Activities calendar

04 December 2015

21:40 - December 4, 2015

హైదరాబాద్ :ఢిల్లీ టెస్ట్‌పై భారత జట్టు పట్టు బిగించింది. రెండో రోజు ఆటలో అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన కొహ్లీ అండ్‌ కో....భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 7 వికెట్లకు 231 పరుగుల స్కోరుతో రెండోరోజుఆట కొనసాగించిన భారత జట్టు ..... ఓవర్ నైట్ స్కోరు మరో 103 పరుగులు జోడించింది.

సొంత గడ్డపై రహానే తొలిటెస్ట్ సెంచరీ....

సొంత గడ్డపై రహానే తొలిటెస్ట్ సెంచరీ నమోదు చేయడంతో పాటు.... అశ్విన్‌ 6వ టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేయడంతో టీమిండియా 334 పరుగులు నమోదు చేసింది. సఫారీ బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ అబోట్ 40 పరుగులిచ్చి 5 వికెట్లు, ఆఫ్ స్పిన్నర్ పీట్ 4 వికెట్లు, లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ ఒక వికెట్ పడగొట్టారు.

సఫారీ బ్యాట్స్‌మెన్‌ మరోసారి విఫలం....

తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన సఫారీటీమ్‌కు ఓపెనర్లు ఎల్గర్, బవుమా శుభారం చక్కటి ఆరంభాన్ని ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. భారత స్పిన్, పేస్ ఎటాక్‌ను దీటుగా ఎదుర్కోలేక సఫారీ బ్యాట్స్‌మెన్‌ మరోసారి విఫలమయ్యారు. జడేజా స్పిన్‌ మ్యాజిక్ ముందు తేలిపోయిన సఫారీ టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌....పెవిలియన్‌కు క్యూ కట్టారు.కెప్టెన్‌ హషీమ్‌ ఆమ్లా 3 పరుగులకే ఔటై నిరాశపరచగా....సిరీస్‌లో దారుణంగా విఫలమైన డు ప్లెసిస్‌ డకౌటయ్యాడు. జేపీ డుమినీ, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ విలాస్‌ కూడా తక్కువ పరుగులకే ఔటవ్వడంతో సఫారీ టీమ్‌ కోలుకోలేకపోయింది.ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా....మరో ఎండ్‌లో డివిలియర్స్‌ కొద్దిసేపు పోరాడాడు. కానీ దక్షిణాఫ్రికా జట్టును ఫాలో ఆన్‌ గండం నుంచి గట్టెక్కించలేకపోయాడు.

121 పరుగులకే కుప్పకూలిన సఫారీ టీమ్...

దీంతో సఫారీ టీమ్ 49.3 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. డివిలియర్స్ ఒక్కడే 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో లెఫ్టామ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా 30 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. పేసర్ ఉమేశ్ యాదవ్, అశ్విన్ చెరో రెండు వికెట్లు, ఇశాంత్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు.

213 పరుగుల భారీ తొలిఇన్నింగ్స్ ఆధిక్యత లభించినా..

టీమిండియాకు 213 పరుగుల భారీ తొలిఇన్నింగ్స్ ఆధిక్యత లభించినా....ఫాలో ఆన్ ఇచ్చే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. మూడోరోజుఆటలో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగి దక్షిణాఫ్రికా జట్టు ముందు భారీ లక్ష్యాన్నుంచాలని కొహ్లీ అండ్‌ కో ప్లాన్‌లో ఉంది. నాలుగుమ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను భారత జట్టు ఇప్పటికే 2-0తో సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్‌లో టీమిండియా బౌలర్ల జోరు చూస్తుంటే.....సఫారీ జట్టుకు మరో ఓటమి తప్పేలా లేదు. 

21:36 - December 4, 2015

హైదరాబాద్: ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యంపై కేజ్రీవాల్‌ సర్కార్‌ చర్యలు చేపట్టింది. ఇకపై ప్రయివేట్‌ కార్లు ప్రతిరోజూ రోడ్డుపై తిరిగే అవకాశం లేదు. నెంబర్‌ ప్లేట్‌ సరి బేసి సంఖ్యల ఆధారంగా రోజు విడిచి రోజు కారును బయటకు తీయాల్సి ఉంటుంది. జనవరి ఫస్ట్‌ నుంచి ఇది అమలులోకి రానుంది.

ఢిల్లీలో సరి, బేసి నెంబర్ల ఆధారంగా నడవనున్న కార్లు....

ఇకపై రాజధాని నగరం ఢిల్లీలోని రోడ్లపై నెంబర్ల ఆధారంగా కార్లు నడవనున్నాయి. అవి కూడా సరి, బేసి సంఖ్యల ఆధారంగా వాహనాలు రోడ్డుపైకి రానున్నాయి. సరిసంఖ్యలైన 2,4,6,8,0 నెంబర్‌ కల వాహనాలు మొదటిరోజు.... 1,3,5,7,9 బేసి సంఖ్యల నెంబర్‌ వాహనాలు రెండోరోజు నడుస్తాయి. సోమవారం కారులో వెళ్తే మంగళవారం కారులో వెళ్లడానికి వీళ్లేదన్నమాట. రోజు తప్పించి రోజు నడపాల్సి ఉంటుంది. అంటే నెలలో కేవలం 15 రోజులు మాత్రమే కారులో వెళ్లే అవకాశముంది. అయితే ఇది ప్రభుత్వ వాహనాలకు వర్తించదు.

జనవరి 1, 2016 నుంచి ఇది అమలులోకి....

ఢిల్లీలో నానాటికి పెరిగిపోతున్న కాలుష్యంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2016 నుంచి ఇది అమలులోకి రానుంది. ఈ నిర్ణయం వల్ల వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని సగం తగ్గించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఢిల్లీలో ప్రతిరోజు సుమారు వెయ్యి కార్లు రోడ్డుపైకి వస్తున్నాయి. ఇది ముంబై, కోల్‌కతా, చెన్నై కన్నా ఎక్కువ. ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకోవడంతో గురువారం హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. డిసెంబర్‌ 21 వరకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని ఆదేశించింది.

ఎమర్జెన్సీగా కాబినెట్‌ సమావేశం నిర్వహించి....

దీంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఎమర్జెన్సీగా కాబినెట్‌ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీలో వ్యాక్యూమ్‌ క్లీనర్‌ ద్వారా రోడ్లపై ధూళిని తొలగించాలని మంత్రిమండలి నిర్ణయించింది. డిటిసి బస్సులు, మెట్రో ట్రెయిన్‌ల సంఖ్యను పెంచడానికి కాబినెట్ ఆమోదం తెలిపింది. కాలుష్యం వెదజల్లుతున్న బదర్‌పూర్‌ పవర్‌ ప్లాంట్‌, ఎన్‌టిపిసికి చెందిన బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్‌ను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.

అత్యధిక కాలుష్య ప్రాంతంగా ఢిల్లీ బీజింగ్‌ను బీట్‌ చేసింది......

అత్యధిక కాలుష్య ప్రాంతంగా ఢిల్లీ బీజింగ్‌ను బీట్‌ చేసింది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ సూచిక ప్రకారం ఢిల్లీలో అత్యధిక కాలుష్య ప్రాంతంలో 860 పాయింట్లు నమోదు కాగా...అదే బీజింగ్‌లో 175 మాత్రమే ఉంది. అతి తక్కువ కాలుష్య ప్రాంతం ఢిల్లీలో 260 పాయింట్లు కాగా బీజింగ్‌లో కేవలం 16 పాయింట్లు మాత్రమే నమోదైంది. ఢిల్లీలోని అతితక్కువ పొల్యూషన్‌ గల ప్రాంతం బీజింగ్‌లోని అత్యధిక కాలుష్య ప్రాంతం కన్నా 50 శాతం ఎక్కువగా ఉండడం గమనార్హం. ఢిల్లీలో కాలుష్యం ఎంత తీవ్రస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

 

21:34 - December 4, 2015

విజయవాడ : కృష్ణా జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ లో ముసలం రాజుకుంటోంది. జిల్లాలో ఓ సీనియర్ నేత , మాజీ మంత్రిని పార్టీలోకి తీసుకువస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనిని జిల్లాలోని ముఖ్య నేతలు వ్యతిరేకిస్తున్నారు. అదే జరిగితే పార్టీ నుండి దుకాణం సర్దేందుకు సిద్దమవుతున్నారు పలువురు నేతలు. ఇంతకీ కృష్ణా జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది.

దేవినేని నెహ్రూ వైసీపీలో చేరతారనే ప్రచారం......

కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న దేవినేని నెహ్రూ వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నెహ్రూ ను పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ అధిష్టానం ఆయనతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. పార్టీకి చెందిన కొందరు నేతలు నెహ్రూ చేరికపై సంప్రదింపులు సైతం జరిపినట్లు తెలుస్తోంది. దీంతో నెహ్రూ పార్టీలో చేరడం ఖాయమని చాలా మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. దేవినేని నెహ్రూ చేరికతో జిల్లాలో కమ్మ సామాజిక వర్గ బలం తమకు కలిసొస్తుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వ్యతిరేకిస్తున్న జిల్లా నేతలు...

దేవినేని నెహ్రూ చేరికను పార్టీకి చెందిన జిల్లా నేతలు వ్యతిరేకిస్తున్నారు. దేవినేని నెహ్రూ పార్టీలోకి వస్తే మేం కొనసాగలేమని ఇప్పటికే ఇకరిద్దరు నేతలు అధినేతకు తేల్చిచెప్పేశారు. వీరిలో ముఖ్యంగా వంగవీటి రాధా అధిష్టానంపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే కాపు సామాజికవర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని వైసీపీ నేతలు భయపడుతున్నారు. దీంతో ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని జగన్ యోచిస్తున్నారు. ఇదిలా ఉంటే నెహ్రూ రాకపై రాధాను ఒప్పించేందుకు బుజ్జగింపు ప్రయత్నాలు మొదలెట్టారు సీనియర్ నేతలు .అయినా సరే రాధా ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది.

జిల్లాలో ఒకరు ఇన్ ..ఒకరు ఔట్ .....

మొత్తానికి కృష్ణా జిల్లాలో ఒకరు ఇన్ ..ఒకరు ఔట్ అయ్యే విధంగా ఉంది వైసీపీ పరిస్థితి. నెహ్రూ పార్టీలోకి వస్తే వంగవీటిరాధా.. పార్టీ నుండి తప్పుకోవడం ఖాయమని ఆయన వర్గీయులు స్పష్టం చేస్తున్నారు. మరి ఇరువురి నడుమ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.   

21:31 - December 4, 2015

హైదరాబాద్ : శాంతా బయోటెక్‌ లిమిటెడ్‌ సంస్థ రూపొందించిన పోలియో వ్యాక్సిన్‌ను సచివాలయంలో సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఈ పోలియో వ్యాక్సిన్‌కు షాన్‌-ఐపీవీ అనే పేరును పెట్టారు. ప్రస్తుతం ఉన్న పోలియో వ్యాక్సిన్ల కన్నా తాము రూపొందించిన వ్యాక్సిన్‌ సురక్షితమైందని శాంతా బయోటెక్‌ చైర్మన్‌ వరప్రసాద్‌రెడ్డి అన్నారు. ఈ వ్యాక్సిన్‌ తయారు చేయడం తెలంగాణకే గర్వకారణమని కేసీఆర్‌ తెలిపారు. శాంతా బయోటెక్‌ కేన్సర్‌ కేర్‌ సెంటర్‌ కోసం చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. 

21:30 - December 4, 2015

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీలతో సమానంగా మైనారిటీలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధితో ఉన్నారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సచివాలయంలో మైనారిటీ సంక్షేమంపై కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి MIM శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌తో సహా.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ముస్లిం మైనారిటీ యువకులు రాసే పరీక్షలు ఉర్దూ మీడియంలో ఉండేలా చూడాలని అక్బరుద్దీన్‌ కోరారు.

 

21:29 - December 4, 2015

ఢిల్లీ : ప్రయాణికులపై మరో భారం మోపేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఇకపై ఐదు నుంచి 12 ఏళ్ల లోపు వయస్సు గల పిల్లలకు రిజర్వేషన్‌లో పూర్తి ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు రైల్వేశాఖ స్పష్టం చేసింది. సాధారణ టికెట్లపై చార్జీలను మాత్రం యధాతథంగా ఉంచింది. ఇప్పటికే రిజర్వేషన్ల టికెట్ల రద్దు చార్జీలను భారీగా పెంచిన రైల్వేశాఖ.. తాజా నిర్ణయంతో రిజర్వేషన్‌ టికెట్లపై ప్రయాణించే వారిపై మరింత భారం పడనుంది. 

21:28 - December 4, 2015

ఢిల్లీ : వచ్చే జాతీయ ఎన్నికల్లో ములాయంసింగ్ యాదవ్‌ ప్రధానమంత్రి, రాహుల్‌గాంధీ డిప్యూటి ప్రధానమంత్రిగా బరిలోకి దిగాలని యుపి సిఎం సరికొత్త ప్రతిపాదన చేయడం చర్చనీయాంశమైంది. హిందూస్థాన్‌ లీడర్‌ షిప్‌ సమ్మిట్‌లో అఖిలేష్‌యాదవ్‌ తన మనసులోని మాటను చెప్పారు. దీనిపై రాహుల్‌ గాంధీ ఎలా స్పందించారు?

హిందుస్థాన్‌ టైమ్స్‌ నిర్వహించిన....

హిందుస్థాన్‌ టైమ్స్‌ నిర్వహించిన లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమావేశంలో అఖిలేష్‌యాదవ్‌తో ఎన్డీటీవీ ప్రతినిధి బర్ఖాదత్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. వచ్చే జాతీయ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌తో జతకట్టే అవకాశముందా అంటూ ప్రశ్నించారు. ప్రధానమంత్రిగా ములాయంసింగ్‌ యాదవ్‌, డిప్యూటి ప్రధానిగా రాహుల్‌గాంధీని ప్రకటిస్తే ఈ క్షణమే కూటమికి రెడీ అని అఖిలేష్‌ నవ్వుతూ అన్నారు. 2017 ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో సైతం కూటమికి సిద్ధమని రిపీట్‌ చేశారు.

రాహుల్‌గాంధీ తనకు చాలా పాత మిత్రుడని...

రాహుల్‌గాంధీ తనకు చాలా పాత మిత్రుడని...కావాలంటే ఇక్కడ కూర్చున్న ఆయన్నే అడగండంటూ బర్ఖాదత్‌నుద్దేశించి అఖిలేష్‌ అన్నారు. వ్యక్తిగత స్నేహాన్ని రాజకీయ స్నేహంగా మలచుకోవచ్చుగదా అన్న ప్రశ్నకు తిరిగి అదే సమాధానమిచ్చారు. తాను సోషలిస్టునని, నా తండ్రి ఈ దేశానికి ప్రధాని కావాలని కలకు కన్నారని, ములాయంను ప్రధానిగా ప్రకటిస్తే కాంగ్రెస్‌తో జతకట్టేందుకు తాను సిద్ధమన్నారు. బిజెపితో జత కట్టే ప్రసక్తే లేదని 45 ఏళ్ల అఖిలేష్‌ స్పష్టం చేశారు.

ఎలాంటి కామెంట్ చేయని రాహుల్...

ఈ సమ్మిట్‌లో ఆడియన్స్‌ సీట్లో కూర్చున్న రాహుల్‌గాంధీ- అఖిలేష్‌ ప్రతిపాదనపై ఎలాంటి కామెంట్‌ చేయలేదు. బీహార్‌ ఎన్నికల్లో నితీష్‌కూటమి సక్సెస్‌ సాధించడంతో 2017లో జరిగే యూపీ ఎన్నికల్లో బిజెపిని అడ్డుకునేందుకు రాజకీయ సమీకరణలపై సమాలోచనలు సాగుతున్నాయి. ఎస్పీ-బిఎస్పీ-కాంగ్రెస్‌ కూటమిలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.

జన్ లోక్ పాల్ బిల్లుకు ఢిల్లీ అసెంబ్లీ అమోదం

హైదరాబాద్ : అవినీతికి వ్యతిరేకంగా ఆప్ ప్రభుత్వం తీసుకువచ్చిన జన్ లోక్ పాల్ బిల్లును ఢిల్లీ అసెంబ్లీ ఆమోదించింది. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేజ్రీవాల్ ఈ బిల్లును ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఎన్నో విమర్వల అనంతరం శుక్రవారం ఈ బిల్లు ఆమోదం పొందింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత బిల్లు చట్టంలోకి రానుంది.

నల్లగొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి

నల్లగొండ: నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పార్టీ నేత తేరా చిన్నపరెడ్డి పేరు ఖారారైంది. జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డిలతో పాటు ఇతర నేతలతో చర్చించిన సీఎం ఈ మేరకు చిన్నపరెడ్డి అభ్యర్థిత్వాన్ని నిర్ణయించారు.

నగరంలో వ్యభిచార గృహాల పై పోలీసుల దాడులు

హైదరాబాద్: నగరంలోని అమీర్‌పేట, ఇంద్రానగర్, గోల్కొండలో గల వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు చేశారు. సోదాల సందర్భంగా పోలీసులు కోల్‌కతా, ముంబైకి చెందిన మోడల్స్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార అరెస్టు చేశారు.

20:30 - December 4, 2015

ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్న కుక్కలు.. చలికి గజగజ వణకుతున్న ములకనూరు... సర్కార్ పెద్దసార్... పరువు నడి బజారుకు... గ్రేటర్ ఎన్నికలకు కారు పార్టీ... పతంగ్ పార్టీ చర్చలు..., దానం నాగేందర్ పార్టీ మారుతున్నారన్న వార్తలకు పుల్ స్టాప్ పెట్టినట్లేనా? తమిళనాడులో వరద ప్రాంతంలో నరేంద్ర మోడీ పర్యటన ఎలా సాగింది? ఇంకా అనేక అంశాలను మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న తన వాక్ శ్చాతుర్యంతో వల్ల వేశారు. మరి మీరు కూడా చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

జన్మభూమి కమిటీలను రద్దు చేయాలి : పి.మధు

విజయవాడ : జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు డిమాండ్ చేశారు. గత రెండు రోజులుగా విజయవాడలో జరిగిన సీపీఎం రాష్ట్ర సమావేశాల వివరాలను మధు మీడియాకు వివరించారు. ఆయన మాటల్లోనే.... 'స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి. జన్మభూమి కమిటీలు స్థానిక సంస్థలకు, ప్రభుత్వ పాలనకు సమాంతర వ్యవస్థలుగా తయారయ్యాయి. పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందకుండా రాజ్యాంగేతర సంస్థలుగా జన్మభూమి కమిటీలు మారాయి. ధరల పెరుగుదలతో పేదలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం నామమాత్రపు చర్యలు చేపడుతోంది. కరువు కోరల్లో ఇంకా అనేక మండలాలున్నాయి.

