Activities calendar

07 December 2015

22:27 - December 7, 2015

దగ్గరబడ్డ దానం దాగుడు మూతలు..మూడో ఆట మొదలువెట్టిన టీఆర్ ఎస్సోళ్లు... పేదొళ్ల జీవితంతోటి సర్కారోళ్ల ఆటలు. మద్యం మత్తు ముచ్చట్ల గమ్మత్తు.. మల్ల మనసువారేసుకున్న హరికృష్ణ. బాబుగారిచేతుల్నే భవిష్యత్. ఇంకా పెద్దగైతున్న పెద్దకూర పంచాయతీ.. ఓయూలో తయారైన పండుగుల జేఏసీ. ఆదుకోవోయి ఆపదలవడ్డ హీరోలు. ఆశోకవనంలోకెళ్లి బయటపడ్డ ఏశకాల్లు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

22:05 - December 7, 2015

ఢిల్లీ : దళితులకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన కేంద్రమంత్రి వీకే సింగ్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో ధర్నా చేశారు. ఈ ధర్నాలో గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, ఆనంద్ శర్మ, దీపేందర్ హుడా తదితర నేతలు పాల్గొన్నారు. దళితులను 'కుక్క' గా వ్యాఖ్యానించిన వీకే సింగ్‌కు మంత్రిపదవిలో కొనసాగే అర్హత లేదని కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు. ఒక అట్టడుగు సామాజిక వర్గం గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతోనే ఈ విషయంలో తాము పట్టుబడుతున్నామని వారు స్పష్టం చేశారు. హరియాణాలో ఇద్దరు దళిత చిన్నారుల హత్య ఘటనపై మంత్రి స్పందిస్తూ -ప్రతి స్థానిక సమస్యకు కేంద్రం బాధ్యత వహించదని, కుక్కలపై రాయి విసిరినా ప్రభుత్వమే బాధ్యత వహించాలా అంటూ వీకే సింగ్ వ్యాఖ్యానించారు.

 

 

22:02 - December 7, 2015

విజయవాడ : కల్తీ మద్యం వల్ల మృతిచెందినవారి కుటుంబాలను సిఎం చంద్రబాబు పరామర్శించారు. మద్యం దుకాణం ఓనర్లు భావిస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బంధువులు అజ్ఙాతంలోకి వెళ్లారు. ఆయన కార్యాలయం వద్ద పోలీసు బలగాలను మోహరించారు. మల్లాది విష్ణు తల్లి, భార్య, బంధువుల పేరుతో మద్యం దుకాణం లైసెన్స్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కొత్త ప్రభుత్వాస్పత్రి వద్ద సిపిఎం, ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నారు. మృతుల బంధువులకు పది లక్షల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. అయితే మల్లాది విష్ణును ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది.

 

21:59 - December 7, 2015

కృష్ణా : విజయవాడలో కల్తీ మద్యం ఏడుగురు ప్రాణాలను బలితీసుకుంది. మరికొంతమంది పరిస్థితిని విషమంగా మార్చింది. కృష్ణ లంకలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.
కోరలు చాచిన కల్తీ మద్యం
విజయవాడలో కల్తీ మద్యం ఆరుగురిని మింగేసింది. కృష్ణ లంకలో స్వర్ణవైన్స్ లో మద్యం తాగిన కూలీలు ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది కూలీలు మద్యం తాగడానికి స్వర్ణ వైన్స్ కు వెళ్లారు. మద్యం తాగిన వెంటనే వారిలో 20 మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వీరిలో ఐదుగురు మృతి చెందారు. మిగతా వారి పరిస్థితి విషమంగా ఉంది.
చనిపోయిన వారంతా పేద కూలీలే
కల్తీ మద్యం ఘటనలో చనిపోయిన వారంతా పేద కూలీలే. రెక్కాడితేనే గాని డొక్కాడని పరిస్థితి. రోజు వారీ కూలి పనిచేసుకుంటూ బతుకు బండిని లాగుతున్నారు. మద్యం రూపంలో మృత్యువు వారిని కబళించింది. వారిపై ఆధారపడ్డ కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. విగత జీవులుగా పడిఉన్న తమ వారిని చూసి కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌
కల్తీ మద్యాన్ని అమ్మిన స్వర్ణ బార్‌ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను కూడా నిర్వహిస్తోంది. ఎం హోటల్‌కు పార్కింగ్‌ ఉన్న ప్రాంతంలో వైన్‌షాపును, బారును ఏర్పాటుచేశారు. నిబంధనలకు విరుద్ధంగా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నడుస్తున్నా ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోలేదు. కార్పొరేషన్‌ సిబ్బంది కూడా ఎటువంటి తనిఖీలు నిర్వహించలేదు. మామూళ్ల మత్తులో ఉన్న ఎక్సైజ్‌ అధికారులు ఈ విషయాలను పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కల్తీ మద్యం ఘటనపై సీపీఎం, మహిళా సంఘాలు ఆగ్రహం
కల్తీ మద్యం ఘటనపై సీపీఎం, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర ఆందోళన చేపట్టాయి. కల్తీ మద్యంతో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశాయి.
బాధ్యులపై కఠిన చర్యలు : ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర
కల్తీ మద్యం ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. కల్తీ మద్యం ఘటనపై తక్షణమే న్యాయ విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్‌ చేసింది.
35కి చేరిన కల్తీ మద్యం బాధితులు
కల్తీ మద్యం బాధితుల సంఖ్య 35కి చేరింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17 మందిని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. బాధితుల్లో నలుగురికి మూత్రపిండాలు ఫెయిల్‌ అయ్యాయి.
ఘటనపై పోలీసులు దర్యాప్తు
కల్తీ మద్యం ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వైన్‌ షాప్‌ మేనేజర్‌తో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొంతమంది కోసం గాలిస్తున్నారు. మరోపక్క నగరంలోని అన్ని బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, మద్యం షాపుల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. స్వర్ణ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బంధువులు పేరు మీద లైసెన్స్ మంజూరు అయినట్లు తెలుస్తోంది.

 

21:45 - December 7, 2015

విజయవాడలోని కృష్ణలంకలో కల్తీ మద్యం ఘటనకు ఎపి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం నాయకురాలు రమాదేవి, వైసిపి నేత అంబటి రాంబాబు, టిడిపి నేత రాజేంద్రప్రసాద్, బిజెపివైఎం నేత విష్ణువర్దన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. కృష్ణలంక ఘటన దురదృష్టకరమన్నారు. మృతులకు తక్షణం నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర రాజీనామా చేయాలన్నారు. ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియలో చూద్దాం..

 

బీఫ్ ఫెస్టివల్ పై సిటీ సివిల్ కోర్టు స్టే

హైదరాబాద్ : బీఫ్ ఫెస్టివల్ పై సిటీ సివిల్ కోర్టు స్టే విధించింది. ఓయూలో ఈనెల 20 వరకు వేడుకలపై నిషేధం విధించింది. ఈనెల 10న ఓయూలో బీఫ ఫెస్టివల్ ను ఆపాలంటూ అడ్వకేట్ సుకంరి జనార్థన్ గౌడ్ కోర్టును ఆశ్రయించాడు.

 

ఎపి పాఠశాల విద్యలో సంస్కరణలకు సలహా సంఘం ఏర్పాటు

ఎపి : పాఠశాల విద్యలో సంస్కరణలకు ఎపి ప్రభుత్వం సలహా సంఘం ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన సలహా సంఘం ఏర్పాటు చేశారు. సలహా సంఘం కార్యదర్శిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నియమించారు. సభ్యులుగా చాగంటి కోటేశ్వరరావు పట్టాభిరామ్, ఎన్ వీవర్లు, శాంతాబయోటిక్ ఎండీ ఉన్నారు. 

కల్తీ మద్యం బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు

విజయవాడ : ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ మద్యం బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు.

 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

హైదరాబాద్ : నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. వేగంగా వచ్చిన కారు వనస్థలిపురం ఇంజాపూర్‌ వద్ద రోడ్డు దాటుతున్న నలుగురిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందారు. తల్లి, కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 

20:56 - December 7, 2015

గృహిణులుగా స్థిరపడిన మహిళలు తమ కళాత్మకతకు మెరుగులు దిద్దుకునేందుకు ఇష్టపడతారు. తీరిక వేళల్లో అందమైన కళాకృతులకు రూపమిస్తారు. అలాంటి వారికి క్రష్ పెయింటింగ్ ను నేర్పేందుకు ఇవాళ్టి సొగసు మీ ముందుకు వచ్చింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:54 - December 7, 2015

పేదరికంతో పోరాటం..అక్షర జ్నానం కోసం ఆరాటం...పరిస్థితులకు ఎదురీదే సంకల్పం. నలుగురికీ అండగా నిలిచే ఆశయం. ఈ లక్షణాలే లక్షలాది మంది అమ్మాయిల్లో ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆటుపోట్లకు ఎదురు నిలిచేలా చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు సమీపంలో, ఒక మారుమూల గ్రామంలో పుట్టిన ఉషా విశ్వకర్మ , స్వయం కృషితో చదువుకుంది. తనలాంటి సమస్యల్లో ఉన్న వారికి అక్షర జ్నానం అందివ్వాలనుకుంది. అందుకోసం కుటుంబంతో, చుట్టుపక్కల వారితో, పురుషాధిపత్యపు ప్రపంచంతో అలుపెరుగని పోరాటం చేస్తోంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురుచూడకుండా, తనే అడుగు ముందుకు వేసి, ఇతరులకు మార్గం సుగమం చేసి, ఎందరికో స్ఫూర్తి మంత్రంగా నిలుస్తున్న ఉషా విశ్వకర్మకి మానవి అభినందనలు తెలియచేస్తోంది. దేశ వ్యాప్తంగా రెడ్ బ్రిగేడ్ వాలంటీర్స్ పనిచేయాలని కోరుకుంటోంది. 

