Activities calendar

27 November 2015

22:14 - November 27, 2015

తూర్పుగోదావరి : విభజన హామీలు సాధించడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలం అయ్యారని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన హామీలు సాధించడంలో చంద్రబాబు ప్రభుత్వం బీజేపి కుమ్మక్కైనట్లుగా కన్పిస్తోందన్నారు. రాజధాని నిర్మాణం చూస్తుంటే దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా ఉందన్నారు. ఇసుక క్వారీల్లో భారీ దోపిడి జరిగిందని రాఘవులు అన్నారు.

 

 

22:12 - November 27, 2015

చిత్తూరు : ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నెంబర్‌ వన్‌ హార్డ్‌వేర్‌ హాబ్‌గా తయారుచేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతిలో ప్రతిష్టాత్మక సెల్‌కాన్‌ కంపెనీ మొబైల్స్‌ పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..తిరుపతిలో సెల్‌కాన్‌ మొబైల్ పరిశ్రమ రావడం జిల్లావాసుల అదృష్టమన్నారు. నెలకు 5లక్షల యూనిట్లు తయారుచేసేవిధంగా పరిశ్రమ ఉంటుందని చంద్రబాబు అన్నారు.

 

22:08 - November 27, 2015

ఢిల్లీ : పార్లమెంట్‌లో రాజ్యాంగంపై నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రధాని నరేంద్రమోది చర్చలో పాల్గొన్నారు. వంద ఏళ్ల తర్వాత కూడా ప్రపంచం ఎలా ఉండబోతుందో ఊహించి రాజ్యాంగాన్ని రచించారని అంబేద్కర్‌ను కొనియాడారు. దేశపౌరుల గౌరవానికి, దేశ ఐక్యతకు మన రాజ్యాంగం ప్రతీకగా మోది అభివర్ణించారు. భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి రాజ్యాంగ భావనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, విద్యాసంస్థల్లో కూడా రాజ్యాంగంపై చర్చ జరగాలని లోక్‌సభలో ప్రధాని అభిప్రాయపడ్డారు.
రాజ్యసభలోనూ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చర్చ
మరోవైపు రాజ్యసభలోనూ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చర్చ జరిగింది. మోది ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వం కేవలం హిందుత్వ ఎజెండాకే ప్రాధాన్యత నిస్తోందని సిపిఎం సభ్యులు సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో జరుపుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో రిజర్వేషన్లను ప్రభుత్వ రంగానికే పరిమితం చేయకుండా ప్రయివేట్‌ రంగంలోను రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకోసం కొత్త చట్టం తీసుకురావాలన్నారు.
దళితులపై దాడులు జరుగుతుండడంపై సిపిఎం ఆందోళన
దళితులపై దాడులు జరుగుతుండడంపై సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది. మోది ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై 19 శాతం దాడులు పెరిగాయని పేర్కొంది. సమానత్వం లేకుంటే స్వేచ్ఛ లేదని అంబేద్కర్‌ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఏచూరి ఉదహరించారు.
ఎమర్జెన్సీని హిట్లర్‌ పాలనతో పోల్చిన అరుణ్ జైట్లీ
1975లో ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ హిట్లర్‌ పాలనతో పోల్చారు. ఉన్నతమైన రాజ్యాంగవ్యవస్థకు కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచిందని, ఎమర్జెన్సీ విధించి పౌరుల హక్కులను హరించిందని మండిపడ్డారు. అలాంటిది అసహనం పెరిగిపోతోందని మాట్లాడుతున్నారని పరోక్షంగా సోనియానుద్దేశించి జైట్లీ పేర్కొన్నారు. మత ఆధారిత విభజనను అంబేద్కర్‌ సైతం తిరస్కరించారని గుర్తు చేశారు. రాజ్యాంగంలో మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
లోక్‌సభ వాయిదా
రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేడ్కర్ 125 జయంతిని పురస్కరించుకుని పార్లమెంట్‌లో రాజ్యాంగంపై నిర్వహించిన ప్రత్యేక సమావేశాలు ముగియడంతో లోక్‌సభ వాయిదా పడింది.

 

కర్ణాటకలో బాలికపై అత్యాచారం

బెంగళూరు : మూడేళ్ల బాలికకు చాక్లెట్ల ఆశ చూపి ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలోని బిదాది ప్రాంతంలో చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాలిక తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. పొరుగునే ఉంటున్న ఓ వ్యక్తి వారు లేని సమయంలో బాలికకు చాక్లెట్ల ఆశచూపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కడుపు నొప్పి వస్తుందని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆరా తీసిన తల్లితండ్రులు పాప అత్యాచారానికి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇరాక్ లో వేర్వేరుబాంబు దాడులు.. 23మంది మృతి

బాగ్దాద్ : ఇరాక్ లో రెండు వేర్వేరుచోట్ల బాంబు దాడులు చోటుచేసుకొని 23మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 17మంది ఇరాక్ సైనికులు ఉండగా మిగితావారు ఉగ్రవాదులు. ఇరాక్ లోని అన్బార్ ప్రావిన్స్ లో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జుబ్బా ప్రాంతంలో తొలిదాడి ఆత్మాహుతి దాడి రూపంలో జరిగింది. ఒంటినిండా బాంబులతో కూడిన జాకెట్ ధరించి వచ్చిన ఓ ఉగ్రవాది ఒక్కసారికా సైనికులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి చొచ్చుకొచ్చి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో 17మంది ప్రాణాలుకోల్పోయారు.

21:40 - November 27, 2015

మెట్రో మంటలు చల్లారేదేలా..? మెట్రోరైలు ఏ మలుపులు తీసుకుంటుంది..? నగర ప్రజలంతా ఆతురుతగా ఎదురు చూస్తున్న మెట్రో రైలు పట్టాలెక్కేదెప్పుడు..? అనేక సమస్యల నడుమ సాగుతున్న ఈ భారీ ప్రాజెక్టు, కాలయాపన, పెరుగుతున్న ఖర్చు ప్రజలపై మరింత భారాన్ని పెంచుతోంది. ఎల్ ఆండ్ టీ నివేదిక ఇచ్చానంటోంది. దీనిపై స్పందించాల్సిన సర్కార్... ఆందోళనలకు సమాధానం ఇవ్వాల్సిన ఏలికలు సైలెంట్ గా ఉండడం విమర్శలకు తావిస్తోంది... మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:21 - November 27, 2015

హైదరాబాద్‌ : నగర మెట్రో రైల్‌ ప్రాజెక్ట్ నిర్మాణం మరోసారి వివాదాల తుట్టె లేపింది. ఓ ప్రధాన మార్గం గుండా మెట్రో లైన్‌ నిర్మాణం జరగకూడదని కొందరు... లేదు అక్కడ నుంచే నిర్మాణం జరుగుతుందని అధికారులు ప్రకటించడంతో వ్యవహారం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం దోబూచులాడుతోంది. అసలేంటి ఈ వివాదం..? దీనిపై ప్రభుత్వ తీరు క్షణక్షణానికి ఎందుకు మారుతోంది.?
హైదరాబాద్‌ కు తలమానికంగా మారిన మెట్రో రైలు ప్రాజెక్టు
హైదరాబాద్‌ నగరానికే తలమానికంగా మారింది మెట్రో రైలు ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌ పూర్తై గాడీ పట్టాలెక్కితే నగర రూపురేఖల్లోనూ మార్పొస్తుంది. అయితే మొదటి నుంచీ వివాదాలకు కేంద్రబిందువుగా మారింది మెట్రో. ఆ గండాలన్నీ దాటుకుని ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం లైన్‌ డిజైన్‌ మార్చాలంటూ ఆందోళనలు చెలరేగుతూనే ఉన్నాయి.
సుల్తాన్‌ బజార్‌ నుంచే లైన్‌ వెళ్తుంది..
హైదరాబాద్‌ మెట్రో ఎండీ మాట్లాడుతూ సుల్తాన్‌ బజార్‌ నుంచే లైన్‌ వెళ్తుందని ఎలైన్‌మెంట్‌లో ఎలాంటి మార్పులూ ఉండబోవని గురువారం ప్రకటించారు. దీంతో ఆ ఏరియా వ్యాపారస్తులు భగ్గుమంటున్నారు. తరతరాల నుంచీ తాము ఇక్కడ వ్యాపారం చేస్తున్నామని, లైన్‌ పేరుతో తమ దుకాణాలు తొలగిస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బంద్‌కు పిలుపినిచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గతంలోనే సుల్తాన్ బజార్ మీదుగా మెట్రో లైన్ వేయొద్దంటూ వ్యాపారులు ముఖ్యమంత్రి కెసిఆర్‌ని కలిసి విన్నవించుకున్నారు. నాడు కెసిఆర్ మీకేం భయంలేదంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు నిర్ణయాలు మారిపోయాయి. అనుకున్నదానికి భిన్నంగా లైన్‌ మారిస్తే తాము నష్టపోవాల్సొస్తుందని మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను చేపట్టిన ఎల్‌అండ్‌టి చెప్తోంది. ఇదే విషయమై ముఖ్యమంత్రి వద్దా ఆ సంస్థ అధికారులు చర్చలు జరిపారు. ఇదంతా జరిగి చాలా రోజులే అవుతోంది. ఆ చర్చలన్నీ పూర్తయ్యాక సుల్తాన్ బజార్‌, అసెంబ్లీ మీదుగానే లైన్ వెళ్తుందని ఎలాంటి మార్పులూ ఉండబోవట్లేదని అధికారులు అంటున్నారు. ఇదే ఇప్పుడు వ్యాపారుల ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లైంది.
మరికొన్ని రోజుల్లో జిహెచ్‌ఎంసి ఎన్నికలు
మరికొన్ని రోజుల్లో జిహెచ్‌ఎంసి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఏ వివాదాల్లోనూ తలదూర్చకూడదని సహజంగానే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం భావిస్తుంటుంది. మరి తాజా వివాదం పట్ల ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనేది చర్చనీయాంశమైంది. ఎన్నికలయ్యేదాకా వివాదాస్పద స్థలంలో మెట్రో నిర్మాణాలకు కంపెనీ దూరంగా ఉంటుందా.? లేక నిర్మాణం జరిగేలా ప్రభుత్వం దూకుడుగానే ముందుకెళ్తుందా అన్నది టాక్‌ ఆఫ్‌ ది టౌనైంది.

 

20:54 - November 27, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 7వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మార్చి 2 నుంచి ఇంటర్ ఫస్టియర్, మార్చి 3 నుంచి సీనియర్ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జంబ్లింగ్ పద్ధతిలోనే ఇంటర్ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తామని గంటా స్పష్టంచేశారు. 

20:46 - November 27, 2015

హైదరాబాద్ : నగరంలో మళ్లీ డ్రగ్స్ కలకలం మొదలైంది. కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న డ్రగ్ స్మగ్లర్లు మళ్లీ విజృంభిస్తున్నారు. ఇవాళ రాజధానిలో సీసీఎస్, టాస్క్ ఫోర్స్ పోలీసులు జాయింట్ గా.. ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 55గ్రాముల కొకైన్, 10గ్రాముల చెరస్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో ఓ ఘనా దేశస్థునితో పాటు.. నలుగురు స్థానికులున్నారు.

 

 

20:36 - November 27, 2015

విశాఖ : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఐదుగురు సీనియర్ విద్యార్థులు.. ఇద్దరు జూనియర్ విద్యార్థులను వేధించారు. జూనియర్లు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. సీనియర్ విద్యార్థులను ప్రిన్సిపల్ 15 రోజులపాటు సస్పెండ్ చేశారు. భవిష్యత్ లో మళ్లీ ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

20:20 - November 27, 2015

హీరోయిన్ అనుష్క నటించిన ఫ్యాట్ ఎంటర్ టైనర్ సైజ్ జీరో. స్లిమ్ ఆండ్ బ్యూటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అనుష్క. అలాంటి బ్యూటీని బొద్దుగుమ్మల్లా చూడాలంటే కష్టం. అయినా అనుష్కను ఫ్యాటీ బ్యూటీగా మార్చి దర్శకుడు కోవెలమూడి ప్రకాశ్ సైజ్ జీరో సినిమా తీశాడు. ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా వుంది..? ప్రేక్షకులను ఆకట్టుకుందా..? లేదా... ? సినిమా రివ్యూకు సంబంధించిన పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

టెన్ టివి రేటింగ్... 2/5

20:06 - November 27, 2015

దేశ జాతీయోత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్న మహిళలకు కేంద్రప్రభుత్వం మరిన్ని సౌకర్యాలు అందించే దిశగా అడుగులు వేస్తుంది. చాలా కాలంగా మహిళాకార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్ ను నెరవేర్చే దిశగా ప్రణాళిక రచిస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

 

19:47 - November 27, 2015

ఢిల్లీ : నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా భావించాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. లోక్ సభలో రాజ్యాంగంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. రాజ్యాంగంపై చర్చ చేపట్టినందుకు స్పీకర్ ను అభినందించారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం కానీ... నవంబర్ 26 అంతకంటే గొప్ప దినమని మోడీ అన్నారు. పార్లమెంట్ లో రాజ్యాంగంపైచర్చ చారిత్రకమైందని చెప్పారు. రాజ్యాంగంపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని పేర్కొన్నారు. 