రేపు పాక్షింకంగా తెరుచుకోనున్న చెన్నై ఎయిర్ పోర్ట్

హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా తమిళనాడు రాజధాని చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా జలమయమైన విషయం తెలిసిందే. దీంతో డిసెంబర్ 6 వరకు ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసి వేశారు. అయితే రన్ వే మెరుగుపడటంతో శనివారం నుంచి విమానాశ్రయాన్ని పాక్షికంగా తెరవనున్నట్లు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ఆర్ కే శ్రీవాస్తవ వెల్లడించారు.

పెరగనున్న రైల్వే ఛార్జీలు...

హైదరాబాద్ : రైల్వే శాఖ మరోసారి ప్రయాణికులపై భారం మోపేందుకు సిద్ధమైంది. సంస్కరణల పేరుతో టికెట్ ధరల పట్టికను సవరించిన రైల్వే శాఖ, ఆదాయం మరింత పెంచుకునేందుకు రిజర్వేషన్ల ఉపసంహరణ ధరలను అమాంతం పెంచేసింది. రైల్వేల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కోరుతున్న రైల్వే శాఖ, వివిధ ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్ల నిర్వహణను ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా మర్ని నిధులు రాబట్టాలని భావిస్తోంది. ఇంతలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు రవాణా వ్యవస్థలో 5 నుంచి 12 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు హాఫ్ టికెట్ విధానం అమలులో ఉండేది. ఇకపై అర్థ ఛార్జీ అనే మాట ఉండదని రైల్వే శాఖ చెబుతోంది.

19:42 - December 4, 2015

చిత్తూరు : తిరుమలలో ఈనెల 21న జరగనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినం వేడుకలకు విస్త్రుత ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి తెలిపింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో అన్ని ఆర్జతసేవలు రద్దు చేసి సామాన్యభక్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఈఓ సాంబశివరావు తెలిపారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రెండో ఘాట్ రోడ్డును సోమవారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈనెల 8నుండి 16 వరకూ కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్త్రుత ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు.

19:41 - December 4, 2015

శ్రీకాకుళం : జిల్లా వజ్రపుకొత్తూరులో ఈనెల 7వ తేదీన చంద్రబాబు పర్యటనకు భావనపాడు పోర్టు నిరసన గుబులు పట్టుకుంది. జిల్లాకు వచ్చే సీఎంకు తమ సమస్యలు చెప్పుకోవాలని భావనపాడు బాధితులున్నారు. మరోవైపు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తే అడ్డుకుంటామని ప్రజాసంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 

19:38 - December 4, 2015

హైదరాబాద్ : చిన్నబోయిన చెన్నపట్నం ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుంది. చెమ్మగిల్లిన చెన్నై ఇప్పుడే సూర్యకిరణాలను చూడగలుగుతోంది. వరదనీటిలో తేలియాడిన నగరం.. ఇప్పుడు బయటకు తేలుతోంది. వరదముట్టడిలో చిక్కుకున్న జనమంతా బురద నుంచి బయటపడేదెలా అని ఆలోచిస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న చిన్నారులకు పాలు అందించేది ఎలా అని తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. మళ్లీ స్టవ్‌ వెలిగిద్దామనుకుంటే అప్పటికే మండిపోతున్న నిత్యావసర సరుకుల ధరలు చూసి ఖంగుతింటున్నారు.

విపరీత వర్షాలకు తల్లడిల్లుతున్న తమిళనాడు......

ఇటీవల కురిసిన వర్షాలతో, అనుకోని వరదలతో చెన్నపట్నం కాస్త కుదుటపడుతోంది.ఇన్ని రోజులు నీటిలోనే ఉన్న నగరంలో ఆర్మీ అధికారులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. పెరిగిన ధరలు, దొరకని నిత్యావసరాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది చెన్నై నగరం. వర్షాలు తగ్గుముఖం పట్టాయంటూ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన గంటలోనే వర్షాలు తాంబరం, చెంగల్ పట్టు, మౌంట్ రోడ్ , తిరువల్లూరు, కాంచీపురం వంటి ఏరియాలలో మళ్లీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఆర్మీ చేపడుతున్న సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. వర్షాలకు విద్యుత్ స్థంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరా అంతంతమాత్రంగానే ఉంది. దీంతో రాత్రి వేళల్లో సహాయక చర్యలు తీవ్ర ఇబ్బందిగా మారింది.

పూర్తిగా దెబ్బతిన్న రవాణా వ్యవస్థ...

తమిళనాడులో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో అమాంతం నిత్యవసరాల ధరలు కొండెక్కాయి. పెరిగిన ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా లీటర్ పాలు 100 రూపాయలు గా అమ్ముతున్నారు దళారులు. ప్రభుత్వం పాలను సరఫరా చేస్తున్నా కాస్త వర్షాలు పలుచగా ఉన్న ఏరియాలలో దళారులు రెచ్చిపోతున్నారు. 20 లీటర్ల మంచినీటి క్యాన్ 150 రూపాయలు పలుకుతోంది. డ్రై ఐటమ్ గా తక్కువ టైంలో ఎనర్జీని ఇస్తున్న క్యారెట్ 60 రూపాయలు పలుకుతోంది. టమాటో బీన్స్ 90 పలుకుతుండడం దారుణం . అసలే విపరీత వరదలతో సర్వం కోల్పోయిన తమను ధరలు మరింత కుంగదీస్తున్నాయని తమిళులు వాపోతున్నారు.

వరదల్లో వేలమంది.....

తమిళనాడు లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదల్లో వేలమంది ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులెటెన్ విడుదల చేసింది. వరదల్లో 18 మంది మృతి చెందారని, ఎంఐవోటీ ఆసుప్రతిలో 75 మంది వెంటిలేటర్ పై ఉన్నారని, మొత్తంగా 575 మంది చికిత్స పొందుతున్నారని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. మొత్తం 9 వేల మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారని తెలిపింది.

కొన్ని రోజులుగా వరదలతో ఉక్కిరిబిక్కిరి...

గడిచిన కొన్ని రోజులుగా వరదలతో తమిళనాడు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మూలిగే నక్కమీద తాడిపండు పడ్డట్లు వరణుడు శాంతించాడు అనుకునే లోపు మరోసారి వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు తమిళప్రజలు

19:34 - December 4, 2015

విజయవాడ : అమరావతిని వారసత్వ నగరంగా ప్రకటించిన నేపథ్యంలో.. సీఎం చంద్రబాబు రేపు అమరావతిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రెండు పైలాన్‌లను బాబు ఆవిష్కరించనున్నారు. ఇందుకుగాను అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. 

19:32 - December 4, 2015

హైదరాబాద్ : భారీ వర్షాలతో అతలాకుతలమైన చెన్నై బాధితులు సోషల్‌ మీడియా అండగా నిలిచింది. మీకు మేము అండగా ఉన్నామంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల ద్వారా నెటిజన్లు ముందుకు వస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలకు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నవారు ఆశ్రయమిస్తున్నారు.

వరద బాధితులను ఆదుకోవడానికి.....

భారీ వర్షాల ధాటికి చెన్నైలోని లోతట్టు, ఎగువనున్న ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. వరద బాధితులను ఆదుకోవడానికి, ఆపన్నులకు సాయం చేసేందుకు సామాజిక మాధ్యమాలు బాగా ఉపయోగపడుతున్నాయి. బాధితులను ఆదుకోవడానికి నెటిజన్లు పెద్దమనసుతో ముందుకు వచ్చారు. వేళచ్చేరి, తాంబరం, అన్నానగర్, రెడ్‌హిల్స్, అంబత్తూర్, వలరస వాక్కం, కెకెనగర్, అశోక్‌నగర్, జాఫర్‌ఖాన్‌ పేట తదితర ప్రాంతాల్లోని నెటిజన్లు బాధితులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.

ఒక్కొక్కరు పదిమందికి ఆశ్రయం.....

అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నవారు ఒక్కొక్కరు పదిమందికి ఆశ్రయం కల్పించారు. మరికొందరు 5 వేల మందికి ఆహార పొట్లాలను సిద్ధం చేసి ఉంచామని, ఫోన్‌ చేసి చెబితే అక్కడి పంపుతామని చెబుతున్నారు. మందుల షాపుల వివరాలు, అందుబాటులో ఉన్న మందుల వివరాలను మెడికల్‌ షాపుల యజమానులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

సురక్షిత ప్రాంతాల ప్రజలు కష్టాల్లో ఉన్నవారికి....

సురక్షిత ప్రాంతాల ప్రజలు కష్టాల్లో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఇంట్లో చోటుంది, 30 మందికి సరిపడా భోజనం చేయిస్తున్నాం...తదితర సహాయం అందిస్తామంటూ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో సమాచారాన్ని పోస్ట్‌ చేస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, కార్పోరేట్‌ కంపెనీలు, షాపింగ్‌ మాల్స్‌ కూడా షెల్టర్‌తో పాటు భోజనం అందిస్తూ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నాయి.

రేపటి నుంచి నగరంలో 144 సెక్షన్

హైదరాబాద్ :డిసెంబర్ 6 బ్లాక్ డే సందర్భంగా నగరంలో రేపటి నుండి 144 సెక్షన్ అమల్లోకి రానున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 7వ తేదీ ఉదయం వరకు అమల్లో ఉంటుదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగరంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిషేధించారు. ముందు జాగ్రత్తగా జంట నగరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు.

' జీఎస్ టీ బిల్లు అమల్లోకి వస్తే ద్వంద్వ పన్నుల భారం ఉండదు'

హైదరాబాద్: వస్తుసేవల పన్ను జీఎస్టీ పై కేంద్రానికి నివేదిక ఆర్థిక ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ సమర్పించారు. జీఎస్ టీ బిల్లు అమల్లోకి వస్తే ద్వంద్వ పన్నుల భారం ఉండదన్నారు. సుపరిపాలన, మేక్ ఇండియా పురోగతికి జీఎస్టీ ఉపకరిస్తుందన్నారు. పెట్రోలియం, మద్యాన్ని జీఎస్టీ పరధిలోకి తెస్తామన్నారు.

చెన్నై బాధితులకు చపాతీలు చేసిన ఖైదీలు

హైదరాబాద్ : చెన్నై వరద బాధితులకు ఆహారమందించేందుకు కేరళలోని ఓ జైలు లో ఖైదీలు చపాతీలు తయారుచేశారు. చెన్నైకి పంపించేందుకు పూజాప్పురా సెంట్రల్ జైలులో ఖైదీలు సుమారు 50వేలకు పైగా చపాతీలను తయారు చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. జైలులో సిద్ధం చేసిన చపాతీలను ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం సహాయంతో చెన్నైకి తరలించి అధికారులకు అప్పగించినట్టు జైలు శాఖ అధికారులు వెల్లడించారు.

ఢిల్లీ కాలుష్య నివారణకు ఆప్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు

హైదరాబాద్ : ఢిల్లీలో కాలుష్య నివారణకు ఆప్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అమలుచేయనుంది. ఇక నుంచి నంబర్ ప్లేట్ల ఆధారంగా వాహనాలు నడవనున్నాయి. ముందు రోజు సరి సంఖ్యతో ప్రారంభమయ్యే వాహనాలను, తర్వాతి రోజు బేసి సంఖ్యతో ప్రారంభమయ్యే వాహనాలను రోడ్లపైకి అనుమతించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా 50 శాతం కాలుష్యాన్ని తగ్గించవచ్చని ఢిల్లీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. జనవరి 1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3-4 వారాల్లో ఢీల్లీ రోడ్డును వ్యాక్యూమ్ క్లీనర్లతో శుభ్రపరచాలని నిర్ణయించింది.

 

 

కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా బీజేపీ నేత రాధిక

హైదరాబాద్ : కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా బీజేపీ నగర మహిళామోర్చా అధ్యక్షురాలు బండారు రాధిక శ్రీధర్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సెన్సార్‌బోర్డు రీజినల్ అధికారి టి.వి.కె.రెడ్డి ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన బండారు రాధిక శ్రీధర్ మాట్లాడుతూ... అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.

ఇక నుండి వాటర్ గ్రిడ్ కాదు.. 'మిషన్ భగీరథ'

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి తాగునీటిని అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటర్ గ్రిడ్ పథకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇకపై ఈ పథకం పేరును మిషన్ భగీరథగా పిలవనున్నారు. ఈ పథకం పేరును మార్చుతూ ఇవాళ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

18:42 - December 4, 2015

తాను ఇచ్చిన 72 సీన్లు అలాగే చిత్రీకరించి ఉంటే రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమా హిట్ అయి ఉండేదని....రీసెంట్ గా రైటర్ కోన వెంకట్ కామెంట్స్ చేశాడు. ఇది నిజమేనేమో అనుకున్నారు కొంతమంది. కానీ...శంకరాభరణం సినిమా చూశాక మాత్రం అది ఖచ్చితంగా నిజం అయి ఉండదని తెలిసిపోతుంది. ఆ 72 సీన్లు అలాగే తీసి ఉంటే...బ్రూస్ లీ మరో పదిరెట్లు అట్టర్ ఫ్లాప్ సినిమా అయి ఉండేదని అర్థమైపోతుంది. ఎందుకంటే కోన వెంకట్ కథ, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేసిన శంకరాభరణం అలా ఉంది మరి. రీమేక్ సినిమాలు నేటివిటీ కుదరకో, ఆర్టిస్టులు సెట్ అవకో ప్రేక్షకులకు నచ్చకుండా తయారవుతాయి...కానీ బాలీవుడ్ ఫిల్మ్ పస్ గయారే ఒబామా ఫ్రీమేక్ శంకరాభరణం మాత్రం....ఆడియెన్స్ కు పీడకలగా మిగిలిపోతుంది. అలా రూపొందించారీ సినిమాను. క్లాసిక్ సినిమా పేరును అంతే గొప్పగా చెడగొట్టారు.....

తండ్రి అప్పుల్లో మునిగిపోగా..

తండ్రి అప్పుల్లో మునిగిపోగా...బీహార్ లో తల్లికున్న ప్యాలెస్ ను అమ్మడానికి ఇండియా వస్తాడు కొడుకు నిఖిల్. ఇక్కడ ప్యాలెస్ లో రెండు డజన్ల మంది బంధువులు తిష్ట వేసి ఉంటారు. పాతికేళ్లుగా ఉంటున్నారు కాబట్టి వాళ్ల అంగీకారం లేనిదే ప్యాలెస్ అమ్మడానికి లేదు. అప్పనంగా ఉంటున్నారు కాబట్టి అమ్మడానికి వాళ్లు ఒప్పుకోరు. నిఖిల్ తల్లి ప్రేమ పేరుతో తమని వదిలేసి వెళ్లిందనే కోపంతో అతనితో మాట్లాడరు. కానీ వాళ్ల ప్యాలెస్ లో ఉండటానికి మాత్రం వాళ్లకేం ఇది లేదు. ఆ ప్యాలెస్ అమ్మడానికి రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో తంటాలు పడుతుంటాడు హీరో. ఈ లోగా...నిఖిల్ కు మరదలు వరసయ్యే నందిత...తన బావ వందల కోట్లకు వారసుడని..ఊళ్లో చాటింపు చేయిస్తుంటుంది. దీంతో...లోకల్ గా ఉన్న బంధిపోట్లు..మన కథానాయకుడిని కిడ్నాప్ చేస్తారు. సినిమా హీరో కాబట్టి...వాళ్లందరిని తన ప్లాన్లతో బురిడీ కొట్టించి....కథను సుఖాంతం చేస్తాడు......

కథపై సింపథీని క్రియేట్ చేయాల్సింది.....

కథపై సింపథీని క్రియేట్ చేయాల్సింది అందులోని పాత్రలే. క్యారెక్టర్లు ఒకటి రెండు తేడాగా ఉంటే ఫర్లేదు. మొత్తం ఉన్న పాత్రలన్నీ తలతిక్కగా ఉంటే ఆ సినిమా శంకరాభరణంలా తయారవుతుంది. తల్లి, తండ్రి అప్పుల్లో కొంపా గోడూ పోయి రోడ్డున పడితే...ఆ కష్టాలు తీర్చేందుకు ఇండియా వచ్చిన మన హీరో....తాగి తందనాలు ఆడుతుంటాడు. హీరో పరిస్థితి ఇదైతే....అమెరికా నుంచి వచ్చిన అడవి పందైనా తాను పెళ్లి చేసుకోవాడనికి ఓకే అంటుంది హీరోయిన్ నందిత. అమెరికా నుంచి వచ్చింది కమెడియన్ సప్తగిరి అనుకుని అతన్ని లవ్ చేస్తుంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ ఇక్కడే కిల్ అయ్యింది. చెల్లెలు ప్రేమ పెళ్లి చేసుకుందని ద్వేషించే రావు రమేష్.. ఆ చెల్లిలి ఇంట్లోనే ఎందుకుంటున్నాడో అర్థం కాదు. ఆ ప్యాలెస్ లో పని పాటా లేకుండా తిని తిరుగుతున్న ఓ రెండు డజన్ల మంది...ఓ సందర్భంలో ఇంటి పెద్ద రావు రమేష్ ను చంపేద్దామనుకుంటారు. దీంతో ఆ పాత్రలన్నింటికీ విశ్వాసం లేనట్లయింది. ఇక రౌడీ గ్యాంగుల్లోనూ నిజాయితీ లేదు. అటు క్రూరంగా కాకుండా...ఇటు కామెడీకి లేకుండా పోయారు. ఇక మున్నీ అనే బంధిపోటు పాత్ర అంజలిది. అసలీ క్యారెక్టర్ ఎందుకు పెట్టారో సదరు క్రియేటివ్ జీనియస్ లకే తెలియాలి...

మొదటి సీన్ లోనే తెలిసిపోతుంది.....

