Activities calendar

08 December 2015

కల్తీ మద్యం ఘటనపై బాబు సమీక్ష..

విజయవాడ : కల్తీ మద్యం ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ కమిషనర్ మీనా, డీజీపీ రాముడు హాజరయ్యారు. 

21:35 - December 8, 2015

ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీ-20 ఆఖరి రెండు సీజన్లో సమరంలో గత ఎనిమిదిసీజన్లుగా పాల్గొన్న చెన్నై, జైపూర్ ఫ్రాంచైజీల స్థానంలో సరికొత్తగా రాజ్ కోట్, పూణే ఫ్రాంచైజీల జట్లు బరిలోకి దిగబోతున్నాయి. రివర్స్ బిడ్డింగ్ ద్వారా ఈ రెండు ఫ్రాంచైజీలు హక్కులు దక్కించుకొన్నట్లు ఐపీఎల్ బోర్డు చైర్మన్ రాజీవ్ శుక్లా ప్రకటించారు. బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల సహయజమానులు చిక్కుకోడంతో...నిబంధనలప్రకారం..ఈ రెండు ఫ్రాంచైజీలపైన రెండేళ్ల నిషేధం పడింది. దీంతో చెన్నై, జైపూర్ ఫ్రాంచైజీలు....ఐపీఎల్ ఫ్రాంచైజీ యాజమాన్యం హక్కులు పోగొట్టుకొన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అవినీతిపై జస్టిస్ లోథా కమిటీ నిర్వహించిన విచారణలో చెన్నై ఫ్రాంచైజీకి చెందిన గురునాథన్ మెయ్యప్పన్, జైపూర్ ఫ్రాంచైజీ కో-ఓనర్ రాజ్ కుంద్రా దోషులుగా తేలడంతో...ఐపీఎల్ 2016, 2017 సీజన్లలో ఆ రెండు ఫ్రాంచైజీలు పాల్గొనే హక్కును కోల్పోయాయి. దీంతో చెన్నై, జైపూర్ ఫ్రాంచైజీల స్థానాన్ని భర్తీ చేయటానికి ఐపీఎల్ బోర్డు తాజాగా బిడ్డింగ్ నిర్వహించింది.

అందుబాటులో రూ.66 కోట్లు..
కేవలం రెండుసీజన్లకు మాత్రమే నిర్వహించిన ఈ బిడ్డింగ్ లో...ఆర్పీజీ గ్రూప్, చెట్టినాడ్ గ్రూప్, యాక్సిస్ కెమికల్స్, సంజీవ్ గోయెంకాకు చెందిన న్యూరైజింగ్ కన్సోర్టియం, ఇంటెక్స్ సంస్థలు పోటీకి దిగాయి. రివర్స్ బిడ్డింగ్ ద్వారా సరికొత్త ఫ్రాంచైజీల ఎంపికను ఐపీఎల్ బోర్డు నిర్వహించింది. 40 కోట్ల రూపాయల బేస్ ప్రైస్ తో నిర్వహించిన ఈ బిడ్డింగ్ లో...అతి తక్కువ మొత్తానికి బిడ్డింగ్ వేసిన జట్లకు మాత్రమే ఫ్రాంచైజీ హక్కులు దక్కేలా చర్యలు తీసుకొన్నారు. దీంతో..పూణే ఫ్రాంచైజీ హక్కులను సంజీవ్ గోయెంకా ఆధ్వర్యంలోని న్యూరైజింగ్ కన్సోర్టియం 16 కోట్ల రూపాయలకు దక్కించుకొంది. సెల్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ టెక్స్ కేవలం 10 కోట్ల రూపాయలకే రాజ్ కోట్ ఫ్రాంచైజీ హక్కులను సొంతం చేసుకొంది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ కు చెందిన మొత్తం 50 మంది క్రికెటర్ల కోసం...డిసెంబర్ 15న వేలం కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఆటగాళ్ల వేలం కోసం ఈ రెండు ప్రాంచైజీలకు 66 కోట్ల రూపాయలు అందుబాటులో ఉంచబోతున్నారు.

ఐకాన్ ప్లేయర్లకు 12 కోట్ల 50 లక్షల రూపాయలు..
క్రికెటర్ల వేలంలో ఐకాన్ ప్లేయర్లకు 12 కోట్ల 50 లక్షల రూపాయలు, ఆ తర్వాతిస్థాయి ఆటగాళ్లకు 9 కోట్ల 50 లక్షలు, 7 కోట్ల 50 లక్షలు, 5 కోట్ల 50 లక్షలు, నాలుగుకోట్ల రూపాయలు చెల్లించే అవకాశం ఉంది. ప్లేయర్లకు సైతం 4 కోట్ల రూపాయలు చెల్లించేలా నిబంధనలు రూపొందించారు. రెండుసార్లు ఐపీఎల్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ లోని మహేంద్రసింగ్ ధోనీ, సురేశ్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, డూప్లెసీ, రాజస్థాన్ రాయల్స్ కు చెందిన షేన్ వాట్సన్, అజింక్యా రహానే, స్టువర్ట్ బిన్నీలతో సహా మిగిలిన ప్రధాన ఆటగాళ్లంతా...వేలం ద్వారా పూణే లేదా రాజ్ కోట్ ఫ్రాంచైజీల్లో ఏదోఒకజట్టులో చేరబోతున్నారు. మొత్తం మీద..ఐపీఎల్ మొదటి ఎనిమిది సీజన్లకు భిన్నంగా 2016, 2017 సంవత్సరాలలో జరిగే ఆఖరి రెండుసీజన్లలో...మహేంద్రసింగ్ ధోనీ, అజింక్యా రహానే లాంటి స్టార్ ప్లేయర్లు కొత్తరంగు పులుముకొని సరికొత్త జెర్సీలతో బరిలోకి దిగబోవడం విచిత్రమే మరి.

21:30 - December 8, 2015

పాకిస్తాన్ : కేంద్ర విదేశాంగమంత్రి సుష్మస్వరాజ్‌ ఇస్లామాబాద్‌ చేరుకున్నారు. ఈరోజు రాత్రి పాక్‌ విదేశాంగ మంత్రి సర్తాజ్‌ అజీజ్‌- సుష్మ స్వరాజ్‌ల మధ్య డిన్నర్‌ సమావేశం జరగనుంది. ఉగ్రవాదం, సరిహద్దులో కాల్పులు, కశ్మీర్‌తో పాటు పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. తన పర్యటనలో భాగంగా పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌తో కూడా సుష్మ భేటీ కానున్నారు. అప్ఘనిస్తాన్‌లో జరిగే కాన్ఫరెన్స్ లోనూ సుష్మా పాల్గొనున్నారు. బ్యాంకాక్‌లో భారత-పాక్‌ విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరిగిన నేపథ్యంలో సుష్మ పాక్‌ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత విదేశాంగ మంత్రి పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లడం 2012 తర్వాత ఇదే మొదటిసారి.

21:28 - December 8, 2015

హైదరాబాద్ : తెలంగాణలో కరువును అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం పర్యటన ముగిసింది. ఈ బృందం.. పలు జిల్లాల్లో బృందం పర్యటించి.. క్షేత్రస్థాయి వివరాలను సేకరించింది. అనంతరం సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి పరిస్థితిని సమీక్షించింది. గత పాలకులు తెలంగాణ పట్ల చూపిన వివక్షే.. నేటి దుర్భిక్షానికి కారణమని ఈసందర్భంగా సీఎం అన్నారు. మరోపక్క విపక్ష నేతలూ కరువు బృందాన్ని కలిసి.. రాష్ట్రానికి సాయం పెంచాలని కోరారు. నిజామాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాలో కరువు బృందం పర్యటించింది. ఆయా జిల్లాల్లో నెలకొన్న కరువు పరిస్థితిని పరిశీలించింది.

కేసీఆర్ తో భేటీ..
రెండు రోజుల పర్యటన ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కేంద్రం బృందం కలిసింది. సెక్రటేరియట్‌లో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు తాము పరిశీలించిన అంశాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. జలశయాల్లో నీరు లేకపోవడంతో పంటలు వేయలేకపోయారని, భూగర్భ జలాలు అడుగంటిపోయాయని తెలిపారు. కరువును ఎదుర్కోవడానికి సమగ్ర ప్రణాళికలు అవసరమని అభిప్రాయపడ్డారు.

231 మండలాల్లో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ..
తెలంగాణలో కరువు పరిస్థితులు ఏర్పడ్డ 231 మండలాల్లో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని, ఉపాధి హామీ దినాలను 200 రోజులకు పెంచాలని.. ఆమేరకు కేంద్రానికి నివేదించాలని సీఎం కరువు బృందాన్ని కోరారు. రాష్ట్రంలో ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్న కేసీఆర్..పశుగ్రాసానికి కూడా నిధులు కేటాయించాల్సిన అవసరాన్ని వివరించారు. వ్యవసాయ భూములను క్రాప్‌ కాలనీలుగా మార్చాల్సిన అవసరాన్నీ కేంద్ర బృందం దృష్టికి తెచ్చారు. గత పాలకుల పాపమే తెలంగాణలో నేటి దుర్భిక్షానికి కారణమని ఆయనీ సందర్భంగా వ్యాఖ్యానించారు.

బృందాన్ని కలిసిన విపక్ష నేతలు..
మరోవైపు... విపక్ష నేతలు, సెక్రెటరియేట్‌లో, కేంద్ర కరవు బృందాన్ని కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులను వారి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ రైతు సంఘం కూడా కేంద్ర బృందాన్ని కలిసి వినతి పత్రం సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయని విపక్షాలు విమర్శించాయి. సీఎంను కలిసి కరవు పరిస్థితులను సమీక్షించిన బృందం..తాము పరిశీలించిన అంశాల ఆధారంగా కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. అనంతరం కరువు సాయంపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

21:25 - December 8, 2015

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు 2వేల 200 కోట్లు ఖర్చుపెట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం కేంద్రం త్వరగా సాయం చేయాలని కోరారు. పశ్చిమగోదావరి పర్యటనలో ఉన్న ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు కొత్త నిర్వాసితులకు నూతన భూసేకరణ చట్టం ప్రకారమే పునరావాసం, పునర్నిర్మాణం ప్యాకేజీ ఇస్తామన్నారు. ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేందుకు నిర్వాసికులు కూడా సహకరించాలని కోరారు చంద్రబాబు.

21:24 - December 8, 2015

హైదరాబాద్ : వింటే నచ్చజెప్పు.... భయపడితే ధైర్యం చెప్పు... లొంగకపోతే బెదిరించేసెయ్... సరిగ్గా ఈ సూత్రాలనే అమలు చేస్తోంది టీఆర్‌ఎస్‌ పార్టీ.. మండలి ఎన్నికల్లో విజయంకోసం క్యాంప్‌ రాజకీయాలకు తెరతీసింది.. ప్రజాప్రతినిధుల్ని హైదరాబాద్‌కు తరలించి విపక్షాలకు చెక్‌ పెట్టాలని చూస్తోంది. ఖమ్మం జిల్లాలో పార్టీకి స్థానిక ప్రజాప్రతినిధులు లేరు.. దీంతో విపక్ష సభ్యుల్ని ఏదోఓరకంగా తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది గులాబీపార్టీ.. సామ, దాన, భేద, దండోపాయాలన్నింటినీ ప్రయోగించి.. విపక్షాలకు చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులను కారెక్కించేందుకు చూస్తోంది. తమను పార్టీ మారాలంటూ పాలక పక్షం నాయకులు ఒత్తిడి తెస్తున్నారని కొందరు ఎంపీటీసీలు ఇప్పటికే కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు.. అయినా గులాబీదండు దూకుడును తగ్గడంలేదు.

బరిలో తుమ్మల అనుచరుడు..
జిల్లాలో మంత్రి తుమ్మల అనుచరుడు బలసాని లక్ష్మీనారాయణ ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు.. వామపక్షాలనుంచి మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వర రావు పోటీ చేస్తున్నారు. పువ్వాడకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించింది.. టీడీపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.. పువ్వాడకే తెలుగు తమ్ముళ్లు ఓకే చెప్పే అవకాశాలున్నాయి.. ఇక వైసీపీ మద్దతుకోసం వామపక్షాలు చర్చలు జరుపుతున్నాయి.. పాలక పక్షం అక్రమాలను ఎదుర్కొనేందుకు.. జిల్లాలో విపక్షాలన్నీ రాజకీయాలకు అతీతంగా.. ఇలా ఒక్కటవుతున్నాయి.

హైదరాబాద్ కు చేరిన రాజకీయాలు...
ఖమ్మం జిల్లాలో పరిస్థితి చూసిన టీఆర్‌ఎస్‌ నేతలు... గెలుపుకోసం సరికొత్త వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. మంత్రి తుమ్మల జిల్లా రాజకీయాలను హైదరాబాద్‌కు మార్చేశారు. కంట్రీ క్లబ్‌కు జడ్పీటీసీ, ఎంపీటీసీ లను తరలించే పనిచేపట్టారు. గులాబీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, మదన్ లాల్, తాటి కొండ వెంకటేశ్వర్లు ఈ పనిని తమ భుజానికి ఎత్తుకున్నారు. వందల సంఖ్యలో ప్రజాప్రతినిధుల్ని రాజధానికి తరలించారు. మిగిలివారి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరందరికీ ప్రత్యేక క్యాంప్‌ నిర్వహిస్తున్నారు. ఒక్క నేత చేజారకుండా ఎన్నికలు అయ్యేంతవరకూ అందరినీ ఇక్కడే ఉంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

హామీల మీద హామీలు..
క్లబ్‌కువచ్చిన నేతల్ని ఏదో ఓరకంగా తమవైపుకు తిప్పుకునేందుకు గులాబీ దండు ట్రై చేస్తోంది. ఎలాంటి ఇబ్బందిలేకుండా చూసుకుంటామంటూ హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు అధికారపార్టీ నేతలు. మరోవైపు టీఆర్‌ఎస్ నేతల తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. తమ పార్టీ ప్రజాప్రతినిధులను వెంటనే వదిలేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మొత్తానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లాలో పొలిటికల్‌ హీట్‌ను మరింత పెంచుతున్నాయి.

21:20 - December 8, 2015

హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల రెండో జాబితాను టీఆర్ఎస్‌ పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ సీనియర్‌ నేత కేశవరావు ఐదుగురు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ నుంచి సుంకిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, రంగారెడ్డి నుంచి పట్నం నరేందర్‌, శంభీపూర్‌ రాజులకు జాబితాలో చోటు దక్కింది. ఇక వరంగల్‌ జిల్లా నుంచి కొండా మురళీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మొదటి విడతలో 7 మంది అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌ తాజాగా మరో ఐదు మంది పేర్లను ప్రకటించడంతో మొత్తం 12 మంది అభ్యర్థులు ఖరారయ్యారు. 

12 స్థానాలనూ గెలుస్తాం - డీఎస్..

హైదరాబాద్ : 12 ఎమ్మెల్సీ స్థానాల్లో తమ టీఆర్‌ఎస్ పార్టీయే గెలుస్తుందని పార్టీ నేత డి.శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు జనాదరణ ఉందనడానికి వరంగల్ ఉప ఎన్నికల్లో తాము సాధించిన ఘన విజయమే నిదర్శనమన్నారు. 

అన్ని శాఖల అధికారులతో ఈటెల సమావేశం..

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో అన్ని శాఖల అధికారులతో మంత్రి ఈటెల సమావేశం నిర్వహించారు. 2016-17 బడ్జెట్ కు సంబంధించి ఈనెల 14 నుండి కసరత్తు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్ పై ప్రత్యేక శ్రద్ధతో దృష్టి సారించాలని అధికారులకు మంత్రి ఈటెల సూచించారు. 

కల్తీ మద్యం మృతుల కుటుంబాలకు నష్టపరిహారం..

విజయవాడ : కల్తీ మద్యం మృతుల కుటుంబాలకు ఏక్సైజ్ శాఖ నష్టపరిహారం ప్రకటించింది. ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున అందచేశారు. ఈ ఘటనపై శాఖాపరమైన చర్యలతో పాటు మెజిస్ట్రీరియల్ విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.

 

శవరాజకీయాలు చేయొద్దన్న కొల్లు..

విజయవాడ : కల్తీ మద్యం మరణాలపై శవ రాజకీయాలు చేయడం జగన్ కు తగదని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. మద్యం గొలుసు దుకాణాలు ఇష్టారాజ్యంగా ఏర్పడడానికి దివంగత వైఎస్ కారణమని ఆరోపించారు. 

టీమిండియాకు బీసీసీఐ రెండు కోట్ల నజరానా..

ముంబై : టీమిండియా జట్టుకు బీసీసీఐ రూ.2 కోట్లను నజరానాగా ప్రకటించింది. టెస్టు సిరీస్ లో దక్షిణాఫ్రికా జట్టుపై విజయం సాధించినందుకు బీసీసీఐ ఈ నజరానాను ప్రకటించింది. ముంబైలో జరిగిన ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

 

వరద బాధితులకు 'హృతిక్' విరాళం..

ముంబై : చెన్నై వరద బాధితులకు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ విరాళం ప్రకటించారు. తనకు స్వయంగా హృతికి ఫోన్ చేసి విరాళం ప్రకటించాడని హీరో నవదీప్ ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. అయితే విరాళం ఎంతనేది తెలుపలేదు. 

20:40 - December 8, 2015

మొన్న తెలంగాణ, నిన్న ఆంధ్రప్రదేశ్, రేపు మరోచోట. ఇప్పుడు మనుష్యులను చంపేస్తున్నది మద్యం. కాటు వేస్తున్నది కల్తీ. సర్కారు సాక్షిగా ఏరులై పారుతున్న మద్యానికి సామాన్యులు బలైపోతున్నారు. కాస్తంత తాగి శారీరక శ్రమ మర్చిపోదామనుకుంటే ఏకంగా శాశ్వతనిద్రలోకి పోతున్నారు. సామాన్యులను చంపేస్తున్న పాపం ఎవరిది..అనుచరులు,బంధువులను అడ్డుపెట్టుకుని మాఫియాను నడిపిస్తున్న రాజకీయ నాయకులదా...వారితో మమేకమవుతున్న సర్కారుదా...సామాన్యులను పీల్చిపిప్పి చేస్తున్న ఇరువురిదా. ఈ అంశంపై వైడాంగిల్ ప్రత్యేక కథనం..

మొన్న తెలంగాణ..నేడు విజయవాడ..
తాగండి. ఊగండి. చావండి. అఘాయిత్యాలకు పాల్పడండి. జీవితాలను ఛిద్రం చేసుకోండి. చీప్ లిక్కరైనా, కల్తీ మద్యమైనా, మత్తులేని కల్లయినా...ఏదో ఒకటి తాగండి. ఆదాయాన్నివ్వండి చాలు. ఇదీ పాలకులు డైరెక్టుగా చెప్పకున్నా..ఇన్ డైరెక్టుగా జరుగుతున్నది అదే. అందుకు మొన్న తెలంగాణ కల్తీ కల్లు...నిన్న విజయవాడ కల్తీ మద్యం మృతులే సాక్ష్యం. ఇక్కడ అక్కడ అన్న తేడా లేదు. ఇప్పుడు అప్పుడు అన్న సమయం లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా సామాన్యులను బలితీసుకుంటున్నది కల్తీ మద్యమే. కల్తీ కల్లు, కల్తీ సారా, కల్తీ లిక్కర్...ఇలా కాదేది కల్తీకి అనర్హమన్నట్టు కాటు వేస్తోంది కల్తీ. బడా బాబుల అండదండలు, వారి అడుగులకు మడుగులొత్తే పాలకుల దమననీతితో కుటుంబాలకు కుటుంబాలే ఛిద్రమవుతున్న దుర్భర ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో లెక్కలేనన్ని.

మద్యం వెనుక పొలిటికల్ రాబందుల హస్తం..
మాఫియా. అది ఇసుక కావచ్చు. మైనింగ్ కావచ్చు. ఆఖరికి మద్యం కావచ్చు. ఈ మాఫియాతో పెనవేసుకున్న బంధం రాజకీయ నాయకులది. అందుకే కల్తీ మద్యం ఏరులై పారుతోంది. ఆ కల్తీ కాటు పడి సామాన్యులు కాటికి పోతున్నారు. కల్తీ మరణాలకు కారణమైన మద్యం వెనక పొలిటికల్ రాబంధుల హస్తముందన్నది బహిరంగ రహస్యం. ఒక్కో జిల్లాలో ఒక్కో నాయకుడి బంధువర్గం,అనుచరగణం మద్యం వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. సిండికేట్లుగా, మాఫియాగా ఏర్పడి బిజినెస్ సాగిస్తున్నారు. యథేచ్చగా కల్తీకి పాల్పడుతూ ప్రజల ప్రాణాలు తోడేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ మాఫియాతో నాయకులు, వారి అనుచరులు పెనవేసుకున్నారు.

ఖజానా నింపుకొనేందుకు ఆరాటం..
ఇంంటింటికీ మద్యం..మండలానికో సర్కారు దుకాణం..షాపింగ్ మాల్స్ లో మందు..టెట్రాప్యాకుల్లోనూ లభ్యం..తాగండి..తాగి ఊగమంటున్నాయి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి తమ ఖజనా నింపుకొనేందుకు ఆరాటపడుతున్నాయి. కానీ లిక్కర్ కల్తీ అవుతున్నా, జనం ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వీరికి ఆదాయం తప్ప ప్రజారోగ్యం అక్కర్లేదా...జనం ప్రాణమంటే అంత నిర్లక్ష్యమా.? పాలకులకు మద్యం ఆదాయం తప్ప ప్రజారోగ్యం అక్కర్లేదు. కానీ ప్రభుత్వాల కుటిల నీతిని జనం గ్రహించాలి. మద్యంపై అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ మాఫియా పన్నాగాలను పసిగట్టాలి. లేదంటే విజయవాడలో కల్తీ కాటు...మరెక్కడైనా కాటేయొచ్చు. కుటుంబాలను నాశనం చేయొచ్చు. 

