Activities calendar

24 November 2015

మహారాష్ట్రతో చర్చలు సఫలం : హరీష్ రావు

హైదరాబాద్ : పెన్‌గంగా ప్రాజెక్టుపై మహారాష్ట్రతో చేపట్టిన చర్చలు సఫలమయ్యాయని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అవసరాల కోసం రెండో డ్యాం నిర్మించి రాష్ట్రం నీటిని వాడుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు. ప్రాజెక్టుల ముంపు భూముల విషయంలో సహకరిస్తామని మహారాష్ట్ర తెలిపిందని పేర్కొన్నారు.

పోలీసుల తనిఖీలు... కిలో బంగారం స్వాధీనం

హైదరాబాద్ : నగరంలోని హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తా వద్ద పోలీసులు ఇవాళ వాహన తనిఖీలు చేపట్టారు. పోలీసులు ఈ తనిఖీల్లో సురేశ్ అనే వ్యక్తి వద్ద బంగారమున్నట్టు గుర్తించారు. అతని నుంచి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి

మెదక్‌ : జిల్లాలోని నారాయణ్‌ఖేడ్‌ మండలం హుమ్నాబాద్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. 

 

22:16 - November 24, 2015

సింగపూర్ : ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు ఆశగా చూస్తుందని ప్రధాని మోడీ అన్నారు. సింగపూర్ లో ప్రవాసభారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రపంచదేశాలకు భారత్ పై నమ్మకం పెరిగిందని తెలిపారు.

 

22:09 - November 24, 2015

భారత్ ప్రమాదం అంచున ఉందా.? ఐఎస్ తీవ్రవాదులతో మన దేశానికి ముప్పు ఉందా..? ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ సిరియా ఇప్పుడు ప్రపంచాన్ని ఒణికించబోతుందా...? జరుగుతున్న పరిణమాలు ఏ సంకేతాలిస్తున్నాయి..? ప్యారిస్ తరహా దాడులు మరిన్ని జరగబోతున్నాయా..? అలాంటి విపత్తే వస్తే మన దేశం తిప్పికొట్టగలిగే పరిస్థితిలో ఉందా...? పడగ విప్పిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం గురించి ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

21:56 - November 24, 2015

ఢిల్లీ : బాలీవుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌ వార్తల్లోని వ్యక్తిగా మారారు. మత అసహనంపై ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. దేశంలో మత అసహనం పెరిగిపోతోందంటూ అమీర్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతోంది. బాలీవుడ్‌ చిత్ర ప్రముఖులతోపాటు, కేంద్ర మంత్రులు ఆయన వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు. ప్రధాని మోదీ పాలనలో దేశంలో మత అసహనం పెరిగిపోయిందంటూ నిరసనవ్యక్తం చేస్తున్న వారి సరసన ఇప్పుడు బాలీవుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌ కూడా చేశారు. దేశంలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా చాలా మంది తమ అవార్డులను తిరిగి విచ్చారు. మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా వారు తీవ్ర విమర్శలు, వ్యాఖ్యలు చేసినట్టే ఇప్పుడు.. అమీర్‌ ఖాన్‌ కూడా వారి బాటలోనే నడిచారు.
భారత్‌ విడిచిపోదామా ? అన్న ప్రస్తావన తెచ్చిన కిరణ్‌రావు
సోమవారం ఢిల్లీలో జరిగిన రామ్‌నాథ్‌ గోయంకా ఎక్స్‌లెన్స్‌ ఇన్ జర్నలిజం అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిధిగా హాజరైన అమీర్‌ఖాన్‌.. మత అసహనంపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఇంట్లో తన భార్య కిరణ్‌ రావుతో మాటామంతీ సందర్భంగా భారత్‌ వదలి వెళ్లిపోదామా ? అన్న ప్రస్తావన వచ్చిందన్నారు. ఇదే అంశంపై నిరసన తెలుపుతూ కొంతమంది సినీ ప్రముఖులు, సాహితీవేత్తలు, శాస్త్రవేత్తలు తమ అవార్డులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చినా... దేశం వదలివెళ్లాలన్న ప్రస్తావన ఎవరూ తీసుకురాలేదు. కానీ దేశం వదిలివెళ్లిపోదామన్న ప్రస్తావన తెచ్చిన అమీర్‌ఖాన్‌ వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి.
పిల్లల భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్న కిరణ్‌రావు
దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న తన భార్య కిరణ్‌రావు... పిల్లల భవిష్యత్‌పై భయాందోళనకు గురువుతున్నారన్న ఆవేదనను అమీర్‌ఖాన్‌ వ్యక్తం చేశారు. ప్రతిరోజు పత్రికలు తిరగేస్తే మతపరమైన దాడులకు సంబంధించిన వార్తలు ఉంటున్నాయని, మన చుట్టూ ఇలాంటి వాతావరణం ఉన్నందుకు కిరణ్‌రావు భయపడుతున్నారన్నవిషయాన్ని ఆయన ప్రస్తావించారు. దేశంలో పెరుగుతున్న అశాంతి, అలజడులు ప్రమాద ఘంటికలకు చిహ్నమన్న భయం ఆమెలో కనిపిస్తోందన్నది అమీర్‌ఖాన్‌ వాదన.
అమీర్‌ఖాన్‌కు మద్దతుగా రాహుల్‌గాంధీ
మత అసహపనంపై ఆందోళన వ్యక్తం చేసిన అమీర్‌ఖాన్‌కు... కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మద్దతుగా నిలిచారు. ప్రధాని మోదీ, ఆయన సర్కార్‌ను ప్రశ్నించేవారిని దేశవ్యతిరేక శక్తులుగా చిత్రీకరిస్తున్నారని రాహుల్‌గాంధీ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఇదంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దుష్ప్రచారమని పాలకులు కొట్టిపారేయడాన్ని తప్పుపట్టారు. ప్రజలను ఆందోళనకు గుర్తిచేస్తున్న సమస్యల పరిస్కారానికి సర్కార్‌ ముందుకు రావాలని రాహుల్‌ కోరారు. దేశంలో జరుగుతున్న పరిణామాలపై నిరసన వ్యక్తంచేసే వారి నోళ్లు మూయించేందుకు పాలకులు బెదిరింపులకు దిగడం, దూషించడం తగదన్నారు.
అమీర్‌ఖాన్‌ వ్యాఖ్యలపై విరుచుకుపడిన కేంద్రమంత్రులు
అమీర్‌ఖాన్‌ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు విరుచుకుపడ్డారు. అమీర్‌ఖాన్‌ భారత్‌లో క్షేమంగా ఉన్నారని, ఆయన దేశం విడిచిపెట్టి వెళ్లాలని తాము ఎప్పుడూ చెప్పలేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ చెప్పారు. అమీర్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు దేశప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని, దేశ విడిచివెళ్లాలన్న ప్రస్తావన తీసుకురావడం ద్వారా తన అభిమానాలను అవమానించారని నఖ్వీ మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మలకలహాలు తగ్గాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు చెప్పారు. అమీర్‌ఖాన్‌ వ్యాఖ్యలు జాతీ ప్రతిష్టను మంటకలిపేలా ఉన్నాయని విమర్శించారు.
అమీర్‌ఖాన్‌ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్న సినీ ప్రముఖలు
అమీర్‌ఖాన్‌ వ్యాఖ్యలపై బాలీవుడ్‌ సినీ ప్రముఖలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. అత్యంత విశ్వసనీయ భారత్‌.. అసహన భారత్‌గా ఎలా మారిందో చెప్పాలని అనుపమ్‌ ఖేర్‌ ట్విట్టర్‌లో నిలదీశారు. భ్యార కిరణ్‌రావు... భారత్‌ విడిచి వెళదామా... అన్న ప్రస్తావన తెచ్చినప్పుడు.. తనను అగ్రశ్రేణి నటుడిగా చేసిన ఇండియాను వదిలి ఎందుకు వెళ్లాలని అడగలేకపోయారా? అని అనుపమ్‌ ఖేర్‌ ప్రశ్నించారు. గతంలో ఇంతకంటే గడ్డు పరిస్థితులు ఉన్నప్పుడు దేశం విడిచి వెళ్లాలనిపించలేదా ? అని నిలదీశారు. సత్యమేవ జయతే కార్యక్రమం ద్వారా దేశ సమస్యలను వెలుగులోకి తెచ్చిన అమీర్‌ఖాన్‌.. మత అసహనం పెరిగిందన్నప్పుడు ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలే కానీ... భయపెట్టకూదని అనుపమ్‌ ఖేర్‌ సలహా ఇచ్చారు.
అమీర్‌ఖాన్‌ వ్యాఖ్యలపై రిషీకపూర్‌ మండిపాటు
రిషీకపూర్‌ కూడా అమీర్‌ఖాన్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు. దేశంలో పరిస్థితులు సానుకూలంగా లేవనుకున్నప్పుడు దానిని చక్కదిద్దే ప్రయత్నం చేయడానికి బదులు... వాటి నుంచి పారిపోయే ప్రయత్నం చేయడం హీరోయిజం అనిపించుకోవదని సున్నితంగా మందలించారు. మొత్తంమీద అమీర్‌ వాఖ్యలుపై రేగుతున్న రాజకీయ దుమారం ఇప్పట్లో తగ్గే అవకాశం కనిపించడంలేదు.

 

21:50 - November 24, 2015

ఢిల్లీ : అన్ని రాష్ట్రాల మెడికల్‌ మెడికల్‌ రిప్రజెంటివ్‌లు ఢిల్లీలో ధర్నా చేపట్టారు. మందుల ధరలను ప్రభుత్వం నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఔషద విభాగాల్లో ఎఫ్ డిఐలను అనుమతించొద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ పాల్గొన్నారు. ఆరోగ్యరంగంలో ప్రభుత్వం తెస్తున్న విధానాలకు వ్యతిరేకంగా డిసెంబర్‌ 16న దేశవ్యాప్తంగా సమ్మె చేస్తామని ప్రకటించారు.

 

21:48 - November 24, 2015

మధ్యప్రదేశ్ : ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వరుస వైఫల్యాలు పలకరిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో ఝబువ రత్లాం లోక్ సభ నియోజక వర్గంలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి కాంగ్రెస్‌ షాకిచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంతిలాల్ భురియ అక్కడ విజయం సాధించాడు. కాంతిలాల్‌ భురియ బిజెపి అభ్యర్థి సిటింగ్‌ ఎమ్మెల్యే పెత్లవాద్‌ నిర్మలా భురియాను 80 వేల ఓట్లతో ఓడించారు. బిజెపి సిట్టింగ్‌ ఎంపి దిలీప్‌ సింగ్‌ భురియా జూన్‌లో మరణించడంతో అక్కడ ఉపఎన్నిక జరిగింది. బిజెపి ఆయన కూతురు నిర్మలా భురియాను రంగంలోకి దింపినప్పటికీ ఫలితం లేకపోయింది. కాంతిలాల్ గెలుపుతో లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 45కు పెరిగింది.

 

21:41 - November 24, 2015

విజయవాడ : అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తుంది. ఆకతాయిలు వెంటపడ్డారు. తనను తాను కాపాడుకునేందుకు పరుగులు తీసింది. పోలీసులు కనిపించగానే తను సేఫ్‌ అనుకుంది. కాపాడమని వేడుకుంది. ఆమె ఆర్తనాదాలను అర్థం చేసుకుని పోలీసులు కర్కషంగా ప్రవర్తించారు. వ్యభిచారిణిగా చిత్రించేందుకు ప్రయత్నం చేశారు...తమ మాట వినలేదని మద్యం తాగించారు. వివస్త్రను చేసి చితకబాదారు. ఇదంతా చేసింది ఎవరో కాదు..బెజవాడ పోలీసులే...
ఒంటి నిండా దెబ్బలు
విజయవాడ బెంజ్ సర్కిల్ పరిధిలో ఉంటున్న దుర్గ వంటమనిషిగా పనిచేస్తోంది. ఆదివారం అర్ధరాత్రి వంటపని ముగించుకుని ఇంటికి బయల్దేరింది. బెంజ్ సర్కిల్ సమీపంలో నలుగురు ఆకతాయిలు ఆమె వెంటపడి వేధించారు. అసభ్యంగా ప్రవర్తించారు. వారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీసింది..చిమ్మచీకట్లో మానప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసింది.
అటుగా వస్తున్న పోలీసులు..
పరుగులు తీస్తున్న దుర్గకు అదే సమయంలో అటుగా వెళ్తున్న పోలీసులు కనిపించడంతో ఊపిరి పీల్చుకుంది..వారి చెంతకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పింది...ఎస్సై మోహన్‌ ఇక్కడకు వస్తున్నారని... ఆయనే అన్ని చూసుకుంటారని ఆ కానిస్టేబుళ్లు చెప్పారు.
ఆకతాయిలకే వంతపాడిన ఎస్సై
విషయాన్ని తెలుసుకున్న ఎస్సై.. దుర్గను..ఆకతాయిల నుంచి వివరాలు తీసుకున్నాడు..ఆ తర్వాత దుర్గనే తప్పుబడుతూ వెయ్యి రూపాయలిచ్చామని చెప్పిన ఆకతాయిల మాటలు నమ్మి వారికే వంతపాడారు..వ్యభిచారం చేయడానికే డబ్బులు తీసుకున్నావంటూ ఆమెను దబాయించాడు...అంతటితో ఆగకుండా ఆమె శరీరాన్ని తాకుతూ నీచంగా ప్రవర్తించిన పోలీసులు చివరకు లాఠీలతో కుళ్లబొడిచారు.
అర్ధరాత్రి ఎటువెళ్లాలో అర్థం కాలేదు...
అర్ధరాత్రి ఎటువెళ్లాలో అర్థం కాలేదు... పోలీసులు కొట్టిన దెబ్బలు..మరోవైపు కారుతున్న రక్తం..అయినా దుర్గ న్యాయం కోసం కమిషనర్ ఉంటున్న ఇంటివైపు వెళ్లింది...అక్కడా కుదరకపోవడంతో ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది...ఆ తర్వాత న్యాయపోరాటానికి దిగడంతో జరిగిన దారుణం వెలుగుచూసింది....
సీపీ కార్యాలయానికి బాధితురాలి పరుగులు
ఎస్సై ,కానిస్టేబుల్స్‌ దెబ్బలకు గాయాలపాలైన దుర్గ న్యాయం కోసం అక్కడి నుంచి సీపీ కార్యాలయానికి పరుగులు తీసింది. కమిషనర్‌ను కలిసే అవకాశం లేదని..ఉదయాన్నే రమ్మన్న పోలీసులు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకోమంటూ ఆమె వచ్చిన ఆటోలోనే పంపారు...
రెండు రోజులు పీఎస్‌లోనే...
ఇక దుర్గ కమిషనర్ ఆఫీస్‌వెళ్లి అక్కడి నుంచి ఆస్పత్రికి వెళ్లిన విషయం తెలుసుకుని చేరుకున్న ఎస్‌ఐ ,కానిస్టేబుల్స్‌ తప్పతాగి నడిరోడ్డుపై న్యూసెన్స్‌ చేస్తుందంటూ నానా హంగామా చేశారు..బలవంతంగా మద్యం నోట్లో పోసి మద్యం సేవించినట్లు సర్టిఫికేట్‌ తీసుకున్నారు... అంతటితో వదిలిపెట్టలేదు. మళ్లీ దుర్గను పోలీస్‌ స్టేషన్‌ తీసుకెళ్లి మహిళా కానిస్టేబుళ్లతో కొట్టించాడు. స్టేషన్లోనే రెండు రోజులు ఉంచారు. పిట్టి కేసు పెట్టి కోర్టు ముందు హాజరుపరిచి వదిలేశారు.
న్యాయం కోసం పోరాటం...
రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారడంతో నివ్వెరపోయిన దుర్గ.. న్యాయం కోసం బెజవాడ బార్‌ అసోసియేష్‌ను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదును విన్న లాయర్లు...న్యాయ సాయం అందించేందుకు ముందుకొచ్చారు. ఇంతటి దురాగతానికి ఒడిగట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకునే వరకు... వదిలేప్రసక్తే లేదంటున్నారు.
పోలీసులు తీరు సిగ్గుచేటు...
బెజవాడలో పోలీసులు ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు...ఓ మహిళకు అర్థరాత్రి రక్షణ కల్పించాల్సినవారు ఇలా ఎందుకు చేసినట్లు..? పోలీసుల తీరు ఇంతేనా..? లేక ఆమె వద్ద డబ్బు కోసం ఇలా చేశారా..? ఆ తర్వాత తప్పు బయటపడుతుందని క్రూరంగా ప్రవర్తించారా..? కంచె చేను మేసినట్లు రక్షించాల్సిన పోలీసులే భక్షకులైతే బాధితులు ఎవరితో చెప్పుకోవాలి.

 

21:34 - November 24, 2015

హన్మకొండ : వరంగల్‌లో అత్యధిక మెజారిటీ సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్...అరుదైన ఘనత సాధించారు. హయ్యస్ట్ మెజారిటీ నమోదు చేసిన హేమాహేమీల సరసన చేరారు. 1991లో వై.ఎస్.రాజశేఖర్‌ రెడ్డి 4.22 లక్షల మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. అలాగే నంద్యాల ఎన్నికలో పీవీ నరసింహారావు 5.8 లక్షలతో రికార్డు నమోదు చేశారు. ఇక బీహార్‌ లో 1989లో రాంవిలాస్ పాశ్వాన్ 5.04 లక్షలు, 2004లో పశ్చిమ బెంగాల్‌లో అనిల్ బసు 5.92 లక్షలు, 2011లో కడప నుంచి వై.ఎస్.జగన్ 5.48 లక్షలు, 2014లో వడోదర నుంచి నరేంద్ర మోదీ 5.7 లక్షల మెజారిటీ సాధించగా...ఈ రికార్డును ప్రీతమ్ ముండే బద్దలు కొట్టారు. మహారాష్ట్ర బీడ్‌లో జరిగిన ఎన్నికలో 6.92 లక్షల మెజారిటీతో ఆమెకు ప్రజలు పట్టం కట్టారు. 2014లో వరంగల్‌ నుంచి కడియం శ్రీహరి 3.92 లక్షల మెజారిటీ సాధించగా...తాజాగా పసునూరి దయాకర్ 4.59 లక్షల మెజారిటీ పొందారు.