20:39 - December 7, 2015

గుంటూరు : ఏరులై పారుతున్న కల్తీ మద్యాన్ని నియంత్రించాలని లెఫ్ట్ నేతలు డిమాండ్ చేశారు. కల్తీ మద్యానికి వ్యతిరేకంగా గుంటూరులో సీపీఎం ఆధ్వర్యంలో అఖిలపక్ష సదస్సు నిర్వహించారు. సంపూర్ణంగా మద్యాన్ని నిషేధించాలని కోరారు. టిడిపి ప్రభుత్వం దుర్మార్గంగా పరిపాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు. ఆదాయానికి ఆశపడి ప్రభుత్వం బెల్టు షాపులు, కల్తీ మద్యాన్ని ప్రోత్సహించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈక్రమంలో ఇవాళ విజయవాడలోని కృష్ణలంకలో కల్తీ మద్యం ఘటనపై నేతలు తీవ్రంగా స్పందించారు. కల్తీ మద్యం తాగి మృతి చెందిన మరణాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అవి ప్రభుత్వ హత్యలని పేర్కొన్నారు. ఎక్సైజ్ మినిస్టర్ వెంటన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రామాదేవి...
'ప్రభుత్వానికి మద్యం దాహం పట్టుకుంది. ప్రజల ప్రాణాల కంటే లాభాలు, ఆదాయానికే ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తుంది. కల్తీ మద్యం తాగి మృతి చెందిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎక్సైజ్ శాఖ మంత్రి రాజీనామా చేయాలి. 
కాంగ్రెస్... సుంకరి పద్మ..
కల్తీ మధ్యం ఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి.
లక్ష్మణ్ రెడ్డి..
విజయవాడలో కల్తీ మద్యం తాగి మృతి చెందిన ఘటన ప్రభుత్వానిదే బాధ్యత. ఈ మరణాలను ప్రభుత్వ హత్యలుగా గుర్తించాలి. డబ్బును సంపాదించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం.. కల్తీ సారా, మద్యం అనుమతులు ఇస్తున్నారు. కల్తీ మద్యం, కల్లును నియంత్రించాలి. బెల్టు షాపులను రద్దు చేయాలి. మద్యాన్ని నియంత్రించాలి. సంపూర్ణ మద్య నిషేదం చేయాలి.
మర్రి రాజశేఖర్ వైసిపి...
ప్రభుత్వ, అధికారుల అండదండలతోనే కల్తీ మద్యం నడుస్తోంది. విజయవాడలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ప్రతి నెల మామూళ్లు తీసుకుంటున్నారు. ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మంత్రి, ఎమ్మెల్యేలపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలి. కల్తీ మద్యం అమ్మకాల్లో మద్యాన్ని ఆదాయ, అక్రమ వ్యాపార వనరుగా భావించారు. బెల్టు షాప్ లు చంద్రబాబు హయాంలో వచ్చాయి. ప్రయివేట్ వ్యాపారం పోవాలి. కఠినమైన మద్య నియంత్రణ పాటించాలి. మద్యం.... ప్రభుత్వానికి ఆదాయ వనురుగా కాదు.. సమాజానికి నష్టం. డబ్బు కోసం, ఓట్ల కోసం మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఘటనకు బాధ్యత వహిస్తూ.. ఎక్జ్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర రాజీనామా చేయాలి.. ఘటనకు సంబంధించిన బాద్యులపై చర్యలు తీసుకోవాలి' అని నేతలు అన్నారు.

 

 

20:23 - December 7, 2015

హైదరాబాద్ : సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాలు తనకు రెండు కళ్ల లాంటివని అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలు 5 రోజులు నిర్వహించినా సరిపోతాయన్నారు.

 

20:13 - December 7, 2015

హైదరాబాద్ :కిక్కు కోసం వెళ్లి.. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఏపీలో ఇదే తొలిసారి కాదు. గతంలో మైలవరం.. ఆ తర్వాత అంతర్వేది ఉత్సవం.. అనంతరం బెజవాడ.. ఇప్పుడు మళ్లీ అదే వాడ..! ప్రతిసారీ కల్తీ మద్యం.. అరడజనుకు తక్కువ కాకుండా.. ప్రాణాలను కబళిస్తోంది.గుర్తుండిపోయిన విషాదం మైలవరం మరణాలు. చావులు కలవరాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో.. బాగా గుర్తుండి పోయిన విషాదం.. మైలవరం మరణాలే. కృష్ణాజిల్లా మైలవరం మండలం కనిమెర్ల, పోరాట నగర్‌ గిరిజన తండాలకు చెందిన 19 మంది.. నూతన సంవత్సర వేడుకల్లో కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయారు. 2011 డిసెంబర్‌ 11న ఈ మండలంలో ఏరులై ప్రవహించిన కల్తీ మద్యం... మూడు రోజుల వ్యవధిలో 19 మంది ప్రాణాలను కబళించింది.
మూడు రోజులకే మరో విషాదం
దుర్ఘటన జరిగిన మూడవ రోజున.. మళ్లీ మైలవరం మండలంలోనే... వెదురుగూడెం ప్రాంతంలో కల్తీ సారా తాగి సుమారు 22 మంది అస్వస్థులయ్యారు. అయితే.. అప్రమత్తమైన బంధువులు వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించి బతికించుకున్నారు. హమ్మయ్య అనుకునేలోపే.. 2012 మే నెల్లో.. బెజవాడలో.. కల్తీ మద్యం సేవించి నలుగురు వ్యక్తులు మరణించారు.
తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ సారా మృతులు 26
అదే ఏడాది.. జనవరి నెలలో తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ సారా.. 26 మందిని కబళించింది. అమలాపురం, అంబాజీపేట మండలాల్లోని గంగలకుర్రు అగ్రహారం పాలగుమ్మి, బండారులంక గ్రామాల ప్రజలు.. అంతర్వేది నరసింహస్వామి బ్రహ్మోత్సవం సందర్భంగా కల్తీసారా సేవించారు. అందులో 26 మంది మృత్యువు పాలయ్యారు. ఈ ఘటనలే కాదు.. జిల్లాల్లో అడపాదడపా.. ఒకరిద్దరు చొప్పున కల్తీ మద్యం కాటుకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య లెక్కే లేదు.
కల్తీ మద్యం దందా..
రాష్ట్రంలో కల్తీ మద్యం దందా.. బడుగు జీవుల ప్రాణాలను కబళిస్తోంది. అయితే వ్యాపారులు.. ఈ దందాను సాగిస్తున్న తీరు ఎవరికైనా ఆశ్చర్యం కలిగించక మానదు. ఓ రెండు పద్ధతుల్లో మద్యాన్ని కల్తీ చేస్తూ.. మందుబాబులకు ప్రాణాంతక కిక్కునిస్తున్నారు.. వ్యాపారులు.
కర్నూలు నుంచి సిక్కోలు దాకా కల్తీ మద్యం దందా
రాష్ట్రంలో మద్యం కల్తీ మహమ్మారి.. ఇందుగలడు అందు లేడు అన్న రీతిలో... ప్రతి చోటా వ్యాపించి ఉంది. కర్నూలు నుంచి సిక్కోలు దాకా మద్యం కల్తీ దందా సాగుతోంది. పగలంతా పడ్డ కష్టాన్ని మరిచేందుకు.. లేదా కాస్తంత ఉపశమనం పొందేందుకు కిక్కును ఆశ్రయిస్తున్నాడు. దీన్నే మద్యం వ్యాపారులు అవకాశంగా తీసుకుంటున్నారు. సామాన్యుడి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
రెండు విధానాలుగా మద్యం కల్తీ
రాష్ట్రంలో మద్యం కల్తీ రెండు విధానాలుగా జరుగుతోంది. బ్రాండెడ్‌ మద్యం బాటిల్‌ మూతను.. చాకచక్యంగా ప్రత్యేక యంత్రం ద్వారా తీసి.. అందులోని పాతిక శాతం మద్యాన్ని తీసుకొని.. ఖాళీ అయిన బాటిల్‌లో ఆమేర స్పిరిట్‌ను నింపుతున్నారు. మద్యం ప్రియులకు అనుమానం రాకుండా బాటిల్‌ లేబుల్‌ను, మూతను డబ్లుకం సాయంతో అమర్చుతున్నారు. మద్యం కల్తీకి మహారాష్ట్ర, పుణె, బీహార్‌లలో దొరికే స్పిరిట్‌ను వినియోగిస్తున్నట్లు సమాచారం.
మద్యంలో స్పిరిట్‌ కల్తీ
బీహార్‌ తదితర రాష్ట్రాల నుంచి తెచ్చే స్పిరిట్‌ను మద్యంలో కలిపినా.. మందు బాబులు ఏమాత్రం గుర్తించలేరని సమాచారం. అందుకే ఈ స్పిరిట్‌ను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. మద్యాన్ని కల్తీ చేసేందుకు స్పెషలిస్టులూ ఉన్నారు. మద్యం వ్యాపారులు ఇలాంటి నిపుణులను పెద్ద మొత్తాలు చెల్లించి.. నియమించుకుంటున్నారు. స్పిరిట్‌ కలిపిన మద్యాన్ని రెండు రోజుల్లోగా వినియోగించక పోతే.. దాని అసలు స్వరూపం బయటపడుతుందట. అందుకే.. కల్తీ చేసిన రెండు రోజుల్లోపే మద్యాన్ని వినియోగదారులకు అంటగట్టేస్తున్నారు.
కల్తీ మద్యం సేవించడం వల్ల తలనొప్పి..
స్పిరిట్‌ కలిపిన మద్యాన్ని సేవించడం వల్ల.. మందుబాబులకు తలనొప్పి, వాంతులు, శరీరం వేడెక్కడం, కాళ్లు లాగడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురవుతారు. ఇప్పుడు కృష్ణలంకలో చోటు చేసుకున్న విషాదంలోనూ.. మందుబాబులు ఇలాంటి లక్షణాలతోనే ఆస్పత్రి పాలయ్యారు.
కల్తీ మద్యం బాధ్యత ఎవరిది..?
బడుగు జీవుల ప్రాణాలు కబళిస్తోన్న కల్తీ మద్యం బాధ్యత ఎవరిది..? సామాన్యుడి ప్రాణాలను కబళిస్తూ.. వ్యాపారులను కోట్లకు పడగలెత్తిస్తున్న కల్తీ మద్యాన్ని నియంత్రించడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమవుతున్నాయి..?
కల్తీ మద్యం దందాలో పాలక పక్షపు ప్రముఖులు ?
రాష్ట్రంలో కల్తీ మద్యం విచ్చలవిడిగా అమ్ముడవుతోందన్నది బహిరంగ రహస్యం. చాలా చోట్ల మంత్రులు, పాలక పక్షపు ప్రముఖులు.. ఈ దందాకు దన్నుగా నిలుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆమధ్యన.. కర్నూలు జిల్లాలో ఎక్సైజ్‌ శాఖ పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ నివేదికలో.. సాక్షాత్తు ఆ జిల్లా పరిషత్‌ చైర్మన్‌.. కల్తీ మద్యం దందాను ప్రోత్సహిస్తున్న తీరును కళ్లకు కట్టినట్లు వివరించారు.
కల్తీ మాఫియాగా మద్యం వ్యాపారులు
ప్రముఖులు దన్ను లేని జిల్లాల్లో మద్యం వ్యాపారులే.. కల్తీ మాఫియాగా రూపాంతరం చెందారు. మద్యం కల్తీ నేరానికి కఠినమైన శిక్షలు లేకపోవడంతో.. వీరు ఈ దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా మైలవరం ఘటన అనంతరం.. పోలీసులు పీచెట్టి రామకృష్ణ అనే వ్యాపారిపై పీడీ యాక్టు కింద అరెస్టు చేశారు. అయితే.. కొంత కాలానికే అతను.. కోర్టు వేసిన జరిమానాను చెల్లించి దర్జాగా బయటికి వచ్చి దొరలా తిరిగాడు. దీన్ని బట్టి మద్యం కల్తీకి శిక్షలు ఏమాత్రమున్నాయో ఇట్టే అర్థమవుతుంది.
గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సారా దుకాణాలు
మద్యం వ్యాపారం నిర్వహించటానికి దాని నుండి ఆదాయం పెంచుకోవటానికి ప్రభుత్వం అనుసరించిన విధానమే కల్తీ మద్యం మరణాలకు ముఖ్య కారణమన్నది నిపుణుల వాదన. గతంలో ప్రభుత్వమే సారా దుకాణాలను నిర్వహించేది. 1990 తర్వాత వేలం ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించడం ప్రారంభమైంది. వేలం పాటల్లో సారాషాపులను దక్కించుకోవటానికి, వ్యాపారులు ప్రత్యర్ధి వర్గాలతో రాజీబేరాలు సాగించటం, దారికి రాకుంటే బెదిరింపులకు, ఆఖరికి హత్యలకు కూడా తెగబడుతున్నారు. ఈ విధంగా మద్యం మాఫియా తమ రాజ్యాలను ఏర్పాటు చేసుకొంటూ వస్తున్నాయి.
అతి తక్కువ కాలంలోనే కోట్లకు పడగలెత్తుతున్న వ్యాపారులు
అన్ని రకాల ఎత్తులూ వేసి.. మద్యం దుకాణాలను పొందిన వ్యాపారులు.. అతి తక్కువ కాలంలోనే కోట్లకు పడగలెత్తేందుకు.. మద్యం కల్తీనీ ఒక సాధనంగా వాడుకుంటున్నారు. మిథనాల్‌ తో పాటు.. అలాంటి స్పిరిట్‌లను మోతాదుకు మించి మద్యంలో కలుపుతూ.. సామాన్యుడి జీవితాల్లో మరణశాసనం లిఖిస్తున్నారు.
తరచూ తనిఖీలు అనివార్యం
మద్యం కల్తీని నిరోధించే బాధ్యతను ప్రభుత్వం సక్రమంగా నిర్వర్తించక పోవడం వల్లే.. ఏటా కల్తీ మద్యం మరణాలు సంభిస్తున్నాయి. తరచూ మద్యం దుకాణాలు, బార్‌లలో తనిఖీలు నిర్వహించడం.. కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వచ్చినా.. కఠినంగా వ్యవహరించడం చేయాలి. దీంతో పాటే.. రాష్ట్ర సరిహద్దుల వద్దనున్న చెక్‌పోస్టులలో అన్ని వాహనాలనూ క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. స్పిరిట్‌, నల్లబెల్లం లాంటి పదార్థాల అక్రమ రవాణాను నియంత్రించాలి. ఇవన్నీ చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి. అధికారుల్లో అంతకు మించిన అంకిత భావం ఉండాలి.