20:17 - December 8, 2015

రాజకీయం రంజుకొచ్చింది.. ఎమ్మెల్సీ ఎన్నికలు వేడెక్కిస్తున్నాయి. నచ్చిన కోటర్..ఆర్డరిస్తున్న అభ్యర్థులు..హైదరాబాద్ అందాలు చూడటానికి హెలికాప్టర్ ను ఉపయోగించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారంట..విజయవాడ కల్తీ మద్యం ఘటనపై విపక్షాల విమర్శలు..ముఖ్యమంత్రి అల్లం పంట ఆగమాగం..కనికరించని కేంద్రం కరువు బృందం..హైద్రాబాద్ ను తలదంతున్న వరంగల్...విధానం మార్చుకున్న ఆశాల విధానం..ఎంటవడ్డోని వంటికి చెప్పు దెబ్బలు..ఆటో స్నాచర్...ఒక వైరైటీ పూజ..లాంటి అంశాలపై 'మల్లన్న' తనదైన శైలిలో ముచ్చట్లు చెప్పారు. పూర్తి వివరాలు వీడియోలు చూడండి.

కేసీఆర్ ను కలిసిన కేంద్రం కరవు బృందం..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ను కేంద్ర కరవు బృందం కలిసింది. జిల్లాల్లో పరిశీలించిన అంశాలను సీఎంకు వివరించారు. జలాశయాల్లో నీరు లేక పంటలు పండించలేకపోయారని, భూగర్భ జలాలు అడుగంటిపోయాయని సీఎంకు వివరణనిచ్చారు. కరువును ఎదుర్కోవడానికి సమగ్ర ప్రణాళికలు అవలింబించాలని పేర్కొంది. కరవు మండలాల్లో ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి పశుగ్రాసానికి నిధులు కేటాయించాలని కేసీఆర్ కోరారు. తెలంగాణలోని ఒక భారీ నీటి పారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని పేర్కొన్నారు. 1964 ప్రారంభించిన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పూర్తి కాలేదని, ఏటా 1600 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందన్నారు.

గేట్ వే హోటల్ లో సీఆర్ఆర్ భాగస్వామ్య సదస్సు..

విజయవాడ : గేట్ వే హోటల్ లో ఉన్నత విద్యాశాఖ సీఎస్ఆర్ భాగస్వామ్య సదస్సు జరిగింది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి గంటా శ్రీనివాస రావు హాజరయ్యారు. ఏపీని విద్యా విజ్ఞాన గనిలా తయారు చేయాలని, ఉన్నత విద్యా సంస్థలతో కార్పొరేట్ సంస్థలు కలిసి పనిచేయడం దేశంలోనే తొలి ప్రయోగమని చంద్రబాబు పేర్కొన్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు, ఇంజినీరింగ్ కాలేజీల్లో సాయంత్రం వేళల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు నిర్వహించే యోచిస్తున్నట్లు తెలిపారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం దక్కాలని ఆకాంక్షించారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన..

హైదరాబాద్ : ఎమ్మెల్సీ అభ్యర్థుల రెండో జాబితాను టీఆర్ఎస్ ప్రకటించింది. మరో ఐదు మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొండా మురళి పేరును ఖరారు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులగా సుంకిరెడ్డి జగదీశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా శంభీపూర్ రాజు, పట్నం నరేందర్‌రెడ్డిలు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైన వారిలో ఉన్నారు.

19:39 - December 8, 2015

విజయవాడ : కల్తీ మద్యం సేవించడం వల్లే ఐదుగురు మృతి చెందారని వైద్య బృందం ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. నిన్న కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో ఐదుగురి మృతదేహాలకు మంగళవారం పరీక్షలు నిర్వహించారు. వీరందరూ కల్తీ మద్యం సేవించడం వల్లే మృతి చెందారని వైద్యులు పేర్కొన్నారు. ఈమేరకు ఏపీ ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం మృతదేహాల కళ్లు, కాలేయం, మెదడు, కిడ్నీ భాగాలను ఫోరెన్సిక్ విభాగానికి పంపించారు. 72గంటల తరువాత పూర్తిస్థాయి నివేదిక వస్తుందని వైద్య బృందం పేర్కొంది. ఇదిలా ఉంటే కల్తీ మద్య విక్రయాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. 9 రకాల మద్య బ్రాండ్లను నిలుపువేసింది. 48 గంటల పాటు బార్..మద్యం షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. సెక్షన్ 328, రెడ్ విత్ 34, 37ఎ ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఏ1- శారత్ చంద్ర, ఏ2 - పూర్ణిచందర్ శర్మ, ఏ3 – లక్ష్మి, ఏ4 - బాలత్రిపుర సుందరమ్మ, ఏ5- వెంకటరమణ, ఏ6- మాలకొండారెడ్డి, ఏ7- వెంకటేశ్వరరావు, ఏ -8 ఎన్ వెంకటేశ్వరరావు, ఏ 9-మల్లాది విష్ణులను నిందితులుగా చేర్చారు. పూర్తి నివేదిక అనంతరం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా ? లైట్ గా తీసుకుంటుందా ? అనేది వేచి చూడాలి. 

19:32 - December 8, 2015

హైదరాబాద్ : కేంద్ర కరవు బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా విపక్ష బృందం కరవు బృందాన్ని కలిసింది. ఈ సందర్భంగా వారు మెమోరాండంలు సమర్పించారు. సీపీఎం, టి.టిడిపి, తెలంగాణ రైతు సంఘం నేతలు కరవు బృందాన్ని కలిసిన వారిలో ఉన్నారు. అనంతరం వేర్వేరుగా నేతలు మీడియాతో మాట్లాడారు.

పంట బీమా కల్పించాలి - ఎర్రబెల్లి...
రైతులకు పంట బీమా కల్పించాలని టి.టిడిపి నేత ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.కేంద్ర కరవు బృందం తో టిడిపి నేతలు భేటీ అయ్యారు. అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. రైతులు వేసుకున్న పంటలు ఎండిపోయాయని, ఎకరానికి రూ.20వేలు ఇవ్వాలని..పంటల బీమా ఏర్పాటు చేయాలని..ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని..దీనివల్ల రైతుల ఆత్యహత్యలు తగ్గే అవకాశం ఉందని..ఉపాధి హామీ రోజులు పెంచాలని..కూలీ రేట్లు పెంచాలని కోరినట్లు తెలిపారు. నగరంలో మంచినీటి కొరత ఉందని, రెండు వేల మంది దాక చనిపోతే వందల సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తోందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు.

మెమోరాండం ఇచ్చాం - సీపీఎం..
రాష్ట్రంలో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నాయని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పేర్కొన్నారు. కేంద్ర బృందానికి మెమోరాండమ సమర్పించినట్లు తెలిపారు. భూగర్భజలాలు ఎండిపోయాయని, పంటలు ఎండిపోయాయని పేర్కొన్నారు. వరికి రూ.10 వేలు, వాణిజ్య పంటలకు రూ.15వేలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

ఆలస్యంగా ప్రకటించారు - సారంపల్లి...
తెలంగాణ రాష్ట్రంలో చాలా ఆలస్యంగా కరవు మండలాలను ప్రకటించారని రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి పేర్కొన్నారు. కేంద్ర బృందాలు రావడం..పోవడం..ఒక ఆనవాయితీగా మారడం జరిగిందని విమర్శించారు. కేంద్రం నుండి కరవు నిధులు రావట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందన్నారు.

కల్తీ మద్య మృతదేహాలకు ముగిసిన వైద్య పరీక్షలు..

విజయవాడ : కల్తీ మద్యంతోనే ఐదుగురు మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మంగళవారం ఐదుగురి మృతదేహాలకు ఇద్దరు సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు జరిగాయి. కళ్లు..మెదడు..కాలేయం..కిడ్నీ భాగాలను ఫోరెన్సిక్ విభాగానికి పంపించారు. 72గంటల తరువాత పూర్తిస్థాయి నివేదిక వస్తుందని వైద్య బృందం పేర్కొంది. 

ఓయూ హాస్టళ్లపై పోలీసుల దాడులు..

హైదరాబాద్ : ఓయూ హాస్టళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. బీఫ్ పెస్టివల్ నిర్వాహకుల కోసం తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. 

కరవు తీవ్రతను అంచనా వేశాం - కేంద్ర కరవు బృందం..

మెదక్ : జిల్లాలో కరవు తీవ్రతను అంచనా వేసినట్లు కేంద్ర కరవు బృందం ప్రతినిధి శర్మ పేర్కొన్నారు. రేపు ఢిల్లీలో కేంద్రానికి నివేదిక అందిస్తామని, కరవు నివారణకు ప్రభుత్వం కోరిన నిధుల కంటే ఎక్కువే ఇవ్వాల్సినవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. 

18:55 - December 8, 2015

తిరుపతి : ఈనెల 21,22 వ తేదీల్లో నిర్వహించే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఏర్పాట్లపై టిటిడి ఈవో సమీక్ష నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు టిటిడి ఈవో పేర్కొన్నారు. వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్లూ రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తిరుమలకు వచ్చే భక్తులకు అదే రోజు దర్శనమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సామాన్య భక్తులకు ఎక్కువ సమయం కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

18:54 - December 8, 2015

తూర్పుగోదావరి : విద్యార్థిని నందిని మృతికి నారాయణ కళాశాల యాజమాన్యమే కారణమని బంధువులు ఆరోపించారు. మంగళవారం కళాశాల యాజమాన్య ప్రతినిధులను నిలదీశారు. తమకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పడంతో మృతి చెందిన విద్యార్థిని బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ప్రతినిధులపై దాడికి యత్నించారు. దీనితో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
నందిని అనే విద్యార్థిని దాసవాయిపేట క్యాంపస్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నారాయణపురానికి చెందిన నందిని ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవలే ఆమె తండ్రి ప్రసాద్‌ చనిపోయారు. దీంతో తల్లి ఆమెను హాస్టల్‌లో చేర్పించి చదివిపించింది. నందిని పదోతరగతి వరకూ రాజమండ్రిలోని షాడే బాలికల ఉన్నత పాఠశాలలో చదివింది. పదో తరగతిలో మంచి మార్కులు రావడంతో నారాయణ కళాశాలలో సీటు వచ్చినట్టు స్థానికులు పేర్కొన్నారు. అయితే ఇటీవల కళాశాలలో యూనిట్‌ పరీక్షలు జరగడం..ఈ పరీక్షల్లో ఆమె కొద్దిగా వెనుకబడినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థినిపై యాజమాన్యం ఒత్తిడి పెరిగినట్లు ఆరోపణలున్నాయి. సెక్షన్‌ కూడా మార్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన నందిని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. నందిని రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు గతంలోనే స్వాధీనం చేసుకున్నారు. దాసరి నందిని మృతిపై న్యాయవిచారణ జరిపించాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, కెవిపిఎస్‌ సంఘాలు అప్పట్లో డిమాండ్‌ చేశాయి. హాస్టల్‌ ఎదుట ఆయా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా కూడా నిర్వహించారు. 

18:30 - December 8, 2015

కర్నూలు : ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలు కాదని అవి జనవంచన యాత్రలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి తీవ్రంగా విమర్శించారు. జిల్లాలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమలో కరవును నివారించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని, హామీలను చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన పట్టించుకోవడం లేదని, రాష్ట్రం ఒక వైపు మునిగింది..మరోవైపు ఎండిపోయిందన్నారు. రావాల్సిన నీళ్లు రావడం లేదని, ప్రజలు కడుపునిండే పరిస్థితి తీసుకరావాలని సూచించారు. ఒకపూట అన్నం తినే పరిస్థితి లేదన్నారు. పాలనను ప్రజలు హర్షిస్తారని అనుకోవడం మూర్ఖత్వమని బైరెడ్డి తెలిపారు. 

18:23 - December 8, 2015

ఛత్తీస్ గఢ్ : మళ్లీ అడవి రక్తమోడింది. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. సుకుమా జిల్లాలో మంగళవారం సాయంత్రం భద్రతా బలగాలు..మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు..ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. భద్రతా బలగాలు..మావోయిస్టుల మధ్య ఇంకా కాల్పులు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం.
డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు పీపుల్స్ గెరిల్లా వారోత్సవాలు జరుగుతున్నాయి.దీనిపై ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. చివరి రోజు కావడంతో తాటిబండ గ్రామం వద్ద 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతలో గ్రామస్తులతో మావోయిస్టులు సమావేశమైనట్లు పోలీసులకు పక్కా సమాచారం అందించింది. వెంటనే ఎస్టీఎస్, ఇతర భద్రతా బలగాలు మొత్తం 250 మంది సమావేశ ప్రాంగణాన్ని చుట్టుముట్టారు. భద్రతా బలగాలను చూడడంతో మావోయిస్టులు కాల్పులకు దిగినట్లు సమాచారం. వెంటనే భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పులు రెండు గంటల పాటు కొనసాగాయి. ఐదుగురు పోలీసులకు గాయాలైనట్లు సమాచారం. వీరిని హెలికాప్టర్ ద్వారా రాయపూర్ ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్...

ఛత్తీస్ గఢ్ : సుకుమా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కిష్టారం అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. 15 మంది మావోయిస్టులు మృతి చెందగా ఐదుగరు జవాన్లకు గాయాలయ్యాయి. 

వైంకుఠ ఏకాదశి..ద్వాదశి ఏర్పాట్లపై టిటిడి ఈవో సమీక్ష..

చిత్తూరు : తిరుమల 21,22 వ తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఏర్పాట్లపై టిటిడి ఈవో సమీక్ష నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు టిటిడి ఈవో పేర్కొన్నారు. వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్లూ రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తిరుమలకు వచ్చే భక్తులకు అదే రోజు దర్శనమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

మల్లాదిపై కేసు..రాజకీయ కక్షే - దేవినేని...

విజయవాడ : కల్తీ మద్యం ఘటనలో మల్లాది విష్ణుపై కేసు నమోదు రాజకీయ కక్ష సాధింపు చర్యేనని పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేసి నిజనిజాలను నిష్పక్షపాతికంగా వెలికి తీయాలని సూచించారు. ఐఏఎస్ అధికారిని ఇచ్చే నివేదికకు కట్టుబడి ఉండాలని నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

 

ఐసీసీ తాజా ర్యాకింగ్స్...

దుబాయి : తాజా టెస్టు ర్యాంకింగ్స్ ను ఐసీసీ ప్రకటించింది. బౌలింగ్ విభాగంలో తొలిసారిగా టాప్ 10లో జడేజాకు చోటు దక్కింది. బౌలింగ్ విభాగంలో 7వ ర్యాంక్ కు జడేజా చేరాడు. ఆల్ రౌండర్ల విభాగంలో అశ్విన్ కు ప్రథమ స్థానం..బ్యాటింగ్ విభాగంలో రహానేకు 12, కోహ్లీకి 14వ స్థానాలు దక్కాయి.

ఢిల్లీకి బాబు..

హైదరాబాద్ : బుధవారం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర మంత్రులు రాధా మోహన్ సింగ్, మహేశ్ శర్మను బాబు కలువనున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పునరావాస, ముంపు సమస్యలపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. చెగ్యాం, ఉండేడా, ముకరావుపేటలో పరిహారంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. బిల్లు అంచనాలు పూర్నైన ఇళ్లకు పది రోజుల్లో చెక్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు. మేడారం చెరువును జలాశయంగా మార్చే పనులను ప్రారంభించాలని 2016 నాటికి ఎల్లంపల్లి ద్వారా 1.5 లక్షల ఎకరాలకు నీరందించాలన్నారు.

 

అగ్రిగోల్డ్ స్కాంలో బడా నేతలు..రాజకీయ నేతలు - కారెం శివాజి..

ఢిల్లీ : అగ్రిగోల్డ్ కుంభకోణంపై కేంద్ర ఆర్థిక శాఖ, సిటీ ఛైర్మన్, రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో కారెం శివాజీ ఫిర్యాదు చేశారు. ఏపీ, తెలంగాణలో అగ్రిగోల్డ్ కుంభకోణం జరిగిందని, ఆస్తులన్నీ బినామీ పేర్లపై ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో బడా నాయకులు, రాజకీయ నేతలున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, సీబీఐతో విచారించాలని సిట్ ను కోరినట్లు తెలిపారు. 

పాతబస్తీలో సీసీఎస్, టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు..

హైదరాబాద్ : పాతబస్తీలో సీసీఎస్, టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురిని అరెస్టు చేశారు. భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

 

రైతులకు పంట బీమా కల్పించాలి - ఎర్రబెల్లి..

హైదరాబాద్ : రైతులకు పంట బీమా కల్పించాలని టి.టిడిపి నేత ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.కేంద్ర కరవు బృందం తో టిడిపి నేతలు భేటీ అయ్యారు. అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. రైతులు వేసుకున్న పంటలు ఎండిపోయాయని, ఎకరానికి రూ.20వేలు ఇవ్వాలని..పంటల బీమా ఏర్పాటు చేయాలని..ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని..దీనివల్ల రైతుల ఆత్యహత్యలు తగ్గే అవకాశం ఉందని..ఉపాధి హామీ రోజులు పెంచాలని..కూలీ రేట్లు పెంచాలని కోరినట్లు తెలిపారు.

టీఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేస్తోంది - జానా..

నల్గొండ : టీఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేస్తోందని టి.కాంగ్రెస్ నేత జానారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్, పోలీసులు నిష్పక్షపాతికంగా వ్యవహరించాలని, అధికార పార్టీ బెదిరింపులను ఈసీ దృష్టికి తీసుకెళుతామన్నారు.

పువ్వాడకు మద్దతు - ఉత్తమ్..

నల్గొండ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి పువ్వాడకు మద్దతిస్తామని టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ ప్రకటించారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోటీ చేస్తున్నట్లు, రెండు రోజుల్లో ఇతర పార్టీల మద్దతుపై స్పష్టత వస్తుందన్నారు. ఇతర జిల్లాల అభ్యర్థులను రేపు ప్రకటించడం జరుగుతుందని, ఫిరాయింపులే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాని వారిని బలవంతంగా పార్టీలో చేర్చుకుంటున్నారని, సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. 

రాజధాని నిర్మాణ పనులకు కమిటీ..

హైదరాబాద్ : రాజధాని తొలి దశ నిర్మాణ పనులు 2018కల్లా పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం సీఎస్ అధ్యక్షతన కమిటీ వేసింది. ఈమేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. కమిటీలో పది మంది సభ్యులు ఉండనున్నారు. 

17:30 - December 8, 2015

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీలో సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణి.. పెద్ద సమస్యగా తయారైంది. కార్యక్రమానికి ఉన్నతాధికారులు రాకుండా డుమ్మా కొడుతున్నారు. ఇక వచ్చిన అధికారులైతే ప్రజలను చిన్నచూపు చూస్తున్నారు. సమస్యలను పరిష్కరించకుండా ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 సర్కిళ్లు, ఐదు జోనల్‌ కార్యాలయాలతో పాటు కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారు. సమస్యల తీవ్రతను బట్టి అప్పటికప్పుడే పరిష్కరిస్తారు.. లేదా సమస్యలను పరిష్కరించాలని క్రిందిస్థాయి అధికారులను ఆదేశిస్తారు. అయితే ఇవేమీ ప్రజావాణిలో కనిపించడం లేదని గ్రేటర్‌వాసులు వాపోతున్నారు. ఈ కార్యక్రమానికి చాలామంది ఉన్నతాధికారులు హాజరుకావడం లేదని చాలామంది అంటున్నారు.

2012లో కార్యక్రమం ప్రారంభం..
2012లో ఈ కార్యక్రమం ప్రారంభించిన్పటి నుండి ఇప్పటివరకు దాదాపు 2 లక్షల 50 వేల వరకు ఫిర్యాదులు వచ్చాయి. అందులో ఈ ఏడాది 62,700 ఫిర్యాదులందాయి. వాటిలో 56,881 ఫిర్యాదులను పరిష్కరించామని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే.. ఇందులో సమస్యలను పరిష్కరించకుండానే పనులు పూర్తి చేసినట్లు ఎస్‌ఎంఎస్‌లు పంపడం విశేషం. హెల్త్, శానిటేషన్‌, టౌన్‌ప్లానింగ్‌, ఆస్తిపన్ను, ఐటీ, ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల రక్షణ, రోడ్ల ఆక్రమణలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. అయితే సమస్యలను పరిష్కరించడంలో అధికారుల చిత్తశుద్ధి లోపించిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించకుండా ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆగ్రహం చెందుతున్నారు.

ప్రజల ఆగ్రహం...
అధికారుల నిర్లక్ష్యంగా కారణంగా తాము చాలా కోల్పోవాల్సి వస్తుందని గ్రేటర్‌వాసులంటున్నారు. సమస్యలను పరిష్కరించకపోవడంతో విలువైన ఆస్తులను పోగొట్టుకోవాల్సి వస్తుందని పలువురు ఆవేదన చెందుతున్నారు. సొంత డబ్బులతో ఇంకుడుగుంతలు నిర్మించి సబ్సిడీ కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుల్లో సగం కూడా పరిష్కారం కావడం లేదు. ప్రజావాణికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ హాజరుకాకపోవడమే ప్రధాన కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని సమాచారమిచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలంటున్నారు. సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఎంతో ఆశతో వస్తున్న తమకు నిరాశే ఎదురవుతుందని ప్రజలంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం ఇదేవిధంగా కొనసాగితే.. ఎంతో మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ప్రజావాణి కార్యక్రమం భవిష్యత్‌లో కనుమరుగయ్యే ప్రమాదముందంటున్నారు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దీనిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. 

17:25 - December 8, 2015

హైదరాబాద్ : మారిషస్‌ తొలి మహిళా అధ్యక్షురాలు వీ బీ అమీనాగురీబ్ ఫకీమ్‌ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన అధ్యక్షురాలికి మంత్రి కేటీఆర్‌ స్వాగతం పలికారు. రెండురోజుల టూర్‌కోసం నగరానికివచ్చిన అమీనా ఫలక్‌నుమా ప్యాలెస్‌, చౌమహల్లా ప్యాలెస్‌, చార్మినార్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియం, గోల్కొండ కోట చూస్తారు. రేపు కేసీఆర్‌ అమీనాగురీబ్‌కు ప్రత్యేక విందు ఏర్పాటుచేశారు.. సాయంత్రం తిరిగి ఫకీమ్‌ మారిషస్‌ వెళ్లిపోతారు.

