Activities calendar

06 December 2015

తుంగభద్ర నదిలో పడి వ్యక్తి మృతి..

మహబూబ్‌నగర్ : జిల్లాలోని అలంపూర్‌లోని జోగులాంబ ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు ప్రమాదవశాత్తూ తుంగభద్ర నదిలో పడి మృతి చెందాడు.

 

ధూల్ పేటలో ఎక్సైజ్ శాఖ దాడులు..

హైదరాబాద్ : ధూల్‌పేట్ లో ఆదివారం ఎక్సైజ్ అధికారులు ముమ్మర దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ పోలీసులు భారీగా గంజాయి తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తయారు చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది. 

కాపులకు మరిన్ని నిధులు కేటాయించాలి - ఆర్.కృష్ణయ్య..

రాజమండ్రి : కాపుల్లోని పేదలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం కేటాయించిన రూ.100 కోట్లకు తోడుగా మరిన్ని నిధులు కేటాయిస్తే సరిపోతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు.

 

21:27 - December 6, 2015

ఢిల్లీ : టెస్ట్‌లో సఫారీ బ్యాట్స్‌మెన్‌ డిఫెన్స్‌ మంత్రాన్ని జపిస్తున్నారు. ఆఖరి టెస్ట్‌లో గెలిచే అవకాశం లేకపోవడంతో పరమ జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్లకు పెద్ద పరీక్షే పెట్టారు. కెప్టెన్‌ హషీమ్‌ ఆమ్లా, డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ ఏబీ డివిలియర్స్‌ పోటీలు పడి మరీ....క్రీజ్‌లో పాతుకుపోయారు.72 ఓవర్లలో ఒక్క పరుగు సగటుతో 72 పరుగులు చేసి అరుదైన రికార్డ్‌ నమోదు చేశారు. ఢిల్లీ టెస్ట్‌లో సఫారీ బ్యాట్స్‌మెన్‌ డిఫెన్స్‌ మంత్రాన్నే జపిస్తున్నారు.డిఫెన్స్‌ అంటే అలాంటి ఇలాంటి డిఫెన్స్‌ కూడా కాదు....డెడ్లీ డిఫెన్స్‌ అనే చెప్పాలి.

అభిమానులకూ విసుగు...
ఆఖరి టెస్ట్‌లో ఎలాగూ గెలిచే అవకాశం లేకపోవడంతో డెడ్లీ డిఫెన్స్‌తో భారత బౌలర్ల సహనానికి పెద్ద పరీక్షే పెట్టారు. పరమ జిడ్డు బ్యాటింగ్‌తో క్రీజ్‌లో పాతుకుపోయిన సౌతాఫ్రికా టాప్‌ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ ఆట నాలుగో రోజు టీమిండియా బౌలర్ల దూకుడుకు చెక్‌ పెట్టారు. 480 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు శుభారంభం చేయలేకపోయింది. 6 పరుగులకే సఫారీ టీమ్‌ తొలి వికెట్‌ పడగొట్టిన భారత జట్టు బౌలర్లకు...హషీమ్‌ ఆమ్లా, బవూమ ఆనందం లేకుండా చేశారు. కెప్టెన్‌ హషీమ్‌ ఆమ్లా, డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ ఏబీ డివిలియర్స్‌ పోటీలు పడి మరీ....క్రీజ్‌లో పాతుకుపోయి భారత బౌలర్లకే కాదు వీక్షిస్తున్న అభిమానులకు విసుగు తెప్పించారు.

డివిలియర్స్ సైతం డిఫెన్స్ కే...
మోడ్రన్‌ క్రికెట్‌లో పరమ జిడ్డు బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన ఆమ్లా...అయితే 100 బంతుల్లో 6 పరుగులే చేసి డిఫెన్స్‌ ఆడటంలో తన తర్వాతే ఎవరైనా అని నిరూపించాడు. మరో ఎండ్‌లో ఓపెనర్‌ బవూమా సైతం తానెమన్నా తక్కువా అంటూ..... ఆమ్లా ఫార్ములానే ఫాలో అయిపోయాడు. 38.4 ఓవర్ల పాటు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన ఈ ఇద్దరూ....రెండో వికెట్‌కు 232 బంతుల్లో 44 పరుగులు జోడించారు. 117 బంతుల్లో 34 పరుగులు చేసిన బవూమాను ఔట్‌ చేసిన భారత బౌలర్ల ఆనందం ఎంతో సేపు నిలువలేదు. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా పేరున్న ...సఫారీ సూపర్‌మ్యాన్‌ ఏబీ డివిలియర్స్‌ సైతం డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు. ధూమ్‌ ధామ్‌ ఇన్నింగ్స్‌కు కేరాఫ్ అడ్రెస్‌ అయిన డివిలియర్స్‌ 50 బంతుల్లో 3 పరుగులే చేసి.....ఫార్మాట్‌కు తగ్గట్టుగా ఆడటంలో తనకు తాను మాత్రమే సాటి అనిపించుకున్నాడు. 200 బంతుల్లో అతి కష్టం మీద 23 పరుగులే చేసిన ఆమ్లా టెస్టు ఫార్మాట్‌లో మరో చెత్త రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. పరమ జిడ్డు బ్యాటింగ్‌తో ఢిల్లీ టెస్ట్‌ను డ్రా చేసే ప్రయత్నంలో ఉన్న సఫారీ బ్యాట్స్‌మెన్‌...ఐదో రోజు ఇంకెన్ని చెత్త రికార్డ్‌లు నమోదు చేస్తారో చూడాలి.

21:23 - December 6, 2015

విజయవాడ : అలుపెరగని పోరాటం చేస్తామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. హిందూ, ముస్లిములు సఖ్యతగా మెలగాలన్న ఆయన మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురాకూడదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన బీజేపీ మతం పేరుతో పబ్బం గడుపుకుంటోందని మధు విమర్శించారు. మతసామరస్యంపై ఆవాజ్‌ ఆధ్వర్యంలో విజయవాడలో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో వివిధ ప్రజా సంఘాలు నేతలు పాల్గొన్నారు.  

21:20 - December 6, 2015

హైదరాబాద్ : నాంపల్లి గ్రౌండ్స్‌లో అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్ల అసోసియేషన్‌ సమావేశమైంది. అగ్రిగోల్డ్ అఖిల భారత సంఘం పేరుతో బాధితులంతా ఒక్కటయ్యారు. ఈ సమావేశంలో 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. కమిటీ అధ్యక్షుడిగా రమేష్‌బాబు, సెక్రటరీగా తిరుపతిరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, ప్రధానిని కలిసి అగ్రిగోల్డ్ బినామీ ఆస్తుల వివరాలు అందిస్తామన్నారు. ఈ సదస్సుకు 7 రాష్ట్రాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా అగ్రిగోల్డ్ పలురకాల అవకతవకలకు పాల్పడుతూ కోర్టునే తప్పుదోవ పట్టిస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమకు సాయపడాల్సిందిపోయి ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వాపోయారు. 

21:19 - December 6, 2015

హైదరాబాద్ : దేశంలో సెక్యులరిజాన్ని కాపాడేందుకు అన్ని పార్టీలూ కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. దేశంలో లౌకిక వాదాన్ని నెలకొల్పేందుకు అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. దేశంలో పెచ్చుమీరుతున్న మతతత్వం, కాషాయీకరణ అంశాలపై హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఙాన కేంద్రంలో వామపక్ష పార్టీలు సదస్సు నిర్వహించాయి. ఈ సదస్సుకు జస్టిస్ చంద్రకుమార్, చాడా వెంకటరెడ్డి, తదితర నేతలు హాజరయ్యారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ దేశం మతతత్వ ప్రమాదంలో కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ మతమూ ఇతర మతాలపై దాడి చేయాలని కోరుకోదని, కొందరు మతపిపాసులు గాంధీని చంపిన వాణ్ని మహాత్మున్ని చేయజూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశాభివృద్ధికి విధానాలు విఘాతం..
బిజెపి అవలంబిస్తున్న విధానాలు దేశాభివృద్ధికి విఘాతంగా మారాయని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. మోడీ గుప్పించిన ఇబ్బడి ముబ్బడి వాగ్దానాలను నమ్మిన ప్రజలు ఓట్లేశారే తప్ప బిజేపినో లేక హిందుత్వాన్నో చూసి కాదని అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం దేశంలో ప్రమాదకరమైన మతోన్మాదాన్ని ప్రవేశపెడుతున్నారని అభిప్రాయపడ్డారు. ప్రమాదకరమైన ఈ తరహా విధానాలకు వ్యతిరేకంగా అన్ని శక్తులూ ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.

ముదురుపాకాన పడుతున్న మతపిచ్చి..
భారతదేశంలో మతపిచ్చి ముదురు పాకాన పడుతోందని సిపిఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. బిజెపి ఎంపిలు, మంత్రులు ఇష్టానుసారంగా స్టేట్‌మెంట్లు ఇస్తూ అలజడి సృష్టిస్తున్నారని ఆరోపించారు. మతతత్వం మూలంగా దేశ ప్రగతి కుంటుబడుతుందని, దేశానికి రావాల్సిన పెట్టుబడులు సైతం నిలిచిపోతాయని వక్తలు అభిప్రాయపడ్డారు. అత్యంత ప్రమాదకరంగా మారిన బిజెపి కాషాయీకరణ విధానాన్ని సంయుక్తంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 

21:15 - December 6, 2015

హైదరాబాద్ : తెలంగాణలో కరువు ప్రాంతాల పరిశీలనకు సోమవారం కేంద్ర కరువు బృందం రానుంది. రేపు ఉదయం 9.30కు తెలంగాణ చీఫ్‌ సెక్రటరీతో బృంద సభ్యులు సమావేశమవుతారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో బృందం పరిశీలన జరుపుతుంది. కాగా కేంద్రాన్ని టి సర్కార్‌ కరువు సాయం కింద 2,500 కోట్ల రూపాయలు కోరింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల మూలంగా ఏపీలో పంట నష్టపోయిన ప్రాంతాల్లో సోమవారం కేంద్ర బృందం పరిశీలన జరపనుంది. పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్న బృందం నష్టంపై ఒక అంచనాకు వస్తుంది. కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించనుందని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఎడతెరపిలేని వర్షాల మూలంగా సుమారు 2లక్షలా 60 వేల ఎకరాల్లో వరి పంట నాశనమైంది. వివిధ ప్రాంతాల్లో చేపలు, రొయ్యల చెరువులు తెగిపోయి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. సుమారు 6 వేల ఎకరాల్లో ఆక్వా రంగంలో తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రి పత్తిపాటి తెలిపారు. కాగా పంట నష్టపోయిన రైతులకు ఉచితంగా విత్తనాలు సరఫరా చేస్తారని మంత్రి అన్నారు. 

21:13 - December 6, 2015

హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచే పార్టీ అభ్యర్థులను... పాలక టీఆర్ఎస్‌ ప్రకటించింది. ఇప్పటివరకూ బరిలో నిలిపే ఏడుగురి పేర్లను కారు పార్టీ ప్రకటించింది. స్థానిక సంస్థల్లో పార్టీకి పట్టు లేని జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో కాస్త తర్జన భర్జన పడుతోంది. ఇక విపక్షాలు బరిలో నిలిపే అభ్యర్థుల విషయమై ఇంకా పూర్తి స్థాయి కసరత్తునే చేపట్టలేదు. ఇంతకుముందే.. నల్లగొండ స్థానానికి తేరా చిన్నప్పరెడ్డి పేరును ఖరారు చేసిన టీఆర్ఎస్‌.. ఆదివారం మరికొన్ని పేర్లను ప్రకటించింది. కరీంనగర్‌ జిల్లాలోని రెండు స్థానాల నుంచి భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణ్‌రావులు, ఖమ్మం నుంచి బాలసాని లక్ష్మీనారాయణ టీఆర్ఎస్‌ పక్షాన బరిలో నిలుస్తారు. స్థానిక సంస్థల ఓటర్ల మద్దతు పెద్దగా లేని.. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలతో పాటు.. వరంగల్‌ జిల్లా అభ్యర్థినీ ప్రకటించాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాలనూ టీఆర్ఎస్‌ కైవసం చేసుకుంటుందని ఆపార్టీ నాయకత్వం ధీమాగా ఉంది.

ఖమ్మం నుండి పువ్వాడ నామినేషన్...
అభ్యర్థుల ప్రకటనలతో టీఆర్ఎస్‌ దూకుడు ప్రదర్శిస్తుంటే.. విపక్షాలు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఖమ్మం స్థానం నుంచి వామపక్ష అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావు ఒక్కరే ఇప్పటివరకూ నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు అధికారికంగా తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. పేర్లను ముందే ప్రకటిస్తే.. వారినీ ఆకర్ష అస్త్రంతో పాలక పక్షం లోబరచుకుంటుందన్న అనుమానం.. పార్టీ నేతల నుంచి స్పందన కరవు కావడం వల్ల.. చివరి నిమిషంలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని ఈ రెండు పార్టీల నాయకత్వాలూ భావిస్తున్నట్లు సమాచారం. 

హాకీలో భారత్ కు కాంస్యం..

హకీ వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నీలో భారత్ కు కాంస్య పతకం లభించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 5-5 స్కోరుతో సమంగా ఉన్నాయి. దీనితో పెనాల్టీ షూటౌట్ లో భారత హకీ జట్టును విజయం వరించింది. 3-2 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ పై భారత్ గెలుపు సాధించింది. 

రేపు తెలంగాణలో కరవు బృందం పర్యటన..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కరవు బృందం పర్యటించనుంది. ఉదయం 9.30గంటలకు సీఎస్ తో కేంద్ర కరవు బృందం భేటీ కానుంది. రాష్ట్రంలో కరవు పరిస్థితులను పరిశీలించేందుకు జిల్లాల్లో బృందం పర్యటించనుంది. కేంద్రాన్ని రూ.2,500 కోట్ల సాయం కావాలని టిఎస్ కోరనుంది. 