ఇవాళ టైం బాగా లేక సినిమాకు వచ్చామని శంకరాభరణం మొదటి సీన్ లోనే తెలిసిపోతుంది. బీహార్ మనుషులు తెలుగులో మాట్లాడుతారు.. లాజిక్ వదిలేసి సినిమాలోని మ్యాజిక్ చూడండని స్క్రోల్ వేయిస్తారు..కానీ ఎన్ ఆర్ ఐ గా వచ్చిన నిఖిల్ మాత్రం అర్థంకాని అమెరికన్ యాసలో మాట్లాడుతుంటాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా...ఒక టార్చర్ ఐతే....ఇంటర్వెల్ నుంచి పిచ్చి పీక్స్ కు చేరుకుంటుంది. అమెరికా నుంచి వచ్చిన ఎవడైనా పెళ్లి చేసుకుంటానని చెప్పి కమెడియన్ ను లవ్ చేసే హీరోయిన్ నందిత...కుటుంబ సంబంధాలు, మనుషుల మధ్య ప్రేమ గురించి ఉపన్యాసాలు ఇస్తుంటుంది. ఇలా సన్నివేశాలు, పాత్రలు, కథ, మొత్తం సినిమా గొప్పదనం చెబితే చాలదు.. చూసి తరించాల్సిందే.

సినిమాలో ఏమీ లేదు......

సాంకేతికంగానూ శంకరాభరణం సినిమాలో ఏమీ లేదు. మ్యూజిక్ వరస్ట్ గా ఉంటే, ఎడిటింగ్ చేయడం మర్చిపోయారా అని డౌట్ వస్తుంటుంది. దర్శకత్వ పర్యవేక్షణ అనే గొప్ప విషయాన్ని వదిలేస్తే....దర్శకుడు ఉదయ్ తనతో ఇండస్ట్రీకి ముప్పు పొంచి ఉందనే సిగ్నల్స్ పంపించాడు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య సినిమాలతో నటనలో తన ప్రత్యేకత చూపించిన నిఖిల్...శంకరాభరణంతో ఆ గుడ్ విల్ తుడిచేసుకున్నాడు. ఇక ఇలాంటి సినిమాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి మంచిదనేది ప్రేక్షకులే చెబుతున్న మాట.....

ఫ్లస్ పాయింట్స్

ఏమీ లేవు

మైనస్ పాయింట్స్

1. కథ, స్క్రీన్ ప్లే, మాటలు

2. దర్శకత్వ పర్యవేక్షణ

3. నిఖిల్

4. నందిత

5. అంజలి

18:37 - December 4, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ..కమీషన్ కాకతీయగా మారుతోందా ? చెరువుల తవ్వకంలో చేతులు చాచిన అక్రమార్కులు చర్లపల్లి బాట పడుతున్నారా? మిషన్‌కాకతీయ వసూళ్లపై ఏసీబీ చేపట్టిన ఆపరేషన్ ఇంజనీరింగ్‌ అధికారుల్లో గుబులు రేపుతుందా అంటే తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి.

అగ్రిమెంట్‌, నాణ్యత ధ్రువీకరణ పత్రం జారీలో అక్రమాలు...

చెరువుల పునరుద్ధరణ కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌కాకతీయ...కాస్తా ఇప్పుడు కమీషన్‌ కాకతీయగా మారింది. నీటి పారుదల శాఖలోని కొందరు ఇంజినీర్లు తమ స్వప్రయోజనాల కోసం నిబంధనలకు పాతరేస్తూ ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. అగ్రిమెంట్, నాణ్యత ధ్రువీకరణ పత్రం జారీ చేయడంలో కాంట్రాక్టర్ల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. పర్సంటేజీ ఫిక్స్ చేసి వసూళ్లకు తెగబడుతున్నారు. పని విలువపై ఒక శాతం పర్సంటేజీ చొప్పున ముడుపులు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా అవినీతి నిరోధక శాఖ విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

భద్రకాళి చెరువు పునరుద్దరణ పనుల్లో అక్రమాలు.....

మిషన్ కాకతీయ నిధులతో వరంగల్ నగరంలోని భద్రకాళి చెరువు పునరుద్ధరణ పనులను కాంట్రాక్టర్ అబ్బు ప్రకాశ్‌రెడ్డి చేపట్టారు. అయితే తాజా అంచనాలను తయారు చేసి ఇచ్చేందుకు ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ సురేందర్‌రావు 50 వేల లంచం తీసుకుంటుండగా..ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. సురేందర్‌రావును అదుపులోకి తీసుకొని విచారించిన ఏసీబీ అధికారులు న్యాయవాది ఆదేశాలతో చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసు విచారణలో కాంట్రాక్టర్ అబ్బు ప్రకాశ్‌రెడ్డి, ఏఈ సురేందర్‌రావు నుంచి ఏసీబీ అధికారులు సాగునీటి శాఖలో సాగుతున్న వసూళ్ల సమాచారాన్ని రాబట్టారు.

చెక్‌మెజర్‌, పనుల పరిశీలన....

గతంలో మాదిరిగానే కాంట్రాక్టర్ల నుంచి ఎంబీ రికార్డు చేయడం మొదలుకొని చెక్‌మెజర్, పనుల పరిశీలన, నాణ్యత ధ్రువీకరణ పత్రం జారీ వరకు 13శాతం పర్సంటేజీకి తగ్గకుండా ముడుపులు వసూలు చేస్తున్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో అక్రమార్జనకు పెద్దపీట వేస్తున్న సాగునీటి శాఖలోని ఇంజినీర్లలో గుండెదడ మొదలైంది. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌ కాకతీయలో అక్రమాలను సహించేది లేదని భారీ నీటిపారుదశాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

అమీర్ దంపతులపై కేసు నమోదు..

ముంబై: బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్,కిరణ్‌రావు దంపతులపై ఐపీసీ సెక్షన్ 153,153ఏ,153బీ, 154 కింద కేసు నమోదైంది. ముజఫర్‌పూర్ జిల్లా కోర్టు ఆదేశాల మేరకు ముజఫర్‌పూర్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అమీర్‌ఖాన్ దంపతులు దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది సుధీర్‌కుమార్ ఓజా కోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై స్పందించిన ముజఫర్‌పూర్ జిల్లా చీఫ్ మేజిస్ట్రేట్ సుష్మా త్రివేది జారీచేసిన ఆదేశాల మేరకు అమీర్‌ఖాన్ దంపతులపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

17:58 - December 4, 2015

హైదరాబాద్ : దేశంలో మరో నెంబర్ ముఖ్యం కానుంది. ఆపదలో ఉన్నప్పుడు 100, 108 నెంబర్ డయల్ చేస్తే సమస్య పరిష్కారమయ్యేది. కాని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం అత్యధునిక టెక్నాలజీతో కొత్త నెంబర్ ప్రవేశపెట్టింది. ఫైలెట్ ప్రాజెక్ట్ గా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుంది కేంద్రం. సాప్ట్ వేర్ ను అమలు చేసి ప్రయోగత్మాకంగా ముందుండేందుకు టీఎస్ స్టేట్ ప్రయత్నిస్తోంది.

అత్యవసర హెల్ప్ లైన్స్ అన్ని 112 నెంబర్ ను అనుసంధానం....

టెక్నాలజీకి అనుకూలంగా ప్రభుత్వాలు మారాలి. పాతకాలపు టెక్నాలజీతో నేరస్తులు తప్పించుకుంటున్నారని కేంద్రం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎవరు నేరం చేశారో గుర్తించేందుకు సంవత్సరాలు పట్టేది. సెకన్స్ లో నేరస్తులను గుర్తించకపోతే భారీ నష్టాన్ని చవి చూడాల్సి వస్తోంది. ప్రపంచ ఆగ్రదేశాలు ఎలాంటి పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేసుకున్నారో పరిశీలించి అత్యవసర హెల్ప్ లైన్స్ అన్ని 112 నెంబర్ ను అనుసంధానం చేయనుంది కేంద్రం.

యూఎస్‌లో 911, బ్రిటన్‌లో 999 నంబర్లు....

యూఎస్‌లో 911, బ్రిటన్‌లో 999 నంబర్లు విస్తృతంగా అత్యవసర సమయంలో సేవలు అందిస్తున్నాయి. నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఎన్‌ఈఆర్‌ఎస్ విధానాన్ని అమలు చేసేలా ఈ నెంబర్ పని చేస్తుంది. పోలీస్, ఫైర్, అంబులెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఇతర అత్యవసర విభాగాలన్నింటిని ఎన్‌ఈఆర్‌ఎస్ వ్యవస్థ అనుసంధానంలో ఉంటాయి.

మూడునెలల్లోగా హైదరాబాద్, సైబరాబాద్‌లో....

ఈ సాఫ్ట్ వేర్ శ్రీకారానికి సైబరాబాద్ కమిషనరేట్ ను ఎంచుకుంది కేంద్రం. ఎక్కడ చిన్న సంఘటన జరిగిన పెట్రోలింగ్ వాహనం నిమిషాల వ్యవధిలో ఉండనుంది. రూ.110 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను మూడునెలల్లోగా హైదరాబాద్, సైబరాబాద్‌లో ప్రారంభించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రూరల్ ఏరియాలో సాఫ్ వేర్ ను నడపడం కష్టమైనా ప్రయోగం చేయనుంది కేసీఆర్ ప్రభుత్వం.

అన్ని సేవలు 112 కే పంపాలని కేంద్రం భావిస్తోంది.....

ఇక నుంచి అన్ని సేవలు 112 కే పంపాలని కేంద్రం భావిస్తోంది. ఇక్కడికి చేరాకే ఎమర్జెన్సీని బట్టి సమాచారం అందించనున్నారు అధికారులు. ఇది ఒక రకంగా మంచిదే. ఇటీవల 108 , ఫైర్ సిబ్బందికి ఫేక్ కాల్స్ బెడద ఎక్కువగా ఉండడంతో నిర్ణయం సరైందే అంటున్న వాదనలు వినిపిస్తున్నాయి. 

17:53 - December 4, 2015

వరంగల్‌ : మేడారం సమ్మక్క-సారక్క జాతర ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, చందూలాల్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. జనవరి 31లోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. దేశంలో అతిపెద్దదైన గిరిజన జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చేస్తామన్నారు. జాతర పనులకు గాను ముందస్తుగా 101 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. 

17:52 - December 4, 2015

ఢిల్లీ : తెలంగాణకు ప్రత్యేకహోదా కావాలంటూ లోక్‌సభలో ప్రైవేటు బిల్‌ను టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ ప్రవేశపెట్టారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ అని.. తమకే ప్రత్యేక హోదా అవసరమని ఎంపీ స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు ఈ వీడియోను క్లిక్ చేయండి..

17:50 - December 4, 2015

హైదరాబాద్ : దానం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన కాంగ్రెస్‌లో కొనసాగుతారా ? లేక కారెక్కుతారా ? అనేది సందేహాస్పదంగా మారింది. తాజాగా డీఎస్‌తో మంతనాలు జరిపిన ఆయన.. గులాబీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలిసింది. కానీ.. ఆయన మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు.

గ్రేటర్‌ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ....

గ్రేటర్‌ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టీఆర్‌ఎస్‌లోకి వలసలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌, టీడీపీల నుంచి పలువురు కారెక్కుతుండగా.. తాజాగా దానం కూడా ఆ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

పార్టీ వ్యవహారాలకు దూరంగా....

కాంగ్రెస్‌ గ్రేటర్‌ అధ్యక్షుడిగా ఉన్న దానం నాగేందర్‌ కొన్నాళ్లనుంచి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ గురువారం నాడు సమన్వయ కమిటీ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించింది. లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో కార్యకర్తలతో సమావేశమైన దానం.. ఏం చర్చించారో తెలియదు గానీ.. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌తో భేటీ అయ్యారు. అనంతరం తాను కాంగ్రెస్‌ పార్టీకి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నానన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని దానం స్పష్టం చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అంతా కలిసి పనిచేస్తామని దానం అన్నారు. తనపై వస్తున్న విమర్శలు అర్ధరహితమని ఎవరో ఏదో వ్యాఖ్యలు చేస్తే అవి తనపై ఆపాధించడం కరెక్ట్‌ కాదన్నారు.

మరో బాంబు.....

ఇక దానం కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని అందరూ భావిస్తున్న తరుణంలో మరో బాంబు పేలింది. దానం కారు ఎక్కేందుకు అంతా సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వరకు డీఎస్‌ నివాసంలో మంతనాలు జరిపిన దానం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోసారి తన అనుచరులతో సమావేశమయ్యారు. ఇక రేపో, మాపో ఆయన గులాబీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయమని తెలుస్తోంది.

దానంతో ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ భేటీ....

ఈ వార్తల నేపథ్యంలో దానంతో ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ దానంకు ఫోన్‌ చేశారు. తొందరపడి పార్టీ మారవద్దని దానంకు సూచించారు. పార్టీలో అసంతృప్తి ఉంటే పరిష్కరించుకుందామన్నారు. మరోవైపు దానం వ్యవహారంపై పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన నివాసంలో గ్రేటర్‌, రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. ఇదిలావుంటే తాను పార్టీ మారడం లేదని.. అన్ని విషయాలు నిన్ననే ప్రకటించానని దానం మీడియాపై ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ఏదిఏమైనా గ్రేటర్‌ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో వలసలు స్పీడందుకుంటున్నాయి. మరి దానం హస్తం పార్టీలో కొనసాగుతారా ? లేక కారెక్కుతారా అనేది రెండు, మూడు రోజుల్లో తేలిపోనుంది. 

తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలి : ఎంపివినోద్

ఢిల్లీ : తెలంగాణకు ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్థిక సాయం చట్టం -2015 ప్రైవేటు బిల్లును టిఆర్ ఎస్ ఎంపి లోక్సభలో ప్రవేశపెట్టారు.

సీఎం చంద్రబాబు తో చైనా ప్రతినిధుల భేటీ

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో చైనా ఆటో మొబైల్ కంపెనీ చాంగ్ ఆన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు అవకాశాలపై చర్చించినట్లు సమాచారం.

కర్నూల్లో వైసీపీ నేత దారుణ హత్య

కర్నూలు : కౌతాలం మండలం రౌడూరు లో వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. రామన్ గౌడ్ ను దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు. పాతకక్షలే హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

700 కిలోల గంజాయి స్వాధీనం...

తూర్పుగోదావరి : జిల్లాలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 700 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన రాజవొమ్మంగి మండలం జమ్మిచావిడి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. జడ్డంగి పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయితో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువు సుమారు రూ. 20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

17:21 - December 4, 2015

హైదరాబాద్ : ముందస్తు బడ్జెట్‌ తెలంగాణ అధికారుల్ని ముప్పుతిప్పలు పెడుతోంది... కేంద్రానికన్నాముందే బడ్జెట్‌ ప్రవేశపెట్టాలన్న తాపత్రయం ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది... ఢిల్లీనుంచి ఎంత వస్తుందనేది తెలియకుండా బడ్జెట్‌ ఎలా తయారుచేయాలంటూ కిందా మీదా పడుతున్నారు అధికారులు..

ఫిబ్రవరిలో బడ్జెట్‌కు కసరత్తు చేస్తున్న టీ సర్కారు....

గతానికి భిన్నంగా ఈసారి కాస్త ముందుగా బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది... కేంద్ర బడ్జెట్‌తో సంబంధంలేకుండా ఫిబ్రవరిలోనే బడ్జెట్‌కు కసరత్తు చేస్తోంది.. లక్షన్నరకోట్లకుమించి బడ్జెట్‌ రూపకల్పనకోసం వివిధ శాఖలనుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తోంది.. సాధారణంగా ప్రతి ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెడుతుంది.. ఇందులో నిధుల కేటాయింపు అంచనాలనుబట్టి రాష్ట్రాలు మార్చిలో బడ్జెట్‌ను ప్రవేశపెడతాయి.. ఏప్రిల్ 1నుంచి కొత్త బడ్జెట్‌ అమల్లోకి వస్తుంది.. అయితే ఈసారి ముందస్తు బడ్జెట్‌ ఆలోచన అధికారులకు చుక్కలు చూపిస్తోంది..

కేంద్ర సంక్షేమ పథకాలు, రాష్టాలకు వచ్చే నిధుల్లో మార్పులు ......

మరోవైపు వచ్చే బడ్జెట్‌లో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది కేంద్రం... కేంద్ర సంక్షేమ పథకాలు, రాష్టాలకు వచ్చే నిధుల్లో మార్పులు చేస్తోంది... పన్నుల వాటాల పంపకాల్లో కొత్త ఫార్ములాను అమల్లోకి తెస్తోంది.. గతంలో 32 శాతం పన్నులను రాష్టాలకు అందించేది... ఇప్పుడు ఆ శాతాన్ని 42కు పెంచింది.. కేంద్ర పథకాల అమలు భారాన్ని రాష్ట్రాలపై మరింత పెంచింది.. కేంద్ర స్కీముల్లోకూడా భారీగా కోతలు పెట్టింది.. ఇక ఏడో పీర్సీసీని వచ్చే బడ్జెట్ లో అమలు చేస్తే కేంద్రంపై లక్ష కోట్ల అదనపు భారం పడే అవకాశముంది.. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్రాలకుఇచ్చే నిధులను తగ్గించే అవకాశాలుకూడా ఉన్నాయి... ఇక ఈసారి కేంద్రం కొత్తగా జీఎస్టీ విధానాన్ని తెస్తోంది.. ఈ విధానంపై చర్చలు నడుస్తున్నాయి...

కేంద్ర ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు....

అయితే కేంద్రం తెస్తున్న ఈ ప్రతిపాదనల్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి... దీంతో ఈ అంశాల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి... ఇలా రోజుకోరకంగా ప్రాధాన్యతలు మారడంతో కేంద్ర బడ్జెట్‌పై స్పష్టత కరువైంది... రాష్ట్రాలకు కేంద్రం ఎన్ని నిధులు ఇవ్వబోతోందన్నదానిపైకూడా క్లారిటీ లేకుండాపోయింది.. ఈ సమయంలో తెలంగాణ బడ్జెట్‌కోసం నిధులను ఎలా అంచనావేయగలమని ఆర్థిక శాఖ అధికారులు సర్కారును ప్రశ్నిస్తున్నారు..

నీటిపారుదల శాఖకు రూ. 25కోట్లు కేటాయించాలని ఆదేశాలు జారీ....