 

20:02 - December 7, 2015

కృష్ణా : విజయవాడ కల్తీ మద్యం ఘటనలో బాధితుల సంఖ్య 35కు చేరింది. ఐదుగురు మృతిచెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో నలుగురికి మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. బాధితులను మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు.
ఘటనపై దర్యాప్తు ముమ్మరం
ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. విజయవాడలో మద్యం షాపుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. మేనేజర్‌ రమణరావుతో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు. మరికొంతమంది నిందితులు పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.

35కి చేరిన కల్తీ మద్యం బాధితులు

కృష్ణా : విజయవాడ కల్తీ మద్యం ఘటనలో బాధితుల సంఖ్య 35కు చేరింది. ఐదుగురు మృతిచెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో నలుగురికి మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. బాధితులను మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. 

కల్తీ మద్యం ఘటనపై దర్యాప్తు ముమ్మరం

కృష్ణా : విజయవాడలో కల్తీ మద్యం ఐదుగురు ప్రాణాలను బలితీసుకుంది. మరికొంతమంది పరిస్థితిని విషమంగా మార్చింది. కృష్ణ లంకలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. 

19:18 - December 7, 2015

హైదరాబాద్ : తెలంగాణలో మొత్తం ఎనిమిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అయితే అందులో 8 స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేయాలని యోచిస్తోంది. ఈమేరకు పేర్లను ఖరారు చేసింది. నల్గొండ.. మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహబూబ్ నగర్.. దామోదర్ రెడ్డి, రంగారెడ్డి.. ఏ.చంద్రశేఖర్, మెదక్... బండారు శ్రీకాంత్ లను ఆయా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారైనట్లు తెలుస్తోంది.

 

 

హైదరాబాద్ లో డెంగ్యూ కలకలం..

హైదరాబాద్ : నగరంలో డెంగ్యూ విస్తరిస్తోంది. కాప్రా పరిధిలో డెంగ్యూతో ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందారు. మరోవైపు గాంధీ ఆసుపత్రిలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన కృష్ణవేణి అనే 8నెలల గర్భిణి స్వైన్ ఫ్లూతో చనిపోయింది.

 

19:05 - December 7, 2015

హైదరాబాద్ : నగరంలో డెంగ్యూ విస్తరిస్తోంది. కాప్రా పరిధిలో డెంగ్యూతో ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందారు. మరోవైపు గాంధీ ఆసుపత్రిలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన కృష్ణవేణి అనే 8నెలల గర్భిణి స్వైన్ ఫ్లూతో చనిపోయింది.

 

19:01 - December 7, 2015

విశాఖ : బాక్సైట్ తవ్వకాల విషయంపై సీఎం చంద్రబాబు రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తున్నారని ఎపి కాంగ్రెస్ చీఫ్‌ రఘువీరారెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకించిన చంద్రబాబు...సీఎం అయిన తర్వాత ఎలా అనుమతులిస్తారని ఆయన ప్రశ్నించారు. 'విశాఖ మన్యం గుండెల్లో బాబు బాక్సైట్ బాణం' పేరుతో వాస్తవ పత్రాన్ని విడుదల చేశారు. ఈమేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘువీరా.... చంద్రబాబు తీరును దుయ్యబట్టారు. జివో నెంబర్ 97ను రద్దు చేయాలని కేబినెట్ సమావేశంలోని మినిట్స్ ను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 

18:50 - December 7, 2015

శ్రీకాకుళం : పేదరిక నిర్మూలనే టిడిపి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో జరిగిన జనచైతన్య యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తమ ప్రభుత్వం చేపడుతున్న పథకాలన్నీ ఆ దిశగానే ఉంటున్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా.. రైతు రుణాలను మాఫీ చేస్తున్న ఘనత తమకే దక్కుతుందని పేర్కొన్నారు.

 

18:48 - December 7, 2015

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా దక్కేవరకు పోరాటం చేస్తామని ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు అన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఈ కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా జరుగుతోంది. ఈ సందర్భంగా పలు పార్టీల అగ్రనాయకులు మాట్లాడుతూ బిజెపి వ్యవహార ధోరణిని తప్పుబట్టారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పదవిని పట్టుకుని వేలాడుతూ సొంత రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. 

18:44 - December 7, 2015

హైదరాబాద్ : కల్తీ మద్యం ఘటనపై తక్షణమే న్యాయ విచారణ జరిపించి..బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బాధిత కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

 

18:39 - December 7, 2015

ప్రకాశం : జిల్లాలో పోలీసుల తీరు వివాదాస్పదమైంది. పోలీసులు ఓవరాక్షన్ ప్రదర్శించారు. పొగాకు రైతు కుటుంబానికి న్యాయం చేయమన్నందుకు రైతులపై కేసు నమోదు చేశారు. అప్పుల బాధతో గత నెల 21న పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ అదే రోజు మృతదేహంతో రైతులు పొగాకు ఆర్ ఎంవో కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. దీనిపై ఆర్ ఎంవో ఫిర్యాదు మేరకు ధర్నాకు దిగిన రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. న్యాయం కోరితే కేసులు పెడతారా అంటూ రైతు నాయకులు పోలీసులపై మండిపడుతున్నారు.

 

కేజ్రీవాల్‌ సర్కార్‌ నిర్ణయంపై పార్లమెంట్‌లో నిరసన

ఢిల్లీ : వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కేజ్రీవాల్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయంపై పార్లమెంట్‌లో నిరసన వ్యక్తం అయింది. సరి సంఖ్య ఉన్న వాహనాలు ఒకరోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజు రోడ్డుపై ప్రయాణించాలనే నిబంధను ఢిల్లీ ప్రభుత్వం తీసుకువస్తే చాలా మంది సామాన్యులను ఇబ్బంది కలుగుతుందని తూర్పు ఢిల్లీ ఎంపీ మహేష్ గిర్రి సభలో ప్రస్తావించారు. ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తే లక్షలాది మంది ఇబ్బందులకు గురౌతారని ఆయన అన్నారు. ముఖ్యంగా టూ వీలర్‌లు ఉన్న వాళ్లు ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆయన తెలిపారు.

మిర్యాలగూడ బస్టాండ్‌లో రూ.8.5లక్షల చోరీ

నల్గొండ : జిల్లాలోని మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌లో నగదు చోరీ ఘటన చోటుచేసుకుంది. కోదాడకు చెందిన చక్రధర్‌రావు అనే వ్యక్తి బ్యాగులోంచి గుర్తుతెలియని వ్యక్తులు రూ.8.5లక్షలు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు మిర్యాలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైస్‌మిల్లు నుంచి కోదాడకు డబ్బులు తీసుకెళ్తుండగా ఈ చోరీ జరిగింది.

18:22 - December 7, 2015

హన్మకొండ : వరంగల్ నగరంలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. 4చోట్ల చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. హంటర్ రోడ్, శివ నగర్, మట్వాడ, సుబేదారి ప్రాంతాల్లో స్నాచింగ్ కు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గొలుసు దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. 

18:20 - December 7, 2015

విజయవాడ : ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ మద్యం బాధితులను ఏపీ ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి అన్నారు. బాథితులకు మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తున్నామని తెలిపారు. కల్తీ మద్యం ఘటనపై సీపీఎం, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర ఆందోళన చేపట్టాయి. కల్తీ మద్యంతో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశాయి. మరోపక్క బార్‌ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

17:46 - December 7, 2015

కృష్ణా : విజయవాడ కృష్ణలంకలో కల్తీమద్యం రక్కసి కోరలు చాచింది. కల్తీమద్యం తాగి ఆరుగురు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మిగిలినవారి పరిస్థితి కూడా 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు. స్వర్ణ బార్‌లో జరిగిన కల్తీ మద్యం ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా కల్తీమద్యాన్ని ఆపేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా కల్తీమద్యం ముఠా ఆటను కట్టించలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్తీమద్యం తాగి మృతి చెందిన వారు మునగాని శంకర్‌రావు, కళందర్‌ అలియాస్‌ బాషా, గోపి, మస్తాన్‌వలీ, మదాచి నాంచార్యగా గుర్తించారు. స్వర్ణబార్‌ తనది కాదని మాజీ ఎమ్మల్యే మల్లాది విష్ణు బెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులను శిక్షిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. 

17:40 - December 7, 2015

మహబూబ్ నగర్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేసే విషయంపై టిడిపి సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబ్ నగర్ జిల్లా పార్టీ నేతలతో భేటీ అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొత్తపల్లి దయాకర్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేశారు. అలాగే నిజామాబాద్.. నర్సారెడ్డి, ఆదిలాబాద్... నారాయణరెడ్డి, రంగారెడ్డి... సామా భూపాల్ రెడ్డిల పేర్లను ఆయా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేసే యోచనలో ఉన్నారు. ఎపి సీఎం చంద్రబాబుతో ఫోన్ లో చర్చించి.. ఈ రాత్రికి అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని ఎర్రబెల్లి చెప్పారు.

 

మహబూబ్ నగర్ టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి కొత్తపల్లి దయాకర్ రెడ్డి

మహబూబ్ నగర్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేసే విషయంపై టిడిపి సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబ్ నగర్ జిల్లా పార్టీ నేతలతో భేటీ అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొత్తపల్లి దయాకర్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేశారు. అలాగే నిజామాబాద్.. నర్సారెడ్డి, ఆదిలాబాద్... నారాయణరెడ్డి, రంగారెడ్డి... సామా భూపాల్ రెడ్డిల పేర్లను ఆయా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేసే యోచనలో ఉన్నారు. ఎపి సీఎం చంద్రబాబుతో ఫోన్ లో చర్చించి.. ఈ రాత్రికి అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని ఎర్రబెల్లి చెప్పారు.

 

ఢిల్లీ హైకోర్టులో సోనియా, రాహుల్ లకు చుక్కెదురు

ఢిల్లీ : నేషన్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వారి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టుకు హాజరు కావాలని సోనియా, రాహుల్ లను హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. 