తిరుపతి మొదటి ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం...

తిరుపతి : మొదటి ఘాట్ రోడ్డు 57వ మలుపు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. కారులో ఉన్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.

20:37 - December 6, 2015

బ్యాంకాక్ : భారత్, పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుల కీలక సమావేశం బ్యాంకాక్ లో జరిగింది. భారత భద్రత సలహాదారు అజిత్ గోవల్, పాక్ భద్రత సలహాదారు నాసిర్ జంజువా మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలు నాలుగు గంటల పాటు కొనసాగాయి. రెండు దేశాలకు సంబంధించిన కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. టెర్రరిస్టు కార్యకలాపాలు..సరిహద్దు చొరబాట్లపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. వీరిద్దరూ మరో మారు భేటీ అవుతారని తెలుస్తోంది. 

20:32 - December 6, 2015

హైదరాబాద్ : సామాజ్య వాద శక్తులతో ఫాసిస్టు శక్తులు చేతులు కలుపుతున్నాయని ఈ ప్రయత్నాలను దళిత, మైనార్టీ సంఘాలు సమైక్యంగా ప్రతిఘటించాలని వక్తలు పిలుపునిచ్చారు. హిందూ మతోన్మాద వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరం అభినవ్ అధ్యక్షతన హిందూ మతోన్మాదం నశించాలి పేరిట గాంధీభవన్ లో బహిరంగ సభ జరిగింది. మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, పౌర హక్కుల సంఘం నేత వరవరరావు, వివిధ ప్రజా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. 

20:30 - December 6, 2015

మహబూబ్ నగర్ : అనుమానంతో కట్టుకున్న భార్యనే చంపేయాలని అనుకున్నాడో ప్రబుద్ధుడు. కిరోసిన్ పోసి నిప్పటించడంతో ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన మహబూబ్ నగర్ లోని వనపర్తిలో చోటు చేసుకుంది. రాజపేట తండాలో సుజాత, రవిలు ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కొద్ది రోజులుగా భార్యపై రవి అనుమానం పెంచుకున్నాడు. తరచూ భార్యతో గొడవకు దిగాడు. ఆదివారం వంట చేస్తున్న సుజాతపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటలకు తాళలేక సుజాత బయటకు పరుగెత్తింది. స్థానికులు మంటలను ఆర్పివేశారు. రవిని స్థానికులు చితకబాదారు. ప్రస్తుతం సుజాత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. 

చెన్నైలో పూర్తిస్థాయి విమాన సేవలు..

చెన్నై: వరద బీభత్సానికి కొన్ని రోజులుగా మూతపబడిన చెన్నై విమానాశ్రయంలో సోమవారం నుండి పూర్తిస్థాయిలో విమాన రాకపోకలు జరుగనున్నట్లు ఎయిర్ పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా పేర్కొంది. 

మంగళవారం చెన్నైలో పర్యటించనున్న రాహుల్..

చెన్నై : వరదల బీభత్సంతో అతలాకుతలమైన చెన్నై నగరంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. 

రెండు రోజుల పాటు మూతపడనున్న గుంటూరు మిర్చి యార్డు..

గుంటూరు : సోమ, మంగళవారాల్లో గుంటూరు మిర్చి యార్డు మూతపడనుంది. మార్కెటింగ్ శాఖలో ఇటీవల అమల్లోకి తెచ్చిన ఈ ట్రేడింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మిర్చి యార్డు కమిషన్ వ్యాపారులు ఆందోళన బాట పట్టారు. 

స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసీ కసరత్తు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ అధికారులను ఆదేశించారు. సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 

20:14 - December 6, 2015

హైదరాబాద్ : చెన్నై లో వరద బాధితులను ఆదుకొనేందుకు టాలీవుడ్ సినీ తారలు నడు బిగించారు. 'మన మద్రాసు కోసం' పేరిట చేపడుతున్న కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజల నుండి విరాళాలు సేకరించేందుకు నటులు స్వయంగా రంగంలోకి దిగారు. రానా, మంచు లక్ష్మి, నవదీప్, నితిన్ తదితర నటులు పాల్గొని విరాళాలు సేకరించారు. ఈసందర్భంగా నటులను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. వారితో కరచాలనం చేసేందుకు..ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. బియ్యం..ఉప్పు..చక్కెర..చింతపండు..చాపలు..బ్లాంకైట్స్..పప్పులు..పాల పౌడర్ తదితర సామాగ్రీని పంపించాలని నటులు కోరారు. రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన కేంద్రంలో తోచిన సాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. 

మధ్యప్రదేశ్ లో ఓ ఇంట్లో పేలుడు..

మధ్యప్రదేశ్ : ఓ ఇంట్లో పేలుడు సంభవించడంతో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. పాలి ఏరియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

19:21 - December 6, 2015

హైదరాబాద్ : తమిళనాడు వరద బాధితులను ఆదుకోవడానికి తెలుగు సిని తారలు ప్రారంభించిన 'మన మద్రాస్ కోసం' కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. రామానాయుడు స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన కేంద్రంలో అభిమానులు తమకు తోచిన సాయం అందించారు. ఈ సందర్భంగా ఆదివారం తెలుగు సినీ తారలు పలు షాపింగ్ మాల్స్ లో బృందాలుగా తిరిగి నిధులు సేకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లు అర్జున్, రానా, మంచు లక్ష్మీ, నవదీప్ తదితరులు పాల్గొని విశేషాలను వెల్లడించారు. ఒక క్యాండిల్ పంపించినా ఎంతో మేలు అని, సహాయపడాలని అల్లు అర్జున్ కోరారు. తాను పుట్టి పెరిగింది చెన్నైలోనేనని, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న రానా, నవదీప్, మంచు లక్ష్మిలను తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. తాము గురువారం నుండి విరాళాలు సేకరించడం ప్రారంభించినట్లు నవదీప్ పేర్కొన్నారు. గురువారం వెళ్లిన ఓ ట్రక్కు శుక్రవారం అక్కడకు చేరుకుందని, ఈ రోజు మరొక ట్రక్కు వెళుతోందని సోమవారం మరో ట్రక్కు వెళుతుందన్నారు. నలుగురికి పది రోజుల వరకు తినడానికి ఉపయోగపడే పలు కంపెనీలు కిట్స్ పంపించాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని, 30 మంది మూడు గంటల పాటు లోడ్ చేశారని తెలిపారు. దిల్ సుఖ్ నగర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు స్వచ్చందంగా ముందుకొచ్చి తాము చెన్నైకి వెళ్లి బాధితులకు సహాయం చేస్తామని పేర్కొన్నారని తెలిపారు. పుట్టి పెరిగింది అక్కడే అని, ఏం చేయకుండానే గమ్మున కూర్చొంటే అది కరెక్టు కాదని మంచు మనోజ్ పేర్కొన్నారు. 

26వ తేదీన ఏవోబీ బంద్ కు మావోయిస్టు పిలుపు...

విశాఖపట్టణం : ఈనెల 26వ తేదీన ఏవోబీ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చారు. ఏవోబీ జోనల్ కమిటీ కార్యదర్శి చంద్రమౌళి పేరుతో లేఖ విడుదలైంది. 

ఎస్వీకేలో మతోన్మాదానికి వ్యతిరేకంగా సదస్సు..

హైదరాబాద్ : బీజేపీ అభివృద్ధి నిరోధక చర్యలకు పాల్పడుతోందని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా సదస్సు జరుగుతోంది. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని, చాడ వెంకట్ రెడ్డి, పలువురు వామపక్ష నేతలు హాజరయ్యారు. ఉన్మాద చర్యలతో అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందని, దేశంలో సెక్యూలరిజాన్ని కాపాడేందుకు వామపక్షాలే కాకుండా అన్ని శక్తులు కృషి చేయాలని తమ్మినేని పిలుపునిచ్చారు. దేశంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. గాంధీ హంతకుడిని మహాత్ముడిని చేస్తున్నారని విమర్శించారు. 

18:53 - December 6, 2015

చిత్తూరు : తిరుమలలో కార్తీక వనభోజనలు ఘనంగా జరిగాయి. టిటిడి అన్నదాన విభాగం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.. టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావుతో పాటు.. భక్తులు, స్థానికులు, అధికారులు ఇందులో భోజనం చేశారు. అంతకుముందు మలయప్ప స్వామి వారు శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా పార్వేట మండపం చేరుకున్నారు. అక్కడ స్వామివారికి శాస్త్రోక్తంగా అర్చకులు తిరుమంజన సేవ చేశారు. 

18:52 - December 6, 2015

పశ్చిమగోదావరి : జిల్లా మొగల్తూరు మండలం కేపీ పాలెం బీచ్‌ పర్యాటకులతో సందడిగా మారింది. కార్తీక మాసం కావడంతో ఆలయాల్లో పూజలు చేసిన భక్తులు ఆ తర్వాత బీచ్‌కు చేరుకున్నారు. ఆదివారం కావడంతో చిన్నా పెద్దా అంతా కలిసి ఆడుతూ పాడుతూ సరదాగా గడిపారు.

18:50 - December 6, 2015

విజయవాడ : భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా విజయవాడ రైల్వే స్టేషన్‌లో మినరల్‌ వాటర్‌ వెండింగ్ మిషన్‌ను ఎంపి కేశినేని నాని ప్రారంభించారు. ప్రయాణికులకు మినరల్ వాటర్‌ అందించేందుకు 12 ప్లాట్‌ ఫారమ్‌లలో 79 వెండింగ్ మిషన్లను అందుబాటులో ఉంచామని నాని అన్నారు. అతి తక్కువ ధరకు అందించేందుకు కసరత్తు చేశామని ప్రయోగాత్మకంగా విజయవాడలోనే ప్రవేశపెట్టామని తెలిపారు. లీటర్ బాటిల్ కు రూ.20 ఉండేదని ప్రస్తుతం ఈ మిషన్ ద్వారా కేవలం రూ.8 రూపాయలు మంచినీటి బాటిల్ అందిస్తామని ఎంపీ నాని పేర్కొన్నారు. 

18:46 - December 6, 2015

కడప : అంబేద్కర్‌ ఏ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని రచించారో... ఆ అంశాల్ని అనుసరించడమే ఆయనకు అందించే నివాళన్నారు.. శాసనమండలి ప్రతిపక్ష నేత సీ రామచంద్రయ్య... కడప ఇందిరాభవన్‌లో అంబేద్కర్‌ వర్ధంతి జరిగింది.. ఈ కార్యక్రమానికి రామచంద్రయ్య హాజరయ్యారు.. ఇతర కాంగ్రెస్ నేతలతోకలిసి అంబేద్కర్‌కు నివాళులు అర్పించారు.. రాజ్యాంగలో ఏవి పొందుపరిచారో అవి తు.చ తప్పకుండా అమలు పాటిస్తారో అప్పుడే నిజమైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు. ఏ ఉద్ధేశ్యంతో రాజ్యాంగం లిఖించారో ఆ ఉద్ధేశ్యం నెరవేరలేదన్నారు. 

18:43 - December 6, 2015

కడప : రాష్ట్రంలో అనుభవంలేని... అసమర్థ ప్రతిపక్ష నేత ఉన్నారన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. వ్యక్తిగత అంశాలతో అసెంబ్లీని తప్పుదోవ పట్టించడమే జగన్‌కు అలవాటుగా మారిందన్నారు. అనుభవం లేని అసమర్థత ప్రతిపక్ష నేత ఉండడం దురదృష్టకరమన్నారు. లోటుపాట్లు ఉంటే ఎత్తిచూపుతూ, ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరకాట పెట్టడం..ప్రశ్నలు సంధిస్తారనే భయం అప్పట్లో అధికారపక్షానికి ఉండేదన్నారు. ప్రస్తుతం అలాంటిదేమి లేదని, సభను తప్పుదోవ పట్టించడానికి వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. జనచైతన్య యాత్రలో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరు రోటరీ క్లబ్ లో అధునాతన పరికారలను మంత్రి ప్రారంభించారు. కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామన్న గంట... గండికోటను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించినట్టు తెలిపారు. 

18:41 - December 6, 2015

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం.. స్పెషల్‌ స్టేటస్‌ సాధన సమితి ఢిల్లీలో నిర్వహించబోయే మహాధర్నాకు.. పలు పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది. ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో సైతం లేవనెత్తుతామని సిపిఐ మాజీ కార్యదర్శి రాజా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో అటు కాంగ్రెస్, ఇటు ఎన్డీయే నేతలు లెక్కలేనన్ని హామీలు ఇచ్చి స్టేట్‌ను విడదీశారు. నాడు ఇచ్చిన హామీల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఒకటి. ఎన్డీయే అధికారంలోకొచ్చాక ఈ హామీ గురించిన ఊసే ఎత్తడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ సందర్భాల్లో స్పెషల్ స్టేటస్‌ కోరుతూ ఆందోళన చేసిన ప్రత్యేక హోదా సాధన సమితి తన రూటు మార్చి ఢిల్లీకి చేరింది. హస్తినలోని జంతర్‌మంతర్‌ వద్ద భారీ సంఖ్యలో జనసమీకరణ చేసి మహాధర్నా నిర్వహించాలని డిసైడ్ చేసింది. డిసెంబర్ 7న జరిగే ఈ ధర్నాకు వామపక్ష పార్టీలు పూర్తి మద్దతు తెలిపాయి.

రౌండ్ టేబుల్ సమావేశం..
మహాధర్నాలో భాగంగా ముందస్తు వ్యూహ రచన కోసం ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి వివిధ ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని సిపిఐ నేత రాజా చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తానిచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు నిలదీయాలని సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. విభజన సమయంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్లే ఈ గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు.  వివిధ ప్రాంతాల నుంచి జనాన్ని సమీకరించడం, ఆందోళనను విజయవంతం చేయడం లాంటి పలు అంశాలను ఈ రౌండ్ టేబుల్‌ సమావేశంలో చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కేదాకా ఆందోళన విరమించబోమని నేతలు స్పష్టం చేశారు. 

