Activities calendar

26 November 2015

ఆ విద్యార్థులు దొరికారు..

ప్రకాశం : జిల్లాలోని గిద్దలూరులో తప్పిపోయిన విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. తప్పిపోయిన ముగ్గురు విద్యార్థులను ఆర్పీఎఫ్‌ పోలీసులు నరసరావుపేటలో గుర్తించారు. ఈ విద్యార్థులు గిద్దలూరులోని సూర్య విద్యానికేతన్‌కు చెందినవారిగా గుర్తించారు. కాగా ఈ ఘటనకు సంబంధించన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

21:51 - November 26, 2015

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయ కమిషన్‌ నిర్ణయంపై  బేరసారాలు కొనసాగుతున్నాయి. ఆస్తులు అమ్మి భాదితులకు వడ్డీతో సహా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని  హైకోర్టు పిటిషనర్లకు హామీ ఇచ్చింది. దీనిలో  బాగంగా  వారానికి రెండు సార్లు కేసు విచారణ చేపడుతున్నారు. అగ్రిగోల్డ్‌  ఆస్తులను విక్రయించి, బాధితులకు  డబ్బులు తెల్లించేందుకు  సీ1 సంస్థ ముందుకు వచ్చింది.  అమ్మకం విధివిధానాలు రూపొందిచేందుకు  హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి  జస్టిస్ సూర్యరావు నేతృత్వంలో కమిటీ  ఏర్పాటు చేశారు. ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి, ఒక చార్టెడ్ అకౌంట్  దీనిలో సభ్యులుగా ఉన్నారు. ఆస్తుల విక్రయాలు జరిపేందుకు ముందుకొచ్చిన  సీ1 సంస్థకు 0.2  కమిషన్ ఇవ్వాలని కమిటీ నివేదించింది.  అయితే తమకు  0.5   కమిషన్‌ కావాలని సంస్థ పట్టుపడుతోంది.  పెట్టుబడి పెట్టి మోసపోయిన పేదల కష్టాలను మానవీయత కోణంలో పని చేయాలని కోర్టు కోరింది. 

ఇష్టం లేకపోతే తప్పుకోవచ్చు..
మొదటి దశలో అమ్మకాల్లో ఖర్చులు  ఎక్కువైతే  రెండో దశలో కమిషన్ పెంచుతామని హైకోర్టు ధర్మాసనం చెప్పింది.  అయినా  సీ 1 సంస్థ అభ్యంతరం చెప్పడంతో.. దీనిలో బలవంతం ఏమీ లేదని తెలిపింది.  ఇష్టం లేకపోతే తప్పుకోవచ్చని సూచించింది. తమకు  సోమవారం వరకు గడువు  ఇస్తే నిర్ణయం చెబుతామని సంస్థ  కోర్టు దృష్టికి తెల్చింది.  మరోవైపు తాము  0.2 శాతం కమిషన్‌తో అగ్రిగోల్డ్‌ ఆస్తుల అమ్మకాలు చేపడతామని  మినీరత్న కంపెనీల్లో ఒకటైన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ మెటల్‌ స్క్రాప్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌...  ఎం.ఎస్.టీ.సి ముందుకు వచ్చింది.
మీడియా కథనాలు భయపెడుతున్నాయి..
ఇక ఆస్తుల అమ్మకాలకు  రిజర్వ్ ప్రైస్ ను అమలు చేసేలా హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆస్తుల విక్రయంపై  మీడియాలో వస్తున్న  కథనాల కొనుగోలుకు ముందుకు వస్తున్న వారిని  ఆందోళనకు గురిచేస్తున్నాయని అగ్రిగోల్డ్ తరుపు న్యాయవాది ప్రకాశ్ రెడ్డి వాదించారు. ఈ అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామంటామని విచారణను  వాయిదా వేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 1 నుంచి ఆస్తులను అమ్మకాలు పక్రియ ప్రారంభించాలి. వచ్చిన సొమ్మును  హైకోర్టు రిజిస్ట్రార్‌   బ్యాంకు అకౌంట్స్ జమచేసి,  బాధితులకు చెల్లించాలని న్యాయస్థానం ఉత్తర్వులు ఉన్నాయి. 

21:37 - November 26, 2015

హైదరాబాద్ : వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక ఓటమి భారం నుంచి కాంగ్రెస్‌ నాయకులు ఇంకా తేరుకోలేదు. ముందుండి పార్టీని నడిపిస్తూ అందిరికీ ధైర్యం చెప్పాల్సిన  పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి  డీలా పడిపోయారు. వరంగల్‌ ఫలితం తర్వాత ఇంటికే పరిమితమైన ఆయనకు కాంగ్రెస్‌ నాయకులు ధైర్యం నూరిపోయాల్సిన పరిస్థితి వచ్చింది. 

ఓటమి భారంతో కుంగిపోతున్న పీసీసీ ఛీఫ్‌  

వరంగల్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే గెలుపని ఉత్తంకుమార్‌ రెడ్డి  ఢంకా బజాయించి చెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్ధి సర్వే సత్యనారాయణకు లక్ష మెజారిటీ వస్తుందన్న సర్వేల సారాంశాన్ని ఎన్నికల ప్రచార వేదికలపై వివరించారు. కానీ ఘోర పరాజయం ఎదువరవడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమి భారంతో పీసీసీ ఛీఫ్‌ కుంగిపోతున్నారు. ఫలితం తర్వాత తనను కలిసేందుకు వచ్చిన అందరు నాయకులతో ఆయన ఇదే విషయం చెబుతున్నారు. వరంగల్‌ ఓటమికి ఢిల్లీ పెద్దలు కూడా క్లాసు తీసుకోవడంతో ఆయన మానసికంగా మరింత కుంగిపోతున్నారని పార్టీలో వర్గాల్లో వినిపిస్తోంది. 

తరుముకొస్తున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు 
పార్టీ కార్యకర్తలను భరోసా, నాయకులు దిశా, నిర్దేశం చేయాల్సిన పీసీసీ అధ్యక్షుడే డీలాపడి పోవడంతో ఆయనకే ధైర్యం నూరిపోయాల్సిన పరిస్థితి వచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ఆయన డీలా పడిపోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారిందంటున్నారు. మెదక్‌ జిల్లా నారాయణ్‌ఖేడ్‌ అసెంబ్లీ నియోజవర్గ ఉప ఎన్నిక కూడా తర్వలోనే జరిగే అవకాశం ఉంది. వీటికి పార్టీని నడిపించాల్సిన నాయకుడు మూడీగా ఉండటం ఏంటని  ప్రశ్నిస్తున్నారు.  దీంతో చేసేదిలేక  కాంగ్రెస్‌ నేతల తమకు తోచిన విధంగా ఉత్తమ్‌కు సూచనలు, సలహాలు ఇస్తూ ఆయనలో ధైర్యం, ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. 

మరేదైనా కారణం ఉందా ? 
ఎన్నికల రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమన్న విషయంతో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉత్తం కుమార్‌రెడ్డికి తెలియని విషయంకాదు. ఆయన కుంగుబాటుకు వరంగల్‌ ఉప ఎన్నికలో ఓటమి కారణమా ? లేక మరేదైనా  ఉందా.... అన్న విషయం అర్ధంకాక కాంగ్రెస్‌ నేతలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. 

21:19 - November 26, 2015

అమీర్ ఖాన్ ఏమన్నాడు? ఏం తప్పు చేశాడు? ఎందుకిలా విరుచుకుపడుతున్నారు. జరుగుతున్న పరిణామల పట్ల తన భార్య అభిప్రాయాన్ని ఓ వేధికపై వెళ్లడించడం నేరమా? ఓ సెలబ్రిటీ.. కోట్లాది అభిమానులను సంపాదించుకున్న హీరో.. ఈ పని చేయకూడదా? రెండు రోజులుగా జరుగుతున్న రగడ అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. దేశంలో నెలకొన్న అసహనాన్ని ప్రశ్నించడం మాని అసహనం వెనుకున్న కారణాలను వదిలేసి సమస్యను లేవనెత్తిన వారిపై విమర్శలెందుకు చేస్తున్నారు. అసహనంపై ప్రశ్నలపట్ల మరింత అసహం వ్యక్తమౌతోందా? ఇదే అంశంపై వైడాంగిల్ స్పెషల్ స్టోరీ వీడియోలో చూడండి. 

డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎంపిక ఇలా..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి విధి విధానాల్లో మార్పులు చేపట్టింది. లబ్ధిదారుల ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. జిల్లా మంత్రి అధ్యక్షుడిగా, కలెక్టర్ కన్వీనర్ గా ఎమ్మెల్యేలు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. లబ్ధిదారులను ఈ కమిటీయే ఖరారు చేస్తుంది. 

21:07 - November 26, 2015

నెల్లూరు : ఓ వింత వస్తువు ప్రజల్ని భయపెడుతోంది. జిల్లాలోని వాకాడ మండలం పంబలి వద్ద రాకెట్‌ ఆకారంలో ఉన్న ఓ వస్తువు సముద్ర తీరంలోకి కొట్టుకొచ్చింది. 10 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు ఉండడంతో స్ధానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీని బరువు సుమారు 5 నుంచి 10 టన్నులు ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. అధికారులు పరీక్షించి ప్రజల భయాన్ని తొలగించాలని స్థానికులు కోరుకుంటున్నారు. 

20:55 - November 26, 2015

విజయవాడ : బాక్సైట్‌ తవ్వకాల విషయంలో ఏపీ ప్రభుత్వం తన ప్రయత్నాన్ని విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. కాంట్ట్రాక్ట్‌ ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేయకుంటే అసెంబ్లీని ముట్టడిస్తానమన్నారు. కేంద్రం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌పై చిన్న చూపు చూస్తోందని మధు అన్నారు. ఆయనతో 10టీవీ ప్రతినిధి  ఫేస్‌ టు ఫేస్‌ ను వీడియోలో చూడండి. 

20:52 - November 26, 2015

మెదక్ : తెలంగాణా సాధించిన పార్టీగా టీఆర్‌ఎస్‌ను వరంగల్‌ ప్రజలు గెలిపించారని సీపీఎం తెలంగాణ రాష్ట్రా కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  అన్నారు. టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత ఉన్నా.. అది ఓడించే స్థాయిలో లేదని ఆయన అన్నారు. మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో ఈనెల 29,30న జరిగే సీపీఎం విస్త్రతస్థాయి సమావేశాలకు రాష్ట్రవ్యాప్తంగా 200 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని తమ్మినేని ప్రకటించారు. 

20:50 - November 26, 2015

వరంగల్ : ఆశా వర్కర్లు ఓ మంత్రికి దిమ్మదిరిగి బొమ్మ కనిపించేలా చేశారు. గత 86 రోజులుగా తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆశాలు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం వరంగల్ జిల్లా ములుగులో ఓ కార్యక్రమానికి వెళుతున్న మంత్రి చందూలాల్‌ కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. కాన్వాయ్ కదలకుండా బైఠాయించారు.  86రోజులుగా తాము సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఈ హఠాత్ పరిణామానికి సర్థుకున్న పోలీసులు వెంటనే ఆశ వర్కర్లపై లాఠీ ఛార్జీ చేసి చెదరగొట్టారు. తమకు కనీస వేతనాలు ఇవ్వమని కోరుతుంటే లాఠీలతో కుళ్లబొడుస్తున్నారు. ఇదేనా బంగారు తెలంగాణా అంటూ ఆశాలు తమ ఆవేదన వెళ్లబుచ్చారు. 

20:48 - November 26, 2015

హైదరాబాద్ : మీరు డబుల్ బెడ్రూమ్ కోసం ధరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మారిన ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే. తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక విధివిధానాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లా మంత్రి నేతృత్వంలో ఎమ్మెల్యేలు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కలెక్టర్ దీనికి కన్వీనర్ గా ఉంటారు. అన్ని ప్రాంతాల్లో గ్రామ, వార్డు సభలను నిర్వహించి. లబ్ధిదారులను ఎంపిక చేయాలని కొత్త నిబంధనలు రూపొందించారు.

సారికది ఆత్మహత్యే..

హైదరాబాద్ :  వరంగల్ లో సంచలనం సృష్టించిన సారిక, ముగ్గురు పిల్లల ఆత్మాహుతి ఘటన పై ఫోరెన్సిక్ నిపుణుల రిపోర్టు వచ్చింది. ఈ నివేధికలో సారికది ఆత్మహత్యేనని తేల్చారు. 

క్వార్టర్స్ లో సింధూ..

మకావు :  మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ భారత షట్లర్ పివి సింధు మహిళల సింగిల్స్ లో భాగంలో క్వార్టర్స్ ఫైనల్స్ కు చేరుకుంది. ప్రి క్వార్టర్ ఫైనల్ లో సింధు 21-17, 21-18 తేడాతో లిందావేణి ఫణేత్రి(ఇండోనేషియా)పై ఘన విజయం సాధించింది. 

అండర్ 16 జట్టులో అర్జున్ టెండూల్కర్ కు చోటు..

ముంబై : అండర్ 16 జట్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కు చోటు దక్కింది. 

19:40 - November 26, 2015

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చ జరిగింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం - కట్టుబాట్లపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభలో చర్చను ప్రారంభించారు. కానీ కోట్లాది ప్రజల అభ్యున్నతిని కాక్షించినా ఆ స్వప్నం కలగానే ఉంది. ఆరు దశాబ్దాల తరువాత కూడా పరిస్థితిలో మార్పు లేదు. అసమానతలు అదే రీతిలో రాజ్యమేలుతూనే ఉన్నాయి. అన్యాయాలు వెక్కిరిస్తూనే ఉన్నాయి. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో విశ్వేశ్వరరావు (సామాజిక విశ్లేషకులు), అద్దంకి దయాకర్ రావు (కాంగ్రెస్), రామారావు (ఏపీ కేవీపీఎస్ నేత), ప్రకాష్ రెడ్డి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

19:34 - November 26, 2015

ఢిల్లీ : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చ జరిగింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం - కట్టుబాట్లపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభలో చర్చను ప్రారంభించారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్ కృషి ఎనలేనిదని ఆయన కొనియడారు. నిష్పాక్షికంగా, విమర్శలకు తావులేకుండా అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. దేశంలో నెలకొన్న అసహన పరిస్థితుల కారణంగా దేశం విడిచి వెళ్తానని బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలనుద్దేశించి హోంమంత్రి అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఓ దళితుడిగా అంబేడ్కర్ ఎన్నో అవమానాలకు గురైనా... తన భావోద్వేగాలను ఎన్నడూ బయటపెట్టలేదన్నారు. భారతదేశాన్ని వదిలి ఇతర దేశానికి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదన్నారు. భారతదేశాన్ని బలోపేతం చేసేందుకే అంబేడ్కర్‌ కృషి చేశారని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పనిలో పనిగా ప్రతిపక్షాలపై కూడా హోంమంత్రి దాడి చేశారు. భారత రాజకీయాల్లో ' సెక్యులర్‌' పదాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంబేద్కర్‌ రాజ్యాంగ పీఠికలో సెక్యులర్‌ పదాన్ని వాడలేదని గుర్తు చేశారు. సోషలిస్టు - సెక్యులర్‌ పదాలను రాజ్యాంగం అమలులోకి వచ్చాకే జోడించారని తెలిపారు.

రాజ్యాంగ స్పూర్తికి ప్రమాదమన్న సోనియా..
ప్రస్తుతం రాజ్యాంగ స్పూర్తికి ప్రమాదం పొంచి ఉందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ హెచ్చరించారు. గత కొన్ని నెలలుగా దేశంలో నెలకొన్న పరిస్థితులు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగిస్తున్నాయన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకోని వారు, రాజ్యాంగంపై నమ్మకం లేనివారు రాజ్యాంగంపై చర్చించడం నవ్వులాటగా ఉందని సోనియా ఎద్దేవా చేశారు. రాజ్యాంగ నిర్మాణంలో డ్రాఫ్టింగ్‌ కమిటీకి కాంగ్రెస్‌ ఎంతో సహకరించిందని పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సం సందర్భంగా... పార్లమెంట్ ఉభయ సభలు అంబేడ్కర్ ఘనంగా నివాళులర్పించాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గౌరవార్థం రెండు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. 

శుక్రవారం సుల్తాన్ బజార్ బంద్..

హైదరాబాద్ : రేపు సుల్తాన్ బజార్ బంద్ కు వ్యాపారస్తులు పిలుపునిచ్చారు. సుల్తాన్ బజార్ లో మెట్రో రైలు నిర్మాణం వద్దని డిమాండ్ చేస్తూ ఈ బంద్ జరుగనుంది. 

 

రాష్ట్రంలో సత్యేంద్రగార్గ్ కేంద్ర బృందం పర్యటన..

ఢిల్లీ : వరద నష్టం అంచనాకు సత్యేంద్రగార్గ్ నాయకత్వంలోని కేంద్ర బృందం సోమవారం నుండి రాష్ట్రంలో పర్యటిస్తుందని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు పేర్కొన్నారు. కరవు మండలాల నివేదికను త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందిస్తుందన్నారు. 

డిసెంబర్ 14 నుండి బోధకాల నివారణ - కామినేని..

విజయవాడ : డిసెంబర్ 14 నుండి బోధకాల నివారణ కార్యక్రమం జరుగనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో కొత్త శానిటేషన్ పాలసీని తీసుకొస్తామని, ఎన్టీఆర్ వైద్య సేవలు, జర్నలిస్టుల హెల్త్ కార్డులు, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. 

పహాడీ షరీఫ్ ఎస్ వోటీ పోలీసుల దాడులు..

హైదరాబాద్ : పహాడీ షరీఫ్ లో ఎస్ వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. నకిలీ పచ్చళ్ల తయారీ కేంద్రంలో సోదాలు నిర్వహించింది. ఒకరిని అరెస్టు చేసి పచ్చళ్లను సావధీనం చేసుకున్నారు. 

ఢిల్లీ అసెంబ్లీలో జర్నలిస్టుల బిల్లు..

ఢిల్లీ : దేశ రాజధాని అసెంబ్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం బిల్లు ప్రవేశ పెట్టింది. మజీత్యా కమిటీ సిఫార్సులను కచ్చితంగా అమలు చేసేలా మీడియా యాజమాన్యాలు ఈ సిఫార్సులను అమలు చేయకపోవడంతో ఢిల్లీ సర్కార్ బిల్లును తీసుకొచ్చింది. జర్నలిస్టులకు కనీస వేతనం రూ.25వేలు, నాన్ జర్నలిస్టులకు రూ.17,500 నిబంధనగా ఉంది. సంస్థల ఆదాయాన్ని ఎనిమిది విభాగాలుగా మీడియా సంస్థల వర్గీకరణ..న్యూస్ ఏజెన్సీలను నాలుగు విభాగాలుగా వర్గీకరణ..పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లు..పితృత్వ సెలవులు వంటి అంశాలను బిల్లులో పొందుపరిచింది. 

కరవు మండలాలపై ప్రభుత్వం వివక్ష – తమ్మినేని..

హైదరాబాద్ : కరవు మండలాలపై ప్రభుత్వం వివక్ష చూపిందని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కరవు మండలాలు స్పష్టంగా ప్రకటించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల కోసం సీపీఎం పోరాడుతుందని స్పష్టం చేశారు. 29,30వ తేదీల్లో సంగారెడ్డిలో సీపీఎం విస్తృతస్థాయి సమావేశం జరుగనుందన్నారు. ఈ సమావేశాలకు సీపీఎం జాతీయ కార్యదర్శి ఏచూరితో పాటు 200 మంది ప్రతినిధులు హాజరౌతారని తెలిపారు. కేసీఆర్ 18 నెలల పాలనలో ప్రభుత్వంపై అసంపూర్తి ఉన్నా అది ఓడించే స్థాయిలో లేదని సీపీఎం గుర్తించిందన్నారు.

మేయర్ దంపతుల హత్య కేసు దర్యాప్తు ముమ్మరం..

చిత్తూరు : నగర మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మేయర్ హత్య కేసులో సంబంధం ఉన్న పలువురికి నోటీసులు జారీ చేశారు. ప్రధాని సాక్షి సతీష్ కు భద్రత పెంచారు. ప్రధాన నిందితుడు కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న వెంకటాచలపతి, మంజునాథ్, జయప్రకాశ్, పరందామన్, గుణశేఖర్, మురుగ, యోగానంద్, మొగిలి, ఎకాంభరంలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

పులి దాడి..యువకుడికి గాయాలు..

ఆదిలాబాద్ : జిల్లా మామడ మండల పరిసరాల్లో పులి జరిపిన దాడిలో మామడ మండల కేంద్రానికి చెందిన యువకుడు గాయపడ్డాడు. అప్రమత్తమైన యువకుడు పులి బారి నుండి తప్పించుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. చికిత్స నిమిత్తం యువకుడిని నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. 

తిరుమల రెండో కనుమదారిలో అనుమతి..

చిత్తూరు : దెబ్బతిన్న తిరుమల రెండో కనుమ దారిలో వాహనాలను గురువారం నుండి టిటిడి అనుమతినిస్తోంది. ఇటీవల వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడడంతో 14 కి.మీటర్ల వద్ద రహదారిని మూసివేసిన సంగతి తెలిసిందే. మరమ్మత్తులు పూర్తి కావడంతో చిన్న వాహనాలను అధికారులు అనుమతినిస్తున్నారు. 

అక్రమ నిల్వలపై దాడులు.