 

21:27 - November 24, 2015

హైదరాబాద్ : టీఆర్ఎస్‌కు ఎస్సీలు దూరమవుతున్నారా..? పాలక పక్షానికి ఎస్సీ రిజర్వేషన్‌ల సెగ తగులుతోందా..? వరంగల్‌ ఉప ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే ఇదే భావన వ్యక్తమవుతోంది. ఈ ఉప ఎన్నికలో.. ఎస్సీ నియోజకవర్గాలు రెండింటా.. హేమాహేమీలు వ్యూహాలు రచించినా.. టీఆర్ఎస్‌కు పెద్దగా ప్రయోజనం చేకూరక పోవడం దీనికి బలం చేకూరుస్తోంది.
ఎస్సీ ఓటర్లు పాలక పక్షానికి దూరం
వరంగల్‌ ఉప ఎన్నికల్లో.. ఎస్సీ ఓటర్లు పాలక పక్షానికి దూరమైనట్లుగా తేటతెల్లమవుతోంది. ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గౌరవప్రదమైన మెజారిటీనే సాధించిన టీఆర్ఎస్‌.. ఎస్సీ నియోజకవర్గాలు రెండింటిలోనూ.. బాగా దెబ్బతిన్నట్లు స్పష్టమవుతోంది.
29వేల ఓట్ల మెజారిటీ తగ్గుదల
వరంగల్‌ పార్లమెంటు సెగ్మెంట్‌లో.. స్టేషన్‌ ఘన్‌పూర్‌, వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వ్‌ అయ్యాయి. ఈ నియోజకవర్గాల్లో.. టీఆర్ఎస్‌ అభ్యర్థికి.. గతం కన్నా బాగా తక్కువ మెజారిటీ రావడం గమనార్హం. స్టేషన్‌ఘన్‌పూర్‌లో.. గత ఎన్నికల్లో కడియం శ్రీహరికి.. లక్షా 23వేల 997 ఓట్లు లభించాయి. సమీప ప్రత్యర్థి మీద 90వేల 310 ఓట్ల మెజారిటీ సాధించారు. కానీ ఈసారి టీఆర్ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు ఇక్కడ కేవలం 87వేల 602 ఓట్లే పోల్‌ కాగా.. మెజారిటీ 61వేల 301 ఓట్లకే పరిమితమైంది. అంటే ఇక్కడ సుమారు.. 29 వేల ఓట్ల మెజారిటీ తగ్గింది. ఇంద్రకరణ్‌ రెడ్డితో పాటు.. కడియం శ్రీహరి తిష్ఠ వేసుకు కూర్చున్నా.. ఇక్కడ మెజారిటీ తగ్గడం విశేషం.
నిరుటికన్నా 31వేల ఓట్లు తగ్గాయి
వర్ధన్న పేట ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. ఇక్కడ 2014లో కడియం శ్రీహరికి లక్షా 28వేల 369 ఓట్లు పోలయ్యాయి. సమీప ప్రత్యర్థికన్నా లక్షా 377 ఓట్ల ఆధిక్యం లభించింది. కానీ ఈసారి, పసునూరి దయాకర్‌కు.. 93వేల 902 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మెజారిటీ కూడా నిరుటికన్నా 31వేల ఓట్లు తగ్గాయి. పసునూరికి ఈ నియోజకవర్గం నుంచి 69వేల 526 ఓట్ల ఆధిక్యం మాత్రమే లభించింది. ఈ నియోజకవర్గ బాధ్యను మంత్రి జోగు రామన్నకు అప్పగించారు.
రికార్డు సృష్టించగలిన పసునూరి
మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో.. మూడింట మెరుగైన మెజారిటీ దక్కడంతో.. పసునూరి రికార్డు సృష్టించగలిగారని చెప్పాలి. మంత్రి ఈటల బాధ్యత తీసుకున్న పరకాల నియోజకవర్గంలో.. టీఆర్ఎస్‌ అభ్యర్థికి పోలైన ఓట్లే కాదు.. మెజారిటీ గణనీయంగా వచ్చింది. ఇక్కడ నిరుడు 80వేల 332 ఓట్లు పోలైతే.. ఈసారి 97వేల 817 ఓట్లు పోలయ్యాయి. మెజారిటీ నిరుటి కన్నా దాదాపు రెట్టింపు లభించింది. నిరుడు శ్రీహరికి ఈ నియోజకవర్గంలో 36వేల 289 ఓట్ల మెజారిటీ రాగా.. ఈసారి పసునూరికి 76వేల 886 ఓట్ల మెజారిటీ లభించింది.
భూపాలపల్లిలో టీఆర్ఎస్‌ ప్రభంజనం
మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బాధ్యత తీసుకున్న భూపాలపల్లిలో టీఆర్ఎస్‌ ప్రభంజనమే సృష్టించింది. ఇక్కడ పార్టీ అభ్యర్థికి పోలైన ఓట్లు.. లభించిన మెజారిటీ ఓ రికార్డే. నిరుడు శ్రీహరికి 74వేల 665 ఓట్లు పోలవగా.. ఈసారి పసునూరికి 93వేల 601 ఓట్లు వచ్చాయి. శ్రీహరి మెజారిటీ 18వేల433 ఓట్లు కాగా.. పసునూరికి 65వేల 805 ఓట్ల మెజారిటీ లభించింది. మంత్రి జగదీశ్వరరెడ్డి బాధ్యత తీసుకున్న పాలకుర్తిలోనూ టీఆర్ఎస్‌కు గౌరవప్రదమైన మెజారిటీ లభించింది. ఇక్కడ నిరుడు శ్రీహరికి 11వేల 422 ఓట్ల మెజారిటీ రాగా.. ఈసారి పసునూరికి 35వేల 918 ఓట్ల ఆధిక్యం లభించింది.
వరంగల్‌ పశ్చిమలో అదే మెజారిటీ
ఇక బావా, బావమరుదులు హరీశ్‌, కేటీఆర్‌లు బాధ్యత తీసుకున్న నియోజకవర్గాల్లో.. టీఆర్ఎస్‌ అభ్యర్థికి చెప్పుకోదగ్గ మెజారిటీ రాకపోవడం గమనార్హం. హరీశ్‌రావు బాధ్యత తీసుకున్న వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో... టీఆర్ఎస్‌కు నిరుడు వచ్చినంత మెజారిటీయే వచ్చింది. 2014లో కడియం శ్రీహరికి 56వేల663 ఓట్ల మెజారిటీ రాగా.. ఈసారి పసునూరికి 56వేల 786 ఓట్ల ఆధిక్యం లభించింది. హరీశ్‌తో పోలిస్తే.. కేటీఆర్ కొంత మెరుగని చెప్పాలి. ఈయన బాధ్యత వహించిన వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో.. టీఆర్ఎస్‌ అభ్యర్థికి నిరుటి కన్నా ఓ ఎనిమిది వేల అధిక మెజారిటీ వచ్చింది. వరంగల్‌ ఉప ఎన్నికల్లో అసెంబ్లీల బాధ్యతలు తీసుకున్న.. ఇంద్రకరణ్‌రెడ్డి, కడియం శ్రీహరి, జోగు రామన్న, హరీశ్‌రావులు మెజారిటీ సాధనలో కాస్తంత వెనుక బడ్డం.. ఎస్సీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌ మెజారిటీ గణనీయంగా తగ్గడం.. చెప్పుకోదగ్గ పరిణామాలు.

 

 

21:13 - November 24, 2015

వరంగల్ : కారు జోరులో ప్రతిపక్ష పార్టీలన్నీ దుమ్ము కొట్టుకు పోయాయి. ఓరుగల్లు ఓటరు పరిణతి ముందు.. పార్టీల అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. గెలవక పోయినా.. పాలక పక్షం మెజారిటీని తగ్గించి తీరతామన్న కాంగ్రెస్‌, ఎన్డీయే నేతల హూంకరింపులు.. ఎక్కడా పనిచేయలేదు సరికదా.. డిపాజిట్లనూ గల్లంతు చేశాయి.
భారీ మెజారిటీతో పసునూరి గెలుపు
వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి.. పసునూరి దయాకర్‌ ఘన విజయం సాధించారు. ఓరుగల్లులోనే కాదు... తెలంగాణలోనూ కనీవినీ ఎరుగని మెజారిటీతో ఆయన జయకేతనం ఎగురవేశారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన సర్వే సత్యనారాయణపై.. నాలుగు లక్షల 59వేల 92 ఓట్ల ఆధిక్యంతో.. పసునూరి దయాకర్‌ విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో దయాకర్‌కు.. ఆరు లక్షల 15 వేల 403 ఓట్లు లభించాయి.
తొలి రౌండ్‌ నుంచీ మెజారిటీ వేట
ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది మొదలు.. పసునూరి దయాకర్ మెజారిటీ వేటలో... అప్రతిహతంగా దూసుకు వెళ్లారు. తొలి రౌండ్‌ నుంచీ.. ప్రత్యర్థులకు అందని వేగంతో.. వారు తన దరిదాపుల్లోకి కూడా రాని రీతిలో.. ఘన మెజారిటీని సాధించారు. తొలి రౌండ్‌లో 32వేలు.. రెండో రౌండులో 34 వేలు.. మూడో రౌండులో 33వేలు ఇలా.. చివరి దాకా ఎక్కడా మెజారిటీ తగ్గకుండా దూసుకువెళ్లారు పసునూరి దయాకర్‌. ప్రతి రౌండ్‌లోనూ బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఏడువేలు.. ఎనిమిది వేల ఓట్లతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.
మొత్తం ఓట్లు 15,09,671
మొత్తం 15 లక్షల 9 వేల 671 ఓట్లలో.. 69.19 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇందులో పసునూరి దయాకర్‌కు 6 లక్షల 15వేల 407 ఓట్లు సాధించి.. సమీప ప్రత్యర్థిపై 4 లక్షల 59వేల 92 ఓట్ల మెజారిటీ సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సర్వే సత్యనారాయణ లక్షా 56వేల 315 ఓట్లు మాత్రమే సాధించారు. లక్షా 30వేల 178 ఓట్లు సాధించిన ఎన్‌డీయే అభ్యర్థి పగిడిపాటి దేవయ్య మూడోస్థానానికే పరిమితమయ్యారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు కేవలం 23వేల 336ఓట్లు దక్కాయి. వామపక్షాలు సమర్థించిన అభ్యర్థి గాలి వినోద్‌కుమార్‌ సుమారు 14వేల 780 ఓట్లను పొందారు. 22 రౌండ్లలోనూ.. ప్రత్యర్థులు.. ఎక్కడా కారు జోరును అందుకోలేక పోయారు.

 

గాయని కౌసల్య భర్తకు పోలీసుల కౌన్సెలింగ్‌

హైదరాబాద్ : గాయని కౌసల్య భర్తకు కౌన్సెలింగ్‌ ఇచ్చామని, అతడిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. తన భర్త వేధింపులకు గురిచేస్తున్నాడంటూ కౌసల్య ఈ రోజు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కౌసల్య భర్తపై కేసు నమోదైందంటూ మీడియాలో వార్తలు రావడంతో ఎస్ఆర్‌నగర్ పోలీసులు వివరణ ఇచ్చారు.

 

ఆల్విన్ కాలనీలో 35 తులాల బంగారు ఆభరణాల చోరీ

హైదరాబాద్‌ : తాళం వేసి ఉన్న ఇంట్లో తలుపులు పగలగొట్టి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మియాపూర్ ఆల్విన్ కాలనీలో మంగళవారం వెలుగు చూసింది. కాలనీలోని 122 నంబర్ ప్లాట్ లో తలుపులు, బీరువాలు పగలగొట్టిన దుండగులు.. 35 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మేయర్ దంపతుల హత్యకేసు.. ముగ్గురు నిందితుల లొంగుబాటు

హైదరాబాద్‌ : మేయర్ దంపతుల హత్యకేసులో ముగ్గురు నిందితుల మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన నిందితులు వెంకటాచలపతి, జయప్రకాశ్‌రెడ్డి, మంజునాథ్‌లను పోలీసు అధికారులు మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడారు. కటారి దంపతుల హత్యకేసులో 11 మంది నిందితులను గుర్తించినట్లు తెలిపారు. త్వరలోనే నిందితులందరినీ పట్టుకుంటామన్నారు.

21:00 - November 24, 2015

టర్కీ : తమ గగనతలంలోకి ప్రవేశించిందన్న కారణంతో రష్యా సుఖోయ్ విమానం ఎస్‌యూ24ను టర్కీ సైన్యం ఎఫ్-16 యుద్ధ విమానంతో కూల్చివేసింది. ఈ విషయాన్ని టర్కీ సైన్యంతోపాటు మాస్కో వర్గాలు కూడా ధ్రువీకరించాయి. అనుమతి లేకుండా సిరియా సరిహద్దు మీదుగా టర్కీలోకి రష్యా యుద్ధ విమానం ప్రవేశించిందని, పలుమార్లు హెచ్చిరించినా పట్టించుకోకపోవడంతో విమానాన్ని కూల్చి వేసినట్లు టర్కీ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో దాని నుంచి ఓ ఫైర్ బాల్ కూడా తుర్కమెన్‌ పర్వతంపై పడినట్లు పేర్కొన్నారు. అయితే, ఇద్దరు పైలట్లూ విమానం కూలిపోవడానికి ముందే పారాచూట్ల సాయంతో దూకేశారని, వాళ్లలో ఒకరిని సిరియన్ తిరుగుబాటుదారులు పట్టుకున్నారని తెలుస్తోంది. అయితే టర్కీ గగనతలంలోకి తమ విమానం ప్రవేశించిందన్న ప్రకటనను రష్యా ఖండించింది. సిరియా గగనతలంలోనే వున్నట్టు నిరూపిస్తామని సవాల్ విసిరింది. ఈ అంశంపై విచారణ జరుపుతున్నట్టు, ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే పరిణామాలు తీవ్రస్థాయిలో ఉంటాయని రష్యా హెచ్చరించింది.

 

20:59 - November 24, 2015

ఢిల్లీ : రాజస్థాన్‌ సిక్కార్‌ జిల్లాలో జనవరి 22నుంచి 25వరకూ ఎస్ ఎఫ్ ఐ జాతీయ మహాసభలు జరగబోతున్నాయి. ఆహ్వానసంఘం ఛైర్మన్‌గా రాజస్థాన్‌ ఎమ్మెల్యే అమరారాం, సభ్యులుగా 52మందిని ఎన్నిక చేశారు. ఆహ్వానసంఘం పర్యవేక్షణలో ఈ మహాసభలు జరుగుతాయని ఈ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు శివ దాసన్‌ ప్రకటించారు. విద్యారంగంపై కేంద్రం తీరును నిరసిస్తూ నవంబర్‌ 26న మార్చ్‌ టు పార్లమెంట్‌ను జరుపుతామని తెలిపారు.

 

20:57 - November 24, 2015

ఢిల్లీ : ప్రధాని మోడీ కార్పొరేట్‌ కంపెనీ సీఈవోగా పనిచేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి ఆరోపించారు. గోవింద్‌ పన్సేకర్‌ జయంతిని సీపీఐ ఢిల్లీ రాష్ట్ర కమిటీ భావస్వేచ్ఛా దినంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొని, ఆయన మాట్లాడారు. అంబాని, బిర్లాలు సంతోషంగా ఉంటే దేశం కూడా అలాగే ఉంటుందని మోడీ భావిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో లౌకిక పునాదులకు బీటలు వారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో సామాజిక కార్యకర్త ఎంపీ డీ రాజా, మాజీ ఎంపీ అజీజ్‌ పాషా, తెలంగాణ సీనియర్‌ నేత సుధాకర్‌ పాల్గొన్నారు.

20:35 - November 24, 2015

మహబూబ్ నగర్ : జిల్లాలోని కోయిల్ కొండ మండలం బూర్గుపల్లి సర్పంచ్ దేవమ్మ ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం చేసిన అప్పులు తీర్చలేక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దేవమ్మ వయసు 60 సంవత్సరాలు. పంచాయతీ సర్పంచ్ మహిళకు రిజర్వ్ కావడంతో ఆమె పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఆమె కొనసాగుతున్నారు. ఆమె మరణవార్త తెలుసుకున్న సర్పంచుల సంఘం రాష్ట్ర కన్వీనర్ పురుషోత్తం రెడ్డి సంఘటనాస్థలానికి వెళ్లి కుటుంబానికి జిల్లా సర్పంచుల సంఘం తరఫున 76వేల ఆర్థిక సాయాన్ని అందించారు.

 

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : చంద్రబాబు

విజయవాడ : ఎపిలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లు అన్నీ నిండిపోయాయని సీఎం చంద్రబాబు తెలిపారు. 20 సంవత్సరాల కంటే ముందు నిండని డ్యాంలు ఇప్పుడు నిండాయన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. 

ఎపిలో 615 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు : చంద్రబాబు

విజయవాడ : బాక్సైట్ త్వకాలకు గత ప్రభుత్వాలు ఇష్టానుసారంగా అనుమతులిచ్చాయని ఎపి సీఎం చంద్రబాబు విమర్శించారు. ఈమేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాక్సైట్ త్వకాలపై ప్రభుత్వ విధానాన్ని చంద్రబాబు వివరించారు. బాక్సైట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఎపి రెండోస్థానంలో ఉందన్నారు. ఎపిలో 615 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలున్నాయని తెలిపారు. వైఎస్ హయాంలో జిందాల్, రస్ ఆల్ ఖైమా కంపెనీలకు అనుమతులిచ్చారని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో ఎలాంటి పద్ధతులు పాటించలేదన్నారు. 224 మెట్రిక్ టన్నుల తవ్వకానికి ఎంవోయూ చేశారని తెలిపారు. 

20:24 - November 24, 2015

విజయవాడ : బాక్సైట్ తవ్వకాలకు గత ప్రభుత్వాలు ఇష్టానుసారంగా అనుమతులిచ్చాయని ఎపి సీఎం చంద్రబాబు విమర్శించారు. ఈమేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాక్సైట్ త్వకాలపై ప్రభుత్వ విధానాన్ని చంద్రబాబు వివరించారు. బాక్సైట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఎపి రెండోస్థానంలో ఉందన్నారు. ఎపిలో 615 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలున్నాయని తెలిపారు. వైఎస్ హయాంలో జిందాల్, రస్ ఆల్ ఖైమా కంపెనీలకు అనుమతులిచ్చారని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో ఎలాంటి పద్ధతులు పాటించలేదన్నారు. 224 మెట్రిక్ టన్నుల తవ్వకానికి ఎంవోయూ చేశారని తెలిపారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి..
ఎపిలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లు అన్నీ నిండిపోయాయని తెలిపారు. 20 సంవత్సరాల కంటే ముందు నిండని డ్యాంలు ఇప్పుడు నిండాయన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు.

 

19:53 - November 24, 2015

హైదరాబాద్ : తెలంగాణలో మరో ఎన్నికల సందడి నెలకొంది. తెలంగాణలో స్థానికసంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. హైదరాబాద్ మినహా 9 జిల్లాలో 12 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 2న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఈసీ తెలిపింది. కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో రెండేసి సంస్థలకు, మిగిలిన ఆరు జిల్లాలో ఒక్కో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల దాఖలు గడువు డిసెంబర్ 9. నామినేషన్ల ఉపసంహరణ గడువు డిసెంబర్ 12. డిసెంబర్ 27న ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 30న కౌంటింగ్ నిర్వహించనున్నారు.

