Activities calendar

03 December 2015

21:36 - December 3, 2015

హైదరాబాద్ : భారత క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు, రెండు ట్రిపుల్ సెంచరీల మొనగాడు వీరేంద్ర సెహ్వాగ్ ను....అతని హోం గ్రౌండ్ న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో బిసిసిఐ ఘనంగా సత్కరించింది. 14 సంవత్సరాలపాటు భారత క్రికెట్ కు అసాధారణ సేవలు అందించిన ఢిల్లీ డైనమైట్ వీరేంద్ర సెహ్వాగ్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

వీరూ..తన కెరియర్ లో.....

37 సంవత్సరాల వీరూ..తన కెరియర్ లో 104 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 23 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలతో 8వేల 586 పరుగులతో 49.34 సగటు నమోదు చేశాడు. అంతేకాదు..251 వన్డే మ్యాచ్ ల్లో 15 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలతో సహా 8వేల 273 పరుగులు సాధించాడు. భారత టెస్ట్ చరిత్రలో 82.23 స్ట్రయిక్ రేట్ తో పాటు రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఒకే ఒక్కడు వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే కావడం విశేషం.

రిటైర్మెంట్ టెస్ట్ మ్యాచ్ ఆడటానికి అనుమతి నిరాకరణ...

37 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ టెస్ట్ మ్యాచ్ ఆడటానికి వీరూను బోర్డు అనుమతించలేదు. అయితే...న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఆఖరిటెస్ట్ ప్రారంభానికి ముందు నిర్వహించిన కార్యక్రమంలో...వీరూకి ఓ జ్ఞాపిక ఇచ్చి..బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ సత్కరించారు. వీరేంద్ర సెహ్వాగ్ ను కొహ్లీ, ఇశాంత్ శర్మ, భారతజట్టు ఇతర సభ్యులు సైతం అభినందించారు.

తన ఉన్నతికి తోడ్పడిన వారికి కృతజ్ఞతలు...

క్రికెటర్ గా తన ఉన్నతికి తోడ్పడిన తొలికోచ్ నుంచి ఫిజియో థెరపిస్ట్ లు, ట్రెయినర్లు, కెప్టెన్లు రవీంద్ర జడేజా, సౌరవ్ గంగూలీ, అనీల్ కుంబ్లే, మాస్టర్ సచిన్ టెండుల్కర్ లకు వీరూ కృతజ్ఞతలు తెలిపాడు. అయితే..ఆరేళ్లపాటు ధోనీ కెప్టెన్సీలో ఆడిన వీరూ...జార్ఖండ్ డైనమైట్ పేరు ప్రస్తావించకపోవడం విశేషం. ఈ కార్యక్రమానికి వీరూ తల్లి కృష్ణ సెహ్వాగ్, భార్య ఆర్తి, ఇద్దరు కుమారులు ఆర్యవీర్, అరిహంత్ సైతం హాజరయ్యారు. రిటైర్మెంట్ తర్వాత..అమెరికాలో ఇటీవలే ముగిసిన ఆల్ స్టార్స్ క్రికెట్ సిరీస్ లో వీరేంద్ర సెహ్వాగ్ పాల్గొన్న సంగతి తెలిసిందే.

21:32 - December 3, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ కేజీ బేసిన్‌లో రిలయన్స్‌ బండారం బయటపడింది. ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జిసి క్షేత్ర సరిహద్దుల్లో బావులు తవ్వడం ద్వారా మోసానికి పాల్పడింది. రిలయన్స్‌ నిర్వాకం వల్ల ఓఎన్‌జిసికి భారీ నష్టం వాటిల్లందని అమెరికాకు చెందిన డి అండ్‌ ఎం సంస్థ తేల్చింది. రిలయన్స్‌ వల్ల భవిష్యత్తులో ఓఎన్‌జిసికి చెందిన ఐదు నిక్షేపాల ఉత్పత్తిపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఓఎన్‌జిసి నిక్షేపాలకు ఎసరు పెట్టిన రిలయన్స్.....

ఆంధ్రప్రదేశ్‌ తీరంలో ఓఎన్‌జిసి కనిపెట్టిన ఐదు నిక్షేపాలు రిలయన్స్‌ సంస్థ కారణంగా ఇబ్బందుల్లో పడ్డాయి. అవి క్రమంగా వట్టిపోయే ప్రమాదం ఏర్పడింది. వీటిలోని రెండు నిక్షేపాలు పక్కనే ఉన్న రిలయన్స్ బావుల్లోకి వెళ్లిపోయినట్టు డల్లాస్‌కు చెందిన డిగోయ్‌లర్‌ అండ్‌ మెక్‌నాటన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో తేలింది.

ఓఎన్‌జిసి క్షేత్ర సరిహద్దులో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ బావులు....

ఏపి కేజీ బేసిన్‌ తీరంలో ఓఎన్‌జిసి క్షేత్ర సరిహద్దులో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ బావులు తవ్వడం ద్వారా తన డి6 క్షేత్రానికి గ్యాస్‌ పారించుకుందని డి అండ్‌ ఎం సంస్థ తన నివేదికలో స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 2009 నుంచి రిలయన్స్‌ సంస్థ 11 వేల 55 కోట్ల విలువైన 8 వేల 9 వందల 81 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ను ఓఎన్‌జిసి నుంచి తోడేసిందని నివేదిక పేర్కొంది. దీంతో ఓఎన్‌జిసి భారీగా గండి పడింది.

రెండేళ్ల క్రితం కోర్టుకెక్కిన ఓఎన్జీసీ సంస్ధ ....

ఈ విషయంలో ఓఎన్జీసీ సంస్ధ రెండేళ్ల క్రితం 2013లోనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సూచనతో అమెరికాకు చెందిన ఓ స్వతంత్ర సర్వే సంస్ధ డి అండ్ ఎమ్ సంస్థ విచారణకు ఓఎన్‌జిసి, రిలయన్స్ అంగీకరించాయి. దీనిపై పూర్తి విచారణ జరిపిన డి అండ్‌ ఎమ్‌ సంస్థ తుది నివేదికను డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రో కార్బన్‌కు సమర్పించింది. ఆ నివేదికలో రిలయన్స్ సరిహద్దు ఆక్రమణ వాస్తవమే తేలింది.

ఓఎన్‌జిసికి ఆరు నెలల్లో నష్టపరిహారం ....

డి అండ్‌ ఎం కంపెనీ ధృవీకరిస్తే ఓఎన్‌జిసికి ఆరు నెలల్లో నష్టపరిహారం చెల్లిస్తామని కేంద్రం ప్రకటించింది. రిలయన్స్‌ నిర్వాకం నిజమని తేలడంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇపుడు ఆసక్తిగా మారింది. ఉత్పత్తిలో రెండు కంపెనీలు భాగస్వామ్యం కావడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుంటాయా అన్నది వేచి చూడాలి.

21:15 - December 3, 2015

హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమిళనాడు రాష్ట్రాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. చెన్నై నగరంలో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించిన ప్రధాని మోడీ తక్షణ సాయం కింద వెయ్యి కోట్ల రూపాయలను ప్రకటించారు. తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం అండగా నిలుస్తుందని మోడీ ప్రకటించారు.

ఫొటో ప్రదర్శనను పరిశీలించిన ప్రధాని...

భారీ వర్షాలతో అతలాకుతులమైన తమిళనాడు రాష్ట్రానికి తోడ్పాటు అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. తమిళనాడులో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు మోదీ ప్రత్యేక విమానంలో చెన్నై సమీపంలోని వేలూరు ఎయిర్‌బేస్‌లో దిగారు. విమానాశ్రయంలో ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వరద పరిస్థితిని వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను ఆయన పరిశీలించారు.

పలు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే .....

వాయుసేనకు చెందిన హెలికాప్టర్‌లో చెన్నై సహా, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేశారు. వరద పరిస్థితిపై అధికారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. వరద పరిస్థితిని చూసి ప్రధాని మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విపత్తు నివారణ చర్యలపై ప్రధాని మోడీ ఆరా తీశారు. అలాగే నష్ట నివారణకు తీసుకుంటున్న చర్యలపై సైతం మోడీ వివరాలు తెలుసుకున్నారు

సీఎం, గరవ్నర్ తో మోదీ భేటీ....

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జయలలిత, గవర్నర్ రోశయ్యతో ప్రధాని భేటీ అయ్యారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో అధిక నష్టం వాటిల్లిందని.. కేంద్రం తరపున తమను ఆదుకోవాలని సీఎం జయలలిత మోదీని కోరారు. దీనిపై మోదీ స్పందిస్తూ తమిళనాడుకు తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ప్రధాని మోడీ ఆపదలో ఉన్న చెన్నై నగరాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని తెలిపారు. అదే విధంగా కేంద్రం నుంచి తమిళనాడుకు వీలైనంత సహాయం అందిస్తామని మోడీ తెలిపారు.

గాంధీ లో స్వైన్‌ఫ్లూతో మహిళ మృతి

సికింద్రాబాద్ : గాంధీ ఆస్పత్రిలో మరో స్వైన్‌ఫ్లూ మృతి నమోదైంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ వేంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన సూర్యకుమారి (55) తీవ్రమైన జ్వరంతో సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చేరింది. నిర్ధారణ పరీక్షల్లో స్వైన్‌ఫ్లూ పాజిటివ్ రావడంతో మెరుగైన చికిత్స కోసం గత నెల 29వ తేదీన గాంధీ ఆస్పత్రిలో రిఫరల్‌పై చేరింది. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం సూర్యకుమారి మృతి చెందింది. ప్రస్తుతం స్వైన్‌ఫ్లూ వార్డులో ముగ్గురు, డిజాస్టర్ వార్డులో ఐదుగురు స్వైన్‌ఫ్లూ అనుమానితులకు వైద్యం అందిస్తున్నారు.

20:49 - December 3, 2015

ఫేస్ బుక్ అధినేత జుకెన్ బర్గ్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ప్రశంసలు కురిపిస్తోంది. జుకెర్ బర్గ్ దంపతులకు కూతురు పుట్టిన నేపథ్యంలో ఫేస్ బుక్ లోని 99 శాతం వాటాను ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తిగత శిక్షణ, వ్యాదులకు చికిత్స, ప్రజల మధ్య అనుసందానం, బలమైన సమాజాల నిర్మాణం వంటి అంశాలపై దృష్టి పెట్టడానికి వినియోగించినట్లు ప్రకటించారు. తన కుమార్తెకు జుకెన్‌ బర్గ్‌ దంపతులు 'మ్యాక్స్' అని నామకరణం చేశారు. తన కుమార్తె పెరిగే ప్రపంచం.. అందమైన నందనవనంలా ఉండాలని ఆ తండ్రి కలగన్నాడు. అలాంటి ప్రపంచాన్ని సాకారం చేసేందుకు తన సంపదనంతా ధారబోశాడు. భావితరాలకు ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని అందించగలమా? అభద్రతకు తావులేని సమాజాన్ని సృష్టించగలమా? జుకెన్ బర్గ్ స్వప్నం నెరవేరుతుందా? నేటి వైడాంగిల్ లో ఈ అంశంపై విశ్లేషణ చేశారు. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:43 - December 3, 2015

ప్రపంచం సుట్టుముట్టు తిర్గి మనకోసం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిండు మన మల్లన్న. అందరకి శనార్థులు అనుకుంట మల్లన్న రచ్చ బండ మీదికి వచ్చి కూసుండు. రాష్టంల జరిగిన ఘరం ఘరం ముచ్చట్లు చెప్ప్తుండు. వినుండ్రి.. 
'అమ్మరాజ్యంల అనంతమైన ఆపతి.. వరద సాయానికి కేంద్రమొల్ల సోపతి'.
'జి.హెచ్.ఎం.సి ఓట్ల కోసం పార్టీలోల్ల ఆరాటం. ఇంకా పాత సమస్యల తోనే పబ్లిక్ పోరాటం'.
తిట్టీ తిట్టి మెచ్చుకున్న ఆనం వివేకం.. పార్టి మారకపోతే మిగిలేది అవివేకం'..
ఇంట్ల సగం ఓడిపోయినా మోడీ సార్.. గుజరాత్ ఓట్లల్ల కళ తప్పిన కమలం'.
'యాగాలకు కొత్త అర్థం దొర్కవట్టిండ్రు.. వర్కర్లంతా నిరసన బాటలు పట్టిండ్రు'.
'పోరన్ని పొర్క పొర్క గొట్టిన పోలీసోళ్లు. సస్పెండ్ చేసేదాక ఉరుకోని మీడియా వోల్లు'.
ఇది సదివితే సక్కగా అర్ధం కాలేదా? అయితే 'వీడియో' సూడుండ్రి.. మాస్త్ ఎంజాయ్ చెయ్యండ్రి.

19:56 - December 3, 2015

వివిధ హెచ్ వోడీలతో ముగిసిన జవహర్ రెడ్డి కమిటీ భేటీ

హైదరాబాద్ : ఏపీ సచివాలయంలో వివిధ హెచ్ వోడీలతో జవహర్ రెడ్డి కమిటీ భేటీ ముగిసింది. ఏపీకి కార్యాలయాల తరలింపునకు కమిటీ 3 ఆప్షన్లు సూచించినట్లు సమాచారం. రెండు వారాల్లో ఈ కమిటి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

ఏపీలో మరో ఐటీడీఏ ఏర్పాటు

హైదరాబాద్ : రాష్ట్రంలో మరో ఐటీడీఏ ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తూ.గో జిల్లా చింతూరు కేంద్రంగా ఐటీడీఏను ఏర్పాటు చేసింది. ఏటపాక, కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం మండలాలకు ఈ ఐటీడీఏ సేవలందిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.

ఫూంచ్ సెక్టార్ లో ముగ్గురు ఉగ్రవాదలు హతం...

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని ఫూంచ్ సెక్టార్ సరిహద్దులో ఉగ్రవాదులు భారీ ఎత్తున చొరబాటుయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు సరిహద్దు వెంబడి కాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి.

ఢిల్లీ ఎమ్మెల్యేల వేతనాలు పెంపు

హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీ ఎమ్మెల్యేలకు వేతనాలు పెంచు తూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు రూ. 13 వేల నుంచి రూ. 50 వేలకు పెంపు, మంత్రులకు రూ. 20 వేల నుండి రూ. 80 వేలకు పెంచింది.

19:31 - December 3, 2015

హైదరాబాద్ : నీతి లేదు. రీతి లేదు. ప్రజాతీర్పుకు విలువే లేదు. అధికారమే పరమావధి. పదవులే తాయిలం. ఏళ్లకు ఏళ్లుగా పార్టీలో పాతుకుపోయినా...కొన్నాళ్లు, కొన్నేళ్లు పవర్‌లో చేతిలో లేకపోతే ఉండలేకపోతున్నారు నేతలు. గోడ దూకి విపక్షం నుంచి అధికారపక్షానికి జంపవుతున్నారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వలసలు తారాస్థాయికి చేరాయి.

తెలుగు రాష్ట్రాల్లో జోరుగా రాజకీయ వలసలు .....

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వలసలు జోరుగా సాగుతున్నాయి. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అన్నట్టు చొక్కాలను మార్చినంత సులువుగా పార్టీలను మార్చేస్తున్నారు. పార్టీల కండువాలను కప్పేసుకుంటున్నారు. ఎన్నడూ లేనంతగా రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల్లో జంపింగ్ జపాంగ్‌లు పెరిగిపోయారు. అధికార పార్టీలోకి మారిపోతున్నారు.

చంద్రబాబు సమక్షంలో సైకిల్‌ ఎక్కిన ఆనం సోదరులు ....