19:27 - November 27, 2015

హైదరాబాద్ : అంగన్‌వాడీ వర్కర్లు కదం తొక్కారు. ధర్నాలు, రాస్తారోకోలు, కలెక్టరేట్ల ముట్టడితో హోరెత్తించారు. జీతాల పెంపుకోసం విడుదల చేసిన జీవోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. జీవోను వెంటనే అమలు చేయకపోతే..సర్కార్‌పై సమరశంఖం పూరిస్తామని అంగన్‌వాడీ వర్కర్లు హెచ్చరించారు.
కర్నూలు
అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టరేట్‌ లోపలికి వెళ్లేందుకు అంగన్‌వాడీలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, అంగన్‌వాడీలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. మరోవైపు అంగన్‌వాడీలు చేపట్టిన దీక్ష ఐదొవ రోజుకు చేరుకోవడంతో ఓ ఉద్యోగి ఆరోగ్యం క్షీణించింది. వెంటనే ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చాలీచాలనీ జీతాలతో అంగన్‌వాడీలు కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారని..వారికి వెంటనే వేతనాలు పెంచిన జీవోను అమలు చేయాలని సీఐటీయూ, వామపక్షాలు డిమాండ్ చేశాయి.
అనంతపురం
పెంచిన జీతాల జీవోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ..అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనలో పాల్గొన్న అంగన్‌వాడీ కార్యకర్తలను, సీఐటీయూ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసేందుకు యత్నించగా...తోపులాట చోటుచేసుకుంది. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఐసీడీఎస్‌ను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన మంచిది కాదని సీఐటీయూ నేతలు సూచించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెంచిన జీతాల జీవోను అమలు చేయాలని...లేకపోతే డిసెంబర్‌ 7న చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతామని హెచ్చరించారు.
కడప
అటు కడపలోనూ పెంచిన జీతాలల జీవోను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ..కలెక్టరేట్‌ను అంగన్‌వాడీ కార్యకర్తలు ముట్టడించారు. లోనికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా...పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాడ చోటుచేసుకుంది.
ప్రకాశంకదం తొక్కిన అంగన్‌వాడీ వర్కర్లు
అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ...ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించే ప్రయత్నం చేయగా..పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట చేటుచేసుకోవడంతో ఓ కార్యకర్త స్రృహ తప్పి పడిపోయాడు. వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరించారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తుంటే...ప్రభుత్వం తమను అణచాలని చూస్తోందని అంగన్‌వాడీ కార్యకర్తలు మండిపడ్డారు.
పశ్చిమగోదావరి
ఇక పశ్చిమగోదావరి జిల్లాలోనూ అంగన్‌వాడీలు చేపడ్డిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఏలూరు కలెక్టరేట్‌ ముట్టడికి కార్యకర్తలు ప్రయత్నించగా..పోలీసులు అడ్డుకోవడంతో ఓ మహిళా కార్యకర్తకు గాయం అయి తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
శ్రీకాకుళం
శ్రీకాకుళంలో సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి అరెస్టులకు దారితీసింది. పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని అంగన్‌వాడీ కార్యకర్తలు మండిపడ్డారు. విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో చేపట్టిన కలెక్టరేట్‌ కార్యాలయాల ముట్టడి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అటు తెలంగాణలోనూ అంగన్‌వాడీ వర్కర్ల కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితుల నడుమ సాగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అంగన్‌వాడీ వర్కర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

వేర్వేరు పడవ ప్రమాదాలు..ఆరుగురి గల్లంతు

టర్కీ : టర్కీ తీరంలో వలసదారులను తరలిస్తున్న రెండు పడవలు ప్రమాదవశాత్తు మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు గల్లంతయ్యారు. తొలుత 20 మంది శరణార్థులతో వెళ్తున్న ఓ పడవ ఏజియాన్‌ రిసార్ట్ ప్రాంతంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కాచెలెళ్లు కొట్టుకుపోయారు. ఈ ఘటన జరిగిన మరి కొద్ది గంటల్లోనే సిరియా, అఫ్గానిస్థాన్‌ నుంచి తరలిస్తున్న 55 మంది వలసదారులతో ఉన్న పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో ఆఫ్గాన్‌కు చెందిన నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు.

మావోయిస్టుల డంప్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు

వరంగల్‌ : జిల్లాలోని గోవిందరావుపేట మండలం ప్రాజెక్టునగర్‌ వద్ద మావోయిస్టుల డంప్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్వాజగుట్ట వద్ద 61 రౌండ్ల తూటాలు, రెండు తుపాకులు, కిట్‌ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.

తమిళనాడులో వర్షాలు.. 184కు చేరిన మృతుల సంఖ్య

చెన్నై : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావం వల్ల తమిళనాడులో ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మరో ఎనిమిది మంది మృతి చెందారు. దీంతో వర్షాల వల్ల అక్కడ మృతి చెందిన వారి సంఖ్య 184కు చేరింది. అల్ప పీడన ప్రభావం వల్ల తమిళనాడులో శనివారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్‌ ఎస్‌ఆర్‌ రమణన్‌ తెలిపారు.

 

18:59 - November 27, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం వచ్చాక.. తమ కష్టాలు తీరుస్తానన్న కేసీఆర్.. ఇంతవరకు ఎలాంటి హామీలు ఇవ్వకపోవడంపై టీఎస్ న్యాయవాదులు మండిపడుతున్నారు. రాష్ట్రం కోసం ఏడాది పాటు విధులకు దూరంగా ఉండి పోరాడితే కనీస డిమాండ్లను నెరవేర్చడం లేదని ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. వకీళ్లు లేంది తెలంగాణ రాష్ట్రమే లేదన్న కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. కేసీఆర్ వెంటనే తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ... 10 జిల్లాల నుంచి వచ్చిన న్యాయవాదులు ధర్నా చౌక్ వచ్చి ఆందోళన నిర్వహించారు.

 

18:57 - November 27, 2015

వరంగల్ : జిల్లాలో విద్యార్థినులకు అసభ్యపదజాలంతో ఎస్ఎంఎస్ లు చేస్తున్న టీచర్ కు దేహశుద్ధి చేశారు. వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ లో గత కొంత కాలంగా విద్యార్థినుల పట్ల ఇంగ్లీష్ టీచర్ ప్రసాద్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. 5వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు అసభ్య పదజాలంతో ఎస్ఎంఎస్ లను పంపిస్తున్నాడు. ఈనేపథ్యంలో విద్యార్థినుల కుటుంబసభ్యులు ప్రసాద్ ను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్కూల్ యాజమాన్యాన్ని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. 

18:48 - November 27, 2015

నల్లగొండ : యాదాద్రిని జిల్లా చేయాలంటూ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆలేరు నుంచి యాదాద్రి వరకు పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం ఉన్న నల్లగొండ జిల్లాను విభజించేందుకు సీఎం కట్ర చేస్తున్నారన్నారు. భువనగిరి నియోజకవర్గాలను సిద్దిపేటలో కలపాలనుకోవడం దారుణమన్నారు. యాదాద్రిని జిల్లాగా ప్రకటించకపోతే డిసెంబర్ 1 నుంచి నిరాహార దీక్ష చేపడతామన్నారు మోత్కుపల్లి.

 

 

18:46 - November 27, 2015

హైదరాబాద్ : నోటుకు ఓటు కేసు ‌కీలక మలుపు తీసుకుంది. ఫోరెన్సిక్ సైంటిఫిక్ ల్యాబ్ ఏసిబి కోర్టుకు నివేదిక ఇచ్చింది. స్టీఫెన్‌సన్‌ ఫోన్ లో రికార్డ్ అయిన వాయిస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, మత్తయ్యలదేనని స్పష్టత ఇచ్చింది. మూడు నెలలుగా సాగిన పరిశోధన అనంతరం ఏసిబి సప్లమెంటరీ చార్జీషీట్ దాఖలు చేసేందుకు సిద్దమవుతోంది. ఈ సారి చంద్రబాబు వాయిస్‌ శాంపిళ్లు సేకరించి ఎఫ్‌.ఎస్.ఎల్ రిపోర్టుకు ఇచ్చేలా ఏసీబీ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
అత్యంత కీలక సాక్ష్యాధారం
ఓటుకు నోటు కేసులో అత్యంత కీలకమైన సాక్ష్యాధారం ఎఫ్‌.ఎస్.ఎల్ రిపోర్టు ఏసిబి కోర్టుకు చేరింది. స్టీఫెన్‌సన్‌ ఫోన్ లో రికార్డయిన 110 వాయిస్ లు అసలైనవేనని తెల్చింది. ఇందులో ఈ కేసుకు సంబంధించి.. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యతో పాటు మత్తయ్యతో మాట్లాడిన మాటలు ఉన్నాయి. వీరి వాయిస్ నిర్ధారణకు అసెంబ్లీ నుంచి రేవంత్ రెడ్డి, సండ్ర ఆడియో, వీడియోలను ఏసిబి తీసుకోని ఎఫ్‌.ఎస్.ఎల్ కు ఇచ్చింది. సెబాస్టియన్, మత్తయ్య లు మీడియాతో మాట్లాడిన ఆడియోలను తీసుకొని పరిశీలించారు. అయితే ప్రతిపదం వీరు మాట్లాడిన పదానికి సరిపోయిందా..? వీరిదేనా అని తేల్చడానికి ఎఫ్.ఎస్.ఎల్. అధికారులు 3 నెలల సమయం తీసుకున్నారు. అయితే తాజాగా ఈ రిపోర్టు ఆధారంగా సప్లిమెంటరీ చార్జీషీట్ రెడీ చేసుకుంటోంది ఏసిబి. ప్రాథమిక చార్జీషీట్‌లో ఏ.పి. సీ.ఎం. చంద్రబాబు పేరును 21 సార్లు ప్రస్తావించిన ఏసిబి, చంద్రబాబు ఆడియో తెల్చేందుకు ఏసిబి కోర్టు అనుమతి కోరే అవకాశం ఉంది.
ఏసిబి అధికారుల్లో ఉత్కంఠ
ఇప్పటి వరకు నిందితులకు మాత్రమే అనుమతి ఇచ్చిన కోర్టు. చంద్రబాబు వాయిస్ పరీక్షకు అనుమతి ఇస్తుందా..? లేదా మీడియాలో మాట్లాడిన అడియోతో పోల్చుకొని స్పష్టత ఇవ్వండని అదేశిస్తుందా..? అనే ఉత్కంఠ ఏసిబి అధికారుల్లో నెలకొంది.

 

18:42 - November 27, 2015

ఢిల్లీ : తెలంగాణ ఏర్పాటులో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందనడం టీఆర్ ఎస్ఎంపీ వినోద్ అవాస్తవమన్నారు. లోక్ సభలో రాజ్యాంగంపై జరిగిన చర్చలో వినోద్ పాల్గొన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ నిబంధనల ప్రకారమే... ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు.

 

18:35 - November 27, 2015

అనంతపురం : పెంచిన జీతాల జీవోను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురంలో అంగన్‌వాడీ వర్కర్లు కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనలో పాల్గొన్న అంగన్‌వాడీ కార్యకర్తలను, సీఐటీయూ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేయడానికి యత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అంగన్‌వాడీ వర్కర్లపై పోలీసులు చేయిచేసుకోవడంతో వారిపై వర్కర్లు మండిపడ్డారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇలాంటి పరిస్థితి దాపురించడానికి...సీఎం చంద్రబాబే కారణమని సీఐటీయూ నేత ఓబులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

18:28 - November 27, 2015

ఢిల్లీ : విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేయాలని కేంద్ర సహాయమంత్రి సుజనాచౌదరి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్రం...మాటను నిలపెట్టుకోవాలన్నారు. వరదలతో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకునేందుకు వెంటనే ఎక్కువ నిధుల్ని విడుదల చేయాలన్నారు. 

18:23 - November 27, 2015

చిత్తూరు : తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. 20ఏళ్ల తరువాత డ్యామ్ నీటితో కళకళలాడుతోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవలి వర్షాలతో జిల్లాలో 4వేలకు పైగా చెరువులు నిండాయని... భూగర్భ జలాలు పెరిగాయన్నారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంతో... ఎలాంటి గండ్లు పడి నీటి వృధా జరగలేదన్నారు చంద్రబాబు.

 

 

విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ర్యాగింగ్

విశాఖ : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఐదుగురు సీనియర్ విద్యార్థులు.. ఇద్దరు జూనియర్ విద్యార్థులను వేధించారు. జూనియర్లు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రిన్సిపల్ సీనియర్ విద్యార్థులను 15 రోజులపాటు సస్పెండ్ చేశారు. 

పార్లమెంట్ ఉభయసభలు సోమవారానికి వాయిదా

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఈమేరకు ఇరు సభలను వాయిదా వేస్తున్నట్లు లోక్ సభ, రాజ్యసభ స్పీకర్లు ప్రకటించారు. 

17:50 - November 27, 2015

ఢిల్లీ : ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో అత్యంత కీలకమైన జీఎస్ టీ బిల్లు సహా ఇతర కీలక బిల్లులను ఎన్డీఏ ఆమోదించుకోవాల్సి ఉంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్‌లను ఆయన తేనీటి విందుకు ఆహ్వానించారు. రేస్ కోర్సు రోడ్డులోని తన నివాసానికి ఈ రోజు సాయంత్రం 7 గంటలకు రావాలని కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం పంపారు. జీఎస్‌టీపై ఎవరితోనైనా చర్చించేందుకు ప్రధాని మోడీ సిద్ధంగా ఉన్నారని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు.

17:47 - November 27, 2015

ఢిల్లీ : 2జీ కుంభకోణం దర్యాప్తులో భాగంగా కేంద్ర మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్‌ను సీబీఐ విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 30 వతేదీన దయానిధి మారన్‌ను సీబీఐ ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించవచ్చని తెలిపింది. విచారణలో భాగంగా కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. 

లోక్ సభలో రాజ్యాంగంపై చర్చ

ఢిల్లీ : లోక్ సభలో రాజ్యాంగంపై చర్చ జరుగుతోంది. రాజ్యాంగంపై చర్చ చేపట్టినందుకు ప్రధాని మోడీ స్పీకర్ ను అభినందించారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం కానీ.. నవంబర్ 26 అంతకంటే గొప్ప దినమని అన్నారు. పార్లమెంట్ లో రాజ్యాంగంపై చర్చ చారిత్రకమైనదన్నారు. రాజ్యాంగంపై ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు.

 

వనస్థలిపురం ఎస్సై సైదులుపై సస్పెన్షన్

హైదరాబాద్ : అవినీతి ఆరోపణలు రావడంతో వనస్థలిపురం ఎస్సై సైదులుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సైదులుపై అవినీతి ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో నైజీరియన్ మృతి

హైదరాబాద్ : హయత్‌నగర్ మండలం బాటసింగారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈప్రమాదంలో నైజీరియన్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరు నైజీరియన్ విద్యార్థులు బైకుపై వెళ్తోండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వేగంగా వెళ్తోన్న లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఒక నైజీరియన్ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు. ఇరువురు నైజీరియన్ విద్యార్థులు నోవా ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారని సెయింట్ మేరీస్ కాలేజీలో పరీక్ష రాసి వస్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు.

17:34 - November 27, 2015

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రం అనే బదులు పచ్చపత్రం అంటే బాగుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. ఇసుక రీచ్‌లను మహిళలకు కాకుండా తన అనుచరులకు కట్టబెట్టేందుకు జనవరి ఒకటో తేదీ నుండి ఇసుక పాలసీలో మార్పులు చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. 

17:30 - November 27, 2015

హైదరాబాద్ : వరంగల్ విజయం టీఆర్‌ఎస్‌ది కాదని...అది ఈవీఎంల విజయమని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ అన్నారు. తనకు పోలైన నాలుగు బ్యాలెట్‌ ఓట్లే నిజమైన ప్రజాతీర్పు అని..ఈవీఎంలలో తీర్పు ట్యాంపరింగ్‌తో వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ సారధి అని చెప్పుకునే కేసీఆర్‌కు ఎప్పుడూ భారీ మెజార్టీ రాలేదని...అది ఆయన ఒప్పుకోవాలని సర్వే అన్నారు.

 

17:28 - November 27, 2015

తూర్పుగోదావరి : ఇటీవలి అకాలవర్షాలకు దెబ్బతిన్న తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తున్నారు. జిల్లాలోని కొత్తపేట, రావులపాలెం మండలాల్లో ఆయన రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జిల్లాలో లక్షా ఎనభై వేల ఎకరాల్లో పంట నష్టపోయినా.. చంద్రబాబు పరామర్శించేందుకు రాలేదన్నారు. తడిసిన, రంగు మారిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేలా... ఆదేశాలు జారీ చేయాలని జగన్ డిమాండ్ చేశారు. 