 

19:49 - November 24, 2015

మహిళను మనిషిగా గుర్తించాలని వక్తలు అన్నారు. మానవి నిర్వహించిన వేదిక చర్చ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ నేత సిహెచ్.దుర్గాభావాని, ఎస్ టిఎఫ్ ఐ కన్వీనర్ ఎం.సంయుక్త పాల్గొని, మాట్లాడారు. మారుమూల గ్రామాలకు వెళ్లే టీచర్లకు రావాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు నియామకాలు జరపాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో కనీసం ఐదుగురు టీచర్లు ఉండాలని పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. దళిత బాలికల విద్య కోసం ప్రత్యేక కృషి జరగాలన్నారు. బాలబాలికలకు సమాన ప్రాతినిధ్య కల్పించాలని చెప్పారు. బాలికా విద్య 50 శాతానికి చేరలేదని వాపోయారు. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినిలకు ఆత్మరక్షణా మార్గాలు కల్పించాలని పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టం పకడ్బందీగా అమలవ్వాలని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

 

తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ : తెలంగాణలో మరో ఎన్నికల సందడి నెలకొంది. తెలంగాణలో స్థానికసంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. హైదరాబాద్ మినహా 9 జిల్లాలో 12 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 2న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఈసీ తెలిపింది. కరీంనగర్, మహబూబ్ నగర్, రెండేసి సంస్థలకు, మిగిలిన ఆరు జిల్లాలో ఒక్కో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 

19:14 - November 24, 2015

నల్లగొండ : భారతదేశాన్ని భారతమాతగా పిలుస్తున్నాము. ఆడ దేవుళ్లను అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తాము. అమ్మను అమితంగా గౌరవిస్తాము. ఆడవారిని అపురూపంగా చూసుకునే సంస్తృతి భారతదేశానికి ఉంది. కానీ ఇప్పుడు ఆడపిల్లలను సాద లేక అమ్ముకునే దుస్థితి నెలకొంది. దేశంలో పలుచోట్ల ఆడపిల్లలను అమ్మేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో శిశు విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దేవరకొండ మండలం దుబ్బతండలో తల్లిదండ్రులు.. శిశువును 50వేలకు అమ్మేశారు. నేనవత్‌ లాలి, లచ్యలకు గతంలో నలుగురు ఆడపిల్లలున్నారు. తాజాగా మరోసారి అమ్మాయి పుట్టింది. పేద కుటుంబం కావడంతో శిశువు పెంచలేమని తల్లిదండ్రులు భావించారు. హైదరాబాద్‌లోని ఓ వాచ్‌మెన్‌కు పాపను ఇచ్చేశారు. కొద్ది రోజులుగా శిశువు కనిపించకపోవడంతో అంగన్‌వాడీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు పాపను అంగన్‌వాడీ కార్యకర్తకు అప్పగించారు. అయితే శిశువును తీసుకున్నవారు మాత్రం తమకు పిల్లలు లేరని.. పాపను పెంచుకునేందుకు తీసుకున్నామని చెబుతున్నారు.

 

18:56 - November 24, 2015

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ విజయం సాధించడంతో సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. వరంగల్ విజయమిచ్చిన ఉత్సాహంతో కేసీఆర్ పలు వరాలు కూడా ప్రకటించారు. త్వరలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామన్నారు. అలాగే 15 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ తో టీచర్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఇచ్చిన హామీలన్నింటిని తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణ చరిత్రలో ఎన్నడూలేని విధంగా అఖండ మెజారిటీనిచ్చిన వరంగల్ ప్రజలకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ భవన్‌ లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ...వరంగల్ విజయం తమ ప్రభుత్వంపై మరింత బాధ్యత పెంచిందని చెప్పారు. ఇది రాష్ట్ర ప్రజల ఆశీర్వాదమని చెప్పారు.
ప్రతిపక్షాలు... అవాకులు చెవాకులు  
వరంగల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు అవాకులు చెవాకులు పేలాయన్నారు. అర్థపర్థం లేకుండా మాట్లాడాయిని అసహనం వ్యక్తం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఐదోరోజే తన దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన సంస్కారం ఈ రాష్ట్ర ప్రతిపక్షాలదేనని విమర్శించారు. వరంగల్ విజయం వారి నోరు మూయించదన్నారు. ప్రాజెక్టుల రీడైజింగ్‌పై ప్రతిపక్షాల రాద్దాంతాన్ని వరంగల్ ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. అనవసరమైన ఆరోపణలు చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని అన్నారు. రవీంద్ర భారతి కూలగొట్టి తెలంగాణ కళా భారతి నిర్మిద్దామంటే వద్దంటారు. ప్రపంచదేశాలు మెచ్చేలా సెక్రటేరియట్‌ కడదామంటే ధర్నాలు చేస్తారు. కూలిపోయే స్థితిలో ఉన్న ఉస్మానియా ఆస్పత్రి స్థానంలో మరించి హాస్పిటల్‌ ను నిర్మిద్దామంటే గోలగోల చేస్తారు. టీఆర్ఎస్ సర్కారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించడమే ప్రతిపక్షాల పని విమర్శించారు కేసీఆర్. వరంగల్ విజయంతోనైనా నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రాజెక్టుల రీడైజింగ్‌పై ప్రతిపక్షాల రాద్దాంతాన్ని వరంగల్ ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు కేసీఆర్. అనవసరమైన ఆరోపణలు చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని అన్నారు. కల్యాణలక్ష్మీ పథకాన్ని బీపీఎల్ దిగువన ఉన్న ప్రతి కుటుంబానికీ వర్తింపజేస్తామన్నారు సీఎం కేసీఆర్. అగ్రవర్ణాల పేదలూ దీని ద్వారా లబ్ది పొందే అవకాశముందన్నారు.

 

 

 

 

 

 

 

18:47 - November 24, 2015

ఖమ్మం : తమ సమస్యను పరిష్కారం కోసం ఆశా కార్యకర్తలు ఖమ్మం జిల్లాపరిషత్ సమావేశంలోని వెళ్లేందుకు యత్నించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. జడ్పీ కార్యాలయం గేటు వద్ద ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆశా కార్యకర్తలు తమ వేతనాన్ని 15 వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

 

18:45 - November 24, 2015

ఆదిలాబాద్‌ : నాసిరకం భోజనం పెడుతున్నారంటూ ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లోని బీసీ హాస్టల్‌ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌ గదులను శుభ్రపరచడంలేదని మండిపడ్డారు. దొడ్డు బియ్యం, నీళ్లచారు, కుళ్లిన అరటిపండ్లను ఇస్తున్నారని ఆరోపించారు.. ఈ వస్తువులతో ఆర్ డీవో కార్యాలయం ముందు నిరసన తెలిపారు. వెంటనే స్పందించిన ఆర్డీవో... బీసీ వెల్ఫేర్ అధికారి నర్సారెడ్డితో ఈ అంశంపై మాట్లాడారు.. హాస్టల్‌లోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ర్యాగింగ్‌ రహిత రాష్ట్రంగా ఏపీ : మంత్రి గంటా

గుంటూరు : నాగార్జున యూనివర్శిటీలో ర్యాగింగ్‌పై ప్రొఫెసర్ కృష్ణమోహన్, ప్రొఫెసర్‌ విజయలక్ష్మితో కమిటీని వేస్తున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఏపీని ర్యాగింగ్‌ రహిత రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు.

18:42 - November 24, 2015

గుంటూరు : నాగార్జున యూనివర్శిటీలో ర్యాగింగ్‌పై ప్రొఫెసర్ కృష్ణమోహన్, ప్రొఫెసర్‌ విజయలక్ష్మితో కమిటీని వేస్తున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఏపీని ర్యాగింగ్‌ రహిత రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. ర్యాగింగ్‌ నిరోధానికి త్వరలో డీజీపీ, సీఎస్‌తోకూడిన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇకపై ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్‌ చేసినట్లు రుజువైతే భవిష్యత్తులో ఎక్కడా చదువుకోకుండా నిషేధం విధిస్తామని హెచ్చరించారు. ఒంగోలులో ట్రిపుల్‌ఐటీకి ఏర్పాటు చేస్తామన్నారు.

 

నాలుగేళ్లలో 'పోలవరం' పూర్తి : చంద్రబాబు

విజయవాడ : పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేస్తామని ఎపి సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు పోలవరం కోసం 2వేల 218 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందని చెప్పారు. 

18:38 - November 24, 2015

విజయవాడ : పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేస్తామని ఎపి సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు పోలవరం కోసం 2వేల 218 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందని చెప్పారు. భారీ వర్షాలతో 3వేల కోట్ల వరకూ నష్టం జరిగిందని అంచనా వేసినట్లు టీడీపీ ఎంపీలతో చంద్రబాబు అన్నారు. కేంద్రం దగ్గర వివిధ అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని... వీటిని సాధించుకునేందుకు సహకరించాలని ఎంపీలకు సూచించారు. విజయవాడలో ఎంపీలతో సమావేశంలో వివిధ విషయాలపై ఏపీ సీఎం చర్చించారు. ఈ విషయాలను కేంద్రమంత్రి సుజనా చౌదరి మీడియాకు వివరించారు.

 

తెలంగాణలో కరువు మండలాల ప్రకటన

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. మొత్తం 231 మండలాలను కరువు మండలాలుగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ అధ్యక్షతను కరువుపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయశాఖా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వర్షపాతం బాగానే ఉందని సమీక్షలో నిర్ధారణకు వచ్చారు. కేంద్రం తక్షణకే కరువు సాయం కింద వెయ్యి కోట్ల అందించాలని కేసీఆర్‌ కోరారు.

18:24 - November 24, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. మొత్తం 231 మండలాలను కరువు మండలాలుగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ అధ్యక్షతను కరువుపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయశాఖా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వర్షపాతం బాగానే ఉందని సమీక్షలో నిర్ధారణకు వచ్చారు. కేంద్రం తక్షణకే కరువు సాయం కింద వెయ్యి కోట్ల అందించాలని కేసీఆర్‌ కోరారు.

డబ్బులు వెదజల్లడంతోనే టీఆర్‌ఎస్‌ గెలుపు : ఎంపీ గుత్తా

హైదరాబాద్ : వరంగల్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని నల్గొండ కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇన్‌ఛార్జిగా నియమించి.... విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లడంతోనే టీఆర్‌ఎస్‌ గెలిచిందన్నారు. అధికార టీఆర్‌ఎస్‌ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకగా భవిష్యత్‌లో లౌకికవాద పార్టీలన్నీ ఏకంకావాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు. 

టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం : ఎర్రబెల్లి

హన్మకొండ : వరంగల్‌ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తెలంగాణ తెలుగుదేశం నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సర్పంచుల నుంచి జడ్పీటీసీ, ఎంపీటీల వరకు అందర్నీ బెదిరించిందని ఆరోపించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టారని చెప్పారు. అత్యధిక మెజారిటీతో గెలిచినా...ప్రభుత్వ వ్యతిరేకతను టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తిస్తుందని భావిస్తున్నామని ఎర్రబెల్లి దయాకర్ అన్నారు.

18:16 - November 24, 2015

హన్మకొండ : వరంగల్‌ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తెలంగాణ తెలుగుదేశం నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సర్పంచుల నుంచి జడ్పీటీసీ, ఎంపీటీల వరకు అందర్నీ బెదిరించిందని ఆరోపించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టారని చెప్పారు. అత్యధిక మెజారిటీతో గెలిచినా...ప్రభుత్వ వ్యతిరేకతను టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తిస్తుందని భావిస్తున్నామని ఎర్రబెల్లి దయాకర్ అన్నారు.
డబ్బులు వెదజల్లడంతోనే టీఆర్‌ఎస్‌ గెలుపు : ఎంపీ గుత్తా
వరంగల్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని నల్గొండ కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇన్‌ఛార్జిగా నియమించి.... విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లడంతోనే టీఆర్‌ఎస్‌ గెలిచిందన్నారు. అధికార టీఆర్‌ఎస్‌ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకగా భవిష్యత్‌లో లౌకికవాద పార్టీలన్నీ ఏకంకావాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు.

 

18:12 - November 24, 2015

హన్మకొండ : వరంగల్ విజయం టీఆర్ఎస్ ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎర్రబెల్లి దయాకర్‌ కు దిమ్మతిరిగే ఫలితమని అన్నారు. ఢిల్లీ, బీహార్‌లో బిత్తరపోయిన బీజేపీకి వరంగల్ లో కనీసం డిపాజిట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. 

 

17:55 - November 24, 2015

ముంబై : అసహనం వల్ల... భారత్ వదిలిపెట్టి పోదామని తన భార్య అడుగుతోందన్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ సోషల్ మీడియాలో మిస్టర్ ఫర్ ఫెక్ట్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. అమీర్ కు ఎక్కడ ప్రశాంతత ఉంటుందనుకుంటే అక్కడి వెళ్లిపోవచ్చని ట్విట్ చేశారు. ఇక్కడ జీవించడానికి భయంగా ఉంటే ఎక్కడికైనా వెళ్లి జీవించే స్వేచ్ఛ అమీర్ ఖాన్ కు ఉందని మనోజ్ తివారీ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.

 

వరంగల్ ప్రజలకు కేసీఆర్ ధన్యవాదాలు...

హైదరాబాద్‌ : ఎప్పుడూ ఎవరికీ రానటువంటి మెజారిటీ ఇచ్చి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని వరంగల్‌ జిల్లా ప్రజలు గెలిపించారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొనియాడారు. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున, వ్యక్తిగతంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ గెలుపు ప్రభుత్వం మీద పెద్ద బాధ్యత పెరిగినట్లు భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

సిరియా యుద్ధ విమానం కూల్చివేత..

టర్కీ : సిరియాపై బాంబులతో వరుసగా విరుచుకుపడుతున్న రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ యుద్ధ విమానాన్ని టర్కీ మంగళవారం కూల్చేసింది. తమ గగనతల నియమాలను ఉల్లంఘించడంతో పాటు హెచ్చరికలను లెక్కచేయనందునే ఎఫ్ 16 యుద్ధ విమానంతో కూల్చేసినట్లు టర్కీ పేర్కొంది.

సింగపూర్ తో భారత్ కీలక ఒప్పందాలు...

సింగపూర్ : సింగపూర్‌తో భారత్ పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. రెండు దేశాలు వాణిజ్య, రక్షణ పరమైన సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకునేందుకు అంగీకరించాయి. అటు ఇరుదేశాల దౌత్య సంబంధాలు అర్ధశతాబ్ధంగా కొనసాగుతున్న నేపథ్యంలో సంయుక్త స్టాంప్‌ను విడుదల చేశారు. సింగపూర్‌ ప్రధాన మంత్రి లీతో భారత ప్రధాని నరేంద్రమోడీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, వాణిజ్య, రక్షణ అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సుమారు 10 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాధినేతల సమక్షంలో దౌత్య అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 

కల్తీ వ్యాపారాలపై పోలీసుల దాడులు

కృష్ణా : విజయవాడలో కల్తీ వ్యాపారాలపై ఖాకీలు జూలు విదిల్చారు. కల్తీ నెయ్యి వ్యాపారం చేస్తున్న ఫణికుమార్‌ను పోలీసులు విచారిస్తున్నారు. సింగ్‌నగర్‌లోని తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించారు. అక్కడ పసుపు, కారం, మసాలాలకు సంబంధించిన నకిలీ కంపెనీల ప్యాకెట్లు కూడా దొరకటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. 

ప్రతిపక్షాలపై కేసీఆర్ విసుర్లు...

హైదరాబాద్ : తమ ప్రభుత్వం ఏ మంచి పని చేద్దామన్నా ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయని సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అబద్దాలు చెబుతున్నాయని అన్నారు. ఏ పనిచేద్దామన్నా మొదలు అడ్డుపడటం నేర్చుకున్నాయన్నారు. 

తెలంగాణలో 213 కరవు మండలాలు..

హైదరాబాద్ : రాష్ట్రంలో 231 మండలాల్లో కరవు తలెత్తినట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్దారించింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కరువు మండలాలలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మీనా, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు హాజరయ్యారు. 

రెండు లారీలు ఢీ.. ఐదుగురి మృతి

నెల్లూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెన్నా బ్రిడ్జీ సమీపంలో ఆగిఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జాతీయ రహదారిపై లారీకి పంక్చర్‌ వేస్తున్న సమయంలో వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. దీంతో పంక్చర్‌ వేస్తున్న మెకానిక్‌త పాటు రెండు లారీల్లో మొత్తం ఐదు మంది మృతి చెందారు.

 

పసునూరి విజయంపై ఎంపీ కవిత హర్షం..

హైదరాబాద్: వరంగల్ లోక్‌సభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ విజయం సాధించడంపై టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఇది వరంగల్ ప్రజల విజయమని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ విజయమని కొనియాడారు. 

ఎస్‌ఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

మహబూబ్ నగర్ : ఏసీబీ వలలో మరో ప్రభుత్వాధికారి చిక్కాడు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు ఫిర్యాదులు రావడంతో మహబూబ్‌నగర్‌ ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ చందూలాల్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు.  

17:47 - November 24, 2015

మహబూబ్ నగర్ : ఏసీబీ వలలో మరో ప్రభుత్వాధికారి చిక్కాడు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు ఫిర్యాదులు రావడంతో మహబూబ్‌నగర్‌ ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ చందూలాల్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కరీంనగర్‌లో చందూలాల్‌కు చెందిన మూడు ఇళ్లల్లోను అధికారులు తనిఖీలు చేపట్టారు. సుమారు మూడు లక్షల రూపాయల నగదును, 30 తులాల బంగారు ఆభరణాలతో పాటు విలువైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

17:45 - November 24, 2015

నెల్లూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెన్నా బ్రిడ్జీ సమీపంలో ఆగిఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జాతీయ రహదారిపై లారీకి పంక్చర్‌ వేస్తున్న సమయంలో వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. దీంతో పంక్చర్‌ వేస్తున్న మెకానిక్‌త పాటు రెండు లారీల్లో మొత్తం ఐదు మంది మృతి చెందారు.

 

17:44 - November 24, 2015

కృష్ణా : విజయవాడలో కల్తీ వ్యాపారాలపై ఖాకీలు జూలు విదిల్చారు. కల్తీ నెయ్యి వ్యాపారం చేస్తున్న ఫణికుమార్‌ను పోలీసులు విచారిస్తున్నారు. సింగ్‌నగర్‌లోని తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించారు. అక్కడ పసుపు, కారం, మసాలాలకు సంబంధించిన నకిలీ కంపెనీల ప్యాకెట్లు కూడా దొరకటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.