16:49 - December 7, 2015

హైదరాబాద్ : నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ కచ్చితంగా నిర్వహించి తీరుతామని ఫెస్టివల్ నిర్వహకులు తేల్చి చెప్పారు. ఈనెల 10 న తల పెట్టిన బీఫ్ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని కోరుతూ నిర్వహకులు ఇవాళ 2కె రన్ నిర్వహించ తలపెట్టారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో నిర్వహకులు పోలీసులు, ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈమేరకు వారు టెన్ టివితో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఓయూలో పలు ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు తెలిపామని... ఏ ఒక్కదానికి కూడా పోలీసుల అనుమతి తీసుకోలేదని చెప్పారు. నాడు జరిగిన తెలంగాణ సాధన పోరాటంలో దళితులు ముందుండి పోరు చేశారని... అలాంటి వారు ఇప్పుడు తమ ఆహారమైన బీఫ్ ను ఫెస్టివల్ గా నిర్వహించాలనుకుంటే అడ్డుపడడం ఏమాత్రం భావ్యం కాదన్నారు. విద్యార్థుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. విద్యార్థినులను మగ పోలీసులు ఈడ్చుకెళ్లి వ్యాన్ లో పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎపి ఉమ్మడి ప్రభుత్వం కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదన్నారు. కానీ తాము కోరి తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వం దారుణ పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ ఎస్.. ప్రజా వ్యతిరేక విధానాల అవలంభిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం దేశంలో తమకు ఇష్టమైన ఆహారం తినే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. ఆవుపై చేయి వేస్తే ఊరుకోమని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై విద్యార్థులు తీవ్రంగా మండిపడ్డారు. కచ్చితంగా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.

 

15:54 - December 7, 2015

ఢిల్లీ : ఉత్తర భారతదేశంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ, పంజాబ్, కాశ్మీర్ లలో స్వల్పంగా భూమి కంపించింది. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. తీవ్ర భయాందోళలనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై భూకంప త్రీవత 7.2 గా నమోదు అయింది. తజకిస్తాన్ లో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది.

 

కల్తీ మద్యం బాధితులను పరామర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర

కృష్ణా : విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కల్తీ మద్యం బాధితులను ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు ఉదయం పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని,, బాధ్యులెంతటివారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఢిల్లీ టెస్టులో భారత్ ఘన విజయం

ఢిల్లీ : టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై 337 పరుగలు తేడాతో భారత్ గెలుపొందింది. టెస్టు సీరీస్ 3-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్ లో 143 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్ అయింది. 

ఎనిమిదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

ఢిల్లీ టెస్టు : దక్షిణాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. విజయానికి భారత్ రెండు వికెట్ల దూరంలో ఉంది.  

ఉత్తర భారతదేశంలో భూ ప్రకంపనలు

హైదరాబాద్ : ఉత్తర భారతదేశంలో భూ ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ,పంజాబ్, యూపీ, జమ్మూకాశ్మీర్ లో భూమి కంపించింది. తజకిస్థాన్ లో భూ కంపకేంద్రంగా ఈ ప్రంకపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత 7.2 గా రిక్టర్ స్కేల్ పై నమోదయ్యింది.

ఆ బార్ నాది కాదు : మల్లాది విష్ణు

విజయవాడ : కృష్ణలంక బార్ కల్తీ మద్యం ఘటనలో బార్ యజమానిగా ప్రచారం సాగుతున్న కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియా ముందుకు వచ్చారు. వార్తా చానెళ్లలో ప్రచారం సాగుతున్నట్టుగా స్వర్ణ బార్ తనది కాదని, అది తన బంధువులది అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారులు ఎలాంటి విచారణ చేసినా తనకు అభ్యంతరం లేదని ఆయన తేల్చిచెప్పారు. బార్ తన బంధువులది అయినప్పటికీ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగాల్సిందేనని ఆయన చెప్పారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

13:36 - December 7, 2015

విజయవాడ : కృష్ణ లంకలో కల్తీ మద్యంతో ఆరుగురు చనిపోగా మరో 20 మంది తీవ్ర అవస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ బార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ప్రజా ప్రతినిధి మల్లాది విష్ణుది. ఈ ఘటన పై ఆయన 'టెన్ టివి'తో మాట్లాడుతూ.. నేను కాదు దాని యజమానికాదని... నకిలీ మద్యం అమ్మడం లేదని స్పష్టం చేశారు. అధికారులు అందరూ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు మంచినీళ్లలో పాయిజన్ కలిపారని ఆరోపించారు. బార్ లో ఉన్న సీసీటీవీ ఫుట్ జ్ ల ఆధారంగా ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

13:33 - December 7, 2015

విజయవాడ : కృష్ణ లంకలో కల్తీ మద్యం వల్ల 6గురు చనిపోయారు. ఈ ఘటనకు ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ వైఫల్యం వల్లే జరిగిందని సీపీఎం నేత బాబూరావు ఆరోపించారు.. ప్రభుత్వ తమ ఖనా నింపుకునేందుకు విచ్చలవిడిగా మద్యానికి అనుమతి ఇవ్వడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని మండిపడ్డారు. కల్తీ మద్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు అర్థం అవుతుందని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు బాధ్యత వహించి... బాధితులకు తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

13:09 - December 7, 2015

విజయవాడ : కృష్ణ లంకలో స్వర్ణ వైన్ షాప్ కల్తీ మద్యం తాగి దాదాపు ఆరుగురు మృతి చెందారు. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 4గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చంద్రబాబు సర్కార్ విచ్చలవిడిగా బార్లకు లైసెన్సు ఇచ్చిన ప్రజలను పొట్టన పెట్టుకున్నారని... దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని... బాధిత కుటుంబాలకు వెంటనే రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని సీపీఎం నేత కాశీనాథ్ డిమాండ్ చేశారు.

పాక్ పర్యటనకు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్

న్యూఢిల్లీ: విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం పాకిస్తాన్లో పర్యటించనున్నారని కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ తెలిపారు. న్యూఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇస్లామాబాద్ వెళ్లి చర్చలు జరిపి భారత్కి ఆమె తిరిగొచ్చాక ఓ ప్రకటన చేస్తారని రాజీవ్ చెప్పారు. పాక్ లో జరగనున్న భద్రతా సదస్సును ముగించుకుని స్వదేశానికి ఆమె విచ్చేసిన తర్వాత పార్లమెంట్ ఉభయసభలలో ఈ విషయంపై చర్చిద్దామన్నారు.

కల్తీ మద్యం ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

విజయవాడ : కృష్ణలంక ఎం హోటల్ లో చోటు చేసుకున్న కల్తీ మద్యం ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న సీఎంకు ఘటన విషయం తెలియడంలో వెంటనే అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై విచారణ జరిపించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. బాధితులకు మెరుగైన సాయం అందించాలని చెప్పారు.

వజ్రపు కొత్తూరులో సీఎం చంద్రబాబు పర్యటన

శ్రీకాకుళం : వజ్రపు కొత్తూరులో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కళాభారతి వీధిలో గ్రామస్తులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

బ్లేడుతో గొంతు కోసుకున్న కానిస్టేబుల్

నల్గొండ : తుర్కపల్లి పీఎస్ లో గౌస్ అనే కానిస్టేబుల్ బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఏపీ సచివాలయంలో కమల్ నాథన్ కమిటీ భేటీ

హైదరాబాద్ : ఏపీ సచివాలయంలో కమల్ నాథన్ కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్ లు పాల్గొన్నారు. ఉద్యోగుల విబజన సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం.

మంత్రి తలసానికి తప్పిన ప్రమాదం

హైదరాబాద్ : ఎర్రగడ్డ సెయింట్ థెరిస్సా ఆసుపత్రిలో వైరు తెగి సెకండ్ ఫ్లోర్ నుంచి లిప్ట్ కింద పడింది. ఈ లిఫ్ట్ లో మంత్రి తలసానితో సహా 16 మంది ఉన్నట్లు సమాచారం. అప్రమత్తమైన అధికారులు లిప్ట్ గ్రిల్స్ తొలగించి మంత్రిని బయటకు తీశారు.

12:09 - December 7, 2015

విజయవాడ : కృష్ణలంకలో కల్తీ మద్యం కలకలం రేగింది. స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ లో కల్తీ మద్యం తాగి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా ఈ బార్ పై అనేక ఆరోపణలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. మరో వైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

12:07 - December 7, 2015

హైదరాబాద్ : మాజీ మంత్రి దానం నాగేందర్ టీఆర్ ఎస్ లో చేరుతున్నారన్న ప్రచారానికి ఆయన తెరదించారు. ఎమ్మెల్సీ షబ్బీర్ అలీతో ఆయన భేటీ అయ్యి అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడనని స్పష్టం చేశారు. తనను టీఆర్ ఎస్ ఆహ్వానించిన మాట వాస్తవమేనని ఆయన తెలిపారు. మంగళవారం గోల్కొండ హోటల్ లో గ్రేటర్ ఎన్నికలపై పార్టీ నేతలతో భేటీ కానున్నట్లు పేర్కొన్నారు. కొందరు నాయకులు పార్టీ నుంచి పొమ్మనక పొగపెడుతున్నారని నాగేందర్ ఆరోపించారు.

కాంగ్రెస్ కు గ్రహణం పట్టింది- పుంజుకుంటాం: షబ్బీర్

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి గ్రహణం పట్టిందని... పుంజుకుంటామని ఆపార్టీ నేత షబ్బీర్ అలీ తెలిపారు. టిఆర్ ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందని మండిపడ్డారు. కిరాయి నేతలతో ప్రభుత్వం నడపాలని చూస్తున్నారని...కొత్త రాష్ట్రంలో ఈ పద్ధతి మంచి కాదని హితవు పలికారు. కొనేస్తాం, పరిపాలిస్తామంటే ప్రజలు మెచ్చరన్నారు.

టిటిడి పాలక మండలి సమావేశం ప్రారంభం

తిరుమల : టిటిడి పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పాలక మండలి సభ్యుడు సాయన్నతో పాటు మరో ఏడుగురు సభ్యులు గైర్హాజరయ్యారు. ఇటీవలే టిడిపి నుండి టీఆర్ ఎస్ లో చేరిన సాయన్నను పాలక మండలిలో సభ్యనిగా కొనసాగించాలా... వద్దా అనే అంశం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

కృష్ణలంకలో కల్తీ మద్యం కలకలం

విజయవాడ : కృష్ణలంకలో కల్తీ మద్యం కలకలం రేగింది. స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ లో కల్తీ మద్యం తాగి 15 మందికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్: నకిలీ విసాతో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. అతడిని ఖాదీర్ బాషాగా, ప్రకాశం జిల్లా వాస్తవ్యుడిగా గుర్తించారు. విచారణ నిమిత్తం అతడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. ఎయిర్‌పోర్టు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత వారం రోజుల క్రితం కడపకు చెందిన 10 మంది నకిలీ వీసాతో దుబాయ్‌కి వెళుతూ పట్టుడి అరెసు అయిన సంగతి తెలిసిందే.

