Activities calendar

05 December 2015

21:39 - December 5, 2015

ఆ పచ్చని పల్లెలో ఓ ఘోరం... ప్రతొక్కరికీ తెలిసిన వాస్తవం.. అందరిలో భయం.. కిరాతకాన్ని మరిచిపోలేక పోతున్న జనం.. కృష్ణా జిల్లాలో పెత్తందారుల చేతుల్లో ఆ ఇంటి అబాగ్యురాలే బలి అయ్యింది. ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? ఎందుకు కన్న కూతురును ఓ తండ్రి కిరాతకంగా హతమార్చాడు? ఎందుకు దీనికి సోదరుడు కూడా సహకరించాడు? ఈ ఘోరం బయటికి రాకుండా ఎలా ప్రయత్నించారు? చివరకు పోలీసులకు ఎలా అడ్డంగా దొరికిపోయారు? ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి..

21:36 - December 5, 2015

ఢిల్లీ : ఫ్రీడం సిరీస్ ఆఖరిటెస్ట్ లో టీమిండియా భారీ విజయానికి పునాది వేసుకొంది. న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లాలో కుదురైన బ్యాటింగ్ తో....మూడురోజుల పిచ్ లు అంటూ రాద్ధాంతం చేస్తున్న విమర్శుకుల నోటికి తాళం వేసింది. మూడోరోజుఆట ముగిసే సమయానికే 400 కు పైగా పరుగుల భారీ ఆధిక్యంతో సఫారీలను పరాజయం అంచుల్లోకి నెట్టింది. 213 పరుగుల కీలక తొలిఇన్నింగ్స్ ఆధిక్యతతో రెండోఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఒకదశలో 57 పరుగులకే నాలుగు టాప్ ఆర్డర్ వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది. ఓపెనర్లు విజయ్ 3, ధావన్ 21,పూజారా 28, రోహిత్ శర్మ పరుగులేవీ లేకుండాను అవుటయ్యారు. అయితే కెప్టెన్ కొహ్లీ, తొలిఇన్నింగ్స్ హీరో అజింక్యా రహానే 5వ వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో...సౌతాఫ్రికా బౌలర్లను నిలువరించారు. ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 190 పరుగులు చేసింది. ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ 3 వికెట్లు, లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ ఒక వికెట్ పడగొట్టారు. నాలుగుమ్యాచ్ ల సిరీస్ ను ఇప్పటికే 0-2తో చేజార్చుకొన్న టాప్ ర్యాంకర్ సౌతాఫ్రికా..ఆఖరి టెస్ట్ ను డ్రాగా ముగించాలన్నా...గెలుచుకోవాలన్న ఆఖరి రెండు రోజుల పాటు పోరాటం చేయాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్ లో 121 పరుగులకే కుప్పకూలిన సఫారీటీమ్..రెండో ఇన్నింగ్స్ లో ఎంత స్కోరు చేసి..ఎంత తేడాతో ఓడిపోతుందన్నదే ఇక్కడి అసలు పాయింట్..

21:34 - December 5, 2015

ఢిల్లీ : శాసనసభ్యుల జీతభత్యాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సమర్థించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సాలరీ తక్కువగా ఉందని భావిస్తే భారీగా పెంచుకోవచ్చన్నారు. ఎమ్మెల్యేల వేతనాన్ని భారీగా పెంచుతూ ఢిల్లీ అసెంబ్లీ బిల్లును పాస్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆమోదం కోసం బిల్లును కేంద్రానికి పంపింది. ఈ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపితే ఎమ్మెల్యే జీతం నాలుగింతలు ఎక్కువ పెరుగుతుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే జీతం 88 వేలు కాగా...లక్షల రూపాయల అలవెన్సుల పెంపుతో వేతనం 2 లక్షల పదివేలకు చేరుకోనుంది.

21:31 - December 5, 2015

ఢిల్లీ : అభ్యుదయ వాది నరేంద్ర దబోల్కర్‌ హత్యపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని ఆయన కుమారుడు హమీద్‌ దబోల్కర్‌ డిమాండ్‌ చేశారు. ఈ అంశంలో తాను అధికార ప్రతిపక్ష సభ్యులను కలుసుకుని విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న అసహన పరిస్థితులపై ప్రధాని స్పందించడం లేదన్న విమర్శలకు హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఇచ్చిన సమాధానం సంతృప్తిగా లేదన్నారు. ప్రతి అంశంలో ప్రధాని జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని అభ్యుదయవాదుల హత్యలనుద్దేశించి రాజ్‌నాథ్‌సింగ్‌ పేర్కొన్నారు. ఇది భద్రతకు సంబంధించిన అంశమని, దీనికి తాను బాధ్యత తీసుకుంటానని హోంమంత్రి అన్నారు. హోంమంత్రి పార్లమెంట్‌లో ఆధారం లేని ప్రకటన చేశారని, దీనిపై రాజ్యసభలో చర్చ జరపాలని అధికార, విపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేసినట్టు నరేంద్ర దబోల్కర్‌ కుమారుడు హమీద్‌ పేర్కొన్నారు.  

21:29 - December 5, 2015

హైదరాబాద్ : డిసెంబర్‌ 6 పేరు వినగానే పోలీసుల్లో కాస్త టెన్షన్‌ పుట్టుకొస్తుంది. నిజానికి నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా ఘర్షణలు జరగనప్పటికీ పోలీసుల్లో మాత్రం భయం మాత్రం తొలగడం లేదు. ముఖ్యంగా ఉగ్రవాద ముఠాల సవాళ్లతో పాటు ఐబీ హెచ్చరికలతో పోలీసులు అలర్టవుతున్నారు. మరో వైపు అస్సాంలోని గౌహతిలో రెండు స్వల్ప ధాటి పేళుళ్లు జరిగాయి. దీంతో దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. వారం ముందు నుంచే పోలీసులు అలర్టయ్యారు. ఇప్పటికే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాలపై నిఘా పెట్టారు. వాహనాలను తనిఖీలతో నగరంలో హడావిడి చేస్తున్నారు. బ్లాక్‌ డే రోజున అల్లరి మూకలు రెచ్చిపోయే అవకాశం ఉండడంతో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లను రెండు రోజుల క్రితమే స్టేషన్లకు రప్పించి బైండోవర్‌ చేశారు.

144 సెక్షన్..
మరోవైపు పాతబస్తీలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించినట్లు దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ తెలిపారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు పికెట్‌ నిర్వహిస్తున్నారు. బ్లాక్‌ డే సందర్భంగా 150 మంది ఎస్సైలు, 50 మంది సీఐలు, 20 ప్లాటూన్ల పారామిలటరీ, స్థానిక పోలీసు బలగాలతో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు 144 సెక్షన్‌ను అమలుచేశారు. నగరంలోని సిటీ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించకూడదని పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి నిషేదాజ్ఞలు జారీ చేశారు. రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, వజ్ర టీమ్స్‌, క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌, వాటర్‌కేనన్‌ వంటి బలగాలను పాతబస్తీలో మోహరింపచేశారు.

అసోంలో జంట పేలుళ్లు...
మరోవైపు అసోంలోని గౌహతిలో జంట బాంబు పేలుళ్లు సంభవించాయి. నిత్యం రద్దీగా ఉండే ఫ్యాన్సీ బజార్ ప్రాంతంలో ఓ దేవాలయానికి సమీపంలోని చెత్త డంప్‌లో ఒక్కసారిగా నాటు బాంబులు పేలడంతో నలుగు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో ఆత్మహుతి దాడులకు తెగబడతామని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. దీంతో బ్లాక్‌ డే నేపథ్యంలో ఈ ఘటనలపై కేంద్ర నిఘా వర్గాలు దేశంలోని పలు ప్రధాన నగరాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో బ్లాక్‌ డే రోజున నిరసన దినం పాటించాలని కొన్ని పార్టీలు పిలుపునిచ్చాయి. మరో వైపు బ్లాక్‌ డే సందర్భంగా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు భరోసా ఇస్తున్నారు.   

21:28 - December 5, 2015

చెన్నై : తమిళనాడులో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఎం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. వరద బాధితులను ఆదుకోవడానికి 10 వేల కోట్ల రిలీఫ్‌ ఫండ్‌ను తక్షణమే విడుదల చేయాలని కేంద్రానికి సూచించింది. వరద విపత్తును ఎదుర్కోవడంతో జయలలిత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం విమర్శించింది. తాగునీరు లాంటి కనీస మౌళిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించిందని పేర్కొంది. మంచి నీళ్లు 2 వందలు, పాల పాకెట్‌ 150 రూపాయలకు అమ్మడమే ఇందుకు నిదర్శనమని తెలిపింది. వరద బాధిత ప్రాంతాల్లో తక్షణమే మౌళిక సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్‌ చేసింది.

21:26 - December 5, 2015

చెన్నై : మహానగరంలో పరిస్థితులు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తున్నాయి. టెలికమ్యూనికేషన్‌ సౌకర్యాలు, రైలు సర్వీసులు పాక్షికంగా పునరుద్ధరించబడ్డాయి. వరద నీరు తీసేయడంతో చాలావరకు రోడ్లు మోటారు వాహనాలు ప్రయాణించడానికి అనువుగా మారుతున్నాయి. అయితే ఇంకా అనేక ప్రాంతాల్లో నీటిలో నానుతునే వున్నాయి. అక్టోబరు 1 నుండి కురిసిన కుండపోత వర్షాలకు ఇప్పటివరకు 245మంది మృత్యువాత పడ్డారని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. అడయార్ నది, కూవం కాలువలు సాధారణస్థితికి చేరుకుంటున్నాయి. అడయార్, వేలంచేరి, మేడంబాకం, మైనానగర్ తదితరప్రాంతాల్లో వరద నీరు ఇంకా అలాగే ఉంది. తీర ప్రాతం సమీపంలోని కాలనీల్లో ఇంకా వరదనీరు కొనసాగుతోంది. నగరంలో ముమ్మరంగా సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. వరద ప్రాంతాల నుంచి బాధితుల కొనసాగింపు కొనసాగుతోంది. అంటువ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల్లో క్లోరినేషన్, బ్లీచింగ్ చేస్తున్నారు.

పాక్షికంగా రైలు..బస్సు సర్వీసులు...
రైలు, బస్సు సర్వీసులు పాక్షికంగా ప్రారంభమయ్యాయి. మొబైల్ ఫోన్ సర్వీసులను కూడా పునరుద్ధరించారు. 80 శాతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. మౌంట్ రోడ్‌తో పాటు మరికొన్ని కీలక రోడ్లలో అధికారులు నాలుగు రోజుల తర్వాత ట్రాఫిక్‌ను అనుమతించారు. పెట్రోలు బంకుల్లోకి నీరు చేరిపోవడం వల్ల డీజిల్, పెట్రోలు లభించడం లేదు. డీజిల్ దొరక్కపోవడంతో జనరేటర్లు మూగబోయాయి. ట్యాంకర్ల డ్రైవర్లు అందుబాటులో లేకపోవడంతో డీజిల్, పెట్రోల్ తరలింపు సమస్యాత్మకంగా మారింది.

నిత్యావసరాల కోసం ప్రజల ఇబ్బందులు...
అనేక ప్రాంతాల్లో ఇంకా నీరు నిలిచే వుండడంతో నిత్యావసరాల కోసం ప్రజల ఇబ్బందులు తప్పడం లేదు. పనిచేస్తున్న కొద్దిపాటి ఎటిఎంల వద్ద, పెట్రోల్‌ స్టేషన్ల దగ్గర చాంతాడులా క్యూలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే ఈ పరిస్థితి చక్కబడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో బ్యాంకులు ఆదివారమైనా పనిచేయనున్నాయి. 8వ తేది వరకు బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన అవిన్‌, పాలు సరఫరాకు అత్యవసరంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ పాల సరఫరా మాత్రం ఇబ్బందిగానే వుంది. చెన్నై నుంచి విమానాలను నడిపేందుకు అధికారులు నిర్ణయించారు. అయితే ప్రస్తుతం కొన్ని విమానాల సర్వీసులు మాత్రమే పునరుద్దరించనున్నట్లు చెన్నై విమానాశ్రయ అధికారులు ఆ వివరాలు వెల్లడించారు. ఎయిర్ ఇండియా నుంచి 7 విమానాల సేవలు ప్రారంభించనుంది. సైన్యం, పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బలగాలు మొత్తంగా 3 లక్షల 50 వేల మందిని కాపాడాయని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.జ్ఞానదేశికన్‌ తెలిపారు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఓ.పి.సింగ్‌ కూడా ఇక్కడ పరిస్థితులను సమీక్షించారు.

21:21 - December 5, 2015

కరీంనగర్ : సంచలనం సృష్టించిన ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి అక్రమ దందా కేసు నీరుగారుతోందా..? దర్యాప్తు సంస్థల అధికారులే పెట్టుబడులు పెట్టడంతో..వారి పేర్లను బయటకు రానీయకుండా జాగ్రత్తలు పడుతున్నారా..? పోలీస్‌ శాఖ పరువు బజారున పడకుండా ప్రయత్నిస్తున్నారా? ముందు దూకుడు పెంచిన ఏసీబీ, సీఐడీ అధికారులు ఎందుకు సైలెంట్‌ అయ్యారు? కేసును క్లోజ్‌ చేయడానికే భారీ డీల్‌తో అమాత్యులతో ఒప్పందం చేసుకోబోతున్నారా? మొదట్లో ఉరుకులు, పరుగులు తీసిన అధికారులు ఒక్కసారిగా సైలెంట్‌ అయ్యారా? కేసుతో లింకున్న అధికారులు, కొన్ని ఆస్తుల వివరాలు బయటపెట్టి సంచలనం సృష్టించిన అధికారులు..ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారా? తవ్వినకొద్దీ వెలుగులోకి వస్తున్న తమ డిపార్ట్‌మెంట్‌ వారి పేర్లు బయటకు రాకుండా చూస్తున్నారా..? ఆ అధికారుల పేర్లను ఎందుకు బయటకు రానీయడం లేదు. ఇప్పటివరకు 36 మంది బాధితుల ఫిర్యాదులు స్వీకరించిన ఏసీబీ.. అక్రమాస్తులు గుర్తించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఇక రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 500కు పైగా దస్తావేజులను స్వాధీనం చేసుకున్న సీఐడీ అధికారులు..విచారణ పేరుతో తాత్సారం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలున్నాయి.