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తరపున అనేక మార్లు గెలిచి, వివిధస్థాయిలో మంత్రి పదవులను పొందిన నేతలు ఆనం సోదరులు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్‌లో తరతరాల నుంచి ఖద్దరు పార్టీలో వెలిగారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సమీప భవిష్యత్తులో నిలబడే ఛాన్సు లేదని గ్రహించి ఖద్దరు కండువా దింపేశారు. చంద్రబాబు సమక్షంలో సైకిల్‌ ఎక్కి....అధికార సవారీకి సిద్దమవుతున్నారు.

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌లోకి వలసల పర్వం.....

ఇక తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌లోకి వలసలు ఆగడం లేదు. విడతల వారీగా తెలుగుదేశం,కాంగ్రెస్ నేతలు కారులో ఎక్కేందుకు క్యూకడుతున్నారు. మొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి,మంచి రెడ్డి కిషన్ రెడ్డి, ధర్మారెడ్డితో పాటు ఎంతో మంది నేతలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో ఒక పార్టీ గుర్తు మీద గెలిచి, ఎమ్మెల్యే పదవిని అలాగే అంటిపెట్టుకోవడమే కాదు.. మంత్రి పదవి అనుభవిస్తున్న ప్రజాప్రతినిధులూ ఉన్నారు. ఇక తాజాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గులాబీ బాస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు మరింత పదును పెట్టారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కేసీఆర్ ను కలిసి అధికార పార్టీలోకి చేరుతున్నట్టు ప్రకటించారు.

రేపో మాపో అన్నట్లు దానం నాగేందర్....

కాంగ్రెస్‌ నేత దానం నాగేందర్‌ పరిస్ధితి అయితే రేపో మాపో అన్నట్లే ఉంది. పైకి ఆయన ఖండిస్తున్నా నమ్మలేమంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఇక లేటెస్టుగా టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ ప్రభాకర్. హైదరాబాద్‌ పట్ల కేసీఆర్ విజన్ అద్భుతంగా ఉందని, ఆయన ప్రణాళికలే స్ఫూర్తిగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు.

పార్టీ బలోపేతానికి కేసీఆర్ ఆపరేషన్‌ ఆకర్ష్‌......

రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వలసల జోరు పెరిగింది. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, తాజా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు..ఇలా ఎందరో ఉన్నారు. తెలంగాణలో గ్రామగ్రామాన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇటు కేసీఆర్ ఆపరేషన్‌ ఆకర్ష్‌ను యుద్ధస్థాయిలో చేపట్టారు. రాబోయే రోజుల్లో టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అటు ఏపీలో కూడా చంద్రబాబు వలసలను ప్రోత్సహిస్తున్నారు.

అధికారానికి దాసోహం......

ఇలా అధికారమే పరమావదిగా నేతలు పార్టీల కండువాలను మార్చేస్తున్నారు. ప్రజాతీర్పును అవహేళన చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లొసుగులే ఆధారంగా అధికారానికి దాసోహమవుతున్నారు. అన్ని పార్టీల కండువాలను జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు. కానీ పూటకో పార్టీ మార్చే నేతలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

19:27 - December 3, 2015

విజయవాడ : ఆదాయం అంతంతమాత్రంగా ఉంది... దీనికితోడు ఎక్సైజ్‌, కమర్షియల్ టాక్స్ శాఖలనుంచి ఆశించినస్థాయిలో సహకారం అందలేదు.. పైగా కేంద్రంనుంచి రెగ్యులర్‌గా రావాల్సిన 27వేల కోట్లు ఇంకా అందలేదు... దీంతో ఏపీ ఆర్థిక పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది..

ప్రధాన శాఖలన్నీ 90శాతం ఆదాయాన్ని మాత్రమే ...

రాష్ట్రం ఏర్పాటై ఏడాదిన్నర కావస్తున్నా ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతూనేఉన్నాయి.. తొలి ఆర్థిక సంవత్సరంలో ప్రధాన శాఖలన్నీ 90శాతం ఆదాయాన్ని మాత్రమే చేరుకున్నాయి... మిగతా శాఖల పరిస్థితి దాదాపు అలాగే ఉంది..... రాబోయే బడ్జెట్‌లోగా ఈ సమస్యల పరిష్కరించాలని ఏపీ సర్కారు తీవ్రంగా కృషి చేస్తోంది.. బడ్జెట్‌ అంచనాలపై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దాదాపు 7వేల కోట్ల రూపాయలవరకూ ఆదాయం తగ్గిందని అంచనావేశారు.. స్టాంపులు, రిజిస్ట్రేష‌న్ల శాఖ, మైన్స్, అట‌వీ శాఖ‌లు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్నాయి.. ఎక్సైజ్‌, కమర్షియల్ టాక్సు శాఖలవల్ల రెవెన్యూ లోటు ఉందని ఆర్థిక శాఖ స్పష్టం చేస్తోంది..

రూ. 10వేల కోట్లు అదనంగా ఖర్చయిందంటున్న అధికారులు....

ఇక బడ్జెట్‌లో కేటాయింపులకంటే ఖర్చు ఎక్కువగా ఉందని అధికారులు అంచనావేస్తున్నారు.. ఇలా దాదాపు 10వేల కోట్లు అదనంగా ఖర్చయిందని చెబుతున్నారు.. రుణ‌మాఫీ కోసం బ‌డ్జెట్‌లో నాలుగు వేల కోట్లు కేటాయించ‌గా..... ఏడు వేల కోట్లకుపైగా విడుద‌ల చేసారు. సాగునీటి ప్రాజెక్టులు, డ్వాక్రా మ‌హిళ‌లకోసం పెద్ద మొత్తంలో నిధులు విడుద‌ల చేశారు.. దీనికి తగినట్లు రుణాలుకూడా తెచ్చుకుంది ఏపీ ప్రభుత్వం... 17వేల కోట్ల రుణం తీసుకునే అవకాశం ఉండగా... ఇప్పటికే దాదాపు 10వేల కోట్లు అప్పుగా తెచ్చుకుంది.. రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ లోటు భర్తీకోసం కేంద్రం 14వేల 409 కోట్లు ఇవ్వాల్సిఉండగా... 2వేల 300కోట్లు మాత్రమే భర్తీ చేసింది.. ఈ లోటును త్వరగా భర్తీ చేస్తే ఆర్థిక శాఖపై భారం తగ్గుతుందని సర్కారు భావిస్తోంది.. ఈ నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతోంది..

లింగంపల్లి రైల్వేస్టేషన్ లో గోనె సంచిలో యువతి మృతదేహం

హైదరాబాద్ : లింగంపల్లి రైల్వే స్టేషన్ లోని రెండో నెంబర్ ప్లాట్ పాం పై గోనె సంచిలో యువతి మృతదేహం లభ్యమయింది. హత్య చేసి ఫ్లాట్ ఫాం పై దుండగులు పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మంత్రి కేటీఆర్ కు ఈసీ నోటీసులు

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. సచివాలయంలో టీఆర్ ఎస్ లో ఎంపీటీసీల చేరికపై ఈసీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

17:55 - December 3, 2015

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ పరిధిలో గృహ విద్యుత్‌, మంచినీటి బకాయిలు రద్దు చేయాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించింది. ఎన్నికల కోడ్‌ అనంతరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. నగరంలో 6 లక్షల గృహ విద్యుత్‌ వినియోగదారులు దాదాపు 128 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. అదేవిధంగా 295 కోట్ల రూపాయలు మంచినీటి బిల్లులు బకాయిలు ఉన్నారు. వీటన్నింటిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

17:54 - December 3, 2015

హైదరాబాద్ : అటవీ గ్రామాలు పోలీసు బూట్ల చప్పుళ్లతో మార్మోగుతున్నాయి...ఏజెన్సీ రహదారులపై బలగాలు మోహరిస్తున్నాయి... తనిఖీలు.. కూంబింగ్ లతో అడవితల్లి ఒడిలో గ్రౌహౌండ్స్ బలగాలు హడావుడి చేస్తున్నాయి...టార్గెటర్లంతా పల్లెలు విడిచి పట్టణాల బాట పట్టారు...అడుగడుగునా నిఘాతో పోలీసు శాఖ అప్రమత్తమవుతోంది... ఇంతకీ ఏం జరుగుతోంది? ఎందుకీ హై అలర్ట్ వాచ్ దిస్ స్టోరీ.

డిసెంబర్ 2 నుంచి 8 వరకు పీపుల్స్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలు.....

సరిగ్గా పదిహేనేళ్ల కిందట కొయ్యూరులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్ అగ్రనేతలు నల్లా ఆదిరెడ్డి అలియాస్ శ్యాం, ఎర్రంరెడ్డి సంతోష్, శీలం నరేశ్ మృతిచెందారు. ఆనాటి నుంచి మావోయిస్టులు ప్రతీఏటా డిసెంబర్ 2 నుంచి 8 వరకు వారం రోజులపాటు పీపుల్స్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల పాటు సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి వారి త్యాగాలను స్మరించుకుంటారు. ప్రస్తుత పరిస్థితులను సమీక్షిస్తూ భవిష్యత్ కార్యాచరణకు వ్యూహాలు రచిస్తారు. అడవిలో అలజడికి, పోలీసుల హడావుడికి ఇదే కారణం.

దంతెవాడ,నారాయణపూర్, కాంకేర్, సుకుమాలో ప్రభావం ...

పీపుల్స్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలను తమ విస్తరణకు ఉపయోగించుకుంటున్నారు మావోయిస్టులు. అమర వీరులకు నివాళులర్పించటంతోపాటు తమ ఉద్యమాన్ని విస్తరించటం లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. తెలంగాణ సరిహద్దు ఛత్తీస్ ఘడ్లోని దంతెవాడ, నారాయణపూర్, కాంకేర్, సుకుమాతోపాటు పలు జిల్లాల్లోని దండకారణ్యంలో మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉంది.

పార్టీ విస్తరణపై మావోయిస్టులు దృష్టి....

కొంతకాలంగా తెలంగాణాలో పార్టీ విస్తరణపై మావోయిస్టులు దృష్టిపెట్టినట్టు చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ డివిజన్లలో కదలికలను పెంచారు. భద్రాచలం డివిజన్లోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు ప్రాంతాల్లో నిత్యం అలికిడి కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం భద్రాచలంకు చెందిన ఆరుగురు టిఆర్ఎస్ నేతలను మావోయిస్టులు కిడ్నాప్ చేసి మూడు రోజుల అనంతరం విడుదల చేశారు. ఈ ఘటన పోలీస్ లకు షాక్ నిచ్చింది.

బూటకపు ఎన్ కౌంటర్లు, గ్రీన్ హంట్ నిలిపివేయాలని డిమాండ్ ........

రెండు రోజుల క్రితం ఏకంగా భద్రాచలంలోని సిఆర్పీఎఫ్ క్యాంపుకు అతి సమీపంలో మావోయిస్టుల కరపత్రాలు వెలిశాయి. ప్రధానంగా బూటకపు ఎన్ కౌంటర్లు, గ్రీన్ హంట్ ను నిలిపివేయటంతోపాటు, మవోయిస్టుల అజెండా తమ అజెండాగా చెప్పి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం పాలకపక్ష పద్దతులనే అనుసరిస్తోందని మావోయిస్టులు కరపత్రాల్లో ఆరోపించారు. మరోవైపు మావోయిస్టు పార్టీలో చేరాలంటూ యువతీ, యువకులకు పిలుపునిచ్చారు. ఈ పరిణామాలను గమనిస్తే తెలంగాణాలో పార్టీ విస్తరణకు మావోయిస్టులు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది.

దండకారణ్యం సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్ ముమ్మరం...

వారోత్సవాల సందర్భంగా భారీ విధ్వంసాలకు మావోయిస్టులు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో దండకారణ్యం సరిహద్దుల్లో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. మావోయిస్టు చర్యలను భగ్నం చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. ఏజెన్సీప్రాంతాల్లో ప్రత్యేక పోలీసులను మోహరించి అటవీ గ్రామాలను జల్లెడ పడుతున్నారు. మాజీలు, సానుభూతిపరులపై నిఘా పెట్టారు. ఇప్పటికే వారిని ఠాణాలకు పిలించుకుని కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సమాచారం. మొత్తానికి అటు మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు, ఇటు పోలీసుల అలజడి అడవిలో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.

17:51 - December 3, 2015

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి నిర్వహిస్తున్న చండీ యాగంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ యాగానికి పలువురు రాష్ట్ర మంత్రులు ఎంపీలు , రాష్ట్ర ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

17:49 - December 3, 2015

హైదరాబాద్ : ఢిల్లీలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు రెండోరోజు కూడా వివిధ కేంద్రమంత్రులను కలిశారు. ఎఫ్ఆర్ బిఎం పరిమితి పెంచాలని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీని కలిసి విజ్ఞప్తి చేశారు. దాదాపు 7వేల కోట్ల జీఎస్టీ బకాయిలను విడుదల చేయాలని విన్నవించారు. అలాగే రక్షణమంత్రి మనోహర్ పారికర్‌తో భేటి అయిన మంత్రులు,ఎంపీల బృందం...సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్డు వివాదం గురించి మరోసారి చర్చించారు. అలాగే రక్షణ శాఖకు సంబంధించి తెలంగాణాకు ప్రాజెక్టులు ఇవ్వాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలో శాశ్వత ఆర్మీ రిక్రూట్ మెంట్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అడిగారు. వీటన్నింటిపై కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించారని రాష్ట్రమంత్రులు,ఎంపీల బృందం తెలిపింది.

17:47 - December 3, 2015

హైదరాబాద్ : ఓయూలో బీఫ్‌ ఫెస్టివల్‌ను అడ్డుకుంటామని ఎమ్మెల్యే రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలపై విద్యార్ధులకు హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 10వ తేదీన బీఫ్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామని విద్యార్ధులు తెలిపారు. ఎవరైనా అడ్డుకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

 

17:45 - December 3, 2015

హైదరాబాద్ : బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే తనను ఆపార్టీలో చేరేలా చేశాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ప్రభాకర్‌ అన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే అది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వల్లే సాధ్యమని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ఒక గొప్ప విజన్‌తో ముందుకెళ్తున్నారని..దాంతో తప్పకుండా తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందంని ప్రభాకర్ తెలిపారు.

17:43 - December 3, 2015

కరీంనగర్‌ : జిల్లాలో దారుణం జరిగింది. పెద్దపల్లి మండలం హన్మంతునిపేటలో ఇటుకబట్టిలో మహిళ కార్మికురాలిపై సూపర్‌వైజర్‌ దాడి చేశాడు. సరిగా పని చేయడం లేదంటూ ఆమెను కొట్టాడు. తీవ్రగాయాలైన మహిళ కార్మికురాలు మృతి చెందింది. విషయం తెలుసుకున్న తోటి కార్మికులు.. బాధితురాలు కుటుంబానికి న్యాయం చేయాలంటూ కార్మికశాఖ ఎదుట ఆందోళన చేపట్టారు.

తమిళ ప్రజలకు అండగా ఉంటాం : ప్రధాని మోదీ

చెన్నై : తమిళనాడు లో వరద ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. తమిళనాడు ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ. 940 కోట్ల సాయం ప్రకటించామని, మరో రూ.1000 కోట్ల సాయాన్ని మోదీ ప్రకటించారు.

గ్రేటర్ లో విద్యుత్, నల్లా బకాయిల మాఫీ

హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో విద్యుత్, నల్లా బకాయిలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 128 కోట్ల విద్యుత్ బకాయిలు, రూ. 290 కోట్ల నల్లా బకాయిలు మాఫీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

తమిళనాడుకు వెయ్యి కోట్ల సాయం : ప్రధాని మోదీ

హైదరాబాద్ : తమిళనాడులో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసేందుకు వచ్చిన ప్రధాని సీఎం జయలలితో భేటీ అయ్యారు. వరద పరిస్థితులపై ప్రధాని జయను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి తక్షణ సాయం కింద రూ. వెయ్యి కోట్లు ఇవ్వనున్నట్లు మోదీ ప్రకటించారు.

