Activities calendar
30 November 2015
మొదటి భార్య పిల్లలను అమ్మకానికి పెట్టిన తండ్రి
హైదరాబాద్ : వాతావరణ మార్పులపై అత్యవసర పోరుకు సన్నద్ధం కావాలని ప్రపంచ దేశాలకు ప్రధాని నరేంద్రమోది పిలుపునిచ్చారు. పారిస్‌లో జరిగిన కావ్-21 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ఆయన భారత్ పెవిలియన్‌ను ప్రారంభించారు. వాతావరణ మార్పులపై పోరాడేందుకు భారత్ కట్టుబడి ఉందని, ప్రపంచ దేశాలు దీన్ని సీరియస్‌గా తీసుకోవాలని మోది పేర్కొన్నారు. వాతావరణ మార్పుల అంశం ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాలని మోది అన్నారు. టెక్నాలజీతో పాటు వనరులను పరస్పరం పంచుకోవలసిన అవసరం ఉందన్నారు. పర్యావరణం, రైతులకు సంబంధించి తమ ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుందని మోది చెప్పారు.
హైదరాబాద్: పారిస్‌లో ప్రధాని నరేంద్రమోది పాకిస్తాన్ ప్రధాని నవాజ్‌షరీఫ్‌తో చేయి కలిపారు. పారిస్‌లో వాతావరణ మార్పులపై జరుగుతున్న కావ్-21 సదస్సు సందర్భంగా ఇరుదేశాల ప్రధానులు కలుసుకున్నారు. కొన్ని నిముషాల పాటు ఇరువురు నేతలు మంతనాలు జరిపారు. వీరి భేటి ఎంతసేపు జరిగింది...ఏం మాట్లాడుకున్నారన్నదానిపై స్పష్టత లేదు. ప్రధాని మోది అమెరికా అధ్యక్షుడు ఒబామాతో సమావేశం కానున్నారు. భారత్-పాక్‌ల మధ్య చర్చలు పునఃప్రారంభించాలని ఒబామా ఈ భేటీలో మోదికి సూచించే అవకాశం ఉంది. కాశ్మీర్ సరిహద్దులో పాక్ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతోందన్న కారణంతో ఇరుదేశాల మధ్య చర్చలు ఆగిపోయాయి.
ఢిల్లీ : పెట్రోలు, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పెట్రోల్‌పై 58 పైసలు, లీటర్ డీజిల్‌పై 25 పైసలు తగ్గింది. తగ్గిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.
కరీంనగర్ : హాయిగా ఉన్న ఆ కుటుంబంలో అత్తమామల ధనదాహానికి ఇల్లాలు బలయింది...కొన్ని గంటలవుతున్నా ఆ డెడ్‌బాడీని కదిలించకుండా స్థానికులు అత్తమామలను చితగ్గొట్టారు...ఆ కాలనీలో రెండ్రోజులు ఆందోళన నిర్వహించారు.... పోలీసుల రాకతో బతికిబయటపడ్డారు.. ఇల్లాలిని బలితీసుకుని ఇద్దరు చిన్నారులను అనాథలను చేశారు దుర్మార్గులు..
ఉద్రిక్త వాతావరణం....
ఒక్కొక్కరూ వచ్చి చేయి చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. వీరంతా ఎవరో కాదు... ఆ ఇంటి యజమానులే..కొడుతున్నవి.. ఏం జరిగిందో తెలియని పసివాళ్లు అక్కడ జరిగేదాన్ని చూసి భయంతో వణికిపోతున్నారు... అక్కడ జనం చేతిలో దెబ్బలు తింటున్నది ఎవరో కాదు..తాతా,నానమ్మ,బాబాయిలే...విషయానికి వస్తే ... ఆ చిన్నారులకు కన్నతల్లి లేదు... ఇక తిరిగి రాదు.. .కరీంనగర్ జిల్లా జగిత్యాల విద్యానగర్‌లో ఉంటున్న సుధారాణి ఆత్మహత్య చేసుకుందా..? లేక హత్యకు గురయిందాన్నది అనుమానాలు కలుగుతున్నాయి.. అత్తమామలే సుధారాణికి చంపేసి ఉరితాడుకు వేలాడదీశారంటూ కాలనీవాసులు..బంధువులు ఆందోళనకు దిగారు... సుధారాణి శనివారం రాత్రి ఉరేసుకున్న ఆ ఇంట్లో వంటలు చేసుకుని తింటూ ఉంటున్నారంటూ జనం వారిని చితగ్గొట్టారు...
డెడ్‌బాడీని కదిలించేది లేదని ఆగ్రహం..
ఆ ఇంటి ఇల్లాలు సుధారాణిని చంపేశారన్న ఆగ్రహంతో జనం వారిని పట్టుకుని చితగ్గొట్టారు.. డెడ్‌బాడీనీ తరలించేది లేదని ఆందోళనకు దిగడంతో విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు...ఆందోళన చేస్తున్నవారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు.. సుధారాణి అత్తమామ గంగారామ్,శాంతాబాయి,మరిది,ఆడబిడ్డలను అదుపులోకి తీసుకున్నారు.. చివరకు పోలీసులు ఇచ్చిన హామీతో జనంలో ఆగ్రహం చల్లారింది..ఆ ఇంటికి తాళం వేసి డెడ్‌బాడీని తరలించారు.. చిన్నారులకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టుకున్నారు..హాయిగా ఉన్న సంసారాన్ని నాశనం చేసుకుని కటకటాలపాలయ్యారు.. తల్లి ప్రేమకు దూరం చేసి పసివాళ్లను అనాథలను చేశారు...
విజయవాడ : కాపులను బీసీల్లో చేర్చే అంశంపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం నుంచి టీడీపీ జన చైతన్య యాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు.
నాలుగు గంటల పాటు కొనసాగిన సమావేశం ......
విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా కాపులను బీసీల్లో చేర్చేందుకు కమిషన్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. తొమ్మిది నెలల్లో కమిషన్ నివేదిక ఇచ్చిన ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని యనమల తెలిపారు. మరోవైపు కాపులను బీసీల్లో చేర్చడం వల్ల ఇతర వర్గాలకు ఎలాంటి నష్టం ఉండదన్నారు. కాంగ్రెస్ హయాంలో రద్దు చేసిన ఆదరణ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తామన్నారు. బీసీ కుల వృత్తులను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
పోర్టుల అభివృద్ధికి మారిటైమ్ బోర్డు ఏర్పాటు .....
రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి గుజరాత్ తరహాలో మారిటైమ్ బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతామని మంత్రి పల్లె రఘునాధరెడ్డి తెలిపారు. బోర్డు ఛైర్మన్, డైరెక్టర్లను ప్రభుత్వం నియమిస్తుందన్నారు. ఈ బోర్డు ఏర్పాటు వల్ల పోర్టుల నిర్వహణ సామర్ధ్యం పెరగడమే కాకుండా.. ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. ఇక డిసెంబర్ 1 నుంచి 14 వరకు జన చైతన్య యాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ, మండల కమిటీలతో సహా.. ఎమ్మెల్యేందరూ పాల్గొని ప్రజ సమస్యలు తెలుసుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలన్నింటిని పరిష్కరిస్తామన్నారు. జనవరిలో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అనంతపురం జిల్లాలో లక్ష చెరువులు తవ్వాలని నిర్ణయించారు.
అర్బన్ డెవలప్మెంట్ కారిడార్‌పై నిర్ణయం వాయిదా...
నెల్లూరు, కర్నూలు, అనంతపురం, రాజమండ్రి, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ కారిడార్‌పై నిర్ణయాన్ని వచ్చే కేబినెట్ సమావేశానికి వాయిదా వేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు, దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు.
హైదరాబాద్ : 2015 సంవత్సరం అత్యంత ఉష్ణ సంవత్సరంగా ఎందుకు చరిత్రకు ఎక్కింది. ఏటికి ఏడాదికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు కారణాలు ఏమిటి? ఇదే కొనసాగితే భూగోళానికి ముప్పు తప్పదా? ఈ గ్లోబల్ వార్మింగ్ సమస్యకు పరిష్కారం ఏమిటి? పారిస్ వాతావరణ సదస్సు ఏం తేల్చబోతున్నారు? పారిస్ లో కాప్ 21 సదస్సు జరుగుతున్న సందర్భంగా ఈ రోజు వైడాంగిల్ ప్రత్యేక కథనం. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.
తీవ్ర కరువు తో అల్లాడుతున్న నల్గొండ జిల్లా
హైదరాబాద్ : సూపర్ సింగర్ ప్రోగ్రామ్ తో కిరాక్ సింగర్ అనిపించుకున్న ప్రణవి గురించి అందిరికీ తెల్సిందే. ప్రస్తుతం ఈ సింగర్ సూపర్ సింగర్ 9 లో కూడా అద్భుతమైన పాటలతో అలరిస్తుంది. కేవలం బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై ఏకంగా ఎ.ఆర్ రెహ్మాన్ దర్శకత్వంలో పాడి సంచలనం సృష్టించింది ప్రణవి. ప్రణవిని '10 టివి' పలకరించింది. మరి ఆమె ఏఏ అంశాలను మాట్లాడారో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి..
హైదరాబాద్ : దిగ్విజయ్‌సింగ్‌తో టీ-కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇక నారాయణఖేడ్ టికెట్ మృతిచెందిన కిష్ణారెడ్డి కుమారుడికి ఇవ్వాలని నిర్ణయించారు. వరంగల్ ఓటమిలో నేతలందరి బాధ్యత ఉందని టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
నల్గొండ: సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో అప్పుడే జన్మించిన శిశువులు తారుమారైన ఘటన చోటుచేసుకుంది. దీంతో మగ శిశువు తమ బిడ్డేనని రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరు మహిళలకు ప్రసవం జరగగా.. మగ, ఆడ శిశువులకు మహిళలు జన్మనిచ్చినట్లు సమాచారం. కాగా ఈ ఘటన మూలంగా సూర్యపేట ఏరియా ఆస్పత్రిలో రెండు కుటుంబాలు ఘర్షణ పడుతున్నాయి.
విశాఖ : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. తమిళనాడును ఆనుకుని ఈ ద్రోణి కదులుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా వెంకటగిరిలో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయంగా మారాయి.
హైదరాబాద్ : అన్నం పెట్టే రైతుల వద్ద లంచాలు తీసుకోవడంపై హైకోర్టు దిగ్భాంతి వ్యక్తం చేసింది. రైతులు కార్యాలయాల చుట్టు తిరగకుండా ఆన్ లైన్ లో పట్టాపాస్ పుస్తకాలు ఇవ్వలేరా అని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రశ్నించింది. రైతులకు ఆన్ లైన్ లో ఎలాంటి ప్రతిపాదనలు ఉన్నాయో తెలపాలంటూ.. ఎమిక్యూరెన్స్ ను ఏర్పాటు చేసింది.
రైతుల సమస్యలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు .......