 

అమీర్‌ ఖాన్‌ వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఓవైసీ ఖండన

హైదరాబాద్‌ : ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అమీర్‌ ఖాన్‌ వ్యాఖ్యల్ని ఖండించారు. దేశంలో ఎన్నో రకాల అలజడులను చూశామని...అయినప్పటికీ వాటన్నంటినీ తట్టుకుని ఇక్కడే ఉంటున్నామని, ఇది మన దేశమని ఆయన గుర్తుచేశారు. అమీర్‌ చేసినటువంటి వ్యాఖ్యలు తానెప్పుడూ చేయనని ఆయన అన్నారు. అటువంటి అర్ధంలేని మాటలు తాను మాట్లాడనని ఆయన అన్నారు. ఎటువంటి సంఘర్షలకు లోనైప్పటికీ ఇక్కడే ఉండి దేశానికి సేవ చేయాలని ఆయన అమీర్‌ ఖాన్‌కు సూచించారు.

 

 

రెండు నెలల్లోగా కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ : సీఎం కేసీఆర్

హైదరాబాద్‌ : రెండు నెలల్లోగా ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఈమేరకు ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. వారం రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. తెలంగాణలో త్వరలోనే డీఎస్సీ ప్రకటన వెలువరిస్తామని చెప్పారు. క్రిస్మస్‌ సందర్భంగా 2 లక్షల మంది పేదలకు దుస్తులు పంపిణీ చేస్తామని, అన్ని నియోజకవర్గాల్లో భోజనం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి పథకాన్ని బీసీలు, అగ్రవర్ణాల పేదలకు కూడా అమలు చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

 

అసెంబ్లీ నుంచి ఓపీ శర్మ సస్పెండ్‌

ఢిల్లీ : బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మను శాసన సభ నుంచి సస్పెండ్‌ చేశారు. ఆప్‌ ఎమ్మెల్యే అల్కా లాంబాపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో స్పీకర్‌ రామ్‌ నివాస్‌ గోయల్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో తన నియోజక వర్గంలో నైట్‌ షెల్టర్‌ల గురించి శర్మ ప్రస్తావిస్తున్న సందర్భంగా అల్కా లాంబా ఆయనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో శర్మ మరింత రెచ్చిపోయి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రాత్రంతా నువ్వు తిరుగుతూనే ఉంటావు కదా అని కామెంట్‌ చేశారు. దీంతో స్పీకర్‌ ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

15:29 - November 24, 2015

బిగ్ బి అమితాబ్ లివర్ చెడిపోయిందంట..ప్రస్తుతం బాలీవుడ్ లో దీనిపై చర్చ సాగుతోంది. ఎందుకంటే తన లివర్ చెడిపోయిందని స్వయంగా బిగ్ బి పేర్కొనడం హాట్ టాపికైంది. వివరాల్లోకి వెళితే...బిగ్ బి..అమితాబ్ బచ్చన్..చాలా మందికి ఎనలేని అభిమానం. ఎప్పుడూ చెలాకీగా కనిపించే అమితాబ్ తన ఆరోగ్యం గురించి మరోసారి వ్యాఖ్యలు చేశారు. హెపటైటిస్ క్యాంపెయిన్ లో బిగ్ బి పాల్గొన్నారు. తాను దాదాపు 75 శాతం పాడైపోయిన లివర్ తో జీవించడం జరిగిందని, ఆ తరువాత ట్రీట్ మెంట్ తీసుకోవడం వల్ల ఇప్పుడు బాగైపోయిందని తెలిపారు. 2000 సంవత్సరంలోనే ఈ విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. తన లివర్‌లో 75% చెడిపోయిందని, కేవలం 25% లివర్‌ మాత్రమే పనిచేస్తోందని ఆయన తెలిపారు. అప్పటి నుంచి డాక్టర్ల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం తీసుకోవడంతో ఇలా మీ ముందు ఉండగలిగానని ఆయన తెలిపారు. మనిషి ఆరోగ్యంగా జీవించడానికి కేవలం లివర్‌లో 12% పనిచేసినా సరిపోతుందని కూడా అమితాబ్‌ తెలిపారు.

కూలీ చిత్రం షూటింగ్‌లో తగిలిన గాయం..
అమితాబ్‌ నటించిన కూలీ అనే చిత్రం షూటింగ్‌ సందర్భంగా ఒక స్టంట్‌లో ఆయనకు గాయమైంది. అమితాబ్ పరిస్థితి తెలిసి రక్తం దానం చేయడానికి 200 మంది ముందుకొచ్చారు. వారందరి నుంచి 60 బ్యాటిళ్ల రక్తం స్వీకరించి అమితాబ్‌ను గండం నుంచి గట్టెంక్కించారు. రక్తం దానం చేసిన వారిలో ఒకరికి హెపటైటిస్‌ బీ అనే వ్యాధి ఉండడంతో అది తనకు సోకిందని...వ్యాధి సోకిన 18 సంవత్సరాల తర్వాత ఈ విషయం బయట పడిందని అమితాబ్ తెలిపారు. మరోవైపు మనదేశంలో డాక్టర్ల అమితాబ్‌ ప్రసంశలు కురిపించారు. విదేశాల్లో ఉన్న వైద్య నిపుణులకు ఏమాత్రం తీసిపోని విధంగా మన డాక్టర్లు ఉన్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వారి కారణంగానే తాను ప్రస్తుతం ఈ స్థితిలో ఉండగలుగుతున్నానని ఆయన కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.

ఈ తీర్పు మా పాలనకు రెఫరెండం : కడియం

వరంగల్ : వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు టీసర్కార్ పాలనకు రెఫరెండమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలకు ప్రజలు ఓటుతో సమాధానం చెప్పారని పేర్కొన్నారు. ఈ గెలుపుతో జిల్లా నాయకుల బాధ్యత మరింత పెరిగిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అవినీతికి దూరంగా ఉంటూ నీతి, నిజాయితీలతో పని చేస్తామని చెప్పారు.

 

14:53 - November 24, 2015

ఆహారం మితంగా తింటే ఆరోగ్యం. పరిమితి దాటి తింటే అనారోగ్యం కదా! అయితే వద్దు అనుకున్నా కూడా తినేసే పరిస్థితి కొన్నిసార్లు ఏర్పడుతుంది. ఇది..ఈటింగ్ డిజార్డర్. దీని ప్రధాన లక్షణాలు ఎన్నో ఉంటాయి. ఆహారం అతిగా తినడం వల్ల శరీరంలో ఎక్కడ పడితే అక్కడ కొవ్వు పేరుకపోతుండడం జరుగుతుంటుంది. తినే తిండి మీద అదుపు లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి ? అందుకోసం ఓ కంపెనీ ఓ గాడ్జెట్ ని కనిపెట్టింది. దాని పేరే 'సెల్ఫ్ షాక్ రిస్ట్ బ్యాండ్'. చేతికి కట్టుకొనే వాచ్ లాగా పెట్టుకోవచ్చు. ఈ సెల్ఫ్ షాక్ రిస్ట్ బ్యాండ్ ధరించి ఇష్టమొచ్చినట్లు లాగించేస్తుంటే ఫస్ట్ బీప్ సౌండ్ తో వార్నింగ్ ఇస్తుంది. అప్పటికీ వినకపోతే చిన్నపాటి షాక్ ఇస్తుంది. వెంటనే తినేయడం ఆపేయాలని వార్నింగ్ ఇస్తుంది. బరువు పెరగడాన్ని నియంత్రించి...మంచి ఆహారపు అలవాట్లను సూచిస్తుందంట. సో..అతిగా తినే వారికి ఈ గాడ్జెట్ బాగా ఉపయోగపడుతుందన్నమాట.

ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచిన టీఆర్ ఎస్ : గాలి వినోద్ కుమార్

వరంగల్ : వరంగల్ ఉప ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి టీఆర్ ఎస్ గెలిచిందని వామపక్షాల అభ్యర్థి గాలి వినోద్ కుమార్ విమర్శించారు. ఉప ఎన్నిక జరిగిన విధానంపై ఈసీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

14:25 - November 24, 2015

వరంగల్ : జిల్లా లోక్ సభ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రి కడియం..ఎంపీ వినోద్ కుమార్ లు పేర్కొన్నారు. లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికకు సోమవారం కౌంటింగ్ జరిగింది. ఈ ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ భారీ మెజార్టీ సాధించి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా మంత్రి కడియం మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం..అన్ని రాజకీయ పార్టీల డిపాజిట్లు గల్లంతు కావడం ప్రజలకు..కేసీఆర్ నాయకత్వం పట్ల విశ్వాసాన్ని తెలియచేస్తుందన్నారు. ఎన్నికల ప్రచారంలో తాము రెండు విషయాలను ప్రధానంగా చెప్పడం జరిగిందని, ఈ తీర్పు పాలనకు రెఫరెండమని చెప్పడం జరిగిందన్నారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలు వరంగల్ జిల్లా ప్రజలు తీర్పు ద్వారా సమాధానం చెబుతారని ఆనాడు చెప్పడం జరిగిందని అదే జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ సూచించడం జరిగిందన్నారు. తప్పులు చేసి ఉంటే శిక్ష వేయాలని, ప్రతిపక్షాలవి అవాస్తవాలు అయితే వారికి శిక్ష వేయాలని సీఎం కేసీఆర్ పేర్కొనడం జరిగిందని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు దిమ్మ తిరిగేలాగా ప్రజలు శిక్ష వేశారని, పసునూరి గెలుపు ద్వారా
జిల్లా నాయకుల బాధ్యత మరింత పెరిగిందన్నారు. జిల్లా అభివృద్ధికి పాటు పడుతామని, నీతి నిజాయితీతో పాలన అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఫలితాల అనంతరం విపక్షాలు ఆత్మ విమర్శ చేసుకోవాల్సింది పోయి ఇంకా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

అండదండగా ఉంటా - పసునూరి..
జిల్లా ప్రజలకు తాను అండదండగా ఉంటానని ఎంపీగా గెలిచిన పసునూరి దయాకర్ పేర్కొన్నారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 4,59,092 ఓట్ల భారీ అధిక్యంతో గెలుపొందారు. ఎన్నికల అధికారులనుండి ఆయన అధికారిక పత్రాలను అందుకున్నారు. తాను ప్రజలకు, కార్యకర్తలకు అండదండలుగా ఉంటానని, మంచిపేరు తెస్తానని తెలిపారు. అలాగే నీతివంతమైన రాజకీయాలు చేస్తాననని, భారీ మెజార్టీ సాధించడం వెనుక కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు చెప్పారు.

ఆనాడు చెప్పిందే జరిగింది - వినోద్..
ఎన్నికల ప్రచారం చివరి రోజు తాను ఏదైతే చెప్పానో అదే ఈ రోజు జరిగిందని ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. పసునూరి గెలుపుకు సహకరించిన వారికి, ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉంచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు అమలు జరుగుతున్నాయని, కేసీఆర్ రూపొందించిన పథకాలు రానున్న రోజుల్లో అమలవుతాయని ప్రజలు విశ్వసించారని తెలిపారు. ఇదే తీర్పు 2019 ఎన్నికల్లో వస్తుందని ఎంపీ వినోద్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

13:46 - November 24, 2015

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికల్లో టిఆర్ ఎస్ అభ్యర్థి మసునూరి దయాకర్ ఘన విజయం సాధించారు. 4,59,092 ఓట్ల మెజారిటీతో పసునూరి విజయం సాధించారు. మరో వైపు విపక్షాలకు డిపాజిట్ కూడా దక్కక పోవడం విశేషం. దీంతో టిఆర్ ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగి పోయాయి. తెలంగాణ చరిత్రలో అత్యధిక మెజారిటీలో పసునూరి గెలుపొందారు.
టీఆర్ఎస్ అభ్యర్థి : 6,15,403...కాంగ్రెస్ అభ్యర్థి : 1,56,315.. బీజేపీ అభ్యర్థి : 1,30,178.. స్వతంత్ర అభ్యర్థి : 28,540.. వైసీపీ : 23,352.. వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి : 14,778.. నోటా ఓట్లు : 7,753

నియోజకవర్గాల వారీగా..
పరకాల : 76,886
వరంగల్ ఈస్ట్ : 73,446
భూపాలపల్లి : 65,805
స్టేషన్ ఘన్ పూర్ : 61,301
వరంగల్ వెస్ట్ : 56,786
పాలకుర్తి : 35,918

వరంగల్ బై పోల్ లో టిఆర్ ఎస్ ఘన విజయం

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికల్లో టిఆర్ ఎస్ అభ్యర్థి మసునూరి దయాకర్ ఘన విజయం సాధించారు. 4,59,092 ఓట్ల మెజారిటీతో పసునూరి విజయం సాధించారు.

4,48,135 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ ఎస్

హైదరాబాద్ : వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 19వ రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4,48,315 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు 1,53,210 ఓట్లు రాగా, బిజెపి అభ్యర్థి పగిడిపాటి దేవయ్యకు 1,28,155 ఓట్లు లభించినట్లు అధికారులు తెలిపారు.

13:26 - November 24, 2015

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ పనితనానికి వరంగల్ ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనమని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. ఆయన వరంగల్ లో 'టెన్ టివి'తో మాట్లాడుతూ... వరంగల్ ఉప ఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల మా పై మరింత బాధ్యత పెరిగిందన్నారు. టిఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజల మన్ననలను చూరగొన్నది అనడానికి ఈ ఫలితం నిదర్శనం అన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేశాయని అయిన ప్రజలు విశ్వసించలేదన్నారు. ప్రజలకు ప్రభుత్వం రుణ పడి ఉంది. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం నడవాల్సి ఉంటుందన్నారు. మేనిఫెస్టోలో పొందుపరుస్తున్న అంశాలన్నింటి పై మరింత బాధ్యతాయుతంగా పని చేస్తామన్నారు.

గుంతకల్లు లో భారీగా కిరోసిన్ పట్టివేత

అనంతపురం : గుంతకల్లు పట్టణంలో మంగళవారం చౌక ధరల దుకాణాలకు సరఫరా చేసే కిరోసిన్ భారీగా పట్టుబడింది. స్థానిక ఆలూరు రోడ్డులోని హిందూ శ్మశానం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పీపాల్లో ఉంచిన సుమారు 4,500 లీటర్ల నీలి కిరోసిన్ ను నిల్వ ఉంచారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు కిరోసిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

బహుదా నదిలో విద్యార్థి గల్లంతు..

చిత్తూరు :నిమ్మనపల్లి మండలం కొండయ్యగారిపల్లికి చెందిన ఓ డిగ్రీ విద్యార్థి బహుదానదిలో గల్లంతయ్యాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. డిగ్రీ చదువుతున్న సోమశేఖర్ (16) గ్రామ సమీపంలోని వంతెనపై నుంచి వెళుతున్న సమయంలో బహుదా నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతడి కోసం స్థానికులు గాలిస్తున్నారు.

13:10 - November 24, 2015

సాయికృప, రామకృష్ణ, వంశీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మిత్రవింద'. అమృత సాయి ఆర్ట్స్‌ బేనర్‌పై సాయిరాం దాసరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. నిర్మాత ఓలేటి రామకృష్ణ. ఈ చిత్ర పోస్టర్‌ను, ట్రైలర్‌ను సోమవారం సంగీత దర్శకురాలు శ్రీలేఖ విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ''ఇదొక సస్పెన్స్‌ థ్రిల్లర్‌. ఈ మధ్య ఇలాంటి చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. టైటిల్‌ చాలా క్యాచీగా ఉంది'' అని చెప్పారు. ఇంతకుముందు 'టాలరీ' అనే చిత్రం చేశానని, దానికి జాతీయ స్థాయిలో అవార్డు దక్కిందని సాయిరాం తెలతిపారు. ఇది మూడో చిత్రమని, ఈ చిత్రం కోసం ఎస్‌బిరే టెక్నాలజీని కొత్తగా వాడినట్లు పేర్కొన్నారు. ఈ చిత్ర ఒక్కరోజులో జరిగేదని, ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయన్నారు. అన్నపూర్ణ స్టూడియెలో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేయడం జరిగిందని, పరిమిత బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు ఓలేటి రామకృష్ణ తెలిపారు. 

13:09 - November 24, 2015

వరుస విజయవంతమైన చిత్రాలతో ఉత్సాహంగా ఉన్న హీరో నిఖిల్‌ మరొక చిత్రం 'టైగర్‌'ను ప్రారంభించాడు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారు. వీరిలో తాప్సీను ఒక హీరోయిన్‌గా ఎంపిక చేశారు. వి.ఐ ఆనంద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. తాప్సీనే ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. రెండో హీరోయిన్‌గా అవికా గోర్‌ను ఎంపిక చేశారు. స్వాతిని మూడో హీరోయిన్‌గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్‌ రెండో వారం నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.

 

13:09 - November 24, 2015

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం చేస్తున్న 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' సినిమాలో 'బుజ్జిగాడు' ఫేమ్‌ సంజనా నటించనుంది. ఈ చిత్రంలో సంజనా రాణి పాత్రలో కన్పించబోతుంది. ఈ సినిమాలో అవకాశం దక్కడంతో ఈ హీరోయిన్‌ తెగ సంబరపడిపోతుంది. ఈ సందర్భంగా సంజనా మాట్లాడుతూ ''ఈ చిత్రం షూటింగ్‌లో ఈ వారంలోనే పాల్గొంటాను. పవన్‌ కళ్యాణ్‌తో నటించే అవకాశం రావడం నా అదృష్టం. బుజ్జిగాడు సినిమాలో త్రిష సోదరిగా నటించాను. ఈ సినిమాలో నేను చేసే పాత్ర మంచి పేరు తెచ్చి పెడుతుంది'' అని తెలిపింది.

కడియం, కేసీఆర్ రికార్డును బ్రేక్ చేసిన పసునూరి

హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రికార్డును పసునూరి దయాకర్ బ్రేక్ చేశారు. వరంగల్ లోక్‌సభ 2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాల కంటే ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ వచ్చింది. సార్వత్రిక ఎన్నికలో 3,92,574 ఓట్ల మెజార్టీ రాగా, ఇప్పుడు 4,07,611 ఓట్ల మెజార్టీ వచ్చింది. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన కేసీఆర్‌కు 3,97,029 మెజార్టీ వచ్చింది. ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు 60 శాతం ఓట్లు పడగా, కాంగ్రెస్ 15, బీజేపీకి 12 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా దక్కలేదు.