సీఎం జయలలితతో భేటీ అయిన ప్రధాని మోదీ

చెన్నై: భారీ వరదలతో అతలాకుతలమైన చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రత్యేక విమానంలో వేలూర్‌, రాజాలి ఎయిర్‌బేస్‌కు చేరుకున్న మోదీ, వరద నష్టంపై ఎయిర్‌పోర్టులో అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌లో ఫొటోలను ఆయన పరిశీలించారు. వరదలో వాటిల్లిన నష్టంపై ఆరా తీశారు. ఏరియల్ సర్వే అనంతరం నరేంద్ర మోదీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితో భేటీ అయ్యారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు.

లోకేశ్ తో కంటోన్మెంట్ టిడిపి నేతల భేటీ

హైదరాబాద్ : టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తో కంటోన్మెంట్ టిడిపి నేతలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ భేటీ అయ్యారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న టిఆర్ ఎస్ లో చేరిన సందర్భంగా వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

16:52 - December 3, 2015

హైదరాబాద్ : విశాఖ ట్రాఫిక్స్‌ పోలీసు విభాగం వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైంది. హ్యాక్‌ చేసిన వెబ్‌సైట్‌లో పాకిస్థాన్‌ జాతీయ జెండాను పోస్టు చేశారు. దీంతో ట్రాఫిక్స్‌ సూచనలు, సలహాలకు ఈ సైట్‌ను చూసేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

చట్టాలు, ఫైన్లు, అధికారుల ఫోన్‌ నంబర్లు ..

విశాఖలో వాహనచోదకుల కోసం ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ సమాచారం చేరవేసేందుకు ఏడాది క్రితం వెబ్‌సైట్‌ ప్రారంభించారు. ట్రాఫిక్‌ నియమనిబంధనలు, చట్టాలు, ఫైన్లు, అధికారుల ఫోన్‌ నంబర్లు దీనిలో ఉంచారు. ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కూడా ఉంది.

వీటితోపాటు నగరంలోని నిషిద్ధ ప్రాంతాల రూట్‌మ్యాప్‌లను అందుబాటులో ఉంచారు. అటువంటి ట్రాఫిక్‌ పోలీసు వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురవడంతో అందర్నీ ఆందోళనకు గురిచేసింది.

నౌకాదళ శాస్త్ర, సాంకేతిన పరిశోధనా సంస్థ ..........

విశాఖ తూరు నౌకాదళం ప్రధాన కేంద్రం. యుద్ధనౌకలు, జలాంతర్గాములకు స్థావరం. రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థకు చెందిన నౌకా శాస్త్ర, సాంకేతిక పరిశోధనా సంస్థ ఉంది. పోర్టుతోపాటు రక్షణశాఖకు చెందిన నౌకా నిర్మాణ కేంద్రం ఉంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలతోపాటు, పరిశ్రమలు ఉన్నాయి. ఇటువంటి కీలక నగరానికి చెందిన ట్రాఫిక్‌ పోలీసు వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురికావడంతో అందరూ కలవరడ్డారు. వీటికి సంబంధించిన సమాచారం, రూట్‌మ్యాప్‌లు సంపాదించేందుకే హ్యాకర్లు దాడి చేసి ఉండొచ్చని అనుమానించారు. విశాఖ ట్రాఫిక్‌ పోలీసు వెబ్‌సైట్‌పై దాడి చేసిన హ్యాకర్లు పాకిస్థాన్‌ జాతీయ పతాకాన్ని పోస్టు చేయడంతో అధికారులకు ముచ్చమటలు పట్టాయి.

మూడు గంటల తర్వాత వెబ్‌సైట్‌ పునరుద్ధరణ........

ట్రాఫిక్‌ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైన విషయాన్ని పోలీసులు... సైబర్‌ విభాగం దృష్టికి తెచ్చారు. వారు మూడు గంటలు కష్టపడి హ్యాకర్ల నుంచి వెబ్‌సైట్‌కు విముక్తి కల్పించి, పునరుద్ధరించారు. హ్యాకింగ్‌ విషయం బయటకు పొక్కితే పరువుపోతుందన్న ఉద్దేశంతో మూడు రోజులు పాటు పోలీసులు రహస్యంగా ఉంచారు. సమాచారం బయటకు వచ్చిన తర్వాత కూడా ట్రాఫిక్‌ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌ను చాలా చిన్న విషయంగా చూపే పయత్నం చేస్తున్నారు.

విశాఖకు పెరిగిన వీవీఐపీలు, వీఐపీల తాకిడి .....

విశాఖ పోలీసు వెబ్‌సైట్‌పై టర్కీ నుంచి హ్యాకర్లు దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు. ట్రాఫిక్‌ వెబ్‌సైట్‌ను టార్గెట్‌ చేయడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత విశాఖకు వీవీఐపీలు, వీఐపీల తాకిడి పెరిగింది. దీంతో నగరంపై ఉగ్రవాదుల కన్ను పడిందన్న అనుమానాలు లేకపోలేదు. ట్రాఫిక్‌ వెబ్‌సైట్‌పై హ్యాకర్ల దాడి తర్వాత ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలో భద్రత కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో నిఘా పెంచారు.

16:49 - December 3, 2015

హైదరాబాద్ : చేనేత కార్మికులకు మంచి రోజులు రానున్నాయి. నేతన్నల రుణాలను లక్షరూపాయల లోపు మాఫీచేస్తూ జీవో జారీ చేసింది. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్థానం మేరకు ఇటీవల నాబార్డ్ మాజీ చైర్మన్ పీ. కోటయ్య అధ్యక్షతన కమిటీ వేసింది ప్రభుత్వం. ఈ కమిటీ హ్యాండ్ లూమ్ , పవర్ లూమ్ సెక్టార్ లాంటివర్గాల వారికి రుణమాఫీ ఏ విధంగా చేయాలి అన్న దానిపై క్లారిటీ ఇచ్చింది కమిటీ.

లక్ష లోపు వ్యక్తిగత రుణాలు ఉన్నవారికే .....

ఇది ఇలా ఉండగా లక్ష లోపు వ్యక్తిగత రుణాలు ఉన్నవారికే రుణమాఫీ చేయాలని కోటయ్య కమిటీ నివేదించింది.మొత్తం చేనేత రుణమాఫీకి సంబంధించి 110 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. లక్షలోపు రుణం ఉన్న23 వేల మందికి 82 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. చేనేత సంఘాలకు 11.83 కోట్లు విడుదల చేయడంతో 16 వేల మంది లబ్ది పొందనున్నారు. ఇన్నేళ్లుగా రుణబంధీలుగా ఉన్న నేతన్నలకు ప్రభుత్వం కొంతమేర ఊరట కలిగించింది. దీంతో అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న చేనేత కార్మికులకు మొదటి విడతలో 24 వేల మంది లబ్థిపొందనున్నారు.

16:47 - December 3, 2015

గుంటూరు : గురజాలలో ఓ ఆకతాయికి స్థానికులు బుద్ది చె‌ప్పారు. తనకు అసభ్య మెసెజ్‌లు పంపుతూ వేధిస్తుండడంతో.. ఓ యువతి తనవాళ్లకు విషయాన్ని చెప్పింది. దీంతో వారంతా రంగంలోకి దిగి నాగుల్‌మీరాను పట్టుకుని దేహాశుద్ది చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.

16:45 - December 3, 2015

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపుపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 6 లక్షల 30 వేల ఓట్ల తొలగింపుపై ఈనెల 10లోగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కోర్టుకు తెలపాలని ఆదేశించింది. బీసీ గణన కూడా సరిగా జరగలేదని పిటిషనర్ తరపు లాయర్లు వాదించారు. ప్రస్తుత పరస్థితుల్లో ఈ సమస్య తీరే వరకు...జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. అయితే ప్రస్తుతం డోర్ టు డోర్ సర్వే చేస్తున్నామని ఈసీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. 22 వేల మంది మళ్లీ అప్లై చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు.

 

16:44 - December 3, 2015

ప.గో : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పశ్చిమగోదావరి జిల్లా జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. కార్యకర్తలతో పాటు సైకిల్‌ తొక్కారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్‌ కల్పిస్తామని.. బీసీలకు అన్యాయం జరగకుండా చేసే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. అవినీతితో కోట్లు సంపాదించినవారి మాటలు నమ్మొద్దంటూ జగన్‌పై విరుచుకుపడ్డారు.

16:43 - December 3, 2015

విజయవాడ : భారీ వర్షాలు, వరదలతో ఏపీలో 81 మంది చనిపోయినట్లు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప పేర్కొన్నారు. 3వేల 750 కోట్ల మేర పంట నష్టం జరిగిందని, రహదారులు అన్నీ కలిపి మరో 3 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. కేంద్రం తమిళనాడుతో పాటు ఏపీని సైతం ఆదుకోవాల్సి ఉందని చినరాజప్ప తెలిపారు.

16:41 - December 3, 2015

హైదరాబాద్ : వర్షాలు, వరదలతో నష్టపోయిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిందని చెప్పారు. హిందూపురం సమస్యలపై మాట్లాడటానికి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసినట్లు ఆయన తెలియచేశారు.

16:39 - December 3, 2015

నల్లగొండ : భువనగిరి సీసీఐ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుమారు పది లక్షల విలువైన పత్తి అగ్నికి ఆహుతి అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక షెడ్‌ లో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి.

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు వర్శిటీల బిల్లు

హైదరాబాద్ : వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు వర్శిటీల బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శాఖ గంటా శ్రీనివాసరావు తెలిపారు.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై : నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 231 పాయింట్లు నష్టపోయి 25,886 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయి 7,864 పాయింట్ల వద్ద ముగిసింది.

చెన్నై చేరుకున్న ప్రధాని మోదీ

హైదరాబాద్ : భారీ వర్షాలకు అతలాకుతలం అయిన చెన్నై, తమిళనాడులో వర్షప్రభావానికి గురైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించేందుకు ప్రధాని మోదీ చెన్నై చేరుకున్నారు.

యజమాని దాడిలో కార్మికురాలు మృతి

కరీంనగర్ : పెద్దపల్లి మండలం హన్మంతుని పేటలో దారుణం జరిగింది. ఇటుకబట్టీ లో కార్మికురాలు సరిగా పని చేయడం లేదని సూపర్ వైజర్ దాడి చేశాడు. ఈ దాడిలో కార్మికులరాలి మృతి చెందింది. దీంతో కార్మికులు, కుటుంబ సభ్యులు పెద్దపల్లి కార్మికశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

గ్రేటర్ లో ఓట్ల తొలగింపు పై విచారణ వాయిదా

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఓట్ల తొలగింపుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. తొలగించిన ఓట్లపై ఈనెల 10లోగా వివరణ ఇవ్వాలని ఈసీని ధర్మాసనం ఆదేశించింది. నోటీసులు ఇవ్వకుండానే 6.3 లక్షల ఓట్లను తొలగించారని పిటిషనర్ల తరపున న్యాయవాది వాదించారు. తమకు అందిన ఫిర్యాదులపై ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేశామని ఈసీ అధికారులు కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నుంచి తమకు నివేదిక అందాల్సి ఉందని తెలిపారు. దీంతో కోర్టు ఈ కేసుపై తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.

16:02 - December 3, 2015

హైదరాబాద్ : భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలం అవుతోంది. కుండపోత వర్షాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వరదల వల్ల వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. మరోపక్క తమిళనాడు ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న ఆ రాష్ట్రానికి చేయూతనిచ్చేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి.

తమిళనాడుకు అపార నష్టం.....

కుండపోత వర్షాలు, భారీ వరదల కారణంగా తమిళనాడుకు అపార నష్టం జరిగింది. దాదాపు15 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అసోచామ్‌ అంచనా వేసింది. చెన్నైలో కుండపోత వర్షాల వల్ల ఆర్థిక నష్టం తీవ్ర స్థాయిలో ఉందని ప్రకటించింది. వ్యాపార సంస్థలు, ట్రేడ్‌, కమర్షియల్‌ అంశాలతో పాటు సాధారణ వ్యక్తులు ఆస్తులకు భారీ నష్టం ఏర్పడిందని తెలిపింది.భారీ వర్షాల కారణంగా రన్‌వేపై వరద నీరు నిలిచిపోవడంతో చెన్నైలోని అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ నెల 6వ తేదీ వరకు ఎయిర్‌పోర్టును మూసివేస్తున్నట్లు విమానాయాన శాఖాధికారులు తెలిపారు.

సహాయం చేయడానికి టాలీవుడ్ సెలబ్రిటీలంతా....

భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న చెన్నై నగరానికి సహాయం చేయడానికి టాలీవుడ్ సెలబ్రిటీలంతా ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. అల్లు అర్జున్ భారీ విరాళం ప్రకటించారు. రూ. 25 లక్షల విరాళం అందిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మహేష్ బాబు తన వంతు సహాయంగా రూ. 10 లక్షలు సిఎం రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నానని చెప్పారు. ఎన్టీఆర్ 10 లక్షలు, కళ్యాణ్ రామ్ 5 లక్షలు తమిళ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నామని తెలిపారు. ఇక రవితేజ 5 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. యువ నటుడు వరుణ్ తేజ్ తన వంతు సహాయం గా 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. సంపూర్ణేష్ బాబు రూ. 50 వేల సహాయం ప్రకటించారు.

ముందుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం....

జల దిగ్బంధంలో ఉన్న తమిళనాడు రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిరాశ్రయులైన బాధితులకు సాయమందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. తమిళనాడు సీఎస్‌తో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎస్‌ రాజీవ్‌ శర్మ మాట్లాడారు.

16:01 - December 3, 2015

హైదరాబాద్ : చెన్నై మహానగరం వరద నీటిలో మునిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 2,400 మందిని రక్షించామని ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ తెలిపారు. సహాయక చర్యల్లో 100 బోట్లు, 29 బృందాలు పని చేస్తున్నాయన్నారు. భారత వైమానిక దళం 200 మందిని హైదరాబాద్‌కు తరలిస్తోంది. మరో వైపు ఢిల్లీ నుంచి ప్రధాని మోది చెన్నై బయల్దేరారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. మరో వైపు తమిళనాడు కోస్తా తీరంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని కేంద్ర వాతావరణ శాఖ పేర్కొంది.

16:00 - December 3, 2015

హైదరాబాద్ : వాతావరణ మార్పులపై పారిస్‌లో జరుగుతున్న సదస్సు చైన్నై వరద బీభత్సం అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిపుణులతోపాటు పౌరసమాజ ప్రతినిధులు, అభివృద్ధి చెందుతున్న దేశాల నాయకులు చెన్నై వరదలపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. వాతావరణ మార్పులే ఈ భయంకర వరదలకు కారణమన్న విషయం చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వాతావరణ మార్పులకు భారత బలిపశువగా మారిందనడానికి చెన్నై వరదలే ప్రబల నిదర్శనమని పారిస్‌ సదస్సుకు హాజరైన ప్రతినిధులు చర్చించుకున్నారు.

చెన్నై వరదలకు కారణం ఏంటి ? ఎవరు కారకులు ?

