Activities calendar

29 November 2015

22:02 - November 29, 2015

ఢిల్లీ : జీఎస్‌టీ బిల్లు ఆమోదానికి దాదాపు లైన్‌ క్లియరైనట్టు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలే ఇందుకు దోహదం చేస్తున్నాయి. రాజ్యసభలో బలం లేకపోవడంతో కాంగ్రెస్‌ అధినేత్రి, మాజీ ప్రధానిని కలిసి మోదీ మద్దతు కోరడం, ఆలోచించి చెబుతామని సోనియా చెప్పడంతో జీఎస్టీ బిల్లు ఆమోదానికి సర్వం సిద్దమైనట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌-బీజేపీ లోపాయికారి ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది.
ప్రతిష్టాత్మకంగా వస్తు సేవల పన్ను సవరణ బిల్లు
వస్తు సేవల పన్ను సవరణ బిల్లును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది నరేంద్ర మోదీ ప్రభుత్వం. అనేక రకాల వస్తుసేవల పన్నులన్నింటికి ఒకే గొడుగు కిందకు తేవడమే బిల్లు ప్రధాన ఉద్దేశ్యం. ఆర్థిక సంస్కరణల అమలులో ప్రతిపాదిత జీఎస్టీ బిల్లు నూతనోత్తేజం నింపుతుందని కేంద్రం నమ్ముతోంది. మేలోనే లోక్‌సభలో ఆమోదం పొందినా రాజ్యసభలో సరైన బలం లేక వెనకబడిపోయింది. దీంతో ప్రతిపక్షాల మద్దతు తప్పనిసరని భావించిన మోదీ... కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ కలిశారు. జీఎస్టీ బిల్లు ఆమోదానికి మద్దతు తెలపాలని విన్నవించారు. అయితే బిల్లులో కొన్ని ప్రతిపాదనలను కాంగ్రెస్ వ్యతిరేకించినట్టు తెలుస్తోంది.
ఎన్డీయే, కాంగ్రెస్‌ల మధ్య కొన్ని అంశాలపై విభేదాలు 
జీఎస్టీ బిల్లుపై ఎన్డీయే, కాంగ్రెస్‌ల మధ్య కొన్ని అంశాలపై విభేదాలున్నాయి. వాటిలో ట్యాక్స్ రేటు 22 శాతం ఉండాలని ఎన్డీయే ప్రతిపాదించగా...కాంగ్రెస్ మాత్రం 18 శాతమే ఉండాలని పట్టుబడుతోంది. అలాగే వస్తువులు ఉత్పత్తయ్యే రాష్ట్రాలపై ఒక శాతం అదనంగా లెవీ విధించాలని ఎన్డీయే చెబుతుండగా, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని తొలగించాలంటోంది కాంగ్రెస్. జీఎస్టీ కౌన్సిల్‌లో ఒకటి బై మూడో వంతు సీట్లు కేంద్రానికి ఉండాలన్నది బిల్లులో సర్కారు ప్రతిపాదన, అయితే ఒకటి బై నాలుగో వంతు సరిపోతుందని కాంగ్రెస్ చెబుతోంది. ఇక ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు జీఎస్టీలో కాకుండా కనీసం ఐదేళ్లు బయటే ఉండాలని బీజేపీ సర్కారు ప్రతిపాదిస్తోంది. అయితే జీఎస్టీలోనే ఉంచాలని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది.
భిన్నాభిప్రాయాలున్నా అవగాహనకు బీజేపీ, కాంగ్రెస్
ఇలా జీఎస్టీ బిల్లుపై ఎన్నో భిన్నాభిప్రాయాలున్నా కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. రెండురోజుల క్రితం సమావేశం అనంతరం దీనిపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి జీఎస్‌టి బిల్లును అమల్లోకి తేవాలని కేంద్రం నిర్ణయించినట్లు మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ బిల్లుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కూడా సూత్రప్రాయంగా అంగీకరించారని చెప్పారు.
బీజేపీ-కాంగ్రెస్‌ల ఒప్పందం పార్లమెంటుకు చెప్పాలి-ఏచూరి
జీఎస్‌టీ బిల్లును గతంలో బీజేపినే అడ్డుకుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయం తీసుకున్నాకే జీఎస్‌టీ బిల్లుపై పార్లమెంటులో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. జీఎస్‌టీ బిల్లుపై బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో పార్లమెంటుకు చెప్పాలన్నారు. మొత్తానికి జీఎస్టీ బిల్లుపై బీజేపీ,కాంగ్రెస్‌లు ఏకతాటి పైకి రావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సీపీఎం సహా మిగతా విపక్షాలన్నీ పార్లమెంటులో నిలదీయాలని నిర్ణయించాయి.

 

21:56 - November 29, 2015

మెదక్ : సంగారెడ్డి ఎరుపు రంగు పులుపుముకుంది. సీపీఎం తెలంగాణ విస్తృతస్థాయి సమావేశాలతో ఎర్రజెండాలు రెపరెపలాడుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కామ్రేడ్స్...తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశంలోనూ నెలకొన్న సామాజిక, రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఎలాంటి అభివృద్ది కానరావడం లేదని సీపీఎం అగ్రనేతలు విమర్శించారు.
2 రోజుల పాటు సమావేశాలు
మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో తెలంగాణ సీపీఎం విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు తెలంగాణ పది జిల్లాల 200ల మంది ప్రతినిధులు హాజరయ్యారు. వాడవాడలా స్వాగత తోరణాలు, బ్యానర్లు, జెండాలు, ఫ్లెక్సీలతో పట్టణం ఎరుపురంగు సంతరించుకుంది.
సీపీఎం రాష్ర్ట నేత మల్లారెడ్డి పతాకావిష్కరణ
సమావేశాలకు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సారంపల్లి, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ముఖ్యనేతలు, వివిధ రంగాల నాయకులు హాజరయ్యారు. సీపీఎం రాష్ర్ట నేత మల్లారెడ్డి పతాకావిష్కరణ చేసి సమావేశాలను ప్రారంభించారు.
నిత్యావసరాల ధరలు మరింత పెరిగాయి-ఏచూరి
సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కీలక ప్రసంగం చేశారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16నెలల కాలంలో దేశంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని ఏచూరి అన్నారు. సామాన్య ప్రజలను వదిలిపెట్టి మోదీ విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో మతోన్మాదం పెరిగిందన్నారు.
వామపక్షాల మహాకూటమి మరింత బలపడాలి-ఏచూరి
వామపక్షాలు బలం పెంచుకుంటే తప్పకుండా కేంద్రంతో పోరాడే అవకాశం వస్తుందని సీతారాం ఏచూరి అన్నారు. గతంలో నాలుగు ఉన్న వామపక్షాలకు తోడు మరో రెండు కలిసి వచ్చాయని..ఈ మహాకూటమి మరింత బలపడాల్సిన అవసరం ఉందని చెప్పారు.
సంక్షేమ కార్యక్రమాలు పడకేశాయి-తమ్మినేని
తెలంగాణ రాష్ట్రంలో 90శాతానికి పైగా ఉన్న బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు..అమలు చేస్తున్న కార్యక్రమాలకు పొంతన లేకుండా ఉందని తమ్మినేని విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు పడకేశాయి అనడానికి రైతుల ఆత్మహత్యలే నిదర్శనం వ్యాఖ్యానించారు. ఇదే సమావేశంలో సీతారాం ఏచూరి రచించిన....మోడీ ప్రభుత్వం-పేట్రేగిన మతోన్మాదం పుస్తకాన్ని ఆవిష్కరించారు. సోమవారం కూడా సమావేశాలు కొనసాగుతాయి. పార్టీ నిర్మాణం, విస్తరణ, ఇతర అంశాలపై సమావేశాల్లో చర్చిస్తారు.

21:50 - November 29, 2015

హైదరాబాద్ : నిజామాబాద్‌ జిల్లాలోని ప్రాజెక్టులు, ఇతర ప్రభుత్వ పథకాలపై క్యాంప్‌ ఆఫీస్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజాంసాగర్‌ ప్రాజెక్ట్ కాల్వలకు మరమ్మతులు చేసి.. జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రాజెక్టుల రీడిజైన్‌తో వచ్చే నూతన ప్రాజెక్టులతో జిల్లాలో మరింత ఎక్కువ భూమి సాగయ్యేందుకు అవసరమైన రిజర్వాయర్లు, కాలువలు నిర్మించాలని కేసీఆర్‌ ఆదేశించారు. కాలేశ్వరం ప్రాజెక్టుతో నిజామాబాద్‌ జిల్లాకు కూడా లాభం జరుగుతుందని.. దీనికోసం మల్లన్న సాగర్‌ నుంచి నీరు తీసుకునేందుకు రిజర్వాయర్లు, కాలువలు నిర్మాణం చేయాలని కేసీఆర్‌ సూచించారు.
లెండి ప్రాజెక్ట్ పై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు
ఇక లెండి ప్రాజెక్ట్ పై ఎప్పటికప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి.. పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. భూసేకరణకు అవసరమైన నిధులను కూడా వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రాణహిత ప్రాజెక్ట్ పనులను యధావిధిగా కొనసాగించాలన్నారు. జిల్లాలో కరవు పరిస్థితుల దృష్ట్యా రెండో విడత మిషన్‌ కాకతీయ పనుల్లో ఎక్కువ చెరువులను మరమ్మతులు చేయాలన్నారు.
జిల్లాకు అదనంగా 2 వేల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో జిల్లాకు అదనంగా రెండు వేల ఇళ్లను కేటాయించేందుకు సీఎం అంగీకరించారు. ఇళ్ల కేటాయింపులో ఎలాంటి అవినీతికి తావులేకుండా.. అర్హులైన వారిని లాటరీ ద్వారా ఎంపిక చేయాలన్నారు. కామారెడ్డిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల కోసం అనువైన స్థలాన్ని గుర్తించాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు.

 

21:44 - November 29, 2015

హైదరాబాద్ : వన్డే వరల్డ్ చాంపియన్‌ ఆస్ట్రేలియా...టెస్టుల్లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. క్రికెట్‌ చరిత్రలో తొలిసారిగా జరిగిన డే అండ్‌ నైట్‌ టెస్ట్ లో సంచలన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ జట్టుతో మూడు రోజుల పాటు హోరాహోరీగా సాగిన పేస్‌, స్వింగ్‌ వార్‌లో ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలిచింది.
సిరీస్ ఆస్ట్రేలియా కైవసం
క్రికెట్‌ చరిత్రలో తొలిసారిగా జరిగిన డే అండ్‌ నైట్‌ టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టెస్ట్ లో సంచలన విజయం సాధించి....ట్రాన్స్ టాస్మన్‌ సిరీస్‌ను సొంతం చేసుకుంది.
పోరాడి ఓడిన కివీస్‌
మూడు రోజుల పాటు ఆసక్తికరంగా సాగిన పోరులో ఆతిధ్య ఆస్ట్రేలియా జట్టుకు అడుగడుగునా గట్టి పోటీనిచ్చిన కివీస్‌ టీమ్ పోరాడి ఓడింది. తొలి సారిగా పింక్‌ బాల్‌తో నిర్వహించిన ఈ పేస్‌ అండ్ స్వింగ్‌ వార్‌లో ఇరు జట్ల బ్యాట్స్ మెన్‌ తేలిపోగా....బౌలర్లే పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించారు. అడిలైడ్‌ ఓవల్‌ స్టేడియం వేదికగా.... ఈ అరుదైన మ్యాచ్‌లో తొలి రోజు టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ జట్టు...202 పరుగులకే కుప్పకూలింది. బదులుగా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 224 పరుగులకు ఆలౌటై... 18 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో బ్యాట్స్‌మెన్‌ మరోసారి విఫలమవ్వడంతో న్యూజిలాండ్‌ జట్టు ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 208 పరుగులకే ఆలౌటై...మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది.
గట్టి పోటీనిచ్చిన న్యూజిలాండ్‌ 
187 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు న్యూజిలాండ్‌ జట్టు గట్టి పోటీనిచ్చింది. న్యూజిలాండ్‌ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కంగారూ టీమ్‌ లక్ష్య చేధనలో తడబడింది. ట్రెంట్‌ బౌల్ట్‌.....చెలరేగడంతో కంగారూ బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టారు. ఓ ఎండ్‌లో బ్యాట్స్ మెన్‌ క్యూ కడుతున్నా...మరో ఎండ్‌లో షాన్‌ మార్ష్‌ క్రీజ్‌లో పాతుకు పోయాడు. కివీస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఆడమ్‌ ఓజెస్‌, మిషెల్‌ మార్ష్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నమోదు చేసి జట్టు విజయానికి పునాది వేశాడు.
అప్పటికే ఆస్ట్రేలియా విజయం ఖాయం
49 పరుగులు చేసిన షాన్‌ మార్ష్‌ను బౌల్ట్‌ ఔట్‌ చేసినా....అప్పటికే ఆస్ట్రేలియా జట్టు విజయం ఖాయమైంది. లోయర్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పీటర్ సిడేల్‌ మిషెల్‌ స్టార్క్‌తో కలిసి బ్యాలెన్స్‌ వర్క్‌ ఫినిష్‌ చేశాడు. 51 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసిన ఆస్ట్రేలియా జట్టు....3 వికెట్లతో విజయం సాధించింది. ఈ విజయంతో కంగారూ టీమ్‌ మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను 2-0తో దక్కించుకుని ట్రాన్స్‌ టాస్మన్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి తొమ్మిది వికెట్లు పడగొట్టిన కంగారూ పేసర్‌ జోష్‌ హేజిల్‌ వుడ్‌కు మ్యాన్‌ ఆతొలి డే అండ్‌ నైట్‌ టెస్ట్ విజేత.. ఆస్ట్రేలియాఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది. మూడు టెస్టుల్లో మూడు బ్యాక్‌ టు బ్యాక్‌ సెంచరీలతో పాటు సిరీస్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచిన డేవిడ్‌ వార్నర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచాడు. టెస్ట్ ఫార్మాట్‌లో తొలి సారిగా జరిగిన డే అండ్ నైట్‌ టెస్ట్‌లో నెగ్గిన జట్టుగా ఆస్ట్రేలియా జట్టు రికార్డులకెక్కింది. మొత్తం మీద ... మూడు రోజుల్లోనే ముగిసిన మొదటి డే అండ్‌ నైట్ టెస్ట్‌ క్రికెట్‌ అభిమానులకు కలకాలం గుర్తుండిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 

21:23 - November 29, 2015

ఖమ్మం : ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అప్పుడే ప్రలోభాల పర్వం మొదలైంది. ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీని ఎలాగైన కైవసం చేసుకొవాలని అధికార పార్టీ పావులు కదుపుతోంది. ఇతర పార్టీల ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లను తమ పార్టీలో చేర్చుకొని సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. అందుకు సామ, దాన, భేద, దండేపాయలను ప్రయోగిస్తున్నారు. అధికార పార్టీ నేతల తీరు విమర్శలపాలవుతోంది.
ఎమ్మెల్సీని దక్కించుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నం
ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీని దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. స్థానిక సంస్థల్లో టిఆర్ఎస్‌కు అధికారికంగా నలుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్సీని దక్కించుకోవాలంటే ఇంకా సంఖ్య బలం కావాలి. అందుకు ఇతర పార్టీల నుంచి నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ సమక్షంలో ఖమ్మం జిల్లా నుంచి భారీగా ఇతర పార్టీలకు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు టిఆర్ఎస్‌లో చేరారు.
ఫిరాయింపులను ప్రోత్సహించాలని నేతల యోచన
ఎన్నికల నాటికి ఈ ఫిరాయింపులను భారీగా ప్రోత్సహించాలని నేతలు యోచిస్తున్నారు. డబ్బులు, కాంట్రాక్టులు, ఇతర అవసరాలను తీర్చేందుకు హామీలిచ్చి ప్రతిపక్షాలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ ఓ ఎంపీటీసీ సభ్యురాలిని తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. కొణిజర్ల ఎంపీటీసీ సభ్యురాలు బండారు నాగలక్ష్మి భర్త సత్యనారాయణకు ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వివాదాస్పదమైంది. తమ పార్టీలోకి రావాలని వస్తే సీఎం సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వచ్చంటూ ఎమ్మెల్యే పలుమార్లు సత్యనారాయణకు ఫోన్ చేశారు. చివరకు ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డారు.
టిఆర్ఎస్‌లోకి భారీగా ఇతర పార్టీల నేతలు
టీడీపీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు కారెక్కాక ఆయనతోపాటు భారీగా ఇతర పార్టీల నేతలు టిఆర్ఎస్‌లోకి వెళ్లారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీని దక్కించుకోవటం మంత్రి తుమ్మలకు ప్రతిష్టాత్మకంగా మారింది. గతంలో వైసీపీ నుంచి వైరా ఎమ్మెల్యేగా విజయం సాధించిన మదన్‌లాల్‌ టిఆర్ఎస్‌లో చేరి ఇప్పుడు తన నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులను టీఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చే పనిని భుజాన వేసుకున్నారు. దీంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఇతర పార్టీల వారిని పార్టీలోకి తెస్తే నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని స్వయంగా మంత్రి తుమ్మల ప్రకటించినట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఇప్పటికే విపక్షాలు మండిపడుతున్న నేపథ్యంలో ఈ ఫోన్ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. తనను ఎమ్మెల్యే ఫోన్ చేసి బెదిరించారని, పార్టీలోకి రమ్మని ఒత్తిడి చేస్తున్నారని ఎంపీటీసీ భర్త సత్యనారాయణ చెప్పారు.
దూకుడుగా టీఆర్ఎస్ వ్యవహారం
గతం నుంచి జిల్లాలో టీఆర్ఎస్ వ్యవహారం దూకుడుగానే ఉంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం, వైరా, ఇల్లందు, మధిర, పినపాక, పాలేరు నియోజకవర్గాలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులకు భారీగా తమ పార్టీల్లో చేర్చుకుంటున్నారు. టిఆర్ఎస్ అనైతికంగా వ్యవహరిస్తోందంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.

