Activities calendar

02 December 2015

21:32 - December 2, 2015

హైదరాబాద్ : గుజరాత్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలం వాడిపోయింది. పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యధిక సీట్లు సాధించి కమలానికి చెక్‌ పెట్టింది. బీహార్‌ ఎన్నికల్లో పరాభవాన్ని మూటగట్టుకున్న ప్రధాని నరేంద్రమోదికి సొంత రాష్ట్రంలోనూ ఎదురుదెబ్బ తగిలింది. పట్టణాల్లో మాత్రం బిజెపి పరువు నిలుపుకుంది.

పుంజుకున్న కాంగ్రెస్...

గుజరాత్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పుంజుకుంది. 31 జిల్లా పంచాయితీలు, 230 తాలుకా పంచాయితీలు, 56 మున్సిపాలిటీలకు గత నెల నవంబర్‌ 26న ఓటింగ్‌ జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలను బుధవారం ప్రకటించారు. 31 జెడ్పీ స్థానాలకు గాను కాంగ్రెస్‌ 20 స్థానాలను దక్కించుకుంది. గత 2010లో జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒకే ఒక్క సీటు దక్కగా బిజెపి 30 సీట్లలో గెలుపొందడం గమనార్హం.

పట్టణ ప్రాంతాల్లో బిజెపి తన పరువు నిలిపుకుంది....

స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ హవా కొనసాగగా, పట్టణ ప్రాంతాల్లో బిజెపి తన పరువు నిలుపుకుంది. 56 మున్సిపాలిటీల్లో 40 స్థానాలు, అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, జామ్ నగర్, భావ్ నగర్‌ కార్పోరేషన్లను బిజెపి కైవసం చేసుకుంది. అయితే ఆశించిన స్థాయిలో బిజెపికి ఫలితాలు రాలేదు. మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్‌ గట్టి పోటీనే ఇచ్చింది. మోది సొంత ఇలాకా మెహన్సా కార్పోరేషన్‌లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. జడ్‌పి సీటును కూడా కాంగ్రెస్‌ దక్కించుకుంది.

స్థానిక సంస్థల ఎన్నికలు ఓ అగ్ని పరీక్ష లాంటివి...

మోది స్థానంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పదవిని స్వీకరించిన ఆనందిబెన్‌ పటేల్‌ కు స్థానిక సంస్థల ఎన్నికలు ఓ అగ్ని పరీక్ష లాంటివి. ఆమె అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరిగిన ప్రధాన ఎన్నికలివి. ఈ ఫలితాలతో బిజెపి అధిష్టానం ఆనందిబెన్‌ పటేల్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.

గుజరాత్‌లో కాంగ్రెస్‌ నామమాత్రంగా....

గత రెండు దశాబ్దాలుగా గుజరాత్‌లో కాంగ్రెస్‌ నామమాత్రంగా రాణిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ గ్రామీణ ప్రాంతాల్లో గణనీయంగా పుంజుకుంది. ఈ ఎన్నికల్లో గ్రామీణ ప్రజలు బిజెపిని తరిమేశారు. బిజెపికి వెన్నుదన్నుగా నిలిచిన పటేల్‌ సామాజికవర్గం ఎదురు తిరిగింది. హార్దిక్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించి రిజర్వేషన్ల ఆందోళన- కమలంపై తీవ్ర ప్రభావం చూపిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పటేల్‌ సామాజికవర్గానికి చెందినవారు కొందరు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయగా...మరికొందరు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్‌ వర్గాల్లో కొత్త జోష్‌ నింపగా... బిజెపికి షాకిచ్చాయి. బీహార్‌ ఎన్నికల ఫలితాల పరాభవాన్ని ఇంకా మరువకముందే సొంత రాష్ట్రంలోనూ ప్రధాని మోదికి తలదించుకునే పరిస్థితి ఏర్పడింది.

21:28 - December 2, 2015

హైదరాబాద్ : ఏపి కి ఉద్యోగుల తరలింపు పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవై ఆర్ కృష్ణారావు ఇచ్చిన సర్కులర్ లపై సచివాలయం ఉద్యోగులు మండిపడుతున్నారు..ఉద్యోగుల సమస్యలు పరిష్కరించిన తర్వాతే...తరలింపు ఉంటుందని చెప్పిన సర్కారు ..ఇప్పడు సర్కులర్ జారీ చేయడం ఏకపక్షమని ఫైర్ అవుతున్నారు. మరో వైపు ఏపి రెవెన్యూ ఉద్యోగసంఘాల నేతలు ఏపి తరలివెళ్లడానికి తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.

 సర్క్యూలర్ ఏకపక్షంగా ఉందని....

 జూన్ 1 లోగా ఏపి కి ఉద్యోగుల తరలి వెళ్లాలని.. ఏపి సీఎస్ జారీ చేసిన సర్క్యూలర్ ఏకపక్షంగా ఉందని..ఏపి సెక్రటేరియట్ ఉద్యోగల సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాకే తరలింపు చేపడతామన్న ప్రభుత్వం..తమతో చర్చించకుండా ఆదేశాలు ఇవ్వడం తగదని వాపోయారు. తమ ఇబ్బందులను తొలగిస్తే, తాము విజయవాడకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నామని..అక్కడకు వెళ్లమని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ఇకనైనా , ఉద్యోగులతో ప్రభుత్వం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. హెచ్ ఆర్ ఏ, స్థానికత, పనిచేసే కార్యాలయంపై స్పష్టత ఇవ్వాలని అన్నారు. మరో వైపు ఏపి రెవెన్యూ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సీఎస్ సర్క్యూలర్‌పై స్పందించారు. సామాజిక బాధ్యత దృష్ట్యా మా ప్రాంతానికి తరలి వెళ్లడానికి సిద్దంగా ఉన్నామని స్పష్టంగా చెప్పారు. ఉద్యోగులకు చిన్న, చిన్న సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని...వాటిని పరిష్కారం కోసం అన్ని ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు. మరి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లుగా ...అన్ని ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందో లేదో చూడాలి. 

21:25 - December 2, 2015

హైదరాబాద్ : పార్టీలో ఉంటావో లేదో తేల్చుకో ఇది దానంకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇచ్చిన అల్టిమేటమ్. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పార్టీకి అంటి ముట్టనట్టు ఉంటున్న దానం తీరుపై ఏదో ఒకటి తేల్చుకోవాలని డిసైడ్ అయింది పార్టీ.

గ్రేటర్ ఎన్నికలపై దృష్టి పెట్టిన అధిష్టానం...

గ్రేటర్ ఎన్నికలు తరుముకొస్తుండడంతో కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానం పార్టీపై దృష్టి పెట్టింది. గ్రేటర్ అధ్యక్షుడిగా దానంనాగేందర్ పై ప్రత్యేక దృష్టి పెట్టిందీ హస్తంపార్టీ . టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పార్టీపై దానం వ్యవహరిస్తున్న తీరు అసంతృప్తిగా ఉన్న పార్టీ పెద్దలు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దానం నాగేందర్ కు అల్టిమేటం జారీ చేశారు.

గ్రేటర్ ప్రెసిడెంట్ గా ఉన్న దానం నాగేందర్.....

గ్రేటర్ ప్రెసిడెంట్ గా ఉన్న దానం నాగేందర్ కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గ్రేటర్ లో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టకుండా.. గ్రేటర్ లో పార్టీ సభ్యత్వం నమోదులో కూడా ఆయన చురుగ్గా పాల్గొనకపోవడంపై అధిష్టానం కాస్త సీరియస్ గా ఉందనే తెలుస్తోంది. గ్రేటర్ లో ఓట్ల తొలగింపుపై మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి సుదీర్ఘంగా పోరాడుతున్నా.. పార్టీ అధ్యక్షుడిగా ఎక్కడా యాక్టీవ్ గా లేకపోవడంతో పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.దీంతో రేపో మాపో గులాభిగూటికి చేరతారనే ఊహగానాల వార్తలు షికారు చేస్తున్నాయి.

ఊగిసలాటకు తెరదించాలని ...

కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఊగిసలాటకు తెరదించాలని చూస్తోంది పార్టీ. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో ఎటువంటి పంథాను ఎంచుకోనుందనేది తేలాల్సి ఉంది. గాంధీభవన్ లో జరిగే సమన్వయ కమిటీ సమావేశంలో దానంపై దానిపై క్లారటీ వచ్చాకే గ్రేటర్ ఎన్నికల్లో దిగాలనేది పార్టీ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. 

21:23 - December 2, 2015

హైదరాబాద్ : చెన్నైలో భారీ వర్షాల కారణంగా.. 137ఏళ్లలో తొలిసారిగా.. ఆంగ్ల దినపత్రిక హిందూ ప్రింటింగ్ ఆగిపోయింది. 1878లో ఒకసారి ప్రింటింగ్‌కు నోచుకోలేదు. వర్షాల కారణంగా మద్రాసులో హిందూ పేపర్‌ ప్రింట్‌ కాలేదు. దీంతో బుధవారం ప్రతి పాఠకులకు చేరలేదు. 

21:21 - December 2, 2015

హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తుండడంతో చెన్నై నగరం అతలాకుతలమవుతోంది. చెన్నైలోని పలు కీలక ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.

అడయార్ నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో....

చెన్నైలోని అడయార్ నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో సైదాపేట్ వంతెనను అధికారులు మూసివేశారు. నదిలో నీరు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండటంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీరు వంతెనను తాకుతూ ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిపేశారు.

తాంబరం విమానాశ్రయం జలమయం....

భారీ వర్షాల కారణంగా చెన్నైలోని తాంబరం విమానాశ్రయం జలమయమైంది. రన్‌వేపైకి భారీగా వరద నీరు చేరడంతో తాంబరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విమానాలన్నింటిని అధికారులు రద్దు చేసారు. మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర నుంచి ఒక్క ఫ్లయిట్‌ కూడా ల్యాండ్‌ కాలేదు. గురువారం ఉదయం 6 గంటల వరకు ఎయిర్‌పోర్టు మూసి ఉంటుంది. విమానాశ్రయంలో 7 వందల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారికి ఆహారం, తాగు నీరు అందిస్తున్నారు. రన్‌వేపై నీరు నిలిచి ఉండడం వల్ల ఎలాంటి ఆపరేషన్ నిర్వహించే పరిస్థితి లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. నీటి మట్టం పెరుగుతుండడంతో దాన్ని డైవర్ట్‌ చేసే పరిస్థితి లేకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. విమానాశ్రయం సమీపంలో కూడా వాహనాల రాకపోకలు స్తంభించాయి.

19 రైళ్లను రద్దు....

చెన్నైలో భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్‌లపై నీరు ప్రవహిస్తుండడంతో అధికారులు 19 రైళ్లను రద్దు చేసారు. చెన్నై-విజయవాడ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్, చెన్నై-హౌరా కోరమండల్ ఎక్స్‌ప్రెస్, చెన్నై-అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. చెన్నై-తిరుచ్చి మార్గంలో గూడూవాంజేరి వద్ద జాతీయ రహదారి ధ్వంసమైంది. దీంతో చెన్నై-బెంగళూరు మార్గంలో వాహనాలను మళ్లించారు.

కీలక ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో ....

చెన్నై నగరంలోని కీలక ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోడంబాక్కం, వడపళని, టి.నగర్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. శానిటోరియం, పల్లవరం, క్రోమ్‌పేట్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

జలదిగ్బంధంలో పలు ప్రాంతాలు....

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై జలమయమైపోయింది. నగరంలోని కీలక ప్రాంతాలైన కోడంబాక్కం, వడపళని, టి.నగర్ తదితర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో చెన్నై నగరం గాడాంధకారంలో చిక్కుకుంది. రోడ్లపై నీరు నదుల్లా ప్రవహిస్తుండంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.

రాజా స్టీల్‌పాక్కం చెరువుకు గండి....

రాజా స్టీల్‌పాక్కం చెరువుకు గండి పడింది. అడయార్, ఇందిరానగర్ మెయిన్‌రోడ్డులో నీటి ఉద్ధృతి కారణంగా తాగునీటిపైప్‌లైన్ పగిలింది. దీంతో పైప్‌లైన్ నుంచి 6అడుగుల ఎత్తున నీరు ఎగజిమ్ముతోంది. అడయార్, కోవం నదుల ప్రాంతాల్లో వరద ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అడయార్ ప్రాంతంలో 2వేల ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

చెన్నైలోని ఐటీ కంపెనీలను కుదిపేసిన భారీ వర్షాలు...

భారీ వర్షాలు చెన్నైలోని ఐటీ కంపెనీలను కుదిపేసింది. ఐటీ కారిడార్‌లోని ఓఎంఆర్ రోడ్డు, వేళచ్చేరి, తాంబరం, తరమణి, జీఎస్టీరోడ్డు, తిరువాన్మియారు, కేళంబాక్కం తదితర ప్రాంతాల్లోని ఐటీ సంస్థల కార్యాలయాలు జలమయమయ్యాయి. దీంతో ఆయా సంస్థలు సెలవు ప్రకటించాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో బయటికొచ్చే పరిస్థితి లేకపోవడంతో చాలామంది ఉద్యోగులు కార్యాలయాల్లోనే ఉన్నారు. ఇన్ఫోసిస్ కార్యాలయం క్యాంటిన్‌లో బల్లలు, కుర్చీలు వాన నీటిలో తేలియాడుతూ కనిపించాయి.

బిక్కు బిక్కు మంటున్న100 మంది వికలాంగ విద్యార్థులు...

చెన్నై శివారుల్లోని ఓ పాఠశాల చుట్టూ నీరు చేరడంతో దాదాపు 100 మంది వికలాంగ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆ పాఠశాలలోనే చిక్కుకుపోయారు. విద్యార్థులుండే హాస్టల్ వంటింట్లోకి భారీగా నీరు చేరడంతో వంట చెయ్యడానికి కుదరక వారంతా పస్తులు ఉంటున్నారు. పాఠశాలకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో అంధకారంలో మగ్గుతున్నారు. తమిళనాడులోని 9 జిల్లాల్లో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

సోషల్‌ మీడియా, ఎస్‌ఓఎస్‌ మెసేజ్‌ ల ద్వారా సహాయాన్ని కోరుతున్న ప్రజలు ...

లోతట్టు ప్రాంతాలన్ని జలమయం కావడంతో ప్రజలు తమని తాము రక్షించుకోవడానికి ఇళ్లపైకి చేరుతున్నారు. సోషల్‌ మీడియా, ఎస్‌ఓఎస్‌ మెసేజ్‌ ల ద్వారా ప్రజలు సహాయాన్ని కోరుతున్నారు. బస్సులు, కార్లు, రూఫ్‌ టాప్‌లపై ఉన్నవారిని జనం కాపాడుతున్నారు. నిత్యావసరాలు, తాగునీరు అందుబాటులో లేక జనం అల్లాడుతున్నారు. వరదలు, వర్షాల్లో చిక్కుకున్నవారికి స్థానికులు, మాల్స్‌, సినిమా థియేటర్లు తమవంతు సహాయాన్ని అందిస్తున్నాయి. ఇల్ల తలుపులు తీసి వారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. భోజనం, వసతి, మొబైల్‌ చార్జింగ్‌ చేసుకోవడానికి సహాయపడుతున్నారు. ప్రజలు వర్షం నుంచి తలదాచుకోవడానికి మాల్స్‌, సినిమా థియేటర్లు, కార్యాలయాలను తెరచి ఉంచారు.

మరో నాలుగురోజుల పాటు వర్షాలు....

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. 72 గంటల తర్వాత మరో వారం పాటు ఓ మోస్తరు వర్షం పడుతుందని పేర్కొంది. తమిళనాడులోని పలు ప్రాంతాలతో పాటు పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షసూచన ఉన్నట్లు హెచ్చరించింది. ఇప్పటివరకు తమిళనాడులో 35 సెం.మీ.ల మధ్య వర్షపాతం నమోదైంది. వర్షాల ధాటికి రిజర్వాయర్లు పొంగిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. చెన్నై వరదలో చిక్కుకుపోయినవారికి సైన్యం సహాయక చర్యలు చేపట్టింది. త్రివిధ దళాలకు చెందిన సైనికులు వరదల్లో చిక్కుకున్న వారికి సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు.

ఉప్పొంగిన అడయార్ నది...

భారీ వర్షాలు, వరదలతో చెన్నై నగరం అతలాకుతలమవుతోంది. చెన్నైలోని అడయార్ నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో సైదాపేట్ వంతెనను అధికారులు మూసివేశారు. నదిలో నీరు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండటంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీరు వంతెనను తాకుతూ ప్రవహించడంతో రాకపోకలు నిలిపేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి కోలుకోకముందే చెన్నైని మళ్లీ భారీవర్షాలు ముంచెత్తుతున్నాయి. చాలా చోట్ల ఇళ్లు, కార్యాలయాలు పూర్తిగా నీటమునిగాయి. మౌలిక సదుపాయాలు, అత్యవసర సేవలపై కూడా వర్షాల ప్రభావం పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చెన్నై వాసులను అడ్డంగా ముంచింది.....

ముఖ్యంగా అడయార్‌ నది చెన్నై వాసులను అడ్డంగా ముంచింది. నది పరీవాహక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగరంలో రహదార్లు వాగులను తలపిస్తున్నాయి. శివార్లలోని రిజర్వాయర్లు నిండిపోయాయి. చెంబరంబాక్కం చెరువు నిండిపోవడంతో దాన్నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని అడయార్ నదిలోకి వదలడంతో అది పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచేసింది. అడయార్ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెన్నై జిల్లా కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు.

చెన్నైలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం...

వానల కారణంగా చెన్నైలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అడయార్‌ నది దిగువ ప్రాంతంలో ఉండే ఎయిర్‌పోర్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. రన్‌వేపైకి వర్షపు నీరు చేరడం, వాతావరణం అనుకూలించకపోవడంతో అన్ని విమానాలను రద్దు చేశారు. పట్టాలపైకి నీరు వచ్చి చేరడంతో దాదాపు 50 రైళ్లను కూడా రద్దు చేశారు.

13 జిల్లాల్లో వర్షాలు.....

చెన్నై, కడలూరు, విల్లుపురం, తిరునెల్వేలి, కాంచీపురం, తిరువళ్లూరు తదితర 13 జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాని మోదీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఫోన్ చేసి వర్షాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమిళనాడుకు కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు.. వాయుగుండం ప్రభావం కొనసాగుతుండటంతో.. తమిళనాడు, చెన్నై నగరానికి వర్షాల ముప్పు మరో వారం రోజులు ఉంటుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. 

ప్రభుత్వ ఉద్యోగులు సహాయక చర్యల్లో పాల్గొనాలి : జయలలిత

చెన్నై : భారీ వర్షాలు, వరదలపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సమీక్షించారు. ప్రభుత్వ ఉద్యోగులు తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆమె ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. సహాయక చర్యల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. 450 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. ఇందుకుగాను సుమారు 96 బోట్లు వినియోగిస్తున్నారు. కాగా, భారీ వర్షాల కారణంగా చెన్నై మహానగరం అతలాకుతలమైంది. చెన్నైలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.

ఏజెన్సీలో పోలీసుల తనిఖీలు

ఖమ్మం : మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంకటాపురం సర్కిల్ పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు పీఎల్‌జీఏ 15వ వారోత్సవాలను మావోయిస్టు పార్టీ నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో నిర్వహించే సభలకు సరిహద్దు ప్రాంతాల నుంచి ఎవరెవరు వెళ్తున్నారన్న దానిపై పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటుచేశారు. ముండలంలోని కుర్నపల్లి, పెదమిడిసిలేరు, పూసుగుప్ప మారుమూల గ్రామాలకు వెళ్లే మార్గాలలో ప్రత్యేక నిఘా ఉంచారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

తమిళనాడకు కర్ణాటక ప్రభుత్వం రూ.5కోట్ల ఆర్థికసాయం

హైదరాబాద్ : భారీ వర్షాలకు తమిళనాడు రాష్ట్రం అతలాకుతలమవుతోంది. చెన్నై సహా పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు కు అండగా ఉండేందుకు కర్ణాటక ప్రభుత్వం రూ.5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన అధికారిక ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

6వ తేదీ వరకు చెన్నై విమానాశ్రయం మూసివేత

హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న చెన్నై నగరానికి మరో నాలుగు రోజుల పాటు విమాన సర్వీసులు బంద్ కానున్నాయి. వరద నీటిలో చిక్కుకున్న చెన్నై విమానాశ్రయాన్ని డిసెంబర్ 6వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు ఎయిర్ పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం..

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఏపీ సహా ఐదు రాష్ట్రాల్లో ఐఐటీల ఏర్పాటుకు రూ.1,41180 కోట్ల నిధులు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. ఏపీ, ఛత్తీస్ గఢ్, గోవా, జమ్మూకాశ్మీర్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఐఐటీల ఏర్పాటు... ఒక్కో ఐఐటీకీ రూ.235.30 కోట్లు కేటాయింపు, 2019 కల్లా ఐఐటీ నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే తాత్కాలిక భవనాల్లో తిరుపతి, కేరళ పలక్కాడ్ ఐఐటీ క్లాసులు కొనసాగుతున్నాయి.

20:38 - December 2, 2015

హైదరాబాద్ : స్థంభించిన జనజీవనం, అస్తవ్యస్థమైన రవాణా వ్యవస్థ... కనీస సౌకర్యాలు కూడా కరువైన దృశ్యం. ప్రజలంతా విలవిలలాడుతున్న పరిస్థితి... వేలాది మంది నిరాశ్రుయులయ్యారు. మరణాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. భారీ వర్షాలకు చెన్నై చిత్తయ్యింది. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది. మన నగరాలకు భారీ వర్షాలను తట్టుకునే శక్తి లేదా? ఇదే విపత్తు ఇతర నగరాలకు పొంచి ఉందా? ఇదంతా గ్లోబల్ వార్మింగ్ ప్రభావమేనా? ఇదే అంశాన్ని నేటి వైడాంగిల్ లో విశ్లేషణ చేశారు. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:31 - December 2, 2015

హైదరాబాద్ : సినిమా టాకీసులు కాబోతున్న బందీఖానాలు...శ్రీమంతాన్ని సింగారించుకున్న ఆవులు, రూపాయికిలో బియ్యం ఎందుకు అంటున్న ఎంపి జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖలు... తదితర అంశాలపై మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

రంగారెడ్డి కలెక్టర్ పై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్ : రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్ రావు పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సేట్ బషీర్ బాగ్ లో భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు పై కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా కోర్టు ధిక్కరణ కేసులో రూ. 2వేల జరిమానా, నెల జైలు శిక్ష విధించింది.

19:52 - December 2, 2015

హైదరాబాద్ : స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలకు.. ఈరోజు నోటిఫికేషన్‌ జారీ అయింది. మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్‌ మినహా తొమ్మిది జిల్లాల్లోనూ ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభమైంది.

ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ......

స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం.. బుధవారం విడుదల చేసింది. స్థానిక సంస్థల కోటా కింద మొత్తం 12 మందిని ఎన్నుకోనున్నారు.