చెన్నై వరద బీభత్సంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయి. ఈ మహానగరం సముద్రాన్ని తలిపిస్తున్న అంశం చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం ఏంటి? కారకులు ఎవరు? పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు విడుదల చేస్తున్న కర్బన ఉద్గారాలతో మారుతున్న వాతావరణం కారణమా? వాతావరణ మార్పులతో వరదలను ముడిపెట్టవచ్చా? అన్న అంశాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

వాతావరణ మార్పులతో ముడిపెట్టలేము .....

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో జరుగుతున్న వాతావరణ సదస్సులో కూడా చెన్నై వరదల అంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. సదస్సుకు హారవుతున్న నిపుణలు, పౌరసమాజ ప్రతినిధులు, అభివృద్ధి చెందుతున్న దేశాల నాయకులు చెన్నై వరద విలయాలన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంతటి జలప్రళయానికి ఇప్పటికిప్పుడు నేరుగా వాతావరణ మార్పులతో ముడిపెట్టలేకపోయినా... ఇది చర్చనీయాంశమేనని, దీనికి తరుణోపాయం కనుగొనాల్సిన సమయం ఆసన్నమైందన్న విషయంపై చర్చించుకున్నారు. అలాఅని వాతావరణ మార్పులతో సంబంధలేదని కూడా చెప్పలేమన్న విషయం ప్రస్తావనకు వచ్చింది. మన దేశం నుంచి పారిస్‌ వాతావరణ సదస్సుకు హాజరైన ప్రతినిధులు సముద్రంగా మారిన చెన్నైని పాశ్చాత్య మీడియా దృష్టి తీసుకెళ్లినప్పుడు వారు తీవ్రంగా స్పందించారు. ఇదే సమయంలో వారు భారత్‌పై విమర్శల వర్షం కూడా కురిపించారు. వాతావరణ చర్చలకు భారత్‌ ప్రతిబంధకంగా మారిందంటూ వాతావరణ మార్పులే ప్రకృతి వైపరీత్యాలకు కారణం…

వాతావరణ మార్పులే ప్రకృతి వైపరీత్యాలకు కారణమనే వాదన...

మన దేశం నుంచి పారిస్‌ సదస్సుకు హాజరైన యాక్షన్‌ ఇండియా ప్రతినిధి హర్జీత్‌సింగ్‌.. వాతావరణ మార్పులే ప్రకృతి వైపరీత్యాలకు కారణమని వాదించారు. భారత్‌తోపాటు మరికొన్ని దేశాలు వాతావరణ మార్పులకు బలవుతున్నాయన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయే దేశాలకు పరిహారం చెల్లించే అంశంపై కూడా ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని సూచించారు. వాతావరణ మార్పులకు కారణమవుతున్న దేశాలపైనే ఈ బాధ్యత ఉందన్న వాదాన్ని ఆయన లేవనెత్తారు. సదస్సు ప్రారంభోత్సవంలో ప్రసంగించిన మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా వాతావరణ మార్పులతో జరిగే నష్టానికి పరిహారం చెల్లించే బాధ్యత అన్న విషయాన్ని ప్రస్తావించారు. సదస్సుకు హాజరైన ప్రపపం ఆరోగ్య సంస్థ ప్రతినిధులు కూడా... వాతవరణ మార్పులకు భారత్‌ బాధిత దేశమేనన్న విషయాన్ని ప్రస్తావించారు. విపత్తులు తీవ్ర ప్రజారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయన్న ఆందోళన వ్యక్తం చేశారు.

వాతావరణ మార్పులతో ముడిపెట్టలేము-ప్రకాష్‌ జావదేకర్‌ .....

అయితే చెన్నై భయంకర వరదలపై కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్‌ జావదేకర్‌ వాదన మాత్రం మరోలా ఉంది. చెన్నై వరద బీభత్సం తీవ్రమైనదైనప్పటికీ.... వాతావరణ మార్పలుతో ముడిపెట్టలేమంటున్నారు. వరుసగా పదిరోజులపాటు కుండపోత వర్షం కురవడంతోనే చెన్నై మునిగిందన్నది ఆయన వాదన. ఇది ప్రకృతి వైపరీత్యమని చెబుతున్నారు. ప్రధాని మోదీతోపాటు పారిస్‌ సదస్సుకు హాజరై ఢిల్లీ తిరిగొచ్చిన జావదేకర్‌.. మళ్లీ అక్కడకు వెళ్లి ఆదివారం జరిగే మంత్రిత్వ స్థాయి చర్చల్లో పాల్గొంటారు. అప్పుడు చెన్నై వరద నష్టాన్ని ప్రపంచ దేశాలకు వివరిస్తారు.

విద్యుత్ షాక్ తగిలి లారీ డ్రైవర్ మృతి

రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ శివార్లలో గురువారం మధ్యాహ్నం విద్యుత్ షాక్తో ఓ లారీ డ్రైవర్ మృతిచెందాడు. మొమిన్‌పేటలో ఓ వేబ్రిడ్జి వద్ద బోరా గంగయ్య(45) అనే డ్రైవర్ లారీ పెకైక్కే క్రమంలో విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. గంగయ్య స్వస్థలం నల్గొండ జిల్లా మంచన్‌పల్లి గ్రామంగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చెన్నైలో ప్రబులుతున్న అంటు వ్యాధులు

చెన్నై : జలదిగ్బంధంలో చిక్కుకుపోయిన చెన్నైకి అంటు వ్యాధులతో మరో పెద్ద ప్రమాదం పొంచింది. చెన్నై లో చాలా ప్రాంతాల్లో మోకాలి పై వరకు నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి… తాగడానికి నీరు లేక అలమటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీటిలో తడవడం, నానడం వల్ల చాలా మంది జ్వరాలతో, పంగస్ ఇన్ ఫెక్షన్లు, చర్మ సంబంధ వ్యాధులు ప్రబలుతున్నట్లు వైద్యులు తెలిపారు. వరదల కారనంగా విద్యుత్, రవాణా, సమాచార వ్యవస్థ స్తంభించడంతో ఆస్పత్రులు నడవడం చాలా కష్టంగా మారింది.

15:12 - December 3, 2015

హైదరాబాద్ : తాను కాంగ్రెస్‌ పార్టీకి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నానన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దానం నాగేందర్‌ స్పష్టం చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అంతా కలిసి పనిచేస్తామని దానం అన్నారు. తనపై వస్తున్న విమర్శలు అర్ధరహితమని ఎవరో ఏదో వ్యాఖ్యలు చేస్తే అవి తనపై ఆపాధించడం కరెక్ట్‌ కాదన్నారు. 

ఐఫా అవార్డ్స్ వాయిదా వేయండి : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : నగరంలో 4వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఐఫా( ఇంటర్నేషనల్ ఇండియా ఫిల్మ్ అకాడమీ) అవార్డ్స్ వేడుకలు వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ ఆఏదశాలు జారీ చేశారు. తమిళనాడు రాజధాని చెన్నై సహా పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వందలాది మంది చనిపోయారు. ఇలాండి సమయంలో వేడుకలు నిర్వహించడం భావ్య కాదని పేర్కొన్నారు.

ఏపీకి తక్షణ సాయం రూ. 330 కోట్లు : రాజ్ నాథ్

న్యూఢిల్లీ : భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఏపీకి తక్షణ సాయంగా రూ. 330 కోట్లు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. వదర నష్టాన్ని అంచనా వేయడానికి త్వరలోనే కేంద్ర బృందం ఏపీలో పర్యటిస్తుందని గురువారం లోక్ సభలో వెల్లడించారు. ఏపీలో 54 మంది మృతి చెందినట్లు ప్రకటించారు.

గూడూరు - చెన్నై మార్గంలో రైళ్ల రద్దు

హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా రైలు పట్టాలపై వరద నీరు ప్రవహిస్తుండటంతో పట్టాలు దెబ్బతిని గూడూరు - చెన్నైల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పలు రైళ్లను గూడూరు, రేణిగుంట మీదుగా దారి మళ్లించారు. పలు రైళ్లను గూడూరు వరకు నడుపుతున్నారు. దీంతో చెన్నై వెళ్లే ప్రయాణీకుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

అల్పపీడనంగా మారిన ద్రోణి

విశాఖ : : నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో ఏర్పడిన ద్రోణి అల్పపీడనంగా మారిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. అల్పపీడన ప్రాంతంలో 4.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తాలో చెదురుమదురు వర్షాలు పడతాయని చెప్పింది. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు పడతాయని పేర్కొంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం తెలిపింది.

చెన్నైకి ప్రధాని మోడీ...

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెన్నై నగరానికి బయలుదేరి వెళ్లారు. చెన్నైలో వదర బాధిత ప్రాంతాలను ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు ఆయన హెలికాప్టర్‌లో నగరమంతా కలియతిరిగి పరిశీలించనున్నారు. అరక్కోణం, నౌకాదళ వైమానిక స్థావరం ఐఎన్‌ఎస్ రజాళి నుంచి ప్రధాని ఏరియల్ సర్వేలో పాల్గొంటారు. కాగా, భారీ వర్షాల కారణంగా చెన్నై నగరంలోని పలు వీధులు నీట మునిగి జనం ఇక్కట్లు పడుతోన్న విషయం తెలిసిందే.

సూర్యలంక బీచ్ లో విషాదం

గుంటూరు : జిల్లా బాపట్ల మండలంలోని సూర్యలంక బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం బీచ్ లో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. జిల్లాలోని కాకుమానుకు చెందిన రత్నం, లక్ష్మీనారాయణ బీచ్ కి స్నానానికి వెళ్లారు. అలల దాటికి మునిగిపోవడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషయాన్ని గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు.

14:50 - December 3, 2015

హైదరాబాద్ : మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా, దంత సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.. ఇక దురలవాట్లు ఉన్న వారికైతే ఈ సమస్య ఎక్కువ. ఈ సమస్యలకు అనేక రకాల చికిత్సా పద్ధతులున్నాయంటుమని 'మానవి హెల్త్ కేర్' కార్యక్రమంలో డెంటిస్ట్ డాక్టర్ హరీష్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

14:47 - December 3, 2015

హైదరాబాద్ : కులమేదైనా, మతమేదైనా, నూటికి 90 శాతం ప్రజలు నమ్మేది దేవుడినే. ఆడైనా, మగైనా ఒకేరీతిగా దైవాన్ని కొలుస్తారు. మరి అలాంటప్పుడు ఆధ్మాత్మిక ప్రదేశాల్లోకి, ఆలయ ప్రాంగణాల్లోకి మహిళలకు ఎందుకు ప్రవేశం ఉండటం లేదు? ఆంక్షలు ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇటీవల శని సింగాపూర్ ఆలయంలో జరిగిన ఘటన మరోసారి ఈ విషయాలను తెరమీదకు తెచ్చిన నేపథ్యంలో మానవి ప్రత్యేక కథనం.

దేవుడి దృష్టిలో అందరూ సమానమే......

ఆడా, మగా అన్నా తేడా లేకుండా, పేద గొప్ప బేధం లేకుండా, అందరూ దేవుడి బిడ్డలే. దేవుడి దృష్టిలో అందరూ సమానమే. ఇవే కదా మనకు నిత్యం వినిపించే మాటలు. తరాలు గడిచినా వినిపించే బోధలు. మరి దేవుడి బిడ్డలైన మహిళలు ఎందుకు అనేక చోట్ల వివక్షకు గురవుతున్నారు ? ఆలయాల్లోని దేవున్ని తాకలేకపోతున్నారు ? ఎందుకు వారిని దూరంగా నెడుతున్నారు. ?

అన్ని చోట్లా మహిళలకు సమాన ప్రాతినిధ్యం దక్కాలి....

దేవుడి ముందు స్త్రీ పురుషులిద్దరూ సమానమే. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులను కల్పించింది. అయినా, ఈ వివక్ష ఎందుకు? ఇకనైనా మహిళల్ని అపవిత్రంగానో, అంటరానివారుగానో చూసే దృష్టి కోణాన్ని మానుకోవాలని, మానవి కోరుకుంటోంది. అన్ని చోట్లా మహిళలకు సమాన ప్రాతినిధ్యం దక్కాలని, ఆకాంక్షిస్తోంది. మరిన్ని పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

తమిళనాడును అన్ని విధాల ఆదుకుంటాం : రాజ్ నాథ్ సింగ్

ఢిల్లీ : చెన్నై వరదలపై గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభలో ప్రకటన చేశారు. గత శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా చెన్నైలో వర్షపాతం నమోదైనట్లు తెలిపిన ఆయన ఇప్పటి వరకు వర్షాలతో 269 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. తమిళనాడులో 30 ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో పాటు ఆర్మీ, నేవీ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. తమిళనాడును కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ హోంమంత్రి హామీ ఇచ్చారు.

కృష్ణా నదీజలాల వివాదం పై సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ : కృష్ణా నదీజలాల వివాదంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. తెలంగాణ తరపున న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. నదీజలాల విషయంలో మొదట్నుంచి తెలంగాణ హక్కులు కాపాడలేదని వైద్యనాథన్ వాదించారు. నీటి పంపకాలకు సంబంధించి వాదనలు వినాలని న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

14:38 - December 3, 2015

హైదరాబాద్ : ప్రభుత్వంలో ఉండి కొన్ని పనులు చేసుకోవచ్చనే భావనతో తాను టీఆర్ఎస్ లో చేరినట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. గురువారం ఉదయం సీఎం కేసీఆర్ ను సాయన్న కలిశారు. అనంతరం ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు. ఈసందర్భంగా సాయన్న టెన్ టివితో మాట్లాడారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా తాను గెలవడం జరిగిందని, ప్రస్తుతం తన నియోజకవర్గంలో సమస్యలు నెలకొనడం జరిగిందన్నారు. కంటోన్మెంట్ రహదారి మూసివేయకుండా సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలు బాగున్నాయని ప్రశంసించారు. ఈ రహదారిపై నియోజకవర్గంలో నిత్యం గొడవలు జరుగుతుండేవని, రహదారి మూసివేయకుండా సీఎం కేసీఆర్ కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించారని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న డబుల్ బెడ్ రూంలు కావాలని తన నియోజకవర్గంలోని ప్రజలు కోరుతున్నారని, తన నియోజవకర్గంలో ఎస్సీ, బీసీలు అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. టిటిడి బోర్డు మెంబర్ గా పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు సాయన్న తెలిపారు. 

సీఎం జయలలిత ఏరియల్ సర్వే

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ సర్వే అనంతరం ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు వరదలతో 269 మంది మృతి చెందారు. వేల మంది పునరావాస కేంద్రాలలో ఉంటున్నారు. ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ సహాయక చర్యల్లో నిమగ్నమైంది. ఇక బుధవారమే ఏరియల్ సర్వే నిర్వహించాలని సీఎం భావించినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు.

కాంగ్రెస్ లోనే - దానం..

హైదరాబాద్ : తాను కాంగ్రెస్ వీడుతున్నట్లు వస్తున్న వార్తలను టి.కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఖండించారు. తాను పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. గురువారం ఉదయం తన నివాసంలో అనుచరులతో దానం నాగేందర్ సమావేశం జరిపారు. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. పార్టీని నాశనం చేయాలని కొందరు కుట్ర పన్నుతున్నారని, ఇందుకు కార్యకర్తలు బలి కావద్దని సూచించారు. ఎమ్మెల్సీ ప్రభాకర్ టీఆర్ఎస్ లో చేరవద్దని సూచించినా వినలేదని దానం వ్యాఖ్యానించారు. కానీ టీఆర్ఎస్ లో చేరాలని కార్యకర్తలు వత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీనిని దానం తోసిపుచ్చినా కొద్ది రోజుల్లో టీఆర్ఎస్ లో చేరుతారని తెలుస్తోంది.

చెన్నైకి సమీపంలో అల్పపీడన కేంద్రం..