 

21:11 - November 29, 2015

ప్రకాశం : జిల్లాలోని గుడ్లూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో 30 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వెంకటగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శ్రీశైలం వెళ్తోంది. మార్గంమధ్యలో గుడ్లూరు మండలం తెట్టు వద్ద రేషన్ లోడ్ తో వస్తున్న లారీ మలువు తిరుగుతుండగా.. ఆర్టీసీ బస్సు లారీ వెనుకభాగాన్ని ఢీకొట్టింది. దీంతో బస్సులోని 30 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. లారీ డ్రైవర్ కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి ఆస్పత్రికి తరలించారు. 

హైదరాబాద్ లో దారుణ హత్య

హైదరాబాద్ : నగరంలోని చంపాపేట్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భాస్కరా వైన్స్ సమీపంలో వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలిస్తున్నారు. మృతుడు ప్రెండ్స్ స్పోర్ట్స్ క్లబ్ యజమాని బాబుగా గుర్తించారు. హత్యకు పాల్పడిన నేరగాళ్ల ఆనవాళ్లు సీసీ కెమెరాలో లభించడంతో.. నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు .

 

20:52 - November 29, 2015

హైదరాబాద్ : నగరంలోని చంపాపేట్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భాస్కరా వైన్స్ సమీపంలో వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలిస్తున్నారు. మృతుడు ప్రెండ్స్ స్పోర్ట్స్ క్లబ్ యజమాని బాబుగా గుర్తించారు. హత్యకు పాల్పడిన నేరగాళ్ల ఆనవాళ్లు సీసీ కెమెరాలో లభించడంతో.. నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు .

 

20:47 - November 29, 2015

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల నాటికి మూడో కూటమి ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్‌ ప్రకటించారు. సినీనటి జయప్రద కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ములాయం.. కుటుంబ సమేతంగా హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా ములాయంకు జయప్రద ఘన స్వాగతం పలికారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

 

20:43 - November 29, 2015

ఢిల్లీ : ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ 90వ వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఆసియా దేశాల కమ్యూనిస్టు పార్టీల సమావేశం జరిగింది. ప్రపంచీకరణలో పెట్టుబడిదారి వ్యవస్థ దాడి, ఆసియా దృష్టి అంశంపై వివిధ దేశాల ప్రతినిధులు చర్చించారు. ఈ సదస్సుకు చైనా,జపాన్, వియత్నాం, కొరియా, నేపాల్, బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాలకు చెందిన కమ్యూనిస్టు పార్టీల నేతల హాజరయ్యారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ ప్రపంచీకరణ పేరుతో అభివృద్ధి చెందుతున్న దేశాలపై పెట్టుబడిదారి వ్యవస్థ ఒత్తిడి పెరుగుతోందన్నారు. పెట్టుబడిదారి విధానాలతో పేదరికం తగ్గదని స్పష్టం చేశారు. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయన్నారు. కార్పొరేట్లకు రాయితీలు నిలిపివేయాలని సూచించారు. దేశంలో సామాజిక వాతావరణం నెలకొనాలని ఆకాంక్షించారు.

 

20:36 - November 29, 2015

హైదరాబాద్ : తెలంగాణ నవనిర్మాణ వేదిక ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ వద్ద వికలాంగ విద్యార్థుల బహిరంగసభ జరిగింది. ఈ సభకు చెవిటి, మూగ, మానసిక వైకల్యం, దృష్టిలోపం గల పిల్లలు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రోఫెసర్‌ హరగోపాల్‌ సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల పట్ల మనం చూపించాల్సింది జాలి కాదని, వారి సంఖ్యకు తగ్గట్లుగా విద్యాహక్కు చట్టానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు.

 

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం

ప్రకాశం : జిల్లాలోని గుడ్లూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో ఈ ఘటన చేటుచేసుకుంది. 

20:25 - November 29, 2015

విశాఖ : దేశ ఆభివృద్ధికి యువత పాటుపడాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ నగరంలోని వుడా పార్క్ లో మూడవ గ్లోబల్‌ యూత్‌ మీట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 31 దేశాల నుంచి 100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్ధులతో వెంకయ్యనాయుడు ముచ్చటించారు. స్వార్ధ రాజకీయాలతోనే కొందరు దేశంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

 

20:22 - November 29, 2015

కడప : తనకు జీవిత ఖైదు నుండి విముక్తి చేసి క్షమాభిక్ష ప్రసాదించాలని లేకుంటే కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతున్నాడు కడప సెంట్రల్ జైలులో ఓ ఖైది. నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరుకు చెందిన శ్రీకాంత్ కిడ్నాప్, హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం పెరోల్ పై బయటకు వచ్చిన శ్రీకాంత్... జి.వో. 163 కింద తనకు అర్హత ఉన్నా... తనకు క్షమాభిక్ష లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనకు క్షమాభిక్ష ప్రసాదించని పక్షంలో కారుణ్య మరణానికి అనుమతివ్వాలని వేడుకొన్నాడు. ఈ మేరకు మానవహక్కుల కమీషన్ ఛైర్మెన్ కు వినతిపత్రం రాశానని శ్రీకాంత్ తెలిపారు.

 

బాలుడు మృతి ఘటనపై మంత్రి కేటీఆర్‌ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌ : మెదక్‌ జిల్లాలో బోరుబావిలో పడి బాలుడు మృతిచెందిన ఘటనపై మంత్రి కేటీఆర్‌ దిగ్భ్రాంతి వక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపయోగంలో లేని బోరుబావులను వెంటనే మూసివేయాలని ఆదేశించారు. బోరుబావుల చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, బోరుబావులు పూడ్చే బాధ్యత గ్రామ సర్పంచ్‌, కార్యదర్శి తీసుకోవాలన్నారు.

పంజాబ్ లోని ఐటీ ఆఫీస్ లో అగ్నిప్రమాదం

పట్నా : పంజాబ్ లోని లూధియానా ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కి చెందిన ఓ ఆఫీస్ లో అగ్నిప్రమాదం సంభవించింది. రిషినగర్లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గత దశాబ్దకాలానికి చెందిన రికార్డులు దగ్ధమయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసులో మంటలు సంభవించడాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందజేశారు. నాలుగు పైరింజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సుమారు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్‌ : సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన కె.శ్రీమతి(46) అనే వివాహిత ఆదివారం కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సైదాపూర్‌ ఎస్సై రవి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీమతి గత కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేకుండా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

 

20:01 - November 29, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో టీఎస్ సర్కారుకు బెదరనని ఆ కేసులో ముద్దాయిగా ఉన్న జెరూసలెం మత్తయ్య అన్నారు. ఈ కేసులో తెలంగాణా ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తే ధైర్యంగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నానని మత్తయ్య అన్నారు. ప్రస్తుతం కేసు వ్యవహారమంతా కోర్టు పరిధిలో ఉందని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కోర్టు వద్ద సీల్డ్ కవర్ లో సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. ఈ విషయంలో తన నిజాయితీ త్వరలోనే తెలుస్తుందన్నారు.

 

19:58 - November 29, 2015

కృష్ణా : విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్ ను పుష్కరాల నాటికి పూర్తిచేసి తీరుతామని స్థానిక ఎంపీ కేశినేని నాని అన్నారు. అత్యాధునిక ప్రమాణాలతో కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఫ్లై ఓవర్ ను నిర్మిస్తున్నామని చెప్పారు. విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్ శంకుస్థాపన పనులను నాని పరిశీలించారు. డిసెంబర్ 5న కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, వెంకయ్యనాయుడు శంకుస్థాపనకు వస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్య చాలా మెరుగుపడుతుందన్నారు. విజయవాడలో అన్ని మౌలిక వసతుల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

 

19:44 - November 29, 2015

హైదరాబాద్ : ఒకరేమో ఆ యూనివర్శిటీ తమదంటూ హస్తగతం చేసుకుంటారు. మరొకరు దానిలో తమకూ భాగముందంటారు. ఎవరైనా ఆ ఇరు ప్రభుత్వాలను చూస్తే విద్యారంగంపై ఎంతటి శ్రద్ధా అనుకుంటారు. కానీ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్స్ విషయంలో మాత్రం తమకే బాధ్యతా లేదంటూ ఎంచక్కా తప్పుకుంటున్నారు. హైకోర్టు మొట్టికాయలేసినా వుయ్‌ డోంట్‌ కేర్‌ అంటున్నారు. మీరిలాగే ఉంటే సివియర్ యాక్షన్‌ తప్పదంటూ కోర్టు సీరియస్‌ అయింది. ఇంతకీ ఆ వ్యవహారంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడ చెడింది.? ఆంధ్రా, తెలంగాణ.. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ ఏదో విషయంలో ఘర్షణాత్మకంగానే ఉంటాయి. తెలుగు యూనివర్శిటీ, ఓపెన్‌ యూనివర్శిటీ విషయంలో ఇది మరోసారి ప్రూవ్‌ అయింది.
రెండు రాష్ట్రాల మధ్య వివాదం
అంబేద్కర్ ఓపెన్‌ యూనివర్శిటీ, తెలుగు యూనివర్సిటి స్టడీ సెంటర్ల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. అది చిలికిచిలికి గాలి వానలా మారింది. హైకోర్టు ఉత్తర్వులను సైతం పట్టించుకోకపోవడంతో ఇరురాష్ట్ర ప్రభుత్వాలకు చీవాట్లు తప్పలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో ప్రధాన కార్యాలయంగా ఉండి పని చేస్తున్న అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ, తెలుగు యూనివర్సిటీ ఉద్యోగుల జీతాల విషయంలో స్పష్టత రాలేదు. జీతాలు ఇవ్వడం లేదని యూనివర్శిటీలు స్టడీ సెంటర్స్ మూసివేశాయి. వార్తా కథనాల అధారంగా హైకోర్టు కేసు విచారణ చేపట్టింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు కూర్చొని చర్చించుకోవాలని సెప్టెంబర్‌ 4న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో పనిచేస్తున్న సిబ్బందికి ఆ ప్రభుత్వం జీతాలు ఇవ్వాలని యూనివర్సిటీల నోటిఫికేషన్లు, పుస్తకాల పంపిణీ, పరీక్షల నిర్వహాణ మొత్తం తెలంగాణ ప్రభుత్వం చూసుకోవాలని కోర్టు అదేశించింది. కానీ ఇందుకు విరుద్ధంగా నడుచుకోవడంతో మరోసారి కోర్టు సీరియస్‌ అయింది.
స్టడీ సెంటర్లు నడిపేందుకు ముందుకు రాని టీ.సర్కార్‌
తాజాగా ఏపీ ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌.. తమ రాష్ట్రంలో స్టడీ సెంటర్లు పని చేయడంలేదని హైకోర్టుకు తెలియజేశారు. జీతాల చెల్లింపుకు ప్రభుత్వం జీ.వో జారీ చేసిందనీ వెల్లడించారు. అయినా స్టడీ సెంటర్లు నడిపేందుకు తెలంగాణ సర్కార్‌ ముందుకు రావడం లేదని కోర్టుకు తెలిపారు. 2015-16 సంత్సరానికి ప్రవేశాలు కల్పించలేదని, ఏపీకి సంబంధించిన 92 అంబేద్కర్‌ స్టడీ సెంటర్ల వివరాలను వెబ్‌సైట్‌ నుంచి తొలగించారని వెల్లడించారు. అయితే తెలంగాణ ఏ.జీ. రామకృష్ణారెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. ఏపీ సర్కార్ ఇప్పటి వరకూ జీతాలు చెల్లించలేదని, 92 కేంద్రాలను తొలగించలేదనీ అన్నారు. ఏ.పీ జారీ చేసిన జీ.వోలో తెలుగు యూనివర్సిటీ ఉద్యోగులకు మాత్రమే జీతాలు ఇవ్వనున్నట్లు.. అంబేద్కర్ యూనివర్శిటీ పేరు లేదని చెప్పారు. దీంతో అలా ఎందుకు చేశారని ఏ.పి.ఏజీని కోర్టు ప్రశ్నించింది. జీతాలు ఇవ్వకపోతే వారి పరిస్థితి ఏంటో అలోచించారా అని కొశ్చన్‌ చేసింది. స్టడీ సెంటర్స్‌ను మూసివేయనప్పుడు ఎందుకు పరీక్షలు నిర్వహించడం లేదని తెలంగాణ ఏజీని ప్రశ్నించింది.
వివాదాలు మానుకోవాలంటూ హైకోర్టు హితవు
విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వివాదాలు మానుకోవాలంటూ రెండు ప్రభుత్వాలకు హైకోర్టు హితవు పలికింది. తమ మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ఏపీలోని 92 విద్యాకేంద్రాల్లో ఎలాంటి సేవలు అందించారో అఫిడవిట్ దాఖలు చేయాలని అంబేద్కర్‌ వర్శిటీ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్‌11కు వాయిదా వేసింది. ఇప్పటికైనా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలోపెట్టుకొని గొడవలను వీడతాయో లేదో చూడాలి.

 

19:34 - November 29, 2015

వరంగల్ : అది గిరిజనుల అరుదైన జాతర. మహాకుంభమేళా తరహాలో జనం పోటెత్తుతారు. సంబరాలు అంబరాన్ని అంటుతాయి. జాతర సమయం సమీపిస్తున్నా... అధికారుల్లో మాత్రం చలనం కనిపించడంలేదు. పనుల్లో పురోగతిలేదు. ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా... మచ్చుకైనా అభివృద్ధి కనిపించదు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఇప్పుడు కూడా రాజ్యమేలుతోంది. సమీక్షలతో కాలయాపన చేస్తున్న అధికారులు పనుల పురోగతి గురించి పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నాయి. మేడారం జాతర పనుల్లో జరుగుతున్న జాప్యంపై ప్రత్యేక కథనం.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మేడారం జాతర
మేడారం జాతర... దేశంలో అతిపెద్ద గిరిజన పండుగ. రాష్ట్రం నుంచే కాదు.. చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. వనదేవలు... నమ్మక, సారలమ్మలకు మొక్కులు తీర్చుకొని తరలిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి జరిగే జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయిచింది. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుకుండా చూడాలన్నది తెలంగాణ సర్కార్‌ లక్ష్యం. కానీ పాలకులు ఒకటి తలిస్తే... అధికారులు మరొకటి తలుస్తున్నారు. వెరసి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది.
జాతర సౌకర్యాలకు నిధుల కొరతలేకుండా చర్యలు
తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి నిర్వహించే జాతర సౌకర్యాల కోసం నిధుల కొరతలేకుండా పాలకులు చర్యలు తీసుకున్నారు. కోటి కాదు.. పది కోట్లు కాదు... వంద కోట్లతో చేపట్టే పనులకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. కొన్ని పనులకు టెండర్లు పిలిచారు. మరికొన్ని టెండర్ల దశలో ఉన్నాయి. జంపన్నవాగుపై 18 కోట్ల రూపాయలతో నిర్మించతలపెట్టిన నాలుగు చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కొన్ని పనులు చేస్తున్నారు.
మేడారం జాతరకు వచ్చే భక్తులకు ట్రాఫిక్‌ సమస్య
మేడారం జాతరకు వచ్చే భక్తులకు పెద్ద సమస్య ట్రాఫిక్‌. ఖమ్మం, చత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఏపీల నుంచి వచ్చే వారికి ప్రతిసారి కష్టాలు తప్పడంలేదు. పస్రా-తాడ్వాయి, తాడ్వాయి-ఏటూరునాగారం 163 వ నంబర్‌ జాతీయ రహదారి అత్యంత కీలకం. 27 కి.మీ. మేర విస్తరణ చేపట్టారు. కానీ పనుల్లో మాత్రం ఆశించన పురోగతి కనిపించడంలేదున్న విమర్శలున్నాయి. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా 2 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మ్యూజియం పనుల పురోగతిలో ఉన్నాయి. సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణానికి సమీపంలో రెండెకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మిగిలిన పనులే పూర్తవుతాయా ? లేదా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
హడావుడిగా చేపడితే నాణ్యత సంగతేంటి ?
మేడారం జాతరలో కీలకమైనవి స్నానఘట్టాలు, చెక్‌డ్యామ్‌లు. వీటి పనులు ఇంకా ప్రారంభమేకాలేదు. దీనిపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జంపన్నవాగుకు ఇరువైపులా ఇప్పటికే ఉన్న 2. కి.మీ. మేర స్నానఘట్టాలున్నాయి. వీటిని 5 కి.మీ. వరకు పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం.. పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేసింది. వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక కోడ్‌ కారణంగా టెండర్ల ప్రక్రియ కూడా ముందుకు సాగలేదు. మూడు రోజుల క్రితం టెండర్లు ఖరారు చేశారు. జాతరకు ఇంకా 81 రోజుల సమయమే మిగిలివుంది. కాంట్రాక్టర్ పనులు చేపట్టినా సంకాలంలో పూర్తవుతాయా? లేదా? అన్న సందేహం కలుగుతోంది. హడావుడిగా పనులు చేపడితే నాణ్యతా ప్రమాణాల సంగతి ఏంటన్నది ప్రశ్న. పంచాయతీరాజ్‌ రక్షిత మంచినీటి సరఫరా విభాగం, రోడ్లు-భవనాలు, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో కొన్ని పనులు జరుగుతున్నాయి.
అసౌకర్యం లేకుండా చూడాలంటున్న భక్తులు
మేడారం జాతర నాటికి అన్ని పనులు పూర్తి చేసి, ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి జరిగే జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలిగితే, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న బాధ పాలకుల్లో కనిపిస్తోంది. దీంతో మేడారం సమ్మక-సారలమ్మ జారత పనులను దగ్గరుంచి పర్యవేక్షించాలి మంత్రులు, ఉన్నతాధికారులు నిర్ణయించారు.