అటు టీ సీఎం కేసీఆర్‌ నిర్ణయాలు తెలంగాణ ఆర్థిక శాఖను కలవరపెడుతున్నాయి... ఫలానా ప్రాజెక్టుకోసం అన్న పేరులేకుండా నీటిపారుదల శాఖకు 25కోట్లు కేటాయించాలని ఆదేశాలు జారీచేశారు.. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని అధికారులు ఆరోపిస్తున్నారు... సాధారణంగా ఓ జిల్లాలో ఓ ప్రాజెక్టుకు ఇంత ఖర్చవుతుందన్న అంచనాతో బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారు... అలాకాకుండా ఇరిగేషన్‌ శాఖకు ఇలా నిధులిస్తే ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడుతున్నారు.. దీన్ని సాకుగా చూపుతూ ఇతర శాఖలుకూడా ఇదే విధానంకోసం డిమాండ్ చేసే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.. అప్పుడు బడ్జెట్ కసరత్తులు, సమగ్ర నివేదిక రూపకల్పన అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు..

రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన టి.సర్కార్...

ఇలా ఈ సమస్యకుతోడు ఇప్పుడు ముందస్తు బడ్జెట్‌ అధికారులను మరింత ఇబ్బందిపెడుతోంది.. తెలంగాణలో ఇప్పటివరకూ రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు.. ఇందులో ఒకటిమాత్రమే పూర్తికాలబడ్జెట్‌... ఇప్పుడు సీఎం సంచలన నిర్ణయాలు, కేంద్ర నిధుల కోత, అనుకున్నంత ఆదాయం రాకపోవడంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది.. ఇలా నెలరోజులముందు బడ్జెట్‌ తలకుమించిన భారమని అధికారులు చెప్పినా కేసీఆర్‌ పట్టించుకోవడంలేదు... దీంతో తప్పనిసరిపరిస్థితుల్లో అధికారులు బడ్జెట్‌ తయారీపై దృష్టిపెట్టారు..

బడ్జెట్‌పై సీఎం ప్రత్యేక వ్యూహం....

అయితే ఈ ముందు బడ్జెట్‌పై సీఎం ప్రత్యేక వ్యూహం కనిపిస్తోంది.. నిర్దిష్ట అంచనాలులేకుండా కేంద్రంనుంచి ఇన్ని వేల కోట్లు వస్తాయంటూ టీ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెడుతుంది... ఆ తర్వాత కేంద్రం తాము కోరినస్థాయిలో నిధులు ఇవ్వలేదని.... తెలంగాణపై వివక్ష చూపుతోందంటూ ఇరుకున పెట్టే అవకాశాలున్నాయి.. అలాగే గత ఏడాది బడ్జెట్‌ నిధులు ఖర్చు చేయలేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే... మార్చిలో పూర్తిచేస్తామని సమాధానం చెప్పొచ్చు... అయితే ఈ కొత్త ఆలోచన ప్రజలను ఎంతవరకూ మెప్పిస్తుందో వేచి చూడాలి..

121 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఆలౌట్

హైదరాబాద్ : భారత్ తో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 121 పరుగులకే కుప్పకూలింది. భారత్ బౌలర్ల ధాటికి సఫారీ జట్టులో డివిలియర్స్ (42) మినహా ఏ బ్యాట్స్ మెన్ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు.

17:00 - December 4, 2015

కరీంనగర్ : ఏడు రోజులుగా మెట్టినింటి ముందు దీక్ష... పస్తులతోనే పోరాటం చేస్తున్న వనిత... ఇరుగుపొరుగు ముద్ద పెడితే కొనసాగించిన ధర్నా.. అయినా ఇంటి తలుపులు తెరవని భర్త... ఈమె సారిక....గోదావరిఖని చెందిన సారిక ఇప్పుడు అత్తారింటి ముందు ఆందోళన చేస్తుంది... ఏడు రోజులుగా పట్టువదలకుండా దీక్ష చేస్తున్న సారికకు స్థానికుల మద్దతు కూడా లభించింది... పెళ్లయి తొమ్మిది నెలలు.

ధనదాహం తీరని భర్తతో గొడవలు..

కరీంనగర్ జిల్లా గోదావరిఖని చెందిన సారికకు, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణం లోని బుడిది గడ్డ భస్తికి చెందినా రాముతో ఈ ఏడాది మార్చిలో పెళ్లయింది...కొద్ది కాలం బాగానే ఉన్నా ఆ తర్వాత రాములో ధనపిశాచి నిద్రలేచింది...ఈ క్రమంలోనే భార్యను నిత్యం వేధించేవాడు...

నాలుగు గోడల నుంచి వీధివరకు..

భర్త నుంచి వచ్చిన విడాకుల ప్రతిపాదనను నిరాకరించిన సారిక పుట్టింటికి వెళ్లిపోయింది.. అయినా వేధింపులు తగ్గకపోవడంతో ఏడు రోజుల క్రితం అత్తారింటికి చేరి ఆ ఇంటి ముందు బైఠాయించింది...ఇరుగుపొరుగు వారంతా కలిసి సారికకు నాలుగు ముద్దలు పెడితే అక్కడే కూర్చోని న్యాయం కోసం పోరాటం కొనసాగించింది...

ఏడు రోజులుగా పోరాటం...

ఇదిలా ఉంటే ఇంటి ముందు ఏడు రోజులుగా భార్య ఆందోళన చేస్తుండడంతో రాక్షసుడిని నిద్రలేపిన రాము ఆమెను ఇంట్లోకి లాక్కెళ్లి కర్రతో కొట్టి లైంగిక దాడికి యత్నించాడు..ఆమె అరుపులు కేకలతోచుట్టూ ఉన్నవారు రావడంతో బయటపడింది..గాయాలపాలైన సారికను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్ళి జరిగిన ఘటన వివరాలను తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. తనకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తానంటున్న సారికకు పోలీసులు ఎలాంటి న్యాయం చేస్తారో చూడాలి...

16:56 - December 4, 2015

విజయవాడ : కొత్త రాష్ట్రంలో కొత్త విద్య విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఏపీ సర్కార్‌ పావులు కదుపుతోంది. రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలకు స్వాగతం పలుకుతూ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తయారుచేసేందుకు సరికొత్త ప్రణాళికలను రూపొందిస్తోంది. అయితే సర్కారీ విద్యకు తూట్లుపొడిచేలా ప్రైవేటు వర్శిటీల నిర్ణయంపై మేధావి వర్గం విమర్శలు గుప్పిస్తోంది.

5-7 ప్రైవేటు యూనివర్శిటీలకు అనుమతి....

విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 5 నుంచి 7 ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. లాజిస్టిక్, ఎన్విరాన్‌మెంట్, స్కిల్ డెవలప్‌మెంట్, వాటర్ తదితర అంశాల్లో ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును కేబినెట్‌లో ఆమోదించి ఆ తర్వాత అసెంబ్లీలో ఆమోదించేలా రూపకల్పన చేశారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం దాదాపు 17,500 కోట్ల నిధుల్ని కేటాయించిందని మంత్రి గంటా అన్నారు. విశాఖలో మెట్రో యూనివర్సిటీని ఏర్పాటుకు అన్ని అనుమతులు తీసుకున్నామన్నారు. ఇప్పటివరకు 7 జాతీయ యూనివర్సిటీలు అనుమతులు కోరాయని..వాటిలో 5 వర్సిటీలకు అనుమతులొచ్చాయన్నారు. ఏడాది కాలంలో వీటిని పూర్తిచేసి కార్యాచరణలోకి తీసుకొస్తామని మంత్రి గంటా అన్నారు.

చట్టసభలో ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు....

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తే...ప్రభుత్వ యూనివర్శిటీల పరిస్థితి ఏంటని మేధావుల సంఘం ప్రశ్నిస్తోంది. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటుందని విమర్శిస్తున్నారు. ప్రైవేటు వర్శిటీల బిల్లును చట్టసభలో ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ వర్శిటీల్లో దాదాపు 1700 పోస్టులు ఖాళీగా ఉన్నా..ఇప్పటివరకు వాటిని భర్తీచేయలేని ప్రభుత్వ ..ఇప్పుడు ప్రైవేటు వర్శిటీలకు ఎలా అనుమతి ఇస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల సర్కారీవిద్య గాడితప్పుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు....

ప్రైవేటు యూనివర్శిటీలకు అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది వ్యక్తులకు లాభం చేకూర్చేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలొస్తున్నాయి. 

16:51 - December 4, 2015

నల్లగొండ : జిల్లాలో భారీ స్థాయిలో సాగు త్రాగు నీరు అందించే ఉద్దేశ్యంతో చేపట్టిన ఎస్ ఎల్ బీసీ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. ప్రాజెక్టులో భాగంగా 46 కిలోమీటర్ల సొరంగం ద్వారా నీటిని అందించాల్సి ఉండగా కేవలం టన్నెల్ మాత్రమే పూర్తయినా పూర్తిగానీటితో నిండి పోయింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

16:50 - December 4, 2015

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో జనవరి నెలాఖరునాటికి తెలుస్తుందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... టీఆర్‌ఎస్‌లోకి ఎవరైనా వచ్చి చేరుతామంటే వద్దంటామా ? అని కేటీఆర్‌ అన్నారు. కుటుంబం పెరిగే కొద్దీ సమస్యలుంటాయని.. వాటిని పరిష్కరించుకుంటామన్నారు. సీఎన్ ఎన్, ఐబీఎన్ మోస్ట్‌ ఇన్‌స్పిరేషన్‌ ఐకాన్‌ అవార్డు ప్రకటించడం పట్ల కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. మున్ముందు మరింత ఉత్సాహంగా పని చేస్తామన్నారు కేటీఆర్‌.

కుప్పకూలిన వాటర్ ట్యాంక్

నెల్లూరు : ఆత్మకూరు మండలం అప్పారావు పాలెంలో వాటర్ ట్యాంక్ కుప్పకూలింది. ఈ ఘటన జరిగినపుడు సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల కురిసిన వర్షాలకు వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుంది.

కేంద్ర మంత్రి వెంకయ్యతో బిల్ గేట్స్ భేటీ

హైదరాబాద్ : కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ అయ్యారు. పార్లమెంట్ హౌస్ లో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం.

కరీంనగర్ లో ఆశా వర్కర్ ఆత్మహత్య

కరీంనగర్ : బెజ్జంకి మండలం బేగంపేటలో గంగాభవాని అనే ఆశావర్కర్ ఆత్మహత్యకు పాల్పడింది. వేతనాల పెంపు కోసం గంగాభవాని సమ్మెలో పాల్గొంటున్న విషయమై శుక్రవారం భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన గంగాభవాని పురుగుల మందు తాగింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.గత కొంతకాలంగా వేతనాల పెంపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆశావర్కర్లు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 249 పాయింట్లు నష్టపోయి 25,638 వద్ద ముగియగా, నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 7,782 వద్ద ముగిసింది. 

చెన్నైలో మళ్లీ భారీ వర్షం..

చెన్నై: తమిళనాడు రాష్ట్రం వర్షంతో తడిసి ముద్దయిపోతోంది. రాజధాని చెన్నైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా చెన్నై ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నగరంలోని తాంబరం, చెంగల్‌పట్టు, మౌంట్‌రోడ్, మైలాపూర్, శ్రీనగర్, తిరువళ్లూరు, కాంచీపురం పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఇవాళ కూడా చెన్నై నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తమిళనాడు కోస్తా ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే

16:14 - December 4, 2015

హైదరాబాద్ : వ‌రంగ‌ల్ ఉపఎన్నిక‌లో వైసిపికి సానుకూల ఓట్లు రావ‌డంతో గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌పైన వైసిపి దృష్టి సారించింది. రానున్న గ్రేటర్ ఎన్నిక‌ల్లో సత్తా చాటాలని భావిస్తున్న ఆ పార్టీ నేతలు ఇప్పటి నుంచే వ్యుహా రచన మొదలు పెట్టారు. గ్రేటర్‌ ఎన్నికల్లో సత్తాచాటి ..తెలంగాణాలో పార్టీకి ఉన్న కొద్దిపాటి క్యాడర్ చేయి జారీ పోకుండా చేయాలని పార్టీనేతలు భావిస్తున్నారు.

2014 సాధారణ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు ....

2014 సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకటి రెండు చోట్ల మినహా మిగతా నియోజక వర్గాలలో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయింది వైసీపి. దీంతో గ్రేటర్ ఎన్నికల్లోనూ అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండేందుకు ముందస్తు కసరత్తు ప్రారంభించింది టీ వైసిపి. ఆందులో భాగంగా నియోజ‌కవ‌ర్గాల వారీగా స‌మీక్షా స‌మావేశాల్ని నిర్వహిస్తోంది. తొలుత కుత్బుల్లాపూర్, శేర్‌లింగంపల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లో మొదలైన సమావేశాలు..మాల్కాజిగిరి, కూక‌ట్‌ప‌ల్లి, ఉప్పల్‌, ఎల్బీన‌గ‌ర్, మ‌హేశ్వరం, రాజేంద్రన‌గ‌ర్‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో కొనసాగనున్నాయి. గ్రేటర్‌ పరిధిలో ఐదు జోన్లకు ఐదుగురు పరిశీలకులను నియమించింది పార్టీ అధిస్టానం. ఆయా జోన్లలో పార్టీ పరిస్థితితో పాటు పార్టీ బలోపేతం చేసే బాధ్యతను కూడా వీరికే అప్పచెప్పింది. మొత్తానికి గ్రేటర్ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి ఖాతా తెరవాల‌ని టీ వైసీపి ప్రయత్నిస్తోంది. గ్రేటర్‌లో కొన్ని స్థానాల్లోనైనా విజయం సాధించి దాని ద్వారా తెలంగాణాలో పార్టీ ఉనికిని చాటుకోవాలని టి వైసీపి భావిస్తోంది. 

16:10 - December 4, 2015

హైదరాబాద్ : చెన్నైలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టాయని వాతావరణ శాఖ ప్రకటించిన కొద్దిసేపటిలో మళ్లీ వర్షం కురవడంతో తాంబరం, చెంగల్‌పట్టు, మౌంట్‌రోడ్డులోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వర్షం కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.  చెన్నపట్నం ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకుపోయింది. నిత్యవసర వస్తువుల కోసం ప్రజల అవస్థలు పడుతున్నారు. ఇదే అవకాశంగా వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఒక్క పాల ప్యాకెట్ 150 రూపాయలకు విక్రయిస్తున్నారు. పలు ప్రాంతాల్లో బాధితులు... ఆకలికేకలతో ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల ఆర్తనాదాలు పెరిగిపోతున్నాయి. ఐసీయులో రోగులకు ఆక్సిజన్‌ అందక మృత్యువాత పడుతున్నారు. చెన్నైలోని ఎంఐవోటీ ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా లేక ఆక్సిజన్‌ సిలిండర్లు పని చేయడం లేదు. ఆక్సిజన్‌ అందక ఈ ఒక్క ఆస్పత్రిలోనే 14 మంది రోగులు మృతి చెందారు.

16:06 - December 4, 2015

నల్గొండ : ప్రియుడు మోసం చేశాడంటూ అతని ఇంటిముందు ఆందోళనకు దిగిందో ప్రియురాలు.. నల్లగొండ జిల్లా కోదాడ మండలం బొజ్జగూడెంలోఉండే బానోతు వినాయక్‌ బీటెక్ చదువుతున్నాడు... బాధితురాలిని ప్రేమిస్తున్నానంటూ ప్రపోజల్ పెట్టాడు.. దీనికి ఆమె అంగీకరించింది.. ఇలా రెండేళ్లపాటు ప్రేమించుకున్నారు.. ఆ తర్వాత కొద్దిరోజులకు వినాయక్‌ ఆ యువతిని పట్టించుకోవడం మానేశాడు.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ప్రియుడి ఇంటిముందు ధర్నాకు దిగింది బాధితురాలు.. ఈ విషయం గమనించిన ప్రియుడు, అతని కుటుంబసభ్యులు అక్కడినుంచి పరారయ్యారు.. 

16:04 - December 4, 2015

కృష్ణా : విజయవాడలో మహిళలకు షీ ఆటోలను పంపిణీ చేశారు సీఎం చంద్రబాబు... 49మంది మహిళలకు దాదాపు కోటి రూపాయల విలువైన ఆటోలను అందజేశారు... లక్షా 91వేల విలువజేసే ఈ ఆటోలకు ప్రభుత్వం 7శాతం సబ్సిడీ ఇస్తోంది... మిగిలినమొత్తాన్ని 40 ఇన్‌స్టాల్‌మెంట్లలలో నెలకు 4వేల 5వందల రూపాయల చొప్పున చెల్లించాల్సిఉంటుంది.. ఈ ఆటోల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ రావు పాల్గొన్నారు..

16:02 - December 4, 2015

నల్గొండ : యాదాద్రి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలయ అభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షుడు కిషన్‌రావ్‌ బృందం, ఆర్కిటెక్ ఆనంద్‌సాయి బృందం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. యాదాద్రి బస్టాండ్‌కు సమీపంలో 200 వసతి గృహాలు నిర్మించడంతో పాటు..వేదపాఠశాల, సాంస్కృతిక కార్యక్రమాలకు నిలయం నిర్మించనున్నట్లు ఉపాధ్యక్షుడు కిషన్‌రావు తెలిపారు. రాయగిరి నుంచి యాదాద్రి శివారు వరకు 4.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తయిందన్నారు. అయితే మెట్లదారిలో ఉన్న షాపుల తొలగింపు ప్రక్రియపై స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే బాధితులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారని ఆయన అన్నారు. 

16:01 - December 4, 2015

హైదరాబాద్ : ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వామపక్షాల అభ్యర్ధిగా సీపీఐ సీనియర్‌ నేత పువ్వాడ నాగేశ్వరరావును ఆ పార్టీ ప్రకటించింది. పువ్వాడ రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. పువ్వాడ అభ్యర్ధిత్వానికి ఇతర ప్రతిపక్షాలు కూడా మద్దతు ప్రకటించే అవకాశముందని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. టీఆర్‌ఎస్‌ బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడుతూ ఫిరాయింపులను ప్రోత్సాహిస్తుందని ఆయన విమర్శించారు. 