రైతుల వద్ద లంచాలు తీసుకుంటున్నట్లు ఒక ఇంగ్లీష్ పత్రికలో వచ్చిన వార్తను సుమోటోగా స్వీకరించింది ఉమ్మడి న్యాయస్థానం. రైతుల వద్ద అధికారులు లంచాలు తీసుకోవడంపై ఇరు రాష్ట్రాలు ఏం చేస్తున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. రైతుల స్థితిగతులపై దిగ్బాంతి చెందానని వాఖ్యానించారు తాత్కాలిక ఛీప్ జస్టిస్ దిలీప్.బి. బోసలే. జస్టిస్ ఎస్.వీ. భట్టు ధర్మాసనం. అన్నం పెట్టే రైతన్న వద్ద ఎలా డబ్బలు తీసుకుంటారని ప్రశ్నించారు. ట్రాన్స్ ఫార్మర్ కావాలంటే 4 వేలు.. పాస్ పుస్తకం ఇవ్వాలంటే 2 వేలు తీసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యతని తెలిపింది.
విద్యుత్తుకు, పట్టా పాస్ పుస్తకాలకు 50 వేల వరకు ఖర్చు ....
రైతులు ఒక ఎకరం పొలాన్ని సాగుచేసుకోవాలంటే.. విద్యుత్తుకు, పట్టా పాస్ పుస్తకాలకు 50 వేల వరకు ఖర్చు చేసుకుంటున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ప్రభుత్వం తరపు న్యాయవాది. అయితే.. అసలు రైతు ఇంటి వద్ద ఉంటే అన్ని అన్ లైన్ లో అప్లయ్ చేసుకునే ఏర్పాటు చేయలేమని అన్నారు. ఇక రైతుల ఆత్మహత్యల పై, రుణమాఫీ పై వేరు వేరుగా వేసిన 5 పిటిషన్ లలో విచారణ వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ తరుపు అడిషనల్ అడ్వకేట్ జనరల్ హాజరుకాకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది న్యాయస్థానం. వ్యవసాయ- కోపరేటివ్ సొసైటి ప్రిన్సిపాల్ సెక్రెటరీని హాజరు కావాలని ఆదేశిచించింది. ఇక తాము పిటిషనర్ ప్రొఫెసర్ కొదండరామ్ సూచనలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపారు. రైతుల దీనస్థితిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం సమంజసమే.. అయినా అధికారుల తీరులో కూడా మార్పు రావాలి. నిజాయితీ లేని అధికారుల కారణంగా ప్రభుత్వాలు అబాసుపాలవుతున్నాయి.
ఢిల్డీ : దేశంలో పెరిగిపోతున్న అసహన పరిస్థితులపై విపక్షాల డిమాండ్ మేరకు లోక్‌సభలో ప్రభుత్వం చర్చకు అనుమతించింది. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చను ప్రారంభించారు. అసహనం అంశంపై లోక్‌సభలో చర్చ మొదలైన కాసేపటికే తీవ్ర గందరగోళం నెలకొంది. 193వ రూల్ కింద సిపిఎం చర్చను ప్రారంభించింది.
అసహన ఘటనలు చిన్న విషయాలేమీ కావు...
భారతదేశం సహనానికి మారు పేరని, దేశంలో జరుగుతున్న అసహన ఘటనలు చిన్న విషయాలేమీ కావన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి...పోతుంటాయి... నిరంతరం మారే ప్రభుత్వాలు ప్రామాణికం కాదన్నారు. ఎవరి తిండి వారి ఇష్టమని, ఎవరి ఇంట్లో ఏం వండుకుంటున్నారో చూడకుండా అన్ని ఇళ్లల్లో పొయ్యి వెలిగిందో లేదో చూడాలని సలీం హితవు పలికారు.
మనసులోని మాటను వినడం లేదు ఎందుకు?....
దేశంలో మనసులోని మాటను వినడం లేదన్నారు. మనం చెప్పేది ఎదుటివారు వింటున్నపుడు వారు చెప్పేది కూడా మనం వినాలన్నారు. ఔట్ గోయింగ్ కాదు ఇన్కమింగ్ కూడా స్వీకరించాలని సలీం చెప్పారు.
హేతుబద్దంగా, బహుళత్వం ప్రాతిపదికగా సాగాలన్నారు.......
దేశం హేతుబద్దంగా ఉండాలని, బహుళత్వం ప్రాతిపదికగా సాగాలన్నారు. అసహనంపై ప్రధాని మోది ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.
నరేంద్రమోది ప్రధానమంత్రి అయితే దేశంలో 8 వందల ఏళ్ల తర్వాత హిందూరాజ్యం ఏర్పడనుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారంటూ సలీం చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారితీశాయి.
సలీం చేసిన వ్యాఖ్యలను ఖండించిన హోంమంత్రి....
సిపిఎం సభ్యులు సలీం చేసిన వ్యాఖ్యలను హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీవ్రంగా ఖండించారు. తానెప్పుడు ఈ వ్యాఖ్యలు చేశానో సలీం నిరూపించాలని, లేదంటే క్షమాపణలు చెప్పాలని హోంమంత్రి డిమాండ్ చేశారు.
ఆరోపణలు చేయడం తగదని స్పీకర్ సూచన....
ఆధారాలు లేకుండా ఎవరిపైనా ఆరోపణలు చేయడం తగదని స్పీకర్ సుమిత్రా మహాజన్ సలీంకు సూచించారు. పృథ్వీరాజ్ చౌహాన్ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు దేశంలో హిందూపాలన వచ్చిందని ఎన్నికల తర్వాత జరిగిన ఓ సమావేశంలో రాజ్‌నాథ్ అన్నట్లు సలీం తెలిపారు. ఓ మ్యాగజిన్లో వచ్చిన కథనాల ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని సలీం స్పీకర్‌కు స్పష్టం చేశారు. రాజ్‌నాథ్‌సింగ్ దాన్ని ఖండించాలంటే సదరు పత్రికకు లీగల్ నోటీసు పంపాలని సూచించారు.
అసహనం ఉందని ఎవరూ అనడం లేదు...
దేశంలో అసహనం ఉందని ఎవరూ అనడం లేదని, ఈ తరహా ఆరోపణలను కావాలనే కొంతమంది పుట్టిస్తున్నారని హోంమంత్రి అన్నారు. మహ్మద్ సలీం చేసిన వ్యాఖ్యలకు తాను తీవ్రంగా మనస్తాపం చెందానని, తన పార్లమెంటరీ జీవితంలో ఎప్పుడూ ఇంత హర్ట్ కాలేదన్నారు.
స్వల్పంగా తగ్గిన పెట్రో, డీజిల్ ధరలు
హోంగార్డు ఆత్మహత్య....
వైరాలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
కృష్ణా : గతంలో కరువును చూశాం. నీటి ఎద్దడిని ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడున్నంతగా ఎద్దడిని ఎన్నడూ చూడలేదంటున్నారు ఆ ప్రాంత అన్నదాతలు. ఎప్పుడూ పచ్చని పొలాలతో ముక్కారు పంటలతో అలరారే డెల్టా ప్రాంతం ఇప్పుడు నీరు లేక బీడుబారే దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రస్తుత కరువు పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో రైతన్నలకు అంతుబట్టట్లేదు.
ఆందోళనలో రైతాంగం...
మడుల నిండా నీటితో చక్కగా ఎదగాల్సిన ఈ పైరు ఇలా ఎండిపోయే దశకు చేరుతోంది. గతేడాది పరిస్థితులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేవి. ఈ నీటి ఎద్దడి పరిస్థితులు ఇప్పుడు కృష్ణా డెల్టా రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అతితక్కువ వర్షపాతం మూలంగా కృష్ణా డెల్టాకు ఖరీఫ్‌కు నీరందలేదు. రైతులు బోర్లు, మోటార్లను ఆశ్రయించి ఏదోలా సాగు చేశారు. వాస్తవానికి ఖరీఫ్‌లో 13.08 లక్షల ఎకరాల్లో పంట వేయాల్సి ఉండగా, ప్రభుత్వ లెక్కల ప్రకారమే 8 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అందులోనూ కొంత భాగం నీరందక ఎండిపోవడంతో రైతులు ఆ పంటను దున్నేశారు. ఎలాగోలా ఖరీఫ్‌ను పూర్తిచేస్తున్న రైతన్నలు రబీపై దృష్టిసారిస్తున్నారు.
నవంబర్ 10 నాటికే రబీ పంట వేయాల్సి ఉండగా...
వాస్తవంగా నవంబర్ 10 నాటికే రబీ పంట వేయాల్సి ఉంది. గతేడాది కృష్ణాడెల్టాలో సుమారు రెండున్నర లక్షల ఎకరాల్లో రబీ పంట వేశారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల మూలంగా కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఇప్పటివరకూ కృష్ణా జిల్లాలో రబీ పంట వేయలేదు. ఖరీఫ్‌లోనే నీరివ్వలేని ప్రభుత్వం రబీకి ఏమిస్తుందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రబీకి నీరివ్వలేమని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
పట్టిసీమ నుంచి రబీకి నీరు వస్తుందని....
పట్టిసీమ నుంచి రబీకి నీరు వస్తుందని రైతులు భావిస్తే అత్యాశే అవుతుందని ఇరిగేషన్ పరిశీలకులు చెబుతున్నారు. గోదావరి నీరు ఉభయగోదావరి జిల్లాల రబీ పంటకే సరిపోతుందని, అక్కడనుంచి నీటిని కృష్ణానదికి తరలించడం కష్టమని అంటున్నారు. ప్రస్తుతం పట్టిసీమ నుంచి రోజుకు 1,500 క్యూసెక్కులకన్నా తక్కువ వస్తోంది. మరోవైపు రబీ సీజన్ ప్రారంభమైంది. దీనికంటే రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తే బాగుంటుందని రైతు సంఘాల నేతలంటున్నారు.
గతేడాది రబీ సీజన్ ప్రారంభమయ్యే నాటికి ....
గతేడాది రబీ సీజన్ ప్రారంభమయ్యే నాటికి పులిచింతల ప్రాజెక్ట్‌లో 11 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం అర టీఎంసీకంటే తక్కువ ఉంది. ఈ నీటిని సాగు కోసం విడుదల చేసే అవకాశాలు లేవు. ఇక నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు నుంచి నీరు విడుదలయ్యే అవకాశం అంతకన్నా లేదు. ఈ అంశాలన్నిటి నేపథ్యంలో డెల్టా ప్రాంతంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రభుత్వం రైతులను ప్రోత్సహించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
విజయవాడ : ఏపీ రాజధాని అమరావతికి అవసరమైన విద్యుత్ ఎంత..? అనే విషయంలో తలెత్తిన తర్జనభర్జనలు ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడంలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలోనూ దీనికి సంబంధించిన చర్చ పరిష్కారం లేకుండానే ముగిసినట్టు తెలిసింది.
ఏపీలో విద్యుత్ డిమాండ్ 500 మెగావాట్లకు మించదు: ఏపీ జెన్కో
ఏపీలో మూడేళ్ళ వరకు ప్రస్తుతం ఉన్న విద్యుత్ డిమాండ్‌కు అదనంగా మరో 500 మెగావాట్లకు మించదని విద్యుత్ అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం దీనికి సరిపోతుందనేది జెన్కో అభిప్రాయం. అనూహ్యంగా డిమాండ్ పెరిగినా సీఆర్డీఏకి సమీపంలో ఉండే లైన్ ద్వారా విద్యుత్ ను సమకూర్చుకునే వెసులుబాటు ఉందని చెబుతున్నారు.