12 స్థానాలను గెలుస్తాం - కేకే..

హైదరాబాద్ : త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలనూ గెలిచే సామర్థ్యం టీఆర్ఎస్ కు ఉందని ఆ పార్టీ నేత కేశవరావు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు గురించి చర్చించలేదని, మిగతా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని త్వరలోనే వారి పేర్లను ప్రకటిస్తారని కేకే పేర్కొన్నారు.

 

18:11 - December 6, 2015

గుంటూరు : రాజధాని అమరావతి భూ సమీకరణపై మరొక అంకానికి ఏపీ ప్రభుత్వం తెరలేపింది. అందులో భాగంగా లంక భూములకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పటికే రాజధాని కోసం 30వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించిన సంగతి తెలిసిందే. ఏడాదికి మూడు పంటలు పండే లంక భూములను సైతం తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. మొత్తం 1945 ఎకరాలకు భూ సమీకరణకు కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదివారం నోటిఫికేషన్ జారీ చేశారు. రాయపూడి - 1093 ఎకరాలు, మందడం - 362 ఎకరాలు, వెంకటపాలెం - 328 ఎకరాలు, ఉండవల్లి - 162 ఎకరాలకు భూ సమీకరణ నోటిఫికేషన్ విడుదలైంది. భూ సమీకరణకు సంబంధించి రైతులు 9.3 అంగీకార పత్రాలను అధికారులకు అందచేయాలని నోటిఫికేషన్ లో వెల్లడించారు. 

భారత్..పాక్ జాతీయ భద్రతా సలహాదారుల భేటీ..

బ్యాంకాక్ : థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భారత్, పాకిస్థాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు భేటీ అయ్యారు. శాంతిభద్రతలు, ఉగ్రవాదం, జమ్ము కాశ్మీర్ అంశాలపై చర్చించినట్టు సమాచారం. 

లంక భూముల సమీకరణకు నోటిఫికేషన్..

గుంటూరు : రాజధాని అమరావతి ప్రాంతంలో 1945 ఎకరాల లంక భూ సమీకరణకు కలెక్టర్ కాంతిలాల్ నోటిఫికేషన్ జారీ చేశారు. రాయపూడి - 1093 ఎకరాలు, మందడం - 362 ఎకరాలు, వెంకటపాలెం - 328 ఎకరాలు, ఉండవల్లి - 162 ఎకరాలకు భూ సమీకరణ నోటిఫికేషన్ విడుదలైంది. భూ సమీకరణకు సంబంధించి రైతులు 9.3 అంగీకార పత్రాలను అధికారులకు అందచేయాలని నోటిఫికేషన్ లో వెల్లడించారు. 

17:26 - December 6, 2015

వరంగల్ : ఈతకు వెళ్లిన నలుగురు మృత్యువాత పడిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఘన్ పూర్ మండలంలోని చెల్పూర్ లోని ఓ చెరువులో ఈత కొట్టేందుకు ప్రదీప్, రమేష్, రాజు, రమణలు ఆదివారం మధ్యాహ్నం వెళ్లారు. వీరంతా 10-12 సంవత్సరాల లోపు ఉంటారని తెలుస్తోంది. కానీ సాయంత్రం అయినా వీరు రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. చెరువు వద్ద చెప్పులు..దుస్తులు ఉండడంతో చెరువులోకి దిగి మృతి చెందారని భావించారు. వెంటనే వారి కోసం చెరువులో గాలింపులు చేపట్టారు. ప్రదీప్, రమణలు ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. 

చెల్పూరులో విషాదం..

వరంగల్ : ఘన్ పూర్ (మం) చెల్పూరులో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ప్రదీప్, రమణ, రమేష్, శేఖర్ లు గా గుర్తించారు. 

17:07 - December 6, 2015

హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిపేందుకు మరో ఇద్దరు అభ్యర్థులను టీఆర్‌ఎస్ ప్రకటించింది. తెలంగాణ భవన్ లో పార్టీ నేత కేకే మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బాలసాని లక్ష్మీనారాయణ.. నిజామాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ అభ్యర్థిగా భూపతిరెడ్డి బరిలో నిలుచుంటారని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తేరా చిన్నప్పరెడ్డి పేరును ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మరో కొద్దిరోజుల్లో మిగతా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తామని కేకే వెల్లడించారు. 

ముగిసిన నాలుగో రోజు ఆట..

ఢిల్లీ : భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో నాలుగో రోజు ముగిసింది. ఆట నిలిచిపోయే సమయానికి దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 72 పరుగులు మాత్రమే చేసింది. విజయానికి మరో 409 పరుగులు చేయాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్ లో 72 ఓవర్లు ఆడిన బ్యాట్స్ మెన్స్ 72 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో ఆమ్లా, డివిలియర్స్ ఉన్నారు. 207 బంతులను ఎదుర్కొన్న ఆమ్లా 23 పరుగులు..91 బంతులను ఎదుర్కొన్న డివిలియర్స్ కేవలం 11 పరుగులు చేశారు. 

ఎస్వీకేలో మతోన్మాదానికి వ్యతిరేకంగా సదస్సు....

హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా సదస్సు జరుగుతోంది. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని, చాడ వెంకట్ రెడ్డి, పలువురు వామపక్ష నేతలు హాజరయ్యారు. 

16:17 - December 6, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని టి.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆదివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులు...చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ధన..రాజకీయ బలాలతో ప్రతిపక్షానికి చెందిన జెడ్పీటీసీలు..ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యం అపహాస్యం చేసే విధంగా కేసీఆర్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మెజార్టీ లేని స్థానాల్లో ఏ రకంగా పోటీ చేస్తారని ప్రశ్నిస్తున్నట్లు, వివిధ వత్తిళ్లకు గురిచేసి అభ్యర్తిని గెలిపించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం అందించిన డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విలువలను ఆచరిస్తారని నమ్ముతున్నానని, లేనిపక్షంలో ప్రజాస్వామ్యవాదులంతా తగురీతిలో కేసీఆర్ కు బుద్ది చెబుతారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ లు, వార్డు మెంబర్ లుగా గెలిచిన వారికి అభినందనలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ ఇంకా బలోపేతంగా ఉందని చెప్పిన ఓటర్లకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళుతుందని, సామాజిక మార్పులకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని మల్లు తెలిపారు. 

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన..

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. 
ఖమ్మం : బాలసాని లక్ష్మీనారాయణ..నిజామాబాద్ : భూపతిరెడ్డి..నల్గొండ : తేరా చిన్నపురెడ్డి..కరీంనగర్ : భానూ ప్రసాద్...నారదాసు లక్ష్మణరావు,..మెదక్ : భూపాల్ రెడ్డి...ఆదిలాబాద్ : పురాణం సతీష్..

 

తిరుపతి - చెన్నై మధ్య మూడు రైళ్లు రద్దు..

చెన్నై : తిరుపతి - చెన్నై మధ్య మూడు రైళ్లు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తిరుపతి - చెన్నై గరుడాద్రి ఎక్స్ ప్రెస్...తిరుపతి - చెన్నై ఎక్స్ ప్రెస్...తిరుపతి - చెన్నై సప్తగిరి ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. 

తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన - భట్టి విక్రమార్క..

హైదరాబాద్ : రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేస్తామని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన వారికి అభినందనలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. దానంకు పార్టీ ఎన్నో పదవులు ఇచ్చిందని, అటువంటి పార్టీని దానం వీడుతారని అనుకోనని తెలిపారు. 

ఎరువుల తూకాల్లో మోసం చేస్తే కఠిన చర్యలు - ప్రత్తిపాటి..

గుంటూరు : ఎరువుల తూకాల్లో మోసాలకు పాల్పడే అన్ని కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని అవసరమైతే బ్లాక్ లిస్టులో పెడుతామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. 

15:53 - December 6, 2015

ఢిల్లీ : దేశంలో పెరుగుతున్న మతోన్మాద ఘటనలు..బాబ్రీ మసీదు కూల్చివేతకు వ్యతిరేకంగా ఆరు వామపక్ష పార్టీలు బ్లాక్ డే నిర్వహించాయి. మండీ హౌస్ నుండి జంతర్ మంతర్ వరకు ఆయా పార్టీల నేతలు ర్యాలీ నిర్వహించారు. దేశంలో మతోన్మాదం నశించాలని..సంఘ్ పరివార్ ఎజెండాను అమలు పరుస్తోందంటూ నినాదాలు చేశారు. బాబ్రీ కూల్చివేతను సౌర్య దివస్ అని, గాడ్చే చనిపోయిన రోజును బలిదాన్ దివస్ అంటూ నిర్వహించడం దేశంలో విధ్వేషాలకు తావివ్వడమేనని పార్టీలు స్పష్టం చేశాయి. బ్లాక్ డే ద్వారా హిందూ, ముస్లిం, క్రైస్తవులకు ఐక్యతా సందేశాన్ని ఇస్తున్నట్లు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. కేంద్ర మంత్రులు దేశ సమైక్యతకు భంగం వాటిల్లే విధంగా విధ్వేష పూరిత ప్రసంగాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేబినెట్ మంత్రులు, బీజేపీ ఎంపీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నా చర్యలు తీసుకుంటారా ? లేదా ? అనే దానిపై ఇంతవరకు ఒక్క హామీ లేదన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారిపై యాక్షన్ తీసుకుంటారా ? లేదా ?అని ఏచూరి ప్రశ్నించారు. 

15:35 - December 6, 2015

చిత్తూరు : తిరుమల, తిరుపతిని సేఫ్ సిటీగా ఉంచడానికే తాము తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అర్బన్ ఎస్పీ గోపినాథ్ జెట్టి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం అర్బన్ ఎస్పీ, డీఐజీ సత్యనారాయణల ఆధ్వర్యంలో పోలీసులు ఇంటింటి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గోపినాథ్ టెన్ టివితో మాట్లాడారు. అనేక దేశాలు..నగరాల్లో జరుగుతున్న సంఘటనలు దృష్టిలో ఉంచుకుని ఇంటిలిజెన్స్ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని తనిఖీలు నిర్వహించడం జరుగుతోందన్నారు. బయటి నుండి వచ్చిన వ్యక్తులు ఇక్కడ ఉంటున్నారని, ఎన్ని రోజుల నుండి ఇక్కడ ఉంటున్నారు ? ఏం చేస్తున్నారు ? తదితర వివరాలను పోలీసు శాఖ వద్ద ఉండాలని భావించినట్లు తెలిపారు. గత నాలుగు రోజుల నుండి చెక్ పోస్టులు, డాగ్ స్వ్కాడ్..సిబ్బందితో దేవాలయాలు, ఆర్టీసీ, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు.
జీవకోన, సత్యనారాయణపురం, సుభాష్ నగర్, ఓటేరి ప్రాంతాల్లో ఇంటింటి సోదాలు నిర్వహించారు. అద్దెకు వచ్చే వారి వివరాలు తెలసుకుని యజమానులు ఇళ్లను అద్దెకివ్వాలని డీఐజీ సత్యనారాయణ సూచించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు, 20 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 

15:31 - December 6, 2015

హైదరాబాద్ : నగరంలోని ఉప్పల్ ట్రాఫిక్ జాంలతో హోరెత్తుతోంది. నిమిషానికి వందల వాహనాలు తిరిగిఏ ఈ రోడ్డు వాహనదారులకు చుక్కల చూపిస్తోంది. ఉప్పల్ లో రోడ్డు విస్తరణ చేస్తామని గతంలో నేతలు హామీలు గుప్పించినా అతి ఇంతవరకు నెరవేరలేదు. ఇప్పటి వరకు ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగలేదని విమర్శలు వస్తున్నాయి. ఇష్టారాజ్యంగా పార్కింగ్ లు చేస్తుండడంతో సమస్య మరింత తీవ్రతరమౌతోంది. రోడ్లపై పార్కింగ్ చేపట్టకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. త్వరగా రోడ్డు విస్తరణ చేపట్టాలని కోరుతున్నారు.

 

15:30 - December 6, 2015

శ్రీకాకుళం : నామినేటెడ్ పోస్టుల భర్తీ నిరంతర ప్రక్రియ అని ఏపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావ్ పేర్కొన్నారు. ఆయన జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా టెన్ టివితో మాట్లాడారు. త్వరలో మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తామన్నారు. బీజేపీతో సమన్వయం లోపం లేదని, ఏవైనా విబేధాలు వస్తే పరిష్కరించుకుందామని నిర్ణయించినట్లు తెలిపారు. పార్టీలోకి రావాలని అనుకున్న వారి విషయంలో ఆలోచిస్తున్నామని తెలిపారు. జగన్ కు విచక్షణ లేదని, కాంగ్రెస్ కు రాష్ట్రంలో ఉనికి లేదన్నారు. విపక్షాల పని విమర్శించడమేనని పేర్కొన్నారు. జనచైతన్య యాత్రలపై చేస్తున్న విమర్శలకు పట్టించుకోవాల్సినవసరం లేదన్నారు. పార్టీ కార్యకర్తలకు ఒక మంచి అవకాశమని, ప్రజలతో మమేకం కావాలని ప్రజల్లోకి వెళ్లేందుకు జనచైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 

పరాజయం చెందిన కిదాంబి శ్రీకాంత్..

ఢిల్లీ : ఇండోనేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటెన్ టోర్నీలో కిదాంబి శ్రీకాంత్ పరాజయం చెందాడు. హోరాహోరీగా జరిగిన పోరులో మలేషియా షట్ర్ సుగర్తో చేతిలో 21-17, 13-21, 22-24 తేడాతో శ్రీకాంత్ ఓడిపోయాడు. 

మురళీ విజయ్ కు ఐసీసీ జరిమాన..