హైదరాబాద్ : అక్రమ నిల్వలపై గురువారం సైబరాబాద్ ఎస్ ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. 142 క్వింటాళ్ల చౌక ధర బియ్యం, 6 క్వింటాళ్ల కందిపప్పును స్వాధీనం చేసుకున్నా ఇందులో 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

18:50 - November 26, 2015

టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి...ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవల్ స్టేడియంలో రేపు తెరలేవనుంది. 138 సంవత్సరాల సాంప్రదాయ టెస్ట్ మ్యాచ్ చరిత్రలో తొలి డే-నైట్ క్రికెట్ సమరం కోసం.. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది ఎదురుచూస్తున్నారు. ఈమ్యాచ్ శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. పెద్దమనుషుల క్రీడ క్రికెట్లో..సరికొత్త చరిత్ర సృష్టించడానికి ట్రాన్స్- టాస్మన్ ప్రత్యర్థులు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు చేయి చేయి కలిపాయి. మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా...అడిలైడ్ ఓవల్ లో శుక్రవారం నుంచి ఐదురోజులపాటు జరిగే ఆఖరి టెస్ట్ ను...డే-నైట్ గా ఆడాలని నిర్ణయించాయి. సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ అనగానే... పట్టపగలు.. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ...ఎరుపు రంగు క్రికెట్ బాల్ తో ...రోజుకు 90 ఓవర్ల చొప్పున మ్యాచ్ ఆడటం అని మాత్రమే మనకు తెలుసు.

138 సంవత్సరాలుగా..
గత 138 సంవత్సరాలుగా నాగపూర్ విదర్భ స్టేడియంలో టీమిండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న 2 వేల 187వ మ్యాచ్ వరకూ..టెస్ట్ క్రికెట్ ను డేమ్యాచ్ గానే నిర్వహిస్తూ వచ్చారు. అయితే...రొటీన్ కు భిన్నంగా...ఓ టెస్ట్ మ్యాచ్ ను డే-నైట్ గా నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు వాస్తవరూపమే 2015 అడిలైడ్ ఓవల్ టెస్ట్. నవంబర్ 27 నుంచి ఐదురోజులపాటు...ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ..డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ను నిర్వహించబోతున్నారు. సాధారణ టెస్ట్ మ్యాచ్ లు ..డ్రింక్స్ బ్రేక్ తో మొదలై..లంచ్ బ్రేక్, టీ బ్రేక్ , డ్రింక్ బ్రేక్ లతో ముగిస్తే....డే -నైట్ టెస్ట్ మ్యాచ్ మాత్రం...టీ బ్రేక్ తో ప్రారంభమై..ఆ తర్వాత లంచ్ బ్రేక్ తో ఆటను కొనసాగించడం విశేషం.

గులాబీ రంగు బాల్...
మొత్తం 90 ఓవర్ల ఆటలో..సగభాగం సన్ లైట్ లోనూ, మిగిలిన సగభాగం ఫ్లడ్ లైట్ల వెలుగులోనూ జరుగుతుంది. అంతేకాదు..సాంప్రదాయం ప్రకారం ఇప్పటి వరకూ ఎరుపు రంగు బంతిని మాత్రమే ఉపయోగిస్తున్నారు. అయితే ఫ్లడ్ లైట్ల వెలుగులో బంతి స్పష్టంగా కనిపించడానికి వీలుగా తొలి సారిగా గులాబీ రంగు బాల్ ను ఉపయోగిస్తున్నారు. స్వింగ్ అండ్ సీమ్ బౌలర్లకు అనువుగాఉండే పింక్ క్రికెట్ బాల్ ను ఆస్ట్రేలియాకు చెందిన కూకాబురా కంపెనీ తయారు చేసింది.
ఇక..రెండుజట్ల బలాబలాల విషయానికి వస్తే...మూడుమ్యాచ్ ల ఈ సిరీస్ లోని మొదటి రెండు టెస్టులు ముగిసే సమయానికి ఆతిథ్య ఆస్ట్రేలియా ఇప్పటికే 1-0 ఆధిక్యం తో పైచేయి సాధించింది. సిరీస్ ను సమం చేయాలంటే ఈమ్యాచ్ లో న్యూజిలాండ్ నెగ్గి తీరాల్సి ఉంది. ఈమ్యాచ్ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు కంగారూ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెబుతున్నాడు. న్యూజిలాండ్ శిక్షకుడు బ్రయన్ మెక్మిలన్ సైతం..డే- నైట్ టెస్ట్ కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.

ఆత్మవిశ్వాసంతో కివీస్...
కంగారూ టాపార్డర్ ఆటగాడు క్వాజా గాయంతోనూ, ఫాస్ట్ బౌలర్ మిషెల్ జాన్సన్ రిటైర్మెంట్ తోనూ ఏర్పడిన ఖాళీలను...షాన్ మార్ష్, పీటర్ సిడిల్ లతో భర్తీ చేయాలని ఆసీస్ టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది. మరోవైపు..రెండోటెస్ట్ లో టాపార్డర్ ఆటగాళ్ళు కేన్ విలియమ్స్ సన్ సెంచరీ, రోస్ టేలర్ సూపర్ డబుల్ సెంచరీలతో కళ్ళు చెదిరే ఫామ్ లో ఉండడంతో న్యూజిలాండ్ ఎనలేని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఐదురోజులపాటు జరిగే ఈ చారిత్రక డే-నైట్ టెస్ట్ లో...ఆస్ట్రేలియా విన్నర్ గా నిలుస్తుందా? లేక న్యూజిలాండ్ విజేతగా నిలిచి..సిరీస్ ను 1-1తో సమం చేయడం ద్వారా చరిత్ర సృష్టిస్తుందా?..తెలుసుకోవాలంటే...వచ్చే ఐదు రోజుల పాటు సస్పెన్స్ భరించక తప్పదు.

18:45 - November 26, 2015

టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తిప్పేశాడు. నాగ్‌పూర్‌లో స్పిన్‌ మ్యాజిక్‌తో సఫారీ బ్యాట్స్‌మెన్‌ను క్యూ కట్టించాడు. క్యారమ్ బాల్ తో మ్యాజిక్‌ చేసిన టీమిండియా స్టార్ స్పిన్నర్‌.... టెస్టుల్లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్...టెస్టుల్లో రికార్డుల మోత మోగిస్తూనే ఉన్నాడు. నాగ్‌పూర్‌ టెస్టుల్లోనూ అశ్విన్‌.... సఫారీ బ్యాట్స్ మెన్‌తో ఆటాడుకున్నాడు. భారత ప్రధాన అస్త్రంగా బరిలోకి దిగిన అశ్విన్‌ అంచనాలకు తగ్గట్టుగానే అదరగొట్టాడు.దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో స్పిన్‌ మ్యాజిక్‌తో సఫారీ బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించిన టీమిండియా స్టార్ స్పిన్నర్‌ టెస్టుల్లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తొలి రోజు ఆటలోనే దక్షిణాఫ్రికా ఓపెనర్‌ వాన్‌ జిల్‌ను పెవిలియన్‌కు పంపి భారత జట్టుకు శుభారంభాన్నిచ్చిన అశ్విన్‌....రెండో రోజు కూడా అదే స్థాయిలో రాణించాడు. క్రీజ్‌లో పాతుకుపోయిన ఓపెనర్‌ డీన్‌ ఎల్గార్‌తో పాటు కెప్టెన్‌ హషీమ్‌ ఆమ్లాను....బోల్తా కొట్టించి దక్షిణాఫ్రికా జట్టును దెబ్బతీశాడు.

ఖాతాలో ఐదు వికెట్లు...
మిడిలార్డర్‌ బ్యాట్స్ మెన్ ను ముప్పు తిప్పలు పెట్టిన అశ్విన్‌ మిగతా లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్ మెన్స్ ను క్రీజ్‌లో కుదురుకోనియ్యకుండా చేశాడు. ఆఖర్లో టెయిలెండర్లు హార్మర్‌, మోర్నీ మోర్కెల్‌ను ఔట్‌ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 14వ సారి 5 వికెట్లు తీసి తనకు తాను మాత్రమే సాటి అని నిరూపించాడు. తొలి టెస్టుల్లో 5 వికెట్ల ఫీట్‌తో టెస్టు ఫార్మాట్‌లో 150 వికెట్ల క్లబ్‌లో చేరిన అశ్విన్‌....మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ తో తన వికెట్ల ఖాతాను 162 వికెట్లకు పెంచుకున్నాడు. నాగ్‌పూర్‌ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్ తో కలిపి ఇప్పటివరకూ 31 టెస్టుల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన అశ్విన్‌....అతి తక్కువ మ్యాచ్‌ల్లోనే 160 వికెట్ల క్లబ్‌లో చేరిన భారత బౌలర్‌గా రికార్డ్‌ నమోదు చేశాడు. మరి టెస్టు ఫార్మాట్‌లో జోరు మీదున్న అశ్విన్‌ రెండో ఇన్నింగ్స్ లోనూ ఇదే స్థాయిలో చెలరేగితే దక్షిణాఫ్రికా జట్టుకు మరోసారి కష్టాలు తప్పవనడంలో ఎటువంటి సందేహం లేదు.

18:40 - November 26, 2015

నాగపూర్ : మూడో టెస్ట్ మూడు రోజుల్లోనే ముగిసిపోడం ఖాయంగా కనిపిస్తోంది. రోజున్నర ఆటలోనే రెండుజట్ల మూడు ఇన్నింగ్స్ ముగియడంతో...మ్యాచ్ రసపట్టుగా మారింది. తొలి ఇన్నింగ్స్ లో 136 పరుగుల భారీఆధిక్యత సాధించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 173 పరుగులకు ఆలౌట్ కావడం ద్వారా..ప్రత్యర్థి ఎదుట 310 పరుగుల భారీలక్ష్యం ఉంచగలిగింది. ఓపెనర్ శిఖర్ ధావన్, వన్ డౌన్ పూజారా, రోహిత్ శర్మ కీలక పరుగులు సాధించడంతో భారత్ మ్యాచ్ విన్నింగ్ స్కోరు నమోదు చేయగలిగింది. సఫారీ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ 38 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. మూడున్నర రోజులఆటలో సౌతాఫ్రికా 310 పరుగులు చేస్తే 1-1 సిరీస్ ను సమం చేయగలుగుతుంది. అయితే రెండోరోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 32 పరుగులు చేసింది. ఓపెనర్ ఎల్గర్, కెప్టెన్ హషీమ్ ఆమ్లా క్రీజులో ఉన్నారు. సఫారీ టీమ్ మూడోరోజుఆటలో మరో 278 పరుగులు చేయాల్సి ఉంది.

18:38 - November 26, 2015

ఆదిలాబాద్ : ఇంట్లో పనులు చేసి చేసి బోర్‌కొట్టిందో..లేక... ఎప్పుడూ లైఫ్‌ ఇంతేనా అనుకుందో...కిక్‌ ఉండాలనుకుందో...మొత్తానికి ఓ లేడి రాత్రి రాత్రి అమ్మవారి అవతారం ఎత్తేసింది..తనకు తాను దేవతనని చెప్పింది. అప్పటిదాకా ఆమె అంట్లు తోమేప్పుడు ఇల్లు ఊడ్చేప్పుడు చూసినవారు కూడా బొక్కబోర్లా పడ్డారు. ఆమె ఊగడం చూసి తన్మయత్వంతో వారూ ఊగిపోయారు. ఆమె మాటలకు పొర్లు దండాలు పెట్టేశారు. ఏకంగా జాతరనే ఏర్పాటు చేశారు. తరువాత ఏం జరిగింది ? తెలుసుకోవాలంటే చదవండి..

దేవతగా చెప్పుకుంది..
తొర్రెం లలిత.. ఊరు ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలం నందిగాం....ఇంటి పట్టున ఉండి ఉన్న పనేదో చేసుకోవాల్సిన లలితలో ఉన్నట్టుండి కొత్త ఆలోచన వచ్చింది...అంతే వన్ ఫైన్ మార్నింగ్ ఈ లేడి పూనకంతో ఊగిపోయింది. తనను తాను దేవతగా చెప్పుకుని..తనకు అతీత శక్తులున్నాయని ప్రచారం చేసుకుంది. ఇంకేముంది..అమాయకులు..అజ్ఞానులైన ఊళ్లో జనం కాస్త లలిత మాటలకు పడిపోయారు. ఆమె చెప్పిందే నిజమనుకున్నారు అంతే ఇక అప్పటి నుంచి ఆమె చెప్పిన మాటలు వింటూ ఆమె చెప్పినట్లుగా ఊహించుకుని తన్మయంతో ఊగిపోయారు. తనకు గుడి కట్టి దైవంగా కొలవాలని చెప్పుకొస్తే సై అన్నారు. అందరి సమస్యలు పరిష్కరిస్తానంటే బొక్కబోర్లా పడి పొర్లు దండాలు పెట్టేశారు. పూజలు చేయకపోతే ఊరికి అరిష్టమంటే భయంతో వణికిపోయారు. నువ్వే కాపాడాలంటూ ఆమె చుట్టూ చేరిన అమాయకులు తాళం కొట్టారు.

పోలీసుల వార్నింగ్...
ఈ విషయం కాస్త వ్యాపించింది. ఇలా పోలీసు స్టేషన్ దాకా చేరింది...లలితమ్మను స్టేషన్‌కు పిలిపించి..ఇలాంటి పిట్టకథలు చెబితే ఊచలు లెక్కించాల్సి వస్తుందని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు...ఆ తర్వాత గ్రామస్థులకు కౌన్సిలింగ్ చేశారు...లలిత చెప్పినట్లు చేయకపోతే ఊరికి అరిష్టమని భయపడ్డ పల్లెవాసులు ఆమెకు జామీను ఇచ్చి మళ్లీ ఊళ్లోకి తెచ్చుకున్నారు.

మోసం బయటపడింది..
కార్తీక పౌర్ణమికి ఒక్కరోజు ముందు పెళ్లిని తలపించేలా ఊరిజనం భారీ ఏర్పాట్లు చేశారు. డప్పు వాయిద్యాలు, మేళ తాళాలతో ఆమెను వేడుకగా తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం 6 గంటలకు అన్ని సిద్ధం చేశారు. లలిత విశ్వరూపం చూసేందుకు పొరుగు ఊళ్ల నుంచి తరలివచ్చారు. అప్పటివరకు పూనకంతో ఊగిపోయిన లలితకు ఒళ్లు నొప్పులొచ్చాయో లేక ఆయాసం వచ్చిందో ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోయింది. మోసాన్ని పసిగట్టిన స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. తిట్లదండకం మొదలెట్టారు. దేవత పేరుతో తమను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవకాశం ఇస్తే చాలు టాలెంట్ చూపించే లలిత లాంటివారెందరో ఉన్నారు... ఊళ్లను మింగేస్తారు..ఊరిని కబ్జా చేస్తారు..తమ గుప్పిట్లో పెట్టుకుని అమాయకులను దోచేస్తారు... సో..తస్మాత్ జాగ్రత్తా...

18:33 - November 26, 2015

హైదరాబాద్ : అనేక దొంగతనాలు, మర్డర్లు చేసిన ఓ దొంగ మనిషిగా మారాడు... గౌరవంగా బతకాలనుకున్న అతనిచేత టీ స్టాల్‌ పెట్టించారు పోలీసులు.. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌కుచెందిన సుంకరి ప్రసాద్‌ రెడ్డి డబ్బుకోసం 120 దొంగతనాలు, 20 హత్యలు చేశాడు. వరుసగా జైలు శిక్ష అనుభవించాడు. చర్లపల్లి జైలుకు వచ్చాక అతని ఆలోచనల్లో మార్పుకోసం పోలీసులు ప్రయత్నించారు. కౌన్సిలింగ్‌ ఇచ్చి కష్టపడి బతకాలని సూచించారు. పోలీసుల మాటలతో ప్రసాద్‌ రెడ్డి మారిపోయాడు. రంగారెడ్డి జిల్లా ఎల్‌బీ నగర్‌ రింగు రోడ్డు సమీపంలో అతనిచేత టీ స్టాల్‌ పెట్టించారు పోలీసులు. ఈ స్టాల్‌ను డిప్యూటీ సీపీ నవీన్‌ కుమార్‌ ప్రారంభించారు.

18:31 - November 26, 2015

కడప : ఒక ఊరిలో భూమి కుంగిపోయింది.. అదేదో మామూలు సమస్య అనుకున్నారు. మరికొన్ని రోజులు గడిచేలోపే మరో మూడు నాలుగు గ్రామాల్లో అలాగే జరిగింది. ఒక్కోచోట పది అడుగుల నుంచి 20, 30 అడుగుల దాకా పుడమి కుంగిపోయింది. ప్రజలకు ఆ వైపరీత్యాలకుగల కారణం తెలియట్లేదు. ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయో అన్న భయంతో కంటిమీద కునుకు ఉండట్లేదు. కొద్ది రోజుల క్రితం కడప జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో ఈ సమస్య మొదలైంది. చింతకొమ్మదిన్నె మండలంలోని పెద్ద ముసల్‌రెడ్డిపల్లె, నాయనోరిపల్లె, నాగిరెడ్డిపల్లె, బలిజపల్లె గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది. పెద్ద ముసల్‌రెడ్డిపల్లె సమీపంలో కిలోమీటరు మేర రెండు అడుగుల లోతు, అంతేమేర వెడల్పుతో భూమి చీలిపోయింది. అంతేకాదు వాగుల్లో కూడా భూమి కుంగిపోవటంతో పెద్దపెద్ద సుడిగుండాలు ఏర్పడ్డాయి. నాయనోరి పల్లెలో భూమి కుంగిపోవడంతో వాటర్‌ ట్యాంక్, పాఠశాల ప్రహరీ గోడ, ఓ చెట్టు ఆ గోతిలోకి కూరుకుపోయాయి.

నాగిరెడ్డి పల్లెలో 20 చోట్ల గోతులు..
నాగిరెడ్డిపల్లె సమీపంలో సుమారు 20 చోట్ల గోతులు పడ్డాయి. భూమి లోపల లైమ్‌ స్టోన్ పొరల్లో నీరు భారీగా చేరటంతో ఆ పొరలు సర్దుకోవడంవల్ల ఇలా జరుగుతోందని భూగర్భ శాస్త్ర నిపుణులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇళ్లు కూలి మరణాలు సంభవించే ప్రమాదముందని అధికారులు నాయనోరిపల్లె గ్రామాన్ని ఖాళీ చేయించారు. మిగిలిన గ్రామాల ప్రజలనూ ఇళ్లు ఖాళీ చేయాలని సూచిస్తున్నారు. ప్రజలు మాత్రం భూములు, ఆస్తులు వదలివెళ్లాలంటే ఇష్టపడటంలేదు.

ఎక్కడకు వెళ్లాలి..?
ఉన్నట్లుండి తమను గ్రామం విడచి వెళ్లమంటే ఎక్కడకి వెళ్లాలని వారు ప్రశ్నిస్తున్నారు. తమ పశువులు, గొర్రెలు ఎక్కడ ఉంచాలి... వాటికి మేత ఎక్కడ నుండి తీసుకురావాలనేది తెలీక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మొండికేసి స్వగ్రామంలోనే ఉంటే ప్రమాదం ఏమైనా ముంచుకొస్తుందేమోనని భయపడుతున్నారు. ప్రభుత్వమే ఏదైనా పునరావాసం కల్పిస్తే ప్రజలు గ్రామాలను ఖాళీ చేసే అవకాశముంటుంది. ఏ సహాయ సహకారాలు లేకండా వందలాదిమంది హుటాహుటిన గ్రామం విడిచి వెళ్లడం సాధ్యమయ్యేపనికాదన్నది అందరి అభిప్రాయం.   

18:28 - November 26, 2015

తూర్పు గోదావరి : జిల్లాలో నిరుపేదలకు రేషన్ కష్టాలు వచ్చిపడ్డాయి. ఈ పాస్‌లో రేషన్ పంపిణీ చేయడంతో వేలిముద్రలు పడక నానా తంటాలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 10వేల మందికి రేషన్ పంపిణీ చేయకపోవడంతో నిరుపేదలు ఆకలి కేకలు వేస్తున్నారు. ముఖ్యంగా వృద్దుల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. తూర్పు గోదావరి జిల్లాలో రేషన్ షాపుల్లో ఎదుర్కొంటున్న ఈ పాస్ కష్టాలపై ప్రత్యేక కథనం..

పలువురికి శాపం..
తూర్పు గోదావరి జిల్లాలో ఈ పోస్ ద్వారా వేలిముద్రలతో రేషన్ పంపిణీ విజయవంతంగా నడుస్తున్నా వేల మంది నిరు పేదలు, వృద్దుల పాలిట శాపంగా మారింది. వేలిముద్రలు వేసేటప్పుడు ఈ పోస్ మిషన్ లకు సిగ్నల్స్ లేకపోవడం , వేలిముద్రలు సరిగ్గా పడకపోవడంతో దాదాపు జిల్లాలో 10వేల మందికి పైనే రేషన్ సరుకుల సరఫరా జరగలేదు. ఈ 10వేల మందిలో దాదాపుగా 3వేల మంది వృద్దులు, వికలాంగులు మంచంపైనే కదలలేని స్థితిలో ఉన్నారు. వీరుకాక మిగిలిన వారికి వేలిముద్రలు నమోదు కాకపోవడంతో రేషన్ సరుకులు ఇవ్వలేదు.