జెన్ కో వాదనను కొట్టిపారేస్తున్న సింగపూర్ కంపెనీలు..
భూగర్భ కేబుల్ తో సహా కలుపుకుని 1050 కోట్లతో విద్యుత్ అవసరాలు తీర్చవచ్చని అధికారులు తాజాగా నివేదించారు. అయితే అమరావతి నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న సింగపూర్ కంపెనీలు మాత్రం జెన్ కో వాదనను కొట్టిపారేస్తున్నాయి. అత్యాధునిక లిప్టులు, ఆధునిక సౌకర్యాలు, మెట్రో రవాణా వ్యవస్థ, నిర్వహణకు 500 మెగావాట్లు సరిపోదని ప్రభుత్వానికి సింగపూర్ సంస్థ అధ్యయన నివేదిక ఇచ్చినట్టు సమాచారం. దీన్ని ఉన్నతస్థాయి సమీక్షలో చర్చించినపుడు జెన్కో అధికారులు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారు.
రూ.10 వేల కోట్ల వరకు అనవసర ఖర్చవుతుంది...
సింగపూర్ సంస్థల ప్రతిపాదనల ప్రకారం ఏకకాలంలోనే 5 వేల మెగావాట్ల విద్యుత్ అవసరాలు ఊహాజనితమైనవని కొట్టిపారేస్తున్నారు. దీనికోసం పెద్దఎత్తున లైన్లు వేయడం, విస్తరణ పనులు చేపట్టడం వల్ల కనీసం రూ.10 వేల కోట్ల వరకు అనవసర ఖర్చవుతుందని చెబుతున్నారు.
ప్రత్యేక విద్యుత్ పంపిణీ సంస్థను ఏర్పాటు చేయాలనే....
రాజధాని, పరిసర ప్రాంతాలతో ప్రత్యేక విద్యుత్ పంపిణీ సంస్థను ఏర్పాటు చేయాలనే వాదన కూడా సరికాదని, దీనివల్ల పాలనాపరమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశముందని జెన్ కో అధికారులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ డిమాండ్ ఎంత అన్న విషయమై స్పష్టత వస్తే తప్ప విద్యుత్ ప్రాజెక్టుల రూపకల్పనపై ఓ నిర్ణయానికి రాలేమని విద్యుత్ వర్గాలు చెబుతున్నాయి. సింగపూర్ సంస్థల ప్రతిపాదనలే ఆమోదిస్తే విద్యుత్ సంస్థలు భారీగా అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. దీనిపై సమగ్ర అధ్యయనంతో నివేదిక ఇవ్వాలని విద్యుత్ శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం.
గుంటూరు : జిల్లా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్స్ మధ్య తోపులాట చోటుచేసుకుంది. సమావేశం ప్రారంభమవగానే ఎజెండాలోని అంశాలపై అధికారులను ప్రతిపక్ష సభ్యులు వివరణ అడుగుతున్న సందర్భంలో అధికార పార్టీ సభ్యులు అడ్డు తగిలారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ పరిణామంతో వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
వరంగల్ ఓటమిలో అందరి బాధ్యత ఉంది : ఉత్తమ్
జీతాలు లేక దయనీయ స్థితిలో కేఎన్ఎం డిగ్రీ కాలేజ్ ఉద్యోగులు
ద్వారపూడిని దత్తత తీసుకున్న అశోక్ గజపతి రాజు
హైదరాబాద్ : వర్షాల్లేక కరువు వెక్కిరిస్తోంది. ప్రాజెక్టుల్లో చుక్కనీరు లేక పంటలు ఎండిపోతుంటే రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఈ ఏడాది వానదేవుడు కరుణించకపోవడంతో తెలంగాణలో కరువు విలయ తాండవం చేస్తోంది. వర్షాల్లేక వేసిన పంటలు ఎండిపోయి పంటపొలాలన్నీ బీడు భూములను తలపిస్తున్నాయి. దీంతో రైతులు మూటాముళ్లె సర్దుకొని ఉపాధి కోసం వలస బాట పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో తాండవిస్తున్న కరువు రక్కసిపై 10టీవీ స్పెషల్ స్టోరీ.
ఖాళీ కుండను తలపిస్తోన్న ప్రాజెక్టులు..
తెలంగాణలో వర్షాల్లేక ప్రాజెక్టులన్నీ ఖాళీ కుండను తలపిస్తున్నాయి. దీంతో కాలువల్లోకి చుక్కనీరురాక పంటపొలాలన్నీ ఎండిపోతున్నాయి. వేసిన నారుమళ్లన్నీ ఇప్పటికే పూర్తిగా ఎండిపోయాయి. మరికొన్ని ఇప్పుడా రేపా అన్నట్లుగా ఉన్నాయి. దీంతో రైతులు ఏం చేయాలో తెలియక బిక్క మొకం వేసుకొని చూస్తున్నారు. ఇదీ నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితి.
అడుగంటిన నిజాం సాగర్ ప్రాజెక్టు..
నిజాంసాగర్ ప్రాజెక్టు అడుగంటి పోవడంతో..రైతుల జీవితాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. కరువుతో రైతులు విలవిల్లాడుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక,..ఏం చేయాలో తెలియక దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కరువుతో పోటీపడలేక, పొట్టకూటికోసం వలసబాట పడుతున్నారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం అందించిన సబ్సిడి విత్తనాలను వేసి సాగుచేస్తున్నారు. ఆరుతడి పంటలైన శనగ, జొన్న, మినుము, పెసర, అనుములు వేసిన రైతులకు ఈసారి వరుణదేవుడు షాక్ ఇచ్చారు. దీంతో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. చేసిన అప్పులు తీర్చలేక..కుటుంబ పోషణ భారమై ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి...అప్పులపాలైన తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
దిగ్విజయ్ సింగ్ భేటీ అయిన టి. కాంగ్రెస్ నేతలు.
హైదరాబాద్ : ఓయూలో డిసెంబర్ 10 న జరిగే బీఫ్ ఫెస్టివల్ అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ రాజాసింగ్ తెలిపారు. ఓయూలో బీఫ్ ఫెస్టివల్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, విద్యార్థి సంఘాల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓయూ పోలీస్ స్టేషన్లో రాజాసింగ్‌పై విద్యార్థిసంఘాలు ఫిర్యాదు చేశాయి.
టిడిపి గంగా ప్రవాహం లాంటిది : కళా
ఉప్పల్ లో ఎస్ వోటీ పోలీసుల దాడులు..
ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఓయూ పీఎస్ లో ఫిర్యాదు...
బంజారాహిల్స్ లో పేకాటరాయుళ్లు అరెస్ట్
ఢిల్లీ : తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేసిన నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు నూరేళ్ల వర్ధంతి సందర్భంగా ఢిల్లీ ఏపీ భవన్లో సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతితో పాటు పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. గురజాడ సాహితీ ప్రస్థానాన్ని నెమరువేసుకున్నారు. గురజాడ మాట ఇప్పటికీ మానవాళికంతటికీ అనుసరణీయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి అన్నారు. మన తెలుగు రాష్ట్రంలో గురజాడ పుట్టడం అదృష్టమని చెప్పారు. ప్రభుత్వమే అధికారికంగా వర్థంతి కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ఆయన రచనలను ఎలిమెంటరీ స్కూల్ నుంచి కాలేజీ వరకు పాఠ్యాంశాలుగా చేర్చాలని, దేశమును ప్రేమించుమన్నా అంటూ గురజాడ రాసిన గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాలన్నారు పుణ్యవతి.
హైదరాబాద్ : పెండింగ్ చలాన్ల వసూళ్లపై ట్రాఫిక్ పోలీసులు రూటు మార్చారు. మొన్నటి వరకు పెండింగ్ చలాన్లను పోస్టులో పంపినా ఫలితం లేకపోవడంతో...ఇప్పుడు ఒక్క ఎస్ ఎంఎస్ అలెర్ట్‌తో ఈ సమస్యకు చెక్‌పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. చలానా కట్టకుంటే కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంటుందన్న ఎస్ ఎంఎస్ హెచ్చరిక ఇప్పుడు పెండింగ్ చలానా దారుల గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తోంది. ట్రాఫిక్ పోలీసులు పంపిన ఎస్ ఎంఎస్ అలెర్ట్‌తో పెండింగ్ చలాన్ల కట్టేందుకు వాహనదారులు క్యూ కడుతున్నారు. దీంతో చలాన్లు కోట్లలో వసూలవుతున్నాయి.
గతంలో ఇళ్లకు జరిమానా నోటీసులు ......
గతంలో పెండింగ్ చలాన్ల వసూలు నగర ట్రాఫిక్ పోలీసులకు పెద్దతలనొప్పిగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక్క ఐడియాతో ట్రాఫిక్ పోలీసులు ఈ సమస్యకు చెక్ పెట్టారు. గతంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి నివాసాలకు జరిమానాల నోటీసులు పంపేవారు. అయితే చాలా మందివి తప్పుడు అడ్రస్‌లు ఉండడం వల్ల అవి వారికి చేరలేక చలాన్లు వసూలు కాలేదు. దీంతో కొన్ని రోజులు రోడ్లపై వాహనాల నంబర్ల ఆధారంగా జరిమానా వివరాలను గుర్తించి వసూలు చేశారు. ఈ విధానం కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ట్రాఫిక్ ఉల్లంఘనలు మాత్రం రోజురోజుకీ పెరిగిపోవడంతో.. కొంతకాలంగా కూడళ్ల వద్ద అత్యాధునిక సీసీ కెమెరాలు ఉపయోగిస్తూ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తిస్తున్నారు. మితిమీరిన వేగంతో వెళ్లేవారిని స్పీడ్ గన్స్‌తో గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు.
పెండింగ్ చలానా దారులపై చార్జీషీట్ అస్త్రం ....
ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చలాన్లు వసూలు కాకపోవడంతో.. ట్రాఫిక్ పోలీసులు రూటు మార్చి పెండింగ్ చలానదారులపై చార్జ్ షీట్ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఒక్కసారి కన్నా ఎక్కువసార్లు నిబంధనలు ఉల్లఘించినవారిని, జరిమానా కట్టాల్సి న సొమ్మును చాలా రోజులుగా కట్టకుండా ఉండేవారిని గుర్తించి కోర్టుమెట్లు ఎక్కించాలని ట్రాఫిక్ పోలీసులు ప్లాన్ చేశారు. జరిమానా పూర్తి వివరాలను ఫోన్‌కు మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు. ఈసేవ, ఏపీ ఆన్లైన్, ఐసీఐసీఐ, ఎస్బీహెచ్ నెట్బ్యాంకింగ్ల ద్వారా దయచేసి ట్రాఫిక్ చలాన్లను చెల్లించండి లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటూ ఎస్ ఎంఎస్ ద్వారా హెచ్చరిస్తున్నారు. దీంతో బెదిరిపోతోన్న వాహనదారులు చలాన్లు కట్టడానికి రెడీ అవుతున్నారు.
కోట్లలో జరిమానాలు వసూలు .....
