస్టు చేయడంతో కొత్త కోణం వెలుగు చూసింది. హత్యకు సంబంధించిన సాక్ష్యాధారాలను మాయం చేశారని, తన భార్య ఇంద్రాణీ ముఖర్జీని కాపాడుకోవడానికి అబద్ధం చెప్పారని సీబీఐ ఆరోపణలు చేసింది. అలాగే షీనా కేసులో పీటర్‌ హత్యకు ముందు, జరిగేటప్పుడు, ఆ తర్వాత కూడా పీటర్‌ ఇంద్రాణికి సహకరించినట్లు తేలింది.
పీటర్‌ ముందు జాగ్రత్త చర్యలు
ఇదిలా ఉంటే షీనా హత్య కేసులో ఇంద్రాణి అరెస్టు అయిన అనంతరం తన ప్రమేయం కూడా బయట పడుతుందని ముందే గ్రహించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ముందే ఊహించిన పీటర్‌ వెంటనే ముందు జాగ్రత్త చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పీటర్‌ తన పేరిట ఉన్న ఇన్సురెన్స్ పాలసీలో నామినీలైన ఇంద్రాణీ, ఆవిడ కుమార్తె విధి బోరాలను తప్పించి తన కుమారులైన రాహుల్‌, రాబిన్‌ పేర్లకు మార్చాలని సదరు కంపెనీని కోరినట్లు తేలింది. అలాగే పాలసీ పూర్తయిన అనంతరం పాలసీ మొత్తం అందుకోవాల్సిన బ్యాంకు అకౌంట్లను సైతం మార్చాలని ఇన్సూరెన్స్ కంపెనీని కోరినట్లు సమాచారం.
పీటర్‌ లావాదేవీలపై నిఘా
సెప్టెంబర్‌ నెలలో పీటర్‌ కోల్‌కతాలోని ప్రముఖ బీమా సంస్థలకు సంప్రదించి తన పాలసీలో నామినీలను మార్చాల్సిందిగా కోరగా అందుకు సదరు సంస్థలు అంగీకరించాయి. సీబీఐ కేసు విచారణ చేపట్టిన అనంతరం ఇంద్రాణీ, పీటర్‌లకు సంబంధించిన లావాదేవీలపై నిఘా వేసిన నేపథ్యంలో పీటర్‌ కేసులో చిక్కినట్లు తెలిసింది.
2011లో షీనా, రాహుల్‌లకు నిశ్చితార్థం
ఇక కేసులో మరో కోణం విషయానికి వస్తే 2006 నుంచి షీనా బోరా పీటర్‌ కుటుంబంతో కలిసి ఉండటం ప్రారంభించింది. షీనాను ఇంద్రాణి తన కూతురుగా కాకుండా సోదరి అని పీటర్‌ కుటుంబానికి పరిచయం చేసింది. ఈ పరిణామంలో 2010లో షీనా పీటర్‌ కుమారుడు రాహుల్‌ను సహజీవనం చేయడం మొదలు పెట్టారు. 2011లో షీనా, రాహుల్‌లకు నిశ్చితార్థం అయింది. అయితే ఇందుకు ఇంద్రాణి విముఖత తెలిపింది. అదే సంవత్సరం రిలయన్స్ కు చెందిన ముంబై మెట్రోవన్‌లో షీనా అసిస్టెంట్‌ మేనేజర్‌గా చేరింది. ఇక 2012 ఏప్రిల్‌ 24 నుంచి షీనా బోరా కనిపించకుండా పోయింది. కొంత కాలానికి ఆమె పేరుతో మెట్రోవన్‌ అధికారులకు రాజీనామా లేఖ, రాహుల్‌కు బ్రేకప్‌ ఎస్సెమ్మెస్‌ అందాయి. అయితే ఈ ఎస్సెమ్మెస్‌, రాజీనామా లేఖల వెనుక ఇంద్రాణీ హస్తం ఉన్నట్లు తేలింది.
షీనా పేరిట ఉన్న సిగ్నేచర్‌ ఫోర్జరీ
షీనా బోరా హత్య జరిగిన రెండు రోజుల అనంతరం 2012 ఏప్రిల్‌ 26న ఫ్లాట్‌ను శుభ్రం చేయాల్సిందిగా ఇంద్రాణి తన సెక్రటరీ కాజల్‌ శర్మను కోరింది. దీంతో ప్రదీప్‌ అనే వ్యక్తిని ఫ్లాట్‌ క్లీన్‌ చేసేందుకు కాజల్‌ పంపించింది. ప్రస్తుతం ప్రదీప్‌ స్టేట్‌ మెంట్‌ను సీబీఐ రికార్డు చేసింది. అలాగే ఇంద్రాణి సెక్రటరీ కాజల్‌ శర్మ షీనా పేరిట ఉన్న సిగ్నేచర్‌ను ఫోర్జరీ చేసినట్లు సమాచారం. షీనా పనిచేస్తున్న రిలయన్స్ మెట్రో కంపెనీ ఆవిడ పేరిట రాజీనామా లేఖను కాజల్‌ శర్మ పంపినట్లు సమాచారం.
షీనా సంతకం ఫోర్జరీ చేసినట్లు కాజల్‌ శర్మ వాంగ్మూలం
ఇంద్రాణి ఆదేశం మేరకు షీనా పేరిట ఆవిడ సంతకం ఫోర్జరీ చేసినట్లు కాజల్‌ శర్మ వాంగ్మూలంలో తెలిపింది. అంతేకాదు షీనా పేరిట ఓ ఈ మెయిల్ ఐడీ క్రియేట్‌ చేసి పలు లావాదేవీలు సైతం చేసినట్లు కాజల్‌ శర్మ వాంగ్మూలంలో తెలిపింది. అలాగే షీనా ఫోన్‌ నుంచి ఇంద్రాణి రాహుల్‌కు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా ఎస్సెమ్మెస్‌ పంపినట్లు సమాచారం.

 

జమ్మూకాశ్మీర్ లో హెలిక్యాప్టర్‌ ప్రమాదం

శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్‌లో హెలిక్యాప్టర్‌ ఘోర ప్రమాదానికి గురైంది. ఏడుగురు యాత్రీకుల బృందంతో వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న హెలిక్యాప్టర్‌ కాట్రా వద్ద కుప్పకూలింది. సాంజీచాట్‌ నుంచి కాట్రాకు తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులతో పాటు ఓ మహిళా పైలట్‌ మృతి చెందారు.

17:20 - November 23, 2015

శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్‌లో హెలిక్యాప్టర్‌ ఘోర ప్రమాదానికి గురైంది. ఏడుగురు యాత్రీకుల బృందంతో వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న హెలిక్యాప్టర్‌ కాట్రా వద్ద కుప్పకూలింది. సాంజీచాట్‌ నుంచి కాట్రాకు తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులతో పాటు ఓ మహిళా పైలట్‌ మృతి చెందారు. ప్రమాదం నుంచి తప్పించేందుకు హెలిక్యాప్టర్‌ను బహిరంగ ప్రదేశంలో టేకాఫ్‌ చేయడానికి పైలెట్‌ చేసిన ప్రయత్నం విఫలమైందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. దట్టమైన పొగమంచు కారణంగానే హెలిక్యాప్టర్‌ ప్రమాదానికి గురైనట్టు ప్రాథమిక సమాచారం. పొగమంచు కారణంగా జమ్ము ఎయిర్‌పోర్టులో పలు విమానాలు ల్యాండ్‌ కాలేదు. ఈ ప్రమాదంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. పైలెట్‌ సుమితా విజయన్‌తో పాటు యాత్రికుల మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన వైష్ణోదేవి ఆలయానికి ప్రతిరోజు వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు.

16:55 - November 23, 2015

అనంతపురం : రాష్ట్ర విభజన జరిగి 18నెలలవుతున్నా..ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించడంలో కేంద్రం విఫలమైందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. డిసెంబర్‌ 7న ప్రత్యేక హోదాపై ఢిల్లీలో ధర్నా చేస్తామని ఆయన అన్నారు. అనంతపురం జిల్లాలోని తాడిమర్రి ఇసుక రీచ్‌లో అక్రమాలు బయటపెట్టినందుకు సీపీఐ నేతలపై కేసులు పెట్టారని..వాటిని వెంటనే ఉపసంహరించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

 

16:53 - November 23, 2015

తూర్పుగోదావరి : కాకినాడలో కలెక్టర్‌ కార్యాలయం ముందు అంగన్‌వాడీ కార్యకర్తలు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. 8 నెలల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు తీర్చాలని కోరారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారని.. కానీ ఇప్పుడు వాటిని అమలు చేయడం లేదన్నారు. ఐదు నెలల నుంచి వేతనాలు, టీఏ, డీఏ, గ్యాస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. రాజధాని పేరుతో వందల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నారని పేర్కొన్నారు. పుష్కరాలకు 1600 వందల కోట్ల రూపాయలు, పుట్టపర్తి సాయిబాబా జయంతికి 3 వందల కోట్లు ఇచ్చారని పేర్కొన్నారు. అంగన్ వాడీ కార్యకర్తల జీతాల చెల్లింపుకు, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం డబ్బులు లేవనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎపిలోని 13 జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. డిసెంబర్ 7 వ తేదీన సీఎం క్యాంప్ ఆఫీస్ ను ముట్టడిస్తామన్నారు.