17:24 - December 8, 2015

హైదరాబాద్ : మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానానికి టీపీడీ అభ్యర్థి దయాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కలెక్టరేట్‌లో నామినేషన్‌ వేశారు దయాకర్ రెడ్డి. ముందు జిల్లాలోని రెండు స్థానాలకు పోటీ చేయాలని టీడీపీ భావించింది.. ఆ తర్వాత ఒకే స్థానంలో బరిలోకి దిగాలని పార్టీ నేతలు నిర్ణయించారు.. బీజేపీ మద్దతుతో ఈ స్థానంలో అభ్యర్థిని పోటీలో ఉంచారు. అటు నోటిఫికేషన్ విడుదలై వారమవుతున్నా మొదటి ఐదురోజులు ఒక్క నామినేషన్‌కూడా రాలేదు. సోమవారం రోజు ఒక స్వతంత్ర్య అభ్యర్థి... మంగళవారం దయాకర్ రెడ్డి నామినేషన్లు వేశారు. మరో వైపు ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థి లింగాల కమల్‌ రాజు నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు..టిడిపి తో కలిసిన ఏ పార్టీతోనూ వైసీపీ జత కట్టదని పొంగులేటి స్పష్టం చేశారు.. టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పేందుకే వైసీపీ ఎన్నికలబరిలో నిలిచిందని ప్రకటించారు.

17:21 - December 8, 2015

హైదరాబాద్ : ఒకప్పుడు ఉప్పు, నిప్పులా ఉన్న ఇద్దరు సీఎంలు ఇప్పుడు స్నేహగీతం పాడుకుంటున్నారు.. చండీయాగంకోసం విజయవాడకు వెళ్లిమరీ ఏపీ సీఎంను ఆహ్వానించబోతున్నారు తెలంగాణ సీఎం... అలాగే అమ్మవారి మొక్కుకూడా చెల్లించుకోబోతున్నారు.. అక్కడే రెండురోజుల పాటు బస చేస్తారని తెలుస్తోంది. పనిలో పనిగా కనకదుర్గమ్మకు మొక్కు చెల్లించుకోబోతున్నారు. అమరావతి శంకు స్థాపనకోసం స్వయంగా కేసీఆర్‌ ఇంటికొచ్చి కార్డు ఇచ్చారు చంద్రబాబు.. ఇప్పుడు బాబు క్యాంప్ కార్యాలయానికి వెళ్లి చండీయాగానికి పిలవాలని కేసీఆర్‌ నిర్ణయించారు. బుధవారం విజయవాడకు బయలుదేరుతున్నారు కేసీఆర్‌. చంద్రబాబుతో భేటీ తర్వాత దుర్గమ్మ గుడికి వెళతారు.. తెలంగాణ ఏర్పాటైతే అమ్మవారికి ముక్కుపుడక చేయిస్తానని కేసీఆర్‌ మొక్కుకున్నారు. కేబినెట్‌లో తీర్మాణం చేసి ఫిబ్రవరిలో నిధుల మంజూరుకోసం జీవో జారీ చేశారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి 15 గ్రాముల బంగారంతో ఈ ఆభరణం చేయించారు. ఈ ముక్కుపుడకను కుటుంబసమేతంగా ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా సమర్పించబోతున్నారు టీ సీఎం.

ఎర్రవెల్లిలో చండీయాగం...
దాదాపు 14ఏళ్లతర్వాత అమరావతి శంకుస్థాపనకు వెళ్లారు కేసీఆర్‌.. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఏపీలో అడుగుపెడుతున్నారు. అటు చండీయాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీని కూడా ఆహ్వానించబోతున్నారు టీ సీఎం.. మరోవైపు పలువురు ప్రముఖులు యాగానికి వచ్చే అవకాశం ఉండడంతో ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఫాం హౌజ్‌తోపాటు.. ఎర్రవెల్లి గ్రామాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డీజీపీ అనురాగ్‌ శర్మ భద్రతను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి దేవుడి మొక్కుల చెల్లింపుకు బెజవాడనుంచి శ్రీకారం చుడుతున్నారు కేసీఆర్‌. అమ్మవారి మొక్కు తీర్చుకున్నాక... తిరుపతి వెంకన్నకు 5కోట్లతో బంగారు హారం, వరంగల్‌ భద్రకాళీ అమ్మవారికి స్వర్ణ కిరీటం, కొరివి వీరభద్ర స్వామికి బంగారు మీసాలను చేయించబోతున్నారు.

17:19 - December 8, 2015

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈసారి అభిమానులు ఎవరూ కూడా తన జన్మదిన వేడుకలను జరపవద్దని, ఆ మేరకు ఎవరైనా ప్రణాళికలు వేసుకుని ఉంటే వాటిని వెంటనే విరమించుకోవాలని చెప్పారు. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తి చెన్నైతోపాటు పలు ప్రాంతాలు నీటిలో మునిగిపోయిన విషయం తెలిసిందే.
జన్మదిన వేడుకల హడావుడి వద్దు..
పరిస్థితులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి కూడా. ఇలాంటి పరిస్థితులు ఉండగా ప్రస్తుతం జన్మదిన వేడుకల హడావుడి వద్దని, తన అభిమానులంతా కలిసి వరదలకు గురైనవారికి, ప్రాంతాలకు సహాయం చేయాలని కోరారు. చెన్నై మొత్తం కన్నీరుమున్నీరుగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తనకు జన్మదిన వేడుకలకన్నా వారికి సహాయం చేయడమే ముఖ్యమని రజనీకాంత్ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుత 63 ఏళ్ల వయసున్న రజనీకాంత్ ఈ వచ్చే శనివారం 64వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. 

16:59 - December 8, 2015

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 99వ చిత్రం డిక్టేటర్. ఎనౌన్స్ అయిన దగ్గర నుంచే బాలయ్య లుక్ తో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ సినిమా. ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డ ఈ సినిమాను, అదే స్ధాయిలో సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. తాజాగా మరో వార్త ఈ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తోంది.
బాలీవుడ్ లో రీమేక్ కు ప్రయత్నాలు
ఇంకా తెలుగులో రిలీజ్ కూడా కాకపోయినా బాలయ్య డిక్టేటర్ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఇందుకు ప్రయాత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు తెలుగులో దర్శకత్వం వహించిన శ్రీవాస్ బాలీవుడ్ లోనూ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. బాలకృష్ణ నటించిన స్టైలిష్ డాన్ పాత్రలో అజయ్ దేవగన్ ను ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు డిక్టేటర్ బాలీవుడ్ రీమేక్ పై చిత్ర యూనిట్ ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇవ్వలేదు.

 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ కు దూరం - తమ్మినేని...

నల్గొండ : ఖమ్మం జిల్లాలో మినహా మిగిలిన జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిలకు సీపీఎం దూరంగా ఉంటుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం వెల్లడించారు. జిల్లాలో ఎవరికీ తాము మద్దతివ్వడం లేదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ కు దూరంగా ఉంటామన్నారు. టీఆర్ఎస్ ఫిరాయింపులను ప్రోత్సాహిస్తూ ఓటర్లను సమీకరిస్తోందన్నారు. రాష్ట్రంలో కరవు చాలా తీవ్రంగా ఉందని తాగునీరు, పశుగ్రాసం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్డీయే సర్కార్ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మౌనంగా ఉండడం తగదన్నారు. 

బీఫ్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణ..

హైదరాబాద్ : ఓయూలో బీఫ్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కృతమైంది. పలు రకాల బీఫ్ వంటకాలను ప్రదర్శించనున్నారు. ఈనెల పదో తేదీన ఫెస్టివల్ జరిపి తీరుతామని సిటీ సివిల్ కోర్టు నుండి తమకు ఎలాంటి నోటీసులు అందలేదని బీఫ్ నిర్వాహకులు ప్రకటించారు. కొంతమంది మతోన్మాదుల కుట్రదారులు కోర్టుకు వెళితే కోర్టు తమ తిండిని కాలరాస్తుందని అనుకోవడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రేపటిలోగా తమకు నోటీసులు అందితే హైకోర్టుకు వెళుతామని, ప్రజాస్వామ్య వాదుల మద్దతు తమకుందని వెల్లడించారు. 

హుస్సేన్ సాగర్ లో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం..

హైదరాబాద్: హుస్సేన్ సాగర్ లో దూకి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లేక్ పోలీసులు వీరిని కాపాడారు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. తల్లిందండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

 

జనచైతన్య యాత్రలు కాదు..జనవంచన యాత్రలు - బైరెడ్డి..

కర్నూలు : టిడిపి నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలు జన వంచన యాత్రలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి విమర్శించారు. రాయలసీమలో కరవును నివారించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని, హామీలను చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. 

మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో తొక్కిసలాట..

పశ్చిమగోదావరి : జంగారెడ్డి గూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. సౌకర్యాల కొరతతో భక్తులు అవస్థలు పడ్డారు. భారీగా భక్తులు తరలివచ్చారు. 

అమరావతి నిర్మాణంపై లోక్ సభలో నివేదిక...

ఢిల్లీ : అమరావతి నిర్మాణంపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను లోక్ సభలో కేంద్ర మంత్రి హెచ్ పీ చౌదరి ప్రకటించారు. అమరావతి నిర్మాణానికి రూ.27,097 కోట్లు..భవనాల నిర్మాణానికి రూ.10,519 కోట్లు..మౌలిక వసతుల అభివృద్ధి..విస్తరణకు రూ.9,181 కోట్లు, మౌలిక వసతులకు రూ.1,536 కోట్లు ఖర్చవుతుందని నిపుణులు పేర్కొన్నారని తెలిపారు.

 

నారాయణ కళాశాల ఎదుట విద్యార్థిని బంధువుల ఆందోళన.

రాజమండ్రి : నారాయణ కళాశాల ఎదుట విద్యార్థిని నందిని బంధువులు ఆందోళన చేపట్టారు. నందిని ఆత్మహత్యకు యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ కళాశాల యాజమాన్యంపై దాడి చేశారు. గత నెలలో నందిని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. 

క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తుంది - రాజయ్య..

హైదరాబాద్ : క్రిస్మస్ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య పేర్కొన్నారు. 16న బట్టల పంపిణీ...19న చర్చీల్లో భోజనం..20న నిజాం కాలేజీ మైదానంలో సీఎం కేసీఆర్ విందు ఇవ్వనున్నట్లు తెలిపారు. కేసీఆర్ దళిత, క్రైస్తవుల పక్షపాతి అని కొనియాడారు.

 

129 సబ్సిడీ కేంద్రాల్లో కందిపప్పు - కేసీఆర్..

హైదరాబాద్ : రాష్ట్రంలో కందిపప్పు ధరను అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 129 సబ్సిడీ కేంద్రాల్లో కేజీ పప్పు రూ.135 కే అందచేస్తున్నట్లు, సబ్సిడీ కేంద్రాల్లో కందిపప్పు కొరత లేకుండా చూడాలని కేసీఆర్ పేర్కొన్నారు. 

16:48 - December 8, 2015

సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ కన్నా యాక్టివ్ గా మరొకరు ఉండరేమో! ఎప్పుడూ ఏదో ఒక విషయంపై కామెంట్లు రాస్తూ, సెటైర్లు వేస్తూ వార్తల్లో ఉండటం రామూకి బాగా అలవాటు. ఇప్పుడు తాజాగా మెగా వారసుడు వరుణ్ తేజ్ పై తన అభిప్రాయాన్ని ట్వీట్ల రూపంలో వ్యక్తపరిచారు.
వరుణ్ తేజ్ లో నాకు నచ్చేదేంటంటే.. 
'వరుణ్ తేజ్ లో నాకు నచ్చేదేంటంటే.. వరుణ్ 'మెగా' ట్రీ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ పవర్ మీద ఆధారపడడు, తన సొంత సోలార్ బ్యాటరీ తనకుంటుంది. అలా ఆధారపడితే ఒక్కోసారి ఆ ఎలక్ట్రిసిటీనే.. పవర్ లేకుండా చేయవచ్చు. స్టార్ పవర్ అంటే 'పవర్ స్టార్' మీద, అలాగే 'మెగా' ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడకపోవడమే. వరుణ్ తేజ్ చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే బ్యాచ్ కాదు, చెట్టుని గౌరవిస్తాడు కానీ కొమ్మలాగ బతకడం కోరుకోడు' అంటూ మరోసారి తన స్టైల్లో దుమ్ము రేపాడు వర్మ.

16:39 - December 8, 2015

మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలూ వచ్చేశాయి. కానీ ఆ ఎన్నికల వివాదానికి సంబంధించిన వార్తలు ఇంకా హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. నటుడు శివాజీరాజా తనను వ్యక్తిగతంగా దూషించాడని నటి హేమ ఆరోపిస్తోంది. శివాజీరాజాపై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా ఈ విషయం దర్శకరత్న దాసరి నారాయణరావు దృష్టికి తీసుకెళ్లిందట. అంతేకాదు అవసరమైతే చిరంజీవితో మాట్లాడతానని, ఇంకా అవసరమనుకుంటే పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లి కూర్చుంటానని, న్యాయ పోరాటం చేస్తానని హేమ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి.

 

16:35 - December 8, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి ఏపీ రాష్ట్రానికి వెళ్లనున్నారు. తాను నిర్వహించే చండీయాగానికి రావాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించనున్నారు. అంతేగాకుండా గతంలో మొక్కును కూడా కేసీఆర్ నెరవేర్చుకోనున్నారు. రెండు రోజుల పాటు ఆయన విజయవాడలో బస చేయనున్నట్లు సమాచారం. బుధవారం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని వివిధ కేంద్ర మంత్రులను కలువనున్నట్లు సమాచారం. చండీయాగానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను వారికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అనంతరం సాయంత్రం నగరానికి చేరుకుని నేరుగా విజయవాడకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతారా ? లేక గురువారం భేటీ అవుతారా అని తెలియరాలేదు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే ఏపీకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అమరావతి శంకుస్థాపనకు రావాలని కేసీఆర్ కు బాబు ఆహ్వానించడంతో ఆయన వెళ్లి వచ్చారు. డిసెంబర్ చివరి వారంలో కేసీఆర్ చండీయాగాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. యాగానికి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు..వివిధ అధికారులను ఆహ్వానించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కూడా ఆహ్వానించాలని కేసీఆర్ తలిచారు. కానీ ఎక్కువగా విజయవాడలో బాబు ఉండడంతో కేసీఆర్ కలువలేకపోయారు. దీనితో నేరుగా విజయవాడకు వెళ్లి సీఎం క్యాంపు కార్యాలయంలో బాబును కలవాలని కేసీఆర్ తాజాగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంతేగాక గతంలో మొక్కు కూడా తీర్చుకున్నట్లు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అమ్మవారికి ముక్కుపుడక చేయిస్తానని గతంలో కేసీఆర్ మొక్కుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబుతో జరిపే భేటీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివాదాలు..ఇతర అంశాలు చర్చకు వస్తాయా ? లేదా ? అన్నది తెలియరాలేదు. 

16:28 - December 8, 2015

ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన అంశం పార్లమెంట్ ను కుదిపేసింది. ప్రభుత్వం కక్ష పూరిత చర్యలకు పాల్పడుతోందని రాజ్యసభలో గులాం నబీ ఆజాద్ ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని సభకు తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు స్తంభించినా చలనం లేదని, ప్రతిపక్షాలపై మాత్రం ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ కూతురు పెళ్లి సందర్భంగా సీబీఐ దాడులు జరుపడం ఇందుక నిదర్శనమన్నారు. అధికార పార్టీయైనా.విపక్షాలైనా ఒకే న్యాయం పాటించాలని సూచించారు. దీనిపై ఆర్థిక మంత్రి జైట్లీ స్పందించారు. ఎస్పీ, బీఎస్సీకి సంబంధించిన కేసులు కాంగ్రెస్ హాయాంలో వెలుగు చూశాయని సభ దృష్టికి తెచ్చారు. కాంగ్రెస్ నేతలపై వచ్చిన ఆరోపణలు సామాన్యమైనవి కావని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వానికి సంబంధం లేదని..కోర్టుకు సంబంధించిందని తెలిపారు. దీనితో కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.


లోక్ సభలో...
నేషనల్ హెరాల్డ్ కేసుకు నిరసనగా లోక్ సభలో కాంగ్రెస్ ప్రశ్నోత్తరాలను అడ్డుకుంది. మంగళవారం ప్రారంభమైన లోక్ సభలో రైతుల సమస్యలపై డిప్యూటి స్పీకర్ చర్చకు అనుమతినిచ్చారు. దీనికి కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసు కోర్టుకు సంబంధించిందని ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్ర మంత్రి రూఢీ సభకు తెలిపారు. సభను అడ్డుకోవడం ద్వారా విలువైన సమయాన్ని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. 

16:14 - December 8, 2015

ఈ వార్త నిజమైతే చూడాలని ఎవరికి ఉండదు చెప్పిండి. అసలే 150వ సినిమా విషయంలో ఉగిసలాటతో ఉన్న చిరంజీవి ఇప్పుడు కమల్ హాసన్ డైరెక్షన్ లో నటిస్తున్నారన్న వార్త వస్తే ఇంకేమైనా ఉందా.. నేషనల్ వైడ్ గా పెద్ద సెన్సేషన్ అవడం కానీ.. చిరంజీవి వ్యవహారం తెలిసిన వాళ్లకు ఇప్పట్లో ఇది సాధ్యమయ్యే విషయం కాదని కాస్త మెల్లగా అర్థమవుతుంది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. సినిమాలకు సంబంధించినంత వరకు వర్సెటల్ టాలెంట్ కమల్ హాసన్ సొంతమని అందరికీ తెలుసు. ఓ నటుడిగా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా, స్టోరీ రైటర్ గా, గాయకుడిగా ఆయన చేసినన్ని ట్రయల్స్ మరే నటుడూ చేయలేందంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. అలాంటి కమల్ హాసన్ 25 ఏళ్ల క్రితం చిరంజీవితో తన డైరెక్షన్ లో ఓ సినిమా చేద్దామని ప్లాన్ చేశారట.

తను దర్శకత్వం వహిస్తాను కానీ ఆ సినిమాలో మాత్రం నటించనని అప్పట్లో చిరంజీవికి కమల్ చెప్పారట. అంతా ఓకే అయినా… చివరికి ఎందుకో ఆ ప్రాజెక్టు షూటింగ్ వరకు వెళ్లలేదని ఈ మధ్యే కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. చిరంజీవికి తానే సీ సినిమా గురించి ప్రపోజ్ చేశానని కూడా చెప్పారు. మరి విషయం ఎక్కడ బెడిసిందో కానీ.. చివరికి అలా పెండింగ్ లో పడిపోయిందట. అందరి దర్శకత్వంలో మీరు ఇలా గుర్తుచేసుకున్నారు.

150వ సినిమా దర్శకుడిగా ఎవరిని ఫైనల్ చేయాలా అన్న విషయంలో దిక్కులు చూస్తున్న చిరంజీవికి ఈ విషయం గుర్తొచ్చి కమల్ డైరెక్షన్ లో నటిస్తే బాగుంటుంది కదా అని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.

 

విజయవాడకు వెళ్లనున్న కేసీఆర్..

హైదరాబాద్ : విజయవాడకు తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. చండీయాగానికి రావాలని ఏపీ సీఎం బాబును కేసీఆర్ ఆహ్వానించనున్నారు. 

15:36 - December 8, 2015

హైదరాబాద్ : కొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే నోటిఫికేషణ్ జారీ కావడం..నామినేషన్ లు ప్రారంభమయ్యాయి. 12 స్థానాలనూ తాము గెలుస్తామని అధికార పక్షం ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎమ్మెల్సీ స్థానానికి వామపక్షాల తరపున పువ్వాడ నాగేశ్వరరావు, టీఆర్ఎస్ తరపున బాలసాని లక్ష్మీనారాయణ బరిలో నిలిచారు. అక్కడ అంతగా బలం లేకపోయినా విజయం సాధిస్తామని ప్రగల్భాలు పలుకుతోంది. అందులో భాగంగా క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. మంగళవారం జిల్లాకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు..సర్పంచ్ లు ..ఇతర నేతలను హైదరాబాద్ కు తరలించారు. శివారు ప్రాంతంలోని శామిర్ పేట వద్ద కంట్రీక్లబ్ లో వీరిని తరలించారు. ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానానికి ఓటు వేసే విధంగా వారికి చెబుతున్నట్లు తెలుస్తోంది.
మండలి ఎన్నికల నేపథ్యంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కానీ ఖమ్మంలో భిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొంది. అధికార పక్షానికి అంతగా ఇక్కడ పట్టు లేదు. జిల్లాకు సంబంధించిన టిడిపికి చెందిన తుమ్మల నాగేశ్వరరావును చేర్చుకని టీఆర్ఎస్ మంత్రి పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరిగే ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని తుమ్మల వ్యూహాన్ని రచిస్తున్నారు. వామపక్షాల తరపున పువ్వాడ నాగేశ్వరరావు విజయం తథ్యమని వార్తలు వస్తున్నాయి. అన్ని వామపక్షాలతో పాటు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. టిడిపికి చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. సంఖ్యా బలంగా చూస్తే పువ్వాడ విజయం తథ్యమని తేలింది. దీనితో అధికార పక్షం అప్రమత్తమై క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై విపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. 

ఉభయసభలు వాయిదా...

ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ అంశం లోక్ సభను..రాజ్యసభను కుదేపిసింది. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీనితో స్పీకర్ లు సభలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

ఆ ఘటనతో మల్లాదికి సంబంధం లేదు - రఘువీరా..

విజయవాడ : స్వర్ణభారత్ తో మల్లాది విష్ణుకు సంబంధం లేదని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా తేల్చిచెప్పారు. మల్లాది విష్ణును కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, మృతుల కుటుంబాలకు మద్యం కంపెనీల నుండి నష్టపరిహారం అందించేలా చట్టం తీసుకరావాలని సూచించారు. కల్తీ మద్యం ఘటన విచారకరమని, ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

రెచ్చిపోయిన ఛైన్ స్నాచర్లు..

హైదరాబాద్ : నగరంలో మరోసారి ఛైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. కంచన్ బాగ్ లో మహిళ వద్ద ఆరు తులాల బంగారు గొలుసు..చైతన్యపురి యాదవ్ నగర్ లో వృద్ధురాలి నుండి నాలుగు తులాల బంగారు గొలుసులను అపహరించారు. 

పోలవరానికి బాబు పూజలు..

పశ్చిమగోదావరి : పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఇటుకలపూడి వద్ద పట్టిసీమను ఆనుకుని ఉన్న పోలవరం కుడి కాల్వకు బాబు పూజలు చేశారు. తొలుత పట్టిసీమ ప్రాజెక్టు వద్దకెళ్లిన ఆయన అక్కడ కొనసాగుతున్న పనులను పరిశీలించారు. 

హైదరాబాద్ లో మారిషస్ ప్రెసిడెంట్..

హైదరాబాద్ : నగరానికి మారిషస్ అధ్యక్షురాలు బీబీ అమీనా ఫిర్ దౌస్ గురిబ్ ఫాఖిమ్ చేరుకున్నారు. రెండు పర్యటన నిమిత్తం ఆమె ఇక్కడకు చేరుకున్నారు. టీఎస్ మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు అధికారులు స్వాగతం పలికారు. 