వాహనాదారులు పోటీపడి మరీ చెల్లిస్తుండటంతో జరిమానాలు కోట్లలో వసూలు అవుతున్నాయి. గతేడాది అక్టోబరులో 2లక్షల,10వేల 852 చలానాలు జారీ చేయగా.. కోటి 78లక్షల రూపాయలు వసూలయ్యాయి. ఈ ఏడాది అక్టోబరులో 2లక్షల, 39వేల, 535చలానాలు జారీ చేయగా..6కోట్లు వసూలయ్యాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాహనదారులు మాత్రం ట్రాఫిక్ పోలీసుల మెసేజ్‌లతో బెంబేలెత్తుతున్నారు. ఇప్పుడు ఏ ఆఫీసులో చూసినా..ఎక్కడ నలుగురు కనపడినా ఈ ట్రాఫిక్ పోలీసుల మెసేజ్‌లపైనే చర్చ జరుగుతోంది.
అవగాహన కల్పించటంలో మాత్రం....
ఇదిలా ఉంటే జరిమానాల పేరుతో కోట్లరూపాయలు వసూలు చేస్తోన్న పోలీసులు..ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించటంలో మాత్రం విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాబడే లక్ష్యంగా చలాన్లు వసూలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు..వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు కల్పించడంలో విఫలమవుతున్నారనే విమర్శ ఉంది. ఇకనైనా అవగాహన కార్యక్రమాలపై ట్రాఫిక్ పోలీసులు దృష్టిసారించాలని వాహనదారులు సూచిస్తున్నారు.
విజయవాడ : రేపటి నుంచి టిడిపి జన చైతన్య యాత్రను నిర్వహించనున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ తెలిపారు. ఆయన విజయవాడ లో మీడియాతో మాట్లాడుతూ..మంగళవారం నుండి గుంటూరుజిల్లా వేమూరు నుంచి జన చైతన్య యాత్ర ప్రారంభం కానుందని.. దీనిని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభింస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారంపాటు ఆయా మండలాల్లో టిడిపి సభలను నిర్వహిస్తారు. ఈ సభలో సీఎం చంద్రబాబు తో పాటు, లోకేశ్ బాబు పాల్గొంటారు. ఈ సభను జయప్రదం చేయడానికి ఎమ్మెల్యేలు, జిల్లా కో ఆర్డినేటర్స్ తోపాటు, దిగువ స్థాయి కార్యకర్తల సహకారం తీసుకుంటామన్నారు.
నల్గొండ : యాదాద్రిని జిల్లా చేయాలంటూ టీడీపీ నేత మోత్కుపల్లి చేపట్టిన ఒకరోజు దీక్షకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా దీక్ష స్థలిని ఏర్పాటు చేశారు. ఈ దీక్షలో 3 వేల పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు స్థానిక నేతలు.యాదాద్రిని జిల్లా చేసేవరకు ప్రభుత్వంపై పోరాడుతానంటున్నారు మోత్కుపల్లి.
హైదరాబాద్ : పార్టీ అధిష్టానం పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి అన్ని విషయాలు చర్చిస్తామని మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సహజమని.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పక విజయం సాధిస్తుందని భట్టి అన్నారు. జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధిష్టానం సూచనల మేరకు ముందుకెళ్తామని.. పొత్తులకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు భట్టి విక్రమార్క.
విజయవాడ: కేబినెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చలు జరడం లేదంటూ ఏపీ ప్రభుత్వ తీరుపై వైసీపీ అధికారప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో విఫలమైందన్నారు. నెలకు మూడు సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తూ సంక్షేమపథకాలు ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్నారని పార్థసారథి ఆరోపించారు.ప్రజా సమస్యలనే ఎజెండాగా తీసుకుని కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
నల్గొండ : అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ముళ్ల పొదల్లో పడేశారు. ఆడ శిశువును పందులు పీక్కుతుంటుండగా గమనించిన స్థానికులు వెంటనే 108 కు సమాచారం అందించారు. 108 సిబ్బంది ఆసుపత్రికి తరలిస్తుండగా శిశువు మృతి చెందింది. ఈ ఘటన నల్గొండ జిల్లా దేవర కొండ బస్టాండ్ పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏజీ, అదనపు ఏజీ హాజరు కాకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మధ్యాహ్నం రెండుపావుకు ఏపీ వ్యవసాయ ముఖ్య కార్యదర్శి కోర్టులో హాజరుకావాలని ఆదేశిస్తూ వాయిదా వేసింది.
విజయవాడ : సీఎం క్యాంప్ కార్యాలయంలో దాదాపు నాలుగు గంటల పాటు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోర్టుల అభివృద్ధికి గుజరాత్ తరహాలో మారిటైమ్ బోర్టు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కాపులను బీసీల్లో చేర్చడంపై కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలపై కేబినెట్ సమావేశంలో చర్చించారు. పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు.
హైదరాబాద్ : అసహనంపై లోక్‌సభలో వాడివాడిగా చర్చ ప్రారంభమయ్యింది. లోక్‌సభలోని 193వ నిబంధన కింద సీపీఎం ఇచ్చిన నోటీసుపై ఓటింగ్లేని చర్చ జరుగుతోంది. సీపీఎం సభ్యుడు సలీం చర్చను ప్రారంభించారు. దేశంలో పెరుగుతున్న అసహనంపై ఆయన విరుచుకుపడ్డారు. 800 ఏళ్ల తర్వాత దేశంలో హిందూ పాలన వచ్చిందంటూ హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గతంలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన విజయోత్సవ సభలో రాజ్‌నాథ్ ఈ అంశాన్ని ప్రస్తావించారంటూ సలీం చెప్పడంపై సభలో దమారం రేగింది. లోక్‌సభలో అసహనంపై చర్చ సందర్భంగా సీపీఎం సభ్యుడు మహ్మద్ సలీం చేసిన ఆరోపణలపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. హిందూ పాలన వచ్చిందని ఎప్పుడూ చెప్పలేదన్నారు.
రాహుల్ పౌరసత్వంపై దాఖలైన పిటీషన్ తిరస్కరణ
సంగారెడ్డి : తెలంగాణలో ఫ్యూడల్ శక్తుల ఆధిపత్యం కొనసాగడం వల్లే ఎస్సీ, ఎస్టీలపై వివక్ష చూపిస్తున్నారని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సంగారెడ్డిలో సీపీఎం విస్తృత స్థాయి సమావేశం ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... దేశంలో 50శాతానికి మించి ఉన్న బీసీలకు బడ్జెట్ లో ఎక్కువ నిధులు బీసీలకు కేటాయించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఎస్సీ, ఎస్టీలపై ఎలాంటి వివక్ష చూపించినా మొత్తం సీపీఎం యంత్రాంగం వారి వెంట నిలబడుతుందని తమ్మినేని వీరభద్రం తెలిపారు. బీసీల్లో అట్టడుగు కులాల వారి కోసం ప్రత్యేక కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీసీ సబ్ ప్లాన్ సాధనకు అన్ని బీసీ సంఘాలు, పార్టీలు సీపీఎంతో కలిసి రావాలని కోరారు. బీసీ సబ్ ప్లాన్ కోసం ప్రత్యేక కార్యాచరణ చేపడతామన్నారు.
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పంచాయితి శాఖలో పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డి అనే అధికారి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేపధ్యంలో సోమవారం ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏకకాలంలో 10 ప్రాంతాల్లో అధికారులు దాడులు చేశారు. విజయవాడలో శ్రీధర్ కు చెందిన నివాసంతో పాటు హైదరాబాద్, తణుకు, ఏలూరు, రాయచోటీల్లో దాడులు కొనసాగుతున్నాయి.
ఇసుక అక్రమ తవ్వకాలపై హైకోర్టులో విచారణ
ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా వాసుదేవ దీక్షితులు
హైదరాబాద్ : కూరగాయలు మనకు ఆహారంగా మాత్రమే తెలుసు. అవి అలంకారానికి, అందమైన ఆర్ట్ కి కూడా సాధనాలని, కళాకారులు, సృజనకారులకి మాత్రమే తెలుసు. అలాంటి కూరగాయలతో అందమైన పెయింటింగ్ ఎలా వేసుకోవాలో, ఇవాళ్టి సొగసులో తెలుసుకుందాం. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..
హైదరాబాద్ : ఆకలి.. అనేక ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఒకరిలో కసిని, మరొకనిరి బాధను కలిగిస్తుంది.కానీ, కొందరికి ఆదే ఆదాయ మార్గానికి కూడా కారణమవుతోంది. నలుగురికీ ఉపాధి మార్గం చూపేందుకు దోహదపడుతుంది. అలా ఆకలిని జయించేందుకు, వ్యాపారంలోకి అడుగుపెట్టిన అతివ కథనంతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్పూర్తి.
వ్యాపారంలోకి అడుగుపెట్టాలనుకోవడం సాహసమే....
సాధారణ చదువు. ఆర్థిక లేమి. ఎవరి ప్రోత్సాహం లేని పరిస్థితి. ఈ స్థితిలో, వ్యాపారంలోకి అడుగుపెట్టాలనుకోవడం సాహసమే అవుతుంది. పరిస్థితులకు ఎదురీదుతూ, ముందుకు సాగడం కత్తి మీద సామే అవుతుంది. అయినా, అన్ని రకాల ప్రతికూలతలను దాటుకుంటూ ముందుకెళ్తోంది సువర్ణలత.
భర్త అనుభవాన్ని ఆసరాగా చేసుకుని....
వ్యాపారం అంటేనే ఎంతో పెట్టుబడి మరెంతో అనుభవం అవసరమనే భావన సాధారణం. కానీ పెద్దగా పెట్టుబడి ఏమీ లేకుండా భర్త అనుభవాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారాన్ని ప్రారంభించి ఎంతో మందికి ఉపాధి చూపిస్తున్న సువర్ణలత ఎందరికో స్పూర్తిమంత్రంగా నిలుస్తోంది.
మహిళలు దృష్టి పెట్టాలే కానీ...
మహిళలు దృష్టి పెట్టాలే కానీ వారు రాణించని రంగమంటూ లేదు. స్వతహాగా ఎంతో ఓపికస్తులైన మహిళలు కస్టమర్ల అభిరుచిని తెలుసుకోవటంలో, నాణ్యమైన సర్వీస్ నివ్వటంలో చూపే శ్రద్ద వారిని వ్యాపారంలో రాణించేలా చేస్తుంది. సాధారణ గృహిణిగా ఉన్న సువర్ణలత వ్యాపారంలో అడుగుపెట్టి విజయం సాధించిన తీరు. మరి మీ ఆలోచనలకు కూడా పదును పెట్టండి, వాటికి రూపమివ్వండి. వ్యాపారం రంగంలో అడుగుపెట్టి విజయాలు సొంతం చేసుకోండి..
విజయవాడలో ఏపీ డీజీపీ క్యాంప్ ఆఫీస్ ప్రారంభం
ఏపీ ఉన్నత విద్యామండలి విభజనపై సుప్రీంలో విచారణ
వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు సోనియాగాంధీ
చింటూకు డిసెంబర్ 14 వరకు రిమాండ్
కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ
విజయవాడ : సీఎం చంద్రబాబు కటౌట్ ఎక్కి ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా అడ్డకల్లుకు చెందిన గోవిందరాజులు విజయవాడ స్వరాజ్ మైదానం వద్ద ఉన్న సీఎం చంద్రబాబు కటౌట్ ఎక్కాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాని చెప్పారు. వ్యవసాయంతో తీవ్రంగా నష్టపోయాయని... తన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు అతనికి సర్ది చెప్పి.. కిందికి దించారు. దీంతో అందరూ ఊపరి పీల్చుకున్నారు.
