Activities calendar

01 December 2015

21:41 - December 1, 2015

హైదరాబాద్ : ఏపీ ఉద్యోగులు అమరావతికి తరలక తప్పదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే చర్చల్లో ఆ విషయం చెప్పిన చంద్రబాబు.. ప్రభుత్వం తరపున అధికారిక ఉత్తర్వులు విడుదల చేయించారు. ఏపీ సీఎస్‌ కృష్ణారావు ఉద్యోగులు అమరావతికి జూన్‌ 1 కల్లా తరలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.

21:39 - December 1, 2015

విజయవాడ : ఆంధ్రపదేశ్‌ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా నియమితులైన సీనియర్‌ పాత్రికేయులు వాసుదేవ దీక్షితులు ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎండనక వాననక కష్టపడి ప్రజలకు సమాచారం అందించడానికి కృషి చేసే పాత్రికేయులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాననని తెలిపారు.

21:35 - December 1, 2015

హైదరాబాద్ : ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్షను ప్రకటించింది. కీలక వడీ రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది. రేపోరేటు 6.75 శాతంగా నిర్ణయించారు. నగదు నిల్వల నిష్పత్తి 4 శాతం యథాతథంగా ఉంచారు. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 5 శాతానికి చేరడం, ఫెడ్ ఫండ్ రేటు పెంపు అంచనాల నేపథ్యంలో... డిసెంబర్ 1వ తేదీన ఆర్‌బీఐ పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తుందన్న అంచనాలు వెలువడ్డాయి. అలాగే ఇప్పటికే తగ్గించిన రేటు కోత ప్రయోజనాన్ని బ్యాంకులు ఇంకా తగిన స్థాయిలో కస్టమర్లకు బదలాయించ లేదని ఆర్బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ చురకలంటించారు. మరోవైపు ద్రవ్యోల్బణంపై ఏడో వేతన సంఘం ప్రభావాన్ని పరిశీలిస్తున్నామని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. 

21:34 - December 1, 2015

విజయవా డ: ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం దాదాపుగా సిద్ధమైంది. దాదాపు పదేళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులపైనా తెలుగు తమ్ముళ్లు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో 8 కార్పొరేషన్లకు సభ్యులను నియమించనున్నట్లు సమాచారం. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు చంద్రబాబు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. ఇక వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌కు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కనుంది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో సత్తా చాటుతున్న పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధకు మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ పదవి వరించనుంది. ఇక, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా జయరామిరెడ్ది, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా ఎల్వీఎస్సార్కే ప్రసాద్, కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా చలమలశెట్టి రామాంజనేయ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా లింగారెడ్డి పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. 

21:32 - December 1, 2015

ఢిల్లీ : రాజ్యాంగం దేశానికి వెలుగురేఖ, దిక్సూచి అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రాజ్యాంగంపై రాజ్యసభలో నిర్వహించిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. కాలగమనంలో అనేక సమస్యలకు రాజ్యాంగం మనకు పరిష్కారం చూపించిందని మోదీ అన్నారు. భారతీయ జీవన విధానంలో మంచి విషయాలను పది మందికి నిరంతరం చెబుతూ ఉంటామన్నారు. రాజ్యాంగం అండగా నిలబడుతుందన్న భావన ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. సభలో జరిగే ప్రతి చర్చా ప్రజల్లోకి వెళ్లాలన్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం దాటి నిష్ఫక్షపాతంగా వ్యవహరించాల్సిన సందర్భాలు ఉంటాయని ప్రధాని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఎంతకాలం ఉంటుంది... ఎంతకాలం సాగుతుంది అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారని... బ్రిటిష్ వాళ్లు అప్పుడప్పుడు ఇలాంటి భావనలకు మరింత బలం చేకూరేలా ప్రవర్తించారన్నారు. అనేక అవాంతరాల మధ్య భారత్ ప్రజాస్వామ్య దేశంగా సగర్వంగా తలెత్తుకుని నిలబడిందన్నారు.

21:31 - December 1, 2015

ఢిల్లీ : రాజ్యసభలో ప్రధాని మోడీ ప్రసంగం ఓ ప్రవచనంలా సాగిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. సభలో సుమారు 50 మంది సభ్యులు రెండు రోజుల పాటు చర్చించగా మోడీ ప్రసంగం మాత్రం అసందర్భంగా ఉందని విమర్శించారు. 

21:29 - December 1, 2015

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్ర మోదిని మళ్లీ టార్గెట్‌ చేశారు. విదేశాల్లో మోది గాంధీని పొగడుతారని, దేశంలో గాడ్సేను పొగిడేవారిపై ప్రధాని ఎలాంటి చర్యలు తీసుకోరని మండిపడ్డారు. అసహన పరిస్థితులకు నిరసనగా మేధావులు తమ అవార్డులను వెనక్కి పంపుతున్నా మోది నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు.

వికె సింగ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావన....

లోక్‌సభలో అసహన పరిస్థితులపై చర్చ సందర్భంగా రాహుల్‌ గాంధీ రక్షణ సహాయమంత్రి వికె సింగ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. దళిత పిల్లలను కుక్కలతో పోల్చిన మంత్రిని ప్రధాని ఏమనరని, ఆయన ఇంకా పదవిలోనే కొనసాగుతున్నారని ఎద్దేవా చేశారు.

గుజరాత్‌ మోడల్‌ గురించి మోది గొప్పగా .....

ఎన్నికల సమయంలో గుజరాత్‌ మోడల్‌ గురించి మోది గొప్పగా చెప్పారు. గుజరాత్‌ మోడల్‌ అంతా ఉత్తిదేనని పటేల్‌ ఆందోళన నిరూపించిందన్నారు. పైగా ఉద్యమం చేసిన ఆందోళనకారులను నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టిందని రాహుల్‌ ఆరోపించారు.

ప్రధాని కనీసం స్పందన ఎక్కడ....

మహాత్మాగాంధీ, అంబేడ్కర్, రాజేంద్రప్రసాద్‌, పటేల్‌ పేర్లను పార్లమెంట్‌లో ప్రస్తావించిన మోది- నెహ్రూ గురించి రెండు మాటలు కూడా చెప్పకపోవడం గర్హనీయమన్నారు. దబోల్కర్, పన్సారే, కల్‌బుర్గి లాంటి అభ్యుదయవాదుల హత్య, దాద్రీ ఘటనపై ప్రధాని కనీసం స్పందించ లేదని రాహుల్ మండిపడ్డారు.

అసహన పరిస్థితులకు నిరసనగా......

దేశంలో పెరుగుతున్న అసహన పరిస్థితులకు నిరసనగా రచయితలు, మేధావులు తమ అవార్డులను వెనక్కి పంపుతుంటే కేంద్రం కనీసం వారి మాటను కూడా వినడం లేదని ధ్వజమెత్తారు. ఆందోళనలన్నీ కావాలని సృష్టిస్తున్నారని అరుణ్‌జైట్లీ చేసిన వ్యాఖ్యలపై ధీటుగా స్పందించారు. ఇది మేక్‌ ఇన్‌ ఇండియాలా కల కాదు...అవన్నీ నిజాలు, వాటిని వినండని సూచించారు. మోది ప్రభుత్వం స్కిల్‌ ఇండియా గురించి గొప్పగా ప్రచారం చేస్తోంది. ఎఫ్‌టిఐఐ విద్యార్థుల గొంతును మాత్రం నొక్కేస్తున్నారని రాహుల్‌ ఆరోపించారు. ప్రధాని మోది విదేశాల్లో గాంధీని జాతిపితగా పొగడుతుంటే, సాక్షిమహారాజ్‌ లాంటి వారు ఇక్కడ గాడ్సే గురించి గొప్పగా ప్రస్తావిస్తారని రాహుల్‌ విమర్శించారు.

ఎలాంటి వాస్తవం లేదు....

దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయనడంలో ఎలాంటి వాస్తవం లేదని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. భారతదేశం సహనానికి మారు పేరని ఈ విషయంలో భారత్‌ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రపంచంలో భారతదేశ పరువును మంటగలిపే పనిచేయొద్దని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. అసహన పరిస్థితులపై హోంమంత్రి సమాధానంతో లోక్‌సభ బుధవారానికి వాయిదా పడింది.

తెలంగాణలో కరువు పై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరువు పరిస్థితిపై ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో మంత్రులు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కేటీర్, హరీశ్ రావు లు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితిని సమీక్షించి నివారణకు చేపట్టాల్సిన చర్యలను ఈ కమిటీ పర్యవేక్షించనుంది.

20:37 - December 1, 2015

హైదరాబాద్ : తెల్లనివన్నీ పాలు కాదు... ఘాటువన్నీ మసాలా దినుసులు కాదు.. నూనెలన్నీ నమ్మకమైనవీ కాదు.. చూడటానికి ఒరిజినల్ గా కనిపిస్తాయి కానీ...నాణ్యతలో మాత్రం అసలకే మోసం. ఒక్క మాటలో చెప్పాలంటే వంటిల్లు విషయంగా మారుతోంది. అస్సలు ఈ కల్తీ దందా ఎలా సాగుతోంది. దీని వెనుక ఉంది ఎవరూ? నగరంలో గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న కల్తీదందా పై నేటి వైడాంగ్ లో విశ్లేషణ చేసింది. మరి మీరూ చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:00 - December 1, 2015

హైదరాబాద్ : డిసెంబర్‌ 10న ఓయూలో బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించాలని తలపెట్టాయి ఎస్‌ఎఫ్ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌తో పాటు దళిత విద్యార్థి సంఘాలు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్,టీడీపీ, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల నేతలను ఆహ్వానించాయి. అయితే ఇదే సమయంలో ఆరెస్సెస్, వీహెచ్‌పీ అనుబంధ సంఘాలు బీఫ్‌ ఫెస్టివల్‌పై అభ్యంతరం చెబుతున్నాయి. ఈ కార్యక్రమానికి అనుమతివ్వొద్దని గోషా మహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓయూ ఇన్‌చార్జ్ వీసీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఆపలేకపోతే, తామే ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని, శాంతి భద్రతల సమస్య తలెత్తితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అస్సలు ఆహార స్వేచ్ఛకు, రాజ్యాంగానికి లింకు ఉంటుందా? ఆహార స్వేచ్ఛను నియంత్రించాలని బిజెపి, ఆర్ ఎస్ ఎస్ ప్రయత్నిస్తోందా? గోవులు వ్యవసాయం చేస్తాయా? ఈ అంశంపై హెడ్ లైన్ షోలో ఆసక్తి కరమైన చర్చ జరిగింది. ఈ చర్చలో రాకేష్ రెడ్డి యనమల ఏబీవీపీ నేత, స్టాలిన్ ఏఐఎస్ ఎఫ్ఐ నేత, నలుగంటి శరత్ దళిత బిబిసిఏ కల్చర్ నేత, కదిర కృష్ణ బిఎస్పీ పీ నేత పాల్గొన్నారు. అలాంటి అసక్తికరమైన చర్చను మీరూ వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

'నీరు - ప్రగతి' శ్వేత పత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు

విజయవాడ : నీరు - ప్రగతి కార్యక్రమంపై జలదర్శిని పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదలచేశారు. దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా నీరు - ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రాష్ట్రంలో 3.97 కోట్ల ఎకరాల భూమి అందుబాటులో ఉంటే..1.99 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి మాత్రమే ఉందన్నారు. ఈ ఏడాది ఇరిగేషన్ కు రూ.9,600 కోట్లు ఖర్చు చేశామన్నారు. మరో రూ.3వేల కోట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జల దర్శిని శ్వేతపత్రంపై ప్రతి ఒక్కరూ చర్చ జరపాలన్నారు. బ్యాంక్ ల్లో డబ్బులు దాచుకుంటున్నట్లే భూగర్భ జలాలను నిల్వ చేసుకోవాలన్నారు. పంట సంజీవని పథకంతో కరువు లేకుండా చేస్తామన్నారు.

రెండో తరగతి విద్యార్థి ని చితకబాదిన టీచర్

మెదక్ : పటాన్ చెరువులో ప్రైవేటు టీచర్ నిర్వాకం బయటపడింది. రెండో తరగతి విద్యార్థి మనోజ్ ను టీచర్ చితకబాదాడు. విద్యార్థి మనోజ్ తలకు గాయం, ఛాతిపై రక్తస్రావం అయ్యింది. ఈ ఘటన శాంతినగర్ కాలనీలోని గీతా హైస్కూల్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన పై మనోజ్ తల్లిదండ్రులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

ఏపీలో వివిధ కార్పోరేషన్లకు ఛైర్మన్ల ఖరారు

హైదరాబాద్ : ఏపీలో పలు కార్పోరేషన్లకు ఛైర్మన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. దీనిపై త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి.

