Activities calendar

09 December 2015

ఐదుగురు బీఫ్ నిర్వాహకుల అరెస్టు...

హైదరాబాద్ : జూబ్లి హిల్స్ లో ఐదుగురు బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఛానెల్ లో చర్చకు వెళ్లి వస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. 

వరంగల్ లో కూలిన ఇంజినీరింగ్ కళాశాల భవనం..

వరంగల్ : హసన్ పర్తి అనంతసాగర్ లో నిర్మాణంలో ఉన్న ఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 25 మందికి గాయాలయ్యాయి. శ్లాబ్ వేస్తుండగా ఈప్రమాదం జరిగింది.

 

ఓయూలో శాంతిభద్రతలపై దృష్టి - ఏసీపీ..

హైదరాబాద్ : ఓయూలో శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని ఏసీపీ లక్ష్మినారాయణ పేర్కొన్నారు. హైకోర్టు నుండి స్పష్టమైన ఆదేశాలున్నాయని, లా అండ్ ఆర్డర్ కాపాడటానికి తాము సిద్ధమని ప్రకటించారు. ఓయూలో ప్రశాంత వాతావరణం నెలకొల్పుతామన్నారు. 

హార్దిక్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వు.

ఢిల్లీ : పటేల్ కులస్తులకు రిజర్వేషన్ల కోసం ఆందోళన చేపట్టిన హార్ధిక్ పటేల్ బెయిల్ పిటిషన్ పై గుజరాత్ లోని అహ్మదాబాద్ సెషన్స్ కోర్టు తీర్పును రిజర్వ్యులో ఉంచింది. పటేల్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అతడిపై రాజద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టు అయిన హార్దిక్ పటేల్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.

 

బాబును కలిసిన ఫాక్స్ కాన్ ప్రతినిధులు..

ఢిల్లీ : ఏపీ భవన్ లో ఏపీ సీఎం చంద్రబాబును ఫాక్స్ కాన్ సంస్థ ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలో కంప్యూటర్లు..ల్యాప్ టాప్ లు..ట్యాబ్ ల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రతినధులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 

సూపర్ సిరిస్ ఫైనల్స్ లో సైనా ఓటమి..

దుబాయ్ : ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్ తొలిపోరులో భారత బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. జపాన్ క్రీడాకారిణి ఒకుహర చేతిలో 21-14, 21-16 సెట్ల తేడాతో ఓటమి చవి చూసింది. 

సుప్రీం చీఫ్ ను కలిసిన కేసీఆర్..

ఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సాయంత్రం కలిశారు. వీరివురి భేటీ అరగంట పాటు జరిగింది.

హైదరాబాద్ లో రేపు మంత్రివర్గం పర్యటన..

హైదరాబాద్ : రాష్ట్ర మంత్రుల బృందం రేపు హైదరాబాద్ నగరంలో పర్యటించనుంది. నగరంలోని తొమ్మిది నియోజకవర్గాల్లో మంత్రుల పర్యటన కొనసాగనుంది. 

21:36 - December 9, 2015

 

ఆఫ్గనిస్తాన్‌ : తాలిబన్లు మళ్లీ విరుచుకుపడ్డారు. కాందహార్ విమానాశ్రయంపై తాలిబన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 37 మంది మరణించారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో సాధారణ పౌరులతో పాటు అఫ్ఘాన్ సెక్యూరిటీ దళాల సభ్యులు కూడా ఉన్నారు. 10 మంది తాలిబన్లను భద్రతా దళాలు కాల్చి చంపాయని అఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. మరో ఉగ్రవాది తప్పించుకున్నాడు. గడిచిన 24 గంటల్లో కాందహార్ ఎయిర్‌పోర్టు మీద తాలిబన్లు దాడి చేయడం ఇది రెండోసారి. మంగళవారంనాడు తాలిబన్లు కాందహార్ పోలీసుస్టేషన్‌ను ముట్టడించి, ముగ్గురు పోలీసు అధికారులను హతమార్చారు. ఇస్లామాబాద్‌లో ఆసియా ప్రాంతీయ భద్రతా సదస్సు జరుగుతుండగానే మరోవైపు అఫ్ఘాన్‌లో ఈ దాడి జరగడం గమనార్హం. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు ఏకే 47 అసాల్ట్ రైఫిళ్లతో కాల్పులకు తెగబడ్డారు. 