150 కోట్ల ప్యాకేజీ ఆఫర్‌ చేస్తున్నారా?..
ఈ కేసులో ఇంటిలిజెన్స్, సిఐడి, ఎసిబి అధికారులు భారీగా పెట్టుబడులు పెట్టడంతో కేసును నీరుగార్చేందుకు కుట్ర జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీలో చక్రం తిప్పే కీలక మంత్రుల సెక్యూరిటీ అధికారులు సైతం భాగస్వాములైనట్లు తెలుస్తోంది. విచారణలో బయటపడుతున్న వారంతా పోలీసులే కావడంతో..డిపార్ట్ మెంట్ పరువు కాపాడుకునే పనిలో పడ్డారు ఉన్నతాధికారులు. పొలిటికల్‌ లీడర్స్‌ జోక్యంతో ముందుకు కదిలిన మోహన్ రెడ్డి ఫైనాన్స్ దందా.. వారితోనే మంత్రాంగం నడిపి కేసుకు పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు మంత్రులకు, ప్రభుత్వంలో చక్రం తిప్పే ఉన్నతస్థాయి అధికారులకు 150 కోట్ల ప్యాకేజీ ఇవ్వబోతున్నట్లు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి.

కలెక్టరేట్‌ ఎదుట బాధితుల దీక్షలు..
ఇద్దరు మంత్రులు, ప్రభుత్వ చీఫ్ విఫ్ జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నా..ఈ కేసుపై నోరు మెదపడం లేదు. కనీసం కేసు విచారణపై కూడా మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు మోహన్‌ రెడ్డి దందాలో పోలీస్‌ అధికారులే భాగస్వాములు కావడంతో..సిఐడి పూర్తి స్థాయిలో విచారించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కేసును సీబీఐకి అప్పగించాలని మూడు రోజులుగా కరీంనగర్‌ కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. దర్యాప్తు సంస్థల అధికారులు, పోలీసు బాసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఉన్నతాధికారులు వారిని రక్షించే ప్రయత్నంలో పడ్డట్టు తెలుస్తోంది. భారీ ఆఫర్‌తో మోహన్‌ రెడ్డీ కథ కంచికి చేరుతుందో లేక మరో మలుపు తిరుగుతుందో చూడాలి. 

21:20 - December 5, 2015

హైదరాబాద్ : ఓయూలో బీఫ్‌ ఫెస్టివల్‌ టెన్షన్‌ కొనసాగుతోంది. బీఫ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు కొంతమంది ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా అడ్డుకొని తీరుతామని మరికొంతమంది హెచ్చరిస్తున్నారు. ఇరువర్గాలు ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగిస్తుండటంతో ఓయూలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. దీంతో యూనివర్శిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓయూలో వాతావరణం మరోసారి ఉత్కంఠభరితంగా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ నెలకొంది. బీఫ్‌ ఫెస్టివల్‌పై లైబ్రరీ హాల్‌లో నిర్వహించ తలపెట్టిన ఆల్‌ పార్టీ మీటింగ్‌ను అధికారులు అడ్డుకోవడంతో విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైబ్రరీహాల్‌లో సమావేశానికి అనుమతి లేదని అధికారులు తాళం వేయడంతో ఆర్ట్స్‌ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీఎం, సీపీఐ, పలు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. మరోవైపు ఈ సమావేశానికి తరలివస్తున్న పలువురు ఎంబీటీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ప్రభుత్వ ఆంక్షలపై నేతల మండిపాటు..
దేశంలో ఎవరి ఆహారపు సంస్కృతి, అలవాట్లను వారు పాటిస్తారని.. వాటిపై ప్రభుత్వ ఆంక్షలు ఏంటని ఆల్‌ పార్టీ మీట్‌లో పాల్గొన్న నేతలు మండిపడ్డారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈనెల 10వ తేదీన బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించి తీరుతామన్నారు. ఆహార సంస్కృతిని కాపాడుకునేందుకే బీఫ్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఎవరికి వ్యతిరేకంగా పని చేయడం లేదని.. బీఫ్‌ తినాలని ఎవరినీ బలవంతం చేయడం లేదని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్ధి సంఘాల నేతలంటున్నారు.

రాజకీయాలు తగదంటున్న నేతలు...
గతంలో యూనివర్సిటీలో ఎన్నో ఉత్సవాలు, కార్యక్రమాలు అనుమతులు లేకుండా జరిగాయని.. ఇప్పుడు కొత్తగా అనుమతి తీసుకోవాలనడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బీఫ్‌ చుట్టూ రాజకీయాలు చేయడం తగదని పలువురు ప్రజాసంఘాల నేతలంటున్నారు. బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తే దాడులు చేస్తామని ప్రజాప్రతినిధులు హెచ్చరించడం దారుణమన్నారు. ఇలాంటి హెచ్చరికలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఏదిఏమైనా బీఫ్‌ ఫెస్టివల్‌పై ఓయూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ నెలకొనడంతో పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు.

21:18 - December 5, 2015

విజయవాడ : అమరావతిని ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మారుస్తామని చంద్రబాబు ప్రకటించారు. స్థల బలం, వాస్తు బలం, పేరు బలం ఎంతో గొప్పగా ఉన్నందునే ఎపీ రాజధానికి అమరావతిగా నామకరణం చేశామని సీఎం తెలిపారు. వారసత్వ నగరంగా అమరావతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి.. పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. హృదయ్‌ పథకంలో ఎంపికైన నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. పెదకూరపాడు, క్రోసూరు, అమరావతి మండలాల్లో 39 శివారు గ్రామాలకు త్రాగునీరు అందించేందుకు 21.5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతున్న సమగ్ర మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం హృదయ్‌, ప్రసాద్‌ పథకం కింద పలు నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో అమరలింగేశ్వరస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు.. మహాస్థూపం, పురావస్తు మ్యూజియం, ద్యాన బుద్ధ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు.

ప్రాచీన చరిత్ర..
వారసత్వాల నగరాల అభివృద్ధి పథకం గురించి ప్రధాని మోదీ చెప్పినప్పుడు.. ఆంధ్రప్రదేశ్‌ నుండి తనకు మొదట గుర్తొచ్చిన నగరం అమరావతి అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్నో శతాబ్ధాల చరిత్ర కలిగిన అమరావతిని వారసత్వ నగరంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పల్లవులు, శాతవాహనులు పాలించిన అమరావతికి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు వెంకయ్యనాయుడు. ప్రాచీన చరిత్ర కలిగిన అమరావతిని, వారసత్వ నగరంగా గుర్తించి అభివృద్ధి చేయడం తెలుగువారందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు. అమరావతి కళాఖండాలన్నీ చెన్నై, లండన్‌ మ్యూజియాల్లో ఉన్నాయని.. వాటిని వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇక అమరావతిని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దుతామన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు మరో 50 కోట్ల రూపాయలు కేటాయించి అమరావతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు చంద్రబాబు. ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా తీర్చదిద్దుకుంటున్న అమరావతిని ఇప్పుడు పర్యాటక రంగంలో కూడా అభివృద్ధి చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ ప్రక్రియ అంతా సవ్యవంగా జరిగితే భవిష్యత్‌లో అమరావతికి పూర్వవైభవం వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

21:01 - December 5, 2015

హైదరాబాద్: 2016 సంవత్సరానికిగానూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక సెలవులను ప్రకటించింది. మొత్తం 44 రోజుల సెలవు దినాలలో 23 సాధారణ సెలవులు కాగా, 21 ఐచ్ఛిక సెలవులున్నాయి. ఈ మేరకు శనివారం ఉత్వర్వులు జారీ చేసింది.
జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 26న గణతంత్ర దినోత్సవం, మార్చి 7న మహాశివరాత్రి, 23న హోలీ, 25న గుడ్‌ఫ్రైడే, ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్‌రాం జయంతి, 8న ఉగాది, 14న అంబేద్కర్ జయంతి, 15న శ్రీరామనవమి,జులై 6న రంజాన్, 7న రంజాన్ తర్వాతి రోజు సెలవుదినం, ఆగస్ట్ 1న బోనాలు, 15న స్వాతంత్య్ర దినోత్సవం, 25న శ్రీకృష్ణాష్టమి, సెప్టెంబర్ 5న వినాయక చవితి, 12న బక్రీద్, 30న బతుకమ్మ, అక్టోబర్ 11న విజయదశమి, 12న మొహర్రం, నవంబర్ 14న గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ, డిసెంబర్ 12న ఈద్ మిలాద్ నబి, 26న బాక్సింగ్ డే లను సాధారణ సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది.ఇక గాంధీ జయంతి, దర్గాష్టమి, దీపావళి, క్రిస్ మస్ పండుగలు ఆదివారం వచ్చాయి.

ఐచ్ఛిక సెలవులు...
ఇక ఐచ్ఛిక సెలవుల విషయానికొస్తే జనవరి 1, 16న కనుమ, 22న యాజ్ దాహుమ్ షరీఫ్, ఫిబ్రవరి 2న శ్రీపంచమి, 23న హజ్రత్ సయ్యద్ మహ్మద్ జయంతి, ఏప్రిల్ 19న మహవీర్ జయంతి, 21న హజ్రత్ అలి జయంతి, మే 5న షబ్-ఇ-మిరాత్, 9న బసవజయంతి, 21న బుద్ధపూర్ణిమ, 23న షెబ్-ఇ-బరాత్, జులై 1న జుమత్-ఉల్-విదా, 6న రథయాత్ర, ఆగస్టు 12న వరలక్ష్మీవ్రతం, 17న పార్సీ కొత్త సంవత్సరం, 18న రాఖీపౌర్ణమి/శ్రావణ పూర్ణిమ, సెప్టెంబర్ 20న ఈద్-ఇ-గదీర్, అక్టోబర్ 10న మహా నవమి, 29న నరక చతుర్ధి, నవంబర్ 21న అర్బఈన్, డిసెంబర్ 24న క్రిస్మమస్ లు ఉన్నాయి. 

20:43 - December 5, 2015

హైదరాబాద్ : తెలంగాణ పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్‌తో ఛత్తీస్‌ గడ్‌ మంత్రి కేదార్‌ కశ్యప్‌ తెలంగాణ సచివాలయంలో భేటీ అయ్యారు. ఫిబ్రవరి 17 నుంచి జరిగే సమ్మక్క సారక్క జాతరకు రావాలని కశ్యప్‌ను ఆహ్వానించారు. రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను చందూలాల్ వివరించారు. 

20:41 - December 5, 2015

హైదరాబాద్ : నగరంలోని చెరువులపై తెలంగాణ మంత్రి హరీష్‌ రావు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మిషన్‌ కాకతీయ రెండో దశ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో నగరంలో ఉన్న చెరువుల పూడికతీత, పునరుద్ధరణ చేయాల్సిన యాక్షన్‌ ప్లాన్‌ పై చర్చించారు. ఇప్పటికే గండిపేట చెరువు పునరుద్ధరణ కోసం ప్రభుత్వం 50 లక్షలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

20:40 - December 5, 2015

హైదరాబాద్ : నేనెవరికీ అవసరం లేదు.. నాకెవరూ అక్కర్లేదు. అందుకే పార్టీ మారాల్సిన అగత్యమే లేదు. ముక్కుసూటిగా మాట్లాడే మాజీ ఎంపీ ఉండవల్లి టెన్‌టీవీ లైవ్‌షోలో ఇలా కుండబద్ధలు కొట్టేశారు. కొన్ని రోజులుగా ఆయన వైసీపీలోకి వెళతారని.. కాదు టీడీపీ వాళ్లు అడుగుతున్నారని వస్తున్న వదంతులను వదంతులేనని తేల్చేశారు. అంతే కాదు పదవులున్నా లేకపోయినా కమ్యూనిస్టులు ప్రజల కోసం పని చేస్తారని.. తాను కూడా అంతేనని మరింత క్లారిటీ ఇచ్చారు ఉండవల్లి.

20:10 - December 5, 2015

నెల్లూరు : మహిళలు అత్యాచారాలు ఆగడం లేదు...ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో ముగ్గురు యువకులు ఓ మహిళపై అత్యాచార యత్నానికి ఒడిగట్టారు. ఆ మహిళ ప్రమాదం నుండి తప్పించుకుంది. స్థానికులను ఇద్దరికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే..దేవారయపల్లి నుండి ఆత్మకూరుకు ఆటోలో (ఎపి 26 టిబి 2372) మహిళ వస్తోంది. కానీ ఆమె వెళ్లాల్సిన గమ్యం వైపుకు వెళ్లకుండా ఇతర ప్రాంతంలోకి ఆటోను పోనిచ్చారు. ఆటో ఉన్న ముగ్గురు యువకులు ఆమెపై అత్యాచార యత్నానికి ఒడిగట్టారు. వెంటనే ఆమె రన్నింగ్ ఆటో నుండి దూకేసింది. దీనితో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ మార్గం గుండా వెళుతున్న కొందరు ఆటోను వెంబడించారు. ఆటోను ఆపి ఇద్దరు యువకులకు దేహశుద్ధి చేయగా మరొకరు పరారయ్యారు. 

విజయవాడలో మరో నకిలీ తయారీ గుట్టు రట్టు....

విజయవాడ : మరో నకిలీ నెయ్యి తయారీ కేంద్రం గుట్టు రట్టైంది. జక్కంపూడి, సత్యనారాయణపురం కేంద్రంగా నకిలీ నెయ్యి తయారీ చేస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశారు. మూడు కంపెనీ పేర్లతో నకిలీ నెయ్యిని తయారు చేస్తున్నారు.