17:23 - November 27, 2015

మహబూబ్‌నగర్‌ : అక్కడ కలియుగ శ్రీనివాసుడు వెలిశాడంటారు. ఆయన్ని దర్శించుకునేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారు. వచ్చిన భక్తులు మాత్రం మామూలుగా వెళ్లరు. మటన్‌ తినీ మరీ వెళతారు. కబాబ్‌ల పనికానిచ్చి తిరిగి ప్రయాణం కడతారు. మసాలాలు గట్టిగా దట్టించిన మటన్‌ సీకులను మళ్లీ మళ్లీ కావాలంటూ ఆరగించేస్తారు. ఇంతకూ శ్రీనివాసుడు వెలిసిన ప్రాంతం ఏమిటి.. మటన్‌ సీకుల మేటర్‌ ఏమిటి..? ఘాటైన మసాల గట్టిగా దట్టించి.. నిప్పుల సెగలో మటన్‌ చువ్వలను మగ్గించి..కురుమూర్తి కబాబ్ అని దానికి పేరు పెడితే...వాటి కోసం వెంకటేశ్వర స్వామి భక్తులు క్యూ కడితే... వెంకటేశ్వరస్వామి భక్తులేమిటి...ఈ మటన్‌ సీకులు కోసం క్యూ కట్టడమేమిటి..
మటన్‌ చువ్వలు హైలెట్‌
మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరుగుతున్న కురుమూర్తి జాతర ఉత్సవాల్లో ఈ మటన్‌ చువ్వలే హైలెట్‌. వీటిని లొట్టలేసుకుని తినేందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
నెల రోజుల పాటు ఉత్సవాలు
జిల్లాలో నెల రోజుల పాటు కురుమూర్తి ఉత్సవాలు జరుగుతాయి. ఈ నెల 11న జాతర ప్రారంభమైంది. కురుమూర్తి దేవాలయంలో ఉన్న వెంకటేశ్వరస్వామి వారిని కొలవడానికి భక్తులు తండోపతండాలు వస్తారు. సహజంగా దేవతల దేవాలయల దగ్గరే మాంసం తినే ఏర్పాట్లు ఉంటాయి. కానీ మిగతా ఆలయాల దగ్గర మాంసం తినడం అరుదు. కాని కురుమూర్తి దేవాలయానికి వస్తే...భక్తుల మనసంతా మటన్‌ మీదే ఉంటుంది.
జాతరలో వంద మటన్‌ షాపులు
కొంగు బంగారంగా పిలిచే కురుమూర్తి స్వామిని దర్శించుకున్న భక్తులు మొక్కలు సమర్పిస్తారు. దర్శనం అనంతరం తిరిగి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మటన్‌ కబాబ్‌ను కడుపునిండా లాగించి వెళతారు. కురుమూర్తి జాతరలో వంద వరకు మటన్‌ షాపులు వెలిసాయంటే...ఇక్కడ ఆ వ్యాపారం ఏ రేంజ్‌లో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
కబాబ్‌ వ్యాపారం రోజుకు లక్షల్లో
కబాబ్‌ వ్యాపారం రోజుకు లక్షల్లో ఉంటుంది. ఒక్కో షాపులో రోజుకు కనీసం 60 కిలోల మాంసం అమ్మకాలు జరుగుతాయి. మొత్తానికి కురుమూర్తి జాతరకు వస్తున్న భక్తులు..ఇటు స్వామి కార్యం అటు కబాబ్‌ల కార్యం కూడా పూర్తిచేసుకుని వెళుతున్నారు.

 

16:55 - November 27, 2015

మహబూబ్ నగర్ : 'చెలియో చెల్లకో.. తమకు చేసిన ఎగ్గు... జెండాపై కపిరాజు'... ఇలాంటి అనేక పాటలు, పద్యాలు నాడు యావత్‌ తెలుగు ప్రజలను అలరించేవి. సంతోష సాగరంలో ఓలలాడించేవి. నేడు ఆ గానమాధుర్యం ఎక్కడా వినిపించట్లేదు. రాగయుక్తంగా సాగే పద్యాలు నేడెక్కడా చెవులకు ఇంపుగా తాకడం లేదు. అయితే అలా అంతరించిపోతున్న పద్యాలను నాటక కళను మరొకసారి గుర్తుచేశారు ఆ కళాకారులు. తమ గానమాధుర్యంతో అందరినీ అలరించారు. అలా పాటందుకుంటే అంతా మైమరచిపోవాల్సిందే.. ఈ కళాకారులు తమ గంభీర స్వరంతో రోమాలు నిక్కబొడుచుకునేలా చేయగలరు.. కళ్ల ఎదుట సజీవంగా ఆయా పాత్రలను నిలపగలరు.. ఎంతో శక్తివంతమైన ఆ నాటక కళ నేడు టెక్నాలజీ ధాటికి కనుమరుగైపోయింది. అందరినీ అలరించిన ఈ మహత్తర కళ ప్రస్తుతం మాయమైపోతోంది.
అందరినీ అలరించిన జానపద నాటకాలు
టివిలు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు ఇలాంటి గాడ్జెట్స్ ఇప్పుడు ప్రతి ఇంటా వినోదాన్ని పంచుతూ అందరినీ తమకు బానిసలుగా చేసుకుంటున్నాయి. ఇవి ఇంతగా ప్రచారంలోకి రాకముందు... ఒక అర్ధశతాబ్దం క్రితం వరకు ప్రాచీన కళలు, పౌరాణిక, జానపద నాటకాలు అందరినీ అలరించేవి. ఆనందాన్ని పంచేవి. వాటిల్లో నాటకాలకు ఉన్నంత ప్రాధాన్యం మరి దేనికీ ఉండేది కాదంటే అతిశయోక్తికాదు.
నాటక ప్రదర్శనకు శ్రీకారం
అయితే అంతరించిపోతున్న కళలకు కళకు ఊపిరులూది జనబాహుళ్యంలోకి తెచ్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తుండాలి. ఇప్పుడూ అదే రీతిలో తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రయత్నంతో మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి పట్టణంలో సురభి సంస్థ వారిచే నాటక ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు.
సురభి సంస్థకు ప్రాధాన్యత
నాటక రంగంలో సురభి సంస్థకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతాకాదు. ఈ కళాకారులు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఆంజనేయుడు, సీత, ద్రౌపది ఇలా ఏ పాత్ర చేపట్టినా దానిలో ఇమిడిపోయి నటించేవారు. కొన్ని దశాబ్దాల క్రితం ఒక ఊరిలో నాటకం ప్రదర్శిస్తున్నారంటే ఆ ఊరి ప్రజలంతా అక్కడకు చేరుకునేవారు. నాటకాన్ని ఆసాంతం సందర్శించి వెళ్లేవారు. ఇదే తరహాలో సురభి ఆర్టిస్టులు వనపర్తిలో నాటకాలు ప్రదర్శించి రంజింపజేశారు. నాటక ప్రదర్శన చివరలో ప్రముఖ వాగ్గేయ కళాకారుడు గోరటి వెంకన్న పద్యంతో పాటు పాటలు పాడి అలరించారు.
ప్రభుత్వం కళాకారులను ఆదుకుంటుంది : సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ఈ నాటక ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి తెలంగాణ సాంస్కృతిక విభాగం సలహాదారుడు రమణాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌ తదితరులు ప్రదర్శనను తిలకించి కళాకారులను సన్మానించారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కళాకారులను ఆదుకుంటుందని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ ప్రదర్శనకు ప్రేక్షకులు కూడా బాగానే రావడంతో సురభి కళాకారుల మోములో ఆనందం కన్పించింది.

 

 

16:49 - November 27, 2015

నల్గొండ : కాకతీయ సామ్రాజ్యానికే వన్నెతెచ్చిన వీర ధీరనారి ఆమె. శత్రువుకు ఎదురొడ్డి నిలిచి.. రాజ్యాన్ని పాలించింది. గొప్ప పరిపాలనాధ్యక్షురాలిగా.. కీర్తికెక్కిన మహిళామణి. ఆమే కాకతీయ సామ్రాజ్యాన్ని దశదిశలా విస్తరింపజేసిన రాణీ రుద్రమదేవి. అయితే రుద్రమదేవి చర్రిత అందరికి తెలిసినప్పటికీ.. ఆమె జీవిత చరమాంకానికి సంబంధించిన విషయాలు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ వివరాలు తెలియాలంటే నల్లగొండ జిల్లాకు వెళ్ళాల్సిందే. ఆమె వర్థంతి సందర్భంగా రాణీ రుద్రమదేవి డెత్ మిస్టరీపై టెన్ టీవీ ప్రత్యేక కథనం.
రాణి రుద్రమదేవి చరిత్ర
కాకతీయుల పేరు చెప్పగానే ముందుగా స్మరణకు వచ్చే రాణి రుద్రమదేవి చరిత్ర. కాకతీయుల్లోనే రాయగజకేసరి బిరుదాంకితురాలై కీర్తింపబడిన రుద్రమదేవి జీవిత చరమాంకం ఏ విధంగా ముగిసిందో చరిత్రలో ఎక్కడా రాయలేదు. కానీ నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని చందుపట్ల గ్రామం రాణీ రుద్రమాదేవి జీవిత చరమాంకానికి సంబంధించిన చారిత్రక అవశేషాలను దాచుకొంది. రాణీ రుద్రమాదేవి ఇదే గ్రామంలో చనిపోయిందని తెలిపే శిలాశాసనాలు చాలాకాలం తర్వాత బయటపడ్డాయి.
రుద్రమదేవి మరణశాసనం
ఉస్మానియా యూనివర్శిటీలో.. తెలుగు రీసెర్చ్ స్కాలర్ గా పని చేస్తున్న సైదులు.. కాకతీయ రుద్రమాదేవి మరణానికి సంబంధించిన చారిత్రిక ఆధారాల కోసం అన్వేషించసాగాడు. ఇందులో భాగంగానే.. చందుపట్ల గ్రామంలో మట్టిలో కూరుకుపోయిన శాసనాన్ని గుర్తించి పురావస్తు శాఖాధికారుల సహాయంతో.. వెలికితీయించి అది రుద్రమదేవి మరణశాసనంగా గుర్తించారు. విరోధనామ సంవత్సరం ద్వాదశి రోజున అంటే.. 1289వ సంవత్సరం, నవంబర్ 27వ తేదీన రాణీ రుద్రమదేవి వీరమరణం పొందినట్లుగా శాసనంపై లిఖించినట్లు వెల్లడైందని తేలింది.
అంబదేవుడి రుద్రమ చేతిలో వీరమరణం
నల్లగొండ సమీపంలోని పానగల్లుకు వస్తోన్న క్రమంలోనే చందుపట్ల కాపర్తి అయిన అంబదేవుడి చేతిలో వీరమరణం పొందినట్లు శిలాశాసనం ద్వారా వెల్లడవుతోంది. రాణి రుద్రమతోపాటు.. ఆమె సైన్యాధ్యక్షుడు మల్లిఖార్జున నాయుడు కూడా అక్కడ చనిపోయినట్లు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. అయితే.. ఈ శాసనాన్ని రాణిరుద్రమ సేవకుడు పువ్వుల ముమ్మడి అనే వ్యక్తి వేయించినట్లు తెలుస్తోంది. ఈ శాసనం బైటపడేవరకు.,. రాణి రుద్రమదేవి మరణించిన తేదీల విషయం ప్రపంచానికి తెలియదు. ఈ శాసనం ఆధారంగా 1289 నవంబర్ 27న రుద్రమదేవి చనిపోయినట్లుగా నిర్ధారణ అయ్యింది.
రుద్రమదేవి కాంస్య విగ్రహం....
మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ చందుపట్లను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అయితే ఇంతవరకు దానికి సంబంధించిన ఊసే లేదని స్థానికులు వాపోతున్నారు. 2002లో 11 లక్షల రూపాయల వ్యయంతో. .. 7.50 క్వింటాళ్ల బరువుతో స్థానికులు రాణి రుద్రమాదేవి కాంస్య విగ్రహాన్ని తయారు చేయించారు. నకిరేకల్-మిర్యాలగూడ రహదారిపై ప్రతిష్టించారు. సీఎం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలని స్థానికులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ రుద్రమాదేవి విగ్రహావిష్కరణ చేసి.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని చందుపట్ల వాసులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనైనా రుద్రమదేవి వర్థంతి వేడుకలను అధికారికంగా చందుపట్లలోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పాలకులను కోరుతున్నారు స్థానికులు, చరిత్రకారులు.

 

 

16:41 - November 27, 2015

హైదరాబాద్ : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిమ్స్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు ధర్నా నిర్విహించారు. లేబర్‌ కమిషన్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్‌ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా నిర్వహించారు. తమను పర్మినెంట్‌ చేసి కనీస వేతనం 15 వేలు చెల్లంచాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందళన కొనసాగిస్తామని తెలిపారు. 

16:39 - November 27, 2015

కర్నూలు : జిల్లాలోని బనగానపల్లె విద్యుత్‌ శాఖ అధికారి లంచం పుచ్చుకుంటూ ఎసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. విద్యుత్‌ శాఖ ఎడిఈ గా పనిచేస్తున్న సుధాకరాచారి గత రెండేళ్లుగా లంచాలు తీసుకుంటూ రైతులు, వ్యాపారవేత్తలను హింసిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండు నెలలుగా కాంట్రాక్టర్‌ కిషోర్‌ను పెండింగ్ బిల్లుల విషయంలో వేధిస్తున్నారు. దీంతో ఆయన ఎసిబి అధికారులను ఆశ్రయించగా విద్యుత్ శాఖాధికారిని బుక్‌ చేసేందుకు ప్లాన్ చేశారు. ఉదయంపూట కాంట్రాక్టర్‌ 2 వేలా 500 రూపాయలు లంచం ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నారు.

 

నగల కోసం స్నేహితురాలు హత్య

హైదరాబాద్ : లంగర్‌హౌస్‌ ఓం నగర్‌లో కొన్ని రోజుల క్రితం హత్యకు గురైన లక్ష్మి తులసి అనే మహిళ హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. బంగారు నగల కోసం స్నేహితురాలే లక్ష్మి తులసిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. బంగారం కోసం లక్ష్మితులసిని కరీంనగర్‌కు చెందిన ఆమె స్నేహితురాలు ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏడాది క్రితం జరిగిన ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనాన్ని రేపింది. 60 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ కేసులో సుమారు 150 మందిని పోలీసులు విచారించారు. చివరకు హత్య చేసింది లక్ష్మి తులసి స్నేహితురాలేనని తెలిసి పోలీసులు షాక్‌కు గురయ్యారు.

ఈనెల 29న ముంబైలో తిరుమల కళ్యాణం

ముంబై : తిరుమల శ్రీనివాసుని కళ్యాణం ముంబైలో నవంబర్‌ 29న జరగనుంది. ఈ కళ్యాణానికి విస్తృత ఏర్పాట్లు జరిగాయి. షణ్ముకానంద హాల్‌లో ఈ వివాహం జరగనుంది. మూడేళ్ల విరామం తర్వాత ఈ వివాహం జరగనుంది. శ్రీనివాసుని దర్శించుకోవడం అందరికీ సాధ్యం కాకపోవడంతో ఇక్కడే కళ్యాణం జరిపించడానికి ఏర్పాట్లు చేసినట్లు బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సురేష్‌ రావు తెలిపారు. వేద మంత్రోచ్ఛరణ మధ్య ఆదివారం నాడు విగ్రహాలను షణ్ముకానంద హాల్‌లోకి విగ్రహాలను తీసుకురానున్నారు.