మార్చిలో బయటకు సంజయ్..?

ముంబై : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వచ్చే ఏడాది జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్చి నెల మొదటి వారంలో ఎరవాడ సెంట్రల్ జైలు నుండి సంజయ్ విడుదల కావచ్చని వార్తలు వస్తున్నాయి. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి అక్రమ ఆయుధాలు కలిగిఉన్నాడన్న అభియోగాలు రుజువు కావడంతో టాడా కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 

14:50 - December 8, 2015

నవంబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు అంతర్జాతీయంగా మహిళలపై హింసా వ్యతిరేక ప్రచారం జరుగనుంది. అన్ని చోట్ల వివక్ష కొనసాగుతుండడం..కుటుంబసభ్యులే దాడులకు పాల్పడుతున్న వైనాలు మనం చూడవచ్చు. ఇంటా, బైట రక్షణ కరువవుతోంది. చివరకు పని ప్రదేశాల్లో కూడా లైంగిక వేధింపులు అధికమౌతున్నాయి. ఈ నేపథ్యంలో మానవి 'వేదిక'లో ఈ అశంపై లక్ష్మీ (ఓయూ ప్రొఫెసర్), గిరిజ (వాయిస్ ఫర్ జెండర్ జస్టిస్) లు విశ్లేషించారు. ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు హింసకు గురవుతున్నారని పేర్కొన్నారు. మహిళల అక్రమ రవాణా అతి పెద్ద వ్యాపారంగా మారిందని, నిస్సహాయ మహిళలను బలవంతంగా సెక్స్ వృత్తిలోకి దింపుతున్నారని తెలిపారు. చివరకు చిన్నారులపై కూడా దాడులు ఆగడం లేదని, చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని..దోషులు తప్పించుకోకుండా చూడాలని..బాధితులకు సత్వర న్యాయం జరగాలని..కుటుంబసభ్యుల ఆలోచనా ధోరణి మారాలని..విద్యావ్యవస్థలో సెన్సివిటీ పెరగాలి..ప్రసార మాధ్యమాల్లో మార్పులు రావాలని సూచించారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

కంట్రీక్లబ్ కు జడ్పీటీసీలు..ఎంపీటీసీలు..

ఖమ్మం : మండలి ఎన్నికల నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. 100 మందికి పైగా జడ్పీటీసీ, ఎంపీటీసీలను కంట్రీక్లబ్ కు తరలించారు. టీఆర్ఎస్ ను గెలిపించుకొనేందుకు గులాబీ నేతలు ఆరాటం చెందుతున్నారు. 

దండేపల్లిలో పెద్దపులి...

ఆదిలాబాద్ : దండేపల్లి (మం) లింగాపూర్ శివారులో చిన్నగుట్ట అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరించింది. పులిని చూసి భయంతో రైతులు పరుగులు తీశారు. 

 

ఐపీఎల్ లో సరికొత్త ఫ్రాంచైజీలు....

ముంబై : ఐపీఎల్ రెండు కొత్త ఫ్రాంచైజీలు వచ్చాయి. రూ.10 కోట్లకు రాజ్ కోట్ జట్టును ఇంటెక్స్ కొనుగోలు చేసింది. రూ.16 కోట్లకు పుణె జట్టును సంజీవ్ గోయెంక దక్కించుకున్నారు. 

సిరివెల్లమెట్ట వద్ద బస్సు - లారీ ఢీ...

కర్నూలు : సిరివెల్లమెట్ట వద్ద ఆర్టీసీ బస్సు - లారీ ఢీకొన్నాయి. ఈఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. బస్సులో చిక్కుకున్న డ్రైవర్ ను రక్షించడం కోసం స్థానికులు ప్రయత్నిస్తున్నారు.  

టీఆర్ఎస్ చేసింది శూన్యం - ఉత్తమ్...

హైదరాబాద్ : 18 నెలల్లో నగరానికి టీఆర్ఎస్ చేసింది శూన్యమని పీసీసీ చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. రాజధానికి గోదావరి, కృష్ణా నీటిని తీసుకొచ్చామని, టీఆర్ఎస్ అబద్దాలు చెబుతోందని తెలిపారు. గ్రేటర్ లో నాయకులంతా సమన్వయంతో ముందుకెళుతారని, ప్రభుత్వ వైఫల్యాలను గ్రేటర్ ప్రజలకు వివరిస్తామన్నారు. 

గూడెపువలసలో ఉద్రిక్తత...

విజయనగరం : గూడెపువలసలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భోగాపురం ఎయిర్ పోర్టు భూ సర్వేను గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసులు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.

కల్తీ మద్యం బాధితులను పరామర్శించిన జగన్...

విజయవాడ : ప్రభుత్వ ఆసుపత్రిలో కల్తీ మద్యం బాధితులను వైసీపీ అధ్యక్షుడు జగన్ పరమార్శించారు. కల్తీ మద్యం మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని, ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యాన్ని తాగిస్తూ అడ్డగోలుగా ఆదాయాన్ని పొందుతోందని విమర్శించారు. కల్తీ మద్యం అమ్మకాల బాధ్యత ప్రభుత్వానిదేనని, మద్యం పాలసీని మార్చాలని సూచించారు. 

14:28 - December 8, 2015

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు ప్రత్యేక హోదా కమిటీ సభ్యులు. ఉద్దండరాయపాలెం నుంచి మట్టి,నీరు తీసుకువచ్చి ఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద కలిపారు. కేంద్రం మాటలతో కాలయాపన చేస్తోందని వెంటనే ఏపీకి విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా నేతలు టెన్ టివితో మాట్లాడారు. నీతి ఆయోగ్ ద్వారా నిర్ణయిస్తామని వాగ్ధానం చేశారని, ఆ దిశగా అడుగులు పడడం లేదన్నారు. పార్లమెంట్ లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతున్నామని, విభజన హామీలు అమలు చేయండని కోరుతున్నామన్నారు. మోడరన్ స్టేటస్ లాంటి గారడి మాటలు చెప్పవద్దని, బిల్లులో ఏమైమవీ ఉన్నావో అవి అమలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. నీతి అయోగ్ ఏర్పడి 11 మాసాలు పూర్తవుతున్నా ఏపీ రాష్ట్రానికి నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్, ఇతర రాష్ట్రాలకు నిధులు కేటాయించారని గుర్తు చేశారు. నీతి ఆయోగ్ పేరిట కాలయాపన చేయడం సరికాదని వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వెనుకబాటు తనం పోవడానికి రూ.50 కోట్లు సరిపోతుందా అని ప్రశ్నించారు.

రాబోయే కాలంలో విభజన బిల్లులో పొందుపరిచిన హామీల సాధనకు పోరాడుతామన్నారు. ఈ ఉద్యమంలో అందరూ ముందుకొస్తున్నారని తెలిపారు. 

14:25 - December 8, 2015

హైదరాబాద్ : రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి ఐదుగురు మరణించడం దారుణమన్నారు కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి. కల్తీ మద్యానికి కారణం మద్యం అమ్మకం దారులా, లేక పట్టించుకోని ఎక్సైజ్ అధికారులా అన్నదానిపై నిష్పక్ష పాతంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తాత్కాలికంగా నిషేధం విధించకుండా కల్తీ అమ్మకంపై దారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సంఘటనను రాజకీయ కక్షల కోసం వాడుకుంటున్నారా ? లేక ఇందులో అసలైన విషయాలు మరుగున పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారా ? అని ప్రశ్నించారు. మల్లాది విష్ణుతో మాట్లాడడం జరిగిందని, బిల్డింగ్ యజమానితో సంబంధం లేదని, బంధువులతో సంబంధం ఉందని అతడిని లాగేప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదని రఘువీరా పేర్కొన్నారు. 

14:23 - December 8, 2015

విజయవాడ : తాము అధికారంలోకి వస్తే మద్యంపై నిషేధం విధిస్తామని ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించారు. రాష్ట్రంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కల్తీ మద్యం ఘటన బాధితులను పరామర్శించిన జగన్‌.. సర్కార్‌పై మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను పెంచుకునేందుకే సర్కార్‌ యత్నిస్తుందన్నారు. కల్తీ మద్యం ఘటనలో మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. మంత్రి గారి ఇలాఖాలో బెల్టు షాపులు యాక్షన్ చేసి అమ్ముకుంటున్నారని, ఇదంతా చూస్తుంటే వ్యవస్థ ఎలా ఉందో అర్థమౌతుందన్నారు. 

13:44 - December 8, 2015

బాలీవుడ్‌ నాయకానాయికలు వరుణ్‌ధావన్‌, జాన్‌ అబ్రహం, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'డిష్యూం' చిత్రం ఫస్ట్‌లుక్‌ సోమవారం విడుదలైంది. ఈ ఫస్ట్‌లుక్‌ ఫొటోను జాన్‌ అబ్రహం తన ట్విట్టర్‌ ఎకౌంట్‌ ద్వారా అభిమా నులతో పంచుకున్నారు. బాలీవుడ్‌ ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌గా నిలిచిన 'షో' చిత్రంలోని జై-వీరు పాత్రలను, ఆ నేపథ్యాన్ని గుర్తుకు తెచ్చేలా 'డిష్యూం' ఫస్ట్‌లుక్‌ ఫొటో ఉంది. ఆద్యంతం యాక్షన్‌ సన్నివేశాల సమాహారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వరుణ్‌ధావన్‌ సోదరుడు రోహిత్‌ ధావన్‌ దర్శకత్వం వహిస్తు న్నారు. ఈ చిత్రాన్ని సాజిద్‌ నడియడ్‌వాలా నిర్మిస్తున్నారు. 

13:39 - December 8, 2015

విజయవాడ : కల్తీ మద్యం ఘటనలో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్ట్‌ చేస్తామని ఏపీ డీజీపీ రాముడు స్పష్టం చేశారు. ఆయన సోమవారం కల్తీ మద్యంతో మరణించిన, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... పూర్తి నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనలో ప్రమేయం ఉన్నవారు ఎంత పెద్దవాళ్లైనా వదిలే ప్రసక్తి లేదన్నారు రాముడు. 

13:37 - December 8, 2015

ధర్మేంద్ర.. రొమాంటిక్‌ హీరోగా, యాక్షన్‌ కింగ్‌గా, హీ మ్యాన్‌గా బాలీవుడ్‌లో చెరగని ముద్ర వేసిన ఆల్‌రౌండర్‌. అగ్రస్థానంలో ఉన్న అమితాబ్‌ బచ్చన్‌కి సైతం గట్టి పోటీ ఇస్తూ దాదాపు మూడు దశబ్దాల పాటు బాలీవుడ్‌లో తిరుగులేని కథానాయకుడిగా నిలిచారు. హావభావాలతో తనదైన నటన, అద్భుతమైన డైలాగ్‌ డెలివరీతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న బాలీవుడ్‌ లెజెండరీ హీరో ధర్మేంద్ర పుట్టిన రోజు నేడు (మంగళవారం). ఈ సందర్భంగా ధర్మేంద్ర గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు చూద్దాం..

- పంజాబ్‌ రాష్ట్రంలోని లుథియానా జిల్లాకు చెందిన నాస్రాలి గ్రామంలో జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్‌ సింగ్‌ డియోల్‌.

-ఇంటర్మీడియట్‌ వరకు సొంత ఊరులోనే చదువుకున్నారు. సినిమాలపై ఆసక్తితో ఇండిస్టీకి వచ్చారు. హ్యాండ్‌సమ్‌ మ్యాన్‌గా ఫిల్మ్‌ఫేర్‌ మ్యాగజైన్‌ కవర్‌పేజీకి ఫోజులిచ్చి పలు అవార్డులందుకున్నారు.

-1960లో తొలిసారి 'దిల్‌ భీó తేరా హమ్‌ భీó తేరా' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.

కెరీర్‌ మొదట్లో రొమాంటిక్‌ పాత్రలకు కేరాఫ్‌గా నిలిచారు. 1960 నుంచి 67 వరకు 'సూరత్‌ ఔర్‌ సీరత్‌', 'బందిని', 'దిల్‌ నే ఫిర్‌ యాద్‌ కియా', 'దుల్హన్‌ ఏక్‌ రాత్‌ కి', 'అన్‌పధ్‌', 'పూజా కే ఫూల్‌', 'బహ్రెన్‌ ఫిర్‌ భీ ఆయేంగీ', 'ఆయీ మిలన్‌ కి బేలా', 'మై భీ లడకీ హూ', 'కాజల్‌', 'ఫూల్‌ ఔర్‌ పత్తర్‌' వంటి చిత్రాల్లో నటించి బాలీవుడ్‌లో రొమాంటిక్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు.

-1975లో విడుదలైన సంచలన 'షోలే' చిత్రంతో బాలీవుడ్‌లో తిరుగులేని నటుడిగా ఎదిగారు. ఈ చిత్రంతోనే ఆయన బాలీవుడ్‌ లో యాక్షన్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌ చిత్రాలు: 'ఆంఖే', 'మేరా గాన్‌ మేరా దేష్‌', 'జుగ్ను', 'కహాని కిస్మత్‌ కి', 'యాదోమ్‌ కి బరాత్‌', 'షోలే', 'చుప్కే చుప్కే', 'నయా జమానా', 'రాజా జాని', 'సీత ఔర్‌ గీత', 'దోస్త్‌', 'ఆగ్‌ హి ఆగ్‌', 'హుకుమత్‌', 'గులామి', 'యతీమ్‌', 'బట్వారా', 'హత్యార్‌', 'క్షత్రియ', 'జానీ గద్దర్‌', 'అప్నే', 'లైఫ్‌ ఇన్‌ మెట్రో' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి ఆల్‌రౌండర్‌గా నిలిచారు.

-హీరోయిన్లలో అత్యధికంగా హేమామాలినితో కలిసి 27 చిత్రాల్లో నటించారు. అప్పట్లో వీరికి మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ పెయిర్‌ ఇన్‌ బాలీవుడ్‌ అనే ముద్ర పడింది. ఆ తర్వాత మీనా కుమారితో ఎక్కువ చిత్రాల్లో నటించారు.

-బిమల్‌ రాయ్ , మోహన్‌ కుమార్‌ దర్శకత్వంలో డ్రామా చిత్రాలు, యష్‌చోప్రా, రఘునాథ్‌ జలానీ దర్శకత్వంలో ఎక్కువగా రొమాంటిక్‌ చిత్రాలు, రాజ్‌ కోస్లా, రమేష్‌ సిిప్పి, అర్జున్‌ హింగోరని, అనిల్‌ శర్మ, రాజ్‌కుమార్‌ సంతోష్‌ వంటి దర్శకులతో ఎక్కువగా యాక్షన్‌ చిత్రాలు చేశారు. అలాగే హృషికేష్‌ ముఖర్జీ, బసు చటర్జీ, రాజ్‌కుమార్‌ కొహ్లీ దర్శకత్వంలో కామెడీ చిత్రాలు చేశారు. ఇలా అన్ని రకాలు చిత్రాల్లోనూ నటించి ఆకట్టుకున్నారు.

1975లోనే నిర్మాతగా మారి 'ప్రతిగ్యా', 'ఘాయల్‌', 'బర్సాత్‌', 'ఇండియన్‌', '23 మార్చ్‌ 1931: షహీద్‌', 'సొచ నా తా', 'అప్నే', 'యమ్లా పాగ్లా దీవానా 2', 'ఘాయల్‌ వన్స్‌ ఎగైన్‌' వంటి చిత్రాలను నిర్మించారు.

-హీరోగా హవా సాగిస్తున్న సమయంలోనే ప్రపంచంలోనే అత్యంత అందమైన ఏడుగురు హీరోల్లో ధర్మేంద్ర ఒకరిగా నిలిచారు.

- ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు ప్రకాష్‌ కౌర్‌, హేమా మాలిని ఉన్నారు. అలాగే కుమారులు సన్నీ డియోల్‌, బాబీ డియోల్‌, కుమార్తెలు విజేత డియోల్‌, అజీత డియోల్‌, ఇషా డియోల్‌, అహానా డియోల్‌ ఉన్నారు.

-హేమామాలినితోపాటు సన్నీడియోల్‌, బాబీ డియోల్‌, ఇషా డియోల్‌, అహానా డియోల్‌ తదితరులంతా బాలీవుడ్‌లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకోవడం విశేషం.

నచ్చిన నటి: హేమా మాలిని, ఇష్టమైన నటులు: దాదా సాహెబ్‌ ఫాల్కే, సురైయా, ఫేవరేట్‌ గేమ్‌: క్రికెట్‌, పంజాబీ ఫుడ్‌ అంటే ఇష్టం. ఖాళీ సమయంలో కవిత్వాలు రాస్తుంటారు.

ఓ వైపు నటుడిగా రాణిస్తూనే మరోవైపు రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. 2004 నుంచి 2009 వరకు బిజెపి పార్టీ తరఫున లోక్‌ సభ సభ్యుడిగా పనిచేశారు.

55ఏళ్ళ సినీ కెరీర్‌లో బాలీవుడ్‌, పంజాబీలో కలిపి దాదాపు 250కిపైగా చిత్రాల్లో నటించి మెప్పించిన ధర్మేంద్రను భారతీయ ప్రభుత్వం 2012లో పద్మ భూషణ్‌ అవార్డుతో సముచితంగా గౌరవించింది. అలాగే నిర్మాతగా తెరకెక్కించిన 'ఘాయల్‌' చిత్రానికి జాతీయ అవార్డునందు కున్నారు. దీంతోపాటు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ (ఫిక్కీ) ద్వారా 'లివింగ్‌ లెజెండ్‌'తోపాటు 'లైఫ్‌ టైం అఛీవ్‌మెంట్‌ అవార్డు', దాదా సాహెబ్‌ ఫాల్కే రత్నా అవార్డులను పొందారు. నేటితో 80 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న ధర్మేంద్ర ఇప్పటికీ పలు చిత్రాల్లో శక్తివంతమైన పాత్రల్లో నటిస్తుండటం విశేషం.

గోల్కొండ హోటల్ లో గ్రేటర్ కాంగ్రెస్ నేతల భేటీ

హైదరాబాద్ : గోల్కొండ హోటల్ లో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నతేలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా జీమెచ్ ఎంసీ ఎన్నికలపై చర్చించారు. ఈ భేటీ తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మర్రిశశిధర్ రెడ్డి, దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

కల్తీ మద్యం బాధితులను పరామర్శించిన డీజీపీ

విజయవాడ: కృష్ణలంక కల్తీ మద్యం కేసులో నిందితులు ఎంతటివారైనా విడిచిపెట్టేది లేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడు స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితులు తప్పించుకోకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. మంగళవారం విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణబార్ను జెవి రాముడు పరిశీలించారు.

13:16 - December 8, 2015

అక్రోట్స్‌ (వాల్నట్‌ ) సాధారణంగా అందరికి తెలిసిన ఎండిన పండ్లు. పోషక విలువలు అధికంగా కలిగిన డ్రైఫ్రూట్‌. వీటితో తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ను నివారించవచ్చని ఇటీవల జరిగిన పరిశోధనల్లో స్పష్టమైంది. కాస్త ఎక్కువ ధర ఉన్నప్పటికీ అనారోగ్యం వచ్చిన తర్వాత వాడే మందులతో పోల్చితే తక్కువే. ఎన్నో పోషకాలున్న అక్రోట్స్‌ తో కలిగే ప్రయోజనాలు..

- రక్తంలోని చక్కెర స్థాయిల నియంత్రించడంలో అక్రోట్స్‌ ఎంతగానో ఉపయోగపడుతాయి.

- డైలీ మెనూలో అక్రోట్స్‌ను చేర్చితే హృదయ రక్తనాళ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని పరిశోధనలలో స్పష్టమైంది.

- వీటిలో ఎక్కువ మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు రోగ నిరోధకశక్తిని పెంచుతాయి.

- అక్రోట్స్‌లో ఎక్కువగా ఉండే ఫాటీ ఆసిడ్స్‌ రొమ్ము క్యాన్సర్‌ ను నివారిస్తాయి. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడేవారు రోజూ కొన్ని అక్రోట్స్‌ తీసుకుంటే ఎంతో మంచిది.

- ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్‌ పుష్కలంగా ఉండే అక్రోట్స్‌ రోజూ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరంలో చెడు కొవ్వు పదార్థాలను తగ్గించి గుండెను ఆరోగ్యకరంగా ఉంచే మంచి కొవ్వు పదార్థాల స్థాయిని పెంచడంలో ఇవి ఉపయోగపడుతాయి.

- గర్భాధారణ సమయంలో బిడ్డ పెరుగుదలకు కావల్సిన పోషకాలు అక్రోట్స్‌లో ఉంటాయి. ఇవి పిండ పెరుగుదలకు, శిశువు ఆరోగ్యాన్ని, తల్లి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతాయి. ప్రసవం సమయంలో సమస్యలను నివారిస్తాయి.

- జీర్ణక్రియ సమస్యలను నివారించడంతో పాటు స్థూలకాయసమస్యను నియంత్రిస్తాయి. ఇటీవల జరిగిన పరిశోధనల ప్రకారం రోజూ 30 గ్రాముల అక్రోట్స్‌ మూడు నెలల పాటు తీసుకుంటే జీర్ణక్రియ సంబంధిత వ్యాధులను నివారించవచ్చు.

- మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ళను అక్రోట్స్‌ తీసుకోవడం వల్ల నివారించవచ్చు.

సో.. ఆరోగ్యానిచ్చే అక్రోట్స్‌ను మీ మెనూలోనూ చేర్చుకోండి..

 

13:02 - December 8, 2015

కాలిఫ్లవర్, బంగాళదుంప, ఉల్లిలకు ఉదర క్యాన్సర్లను రాకుండా అడ్డుకునే లక్షణాలు ఉన్నట్లు చైనాలోని జిజియాంగ్ విశ్వవిద్యాలయ పరిశోధనలో వెల్లడైంది. అయితే బీర్, మద్యం, ఉప్పు, నిల్వ చేసిన ఆహారపదార్థాల వల్ల క్యాన్సర్ కారకాలు పెరిగే ప్రమాదం ఉందని అద్యయనం చెప్పింది.

బ్రిటన్ లో ప్రతిరోజు ఉదరక్యాన్సర్ తో పదిహేను మంది మరణిస్తున్నారు. బాధితుల్లో పదిహేను శాతం మంది పదేళ్ల కంటే ఎక్కువ జీవించడం లేదని అధ్యయనకారులు పేర్కొన్నారు. క్యాబేజి, కేల్, సెలరీ వంటి వాటిల్లోనూ క్యాన్సర్ ను అడ్డుకునే గుణాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది.