బియ్యం అందక నిరుపేదల ఆకలి కేకలు..
వాస్తవానికి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా లక్షకు పైనే ఆదార్ కార్డులు సస్పెండ్ అయ్యాయి. వీటిని మళ్ళీ నమోదు చేయాల్సి ఉంది. ఆధార్‌ను మళ్ళీ నమోదు చేసుకుంటే పాత ఆధార్ నంబర్ మళ్ళీ కొనసాగుతుంది. ఆ నంబర్ నుంచి ఈ పోస్ ద్వారా రేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాని ఈ పనులన్నీ చేయాల్సిన మండల స్థాయి పౌర సరఫరాల అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తుండటంతో ఆ భారం నిరుపేదలపై పడుతోంది. ప్రతినెల ఈ పోస్ లో రేషన్ రాని నిరుపేదలు, వృద్దులు నానా కష్టాలు పడి కలెక్టర్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ కి వచ్చి తమ గోడు చెప్పుకుంటున్నారు. మళ్ళీ అక్కడ నుంచి సివిల్ సప్లయ్ అధికారుల దగ్గరకు పంపిస్తున్నారు. మళ్ళీ వాళ్ళు మండల స్థాయి అధికారుల దగ్గరకు పంపడంతో అన్ని చోట్లకు తిరిగి రేషన్ తీసుకోవడానికి వెళ్ళే సమయానికి రేషన్ వచ్చే గడువు అయిపోయిందని డీలర్లు చెప్పడంతో ఆ నెలలో బియ్యం అందక ఆకలి కేకలు వేస్తున్నారు. ఎన్నిసార్లు తమ సమస్యను చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని, ఆఫీసుల చుట్టూ తిరగలేకపోతున్నామని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కష్టాలు దూరం చేయాలంటున్న పేదలు...
నాణ్యత లేని మిషన్లు వాడుతూ లబ్దిదారులను నానా కష్టాల పాలు చేస్తున్నారని సీపీఎం నేతలు మండిపడుతున్నారు. కిందిస్థాయి అధికారులు అవినీతి కూడా రేషన్ సరుకులు అందకపోవడానికి కారణమని ఆరోపిస్తున్నారు. సివిల్ సప్లయ్ అధికారులు మాత్రం సమస్య ఉన్నా అందరికీ రేషన్ అందిస్తున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం అందరికీ రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని చెప్తున్నా అధికారుల నిర్లక్ష్యం నిరుపేదలు, వృద్దులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పటికైనా అధికారులు జిల్లాలో రేషన్ అందక అనేక ఇబ్బందులు పడుతున్న పేదలకు రేషన్ ఇవ్వాలని, ఈ పోస్ మెషన్లనూ సరి చేయాలని జనం కోరుతున్నారు.

18:23 - November 26, 2015

ఢిల్లీ : యూపీఏ హయాంలో ప్రజాభిప్రాయానికి వ్యతిరకేంగా ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగిందని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. ఆయన గురువారం లోక్ సభలో మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించొద్దని అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కూడా యూపీఏ పాలకులు పరిగణలోకి తీసుకోలేదని లోక్‌సభలో ఆయన మండిపడ్డారు. ఎన్డీయే హయాంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినా ఎక్కడా సమస్యలు రాలేదన్నారు. కానీ ఏపీ, తెలంగాణలో సమస్యలు తలెత్తడానికి యూపీఏ తప్పుడు విధానాలే కారణమని రామ్మోహన్‌నాయుడు విమర్శిస్తున్నారు. 

18:11 - November 26, 2015

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో అంగన్ వాడీలు చేపడుతున్న పోరాటానికి ఏపీ సర్కార్ తలవంచింది. జీతాల పెంపు చేస్తూ వెలువడిన జీవో అమలు చేయాలని గత కొన్ని రోజులుగా అంగన్ వాడీలు ఆందోళన చేపడుతున్నారు. గురువారం ప్రభుత్వం ఆఘమేఘాల మీద వారి జీతభత్యాల పెంపుకు సర్కార్ ఒకే చెప్పింది. ఈమేరకు యనమల నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో త్వరలోనే జీవో విడుదల కానుంది. మరోవైపు దీనిపై ఎలాంటి ఆందోళనలు చెందాల్సినవసరం లేదని, ఆందోళనలు చేపట్టి ఇబ్బందులు కలిగించవద్దని యనమల సూచించారు.

ఆగస్టు 6న నిర్ణయం...
ఇటీవల ఏపీ రాష్ట్రంలో వేతనాలు పెంచాలని అంగన్ వాడీలు పోరాటం చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఆగస్టు 6వ తేదీన వేతనాలు పెంచుతున్నట్లు జీవో జారీ చేసింది. అంగన్ వాడీలకు రూ. 4200 నుండి రూ. 7,100కు, హెల్పర్స్ కు రూ.2,000 నుండి రూ.4,600 పెంచుతున్నట్లు జీవోలో పేర్కొంది. కానీ వేతనాలు పెంచకపోవడం వల్ల అంగన్ వాడీలు మళ్లీ పోరాటానికి దిగారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. మూడు కేబినెట్ సమావేశాలు జరిగినా ఇంతవరకు అంగన్ వాడీల జీతభత్యాలపై స్పందించలేదని విమర్శలు గుప్పించారు. అంగన్ వాడీలు చేపట్టిన దీక్షలను బుధవారం పోలీసులు భగ్నం చేశారు. దీనికి నిరసనగా అంగన్ శాడీలు శుక్రవారం కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. దీనిపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారా ? లేక జీతభత్యాల పెంపు నిర్ణయం తీసుకున్నారా ? అనేది తెలియరాలేదు. మరోవైపు కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం మాత్రం యదావిధిగా కొనసాగుతుందని తెలుస్తోంది. 

ఏపీలో అంగన్ వాడీ జీతభత్యాల పెంపుకు ఒకే..

విజయవాడ : అంగన్ వాడీ జీతభత్యాల పెంపునకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఈమేరకు యనమల నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం ఆమోదం తెలిపింది. అంగన్ వాడీల జీతాలు పెంచాలని, త్వరలో జీవో విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీలు ఆందోళన చెందాల్సినవసరం లేదని, ఆందోళనలు చేపట్టి ఇబ్బందులు కలిగించవద్దని యనమల సూచించారు. 

ఇసుక పాలసీ శ్వేతపత్రం అసత్యం - వాసిరెడ్డి..

విజయవాడ : ఇసుక పాలసీపై విడుదల చేసిన శ్వేతపత్రం అసత్యం అని వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఇసుక మాఫియాలో రూ. వందల కోట్ల అవినీతి జరుగుతోందని తెలిపారు. 

 

ముగిసిన రెండో రోజు ఆట..

హైదరాబాద్ : భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య జరగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్ లో 173 పరుగులకు భారత్ ఆలౌట్ అయ్యింది. 310 పరుగుల లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా తడబాటుకు గురైంది. 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

గురజాడ వర్ధంతి సందర్భంగా సామూహిక గీతాలాపన...

విశాఖపట్టణం : గురజాడ శత వర్ధంతి సందర్భంగా ఆర్ కే బీచ్ లో ఘనంగా సామూహిక గీతాలాపన జరిగింది. దేశమును ప్రేమించుమన్న గీతాన్ని విద్యార్థులు ఆలపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యువరాజ్, ఏయూ వీసీ రాజు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా గురజాడ మునిమనువడు రవీంద్ర హాజరయ్యారు. 29,30వ తేదీల్లో గురజాడ ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.

17:17 - November 26, 2015

ఢిల్లీ : రాజ్యాంగాన్ని అందించిన రోజు ప్రమాణం చేయడం ఎంతో సంతోషం కలుగ చేసిందని ఎంపీ పసునూరి దయాకర్ రావు పేర్కొన్నారు. గురువారం ఆయన లోక్ సభలో ఎంపీగా తెలుగులో ప్రమాణం చేశారు. ఈసందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. తన మీద నమ్మకంతో ఎంపీ అభ్యర్థిగా నియమించినందుకు అలాగే భారీ మెజార్టీతో తనను గెలిపించినందుకు వరంగల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ కు వరంగల్ ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. ఎంపీగా ప్రమాణం చేయడాన్ని జీవితంలో మరిచిపోలేనన్నారు. పార్లమెంట్ లో తాను అడుగు పెడుతానని ఊహించలేదని, కేసీఆర్ చేసే అభివృద్ధి పనులు తన గెలుపుకు కారణమన్నారు. ప్రజల సమస్యల పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుందని, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. కేంద్ర పరిధిలో ఉన్న అంశాలను పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఖాళీ సమయంలో కళలు చేస్తానని ఎంపీ పసునూరి తెలిపారు. 

17:13 - November 26, 2015

రంగారెడ్డి : జిల్లాలోని కోకాపేటలో రాక్ వెల్ ఇంటర్నేషనల్ పాఠశాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని, తమ బిడ్డలకు మంచి చదువు కావాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారని తెలిపారు. తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు వస్తుందని, రాక్ వెల్స్ సంస్థ జూబ్లిహిల్స్ లో ఆరుగు విద్యార్థులతో మొదలై 500 మంది విద్యార్థులకు చేరుకుందని తెలిపారు. రాక్ వెల్స్ సంస్థలను అభినందిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 182 పాయింట్లు లాభపడి 25,958 సూచీ వద్ద అదేవిధంగా నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 7,883 సూచీ వద్ద ముగిసింది. 

నవంబర్ 30 వరకు పీటర్ సీబీఐ కస్టడీ..

ఢిల్లీ : పీటర్ ముఖర్జీ సీబీఐ కస్టడీకి సీబీఐ ప్రత్యేక కోర్టు అప్పగించింది. నవంబర్ 30వరకు కస్టడీ కొనసాగనున్నట్లు కోర్టు పేర్కొంది. 

విభజన కోరుకోలేదు - ఎంపీ రామ్మోహన్ నాయుడు..

ఢిల్లీ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని తాము కోరలేదని, గత ప్రభుత్వం విభజించిందని టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. లోక్ సభలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాడ్డాయని, ఆ మూడు రాష్ట్రాల్లో రాని సమస్యలు ఏపీలో వస్తున్నాయని తెలింపారు. ఇందుకు యూపీఏ అనాలోచిత నిర్ణయాలే కారణమని, ఈ వ్యవహారంపై కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు.

త్వరలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు - సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రానున్నాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని వెల్లడించారు. కోకాపేటలో రాక్ వెల్ ఇంటర్నేషనల్ పాఠశాల ప్రారంభోత్సవంలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు యూనివర్సిటీలు ముందుకు రావాలని సూచించారు. 

 

నాగ్ పూర్ లో భారత్ స్పిన్ మాయాజాలం..

నాగ్ పూర్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ స్పిన్నర్లు విజృంభిస్తున్నారు. 310 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించడానికి సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆరంభించింది. జట్టు స్కోరు 17 పరుగుల వద్ద వాన్ జిల్ (5) అను అశ్విన్ పెవిలియన్ పంపించాడు. అనంతరం వచ్చిన తాహిర్ ఎక్కువ సేపు కుదురుకోలేదు. మిశ్రా బౌలింగ్ లో తాహిర్ (8) ఎల్ బి డబ్ల్యూ అయ్యాడు. ప్రస్తుతం ఎల్గర్ 10, ఆమ్లా 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

తిరుపతిలో ఎయిర్ పోర్టులో వైసీపీ..అధికారుల వివాదం..

చిత్తూరు : రేణిగుంట విమానాశ్రయం నూతన టర్మినల్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హంగామా సృష్టించారు. వైఎస్ జగన్ రాక సందర్భంగా బోర్డింగ్ పాస్ ల గురించి ఎయిర్ పోర్టు సిబ్బందితో నేతలు గొడవకు దిగారు. ఎయిర్ పోర్టు మేనేజర్ పై దాడికి యత్నించారు. 

సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్...29/1..

నాగ్ పూర్ : భారత్ నిర్ధేషించిన 310 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఆటను ఆరంభించింది. జట్టు స్కోరు 17 పరుగుల వద్ద ఉన్నప్పుడు వాన్ జిల్ (5) ను అశ్విన్ పెవిలియన్ పంపించాడు. ప్రస్తుతం ఎల్గర్ 10, తాహిర్ 8లు క్రీజులో ఉన్నారు. 

16:34 - November 26, 2015

గుంటూరు : పత్తి తూకంలో ఎలాంటి మోసాలకు పాల్పడవద్దని..పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో అధికారులు దాడులు చేసిన సమయంలో మోసాలు గుర్తించినట్లు తెలిపారు. విత్తన చట్టంలో మార్పులు తెస్తామని, సీసీఐ నిబంధనల ప్రకారం కొనుగోళ్లు జరపాలని సూచించారు. 

16:30 - November 26, 2015

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ సంస్థల ఆస్తుల విక్రయాలలో ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఆస్తుల క్రయ విక్రయాల విషయంలో సీ1 సంస్థ మధ్యవర్తిగా ఉన్న సంగతి తెలిసిందే. 0.2 కమిషన్ తక్కువ అవుతుందని సంస్థ వ్యాఖ్యానించడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్ తక్కువ అనుకుంటే తప్పుకోవాలంటూ సూచనలు చేసింది. గురువారం అగ్రిగోల్డ్ సంస్థల విక్రయాల కేసు హైకోర్టులో విచారణ జరిగింది. ఆస్తుల క్రయ విక్రయాల్లో 0.2 కమిషన్ తక్కువ అవుతుందని, 0.5 శాతం ఇవ్వాలని కోర్టుకు సీ1 సంస్థ తెలిపింది. దీనిపై కోర్టు అభ్యంతరం తెలిపింది. అగ్రిగోల్డ్ సంస్థల్లో ఉన్న డబ్బు పేదలు..బడుగు..బలహీన వర్గాల వారిదని, అంతమొత్తంలో కమిషన్ చెల్లించలేమని స్పష్టం చేసింది. కమిషన్ విషయంలో ఏదైనా అభ్యంతరాలుంటే తప్పుకోవాలని సూచనలు చేసింది. ఏదైమైనా ఉంటే స్పష్టంగా చెప్పాలని, బాధితులకు త్వరగా న్యాయం జరగాలంటే నిర్ణయం తొందరగా చెప్పాలని సూచించింది. దీనితో తమకు గడువు కావాలని సీ1 సంస్థ కోరింది. దీనితో కోర్టు విచారణనను సోమవారానికి వాయిదా వేసింది. 

16:18 - November 26, 2015

నాగ్ పూర్ : భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రసపట్టుగా మారింది. దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే 310 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన భారత్ 173 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తాహీర్ విజృంభించడంతో భారత్ బ్యాట్ మెన్స్ వరుసగా క్యూ కట్టారు. గురువారం సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఆటను ఆరంభించింది. కానీ 79 పరుగలకే ఆలౌట్ అయ్యింది. అశ్విన్ స్పిన్ మాయాజాలం..జడేజాలు రాణించడంతో సఫారీ బ్యాట్ మెన్స్ పరుగులు రాబట్టలేకపోయారు. డుమిని (35) ఒక్కటే అత్యధిక స్కోరర్ గా మిగిలాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్ విజయ్ (5) వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన పుజారా..ఓపెనర్ ధావన్ లు వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడడం మొదలు పెట్టారు. సింగిల్స్...అదుపు తప్పిన బాల్స్ ను బౌండరీలకు తరలించారు. జట్టు స్కోరు 52 పరుగుల వద్ద పుజారా (31) పెవిలియన్ చేరాడు. అనంతరం ధావన్ కు కోహ్లీ జత కలిశాడు. ధావన్ స్కోరు బోర్డును పరుగెత్తించాలని ప్రయత్నించాడు. కానీ తాహీర్ బౌలింగ్ లో షాట్ కు ప్రయత్నించిన ధావన్ (39) విలాస్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ విజృంభిస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. కేవలం 16 పరుగులు చేసిన కోహ్లీ తాహీర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. అనంతరం ఇతర బ్యాట్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. చివరకు 173 పరుగుల వద్ద భారత్ ఆలౌట్ అయ్యింది.

భారత్ తొలి ఇన్నింగ్స్ : 215 ఆలౌట్..
సౌతాఫ్రికా బౌలింగ్ : హర్మర్ 4 వికెట్లు, మోర్కెల్ 3 వికెట్లు, రబడా ఒక వికెట్, ఎల్గర్ ఒక వికెట్, తాహిర్ ఒక వికెట్ తీశారు.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : 79 ఆలౌట్..
భారత్ బౌలింగ్ : అశ్విన్ ఐదు వికెట్లు, జడేజా నాలుగు, మిశ్రా ఒక వికెట్ తీశారు.
భారత్ రెండో ఇన్నింగ్స్ : 173 ఆలౌట్
సౌతాఫ్రికా బౌలింగ్ : తాహిర్ ఐదు వికెట్లు, మోర్కెల్ మూడు వికెట్లు, హర్మర్ ఒక వికెట్, డుమిని ఒక వికెట్ తీశారు. 

అగ్రిగోల్డ్ సోమవారానికి వాయిదా..

హైదరాబాద్ : హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరిగింది. శ్రీవన్ సంస్థకు సంబంధించిన కమిషన్ 0.2 చేయకుంటే తప్పుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమకు సమయం కోవాలని శ్రీవాస్ సంస్థ కోరడంతో సోమవారానికి వాయిదా వేసింది. 

ఎంపీ రామ్మోహన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన జితేందర్..

ఢిల్లీ : తెలంగాణ ఏర్పాటు తప్పిదమని టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు సభలో పేర్కొనడాన్ని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి తప్పుబట్టారు. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ఏర్పడిందని, తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టడం రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని తెలిపారు. ఎర్రన్నాయుడు ఆధ్వర్యంలో కమిటీ 2008లో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని, 2009లో టిడిపి - టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుందని గుర్తు చేశారు. 

16:03 - November 26, 2015

హైదరాబాద్ : తెలంగాణలో వినాయక విగ్రహాల ఎత్తు తగ్గింపుపై హైకోర్టు లో విచారణ జరిగింది. విగ్రహాల ఎత్తు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎత్తు అనే అంశం చాలా సున్నితమైన అంశమని ఈ విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టలేమని తేల్చిచెప్పింది. దీనిపై కోర్టు వాదనలు విన్నది. భాగ్యనగర ఉత్సవ కమిటీ, మండపాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

 

15:56 - November 26, 2015

పాట్నా : ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడానికి బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నడుం బిగించారు. అందులో భాగంగా రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. మద్యపానం వల్ల మహిళలే ఇబ్బందులు పడుతున్నారని అందుకే తాను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఏప్రిల్ 1, 2016 నుండి ఈ విధానం అమల్లోకి రానున్నట్లు, ఈమేరకు సీఎం నితీష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోసారి అధికారం ఇస్తే రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేస్తామని గత జులైలో నితీష్ మహిళలకు హామీనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఎన్నికల్లో మహా కూటమి విజయం సాధించడం..నితీష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గుజరాత్, నాగాలాండ్, మణిపూర్, జైపూర్, లక్షద్వీప్ లలో మద్య నిషేధం అమల్లో ఉంది. 

భారత్ 173 ఆలౌట్..

నాగ్ పూర్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ రెండో ఇన్నింగ్స్ లో 173 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే 310 పరుగులు చేయాల్సి ఉంటుంది. 

భారత్ 167/8...

నాగ్ పూర్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ రెండో ఇన్నింగ్స్ లో 167 పరుగులకుఏ ఎనిమిది వికెట్లు కోల్పోయింది.

 

15:32 - November 26, 2015

ఢిల్లీ : డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 125వ జయంతితో పాటు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లోక్ సభలో సమావేశాలను స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రారంభించారు. ఈసందర్భంగా అధికార, విపక్ష సభ్యులు మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చర్చలో పాల్గొన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్ లో క్రమశిక్షణ ఉందని సోనియా వ్యాఖ్యానించినప్పుడు సభలో నవ్వులు వెల్లివిరిశాయి. అంబేద్కర్ అత్యంత ప్రభావంతుడని, ఆయన గొప్పదనాన్ని గుర్తించి కాంగ్రెస్ ప్రోత్సాహించిందన్నారు. రాజ్యాంగ సభలో ఆయనకు సముచిత స్థానం కల్పించినట్లు చెప్పుకొచ్చారు. 

15:20 - November 26, 2015

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో బీసీ జనగణన పూర్తయ్యింది. సేకరణను సక్రమంగా చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. జనగణన లిస్టుకు సంబంధించిన విషయాలను ఆయన టెన్ టివికి తెలిపారు. మొత్తం 26.22 బీసీలున్నట్లు తేల్చారు. పలు కార్యాయాలు..ఆర్డీఓ కార్యాలయాల్లో బీసీ జనగణన లిస్టులు ఉంచినట్లు తెలిపారు. ఇందులో అభ్యంతరాలు ఏవైనా ఉంటే దరఖాస్తులు చేయాలని సూచించారు. ఏ రోజుకా రోజు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఓటర్ లిస్టు ప్రకారం సర్వే చేయడం జరిగిందని, ప్రజల నుండి సూచనలు, సలహాలు తీసుకుంటామని, లెక్కలో 26.22 వచ్చినా రిజర్వేషన్ లో మాత్రం 33 శాతం తప్పకుండా ఉంటుందని ఎలాంటి ఆందోళనలు చెందాల్సినవసరం లేదన్నారు. 

అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్టు..

చిత్తూరు : నలుగురు అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు మురుగన్, బబ్లూ, సతీష్ కుమార్, రాజేంద్రపై పీడీ యాక్టు నమోదు చేశారు. వీరిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఒక్కొక్కరిపై 20 నుండి 25 ఎర్రంచందనం కేసులున్నాయి. 