చలాన్ల వసూళ్లపై రూట్ మార్చిన పోలీసులు.
అంబేద్కర్ పై రాజ్ నాథ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
0.25 కమీషన్ కు ఆస్తులు విక్రయిస్తామన్న ఎంఎస్ సీపీ
హైదరాబాద్ : హైకోర్టులో అగ్రిగోల్డు కేసుపై విచారణ జరిగింది. అగ్రిగోల్డు ఆస్తులు అమ్మి బాధితులకు చెల్లించే విషయంలో తమ కమీషన్ సరిపోదంటూ సీ-1 సంస్థ తప్పుకుంది. 0.25 కమీషన్ కు ఆస్తుల విక్రయిస్తామని ఎంఎస్ సీపీ సంస్థ కోర్టుకు తెలిపింది. విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. న్యాయవాదులు మీడియాతో మాట్లాడవద్దని హైకోర్టు అదేశించింది. ఎపీ తరపు న్యాయవాదులు కోర్టుకు హాజరు కాలేదు.
ఢిల్లీ : దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అసహనం సంఘటనలపై లోక్‌సభలో చర్చ మొదలైంది. 193 సెక్షన్ ప్రకారం చర్చ చేపట్టాలని విపక్షాలు స్పీకర్‌కు నోటీసులు ఇచ్చాయి. దీంతో అధికారపార్టీ చర్చకు అంగీకరించింది. సీపీఎం సభ్యుడు సలీం చర్చను ప్రారంభించారు. కేంద్రంపై సలీం విరుచుకుపడ్డాడు. మేధావులు, కళాకారులు అవార్డులు తిరస్కరిస్తే.. అవమానిస్తారా.. అని నిలదీశారు. జన్ ధన్ ఖాతాల గురించి మాట్లాడుతున్నారు కానీ... ప్రజల గోడు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎవరు ఏం తింటున్నారో ముఖ్యం కాదు... జనం కడుపునిండా తింటున్నారా అన్నదే ముఖ్యమని సలీం చెప్పారు. దేశంలో 800 ఏళ్ల తర్వాత హిందూపాలకుడు వచ్చారంటూ రాజ్ నాథ్ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ఈ హత్యాకాండ ఎక్కడి సంస్కృతి అని ప్రశ్నించారు. అయితే సలీం వ్యాఖ్యలతో సభలో దుమారం రేగింది.
'అసహనం'పై లోక్‌సభలో చర్చ
ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలు మూడో రోజు ప్రారంభం అయ్యాయి. లోక్ సభలో అహహనంపై చర్చ జరుగుతోంది. రాజ్యాంగంపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు.
లోక్ సభ మ.2.05 గంటలకు వాయిదా..
ఖమ్మం : జిల్లాలో పేదల సొంతింటి కల కలగానే మిగిలుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం పథకానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఒక్కో ఇంటికి కేటాయించిన బడ్జెట్ తో ఇళ్ల నిర్మాణాలు సాధ్యం కావంటూ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటంతో శంకుస్థాపనలకే పరిమితమవుతున్నాయి.
డబుల్ బెడ్ రూం ఇళ్లకు ఘనంగా శంకుస్థాపనలు
ఖమ్మం జిల్లాలో డబు ల్ బెడ్ రూం ఇళ్లకు మంత్రులు ఘనంగా శంకుస్థాపనలు చేశారు. అయినా నేటికీ పనులు ప్రారంభమే కాలేదు . జిల్లాలో పది నియోజకవర్గాలకు 4 వేల ఇళ్లు మంజూరయ్యాయి. త్వరలో కార్పోరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఖమ్మం నగరానికి అదనంగా మరో 16 వందల ఇళ్లను సీఎం కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గ్రామజ్యోతి పథకంలో భాగంగా ఖమ్మం సమీపం లో ఉన్న మద్దులపల్లిని దత్తత తీసుకున్నారు. ఈ గ్రామంలో 19 మంది లబ్దిదారులను డబుల్ బెడ్ రూం పథకానికి ఎంపిక చేశారు. శంకుస్థాపన మాత్రమే చేశారు గానీ ఇప్పటి వరకు ఇళ్లనిర్మాణం మాత్రం జరగలేదు.
నియోజకవర్గానికి 400ఇళ్లు
నియోజకవర్గానికి 400ఇళ్లు కేటాయించగా ఇందులో 200 ఇళ్లు ఎమ్మెల్యేలకు, మరో 200 ఇళ్లు జిల్లా మంత్రి కేటాయించే అధికారాన్ని కట్టబెట్టారు. ప్రతిఏటా ఇళ్ల సంఖ్యను ప్రభుత్వం పెంచనుంది. ఇళ్లను ప్రభుత్వమే నిర్మించి ప్రజలకు అందించనుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ ప్రజలకు మొదటి ప్రాధాన్యత క్రమంలో ఇళ్లను కేటాయించనున్నారు. అదేవిధంగా పట్టణాల్లో నిర్మించే ఇళ్లకు 5.30లక్షలు , గ్రామాల్లో నిర్మించే ఇళ్లకు 5.4 లక్షలు కేటాయించారు. మంత్రి దత్తత తీసుకున్న గ్రామంలో 19 ఇళ్లకు 95 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసి టెండర్లను పిలిచింది. అయితే ఒక్కో ఇంటికి కేటాయించిన బడ్జెట్ తో ఇళ్లనిర్మాణం సాధ్యంకాదని కాంట్రాక్టర్లు తెగేసి చెప్పేశారు. దీంతో మిగిలినవారెవరు టెండర్లలో పాల్గొనలేదు. రెండు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు పాల్గొనకపోవటంతో అధికారులు అయోమయంలో పడ్డారు.
ఆసక్తికరంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల వ్యవహారం
యూనిట్ ధర సరిపోవటంలేదని కాంట్రాక్టర్లు ముందుకు రాని నేపథ్యంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ఓ వైపు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీ సుకోవటంతో యూనిట్ ధరలు సవరించాలని లబ్దిదారులు కో రుతున్నారు. మరోవైపు త్వరలో ఖమ్మంలో కార్పోరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయంగా ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించటం అధికార పార్టీకి అత్యవసరం. అయితే సంక్షేమ పథకాల పేరుతో ప్రచార ఆ ర్భాటాలకు మాత్రమే పరిమితమవకుండా యూనిట్ ధరను పెంచైనా సరే ఇ ళ్ల నిర్మాణాలను చేపట్టాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం అబాసుపాలవుతోంది. ఆర్భాటంగా శంకుస్థాపనలు చేసినా నిర్మాణాలకు నోచుకోకపోవడంతో ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైంది రెండు పడక గదుల నిర్మాణాల పథకం .
కృష్ణా : విజయవాడలో తన క్యాంపు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ డిజిపి జేవీ రాముడు ప్రారంభించారు. ముఖ్యమంత్రి విడిది కార్యాలయానికి సమీపంలోనే దీనిని ఏర్పాటుచేశారు. ఈ కార్యాలయానికి ఆనుకుని ఉన్న డీజీపీ అధికారిక నివాసం రెండు నెలల కిందటే ఆరంభమైంది. ప్రస్తుతం ఆఫీసర్స్ క్లబ్ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చారు.
హైదరాబాద్ : ఐసిస్.. ప్రపంచానికి పెనుముప్పుగా మారిన ఈ ఉగ్రవాద సంస్థ సృష్టిస్తున్న జనహననం అంతాఇంతా కాదు. ఇది ఉనికిలోకి వచ్చి మహా అయితే ఏడాది అవుతుందేమో. కానీ కబళించిన మానవ ప్రాణాలు మాత్రం వేలల్లోనే. అగ్ర దేశాలతో సహా ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ ఉగ్ర మూక గురించిన ఓ రిపోర్ట్... ఐసిస్ ఎంత ప్రమాదకరమైనదో వివరిస్తోంది. గడచిన 18 నెలల కాలంలో ఒక్క సిరియాలోనే వందలాది మందిని తన రక్త దాహానికి బలితీసుకుంది. మంచినీరు తాగినంత ఈజీగా మానవ ప్రాణాలను తీసేస్తున్నారు. తాము చేసే దారుణాలన్నీ దేవుడి కోసమే అంటూ బీభత్సానికి పాల్పడుతున్నారు.
ఐసిస్ ను మట్టుబెట్టడానికి నడుం బిగించిన ప్రపంచదేశాలు
ప్రపంచానికి పెనుముప్పులా మారిన ఈ సంస్థను మట్టుబెట్టడానికి ఆలస్యంగానైనా ప్రపంచ దేశాలు నడుం బిగించాయి. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం భారీగానే జరిగిపోయింది. వేల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ సంస్థ ఉద్భవించి 18 నెలలే అయినా ఏకంగా 3,500 మందిని కబళించింది.
ఐసిస్ మారణహోమం
బాంబు పేలుళ్లు, విచక్షణా రహిత కాల్పులు, ఆత్మాహుతి దాడులతో ప్రపంచ దేశాల్లో ఐసిసి మారణహోమం సృష్టిస్తోంది. బ్రిటన్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ జరిపిన పరిశోధనలను బట్టి ఇప్పటివరకూ ఐసిస్ సిరియా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 3,500 మందిని హతమార్చింది. వీరిలో సైన్యం, సామాన్య ప్రజలు, చిన్నా పెద్దా అందరూ ఉన్నారు.
గతేడాది జూన్‌లో ఐసిస్ స్థాపన
ప్రపంచమంతా ఖలీఫా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా గతేడాది జూన్‌లో ఐసిస్ ఏర్పడింది. సిరియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఇది ఏర్పడినప్పటిదగ్గర్నుంచీ హత్య చేసిన 3,500 మంది కూడా సిరియా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారే. పారిస్ తదితర దేశాల్లో ఐసిస్ దాడులు చేయగా మరణించినవారు ఈ లెక్కలోకి రారు. వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది. గత ఒక్క నెలలోనే సిరియాలో 53 మందిని ఉగ్రవాదులు ఉరితీసి చంపారు. వారిలో 35 మంది సిరియా పౌరులు కాగా మిగిలినవారు ఇతర దేశాలకు చెందినవారు. ఒక్క హత్యలేగాక మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతూ వీరు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
సున్నీలను తీవ్రంగా హింసిస్తోన్న ఐసిస్
ఐసిస్ హతమార్చినవారిలో ఎక్కువమంది సున్నీ వర్గానికి చెందినవారే. షియా వర్గానికి చెందిన ఐసిస్ సున్నీలను తీవ్రంగా హింసిస్తోంది. హోమో సెక్స్ కు పాల్పడుతున్నారనో లేదా అమెరికా లాంటి దేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనో ఐసిస్ వారిని అంతమొందించింది. సిరియాలోని హామ్స్, హమా ప్రావిన్స్ లు, డెయిర్ ఎజ్జార్, హస్సాకేహ్, తదితర ప్రాంతాలు ప్రస్తుతం ఐసిస్ ఆధీనంలో ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి, సమస్తంగా ప్రపంచాన్నుంచి ఐసిస్‌ను తుదముట్టిచినదాకా దాని మారణహోమం కొనసాగుతూనే ఉంటుంది.