ఎబ్సీ నగర్ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: నగరంలోని ఎల్‌బీ నగర్‌లో ఉన్న మారుతీ మెకానికల్ గ్యారెజ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. గ్యారేజ్ పక్కనే ఉన్న చెత్త డంప్ నుంచి మంటలు మెకానిక్ షాప్‌కు వ్యాపించాయి. మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

గవర్నర్ ను కలిసిన ఏపీ అసెంబ్లీ స్పీకర్

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కొద్దిసేపటి క్రితం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలిశారు. హైదరాబాదులోని రాజ్ భవన్ కోడెల గవర్నర్ తో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పురపాకల సంఘం శతాబ్ది ఉత్సవాలు ఈ నెల 11 నుంచి జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరుకావాలని గవర్నర్ ను కోడెల ఆహ్వానించారు. ఇందుకోసమే కోడెల రాజ్ భవన్ కు వెళ్లారు. ఉత్సవాలను రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని సంకల్పించిన కోడెల ఇప్పటికే విపక్ష పార్టీలకు చెందిన నేతలకు కూడా ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారు.

కాంగ్రెస్ లోనే ఉంటా : దానం

హైదరాబాద్ : మాజీ మంత్రి దానం నాగేందర్ టీఆర్ ఎస్ లో చేరుతున్నారన్న ప్రచారానికి ఆయన తెరదించారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడనని స్పష్టం చేశారు. తనను టీఆర్ ఎస్ ఆహ్వానించిన మాట వాస్తవమేనని ఆయన తెలిపారు. మంగళవారం గోల్కొండ హోటల్ లో గ్రేటర్ ఎన్నికలపై పార్టీ నేతలతో భేటీ కానున్నట్లు పేర్కొన్నారు. కొందరు నాయకులు పార్టీ నుంచి పొమ్మనక పొగపెడుతున్నారని నాగేందర్ ఆరోపించారు.

గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా నాగలక్ష్మి

హైదరాబాద్ : గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ గా ఎన్.నాలక్ష్మి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఐదు నెలలు గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహించిన అనురాధ బదిలీ అయ్యారు. దీంతో ఆమె స్థానంలో నాగలక్ష్మిని ప్రభుత్వం నియమించింది.

11:13 - December 7, 2015

హైదరాబాద్: దేశంలో యాసిడ్ దాడికి గురైన వారందరినీ వికలాంగులుగా పరిగణించాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వారందరినీ వికలాంగుల చట్టం పరిధి కిందకు తీసుకురావాలని అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలు పంపింది. యాసిడ్ దాడి బాధితులకు వికలాంగుల చట్టం నిబంధనల కింద ఉచిత చికిత్స, ఆపై పునరావాసం, పరిహారం ఇవ్వాలని కొద్దిసేపటి క్రితం వెల్లడించింది. వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. ఇతర అంగవికలురు పొందుతున్న అన్ని రకాల ప్రయోజనాలను వీరికీ కల్పించాలని తెలియజేసింది.

జీవో 97ను రద్దు చేయాలి : రఘువీరారెడ్డి

విశాఖ : బాక్సైట్ తవ్వకాలపై వాస్తవ పత్రాన్ని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విడుదల చేశారు. దీంతో పాటుగా సీఎం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పటి ప్రసంగాల సీడీ విడుదల చేశారు. ఈ సందర్భంగా జీవో 97, పర్యావరణ అనుమతులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఓయూ లో ఉద్రిక్తత

హైదరాబాద్ : ఓయూలో బీఫ్ ఫెస్టివల్ కు మద్దతుగా 2కే రన్ నిర్వహించేందుకు విద్యార్థులు సమాయత్తం అయ్యారు. 2కే రన్ పాల్గొనేందుకు వస్తున్న విద్యార్థులను, నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో విద్యార్థులు.. పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

మంత్రి వీకే సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆందోళన

ఢిల్లీ : మంత్రి వీకే సింగ్ వ్యాఖ్యలకు నిరసనంగా పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది.

సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి

జమ్మూకాశ్మీర్ : అనంతనాగ్ జిల్లా బిజ్ బెహారాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి.

10:51 - December 7, 2015

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అంటారు మన పెద్దలు.. వెల్లుల్లి గురించి తెలియని వారు దాదాపు ఉండరనే చెప్పాలి, నిజానికి వెల్లుల్లి ఆహార పదార్థాలకు అద్భుత రుచిని అందించే మరియు అన్ని రకాల ఆహార పదార్థాలలో వాడే ఇంట్లో ఉండే సహజ ఔషదంగా పేర్కొనవచ్చు. వెల్లుల్లి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోనూ, పెద్దప్రేగు క్యాన్సర్, పురీషనాళ, స్టమక్, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్, మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ లను నిరోధించటంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.

బరువు తగ్గించడంలో...

రోజుకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు తింటే జీర్ణాశయంలో ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతాము. అంతే కాదు జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రాసెస్ చేయడమే కాదు అవసరమైన ఫ్యాట్ ను శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది.

రక్తాన్ని శుద్ది చేయడంలో...

వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. అంతే కాదు శరీరం లోపలి భాగాల్ని కూడా శుద్ధి చేస్తుంది. శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్ ను హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ గా మారుస్తుంది. ఈ గ్యాస్ రక్తపోటును నియంత్రిస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల చర్మంపై ముడతలు ఏర్పడవు, ప్రమాదకరమైన విష పదార్థల నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది.

కాలేయానికి...

వెల్లుల్లిలో ఉండే ఎలిసిన్, సెలినియం రసాయనాలు ఫ్యాటీ లివర్ జబ్బును ట్రీట్ చేసే బైల్ అనే ఫ్లూయిడ్ ను ఎక్కువగా ఉత్పిత్తి చేస్తాయి. దీనిలో యాంటాక్సిడెంట్లు కూడా బాగా ఉన్నాయి. వీటిల్లో అమినోయాసిడ్స్, ప్రోటీన్లు కూడా ఉన్నాయని అధ్యయనాల్లో వెల్లడయింది. ఇవి కాలేయాన్ని ప్రకృతిసిద్ధమైన విష పదర్థాల నుంచి రక్షిస్తాయి...

బిపి, షుగర్ తగ్గించడంలో....

వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పది నుంచి ఆరు శాతం వరకూ తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉన్న రసాయానాలకు ఆర్డీరియల్ ఫ్లేక్ ఫ్మారేషన్ కాకుండా ఆపగల సామర్థ్యం కూడా ఉంది. వెల్లుల్లిలో గ్లూకోజ్ టాలరెన్స్ ను మెరుగు పరుస్తుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని గుజ్జులా చేసి గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లతో నోట్లో వేసుకుని మింగేయాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ తగ్గుముఖం పడుతుంది. 

బైక్ ను ఢీకొన్న లారీ :ఇద్దరు మృతి

మెదక్ : చేగుంట మండలం పోతాన్ శెట్టి పల్లి వద్ద ప్రమాదం జరిగింది. బైక్ ను లారీ ఢీ కొనడంతో ఇద్దరు ఐటీఐ విద్యార్థులు మృతి చెందారు. అనిల్, రాజులుగా గుర్తించారు.

సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్థన్ కు అస్వస్థత

ఢిల్లీ : సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్థన్ అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు ఉదయం గుండె పోటు రావడంతో జీబీ పంథ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య

కరీంనగర్ : పెద్ద పల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడు వరంగల్ జిల్లా చిట్యాలకు చెందిన ప్రశాంత్ పోలీసులు గుర్తించారు. 

చివరి రోజు ఆట ప్రారంభం

హైదరాబాద్ : భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో చివరి రోజు ఆట ప్రారంభమైంది. 481 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా ఓవర్ నైట్ స్కోర్ 72/2 తో దక్షిణాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. క్రీజులో ఆమ్లా(23), డివిలియర్స్ (11) ఉన్నారు.

 

09:41 - December 7, 2015

హైదరాబాద్ : టిఆర్ ఎస్ లో చేరికపై దానం నాగేందర్ డైలమాలో వూగిసలాడుతున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్ సమక్షంలో దానం కారెక్కేందుకు సిద్ధమయ్యారు. కానీ కేసీఆర్ మాత్రం కేకే సమక్షంలో టిఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోవాలని సూచించడంతో దానం అవాక్కయినట్లు సమాచారం.  నగరంలోని పలు ప్రాంతాల్లో వెలసిన ఫ్లెక్సీలు రాత్రికి రాత్రే కనుమరుగయ్యాయి. ఈ ఫ్లెక్సీలను దానం అనుచరులే తొలగించినట్లు తెలుస్తోంది. ఫ్లెక్సీల తొలగింపునకు కేసీఆర్ తీసుకున్న ఓ నిర్ణయమే కారణమన్న వాదన వినిపిస్తోంది. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో దానం టీఆర్ఎస్ లో చేరాలని భావించారు. అయితే తన సమక్షంలో కాకుండా పార్టీ కీలక నేత కె.కేశవరావు సమక్షంలో పార్టీలో చేరిపోవాలని దానంకు కేసీఆర్ సూచించారట. దీంతో కంగుతిన్న దానం టీఆర్ఎస్ లో చేరికపై డైలమాలో పడ్డారట. అంతేకాక తనలాంటి సీనియర్ నేత వస్తుంటే, కేసీఆర్ తన కింది స్థాయి నేత వద్ద చేరమనడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన దానం, తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఫ్లెక్సీలను తొలగించాలని ఆయన తన అనుచరులకు సూచించారట. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన దానం అనుచర వర్గం ఏర్పాట్లు చేసిన కొద్ది గంటల్లోనే ఫ్లెక్సీలను తొలగించారని వదంతులు వినిపిస్తున్నాయి.

09:27 - December 7, 2015

వరంగల్ : మూగ, చెవిటి ఆశ్రమంలో పెళ్లి బాజాలు మోగాయి... మాటలు రాకపోతేనేం... మనసులు కలుసుకున్న ఆ జంట వేదమంత్రాలమధ్య ఒక్కటైంది.. మానసిక వికలాంగుల మధ్య వైభవంగా జరిగిన ఈ పెళ్లి అందరి మనసుల్లో సంతోషం నింపింది..

హన్మకొండ మల్లికంబ మానోవికాస కేంద్రంలో ....

హన్మకొండ మల్లికంబ మానోవికాస కేంద్రంలో ఓ అరుదైన వివాహం జరిగింది.. ఇద్దరు మూగ, చెవిటి యువతీ యువకులను వేదమంత్రాల సాక్షిగా ఒక్కటిచేశారు ఈ కేంద్రం నిర్వాహకులు.. పెంచి పెద్ద చేయడంతో తమ బాధ్యత తీరిందనుకోలేదు... తగిన వరుడిని వెతికి మరీ అమ్మాయికి కల్యాణం జరిపించారు..

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ యువతి....

వధువు సరస్వతి ఇంటర్‌ చదివి బ్యుటీషియన్‌గా పనిచేస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ యువతి కుటుంబసమస్యలతో ఊరొదిలివచ్చేసింది.. హన్మకొండ బస్టాండ్‌లోఉన్న ఈమెను స్థానికులు మనోవికాసకేంద్రంలో చేర్పించారు.. అక్కడే చదువు పూర్తిచేసి స్వయం ఉపాది చూసుకుంది.... పెళ్లీడుకొచ్చిన సరస్వతికి... నరేందర్‌ సరైన జోడీ అని ఆశ్రమ నిర్వాహకులు భావించారు.. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డాక పెళ్లికి మహూర్తం పెట్టారు..

మాట్లాడలేడు.. వినలేడు.