అంబేద్కర్ కు సముచిత స్థానం - సోనియా..

ఢిల్లీ : రాజ్యాంగ సభలో అంబేద్కర్ కు సముచిత స్థానం కల్పించామని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అత్యంత ప్రతిభావంతుడని, ఆయన గొప్పదనాన్ని గుర్తించి కాంగ్రెస్‌ ఆయనను ప్రొత్సహించిందన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125వ జయంతితో పాటు రాజ్యాంగ దినోత్సవాన్ని పురష్కరించుకుని రెండు రోజుల ప్రత్యేక సమావేశాలను లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ గురువారం పార్లమెంట్‌లో ప్రారంభించారు. లౌకిక సామ్యవాద అనే పదాల ప్రస్తావన సందర్భంగా వాడి వేడి చర్చ జరిగింది.

ఇండియా 128/6..

నాగ్ పూర్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. విజయ్ (5), ధావన్ (39), పుజారా (31), కోహ్లీ (16), రహానే (9), సాహా (7), శర్మ 6, జడేజా 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో తాహిర్ నాలుగు, డుమిని, మోర్కెల్ చెరో ఒక వికెట్ తీశారు. 

ఇసుక అమ్మకాల ద్వారా రూ.821.21 కోట్ల ఆదాయం - బాబు..

విజయవాడ : ఇసుక అమ్మకం ద్వారా రూ.821.21 కోట్ల ఆదాయం ఇసుక రీచ్ ల ద్వారా సమకూరిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇసుక విధానంపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. అత్యధికంగా తూ.గో జిల్లాలో రూ.143 కోట్ల ఆదాయం సమకూరిందని, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో రూ.12.79 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కోటి 37 లక్షల 89 వేల మందికి ఇసుక విక్రయాలు, 4,013 స్వయం సహాయక సంఘాలు ఇసుక రీచ్ ను నిర్వహించాయన్నారు. ఇప్పటి వరకు నాలుగు వేల మంది గ్రూపులకు ఉపాధి చూపడం జరిగిందని, 2.82 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.

టిడిపిలో చేరే తేదీ ప్రకటిస్తాం - ఆనం..

నెల్లూరు : కార్యకర్తలు, అనుచరులతో మాట్లాడి మూడు రోజుల్లో టిడిపిలో చేరే తేదీని నిర్ణయిస్తామని ఆనం రాం నారాయణరెడ్డి వెల్లడించారు. ఏ బాధ్యతలు అప్పగించినా జిల్లా అభివృద్ధి కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు, ఇప్పటికే చంద్రబాబుతో సంప్రదింపులు జరిపామని, పీసీసీ అధ్యక్షుడు రఘువీరాతో మాట్లాడి పార్టీ మారాల్సిన అంశంపై వివరిస్తామని తెలిపారు. మంత్రి నారాయణతో తమకెలాంటి విబేధాలు లేవని, రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారడంతోనే కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ఆనం వెల్లడించారు. 

గడ్కరితో సుజనా..ఎంపీ కేశినేని నాని భేటీ..

ఢిల్లీ : కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితీన్ గడ్కరిని కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ కేశినేని కలిశారు. ఏపీకి రావాల్సిన జాతీయ రహదారులు, పోర్టులపై చర్చించినట్లు, వరదలతో దెబ్బతిన్న రహదారులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని కోరినట్లు తెలిపారు. వాన్ పిక్ పోర్టు నిర్వాహణ బాధ్యత కేంద్రమే చేపట్టాలని, ఇందుకు సంబంధించిన ఓ కమిటీని వేస్తామని గడ్కరీ తెలిపినట్లు పేర్కొన్నారు. విజయవాడలో దుర్గగుడి ఫ్లై ఓవర్ శంకుస్థాపనకు గడ్కరిని ఆహ్వానించడం జరిగిందన్నారు. 

14:39 - November 26, 2015

హైదరాబాద్ : లక్షల ఏళ్ల నాటి డైనోసార్‌ దంతాలను చూడొచ్చు. సముద్రంలో లభించే అరుదైన ఆల్చిప్పలను పరిశీలించవచ్చు. ఆకాశంపై నుంచి పడిన గ్రహ శకలాలను కూడా తనవి తీరా తిలకించవచ్చు. దేశ, విదేశాల్లోని అరుదైన ఖనిజాలను భూగర్భంలోని శిలాజాలను ఒక్కచోటే చూడొచ్చు. ఈ ఛాన్స్ ఇప్పుడు హైదరాబాద్‌ వాసులకు దక్కింది. ఓయూలో ఏర్పాటుచేసిన మినరల్స్ ఎగ్జిబిషన్‌ అందరినీ ఆకర్షిస్తోంది. తెలంగాణ శాస్త్ర సాంకేతిక మండలి , ఉస్మానియా సైన్స్ కళాశాల సంయుక్తంగా ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నాయి. 105 రకాల ఖనిజాలు, 11 రకాల శిలాజాలు ఈ ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉన్నాయి.

గ్రహ శకలం హైలెట్..
రష్యా నుంచి సేకరించిన గ్రహశకలం ఎగ్జిబిషన్‌లో హైలెట్‌గా నిలుస్తోంది. వివిధ రకాల ముడి ఖనిజాలతో పాటు గృహోపకరణాల తయారీలో ఉపయోగించే ఖనిజాలను కూడా ఎగ్జిబిషన్‌లో ఉన్నాయి. జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్, చైనా, సౌత్ ఆఫ్రికా, జపాన్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో లభించే అరుదైన ఖనిజాలను తీసుకొచ్చారు. లక్షల సంవత్సరాల నాటి డైనోసార్ దంతం, గుడ్లు, ఎముకలు, దంతాలు, సముద్రంలో లభించే అరుదైన ఆల్చిప్పలు సైతం ప్రదర్శనలో ఉంచారు.

ఫసియుద్దీన్ మక్కీ కృషి..
ఎగ్జిబిషన్‌ ఏర్పాటుకు పుణెకు చెందిన ఫసియుద్దీన్‌ మక్కీ తీవ్రంగా కృషి చేశారు. అరుదైన ఖనిజాలు, శిలాజాలను సేకరించడమంటే మక్కీకి చాలా ఇంట్రెస్ట్. ఈ ఆసక్తితోనే వివిధ దేశాలు తిరిగి ఖనిజాలు సేకరించారాయన. నిత్యజీవితంలో వినియోగించే వస్తువులకు ఉపయోగించే ముడి ఖనిజాలు, పదార్థాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు మక్కీ చెబుతున్నారు. ఈ ప్రదర్శనను తిలకించడానికి ఆయా పాఠశాలల విద్యార్థులు క్యూ కడుతున్నారు. ఈ నెల 28 వరకు మినరల్స్ అండ్‌ ఫాజిల్స్ ఎగ్జిబిషన్‌ జరుగుతుంది. 

14:34 - November 26, 2015

హైదరాబాద్ : స్వచ్ఛ హైదరాబాద్‌ను సక్సెస్‌ చేసేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్‌లు రచిస్తోంది. అవార్డులిచ్చి అందరినీ భాగస్వాములు చేయాలని భావిస్తోంది. నగరంలోని రోడ్లపైనా కార్పొరేషన్‌ దృష్టిసారించింది. పనుల్లో నాణ్యత ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. పారిశుధ్యంలో మెరుగైన సేవలు అందించడంతో పాటు ఇతరులకు ఆదర్శంగా నిలిచిన వారిని గుర్తించి స్వచ్ఛ ఛాంపియన్‌లుగా గుర్తించాలని కార్పొరేషన్‌ అధికారులు నిర్ణయించారు. స్వచ్ఛ హైదరాబాద్‌ కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తున్న కాలనీలు, బస్తీలతో పాటు కార్మికులు..అధికారులకు అవార్డులు ప్రదానం చేయాలని జీహెచ్‌ఎమ్‌సీ భావిస్తోంది. ప్రజల భాగస్వామ్యం లేకుండా స్వచ్ఛ హైదరాబాద్‌ను సక్సెస్‌ చేయడం అసాధ్యమని గ్రహించిన..జీహెచ్‌ఎమ్‌సీ...నగర పౌరులను కూడా పాలుపంచుకునేలా ప్రణాళికలు తయారుచేస్తోంది.

నగరంలో 4,380 గుంతలు...
మరోపక్క గ్రేటర్‌ పరిధిలో ఉన్న గుంతల లెక్కను అధికారులు తేల్చారు. నగరంలోని 4,380 గుంతలను గుర్తించారు. గుంతలతో పాటు దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలో సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లను రీకార్పెటింగ్‌ చేస్తున్నారు.

పనుల్లో నాణ్యతపై దృష్టిసారించిన జీహెచ్‌ఎమ్‌సీ..
కార్పొరేషన్‌ పరిధిలో జరుగుతున్న పనుల్లో నాణ్యత లోపిస్తోందన్న ఆరోపణలపై జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు దృష్టిసారించారు. పనులపై క్వాలిటీ కంట్రోల్‌ విభాగంతో పాటు థర్డ్ పార్టీ సంస్థల ద్వారా పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నారు. మరింత జవాబుదారీ తనాన్ని పెంచడానికి ఆయా ప్రాంతాల్లో జరిగే పనుల పర్యవేక్షణకు బస్తీ..కాలనీ సంక్షేమ సంఘాలను భాగస్వాములను చేయాలని నిర్ణయించారు.

14:29 - November 26, 2015

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో ఇసుక రీచ్ లపై సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. గతంలో విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబు మాట్లాడారు. ఇసుక అమ్మకాల ద్వారా రూ.821.21 కోట్ల ఆదాయం సమకూరిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అత్యధికంగా తూ.గో జిల్లాలో రూ.143 కోట్ల ఆదాయం సమకూరిందని, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో రూ.12.79 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కోటి 37 లక్షల 89 వేల మందికి ఇసుక విక్రయాలు, 4,013 స్వయం సహాయక సంఘాలు ఇసుక రీచ్ ను నిర్వహించాయన్నారు. ఇప్పటి వరకు నాలుగు వేల మంది గ్రూపులకు ఉపాధి చూపడం జరిగిందని, 2.82 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.

రీచ్ లలో సీసీ కెమెరాలు...
రీచ్ లలలో సీసీ కెమెరాలు, ఇసుక వాహనాల్లో జీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు బాబు పేర్కొన్నారు. 2015 నవంబర్ నాటికి రాష్ట్రంలో 387 ఇసుక రీచ్ లున్నాయని, 1,37,89,000 వేల మందికి ఇసుక విక్రయాలు చేయడం జరిగిందన్నారు. అన్ని జిల్లాల్లోని రీచ్ లలో తవ్వకాలు తెలుసుకొనేందుకు విజయవాడలో కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు, ఇసుకరీచ్ లను మహిళా సంఘాలకు అప్పగించడం వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా వచ్చాయన్నారు. లాభ నష్టాలను ప్రజల ముందుంచి ఇసుక రీచ్ లపై వారి ఫీడ్ బ్యాక్ తెలుసుకోవాన్నదే తన ప్రయత్నమన్నారు. రాష్ట్రంలో ఇసుక అవసరాలు విపరీతంగా ఉన్నాయని, ప్రభుత్వం వైపు నుండి చాలా డిమాండ్ ఉందన్నారు. ఇసుక విధానంప.ఐ రాష్ట్ర ప్రజానీకంలో చర్చ జరగాల్సి ఉందని, ఏది ఉత్తమమైన విధానమో ప్రజల నుండి తెలుసుకుని దానినే అనుసరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ తెలుసుకొనేందుకు కాల్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు, ముగ్గురితో మంత్రివర్గ ఉపసంఘం నియమిస్తున్నట్లు తెలిపారు. అధికారులు..అనధికారులు..ఎవరి పరిధుల్లో వారుండాలని వనజాక్షి ఘటనపై బాబు స్పందించారు. ఇసుక మాఫియాను ఉపేక్షించేది లేదని, టిడిపి శ్రేణులు తప్పులు చేసినా ఉపేక్షించి లేదని హెచ్చరించారు. ప్రజల ఫీడ్ బ్యాక్ ఆధారంగా జనవరి 1 నుండి కొత్త ఇసుక విధానం తీసుకొస్తామన్నారు. ఉద్యోగులంతా విజయవాడకు రావాల్సిందేనని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడ నుండి పూర్తిస్థాయి పాలన సాగనున్నట్లు తెలిపారు. 

 

14:22 - November 26, 2015

ఢిల్లీ : రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ సర్కారు అన్ని దినపత్రికలకు ప్రకటనలు జారీ చేసింది. కాగా ఈ ప్రకటనల్లో ప్రచురించిన రాజ్యాంగ పీఠికలో సెక్యులర్‌, సోషలిస్ట్‌ పదాలను తొలగించారు. దీంతో వివాదం చెలరేగింది. దీన్ని గుర్తించిన సీఎం కేజ్రీవాల్‌ విచారణకు ఆదేశించారు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన పని కాదని సంజాయిషీ ఇచ్చారు.

 

14:21 - November 26, 2015

ఢిల్లీ : లోక్‌సభలో రాజ్యాంగంపై జరిగిన చర్చ క్రమంగా వివాదాలకు దారితీస్తోంది. విదేశీయులు వేధిస్తున్నా ఆందోళనలు జరుగుతున్నా... దేశంలో అసహనం పెరిగిపోయిందంటూ అంబేద్కర్ దేశం విడిచి వెళ్తాననలేదని రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. అంబేద్కర్ గురించి మాట్లాడుతూ అసహనంపై హోంమంత్రి రాజ్‌నాథ్‌ ఈ అనవసర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా అమిర్‌ఖాన్‌ని విమర్శించడానికి ప్రయత్నించారు.
ఖర్గే ఆగ్రహం...
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఇక్కడివాడేనని...ఆర్యులుగా మీరే బయటనుంచి వచ్చారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

14:20 - November 26, 2015

ఢిల్లీ : రాజ్యాంగ పీఠికలోని లౌకిక, సామ్యవాద పదాలు దేశ రాజకీయాల్లో చాలా సార్లు దుర్వినియోగ పరిచేందుకే వాడారని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి మాట్లాడారు. తొలుత రూపొందించిన రాజ్యాంగ పీఠికలో సోషలిస్టు, సెక్యులర్‌ రెండు పదాలు లేవని ఈ సందర్భంగా రాజ్ నాథ్‌ వ్యాఖ్యానించారు.  

భారత్ 97/3

నాగ్ పూర్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ రెండో ఇన్నింగ్స్ లో ధావన్ (39) వికెట్ కోల్పోయింది. అంతకు ముందు సౌతాఫ్రికా 79 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 

వన్డే సిరీస్ కు పాక్ గ్రీన్ సిగ్నల్ ?

ఢిల్లీ : భారత్, పాక్ వన్డే సిరీస్ కు పాక్ క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీలంకలో మ్యాచ్ లు ఆడేందుకు పాక్ ప్రధాని అంగీకరించారు. ఈ మేరకు అనుమతినిస్తూ పీసీబీకి నవాజ్ షరీఫ్ లేఖ రాశారు. శ్రీలంకలో డిసెంబర్ లో భారత్ - పాక్ ఐదు వన్డేలు ఆడనుంది. అధికారిక ప్రకటనే తరువాయి. 

నెల్లూరు, రాయలసీమలో పాఠశాలలు తనిఖీలు చేయాలి - గంటా...

విజయవాడ : వరదల దృష్ట్యా నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పాఠశాలలు తనిఖీలు చేయాలని మంత్రి గంటా శ్రీనివాస రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల భవనాలు పాడైతే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు. 

ప్రజల భావ స్వేచ్ఛను హరిస్తున్నాయి - శైలజనాథ్...

హైదరాబాద్ : బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజల భావ స్వేచ్ఛను హరిస్తున్నాయని మాజీ మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగ దినోత్సవం జరుపడం దారుణమని, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ భావాన్ని బీజేపీ దేశద్రోహంగా చిత్రీకరిస్తోందన్నారు. తాను పార్టీ మారుతానని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. చివరి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. 

డ్యాన్స్ బార్లు తెరవాలని సుప్రీం ఆదేశాలు..

ఢిల్లీ : డ్యాన్స్ బార్లు తెరవాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో అనుమతి ప్రక్రియ ప్రారంభించాలని నోటీసులో పేర్కొంది. 

బీహార్ లో సంపూర్ణ మద్య నిషేధం..

బీహార్ : రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధానికి నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఎప్రిల్ 1 నుండి అమల్లోకి రానుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నితీష్ కుమార్ నిలబెట్టుకున్నారు.

 

 

13:25 - November 26, 2015

హైదరాబాద్ : తెలుగు భాషకు మద్రాసు హైకోర్టులో న్యాయం దొరికింది. 30 వేలమంది విద్యార్థులు వీధిన పడకుండా న్యాయస్థానం ఆపన్నహస్తం అందించింది. తమిళనాడులోని వేలాదిమంది మైనారిటీ భాషల విద్యార్థులకు మద్రాసు కోర్టులో ఊరట లభించింది. నిర్బంధ తమిళంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలుగు, ఉర్దూ, కన్నడ, మళయాళ విద్యార్థులకు మద్రాసు కోర్టు చల్లని కబురు అందించింది.

మైనారిటీ భాషల విద్యార్థులకు మద్రాసు హైకోర్టు బాసట....

ఇన్నాళ్లు చదివిన తెలుగు భాష దూరమవుతుందనే భయంతో గత కొన్ని నెలలుగా విద్యార్థులు బిక్కు బిక్కు మంటూ బడులకు వెళుతున్నారు. ఇక తెలుగులో పరీక్షలు రాయలేము అంటూ దిగులు పడ్డ తెలుగు తదితర మైనారిటీ భాషల విద్యార్థులకు మద్రాసు హైకోర్టు బాసటగా నిలిచింది. నిర్బంధ తమిళం అమలులో ప్రభుత్వ పక్షపాత వైఖరి వల్ల మైనారిటీ భాషల విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నారని లింగ్విస్టిక్‌ మైనారిటీ ఫోరం మద్రాసు హైకోర్టుకు ఎక్కింది. దీంతో ఈ విషయంపై విచారించిన ప్రధాన న్యాయమూర్తితో కూడిన డివిజనల్‌ బెంచ్‌ తమిళనాడు ప్రభుత్వంపై మండిపడింది.

విద్యార్థులంతా తమిళంలో పరీక్షలు రాయాలని...

నిర్బంధ తమిళం అమలులో లోపాలు ఉన్నాయని నిర్లక్ష్యం కారణంగా వేలాదిమంది మైనారిటీ భాషల విద్యార్థులు నష్టపోతున్నారని గ్రహించిన న్యాయమూర్తులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు తమ మాతృభాషలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు హఠాత్తుగా తమిళంలో పరీక్షలు రాయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించడం చట్టవిరుద్ధమని తేల్చేసింది.

ఈ ఏడాది తెలుగులోనే పరీక్షలు రాసే వీలు కల్పించాలని కోర్టు ఆదేశం....

తద్వారా ఈ ఏడాది మైనారిటీ భాషలకు చెందిన విద్యార్థులు తమ భాషల్లోనే పరీక్షలు రాసేందుకు వీలు కల్పించాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వమే ఈ ఏడాది మైనారిటీ భాషల విద్యార్థులు తమ మాతృభాషలోనే పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లను ప్రభుత్వమే చేయాలని సూచించింది. వచ్చే ఏడాది నిర్బంధ తమిళం అమలుకు సంబంధించి కొత్తగా పూర్తి వివరాలతో మరో పిటీషన్‌ దాఖలు చేసుకోవచ్చని మైనారిటీ భాషల ఫోరంకు హైకోర్టు సలహా ఇచ్చింది. దీంతో తమిళనాట ఉన్న తెలుగువారంతా ఆనందం వ్యక్తం చేశారు. అయితే తమిళనాడులోని తెలుగువారంతా ఏకం కావాలని, ఏకతాటిపై నిలవాలని లింగ్విస్టిక్‌ మైనారిటీ ఫోరం ఛైర్మన్‌, అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సీఎంకే రెడ్డి అభిప్రాయపడ్డారు.ప్రధానంగా తమిళనాడు వ్యాప్తంగా 17వేల మంది తెలుగు విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలు తమ మాతృభాషలోనే రాసే అవకాశం దక్కనుంది. తమ పోరాటానికి న్యాయం దొరికినా అది రేపటి తరాలకు అందేలా పోరాడేందుకు సిద్ధమవుతున్నామని తెలుగుసంఘాలు తెలిపాయి.

13:18 - November 26, 2015

కృష్ణా : బెజవాడ మెట్రో ప్రాజెక్ట్‌ పరుగులు పెడుతోంది. తొలిదశ పనులు పూర్తిచేయటానికి అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్‌ ప్రభుత్వాన్నీ పరుగులెత్తిస్తోంది. భూసేకరణ కోసం మరికొంత మొత్తంలో డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇదే సమయంలో మెట్రో పనులు జరగాల్సిన ప్రదేశంలో అనేక అడ్డంకులు ఉన్నాయి. వాటిని ఏఎంఆర్ సీ ఏ విధంగా తొలగించుకుని ముందుకు సాగుతుందనేది చర్చనీయాంశంగా ఉంది.

పనులు వేగవంతం...

విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్ పనులు వేగమందుకుంటున్నాయి. 2018 జూన్‌ లోగా తొలిదశ మెట్రో ప్రాజెక్ట్ పనులు పూర్తి కావాల్సి ఉంది. అందుకు అవసరమైన పనులను ఏఎంఆర్సీ ముమ్మరం చేస్తోంది. కారిడార్-2కు సంబంధించిన నిర్మాణ రంగ పనులను 2016 జనవరిలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌ ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం డీఎంఆర్సీ టెండర్లు కూడా పిలిచింది. టెండర్లకు దేశీయ కాంట్రాక్ట్ సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయి. డిసెంబర్‌7న ఈ టెండర్లను ఖరారు చేస్తారు. ఆ తర్వాత పనులు ప్రారంభమవుతాయి.

కోచ్‌ డిపోను నిడమానూరు దగ్గర....

కారిడార్-2లో భాగంగా మెట్రో ప్రాజెక్ట్‌కు అతి ముఖ్యమైన కోచ్‌ డిపోను నిడమానూరు దగ్గర ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. మొత్తం అరవైరెండున్నర ఎకరాలలో కోచ్ డిపో నిర్మాణం జరగాల్సి ఉంది. ఇందుకు అవసరమైన ప్రాంతాన్ని ఇప్పటికే డీఎంఆర్సీ గుర్తించింది. ఆ భూమిని తమకు అప్పగించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. దీనికి కలెక్టర్‌ బాబు సానుకూలంగా స్పందిస్తూ 20 మంది సర్వే సిబ్బందిని నియమించి నాలుగు రోజుల్లో సర్వే కార్యక్రమాలు పూర్తిచేయించారు. ఈ భూమిని సేకరించి ఇచ్చేందుకు 500 కోట్ల రూపాయలు డిపాజిట్‌ చేయాలని కలెక్టర్‌ బాబు ఏఎంఆర్సీకి లేఖ రాశారు. భూ సేకరణకు నోటిఫికేషన్‌ సిద్ధం చేస్తున్నామని డబ్బు డిపాజిట్ చేయగానే సేకరణ కార్యక్రమం ప్రారంభిస్తామని ఆయన వారికి తెలియచేశారు.

ఈ ఏడాది బడ్జెట్‌లో 282 కోట్ల రూపాయలు ....

ప్రభుత్వం మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో 282 కోట్ల రూపాయలు కేటాయించింది. భూ సేకరణకు ఇంకా 220 కోట్లు అవసరవుతున్నందున ఏపి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శికి ఈ నెల 19న ఏఎంఆర్సీ ఎండీ ఒక లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక శాఖతో మాట్లాడి భూ సేకరణకు అవసరమైన మిగిలిన నిధుల విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలని కోరారు. మార్చిలోగా నిధుల కేటాయింపు జరిగేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డిపోకు అవసరమైన భూసేకరణకు సంబంధించి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అయితే ప్రాజెక్ట్‌ నిర్మాణ ప్రదేశంలో పలు అడ్డంకులున్నాయి. పిల్లర్లు వేసి ట్రాక్‌ నిర్మించే ప్రధాన రెండు మార్గాల్లో భూసేకరణకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. గతంలో కారల్‌మార్క్స్‌ రోడ్‌, ఎంజి రోడ్డు ఇరుకుగా ఉండగా వాటిని విస్తరించేందుకే అధికారులు ముప్పతిప్పలు పడ్డారు. అవే రోడ్లను మళ్లీ విస్తరించాలంటే స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముంది. ఈ అడ్డంకులతోబాటు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. మరి మెట్రో పనులకు నిధులు త్వరితగతిన అందుతాయా లేదా.? పనులు వేగంగా కొనసాగుతాయా అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది.

13:11 - November 26, 2015

హైదరాబాద్ : హ‌స్తం సైకిలెక్కుతుందా ..?ఉప్పు నిప్పులు భాయ్ భాయ్ అంటాయా ..?తెలంగాణ రాజ‌కీయ ముఖ‌చిత్రంపై స‌రికొత్త పొత్తు పొడుపులుంటాయా..? టీడీపీతో పొత్తు కోసం కాంగ్రెస్ ఆరాటం...మొన్న గుత్తా .. నేడు జానా, భ‌ట్టి .. కాంగ్రెస్ నేత‌ల వ‌రుస‌ కామెంట్స్‌తో స‌ర్వత్రా ఆస‌క్తి నెలకొంది.
ఎన్నిక‌ల స‌మ‌యంలో చ‌ర్చకు వ‌చ్చే అంశం....
రాజ‌కీయ పార్టీల మ‌ధ్య పొత్తుల అంశం ఎన్నిక‌ల స‌మ‌యంలో చ‌ర్చకు వ‌చ్చే అంశం. కానీ తెలంగాణ‌లో అందుకు భిన్నమైన వాతావ‌ర‌ణం క‌న్పిస్తోంది. అధికార టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు స‌ర్వశ‌క్తులు ఒడ్డిన కాంగ్రెస్ .. వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ఇక త‌మ ఒక్కరమే.. గులాబీ బాస్‌ను ఎదుర్కోవ‌డం సాధ్యం కాద‌ని డిసైడ్ అయిన‌ట్లు క‌న్పిస్తోంది. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత‌ల కామెంట్లే ఇందుకు బ‌లం చేకూరుస్తున్నాయి.

త‌మ‌తో క‌లిసొచ్చే పార్టీల‌తో క‌లిసి న‌డ‌వాల‌ని.....

ఇక రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ‌తో క‌లిసొచ్చే పార్టీల‌తో క‌లిసి న‌డ‌వాల‌ని కాంగ్రెస్ నిర్ణయించిన‌ట్లు క‌న్పిస్తోంది. అందుకే తెలంగాణ‌లో బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉన్న టీడీపీపై హ‌స్తం నేత‌ల క‌న్నుప‌డ్డట్లు తెలుస్తోంది. అందుకే టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్దమ‌నే సంకేతాలు ఇచ్చారు ఆ పార్టీ ఎంపి గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి. గుత్తా కామెంట్ రాజ‌కీయ వ‌ర్గాల్లో కొంత ఆస‌క్తి రేపినా. .. వ‌రుస‌గా పార్టీ ముఖ్యనేత‌లు దానికి బ‌లం చేకూర్చేలా మాట్లాడుతున్నారు. గుత్తా కామెంట్‌పై త‌న‌దైన‌శైలిలో స్పందించిన సీఎల్పీనేత జానారెడ్డి రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్యమేన‌ని స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు దానిపై అధికారికంగా మాట్లాడ‌క‌పోయినా .. భ‌విష్యత్తులో రాజ‌కీయ పార్టీల మ‌ధ్య అప్పటి రాజ‌కీయ అవ‌స‌రాల‌క‌నుగుణంగా పొత్తులుంటాయ‌ని చెప్పుకొచ్చారు.

లౌకిక వాదంతో ముందుకెళ్లే ఏ పార్టీతోనైనా....

ఇక ఇదే అంశంపై పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క సైతం స్పందించారు. లౌకిక వాదంతో ముందుకెళ్లే ఏ పార్టీతోనైనా కలిసి నడిచేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు అంశంపై పార్టీ అంత‌ర్గతంగా చ‌ర్చించి నిర్ణయం తీసుకుంటామ‌ని భట్టి చెప్పారు.

పొత్తుపై కాంగ్రెస్ నేత‌లు వ‌రుస ప్రతిపాదన‌లు తెస్తున్నా...

పొత్తుపై కాంగ్రెస్ నేత‌లు వ‌రుస ప్రతిపాదన‌లు తెస్తున్నా .. టీడీపీ నుంచి మాత్రం ఇప్పటి వ‌ర‌కూ ఎలాంటి స్పంద‌నా లేదు. ఒక వేళ టీడీపీ కూడా హ‌స్తంతో క‌లిసి న‌డిచేందుకు సిద్దమైతే .. అది ప్రస్తుత లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల నుంచే ఉంటుందా .. లేక గ్రేట‌ర్ ఎన్నిక‌ల నుంచి ఉంటుందా అనే చ‌ర్చ స‌ర్వత్రా ఆస‌క్తి రేపుతోంది.

దార్శనికుడు అంబేద్కర్‌ : స్పీకర్ సుమిత్రా మహాజన్

ఢిల్లీ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌కు పార్లమెంట్ ఘనంగా నివాళులర్పించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే మన రాజ్యాంగ దినోత్సవం కూడా అయిన నేపథ్యంలో జాతికి అంబేద్కర్ అందించిన సేవలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కొనియాడారు. ప్రజలే పునాదిగా వ్యవస్థలను ఏర్పరిచిన దార్శనికుడు అంబేద్కర్‌ అని, సామాజిక సమానత్వానికి ఆయన పెద్దపీట వేశారని అన్నారు. వారి సేవల ఫలితంగానే భారత్ అత్యంత శక్తిమంతమైన ప్రజాస్వామిక దేశంగా ఆవిర్భవించిందన్నారు.

ఈ రోజు ఓ చారిత్రకమైన రోజు: సోనియా గాంధీ

ఢిల్లీ : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌరవార్థం లోక్ సభలో జరుగుతున్న చర్చలో పాల్గొన్న సోనియా గాంధీ మాట్లాడుతూ.. అంబేద్కర్ పూర్తి బాధ్యతతో రాజ్యాంగాన్ని పూర్తి చేశారని తెలిపారు. ఈ రోజు ఓ చారిత్రకమైన రోజు అని కొనియాడారు. ఎన్నో ఆటుపోట్ల మధ్య మన రాజ్యాంగం సంక్రమించిందన్నారు.

12:46 - November 26, 2015

ఢిల్లీ :భారత రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు వెళ్తామని కేంద్ర హోం మంత్రి రాజ్ సింగ్ తెలిపారు. లోక్ సభలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గౌరవార్థం చర్చ జరుగుతోంది. ఈ చర్చలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ...భారత రాజ్యాంగం రూపకల్పనలో అంబేద్కర్ కృషి ఎనలేనిది అని తెలిపారు. అంబేద్కర్ ను దళిత నేత అనడం సంస్కారం కాదన్నారు. అంబేద్కర్ భారతదేశానికి మార్గదర్శి... ఓ రుషి అని కొనియాడారు. అంబేద్కర్ ఆదర్శ సమాజం కోసం కల కన్నారని... సమానత్వం కోసం రిజర్వేషన్లు పరిచయం చేశారన్నారు. సెక్యులర్ అనే పదాన్ని రాజకీయ పార్టీలు స్వార్థం కోసం వాడుకుంటున్నాయని తెలిపారు. దీంతో విపక్షాలు ఒక్కసారిగా ఆందోళనకు దిగాయి. రాజ్యాంగపరమైన అవసరాల కోసమే అంబేద్కర్ రిజర్వేషన్లు ప్రతిపాదించారని... రాజకీలయ కోసం కాదన్నారు. భారత్ లౌకికవాద దేశమని.. ముస్లిం సమాజంలో కంటే ఎక్కువగా 72 శాతం ముస్లింలు భారత్ లో ఉన్నారు. పార్శీలు కూడా ఎక్కువగా ఉన్న దేశం భారత్ అని పేర్కొన్నారు. రాముడ్ని మించిన ప్రజాస్వామ్యం ఎక్కడా లేదన్నారు. భారతదేశంలో పుట్టిన వారంతా భారతీయులేనని.. అంటరాని తనం విడనాడాలని సందేశమిస్తున్నాం తెలిపారు. పారామిలటరీ బలగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు చెప్పారు.

12:37 - November 26, 2015

హైదరాబాద్ : ఆస్థుల అమ్మకాలు ఏమయ్యాయంటే ... అనవసర ప్రచారం వల్ల అమ్ముడుపోవడం లేదంటూ యాజమాన్యం కొత్త ట్విస్ట్‌ ఇచ్చింది. అగ్రిగోల్డ్‌ కేసుపై హైకోర్టు విచారించింది. విచారణను మధ్యాహ్నం రెండుపావుకు వాయిదా వేసింది. ఆస్థులను అమ్మి బాధితులకు చెల్లింపులు చేయాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. ఆ ప్రాసెస్‌ ఎందుకు జరగడం లేదని ప్రశ్నిస్తే.. అగ్రిగోల్డ్‌ యాజమాన్యం వింత సమాధానం ఇచ్చింది. మీడియాలో ప్రచారం వల్లే ఆస్తులు ఎవరూ కొనడం లేదని.. ప్రచారం ఆపాలని ఆదేశాలివ్వాలని కోర్టును కోరింది. జనవరి 1 నుంచి ఆస్తులు వేలం వేయాలని హైకోర్టుకు రిటైర్డ్ జడ్జి సూర్యారావు కమిటీ సూచించింది. మీడియాను నిరోధించాలని హైకోర్టును అగ్రి గోల్డ్ తరపు లాయర్లు కోరగా మీడియాను నిరోధించలేమని కోర్టు తెలిపింది. 

12:34 - November 26, 2015

ఢిల్లీ : వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపిగా ఎన్నికైన పసునూరి దయాకర్ ఇవాళ పార్లమెంట్‌లో ప్రమాణస్వీకారం చేశారు. పసునూరి తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు.

12:33 - November 26, 2015

నిజామాబాద్ : కామారెడ్డి మండలం రామేశ్వర్‌పల్లి బైపాస్‌ రోడ్డు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టావేరా వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని గాంధీకి తరలించారు. హైదరాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే కొడుకు వివాహానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు పోషెట్టి, ఆనంద్‌పటేల్, బోజిరావ్‌ పటేల్‌గా గుర్తించారు.

12:31 - November 26, 2015

హైదరాబాద్ : నాగపూర్ టెస్ట్ రెండోరోజుఆటలోనే టీమిండియా పట్టు బిగించింది. సౌతాఫ్రికాను 79 పరుగులకే ఆలౌట్ చేయడం ద్వారా 137 పరుగుల భారీతొలిఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. టీమిండియా తొలిఇన్నింగ్స్ స్కోరు 215 పరుగులకు సమాధానంగా ఓవర్ నైట్ స్కోరు 2 వికెట్లకు 11 పరుగులతో రెండోరోజుఆట కొనసాగించిన సఫారీటీమ్ ..మొదటి గంటన్నర ఆటలోనే..కుప్పకూలింది. డుమ్నీ ఒక్కడే ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడడంతో సౌతాఫ్రికా కనీసం 79 పరుగులైనా చేయగలిగింది. కెప్టెన్ ఆమ్లా 1, డివిలియర్స్ డకౌట్ కాగా..డూప్లెసీ 10 పరుగుల స్కోరు సాధించాడు. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లు, జడేజా 4 వికెట్లు, మిశ్రా ఒక వికెట్ పడగొట్టారు. రెండోరోజుఆట లంచ్ విరామానికి.. టీమిండియా రెండోఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 5 పరుగుల స్కోరుతో ...141 పరుగుల ఓవరాల్ ఆధిక్యం సంపాదించింది.

లాడ్జిలో టెన్త్ విద్యార్థినితో పోలీసులకు చిక్కిన టీచర్

నల్గొండ : సూర్యాపేటలోని ఓ లాడ్జిలో టెన్త్ క్లాస్ విద్యార్థినితో ఉపాధ్యాయుడు పోలీసులకు చిక్కాడు. పదో తరగతి విద్యార్థినితో ఉపాధ్యాయుడి ప్రేమాయణం నడుపుతూ బుధవారం రాత్రి పోలీసుల తనిఖీల్లో నాగేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు పట్టుబడ్డాడు. కూసుమంచి మండలం నేపల్లి జెడ్పీ హెచ్ ఎస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు.

రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు వెళ్తాం : రాజ్ నాథ్ సింగ్

ఢిల్లీ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గౌరవార్థం లోక్ సభలో చర్చ జరుగుతోంది. ఈ చర్చలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ... రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు వెళ్తామన్నారు. భారత రాజ్యాంగం రూపకల్పనలో అంబేద్కర్ కృషి ఎనలేనిది అని తెలిపారు. అంబేద్కర్ ను దళిత నేత అనడం సంస్కారం కాదన్నారు. అంబేద్కర్ భారతదేశానికి మార్గదర్శి... ఓ రుషి అని కొనియాడారు. అంబేద్కర్ ఆదర్శ సమాజం కోసం కల కన్నారని... సమానత్వం కోసం రిజర్వేషన్లు పరిచయం చేసిందన్నారు.

వాటర్ ట్యాంక్ ఢీకొన్ని విద్యార్థి మృతి

హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ పరిధిలోని కొంపల్లి జాతీయరహదారిపై వాటర్ ట్యాంకు ఢీకొని రాజేష్(21) అనే విద్యార్థి మృతి చెందాడు. స్నేహితునితో కలిసి కొంపల్లిలోని సాయిచైతన్య కళాశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాజేష్ బీకాం సెకండియర్ చదువుతున్నాడు. ఈ ప్రమాదంతో సంఘటనాస్థలంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

షాద్నగర్ లో కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం..

మహబూబ్నగర్ : షాద్నగర్ మండలం చిలకలమర్రి కాటన్ మిల్లులో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై... అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని.. మంటలార్పుతున్నారు. ఈ అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు భద్రత సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.

సెల్ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

మెదక్‌ : రేగోడు మండలం నిరుజప్లలో విఠల్‌ అనే వ్యక్తి తన సెల్‌ఫోన్ చార్జింగ్‌ పెడుతూ మృతి చెందారు. ఈ సంఘటనతో నిరుజప్ల గ్రామంలో విషాదం అలుముకుంది.

పురుగు మందు తాగి దంపతుల ఆత్మహత్య

నెల్లూరు : గూడూరులోని ఇందిరమ్మ కాలనీలో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే దంపతుల ఆత్మహత్యకు కారణమని స్థానికులు చెప్పారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

11:46 - November 26, 2015

ఢిల్లీ : రాజ్యాంగమే మనకు ఆశారేఖ అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంలోని 'హోప్' అనే పదానికి మోదీ సరికొత్త నిర్వచనం ఇచ్చారు. 'హోప్' పదంలో 'హెచ్ అంటే సామరస్యం, ఒ-అవకాశం, పి-ప్రజల భాగస్వామ్యం, ఇ- సమానత్వం' అని వివరించారు. చర్చలు, సంప్రదింపులే పార్లమెంట్‌కు ఆత్మ అని వ్యాఖ్యానించారు.

 

11:45 - November 26, 2015

విజయవాడ: అమరావతి విద్యార్థులకు.. అమెరికాపై ధ్యాస మళ్లింది. ఉన్నత విద్యను విదేశాల్లో పూర్తి చేయాలని తహతహలాడుతున్నారు. నిన్న మొన్నటి దాకా.. పొరుగు పట్టణానికి వెళ్లి చదువుకోవడమే గగనంగా భావించిన ఈ ప్రాంత విద్యార్థులు.. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల వైపు చూస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం.. ఏపీ నుంచి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్న విద్యార్థుల్లో... సింహ భాగం గుంటూరు, కృష్ణాజిల్లాల వారే కావడం విశేషం.

గుంటూరు, కృష్ణా జిల్లా నుంచి విదేశాలకు ఏటా 50వేల విద్యార్థులు........

సాంకేతిక విప్లవం దేశాల మధ్య హద్దులను చెరిపేస్తోంది. ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయిన పరిస్థితుల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు యువత విదేశాలకు పరుగులు తీస్తోంది. ఒకప్పుడు పొరుగు రాష్ట్రం వెళ్లి చదువుకునేందుకూ వెనుకడుగు వేసిన విద్యార్థులు.. ఉన్నత చదువుల కోసం ఇప్పుడు ఖండాలు దాటి వెళుతోంది. ముఖ్యంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో.. విదేశీ విద్య కోసం వెళుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గుంటూరు, కృష్ణాజిల్లాల నుంచే ఏటా 30 నుంచి 50 వేల మంది విద్యార్థులు విదేశాలకు క్యూ కడుతున్నారు.

భారీ వేతనంతో కూడిన ఉద్యోగావకాశాలు...

విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసుకుని వచ్చిన వారికి ఇక్కడ భారీ వేతనంతో కూడిన ఉద్యోగావకాశాలు లభిస్తుండడంతో అమరావతి ప్రాంత విద్యార్థుల్లో.. విదేశీ విద్యపై ఆసక్తి పెరుగుతోంది. ఎంఎస్‌తో పాటు.. తక్కువ వ్యవధిలో పూర్తయ్యే డిప్లొమా కోర్సులపైనా విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. విదేశాల్లో డిప్లొమా కోర్సులు చేసిన వారికీ ఇక్కడ ఉన్నత స్థాయి ఉద్యోగాలు లభిస్తుండడంతో.. విద్యార్థులు పెద్ద సంఖ్యలో విదేశాలకు తరలి వెళుతున్నారు.

అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనెడా, జర్మనీల వర్శిటీలకు డిమాండ్‌....

రాష్ట్రానికి చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో చేరుతుండడంతో... యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, న్యూజిలాండ్, సింగపూర్ వంటి దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఎంఎస్, డిప్లొమా కోర్సులకు డిమాండ్ పెరిగింది. విదేశాల్లో బీటెక్, డిగ్రీ, ఎంబీఏ, అర్హతలతో రెండేళ్ల ఎంఎస్ చదివేందుకు, ఇంటర్మీడియట్ అర్హతతో డిప్లొమా కోర్సుల్లో చేరే వీలుంది. విదేశాల్లో ఎంఎస్, డిప్లొమా కోర్సుల్లో చేరాలంటే అందుకు ఆయా వర్శిటీలు దిగువ కోర్సుల్లో 55 శాతం మార్కులు సాధించాలనే నిబంధన విధించాయి. అయితే అక్కడి విద్యా విధానం అమరావతి విద్యార్థులను అమితంగా ఆకర్షిస్తోంది.

ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జి వర్శిటీలకు డిమాండ్‌........

విదేశాల్లో వందలాది వర్శిటీలు ఉన్నా... కేంబ్రిడ్జ్, ఆక్స్ ఫర్డ్ వంటి విశ్వవిద్యాలయాల్లో సీటు సాధించడం చాలా కష్టం. అక్కడ చదవాలంటే ఏటా లక్షలాది ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. వివిధ దేశాల నుంచి వచ్చే విద్యార్థులకు ఆయా దేశాలు.. ఏటా వివిధ దశల్లో అడ్మిషన్లు కల్పిస్తున్నాయి. యూఎస్ఏలో ఫాల్, స్ర్పింగ్, సమ్మర్ పేర్లతో ఆగస్టు-సెప్టెంబర్, జనవరి-ఫిబ్రవరి, ఏప్రిల్-మే నెలల్లో మూడు విడతల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. జర్మనీలో సెప్టెంబర్-అక్టోబర్, మార్చి-ఏప్రిల్ మధ్య కాలంలో, కెనడా, యూకేలలో జనవరి, మే, సెప్టెంబర్ నెలల్లోనూ, ఆస్ట్రేలియాలో మార్చి, జులై, నవంబర్ నెలల్లోనూ అడ్మిషన్లు ఇస్తున్నాయి. న్యూజిలాండ్ విశ్వవిద్యాలయాలు ప్రతినెలా, సింగపూర్ వర్శిటీలు నిరంతరం అడ్మిషన్లు కల్పిస్తున్నాయి.

ఐ-ఎల్ట్స్‌, టోఫెల్‌, జీఆర్‌ఈ తదితర పరీక్షల్లో అర్హత తప్పనిసరి...

విదేశాల్లో చదవాలన్న ఆశ ఉంటే చాలదు.. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు విద్యార్థులూ కొంత కసరత్తు చేయాల్సి ఉంటుంది. ముందుగా.. విద్యార్థులు.. ఐ-ఎల్ట్స్‌, టోఫెల్‌, జీఆర్‌ఈ లాంటి పరీక్షలు పాస్‌ కావాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగా.. విదేశీ విశ్వవిద్యాలయాల్లో సీట్లు, స్కాలర్‌షిప్పులూ లభిస్తుంటాయి. విద్యార్థి ఈ పరీక్షల్లో సాధించిన స్కోర్‌ ఆధారంగా.. తనకు నచ్చిన.. తనకు సీటు వచ్చే వర్శిటీలను, అక్కడ చేయబోయే కోర్సులనూ ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ కోర్సుల సర్టిఫికెట్ల వివరాలనూ ఆన్‌లైన్‌లో పొందు పరచాలి.

వర్శిటీ అడ్మిషన్‌ లెటర్‌తో ఎంబసీని సంప్రదించాలి.......

దరఖాస్తు పంపిన 10 రోజులకు ఆయా వర్శిటీ పంపే అడ్మిషన్ లెటర్ అందుకుని, సదరు దేశానికి సంబంధించిన ఎంబసీని సంప్రదించి వీసా పొందాలి. యూఎస్ఏ మినహా ఇతర దేశాల ఎంబసీలు విద్యార్థులకు ఇంటర్వ్యూతో పని లేకుండా నేరుగా అడ్మిషన్ కల్పిస్తున్నాయి. అమెరికన్‌ ఎంబసీ అధికారులు మాత్రం.. తమ దేశంలో ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను మౌఖిక ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

వెస్ట్రన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌, యూటీఐల ద్వారానే ఫీజు చెల్లించాలి.........

విదేశీ యూనివర్శిటీల్లో అడ్మిషన్ ఖరారైన తర్వాత.. సదరు వర్శిటీల నిబంధనలకు మేరకు... నిర్దేశిత ఫీజును వెస్ట్రన్ మనీ ట్రాన్స్ ఫర్, యూటీఐ ద్వారా ఆయా వర్శిటీలకు నేరుగా చెల్లించాలి. ప్రతిభావంతులైన విద్యార్థులకు విదేశీ విశ్వ విద్యాలయాలు ఉపకార వేతనాలు మంజూరు చేసి, ప్రోత్సహిస్తున్నాయి. సదరు విశ్వవిద్యాలయానికి విద్యార్థి చెల్లించే ఫీజులో 20 నుంచి 60 శాతం మధ్య ఉపకార వేతనం రూపంలో తిరిగి వస్తుంది. ఎంఎస్ లో చేరిన విద్యార్థులకు బీటెక్, డిగ్రీ కోర్సుల్లో 60 శాతానికి పైగా మార్కులు సాధించి ఉంటే జర్మనీ విశ్వవిద్యాలయాలు ఉచిత విద్యను అందిస్తున్నాయి. విదేశాల్లో ఎంఎస్, డిప్లొమా కోర్సులను అభ్యసిస్తూ విద్యార్థులు పార్ట్-టైం ఉద్యోగం చేసుకునే వీలూ ఉంటుంది.

మార్గదర్శకంగా నిలుస్తోన్న కన్సల్టెన్సీలు....

విదేశాల్లోని ఏ యూనివర్శిటీ మంచిది.. ఎందులో చేరితే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అన్న సందేహం విద్యార్థులను ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. ఇలాంటి వారికి.. ప్రసిద్ధ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీలు చక్కటి మార్గ నిర్దేశాన్ని అందిస్తున్నాయి. విద్యార్థులకు.. విదేశీ విశ్వవిద్యాలయాలకు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తూ.. కన్సల్టెన్సీలు ఉపకరిస్తున్నాయి. అందుకే.. విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించాలని కోరుకునే వారిలో అత్యధికులు.. ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీలపై ఆధారపడుతున్నారు.

గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వందకు పైగా కన్సల్టెన్సీలు....

విదేశాలకు వెళ్లగోరే విద్యార్థుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడంతో... కన్సల్టెన్సీలు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి. గుంటూరు, కృష్ణాజిల్లాల్లోనే ఇప్పుడు వందకు పైగా కన్సల్టెన్సీలు ఉన్నట్లు ఓ అంచనా. దరఖాస్తు చేయడం మొదలు సదరు విశ్వవిద్యాలయంలో చేరే వరకూ ప్రతి అంశాన్ని కన్సల్టెన్సీల నిర్వాహకులే పర్యవేక్షిస్తున్నాయి. ఇందుకు విద్యార్థులు చేయాల్సిందల్లా పేరొందిన కన్సల్టెన్సీని ఎన్నుకోవడమే.

కన్సల్టెన్సీలకు కొంత మొత్తాన్ని చెల్లిస్తున్న విదేశీ వర్శిటీలు.......

ఇండియాలోని కన్సల్టెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకున్న విదేశీ యూనివర్శిటీలు.. విద్యార్థులను చేర్పించినందుకు గాను.. సదరు కన్సల్టెన్సీకి కొంత మొత్తాన్ని చెల్లిస్తాయి. దీంతో ఈ మొత్తానికి ఆశపడి కొన్ని కన్సల్టెన్సీలు విద్యార్థులను రాంగ్‌ వర్శిటీల్లో చేర్చే ప్రమాదమూ ఉంది. అందుకే.. విదేశీ విద్యను అభిలషించే విద్యార్థులు.. కన్సల్టెన్సీల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్‌సైట్‌ల ద్వారా వర్శిటీలు, కోర్సుల వివరాల తనిఖీ తప్పనిసరి...........

విద్యార్థులు.. తాము చేరదలచుకున్న కోర్సు, వర్శిటీ వివరాలను వెబ్‌సైట్‌ల ఆధారంగా క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ ఖర్చుతో.. తక్కువ వ్యవధిలో కోర్సు పూర్తి చేసేందుకు వీలున్న వర్శిటీని ఎంచుకోవడం మంచిదని అంటున్నారు. అటు తల్లిదండ్రులు కూడా.. కోర్సు ఫీజుతో పాటు హాస్టల్ ఖర్చును సైతం ముందే తెలుసుకోవాలని సూచిస్తున్నారు. వర్శిటీలకు చెల్లించాల్సిన ఫీజును.. కన్సల్టెన్సీలకు కాకుండా నేరుగా వర్శిటీకే చెల్లించాలని హెచ్చరిస్తున్నారు. విద్యార్హతలు తెలిపే ధ్రువపత్రాలు సిద్ధం చేసుకుని దరఖాస్తు చేస్తే సీటు పొందడం సులభమవుతుందని అంటున్నారు. 

లోక్ సభలో రాజ్యాంగం పై చర్చ

ఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన వెంటనే వరంగల్ ఎంపిగా గెలిచిన పసునూరి దయాకర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మాజీ సభ్యుల మృతికి లోక్ సభ సంతాపం తెలిపింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గౌరవార్థం లోక్ సభలో రాజ్యాంగం పై చర్చ నడుస్తుంది.

దక్షిణాఫ్రికా అలౌట్

నాగ్‌పూర్: భారత్‌తో ఇక్కడ జరుగుతున్న 3వ టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో 79 పరుగులకే మొత్తం వికెట్లు కోల్పోయి దారుణమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. టెస్టుల్లో భారత్‌పై దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. రెండు వికెట్ల నష్టానికి 11 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టుకు మన బౌలర్లు చుక్కలు చూపించారు. అంతకు ముందు మన జట్టు 215 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించిన సంగతి తెలిసిందే.

స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక లోపం

రంగారెడ్డి : శంషాబాద్‌ విమానాశ్రయంలో స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఈ విమానం ఎయిర్‌పోర్టులోనే నిలిచిపోయింది. ఉదయం 5.40 గంటలకు ముంబయికు బయలుదేరాల్సిన స్పైస్‌జెట్‌ విమానం నిలిచిపోయినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో 180 మంది అధికారులు ఆందోళనలో ఉన్నారు.

 

పసునూరి దయాకర్ ప్రమాణ స్వీకారం

ఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన వెంటనే లోక్ సభలో వరంగల్ ఎంపిగా గెలిచిన టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ప్రమాణ స్వీకారం చేశారు.

పీకల లోతు కష్టాల్లో సఫారీలు

హైదరాబాద్ : భారత్ తో నాగపూర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోతుంది. ఓవర్ నైట్ స్కోరు 11/2 గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీలు 66 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలో పడ్డారు.

భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

మహబూబ్‌నగర్ : తలకొండపల్లి మండలం తడక తండాలో దారుణం జరిగింది. భార్యను గొడ్డలితో నరికి చంపాడు ఓ భర్త. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పాలమూరు జిల్లాలో 10మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

మహబూబ్ నగర్ : పాలమూరు జిల్లాలో పది మంది పేకాట రాయుళ్లను బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలో పేకాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పది మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి 10 సెల్‌ఫోన్‌లు, రూ.లక్షా 80 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు.

'హోప్' పదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన ప్రధాని మోదీ

ఢిల్లీ : రాజ్యాంగంలోని 'హోప్' అనే పదానికి ప్రధాని మోదీ సరికొత్త నిర్వచనం ఇచ్చారు. గురువారం ఢిల్లీలో మీడియా తో మాట్లాడుతూ 'హోప్ ' పదంలో ' హెచ్ అంటే సామరస్యం, ఒ- అవకాశం, పి- ప్రజల భాగస్వామ్యం, ఇ- సమానవత్వం' అని వివరించారు. చర్చలు, సంప్రదింపులే పార్లమెంట్ కు ఆత్మ అని వ్యాఖ్యానించారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఎంపిలు వ్యవహరిస్తారనే విశ్వాసం ఉందన్నారు. నిన్నటి అఖిల పక్ష సమావేశం సామరస్య పూర్వకంగానే జరిగిందని, పార్లమెంట్ సజావుగా సాగాలని అంతా ముక్త కంఠంతో చెప్పారని తెలిపారు.

10:30 - November 26, 2015

హైదరాబాద్ : టర్కీ సైన్యం రష్యా యుద్ధవిమానాన్ని కూల్చివేసిన ఘటనపై రెండు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమ భూభాగంలో ప్రవేశించిన రష్యా యుద్ధవిమాన పైలెట్లకు పలుసార్లు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోవడంతోనే కూల్చివేశామని టర్కీ అధికారులు చెబుతున్నారు. టర్కీ అధికారులు ప్రకటనను రష్యా తప్పుపట్టింది. తమ విమానం టర్కీ భూభాగంలో ప్రవేశించకపోయినా కూల్చివేశారంటూ మండిపడుతోంది.

సిరియా ఉగ్రవాదుల చేతిలో మరణించిన రష్యా పైలట్‌ ....

టర్కీ సైనికలు రష్యా యుద్ధవిమాన్ని కూల్చిన వేసిన ఘటనపై రెండు దేశాల మధ్య తీవ్రరగడ జరుగుతోంది. ఈ ఘటనలో తీవ్రగాయపడిన ఒక పైలట్‌ సిరియా ఉగ్రవాదులకు చిక్కి మరణించాడు. మరో పైలట్‌ ఉగ్రవాదులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. అతను సురక్షితంగా ఉన్నట్టు రష్యా ప్రకటించింది. సిరియా భద్రతా దళాలు రక్షించినట్టు రష్యా రాయబారి అలెగ్జాండర్‌ ఒర్లోవ్‌ చెప్పారు.

తమ భూభాగంలోనే కూల్చివేశాం-టర్కీ

యుద్ధవిమానం కూల్చివేత ఘటనపై రష్యా, టర్కీల మధ్య ఘర్షణకు దారితీస్తోంది. తమ భూభాగంలోకి ప్రవేశించడంతోనే కూల్చివేశామని టర్కీ అధికారులు ప్రకటించడాన్ని రష్యా తప్పుపట్టింది. సిరియా భూభాగంలో ఉండగాలనే కూల్చివేశారంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మండిపడుతున్నారు. వెన్నుపోటుకు పాల్పడిన టర్కీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలకు విఘాతం కలిగించేలా టర్కీ వ్యవహరించింది మండిపడ్డారు. సిరియా భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై తమ విమానం దాడులు చేస్తున్నప్పుడు కూల్చివేయడాన్ని రష్యా తప్పుపట్టింది.

సిరియా అధ్యక్షుడు అసద్‌ను దిగిపొమ్మంటున్న టర్కీ ......

మరోవైపు అమెరికా పర్యటనలో ఉన్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు.. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో చర్చల సందర్భంగా టర్కీలో రష్యా యుద్ధవిమానం కూల్చివేత అంశం ప్రస్తావనకు వచ్చింది. సిరియా అధ్యక్షుడు అసద్‌ అధికారం నుంచి దిగిపోలని టర్కీ కోరుతోంది. కానీ రష్యా మాత్రం అసద్‌కు మద్దతు ఇస్తోంది. రష్యా యుద్ధవిమానం కూల్చివేతకు ఇదో కారణమై ఉండొచ్చన్న అంశం ఒబామా, హోలెండే మధ్య చర్చకు వచ్చింది. ఐఎస్‌ ఉగ్రవాదులను అణచివేసే అంశంపై కూడా ఇద్దరు అధ్యక్షుడు చర్చించారు. ఈ విషయంలో రాజీలేని ధోరణి అవలంభించాలని నిర్ణయించారు. 

10:28 - November 26, 2015

హైదరాబాద్ : కమలంతో దోస్తీకి సైకిల్ కటీప్ చెబుతుందా.. లేక సైకిల్ కు కమలం విడాకులిస్తుందా.. ఇప్పుడు రెండు పార్టీల్లోనూ, పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే చర్చ.. వరంగల్ ఫలితం ప్రభావం చూపబోతుందా.. గ్రేటర్ వరకు కాపురం ఉంటుందా..

2014 ఎన్నికల్లో జత కట్టిన మోదీ, చంద్రబాబు...

మాది అభివృది జోడి అంటూ 2014 ఎన్నికల్లో మోదీ, చంద్రబాబు జత కట్టారు.. ఈ జత కథ.. మనకు సరిపడదంటూ అప్పుడు తెలంగాణలో పది జిల్లాల బిజెపి అధ్యక్షులు వ్యతిరేకించారు.. కానీ పొత్తు ధర్మం పాటించాలి కదా అంటూ నేతలను వెంకయ్యనాయుడు అండ్ టీం బుజ్జగించింది.. ఫలితాలొచ్చాయి.. తెలంగాణకు మద్దతుగా బిల్లుకు మద్దతిచ్చిన కమలానికి తెలంగాణ ఓటరు నీరు పోయలేదు.. దీంతో నీరసించిపోయారు లోటస్ టీం సభ్యులు.. అయితే టీడీపీతో పొత్తు వల్లే గ్రేటర్ లో ఎక్కువ స్థానాలు గెలుచుకున్నామని నేతలు చెప్పుకొచ్చారు.. కానీ వరంగల్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఆ పరిస్థితి కనిపించడం లేదు..

బిజెపికి అయిష్టంగా సీటు వదిలిన టీడీపీ...........

వరంగల్ ఉప ఎన్నికల్లో బిజెపి తరపున దేవయ్య రంగంలోకి దిగారు.. నామినేషన్ల తుది గడవుకు దగ్గర్లో దేవయ్య అభ్యర్థిత్వం ఖరారైంది.. 2014 ఎన్నికల్లోనూ ఈ స్థానం నుంచి బిజెపియే పోటీ చేసింది... అయితే ఈసారి పోటీకి టీడీపీ సిద్దమైంది.. కానీ పొత్తు ధర్మం పాటించాలంటూ టీడీపీ అధినేత పాత సూత్రాన్ని మళ్లీ పాడారు.. దాంతో టీడీపీ నేతలు అయిష్టంగానే బిజెపికి ఈ సీటు వదిలారు.. కానీ ఓటర్లు మాత్రం ఓటు వదల్లేదు.. దీంతో డిపాజిట్ కోల్పోయింది బిజెపి.. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తును గతంలో వ్యతిరేకించిన తెలంగాణ బిజెపి నేతలు వరంగల్ బై ఎలక్షన్ ఓటమికి టీడీపీతో ఉండటమే కారణమంటూ తేల్చేశారు.. టీడీపీ నేతలు అనుకున్నంత స్థాయిలో పనిచేయలేదని కమలం నేతలు మండిపడుతున్నారు.. ఎర్రబెల్లి, రేవంత్ లాంటి నేతల మధ్య సమన్వయ లేమి కొంపతీసిందంటున్నారు..

గ్రేటర్‌లో పొత్తు ఉంటుందా?

ఇప్పుడు అందరి దృష్టి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై.. అంతా సవ్యంగా జరిగితే జనవరి మూడు లేదా నాల్గో వారంలోనే ఎన్నికలు ఉండోచ్చు.. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ బిజెపి పొత్తు ఉంటుందా ఉండదా అనేదే ప్రశ్న.. గ్రేటర్ ఓటర్ల స్వరూపం చూసినప్పుడు.. ఈరెండు పార్టీలు కలిసే పనిచేస్తాయని టీడీపీ నేతలంటున్నారు.. కానీ బిజెపి నేతల్లో ఆ తరహా విశ్వాసం కనిపించడం లేదు.. గ్రేటర్ ఎన్నికల తర్వాతైనా టీడీపీ నుంచి వీడిపోవాలని పార్టీ హైకమాండ్ పై ఒత్తిడి పెరగొచ్చని కొందరు బిజెపి సీనియర్ నేతలంటున్నారు.. ఒక వేళ అదే జరిగితే టీడీపీకి ప్లస్సా లేదా మైనస్సా అనేది గ్రేటర్ ఎన్నికల తర్వాతే చెప్పగలం.. నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక కూడా ముందుంది..

వరంగల్‌ ప్రచారానికి రాని బాబు....

బిజెపికి సీటు వదిలేసినా టీడీపీ నాయకులు పూర్తి స్థాయిలో శ్రద్ద పెట్టలేదనేది వాస్తవం... ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబునాయుడు కనీసం ఒక్కరోజైనా ప్రచారానికి రాలేదు.. మొత్తం తెలంగాణ నేతలపై బాధ్యత పడేశారు.. వైసీపీ కి అంత సీన్ లేకపోయినా జగన్ మూడు రోజులు ప్రచారంలో పాల్గొన్నారని బిజెపి నేతలు గుర్తు చేస్తున్నారు.. రానున్న కాలంలో ఎప్పుడైనా సనత్ నగర్ ఉప ఎన్నిక వస్తుందని.. అప్పుడు బిజెపి నేతల సహకారం లేకుండా టీడీపీ ఎలా పోటీ ఇవ్వగలుగుతుందని గ్రేటర్ బిజెపి నేతలంటున్నారు.. టీడీపీ పూర్తి స్థాయి దృష్టి పెట్టి ఉంటే ఓటమి ఎదురైనా డిపాజిట్ దక్కించుకొని 2 లక్షలకు పైగా ఓట్లు సాధించుకునేవాళ్లమని వరంగల్ నేతలంటున్నారు..  

10:24 - November 26, 2015

అమరావతి : కొత్త రాజధానిలో భూ రాబందులు వాలిపోయాయి. ప్రత్యేకంగా పేదల భూములపైనే వాటి కన్ను పడింది. అందిన అసైన్డ్ భూములను తన్నుకుపోతున్నాయి. లంక భూములను లాగేసుకుంటున్నాయి. ఈ భూ రాబందులు నడిపిస్తున్న దందాకు..అధికారుల అండదండలు కూడా తోడయ్యాయి. దీంతో రిజిస్ట్రేషన్‌ల వ్యవహారంగా తేలిగ్గా జరిగిపోతోంది. ఈ భూ దందా విషయం సర్కార్‌ దృష్టికి వచ్చింది. విచారణ కూడా ప్రారంభమైంది. ఐతే ప్రభుత్వ పెద్దలే ఈ వ్యవహారంలో పాలుపంచుకోవడంతో విచారణ ఎలా సాగుతుందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.