 

18:44 - November 29, 2015

ఖమ్మం : ఎమ్మెల్సీ ఎన్నికలకు అప్పుడే ప్రలోభాల పర్వం మొదలైంది. ఖమ్మం జిల్లాలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లకు టీఆర్ ఎస్ నేతలు ఫోన్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొణిజర్ల ఎంపిటిసి సభ్యురాలి భర్త సత్యనారాయణను వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ ఫోన్ లో బెదిరించారు. టీఆర్ ఎస్ లో చేరాలని అతనిపై ఒత్తిడి పెంచారు. మదన్ లాల్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఎంపిటిసి సభ్యురాలి భర్త సత్యనారాయణ...
'టీఆర్ ఎస్ లో చేరాలని వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ నాకు ఫోన్ చేసి..  నాపై ఒత్తిడి పెంచారు. చేరకపోతే నన్ను చంపేస్తానని బెదిరించాడు. చంపితే నన్ను ఒక్కరిని చంపుతారేమో కానీ.. అనేక మంది కార్యకర్తలు పుడుతారు. నేను మాత్రం టీఆర్ ఎస్ చేరే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యే మదన్ లాల్ కు చేతనైతే రాజీనామా చేసి...నా భార్యపై పోటీ చేసి గెలవాలి' అని సవాల్ చేశారు.
ఎమ్మెల్యే మదన్ లాల్...
'సత్యనారాయణ టీఆర్ ఎస్ లో చేరతానని అన్నారు. నాతో ఫోన్ లో మాట్లాడి మా పార్టీలో చేరుతానని చెప్పాడు. ఆ మేరకు ఆయన నాకు ఫోన్ చేశారు. నేను ఆయనతో ఫోన్ లో మాట్లాడింది నిజం. నేను ఎవరిని బెదిరించలేదు. నాకు అతన్ని బెరించాల్సిన అవసరం లేదు. కేసీఆర్ విధానాలు, టీసర్కార్ సంక్షేమ కార్యక్రమాలు నచ్చితే చేరాలి లేకపోతే లేదు. పార్టీలోకి రావాలని నేను అతన్ని బలవంతం చేయలేదు' అని అన్నారు.

 

ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రలోభాల పర్వం

ఖమ్మం : ఎమ్మెల్సీ ఎన్నికలకు అప్పుడే ప్రలోభాల పర్వం మొదలైంది. ఖమ్మం జిల్లాలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లకు టీఆర్ ఎస్ నేతలు ఫోన్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొణిజర్ల ఎంపిటిసి సభ్యురాలు భర్త సత్యనారాయణను వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ ఫోన్ లో బెదిరించారు. టీఆర్ ఎస్ లో చేరాలని అతనిపై ఒత్తిడి పెంచారు. మదన్ లాల్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. 

కుటుంబం ఆత్మహత్యాయత్నం... ఒకరి మృతి

ఖమ్మం : జిల్లాలో కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లీ, ఇద్దరు కొడుకుల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చిన్న కుమారుడు ఖాసీం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కుమారుడు కరీం దోమలమందు తాగాడు. అతని పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోబోయిన తల్లిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే కరీం భార్య మదార్ బీ.. నిన్న అనుమానాస్పదంగా మృతి చెందారు. 

వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరేన్ పై సస్పెన్షన్

హైదరాబాద్ : వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరేన్ పై సస్పెన్షన్ వేటు పడింది. బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని ఐసీసీ.. సునీల్ నరేన్ ను సస్పెండ్ చేసింది.

 

ఎన్ టిఆర్ ట్రస్టు భవన్ లో పాలమూరు టిడిపి నేతల సమావేశం

హైదరాబాద్ : ఎన్ టిఆర్ ట్రస్టు భవన్ లో రేవంత్, రావుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా టిడిపి నేతల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.

 

భారత్ లో ఆర్థిక సంక్షోభం : సురవరం

ఢిల్లీ : భారత్ లో ఆర్థిక సంక్షోభం నెలకొందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో 'ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థకు ప్రత్యామ్నాయం' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడి దారి వ్యవస్థ ద్వారా కార్మికవర్గంపై ఆర్థిక భారం పెరుగుతోందని చెప్పారు. ప్రపంచీకరణ పేరుతో పెట్టుబడిదారి వ్యవస్థ విస్తరణలో ఆసియా దేశాలపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. ప్రపంచీకరణ-వ్యాపారీకరణ పేరుతో పెట్టుబడి వ్యవస్థ ద్వారా ఆర్థిక రాజకీయ పెత్తనం పెరుగుతుందని పేర్కొన్నారు.

సీపీఐ కేంద్ర కార్యాలయంలో సదస్సు

ఢిల్లీ : సీపీఐ కేంద్ర కార్యాలయంలో ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థకు ప్రత్యామ్నాయంపై సదస్సు నిర్వహించారు. చైనా,జపాన్, వియత్నాం, శ్రీలంక, నేపాల్ దేశాల వామపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. 

ఇరిగేషన్ శాఖపై ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ శాఖపై నిర్వహించిన సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం ముగిసింది. దుమ్ముగూడెం, కాంతనపల్లి ప్రాజెక్టుల పనుల వేగవంతంపై చర్చ జరిగింది. దీంతో పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావులు హాజరయ్యారు.

 

17:47 - November 29, 2015

కర్నూలు : జిల్లాలోని ఆత్మకూరులో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌ విద్యార్ధిపై విరుచుకుపడ్డాడు. ప్రగతి ప్రైవేట్‌ స్కూల్‌ స్టడీ అవర్‌లో 10వ తరగతి విద్యార్ధి వినోద్‌కుమార్‌ను సాయికిరణ్‌ అనే టీచర్‌ చితకబాదాడు. దెబ్బలకు తాళలేక విద్యార్ధి స్పృహ తప్పిపోయాడు. తోటి విద్యార్ధులు వినోద్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరోవైపు విద్యార్ధి సిగరేట్‌ తాగడం వల్లే మందలిచ్చామని పాఠశాల యాజమాన్యం చెబుతోంది. ఉపాధ్యాయుడి తీరుపై తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

17:42 - November 29, 2015

న్యూజిలాండ్ : రెడ్‌బుల్‌ డ్రిఫ్ట్ చాలెంజ్‌ రేస్‌తో దుబాయ్‌ హోరెత్తిపోయింది. హాట్‌స్పాట్‌ ఎరీనా వేదికగా జరిగిన ఈ పోటీలో టాప్‌ క్లాస్‌ డ్రిఫ్ట్ రేస్‌ స్పెషలిస్ట్ లు పోటీపడ్డారు. రేస్‌ ట్రాక్‌లో జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోయిన పోటీదారులు...సూపర్‌ స్టంట్స్ తో అదరగొట్టారు. కార్లతో వెరైటీగా డ్రిఫ్ట్ చేసి వీక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేశారు. ఈ పోటీలో డేర్‌డెవిల్‌ ఫీట్లతో ఆకట్టుకున్న జర్మనీ డ్రిఫ్ట్ స్పెషలిస్ట్...అలెగ్జాండర్‌ విల్స్ విజేతగా నిలిచాడు.

 

 

17:38 - November 29, 2015

విజయనగరం : మహాకవి గురజాడ అప్పారావు శత వర్ధంతి వేడుకలను ఏపీ సర్కార్‌ ఘనంగా నిర్వహిస్తోంది. గురజాడ తెలుగు భాషకు చేసిన కృషిని.. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై కలంతో రగిలించిన ఉద్యమం వెలకట్టలేనిదని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. విజయగనరంలో గురజాడ నివసించిన ఇంటిని జాతీయ సంపదగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు గురజాడ ఇంటిని అందంగా తీర్చిదిద్దారు. ఆయన రచనలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. గురజాడ ఉపయోగించిన వస్తువులు ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

పీపుల్స్ పార్కు అభివృద్ధికి కృషి - మధు

నెల్లూరు : ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. నెల్లూరు- హరినాథపురంలోని పీపుల్స్ పార్కును ఆయన సందర్శించారు. పార్కులో మొక్కలు నాటారు. పీపుల్స్ పార్కును అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని మధు హామీ ఇచ్చారు. 

17:22 - November 29, 2015

నెల్లూరు : ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. నెల్లూరు- హరినాథపురంలోని పీపుల్స్ పార్కును ఆయన సందర్శించారు. పార్కులో మొక్కలు నాటారు. పీపుల్స్ పార్కును అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని మధు హామీ ఇచ్చారు. పార్కు అభివృద్ధికి కృషి చేస్తున్న కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. రాబోయే సంక్రాంతి ఆటల పోటీలను పార్కులోనే నిర్వహించేలా కృషి చేయాలని కమిటీ సభ్యులకు ఆయన సూచించారు.

 

తొలి డే ఆండ్ నైట్ టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం

ఆడిలైట్ : తొలి డే ఆండ్ నైట్ టెస్టు మ్యాచ్ లో న్యూటిలాండ్ పై మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మూడు మ్యాచ్ ల టెస్టు 2-0 తేడాతో ఆసీస్ సీరీస్ కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 202 పరుగుతకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో 208 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 224 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

 

కోల్ కతాలో ముగ్గురు ఐఎస్ ఐ ఉగ్రవాదుల అరెస్టు

పశ్చిమబెంగాల్ : కోల్ కతాలో ముగ్గురు ఐఎస్ ఐ ఉగ్రవాదులను ఎస్ టీఎఫ్ బలగాలు అరెస్టు చేశారు. ఇర్షద్, అశ్వాక్, జహీంగీర్ అనే ముగ్గురు ఉగ్రవాదులు బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి ప్రవేశించారు. వీరిని ఎస్ టీఎఫ్ బలగాలు అరెస్టు చేశారు. భారత్ లోకి ప్రవేశించేందుకు ఐఎస్ ఐ ఉగ్రవాదులకు పాకిస్తాన్ నిఘా వర్గాలు సహకరించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

16:46 - November 29, 2015

కృష్ణా : జిల్లాలో విషాదం నెలకొంది. మరో అన్నదాత తనువు చాలించాడు. అప్పుల బాధకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని చందర్లపాడు మండలం గుడిమెట్ల శివారు రామన్నపేట గ్రామానికి చెందిన ప్రసాదపు బసవయ్య నాలుగు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని అందులో పత్తిపంట వేశాడు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట మొత్తం నేలపాలయింది. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక బసవయ్య పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

16:38 - November 29, 2015

తూర్పుగోదావరి : ఓఎన్జీసీ, గెయిల్‌కు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని బోడసకుర్రు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వైనతేయ నది వద్ద భూగర్భంలో డ్రిల్లింగ్‌ వల్ల తమ ఇళ్లు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ.. గెయిల్‌ టెర్మినల్‌ వద్ద గ్రామస్తులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. వీరి ఆందోళనకు పలు పార్టీల నేతలు మద్దతు తెలిపారు. యాజమాన్యం పట్టించుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

 

నెల్లూరులోని నాలాల ప్రాంతాల్లో మధు పర్యటన

నెల్లూరు : జిల్లా కేంద్రంలోని నాలాల ప్రాంతాల్లో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు పర్యటించారు. ఆక్రమణల తొలగింపులో నివాసాలు కోల్పోయే పేదలకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని డిమాండ్ చేశారు. కాల్వలపై అక్రమంగా నిర్మించిన బహుల అంతస్తుల హోటళ్లు, భవంతులను కూల్చిన తర్వాతే పేదల ఇళ్లను కూల్చాలని మధు అన్నారు.

హైదరాబాద్‌ లో 110 మంది నకిలీ వైద్యుల అరెస్టు

హైదరాబాద్‌ : నగరంలోని పాతబస్తీలో వైద్యం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీలోని పలు ఆస్పత్రుల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అర్హతా పత్రాలు లేకుండా వైద్యం చేస్తున్న 110 మంది నకిలీ వైద్యులను గుర్తించి.. అరెస్ట్ చేశారు. వీరు నిర్వహిస్తున్న క్లినిక్‌లను సీజ్ చేసినట్లు సమాచారం. 

16:16 - November 29, 2015

హైదరాబాద్ : వరంగల్‌ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయంపై కాంగ్రెస్‌ దృష్టి పెట్టింది. ఓటమికి గల కారణాలను తెలుసుకునేందుకు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీకి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. సోమవారం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని నేతలకు హైకమాండ్‌ ఆదేశాలు జారీ చేసింది. వరంగల్‌ ఉప ఎన్నిక ఓటమికి గల కారణాలు, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనున్నట్లు సమాచారం.  

16:13 - November 29, 2015

హైదరాబాద్‌ : నగరంలోని పాతబస్తీలో వైద్యం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీలోని పలు ఆస్పత్రుల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అర్హతా పత్రాలు లేకుండా వైద్యం చేస్తున్న 110 మంది నకిలీ వైద్యులను గుర్తించి.. అరెస్ట్ చేశారు. వీరు నిర్వహిస్తున్న క్లినిక్‌లను సీజ్ చేసినట్లు సమాచారం.

 

16:09 - November 29, 2015

నెల్లూరు : ఆక్రమణల తొలగింపులో నివాసాలు కోల్పోయే పేదలకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. నెల్లూరులోని నాలాల ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. కాల్వలపై అక్రమంగా నిర్మించిన బహుల అంతస్తుల హోటళ్లు, భవంతులను కూల్చిన తర్వాతే పేదల ఇళ్లను కూల్చాలని మధు అన్నారు. పేదలకు అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో ప్రతిపక్షాలన్నీ ఏకమై ఉద్యమం చేపడతాయని హెచ్చరించారు.

 

ఇరిగేషన్ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. దుమ్ముగూడెం, కాంతనపల్లి ప్రాజెక్టుల పనుల వేగవంతంపై చర్చ కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావులు హాజరయ్యారు. 

15:34 - November 29, 2015

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికలకు జీహెచ్‌ఎంసీ అధికారులు వేగం పెంచారు. నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమించిన జీహెచ్‌ఎంసీ.. వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఓటర్‌ లిస్ట్‌ను వెబ్‌సైట్‌లో పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వార్డుల వారీగా ఓటర్ల జాబితా
ఇప్పటివరకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవడంతో.. గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణపై జీహెచ్‌ఎంసీ అధికారులు వేగం పెంచారు. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించిన అధికారులు.. బీసీ ఓటర్ల ముసాయిదాను కూడా జారీ చేశారు. వీటిపై అభ్యంతరాలను డిసెంబర్‌ 2వరకు స్వీకరించనున్నారు. మార్పుల అనంతరం తుది జాబితాను 8వ తేదీన ప్రకటించనున్నారు. మరోవైపు అర్హులైన ఓటర్లు తమ పేర్లను ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే వరకు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
రెండు విడతలుగా శిక్షణ
ఇక ఎన్నికల కోసం 150 వార్డులకు రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమించారు. వీరికి రెండు విడతలుగా ప్రత్యేక శిక్షణను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. అదేవిధంగా ఎన్నికల కోసం తీసుకుంటున్న చర్యలపై చర్చించేందుకు.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిసెంబర్‌ 5న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఎన్నికల సామాగ్రిపై దృష్టి
మరోవైపు ఎన్నికలకు కావాల్సిన సామాగ్రిపై అధికారులు దృష్టి సారించారు. గ్రేటర్‌లోని 7050 పోలింగ్‌ కేంద్రాలకు 10 వేల ఈవీఎంలు కావాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఎన్నికల కోసం 50 వేల మంది సిబ్బంది సేవలు అవసరమవుతాయని భావిస్తున్నారు. అయితే గ్రేటర్‌లో ఎంతమంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు ? ఇంకా ఇతర జిల్లాల నుంచి ఎంతమందిని సర్దుబాటు చేయాల్సి ఉంటుందనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ఇదిలావుంటే.. గ్రేటర్‌ ఎన్నికల్లో నోటా ఉంటుందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై పూర్తి నిర్ణయం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌దేనని జీహెచ్‌ఎంసీ అధికారులంటున్నారు.
ఎన్నికలు మరింత పారదర్శకంగా నిర్వహించేలా ఏర్పాట్లు
ఇక గ్రేటర్‌లో ఎన్నికల నిర్వహణపై వస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకున్న జీహెచ్‌ఎంసీ.. ఎన్నికలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల వివరాలు, పోలింగ్‌ స్టేషన్ల జాబితాను ప్రత్యేకంగా సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సహకారంతో.. వెబ్‌సైట్‌లో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఏది ఏమైనా గ్రేటర్‌ ఎన్నికలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు.