కరీంనగర్‌, రంగారెడ్డి, పాలమూరు జిల్లాల్లో 2 చొప్పున ఎమ్మెల్సీలు.....

కరీంనగర్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో రెండేసి స్థానాలకు, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నిక జరుగనుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు.. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ ఎమ్మెల్సీల సంఖ్య రెండుకు చేరింది.

డిసెంబర్‌ 9 వరకూ నామినేషన్‌ల స్వీకరణ.......

బుధవారం నోటిఫికేషన్‌ జారీ అయిన క్షణం నుంచే.. నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ మొదలైంది. ఈనెల 9వరకూ నామినేషన్లను స్వీకరించనున్నారు. 10వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 12వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. 27న ఎన్నిక.. 30న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ కసరత్తు షురూ.....

పది రోజుల క్రితమే షెడ్యూలును వెలువరించిన ఈసీ.. బుధవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీంతో.. జిల్లాల్లోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు.. ఎన్నికల నిర్వహణకు కసరత్తును ప్రారంభించారు. ఇప్పటికే ఓటర్ల జాబితాను రూపొందించారు. గతంలో జెడ్పీ, ఎంపీపీ కార్యాలయాల్లో పోలింగ్‌ జరిపిన అధికారులు.. ఈసారి, ఆర్డీవో కార్యాలయాలను పోలింగ్‌ కేంద్రాలుగా ఎంచుకున్నారు. 

19:49 - December 2, 2015

ఢిల్లీ : రాజ్యసభలో తమిళనాడు వరదలపై వాడివేడి చర్చ జరిగింది. రాష్ట్రంలో తీసుకుంటున్న సహాయక చర్యలపై వివరాలు తెలపాలని సభ్యులు డిమాండ్ చేశారు. తమిళనాడులో పరిస్థితి దారుణంగా ఉందని, ప్రస్తుత పరిస్థితి పై కేంద్రం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. సత్వరం తమిళనాడు,ఏపీ రాష్ట్రాల్లో కేంద్ర హోంశాఖ తీసుకుంటున్న చర్యలేంటో తెలపాలని విపక్షనేతలు డిమాండ్ చేశారు.

తమిళనాడును 11 ఏళ్లుగా వరదలు వెంటాడుతున్నాయ్ ..

తమిళనాడుకు వరదలు రావడం ఇది మొదటి సారి కాదని , 11 ఏళ్ల క్రితం సునామి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందని ఎంపీ కనిమొళి తెలిపారు. చెన్నై రాష్ట్రంలోని ప్రతీ గ్రామాలు , మండలాలు నీటిలో చిక్కుకున్నాయని తక్షణం చర్యలను వేగవంతం చేసి తమిళనాడును ఆదుకోవాలని కోరారు. తిరువళ్లు , కాంజీపురం వంటి నగరాలు నీటిలోనే ఉన్నాయని తెలిపారు. తమిళనాడులోని ప్రతి ఏరియాలో చెరువులను తలపిస్తున్నాయని , ప్రజల సహాయార్థం పడవలను ఏర్పాటు చేశామన్నారు కనిమొళి. తక్షణం ఆర్థిక సహాయాన్ని పెంచి రాష్ట్రానికి నిధులను విడుదల చేయాలన్నారు. తమిళనాడు ప్రభుత్వం హెల్ప లైన్ నెంబర్లను, జిల్లా హెడ్ క్వార్టర్లను అలర్ట్ చేసిందని కనిమొళి తెలిపారు. రెస్క్యూ టీంలను పెంచాలని, వైద్యారోగ్య శాఖను అందుబాటులో ఉంచాలని కనిమొళి కేంద్రాన్ని కోరారు.

తక్షణం సహాయక చర్యలు చేపట్టాలి....

తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని , ఎంపీ ల్యాండ్స్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. దీనికి సభ్యులందరూ అంగీకరించారన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తమిళనాడు రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో ఆర్మీ ఫోర్స్ లను పంపించాలని కోరారు. కేంద్రం ఇచ్చిన వివరణతో తమిళనాడు రాష్ట్రం విపరీత పరిణామం నుంచి కోలుకోదని అభాగ్యులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు.

విపత్తు పరిణామాలపై ప్రత్యేక దృష్టి సారించాం...

కేంద్రం తమిళనాడు రాష్ట్రంలోని విపత్తు పరిణామాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు వెంకయ్యనాయుడు. 25 రోజులుగా చెన్నై నీటిలోనే ఉందని వేలాది మంది రవాణా సౌకర్యాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సైన్యం , ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపడుతున్నారని వెంకయ్యనాయుడు తెలిపారు. రైల్వేలు , ఎయిర్ పోర్టులు పూర్తిగా నీటితో నిండి ఉన్నాయని ఆర్మీ వెళ్లేందుకు కాస్త అవాంతరాలు ఎదురవుతున్నయన్నారు. పూర్తిగా కాలనీలన్ని నీటితో నిండిపోయాయన్నారు. దీనిపై ప్రధానమంత్రి ఉన్నతస్థాయి సమక్ష నిర్వహించనున్నారని తెలిపారు.

రాజ్యసభలోని ఎంపీలందరూ మూకుమ్మడిగా....

రాజ్యసభలోని ఎంపీలందరూ మూకుమ్మడిగా తమిళనాడులోని విపరీతానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నిలదీశారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్రంలో రెస్క్యూ టీంలను ఏర్పాటు చేశామని తెలిపినా.. రాష్ట్రంలో పరిస్థితి కొనసాగుతూనే ఉంది. మరో రెండు రోజులు తమిళనాడులో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరి ఇంకా ఎంత నష్టం చవిచూడాల్సి వస్తుందోనని అందరూ ఆందోళన చెందుతున్నారు. 

19:45 - December 2, 2015

విజయవాడ: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. రేపటికి తీరం దిశగా కదిలే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తేలిపింది. తమిళనాడు తీరం వెంబడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. దీని ప్రభావంతో రాగల 24 గంటలపాటు తమిళనాడు, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 45- 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

కానిస్టేబుల్ గిరిధర్ రెడ్డి కి రిమాండ్...

నల్గొండ : కలెక్టరేట్ సమీంపలోని రాంగనగర్ పార్క్ లో కానిస్టేబుల్ గిరిధర్ రెడ్డి నిర్వాకం బయటపడింది. రెండు రోజుల క్రితం ప్రేమజంటను బెదిరించి చెవి కమ్మలను లాక్కున్నాడు. యువతి చెవులకు గాయాలు అయ్యాయి. కానిస్టేబుల్ గిరిధర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మిర్యాలగూడ టూటౌన్ పీఎస్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు.

బీఫ్ ను ఇంట్లోనో, షాదీఖానాలోనో తినండి:డిప్యూటీ సీఎం మహమూద్ అలీ

హైదరాబాద్ : యూనివర్శిటీ ఉన్నది చదువుకునేందుకు, బీఫ్, పోర్క్ ... ఏదైనా ఇంట్లోనో, షాదీఖానాలోనో తినండి అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి అన్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఈ నెల 10వ తేదీన జరగనున్నబీఫ్ ఫెస్టివల్ పై మహమూద్ అలీ స్పందించారు. యూనివర్శిటీలో రాజకీయాలు చేయవద్దని ఆయన అన్నారు.

మహబూబ్ నగర్ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొత్తకోట

మహబూబ్ నగర్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మహబూబ్ నగర్ టిడిపి అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు కొత్తకోట దయాకర్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈమేరకు కొత్తకోట దయాకర్ రెడ్డి పేరును నాయకులు ప్రతిపాదించగా ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించారు.

18:51 - December 2, 2015

విజయవాడ : రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో విజయవాడలో జరిగిన సదస్సును ఆయన ప్రారంభించారు. వివిధ పారిశ్రామిక సంఘాలతోపాటు, జపాన్‌కు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు రాష్ట్రంలో మంచి భవిష్యత్‌ ఉందని చంద్రబాబు చెప్పారు. పెట్టుబడులకు ఏపీలో మంచి అవకాశాలున్నాయని చెబుతున్నారు. 

18:50 - December 2, 2015

విజయవాడ : టీడీపీతో పొత్తును బిజెపి రద్దు చేసుకోవాలని ఆ పార్టీ ఏపీ నాయకుడు వాసుదేవరావు డిమాండ్‌ చేశారు. బందరు పోర్టుకు బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర ధర్నా నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం సన్న చిన్నకారు రైతుల భూములను బలవంతంగా లాక్కుంటుందని వాసుదేవరావు మండిపడ్డారు. కేంద్రం ఏపీ ప్రభుత్వానికి బలవంతపు భూసేకరణ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.

18:48 - December 2, 2015

నెల్లూరు : అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నెల్లూరు అల్లాడిపోతోంది. వానలు కాస్త తగ్గుముఖం పట్టినా.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు ఇంకా ఉగ్రరూపంలోనే ఉన్నాయి. 

18:46 - December 2, 2015

చిత్తూరు : జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో జనజీవనం అస్థవ్యస్తం అయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. స్వర్ణముఖీ నది ఉగ్రరూపం దాల్చుతోంది. తొట్టంబేడు మండలం కొత్తకండ్రిక వద్ద వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో..కేవీపురం మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. మరోవైపు కేవీపురం మండలంలోని కాళంగి రిజర్వాయర్‌ పూర్తిగా నిండిపోయింది. దీంతో కుడికాలువ వైపున్న 8 గేట్లను ఎత్తేశారు. దీంతో సమీప ప్రాంతాలన్నీ నీటమునిగాయి. 

136 సార్లు భూమి కంపించింది: కేంద్ర మంత్రి

హైదరాబాద్: ఈ ఏడాదిలో మన దేశంలో సుమారు 136 సార్లు భూ ప్రకంపనలు వచ్చా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. బుధవారం లోక్ సభలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా భూ ప్రకంపనలు, వాటి తీవ్రత మొదలైన విషయాలను ఆయన తెలిపారు. రిక్టర్ స్కేల్ పై 114 సార్లు 5 తీవ్రతతో, 14 సార్లు 4 తీవ్రతతో, 3 సార్లు 3 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 24న నేపాల్ లో సంభవించిన భూ కంప ప్రభావం భారత్ పై కూడా పడింది. దీని ప్రభావం కారణంగా భారత్ లో మొత్తం 102 మంది ప్రాణాలు కోల్పోగా, 13 వేల ఇళ్లు ధ్వంసమైనట్లు మంత్రి వివరించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపితో కలిసి పోటీ : బిజెపి నేత రామచంద్రరావు

హైదరాబాద్ : తెలంగాణ లో శాసనమండలి ఎన్నికల్లో టిడిపి కలిసి పోటీ చేస్తుందని బిజెపి నేత, ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పై ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయనపై క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. కిషన్ రెడ్డి జీవితాన్ని పార్టీకే అంకితం చేశారని, ఆయన నిర్ణయాలు ఏవీ వ్యక్తిగతం కావన్నారు.

క్రొకడైల్ పార్క్ లోకి భారీగా చేరిన వరద నీరు

హైదరాబాద్ : తమిళనాడు రాజధాని చెన్నై క్రొకడైల్ పార్క్ లోకి భారీగా వరద నీరు చేరింది. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో చెన్నై నగరం కకావిలకమైపోతుంది. చెన్నై వీధులన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. జనజీవనం ఎక్కడికక్కడే స్థంభించిపోయింది. పార్క్ లోకి భారీగా వరద నీరు చేయడంతో 40 మొసల్లు వరద నీటిలో కొట్టుకొచ్చాయి. ఓఎంఆర్, వేలాద్రి, మడిబాకంలో మొసళ్లు సంచిరిస్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు.

17:35 - December 2, 2015

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం రసవత్తరంగా మారుతోంది. ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాని.. అధికార పార్టీ ఆరాటపడుతోంది. ప్రలోభాస్త్రంతో దూకుడు మీదున్న కారు స్పీడుకు బ్రేకులు వేసి తీరాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి... వామపక్ష పార్టీల మద్దతుతో... సీపీఐ అభ్యర్థి పోటీ దాదాపుగా ఖరారైంది. మిగతా పార్టీల విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

టిఆర్ఎస్ దూకుడుగా....

ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు టిఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. కేవలం నలుగురు సభ్యులే కలిగివున్న ఈ పార్టీ... కాంగ్రెస్, టిడిపి, వామపక్షాల ప్రజా ప్రతినిధులపై ఆకర్ష్ మంత్రం ప్రయోగిస్తోంది. మధిర, ఇల్లందు, వైరా, మణుగూరు ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిదులు కొందరు ఇప్పటికే టీఆర్ఎస్‌ ఆకర్షణకు లోనయ్యారు. సీఎం కెసిఆర్ సమక్షంలోనే... కొందరు గులాబీ కండువా కప్పుకున్నారు.

మంత్రి తుమ్మల కు ప్రతిష్టాత్మకంగా...

ఖమ్మం ఎమ్మెల్సీని గెలవడం.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. టీఆర్ఎస్‌ తరఫున ఎవరు బరిలో నిలుస్తారన్న విషయంలో స్పష్టత రాకున్నా.. అధినేత ఎవరిని నిలిపితే వారిని గెలిపించి తీరాలని తుమ్మల భావిస్తున్నారు. అయితే.. స్థానికంగా చక్రం తిప్పే తుమ్మల నాగేశ్వరరావుకే.. అభ్యర్థి ఎంపిక బాధ్యతనూ అప్పగించవచ్చన్న వార్తల నేపథ్యంలో.. ఆశావహులు ఆయన చుట్టూ పరిభ్రమిస్తున్నారు. దీంతో అభ్యర్థి ఖరారు విషయం తుమ్మలకు తలనొప్పిగా మారే పరిస్థితి కనిపిస్తోంది.

తుమ్మల నాగేశ్వరరావును నమ్మి..

తుమ్మల నాగేశ్వరరావును నమ్మి.. చాలా మంది టీడీపీని వీడి కారెక్కారు. వారిలో అత్యధికులు ఇప్పుడు ఎమ్మెల్సీ టిక్కెట్టును ఆశిస్తున్నారు. దీంతో ఎవరికి అభయం ఇచ్చినా మిగిలిన వారు వ్యతిరేకంగా మారే వీలుండడంతో.. తుమ్మల ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగి గెలిచే అవకాశాలు లేకపోవడంతో.. వైసీపీని కలుపుకోవాలన్న ఆలోచనలో టీఆర్ఎస్‌ నేతలున్నారు.

అధికార పార్టీ ప్రలోభాలకు తెరలేపడాన్ని..

అధికార పార్టీ ప్రలోభాలకు తెరలేపడాన్ని.. విపక్షాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులను టీఆర్ఎస్‌లోకి చేరాలంటూ.. వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్‌ ఒత్తిడి తేవడం.. ఆ వీడియో వెలుగు చూడడంతో.. విపక్షాలు మండి పడుతున్నాయి. పాలక పక్షం అనైతిక చర్యకు పాల్పడుతోందని.. రేవంత్‌రెడ్డి కేసులాగానే... ఇదీ ఓటుకు నోటు తరహా వ్యవహారమేనంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి.

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ...

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ... విజయానికి సరిపడా సభ్యుల సంఖ్య లేకపోవడంతో.. పోటీపై ఊగిసలాడుతోంది. సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైన నేపథ్యంలో.. ఆయన కుమారుడు ప్రస్తుత ఖమ్మం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌.. తన తండ్రికే కాంగ్రెస్‌ మద్దతునిచ్చేలా ఒత్తిడి తెస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం పొత్తులు లేవని తేల్చిచెప్పడంతో... ఆయన పునరాలోచనలో పడ్డట్లు చెబుతున్నారు.

టీడీపీలోనూ పోటీపై కొరవడిన స్పష్టత .....

టీడీపీలోనూ పోటీపై స్పష్టత కొరవడింది. అధికార పార్టీని అడ్డుకోవటంతోపాటు, తుమ్మల ప్రభావాన్ని తగ్గించేందుకు టిడిపి వామపక్షాలకు మద్దతునిస్తుందని ప్రచారం జరుగుతోంది. తాను చేరడమే కాకుండా.. చాలామంది టీడీపీ నేతలను.. టీఆర్ఎస్‌లో చేర్పించిన తుమ్మలపై ప్రతీకారం తీర్చుకొనే సమయం వచ్చిందని టీడీపీ జిల్లా నాయకత్వం భావిస్తోంది. దీంతో సొంతంగా నిలవడం కన్నా.. వామపక్షాల అభ్యర్థికి మద్దతునిచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. అయితే.. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు టీడీపీ తరఫున బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇతరుల సహకారం లేనిదే గెలిచే అవకాశం లేకపోవడంతో.. టీడీపీ పోటీపై వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది.

పోటీపై వైసీపీలోనూ లేని స్పష్టత....

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై వైసీపీలోనూ స్పష్టత లేదు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నందున.. ఈపార్టీ అధికార పక్షానికే మద్దతునిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. గత ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ దాన్ని కొనసాగిస్తుందని వామపక్షాలు భావిస్తున్నాయి. ఇప్పటికే సీపీఐ నేతలు వైసీపీ మద్దతను కోరారు. దీంతో వైసీపీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. జగన్‌ తుది నిర్ణయం ప్రకారమే ఆపార్టీ ఆ రాష్ట్ర నాయకత్వం వ్యవహరించనుంది. ఇప్పటికే పోటీపై స్పష్టతనిచ్చిన సీపీఐ.. త్వరలోనే అభ్యర్థి పేరును ఖరారు చేయనుంది. దీంతోపాటే.. తమ అభ్యర్థి విజయం కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది.

అయోమయంలో విపక్షాలు...

రాష్ట్రంలో టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఏర్పడక ముందు వరకూ.. ఖమ్మం జిల్లాలో స్థానిక ప్రజా ప్రతినిధుల సంఖ్యాపరంగా బలంగా ఉన్న విపక్షాలు.. ఇప్పుడు అయోమయంలో ఉన్నాయి. టీఆర్ఎస్‌ గూటికి ఎందరు చేరిపోయారో లెక్కలు తేల్చుకునే పనిలో పడ్డాయి. తాజా అంచనాల ప్రకారం.. ఏ పార్టీకీ సొంతంగా బరిలోకి దిగే బలం లేదు. దీంతో ఎవరు ఎవరితో జతకడతారు..? అసలు ఇంకా ఎందరు అటూ ఇటూ జంప్‌లు చేస్తారు..? అన్న అంశాలపై కొంత అయోమయం నెలకొంది. వీటిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

17:31 - December 2, 2015

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికలు.. తెలంగాణ తెలుగుదేశం పార్టీని సంశయంలో పడేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలా..? పాత పద్ధతిలోనే ఎన్‌డీయే కూటమితోనే ముందుకు సాగాలా..? లేక కలిసి వచ్చే ఇతర పార్టీలను కలుపుకొని పోవాలా..? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరక్క... తెలంగాణ తెలుగుదేశం సతమతమై పోతోంది. ఓరుగల్లు ఎంపీ ఉప ఎన్నిక ఫలితాలతో సైకిల్‌ పార్టీ స్వీయ ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి. దీంతో.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు అనివార్యం. అందుకే.. మండలి ఎన్నికల్లో విజయం కోసం.. వ్యూహ రచనలో పడిపోయారు.. టీటీడీపీ నేతలు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బాధ్యత చేపట్టిన ఎర్రబెల్లి...

ఈనెల 27న జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై.. టీ-టీడీపీ నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని అందించే బాధ్యతను తీసుకున్న ఎర్రబెల్లి దయాకర్‌ వ్యూహరచనలో పార్టీ సహసీనియర్లతో మంతనాలు సాగిస్తున్నారు. బలమైన శత్రువుపై ఉమ్మడిగా దాడి చేస్తేనే విజయం సాధించగలమన్న వ్యూహాన్ని ఆయన విశ్వసిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే ఈ వ్యూహాన్ని అత్యంత గోప్యంగా అమలు చేయాలని నిర్ణయించింది.

క్షేత్ర స్థాయి అవగాహనను కుదుర్చుకునే యోచనలో టీడీపీ....

గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసుతో తల బొప్పి కట్టిన టీడీపీ.. ఈసారి అతి జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఎన్నికలు స్ధానిక సంస్ధలకు చెందినవి కాబట్టి... క్షేత్ర స్ధాయిలో అవగాహనను కుదుర్చుకోగలిగితే... ఫలితం సానుకూలంగా వెలువడుతుందని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. అందుకే కలిసి వచ్చే పార్టీలతో లోపాయకారీ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని యోచిస్తోంది. అయితే.. ఇలాంటి అనైతిక పొత్తు వల్ల... పార్టీకి ఇబ్బందులు వస్తాయని పార్టీలోని మరికొందరు నేతలు అభ్యంతర పెడుతున్నట్లు సమాచారం.

పాలమూరులో గెలుస్తామని టీడీపీ నేతల విశ్వాసం.....

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌లో విజయం సాధించే అవకాశం ఉండడంతో.. అక్కడ కాంగ్రెస్‌ మద్దతు తీసుకొని.. రంగారెడ్డి జిల్లాలో ఆపార్టీకి మద్దతు ఇస్తే ఎలా ఉంటుందని పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. దీనికి సంబంధించి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇరు పార్టీల నేతల మధ్య ప్రాథమిక చర్చలు సాగినట్లు సమాచారం. ఇప్పటికే రంగారెడ్డిలో తమ అభ్యర్థిగా సుధీర్‌రెడ్డిని ప్రకటించిన కాంగ్రెస్‌... ఈ లోపాయకారీ ఒప్పందానికి సై అంటే.. పాలమూరులో టీడీపీ టికెట్‌ను దక్కించుకునేందుకు.. రావుల చంద్రశేఖరరెడ్డి, కొత్తకోట దయాకరరెడ్డి, సీతా దయాకరరెడ్డి, రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డిలు పోటీలు పడుతున్నారు.

ఖమ్మంలో వామపక్షాల అభ్యర్థి పువ్వాడకు మద్దతు ఇచ్చే యోచన?....

ఖమ్మం జిల్లాలో తుమ్మల హవాను నిలువరించేందుకు.. తాము బరిలోకి దిగడం కన్నా.. వామపక్షాల దన్నుతో బరిలోకి దిగుతున్న సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావుకు మద్దతు ఇస్తే ఎలా ఉంటుందా అని టీడీపీలో చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణలో విజయం కోసం అర్రుల చాస్తున్న టీడీపీ.. పెద్దల సభలో పసుపు కండువాను మెరిపించేందుకు ఆపసోపాలు పడుతోంది. ఈ క్రమంలో చేతిలో చేయి వేయాలనీ అనుకుంటోంది. కానీ ఈ లోపాయకారీ ఒప్పందాన్ని టీడీపీ శ్రేణులు వ్యతిరేకంగా తీసుకుంటే.. మొదటికే మోసం వస్తుందన్న భయమూ పార్టీని వెన్నాడుతోంది. అందుకే.. ఎలాంటి నెగిటివ్‌ పరిణామాలూ తలెత్తకుండా.. ప్రతి అడుగూ ఆచితూచి వస్తోంది టీడీపీ. 