ప్రభుత్వం విచారణ -అధికారుల్లో అలజడి...

అమరావతి పరిధిలో లంక, అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ల శాఖ రిజిస్ట్రేషన్ చేయడం వివాదాస్పదమవుతోంది. రిజిస్ట్రేషన్ల శాఖతో పాటు రెవెన్యూ శాఖ కూడా విచారణకు ఉపక్రమించింది. దీంతో అక్రమ రిజిస్ట్రేషన్లను ప్రోత్సహించిన అధికారుల్లో అలజడి మొదలైంది.

పేదల భూములపై పెద్దల కన్ను..........

లబ్ధిదారులకు అందిన ప్రభుత్వ భూములను కారు చౌకగా చేజిక్కించుకోవడమే..ఈ దందా వెనుక అసలు వ్యూహం. లంక , అసైన్డ్‌ భూములను కొంతమంది బడా బాబులు ఆ విధంగానే తీసుకుంటున్నారు. భయపెట్టో...నచ్చజెప్పో...బలవంతం చేసో...ఏదో విధంగా ఆ భూములను తక్కువ రేటుకే సొంతం చేసుకుంటున్నారు. తమకు ఇవ్వకపోతే ప్రభుత్వమే లాగేసుకుంటుందనే భయాన్ని వారికి కలిగించి...చివరికి తమ దారిలోకి వచ్చేలా ఉచ్చు పన్నుతున్నారు. అలా తీసుకున్న భూములను భూ సేకరణ కింద ప్రభుత్వానికే ఇచ్చి లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ భూములకు రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోతున్నాయి.

భూ దందాపై ఉన్నతాధికారులు సీరియస్‌.....

ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. దీనికి బాధ్యులైన సబ్ రిజిస్ట్రార్లకు సంబంధించి ఆ శాఖ ఐజీ వెంకట్రామిరెడ్డి ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నారు. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ శాఖ నుంచి నివేదిక తెప్పించుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.

భూ దందాపై నిఘా వర్గాల ఆరా....

అమరావతిలో భూ దందాపై నిఘా వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి. ఇప్పటికే ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. ఈ రిజిస్ట్రేషన్ల వ్యవహారాల వెనుక కొంతమంది పెద్దలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ రిజిస్ట్రేషన్లకు నగదు భారీగా చేతులు మారినట్లు వారి పరిశీలనలో వెల్లడైనట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ అధికారి ఒకరు తన ఇంట్లోనే ఈ డాక్యుమెంట్లకు సంబంధించిన కసరత్తును పూర్తిచేసి... కోర్టుకు వెళ్లి ఆ మేరకు రిజిస్ట్రేషన్లకు అనుమతి తెచ్చుకునేలా సలహాను ఇచ్చినట్లు భావిస్తున్నారు. ఇది ఇలా ఉంటే అసైన్డ్‌ భూములు, లంక భూముల రిజిస్ట్రేషన్ల వెనుక టీడీపీకే చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీకే చెందిన పెద్దలు..ఈ వ్యవహారంలో ఉండడంతో విచారణ ఎలా సాగుతుందో అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

10:21 - November 26, 2015

కృష్ణా : మందుబాబులను మద్యం మత్తులో ముంచాలి. దొరికినంత దోచుకోవాలి. అందినకాడికి పిండేయాలి. ఇదే కాన్సెప్ట్‌తో బెజవాడలో మద్యం మాఫియా చెలరేగిపోతోంది. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు మద్యం అమ్ముతూ కోట్ల రూపాయలు దండుకుంటుంది. ముడుపులు, నజరానాలతో పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు కళ్లకు గంతలు కడుతోంది.

మాముళ్ల మత్తులో అధికారులు, పోలీసులు ......

బెజవాడ ఎక్సైజ్‌, పోలీస్‌ అధికారులకు ఈ స్థాయిలో ముడుపులు అందుతున్నాయట. కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు నెలకు అధికారులకు ముట్టజెప్పేది అక్షరాల కోటి 42 లక్షలాట. ఒక్కో వైన్‌ షాప్‌ నుంచి సంబంధిత ఎక్సైజ్‌స్టేషన్‌కు 15 వేలు...ఠాణాకు 14 వేలు . ఇలా ఎక్కడికక్కడ అధికారులు,పోలీసుల చేతులు తడుపుతూ.. కృష్ణా జిల్లాలో మద్యం మాఫియా రెచ్చిపోతున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అధికారులకు లక్షలు గుమ్మరించి... కోట్లు కొట్టేస్తున్నారట. జిల్లాలో 343 వైన్‌ షాపులు, 167 బార్లు ఉన్నాయి. నెలకు సుమారు 110 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు సాగుతున్నాయి.

బాటిళ్లపైనే ఎమ్మార్పీ ధరలు...

ఎమ్మార్పీ అనేది బాటిళ్లపైనే కనిపిస్తాయి. కాని ఎవ్వరూ ఆ ధరకు అమ్మరు. బ్రాండ్‌ ఏదైనా 10 రూపాయలు అదనంగా సమర్పించుకోవాల్సిందే. నెలకు 5 కోట్లకుపైగా అదనపు ఆదాయాన్ని గడిస్తూ మందుబాబుల జేబులకు చిల్లు పెడుతున్నారు. సమయపాలన అస్సలు పాటించరు. అడ్డగోలుగా మద్యం విక్రయాలు సాగిస్తున్నా.. ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు నామమాత్రపు కేసులతో సరిపెడుతున్నారు.

గల్లీకో బెల్ట్‌షాపు.......

కృష్ణా జిల్లాలో బెల్ట్‌ షాపులు కోకొల్లలు. గల్లి గల్లికి వీధి వీధికి దర్శనమిస్తున్నాయి. ప్రతి వైన్ షాప్‌కు అనుబంధంగా 20 నుంచి 50 వరకు బైల్ట్‌షాపులుంటున్నాయి. ఎమ్మార్పీపై 20 నుంచి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. జిల్లా మొత్తంలో 3 వేలకుపైగా బెల్ట్ షాపులున్నాయాంటే... లిక్కర్‌ దందా ఏ స్థాయిలో సాగుతుందో అర్థంచేసుకోవచ్చు. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులపై 418 కేసులు నమోదు చేశారు. లిక్కర్‌ దందాపై మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు పెదవి విరుస్తున్నాయి. బెల్ట్‌ షాపులు లేకుండా చేస్తామన్న సీఎం చంద్రబాబు...ఆ వాగ్దానాన్ని విస్మరించారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బెల్ట్‌ షాపులు తొలగించడంతో పాటు..మద్యం మాఫియాకు అడ్డుకట్ట వేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. 

500గ్రాముల బంగారం పట్టివేత...

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 500 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం కలిగి ఉన్న ప్రయాణికుడిని అధికారులు విచారిస్తున్నారు.

చెట్టును ఢీ కొట్టిన క్వాలీస్ : ఇద్దరుమృతి

నిజామాబాద్‌ : కామారెడ్డి మండలం రామేశ్వరపల్లి దగ్గర వేగంగా వస్తున్న క్వాలీస్‌ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

ముంబై : నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 75 పాయింట్లు లాభపడి 25840.36 పాయింట్ల వద్ద ప్రారంభమైంది, ఇక నిఫ్టీ 20 పాయింట్లతో 7850.20 మార్క్ దాటింది. ప్రపంచ స్టాక్ మార్కెట్ల నుంచి మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లు మాత్రం లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. 

విద్యుత్ షాక్ : ఇద్దరు చిన్నారులు మృతి

ప.గో : దెందులూరు మండలం భోగాపురంలో విషాదం చోటు చేసుకుంది. బైబిల్ స్కూలులో విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

09:23 - November 26, 2015

హైదరాబాద్ : హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారు. సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన పార్టీని వీడనున్న ఆనం బ్రదర్స్ కొత్తగా ‘సైకిల్’ పార్టీలోకి చేరనున్నారట. ఈ మేరకు డిసెంబర్ 5న వీరు టీడీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైందని వార్తలు వస్తున్నాయి. రాంనారాయణ రెడ్డికి ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం, వివేకానందరెడ్డి కుమారుడికి నెల్లూరు రూరల్ నియోజకవర్గబాధ్యతలు అప్పగించేందుకు టిడిపి సుముఖంగా ఉన్నట్లు సమాచారం. దీంతో నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

నేటి నుంచి చిత్తూరు జిల్లాల చంద్రబాబు పర్యటన

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేటి నుంచి రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. రాత్రికి నారావారి పల్లెలో చంద్రబాబు బస చేయనున్నారు. ఈ నెల 27న చంద్రబాబు మనుమడు దేవాన్స్ పెటట్టెంట్రుకల కార్యక్రమంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు పాల్గొనున్నారు.

టిడిపిలో చేరనున్న ఆనం బద్రర్స్

హైదరాబాద్ : నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, వివేకానందరెడ్డి డిసెంబర్ 5వ తేదీన టిడిపిలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే టిడిపి అధిష్టానంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రాంనారాయణ రెడ్డికి ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం, వివేకానందరెడ్డి కుమారుడికి నెల్లూరు రూరల్ నియోజకవర్గబాధ్యతలు అప్పగించేందుకు టిడిపి సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

శంకర్ పల్లిలో దొంగల బీభత్సం

రంగారెడ్డి : శంకర్‌పల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లో తాళాలు పగులగొట్టి 50 తులాల బంగారం దోచుకెళ్లారు. రూ.4 లక్షల నగదును దొంగలు అపహరించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

08:44 - November 26, 2015

హైదరాబాద్: మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్‌ భార్యగా అందరికీ సుపరిచితమైన వ్యక్తి కిరణ్‌ రావు.. ‘నా భార్య.. దేశం వదిలి వెళదామంటోంది’ అంటూ ఇటీవల ఆమీర్‌ చేసిన వ్యాఖ్యలతో అందరి దృష్టి కిరణ్‌రావుపైకి మళ్లింది. కిరణ్‌ రావుకు తెలంగాణతో దగ్గరి బంధమే ఉంది. కిరణ్‌ తాతగారు(తండ్రి వైపు) మహబూబ్‌నగర్‌లోని వనపర్తి రాజవంశీకులు. ఇంజనీరింగ్‌ పట్టభద్రుడైన కిరణ్‌ తండ్రి ఉద్యోగరీత్యా బెంగళూరు, కోల్‌కతా, ముంబైల్లో పనిచేశారు. దీంతో కిరణ్‌ విద్యాభ్యాసం కూడా కోల్‌కతా, ముంబైలలో సాగింది. కోల్‌కతాలోని లొరెటో హౌస్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన కిరణ్‌ ఎకనామిక్స్‌ డిగ్రీని ముంబైలోని సోఫియా కళాశాల నుంచి తీసుకొన్నారు. అనంతరం మాస్‌ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ నుంచి పొందారు. సినీరంగంపై ఉన్న ఆసక్తితో అశుతోష్‌ గోవర్కిర్‌ వద్ద అసిస్టెంట్‌ డైరక్టర్‌గా చేరిన కిరణ్‌ ఆమీర్‌ఖాన్‌ నిర్మించిన లగాన్‌కు పనిచేశారు. ఆ సమయంలో ఆమీర్‌తో ఏర్పడిన పరిచయం వివాహానికి దారితీసింది. 2002లో ఆమీర్‌ తన తొలి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చి కిరణ్‌రావును పెళ్లి చేసుకొన్నారు. వీరికి ఆజాద్‌ అనే బాబు ఉన్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు అబుల్‌ కలాం ఆజాద్‌ పేరు మీదుగా తన కొడుకుకు ఆజాద్‌ అని పేరు పెట్టినట్లు కిరణ్‌ గతంలో ప్రకటించారు. లగాన్‌ తర్వాత గోవర్కిర్‌ వద్ద స్వదేశ్‌ సినిమాకూ కిరణ్‌ అసిస్టెంట్‌గా చేశారు. అనంతరం మీరానాయర్‌ వద్ద మాన్‌సూన్‌ వెడ్డింగ్‌ అనే సినిమాకు అసిస్టెంట్‌గా చేశారు. 2011లో సొంతంగా ఆమీర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ధోబీ ఘాట్‌ అనే సినిమాను స్వీయదర్శకత్వంలో నిర్మించారు. తారే జమీన్‌ పర్‌, జానే తు.. యా జానేనా, తలాష్‌, పీప్‌లీ లైవ్‌, ఢిల్లీ బెల్లీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆమీర్‌ నటించిన దిల్‌ చాహతా హై చిత్రంలో చిన్న పాత్రలో కిరణ్‌రావు కనిపిస్తారు. కిరణ్‌రావు 1973 నవంబరులో బెంగళూరులో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు రావు, ఉమ ప్రస్తుతం బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు. 

08:38 - November 26, 2015

హైదరాబాద్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి... ఈ సమావేశాలకున్న ప్రాధాన్యత ఏమిటి? ఈ సమావేశాల్లో ప్రధానంగా దేశంలో జరుగుతున్న అసహనం అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో దహన్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ తెలిపారు. ఈ దేశంలో ఉన్న భిన్నత్వం ఏ దేశంలో లేదు. ఎవరికైనా వారి భావాలను వ్యక్త పరిచే స్వేచ్ఛ వుండాలి. ... అదే విధంగా ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించాల్సిన బాధ్యత కూడా ఉందని తెలిపారు.ఈ దేశంలో ఉండాల్సిన వాతావరణం ఇదేనా? మధ్యయుగాల కాలానికి దేశం వెళుతోందా? అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై ఎందుకు వివాదం చేస్తున్నారు? భిన్నాభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ లేదా? దేశంలో సామానులు ఎదుర్కొంటున్న మౌలిక అంశాలపై చర్చించకుండా ఇతర అంశాలపై నేతలు ఎందుకు వావాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు? వార్తా ప్రసారాల విషయంలో మీడియా తీరులో మార్పు రావాల్సిన అవసరం ఉందా? రాజకీయ సంస్కృతి మారాలి? పార్లమెంట్ సభ్యులు ఏమి చేస్తున్నారో పౌరులు ప్రశ్నించేతత్వం పెరగాలని నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. మరి పూర్తి విశ్లేషణను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

ట్రాక్టర్ బోల్తా : ఒకరి మృతి

కడప : వేముల మండలం నల్లచెరువుపల్లె దగ్గర ట్రాక్టరు బోల్తా పడి ఒకరు మరణించారు. ఈ ఘటనలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వాసులంతా మొగిలిచెరువు వాసులని పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

చిత్తూరు : తిరుమల లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 3 కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.

07:56 - November 26, 2015

హైదరాబాద్ : విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు మొదలు పెడితే యుద్ధమే వస్తుందని న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. బాక్సైట్ తవ్వకాలను నిలిపేస్తున్నామన్న చంద్రబాబు ఆ మాటకు కట్టబడతాడా? బాక్సైట్ తవ్వకాలపై చంద్రబాబు నాయుడు నటిస్తున్నాడా? వ్యతిరేకత వచ్చిన తరువాత ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని చెప్పడం వెనుక అర్థం ఏమిటి? అసహనం పేరుతో ఎన్డీయే ని అప్రదిష్ట పాలు చేసేందుకేనా? ప్రభుత్వం పై వస్తున్న వ్యతిరేకతను తప్పించుకునేందుకే అమీర్ వ్యాఖ్యలను వివాదాస్పదం చేస్తోందా? అసహనం పై ఇప్పటికైనా ప్రభుత్వా మేల్కోవాల్సిన అవసరం లేదా? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో బిజెపి నేత సాంబమూర్తి, టిడిపి నేత శ్రీరాములు, నరహరి శెట్టి నరసింహరావు కాంగ్రెస్ నేత, సీపీఎం నేత ఎంఏ గఫూర్, వైసీపీ నేత గౌతం రెడ్డి పాల్గొన్నారు. ఈ చర్చలో ఇంకా అనేక అంశాలను నేతలు ప్రస్తావించారు. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

28 నుంచి దక్షిణ కోస్తాలో మళ్లీ భారీ వర్షాలు

విశాఖ : దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో స్థిరంగా ఉన్న ఉపరిత ఆవర్తనం మరింత బలపడి మరో 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయిన భారత వాతావరణ శాఖ అంచానా వేస్తోంది. మంగళవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారం మరింత బలబడింది. ఇది అల్పపీడనంగా మారాకా శుక్రవారం నుంచి తమిళనాడు, పుదుచ్ఛేరి, అండమాన్ లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. రాయలసీమ, కోస్తాలోని ఇతర జిల్లాలపైనా ఈ ప్రభావం ఉండొచ్చని అధికారులు చెపుతున్నారు.

బైక్ ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు : ఒకరు మృతి

కర్నూలు : పాములపాడు మండలం రుద్రవరం వద్ద గురువారం బైక్పై వెళ్తున్న దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మరణించగా... అతడి భార్య తీవ్రంగా గాయపడ్డింది. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆవిడ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

07:04 - November 26, 2015

హైదరాబాద్ : వడ్డీ ఎఎస్సై మోహాన్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తోంది. కేసు కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు చేరింది. ఏసిబి, సిఐడి,ఐటీ అధికారులు దర్యాప్తు స్పీడ్‌ పెంచారు. 40 అకౌంట్లను సీజ్‌ చేసి 30 కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యేల నుంచి సినీ నిర్మాతల వరకు కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నవారిపై దృష్టిసారించారు. పెట్టుబడులు పెట్టిన పోలీస్‌ అధికారులు బండారాన్ని బయటపెట్టేందుకు స్కెచ్‌ గీశారు.

ఏఎస్సై మోహన్‌రెడ్డి వ్యవహారంపై సీరియస్‌...

ఏఎస్సై మోహన్ రెడ్డి అక్రమ వడ్డీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న దర్యాప్తు బృందాలు విచారణ వేగవంతం చేశాయి. నిజా నిజాల నిగ్గుతేల్చేందుకు సీఐడీ, ఏసీబీ, ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. మోహాన్ రెడ్డి ఫైనాన్స్ సంస్థలో బ్లాక్ మనీని పెట్టుబడిగా పెట్టిన 12 మంది పోలీసులపై వేటు వేశారు. మరికొందరు పోలీస్‌ అధికారులకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. వారి ఆస్తుల వివరాలపై కూపీ లాగుతోంది. మరోవైపు సీఐడీ పోలీసులు ఇప్పటికే ఎఎస్పీ జనార్ధన్ రెడ్డిని హైదరాబాద్ సి.ఐ.డి. కార్యాలయంలో విచారించారు. ముగ్గురు డిఎస్పీలపై బదిలీ వేటు వేశారు. ఏఎస్సై మోహన్‌ రెడ్డి అక్రమ దందాతో సంబంధమున్న మరో ఎస్పీ పేరు తెరపైకివచ్చింది.

19 మందికి చెందిన 40 అకౌంట్ల నిలిపివేత...

19 మందికి సంబంధించిన 40 బ్యాంక్‌ అకౌంట్లను నిలిపేసిన సి.ఐ.డి...550 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని క్షుణంగా పరిశీలించి ఆస్తులను అంచనా వేస్తుంది. ఇందులో ఓ ఎమ్మెల్యేకు మూడున్నర కోట్లు ఇచ్చినట్లు తేలడంతో..అతని స్టేట్ మెంట్ రికార్డు చేయాలని నిర్ణయించింది. డ్యాకుమెంట్లను పరిశీలించిన అధికారులు..ఆస్తుల విలువ సుమారు 100 కోట్ల ఉండొచ్చని అంచనా వేసినట్లు సమాచారం.

పాత కేసును తిరగదోడే పనిలో ఏసీబీ....

2006లో 30 వేలు లంచం తీసుకుంటూ మోహాన్ రెడ్డి ఏసిబికి చిక్కిన కేసును...అవినీతి నిరోధక శాఖ తిరగదోడేందుకు సిద్దమైంది. మరోవైపు మోహాన్ రెడ్డి సెల్‌ఫోన్‌ను ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుకు పంపింన సీఐడీ...ఎవరెవరు అధికారులతో లింకులున్నాయో తేల్చేపనిలో పడింది. ఆత్మహత్య చేసుకున్న ప్రసాదరావుతో ఉన్న గొడవలేంటి.. తొలగించిన మెసెజ్‌లు రికవరి చేసి పక్క ఆధారాలతో కేసులు పెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారు. 

07:01 - November 26, 2015

.గో : తణుకులో సంచలనం సృష్టించిన కృపామణి ఆత్మహత్య కేసులో కీలక నిందితుడు గుడాల సాయి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా పోలీసులు ధృవీకరించలేదు.

వ్యభిచారం చేయాలని కూతురిపై ఒత్తిడి....

కన్న తల్లిదండ్రులే సాయి శ్రీనివాస్‌తో వ్యభిచారం చేయాలని గదిలో బంధించి వేదించడంతో కృపామణి గత నెలలో కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే.. ఆత్మహత్యకు ముందు ఆమె తన సెల్‌ఫోన్‌లో తీసిన సెల్ఫీ ఆదారంగా ఆమె తల్లిదండ్రులు, సోదరుడితో పాటు ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడైన రౌడీషీటర్‌ సాయి శ్రీనివాస్‌ కోసం పోలీసులు అనేక ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగించారు. తాజాగా శ్రీనివాస్‌ను పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే.. ఆ విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. ఏదిఏమైనా సభ్య సమాజం తలదించుకునేలా కన్న కూతురితోనే వ్యభిచారం చేయించిన తల్లిదండ్రులతో పాటు ఇందుకు సహకరించిన వారికి కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. 