 

రామగుండం రైల్వే స్టేషన్ లో ఫైర్ ఆక్సిడెంట్..

కరీంనగర్ : రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. నాలుగు వ్యాన్ లలో ఉన్న బొగ్గు తగులబడుతోంది. మంచిర్యాల నుండి కాజీపేటకు బొగ్గు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. 

నగరంలో డ్రోన్ కెమెరాలపై నిషేధం..

హైదరాబాద్ :నగరంలో డ్రోన్ కెమెరాల వినియోగంపై నిషేధం విధించారు. వచ్చే నెల ఏడో తేదీ వరకు డ్రోన్ కెమెరాలపై నిషేధం అమల్లో ఉంటుంది. ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందన్న సమాచారంతో నిషేధం విధించినట్లు పోలీసులు వెల్లడించారు. 

2016 సంవత్సరానికి టీఎస్ ప్రభుత్వం సెలవులు..

హైదరాబాద్ : 2016 సంవత్సరానికి టీఎస్ ప్రభుత్వం సెలవులు సెలవులు ఖరారు చేసింది. 23 సాధారణ...21 ఐచ్చిక సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

మానాయకుంట గ్రామ పంచాయతీలో సైదులు గెలుపు..

నల్గొండ : మోత్కురు (మం) మానాయకుంట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన సైదులు విజయం సాధించారు. 

19:22 - December 5, 2015

తెలుగు సినీ జగత్తులో ఎందరో నటీమణులు.. మహానటి మాత్రం ఒక్కరే. ఆమె సావిత్రి..ఆ తరంలోనే కాదు.. ఈ తరంలోనూ, భవిష్యత్తు తరాల్లోనూ ఇది అక్షర సత్యమనడం అతిశయోక్తి కాదు.. అభినయానికి నిలువెత్తు నిర్వచనంగా నిలిచే సావిత్రి 80 వ జయంతి సందర్బంగా ఆ మహానటి సినీ ప్రయాణంలో తాను వదిలి వెళ్లిన వెండితెర ఙ్ఞాపకాలు. సావిత్రి వచ్చే వరకు మహానటి అనే పేరు మరే నటికి లేదేమో. ఆమె తర్వాత కూడా మరో మహానటి రాలేదని చెప్పవచ్చు. 20వ శతాబ్దానికి మహానటి సావిత్రి ఒక్కరే. ఒక్క రోజులోనో, సిఫార్సులతోనో ఆమెకు వేషాలు రాలేదు. అతి ప్రయాసతో, ప్రతిభతో సినిమాల్లో వేషాలు సంపాదించుకున్నారు. స్డూడియోల చుట్టూ తిరిగి, నిర్మాతల కార్యాలయాల మెట్లు ఎక్కిదిగుతూ పడరాని పాట్లు పడ్డారు. కానీ ఒక్కసారి అవకాశం వచ్చాక మాత్రం వెనుదిరిగి చూసుకోలేదు.

ధృవతార సావిత్రి...
తెలుగు సినీ వినీలాకాశంలో ఓ వెలుగు వెలిగిన ధృవతార సావిత్రి. ఆమె నటిస్తే ఆ పాత్రకే కొత్త సొగసులొస్తాయి. ఆమె నృత్యం చేస్తే ఆ పాటకు సరికొత్త వన్నెలద్దుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే .. ఆమె నటిస్తే.. అదే ఆ సినిమాకు ఓ పెద్ద ఎసెట్. అదీ సావిత్రి రేంజ్.. హీరో ఎవరైనా సరే... సావిత్రి ఉంటే చాలు.. బిగ్ హిట్టే. కళ్లతో ఆమె పలికించే భావాల్ని ఒడిసిపట్టేందుకు ప్రేక్షకులు సినిమాహాళ్లకు పరుగులు తీసేవారు. చిరు కోపంలో ఆమె చూపించే కస్సుబుస్సుల్లో ఉండే తెలియని మత్తేదో అభిమానుల్ని మళ్లీ మళ్లీ ధియేటర్లకి రప్పించేది. నిన్నటి తరమే కాదు.. నేటి తరం కూడా ఆ మాయలో పడ్డారంటే.. అందులో లీనమైపోవాల్సిందే.

బతికింది 44 ఏళ్లే...
చూపుల సోయగమే కాదు.. మైమరిపించే నటచాతుర్యం ఆమె సొంతం. ప్రేక్షకుల్ని నవరసాల్లో ముంచెత్తి.. కొత్త లోకాల్లోకి తీసుకుపోయే ఆమె గొప్పదనానికి ఎవరైనా దాసోహం అనాల్సిందే. సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూనే ఉంటాయి. ఒక్కో పాత్రలో ఒక్కో ప్రత్యేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది. ఆ మహానటి బతికింది 44 ఏళ్లే. అందులో 30 ఏళ్లకు పైగా సినీజీవితమే. ఇప్పుడు మనమధ్య లేకపోయినా.. మన కోసం మర్చిపోలేని జ్ఞాపకాల్ని వదిలివెళ్లారు. తెలుగువారి హృదయాలకు, వెండితెరకు మధ్య కాలం కట్టిన పూలవంతెన సావిత్రి. అద్దమంటి మనస్సు ఉంది.. అందమైన సొగస్సు ఉంది అంటూ తెలుగువారి హృదయాల్ని కదిలించి, వెండితెరను వెలిగించిన వెన్నెల దీపం మహానటి సావిత్రి. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా ప్రపంచంలో ఎన్ని తరాలు మారినా చెక్కు చెదరని కీర్తిమెరుపు సావిత్రి సొంతం. 

వరద మృతుల కుటుంబాలకు ప్రధాని ఎక్స్ గ్రేషియా..

ఢిల్లీ : చెన్నై వరదల్లో మృతి చెందిన వారికి ప్రధాని ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ కింద మృతుల కుటుంబ సభ్యులకు రూ.2లక్షలను పీఎం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేలు ఆర్థిక సహాయం ప్రకటించారు. 

వరద బాధితుల కోసం ఏపీ సీపీఎం విరాళాల సేకరణ...

విజయవాడ : రాష్ట్రంతో పాటు చెన్నై వరద బాధితుల కోసం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు వివరాలు సేకరించారు. బీసెంట్ రోడ్డులో విరాళాలు సేకరించారు. వరదల కారణంగా అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని, వరద బాధితులను ఆదుకోవాలని బాధ్యత అందరిదీ అని మధు పేర్కొన్నారు. 

తిరుపతిలో ఆక్టోపస్, ఏపీఎస్పీ బలగాల తనిఖీలు..

తిరుపతి : రేపు బ్లాక్ డే సందర్భంగా తిరుమలలో భద్రతను డీజీఐ సత్యనారాయణ, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపినాథ్ జెట్టి తనిఖీలు నిర్వహించారు. మరోవైపు ఆక్టోపస్, ఏపీఎస్పీ బలగాలతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. భక్తులకు అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని డీఐజీ సత్యనారాయణ సూచించారు.

 

విజయవాడలో రెండు రైళ్ల పునరుద్ధరణ...

విజయవాడ : రైల్వే డివిజన్ పరిధిలో రెండు రైళ్ల పునరుద్ధరణ చేశారు. విజయవాడ – చెన్నై పినాకిని ఎక్స్ ప్రెస్, కాకినాడ - చెన్నై సర్కార్ ఎక్స్ ప్రెస్ రైళ్ల పునరుద్దరించారు. 

వైసీపీలో చేరను - ఉండవల్లి..

జగన్ ఆహ్వానించినా వైసీపీ పార్టీలో చేరనని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. టెన్ టివితో ఆయన మాట్లాడారు. తనను చేర్చుకోవాల్సినవసరం వైసిపి, టిడిపిలకు లేదన్నారు. కమ్యూనిస్టులు పదవి లేకపోయినా ప్రజల కోసం పోరాడుతారని, తాను అలాగే అనుకుంటానని తెలిపారు. ఏపీలో అధికార, ప్రతిపక్షం రెండూ విఫలమయ్యాయని, వైఎస్ జగన్ కేంద్రాన్ని నిలదీయడంలో ఫెయిల్ అయ్యారని పేర్కొన్నారు. 

కార్మిక చట్టాలను బలహీనం చేయాలని చూస్తున్నారు - రాహుల్..

ఢిల్లీ : కార్మిక చట్టాలను బలహీనం చేయాలని చూస్తున్నారని ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ విభాగంలో ఆయన మాట్లాడారు. గుజరాత్, హర్యానా, రాజస్థాన్ లలో ఏర్పరచిన నూతన కార్మిక చట్టాలను పరిశీలిస్తే కార్మికులకు తీవ్ర నష్టం కలిగించేవిగా ఉన్నాయన్నారు. 

కేసీఆర్ ను కలిసిన జిలీడ్ కంపెనీ ప్రతినిధులు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాలిఫోర్నియాకు చెందిన జిలీడ్ కంపెనీ ప్రతినిధులు కలిశారు. నగరంలో ఫార్మా సిటీలో యూనిట్ ఏర్పాటు చేస్తామని, వైద్య, ఆరోగ్య కార్యకలాపాల్లో భాగస్వాములవుతామని ప్రతినిధులు పేర్కొన్నారు. 

18:34 - December 5, 2015

దివంగత సీఎం వైఎస్ ముఖ్య అనుచరుడు...గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్లీ స్వరం వినిపిస్తున్నారు. అవినీతిపైన...ప్రభుత్వంపైన పలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఏపీ ప్రభుత్వంలో పాలన భయంకరంగా ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఉండవల్లితో టెన్ టివి ముచ్చటించింది. జై సమైక్యాంధ్ర పార్టీ...ప్రత్యేక హోదా…క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశం తదితర అంశాలపై ఆయన విశ్లేషించారు. ప్రభుత్వం పట్ల వచ్చిన వ్యతిరేకత కవర్ చేసుకోవడానికి చంద్రబాబు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వచ్చిన 18 నెలల్లో ఎలాంటి ఫలితం వచ్చిందో ముఖ్యమన్నారు. 

సంవత్సరం తరువాత మాట్లాడుతున్నా...
ఏపీ విడదీసిన తీరు..ప్రజల మనోభావాల తీరు..ఎన్నుకోబడిన ప్రభుత్వాలకు సమయం ఇవ్వాల్సినవసరం ఉందన్నారు. కొత్తగా రాష్ట్రం ఏర్పటైన రాష్ట్రంలో చంద్రబాబు మేలు చేస్తారని ప్రజలు ఆశించారని, వైసీపీ గెలుస్తుందని అందరూ భావించారని పేర్కొన్నారు. కానీ టిడిపి - బిజెపి అలయెన్స్ విజయం సాధించడం జరిగిందన్నారు. సంవత్సర కాలం తరువాత ప్రస్తుతం తాను మాట్లాడడం జరుగుతోందని, ముందటి కంటే బాబు పాలన ప్రస్తుతం భయంకరంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్ పార్టీ బహిష్కృతిడినని, ఏ పార్టీకి చెందిన వాడిని కాదన్నారు. లెటర్ లు పంపించిన తరువాత సమాధానం ఇంతవరకు రాలేదుని, పట్టిసీమపై మాట్లాడుతుంటే మంత్రులు ఏదో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఆ రెండు పత్రికలు చదవద్దని ఏనాడు సీఎం రాజశేఖరరెడ్డి చెప్పలేదన్నారు.

పట్టిసీమ వల్ల ఎంతో నష్టం...
పట్టిసీమ కట్టడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయో మీరే చూస్తారని, సుప్రీంకోర్టులో కేసు ఉందన్నారు. ఈ కేసు వివరాలను చూస్తే పట్టిసీమను మొదలు పెట్టరని పేర్కొన్నారు. పట్టిసీమ పై తాను చేసిన ఆరోపణలకు స్పందించాలని తెలిపారు. తాజాగా తాను సీఎంకు మరో లేఖ రాయడం జరిగిందన్నారు. రూ. 333 కోట్లతో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటుకు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చిందని, సదరు కంపెనీ బ్లాక్ లిస్టులో ఉందన్నారు. బ్లాక్ లిస్టులో పెట్టింది ఈ ప్రభుత్వమేనని, ప్రస్తుతం బ్లాక్ లిస్టులో నుండి తొలగించారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఎవరికీ ఉద్ధేశ్యం లేదని, ఇచ్చే ఉద్ధేశ్యం వారికి కూడా లేదన్నారు. ఈ విషయంలో వైసీపీ పార్లమెంట్ లో కూడా మాట్లాడడం లేదన్నారు. హోదా కాంగ్రెస్ ఇవ్వలేదని, రాజ్యసభ లో వెంకయ్య నాయుడు ఈ విషయంపై చర్చ ప్రారంభించారని తెలిపారు. మరిన్ని విశేషాల కోసం వీడియో చూడండి..

చింటూకి వసతి కల్పించిన న్యాయవాది అరెస్టు..

చిత్తూరు : నగర మేయర్ అనురాధ దంపతుల హత్యకేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న చింటూ..పరారీలో ఉన్న సమయంలో అతనికి వసతి కల్పించిన న్యాయవాదిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. 

మహారాష్ట్ర సీఎంకు కేసీఆర్ లేఖ..

హైదరాబాద్ : మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. లెండి ప్రాజెక్టు సత్వర పూర్తికి చొరవ చూపాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భూసేకరణ, ముంపు గ్రామాల పునరావాసంపై దృష్టి సారించాలని కోరారు. కేంద్ర జలసంఘ అనుమతులు, పనుల పూర్తిపై దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 189 కోట్లు డిపాజిట్ చేసినట్లు సీఎం తెలిపారు. బాధితులకు నష్ట పరిహారం చెల్లించి భూ సేకరణ చేపట్టాలని కోరారు.  