టెట్, డీఎస్సీల నిర్వహణపై కడియం సమీక్ష

హైదరాబాద్: టెట్, డీఎస్సీల నిర్వహణపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. ఈరోజు ఆయన నిర్వహించిన ఈ సమావేశానికి విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా, త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని సీఎం కేసీఆర్ వరంగల్ ఉప ఎన్నికల విజయం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

15:57 - November 27, 2015

మహారాష్ట్ర : నాగ్‌పూర్‌ టెస్ట్ లో టీమిండియా సంచలన విజయం సాధించింది. మూడో రోజు ఆటలోనూ భారత స్పిన్నర్లు చెలరేగారు. రెండోరోజు ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 2 వికెట్లకు 32 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టు...బ్యాట్స్‌మెన్‌ మరోసారి విఫలమవ్వడంతో ఓటమి తప్పలేదు. భారత స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌, మిశ్రాల ధాటికి సఫారీ బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టారు.సఫారీ టీమ్‌ను 185 పరుగులకే కుప్పకూల్చిన భారత జట్టు 124 పరుగుల తేడాతో నెగ్గి ...2-0తో టెస్ట్‌ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌ విజయంతో వన్డే ,టీ 20 సిరీస్‌ల్లో దక్షిణాఫ్రికా జట్ల చేతిలో ఎదురైన పరాభవానికి భారత జట్టు బదులు తీర్చుకుంది.
టీమిండియా టెస్టుల్లో పెద్ద సంచలనం 
అందరూ కుర్రాళ్లతో కూడిన టీమిండియా టెస్టుల్లో పెద్ద సంచలనమే సృష్టించింది. సొంతగడ్డపై టెస్ట్‌ టాప్‌ ర్యాంకర్‌ దక్షిణాఫ్రికా జట్టును చిత్తు చేసి సిరీస్‌ విజయం సాధించింది. నాగ్‌పూర్‌ టెస్ట్‌లో బ్యాట్స్ మెన్‌ విఫలమైనా....స్టార్‌ స్పిన్నర్ అశ్విన్‌, రవీందర్‌ జడేజా, అమిత్‌ మిశ్రాలు చెలరేగడంతో భారత జట్టుకు పోటీనే లేకుండా పోయింది. స్పిన్‌ మ్యాజిక్‌తో సఫారీ టీమ్‌కు షాకిచ్చి మరో మ్యాచ్‌ మిగిలుండగానే టెస్ట్‌ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇషాంత్‌ శర్మ మినహా టెస్ట్ ఫార్మాట్‌లోఒక్కరికి కూడా కనీసం 50 మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా లేదు. అయినా సొంతగడ్డపై భారత జట్టు పెద్ద సంచలనమే సృష్టించింది. టెస్టుల్లో టాప్‌ ర్యాంక్‌లో ఉన్న సౌతాఫ్రికా జట్టు...స్పిన్‌ ట్రాప్‌లో పడేసి సిరీస్‌ను సొంతం చేసుకొని అందరినీ ఆశ్చర్యపరచారు. టీ20 సిరీస్‌ పోయింది. వన్డే సిరీస్‌ కూడా దక్కలేదు. టాప్‌ ర్యాంకర్ సఫారీ టీమ్‌తో టెస్ట్ సిరీస్‌ నెగ్గడం గగనమే అనుకున్నారంతా....కానీ కట్‌ చేస్తే టెస్టుల్లో సీన్‌ మారింది.
టీమిండియా పూర్తి స్థాయిలో ఆధిపత్యం
విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని యంగ్‌ టీమిండియా నాగ్‌పూర్‌ టెస్ట్ లో పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. మూడు రోజుల పాటు సాగిన స్పిన్‌ వార్‌లో భారత జట్టే విజేతగా నిలిచింది. బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా....స్టార్‌ స్పిన్నర్ అశ్విన్‌, రవీందర్‌ జడేజా, అమిత్‌ మిశ్రాలు చెలరేగడంతో భారత జట్టుకు పోటీనే లేకుండా పోయింది.
అశ్విన్‌, అమిత్‌ మిశ్రాల ధాటికి సఫారీ బ్యాట్స్‌మెన్‌ క్యూ 
ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 2 వికెట్లకు 32 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టుకు ...బ్యాట్స్‌మెన్‌ మరోసారి విఫలమవ్వడంతో ఓటమి తప్పలేదు. భారత స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌, అమిత్‌ మిశ్రాల ధాటికి సఫారీ బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టారు. ఎంతో ఓర్పుగా బ్యాటింగ్‌ చేసిన కెప్టెన్‌ హషీమ్‌ ఆమ్లా, ఫాఫ్‌ డు ప్లెసిస్‌ .... 5 వికెట్‌కు 278 బంతుల్లో అతికష్టం మీద 72 పరుగులు జోడించిన ఈ ఇద్దరు భారత బౌలర్లకు పెద్ద పరీక్షే పెట్టారు. మూడో రోజు క్రీజ్‌లో పాతుకు పోయిన హషీమ్‌ ఆమ్లా, ఫాఫ్‌ డు ప్లెసిస్‌లను మిశ్రా బోల్తా కొట్టించగా...లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ను అశ్విన్‌ స్పిన్‌ మ్యాజిక్‌తో ముప్పుతిప్పలు పెట్టాడు.దీంతో 310 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ టీమ్‌ను 185 పరుగులకే కుప్పకూలింది. భారత జట్టు 124 పరుగుల తేడాతో నెగ్గి.....2-0తో టెస్ట్‌ సిరీస్‌ను సొంతం చేసుకుంది.
అశ్విన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్‌ 
29.5 ఓవర్లలో 66 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టి భారత జట్టుకు సంచలన విజయాన్నందించిన స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది. ఈ టెస్ట్‌ సిరీస్‌ విజయంతో వన్డే ,టీ 20 సిరీస్‌ల్లో దక్షిణాఫ్రికా జట్టు చేతిలో ఎదురైన పరాభవానికి భారత జట్టు బదులు తీర్చుకుంది.

 

 

 

నాగపూర్ టెస్టులో భారత్ ఘన విజయం

మహారాష్ట్ర : నాగపూర్ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 124 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. భారత బౌలర్ల స్పిన్ మాయాజాలానికి మూడు రోజుల్లోనే ఆట ముగిసింది. 2-0 తేడాతో టీమిండియా సీరిస్ ను కైవసం చేసుకుంది.

 

భార్యపై కిరోసిన్ పోసి ..

నల్లగొండ: బోడుప్పల్‌లో దంపతుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆవేశంతో భర్త భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో భార్య మృతిచెందింది. ఈ సంఘటనలో భర్తకు కూడా కాలిన గాయలైనాయి.

దయానిధి మారన్ కు సుప్రీం లో ఎదురు దెబ్బ

హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వారం రోజుల్లో సీబీఐ ఎదుట హాజరు కావాలని సుప్రీం స్పష్టం చేసింది. 

తెలంగాణ వ్యాప్తంగా భూముల రీసర్వే :రేమండ్ పీటర్

హైదరాబాద్ : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ వ్యాప్తంగా భూములు రీ సర్వే చయిస్తామని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ తెలిపారు. భూముల రీ సర్వే కోసం కావాల్సిన పూర్తి నిధులను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.

రాజ్యసభ వాయిదా

న్యూఢిల్లీ: రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా పడింది. ఇవాళ పార్లమెంట్ శీతాకాల రెండో రోజు సమావేశాల్లో రాజ్యాంగంపై కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ చర్చ ప్రారంభించారు. అనంతరం సభను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేస్తోన్నట్టు ఛైర్మన్ ప్రకటించారు.

ఫాం హౌస్ లో కేసీఆర్ దంపతులు

మెదక్: జిల్లాలోని ఎర్రవెల్లిలో ఉన్న సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో సీఎం దంపతులు ఆయుత చండీయాగం పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఈమేరకు ఇవాళ వాళ్లు యాగం ప్రారంభానికి ముందు చేయాల్సిన ప్రత్యేక పూజలను నిర్వహించారు. కాగా, దేశవ్యాప్తంగా ఉన్న పెద్దపెద్ద పండితులు, పామరులను రాష్ర్టానికి పిలిపించి సీఎం కేసీఆర్ ఆయుత చండీయాగం నిర్వహించతలపెట్టిన విషయం తెలిసిందే.

13:27 - November 27, 2015

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని నేను కూడా ఆకాంక్షిస్తున్నానని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. రాజ్యాంగ దినోత్సవం ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో లోక్‌సభలో ఆయన మాట్లాడారు. నీతి అయోగ్ పరిశీలనలో ప్రత్యేక హోదా అంశం ఉందని చెప్పారు. దేశ సమగ్రతను, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలు పని చేయాలన్నారు. ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కోరుతున్నాయని చెప్పారు. అభివృద్ధి చెందిన పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నాయని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ లోటు బాగా ఉన్నందునే ప్రత్యేక హోదా అడుతున్నారని వెంకయ్య నాయుడు చెప్పారు.

రాజ్ నాథ్ తో ఏపీ డీజీపీ, సుజనా చౌదరి భేటీ...

ఢిల్లీ : ఏపీ డీజీపీ జేవీ రాముడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కొద్దిసేపటి క్రితం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావులు వెంటరాగా కేంద్ర హోం మంత్రితో రాముడు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

13:14 - November 27, 2015

హైదరాబాద్ : వరకట్న వేధింపులకు మరో మహిళ బలి అయ్యింది. కూకట్‌పల్లి మైత్రినగర్‌లో ఈ ఘటనలో చోటు చేసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆత్మహత్య చేసుకున్న ప్రసన్న భర్త మనోహర్‌రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అని పోలీసులు చెప్పారు. కాగా వీరు కర్నూలు జిల్లాకు చెందిన వారు. అత్తింటివారే తమ అమ్మాయిని చంపారని మృతురాలి బంధువులు ఆరోపించారు. పెళ్లయిన వారం రోజులనుండే వేధిస్తుండే వాడని ప్రసన్న తల్లిదండ్రులు చెప్తున్నారు. నిరంతరం ఇంట్లో గొడవలు జరుగుతుండేవని స్థానికులు తెలిపారు. మరో వైపు పోలీసులు అనుమానస్పద మృతి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

అఫ్జల్ గంజ్ లో దోపిడీకి యత్నం..

హైదరాబాద్ : నగరంలోని అఫ్జల్ గంజ్ లో దొంగలు దోపిడీకి యత్నించారు. మహేష్ బ్యాంక్ లో రూ. 7 లక్షలు డిపాజిట్ చేసేందుకు వెళ్తున్న వ్యాపారి సత్యనారాయణ నుంచి బ్యాగ్ ను దొంగిలించాడు దొంగ. సత్యనారాయణ కేకలు వేయడంతో పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు అప్రమత్తమై దొంగ వసీమ్ ను పట్టుకున్నారు. అనంతరం దొంగ వద్ద నుంచి రూ. 7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

హన్మకొండ బస్టాండ్‌లో పేలుడు పదార్థాలు..

వరంగల్: హన్మకొండ బస్టాండ్‌లో ఇవాళ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బాంబుస్కాడ్ సాయంతో తనిఖీలు నిర్వహించి సుమారు 7.5 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు. స్టోన్ క్రషర్ లో ఉపయోగించే పేలుడు పదార్థాలుగా గుర్తించినట్టు సమాచారం.

12:40 - November 27, 2015

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్‌వాడీలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు దిగారు. జీతభత్యాల పెంపు అంశంపై మంత్రివర్గ ఉపసంఘం మరోసారి చర్చించామన చెపుతూ మోసపూరిత ప్రకటనలు మానుకుని జి.ఓ ను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది రోజులు అంగన్ వాడీలు ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. గతంలోఅం గన్ వాడీ ఉద్యోగుల పోరాటంతో ప్రభుత్వాలే కూలిపోయాయని ఈ ప్రభుత్వం గుర్తించాలని హెచ్చరించారు. అంగన్ వాడీలకు వామపక్షాలు, సిఐటియు మద్దతు తెలిపాయి. మరో వైపు ఆందోళన చేపట్టిన అంగన్ వాడీ కార్యకర్తలను ఎక్కడికక్క డ అరెస్టు చేస్తున్నారు.

మంత్రి వర్గ ఉపసంఘం ఆమోదం తెలిపినెలలు గడిచింది....

అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల జీతభత్యాలను పెంచేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. త్వరలో జరిగే కేబినెట్‌ భేటీలో ఈ మేరకు జీవో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ నాన్చివేత థోరణిని నిరసిస్తూ అంగన్‌వాడీల ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి 2015 మే 12న మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది ఏపీ సర్కార్. ఆర్ధికమంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు నేతృత్వంలో మంత్రులు పీత‌ల సుజాత, అచ్చ న్నాయుడు, కామినేని శ్రీనివాస్‌ స‌భ్యులుగా ఈ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ క‌మిటీ ఇప్పటికీ దాదాపు 4 సార్లు స‌మావేశం అయ్యింది. అంగ‌న్‌వాడీ టీచ‌ర్‌కు రూ.4,200 నుంచి 7,100కు, హెల్పర్లకు రూ.2,400 నుంచి 4,600కు వేతనాల పెంపుకు అంగీకారం తెలిపారు. మినీ అంగ‌న్ వాడీ కార్యక‌ర్తల‌కు 2950 నుంచి 4600 వ‌ర‌కూ వేత‌నం పెంచాల‌ని ఏపీ క్యాబినెట్ స‌బ్ క‌మిటీ ప్రభుత్వానికి నివేదించింది. ఇంతే కాకుండా అంగ‌న్‌వాడీల‌కు రిటైర్డ్ అయిన త‌రువాత గ్రాడ్యూటీ 50 వేలు ఇవ్వాల‌ని కూడా నిర్ణయించింది. ఈ విష‌యాన్ని అప్పట్లో కార్మిక శాఖ మంత్రి అచ్చం నాయుడు కూడా చెప్పారు.

12:34 - November 27, 2015

హైదరాబాద్ : రెప్పపాటులో 18 సినిమాల డౌన్‌లోడింగ్. ఒక సెకనుకు 224 జీబీ స్పీడ్. ఇదేంటి వైఫై అనుకుంటున్నారా. దీనికి అబ్బలాంటి లైఫై. అవును. వైఫై కి 100 రెట్లు మేలైన లైఫ్ ఒక ఎల్ఈడీ బల్బు ఉంటే చాలు. ఆ వెలుతురు ప్రసరించేంత వరకు హైస్పీడ్ ఇంటర్నెట్‌ బ్రౌజ్‌ చేయొచ్చు. ఇంతకీ ఈ లైఫై ఏంటి...ఎలా పని చేస్తుంది...వాచ్‌ దిస్‌ స్టోరి.

ఇప్పటి వరకు వైఫై అంటేనే.....