అన్ని రకాల కూరగాయల్లో విటమిన్-సి ఉంటుంది. బంగాళదుంపల్లోని యాంటాక్సిడెంట్స్ ఉదరంలోని కణజాలం మీద ఒత్తిడి పడకుండా కాపాడుతాయి. ప్రతిరోజు యాభై గ్రాముల పండ్లు తిన్నా కూడా అయిదు శాతం క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంఇ. కాబట్టి మీరు తాజా కూరగాయలు, పండ్లు తినడం మరువద్దు. పండ్ల రసాలకు బదులు పండ్లు తీసుకోవడమే ఉత్తమం. శరీరానికి తగినంత పీచుపదార్థం లభిస్తుంది. జీర్ణకోశ సమస్యలు రావు.

 

 

నామినేషన్ దాఖలు చేసిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

హైదరాబాద్ : నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.

ప్రొఫెసర్ కు ఐఎస్ తో సంబంధాలు.. అరెస్ట్

హైదరాబాద్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో పాకిస్తాన్ లో మరో అరెస్టు జరిగింది. పంజాబ్ లోని యూనివర్సిటీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ కు చెందిన గలీబ్ అటా అనే ప్రొఫెసర్ ని పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాద వ్యతిరేక బలగాలు, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ప్రత్యేక రైడింగ్ లు జరిపిమరీ అతడిని అరెస్టు చేశారు. గత వారంలో అరెస్టయిన ఉగ్రవాద నేత హిజ్బుత్ తహ రీర్ కు గలీబ్ కు సంబంధాలు ఉన్నాయని తమ విచారణలో తేలిందని అందుకే ఆయనను ఉన్నపలంగా అరెస్టు చేసినట్లు పాక్ అధికారులు చెప్పారు.

12:50 - December 8, 2015

వాతదోషప్రకోపం వల్ల ఎముకలు గుల్ల బారి బలహీనంగా తయారవుతాయని ఆయుర్వేదం చెబుతుంది. ఈ వ్యాధినే ఆయుర్వేద వైద్యులు 'ఆస్టియోపోరోసిస్' అని పిలుస్తారు. ఈ వ్యాధి బారిన పడినవారికి నడుము, వెన్నెముక, మణికట్టు వద్ద ఎముకలు సులభంగా విరిగిపోతాయి. శరీరంలో కాల్షియంతో పాటు విటమిన్ -డి తగ్గిపోవడం థైరాయిడ్ గ్రంథి క్రియలో అతిగా స్పందించడం, మధుమేహం బారిన పడినవారు, వయసుమీరిన వారు ఈ వ్యాధి బారినపడతారు. నడుంనొప్పి, ఎత్తుతగ్గడం, ఎముకల్లో కదలికలు లేకపోవడం లాంటివి ఈ వ్యాధి ప్రధాన క్షణాలు. ఎముకలు గుల్లబారిపోకుండా ఇంట్లోనే కొన్ని సులభ చికిత్సలు చేయవచ్చు.

-రోజూ ఉదయం, రాత్రి పావు టీస్పూన్ దాల్చిన చెక్కను మెత్తని చూర్ణంగా చేసి పాలల్లో కలిపి తాగాలి.

-గ్లాసు పాలల్లో అల్లం రసం, తేనెలను ఒక టీస్పూన్ చొప్పున కలిపి తాగాలి.

-రోజూ ఉదయాన్నే రెండు చిటికెల పిప్పిళ్ల చూర్ణాన్ని పాలల్లో తేనెలో కలిపి తీసుకోవాలి.

-ఒక టీ స్పూన్ మద్ది చెక్క మెత్తని చూర్ణాన్ని పాలల్లో కలిపి తాగాలి.

-కప్పు వేడిపాలలో టీస్పూన్ నువ్వుల పొడిని కలిపి రోజుకు మూడుసార్లు తాగుతుంటే ఎముకలు గట్టిపడతాయి.

-కాల్షియం ఎక్కువగా ఉండే మునగ ఆకులతో కూరను, పువ్వులతో చట్నీ చేసుకోవాలి. తరుచూ మునగ కాయలతో పులుసు చేసుకుని తింటుంటే చక్కని ఫలితం కలుగుతుంది.

-ఎనిమిది బాదం గింజలు నీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటి పై పొరలు తీసి ఆవుపాలలో కలిపి నూరి గ్లాసు పాలలో తాగాలి.

-ఇసుకలో దొరికే పసుపురంగు గవ్వను కానీ, తెల్లని నత్తగుల్లను కానీ నీటిలో శభ్రంగా కడిగి రాత్రి ఒక గ్లాసులో వేసి ఒక నిమ్మకాయ రసం పిండి మూత పెట్టాలి. ఉదయాన్నే ఆ గ్లాసులోని నీటిని వడబోసి తాగుతుంటే వ్యాధి తగ్గిపోతుంది.

 

సాయంత్రం హస్తినకు సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ఈ రోజు సాయంత్రం సీఎం కేసీఆర్ హస్తినకు వెళ్లనున్నారు. బుధవారం జరిగే కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ కుమారుడి వివాహానికి సీఎం హాజరు కానున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులను ఆయుత చండీ యాగానికి సీఎం ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది.

12:40 - December 8, 2015

విజయవాడ : కల్తీ మద్యం కేసులో పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 328, రెడ్ విత్ 34, 37ఎ ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఏ1- శారత్ చంద్ర, ఏ2 - పూర్ణిచందర్ శర్మ, ఏ3 – లక్ష్మి, ఏ4-బాలత్రిపుర సుందరమ్మ, ఏ5- వెంకటరమణ, ఏ6- మాలకొండారెడ్డి, ఏ7- వెంకటేశ్వరరావు, ఏ -8 ఎన్ వెంకటేశ్వరరావు, ఏ 9-మల్లాది విష్ణులను నిందితులుగా చేర్చారు.

12:39 - December 8, 2015

కృష్ణా : విజయవాడలోని స్వర్ణ బార్ లో నిన్న కల్తీ మద్యం సేవించి ఐదు మంది ప్రాణాలు కోల్పోవడంతో, ఏపీ సర్కారు కన్నెర్ర చేసింది. కల్తీ మద్యం సరఫరా చేస్తున్న పలు బ్రాండ్లపై నిషేధం విధించింది. ఆఫీసర్స్ ఛాయిస్ బ్యాచ్ 120, రాయల్ స్టాగ్ బ్యాచ్ 26, డైరెక్టర్స్ స్పెషల్ బ్యాచ్ 143, ఓఏబీ బ్యాచ్ 57, ఓల్డ్ టావెర్న్ బ్యాచ్ 77, మెక్ డోవెల్స్ విస్కీ బ్యాచ్ 9, మెక్ డోవెల్స్ బ్రాందీ బ్యాచ్ 232, ఇంపీరియల్ బ్లూ బ్యాచ్ 10, బ్యాగ్ పైపర్ మ్యదంపై నిషేధం విధించింది.

12:37 - December 8, 2015

నెల్లూరు : కడప , చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టు నెల్లూరు జిల్లాలో ఉండగా, ముంపు ప్రాంతాలు మాత్రం కడప జిల్లాలో ఉన్నాయి. ప్రాజెక్టులోని నీరు సమీప గ్రామాలలోకి ప్రవేశించడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. గ్రామాల్లో నడుములోతు నీరు పారుతున్నాప్రజలు ఊరు వదిలివెళ్లేందుకు నిరాకరిస్తున్నారు.

114 గ్రామాల్లో ముందపు...

దాదాపు 114 గ్రామాలు సోమశిల ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కడపజిల్లాలోని చెయ్యేరు నది, శేషాచల అడవుల నుంచి వచ్చే నీరు, గుంజనేరు నది మీదుగా భారీగా సోమశిల బ్యాక్ వాటర్ కు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 78 టీఎంసీలు కాగా, ఎగువ నుంచి వచ్చిన నీటితో బ్యాక్ వాటర్ పెరిగింది. సోమశిల జలాశయంలో ప్రస్తుతం 72 టీఎంసీల నీరు ఉంది. ఈ సారి 75 టీఎంసీలు నిల్వ చేయాలని నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం భావిస్తోంది. దీని ఫలితంగా కడప జిల్లాలో చాలా గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ముంపు గ్రామాల ప్రజలను ఖాళీ చేయాలని అధికారులు కోరుతున్నా గ్రామస్థులు ససేమిరా అంటున్నారు .

94 గ్రామాలకు ప్రభుత్వం నష్టపరిహారం.....

సోమశిల ముంపు గ్రామాలలోని 114 గ్రామాల్లో 94 గ్రామాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. ఇంటిమిట్ట మండలంలోని ముంపుగ్రామాల్లో నష్టపరిహారం ఇవ్వలేదు. భూములను కోల్పోయిన వారికి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. ముంపుగ్రామాల ప్రజలకు డికెటి పట్టా ఉన్నా లబ్దిదారులకు ఇంకా నష్టపరిహారం అందలేదు. అధికారులు తమకు న్యాయం చేసేంతవరకు గ్రామాలు వదిలి వెళ్లేది లేదని గ్రామస్థులు తేల్చి చెబుతున్నారు. ముంపు ప్రాంతాల్లోని అట్లూరు, గోపవరం , ఒంటిమిట్ట, నందలూరు గ్రామప్రజలు ఇక్కడే ఉంటూ చేపలు పట్టుకుంటున్నారు. బయటకు వెళదామంటే గ్రామాన్ని నీరు చుట్టేసింది. దీంతో వీరి బ్రతుకులు అయోమయంలో పడ్డాయి. ప్రత్యామ్నాయం చూపించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.

ప్రజలను ముంచేలా ఉండకూడదు...

ప్రాజెక్టులు ప్రజల దాహార్తిని తీర్చేలా ఉండాలే తప్ప, ప్రజలను ముంచేలా ఉండకూడదు. వరదలు వచ్చినప్పుడే అధికారులకు ముంపు ప్రాంతాలు గుర్తుకు వస్తాయని.. అలాంటిది తమ దీనిస్థితి అధికారులకు ఎందుకు కనిపించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. శాశ్వత పరిష్కారం చూపించి.. తమకు నష్టపరిహారం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలిక ఉపశమనంతో సమస్యలు పరిష్కారం కావని చెబుతున్నారు బాధితులు. 

12:35 - December 8, 2015

విజయవాడ : జూన్ 1లోగా ఏపీ ఉద్యోగులంతా రాజ‌ధాని అమ‌రావ‌తికి త‌ర‌లిపోవాల‌ని ఇటీవ‌ల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే నివాస‌ప‌రంగా సౌక‌ర్యాలు లేవని, ఒకవేళ ఇళ్లు ఖాళీగా ఉన్నా అద్దెలు భారీగా ఉంటాయనే విమర్శలు ఉద్యోగుల నుంచి వెలువడుతున్నాయి. అయితే నగర ఉద్యోగులు మాత్రం అవన్నీ అపోహలు అంటున్నారు. ఇంతకి ఏది నిజం.. ఏది అబద్ధం..

ఉద్యోగుల త‌ర‌లింపు ప్రక్రియ ఒక హాట్‌ టాపిక్‌గా....

ఏపీలో నూతన రాజధానికి ఉద్యోగుల త‌ర‌లింపు ప్రక్రియ ఒక హాట్‌ టాపిక్‌గా మారింది. మౌలిక వసతులు, నివాస గృహాలు, ఆఫీసుల గురించి ప్రభుత్వానికి, ఉద్యోగుల సంఘాల‌కు మధ్య చ‌ర్చలు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా టిడిపి సర్కార్ ఉద్యోగుల త‌ర‌లింపుకు డెడ్‌ లైన్ ప్రక‌టించ‌డంతో ఉద్యోగుల నుంచి అసమ్మతి వ్యక్తమవుతోంది. వెంట‌నే ప్రభుత్వం ముందు త‌మ కోరిక‌ల చిట్టానుంచారు. త‌మ డిమాండ్‌లన్నీ స‌రైన‌వేనని ఉద్యోగులు చెప్పుకొచ్చారు. వాళ్లు చెప్తున్న సమస్యల్లో ఇళ్ల అద్దె ప్రధాన సమస్యగా ఉంది.

ఎక్కువమంది విజయవాడ నగరంలోనే....

రాజధాని తరలింపులో భాగంగా ఎక్కువమంది విజయవాడ నగరంలోనే ఉండాలి. దీంతో నివాసాల అద్దెలు ఎక్కువగా ఉంటాయనే విమర్శ వ్యక్తమవుతోంది. అయితే ప్రస్తుతం నగరంలో ఉంటున్న ఉద్యోగులు మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నారు. చాలా చోట్ల ఇంటి అద్దెలు అందుబాటులోనే ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ కార్యాల‌యాల ఏర్పాటుకు సంబంధించి క‌మ‌ర్షియ‌ల్‌ కాంప్లెక్స్‌ల కిరాయి కాస్త ఎక్కువ‌గానే ఉంది. మెయిన్ సెంటర్లలో చదరపు అడుగు 30 నుండి 40 రూపాయ‌ల దాకా ఉంటోంది. ఇది ప్రభుత్వానికి భార‌మ‌నే చెప్పొచ్చు.

అయితే ఇంటి అద్దెలు మాత్రం....

అయితే ఇంటి అద్దెలు మాత్రం అంత భారీగా ఏమీ లేవు. న‌గ‌రంలోని రామ‌వ‌ర‌ప్పాడు, ప్రసాదంపాడు, పోరంకి, కృష్ణలంక వంటి ఏరియాల్లో సింగిల్‌ బెడ్‌ రూమ్ అద్దెలు 4 నుంచి 5 వేల వ‌ర‌కూ, డ‌బుల్‌ బెడ్‌రూమ్ 8 నుంచి10 వేల దాకా ఉంది. దాదాపుగా హైద‌రాబాద్‌లో మాదిరే ఇక్కడా అద్దెలు ఉన్నాయ‌ని స్థానిక ఉద్యోగులు చెప్తున్నారు.

హైద‌రాబాద్‌లో ఉన్న హెచ్ఆర్ఏనే....

ప్రస్తుతం హైద‌రాబాద్‌లో ఉన్న హెచ్ఆర్ఏనే ఇక్కడా అమ‌లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబ‌ట్టి ఉద్యోగుల త‌ర‌లింపుకు ఇంటి అద్దెలు అడ్డంకిగా ఉండ‌క‌పోవ‌చ్చు. ఏది ఏమైనా జూన్ 1లోపు తరలి రావ‌డానికి ఎటువంటి అభ్యంత‌రాలు లేవంటున్నారు ఉద్యోగులు. మౌలిక వసతులు కల్పిస్తే ఏ సమస్యా ఉండదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

నేను ఇందిరాగాంధీ కోడలిని : సోనియా

ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి నిన్నటిదాకా నోరు విప్పని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తొలిసారిగా స్పందించారు. నేటి ఉదయం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. హెరాల్డ్ కేసుపై స్పందించాలని మీడియా ప్రతినిధులు పదే పదే కోరగా ఆమె ఘాటుగా స్పందించారు. ‘‘నేను దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కోడలిని. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు’’ అని ఆమె తేల్చిచెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు నమోదయ్యాయన్న విషయం మీకు తెలియదా? అంటూ ఆమె మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నించారు.

12:02 - December 8, 2015

హైదరాబాద్ : ఆదివాసీల జీవితాల్లో వెలుగు నింపేందుకు దశాబ్దాలుగా కృషి చేశారు. కలెక్టర్‌గా ఆదివాసీలకు అండగా నిలిచారు. ఉన్న ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా భావించి అడవి బిడ్డల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. గిరిజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఆ మహా మనిషి బ్రహ్మదేవ్‌ శర్మ ఇక లేరు.

ఆదివాసీల కోసం అహర్నిశలు కృషి చేసి....

ఆదివాసీల కోసం అహర్నిశలు కృషి చేసి, భారత ప్రజా ఉద్యమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకున్న మహా వ్యక్తి డాక్టర్‌ బ్రహ్మదేవ్‌ శర్మ ఆదివారం గ్వాలియర్‌లో కన్ను మూశారు. ఆయన గత కొన్నాళ్లుగా అస్వస్థతగా ఉన్నారు.

ఉత్తరప్రదేశ్‌ మురాదాబాద్‌లో జన్మించారు..

బిడి శర్మ 19 జూన్‌, 1931లో ఉత్తరప్రదేశ్‌ మురాదాబాద్‌లో జన్మించారు. అనంతరం ఆయన కుటుంబం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు మారింది. బిడి శర్మ1956లో మధ్యప్రదేశ్‌ కాడర్‌ ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. గణితంలో పిహెచ్‌డి చేసిన శర్మ- 1968 నుంచి 1970 వరకు మధ్యప్రదేశ్‌లోని బస్తర్‌ జిల్లాలో కలెక్టర్‌గా పనిచేశారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో ఆదీవాసీ సమాజంతో ఆయనకు విడదీయరాని బంధం ఏర్పడింది.

1973-74లో హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా....

ఎప్పుడూ గిరిజనులు, పేదలు, రైతుల సంక్షేమం గురించే ఆలోచించే శర్మ- ఎస్‌టి కమిషన్‌ కమిషనర్‌గా ఆయన ఇచ్చిన రిపోర్టు ఆదివాసీలకు ఎంతో న్యాయం చేకూరిందని చెబుతారు. 1973-74లో హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా కూడా బిడి శర్మ పనిచేశారు. గ్రామాల్లో పేదరికం కారణంగానే రైతులు దోపిడీకి గురవుతున్నారని తెలిపేవారు.

బిడి శర్మ ఆవేదన.....

భూమి, నీరు, అడవిని నమ్మకుని జీవించే ఆదీవాసీలకు అభివృద్ధి పేరిట ప్రభుత్వం ప్రాజెక్టులకు అనుమతిస్తుండడం వల్ల వారు తమ ఉనికిని కోల్పోతున్నారని బిడి శర్మ ఆవేదన చెందేవారు. 1980లో బస్తర్‌లో పాయిన్‌ ప్రాజెక్ట్‌ నిర్మించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ బిడి శర్మ తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేశారంటే ఆదీవాసీల పట్ల అయనకున్న అంకిత భావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో ఆయన మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రాజెక్టులలో పనిచేయడానికి వచ్చే కొందరు అభం శుభం తెలియని ఆదివాసి అమ్మాయిలను పెళ్లి పేరిట వారిపై అత్యాచారానికి పాల్పడేవారు. అలాంటివారిని గుర్తించిన శర్మ - దాదాపు 3 వందల ట్రైబల్‌ అమ్మాయిలను గిరిజనేతర వాళ్లతో పెళ్లి చేసి న్యాయం చేశారు.

ఆదీవాసీలు మావోయిస్టులకు మద్దతిస్తున్నట్టు...

తమ హక్కులను కాపాడుతున్నందువల్లే ఆదీవాసీలు మావోయిస్టులకు మద్దతిస్తున్నట్టు తనకు అర్థమైందని ఓ ఇంటర్వ్యూలో శర్మ పేర్కొన్నారు. బస్తర్‌ కలెక్టర్‌గా తాను పెద్ద ప్రాజెక్టులకు అనుమతించలేదని ఆయన చెప్పారు. ఓసారి బస్తర్‌ కలెక్టర్‌ అలెక్స్‌పాల్‌ మీనన్‌ను మావోయిస్టులు కిడ్నాప్‌ చేస్తే ప్రభుత్వం తరపున శర్మ మధ్యవర్తిగా వ్యవహరించి ఆయనను విడిపించారు.

శర్మ లేని లోటు ఎప్పటికీ తీరనిది.....

ఆదీవాసీ ప్రాంతాల్లో అడవి, భూమి, నీరు లాంటి వనరులపై ఇప్పటికీ వారికి యాజమాన్య హక్కులు కల్పించకపోవడం అన్యాయమని చెప్పేవారు. బ్రిటీష్‌ పాలనలో గిరిజన ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించారని- కానీ.. దేశానికి స్వాతంత్రం వచ్చాకా ఆదివాసీల పరిస్థితి మరింత దుర్భరంగా మారిందని శర్మ ఆవేదన చెందేవారు. ఆదీవాసీ సమాజ పరిరక్షణ కోసం వారి వికాసానికి కృషి చేసిన శర్మ లేని లోటు ఎప్పటికీ తీరనిది.

11:54 - December 8, 2015

హైదరాబాద్ : తెలంగాణాలో ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఆన్‌లైన్‌గా మార్చేందుకు ప్లాన్‌లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఇరిగేషన్‌ శాఖలో ఫైల్‌ ట్రాకింగ్‌ కోసం బార్‌కోడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా ఆర్థికశాఖలో ఫైల్ మూవింగ్‌, సంతకాలను మొత్తం ఆన్‌లైన్‌లోనే చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆర్ధికశాఖను కాగితరహితంగా చేయాలనే నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం.

ఏ శాఖ నుంచి పనులు కావాలన్నా..

ఏ శాఖ నుంచి పనులు కావాలన్నా.. పథకాలు అమలు కావాలన్నా ఆర్థికశాఖ అనుగ్రహం తప్పనిసరి. ఆర్థిక శాఖ అనుమతి లేనిదే ఏ శాఖలోని ఏ పనులు ముందుకు సాగవు. కాని ఆర్థిక శాఖ పనులలో అలసత్వం పెరిగిపోయిందని ఇతర శాఖలు ఆరోపిస్తున్నాయి. దీంతో తమ పని విధానాన్ని చాటేందుకు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ఆన్ లైన్ విధానాన్ని అవలంభించేందుకు రెడీ అయింది. ఆర్థిక శాఖ మరో 15 రోజుల్లో కాగితంరహిత విధానాన్నివందశాతం అమలు చేసేందుకు సిద్దమైంది.

ఇప్పటికే 90 శాతం వరకు ఫైల్స్‌ ఆన్‌లైన్‌లోకి....

ఇప్పటికే 90 శాతం వరకు ఫైల్స్‌ ఆన్‌లైన్‌లోకి వచ్చాయి. సెక్షన్ ఆఫీసర్‌కు వచ్చే మూలాధార ఫైల్‌ తప్పా మిగతావన్నీ ఆన్‌లైన్‌ చేసింది ఆర్థికశాఖ. సెక్షన్‌ ఆఫీసర్‌కు ఏ సమయానికి ఫైల్ వచ్చింది... అక్కడి నుంచి అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌కు ఎప్పుడు చేరింది.. డిప్యూటీ సెక్షన్‌ అధికారికి ఎంత కాలానికి చేరిందనే వివరాలన్నీ ఇప్పటికే ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఇదే కాదు పద్దుల నిర్వహణతో పాటు రోజువారి ఆదాయ, వ్యయాలను కూడా ఆన్‌లైన్‌లో వచ్చేటట్లు చేస్తున్నారు.