15:59 - December 4, 2015

హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్ కొరతలు లేకుండా చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అని . మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్‌లో రెప్పపాటుకూడా కరెంటు కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు... చిన్న తరహా పరిశ్రమల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పుకొచ్చారు.సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, భవిష్యత్తులో ఐటీ పరిశ్రమల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు.

15:57 - December 4, 2015

విజయవాడ : దుర్గగుడి ఫ్లైఓవర్ శంకుస్థాపన పనులను స్థానిక మంత్రి దేవినేని ఉమ పరిశీలించారు. రేపు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేత ఫ్లైఓవర్‌ పనులను ప్రారంభించనున్నారు. దుర్గగుడి వద్ద నిర్మిస్తున్న ఈ ఫ్లై ఓవర్‌ భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి దేవినేని అన్నారు. ప్రకాశం బ్యారేజ్ ఎగువన సూరాయపాలెం సమీపంలో మరో బ్రిడ్జ్‌ను నిర్మించటం వలన అమరావతి, విజయవాడలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయన్నారు. దాదాపు 400 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ విజయవాడ ట్రాఫిక్ సమస్యను అధిగమిస్తుందని మంత్రి అన్నారు.  

15:55 - December 4, 2015

హైదరాబాద్ : ఇసుక అక్రమ రవాణాపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, మహారాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పర్యావరణ శాఖకు, కృష్ణా, గోదావరి రివర్ డెవలప్ మెంట్ అథారిటీకి నోటీసులు జారీ చేసింది. ఇసుక అక్రమ రవాణాపై... పశ్చిమగోదావరి జిల్లా మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు వరలక్ష్మి గ్రీన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. క్రేన్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారని ఫోటోల ద్వారా ఎన్ జీటీ కి వివరించారు. దీనిని విచారణకు స్వీకరించిన ట్రిబ్యునల్... రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశిస్తూ.. తదుపరి విచారణ జనవరి 7కు వాయిదావేసింది. 

15:54 - December 4, 2015

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లోచెత్త తరలించే వాహనాల నిర్వహణను ఆర్టీసీకి అప్పగించే యోచనలో జీహెచ్ ఎంసీ ఉంది. ప్రస్తుతం నగరంలో 500 వాహనాలుండగా.. అందులో 200కు పైగా వాహనాలు 15ఏళ్ల క్రితం నాటివి. ప్రతి ఏడాది నిర్వహణ ఖర్చు పెరుగుతుండటంతో.. ఆర్టీసీకి అప్పగించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది.  

15:52 - December 4, 2015

హైదరాబాద్ : దానం నాగేందర్ పార్టీ వీడకుండా ఉండేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. దానం పార్టీ మారుతున్నారన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ దానంకు ఫోన్‌చేశారు. తొందరపడి పార్టీ మారొద్దని దానంకు సూచించారు. పార్టీలో అసంతృప్తి ఉంటే పరిష్కరించుకుందామన్నారు. మరోవైపు దానం వ్యవహారంపై పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన నివాసంలో గ్రేటర్‌, రంగారెడ్డి జిల్లా నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్‌, సుధీర్‌రెడ్డి, రంగారెడ్డి డిసిసి అధ్యక్షులు హాజరయ్యారు.  

15:25 - December 4, 2015

బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు 'సరైనోడు' అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు. ఈ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. 'జులాయి' సినిమా నుంచి అల్లు అర్జున్‌ సినిమాల మార్కెట్‌ క్రేజ్‌ భారీగా పెరిగింది. అందుకే బన్ని సినిమాలకి విడుదలకు ముందే భారీ రేటుకు అన్ని ఏరియాల రైట్స్‌ అమ్ముడుపోతుంటాయి. అదే విధంగానే తాజాగా 'సరైనోడు' సీడెడ్‌ రైట్స్‌ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ ఎన్వి ప్రసాద్‌ ఈ సినిమా సీడెడ్‌ రైట్స్‌ని సుమారు 8 కోట్లకి పైనే ఖర్చు పెట్టి కొనుగోలు చేసినట్లు సమాచారం. అప్పట్లో 'సత్యమూర్తి' సీడెడ్‌లో సుమారు 7 కోట్లకి అమ్ముడయింది. అల్లు అర్జున్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో విలన్‌గా ఆది పినిశెట్టి, ఓ ముఖ్య పాత్రలో శ్రీకాంత్‌ కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 

కశ్మీర్ లో ఎన్ కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదుల హతం

హైదరాబాద్ : కశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు.

ఎమ్మార్వో ఆఫీసులో పాము కలకలం..

నెల్లూరు : చేజర్ల తహసీల్దార్ కార్యాలయంలో పాము కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం అధికారులు, సిబ్బంది తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయంలో పాము దర్శనమిచ్చింది. దీంతో అధికారులు... సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. పాము పట్టుకునేందుకు స్నేక్ సొసైటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది అధికారులు తెలిపారు. దీంతో కార్యాలయం బయటే అధికారులు సిబ్బంది... పడిగాపులు పడుతున్నారు.

అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్ జీటీ ఆగ్రహం..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక దందాపై శుక్రవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. ఆదాయమే ధ్యేయంగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి అని మండిపడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఒడిశాలకు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది.

8మంది అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

నల్లగొండ : భువనగరిలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగల ముఠా నుంచి రూ. 30 లక్షల విలువ చేసే 93 తులాల బంగారం, కారు 4 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పోలీసులు విచారిస్తున్నారు.

దానం కాంగ్రెస్ పార్టీని వీడరు : షబ్బీర్ అలీ

హైదాబాద్ : మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నారనే వార్తలు అవాస్తవమని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్సీబర్ అలీ స్పష్టం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం దానంతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అధిష్టానం పెద్దలతో ఫోన్లో దానంతో మాట్లాడించారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. దానం కాంగ్రెస్ ను వీడరని స్పష్టం చేశారు. 

14:49 - December 4, 2015

హైదరాబాద్ : అతివలకు అన్ని సందర్భాలకు తగిన విధంగా అమరిపోయే వస్త్రధారణ చుడీదార్స్. ఈ చుడీదార్స్ లో ప్రత్యేక సందర్భాల కోసం చక్కటి కలెక్షన్ ను అందిస్తున్నారు కియారా డిజైనర్స్. ఆ కలెక్షన్ ఏమిటో ఇవాళ్టి సొగసులో చూద్దాం.

 

14:48 - December 4, 2015

హైదరాబాద్ : మహిళలకు అడుగడుగునా వేధింపులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆత్మరక్షణా పద్ధతులలో వారు నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే కరాటేలో మెళకువలతో ఇవాళ్టి నిర్భయ మీ ముందుకొచ్చింది.

14:47 - December 4, 2015

మహిళా రిజర్వేషన్లకు మోక్షమెప్పుడు అంటోంది మహిళా లోకం. తాజాగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా సంఘాలు చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాయి.

ఆంగ్ సాన్ సూకీ వచ్చే ఏడాది బాధ్యతలు.....

మయన్మార్ పార్లమెంటరీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన ఆంగ్ సాన్ సూకీ వచ్చే ఏడాది బాధ్యతలు తీసుకోనుంది. ప్రభుత్వం సైనిక పాలనతో కలిసి బాధ్యతలు చేపట్టేందుకు చర్చలు కొనసాగుతున్నాయి.

అంగన్ వాడీ కేంద్రాలకు సొంత భవనాలు.....

క్షేత్ర స్థాయిలో మాతా, శిశు సంరక్షణ కోసం ఏర్పడిన అంగన్ వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ఏటా వీటి నిర్మాణాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయనుందని సంబంధిత మంత్రి వెల్లడించారు.

ఆడపిల్లల పుట్టుకను ప్రశ్నార్థకం చేస్తున్న వ్యవస్థపై......

ఆడపిల్లల పుట్టుకను ప్రశ్నార్థకం చేస్తున్న వ్యవస్థపై ఇక ముందు నిఘా పెంచనున్నారు. అందుకు సంబంధంచి గర్భస్థ పిండ నిర్ధారణ నిషేధిత చట్టం అమలు పర్యవేక్షణలో కొన్ని మార్పుల కోసం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మహిళా వైద్యురాలికి అరుదైన హోదా......

భారత సంతతి కి చెందిన మహిళా వైద్యురాలికి అరుదైన హోదా లభించింది. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన సంస్థకు సారథిగా ఎంపికయి ఆమె ఈ ప్రత్యేకతను సాధించారు.

చెన్నై ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల ఆర్తనాదాలు

తమిళనాడు : చెన్నైలో వరదలకు ప్రజలు విలవిల్లాడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఐసీయులో రోగులకు ఆక్సిజన్‌ అందక మృత్యువాత పడుతున్నారు. చెన్నైలోని ఎంఐవోటీ ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా లేక ఆక్సిజన్‌ సిలిండర్లు పని చేయడం లేదు. ఆక్సిజన్‌ అందక ఈ ఒక్క ఆస్పత్రిలోనే 14 మంది రోగులు మృతి చెందారు.

బీఎస్పీ నేత దారుణ హత్య

ఉత్తరప్రదేశ్ : వారణాసిలో కొందరు గుర్తుతెలియన దుండగురు బీఎస్పీ నేత రాంబిహార్‌ చౌబేను అతి దారుణంగా చంపారు. శ్రీకాంత్‌ పూర్‌లోని చౌబే ఇంటిలోకి చొరబడిన దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ సంఘటన పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో జరగడం విశేషం. మోటర్‌ సైకిళ్లపై వచ్చిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి రాంబిహార్‌ను తుదముట్టించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

 

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అత్యవసర సమావేశం

ఢిల్లీ : హస్తినలో ప్రమాద స్థాయికి చేరిన వాతావరణ కాలుష్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆప్‌ సర్కార్‌ మేల్కొంది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీలో వాతావరణం గ్యాస్‌ చాంబర్‌లో ఉన్నట్లు ఉందని హైకోర్టు వ్యాఖ్యానించడం, కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి డిసెంబర్‌ 21 లోగా తమకు సమర్పించమని హైకోర్టు ఆదేశించడంతో కేజ్రీవాల్‌ సర్కార్‌ చర్యలకు ఉపక్రమించింది.

 

రసాయన కర్మాగారంలో పేలుడు..ముగ్గురి సజీవదహనం

తమిళనాడు : అమ్మత్తూర్‌ జిల్లాలోని ఓ రసాయన కర్మాగారంలో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయాయి. క్షతగాత్రులను మధురైలోని విరుధునగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరారీలో ఉన్న కర్మాగార యజమానిపై అమ్మత్తూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

13:40 - December 4, 2015

చిత్తూరు : తిరుమలలో ఈనెల 21న జరగనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినం వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి ఈఓ సాంబశివరావు తెలిపారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో అన్ని ఆర్జతసేవలు రద్దు చేసి సామాన్యభక్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఈఓ సాంబశివరావు తెలిపారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రెండో ఘాట్ రోడ్డును సోమవారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈనెల 8నుండి 16 వరకూ కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు.

 

13:24 - December 4, 2015

ఢిల్లీ : కనీవినీ ఎరుగని రీతిలో చెన్నైని వరదలు ముంచేశాయన్నారు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రకటించారు.. వరద బాధితుల్ని ఆదుకునేందుకు చాలామంది ముందుకొస్తున్నారని చెప్పుకొచ్చారు... సైన్యం చురుగ్గా సహాయకచర్యల్లో పాల్గొంటోందని వెంకయ్య తెలిపారు..

 

13:22 - December 4, 2015

తమిళనాడు : చెన్నై మహానగరం వరద నీటిలో మునిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 2,400 మందిని రక్షించామని ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ తెలిపారు. సహాయక చర్యల్లో 100 బోట్లు, 29 బృందాలు పని చేస్తున్నాయన్నారు. భారత వైమానిక దళం 200 మందిని హైదరాబాద్‌కు తరలిస్తోంది. మరో వైపు ఢిల్లీ నుంచి ప్రధాని మోది చెన్నై బయల్దేరారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. మరో వైపు తమిళనాడు కోస్తా తీరంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని కేంద్ర వాతావరణ శాఖ పేర్కొంది.

 

రోడ్డు ప్రమాదంలో చిన్నారులకు గాయాలు

వరంగల్ : డోర్నకల్ పట్టణంలోని ఎస్సీబీసీ కాలనీ వద్ద ఓ బైక్ ఢీకొని ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులు స్కూలుకు వెళ్తుండగా బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన ఇద్దరిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

13:15 - December 4, 2015

హవాయి వండర్‌ సర్ఫర్‌ కరిస్సా మూర్‌...చరిత్ర సృష్టించింది. అతి చిన్నవయసులోనే సర్ఫింగ్‌ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన కరిస్సా....మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. హోనోల్వా తీరంలో జరిగిన ఫైనల్‌ రౌండ్‌లో అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సూపర్‌ సర్ఫింగ్‌ ఫీట్స్‌ ప్రదర్శించి...వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్ ఎగరేసుకుపోయింది.
మోడ్రన్‌ సర్ఫింగ్‌ క్వీన్‌ 
హవాయి వండర్‌సర్ఫర్‌...మోడ్రన్‌ సర్ఫింగ్‌ క్వీన్‌ కరిస్సా మూర్‌....మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మవూయీ ప్రో సర్ఫింగ్‌ పోటీల్లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన కరిస్సా....వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచి ప్రస్తుతం మహిళా సర్ఫింగ్‌ వరల్డ్‌లో తన తర్వాతే ఎవరైనా అని నిరూపించింది.
సంచలన విజయం
హోనోల్వా తీరంలో జరిగిన సీజన్‌ ఆఖరి అంచె పోటీల్లో సంచలన విజయం సాధించింది. మొత్తం 150 మంది టాప్‌ క్లాస్‌ సర్ఫర్లు పాల్గొన్న ఈ మెగా ఈవెంట్‌లో క్వాలిఫైయింగ్‌ రౌండ్‌ నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన కరిస్సా ....టైటిల్‌రేస్‌లో ముందు వరుసలో నిలిచింది. ఫైనల్‌ రౌండ్‌లోనూ స్థాయికి తగ్గట్టుగా రాణించింది. హోరాహోరీగా జరిగిన ఆఖరి రౌండ్‌ పోటీలో ...ఆస్ట్రేలియన్‌ సర్ఫర్‌ శాల్లీ ఫిట్జిబోన్స్‌ను ఓడించింది.
అందరినీ ఆశ్చర్యపరచిన మూర్...
మొత్తం 10 రౌండ్లలో నిర్వహించిన ఫైనల్‌ రౌండ్‌ పోటీలో....సూపర్‌ ట్రిక్స్ తో అభిమానులతో పాటు జడ్జ్ లను సైతం ఆకట్టుకుంది. భారీ అలలపై శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ అదే సమయంలో ఫ్రీ స్టైల్‌లో సర్ఫింగ్‌ ట్రిక్స్ ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరచింది. 3 నిమిషాల 20 సెకన్లు ఎక్కడా తడబడకుండా అలలపై సవారీ చేసి...వీక్షకుల చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. రికార్డ్‌ లెవల్లో 19.50 రేటింగ్‌ పాయింట్లు నమోదు చేసి ...టైటిల్‌ ఎగరేసుకుపోయింది.
18 ఏళ్లకే వరల్డ్ చాంపియన్‌
2011లో తొలి సారిగా...18 ఏళ్లకే వరల్డ్ చాంపియన్‌గా నిలిచి సంచలనం సృష్టించిన కరిస్సా......2013లో మరోసారి వరల్డ్‌ టైటిల్‌ సొంతంచేసుకుంది. 2015లోనూ మూడోసారి వరల్డ్‌ టైటిల్‌ నెగ్గి.....23 ఏళ్లకే మూడు సార్లు ప్రొఫెషనల్‌ సర్ఫింగ్‌లో వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన మహిళా సర్ఫర్‌గా కరిస్సా చరిత్ర సృష్టించింది. 23 ఏళ్లకే మిగతా టాప్‌ క్లాస్‌ సర్ఫర్లకు సైతం సాధ్యం కానటువంటి అరుదైన విజయాలు,అరుదైన ఘనతలు సొంతం చేసుకుని.....కరిస్సా మూర్‌ మహిళా సర్ఫింగ్‌లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. మరి ఈ సర్ఫింగ్‌ క్వీన్‌ భవిష్యత్‌లో ఇంకెన్ని రికార్డ్‌లు తిరగరాస్తుందో చూడాలి.

 

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

హైదరాబాద్ : నగరంలోని కూకట్‌పల్లి మలేషియా టౌన్ షిప్‌ వద్ద ఓ ఆర్టిసి బస్సు, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేష్‌నాయక్(22) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజేష్ స్వస్థలం ఖమ్మం జిల్లా కాగా వారి కుటుంబం 20 సంవత్సరాల క్రితం కెపిహెచ్‌బి ఫోర్త్ ఫేజ్‌లో స్థిరపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

భారత్ 334 పరుగులకు ఆలౌట్

ఢిల్లీ : శాంతి సిరీస్‌ నాలుగో టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్ లో 117.5 ఓవర్లలో భారత్‌ 334 పరుగులకు ఆలౌటైంది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా.. ఆది నుండి తడబడింది. నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించిన విజయ్‌, ధావన్‌ జట్టుకు ఓపెనింగ్‌ భాగస్వామ్యం అందించడంలో విఫలమయ్యారు. విజయ్‌ (12) పరుగులు చేసి తొలి వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు. అనంతరం ధావన్‌ (33), పుజారా (14) కూడా వెనువెంటనే వికెట్లు కోల్పోయారు. ఈ దశలో కెప్టెన్‌ కోహ్లీ (44) విలువైన పరుగులు చేసి జట్టును పటిష్ట స్థితి నిలిపే యత్నం చేశాడు. అదే సమయంలో రహానేతో కలిసి 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

12:54 - December 4, 2015

తమిళనాడు: చెన్నైలో వరదలకు ప్రజలు విలవిల్లాడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఐసీయులో రోగులకు ఆక్సిజన్‌ అందక మృత్యువాత పడుతున్నారు. చెన్నైలోని ఎంఐవోటీ ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా లేక ఆక్సిజన్‌ సిలిండర్లు పని చేయడం లేదు. ఆక్సిజన్‌ అందక ఈ ఒక్క ఆస్పత్రిలోనే 14 మంది రోగులు మృతి చెందారు.