17:56 - December 5, 2015

నల్లగొండ : జిల్లా నకిరేకల్‌ పంచాయతీ ఎన్నికల్లో పలు వార్డుల్లో ఘర్షణలు జరిగాయి. 19వ వార్డులో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో.. పోలీసులు లాఠీచార్జ్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అధికార పార్టీకి చెందినవారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ప్రజాఫంట్‌ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థికి దొంగ ఓటు వేసేందుకు మహిళ యత్నం చేయగా సీపీఎం, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. దొంగ ఓటు వేసేందుకు వచ్చిన మహిళను బైక్ పై ఎక్కించుకుని పోలీసులు అక్కడి నుండి తప్పించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

17:54 - December 5, 2015

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల ప్రక్రియ వేగవంతమవుతోంది. పోలింగ్‌బూత్‌ల ఏర్పాటుపై అఖిలపక్ష నేతలతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఓట్ల తొలగింపు అధికార పార్టీకి అనుకూలంగా చేశారని పలువురు ఆరోపించారు. దీంతోపాటు వార్డుల డీలిమిటేషన్‌ కూడా శాస్త్రీయంగా జరగలేదని.. బీసీల గణనలో కూడా పారదర్శకత లేదని మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. బల్దియా పీఠాన్ని దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్‌ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తుందని వివేకానంద అన్నారు. 

17:51 - December 5, 2015

హైదరాబాద్ : డిసెంబర్ 10...ఓయూలో బీఫ్ ఫెస్టివల్...నిర్వహించవద్దని ఓ వైపు హెచ్చరికలు..నిర్వహిస్తామని నిర్వాహకుల స్పష్టీకరణ..దీనితో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శనివారం ఓయూలో అఖిలపక్ష సమావేశాన్ని అధికారులు అడ్డుకున్నారు. సమావేశానికి లైబ్రరీహాల్‌లో అనుమతి లేదనడంతో.. నిర్వాహకులు ఆర్ట్స్‌ కళాశాలలో సమావేశమయ్యారు. మరోవైపు మీటింగ్‌కు వస్తున్న ఎంబీటీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆర్ట్స్‌ కాలేజీ ఆవరణలో కింద కూర్చునే అఖిలపక్షం నిర్వహించారు.

చెరువుల కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు - హరీష్ రావు..

హైదరాబాద్ : నగరంలో చెరువుల కబ్జాకు పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో చెరువుల సుందరీకరణపై మంత్రి హరీష్ సమీక్ష నిర్వహించారు.

 

 

ముగిసిన మూడో రోజు ఆట...

ఢిల్లీ : సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో లభించిన 213 పరుగుల అధిక్యం కలుపుకుని మొత్తం 403 పరుగుల అధిక్యంతో భారత్ మూడో రోజు ఆటను ముగించింది. 

జిల్లా కలెక్టర్ల సదస్సుకు సిద్ధం కావాలి - ఏపీ సీఎస్...

విజయవాడ : జిల్లా కలెక్టర్ల సదస్సుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు కూడా పూర్తిగా సన్నద్ధం కావాలని సూచించారు.

 

వరద బాధితులకే కేవీబీ విరాళం రూ.2 కోట్లు..

ఢిల్లీ : చెన్నై వరద బాధితులకు కరూర్ వైశ్యా బ్యాంకు రూ. 2 కోట్ల విరాళం ప్రకటించింది. తమిళనాడు సీఎం సహాయ నిధికి విరాళం అందచేసినట్లు బ్యాంకు నిర్వాహకులు పేర్కొన్నారు. 

ఫైనల్ లో కిదాంబి శ్రీకాంత్...

ఢిల్లీ : ఇండోనేషియా మాస్టర్ గ్రాండ్ ఫ్రీ బ్యాడ్మింటెన్ టోర్నీలో కిదాంబి శ్రీకాంత్ ఫైనల్ కు చేరాడు. సెమిఫైనల్ లో ఇండోనేషియా షట్లర్ అంటోనీపై శ్రీకాంత్ గెలుపు సాధించాడు. 

కరీంనగర్ లో దాఖలు కాని ఎమ్మెల్సీ నామినేషన్లు....

కరీంనగర్ : మూడో రోజు ఎమ్మెల్సీ స్థానాలకు ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇంకా అభ్యర్థులను పార్టీలు ప్రకటించలేదు. 

సీఎంకు ఏపీ సీపీఎం లేఖ...

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు కు సీపీఎం రాష్ట్ర కమిటీ లేఖ రాసింది. అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు సేకరించేటప్పుడు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలని లేఖలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది ఎకరాల భూమిని సేకరిస్తోందని, దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల ప్రజలు భూములపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. భూములు సేకరించేటప్పుడు పూర్తి నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

 

అమ్మనబోలు గ్రామ పంచాయతీలో స్వరూప విజయం..

నల్గొండ : ఆలేరు (మం) అమ్మనబోలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన స్వరూప విజయం సాధించింది. 

ఐటీ రంగం అభివృద్ధికి త్వరలో నాలుగు పథకాలు - కేటీఆర్...

హైదరాబాద్ : ఐటీ రంగానికి చిరునామాగా హైదరాబాద్ ను మారుస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఐటీ రంగం అభివృద్ధిలో త్వరలో నాలుగు కొత్త పథకాలు ప్రకటించనున్నట్లు, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచడమే లక్ష్యమన్నారు. వచ్చే ఏడాది హైదరాబాద్ లో ఇమేజ్ సెంటర్ ను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. గేమింగ్, యానిమేషన్ స్టార్టప్ రంగాలకు విస్తృత ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. టీ హబ్ లో ఈనెల 28వ తేదీన నాదేళ్ల స్టార్టప్ లను ప్రారంభిస్తారని తెలిపారు. 

16:44 - December 5, 2015

విశాఖపట్టణం : జిల్లాలో నిర్బంద కాండ పెరుగుతోందని వామపక్ష నేతలు విమర్శించారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. పోలీసులు టిడిపి పార్టీకి తొత్తులుగా మారారని, తాము చేపట్టే ధర్నాలు..ఆందోళనలకు అనుమతినివ్వని పోలీసులు జన చైతన్య యాత్రలకు ఎలా అనుమతినిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజా ఉద్యమాలు చేస్తున్న నేతలపై ఇంటిలిజెన్స్ పోలీసులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. అవసరమైతే పోలీసులపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. గతంలో ఎన్నడూ ఇలాంటి నిర్బంద కాండ లేదని, ప్రజాస్వామ్య ఉద్యమాలపై ఉక్కుపాదం పెట్టడం సరికాదని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు విశాఖపట్టణానికి వస్తే ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయవద్దని పేర్కొనడం ఎంతవరకు సబబమని ప్రశ్నించారు. 

16:42 - December 5, 2015

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎప్పుడో మునిగిపోయే పడవ అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ పేర్కొన్నారు. అధికార దాహంతో టీఆర్ఎస్ లో చేరుతున్న కాంగ్రెస్ నాయకులను పదవులకు దూరంగా పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందని, పార్టీలు మారే వారికి ప్రజలు బుద్ది చెబుతారని తెలిపారు. 2019 నాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఇతర పార్టీల్లోని నేతలను తీసుకొని ఏం చేస్తారని సూటిగా ప్రశ్నించారు. ఎక్కడ పచ్చగా ఉంటే ఆవులు మేసే విధంగా వలసలుగా వెళుతున్నారని పేర్కొన్నారు

16:42 - December 5, 2015
16:39 - December 5, 2015
16:38 - December 5, 2015
16:35 - December 5, 2015

రహానే హాఫ్ సెంచరీ..

ఢిల్లీ : సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో భారత బ్యాట్ మెన్స్ రహానే అర్ధ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం కోహ్లీ 79, రహానే 52 పరుగులతో ఆడుతున్నారు.

16:33 - December 5, 2015
16:32 - December 5, 2015
16:30 - December 5, 2015
16:25 - December 5, 2015
16:21 - December 5, 2015
16:19 - December 5, 2015
16:17 - December 5, 2015

ఢిల్లీ : గౌహతిలో జంట పేలుళ్లు సంభవించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానిక ఫ్యాన్సీ బజార్ లో శనివారం మధ్యాహ్నాం ఈ ఘటన చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలైట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పేలుళ్ల తీవ్రత తక్కువగా ఉందని, ఎలాంటి భయం అక్కర్లేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఇది తీవ్రవాదుల చర్యా ? లేక ఇతరులెవరైనా చేశారా ? అనేది తెలియరాలేదు.

ఢిల్లీకి ఉగ్రవాద ముప్పు..
దేశ రాజధానికి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడవచ్చని ఎఫ్ఐఆర్ నమోదైంది. 1వ తేదీన ఢిల్లీ స్పెషల్ సెల్ డీసీపీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇద్దరు ఉగ్రవాదులు ఢిల్లీలో చొరబడ్డారని ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు. భద్రతా దళాల సమాచారం మేరకు లష్కర్‌కు చెందిన దుజానా, ఒకాస సరిహద్దు నుంచి భారత్‌లోకి చొరబడ్డారని, ఢిల్లీలో రెక్కీ నిర్వహించినట్టు సమాచారం. వీరిద్దరు ఢిల్లీలోని వివిఐపిలు, నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాలను టార్గెట్‌ చేశారన్న సమాచారం మేరకు భద్రతను కట్టుదిట్టం చేశారు. వీరికి సంబంధించి జైద్‌, జుమ్మన్, ఖుర్షీద్‌ అనే సీక్రెట్‌ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. వీరిద్దరు జమ్మకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. లష్కరే ఉగ్రవాదుల కోసం పోలీసులు ఢిల్లీలో జల్లెడ పడుతున్నారు. దీనిపై కేంద్ర హోం శాఖ దృష్టి సారించింది. పారిస్ ఘటన తరువాత ఉగ్రవాద కార్యాకలాపాలు విస్తరించే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ భావించింది. దేశంలో ఎవరైనా ఎంటర్ అయ్యారా ? అని ఇంటిలిజెన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దీనితో దేశంలో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దులు దాటి ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం ఉందని పలు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. 

16:14 - December 5, 2015

అమరావతితో వెంకయ్య..బాబు పర్యటన..

గుంటూరు :ఏపీ రాజధాని అమరావతిలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడులు పర్యటిస్తున్నారు. సమగ్ర మంచినీటి పథకానికి శంకుస్థాపన..ధ్యానబుద్ధ గార్డెన్స్ వద్ద వారసత్వ నగర అభివృద్ధి పథకాల పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

అఖిలపక్ష నేతలతో ముగిసిన జీహెచ్ఎంసీ కమిషనర్ భేటీ..

హైదరాబాద్ : అఖిలపక్ష నేతలతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్థర్‌రెడ్డి జరిపిన భేటీ ముగిసింది. సమావేశానికి టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం, సీపీఎం పార్టీల నేతలు హాజరైయ్యారు. చట్ట ప్రకారమే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, అన్ని పార్టీలు సహకరించాలని కమిషనర్ కోరారు. బీసీ ఓటర్ల సంఖ్య తగ్గినా 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మరోమారు స్పష్టం చేశారు. 

భారత్ 167/4…

ఢిల్లీ : సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో భారత్ భారీ అధికత్యత దిశగా దూసుకెళుతోంది. ప్రస్తుతం కోహ్లీ 72, రహానే 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

గౌహతిలో జంట పేలుళ్లు..

అసోం : గౌహతి ఫ్యాన్సీ బంజార్ ఏరియాలో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. పేలుళ్ల ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. 

చెన్నై ఎయిర్ పోర్టులో ఇంకా వర్షపు నీరు..

చెన్నై : ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు మరో రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎయిర్ పోర్టులో ఇంకా వర్షపు నీరు నిలిచి ఉంది. 

మరోసారి పెరిగిన బంగారం..వెండి ధరలు..

ముంబై : మరోసారి బంగారం..వెండి ధరలు పెరిగాయి. పది గ్రామలు బంగారం ధర రూ.400 పెరిగి రూ. 26వేలకు చేరుకుంది. కిలో వెండి ధర రూ.850 పెరిగి రూ.34,950కి పెరిగింది. 

15:45 - December 5, 2015

చిత్తూరు : ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తిరుమల కోలుకుంటోంది. వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు మరమ్మతులు నిర్వహిస్తున్నారు. కొండచరియలు విరిగిపడి ధ్వంసమైన రోడ్లను పునరుద్దరించారు. ఈనెల 21న జరగనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినం వేడుకలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు తిరుమలను అతలాకుతలం చేశాయి. కొండచరియలు విరిగిపడడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. భారీ వర్షాలతో కొండపైన ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. మెట్ల దారిపై నీళ్లు ప్రవహించడంతో కొన్నిరోజులపాటు నడకదారిని మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొండచరియలు విరిగిపడడంతో లింక్‌రోడ్డు ద్వారా వాహనాలను కొండపైకి పంపించారు.

వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు..
తిరుమలకు నీటి సమస్య తలెత్తుతుందని భావించిన తరుణంలో భారీ వర్షాలు కురవడంతో ఆ కొరత తీరింది. కురిసిన వర్షాలతో మరో రెండేళ్లపాటు నీళ్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొండపైన ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారడంతో.. తిరుమలకు వచ్చే భక్తులు ఏడు కొండల అందాలను ఆస్వాదిస్తున్నారు. ఇక ఈ నెల 21న వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఏకాదశి రోజున అన్ని ఆర్జితసేవలను రద్దు చేసి.. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. ఇక ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రెండో ఘాట్‌ను సోమవారం నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలకు భారీగా భక్తులు తరలిరానున్నందున టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

15:40 - December 5, 2015

ఖమ్మం : కమ్యూనిస్టు పోరాటాల వల్లే జిల్లా అభివృద్ధి చెందిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి వామపక్షాల అభ్యర్థిగా పువ్వాడ నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఇతర వామపక్ష నేతలు పాల్గొన్నారు. పువ్వాడ తన నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా తమ్మినేని మీడియాతో మాట్లాడారు. మొదటి నుండి కమ్యూనిస్టుల అధిక్యత ఉన్న జిల్లా అని, జిల్లా అభివృద్ధిలో కమ్యూనిస్టుల పాత్ర ఉందన్నారు. కమ్యూనిస్టుల పోరాటల వల్లే ఇదంతా జరిగిందని, బూర్జువా పార్టీలు నాయకుల దయా దాక్షిణాల్యలతో అభివృద్ధి జరగలేదన్నారు. తిరిగి ఆ పరిస్థితి రాబోతుందని, మళ్లీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభంమైందన్నారు. ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ఈనెల 9న ముగియనుంది. 