 

14:52 - November 29, 2015

హన్మకొండ : పత్తికి మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఇప్పటికే కేంద్రంతో పలుమార్లు చర్చించామని చెప్పారు. ఉషా మెహ్ర కమిషన్‌కు రిపోర్టు కూడా ఇచ్చామని పేర్కొన్నారు. పత్తికి మద్దతు ధర కల్పించడంతో పాటు..ఎస్సీ వర్గీకరణ సమస్యలను కేంద్రంతో మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని అన్నారు. డిసెంబర్‌ 2న లేదంటే 3న ప్రధానిని కలిసి సమస్యలను వివరిస్తామని మంత్రి అన్నారు.

 

14:47 - November 29, 2015

ఢిల్లీ : దేశాభివృద్ధికి జీఎస్‌టి బిల్లు ఎంతో కీలకమైందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అనే రకాల వస్తు సేవాపన్నులంటిన్నింటిని ఒకే గొడుగు కిందకు తెస్తున్నామని..వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి జీఎస్‌టి బిల్లును అమల్లోకి తేవాలని కేంద్రం నిర్ణయించినట్లు మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ బిల్లుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కూడా సూత్రాప్రాయంగా అంగీకరించారని మంత్రి తెలిపారు. జీఎస్‌టీ బిల్లును రాజకీయ కోణంలో చూడొద్దని రాజకీయపార్టీలకు సూచించారు.

 

భారత జవాన్ల విడుదల

నేపాల్ : తమ భూభాగంలోకి ప్రవేశించారంటూ అదుపులోకి తీసుకున్న సశస్త్ర సీమా బల్‌ సిబ్బంది (ఎస్‌ఎస్‌బీ)ని నేపాల్‌ ఆర్మీ విడిచిపెట్టింది. డీజిల్‌ స్మగ్లర్లను వెంబడిస్తూ సరిహద్దూ దాటి నేపాల్‌లోకి ప్రవేశించిన జవాన్లను నేపాల్‌ ఆర్మీ అరెస్ట్ చేసి పోలీసులకు అప్పగించింది. అయితే దీనిపై స్పందించిన భారత ఆర్మీ అధికారులు నేపాల్‌ అధికారులతో చర్చలు జరిపారు. దీంతో అరెస్ట్ చేసిన భారత జవాన్లను నేపాల్‌ ఆర్మీ విడిచిపెట్టింది.

ఈజిప్టులో ఉగ్రవాదుల దారుణం..

ఈజిప్టు : రాజధాని కైరోలో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. మోటారు సైకిల్‌పై వచ్చిన ఉగ్రవాదులు పోలీసులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు పోలీసులు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 

13:27 - November 29, 2015

చిత్తూరు : టీటీడీకి కానుకగా 30 లక్షల రూపాయల విలువైన రెండు అంబులెన్సులను కోల్‌కతాకు చెందిన ప్రకాష్ చౌదరి అనే భక్తుడు సమర్పించారు. శ్రీవారి ఆలయం వద్ద తిరుమల జేఈఓ శ్రీనివాసరాజుకు రెండు అంబులెన్సులను అప్పగించారు. ఇప్పటికే ప్రకాష్ చౌదరీ అనేక విరాళాలు ఇచ్చారని తెలిపారు. ఇటీవల మరణించిన లడ్డూల తయారీ కాంట్రాక్టర్ పోటు రమేష్ జ్ఞాపకార్ధం రెండు అంబులెన్సులను శ్రీవారికి కానుకగా ఇచ్చినట్లు దాత జేఈఓ పేర్కొన్నారు.  

13:20 - November 29, 2015

విజయవాడ : అగ్రిగోల్డ్ కుంభకోణంపై సీబీఐపై దర్యాప్తుకు ఆదేశించాలని మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వేల కోట్ల రూపాయల కుంభకోణం దర్యాప్తుపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్ కు సంబంధించిన వేలాది వేలాది కోట్ల రూపాయల బినామీ ఆస్తులను బయటపెట్టి తాము... బాధితులను న్యాయం జరిగే వరకు పోరాడతామని శివాజీ చెబుతున్నారు. 

13:18 - November 29, 2015

హైదరాబాద్ : వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొనడాన్ని వైసీపీ తప్పుబట్టింది. అసలు అంతలా వృద్ధి రేటు సాధ్యమా అని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిడిపి ప్రభుత్వంపై పలు విమర్శలు సంధించారు. 2016-17 ఆర్ధిక సంవత్సరానికి 15శాతం వృద్ధి రేటును సాధించాలని సీఎం చంద్రబాబు కలలు కంటున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనాకే అంతస్థాయిలో గ్రోత్‌రేట్‌ లేదని..అలాంటిది ఏపీలో ఎలా సాధ్యమని ఆమె ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలు, మహిళలపై అత్యాచారాల్లో దేశంలోనే రాష్ట్రం నెంబర్‌ వన్‌ స్థానాన్ని సాధించిందని రోజా ఎద్దేవా చేశారు.  

13:13 - November 29, 2015

మెదక్ : జీఎస్‌టీ బిల్లును గతంలో బీజేపినే అడ్డుకుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సంగారెడ్డిలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏచూరి మెదక్ వచ్చారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏచూరి మాట్లాడారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయం తీసుకున్నాకే జీఎస్‌టీ బిల్లుపై పార్లమెంటులో చర్చించాలని ఆయన సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. జీఎస్‌టీ బిల్లుపై బిజేపి-కాంగ్రెస్‌ల మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో పార్లమెంటుకు చెప్పాలన్నారు.

 

13:11 - November 29, 2015

హైదరాబాద్ : వరంగల్ ఎన్నిక ఓటమిపై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి సారించింది. ఓటమికి గల కారణాలను తెలుసుకునేందుకు టి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీకి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. సోమవారం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని నేతలకు హైకమాండ్‌ ఆదేశాలు జారీచేసింది. వరంగల్‌ ఉప ఎన్నిక ఓటమికి గల కారణాలు, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనున్నట్లు సమాచారం.

ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్..
వరంగల్ ఓటమిని కాంగ్రెస్ హై కమాండ్ జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉంది. కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది..అలాగే హామీలు నెరవేరలేదు కనక ఎన్నికల్లో లబ్ది పొందవచ్చునని కాంగ్రెస్ భావించింది. కానీ ఎన్నికల ఫలితాలు రివర్స్ గా వచ్చాయి. కనీసం కాంగ్రెస్ కు డిపాజిట్ దక్కలేదు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయినా ఎందుకు విజయం సాధించలేదని హై కమాండ్ మదిని తొలిచేస్తున్నట్లు సమాచారం. పెద్ద తలకాయలను ఎన్నికల ప్రచారంలో దింపినా ఫలితం రాలేదు. అందులో భాగంగా ఎన్నిక ఓటమిపై హై కమాండ్ దృష్టి సారించింది. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో రానున్నాయి. ఈ నేపథ్యంలో హై కమాండ్ టి. కాంగ్రెస్ నేతలతో చర్చలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మరి హై కమాండ్ వీరితో ఏం చర్చిస్తారో ..ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి. 

13:07 - November 29, 2015

నిద్రపోతూ కనేది కల. నిద్రపోతున్న సమాజాన్ని తట్టిలేపేది కళ. ఇది ఓ తెలుగు సినిమాలోని డైలాగ్. కళాకారులు సమాజాన్ని నిద్రమేల్కోల్పే సినిమాలు చేయాలి. సమాజంలోని రుగ్మతలను రూపుమాపే సినిమాలు చేయాలి. ఏం చేసిన ఏలా చేసిన సినిమా అనే కళ ద్వారా జనం చైతన్యవంతులు కావాలి. అచ్చం ఇలాంటి సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో ఆలోచన రేకేత్తించాలని బాలీవుడ్ మిస్టర్ ఫర్ పెక్ట్ అమీర్ ఖాన్ ప్రయత్నం చేస్తుంటాడు. ఈ మిస్టర్ ఫర్ ఫెక్ట్ సమాజకోణంలో ఆలోచించి వెండితెరపై అద్భుతాలు చేశాడు. సమాజం మీద ఉన్న బాధ్యతను ఒక్కో వ్యక్తి ఒక్కో రూపంలో వ్యక్తపరుస్తుంటాడు. అదే బాధ్యత గల కళాకారులైతే కమర్షయల్ సక్సెస్ ల గురించి ఆలోచించకుండా తమ సినిమాల ద్వారా సందేశం ఇవ్వాలని ప్రయత్నిస్తుంటారు. అమీర్ ఖాన్ ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నాడు.

ఖాన్ సినిమా అంటే కొత్తదనం..
అమీర్ ఖాన్ సినిమా అంటే కొత్తదనం ఆయన సినిమా అంటే ఓ ఆలోచన, సమాజం మీద తనకున్న బాధ్యతను చాలా గౌరవంగా చూపించే అద్భుతమైన యాక్టర్ అమీర్ ఖాన్. అందుకే ఆయన ఏలాంటి కాన్సెప్ట్ టచ్ చేసిన కూడా ప్రేక్షకులు బ్రహ్మరథ పట్టడుతున్నారు. అమీర్ ఖాన్ కెరీర్ లోనే కాదు బాలీవుడ్ హిస్టరీలో నిలిచిపోయే మరో ఆణిముత్యం రంగ్ దే బసంతి. నాటి ప్రీడమ్స్ ఫైటర్స్ స్టోరీని ఇన్స్ ప్రెన్షన్ గా తీసుకుని చేసిన ఈ మూవీ యావత్తు దేశవ్యాప్తంగా అద్బుత విజయం సాధించింది.
హీరోగా సమాజానికి ఉపయోగపడే సినిమాలు అమీర్ ఖాన్ చేసినంత మరే హీరో చేయలేదని చెప్పాలి. హీరోగా గొప్ప అనిపించుకోవాలని కాకుండా సమాజంపై తనకున్న అవగాహనను తన సినిమాల ద్వారా ఆడియన్స్ అర్దమయ్యే విధంగా అందించాలనే తపనతో అమీర్ సోషల్ అవైర్ నెస్ స్టోరీస్ ని టచ్ చేస్తున్నాడు.

సమాజానికి ఉపయోగపడే సినిమాలు..
హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా ఏ కోణంలో చూసిన కూడా అమీర్ ఖాన్ సమాజ శ్రేయస్సు కోరే స్టోరీస్ నే ఎంచుకున్నాడు. హీరో అనే పదానికి మించి ఓ పౌరుడిగా తను సమాజానికి ఎంత వరకు మంచి చేయాగలడో తన సినిమాల ద్వారా అంత చేస్తున్నాడు. ఈ విధంగా అమీర్ ఖాన్ తనకున్న పరిధిలో సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేశాడు. అంతేకాదు అనేక సామాజిక కార్యక్రమాల ద్వారా ఈ స్టార్ సమాజంపై తనకున్న బాధ్యతను నిర్వర్తిస్తునే ఉన్నాడు. ముందు ముందు అమీర్ ఖాన్ మరిన్ని సోషల్ అవైర్ నెస్ సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుందాం.

12:54 - November 29, 2015

కొందరు పాటలను వినోదం కోసం రాస్తారు. మరి కొందరు విజ్ఞానం కోసం రాస్తారు. కాని తెలంగాణా గేయ రచయితలు మాత్రం వినోదం, విజ్ఞానంతో పాటు ప్రజలను చైతన్యవంతం చేయడానికే ఎక్కువగా పాటలల్లారు. అలాంటి వారిలో బండి సత్తెన్న ఒకరు. అక్షరాస్యత మెదలుకొని అమరవీరులను కీర్తించే వరకు వస్తు వైవిధ్యంతో ఆయన ఎన్నో పాటలు రాశారు. ప్రముఖ గేయ రచయిత బండి సత్తెన్న జనం పాటలపై ప్రత్యేక కథనం..

12:52 - November 29, 2015

సాహిత్యం సమాజానికి దిక్సూచిలాంటిది. ప్రజల్లోమూఢ నమ్మకాలు మూర్ఖపు విశ్వాసాలను తొలగించడానికి సాహిత్యం తోడ్పడుతుంది. ప్రగతిశీల భావాలు పెంపొందించడానికి సాహిత్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన వారిలో గురజాడ అప్పారావ్ కు మెదటి స్థానం దక్కుతుంది. నవంబర్ 30 న గురజాడ వర్థంతి. ''దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా'' అన్నారు మహాకవి గురజాడ అప్పారావ్ .ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ఆయన మలుపుతిప్పారు. 20వ శతాబ్ధపు తెలుగు సాహిత్యానికి దిశానిర్ధేశం చేసిన మహాకవి గురజాడ సాహిత్యం, జీవితం గురించి ప్రముఖ కథకులు, వేదగిరి రాంబాబు విశ్లేషణా కథనం.

 

అగ్రిగోల్డ్ లో సరైన విచారణ జరగడం లేదు - కారెం శివాజీ..

విజయవాడ : అగ్రిగోల్డ్ కేసులో సరైన విచారణ జరగడం లేదని కారెం శివాజీ పేర్కొన్నారు. సీబీఐచే విచారణ చేపట్టాలని, అగ్రిగోల్డ్ నిర్వాహకులను, బినామీ దారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 

నేపాల్ పోలీసుల అదుపులో 12 మంది ఎస్ఎస్ బి జవాన్లు..

నేపాల్ : నేపాల్ సరిహద్దులో 12 మంది ఎస్ఎస్ బి జవాన్లను నేపాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీజిల్ స్మగ్లర్లను వెంటాడుతూ నేపాల్ సరిహద్దులను జవాన్లు దాటారు. 

ఎంపీ గల్లా అవయవదానం..

గుంటూరు : అవయవదానాలు చేస్తున్నట్లు ఎంపీ గల్లాజయ్ దేవ్ ప్రకటించారు. ప్రభుత్వాసుపత్రితో అవయవదానంపై గల్లా సంతకం చేశారు. అవయవదానంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని, అవయవదానం చేయడం అంటే ఇతరులకు జీవం పోసినట్లేనన్నారు. ఇందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

టి.కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కు అధిష్టానం పిలుపు..

హైదరాబాద్ : టి.కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. ఆయనతో పాటు జానారెడ్డి, షబ్బీర్ ఆలీలకు పిలుపు రావడంతో సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. వరంగల్ ఉప ఎన్నికల ఓటమిపై అధిష్టానంతో చర్చలు జరుపున్నట్లు సమాచారం. 

ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీలు..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నకిలీ వీసాలతో దుబాయి వెళ్లేందుకు ప్రయత్నించిన 11 మందిని అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వారంతా కడప జిల్లా రాజంపేటకు చెందిన వారు. 

12:35 - November 29, 2015

మెదక్ : తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం వరకు ఉన్న బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సంగారెడ్డిలో జరుగుతున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలకు..అమలు చేస్తున్న కార్యక్రమాలకు పొంతన లేకుండా ఉన్నాయని, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు పడకేశాయనడానికి రైతుల ఆత్మహత్యలే నిదర్శనమన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం..పరిశ్రమలు అభివృద్ధి చెందాలన్నారు. కానీ వాస్తవానికి వాటికి అవసరమైన పునాది ఏర్పడడం లేదనేది వాస్తవని, మరోవైపు వ్యవసాయం సంక్షోభంలో ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితే కాక దేశ ఆర్థిక విధానాలు ఒక కారణమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఊతమిచ్చే విధంగా చేయడం లేదనేది వాస్తవమన్నారు. రైతుల ఆత్మహత్యల ఘటనలు ఇవి సూచిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రం యొక్క ఆదాయం రూ.4వేల కోట్లు ఉంటే జీతభత్యాలకే రూ.2 వేల కోట్లు పోతున్నాయన్నారు. రూ.1,500కోట్లు అభివృద్ధి సాధ్యానికి పొంతన లేదని విమర్శించారు. సామాజికంగా వెనుకబడిన ఉన్న కులాల సంక్షమం పట్టించుకోకుండా రాష్టాన్ని అభివృద్ధి చేస్తామనడం సాధ్యం కాదని, రాష్ట్ర ప్రభుత్వం ఆ కోణంలో ఆలోచించడం లేదని తమ్మినేని విమర్శించారు. 