13:08 - November 24, 2015

బరువు బాధతో ఇబ్బందిపడేవాళ్లకు... ఆ బరువు తగ్గించుకునే టిప్స్‌ కొన్ని...
ఉదయానే లేచి పేపర్‌ చదివి... టీతాగి ఇతరత్ర కార్యాక్రమాలు చేసుకుంటూ నిరంతరం యాక్టివ్‌గా ఉండే విధంగా ప్రయత్నించండి. వీలయితే సైకిల్‌ తీసుకుని అలా బయటికి వెళ్లిరండి. బయటికి వెళ్లే అవకాశం లేకుంటే ఇంట్లో తాడు తీసుకుని 5నుంచి 10 నిమిషాల పాటు స్కిప్పింగ్‌ చేయండి. ఇంట్లోనే ఉండాలనుకుంటే యూట్యూబ్‌లోనో, టీవీ ఛానల్స్‌లోనో వస్తున్న యోగా చూస్తూ ప్రాక్టీస్‌ చేయండి. ఎన్నిసార్లు తిన్నా తినేటప్పుడు మాత్రం కంట్రోల్‌లో ఉండండి. తక్కువ మొత్తాన్ని ఎక్కువసార్లు తీసుకోండి. చక్కెర, ఉప్పువాడకం కొంత తగ్గించండి. తాజా పండ్లు తీసుకోండి. వాటిలో సహజమైన చక్కెరలుంటాయి. ఏదైనా ఇష్టమైన ఫుడ్‌ చూడగానే మనసుకేమో తినలానిపిస్తుంది. మెదడేమో వద్దని చెబుతుంది. అలాంటి సమయంలో మెదడు చెప్పిన మాట వినండి. నోరూరించినదాన్నల్లా లాగించకండి. ఆకలి వేసినప్పుడు జ్యూస్‌లు ఎక్కువగా తీసుకోండి. ఆకలి తీరుతుంది. ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకున్నట్టుగా ఉంటుంది. వేడినీళ్లు తాగడం వల్ల ఒంటిలో నిల్వ ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అందుకే ఉదయాన్నే గ్లాసెడు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనే, కొంచెం నిమ్మరసం కలిపి తాగండి. తొందరగా బరువు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒంట్లో ఉన్న టాక్సిన్స్‌ అన్నీ బయటికి వెళ్లాలంటే రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి.

13:07 - November 24, 2015

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు. ఆకుకూరల్లోని విటమిన్‌-బీ పాలెట్స్‌ జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇందులోని విటమిన్‌-ఏ కంటిచూపును మెరుగు పరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే అమైనో ఆమ్లాలనూ నియంత్రిస్తాయి. ముఖ్యంగా పొన్నగంటి కూరలో ఏ విటమిన్‌ అధికం. దీనిని తింటే రేచీకటి రాదు. శరీరానికి చలువ కూడా. పేగుల్లోకి వెళ్లిన వెంట్రుకలను సైతం కరిగించే శక్తి దీనికుంది. ఇక కూరల్లోగానీ, పచ్చడిగా గానీ పుదీనా తీసుకుంటే మెదడు చురుగ్గా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

ఆహారంలో ఆకుకూరలు...
బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడే ఒక రాఫుడ్‌ ఆకుకూరల్లో ఉంటుంది. వీటిలో విటమిన్‌ కె పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరానికి కావలసిన ఐరన్‌ని అందిస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు. ఆకు కూరల్లో క్యాలరీలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ప్రతి రోజూ ఏదో ఒక ఆకు కూర తీసుకునే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పధ్నాలుగు శాతం తగ్గించ వచ్చంటున్నారు. కాబట్టి ఆహారంలో ఆకుకూరలు వారానికి మూడు సార్లు తీసుకుంటూ వుండండి. అలాగే డ్రై ఫ్రూట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరా, బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, చెర్రీ, అంజీరా, పిస్తా, వాల్‌నట్స్‌ లాంటి ఎండు పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యంతో పాటు శరీరానికి అదనపు శక్తిని ఇస్తాయి. రుచిగా ఉన్నాయి కదా అని మరీ ఎక్కువ తింటే అజీర్తి, అనారోగ్య సమస్యలు రావొచ్చు. అందుకే రోజుకు రెండు నుంచి నాలుగు డ్రైఫ్రూట్స్‌ మాత్రమే తీసుకోవాలి. నట్స్‌ను తీసుకునే ముందు వాటిని శుభ్రం చేసుకోవడం మంచిది. 

13:04 - November 24, 2015

వరుణ్‌ తేజ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ సి.కళ్యాణ్‌ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకంపై సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్‌, తేజ నిర్మిస్తున్న చిత్రం 'లోఫర్‌'. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చిందని, చాలా తక్కువ టైమ్‌లో 10 లక్షల క్లిక్స్‌ వచ్చాయని నిర్మాత కళ్యాణ్ తెలిపారు. ట్రైలర్‌కి వచ్చిన ట్రెమండస్‌ రెస్పాన్స్‌తో బిజినెస్‌ కూడా చాలా స్పీడ్‌గా ఉందని, అన్ని ఏరియాల నుంచి ఫ్యాన్సీ ఆఫర్స్‌ వస్తున్నాయన్నారు. డిసెంబర్‌ 7న ఈ చిత్రం ఆడియోను శిల్పకళా వేదికలో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడం జరుగుతుందని, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి మదర్‌ సెంటిమెంట్‌, హై యాక్షన్‌ ఈ చిత్రంలో ఉంటుందన్నారు. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో రవితేజకి 'ఇడియట్‌', మహేష్‌కి 'పోకిరి', ఎన్టీఆర్‌కి 'టెంపర్‌', చరణ్‌కి 'చిరుత', బన్నీకి 'దేశముదురు' ఎలా మాస్‌ సినిమాలు అయ్యాయో, వరుణ్‌తేజ్‌కి 'లోఫర్‌' మంచి మాస్‌ సినిమా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 18న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. 

13:01 - November 24, 2015

అనుష్క ఆర్య, సోనాల్‌ చౌహాన్‌ ప్రధాన పాత్రధారులుగా ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో ప్రసాద్‌ వి. పొట్లూరి(పివిపి) నిర్మించిన చిత్రం 'సైజ్‌ జీరో'. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా గోల్డ్‌ కాంటెస్ట్‌ని నిర్వహిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత పివిపి మాట్లాడారు. అధిక బరువు నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రాన్ని ఈ నెల 27న అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. తమ సినిమా గురించి అందరు మాట్లాడుకోవాలని ప్రత్యేకంగా 'గోల్డ్‌ కాంటెస్ట్‌'ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. థియేటర్లలో టికెట్‌ కొన్న వారికి టికెట్‌తోపాటు ఒక కూపన్‌ ఇస్తారని, ఆ కూపన్‌లో ఉన్న నెంబర్‌ని తాము సూచించిన నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయాలని సూచించారు. అలా పంపిన ఎస్‌ఎంఎస్‌లను ప్రత్యేక సాప్ట్ వేర్‌ 20 మందిని ఎంపిక చేసి అనుష్కతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడే అవకాశం కల్పిస్తామన్నారు. వారిలో ఫైనల్‌గా ఒక్కరిని ఎంపిక చేసి కేజీ బంగారాన్ని అందిస్తామన్నారు. పివిపి, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని పెద్ద హిట్‌ చేస్తారని ఆశిస్తున్నట్లు దర్శకుడు ప్రకాష్‌ కోవెలమూడి పేర్కొన్నారు. 

గ్రేటర్ పీఠాన్ని దక్కించుకుంటాం : మంత్రి పద్మారావు

హైదరాబాద్ : గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని మంత్రి పద్మారావు తెలిపారు. ప్రభుత్వ పని తీరుకు ఉప ఎన్నిక ఫలితాలే నిదర్శనమని తెలిపారు. వరంగల్ ఉప ఎన్నికలో టిఆర్ అభ్యర్థి పసునూరి దయాకర్ భారి ఆధిక్యం సాధించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు ప్రజలు మంచి గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు.

13:00 - November 24, 2015

గతంలో 'ధోని', 'ఉలవచారు బిర్యాని' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన నటుడు ప్రకాష్‌రాజ్‌ తాజాగా గ్రామాల్లోని సమస్యల్ని వినోదాత్మకంగా 'మన ఊరి రామాయణం' పేరుతో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతమందిస్తున్న ఈ చిత్రంలోని నటీనటులంతా దాదాపు కొత్తవారే కావడం విశేషం. ఈ విషయాన్ని నటుడు, దర్శకనిర్మాత ప్రకాష్‌రాజ్‌ తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలిపారు. అంతేకాకుండా చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. వైవిధ్యంగా ఉన్న ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ప్రస్తుతం సామాజిక మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 'గ్రామాల్లో ఇప్పుడున్న పరిస్థితులు, అక్కడి సమస్యలను వినోదాత్మకంగా చర్చించటానికే ఈ చిత్ర కథాంశాన్ని ప్రకాష్‌రాజ్‌ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

13:00 - November 24, 2015

జీవిత కథల నేపథ్యంలో ప్రస్తుతం బాలీవుడ్‌లో చాలా చిత్రాలు రూపొందుతున్నాయి. స్పేస్‌లోకి అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ కల్పనా చావ్లా జీవిత చరిత్ర ఆధారంగా త్వరలోనే ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో కల్పనా చావ్లా పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంకచోప్రా నటించనున్నట్టు సమాచారం. గతంలో బాక్సింగ్‌ ఒలింపియన్‌ మేరీకోమ్‌ జీవిత కథ ఆధారంగా రూపొందిన 'మేరీకోమ్‌' చిత్రంలో ప్రియాంక నటించింది. తాజాగా కల్పనాచావ్లా జీవిత కథలోనూ ప్రియాంక నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 2003లో జరిగిన కొలంబియా స్పేస్‌ షటిల్‌ దుర్ఘటనలో కల్పనా చావ్లా మృతి చెందిన విషయం విదితమే. ప్రియాంక ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'బాజీరావ్‌ మస్తానీ'లో నటిస్తున్న విషయం తెలిసిందే.

12:58 - November 24, 2015

అజిత్‌ కథానాయకుడిగా ఇటీవల తమిళనాట విడుదలై సంచలన విజయం సాధించిన 'వేదాలమ్‌' చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు కొంతమంది అగ్ర నిర్మాతలు, స్టార్‌ హీరోలు పోటీ పడుతున్నారని సమాచారం. తెలుగులో రీమేక్‌ చేసే ఈ చిత్రంలో నటించేందుకు చిరంజీవి, ఎన్టీఆర్‌ సుముఖంగా ఉన్నారని టాక్. ఈ ఇద్దరూ ఇటీవల స్పెషల్‌ స్క్రీనింగ్‌ వేయించుకుని మరీ చూసినట్టు తెలిసింది. గతంలో కూడా విజయ్ ద్విపాత్రా భినయంలో నటించిన 'కత్తి' చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారనే వార్తలొచ్చినప్పుడు కూడా ఈ ఇద్దరు స్టార్ల పేర్లే ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. 150వ చిత్రంగా చిరంజీవి 'వేదాలమ్‌' రీమేక్‌లో నటిస్తే బాగుంటుందని భావిస్తున్నారట.

12:50 - November 24, 2015

వరంగల్ : డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రికార్డును పసునూరి బ్రేక్ చేశారు. వరంగల్ బై పోల్ ఎన్నికల కౌంటింగ్ లో 16వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. అధికారిక వివరాల ప్రకాంర 4,07,000 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ ఎస్ అభ్యర్థి వున్నారు. 2004 లో కడియం శ్రీహరికి 6,61639 ఓట్లు పోల్ కాగా 3,92,574 ఓట్ల మెజారీటీ సాధించారు.

12:44 - November 24, 2015

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికల కౌంటింగ్ లో టిఆర్ ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ దూసుకుపోతున్నారు. దీంతో టిఆర్ ఎస్ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. బాణ సంచా, డప్పు వాయిద్యాలతో నీత్యాలు చేస్తూ సందడి చేశారు.

12:41 - November 24, 2015

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరుకు వరంగల్ ప్రజలు కట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు. అనడానికి వరంగల్ లోక్‌సభలో విజయమే నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఈ ఫలితాలతో తల ఎక్కడ పెట్టుకుందని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని తాము సరిగ్గా పని చేయకపోతే ప్రజలే సమాధానం చెప్తారు అని పేర్కొన్నారు. వరంగల్ ఉప ఎన్నిక తమప్రభుత్వ తీరుపట్ల రెఫరెండం అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించామని... ఏ ఒక్క ప్రతిపక్ష నేతనైనా ప్రకటించిందా అని ప్రశ్నించారు. టిఆర్ఎ స్ ప్రభుత్వం భారత్ కే ఆదర్శంగా నిలిచే విధాంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు ఎన్ని విష ప్రచారాలు చేసినా వరంగల్ ప్రజలు చైన్యవంతమైన, పరిణితితో కూడిన తీర్పు ఇచ్చారని చెప్పారు. వరంగల్ ప్రజలందరికీ సవినయంగా, వెన్నుతట్టి ప్రోత్సహించారని తెలిపారు. ఏ బాధ్యతను, ఏ విశ్వాసాన్ని మా పై ఉంచారో వాటన్నింటిన్ని పై టిఆర్ఎస్ పని చేస్తుందని తెలిపారు. ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రతిపక్షాలు ఇప్పటికైనా గుర్తించాలన్నారు. ప్రతిపక్షాలు తిట్లను దీవెనగానే భావిస్తామన్నారు. ప్రజల పై భారం వేసే ముందుకు వెళ్లామని.... తెలంగాణ ప్రజలే మాకు బాసులు అన్నారు. గత 50 ఏళ్ళలో జరగని అభివృద్ధిని ఐదేళ్లలో చూపిస్తామన్నారు. ముందుకు పోవడానికి గొప్ప అవకాశన్ని ఇచ్చిన వరంగల్ ప్రజలకు శతదా వందనాలు తెలిపారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మాపై విషం చిమ్మింది. దాన్ని మానుకుని ప్రజలకు అవసరమైన అంశాలనుప్రచారం చేయాలని సూచించారు. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని సూచించారు. వరంగల్ ఉప ఎన్నిక ఒక సునామిగా మారి ప్రతిపక్షాలను తుడిచిపెట్టుకుపోయిందన్నారు. గ్రేటర్ లో గెలుస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

మణిపూర్‌లో బీజేపీ,మిజోరంలో కాంగ్రెస్ విజయకేతనం..

హైదరాబాద్ : మణిపూర్‌లో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ రెండు సీట్లను గెలుచుకుంది. 60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీలో ఇప్పుడు బీజేపీ ఖాతాలో రెండు సీట్లు చేరాయి. మరోవైపు మిజోరం అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. ఉత్తర ఐజావల్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర మాజీ మంత్రి లాల్ థంజారా భారీ మెజారిటీతో గెలుపొందాడు. మిజోరం సీఎం లాల్ థనావాలాకు లాల్ థంజారా సోదరుడు. ఉప పోరులో థంజారా 1498 ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించాడు.

12:10 - November 24, 2015

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎ స్ టిఆర్ ఎస్ అభ్యర్థిని ప్రజలే గెలిపంచారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన వరంగల్ ఎన్నిక ఫలితం పై స్పందిస్తూ.. ప్రభుత్వ పాలన పట్ల, టిఆర్ ఎస్ చేస్తున్న కార్యక్రమాల పట్ల ప్రజలు ఇస్తున్న తీర్పు అని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికలనే ది ప్రాతిపదిక అని..టిఆర్ ఎస్ ప్రభుత్వ కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలే టిఆర్ ఎస్ కు గెలుపు కారణం అయ్యిందన్నారు. వ్యక్తిగత గా నోరు పారేసుకుంటే ప్రజలు నాలుక చీరేస్తారని నిరూపించారన్నారు. ఈ ఎన్నిక ప్రతిపక్షాలకు చెంప పెట్టు అని...ఇప్పటికైనా ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. మంత్రులు, టిఆర్ ఎస్ కార్యకర్తలు, నేతలు కలసి ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లారని చెప్పారు. దేశ రాజకీయాల్లో భారీ మెజారిటీ సాధించిన వ్యక్త పసునూరి నిలబడ్డాడని తెలిపారు. తెలంగాణ ప్రజలకు టిఆర్ ఎస్ పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసాన్ని చూపిస్తున్నారనడానికి ఇదొక నిదర్శనమన్నారు. వరంగల్ ఎన్నికల ఫలితాన్ని చూసైనా నేషనల్ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. కొన్ని మీడియాలు పని కట్టుకుని వార్తలు రాశారని మండి పడ్డారు.

బేగంబజార్‌లో బాంబు కలకలం....

హైదరాబాద్ : బేగంబజార్‌లోని అజీజ్ ప్లాజా వద్ద బాంబు కలకలం సృష్టిస్తుంది. బాంబు కలకలంతో బేగంబజార్ రోడ్లన్నీ పోలీసులు మూసివేశారు. డాగ్, బాంబ్ స్కాడ్‌తో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

11:48 - November 24, 2015

వరంగల్ : టిఆర్ ఎస్ ప్రభుత్వ పని తీరుకు నిదర్శనమే వరంగల్ ఉపపోరు గెలుపు అని వరంగల్ జిల్లా టిఆర్ ఎస్ నేత తక్కలపల్లి రవీందర్ అన్నారు. వరంగల్ లో 'టెన్ టివి'తో మాట్లాడుతూ... మెజారిటీ నాలుగు నుండి నాలుగున్నర లక్షలు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.. టిఆర్ ఎస్ ను ఓడించడానికి ఏకమైన ప్రతిపక్షాలు వరంగల్ ఎన్నిక ఫలితాలు చెప్పపెట్టన్నారు. సభలు పెట్టి కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకు ప్రతిపక్షాలు ప్రజల వద్దకు వెళ్లలేదని... టిఆర్ ఎస్ మాత్రం ప్రజలవద్దకు వెళ్లిందని తెలిపారు. ప్రభుత్వ పనితీరుకు ఫలితమే ఈ ఎన్నికలు అని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై చేయాల్సిన పోరాటం చేస్తూనే పత్తి రైతులను ఆదుకోవడం తెలంగాణ ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు. 

ఎంపి కేశినేని తో హంగేరి బృందం భేటీ

కృష్ణా : విజయవాడ ఎంపి కేశినేని తో హంగేరి బృందం భేటీ అయింది. విజయవాడ నగర మంచినీటి సరఫరా అభివృద్ధిపై చర్చించినట్లు సమాచారం.

ప్రజా తీర్పును శిరసా వహిస్తాం : రేవంత్ రెడ్డి....

హైదరాబాద్ : వరంగల్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రజాతీర్పును శిరసావహిస్తామని టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఉప ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ ఇలానే ఉంటాయన్నారు. గతంలో వైసీపీ ఉప ఎన్నికల్లో ఇదే ఫలితాలు సాధించిందని, సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందన్నారు. తెలంగాణలో 2019 ఎన్నికల్లో ఇదే పునరావృతం అవుతుందన్నారు. టీఆర్‌ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయం మేమే అన్నారు. ప్రతిపక్షాలు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలన్నారు. అలాగే ప్రస్తుతం పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదన్నారు.

వరంగల్ ప్రజలకు కేటీఆర్ కృతజ్ఞతలు

హైదరాబాద్ : వరంగల్ లో టిఆర్ ఎస్ కు విజయంపై మంత్రి కేటీఆర్ వరంగల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ విజయంతో మా మీద మరింత బాధ్యత పెరిగిందన్నారు.