15:37 - December 5, 2015

నల్గొండ : తమ సమస్యలు తీర్చాలంటూ గత కొద్ది రోజులుగా ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని వారు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో ఆశా వర్కర్లు వివిధ పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కోదాడ మండలం ఆల్వాలపురంలో ఆశావర్కర్లు శనివారం వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు వరి కోసి తమ నిరసనను ప్రదర్శించారు. 94 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇన్ని రోజులు సమ్మె చేయలేదని.. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 

15:35 - December 5, 2015

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో ఇసుక అక్రమాలపై సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కూ వాటా ఉందని వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇసుక దోపిడీలో వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఏపీలో అధికార టీడీపీ నేతలు ఇసుకు దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బహిరంగ చర్చకు రావాలని అంబటి సవాల్‌ విసిరారు. ఇసుక రేటు 17 రెట్లు పెంచి మూడు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం విడుదల చేసిన పత్రంలో 500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పడం సత్యదూరమని అంబటి రాంబాబు మండిపడ్డారు. 

15:32 - December 5, 2015

విజయవాడ : 2029 సంవత్సరం నాటికి ఏపీ అగ్రస్థానంలో ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడ దుర్గగుడి, బెంజి సర్కిల్ వద్ద పై వంతెన, రహదారి నిర్మాణ పనులకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బాబు ప్రసంగించారు. రాబోయే పదేళ్లలో దేశంలోని మూడు పెద్ద రాష్ట్రాల జాబితాలో ఏపీ నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే పదిహేనేళ్లలో ఏపీ దేశంలోనే అత్యంత అభివృద్ధిచెందిన రాష్ట్రంగా ఎదుగుతుందని ఆశించారు. విభజన తర్వాత సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పుకొచ్చారు.. కృష్ణా పుష్కరాలలోపు దుర్గా ఫ్లై ఓవర్‌ను పూర్తిచేస్తామని ప్రకటించారు..

15:29 - December 5, 2015

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబును నాయుడిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పొగడ్తలతో ముంచెత్తారు. కృష్ణా జిల్లా విజయవాడలో వంతెనలు, రహదారుల నిర్మాణానికి గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, అభివృద్ధి విషయంలో బాబు ఖచ్చితంగా ఉంటారని తెలిపారు. ఏపీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, ఏపీలో పెట్టుబడులుకు చాలా దేశాలు ముందుకొస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి... ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు చినరాజప్ప, శిద్దా రాఘవరావు, దేవినేని ఉమ, కామినేని పాల్గొన్నారు... 

జీహెచ్ఎంసీలో రాజకీయ పార్టీల సమావేశం..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. వార్డుల విభజన..పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..బీసీ ఓటర్ల జాబితాపై నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నేతల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని సమస్యలు పరిష్కరిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ హామీ ఇచ్చారు. 

చిప్పలపల్లి సర్పంచ్ గా పుట్టా అరుణ విజయం..

రంగారెడ్డి : కందుకూరు (మం) చిప్పలపల్లి సర్పంచ్ గా టీఆర్ఎస్ బలపరిచిన పుట్టా అరుణ విజయం సాధించారు. 

కోహ్లీ అర్ధ సెంచరీ..

ఢిల్లీ : సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో భారత్ రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ అర్ధ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం కోహ్లీ 57, రహానే 23 పరుగులతో ఆడుతున్నారు. 

ఢిల్లీకి ఉగ్రవాదుల ముప్పు..

ఢిల్లీ : దేశ రాజధానిలో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడవచ్చని ఎఫ్ఐఆర్ నమోదైంది. 1వ తేదీన ఢిల్లీ స్పెషల్ సెల్ డీసీపీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇద్దరు ఉగ్రవాదులు ఢిల్లీలో చొరబడ్డారని ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు. 

దానంకు స్థానిక నేతలతో విబేధాలు - వీహెచ్..

హైదరాబాద్ : దానంకు స్థానిక నేతలతో విబేధాలున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు పేర్కొన్నారు. అధిష్టానం పెద్దలు దానంతో మాట్లాడినట్లు, టీఆర్ఎస్ హవా తాత్కాలికమేనని తెలిపారు. కేసీఆర్ వలసలను పోత్సాహించడం సరికాదని, రాబోయే కాలం కాంగ్రెస్ దేనని ధీమా వ్యక్తం చేశారు. నేతలు, కార్యకర్తలు నిరుత్సాహానికి గురి కావద్దని, పార్టీలు మారుతున్న నేతలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. బీఫ్ ఫెస్టివల్ పై బీజేపీ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని వ్యాఖ్యానించారు.

 

కరీంనగర్ లో మావోయిస్టు పోస్టర్లు..

కరీంనగర్ : మహదేవ్ పూర్ (మం) అంబటిపల్లిలో మావోయిస్టు పోస్టర్లలు వెలవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోస్టర్లను తొలగించి కూంబింగ్ నిర్వహించారు. 30 మంది గ్రామస్తులను పోలీసులు విచారించారు. 

వరంగల్ లో అక్రమ పేలుడు పదార్థాలు...

వరంగల్ : కేససముద్రం (మం) అర్పనపల్లిలోని వినాయక క్రషర్ మిల్లులో పేలుడు పదార్థాలు గుర్తించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 1000 డిటోనేటర్లు, 150 కిలోల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. 

నకిరేకల్ గ్రామ పంచాయతీలో ఘర్షణ..

నల్గొండ : నకిరేకల్ గ్రామ పంచాయతీ ఎన్నికలో ఓ పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్, విపక్షాల మధ్య ఘర్షణ చెలరేగింది. టీఆర్ఎస్ అభ్యర్థికి దొంగ ఓటు వేసేందుకు మహిళ యత్నం చేయగా సీపీఎం, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. దొంగ ఓటు వేసేందుకు వచ్చిన మహిళను బైక్ పై ఎక్కించుకుని పోలీసులు అక్కడి నుండి తప్పించారు. 

గడ్కరి ఎక్కువగా స్పందించారు - బాబు...

విజయవాడ : ఊహించినదానికంటే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఎక్కువగా స్పందించారని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాలలోపు ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తవుతుందని ఈ ఫ్లై ఓవర్ కు కనకదుర్గా ఫ్లై ఓవర్ గా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. అమరావతి చుట్టూ 220 కి.మీ మేర ఔటర్ రింగ్ రోడ్డు కోసం కేంద్రం రూ.20వేల కోట్లు మంజూరు చేయనుందని తెలిపారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రోడ్లు అధ్వాన్నస్థితికి చేరాయని, పోలవరంను జాతీయ ప్రాజెక్టుకుగా కేంద్రం గుర్తించిందన్నారు. 2029 నాటికి దేశంలో ఏపీ అగ్రస్థానంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

 

ఏపీకి నూతన జాతీయ రహదారి - గడ్కరి..

విజయవాడ : ఏపీకి నూతన జాతీయ రహదారిని ఆమోదిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పేర్కొన్నారు. 1350 కి.మీ మేర ఏపీకి జాతీయ రహదారిని కేటాయిస్తున్నట్లు, డిసెంబర్ 2016 నాటికి రాష్ట్రం కోరిన అన్ని జాతీయ రహదారి పనులను ప్రారంభిస్తామన్నారు. విజయవాడలో జాతీయ రహదారుల నూతన కేంద్రానికి అమనుతి మంజూరు చేస్తున్నట్లు, విజయవాడలో 180 కి.మీ మేర రింగ్ రోడ్డుకు రూ.20వేల కోట్లు ఖర్చు అవుతాయని తెలిపారు. రాష్ట్రంలో రూ.65 వేల కోట్లతో జాతీయ రహదారి పనులకు ఆమోదం తెలుపుతున్నట్లు వెల్లడించారు.

విజయవాడలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి...

విజయవాడ : బెంజిసర్కిల్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం..మచిలీపట్నం - విజయవాడ రహదారి విస్తరణ పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి పాల్గొన్నారు. రూ. 1460 కోట్లు కేటాయించారు. 

14:13 - December 5, 2015

హైదరాబాద్ : గ్రేటర్‌ పరిధిలో తెలంగాణ సర్కార్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భవనాలు, లేఔట్‌ల క్రమబద్ధీకరణ పథకం మందకొడిగా సాగుతోంది. పథకం ప్రారంభమై వన్‌ మంత్‌ కావస్తున్నా స్కీం ఊపందుకోవడం లేదు. కొన్ని సర్కిళ్లల్లో ఇప్పటివరకూ కనీసం వంద దరఖాస్తులు కూడా రాలేదని బల్దియా వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్‌ ఎన్నికల టైం మొదలవడంతో ప్రభుత్వం కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.
రూ.800 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా
గ్రేటర్‌లో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ఆసక్తిరేపిన బిఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం ప్రకటన వెలువడి నెల రోజులు గడుస్తున్నా కార్యాచరణ నత్తనడకనే సాగుతోంది. ఈ పథకం ద్వారా భారీ స్థాయిలో ప్రభుత్వ ఖజానాకు డబ్బులు వస్తాయనుకున్నా పెద్దగా వర్కవుట్‌ అయ్యేలా కనిపించడం లేదు. ఈ రెండిటి ద్వారా సుమారు 800 కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తుందని జిహెచ్‌ఎంసి లెక్కలేసింది. అయితే గ్రేటర్‌ పరిధిలోని మొత్తం 24 సర్కిళ్లలో ఇప్పటివరకూ ఎల్‌ఆర్‌ఎస్‌కు కేవలం 3 వేలు, బిఆర్‌ఎస్‌కు 2వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
గందరగోళానికి గురిచేస్తున్న ఆన్‌లైన్‌ విధానం
లేఔట్లు, భవనాల క్రమబద్దీకరణ దరఖాస్తుల స్వీకరణను ప్రభుత్వం తొలిసారిగా ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టింది. ఈ చర్యల ద్వారా ఎలాంటి ఆలస్యానికీ పొరపాట్లకు అవినీతికి తావు లేకుండా చూడడమే తమ ఉద్దేశ్యమని ప్రకటించింది. అయితే అదే ఆన్‌లైన్ విధానం ప్రస్తుతం గందరగోళానికి తెరలేపుతోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ఈసీ, సేల్‌ డీడ్‌, మార్కెట్‌ వ్యాల్యూ కాపీ, బిల్డింగ్ ప్లాన్‌తోపాటు లేఔట్‌ వివరాలతో సహా పలు కాపీలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చెయ్యాల్సి ఉంటుంది. అయితే వీటిని అప్‌లోడ్‌ చెయ్యడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇదే దరఖాస్తుదారులకు ఇబ్బందిగా మారింది. ఈ తతంగాన్నంతా కేవలం ఇంటర్నెట్‌, జిరాక్స్‌ సెంటర్లు, వాటితోపాటు ఆర్కిటెక్చర్లు సొమ్ముచేసుకుంటున్నారు.
ఏరియానుబట్టి ఫీజులు వసూలు
నగరంలో ఏదైనా భవనానికి లే ఔట్‌కు ప్లాన్ ఇవ్వడానికి ఏరియాను బట్టి ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బిఆర్‌ఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ల మాస్టర్‌ ప్లాన్‌ కోసం 8 వేల నుంచి 15 వేల వరకు ధరను నిర్ణయించారు. అయితే ఈ ఆన్‌లైన్‌ విధానంపై కొన్ని ఇబ్బందులు ఉన్నా వెనక్కితగ్గేది లేదంటున్నారు జిహెచ్ఎంసి అధికారులు. ఇలాంటి పథకాలకు సాధారణంగా చివరి నిమిషం వరకూ ఆదరణ తక్కువగా ఉంటుందని, కానీ చివర్లో భవన యజమానులు ఇలాంటి విధానంవైపే మొగ్గుచూపుతారని కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి అన్నారు.
పారదర్శకత కోసమే ఆన్‌లైన్
టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తామని అధికారులు అంటున్నారు. పారదర్శకత కోసమే ఆన్‌లైన్ సిస్టమని కొద్దిగా కష్టమైనా ప్రజలు సహకరించాలని బల్దియా కోరుతోంది.

 

ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి పువ్వాడ నామినేషన్

ఖమ్మం : జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి వామపక్షాల అభ్యర్థిగా పువ్వాడ నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఇతర వామపక్ష నేతలు వెంటరాగా... పువ్వాడ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.

14:02 - December 5, 2015

ఖమ్మం : జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి వామపక్షాల అభ్యర్థిగా పువ్వాడ నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఇతర వామపక్ష నేతలు వెంటరాగా... పువ్వాడ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ఈనెల 9న ముగియనుంది.

 

14:00 - December 5, 2015

విశాఖ : చెన్నై వరద బాధితుల సహాయార్థం సీపీఎం విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్ లో సీపీఎం నాయకులు, కార్యకర్తలు విరాళాలు సేకరించారు. తాగేందుకు మంచినీళ్లు కూడా లేని చెన్నై వాసులకు ప్రతీ ఒక్కరు మానవతా హృదయంతో సహాయం చేయాలని కోరారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వరద బాధితుల కోసం మరిన్ని నిధులు విడుదల చేయాలని కోరారు.