కాపు కార్పోరేషన్ - చలమలశెట్టి రామాంజనేయ

పౌరసంబంధాల కార్పొరేషన్ - లింగారెడ్డి

స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ - జయరామిరెడ్డి

హౌసింగ్ కార్పోరేషన్ - వర్ల రామయ్య

ఎస్సీ కార్పోరేషన్ - జూపూడి ప్రభాకర్

మహిళా కార్పోరేషన్ - పంచమర్తి అనురాధ

లోక్ పాల్ పై అన్నా సలహాలు పాటిస్తాం : కేజ్రీవాల్

న్యూఢిల్లీ: జనలోక్‌పాల్ బిల్లుపై సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే చేసిన సలహాలను అమలు చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. లోక్‌పాల్‌పై విలువైన సూచనలు, సలహాలందించిన అన్నాజీకి ధన్యవాదాలు. లోక్‌పాల్‌కు అందిస్తున్న మీ మద్దతుకు, దీవెనలకు కృతజ్ఞతలు. అంబుడ్స్‌మన్ నియామకం, తొలగింపు వంటి అంశాలపై మీరందించిన సూచనలు అమలుచేస్తామంటూ ట్విట్టర్ లో సందేశాన్ని పోస్ట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో నిన్న కేజ్రీవాల్ ప్రభుత్వం లోక్ పాల్ బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

జూన్ 1కల్లా ఏపీ ఉద్యోగులు విజయవాడకు తరలి వెళ్లాలి : సీఎస్

హైదరాబాద్ : వచ్చే సంవత్సరం జూన్ 1 కల్లా ఏపీ ఉద్యోగులు విజయవాడకు తరలి వెళ్లాలని ఏపీ సీఎస్ కృష్ణారావు సర్క్యూలర్ జారీ చేశారు. ఉద్యోగుల తరలింపు బాధ్యత హెచ్ వోడీలకు అప్పగించినట్లు తెలిపారు.

త్వరలో జిల్లాల్లో పర్యటిస్తా : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : త్వరలో జిల్లాల్లో పర్యటిస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రటించారు. ఆదిలాబాద్ జిల్లా నుంచే పర్యటన ప్రారంభిస్తానన్నారు. ప్రతి జిల్లాలో వారం పాటు ఉంటానన్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తామన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులు, వాటర్ గ్రిడ్, రహదారులు, వంతెనల నిర్మానాలను పరిశీలిస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయని వాటిని వేగంగా అమలు చేయడమే మా లక్ష్యమని కేసీఆర్ తెలిపారు.ఃతూర్పు ఆదిలాబాద్ జిల్లాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. జోడే ఘాట్ లో కొమురం భీం వారసులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.

19:16 - December 1, 2015

హైదరాబాద్ : ఓయూ బీఫ్‌ ఫెస్టివల్‌పై రగడ రాజుకుంది. అడ్డుకుంటామని వీహెచ్‌పీ,ఏబీవీపీ సంఘాల హెచ్చరిలు చేస్తున్న నేపథ్యంలో జరిపి తీరుతామని వామపక్ష, దళిత విద్యార్థి సంఘాల సవాల్ విసురుతున్నారు. వివాదానికి ఆజ్యం పోస్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు ఆజ్యం పోస్తున్నాయి. బీఫ్‌ ఫెస్టివల్‌పై ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి ఉద్రిక్తమవుతోంది. ఇటు ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థలు, అటు వామపక్ష విద్యార్థి సంఘాల పరస్పర హెచ్చరికలతో క్యాంపస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంటోంది.

డిసెంబర్‌ 10న ఓయూలో బీఫ్‌ ఫెస్టివల్‌ .......

డిసెంబర్‌ 10న ఓయూలో బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించాలని తలపెట్టాయి ఎస్‌ఎఫ్ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌తో పాటు దళిత విద్యార్థి సంఘాలు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్,టీడీపీ, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల నేతలను ఆహ్వానించాయి. అయితే ఇదే సమయంలో ఆరెస్సెస్, వీహెచ్‌పీ అనుబంధ సంఘాలు బీఫ్‌ ఫెస్టివల్‌పై అభ్యంతరం చెబుతున్నాయి. ఈ కార్యక్రమానికి అనుమతివ్వొద్దని గోషా మహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓయూ ఇన్‌చార్జ్ వీసీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఆపలేకపోతే, తామే ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని, శాంతి భద్రతల సమస్య తలెత్తితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

ఆహారపు అలవాట్లను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే సహించేది లేదు-ఓయూ విద్యార్థులు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. అంతేకాదు తన ఫేస్‌బుక్‌ పేజీలో చేతిలో కత్తి పట్టుకుని ఛలో ఉస్మానియా యూనివర్సిటీ అంటూ రాజాసింగ్‌ పిలుపునివ్వడంపై అటు వామపక్ష, దళిత విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ఆహారపు అలవాట్లను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. మానవ హక్కుల రోజున జరిగే పెద్దకూర పండుగపై బీజేపీ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాడ్ చేశారు. ఎవరు అడ్డొచ్చినా డిసెంబర్ 10న ఓయూలో బీఫ్‌ ఫెస్టివల్‌ జరిపి తీరుతామని స్పష్టం చేశారు. ఓయూ పోలీస్‌ స్టేషన్‌లో రాజాసింగ్‌పై ఫిర్యాదు చేశారు.

2012 ఓయూ బీఫ్‌ ఫెస్టివల్‌లో పెద్ద ఎత్తున ఘర్షణ .....

2012లో ఓయూలో జరిగిన బీఫ్‌ ఫెస్టివల్‌ లో పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఆరెస్సెస్ అనుబంధ విద్యార్థి సంఘాల నేతలు, ఇటు వామపక్ష,దళిత విద్యార్థి నేతలు గొడవపడ్డారు. ఇప్పుడ కూడా సై అంటే సై అంటూ సవాల్ విసురుకుంటున్నారు. మొత్తానికి డిసెంబర్‌ 10న ఓయూలో నిర్వహించతలపెట్టిన బీఫ్‌ ఫెస్టివల్‌పై గొడవ ముదురుతోంది. ఆరోజు ఓయూలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

19:07 - December 1, 2015

హైదరాబాద్‌ : ఎస్‌బీహెచ్‌ నుంచి హైకోర్టు నిధులు 8 కోట్లు మాయమయ్యాయి. ఆన్‌లైన్‌లో హైకోర్టు బ్యాంక్‌ ఖాతా నుంచి డబ్బును ఎవరో దుండగులు లాగేశారు. హైదరాబాద్‌ మల్కాజిగిరి పరిధిలోని మల్లికార్జుననగర్‌ బ్రాంచ్‌లో ఈ ఘటన జరిగింది. దీనిపై హైకోర్టు లిక్విడేటర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంక్‌ అధికారులు కూడా దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

19:04 - December 1, 2015

హైదరాబాద్ : తెలుగు తమ్ముళ్లకు శుభవార్త అందింది. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. నామినేషన్‌ పదవులు ఇచ్చే ప్రక్రియకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు. ఈ రాత్రికి ఎనిమిది మంది కార్పొరేషన్‌ ఛైర్మన్ల పేర్లు విడుదల చేయనున్నారు. స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జయరామిరెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది.

19:02 - December 1, 2015

ప్రకాశం : అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన తల్లి తన కొడుకుపట్ల కర్కశంగా ప్రవర్తించింది. ప్రకాశం జిల్లా ఒంగోలు హౌజింగ్‌ బోర్డు కాలనీకి చెందిన గీత తన రెండున్నరేళ్ల కుమారుడు అఖిరానంద్‌ను కాల్చి వాతలు పెట్టింది. అట్లకాడతో వాతలు పెట్టడంతో చిన్నారి చర్మం కందిపోయింది. ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ సమాచారం మేరకు చైల్డ్‌ లైఫ్‌ సిబ్బంది గీత నుంచి కుమారున్ని కాపాడారు. అనంతరం వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

19:01 - December 1, 2015

చిత్తూరు : మేయర్‌ కటారి దంపతుల హత్యకేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చింటూకు పుంగనూరులో ఆశ్రయమిచ్చిన లాయర్‌ ఆనంద్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చింటూని చిత్తూరు పోలీసు శిక్షణా కళాశాలలో రహస్యంగా విచారిస్తున్నారు. కేసులో నిందితులైన వెంకటేశ్‌, మొగిలి కోసం గాలింపును ముమ్మరం చేశారు. హత్యలో వెంకటేశ్‌కు ప్రత్యక్ష సంబంధం ఉందని... మొగిలి పరోక్ష సహకారం అందించాడని పోలీసుల అనుమానిస్తున్నారు. వెంకటేశ్‌ సైతం లొంగిపోతాడంటూ పోలీసులు ప్రచారం చేస్తున్నారు. 

18:59 - December 1, 2015

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబుకు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం లేఖాస్త్రాన్ని సంధించారు. కాపులను బీసీల్లో చేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. తమ కుల నాయకులతో తనపై మాటల దాడి చేయించడం బాధగా ఉందన్న ముద్రగడ తనకు పదవులు అక్కరలేదు అన్నారు. ఏపార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. కాపులకు వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామన్న సీఎం హామీని నిలబెట్టుకోవాలన్నారు. లేదంటే జనవరి 31న తునిలో జరిగే సమావేశంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తానని ముద్రగడ పద్మనాభం లేఖలో స్పష్టం చేశారు.  

మల్కాజ్ గిరి పీఎస్ పరిధిలో ఆన్ లైన్ మోసం

హైదరాబాద్ : మల్కాజ్ గిరి పీఎస్ పరిధిలో ఆన్ లైన్ మోసం వెలుగుచూసింది. ఖాతాదారుల అకౌంట్ నుంచి ఆన్ లైన్ ద్వారా దుండగులు రూ. 8 కోట్లు డ్రా చేసినట్లు సమాచారం. ఈ ఘటన మల్లికార్జున నగర్ ఎస్ బీహెచ్ బ్రాంచ్ లో జరిగింది. అప్రమత్తమైన బ్యాంక్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

చంద్రబాబు పునరాలోచన చేయాలి : ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్ : ఏపీలో కాపులను బీసీల్లో చేర్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాను ఖండిస్తున్నాని బీసీ సంక్షేమ సంఘం జాతీయా ధ్యక్షుడు, టి.టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. ఈ అంశం పై చంద్రబాబు పునరాలోచన చేయాలని కోరారు. త్వరలో బీసీ సంఘాల నాయకులతో విజయవాడలో తాను సమావేశం నిర్వహిస్తున్నాని ఆయన తెలిపారు.

కాపులను బీసీలలో చేర్చాలి : ముద్రగడ పద్మనాభం

హైదరాబాద్ : కాపులను బీసీలలో చేర్చాలని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం సీఎం చంద్రబాబు నాయుడు ఓ లేఖ రాశారు. నాకు పదవులు అవసరంలేదని... మా కుల నాయకులతోనే నాపై మాటల దాడి చేయించడం బాధాకరం అన్నారు. నాకు రాజకీయాలు అవసరం లేదని.. ఏ పార్టీలో చేరనని ఆ లేఖలో స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా కాపులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని.... లేకపోతే జనవరి 31న తునిలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.

ముగిసిన మోత్కుపల్లి దీక్ష

నల్గొండ : యాదాద్రిని జిల్లా చేయాలంటూ టిటిడిపి నేత మోత్కుపల్లి నరసింహులు యాదగిరిగుట్టలో చేపట్టిన ఒక రోజు దీక్ష ముగిసింది. మోత్కుపల్లికి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు నిమ్మరం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

పార్టీ ఫిరాయింపులపై సుప్రీంలో టిటిడిపి, కాంగ్రెస్ పిటిషన్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల అంశం తాజాగా సుప్రీంకోర్టుకు చేరింది. టి.టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, టి.కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ లు పిటిషన్ లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ లో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, కాలె యాదయ్య, రెడ్యా నాయక్, విఠల్ రెడ్డి, కనకయ్యలు తమ పార్టీలకు రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారని, ఇది పార్టీ ఫిరాయింపుల కిందకు వస్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు. కాబట్టి వారిని అనర్హులుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. 