వచ్చిన ఫైల్‌ వారంరోజుల్లో క్లియర్ అయ్యే విధంగా....

సెక్షన్‌ అధికారికి వచ్చిన ఫైల్‌ వారంరోజుల్లో క్లియర్ అయ్యే విధంగా పనులను ఆన్ లైన్ లో పెట్టాలని ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో జాప్యాన్ని తగ్గించే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మొదట ఆర్థిక శాఖ సంస్కరణలను ప్రారంభిస్తే.. మిగతా శాఖలు కూడా అదే బాటలో నడుస్తాయంటున్నారు అధికారులు. 

11:51 - December 8, 2015

హైదరాబాద్ : బాక్సైట్ త‌వ్వకాల‌కు వ్య తిరేకంగా వైసీపీ ఆందోళ‌న‌కు సిద్దమైంది. బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వం ఇచ్చిన జివో 97ను వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని పోరుబాట‌ పడుతున్నారు. ప్రభుత్వ తీరుకు నిర‌స‌న‌గా చింతపల్లిలో వైఎస్‌ జ‌గ‌న్ ఆధ్వర్యంలో బ‌హిరంగస‌భను నిర్వహించేందుకు వైసీపీ నేత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

విశాఖ మన్యంలో 1212 హెక్టార్లలో బాక్సైట్ తవ్వకాలు........

విశాఖ‌ మ‌న్యంలో 1212 హెక్టార్లలో బాక్సైట్ త‌వ్వకాలకు అనుమ‌తి ఇస్తూ జీవో నెంబ‌ర్ 97 ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అన్ని పార్టీలు ఆందోళ‌న బాట ప‌ట్టాయి. బాక్సైట్ తవ్వకాలపై జీవో 97ను వెన‌క్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ విష‌యంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రక‌ట‌న చేయ‌లేద‌ని ప్రధాన ప్రతిప‌క్షం వైసీపి ఆరోపిస్తుంది. బాక్సైట్ త‌వ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళ‌న‌ని ఉధృతం చేయాల‌ని వైసీపి నిర్ణయించింది. ఇప్పటికే స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బాక్సైట్ త‌వ్వకాల‌కు ప్రభుత్వం ఇచ్చిన జీవోకి వ్యతిరేకంగా స్థానికుల‌తో క‌లిసి ఆందోళ‌న చేస్తున్నారు. ప్రభుత్వం జీవో వెన‌క్కి తీసుకోకుంటే రాజీనామాకి సైతం సిద్దమని ఈశ్వరి ప్రకటించారు. ఈ పోరాటంలో బాగంగానే ఈనెల 10న విశాఖ జిల్లా చింత‌ప‌ల్లిలో జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో పర్యటన వారం వాయిదా

వాస్తవానికి ఈ నెల మొదటివారంలో జగన్‌ విశాఖ మన్యంలో పర్యటించాల్సి ఉంది. కానీ మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతుండడంతో వారం రోజులు పాటు పర్యటన వాయిదా వేసుకున్నారు. బాక్సైట్ త‌వ్వకాల వ‌ల్ల న‌ష్టపోతున్న గిరిజ‌నుల‌కు అండగా ఉంటామ‌ని వైసీసీ అధినేత జగన్ స్పష్టం చేశారు. గ‌తంలో చంద్రబాబు ప్రతిప‌క్ష నేత‌గా ఉన్నప్పుడు బాక్సైట్ మైనింగ్‌కు వ్యతిరేకంగా గ‌వ‌ర్నర్‌కు లేఖ రాసిన విష‌యాన్ని వైసీపీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. బ‌హిరంగస‌భ‌కు ప్రభుత్వం నుంచి అనుమ‌తి తీసుకునేందుకు వైసీపీ నేత‌లు ప్రయ‌త్నిస్తున్నారు. ఒక‌వేళ ప్రభుత్వం అనుమ‌తించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచ‌న‌లో వైసీసీ నేతలున్నారు. బాక్సైట్ మైనింగ్‌కు వ్యతిరేకంగా వామ‌ప‌క్షాలు, స్థానిక అధికార టీడీపీ నేత‌లు కూడా ఆందోళ‌న చేస్తున్నారు. ఇత‌ర పార్టీల‌ని కూడా క‌లుపుకొని ఆందోళ‌న ఉధృతం చేస్తామని వైసీపీ నేత‌లు స్పష్టం చేస్తున్నారు.

11:49 - December 8, 2015

ఢిల్లీ : ఉమ్మడి ఏపీకి కృష్ణా ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని ఏపీ, తెలంగాణ పంచుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ కోరినట్లు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అవసరం లేదని స్పష్టం చేసింది. తెలంగాణ లేవనెత్తిన వివాదాన్ని ఆ రాష్ట్రాలకే పరిమితం చేయాలని ధర్మాసనం తెలిపింది. ఈ విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది.

11:49 - December 8, 2015

ఏదైనా జబ్బు బారిన పడిన తర్వాత మందులకు తగ్గకపోవచ్చేమో గానీ, జబ్బు రాకుండా ముందే జాగ్రత్తపడేందుకు ప్రకృతి మనకు ఎన్నెన్నో ఆహార పదార్థాల్ని ఇచ్చింది. ఆ విషయాల గురించి కొంత అవగాహన ఉంటే చాలా రకాల భయాలకు మనం దూరంగా ఉండొచ్చు. కొన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే హృద్రోగ సమస్యలను అధిగమించవచ్చు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ వారు ఇటీవల జరిపిన ఒక పరిశీధోనలో వాల్నట్స్ గుండె జబ్బులు రాకుండా చేయగలుతున్నాయంటూ తేలింది. రోజూ వాల్నట్స్ తీసుకుంటే రక్తంలో చెడు కొస్ట్రాల్, ట్రెగ్లిసరైడ్స్ బాగా తగ్గిపోతున్నట్లు స్పష్టమైంది.

-వాల్నట్స్ లో గడ్డకట్టని కొవ్వు పదార్థాలు, శరీర రక్షణకు అవసరమైన లవణాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.
-వీటిలో ఒమేగా-3 అంటే శరీరానికి అత్యవసరమైన అల్ఫా-లైనోలెనిక్ ఆసిడ్ ఉంటుంది.
-ప్రతి రోజూ 60 గ్రాముల వాల్నట్స్ ను ఆహారంగా తీసుకుంటే గుండె జబ్బులకు కారణమయ్యే ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా టైప్-2 మధుమేహం వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.

 

కల్తీ మద్యం కేసులో ముద్దాయిలు వీరే...

విజయవాడ : కల్తీ మద్యం కేసులో పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 328, రెడ్ విత్ 34, 37ఎ ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఏ1- శారత్ చంద్ర, ఏ2 - పూర్ణిచందర్ శర్మ, ఏ3 – లక్ష్మి, ఏ4-బాలత్రిపుర సుందరమ్మ, ఏ5- వెంకటరమణ, ఏ6- మాలకొండారెడ్డి, ఏ7- వెంకటేశ్వరరావు, ఏ -8 ఎన్ వెంకటేశ్వరరావు, ఏ 9-మల్లాది విష్ణులను నిందితులుగా చేర్చారు.

ఉభయ సభల్లో కాంగ్రెస్ సభ్యుల ఆందోళన

ఢిల్లీ: కాంగ్రెస్అ ధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పై కేంద్ర ప్రభుత్వం రాజకీయ కుట్ర పన్నినట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలను ప్రభుత్వం కావాలనే ఇరికిస్తోందని ఎంపీలు సభలను స్తంభింపచేశారు. లోకసభ, రాజ్యసభలోనూ కాంగ్రెస్ ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. వెల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో ఉభయ సభలను వాయిదా వేశారు. మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టింది. తాము రాజకీయ కుట్రకు పాల్పడలేదని బీజేపీ తేల్చి చెప్పింది. కేసు కోర్టులో ఉంటే పార్లమెంట్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఏపీలో పలు బ్రాండ్ల మద్యంపై నిషేధం...

కృష్ణా : విజయవాడలోని స్వర్ణ బార్ లో నిన్న కల్తీ మద్యం సేవించి ఐదు మంది ప్రాణాలు కోల్పోవడంతో, ఏపీ సర్కారు కన్నెర్ర చేసింది. కల్తీ మద్యం సరఫరా చేస్తున్న పలు బ్రాండ్లపై నిషేధం విధించింది. ఆఫీసర్స్ ఛాయిస్ బ్యాచ్ 120, రాయల్ స్టాగ్ బ్యాచ్ 26, డైరెక్టర్స్ స్పెషల్ బ్యాచ్ 143, ఓఏబీ బ్యాచ్ 57, ఓల్డ్ టావెర్న్ బ్యాచ్ 77, మెక్ డోవెల్స్ విస్కీ బ్యాచ్ 9, మెక్ డోవెల్స్ బ్రాందీ బ్యాచ్ 232, ఇంపీరియల్ బ్లూ బ్యాచ్ 10, బ్యాగ్ పైపర్ మ్యదంపై నిషేధం విధించింది.

కృష్ణా నదీ జలాల వివాదంపై విచారణ 10కి వాయిదా

ఢిల్లీ : ఉమ్మడి ఏపీకి కృష్ణా ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని ఏపీ, తెలంగాణ పంచుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ కోరినట్లు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అవసరం లేదని స్పష్టం చేసింది. తెలంగాణ లేవనెత్తిన వివాదాన్ని ఆ రాష్ట్రాలకే పరిమితం చేయాలని ధర్మాసనం తెలిపింది. ఈ విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది.

11:26 - December 8, 2015

హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం కల్తీ మహమ్మారి.. ఇందుగలడు అందు లేడు అన్న రీతిలో... ప్రతి చోటా వ్యాపించి ఉంది. కర్నూలు నుంచి సిక్కోలు దాకా మద్యం కల్తీ దందా సాగుతోంది. పగలంతా పడ్డ కష్టాన్ని మరిచేందుకు.. లేదా కాస్తంత ఉపశమనం పొందేందుకు కిక్కును ఆశ్రయిస్తున్నాడు. దీన్నే మద్యం వ్యాపారులు అవకాశంగా తీసుకుంటున్నారు. సామాన్యుడి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

రెండు విధానాలుగా మద్యం కల్తీ..........

రాష్ట్రంలో మద్యం కల్తీ రెండు విధానాలుగా జరుగుతోంది. బ్రాండెడ్‌ మద్యం బాటిల్‌ మూతను.. చాకచక్యంగా ప్రత్యేక యంత్రం ద్వారా తీసి.. అందులోని పాతిక శాతం మద్యాన్ని తీసుకొని.. ఖాళీ అయిన బాటిల్‌లో ఆమేర స్పిరిట్‌ను నింపుతున్నారు. మద్యం ప్రియులకు అనుమానం రాకుండా బాటిల్‌ లేబుల్‌ను, మూతను డబ్లుకం సాయంతో అమర్చుతున్నారు. మద్యం కల్తీకి మహారాష్ట్ర, పుణె, బీహార్‌లలో దొరికే స్పిరిట్‌ను వినియోగిస్తున్నట్లు సమాచారం.

మందుబాబులు గుర్తించలేని రీతిలో మద్యంలో స్పిరిట్‌ కల్తీ...............

బీహార్‌ తదితర రాష్ట్రాల నుంచి తెచ్చే స్పిరిట్‌ను మద్యంలో కలిపినా.. మందు బాబులు ఏమాత్రం గుర్తించలేరని సమాచారం. అందుకే ఈ స్పిరిట్‌ను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. మద్యాన్ని కల్తీ చేసేందుకు స్పెషలిస్టులూ ఉన్నారు. మద్యం వ్యాపారులు ఇలాంటి నిపుణులను పెద్ద మొత్తాలు చెల్లించి.. నియమించుకుంటున్నారు. స్పిరిట్‌ కలిపిన మద్యాన్ని రెండు రోజుల్లోగా వినియోగించక పోతే.. దాని అసలు స్వరూపం బయటపడుతుందట. అందుకే.. కల్తీ చేసిన రెండు రోజుల్లోపే మద్యాన్ని వినియోగదారులకు అంటగట్టేస్తున్నారు.

కల్తీ మద్యం సేవించడం వల్ల తలనొప్పి....

స్పిరిట్‌ కలిపిన మద్యాన్ని సేవించడం వల్ల.. మందుబాబులకు తలనొప్పి, వాంతులు, శరీరం వేడెక్కడం, కాళ్లు లాగడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురవుతారు. ఇప్పుడు కృష్ణలంకలో చోటు చేసుకున్న విషాదంలోనూ.. మందుబాబులు ఇలాంటి లక్షణాలతోనే ఆస్పత్రి పాలయ్యారు.

కల్తీ మద్యం దందాలో పాలక పక్షపు ప్రముఖులు ?

రాష్ట్రంలో కల్తీ మద్యం విచ్చలవిడిగా అమ్ముడవుతోందన్నది బహిరంగ రహస్యం. చాలా చోట్ల మంత్రులు, పాలక పక్షపు ప్రముఖులు.. ఈ దందాకు దన్నుగా నిలుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆమధ్యన.. కర్నూలు జిల్లాలో ఎక్సైజ్‌ శాఖ పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ నివేదికలో.. సాక్షాత్తు ఆ జిల్లా పరిషత్‌ చైర్మన్‌.. కల్తీ మద్యం దందాను ప్రోత్సహిస్తున్న తీరును కళ్లకు కట్టినట్లు వివరించారు.

కల్తీ మాఫియాగా మారిన మద్యం వ్యాపారులు

ప్రముఖులు దన్ను లేని జిల్లాల్లో మద్యం వ్యాపారులే.. కల్తీ మాఫియాగా రూపాంతరం చెందారు. మద్యం కల్తీ నేరానికి కఠినమైన శిక్షలు లేకపోవడంతో.. వీరు ఈ దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా మైలవరం ఘటన అనంతరం.. పోలీసులు పీచెట్టి రామకృష్ణ అనే వ్యాపారిపై పీడీ యాక్టు కింద అరెస్టు చేశారు. అయితే.. కొంత కాలానికే అతను.. కోర్టు వేసిన జరిమానాను చెల్లించి దర్జాగా బయటికి వచ్చి దొరలా తిరిగాడు. దీన్ని బట్టి మద్యం కల్తీకి శిక్షలు ఏమాత్రమున్నాయో ఇట్టే అర్థమవుతుంది.

గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సారా దుకాణాలు

మద్యం వ్యాపారం నిర్వహించటానికి దాని నుండి ఆదాయం పెంచుకోవటానికి ప్రభుత్వం అనుసరించిన విధానమే కల్తీ మద్యం మరణాలకు ముఖ్య కారణమన్నది నిపుణుల వాదన. గతంలో ప్రభుత్వమే సారా దుకాణాలను నిర్వహించేది. 1990 తర్వాత వేలం ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించడం ప్రారంభమైంది. వేలం పాటల్లో సారాషాపులను దక్కించుకోవటానికి, వ్యాపారులు ప్రత్యర్ధి వర్గాలతో రాజీబేరాలు సాగించటం, దారికి రాకుంటే బెదిరింపులకు, ఆఖరికి హత్యలకు కూడా తెగబడుతున్నారు. ఈ విధంగా మద్యం మాఫియా తమ రాజ్యాలను ఏర్పాటు చేసుకొంటూ వస్తున్నాయి.

అతి తక్కువ కాలంలోనే కోట్లకు పడగలెత్తుతున్న వ్యాపారులు

అన్ని రకాల ఎత్తులూ వేసి.. మద్యం దుకాణాలను పొందిన వ్యాపారులు.. అతి తక్కువ కాలంలోనే కోట్లకు పడగలెత్తేందుకు.. మద్యం కల్తీనీ ఒక సాధనంగా వాడుకుంటున్నారు. మిథనాల్‌ తో పాటు.. అలాంటి స్పిరిట్‌లను మోతాదుకు మించి మద్యంలో కలుపుతూ.. సామాన్యుడి జీవితాల్లో మరణశాసనం లిఖిస్తున్నారు.

తరచూ తనిఖీలు అనివార్యం

మద్యం కల్తీని నిరోధించే బాధ్యతను ప్రభుత్వం సక్రమంగా నిర్వర్తించక పోవడం వల్లే.. ఏటా కల్తీ మద్యం మరణాలు సంభిస్తున్నాయి. తరచూ మద్యం దుకాణాలు, బార్‌లలో తనిఖీలు నిర్వహించడం.. కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వచ్చినా.. కఠినంగా వ్యవహరించడం చేయాలి. దీంతో పాటే.. రాష్ట్ర సరిహద్దుల వద్దనున్న చెక్‌పోస్టులలో అన్ని వాహనాలనూ క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. స్పిరిట్‌, నల్లబెల్లం లాంటి పదార్థాల అక్రమ రవాణాను నియంత్రించాలి. ఇవన్నీ చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి. అధికారుల్లో అంతకు మించిన అంకిత భావం ఉండాలి. 

11:24 - December 8, 2015

కొంచెం తీపి, కొంచెం వగరుగా ఉండే నేరేడులో ఔషధాల విలువలు ఆపారంగా ఉన్నాయి. ఆకులు, గింజలు ఆరోగ్యానికి రక్షణ కల్పించేవి. దీన్ని కొన్ని పాంతాల్లో కాలాజామున్ గా పిలుస్తారు. చూడటానికి వంకాయరంగులో మిలమిలా మెరిసి పోతుంటాయి. వగరు వగరుగా ఉండడంతో కొందరు చిన్న పిల్లలు ఇష్టపడరు. నేరేడును ఆయుర్వేదంలో అపరసంజీవనిగా పేర్కొంటారు. చెక్కర వ్యాధి ఉన్న వారికి మామిడి తీపి చేదు చేస్తే నేరేడు వగరు ఆరోగ్యానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది చక్కెర వ్యాధి ఉన్నవారికి ఈ పండు ఎంతో మేలు చేస్తుంది. ఆమ్లాలు, ఆక్సలిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం ఉండటంతో ఈ పండుకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఈ పండ్లను ఉప్పు, చక్కెర, కారం కులుపుని తింటుంటారు. ఈ పండ్లను అమ్మేవారు నూనే పూసి విక్రయిస్తారు. రంగు మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి ఇలా చేస్తారు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. నేరేడును నీటితో శుభ్రంగా కడిగి తినాలి..

 

 

11:22 - December 8, 2015

హైదరాబాద్ : కిక్కు కోసం వెళ్లి.. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఏపీలో ఇదే తొలిసారి కాదు. గతంలో మైలవరం.. ఆ తర్వాత అంతర్వేది ఉత్సవం.. అనంతరం బెజవాడ.. ఇప్పుడు మళ్లీ అదే వాడ..! ప్రతిసారీ కల్తీ మద్యం.. అరడజనుకు తక్కువ కాకుండా.. ప్రాణాలను కబళిస్తోంది.

గుర్తుండిపోయిన విషాదం మైలవరం మరణాలు..........

ఆంధ్రప్రదేశ్‌లో తరచుగా కల్తీ మద్యం చావులు కలవరాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో.. బాగా గుర్తుండి పోయిన విషాదం.. మైలవరం మరణాలే. కృష్ణాజిల్లా మైలవరం మండలం కనిమెర్ల, పోరాట నగర్‌ గిరిజన తండాలకు చెందిన 19 మంది.. నూతన సంవత్సర వేడుకల్లో కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయారు. 2011 డిసెంబర్‌ 11న ఈ మండలంలో ఏరులై ప్రవహించిన కల్తీ మద్యం... మూడు రోజుల వ్యవధిలో 19 మంది ప్రాణాలను కబళించింది.

మైలవరం ఘటన జరిగిన మూడు రోజులకే మరో విషాదం...............

దుర్ఘటన జరిగిన మూడవ రోజున.. మళ్లీ మైలవరం మండలంలోనే... వెదురుగూడెం ప్రాంతంలో కల్తీ సారా తాగి సుమారు 22 మంది అస్వస్థులయ్యారు. అయితే.. అప్రమత్తమైన బంధువులు వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించి బతికించుకున్నారు. హమ్మయ్య అనుకునేలోపే.. 2012 మే నెల్లో.. బెజవాడలో.. కల్తీ మద్యం సేవించి నలుగురు వ్యక్తులు మరణించారు.

తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ సారా మృతులు 26.............

అదే ఏడాది.. జనవరి నెలలో తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ సారా.. 26 మందిని కబళించింది. అమలాపురం, అంబాజీపేట మండలాల్లోని గంగలకుర్రు అగ్రహారం పాలగుమ్మి, బండారులంక గ్రామాల ప్రజలు.. అంతర్వేది నరసింహస్వామి బ్రహ్మోత్సవం సందర్భంగా కల్తీసారా సేవించారు. అందులో 26 మంది మృత్యువు పాలయ్యారు. ఈ ఘటనలే కాదు.. జిల్లాల్లో అడపాదడపా.. ఒకరిద్దరు చొప్పున కల్తీ మద్యం కాటుకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య లెక్కే లేదు.

11:17 - December 8, 2015

హైదరాబాద్ : హర్యానాలోని పల్వల్‌ సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. లోకమాన్యతిలక్‌ ఎక్స్‌ప్రెస్‌, ఈఎంయూ రైళ్లు ఒకే ట్రాక్‌పైకి రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఈఎంయు రైలు డ్రైవర్‌తో మృతి చెందాడు. వంద మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు అంటున్నారు.

నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ 19కి వాయిదా...

ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీకి కాస్త ఊరట లభించింది. కోర్టు విచారణను న్యాయస్థానం ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది. కేవలం నాలుగు నిమిషాల్లోనే ఢిల్లీ హైకోర్టు ఇవాళ తీర్పును వెల్లడించింది. వాస్తవానికి ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీలు ఇవాళ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. నిధుల దుర్వినియోగం కేసులో వ్యక్తిగత మినహాయింపు కావాలంటూ ట్రయల్ కోర్టు సమన్లను సవాల్ చేసిన కాంగ్రెస్ నేతలకు నిన్న ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అయితే మెజిస్ట్రేట్ మారడంతో పరిస్థితి తారుమారైంది. తమకు సమన్లు ఆలస్యంగా అందినట్లు కాంగ్రెస్ నేతలు కోర్టుకు తెలిపారు.