చింటూ లొంగుబాటు..
చిత్తూరు : మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ చిత్తూరు జిల్లా కోర్టులో లొంగిపోయాడు. న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించడంతో.. చింటూను తిరుపతి సబ్ జైలుకు తరలించారు. కటారి అనురాధ దంపతుల హత్య జరిగిన అనంతరం రెండు వారాలుగా చింటూ పరారీలో ఉన్నాడు. ఇప్పటికే ఈకేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులు హరిదాసు, మురుగు, పరందాము పోలీసులకు లొంగిపోయారు. ఈనేపపథ్యంలో హత్యకేసులో కీలక సూత్రధారిగా ఉన్న చింటూ కూడా ఇవాళా కోర్టులో లొంగిపోయాడు. అయితే ఈ హత్యకేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చింటూ ఇటీవల విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. తనను అకారణంగా కేసులో ఇరికించారని చెప్పారు. తాను నిర్దోషినని పేర్కొన్నారు. ఈకేసులో నిందితులుగా భావిస్తున్న చింటూతో పాటు 11 మందిపై 9 కేసులు నమోదు అయ్యాయి. చింటూతోపాటు మిగత నిందితులు హత్యకు కుట్ర పన్నిన వారుగా ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులుగా ఉన్న హరిదాసు, మురుగు, పరందాము ఇదివరకే పోలీసులకు లొంగిపోయారు.
కృష్ణా డెల్లాలో రబీ సీజన్ కు నీటి కొరత
ప్రారంభమైన ఎపి కేబినెట్ సమావేశం
బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం : బృందాకరత్
విజయవాడ : రాజధాని కోసం సీఆర్ డీఏ మరోసారి భూసేకరణకు సిద్ధమైంది. అమరావతికి సమీపంలోనే ఉన్న లంక భూములను సేకరించేందుకు సాయంత్రం నోటిఫికేషన్ ఇవ్వనుంది. రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండరాయుని పాలెం, మందడం, వెంకటపాలెం, ఉండవల్లి గ్రామాల్లో 2వేల 300 ఎకరాలు సేకరించనున్నారు. ఇందులో 1300 ఎకరాలు ప్రభుత్వ భూములుండగా... 574 ఎకరాలు అసెన్డ్ భూములున్నాయి. భూములు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నట్టు రైతులు 9.3 పత్రాలు ఇవ్వాలని అధికారులు తెలిపారు.
విశాఖ : బాక్సైట్ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం అసత్యాల పుట్ట అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శించారు. బాక్సైట్ తవ్వకాలతో వేలాది మంది గిరిజనులు నిరాశ్రయులై, జీవనోపాధి కోల్పోతారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా మన్యం ప్రజలు చేస్తున్న ఉద్యమానికి పార్టీ తరపున ఆమె మద్దతు ప్రకటించారు. బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కంపెనీ ప్రయోజనాలకే ఉపయోగపడుతుందన్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ప్రకాశం : తనకు ఏమైనా పర్వాలేదనుకున్నాడు... విద్యార్థులను క్షేమంగా కాపాడాడు. తన రెండు కాళ్లను పొగొట్టుకుని.. విద్యార్థుల ప్రాణాలకు ఎలాంటి హాని కలుగకుండా రక్షించాడు ఓ బస్సు డ్రైవర్. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ కాళ్లు విరిగాయి. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు 40 మంది విద్యార్థులతో ఒంగోలు వెళ్తోంది. మార్గంమధ్యలో ఒంగోలు త్రోవగుంట వద్ద రాంగ్ రూట్ లో ఐరన్ లోడ్ తో ఎదురుగా వస్తున్న లారీని బస్సు డ్రైవర్ తప్పించబోయాడు. దీంతో పక్కనే ఉన్న కాలువలోకి బస్సు దూసుకెళ్లింది. స్కూల్ బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. కానీ బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడి తన రెండు కాళ్లు విరిగిపోయాయి. అతన్ని ఆస్పత్రికి తరలించారు.
ఎపి కేబినెట్ సమావేశం ప్రారంభం
మెదక్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని టిఆర్ ఎస్ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు విమర్శించారు. బీజెపీ అధికారంలోకి వచ్చాక మత అసహనం పెరిగిపోయిందన్నారు. బలహీన వర్గాల అభ్యన్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిధులు కేటాయించడడం లేదని విమర్శించారు. లౌకిక వాదాన్ని నిలిబెట్టేందుకు కలిసొచ్చే శక్తులను కలుపుకుని పోరాడుతామని చెప్పారు. వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించే స్థితిలో పాలకులు లేరని మండిపడ్డారు.
విశాఖ : మహాకవి గురజాడ అప్పారావు శత వర్థంతి కార్యక్రమాలు విశాఖలో ఘనంగా జరుగుతున్నాయి. ఐద్వా ఆధ్వర్యంలో గురజాడ రచనలపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు రచయితలు, కవులు పరిశోధకులు సెమినార్ లో పాల్గొని గురజాడ రచనలపై చర్చించారు.
గురజాడ శత వర్థంతి.. ఐద్వా పలు కార్యక్రమాలు
గురజాడ అప్పారావు శత వర్థంతి సందర్భంగా ఐద్వా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గురజాడ దేశభక్తి గేయాల సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు ఐద్వా నేతలు . ఎయూ అంబేధ్కర్ హాలులో గురజాడ రచనలపై సెమినార్ నిర్వహించారు. అభ్యుదయవాది సంఘసంస్కర్త అయిన గురజాడ రచనలు ఈ తరానికి ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్సీ శర్మఅభిప్రాయపడ్డారు.
మహిళా అభ్యుదయవాది గురజాడ
పలువురు వక్తలు మహిళా అభ్యుదయవాది గురజాడ అని కొనియాడారు. పలువురు పరిశోధకులు గురజాడ రచనలపై చర్చించారు. ప్రపంచ స్థాయిలో గురజాడ రచనలపై చర్చ జరగాల్సిన అవసరం ఆకాంక్షించారు. గురజాడకు నివాళులర్పిస్తూ ప్రజా నాట్య మండలి ప్రదర్శించిన పలఉ పలు కళారూపాలు ఆకట్టుకున్నాయి. పుత్తడిబొమ్మ , డామిడ్ క థ అడ్డం తిరిగింది.మా అడుగు జాడ గురజాడ నాటికలు ఆకట్టు కున్నాయి.
ప్రజానాట్య మండలి కళారూపాలు
ఐద్వా, ప్రజానాట్య మండలి వారు చేస్తున్న కార్యక్రమాలు గురజాడ గొప్పదనాన్న ప్రతిబింబిస్తున్నాయి. గురజాడ స్ఫూర్తిని నేటి తరానికి చాటి చెప్పేలా ప్రజానాట్య మండలి, ఐద్వా కార్యక్రమాలు ఉన్నాయి. నేటికి , భవిష్యత్ తరానికి గురజాడ ముమ్మాటికి స్ఫూర్తి ప్రధాతే .
ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు..
చిత్తూరు : జిల్లాలో మళ్లీ భారీగా వర్షాలు కరుస్తున్నాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు, వరదయ్య పాలెం, పిచ్చటూరు మండలాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. కాళంగి జలాశయం నిండింది. నీటి ఉధృతికి కాళంగి గేటు విరిగింది. అధికారులు మరో గేటు ఎత్తివేశారు. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శ్రీకాళహస్తి పరిధిలోని చెరువులు ప్రమాదస్థాయిలో ఉన్నాయి. వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక పాలన : బివి.రాఘవులు
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం...
కాసేపట్లో తెలంగాణ ఎంఎస్ వో ల సమావేశం
నేడు తెలంగాణ ట్రాన్స్ కో రాతపరీక్షల కీ విడుదల
వరంగల్ : ఉత్తర తెలంగాణ పెద్దాస్పత్రికి అవినీతి జబ్బు చేసింది. పేదల ప్రాణవాయువును పెద్దలు పీల్చేస్తున్నారు. కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. కానీ ఏదో ఒక రోజు పాపం పండకపోదన్న సామెత నిజమైంది. సిలిండర్ల కుంభకోణంపై అక్రమార్కుల పాపం పండింది. ఆక్సిజన్ వ్యవహారంలో చేతుల మారిన వ్యవహారంపై టెన్ టీవీ ప్రసారం కథనాలపై ప్రభుత్వం కదిలింది. అవినీతి భరతంపై సర్కార్ విచారణ చేపడుతోంది. నిధులు దిగమింగిన వాళ్లపై సీఐడీ కొరఢా ఝులిపిస్తోంది.
పేదల ప్రాణవాయువు పీల్చేస్తున్నారు
పేదల ప్రాణవాయువు పీల్చేస్తున్నారు.... పెద్దల రూపంలో గద్దల్లా వాలి ఎత్తుకెళుతున్నారు.. కోట్లాది నిధులను కొల్లగొడుతున్నారు... రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు... 10టీవీ కథనాలతో బట్టబయలైన ఆక్సిజన్ సిలిండర్ల కుంభకోణం. ఉత్తర తెలంగాణలో కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు పెద్ద దిక్కు మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రి. నిరుపేదల దవాఖానా. కానీ ఇక్కడ కొందరు అక్రమార్కులు దీన్ని దగాఖానాగా మార్చేశారు.
కాసులు కురిపిస్తున్న ఆక్సిజన్ సిలిండర్లు
పేదల ప్రాణాలను నిలబెట్టడంలో ఇక్కడ నెలకొన్నంత నిర్లక్ష్యం మరెక్కడా కనిపించదు. కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతూ కొందరు.. ప్రాణవాయువు కోసం పరితపించే పేషంట్ల బాధలు ఇక్కడి డాక్టర్లకు, అవినీతి అధికారులకు కాసులు కురిపించే కామధేనువు అవుతున్నాయి.
ఎంజీఎంలో అంతా కుంభకోణాలమయం
ఎంజీఎం ఆస్పత్రిలో రోజుకో రకమైన కుంభకోణం వెలుగులోకి వస్తోంది. మొన్న టెన్ టీవీ అందించిన మార్చురీ పెట్టెల కుంభకోణం నుంచి తాజాగా పేదల ప్రాణాలు నిలిపే ప్రాణవాయువు వరకు అంతా కుంభకోణాలమయమే. ప్రైవేట్ ఆస్పత్రులకు రు. 230 లకే ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేసిన కాంట్రాక్టర్ ఎంజీఎంకు మాత్రం రు.385 చొప్పున అంటగట్టాడు. అర్రులు చాచిన అధికారులకు బొక్కలు విసిరాడు. ఒక్కో సిలిండర్ పై రు.155 ల చొప్పున సర్కారు డబ్బులకు బొక్క పెట్టాడు. ఏళ్లతరబడి ఈ వ్యవహారం నిరాటంకంగా కొనసాగుతోంది.