ఇప్పటి వరకు వైఫై అంటేనే మనకు అదొక బ్రహ్మాండమైన ఆవిష్కరణలా అనిపిస్తుంది. ఈ వైఫై సౌకర్యాన్ని ఒక అద్భుతంలా అందరూ భావిస్తున్నారు. ఇది ఇంకా పాతబడకముందే మరో సరికొత్త ఆవిష్కరణ ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థను కొత్త శిఖరాలకు చేర్చబోతోంది. అదే లైఫై లైట్ ఫిడెలిటి.

ఎల్ ఈడీ బల్బు వెలుగు తరంగాలతో పని చేసే లైఫై...

వైఫైకి, లైఫైకి చాలా తేడా ఉంది. వైఫై రేడియో తరంగాల ఆధారంగా డేటాను చేరవేస్తుంది. LED బల్బు వెలుతరు తరంగాలతో పని చేస్తుంది. కానీ వైఫై కెపాసిటీకి చాలా లిమిట్స్ ఉన్నాయి. 2019 నాటికి రేడియో తరంగాల వినియోగం భారీగా పెరుగుతుంది. దీంతో వైఫై సిగ్నల్స్ మరింత స్లో అవుతాయి. అంతేకాదు సెన్సిటివ్ డేటా కూడా తస్కరణకు గురయ్యే అవకాశముంది. కానీ లైఫైలో అలాంటి ప్రాబ్లమ్ ఉండదు.

వైఫైతో పోల్చితే లైఫై వందరెట్లు వేగం....

వైఫైతో పోల్చితే లైఫై వందరెట్లు వేగం. రెప్పపాటులో 18 హాలీవుడ్ సినిమాలను డౌన్‌లోడ్ చేయొచ్చు. సెకనుకు 224 జీబీ స్పీడ్‌తో పని చేస్తుందని ఇప్పటికే శాస్త్రవేత్తల పరిశోధనల్లో ప్రూవ్ అయ్యింది. అంతేకాదు ఇది పని చేసేది కూడా LED బల్బుతోనే. బల్బు స్విచ్ ఆన్ చేస్తే లైఫై స్టార్టవుతుంది. ఆఫ్‌ చేస్తే బందవుతుంది.

డివైస్‌లలో చిన్న చిప్‌ అమర్చుకోవాలి.........

ఆ వెలుతురు ఎక్కడి వరకు ప్రసరిస్తే అక్కడి వరకు మొబైల్స్, ల్యాప్ టాప్‌, ట్యాబ్‌, కంప్యూటర్లలో ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయొచ్చు. మనం ఉపయోగించే డివైస్‌లలో చిన్న చిప్‌ అమర్చుకోవాలి. అది లైట్‌ తరంగాలను గ్రహిస్తుంది. కంటికి కనపడని తరంగాలు డేటాను ట్రాన్స్ ఫర్ చేస్తాయి. ఈ లైట్ స్పెక్ట్రమ్...రేడియో తరంగాల కంటే పదివేల సార్లు ప్రభావమంతమైనవి.

హారాల్డ్ హాస్. ఎడిన్‌ బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్...

హారాల్డ్ హాస్. ఎడిన్‌ బర్గ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్. 2011లోనే ఈయన టీఈడీ టాల్క్ పేరుతో ఈ లైఫైను ప్రదర్శించారు. ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థను ఈ లైఫై మారుస్తుందని చెబుతున్నారు హారాల్డ్ హాస్.

క్షణంలో సమాచార పంపిణీ....

ఎల్ ఈడీ బల్బు సాయంతో ఇంటర్నెట్‌ వచ్చేస్తుంది. అంటే ఇంటిలోపలా, బయటా, స్ట్రీట్ లైట్స్, ట్రాఫిక్‌ సిగ్నల్స్, కారు, హాస్పిటల్స్, ట్రైను, విమానం, ఆఖరికి సముద్రపుగర్భంలోనూ లైటు ద్వారా మనం ఇంటర్నెట్‌ను పొందవచ్చు. క్షణంలో సమాచారాన్ని పొందవచ్చు. పంపవచ్చు. రెప్పపాటులో ప్రపంచానికి కమ్యూనికేట్ చేయొచ్చు. ప్రమాదాలను నివారించవచ్చు. సరికొత్త ఆవిష్కరణలు నెలవు కావచ్చు. ఒక ఎల్‌ఈడీ బల్బ్ ప్రపంచాన్ని మరింత స్మార్ట్ గా వెలిగేందుకు వెలుతునిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా లైఫై అందుబాటులోకి రావడానికి మరికొద్ది కాలంలో వెయిట్ చేయకతప్పదు.

ఏపీకి ప్రత్యేకహోదా రావాల్సిందే: వెంకయ్యనాయుడు..

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సిందేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పార్లమెంట్ లో వెల్లడించారు. ఏపీకి రెవెన్యూ లోటు ఉన్నందునే హోదా కావాలని ప్రజలు కోరుతున్నారని, అలా కోరుతున్నవారిలో తాను కూడా ఉన్నానని స్పష్టం చేశారు. హోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ధి త్వరితగతిన సాగుతుందని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం నీతి ఆయోగ్ పరిశీలనలో ఉందని వెల్లడించిన ఆయన, ఏపీ అభివృద్ధికి, విభజన హామీల అమలుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు.

పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు : ఏపీపీఎస్సీ ఛైర్మన్

విజయవాడ :ఏపీలో వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడతామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయభాస్కర్‌ చెప్పారు. త్వరలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. అవసరమైతే సిలబస్‌లో మార్పులు చేస్తామన్నారు. దళారుల మాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని ఆయన కోరారు.

హైదరాబాద్ లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

హైదరాబాద్‌ : నగరంలో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు అయింది. నలుగురు సభ్యులున్న ముఠాతోపాటు 55 గ్రాముల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ఆఫ్రికా దేశస్థుడు, ముగ్గురు విద్యార్థులున్నారు. గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను ఈ ముఠా సరఫరా చేసిందని పోలీసులు చెప్పారు.

ఏసీబీ వలలో బనగానపల్లెలో విద్యుత్ శాఖ ఏడీఈ

కర్నూలు : ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ బనగాన పల్లె విద్యుత్ శాఖ ఏడీఈ సుధాకర్ రావు ఏసీబీకి చిక్కాడు.

కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

తూ.గో : కాకినాడ కలెక్టర్ ను ముట్టడించేందుకు అంగన్ వాడీ కార్యకర్తలు యత్నించగా వారిని పోలీసులు అడ్కుఉనే ప్రయత్నం చేశారు. పోలీసులకు.. అంగన్ వాడీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దాదాపు 10 వే లమంది కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ గేట్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఆర్టికల్ 356ని అనేక సార్లు దుర్వినియోగం చేశారు : జైట్లీ

ఢిల్లీ : రెండో రోజు రాజ్యసభలో 'రాజ్యాంగం' పై చర్చ ప్రారంభం అయ్యింది. ఈ చర్చలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ... 'ఆర్టికల్ 356ని అనేక సార్లు దుర్వినియోగం చేశారు. 1970 లో ఆర్టికల్ 21ని రద్దు చేసి పౌర స్వేచ్ఛను హరించారు. ఈ రోజు టీవీ ముందుకు వచ్చి మాట్లాడితే చాలా అసహనం అంటున్నారు. భూ సేకరణ బిల్లుపై చర్చ పెడితే ప్రాథమిక హక్కులకు భంగం అంటూ అడ్డుకున్నారు. ఎవరికి వారు తమ ప్రాంతాలు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. ఫెడరల్ రాజకీయాలు అభివృద్ధి చెందాయి. ప్రాంతీయ పార్టీలు అధికారంలో కీలకంగామారాయి. అని చెప్పారు. ఇంకా చర్చ కొనసాగుతోంది.

ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదు : వెంకయ్యనాయుడు

ఢిల్లీ : రెండో రోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ లో ప్రత్యేక చర్చ ఈ రోజు కూడా కొనసాగనుంది. సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన స్లావేనియా ప్రతినిధులు ప్రత్యేక గ్యాలరీలో కూర్చున్నారు. ఎంపీగా కాంతిలాల్ భూరియా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ క్షమాపణకు కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గెహ్లాట్ సభలో లేరని వచ్చాక క్షమాపణ చెబుతారని వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. దీంతో విపక్షాలు ఆందోళన చేపట్టాయి.

ప్రారంభమైన మోత్కుపల్లి పాదయాత్ర

నల్గొండ : యాదగిరి గుట్టను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆలేరు నుంచి యాద్రాద్రి వరకు టిడిపి నేత మోత్కుపల్లి పాదయాత్ర పార్రంభమైంది.

ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు

ఢిల్లీ : రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ లో ప్రత్యేక చర్చ ఈ రోజు కూడా కొనసాగనుంది.

కూకట్‌పల్లి మైత్రినగర్‌లో ఓ మహిళ ఆత్మహత్య

హైదరాబాద్ : కూకట్‌పల్లి మైత్రినగర్‌లో ఉర్తివేసుకొని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న మహిళ భర్త మనోహర్‌రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అని పోలీసులు చెప్పారు. కాగా అత్తింటివారే తమ అమ్మాయిని చంపారని మృతురాలి బంధువులు ఆరోపించారు.

హిమాచల్ ప్రదేశ్ సీఎం అక్రమాస్తుల కేసులో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ పలుమార్లు వీరభద్ర సింగ్ ఇళ్లలో సోదాలు చేసింది. అంతేకాక ఆయన అరెస్ట్ ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు అడ్డుకుంటోందని ఆరోపించిన సీబీఐ, కేసు విచారణను ఏకంగా ఢిల్లీ హైకోర్టుకు బదలాయించుకుంది. తాజాగా వీరభద్ర సింగ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొద్దిసేపటి క్రితం నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు సమన్లు జారీ చేసింది.

గుడివాడ మున్సిపాలిటీలో అక్రమాలు

కృష్ణా : గుడివాడ మున్సిపాలిటీలో అక్రమాలు జరిగాయి. రూ. 5 లక్షల బిల్లును మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్లకు రెండు సార్లు చెల్లించారు. మున్సిపల్ కౌన్సిలర్ ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన కౌన్సిల్ సమావేశంలో రహస్యంగా చర్చ జరిగింది. మిగిలిన బిల్లులపై లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. అక్రమాలలో ప్రముఖుల పాత్ర ఉన్నట్లు సమాచారం.

10:35 - November 27, 2015

విజయవాడ : సీఆర్‌డీఏ ఏడీఎం సాయికుమార్‌ ఇంట్లో మరోసారి ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. 7 బ్యాంక్‌ అకౌంట్ల పత్రాలు, 4 ఇళ్లకు సంబంధించిన కాగితాలు, 10 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. మూడంతస్థుల భవనం కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 16వ తేదీన సాయికుమార్‌పై ఏసీబీ దాడులు చేసింది. కేసు కూడా నమోదు చేశారు. అంతే కాకుండా కాసేట్లో ఏసీబీ అధికారులు మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం.

 

10:33 - November 27, 2015

చిత్తూరు : నారావారిపల్లె అంతా సందడి వాతావరణం నెలకొంది. ఇటు నందమూరి..అటు నారావారి కుటుంబాలు పండగ చేసుకుంటున్నాయి. ఆ పండక్కి కారణం బాబు, బాలయ్యల మనవడే. లోకేష్‌, బ్రాహ్మణిల కుమారుడికి పుట్టెంట్రుకలు తీసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అందరూ తరలిరావడంతో నారావారిపల్లె కళకళలాడిపోయింది.

10:31 - November 27, 2015

హైదరాబాద్ : సుల్తాన్‌బజార్‌లో మెట్రోరైల్‌ వివాదం చెలరేగుతోంది. తరతరాలుగా తమకు ఆధారంగా ఉన్న షాపులను తొలగించొద్దని వ్యాపారులు బంద్‌ నిర్వహిస్తున్నారు. మొదట్లో కేసీఆర్‌ రూట మారుస్తున్నట్లు ప్రకటించడంతో.. వారంతా సంబరాలు చేసుకున్నారు. కాని మళ్లీ పాత రూటే ఖరారైందని తెలియడంతో అందరూ నిరసనలకు దిగారు. అప్పుడు కూడా హామీ ఇచ్చారు. కాని నిన్న ఎల్‌అండ్‌టీ ఎండీ సుల్తాన్‌ బజార్‌పై నుంచే మెట్రో రైల్‌ వెళుతుందని స్పష్టంగా ప్రకటించడంతో.. వర్తకులంతా నేడు బంద్‌కు దిగారు. మెట్రో రూటు మార్చి ఆదుకోండి కేసీఆర్‌జీ అంటూ వారంతా విన్నవించుకుంటున్నారు. మరో వైపు ఆందోళన చేస్తున్నా వ్యాపారస్థులను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో భారీ పోలీసులు మోహరించారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

10:27 - November 27, 2015

హైదరాబాద్ : చల్లబడిందనుకుంటున్న ఓటుకు నోటు కేసు మళ్లీ ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక రాకతో వేడెక్కింది. స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించిన వీడియో, ఆడియో టేపులు సరైనవేనని.. రేవంత్‌, సండ్ర వెంకటవీరయ్య, మత్తయ్యల వాయిస్‌లు సరిపోయాయంటూ ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు ఇచ్చింది. దీంతో అదనపు ఛార్జిషీటు దాఖలు చేయడానికి ఏసీబీ సిద్ధమవుతోంది. అయితే చంద్రబాబు వాయిస్‌ శాంపిల్స్‌ కూడా సేకరిస్తే.. దానిపై కూడా ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక తెప్పించుకోవచ్చని ఏసీబీ భావిస్తోంది.

10:26 - November 27, 2015

చిత్తూరు : తిరుపతిలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. జలకళతో ఉట్టిపడుతున్న కళ్యాణి డ్యామ్‌ను నేడు సీఎం సందర్శించనున్నారు. నిండుగా నీళ్లతో నిండి ఉన్న డ్యామ్‌కు ఇప్పటికే సందర్శకులు బాగా పెరిగారు. సీఎం వస్తున్నందున భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. డ్యామ్‌ వద్ద చంద్రబాబు గంగాపూజ నిర్వహించనున్నారు.

కాంగ్రెస్ ఎంపీలతో సోనియా, రాహుల్ భేటీ

హైదరాబాద్ : పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలతో ఆ పార్టీ అధ్యక్షులు రాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించినట్లు సమాచారం.

చిత్తూరు జిల్లాలో ఏగనుల బీభత్సం

 చిత్తూరు: గుడుపల్లి మండలం పెద్దపర్తికుంట, బోయినపల్లి, చినపర్తికుంట, అలుగుమాని పల్లె, సంగనపల్లెలో శుక్రవారం తెల్లవారుజామున ఏనుగులు బీభత్సం సృష్టించాయి. సంగన పల్లె ప్రాంతంలో 3 ఏనుగులు ఇద్దరు రైతులపై దాడి చేశాయి. బోయనపల్లి గ్రామానికి చెందిన మురుగేశ్, గణేష్ లు పొలంలోని కల్లంలో నిద్రిస్తుండగా ఏనుగులు వారిపై దాడి చేశాయి. స్థానికులు వారిని ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో మురుగేశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

నాగ్ పూర్ లో మూడో రోజు టెస్ట్ మ్యాచ్ ఆరంభం

హైదరాబాద్ : మహారాష్ట్రంలోని నాగ్ పూర్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆరంభమైంది.