12:28 - November 29, 2015

మెదక్ : ప్రస్తుత తరుణంలో వామపక్షాలు బలపడాల్సినవసరం ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. సంగారెడ్డిలో తెలంగాణ సీపీఎం రాష్ట్ర స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. జెండా ఆవిష్కరించిన అనంతరం ఏచూరి మాట్లాడారు. వామపక్షాలు బలం పెంచుకుంటే కేంద్రంతో పోరాడే శక్తి వస్తుందని తెలిపారు. వామపక్షాల ఐక్యత చాలా అవసరమని, డిసెంబర్ 1-6 మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతామని ప్రకటించడం జరిగిందన్నారు. గతంలో నాలుగు ఉండే పార్టీలు ఈసారి ఆరు అయ్యాయని తెలిపారు. లెఫ్ట్ యూనిటీని బలపర్చాలని ఏచూరి పిలుపునిచ్చారు. 

12:18 - November 29, 2015

మకావు : అంతర్జాతీయ వేదికపై తెలుగు బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి మెరిసింది. మకావు ఓపెన్ బ్యాడ్మింటెన్ మహిళ సింగిల్స్ విభాగంలో జరిగిన ఫైనల్ పోరులో సింధూ విజయం సాధించింది. జపాన్ కు చెందిన క్రీడాకారిణి మిథానిపై తిరుగులేని అధిపత్యాన్ని ప్రదర్శించింది. మూడు సెట్ల పాటు ఆట సాగింది. రెండు సెట్ లలో అధిపత్యం చూపిన సింధూ 21-9, 21-23, 21-14 తేడాతో విజయం సాధించింది. మకావు ఓపెన్ టైటిల్ ను గెలుచుకోవడం సింధూకు మూడోసారి కావడం విశేషం.

ఇద్దరు విద్యార్థినిలపై అత్యాచారం ?

వరంగల్ : తిరుపతి ఎస్సీ హాస్టల్ నుండి తప్పించుకున్న వరంగల్ వచ్చిన ఇద్దరు విద్యార్థినిలపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మిల్స్ కాలనీ పీఎస్ లో విద్యార్థినిలు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

మకావు ఓపెన్ టైటిల్ విజేత పీవీ సింధూ..

మకావు ఓపెన్ బ్యాడ్మింటెన్ విజేతగా పీవీ సింధూ నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో జపాన్ ప్లేయర్ మిథానిపై సింధూ విజయం సాధించింది. 21-9, 21-23, 21-14 తేడాతో గెలుపొందింది. వరుసగా మూడోసారి టైటిల్ ను సింధూ సాధించింది. 

12:01 - November 29, 2015

వీహెచ్...తెలంగాణ కాంగ్రెస్ నేత. రాజ్యసభ సభ్యుడు. దాదాపు 50 సంవత్సరాల నుండి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. చెన్నారెడ్డి దిగిన అనంతరం తనను సీఎం చేయాలని రాజీవ్ గాంధీ చెప్పారని వీహెచ్ పేర్కొన్నారు. కానీ కాకుండా చేశారని పేర్కొన్నారు. టెన్ టివిలో 'రచ్చబండ' కార్యక్రమంలో మల్లన్నతో 'వీహెచ్' ముచ్చటించారు. ప్రధాన పత్రికల్లో వచ్చిన కథనాలపై విశ్లేషణ తనదైన శైలిలో వీహెచ్ అందించారు. మరి వీహెచ్ వ్యక్తిగత విశేషాలు ఏంటీ ? మరి ఆ విశేషాలు తెలియాలంటే వీడియో క్లిక్ చేయండి. 

ఆర్మీ శిబిరాలపై పాక్ కాల్పులు...

జమ్మూ : శనివారం రాత్రి నుంచి పూంచ్ జిల్లాలో ఆర్మీ శిబిరాలపై పాక్ దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్ గాయపడినట్లు తెలుస్తోంది. 

యాదాద్రిలో భక్తుల రద్దీ...

నల్గొండ : శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం నల్గొండ జిల్లా యాదాద్రికి పోటెత్తారు. స్వామివారి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో కొండపైకి వెళ్లే వాహనాలను కిందే నిలిపివేశారు. దీంతో అటు రోడ్డు మార్గం, ఇటు మెట్ల మార్గం భక్తులతో కిటకిటలాడుతుంది.

ఆడిలైడ్ టెస్ట్..

ఆడిలైడ్ : ఆస్ట్రేలియాతో ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న డే / నైట్ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఆసీస్ బౌలర్ లియాన్ బౌలింగ్ లో శాంటర్ స్టంప్ ఔట్ అయ్యాడు. 88 బంతులు ఎదుర్కొన్న శాంటర్ ఐదు ఫోర్లు...1 సిక్స్ సాయంతో 45 పరుగులు చేశాడు. 

ట్రాన్స్ కో లో ఏఈ ఉద్యోగాలకు రాతపరీక్ష ప్రారంభం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్ కో లో సహాయ ఇంజినీర్ల పోస్టులకు రాత పరీక్ష ఆదివారం ఉదయం ప్రారంభమైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో 53 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 206 పోస్టులకు 47,246 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం 10.30గంటల నుండి 12.30గంటల వరకు ఈ పరీక్ష జరుగనుంది.

 

విశాఖలో గ్లోబల్ యూత్ మీట్ ప్రారంభం..

విశాఖపట్టణం : వుడా పార్కులో ఏర్పాటు చేసిన గ్లోబల్ యూత్ మీట్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. 

11:18 - November 29, 2015

మెదక్ : నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక దేశంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి పేర్కొన్నారు. సంగారెడ్డిలో సీపీఎం తెలంగాణ రాష్ట్రస్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్టీ పతాకాన్ని ఏచూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏచూరి మోడీ ప్రభుత్వ పాలన తీరును ఎండగట్టారు. రైతుల ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలు 19 శాతం అధికమయ్యాయని తెలిపారు. అంబేద్కర్ పేరిట రెండు రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించారని, అసలు ఏమి అడిగాం ? ఏమి చెప్పారని ప్రశ్నించారు. కేవలం రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగిందని విమర్శించారు. బీహార్ లో వామపక్షాలు ఏజెండాను కొనసాగిస్తామని నితీష్ చెప్పడం జరిగిందని, దీని ప్రభావం ఎన్నికలపై పడింది. ఏచూరి ఏమన్నారో ఆయన మాటల్లోనే....

తెలంగాణకు రావడం సంతోషం..
''తెలంగాణకు రావడం చాలా సంతోషంగా ఉంది. తన కుటుంబం పుట్టుక కోనసీమ...గోదావరి..నేను చెన్నపట్నంలో పుట్టాను. హైదరాబాద్ లో చదివాను..ముల్కీ సర్టిఫికేట్ నా దగ్గర ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో పోరాటాలు..వెనుకబడిన అంశాలను సూటిగా పరిష్కరించడానికి ఒక ప్లాన్ అయినట్లు ప్రస్తుతం కనిపించడం లేదు.

రైతు ఆత్మహత్యలు పెరిగాయి..
17 నెలల కాలంలో మోడీ ప్రభుత్వం వచ్చినప్పుటి నుండి తీవ్రమైన మార్పులు వచ్చాయి. ఒక రకంగా ఈ ప్రమాదాలు దేశం..సమాజంపై పడుతున్నాయి. ఇది అన్ని రంగాల్లో నెలకొని ఉంది. ఆర్థిక భారాలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ధరలు ఏ రకంగా పెరుగుతున్నాయో చూడవచ్చు. ఉత్తరాది వారు దాల్..రోటి తింటుంటారు. కానీ అక్కడ ధరలు ఎలా ఉన్నాయో చూడండి. చికెన్ల ధర తక్కువ. చమురు ధరలు పెరుగుతున్నాయి.

వ్యవసాయరంగంలో సంక్షోభం...
వ్యవసాయ రంగం సంక్షోభం తీవ్రంగా ఉంది. రైతుల ఆత్మహత్యలు 19 శాతం పెరిగాయి. 2014 ఎన్నికల ప్రచారంలో రైతులకు ఎంత ఖర్చు అవుతుందో 150 శాతం ఎక్కువగా ఇస్తామని చెప్పింది. కానీ వాస్తవంగా రైతులకు ఖర్చు ఎంత పెంచారు ? రుణాల వల్ల రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రుజువైంది. రుణాలు ఇంకా పెరుగుతాయి. ఆత్మహత్యలు ఇంకా పెరుగుతాయని పాలన సూచిస్తోంది.

మోడీ విదేశాలకు ...
మోడీ విదేశాలకు వెళుతూనే ఉన్నారు. ఏ దేశానికి ఎప్పుడు వెళుతున్నారో తెలియడం లేదు. ఇటీవల పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో బీజేపీ నేతలు ఛమత్కారాలు మాట్లాడుకున్నారు. పార్లమెంట్ లో మోడీ కూర్చున్న తరువాత తడుముకుంటున్నాడంట. సీటు బెల్టు వెతుక్కుంటున్నాడం. అనంతరం నిద్ర పోయాడు. రాజ్ నాథ్ లేపాడు. లేవగానే ఏంటీ ల్యాండ్ అయిపోయామా ? అన్నాడంట.

ప్రతిపక్షాలపై మోడీ విమర్శలు..
2014 ఎన్నికలు జరిగిన అనంతరం ప్రతిపక్షాలు సిటీ బస్సులో తిరగవని మోడీ పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల అనంతరం సిటీ బస్సులో ప్రతిపక్షాలు తిరుగుతాం. మరి మీరు ఆటో రిక్షాలో తిరగాల్సి వస్తుందని పేర్కొన్నాం. బీహార్ ఎన్నికల అనంతరం ఆటో రిక్షాలో తిరుగుతారా ? లేదా ? అనేది చూడాలి అని వ్యాఖ్యానించాం.

పోరాటాలు ఉధృతం చేయాలి.
గతంలో జరిగేవే తీవ్రంగా ఇంకా ఉద్యమాలు జరగాలి. ఒక వారసత్వం ఉంది. దీనిని కొనసాగించాలి. అఖిల భారత ప్లీనం జరుగుతుంది. అక్కడి నిర్ణయాలు తీసుకుంటాం. తెలంగాణలో మార్పు తీసుకరావడానికి ముందడుగు వేయాలనే దానిపై చర్చించడం జరగుతుంది. ఉన్నటువంటి పరిస్థితులపై నిర్ణయాలు తీసుకోవాల్సినవసరం ఉంది''. అని ఏచూరి తెలిపారు. 

ఆడిలైడ్ టెస్ట్..

అడిలైడ్ : ఆస్ట్రేలియాతోతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి అంతర్జాతీయ డే/నైట్ టెస్టు మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. 

సముద్రంలో తెప్ప బోల్తా..

విజయనగరం : జిల్లా ఇచ్పాఉరం మండలం డొంకూరు సాగరతీరం నుండి ఆదివారం ఉదయం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన తెప్పల్లో ఓ తెప్ప బోల్తా పడింది. మత్స్యకారులు క్షేమంగానే ఉన్నారని తెలుస్తోంది. 

సీపీఎం రాష్ట్ర స్థాయి సమావేశాలు ప్రారంభం..

మెదక్ : సీపీఎం రాష్ట్ర స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరయ్యారు. పార్టీ పతాకావిష్కరణ అనంతరం ఏచూరి ప్రసంగించారు. మోడీ అధికారంలోకి వచ్చిన అనంతరం దేశంలో రైతు ఆత్మహత్యలు 19 శాతం పెరిగాయని, నిత్యావసర ధరలు విపరితంగా పెరిగాయని తెలిపారు. 

10:29 - November 29, 2015

నల్గొండ : హుజూర్ నగర్ శివారులో భారీగా ఎర్రచందనం దుంగలు దొరికాయి. పోలీసులు జరిపిన తనిఖీల్లో దాదాపు 8క్వింటాళ్ల దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 40-50 లక్షలు ఉంటుందని అంచనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా పరివాహక ప్రాంతం సరిహద్దు కావడం బెల్లం, రేషన్ బియ్యం ఇతరత్రా అక్రమంగా రవాణా అవుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీనితో ఆదివారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. ఎపి 24టిసి 1737 వాహనాన్ని ఆపి తనిఖీలు నిర్వహించారు. అందులో ఉన్న ఎర్రచందనం దుంగలతో పాటు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వాహనం వెనుకాలే వస్తున్న మరో వాహనంలో ఉన్న ముగ్గురు పరారయ్యారని పోలీసులు భావిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో హైదరాబాద్ కు చెందిన ఓ కానిస్టేబుల్ కీలక పాత్ర పోషిస్తున్నాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

10:18 - November 29, 2015

ప్రైవేటు రంగంలో ప్రభుత్వ నియంత్రణ ఉండాలని, ముఖ్యంగా విద్యా రంగంలో ఫీజు నియంత్రణ చట్టం ఉండాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రైవేటు విశ్వ విద్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రైవేటు విశ్వ విద్యాలయాల రాకతో విద్యారంగ స్వరూపమే మారిపోయే అవకాశం ఉంది. నిజానికి ప్రైవేటు విశ్వ విద్యాలయాల వల్ల సామాన్యులకు, మధ్య తరగతి ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా ? అసలు ఎందుకీ ప్రైవేటు విశ్వ విద్యాలయాలు ? ఈ అంశంపై 'ఫర్ ద పీపుల్ టాక్ షో విత్ రాఘవులు' విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొని రాఘవులు మాట్లాడారు. ఆయన మాటల్లోనే...

విద్య వ్యాపారమయం..
''ఇలాంటి విశ్వ విద్యాలయాలు చాలా వచ్చాయి. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు తెస్తున్నారా ? విద్య అనేది వ్యాపారమై పోయింది కనుక కొంతమంది వత్తిడి తెస్తున్నారా ? విద్యా వ్యాపార వేత్తలు చాలామంది కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారి ప్రయోజాల కోసం చేస్తున్నారా ఆలోచించాలి. నాణ్యమైన ఉన్నత విద్య ఉండే దేశం బాగా అభివృద్ధి చెందుతుంది. ఉన్నత విద్య లేని దేశం ఇతర దేశాలతో పోటీని తట్టుకోవడం కష్టం. ప్రభుత్వ రంగాన్ని హీనంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. విద్యారంగం నుండి తప్పుకోవాలనే ఆలోచన నుండే ఇది వస్తోంది.

1990 సంస్కరణలు...
1990 సంవత్సరంలో దేశంలో సంస్కరణలు ప్రారంభం తరువాత రాజకీయ ప్రధాన పార్టీల ఆలోచనలు మారిపోయాయి. ప్రభుత్వం ఉత్తత్తి..వ్యాపారం ఎందుకు చేయాలనే ఆలోచన వచ్చింది. విద్యారంగాన్ని అశ్రద్ధ చేయడం ప్రారంభించారు. అన్ని రంగాలు వ్యాపారంగా మారాయో అందులో భాగంగా విద్య...వైద్య రంగాలను కూడా వ్యాపారంగా మార్చేస్తున్నారు. 

విశ్వవిద్యాలయాల్లో సౌకర్యాలు ఎక్కడ ?
విశ్వ విద్యాలయాలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలో జిల్లాకో యూనివర్సిటీ పెడుతున్నారు. పేర్లు మాహత్తరంగా పెట్టారు. భవనాలు..ఫ్యాకల్టీ, సౌకర్యాలు లేవు. ఉస్మానియా యూనివర్సిటీ క్షీణించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంట్రాక్టు పద్ధతిలో ఉంటే పరిశోధన ఏం చేస్తారు ? ఉన్నత విద్య అంటే కొద్ది మందికి మాత్రమే ఇవ్వడం అని ఇతర తరగతుల వారిని ప్రోత్సాహించాలనే దృక్పథాన్ని వదిలేశారు. 1.44 కోట్ల వ్యాపారం కోచింగ్ జరగుతోందంట.

ఫీజు నియంత్రణ చట్టం ఉండాలి..
ఫీజు నియంత్రణ చట్టంలో ఉండాలి. సివిల్ సొసైటీ సంఘటితమై చట్టాన్ని రూపొందించాలని వత్తిడి చేయాలి. ఇందులో మీడియా వైపు సహకారం కూడా తక్కువగా ఉంది. 58 యూనివర్సిటీలున్నాయి. వీటి అనుభవాలు ముందున్నాయి. బంగారు తెలంగాణ నిర్మిస్తామన్నారు. ప్రవేటు రంగంలో ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. విద్య..వైద్యం చాలా అవసరం'' అని రాఘవులు పేర్కొన్నారు. మరింత విశ్లేషణ కోసం వీడియో చూడండి..