అటు వరుడు నరేందర్‌ కూడా మాట్లాడలేడు.. వినలేడు.. హన్మకొండలో చిన్న ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.. సరస్వతితో ఇతనికి మనసు కలిసింది.. ఆశ్రమ నిర్వాహకుల సమక్షంలో వధువును వివాహమాడాడు ఈ యువకుడు. ఈ పెళ్లిని దగ్గరుండి జరిపించారు ఎన్ ఆర్ఐ జ్యోతిరెడ్డి... నిండుమనసుతో వధూవరులిద్దరినీ ఆశీర్వదించారు.. కేవలం నరేందర్, సరస్వతేకాదు... ఆశ్రమంలోని మిగతావారికీ తగు జోడీచేసి పెళ్లిచేస్తామన్నారు జ్యోతిరెడ్డి.. 

దానంకు సీఎం కేసీఆర్ ఝలక్

హైదరాబాద్ : టిఆర్ ఎస్ లో చేరికపై దానం నాగేందర్ డైలమాలో వూగిసలాడుతున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్ సమక్షంలో దానం కారెక్కేందుకు సిద్ధమయ్యారు. కానీ కేసీఆర్ మాత్రం కేకే సమక్షంలో టిఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోవాలని సూచించడంతో దానం అవాక్కయినట్లు సమాచారం. గత రాత్రి భారీ కటౌట్లు ఏర్పాటు చేయాలని ఆశించిన దానంకు సీఎం కేసీఆర్ సూచనలతో అస్సలు టిఆర్ ఎస్ లో చేరాల లేదా అన్న డైలమాలో ఉన్నట్లు అనుచరులు చెప్తున్నారు.

చెన్నై నుండి 11 రైళ్లు రద్దు...

చెన్నై: ఎగ్మోర్, చెన్నై సెంట్రల్ నుంచి 11 రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రద్దయిన రైళ్లలో టికెట్ల రీఫండ్ కోసం 10 రోజుల గడువు ఉందని దక్షిణ రైల్వే వర్గాలు తెలిపింది. చెన్నైలోని లోకల్ రైలు సర్వీసులు యధాతథంగా తిరగనున్నాయి. ఈ రోజు నుంచి చెన్నై ఎయిర్‌పోర్టులో పూర్తిస్థాయిలో విమాన సేవలు అందించనున్నారు. విమానాల రాకపోకలకు దేశీయ టెర్మినల్ సిద్ధంగా ఉందని ఏఏఐ ప్రకటించింది. పునరావాస సహాయ చర్యలకు 60 బృందాలను సైన్యం వినియోగిస్తుంది.

గుంటూరు మిర్చియార్డులో నిలిచిన లావాదేవీలు

గుంటూరు : మార్కెటింగ్ శాఖలో ఇటీవల అమల్లోకి తెచ్చి ఈ -ట్రేడింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు మిర్చి యార్డు కమిషన్ వ్యాపారులు ఆందోళన బాట పట్టారు. రైతులతో పాటు తమకూ ఈ విధానం అనుకూలంగా లేదని నిరసిస్తూ సోమ, మంగళవారాల్లో గుంటూరు మిర్చి యార్డులో లావాదేవీలు బహిష్కరణకు పిలుపునిచ్చారు.

ఖమ్మం వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గా కమల్ రాజ్

ఖమ్మం : వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గా కమల్ రాజ్ పేరును ఖరారు చేసింది. రేపు నామినేషన్ చేయనున్నట్లు వైసీప అధిష్టానం తెలిపింది.

08:01 - December 7, 2015

హైదరాబాద్: ఏపీ ప్రత్యేక హోదా గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేద ని న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్న సీనియర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం పై బిజెపి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని వామపక్ష పార్టీలు నేడు పార్లమెంట్ వేదికగా ఆందోళన చేపట్టబోతున్నాయి. ప్రత్యేక హోదా వస్తుందని చెప్తున్న మాటలకు విశ్వసనీయత ఉంటుందా? రైతులకు రుణమాఫీ చేస్తే విచ్చలవిడి ఖర్చు అవుతుందా? ప్రత్యేక హోదా పై టిడిపి, బిజెపి కుమ్మక్కయ్యారా?వామపక్షాలు చేసే పోరాటానికి టిడిపి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందా? టిడిపి, బిజెపి నేతల మధ్య జరుగుతున్న విమర్శలు నిజమైనవేనా? ఎన్నిల కోణంతో బిజెపి ఆలోచిస్తుందా? అన్ని వ్యవస్థల్లో అవినీతి పెరిగిపోతోందా? సామాన్యుల గురించి న్యాయవ్యవస్థ పని చేస్తున్నాయా? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో తెలకపల్లి రవితో పాటు టిడిపి నేత విజయ్ కుమార్, కాంగ్రెస్ నేత రవిచంద్రారెడ్డి,బిజెవైఎం అధ్యక్షుడు విష్ణు వర్థన్ రెడ్డి పాల్గొన్నారు. మరి ఆ చర్చను మీరూ వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

రంగాపూర్ వద్ద యువకుడి దారుణ హత్య...

రంగారెడ్డి: జిల్లాలోని మంచాల మండలం రంగాపూర్ దగ్గర దారుణ సంఘటన చోటు చేసుకుంది. బైక్‌పై వెళుతున్న కిరణ్ అనే యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు యువకుడి తల, మొండెం వేరు చేశారు. మృతుడు యాచారం మండలం మేడిపల్లి వాసిగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

కారెక్కనున్న దానం నాగేందర్ !

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు దానం నాగేందర్ సీఎం కేసీఆర్ సమోంలో కారెక్కేందుకు సిద్ధమయినట్లు సమాచారం. గత కొన్ని రోజులు గా దానం టిఆర్ ఎస్ లో చేరతారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దానంతో టిఆర్ ఎస్ నేత డి.శ్రీనివాస్, హరీశ్ రావులు గత కొన్ని రోజులుగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి ట్రాక్టర్ బోల్తా : ఒకరి మృతి

అనంతపురం : జిల్లాలో పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతిచెందగా, మరికొంత మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా కుందుర్తి మండలం లోని మలయనురు వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పెళ్లిబృందం ట్రాక్టర్లో వెళ్తుండగా అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ట్రాక్టర్ లో వెళ్తున్న ఒకరు చనిపోగా, వధూవరులు సహా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలిస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

చిత్తూరు : నేడు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 3 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

తిరుమల రెండో ఘాట్ రోడ్ లో వాహనాలకు అనుమతి

చిత్తూరు : నేటి నుంచి తిరుమల రెండో ఘాట్ రోడ్డులో వాహనాలకు అనుమతి ఇస్తున్నట్లు టిటిడి ఈఓ సాంబశివరావు తెలిపారు. తిరుమలలో గురిసిన వర్షాల వల్ల కొండచరియలు పడిపోవడం వల్ల కొద్ది రోజుల నుంచి ఈ ఘాట్ రోడ్ ద్వారా వాహనాలకు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.

గవర్నర్ ను కలవనున్న ఏపీ స్పీకర్ కోడెల

విజయవాడ : నేడు ఉదయం 11.15గంటలకు గవర్నర్ నరసింహన్ తో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ భేటీ కానున్నారు. నర్సరావు పేట మున్సిపాలిటీ శతాబ్ధి ఉత్సవాలకు గవర్నర్ ను ఆహ్వానించేందుకే స్పీకర్ కలవనున్నట్లు సమాచారం.

 

చింటూ ఆఫీసు, నివాసంలో ఈడీ బృందం సోదాలు

హైదరాబాద్ : చిత్తూరు మేయర్‌ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ ఆర్ధిక లావాదేవీపై ఉచ్చు బిగిస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఆయన ఆస్తులపై ఆరా తీస్తున్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్‌

హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచే పార్టీ అభ్యర్థులను... పాలక టీఆర్ఎస్‌ ప్రకటించింది. ఇప్పటివరకూ బరిలో నిలిపే ఏడుగురి పేర్లను కారు పార్టీ ప్రకటించింది. స్థానిక సంస్థల్లో పార్టీకి పట్టు లేని జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో కాస్త తర్జన భర్జన పడుతోంది. ఇక విపక్షాలు బరిలో నిలిపే అభ్యర్థుల విషయమై ఇంకా పూర్తి స్థాయి కసరత్తునే చేపట్టలేదు. 

చెన్నై ఐటీ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ

హైదరాబాద్ : చెన్నై ఐటీ పరిశ్రమ చిన్నబోయింది. వరద విలయం నుంచి తేరుకోవడానికి తంటాలు పడుతోంది. ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో పడిపోవడంతో వందల కోట్లు నష్టం వాటిల్లింది. పని ప్రారంభించే పరిస్థితి ఇప్పటికీ లేకపోవడంతో ఉద్యోగులను ఇతర నగరాలకు తరలిస్తున్నారు. అటు ఆటోమొబైల్‌ రంగం కూడా వరదల తాకిడితో అతలాకుతలమైంది. ఈ రంగమూ వేల కోట్ల రూపాయలు నష్టపోయింది.

వరద బీభత్సం నుంచి కోలుకుంటున్న చెన్నై

హైదరాబాద్ : చెన్నై క్రమంగా కోలుకుంటోంది.వరద ముంపు నుంచి బయటకు వస్తోంది.ఐనా వరుణుడు భయపెడుతూనే ఉన్నాడు.అక్కడక్కడా వర్షిస్తూ..ప్రజలను వణికిస్తున్నాడు.భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో ఇళ్లు కుప్ప కూలడంతో బాధితులు పుట్‌పాత్‌ల మీదే నివాసముంటున్నారు. అక్కడే తాత్కాలిక నివాసాలను ఏర్పాటుచేసుకుని తలదాచుకుంటున్నారు.నిత్యావసర వస్తువుల కోసం లక్షలాది మంది బాధితులు కళ్ల కాయలయ్యేలా ఎదురు చూస్తున్నారు.

07:14 - December 7, 2015

హైదరాబాద్ : చెన్నైలో ఐటీ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలింది. భారీ వర్షాలు, వరదల కారణంగా వివిధ ఐటీ సంస్థలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో సంస్థల్లో పని నిలిచిపోయింది. ఉద్యోగులు కార్యాలయానికి రాలేని పరిస్థితి నెలకోవడంతో ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో పడిపోయాయి. తాజా వరదల వల్ల.. చెన్నై ఐటీ పరిశ్రమ వందల కోట్ల రూపాయలను కోల్పోయిందని ప్రాథమిక అంచనా.

ఐటీ పరిశ్రమకు రూ. 400 కోట్లు నష్టం!......

చెన్నై వరద కారణంగా ఐటీ పరిశ్రమకు సుమారు 400 కోట్ల రూపాయల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని కంపెనీలూ నష్టపోయాయి. చిన్న ఐటీ కంపెనీలు సుమరు 70 కోట్ల రూపాయల దాకా నష్టపోయాయయని.. పెద్ద సంస్థలు అటూ ఇటుగా 350 కోట్ల రూపాయల దాకా నష్టపోయాయని అంచనా వేస్తున్నారు.

ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న సంస్థలు...........

చెన్నై వరదలు మిగిల్చిన ప్రతికూల పరిస్థితుల్లో... పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఐటీ సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు తరలించి మరీ ప్రాజెక్టులను కంప్లీట్‌ చేయిస్తున్నాయి. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను ఇతర నగరాలకు ప్రత్యేక బస్సుల్లో తరలిస్తున్నాయి. ఆ నగరాల్లో ఉన్న కార్యాలయాల్లో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయిస్తున్నాయి.

ఆటోమొబైల్‌ రంగానికి తీవ్ర నష్టం........