 

12:50 - December 4, 2015

గుంటూరు : జిల్లాలోని కావటి కళ్యాణమండపంలో పేలుడు సంభవించింది. మంటలు చెలరేగాయి. ఈఘటనలో నలుగురు గాయపడ్డారు. జిల్లా కేంద్రంలోని వైసిపి యువజన నాయకుడు కావటి మనోహర్ రావు చెందిన కావటి కళ్యాణమండపంలో పేలుడు సంభవించింది. కిటికీలు, అద్దాలు 30 మీటర్ల దూరంలో పడ్డాయి. అక్కడే పని చేస్తున్న వంటమనుషులపై పడ్డాయి. దీంతో నలుగురు గాయపడ్డారు. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి అగ్నిప్రమాదం జరగలేదు. అయితే అక్కడున్న మూడు సిలిండర్లు పేల లేదు. గదిలో నుంచి బలమైన పేలుడు వచ్చినట్లు తెలుస్తోంది. గుంటూరు అర్బన్ ఎస్పీ త్రిపాఠి ఘటనాస్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ లను రప్పిస్తున్నారు. 

ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై రివ్యూ

ఆదిలాబాద్ : జిల్లా అభివృద్ధిపై సచివాలయంలో రివ్యూ సమావేశం జరిగింది. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, రహదారులపై మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరారవు, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షలో చర్చించారు. త్వరలో కేసీఆర్ జిల్లా పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.

 

12:37 - December 4, 2015

ఆదిలాబాద్ : జిల్లా అభివృద్ధిపై సచివాలయంలో రివ్యూ సమావేశం జరిగింది. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, రహదారులపై మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరారవు, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షలో చర్చించారు. త్వరలో కేసీఆర్ జిల్లా పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. 

జంతు కళేబరాలతో నూనె తయారుచేస్తున్న ముఠా అరెస్ట్

నల్గొండ : జంతు కళేబరాలతో నూనె తయారుచేస్తున్న మరో ముఠా గుట్టురట్టు అయింది. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం మేడికొండపల్లిలో నలుగురు సభ్యులు ముఠా జంతు కళేబరాలతో నూనే తయారు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి సోదాలు నిర్వహించారు. కల్తీ నూనే తయారు చేస్తున్న నలుగురిని అరెస్టు చేశారు.

12:34 - December 4, 2015

నల్గొండ : జంతు కళేబరాలతో నూనె తయారుచేస్తున్న మరో ముఠా గుట్టురట్టు అయింది. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం మేడికొండపల్లిలో నలుగురు సభ్యులు ముఠా జంతు కళేబరాలతో నూనే తయారు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి సోదాలు నిర్వహించారు. నకిలీ నూనే తయారు చేస్తున్న నలుగురిని అరెస్టు చేశారు.

11:53 - December 4, 2015

తూర్పుగోదావరి : కాకినాడలోని పరిశ్రమలు కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. నాణ్యతలేని పరికరాల వాడకం.. కాలం చెల్లిన పరికరాలను మార్చక పోవడం లాంటి కారణాల వల్ల.. సంస్థల్లోలని కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారు. తరచూ తనిఖీలు చేయాల్సిన అధికారులు.. అవినీతి మత్తులో జోగుతూ.. కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్నారు. ఫలితంగా గడచిన పదేళ్లలోనే పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కాకినాడ సముద్ర తీరంలో.. ప్రమాదకర పరిశ్రమలపై 10టీవీ స్పెషల్‌ రిపోర్ట్...
కాకినాడ పరిశ్రమల్లో కార్మికులకు భద్రత కరవు
తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ సముద్ర తీర ప్రాంతపు పరిశ్రమలు.. కార్మికుల పాలిట మృత్యు నిలయాలుగా మారాయి. పరిశ్రమల్లో కార్మికులకు భద్రత పూర్తిగా కరవైంది. యాజమాన్యాల నిర్లక్ష్యం.. అధికారుల అవినీతి.. కార్మికుల ప్రాణాలను హరించి వేస్తున్నాయి. ముఖ్యంగా గ్యాస్‌తో నిర్వహించే పరిశ్రమల్లో ప్రమాదాలు నిత్య కృత్యమయ్యాయి. ఇక్కడి పరిశ్రమల్లో వారం క్రితం.. రెండు రోజుల వ్యవధిలోనే.. బాయిలర్‌లు పేలి... ఇద్దరు కార్మికులు మరణించారు. కాకినాడ వాకలపూడిలోని కోరమాండల్ పరిశ్రమలోను, యానాంలోని ఫార్మసీ ఫ్యాక్టరీలోను ఈ దుర్ఘటనలు జరిగాయి.
ప్రమాద వివరాలు బయటకు పొక్కనీయని సంస్థలు
కాకినాడ నగరంలో ఏర్పాటు చేసిన ఎరువులు.. ఆయిల్‌ పరిశ్రమలన్నీ.. దాదాపుగా నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉండడం.. వేల ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక వాడ ఉండడంతో.. అక్కడ ఏ ప్రమాదం జరిగినా వెంటనే బయటకు రావడం లేదు. యాజమాన్యాలు కార్మికుల నోళ్లు నొక్కుతూ.. ఇలాంటి ఘటనల గురించి బయటికి పొక్కకుండా చూస్తున్నారు. గడచిన ఐదేళ్లలో.. ఇక్కడి పరిశ్రమల్లో చాలా ప్రమాదాలు జరిగాయి. ప్రతి సందర్భంలోనూ కార్మికుల ప్రాణాలు పోవడమో.... చాలామంది గాయాలపాలవడమో.. అనారోగ్యానికి గురికావడమో జరుగుతున్నాయి.
ప్రమాదానికి కారణమైన పరిశ్రమలపై చర్యలు శూన్యం
ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప.. ఆ తర్వాత అధికార యంత్రాంగం పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. పలువురు కార్మికులతో పాటు.. సామాన్యుల ప్రాణాలూ గాల్లోకి కలిసి పోతున్నా ఫ్యాక్టరీలపై ఎలాంటి న్యాయపరమైన చర్యలూ తీసుకోవడం లేదు. ప్రమాదం జరిగినప్పుడు తప్ప.. పరిశ్రమలను తనిఖీ చేసిన అధికారే లేడు. ఇటీవల... కోరమాండల్‌ సంస్థలో జరిగిన ప్రమాదం విషయంలో యాజమాన్యం తీరును కార్మికులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల.. బాయిలర్‌ పేలుడులో ఓ కార్మికుడు చనిపోతే.. ఆ మృతదేహాన్ని సంస్థలోనే వేరే చోటికి తరలించి.. సాధారణ ప్రమాదంగా చూపుతున్నారని ఆరోపిస్తున్నారు.
కాకినాడ పరిశ్రమల్లో ప్రమాదాలు నిత్యకృత్యం
కాకినాడ పరిశ్రమల్లో ప్రమాదాలు నిత్య కృత్యమయ్యాయి. ఇక్కడి కోరమాండల్‌, నాగార్జున సంస్థలలోనే అత్యధిక ప్రమాదాలు జరగుతుండడం గమనార్హం. ఈ ఒక్క పరిశ్రమలోనే కాదు.. ఇక్కడి 13 ఆయిల్‌ కంపెనీల్లోనూ ప్రమాదాలకు అడ్డే లేదు. 2008 నుంచి లెక్కిస్తే.. కాకినాడ పారిశ్రామిక వాడలో.. దాదాపు డజనుకు పైగా ప్రమాదాలు సంభవించాయి. 2008లో గుడ్‌హెల్త్‌ సంస్థలోను, 2009లో కెడిఆర్ కంపెనీలోనూ ప్రమాదాలు జరిగాయి. ప్రాణాపాయం లేకున్నా.. చాలామంది కార్మికులు ఆసుపత్రుల పాలయ్యారు. అనంతరం 2010లో కోరమాండల్‌ అమోనియా ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి ఇద్దరు ఇంజనీర్లు మరణించారు. చాలామంది అనారోగ్యానికి గురయ్యారు. ఇదే సంవత్సం, ఆరణి సంస్థలోను, డీప్‌ వాటర్‌ పోర్ట్‌లో బోట్‌ పేలిన సందర్భంలోనూ.. అదృష్టవశాత్తు కార్మికులకు ప్రాణాపాయం తప్పింది. 2012లో నిఖిల్‌ ఆయిల్‌ రిఫైనరీలో పైపు లీక్‌ అయి ఇద్దరు కార్మికులు చనిపోయారు. చాలామందికి గాయాలయ్యాయి. ఆ మరుసటి సంవత్సరం.. కోరమాండల్‌ అమోనియా ప్లాంట్‌లో విస్ఫోటనం జరిగి.. గ్యాస్‌ లీకై చాలామంది అనారోగ్యం పాలయ్యారు. అదే ఏడాది ఎన్‌సీఎస్‌లో జరిగిన ప్రమాదంలో ఒకరు, ఆయిల్‌ ట్యాంకర్‌ పేలిన ఘటనలో ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఇక 2014లో గెయిల్‌ గ్యాస్‌ పేలుడు తీవ్రత చెప్పక్కరలేదు. ఈ దుర్ఘటనలో దాదాపు 25 మంది సామాన్యులు మరణించారు. ఈ ఏడాదిలో వారం క్రితం కోరమాండల్‌లో జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడి దేహం ఛిద్రమైపోయింది.
ప్రభుత్వం ఉదాసీనత
కాకినాడ పరిశ్రమల్లో ప్రమాదాల గురించి తెలిసినా ప్రభుత్వం సదరు సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలోఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కనీసం ప్రమాదాలు జరిగినప్పుడైనా నిర్వహణ, భద్రతలపై తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. కాకినాడలోని పరిశ్రమలు.. కార్మికుల పాలిటే కాదు.. సాధారణ ప్రజల పాలిటా ఇబ్బందికరంగా తయారయ్యాయని ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం ఉంది. ఈ విషయాన్ని సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్పే అంగీకరించారు. అయితే.. సదరు సంస్థలపై చర్చిస్తామని, ఆనక చర్యలు తీసుకుంటామని రొటీన్‌ డైలాగు పలికి వెళ్లిపోయారు.
ప్రమాదకర పరిశ్రమలపై.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి
కార్మికుల పాలిట ప్రాణాంతకంగా మారిన ప్రమాదకర పరిశ్రమలపై.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని.. అవినీతి మత్తులో జోగుతూ.. తనిఖీలను నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వం చర్య తీసుకుంటుందన్న భయం ఉన్నప్పుడే.. పరిశ్రమల్లోనూ, అధికారుల్లోనూ అప్రమత్తత, బాధ్యత పెరుగుతాయని సూచిస్తున్నారు.

 

సోమవారం టిఆర్ ఎస్ లో చేరనున్న దానం..

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత దానం నాగేందర్ టిఆర్ ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. సీఎం కేసీఆర్ సమక్షంలో సోమవారం దానం టిఆర్ ఎస్ లో చేరనున్నారు.

 

అశ్విన్ హాఫ్ సెంచరీ

ఢిల్లీ టెస్టు: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో భారత బ్యాట్స్ మెన్ అశ్విన్ హాఫ్ సెంచరీ చేశాడు. టెస్టులో అశ్విన్ 6 హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. 

11:27 - December 4, 2015

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ఆపరేషన్ ఆకర్ష్ గ్రేటర్‌లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే సాయన్న నిన్న టీఆర్‌ఎస్‌ తీర్థం తీసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్‌ నేత దానం నాగేందర్‌ అదే బాటలో నడిచారు. నిన్నటి వరకు కాంగ్రెస్‌తోనే ఉంటానన్న దానం నాగేందర్‌ కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. అర్ధరాత్రి వరకు డీఎస్‌ నివాసంలో మంతనాలు జరిపిన దానం నాగేందర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌ సమక్షంలో దానం నాగేందర్‌ గులాబీ తీర్థం తీసుకునేందుకు ముహూర్తం ఖరారైంది. నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ టిఆర్ ఎస్ లో చేరారు. 

 

11:16 - December 4, 2015

చిత్తూరు : పోలీస్ కస్టడీలో చింటూ నేరాల చిట్టా ఒక్కక్కటిగా బయటపడుతోంది. చింటూ ఆస్తుల జప్తుకు ఈడీకి సిఫార్సు చేస్తామని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అలాగే క్వారీల లావాదేవీలపై కూడా మైనింగ్ విభాగానికి సమాచారం అందిస్తామన్నారు. మేయర్ హత్యకేసులో పుంగనూరుకు చెందిన ఓ అడ్వకేట్, నకిలీ విలేకరిని విచారిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. 

11:13 - December 4, 2015

తమిళనాడు: చెన్నై మహానగరం కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. చెన్నపట్నం ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకుపోయింది. నిత్యవసర వస్తువుల కోసం ప్రజల అవస్థలు పడుతున్నారు. ఇదే అవకాశంగా వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఒక్క పాల ప్యాకెట్ 150 రూపాయలకు విక్రయిస్తున్నారు. పలు ప్రాంతాల్లో బాధితులు... ఆకలికేకలతో ప్రభుత్వంపై మండిపడుతున్నారు. నగరంలో 90శాతం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్ధరుణకు నోచుకోలేదు. పలువురు పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ ద్వారా ఆహారం, మంచినీరు పంపిణీ జరుగుతోంది. అరక్కోణం వైమానిక స్థావరం నుంచి ఎయిరిండియా సేవలు ప్రారంభించింది. నేవీకి చెందిన 2యుద్ధ నౌకలు భారీగా ఆహార పదార్థాలతో విశాఖ నుంచి చెన్నై చేరుకున్నాయి. మరోవైపు చెన్నైలో తాజా పరిస్థితిపై హస్తినలో కేంద్రహోంశాఖ రివ్యూ నిర్వహించింది. హోం సెక్రటరీ రాజీవ్ మెహర్షి ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి ఎన్ డిఆర్ ఎఫ్ డీజీ ఓపీ.సిగ్, హోంశాఖ అధికారులు హాజరయ్యారు.

 

 

ఎదురు కాల్పుల్లో తాలిబన్ చీఫ్ ముల్లా అక్తర్ మాన్సోర్ మృతి

ఆఫ్ఘనిస్థాన్ : తాలిబన్ చీఫ్ ముల్లా అక్తర్ మాన్సోర్ మృతి చెందినట్లు ఆప్ఘనిస్థాన్ అధికారులు ధృవీకరించారు. బుధవారం తాలిబన్లకు, పోలీసు బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముల్లా అక్తర్ తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. తీవ్ర గాయాలపాలైన ముల్లా ఇవాళ మరణించినట్లు స్పష్టం చేశారు.

10:54 - December 4, 2015

బ్రిటన్ : ఇస్లామిక్‌ స్టేట్‌పై యుద్ధం ప్రకటించిన దేశాలతో ఇప్పుడు బ్రిటన్‌ కూడా తోడైంది. సిరియాలోని ఐసిస్‌ ముష్కరుల స్థావరాలపై బ్రిటిష్‌ సైన్యాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఉగ్రవాదుల ఆర్థిక ఆయువు పట్టైన చమురు క్షేత్రాలను టార్గెట్‌గా చేసుకుని ఈ దాడులు చేస్తున్నారు. ఐఎస్‌పై దాడులకు బ్రిటన్‌ పార్లమెంట్ అనుమతించిన కొన్ని గంటలకే వైమానిక దాడులు మొదలయ్యాయి. తూర్పు సిరియాలోని ఒమర్‌లో ఉన్న చమురు క్షేత్రాలు ధ్వంసమయ్యాయి. దాడులను ముమ్మరంచేసే ఉద్దేశంతో సైప్రస్‌లోని వైమానిక స్థావరానికి బ్రిటన్‌ మరో 8 యుద్ధ విమానాలను పంపనుంది.