ఢిల్లీ : భారత ఓపెనర్ మురళీ విజయ్ కు ఐసీసీ జరిమాన విధించింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో మురళీ అంపైర్ ధర్మసేనకు సంజ్ఞలు చేయడం ద్వారా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఐసీసీ తేల్చింది. శనివారం భారత్ రెండో ఇన్నింగ్స్ లో మోర్నీ మోర్కెల్ విసిరిన బౌన్సర్ బంతిని ఆడేందుకు మురళీ ప్రయత్నించాడు. బంతి ఆర్మ్ గార్డ్ను తాకుతూ సఫారీ కీపర్ చేతుల్లో పడింది. వెంటనే ఫీల్డర్లు అప్పీల్ చేశారు. అంపైర్ ధర్మసేన ఔట్ గా ప్రకటిస్తూ వేలు చూపించాడు. ఈ నిర్ణయంపై మురళీ విజయ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ బంతి ఆర్మ్ గార్డ్ ను తాకిందంటూ అంపైర్ కు సంజ్ఞలు చేశాడు.

పాతబస్తీలో డీజేఎస్ కార్యకర్తల అరెస్టు..

హైదరాబాద్ : దారు షిఫా ప్రాంతంలో డీజేఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా మసీదు బయటకొచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించారు. అప్పటికే బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని డబీర్ పురా పీఎస్ కు తరలించారు. 

14:54 - December 6, 2015

హైదరాబాద్ : అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో బహుజన 2 కే రన్‌ను నిర్వహించారు. తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. అంబేద్కర్‌ ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లడమే ముఖ్య ఉద్దేశమని పిడమర్తి రవి అన్నారు.

అనంతలో...
అనంతపురం జిల్లా మడక శిర పట్టణంలో అంబేధ్కర్ విగ్రహానికి ఏపీ పీసీసీ ఛీఫ్ రఘువీరారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీకి కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు లేదన్నారు. ప్రజాసమస్యలను తేల్చకుండా జనచైతన్యయాత్రల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు రఘువీరా. సీపీఐ తలపెట్టబోయే రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పాల్గొంటారని రఘువీరా తెలిపారు. 

14:49 - December 6, 2015

విశాఖపట్టణం : వరదలతో అష్టకష్టాలు పడుతున్న చెన్నైవాసులను ఆదుకునేందుకు విశాఖ పీపుల్స్‌ ఫ్రంట్‌ నడుం బిగించింది. బీచ్‌రోడ్డులో విరాళాల సేకరణ చేపట్టింది. మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన వారందరి నుంచి విరాళాలు సేకరించారు. బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఫ్రంట్‌ కన్వీనర్‌.. ఏయూ మాజీ వీసీ రమణ అన్నారు. 

14:47 - December 6, 2015

శ్రీకాకుళం : రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయిందని వారు చేస్తున్న విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఏపీ టీడీపీ పార్టీ అధ్యక్షులు కళావెంకటరావు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా జన చైతన్యకార్యక్రమాలకు మంచి స్పందన వస్తోందని తెలిపారు. 7న వజ్రపుకొత్తూరు, విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాలలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారని తెలిపారు.

14:46 - December 6, 2015

హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా విజయవాడలోనే పాలన చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే హైదరాబాద్ కు వచ్చారు. వచ్చిన అనంతరం పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు దిశా నిర్ధేశం చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి గ్రేటర్‌ టీడీపీ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్‌, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రకాష్‌గౌడ్‌, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా గ్రేటర్‌ ఎన్నికలు, సాయన్న రాజీనామా అంశంపై చర్చించారు. నేతలను కొనుగోలు చేసే పార్టీలు ప్రజల్లో చులకన అవుతాయని.. వీటిని పట్టించుకోకుండా గ్రేటర్‌ ఎన్నికల్లో విజయం దిశగా కృషి చేయాలని తమ్ముళ్లకు చంద్రబాబు సూచించారు. ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని.. మిత్రపక్షం బీజేపీతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. డివిజన్ ల వారీగా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియచేయాలని బాబు సూచించారు. బుధవారం సివిల్ సప్లయ్ కార్యాలయం ఎదుట ధర్నా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. 

జగదీశ్ టైట్లర్ పై దాడి..

ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత జగదీశ్ టైట్లర్ పై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. మెహ్రౌలీ ప్రాంతంలో ఓ ఫార్మ్ హౌస్ లో వివాహ వేడుకకు హాజరైన టైట్లర్ పై ఉమంగ్ భాటియా అనే వ్యక్తి దాడి చేశాడు. వెంటనే పోలీసులు భాటియాను అదుపులోకి తీసుకున్నారు. 

హయత్ నగర్ లో ట్రాఫిక్ పోలీసుల ఓవర్ యాక్షన్...

హైదరాబాద్ : హయత్ నగర్ లో ట్రాఫిక్ పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. మొక్కజొన్న బండి తొలగించాలంటూ తోపుడు బండి యజమానిని ట్రాఫిక్ పోలీసులు తోసేశారు. వేడి నీటిలో తోపుడి బండి యజమాని సంజయ్ పడడంతో గాయాలయ్యాయి. వెంటనే సంజయ్ ను ఆసుపత్రికి తరలించారు. 

త్వరలో మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీ - కళా వెంకట్రావ్...

శ్రీకాకుళం :త్వరలో మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తామని ఏపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావ్ వెల్లడించారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. బీజేపీతో సమన్వయం లోపం లేదని, పార్టీలోకి రావాలని అనుకున్న వారి విషయంలో ఆలోచిస్తున్నామని తెలిపారు. జగన్ కు విచక్షణ లేదని, కాంగ్రెస్ కు రాష్ట్రంలో ఉనికి లేదన్నారు. విపక్షాల పని విమర్శించడమేనని పేర్కొన్నారు. 

ఏపీ విభజనపై గత నిర్ణయానికి కట్టుబడి - ఏచూరి..

ఢిల్లీ : ఏపీ విభజనపై గత నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. విభజన వల్ల సమస్యలు వస్తాయని చెప్పినా పట్టించుకోలేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్ర విభజన చేశారని తెలిపారు. రాష్ట్ర అంశాలపై ఇప్పటి వరకూ కేంద్రం తన బాధ్యత నిర్వర్తించడం లేదని విమర్శించారు. ఏపీకి ఇచ్చిన హామీలు అమయ్యేలా కనిపించడం లేదని, విద్యా సంస్థలు, విద్యుత్, ఆర్థిక లోటు విషయంలో కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తోందన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలపై పార్లమెంట్ లో లేవనెత్తుతామని, ప్రజా ఉద్యమాలు బలపడితేనే రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకోగలుగుతామని స్పష్టం చేశారు. 

మిర్యాలగూడ అగ్రిగోల్డ్ కాలనీలో చోరీ..

నల్గొండ : మిర్యాలగూడ అగ్రిగోల్డ్ కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. 16.5 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.6వేల నగదు, ల్యాప్ టాప్ అపహరించారు. 

శ్రీకాకుళంలో రేపు సీఎం బాబు పర్యటన..

శ్రీకాకుళం : ఏపీ సీఎం చంద్రబాబు రేపు జిల్లాలో పర్యటించనున్నారు. వజ్రపుకొత్తూరులో జనచైతన్య యాత్రలో సీఎం పాల్గొననున్నారు. ఏర్పాట్లను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు.

 

తల్లిపై కొడుకు అత్యాచారయత్నం...

చిత్తూరు : మదనపల్లె (మం) విజయనగరం కాలనీలో తలిపై కొడుకు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. తల్లి రాజమ్మకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కొడుకు వెంకటాచలాన్ని (30) పోలీసులు అరెస్టు చేశారు. 

తిరుమలలో పోలీసుల విస్తృత తనిఖీలు..

తిరుపతి : పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. డీఐజీ, అర్బన్ ఎస్పీ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగాయి. జీవకోన, సత్యనారాయణపురం, సుభాష్ నగర్, ఓటేరి ప్రాంతాల్లో ఇంటింటి సోదాలు నిర్వహించారు. అద్దెకు వచ్చే వారి వివరాలు తెలసుకుని యజమానులు ఇళ్లను అద్దెకివ్వాలని డీఐజీ సత్యనారాయణ సూచించారు. కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికల మేరకు తిరుమల, తిరుపతిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతోందని, అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. 20 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 

14:14 - December 6, 2015

ఢిల్లీ : ఏపీకి తమ మద్దతు ఉంటుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. రాష్ట్రంలోని సమస్యలను క్షుణ్ణంగా చర్చించిన తర్వాతే బిల్లు పెట్టాలని ఆయన అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి ఢిల్లీలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి నివేదిక ఇవ్వాలని సూచించారు. ప్రజా ఉద్యమాలు బలపడితేనే రాష్ట్రానికి కావలసిన హక్కులు సాధించుకోగలమని, పార్లమెంట్‌లోతమ పార్టీ మద్దతు ఉంటుందని ఏచూరి స్పష్టం చేశారు. విద్యుత్ , విద్య నీటిపంపకాలు సరిగా అమలుకునోచుకోవడం లేదని చెప్పారు. ఎపి రాష్ట్ర విభజనపై గత నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. అనంతరం సీపీఐ జాతీయ నేత డి.రాజా మాట్లాడుతూ ఏపీ సమస్యలు పార్లమెంటుకు తెలుసు.. అయినా నోరు విప్పడం లేదని విమర్శించారు.

 

14:14 - December 6, 2015

మంచి చెడ్డలు ఎంచి చూడగ మనుజులందున రెండెకులములు. మంచి అన్నది మాలయైతే..ఆ మాల నేనగుదున్... అంటూ సగర్వంగా ఆనాడే ప్రకటించి కులం పునాదులు కదిలించిన ధిక్కారస్వర కవితా తరంగం గురజాడ. అందుకే వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో ముగ్గురే మహాకవులని ..వారిలో తెలుగుకు కావ్య గౌరవం కల్పించిన తిక్కన, అచ్చ తెనుగులో ఆటవెలది పద్యాలకు ప్రాణం పోసిన వేమన, తెలుగు జీవద్భాషకు పట్టంగట్టిన గురజాడ..ఈ ముగ్గురే మహాకవులని ..మహాకవి శ్రీశ్రీ ప్రకటించారు. అంతటి ఘనతను సాధించిన 20వ శతాబ్దపు మహాకవి గురజాడ నూరవ వర్థంతి వేడుకలను తెలుగు ప్రజలు ఎంతో ప్రేమతో, అభిమానంతో జరుపుకున్నారు. ఆ విశేషాల్లేంటో వీడియోలో చూడండి...

14:13 - December 6, 2015

ఆధునికి తెలుగు సాహిత్యాన్ని ఒక మలుపుతిప్పి దిశానిర్దేశం చేసిన మహాకవి గురజాడ అప్పారావ్. అంత వరకు వచ్చిన ఇతిహాస కావ్య ప్రబంధ సాహిత్యాలను పక్కనపెట్టి ఆధునికి భాషకు, ప్రజా సాహిత్యానికి పట్టం గట్టిన మహా రచయిత గురజాడ. ఒకవైపు దేశభక్తిని, మరోవైపు వ్యవహారికి భాషోద్యమాన్ని, ఇంకోవైపు సంఘసంస్కరణ రచనలను ఏకకాలంలో సమాజంపై విసరేసి పెనుదుమారం సృష్టించిన సృజనచైతన్య ఝంఝామారుతమతడు. అధునాతన ఆలోచనల ప్రగతిశీల భావాల క్రాంతదర్శి అతడు. ఆ మహాకవి సంఘ సంస్కర్త, వ్యవహారిక భాషోద్యమ కృషీవలుడు గురజాడ అప్పారావ్ శతవర్ధంతి వేడుకల సందర్భంగా ప్రత్యేక కథనం..

 

బాబును కలిసిన మాగంటి..ప్రకాష్ గౌడ్..

హైదరాబాద్ : టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాగంటి గోపినాథ్ లు కలిశారు. గ్రేటర్ లో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. ఇతర నేతలను టీఆర్ఎస్ కొనుగోలు చేసే కొద్దీ ప్రజల్లో వారే చులకనవుతారని బాబు వ్యాఖ్యానించారు. నేతలు ఖాళీ అయిన చోట యువనాయకత్వాన్ని బలోపేతం చేయాలని బాబు ఆదేశాలు జారీ చేశారు. మేయర్ పీఠం కైవసం చేసుకునే దిశగా కృషి చేయాలని సూచించారు. 

14:00 - December 6, 2015

పశ్చిమగోదావరి : జిల్లాలో వైసిపి కార్యకర్తలు రెచ్చిపోయారు. సీపీఎం కార్యకర్తలపై వైసిపి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పదిమంది సీపీఎం కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. శ్రమదానంలో భాగంగా యలమంచిలి మండలం చించినాడలో సీపీఎం ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన కార్యకర్తులు రోడ్డుపై ఉన్న గుంతలు పూడ్చుతున్నారు. ఈక్రమంలో వారిపై దాదాపు 60 మంది వైసిపి కార్యకర్తలు కర్రలు, కత్తులతో అమానుషంగా దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది సీపీఎం కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు.
సీపీఎం నేత... బాలరాజు
వైసిపి కార్యకర్తలు అమానుషంగా దాడి చేశారు. కర్రలు, ఇనుప రాడులు, కత్తులతో దాడి చేశారు. వారి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటినా దళితులకు రక్షణ లేదు. అగ్ర వర్ణాల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి.

 

భార్యను హత మార్చిన భర్త

రంగారెడ్డి : జిల్లాలో దారుణం జరిగింది. భార్యను భర్త కొట్టి చంపాడు. ఈ విషాద సంఘటన దోమలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలే హత్యకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు.