పెన్నా బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం

నెల్లూరు : పెన్నా బ్రిడ్జి సమీపంలో ఆగివున్న లారీని ఆటో ఢీ కొట్టింది. ఈఘటనలో నలుగురు మృతి చెందగా...మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

11:19 - November 24, 2015

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్‌పై మండిపడ్డారు. దేశంలో అసహనం పెరుగుతుందంటున్న మేధావులతో అమీర్ జత కలవడమే ఇందుకు కారణం. ఢిల్లీలోని రామ్‌నాథ్ గోయంకా ఎక్స్‌లెన్స్ ఇన్ జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ మాట్లాడుతూ.. ''దేశంలో జరుగుతున్న పలు సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే విషయం నా భార్య కిరణ్‌ పలుమార్లు నాతో చర్చించింది. ఓ దశలో ఈ దేశం వదిలి వెళ్దామని ప్రతిపాదించింది'' అని పేర్కొన్న సంగతి తెలిసిందే. హిందూ మతం మెజార్టీగా ఉన్న భారత్‌లో అమీర్‌ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లు అతిపెద్ద స్టార్లుగా కొనసాగుతున్నారని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. వీరు ముగ్గురు ముస్లీంలేనని, ముగ్గురు ఖాన్‌లు స్టార్లుగా కొనసాగడమే ప్రజల సహనానికి నిదర్శనమన్నారు. దేశంలో మరి అసహనం ఎక్కడ ఉందో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. ఫిర్యాదు చేసే వారిలో ప్రముఖులుగా పిలువబడేవారు చివరలో ఉండాలని రామ్ గోపాల్ వర్మ సూచించారు. 

టిఆర్ ఎస్ భవన్ సంబురాలు...

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణ భవన్‌లో సంబురాలు మొదలయ్యాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకుంటున్నారు. ఆనందంలో మునిగిపోతున్నారు. వరంగల్ గెలుపుకు సీఎం కేసీఆర్ పాలనే నిదర్శనమని కార్యకర్తలు చెబుతున్నారు. 

11:15 - November 24, 2015

దేశంలో అసహనం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మేధావులతో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ కూడా గళం కలిపారు. పలు సంఘటనలు తనకు ఆందోళన కలిగించాయని.. తన భార్య కిరణ్‌రావ్ ఈ దేశం వదిలి వెళ్దామని కూడా ప్రతిపాదించారని తెలిపారు. సోమవారం ఢిల్లీలోని రామ్‌నాథ్ గోయంకా ఎక్స్‌లెన్స్ ఇన్‌జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో అమీర్ మాట్లాడారు. 'ఒక వ్యక్తిగా, ఈ దేశపు పౌరుడిగా.. ఏం జరుగుతోందో మనం పత్రికల్లో చదువుతాం. నిజంగా నేను ఆందోళనకు గురయ్యాను.. కొంతకాలంగా దేశంలో అభద్రతాభావం పెరుగుతోంది'' అంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయాలపై తన భార్య కిరణ్‌తో మాట్లాడినపుడు.. 'ఇండియా వదిలి వేరే దేశానికి వెళ్దామా?' అని ఆమె అడిగేవారని చెప్పారు. ''ఆమె తన కొడుకు కోసం భయపడుతున్నారు. చుట్టూ ఉండే వాతావరణం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు'' అని అమీర్ పేర్కొన్నారు.

2019 ఎన్నికల్లో అన్ని పార్టీలతో పొత్తు : ఎంపి గుత్తా...

నల్గొండ : 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించేందుకు టీడీపీతో సహా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలంటే తెలంగాణలో వామపక్షాలతో పాటు టీడీపీని సైతం కలుపుకుని పోవాల్సిన అవసరం ఉందని గుత్తా వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ విషయంలో మొదటి నుంచి స్పష్టమైన వైఖరితో ముందుకువెళ్తున్న గుత్తా ఒక్కసారి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనాలకు దారి తీస్తోంది.

11:02 - November 24, 2015

వరంగల్ : ఉప పోరులో గులాబీ జోరు కొనసాగుతోంది. వార్ వన్ సైడ్ గా సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ రెండు లక్షలకు పైగా అధిక్యంలో దూసుకపోతున్నారు. ప్రస్తుతం ఆరు రౌండ్లు పూర్తయ్యాయి. రౌండ్ రౌండ్‌కు టీఆర్‌ఎస్ ఆధిక్యం భారీగా పెరుగుతోంది. మిత్రపక్షాలైన కాంగ్రెస్, టిడిపి - బిజెపి పార్టీలు చతికిలపడ్డాయి. వరంగల్‌లో టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రోడ్లపైకి వచ్చి టపాసులు పేలుస్తూ డప్పులతో డాన్సులు చేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని ఆ పార్టీల నేతలు పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి 2,45,779 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి 62,868, బీజేపీకి 45,910 ఓట్లు పోలయ్యాయి.

ఈనెల 21న పోలింగ్..
తెలంగాణ వ్యాప్తంగా అత్యంత ఆసక్తి కలిగించిన వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నిక ఈనెల 21వ తేదీన జరిగింది. కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి అన్ని పార్టీలు పోటీ పడ్డాయి. స్థానం దక్కించుకుని పరువు నిలబెట్టుకోవాలని ఇటు అధికారపక్షం, ప్రభుత్వ వ్యతిరేకత ఎంత బలంగా ఉందో చాటడానికి విపక్షాలు పోటాపోటీగా ప్రచారం సాగించాయి. మొత్తం 23 మంది అభ్యర్థులు పోటీపడగా, 1778 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

2,90,000 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ ఎస్ అభ్యర్థి

హైదరాబాద్ : వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌ 2,90,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో ముందుకు దూసుకుపోతున్నారు. వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం లోగా ముగిసే అవకాశముంది. 

'కేసీఆర్ పాలనకే నిలువెత్తు నిదర్శనం'

హైదరాబాద్ : ప్రతిపక్షాలను ఏ రోజూ ప్రజలు నమ్మలేదని... వరంగల్ బై పోల్ ఫలితం సీఎం కేసీఆర్ పాలనకే నిలువెత్తు నిదర్శనమని గ్రేటర్ అధ్యక్షుడు తెలిపారు. వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ... కొన్ని పత్రికలు, మీడియా ఛానల్స్ కావాలని పనికట్టుకుని కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశాయని ఆరోపించారు. కడియం శ్రీహరి కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని తెలిపారు.

వరద పరిస్థితిపై ఏపీ సీఎం టెలీకాన్ఫరెన్స్

హైదరాబాద్ : నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వరద నష్టం, సహాయ కార్యక్రమాలపై ఏపీ సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. వరద నష్టం పై క్షేత్రస్థాయి నుంచి కార్యదర్శి స్థాయి వరకు ఒకే సారి 7 వేల మందితో సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అంబేద్కరే ఓడిపోయారు, నేనెంత? : దేవయ్య

హైదరాబాద్ :ఏడో తరగతి ఫెయిలైన అభ్యర్థి చేతిలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కరే ఓడిపోయారు, నేనెంత? అని బీజేపీ అభ్యర్థి దేవయ్య తెలిపారు. పాలకుర్తి లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వరంగల్ ఉప‌ఎన్నికల ఫలితాలపై తానేమీ అసంతృప్తి చెందడం లేదని...ప్రజల్లో గుర్తింపు వచ్చిందని, ఎన్నికల ప్రచారంలో సీఎం, మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడటం వల్లే టీఆర్ఎస్‌కు ఓట్లు వచ్చాయని ఆరోపించారు. ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. వరంగల్‌లో టీఆర్ఎస్ గెలిపొందినా ప్రజలకు ఏమీ చేయదని దేవయ్య తాను ఓడిపోయన ప్రజలతోనే ఉంటా...అభివృద్ధి కోసం ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు.

చెన్నై విమానాశ్రయంలో 8 కేజీల బంగారం పట్టివేత

హైదరాబాద్ : చెన్నై విమానాశ్రయంలో మంగళవారం ఎనిమిది కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ రెండున్నర కోట్ల రూపాయలుంటుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో భాగంగా ముందు రెండు బ్యాగుల్లో అక్రమంగా రవాణా చేస్తున్న అయిదున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికుడ్ని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతని బ్యాగ్ లోకి బంగారం ఎలా వచ్చిందనే విషయాన్ని ఆరా తీస్తున్నామని, విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

10:21 - November 24, 2015

వరంగల్ : తాను అందరికీ రుణపడి ఉంటానని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ పేర్కొన్నారు. ఈనెల 21న జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ మంగళవారం నిర్వహించారు. ఈ ఎన్నికలో పసునూరి దయాకర్ అధిపత్యం కొనసాగించారు. ఎనుమాముల మార్కెట్ లో ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రౌండ్ నుండి పసునూరి అధిక్యత కనబరిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 1,82,368 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. మిత్రపక్షాలు పోటీనివ్వలేకపోయాయి. ఈ సందర్భంగా పసునూరి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారనడానికి ఎన్నికలు ఉదహారణ అని, తనమీద నమ్మకం ఉంచిన కేసీఆర్ కు రుణపడి ఉంటానని తెలిపారు. అలాగే కార్యకర్తలు, వరంగల్ ప్రజలందరికీ సేవ చేసి పేరు నిలబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు. అందరి ఆశీస్సులతో భారీ మెజార్టీ గెలుపు సాధిస్తామని, జాతీయ రహదారులు, టెక్స్ టైల్ పార్కు, స్మార్ట్ సిటీ, అభివృద్ధి కోసం తాను కృషి చేయడం జరుగుతుందన్నారు. తనపై నమ్మకం ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు పసునూరి చెప్పారు.

22 రౌండ్లు...
మొత్తం 22 రౌండ్లలో ఓట్ల కొనసాగింపు సాగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకల్లా ఫలితం రానుంది. ఉప ఎన్నిక బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ రమణ, వరంగల్ నగర పోలీసు కమిషనర్ సుధీర్ బాబు పర్యవేక్షిస్తున్నారు. 

2001లో టీఆర్ఎస్ లో చేరిన పసునూరి..
పసునూరి తెలంగాణ తల్లి విగ్రహ సృష్టికర్త, 2001లో టిఆర్ ఎస్ చేరారు. వర్ధన్నపేట టిఆర్ ఎస్ ఇంచార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం టిఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు. 2009,14 ఎన్నికల్లో పసునూరికి అసెంబ్లీ టికెట్ తృటిలో చేజారింది.

2,15,000 ఓట్ల ఆధిక్యంలో పసునూరి

హైదరాబాద్ : వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల పోరు ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌ 2,15,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో ముందుకు దూసుకుపోతున్నారు. వరంగల్‌ లోక్‌సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దయాకర్‌ ఆధిక్యతలో ఉన్నారు. కొన్ని చోట్ల నోటాకు కూడా ఓట్లు పడ్డాయి.

మీ అందరికీ రుణ పడి ఉంటా: పసునూరి

హైదరాబాద్ : వరంగల్ బై పోల్ లో టిఆర్ ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ రావు దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి ఓట్లు వేసిన ఓటరు దేవుళ్లందరికీ రుణ పడి ఉంటానని తెలిపారు. సామాన్య కార్యకర్తకు అండగా ఉంటూ రాష్ట్ర నాయకత్వం అండదండతో సేవ చేస్తానని స్పష్టం చేశారు.

స్పష్టమైన ఆధిక్యం దిశగా టిఆర్ ఎస్

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక ఫలితంలో వార్ వన్‌సైడ్ గా నడుస్తుంది. కారు వేగాన్ని బీజేపీ, కాంగ్రెస్ అందుకోలేక పోతున్నాయి. 1,82,000 పై చిలుకు ఆధిక్యతతో ముందుకు దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో కాంగ్రెస్ 34 వేల ఓట్లు సాధించగా, బిజెపికి 25 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. 

10:01 - November 24, 2015

వరంగల్ : జిల్లా ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. అందరూ అనుకున్నట్లుగానే గులాబీ దూసుకపోతోంది. ప్రభుత్వ వ్యతిరేకతే తమను గెలుస్తుందని ధీమా పలికిన కాంగ్రెస్, టిడిపి - బిజెపి పక్షాలు చతికిలబడ్డాయి. నాలుగు రౌండ్ల లెక్కింపు ముగిసే సరికి అధికార టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 1.30 లక్షల ఓట్లను సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు 24,560 ఓట్లు, టిడిపి - బిజెపి పక్షాల ఉమ్మడి అభ్యర్థి దేవయ్యకు 22,463 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నల్లా సూర్యప్రకాశ్ కు కేవలం 2,246 ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ ముగిసేసరికి భారీ అధిక్యం సాధిస్తామని టీఆర్ఎస్ శ్రేణులు ధీమాను వ్యక్తపరుస్తున్నాయి.

1,23,554 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ ఎస్..

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక ఫలితంలో వార్ వన్‌సైడ్ గా నడుస్తుంది. కారు వేగాన్ని బీజేపీ, కాంగ్రెస్ అందుకోలేక పోతున్నాయి. ఐదవ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 1,23,554 లక్ష మెజార్టీ దాటింది.

1,04,640 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ ఎస్

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం టిఆర్ ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 1,04,843 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నట్లు సమాచారం. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది.

ఆర్ అండ్ బీ ఎస్ ఈ ఇంట్లో ఏసీబీ తనిఖీలు...

కరీంనగర్ :రోడ్డు భవనాల శాఖ సూపరిండెంట్ ఇంజినీర్ ఇంట్లో అవినీతి నిరోదక శాఖ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఎస్ఈ చందూలాల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు వచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తుండగా... ఆయనకుగల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. కరీంనగర్‌లోని భగత్‌నగర్‌, అపోలోరీచ్‌లో ఆయనకు ఇళ్లు ఉండగా వాటిల్లో సోదాలు నిర్వహించారు.

జంటనగరాలను జల్లెడపడుతున్న పోలీసులు...

హైదరాబాద్ : నగర పోలీసులు జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌లను జల్లెడ పడుతున్నారు. ఉగ్రవాదుల జాబితాలో హైదరాబాద్ నగరం ఉందంటూ... కేంద్రప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. దీంతో జంట నగరాల్లోని ఆయా ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన 115 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే 88 బైక్‌లు, 50 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారమందించాలని పోలీసులు కోరారు.

80 వేల ఆధిక్యంలో టిఆర్ ఎస్

హైదరాబాద్ : వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల పోరు ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌ 80 వేలకుపైచిలుకు ఓట్ల ఆధిక్యతతో ముందుకు దూసుకుపోతున్నారు. వరంగల్‌ లోక్‌సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రౌండ్‌ రౌండ్‌కు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మెజారిటీ పెరుగుతోంది.

అధికారికంగా వెలువడిన తొలిరౌండ్ ఫలితం..

వరంగల్ : వరంగల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో తొలి రౌండ్ ఫలితం అధికారికంగా వెలువడింది. తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 24,723 ఓట్ల ఆధిక్యంలో ముందు వరుసలో ఉన్నారు. ఇక మొదటి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 37,798, కాంగ్రెస్‌కు 8075, బీజేపీకి 7591 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం ఐదో రౌండ్ కొనసాగుతుంది. పసునూరి 75 వేల ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

రెండో రౌండ్ కౌటింగ్ పూర్తి...

హైదరాబాద్ : వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల పోరు ఓట్ల లెక్కింపు రెండో రౌండ్ పూర్తయ్యింది. ఈ సమయానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌ 50 వేలకుపైచిలుకు ఓట్ల ఆధిక్యతతో ముందుకు దూసుకుపోతున్నారు. మూడో రౌండ్ కౌటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది.

శంషాబాద్ పీఎస్ వద్ద వ్యక్తి దారుణ హత్య...

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ వద్ద దారుణం జరిగింది. పోలీస్ స్టేషన్ పక్కనే గుర్తు తెలియని వ్యక్తిని బండరాళ్లతో మోదీ చంపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనకు పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం..ఐదుగురు మెదక్ వాసుల మృతి

హైదరాబాద్ : పొట్టకూటి కోసం పొరుగూరుకు వెళ్తున్న ఐదుగురు మెదక్ జిల్లా వాసులు మృత్యువాత పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా మనూరు మండలం ఇరాక్ పల్లి. డోవూరు తండాకు చెందిన పలువురు గిరిజనులు కర్ణాటక రాష్ట్రంలోని ఓ కర్మాగారంలో పనిచేసేందుకు వెళ్తుండగా... హుమ్నాబాద్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. వీరు వెళ్తున్న లారీ ఓ ట్రాక్టర్ ను ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. జైసింగ్(40), ఫాతీబాయి(35), కృష్ణ(10) అనే వారు మృతిచెందగా మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా...

25,090 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ ఎస్ అభ్యర్థి

హైదరాబాద్ : వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌ 25,090 ఓట్ల ఆధిక్యతతో ముందున్నారు. ద్వితీయ స్థానంలో కాంగ్రెస్ కొనసాగుతోంది. వరంగల్‌లోని ఎనుమాముల మార్కెటులో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది.

పాపాగ్ని నదిలో చిక్కుకున్న కూలీలు

చిత్తూరు : పెద్ద తిప్ప సముద్రం మండలం పి.సదుం వద్ద పాపాగ్ని నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పాపాగ్ని నది మధ్యలో 30 మంది కూలీలు చిక్కుకున్నారు. నదిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు స్థానికులు యత్నిస్తున్నారు.

తొలి రౌండ్ లో టిఆర్ ఎస్ అభ్యర్థి ఆధిక్యం

హైదరాబాద్ : వరంగల్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ విభాగంలో పోలైన ఓట్లను పరిశీలించిన తర్వాత తొలి రౌండ్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. తొలి రౌండ్ లోనే స్పష్టమైన ఆధిక్యం సాధించిన అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 7 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. 

08:41 - November 24, 2015

హైదరాబాద్ : నేడు వరంగల్ ఎంపి స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది. అయితే ఈ ఎన్నికల్లో టిఆర్ ఎస్ గెలుపు దిశగా పయనిస్తుందని ట్రెండ్ ను బట్టి అర్థం అవుతోంది. ఈ ఎన్నికకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ద హన్స్ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ తెలిపారు. గత ఎన్నికల్లో ఆధిక్యతతో టిఆర్ఎస్ గెలుపొందింది. అదే మెజారిటీ కొనసాగుతుందా? అస్సలు ఈ ఎన్నిక రావడానికి కారణం ఏమిటి? ప్రతిపక్షాల వ్యూహాత్మక వైఖరిలో లోపం ఉందా? మోడీ ప్రభుత్వం పై టిసర్కార్ పోరాటానికి ఎందుకు సిద్ధమౌతోంది? డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను స్థానిక ప్రజా ప్రతినిధులకు అప్పజెప్పడం ఎంత వరకు సమంజసం? తెలంగాణ వచ్చినా రాజకీయ సంస్కృతిలో మార్పు రాలేదా? ఇలాంటి అంశాలపై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. తెలంగాణ వివక్ష పై నిర్ధిష్టం శ్వేత పత్రం విడుదల చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలపై పూర్తి విశ్లేషణ చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

భారీగా ఎర్రచందనం డంప్ స్వాధీనం

కర్నూలు : చాగలమర్రిమండలం చిన్నవంగలిలో 300 ఎర్రచందనం దుంగలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ.కోటి వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

కౌంటింగ్ ప్రారంభం

హైదరాబాద్ : వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. భారీ సాయుధ పోలీసుల పహరా మధ్య వరంగల్‌లోని ఎనుమాముల మార్కెటులో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఆరంభం అయింది. ఒక్కో అసెంబ్లీ పరిధిలో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విడివిడిగా రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు సాగుతోంది.