పక్కదారి పట్టిన రూ.4 కోట్లు
ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్ల కుంభకోణంతో నాలుగు కోట్ల రూపాయల పక్కదారి పట్టాయి. అందరి కళ్లకు గంతలు కట్టిన కాంట్రాక్టర్ భారీగా దండుకున్నాడు. ఆక్సిజన్ సిలిండర్లకు మార్కెట్ రేటు కంటే రు.155 ఎక్కువ వెచ్చించిన ఆస్పత్రి అధికార గణం...అదీ చాలదన్నట్లు రోజుకు రూ. 26 అద్దె కూడా కాంట్రాక్టర్ కు సమర్పించింది.
ఆక్సిజన్ అవినీతి బాగోతంపై 10టీవీ వరుస కథనాలు
ఆక్సిజన్ అవినీతి బాగోతంపై టెన్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. ప్రాణవాయువు కుంభకోణం జరుగుతున్న తీరును బాహ్యప్రపంచానికి చాటి చెప్పింది. దీంతో అనేక ప్రజా సంఘాలు, ఎంజీఎం పరిరక్షణ సమితి, ఎన్ జీవీలు స్పందించాయి. ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కదిలింది. కేసును సీఐడీకి అప్పగించింది.
రాజకీయాల్లో విలువలు పాటించకపోతే దేశానికి ప్రమాదకరమని ది హన్స్ ఇండియా ఎటిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ విశ్లేషణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పార్టీలు ప్రజలను ప్రలోభాలకు గురిచేశాయన్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం ఇతర పార్టీల నేతలను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ కు ప్రజలు ఎన్నికల్లో అద్భుతమైన తీర్పు ఇచ్చినా.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని వాపోయారు. కళ్లముందు అవినీతి జరుగుతున్నా... అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే....
రాష్ట్రంలో అవినీతి రాజకీయం
'రాష్ట్రంలో అంతా అవినీతి రాజకీయం నడుస్తోంది. టిడిపి సభ్యులు ప్రలోభాలకు పాల్పడితే... టీఆర్ఎస్ నానా యాగి చేసింది. కానీ ఇప్పుడు ఖమ్మం జిల్లాలో టిఆర్ ఎస్ ఎమ్మెల్యే మదన్ లాల్ ఓ ఎంపిటిసి సభ్యురాలి భర్యను ప్రలోభాలకు గురి చేసి.. టిఆర్ఎస్ లో రావాలని ఒత్తిడి పెంచారు. నిరాకరించినందుకు గానూ అతనిపై బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. కానీ ఈఘటనపై టిఆర్ఎస్ నోరు విప్పడం లేదు. అధికారంలో ఉన్నవారే రాజకీయ విలువలను పాటించకుండా ప్రలోభాలకు పాల్పడడం దారుణం. ప్రలోభాలకు లోను చేయడమే కాకుండా... ఆపై బెదిరింపులకు దిగడం శోచనీయం.
రాజకీయ విలువలు పాటించకపోవడం దురదృష్టకరం
కనీస రాజకీయ విలువలు పాటించకపోవడం దురదృష్టకరం. టీఆర్ ఎస్ కు భారీ మెజారిటీ వచ్చింది... అలాంటప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది. రాజకీయాల్లో విలువలు పాటించకపోతే దేశానికి ప్రమాదం. ప్రతిపక్షాలు ఎవరూ మిగలకూడదనుకోవడం ప్రజాస్వామ్యంలో ప్రమాదకరం. రాజకీయాల్లో అసహనం, అహంభావం ఉండకూడదు. గతంలో తెలుగుదేశంపై సీఎం చేసిన అభియోగాలు ఎక్కడికిపోయాయో తెలియదు. ఈ మధ్యకాలంలో చంద్రబాబుపై కేసీఆర్ విమర్శలు చేయడం లేవు. కేసీఆర్.. చంద్రబాబును విమర్శించడం లేదు.
ప్రజాస్వామ్యం అపహాస్యం
ప్రలోభాలకు పాల్పడుతూ...ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రలోభాలకు గురిచేసే వారిలో మొదటగా ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే వారు సామాజిక, ఆర్థిక వెనుకబాటు తనంతో ఉన్నారు. వారి సామాజిక, ఆర్థిక వెనుకబాటు తనాన్ని ఆసరగా చేసుకుని... ప్రలోభాలకు గురి చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు.
మదన్ లాల్ పై చర్యలేవీ..?
టీఆర్ ఎస్ ఎమ్మెల్యే మదన్ లాల్ పై ఎసిబి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. బెదిరింపులకు పాల్పడిన అతనిపై ఎందుకు విచారణ జరపడం లేదు. అధికారంలో ఉన్నవారికి ఎసిబి, పోలీసులు వంతపాడడం సరికాదు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని ప్రజలు నమ్మారు. కానీ పేద, మధ్యతరగతి ప్రజల్లో అభివృద్ధి లేదు. రాబోయే కాలంలో తెలంగాణ అల్లకల్లోలంగా మారబోతుంది. ఇలాంటి అవినీతి రాజకీయాలపై ప్రజలు పోరు చేయాలి. నూతన రాజకీయం కోసం పోరాటం చేయాలి' అని నాగేశ్వర్ పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
వరంగల్: నిర్భయలాంటి ఎన్ని చట్టాలొచ్చినా.. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో మరో దారుణ ఘటన జరిగింది. ఇద్దరు దళిత బాలికలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. వీరిద్దరు ఈనెల 24న ఊరి నుంచి హాస్టల్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత స్కూలుకని బయటకు వెళ్లి తిరిగి రాలేదని హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆరోజు అదృశ్యమైన బాలికలు అదే రోజు రాత్రి వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అయితే విశ్వనాథ్, సతీష్ అనే ఇద్దరు వ్యక్తులు మాయ మాటలు చెప్పి బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీరితో పాటు వీరి ఇద్దరు స్నేహితులు కూడా అత్యాచారం చేశారు. వీరి చెర నుంచి ఓ బాలిక తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన విశ్వనాథ్, సతీష్ కోసం గాలిస్తున్నారు. మరొక బాలిక అచూకి ఇంకా తెలియలేదు.
పగిలిన కృష్ణా పైపులైను..
హైదరాబాద్ : నగరంలోని తార్నాక చౌరస్తాలో కృష్ణా పైపులైను పగిలింది. దీంతో ఆ ప్రాంతంలో రోడ్డుపై భారీగా నీరు ప్రవహిస్తోంది. సమాచారం తెలుసుకున్న వాటర్ వర్స్క్ అధికారులు మరమ్మతులు చేపట్టారు.
బాలికలపై సామూహిక అత్యాచారం...
ప్రస్తుతం ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరగడం లేదని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకుడు నగేష్ కుమార్, టిఆర్ ఎస్ నేత రాకేష్, టీకాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, బిజెపి నేత ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. ప్రతీ ఎన్నికల్లో డబ్బు ప్రధానమైనదిగా కనిస్తుందన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగితే పోరాడటానికి అవకాశం ఉటుందని తెలిపారు. ప్రజాస్యామ్యంలో గెలుపు, ఓటమును స్వీకరించాలని పేర్కొన్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రలోభపెట్టి ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా రాజీలేని పోరాటాలు చేయాలని సూచించారు.
ప్రైవేట్ యూనివర్సిటీలు ప్రభుత్వ విద్యావ్యవస్థకు ప్రమాదకరమని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అశోక్ అన్నారు. ప్రభుత్వ విద్య నిర్వీర్యం అవుతుందని తెలిపారు. ఇదే అంశం నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. త్వరలోనే దీనిపై బిల్లు పెట్టే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు యూనివర్శిటీల వల్ల జరిగే నష్టాలపై ఆయన చర్చించారు. మరిన్ని వీడియోలో చూద్దాం....
గజ్వేల్ లో అక్రమనిర్మాణాల కూల్చివేత
నేటితో ముగియనున్న సీపీఎం తెలంగాణ విస్తృస్థాయి సమావేశాలు
ఫ్రాన్స్ : మానవుడు ఎంతగా అభివృద్ధి చెందుతున్నాడో అదేస్థాయిలో పర్యావరణానికి వినాశనం కలిగిస్తున్నాడు. విచ్చలవిడిగా వదులుతున్న కర్బన్ ఉద్గారాలు, ఇతరత్రా వ్యర్థాలు వాతావరణాన్ని సమూలంగా నాశనం చేసేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు దిద్దుబాటు చర్యలకు దిగాయి. ఇందులో భాగంగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో కాప్ 21 పేరుతో సదస్సును నిర్వహిస్తున్నారు. భారత్ తరపున ప్రధాని మోడీ ఈ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.
మారుతున్న వాతావరణ పరిస్థితులు
మారుతున్న వాతావరణ పరిస్థితుల మూలంగా ప్రపంచవ్యాప్తంగా కరువు కాటకాలు, అతివృష్టి, అనావృష్టిలాంటి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి. మానవులు తాము అభివృద్ధి చెందే లక్ష్యంతో బొగ్గు, పెట్రోలియం తదితర ఇంధనాలను విచ్చలవిడిగా దహించివేస్తున్నారు. ఫలితంగా కార్బన్డయాక్సైడ్ తదితర ప్రాణాంతక వాయువులు వాతావరణంలో కలిసి వాతావరణానికి హాని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ పరిరక్షణ కోసం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 150 దేశాల అధినేతలంతా సమావేశమవుతున్నారు. ప్రధాని మోడీ వర్ధమాన దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
స్వచ్ఛమైన పునరుత్పాదక ఇంధనాల వినియోగం
కర్బన ఉద్గారాలను తగ్గించాలనే లక్ష్యంతో సార్వత్రిక ఒప్పందాన్ని చేసుకోవటం కాప్ 21 యొక్క ప్రధాన లక్ష్యం. స్వచ్ఛమైన పునరుత్పాదక ఇంధనాలనే వినియోగించాలని అభివృద్ధి చెందిన దేశాలు వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కర్బన ఉద్గారాల నియంత్రణపై భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నియంత్రణ ఒప్పందాలు అభివృద్ధి చెందిన దేశాలకు కొంతమేర అనుకూలంగా ఉండడమే ఇందుకు కారణం. ఒప్పందంలో పేర్కొన్న అంశాలపై చట్టం చేయాలని అమెరికా, యూరప్ దేశాలు పట్టుబడుతున్నాయి. కానీ భారత్, తదితర వర్ధమాన దేశాలు కొన్ని అంశాలపై విముఖత వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ సార్వత్రిక ఒప్పందాన్ని చట్టబద్దం చేయడానికి యూరోపియన్ యూనియన్ ప్రయత్నిస్తోంది. అయితే ఒప్పందం అంతిమంగా ఎలాంటి రూపంలో ఉండబోతుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కర్బన ఉద్గారాల విషయంలో నియంత్రణలు
కర్బన ఉద్గారాల విషయంలో నియంత్రణలు అమలుజేయాలన్నది ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న డిమాండ్. 2009లో కోపెన్‌హాగెన్‌లో జరిగిన సదస్సులో 115 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగింది. భూతాపాన్ని తగ్గించడంపై ప్రపంచ దేశాలు ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా ఇలాగే కొనసాగితే 2,100వ సంవత్సరం నాటికి ఉష్ణోగ్రత 4.5 డిగ్రీలు పెరుగుతుంది. అదే ఒప్పందం మేరకు నడుచుకుంటే 2.7 డిగ్రీల సెల్సియస్ మాత్రమే పెరుగుతుంది. అయినా ప్రకృతి వైపరీత్యాలు కొంతమేర తప్పవు. మరి ఇంతటి ప్రాధ్యాన్యత సంతరించుకున్న ఒప్పందం ఒక కొలిక్కి వస్తుందో లేదో చూడాలి. ఇదింతటి ముఖ్యమైన అంశం కాబట్టే నవంబర్ 30 నుంచి డిసెంబర్ 11 వరకు సుదీర్ఘంగా ఈ సదస్సు నిర్వహించనున్నారు.