 

10:46 - December 4, 2015

రాజకీయాల్లో వలసల ధోరణి మంచిదికాదని దిహన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు. పార్టీ పిరాయింపులను ప్రోత్సహించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీల నేతలను టీఆర్ ఎస్ లో చేర్చుకుని పార్టీని బలోపేతం చేయాలనుకోవడంలో అర్థం లేదన్నారు. రాజకీయాలే.. ప్రభుత్వ విధానాలను నిర్ణయిస్తాయని తెలిపారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే...
భారత రాజకీయాల్లో వలసలు, పార్టీ పిరాయింపులు కొత్తకాదు. ఈ విషయంలో టీఆర్ ఎస్ ను తప్పుపట్టాల్సిన పని లేదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్, టిడిపిలు సైతం వలసలు, పార్టీ పిరాయింపులను ప్రోత్సహించాయి. ఇతర పార్టీల నేతలను తమ పార్టీల్లో చేర్చుకున్నారు. కాబట్టి కాంగ్రెస్, టిడిపిలకు టీఆర్ ఎస్ ను అడిగే నైతిక హక్కు లేదు. అయితే రాజకీయాల్లో వలసలు మంచిధోరణి కాదు.
టీఆర్ ఎస్ కు సంస్థాగత నిర్మాణం లేదు..
టీఆర్ ఎస్ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చింది. టీఆర్ ఎస్ కు సంస్థాగత నిర్మాణం లేదు. కొన్ని జిల్లాల్లో టీఆర్ ఎస్ పెద్ద ప్రభావం చూపలేదు. సెంటిమెంట్ తో ఎల్లకాలం అధికారంలో ఉండలేమన్న నిర్ధారణకు టిఆర్ ఎస్ నేతలు వచ్చారు. అందుకే ఇరత పార్టీల నేతలను తమపార్టీలోకి తీసుకుని బలోపేతం కావాలని యోచిస్తున్నారు. బలహీనంగా ఉన్న జిల్లాల్లో ఇతర పార్టీల నేతలను పార్టీలోకి తీసుకుంటున్నారు. ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో.. ఎక్కడైతే ఎన్నికలు ఉన్నాయో అక్కడ ఇతరు పార్టీలోని నేతలు, కార్యకర్తలను టిఆర్ ఎస్ లోకి చేర్చుకుంటున్నారు. అయితే ఆ విధంగా టిఆర్ ఎస్ లోకి వచ్చినా... ఆ పార్టీ బలుపు కాదు... వాపు. ప్రజల్లో పార్టీ, కేసీఆర్ బలం తగ్గినప్పుడు ఇప్పుడు పార్టీలో చేరిన వారు మున్ముందు మళ్లీ బయటికి వెళ్తారు. ఇప్పుడు చేరినవారు భవిష్యత్ లో రిటన్ గా పోతారు. కేసీఆర్ ను విమర్శిస్తారు. అరువు తెచ్చుచున్న నేతలతో పార్టీ మనుగడ సాగించలేదు. తాత్కాలిక ప్రయోజనాలతో దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతింటాయి.
టీఆర్ ఎస్ కు చారిత్రాత్మక అవకాశం
గతంలో టిడిపికి మంచి అవకాశం వచ్చింది. అదే విధంగా ఇప్పుడు టీఆర్ ఎస్ కూడా చారిత్రాత్మక అవకాశం వచ్చింది. దానిని సద్వినియోగం చేసుకోవాలి. రాజకీయాలే ప్రభుత్వ విధానాలను నిర్ణయిస్తాయి. వరంగల్ ఎన్నికల కంటే ముందు టీఆర్ ఎస్ నేతలు కేంద్రాన్ని అంతగా విమర్శించలేదు. కానీ జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. ఇవి కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే. రాబోయే కాలంలో కేంద్రంపై టీఆర్ ఎస్ తీవ్రస్థాయిలో మండిపడుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట.. అధికారంలోకి వచ్చాక మరోమాట చెబుతున్నారు.
విభజనచట్టంలోని అంశాల అమలులో కేంద్రం జాప్యం
విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడంలో కేంద్రం జాప్యం, అలసత్వం ప్రదర్శిస్తోంది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. కృష్ణా నది జలాలను రాష్టాల ప్రాతిపదికన విభజన చేస్తారు. ఇప్పటికి ఉద్యోగుల విభజన పూర్తి కాలేదు. హైకోర్టు విభజన జరగలేదు అని నాగేశ్వర్ వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

10:21 - December 4, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడిచిన నేతల్లో అసంతృప్తి రాజుకుంటోంది. సాధారణ ఎన్నికల సమయంలో అధికారం దక్కించుకునేందుకు పార్టీలోని సీనియర్ల కంటే కొత్త నేతలకే ప్రాధాన్యతనిచ్చారు. అది సక్సెస్‌ కావడంతో మిగతా అన్ని ఎన్నికల్లోనూ అదే పంథాను అనుసరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ బాస్‌ ఫాలో అవుతున్న ఈ ఫార్ములా కొంతమంది నేతల్లో అసహనం పెంచడానికి కారణమవుతోంది.
ఇప్పటికీ దక్కని నామినేటెడ్‌ పదవులు
నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెడుతామంటూ అధినేత ప్రకటనలు చేస్తున్నారు. పని మాత్రం మొదలుపెట్టలేదు. దీంతో సదరు నేతల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎన్నికల మినహా మిగతా అన్ని ఎన్నికల్లోనూ బయట నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత దక్కిందనే ఫీలింగ్‌ నేతల్లో ఉంది. శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైనా ఆరుగురూ టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి వచ్చినవారే. చివరికి మంత్రివర్గంలోనూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత దక్కింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రితో ఎన్నికలకు ముందు హామీలు పొందిన నేతలకు తప్ప మిగతా వారికి అవకాశాలు దక్కేలా కనిపించడం లేదు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి కారెక్కిన వారికి ఇప్పటికే సీట్లు ఖరారైనట్లు తెలుస్తోంది. తాజాగా మరోసారి వలసలు తీవ్రం అవుతుండడంతో....గ్రేటర్ నేతల్లో కూడా అయోమయ పరిస్థితి నెలకొంటోంది.
అధికార పార్టీ నేతల్లో ఆందోళన
గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ తరపున పోటీచేసి అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్న నేతలకు పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. పార్టీకి ముందు నుంచి పనిచేసిన నేతలకు అవకాశాలు దక్కుతాయన్న ధీమా నేతల్లో కనిపించడం లేదు. వలసలతో పార్టీ బలోపేతం అవుతుందని చెప్పుకుంటున్నా....... పెరుగుతున్న అసంతృప్తి ఎటు వైపు దారి తీస్తోందో అన్న ఆందోళన అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది.

 

రహానే సెంచరీ...

ఢిల్లీ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో రెండో రోజు భారత బ్యాట్స్ మెన్ రహానే సెంచరీ చేశాడు. టెస్టుల్లో రహానే ఐదో సెంచరీ పూర్తి చేశాడు. కాగా ఈ టెస్టు సీరీస్ లో తొలి సెంచరీ నమోదు చేశాడు.

 

నాలుగో టెస్టు మ్యాచ్‌లో రెండోరోజు ఆట ప్రారంభం

ఢిల్లీ : ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్‌ నైట్‌ స్కోరు 231/7తో భారత్‌ తొలి ఇన్నింగ్స్ ను రహానె (89), అశ్విన్‌ (1) ఇవాళ ఆరంభించారు. తొలి ఓవర్‌ దక్షిణాఫ్రికా బౌలర్‌ మోర్నీ మోర్కెల్‌ వేశాడు.

09:48 - December 4, 2015

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పార్టీలో మ‌రోసారి వ‌ల‌స‌ల జోరు పెరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌తో పాటు గ్రేట‌ర్ ఎన్నిక‌లు కూడా పార్టీ ఎదుర్కోవాల్సి ఉంది. దీంతో విప‌క్ష నేత‌ల‌ను కారెక్కించుకునే ప‌నిలో గులాబి నేత‌లు బిజీగా మారారు. ప్రధానంగా గ్రేట‌ర్ ప‌రిధిలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల‌ను ఖాళీ చేసేందుకు అధికార పార్టీ పావులు క‌దుపుతోంది.
ప్రతిప‌క్ష పార్టీల‌పై టీఆర్ ఎస్ దృష్టి
నిన్న మొన్నటి వ‌ర‌కు టిడిపిని టార్గెట్ చేసుకున్న టిఆర్ఎస్, ఇప్పుడు ప్రతిప‌క్ష పార్టీల‌న్నింటిపై దృష్టి పెట్టింది. అధికార పార్టీ గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బల్దియాలో గులాబి జెండా ఎగ‌రేసేందుకు అన్ని పావులను వాడనుంది. వార్డు స‌భ్యుడి నుంచి ఎమ్మెల్యే వ‌ర‌కు ఎవ‌రు చేరేందుకు సిద్ధంగా ఉన్నా గులాబీ కండువా కప్పేందుకు సిద్ధంగా ఉంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో విప‌క్ష పార్టీల‌కు ఏమాత్రం స్థానం లేకుండా చేసే విధంగా గులాబీ దళపతి పావులు క‌దుపుతున్నారు. సాధార‌ణ ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ ప‌రిధిలో గులాబి పార్టీ త‌ర‌పున‌ కేవలం ఇద్దరు శాస‌న‌స‌భ్యులు మాత్రమే ఎన్నిక‌య్యారు. కాని ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో శాస‌న‌స‌భ్యుల సంఖ్యను భారీగా పెంచుకున్నారు.
టీఆర్‌ఎస్‌లో చేరిన సాయ‌న్న
తాజాగా టీఆర్‌ఎస్‌లో గ్రేటర్‌కు చెందిన మరో ఎమ్మెల్యే సాయ‌న్న చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ప్రభాక‌ర్ కూడా టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మ‌రోసారి పెద్ద ఎత్తున గ్రేట‌ర్‌లో ఆపరేషన్‌ ఆకర్ష్‌కు అధికార పార్టీ తెర‌తీసింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం,కాంగ్రెస్ పార్టీల‌కు చెందిన నేత‌లు కారెక్కుతున్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం జ‌రుగుతోంది.
టీఆర్ ఎస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్
ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో కాంగ్రెస్ పార్టీకి చెందిన మరికొంత మంది ఎమ్మెల్సీలను పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు అధికార పార్టీ ఎత్తులు వేస్తోంది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ బాధ్యత‌లు పార్టీ మంత్రుల‌కు అప్పచెప్పినట్లు సమాచారం.

 

09:42 - December 4, 2015

పార్టీ పిరాయింపులు సరికాదని వక్తలు సూచించారు. 'టిఆర్ ఎస్ లోకి వలసల జోరు' అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు తెలకపల్లి రవి, వైసిపి నేత మధుమోహన్ రెడ్డి, టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, టిటిడిపి అధికార ప్రతినిధి సతీష్ మాదిగ పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టిఆర్ ఎస్ లోకి వలసలు పెరిగాయనడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. అభివృద్ధి చూసే వస్తున్నారనే మంత్రాన్ని విరమిస్తే మంచిదని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో అఖిలపక్ష సమావేశం అనే సంస్కృతి పోయిందని చెప్పారు. తమిళనాడుకు ఏం సహాయం చేస్తారో.. నెల్లూరుకు కూడా అదే చేయాలని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు నాలుగు రెట్లు పెంపు

ఢిల్లీ : హస్తిన ఎమ్మెల్యేలు ఒక్కసారిగా తమ జీతాలను నాలుగు రెట్లు పెంచేసుకున్నారు. ప్రస్తుతం వాళ్లకు నెలజీతం రూ. 88వేల వంతున ఉండగా, దాన్ని రూ. 2.35 లక్షలు చేయాలంటూ ఓ స్వతంత్ర కమిటీ ఇచ్చిన నివేదికను అసెంబ్లీ యథాతథంగా ఆమోదించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు గురువారం నాడే ఈ బిల్లును ప్రవేశపెట్టి, వెంటనే ఆమోదించేశారు. జీతాలు పెంచుకోడానికి ఇది సరైన సమయం కాదని బీజేపీ సభ్యులు వాదించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో, తాము ఈ బిల్లు మీద ఓటింగుకు దూరంగా ఉంటున్నట్లు విపక్ష నేత విజేందర్ గుప్తా చెప్పారు.

వైజాగ్ నుంచి చెన్నై కి మరో రెండు యుద్ధనౌకలు

తమిళనాడు : విశాఖపట్నం నుంచి మరో రెండు నౌకాదళ యుద్ధనౌకలు చెన్నై చేరుకున్నాయి. రెండు యుద్ధనౌకల్లో 30 టన్నుల ఆహారపదార్థాలు, తాగునీరు తీసుకువచ్చారు. అరక్కోణం వైమానిక స్థావరం నుంచి ఏయిరిండియా విమాన సేవలు నడుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు తమిళనాడు కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. చెన్నైలో ఈ రోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

రష్యా తాలిబన్ కు జీవిత ఖైదు

అమెరికా : రష్యాకు చెందిన ఓ తాలిబన్ కు అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. అతడు చనిపోయేవరకు జైలులోనే ఉంచాలని ఆదేశించింది. అఫ్గనిస్థాన్ లో అమెరికా విమానంపై దాడి చేయడమే కాకుండా అందులోని అమెరికా, అఫ్గనిస్థాన్ సైనికులపై కూడా కాల్పులు జరిపేందుకు కారణమైన కేసులో అతడికి అమెరికా కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. ఇరెక్ ఇజిజ్ హమిదుల్లిన్ (55) అనే రష్యాకు చెందిన పౌరుడు ఉగ్రవాద సంస్ధ తాలిబన్లలో చేరిపోయి ఉగ్రవాద కార్యకలాపాలకు దిగాడు. నవంబర్ 28న 2009లో అఫ్గనిస్థాన్ లో అమెరికా సైన్యం, విమానంతోపాటు, అఫ్గనిస్థాన్ సైనికులపై కూడా దాడులకు పాల్పడి పలువురు హత్య చేసేందుకు కుట్ర పన్నాడు.

08:51 - December 4, 2015

బంగారుతల్లి పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యురాలు జ్యోతి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆమో పాల్గొని, మాట్లాడారు. బంగారుతల్లికి కళ్యాణలక్ష్మీ ప్రత్యామ్నాయం కాదన్నారు. రెండు పథకాలను కొనసాగించాలని కోరారు. 'బంగారుతల్లి చట్టాన్ని రద్దు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్న వార్త అనేకమంది ఆడపిల్లలనూ, వారి అమ్మానాన్నలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. అసలు బంగారుతల్లి చట్టం వల్ల ఆడపిల్లలకు జరుగుతున్న మేలేమిటి? ఈ చట్టం అమలు తీరు ఎలా వుంది? కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం బంగారుతల్లికి ప్రత్యామ్నాయం అవుతుందా? ఈ రెండింటికీ వున్న తేడా ఏమిటి? బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? బాలికల సమగ్రాభివ్రుద్ధికి తీసుకోవాల్సిన చర్యలేమిటి? ఇలాంటి అంశాలపై జ్యోతి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:45 - December 4, 2015

కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినందున బంగారు తల్లి చట్టాన్ని రద్దు చేయాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం వున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే, బంగారుతల్లికి కళ్యాణలక్ష్మికి ప్రత్యామ్నాయం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇవాళ అమ్మాయిగా పుట్టడమే నేరమవుతోంది
తాను ఆడపిల్లగా పుట్టినందుకు బాధపడని అమ్మాయికి మించిన అదృష్టవంతురాలు ఈ భూమ్మండలం మీద మరొకరు వుండరు. ఇవాళ అమ్మాయిగా పుట్టడమే నేరమవుతోంది. తమకు పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసిన మరుక్షణమే అబార్షన్ చేయించుకుంటున్నవారి సంఖ్య, కాన్పు అయిన మరుక్షణమే పసికందుల ప్రాణం తీస్తున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. చిన్న చిన్న ఆడపిల్లలను అమ్మకానికి పెడుతున్న దౌర్భాగ్యాన్ని ప్రతి రోజూ చూస్తూనే వున్నాం. అబ్బాయిల కంటే అమ్మాయిలే బెస్ట్ అని మనస్పూర్తిగా కితాబులిచ్చేవారు సైతం ఆడబిడ్డ పుడితే కలత చెందుతున్న ద్రుశ్యాలు మన చుట్టూ కనిపిస్తున్నాయి. ఆడపిల్లల సంరక్షణ వారి అమ్మానాన్నలకు ఇప్పుడో పెద్ద సవాలుగా మారుతోంది. కనీసం తన దుస్తులు తాను వేసుకోలేని, తన జుత్తు తాను దువ్వుకోలేని తమ చిట్టితల్లిని ఆడుకోవడానికి పంపించాలన్నా భయపడాల్సిన దురద్రుష్టకర కాలమొచ్చింది. ఎవడు ఏ క్షణంలో కాటువేస్తాడోనన్న భయం. ఏ బూచోడు ఎట్నుంచి వచ్చి ఎత్తుకెళ్తాడోనన్న భయం. ఏ పాపిష్టి చూపులు తన బంగారుతల్లిని పొట్టనబెట్టుకుంటాయోనన్న భయం. ఇంత భయంకర పరిస్థితుల మధ్య, ఇన్ని భయంకర అనుభవాల మధ్య ఆడపిల్లలను సంరక్షిస్తున్న అమ్మానాన్నలను రుణం ఈ దేశం ఎన్నటికీ తీర్చుకోలేనిది.
దారుణంగా తగ్గిపోతోన్న స్త్రీల సంఖ్య
మన దేశంలోనూ, మన తెలుగు నేల మీద స్త్రీల సంఖ్య దారుణంగా తగ్గిపోతోంది. అయిదేళ్లలోపు చిన్నారుల్లో ఈ నిష్పత్తి పడిపోతున్న తీరు మరింత కలవరపెడుతోంది. మన దేశంలో ప్రతి వెయ్యి మంది బాలురకు కేవలం 914 మంది బాలికలు మాత్రమే వుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటికైనా మనం కళ్లు తెరిచి, బాలికల సంరక్షణ కర్తవ్యాన్ని స్వీకరించకపోతే, రేపటి పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుంది. జనాభాలో అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం ఏ ఒక్క సమాజానికీ, ఏ ఒక్క రాష్ట్రానికీ, ఏ ఒక్క జాతికీ మంచిది కాదు. స్త్రీ శిశు సంక్షేమానికి పాటు పడే ప్రతి పథకాన్నీ, ప్రతి చట్టాన్నీ మనం మరింత ద్రుఢ చిత్తంతో అమలు చేసుకోవాల్సిన సమయమిది. కానీ, దురద్రుష్టవశాత్తు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటినే భారంగా భావిస్తున్నాయి. ఐ సీడీఎస్ లాంటి స్త్రీ శిశు సంక్షేమ పథకాలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిధులు తగ్గిస్తుంటే, బంగారుతల్లి లాంటి పథకాలను ఎత్తివేసేందుకు కే సీ ఆర్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి చేసిన అతికొద్ది మంచిపనుల్లో బంగారుతల్లి ఒక్కటన్నది రాజకీయ ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తున్న విషయం. ఆడ పిల్ల పుట్టిన నాటి నుంచి పెళ్లీడు వచ్చి, చదువులు పూర్తయ్యే వరకు ప్రతి ఏటా ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం విశిష్టత. ఇంకా ఈ పథకం జనబాహుళ్యంలోకి విస్త్రుతంగా వెళ్లకముందే, లబ్ధిదారులను పూర్తిగా చేరకముందే, విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది.
బంగారుతల్లి దండగన్న ఆలోచన అభ్యంతరకరం
18 ఏళ్లు నిండి, పెళ్లి చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లలకు 51వేల కానుక ఇస్తామంటూ కేసీఆర్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. కళ్యాణలక్ష్మి వుండగా, ఇక బంగారుతల్లి ఎందుకు దండగ అన్న రీతిలో ప్రభుత్వం ఆలోచిస్తుండడం అభ్యంతరకరం. నిజానికి ఈ రెండు పథకాలు ఒకటి కాదు. పుట్టిన నాటి నుంచి చదువులు పూర్తయ్యే వరకు ప్రతి ఏటా నిర్ధిష్ట మొత్తంలో ఆర్థిక చేయూతనిచ్చే పథకం బంగారుతల్లి అయితే, పెళ్లి సమయంలో మాత్రమే కానుకలు సమర్పించే పథకం కళ్యాణలక్ష్మి. ఇవాళ్టి సమాజంలో ఆడపిల్లలు 18 ఏళ్లు వచ్చే దాక కాదు 18 క్షణాలైనా సజీవంగా వుండడం కష్టంగా మారుతోంది. అసలు పుట్టడమే పాపమైన చోట 18 ఏళ్లు బతికి, పెళ్లి చేసుకుంటే అప్పుడు కానుక ఇస్తాననడం స్త్రీ శిశు సంక్షేమానికి ఏ మాత్రం అక్కరకు రాదన్న వాస్తవాన్ని కేసీఆర్ ప్రభుత్వం గుర్తించాలి. ఆడపిల్లల సంరక్షణ పట్ల బాధ్యత గల ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది బంగారుతల్లి చట్టాలను మరింత సమర్ధవంతంగా అమలు చేయడం. ఉన్న కొద్దిపాటి మంచిచట్టాలకు అదనంగా తాము ఇంకా ఏమి చేయగలమో ఆలోచించడం. అప్పుడే మన నట్టింట్లో చిట్టితల్లుల చిరునవ్వులు నాట్యమాడుతాయి.