08:01 - November 24, 2015

హైదరాబాద్ : నేడు వరంగల్ పార్లమెంట్ సీటు ఎవరిదో తేలిపోనుంది. అయితే ఈ ఎన్నిక టిఆర్ ఎస్ ప్రభుత్వానికి రిఫరెండమ్ కాదని... పెరా మీటరే అని 'న్యూస్ మార్నింగ్' చర్చలో నేతలు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పనున్నారా? ప్రతి ఎన్నికను ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోందా? విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం లేదా? ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్ నగేష్, టిడిపి నేత శోభారాణి, టిఆర్ ఎస్ నేత నరేంద్ర గౌడ్, కాంగ్రెస్ కౌలాష్ నాథ్ పాల్గొన్నారు. మరి వారు ఎలాంటి అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

మార్చి 2 నుండి ఇంటర్ పరీక్షలు...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు షెడ్యూలు జారీ చేసింది. పరీక్షల షెడ్యూలుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం ఆమోదం తెలిపారు. ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 3న జేఈఈ మెయిన్ రాత పరీక్ష నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో అంతకంటే పది రోజుల ముందుగానే ఇంటర్ పరీక్షలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో బోర్డు కసరత్తు చేసింది.

25 నుంచి మైసిగండి మైసమ్మ జాతర

మహబూబ్ నగర్(ఆమనగల్లు) : భక్తులకు కొంగు బంగారమైన మైసిగండి మైసమ్మ జాతర ఈ నెల 25వ తేదిన ప్రారంభమై డిసెంబరు 2న ముగియనుంది. జాతర ఉత్సవాలను విజయవంతం చేయ్యడానికి ఆలయ నిర్వాకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పాత బస్తీలో పోలీసుల తనిఖీలు

హైదరాబాద్ : కేంద్ర నిఘావర్గాల సమాచారంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నేటి తెల్లవారు జామునుంచి పాత బస్తీలోని చాంద్రాయణగుట్ట, బాబా నగర్, ఫలక్ నుమాలో పోలీసులు నతిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 2 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 56,407 మంది భక్తులు దర్శించుకున్నారు.

భారీ వర్షాలతో పలు రైళ్ల రద్దు...వివరాలు....

సికింద్రాబాద్ : భారీ వర్షాలకు గుత్తి-రేణిగుంట సెక్షన్‌లోని రాజంపేట-పుల్లంపేట, నందలూరు-మంటపంపల్లె మధ్య రైల్వే ట్రాక్‌పై వరద నీరు ప్రవహిస్తుండడంతో.... కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్యరైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు.

సికింద్రాబాద్ లో ముగ్గురు రైల్వే హోంగార్డుల అరెస్ట్

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ముగ్గురు రైల్వే హోంగార్డులను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ప్రయాణీకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని వీరి పై ఆరోపణలు రావడంతో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

07:16 - November 24, 2015

అమరావతి : తాజాగా విజయవాడ క్యాంప్‌ కార్యాలయంలో చైనా మంత్రి చెనఫెంగ్సియాంగ్‌తో పాటు అధికారుల బృందంతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి అభివృద్ధి గురించి ఈ సమావేశంలో చర్చించారు.

రాజధాని నిర్మాణానికి చైనీయుల అవసరం ఉంది..........

నిర్మాణాలను వేగంగా రూపొందించడంలో అగ్రగణ్యులైన చైనీయుల అవసరం రాజధాని నిర్మాణానికి ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాజధాని నగర నిర్మాణంలో పాలుపంచుకునే అవకాశం అరుదుగా దొరుకుతుందని.. ఇందులో భాగస్వాములు కావడం వల్ల చైనా పేరు దేశంలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రపంచంలోని మొదటి ఐదు ఉత్తమ నగరాలలో అమరావతి కూడా ఒకటిగా నిలవనుందని,.. అత్యుత్తమ ప్రమాణాలతో బ్లూ, గ్రీన్‌సిటీగా నిలవనుందన్నారు. నది వెంబడి 40 కిలోమీటర్లకు పైగా మార్గం ఉన్న నేపథ్యంలో.. నగరానికి జల రవాణ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు.

సిల్క్‌రూటును విశాఖ మీదుగా తీసుకెళ్లాలని కోరిన బాబు ......

మరోవైపు చైనా ప్రతిపాదించిన సిల్క్‌ రూటును విశాఖపట్టణం మీదుగా తీసుకెళ్లాలని చంద్రబాబు చైనా ప్రతినిధులను కోరారు. ఏపీ తూర్పు తీరానికి విశాఖ సరిగ్గా మధ్యలో ఉందని.. కోల్‌కతా, చెన్నైల కన్నా సిల్క్‌రోడ్డుకు ఏపీ అన్ని విధాలుగా ఆకర్షణీయంగా ఉంటుందన్నారు చంద్రబాబు. షాంఘై తర్వాత పెట్టుబడులకు అమరావతిని ఎంచుకోవాలని చైనా ప్రతినిధులకు చంద్రబాబు సూచించారు.

విభిన్నంగా అమరావతి నిర్మాణం ....

చంద్రబాబు సమర్ధ నాయకత్వం మేము ఇక్కడకు వచ్చేలా చేసిందని చైనా మంత్రి అన్నారు. రాజధాని నిర్మాణాన్ని ఇదే చొరవతో త్వరితగతిన పూర్తి చేస్తామని.. ఇది అతిపెద్ద ప్రాజెక్టుగా అవుతుందన్నారు. తామెన్నో రాజధానులను సందర్శించామని.. అమరావతి వాటన్నింటికి విభిన్నంగా , విలక్షణంగా రూపుదిద్దుకుంటుందన్నారు.

పలు గ్రామాల్లో పర్యటించిన చైనా బృందం.........

అనంతరం చైనా బృందం అమరావతిలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఇక్కడి సంస్కృతి, జీవన విధానం, వాతావరణ పరిస్థితులు, మౌలిక వసతుల గురించి చైనా బృందం పరిశీలించింది. తుళ్లూరు మండలం రాయపూడిలో ఓ ఇంటికి వెళ్లి వారి జీవనశైలిని పరిశీలించారు. అనంతరం అమరావతికి చేరుకొని ద్యానబుద్ద ప్రాజెక్టును సందర్శించారు. చారిత్రక కట్టడాలు, పురావస్తుశాలను పరిశీలించారు. 

07:13 - November 24, 2015

విజయవాడ : 2016 నుంచి ఇసుక విక్రయాలను వేలం విధానం ద్వారానే చేపట్టాలని ఏపీ సర్కార్‌ సూత్రప్రాయంగా నిర్ణయించింది. మహిళా సంఘాల ద్వారా చేస్తున్న విక్రయాల వల్ల ఇసుక మాఫియాను అరికట్టలేకపోతున్నారన్న విమర్శల నేపథ్యంలో.. కొత్త రీచ్‌లను వేలం వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు మైనింగ్‌ విధానంపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేసేందుకు సర్కార్‌ సిద్దమవుతోంది.

గనుల శాఖ పనితీరుపై అధికారులతో సీఎం సీమక్ష...

రాష్ట్రంలో గనుల శాఖ పనితీరుపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గనుల కార్యక్రమాలను సమర్ధంగా నిర్వహించాలని మార్గనిర్దేశం చేశారు. ఎక్కడా నిర్వహణ లోపాలు లేకుండా చూడాలని హెచ్చరించారు.

మాఫియాను నిరోధించడంలో విఫలం....

ఇక ఈ సమావేశంలో ఇసుక విధానంపై కూడా చర్చ జరిగింది. 2016 జనవరి నుంచి ఇసుక విక్రయాలను వేలం విధానం ద్వారానే చేపట్టాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మహిళా సంఘాల ద్వారా చేపడుతున్న ఇసుక విక్రయాల్లో.. మాఫియాను నిరోధించడంలో విఫలమవుతున్నామన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి కొత్త రీచ్‌లను వేలం వేయాలని.. త్వరలోనే మైనింగ్‌ విధానంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రీచ్‌ నుంచి ఇసుక వినియోగదారుడికి చేరే సమయాన్ని పరిగణనలోకి తీసుకొని రవాణా ఛార్జీలను లెక్కించాలని చంద్రబాబు సూచించారు. వినియోగదారుడికి సంతృప్తి స్థాయిలో ఇసుకను అందించడమే తమ ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు. ఇసుక కావాలంటూ ఆర్డర్లు వచ్చిన 24 గంటల్లోనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేతస్థాయిలో అక్కడక్కడా ఎదురవుతున్న చిన్న చిన్న లోపాలను సరిచేసుకోవాలని ఆదేశించారు.

ఇసుక క్వారీల నిర్వహణ ఎలా ఉందో పరిశీలిన......

తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇసుక క్వారీల నిర్వహణ ఎలా ఉందో పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇసుక మాఫియా ఆగడాలను నిరోధించాలని.. మైనింగ్‌ ద్వారా ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నేడు మైనింగ్‌ విధానంపై శ్వేతపత్రంలో పొందుపర్చాల్సిన అంశాలపై అధికారులు క్షుణ్ణంగా చర్చించనున్నారు. 

26 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు..

హైదరాబాద్ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ భేటీలో అనుసరించే వ్యూహాలపై చర్చించేందుకు టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశమయ్యింది. భేటీకి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, విధులు, హక్కులు, వాటాలను సాధించుకునేందుకు ఎన్డీయే సర్కార్‌ను నిలదీయాలని కేసీఆర్‌ సూచించారు. 

గ్రేటర్‌లో బీసీ గణనపై వెల్లువెత్తుతున్న విమర్శలు

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ లో బీసీ గణనను అధికారులు ఇష్టారీతిగా గజిబిజి చేస్తున్నారు. తొలి విడతలో తక్కువగా ఉన్న బీసీల శాతం.. మూడు రోజుల్లో చేపట్టిన గణనలో ఆరు శాతం పెరగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వార్డుల డీలిమిటేషన్‌, ఓటర్ల గల్లంతుపై ప్రతిపక్షాలు పోరాటం చేస్తుండగా.. తాజాగా బీసీ గణనలో అధికారుల నిర్లక్ష్యంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

07:07 - November 24, 2015

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ లో బీసీ గణనను అధికారులు ఇష్టారీతిగా గజిబిజి చేస్తున్నారు. తొలి విడతలో తక్కువగా ఉన్న బీసీల శాతం.. మూడు రోజుల్లో చేపట్టిన గణనలో ఆరు శాతం పెరగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వార్డుల డీలిమిటేషన్‌, ఓటర్ల గల్లంతుపై ప్రతిపక్షాలు పోరాటం చేస్తుండగా.. తాజాగా బీసీ గణనలో అధికారుల నిర్లక్ష్యంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పలు ఆరోపణలు .........

బల్దియాలో మళ్లీ కొత్త లొల్లి మొదలైంది. ఇన్నాళ్లు వార్డుల డీలిమిటేషన్‌, ఓటర్ల తొలగింపుపై జరిగిన రచ్చ.. ఇప్పుడు బీసీ ఓటర్ల లెక్కల మీదకు డైవర్ట్‌ అయ్యింది. ఇంటింటిని సక్రమంగా పరిశీలించకుండానే బీసీ ఓటర్ల సర్వే నిర్వహించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బీసీ గణనకు ప్రత్యేక చర్యలు చేపట్టిన అధికారులు.........

గతానికి భిన్నంగా వెనకబడిన వర్గాల ఓటర్ల వివరాలను సేకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొంటున్నప్పటికీ.. వీటిలో అనేక లోపాలు వెలుగు చూస్తున్నాయి. ఇంటింటికి వెళ్లిన సమయంలో ఓటర్ల నుంచి సంతకాలు తీసుకున్నట్లు అధికారులు చెప్పినా.. కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది తమ ఇళ్లకు రాలేదని ప్రజలంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో స్థానిక నేతలు చెప్పిన వివరాలనే రాసుకున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

13 రోజుల పాటు సర్వే .............

మరోవైపు 13 రోజుల పాటు సర్వే చేసిన అధికారులు 50 లక్షల ఓటర్లలో.. 10 లక్షల మంది బీసీలు ఉన్నారని గుర్తించారు. ఇది 20.42 శాతంగా లెక్కతేలింది. ఈ లెక్కలను చూసిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి షాక్‌కు గురైనట్లు సమాచారం. అనుమానం వచ్చిన జనార్ధన్‌రెడ్డి.. మరోసారి బీసీ గణనను పరిశీలించాలని ఆదేశించారు. దీంతో అధికారులు మరోసారి సర్వే చేశారు. ఈ లెక్కల్లో బీసీలు 25.84 శాతం ఉన్నారని తేలింది. అధికారులు ఇష్టమొచ్చినట్లు చేస్తున్న గణనతో.. బీసీలు రిజర్వేషన్లు కోల్పోవాల్సి వస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు.

బీసీ గణనపై అనేక అనుమానాలు ................

తొలుత ఉప్పల్‌, ఎల్బీనగర్‌ సర్కిళ్లలో బీసీల శాతంగా తక్కువగా ఉన్నట్లు లెక్కల్లో బయటపడింది. కానీ.. ఆ తర్వాత ఆ లెక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఇప్పుడు జీహెచ్‌ఎంసీ సిబ్బంది చేపట్టిన గణనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లకుండానే.. కార్యాలయాలు, హోటళ్లలో కూర్చుని ఓటర్‌లిస్ట్‌ను చూసి జాబితాలు సిద్దం చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.  ఏదిఏమైనా జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం, అత్యుత్సాహంతో తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని బీసీలంటున్నారు. తమకు అన్యాయం జరిగితే అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్దమని బీసీ నేతలంటున్నారు. మరి జీహెచ్‌ఎంసీ బీసీ గణన డ్రాఫ్ట్‌ను విడుదల చేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి !

07:03 - November 24, 2015

చిత్తూరు,నెల్లూరుకడప :కుండపోత వర్షాలు కోస్తా,సీమ జిల్లాలను అల్లకల్లోం చేస్తూనే ఉన్నాయి. విరామం లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తాజాగా వాతావరణ శాఖ హెచ్చరిక మరింత భయాందోళనకు గురిచేస్తోంది. అటు బాధిత ప్రాంతాల్లో నేతలు,మంత్రుల పర్యటనలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలు చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలను వదలడం లేదు. జిల్లాల్లో ఎటు చూసినా నీటి మడుగులే కనిపిస్తున్నాయి.

కుండపోతగా వర్షాలు.........

ఒక పక్క ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగుతున్నా...ఆగకుండా వర్షాలు కురుస్తుండడంతో వరద ప్రభావిత ప్రాంతాలు మరింత పెరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే మరో రెండు రోజుల పాటు దక్షిణ కోస్తాకు వర్షాలు తప్పవని వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక మరింత ఆందోళనకు గురిచేస్తోంది. వరుసగా వచ్చిన అల్పపీడనాల వల్ల ఈశాన్య రుతుపవనాలు బలపడుతున్నాయి. దీని ప్రభావంతో వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నారు.

నెల్లూరులో వర్షాలు......

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలోని పలు గ్రామాలు, కాలనీలు వరదలో చిక్కుకున్నాయి. ఇప్పుడిప్పుడే వరద నీటి నుంచి బయటపడుతున్న సమయంలోనే సోమవారం ఉదయం నుంచి మళ్లీ వర్షాలు పడుతున్నాయి. గూడూరు డివిజన్‌లో జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. ఇందూరు వద్ద రెండు కిలోమీటర్ల మేర రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

ఉధృతంగా ప్రవహిస్తున్న కైవల్యానది.......

తిప్పవరపాడు దగ్గర కైవల్యానది ఉధృతంగా ప్రవహిస్తోంది. కైవల్యానది కాలువలో పడి ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరిని పోలీసులు రక్షించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.కోవూరు, గూడూరు, సూళ్లూరుపేట, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, వెంకటగిరి నియోజకవర్గాలు పరిధిలో 54 గ్రామాలు, కాలనీలు వరద నీటిలో చిక్కుకునే ఉన్నాయి.

కడప జిల్లాలో 35 మండలాల్లో వర్షం......

కడప జిల్లాలోనూ వర్షాలు ఆగడం లేదు. రైల్వే కోడూరులో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యింది. భారీ వర్షాల కారణంగా కడప జిల్లా నందలూరు సమీపంలో రైలు పట్టాలపైకి వరదనీరు చేరింది. తిరుపతి-హుబ్లీ, హుబ్లీ-తిరుపతి ఇంటర్‌సిటీ ప్యాసింజర్‌, అరక్కోణం-కడప, కడప-అరక్కోణం ప్యాసింజర్‌ రైళ్లు రద్దు చేశారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

నష్టపోయిన రైతులను పరామర్శించిన జగన్....

కడప జిల్లాలో పంట నష్టపోయిన రైతులను వైసీపీ అధినేత జగన్‌ పరామర్శించారు.. రైల్వే కోడూరు, ఓబులవారిపల్లె మండలాల్లోని ప్రజలను కలుసుకున్నారు.. వరద బాధితులందరికీ తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.. సెట్టిగుంట చెరువు దగ్గర నీటమునిగిన అరటి తోటలను పరిశీలించారు. గోడకూలి చనిపోయిన బాలుని కుటుంబాన్ని ఓదార్చారు.

అన్ని విధాల ఆదుకుంటాం....

వర్షాలు, వరదలతో నష్టపోయిన ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను కేంద్రం అన్ని విధాల ఆదుకుంటుందని పట్ణణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ దగ్గర ఉన్న ప్రకృతి వైపరీత్యాల నిధి నుంచి ఖర్చే చేయాలని కోరారు. ఆ తర్వాత కేంద్రం సాయం చేస్తుందని చెప్పారు. వరసపెట్టి కురుస్తున్న వానలకు చిత్తూరు జిల్లా వణికిపోతోంది. గత 15 రోజులుగా వానలు పడుతూనే ఉన్నాయి. జిల్లాలో రబీ సాధారణ వర్షపాతం 569 మి. లీటర్లు కాగా..ఇప్పటికే 1384 మి. లీటర్ల వర్షపాతం నమోదయ్యింది. మరో రెండు రోజుల పాటు దక్షిణ కోస్తాకు వర్షాల తప్పవని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 

మరో రెండు రోజులపాటు దక్షిణ కోస్తాకు వానలు

చిత్తూరు,నెల్లూరు, కడప :కుండపోత వర్షాలు కోస్తా,సీమ జిల్లాలను అల్లకల్లోం చేస్తూనే ఉన్నాయి. విరామం లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తాజాగా వాతావరణ శాఖ హెచ్చరిక మరింత భయాందోళనకు గురిచేస్తోంది. అటు బాధిత ప్రాంతాల్లో నేతలు,మంత్రుల పర్యటనలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలు చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలను వదలడం లేదు. జిల్లాల్లో ఎటు చూసినా నీటి మడుగులే కనిపిస్తున్నాయి. 