 

16:44 - November 23, 2015

విశాఖ : ఎపి సర్కార్.. కబుర్ల ప్రభుత్వమని... చేతల ప్రభుత్వం కాదని ఎమ్మెల్సీ ఎంవిఎస్. శర్మ విమర్శించారు. విశాఖ జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలు మళ్లీ ఆందోళన ప్రారంభించారు. పెంచిన జీతాలకు సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చూస్తూ విశాఖ కలెక్టరేట్‌ దగ్గర రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలు చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు శర్మ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తాను సమర్థవంతమైన సీఎంగా చెప్పుకుంటున్నారు... కానీ కీలకమైన సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు అసమర్థత కనపడుతుందని ఎద్దేవా చేశారు. పుష్కరాలకు బడ్జెట్ లో రూ.600 కోట్లు కేటాయించగా.. 16 వందల కోట్ల రూపాయలను ఖర్చు చేశారని పేర్కొన్నారు. కానీ అంగన్ వాడీల జీతాలను మాత్రం పెంచడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి ప్రయోజనం కలిగే కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు సరిగ్గా లేవన్నారు. అంగాన్ వాడీల సమస్యలను పరిష్కరించడంలో ఎపి సర్కార్ తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

16:32 - November 23, 2015

నెల్లూరు : జిల్లాలోని గూడూరులో వరద ఉధృతికి ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు. భారీ వర్షాలకు గూడూరులోని వాగు పొంగిపోవడంతో వ్యక్తి వరద ప్రవాహంలో కొట్టుకు పోకుండా చెట్టును పట్టుకొని వేలాడుతున్న ఘటన చోటుచేసుకుంది. వరదల్లో చిక్కుకున్న వ్యక్తి సహాయం కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

 

16:26 - November 23, 2015

చిత్తూరు : జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు మృతి చెందారు. శ్రీకాళహస్తి డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులు ఒక బస్సు శ్రీకాళహస్తి నుంచి తిరుమలకు, మరో బస్సు తిరుమల నుంచి శ్రీకాళహస్తికి వస్తోంది. మార్గంమధ్యలో శ్రీకాళహస్తిలో మేర్లపాక వద్ద మూలమలుపులో రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సుల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఇరు బస్సుల్లో ఉన్న మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి

చిత్తూరు : జిల్లాలోని శ్రీకాళహస్తిలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే చనిపోయారు. సుమారు 20మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

15:50 - November 23, 2015

హన్మకొండ : వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కౌంటింగ్‌ కోసం ఎనుమాముల మార్కెట్‌లో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 

వరంగల్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తి

హన్మకొండ : వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కౌంటింగ్‌ కోసం ఎనుమాముల మార్కెట్‌లో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 

గగన్‌పహాడ్‌ లో వ్యర్ధ పదార్ధాల దగ్ధం...దట్టమైన పొగలు

రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్‌ గగన్‌పహాడ్‌ పారిశ్రామికవాడలో వ్యర్ధ పదార్ధాలను తగలబెట్టారు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడి.. ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగతో నిండిపోయింది. ఆ ప్రాంతంలో హైటెన్షన్ విద్యుత్‌ తీగలు ఉండటంతో.. స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

 

అనంతపురంలో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం మోసం

అనంతపురం : పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ కాలేజ్ యాజమాన్యం నిర్వాకం కారణంగా 50 మంది డీఎడ్ విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైంది. రెండేళ్ల డీ ఎడ్ కోర్సు చేసేందుకు 50 విద్యార్థులు కళాశాలలో చేరారు. అయితే సదరు కళాశాలకు ప్రభుత్వం నుంచి పర్మిషన్‌ లేదు. అయినా విద్యార్థుల నుంచి రెండేళ్లకు సంబంధించిన ఫీజులు వసూలు చేశారు. తీరా పరీక్షలు ఉండగా కళాశాల పర్మిషన్‌ సమస్య కోర్టులో ఉందని..హాల్ టికెట్లు అందలేదంటూ యాజమాన్యం చేతులెత్తేసింది. తమ రెండేళ్ల కాలాన్ని, జీవితాన్ని వృథా చేశారంటూ విద్యార్థులు యాజమాన్యంపై మండిపడుతున్నారు. 

అవినీతికి పాల్పడుతున్న చంద్రబాబు : శ్రీకాంత్‌ రెడ్డి

హైదరాబాద్ : చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అవినీతిపై తమ దగ్గర ఆధారాలున్నాయన్నారు. అవినీతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

15:39 - November 23, 2015

అనంతపురం : పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ కాలేజ్ యాజమాన్యం నిర్వాకం కారణంగా 50 మంది డీఎడ్ విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైంది. రెండేళ్ల డీ ఎడ్ కోర్సు చేసేందుకు 50 విద్యార్థులు కళాశాలలో చేరారు. అయితే సదరు కళాశాలకు ప్రభుత్వం నుంచి పర్మిషన్‌ లేదు. అయినా విద్యార్థుల నుంచి రెండేళ్లకు సంబంధించిన ఫీజులు వసూలు చేశారు. తీరా పరీక్షలు ఉండగా కళాశాల పర్మిషన్‌ సమస్య కోర్టులో ఉందని..హాల్ టికెట్లు అందలేదంటూ యాజమాన్యం చేతులెత్తేసింది. తమ రెండేళ్ల కాలాన్ని, జీవితాన్ని వృథా చేశారంటూ విద్యార్థులు యాజమాన్యంపై మండిపడుతున్నారు.

 

 

15:36 - November 23, 2015

హైదరాబాద్ : చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అవినీతిపై తమ దగ్గర ఆధారాలున్నాయన్నారు. అవినీతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలని ఆయన డిమాండ్‌ చేశారు. పేదలు, రైతుల భూములను లాక్కొని సీఎం తన బంధువులకు, అనుచరులకు కారు చౌకగా కట్టబెడుతున్నారని ఆరోపించారు.

 

 

15:33 - November 23, 2015

ఢిల్లీ : దేశంలో అల్‌ఖైదా దాడులకు తెగబడే అవకాశముందని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఐబీ హెచ్చరికలతో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌ నగరాలలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ నగరాల్లో ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశముందని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.

 

దేశంలో అల్‌ఖైదా దాడులకు తెగబడే అవకాశం : కేంద్ర ఇంటెలిజెన్స్

ఢిల్లీ : దేశంలో అల్‌ఖైదా దాడులకు తెగబడే అవకాశముందని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఐబీ హెచ్చరికలతో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌ నగరాలలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ నగరాల్లో ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశముందని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.

 

యాదగిరిగుట్టలో డిసెంబర్ 1న మోత్కుపల్లి నిరసన దీక్ష

హైదరాబాద్ : యాదగిరిగుట్టలో డిసెంబర్ 1న టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహ్మ నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఈమేరకు ఆయన నిరసన దీక్ష పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్టను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.   

12:04 - November 23, 2015

అనుష్క‌, ఆర్య ప్రధాన‌ పాత్రలలో న‌టించిన చిత్రం సైజ్ జీరో. తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ చిత్రం న‌వంబ‌ర్ 27న గ్రాండ్ లెవ‌ల్‌లో విడుద‌ల‌వుతోంది. ఈ చిత్రం కోసం అనుష్క 20 కిలోల బ‌రువు పెరిగిందంట. అనుష్క ఇలాంటి డిఫ‌రెంట్ రోల్ చేయ‌డంతో సినిమాపై ప్రేక్షకుల్లో, ట్రేడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తి పెరిగింది. ఈ చిత్రంలో ప‌లు సినీ సెల‌బ్రిటీలు ముఖ్య‌పాత్రల్లో క‌నిపించ‌నున్నారని వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున‌, ద‌గ్గుబాటి రానా, రంగం హీరో జీవా, హీరోయిన్స్ హ‌న్సిక‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, త‌మ‌న్నా, శ్రీదివ్య‌, రేవ‌తి, మంచు ల‌క్ష్మి త‌దిత‌రులు స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ లో క‌న‌ప‌డ‌నున్నారని తెలుస్తోంది. ఇంత మంది సినీ సెల‌బ్రిటీలు ఈ చిత్రంలో స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ చేయ‌డానికి కార‌ణం ఆర్య‌, అనుష్కల‌తో వారికున్న స్నేహ సంబంధమే కాకుండా పెద్ద నిర్మాణ సంస్థ అయిన పివిపి బ్యాన‌ర్‌తో ఉన్న ప్రొఫెష‌న‌ల్ రిలేష‌న్ షిప్‌ అని తెలుస్తోంది. 

12:02 - November 23, 2015

దక్షిణ భారతదేశంలోని రెండు రాష్ట్రాల పోలీసులను వణికించిన స్మగ్లర్ వీరప్పన్‌ను చంపిన పోలీస్ ఆఫీసర్ కథాంశంతో, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'కిల్లింగ్ వీరప్పన్' ను చిత్రం తెరకెక్కుతోంది. విడుదల విషయంలో వర్మ ఆదివారం ఒక ప్రకటన చేశారు. డిసెంబర్ 4వ తేదీన తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వర్మ తెలిపారు. సినిమాలో వీరప్పన్‌ను చంపిన పోలీస్ ఆఫీసర్‌గా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ నటిస్తుండడంతో చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అన్ని భాషల్లోనూ సుమారు 2వేలకు పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుండగా ప్రేక్షకులను అలరిస్తుందా ? లేదా ? అనేది వేచి చూడాలి. 

మంత్రి మృణాళిని భర్త కు గుండె పోటు..

విజయనగరం : రాష్ట్రమంత్రి కిమిడి మృణాళిని భర్త కిమిడి గణపతిరావుకు గుండెపోటు వచ్చింది. ఆయన్ను విశాఖలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం అందటంతో జిల్లాలో అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకొని మంత్రి హుటాహుటిన విశాఖకు బయలుదేరారు.

విజయవాడ లో 32 ఏళ్ల మహిళపై రౌడీషీట్‌

కృష్ణా :విజయవాడ నగరంలోని మాచవరం పోలీసుస్టేషనులో తొలిసారి రౌడీ షీట్‌ తెరిచారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న 32 ఏళ్ల మహిళపై రౌడీషీట్‌ తెరిచారు. గత 15 ఏళ్లలో ఓ మహిళపై తొలిసారి రౌడీషీటు తెరవడం విశేషం.

రాజేంద్ర నగర్ లో అగ్ని ప్రమాదం...

రంగారెడ్డి : రాజేంద్రనగర్ గగన్‌పహాడ్‌లో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రసాయన డంపింగ్ యార్డులో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తుంది.

11:54 - November 23, 2015

హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద మూకలు విరుచుకుపడుతున్న నేపథ్యంలో బెల్జియం అప్రమత్తమైంది. దాడులు చేస్తున్న వారిలో ఎక్కువమంది బెల్జియానికి చెందినవారే ఉండటంతో ఉలిక్కిపడింది. ఏక్షణమైనా ఇస్లామిక్ స్టేట్ తమపై కూడా దాడులు చేసే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో రాజధాని బ్రస్సెల్స్ ఖాకీవనంగా మారింది. సుమారు 16 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. పౌరుల ఇళ్లల్లోకి చొరబడి మరీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతర్గత భద్రతా విభాగం సూచన మేరకు మెట్రో, లైట్‌ రైల్వే స్టేషన్లను మూసివేస్తున్నట్లు బ్రస్సెల్స్‌ రవాణా సంస్థ తన వెబ్‌సైట్‌లో ఒక ప్రకటనలో వివరించింది.

పీఎస్ బీ చీఫ్ లతో జైట్లీ భేటీ..