వరద కారణంగా చెన్నై ఆటోమోబైల్‌ రంగం తీవ్రంగా దెబ్బతింది. ఈ రంగానికి సుమారు 15,000 కోట్ల రూపాయల నష్టం కలిగిందని అంచనావేస్తున్నారు. చిన్న, మధ్య తరహా, సాంకేతిక, టెక్స్టైల్ పరిశ్రమలు కూడా తీవ్రంగా ప్రభావితం అయినట్లు అసోచామ్ వెల్లడించింది. వర్షాలతో మూతపడిన పలు కంపెనీలు తెరిపినబడి... తెరుచుకోవడానికి మరికొన్ని రోజులు పట్టేలా ఉందని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. 

07:05 - December 7, 2015

హైదరాబాద్ : స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు.. తమ పార్టీ అభ్యర్థులను టీఆర్ఎస్‌ నాయకత్వం ప్రకటించింది. ఇంతకుముందే.. నల్లగొండ స్థానానికి తేరా చిన్నప్పరెడ్డి పేరును ఖరారు చేసిన టీఆర్ఎస్‌.. ఆదివారం మరికొన్ని పేర్లను ప్రకటించింది. ఆదిలాబాద్‌ స్థానానికి పురాణం సతీశ్‌, మెదక్‌ నుంచి భూపాల్‌రెడ్డి, నిజామాబాద్‌ నుంచి భూపతిరెడ్డిలు పోటీ చేస్తారని టీఆర్ఎస్‌ నేత కె.కేశవరావు తెలిపారు. కరీంనగర్‌ జిల్లాలోని రెండు స్థానాల నుంచి భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణ్‌రావులు, ఖమ్మం నుంచి బాలసాని లక్ష్మీనారాయణ టీఆర్ఎస్‌ పక్షాన బరిలో నిలుస్తారు. స్థానిక సంస్థల ఓటర్ల మద్దతు పెద్దగా లేని.. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలతో పాటు.. వరంగల్‌ జిల్లా అభ్యర్థినీ ప్రకటించాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాలనూ టీఆర్ఎస్‌ కైవసం చేసుకుంటుందని ఆపార్టీ నాయకత్వం ధీమాగా ఉంది. అభ్యర్థుల ప్రకటనలతో టీఆర్ఎస్‌ దూకుడు ప్రదర్శిస్తుంటే.. విపక్షాలు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఖమ్మం స్థానం నుంచి వామపక్ష అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావు ఒక్కరే ఇప్పటివరకూ నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు అధికారికంగా తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. పేర్లను ముందే ప్రకటిస్తే.. వారినీ ఆకర్ష అస్త్రంతో పాలక పక్షం లోబరచుకుంటుందన్న అనుమానం.. పార్టీ నేతల నుంచి స్పందన కరవు కావడం వల్ల.. చివరి నిమిషంలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని ఈ రెండు పార్టీల నాయకత్వాలూ భావిస్తున్నట్లు సమాచారం. 

07:03 - December 7, 2015

విజయవాడ : చిత్తూరు మేయర్‌ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో చింటూ... అలియాస్‌ చంద్రశేఖర్‌.. ప్రధాన నిందితుడు. ఇటీవలే కోర్టులో లొంగిపోయాడు. ఇప్పుడు అతడి ఆర్ధిక లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు దృష్టి పెట్టారు.

కోట్ల రూపాయల లావాదేవీలు ......

కటారి దంపతుల హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు చింటూకు సంబంధించిన కోట్ల రూపాయల ఆర్ధిక లావాదేవీలు బయటపడ్డాయి. వీటికి సంబంధించిన రికార్డులు లేవని గుర్తించారు. చింటూ ఆస్తుల సమాచారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌తోపాటు, వాణిజ్య పన్నులు గనుల శాఖల అధికారులకు అందజేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ లక్ష్మీకాంత్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం చిత్తూరు చేరుకుని చింటూ కార్యాలయం, నివాసంలో తనిఖీలు చేసింది.  

07:01 - December 7, 2015

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌ కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఉన్న జిల్లాలు చాలా పెద్దవిగా ఉన్నాయి. పాలనాపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పరిపాలన సౌలభ్యం దృష్ట్యా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్‌ సర్కార్‌ నిర్ణయించింది.

జనవరిలో జిల్లాల పునర్వస్థీకరణ నోటిఫికేషన్‌.....

కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ నేతృత్వంలోని కమిటీ ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది. కొన్ని ప్రతిపాదనలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పించింది. దీనిని పరిశీలించన తర్వాత వచ్చే నెలలో జిల్లా పునర్వస్థీకరణకు నోటిఫికేషన్‌ జారీ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సూచనలు, సలహాలు, అభ్యంతరాలు స్వీకరించేందుకు ఫిబ్రవరి 28 వరకు గడువు ఇచ్చే అవకాశం ఉంది. వీటిని పరిశీలించి సమాచారమంతా క్రోడీకరిస్తారు. ఆ తర్వాత వచ్చే ఏడాది మార్చి నుంచి కార్యాచరణ ప్రారంభిస్తారు. తెలంగాణలో ప్రస్తుతం 10 జిల్లాలు ఉన్నాయి. కొత్తగా మరో 14 జిల్లాల ఏర్పాటుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్త జిల్లాల కోసం వివిధ పార్టీల నాయకులు ఉద్యమిస్తున్న తరుణంలో ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.

జిల్లా కేంద్రానికి 50-100 కి.మీ. దూరం...

కొత్త జిల్లాల ఏర్పాటుకు వీలుగా 1973లో చేసిన ఆంధ్రప్రదేశ్‌ డిస్ట్రిక్ట్‌ ఫార్మేషన్‌ యాక్ట్‌ని తెలంగాణ ప్రభుత్వం ప్రాతిపదికగా తీసుకుంది. జిల్లా కేంద్రానికి 50 నుంచి 100 కి.మీ. దూరంలో ఉన్న మున్సిపాలిటీలను కొత్త జిల్లాలు ప్రకటించాలని సీఎస్‌ రాజీవ్‌ శర్మ నేతృత్వంలోని కమిటీ నిర్ణయించినట్టు సమాచారం. తొలి దశలో ఏడు జల్లాలు ఏర్పాటు చేస్తారు. మలి దశలో మరో ఏడు జిల్లాలను ప్రకటిస్తారు. రెండో దశలో ఏర్పాటయ్యే జిల్లాలకు జనాభా, ఆర్ధిక వనరులు, మౌలికసదుపాయాలను పరిగణలోకి తీసుకుంటారు.

యాదగిరిగుట్ట కోసం మోత్కుపల్లి ఉద్యమం .....

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గద్వాల్‌ను కొత్త జిల్లాగా ప్రకటించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకీ అరుణ డిమాండ్‌ చేస్తున్నారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్టను జిల్లా చేయాలని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు కోతున్నారు. ఇదే జిల్లాకు చెందిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు ఉమామాధవరెడ్డి భువనగిరిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండ్‌ లేవనెతత్తారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోలని షాద్‌నగర్‌, నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, రంగారెడ్డి జిల్లాలోని వికరాబాద్‌లను కొత్త జిల్లాలుగా ప్రకటించే అవకాశం ఉంది. చేవెళ్లతోపాటు హైదరబాద్‌ శివారు ప్రాంతాల్లోని రంగారెడ్డి జిల్లాలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్టు సమాచారం.

మంచిర్యాల, జగిత్యాల, మెదక్‌, సిద్దిపేట....

మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తితోపాటు నాగర్‌కర్నూల్‌ను జిల్లాలు ప్రకటించాలన్న డిమాండ్‌ ఉంది. ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల, కరీంనగర్‌ జిల్లా జగిత్యాల, మెదక్‌, సిద్దిపేటల్లో కొత్త జిల్లాలు వచ్చే అవకాశం ఉంది. నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు అంశం పరిశీలనలో ఉంది. వరంగల్‌ జిల్లాను కూడా విభజించాలన్న వినతలు ప్రభుత్వానికి అందుతున్నాయి. అయితే ఈ జిల్లాలోని జనగామను కొత్తగా ఏర్పాటయ్యే సిద్దిపేట జిల్లాలో లేదా భువనగిరి కేంద్రంగా జిల్లా ఏర్పాటైతే... దీనిలో కలిపే అవకాశం ఉంది. వరంగల్‌ జిల్లాలోని డోర్నకల్‌ను ఖమ్మం జిల్లాలో కలిపి, మిలిగిన ప్రాంతాన్ని వరంగల్‌ జిల్లాగా కొనసాగించేలా ముసాయిదా సిద్ధమైందని సమాచారం. కొత్త జిల్లాలే కాదు.. మండలాలు, రెవిన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా తెలంగాణ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. వీటిపై ప్రజలు, వివిధ పార్టీల నాయకులు నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకుండా చూసే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు. 

06:57 - December 7, 2015

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి స్వగ్రామం లక్కవరపు కోటలో నిర్వహించే టీడీపీ జన చైనత్య యాత్రలో పాల్గొంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇందుకోసం జనసమీకరణ చేస్తున్నారు. చంద్రబాబు పర్యటన కోసం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొంటారు. విజయనగరం జిల్లాలో టీడీపీ పటిష్టతపై చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహిస్తారు. 

06:56 - December 7, 2015

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రకాల సమస్యలు నెలకొన్నాయి. తెలంగాణలో కరవు తాండవిస్తుంటే.... ఏపీలోని దక్షిణకోస్తా, రాయసీమ జిల్లాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. రెండు రాష్ట్రాల్లోని నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర అధికారుల బృందాలు పర్యటించనున్నాయి.

పునరావాస కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి కూడా....

తెలంగాణ లో కరవు పరిస్థితిని పరిశీలించేందుకు హైదరాబాద్‌ వస్తున్న కేంద్ర అధికారుల బృందం ముందుగా సచివాలయలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మతో భేటీ అవుతుంది. పునరావాస శాఖ కమిషనర్‌ వెంక్రటామిరెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వీరు కరవు తీవ్రతను కేంద్ర బృందానికి వివరిస్తారు. కేంద్ర బృందంలో వ్యవసాయం, పశుసంవర్ధక, నీటిపారుదల, గ్రామీణ మంచినీటి సరఫరా, ఆరోగ్య శాఖల అధికారులు ఉంటారు. నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి రెవిన్యూ డివిజన్‌తోపాటు, మరికొన్ని ప్రాంతాల్లో కేంద్ర బృందం సభ్యులు పర్యటిస్తారు. వీరి కోసం ఆయాన ప్రాంతాల్లో వర్షపాతం, పంటనష్టం, ఇతర వివరాలపై ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రైతులు, రైతు సంఘాల ప్రతినిధులను కలుసుకుంటారు. కరవుపై వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. మళ్లీ హైదరబాద్‌ తిరిగొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కేంద్ర బృందం సభ్యలు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ తిరిగి వెళ్లిన తర్వాత కేంద్రానికి నివేదిక అందజేస్తారు. కరవు నష్టం కింద 2,500 కోట్ల రూపాయల సహాయాన్ని అందిచాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. కరవు మండలాలను ప్రకటించింది.

ఉభయగోదారి, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో...

ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా కేంద్ర బృందం పర్యటించనుంది. భారీ వర్షాలు, వరదలకు నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తారు. నష్టం వివరాలు సేకరిస్తారు. ఉభయ గోదావరి, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాల్లో వరి పంటనష్టం జగింది. మిగిలిన పంటలు కూడా దెబ్బతిన్నాయి. చేపలు, రొయ్యల చెరువులకు గండ్లు పడటంతో ఆక్వా రైతులు నష్టపోయారు. కేంద్ర బృంద సభ్యలు వీటిని పరిశీలిస్తారు. ఈ బృంద మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అవుతంది. ఢిల్లీ తిరిగి వెళ్లిన తర్వాత నష్టంపై కేంద్రానికి నివేదిక అందజేస్తారు. 