06:58 - November 24, 2015

హైదరాబాద్: రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన ఉమెన్ టీచర్స్ నేషనల్ కన్వెన్షన్‌కు 16 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హజరై మహిళా టీచర్ల సమస్యలు, బాలికా విద్య, మహిళా రిజర్వేషన్ బిల్లు, మహిళా హక్కులు, వంటి అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న విద్యా విధానం, అక్కడి సమస్యలను, బాలికలు విద్యకు దూరం కావడం వంటి అంశాలను సదస్సులో చర్చకు తెచ్చారు. హర్యాణ లోని పానిపట్టులో ప్రధాని మోదీ బేటీ బచావో కార్యక్రమం చేపట్టినా.. అక్కడ బాలికా విద్య అగమ్య గోచరంగానే ఉందని హర్యాణ నుంచి వచ్చిన ప్రతినిధులు మండిపడ్డారు. దేశంలో పలు ప్రాంతాల్లో సిలబస్ కాషాయీకరణ చేసేందుకు కుట్ర జరుగుతుందని, పలు చోట్ల బలవంతంగా సిలబస్‌లో హిందుత్వంకు సంబందించి కొన్ని పాఠాలను పెడుతున్నారని ప్రతినిధులు ఆక్షేపించారు. అలాగే విద్యా ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణపై మహిళా టీచర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు.

రెగ్యులరైజ్‌ చేయడాన్ని విస్మరించిన ప్రభుత్వం...

కాంట్రాక్టు ప్రాతిపదికన టీచర్ల భర్తీ చేసిన ప్రభుత్వం వారిని రెగ్యులరైజ్‌ చేయడాన్ని విస్మరించిందని, వారు తక్కువ వేతనాలతో ఇబ్బందులకు గురవుతున్నారని... జమ్మూ నుంచి వచ్చిన ప్రతినిధి తెలిపారు. జాతీయ విద్యావిధానం రూపొందుతున్న తరుణంలో ప్రభుత్వం వారందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక మహిళా ముఖ్యమంత్రి ఉన్న పశ్చిమబెంగాల్‌లో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన ప్రతినిధి అన్నారు. బాలుర కంటే బాలికల డ్రాపౌట్స్ ఎక్కువగా ఉంటున్నాయని, దీనికి ప్రధాన కారణం పాఠశాలల్లో టాయిలెట్స్‌తో పాటు కనీస వసతులు లేక పోవడమే అన్నారు. ఈ సందర్భంగా మహిళా టీచర్ల జాతీయ కమిటీని ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో మహిళా టీచర్ల సమస్యలు, బాలికా విద్య వంటి అంశాలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఏపీలో అంగన్‌వాడీ కార్యకర్తల నిరాహార దీక్షలు

విజయవాడ : అంగన్‌వాడీ కార్యకర్తలు పోరుబాట పట్టారు. తమ సమస్యల పరిష్కారం.. జీతాల పెంపు జీవో విడుదలను కోరుతూ.. అంగన్‌వాడీలు నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోనూ వీరి నిరసనలు కొనసాగుతున్నాయి. 

06:56 - November 24, 2015

విజయవాడ : అంగన్‌వాడీ కార్యకర్తలు పోరుబాట పట్టారు. తమ సమస్యల పరిష్కారం.. జీతాల పెంపు జీవో విడుదలను కోరుతూ.. అంగన్‌వాడీలు నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోనూ వీరి నిరసనలు కొనసాగుతున్నాయి.

విశాఖ జిల్లాలో...

విశాఖ జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసన దీక్షను ఉధృతం చేశారు. పెంచిన జీతాల జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. కలెక్టరేట్‌ దగ్గర నిరవదిక నిరహార దీక్షలు చేపట్టారు. చలిని సైతం లెక్కచేయకుండా.. రాత్రి అక్కడే నిద్రించారు. పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని.. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అంగన్‌వాడీ కార్యకర్తలు హెచ్చరించారు.

విజయవాడలో...

విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.. డిమాండ్ల సాధనకోసం నిరాహారదీక్ష చేపట్టారు.. సిఐటియు ఏపీ ప్రధాన కార్యదర్శి గఫూర్‌ ఈ దీక్షలను ప్రారంభించారు.. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని.. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు..

గుంటూరులో...

గుంటూరులోకూడా అంగన్‌వాడీలు సామూహిక దీక్షలు చేపట్టారు.. పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.. వీరి దీక్షలకు మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణ్‌రావు సంఘీభావం ప్రకటించారు.

శ్రీకాకుళంలో...

శ్రీకాకుళం కలెక్టరేట్‌ ఎదుటా.. అంగన్‌వాడీ వర్కర్లు ఆందోళనకు దిగారు.. పెంచిన జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు..

అనంతపురం జిల్లాలో...

అనంతపురం జిల్లాలోనూ అంగన్‌వాడీల నిరసనలు కొనసాగాయి.. ఆర్డీవో కార్యాలయం ఎదుట కార్యకర్తలు నిరవధిక దీక్షలు చేపట్టారు.. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబులు వీరికి మద్దతు ప్రకటించారు..

ఒంగోలులో...

ఒంగోలులోకూడా అంగన్‌వాడీ కార్యకర్తలు దీక్షలకు దిగారు.. చాలీ చాలని జీతాలతో ఎలా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు... తమ సమస్యలు పరిష్కరించేవరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కాకినాడలో...

కాకినాడలో కూడా కలెక్టర్‌ కార్యాలయం ముందు అంగన్‌వాడీ కార్యకర్తలు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు.. 8 నెలల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.. తమ సమస్యలు తీర్చకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.. 

06:52 - November 24, 2015

హైదరాబాద్ : నగరంలో జల వనరుల నిర్వహణ అత్యంత దారుణంగా తయారైంది. ఒకప్పుడు భాగ్యనగరవాసులకు వరప్రసాదంగా భాసిల్లిన అనేక చెరువులు ఇప్పుడు కాలకూట విషంలా మారి వెక్కిరిస్తున్నాయి.

గుండె చెరువు..........

హైదరాబాద్ లో చెరువుల పరిస్థితి చూస్తే మన గుండె చెరువు అవుతుంది. ఒక్కప్పుడు హైదరాబాద్ మంచినీటి, సాగునీటి అవసరాలు తీర్చడంలో చెరువులు ప్రముఖ పాత్ర పోషించేవి. సిటీలో ఎటు చూసినా చక్కటి చెరువులు కనిపిస్తుండేవి. కానీ, రానురాను వాటి సంఖ్య తగ్గిపోతోంది. విస్తీర్ణమూ తరిగిపోతోంది. జీహెచ్ఎంసీ రికార్డులకీ, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితికీ లెక్క కుదరని దీనావస్థ భాగ్యనగరంలో నెలకొంది. జీహెచ్ఎంసీ పరిధిలో 168 చెరువులున్నట్టు రికార్డులు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో అవన్నీ కనిపించని దౌర్భాగ్యం. దాదాపు 40కి పైగా చెరువులు ఆనవాళ్లు కోల్పోయాయి. హైదరాబాద్ లో అధికభాగం చెరువుల్లో ఏదో ఒక స్థాయిలో అక్రమ కట్టడాలు వెలిశాయి. హెచ్ ఎండీఏ పరిధిలో 2857 చెరువులున్నట్టు రికార్డుల్లో రాసుకున్నా, వాస్తవాలు మరో రకంగా వెక్కిరిస్తున్నాయి.

అత్యంత ప్రమాదకర రసాయనాలకు నెలవులుగా ......

మిగిలిన కొద్దిపాటి చెరువుల నిర్వహణ మరీ ఘోరంగా తయారైంది. హైదరాబాద్ చెరువులు అత్యంత ప్రమాదకర రసాయనాలకు నెలవులుగా మారాయి. ఈ విషయాన్ని యునెస్కో ఏనాడో హెచ్చరించింది. దుర్గం చెరువు, కిష్టారెడ్డిపేట, ఖాజిపల్లి, ఆసానికుంట, సాయి చెరువు, నూర్ మహ్మద్ కుంట, పెద్ద చెరువు ఇలా మరెన్నో చెరువుల్లో ప్రమాదకర రసాయనాలు తిష్టవేశాయి. ఇక హుస్సేన్ సాగర్ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఆయా చెరువుల సమీపంలోని వివిధ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలే ఇంత ప్రమాదకర పరిస్థితికి కారణం. హైదరాబాద్ లో ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాలకు అతి ప్రధాన కారణం నీటి వనరులు కలుషితం కావడమే. పిల్లల్లో తరచూ నులిపురుగులు ఏర్పడడానికీ, వారిలో ఎదుగుదల లోపించడానికి, డయేరియా లాంటి వ్యాధుల బారిన పడడానికీ జల కాలుష్యమే కారణమంటూ యునెస్కో నివేదిక ఏనాడో స్పష్టం చేసింది. హైదరాబాద్ లో కొన్ని చెరువుల కింద సాగు చేసిన ఆకు కూరలు తిన్నవారికీ అనారోగ్యం తప్పడం లేదు. ఆ చెరువుల నీళ్లు తాగిన పశువుల పాలు సైతం మన ఆరోగ్యాలను గుల్ల చేస్తున్నాయి. లీటర్ నీటిలో ఆరు మిల్లీ గ్రాముల ఆక్సిజన్ వుండాలి. అంతకంటే తగ్గితే చేపలు కూడా బతకలేవు. కానీ హైదరాబాద్ లోని అనేక చెరువుల్లో మూడు మిల్లీగ్రాముల ఆక్సిజన్ కూడా దొరకని పరిస్థితి. ప్రమాద తీవ్రతను అర్ధం చేసుకోవడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇప్పటికైనా హైదరాబాద్ చెరువుల నిర్వహణ విషయంలో తక్షణ జాగ్రత్తలు తీసుకోకపోతే, పరిస్థితి మరింత వికటించడం ఖాయం. 

06:51 - November 24, 2015

హైదరాబాద్ : ఒకప్పుడు హైదరాబాద్ చెరువులకు ప్రసిద్ధి. వీటి కింద పంటలు పండేవి. తాగునీటి అవసరాలు తీరేవి. కానీ ఇప్పుడు ఈ చెరువుల కింద సాగు చేసిన ఆకు కూరలు తినాలన్నా భయపడాల్సిన దుస్థితి వచ్చింది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? హైదరాబాద్ చెరువులు ఎందుకు తరిగిపోతున్నాయి? వాటి నీళ్లు ఎందుకు ప్రమాదకరంగా మారుతున్నాయి? హైదరాబాద్ చెరువులకు పూర్వ వైభవం తీసుకురావాలంటే ఏం చేయాలి? వాటి నిర్వహణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చెరువుల నిర్వహణను నిర్లక్ష్యం చేస్తే మనం ఎదుర్కోబోయే కష్టనష్టాలేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సేవ్ అవర్ అర్బన్ లేక్స్ (సౌల్) నేత లుబ్నా పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై మాట్లాడారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:47 - November 24, 2015

హైదరాబాద్ : వరంగల్‌ పార్లమెంట్‌ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.. విజయం సాధిస్తామన్న ధీమా ఉన్నా... అభ్యర్థుల్లో టెన్షన్ మాత్రం పెరిగిపోతోంది.. మరికొద్ది గంటల్లో జరగబోయే కౌంటింగ్‌పై రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

విజయంపై ధీమాగాఉన్న టీఆర్‌ఎస్‌...............

వరంగల్‌ ఉప ఎన్నికలో మంచి మెజారిటీతో విజయం సాధిస్తామని టీఆర్‌ఎస్‌ ధీమాగా ఉంది.. గులాబీ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అనుకూలించకపోయినా పట్టు సడలకుండా ముందునుంచి పక్కా ప్లాన్‌తో వ్యవహరించారు పార్టీ నేతలు.. ఈ స్థానంనుంచి 2014 ఎన్నికల్లో 4లక్షల మెజారిటీతో విజయం సాధించారు కడియం శ్రీహరి.. ఈ ఉప ఎన్నికలో ఆస్థాయి పోలింగ్‌ నమోదు కాదని అధికారపార్టీ ముందే అంచనా వేసింది.. అయితే 70శాతం వరకు ఓటు హక్కు వినియోగించుకోవడంతో నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది..

రంగంలో 8 మంది మంత్రులు..........

ఈ ఎన్నికకోసం ఓ సాధారణ కార్యకర్తను పోటీలో ఉంచారు సీఎం కేసీఆర్.. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఎదుర్కొనేందుకు 8మంది మంత్రులను రంగంలోకి దించారు.. కాంగ్రెస్‌ పార్టీనుంచి గట్టి పోటీ ఉంటుందని ముందునుంచి భావించారు. ఆ తర్వాత బీజేపీ అభ్యర్థి కాస్త పుంజుకోవడంతో గులాబీదళం అప్రమత్తమైంది.. బూత్‌ స్థాయినుంచి ద్వితీయ శ్రేణి నేతల్ని ఆకట్టుకునేందుకు వ్యూహాలు రచించి.. జాగ్రత్తగా అమలు చేసింది.. చివరిరోజు ఓటింగ్ ను బట్టి తమ వ్యూహాం ఫలించిందని.. పోలింగ్‌ శాతం పెరగడంతో రెండున్నర లక్షల ఓట్లతో గెలుస్తామని నేతలు భావిస్తున్నారు.. మొత్తానికి వరంగల్‌ ఓటర్లు ఎవరివైపున్నారో మరి కొద్ది గంటల్లో తేలనుంది.. 

06:44 - November 24, 2015

హైదరాబాద్ : అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వరంగల్‌ ఉప ఎన్నిక ఫలితం నేడు వెలవడనుంది. రసవత్తరంగా సాగిన వరంగల్‌ పార్లమెంట్‌ ఎన్నికలో విజేత ఎవరు అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఉప ఎన్నిక ఫలితాల కోసం ఇప్పటికే జిల్లా కేంద్రం వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఫలితం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠతో.. అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

సర్వం సిద్ధం...

వరంగల్ ఉప ఎన్నికల ఫలితాల వెల్లడికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈవీఎంలను భద్ర పరిచిన ఏనుమామూలు వ్యవసాయ మార్కెట్‌లోనే..ఉదయం 8గంటలకు ఓట్ల కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. పార్లమెంట్‌ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్‌ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి కూడా అయిన.. కలెక్టర్‌ అరుణ, జిల్లా ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు.

ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం ..........

వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ నియెజకవర్గాలకు సంబంధించి మొత్తం 7 కౌంటింగ్‌ హాళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో కౌంటింగ్‌ హాల్లో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభయ్యే కౌంటింగ్‌లో తొలిరౌండ్‌ ఫలితం 9గంటలకల్లా వెలువడనుంది. భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి 22 రౌండ్లు, వరంగల్‌ ఈస్ట్‌ 16 రౌండ్లు, వరంగల్‌ వెస్ట్‌ 17రౌండ్లు, స్టేషన్‌ఘనపూర్‌ 20 రౌండ్లు, పరకాల 17 రౌండ్లు, పాలకుర్తి 19 రౌండ్లు, వర్థన్నపేట నియోజకవర్గానికి సంబంధించి 19రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి.

7 కౌంటింగ్‌ హాళ్లు ..............

ఉప ఎన్నిక ఫలితాల సందర్బంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరంలో 144 సెక్షన్‌ విధించారు. ఇప్పటికే ఏనుమామూల మార్కెట్‌కు కేంద్ర పారామిలటరీ దళాలు, సీఆర్‌పీఫ్‌, ఏపీఎస్పీ బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఫలితాల వెల్లడి తర్వాత శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా పటిష్ట బందోబస్త్‌ను ఏర్పాటు చేసింది.

నగరంలో 144 సెక్షన్‌ ...........

ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న అభ్యర్థులు...

మంగళవారం వెలువడే ఫలితాల కోసం ఎన్నికల్లో పోటీచేసిన 23 మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అభ్యర్థులే కాదు..ఆయా పార్టీల అభిమానులు కూడా ఫలితం కోసం నిరీక్షిస్తున్నారు. అయితే ఈ ఉపపోరులో టీఆర్‌ఎస్ విజయం ఖాయమని ఎగ్జిట్‌పోల్‌ సర్వేలు చెప్తున్నాయి. ఈ ఉప ఎన్నికలో 69శాతంపైనే ఓట్లు పోలవడంతో...భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే కాంగ్రెస్, బీజేపీలు కూడా గెలుపు తమదంటే తమదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటరు మహాశయులు ఎవరిని పార్లమెంట్‌కు పంపుతారో రేపు మధ్యాహ్నం 3గంటలకల్లా తేలి పోనుంది. . 

నేడే వరంగల్ ఉప ఎన్నిల కౌంటింగ్

హైదరాబాద్ : కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు హోరా హోరీగా తలపడిన వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈనెల 21న జరిగిన వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకల్లా పూర్తి ఫలితం వెలువడనుందని భావిస్తున్నారు.

విభజన అంశాలపై సబ్ కమిటీ ఏర్పాటు...

హైదరాబాద్ : ఏపీ విభజన నేపథ్యంలో తలెత్తిన వివాదాల పరిష్కారంపై పనిచేస్తున్న కమిటీకి సాయం అందించేందుకు కేంద్ర హోంశాఖ ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏపీ, తెలంగాణల మధ్య ఉన్న వివాదాలు, ఇబ్బందులను పరిష్కరించే అంశాలపై దృష్టి పెడుతుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి కుమార్ అలోక్ దీనికి నేతృత్వం వహిస్తారు. ఇరు రాష్ట్రాల నుంచి పునర్‌వ్యవస్థీకరణ కార్యదర్శులు, ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్లు, రెండు రాష్ట్రాల శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.

నగరంలో న్యాయవాది దరుణ హత్య

హైదరాబాద్ : నగరంలో ఓ న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. నగర శివారులోని రాజేంద్రనగర్‌లో సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో అడ్వకేట్‌ షేక్‌ ఆజం దారుణహత్య గురయ్యారు. అతని అల్లుడు తలపై బండరాయితో కొట్టి చంపాడు. కుటుంబ కలహాలే ఆయన హత్యకు కారణమని భావిస్తున్నారు. ఇతర విషయాలు తెలియాల్సి ఉంది.

Don't Miss