చెన్నై : చెన్నైకి సమీపంలో అల్పపీడన కేంద్రం కేంద్రీకృతమైంది. తమిళనాడులో మరో 48 గంటల పాటు వర్షాలు కురవనున్నాయని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర, దక్షిణ తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురువనున్నాయని, దక్షిణాంధ్ర, పుదుచ్చేరికి భారీ వర్షాలు పడవచ్చని..దక్షిణాంధ్రలో 72గంటలు..పుదుచ్చేరిలో 24గంటల పాటు భారీ వర్షాలు పడుతాయని హెచ్చరికలు జారీ చేసింది. 

ఏపీలో ఎండవేడిమి తగ్గించేందుకు కమిటీ..

విజయవాడ : ఏపీలో ఎండవేడిమి తగ్గించేందుకు కమిటీ ఏర్పాటైంది. రెవెన్యూ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్ గా, 11 మంది సభ్యులతో ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఇతర రాష్ట్రాల్లో ఎండ వేడిమిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అధ్యయనం చేసి ప్రణాళికలు కమిటీ రూపొందించనుంది. 

డీకే అరుణ దీక్ష నిరసన దీక్ష...

మహబూబ్ నగర్ : గద్వాల మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ నిరసన దీక్ష చేపట్టారు. గద్వాలను జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపట్టారు. గద్వాలకు జిల్లాకు కావాల్సిన అన్ని అర్హతలున్నాయని, గద్వాలను జిల్లా చేయకుంటే పోరాటం చేస్తామని జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. 

సాయన్న చేరికపై ఎర్రబెల్లి స్పందన...

హైదరాబాద్ : ఒక నాయకుడు పార్టీని వీడినంత మాత్రాన కార్యకర్తలు పార్టీ నుండి వెళ్లని ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. సాయన్నను నాలుగు సార్లు ఎమ్మెల్యేను చేసి పార్టీ గౌరవించిందని, సాయన్నను ప్రలోభ పెట్టి టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని సచివాలయం, క్యాంపు ఆఫీసులను టీఆర్ఎస్ కార్యాలయాలుగా మార్చారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి విజయం ఖాయమన్నారు. 

ఎమ్మెల్సీ ప్రభాకర్ చేరికపై స్పందించని ఉత్తమ్..

హైదరాబాద్ : టీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ ప్రభాకర్ చేరికపై స్పందించడానికి టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ నిరాకరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించామన్నారు. డీసీసీ అధ్యక్షులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

అభివృద్ధికి కేసీఆర్ కృషి - ఎమ్మెల్సీ ప్రభాకర్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ ప్రభాకర్ పేర్కొన్నారు. నిరంతర విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్ దేనని, గోదావరి జలాలను హైదరాబాద్ కు తరలించడంలో కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రేటర్ అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ తనకు అవమానం జరిగిందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమాయత్తం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని తెలిపారు.

 

ఇబ్రహ్నింపట్నంకు వెళ్లిన సీఎం కేసీఆర్ దంపతులు..

రంగారెడ్డి : జిల్లా ఇబ్రహింపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో శత చండీయాగం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు.

 

ప్రభాకర్ కాంగ్రెస్ లో ఉండి చేసేందేమి లేదు - జానా..

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ పార్టీలో ఉండి చేసేందేమి లేదని టి.కాంగ్రెస్ నేత జానారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ను ప్రభాకర్ కలిసిన విషయం తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. టీఆర్ఎస్ లోకి వెళ్లి చేసేదేమి లేదని ఎద్దేవా చేశారు. 

షెల్జా వివాదంపై రాజ్యసభలో దుమారం..

ఢిల్లీ : కుమారి షెల్జా వివాదంపై రాజ్యసభలో దుమారం చెలరేగింది. షెల్జాపై ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రులు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు ఆందోళన నిర్వహించారు. డిప్యూటి ఛైర్మన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

 

శంషాబాద్ లో కిలో బంగారం..కిలో వెండి స్వాధీనం...

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో దుబాయి నుండి వచ్చిన ప్రయాణీకుడి వద్ద పొడి రూపంలో ఉన్న కిలో బంగారం, కిలో వెండిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణీకుడిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. 

పొంగి ప్రవహిస్తున్న కమ్మకొత్తూరు చెరువు...

చిత్తూరు : శ్రీకాళహస్తి రూరల్ దొమ్మరిపాలెం వద్ద కమ్మకొత్తూరు చెరువు పొంగి ప్రవహిస్తోంది. 30 గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కేవీబీపురం కాళంగి రిజర్వాయర్ గేట్లు ఎత్తివేయడంతో నాలుగు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. 

శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి రూ. కోటి విరాళం...

చిత్తూరు : తిరుమల శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి ముంబైకి చెందిన విధిష్టర్ పఠావ్ రూ. కోటి విరాళం అందించారు. 

తమిళనాడు సీఎస్ తో మాట్లాడిన ఏపీ సీఎస్...

విజయవాడ : సీఎం చంద్రబాబు ఆదేశాలతో వరద ప్రభావంపై తమిళనాడు సీఎస్ తో ఏపీ సీఎస్ కృష్ణారావు మాట్లాడారు. తమిళనాడుకు ఏ సహాయం కావాలన్నా అందిస్తామని ఏపీ సీఎస్ పేర్కొన్నారు. చిత్తూరు నుండి వివిధ డ్యామ్ ల ద్వారా తమిళనాడుకు వచ్చే వరద ప్రవాహాన్ని తగ్గించాలని ఏపీ సీఎస్ ను తమిళనాడు సీఎస్ కోరారు. 

చెన్నైలో కొనసాగుతున్న సహాయక చర్యలు..

చెన్నై : వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో సైన్యం, నావికా దళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. తిరువళ్లూరులో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 600 మందిని రక్షించాయి. 

బ్యాటింగ్ ఆరంభించిన భారత్..

ఢిల్లీ : సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో భారత్ టెస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు విజయ్, ధావన్ లు ఆటను ఆరంభించారు. 

09:25 - December 3, 2015

హైదరాబాద్ : టి.టిడిపికి మరో ఎదురు దెబ్బ తగులనుందా ? జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీలోకి నేతలు తరలివెళ్లనున్నారా ? దీనిపై టి.టిడిపి నేతలు గబులు పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ ను ఆయన కలువనున్నారు. కేవలం తన నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు కేసీఆర్ ను కలువనున్నట్లు సాయన్న పేర్కొంటున్నట్లు సమాచారం. కానీ ఆయన పార్టీలో చేరేందుకు సిద్ధమౌతున్నట్లు టి.టిడిపి గ్రహించింది. వెంటనే రంగంలోకి దిగి సాయన్నతో చర్చించేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. కానీ సాయన్న అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్టీ ఎన్నికల బాధ్యతలపై సాయన్న కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాక గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలపై అంటీముట్టన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టిడిపి నేత రావుల కుమారుడు వివాహానికి...టి.టిడిపి సమావేశానికి సాయన్న గైర్హాజర్ అయ్యారు. దీనితో టీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. మరి సాయన్న గులాబీ కండువా కంప్పుకుంటారా ? లేదా ? అన్నది వేచి చూడాలి. 

కేసీఆర్ ను కలువనున్న సాయన్న..

హైదరాబాద్ : కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలువనున్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. 

టాస్ గెలిచిన భారత్..

ఢిల్లీ : టీమిండియా, సౌతాఫ్రికాజట్ల నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ సమరం..తుది అంకానికి చేరింది. ఆఖరి మ్యాచ్‌ ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

కాల్పుల ఘటనపై ఒబామా ఆందోళన..

అమెరికా : న్యూయార్క్ లోని శాన్ బెర్నార్డినోలో జరిగిన కాల్పులు అనంతరం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మీడియాతో మాట్లాడారు. ఎక్కడా లేని రీతిలో అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

నెక్లెస్ రోడ్డులో వికలాంగుల అవగాహన ర్యాలీ..

హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డులో వికలాంగుల అవగాహన ర్యాలీ జరిగింది. ఈర్యాలీలో ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ పాల్గొన్నారు. 

సిరిసిల్ల మాధవిపై సస్పెన్షన్ వేటు..

వరంగల్ : సిరిసిల్ల రాజయ్య భార్య మాధవిపై సస్పెన్షన్ వేటు పడింది. మాధవిని నవంబర్ 5 నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్వర్వులో పేర్కొన్నారు. కోడలు సారిక ముగ్గురు మనవళ్ల అనుమానాస్పద మృతికి గురై 27 రోజుల తరువాత కేయూ అధికారులు చర్యలు తీసుకున్నారు. కేయూ యూనివర్సిటీలో మాధవి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తోంది. 

మోడీపై ఒబామా ప్రశంసలు..

అమెరికా : భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసల జల్లు కురిపించారు. ఈమేరకు వైట్ హస్ వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. మోడీ నిజాయితీ, స్పష్టమైన రాజకీయ నాయకుడని ఆ ప్రకటనలో ఒబామా పేర్కొన్నారు. భారత్ అభివృద్దిపై స్పష్టమైన విజన్ ఉన్న నేత అని పేర్కొన్నారు.

 

నెల్లూరులో వర్షాలు తగ్గుముఖం..

నెల్లూరు : జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. సూళ్లూరు పేట, గూడురులో ఓ మోస్తారు వర్షం కురుస్తోంది. ఆత్మకూరు, కావలి, నాయుడుపేట, నెల్లూరులో చిరుజల్లులు పడుతున్నాయి. పలుచోట్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కాళంగి నది, కైవల్యా, తంబిలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

08:41 - December 3, 2015

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మహానగరాలకు వరదలు పెరిగే అవకాశాలున్నాయని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. చెన్నైలో వరద బీభత్స పరిణామాలపై టెన్ టివిలో 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో విశ్లేషించారు. ఆయన మాటల్లోనే...

వాతవరణ మార్పు...
''వాతవారణ మార్పు ప్రపంచ వ్యాప్తంగా కనబడుతోంది. తొలుత ఓ మోస్తారు వర్ష పాతం పడింది. కానీ ప్రస్తుతం ఒకే సారి భారీ వర్షం కురుస్తోంది. తుపాన్ వస్తే వరదలు వస్తాయి...కానీ ప్రస్తుతం వర్షం వల్ల వరదలు వస్తున్నాయి. ఎవరికీ అర్థం కాని వర్షం పడుతుంది. ? ఎంత తీవ్రంగా ఉంటుందనేది అర్థం కాదు. చెన్నైలో గత వంద సంవత్సరాల్లో ఇలాంటి వర్షం చూడలేదు. భూతాపం వల్ల నగరాలు మునిగిపోతాయి. చెన్నై నగరాలు మునిగిపోతాయని ఆనాడే చెప్పడం జరిగింది. నాసా అధ్యయనాలు...ఇలాంటి ఎన్నో అధ్యయనాలు పేర్కొంటున్నాయి. తీర ప్రాంతాల ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే వాతావరణ మార్పు..భూమిపై విషవాయువులు వెదజల్లడం భూ వాతావరణాన్ని వేడేక్కిస్తుంది. సముద్రం వాతావరణం వల్ల వేడెక్కడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పర్యావరణాన్ని ఎలా తగ్గించుకుంటాం అనేది ముందు ఉన్న సవాల్.

మహానగరాల మనుగడకు ప్రమాదం...
మహానగరాల మనుగడకు ప్రమాదం ఉంది. మహానగరాల్లో ఒకప్పుడు చెట్లు..తోటలతో ఉండేవి. ప్రస్తుతం చెట్లు నరికివేస్తూ కాంక్రీట్ అరణ్యాలుగా మార్చేస్తున్నారు. పెద్ద ఎత్తున్న వాతావరణ కాలుష్యం వెదజల్లుతున్నారు. తీర ప్రాంతం కనుక ఆ సమస్య వచ్చింది. వరదనీరుకు సహజ పరివాహక వ్యవస్థ ఉండాలి. మహానగరాల్లో నిర్మాణాలు ఇష్టమొచ్చినట్లుగా నిర్మాణాలు చేపట్టారు. కాల్వలకు..నాలాలకు అడ్డంగా నిర్మాణాలు చేస్తున్నారు. నీరు ఎక్కడకు వెళ్లాలో తెలియక ఇళ్లలోకి..ఇతర ప్రాంతాల్లోకి వెళుతోంది. అంతేగాక భూమిపై కాంక్రీట్ పెరగడం వల్ల నీరు ఇంకే అవకాశం లేదు. భూగర్భ జలాలు పెరగడం లేదు. వర్షపు నీటిని త్వరగా తొలగించే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఆనాడు ముంబై నగరానికి రూ.1200 కోట్లు ఇచ్చారు. హైదరాబాద్ కు లేదు. హైదరాబాద్ నగరానికి కూడా ముప్పు అవకాశం ఉంది. ఎందుకంటే చెరువులు..నాలాలు..కబ్జాలు చేశారు. భారతదేశానికి ఇలాంటి వరదలు..కరవులు పెరిగిపోతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నిర్ధిష్ట సమాచారాన్ని ఇచ్చే విధంగా తయారు చేసుకోవాలి. తీర ప్రాంతా పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయవద్దు''. అని నాగేశ్వర్ పేర్కొన్నారు. 

జయలలిత ఏరియల్ వ్యూ..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. చెన్నై, కాంచీపురం, తిరువల్లూర్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 

07:58 - December 3, 2015

గుజరాత్ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలలో బీజేపీ చేదు ఫలితాలు చవి చూసింది. బీజేపీ గెలుపు పట్టణాల వరకే పరిమితం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో అది తుడిచిపెట్టుకపోయింది. పల్లెపట్టుల్లో కాంగ్రెస్ ముందంజ వేసింది. మరోవైపు ఆనం సోదరులు టిడిపి పార్టీలో చేరారు. రౌడీ పార్టీలో చేరమని పేర్కొంటూ వైసీపీపై పలు విమర్శలు చేశారు. ఏపీ రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలపై ఇంకా దుమారం రేగుతోంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వేణుగోపాల్ రెడ్డి (బీజేపీ), గౌతమ్ (ఏపీ కాంగ్రెస్), అంబటి రాంబాబు (వైసీపీ), రామకృష్ణ ప్రసాద్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

తెలంగాణలో నేడు పదో తరగతి పరీక్షల షెడ్యూల్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను గురువారం అధికారికంగా విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో మార్చి 21న ప్రారంభమై ఏప్రిల్ 9వ తేదీతో పరీక్షలు ముగిసేలా ప్రభుత్వ పరీక్షల విభాగం షెడ్యూల్ ను రూపొందించి కొద్ది రోజుల కిందట మంత్రి కడియం శ్రీహరికి సమర్పించింది. ఎన్నికల నియామవళి అమల్లో ఉన్నందున అధికారికంగా ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి అవసరం కావడంతో బుధవారం అధికారులు లేఖ రాశారు. 