బీజింగ్ లో వాయుకాలుష్యం... రెడ్ అలర్ట్ జారీ...

హైదరాబాద్: చైనా రాజధాని బీజింగ్‌లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటింది. దీంతో తొలిసారి అధికారులు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. నగరంలో నిర్మాణాలను కూడా నిలిపేశారు. మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ వార్నింగ్ అమలులో ఉంటుంది. కార్ల వినియోగంపైన ఆంక్షలు విధించారు. ఫ్యాక్టరీలను మూసేశారు. పారిస్‌లో వాతావరణ మార్పులపై సదస్సు జరుగుతున్న నేపథ్యంలో చైనా ఈ చర్యకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. బీజింగ్ వాతావరణంలో విషపూరిత పదార్థాలు ప్రమాదకర స్థాయిని దాటాయని అమెరికా దౌత్యకార్యాలయం పేర్కొంది.

11:10 - December 8, 2015

సాయంత్రం వేళ చల్లగాలులు గిలిగింతలు పెడుతుంటే వేడివేడి బఠాణీలు తింటూ.. శీతాకాలాన్ని ఎంజాయ్ చేయడం చాలా మందికి ఇష్టం. మనసుకు రిలాక్స్‌ ఇచ్చే ఈ అలవాటులో శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి. ఎందుకంటే శీతాకాలంలో మందగించే జీర్ణక్రియను బఠాణీలు వేగవంతం చేస్తాయి. అందుకే బఠాణీలు తింటే మనసుకే కాదు.. శరీరానికి కూడా అవసరమైన పోషకాలు అందుతాయి. ఈ సీజన్‌లో ఎక్కువగా మార్కెట్‌లోకి వచ్చే బఠాణీలలో ఎన్నో పోషకాలు ఉండటంతో వాటిని పోషకాల రాణీగా చెప్పవచ్చు. శీతాకాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది.. బఠాణీల తింటే జీర్ణక్రియ వేగవంతమవుతుంది. అందుకే చల్ల గాలికి.. బఠాణీలకు అనినాభావ సంబంధం ఉంది.
బఠాణీలో ఆరోగ్య ప్రయోజనాలు..
బఠాణీలు తింటే త్వరగా ఆకలి కాదు. బరువు తగ్గాలనుకునే వారు బఠాణీలను తమ డైట్‌లో చేర్చుకోవచ్చు. పాలకూర, తోట కూర వంటి ఆకుకూరలు, బీన్స్‌, ఆలు, క్యారెట్‌ వంటి కూరల్లోనే కాదు.. బిర్యానీ లోనూ బాఠాణీలు వేసి వండుతారు. వీటిని చేర్చ డం వల్ల ఆహార పదార్థాలకు మరింత రుచి వస్తుంది. విటమిన్‌ - ఎ, బి 1, బి2, సి, ఇనుము, కాల్షియం, ఫాస్పరస్‌ ఇందులో సమృద్దిగా ఉన్నాయి. పెరిగే పిల్లలకు బఠాణీ బరవర్ధకమైన ఆహారం.

 

10:57 - December 8, 2015

'బాహుబలి' సినిమాకు సంబంధించిన పరిణామం ఒకటి సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 'బాహుబలి' సిరీస్ లో రానున్న మూడో సినిమా కోసం తాను స్క్రిప్ట్ పనులు కూడా ప్రారంభించినట్టు ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ వెల్లడించారు. అయితే 'బాహుబలి' తొలి రెండు సినిమాల్లో హీరోగా ఉన్న ప్రభాస్.. మూడో పార్టులో కనిపించే అవకాశం లేకపోవచ్చునని ఆయన స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది 'బాహుబలి' రెండోపార్టు
అనుకున్నది అనుకున్న ప్రకారం జరిగితే 'బాహుబలి-3' పూర్తిగా సరికొత్త కథ, కథనాలతో తెరకెక్కిస్తామని, సత్యరాజ్ పోషించిన కట్టప్ప పాత్ర కూడా మూడో పార్టులో ఉండకపోవచ్చునని చెప్పారు. ఎపిక్ డ్రామాగా తెరకెక్కిన 'బాహుబలి' బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో రికార్డులు బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. దాయాదుల వైరం ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా తన సత్తా చాటింది. 'బాహుబలి' రెండోపార్టు వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశముంది.

 

10:51 - December 8, 2015

పక్షవాతం (బ్రెయిన్‌ స్ట్రోక్‌) ఉన్నట్టుండి మన జీవితాన్ని అంధకారంలోకి నెడుతుంది. అప్పటివరకు ఎంతో సంతోషంగా అటూఇటూ తిరిగిన వారు అకస్మాత్తుగా కుప్పకూలిపోతారు. కాళ్లూ, చేతులూ పడిపోయి వికలాంగుల్లా మారిపోతారు. పక్షవాతం బారిన పడినవారిలో కొందరు వికలాంగులై బతుకీడుస్తుంటే, మరికొందరు ఏకంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకప్పుడు పక్షవాతం బారిన పడితే ఇక ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది. కానీ, నేడు వైద్యులలో పెరుగు తున్న నైపుణ్యత, అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో పక్షవాతం బారిన పడిన రోగులను కూడా మళ్లీ సాధారణ జీవితం గడిపేలా చేస్తున్నారు. పక్షవాతం విషయంలో సమయమే కీలకపాత్ర పోషిస్తుంది. స్ట్రోక్‌ వచ్చిన నాలుగు నుంచి ఆరు గంటల లోగా చికిత్స అందితే పక్షవాతం నుంచి పూర్తిగా బయటపడవచ్చు. పక్షవాతం తాలూకు హెచ్చరికలు కనిపించిన తర్వాత ఎంత త్వరగా ఆసుపత్రికి వెళితే అంత మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
ఎలా వస్తుంది..
మన శరీరంలోని ప్రతి అవయవానికి రక్తం నిరంతరం సరఫరా అవుతుండాలి. ఇక మెదడు విషయంలో నైతే అది మరింత అవసరం. ఏదైన కారణం వల్ల మెదడుకు రక్తసరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే అక్కడి కణాలు మరణిస్తాయి. మెదడుకు హఠాత్తుగా రక్తసరఫరా ఆగిపోవడాన్నే పక్షవాతం అంటారు. రక్తసరఫరాలో అంతరావయనికి ప్రధానంగా రెండు రకాల కారణాలున్నాయి. మొదటిది మెదడు రక్తనాళాల్లో ఎక్కడైనా రక్తం గడ్డకట్టి అది ప్రవాహానికి అడ్డుపడటం వల్ల పక్షవాతం వస్తుంది. దీనిని ఇస్కిమిక్‌ స్ట్రోక్‌. దాదాపు 80 శాతం పక్షవాతం కేసుల్లో ఇదే కారణం. ఇక ఒక్కోసారి రక్తనాళాలు చిట్లడం వల్ల రక్తం బయటకు ప్రవహించ డంతో మదడులోని కొన్ని కణాలకు రక్తసరఫరా అంద కపోవడం వల్ల పక్షవాతం వస్తుంది. దీనిని హెమరేజిక్‌ స్టోక్ర్‌ దాదాపు 20 శాతం కేసుల్లో పక్షవాతానికి ఈ కండిషన్‌ కారణమవుతుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా మెదడులోని ఆ రక్తనాళాలు సరఫరా చేసే భాగానికి తగిన పోషకాలు, ఆక్సిజన్‌ అందక ఈ ప్రాంతంలోని కణాలు నశిస్తాయి. దాంతో అవి నియంత్రించే శరీర భాగాలు చచ్చుబడిపోతాయి.

కారణాలు..

- మానసిక ఒత్తిడి

- రక్తపోటు, మధుమేహం

- మద్యం సేవించడం, సిగరెట్లు కాల్చడం

- అధిక బరువు

- జన్యుపరమైన కారణాలతో కూడా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది.

లక్షణాలు..

పక్షవాతం బారిన పడటానికి ముందుగా ప్రతి ఒక్కరిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ఫాస్ట్‌ (ఖీAూు)గా పేర్కొంటారు. ఫాస్ట్‌ లక్ష ణాల ద్వారా పక్షవాతాన్ని త్వరగా గుర్తించి ఎక్కువ నష్టం జరగకుండా జాగ్రత్త పడొచ్చు.

ఖీ ఎఫ్‌ - (ఫేస్‌) ముఖం బలహీనం కావడం, మూతి వంకర పోవడం

A ఏ - (ఆర్మ్‌) చేతులు బలహీనం కావడం

ఎస్‌ - (స్పీచ్‌) మాట పడిపోవడం, మాట్లాడడంలో ఇబ్బంది తలెత్తడం

టి - (టైమ్‌) పక్షవాతం వచ్చినప్పుడు ప్రతి నిమిషమూ కీలకమే. ఎందుక్‌టే ప్రతి ఐదు నిమిషాలకు ఒక కోటి న్యూరాన్లు (నాడీకణాలు) చనిపోతాయి. కాబట్టి సాధ్యమైనంత త్వరగా చికిత్స ప్రారంభిస్తేనే ఫలితం ఉంటుంది. అందువల్ల పక్షవాతం లక్షణాలు కనిపించిన వెంటనే వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించాలి.
 

థ్రోంబెక్టమీతో పక్షవాతానికి మెరుగైన చికిత్స...

మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల వచ్చే ఇస్కిమిక్‌ స్ట్రోక్‌కు థ్రోంబెక్టమీ అనే అత్యాధునిక విధానం అందు బాటులోకి వచ్చింది. రక్తప్రసరణ సాఫీగా కొనసాగేలా చూస్తూ పక్షవాతం ముప్పును అడ్డుకోవడం థ్రోంబెక్టమీ ప్రత్యేకత. ఈ కొత్త విధానంలో మెదడులో రక్తం గడ్డకట్టిన భాగాన్ని గుర్తించి, సూక్ష్మమైన ఆప్టిక్‌ఫైబర్‌ కేబులు ద్వారా ఇమే జింగ్‌ టెక్నాలజీ సహాయంతో తొలగిస్తారు. రోగి తొడభాగంలో చిన్న కోత పెట్టి ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ను మెదడులో మూసుకు పోయిన రక్తనాళంలోకి పంపిస్తారు. ఆ తర్వాత సున్నితమైన గొడుగు లాంటి స్టెంట్రీ వర్‌ ఉన్న కాథటారును పంపిస్తారు. మెదడు రక్తనాళంలో పూడిక ఉన్న చోటుకుకాథటార్‌ చేరుకున్న తర్వాత స్టెంట్రీవర్‌ గొడుగు తెరుచుకుంటుంది. దాంతో రక్తనాళం లోని పూడికను బయటకు లాగుతారు. రక్తనాళంలోని పూడినకు పూర్తిగా తొలగించడం వల్ల రక్తప్రసరణ సాఫీగా కొనసాగి పక్షవాతం ముప్పు తొలగిపోతుంది. థ్రోంబెక్టమీ విధానంలో తలభాగంలో ఎక్కడా కోత పెట్టకుండా, మెదడును తాకకుండా సురక్షితంగా రక్తనాళంలో ఏర్పడిన పూడికను తొలగిస్తారు. ఈ విధానంలో మెదడు రక్తనాళంలోని పూడికను పూర్తిగా తొలగిస్తారు కాబట్టి భవిష్యత్తులో ఏర్పడే దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి.

ఇప్పటివరకు పక్షవాతానికి గురైన నాలుగున్నర గంటలలోపు ఆస్పత్రికి వస్తే థ్రోంబోలైటిక్‌ థెరపీ ద్వారా రక్తనా ళాలలోని అడ్డంకులు తొల గించేవారు. ఇప్పుడు పక్షవా తం వచ్చిన ఎనిమిది గంటలలోపు వచ్చిన వారికి కూడా ఈ విధానంలో చికిత్స అందిస్తున్నారు.
 

టైమ్‌ ఈజ్‌ బ్రెయిన్‌...
 

పక్షవాత బాధితులలో సమయం కీలకపాత్ర పోషిస్తుంది. సాధార ణంగా టైమ్‌ ఈజ్‌ మనీ అంటారు. కానీ పక్షవాత బాధితులకు మా త్రం టైమ్‌ ఈజ్‌ బ్రెయిన్‌. పక్షవాతం లక్షణాలు కనిపించిన తర్వాత ఎంత త్వరగా వైద్యుల వద్దకు వెళ్లితే అంత ఎక్కువగా బ్రెయిన్‌ను కాపాడు కోవచ్చు. అయితే పూర్తిస్థాయి వైద్యుల బృందం, అత్యాధు నిక సౌక ర్యాలు అందుబాటులో ఉన్న ఆస్పత్రికి వెళ్ళాలి. సీటీస్కాన్‌, సీటీ యాంజియోతో పాటు అవసరం అయితే ఎంఐర్‌ఐ పరీక్షలు చేసి పక్ష వాతం తీవ్రతను నిర్ధారణ చేస్తారు. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే చికిత్స ప్రారంభించాలి. అప్పుడే రోగి త్వరగా కోలుకుంటారు.

నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

- ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. రోజుకు ఐదు గ్రాములకు మించి వాడటం మంచిది కాదు.

- బ్రిస్క్‌ వాక్‌ చేయాలి

- సైక్లింగ్‌, స్విమ్మింగ్‌ వంటి వ్యాయామాలు టెన్నిస్‌, షటిల్‌, బాస్కెట్‌బాల్‌ వంచి ఆటలు ఆడాలి.

- రోజువారీ ఆహారంలో 30శాతం పండ్లు, 30శాతం కూరగాయలు, 20శాతం పిండిపదార్థాలు, 20శాతం ప్రోటీన్లు విధిగా ఉండాలి. మాంసాహారులు చేపలు ఎక్కువగా తీసుకోవాలి.

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

చెన్నై : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రస్తుతం కన్యాకుమారి, తిరునెల్వేళి, తూతుకుడి, పుదుకోటయ్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో తమిళనాడులో మొత్తం 11 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.

హరియానాలోని రెండు రైళ్లు ఢీ: పలువురికి గాయాలు..

హైదరాబాద్ : హరియానాలోని పల్వల్ సమీపంలో కొద్ది సేపటి క్రితం ఘోర ప్రమాదం సంభవించింది. లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్, ఈఎంయూ రైళ్లు ఢీకొన్నాయి. సిగ్నలింగ్ సమస్యల కారణంగానే ఈ ఘటన జరిగినట్టు ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది. తొలి వార్తల ప్రకారం, ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకుంటున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలను ప్రారంభించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 

తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరీకి యత్నం...

కరీంనగర్: తెలంగాణ గ్రామీణ బ్యాంకులో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించిన సంఘటన జిల్లాలోని రాయికల్ మండంలోని అల్లీపూర్‌లో సోమవారం అర్ధరాత్రి జరిగింది. అల్లీపూర్‌లో ఉన్న బ్యాంకులో సోమవారం అర్ధరాత్రి ప్రవేశించి చోరీకి యత్నించారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. స్ధానికులు గుర్తించి బ్యాంకు అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కృష్ణలంక ఎక్సైజ్ సీఐ సస్పెన్షన్ కు ఆదేశాలు

విజయవాడ : నగరంలో కల్తీ మద్యం ఘటనపై ప్రభుత్వం కృష్ణలంక ప్రాంత ఎక్సైజ్ సీఐని సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలుజారీ చేసింది. అలాగే ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ చంద్రశేకర్ నాయుడు, ఎక్సైజ్ కమిషనర్ మీనా పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు బీభత్సం

నెల్లూరు : వెంకటగిరి లో నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ బస్ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ చిన్నారి, వృద్ధుడికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికితరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.

స్కూల్ వ్యాన్ ఢీకొని రెండేళ్ల చిన్నారి మృతి

ఖమ్మం : దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లిలో స్కూల్ వ్యాన్ ఢీకొని రెండేళ్ల చిన్నారి మృతి చెందింది.

కాకినాడలో అగ్ని ప్రమాదం:20గుడిసెల దగ్ధం

తూ.గో : కాకినాడ సిద్దార్థ నగర్ లో ఈ రోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ ఓ ఇంట్లో చెలరేగిన మంటలు వ్యాపించి 20 గుడిసెలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

కల్తీ మద్యం బాధితులను పరామర్శించనున్న జగన్

విజయవాడ : కల్తీ మద్యం బాధితులను పరామర్శిచేందుకే నేడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెజవాడ వెళ్లనున్నారు. విజయవాడలోని కృష్ణలంకకు చెందిన స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ లో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృత్యువాత పడగా, మరో 29 మంది తీవ్ర అస్వస్థతకు గురయిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించనున్నారు. అనంతరం జగన్ మృతుల కుటుంబాలను కూడా కలవనున్నారు. 

09:35 - December 8, 2015

నిజామాబాద్ : నిజాంసాగర్ జవహార్ నవోదయ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. గతంలో విద్యాలయంలో పని చేసిన ఉపాధ్యాయులు తమ పనితనాన్ని, పూర్వ విద్యార్థులతో ఉన్న అనుబంధాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఇతర దేశాల్లో పని చేస్తున్న వారు వీడియో సందేశాలు పంపి తోటి స్నేహితులతో పాత మధుర స్మృతులను పంచుకున్నారు. 

09:32 - December 8, 2015

హైదరాబాద్ : జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రామ్‌గడ్‌ జిల్లా బుర్కుందాలో రైల్వే క్రాసింగ్‌ వద్ద ఓ కారును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

09:30 - December 8, 2015

మెదక్ : సంగారెడ్డి మండలం కంది గ్రామ శివారులో దారి దోపిడీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు పత్తి వ్యాపారుల కళ్లల్లో కారం చల్లి రూ.50 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. హైదరాబాద్‌ నుంచి సదాశివపేట వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలిని ఎస్పీ సుమతి పరిశీలించారు. 

09:28 - December 8, 2015

విజయవాడ : కల్తీ మద్యం సేవించిన మరో ఐదుగురి పరిస్థితి విషమం ఉంది. ఇప్పటికే కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందారు. 15 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మిథైల్‌ ఆల్కహాల్‌ సేవించడం వల్ల కళ్ల మీద ప్రభావం పడిందని.. 72 గంటల తర్వాత కళ్ల పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. కల్తీ మద్యం శాంపిల్స్‌ను ఎక్సైజ్‌శాఖ పోరెన్సిక్‌ విభాగానికి పంపించింది. మరోవైపు మృతదేహాలకు నేడు శవ పరీక్షలు జరపనున్నారు.

మియాపూర్ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : మియాపూర్ ఆల్విన్ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

జార్ఖండ్ లో ఘోర రైలు ప్రమాదం : 13 మంది మృతి

హైదరాబాద్ : జార్ఖండ్ రాష్ట్రం రామ్ గఢ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు.మృతుల్లో 5గురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. రైల్వే క్రాసింగ్ వద్ద హౌరా -భోపాల్ ఎక్స్ ప్రెస్ కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన అధికారులు సహాయచర్యలు ముమ్మరం చేశారు.

మరో ఐదుగురి పరిస్థితి విషమం

విజయవాడ : కల్తీ కల్లు బాధితుల్లో మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు... 15 మంది బా బాధితుల ఆరోగ్యం నిలకడగా వైద్యులు తెలిపారు. మిథైల్ ఆల్కాహాల్ కారణంగా కళ్లపై ప్రభావం పడిందని వైద్యులు నిర్ధారించారు. 72 గంటల తర్వాత బాధితులకు కంటి పరీక్షలు నిర్వహించి కల్తీ మద్యం శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ తరలిస్తామన్నారు. ఈ రోజు కల్తీ మద్యం మృతులకు శవ పరీక్షలు నిర్వహించనున్నారు.

08:33 - December 8, 2015

హైదరాబాద్ : మోడీ ప్రభుత్వానికి స్థిరమైన విదేశాంగ విధానం ఉండాలని, భారత్ - పాకిస్థాన్ సంబంధాలు అనివార్యం అని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ద హన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ చెప్పారు. 'హార్ట్ ఆఫ్ ఏసియా' పేరిట పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో జరగనున్న ఐదో వార్షిక సదస్సుకు భారత్ తరపున సుష్మాస్వరాజ్ నేతృత్వం వహించనున్నారు. పాకిస్థాన్ తో గతంలో చర్చలను అర్థాంతరంగా ఎందుకు ఆపేశారు? ఇప్పుడు ఎందుకు చర్చలకు వెళుతున్నారు? పాకిస్థాన్ ఇప్పటికీ వేర్పాటువాద శక్తులకు మద్దతు ఇవ్వడంలేదా? దేశీయ రాజకీయ అవసరాల కోసం విదేశాంగ విధానం వాడుకోవడం సరికాదన్నారు. విజయవాడలో కల్తీ మృతల బాధ్యత ఎవరిది? అంటే టిడిపి ప్రభుత్వంలో కాంగ్రెస్ వారి అక్రమ బార్లు సేఫ్ గా ఎందుకు నడుస్తున్నాయి? రాజకీయాలకు మద్యం మాఫీయాకు వున్న సంబంధాలే ఈ ఘటనకు కారణమా? చట్ట విరుద్ధంగా జరుగున్న మద్యం వ్యాపారాన్ని అరకట్టాల్సిన అవసరం లేదా? ఇత్యాది అంశాలపై నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. విశ్లేషణ పూర్తి సారాంశాన్ని వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

08:08 - December 8, 2015

ఢిల్లీ : విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఇవాళ పాకిస్తాన్లో పర్యటించనున్నారు. పాక్ లో జరగనున్న భద్రతా సదస్సులో ఆమె భారత ప్రతినిధిగా పాల్గోనున్నారు. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ లో భారత్, పాకిస్తాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు సమావేశమైన నేపథ్యంలో సుష్మా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. నిర్మాణాత్మకమైన సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని ఇరు దేశాల నేతలు థాయ్‌లాండ్‌ భేటీలో చర్చించినట్లు సమాచారం. థాయ్‌లాండ్‌లో జరిగిన ఇరుదేశాల చర్చలను ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. థాయ్‌లాండ్‌లో జరిగిన సమావేశంలో భద్రత, ఉగ్రవాదం, జమ్ముకశ్మీర్‌ తదితర అంశాలపై చర్చ జరిగింది.

ఒంటిమిట్ట రామాలయం అభివృద్ధికి రూ.100 కోట్లు...

కడప : జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ. 100 కోట్లు కేటాయిస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానించింది. దానికి తక్షణమే రూ. 20 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినట్టు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు సోమవారం జరిగిన సమావేశం అనంతరం మీడియాకు వెల్లడించారు.