ప్రభుత్వం విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

హైదరాబాద్ : లోక్ సభలో అసహనంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ప్రజల మాటలను ప్రధాని మోదీ వినడం లేదని విమర్శించారు. రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న ప్రధాని మోదీకి రాజ్యాంగం పట్ల గౌరవం ఉందా అని ప్రశ్నించారు. మహాత్మాగాంధీని పొగిడిన ప్రధాని... గాడ్సేను దేశభక్తుడన్న సాక్షి మహరాజ్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదని విమర్శించారు. కేవలం ముస్లిం అయినందువల్లే అఖ్లాక్ ను హత్య చేశారని... ఆయన కుమారుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తూ దేశానికి సేవ చేస్తున్నారని...

కడపలో ఏడుగురు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్

కడప : జిల్లాలో ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు చైనా వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుండి రూ.15 లక్షల విలువ చేసే ఎర్ర దుంగలతో పాటు కారు, ల్యాప్ టాప్, 11 సెల్ ఫోన్లు, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.

17:53 - December 1, 2015

హైదరాబాద్ : ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. ఈ సామెత మన పోలీస్ డిపార్టుమెంట్‌కు సరిగ్గా సరిపోతుంది. దీంతో నేరస్తుల చేతులకు వేయాల్సిన సంకెళ్లు ఇప్పుడు వారికే పడుతున్నాయి. కంచే చేనుమేస్తే అన్న చందంలా తయారైన డిపార్ట్‌మెంట్‌ను మరోసారి ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు పోలీస్‌బాస్‌లు. సమగ్ర నేర సర్వే పక్కనపెట్టి అవినీతి సిబ్బంది సర్వే నిర్వహించాలని ఆలోచిస్తున్నారు.

నేరాలపై నిరంతర నిఘా....

తప్పు చేసిన వాడి తాట తీయాలి. నేరాలపై నిరంతరం నిఘా పెట్టాలి. వారి ఆలోచనలు..ఆచరణను ముందుగా పసిగట్టాలి..జనం జీవితాలను, ఆస్తులను కాపాడేందుకు ప్రాణాలనే పణంగా పెట్టాలి. ఇదీ..కాకీల డైలీ డ్యూటీ. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. నేరస్తుల స్థానంలో పోలీసులే నిలబడటం,..చేతులకు బేడీలు వేయాల్సిన వారికే సంకెళ్లు పడటం కాకీ డిపార్టుమెంట్‌లో కలవరం రేపుతోంది. జనాలకు పోలీసులంటే నమ్మకం కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కొందరు సిబ్బంది మూలంగా నీరుగారిపోతుండం అధికారులకు తలనొప్పి వ్యవహారంగా మారింది.

పోలీస్‌ డిపార్టమెంటులో రోజుకో అవినీతి బాగోతం...

ధారణంగా ప్రభుత్వశాఖలో ఏ డిపార్టుమెంట్ అవినీతిలో ఫస్ట్ అంటే చిన్న పిల్లాడైనా పోలీస్ ఫస్ట్ అని చెప్పేస్తాడు. అలా తయారైంది మన పోలీసుశాఖ. జనంతో మమేకమై ఫ్రెండ్లీ పోలీస్‌గా ఉండాలని ప్రభుత్వం ఎంత చెప్పినా..మన పోలీసుల తీరు మాత్రం మారడంలేదు. రోజుకో అవినీతి బాగోతం బయటపడడం..పోలీస్‌డిపార్ట్‌మెంట్‌కే మచ్చ తెస్తోంది. అవినీతి శాఖలో చాలా కాలం పనిచేసి..ఇటీవల కూకట్‌పల్లి ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన ఏసీపీ సంజీవరావు చేతివాటం ప్రదర్శించి కోట్లు కూడబెట్టాడు. నిత్యం నీతి పాఠాలు చెప్పే సంజీవరావు సార్‌ ఇంట్లో..సోదాలు చేస్తే లక్షల విలువ చేసే వజ్రాలు, ఇళ్ల స్థలాలు, పొలాలు. అన్నీ కలిపి 20 కోట్ల రూపాయల అక్రమాస్తులు బయటపడ్డాయి.

చైన్‌ స్నాచర్లకు అండగా నిలిచిన కానిస్టేబుల్‌ మధు....

ఇక సిటీ మొత్తాన్ని గడగడలాడిస్తున్న చైన్ స్నాచర్ల ముఠాకు నాయకుడు ఓ కానిస్టేబుల్ అని ఇటీవలే తెలియడంతో మరోసారి పోలీసులకు దిమ్మతిరిగినంత పనైంది. స్నాచర్ల ఆటకట్టించాల్సిన కానిస్టేబుల్ మధు..వారికి వాహనాలను అందించడమే కాకుండా..దోచుకున్న సొత్తులో తన వాటా తీసుకోవడం, నిందితులకు అండగా నిలబడటం పోలీసు శాఖకు మింగుడు పడని వ్యవహారంలా మారింది. వడ్డీ మాఫియాతో 300కోట్లు సంపాదించిన ఏఎస్ఐ మోహన్‌రెడ్డి, జనాల ఆస్తులు దోచుకున్న ఏసీపీ సంజీవరావు, స్నాచర్లతో చేతులు కలిపిన కానిస్టేబుల్ మోహన్‌లే కాకుండా, గతంలో చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఓ కానిస్టేబుల్ అనుమానంతో భార్యను చిత్రహింసలకు గురిచేసి ఆమె ఆత్మహత్యకు కారకుడయ్యాడు. దొంగతనం కేసులో సీజ్ చేసిన వాహనాన్ని కొడుకు ముచ్చటపడ్డాడని అప్పగించి సస్పెండ్ అయిన ఉప్పల్ ఎస్ఐ నిర్వాకం. తప్పతాగిన మైకంలో మహిళపై అత్యాచారానికి పాల్పడిన హోంగార్డు, కానిస్టేబుల్ ఘటన. మామూళ్లు ఇవ్వలేదని ఓ వ్యాపారిని చితకబాదిన ఎల్బీనగర్ పోలీసులు..ఇలా చెప్పుకుంటూ పోతే నేరస్తులు చేసిన నేరాలకన్నా..పోలీసులు చేసే నేరాలే కుప్పలు తెప్పలుగా కన్పిస్తున్నాయి.

యూనిఫాం ముసుగులో ఎవరేం చేస్తున్నారు?

తప్పు చేసిన వాడి చేతికి పడాల్సిన బేడీలు తమ వారికే పడడం పోలీస్‌బాస్‌లకు మింగుడు పడని వ్యవహారంలా మారింది. కాపలా ఉండాల్సిన కాకీ కంచే జనాల జీవితాలు, ఆస్తులతో చెలగాటమాడుతుంటే ఇక తమ డిపార్టుమెంట్‌పై జనాలకు ఎలా భరోసా కలుగుతుందని కొందరు బాస్‌లు అంటున్నారు. అయితే యూనిఫాం ముసుగులో ఎవరెవరు ఏం చేస్తున్నారు..ఎంత కూడబెట్టారు. ఎవరితో చేతులు కలుపుతున్నారన్న విషయాలపై డిపార్ట్‌మెంట్‌ నిఘాపెట్టింది. సమగ్ర నేర సర్వే కాకుండా..సమగ్ర సిబ్బంది అవినీతి సర్వేపైనే ఇప్పుడు పోలీస్‌బాస్‌ ఫోకస్ పెట్టారు. అయితే ఇలాంటి చర్యలు ఎంతవరకు సక్సెస్‌ అవుతాయో చూడాలి. 

17:50 - December 1, 2015

ఢిల్లీ : తెలుగు దేశం పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సుజనాచౌదరీ ప్రత్యేక హోదాపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. అలాగే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చకూడదని కోరారు. ఏపీ ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇతర రాష్ట్రాల సమస్యలకన్న భిన్నమైనవని తెలిపారు. 

17:49 - December 1, 2015

హైదరాబాద్ : బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని టార్గెట్‌ చేశారు సొంత పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌. కిషన్‌రెడ్డి వల్ల బీజేపీ సర్వనాశనం అయిపోతుందని.. వెంటనే ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. కిషన్‌రెడ్డి గ్రూపులను పెంచి పోషిస్తున్నారని రాజాసింగ్‌ ఆరోపించారు. కిషన్‌రెడ్డి వ్యవహారాన్ని పార్టీ అధిష్టానానికి సైతం లేఖ రూపంలో వివరించినట్లు చెప్పారు. మరింత సమాచారం కోసం  ఈ వీడియోను క్లిక్ చేయండి...

 

17:32 - December 1, 2015

హైదరాబాద్ : నెల్లూరులో భారీవర్షాలు ఆగకుండా కురుస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు వర్షబీభత్సాన్ని ఎదుర్కొన్న జిల్లా మరోసారి వరుణుడు దాడి చేయడంతో అల్లాడిపోతోంది. గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు ప్రాంతాలలో భారీ వర్షాలతో చెరువులు పొంగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

17:31 - December 1, 2015

పశ్చిమగోదావరి : పాలకోడేరు మండలం గొరగనమూడిలో ఓ కౌలు రౌతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అకాల వర్షాలతో పంట నష్టపోవడంతో తులసీ రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని పంట వేయగా.. ఇటీవల కురిసిన వర్షాలకు పంట అంతా మునిగి పోయింది. వ్యవసాయానికి తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. ఇక చేసేది లేక తులసీ రామకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

17:29 - December 1, 2015

మెదక్‌ : జిల్లా చుక్కపూర్‌ గ్రామంలో కలకలం రేపిన చిరుత చివరకు చిక్కింది. మొదట ఒకసారి అధికారుల వేసిన వల నుంచి తప్పించుకున్న చిరుత.. చివరకు స్థానికుల సహాయంతో అధికారుల విశ్వప్రయత్నం ఫలించి దొరికింది. ఉదయం ఇదే ప్రాంతంలో ఏడుగురిపై ఈ చిరుత దాడి చేసి గాయపరిచింది. సుదీర్ఘ సమయం కొనసాగిన ఈ ఆపరేషన్‌ చిరుత చివరకు విజయవంతంగా ముగిసింది.

ఎట్టకేలకు చిరుతను పట్టుకున్న అధికారులు...

మెదక్ : కొల్చారం మండలం తుక్కాపురం సుమారు 6 గంటల పాటు అటు అటవీ శాఖ అధికారులను, ఇటు గ్రామస్తులను ముప్పుతిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు పట్టుకున్నారు. మొదటగా అధికారులు వేసిన వలలోకి వచ్చినట్టే వచ్చి తప్పించుకుపోయింది చిరుత. ఇక ఎట్టకేలకు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చిరుతను అధికారులు వలలో బంధించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. చిరుత దాడిలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దాడిలో గాయపడింది కూడా ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం. చిరుతను అధికారులు తీసుకెళ్లారు.

ఏసీబీ వలలో వరంగల్ ఇరిగేషన్ ఏఈ

వరంగల్ : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు వరంగల్ ఇరిగేషన్ ఏఈ. రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏఈ సురేందర్‌రావును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆయన కార్యాలయంతో పాటు నివాసంలో ఏసీబీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

ఉధృతంగా ప్రవహిస్తున్న కాళంగి నది

నెల్లూరు : దొరవారి సత్రం మండలం తనియాలి వద్ద కాళంగి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నది వంతెన ముగినిపోయింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఆర్టీసీ బస్సు - కారు ఢీ : ఒకరి మృతి

ఆదిలాబాద్ : తాండూరు మండలం రపల్లె వాడ వద్ద ఆర్టీసీ బస్సు.. కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

16:58 - December 1, 2015

జామపండు ను ఆంధ్రా యాపిల్, పేదవాడి యాపిల్ అని కూడా అంటారు. రోజూ ఒక యాపిల్ తినండి డాక్టర్ కు దూరంగా ఉండండి అని వినే ఉంటాం. అలాగే ఈ ఆంధ్రా యాపిల్ లో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కాశ్మీర్ యాపిల్ కంటే ఎక్కువ ప్రయోజనాలు...

కొన్ని ఉపయోగాలు...

వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. జామపండును ఆహారం తీసుకున్న తరువాత తినడం ఉత్తమం. భోజనానికి ముందు జామపండు తినాలనుకుంటే, భోజనం చేయడానికి కనీసం రెండు గంటల ముందు తినాలి.
అతితక్కువ క్యాలరీలు, తక్కువ కొలెస్ట్రాల్ కలిగి , ఎక్కువ పోషక విలువలు ఉన్న పండు జామపండు.
ఎక్కవ పీచుపదార్ధం (ఫైబర్) కలిగి ఉంటుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
వయసుకు ముందే ముఖం పై ముడతలు , చర్మంలో సాగుదల లేకుండా చేస్తుంది.
ఏ,బీ,సీ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి కావాల్సిన యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.
కంటి సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా జామపండు కాపాడుతుంది. స్త్రీలలో రుతుచక్ర సమస్యలు , బ్రెస్ట్ క్యాన్సర్ మరియు పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది.
జామపండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి , అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.
విటమిన్ ఎ , ఫ్లావనాయిడ్స్ అయిన బీటాకెరోటిన్ , లైకోపిన్ ఉండడం వల్ల ఉపిరితిత్తులకు , చర్మానికి, కంటికి చాల మంచిది అతినీలలోహిత కిరణాల నుండి వచ్చే కొన్ని క్యాన్సర్ కారకాలను జామకాయ లో ఉండే లైకోపిన్ అడ్డుకుంటుంది.
జామకాయ లో ఉండే పొటాషియం గుండె జబ్బులు, బీపి పెరగకుండా చేస్తాయి.
అంతే కాకుండా జమకాయలో బి కాంప్లెక్స్ విటమిన్స్ (బి6 , బి9 ) , ఈ, కె విటమిన్స్ ఉంటాయి.ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో జామకాయ ఎంతగానో సహాయపడుతుంది.

బాగామాగిన జామపండులో....

బాగామాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచించారు.ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు సేవిస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుందని నిపుణులు చెపుతున్నారు.
గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతి రోజు భోజనంతో పాటు జామపండు గుజ్జును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితముంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది.
జామపండు చెట్టులోని ఆకులను (కనీసం 20-25 ఆకులు) నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటిని చల్చార్చి అందులో పటిక వేసి బాగా కలుపుకోండి. ఆ నీటిని పుక్కలిస్తే పంటి నొప్పులుంటే మటుమాయమై పోతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్‌మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 24 పాయింట్లు లాభపడి 26,169 సూచీ వద్ద అదేవిధంగా నిఫ్టీ 20 పాయింట్లు లాభపడి 7,955 సూచీ వద్ద ముగిశాయి. 

జీఎస్ టీ బిల్లుకు సంపూర్ణ మద్దతు : సుజనా చౌదరి

ఢిల్లీ : జీఎస్ టీ బిల్లుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశౄరు. ఏపీకి ప్రత్యేక హోదాపై అన్ని రాష్ట్రాల అభిప్రాయం కావాలనడం సరికాదన్నారు. పార్లమెంట్ లో చర్చించాకే విభజన బిల్లు ఆమోదం పొందిందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇస్తారో స్పష్టత లేదన్నారు.

చండీ యాగానికి గరవ్నర్ కు కేసీఆర్ ఆహ్వానం..

హైదరాబాద్ : ఆయత చండీ యాగానికి గవర్నర్‌ను సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో కలిసి ఆహ్వానించారు. ఆయత చండీ యాగంకు ముందు జరిగే శాంతి పూజల్లో కేసీఆర్ దంపతులు పాల్గొన్న విషయం విదితమే. చండీ యాగం డిసెంబర్ 23 నుంచి 27 వరకు జరగనుంది. యాగానికి సంబంధించి మెదక్ జిల్లా ఎర్రవల్లిలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 3 వేల మంది పండితులతో ఈ క్రతువును కేసీఆర్ నిర్వహించనున్నారు. సుమారు 10 వేల మంది యాగాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

15:46 - December 1, 2015

విశాఖ : మన్యంలో బాక్సైజ్‌ తవ్వకాల కోసం ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ మండిపడ్డారు. రాజ్యాంగం ఐదో షెడ్యూలుకు విరుద్ధంగా బాక్సైటై జీవో జారీ చేశారని ఆమె విమర్శించారు. బాక్సైట్‌ ప్రాజెక్ట్‌ మరో ఎన్‌రాన్‌గా మారే అవకాశం లేకపోలేదనిబృందాకారత్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

15:44 - December 1, 2015

హైదరాబాద్ : వ‌రంగ‌ల్ ఎన్నిక‌ల ఓట‌మి నుండి ఇంకా తేరుకోకముందే .. త‌రుమొకొచ్చిన ఎమ్మెల్సీ ఎన్నిక‌లు కాంగ్రెస్‌కు ముచ్చెమ‌ట‌లు పట్టిస్తున్నాయి. నామినేష‌న్లు ప్రారంభం కాక‌ముందే నేత‌ల తీరుతో పార్టీలో కాక పెరుగుతోంది. గెలుపే లక్ష్యంగా నేత‌లు ఎవ‌రికి వారు చేస్తున్న సొంత ప్రయత్నాలు పార్టీకి ఊపిరాడకుండా చేస్తున్నాయి.

నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో టీఆర్‌ఎస్‌లో చేరిన నేతలు....

ఎంపీటీసీ, జడ్పీటీసీల సంఖ్యాబలం ఉన్న నల్లగొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే చాలామంది సభ్యులు టీఆర్‌ఎస్‌ గూటికి చేరిపోయారు. ఆయా జిల్లాల్లో ఎంతమంది పార్టీలో ఉన్నారన్న సంగతి పార్టీని కలవరపెడుతుంటే.. మరోవైపు ఎమ్మెల్సీ ఆశావాహుల ప్రయత్నాలు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

నల్లగొండ జిల్లాలో రెండు గ్రూపులు .....

నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్సీ స్థానానికి రెండు గ్రూపులు పోటీ పడుతున్నాయి. ఎప్పటినుంచో సీటుపై ఆశపెట్టుకున్న మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు తన కొడుకును రంగ ప్రవేశం చేయించాలని జానారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో జిల్లాలో నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇక పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు.. కోమటిరెడ్డి ఫ్యామిలీకి ఉన్న ఆధిపత్య పోరుతో ఇప్పుడు అభ్యర్ధి ఎవరనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఎవరికి వారు స్వంత నిర్ణయాలు ....

ఇక రెండు స్థానాలున్న రంగారెడ్డి జిల్లాలో పోత్తులపై ఎవరికివారుగా నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. చాలామంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు టీఆర్‌ఎస్‌ గూటికి చేరిన నేపథ్యంలో.. రిస్క్‌ తీసుకోకుండా ఒక్కస్థానానికే పోటీ చేయాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఎలాగైనా గెలిచేందుకు ఇతర పార్టీలతో అనుకూలతను బట్టి దోస్తి కట్టేందుకు తహతహలాడుతున్నారు.

సీపీఐకి మద్దతిచ్చిన కాంగ్రెస్‌ నేతలు .....

ఇదిలాఉంటే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ నేతలు చేతులెత్తేశారు. పోటీకి ముఖం చాటేసిన నేతలు.. సీపీఐకి మద్దతు ప్రకటించారు. ఇక కరీంనగర్‌లో రెండు స్థానాలున్నప్పటికీ.. పోటీకి ఉత్సాహం చూపడం లేదు. గెలుపునకు సరిపడ సంఖ్యాబలం లేకపోవడంతో.. పోటీకి ఎవరూ ముందుకు రావడం లేదు. మెదక్‌లో ఉన్న ఒక్క స్థానానికి గజ్వేల్‌ ఇన్‌చార్జ్‌ బండారు శ్రీకాంత్‌ ఉత్సాహం చూపిస్తున్నారు. టీడీపీ నేతలతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇక గాంధీభవన్‌లో భేటీ అయిన పాలమూరు కాంగ్రెస్‌ నేతలు.. రెండు స్థానాల్లో ఒక్కదానికే పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో టీడీపీ నేతలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పార్టీలో టాక్‌ వినిపిస్తోంది. ఇలా సంఖ్యాబలం లేనిచోట కాంగ్రెస్‌ నేతలు పోటీకి చెతులెత్తేస్తే.. కాస్తా బలం ఉన్న చోట సొంత పొత్తులకు తెరదీస్తున్నారు. టీఆర్‌ఎస్‌తో కొందరు.. టీడీపీతో మరికొందరు పొత్తులకు బాటలు వేస్తుండడంతో.. ఎవరితో వెళ్తే ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ పార్టీని వెంటాడుతోంది. 

15:41 - December 1, 2015

హైదరాబాద్ : జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నారు. బల్దియా ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన రిజర్వేషన్ల ప్రక్రియ ఒక కొలిక్కి వస్తోంది. డిసెంబర్‌ 12లోగా దీన్ని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోపక్క ఎన్నికల సిబ్బందికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ శిక్షణా కార్యక్రమాలు చేపడుతోంది. రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమించిన జీహెచ్‌ఎమ్‌సీ...వారికి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.వీరితో పాటు బల్దియాలో పనిచేస్తున్న సిబ్బందికి ఎన్నికల శిక్షణ ఇవ్వనున్నారు.

అధికారులకు ఆదేశాలు జారీ...

ఎన్నికల విధులకు సిద్ధం కావాలని రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు చాలా మంది అధికారులు రిపోర్టు చేసినా..మరికొంతమంది ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. రిపోర్టు చేయని అధికారులు వెంటనే తమను సంప్రదించాలని లేకపోతే వారిపై ఎన్నికల నిబంధనావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎమ్‌సీ కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి హెచ్చరించారు. జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేస్తుంది. ఈ నోటిఫికేషన్‌ జారీ అయ్యేలోపు కొత్త ఓటర్ల చేర్చుకునే ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఓటర్ల జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశముందని పేర్కొన్నారు. 

15:38 - December 1, 2015

ఢిల్లీ: దేశంలో అసహనం పెరిగిపోతోందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో... టీడీపీ మాత్రం ఈ సమస్యను చాలా తేలిగ్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. అసహనంపై మంగళవారం లోక్‌సభలో రెండో రోజు జరిగిన చర్చలో టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్‌ పాల్గొన్నారు. దాద్రి, కల్‌బుర్గి, దోబ్లేకర్‌ హత్యలను టీడీపీ ఖండించిందిన్నారు. అయితే ఈ ఘటనలను ఎన్డీయే ప్రభుత్వం బాధ్యత వహించాలనడం సరికాదన్నారు. శాంతి భద్రతల అంశం రాష్ట్రాల పరిధిలోకి వస్తున్నందంటున్నారు. . 

15:36 - December 1, 2015

ఢిల్లీ : దేశంలో పెరుగుతున్న అసహనం అభివృద్ధి ప్రభావం చూపుతోందని లోక్‌సభలో ఆందోళన వ్యక్తమయ్యింది. అసహనంపై రెండో రోజు కూడా చర్చ కొనసాగింది. అసహనంతో దేశానికి పెట్టుబడులు రాకుండాపోయే ప్రమాదం ఉందని ప్రారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయని అన్నా డీఎంకే సభ్యుడు పీ కుమార్‌ సభ దృష్టికి తెచ్చారు. 

15:28 - December 1, 2015

ఢిల్లీ : బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతకలహాలు పెరిగిపోయాయని లోక్‌సభలో విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో బీజేడీ సభ్యుడు రవీంద్రకుమార్‌ జీనా ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు సమాధానం ఇచ్చారు. యూపీఏ పాలనతో పోలిస్తే ఎన్డీయే మతకలహాలు తగ్గాయన్నారు. యూపీఏ ప్రస్తావన తీసుకురావడంపై లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కవ మతకలహాలు జరిగాయంటూ లెక్కలు చెప్పారు. 

15:20 - December 1, 2015

గుంటూరు : జిల్లాలోని వేమూరు మండలంలో జనచైతన్య యాత్రను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలనే అజెండాతో ఏపీ టీడీపీ జనచైతన్య యాత్రలను చేపట్టింది. ఇవాల్టి నుంచి 13వ తేది వరకు నిర్వహించే ఈ జనచైతన్యయాత్రల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి లోయర్ కేడర్‌ను తిరిగి ఉత్సాహపరుస్తామని టిడిపి నేతలు చెప్తున్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరిగేందుకు సమయం సరిపోనందున మండలానికి నాలుగు రోజుల చొప్పున యాత్రలో పాల్గొనేందుకు ప్రణాళికలు రెడీ చేశారు. ఈనెల 8న ప్రకాశం, 10న శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పాల్గొనే విధంగా రూట్‌మ్యాప్‌ ఖరారు చేశారు.