17:28 - December 2, 2015

ఖమ్మం : నగరంలో సీపీఎం శ్రేణులు ఇళ్ల స్ధలాలు, డబల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల కొరకు ఆందోళనకు దిగాయి. ఏళ్ల తరబడి డిమాండ్‌ చేస్తున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ ధర్నా చేశారు. అయితే సీపీఎం నేతలు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. ఈ సమయంలో తోపులాట జరిగింది. పోలీసులు నేతలను ఈడ్చుకుపోయి వ్యానుల్లో పడేశారు.

17:26 - December 2, 2015

హైదరాబాద్ : గ్రేట‌ర్‌లో ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. అధికార పార్టీ..మేయ‌ర్ పీఠ‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తోంది. ప్రజ‌ల‌ను అభివృద్ది పేరిట ఆక‌ర్షించేందుకు ప్లాన్ చేస్తోంది. నిత్యం ఏదో ఒక శంకుస్థాప‌న, ప్రారంభోత్సవాల పేరటి హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు న‌గ‌ర మంత్రులు. గ్రేటర్‌లో గెలుపే లక్ష్యంగా గల్లీ గల్లీ తిరుగుతూ అభివృద్ది మంత్రం జపిస్తున్నారు.

అభివృద్దిపై తెగ హ‌డావిడి చేస్తున్న మంత్రులు...

గ్రేట‌ర్ ఎన్నిక‌లు ద‌గ్గర ప‌డుతుండ‌టంతో హైద‌రాబాద్‌లో అధికార పార్టీ ప‌ట్టుకోసం చేస్తున్న ప్రయ‌త్నాల్లో వేగం పెంచింది. ప‌లు ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రులు అభివృద్ది కార్యాక్రమాలకు శంకుస్థాప‌నలు చేస్తున్నారు. గ‌త ప్రభుత్వ హ‌యాంలో చేసిన అభివృద్ది ప‌నుల‌ను సైతం త‌మ ఖాతాలో వేసుకుంటున్నారు. హైద‌రాబాద్ అభివృద్దిపై తెగ హ‌డావిడి చేస్తున్నారు.

గ్రేటర్లో పట్టుకోసం అభివృద్ధి మంత్రం .....

గ‌తంలో నిర్వహించిన స్వచ్చ హైద‌రాబాద్ కార్యక్రమం ద్వారా నగరంలో కొంతమేర ప‌ట్టు పెంచుకున్న ప్రభుత్వ పెద్దలు..అప్పుడు మంజూరూ చేసిన అన్ని ప‌నుల‌కు ఇప్పుడు ప్రారంభ కార్యక్రమాలు చేప‌డుతున్నారు. 5రూపాయ‌ల భోజ‌న కేంద్రాల ఏర్పాటు మొద‌లుకొని..సీసీరోడ్డు, తారురోడ్డు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌తో పాటు స్మశాన వాటిక‌ల అభివృద్ది ప‌నుల‌ను సైతం వ‌ద‌ల‌కుండా మంత్రులు గ‌ల్లీ గల్లీని చుట్టేస్తున్నారు. స్మార్ట్ సిటికోసం రెసిడెన్స్ వేల్ఫెర్ అసోసియేష‌న్స్‌తో జీహెచ్ఎంసి నిర్వహించిన సాధారణ స‌మావేశాల‌ను సైతం మంత్రులు వ‌ద‌లడం లేదు.

స్థలాలు సేకరించకుండానే శంకుస్థాపనలు....

ల‌బ్దిదారుల‌ను గుర్తించ‌కుండా,..ఇళ్లనిర్మాణానికి స్థలాలు సేక‌రించ‌కుండానే డ‌బుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాప‌న‌లు చేశారు. స్కైవేల నిర్మాణానికి స్థలాల సేక‌ర‌ణ చేయకుండానే టెండర్లు పిలిచి వాటిని అట‌కెక్కించారు. మ‌ల్టీలెవ‌ల్ మార్కెట్స్‌కి ఫౌండేష‌న్ స్టోన్స్ వేశారు. అయితే ఎమ్మెల్యేలుగా,.మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి 18నెలలు గడిచినా..నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ది నిధుల‌ను ఖ‌ర్చు చేయని మంత్రులు ఇప్పుడు హాడావిడి చేయడంపై నరగవాసులు మండిపడుతున్నారు. జీహెచ్ఎంసి ఎన్నిక‌ల కోసమే అధికార పార్టీ జిమ్మిక్కుల‌కు పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. అయితే ఇలాంటి చీఫ్‌ పబ్లిసిటీ ద్వారా న‌గ‌ర‌వాసుల మ‌న్ననలు పొందలేరని..నిజ‌మైన అభివృద్దికోసం ప‌ని చేయాలంటున్నారు.

స్కైవేలు, మల్టీలెవల్‌ ఫ్లైఓవర్లు, ఆకాశ హర్మ్యాలు...

గ్రేట‌ర్‌లో అధికారం కోసం హైద‌రాబాద్‌ను విశ్వన‌గ‌రంగా తీర్చిదిద్దడ‌మే త‌మ ల‌క్ష్యమ‌న్నారు. స్కైవేలన్నారు, మ‌ల్టీలెవ‌ల్ ఫ్లైఓవర్లనన్నారు, ఆకాశ హ‌ర్మ్యాలంటూ ఉద‌ర‌గొట్టారు. కానీ అవిప్పుడు అట‌కెక్కాయి. అయితే గ్రేట‌ర్‌లో అధికారంలోకి వ‌స్తే వీటిపై దృష్టి సారిస్తారా లేక పాత‌పాటే పాడుతారా అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. 

17:20 - December 2, 2015

హైదరాబాద్ : తెలంగాణ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల అమలుతీరును పరిశీలించి, అధికారులుకు దిశా, నిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంలోనే సీఎం ఈ ప్రకటన చేసినా... వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికలతో బ్రేక్‌ పడింది. స్థానిక సంస్థల కోటా నుంచి మండలి ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన తరుణంలో జిల్లాల పర్యటన ప్లాన్‌ను అమలు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు.

ఈనెల 23-27 వరకు చండీయాగం.......

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివిధ పనులతో బిజీ బిజీగా ఉన్నారు. ఓ వైపు మెదక్‌ జిల్లా జగ్‌దేవ్‌పూర్‌ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఈ నెలా 23 నుంచి 27 వరకు జరిగే చండీయాగం పనులను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల కోటా నుంచి మండలికి జరిగే ఎమ్మెల్సీ ఎన్నిల అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇదే సయంలో ఆయన జిల్లా పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన .....

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యేలోగానే ఒక రౌండ్‌ జిల్లాల్లో పర్యటన పూర్తి చేయాలని నిర్ణయించారు. రెండు లక్ష్యాలతో కేసీఆర్‌ జిల్లాల పర్యటనకు ప్లాన్‌ చేసుకున్నారు. జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించి, వేగం పెంచాలన్నది మొదటి లక్ష్యం. స్థానిక సంస్థల కోటా నుంచి మండలికి జరిగే ఎన్నికలకు అన్ని స్థాయిల్లో పార్టీని పటిష్టం చేయడం రెండో లక్ష్యం. మండలి ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ సంస్థల ప్రజా ప్రతినిధులు కేసీఆర్‌ కలుసుకునే అవకాశం ఉంది.

నీటిపారుదల ప్రాజెక్ట్‌లు, మంచినీటి పథకాలు....

ప్రతి జిల్లాలో కూడా కేసీఆర్‌ మూడు లేదా నాలుగు రోజులు ఉండి అన్నీ చక్కబెట్టేలా ప్లాన్‌ చేసుకున్నారు. నీటిపారుదల ప్రాజెక్ట్‌లు, మంచినీటి పథకాలు రహదారులు, వంతెలన నిర్మాణం పనుల అమలును పర్యవేక్షించడంతోపాటు, సమీక్షిస్తారు. జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ పటిష్టతపై పార్టీ నాయకులతో చర్చిస్తారు. ముందుగా కేసీఆర్‌ ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. గోండు వీరడు కొమురం భీమ్‌ వారసులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటారు.

ప్రజలతో మమేకమై పనిచేయాలని నిర్ణయం..

తెలంగాణ ప్రజలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ముచేయకూదని భావిస్తున్న కేసీఆర్‌... ప్రజలతో మమేకమైన పని చేయాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలో అటు ప్రజా ప్రతినిధులతోపాటు, ఇటు అధికారుల్లో చలనం వస్తుందని భావిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు.... ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తన పర్యటనలు దోహదం చేస్తాయని సీఎం భావిస్తున్నారు. 

క్వారీలో జారిపడి కార్మికుడి మృతి

కరీంనగర్ : క్వారీలో పనిచేసే ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ బుధవారం మధ్యాహ్నం మృతిచెందాడు. వెలగట్టూరు స్టోన్ క్వారీలో పనిచేస్తున్న ఎల్లయ్య(45) అనే కార్మికుడు రాళ్లకు కంప్రెషర్ ద్వారా రంధ్రాలు వేస్తుండగా జారి కిందపడ్డాడు. తీవ్రగాయాలైన ఎల్లయ్యను కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యంలోనే ప్రాణాలొదిలాడు. ఎల్లయ్య స్వస్థలం వెలగట్టూరు మండలం పైడిపల్లి గ్రామం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సేఫ్టీ బెల్ట్ ధరించకుండా పనులు చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు చెప్పుతున్నారు.

రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించిన ఎన్టీఆర్

హైదరాబాద్ : భారీ వర్షాలతో తమిళనాడు రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. రాజధాని చెన్నై సహా పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ దారుణ పరిస్థితిని చూసి చలించిన సినీతారులుతమవంతు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తెలుగు హీరో ఎన్టీఆర్ తమిళనాడు సీఎం సహాయనిధికి రూ. 10 లక్షలు ఇస్తున్న ప్రకటించారు. ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్ రామ్ రూ. 5 లక్షలు, సంపూర్ణేశ్ బాబు రూ. 50 వేలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

ఏలూరులో బైక్ దొంగల అరెస్ట్

ప.గో : ఏలూరు లో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 11 బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఏపీలో బైక్ లు దొంగలించి ఒడిశాలోని పలు నగరాల్లో అమ్మేవారని తెలిపారు.

కోల్ కతాలో మరో ఐఎస్ఐ ఏజెంట్ అరెస్ట్....

హైదరాబాద్ : పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకు చెందిన మరో ఏజెంటును పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి పాస్ పోర్ట్ కార్యాలయం బయట అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతనితో కలిపి కోల్ కతాలో అరెస్టైన ఐఎస్ఐ ఏజెంట్ల సంఖ్య నాలుగుకు చేరింది. భారత్ లో మొత్తం వెయ్యి మంది ఏజెంట్లు ఉన్నారని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే జమ్ము కశ్మీర్ లో, ఢిల్లీలో ఒక్కొక్కరిని అరెస్ట్ చేశారు. బెంగాల్ లో అరెస్టైన వారిలో కాంట్రాక్ట్ లేబరర్, అతని కుమారుడు, అతని బంధువు ఉన్నారు. ఇటీవలే మహ్మద్ కలాం అనే ఐఎస్ఐ ఏజెంట్ ను మీరట్ లో అరెస్ట్ చేశారు.

16:49 - December 2, 2015

ఖమ్మం : షుగర్‌ ఫ్రీ, కొలెస్టరాల్ ఫ్రీ, ఫ్యాట్‌ ఫ్రీ... ఇలాంటి ప్రొడక్ట్స్‌ ఎన్నో చూశాం. ఇప్పుడు షుగర్‌ ఫ్రీ రైస్‌ కూడా వచ్చేస్తున్నాయి. ఖమ్మం జిల్లా మణుగూరులో ఓ రైతు షుగర్‌ ఫ్రీ వరిని సాగుచేశాడు. సుందరయ్యనగర్‌కు చెందిన సుగ్గల రాజేశ్వరరావు అనే రైతు... ప్రొఫెసర్‌ జయశంకర్‌ యూనివర్సిటీ నుంచి తెచ్చిన ఈ వరి వంగడాన్ని తన పొలంలో సాగు చేశాడు. షుగర్‌ ఫ్రీ బియ్యంలో పిండిపదార్ధం చాలా తక్కువగా ఉంటుందని.. ఇది షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఈ వంగడం వర్షాభావ పరిస్థితులను కూడా తట్టుకుంటుందని.. ఖరీఫ్‌, రబీలో సాగుచేసుకోవచ్చని రైతులు చెప్పారు.

16:47 - December 2, 2015

అనంతపురం : ధర్మవరం నియోజకవర్గంలోనిప్రజల సమస్యలు పరిష్కరించడానికి సరికొత్త ప్రయోగం చేశారు ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ. ఇందుకు గాను కొత్తగా వెబ్ సైట్ ను ప్రారంభించి అందులో ప్రజల సమస్యలను ఉంచడం ప్రారంభించారు. దీని కారణంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో హంద్రీనీవాలపేరుతో 4 వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు.

16:44 - December 2, 2015

హైదరాబాద్ : రాష్ట్రంలో బీసీ వర్గాల సంక్షేమానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని బీసీ కార్పోరేషన్ కు చైర్మన్ గా ఎన్నికైన హిందూపూర్ మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు తెలిపారు. సీఎం ,బాలకృష్ణ ఆశిస్సులతోనే తనకు ఈ పదవి దక్కిందని.. అన్ని వర్గాల శ్రేయస్సుకు పాటుపడతానన్నారు రంగనాయకులు. 

16:43 - December 2, 2015

ప్రకాశం : అల్పపీడన ద్రోణి ప్రభావంతో ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కందుకూరు, కనిగిరి, మార్కాపురం గిద్దలూరులో భారీ వర్షం కురిసింది. ఒంగోలులో కురుస్తున్న వర్షాలకు కర్నూలు రోడ్డు, కొత్త కూరగాయల మార్కెట్ నీళ్లతో నిండిపోయాయి. వర్షాలకు రాళ్లపాడు ప్రాజెక్ట్ కు భారీగా వరదనీరు చేరడంతో 5గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఉప్పుటేరు మున్నేరు వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

16:41 - December 2, 2015

నెల్లూరు : జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. జిల్లాలోని బంగారు పేట బీసీ కాలనీలో వర్షాలకు బొప్పాపురం చెరువు పొంగిపొర్లింది. దీంతో ఈ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల జలదిగ్బంధంలో చిక్కుకుంది. అయినప్పటికీ పరీక్షలు దగ్గర పడడంతో నీళ్ల మధ్యే చదువులు కొనసాగిస్తున్నారు. వరదనీటితో తరగతి గదుల్లో దోమల బెడద ఉండడంతో మస్కిటో కాయిల్స్‌ రక్షణ వెలిగించుకొని మరి చదువులు కొనసాగిస్తున్నారు. 

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 51 పాయింట్లు నష్టపోయి 26,117 వద్ద ముగియగా, నిఫ్టీ 23 పాయింట్లు నష్టపోయి 7,931 పాయింట్ల వద్ద ముగిసింది.

చైన్ స్నాచర్ మురళీకృష్ణ అరెస్ట్...

హైదరాబాద్ : గొలుసు దొంగతనాలలో ఆరితేరిన గజ దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న మురళీకృష్ణ అనే వ్యక్తిని వనస్థలిపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2013 నుంచి వనస్థలిపురంతో పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో మురళీ గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. నిందితుడి నుంచి భారీగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.

తెలంగాణకు రూ.100 కోట్ల కరువు నిధులు

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఎస్ డీఆర్ ఎఫ్ కింద రూ. 100 కోట్లను ప్రకటిస్తున్నట్లు కేంద్ర మంత్రి రాథామోహన్ సింగ్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఈ సాయం ప్రస్తుతానికేనని, కరువు పై పూర్తిస్థాయి నివేదిక వచ్చాక మరిన్ని నిధులు విడుదల చేస్తామన్నారు.

16:25 - December 2, 2015

బొప్పాయి పండులో వున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. అందరికీ అందుబాటు ధరలో ప్రతి చోటా లభిస్తుంది. మన ఆరోగ్యానికి బొప్పాయిపండు ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్ "ఏ", విటమిన్ "బీ", విటమిన్ "సీ", విటమిన్ "డీ"లు తగుమోతాదులోనున్నాయి. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
పుట్టు పూర్వోత్తరాలు...

బొప్పాయి సుమారు 400 సంవత్సరాల క్రితం విదేశాల నుంచి భారతదేశానికి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. రంగు, రుచి, వాసనలో మేలైన ఈ పండు కాలక్రమంలో దేశమంతా విస్తరించి ప్రజల మన్ననను పొందింది.

బొప్పాయిలో...

బొప్పాయిలో 9.81 గ్రాముల కార్బోహైడ్రేట్‌‌స, 5.9 గ్రా ముల చక్కర, 1.8 గ్రాముల పీచుపదార్థం, 0.14 గ్రా. కొ వ్వు, 0.61 గ్రా.ప్రొటీన్‌, 6.1 శాతం ఎ విటమిన్‌, మూ డు శాతం బీటాకెరోట్‌, రెండు శాతం కాల్షియం, ఒక్క శా తం ఐరన్‌, 1 శాతం పాస్ఫరస్‌, మూడు శాతం మెగ్నీషి యం, 5 శాతం పొటాషియం, 0.1 శాతం సోడియం ఉన్నా యి.

రోగ నిరోధక శక్తి...

వంద గ్రాముల బొప్పాయిలో 60 నుంచి 126 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. అందుకే ఇది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. చిగుళ్లవాపును, రక్తస్రావాన్ని అరికడుతుంది. ఈ పండులో విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది. సూర్యరశ్మి ద్వారా లభించే మొత్తంతో పోల్చితే ఇది చాలా ఎక్కువ.

మలబద్ధకాన్ని పోగొట్టడంలో....

బొప్పాయి మలబద్ధకాన్ని పోగొడుతుంది. ఆహారాన్ని వెంటనే అరిగేలా చేస్తుంది. టీబీని నివారిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. రక్తంలోని దోషాలను నివారిస్తుంది. రక్త ప్రసరణ పెరగడానికి దోహదపడుతుంది. వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది. కడుపులోని యాసిడ్స్‌ను కంట్రోల్ చేస్తుంది.

పపేయిన్ అనే ఎంజైమ్....
బొప్పాయికాయలో పపేయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మాంసాహారం త్వరగా అరగడానికి దోహదం చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మాంసాహారం వండేటప్పుడు త్వరగా ఉడకడానికి బొప్పాయి కాయ ముక్కలను వేస్తారు.

బ్రేక్‌ఫాస్ట్‌గా ....

బొప్పాయి పండును ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే చాలా మంచిది. బొప్పాయిపండు ముక్కలకు తేనె చేర్చి తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బొప్పాయి ముక్కలను పాలతో ఉదయం పూట తీసుకుంటే కాలేయ సంబంధ జబ్బులు నయం చేస్తుంది.

నీళ్ల విరేచనాలకు....

నీళ్ల విరేచనాలకు బొప్పాయి పండు బాగా పనిచేస్తుంది. కడుపునొప్పితో నీళ్ల విరేచనాలు మొదలైతే బొప్పాయితో నయం చేయవచ్చు. అందుకోసం బొప్పాయి గింజలు రెండు భాగాలు, ఒక భాగం శొంఠి, కొద్దిగా ఉప్పు కలిపి చూర్ణంగా చేయాలి. ఈ చూర్ణాన్ని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. అంతేగాకుండా పైల్స్ నివారణకు పచ్చి బొప్పాయికాయ కూర బాగా ఉపయోగపడుతుంది.

బొప్పాయి పాలు, చెరకు రసంతో...

10 గ్రాముల బొప్పాయి పాలను చెరకు రసంతో కలిపి తీసుకుంటే పచ్చకామెర్లు నయమవుతాయి. బొప్పాయి పాలలో కొంచెం తేనె కలిపి ఇస్తే కడుపులో నులి పురుగులు పడిపోతాయి. చిన్నపిల్లలకు అరస్పూను ఇస్తే సరిపోతుంది. తేనె కలిపిన పాలకు రెట్టింపుగా వేడి నీరు కలిపి చల్లారిన తర్వాత మాత్రమే తాగించాలి.

హైఫీవర్ కంట్రోల్....

బొప్పాయి ఆకులను ఎండబెట్టి పొడి చేయాలి. 10 గ్రాముల పొడి తీసుకుని ఒక కప్పు వేడి నీటిలో ఐదు నిమిషాలు నానబెట్టి తాగించాలి. దీనివల్ల హైఫీవర్ కంట్రోల్ అవుతుంది. ఈ నీటికి గుండెనొప్పిని కూడా తగ్గించే గుణం ఉంది. గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం బొప్పాయి వాడుతుండాలి. మధుమేహం కూడా నయమవుతుంది.

బొప్పాయితో బీపీ కంట్రోల్...

రక్తపోటు ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం పరగడుపున బొప్పాయి తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. అంతేగాకుండా కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. బొప్పాయి వేరును అరగదీసి నీటిలో కలిపి దాహం అనిపించినప్పుడల్లా తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్లు మాయమవుతాయి.
బాలింతలకు...

బొప్పాయి ముక్కలను పాలతో కలిపి బ్రేక్‌ఫాస్టుగా తీసుకుంటే బాలింతలకు స్తన్యం ఎక్కువగా వస్తుంది. అజీర్ణం, ఆకలి మందగించడం, వికారం వంటి లక్షణాలు ఉన్నప్పుడు, గుండెల్లో మంట, కడుపులో నొప్పి, ఆహారం సహించకపోవడం, నీళ్ల విరేచనాలను వెంటనే అరికడుతుంది.
వేళకు భోజనం చేయకపోవడం, అతిగా భుజించడం, ఆల్కహాల్ వంటివి ఎక్కువగా తాగటం, మానసిక ఒత్తిడి, మితిమీరిన టెన్షన్ వంటివి జీర్ణకోశాన్ని నష్టపరుస్తాయి. ఇలాంటి సమయంలో బొప్పాయి పండు అమోఘంగా పనిచేస్తుంది.
బొప్పాయి కాయలను కూరగా వండుకుని రెండు వారాలు తింటే జీర్ణకోశ వ్యాధులు నయమవుతాయి.
బొప్పాయిలో ఫాస్పరస్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. దీనిద్వారా మనిషి ఎదుగుదలకు, కళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఆకలి లేకపోవటం, బలహీనత వంటి వాటికి బొప్పాయి అరచెక్కను తింటే ఆకలి పెరగడమే కాకుండా బలహీనత తగ్గుతుంది. ఒక స్పూను బొప్పాయి పాలను తీసుకున్నా ఆకలి పుడుతుంది. బొప్పాయిపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా, నునుపుగా చేస్తుంది.
బ్యూటీక్రీమ్‌లు, బ్యూటీ లోషన్లలో పండును ఎక్కువగా వాడతారు. బొప్పాయి చెట్టు పాలు చర్మ సంరక్షణకు లోషన్‌గా ఉపయోగపడుతాయి. బొప్పాయి కాయలను బాగా ఎండబెట్టి, పొడిగా మార్చి, ఉప్పు కలుపుకుని తింటే చర్మం అందంగా తయారవుతుంది. బొప్పాయి గుజ్జును ముఖానికి మాస్క్‌లా నెల రోజులు చేసుకుంటే నల్లదనం తగ్గి రంగు తేలుతుంది. బొప్పాయి పండు, ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే మేలు చేస్తుంది.