13:37 - December 6, 2015

నల్లగొండ : జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో కారు జోరుకు కాస్తా బ్రేక్‌ పడింది. గత సర్పంచులు చనిపోవడం, కోర్టు కేసులు తదితర కారణాలతో ఖాళీగా ఉన్న తొమ్మిది పంచాయతీలకు శనివారం ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 9 పంచాయతీల్లో ఐదు చోట్ల టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్ధులు గెలుపొందగా.. నాలుగుచోట్ల విపక్ష అభ్యర్ధులు విజయం సాధించారు.
ప్రజాఫ్రంట్‌ అభ్యర్ధి 443 ఓట్ల మెజారిటీతో గెలుపు
ఈ ఎన్నికల్లో అధికారం, డబ్బు హవా పెద్దగా పని చేయలేదు. నకిరేకల్‌ మేజర్‌ గ్రామపంచాయతీలో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిపై ప్రజాఫ్రంట్‌ అభ్యర్ధి పనాల రంగమ్మ 443 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికలను మంత్రి జగదీష్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేసినా.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఉన్నా ప్రజాఫ్రంట్‌ అభ్యర్ధులు గెలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
నకిరేకల్‌, కడపర్తి, చందంపల్లిలో ప్రజాఫ్రంట్‌
ఇక చందుపట్ల, నోముల, మానాయికుండ, నెల్లిబండ, తాటికల్‌ పంచాయతీల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందగా.. నకిరేకల్‌, కడపర్తి, చందంపల్లిలో ప్రజాఫ్రంట్‌ అభ్యర్ధులు విజయం సాధించారు. ఆలేరు మండలం అమ్మనబోలులో టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయింది. కాంగ్రెస్‌ అభ్యర్ధి 178 ఓట్లతో గెలుపొందారు.
అసెంబ్లీ ఎన్నికలను తలపించిన నకిరేకల్‌ ఎన్నికలు
ఇక నకిరేకల్‌ పంచాయతీ ఎన్నికలు శాసనసభ ఎన్నికలను తలపించాయి. టీఆర్‌ఎస్‌ కీలక నేతల ప్రచారం నేపథ్యంలో ఇక్కడ టీఆర్‌ఎస్‌దే విజయం అన్న భావన కలిగింది. కానీ.. ఫలితాలు మాత్రం ఆ పార్టీకి షాక్‌నిచ్చాయి. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం,.. విపక్ష అభ్యర్ధుల కుటుంబసభ్యులపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌ చేయడం లాంటి అంశాలు స్థానికుల్లో ఆలోచనను రేకెత్తించాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికార పార్టీకి మింగుడుపడని వైనం
మరోవైపు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోని 9 పంచాయతీల్లో టీఆర్‌ఎస్‌ ఐదు స్థానాలకే పరిమితం కావడం ఆ పార్టీకి మింగుడుపడడం లేదు. విపక్షాలన్నీ ఏకమై ప్రజాఫ్రంట్‌గా ఏర్పడటాన్ని ప్రజలు స్వాగతించారని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. ప్రభుత్వం, స్థానిక నేతలపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోవడంలో ప్రజాఫ్రంట్‌ నేతలు సక్సెస్‌ సాధించారనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. నకిరేకల్‌ పంచాయతీని దక్కించుకునేందుకు అధికార పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ వమ్ము అయ్యాయని.. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు అహంకారాన్ని తగ్గించుకోవాలని పలువురు సూచిస్తున్నారు. లేకుంటే భవిష్యత్‌లోనూ ఇలాంటి ఫలితాలే పునరావృతమవుతాయంటున్నారు.

 

13:27 - December 6, 2015

తమిళనాడు : చెన్నై వరద బాధితులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వ్యాపారులు నిత్యావసరాల ధరలను ఒక్కసారిగా పెంచడంతో ఏం కొనలేక పేదలు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆ వివరాలు వారిమటల్లోనే....'20, 30 ఏళ్ల నుంచి ఇంత పెద్ద వర్షాలు ఎప్పుడూ రాలేదు. మంచినీరు లేదు. పిల్లలకు పాలు లేవు. కరెంట్ లేదు. నాలుగు దినాలుగా కరెంట్ లేదు. బియ్యం, బట్టలు నీటిలో కొట్టుకుపోయాయి. ఇళ్లలన్ని కొట్టుకుపోయాయి. మురికి నీరులో అవస్థలు పడుతున్నాము. ఎలాంటి ప్రభుత్వ సహాయం అందండం లేదు' అని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:18 - December 6, 2015

హైదరాబాద్ : అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పలువురు నేతలు అంబేద్కర్‌కు నివాళులర్పించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి టీ-పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క, మాజీమంత్రి లక్ష్మయ్య నివాళులర్పించారు. ఇక గాంధీభవన్‌లో కూడా పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సహా పలువురు నేతలు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇందిరాభవన్‌లో
ఇక అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ఇందిరాభవన్‌లోనూ ఏపీ కాంగ్రెస్‌ నేతలు నివాళులర్పించారు. అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలల వేసి పలువురు నేతలు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
వైసీపీ కార్యాలయంలో
అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా లోటస్‌పాండ్‌లోని వైసీపీ కేంద్రం కార్యాలయంలో పలువురు నేతలు నివాళులర్పించారు. అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి జగన్‌ నివాళులర్పించారు.

 

 

సీపీఎం-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

పశ్చిమగోదావరి : యలమంచిలి మండలం చించినాడలో సీపీఎం, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చేటుచేసుకుంది. ఈ ఘటనలో 10 మంది సీపీఎం కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని పాలకొల్లు ఆస్పత్రికి తరలించారు. 

12:29 - December 6, 2015

హైదరాబాద్ : తెలంగాణలో కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తగ్గిన వర్షపాతంతో రాష్ట్రంలో భూగర్భ జలాల నీటి మట్టాలు ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయి. గ్రౌండ్ వాటర్ లెవల్స్ పడిపోతే వచ్చే ప్రమాదమేంటి? భూగర్భ జలాల స్థాయి పాతాళానికి దిగజారితే ఏం జరుగుతుంది. వాచ్ దిస్ స్టోరీ.
ప్రాణ కోటికి జీవనాధారం నీరు
ప్రాణ కోటికి జీవనాధారం నీరు. నిత్య జీవితంలో ప్రతీ అంశమూ నీటితోనే ముడిపడి ఉంటుంది. అటువంటి నీరు వర్షం ద్వారా మనకు లభిస్తుంది. వర్షాకాలంలో సమకూరే నీరే... ఆ తరువాత కాలాల్లో ప్రజల అవసరాలు తీర్చేది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. ఈ విషయాన్ని తెలంగాణ వ్యవసాయశాఖ అధికారికంగా ప్రకటించింది. గత సంవత్సరం జూలైతో పోలిస్తే ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో తప్ప తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భూగర్భ జలాలు ఒకటి నుండి 4 మీటర్ల మేర పాతాళానికి దిగజారాయి. ఇప్పటికే మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ లాంటి జిల్లాల్లో 4 వందల నుండి 6 వందల అడుగుల వరకు బోరుబావులు తవ్వినా జలంజాడ కనపడటం లేదు. తాజాగా తగ్గిన నీటిమట్టం ప్రకారం వేలాది బోరుబావులు ప్రమాదం అంచుకు చేరాయి. వ్యవసాయానికేగాక వేలాది గ్రామాలకు తాగునీటికి బోరు బావులే దిక్కు.
పాతాళానికి దిగజారిన భూగర్భ జలాలు
గత సంవత్సరంతో పోలిస్తే రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో 7 మీటర్లు, రంగారెడ్డి జిల్లాలో 6 మీటర్లు, మెదక్ జిల్లాలో 7 మీటర్లు, నిజామాబాద్ లో 9 మీటర్లు, కరీంనగర్ జిల్లాలో 5 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పాతాళానికి దిగజారింది. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం గత సంవత్సరంతో పోలిస్తే పెద్దగా మార్పులేదు. అయితే ఈ గణాంకాలు జిల్లాను సగటుగా తీసుకుని విడుదల చేశారు అధికారులు. ఏజెన్సీ ప్రాంతాల్లో మినహా మైదాన ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగానూ వర్షాలు సరిగ్గా కురవలేదు. వరంగల్ జిల్లా జనగామ ప్రాంతంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. జనగామ ప్రాంతంలోని చేర్యాల మండలంలో ఇరవై మీటర్ల కంటే కిందకు నీటి మట్టాలు దిగజారాయని నివేదికలో పేర్కొంది భూగర్భ జల వనరుల శాఖ. మొత్తంగా చూస్తే శాంపుల్స్ సేకరించిన దాదాపు 70 కేంద్రాల్లో 25 మీటర్ల కంటే దిగువకు చేరింది పాతాళ గంగ. మెదక్ జిల్లాలో ఐతే సగానికంటే పైగా, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో 30 శాతానికి పైగా కేంద్రాల్లో పరిస్థితి దారుణంగా ఉందని నివేదికలో పేర్కొంది.
రాష్ట్ర వ్యాప్తంగా 10 శాతానికి తక్కువగా వర్షపాతం
రాష్ట్ర వ్యాప్తంగా సగటు కంటే 10 శాతం తక్కువగా వర్షపాతం నమోదయింది. ఇదే పరిస్థితి కొనసాగితే సాగునీరేమో కానీ తాగునీటికే ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. ప్రభుత్వం వెంటనే ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయకపోతే రాబోమే వేసవి కాలం నుండి పెను సవాళ్లను ఎదుర్కోక తప్పదు.

 

12:20 - December 6, 2015

చెన్నై : కనీవిని ఎరుగని వరదలతో అతలాకుతలమైన చెన్నై మహానగరం కోలుకోడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉంది. వరదలు సృష్టించిన విలయం అన్ని రంగాలకు భారీ నష్టాన్ని మిగిల్చింది. మహానగరం ముంపు నుంచి తేరుకుంటే చాలు... బీమా కంపెనీలకు కుప్పలు తెప్పలుగా పరిహారం క్లెయిములు వెల్లువెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మహా విలయాన్ని సృష్టించిన వరదలు
చెన్నై వరదలు మహా విలయాన్ని సృష్టించాయి. అనూహ్య వరదలకు చిన్న వ్యాపారుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరూ నష్టపోయారు. చాలా మంది బీమా చేసినా.... పూర్తి స్థాయిలో పరిహారం వస్తుందన్న ధీమా మాత్రం వారిలో కనిపించడంలేదు. జరిగిన అపార నష్టానికి కొంతలో కొంతైనా బీమా సొమ్ము వస్తే చాలనుకుంటున్నారు.
వెయ్యి కోట్ల రూపాయల క్లెయిములు అందే అవకాశం
వరదలు తగ్గిన తర్వాత నష్టంపై స్పష్టత వస్తుంది. బీమా సంస్థలకు భారీగా పరిహారం క్లెయిములు అందే అవకాశం ఉంది. తాజా అంచనాల ప్రకారం బీమా సంస్థలకు ముందుగా వెయ్యి కోట్ల రూపాయల క్లెయిములు అందే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. షాపులు, మోటారు వాహనాల యజమానులు, ఇతరితర వ్యాపారుల నుంచి జనరల్‌ ఇన్సూరెన్స్ కొర్పొరేషన్‌కు 500 కోట్ల రూపాయల మేర పరిహారం దరఖాస్తులు అందే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. అన్ని బీమా సంస్థల నుంచి జీఐసీ సమాచారం సేకరిస్తోంది. న్యూ ఇండియా ఎష్యూరెన్స్‌ కంపెనీ నుంచి జీఐసీకి ఇప్పటి వరకు 35 కోట్ల రూపాయల పరిహారం క్లెయిములు అందాయి. వదర తగ్గిన తర్వాత ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. క్లెయిములు అందిన వెంటనే పరిష్కరించేందుకు వీలుగా బీమా సంస్థలు సొమ్ము సిద్ధం చేసుకుంటున్నాయి.
ఎక్కువగా అగ్ని ప్రమాదాల పరిహారం క్లెయిములు
బీమా కంపెనీలకు ఎక్కువగా అగ్ని ప్రమాదాల పరిహారం క్లెయిములు అందుతాయి. ఈసారి ఇది వరదలకు మారింది. వస్తు నిల్వలు, యంత్రాలకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో భారీగానే బీమా క్లెయిముందు అందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2012 జూన్‌లో సంభవించిన ఉత్తరాఖండ్‌, 2014లో వచ్చని జమ్ము-కశ్మీర్‌ వరదలకు బీమా సంస్థలకు 1500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. 2005 జులై 26న ముంబైని ముంచెత్తిన వరదలకు బీమా నష్టం 3 వేల కోట్ల రూపాయలు. 2014 అక్టోబర్‌లో ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాలను కుదిపేసిన హుద్‌ హుద్‌ తుపానుకు బీమా కంపెనీలు 4 వేల కోట్ల రూపాయల పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో ప్రకృతి వైపరీత్యాలకు బీమా కంపెనీలు ఎక్కువగా నష్టపోతున్నాయి.
వరదలకు భారీగా ఆర్ధికనష్టం
చెన్నై వరదలకు ఆర్ధికనష్టం భారీగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఐదు రోజుల క్రితం అసోచామ్‌ అంచనా ప్రకారం వదర నష్టం 15 వేల కోట్లని నివేదించారు. వదర నష్టంపై గత నెల 28 న తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది. నష్టం 8,481 కోట్ల రూపాయలుగా నివేదించారు. ఆతర్వాత మళ్లీ వర్షాలు, వరదలు రావడంతో చెన్నైకి కోలుకోలేని నష్టం జరిగింది. దీంతో నష్టం భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. పరిహారం చెల్లింపుపై బీమా కంపెనీలు కూడా తమ అంచనాలను సవరించుకోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు.