 

విద్యార్థిపై టీచర్ లైంగిక దాడి

హైదరాబాద్‌ : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫలక్‌నుమా అర్పం హైస్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పాఠశాల అనంతరం పాఠశాల డైరెక్టర్ ఇలియాస్(24) వద్ద సాయంత్రం సమయంలో ప్రత్యేక తరగతులకు హాజరవుతూ విద్యాభ్యాసం సాగిస్తున్నాడు. ట్యూషన్‌కు వెళ్లిన విద్యార్థిపై ఇలియాస్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దాడి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న బాధితులు ఇలియాస్‌పై ఫిర్యాదు చేశారు.

08:11 - December 4, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త వ్యూహానికి సిద్ధమయ్యారు. రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నగర వాసులకు మంచినీటి, విద్యుత్ బకాయిలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్దమయ్యారు. అగండి ఇందులో తిరకాసు ఉంది ఇది కేవలం నిరుపేదలకు మాత్రమే.
మంచినీటి, విద్యుత్ బకాయిల రద్దు యోచన
వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో గులాభి జెండాను ఎగరేసేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది టీఆర్ఎస్ . భారీ పథకాలతో కాకుండా పేద, మద్యతరగతి వారిని ఆకర్షించేందుకు నేరుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా గ్రేటర్ లోని మంచినీటి బిల్లులు, కరెంట్ బకాయిలు రద్దు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతకు ముందే 1200 రూపాయల లోపు ప్రాపర్టీ టాక్స్ చెల్లించే వారికి 101 రూపాయికే పరిమితం చేశారు సీఎం. తాజా నిర్ణయంతో 14 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
నగరంలో 3 లక్షల నిరుపేదలు
ఈ పథకం కేవలం నిరుపేదలకు అంటున్నారు మరి నగరంలో 3 లక్షల మంది నిరుపేదలు ఉన్నారు. వారిలో ఉండడానికి గూడు లేని వారు లక్ష మంది ఉన్నారు. అంటే కేవలం ఈ పథకం 2 లక్షల మంది కోసమే అన్నమాట. అధికార పార్టీ వ్యూహాలు ఎలా ఉన్నా.. బకాయిలను రద్దు చేయాలనే ఆలోచన సరైందనే కామెంట్స్‌ వినబడుతున్నాయి. విద్యుత్ బిల్లులతో ఆరు లక్షల కుటుంబాలకు చెందిన 128 కోట్ల రూపాయలను ప్రభుత్వం రద్దు చేయనుంది.
అడ్డంకిగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్
ఇప్పటికే ప్రాపర్టీ టాక్స్ ను అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం... వాటర్ అండ్ కరెంట్ బిల్లుల బకాయిలను రద్దు చేయాలని చూస్తోంది. కాని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల విషయంలో మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

 

08:04 - December 4, 2015

పశ్చిమగోదావరి : టీడీపీ జనచైతన్య యాత్రలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి జనచైతన్య యాత్రలో పాల్గొన్న చంద్రబాబు సైకిల్‌ తొక్కి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఇక ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న సంక్షేమపథకాలను వివరించారు. ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేస్తున్నా కొంతమంది పనికట్టుకొని విమర్శిస్తున్నారని.. ప్రజలు ఇలాంటివి నమ్మాల్సిన అవసరం లేదన్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన టీడీపీ జనచైతన్య యాత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల గురించి బాబు వివరించారు. ప్రజల సంక్షేమం కోసం టీడీపీ ఎప్పుడూ పని చేస్తుందన్నారు. గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపడతున్నామని.. భవిష్యత్‌లోనూ మరెన్నో పథకాలు చేపడతామని ఆయన అన్నారు. ఎన్నికల హామీ మేరకు కాపులకు రిజర్వేషన్‌ కల్పిస్తామన్నారు. ఇదే సమయంలో బీసీలకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తనదేనని బాబు స్పష్టం చేశారు .
జుకర్‌బర్గ్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలన్న బాబు
ఫేస్‌బుక్‌ అధినేత జుకర్‌బర్గ్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టినా కొంతమంది పనికట్టుకోని విమర్శిస్తున్నారన్నారు. అవినీతితో కోట్లు సంపాదించిన నేతల మాటలు నమ్మొద్దని.. పరోక్షంగా జగన్‌పై విమర్శలు చేశారు. అంతకుముందు జనచైతన్య యాత్రలో పాల్గొన్న చంద్రబాబు సైకిల్‌ తొక్కి కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

 

 

చెన్నై కి సహాయక చర్యలు అందిస్తాం : అమెరికా

అమెరికా : చెన్నై నగరం భారీ వర్షాల ప్రభావానికి గురై వరదల్లో కొట్టుమిట్టాడుతున్న నగరాన్ని ఆదుకునేందుకు అమెరికా కూడా ముందుకొచ్చింది. తమ దేశానికి అత్యంత ముఖ్యమైన భాగస్వామి దేశమైన భారత్ లో ఎలాంటి కష్టం ఏర్పడినా తాము స్పందిస్తామని, అవసరమైన సహాయక చర్యలు అందిస్తామని అమెరికా అధికారి మార్క్ టోనర్ తెలిపారు. తమిళనాడులోని చెన్నై పరిస్థితి దయనీయంగా మారిందని, పరిస్థితి తమ హృదయాలను ద్రవింపజేసేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం పట్ల తమ సానుభూతిని ప్రకటిస్తూ వారికి ఎలాంటి సహాయమైన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.

తుపాకి మిస్ ఫైర్..

గుంటూరు : జిల్లా మంగళగిరిలోని పోలీస్‌ బెటాలియన్‌లో ప్రమాదవశాత్తూ తుపాకి పేలింది. ఎన్ఎస్‌జీ గార్డు తుపాకి శుభ్రం చేస్తుండగా పేలుడంతో గాయాలయ్యాయి. ఎన్‌ఎస్‌జీ గార్డును ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇంకా జలదిగ్బంధంలోనే చెన్నై

తమిళనాడు : ప్రస్తుతం వర్షం తగ్గినప్పటికీ చెన్నై మాత్రం జలదిగ్బంధంలోనే ఉండిపోయింది. వరద నీరు ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. ముంపు ప్రమాదంలోనే మహానగరం ఉండిపోయింది. ఇప్పటి వరకు తమిళనాడులో వర్షాల కారణంగా 269మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ తాగునీరు, ఆహారం అందక బాధితులు అలమటిస్తున్నారు. మరోపక్క, మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు తప్పవని భారత వాతావరణ సంస్థ తెలిపింది.

 

14 కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు

హైదరాబాద్‌ : కొత్త జిల్లాల ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలోని పాత చట్టాన్ని యథాతథంగా అన్వయించుకుంది. ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్-1974కు బదులు తెలంగాణ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ గా పరిగణిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ అన్ని జిల్లాల నుంచి సమాచారం కోరింది. పరిపాలన సౌలభ్యంతో పాటు భౌగోళికంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా కొత్త జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం ప్రధాన లక్ష్యం.

07:44 - December 4, 2015

హైదరాబాద్ : ఏపీ సీఎస్ ఐవైఆర్ పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 31 తో ముగుస్తోంది. దీంతో ఏపీ నూతన సిఎస్ ఎవరనే దానిపై చర్చమెదలైంది.. ఏపీ ప్రధాన కార్యదర్శి పదవి ఎవరికి దక్కబోతుంది... రేస్ లో ఎవరెవరున్నారు అని అంశాలు తెరపైకి వచ్చాయి.
జనవరి 31న ఐవైఆర్ కృష్ణారావు పదవి విరమణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 31 పదవి విరమణ చేయనున్నారు. దీంతో ఏపీ కొత్త సీఎస్ పై చర్చ సాగుతోంది. ప్రస్తుతం సీఎస్‌ రేసులో రాష్ట్ర గవర్నర్‌ వద్ద ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఎస్‌పి టక్కర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. 1981 బ్యాచ్ కు చెందిన ఎస్పి టక్కర్ ప్రణాళికరంగంలో కీలకపాత్ర పోషిస్తూ ముఖ్యమంత్రికి సన్నిహితునిగా ఉన్నారు. సీయం ప్రతిష్టాత్మకంగా భావించిన ఏడు మిషన్ల రూపకల్పనలో కూడా టక్కర్‌ కీలక పాత్ర పోషించారని సమాచారం. ఈ నేపథ్యంలో టక్కర్‌కే సిఎస్‌ పదవి లభించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
సీఎం కు సన్నిహితుడిగా రమేష్ 
అయితే ప్రస్తుతం గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌ కూడా సీఎస్ రేసులో పోటీపడుతున్నారు. 1982 బ్యాచ్ కు చెందిన రమేష్ సీఎం కు సన్నిహితుడిగా ఉన్నారు. గతంలో బాబు సీయంగా ఉన్నప్పుడు కమర్షియల్ టాక్సెస్ కమిషనర్ గా పనిచేసారు.
రేసులో ఎస్‌పి టక్కర్‌, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌
అయితే కొత్త సీఎస్‌లుగా రేసులో ఉన్న ఎస్‌పి టక్కర్‌, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సైతం త్వరలోనే పదవీ విరమణ చేయనున్నారు. రమేష్‌కుమార్‌ మార్చి 31న, టక్కర్‌ ఆగస్టు 31 పదవీ విరమణ చేయనున్నారు. వీరిరువురిలో ప్రధాన కార్యదర్శి పదవి ఎవర్ని వరిస్తుందో వేచి చూడాలి.

 

07:34 - December 4, 2015

హైదరాబాద్ : చేసింది ఎవరైనా ఒక అతిపెద్ద తప్పు ఎంతో పేరున్న ఎలక్షన్‌ కమిషన్‌ పరువును గంగపాలు చేసింది. ఇప్పుడు అదే మిస్టేక్‌ ఎలక్షన్‌ అధికారులను కోర్టు చుట్టూ తిరిగేలా చేస్తోంది. జిహెచ్ ఎంసి పరిధిలో ఇష్టానుసారంగా ఓట్లను తొలగించిన వ్యవహారంపై హైకోర్టు విచారిస్తోంది. ఏకంగా లక్షల సంఖ్యలో ఓట్లను తొలగించడంతో ఈసీ నుంచి మరిన్ని వివరాలు కోరింది.
ఆరున్నర లక్షల ఓట్ల తొలగింపు..
అత్యంత విస్మయకర రీతిలో జిహెచ్‌ఎంసి పరిధిలో ఆరున్నర లక్షల ఓట్లు మాయమయ్యాయి. మరికొన్ని రోజుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఇదే సమయంలో ఏకంగా ఆరున్నర లక్షల దాకా ఓట్లను తొలగించారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది. స్టేట్‌ ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ తప్పును గుర్తించి కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టింది.
గందరగోళంగా జిహెచ్‌ఎంసి ఎన్నికలు
గతంలో ఎలా ఉన్నా ఈసారి మాత్రం జిహెచ్‌ఎంసి ఎన్నికల వ్యవహారమంతా గందరగోళంగా, అత్యంత వివాదాస్పదంగా జరుగుతోంది. అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ గ్రేటర్‌ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు కొన్ని అవకతవకలకు పాల్పడిందని భారీ స్థాయిలో విమర్శలొచ్చాయి. వార్డులను విభజించడం దగ్గరనుంచి ఓట్ల తొలగింపు దాకా దాని పాత్ర ఉందని ప్రతిపక్షాలు విమర్శించాయి. విమర్శిస్తున్నాయి. ఈ వ్యవహారంలో అత్యుత్సాహానికి పోయిన జిహెచ్‌ఎంసి కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ను చివరకు వేరే పోస్ట్‌కు ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్‌ చేయాల్సొచ్చింది.
కేంద్రఎలక్షన్‌ కమిషన్‌కు ప్రతిపక్షాల ఫిర్యాదు
లక్షల సంఖ్యలో ఓట్లు మాయమవడంతో ఆగ్రహించిన ప్రతిపక్షాలు కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. దీంతో రంగంలోకి దిగిన ఈసీ ఇతర రాష్ట్రాల అధికారులతో కమిటీ వేసి విచారణ చేయించింది. పశ్చిమ బెంగాల్‌ సీఈవో సునీల్‌ గుప్తా నేతృత్వంలో ఉత్తరప్రదేశ్‌ అదనపు సీఈవో, ఆరుగురు కార్యదర్శులు, ఆరుగురు సహాయ కార్యదర్శులతో కూడిన 14 మంది బృందం విస్తృతంగా పరిశీలన జరిపి నివేదిక తయారుచేసింది. ఇదిలా ఉండగా ఓట్ల తొలగింపు విషయమై హైకోర్టులో కేసు నమోదవడంతో అది విచారిస్తోంది.
తొలగించిన ఓట్లపై వివరాలు వెల్లడించాలన్న కోర్టు
నోటీసులు ఇవ్వకుండానే 6.30 లక్షల ఓట్లను తొలగించారని కోర్టులో పిటిషనర్లు వాదించారు. కాగా ఫిర్యాదులపై ఇంటింటి పరిశీలన జరిపామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నుంచి నివేదిక అందాల్సి ఉందని ఈసీ తెలిపింది. ఈ నేపథ్యంలో తొలగించిన ఓట్లపై ఈ నెల 10లోగా వివరాలు వెల్లడించాలని కోర్టు ఈసీని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.

 

07:27 - December 4, 2015

హైదరాబాద్ : కృష్ణా జలాలను ఏ రాష్ట్రానికి ఎంతమేర కేటాయించాలి... ఇదే అంశం ఇప్పుడు సుప్రీంకోర్టులో స్ట్రగులవుతోంది. రాష్ట్రాల మధ్య గొడవలకు కారణమయ్యే జలపంపిణీ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మరో స్టేట్‌కు అన్యాయం జరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే మా రాష్ట్ర కోటాను తేల్చండి అంటూ తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. అయితే సమాచారం ఇచ్చే విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కోర్టు సీరియస్‌ అయింది.
ఆ నాలుగు రాష్ట్రాలకు వరప్రదాయని.. కృష్ణానది
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర. ఈ నాలుగు రాష్ట్రాలకు వరప్రదాయనిలాంటిది కృష్ణానది. దీనిని నమ్ముకుని లక్షలాది ఎకరాల్లో పంటలు సాగుచేస్తుంటారు. అందుకే ఈ నదీజలాల పంపిణీ విషయంలో తరచూ గొడవలొస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆ జలాల్లో తమ వాటాను తేల్చమని తెలంగాణ కోరడంతో సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. అయితే ఈ విషయంలో వివరాలు అందించాల్సిన కేంద్రం తన వైఖరి వెల్లడించకపోవడంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణ తరపున వాదనలు ప్రారంభించిన వైద్యనాథన్‌
మొదట తెలంగాణ తరపున వాదనలు ప్రారంభించిన వైద్యనాథన్‌ మొదటి నుంచీ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మిగిలిన రాష్ట్రాలకు ఏవిధంగా హక్కులు ఉంటాయో తమకూ అవే రైట్స్ ఉంటాయని తెలిపారు. ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటకలు ఎక్కువ మొత్తంలో నీళ్లు వాడుకుంటున్నారని అందుకే ఈ సంవత్సరం ఏపీకి, తెలంగాణకు నీళ్లు లభించలేదని వైద్యనాథన్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై మీ వివరణేంటని కోర్టు కేంద్రప్రభుత్వాన్ని కోరగా కేంద్రం తమకు మరికొంత సమయం కావాలని కోరింది. దీంతో తెలంగాణ పిటిషన్‌పై ఇంతవరకు ఎందుకు మీ వైఖరి వెల్లడించలేదని ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా కేంద్రాన్ని ప్రశ్నించారు. పూర్తిగా సమాచారం లేకుండా వాయిదా ఎలా అడుగుతారని ప్రశ్నిస్తూ 15 నిమిషాల్లోగా సమాచారం తెలుసుకుని రావాలని కేంద్రం తరపు న్యాయవాది మోహనను ఆదేశించారు.
కేంద్రప్రభుత్వ న్యాయవాదిపై ధర్మాసనం ఆగ్రహం
అనంతరం సమాచారంతో వచ్చిన కేంద్ర ప్రభుత్వ న్యాయవాది... జలవనరుల నుంచి ఇంతకుముందే దస్త్రం వచ్చిందని అందులో తెలిపిన అంశాలు ఇంకా తెలియనందున కొంత సమయం కావాలని అభ్యర్థించారు. దీంతో ఆగ్రహించిన ధర్మాసనం సమయం విలువ తెలుసుకుని వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. పిటిషన్‌పై వివరాలు తెలపాలంటూ ఆదేశించి నెల దాటినా ఇప్పటివరకూ సమాధానం ఇవ్వకుండా మరింత సమయం కావాలని కోరడంలో ఆంతర్యమేంటని కేంద్రాన్ని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ విషయాన్ని వాదనలు ప్రారంభించకముందే చెప్పాల్సిందన్నారు. మీ బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని సీరియస్‌ అవుతూ తదుపరి విచారణలో అయినా పూర్తి సమాచారంతో రావాలని ఆదేశించారు. కేసును వచ్చే మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది.

 

 

నేడు కంటోన్మెంట్ కార్యకర్తలతో టీటీడీపీ నేతల భేటీ

హైదరాబాద్ : నేడు కంటోన్మెంట్ నియోజకవర్గ కార్యకర్తలతో టీటీడీపీ నేతల సమావేశం జరుగనుంది. 

ఖమ్మం ఎమ్మెల్సీ వామపక్షాల అభ్యర్థిగా పువ్వాడ

ఖమ్మం : ఖమ్మం ఎమ్మెల్సీ వామపక్షాల అభ్యర్థిగా పువ్వాడ నాగేశ్వరరావును సీపీఐ ప్రకటించనుంది.  

Don't Miss