 

15:54 - December 2, 2015

హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఫీఫా బ్యాలెన్‌ డి యర్ అవార్డ్‌ ఫైనల్‌ లైనప్ రెడీ అయింది.2014-15 సీజన్‌లో అదరగొట్టిన అర్జెంటీనా కమ్‌ బార్సిలోనా స్టార్‌ స్ట్రైకర్‌ లయనెల్‌ మెస్సీ, పోర్చుగల్‌ కమ్‌ రియల్‌మ్యాడ్రిడ్‌ స్ట్రైకర్‌ క్రిస్టియానో రొనాల్డో , బ్రెజిల్‌ కమ్‌ బార్సిలోనా ఫార్వర్డ్‌ నైమర్‌ జూనియర్‌ ఫీఫా బ్యాలెన్‌ డి యర్ అవార్డ్‌ రేస్‌లో ముందు వరుసలో నిలిచారు.

ఫైనలిస్ట్‌లను ప్రకటించిన ఫిఫా...

ప్రతీ యేడాది ఇంటర్నేషనల్‌ సాకర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాడికి ఇచ్చే ప్రతిష్టాత్మక బ్యాలెన్‌ డి యర్‌ అవార్డ్‌ ఫైనలిస్ట్‌లను ఫీఫా ప్రకటించింది. వరల్డ్‌ నెంబర్‌ వన్‌ గేమ్‌ సాకర్‌లో....నెంబర్‌ వన్‌ ప్లేయర్‌ ఎవరంటే మాత్రం చెప్పడం కష్టం. కానీ ఫీఫా బ్యాలెన్‌ డి యర్‌ అవార్డ్‌ను ఎవరు సొంతం చేసుకుంటే వారే....ఆ సీజన్‌కు బెస్ట్‌ ప్లేయర్‌.

మొత్తం 50 మంది ఆటగాళ్లను నామినేట్‌ చేయగా...

2014-15 సీజన్‌కు గాను ఫీఫా మొత్తం 50 మంది ఆటగాళ్లను నామినేట్‌ చేయగా....23 ఆటగాళ్లు సెమీఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించారు. 23 మందిలో అత్యధికంగా స్కోర్‌ చేసి, అత్యుత్తమ ప్రదర్శన చేసిన ముగ్గురు ఆటగాళ్లను ఫైనలిస్ట్‌లుగా ప్రకటించారు. అర్జెంటీనా కమ్‌ బార్సిలోనా స్టార్‌ స్ట్రైకర్‌ లయనెల్‌ మెస్సీ, పోర్చుగల్‌ కమ్‌ రియల్‌మ్యాడ్రిడ్‌ స్ట్రైకర్‌ క్రిస్టియానో రొనాల్డో , బ్రెజిల్‌ కమ్‌ బార్సిలోనా ఫార్వర్డ్‌ నైమర్‌ జూనియర్‌ ఫీఫా బ్యాలెన్‌ డి యర్ అవార్డ్‌ రేస్‌లో ముందు వరుసలో నిలిచారు.

మెస్సీ, రొనాల్డో , నైమర్‌.....

మెస్సీ, రొనాల్డో , నైమర్‌.....ముగ్గురూ ముగ్గురే.మోడ్రన్‌ సాకర్‌లో గత 8 ఏళ్ల నుంచి మెస్సీ, రొనాల్డోల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ సాకర్‌ ఆటగాడు ఎవరని అడిగితే....ముందుగా ఈ ఇద్దరి పేర్లు మాత్రమే వినిపిస్తాయి. ఇద్దరి ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌, మెరుపు వేగంతో గోల్స్‌ కొట్టాలన్నా....ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ స్కోర్‌ చేయాలన్నా ఈ ఇద్దరి తర్వాతే ఎవరైనా. మెస్సీ ఇప్పటివరకూ నాలుగు సార్లు బ్యాలెన్‌ డియర్ అవార్డ్‌ సొంతంచేసుకోగా, రొనాల్డో మూడు సార్లు బెస్ట్‌ ప్లేయర్‌గా నిలిచాడు.

ఇద్దరిలో మెస్సీనే ది బెస్ట్‌ అంటూ .....

ఇద్దరిలో మెస్సీనే ది బెస్ట్‌ అంటూ కొంతమంది....కాదు రొనాల్డోనే అత్యుత్తమ ఆటగాడు అని మరికొంతమంది వాదన.గత 8 ఏళ్లుగా బ్యాలెన్‌ డి యర్‌ అవార్డ్‌ కోసం మెస్సీ,రొనాల్డోలు పోటీపడుతూనే ఉన్నారు. మరోవైపు ఈ ఇద్దరితో పోటీ పడుతున్న యంగ్‌ గన్‌ కూడా తక్కువ వాడేమీ కాదు. ఎందుకంటే సాకర్‌ క్రేజీ నేషన్‌ బ్రెజిల్‌ తరఫున అతిచిన్న వయసులోనే ఎన్నో అరుదైన రికార్డ్‌లు నమోదు చేసిన నైమర్‌కు ప్రత్యేక స్థానమే ఉంది.

2014-15 సీజన్‌లో....

2014-15 సీజన్‌లో రియల్‌ మ్యాడ్రిడ్‌, పోర్చుగీస్‌ జట్టు తరఫున క్రిస్టియానో రొనాల్డో 14 ఎసిస్ట్‌లతో పాటు 48 గోల్స్‌ నమోదు చేశాడు. బార్సిలోనా, అర్జెంటీనా జట్ల తరఫున లయనెల్‌ మెస్సీ ఓవరాల్‌గా 24 ఎసిస్ట్‌లతో పాటు 48 గోల్స్‌ స్కోర్‌ చేశాడు. తొలి సారిగా ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధించిన నైమర్‌ బార్సిలోనా, బ్రెజిల్‌ జట్ల తరఫున 17 ఎసిస్ట్‌లతో పాటు 41 గోల్స్‌ నమోదు చేశాడు.

బ్యాలెన్‌ డి యర్ అవార్డ్‌ దక్కే అవకాశాలు.....

ఈ ముగ్గురిలో బ్యాలెన్‌ డి యర్ అవార్డ్‌ దక్కే అవకాశాలు అర్జెంటీనా కమ్‌ బార్సిలోనా స్టార్‌ స్ట్రైకర్‌ లయనెల్‌ మెస్సీకే ఎక్కువగా ఉన్నాయి. గత రెండేళ్లుగా రొనాల్డో ఈ అవార్డ్‌ అందుకున్న రొనాల్డోతో పాటు ,ప్రస్తుతం కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న నైమర్‌కు సైతం అవకాశాలు లేకపోలేదు. మరి 2014-15 సీజన్‌ ప్రతిష్టాత్మక ఫీఫా బ్యాలెన్‌ డి యర్‌ అవార్డ్‌ను దక్కించుకునే సాకర్‌ హీరో ఎవరో తెలుసుకోవాలంటే మాత్రం 2016 జనవరి 11 వరకూ వేచి చూడాల్సిందే.  

 

15:50 - December 2, 2015

హైదరాబాద్ : డాలర్‌ ఆధిపత్యానికి పగ్గాలు వేసేందుకు బ్రిక్స్‌ న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు తొలి అడుగు వేసింది. రుణ గ్రహీతల్లో ప్రధాన దేశాలకు చెందిన కరెన్సీల్లోనే రుణాలు అందించాలనే నిర్ణయం తీసుకుంది. తొలి దఫా రుణాలు చైనా కరెన్సీ యువాన్‌లో చెల్లించనుండడంతో అంతర్జాతీయ విపణిలో సంచలనం చోటుచేసుకోనుంది.

బ్రిక్స్‌ బ్యాంకు రుణాల తొలి దఫా చైనా కరెన్సీలో వితరణ..

బ్రిక్స్‌ దేశాలు ఏర్పాటు చేసిన న్యూ డెవలప్‌ మెంట్ బ్యాంకు తన తొలి రుణ వితరణను చైనా కరెన్సీ యువాన్‌ ద్వారా చెల్లించనున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్యాంకు వైస్‌ ప్రెసిడెంట్‌ వ్లాదిమర్‌ కజ్బెకోవ్‌ ప్రకటించారు. బ్రిక్స్‌ ఎన్డీబీ బ్యాంకును ఆశ్రయించిన ప్రభావశీల దేశాలకు, సంస్థలకు ప్రధానంగా వారి జాతీయ కరెన్సీలలో రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. కాగా విపణి మార్కెట్‌లో చైనా కరెన్సీ స్థిర రేటును, చైనా మార్కెట్‌ను దృష్టిలో వుంచుకొని న్యూ డెవలప్‌ మెంట్‌ బ్యాంకు రుణాలు తొలుత చైనా మార్కెట్‌లోనే ప్రవేశించే అవకాశాలున్నాయి. దీంతో తొలి రుణ వితరణ యువాన్‌ కరెన్సీ రూపంలోనే ఎన్డీబీ నిధులు మార్కెట్‌లోకి ప్రవేశించనున్నాయి.

చైనా యువాన్‌ కరెన్సీని...

మరోవైపు చైనా యువాన్‌ కరెన్సీని అంతర్జాతీయ మానిటరీ ఫండ్‌ "స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌" విభాగంలో చేర్చింది. ఈ విభాగంలో ఇంతకు మునుపు అమెరికన్‌ డాలర్‌, యూరో, బ్రిటిష్ పౌండ్‌, జపాన్‌యెన్‌లు ఉన్నాయి.

బ్రిక్స్‌ సభ్య దేశాల విపణిలోకి....

ఎన్డీబీ బ్యాంకు అతి త్వరలో బ్రిక్స్‌ సభ్య దేశాల విపణిలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ఆయా మార్కెట్లలోకి త్వరగా ప్రవేశించేందుకు వీలుగా సులభ విధానాలను అన్వేశిస్తున్నట్లు బ్యాంకు వైస్‌ ప్రెసిడెంట్‌ తెలిపారు. ఇందులో భాగంగానే రుణ గ్రహీతల స్వంత కరెన్సీలోనే రుణాలు అందిస్తున్నట్లుఎ ఎన్డీబీ తెలిపింది. ఎన్డీబీ బ్యాంకు 2014 లో బ్రిక్స్‌ సభ్య దేశాల తోడ్పాటుతో యాభై బిలియన్‌ డాలర్ల మూలనిధితో ఏర్పాటైంది. ప్రధానంగా ప్రపంచ బ్యాంకు, ఇతర పశ్చిమ దేశాల ఆర్థిక సంస్థలకు ప్రత్యామ్నాయం ఎన్డీబీ బ్యాంకు కార్యకలాపాలు మొదలుపెట్టింది. 

15:42 - December 2, 2015

హైదరాబాద్ : రవితేజ, తమన్నా, రాశీఖన్నాలు కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'బెంగాల్ టైగర్' ఈ చిత్రంలో సెలబ్రిటీ శాస్తి పాత్రలో నటించిన పోసాని కృష్ణమురళి ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రాధామోహన్ నిర్మాతగా వ్యవహరింస్తున్నారు. ఈ నెల 10న ఈ చిత్ర ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఉధృతంగా ప్రవహిస్తోన్న స్వర్ణముఖి నది

నెల్లూరు : భారీ వర్షాలు నేపథ్యంలో స్వర్ణముఖి నదికి బుధవారం వరద ఉధృతి పెరిగింది. జిల్లాలోని నాయుడుపేటలోని లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యే సంజీవయ్యలు తడ మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు భరోసా ఇచ్చారు. అయితే భారీ వర్షాల కారణంగా పెళ్లకూరు మండలంలోని 7 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సదరు గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తుళ్లూరులో ఇంజనీరింగ్ పట్టభద్రుల ఆందోళన

గుంటూరు : తుళ్లూరు సీఆర్ డీఏ కార్యాలయం ఎదుట ఇంజనీరింగ్ పట్టభద్రులు ఆందోళన చేపట్టారు. నైపుణ్య శిక్షణ పేరుతో 45 రోజుల పాటు శ్రీకాకుళానికి పంపి ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని ఇంజనీరింగ్ పట్టభద్రులు ఆరోపిస్తున్నారు.

లిఫ్టులో ఇరుక్కుపోయిన అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్

హైదరాబాద్: అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్‌ఖోవా లిఫ్టులో ఇరుక్కుపోయారు. రాజ్‌భవన్‌లో ఆయన లిఫ్టులో ఉండగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మూడు నిమిషాల పాటు ఆయన లిఫ్టులోనే ఉండిపోయారు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన గవర్నర్.. విద్యుత్ శాఖ అధికారులను పిలిపించి చీవాట్లు పెట్టారు. గవర్నర్ లిఫ్టులో ఉన్న సమయంలో అందులో కనీసం లైటు, ఫ్యాన్ కూడా పనిచేయలేదని, దాంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారని రాజ్‌భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయనతోపాటు ఉన్న వ్యక్తిగత భద్రతాధికారి వెంటనే అత్యవసర కాల్స్ చేయడంతో.. ఆ తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

సినీ నటుడు వినోద్ కుమార్ కు బెయిల్

హైదరాబాద్: సినీ నటుడు వినోద్ కుమార్ కు పుత్తూరు జిల్లా ఐదవ అదనపు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత మేనేజర్ సచ్చిదానందంపై హత్యాయత్నం కేసులో గత నెల 16న ఆయన అరెస్టయిన సంగతి తెలిసిందే.

గుర్రం కొండ కోటలో బయటపడ్డ సొరంగం

చిత్తూరు : జిల్లాలో గుర్రంకొండలో ఉన్న చారిత్రాత్మక కోటలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల... కోటలోని ఒక ప్రాంతంలో ఈ రోజు భూమి కుంగిపోయింది. 30 అడుగుల లోతు, 10 అడుగుల వెడల్పుతో పెద్ద గుంత ఏర్పడింది. అయితే, ఆశ్చర్యకరంగా భూమి కుంగిన ప్రాంతంలో ఓ సొరంగ మార్గం వెలుగు చూసింది. సొరంగం వల్లే భూమి కుంగి పోయిందని స్థానికులు అంటున్నారు. మరోవైపు, ఈ విషయంపై పురాతత్వ శాఖకు సమాచారాన్ని అందించారు.

తమిళనాడు ప్రజలకు ఎయిర్ టెల్ ఉచిత కాల్స్

హైదరాబాద్ : వర్ష బీభత్సంతో తమిళనాడు రాష్ట్రం నీటిలో మునిగిపోయిన నేపథ్యంలో ఎయిర్ టెల్ కంపెనీ ఉచిత ఫోన్ కాల్స్ సౌకర్యం కల్పించింది. ప్రతి ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ వినియోగదారుడికీ ఉచితంగా రూ.30ల బ్యాలెన్స్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఎయిర్ టెల్ నుంచి ఎయిర్ టెల్ కస్టమర్లు 10 నిమిషాల పాటు ఉచితంగా మాట్లాడుకునేలా వెసులుబాటు కల్పించింది. ఇక మొబైల్ డేటా 50 ఎంబీ ఉచితంగా కల్పించనుంది. ఈ వెసులుబాటు రెండు రోజుల పాటు అమల్లో ఉండనుంది.

రూ.10 లక్షల విరాళం అందించిన రజినీ కాంత్

హైదరాబాద్ : సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళనాడు వరద బాధితులకు రూ. 10 లక్షల విరాళం అందించారు. రజనీకాంత్ నడుపుతున్న శ్రీ రాఘవేంద్ర పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందించినట్లు అధికారులు తెలిపారు. రజినీకాంత్ అల్లుడు ధనుష్ రూ. 5లక్షలు, సూర్య, ఆయన సోదరుడు కార్తీలు కలిసి రూ. 25 లక్షలు, విశాల్ రూ. 10 లక్షలు విరాళంగా అందించారు.

రైతు సమస్యలను పరిష్కరిస్తాం : సంతోష్ గంగ్వార్

ఢిల్లీ : రైతుకు సమస్య రాకుండా చూడటమే తమ తొలి ప్రాధాన్యమని కేంద్ర జౌలిశాఖ సహాయమంత్రి సంతోష్ గంగ్వార్ అన్నారు. పత్తికి కనీస మద్దతు ధర కోరుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వ బృందం నేడు సంతోష్ గంగ్వార్‌ను కలిశారు. భేటీ అనంతరం సంతోష్ మాట్లాడుతూ.. పత్తి రైతుల సమస్యలను మా దృష్టికి తెచ్చారు. పత్తి ధరను మేము నిర్ణయించం. ధర నిర్ణయించడంలో మా పాత్ర తక్కువగా ఉంది. పత్తి ధర వ్యవసాయశాఖ పరిధిలోని కమిటీ నిర్ణయిస్తుంది. రైతులకు సమస్య రాకుండా చూడటమే తమ తొలి ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు.

14:43 - December 2, 2015

హైదరాబాద్ : న్యాయసలహాలు, సూచనలు అందించే 'మైరైట్' కార్యక్రమంలో తల్లిదండ్రులు, పిల్లలు వారి భార్య, మెయింటెనెన్స్ కు ఎలాంటి చట్టాలు ఉన్నాయి. మెయిటెనెన్స్ తీసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? అనే అంశం పై ప్రముఖ న్యాయవాది పార్వతి తెలియజేశారు. పార్వతి ఏఏ అంశాలను తెలియజేశారో వినాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:38 - December 2, 2015

హైదరాబాద్ : గల్ఫ్‌ దేశాల్లో భారతీయ కార్మికులు పడుతున్న కష్టాల అంశం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావనకు వచ్చింది. ఏజెంట్ల మోసాలతో గల్ఫ్‌ వెళుతున్న కార్మికులు జైళ్ల పాలువుతున్నారని వివిధ పక్షాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం సభ్యుడు మహ్మద్‌ సలీం... గల్ఫ్‌ హౌస్‌మెయిడ్స్‌ కష్టాలను సభ దృష్టికి తెచ్చారు. దీనికి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ సమాధానవిస్తూ... ఏజెంట్ల ద్వారా హౌస్‌మెయిడ్స్‌ రిక్రూమ్‌మెంట్‌ను నిలిపివేసినట్టు చెప్పారు.

14:32 - December 2, 2015

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగేందుకు పాలక టీఆర్ఎస్‌ సిద్ధమవుతోంది. కాంగ్రెస్‌తో కలిసి సాగే అవకాశాలున్నాయన్న ఊహాగానాలకు పాలక పక్షం తెరదించింది. ఎన్నికల్లో ఒంటరిగానే సాగేందుకు వీలుగా.. పార్టీ నేతలు ఏర్పాట్లనూ చేసుకుంటున్నారు.

కాంగ్రెస్‌తో పొత్తు ఊహాగానాలకు టీఆర్ఎస్‌ తెర

తెలంగాణా శాసనమండలి ఎన్నికల్లో.. టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య పొత్తులపై వెలువడుతోన్న ఊహాగానాలకు టీఆర్ఎస్‌ కూడా తెరదించింది. 12 స్థానాలకూ అభ్యర్థులను నిలుపుతామని.. ఏ పార్టీతోనూ అవగాహనను కుదుర్చుకోబోమని టీఆర్ఎస్‌ తేల్చి చెప్పింది. విపక్షాలు సహకరిస్తే.. ఒకటి రెండు స్థానాలు వాటికి కేటాయించి.. ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని టీఆర్ఎస్‌ భావిస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. తాము ఎవరితోనూ పొత్తు కుదుర్చుకోబోమని ఇప్పటికే కాంగ్రెస్‌ అధినాయకత్వం ప్రకటించింది. తాజాగా టీఆర్ఎస్‌ కూడా అదే తరహా ప్రకటన చేసింది.

కాంగ్రెస్‌తో లోపాయకారీ ఒప్పందానికి టీఆర్ఎస్‌ యోచన

కాంగ్రెస్‌, టీడీపీలకు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజా ప్రతినిధులున్న చోట్ల.. మండలి స్థానం దక్కించుకోవడం ఇబ్బందికరమని టీఆర్ఎస్‌ భావించింది అందుకే.. కాంగ్రెస్‌తో లోపాయకారీ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని యోచించింది. అయితే.. పాలకపక్షాన్ని దెబ్బతీసేందుకు.. కాంగ్రెస్‌ నాయకులు.. టీడీపీతో సఖ్యతకు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో.. టీఆర్ఎస్‌ వ్యూహం మార్చిందంటున్నారు.

వ్యూహాలకు పదును పెట్టిన టీఆర్ఎస్‌

ఒంటరి పోరు అనివార్యమని తేలడంతో.. టీఆర్ఎస్‌ నాయకత్వం.. తనదైన వ్యూహాలకు పదును పెట్టింది. స్థానిక సంస్థలకు చెందిన విపక్ష ప్రజా ప్రతినిధులను కారెక్కించడంతో పాటు.. పాలక పక్షంగా తన చేతిలో ఉన్న అన్ని అస్త్రాలనూ ప్రయోగిస్తోంది. రాష్ట్రంలో టీడీపీ బలపడకుండా వ్యూహరచన చేస్తోంది. నోటిఫికేషన్ వెలువడ్డ నాటి నుంచి.. పోలింగ్‌ నాటి వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనే దృష్టి పెట్టింది. టికెట్లు ఖరారైన నేతలు ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేసుకుంటున్నారు. 

14:29 - December 2, 2015

విజయవాడ : పిన్నమనేని రోడ్డులో ఓ అపరిచితవ్యక్తి 10 లక్షల రూపాయలను పారేసుకున్నారు. రోడ్డుపై పడి ఉన్న సంచిని గమనించిన మరో వ్యక్తి అందులో 10 లక్షల రూపాయలు ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే వాటిని ట్రాఫిక్‌ పోలీసులకు అప్పగించాడు. డబ్బుల సంచిని ట్రాఫిక్‌ పోలీసులు సీపీకీ అప్పగించారు. 

14:27 - December 2, 2015

ఢిల్లీ : భారీ వర్షాలు, వరదలతో తమిళనాడుకు జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని అన్నా డీఎంకే... కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. వరద సహాయం, పునర్నిర్మాణ కార్యక్రమాల అమలుకు 8,400 కోట్ల రూపాయలను విడుదల చేయాలని లోక్‌సభలో ఆ పార్టీ కోరింది. దేశంలో నెలకొన్న వర్షాలు, వరదలు, కరవు పరిస్థితులపై 193 వ నిబంధన కింద లోక్‌సభలో చర్చ ప్రారంభమయ్యింది. చర్చలో పాల్గొన్న డిఎంకే సభ్యుడు టీజీ వెంకటేష్‌బాబు..వర్షాలు, వరదలతో తమిళనాడుకు జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. 