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల ఛైర్మన్ లతో భేటీ అయ్యారు. బ్యాంకుల్లో పెరుగుతున్న మొండిబకాయిల సమస్యతో పాటు రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపునకు సంబంధించి సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

11:51 - November 23, 2015

మహబూబ్ నగర్ : కల్తీ రాయుళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. బేగంబజార్‌లో కల్తీ మసాలాల ఘటన మరువక ముందే.. అదే తరహా ఘటన పాలమూరులో వెలుగుచూసింది. పశువుల ఎముకలతో నూనెలు తయారు చేస్తూ పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి వస్తువునూ కల్తీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు కల్తీ రాయుళ్లు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. పప్పులు, మసాలాలు, నూనెలు, పాలు ఇలా అన్ని రకాల వస్తువులను కల్తీ చేస్తున్నారు.

టీడీ గుట్ట ప్రాంతానికి చెందిన ఖురేషి ......

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీడీ గుట్ట ప్రాంతానికి చెందిన ఖురేషి గత కొంతకాలంగా తన ఇంట్లో పశువుల ఎముకలు, కళేభరాలతో గుట్టుగా నూనెను తయారు చేస్తున్నాడు. ఇక్కడ తయారు చేసిన నూనెను జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలకు సరఫరా చేసి క్యాష్‌ చేసుకుంటున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ ఇంటిపై దాడి చేసి పశువుల ఎముకలతో తయారు చేసిన 26 డబ్బాల కల్తీ నూనెని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కల్తీ నూనెను హోటళ్లు, కిరాణా షాపుల్లో విరివిగా విక్రయిస్తున్నట్టు చెబుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

లష్కర్ మిలిటెంట్ హతం..

జమ్మూ కాశ్మీర్ : కుప్వారా ప్రాంతంలో భద్రతా దళాలు..ఉగ్రవాదులకు జరిగిన కాల్పుల్లో ఒక లష్కర్ తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు. ఇద్దరు ఆర్మీ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. 

11:48 - November 23, 2015

గుంటూరు : ఆ క్యాంపస్‌కు పట్టిన దెయ్యం వదల్లేదు. నాగార్జున యూనివర్శిటీని ర్యాగింగ్‌ రక్కసి విడిచిపెట్టలేదు. రిషితేశ్వరి మరణం తర్వాత భారీ సంస్కరణలు తెచ్చామన్న అధికారులు.. మళ్లీ ర్యాగింగ్‌ కలకలంతో ఉలిక్కిపడ్డారు. అదికూడా ఆర్కిటెక్చర్‌ కాలేజిలోనే జరగడం మరింత అవమానకరంగా మారింది. ఫిర్యాదు అందుకున్న అధికారులు ముగ్గురు విద్యార్ధులను డిబార్‌ చేయగా.. మరో ఇద్దరిని నెలరోజులపాటు సస్పెండ్‌ చేశారు. వివరాలు తెలుసుకున్న మంత్రి గంటా సీరియస్‌గా స్పందించారు. ఇంకా ర్యాగింగ్‌ ఎలా కొనసాగుతుందని అధికారులను నిలదీసినట్లు తెలుస్తోంది. మంత్రి రేపు క్యాంపస్‌లో పర్యటించనున్నారు.

 

 

చైనా మంత్రితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

 విజయవాడ :చైనా మంత్రి చెనఫెంగ్సియాంగ్‌తో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎంతోపాటు రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, రావెల, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చైనా మంత్రితోపాటు ఆ దేశ అధికారుల బృందం ఉన్నారు. చైనా బృందం అమరావతి, రాయపూడిలలో పర్యటించనుంది. చైనా మంత్రితో పాటు అధికారుల బృందానికి సీఎం విందు ఇవ్వనున్నారు. ఈ భేటీలో అమరావతి అభివృద్ధి గురించి చర్చించారు.

10:54 - November 23, 2015

హైదరాబాద్ : ఏసీబీ దాడుల్లో పట్టుబడిన మాజీ ఏసీపీ సంజీవరావు అస్వస్ధతకు గురయ్యారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో సంజీవరావు రిమాండ్‌లో ఉన్నారు.

10:53 - November 23, 2015

హైదరాబాద్ : పాలకుర్తి మండలం బమ్మెరలో పై నుంచి వచ్చిన డబ్బులను మహిళా సంఘాల వీవోలు మధ్యలోనే కాజేశారని కొంత మంది మహిళలు ఆరోపిస్తున్నారు. వరంగల్‌ ఉప ఎన్నికలో డబ్బులు భారీగానే పంచారని తెలుస్తోంది. అధికార పార్టీ ఈ విషయంలో ముందంజలో ఉన్నట్లు తాజా ఘటన తెలియచేస్తోంది. పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో వీవోలు డబ్బులు పంచకుండా వారే కాజేశారని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు గ్రామానికి రూ. 50 వేల నుంచి లక్ష వరకు పంచితే తమకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని డ్వాక్రా మహిళలకు పంచాలంటూ ముగ్గురు సీఏలకు ఒక్కొక్కరికీ రూ.50 వేలు ఇచ్చారని అన్నారు. అయితే, సీఏలు వేరే పార్టీలకు చెందిన వారని, అందుకే తమకు డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు. డబ్బు పంపిణీ విషయం నేతల ద్వారా తెలిసిన తర్వాత ఆదివారం నాడు కమ్యూనిటీ హాలు వద్ద టెంటు వేసుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆందోళన చేసినట్లు వెల్లడించారు. తమకి ఆ డబ్బులు పంచాల్సిందేనని వారు డిమాండ్‌ చేశారు.

 

10:48 - November 23, 2015

నెల్లూరు : జిల్లా గూడూరు ప్రాంతం భారీ వర్షం అతలాకుతలమైపోయింది. రాత్రి 7 గంటల నుంచి నాన్‌స్టాప్‌గా కురుస్తున్న వర్షంతో.. వరద ముంపుకు గురైంది. కైవల్యానది పొంగి పొర్లడంతో ఐదుగురు గల్లంతయ్యారు. స్థానికులు రక్షించడానికి ప్రయత్నించగా ఒకరు బతికి బయటపడ్డారు. తిప్పవరపుపాడు వద్ద ఈ ఘటన జరిగింది. వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు.

బిజెపి రాజీనామా చేసిన యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ : పాలమూరు జిల్లాలో బీజేపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఉదయం ఆ పార్టీకీ రాజీనామా చేశారు. దివంగత రాజేశ్వర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తరఫున యెన్నం గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని యెన్నం స్పష్టం చేశారు.

నందలూరు వద్ద దెబ్బతిన్న రైల్వే ట్రాక్

కడప :నందలూరు వద్ద వర్షాలకు దెబ్బతిన్న రైల్వే ట్రాక్ కు అధికారులు మరమ్మత్తులు చేస్తున్నారు. దీని కారణంగా కడప – అరక్కోణం, అరక్కోణం - కడప మధ్యనడిచే ప్యాసింజర్ రైళ్లు పాక్షింకగా రద్దు అయ్యాయి.తిరుపతి - హుబ్లీ - హుబ్లీ -తిరుపతి ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేశారు.

.

రేణిగుంట విమానాశ్రయానికి జగన్

 నెల్లూరు : జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ అధినేత జగన్‌మోహనరెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం ఆయన సోమవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి రైల్వేకోడూరు, ఏర్పేడు, నాయుడుపేటల మీదుగా నెల్లూరు జిల్లాకు చేరుకొని అక్కడి వరద బాధితులను పరామర్శించనున్నారు.

 

బీరంగూడలో ఐదేళ్ల బాలుడు అదృశ్యం

మెదక్ : బీరంగూడలో ఐదేళ్ల బాలుడు పృధ్వీ అదృశ్యమయ్యాడు. డార్విన్ పాఠశాలలో ఎల్ కేజీ చదువుతున్న పృద్వి అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మాజీ ఏసీపీ సంజీవరావుకు అస్వస్థత

హైదరాబాద్ : చంచల్ గూడ జైల్లో మాజీ ఏసీపీ సంజీవరావు అస్వస్థతకు గురయ్యారు. ఆదాయానికి మంచి ఆస్తులున్న కేసులో ఇటీవల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే...

కృషి విద్యానికేతన్ డీఈడీ విద్యార్థుల ఆందోళన

కర్నూలు : ఆళ్లగడ్డ కృషి విద్యానికేతన్ డీఈడీ కాలేజీ ఎదుట హాల్ టికెట్లు ఇవ్వలేదని విద్యార్థుల ఆందోళ చేపట్టారు. అంతే కాకుండా పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

ఓయూ రిజిస్ట్రార్ పదవీ కాలం పొడిగింపు...

 హైదరాబాద్ : ఓయూ రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ ఈ.సురేష్‌ కుమార్‌ పదవీ కాలాన్ని మ రో ఏడాది పాటు పొడిగించారు. ఓయూ పాలక మండలి చేసిన తీర్మానం మేరకు ఓయూ ఇనచార్జి వైస్‌ చాన్సలర్‌ రంజీవ్‌ ఆచార్య ఉత్తర్వులు జారీచేశారు. ఓయూ రిజిస్ర్టార్‌గా ప్రొఫెసర్‌ సురేష్‌ కుమార్‌ గతేడాది నవంబరు 29న బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 28తో ఆయన పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో అధికారులు తిరిగి ఆయననే రిజిస్ర్టార్‌గా మరో ఏడాది పాటు కొనసాగించేందుకు నిర్ణయించి ఉత్త ర్వులు జారీచేశారు.

నెల్లూరు జిల్లాలో వరదనీటిలో మగ్గురు గల్లంతు

 నెల్లూరు : గూడూరు మండలం తిప్పవరపాడు దగ్గర వరద నీటిలో ముగ్గురు గల్లంతు అయ్యారు. సైదాపురం వైపు వెళ్లే దారిలో వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రోడ్డు దాటబోయి నీటిలో కొట్టుకుపోయారు. ఇద్దరు మహిళలు సహా ఓ యువకుడు కొట్టుకుపోయారు. వారికోసం గాలిస్తున్నారు.

శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు..

హైదరాబాద్ : కార్తీక సోమవారం సందర్భంగా మల్లన్న క్షేత్రం భక్తులతో నిండి పోయింది. పుణ్యస్నానాలు ఆచరించి స్వామి దర్శనం కోసం భక్తులు అర్థరాత్రి నుంచే బారులు తీరారు. వేలాది మందిగా తరలిరావటంతో స్వామి దర్శనానికి ఆరుగంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. రద్దీ కారణంగా అధికారులు అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసి, స్వామి వారి అలంకార దర్శనాన్ని అమలు చేశారు.