అన్నా హజారేని కలిసిన ఆప్ నేతలు...

హైదరాబాద్ : గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నాహజారేని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కుమార్ విశ్వాస్, సంజయ్ సింగ్ లు కలిశారు. ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనలోక్ పాల్ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లులోని ముఖ్యాంశాలను వారు హాజారేకు వివరించారు. దాంతో అవినీతిని సమర్థవంతంగా అరికడతామని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్నా తన స్వగ్రామం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా రాలేగావ్ సిద్ధిలో ఉన్నారు.

ఇంద్రకీలాద్రి పై ఇరుముడుల వివాదం

విజయవాడ : ఇంద్రకీలాద్రి పై దుర్గ గుడి వద్ద భవానీ దీక్షల ఇరుముడులు విప్పే అంశం వివాదానికి దారితీసింది. ఇరుముడులు విప్పే అవకాశం తమకు ఇవ్వాలని గురుస్వాములు కోరారు. అయితే, దుర్గగుడి పై అలాంటి సంప్రదాయం లేదని అధికారులు తెలపడంతో వీరి మధ్య వివాదం చెలరేగింది. చివరికి మధ్యాహ్నాం గురుస్వాములతో చర్చించేందుకు ఆలయ ఈవో అంగీకరించారు.

చిదంబరం కుమారుడు కార్తీ నివాసంలో ఈడీ, ఐటీ సోదాలు..

చెన్నై : మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ నివాసంలో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కార్తీ చిదంబరానికి చెందిన పలు కంపెనీల్లో ఈడీ తనిఖీలు చేసింది. 2జీ కుంభకోణంలో భాగంగా ఎయిర్‌సెల్ - మ్యాక్సిక్ ఒప్పందానికి సంబంధించి జరిగిన అవకతవకల్లో కార్తీ ప్రమేయముందని కేసు నమోదైన విషయం విదితమే. తనిఖీల్లో భాగంగా పలు కీలక దస్ర్తాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.

నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర పెంపు..

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజీల్ ధరలు స్వల్పంగా తగ్గిన రెండోరోజే నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. 14.2 కిలోల బరువుండే ఒక్కో సిలిండర్ పై రూ.61.50 వంతన పెంచారు. ఒక కనెక్షన్ కు ఏడాదికి 12 సిలిండర్లను మాత్రమే సబ్సిడిపై ఇస్తున్నారు. ఆ కోటా దాటాక ఇచ్చేవే నాన్ సబ్సిడీ సిలిండర్లు. వాటి ధర మాత్రమే ఇప్పుడు పెరిగింది. ఇదే క్రమంలో విమాన ఇంధన ధరలు మాత్రం 1.2 శాతం చొప్పున స్వల్పంగా తగ్గాయి.

14:49 - December 1, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో కరువు విలయతాండం చేస్తోంది. అందులో భాగంగా పాఠశాలల్లో పిల్లల డ్రాపవుట్స్ పెరుగుతోంది. దీనికి కారణాలు ఏమిటి? విద్యాహక్కు చట్టాన్ని పగడ్బందీగా అమలు చేస్తే డ్రాపవుట్స్ సంఖ్య తగ్గుతుందా? బాలకార్మిక వ్యవస్థను మాఫియా పోషిస్తోందా? నిర్బంధ విద్యను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? ఉపాధి హామీ పని దినాలు పెంచితే డ్రాపవుట్స్ తగ్గుతాయా? ఇత్యాది అంశాలపై వేదిక లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వెంకటేష్ ఎంవీ ఫౌండేషన్, పీడీఎస్ యూ నేత నర్సయ్య పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

కిషన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ రాజాసింగ్

హైదరాబాద్ : తెలంగాణ బిజెపి అధ్యక్షుడు ఎమ్మెల్యే కిషన్రెడ్డి పై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి పార్టీలో నాయకులను, కార్యకర్తలను ఎదగనీయడం లేదని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో విఫలమయ్యారని విమర్శించారు. కిషన్ రెడ్డిని అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తేనే తెలంగాణలో పార్టీ బాగుపడుతుందన్నారు.

రైతుల ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ లో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అందించిన పరిహారం రికార్డులను సమర్పించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. కోదండరామ్ సూచనలు పాటిస్తున్నామని టీఎస్ సర్కార్ తెలిపింది. తదుపరి విచారణ రెండు వారాలక వాయిదా వేసింది.

 

13:42 - December 1, 2015

చిత్తూరు : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండుకుండల్లా మారాయి. స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీకాళహస్తితో పాటు తొట్టంబేడు, ఏర్పేడు, కేవీబీపురం, బుచ్చినాయుడుకండ్రిగ, వరదయ్యపాళెం, సత్యవేడులో కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండి ప్రమదాకరస్థితికి చేరుకున్నాయి.

13:39 - December 1, 2015

ఢిల్లీ : ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విత్తనాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీ తొట నరసింహం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. వరదలు, కరవు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పంటల నష్టపోవడంతో రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కేంద్రం తీసుకొస్తున్న జాతీయ వవ్యసాయ విధానంలో ఈ అంశాలను చేర్చాలని కోరారు. దీనికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ సమాధానం చెప్పారు. స్వల్పవ్యవధి వంగడాల అభివృద్ధికి పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.

 

13:23 - December 1, 2015

హైదరాబాద్ : ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం అమెజాన్‌ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. హోమ్‌ డెలివరీకి ఆ సంస్థ డ్రోన్లను ఉపయోగించుకునే పనిలో పడింది. దీనిపై ఇప్పటికే ప్రయోగాలు మొదలు పెట్టింది. అమెజాన్‌ రిలీజ్‌ చేసిన లేటెస్ట్‌ వీడియో..ఫ్యూచర్‌ డోర్‌ డెలివరీ సిస్టమ్‌ను స్ర్కీన్‌ మీద చూపించింది.
డ్రోన్లతో వస్తువుల డెలవరీ
ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజమైన అమెజాన్‌ కస్టమర్లకు మరింత దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తోంది. అతి తక్కువ సమయంలో వస్తువులను డెలివరీ చేయడానికి దగ్గర దారులు వెదుకుతోంది. దీని కోసం ఏకంగా డ్రోన్లనే ఉపయోగించేందుకు సిద్ధమవుతోంది. డ్రోన్లతో డెలివరీ చేసే విధానంపై ఇప్పటికే పలు మార్లు ప్రయోగాలు నిర్వహించింది. ఈ ప్రయోగాలకు సంబంధించి ఓ వీడియోను ఆ సంస్థ విడుదల చేసింది.
ప్రోటోటైప్‌ టెక్నాలజీతో ప్రయోగం
డ్రోన్‌ డెలివరీ కోసం ప్రోటోటైప్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు అమెజాన్‌ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన వీడియోలో సాకర్ షూలను 30 నిమిషాల్లో వినియోగదారుడికి డ్రోన్ డోర్ డెలివరీ చేసింది.
వచ్చే ఏడాది జూన్‌లో కార్యాచరణ
డ్రోన్‌ డెలివరీని ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తామనే విషయాన్ని మాత్రం అమెజాన్ వెల్లడించలేదు. వచ్చే ఏడాది జూన్‌లో ఇందుకు సంబంధించిన కార్యాచరణను పూర్తి చేసి.. వచ్చే 12 నెలల్లో డ్రోన్‌ల ద్వారా వస్తువులను సరఫరా చేసే అవకాశం ఉందని సంస్థ అధికారులు చెబుతున్నారు. మరోపక్క గూగుల్, వాల్‌మార్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలు తమ వస్తువులను డ్రోన్‌ల ద్వారా వినియోగదారులకు చేరవేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

 

13:20 - December 1, 2015

విశాఖ : జిల్లాలోని చింతపల్లిలో జరిగిన గిరిజన గర్జన విజయవంతం అయింది. కార్యక్రమంలో సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ పాల్గొని, మాట్లాడారు. పీఎంవో సూచనలతోనే రాష్ట్ర ప్రభుత్వం బాక్సైట్‌ తవ్వకాలపై శ్వేతపత్రం విడుదల చేసిందని బృందాకారత్‌ ఆరోపించారు. బాక్సైట్‌పై ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ లేవనెత్తిన ఏ ఒక్క అంశానికీ శ్వేతపత్రంలో చంద్రబాబు సమాధానం ఇవ్వలేదన్నారు.
చంద్రబాబు ద్వంద్వ వైఖరి
బాక్సైట్‌పై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం చంద్రబాబు ద్వంద్వ వైఖరిని సూచిస్తోందని బృందాకారత్‌ విమర్శించారు. ప్రధానమంత్రి కార్యాలయం సూచనలతోనే శ్వేతపత్రాన్ని విడుదల చేశారని ఆరోపించారు. రాజ్యాంగ సవరణను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ లేవనెత్తిన ఏ ఒక్క అంశానికీ శ్వేతపత్రంలో సమాధానం లేదన్నారు. కొన్ని దేశాలకు, కంపెనీలకు ఉపయోగపడేలా శ్వేతపత్రం ఉందని వ్యాఖ్యానించారు. బాక్సైట్‌ శ్వేతపత్రాన్ని తాము తిరస్కరిస్తున్నామని ఆమె అన్నారు.
భారీ ర్యాలీ
బాక్సైట్‌ ఒప్పందాలను రద్దు చేయాలని చేస్తున్న పోరాటంలో భాగంగా చింతపల్లిలో జరిగిన 'గిరిజన గర్జన సభ'లో బృందా కారత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులతో పెద్ద ఎత్తున గిరిజన సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కంపెనీ ప్రయోజనాలకే ఉపయోగపడుతుందని బహిరంగ సభలో ఆమె తెలిపారు.
బాక్సైట్‌ తవ్వకాలతో నిరాశ్రయులుకానున్న గిరిజనులు
బాక్సైట్‌ తవ్వకాలతో వేలాది మంది గిరిజనులు నిరాశ్రయులై, జీవనోపాధి కోల్పోతారని బృందా కారత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా మన్యం ప్రజలు చేస్తున్న ఉద్యమానికి పార్టీ తరపున ఆమె మద్దతు ప్రకటించారు. బాక్సైట్‌పై కాంగ్రెస్‌, టిడిపి విధానాలు ఒక్కటేనని గిరిజన సంఘం నేతలు విమర్శించారు. డొంక తిరుగుడు మాటలు మాని ఒప్పందాలు రద్దు చేయాలన్నారు. అవసరమైతే ప్రభుత్వంపై న్యాయ పోరాటానికైనా సిద్ధమని సంఘం ప్రతినిధులు హెచ్చరించారు.

 

శ్రీరాంచిట్స్ లో చోరీ...

తూర్పుగోదావరి : కాకినాడ మండల కేంద్రంలోని పిఠాపురం రోడ్డులో ఉన్న శ్రీరాం ట్రాన్స్ పోర్ట్ అండ్ ఫైనాన్స్ కంపెనీలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ చోరీ జరిగింది. మెయిన్ రూం కిటికీ గ్రిల్స్ తొలగించి రూ.17 లక్షల నగదు..220 గ్రాముల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. కాకినాడ ఎఎస్పీ దామోదర్ సంఘటనాస్థలానికి క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.

అద్వాణీ సతీమణికి అస్వస్థత

ఢిల్లీ : బీజేపీ అగ్రనేత ఎల్‌కె అద్వాణీ భార్య కమలా అద్వాణీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటినా ఎయిమ్స్ లో జాయిన్‌ చేశారు. ఎయిమ్స్ డైరెక్టర్‌ ఎంసీ మిశ్రా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ రోజు ఉదయాన్నే అద్వాణీ భార్య ఇక్కడ ఎడ్మిట్‌ అయ్యారని మిశ్రా తెలిపారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉన్నారని, వయసు మళ్ళిన కారణంగా వచ్చిన ఆరోగ్య సమస్యేలని ఆయన తెలిపారు.