14:24 - December 2, 2015

హైదరాబాద్ : చెన్నై చెల్లాచెదురైంది. భారీ వర్షాలకు చెన్నై మహానగరం నిండా మునిగింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలో ఆరడుగుల మేర నీరు నిలిచి ఉంది. అపార్ట్‌మెంట్‌లలోని రెండో ఫ్లోర్‌ వరకు వరద నీరు చేరింది. చెన్నై విమానాశ్రయం జలమయమైంది. ఎయిర్‌పోర్ట్‌ను మూసేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. రైలు పట్టాల పైకి నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఐటీ కారిడార్‌ నీట మునిగింది. కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెన్నైతోపాటు తిరువళ్లూరు, పుదుచ్చేరిలో వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంలో అత్యధికంగా 25 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. భారీ వర్షాలకు ఇంతవరకు తమిళనాడులో 188 మంది మృతి చెందారు. 

మరో 5 రోజులపాటు...

చెన్నైని పగబట్టిన వరుణుడు ఇప్పట్లో శాంతించేలా కనిపించడంలేదు. మరో 5రోజుల పాటు తమిళనాడు అంతటా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. నిన్న రాత్రి చెన్నైలో కుంభవృష్టి కురిపించిన వరుణుడు ఇవాళ కొంచెం శాంతించినా...రాత్రి వర్ష బీభత్సానికి చెన్నై నగరం తడిసి ముద్దయింది. నగరం మొత్తం నీటిలో మునిగిపోయింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా కురిసిన కుండపోత వర్షానికి చెన్నైలో రవాణా వ్యవస్థ మొత్తం పూర్తిగా స్థంభించిపోయింది. నదులు, కాలువులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో చెన్నై నగరం మొత్తం అతలాకుతలం అయింది. ఎక్కడికక్కడ రాకపోకలు బంద్‌ అయ్యాయి. సైకిల్‌ నుంచి మొదలుకొని విమానాల వరకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. చెన్నైకి వచ్చే రైళ్లన్ని పూర్తిగా రద్దయ్యాయి. చెన్నై ఎయిర్‌పోర్టులోకి నడుం వరకు భారీగా వరద నీరు భారీగా చేరడంతో ఎయిర్‌పోర్టును మూసేశారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇళ్లల్లో ఉన్నవారు బయటకు ఒక్క అడుగు కూడా వేయలేనంతగా వరద ముంచెత్తింది. దీంతో నగర వీధులు చెరువులను తలపిస్తున్నాయి. చెన్నైలో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా వ్యవస్థ ఆగిపోవడంతో జనం ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. . పాలు, నీళ్లు దొరక్క జనం పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. సహాయక చర్యల్లో కేంద్ర బలగాలు , ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, స్థానిక పోలీసులు తలమునకలయ్యారు. వరదలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. గత 100 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కుండపోత వర్షాలు కురుస్తుండడంతో చెన్నైవాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయంతో వణికిపోతున్నారు.

దానం నాగేందర్ కు పీసీసీ అల్టిమేటం

హైదరాబాద్ : దానం నాగేందర్ కు పీసీసీ అల్టిమేటం జారీ చేసింది. కో - ఆర్డినేషన్ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించింది. పార్టీలో ఉంటారో లేదో తేల్చుకోవాలని పీసీసీ తెలిపినట్లు సమాచారం.

జాతీయ విపత్తుగా ప్రకటించండి : అన్నాడీఎంకే

ఢిల్లీ : తమిళనాడు భారీ వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని అన్నాడీఎంకే డిమాండ్ చేసింది. భారీ వర్షాలతో కుదేలైన తమ రాష్ట్రాన్ని కేంద్రం అన్నివిధాలా ఆదుకోవాలని అన్నాడీఎంకే ఎంపీ టీజీ వెంకటేశ్ బాబు కోరారు. లోక్ సభలో బుధవారం మాట్లాడుతూ... కుండపోత వర్షం, ప్రకృతి ప్రకోపం కారణంగా తమ రాష్ట్రం అతలాకుతలమైందని అన్నారు.

చెన్నైలో 'ది హిందూ' పత్రిక ప్రచురణ నిలిపివేత...

హైదరాబాద్ : చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'ది హిందూ' ప్రింట్ ఎడిషన్ ప్రచురణ నిలిచిపోయింది. చెన్నైలోని మౌంట్ రోడ్డులో హిందూ ప్రధాన కార్యాలయంలో జరగాల్సిన సిటీ ఎడిషన్ ముద్రణ నిలిపివేశారు. ఈ విషయాన్ని హిందూ వెబ్ సైట్ లో తెలిపారు.137 ఏళ్ల చరిత్రలో హిందూ పత్రిక ప్రచురణ తొలిసారిగా ఆగిపోయింది. చెన్నైలో 1878లో హిందూ పత్రిక స్థాపించిన నాటి నుంచి ప్రింట్ ఆగిపోవడం ఇదే ప్రథమం. చెన్నైతో పాటు తిరుపతి, వేలూరు, పుదుచ్చేరిలో కూడా పత్రిక ప్రచురణ కాలేదు.

ఏపీ, తమిళనాడు వరదలపై చర్యలు - సురేష్ ప్రభు..

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రంలో వరద పరిస్థితులపై చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. 

గుజరాత్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ముందంజ..

గుజరాత్ : కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ముందంజలో నిలుస్తోంది. అహ్మదాబాద్, సూరత్, రాజ్ కోట్, వడోదర, జామ్ నగర్, భావ్ నగర్ కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. పటేళ్ల నాయకుడు హార్ధిక్ పటేల్ వార్డులో బీజేపీ విజయం సాధించింది. 

తమిళనాడు వరదబాధితులకు ఎయిర్ టెల్ సహాయం..

చెన్నై : వరద బాధిత ప్రాంతాల్లో ఎయిర్ టెల్ వినియోగదారులకు రూ.30 ఫ్రీ టాక్ టైం, నెట్ వినియోగదారులకు ఉచితంగా 50 ఎంజీబీ డేటా సౌకర్యం కల్పిస్తున్నట్లు ఎయిర్ టెల్ ప్రకటించింది.

 

చింటూకు ఆశ్రయిమిచ్చిన అడ్వకేట్ అరెస్టు..

చిత్తూరు : మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ ల హత్య కేసులో కీలక నిందితుడు చింటూకు ఆశ్రయమిచ్చిన కారణంతో అడ్వకేట్ ను ఆనంద్ ను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. 

13:35 - December 2, 2015

విజయవాడ : గత పాలనకు భిన్నంగా చంద్రబాబునాయుడు నీటి పారుదల రంగంపై దృష్టిపెట్టారు. ప్రణాళికాబద్ధంగా ప్రాధాన్యత క్రమంలో నీటిపారుదల ప్రాజెక్ట్‌లను పూర్తిచేస్తామని గతంలో ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే పట్టిసీమ ప్రాజెక్ట్‌ను నిర్మించి అందరి దృష్టినీ ఆకర్షించారు. అయితే నాసిరకం పనుల మూలంగా గండ్లు పడడంతో విమర్శలనూ చవి చూశారు. ఇదే సమయంలో త్వరితగతిన పూర్తిచేసినందుకు ప్రశంసలు కూడా దక్కాయి. ప్రస్తుతం అదే ఉత్సాహంతో పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు అడుగులు వేస్తున్నారు. 2018 నాటికి ఆ ప్రాజెక్ట్‌ పూర్తిచేస్తామని సర్కార్‌ ప్రకటించింది. ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

సబ్ కాంట్రాక్టు విధానం..
ప్రాజెక్ట్ నిర్మాణ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ మొబిలైజేషన్‌ అడ్వాన్సుల పేరిట ఇప్పటికే 500 కోట్ల రూపాయల మేర పొందింది. కానీ నిర్మాణ విషయంలో శ్రద్ధ కనబరచడంలేదనే వాదన ఉంది. అదిప్పటివరకూ కనీసం 2 శాతం పనులు కూడా పూర్తిచేయలేదని కేంద్రమే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో సదరు సంస్థతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకోవాలని తొలుత రాష్ట్ర సర్కార్‌ భావించింది. అయితే కొన్ని సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలోనే సబ్‌ కాంట్రాక్ట్‌ విధానాన్ని తెరపైకి తెచ్చింది.

ఇప్పటి వరకు 2,218 కోట్ల ఖర్చు...
ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను పలు విభాగాలుగా విభజించి వాటి నిర్మాణ బాధ్యతలను సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా పనులను వివిధ కంపెనీలకు అప్పగించి టార్గెట్లు విధించాలని భావిస్తోంది. ప్రాజెక్ట్ అంచనాలను సవరించాలనీ ప్లాన్‌ చేస్తోంది. ఇప్పటివరకు పోలవరం కోసం 2,218 కోట్లు ఖర్చుపెట్టారు. ఇది జాతీయ ప్రాజెక్ట్‌ కాబట్టి ఖర్చుచేసిన నిధులను రీయింబర్స్‌ చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే తన నేతృత్వంలో అత్యున్నత సమావేశం ఏర్పాటుచేసి ప్రాజెక్ట్‌ నిర్మాణంపై మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. రానున్న ఎన్నికలకు పోలవరం కీలకంగా మారుతుంది కాబట్టి అప్పటికల్లా దాన్ని పూర్తిచేయాలన్నది బాబు టార్గెట్‌. మరి ఆ లక్ష్యాన్ని ఎంతవరకు రీచ్‌ అవుతారో చూడాలి. 

13:32 - December 2, 2015

ఢిల్లీ : గుజరాత్‌లోని ద్వారకా దేవాలయంలో కులవిపక్ష పాటిస్తున్నారన్న అంశం రాజ్యసభను కుదిపేసింది. కాంగ్రెస్‌ సభ్యురాలు కుమారి షెల్జ ఈ అంశాన్ని పస్తావించారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 2013 ఫిబ్రవరి 23 ద్వారక సందర్శించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. స్వయంగా కులవివక్ష అనుభవం ఎదురైందని సభ దృష్టికి తెచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయని భక్తుల నుంచి ఫిర్యాదు చేస్తున్నారని షెల్జ ప్రస్తావించారు. అయితే ద్వారకాలో అటువంటి పరిస్థితి తేలేదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. దీనిపై షెల్జ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రాజ్యసభలో కార్యకలాపాలు స్తంభించాయి. అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మన్‌ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పులేకపోవడంతో మధ్యాహ్నం 12 గంటలకు, ఆ తర్వాత మళ్లీ 2 గంటలకు వాయిదా వేశారు. 

13:29 - December 2, 2015

హైదరాబాద్ : మూడున్నర ఏళ్ల తర్వాత కూడా మళ్లీ తామే అధికారంలోకి రావాలి.. అందుకోసం ఏం చేస్తే ప్రయోజనం చేకూరుతుందో వాటిపైనే తెలంగాణ ప్రభుత్వం ఫుల్‌గా ఫోకస్ పెట్టింది. జనాలకు అభివృద్ధి కన్నా ప్రత్యక్షంగా వేటిద్వారా ప్రయోజనం చేకూరుతుందో వాటినే గులాబీ పార్టీ నమ్ముకుంటోంది. దీనికోసమై బడ్జెట్‌లో భారీగా నిధులు సమకూర్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. వెల్ఫేర్‌ స్కీముల్లో ఎలాంటి అవినీతీ జరగకూడదని అధికారులను హెచ్చరిస్తున్నారు.

నేరుగా ఖాతాల్లోకి...
వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కల్లుగీత, చేనేత కార్మికులు, ఎయిడ్స్‌ పీడితులకు పెద్ద మొత్తాల్లోనే టిఎస్ సర్కార్‌ పింఛన్లు మంజూరు చేస్తోంది. గత ప్రభుత్వాలు ఇచ్చే 2 వందలు లేదా 5 వందలు వారికి సరిపోవని ఏకంగా వెయ్యి, 15 వందల రూపాయల వరకు పింఛన్లు పెంచేశారు. ఇలాంటి పథకాలే ఓట్లు కుమ్మరిస్తాయి కాబట్టి ఆయా నిధులు దారిమళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు టి ప్రభుత్వం హుకుం జారీచేసింది. త్వరలో లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలు ఓపెన్‌ చేసి నేరుగా ఖాతాల్లోనే డబ్బు పడేవిధంగా ప్లాన్‌ చేస్తున్నారు. దీని ద్వారా అవినీతిని అరికట్టడంతోపాటు వృద్ధులు, వికలాంగులు క్యూలైన్లలో వేచివుండే పని తప్పనుంది.

బడ్జెట్ పై అప్పుడే కసరత్తు..
వచ్చే ఏడాది జరిగే బడ్జెట్‌ సమావేశాలకు సంబంధించి అప్పుడే కసరత్తు మొదలైంది. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశమై బడ్జెట్‌ అంచనాలపై చర్చిస్తున్నారు. వాటర్‌గ్రిడ్‌, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లతోపాటు సంక్షేమ రంగానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఈ కోణంలోనే 2016 -17 బడ్జెట్‌లో ఆ మూడు రంగాలకే అధిక మొత్తంలో నిధులు కేటాయించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఒక్క పెన్షన్లకే 30 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్న ప్రభుత్వం తమదేనని కేసిఆర్‌ చెప్పుకుంటున్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో ? 
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతుల పెళ్లిళ్లకు 51 వేల రూపాయల చొప్పున కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పేరుతో ఆర్థిక సాయమందిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యం అన్నం, వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లోనూ ఆ తరహా అన్నం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా సంక్షేమ పథకాలనే నమ్ముకుని కెసిఆర్‌ ముందుకుసాగుతున్నారు. పథకాలన్నిటికీ అంచనాలు భారీగా పెరిగిపోతుండడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందన్నది చర్చనీయాంశమవుతోంది. 

13:24 - December 2, 2015

శ్రీకాళహస్తి : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్థవ్యస్తం అయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. స్వర్ణముఖీ నది ఉగ్రరూపం దాల్చుతోంది. తొట్టంబేడు మండలం కొత్తకండ్రిక వద్ద వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో..కేవీపురం మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. మరోవైపు కేవీపురం మండలంలోని కాళంగి రిజర్వాయర్‌ పూర్తిగా నిండిపోయింది. దీంతో కుడికాలువ వైపున్న 8 గేట్లను ఎత్తేశారు. దీంతో సమీప ప్రాంతాలన్నీ నీటమునిగాయి.
గత పది రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. సుమారు 400 చెరువులకు గండి పడడంతో పలు గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ముంపు ప్రాంతాలకు గురైన వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాళంగి రిజర్వాయర్ పరివాహక ప్రాంతాల్లోని 50 గ్రామాల్లో ఉన్న ప్రజలను ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

13:11 - December 2, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ మరోమారు జరుగబోతోంది. ఇటీవలే అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమ ఆహ్వానపత్రికను ఏపీ సీఎం చంద్రబాబు..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందచేసిన సంగతి తెలిసిందే. అనంతరం శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేసీఆర్ పాల్గొన్నారు. తాజాగా వీరు భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. టిడిపి నేత రావుల చంద్రశేఖర్ కుమారుడి వివాహానికి చంద్రబాబు హైదరాబాద్ కు రానున్నారు. అందులో భాగంగా చంద్రబాబును కేసీఆర్ కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 23-27వ తేదీ వరకు నిర్వహించే చండీయాగానికి కేసీఆర్ ఆహ్వానించనున్నారు. ఈ యాగానికి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు..ఇతర ముఖ్యులు..సీఎం చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తామని ఇటీవలే సీఎం కేసీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇస్తారా ? లేదా ? అన్నది తెలియరాలేదు. ఏపీ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో బిజీ బిజీగా ఉన్న చంద్రబాబు కేవలం నగరంలో గంట పాటు ఉండనున్నారు. షెడ్యూల్ ప్రకారం అపాయింట్ మెంట్ ఇస్తారా ? లేదా ? అన్నది తెలియడం లేదు. 

బాబును కలువనున్న కేసీఆర్..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని సీఎం కేసీఆర్ కలువనున్నారు. టి.టిడిపి నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి కుమారుడి వివాహానికి హైదరాబాద్ కు చంద్రబాబు రానున్నారు. చంద్రబాబును కలిసి చండీయాగానికి కేసీఆర్ ఆహ్వానించనున్నారు. 

కేంద్ర మంత్రి గంగ్వార్ తో టి. మంత్రుల భేటీ...

ఢిల్లీ : కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తో తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు కడియం, మహమూద్ ఆలీ భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి పోచారం, టీఆర్ఎస్ ఎంపీలు పాల్గొన్నారు. పత్తి కొనుగోళ్లు, పత్తికి మద్దతు ధర, పత్తి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి నివేదిక ఇచ్చారు. సీసీఐ ద్వారా పత్తికొనుగోళ్లు పెంచాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. 

సిక్కోలులో భారీ వర్షం..

శ్రీకాళహస్తి : భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. 

12:40 - December 2, 2015

అమెరికా : ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ కంపెనీలోని 99 శాతం షేర్లను స్వచ్చంద సంస్థలకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మార్క్ జుకర్ బర్గ్ - ప్రిస్కిల్లా దంపతులకు ఇటీవలే పాప జన్మించిన సంగతి తెలిసిందే. తమ షేర్లను స్వచ్చంద సంస్థలకు ఇవ్వనున్నట్లు జుకర్ బర్గ్ దంపతులు తమ కుమార్తె మాక్స్ కి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను జుకర్ బర్గ్ ఈ రోజు తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. బర్గ్ ఇస్తానన్న షేర్ల ప్రస్తుత విలువ 45 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు 3లక్షల కోట్లు. జుకర్ బర్గ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని బిల్ గేట్స్ ఆయన భార్య మెలిండా అభినందించారు. తీసుకున్న నిర్ణయం తమకు, ప్రపంచానికి ఎంతో స్పూర్తిదాయకమని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. పాప పుట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నామని బర్గ్ లేఖలో పేర్కొన్నారు. ''భవిష్యత్ పై నీవు మాకిచ్చిన నమ్మకాన్ని ఎలా వివరించాలో అర్థం కావడం లేదు..నీ ఈ కొత్త జీవితం సంతోషాలతో..ఆరోగ్యవంతంగా సాగుతుందని భావిస్తున్నాం...అందరి తల్లిదండ్రుల్లాగానే మేము కూడా మీకు మా కన్నా గొప్ప జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాం..కేవలం నీ మీద ఉన్న ప్రేమతో మాత్రమే ఈ నిర్ణయం తీసుకోలేదు..అందరు చిన్నారులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం'' అని జుకర్ బర్గ్ లేఖలో పేర్కొన్నారు.

చెన్నై కు ఐఎన్ఎన్ ఐరావత్..

చెన్నై : తమిళనాడులో సహాయక చర్యలకు విశాఖ నుండి ఐఎన్ఎన్ ఐరావత్ బయలుదేరింది. బోట్లతో 20 మంది ఐరావత్ గజ ఈతగాళ్లు బయలుదేరారు. ఒడిశా నుండి చెన్నై కు 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. 

తమిళనాడుకు భారీ వర్ష సూచన..

చెన్నై : తమిళనాడులో మరో వారం రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడులో ఈ రోజు 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

12:32 - December 2, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. 12 శాసనమండలి సభ్యుల ఎన్నికకు బుధవారం నోటిఫికేషన్ ను అధికారులు జారీ చేశారు. స్థానిక సంస్థల కోటాలో సభ్యులు ఖాళీల భర్తీకి ఎన్నికలు జరుగుతున్నాయి. హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో 12 స్థానాలున్నాయి. ఆదిలాబాద్ -1, నిజామాబాద్ -1, మెదక్ -1, నల్గొండ -1, వరంగల్ -1, ఖమ్మం -1, కరీంనగర్ -2, రంగారెడ్డి -2, మహబూబ్ నగర్ -2 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
డిసెంబర్ 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ. 10వ తేదీన నామినేషన్ల పరిశీలన. 12 వరకు ఉపసంహరణ గడువు. 27వ తేదీన పోలింగ్, 30న ఫలితాల ప్రకటన..

కాంకేర్ జిల్లాలో పేలిన మందుపాతర..

ఛత్తీస్ గఢ్ : కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనో ఓ జవాన్ మృతి చెందగా మరో జవాన్ కు తీవ్రగాయాలయ్యాయి.

 

అధికారులతో విద్యాసాగర్, జోషి సమీక్ష..

హైదరాబాద్ : సచివాలయం అధికారులతో నీటిపారుదల శాఖ సలహాదారు విద్యాసాగర్ రావు, జోషి సమీక్ష నిర్వహించారు. మిషన్ కాకతీయ రెండో దశ పనులు, ప్రాజెక్టుల భూసేకరణ జిల్లా వారీగా ప్రాజెక్టుల నిర్మాణ ప్రణాళికలపై చర్చ జరుగుతోంది.

12:18 - December 2, 2015

విజయవాడ : ఇటీవల పలు పార్టీల్లో దీర్ఘకాలం కొనసాగిన కొంతమంది నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. గతంలో తిట్టిన నేతల చేతులతోనే కండువాలు కప్పుకుంటున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ లో సుదీర్ఘకాలంపాటు రాజకీయాల్లో కొనసాగిన 'ఆనం' సోదరులు టిడిపిలో చేరారు. తాము పదవులు..హోదాలు ఆశించి టిడిపిలో చేరలేదని ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు క్యాంపు ఆఫీసులో ఆనం సోదరులు కలిశారు. టిడిపి కండువాలు కప్పిన బాబు పార్టీలో సాదారంగా ఆహ్వానించారు. అనంతరం ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. రేపటి తరానికి న్యాయం చేయాలన్న లక్ష్యంతోనే తాము టిడిపిలో చేరినట్లు తెలిపారు. 25 సంవత్సరాల కాలం కాంగ్రెస్ పార్టీలో ఒక క్రియాశీలిక రాజకీయాల్లో కలిసి పనిచేయడం జరిగిందన్నారు. 2014 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క మనోభావాలను లెక్కలోకి తీసుకోకుండా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిందన్నారు. ఆ రోజు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వల్ల ఏపీ అభివృద్ధికి నోచుకోలేదని, రాజధాని ఎక్కడో తెలియదన్నారు. ఎక్కడ కూర్చొని పాలించాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి కోసం చంద్రబాబు యాక్షన్ ప్లాన్ చేశారని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహయ సహకారాలు అందించేందుకు ఆనం కుటుంబసభ్యులు టిడిపి పార్టీలో చేరడం జరిగిందన్నారు. 

12:10 - December 2, 2015

ఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వారికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హంతకులు మురుగన్, పేరారివాలన్, శంతన్ లకు జీవిత ఖైదు విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. ఈ కేసులో ఉరిశిక్ష వీరిని సుప్రీంకోర్టు జీవిత ఖైదుగా మార్చిన సంగతి తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల పాటు రాష్ట్రపతి నిలయంలో దోషుల క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో గతేడాది సుప్రీంకోర్టు ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో దోషుల శిక్షకాలం తగ్గించి వారిని విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ పిటిషన్ పై ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ బుధవారం తీర్పు చెప్పింది. రాజీవ్ హంతకులను వదిలిపెట్టే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి లేదని, కేంద్రం అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా రాజీవ్ హంతకులను విడుదల చేయరాదంటూ సుప్రీం కోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులు ప్రస్తుతం యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్నారు. 