నారావారి పల్లెలో సందడి...

చిత్తూరు : నారావారిపల్లెలో ప్రముఖుల రాకతో కోలాహలం ఏర్పడింది. ఏపీ సీఎం చంద్రబాబు తన మనవడు దేవాన్ష్ తలసీలాలు తీయిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ కుటుంబసభ్యులు హాజరయ్యారు. నాగాలమ్మ గుడి దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖుల రాకతో నారావారిపల్లెలో పండగ వాతావరణం కనిపించింది.

ఎంపీ మిథున్ రెడ్డి పై కేసు నమోదు

చిత్తూరు : తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా సిబ్బందిపై దాడి చేసిన ఘటనకు సంబంధించి కడప జిల్లా రాజంపేట వైసీపీ ఎంపి మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరో 13 మంది పై ఏర్పేడు పీఎస్ లో కేసు నమోదయ్యింది.

09:32 - November 27, 2015

హైదరాబాద్ : సుల్తాన్ బజార్ వ్యాపారుల సంఘం శుక్రవారం బంద్ కు పిలుపునిచ్చింది. మెట్రో మార్గాన్ని సుల్తాన్ బజార్ మీదుగా వెళ్లకుండా మర్చాలని డిమాండ్ చేస్తూ వ్యాపారాలు బంద్ నిర్వహిస్తున్నారు. దీంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ప్రతి దుకాణం ముందు వ్యాపారులు 'సేవ్ సుల్తాన్ బజార్ ' పేరుతో పోస్టర్లు అంటించారు. మరో వైపు గురువారం నుండి ఎల్ అండ్ టీ, మెట్రో రైల్ ఎండీ వి.బి. గాడ్గిల్ పాత సుల్తాన్ బజారు మీదుగా మెట్రో రైలు మార్గం వెళ్తుందని స్పష్టం చేశారు.

నేడు బంద్ కు పిలుపునిచ్చిన సుల్తాన్ బజార్ వ్యాపారుల సంఘం

హైదారాబాద్ : సుల్తాన్ బజార్ వ్యాపారుల సంఘం శుక్రవారం బంద్ కు పిలుపునిచ్చింది. మెట్రో మార్గాన్ని సుల్తాన్ బజార్ మీదుగా వెళ్లకుండా మర్చాలని డిమాండ్ చేస్తూ వ్యాపారాలు బంద్ నిర్వహిస్తున్నారు.

మార్చి 21నుంచి టెన్త్ పరీక్షలు..

హైదరాబాద్ : టెన్త్‌ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 9వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే ఈ సారి పరీక్షలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోఒకే షెడ్యూల్‌ ప్రకారం జరగనుండడం విశేషం! ఇరు రాష్ట్రాల విద్యామంత్రుల సూచనల మేరకు ఎస్‌.ఎ్‌స.సి. బోర్డులు ఓ అవగాహనకు వచ్చాయి. ఇరు రాష్ట్రాల్లో విభిన్న షెడ్యూల్‌తో పరీక్షలు నిర్వహిస్తే, ప్రశ్నలు కలుస్తున్నాయన్న వాదనకు చెక్‌ పెట్టడమే ఈ నిర్ణయం వెనుక కారణం. గతేడాది రెండు రాష్ట్రాల్లో ఒక్కరోజు తేడాతో పదో తరగతి పరీక్షలు మొదలయాయి.

09:13 - November 27, 2015

హైదరాబాద్ : ఉరిశిక్ష పడ్డ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టడం తెలుసు.. కానీ అమెరికా అధ్యక్షుడు ఒబామా రెండు టర్కీ కోళ్లకు క్షమాభిక్ష పెట్టారు. కోళ్లకు క్షమాభిక్ష ఏంటనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడండి మీకే తెలుస్తుంది.

వైట్‌హౌస్‌కు రెండు టర్కీ కోళ్లు....

అమెరికా అధ్యక్షుని నివాసమైన వైట్‌హౌస్‌కు రెండు టర్కీ కోళ్లను తీసుకువచ్చారు అధికారులు. హానెస్ట్, అబె పేర్లు కలిగిన ఈ కోళ్లకు అధ్యక్షుడు బరాక్‌ ఒబామా క్షమాభిక్ష పెట్టారు. తన ఇద్దరు కుమార్తెల సమక్షంలో కోళ్లకు ప్రాణం పోశారు. రోజ్‌ గార్డెన్‌లో జరిగిన ఈ వేడుకులకు పలువురు అధికార, అనధికార ప్రముఖులు హాజరయ్యారు. ఇకపై వైట్‌ హౌస్‌ ప్రాంగణంలోని వెయ్యి ఎకరాల్లో ఉన్న టర్కీ కోడి పెంపక కేంద్రంలో ఈ టర్కీ కోళ్లు దర్జాగా బతుకుతాయి.

క్షమాభిక్ష ప్రసాదించడం వెనుక పెద్దకథే....

కోళ్లకు క్షమాభిక్ష ప్రసాదించడం వెనుక పెద్దకథే ఉంది. థ్యాంక్స్ గివింగ్‌డే సందర్భంగా అధ్యక్షుడు ఒక కోడికి క్షమాభిక్ష పెట్టడం 1947నుంచి ఆనవాయితీగా వస్తోంది. అంతకు ముందు వరకు ఏటా జరిగే థ్యాంక్స్ గివింగ్‌డే ఉత్సవాల్లో కోళ్లను వండి ఆరగించేవారు. ఈ ఏడాది రెండు కోళ్లను అధ్యక్ష భవనానికి తీసుకురావడంతో ఒబామా వాటికి క్షమాభిక్ష ప్రసాదించారు. థ్యాంక్స్‌ గివింగ్‌ డే వేడుకలకు తన కుమార్తెలు కూడా హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు ఒబామా.

బహుమతిగా ఇచ్చే కోళ్ల ఎంపిక వెనుక ఒక పెద్ద ప్రక్రియే......

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షునికి బహుమతిగా ఇచ్చే కోళ్ల ఎంపిక వెనుక ఒక పెద్ద ప్రక్రియే వుంటుంది. అత్యుత్తమ జాతికి చెందిన 80 టర్కీ కోళ్లను దీని కోసం ఎంపిక చేస్తారు. వీటిలో నుంచి తిరిగి ఒకటి లేదా రెండు మంచి కోళ్లను తీసుకువచ్చి అధ్యక్షునికి అప్పగిస్తారు. క్షమాభిక్ష అనంతరం వీటిని సంరక్షణకేంద్రంలో వుంచుతారు. వాటి చివరిశ్వాస వరకు అవి అక్కడే వుంటాయి.

థ్యాంక్స్‌ గివింగ్‌ డే సందర్భంగా...

గత ఏడాది వచ్చిన పంటల ద్వారా దేశ వాసులకు ఆహార సరఫరా చేసిన రైతులకు ధన్యవాదాలు తెలిపేందుకు థ్యాంక్స్‌ గివింగ్‌ డే జరుపుకోవడం ఆనవాయితీ. అమెరికా, కెనడాలో ప్రారంభమైన ఈ వేడుకలు క్రమంగా ఇతర దేశాలకూ విస్తరిస్తున్నాయి. నవంబర్‌ నెల చివరి వారంలో ఈ వేడుకలు జరుపుతారు. థ్యాంక్స్‌ గివింగ్‌ డే సందర్భంగా ఒబామా దంపతులు పేదలకు ఆహారం పంపిణీ చేశారు.

సీఆర్ ఏ ఏడీఎం సాయికుమార్ ఇంట్లో సోదాలు..

విజయవాడ : సీఆర్ ఏ ఏడీఎం సాయికుమార్ ఇంట్లో మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 7 బ్యాంక్ అకౌంట్లు, 4 ఇళ్ల పత్రాలు, రూ.10 లక్షలు, మూడంతస్థుల భవనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

పొందుగుల చెక్ పోస్ట్ పై ఏసీబీ దాడులు

గుంటూరు : దాచేపల్లి మండలం పొందుగుల చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.68వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 8 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.

ఆడియో టేపుల్లోని వాయిస్ రేవంత్, సండ్రలవే

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిన ఓటుకు నోటు కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ ఓటును కొనుగోలు చేసేందుకు టీ టీడీపీ యత్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టీఫెన్ సన్ కు రూ.50 లక్షలు ముట్టజెబుతూ తెలంగాణ అసెంబ్లీలో టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా బుక్కయ్యారు. ఈ క్రమంలో సాక్ష్యాలుగా సేకరించిన ఏసీబీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి పంపింది.

కారు బోల్తా :ఒకరి మృతి

శ్రీకాకుళం :కొత్తరోడ్డు జంక్షన్ లో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అతివేగం వల్లనే కారు బోల్తా పడిందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

08:41 - November 27, 2015

హైదరాబాద్ : ప్రజా జీవితాల నుండి మతాన్ని వేరు చేయాలి... దేశ సమగ్రత కోసం లౌకితత్వం ఉండాలని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ద హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.కె.నాగేశ్వర్ తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్‌లో జరుగుతున్న చర్చలో భారత రాజకీయాల్లో సెక్యులర్‌ పదాన్ని దుర్వినియోగం చేస్తున్నారని హోంమంత్రి విపక్షాలపై ధ్వజమెత్తారు. అస్సలు సెక్యులర్ అంటే ఏమిటి? భారత దేశంలో సెక్యులర్ ఆవశ్యకత ఏమిటి? దేశంలో ప్రైవేటు యూనివర్శిటీ లను తీసుకు వచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. దీని వల్ల జరిగే నష్టాలు, లాభాల గురించి నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. ఈ అంశాలపై పూర్తి విశ్లేషణను తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:59 - November 27, 2015

హైదరాబాద్ : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చ జరిగింది. సామాజిక ధర్మం గురించి చర్చ చేయకుండా సనాతన ధర్మం గురించి మాట్లాడటం అంటే మరళా దేశ చరిత్రను వెనక్కు నడిపిస్తున్నట్లే అని న్యూస్ మార్నింగ్ చర్చలో సీనిరయర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అభిప్రాయపడ్డారు. బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ నుద్దేశించి కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. దళితుడైన అంబేడ్కర్‌ ఎన్నో అవమానాలకు గురైనా భారతదేశాన్ని వదిలి ఎప్పుడూ వెళ్లాలనుకోలేదని రాజ్‌నాథ్‌ అన్నారు. భారత రాజకీయాల్లో సెక్యులర్‌ పదాన్ని దుర్వినియోగం చేస్తున్నారని హోంమంత్రి విపక్షాలపై ధ్వజమెత్తారు. సనాత ధర్మంలో లౌకిక వాదం ఉందా?, భిన్న సంస్కృతలను గౌరవించాల్సిన అవసరం లేదా? ఆధ్యాత్మిక విషయాలకు సామాజిక అంశాలకు ముడిపెట్టడం సరేనా? ఏపీలో ఇసుక పాలసీ సీఎం చంద్రబాబు నాయుడు స్వేత పత్రం విడుదల చేశారు. దీని వల్ల వినియోగదారులకు ఎంత వరకు ఉపయోగపడుతుంది? ఆ శ్వేత పత్రానికి ఎంత విశ్వసనీయత ఉంటుంది? ఈ అంశాలపై చర్చ జరిగింది. ఈ చర్చలో తెలకపల్లి రవితో పాటు బిజెపి నేత చారి, కాంగ్రెస్ నేత గౌతమ్, టిడిపి నేత వర్లరామయ్య పాల్గొన్నారు. వారి మధ్య ఇంకా ఏఏ అంశాలు చర్చకు వచ్చాయో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:39 - November 27, 2015

         యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీస్‌ సంస్థ ఒక భారీ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమం అక్టోబర్‌ 25న జరిగింది.  ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్‌ లాల్‌ కీలక పాత్ర పోషించబోతున్నారు. ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌తో పోటాపోటీగా సాగే ఈ పాత్ర గురించి వినగానే మోహన్‌ లాల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కొరటాల శివ మాట్లాడుతూ... ''ఎన్టీఆర్‌లో ఉన్న నటుడికి, ఆయన మాస్‌ ఇమేజ్‌కి సరిపడే కథ ఇది. ఇటువంటి భారీ ప్రాజెక్ట్‌లో మోహన్‌ లాల్‌ కూడా ఉండటం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఇద్దరు అద్భుతమైన నటులు కలిసి పండించే సన్నివేశాలు ప్రేక్షకులకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ చిత్రానికి సంగీతాన్ని దేవీ శ్రీ ప్రసాద్‌ అందిస్తారు. కెమెరామేన్‌గా ఎన్నో ప్రశంసలు అందుకున్న తిరు పని చేస్తారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్‌లు ఉంటారు. ఈ వివరాలు త్వరలో తెలియజేస్తాం. వచ్చే ఏడాది తొలి మాసాలలో చిత్రీకరణ ప్రారంభించి, ఆగస్టు 12న విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం'' అని అన్నారు. నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ - కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చే ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో, ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మిస్తామని తెలిపారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని వెల్లడించారు.

07:21 - November 27, 2015

హైదరాబాద్ : దేశంలో అసహనంపై మాట్లాడినందుకు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌ను హిందుత్వ శక్తులు టార్గెట్‌ చేశాయి. తాజాగా పంజాబ్‌లో శివసేన నాయకులు ఆందోళన చేపట్టారు. లుధియానాలో 'దంగల్' సినిమా షూటింగ్‌ కోసం అమీర్‌ బస చేసిన ఎంబీడీ రాడిసన్ బ్లూ హోటల్ వద్ద నిరసనకు దిగారు. అమీర్ ఖాన్‌ను చెంపదెబ్బ కొట్టిన వారికి లక్ష రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు. మరోవైపు అమీర్‌ కుటుంబం మొత్తం పాకిస్థాన్ వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్కయ్యాయి. అమీర్ ఖాన్, ఆయన భార్య, కొడుకు కోసం నవంబర్ 30న పాక్ వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్ అయ్యాయని, వాటిని హిందూసేన బుక్ చేసిందని ఢిల్లీకి చెందిన ఓ పాత్రికేయుడు ట్వీట్ చేశారు. అయితే టికెట్లు బుక్ అయినట్లు ఉంది గానీ.. వాటిని ఎవరు బుక్ చేశారనడానికి మాత్రం అందులో ఎలాంటి ఆధారం లేదు.

అమీర్ కు మమతా బెనర్జీ మద్దతు..

మరోవైపు అమీర్‌కు పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మద్దతు పలికారు. అమీర్‌ను దేశం విడిచి వెళ్లమనే హక్కు ఎవరికీ లేదన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని, ఆ పరిధిలోనే అమీర్‌ఖాన్‌ తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పారని అన్నారు.

తాను ఏకీభవించడంలేదని బీజేపీ ఎంపీ శతృఘ్నసిన్హా...