06:53 - December 7, 2015

హైదరాబాద్ : పేదలకు వైద్య ఆరోగ్య సేవలందించడంలో పీహెచ్ సీలదే కీలకపాత్ర. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు రెండు వేల దాకా పీహెచ్ సీలున్నాయి. అయితే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సవాలక్ష సమస్యలు పీడిస్తున్నాయి. తగినంత సిబ్బందిలేక, సక్రమంగా మందుల సరఫరా జరగక, వైద్య పరికరాలేక, వున్నవి పనిచేయక పేషెంట్లు నానా అవస్థలు పడుతున్న ద్రుశ్యాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరికీ వైద్య ఆరోగ్య సేవలందించాలన్న మహోన్నత ఆశయంతో ప్రారంభించిన పీహెచ్ సీల వ్యవస్థను గత, ప్రస్తుత ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. అయిన్నప్పటికీ అరకొర సౌకర్యాల మధ్యనే అందుబాటులో వున్న పీహెచ్ సీల ద్వారా ప్రతిరోజూ ఉభయ రాష్ట్రాల్లో కొన్ని వేల మంది ఏదో ఒక స్థాయిలో ప్రాథమిక వైద్య ఆరోగ్య సేవలు పొందుతున్నారు. కాన్పులు, వ్యాధి నిరోధక టీకాలు, వాంతులు, విరోచనాలు, జలబు, దగ్గు, జ్వరం, కుక్కకాటు, పాముకాటు లాంటి సందర్భాలలో పేషెంట్లు ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలనే ఆశ్రయిస్తున్నారు. అయితే, కొన్ని చోట్ల వ్యాధి నిర్ధారణ పరికరాలు లేకపోవడం, అవి వున్న చోట వాటిని ఆపరేట్ చేయగలిగే సిబ్బంది లేకపోవడం లాంటి సమస్యలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వెక్కిరిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బాగోగుల గురించి ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ తీసుకోకపోవడమే ఈ దుస్థితికి కారణం.

ప్రయివేట్ కార్పొరేట్ ఆస్పత్రుల అభివృద్ధికీ, విస్తరణకు.....

గత పది పదిహేనేళ్లకాలంలో ప్రయివేట్ కార్పొరేట్ ఆస్పత్రుల అభివృద్ధికీ, విస్తరణకు వివిధ రూపాల్లో సంపూర్ణ సహాయ సహకారాలందించిన ప్రభుత్వాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను చాలీచాలని నిధులిచ్చి, వెక్కిరించాయి. ఫలితంగా చాలాచోట్ల ఇవి అందించే వైద్య సేవలు నామమాత్రంగా మిగిలిపోయాయి. నిజానికి ఇప్పుడు చిన్న పట్టణాలు, గ్రామాలను సైతం షుగర్, బీపీ లాంటి రుగ్మతలు పీడిస్తున్నాయి. మన సమాజం నుంచి మాయమైపోయిందనుకున్న టీబీ వ్యాధి మరోసారి కలవరపెడుతోంది. కేన్సర్ విజ్రుంభిస్తోంది. చిన్న వయస్సువారిని సైతం గుండె జబ్బులు కాటేస్తున్నాయి. రోజురోజుకీ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. వీటి బారినపడి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరింత పరిపుష్టం చేయాల్సిన అవసరం వుంది. నేటి అవసరాలకు తగ్గట్టుగా వైద్య సిబ్బందిని నియమించి, వ్యాధి నిర్ధారణ పరికరాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజాస్వామిక ప్రభుత్వాల మీద వుంది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు....

కానీ, దురద్రుష్టవశాత్తు, బడ్జెట్ లలో వైద్య రంగానికి నిధుల కేటాయింపులు అవసరాలకు తగ్గట్టుగా పెరగడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ప్రభుత్వాలు వ్యూహరచన చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని 1156 పీహెచ్ సీలలో 8 రకాల పరీక్షలు, 192 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లలో 23 రకాల పరీక్షలను ప్రయివేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ పరీక్షలన్నీ పేషెంట్లకు ఉచితంగానే చేస్తామని చెబుతున్నప్పటికీ, భవిష్యత్ లో దండిగానే ఫీజులు వసూలు చేస్తారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ఈ పరీక్షలేవీ ఆయా సంస్థలు స్వచ్ఛంద సేవ రూపంలో అందించడం లేదు. వాటికి అవసరమైన డబ్బులన్నీ ప్రభుత్వమే ఇస్తుందన్న విషయాన్ని మరవరాదు. మరి అలాంటప్పుడు, వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వమే నిర్వహించకుండా, ప్రయివేట్ సంస్థలకు అప్పగించడం వెనక మతలబేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అసలు ఈ సంస్థలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటున్నారు? ఈ ఒప్పందాలు ఎంత కాలం అమలులో వుంటాయి? ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వమే నిర్వహించాల్సిన వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రయివేట్ సంస్థల చేతిలో ఎందుకు పెడుతున్నారు? ఏవో రెండు మూడు సంస్థలకు మాత్రమే ఇలాంటి బృహత్తర బాధ్యతలు ఎందుకు అప్పగిస్తున్నారు? ఇలాంటి సమాచారమేదీ పారదర్శకంగా లభించడం లేదు. ప్రభుత్వ వైద్య సంస్థల్లో ప్రయివేట్ సేవలు, ప్రయివేట్ సంస్థల వ్యాపారాలు ఎంతవరకు సమర్ధనీయమన్న చర్చ కూడా లేకుండానే నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నిజానికి ఇప్పుడు చాలా పీహెచ్ సీలకు సొంత భవనాలున్నాయి. చాలా ఆస్పత్రుల్లో ల్యాబ్ టెక్నీషిన్లున్నారు. కొన్ని చోట్ల వ్యాధి నిర్ధారణ పరికరాలు కూడా వున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు చేయాల్సిందల్లా ప్రభుత్వాసుపత్రులలో నిర్వహణా పద్ధతులను మెరుగుపరచడమే. అవసరానికి తగ్గట్టుగా నిధులు కేటాయించి, ప్రభుత్వం సక్రమంగా అజమాయిషీ చేస్తే, చక్కటి ఫలితాలు చూపించగల డాక్టర్లకీ, నర్సులకీ కొదవలేదు. అయినా, ఆ పని చేయకుండా, వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రయివేట్ సంస్థల చేతిలో పెట్టడానికి ఆరాటపడు తుండడమే అనేక అనుమానాలకు తావిస్తోంది. వైఎస్ హయాంలో ప్రారంభమైన ఆరోగ్య శ్రీ పథకం అనేక అనుభవాలనిచ్చింది. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు మేలు జరుగుతున్న మాట వాస్తవమే అయినా, అంతకు పదింతలు కార్పొరేట్ వ్యవస్థ బలంగా వేళ్లూనుకుని పోయింది. ప్రభుత్వం చెల్లించే ఫీజులు చాలడం లేదంటూ, వాటిని మరింత పెంచాలంటూ, లేదంటే ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తామంటూ కార్పొరేట్ సంస్థలు బెదిరిస్తుంటే, వాటిని ఏమీ చేయలేని స్థితిలో ప్రభుత్వాలు చిక్కుకోవడాన్ని మనం చూస్తూనే వున్నాం. నిజానికి కార్పొరేట్ ఆస్పత్రులకు చెల్లించిన సొమ్మును ప్రభుత్వ ఆస్పత్రుల మీద వెచ్చించి వుంటే, ఇవాళ వైద్యం ఇంత ఖరీదైన వ్యాపారంగా మారేది కాదు. ప్రయివేట్, కార్పొరేట్ వైద్య సంస్థల దయా దక్షిణ్యాల మీద లక్షలాది మంది రోగులు ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. రేపు, వ్యాధి నిర్ధారణ పరీక్షల విషయంలో ప్రయివేట్ సంస్థలు కూడా ఇదే రకమైన ఒత్తిడిలు ప్రయోగించి, బ్లాక్ మెయిలింగ్ కు దిగితే పరిస్థితి ఏమిటి? అవసరమున్నా లేకపోయినా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ ప్రభుత్వ డాక్టర్ల మీద ప్రయివేట్ సేవల యజమానులు ఒత్తిడి ప్రయోగిస్తే ఆ భారాన్ని ఎవరు మోయాలి? ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రయివేట్ సంస్థలకు అప్పగించేందుకు ఆరాటపడుతున్న ప్రభుత్వాలు ఇలాంటి ప్రశ్నలన్నింటినీ చిత్తశుద్ధితో సమాధానాలు వెదుక్కోవాలి. లేకపోతే, మొత్తం ప్రజారోగ్య వ్యవస్థే పెనుప్రమాదంలో పడుతుంది. 

06:49 - December 7, 2015

హైదరాబాద్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రయివేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో మెడాల్, కష్టా డయాగ్నస్టిక్ సెంటర్లతో ఇందుకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. మరోవైపు తెలంగాణలో సైతం పైలట్ ప్రాజెక్ట్ గా ఈ వైద్య సంస్థకు నాలుగు పీహెచ్ సీలను అప్పగిస్తున్నారు. అయితే, పీహెచ్ సీలలో వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రయివేట్ సంస్థలకు అప్పగించడం దేనికి సంకేతం? వైద్యం రంగం మీద ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఇదే విధానం అవలంభించిన బీహార్ , చత్తీస్ గఢ్ అనుభావాలేమిటి? అసలు పీహెచ్ సీలు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? వాటికి పరిష్కారం ఏమిటి? ఇలాంటి అంశాలపై నేటి జనపథంలో చర్చను చేపట్టింది. ఈచర్చలో జన స్వస్థా అభియాన్ కన్వీనర్ డాక్టర్ సురేష్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై మాట్లాడారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

నేడు కేంద్ర కరువు బృందం రాక

హైదరాబాద్ : తెలంగాణలో కరువు ప్రాంతాల పరిశీలనకు నేడు కేంద్ర కరువు బృందం రానుంది. రేపు ఉదయం 9.30కు తెలంగాణ చీఫ్‌ సెక్రటరీతో బృంద సభ్యులు సమావేశమవుతారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో బృందం పరిశీలన జరుపుతుంది. కాగా కేంద్రాన్ని టి సర్కార్‌ కరువు సాయం కింద 2,500 కోట్ల రూపాయలు కోరింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల మూలంగా ఏపీలో పంట నష్టపోయిన ప్రాంతాల్లో సోమవారం కేంద్ర బృందం పరిశీలన జరపనుంది.

మావోయిస్టుల లేఖలు కలకలం

విశాఖ : జి.మాడుగులలో మావోయిస్టుల లేఖలు కలకలం సృష్టించాయి. ఆంధ్రా-ఒడిషా సరిహద్దు(ఏవోబీ) స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ చంద్రమౌళి పేరుతో లేఖలు రాశారు. ప్రజల ఆగ్రహంపై నీళ్లు చల్లేందుకే జీవో నం.97 ఉపసంహరణ నాటకం ఆడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అడవిపై హక్కుల కోసం ఆయుధాలు పట్టండంటూ మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నెల 21 నుంచి 27 వరకు నిరసన వారంగా తమ లేఖ ద్వారా ప్రకటించారు. 26న ఏవోబీ బంద్కు మావోయిస్టులు పిలుపిస్తున్నట్లు తమ లేఖలో పేర్కొన్నారు.

Don't Miss