జపాన్ పారిశ్రామిక వేత్తలతో బాబు భేటీ..

విజయవాడ : జపాన్ పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి 30 జపాన్ కంపెనీలు హాజరయ్యాయి. రైస్ బ్రాండ్ ఆయిల్, ఆక్వా, పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ లో మెగా ఫుడ్ పార్కుల ఏర్పాటుకు జపాన్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. 

ఏపీ, చెన్నై వరద పరిస్థితిపై చర్చిద్దాం - వెంకయ్య..

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలతో ఏర్పడిన వరద పరిస్థితిపై చర్చ చేపడుదామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు లోక్ సభలో విపక్షాలను కోరారు. ఐదో రోజు ప్రారంభమైన సభలో వెంకయ్య మాట్లాడారు. 

తిరుమలలో ధార్మిక సదస్సు ప్రారంభం..

చిత్తూరు : శ్రీవారి ఆస్థాన మండలంలో బుధవారం ఉదయం ధార్మిక సదస్సు ప్రారంభమైంది. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, టిటిడి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు సదస్సునుద్దేశించి ప్రసంగించారు. 

ఏరో స్పేస్ అభివృద్ధికి కృషి - కేటీఆర్...

హైదరాబాద్ : ఏఎస్ఎంఈ గ్యాస్ టర్బయిన్ ఇండియా కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏరో స్పేస్ ను ప్రోత్సాహిస్తామని, సీఎం కేసీఆర్ ఏరోస్సిస్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. 

తెలంగాణ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ జారీ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని 12 శాసనమండలి సభ్యుల ఎన్నికకు బుధవారం నోటిఫికేషన్ జారీ అయ్యింది. 9వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 10వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 12వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకొనే గడువు ఇచ్చారు. ఈనెల 27 పోలింగ్ జరుగనుండగా 30వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. 

11:49 - December 2, 2015

నెల్లూరు : ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ జిల్లాలో పర్యటించారు. గత కొద్ది రోజుల క్రితం జిల్లాలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. తాజాగా కురుస్తున్న వర్షాలతో పలు గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకపోయాయి. ఈ నేపథ్యంలో మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం ఉదయం నగరంలోని వెంగళరావునగర్, బీవీనగర్, ఓల్డ్ వేదాయపాలెంలో పర్యటించారు. మలేరియా, డయేరియా లాంటి వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పేదలకు కేంద్ర ప్రభుత్వం 1.93 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. అందులో పది వేల ఇళ్లను జిల్లాకు సీఎం చంద్రబాబు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇళ్లు కొల్పోయిన వారికి ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు, తీసుకొనే చర్యలపై రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. 

11:44 - December 2, 2015

ఢిల్లీ : చైన్నైలో కురుస్తున్న భారీ వర్షాలపై కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితో ఫోన్ లో మాట్లాడిన నరేంద్ర మోడీ కొద్దిసేపటికే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్, అశోక్ గజపతి రాజు, సురేష్ ప్రభు, రాజ్ నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. తమిళనాడు రాష్ట్రంలో చేపట్టే చర్యలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ఏ విధంగా చేపట్టాలనే దానిపై సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. చెన్నైలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడికక్కడ భారీగా వరద నీరు పోటెత్తింది. అపార్ట్ మెంట్లు, జాతీయ రహదారులు, కాలనీలు నీటిలో జలదిగ్భందంలో చిక్కుకపోయాయి. సుమారు ఆరడగుల మేర నిలిచిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ పోర్టు మూసివేయడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నాయి. ప్రస్తుత తరుణంలో ఎలాంటి ముందడుగు వేయాలనే దానిపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రానికి రూ.940 కోట్లు మంజూరు చేసిన కేంద్రం తదనంతరం తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు సైతం చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

11:11 - December 2, 2015

చెన్నై : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తమిళనాడును భారీ వార్షలు ముంచెత్తుతున్నాయి. చెన్నైలోని పలు కీలక ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చెన్నై నగరం గాడాంధకారంలో చిక్కుకుంది. రవాణా వ్యవస్థ స్తంభించిందిపోయింది. భారీ వర్షాలకు ఇప్పటి వరకు 188 మంది మృతి చెందారు. అనధికారికంగా 200 మందికిపైగా ఉంటుందని సమాచారం. చెన్నైలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తమిళనాడులోని 9 జిల్లాల్లో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. నిత్యావసర సరుకులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితో ఫోన్ లో మాట్లాడారు. కేంద్ర అండగా ఉంటుందని మోడీ భరోసా ఇచ్చారు. 

రైళ్లు రద్దు..
చెన్నైలో భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. చెన్నై - విజయవాడ జనశతాబ్ధి ఎక్స్ ప్రెస్, చెన్నై - హౌరా కోరమండల్ ఎక్స్ ప్రెస్, చెన్నై - అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

హడలిపోయిన ఐటీ కంపెనీలు..
ఐటీ కంపెనీలు వానతో హడలిపోయాయి. ఐటీ కారిడార్ లోని ఓఎంఆర్ రోడ్డు, వేళచ్చేరి, తాంబరం, తరమణి, జీఎస్టీరోడ్డు, తిరువాన్మియూరు, కేళంబాక్కం తదితర ప్రాంతాల్లోని పలు ఐటీ సంస్థల కార్యాలయాలు జలమయమయ్యాయి. వర్షాలు వరదల వల్ల బయటకు వచ్చే మార్గం లేక ఉద్యోగులు చాలా మంది కార్యాలయాల్లోనే ఉండిపోయారు. 

10:23 - December 2, 2015

నల్గొండ : జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికకు మత్తుమందు ఇచ్చి ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన కేతపల్లి (మం) బొప్పారంలో చోటు చేసుకుంది. రెండు రోజుల పాటు అత్యాచారానికి ఒడిగట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం బాధితురాలు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శ్రీధర్,నరేష్ ల కోసం గాలిస్తున్నారు. 

గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

గుజరాత్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. వడోదరలో బీజేపీ 17, కాంగ్రెస్ 7..సూరత్ లో కాంగ్రెస్ 30, బీజేపీ 20 స్థానాల్లో విజయం సాధించారు. 

10:13 - December 2, 2015

విజయవాడ : అధికారం అనే ఆక్సిజన్ కోసం నేతలు ఏమైనా మాట్లాడుతారని ఆనం బ్రదర్స్ నిరూపించారు. మొన్నటి వరకు చంద్రబాబుపై విమర్శలు చేసిన ఆనం బ్రదర్స్ టిడిపి పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఆరు దశాబ్ధాల అనుబంధనాన్ని 'ఆనం' సోదరులు తెగదెంపులు చేసుకున్నారు. ఏపీలో అధికార పార్టీగా ఉన్న టిడిపి పార్టీలో ఆనం సోదరులు చేరారు. బుధవారం ఉదయం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో ఆనం సోదరులు కలుసుకున్నారు. ఈసందర్భంగా వారి మెడలో బాబు పచ్చకండువా వేసి పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు. వారితో పాటు టిడిపి నేతలు కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులున్నారు.

నెల్లూరులో చక్రం..
నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం సోదరులు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నరు. ఎనిమిది దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆనం సోదరులు గత ఎన్నికల్లో చావు దెబ్బతిన్నారు. 1982లో టిడిపి అభ్యర్థిగా ఆనం రాంనారాయణరెడ్డి ఎన్నికల్లో విజయం సాధించారు. 1985లో ఉప ఎన్నికకు జరిగిన ఎన్నికల్లో సైతం ఆనం గెలుపు సాధించారు. ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా వ్యవహరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 1999లో పోటీ చేసి ఓడిపోయారు. 2004లో గెలిచిన అనంతరం వైఎస్ కేబినెట్ సమాచార మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2008లో రోశయ్య, కిరణ్ పాలనలో కేబినెట్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర విబజన అనంతరం కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకపోయింది. అనంతరం వీరిద్దరూ ఏ పార్టీలో చేరాలనే దానిపై తర్జనభర్జనలు పడ్డారు. వైసీపీ పార్టీలో చేరాలని భావించినా అది అంతగా సత్ఫలితం ఇవ్వలేదు. అనంతరం టిడిపి పార్టీలో చేరాలని ఆనం బ్రదర్స్ భావించారు. కానీ వీరి రాకను కూడా నెల్లూరు జిల్లాకు చెందిన నేతలు కొంతమంది వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. చివరకు కొంతమంది నేతలు రంగ ప్రవేశం చేసి జిల్లా నాయకులను సంతృప్తిపరిచే విధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆనంకు ఎమ్మెల్సీ పదవి వరిస్తుందనే ప్రచారం జరుగుతోంది. 

నేడు తిరుమలలో ధార్మిక సదస్సు..

చిత్తూరు : తిరుమలలో సనాతన ధార్మిక సదస్సు కాసేపట్లో ప్రారంభం కానుంది. సదస్సుకు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, టిటిడి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, టిటిడి ఈవో సాంబశివరావుతో పాటు వివిధ రాష్ట్రాల నుండి 60 మంది వరకు పీఠాధిపతులు, మఠాధిపతులు, అధ్యాత్మిక వేత్తలు హాజరు కానున్నారు. 

మైనర్ బాలికకు మత్తు మందు ఇచ్చి....

నల్గొండ : కేతపల్లి (మం) బొప్పారంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికకు మత్తుమందు ఇచ్చి రెండు రోజుల పాటు ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రస్తుతం బాధితురాలు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 

వికలాంగులకు ప్రభుత్వం అండ - స్వామిగౌడ్...

హైదరాబాద్ : వికలాంగ దినోత్సవం సందర్భంగా గన్ పార్కు నుండి రవీంద్ర భారతి వరకు అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ పాల్గొన్నారు. వికలాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి డిమాండ్స్ నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. 

నెల్లూరులో ఏపీ మంత్రి కామినేని పర్యటన..

నెల్లూరు : ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం ఉదయం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. వెంగళరావు నగర్, బీవీ నగర్, ఓల్డ్ వేదాయపాలెంలో ఆయన పర్యటించారు. 

టిడిపిలోకి ఆనం బ్రదర్స్..

విజయవాడ : కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనం బ్రదర్స్ టిడిపి పార్టీలో చేరిపోయారు. నెల్లూరు నుండి విజయవాడకు చేరుకున్న ఆనం బ్రదర్స్ నేరుగా టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ను గెస్ట్ హౌస్ లో కలుసుకున్నారు. అనంతరం వారిని చంద్రబాబు పార్టీ కండువా కప్పి సాదారంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

ఏపీ సీఎం తిరుపతి పర్యటన రద్దు..

చిత్తూరు : ఏపీ సీఎ చంద్రబాబు నాయుడు చిత్తూరు పర్యటన రద్దయైంది. భారీ వర్షాల కారణంగా పర్యటన రద్దు చేసుకున్నారు. స్విమ్స్ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. ఆ తరువాత కురిసిన భారీ వర్షాలపై ఆయన అధికారులతో సమీక్ష చేయాల్సి ఉంది. 

09:18 - December 2, 2015

చెన్నై : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు ఫోన్ చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఆరా తీశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపడంతో పాటు అండగా ఉంటామని మోడీ భరోసా ఇచ్చారు. వరద సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు. గత కొన్ని రోజులుగా చెన్నైని వరుణుడు వీడడం లేదు. 1918లో 108.8 సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తే ప్రస్తుతం 119.73 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. వేల కోట్లలో నష్టం వాటిల్లిందని తక్షణ సాయం కింద మూడు వేల కోట్లను విడుదల చేయాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. దీనితో నీతి ఆయోగ్ సూచనల మేరకు రూ.940 కోట్లను కేంద్రం విడుదల చేసింది. నాలుగు జిల్లాలు పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకపోవడంతో భారీగా ఆస్తి నష్టం కలిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 1498 చెరువులు ఉంటే అందులో 7వేలు చెరువులు నిండిపోయాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చెన్నైలో కురుస్తున్న వర్షాలపై పీఎంఓ కార్యాలయం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ చర్యలను చేపడుతోంది. హెలికాప్టర్ లను పంపించే దిశగా అడుగులు వేస్తోంది. 

మోర్దానపల్లిలో నడుస్తున్న పీఈఎస్ పాఠశాల..

చిత్తూరు : యాదమర్రి (మం) మోర్దానపల్లిలో పీఈఎస్ పాఠశాల యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించింది. వర్షాల కారణంగా విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించినా పాఠశాలను యాజమాన్యం నడిపిస్తోంది. 

హిందూపురం వాసవి కళ్యాణ మంటపంలో చోరీ..

అనంతపురం : హిందూపురం వాసవి కళ్యాణ మంటపంలో మరో చోరీ జరిగింది. పెళ్లికూతురు బంధువులకు చెందిన రూ. పది లక్షల విలువైన బంగారు నగలను ఎత్తుకెళ్లారు. పీఎస్ లో బాధితులు ఫిర్యాదు చేశారు.

08:39 - December 2, 2015

హైదరాబాద్ : మాదన్నపే పీఎస్ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు పీఎస్ పై రాళ్లతో దాడి చేశారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని విడిపించుకొనేందుకు ఓ వర్గానికి చెందిన వ్యక్తులు పీఎస్ కు వచ్చారు. లాకప్ లో ఉన్న వ్యక్తిని విడుదల చేయాలంటూ విధి నిర్వాహణలో ఉన్న పోలీసులపై దాడికి దిగారు. పీఎస్ పై రాళ్లు రువ్వారు. ఓ కానిస్టేబుల్ పై చేయి చేసుకోవడమే కాకుండా నానా దుర్భషలాడారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్నదని గ్రహించిన పోలీసులు అదనపు సిబ్బందిని పీఎస్ వద్దకు తరలించారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. చిట్టీల విషయంలో రెండు గ్రూపుల మధ్య వివాదం చెలరేగిందని, దీనితో ఓ వర్గానికి చెందిన వ్యక్తిని పీఎస్ కు తీసుకరావడం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసులు సంయమనం పాటించారని, ఎలాంటి దాడులు చేయలేదని పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. విధుల నిర్వాహణకు అడ్డుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 

08:30 - December 2, 2015

నెల్లూరు : మొన్నటి వర్ష బీభత్సం నుండి జిల్లా తేరుకోనేలేదు. మళ్లీ మరోమారు వరుణుడు జిల్లాపై పెను ప్రభావం చూపుతున్నాడు. బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణి కారణంగా రెండు రోజులుగా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా జలాశయాలన్నీ పూర్తిగా నిండిపోతున్నారు. సూళ్లూరు పేట, నాయుడుపేట, గూడురు, వెంకటగిరి, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లోని పల్లెలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. జిల్ల పరిధిలోని స్వర్ణముఖి, కైవల్యా నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులు నీటి ప్రవాహానికి కొట్టుకపోయాయియ. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. వరదనీరు రైళ్ల పట్టాలపై నీరు చేరడంతో పలు రైళ్లను రద్దు చేశారు. 

08:25 - December 2, 2015

చెన్నై : ఎక్కడ చూసినా నీరే..ఎటువెళ్లాలో తెలియని పరిస్థితి..ఇళ్లలోకి భారీగా నీరు చేరిక..వాహనాలు మునక..రోడ్లపై ఆరు అడుగుల నీరు..ఇంటికి దూరంగా ఎంతోమంది ఉద్యోగులు కార్యాలయాల్లోనే జాగారం..ఇదంతా చెన్నైలోని పరిస్థితి.
వందేళ్ల నాటి కిత్రం కురిసిన వాన ప్రస్తుతం కురుస్తోంది. దీనితో చెన్నైలోని జనజీవనం స్తంభించింది. గత నాలుగు రోజులుగా పరిస్థితి ఫర్వాలేదనిపించినా ప్రజలు కాస్తంత కుదుటపడుతున్న తరుణంలో సోమవారం రాత్రి నుండి వర్షాలు మళ్లీ ముంచెత్తాయి. బంగళాఖాతంలో వాయుగండం ప్రభావంతో తమిళనాడును వర్షాలు కుమ్మేస్తున్నాయి. చెన్నై, కడలూరు, విల్లుపురం, తిరునెల్వేలి, కాంచీపురం, తిరువళ్లూరు తదితర 13 జిల్లాలను వర్షాలు భయపెడుతుఆన్నయి. ప్రధాని మోడీ మంగళవారం రాత్రి జయలలితకు ఫోన్ చేసి వర్షాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తమిళనాడుకు కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గతంలో నవంబర్ నెలలో 108 సెంటీ మీటర్ల వర్షం కురిస్తే ఈసారి ఏకంగా 119.73 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అంతా చీకటి..
చెన్నై మంగళవారం పగలు..రాత్రి కూడా చీకటిమయంగా మారింది. పగలతంతా మబ్బులు కమ్మి చీకటిగా మారిపోతే..వర్షాలకు నగరమంతా దాదాపుగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వానల కారణంగా చెన్నైలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రన్ వై పైకి వర్షపు నీరు చేరడం..వాతావరణం అనుకూలించకపోవడం లాంటి కారణౄలతో పలు విమానాలను వెనక్కిం పంపించేశారు.

కొనసాగనున్న వాయుగుండం..
తమిళనాడు..చెన్నై నగరానికి వర్షాల ముప్పు మరో వారం రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అల్పపీడనం వాయుగుండంగా మారడంతో దాని ప్రభావం మరో నాలుగు రోజుల వరకు ఉంటుందని చెబుతున్నారు. తరువాత మూడు, నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే సూచనులున్నాయని తెలిపారు. 

08:03 - December 2, 2015

వరుణ్‌ సందేశ్‌, వితిక ఒకటి కాబోతున్నారు. కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ ప్రేమికుల వివాహానికి ఇరువైపుల తల్లిదండ్రులు అంగీకరించారు. డిసెంబర్‌ 7వ తేదీన వీరి నిశ్చితార్థం నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం తన ట్విట్టర్ పేజ్ పై వితికా షేరుతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన వరుణ్.. డిసెంబర్ 7వ తేదీన నిశ్చితార్థం జరగనున్నట్టు ప్రకటించాడు. ఈ కార్యక్రమం హైదరాబద్‌లోని జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఆ రోజు ఉదయం 8.30 గంటలకు ఉంటుంది. వరుణ్‌ సందేశ్‌, వితిక హీరో హీరోయిన్లుగా 'పడ్డానండి ప్రేమలో మరి' చిత్రంలో నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిరుగురించింది. డిసెంబర్‌ 7న నిశ్చితార్థం అయ్యాక వచ్చే ఏడాది వివాహం చేసుకోనున్నారు. 'హ్యాపీడేస్' సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న వరుణ్ సందేశ్, తరువాత 'కొత్త బంగారు లోకం' సినిమాతో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ కు దగ్గరవుతున్నాడనుకున్న సమయంలో వరుస ఫ్లాప్ లతో డీలా పడిపోయాడు. ప్రస్తుతం ఉదయం, ట్విస్ట్ సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. 

07:52 - December 2, 2015

సర్కారు వైద్యం ఇక ప్రైవేట్ పరం కానుంది. నిర్వాహణ బాధ్యతలనూ ప్రైవేటు సంస్థలే చేపట్టనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ పార్టీ నేత రాజాసింగ్ పార్టీ అధ్యక్షుడి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జూన్ ఒకటో తేదీ వరకు ఉద్యోగులందరూ కొత్త రాజధాని ప్రాంతానికి వెళ్లాల్సిందేనని, మొత్తం పాలన అక్కడి నుండే కొనసాగాలి అని ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నడింపల్లి సీతరామరాజు (విశ్లేషకులు), శ్రీరాములు (టిడిపి), తాడూరి శ్రీనివాసరాజు (టీఆర్ఎస్), లక్ష్మీనారాయణ (బీజేపీ), గౌతంరెడ్డి (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:43 - December 2, 2015

దేశంలో అసహనం పెరిగిందంటూ అమీర్‌ఖాన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న అమీర్‌కు బాలీవుడ్‌ నటుడు షారూక్‌ ఖాన్‌ మద్దతు ప్రకటించారు. 'నీ దేశభక్తిని మరో మార్గంలో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దేశానికి మంచి జరగాలని కోరుకుంటే, మంచి జరుగుతుంది. దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలి. మంచి మనసుతో ఆలోచిస్తే మంచి జరుగుతుంది. నేను ప్రాంతీయతత్వంతో, అవినీతితో ఆలోచిస్తే, నేను దేశానికి హాని చేస్తాను' అని షారూక్‌ ఒక వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దేశంలో అసహనం పెరుగుతోందంటూ షారూక్‌ నవంబరు మొదటి వారంలో వ్యాఖ్యానించగా, హిందూ అతివాద సంస్థల నుండి ఇదే విధమైన దాడిని ఆయనా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇద్దరు ఖాన్‌లపైనా దేశద్రోహులుగా ముద్రవేస్తూ హిందూ అతివాద సంస్థలు దాడికి దిగాయి. తనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో భారతీయుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని, దేశం విడిచి వెళ్లే ఉద్దేశం తనకు లేదని అమీర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 'ట్విట్టర్‌, సామాజిక మాధ్యమాలు స్వేచ్ఛగా అభిప్రాయాలను చెప్పుకునే వేదికలు. ఇందులో చాలా మంది తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేస్తారు. ఇతరులపై దుర్భాషలు కూడా చేస్తారు. కొన్ని సందర్భాల్లో సాధారణ ప్రకటనలు కూడా తీవ్రమైనవిగా కొందరు మార్చేస్తారు' అని షారూక్‌ వ్యాఖ్యానించారు.

స్థిరంగా అల్పపీడన ద్రోణి..

విశాఖపట్టణం : బంగాళాఖాతంలో తమిళనాడు తీరం వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావం బుధవారం కూడా తమిళనాడుపై ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రోణి స్థిరంగా కొనసాగుతున్నందున, బుధవారం కూడా అదేస్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 

07:29 - December 2, 2015

అభిమాన నటులు షారూఖ్‌ ఖాన్‌, కాజోల్‌తో కలిసి 'దిల్‌వాలే' చిత్రంలో నటించిన కృతిసనన్‌ తాజాగా మోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందనున్న 'హాఫ్‌ గర్ల్ ఫ్రెండ్‌' చిత్రంలోనూ నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ రాసిన 'హాఫ్‌ గర్ల్ ఫ్రెండ్‌' పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా కృతి మాట్లాడుతూ,'చేతన్‌ భగత్‌ పుస్తకాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన పుస్తకాలు సినిమాలకు చాలా దగ్గరగా ఉంటాయి. ఈమధ్యనే 'హాఫ్‌ గర్ల్ ఫ్రెండ్‌' పుస్తకాన్ని చదివాను. అద్భుతంగా ఉంది. చదువుతున్నప్పుడు ప్రత్యక్షంగా సినిమాను చూసిన అనుభూతి పొందాను. ఈ పుస్తకం ఆధారంగా మోహిత్‌ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రంలో నటించే ఛాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ విషయమై ఇటీవల దర్శకుడిని కలిశాను. స్క్రిప్ట్ ని ఆయన నెరేట్‌ చేసిన విధానం నాకెంతో నచ్చింది. కథ, కథనం గురించి ఎన్ని విషయాలైనా చెబుతా కానీ ఈ చిత్రంలో నటించే పాత్ర గురించి మరిన్ని విషయాలను మాత్రం ఇప్పుడే చెప్పలేను. ఈ చిత్రంలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌కి జోడీగా నటిస్తున్నాను' అని చెప్పింది. కృతిసనన్‌ నటిస్తున్న 'దిల్‌వాలే' చిత్రం క్రిస్మస్‌ కానుకగా ఈ నెల 18న విడుదల కానుంది. దీంతోపాటు 'ఫార్జీ', దినేష్‌ విజన్‌ చిత్రంలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది.