నేటి నుంచి పారిస్ లో వాతావరణ సదస్సు
నేడు పారిస్ లో అంతర్జాతీయ సౌరకూటమి ప్రారంభం
హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో నకిలీ డాక్టర్లు కలకలం సృష్టించారు. ఎలాంటి అర్హతా పత్రాలు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నకిలీ వైద్యుల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 110 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 56 మంది నకిలీ డాక్టర్లని తెలింది. ఒక్కొక్కరి వ్యవహార తీరు చూసి పోలీసులే ఖంగుతిన్నారు. ఈ శంకర్ దాదా ఎంబీబీఎస్‌లను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
పాతబస్తీలో నకిలీ డాక్టర్స్ వ్యవహారం సంచలనం
నకిలీ డాక్టర్స్ వ్యవహారం హైదరాబాద్ పాతబస్తీలో సంచలనం రేపుతోంది. కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా ఒకటే మందు.. శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలోలా ఈ ఉత్తుత్తి డాక్టర్లు చేసిందే వైద్యం... ఇచ్చిందే మందులా మారింది. ఇటీవల అలీనగర్‌లో ఓ నకిలీ డాక్టర్.. వైద్యం కోసం వచ్చిన రోగికి ఇంజెక్షన్ ఇవ్వగా అది వికటించి మృతి చెందాడు. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా శంషాబాద్ మండలం సాతంరాయికి తీసుకెళ్లి తగులబెట్టాడు. స్థానికులు నిలదీయడంతో గుట్టురట్టయ్యింది.
110 మంది నకిలీ డాక్టర్ల అరెస్టు
అయితే ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎక్కడెక్కడ ఆస్పత్రులు ఉన్నాయో గమనించి అకస్మికంగా తనిఖీలు చేపట్టారు. పోలీసులు జరిపిన సోదాల్లో 110 మంది నకిలీ డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 56 మంది పూర్తిగా నకిలీ వైద్యులని తేలింది. వీరిపై ఐపీసీ 420 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.
ప్రజల్ని బురిడీ కొట్టిస్తున్న నకిలీ డాక్టర్లు
చదివింది పదో తరగతి అయినప్పటికీ నేమ్ ప్లేటుల్లో మాత్రం ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, యూఎస్, యూకే, చైనా, జపాన్ అని తగిలించుకొని మరీ ప్రజల్ని బురిడీ కొట్టిస్తున్నారు. పాతబస్తీలో గల్లీకో క్లీనిక్ చొప్పున వందలాది క్లీనిక్‌లు వెలిశాయి. ఈ నకిలీ డాక్టర్లకు జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో ఏజెంట్లు కూడా ఉన్నారు.
ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు వైద్యం
అయితే పట్టుబడ్డ నకిలీ డాక్టర్లలో ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు వైద్యం. తలాబ్ కట్టకు చెందిన ఓ నకిలీ వైద్యుడు క్లినిక్ ఓపెన్ చేసి ఎలాంటి రోగమైనా సెలైన్ ఎక్కించడమే చికిత్సగా మార్చేసాడు. ఇలాంటి నకిలీల వద్ద వైద్యం చేయించుకొని పక్ష వాతం.. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాధితులెందరో ఉన్నారు.
వారిని ఊపేక్షించేది లేదంటున్న పోలీసులు
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిని ఊపేక్షించేది లేదని పోలీసులు ఖరాఖండిగా చెబుతున్నారు. సరైన అర్హతలు, అనుమతులు ఉన్నవారే వైద్యం చేయాలని పోలీసులు కోరారు. ఎవరైనా అతిక్రమిస్తే.. పరిణామాలు సీరియస్‌గా ఉంటాయని హెచ్చరించారు.
హైదరాబాద్ : బోరుబావిలో పడి బాలుడు మృతి చెందిన ఘటనను తెలంగాణ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్రంలోని బోరుబావులపై వెంటనే సర్వే నిర్వహించి.. వారంలోగా నివేదిక అందించాలని అధికారులను ఆదేశించింది. నిరూపయోగంగా ఉన్న బోరుబావులను వెంటనే మూసివేసి.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
బోరుబావుల మూసివేతపై మంత్రి కేటీఆర్ సమీక్ష
మెదక్ జిల్లాలో బోరుబావిలో పడి మూడేళ్ల బాలుడు రాకేష్ మృతి చెందిన ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో రాష్ట్రంలో నిరూపయోగంగా ఉన్న బోరుబావుల మూసివేత అంశంపై మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాకేష్ మృతి పట్ల కేటీఆర్ ఆవేదన
రాకేష్ మృతి పట్ల కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని.. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నిరూపయోగం ఉన్న బోరుబావులను వెంటనే మూసివేయాలన్నారు. ఉపయోగపడే బోరుబావుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు కేటీఆర్ సూచించారు.
బోరుబావులు పూడ్చే బాధ్యతను సర్పంచ్, కార్యదర్శులే తీసుకోవాలి
ఇక గ్రామీణ ప్రాంతాల్లోని బోరుబావులపై సర్వే నిర్వహించి.. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. పనికిరాని బోరుబావులను గుర్తించడంలో ప్రజలతో పాటు సర్పంచ్, కార్యదర్శులు సహకరించాలని.. వీటిని పూడ్చివేసే బాధ్యతను స్వయంగా వారే తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. అదేవిధంగా ఉపయోగపడే బోరు బావులకు క్యాప్‌లు బిగించి.. వాటి చుట్టూ ఫెన్సింగ్ వేయాలన్నారు.
ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆగ్రహం
మరోవైపు ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సంఘటన జరిగిన తర్వాత హడావుడి చేసే ప్రభుత్వం.. ముందే చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రకటనలకు పరిమితం కాకుండా.. నిరూపయోగంగా ఉన్న బోరుబావులను ఖచ్చితంగా మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నేడు డిజిపి కార్యాలయం ప్రారంభం
కృష్ణా : ఏపీ కేబినెట్ ఇవాళ విజయవాడలో సమావేశమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ నగరాలకు సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటుపై మంత్రివర్గం ప్రధానంగా చర్చించనుంది. కాపు కార్పొరేషన్ విధి విధానాలపైనా కేబినెట్లో చర్చించనున్నారు.
విజయవాడలో ఉదయం 11 గం.కు సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం విజయవాడలో జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ఈ మీటింగ్ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో పలు నగరాలకు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా దీనిపై చర్చ జరిగే అవకాశముంది.
వైజాగ్ మెట్రో పాలిటన్ అథారిటీగా వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ
వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని వైజాగ్ మెట్రో పాలిటన్ అథారిటీగా మార్చే అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. వీటితో పాటు అనంతపురం, నెల్లూరు, కర్నూలు జిల్లాలకు ప్రత్యేకంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటు గురించి మంత్రివర్గంలో ప్రస్తావనకు రానుంది. అదే విధంగా కాకినాడ, రాజమండ్రిని కలిపి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటుచేయడంపైనా మంత్రి వర్గం చర్చించే అవకాశం ఉంది.
ఏపీ మారిటైమ్ బోర్డు ఏర్పాటుపై చర్చ
ఏపీలో ఏపీ మారిటైమ్ బోర్డు ఏర్పాటుపైనా ఏపీ కేబినెట్ చర్చించనుంది. కాపు కార్పొరేషన్‌పైనా మంత్రివర్గంలో ప్రధానంగా చర్చించనున్నారు. కాపుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని గత కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయించిన నేపథ్యంలో...కార్పొరేషన్ విధివిధానాలు...నిధుల కేటాయింపుల అంశాలను ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. వీటితో పాటు తాజా రాజకీయ పరిణామాలపైనా కేబినెట్ మీటింగ్‌లో సుదీర్ఘంగా చర్చించే అవకాశం వుంది.
తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం
ఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వేడెక్కనున్నాయి. అసహనం అంశంపై ఇవాళ లోక్‌సభలో చర్చ జరుగనుంది. ఇప్పటికే దేశంలో తీవ్ర చర్చకు దారితీసిన అసహనం అంశంపై ఉభయ సభల్లోనూ వాడివేడిగా డిబేట్ జరిగే అవకాశం ఉంది.
వేడెక్కనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అసలు ఎపిసోడ్ సోమవారం నుంచి ప్రారంభ కానుంది. ఉభయసభలు వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న అసహనం అంశంపై లోక్‌సభలో చర్చ జరుగుతుండడంతో...సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి.
అసహనంపై చర్చించాలని సీపీఎం, కాంగ్రెస్ నోటీసులు
అసహనంపై చర్చించాలని సీపీఎం ఎంపీ కరుణాకరన్, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ నోటీస్ ఇచ్చారు. దీన్ని స్వీకరించిన స్పీకర్ సోమవారం చర్చకు అనుమతి ఇచ్చారు. ఈ అంశంపై లోక్‌సభలో తీవ్ర చర్చ సాగే అవకాశం ఉంది. నవంబర్ 25న జరిగిన అఖిల పక్షం సమావేశంలో ఆమీర్‌ఖాన్ వ్యాఖ్యలపైనే ఎక్కువసేపు చర్చ జరిగిన నేపథ్యంలో...పార్లమెంట్లో అసహనం చర్చ వేడి పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
రాజ్యసభలో కాంగ్రెస్, జేడీయూలు నోటీస్
దేశంలో నెలకొన్న పరిస్థితులపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు...అధికార పార్టీ ఎంపీలు..చేస్తున్న కాంట్రవర్సీ కామెంట్లును ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రస్తావించనున్నాయి. అసహనంపై రాజ్యసభలో కాంగ్రెస్, జేడీయూలు నోటీసులు ఇచ్చాయి. రాజ్యంగ దినంపై చర్చ అనంతరం పెద్దలసభలోనూ దీనిపై చర్చ జరుగుతుంది.
హాట్ హాట్ గా చర్చ
పార్లమెంట్ సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రెండు రోజులు రాజ్యాంగంపై అధికార, విపక్షాలు ఆరోపణలు చేసుకున్నా...కలిసి ముందుకు సాగుదామనే ఉమ్మడి నిర్ణయంతో పెద్ద రచ్చ జరగలేదు. కాని అసహనంపై చర్చ సందర్భంగా ఆ పరిస్థితి కనిపించకపోవచ్చు. అసహనంపై పట్టుపడతామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చర్చ హాట్‌హాట్‌గా సాగనుంది.
ప్రతిపక్షాలపై ఎదురుదాడికి అధికార పక్షం రెడీ
మరోపక్క ప్రతిపక్షాలపై ఎదురుదాడికి అధికార పక్షం రెడీ అవుతోంది. దాద్రి, కల్బుర్గి హత్య వంటి సంఘటనలతో పాటు విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇప్పటికే ప్రకటించారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు తీవ్రస్థాయిలో జరిగే అవకాశం ఉంది.