06:59 - November 26, 2015

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో కుక్కల నియంత్రణ కోసం వెచ్చిస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయి. వీధికుక్కల పుణ్యమా అని కొంతమంది అధికారులకు కాసుల పంట పండుతోంది. కుక్కల నుంచి ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన అధికారులు వాటిని పట్టించుకోకుండా.. నిధులు బొక్కడంపైనే దృష్టి సారిస్తున్నారు. దీంతో నగరవాసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రోడ్డుపై వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి.....

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఏ రోడ్డు చూసినా.. ఏ గల్లీ చూసినా వీధికుక్కలే దర్శనమిస్తాయి. రోడ్లపై నడిచి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రతిరోజు ఎంతోమంది కుక్కకాటు బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. అయితే కుక్కల బారి నుండి ప్రజలను రక్షించేందుకు జీహెచ్‌ఎంసీ ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా.. కుక్కల నియంత్రణ మాత్రం కనిపించడం లేదు. కానీ.. కొందరు అధికారులు కుక్కలను ఆదాయ వనరుగా మార్చుకొని కోట్లు దండుకుంటున్నారు. వీధికుక్కల కోసం జీహెచ్‌ఎంసీ చేస్తున్న ఖర్చును పరిశీలిస్తే అధికారుల బాగోతం పడుతోంది.

కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ..........

గ్రేటర్‌లో కుక్కల నియంత్రణ కోసం జీహెచ్‌ఎంసీ సిబ్బంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తుంటారు. అలాగే వాటికి అంటురోగాలు ప్రబలకుండా చూడటంతోపాటు రేబిస్‌ వ్యాక్సిన్లు వేస్తుంటారు. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. గత ఐదేళ్లలో కుక్కల కోసం 41 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 44,100 కుక్కలకు వ్యాక్సిన్‌ వేసేందుకు 25 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంటే ఒక్కొక్క కుక్కపై ఐదు వేల ఆరు వందల అరవై ఎనిమిది రూపాయలు ఖర్చు చేశారు. అయితే.. అధికారులు భారీగానే నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ ఫలితం మాత్రం ఆ మేరకు ఉండడం లేదు. దాదాపు 35 వేల మంది కుక్క కాటు బారిన పడడమే ఇందుకు నిదర్శనమని పలువురంటున్నారు.

కోట్లు దండుకుంటున్నారని ఆరోపణలు....

కుక్కల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అధికారులు లెక్కలు చూపించి.. వాటిని దండుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగంలో ఈ అవినీతి తారాస్థాయికి చేరిందని.. ఎన్నోఏళ్లుగా ఈ విభాగంలో పాతుకుపోయిన అధికారిదే కీలకపాత్ర అని పలువురంటున్నారు. కుక్కల నియంత్రణ కోసం చేస్తున్న లెక్కల వివరాలు అడిగితే మాత్రం.. క్రిందిస్థాయి అధికారుల వద్ద తీసుకోవాలని సూచిస్తున్నారు. కుక్కల నియంత్రణ కోసం కోట్ల నిధులు ఖర్చు పెడుతున్నా నగరవాసులకు కుక్కకాట్లు తప్పడం లేదంటున్నారు. ఎన్నోఏళ్లుగా పక్కదారి పడుతున్న నిధుల వ్యవహారంపై కొత్త కమిషనర్‌ అయినా దృష్టి సారిస్తారో ? లేదో ? వేచిచూడాలి. 

06:56 - November 26, 2015

హైదరాబాద్ : వరంగల్‌ ఉప ఎన్నిక ఫలితాన్ని మరిచిపోయి గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలపై దృష్టి పెట్టాలని టీడీపీ భావిస్తోంది. తమకు కంచుకోటగా ఉన్న భాగ్యనగరంలో.. క్యాడర్‌ను సమాయత్తం చేయాలని నేతలు నిర్ణయించారు. ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగించేందుకు తమ్ముళ్లు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.

స్వయంకృతాపరాధమే కొంపముంచిందంటున్న టీడీపీ నేతలు ....

వరంగల్‌ ఉప ఎన్నికలో స్వయంకృతాపరాధమే కొంప ముంచిందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అభ్యర్ధి ఎంపికలో జాప్యం నుంచి.. అనేక చిన్న చిన్న పొరపాట్లు ఓటమికి కారణమయ్యాయంటున్నారు. ఏది ఏమైనా ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తామంటూనే.. టీఆర్‌ఎస్‌తో పోరు కొనసాగిస్తామంటున్నారు.

కేసీఆర్‌ వ్యవహారశైలిని బట్టే తమ శైలి అంటున్న టీడీపీ నేతలు ...

ఇక సీఎం కేసీఆర్‌ వ్యవహారశైలిని బట్టే తమ వ్యవహారశైలి ఉంటుందని టీడీపీ నేతలంటున్నారు. ప్రతిపక్షాలు సహకరించాలంటున్న కేసీఆర్‌.. అది ఎలాగో కూడా ఆయన చెప్పాలంటున్నారు. ప్రతిపక్షాల నైతికత గురించి ప్రశ్నించే ముందు కేసీఆర్‌ తన నైతికత ఏంటో ఆత్మవిమర్శ చేసుకోవాలంటున్నారు. తమ కుటుంబ సభ్యులకు మాత్రమే ఆత్మగౌరవం ఉండాలనుకోవడం కేసీఆర్‌కు తగదని.. అందరికీ ఇది వర్తిస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలంటున్నారు.

ఫలితం ఇంత ఘోరంగా ఉంటుందనుకోలేదంటున్న టీడీపీ శ్రేణులు..........

వరంగల్‌ ఉప ఎన్నికలో ఓటమిని ముందే ఊహించినా.. ఫలితం ఇంత ఘోరంగా ఉంటుందనుకోలేదని టీడీపీ శ్రేణులంటున్నాయి. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోలేకపోయామని దేశం శ్రేణులు భావిస్తున్నాయి. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి పోటీ చేసి ఉంటే.. క్యాడర్‌ సర్వశక్తులు ఒడ్డి పోరాడేదంటున్నారు. ఇక ఓటమికి గల కారణాలు, నారాయణఖేడ్‌ ఉప ఎన్నిక, గ్రేటర్‌ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు టీడీపీ నేతలు సమావేశం కాబోతున్నారు. అదేవిధంగా చంద్రబాబు కూడా హైదరాబాద్‌ రానున్న నేపథ్యంలో ఆయనతో భేటీ అయ్యి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు.

 గ్రేటర్‌ పీఠం తమదేనన్న ధీమాను టీడీపీ.....

మరోవైపు వరంగల్‌ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉన్నా.. గ్రేటర్‌ పీఠం తమదేనన్న ధీమాను టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌ మెజారిటీతో సంబరపడుతున్న అధికారపక్షానికి దమ్ముంటే... పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాలతో పాటు గ్రేటర్‌ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని టీడీపీ నేతలు సవాల్‌ విసురుతున్నారు. ఏదిఏమైనా వరంగల్‌ ఉప ఎన్నిక ఫలితాన్ని మరిచిపోయి ప్రజాక్షేత్రంలో ఉండి ప్రభుత్వంపై పోరాటం చేయాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించాలని నేతలు భావిస్తున్నారు. 

06:53 - November 26, 2015

హైదరాబాద్ : వ‌రంగ‌ల్ ఉపపోరులో చ‌తిక‌లప‌డ్డ కాంగ్రెస్‌.. క్యాడ‌ర్‌లో మ‌నోధైర్యం నింపే ప‌నిలో ప‌డింది. లేటు చేయకుండా గులాబీ పార్టీ టార్గెట్‌గా విమ‌ర్శలు ..స‌వాళ్ళ ప‌రంప‌రను కొన‌సాగిస్తున్నారు. బైపోల్ ఓట‌మిపై మాత్రం హ‌స్తం నేతలు త‌లోమాట చెబుతున్నారు.

మ‌నోధైర్యం కోల్పోవ‌ద్దని క్యాడర్‌కు సూచన.........

వరంగల్లు ఉప ఎన్నిక‌ల్లో బొక్కబోర్లాప‌డ్డ కాంగ్రెస్‌ పార్టీ .. లేటు చేయకుండా యాక్టివ్ అయ్యేందుకు ప్రయ‌త్నిస్తోంది. ఫ‌లితాలు వెలువ‌డ్డ రోజు మీడియా ముందుకురాని హ‌స్తం నేతలు మ‌రుస‌టిరోజు మాత్రం గులాబీ పార్టీపై విరుచుకుప‌డ్డారు. అధికార పార్టీపై అటాక్‌ను కొన‌సాగిస్తూ .. క్యాడ‌ర్‌లో మ‌నోధైర్యం నింపే ప్రయ‌త్నం చేస్తున్నారు.

కొత్త భాష్యం చెపుతోన్న జానారెడ్డి...

స‌హ‌జంగా ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా .. ఫ‌లితాల‌కు త‌న‌ది బాధ్యత‌నో .. లేక ఉమ్మడి బాధ్యత‌నో చెప్పడం రాజ‌కీయ పార్టీలు చేసే ప‌ని. కానీ వరంగ‌ల్‌ ఉపఎన్నిక‌ ఫ‌లితంపై మాత్రం కాంగ్రెస్ ముఖ్యనేత జానా రెడ్డి కొత్త భాష్యం చెబుతున్నారు. ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ ఓట‌మికి ప్రజ‌ల‌దే బాధ్యత‌ని అంటున్నారు.

భ‌విష్యత్తు కాంగ్రెస్‌దేన‌ని ధైర్యాన్ని నూరిపోసే ప్రయ‌త్నాలు.....

ఓట‌మిపై క్యాడ‌ర్‌ చ‌తికిల ప‌డ‌కుండా మ‌నోధైర్యాన్ని నింపేందుకు హస్తం నేతలు రంగంలోకి దిగారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమంటున్న కాంగ్రెస్‌.. టీఆర్ఎస్ బ్లాక్ మెయిల్ రాజ‌కీయాల‌తోనే బైపోల్‌లో నెగ్గింద‌ని విమ‌ర్శిస్తున్నారు. కార్యక‌ర్తలు ఓట‌మిని ప‌క్కన‌బెట్టి ..నిరంత‌రం ప్రజ‌ల ప‌క్షాన నిల‌బ‌డి పోరాటాలు కొన‌సాగించాల‌ని .. భ‌విష్యత్తు కాంగ్రెస్‌దేన‌ని ధైర్యాన్ని నూరిపోసే ప్రయ‌త్నాలు ముమ్మరం చేశారు.

కేసీఆర్‌కు హ‌స్తం నేత‌ల స‌వాల్‌..

ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో ప్రజ‌లు ప్రతిప‌క్షాల కుట్రల‌ను న‌మ్మలేద‌ని .. తాము చేస్తున్న అభివృద్ధి సంక్షేమ‌ప‌థ‌కాల‌కు మ‌ద్దతుగా నిల‌బ‌డ్డారంటూ కేసీఆర్ చేసిన వాఖ్యల‌పై ..కౌట‌రిచ్చిన కాంగ్రెస్ నేత‌లు .. అదే నిజ‌మైతే పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామాలు చేయించ‌గ‌ల‌రా అంటూ స‌వాల్ విసురుతున్నారు. ఓరుగ‌ల్లు షాక్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ముఖ్యనేత‌ల ప్రయ‌త్నాలు ఇలా ఉంటే .. అస‌లు వ‌రంగ‌ల్ ఓట‌మికి కార‌ణం అభ్యర్థి స‌ర్వే స‌త్యనారాయ‌ణే కార‌ణ‌మ‌ని మాజీ మంత్రి శంక‌ర్‌రావు ధ్వజ‌మెత్తారు. స‌ర్వే వ‌ల్లే వ‌రంగ‌ల్‌లో పార్టీకి ఈ ప‌రాభ‌వం ఎదురైంద‌ని శంక‌ర్‌ రావు విశ్లేషించారు. 

06:48 - November 26, 2015

హైదరాబాద్ : వాటర్‌ గ్రిడ్‌ పథకం అమలుపై సీరియస్‌గా కసరత్తు చేస్తోంది టీ సర్కారు.. ఈ స్కీంపై మంత్రులు కేటీఆర్‌, హరీశ్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు, ఏజెన్సీలతో హైదరాబాద్‌లో సమీక్ష జరిపారు సీఎం కేసీఆర్‌... వాటర్‌ గ్రిడ్‌ను సకాలంలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.. భూసేకరణ, డిజైన్లు, టెండర్లు, ఆర్థిక విషయాల్లో ఎన్నో మార్పులు తెచ్చామని గుర్తుచేశారు.. వీటికి అనుగుణంగా పనిచేయాలని సూచించారు.. పనుల్లో జాప్యానికి కారణాలు సమీక్షించి వేగం పెంచాలన్నారు.. అలాగే రైల్వే క్రాసింగ్‌ల దగ్గర అనుమతులపై సానుకూలంగా స్పందించిన రైల్వేశాఖకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.. రైల్వే, నేషనల్‌ హైవేస్‌, ఆర్‌ అండ్‌ బీ, విద్యుత్, నీటిపారుదల అధికారులతో ఎప్పటికప్పుడు భేటీ అవుతూ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సూచించారు.. వాటర్‌గ్రిడ్‌కోసం అవసరమైన విద్యుత్తుకు ప్రత్యేక సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేశారు..

హైదరాబాద్‌లోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్‌ 30లోగా తాగునీరు

ఇక పనులను సకాలంలో పూర్తిచేసే కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకాలు ప్రకటించారు కేసీఆర్‌.. హైదరాబాద్‌లోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్‌ 30లోగా తాగునీరు అందించాలన్నారు కేసీఆర్‌.. అటవీభూముల్లో పైప్‌లైన్ల అనుమతులకోసం ప్రత్యేక డీఎఫ్ ఓ ను ఏర్పాటు చేశామని సీఎం ప్రకటించారు.. రైట్‌ వే ఆఫ్ చట్టం ప్రకారం ఆరు అడుగుల లోతున పైప్‌లైన్లు వేయాలని ఆదేశించారు.. మెదక్‌ జిల్లాలో వేసే పైప్‌లైన్‌ తన ఫాం హౌజ్‌నుంచే వెళుతుందని స్పష్టం చేశారు.. చట్టానికి సీఎంతోసహా ఎవ్వరూ అతీతులు కారని తెలిపారు.. వాటర్‌ గ్రిడ్‌ పైప్‌లైన్లకు ప్రజలంతా సహకరించాలని కోరారు.. 

06:46 - November 26, 2015

విజయవాడ : బాక్సైట్‌ మైనింగ్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ సీయం చంద్రబాబు.. ఇసుక తవ్వకాలపై శ్వేత పత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో రాష్ట్రానికి ఇసుక ద్వారా ఎంత ఆదాయం వచ్చింది.. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఏడాది కాలంలోనే ఎంత ఆదాయం సమకూరింది అనే విషయాలు ఈ శ్వేతపత్రంలో వివరించనున్నారు. దీంతోపాటు... ప్రస్తుత ఇసుక విధానంపై వస్తున్న విమర్శలను పరిగణనలోకి తీసుకుని... చేసే మార్పులు చేర్పులను ప్రజలకు వివరించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అమలవుతున్న ఇసుక విధానం పై అధికారుల బృందం అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమాలు పూర్తిగా నివారించటంతో పాటు వినియోగదారులపై భారం పడకుండా ఏం చేసేది శ్వేతపత్రం ద్వారా సీఎం తెలపనున్నారు.

సెర్ఫ్ నుంచి మైనింగ్ శాఖకు బదిలీ చేసే యోచనలో సర్కారు.

రాష్ట్రంలో ప్రస్తుతం సెర్ఫ్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు ఇసుక రీచ్‌లను నిర్వహిస్తుండగా... బాధ్యతలను సెర్ఫ్ నుంచి మైనింగ్ శాఖకు బదిలీ చేసే యోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం. ఇసుక రీచ్‌లను వేలం వేసి, పర్యవేక్షణ బాధ్యతలు మైనిగ్ శాఖకు ఇచ్చి... వేలంలో జిల్లా మహిళా సమాఖ్యలు, మండల మహిళా సమాఖ్యలు పాల్గొనేలా చేయాలన్నది సర్కారు యోచనగా తెలుస్తోంది. తమిళనాడు తరహాలో పలు రీచ్‌లను ప్రభుత్వమే నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అలా చేస్తే ధర నియంత్రణలో ఉండటంతో పాటు ప్రస్తుతం ఉన్న ధరకంటే తక్కువ ధరకే ఇసుకను వినియోగదారులకు అందించవచ్చని అంచనా వేస్తున్నారు.

మళ్లీ నీటి పారుదల రంగంపై శ్వేతపత్రం విడుదలకు యోచన.......

ఏడాదిన్నర క్రితం కీలకమైన నీటి పారుదల రంగానికి సంబంధించి శ్వేత పత్రం విడుదల చేసిన సీఎం మళ్లీ తాజా పరిస్థితులు వివరిస్తూ మరో శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించారు. గత శ్వేతపత్రంలో 1994 నుంచి 2004 వరకు నీటిపారుదల రంగంలో జరిగిన వృద్ధా ఖర్చుతో పాటు వేలకొట్లు అక్రమార్కుల పాలైన సందర్భాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పుడు ఏడాదిన్నర కాలంలో జలవనరుల శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించనున్నారు. ప్రాంతాల వారిగా, ప్రాజెక్టుల వారిగా నిధులను ఎలా ఖర్చు చేస్తున్నదీ.. పట్టిసీమ, నదుల అనుసంధానం విజయాలను తాజా శ్వేతపత్రంలో ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి కావాల్సిన మొత్తం 39 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వేసుకున్న సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో పాటు ఏడాది ప్రణాళికలూ శ్వేతపత్రంలో వివరించనున్నట్లు తెలుస్తోంది.

ఇసుక తవ్వకాలపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధం

విజయవాడ : బాక్సైట్ తవ్వకాలపై శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ సీయం చంద్రబాబు .. మరికొన్ని శ్వేతపత్రాల జారీకి సిద్ధం అవుతున్నారు. ఇసుక తవ్వకాలు, సాగునీటి ప్రాజెక్టుల పై శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఇసుక విధానంలో మార్పులకు అనుగుణంగా పొరుగు రాష్ట్రాల్లో దీని అమలుపైనా సర్కారు అధ్యయనం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నీటి నిర్వహనతో పాటు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పురోగతిపై... శ్వేతపత్రం విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.

నేటి నుండి పార్లమెంట్ సీతాకాల సమావేశాలు..

హైదరాబాద్ : నేటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఓ వైపు బీహార్‌ ఎన్నికల విజయంతో ప్రతిపక్షాలు బలం పుంజుకున్నాయి. దేశవ్యాప్తంగా నెలకొన్న అసహన పరిస్థితులపై కూడా ప్రతిపక్షాలు బీజేపీని ఇరకాటంలో పడేసేందుకు సమాయత్తం అవుతున్నాయి. మరో వైపు జీఎస్టీ సహా పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు అధికార పక్షం ఎత్తుగడలు వేస్తోంది. 

06:42 - November 26, 2015

హైదరాబాద్ : ఎట్టకేలకు తెలంగాణలో కరువు మండలాల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. 231 కరువు మండలాలను గుర్తించిన ప్రభుత్వం వెయ్యి కోట్ల సాయం చేయాలంటూ కేంద్రాన్ని కోరింది. మహబూబ్‌ నగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. రంగారెడ్డిలో నాలుగు మండలాలు మినహా మిగిలిన జిల్లాను కరువు ప్రాంతంగా గుర్తించింది. ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో కరువు లేదని తేల్చింది. ఈ రెండు జిల్లాల్లో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలాల జాబితాలో చేర్చలేదు వరంగల్‌లో 11, కరీంనగర్‌లో 19, నల్లగొండలో 22 మండలాల్లో కరువు వున్నట్టు గుర్తించింది. అయితే, ప్రభుత్వం విడుదల చేసిన కరువు మండలాల జాబితాపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 364 మండలాల్లో కరువు వుంటే కేవలం 231 మండలాలనే ఎంపిక చేయడం అన్యాయమన్న వాదన వినిపిస్తోంది. ఎందుకిలా జరిగింది? కరువును నిర్ధారించడానికి ఉన్న ప్రమాణాలేమిటి? కరువు ప్రాంతంగా ప్రకటించడం వల్ల ఆ ప్రాంతానికి దక్కే ప్రయోజనాలేమిటి? కరువు మండలాల ఎంపికలో వివక్ష ప్రదర్శించారా? అసలు కరువును నిర్ధారించే పద్ధతిలోనే లోపాలున్నాయా? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నేత జంగారెడ్డి పాల్గొన్నారు. మరి వారు ఏఏ అంశాలపై మాట్లాడారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

రంగస్థల నటుడు ఆచంట వెంకటరత్నం కన్నుమూత

విజయవాడ :ప్రముఖ రంగస్థల నటుడు ఆచంట వెంకటరత్నం నాయుడు (81) బుధవారం కన్నుమూశారు. తులసీ జలంధర నాటకంలో ధుర్యోధనుడి పాత్ర ద్వారా ఈయన ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఆచంట అద్భుత నటనకు హంస, ఎన్టీఆర్‌ పురస్కారాలు వరించాయి.

Don't Miss