 

 

12:13 - December 6, 2015

తమిళనాడు : చెన్నైలో వరదలతో ఆటోమొబైల్‌ పరిశ్రమలు కుదేలయ్యాయి. ఒకటి కాదు... రెండు కాదు.. దాదాపు 20 వరకు ఆటో మొబైల్‌ యూనిట్లు ఈ మహానగరంలో ఉన్నాయి. భారీ వర్షాలు, వరదలకు ఈ పరిశ్రమల్లోకి నీరు చేరింది. దీంతో ఉత్పత్తి నిలిచిపోయి, భారీ నష్టం వాటిల్లింది.
చెన్నై... డెట్రాయిట్‌ ఆఫ్‌ ఇండియా
చెన్నై... డెట్రాయిట్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుపొందిన నగరం. అమెరికాలో కార్ల తయారీకి డెట్రాయిట్‌ కేంద్రమైతే, మన దేశంలో చెన్నై కూడా అలాంటిదే. అటువంటి ఆటోమొబైల్‌ పరిశ్రమ వరదలకు కుదేలయ్యింది. భారీ వర్షాలు, వరదలకు నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఈ పరిశ్రమలు మూతపడటంతో వందల కోట్లలో నష్టం వాటిల్లింది.
చెన్నైలో ఇరవై ఆటోమొబైల్‌ యూనిట్లు
చెన్నైలో ఇరవై వరకు ఆటోమొబైల్‌ యూనిట్లు ఉన్నాయి. కొన్ని కార్ల తయారీ పరిశ్రమలైతే, మరికొన్ని అసెంబ్లింగ్‌ యూనిట్లు ఉన్నాయి. ఆర్‌ అండ్‌ డీ, సేల్స్‌ విభాగాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. హిందూజాల అశోక్‌ లేలాండ్‌ యూనిట్‌, దక్షిణ కొరియా హూందయ్‌, మారుతీ, టీవీఎస్‌ మోటార్స్‌, బీఎండబ్ల్యూ, రేనాల్ట్ - నిస్సాన్‌, ఫోర్డ్ మోటార్స్, దైమ్లర్‌ ట్రక్స్... ఇలా చాలా ఆటో మొబైల్‌ పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. అపోలో టైర్ తయారీ పరిశ్రమ కూడా చెన్నైలోనే ఉంది. వరదలతో వీటన్నింటికి కోలుకోలేని నష్టం జరిగింది.
ఇంజిన్లు, కార్లు తయారు చేస్తున్న ఫోర్డ్ మోటార్స్
ఫోర్డ్ మోటార్స్ భారీగా ఇంజిన్లు, కార్లు తయారు చేస్తుంది. ఏటా 3.40 లక్షల ఇంజిన్లు, రెండు లక్షల కార్లు ఫోర్డ్ ఉత్పత్తి చేస్తుంది. అటువంటి సంస్థలో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. వరద నీరు తగ్గిన తర్వాత ఉత్పత్తిని పునరుద్ధించడానికి నెల రోజులకుపైగా పట్టే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. రేనాల్ట్‌-నిస్సాన్‌, యమహా, ఫోర్డ్ కంపెనీల్లో ఒక్క రోజు ఉత్పత్తి నిలిచిపోతే 150-180 కోట్ల రూపాయల నష్టం వస్తుందని అంచనా వేశారు. డీలర్లకు మరి కొన్ని వందల కోట్ల నష్టం వాటిల్లింది. ఫోర్డ్‌ కంపెనీలో 1200 కార్ల ఉత్పత్తికి బ్రేక్‌ పడింది. ఆర్గండంలో ఉన్న రేనార్ట్‌-నిస్సాన్‌ ప్లాంట్‌లో 1800 కార్ల తయారీ నిలిచిపోయింది. దీంతో డీలర్లకు సకాలంలో కార్లు అందజేయలేని పరిస్థితి ఏర్పడింది. జర్మన్‌ ట్రక్‌ల తయారీ సంస్థ దైమ్లర్‌లో తయారీ నిలిచిపోయింది.
డెలివరీ నిలిచిపోవడంతో డీలర్లకు భారీ నష్టం
ఇక మోటార్‌ బైట్‌ల తయారీ సంస్థల్లో యమహా, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, టీవీఎస్‌ మోటార్స్‌కు భారీ నష్టం వాటిల్లింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటార్స్‌లో రోజువారీ 1500 బుల్లెట్‌ బైట్‌కు తయారువుతాయి. అవుటవంటి గత వారం రోజులుగా ఉత్పత్తి నిలిచిపోయింది. యమహా మోటార్స్‌ కూడా రోజువారీగా వందల సంఖ్యలో బైక్‌లు ఉత్పత్తితాయి. దీంతో డీలర్లకు సకాలంలో డెలివరీ చేయకపోవడంతో భారీ నష్టం వచ్చింది. హూందయ్‌ కంపెనీలో ఉత్పత్తికి పెద్దగా ఆటంకం లేకపోయినా.. కార్ల రవాణ నిలిచిపోయింది. ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో డీలర్లకు వెయిటింగ్‌ పిరియడ్‌ పెంచుతున్నారు. ఇది ఆకంపెనీకి ఆర్ధిక నష్టమే. వరదలతో ఉత్పత్తి నిలిచిపోవడంతో ఆయా ఆటోమొబైల్‌ కంపెనీల షేర్లు కూడా పడిపోతున్నాయి. దీంతో ఈ పరిశ్రమల యాజమాన్యాలు ఆందోళనకు గురవుతున్నాయి.

 

టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం

నెల్లూరు : జిల్లాలోని కావలిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. తహశీల్దార్‌ కార్యాలయంలో అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ప్రోటోకాల్‌ విషయంలో వివాదం చెలరేగింది. 

12:00 - December 6, 2015

ఢిల్లీ : హస్తినలో జరగుతున్న నాలులో టెస్ట్ మ్యాచ్‌ లో భారత్‌ పట్టు బిగించింది. వరుసగా రెండో ఇన్నింగ్స్ లో అజింక్యా రహానే సెంచరీ సాధించాడు. 206 బంతుల్లో రహానే 100 పరుగులు చేశాడు. కాగా రెండో ఇన్నింగ్స్ లో భారత్‌ 267 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్‌ చేసింది. సఫారీల ముందు 481 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్‌ నిర్దేశించింది.  88 పరుగులతో కోహ్లీ కెప్టెన్‌ ఇన్నింగ్స్ ఆడాడు.

 

11:54 - December 6, 2015

నెల్లూరు : జిల్లాలోని కావలిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. తహశీల్దార్‌ కార్యాలయంలో అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ప్రోటోకాల్‌ విషయంలో వివాదం చెలరేగింది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దూషించుకున్నారు. తనను పిలవకుండా టీడీపీ నేత బీద మస్తాన్‌రావును పిలవడంపై వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

11:46 - December 6, 2015

శ్రీకాకుళం : పాఠాలు చెప్పాల్సిన గురువు... విద్యార్థినులపై వేధింపులకు పాల్పడ్డాడు. జిల్లాలోని రాజాం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో స్థానికులు సదరు ఉపాధ్యాయుడిని నిలదీయడంతో గొడవ చెలరేగింది. స్థానికులు ఉపాధ్యాయుడిని చితకబాదారు. ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

 

11:43 - December 6, 2015

హైదరాబాద్‌ : నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45, రామంతపూర్ , క్రాస్ రోడ్ , ముషారాంబాగ్ లాంటి పలుచోట్ల అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైడ్ నిర్వహించారు. ఈ దాడులలో తాగి వాహనాలు నడుపుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రంక్ డ్రైవ్ లో 5 కార్లు, ఆటో, లారీ, బైక్ లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

 

తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

ఢిల్లీ టెస్టు : దక్షిణాఫ్రికా, భారత్ ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగుల వద్ద ఎల్గర్ (4) ఔట్ అయ్యారు. 

11:24 - December 6, 2015

ఈనెల 27న సల్మాన్‌ఖాన్‌ 50వ పుట్టినరోజుని పురస్కరించుకుని సల్మాన్‌ఖాన్‌ జీవిత చరిత్రపై రచయిత జాసిమ్‌ఖాన్‌ రాసిన 'బీయింగ్‌ సల్మాన్‌' పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. ఈ పుస్తకంలో సల్మాన్‌ సినీ జీవితం, సినిమాలు హిట్లు, ఫట్లు..కుటుంబంతో ఆయనుకున్న అనుబంధం, సల్మాన్‌ మీద వచ్చిన విమర్శలు, కేసులు వంటి విషయాలను కూడా పొందుపరిచానని, సల్మాన్‌ 50వ బర్త్ డే కానుకగా ఈ పుస్తకాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉందని రచయిత జాసిమ్‌ఖాన్‌ తెలిపారు. సల్మాన్‌ ఇటీవల నటించిన 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల రూపాయల్ని కలెక్ట్ చేసి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

 

భారత్ రెండో ఇన్నింగ్స్ 267/5 డిక్లేర్డ్

హైదరాబాద్ : భారత్ , దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ లో భారత్ రెండో ఇన్నింగ్స్ 265/7 డిక్లేర్డ్ చేశారు. సౌతాఫ్రికా టార్గెట్ 481 పరుగులు. 

రహానే సెంచరీ

ఢిల్లీ : భారత్ , దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ లో రహానే సెంచరీ చేశాడు. టెస్టులో ఆరో సెంచరీ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లోనూ రహానే సెంచరీ పూర్తి చేశాడు.

10:55 - December 6, 2015

ఖమ్మం : జిల్లాలోని మణుగూరు పట్టణంలో సబ్‌ డివిజన్‌ పోలీసులు ఎక్సైజ్‌ అధికారులు కార్డన్‌ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహించారు. బాపనకుంట, శివలింగాపురం, పాత మణుగూరు, మల్లేపల్లి గ్రామాల్లో పోలీసులు 10 గ్రూపులుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. ఈ కార్డన్‌ సెర్చ్ లో 63 ద్విచక్ర వాహనాలు, పెద్ద ఎత్తున గుడుంబా, బెల్లం పాకంను స్వాధీనం చేసుకున్నారు.

 

రాజస్థాన్ లో రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి

జైపూర్: రాజస్థాన్‌లోని ధోలాపని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది కూలీలు మృతి దుర్మరణం చెందారు. మృతుల్లో 11 మంది మహిళలు ఉన్నారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. కూలీలు ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులు ఉదయ్‌పూర్, ప్రతాప్‌ఘర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కూలీల మృతిపై ఆ రాష్ట్ర సీఎం వసుంధర రాజే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 50 వేలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 25 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

 

10:46 - December 6, 2015

చిత్తూరు : జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని ముల్కల చెరువు మండలం కదిరినాయినికోటలో ఆది, అరుణలు హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని స్థానికులంటున్నారు. ఒకేసారి ఇద్దరు హత్యకు గురి కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అయితే వీరి హత్య వెనుక అరుణ బర్త హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారిస్తున్నారు. నిందితుని కోసం గాలిస్తున్నారు.

 

10:40 - December 6, 2015

తూర్పుగోదావరి : జిల్లాలోని పెద్దాపురంలో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకుడు ముత్యాలు ఇంట్లో దొంగతనం జరిగింది. 3 కిలోల బంగారం, రెండు లక్షల రూపాయల నగదు అపహరించినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో భారీ చోరీ

తూర్పుగోదావరి : జిల్లాలోని పెద్దాపురంలో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకుడు ముత్యాలు ఇంట్లో దొంగతనం జరిగింది. 3 కిలోల బంగారం, రెండు లక్షల రూపాయల నగదు అపహరించినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

10:30 - December 6, 2015

ఢిల్లీ : అయోధ్యలో మందిర నిర్మాణ అంశంపై ప్రకటనల జోరు పెరుగుతోంది. ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌ మోహన్ భగవత్ ఒకమాటంటే ఆయనకు మద్దతుగా శివసేన మంటలు పుట్టించే వ్యాఖ్యలు చేసింది. పనిలో పనిగా ప్రధాని నరేంద్ర మోడీని కూడా కాషాయ సేన రామమందిర వివాదంలోకి ప్రవేశపెడుతోంది. శివసేన చేసిన కామెంట్స్ పై మోడీ ఎలా స్పందిస్తారో అని అంతా ఎదురుచూస్తున్నారు.
మోహన్‌భగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు
అయోధ్యలో మందిర నిర్మాణ అంశంపై కాషాయ శక్తులు తమ వ్యాఖ్యల జోరు పెంచుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్ మాట్లాడుతూ తన జీవిత కాలంలోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణమనే అత్యున్నత లక్ష్యం నెరవేరుతుందని, బహుశా మనం ఆ దృశ్యాన్ని మన కళ్లతోనే చూడగలుగుతామని అన్నారు. మందిరం ఎప్పుడు నిర్మాణమవుతుందో మనం చెప్పలేకపోయినా మనం దానికోసం ఎదురుచూడాలని అన్నారు. దీనిపై సెక్యులర్‌ వాదులు ఘాటుగానే స్పందించారు. అసలే దేశంలో అసహన పరిస్థితులు నెలకొనగా ఇప్పుడీ వ్యాఖ్యలేంటంటూ మండిపడ్డారు. భగవత్ వ్యాఖ్యలపై చర్చ జరపాలంటూ రాజ్యసభలో పెద్దలు నిరసనలు కూడా చేశారు. అయితే తాజాగా మోహన్‌ భగవత్‌కు మద్దతు పలుకుతూ శివసేన రంగంలోకి దిగి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
డేట్ ప్రకటించాలని మోహన్‌ భగవత్‌ కు శివసేన డిమాండ్
అయోధ్యలో మందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందో డేట్ ప్రకటించాలని శివసేన మోహన్‌ భగవత్‌ను డిమాండ్ చేసింది. మందిరం విషయంలో మోహన్ భగవత్ తీసుకున్న నిర్ణయానికి తాము పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నామని శివసేన తెలిపింది. ఆయన తేదీని కూడా ప్రకటిస్తే మహబాగా ఉంటుందని ఆ పార్టీ తన అధికార పత్రిక సామ్నాలో తెలిపింది. పైగా మోడీని కూడా ఈ వ్యవహారంలోకి తీసుకొచ్చారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించేందుకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్నాయని మందిరం నిర్మిస్తే ఆయనకు మరింత ప్రజాకర్షణ పెరుగుతుందని శివసేన తెలిపింది.
ఇప్పుడు నిర్మించకుంటే మరెప్పుడూ నిర్మించలేరు : శివసేన సామ్నా
రామ మందిరాన్ని ఇప్పుడు నిర్మించకుంటే మరెప్పుడూ నిర్మించలేరనీ శివసేన సామ్నా ద్వారా కామెంట్ చేసింది. మరి ఈ విషయంలో మోడీ పెదవి విప్పుతారో లేదో చూడాలి. మొత్తమ్మీద అయోధ్య అంశాన్ని తీవ్రతరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఈ వరుస కామెంట్లు నిరూపిస్తున్నాయి.