గుంతకల్లులో దీపిడీ దొంగల బీభత్సం...

అనంతపురం : జిల్లాలోని గుంతకల్లులో మంగళవారం తెల్లవారుజామున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సిండికేట్‌ బ్యాంక్‌ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. అద్దాలు పగులగొట్టి ఏటీఎంను దుండగులు ధ్వంసం చేశారు. ఏటీఎం లాక్‌ ఓపెన్‌ కాకపోవడంతో దుండగులు అక్కడినుంచి పరారీ అయినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తిరుచానూరులో నేటి నుంచి శ్రీవారి లడ్డూల విక్రయం

తిరుమల : తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో నేటి నుంచి తీరుమల శ్రీవారి లడ్డూలను విక్రయించనున్నారు. ఉత్సవాలు ముగిసే వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఒక్కో భక్తుడికి ఒకలడ్డూను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి దర్శనం కోసం 3 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. అదే విధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

07:33 - December 8, 2015

హైదరాబాద్ : విజయవాడ కృష్ణలంకలో సోమవారం జరిగిన ఘటనతో కల్తీ మద్యం విక్రయాలు వెలుగులోకి వచ్చినా... చాటుమాటుగా ఇలాంటి చీకటి వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేషనల్ హెరాల్డ్ పత్రికలో అవకతవకలపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కోర్టు మెట్లు ఎక్కనున్నారు?కారణాలు ఏమిటి? ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్ నగేష్, కాంగ్రెస్ నేత ద్రోణం రాజు శ్రీనివాస్, టిడిపి నేత రామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై మాట్లాడారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

బాలిక వివాహాన్ని అడ్డుకున్న అధికారులు...

హైదరాబాద్ : బేగంబజార్ లో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. సీతారాంబాగ్‌లోని వాంబేకాలనీలోని 5వ బ్లాక్ వద్ద 12 ఏళ్ల బాలికను 17 ఏళ్ల బాలుడితో వివాహం జరిపిస్తున్నారనే సమాచారం మేరకు చైల్డ్ ప్రొటక్షన్ అధికారులు రంగంలోకి దిగారు. ఇద్దరు ఎస్‌ఐల సహకారంతో బాలిక వివాహాన్ని అడ్డుకున్నారు. బాలికను నింబోలి అడ్డాలోని జువైనల్ హోంకు తరలించారు. బాల్య వివాహాలు జరిపిస్తే కఠిన చర్యలు తప్పవని చైల్డ్ ప్రొటక్షన్ అధికారి ఇంతియాజ్ హెచ్చరించారు.

హైదరాబాద్ శివారులో దారి దోపిడీ

సంగారెడ్డి : హైదరాబాదు-ముంబై జాతీయ రహదారి పై దారి దోపిడీకి పాల్పడ్డ దొంగలు ఏకంగా రూ.50 లక్షలు ఎత్తుకెళ్లారు. అది కూడా హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఉన్న మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డికి 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న కంది గ్రామ సమీపంలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో పత్తి రైతుల కళ్లల్లో కారం చల్లిన దొంగలు వారి నుంచి రూ.50 లక్షలను అపహరించారు. హైదరాబాదు నుంచి మెదక్ జిల్లా సదాశివపేటకు బయలుదేరిన పత్తి రైతులకు సంబంధించిన సమాచారాన్ని ముందే గ్రహించిన దొంగలు కంది సమీపంలో జాతీయ రహదారిపై దారి కాచారు. రైతులు ప్రయాణిస్తున్న కారు అక్కడకు రాగానే దానిపై మూకుమ్మడిగా దాడి చేశారు.

కేసీఆర్ తో భేటీ కానున్న కరువుబృందం

హైదరాబాద్ :నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ తో కేంద్ర కరువు బృందం భేటీ కానుంది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్తితులపై కేంద్ర ప్రతినిధులతో కేసీఆర్ చర్చించనున్నారు. కరువు ప్రభావిత ప్రాంతాలను ఆర్థికంగా ఆదుకోవాలని, రైతులకు ప్రత్యామ్నయాలకు కల్పించాలని ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరనున్నట్లు సమాచారం.

మచిలీపట్నంలో కల్తీ మద్యానికి ఒక వ్యక్తి బలి

కృష్ణా : మచిలీపట్నంలో జరిగిన కల్తీమద్యం ఘటనలో శ్రీనివాసరావు అనే వ్యక్తి మరణించాడు. పాడురంగా వైన్స్‌లో మద్య సేవించిన వెంటనే శ్రీనివారావుకు వాంతులయ్యాయి. ఆ తర్వాత వెంటనే కుప్పకూలిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీనిని గమనించిన కొందరు వ్యక్తులు అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించిన వెంటనే శ్రీనివాసరావుకు డాక్టర్లు వైద్యం ప్రారంభించారు. కల్తీ మద్యాన్ని కక్కించే ప్రయత్నం చేస్తున్న సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. కల్తీ మద్యం విక్రయించిన పాండురంగ వైన్‌ షాపుకు ఎక్సైజ్‌ అధికారుల సీలు వేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కల్తీ మద్యం కాటుకు ఏడుగురి మృతి

కృష్ణా : జిల్లాలో కల్తీమద్యం కాటేసింది. విజయవాడ, మచిలీపట్నంలో జరిగిన వేర్వేరు ఘటనలో కల్తీ మద్యానికి ఎనిమిది మంది బలయ్యారు. విజయవాడలో ఏడుగురు ప్రాణాలు కోల్పోతే, మచిలీపట్నంలో ఒకరు మరణించారు. విజయవాడ కల్తీ మద్యం ఘటనలో మరో 21 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషయమంగా ఉంది. 

07:05 - December 8, 2015

ఢిల్లీ : నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురయ్యింది. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కొనుగోలు వ్యవహారంలో భారీగా ఆర్ధిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి కేసు వేశారు. దీనిపై విచారణ జరుపుతున్న ఢిల్లీ న్యాయస్థానం ఇవాళ కోర్టుకు హాజరు కావాలని సోనియా, రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. వీటిని నిలిపివేయాంటూ సోనియా, రాహుల్‌... ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వీరి విన్నపాన్ని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఇవాళ వీరు ఢిల్లీ న్యాయస్థానం ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే దీనిపై సోనియా, రాహుల్‌... మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. 

07:03 - December 8, 2015

హైదరాబాద్ :ఎమ్మెల్యే లోక‌ల్ బాడీ , ఎన్నిక‌లకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక క్లైమాక్స్ దశకు చేరింది. నామినేషన్ గడువు సమయం దగ్గరపడటంతో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పార్టీ ముమ్మర కసరత్తు చేస్తోంది. గాంధీ భవన్ లో జిల్లాల వారిగా సమావేశం అయిన టీ పిసిసి చీఫ్ ఉత్తమకుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క, పార్టీ సీనియర్ నేతలు. అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు.. .

మహబూబ్ నగర్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలు ....

మహబూబ్ నగర్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలు వున్నాయి.. అయితే తమ సంఖ్య బలాన్ని దృష్టిలో ఉంచుకున్న కాంగ్రెస్,..ఒక్కొక్క స్థానానికే పోటీ చేయాలని నిర్ణయించింది. దీంతో మహబూబ్ నగర్ నుండి మాజీ జేడ్పి చైర్మన్‌ కూచుకుల్ల దామోదర్ రెడ్డి ని రంగంలోకి దింపాలని పార్టీ నిర్ణయించింది..మరో వైపు రంగారెడ్డిలో సబిత ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలో ఇద్దరిలో ఎవరినో ఒకరిని పోటికి దించాలని పిసిసి భావించింది. అయితే వాళ్లు పోటీకి సుముకంగా లేకపోవడంతో ..మాజీ మంత్రి ఎ చంద్రశేఖర్ ను బరిలో దింపాలని పిసిసి నిర్ణయించింది...ఇక నల్గొండ జిల్లా నుండి మాజీ ఎంపీ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ని అభ్యర్థిగా నిర్ణయించింది.

ఖమ్మంజిల్లాలో సీపీఐ అభ్యర్థికి మద్దతు ......

సంఖ్యాబలం లేకపోవడంతో ఖమ్మం జిల్లాలో సిపిఐ అభ్యర్థికి మద్దతుగా నిలవాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఇక అదిలాబాద్ నుంచి డిసీసీ ప్రెసిడెంట్ మహేశ్వర్ రెడ్డి ని ఎమ్మెల్సీ అభ్యర్దిగా నిర్ణయించారు. నిజమాబాద్ నుండి మాజీ జెడ్పీ చైర్మన్‌ వెంకట్రమణ రెడ్డి ని పోటికి దింపనుంది..ఇక కరీంనగర్ నుండి డాక్టర్ వెంకట్ ,దామోదర్ లో ఎవరో ఒకరిని బరిలో దింపాలని చూస్తుంది..వరంగల్ ఒక్క స్థానానికి ఇంకా స్పష్టత రాలేదు..అయితే ఆ స్థానం నుండి జంగా రాఘవరెడ్డిని నిలిపే అవకాశం కనిపిస్తుంది ..సీఎం సొంత జిల్లా అయిన మెదక్ నుంచి బండారు శ్రీకాంత్ పేరు దాదాపు ఖరారు చేసింది. వీరందరి లిస్టును ఢిల్లీ హైకమాండ్ కు పంపించింది... అభ్యర్థుల నామినేషన్ల గడువు 9వతేది న ముగియనుండడంతో ఇవాళ పిసిసి చీఫ్‌ ఉత్తమ్ అభ్యర్తులందరికి బీఫామ్ లను అందచేయనున్నారు. 

06:59 - December 8, 2015

హైదరాబాద్ : తెలంగాణలో కరవు పరిస్థితులను అంచనావేసేందుకు కేంద్రబృందం జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేసింది. నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో పర్యటించిన కేంద్ర బృందం..ఆయా జిల్లాల్లోని కరువు పరిస్థితిని అంచనా వేశారు. దాంతో పాటు రైతుల ఆత్మహత్యలకు కారణలను..క్షేత్రస్థాయిలో రైతులను అడిగి తెలుసుకున్నారు.

ఒక్కో కరువు బృందం ఒక్కో జిల్లాలో....

తెలంగాణలో కరవు పరిస్థితులను అంచనావేసేందుకు కేంద్రబృందం తెలంగాణ జిల్లాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఒక్కో కరువు బృందం ఒక్కో జిల్లాలో పర్యటించి కరువు పరిస్థితులను అంచనా వేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో కేంద్ర కరువు బృందం పర్యటించింది. పత్తి, వేరుశనగ, కంది, మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెల్‌దండ మండల కేంద్రంలో మూడు చోట్ల భూగర్బజలాల్ని పరిశీలించారు. జిల్లాలో రైతులు ఎంతమేర నష్టపోయారో వారినే నేరుగా అడిగి తెలుసుకున్నారు. కరువు బృందం పర్యటనలో జిల్లా కలెక్టర్‌ శ్రీదేవి సహా అధికారులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లాలో కేంద్ర బృందం సుడిగాలి పర్యటన.........

కరువు పరిస్థితులపై నల్గొండ జిల్లా ఆలేరు నియోజకవర్గంలో కేంద్ర బృందం సుడిగాలి పర్యటన చేసింది. జిల్లాలోని బొమ్మలరామారం మండలం మర్యాల, మల్లాపూర్ గ్రామాల్లో అధికారులు పర్యటించారు. ప్రభుత్వ విప్ సునిత, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి..జిల్లాలో పరిస్థితిని వివరించారు. ఆయా గ్రామాల్లో కరువు ఎంత మేర ఉంది, రైతుల ఆత్మహత్యలకు కారణలను..క్షేత్రస్థాయిలో రైతులను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులు వివరించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని స్థానిక గ్రామ సర్పంచ్ లు విజ్ఞప్తి చేశారు.

వరంగల్ జిల్లాలో....

వరంగల్ జిల్లా జనగామ సబ్‌డివిజన్‌లోని కరువు బృందం పర్యటించింది. బచ్చన్నపేట, చేర్యాల, మండలాల్లోని ఆలంపూర్‌, ముస్త్యాలలో కేంద్ర బృంద సభ్యులు పర్యటించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా వ్యవసాయ అధికారులు పలు పంటలను పరిశీలించి వాటి వివరాలను కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. వర్షపాతం తక్కువుగా ఉండడంతో ఈ ప్రాంతంలో కరువు ఎక్కువగా ఉందని...రైతులకు పంటనష్టం చెల్లించి ఆదుకోవాలని వారు కోరారు. కేంద్రానికి వీలైనంత త్వరలో నివేదిక సమర్పించి రైతులకు న్యాయం చేస్తామని కేంద్ర బృంద సభ్యులు తెలిపారు. 

06:57 - December 8, 2015

కృష్ణా : విజయవాడ కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి ఉచ్చు బిగుస్తోంది. కల్తీ మద్యం తాగి ఏడుగురు కూలీల మృతికి కారమైన స్వర్ణబార్‌కు ఆయనే యజమాని. దీంతో పోలీసు, ఎక్సైజ్‌ అధికారులు విష్ణుని ప్రశ్నించారు. కల్తీ మద్యం అమ్మకంపై ఆరా తీస్తున్నారు.

స్వర్ణ బార్‌లో ఎప్పటి నుంచో కల్తీ మద్యం విక్రయాలు ....

మల్లాది విష్ణుకు చెందిన స్వర్ణ బార్‌లో ఎప్పటి నుంచో కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులున్నాయి. తనకున్న రాజకీయ అండ, పలుకుబడితో ఆయన యదేశ్ఛగా ఛీప్‌ లిక్కర్‌ అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. వీటి గురించి అటు ఎక్సైజ్‌ అధికారులు కానీ, ఇటు పోలీసులు కానీ పట్టించుకోపోవడంతో ఇప్పడు పేద ప్రజల ప్రాణాలమీదకు తెచ్చి పెట్టింది.

ఉదయం 11 గంట లోపు బార్‌ తెరవకూడదు ...

మల్లాది విష్ణు బంధువుల పేరుతో స్వర్ణబార్‌ లైసెన్స్‌ ఉంది. అయితే దీని నిర్వహణ అంతా ఆయనే చూసుకుంటున్నారు. ఈ బార్‌లో ఎక్కడా నిబంధనలు పాటించరు. ఉదయం 11 గంటల లోపు బార్‌లో మద్యం విక్రయాలు జరపుకూడదు. రాత్రి 11 దాటిన తర్వాత అమ్మకాలు చేయకూడదు. కానీ స్వర్‌బార్‌కు ఇవేమీ వర్తించవు. ఉదయం 6 గంటల నుంచే అమ్మకాలు ప్రారంభిస్తారు. అర్ధరాత్రి, అపరాత్రి అన్నతేడాలేదు. తెల్లవారుజాము వరకు కూడా మద్యం అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అయినా ఎక్సైజ్‌, పోలీసులు అధికారులకు ఇవేమీ పట్టవు. మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ఇదే పద్ధతి. అదేమని ప్రశ్నిస్తే.... తన అనుచరగణంలో దాడులు చేయిస్తాడన్న భయం ఉంది. బెదిరించిన నోరు నొక్కే ప్రయత్నం చేస్తారు. దీంతో మల్లాది విష్ణుతోపాటు, ఆయన కుటుంబ సభ్యుల ఇష్టారాజ్యం కొనసాగుతోందని మండిపడుతున్నారు.

స్వర్ణబార్‌లో తనిఖీలు....

సోమవారం జరిగిన కల్తీ మద్యం ఘటన తర్వాత కల్లు తెరిచిన పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు స్వర్ణబార్‌లో తనిఖీలు చేశారు. మద్యం నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. బార్‌కు సీలు వేశారు. లైసెన్స్‌దారులైన మల్లాది త్రిపురసుందరి, భాగవతుల శరత్‌చంద్ర, కావూరి పూర్ణచంద్రశర్మ, కేఏ లక్ష్మిసరస్వతిలపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. బార్‌లో విధులు నిర్వహించిన సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెల్లార్‌లో నిర్వహిస్తున్న ఈ బార్‌లో పరిశుభ్రత మచ్చుకైనా కనిపించదు. ఎక్కడ చూసిన అపరిశుభ్రత రాజ్యమేలుతుందుని స్వయంగా పోలీసులే చెబుతున్నారు.

బినామీ పేర్లలో మరికొన్ని మద్యం షాపులు.....

మల్లాది విష్ణుకు స్వర్ణబార్‌ ఒక్కటేకాదు... బినామీ పేర్లలో మరికొన్ని మద్యం షాపులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి. కాసులు కోసం కక్కుర్తిపడే అధికారులు విష్ణు వైన్‌ షాపులవైపు తొంగికూడా చూడరని అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌లో బార్‌ నడుపుతున్నా నగరపాలక సంస్థ అధికారులు కూడా పట్టించుకోలేదు. అన్ని స్థాయిల్లో అధికారులు నిర్యక్ష్యమే కూలీల నిండుప్రాణాలను బలిగొందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

06:53 - December 8, 2015

కృష్ణా : మచిలీపట్నంలో జరిగిన కల్తీమద్యం ఘటనలో శ్రీనివాసరావు అనే వ్యక్తి మరణించాడు. పాడురంగా వైన్స్‌లో మద్య సేవించిన వెంటనే శ్రీనివారావుకు వాంతులయ్యాయి. ఆ తర్వాత వెంటనే కుప్పకూలిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీనిని గమనించిన కొందరు వ్యక్తులు అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించిన వెంటనే శ్రీనివాసరావుకు డాక్టర్లు వైద్యం ప్రారంభించారు. కల్తీ మద్యాన్ని కక్కించే ప్రయత్నం చేస్తున్న సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. కల్తీ మద్యం విక్రయించిన పాండురంగ వైన్‌ షాపుకు ఎక్సైజ్‌ అధికారుల సీలు వేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

06:51 - December 8, 2015

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మన రెండు రాష్ట్రాల్లోనూ హెల్మెట్ వాడకం తప్పనిసరి. అయినా, ఇప్పటికీ చాలామంది హెల్మెట్ ధరించకుండానే వాహనాలు నడుపుతున్నారు. ఊహించని ప్రమాదాల్లో తాము గాయపడి, తమ కుటుంబ సభ్యులందరినీ బాధపెడుతున్నారు.

ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదం ....

పొద్దున్నే లేవగానే టీవీ పెడితే, మన గుండెలను పిండివేసే రోడ్డు ప్రమాదాల విషాద వార్తలే వినిపిస్తున్నాయి. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదం రూపంలో మ్రుత్యువు వెన్నాడుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా 13వేల మందికిపైగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. ఇందులో సగం మందిని బలి తీసుకుంటున్నవి స్కూటర్లు, బైక్ లే. మన దేశంలో జరిగే ప్రతి నాలుగు యాక్సిడెంట్స్ లో ఒకటి ద్విచక్ర వాహనానికి సంబంధించినదే. టూ వీలర్స్ నడుపుతూ చనిపోతున్నవారిలో 75శాతం మంది తలకు బలమైన గాయాలవ్వడం వల్లనే మరణిస్తున్నారు. అంటే స్కూటర్లు, బైక్ లు నడిపేవారు హెల్మెట్ ధరించకపోవడం ఆయా కుటుంబాలను అంతులేని విషాదంలోకి ఈడ్చుకెళ్తోంది. కేవలం హెల్మెట్ పెట్టుకోకపోవడం అనే ఒకే ఒక్క పొరపాటు ప్రతి రోజూ కొన్ని వందల మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంటోంది. కొన్ని వందల మంది బిడ్డలను తమకు నాన్న లేని శాపగ్రస్తులుగా మారుస్తోంది. కొన్ని వందల మంది అమ్మానాన్నలకు భరించలేనంత గర్భశోకాన్ని మిగుల్చుతోంది. కొన్ని వందలమంది స్త్రీలను వితంతవులుగా మారుస్తోంది.

జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారన్న గ్యారంటీ లేదు....

మనం జాగ్రత్తగానే డ్రైవ్ చేస్తాం కదా హెల్మెట్ లేకపోతే ఫర్వాలేదులే అన్న ధోరణితో కొందరు అలక్ష్యం చేస్తుంటారు. కొద్ది దూరమే కదా వెళ్లేది అనే అభిప్రాయంతో మరికొందరు హెల్మెట్ పెట్టుకోరు. కానీ, మనం ఎంత జాగ్రత్తగా నడిపినా ఎదురుగా వచ్చేవారో, వెనకి నుంచి వచ్చే వారో, పక్కనుంచి వెళ్లో వారో జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారన్న గ్యారంటీ లేదు కదా. ఎదుటివాడి అజాగ్రత్త నుంచి, ఎదుటివాడి బాధ్యతా రాహిత్యం నుంచి మన ప్రాణాలను కాపాడేది , మన తలకు బలమైన గాయాలు కాకుండా రక్షించేది ఒక్క హెల్మెటే అన్న విషయాన్ని మరచిపోవద్దు. హెల్మెట్ శిరోభారం కాదు. అదే మనకు రక్ష. హెల్మెట్ అనేది ట్రాఫిక్ పోలీసులు విధించే చలాన్ల నుంచి కాపాడే వస్తువు కాదు. మన తలను ముద్దాడుతూ, మన ప్రాణాలను కాపాడే మన నెచ్చలి. దాన్ని హ్యాపీగా ధరిద్దాం రండి. 

06:49 - December 8, 2015

హైదరాబాద్: ప్రపంచంలో ఏటా 12 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. వీరిలో దాదాపు ఆరు లక్షల మంది ద్విచక్ర వాహనాలు నడిపేవారే. తలకు బలమైన గాయాలు తగలడం వల్ల చనిపోయేవారి సంఖ్య ఎక్కువగా వున్నట్టు వివిధ అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరి ఈ మరణాలను, ఈ విషాదాలను మనం నివారించుకోలేమా? రోడ్డు ప్రమాదాలను నివారించి, మన ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి? వాహనాలు నడిపేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆర్ టీఐ జాయింట్ కమిషనర్ పాండురంగారావు పాల్గొన్నారు. వారు ఇంకా ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

నల్సార్ లో పోలీసు అధికారులకు ఇంటరాక్షన్ కోర్సు

హైదరాబాద్ : శాంతిభద్రతలు, నేరాల అంశాలపై నల్సార్ యూనివర్సిటీలో పోలీసు అధికారులకు వర్టికల్ ఇంటారాక్షన్ కోర్సును సోమవారం ప్రారంభించారు. బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్డీ) సహకారంతో నల్సార్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ కోర్సు ఐదు రోజులపాటు జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ అధికారులతోపాటు, సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Don't Miss