అటు అమీర్‌ వ్యాఖ్యలతో తాను ఏకీభవించడంలేదని బీజేపీ ఎంపీ శతృఘ్నసిన్హా అన్నారు. దేశానికి అసహన ముద్ర వేయడం సరికాదన్నారు. మన మాతృభూమి స్వతఃసిద్ధంగానే శాంతిని ప్రేమిస్తుందని, ప్రతి కులాన్ని, మతాన్ని గౌరవిస్తుందని శతృఘ్నసిన్హా ట్వీట్‌ చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ స్పందిస్తూ.. ఆమిర్‌ఖాన్ తన పూర్వీకులు నివసించిన అఖ్తియార్‌పూర్‌లో పర్యటించి, అక్కడి ప్రజల మధ్య ప్రేమ, సామరస్యం ఎలా ఉందో తెలుసుకోవాలన్నారు.

07:18 - November 27, 2015

హైదరాబాద్ : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చ జరిగింది. బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ నుద్దేశించి కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. దళితుడైన అంబేడ్కర్‌ ఎన్నో అవమానాలకు గురైనా భారతదేశాన్ని వదిలి ఎప్పుడూ వెళ్లాలనుకోలేదని రాజ్‌నాథ్‌ అన్నారు. భారత రాజకీయాల్లో సెక్యులర్‌ పదాన్ని దుర్వినియోగం చేస్తున్నారని హోంమంత్రి విపక్షాలపై ధ్వజమెత్తారు. మరోవైపు ప్రస్తుతం రాజ్యాంగ స్పూర్తికి ప్రమాదం పొంచి ఉందని సోనియా హెచ్చరించారు.

భారత రాజ్యాంగం- కట్టుబాట్లపై..

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా... భారత రాజ్యాంగం- కట్టుబాట్లపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభలో చర్చను ప్రారంభించారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్ కృషి ఎనలేనిదని ఆయన కొనియడారు. నిష్పాక్షికంగా, విమర్శలకు తావులేకుండా అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు.

అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి.......

దేశంలో నెలకొన్న అసహన పరిస్థితుల కారణంగా దేశం విడిచి వెళ్తానని బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలనుద్దేశించి హోంమంత్రి అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఓ దళితుడిగా అంబేడ్కర్ ఎన్నో అవమానాలకు గురైనా... తన భావోద్వేగాలను ఎన్నడూ బయటపెట్టలేదన్నారు. భారతదేశాన్ని వదిలి ఇతర దేశానికి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదన్నారు. భారతదేశాన్ని బలోపేతం చేసేందుకే అంబేడ్కర్‌ కృషి చేశారని రాజ్నాథ్ సింగ్ అన్నారు.

పనిలో పనిగా ప్రతిపక్షాలపై దాడి...

పనిలో పనిగా ప్రతిపక్షాలపై కూడా హోంమంత్రి దాడి చేశారు. భారత రాజకీయాల్లో ' సెక్యులర్‌' పదాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంబేడ్కర్‌ రాజ్యాంగ పీఠికలో సెక్యులర్‌ పదాన్ని వాడలేదని గుర్తు చేశారు. సోషలిస్టు-సెక్యులర్‌ పదాలను రాజ్యాంగం అమలులోకి వచ్చాకే జోడించారని తెలిపారు.

రాజ్యాంగ స్పూర్తికి ప్రమాదం పొంచి ఉంది....

ప్రస్తుతం రాజ్యాంగ స్పూర్తికి ప్రమాదం పొంచి ఉందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ హెచ్చరించారు. గత కొన్ని నెలలుగా దేశంలో నెలకొన్న పరిస్థితులు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగిస్తున్నాయన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకోనివారు, రాజ్యాంగంపై నమ్మకం లేనివారు రాజ్యాంగంపై చర్చించడం నవ్వులాటగా ఉందని సోనియా ఎద్దేవా చేశారు. రాజ్యాంగ నిర్మాణంలో డ్రాఫ్టింగ్‌ కమిటీకి కాంగ్రెస్‌ ఎంతో సహకరించిందని పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సం సందర్భంగా... పార్లమెంట్ ఉభయ సభలు అంబేడ్కర్ ఘనంగా నివాళులర్పించాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గౌరవార్థం రెండు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. 

07:15 - November 27, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే ఎన్నో ఆందోళనలు, దీక్షలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక పార్లమెంటు వేదికగా పోరాటానికి సిద్దమవుతోంది. ఇంత‌వ‌ర‌కూ ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సానుకూల ప్రక‌ట‌నా చేయ‌క‌పోవ‌డంతో సమావేశాల్లో కేంద్రాన్ని గట్టిగా అడగాలని నిర్ణయించింది. స్టేటస్‌ అంశంలో ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌తో క‌లిసి పార్లమెంటులో ఆందోళ‌న‌లు చేస్తామంటున్నారు వైసీపీ ఎంపిలు. అవ‌స‌ర‌మైతే పార్లమెంట్ స‌మావేశాలు జ‌రిగే స‌మ‌యంలోనే జ‌గ‌న్...ప్రధాని మోదీని క‌ల‌వాల‌నే ఆలోచ‌న‌లో కూడా ఉన్నట్లు వైసీపి ఎంపీలు వ్యూహాలు ర‌చిస్తున్నారు.

రాష్ట్రంలో అధికార టీడీపీపై ఒత్తిడికి వ్యూహాలు.....

ఇటు రాష్ట్రంలో అధికార‌ టీడీపీ పైనా ఒత్తిడి పెంచేలా వ్యూహ ర‌చ‌న చేస్తోంది వైసీపీ. పార్లమెంట్ వేదిక‌గా తాము చేస్తున్న ఆందోళ‌నకు టీడీపీ మ‌ద్దతు ఇవ్వాలని వైసీపీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎలాగూ ఆందోళ‌న చేసే అవ‌కాశం లేక‌పోవ‌డంతో తాము ఆందోళ‌న చేయ‌డంతో పాటు,మ‌ద్దతు ఇవ్వాల‌ని కోరినా అధికార పార్టీ ఎంపీలు క‌ల‌సి రావ‌డం లేద‌ని ప్రజ‌ల‌కి చెప్పాల‌ని వైసీపీ నేత‌లు భావిస్తున్నారు.

విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్, పోల‌వ‌రానికి నిధులు .........

ప్రత్యేక హోదాతో పాటు, రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్బంగా ఏపీకి ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌నే అంశాన్ని లేవ‌నెత్తుతామంటున్నారు వైసీపీ ఎంపీలు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు, పోల‌వ‌రానికి నిధులు కేటాయించాల‌ని కేంద్రాన్ని కోర‌తామంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో క‌రువు మండలాలను ఆదుకోవ‌డంతో పాటు, అకాల వ‌ర్షాల వ‌ల్ల తీవ్రంగా న‌ష్ట పోయిన రైతుల‌ను ఆదుకోవాల‌ని కేంద్రానికి విన్నవిస్తామంటున్నారు. పొగాకు, లెవీ, ధాన్యానికి మ‌ద్దతు ధ‌ర అంశాన్ని పార్లమెంట్ స‌మావేశాల్లో చ‌ర్చిస్తామంటోంది. పార్లమెంట్ వేదిక‌గా హోదా సాధనకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతమేరకు ఫలిస్తాయో చూడాలి. 

07:12 - November 27, 2015

నెల్లూరు : జిల్లా కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జిల్లా ముఖ్యనేతలైన ఆనం సోదరులు కాంగ్రెస్‌ ను వీడుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్‌తో పాతికేళ్ల బంధాన్ని తెగతెంపులు చేసుకుని తెలుగుదేశం సైకిల్ ఎక్కబోతున్నట్టు స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌కు ఆనం సోదరుల గుడ్‌బై....

ఆనం సోదరుల అంతరంగం బహిర్గతమైంది. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతారన్న ప్రచారమే నిజమైంది. దశాబ్దాల కాంగ్రెస్‌ కు గుడ్‌ బై చెబుతున్నట్టు కిక్కిరిసిన కార్యకర్తల సమావేశంలో అధికారికంగా ప్రకటించారు ఆనం బ్రదర్స్.

అధికారిక ప్రకటన.....

కాంగ్రెస్ సీనియర్ నాయకులు, నెల్లూరు జిల్లా కాంగ్రెస్‌కు పెద్దదిక్కు మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. తన సోదరుడు ఆనం వివేకానందరెడ్డితో కలసి వివిధ నియోజకవర్గాల నేతలు, కార్యర్తలు, అభిమానులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్టీ మార్పుపై సుదీర్ఘంగా సమాలోచనలు చేశారు. తాము కాంగ్రెస్‌ను వీడడానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు. తాను తన సోదరుడు ఆనం వివేకాతో కలిసి కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు ప్రకటించారు.

టీడీపీలోకి రావాలని పార్టీ నేతలు ఆహ్వానించారు-ఆనం

కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పి ఏ పార్టీలో చేరుతున్నారన్న విషయంపైనా క్లారిటీ ఇచ్చారు ఆనం. తెలుగుదేశంలోకి రావాలని, ఆ పార్టీ నేతలు ఆహ్వానించారని, తాను కూడా అందుకు సమ్మతంగానే ఉన్నట్టు స్పష్టం చేశారు. ఎప్పుడు, ఎక్కడ చేరుతాం అనే విషయాలు హైదరాబాద్ వెళ్లి వచ్చిన తర్వాత ప్రకటిస్తామన్నారు.

రఘువీరాతో నాకు ఎలాంటి విభేదాల్లేవు-ఆనం....

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల ఇటు పార్టీ, అటు రాష్ట్రం రెండూ నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆనం. పీసీసీ అధ్యక్షుడు రఘువీరాతో తనకు ఎలాంటి విభేదాల్లేవన్నారు. అయితే తమ కుటుంబాన్ని నమ్ముకున్న వేలాది పేద, మధ్య తరగతి కుటుంబీకుల పరిస్థితి, నెల్లూరు జిల్లా అభివృద్ధి గురించి ఆలోచించిన తర్వాత పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

వివిధ మంత్రి పదవులు నిర్వహించిన ఆనం......

ఆనం సోదరులు గతంలో టీడీపీలోనే ఉన్నారు. ఆ తర్వాత పరిణామాలతో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఇద్దరు సోదరులు అనేక సార్లు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆనం రాంనారాయణ రెడ్డి కీలకమైన ఆర్థిక శాఖతో పాటు వివిధ మంత్రి పదవుల్లో పని చేశారు. విభజన సమయంలో సీఎం రేసులోనూ ఆనం పేరు వినిపించింది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదని భావించడం, తమ భవిష్యత్, తమ వారసుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తిరిగి సైకిలెక్కడానికి ఓ ఐఏఎస్ అధికారి కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలోనూ టీడీపీకి బలమైన నాయకత్వం లేకపోవడం కూడా ఆనం సోదరుల పునరాగమనానికి చంద్రబాబు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. త్వరలో ఆనంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశముందని సమాచారం.

ఆనం సోదరుల రాకను వ్యతిరేకిస్తున్న స్థానిక టీడీపీ నేతలు.....

మొత్తానికి టీడీపీలోకి ఆనం సోదరుల రీఎంట్రీ ఖాయమైంది. అయితే ఆనం సోదరుల రాకను కొందరు స్థానిక టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ఏళ్లుగా పార్టీకి అంకితభావంతో పని చేస్తున్న తమను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని అసంతృప్తితో రగిలిపోతున్నారు. ముఖ్యంగా ఈ జిల్లాకే చెందిన మంత్రి నారాయణ...ఆనం సోదరుల రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. టీడీపీలో ఆనం సోదరుల సెకండ్ ఇన్నింగ్స్ ఎలా సాగుతుందో చూడాలి.

07:08 - November 27, 2015

కృష్ణా : విజయవాడలో ప్రేమోన్మాది కలకలం రేపాడు. వినాయక థియేటర్ వద్ద బాషా అనే యువకుడు మహాలక్ష్మి అనే యువతిని గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నంచాడు. ఆమె అప్రమత్తమై కేకలు వేయడంతో స్థానికులు ఆమెను రక్షించారు. అయితే వారిలో శ్రీను అనే యువకుడిని బాషా తీవ్రంగా గాయపరిచాడు. దీంతో శ్రీనును ఆస్పత్రికి తరలించారు. యువతి ఫిర్యాదుతో పటమట పోలీసులు బాషాను అరెస్టు చేశారు. అయితే ఆవేశంతో పోలీసుల ఎదుటే బాషాను బాధిత యువతి చెప్పుతో కొట్టింది. మరోవైపు తామిద్దరం ప్రేమించుకున్నామని.. అవసరానికి చాలాసార్లు డబ్బులు కూడా ఇచ్చానని బాషా చెప్పుకొచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

07:07 - November 27, 2015

హైదరాబాద్ : అంతన్నారు..ఇంత‌న్నారు. కేసీఆర్‌పై పీకలదాకా వ్యతిరేకత ఉందన్నారు. దీంతో ఆ ఓట్లన్నీ మన‌కే అన్నారు. కానీ ఇప్పుడేం జరిగింది ? ఇది పీసీసీపై కాంగ్రెస్‌ హైక‌మాండ్ కురిపిస్తున్న ప్రశ్నల వ‌ర్షం. వరంగల్ ఉప ఎన్నికలో క‌నీసం డిపాజిట్ ద‌క్కకపోవడంతో ఢిల్లీ పెద్దలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఓటమిపై గ్రౌండ్ రిపోర్ట్ కోసం ఆదేశాలు జారీచేశారు.

కాంగ్రెస్‌పై విమర్శల జడివాన .....

వరంగల్ ఓటమి ప్రకంపణలు ఇప్పుడు కాంగ్రెస్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని..అదే గెలిపిస్తుందని కోటి ఆశలతో ఓరుగల్లు బరిలో దిగిన హస్తం పార్టీకి ఉప ఎన్నికల ఫలితాలు నివ్వెర పరిచాయి. దీంతో ఇప్పడికే క్యాడర్ , సహచరుల నుండి విమర్శలతో ఇబ్బంది పడుతున్న పీసీసీకి ఇప్పుడు ఢిల్లీ ఆగ్రహం మరింత ఊపిరాడనివ్వడం లేదు.

గెలుపుపై ధీమా.........

ఎన్నికలకు ముందు సర్వేలు చేయించిన పీసీసీ..గెలుపుపై ధీమా వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని హైకమాండ్‌కు క్లీయర్‌గా చెప్పిన పీసీసీ పెద్దలు..అభ్యర్ధి ఎంపికలో ఢిల్లీ నుండి గతంలో ఎన్నడూ లేనంత స్వేచ్చను తీసుకున్నారు. అంతేకాదు లక్ష ఓట్ల మెజారీటితో గెలుస్తున్నామని ఢిల్లీ పెద్దలకు చెవులు మారు మ్రోగేలా చెప్పారు. అయితే తీరా ఎన్నికల ఫలితాల్లో బొక్కబోర్లా పడటంతో అధిష్టానం నివ్వెర పోయింది. అందులోనూ గత ఎన్నికల కంటే..లక్షా 30 వేల ఓట్లు తగ్గి... ఏకంగా డిపాజిట్ గల్లంతు కావడంతో అధిష్టాన పెద్దలు పీసీసీ ఛీప్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

సమగ్ర రిపోర్టుకు ఆదేశం....