 

10:18 - December 6, 2015

విశాఖ : క్షణాల్లోనే భారీ నౌక మునిగిపోతుంది. కొంతదూరంలో మళ్లీ ప్రత్యక్షమవుతుంది. సముద్ర ఉపరితలంపై హెలికాప్టర్ల విన్యాసాలు..లక్ష్యాన్ని చేధించే యుద్ధ విమానాలు...స్పీడుగా వెళ్తున్న షిప్‌..దాని వెనకాలే తాడు సాయంతో నీటిపై డైవింగ్‌ చేసే విన్యాసకుడు... ఇలాంటి అద్బుతాల్లేన్నో విశాఖ తీరంలో కనువిందు చేయనున్నాయి. చూపరులను అమితంగా ఆకర్షించనున్నాయి.
విశాఖలో కౌంట్ డౌన్ ఆరంభం
ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన నేవీ దళాల ప్రదర్శనకు విశాఖలో కౌంట్ డౌన్ ఆరంభమైంది. 89 దేశాలకు చెందిన నేవీ దళాలు తూర్పు తీరానికి రానున్నాయి. ఫిబ్రవరి 4న ప్రారంభం కానున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ..నాలుగు రోజుల పాటు ఆహుతులను ఆకట్టుకోనుంది. ఆద్యంతం ఉత్కంఠగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్, సీఎం చంద్రబాబు ముఖ్య అతిధులుగా హాజరవుతున్నారు. సుమారు 2 లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని తిలకిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. జనవరి 15 నుంచి విశాఖ బీచ్ ప్రాంతాన్ని నేవీ అధికారులు..తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు.
దేశంలో జరుగుతున్న రెండో ఫ్లీట్‌ రివ్యూ
పరస్పర సహకారం, స్నేహతత్వం, సముద్ర రవాణా రంగం అభివృద్ధి అంశాల ప్రాతిపదికన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరగనుంది. దేశంలో జరుగుతున్న రెండో ఫ్లీట్ రివ్యూ ఇది. 2001లో ముంబై నగరం..ఐఎఫ్ ఆర్కి ఆతిధ్యమిచ్చింది. 89 దేశాల నేవీ దళాలు విశాఖ తీరానికి చేరుకుంటున్నాయి. వివిధ దేశాలకు 100 యుద్ధనౌకలు, మరెన్నో యుద్ధ విమానాలు, జలంతర్గాములు, ప్రదర్శనలో పాల్గొంటున్నాయి.
నేవీ అమరవీరులకు నివాళులు
2016 ఫిబ్రవరి 4 న సీఎం చంద్రబాబు నేవీ అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అదే రోజు నేవీ ఎగ్జిబిషన్‌ ప్రారంభిస్తారు.5న గవర్సర్ నరసింహన్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. 6న రాష్ట్ర్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఐఎఫ్ ఆర్పై సమీక్ష నిర్వహిస్తారు. 7న ఆర్కే బీచ్‌లో నేవీ దళాల ప్రదర్సన, 8న యుద్ధ విన్యాసాలు...ఈ ప్రదర్సనకు ప్రజలను అనుమతిస్తారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను సక్సెస్‌ చేసేందుకు నేవి అధికారులు సర్వశక్తులొడ్డుతున్నారు.
ఫ్లీట్ రివ్యూపై విస్తృత ప్రచారం
ఇక ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూపై విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించారు. హాయ్ , హలో, నమస్తే అంటూ సాగే ధీమ్ సాంగ్ విడుదల చేశారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించారు., వాట్సాప్ లో పోస్ట్ చేసారు. డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు రింగ్ టోన్స్ అందుబాటులో ఉంచారు. 89 దేశాల నావిక దళాలతో అట్టహాసంగా జరిగే కార్యక్రమాన్ని భారీ భద్రత కల్పించేందుకు నేవీ అధికారులు వ్యూహాలు రచిస్తున్నారు. 

చెన్నైకు రైళ్ల రాకపోకలను పునరుద్ధరించిన ద.మ రైల్వే

తమిళనాడు : దక్షిణమధ్య రైల్వే చెన్నైకు రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. హైదరాబాద్-చెన్నై చార్మినార్ ఎక్స్ ప్రెస్, హైదరాబాద్-చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, విజయవాడ-చెన్నై పినాకిని ఎక్స్ ప్రెస్, కాకినాడ-చెన్నై ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్ రైళ్లను పునరుద్ధరించారు.

చెన్నైలో కొనసాగుతున్న సహాయక చర్యలు

చెన్నై : నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి చిరు జల్లులు కురుస్తున్నాయి. సైన్యం, ఎన్ డీఆర్ ఎఫ్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమాన, బస్సు, బ్యాంక్ సర్వీసులు పాక్షికంగా ప్రారంభమయ్యాయి. కమ్యూనికేషన్, విద్యుత్ సరఫరా కొంత మెరుగుపడింది. అయితే నిత్యవసరాల కోసం ప్రజలు అల్లాడుతున్నారు. పాలు, నీటి ధరలు కొండెక్కాయి. ఆటోవాలాలు విపరీత ఛార్జీలతో ప్రజలను దోచుకుంటున్నారు.

 

చిత్తూరు జిల్లాలో జంట హత్యలు

చిత్తూరు : ముల్కలచెరువు మండలం కదిలినాయినికోటలో జంట హత్యలు జరిగాయి. ఆది, అరుణ అనే ఇద్దరు హత్యకు గురయ్యారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తెలుస్తోంది. 

వదినపై మరిది అత్యాచారయత్నం.. ఆపై హత్య

కరీంనగర్ : కాటారం మండలం చింతకానిలో దారుణం జరిగింది. వదిన లచ్చమ్మపై మరిది అత్యాచారయత్నం చేశాడు. లచ్చమ్మ ప్రతిఘటించడంతో గొంతు నులిమి చంపేశాడు. 

08:46 - December 6, 2015

హైదరాబాద్ : ఏపీలో అమలవుతున్న పథకాలు, అధికారుల పనితీరుకు సంబంధించి ఏపీ సిఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. సెక్రటేరియట్‌లో జరిగిన ఈ భేటీలో ప్రభుత్వ కార్యక్రమాలు, వర్షాలు, జన్మభూమి తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. అకాల వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాల్లో వచ్చిన నష్టాన్ని అంచనా వేయాలని సిఎస్‌ సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో నిత్యావసర సరుకులు బాధితులందరికీ సక్రమంగా అందేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేంద్ర బృందం త్వరలో పరిశీలనకు వస్తుందని దీనికి సంబంధించి జరిగే సమావేశానికి అన్ని వివరాలతో సంబంధిత అధికారులు, కార్యదర్శులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నించాలన్న సిఎస్‌ 
మీ కోసం పోర్టల్‌కు సంబంధించి కార్యదర్శులంతా ఎప్పటికప్పుడు సమాచారం అందుబాటులో ఉంచుకుని సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నించాలని సిఎస్‌ సూచించారు. కిందిస్థాయి నుంచి వచ్చే సమస్యలన్నిటినీ గుర్తించి సిఎం దృష్టికి తీసుకెళ్లే విధంగా సిద్ధంగా ఉండాలన్నారు. వచ్చే నెల 1 నుంచి జరిగే జన్మభూమి కార్యక్రమంలో చేపట్టే అంశాలపైన దృష్టిపెట్టాలని సిఎస్ కృష్ణారావు కోరారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అన్ని వివరాలు సిద్ధం చేసుకోవాలన్నారు.
ఈ నెల 12న దక్షిణ భారత రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం
ఈ నెల 12న విజయవాడలో కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో దక్షిణ భారత రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో సమావేశం జరుగుతుందని, దానిలో చర్చించాల్సిన అంశాలపై ప్రధానంగా దృష్టిసారించాలన్నారు. కేంద్రం ప్రకటించిన పథకాలకు అందే నిధులపై కూడా దృష్టి పెట్టాలన్నారు. మొత్తంగా పాలనా విషయాల్లో అధికారుల పనితీరు ప్రశంసనీయంగా ఉండాలని సిఎస్‌ సూచించారు.

 

 

08:40 - December 6, 2015

హైదరాబాద్ : ఒకప్పుడు సరసుల నగరం. కబ్జా రాయుళ్ల వీరవిహారంతో సరస్సులు కాస్తా స్మాష్‌ అయ్యాయి. ఒకపక్క కబ్జారాయుళ్లు పోటీపడి చెరువులను ఆక్రమిస్తుంటే గత ప్రభుత్వాల్లోని కొందరు సైలెంట్‌గా సహకారమందించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒకటి రెండు చెరువులనైనా రక్షించుకుంటామంటూ టి.సర్కార్‌ ముందుకొచ్చింది. లేక్స్ పై లేటెస్ట్ గా దృష్టిసారించి అధికారులతో రివ్యూ నిర్వహించింది.
వరుసగా రివ్యూలు
గత కొన్ని రోజులుగా వివిధ అంశాలపై తెలంగాణ ప్రభుత్వం వరుసగా రివ్యూలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే చెరువులపై దృష్టి సారించింది. గతంలో హైదరాబాద్‌ నగరం, దాని చుట్టుపక్కల లెక్కలేనన్ని చెరువులు ఉండగా అవన్నీ కబ్జాకు గురై ప్రస్తుతం 169 మాత్రమే మిగిలాయి. ఉన్న ఈ కొద్ది సరస్సులనైనా పూడిక తీసి సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా మిషన్‌ కాకతీయ ద్వారా ఇప్పటికే 155 చెరువుల్లో పూడికతీత పనులు జరుగుతున్నాయి. మిగతా 14 చెరువుల సర్వే పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అధికారుల సమావేశంలో మంత్రి హరీష్‌రావు ఆదేశించారు.
చెరువులను సుందరీకరించాలని ప్రభుత్వం యోచన
చెరువులన్నీ కబ్జాకు గురవ్వగా ప్రస్తుతం జంట నగరాల పరిధిలో 26 చెరువులు, హైదరాబాద్‌ శివారు రంగారెడ్డిజిల్లా పరిధిలో 133, మెదక్‌ జిల్లా పరిధిలో 10 చెరువులు ఉన్నాయి. వీటిని కబ్జాల బారి నుంచి కాపాడి పునరుద్ధరించి సుందరీకరించాలని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 155 చెరువుల సర్వే పూర్తయిందని అధికారులు మంత్రి హరీష్‌రావుకు తెలిపారు. మిగతా 14 చెరువుల సర్వేను డిఫెన్స్, రెవిన్యూ అధికారుల సహకారంతో వచ్చే నెల రోజుల్లో పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. సర్వేలు పూర్తయిన 155 చెరువులకుగాను 64 చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం అనుమతులిచ్చి వంద కోట్లను మంజూరు చేసింది. ఇదిలా ఉండగా 37 చెరువుల టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. వాటిల్లో పనులు ముమ్మరం చేయాలని హరీష్‌రావు అధికారులకు సూచించారు.
కబ్జాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు
చెరువుల కబ్జాలకు పాల్పడేవారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని, పునరుద్ధరణ పనులకు ఏవైనా లీగల్ సమస్యలు అడ్డొస్తే వాటిని త్వరితగతిన పరిష్కరించుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అవసరమైతే అడ్వకేట్‌ జనరల్‌ సాయం తీసుకోవాలన్నారు. ప్రభుత్వ చర్యలన్నీ పూర్తయి చెరువుల పునరుద్ధరణ జరిగితే హైదరాబాద్ మహానగర రూపురేఖల్లో గణనీయమైన మార్పులొస్తాయి. అటువంటి సుందర హైదరాబాద్ కోసం కొంతకాలం వేచి చూడాలేమో..

 

08:23 - December 6, 2015

దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ అది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంది. అయితేనేం త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులు దొరక్క కలవరపడుతోంది. గెలిచినా...ఓడినా బరిలోకి దిగాల్సిన గడ్డు పరిస్థితుల్లో సరైన అభ్యర్థుల కోసం ఎదురుచూస్తున్నారు. రండి బాబూ టిక్కెట్‌ ఇస్తామంటున్నా వద్దు బాబూ మావల్ల కాదంటున్నారు. పైగా కష్టకాలంలో పోటీకి ముందుండాల్సిన సీనియర్లు ఇప్పుడు ముఖం చాటేస్తుండడంతో టోటల్‌గా ఈ ఎన్నికల వ్యవహారం సవాలుగా మారింది.
కాంగ్రెస్‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. టిఆర్‌ఎస్‌ చేస్తున్న ఆకర్ష్ ను తట్టుకుని ముందుకెళ్లడం ఎలాగని కాంగ్రెల్‌ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. కనీసం ఈ ఎన్నికల్లోనైనా సత్తా చాటుకోకపోతే ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్‌కు విలువ ఉండదు. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఎంపిటిసి, జడ్‌పిటిసిలు హస్తం పార్టీకి హ్యాండిచ్చి కారెక్కి టిఆర్‌ఎస్‌ గూటికి చేరారు. ఆ వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలను ఎలా డీల్‌ చేయాలో అంతుబట్టక తెలంగాణ పిసిసి నేతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పోటీకి సీనియర్లు అనాసక్తి
అసలే పరిస్థితులు అంతంతమాత్రంగా ఉంటే పార్టీని ముందుండి నడిపించాల్సిన సీనియర్లు పోటీకి ఆసక్తి చూపించడం లేదని సమాచారం. గెలుపుపై కొంత ఆశ ఉన్న మహబూబ్‌నగర్‌, నల్గొండలు మినహాయిస్తే మిగతా జిల్లాల్లో పోటీకి నేతలు ముందుకురావడం లేదు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నల్గొండ బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. ఐతే జిల్లాలో నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారిందన్న చర్చ జరుగుతోంది. మహబూబ్‌నగర్‌లో రెండు స్థానాలకుగాను ఒకదాంట్లో పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. మాజీ జడ్పీ చైర్మన్‌ దామోదరరెడ్డిని రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నారు.
రంగంలోకి బండారు శ్రీకాంత్‌
ఇక సిఎం సొంత జిల్లాలో బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని కాంగ్రెస్‌ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా గజ్వేల్ ఇన్‌ఛార్జ్ గా ఉన్న బండారు శ్రీకాంత్‌ను రంగంలోకి దింపనున్నారు. శ్రీకాంత్‌కు అధిష్టానం ఆశీసులు దండిగా ఉండడంతో ఆయన పేరు దాదాపుగా ఖరారైందని సమాచారం. ఐతే రంగారెడ్డి జిల్లాలో ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై తర్జనభర్జన పడుతున్నారు. ఇక్కడి నుంచి సబితాఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డిలో ఎవరో ఒకరిని పోటీకి దింపాలని పిసిసి భావిస్తుంటే వారు మాత్రం నో అంటున్నారని సమాచారం.
ఖమ్మంలో చేతులెత్తేసిన కాంగ్రెస్‌
ఇక ఖమ్మంలో సరైన బలం లేకపోవడంతో పోటీ ఆలోచనే లేక కాంగ్రెస్‌ చేతులెత్తేస్తోంది. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లలో పోటీకి అభ్యర్థులు ముందుకు రావడం లేదు. అనవసరంగా పోటీ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకనే ఆలోచనలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరో ఒకరిని బరిలోకి దింపకపోతే పరువు పోతుందనే ఉద్దేశంతో డిసిసి నేతలతో మంతనాలు జరుపుతున్నారు. లోకల్‌లో మీ ఇష్టం ఉన్నవాళ్లతో అవగాహన కుదర్చుకుని పోటీకి దిగొచ్చని ఆఫర్‌ కూడా ప్రకటిస్తున్నారు. మొత్తంగా తెలంగాణ ఇచ్చీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండీ ఇలా అభ్యర్థులు దొరక్క ఇబ్బంది పడడం కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది.