10:02 - November 29, 2015

విశాఖపట్టణం : సాగర తీరం యువతుల అందాల పోటీకి సిద్దమైంది. తమ అందానికి గుర్తింపు రావాలని ఆరాటపడే అందగత్తెల కోసం.. విశాఖ వేదికగా మిస్‌ వైజాగ్‌ కాంటెస్ట్‌ జరుగుతోంది. అందం, ఆత్మవిశ్వాసం, ప్రావీణ్యం ప్రదర్శించేందుకు 20 మంది యువతులు పోటీ పడుతున్నారు. మరెంతమందో అమ్మాయిలను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపే విధంగా పోటీలు..
ఈ కాంటెస్ట్ కు 100 మంది దరఖాస్తు చేసుకోగా.. 20 మంది ఫైనల్‌కు అర్హత సాధించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా ప్రముఖ దర్శకులు ఆర్పీ పట్నాయక్‌,., ఆనందం మూవీ హీరోయిన్‌ రేఖ, మోడల్‌ మార్గాని భరత్‌ వ్యవహరించనున్నారు. సినిమా లేదా ఫ్యాషన్‌ రంగంలో రాణించే విధంగా అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

టీనేజర్స్‌ నుంచి మంచి ఆదరణ..
మిస్‌ వైజాగ్‌ కాంటెస్ట్ కు టీనేజర్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తమ టాలెంట్‌ను ప్రదర్శించేందుకు ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయంటున్నారు విశాఖ అమ్మాయిలు. ఈ కాంటెస్ట్ లో ఎంటెక్‌, ఎంబీబీఎస్‌ విద్యార్ధులు సైతం పాల్గొని తమ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో విశాఖ స్టీల్‌ సిటీ ముద్దుగుమ్మల అందాలతో మెరిసిపోతోంది. మొత్తం మూడు రౌండ్లలో పోటీలు జరుగుతాయి. శారీ, లాంగ్‌ స్కాట్‌, అభినయం ద్వారా 'మిస్‌ వైజాగ్‌'ను ఎంపిక చేయనున్నారు. 20 మంది అమ్మాయిలు తమ అందచందాలను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. ఈ పోటీలను తిలకించేందుకు యువతీ యువకులు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఇక ఈ మిస్‌ వైజాగ్‌ కిరీటం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. 

09:54 - November 29, 2015

హైదరాబాద్ : పన్నుల వాటా వ్యవహారం కేంద్ర, రాష్ట్రాల మధ్య చిచ్చురేపుతోంది. కేంద్రం ఓ చేత్తో ఇస్తూ.... మరో చేత్తో తీసేసుకునే విధంగా నిర్ణయాలు తీసుకుంటోందని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. మధ్యాహ్న భోజన పథకం, నేషనల్‌ హెల్త్ మిషన్‌, రాజీవ్‌ విద్యా మిషన్‌... వంటి పథకాలకు భారీగా నిధులు కోత పెట్టిన కేంద్రం వైనాన్ని తప్పుబడుతున్నాయి. ఆ భారాన్ని రాష్ట్రాలకు బదాలయించడంపై తెలంగాణ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కొత్త పన్నుల విధానం తీసుకురానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వస్తు సేవల పన్నును అమలు చేయనుంది. ఇప్పుడున్న పన్నుల విధానంలో రాష్ట్రాలకు 32 శాతం బదాలయిస్తున్నారు. జీఎస్‌టీ తీసుకురానున్న కేంద్రం... రాష్ట్రాలను బుజ్జగించేందుకు పన్నుల్లో 42 శాతం వాటా ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇచ్చే నిధులను తగ్గించ నుంది. దీనివల్ల తమపై అదనపు భారం పడుతోందని రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 223 కోట్ల అదనపు భారం..
జీఎస్టీ ఆమోదం పొందాక... కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు... ఇకపై రాష్ట్రాలు అధిక నిధులను భరించాల్సి వస్తుంది. పన్నుల విధానంలో కేంద్రం తీసుకురానున్న మార్పుల ద్వారా తెలంగాణ సర్కార్‌పై వెయ్యి కోట్ల రూపాయలకు పైగా అదనపు భారంపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మధ్నాహ్న భోజనం వంటి ముఖ్యమైన పథకాల అమలులో.. రాష్ట్రం ఎక్కువ భారాన్ని భరించాల్సి వస్తుందని అంటున్నారు. పదిహేడు రకాల స్కీములకు రాష్ట్రాలే అధిక మొత్తం భరించాలని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన కింద ఇప్పటి వరకు నూరు శాతం నిధులను కేంద్రమే భరించేది. దీనిని ఇప్పుడు 60 శాతానికి కుదించారు. దీంతో తెలంగాణ సర్కార్‌పై 130 కోట్ల అదనపు భారం పడనుంది. జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద ఇచ్చే నిధులను 75 నుంచి 60 శాతానికి తగ్గించారు. ఈనిర్ణయంతో రాష్ట్రంపై 223 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది.

విద్యా మిషన్‌ నిధుల్లో 15 శాతం కోత..
జాతీయ విద్యా మిషన్‌ నిధుల్లో కూడా కేంద్రం కోత పెట్టనుంది. ఈ పథకానికి 15 శాతం నిధులు తగ్గించడం ద్వారా రాష్ట్రం 71 కోట్ల రూపాయల అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది. సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకానికి ఇచ్చే వంద శాతం నిధుల్లో సగం తగ్గించారు. దీంతో రాష్ట్రం నెత్తిన 294 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. మధ్నాహ్నం భోజనం పథకంపై 8 కోట్లు, గృహ నిర్మాణ పథకానికి 104 కోట్లు, వన్యప్రాణుల సంరక్షణకు 7 కోట్ల రూపాయల భారాన్ని భరించాల్సి ఉంది. నేషనల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌కు 19.38 కోట్ల రూపాయలు, స్మార్ట్ సిటీస్‌కు 110 కోట్ల రూపాయాలు భరించాల్సి వస్తుంది.

కేంద్ర పథకాలకు నిధులు పెంచాల్సి ఉంది..
కొత్త పన్నుల విధానం రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్ధిక శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించాల్సింది పోయి... ఇస్తున్న నిధుల్లోనే కోత విధించే విధానం మంచిదికాదని రాష్ట్ర పాలకులు చెబుతున్నారు. దీనిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. కేంద్ర ప్రథకాలకు నిధుల తగ్గింపు వ్యవహారం లబ్ధిదారులను కూడా ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. 

09:25 - November 29, 2015

మెదక్ : సీపీఎం రాష్ట విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నామని పార్టీ నేత చుక్కా రాములు పేర్కొన్నారు. సంగారెడ్డిలో పార్టీ విస్తృతస్థాయి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొననున్నారు. ఈసందర్భంగా సమావేశ వివరాలను చుక్కా రామయ్య టెన్ టివికి తెలిపారు. డిసెంబర్ లో కలకత్తాలో నిర్వహించనున్న ప్లీనంలో డాక్యుమెంటరీ దానిపై అన్ని రాష్ట్రాలు చర్చిస్తున్నాయని అందులో భాగంగా డాక్యుమెంటరీపై చర్చించబోతున్నట్లు తెలిపారు. విశాఖలో జరిగిన ఆల్ ఇండియా మహాసభలో పిలుపులో భాగంగా పార్టీ నిర్మాణంపై చర్చ జరుగుతుందన్నారు. ఈ సమావేశాలకు పది జిల్లాల నుండి 200 మంది ప్రతినిధులు హాజరౌతున్నారని పేర్కొన్నారు. రాజకీయ పరమైన ఎలాంటి చర్చ ఉండదని, కేవలం సీపీఎం పార్టీ నిర్మాణానికి ముఖ్యమైన చర్చ జరుగుతుందన్నారు. తొలి రోజు కార్యక్రమం ఉదయం 10గంటలకు పతాకవిష్కరణ జరుగుతుందని, అనంతరం ఓపెన్ సెషన్..ప్రతినిధుల సమావేశం ప్రారంభమౌతుందన్నారు. మధ్యాహ్నాం మొదలయ్యే ప్రతినిధుల సమావేశం సోమవారం సాయంత్రం వరకు కొనసాగనుందన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగబోతుండడం వల్ల ఏచూరి ఒక రోజు మాత్రమే ఉంటారని, వారి సూచనలు అందచేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశాలకు పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎమ్మెల్యే సున్నం రాజయ్యతో పాటు ముఖ్య నేతలు, వివిధ రంగాల నాయకులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. 

09:15 - November 29, 2015

మెదక్ : చిన్నారి రాకేష్ మృతి చెందడం బాధాకరమని సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రి వైద్యుడు పేర్కొన్నారు. శనివారం ఉదయం జిల్లాలోని పుల్కల్ మండలం బొమ్మారెడ్డి గూడెంలో బోరు బావిలో రాకేష్ (3) పడిన సంగతి తెలిసిందే. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమించి రాకేష్ ను బయటకు తీశారు. వెంటనే 108 వాహనంలో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వైద్యుడు మీడియాతో మాట్లాడారు. పడిన సమయంలో తలకింద ఉండడంతో తలకు బలమైన గాయమైందని పేర్కొన్నారు. అంతేగాక ఊపిరాడక చనిపోయాడని, పోస్టుమార్టం అనంతరం ఇతర వివరాలు తెలుస్తాయని తెలిపారు. ఇద్దరు వైద్యులు ఘటనాస్థలంలో ఉన్నారని, బాలుడిని బయటకు తీయడంతో 108 వాహనంలో ఇక్కడకు తరలించడం జరిగిందన్నారు. 30 అడుగుల లోతున పడడం..చిన్నారి ప్రాణాలతో ఉండడం చాలా కష్టమని, ప్రాణాలతో బయటపడుతామని ఊహించామని కానీ ఫలితం ఇలా రావడం బాధాకరమన్నారు. 

బేగంపేటలో కార్డన్ సెర్చ్...

హైదరాబాద్ : బేగంపేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మహారాష్ట్ర, యూపీ, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 80మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

08:59 - November 29, 2015

అక్కినేని నాగచైతన్య, శ్రుతి హాసన్‌, అనుపమ పరమేశ్వరన్‌ హీరోహీరోయిన్లుగా చందు మొండేటి దర్శకత్వంలో పి.డి.వి.ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న కొత్త చిత్రం శనివారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో అఖిల్‌ క్లాప్‌నివ్వగా నిర్మాత డి.సురేష్‌బాబు కెమెరా స్విచాన్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, 'మలయాళంలో ఘనవిజయం సాధించిన 'ప్రేమమ్‌' చిత్రాన్ని నాగచైతన్య, శ్రుతిహాసన్‌, చందు మొండేటి కాంబినేషన్‌లో రీమేక్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న తొలి చిత్రమిది. రెగ్యులర్‌ షూటింగ్‌ను డిసెంబర్‌ 3 నుంచి విశాఖలో ప్రారంభించనున్నాం. ప్రేమ, సంగీతం నేపథ్యంలో దృశ్యకావ్యంగా రూపొందించనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిపారు. 

08:58 - November 29, 2015

జాతీయ ఉత్తమ నటి కొంకణాసేన్‌ శర్మ త్వరలోనే ప్రేక్షకులకు దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. 'డెత్‌ ఇన్‌ ఏ గుంజ్‌' చిత్రానికి కొంకణా తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నారు. నేషనల్‌ ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కొంకణా రాసిన 'డెత్‌ ఇన్‌ ఏ గుంజ్‌' స్క్రిప్ట్ ని ఆమోదించారు. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించి ప్రీ పొడక్షన్‌ వర్క్ జరుగుతోంది. ఇందులో భాగంగా కొంకణాసేన్‌తోపాటు చిత్ర యూనిట్‌ లొకేషన్స్ కోసం లక్నోకి చేరుకున్నారు. లక్నో, గోరఖ్‌పూర్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ నిర్వహించేందుకు కొంకణా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్‌ పనులను డిసెంబర్‌ నెలాఖరునాటికి పూర్తి చేసి, జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏదిఏమైనా ఇప్పటివరకు నటిగా ప్రేక్షకులను అలరించిన కొంకణా ఇకపై దర్శకురాలిగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని ఆశిద్దాం..

08:57 - November 29, 2015

'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిందని' అంటోంది సోనమ్‌కపూర్‌. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కి జోడీగా సోనమ్‌ 'ప్రేమ్‌ రతన్‌..'లో నటించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణతో దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి సంచలన విజయం దిశగా పయనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విజయానందాన్ని సోనమ్‌ ఆస్వాదిస్తూ పై విధంగా స్పందించింది. అంతేకాకుండా ఈ సక్సెస్‌ని కేవలం తనకు, తన కుటుంబ సభ్యులకే పరిమితం చేయకుండా కెరీర్‌ ప్రారంభం దగ్గర్నుంచి ఇప్పటివరకు వెన్నంటి నిలిచిన స్టాఫ్‌కు లేటెస్ట్‌ టాబ్‌లెట్స్ ను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తింది. 'సదా వెన్నంటి ఉండి పూర్తి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు' అంటూ స్వయంగా రాసిన స్పందనని సైతం బహుమతితోపాటు కలిపి ఇచ్చింది. సోనమ్‌ ప్రస్తుతం నీరజా భానోత్‌ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న 'నీరజా భానోత్‌' చిత్రంలో నటిస్తోంది.

08:42 - November 29, 2015

నువ్వులు తింటే వేడి చేస్తాయని ఎక్కువగా తినరు. కానీ ఈ కాలంలో వీటిని తీసుకోవడం మంచిదని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. వాటిలో పోషకాలు ఎక్కువ. మాంసకృత్తులు, ఆమినోయాసిడ్లు నువ్వుల్లో సమృద్ధిగా ఉన్నాయి. మెగ్నీషియం శాతమూ ఎక్కువే. నువ్వులతో తయారైన నూనెను వాడటం వల్ల అధిక రక్తపోటు, రక్తంలో చక్కెరస్ధాయిలూ అదుపులో ఉంటాయి. ముఖ్యంగా నల్ల నువ్వుల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడుతున్న, బలహీనంగా ఉన్న వారు నువ్వులను ఎక్కువగా తీసుకుంటే మంచిది. నువ్వుల్లో సెసమాల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్ధం ఉంటుంది. అది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వాటిల్లో ఉండే మోనోశాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించి, మంచి కొలస్ట్రాల్‌ పెరిగేలా చేస్తాయి. నువ్వుల్లో ఉండే పీచు జీర్ణక్రియ పనితీరుని మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. పీచు, జింక్‌, కాల్షియం సమృద్ధిగా ఉందడం వల్ల రక్తనాళాలు, ఎముకలు, కీళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. నువ్వులు ఉబ్బసాన్ని తగ్గించడంలోనూ ఉపయోగపడతాయి. 

08:40 - November 29, 2015

ఇంటి ఆవరణలో పెంచుకునే పూల మొక్కలు ఆ ఇంటికి అందాన్నిస్తాయి. మరి ఆ మొక్కలు అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పంచుతాయంటే నమ్ముతారా? అవునండి, ప్రశాంతమైన నిద్రకు కొన్ని పూల మొక్కల పెంపకం ఓ అద్భుత మార్గమని చెబుతున్నారు నిపుణులు. మరి ఆ మొక్కలేంటో తెలుసుకుందాం..
మల్లె మొక్క: ఓ అధ్యయనంలో సహజ నిద్ర సహాయకారిగా పనిచేసే సామర్థ్యం మల్లెపూలలో ఉందని తేలింది. సానుకూల ప్రభావం ఉండటం వల్ల నిద్ర బాగా పడుతుందట. లావెండర్‌: సబ్బులలో, షాంపూలు తదితరాల సువాసన కోసం ఉపయోగిస్తారు. నిజానికి లావెండర్‌ మొక్క నిద్రలేమి, ఒత్తిడి సమస్యల నివారణకు సహాయపడుతోంది. దాని సువాసన పీల్చడం వల్ల ఉపశమనం కలుగుతుందని పరిశోధకులు గుర్తించారు.
గార్డేనియా: నిద్రలేమి సమయంలో ఇవి నిద్రమాత్రలంత సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఒక జర్మన్‌ అధ్యయనంలో ఎలుకల మీద పరీక్షలు చేసి ఈ విషయాన్ని నిర్థారించారు. ఈ పువ్వులు ఒక న్యూరోట్రాన్స్మిటర్‌ మీద ప్రభావం చూపాయి. ఒక బోనులో ఎలుకలను, ఈ పువ్వులను ఉంచితే ఎలుకలలో చురుకుదనం తగ్గి, మూలలో రిలాక్స్‌గా కూర్చున్నాయి. తర్వాత మానవులపై కూడా ఒకే ఫలితాన్ని చూపాయి.
స్నేక్‌ప్లాంట్‌: దీని మారుపేరు మదర్‌ ఇన్‌ లాస్‌ టంగ్‌. ఇంట్లోని ఆక్సిజన్‌ స్వచ్ఛత మెరుగుపరిచేందుకు ఈ మొక్క పెంపకం ఓ గొప్పమార్గం. అంటే దీని ఉపయోగం మనకు ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కలబంద మొక్క: మచ్చలు, కాలిపోయిన చర్మం, వాపులకు కలబంద ఓ ప్రకృతి వైద్యంగా గొప్పగా పనిచేస్తుంది. అయితే ఇది కూడా కొన్ని సందర్భాలలో శరీరానికి హాని చేయవచ్చు. కానీ కాలుష్య కారక రసాయనాలను నిర్మూలించేందుకు కలబంద సహాయపడుతుంది. ఇంటి ఆవరణలో అధికస్థాయిలో హానికరమైన రసాయనాలు ఉన్నప్పుడు ఈ మొక్కలమీద గోధుమ రంగు మచ్చలు అభివృద్ధి చెందుతాయి. కాలుష్య కారకాల పరిస్థితిని ఈ మొక్కల ద్వారా పసిగట్టవచ్చు.