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం : నలుగురి మృతి

హైదరాబాద్ : ఢిల్లీలోని జేజే కాలనీలో భాల్ స్వా డెయిరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం.

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం : ముగ్గురి మృతి

 నెల్లూరు : జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. తడ మండలం పూడి దగ్గర ఆటోను బైక్‌ ఢీకొని ఇద్దరు మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. నాయుడుపేట దగ్గర జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మరణించాడు.

09:32 - November 23, 2015

తిరుపతి : చంద్రగిరి మండలం కల్యాణి డ్యాం జలాశయం నిండుకుండలా మారింది. ఎన్నాళ్లుగానో చూస్తున్న ప్రజల కళ నేటితో నేరవేరింది. డ్యాం పూర్తిగా నిండిపోవడంతో ఆదివారం సాయంత్రం గేట్లు తెరిచారు. 20 ఏళ్ల తరువాత రెండు గేట్లు ఎత్తివేసి నీటిని కిందకు వదిలారు. డ్యాం నిండడంతో ప్రజల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తమ దాహార్తీ తీరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విస్తారంగా కురిసిన వర్షాలతో డ్యాంలోకి ఎగువ ప్రాంతాలైన శేషాచల కొండలోని రాగిమానుకోన, అనుంకోన, అబ్బాలమేరు, గుండాలపెంట, కరివేపాకు కోన, అన్నదుమ్మల కాల్వ,ఈ చీకిమానుకోన ప్రాంతాల నుండి జాలువారిన నీరు డ్యాంలో చేరాయి. ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు కుండపోతగా కురిసిన వర్షం వల్ల డ్యాం ఎగువ ప్రాంతం నుండి మూడు వేల క్యూసెక్కుల వరదనీరు డ్యాంలోకి చేరాయి. అంతేమోదాలో వరదనీటిని కల్లేటివాగులోకి విడిచిపెడుతున్నారు. వరదనీటిని కిందకు వదులుతుండడంతో ముంపు ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

జలాశయం విశేషాలు..

  • తిరుమల - తిరుపతి పుణ్యక్షేత్రాల దాహార్తి తీర్చేందుకు 1972లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కల్యాణి డ్యాంకు శంకుస్థాపన చేశారు.
  • 500మీటర్ల పొడవు..36 అడుగుల ఎత్తుతో నిర్మితమైంది. ఈ జలాశయాన్ని 1979లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రారంభించారు.
  • వంద అడుగుల నీటి నిల్వ సామర్థ్యంతో డ్యాంను నిర్మించారు.
  • తొలిసారిగా 1991లో కురిసిన భారీ వర్షాలతో నిండిన డ్యాం గేట్లు ఎత్తిన సమయంలో నీటి ఉధృతికి మధ్యలోని గేటు విరిగింది.
  • 1997లో కురిసన వర్షాలతో డ్యాంలోకి 97.55 అడుగుల మేర వరదనీరు చేరిన సందర్భంగా రెండు గేట్లను ఎత్తి మిగులునీటిని విడుదల చేశారు.
  • డిసెంబర్ 2005, జనవరి 2006లో కురిసన వర్షాలకు డ్యాం గేట్ లెవల్ కు నీళ్లు చేరాయి.
  • 2008 జనవరిలో కురిసిన వర్షానికి డ్యాంలో 97.09 అడుగుల మేర నీరు చేరింది. 24గంటల పాటు మధ్య గేటును మూడు అంగుళాల మేర ఎత్తి మిగులు నీటిని విడుదల చేశారు. 
09:19 - November 23, 2015

వరంగల్ : ఉభయ రాష్ట్రాల్లో నిత్యం రోడ్లు రక్తమోడుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒక చోట జరుగుతున్న ప్రమాదాల్లో నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. నిద్రమత్తులో ఒకరు..మద్యం మత్తులో మరొకరు..నిర్లక్ష్యంగా నడపడం..ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలోని బచ్చన్నపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. రఘునాథపల్లి మండలం నిడుగొండకు చెందిన కార్తీక్, మహేష్ లు ఇద్దరు వ్యక్తులు సొంత పనులపై హైదరాబాద్ కు కారులో వెళ్లి వస్తున్నారు. ఐనాపూర్ వద్ద ఉన్న క్రాసింగ్ వద్దకు రాగానే అతివేగంగా ఉన్న కారు అదుపు తప్పింది. అక్కడనే ఓ చెట్టుకు బలంగా ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడనే మృతి చెందారు. స్థానికులు వీరి మృతదేహాలను బయటకు తీశారు. నిద్రమత్తులో ఉండడం..గమనించే లోపు ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. 

09:15 - November 23, 2015

ప్రకాశం : కంటికి రెప్పలా కాపడాల్సిన తల్లిదండ్రులు పసిపిల్లలను హతమారుస్తూ నిందితులవుతున్నారు. ఒంగోలులోని మదర్ థెరిస్సా కాలనీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సొంత తల్లిదండ్రులు క్షుద్రపూజల పేరిట రెండు నెలల బాబును హత్య చేశారు. రాజిరెడ్డి అనే వ్యక్తి భూత వైద్యుడనే పేరు ఉంది. ఇతనికి అక్కడనే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. వీరికి రెండు నెలల బాబు ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈ బాబును రాజిరెడ్డి, మహిళ హత్య చేశారు. క్షుద్రపూజల పేరిట చేసిన ఈ హత్య వెనుక ఓ వ్యాపారి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

బచ్చన్నపేటలో రోడ్డు ప్రమాదం..

వరంగల్ : బచ్చన్నపేట (మం) ఐనాపూర్ వద్ద కారు చెట్టును ఢీకొంది. ఈఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు రఘనాథపల్లి (మం) నిడుగొండ వాసులుగా గుర్తించారు. 

అస్సాంలో రోడ్డు ప్రమాదం..ఐదుగురి మృతి..

అస్సాం : రాష్ట్రంలోని దుబ్రి ప్రాంతంలో బస్ - ట్రక్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. 

08:46 - November 23, 2015

వాకింగ్‌, జాగింగ్‌ చేసే అలవాటు లేదా?! ఒకప్పుడు ఉన్నా.. ఈమధ్య తీరుబడిలేక మానేశారా?! చాలా రోజులుగా మళ్ళీ ఉదయంపూట నడక ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే ''మంచి కాలం ఇదేనండోయ్'' అంటున్నారు ఆరోగ్యనిఫుణులు. బాగా వేడిగా ఉండే ఎండాకాలం, జోరుగా వానలు పడే వర్షాకాలంలో వాకింగ్‌, జాగింగ్‌లకు కాస్త అంతరాయం కలగొచ్చు. కానీ చలిచలిగా ఉండే శీతాకాలంలో మాత్రం ఎలాంటి ఆటంకాలూ ఉండవు. నడక అయినా, కాస్త వ్యాయామమైనా శీతాకాలం అందరికీ అనువైనకాలం. ఈ సీజన్లో చల్లగా ఉండే వాతావరణ పరిస్థితులు కూడా ఓపిక చేసుకుని నడవడానికి అనుకూలిస్తాయి అన్నది నిఫుణుల మాట. దీనికి కావాల్సిందల్లా.. బద్ధకం పక్కనపెట్టి, దుప్పటి ముసుగును తీసేసి హుషారుగా ట్రాక్‌ సూట్‌తో రెడీ అయితే చాలు. జోరుగా హుషారుగా నడక సాగినట్టే. అందుకు ఈరోజే ముందడుగు వేసే ప్రయత్నం చేయండి.! మీ ఆరోగ్యం మీచేతుల్లోనే.!!

ఆప్ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్..

ఢిల్లీ : ఆప్ ఎమ్మెల్యే సరితా సింగ్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సరితా సింగ్ రాష్ డ్రైవింగ్ తో పోలీసు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు.

చెన్నైలో స్తంభించిన జనజీవనం..

చెన్నై : కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. నివాసాల్లోకి నీళ్లు చేరడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. రహదారులపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

న్యూ ఆర్లాన్స్ లో కాల్పులు..పది మంది మృతి..

అమెరికా : న్యూ ఆర్లాన్స్ లో జరిగిన ఓ పార్టీలో ఆగంతకుడు కాల్పులు జరిపారు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో పది మంది అక్కడికక్కడనే మృతి చెందారు. 

08:27 - November 23, 2015

పోలీసులకు వాహనాలు..భవంతులు కాదని..ఆ వ్యవస్థలో మార్పులు రావాలని ద హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. నగరంలో కమాండ్ కంట్రోల్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మరోవైపు చెన్నై ఇంజనిరింగ్ కాలేజీలో ర్యాగింగ్ భూతానికి మరొక విద్యార్థి బలయ్యాడు. ఈ అంశాలపై టెన్ టివిలో 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. ఆయన మాటల్లోనే...

పోలీసు వ్యవస్థలో మార్పులు..
ఇటీవలే పోలీసులకు ఆధునిక కార్లు..మోటర్ సైకిళ్లు ఇచ్చారు. ఇదంతా ఒక ఎత్తు. మౌలికంగా పోలీసు వ్యవస్థలో మార్పులు రావాలి. దేశ వ్యాప్తంగా రాష్ట్రాల బడ్జెట్ చూస్తే పోలీసు వ్యవస్థ పై పెట్టేది 4.3 శాతం మాత్రమే. ఇందులో 80 శాతం పోలీసుల జీత భత్యాలకు పోతుంది. ఆధునికీకరణ కోసం..అభివృద్ధి కోసం నిధులు ఉండవు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 20 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దిగువస్థాయిలో ఉద్యోగాలు ఖాళీలున్నాయి. వీరిపై పని భారం ఎక్కువ. వేతనాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. అన్ని రకాల సమస్యలకు ఒకే రకమైన పోలీసు ఉంటోంది.

ఏమి చేయాలి..?
ఖాళీలను పూర్తి చేయడం..దిగువ స్థాయి పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలి. రకరకాల శిక్షణ ఉండాలి. ఆధునిక సవాళ్లు ఎదుర్కొనే విధంగా శిక్షణ ఉండాలి. ఆధునికమైన ఆయుధాలు ఉండాలి. లా అండ్ డిపార్ట్ మెంట్, ఇన్వేస్టిగెంట్ మెంట్ ను వేరే విధంగా చూడాలి. ఇంటిలెజెన్స్ వ్యవస్థ బలంగా ఉండాలి.

ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉండాలి...
సామాన్యుడు పీఎస్ లో వెళితే ఎలాంటి పరిస్థితి ఉంది ? ప్రజలకు..పోలీసులకు సన్నిహిత సంబంధాలు ఉండాలి. పోలీసు అంటే నెగటివ్..పాజిటివ్ మీనింగ్ లున్నాయి. ఆధునిక..భవనాలు..టెక్నాలజీ.. బలవంతమైన..అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన పోలీసు వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

ర్యాగింగ్ మానవ హక్కుల ఉల్లంఘన...
ర్యాగింగ్ పై అత్యున్నత న్యాయస్థానం పలు తీర్పులు చెప్పింది. 2006 రాఘవన్ కమిటీ నియమించింది. ఈ కమిటీ పలు సూచనలు చేసింది. విశ్వవిద్యాలయాయాల్లో ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి. ఎన్నికైన విద్యార్థులు ఉండాలి. ర్యాగింగ్ మానవ హక్కుల ఉల్లంఘనే అని కోర్టు పేర్కొంది. విద్యా సంస్థ యాజమాన్యాలు జవాబుదారితనంగా ఉండాలని చెప్పింది. యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఉండాలి. ఇందులో తల్లిదండ్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సీనియర్స్, జూనియర్స్, ఉపాధ్యాయులు వంటి వారు ఉండాలి. ర్యాగింగ్ లో అంతర్లీనంగా కుల దాడి..కుల అధిపత్యం..మతపరమైన వివక్ష..భాషాపరమైన..ప్రాంతీయ..లింగ అనే వివక్షలు ఉన్నాయి.

విద్యార్థుల్లో రాజకీయాలు వస్తే చెడిపోరు..
ప్రశ్నించేటటువంటి ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి. ఈ మనస్థత్వం ఎందుకు పెరుగుతోంది. ? విద్యార్థుల్లో రాజకీయాలు వస్తే చెడిపోరు. రాజకీయకరణ వల్ల ప్రపంచీకరణ దృక్పథం మారుతుంది. ప్రతి విద్యాసంస్థ సాహితి, సాంస్కృతిక..క్రీడా అనేక కార్యక్రమాలు చేయాలి. ప్రతి అంశంపై రోజు చర్చ జరుగుతుంటే ఇతరులను అణిచివేయాలి..హింసించాలి..శిక్షించాలనే దానిపై విద్యార్థులు దృష్టి పెట్టరు. నేరపూరితమైన చర్యలుంటే కచ్చితంగా శిక్షలు ఉండాలి. అది కూడా వేగవంతంగా ఉండాలి. సరదా కోసం అయితే ఎందుకు ఆత్మహత్యలు జరుగుతాయి ? సీనియర్లు..జూనియర్ల మధ్య స్నేహం కావడం కోసం ఇతర కార్యక్రమాలు చేయవచ్చు కదా ? '' అని నాగేశ్వర్ పేర్కొన్నారు. 

యూపీలో పర్యటించనున్న రాహుల్..

ఉత్తర్ ప్రదేశ్ : ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే కిసాన్ పాదయాత్రలో రైతులతో రాహుల్ మాట్లాడనున్నారు. 

07:52 - November 23, 2015

ఏపీ రాష్ట్ర ప్రజలపై మరోసారి విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. దీని భారం అంచనా రూ.5,629 కోట్లు. ఈ మేరకు 2016-17 సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) నివేదికలపై డిస్కమ్ లు కసరత్తు పూర్తి చేశాయి. ఈ నెల 24న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ట్రాన్స్ కో, డిస్కమ్ ల ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. మరోకవైపు ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి అరెస్టు విషయంలో వైసీపీపై టీడీపీ నేత జూపూడి పలు విమర్శలు..ఆరోపణలు గుప్పించారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో విజయ్ కుమార్ (టిడిపి), మదన్ మోహన్ రెడ్డి (వైసిపి), రామ శర్మ (ఏపీ కాంగ్రెస్), గఫూర్ (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. 

క్షుద్రపూజల పేరిట చిన్నారి హత్య..

ప్రకాశం : ఒంగోలు మదర్ థెరిస్సా కాలనీలో దారుణం చోటు చేసుకుంది. క్షుద్రపూజల పేరిట రెండు నెలల చిన్నారిని తల్లిదండ్రులు హతమార్చారు. నిందితులను ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

07:44 - November 23, 2015

మంచు విష్ణు, సోనారిక జంటగా జి.కార్తిక్‌ రెడ్డి దర్శకత్వంలో డి.కుమార్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్‌ బ్యానర్‌పై సోమా విజరు ప్రకాష్‌, పల్లి కేశవరావులు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి 'సరదా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నేడు మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, 'మంచు విష్ణు లాంటి స్టార్‌ హీరో 'సరదా' చిత్రం చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఆయన బాడీ లాంగ్వేజ్‌ చాలా కొత్తగా ఉంటుంది. కథానుగుణంగా ట్రెండీగా ఉండే ఆయన న్యూ లుక్‌ ఆకట్టుకుంటుంది. లవ్‌, యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రతి మనిషిలో సరదా ఉంటుంది. ప్రతి ప్రేమలోనూ సరదా ఉంటుంది. ఆ సరదాను హైలైట్‌ చేస్తూ పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. టైటిల్‌కు తగ్గట్టుగానే మొదటి ఫ్రేమ్‌ నుంచి చివరి ఫ్రేమ్‌ వరకు ప్రతి ఒక్కరూ చూసేలా 'సరదా'గా సాగుతుంది. అనూప్‌ రూబెన్స్ మ్యూజిక్‌, విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి' అని అన్నారు. 'మా బ్యానర్‌లో రెండో చిత్రంగా వస్తున్న ఈ సినిమాని ప్రొడక్షన్‌ విషయంలో ఎక్కడా రాజీపడకుండా రూపొందిస్తున్నాం. టైటిల్‌ ఎంత సరదాగా ఉందో సినిమా కూడా అంత కంటే 'సరదా'గా సాగుతుంది. సోనారికతోపాటు మరో ప్రముఖ హీరోయిన్‌ ఇందులో నటిస్తుంది. సినిమా రెండో షెడ్యూల్‌ పూర్తయింది. త్వరలో తదుపరి షెడ్యూల్‌ ప్రారంభిస్తాం' అని నిర్మాతలు తెలిపారు.

 

07:42 - November 23, 2015

సక్సెస్‌ ఫుల్‌ హీరోగా భిన్న చిత్రాలతో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆకట్టుకుంటున్న నాగచైతన్య పుట్టినరోజు నేడు (సోమవారం). ఈ సందర్భంగా నాగచైతన్య తన కెరీర్‌ సంబంధించిన విశేషాలు మీడియాకు తెలిపారు. ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు ఆదరించడం వల్ల హీరోగా తన కెరీర్‌ చాలా హ్యాపీగా వుందని, 'ఏమాయ చేసావె', '100% లవ్‌', 'తడాఖా', 'ఒక లైలా కోసం' చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. వాటన్నింటినీ మించి 'మనం' చిత్రం అన్ని విధాలా సంతృప్తి కలిగించిన విజయాన్ని అందించిందన్నారు. తాతగారితో, నాన్నతో కలిసి నటించడం అనేది ఓ మంచి అనుభూతి కలిగించిందని, 'మనం' నా కెరీర్‌లో ఓ మెమరబుల్‌ ఫిలిం అయిందని తెలిపారు. ప్రేక్షకులు, అభిమానులు మెచ్చే వైవిధ్యమైన సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నదే తన గమ్యమన్నారు. అన్నపూర్ణ స్టూడియో బేనర్‌లో నిర్మించిన 'ఒక లైలా కోసం'లో హీరోగా నటిస్తూనే ప్రొడక్షన్‌ కూడా చూసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. నిర్మాతగా అందరికీ నచ్చే సినిమాలు చెయ్యాలన్నది తన యాంబిషన్‌ అని తెలిపారు.

మరో మంచి సినిమా 'సాహసం శ్వాసగా సాగిపో'
'ఏమాయచేసావె'తో రొమాంటిక్‌ హీరోగా నాకు ఇమేజ్‌ తెచ్చిన గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో 'సాహసం శ్వాసగా సాగిపో' చేస్తున్నట్లు, ఈ సినిమా ఆల్‌ మోస్ట్ పూర్తయిందన్నారు. ఫస్ట్ హాఫ్‌ ఓ రోడ్‌ ట్రిప్‌లో జరిగే లవ్‌స్టోరీ అని, సెకండాఫ్‌ యాక్షన్‌కి వెళ్తుందన్నారు. ఈ యాక్షన్‌ చాలా నేచురల్‌గా ఉండడం జరుగుతుందని, హీరో క్యారెక్టర్‌కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని తెలిపారు. గౌతమ్‌ మీనన్‌ ఈ సినిమాని బాగా డిజైన్‌ చేసినట్లు, 'ఏమాయ చేసావె' తర్వాత ఎ.ఆర్‌.రెహమాన్‌ తనకు మ్యూజిక్‌ చెయ్యడం వెరీ హ్యాపీగా ఉందని తెలిపారు. మ్యూజిక్‌కి ఈ సినిమాకి చాలా పెద్ద ఎస్సెట్‌ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

'ప్రేమమ్‌' కథ నాకెంతో బాగా నచ్చింది..
'కార్తికేయ' డైరెక్టర్‌ చందు మొండేటితో సినిమా చేద్దామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారని, తనకు 'కార్తికేయ' బాగా నచ్చిందన్నారు. ఇటీవల మలయాళంలో 'ప్రేమమ్‌' అనే లవ్‌స్టోరీ సూపర్‌హిట్‌ అయిందని, ఈ కథ బాగా నచ్చి రీమేక్‌ చేద్దామన్నట్లు తెలిపారు. స్కూల్‌లో వున్నప్పుడు ప్రేమ, కాలేజీలో వున్నప్పడు ప్రేమ, మెచ్యూర్డ్ ఏజ్‌లో పెళ్ళి చేసుకున్నప్పుడు వుండే ప్రేమ.. వీటన్నింటి మధ్య వుండే వేరియేషన్‌ని హీరో క్యారెక్టర్‌ నుంచి చెప్పే అల్టిమేట్‌ లవ్‌స్టోరీ ఇదన్నారు. లైఫ్‌ జర్నీలో ఈక్యారెక్టర్‌ మారే తీరు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని, ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే అనుభవాలు ఈ హీరో పాత్రలో వుంటాయన్నారు. ఈ సినిమాని ఎంతో ప్యాషన్‌తో వంశీ, చందు మొండేటి చేస్తున్నట్లు, ఈ సినిమాకి తెలుగులో ఇంకా పేరు నిర్ణయించలేదన్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్‌తోపాటు మరో ఇద్దరు హీరోయిన్లు వుంటారని, వారిలో ఒకరు అనుపమ పరమేశ్వరన్‌ కాగా, మరో హీరోయిన్‌ ఎంపిక జరుగుతోందని నాగ చైతన్య తెలిపారు. 