07:30 - December 3, 2015

ఇటీవ‌లే స్వీటీ అనుష్క తొడ‌ల వివాదంపై పెద్ద దుమారం రేగింది. ఈ వ్వ‌వ‌హారికి ప్ర‌ధాన కారుకుడైన అలీపై మ‌హిళా సంఘాలు భ‌గ్గుమ‌న్న సంగతి తెలిసిందే. దీంతో అలీ మీడియా ముంద‌కు వ‌చ్చి వివ‌ర‌ణ‌ ఇచ్చుకోవాల్సిన సీన్ క్రియేట్ అయింది. తాజాగా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ అల‌నాటి అందాల హీరోయిన్ శ్రీదేవి తొడ‌ల గురించి మాట్లాడి వార్త‌ల్లోకి ఎక్కేసాడు. అస‌లు వివ‌రాల్లోకి వెళ్తే.. వ‌ర్మ గ‌న్స్ అండ్ థైస్'(గన్స్ మరియు తొడలు) పేరుతో ఆత్మ‌క‌థ రాసిన సంగతి తెలిసిందే. ఈ బుక్ లో త‌న వ్య‌క్తిగ‌త విష‌యాలెన్నో ప్ర‌స్తావించాడు. ఈ బుక్ లో శ్రీదేవి గురించి చాలా విష‌యాలు ప్ర‌స్తావించాడు వ‌ర్మ‌. తాను ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇవ్వ‌డానికి అమితాబ్‌, శ్రీదేవే కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. దీవార్‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ గ‌న్‌ని, హిమ్మ‌త్‌వాలాలో శ్రీదేవి తొడ‌ల‌ను చూసి ఇన్‌స్ప‌యిర్ అయ్యి డైరెక్ట‌ర్ అవ్వాల‌ని క‌ల‌లు క‌న్నాన‌ని వివ‌రించాడు వ‌ర్మ‌. ఈ పుస్తకంలో శ్రీదేవిపై రాసిన చాప్టర్ ఆమెకు తాను రాసిన ప్రేమలేఖ లాంటిదని, ఆమె పట్ల తనకున్న ఆకర్షణ ఒక డ్రగ్స్‌ లాంటింద‌ని..ఆమె అంత పెద్ద హీరోయిన్ అయిందంటే కేవ‌లం పెర్పార్ మెన్స్ ఒక్క‌టే కాదు..ఆమె అంద‌మైన తొడలు కూడా ఓకార‌ణం అని వ‌ర్మ వ్యాఖ్య‌లు చేశాడ‌ట‌. ఈ కామెంట్స్ పై శ్రీదేవి భ‌ర్త బోనీ కపూర్ మండిప‌డ్డాడు. వ‌ర్మ వ్యాఖ్య‌లు హాస్యాస్ప‌దంగా ఉన్నాయని, వర్మది వెర్రి మనస్తత్వమన్నారు. ప్ర‌చారం కోసం దిగ‌జారిపోతున్నాడని బోనీ విమ‌ర్శించారు. దీనికి వ‌ర్మ వెంట‌నే కౌంట‌ర్ కూడా వేశాడు. నాపై విమర్శలు చేసే ముందు గన్స్ అండ్ థైస్ పుస్తకం పూర్తిగా చదవాలని బోనిని కోరుకుంటున్నా అని తెలిపారు. ఈ వివాదం ఎంత‌వ‌ర‌కూ వెళ్తుందో ??

07:15 - December 3, 2015

ఢిల్లీ : టీమిండియా, సౌతాఫ్రికాజట్ల నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ సమరం..తుది అంకానికి చేరింది. ఆఖరి మ్యాచ్‌ ఇవాళ ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ఆరంభమవుతుంది. ఇప్పటికే 2-0 తేడాతో ఫ్రీడమ్‌ టెస్ట్ సీరిస్‌ను కైవశం చేసుకున్న కోహ్లీసేన.. చివరిదైన ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు రాబోయే ఇంగ్లాండ్‌ పర్యటన నేపథ్యంలో కనీసం ఆత్మవిశ్వాసం కోసమైన ఢిల్లీలో నెగ్గాలని దక్షిణాఫ్రికా కృతనిశ్చయంతో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకుంటుంది. 

ఉద్యోగుల తరలింపుపై అధికారుల కమిటీ భేటీ..

విజయవాడ : ఏపీ ఉద్యోగుల తరలింపుపై అధికారుల కమిటీ భేటీ కానుంది. జూన్ ఒకటో తేదీ నుండి ఉద్యోగులు విజయవాడకు తరలివెళ్లాలని ప్రభుత్వం ఆదేశం జారీ చేసిన సంగతి తెలిసిందే. 

నేడు ఢిల్లీలో మంత్రి ఈటెల పర్యటన..

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ ఢిల్లీలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, రామ్ విలాస్ పాశ్వాన్ తో భేటీ కానున్నారు. 

చెన్నై వరదలపై నేడు రాజ్ నాథ్ ప్రకటన..

ఢిల్లీ :నేడు చెన్నై వరదలపై హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లోక్ సభలో ప్రకటన చేయనున్నారు. తమిళనాడులో ఎడతెరిపి లేకుండా ముంచెత్తుతున్న వరదలు ప్రజా జీవనాన్ని స్తంభింపచేశాయి.

 

అమెరికాలో కాల్పులు..పెరుగుతున్న మృతుల సంఖ్య..

అమెరికా : కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినో ప్రాంతంలోని వాటర్ మాన్ అవెన్యూ సమీపంలో బుధవారం జరిగిన కాల్పుల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు.

 

07:00 - December 3, 2015

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కొద్దిరోజుల క్రితమే ఇసుక పై శ్వేతపత్రం విడుదల చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన విధానంలో కొన్ని లాభాలు, కొన్ని లోపాలు వున్నాయంటున్న ముఖ్యమంత్రి జనవరి కల్లా కొత్త విధానం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అమలవుతున్న ఇసుక విధానంలో లోపాలేమిటి? డ్వాక్రా సంఘాలకు ఇసుక రీచ్‌లు అప్పగించడం ఎలాంటి ఫలితం ఇచ్చింది? ఇసుక వ్యాపారానికీ రాజకీయాలకీ వున్న అనుబంధం ఎలాంటిది? ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికే ఇసుక ధరలు ఎందుకు కొండెక్కి కూర్చుంటున్నాయి? అసలు ఇసుక విధానం ఎలా వుండాలి? ఈ అంశాలపై సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గఫూర్‌ విశ్లేషించారు. 

06:47 - December 3, 2015

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫియా పడగవిప్పుతోంది. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ తరహా అరాచకాలకు కేంద్రంగా మారుతోంది. ప్రకృతి వనరులను కొల్లగొట్టి, సామాన్యులకు ఇసుక దొరకని పరిస్థితి సృష్టిస్తున్న ఇసుక మాఫియా ఎంతలేదన్నా ఏడాదికి 7వేల కోట్ల రూపాయలు అడ్డంగా సంపాదిస్తోందన్న అంచనాలున్నాయి. ఈ అరాచక సంస్కృతికి అడ్డుకట్ట పడేదెన్నదు? తెలుగునేల మీద ఇసుకకు కొరత లేదు. ఆంధ్రప్రదేశ్‌కి ఆ సమస్య అసలే లేదు. విశాలమైన తీర్రప్రాంతం, కృష్ణా, గోదావరి, పెన్నాలాంటి నదులు ప్రవహించే చోట కావాల్సినంత ఇసుక. కానీ, విచిత్రంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇసుకకు కొరతొచ్చింది. నదీతీరాల వెంట పుష్కలంగా ఇసుక వుంది. కానీ, ఒక్క మరుగుదొడ్డి నిర్మించుకోవాలంటే ఇసుక దొరకడం లేదు. ఇసుక కోసం జనం అల్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవైపు చిన్న చిన్న అవసరాలకు కూడా ఇసుక దొరక్క జనం అవస్థ పడుతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఇసుక దిబ్బలపై ఆధిపత్యానికి కొట్టుకుంటున్నారు. తన్నుకుంటున్నారు. తమకు అడ్డొచ్చినవారి మీద దాడులు చేస్తున్నారు.

రాజకీయ నాయకులకు ఆదాయ వనరు..
ఇసుక అనేకమంది రాజకీయ నాయకులకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. నిర్మాణ రంగాన్ని ఇసుక మాఫియా శాసిస్తోంది. పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న అనేక మంది రాజకీయ ప్రముఖులకి ఇసుక మాఫియాతో విడదీయరాని బంధం వుంది. కొంతమంది నాయకులు సొంతంగానే ఇసుక గ్యాంగ్ లు మెయింటెన్ చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇసుక మాఫియాయే ప్రభుత్వాలను శాసిస్తోంది. తెగ బలిసిన ఇసుక మాఫియా తమకు అడ్డొచ్చిన అధికారులను హత్య చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ ఇలాంటి భయంకర పరిస్థితులే దాపురిస్తున్నాయి. ఉభయ రాష్ట్రాలోనూ ఇసుక మాఫియా పడగ విప్పుతోంది.

7వేల 500 కోట్ల వ్యాపారం..
ఇసుక దిబ్బలున్న ప్రాంతాలకు అధికార పార్టీ ఎమ్మెల్యేలే సామంతరాజులు. పైకి ఎన్ని నిబంధనలు విధించినా ఇసుక వ్యాపారాన్ని నడిపించేదీ అధికార పార్టీ నేతలే. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీదే ఇసుక మీద పెత్తనం. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఏటా 7వేల 500 కోట్ల రూపాయల ఇసుక వ్యాపారం నడుస్తోందని అంచనా. కానీ ఇసుక ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం చాలా స్వల్పం. ఏటా దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇసుక మాఫియా నొక్కేస్తోంది. ఇష్టమొచ్చినట్టు ధరలు పెంచేసి జనం నుంచి పిండుకుంటున్న ఇంత సొమ్మును ఇసుక వ్యాపారులు, రాజకీయ నాయకులు కలిసి పంచుకుంటున్నారన్నది వాస్తవం.

ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ఇసుక రీచ్‌లను డ్వాక్రా సంఘాలకు అప్పగించి, ఇసుక దందాకు తెరవేస్తామంటూ నూతన విధానం ప్రకటించారు. కానీ అందులో నిజాయితీ లోపించింది. యథా ప్రకారం రాజకీయ నేతలు ఇసుక దందా సాగించారు. సామాన్యుడికి బండెడు ఇసుక దొరకని పరిస్థితిని సృష్టించారు. చివరకు బండ్లు కట్టి జీవనోపాధి పొందుతున్నవారి కడుపుమీద కొట్టారు. కేసులు పెట్టారు. తన పార్టీ ఎమ్మెల్యేలే ఇసుకాసురులై స్వైరవిహారం చేస్తున్నా, అధికారుల మీద దాడులకు తెగబడ్డా, వారిని నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అధికార పార్టీ అండదండలున్న ఇసుక మాఫియా ఎక్కడికక్కడ బ్లాక్‌ చేసింది. అడ్డగోలుగా ధరలు పెంచింది. తమ ఇష్టమొచ్చినరేటుకు చిత్తమొచ్చినట్టు అమ్ముకుంది. ఇదంతా ఇవాళ మన కళ్లెదుటే నడుస్తున్న చరిత్ర. ఈ అస్తవ్యస్థ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వుంది.

ఇసుకతో రాజకీయాలు మంచిది కాదు...
ఇసుక ప్రకృతి ప్రసాదించిన వనరు. ఇసుక తవ్వకాల్లో విచక్షణ పాటించాలి. ఎక్కడపడితే అక్కడ ఎవరిష్టమొచ్చినట్టు వారు విచక్షణారహితంగా ఇసుకను తవ్వితే పర్యావరణం దెబ్బతింటుంది. భూగర్భ జలాలు ఎండిపోతాయి. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తుతాయి. అందుకే ఇసుక తవ్వకాల విషయంలో ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సొంత పార్టీ కార్యకర్తలనో, ఇసుక మాఫియానో సంతృప్తిపరచడం కోసం ఇసుకతో రాజకీయాలు చేయడం మంచిది కాదు. 

06:44 - December 3, 2015

హైదరాబాద్ : బీఫ్‌ ఫెస్టివల్‌పై రగడ రోజు రోజుకూ ముదురుతోంది. అడ్డుకుంటామని హిందూ సంస్థలు ప్రకటిస్తే...నిర్వహించి తీరుతామని అభ్యుదయ, సామాజిక విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. మరోపక్క యూనివర్శిటీల్లో రాజకీయాలు తగదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. ఐతే బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు అనుమతి లేదని ఓయూ అధికారులు ప్రకటించారు.
అడ్డుకుంటామని హిందూ సంస్థలు హెచ్చరికలు..
ఉస్మానియా యూనివర్శిటీలో ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఈ బీఫ్‌ పెస్టివల్‌ జరుగుతోంది. దీనిని అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఇప్పటకే హెచ్చరించారు. మరోపక్క బీజేపీ అనుబంధ విద్యార్థిసంఘాలు కూడా పెద్ద కూర పండుగను అడ్డుకుంటామని చెబుతున్నాయి. ఈ హెచ్చరికలను పట్టించుకోబోమని అభ్యుదయ, సామాజికి విద్యార్థి సంఘాలు ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేశాయి. ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో 26 సంఘాలు బీఫ్‌ పెస్టివల్‌ను నిర్వహించేందుకు ముందుకు వచ్చాయి. ఆర్ట్స్‌ కళాశాలలో దీనిపై నవంబర్‌ 5న సన్నాహక సమావేశం కూడా నిర్వహించాయి. 20న 500 మంది విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. మంగళవారం కవి సమ్మేళనం సైతం నిర్వహించారు.

స్పందించిన ఆలీ..
ఐతే బీఫ్‌ ఫెస్టివల్‌ రగడపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ స్పందించారు. బీఫ్‌ అయినా పోర్క్ అయినా ఇంట్లోనో, షాదీకానాలోనో తినాలని గాని..ఇలా యూనివర్శిటీల్లో రాజకీయాలు చేయడం తగదని ఆయన అన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టిపెట్టాలని సూచించారు.ఇది ఇలా ఉంటే యూనివర్శిటీలో బీఫ్‌ పెస్టివల్‌కుగాని..గోమాత పూజకు గాని ఎటువంటి అనుమతులు లేవని అధికారులు ప్రకటించారు.

బీఫ్‌ ఫెస్టివల్‌కు పోటీగా పోర్క్‌ ఫెస్టివల్‌..
మరోపక్క బీఫ్ పెస్టివల్‌కు పోటీగా ఈ నెల 10న ఓయూ జేఏసీ, పోర్క్ ఫెస్టివల్‌ను, గిరిజన జేఏసీ బోటీబాటీ సలాయ్‌ అనే కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఐతే తాము బీఫ్‌ పెస్టివల్‌కు వ్యతిరేకంగా కాదని, అలాగని మద్దతు కూడా ఇవ్వడం లేదని పోర్క్ ఫెస్టివల్‌ నిర్వాహకులు చెబుతున్నారు. 

06:40 - December 3, 2015

ఢిల్లీ : తెలంగాణ సమస్యలు పరిష్కరించాలంటూ తెలంగాణ ప్రభుత్వ అత్యున్నతస్థాయి ప్రతినిధి బృందం కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసింది. కనీస మద్ధతు ధర కల్పించి పత్తి రైతులను ఆదుకోవాలని జౌళి శాఖ మంత్రిని, కరవు మండలాలకు ఆర్థిక సాయం అందించాలని వ్యవసాయ శాఖ మంత్రిని, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని రైల్వే మంత్రిని కోరింది మంత్రుల బృందం. మొదటి సారిగా తెలంగాణ ఇద్దరు ఉపముఖ్యమంత్రులు, ఇద్దరు ప్రత్యేక ప్రతినిధులు ఎంపీలందరూ కలిసి కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడిపారు.

మైనార్టీలకు బడ్జెట్‌ కేటాయించాలని నజ్మాహెప్తుల్లాకు విజ్ఞప్తి..
మొదటగా తెలంగాణలో మైనార్టీలకు ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయించాలంటూ ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ ప్రత్యేక ప్రతినిధులు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లాను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు.

పత్తి మద్దతు ధరపై జౌళిశాఖామంత్రితో భేటీ..
తెలంగాణలో పత్తి రైతులు కనీస మద్ధతు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారానికి ఐదు రోజులు కొనుగోలు చేయాలంటూ ఉప ముఖ్యమంత్రులు, ప్రత్యేక ప్రతినిధులు ఎంపీలు కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ ను కోరామన్నారు.