07:26 - December 2, 2015

'తొలి సారి పోరాట సన్నివేశాల్లో నటించే అవకాశం రావడం నిజంగా చాలా గొప్ప అనుభూతినిస్తోంద'ని అంటోంది బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌. 'అషికీ 2', 'ఏక్‌ విలన్‌', 'హైదర్‌' చిత్రాలతో బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా ప్రస్తుతం 'బాగీ' చిత్రంలో టైగర్‌ షరాఫ్‌ సరసన నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ బ్యాంకాక్‌లో జరుగుతోంది. కథలో భాగంగా తనపై వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్ లో శ్రద్ధా కూడా నటిస్తోందట. ఈ సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో ట్వీట్‌ ద్వారా పంచుకుంది. 'బ్యాంకాక్‌లో చిత్రీకరిస్తున్న పోరాట సన్నివేశాల్లో నటిస్తున్నాను. ప్రత్యర్థులతో హ్యాండ్‌ టు హ్యాండ్‌ ఫైటింగ్‌, పంచ్‌లివ్వడం, ఛేజింగ్‌ సన్నివేశాలన్నీ ఈ యాక్షన్‌లో సీక్వెన్స్ లో ఉన్నాయి. నాకిది తొలిసారి అయినప్పటికీ రోజూ మూడు గంటల పాటు ఐదు రోజులుగా ట్రైనింగ్‌ తీసుకుంటున్నాను. యాక్షన్‌ సన్నివేశాల పుణ్యామా అని కొత్త విద్యలు నేర్చుకోవడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది' అని పేర్కొంది. ఈ చిత్రంతోపాటు 'రాక్‌ ఆన్‌ 2' చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది శ్రద్ధా.

07:24 - December 2, 2015

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన సుహాసిని మణిరత్నం తాజాగా బాలీవుడ్‌లోకి అడుగిడబోతున్నారు. దర్శకురాలు అను మీనన్‌ దర్శకత్వం వహించబోతున్న చిత్రంలో నసీరుద్దీన్‌షాకు భార్యగా సుహాసిని నటిస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు అను మీనన్‌ ధ్రువపరుస్తూ, 'స్క్రిప్ట్ నెరేట్‌ చేయగానే సుహాసిని మణిరత్నం నటించేందుకు అంగీకరించారు. కథ తనకెంతో బాగా నచ్చిందన్నారు. అయితే ఇంత వరకు హిందీలో ఏకధాటిగా మాట్లాడిన సందర్భాలు లేవని, దీని కోసమై హిందీ డైలాగులన్ని తమిళంలో రాసిస్తే, షూటింగ్‌ టైమ్‌లో భాషతో ఇబ్బంది ఉండదని చెప్పారు. ఈ చిత్ర కథకు తగ్గట్టు హిందీ, ఇంగ్లీష్‌ భాషలను దక్షిణాది యాసలో మాట్లాడే ఇల్లాలిగా సుహాసిని పాత్ర ఉంటుంది. ఈచిత్రంతో నసీరుద్దీన్‌షా, సుహాసినితోపాటు కల్కీకొచ్లిన్‌ కూడా నటిస్తోంది' అని చెప్పారు. గతంలో అను మీనన్‌ 'లండన్‌ ప్యారిస్‌ న్యూయార్క్' చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే నసీరుద్దీన్‌ షా, కల్కికొచ్లిన్‌లు 'దట్‌ గర్ల్ ఇన్‌ ద ఎల్లో బూట్స్' చిత్రంలో నటించారు. దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఈ కాంబినేషన్‌ తాజా చిత్రంతో రీ యూనిట్‌ అవ్వబోతోంది.

07:22 - December 2, 2015

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌, దర్శకుడు సుజీత్‌ సిర్కార్‌ కాంబినేషన్‌లో రూపొంది విజయం సాధించిన చిత్రం 'పీకూ'. సున్నితమైన భావోద్వేగాలతో ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిన 'పీకూ' చిత్రంలో దీపికాపదుకొనె నటించిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్‌బి, దర్శకుడు సుజీత్‌ సిర్కార్‌ కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొంద నుంది. ఈ విషయం గురించి దర్శకుడు సుజీత్‌ సిర్కార్‌ మాట్లాడుతూ,'పీకూ' తర్వాత బిగ్‌బి కాంబినేషన్‌లో చేస్తున్న చిత్రమిది. బిగ్‌బితో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఢిల్లీ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నాను' అని తెలిపారు.

07:21 - December 2, 2015

బాలకృష్ణ, అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష హీరోహీరోయిన్లుగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం 'డిక్టేటర్‌'. టాకీపార్ట్ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మీడియాతో మాట్లాడారు. 'బాలయ్య 99వ చిత్రం కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారని తెలుసని, వారి అంచనాలకు తగ్గట్టుగా ఉండే చిత్రమిదన్నారు. ఆయన అభిమానులు బాలకృష్ణను ఎలా చూడాలనుకుంటున్నారో, దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు పేర్కొన్నారు. డిఫరెంట్‌గా ఉంటూనే ఇప్పటి వరకు చూడని స్టయిలీష్‌ యాంగిల్‌లో బాలకృష్ణ అలరించనున్నారని తెలిపారు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఇటీవల ఢిల్లీ, హర్యానాల్లోని బ్యూటిఫుల్‌ లొకేషన్లలో బాలకృష్ణ, అంజలి, అక్ష, సుమన్‌లపై చిత్రీకరించడంతో టాకీపార్ట్ పూర్తయ్యిందన్నారు.. తమన్‌ మొదటిసారి బాలకృష్ణ చిత్రానికి సంగీతమందిస్తున్నారని, ఆయన అందించిన ట్యూన్స్ అదిరిపోయేలా ఉన్నాయన్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు, సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. 

07:20 - December 2, 2015

అప్పుడే పుట్టిన పసిపాపకు మొదటి ఆహారం తల్లి పాలు. ఆ బిడ్డకు భవిష్యత్తులో ఎదురయ్యే ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి తల్లి పాలు కాపాడతాయి. అంతే కాదు బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు కావల్సిన పోషకాలను పాలు అందిస్తాయి. అందుకే పుట్టిన ఆరు నెలల వరకు బిడ్డకు తల్లి పాల అవసరం గురించి ప్రతి డాక్టర్‌ వివరిస్తారు. ప్రతి మనిషి శరీరానికి అవసరమైన కనీస ప్రోటీన్లు, కొవ్వు పాల ద్వారా అందుతాయి. ముఖ్యంగా మహిళల్లో వయసు పెరిగేకొద్ది కాల్షియం సమస్యలు ఎదురవుతాయి. దాంతో ఎముకలు బలహీనపడిపోతాయి. అందుకే మహిళలు ప్రతి రోజూ కచ్చితంగా పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

మన శరీరానికి పాల వల్ల కలిగే ప్రయోజనాలు..
అధిక శక్తిని అందిస్తాయి. పాలల్లో ఉండే కాల్షియం మన శరీరం ఆరోగ్యంగా ఎదగడానికి అవసరమైన శక్తిని అందించి, మంచి ఎత్తు, బరువు పెరిగేలా చేస్తాయి. వాస్తవానికి మన శరీర ఎదుగుదలలో పాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే మన భారతదేశంలో చిన్నపిల్లలకు పాల అవసరం గురించి టీవీల్లో ప్రకటనలు కూడా ఇస్తూ ఉంటారు. మనం తీసుకునే ఆహారంలో పాలు అత్యంత బలవర్ధకమైన ఆహారం. కాబట్టి ప్రతిరోజూ ఓ గ్లాసు పాలు తాగి, అనారోగ్య సమస్యలకూ దూరంగా ఉండమని వైద్యులు సూచిస్తున్నారు.

చర్మం మెరిసిపోతుంది..
పనిరీత్యా మనం ప్రతి రోజూ ప్రయాణం చేయాల్సి వస్తుంది. దుమ్మూ, ధూళి ప్రభావం శరీరంపై ఎక్కువగా ఉంటుంది. దాంతో శరీరం పొడిబారడం, జిడ్డుగా మారడం వంటి సమస్యలు సర్వసాధారణం. దీనికి సరైన రక్షణ తీసుకోకపోతే చర్మం రోజు రోజుకు నిర్జీవంగా తయారవుతుంది. చర్మ రక్షణ కోసం మార్కెట్లో దొరికే క్రీములు వాడితే సరిపోదా అని అని చాలామంది అనుకుంటారు. కాని ఇది సరైన నిర్ణయం కాదు. కేవలం క్రీములు మాత్రమే మీ చర్మాన్ని కాపాడవు. దీనికోసం రోజూ గ్లాసు పాలు తాగడం చాలా ఉత్తమం. పాలల్లో ఉండే అమినో ఆసిడ్స్ కాలుష్యం వల్ల మీ చర్మాన్ని హాని కారకాల నుండి కాపాడతాయి. చర్మం మెరిసిపోయేలా చేస్తాయి.

ఎముకలకు బలాన్ని ఇస్తాయి..
ఎముకలను బలంగా ఉంచడంలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుందని ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఈ కాల్షియం కీళ్ళ నొప్పుల బారి నుండి కాపాడటంలో బాగా పనిచేస్తుంది. కాల్షియం పాల నుండి ఎక్కువగా లభిస్తుంది. అందుకే మీరు ఒక గ్లాసు పాలను ప్రతి రోజూ తీసుకున్నట్లయితే మీ ఎముకలు బలంగా ఉంటాయి.

మంచి నిద్ర కోసం..
ఒత్తిడితో కూడుకున్న జీవితం సుఖ నిద్రకు మిమ్మల్ని దూరం చేస్తుంది. అందుకే మీరు నిద్రకు ముందు ఒక గ్లాసు పాలను తాగడం అలవాటు చేసుకోండి. పాలల్లో ఉండే అమినో ఆసిడ్స్ మెదడులో ఏర్పడిన ఒత్తిడిని మాయం చేయడంలో సహాయపడతాయి. దీంతో మీరు సుఖంగా నిద్రపోవచ్చు. తర్వాత రోజు మీ పనులను ఎంతో ఉత్సాహంగా చేసుకోగలుగుతారు.

07:19 - December 2, 2015

చక్కని రుచిని అంతే చక్కని ఆరోగ్యాన్ని అందించే పెరుగుకి మరికొన్ని వంటింటి పదార్ధాలను జతచేస్తే మెరుపులీనే అందం మీసొంతమవుతుంది. అదెలాగంటే,అరకప్పు పెరుగులో చెంచా వేప పిండి, అర చెంచా నిమ్మరసం, చెంచా ఆలివ్‌ నూనె కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే వెంట్రుకలు పట్టుకుచ్చుల్లా తయారవడంతో పాటు చుండ్రు సమస్య అదుపులో ఉంటుంది.

  • పెరుగులో మెంతిగింజల్ని రాత్రి నానబెట్టి ఉదయాన్నే మెత్తగా రుబ్బుకోవాలి. దానికి అరచెంచా తేనె, రెండు చుక్కల నిమ్మరసం కూడా కలుపుకుని వెంట్రుకలకు పట్టించాలి. జుట్టుకి కొత్త నిగారింపు వస్తుంది.
  • పెరుగు చర్మానికి సహజసిద్ధమైన క్లెన్సర్‌లా పనిచేస్తుంది. దీనికి చెంచా చొప్పున సెనగపిండి, పెసరపిండి, తేనె కలిపి ఒంటికి పట్టించి నలుగులా రుద్దుకోవాలి. అప్పుడే దుమ్ము, ధూళితో పాటు మృతకణాలు తొలగిపోయి నునుపుదనం మీ సొంతమవుతుంది.
  • పెరుగులో తమలపాకుని కొద్దిసేపు నానబెట్టి ఆ తర్వాత కళ్లపై ఉంచుకుంటే వేడి హరించుకుపోయి తాజాగా కనిపిస్తాయి.
  • పావుకప్పు పెరుగులో అంతే పరిమాణంలో కలబంద గుజ్జు, చెంచా సెనగపిండి, నిమ్మరసం, అరచెంచా బాదం నూనె కలిపి మెత్తగా చేసుకొని ముఖానికి పూతలా వేయాలి. ఇలా ఓ ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని అరాక గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ముఖం కాంతివంతమవడం ఖాయం.
07:17 - December 2, 2015

కడుపులో వికారంగా అనిపించినప్పుడు పుదీనా వాసనను చూస్తే చాలు వికారం మటుమాయం అవుతుంది. వాంతులతో బాధపడేవారు సైతం పుదీనా పచ్చడి తినటంవల్ల కోలుకుంటారు. గర్భిణిలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా తలనొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను ముద్దగా చేసి నుదుటిపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది. అపస్మారక స్థితిలో వెళ్లినవారికి రెండు చుక్కల పుదీనా రసం ముక్కులో వేస్తే కోలుకుంటారు. చిన్న పిల్లలు కడుపునొప్పి, కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే గోరువెచ్చని నీటిలో ఐదారు చుక్కల పుదీనా రసం కాచి తాగించడం వలన ఉపశమనం కలుగుతుంది. చిన్న పిల్లలకు జలుబు చేస్తే పుదీనా నుండి తయారయ్యే మెంథాల్‌ ముద్ద, కర్పూరం, కొబ్బరి నూనెలతో మిశ్రమం చేసి ఛాతికీ, వీపునకు రాస్తే జలుబు తగ్గుతుందని ఆయుర్వేదం సూచిస్తోంది. నోటి దుర్వాసనతో ఇబ్బందిపడేవారు పుదీనా రసాన్ని నీటిలో కలిపి పుక్కిలించడం ద్వారా క్రిములను దూరంగా ఉంచి దుర్వాసనను పోగొట్టవచ్చు. గొంతు నొప్పితో బాధపడేవారు పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలిస్తే సమస్య తొలగుతుంది. దంత వ్యాధులతో బాధపడేవారు సైతం ప్రతిరోజూ పుదీనా ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది. గర్భిణిలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది. పుదీనా రసం తాగటంవల్ల తరచుగా వచ్చే వెక్కిళ్లను కూడా తగ్గించవచ్చు. జలుబు చేసినప్పుడు మరిగే నీటిలో కాస్త పసుపు మెంథాల్‌ వేసి ఆవిరిపడితే జలుబు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. కీళ్ళ నొప్పులతో బాదపదేవారు తరచూ పుదీనా తింటే ఎంతో మంచిది.

07:15 - December 2, 2015

మొండి బకాయిలు ప్రభుత్వరంగ బ్యాంక్ లకు గుదిబండలుగా మారుతున్నాయి. దాదాపు 3 లక్షల కోట్లకు చేరిన ఈ బకాయిలు బ్యాంకింగ్ రంగానికే కాదు మొత్తం ఆర్థిక వ్యవస్థకే చుక్కలు చూపిస్తున్నాయి. అసలు ఇంత భారీ స్థాయిలో మొండిబకాయిలు ఎందుకు పెరుగుతున్నాయి? బకాయిలు ఎగ్గొడుతున్నవారిలో వున్నదెవరు? సామాన్యులా? బడాబాబులా? మొండిబకాయిలు ఇంత భారీ సైజులో పెరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోంది? ఈ బకాయిలు ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థ మీద, దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి.? బడాబాబుల నుంచి అప్పులు రాబట్టుకోవాలంటే ప్రభుత్వం తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ అంశాలపై జనపథంలో ఆర్థికరంగ నిపుణులు, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నేత వెంకట్రామయ్య విశ్లేషించారు. 

పటన్ చెరు వద్ద రోడ్డు ప్రమాదం..

మెదక్ : పటన్ చెరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్టాండు నుండి బయటకు వస్తున్న బస్సును లారీ ఢీకొంది. 10మందికి తీవ్రగాయాలయ్యాయి. ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

మాదన్నపేట పీఎస్ వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ : మాదన్నపేట పీఎస్ వద్ద మంగళవారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అదుపులోకి తీసుకున్న వారిని వదిలిపెట్టాలని మాదన్నపేట పీఎస్ పై ఓ వర్గం రాళ్లతో దాడి చేసింది. ఈఘటనలో ఏడుగురిపై కేసు నమోదైంది. రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది.

 

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం త్రి దశాబ్ది ఉత్సవాలు..

హైదరాబాద్ : నేడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం త్రి దశాబ్ది ఉత్సవాలు జరుగనున్నాయి. మంత్రి ఈటెల, వివిధ వర్సిటీల ప్రొఫెసర్లు హాజరు కానున్నారు. 

భద్రాచలంలో వెలిసిన మావోయిస్టు పోస్టర్లు...

ఖమ్మం : భద్రాచలం సీఆర్ఫీఎఫ్ క్యాంప్ సమీపంలో మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు శభరిదళం పేరుతో కరపత్రాలు బయటపడ్డాయి. గ్రీన్ హంట్ ను నిలిపివేయాలని, మోడీ ప్రభుత్వ మతతత్వ విధానాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. 

 

నెల్లూరులో భారీ వర్షాలు...

నెల్లూరు : జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేటలో కాళంగి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. జాతీయ రహదారిపై వరదనీరు చేరింది. స్వర్ణముఖి, కైవల్యానదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వెంకటగిరి - గూడూరు మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులకు నేడు శిక్ష ఖరారు.

ఢిల్లీ : రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులకు సుప్రీంకోర్టు శిక్ష ఖరారు చేయనుంది.

నేడు వ్యవసాయ వర్సిటీల వీసీల సమావేశం..

చిత్తూరు : నేడు వ్యవసాయ యూనివర్సిటీ వీసీల 40వ సమావేశం జరుగనుంది. 66 వర్సిటీల వీసీలు పాల్గొనున్నారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి.

 

06:48 - December 2, 2015

మొండిబకాయిలు... ఇప్పుడు ఈ ఒక్క పదమే బ్యాంకింగ్ వ్యవస్థను కలవరపెడుతోంది. కేంద్ర ఆర్థికమంత్రి, ఆర్ బీఐ గవర్నర్ , ప్రఖ్యాత ఆర్థికరంగ నిపుణులు ఇప్పుడు ప్రతి ఒక్కరూ వీటి గురించే బ్యాంకర్లను హెచ్చరిస్తున్నారు ఇంతకీ మొండిబకాయిలు ఇంత ప్రమాదకర స్థాయిలో పెరగడానికి కారణం ఏమిటి? కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన అప్పులను తిరిగి రాబట్టుకోవడం ఇప్పుడు ప్రభుత్వరంగ బ్యాంక్ లకు పెద్ద సవాలుగా మారింది. పార్లమెంట్ లో కూర్చొని చట్టాలు చేసేవారు, కేబినెట్ మీటింగ్ లలో ప్రభుత్వ విధానాలు ఖరారు చేసేవారే బ్యాంక్ లోన్లు ఎగ్గొడుతున్న దౌర్భాగ్యం మన దేశంలో నెలకొంది. ఒక మాజీ కేంద్ర మంత్రికి చెందిన ప్రోగ్రెసివ్ కన్సస్ట్రక్షన్ కంపెనీ దాదాపు 350 కోట్ల రూపాయిలు బకాయిపడింది. సుజనా టవర్స్ లిమిటెడ్ 262 కోట్లు, సుజన యూనివర్సల్ ఇండియా లిమిటెడ్ 330 కోట్ల రూపాయలు బకాయిపడ్డాయి. ల్యాంకో హోస్కొటే హైవే పేరు మీద కూడా 533 కోట్ల రూపాయల మొండిబకాయిలు పేరుకుపోయాయి. ఇలాంటి జాబితాలో మరెందరో ప్రముఖులున్నారు. విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ది వీటిలో ప్రథమ స్థానం.

మొండి బకాయిల విలువ 95వేల 122 కోట్లు..
మన దేశంలో కేవలం ముప్పై మంది ప్రముఖుల మొండిబకాయిల విలువ 95వేల 122 కోట్లు. ఈ విషయాన్ని ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వమే రాజ్యసభలో ప్రకటించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పేరకుపోయిన మొండిబకాయిల విలువ 2 కోట్ల 60 లక్షల 531 కోట్లకు చేరిన్నట్టు గత డిసెంబర్ లోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి నాటికి ఈ మొండి బకాయిల విలువ మరో 7 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. ప్రముఖ సంస్థల మొండి బకాయిల విలువ 70 వేల 300 కోట్ల రూపాయల దాకా వున్నాయంటూ ఓ భయంకర నిజాన్ని మూడేళ్ల క్రితమే బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు లెక్కలతో సహా బయటపెట్టాయి. ఆనాడే బ్యాంక్ ఉద్యోగుల సంఘాల ఆవేదనను , హెచ్చరికలను అర్ధం చేసుకుని, గట్టి చర్యలు తీసుకుని వుంటే ఇప్పుడు వీటి విలువ లక్షల కోట్ల రూపాయలకు చేరేది కాదు. బ్యాంక్ లకు భారీగా బకాయిలుపడ్డ వారి జాబితాలో ప్రధాని నరేంద్రమోడీ స్వరాష్ట్రం గుజరాత్ కి చెందినవారే ఎక్కువగా వుండడం మరో ఆసక్తికర విషయం.

వసూలు అవుతాయా ?
ఈ బకాయిలు ఎలా వసూలు చేసుకోవాలో తెలియక, అసలు ఇవి వసూలవుతాయో లేదో తెలియక బ్యాంక్ లు కిందామీదా పడుతున్నాయి. మొండిబకాయిలు ఇంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడానికి కారణం ప్రభుత్వ విధానాలే. బ్యాంక్ బోర్డుల్లోకి రాజకీయ నాయకుల అనుయాయులను జొప్పించడం, కార్పొరేట్ సంస్థల పెద్దలకు అడిగినంత లోన్లు ఇవ్వాలంటూ బ్యాంక్ అధికారుల మీద తీవ్ర ఒత్తిడి ప్రయోగించడం, గాలి బుడగలాంటి బూమ్ లను అడ్డుపెట్టుకుని ప్రాధాన్యతారంగాలంటూ రియాల్టీ, ఇన్ ఫ్రా రంగాలకు ఇష్టమొచ్చినట్లు లోన్ లు ఇప్పించడం ఈనాటి దుస్థితికి కారణం. మొండిబకాయిల్లో మైనింగ్, స్టీల్, టెక్స్ టైల్స్, ఏవియేషన్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఈ అయిదు రంగాలకు సంబంధించిన కంపెనీలే 53శాతం ఆక్రమించినట్టు ఓ అధ్యయనంలో తేలింది. ఇందులో ఇన్ ఫ్ర్రాస్ట్రక్చర్ కంపెనీల వాటా 30శాతం.