12:49 - December 1, 2015

విజయనగరం : అదో గ్రామం. అన్ని ఊళ్ల మాదిరిగానే ఈ గ్రామంలో కూడా సమస్యలు తాండవించేవి. తాగేందుకు మంచినీరు ఉండేదికాదు. మరుగుదొడ్లు లేక మహిళలు ఇబ్బందిపడేదవారు. రోడ్లూ అంతంత మాత్రమే. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఊరి స్వరూపమే మారిపోయింది. కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు దత్తత తీసుకున్న తర్వాత సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. దేశవ్యాప్తంగా మర్మోగుతున్న ఆ ఊరి విశేషాలేంటో చూద్దాం.
జాతీయ స్థాయికి ఎదిగిన ద్వారపూడి
విజయనగరం జిల్లాలోని ద్వారపూడి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఉన్న ఈ గ్రామం ఖ్యాతి ఇప్పుడు జాతీయ స్థాయికి ఎదిగింది. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ద్వారాపూడి ప్రస్తావన తెచ్చారంటే ఇక్కడ జరిగిన అభివృద్ధి గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు దత్తత తీసుకున్న తర్వాత ద్వారపూడి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
మించినీటి కోసం ఆర్‌వో ప్లాంట్‌ ఏర్పాటు
ఏడాది క్రితం ద్వారపూడిని దత్తత తీసుకున్న అశోక్‌గజపతిరాజు... గ్రామంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. మట్టి రోడ్లను సిమెంటు రోడ్లుగా మార్చారు. మంచినీటి కోసం ఆర్‌వో ప్లాంట్‌ నిర్మించారు. టాయిలెట్ల నిర్మాణం ద్వారా బహిరంగ మలవిసర్జన సమస్యను దూరం చేశారు. వీధి దీపాల కోసం మినీ సోలార్‌ విద్యుత్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేశారు. అశోక్‌గజపతి రాజు ద్వారపూడిని దత్తత తీసుకోడానికి ముందు డ్రెయినేజీ నీరంతా రోడ్ల మీదే ప్రవహించేంది. ఇప్పుడు అక్కడ డెయిన్లు ఏర్పాటు చేయించారు. దీంతో ఊరు సర్వారంగ సుందరంగా కనిపిస్తోంది.
దత్తత తర్వాత 50 శాతానికి చేరిన అక్షరాస్యత
ప్రజలతో మద్యపాన వ్యవసం మాన్పించేందుకు గ్రామంలో ఉన్న వైన్‌షాపును దీని యజమాని స్వచ్ఛందంగా మూసివేశారు. దత్తతకు ముందు ద్వారపూడిలో 25 నుంచి 30 శాతం మధ్య అక్షరాస్యత ఉండేది. ఇప్పుడది 50 శాతానికి పెరిగింది. దీనిపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మహిళల ఉపాధి కోసం కుట్టుమిషన్లు
మహిళల ఉపాధి కోసం కుట్టుమిషన్లు సమకూర్చారు. కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు దత్తత తీసుకున్న తర్వాత గ్రామంలో అన్ని సమస్యలు పరిస్కారమయ్యాయని ద్వారాపూడి ప్రజలు చెబుతున్నారు.
నేతలకు ఆదర్శంగా ద్వారకపూడి
పాలకులు చొరవతీసుకుంటే గ్రామాలు ఎలా అభివృద్ధి చెందుతాయో చూపించడానికి ద్వారపూడి నిదర్శనంగా నిలుస్తుంది. ఇప్పుడు ఈ గ్రామం చాలా మంది నేతలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎందరో నేతలు, ఎన్నో గ్రామాలకు ఇది మరింత ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నారు.

 

బాక్సైట్‌ తవ్వకాల జీవో రాజ్యాంగ విరుద్ధం : బృందాకరత్

విశాఖ : మన్యంలో బాక్సైజ్‌ తవ్వకాల కోసం ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ మండిపడ్డారు. రాజ్యాంగం ఐదో షెడ్యూలుకు విరుద్ధంగా బాక్సైట్ జీవో జారీ చేశారని ఆమె విమర్శించారు. బాక్సైట్‌ ప్రాజెక్ట్ మరో ఎన్‌రాన్‌గా మారే అవకాశం లేకపోలేదని బృందాకారత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులతో చర్చించకుండా విదేశీ కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకుందన్నారు. బాక్పైట్‌ జీవోపై ఏపీ విడుదల చేసిన శ్వేతపత్రం అసత్యాల పుట్ట అని ఎద్దేవా చేశారు.

 

12:41 - December 1, 2015

విశాఖ : మన్యంలో బాక్సైజ్‌ తవ్వకాల కోసం ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ మండిపడ్డారు. రాజ్యాంగం ఐదో షెడ్యూలుకు విరుద్ధంగా బాక్సైట్ జీవో జారీ చేశారని ఆమె విమర్శించారు. బాక్సైట్‌ ప్రాజెక్ట్ మరో ఎన్‌రాన్‌గా మారే అవకాశం లేకపోలేదని బృందాకారత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులతో చర్చించకుండా విదేశీ కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకుందన్నారు. బాక్పైట్‌ జీవోపై ఏపీ విడుదల చేసిన శ్వేతపత్రం అసత్యాల పుట్ట అని ఎద్దేవా చేశారు.

 

చిరుతపులి కలకలం...

మెదక్ : జిల్లాలోని కొల్చారం మండలం చుక్కాపూర్‌లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామంలోని ఆరుగురు వ్యక్తులపై చిరుత దాడి చేసింది. మొదటగా ఒకే కుటుంబానికి చెందిన మంగలి బుజ్జమ్మ, యాదగిరి, శంకరయ్య, మల్లేషం అనే నలుగురు వ్యక్తులపై దాడి చేయడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో గంట తర్వాత మరో ఇద్దరిపై దాడి చేసింది. 

12:36 - December 1, 2015

మెదక్ : జిల్లాలోని కొల్చారం మండలం చుక్కాపూర్‌లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామంలోని ఆరుగురు వ్యక్తులపై చిరుత దాడి చేసింది. మొదటగా ఒకే కుటుంబానికి చెందిన మంగలి బుజ్జమ్మ, యాదగిరి, శంకరయ్య, మల్లేషం అనే నలుగురు వ్యక్తులపై దాడి చేయడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో గంట తర్వాత మరో ఇద్దరిపై దాడి చేసింది. స్థానికులు భయాందోళలో ఉన్నారు. అయితే దాడి చేసేందుకు ఓ ఇంట్లోకి దూరిన చిరుతను గ్రామస్తులు బందించారు. అయితే ఘటన స్థలానికి అటవీశాఖ అధికారులు రాకపోవడం గమనార్హం. 

12:28 - December 1, 2015

ఢిల్లీ : దేశంలో పెరుగుతున్న అసహనాన్ని నిరసిస్తూ వామపక్ష ఎంపీలు పార్లమెంటు మెయిన్‌ గేటు దగ్గర ధర్నా నిర్వహించారు. ప్రధాని మోదీ పాలనలలో దేశంలో మతత్వం పెరిగిపోతోందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. అసహనంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా కూడా పాలక బీజేపీ సభ్యులు, మంత్రులు అసహనం ప్రదర్శించడాన్ని వామపక్ష ఎంపీలు తప్పుపట్టారు.

11:49 - December 1, 2015

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలు ప్రారంభం ఆయ్యాయి. మతకలహాలపై లోక్ సభలో చర్చ జరుగుతోంది. వాడివేడిగా సమావేశాలు కొనసాగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతకలహాలు పెరిగిపోయాయని లోక్‌సభలో విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో బీజేడీ సభ్యుడు రవీంద్రకుమార్‌ జీనా ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు సమాధానం ఇచ్చారు. యూపీఏ పాలనతో పోలిస్తే ఎన్డీయే మతకలహాలు తగ్గాయన్నారు. యూపీఏ ప్రస్తావన తీసుకురావడంపై లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కవ మతకలహాలు జరిగాయంటూ లెక్కలు చెప్పారు.

 

11:44 - December 1, 2015

హైదరాబాద్ : ఎన్నికలపై బల్దియా వడివడిగా అడుగులు వేస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలను నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తోంది. పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఎన్నికలకు అధికారులు సిద్ధం
జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నారు. బల్దియా ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన రిజర్వేషన్ల ప్రక్రియ ఒక కొలిక్కి వస్తోంది. డిసెంబర్‌ 12లోగా దీన్ని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోపక్క ఎన్నికల సిబ్బందికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ శిక్షణా కార్యక్రమాలు చేపడుతోంది. రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమించిన జీహెచ్‌ఎమ్‌సీ...వారికి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వీరితో పాటు బల్దియాలో పనిచేస్తున్న సిబ్బందికి ఎన్నికల శిక్షణ ఇవ్వనున్నారు.
ఎన్నికల విధులకు సిద్ధం కావాలని ఆదేశాలు
ఎన్నికల విధులకు సిద్ధం కావాలని రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు చాలా మంది అధికారులు రిపోర్టు చేసినా..మరికొంతమంది ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. రిపోర్టు చేయని అధికారులు వెంటనే తమను సంప్రదించాలని లేకపోతే వారిపై ఎన్నికల నిబంధనావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎమ్‌సీ కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి హెచ్చరించారు.
కొలిక్కి వస్తున్న బీసీ ఓటర్ల జాబితా
జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేస్తుంది. ఈ నోటిఫికేషన్‌ జారీ అయ్యేలోపు కొత్త ఓటర్ల చేర్చుకునే ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఓటర్ల జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశముందని పేర్కొన్నారు.

 

11:39 - December 1, 2015

హైదరాబాద్‌ : నగరంలో మాదాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో దారుణం జరిగింది. 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక పాఠశాలలోని బాత్‌రూంలో డెలీవరి కావడం నగరంలో కలకలం రేపుతోంది. బాలిక ప్రసవం ఘటనలో శేరిలింగంపల్లి ఎంఈవో బసవలింగయ్యపై రంగారెడ్డి డీఈవో సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ ఘటనలో పాఠశాలలోని మరో 10మంది ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులను కూడా జారీ చేశారు. మాదాపూర్‌కు సమీపంలోని చంద్రనాయక్‌ తండాలో నివాసం ఉంటున్న సేవ్యా నాయక్‌కు నలుగురు కుమార్తెలు. అందులో ఇద్దరు కుమార్తెలకు వివాహం కాగా మూడో కుమార్తె మాదాపూర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అయితే ఎప్పటిలాగే స్కూల్ కు వెళ్తున్న బాలిక గర్భం దాల్చి 9నెలలవుతున్నా...అటు తల్లిదండ్రులు కానీ..ఇటు స్కూలు సిబ్బంది కాని గమనించలేదు. బాలిక స్కూల్‌ బాత్‌రూంలో ప్రసవం కావడంతో విషయం బయటపడింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం తొలుత ఎంఈవోపై సస్పెన్షన్‌ వేటు వేసింది. మరో 10 మంది టీచర్లకు షోకాజ్‌ నోటీసులు జారీచేసి...సమాధానాలు చెప్పాలని ఆదేశించింది. ఈ కేసులో ఎంతమంది ఉన్నా...వారందరిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
ఘటనపై అధికారులకు రెండు రోజుల క్రితమే తెలిపాం : ఎంఈవో
అయితే జరిగిన ఘటనపై అధికారులకు రెండు రోజుల క్రితమే తెలియచేశామని ఎంఈవో బసవలింగం తెలిపారు. అయితే ఈ ఘటన బయటే జరిగి ఉంటుందని..స్కూలు సిబ్బందికి ప్రమేయం లేదని ఆయన అన్నారు. జరిగిన ఘటనపై రెండు రోజుల క్రితమే తండ్రికి చెప్పామని ఎంఈవో తెలిపారు.
స్కూలు సిబ్బందిపై ఎలాంటి అనుమానం లేదు: బాలిక తండ్రి 
అయితే దీనిపై తండ్రి స్పందిస్తూ..కూతురుకు ఇలా జరిగిందన్న విషయం అసలు తనకు తెలియదన్నారు. స్కూలు సిబ్బందిపై ఎలాంటి అనుమానం లేదని తండ్రి సేవ్యానాయక్‌ అన్నారు.

 

 

11:32 - December 1, 2015

చిత్తూరు : ఎపిలోని పలు జిల్లాల్లో మళ్లీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. తూర్పుమండలాలైన శ్రీకాళహస్తి, ఏర్పాడు, కేవిబిపురం, బీఎన్‌ కండ్రిగ, నగరి, పిచ్చాటూరు, పుత్తూరులలో భారీ వర్షం కురుస్తోంది. 359 చెరువులు ప్రమాదస్థితిలో ఉండగా 69 చెరువులకు గండ్లు పడ్డాయి.తొట్టంబేడు మండలం తారకొల్లు గుండ్లవాగులో వృద్ధుడు గల్లంతయ్యాడు. కేవిబి పురంలో వర్ష బీభత్సానికి 4 కాజ్‌వేలు కొట్టుకుపోయాయి.
నెల్లూరు జిల్లాలో
నెల్లూరు జిల్లాలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కవాడీగుంట, బీసీ కాలనీ, బంగారుకోట కాలనీలన్నీ జలమయం అయ్యాయి. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కైవల్యానదికి వరద నీరు భారీగా చేరుకుంటుంది. వారం రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షాల నుంచి ఇంకా కోలుకోకముందే మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో జిల్లా వాసులు వణికిపోతున్నారు. కాలనీలు, ఇళ్లల్లోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. వరదనీరుతో ఇళ్లల్లోంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుండడంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అటు ఉత్తర కోస్తాలో కూడా చెదురు ముదురు వర్షాలు కురుస్తాయని...తీరం వెంట 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.