08:39 - November 29, 2015

స్నేహ చిత్ర పిక్చర్స్‌ పతాకంపై ఆర్‌.నారాయణ మూర్తి దర్శక నిర్మాతగా రూపొందిస్తోన్న చిత్రం ' దండ కారణ్యం'. ఆర్‌.నా రాయణమూర్తి, త్రినాథ్‌, ప్రసాద్‌రెడ్డి, విక్రమ్‌ ప్రధాన పాత్రధారులు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా నారాయణ మూర్తి శనివారం విలేకరులతో మాట్లాడారు. ''సీతారాములు త్రేతా యుగంలో, పాండవులు ద్వాపరి యుగంలో అరణ్యవాసం చేసేటప్పుడు దండకారణ్యంలోనే ఉన్నారు. ఇలాంటి దండకారణ్యం ఇప్పుడు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. ప్రభుత్వం చేపట్టే బాక్సైట్‌ గనుల తవ్వకాల వల్ల అక్కడున్న ఆదివాసీలకు మనుగడ లేకుండా పోతుంది. ఆదివాసీల హక్కుల గురించి తెలియజేసే చిత్రమే 'దండకారణ్యం'. బొబ్బిలి, అరకు, విజయనగరం, పాల్వంచ, రంపచోడవరం, పాపికొండలలో చిత్రీకరించాం. డబ్బింగ్‌ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం రీరికార్డింగ్‌, ఫైనల్‌ మిక్సింగ్‌ పనులు జరుగుతున్నాయి. జనవరిలో ఈ చిత్రం విడుదల చేస్తాం'' అని అన్నారు.

 

08:08 - November 29, 2015

మరాఠా పేష్వా బాజీరావ్‌ జీవిత కథ ఆధారంగా హిందీలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న పీరియాడిక్‌ డ్రామా చిత్రం 'బాజీరావ్‌ మస్తానీ'. రణ్‌వీర్‌ సింగ్‌, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, సంజరులీలా భన్సాలీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ ఒకేసారి డిసెంబర్‌ 18న విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోస్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ నందు అహుజా మాట్లాడుతూ, 'దక్షిణాదిన పీరియాడికల్‌ డ్రామా చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. ప్రముఖ రచయిత మదన్‌ కర్కే ఈ సినిమాకు పాటలు, మాటలు రాయగా, తెలుగులో పాటలను రామజోగయ్య శాస్త్రి రాశారు. 

తెలుగులో బాజీరావ్ మస్తానీ...
మరాఠా పేష్వా బాజీరావ్‌ జీవిత కథ ఆధారంగా హిందీలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న పీరియాడిక్‌ డ్రామా చిత్రం 'బాజీరావ్‌ మస్తానీ'. రణ్‌వీర్‌ సింగ్‌, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, సంజరులీలా భన్సాలీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ ఒకేసారి డిసెంబర్‌ 18న విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోస్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ నందు అహుజా మాట్లాడుతూ, 'దక్షిణాదిన పీరియాడికల్‌ డ్రామా చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. ప్రముఖ రచయిత మదన్‌ కర్కే ఈ సినిమాకు పాటలు, మాటలు రాయగా, తెలుగులో పాటలను రామజోగయ్య శాస్త్రి రాశారు. అద్భుతమైన కథ, ఎపిక్‌ డ్రామాతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు బాగా నచ్చడంతోపాటు సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది' అని అన్నారు. 'చాలా సంవత్సరాల నా కల ఈ సినిమా. ప్రేక్షకులందరికీ నా కల తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను' అని దర్శకుడు భన్సాలీ తెలిపారు. అద్భుతమైన కథ, ఎపిక్‌ డ్రామాతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు బాగా నచ్చడంతోపాటు సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది' అని అన్నారు. 'చాలా సంవత్సరాల నా కల ఈ సినిమా. ప్రేక్షకులందరికీ నా కల తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను' అని దర్శకుడు భన్సాలీ తెలిపారు.

08:01 - November 29, 2015

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషా చిత్రాల పరిశ్రమలకు చెందిన 'ఐఫా ఉత్సవం' డిసెంబర్‌ 4వ తేదీన కమల్‌హాసన్‌, చిరంజీవి వంటి హేమాహేమీలు ముఖ్యఅతిథులుగా హైదరాబాద్‌లో వైభవంగా ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు 'ఐఫా' నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవంలో రామ్‌చరణ్‌, దేవీశ్రీప్రసాద్‌, శివరాజ్‌ కుమార్‌, జీవా, తమన్నా, శ్రియా తదితరులు డాన్స్ పెర్మామ్‌ చేయనున్నారు. డిసెంబర్‌ 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విశేష ఆదరణ పొందిన చిత్రాలకు, ప్రతిభ కనబర్చిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలను అందజేయనుంది.

'ఐఫా' నామినేషన్స్ విడుదల..
'ఐఫా ఉత్సవం -2015' పురస్కారాల కోసం ఉత్తమ చిత్రాల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పురస్కారాలకు సంబంధించిన నామినేషన్లను ఐఫా పురస్కారాల కమిటీ ఇటీవల విడుదల చేసింది. తెలుగు ఉత్తమ చిత్రాల విభాగంలో 'శ్రీమంతుడు', 'బాహుబలి' పోటీ పడుతుండగా, ఉత్తమ నటుడు విభాగంలో ప్రభాస్‌, మహేష్‌బాబు, అల్లుఅర్జున్‌, ఎన్టీఆర్‌తోపాటు నాని బరిలో నిలిచారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరిగే 'ఐఫా ఉత్సవం-2015' పురస్కారాలు ఎవరిని వరించనున్నాయో త్వరలోనే తెలియనుంది. అభిమానుల ఓటింగ్‌ ఆధారంగా ఈ పురస్కారాలను అందించనున్నారు.
 

'ఉత్తమ చిత్రం' బరిలో ఉన్న చిత్రాలు : 'శ్రీమంతుడు', 'బాహుబలి', 'పాఠశాల', 'భలే భలే మగాడివోయ్', 'ఎవడే సుబ్రమణ్యం'
'ఉత్తమ నటుడు' పురస్కారానికి పోటీ పడుతున్న హీరోలు : ప్రభాస్‌ (బాహుబలి), మహేష్‌బాబు (శ్రీమం తుడు), అల్లుఅర్జున్‌ (సన్నాఫ్‌ సత్యమూర్తి), ఎన్టీఆర్‌ (టెంపర్‌), నాని (భలే భలే మగాడివోయ్)

'ఉత్తమనటి' పురస్కార విభాగంలో.. : తమన్నా (బాహుబలి), లావణ్య త్రిపాఠి (భలే భలే మగాడివోయ్), నిత్యమీనన్‌ (మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు), శ్రుతిహాసన్‌ (శ్రీమంతుడు), మంచు లక్ష్మీ (దొంగాట)

'ఉత్తమ దర్శకుడు' విభాగంలో : పూరీ జగన్నాథ్‌ (టెంపర్‌), కొరటాల శివ (శ్రీమంతుడు), రాజమౌళి (బాహుబలి), మహి.వి.రాఘవ్‌ (పాఠశాల), చందు మొండేటి (కార్తికేయ)

'ఉత్తమ సహాయనటుడు' విభాగంలో : సత్యరాజ్‌ (బాహుబలి), జగపతిబాబు (శ్రీమంతుడు), పవన్‌కళ్యాణ్‌ (గోపాల గోపాల), నవీన్‌చంద్ర (భమ్‌ భోలేనాథ్‌), పోసాని కృష్ణమురళి (టెంపర్‌)

'ఉత్తమ సహాయనటి' కేటగిరిలో : రమ్యకృష్ణ (బాహుబలి), రితూవర్మ (ఎవడే సుబ్రమణ్యం), తులసి (శ్రీమంతుడు), అపూర్వ శ్రీనివాసన్‌ (జ్యోతిలక్ష్మీ), ప్రాచీ థాకీర్‌ (పటాస్‌)

'ఉత్తమ సంగీత దర్శకుడు' విభాగంలో : ఎం.ఎం.కీరవాణి (బాహుబలి), రఘుకుంచె, సాయికార్తీక్‌, సత్యమహావీర్‌ (దొంగాట), దేవిశ్రీప్రసాద్‌ (శ్రీమంతుడు), అనూప్‌ రూబెన్స్‌ (టెంపర్‌), (గోపాల గోపాల) బరిలో ఉన్నారు.
ఈ అవార్డులు ఎవరిని వరించనున్నాయో తెలియాలంటే కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. 

నెక్లెస్ రోడ్డులో 10కే రన్..

హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డులో 10 కే రన్ ను పరుగువీరుడు మిల్కా సింగ్, సినీ నిర్మాత సురేష్ బాబు ప్రారంభించారు. పీపుల్స్ ప్లాజా నుండి హుస్సేన్ సాగర్ చుట్టూ ఈ రన్ నిర్వహించారు. 

ఎంఎస్ మక్తాలో పోలీసుల నిర్భంద తనిఖీలు..

హైదరాబాద్ : పంజాగుట్ట పరిధిలోని ఎంఎస్ మక్తాలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.

07:42 - November 29, 2015

విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్ కు మరోసారి వాయుగుండం కష్టాలు తప్పేలా లేవు. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం వచ్చే 48 గంటల్లో వాయుగుండంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వరుస వర్షాలు, వాయుగుండాలతో ఇప్పటికే దక్షిణకోసా, రాయలసీమ జిల్లాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. వరదముంపు నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తరుణంలో మరో పిడుగులాంటి వార్త ఈ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.

ముందుగా అల్పపీడనం, ఆతర్వాత వాయుగుండం..
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. ఆదివారానికి ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనావేస్తున్నారు. ఆతర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు నైరుతీ బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది ఉపరితల ఆవర్తనంతో కలిసి స్థిరంగా కొనసాగుతోంది. వీటికి తోడు ఈశాన్య రుతుపవనాల ప్రభావం రాయలసీమ, జిల్లాలపై ఎక్కువగా ఉంది. ఫలితంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని ఆంధ్రాయూనివర్సిటీ సముద్ర అధ్యయశాస్త్ర విభాగాధిపతి రామకృష్ణ చెబుతున్నారు.

హడిలిపోతున్న అన్నదాతలు..
ఇప్పటికే రెండు సార్లు కురిసిన భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోసారి భారీ వర్షాలు పడితే రైతులు కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతలు హడలిపోతున్నారు. వర్షార్పణం కాగా మిగిలిన పంటలనైనా రక్షించుకుందామని ప్రయత్నిస్తున్న తరుణంలో ఉపరితల ఆవర్తన వార్తలతో మరింత కుంగిపోతున్నారు. 

దక్షిణ కోస్తాలో భారీ వర్షాలకు అవకాశం..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా, రాయలసీమల్లో ఆదివారం రాత్రి వరకు పలు చోట్ల చెదురుముదురుగా వర్షాలు..దక్షిణ కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్టణం తుపాన్ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. అల్పపీడనద్రోణి అల్పపీడనంగా మారే అవకాశం కనబడడం లేదని, ద్రోణీ ప్రభావంతో ఆదివారం నుండి మూడో తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. 

07:15 - November 29, 2015

మెదక్ : చిన్నారి రాకేష్ మృత్యుంజయుడిగా తిరిగి రావాలి..తమ ముద్దుల కొడుకు ప్రాణాలతో రావాలి..ముద్దుముద్దు మాటలు మాట్లాడాలి...అని కోరుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. బోరు బావిలో పడిపోయిన చిన్నారి విగతజీవుడిగా బయటకొచ్చాడు. తమ కొడుకు మృతదేహాన్ని చూసిన కన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి రాకేష్ మృతి చెందాడన్న తెలుసుకున్న గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.

శనివారం ఉదయం...
మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డి గూడెం తండాలో శనివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో సాయిలు, మొగులమ్మ దంపతుల కుమారుడు రాకేష్ (3) సమీపంలో ఉన్న బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బోరు బావికి సమాంతరంగా జేసీబీలతో గొయ్యిని తవ్వారు. బోరు బావిలో ఆక్సిజన్ పంపించారు. తెల్లవారుజాము వరకు తవ్వకాలు కొనసాగించారు. తమ కుమారుడు ప్రాణాలతో తిరిగి రావాలని కన్నీతల్లిదండ్రులు ఘటనాస్థలంలోనే వేచి చూశారు. గ్రామస్తులు ఉత్కంఠతో సహాయక చర్యలు చూస్తూ ఉండిపోయారు. తెల్లవారుజామున ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో రాకేష్ ను బయటకు తీశారు. విగతజీవుడిగా బయటకు రావడంతో సాయిలు, మొగులమ్మ రోదన మిన్నంటింది. రాకేష్ ఇక లేడనే వార్త గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు.

గ్రామస్తుల ఆగ్రహం..
రాకేష్ బోరు బావిలో పడిపోయిన అనంతరం అత్యాధునిక యంత్రాలతో తవ్వకాలు సాగిస్తే రాకేష్ బతికేవాడని గ్రామస్తులు పేర్కొంటున్నారు. జాతియ విపత్తు నివార దళం కేవలం రెండు గంటల్లో ఆపరేషన్ పూర్తి చేసిందని..ఇదే అప్పుడే చేస్తే ఫలితం ఉండేదని పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్లు..నగరానికి 60 కిలోమీటర్లు ఉన్న ఈ ప్రాంతానికి విపత్తు దళాలు చేరుకోలేదా అని ప్రశ్నిస్తున్నారు. 

06:59 - November 29, 2015

హైదరాబాద్ : వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక ఓటమితో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పునరాలోచనలో పడ్డారా ? త్వరలో జరుగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారా? మూడు నెలలుగా విజయవాడకే పరిమితమైన బాబు.. ఇప్పుడు ఒక్కసారిగా హైదరాబాద్‌ రావడంలోని ఆంతర్యం ఏంటి? తెలుగు తమ్ముళ్ల ఒత్తిడితోనే ఆయన రూటు మార్చారా? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఇకపై వారంలో రెండు రోజులు హైదరాబాద్‌లో ఉండాలని నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణమూ టీడీపీ పటిష్టత, జీహెచ్‌ఎంసీ ఎన్నికలే అని అంటున్నారు.

బిజీ బిజీగా బాబు..
ఓటుకు నోటు వివాదం తర్వాత పాలనా వ్యవహారాలన్నీ హైదరాబాద్‌ నుంచి విజయవాడకు మార్చిన చంద్రబాబు... మంత్రివర్గ సమావేశాలు, ప్రభుత్వశాఖ సమీక్షలు కూడా అక్కడే నిర్వహిస్తున్నారు. పారిశ్రామికవేత్తలు, వాణిజ్య బృందాలు, విదేశీ ప్రతినిధులతో విజయవాడలోని క్యాంపు ఆఫీసులోనే భేటీ అవుతున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా గతనెలంతా బిజీ గడిపారు. మంత్రులు కూడా ఆయన బాటలోనే నడిచారు. అటువంటి చంద్రబాబు వైఖరిలో ఇప్పుడు ఒక్కసారి మార్పు వచ్చింది.

టీడీపీ శ్రేణుల్లో నిరాశ, నిస్పృహ..
దాదాపు మూడు నెలల తర్వాత చంద్రబాబు హైదరాబాద్‌ సచివాలయంలో అడుగుపెట్టారు. ఆయనలో వచ్చిన ఈమార్పుకు కారణం లేకపోలేదు. వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో ఎన్డీయే అభ్యర్ధి దేవయ్యకు డిపాజిట్‌ కూడా దక్కలేదు. దీంతో టీడీపీ శ్రేణుల్లో నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి. ఇదే తరుణంలో తెలంగాణలో స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యింది. మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. అటు మెదక్‌ జిల్లా నారాయణ్‌ఖేడ్‌ ఉప ఎన్నిక ఉండనే ఉంది. ఈ దశలో పార్టీకి దిశా, నిర్దేశం చేయాలి. కార్యకర్తల మదిలోని నైరాశ్యాన్ని పారద్రోలి, ఆత్మస్థైర్యం నింపాలి. దీంతో చంద్రబాబు రూటు మార్చుకున్నారు. వారంలో రెండు రోజులు హైదరాబాద్‌లో ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు...
టీడీపీకి జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం. జంటనగరాల్లో టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండటంతో గ్రేటర్‌ పీఠంపై తెలుగుదేశం ఆశలు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో సెటిలర్లు, ఉద్యోగుల ఓట్లు కీలకం కావడంతో వారిని పార్టీవైపు తిప్పుకునేందుకు తాను హైదరాబాద్‌లో ఉండటం మంచిదని చంద్రబాబు భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూలుకు ముందే వ్యూహాన్ని సిద్ధంచేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటకపోతే తెలంగాణలో పార్టీ నాయకులు, కార్యకర్తలు దిగాలు పడిపోతారనడంలో సందేహంలేదు. ఇది పార్టీకి నష్టం కూడా. ఈ విషయాలను పార్టీ నేతలు కూడా ఆయన దృష్టికి తెచ్చారు. అన్నీ గ్రహించిన చంద్రబాబు.. వారంలో రెండు రోజులు హైదరాబాద్‌లో ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నారు.