రైతుల ప్రయోజనాలు కాపాడతామన్న కేంద్ర మంత్రి..
పత్తికి కనీస మద్ధతు ధరను వ్యవసాయ శాఖ పరిధిలోని కమిటీ నిర్ణయిస్తుందని జౌళి శాఖమంత్రి అన్నారు. ధర నిర్ణయంలో తమ పాత్ర తక్కువన్న ఆయన రైతుల ప్రయోజనాలు కాపడటమే తమ మొదటి ప్రయోజన మన్నారు. సీసీఐ కేంద్రాలన్నీ సమర్థంగా పనిచేసేలా వారంలో ఐదు రోజులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

కరువు మండలాలకు సాయమందించాలన్న ప్రతినిధి బృందం..
తెలంగాణలో ఉన్న 231 కరవు మండలాలను ఆదుకునేందుకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వ ప్రతినిధి బృందం వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ను కోరారు. తెలంగాణా రాష్ట్ర సమస్యలకు సంబంధించి కేంద్ర మంత్రులతో సమావేశాలు విజయవంతమయ్యాయని ఇకనైనా కేంద్రం రాష్ట్రానికి సహకారం అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఉపముఖ్యమంత్రులు..

06:37 - December 3, 2015

విజయవాడ : రెండంకెల వృద్ధితో దూసుకెళుతున్న ఆంధ్రప్రదేశ్‌ను జపాన్‌ తన పెట్టుబడులకు రెండో రాజధానిగా చేసుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. ఆగ్నేయ ఆసియాకు గేట్‌వేగా వున్న ఏపీలో పరిశ్రమల స్థాపనకు సకల సౌకర్యాలు వున్నాయని, వీటిని వినియోగించుకోవాల్సిందిగా జపాన్ పారిశ్రామికవేత్తలకు సూచించారు. విజయవాడ హోటల్ ఫార్చూన్ మురళిలో ఏర్పాటు చేసిన ఎ నెట్‌ వర్కింగ్ కాంక్లేవ్ ఆఫ్ ఏపీ అండ్ జపనీస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సదస్సుకు 30 జపాన్ కంపెనీల ప్రతినిధులు, 60 దేశీయ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.

వ్యవసాయంలో నెంబర్ వన్ గా ఏపీ..
ఆగ్రోప్రాసెసింగ్‌లో జపాన్, వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ముందున్నాయని, సాంకేతికతలో తిరుగులేని జపాన్, ఏపీలో పెట్టుబడులు పెట్టి మద్దతిస్తే ఫుడ్ ప్రాసెసింగ్‌లో అద్భుత ప్రగతి సాధించవచ్చని పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు సూచించారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా చేసి, వ్యవసాయంలో నెంబర్‌వన్‌గా నిలబెడతామని చెప్పారు. మౌలిక వసతులు, నిరంతర విద్యుత్, 974 కిలోమీటర్ల సుదూర తీరప్రాంతం, పోర్టులు, నాలుగు ప్రధాన ఎయిర్ పోర్టులు, రెండు మెగా పారిశ్రామిక కారిడార్లు, నైపుణ్యం కలిగిన యువత, పుష్కలమైన నీటి-ఖనిజ వనరులు, వ్యవసాయ రంగ ఉత్పత్తులు ఏపీ బలమని సీఎం చెప్పారు. వంద శాతం ఎఫ్‌డిఐలకు అనుమతి వుందన్న విషయాన్ని చంద్రబాబు పారిశ్రామిక వేత్తలకు గుర్తు చేశారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి ఆస్కారం వుంటుందని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లో 5 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి 50 వేల మందికి ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం 3,295 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రాష్ట్రంలో పనిచేస్తున్నాయన్నారు.

టాప్ 5 నగరాల్లో ఒకటిగా..
నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో ఒకటిగా, ఏపీ ని అభివృద్దిలో టాప్ 10 లో నిలుపుతామన్న నమ్మకం వుందని తెలిపారు. అనంతరం రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించే పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అటు రైస్, రైస్ బ్రాన్ ఆయిల్, ఆక్వా, పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్‌లో పెట్టుబడులకు, మెగా ఫుడ్ పార్కుల ఏర్పాటుకు సదస్సుకు హాజరైన జపాన్ కంపెనీలు ఆసక్తి చూపించాయి. జపాన్, ఆంధ్రప్రదేశ్ మధ్య సాంస్కృతిక సంబంధాలు ఎన్నో ఏళ్లుగా వున్నాయని సీఎం గుర్తు చేశారు. 

06:33 - December 3, 2015

విజయవాడ : అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు చిత్తూరు, నెల్లూరు జిల్లాలు వణికిపోతున్నాయి. కుండపోత వర్షాలకు పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు దెబ్బతిన్నాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

చిత్తూరులో...
చిత్తూరు జిల్లాల్లోని భారీ వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. చెరువుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వాతావరణ శాఖ మరో రెండు రోజులు పాటు వర్షసూచన ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేవీబీపురం, శ్రీకాళహస్తి, తొట్టంబేడు వరదయ్యపాలెం, నారాయణ వనం, నాగలాపురం సత్యవేడు, బీఎన్‌ కండ్రిగ మండలాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జిల్లాలో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు గత ఈతగాళ్లను కూడా రంగంలోకి దింపారు.

నెల్లూరులో..
నెల్లూరుని వర్షాలు వదిలిపెట్టడం లేదు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో పలు గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కాళంగి నదికి వరద ఉధృతి పెరిగింది. కైవల్యానదికి వరద పోటెత్తింది. నల్లవాగు, పంబలేరు, కండలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. గూడూరు వెంకటగిరి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దొరవారి సత్రం, చిల్లకూరు, గూడూరు, సూళ్లూరుపేట మండలాల్లోని పలు గ్రామాలు వరద పోటెత్తింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తం 50 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు.

ప్రకాశంలో...
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వలేటివారిపాలెం దగ్గర తూములేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పోకూరు, మాలకొండరాయుని పాలెం మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఒంగోలు, అద్దంకి ప్రాంతాల్లో భారీ వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాళ్లపాడు జలశయానికి భారీగా వరద నీరు రావడంతో ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నాయి. కందుకూరు, కనిగిరి, మార్కాపురం గిద్దలూరులో భారీ వర్షం కురిసింది. ఉప్పుటేరు మున్నేరు వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

06:30 - December 3, 2015

చెన్నై : భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలం అవుతోంది. కుండపోత వర్షాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వరదల వల్ల వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. మరోపక్క తమిళనాడు ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న ఆ రాష్ట్రానికి చేయూతనిచ్చేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. కుండపోత వర్షాలు, భారీ వరదల కారణంగా తమిళనాడుకు అపార నష్టం జరిగింది. దాదాపు15 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అసోచామ్‌ అంచనా వేసింది. చెన్నైలో కుండపోత వర్షాల వల్ల ఆర్థిక నష్టం తీవ్ర స్థాయిలో ఉందని ప్రకటించింది. వ్యాపార సంస్థలు, ట్రేడ్‌, కమర్షియల్‌ అంశాలతో పాటు సాధారణ వ్యక్తులు ఆస్తులకు భారీ నష్టం ఏర్పడిందని తెలిపింది.భారీ వర్షాల కారణంగా రన్‌వేపై వరద నీరు నిలిచిపోవడంతో చెన్నైలోని అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ నెల 6వ తేదీ వరకు ఎయిర్‌పోర్టును మూసివేస్తున్నట్లు విమానాయాన శాఖాధికారులు తెలిపారు.

టాలీవుడ్ సహాయం..
భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న చెన్నై నగరానికి సహాయం చేయడానికి టాలీవుడ్ సెలబ్రిటీలంతా ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. అల్లు అర్జున్ భారీ విరాళం ప్రకటించారు. రూ. 25 లక్షల విరాళం అందిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మహేష్ బాబు తన వంతు సహాయంగా రూ. 10 లక్షలు సిఎం రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నానని చెప్పారు. ఎన్టీఆర్ 10 లక్షలు, కళ్యాణ్ రామ్ 5 లక్షలు తమిళ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నామని తెలిపారు. ఇక రవితేజ 5 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. యువ నటుడు వరుణ్ తేజ్ తన వంతు సహాయంగా 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. సంపూర్ణేష్ బాబు రూ. 50 వేల సహాయం ప్రకటించారు.

ముందుకొచ్చిన టి.సర్కార్...
జల దిగ్బంధంలో ఉన్న తమిళనాడు రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిరాశ్రయులైన బాధితులకు సాయమందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. తమిళనాడు సీఎస్‌తో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎస్‌ రాజీవ్‌ శర్మ మాట్లాడారు. 

06:26 - December 3, 2015

అమెరికా : అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం..15 రోజుల వ్యవధిలోనే మూడో ఘటన..కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ బెర్నార్డినో నగరంలోని వికలాంగుల సేవా కేంద్రంలో చొరబడిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 11.45గంటలకు ఈ ఘటన జరిగింది. సైనిక దుస్తులు ధరించిన ముగ్గురు దుండగులు వికలాంగుల ఆరోగ్య కేంద్రంలోకి చొచ్చుక వచ్చారు. అత్యాధునిక ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఎవరికీ ఏమి జరుగుతుందో తెలియలేదు. ప్రాణాలు రక్షించుకోవడానికి పలువురు పరుగులు తీశారు. బుల్లెట్ల గాయాలతో కొందరి శరీరాలు ఛిద్రమయ్యాయి. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. ఆగంతకుల వద్ద భారీ ఎత్తున ఆయుధాలున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు బరాక్ ఒబామా శాన్ బెర్నార్డినో కాల్పుల ఘటన వివరాలను ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా తెలుసుకుంటున్నారు. దండగులను బంధించేందుకు అధికారులు ఆపరేషన్ ను చేపట్టారు. ఆ ముగ్గురు ఉగ్రవాదులా ? లేక వేరేవారా ? అనేది తెలియ రాలేదు.
నవంబర్ 27న ఇదే రాష్ట్రంలోని కొలరాడోస్ప్రింగ్స్ పట్టణంలో సాయుధుడు జరిపిన కాల్పుల్లో పోలీస్ అధికారి సహా ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే. అంతకు నాలుగు రోజుల మందు న్యూ ఓర్లియాన్స్ నగరంలోని ఓ పార్కులో ఇరువర్గాలకు జరిగిన కాల్పుల్లో 10 మంది దుర్మరణం చెందారు. తాజా ఘటనలో 14 మంది మరణించడంతో గడిచిన 15 రోజుల్లోనే అగ్రరాజ్యంలో మూడు మారణహోమాలు జరిగినట్లయింది.

06:07 - December 3, 2015

హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాల కథానాయికగా నయనతారకు కోలీవుడ్‌లో మంచి పేరే ఉంది. తాజాగా విడుదలైన 'రాజారాణి', హర్రర్‌ ప్రధానమైన 'మాయ', రాజకీయ నేపథ్యంలో సాగే 'తని ఒరువన్‌', పక్కా కమర్షియల్‌ చిత్రంగా రూపొందిన 'నానుమ్‌ రౌడీదాన్‌' వంటి తదితర చిత్రాలు ప్రేక్షకుల విశేష ఆదరణతో మంచి విజయాల్ని సొంతం చేసుకున్నాయి. దీంతో కోలీవుడ్‌లో నయనతారకు మరిన్ని మంచి అవకాశాలొస్తున్నాయి. ఎటువంటి జోనర్‌లో కథ ఉన్నా సరే తన పాత్రకు సరైన ప్రాధాన్యత ఉంటే దర్శకులు కొత్తవారైనా, సీనియర్లు అయినా సరే నయనతార నటించడానికి మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మరో హర్రర్‌ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఏ సర్గుణం సినిమాస్‌ పతాకంపై యువ దర్శకుడు సర్గుణం తనవద్ద పని చేసిన దాస్‌ రామసామిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ హర్రర్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దర్శకుడు కథ చెప్పిన విధానం, కథ రెండూ నచ్చడంతో నయనతార ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్‌సిగల్‌ ఇచ్చారని సర్గుణం తెలిపారు.

06:03 - December 3, 2015

హాలీవుడ్‌ యాక్షన్‌ సీరిస్‌లో అత్యంత విశేష ప్రేక్షకాదరణ పొందిన సీరిస్‌లో 'రాంబో ఒకటి. సిల్వెస్టర్‌ స్టాలోన్‌ హీరోగా రూపొందిన ఈ యాక్షన్‌ సీరిస్‌ ఇకపై బుల్లితెర మీద సందడి చేయనుంది. ఆద్యంతం ఉత్కంఠభరితమైన పోరాటాలతో సాహసోపేతంగా సాగే ఈ యాక్షన్‌ సీరిస్‌ను టీవీ సీరియల్‌గా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీరిస్‌ కు రాంబో కథానాయకుడు సిల్వెస్టర్‌ స్టాలోన్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమా కథల్లో యాక్షన్‌కే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. అయితే టెలివిజన్‌ సీరిస్‌లో యాక్షన్‌తోపాటు ఫ్యామిటీ డ్రామా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ టీవీ సీరిస్‌లో రాంబోనే కాకుండా రాంబో కొడుకు కూడా ఉన్నట్లు చూపించబోతున్నారు. ఇది కూడా కేవలం టీవీ సీరిస్‌ కోసమే మాత్రమే తండ్రీకొడుకులున్నట్లుగా కథని రెడీ చేస్తున్నారని సమాచారం. 1982లో తొలిసారిగా రాంబోగా కనిపించిన సిల్వెస్టర్‌ స్టాలోన్‌, ఆ తర్వాత వరుసగా నాలుగు భాగాల్లో అదే పాత్రలో కనిపించి యావత్‌ ప్రపంచ ప్రేక్షకుల్ని మెప్పించారు. ఈ సీరిస్‌తోనే యాక్షన్‌ స్టార్‌గా భారీ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. 'రాంబో'తోపాటు 'ద ఎక్స్‌పాండబుల్స్‌' సీరిస్‌ను కూడా టెలివిజన్‌ సీరిస్‌గా రూపొందించేందుకు స్టాలోన్‌ సన్నాహాలు చేస్తున్నారు.

06:01 - December 3, 2015

పలు వైవిధ్యమైన చిత్రాలతో తెలుగునాట తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుధీర్‌బాబు. తాజాగా 'భలే మంచి రోజు' చిత్రంలో నటిస్తున్న ఆయన బాలీవుడ్‌లో రూపొందుతున్న 'బాగీ' చిత్రంలో విలన్‌గా నటిస్తున్న సంగతి విదితమే. టైగర్‌ షరాఫ్‌, శ్రద్ధాకపూర్‌ హీరో హీరోయిన్లుగా 'బాగీ' తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి క్లయిమాక్స్‌ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా ఫైట్‌ రిహార్సల్‌ చేస్తున్న సుధీర్‌బాబుకు గాయాలయ్యాయి. ఇదే విషయాన్ని సుధీర్‌బాబు ఫొటోతో సహా తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. 'హాలీవుడ్‌కి ఏమాత్రం తగ్గని రీతిలో ఈ చిత్రంలోని క్లయిమాక్స్‌ ఫైట్‌ ఉంటుంది. ఈ ఫైట్‌ని టైగర్‌ షరాఫ్‌ అద్భుతంగా చేస్తున్నారు' అని సుధీర్‌బాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.