13:57 - December 5, 2015

ఇప్పటి వరకు వాటర్‌ ప్రూఫ్‌ , డస్ట్‌ ప్రూఫ్‌ స్మార్ట్‌ఫోన్ల గురించే విన్నాం. ఇక ఇది పాత విశేషం కానుంది. ఎంత వాటర్‌ ప్రూఫ్‌ ఫోన్‌ అయినా పూర్తిగా నీటిలో మునిగితే ఏదో ఒక లోపం తలెత్తడం ఖాయం, వాడుకలో కూడా తేడా కనిపిస్తుంది. ఇలాంటి ఫోన్లకు భిన్నంగా జపాన్‌లోని ఒక్క కంపెనీ అందరినీ అబ్బురపరిచేలా పాడవని స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ ఫోన్‌ను సబ్బుతో రుద్దినా లేదా నీటితో శుభ్రం చేసినా పాడవదు. జపాన్‌కు చెందిన 'క్యొకెరా' అనే సంస్థ 'డిగ్నో రెప్రే' పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేసింది. ఐదు అంగుళాల తెర కలిగిన ఈ ఫోన్‌ ఏకంగా 43 డిగ్రీల సెల్సీయస్‌ వేడి నీళ్లలో ముంచినా చక్కగా పని చేస్తుందని ఆ కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్‌ 2జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంటర్నల్‌ మెమోరీ కలిగి ఉంటుంది. ఎస్‌డీ కార్డుతో ఈ సామర్థాన్ని మరింతగా విస్తరించుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టంతో అభివృద్ధి చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే శుక్రవారం ఆ కంపెనీ విడుదల చేయనుంది. దీని ధర 460 డాలర్లుగా నిర్ణయించింది, భారత కరెన్సీలో రూ.30,200 విలువ చేస్తుందని అంచనా.

13:56 - December 5, 2015

తమిళనాడు : చెన్నైలో మళ్లీ వర్షం పడుతోంది. దీంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. చెన్నై నుంచి సొంత ఊర్లకు వెళ్లేవారి కోసం ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించింది. నగరంలో నాలుగురోజులపాటు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. మరోవైపు ఐటీ కంపెనీలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఐటీ దిగ్గజం విప్రో చెన్నై నుంచి ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వంద బస్సులను రంగంలోకి దింపింది. కోయంబెడు బస్టాప్‌ నుంచి ఉదయం 7 నుంచి 8.30 గంటల మధ్య వంద బస్సుల్లో ఉచితంగా ప్రజలను తరలించింది.
ఉన్నతాధికారులతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ సమీక్ష
చెన్నైలో వరద ప్రాంతాల పరిస్థితిపై కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్, రైల్వే, సమాచార, విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. చెన్నైలో చేపట్టిన సహాయక కార్యక్రమాలపై కేబినెట్ సెక్రటరీ అడిగితెలుసుకున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.. సహాయకచర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. చెన్నై ఎయిర్ పోర్ట్ బంద్ కావడంతో... వర్షాలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ విమానయాన సంస్థలు.. అరక్కోణం వైమానిక స్థావరం నుంచి సర్వీసులు ప్రారంభించాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా ఉండటంతో.. రద్దీ బాగా పెరిగింది. దీంతో ఎయిర్ లైన్ సంస్థలు టికెట్టు ధరలను అమాంతం పెంచేశాయి. చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్లడానికి ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ టికెట్ ధర 51వేలుగా నిర్ణయించింది. జెట్ఎయిర్‌వేస్ టికెట్ ధర 47వేల రూపాయలు. ఈ రెండు సంస్థలే కాకుండా మిగతా ఎయిర్ లైన్స్ కూడా భారీగానే ధరలను పెంచేశాయి. ఇలాంటి విపత్కర సమయంలో ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.

 

13:49 - December 5, 2015

నిద్రలేచింది మొదలు... ఉరుకులు పరుగుల జీవితం మహిళలది. త్వరగా అలసిపోవడం, నీరసంగా అనిపించడం ప్రతి మహిళలను నేడు వేధిస్తున్న సమస్య. దీనికి కావాల్సిందల్లా ఐరన్‌. శరీరానికి తగిన ఐరన్‌ను ఆహారం ద్వారా అందించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అందుకే తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఐరన్‌ శరీరానికి ఖనిజాలను అందిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు ఐరన్‌ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుంది.

  • ఐరన్‌ లోపం వల్ల లావు తగ్గడం, తరచూ తలనొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఐరన్‌ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవాలి.
  • ఐరన్‌ లభించే పదార్థాలు : ఉడికించిన గుడ్డు, చేపలు, బీన్స్‌, ఆకుకూరలు, పచ్చని కూరలు, డ్రైఫ్రూట్స్‌, సోయా, మాంసం, రాగులు.
  • ఐరన్‌ పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. శరీరానికి ఆక్సిజన్‌ అందించే ఎర్ర రక్తకణాల సంఖ్య పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్లను దరిచేరనివ్వదు.
  • బిడ్డ నాడీవ్యవస్థ మీద ప్రభావం చూపే ఐరన్‌ను గర్భిణులు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది.
  • నెలసరి సమస్యలు ఎదుర్కొనేవారు, బాలింతలు తప్పక ఐరన్‌ తీసుకోవాలి. 
13:47 - December 5, 2015

ప్రస్తుత జనరేషన్లో యువత ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య మొటిమలు. ఈ మొటిమలు వచ్చినప్పుడు భరించలేని నొప్పితో బాధపడటమే కాకుండా ముఖసౌందర్మం అందవిహీనంగా తయారవుతుంది. ముఖ్యంగా అమ్మాయిల పరిస్థితి మరింత దారుణంగా వుంటుంది. ఆ మొటిమలు వచ్చినప్పుడు ఇంట్లోనుంచి బయటకు ఎక్కువ రాకుండా, వాటి నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాల తంటాలు పడుతుంటారు. అంతేకాదు.. ఈ మొటిమలు తగ్గిన చోట వాటి మచ్చలు అలాగే వుండిపోతాయి. అలాంటప్పుడు వీటి నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఆ చిట్కాలు ఏమిటంటే..

  • ఒక పాత్రలో కొద్దిగా శనగపిండి తీసుకుని, అందులో కాస్త పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పేస్ట్‌లా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకున్న తర్వాత దాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాలపాటు అలాగే వుంచుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా తరుచుగా చేస్తే.. మొటిమలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
  • ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా ఉల్లిరసం వేసి, అనంతరం దాంట్లో కొంచెం తేనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు, వాటి మచ్చలపై రాసి.. కొద్దిసేపు మర్దన చేసుకోవాలి. గంటసేపు అలాగే వుంచుకోవాలి. ఆ తర్వాత సున్నిపిండితో కడిగితే మంచి ఫలితం లభిస్తుంది. ఇవేకాకుండా, గులాబీ రేకులు, బచ్చలి ఆకులు నూరి ముఖానికి రాసుకుని అర్థ గంట తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమల బాధ నుంచి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చని బ్యూటీషియన్లు అభిప్రాయపడుతున్నారు.
  • ఒక స్పూన్‌ మెంతులపొడి, ఒక స్పూన్‌ పసుపుపొడి, దోసకాయగుజ్జు, ఒక స్పూన్‌ టమాట రసం, కొబ్బరినీళ్లు... ఒక పాత్రలో తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.
  • మెంతికూర, వేపాకు చిగుళ్లు, పసుపు కలిపి నూరాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టి ఐదు నిమిషాల పాటు మసాజ్‌ చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు లేక మూడు సార్లు చేస్తే మొటిమలు, మచ్చలు మాయమవుతాయని వారు చెబుతున్నారు. 
13:45 - December 5, 2015

మనం ఇంట్లో వాడుకునే దాల్చిన చెక్కతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాల్చిన చెక్కను నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరి నుదురుకు కట్టులాగా వేస్తే జలుబువల్ల వచ్చే తలనొప్పి వెంటనే తగ్గుతుంది. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ఒక కప్పు నీటిలో మూడు టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి, రెండు టీస్పూన్ల తేనె కలిపి రోజుకు మూడుసార్లు క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది. దాల్చిన చెక్క నూనె చెవిలో వేసుకుంటే వినికిడి శక్తి పెరుగుతుందని, అలాగే చిటికెడు దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలిపి రాత్రిపూట పడుకునే ముందు సేవిస్తే జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుందని పెద్దలు చెబుతుంటారు.
మాంసాహార, శాకాహార వంటకాల్లో సువాసన కోసం వాడే ''దాల్చిన చెక్క'' మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. గుండె పట్టేసినట్లుగా అనిపిస్తుంటే దాల్చిన చెక్క చూర్ణం, యాలకుల పొడి సమపాళ్ళలో నీటిలో కలుపుకుని కషాయంలాగా కాచి తాగితే గుండె బిగపట్టడం తగ్గుతుంది. అలాగే దాల్చిన చెక్క కషాయం తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయని కూడా వైద్యులు చెబుతున్నారు.
కాస్తంత తేనెను వేడిచేసి అందులో ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిని కలిపి రోజుకు మూడు పూటలా తీసుకున్నా లేదా ఇదే మిశ్రమాన్ని శరీరానికి పూసినా దురదలు, ఎగ్జిమా, పొక్కులు లాంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులను అరికట్టవచ్చు. బియ్యం కడిగిన నీటిలో మూడు గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలిపి తాగితే మహిళలను వేధించే అధిక రుతుస్రావం బారి నుంచి కూడా కాపాడవచ్చు. 

13:43 - December 5, 2015

విజయనగరం : తమిళనాడుతో పాటు ఏపిలోని వరద బాధితుల సహాయార్థం సీపీఎం విరాళాలు సేకరిస్తోంది. విజయనగరంలో సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు విరాళాలు సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు, పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పాల్గొన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సీపీఎం ఎప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు.

చెన్నైలో ఆకాశాన్నంటుతున్న నిత్యవసరాల ధరలు

తమిళనాడు : చెన్నైలో వర్షాల ఉధృతి తగ్గి.. కాస్త తెరిపి ఇవ్వడంతో ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు బయటకు వస్తున్నారు. నిత్యవసర వస్తువులు తక్కువుగా అందుబాటులో ఉండడంతో వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరిగిన కూరగాయల ధరలతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఒక లీటరు పాల ధర 100 రూపాయిలకు చేరింది. సాధారణ రోజుల్లో 20 రూపాయిలకు లభ్యమయ్యే మినరల్‌ వాటర్‌ ప్రస్తుతం 150 రూపాయిలకు చేరింది. అదే విధంగా టమోటాలు, బీన్స్ వంటివి కిలో 90 రూపాయిలకు లభ్యమౌతున్నాయి. మరోవైపు పెట్రోల్‌ బంకుల ముందు, ఏటీఎంల ముందు భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి.

 

13:38 - December 5, 2015

విజయవాడ : కాంగ్రెస్ కుహనా రాజకీయాలు దేశ ప్రజలందరికి తెలియాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. తాను రచించిన 'నాడు నిశబ్ధం-నేడు నిరసన' పుస్తకాన్ని ఆయన విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ నేతలకు నెహ్రూ తప్పితే.. మరెవరు గుర్తుకు రాలేదన్నారు. తాము జాతి గర్వించదగ్గ నేతలను కొనియాడుతుంటే.. అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాను రాసిన పుస్తకం ప్రజల్లోకి వెళితే కాంగ్రెస్ అసలు రంగు అందరికి తెలుస్తుందన్నారు.

 

13:35 - December 5, 2015

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని జడ్చర్ల, కావేరమ్మపేట గ్రామపంచాయితీలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి.. ఉదయం 7గంటలనుంచి ఇక్కడ పోలింగ్‌ ప్రశాంతంగా నడుస్తోంది.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటుచేశారు.. ఉదయంనుంచి ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.. 

పుష్కరాల లోపు ఫ్లైవోవర్ నిర్మాణం పూర్తి : చంద్రబాబు

విజయవాడ : ఎన్నికల హామీలను అమలు చేసి తీరుతామని ఎపి సీఎం చంద్రబాబు అన్నారు. జెజవాడ దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం, మచిలీపట్నం-విజయవాడ రహదారి విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం కేంద్రం రూ.1460 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కృష్ణా పుష్కరాల లోపు ఫ్లైవోవర్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 

13:29 - December 5, 2015

విజయవాడ : ఎన్నికల హామీలను అమలు చేసి తీరుతామని ఎపి సీఎం చంద్రబాబు అన్నారు. జెజవాడ దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం, మచిలీపట్నం-విజయవాడ రహదారి విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం కేంద్రం రూ.1460 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కృష్ణా పుష్కరాల లోపు ఫ్లైవోవర్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతి చుట్టూ 220 కిమీ మేర రింగ్ రోడ్డు రోబోతుందని చెప్పారు. రింగ్ రోడ్డు నిర్మాణం కోసం కేంద్రం 20 వేల కోట్ల రూపాయలను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. 2029 నాటికి ఎపి.. భారత్ లో నెంబర్ వన్ స్టేట్ గా అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎపి అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్రానికి బాబు ధన్యవాదాలు తెలిపారు.