ఆర్బీఐ అధికారాలపై కత్తెర..
అవాస్తవిక అంచనాలతో అధికారాన్ని అడ్డంపెట్టుకుని, పైరవీలు సాగించి ఇబ్బడిముబ్బడిగా లోన్లు తీసుకుని, వాటిని తమ ఇష్టమొచ్చినట్టు వాడుకుని వాయిదాల ప్రకారం తిరిగి చెల్లించకుండా మొండికేసిన కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు బ్యాంక్ ల వడ్డీ రేట్లు తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వం మీద, ఆర్ బీఐ మీద ఒత్తిడి పెంచుతున్నాయి. వడ్డీ రేట్ల విషయంలో తమ మాట వినడం లేదన్న కోపంతో ఆర్ బీఐ అధికారాలకు కత్తెర వేసేందుకూ కేంద్రం పావులు కదుపుతున్న తీరు మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా తమ విధానాలు మార్చుకోవాలి. వాస్తవిక పరిస్థితికి, దేశ అవసరాలకు అనుణంగా ప్రాధాన్యతారంగాల్లో మార్పులు తీసుకురావాలి. కంపెనీల ఆర్థిక కార్యకలాపాలపై ఆర్ బీఐ, సెబీలాంటి సంస్థల నిఘా పెంచాలి. మార్కెట్లపై అవగాహన వున్నవారినీ, నిపుణులను మాత్రమే బ్యాంక్ డైరెక్టర్ లుగా నియమించాలి. ఈ తప్పులేవీ సరిదిద్దుకోకుండా చేయడం వాటిని ప్రయివేటీకరించాలనుకోవడం మంచిది కాదు. నిజానికి మొండి బకాయిలు బ్యాంకింగ్ వ్యవస్థ మీదే కూడా దేశ ఆర్థిక ప్రగతి మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. చిన్నచిన్న పరిశ్రమలకు లోన్లు ఇవ్వలేని పరిస్థితి దాపురిస్తోంది. విదేశీ బ్యాంక్ ల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తానంటూ ఎన్నికల వాగ్ధానం చేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం కనీసం బడాబాబులు మొండికేసిన బకాయిలనైనా వసూలు చేయలేకపోతే ఎలా?

06:42 - December 2, 2015

ఢిల్లీ : దేశంలో పెరుగుతున్న అసహనంపై లోక్‌సభలో రెండో రోజు కూడా చర్చ కొనసాగింది. అసహన పరిస్థితులపై మాట్లాడిన అసదుద్దీన్‌ ఓవైసీ ఈ దేశంలో ముస్లింలకు అన్యాయం జరుగుతోందన్నారు. తమ వర్గాన్ని పాకిస్తానీలుగా పరిగణించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదం పేరిట ముస్లింలను టార్గెట్‌ చేయడం సరికాదన్నారు. డెవలప్‌ ఇండియా పేరిట మోది అధికారంలోకి వచ్చారని, ప్రస్తుతం ఏ పత్రిక చూసినా డివైడెడ్‌ ఇండియా వార్తలే కనిపిస్తున్నాయని ఎన్‌సిపి సభ్యురాలు సుప్రియా సూలే ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్డీయే హయాంలో ఘర్‌వాప్‌సి, అవార్డ్‌ వాప్సీ అంశాలు చర్చనీయాంశంగా మారాయన్నారు. అధికార పార్టీలో పలువురు ఇష్టమొచ్చిన రీతిలో వ్యాఖ్యలు చేస్తుంటే వారిని అదుపు చేయాల్సిన బాధ్యత హోంమంత్రి, ప్రధానిపై లేదా అంటూ కుటుంబంలో తల్లి పాత్రని ఉదహరించారు. షారుక్‌ఖాన్‌, అమీర్‌ ఖాన్‌లకు ప్రపంచంలోనే గుర్తింపు ఉందని వారిని టార్గెట్‌ చేయడం ఎంతవరకు సబబన్నారు.

మతకలహాలు తగ్గాయన్న కిరణ్ రిజిజు..
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతకలహాలు పెరిగిపోయాయంటూ విపక్షాలు చేసిన ఆందోళనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు సమాధానం ఇచ్చారు. యూపీఏ పాలనతో పోలిస్తే ఎన్డీయే మతకలహాలు తగ్గాయన్నారు. యూపీఏ ప్రస్తావన తీసుకురావడంపై లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువ మతకలహాలు జరిగాయన్న ఖర్గే వాదనను కిరణ్‌ రిజ్జు కొట్టి పారేశారు. 2014-15లో మత కలహాలు వెలుగు చూసినప్పటికీ 2013తో పోలిస్తే అది తక్కువే నన్నారు.

ఓటు బ్యాంకు కోసం రాజకీయాలన్న గల్లా..
సహనానికి భారత్‌ పెట్టింది పేరని టిడిపి సభ్యుడు గల్లా జయదేవ్‌ అన్నారు. దేశంలో జరిగిన దాద్రి, కల్‌బుర్గి, దోబ్లేకర్‌ హత్యలను టీడీపీ ఖండించిందని, అయితే ఈ ఘటనలకు ఎన్డీయే ప్రభుత్వం బాధ్యత వహించాలనడం సరికాదన్నారు. కేవలం ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కుల మతాలను వాడుకుంటున్నారని జయదేవ్‌ విమర్శించారు.

అన్నాడీఎంకే ఆందోళన...
అసహన పరిస్థితుల కారణంగా దేశానికి చెడ్డ పేరు వస్తోందని, అభివృద్ధిపై ప్రభావం చూపుతోందని అన్నాడిఎంకే ఆందోళన వ్యక్తం చేసింది. అసహనంతో దేశానికి పెట్టుబడులు రాకుండాపోయే ప్రమాదం ఉందని పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయని అన్నా డీఎంకే సభ్యుడు పీ కుమార్‌ సభ దృష్టికి తెచ్చారు. ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఉంటుందని హెచ్చరించారు.

06:40 - December 2, 2015

విజయవాడ : నెల్లూరు జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాల్లో తమ కంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకున్న ఆనం సోదరులు టీడీపీలోకి జంప్‌ అవుతున్నారు. హస్తానికి హ్యాండ్‌ ఇచ్చి..తెలుగుదేశంలో ల్యాండ్‌ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనం సోదరులను సాదరంగా ఆహ్వానించనున్నారు. విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఆనం సోదరులు టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు. కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పిన ఆనం వివేకానందరెడ్డి, రాం నారాయణ రెడ్డి బుధవారం చంద్రబాబును కలిసి అధికారికంగా పార్టీలో చేరతారు. ఆనం సోదరులు టీడీపీలో చేరతారనేది గత కొన్ని రోజులుగా హాట్‌టాపిక్‌గా మారింది. ఆ తరువాత తాము కాంగ్రెస్‌ను విడిచిపెడుతున్నామని ఆనం సోదరులు స్వయంగా చెప్పడంతో దీనిపై క్లారిటీ వచ్చింది. ఐతే ఆనం బ్రదర్స్‌ రాకను నెల్లూరు జిల్లాలో కొంతమంది నేతలు వ్యతిరేకించారు.

ఆనం సోదరుల రాకకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్..
ఆనం సోదరుల రాకకు చంద్రబాబు పచ్చ జెండా ఊపడంతో తీర్థం పుచ్చుకోవడానికి రూట్‌ క్లియర్‌ అయ్యింది. వీరి రాకను వ్యతిరేకిస్తున్న వారితో పార్టీ అగ్రనేతలు చర్చలు జరిపారు. నెల్లూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆనం సోదరుల రాక సహాయం పడుతుందని నచ్చ చెప్పారు. దీంతో ఆనం సోదరులకు మార్గం సుగమమైంది. రాష్ట్రాన్ని బాధాకరంగా విభజించి, ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థిక కష్టాల్లో నెట్టిందంటూ కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన ఆనం బ్రదర్స్ నాలుగైదు రోజులుగా నెల్లూరులోని తమ నివాసంలో అభిమానులు, అనుచరులతో సమాలోచనలు జరిపి, పార్టీ మారేందుకు దారి తీసిన పరిస్థితులను వారికి వివరించారు.

రాం నారాయణకు ఎమ్మెల్సీ పదవి ?
మొత్తానికి టీడీపీలోకి రీ ఎంట్రీ ఇస్తున్న ఆనం బ్రదర్స్ లో రాంనారాయణరెడ్డికి ఎమ్మెల్సీ ఖాయమైందన్న ప్రచారం సాగుతోంది. ఇక 2017లో స్థానిక సంస్థల కోటాలో.. ఆనం వివేకాకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు నిర్ణయం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎమ్మెల్సీ కాకున్నా.. అసెంబ్లీ సీటుతో పాటు నెల్లూరు ఎంపీ సీటు ఆనం సోదరులకు ఇవ్వడం కన్‌ఫామ్‌ అయినట్లు ప్రచారం జరుగుతోంది. 

06:36 - December 2, 2015

హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు టీ కాంగ్రెస్‌ను కలవరపెడుతున్నాయి. ఎన్నికల్లో ఎలా ముందుకెళదామన్న దానిపై ఆ పార్టీ తర్జనభర్జన పడుతోంది. హై కమాండ్‌ పిలుపుతో హస్తినకు వెళ్లిన పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్‌ ఆలీలు ఢిల్లీ పెద్దలతో సమావేశమయ్యారు. రాబోతున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నేతలు నిర్ణయించారు. ఐతే ఎన్నికల వ్యూహంపై ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. పొత్తుల విషయంలో టీ కాంగ్రెస్‌ నేతలు డైలమాలో పడుతున్నారు. 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నా రంగారెడ్డి, నల్లగొండ, పాలమూరు జిల్లాల్లో ఆ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తోంది. అది కూడా ఒక్కో స్థానంలో మాత్రమే విజయం సాధించే ఛాన్సెస్‌ ఉన్నాయి. దీంతో స్నేహహస్తం కోసం స్థానిక నేతలు టీఆర్ఎస్‌, టీడీపీలవైపు చూస్తున్నారు. ఇప్పుడిదే టీ కాంగ్రెస్‌కు సవాల్‌గా మారింది.

అధికార పక్షంతో దోస్తీపై వ్యతిరేకత..
అధికార పక్షంతో జత కట్టడాన్ని కొంతమంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. దిగ్విజయ్‌సింగ్‌తో జరిగిన సమావేశంలో ఈ అంశంపైనే నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక టీడీపీతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో పార్టీ దెబ్బతింటుందని మరికొంతమంది నేతలు హెచ్చరించినట్లు సమాచారం. టీడీపీతో జత కడితే తెలంగాణలో ఆ పార్టీకి ఊపిరిపోసినట్లువుతుందని అభిప్రాయపడుతున్నారు. పొత్తులపై విభిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు కూడా ఆ బాధ్యతను కో ఆర్డినేషన్‌ కమిటీకి అప్పజెప్పినట్లు తెలుస్తోంది. పొత్తులపై చర్చించేందుకు కో ఆర్డినేషన్‌ కమిటీ ఒకటి రెండు రోజుల్లో సమావేశం కానుంది. దీంతో అందరి చూపు ఆ భేటీపైనే ఉంది. పొత్తులపై కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది హాట్‌టాపిక్‌గా మారింది. 

06:30 - December 2, 2015

హైదరాబాద్ : స్థానిక సంస్థల మండలి ఎన్నికలకు తెరలేచింది. బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ రంగం సిద్దం చేసింది. మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎలక్షన్స్ కోసం నవంబర్ నెలలోనే షెడ్యూల్ విడుదలైంది. కాగా బుధవారం నాడు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో 12 స్థానాలున్నాయి. ఆదిలాబాద్ -1, నిజామాబాద్ -1, మెదక్ -1, నల్గొండ -1, వరంగల్ -1, ఖమ్మం -1, కరీంనగర్ -2, రంగారెడ్డి -2, మహబూబ్ నగర్ -2 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 

నామినేషన్లకు చివరి తేది డిసెంబర్ 9..
బుధవారం నోటిఫికేషన్ అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నామినేషన్లకు చివరి తేది డిసెంబర్ 9. డిసెంబర్ 10న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది డిసెంబర్ 12. ఇక డిసెంబర్ 27న ఆయా జిల్లాల్లో ఎన్నికలు జరుగుతాయి. 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. మొత్తానికి ఒకేసారి ఏకంగా 12 స్థానాలకు ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ధీటైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నాయి.

06:26 - December 2, 2015

చిత్తూరు : బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు దిశగా కేంద్రీకృతమైన అల్పపీడన ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలు నెల్లూరు, చిత్తూరుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నెల్లూరు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో అధికారులు వెంటనే స్పందించి... లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెన్నై-విజయవాడ మార్గంలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. జిల్లాలోని అనేక వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

సూళ్లూరు పేటలో కాళంగి నది ఉగ్రరూపం..
ఉప్పుటేరులో ఓ వ్యక్తి గల్లంతు కాగా, చిల్లకూరు మండలంలో తిప్పగుంటపాలెం జల దిగ్బంధనంలో చిక్కుకొంది. డక్కిలి మండలం కమ్మపల్లి వద్ద ఎఎన్‌ఎం రాజమ్మ వాగులో కొట్టుకుపోయి గల్లంతైంది. కావలిలో 9.5 సెంమీ వర్షపాతం నమోదైంది. సోమశిల జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్ట్ లో నీటిమట్టం 67 టీఎంసీలకు చేరింది. సూళ్లురుపేటలో కాళంగి నది ఉగ్ర రూపం దాల్చింది. జిల్లాలోని గూడూరు వద్ద రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. పలు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే జిల్లాలోని కండలేరు, కుక్కుటేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.

అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు...
అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకుగాను అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజలకు చిత్తూరు కలెక్టర్ సిద్దార్థ్ జైన్ సూచించారు. ఎక్కడ ఎటువంటి విపత్తు సంభవించిన సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను సిద్దంగా ఉంచినట్లు ఆయన చెప్పారు. అలాగే సహాయక చర్యల కోసం రేణిగుంట విమానాశ్రయంలో హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచామన్నారు. పీఆర్ కండ్రిగ, నేచనూరు వద్ద నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని తెలిపారు. జిల్లాలోని నాగులాపురం, విజయపురం, తొట్టంబేడు మండలాల్లో కొన్ని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు. 

06:24 - December 2, 2015

చెన్నై : భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలం అవుతోంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. స్కూళ్లకు ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్రకటించింది. తీరప్రాంతాల్లో ఉన్న రెండు లక్షల 40 వేల మంది నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల కారణంగా చెన్నై నగర వీధులు జలమయమై వాగులను తలపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. ఐటీ సంస్థలను మూసివేశారు. గత పదిహేను రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 188 మంది మృత్యువాత పడినట్లు ప్రభుత్వం పేర్కొంది. జాతీయ విపత్తు నివారణ సంస్థతో పాటు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. కోస్ట్ గార్డ్స్ ను సైతం సిద్ధం చేశారు. సైన్యాన్ని కూడా రంగంలోకి దింపుతున్నారు.
 

11 రైళ్లు రద్దు..
చెన్నై నగరాన్ని వరదలు వెంటాడుతుండటంతో 36 సహాయక కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వరద సహాయక చర్యలో 10 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పొల్గొన్నాయి. 1913 నెంబర్‌తో హెల్ప్ లైన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారీ వర్షాల కారణంగా రైల్వే శాఖ అధికారులు ఇవాళ 11 రైళ్లను రద్దు చేశారు. మరో 11 రైళ్లను దారి మళ్లించారు. భారీ వర్షాల కారణంగా చెన్నై ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. విమానాల రాకపోకలు ఆగిపోయాయి.
 

మరో నాలుగు రోజుల పాటు వర్షాలు..
తమిళనాడులో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాలపై ప్రధాని మోడీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి జయలలితతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. భారీ వర్షాలపై సీఎం జయలలిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల పర్యవేక్షణకు మంత్రులను నియమించారు. 

06:20 - December 2, 2015

విజయవాడ : గత కొంతకాలంగా నామినేటెడ్‌ పదవుల కోసం ఎదురుచూస్తున్న తెలుగు తమ్ముళ్లను అధినేత కరుణిస్తున్నారు. ఎంతో కాలంగా పార్టీలో ఉంటూ సేవ చేస్తున్న నేతలకు పదవులు కట్టబెట్టేందుకు అధిష్టానం సిద్ధమైంది. ప్రస్తుతానికి 8 మందిని నామినేటెడ్‌ పదవులకు ఎంపిక చేసినట్లు సమాచార పౌరసంబంధాల శాఖ తెలిపింది. దాదాపు పదేళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో తెలుగు తమ్ముళ్లు పార్టీ పదవులతోపాటు నామినేటెడ్ పోస్టులపైనా గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వివిధ కార్పొరేషన్లకు సభ్యులను నియమిస్తున్నారు. టీడీపీ సీనియర్‌ నేత పార్టీ ఏపి విభాగం ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యకు... ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు పార్టీ అధినేత డెసిషన్‌ తీసుకున్నారు. ఇక వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌కు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో సత్తా చాటుతున్న పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధను మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా ఎంపిక చేశారు. ఇక స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా జయరామిరెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా ఎల్వీఎస్సార్కే ప్రసాద్‌ను నిర్ణయించారు.

కాపులకు పలు హామీలు..
గత ఎన్నికల టైంలో చంద్రబాబు కాపు వర్గానికి పలు హామీలు ఇచ్చారు. అయితే వాటిని నెరవేర్చడంలో బాబు విఫలమయ్యారని ఆ వర్గం నుంచి విమర్శలు తీవ్రమయ్యాయి. దీంతో కొద్దికాలం క్రితం కాపు సంక్షేమ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్‌గా చలమలశెట్టి రామాంజనేయులును ఎంపిక చేశారు. సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్ చైర్మన్‌గా మల్లెల లింగారెడ్డి పేరు ఖరారు చేశారు. హిందూపురం మాజీ ఎమ్మెల్యే బి రంగనాయకులు బీసీ ఆర్థిక సహకార సంస్థకు చైర్మన్‌గా ఎంపికయ్యారు. నామినేటెడ్‌ పోస్టులకు శ్రీకారం చుట్టడంతో నేతల్లో చర్చ మొదలైంది. మరికొన్ని పదవులు ఉండడంతో వాటిపైన నాయకులు ఆశపెట్టుకున్నారు. 

06:18 - December 2, 2015

విజయవాడ : సచివాలయం తరలింపుపై... ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జూన్ 1 నాటికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్ని కార్యాకలాపాలు, విధులు నూతన రాజధాని నుంచే చేపట్టాలని ఏపీ సీఎస్ అదేశాలు జారీ చేసారు. ఉద్యోగుల తరలింపు బాధ్యతలు ఆయా శాఖల విభాగాధిపతులకు అప్పగించారు. నూతన రాజధానిలో పనిచేసేందుకు కావాల్సిన అన్నీ రకాల ఏర్పాట్లు చేయాల్సిందిగా సిఎస్ అదేశించారు.

శాఖ కార్యాలయాలపై రాని క్లారిటీ..
అయితే నూతన రాజధానిలో శాఖ కార్యాలయలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు.. ఆ బాధ్యతను హెచ్‌వోడిలకు అప్పగించారు. రాజధానిలో పని చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఇప్పటి నుంచే చేసుకోవాలంటూ ప్రభుత్వ శాఖా విభాగాల ఆధిపతులకు అదేశించారు. అయితే ఇప్పటికే ఉద్యోగుల తరలింపుపై మూడు రకాల అప్షన్ లు ఇచ్చింది ఏపీ సర్కార్. నవంబర్,ఫిబ్రవరీ మాసాంతం జూన్ 1 నాటికి తరలివెళ్ళేవారి వివరాలు కోరింది. దీనిలో జూన్ 1 నాటికి తరలివెళ్ళేదుకే మెజారిటీ ఉద్యోగులు సంసిద్ధత వ్యక్తం చేసారు.

ఉద్యోగుల అభ్యంతరాలపై సర్కార్ దృష్టి..
ఉద్యోగులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై గతంలోనే ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఏపీ కి తరలివెళ్ళే వారి పిల్లలకు వారు కోరిన చోట స్ధానికత ఇచ్చే అంశంపై ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖరాసింది. జూన్ 2017 కటాఫ్ డేట్ గా పెట్టింది. ఇక హెచ్ఆర్ఏ పై కూడా ఉద్యోగులు కోరిన మేర రాజదానిలో 30 పర్సెంట్ ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇక రాజధాని ప్రాంతానికి శాఖా కార్యాలయాల తరలింపుపై అవసరమైన మౌలిక వసతులపై ప్రభుత్వం క్లారిటీతో ఉంది. సచివాలయం సింహబాగం గన్నవరంలోని మేథా టవర్స్ లో ఏర్పాటు చేసేందుకు సంసిద్దత వ్యక్తంచేస్తోంది. ఇకపోతే ఇప్పటికే పలు శాఖలు నూతన రాజధాని కేంద్రంగా పాలన కొనసాగిస్తుండగా సిఎస్ ఇచ్చిన అదేశాలతో సచివాలయం ఆసాంతం విజయవాడకు తరలిపోనుంది.

నల్లాకుల వారి పాలెం వద్ద రోడ్డు ప్రమాదం..

పశ్చిమగోదావరి : జిల్లా పెరవలి మండలం నల్లాకుల వారి పాలెం ఆరో నెంబర్ జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. 

చెన్నై ఎయిర్ పోర్టు మూసివేత..

చెన్నై : భారీ వర్షాల కారణంగా చెన్నై ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే వరద హెచ్చరికలు జారీ చేసింది. 

సారంగి కళాకారులు సబ్రీఖాన్ కన్నుమూత..

ఢిల్లీ : ప్రముఖ సారంగి కళాకారుడు సబ్రీఖాన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధ పడుతున్న ఆయన సోమవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సబ్రీ కుమారుడు కమల్ పేర్కొన్నారు.

 

హస్తినకు తెలంగాణ మంత్రులు...

హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసేందుకు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ ఆలీ, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిలు హస్తినకు బయలుదేరి వెళ్లారు. బుధవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తో భేటీ కానున్నారు. 

తమిళనాడులో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు..

చెన్నై : తమిళనాడులో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వరద సహాయక చర్యల్లో 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. భారీ వర్షాల కారణంగా రైల్వే శాఖ అధికారులు 11 రైళ్లను రద్దు చేశారు. మరో 11 రైళ్లను దారి మళ్లించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో మూడు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని 12 శాసనమండలి సభ్యుల ఎన్నికకు బుధవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. స్థానిక సంస్థల కోటాలో సభ్యుల ఖాళీలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో 12 స్థానాలున్నాయి. ఆదిలాబాద్ -1, నిజామాబాద్ -1, మెదక్ -1, నల్గొండ -1, వరంగల్ -1, ఖమ్మం -1, కరీంనగర్ -2, రంగారెడ్డి -2, మహబూబ్ నగర్ -2 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 

Don't Miss