 

ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నాలుగోరోజు పార్లమెంట్ ఉభయసభలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. 

10:58 - December 1, 2015

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పు ప్రజల ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని దిహన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు తలకిందులవుతున్నాయన్నారు. భూతాపం పెరగడం వల్ల అనూహ్యమైన విపత్తులు, వరదలు వస్తాయని పేర్కొన్నారు. విశృంఖుల వస్తువ్యామోహ సంస్కృతి పర్యావరాణాన్ని నష్టం చేస్తుందన్నారు. భూతాపాన్ని తగ్గించాలంటే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని సూంచించారు. సాంప్రదాయేతర ఇంధన వనరులను వినియోగించాలని తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...
భూతాపం పెరగడం వల్ల అనూహ్యమైన వరదలు 
'భూతాపం పెరగడం వల్ల చెన్నైలో అనూహ్యమైన వరదలు వచ్చాయి. దీవులు, సముద్రతీరాన ఉన్న ప్రాంతాలు, సమద్రమట్టాటనికి దిగవనున్న ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయే పరిస్థితి కనబడుతోంది. అకస్మాత్తుగా అనూహ్యమైన కరువు, వర్షాలు సంభవిస్తున్నాయి. భూతాపాన్ని తగ్గించాలంటే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి. సాంప్రదాయేతర ఇంధన వనరులను వినియోగించాలి. సౌర విద్యుత్, పవన విద్యుత్ ను ఉపయోగించాలి. అడవులను నరికివేయడం ఆపాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి. భూసారాన్ని పరిరక్షించుకోవాలి. భూతాపానికి కారణమైన గ్రీన్ హౌజ్ వాయువులను నివారించాలి. ఆర్థిక వ్యవస్థలో కర్బన సాంద్రతను తగ్గించాలి.
పర్యావరణ నష్టానికి అందరూ బాధ్యులు కారు...
పర్యావరణ నష్టానికి అందరూ సమానంగా బాధ్యులు కారు. కాలుష్య కారకులు,, కాలుష్య బాధితులు సమాన బాధ్యత వహించరు. విశృంఖుల వస్తువ్యామోహ సంస్కృతి పర్యావరాణాన్ని నష్టం చేస్తుంది. పశ్చిమదేశాల విలాసాలకు, వర్ధమాన దేశాల అవసరాలకు ముడిపెట్టడం సరైంది కాదు. ప్రమాదకర విష వాయులను తగ్గించడానికి అమెరికా ముందుకు రావడం లేదు. కాలుష్యకారకులు, కాలుష్య బాధితులు కాలుష్యాన్ని నివారించడంలో సమానమైన బాధ్యతను నిర్వర్తించలేరు. కాలుష్యానికి కారణమైన వారు క్లైమాట్ ఫైనాన్స్ ఏర్పాటు చేసేందుకు పంపన్నదేశాలు ప్రధాన భూమకి పోశించాలి. ప్రపంచ పర్యావరణ ఉద్యమానికి భారతదేశం నాయకత్వం వహించాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది.
వాగ్ధానాలు ఘనం.. అమలు శూన్యం
ప్రభుత్వాలు వాగ్ధానాలను ఘనం చేస్తున్నాయి కానీ.. అమలు చేయడంలో విఫలం అవుతున్నాయి. వాగ్ధానాలే అవసరమైన మేర చేయలేదు.. వాటిని అమలు ఎలా చేస్తారు. వాగ్ధానం చేయడానికి ముందు అధ్యయనం చేయాలి. అధ్యయనాలతో కాలక్షేపం చేస్తున్నారు. కాపులకు రిజర్వేషన్లు అంత సులువు కాదు. ఎన్నికల్లో ఓట్ల కోసం... వాగ్ధానాలు చేశారు. ఒక కమ్యూనిటీ తనకు తానుగా బ్యాక్ వార్డు క్లాసు, వెనుకబడిపోయామనుకుంటే సరిపోదని సుప్రీంకోర్టు పేర్కొంది.
జీఎస్ టీ బిల్లుతో నష్టం..
కార్పొరేట్ రంగం జీఎస్ టీ బిల్లును త్వరగా ప్రవేశపెట్టాలని తహతహలాడుతుంది. జీఎస్ టీ బిల్లుతో రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత నష్టం జరుగుతుంది. రాష్ట్రాలు పన్నులు వేసే స్వేచ్ఛను కోల్పోతున్నాయి. విలాస వస్తువులపై అధికపన్ను ఉండాలి. జనబాహుళ్యం తమ జీవన మనుగడకు వాడుతున్న వస్తువులపై తక్కువ పన్ను ఉండాలి. అత్యవసర వస్తువులపై పన్ను ఉండకూడదు. రాజకీయ స్వేచ్ఛను రాష్ట్రాలు కోల్పోతాయి. పన్నుల విధానంపై స్పష్టత ఉండాలి. జీఎస్ టీ బిల్లుపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలి. రాష్ట్రాలకు నష్ట పరిహారం ఇవ్వాలి' అని నాగేశ్వర్ తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

చిత్తూరు : జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. 

తిరుపతి ఎస్టీ హాస్టల్ బాలికల అదృశ్యం సుఖాంతం

వరంగల్ : తిరుపతి ఎస్టీ హాస్టల్ బాలికల అదృశ్యం సుఖాంతం అయింది. వరంగల్ లో కామాంధుల చెర నుంచి బాలికలు బయటపడ్డారు. బాలికలను పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇద్దరు విద్యార్థినులు ఏర్పేడు మండలం కోబాక వాసులు.

బాలిక ప్రసవం ఘటనలో అధికారుల చర్యలు

హైదరాబాద్ : మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో బాలిక ప్రసవం ఘటనలో అధికారులు చర్యలు తీసుకున్నారు. శేరిలింగంపల్లి ఎంఈవో బసవలింగంపై సస్పెన్షన్ వేటు పడింది. మరో ఆరుగురు టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 

08:53 - December 1, 2015

ప్రజల మధ్య అనైక్యత కలిగించే విధంగా ఎన్ డిఎ ప్రభుత్వం వ్యవహరిస్తుందని వక్తలు తెలిపారు. 'పార్లమెంట్ సమావేశాలు... అసహనంపై చర్చ' అనే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సీపీఎం నేత బాబురావు, బీజేపీ నేత ప్రేమేందర్, టీడీపీ నేత విజయ్ కుమార్, వైసిపి నేత కరణం ధర్మశ్రీ పాల్గొని, మాట్లాడారు. జిజెపి నేతలు మత అసహనాన్ని ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:40 - December 1, 2015

అద్దె బస్సులతో ఆర్టీసీకి నష్టాలు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎస్ డబ్ల్యుఎఫ్ నేత సుందరయ్య అన్నారు. జనపథం చర్చా కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. ఆర్టీసీ యాజమాన్యం స్వంత బస్సులు నడపడంతో సంస్థకు లాభం చేకూరుతుందని తెలిపారు. 'ఏపీఎస్ ఆర్టీసీలో మరోసారి కలకలం రేగుతోంది. మరికొన్ని అద్దెబస్సులను ప్రవేశపెట్టాలన్న నిర్ణయానికి తోడు, ఆర్టసీ ఆస్తులను వందేళ్లపాటు లీజులకివ్వాలన్న నిర్ణయం ఆందోళనకు కారణమవుతోంది. ఇలాంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 4న సామూహిక దీక్షలు చేపట్టేందుకు ఆర్టీసీ కార్మికులు సమాయత్తమవుతున్నారు. అద్దెబస్సుల వల్ల కలిగే లాభ నష్టాలేమిటి? ఆర్టీసీ స్థలాలను ప్రయివేట్ సంస్థలకు లీజుకిస్తే ఏమవవుతుంది? వ్రుత్తిపరంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేమిటి? ఆర్టీసీ పరిరక్షణకు, ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోవాలి...? మొదలైన అంశాలపై సుందరయ్య మాట్లాడారు.

 

08:34 - December 1, 2015

ఆర్టీసీ కార్మికులు మరోసారి ఆందోళన బాటపడుతున్నారు. 850 అద్దెబస్సులను ప్రవేశపెట్టాలన్ని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వీరు కోరుతున్నారు. ఆర్టీసీలో అద్దె బస్సుల హవా 1999లో మొదలైంది. ప్రస్తుతం ఆర్టీసీలో 20శాతం పైగా అద్దెబస్సులున్నాయి. ఇప్పుడు మరో 850 అద్దె బస్సులను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. నిజానికి, అద్దె బస్సుల సంఖ్యను తగ్గిస్తామంటూ 2005లో కార్మికులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ అది అమలుకావడం లేదు. ప్రస్తుతం అద్దె బస్సులకు కిలో మీటరుకు 19 నుంచి 24 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. రోడ్లు చక్కగా వున్న మార్గాల్లోనే అద్దె బస్సుల యజమానులు తమ సర్వీసులు అందిస్తున్నారు.
అద్దె బస్సులతో నష్టాలే ఎక్కువ
అద్దె బస్సుల వల్ల లాభాలు లేకపోగా నష్టాలే ఎక్కువగా వున్నట్టు కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి. 2015 మొదటి త్రైమాసికం లెక్కలు కూడా ఇదే అంశాన్ని రుజువు చేస్తుండడం విశేషం. ఈ కాలంలో ఒక కిలోమీటరుకు ఆర్టీసీ సొంత బస్సులు 24 రూపాయల 39 పైసలు సంపాదించి పెడితే, అద్దె బస్సులు 22 రూపాయల 43 పైసలు మాత్రమే సంపాదించిన విషయాన్ని కార్మికసంఘాలు గుర్తు చేస్తున్నాయి. ఈ మూడు నెలల కాలంలో 10 కోట్ల 70 లక్షల 15వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన అద్దె బస్సులు ఆర్టీసీ సొంత బస్సుల కంటే 22 కోట్ల రూపాయలు తక్కువగా ఆర్జించి పెట్టాయి.
సొంతంగా బస్సులు కొనుగోలు చేయాలి : కార్మిక సంఘాలు
అద్దె బస్సుల యజమానులు తయారీ కంపెనీల దగ్గర కేవలం 50 వేల రూపాయల చొప్పున డిపాజిట్ చేసి, బ్యాంక్ లోన్లు తీసుకుని వాటిని కొనుగోలు చేస్తున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చే కిరాయిలో కొంతభాగం ఈఎంఐలుగా చెల్లించి, మరి కొంత లాభాన్ని జేబులో వేసుకుంటున్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఇలా అద్దె బస్సుల యజమానులకు లాభాలు పంచిపెట్టే బదులు తామే సొంతంగా బస్సులు కొనుగోలు చేయాలన్నది కార్మిక సంఘాల సూచన. అద్దె బస్సుల వ్యవహారం ఇలా వుంటే ఇక ఇప్పటికే ఆర్టీసీకున్న ఆస్తులను లీజుల పేరుతో ప్రయివేట్ వ్యక్తులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతుండడమూ వివాదస్పదమవుతోంది.