 

ప్రత్యేకహోదా రాకుండా బాబు, వెంకయ్య కుట్ర : అంబటి

హైదరాబాద్ : ఎపికి ప్రత్యేకహోదా రాకుండా సీఎం చంద్రబాబు, వెంకయ్యనాయుడు అడ్డుకుంటున్నారని వైసిపి నేత అంబటి రాంబాబు అరోపించారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడులు ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. ఇద్దరు నాయుడులు ఎపికి ప్రత్యేకహోదా తీసుకురాకుండా మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎపికి ప్రత్యేకహోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

12:57 - December 5, 2015

హైదరాబాద్ : ఎపికి ప్రత్యేకహోదా రాకుండా సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులు అడ్డుకుంటున్నారని వైసిపి నేత అంబటి రాంబాబు అరోపించారు. బాబు, వెంకయ్యలు ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. ఇద్దరు నాయుడులు ఎపికి ప్రత్యేకహోదా తీసుకురాకుండా మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎపికి ప్రత్యేకహోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి.. వైసిపి కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

ఎపిని అన్ని విధాలా ఆదుకుంటాం : వెంకయ్యనాయుడు

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ను కేంద్రప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. అవకాశం వచ్చినప్పుడల్లా.. కేంద్రం ఎపికి సహాయం చేస్తోందని పేర్కొన్నారు. ఎపికి ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఎపికి ఏ ఆపదొచ్చినా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

12:43 - December 5, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ను కేంద్రప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. అవకాశం వచ్చినప్పుడల్లా.. కేంద్రం ఎపికి సహాయం చేస్తోందని పేర్కొన్నారు. విజయవాడలో దుర్గగుడి ఫ్లైవోవర్ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరై, ప్రసంగించారు. ఎపికి ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఎపికి ఏ ఆపదొచ్చినా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఎపికి న్యాయం చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పారు. కొత్త కేపిటల్ చుట్టూ 186 కిమీ మేర రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా పేదలకు రెండు లక్షల 23 వేల ఇళ్లను మంజూరు చేస్తే.. అందులో లక్షా 93 వేల ఇళ్లను ఎపికి మంజూరు చేశామని పేర్కొన్నారు. అభివృద్ధి.. రాత్రికి రాత్రే జరగదన్నారు. విజయవాడ మెట్రోరైలుకు కేంద్రం ఆమోదం తెలిపిందని చెప్పారు. కేంద్ర సహాయంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఎపి ముందుకు దూసుకెళ్తోందన్నారు. ప్రపంచం యావత్తు భారత్ వైపు చూస్తోందన్నారు. వరదబాధితులకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల నష్ట పరిహారం ఇచ్చారని... కానీ బిజెపి ప్రభుత్వం నష్టపరిహారాన్ని రూ.4 లక్షలకు పెంచారని తెలిపారు. 30 శాతం పంట నష్టపోతే కూడా నష్ట పరిహారం వస్తుందన్నారు. అభివృద్ధియే ఎజెండాగా మోడీ పని చేస్తున్నారని తెలిపారు.
నేను ఆంధ్రనాయకుని కాదు.. తెలుగు వాణ్ణి..
'నేను ఆంధ్రనాయకున్ని కాదు.. తెలుగు వాణ్ణి' అని చెప్పారు. ఎన్ టిఆర్... తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పై విమర్శలు...
కాంగ్రెస్ పై వెంకయ్య తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయం అయిందని విమర్శించారు. భూమిని, భూగర్భం, ఆకాశాన్ని వదలేదని.. అన్నింటిని దోపిడీ చేశారని తెలిపారు. భూముల స్కాం, బొగ్గు, అగస్టా హెలికాప్టర్, 2జి కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక కుంభకోణాలు లేవన్నారు.

 

 

11:57 - December 5, 2015

నల్లగొండ : జిల్లాలోని 9 గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. జిల్లాలోని నకిరేకల్‌ గ్రామపంచాయతీతోపాటు.. మండలపరిధిలోని ఆరు గ్రామాలు, ఆలేరు మండలం అమ్మనబోలు, మోత్కూరు మండలం మూసాయికుంటలో పోలింగ్‌ నడుస్తోంది. నకిరేకల్‌లో ఈవీఎం ద్వారా పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నకిరేకల్ లోని 20 వార్డులకు 40 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. నకిరేకల్ లో 20 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. వారు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. టిఆర్ ఎస్ తోపాటు విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టిఆర్ ఎస్ పై పోటీకి పత్రిపక్షాలు ప్రజాఫ్రంట్ గా ఏర్పడ్డాయి. గ్రామపంచాయతీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి.

 

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ ప్రాంతంలో కేంద్రబృందం పర్యటన

నల్గొండ : నేడు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ ప్రాంతంలో కేంద్ర బృందం పర్యటించనుంది.

 

'నాడు నిశ్చబ్ధం-నేడు నిరసన' పుస్తకావిష్కరణ

కృష్ణా : విజయవాడలో 'నాడు నిశ్చబ్ధం-నేడు నిరసన' పుస్తకావిష్కరణ జరిగింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

హైదరాబాద్ లో సూదిగాడి కలకలం..

హైదరాబాద్ : నగరంలో మళ్లీ సూదిగాడు కలకలం రేపాడు. వనస్థలిపురంలోన హిల్స్ కాలనీలో ఉదయం 10 గంటల సమయంలో రమాదేవి అనే మహిళకు సూదిగుచ్చి దుండగుడు పరారయ్యాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. చికిత్స నిమ్తితం రామాదేవిని ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి విష పదార్థం ఇంజెక్టు కాలేదని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు రంగంలోకి దిగి.. సూదిగాడి కోసం గాలిస్తున్నారు. పోలీసుల రెండు బృందాలుగా ఏర్పడి సూదిగాడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

11:34 - December 5, 2015

హైదరాబాద్ : నగరంలో మళ్లీ సూదిగాడు కలకలం రేపాడు. వనస్థలిపురంలోన హిల్స్ కాలనీలో ఉదయం 10 గంటల సమయంలో రమాదేవి అనే మహిళకు సూదిగుచ్చి దుండగుడు పరారయ్యాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. చికిత్స నిమ్తితం రామాదేవిని ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి విష పదార్థం ఇంజెక్టు కాలేదని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు రంగంలోకి దిగి.. సూదిగాడి కోసం గాలిస్తున్నారు. పోలీసుల రెండు బృందాలుగా ఏర్పడి సూదిగాడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

11:26 - December 5, 2015

రణ్‌బీర్‌ కపూర్‌, దీపికా పదుకొనె జంటగా ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన చిత్రం 'తమాషా'. ప్రేక్షకాదరణతో రోజు రోజుకి బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్‌ సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దీపికా పదుకొనె మాట్లాడుతూ..'తమాషా' దీపికా వల్లే హిట్‌ అయ్యిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. నిజానికి రణ్‌బీర్‌ కృషి, పట్టుదలే సినిమా సక్సెస్‌కి కారణం. రణ్‌బీర్‌ చాలా కష్టపడతాడు. ఈ సినిమా విజయంతో అతని గురించి అందరూ అనుకుంటున్నదంతా తప్పని రుజువు చేశాడు. వరుస ఫ్లాపుల తర్వాత రణ్‌బీర్‌ మళ్ళీ సక్సెస్‌ సాధించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది' అని చెప్పారు. దీపికా ప్రస్తుతం 'బాజీరావ్‌ మస్తానీ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు మహేష్‌బాబు, ఏ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెలుగు, తమిళంలో ఒకేసారి రూపొందుతున్న చిత్రంలో నటించేందుకు దీపిక గ్రీన్‌సిగల్‌ ఇచ్చినట్టు సమాచారం.

 

విజయవాడలో నేడు పలు నిర్మాణాలకు శంకుస్థాపనలు

కృష్ణా : విజయవాడలో ఇవాళ పలు నిర్మాణాలకు శంకుస్థాపనలు జరుగనున్నాయి. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. రూ.447 కోట్లతో దుర్గగుడి వద్ద ఫ్లైవోవర్ నిర్మాణం, రూ.68 కోట్లతో బెజ్ సర్కిల్ వద్ద ఫ్లైవోవర్ నిర్మాణం, విజయవాడ-బందరు 4 లేన్ల రోడ్డు విస్తరణ, విజయవాడ-జికొండూరు 4 లేన్ల రోడ్డు విస్తరణకు శంకుస్థాపన జరుగనుంది. ఉదయం 9.30 నుంచి శంకుస్థాపనలు ప్రారంభం కానున్నాయి. 

నేడు హకీ ప్రపంచ లీగ్ టోర్నీ సెమీ ఫైనల్

హైదరాబాద్ : నేడు హకీ ప్రపంచ లీగ్ టోర్నీ సెమీ ఫైనల్ జరుగనుంది. భారత్, బెల్లియం ఢీ కొనబోతున్నాయి. సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

10:41 - December 5, 2015
10:36 - December 5, 2015

హైదరాబాద్ : ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టారు. ఫ్రీ పార్కింగ్‌ పాయింట్లను ఏర్పాటుచేసి వాహనదారుల ఇబ్బందులను పరిష్కరించేందుకు నడుం బిగించారు. ఫ్రీ పార్కింగ్‌ పాయింట్ల ఫార్మూలా సక్సెస్‌ కావడంతో వీటిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉచితంగా పార్కింగ్‌ చేసుకునే అవకాశం
నగర ప్రజలకు పార్కింగ్‌ ఇబ్బందులు తప్పనున్నాయి. చలాన్ల చిక్కులకు...అక్రమ వసూళ్ల బెడదకు ఫుల్‌స్టాప్‌ పడనుంది. ఫ్రీపార్కింగ్‌ పేరుతో పార్కింగ్‌ పాయింట్లను ట్రాఫిక్‌ పోలీసులే ఏర్పాటుచేస్తున్నారు. వాహనదారులు ఉచితంగా పార్కింగ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
అమీర్‌పేట్‌లో ప్రయోగాత్మకంగా ఫ్రీ పార్కింగ్‌ పాయింట్‌
అమీర్‌పేట్‌లోని మైత్రి వనం దగ్గర ప్రయోగాత్మకంగా ఫ్రీ పార్కింగ్‌ పాయింట్‌ను ఏర్పాటుచేశారు. ఇది సక్సెస్‌ అవడంతో జాబ్లీహిల్స్‌లోని ఫిలింనగర్‌ దగ్గర మరో పాయింట్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకు వంద వరకు ఫ్రీ పార్కింగ్‌ పాయింట్లను ఏర్పాటుచేశారు. పార్కింగ్‌ ప్రాంతాల్లో బ్యానర్లు కట్టి వాహనదారులను ఆహ్వానిస్తున్నారు. రానున్న కాలంలో ఫ్రీపార్కింగ్‌ పాయింట్ల సంఖ్యను పెంచాలని అధికారులు భావిస్తున్నారు. వీటి సంఖ్య 200 నుంచి 400 వరకు పెంచే ఆలోచనలో ఉన్నారు.
ప్రజలు, వ్యాపారుల భాగస్వామ్యం
ఫ్రీపార్కింగ్‌ స్థలాల కేటాయింపులలో ప్రజలు, వ్యాపారుల భాగస్వామ్యం కూడా ఉండేలా ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కాలనీ సంఘాలతో ప్రతినిధులతో మాట్లాడి..మోడల్‌ కాలనీలను ఎంపిక చేస్తున్నారు. ఈ కాలనీలతో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు, కాలనీలలోని అంతర్గత రోడ్లలో రద్దీగా ఉన్న ఏరియాల్లో ఫ్రీ పార్కింగ్‌ పాయింట్ల ఏర్పాటు చేస్తున్నారు.

 

 

10:36 - December 5, 2015

విజయవాడలో టీడీపీ-బీజేపీ నేతల భేటీ

కృష్ణా : విజయవాడలోని సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ, బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపి హరిబాబు, బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్‌సింగ్‌తో పాటు మాణిక్యాలరావు, గోకరాజు గంగరాజు హాజరయ్యారు. ఇరుపార్టీల మధ్య ఇటీవల చోటుచేసుకున్న అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి సోమవీర్రాజు గైర్హాజరయ్యారు. 

10:23 - December 5, 2015

కృష్ణా : విజయవాడలోని సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ, బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపి హరిబాబు, బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్‌సింగ్‌తో పాటు మాణిక్యాలరావు, గోకరాజు గంగరాజు హాజరయ్యారు. ఇరుపార్టీల మధ్య ఇటీవల చోటుచేసుకున్న అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి సోమవీర్రాజు గైర్హాజరయ్యారు. 

10:18 - December 5, 2015

తమిళనాడు : చెన్నై నగరం ఇంకా వరదనీటిలోనే నానుతోంది. నిన్నటి నుంచి వర్షాలు తెరపినిచ్చినా.. అక్కడక్కడా కురుస్తున్న వానలతో.. ఇబ్బందులు తప్పడం లేదు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వరదనీటికి తోడు.. నిత్యవసర వస్తువులు అందక ప్రజలు అల్లాడుతున్నారు. పాలు, మంచినీరు, కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. టమోటో కిలో రూ.80 రూపాయలకు కోనుగోలు చేస్తున్నారు. లీటర్ పెట్రోల్ ధర 200రూపాయలు కాగా.. డీజిల్ ధర 500 పైనే అమ్ముతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఎన్ డిఆర్ ఎఫ్ ఇప్పటివరకు 16వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వరదలతో 50 లక్షలమంది నిరాశ్రయులయ్యారు.

 

నవాబ్‌పేట జడ్పిటిసి ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభం

రంగారెడ్డి : జిల్లాలోని నవాబ్‌పేట జడ్పిటిసి ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. మీనపల్లి గ్రామంలో ఈవీఎంలు మెరాయించడంతో పోలింగ్‌కు అంతరాయం కలిగింది. ఎన్నికల అధికారులు వెంటనే ఈవీఎం మరమ్మతు కోసం సిబ్బందిని పంపించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 21గ్రామ పంచాయితీలకు 43 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 31,800మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

09:44 - December 5, 2015

రైల్వేస్టేషన్లను ప్రైవేటీకరణ చేయడం సరికాదని వక్తలు అభిప్రాయపడ్డారు. 'రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధమవుతోంది. 400 రైల్వే స్టేషన్లను ప్రైవేట్ సంస్థలకు కేంద్రం అప్పగించనుంది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో ప్రైవేట్ కు అప్పగించే యోచనలో ఉంది'. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు వినయ్ కుమార్, ఎపి కాంగ్రెస్ నేత తులసీరెడ్డి, టిడిపి నేత విద్యాసాగర్ రావు, బిజెపి నేత టి.ఆచారి, టిఆర్ ఎస్ నేత రాకేష్ లు పాల్గొని, మాట్లాడారు. స్టేషన్ల ప్రైవేటీకరణ చేస్తే అనేక సమస్యలు వస్తాయన్నారు. రోడ్ల విస్తరణతో పోలిస్తే రైల్వే విస్తరణ చాలా తక్కువగా ఉందని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

జడ్చర్ల గ్రామ పంచాయతీకి కొనసాగుతోన్న పోలింగ్

మహబూబ్ నగర్ : జడ్చర్ల గ్రామ పంచాయతీకి పోలింగ్ కొనసాగుతోంది. 8, 9 వార్డులలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 

చెన్నైలో సహాయకచర్యలు వేగవంతం

చెన్నై: గత కొన్ని రోజులుగా తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వరదల కారణంగా చెన్నై చిన్నాభిన్నమైన విషయం తెలిసిందే. వర్షం కాస్త తుగ్గు ముఖం పట్టింది. దీంతో వరద బాధితుల కోసం చెన్నై ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేసింది. చెన్నై నుంచి సొంత వూర్లకు వెళ్లే వారికోసం ఉచిత బస్సులు ఏర్పాటు చేసింది. నగరంలోని సిటీ బస్సుల్లో 4రోజుల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.