07:41 - November 23, 2015

మహేష్‌ హీరోగా పి.వి.పి. సినిమా పతాకంపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్న 'బ్రహ్మోత్సవం' చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రోగ్రెస్‌ గురించి దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల తెలియచేశారు. ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ జరిగాయని, ఈనెల 28 నుంచి మూడో షెడ్యూల్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 9 వరకు హైదరాబాద్‌లో షూటింగ్‌ చేసి ఊటీ షిఫ్ట్ అవుతామని, అక్కడ డిసెంబర్‌ 10 నుంచి నెలాఖరు వరకు షెడ్యూల్‌ చేయడం జరుగుతుందన్నారు. ఊటీలో చిత్రంలోని నటీనటులందరూ పాల్గొనే ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించడం జరుగుతుందని తెలిపారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సూపర్‌హిట్‌ తర్వాత మహేష్‌తో మళ్ళీ ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఒక అద్భుతమైన కథతో, అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాత ప్రసాద్‌ వి.పొట్లూరి తెలిపారు. దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని, సమ్మర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నామన్నారు. ఈ చిత్రంలో మహేష్‌ సరసన సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

07:41 - November 23, 2015

పవన్‌ కళ్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రం షూటింగ్‌ గత కొన్ని రోజులుగా గుజరాత్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. షూటింగ్‌లో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ను ప్రముఖ భారత మాజీ క్రికెట్‌ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ కలిశారు. దీంతో ఈ ఆత్మీయకలయిక ప్రస్తుతం సామాజిక మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. 'పవన్‌ నటించిన చిత్రాలను చూశానని, అవెంతో బాగున్నాయని' కపిల్‌దేవ్‌ అన్నారు. కపిల్‌దేవ్‌ కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పవన్‌కళ్యాణ్‌ చెప్పారు. ఈనెల 18 నుంచి గుజరాత్‌లో షూటింగ్‌ ప్రారంభమైంది. డిసెంబర్‌ రెండోవారం వరకు ఈ షెడ్యూల్‌ కొనసాగుతోంది. 25 రోజులు పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో పవన్‌కళ్యాణ్‌, కాజల్‌ అగర్వాల్‌ నటించే సన్నివేశాలతోపాటు సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. బాబీ దర్శకత్వంలో శరత్‌మరార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి స్పెషల్‌గా విడుదల చేయనున్నారు. నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, పవన్‌కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

07:40 - November 23, 2015

శీతాకాలంలో తేలికగా జీర్ణమయ్యే అహారాన్ని తీసుకోవాలని డైటీషియన్లు అంటున్నారు. ఈ సమయంలో సూప్స్ కి మించిన మంచి ఆహారం మరొకటి ఉండదు. సూప్‌లు జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి అవసరం లేదు. అంతేకాదు, ఇవి శరీరం ఇన్‌ ఫెక్షన్లతో పోరాడటానికి ఎంతో సహాయం చేస్తాయి. ఈ చల్లటి వాతావరణంలో శరీరానికి తగిన వేడి అందుతుంది. ఒక బౌల్‌ సూప్‌ తీసుకున్నప్పుడు కడుపు నిండినట్లవవుతుంది. దీన్ని తాగడానికి నోట్లోకి తీసుకోవడం, నెమ్మదిగా చప్పరించడం, రుచి, వాసనను ఆశ్వాదిస్తూ మింగడం వంటివన్నీ గబగబ తాగడానికి బదులు ఆహారాన్ని నెమ్మదిగా తీసుకున్నవారవుతారు. ఇలా చేయడం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. తక్కువ కెలరీలతో ఎక్కువ ఎనర్జీ పొందినవారవుతారు. సూప్‌లలో ఉప్పు తక్కువగా వాడతాం. దీనివల్ల పొటాషియం అధికంగా ఉండి రక్తపోటును నియంత్రిస్తుంది. శరీరంలో నీటి సమతుల్యాన్ని పరిరక్షిస్తుంది. ఇవి శరీరం మరింత తేలిగ్గా, శక్తివంతంగా ఉండేందుకు సహకరిస్తాయి. వీటిని భోజనానికి ముందు తీసుకుంటే చాలా మంచిది. క్యాప్సికం, బ్రొకోలి, ఉల్లికాడలు, క్యారెట్స్ లాంటి వాటితో సూప్‌లు తయారు చేస్తే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా అందుతాయి. చికెన్‌, ఫిష్‌ లేదా ప్రాన్స్ సూప్స్ లలో ప్రోటీన్లు అధికం. అంతేకాదు, ఈ కాలంలో శరీరానికి తగిన వేడిని ఇస్తాయి. సూప్‌కి చిక్కదనం రావాలంటే బియ్యం, మొక్కజొన్న, ఓట్స్ పిండిని కలపాలి. ఇవి చిక్కదనానికే కాక వీటిలో శరీరానికి కావాల్సిన మంచి పోషకాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, సూప్‌లో అదనంగా ప్రోటీన్లు పెంచడానికి పప్పులు, నట్స్ చేర్చుకుంటే మంచిది. ఇష్టపడేవారు గుడ్డులోని తెల్లసొనను కలుపుకోవచ్చు. 

పుట్టపర్తికి చేరుకున్న నరసింహన్..

అనంతపురం : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పుట్టపర్తికి చేరుకున్నారు. సత్యసాయి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. 

07:11 - November 23, 2015

అనంతపురం : నేడు పుట్టపర్తి సత్యసాయిబాబా 90వ జయంతి. బాబా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్ సభ్యులు ప్లాన్‌ చేస్తున్నారు. దేశ, విదేశాల నుంచి అనేకమంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు అనేకమంది భక్తులు ఇప్పటికే పుట్టపర్తికి తరలివచ్చారు.

1926 లో జననం..
1926 నవంబర్‌ 23న ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజులకు నాల్గొవ సంతానంగా సత్యసాయిబాబా జన్మించారు. కొండగుట్టల మధ్య ఉన్న ఓ కుగ్రామమైన గొల్లపల్లిలో సాయిబాబా జన్మించారు. తల్లిదండ్రులు సత్యసాయికి మొదట్లో.. సత్యనారాయణ రాజు అని నామకరణం చేశారు. చిన్నతనం నుంచే భజన పాటలు వినిపిస్తూ భక్తులను ఆకట్టుకున్నాడు. బాల్యంలో పుట్టపర్తి, బుక్కపట్నం పాఠశాలల్లో విద్యను అభ్యసించాడు. 1940 అక్టోబర్‌ 20న తన 14వ ఏట తాను 'సత్యసాయిబాబా'ను అంటూ తన అవతారాన్ని ప్రకటించుకున్నాడు. 1941లో తొలిసారి బాబా భవిష్యవాణిని వినిపించాడు. తన 25వ జన్మదినోత్సవం రోజున ప్రశాంతి నిలయం ప్రారంభోత్సవం జరిగింది. అప్పటినుంచి బాబా కీర్తి ప్రతిష్టలు దేశ, విదేశాలకు వ్యాప్తించాయి. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే సనాతన ధర్మాలను ప్రచారం చేస్తూ ప్రశాంతి నిలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు.

సేవా కార్యక్రమాలు..
ఇక పుట్టపర్తికి వస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి సత్యసాయిబాబా దర్శనానికి వచ్చేవారు. అంతేకాకుండా కొంతమంది విదేశీ భక్తులు ఇక్కడే స్థిర నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక 1954వ సంవత్సరం నుంచి ట్రస్ట్‌ తరపున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇవి ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే 1956లో జనరల్‌ ఆస్పత్రి, 1991లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు. ఎంతో ఖరీదైన వైద్యాన్ని ఇక్కడ ఉచితంగా అందజేస్తారు. 1964లో విద్యాసేవలు ప్రారంభించారు. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యాలయాలను ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందజేస్తున్నారు. 1981లో శ్రీసత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. జిల్లాలో తాగునీటి సమస్యను నివారించేందుకు 1995లో 300 కోట్ల రూపాయలతో భారీ మంచినీటి పథకాన్ని ప్రారంభించారు.

సమాజానికి ఎన్నో సేవలు..
సత్యసాయిబాబా సమాజానికి చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచ దేశాధినేతలు, రాష్ట్రపతులు, గవర్నర్లు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎంతోమంది ప్రముఖులు సత్యసాయిబాబాను దర్శించుకున్నారు. బాబాను దర్శించుకుంటే జీవితం ధన్యమవుతుందని భక్తుల నమ్మకం. బాబా శివైఖ్యం చెంది మూడేళ్లు అవుతున్నా.. భక్తుల తాకిడి ఏ మాత్రం తగ్గకుండా ప్రశాంతినిలయం సత్యసాయిబాబా జయంతి వేడుకలకు సిద్దమవుతోంది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ట్రస్ట్‌ సభ్యులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బాబా భౌతికంగా లేకపోయినప్పటికీ తమ హృదయాలలో నెలకొని ఉన్నాడని భక్తులు విశ్వసిస్తున్నారు. 

మతోన్మాదం..కళాకారులపై దాడికి నిరసనగా నేడు ర్యాలీ..

హైదరాబాద్ : మతోన్మాదం, కళాకారులపై దాడులకు నిరసనగా లౌకిక ప్రజాస్వామిక సాహిత్య, సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఎస్వీకే నుండి ఇందిరాపార్కు వరకు ర్యాలీ జరుగనుంది. 

నేడు టీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ భేటీ..

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ భేటీ కానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. 

నేడు శ్రీవారి ఆలయంలో త్రైసిక ద్వాదశి...

చిత్తూరు : నేడు శ్రీవారి ఆలయంలో త్రైసిక ద్వాదశి కార్యక్రమం జరుగనుంది. తిరుమాడ వీధుల్లో ఉగ్ర శ్రీనివాసమూర్తి విహరించనున్నారు.

 

నేడు వరద ముంపు ప్రాంతాల్లో జగన్ పర్యటన...

విజయవాడ : నేడు వరద ముంపు ప్రాంతాల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటించనున్నారు. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. 

అమరావతిలో నేడు చైనా బృందం పర్యటన..

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతిలో చైనా బృందం పర్యటన చేయనుంది. రాజధాని శంకుస్థాపన ప్రదేశంతో పాటు ధ్యాన బుద్ధ ప్రాజెక్టును బృందం పరిశీలించనుంది. 