 

08:05 - December 1, 2015

చిత్తూరు : నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే వర్షాలతో అల్లాడిపోతుంటే..తాజాగా వాతావరణ శాఖ హెచ్చరిక మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం భయపెడుతోంది.
మళ్లీ వర్షాలు
రోవాన్ తుపాను..ఆ తరువాత అల్పపీడనంతో కురిసిన వర్షాలకు అతలాకుతలమైన నెల్లూరు, చిత్తూరు జిల్లాలను మళ్లీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
నెల్లూరు జిల్లా అతలాకుతలం
భారీ వర్షాలు నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. ఏఎస్ పేట మండలం లోని కలుజు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చుట్టు పక్కల ఉన్న 18 గ్రామాలకు సోమవారం ఉదయం నుంచే రాకపోకలు నిలిచిపోయాయి. జలదంకిలో 132.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గూడూరు, కావలి, నెల్లూరు ప్రాంతాల్లో ఎడతెరపిలేకుండా వర్షాలు పడ్డాయి.
కైవల్యానది వరద ఉదృతి
గూడూరు వద్ద కైవల్యానది వరద ఉదృతి 25 రోజుల నుండి కొనసాగుతోంది. దీంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే నిండుకుండలా ఉన్న చెరువులకు గుండ్లు పడే ప్రమాదముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీరప్రాంత మండలాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. చిట్టమూరు మండలంలోని ఎనిమిది గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి.
చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు
చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని సత్యవేడు, చంద్రగిరి, శ్రీకాళహస్తిలో పడుతున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. కాళంగి జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షానికి భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రెండో ఘాట్ రోడ్ లో స్వల్పంగా కొండ చరియలు విరిగిపడడంతో.. టీటీడీ వాహనదారులను అప్రమత్తం చేసింది. రోడ్లపై పడుతున్న చిన్న చిన్న బండరాళ్లను సిబ్బందితో తొలగించి రాకపోకలకు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
రాళ్లపాడు ప్రాజెక్టులోకి 19.3 అడుగల మేర నీరు
ప్రకాశం జిల్లా రాళ్లపాడు ప్రాజెక్టులోకి 19.3 అడుగల మేరకు నీరు చేరింది. ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తారు. తొమ్మిది వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అధికారులు అదే స్థాయిలో అవుట్‌ ఫ్లో వదిలారు. ఫలితంగా దిగువనున్న మన్నేరు, ముట్టేరు పొంగుతున్నాయి. గుడ్లూరు వద్ద ఉప్పుటేరు పొంగిపొర్లుతోంది. పలు గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి.

ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు అల్లాడిపోతుంటే.. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి మరింత భయపెడుతోంది. తమిళనాడును ఆనుకుని ఈ ద్రోణి కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

 

విద్యార్థిని అనుమానాస్పద మృతి

ఖమ్మం : జిల్లాలోని వైరాలోని తెలంగాణ సాంఘిక సం క్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి బాలిక అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. కొణిజర్ల మండలం పెద్దగోపతికి చెందిన యామాల మేఘన(15) సోమవారం మధ్యాహ్నం పాఠశాల నుంచి వసతిగృహానికి వెళ్లింది. సాయంత్రం తోటివిద్యార్థినులు వెళ్లిచూడగా ఉరేసుకొని కనిపించింది. మేఘన మృతిపై భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. సిబ్బంది వేధింపులతోనే కూతురు ఆత్మహత్య చేసుకున్నదని బాలిక తల్లిదండ్రులు,బంధువులు ఆరోపిస్తున్నారు. వైరా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నేటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలకు ఆన్ లైన్ ధరఖాస్తు ప్రక్రియ

హైదరాబాద్‌ : జేఈఈ-మెయిన్స్ పరీక్షలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించడానికి ఈనెల 31 వరకు గడువు విధించారు. మార్చి రెండో వారం నుంచి అడ్మిట్ కార్డులు అందుబాటులో పెట్టనున్నారు. దేశవ్యాప్తంగా 132 కేంద్రాలలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాలలో జేఈఈ-మెయిన్స్ పరీక్షలు ఆఫ్‌లైన్-ఆన్‌లైన్ నిర్వహించనున్నారు.

 

07:52 - December 1, 2015

హైదరాబాద్ : తెలంగాణాలో మండలి ఎన్నికలు అధికార పార్టీ నేతల్లో కాకపుట్టిస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ పార్టీ ఆశావహులు కొందరు టికెట్లు తమకే దక్కుతాయని ఆశపడుతూ వచ్చారు. కానీ విపక్షాలతో పొత్తులు ఉండొచ్చన్న ప్రచారం గులాబీ నేతల్లో గుబులు మొదలైంది. పైగా ఇతర పార్టీల నుంచి వస్తున్న నేతలకు పదవులు కట్టబెడుతుండడంతో కోపాన్ని దిగమింగుకోలేక బయటకు కక్కలేక విలవిల్లాడుతున్నారు.
టిఆర్‌ఎస్‌లోకి రాజకీయ వలసలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టిఆర్‌ఎస్‌లోకి రాజకీయ వలసలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున కారెక్కుతున్నారు. దీంతో పార్టీలో ముందు నుంచి ఉన్న నేతలు తమకు పదవులు దక్కుతాయనుకున్నా కొత్త వారికి ప్రాధాన్యత దక్కుతుండడంతో అసంతృప్తితో రగులుతున్నారు.
పొత్తుల విషయాన్ని వ్యతిరేకిస్తున్న టిఆర్ ఎస్ నేతలు
త్వరలో 12 స్థానాల్లో శాసనమండలి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏదోరకంగా వాటన్నిటినీ స్వంతం చేసుకోవాలని టిఆర్‌ఎస్‌ వ్యూహాలు రచిస్తోంది. తమకు పూర్తిస్థాయిలో బలం లేదని భావిస్తున్న జిల్లాల్లో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను వారికోరికలు తీర్చే ఒప్పందంతో పెద్దఎత్తున పార్టీలోకి ఆహ్వానిస్తోంది. కానీ నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో విపక్ష పార్టీలు బలంగా ఉండడంతో ఆ జిల్లాల్లోనూ విజయంకోసం ప్రతిపక్షపార్టీలతో అధికార పార్టీ అవగాహనకు వస్తోందన్న ప్రచారం జోరందుకుంది. ఎమ్మెల్సీ పదవులపై కన్నేసిన గులాబి నేతలు పొత్తుల విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే పార్టీ అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి సమాచారం బయటకు పొక్కడం లేదు.
ప్రధాన ప్రత్యర్థిగా టిడిపి
టిఆర్‌ఎస్‌కు టిడిపి ఎంత శత్రువో కాంగ్రెస్‌కూడా అంతే స్థాయిలో శత్రువు. కానీ శాసనమండలి ఎన్నికల విషయానికొచ్చేసరికి టిడిపియే ప్రధాన ప్రత్యర్థిగా మారినట్లు తెలుస్తోంది. దీంతో టిఆర్‌ఎస్‌ ఆ పార్టీకి స్థానం దక్కుండా చేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆ పార్టీ బలం ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ప్రధానంగా ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో టిడిపి ప్రభావితం చేస్తుందని అధికార పార్టీ అంచనా వేస్తోంది. ఆ జిల్లాల్లో ఇప్పటికే ఓ వైపు ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహించడంతోపాటు పూర్తి మెజార్టీ సాధించే దిశగా గులాబి పార్టీ అడుగులు వేస్తోంది.
కాంగ్రెస్‌ మద్దతు కూడగట్టే ఆలోచన
ఎన్నికల నాటికి పరిస్థితులు అధికార పార్టీ గుప్పిట్లోకి రాకపోతే రెండో వ్యూహంలో భాగంగా ఆ జిల్లాల్లో కాంగ్రెస్‌ మద్దతు కూడగట్టే ఆలోచనా ఉంది. ఇదే అమలు చేయాల్సొస్తే ఒకటి రెండు స్థానాలను పొత్తుకుదుర్చుకున్న పార్టీకి వదులుకోవాల్సొస్తుంది. ఇవే అనుమానాలు అధికార పార్టీ నేతలను వెంటాడుతున్నాయి. దీంతో టిఆర్‌ఎస్‌ ఆశావహుల్లో దిగులుమొదలైంది. పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయాలను అమలు చేస్తుందోనన్న ఉత్కంఠ ఆ నేతల్లో కనిపిస్తోంది.

 

07:40 - December 1, 2015

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్‌ పరిణామాలపై చర్చించేందుకు ఢిల్లీ తరలివెళ్లిన పీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ పలు కీలక అంశాలపై దిగ్విజయ్‌ సింగ్‌తో చర్చించారు. ముఖ్యంగా వరంగల్‌ ఓటమిపై ఢిల్లీ పెద్దలతో ఉత్తమ్‌ సమాలోచనలు చేశారు. ఉప ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవానికి గల కారణాలను విశ్లేషించుకున్నారు. భేటీ అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. వరంగల్ ఉపఎన్నిక ఫలితాలు తమకు బాధ కలిగించాయని అన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్తో భేటీలో వరంగల్ ఓటమి, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించినట్లు తెలిపారు.
ఇతర పార్టీల సహకారంతో ముందుకు
ఇతర పార్టీల సహకారం తీసుకుని శాసన మండలి ఎన్నికల్లో ముందుకు వెళతామన్నారు. సమన్వయ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ తెలిపారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ శాసనసభ ఉప ఎన్నికలో దివంగత మాజీ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి కుమారుడే పార్టీ అభ్యర్థి అని ఆయన వెల్లడించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎంతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు.

 

07:29 - December 1, 2015

విజయవాడ : ఇంటింటికీ తెలుగుదేశం జెండా ఎగరాలనే అజెండాతో ఏపీ టీడీపీ జనచైతన్య యాత్రలకు సిద్ధమవుతోంది. రెండు వారాల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ముందుగానే గ్రామ గ్రామాన ప్రభుత్వ పథకాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీని కోసం ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరిస్తున్నారు నేతలు.
జనచైతన్య యాత్రల పేరిట జనాల్లోకి టీడీపీ
గడగడపకు తెలుగుదేశాన్ని తీసుకువెళ్లటమే లక్ష్యంగా జనచైతన్య యాత్రలకు పార్టీ సిద్దమవుతోంది. ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు 16 నెలల కాలంలో పార్టీ చేసిన అభివృద్ది కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహనా కల్పించేందుకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. డిసెంబర్ 1 నుండి 13 వ తేది వరకు నిర్వహించేందుకు అన్ని గ్రామాల కేడర్ కు ఆదేశాలు , ప్రణాళికలు సిద్దం చేశారు. గుంటూరు జిల్లాలోని వేమూరు మండలంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారని అధ్యక్షులు కళా వెంకట్రావు తెలిపారు.
లోయర్ కేడర్ ను ఉత్సాహపరిచేందుకు ప్రణాళికలు సిద్ధం
జనచైతన్య యాత్రల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి లోయర్ కేడర్ ను తిరిగి ఉత్సాహపరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది టీడీపీ. ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరిగేందుకు సమయం సరిపోనందున మండలానికి నాలుగు రోజుల చొప్పున యాత్రలో పాల్గొనేందుకు ప్రణాళికలు రెడీ అయ్యాయి. డిసెంబర్ 1 న చంద్రబాబు గుంటూరు జిల్లాలో పాల్గొని, 8న ప్రకాశం, 10న శ్రీకాకుళం జిల్లాలో పాల్గొనే విధంగా రూట్‌మ్యాప్‌ ఖరారు చేశారు. గ్రామ గ్రామాన పార్టీని క్రియాశీలకంగా మార్చేందుకు పథకాలు రచిస్తున్నారు సీనియర్ నేతలు. మంత్రులు, జిల్లా ఇంచార్జులు , పార్టీ ఇంఛార్జ్ లు ఇలా ఓ ప్రత్యేక వ్యవస్థను సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారని తెలిపారు. జన చైతన్య యాత్రల పేరిట తమకు కేడర్ లేని జిల్లాలోను పచ్చ జెండా ఎగరేయాలని టీడీపీ చూస్తోంది. అటు లోయర్ కేడర్ లో ఉత్సాహం.. ఇటు తమ ప్రాబల్యం లేని నియోజకవర్గాల్లో పట్టు సాధించాలనే ఆలోచనతో టీడీపీ పావులు కదుపుతోంది.

 

వాహనం ఢీకొని ఇద్దరు మృతి

మహబూబ్ నగర్ : వనపర్తి మండలం తిరుమలగుట్ట సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మృతులు కృష్ణగిరికి చెందిన కావలి కృష్ణ (50), రమేష్ (25). 

వైసిపి, టిడిపి వర్గీయుల మధ్య ఘర్షణ

పశ్చిమగోదావరి : ఉండ్రాజవరం మండలం మోర్తలో వైసిపి, టిడిపి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అక్కడ 144 సెక్షన్ విధించారు. 

యాదగిరిగుట్టలో నేడు మోత్కుపల్లి నిరసన దీక్ష

నల్గొండ : యాదగిరిగుట్టలో నేడు టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు నిరసన దీక్ష చేపట్టనున్నారు. యాదగిరిగుట్టను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. 

Don't Miss