హకీంపేటలో ప్రారంభమైన సురక్ష మారథాన్

హైదరాబాద్ : నగరంలోని హకీంపేటలో సురక్ష మారథాన్ ప్రారంభమైంది. జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీ నుంచి 5కే, 10కే, 21కే మారథాన్ ప్రారంభించారు. మారథాన్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జ ప్రారంభించారు. ప్రజల్లో భద్రత అవగాహన పెంచేందుకు సురక్ష మారథాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నల్లగొండ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వేగంగా వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. చర్లపల్లికి చెందిన ఓ రైతు ద్వచక్రవాహనంపై నల్లగొండకు వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

నేడు విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

విజయనగరం : ఎపి సీఎం చంద్రబాబు నేడ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు.

 

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

నిజామాబాద్ : జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. నిజామాబాద్ రూరల్ మండలం న్యాలకల్ గ్రామానికి చెందిన ఇందిర (28) నిజామాబాద్ టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. ఆరు నెలల క్రితం ఆమెకు వివాహమైంది. భర్తతో తలెత్తుతున్న మనస్పర్ధల కారణంగా కొన్ని రోజుల కిందట విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో మనోవేదనకు గురైన ఆమె శుక్రవారం ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మనోవేదనతోనే ఇందిర ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

 

08:39 - December 5, 2015

ఢిల్లీ : ఒకపక్క అసహనంపై జరిగిన చర్చ లోక్‌సభలో దుమారం రేపింది. మరోపక్క అసహనానికి ఆజ్యం పోసేలా కొందరు చేస్తున్న వ్యాఖ్యలు రాజ్యసభలో విపక్షాల ఆందోళనకు కారణమయ్యాయి. వివాదాస్పద అయోధ్య అంశంపై ఆర్ ఎస్ఎస్ చీఫ్‌ చేసిన కామెంట్, వికెసింగ్‌ వ్యవహారం పెద్దల సభలో ప్రధాన ఇష్యూగా మారాయి. ఫలితంగా శుక్రవారం జరిగిన సభ వాయిదాలు, నినాదాలతోనే ముగిసింది.
విపక్షాల నుంచి బిజెపికి మరోసారి నిరసన సెగ
రాజ్యసభలో అధికార పక్షం బిజెపికి విపక్షాల నుంచి మరోసారి నిరసన సెగ తగిలింది. దళితుల పట్ల కేంద్రమంత్రి వికెసింగ్‌ చేసిన కామెంట్స్ తమని తీవ్రంగా కలిచివేశాయని బిఎస్‌పి అధినేత్రి మాయావతి మండిపడ్డారు. అయోధ్య అంశంపై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్ చేసిన ప్రకటనపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఆ చర్చకు సభా నాయకుడు అనుమతివ్వకపోవడంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది.
వికె సింగ్‌ వ్యాఖ్యలపై చర్చకు పట్టుబట్టిన మాయావతి
బిఎస్‌పి అధినేత్రి మాయావతి తొలుత కేంద్రమంత్రి వికె సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై చర్చకు పట్టుబట్టారు. దళితులను కించబరిచేలా వికెసింగ్ చేసిన కామెంట్స్ పై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు డిప్యూటీ చైర్మన్ కురియన్ స్పందిస్తూ నోటీస్ ఇవ్వకుండా చర్చకు అంగీకరించలేమన్నారు. దాంతో బిఎస్‌పి సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. రామమందిరాన్ని నిర్మించి తీరుతామంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్ ప్రకటన చేసిన అంశాన్ని సమాజ్‌వాదీ పార్టీ లేవనెత్తింది. నోటీస్ ఇవ్వకుండా దానిపైనా చర్చ జరపలేమని, జీరో అవర్‌లో ప్రస్తావించాలని కురియన్‌ అనడంతో ఎస్పీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు.
రాజ్యసభ పలుమార్లు వాయిదా
వికెసింగ్, మోహన్‌భగవత్‌ వ్యాఖ్యలపై చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టడంతో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. వాయిదా అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ మాట్లాడుతూ అయోధ్య అంశంపై కోర్టు తీర్పును కేంద్రం గౌరవిస్తుందని అన్నారు. అయితే ప్రజలకు అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని కోరే హక్కు ఉందని అన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకే ఆలయ నిర్మాణం జరుగుతుందన్నారు. వికెసింగ్‌ గురించి ప్రస్తావిస్తూ దళిత వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని ఆయన ఇప్పటికే వివరణ ఇచ్చారని నఖ్వీ తెలిపారు. ఈ దశలో కొందరు కాంగ్రెస్‌ నేతలు వెల్‌లోకి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడంతో రాజ్యసభ వాయిదా పడక తప్పలేదు.

 

హైటెక్‌ వ్యభిచారం... బ్రోకర్ల అరెస్ట్

హైదరాబాద్ : నగరంలోని హైటెక్‌ వ్యభిచార గృహాల గుట్టురట్టు అయింది. ఇతర రాష్ట్రాల నుంచి విమానాల్లో యువతుల్ని రప్పించి హైటెక్‌ వ్యభిచార గృహాల్ని నిర్వహిస్తున్న బ్రోకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులే విటుల వేషాల్లో వెళ్లి ఆ వ్యభిచార గృహాల గుట్టు రట్టు చేశారు. 

 

 

08:26 - December 5, 2015

హైదరాబాద్ : నగరంలోని హైటెక్‌ వ్యభిచార గృహాల గుట్టురట్టు అయింది. ఇతర రాష్ట్రాల నుంచి విమానాల్లో యువతుల్ని రప్పించి హైటెక్‌ వ్యభిచార గృహాల్ని నిర్వహిస్తున్న బ్రోకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులే విటుల వేషాల్లో వెళ్లి ఆ వ్యభిచార గృహాల గుట్టు రట్టు చేశారు. కోల్‌కతా, ముంబై నగరం నుంచి యువతుల్ని రప్పించి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్సార్‌నగర్, గోల్కొండ ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహింపజేస్తున్నారు. డెకాయ్ ఆపరేషన్‌లో భాగంగా 2 వేల రూపాయలకు బేరం కుదుర్చుకున్న కానిస్టేబుల్‌ వ్యభిచార గృహంలోకి వెళ్లాక వెస్ట్ జోన్‌ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. పట్టుబడ్డ 10 మంది యువతుల్ని ఆయా పోలీస్‌ స్టేషన్లకు తీసుకొచ్చి అప్పగించారు. కాకినాడకు చెందిన భారతి, మహబూబ్‌నగర్‌కు చెందిన మున్వర్ బాషాలనే బ్రోకర్లపై కేసులు నమోదు చేశారు.

 

08:22 - December 5, 2015

హైదరాబాద్‌ : నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ఎదుటే మందు బాటిల్‌ను పడేసి ఓ యువకుడు అడ్డంగా దొరికిపోయాడు. 

హైదరాబాద్‌లో డ్రంక్‌ అండ్ డ్రైవ్‌

హైదరాబాద్‌ : నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ఎదుటే మందు బాటిల్‌ను పడేసి ఓ యువకుడు అడ్డంగా దొరికిపోయాడు. 

08:18 - December 5, 2015

హైదరాబాద్ : రైతులకు 9 గంటల విద్యుత్‌ను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇదే అంశంపై మంత్రులు జగదీష్‌రెడ్డి, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయానికి 9 గంటలకు విద్యుత్‌ సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలను ప్రధానంగా చర్చించారు.
8,930 మెగావాట్ల విద్యుత్‌ అవసరం
ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు నిరంతరాయంగా 9 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేయాలంటే సుమారు 8930 మెగావాట్ల విద్యుత్‌ అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి 2500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం 2500 నుంచి 2700 మెగావాట్ల విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. రైతుల అవసరాలకు పూర్తిగా సరిపోకపోవడం వల్ల మరింత విద్యుత్‌ను కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తికి ప్రయత్నాలు
విద్యుత్‌ను పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసుకోవడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.ఇప్పటికే 2500 కోట్ల రూపాయలతో వివిధ విద్యుత్‌ ప్రాజెక్టులకు సంబంధించిన పనులను ప్రారంభమయ్యాయి.వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి కానున్న సింగరేణి పవర్‌ ప్లాంట్‌ నుంచి 1200 మెగావాట్లు, భూపాలపల్లి పవర్‌ ప్లాంట్‌ నుంచి 600 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశాలున్నాయని సర్కార్‌ భావిస్తోంది. ఒక వేళ పూర్తిస్తాయిలో విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేకపోతే బయట నుంచి కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.

 

 

08:14 - December 5, 2015

విజయవాడ : ఏపీ టీడీపీ, బీజేపీల సమన్వయ కమిటీ సమావేశం ఇవాళ జరుగుతుంది. ఇరు పార్టీల నేతలు చేస్తున్న విమర్శలు...ప్రతి విమర్శలపై కమిటీ ప్రధానంగా చర్చించనుంది. వీటితో పాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌ ప్రాజెక్టులు, ప్రత్యేక హోదా, ప్యాకేజీ తదితర అంశాలను సమావేశంలో చర్చిస్తారు. చాలా రోజుల తర్వాత సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుండడంతో మీటింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలపై చర్చ
ఏపీ టీడీపీ, బీజేపీల మధ్య సమన్వయ కమిటీ సమావేశం విజయవాడలో జరుగుతుంది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌, బీజేపీ నుంచి విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, ఆ పార్టీకి చెందిన మంత్రులు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాల రావు ఈ మీటింగ్‌లో పాల్గొంటారు. ఇటీవల కాలంలో బీజేపీ,టీడీపీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న విమర్శలు, ప్రతి విమర్శలను ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది.
టీడీపీని టార్గెట్‌ చేస్తూ బీజేపీ నేతల విమర్శలు
మాజీ కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు లాంటి బీజేపీ నేతలు టీడీపీని టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఐతే కమల నాథుల కామెంట్లకు టీడీపీ నేతలు కూడా కౌంటర్‌ ఇచ్చుకుంటూ వస్తున్నారు. విజయవాడలో జరిగే సమావేశంలో దీనిపై చర్చ జరిగే అవకాశముంది.
నామినేటెడ్‌ పదవులపైనా చర్చ
ఇక నామినేటెడ్‌ పదవులపైనా సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవల ఎనిమిది కార్పొరేషన్లకు ఛైర్మన్‌ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. మిగతా నామినేటెడ్‌ పోస్టులను కూడా భర్తీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. నామినేడెట్‌ పదవులను తమకు కూడా ఇవ్వాలని బీజేపీ అడుగుతోంది. ఈ అంశాన్ని కూడా కమిటీ సమావేశంలో కమలనాథులు లేవనెత్తనున్నారు.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా చర్చ
వీటితో పాటు కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్‌ ప్రాజెక్టులపైనా సమన్వయ కమిటీ సమావేశంలో చర్చకు వస్తుంది. ఇటీవల వరదల వల్ల కొన్ని జిల్లాలు తీవ్రంగా నష్టపోయినా కేంద్రం నుంచి ఆశించిన సాయం అందలేదు. ఈ విషయంతో పాటు రాజధాని నిర్మాణానికి సహకారం, ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ తదితర అంశాలను కూడా చర్చిస్తారు.

 

07:59 - December 5, 2015

హైదరాబాద్ : వరదలతో నష్టపోయిన చెన్నైవాసులను ఆదుకోవటానికి టాలీవుడ్‌ ముందుకొచ్చింది. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కూకట్‌పల్లి, ఇనార్బిట్‌ మాల్‌ తదితర ప్రాంతాల్లో విరాళాలు సేకరించాలని తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు నిర్ణయించారు.

 

'జన్ లోక్ పాల్' కు ఢిల్లీ అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్

ఢిల్లీ : అవినీతికి వ్యతిరేకంగా ఆప్ ప్రభుత్వం తీసుకువచ్చిన జన్ లోక్ పాల్ బిల్లును ఢిల్లీ అసెంబ్లీ ఆమోదించింది. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేజ్రీవాల్ ఈ బిల్లును ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఎన్నో విమర్వల అనంతరం శుక్రవారం ఈ బిల్లు ఆమోదం పొందింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత బిల్లు చట్టంలోకి రానుంది.

నేడు విజయవాడలో సుపరిపాలన సదస్సు

విజయవాడ : విజయవాడలో నేడు సుపరిపాలన సదస్సును నిర్వహించనున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. వైద్య ఆర్యోగశాఖ సేవలపై శాఖలోని అధికారులు, సిబ్బందికి అవగాహన పెంచేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

పదేండ్లు వాడిన వాణిజ్య వాహనాలపై త్వరలో నిషేధం

ఢిల్లీ : కాలుష్యాన్ని తగ్గించేందుకు రోడ్లపైకెక్కి పదేండ్లు పూర్తి చేసుకున్న వాణిజ్య వాహనాలను నిషేధించేలా త్వరలో చట్టం తీసుకురానున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అయితే 15 ఏండ్లు పూర్తి చేసుకున్న ట్రక్కులు, బస్సులను నిషేధించే తక్షణ ప్రతిపాదనేదీ లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు ఈ పాలసీలో భాగంగా రూ.10 లక్షల విలువ చేసే కొత్త వాహనం కొనుగోలుపై గరిష్ఠంగా రూ.2.5 లక్షల విలువ చేసే పన్ను రాయితీలు, డిస్కౌంట్లు కల్పించనున్నట్లు భారత పరిశ్రమ సమాఖ్య(సీఐఐ) ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటైన ఓ సమావేశంలో మంత్రి తెలిపారు.

నేడు నల్గొండ జిల్లాలోని 9 గ్రామ పంచాయతీలకు పోలింగ్

నల్గొండ : నేడు జిల్లాలోని 9 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగనుంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

 

Don't Miss