ప్లాన్ వర్కవుట్ అవుతుందా ? 
ఇప్పటికే ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేశారు. మరికొందరు ముఖ్యనేతలు కూడా కారు ఎక్కాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ పరిణామాలతో తెలంగాణలో పార్టీ పరిస్థితి ప్రమాదంలో పడే అవకాశం ఉందని గ్రహించిన బాబు.. రూటు మార్చారని పార్టీలో వినిపిస్తోంది. ఆయన ప్లాన్‌ ఎంతవరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి.   

06:42 - November 29, 2015

హైదరాబాద్ : పాల‌న‌లో వ్యవస్థీకృత మార్పులతో పాటు..సంస్కరణలూ తప్పనిసరి అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 3నెలల సుదీర్ఘ విరామం తర్వాత... హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయానికి వచ్చిన చంద్రబాబు.. అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా...వ్యవసాయంతో పాటు అనుబంధ‌ రంగాలు.. దేవాదాయ‌-గృహ‌నిర్మాణ శాఖ‌ల ప‌ని తీరుపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసారు. ఇకనుంచి ఉన్నతస్థాయి సహా అన్ని రకాల సమావేశాలనూ విజయవాడలోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ముఖ్యంగా రెండంకెల అభివృద్ది సాధించడంపై సీఎం ప్రత్యేకంగా సమీక్ష చేసారు. రాష్ట్రంలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో వృద్ది రేటు 7.48గా నమోదు అయిందని, 2015-16లో ప్రభుత్వ లక్ష్యం 10.83గా నిర్దేశించుకున్నామని వివరించారు. వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలు ఆకర్షణీయమైన వృద్ధిని సాధించాయని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు. నదుల అనుసంధానం, ప్రాజెక్టులను పూర్తిచేయడం, నీరు-చెట్టు, మైక్రో ఇరిగేషన్, భూగర్భజలాల సంరక్షణ, రెయిన్ గన్ వంటి కార్యక్రమాలతో వ్యవసాయరంగంలో రైతుకు ఆశలు చిగురిస్తున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని క‌రువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామ‌ని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.

రాజధాని నిర్మాణం అరుదైన అవకాశం..
రాజధాని నిర్మాణం తమకు లభించిన అరుదైన అవకాశమ‌న్న సీఎం.. సీ పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పెద్దఎత్తున రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. చరిత్రలో ఎప్పుడూ జరగనంత ఎకనామిక్ యాక్టివిటీ రాష్ట్రంలో జరుగుతోందని..ఇలాంటి స‌మ‌యంలో ఆశించిన వృద్ధి రేటును సాధించడం ఏమాత్రం అసాధ్యం కాద‌న్నారు చంద్రబాబు. ఓవైపు వృద్ధి రేటు సాధిస్తూనే వ్యవస్థలో మార్పు తీసుకురావడం తప్పనిసరన్నారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ కలర్స్ పెట్టుకుని ప్రతి త్రైమాసికానికి పనితీరును రివ్యూ చేసే విధానం మలేసియాలో సత్ఫలితాలను ఇచ్చిందని..త్వరలో రాష్ట్రంలోనూ మలేసియా తరహా ల్యాబ్స్ ఏర్పాటుచేస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు.

గణనీయంగా భూగర్భ జలాలు...
మొత్తం బోర్లపైనే ఆధారపడిన చిత్తూరు జిల్లాలో గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా నమోదైన వర్షపాతంతో అక్కడ భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయన్నారు... చంద్రబాబు. కలెక్టర్లు, అధికారుల సమర్ధ పనితీరుతో గృహ నిర్మాణ రంగం ఆశాజనకంగా ఉందని ప్రశంసించారు. మత్స్య పరిశ్రమ, పశుగణాభివృద్ధి, దేవాదాయశాఖల పనితీరు బాగుందన్నారు. టూరిజంలో ఇప్పటి వరకు లక్షా 50వేల 320 మంది విదేశీ పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించారని..పర్యాటక రంగంలో ఇప్పటివరకు 800 కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. మరో 6,660 కోట్ల విలువైన ప్రాజెక్టులను వివిధ దశల్లో పూర్తిచేస్తామన్నారు. డిసెంబ‌ర్ 14,15 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగే క‌లెక్టర్ల స‌ద‌స్సుకు హాజరయ్యేటప్పుడు రెండంకెల అభివృద్దిపై పూర్తి స‌మాచారంతో రావాలని అధికారులను ఆదేశించారు. ఇకనుంచి ఉన్నతస్థాయి సహా అన్ని సమీక్ష సమావేశాలను విజయవాడలోనే నిర్వహించుకుందామని సీఎం మంత్రులు, అధికారులకు సూచించారు. 3నెలల విరామం తర్వాత ఏపీ సచివాలయానికి సీఎం రావడంతో..సచివాలయం కొత్తకళను సంతరించుకుంది. మంత్రులు, అధికారులంతా ఉల్లాసంగా క‌నిపించారు.

06:36 - November 29, 2015

హైదరాబాద్ : పంజాగుట్ట పీఎస్‌ పరిధిలో రాజ్‌భవన్‌ ముందు బస్తీల్లో వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 350 మంది పోలీసులు పాల్గొన్నారు. ఆఫ్ఘన్‌స్తాన్‌కు చెందిన ఏడుగురితో పాటు.. మరో 56 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 76 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 

బోరు బావిలో పడిన చిన్నారి మృతి..

మెదక్ : బోరు బావిలో పడిపోయిన రాకేష్ (3) మృతి చెందాడు. శనివారం ఉదయం బోరు బావిలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 

06:34 - November 29, 2015

హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు మరో ముగ్గురు ప్రాణాలు బలిగొంది. మాజీ డీజీపీ పేర్వారం రాములు మనువడు, మరో ఇద్దరు మృతి చెందిన ఘటన మరువకముందే అప్పా జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు నుంచి చంద్రశేఖర్ కుటుంబం లింగంపల్లికి వస్తోంది. అతివేగంగా రావడంతో కారు అదుపు తప్పింది. డివైడర్ ను ఢీకొనడంతో కారులో ఉన్న చంద్రశేఖర్, తనూష, సంధ్యారాణి అక్కడికక్కడే చనిపోయారు. వీరి కారు వెనుకాలే మరో కారు ఢీకొంది. అందులో ఉన్న వారికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. 

06:29 - November 29, 2015

మెదక్ : సీపీఎం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలకు సంగారెడ్డి ముస్తాబైంది. వాడవాడలా స్వాగత తోరణాలు, బ్యానర్లు రెపరెపలాడుతున్నాయి. పట్టణమంతా ఎరుపు వర్ణం సంతరించుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సమావేశాలకు వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

ఏచూరి రాక..
ఉదయం జిల్లా పార్టీ కార్యాలయం కేవల్‌ కిషన్‌ భవన్‌ వద్ద ప్రారంభ సభ నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు పార్టీ పతాక ఆవిష్కరణ చేస్తారు. 10 గంటలకు జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి సభను ప్రారంభిస్తారు. అనంతరం 11.30 గంటలకు రెడ్లాస్‌ హోటల్‌లో ప్రతినిధుల సమావేశాలు ప్రారంభమవుతాయి. సోమవారం కూడా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా పార్టీ నిర్మాణం, విస్తరణ ఇతర అంశాలపై చర్చించనున్నారు.

ప్రతినిధులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు..
విస్తృతస్థాయి సమావేశాల నేపథ్యంలో వీధుల్లో స్వాగత తోరణాలు, బ్యానర్లు రెపరెపలాడుతున్నాయి. పట్టణమంతా ఎరుపు వర్ణం సంతరించుకుంది. సమావేశాలకు వచ్చే ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశాలకు పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎమ్మెల్యే సున్నం రాజయ్యతో పాటు ముఖ్య నేతలు, వివిధ రంగాల నాయకులు హాజరుకానున్నారు. 

06:26 - November 29, 2015

మెదక్ : మెదక్‌ జిల్లా. పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండా ఇంకా టెన్షన్ కొనసాగుతోంది. శనివారం ఉదయం బోరుబావిలో పడిన చిన్నారి రాకేష్ బయటకు తీయడానికి ఏర్పాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో స్థానిక అధికారులు కొంత జాగ్రత్తగా ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆధునిక యంత్రాలతో కాకుండా మాములు యంత్రాలతో తవ్వకాలు..చర్యలు కొనసాగిస్తున్నారనే పలువురు విమర్శిస్తున్నారు. తెల్లవారు జామున మూడు గంటలకు తవ్వకాలను నిలిపివేశారు. జాతియ విపత్తు దళం, ఇతర అధికారులను రప్పించాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు భావించి తవ్వకాలు నిలిపివేశారు. ఆధునిక యంత్రాన్ని అందులోకి పంపించినట్లు తెలుస్తోంది. బాబు మృత్యుంజయుడిగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.

అసలేం జరిగింది ?
కుమ్మరి రాములు తాగునీటి కోసం బోరు వేశాడు. కానీ నీళ్లు పడలేదు. అయితే బోరుబావిని మూతవేయకుండా అలాగే వదిలేశాడు. బోరుబావికి వంద మీటర్ల దూరంలో సాయిలు కుటుంబం నివసిస్తోంది. సాయిలు చిన్న కుమారుడే రాకేశ్‌. వయసు మూడేళ్లు. అన్నతో కలిసి ఆడుకుంటున్నాడు రాకేశ్. అలాగే ఆడుకుంటూ ఆడుకుంటూ బోరు బావి దగ్గరకు వచ్చారు. అయితే ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. పక్కనే ఉన్న అన్న చేయిపట్టుకుని పైకి లేపడానికి ప్రయత్నించాడు. అయితే బరువు మొయ్యలేకపోయాడు. రాకేశ్‌ అంతకంతకు బావిలోకి జారిపోతూనే ఉన్నాడు. ఇద్దరు చిన్నారులు ఏడుపు మొదలుపెట్టారు. ఏడుపులు విన్న తల్లిదండ్రులు ఆందోళనగా పరుగెత్తుకుంటూ బోర్ వెల్ దగ్గరకు వచ్చారు. కానీ అంతలోపే చిన్నారి రాకేశ్‌ అందనంత లోపలికి పడిపోయాడు.

నొప్పితో తాడును వదిలేసిన రాకేశ్‌..
వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారమిచ్చారు. అంతలోపు తాడును జారవిడిచి రాకేశ్‌ను పైకి లాగడానికి ప్రయత్నించారు. బాలుడు తాడును కూడా పట్టుకున్నాడు. అయితే పైకి లేవడానికి ఇరుకుగా ఉండటం, చేతులకు నొప్పి పెట్టడంతో తాడును వదిలేశాడు. దీంతో మరింత లోపలికి జారిపోయాడు.

ఆక్సిజన్ అందిస్తున్న అధికారులు..
బాధితుల సమాచారంతో పోలీసులు, 108, ఫైరింజన్, క్రేన్, రెస్క్యూ టీం మొత్తం ఘటనాస్థలానికి చేరుకుంది. ఆక్సిజన్‌ ను లోపలికి పంపించడం మొదలుపెట్టారు. బోరు బావికి సమాంతరంగా మరో గొయ్యి తీశారు. శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.
తల్లిదండ్రులు గుండెను అదిమిపెట్టి, పంటిబిగువన ఆవేదనను దాచుకుని కుమారుని రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఊరు ఊరంతా ఘటనాస్థలికి తరలివచ్చారు. అటు న్యూస్ ఛానెల్స్ ముందు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది జనం ఊపిరి బిగపట్టి రెస్క్యూ ఆపరేషన్ తిలకిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్‌ డేట్స్ తెలుసుకుంటున్నారు. అందరిదీ ఒకే ఆశ, ఒకే ప్రార్థన... రాకేష్‌ మృత్యంజయుడిగా తిరిగిరావాలని. రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ కావాలని..

నేడు, రేపు సీపీఎం రాష్ట్రస్థాయి విస్తృతస్థాయి సమావేశాలు..

మెదక్ : సంగారెడ్డిలో సీపీఎం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. సమావేశాలను జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించనున్నారు. 

అప్పా కూడలి వద్ద రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి..

హైదరాబాద్ : నగర శివారులోని అప్పా కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. 

రాజ్ భవన్ వద్ద కార్డన్ సెర్చ్...

హైదరాబాద్ : రాజ్ భవన్ వద్ద డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ జరిగింది. 56 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 76 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 

కోహెడ వద్ద రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి..

హైదరాబాద్ : హయత్ నగర్ (మం) కోహెడ వద్ద కారు - టిప్పర్ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. కారులో ఇరుకున్న మరో ఇద్దరిని స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 

పాతబస్తీలో 50 మంది నకిలీ వైద్యులు..

హైదరాబాద్ : పాతబస్తీలో పలు ఆసుపత్రులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మంది నకిలీ వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

చెర్లపల్లెలో టిడిపి, వైసిపి వర్గీయుల ఘర్షణ..

కర్నూలు : ఆవుకు (మం) చెర్లపల్లెలో టిడిపి, వైసిపి వర్గీయులు ఘర్షణ పడ్డారు. వేటకొడవళ్లతో పరస్పరం దాడులకు దిగడంతో పలువురికి గాయాలయ్యాయి.

భారత్ తో చర్చలకు సిద్ధం - నవాజ్ షరీఫ్..

పాకిస్తాన్ : భారత్ తో ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ప్రకటించారు. పొరుగుదేశాలైన భారత్, అప్ఘనిస్తాన్ దేశాలతో స్నేహ బంధాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు.

 

కాసాపురం ఎస్ఐ పై లోకాయుక్త ఆగ్రహం..

అనంతపురం : జిల్లా కాసాపురం ఎస్ఐ శ్రీనివాసులపై లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ వివాదంలో జోక్యం చేసుకుంటున్నారని లోకాయుక్తలో పిటిషన్ దాఖలైంది. ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 30వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. 

డిసెంబర్ 2న కేంద్ర మంత్రిని కలువున్న టి. మంత్రులు..

హైదరాబాద్ : డిసెంబర్ 2న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని తెలంగాణ రాష్ట్ర మంత్రులు కలువనున్నారు. కేంద్రం నుండి రూ.2వేల కోట్ల సాయాన్ని కోరనున్నారు. శనివారం తెలంగాణ కరవు పరిస్థితులపై మంత్రులు మహమూద్ ఆలీ, పోచారంలు సమీక్ష నిర్వహించారు. 

రేపు అసహనంపై చర్చ..

ఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సోమవారం అసహనంపై చర్చ జరుగనుంది. సీపీఎం ఎంపీ పి.కరుణాకరన్, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఇచ్చిన నోటీసులను స్వీకరించిన స్పీకర్ సోమవారం చర్చకు అనుమతినిచ్చారు.

 

నేడు, రేపు గురజాడ శతవర్ధంతి కార్యక్రమాలు..

విజయనగరం : తెలుగు జాతి వైభవాన్ని ప్రపంచానికి తెలియచేసిన మహా కవి, నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు శతవర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 29, 30వ తేదీల్లో ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. 29వ తేదీ ఉదయం 9.30గంటలకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగనుంది. కుమారి ప్రవల్లిక నారాయణ్ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ తైలవర్ణ చిత్ర ప్రదర్శన నిర్వహిస్తారు. ప్రారంభోత్సవ సభలో ప్రముఖ సహస్రావధాని గరికపాటి నరసింహరావు ప్రసంగిస్తారు. గౌరవ అతిథిగా ప్రముఖ నటుడు, రచయిత రావికొండలరావు హాజరవుతారు.

రేపటి నుండి సౌత్ జోన్ హాకీ టోర్నమెంట్..

హైదరాబాద్ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పురుషుల హాకీ టోర్నమెంట్ ఈనెల 30న యూనివర్సిటీలో ప్రారంభం కానుంది.

 

నేడు నిజామాబాద్ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష..

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్, ప్రాణహితతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ఆదివారం సమీక్ష నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోని ప్రాజెక్టులపై కూడా సమీక్షించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Don't Miss