 

 

08:13 - December 6, 2015

హైదరాబాద్ : రైతు రుణమాఫీపై ప్రభుత్వం పాత పాటే పాడుతోంది. మొత్తం రుణాలను ఏకకాలంలో కాకుండా విడతల వారీగా మాఫీ చేయబోతోంది. కేసీఆర్ తాను అధికారంలోకొస్తే రైతు రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల ముంగిట ప్రకటించారు. ఆ మొత్తం 17 వేల కోట్ల రూపాయలు కాగా ప్రతి సంవత్సరం 25 శాతం మేర మాఫీ చేసేలా బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నారు. దానికి అనుగుణంగా గత రెండు బడ్జెట్లలో కలిపి 50 శాతం మేర బ్యాంకుల్లో నిధులను ప్రభుత్వం జమ చేసింది. రైతులకు పూర్తి స్థాయిలో రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలను అందించాలని ప్రభుత్వం సూచించింది. అయితే బ్యాంకులు మాత్రం మరో రకంగా వ్యవహరించాయి. మొత్తం రుణాలను కాకుండా ప్రభుత్వం తమకు చెల్లించిన మేరకే రైతులకు ఫ్రెష్‌ రుణాలను అందజేశాయి. అవి ఏ మూలకూ సరిపోకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు చేసి సాగు చేశారు. ఇదే సమయంలో ప్రకృతి సహకరించకపోవడంతో ఆశించినమేర దిగుబడులు రాకపోగా అప్పులు మరింత పేరుకుపోయాయి. ఫలితంగా కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో విడతల వారీగా కాకుండా ఒకేసారి రుణమాఫీ చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
25 శాతం మేర బడ్జెట్‌లో కేటాయింపు 
రైతులకు మద్దతుగా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు కూడా ఉద్యమాలు నిర్వహించాయి. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం మిగిలిన నిధులను రెండు విడతల్లో కాకుండా ఒకే విడతలో చెల్లించేందుకు సిద్ధపడింది. ఇందుకనుగుణంగా వచ్చే బడ్జెట్‌లో 8,500 కోట్ల నిధులను బ్యాంకులకు మంజూరు చేస్తానని కెసిఆర్‌ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పుడు హఠాత్తుగా ప్రభుత్వం తన మనసు మార్చుకుంది. మొత్తం నిధులను కాకుండా గతంలోలా 25 శాతం మేరే బడ్జెట్‌లో కేటాయించేందుకు మొగ్గు చూపుతోంది. నిధుల కొరత మూలంగా ఒకేసారి ఎనిమిదిన్నరవేల కోట్లు కేటాయించడం సాధ్యం కాదని ఆర్థిక శాఖ అధికారులంటున్నారు. పైగా బ్యాంకులు కూడా ఒకేసారి రుణమాఫీకి అంగీకరించట్లేదు. ఒకేసారి మాఫీ చేయాలంటే తమ రుణ ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సొస్తుందని అంటున్నాయి.
టర్మ్‌లోన్లుగా వ్యవసాయ రుణాలు
అయితే ప్రభుత్వం మాత్రం రైతులకు ఎలాంటి నష్టం ఉండదంటోంది. మొత్తం 459 మండలాల్లో 231 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన నేపథ్యంలో అక్కడి వ్యవసాయ రుణాలన్నీ టర్మ్‌లోన్లుగా మారతాయని చెప్తోంది. వాటిని చెల్లించకుండానే తమ శక్తినిబట్టి రైతులు ఫ్రెష్‌ లోన్లు పొందే వెసులుబాటు ఉంటుంది. దీంతో మెజార్టీ రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వమంటోంది. అయితే కరువు మండలాలుగా ప్రకటించని ఏరియాల్లో తమ పరిస్థితేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా పూర్తి రుణమాఫీ అవుతుందనుకుంటున్నరైతులకు నిరాశే ఎదురయ్యేలా ఉంది. 

బైక్ రేసింగ్ లతో యువకుల హల్ చల్

హైదరాబాద్‌ : సర్రుమంటూ అర్ధరాత్రి వేళ బైక్‌లపై దూసుకెళ్తూ హైదరాబాద్‌లో యువకులు హల్‌చల్‌ చేశారు. రాత్రి రెండు గంటల వేళ సుమారు వంద మంది బైక్‌ రేసింగ్ నిర్వహించారు. కెబిఆర్‌పార్క్, టిడిపి భవన్‌ మీదుగా చెక్‌పోస్ట్, మాదాపూర్ వరకు ఈ రేస్‌ నిర్వహించారు. అత్యంత ప్రమాదకరంగా పయనిస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగించారు. అయితే పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బైక్‌ రేస్‌లో ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం.

 

జీహెచ్ ఎంసీ అభ్యర్థనలపై స్పందించాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్ : అక్రమ నిర్మాణాలను అణచివేసేందుకు వీలుగా పలు చట్ట సవరణల కోసం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) చేసిన అభ్యర్థనలపై యుద్ధప్రాతిపదికన స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ అభ్యర్థనలపై ఏ చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని స్పష్టం చేసింది. ఇందుకు రెండు నెలల గడువిస్తూ.. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.

07:49 - December 6, 2015

హైదరాబాద్‌ : సర్రుమంటూ అర్ధరాత్రి వేళ బైక్‌లపై దూసుకెళ్తూ హైదరాబాద్‌లో యువకులు హల్‌చల్‌ చేశారు. రాత్రి రెండు గంటల వేళ సుమారు వంద మంది బైక్‌ రేసింగ్ నిర్వహించారు. కెబిఆర్‌పార్క్, టిడిపి భవన్‌ మీదుగా చెక్‌పోస్ట్, మాదాపూర్ వరకు ఈ రేస్‌ నిర్వహించారు. అత్యంత ప్రమాదకరంగా పయనిస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగించారు. అయితే పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బైక్‌ రేస్‌లో ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం.   

07:38 - December 6, 2015

హైదరాబాద్ : బల్దియా ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడించేందుకు టీఆర్‌ఎస్‌ ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. ప్రధాన ప్రతిపక్షాలను బలహీనం చేసేందుకు...ఆ పార్టీ నేతలకు కారెక్కించేస్తోంది. ఎన్నికల సమయంలో కాకుండా ముందుగానే ప్రజాకర్షణ గల నేతలను గులాబీ గూటికి చేర్చుకుంటుంది. విపక్ష పార్టీలను మైండ్ గేమ్‌తో మానసికంగా దెబ్బ తీసేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది.
ఆపరేషన్‌ ఆకర్ష్ తో నేతలకు వల
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో గుర్తింపు పొందిన బలమైన నేతలను తమ గూటికి చేర్చుకునేందుకు అధికార పార్టీ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇందుకోసం సీనియర్ నేతలతో రాయబారం నడుపుతోంది. వలస వచ్చే నేతలకు రాజకీయ భవిష్యత్‌పై భరోసా కల్పించి... తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.
దానం విషయంలో కరువైన స్పష్టత
ఏడాది కాలంగా గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ గులాబీ తీర్థం పుచ్చుకుంటాడని పుకార్లు షికార్లు చేస్తున్నా సస్పెన్స్ మాత్రం వీడడం లేదు. మరోవైపు దానం గులాబి గూటికి చేరడం ఖాయమనే సంకేతాలు అధికార పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. దానం చేరికపై ఆయన రాజకీయ గురువు డిఎస్ తో కూడా టీఆర్‌ఎస్‌ నేతలు మంతనాలు జరిపినట్లు టాక్‌. ఇప్పటికే దానం శిశ్యుడిగా గుర్తింపు పొందిన ప్రభాకర్ కారెక్కేశారు.
గ్రేటర్ ఎన్నికల నోటిఫేషన్ నాటికి మరికొంత మంది గులాబి గూటికి..?
గ్రేటర్ ఎన్నికల నోటిఫేషన్ నాటికి మరికొంత మంది ఎమ్మెల్యేలు, మండలి సభ్యులు గులాబి గూటికి చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తానికి టీఆర్‌ఎస్‌ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ తో విపక్ష పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎప్పుడు ఏ నేత చేజారిపోతాడోనని ఆందోళన చెందుతున్నారు.

 

 

07:28 - December 6, 2015

హైదరాబాద్ : ప్రత్యేక హోదా కోసం మళ్లీ ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ప్రత్యేక హోదా సాధన సమితి ఈనెల 7న ఢిల్లీలో మహాధర్నా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. హస్తినలో మకాం వేసిన సభ్యులు...విపక్ష పార్టీ నేతల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయా పార్టీల నేతలను కలుస్తూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఢిల్లీ చేరిన ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యులు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. మద్దతు కూడగట్టేందుకు సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ పార్టీలకు చెందిన ఎంపీలు, నాయకులను కలిశారు. మహాధర్నాలో పాల్గొనాలని అభ్యర్థించారు.
ఉద్యమాలెన్ని చేసినా కేంద్రం స్పందించడం లేదు-రామకృష్ణ
రాష్ట్రంలో ఎన్నో ఆందోళనలు, నిరసనలు చేపట్టామని...అయినా కేంద్రం స్పందించలేదన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అందుకే వేలాది మందితో ఈనెల 7న జంతర్‌ మంతర్‌ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్ర మంత్రి వెంకయ్య చెప్పేవన్ని మాయమాటలని విమర్శించారు. ఈ విషయంలో ఆయనకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.
హోదా లేకపోతే అన్ని కష్టాలే - చలసాని
ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల...రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావడం లేదన్నారు చలసాని శ్రీనివాస్‌. డీఎస్సీ తప్ప కొత్త నోటిఫికేషన్లు రాకపోవడం వల్ల నిరుద్యోగులు అల్లాడుతున్నారని వాపోయారాయన. ప్యాకేజీ పేరు చెప్పి కాలం వెల్లదీస్తున్నారని...అది ఎప్పటికి అమలు చేస్తారో కూడా చెప్పడం లేదని మండిపడ్డారు. ప్రధాని మోడీ, చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. అత్యున్నతమైన పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన వాగ్దానాలను బీజేపీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 7న రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపజేయాలని కోరారు.
కష్టాలు తీరాలంటే ప్రత్యేకహోదా రావాలి- శివాజీ
ఆంధ్రప్రదేశ్‌ ఆకలిరాజ్యంగా మారకముందే ప్రత్యేక హోదా ప్రకటించాలని కారెం శివాజీ డిమాండ్‌ చేశారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే... ప్రత్యేక హోదాతోనే సాధ్యమన్నారు. పార్లమెంట్‌ సభ్యులు గళమెత్తే సమయం ఆసన్నమైందని..ప్రతి ఒక్కరూ తమతో చేతులు కలపాలన్నారు. రాష్ట్రానికి రాజధాని వచ్చినా...హోదా రాకపోతే ఎలాంటి ఉద్యోగాలు రావని తెలుసుకోవాలన్నారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రత్యేక హోదా ప్రకటించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యులు హెచ్చరించారు.

 

హైదరాబాద్ లో అర్ధరాత్రి బైక్ రేసింగులు..

హైదరాబాద్ : జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్కు, మాదాపూర్ వద్ద 100 మంది యువకులు బైక్ రేసింగులకు పాల్పడ్డారు. పోలీసులు యువకులను అడ్డుకున్నారు. అయితే యువకులు తప్పించుకున్నారు. 

నేడు ఇండోనేషియా ఓపెన్ టోర్నీ ఫైనల్ మ్యాచ్

ఢిల్లీ : నేడు ఇండోనేషియా ఓపెన్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇండోనేషియా, భారత్ ల మధ్య మ్యాచ్ జరుగనుంది. 

నేటి నుంచి దేశవ్యాప్తంగా రైతులకు భూసార కార్డుల పంపిణీ

ఢిల్లీ : నేటి నుంచి దేశవ్యాప్తంగా రైతులకు భూసార కార్డుల పంపిణీ జరుగనుంది. 

నేడు టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్ సీర్స్ ఉద్యోగ పరీక్ష

హైదరాబాద్ : నేడు టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్ సీర్స్ ఉద్యోగ పరీక్ష  జరుగనుంది. ఆన్ లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు.

Don't Miss