07:01 - November 23, 2015

హైదరాబాద్‌ వాసులకు కొత్త కష్టం ముంచుకొస్తోంది. దాదాపు 5 లక్షల వాహనాలకు, 20 లక్షల మంది ప్రజలకు ఎటు వెళ్లాలో దారితెలియని పరిస్థితి వస్తోంది. ఏమిటీ సమస్య? ఎందుకీ కష్టం? సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఏరియాలో దారులు మూసుకుపోతే, ఇంతమంది పరిస్థితి ఏమిటి ? దారుల మూసివేత సమస్యకు పరిష్కారం ఏమిటి? ప్రత్యామ్నాయం ఏమిటి? ఈ అంశంపై జనపథంలో కంటోన్మెంట్‌ బోర్డు మెంబర్‌ రామకృష్ణ, ప్రముఖ యాక్టివిస్ట్ చంద్రశేఖర్‌ విశ్లేషించారు. అలాగే ప్రజలు ఈ చర్చలో పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

06:57 - November 23, 2015

హైదరాబాద్‌ సిటీలో దాదాపు 20 లక్షల మంది దైనందిన కార్యకలాపాలతో ముడిపడిన వ్యవహారమిది. జీహెచ్‌ఎంసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై శ్రద్ధ పెట్టని కారణంగా ఇప్పుడు ఇన్ని లక్షల మంది అవస్థ పడాల్సిన దుస్థితి లో చిక్కుకున్నారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఏరియా. 13వేల ఎకరాల్లో, 40 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించిన ఆర్మీ ప్రాంతం. నిత్యం మిలటరీ కార్యకలాపాలు సాగుతుంటాయి. ఇది సికింద్రాబాద్‌ నడిబొడ్డున వుండడంతో కొన్ని లక్షల మంది ఇటు వైపు నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. సైనిక్‌పురి, ఏఎస్‌రావునగర్‌, ఈసీఐఎల్‌తో పాటు మరికొన్ని కాలనీవాసుల రాకపోకలకు ఇదే అత్యంత ప్రధాన మార్గం. ఈ ప్రాంతంలో ప్రతి నిత్యం 5 లక్షల వాహనాలు తిరుగుతుంటాయని అంచనా. 15 నుంచి 20 లక్షల మంది తమ దైనందిన పనులు చక్కదిద్దుకునేందుకు ఇదే మార్గం గుండా రాకపోకలు సాగిస్తుంటారు.

నాలుగేళ్ల క్రితమే..
ఏవోసీ పరిధిలోని రోడ్లను మూసివేయాలని నాలుగేళ్ల క్రితమే ఆర్మీ అధికారులు నిర్ణయించడంతో దాదాపు 20 లక్షల మంది ఉలిక్కిపడ్డారు. ఇక తాము ఎటు వెళ్లాలంటూ దిగులుపడ్డారు. కాలనీ వాసుల సమాఖ్య హైకోర్టును ఆశ్రయించింది. అప్పట్లో తొలుత కోర్టు స్టే విధించడంతో కాలనీ వాసులు కాస్తంత ఊరట చెందారు. అయితే, ఆ తర్వాత ఆర్మీ అధికారుల వాదనలతో ఏకీభవించిన కోర్టు స్టే తొలగించింది. దీంతో ఆర్మీ అధికారులతో కాలనీవాసుల సమాఖ్య చర్చలు జరిపింది. కొంతకాలం పాటు రాకపోకలకు అనుమతిస్తామనీ, ఈలోగా ప్రత్యామ్నాయ రోడ్లు నిర్మించుకోవాలంటూ ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు.

జీహెచ్ఎంసీ సర్వే...
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జీహెచ్‌ఎంసీ సర్వే నిర్వహించింది. సర్వే పేరుతో మూడు నెలల కాలం గడిపిన జీహెచ్‌ఎంసీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించలేదు. ఏవోసీ పరిధిలోని రోడ్లకు ప్రత్యామ్నాయంగా ఒక్క రోడ్డు కూడా నిర్మించలేదు. మరోవైపు ఈ రోడ్లు మూసి వేసేందుకు ఆర్మీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకతప్పదని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది కాబట్టి, రోడ్లు మూసివేయకుండా ఆర్మీ అధికారులను ఆదేశించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రక్షణ శాఖా మంత్రికి లేఖ రాశారు. ఇప్పటికే రాత్రి పది నుంచి ఉదయం ఏడు గంటల వరకు ఏవోసీ పరిధిలో వాహనాలను అనుమతించడం లేదు. ఇక పగలు కూడా పూర్తిగా మూసివేస్తే తమ పరిస్థితి ఏమిటన్న ఆవేదన ఆ ప్రాంతవాసుల్లో వ్యక్తమవుతోంది. 

06:40 - November 23, 2015

హైదరాబాద్ : దేశంలో రైతాంగ దుస్థితికి పాలకుల విధానాలే కారణమని ప్రముఖ ఆర్థిక వేత్త ప్రొఫెసర్ వెంకటేశ్ ఆత్రేయ విమర్శించారు. కార్పొరేట్లపై ప్రేమ చూపుతున్న ప్రభుత్వాలు... కర్షకుల పట్ల కనికరం చూపడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అంత్యంత ముఖ్యమైన వ్యవసాయరంగాన్ని పాలకులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని వెంటేశ్‌ ఆత్రేయ దుయ్యబట్టారు.

రైతు ఆత్మహత్యలపై సదస్సు..
రైతు ఆత్మహత్యలపై బ్యాంకు ఉద్యోగ సంఘాల సమాఖ్య ఆధర్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో ప్రొఫెసర్‌ వెంకటేశ్‌ ఆత్రేయ కీలకకోపన్యాసం చేశారు. బెఫీతోపాటు, గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం, రిజర్వుబ్యాంకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. బ్యాంకు ఉద్యోగ సంఘ నిర్మాత ఆశిస్‌ సేన్‌ స్మారకోపన్యాసం చేసిన వెంటేశ్‌ ఆత్రేయ ప్రపంచీకరణ తర్వాత వ్యవసాయరంగం కుదేలయ్యిందన్నారు. హరిత విప్లవం, ప్రపంచీకరణ ఫలాలు కార్పొరేట్లకే దుక్కుతున్నాయన్నారు. పారిశ్రామికవేత్తలకు ఈ ఏడాది 3 లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చిన సర్కార్‌... రైతులకు సబ్సిడీలు తొలగించి.. అన్నదాతల నోట్లో మట్టికొట్టిందని దుయ్యబట్టారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా రైతు సంఘాలు చూడాలన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రొఫెసర్‌ వెంకటేశ్‌ ఆత్రేయ పిలుపు ఇచ్చారు.

పాలకుల విధానాలను దుయ్యబట్టిన వక్తలు.. 
సదస్సుకు హాజరైన హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి... రైతులు విషయంలో పాలకులు అవలంభిస్తున్న విధానాలను దుయ్యబట్టారు. ప్రభుత్వాలకు వ్యవసాయరంగంలో దార్శనిక దృక్పథం లేదన్నరు. అన్నదాతల ఆత్మహత్యలపై సర్కారీ లెక్కల నుంచి ఎఫ్‌ఐఆర్‌ల నమోదు వరకు అంతో మాయగా మారిందని దుయ్యబట్టారు. వ్యవసాయరంగ నిపుణులు సారంపల్లి మల్లారెడ్డి, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

06:36 - November 23, 2015

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికలతో రాజకీయంగా రగిలిన వేడి పార్లమెంట్ సమావేశాల్లోనూ అనుసరించాలని అధికార పార్టీ భావిస్తోంది. రెండు జాతీయ పార్టీలతో పోటీ పడ్డ టీఆర్‌ఎస్‌ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు రెడీ అవుతోంది. టిఆర్ఎస్ ఎంపీలు ఇప్పటికే..... ప్రాథమికంగా ఏ ఏ అంశాలు లేవనెత్తాలనే అంశంపై దాదాపు కసరత్తు పూర్తి చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకు అధికార పార్టీ సమాచారాన్ని సేకరించింది. ఇటీవల వరంగల్ పార్లమెంట్‌ ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ నేతలు చేసిన విమర్శలను తమ అస్త్రాలుగా వాడుకునేందుకు గులాబీ దళం రెడీ అయింది. గ్రేటర్ ఎన్నికలు కూడా త్వరలో ఎదుర్కోవాల్సి ఉండటంతో.. టీడీపీ, బీజేపీలను ఇప్పటి నుంచే టార్గెట్ చేయాలని నిర్ణయించింది.

కేంద్రం వివక్ష..
కేంద్ర ప్రభుత్వం సహకారంతో జరగాల్సి ఉన్న అభివృద్ధి పనుల విషయంలోనూ వివక్ష చూపిస్తోందని గులాబీ దళం ఆరోపిస్తోంది. ఇటీవల కేటాయించిన పట్టణ గృహనిర్మాణాల కేటాయింపునే ఇందుకు నిదర్శనంగా చూపిస్తోంది. దేశవ్యాప్తంగా కేటాయించిన ఇళ్లలో సగం ఇళ్లను ఎపీకి కేటాయించి కేంద్రం.. తెలంగాణకు ఎందుకు న్యాయం చేయడం లేదని ప్రశ్నిస్తోంది. ఇలాంటి విషయాల్లో జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని ఎంపీ కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ ఐదు సార్లు ప్రధానిని కలిసినా.. కేంద్రం నుంచి స్పందన కరువైందని టీఆర్ఎస్ అభిప్రాయపడుతోంది.

06:33 - November 23, 2015

హైదరాబాద్ : నగరంలో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరబోతోంది. దేశంలోనే అత్యాధునిక కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి భూమి పూజ జరిగింది. హైదరాబాద్‌ నగరానికి చార్మినార్‌ తొలి ల్యాండ్‌ మార్క్ అయితే.. రెండో ల్యాండ్‌ మార్క్ గా ఈ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ఉండబోతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకోనున్న ఈ ట్విన్‌ టవర్స్ నిర్మాణం కోసం.. ప్రస్తుతానికి 300 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం.. వచ్చే బడ్జెట్‌లో 700 కోట్లు కేటాయించనుంది. ఉదయం 9గంటల 51 నిమిషాలకు జరిగిన ఈ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, సీఎస్ రాజీవ్ శర్మ, సీపీ మహేందర్‌రెడ్డి, మాజీ డీజీపీలు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వచ్చే బడ్జెట్ లో రూ.700 కోట్లు..
దేశంలోనే అద్భుతమైన రీతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టిన కమాండ్ కంట్రోల్ కేంద్రానికి ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు కేటాయిస్తామని కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే 302 కోట్లు మంజూరు చేశామని, వచ్చే బడ్జెట్‌లో మరో 700 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు, వ్యాపార, వాణిజ్య వర్గాలు ముందుకొచ్చి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వీలైనంత తక్కువ సమయంలో కమాండ్ కంట్రోల్ వ్యవస్థ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. స్నేహపూర్వక పోలీసింగ్ వ్యవస్థ రావాలంటే..ప్రజలు కూడా స్నేహపూర్వకంగా ఉండాలని సీఎం అన్నారు.

పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం - నాయిని..
శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలో హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ వ్యవస్థను అధునీకరించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ వ్యవస్థను కమాండ్ కంట్రోల్ కేంద్రంలో అనుసంధానం చేస్తామన్నారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఇతర అభివృద్ధి దేశాల్లోని భద్రత, నిఘా వ్యవస్థకు దీటుగా ఉండేలా కమాండ్, కంట్రోల్ వ్యవస్థకు రూపకల్పన చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. నగర పోలీసు వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నామని.. రానున్న రెండేళ్లలో పోలీసు రహిత ట్రాఫిక్ వ్యవస్థను హైదరాబాద్‌లో అందుబాటులోకి తెస్తామని మహేందర్‌రెడ్డి అన్నారు. మొత్తానికి హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటుకానున్న అత్యాధునిక ప్రపంచస్థాయి నిర్మాణం ద్వారా.. నగరంలో శాంతి భద్రతలు అదుపులోకి వస్తాయని పోలీసు శాఖ భావిస్తోంది. ప్రజలకు శాంతియుత వాతావరణాన్ని కల్పించడం సాధ్యమవుతుందనీ పోలీసువర్గాలు చెప్తున్నాయి.

24 అంతస్తులు..
బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని 8ఎకరాల స్థలంలో అత్యాధునిక వసతులతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం కానుంది. అంతర్జాతీయ స్థాయిలో నిర్మితమయ్యే ఈ భవనాన్ని హైదరాబాద్‌ పోలీస్‌ ట్విన్‌ టవర్స్ గా వ్యవహరించనున్నారు. ఈ భవనంలో మొత్తం 24 అంతస్తులుంటాయి. 18 అంతస్తులతో కూడిన మరో టవర్‌ కూడా ఉంటుంది. నగరంలోని లక్ష సీసీ కెమెరాలను అత్యాధునిక టెక్నాలజీతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల నగరంలోని ప్రతి అంగుళం ఇక్కడినుంచే పర్యవేక్షించే సౌకర్యం ఉంటుంది. సింగపూర్, న్యూయార్క్ తర్వాత ఇలాంటి అత్యాధునిక సౌకర్యాలు కలిగిన కమాండ్‌ సెంటర్‌ ఇదే. హైదరాబాద్ నగరానికి ఈ ట్విన్‌ టవర్స్‌ రెండో ల్యాండ్ మార్క్‌గా నిలుస్తాయని భావిస్తున్నారు. పోలీసు శాఖ మాత్రమే కాకుండా జీహెచ్‌ఎంసీ, ఆర్టీఏ, వాటర్‌ వర్క్స్, ఎన్డీఆర్ఎఫ్ తదితర విభాగాలు సైతం ఉపయోగించుకునేలా ట్విన్‌ టవర్స్ ను నిర్మించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, డీజిపి... అత్యవసర పరిస్థితుల్లో కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ నుంచే పర్యవేక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 

06:24 - November 23, 2015

రంగారెడ్డి : దొంగలు కొత్త స్టైల్ కు తెరలేపారు. చోరీ చేయడమే కాకుండా ఇళ్లకు నిప్పంటిస్తున్నారు. ఈ ఘటన రాజేంద్రనగర్ లోని పుప్పాల్ గూడలో చోటు చేసుకుంది. ఈ ఘటతో కాలనీ వాసులు బేంబెలెత్తిపోయారు. తులిఫ్‌ గార్డెన్‌లోని ఓ ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడ్డారు. 10 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అనంతరం మరో ఇంట్లోకి చొరబడి చీరలు, వస్తువులకు నిప్పుపెట్టారు. ఇంట్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ను ఓపెన్‌ చేయడంతో.. మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో కాలనీవాసులు భయాందోళనలకు గురయ్యారు. 

06:21 - November 23, 2015

కడప : కుండపోత వర్షాలతో కడప కన్నీటి సంద్రమైంది. జిల్లాలో భారీ ఎత్తున వానలు పడుతున్నాయి. కడప జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం వరకు 45 మండలాల్లో వర్షం కురిసింది. పోరుమామిళ్ల మండలంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. బద్వేల్ పట్టణంలో రెండు ఇళ్లు కూలిపోయాయి.

రైల్వే కోడూరులో మంత్రి సునీత..
కడప జిల్లా రైల్వే కోడూరులో వరద బాధితులను పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సందర్శించారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సునీత తెలిపారు. వరద బాధిత కుటుంబాలకు తక్షణమే 25 కేజీల బియ్యం, 1 కేజీ నూనె, ఒక కేజీ కందిపప్పు, ఒక కేజీ చక్కెర పంపిణీ చేసినట్లు తెలిపారు. 

06:20 - November 23, 2015

న్యూఢిల్లీ : అఫ్గనిస్థాన్‌ లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.9 గా నమోదయ్యింది. అప్ఘన్‌ రాజధాని కాబూల్‌కు ఈశాన్యంగా 300 కి.మీ. దూరంలో ఇది సంభవించింది. పాకిస్థాన్‌తోపాటు, భారత దేశంలోని ఢిల్లీ, జమ్ము - కాశ్మీర్‌లో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. గత నెలలో కూడా ఉత్తర అప్ఘనిస్థాన్‌, ఉత్తర పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. అప్పట్లో 400 మంది మరణించారు. చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అక్టోబర్‌లో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.5 గా నమోదయ్యింది. పాకిస్థాన్‌లో అక్టోబర్‌లో భయానక భూకంపాలు సంభవించిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. 2005 అక్టోబర్‌లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. అప్పట్లో 75 వేల మందికిపైగా మరణించారు. మూడున్నర లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అప్ఘనిస్థాన్‌లోని హిందూకుష్‌ పర్వతశ్రేణుల్లో తరచు భూకంపాలు సంభవించడంమో లేక భూ ప్రకంపనలు నమోదవడమో జరుగుతోంది. నేపాల్‌లో కూడా ఈ ఏడాది ఏప్రిల్‌, మేలో భూకంపాలు వచ్చాయి. మే లో సంభవించిన భూకంపంలో 8,900 మంది ప్రాణాలు కోల్పోయారు. 

పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ లో భూ ప్రకంపనాలు..

న్యూఢిల్లీ : పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ లలో భూ ప్రకంపనాలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.9గా నమోదైంది. అప్ఘనిస్తాన్ లోని అష్కశం వద్ద భూకంప కేంద్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పాక్ లోని ఇస్లామాబాద్, లాహోర్, అప్ఘనిస్తాన్ లలోని కాబూల్ తదితర ప్రాంతాల్లో ప్రకంపనాలు వచ్చాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్, ఢిల్లీతో సహా ఉత్తర భారతంలోని పలుచోట్ల భూమి కంపించింది. 

 

నేడు మంత్రి పోచారంతో అమెరికా బృందం భేటీ..

హైదరాబాద్ : వ్యవసాయరంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, స్థానిక వ్యవసాయస్థితిగతులను తెలుసుకొనేందుకు అగ్రదేశం అమెరికా ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు అమెరికా వ్యవసాయ శాఖ మంత్రి స్కాట్ సిండ్లర్ సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శౄఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో భేటీ కానున్నారు.

 

పీపీఏలపై నేడు ఢిల్లీలో సమావేశం..

న్యూఢిల్లీ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి సంబంధించి సోమవారం ఢిల్లీలో నీరజామాధుర్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరుగనుంది. ఇందులో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున విద్యుత్ శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ మొత్తాన్ని తెలంగాణకే కేటాయించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు తేల్చిచెప్పనున్నారు. 

నేడు పీఎస్ బీ చీఫ్ లతో జైట్లీ భేటీ..

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల ఛైర్మన్ లతో భేటీ కానున్నారు. బ్యాంకుల్లో పెరుగుతున్న మొండిబకాయిల సమస్యతో పాటు రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపునకు సంబంధించి సమావేశంలో చర్చించనున్నారు. 

నెల్లూరులో రోడ్డు ప్రమాదం..

నెల్లూరు : జిల్లా తడ మండలం పూడి వద్ద ఆటో - ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. 

సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి...

మెదక్ : సంగారెడ్డిలోని మెడికల్ కళాశాల సమీపంలోని బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. 

కృష్ణా నదిలో గల్లంతైన యువకుల మృతదేహాల వెలికితీత...

కృష్ణా : నదిలో శనివారం సాయంత్రం గల్లంతైన యువకుల మృతదేహాలను గ్రామస్తులు బయటకు తీశారు. బల్లకట్టుపై నుండి నదిలో గోపి, నర్సింహరావు, రమణ యువకులు జారి పడిన సంగతి తెలిసిందే. తమ పరిధిలోకి రాదంటూ కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు భీష్మించుకుని కూర్చోవడంతో గ్రామస్తులు నాటు పడవలతో గాలించి మృతదేహాలను బయటకు తీశారు.

 

కోరమండల్ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలన్న చిన రాజప్ప..

కాకినాడ : వాకలపూడి కోరమండల్ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు ప్రాంతాన్ని హోం మంత్రి చిన రాజప్ప పరిశీలించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు కార్మికులను పరామార్శించారు. కోరమండల్ యాజమాన్యంపై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మృతుల, గాయపడిన కుటుంబాలను కోరమండల్ యాజమాన్యమే ఆదుకోవాలని సూచించారు.

 

తిరుపతి అతలాకుతలం..

చిత్తూరు : భారీ వర్షాలకు తిరుపతి పట్టణం అతలాకుతలమైంది. ఇంద్రానగర్, గాలివీధిలో రెండు ఇళ్లు కూలాయి. నవోదయ కాలనీ, అశోక్ నగర్, చంద్రశేఖర్ రెడ్డి కాలనీ, రైల్వే కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

మావోయిస్టు బక్కన్న అరెస్టు...

ఆదిలాబాద్ : మావోయిస్టు బక్కన్నను బెల్లంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్దనుండి 9ఎంఎం తుపాకీ, మూడు రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

Don't Miss