06:01 - December 3, 2015

బోయపాటి శ్రీను, హరీష్‌ శంకర్‌, బాబీ, శ్రీనువైట్ల, గోపీచంద్‌ మలినేని వంటి వారిని తన సినిమాల ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకులుగా పరిచయం చేసిన ఘనత హీరో రవితేజదేనని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. తాజాగా మరో కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి రవితేజ రెడీ అవుతున్నారు. 'బలుపు', 'పవర్‌' వంటి విజయవంతమైన సినిమాలకు పనిచేసిన చక్రిని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు. చక్రి నెరేట్‌ చేసిన కథ బాగా ఆకట్టుకోవడంతో వెంటనే ఈ చిత్రానికి పచ్చజెండా ఊపారు. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుందని చిత్ర యూనిట్‌ తెలిపింది.

06:00 - December 3, 2015

ఇంగ్లాండ్‌ రాజధాని లండన్‌లో 'దిల్‌వాలే' చిత్ర బృందం సందడి చేసింది. సెంట్రల్‌ లండన్‌ హోటల్‌లో నిర్వహించిన ఫొటో కాల్‌కు చిత్ర బృందం హాజరై మీడియాతో ముచ్చటించారు. బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ఖాన్‌, కాజోల్‌, వరుణ్‌ధావన్‌, కృతిసనన్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రమిది. రోహిత్‌శెట్టి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 18న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

05:59 - December 3, 2015

భారతదేశంలో ఎక్కడైనా ఎటువంటి విపత్తు సంభవించినా భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్న ఆర్తులను ఆదుకునేందుకు తారాలోకమంతా 'మేము సైతం' అంటూ ముందడుగేసి ఇతరులకు సైతం మార్గదర్శకంగా నిలిచిన సందర్భాలెన్నో ఉన్నాయి. సాయం చిన్నదైనా పెద్ద మనసుతో చేయాలని విజ్ఞప్తి చేస్తూ చెన్నై వరద బాధితుల సహాయార్థం తారాలోకమంతా మరోమారు ఏకతాటిపైకి వచ్చింది.. తమకు తోచిన సాయాన్ని చేస్తూ మరికొంత మందికి స్ఫూర్తిదాయంగా నిలుస్తోంది...
గత కొన్ని రోజులుగా భారీ వర్షాల ధాటికి చెన్నై, పరిసర ప్రాంతాల్లో జన జీవనం అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ విపత్తు చేస్తున్న అంధకారంలో నుంచి చెన్నై వాసులు బయట పడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అహర్నిశలు శ్రమిస్తున్నాయి.

నడుం బిగించిన తారా లోకం..
అధికారులతోపాటు మానవతా దృక్పథంతో స్వచ్ఛందంగా ఎంతో మంది తమవంతు సహాయసహకారాల్ని అందిస్తున్న తరుణంలో నిరాశ్రయులైన బాధితులకు చేయూతనివ్వడం కోసం తమిళ తారాలోకం నడుంబిగించింది. వరద బాధితుల సహాయార్థం తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పది లక్షల రూపాయల విరాళాన్ని అందించి తన ఔదర్యాన్ని చాటుకున్నారు. రజనీకాంత్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ రాఘవేంద్ర పబ్లిక్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఈ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. రజనీ మాదిరిగానే ఆయన అల్లుడు ధనుష్‌ 5 లక్షల రూపాయలు, సూర్య, ఆయన సోదరుడు కార్తీ సంయుక్తంగా 25 లక్షల రూపాయలు, విశాల్‌ 10 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. వీళ్ళంతా ఈ విరాళాన్ని చెన్నై ఫ్లడ్‌ రిలీఫ్‌ ఫండ్‌ కోసం నడిగర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్‌కు అందజేశారు. సూర్య బాటలోనే కెప్టెన్‌ విజయ్ కాంత్‌, రాఘవ లారెన్స్‌, అనిరుధ్‌, సూర్య శివకుమార్‌ తదితరులు సైతం తమవంతు సహాయాన్ని అందించారు. వీరి బాటలోనే మరో నటుడు సిద్ధార్థ్‌ వరద బాధితులకు ఆహారం ప్యాకెట్లు అందించేందుకు ముందుకు రావడంతోపాటు ఎవరైనా ఆహార ప్యాకెట్లు ఇచ్చేందుకు సహాయం చేయదలిస్తే తనను ట్విట్టర్‌ ద్వారా సంప్రదించగలరని అభిమానులకు, ట్విట్టర్‌ ఫాలోవర్స్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే కొంతమంది సినీ ప్రముఖులు చెన్నై ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ సామాజిక మీడియా ద్వారా ఆక్షించారు. ఖుష్బు, విశాల్‌, ఐశ్వర్య ధనుష్‌, సాయిధరమ్‌తేజ్‌, లక్ష్మీమీనన్‌ తదితరులు తమిళ నాడులోని వివిధ ప్రాంతాల్లో సహాయ చర్యల నిమిత్తం సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్లను సైతం ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ ఎకౌంట్స్‌లో పోస్ట్‌ చేశారు. వీరితోపాటు బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా సైతం చెన్నైలో వరదల కారణంగా ప్రజల దారుణ పరిస్థితి గురించి ట్విట్టర్‌లో స్పందించారు.

'శ్రీమంతుడు' సాయం 10 లక్షలు..
వరదల తాకిడికి గురై చెన్నై, పరిసన ప్రాంతాల్లోని జనజీవనం తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు మహేష్‌బాబు తనవంతు సాయంగా పదిలక్షల రూపాయల్ని విరాళంగా ప్రకటించారు. త్వరలోనే తమిళనాడు సిఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఈ విరాళాన్ని అందజేయనున్నారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ,'భారీ వర్షాలు, వరదల వల్ల ఎన్నో కష్ట ఎదుర్కొంటున్న చెన్నై ప్రజానీకం ఈ విపత్కర పరిస్థితి నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ నా వంతు సాయంగా పది లక్షల రూపాయల్ని అందిస్తున్నాను' అని చెప్పారు.

బాధితులకు అండగా నందమూరి బ్రదర్స్‌..
తుఫాను కారణంగా చెన్నై నగరంలో చోటు చేసుకున్న ప్రకృతి విళయ తాండవాన్ని చూసి చలించిన నందమూరి సోదరులు కళ్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ స్పందించారు. తమ వంతుగా సహాయంగా ఎన్టీఆర్‌ పదిలక్షలు, కళ్యాణ్‌ రామ్‌ ఐదు లక్షల రూపాయలను తమిళనాడు సిఎం రిలీఫ్‌ ఫండ్‌కి విరాళం గా ప్రకటించారు. 'చెన్నైతో మాకున్న అనుబంధం మరువలేనిది. అటువంటి మహానగరం పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. ప్రజలు ధైర్యం కోల్పోకుండా ఉండాల్సిన తరుణమిది. చెన్నై ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఈ నేపథ్యంలో సహాయం అందించగలిగిన ప్రతి ఒక్కరు స్పందించమని విజ్ఞప్తి చేస్తున్నాం' అని ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ తెలిపారు.

రవితేజ ఔదార్యం..
గత కొన్ని రోజులుగా విస్తృతంగా కురుస్తున్న వర్షాల కారణంగా చెన్నై జన జీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న ఆర్తులకు చేయూతగా రవితేజ సైతం 5 లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. త్వరలోనే తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్‌కు ఈ మొత్తాన్ని అందజేయనున్నారు.

25 లక్షలతో బన్నీ చేయూత..
చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు అల్లుఅర్జున్‌ 25 లక్షల రూపాయల్ని సాయంగా ప్రకటించారు. 'చెన్నై వరదలు ప్రళయానికి ప్రతీకగా ఉన్నాయి. 18 సంవత్సరాలు నేను చెన్నైలో పెరిగాను. నేనేంటో అందరికీ తెలిసేలా చేసింది కూడా చెన్నైనే.. అటువంటి చెన్నైలో నేటి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అతిత్వరలోనే చెన్నై, చెన్నై ప్రజలు కోలుకోవాలని ఆశిస్తున్నాను' అని అల్లుఅర్జున్‌ చెప్పారు.

వరుణ్‌తేజ్‌ సైతం..
ప్రస్తుతం చెన్నైలోని పరిస్థితులకు స్పందిస్తూ యువనటుడు వరుణ్‌తేజ్‌ సైతం తనవంతు సాయంగా 3 లక్షల రూపాయల్ని విరాళంగా ప్రకటించారు. 'నేను చెన్నైలోనే పుట్టాను. అటువంటి చెన్నై నేడు ఇలా వరద నీట మునగటం నన్నెంతగానో కలిచివేసింది' అని వరుణ్‌తేజ్‌ తెలిపారు. వీరి బాటలోనే '3జి లవ్‌' సినిమాను నిర్మించిన నిర్మాత ప్రతాప్‌ కోలగట్ల చెన్నై వరద బాధితులకు సహాయంగా లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఎపిలో హుదూద్‌ తుఫాన్‌ సంభవించినప్పుడు తమిళ హీరోలు సూర్య, విశాల్‌ వంటి వారు లక్షల్లో విరాళం ఇచ్చి స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పుడు అలాంటి విపత్తే చెన్నైని తాకింది' అని అన్నారు. మరో నటుడు సంపూర్నేష్‌బాబు బాధితులకు సహాయంగా 50వేల రూపాయల్ని విరాళంగా అందించగా, యువనటుడు సందీప్‌కిషన్‌ 5 వేల ఆహార పొట్లాలను బాధితుల సహాయార్థం చెన్నైకు పంపించారు.

05:57 - December 3, 2015

పొద్దున్నే కాసేపు వ్యాయామం చేస్తూ, తక్కువగా తింటుంటే... సన్నబడటం సులువు అంటారు. కానీ ఇంటి పనులు, ఆఫీసు బాధ్యతలతో తీసుకునే ఆహారం విషయం లో కచ్చితమైన ప్రణాళికను పాటించడం అంత సులువు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే క్యాలరీలు పెరగకుండా చూసు కోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

  • దాహంగా అనిపించినప్పుడు ఆకలి వేస్తోందని భ్రమపడి ఏదో ఒకటి తినడం చాలా మందికి అలవాటు. దానివల్లే క్యాలరీలు పెరుగుతాయి. అందుకే ఎప్పుడు ఆకలిగా అనిపించినా ముందు గ్లాసు మంచినీళ్లు తాగేయండి. తర్వాత కూడా ఆకలిగా అనిపిస్తుంటే ఏదో ఒకటి తినాలి తప్ప ముందే కాదు.
  • రోజూ వంట చేసేటప్పుడు ఈ కూర తినకూడదు అది తినకూడదు అని అనుకుంటుంటారు. అలాకాకుండా వాటిలో ఉండే పోషకాలను తీసుకోవచ్చో లేదో తెలుసుకోవడం ముఖ్యం.
  • కొంతమందికి గంట గంటకి ఆకలి అనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు కొద్దిగా నిమ్మరసం, పుదీనా ఆకుల్లాంటివి నీళ్లలో కలుపుకొని తాగితే ఇంకా మంచిది.
  • రెగ్యులర్‌గా పండ్లు, కూర గాయాలు ఎక్కువగా తినాలి. క్యారెట్‌, కీర, వంటి వాటిని పచ్చిగా తింటే శరీరానికి కావాల్సిన పీచు అందుతుంది. దాంతో ఆకలని పించదు. ఆరోగ్యానికీ మంచిది.
  • బరువు తగ్గించడంలో, తక్కువగా ఆకలి అనిపించడంలో ప్రోటీన్లు కీలకపాత్ర పోషిస్తాయి. కాబట్టి కొవ్వు, పిండి పదార్థాల కన్నా ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పదార్థాలనే ఎంచుకోవాలి. వెన్నలేని పెరుగు, చీజ్‌, నట్స్‌ లాంటివన్నీ ప్రోటీన్లు అందించే పదార్థాలే.
  • భోజనానికీ, భోజనానికీ మధ్యలో ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు డ్రైఫ్రూట్స్‌ని ఎంచుకోవడం ఉత్తమం. అలాగే, ఉదయాన్నే క్యారెట్‌ లేదా టమాటా జ్యూస్‌ తాగడం వల్ల బీటాకెరోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. అంతేకాదు, రాత్రిపూట ఆలస్యం కాకుండా త్వరగా, తక్కువగా తినాలి.
05:56 - December 3, 2015

చర్మం సహజ కాంతిలో మెరుస్తూ తాజాగా కనిపించాలంటే సంరక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
అరటి పండు తీసుకొని గుజ్జులా చేసి అందులో రెండు చెంచాల వంట నూనె లేదా కొబ్బరి నూనెను కలపాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకొని పావు గంటయ్యాక కడిగేసుకుంటే పొడి బారినట్లుగా ఉన్న చర్మం మృదువుగా అవుతుంది.
గుడ్డులోని తెల్ల, పచ్చసొనల్ని విడివిడిగా తీసుకోవాలి. మొదట తెల్లసొనను గిలక్కొట్టి, ముఖానికి పూతలా రాసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేసుకుని తర్వాత పచ్చసొన రాసుకోవాలి. ఇది బాగా ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం తాజాగా, తేమగా మారుతుంది.
అరకప్పు గోరువెచ్చని నీటిలో పావుకప్పు ఓట్స్‌, చెంచా పెరుగు, రెండు చెంచాల తేనె, గుడ్డులోని తెల్లసొన వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి రాసుకొని ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

కరీంనగర్ లో రౌడీషీటర్ దారుణ హత్య..

కరీంనగర్ : ధర్మపురి (మం) రాయపట్నంలో రౌడీషీటర్ చంద్రయ్య దారుణ హత్యకు గురయ్యాడు. బండరాళ్లతో దుండగులు కొట్టి చంపారు. గతంలో చంద్రయ్యపై అనేక కేసులున్నాయి.

కాలిఫోర్నియాలో కాల్పులు..14 మంది మృతి..

కాలిఫోర్నియా : శాన్ బెర్నార్డినోలో ఆగంతకులు కాల్పులు జరిపారు. 14 మంది మృతి చెందగా మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఆరోగ్య కేంద్రం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

 

స్థిరంగా అల్పపీడన ద్రోణి..

విశాఖపట్టణం : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. నేడు తీరం దిశగా కదిలే అవకాశం ఉంది. తమిళనాడు తీరం వెంబడి ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ఫలితంగా రాగల 24గంటల పాటు తమిళనాడు దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని, తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది.

 

నేడు సెహ్వాగ్ కు బీసీసీఐ సన్మానం..

ఢిల్లీ : ఫిరోజ్ షా కోట్ల మైదానంలో మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ను బీసీసీఐ సన్మానించనుంది. ఇటీవలే సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

 

నేడు భారత్ - సౌతాఫ్రికా నాలుగో టెస్టు..

ఢిల్లీ : ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఉదయం 9గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

 

నేడు తేలనున్న దానం భవితవ్యం..

హైదరాబాద్ : దానం నాగేందర్ కు పీసీసీ అల్టిమేటం జారీ చేసింది. నేడు జరిగే కో - ఆర్డినేషన్ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించింది. పార్టీలో ఉంటారో లేదో తేల్చుకోవాలని పీసీసీ తేల్చిచెప్పింది. దీనితో దానం నాగేందర్ భవితవ్యం నేడు తేలనుంది.

నేటి నుండి మావోయిస్టు వారోత్సవాలు...

విశాఖపట్టణం : నేటి నుండి వారం రోజుల పాటు మావోయిస్టు వారోత్సవాలు జరుగనున్నాయి. ప్రజా విముక్తి గెరిల్లా ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీనితో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఠాగూర్ ప్రమాణ స్వీకారం...

ఢిల్లీ : నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీఎస్ ఠాగూర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

 

నేడు ఇబ్రహింపట్నంకు కేసీఆర్..

రంగారెడ్డి : నేడు సీఎం కేసీఆర్ ఇబ్రహింపట్నంకు వెళ్లనున్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యజ్ఞానికి కేసీఆర్ హాజరు కానున్నారు. 

Don't Miss