అంతేకాదు..తెలంగాణ ఏర్పాటులో కీలంగా వ్యవహరించిన మీరాకుమార్‌, సుశీల్‌కుమార్‌ షిండే , గులాంనబీ ఆజాద్ , దిగ్విజయ్‌సింగ్‌ ఇలా అగ్రనేతలందరూ ప్రచారంలో పాల్గొన్నారు. అంతా బాగే ఉందన్నారు. మరి ఎందుకిలా జరిగింది..? గెలుపు పక్కనబెట్టండి..కనీసం డిపాజిట్ ఎందుకు దక్కలేదని ప్రశ్నలు కురిపించిన హైకమాండ్‌..తక్షణమే సమగ్రమైన రిపోర్ట్ పంపాలని పీసీసీ చీఫ్ ఉత్తంను ఆదేశించినట్లు సమాచారం.

బయటా పరువుపోయినట్లైందని ఆవేదన...

కేసీఆర్ టార్గెట్‌గా నిత్యం విమర్శలు సంధించిన పీసీసీ నేతలకు..వరంగల్‌లో డిపాజిట్ గల్లంతు కావడంతో..ఏం చేయాలో పాలుపోవడంలేదు. ఇక ఢిల్లీ పెద్దలు కూడా దీనిపై సీరియస్‌గా ఉండటంతో..ఉక్కిరి బిక్కిరవుతుంది పీసీసీ. ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకక పోవడంతో ఇంటా బయటా పరువుపోయినట్లైందని గాంధీభవన్లో వ్యక్తమవుతుంది. 

07:04 - November 27, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్‌వాడీల జీతభత్యాల పెంపు అంశంపై మంత్రివర్గ ఉపసంఘం మరోసారి చర్చించింది. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల జీతభత్యాలను పెంచేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. త్వరలో జరిగే కేబినెట్‌ భేటీలో ఈ మేరకు జీవో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ నాన్చివేత థోరణిని నిరసిస్తూ అంగన్‌వాడీల ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి.

2015 మే 12న మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు...

అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి 2015 మే 12న మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది ఏపీ సర్కార్. ఆర్ధికమంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు నేతృత్వంలో మంత్రులు పీత‌ల సుజాత, అచ్చ న్నాయుడు, కామినేని శ్రీనివాస్‌ స‌భ్యులుగా ఈ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ క‌మిటీ ఇప్పటికీ దాదాపు 4 సార్లు స‌మావేశం అయ్యింది. అంగ‌న్‌వాడీ టీచ‌ర్‌కు రూ.4,200 నుంచి 7,100కు, హెల్పర్లకు రూ.2,400 నుంచి 4,600కు వేతనాల పెంపుకు అంగీకారం తెలిపారు. మినీ అంగ‌న్ వాడీ కార్యక‌ర్తల‌కు 2950 నుంచి 4600 వ‌ర‌కూ వేత‌నం పెంచాల‌ని ఏపీ క్యాబినెట్ స‌బ్ క‌మిటీ ప్రభుత్వానికి నివేదించింది. ఇంతే కాకుండా అంగ‌న్‌వాడీల‌కు రిటైర్డ్ అయిన త‌రువాత గ్రాడ్యూటీ 50 వేలు ఇవ్వాల‌ని కూడా నిర్ణయించింది. ఈ విష‌యాన్ని అప్పట్లో కార్మిక శాఖ మంత్రి అచ్చం నాయుడు కూడా చెప్పారు.

ఆగ‌స్టులో జ‌రిగిన మంత్రి వ‌ర్గ ఉపసంఘం స‌మావేశంలో ....

ఆగ‌స్టులో జ‌రిగిన మంత్రి వ‌ర్గ ఉపసంఘం స‌మావేశంలో కేవ‌లం వేత‌నాలు పెంపుపైనే కాకుండా ఉద్యోగుల ఇబ్బందుల‌పై కూడా చర్చించారు. అంగ‌న్‌వాడీలు చేస్తున్న ప‌ని కాకుండా.. ప్రభుత్వ పథకాలకు, ఇతర పనులకు వినియోగించకూడదని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది మంత్రివర్గ ఉపసంఘం. అంగ‌న్‌వాడీల‌కు వేత‌నాలు పెంచ‌డం వ‌ల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 317 కోట్ల భారం ప‌డుతుంది. 1.04 లక్షల మంది అంగన్‌వాడీ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. క్యాబినెట్ స‌బ్ క‌మిటీ నిర్ణయం తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ ప‌ర్యట‌న‌లో ఉన్నారు. దాన్ని ఆయ‌న‌తో చ‌ర్చించిన త‌రువాత సెప్టెంబ‌ర్ 1 నుంచే అమ‌లు చెస్తామ‌ని ఘనంగా ప్రకటించింది ప్రభుత్వం. దాదాపు మూడు నెల‌లు గ‌డిచాయి.. 6 క్యాబినెట్ స‌మావేశాలు జ‌రిగాయి. కాని ప్రభుత్వం ఇంత వ‌ర‌కూ అంగ‌న్‌వాడీల స‌మ‌స్యల‌పై తీసుకున్న నిర్ణయం మాత్రం వెలువ‌డ‌లేదు. పైగా ఆందోళ‌న చేస్తున్న అంగ‌న్‌వాడీల‌ను అరెస్టు చేస్తున్నారు.

యనమల నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం మరోసారి చర్చ....

అంగన్‌వాడిల జీతభత్యాల పెంపు అంశంపై ఆర్థిక మంత్రి యనమల నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం మరోసారి చర్చించింది. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల జీతభత్యాలను పెంచేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. త్వరలో జరిగే కేబినెట్‌ భేటీలో ఈ మేరకు జీవో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంగన్‌వాడీలు తొందరపడి ఆందోళనలు చేయవద్దని యనమల విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ వైఖరి పై అనేక విమ‌ర్శల‌కు.......

అంగ‌న్‌వాడీ స‌మ‌స్యల విష‌యంలో ప్రభుత్వ వైఖరి అనేక విమ‌ర్శల‌కు తావిస్తోంది. విదేశీ కంపెనీలు పెట్టుబడుల కోసం రాయితీలు అడ‌గ‌గానే కాదనకుండా ఇచ్చే ప్రభుత్వం .. అంగ‌న్ వాడీ స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించ‌డంలో మాత్రం వివ‌క్ష చూపుతుందనే విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఒక వైపు నిధులు లేవంటూనే రాజధాని శంకుస్థాప‌న కోసం వంద‌లాది కోట్లు ఖర్చు చేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఈ సారైనా ప్రభుత్వం తమ సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని అంగన్‌వాడీలు కోరుతున్నారు.

07:00 - November 27, 2015

విజయవాడ : ఇసుక అక్రమ రవాణాని అరికట్టడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందించే పనిలో పడింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా..అత్యంత పారదర్శకంగా శాండ్ పాలసీని రూపొందిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2014 సంవత్సరానికి సంబంధించిన ఇసుక పాలసీపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇకనుంచి ఇసుక రీచ్‌లను మహిళా స్వయం శక్తి సంఘాలకు అప్పగిస్తామన్నారు. ఇప్పటివరకు జరిగిన ఇసుక తవ్వకాలు, అమ్మకాల విధానం పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని.. దానిస్థానంలో అక్రమాలకు తావులేకుండా,.. వినియోగదారులకు అందుబాటులో ఉండేవిధంగా కొత్త విధానం ఉంటుందని చంద్రబాబు అన్నారు.

2014లో రూ. 517 కోట్ల ఆదాయం....

2006, 2012 ఇసుక విధానాలకు భిన్నంగా 2014 ఇసుక విధానాన్ని అమలు చేశామని, ఇందులో ప్రభుత్వానికి 517 కోట్లు ఆదాయం సమకూరిందని సీఎం చంద్రబాబు అన్నారు. అందులో 25 శాతం డ్వాక్రా సాధికారితకు, మరో 25 శాతం రైతు సాధికారితకు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించటం, జీపీఆర్ఎస్‌లు, సీసీ కెమెరాలు వీటన్నిటినీ ఉపయోగించడంతో ఇసుక అక్రమాలను కొంతమేర తగ్గిందన్నారు. ప్రస్తుతం 2 కోట్ల 82 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందన్నారు చంద్రబాబు. ప్రస్తుతం దీనికి డిమాండ్ ఎక్కువగా ఉన్నందున..కృష్ణా, గోదావరి నదులలో పూడికను తీయించి ఇసుకను బయటకు తీస్తామన్నారు. ఇసుక అక్రమ రవాణాలో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించేదిలేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. వీలైనంత తక్కువ ధరకే అందరికీ అందుబాటులో ఉండేలా 2016 జవవరి ఒకటో తేదీ నుంచి కొత్త పాలసీని తీసుకొస్తామన్నారు.

బెజవాడ నుంచే పాలన.....

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోయినందున..బెజవాడ నుంచే పాలన కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ ఉద్యోగులంతా తెలంగాణ నుంచి విజయవాడ రావాల్సిందేనని బాబు అల్టిమేటం జారీచేశారు. స్మగ్లర్లను విడుదల చేయాలని కొంతమంది నిరాహారదీక్షలు చేస్తున్నారని, రాష్ట్రం ఎటుపోతుందోనంటూ నంటూ పరోక్షంగా వైఎస్‌ జగన్‌పై వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఏడాది నుంచి కొత్త పాలసీని తీసుకొస్తున్నారు. అయితే ఈ కొత్త పాలసీ ఇసుకాసురులకు ఎంతవరకు కళ్లెం వేస్తుందో వేచిచూడాల్సిందే. 

06:57 - November 27, 2015

హైదరాబాద్ : డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు విధి విధానాల్లో మార్పులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్ల కేటాయింపుల్లో మంత్రులు, ఎమ్మెల్యేల జోక్యం ఎందుకని హైకోర్టు ప్రశ్నించడంతో మార్పులు చేయక తప్పలేదు. లబ్దిదారులను ఎంపిక చేయడానికి జిల్లా మంత్రిని అధ్యక్షుడిగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో కలెక్టర్‌, ఎమ్మెల్యే సభ్యులుగా ఉండనున్నారు. తొలుత ఇచ్చిన జీవో నుంచి వెనక్కు తగ్గిన సర్కారు... కొన్ని మార్పులు చేస్తూ తాజాగా మరో జీవోను విడుదల చేసింది.

ఈ ఏడాది 60 వేల ఇళ్లు....

తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఏడాది 60 వేల ఇళ్లను పేదలకు కట్టించి ఇవ్వాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలనుకూడా విడుదల చేసింది. ప్రతి నియోజకవర్గానికి 400 ఇళ్లను కేటాయించింది. వాటిలో 200 ఇళ్లను జిల్లా మంత్రి, మరో 200 ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే అర్హులైన వారికి కేటాయిస్తారని తొలుత ఇచ్చిన జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే అంశంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ... హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఇళ్ల కేటాయింపుల్లో మంత్రులు, ఎమ్మెల్యేల జోక్యం ఎందుకని ప్రశ్నించింది. దాంతో తొలుత ఇచ్చిన జీవో నుంచి వెనక్కు తగ్గిన సర్కారు... వాటిలో కొన్ని మార్పులు చేస్తూ తాజాగా మరో జీవోను విడుదల చేసింది.

జిల్లా స్థాయిలో కమిటీ.....

తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీని వేశారు. కమిటీకి అధ్యక్షుడిగా జిల్లా మంత్రి, కన్వీనర్‌గా జిల్లా కలెక్టర్, సభ్యులుగా జిల్లాలోని అన్ని పార్టీల శాసన సభ్యులు ఉంటారు. జిల్లాలో ఉన్న కులసమీకరణాల ఆధారంగా సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకొని అందరికీ ప్రాధాన్యం ఉండేలా ఇళ్ల కేటాయింపు చేయనున్నారు.

ఎమ్మార్వో ప్రాధమిక పరిశీలన....

ఇక అర్హులైన వారినుంచి గ్రామసభలు, వార్డు సభల ద్వారా దరఖాస్తులను తీసుకుంటారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్దిదారుల జాబితాను స్థానిక తహశీల్ధార్‌కు పంపుతారు. ఎమ్మార్వో ప్రాధమిక పరిశీలన తరువాత ఆ జాబితాను జిల్లా కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ ఆ జాబితాను ఫైనలైజ్ చేసి తిరిగి ఎమ్మార్వోకు పంపిస్తారు. దాన్ని గ్రామసభ, వార్డుసభల్లో ఉంచుతారు. అలా ఉంచిన జాబితాలో లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉంటే... డ్రా పద్దతి ద్వారా ఎంపిక చేస్తారు. తాజాగా ఇచ్చిన మార్గదర్శకాలతో.. ప్రజా ప్రతినిధులకు, అధికారులకు తలనొప్పులు తగ్గడమే కాకుండా...అంతా పారదర్శకంగా ఉంటుందని సర్కారు భావిస్తోంది. 

వచ్చే ఏడాది నుంచి బీహార్ లో సంపూర్ణ మద్యనిషేధం

హైదరాబాద్ : బీహార్‌లో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి మద్య నిషేధం విధించనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌ కుమార్‌ ప్రకటించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహిళలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. గురువారం ఎక్సైజ్‌ డే సందర్భంగా పట్నాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మద్యం విక్రయాల వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా రూ. 400 కోట్ల ఆదాయం వస్తుందని, కానీ మహిళలు, పేదల ప్రయోజనాల కోసం మద్య నిషేధం విధిస్తున్నామని తెలిపారు.

కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ప్రకటించిన ఆనం సోదరులు

నెల్లూరు : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ విషయమై ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుతో చర్చించామని, ఒకటి రెండు రోజుల్లో సీఎం చంద్రబాబుతో కూడా చర్చించి పార్టీలో చేరిక తేదీని ఖరారు చేస్తామన్నారు. తొలుత ఆనం సోదరులు గురువారం నెల్లూరులోని తమ నివాసంలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి, అభిప్రాయ సేకరణ జరిపారు.

నేడు హైదరాబాద్ కు గోదావరి జలాలు !

హైదరాబాద్ : గోదావరి జలాలు శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నాయి. ఘనాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి రింగ్‌మెయిన-1 ద్వారా కుత్బుల్లాపుర్‌ సర్కిల్‌లో సరఫరా చేయనున్నట్టు వాటర్‌బోర్డు డైరెక్టర్‌ జి.రామేశ్వర్‌రావు తెలిపారు. మొదటి విడతలో 38ఎంజీడీలు తీసుకువస్తున్నారు. డిసెంబర్‌ మొదటి వారంలో మరో 38 ఎంజీడీలు సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. 3 రోజుల క్రితం గోదావరి నీళ్లు ఘనాపూర్‌ రిజర్వాయర్‌కు చేరాయి. పైపులైన్ శుభ్రపర్చే పనులు కొనసాగిస్తున్న అధికారులు.. నేడు సరఫరా ప్రారంభించే సన్నాహాలు చేశారు.

హైదరాబాద్ పీఎస్ పరిధిలో పోలీసుల కార్డన్ సెర్చ్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పీఎస్ పరిధిలో పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీపీసీ రవీందర్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో 66 సిలిండర్లు, 20 బైక్లు, 3 ఆటోలు, 10 మంది అనుమానితనలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Don't Miss