21:34 - December 9, 2015

అమెరికా : మతి తప్పి మాట్లాడితే మీడియాలో తొందరగా పాపులర్ అయిపోతాననుకున్నాడో ఏమో.. నోటికొచ్చినట్లు మాట్లాడాడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా రేసులో ముందంజలో ఉన్న ట్రంప్ అలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో దేశంలోనే అందరూ ఆయనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అజ్ఞానంతో మాట్లాడిన ఆ మాటలను పట్టించుకోవద్దని అమెరికా పౌరులూ ట్వీట్ చేశారు. ఇంతకీ ట్రంప్ ఏమన్నారు? చదవండి..2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ ట్రంప్ కార్డుగా కనిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్. మేక్ అమెరికా గ్రేట్ అగేన్.. అన్నది ఆయన నినాదం. అమెరికాలో బిజినెస్ సక్సెస్ స్టోరీకి ఆయన ఓ సింబల్ కావచ్చు. అమ్మాయిల ఛాతీ మీద ఆటోగ్రాఫ్ చేసేందుకు సరదా పడవచ్చు. ఎవరిష్టం వారిది. వియ్ డోంట్ కేర్. కానీ, ఫాసిస్ట్ భావజాలాన్ని మీడియా మైకుల ముందు చిమ్ముతుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు. ట్రంప్ తాజా కామెంట్స్ మీద అమెరికన్లే అటాక్ మొదలు పెట్టారు.

అమెరికాలో ముస్లింలు రావద్దంట..
అమెరికాలోకి ముస్లింలు రావడాన్ని పూర్తిగా నిషేధించాలని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. గ్లోబల్ జిహాద్ లో భాగంగా ముస్లింలు అమెరికన్లపై దాడిని సమర్థిస్తున్నారని సర్వే లెక్కలు వినిపిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు అమెరికాలో పెద్ద దుమారాన్ని రేపాయి. మేక్ అమెరికా గ్రేట్ అగేన్ కాదు.. నీ వ్యాఖ్యలు మేక్ అమెరికా హేట్ అగేన్ అన్నట్లుగా ఉన్నాయని యువతరం కార్టూన్లతో ట్వీట్లతో విరుచుకుపడింది. ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా విలువలకు విరుద్ధంగా ఉన్నాయని వైట్ హౌస్ ప్రకటించింది. టీవీ చానళ్ళు ఫాసిస్ట్ ట్రంప్ అంటూ ఆయనపై విమర్శనాత్మక కథనాలు ప్రసారం చేశాయి. పేస్ బుక్ జనరేషన్ డొనాల్డ్ ట్రంప్ ను అడాల్ఫ్ ట్రంప్ అని ఎద్దేవా చేశాయి. హారీ పోటర్ నవలలతో సంచలన సృష్టించిన రచయిత్రి జె.కె. రోలింగ్ అయితే తన నవలలోని దెయ్యం విలన్ వోల్డెమార్ట్.. డొనాల్డ్ ట్రంప్ ముందు దేనికీ పనికిరాడని ట్వీట్ చేశారు.

మాటలు పట్టించుకోవద్దన్న గవర్నర్లు..
తీవ్రవాదానికి మతం లేదని, ఉగ్రవాద ఘాతుకాలకు ఉమ్మడిగా ఎదుర్కోవాలని ప్రపంచదేశాల నేతలు సమాయత్త మవుతుంటే, ఒక మతానికి చెందిన వారిని దేశంలోకి రానివ్వొద్దనే పిలుపు నిచ్చిన డొనాల్డ్ ట్రంప్ కు మతి భ్రమించిందని, ఆయన మాటలను పట్టించుకోవద్దని అమెరికాలోని వివిధ రాష్ట్రాల గవర్నర్లు కూడా వ్యాఖ్యానించారు. ట్రంప్ ఇలా మాట్లాడం కొత్తేమీ కాదు. గతంలో ఆయన, అమెరికాలోకి అక్రమంగా చొరబడుతున్న మెక్సికన్లంతా రేపిస్టులని నోరు పారేసుకున్నారు. వియత్నాంలో పట్టుబడ్డ జాన్ మెక్ కెయిన్ యుద్ధవీరుడు ఎలా అవుతాడని తీసిపారేశారు. తాజాగా సిబిఎస్ చానల్ ఫేస్ ది నేషన్ కార్యక్రమంలో, ముస్లింల కోసం రిజిస్టర్ మెయింటెయిన్ చేయాల్సన అవసరం ఉందన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను నోటి దురదగా తీసిపారేయడానికి వీల్లేదు. భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లాభం పొందే కుట్రలో భాగంగానే ట్రంప్ ఇలా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అతివాదాన్ని అసహ్యించుకుంటున్న నేటి తరం అమెరికన్లు..
డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అధ్యక్ష పదవికి అభ్యర్థిగా తన రిపబ్లికన్ ప్రత్యర్థి బెన్ కార్సన్ కన్నా 20 పాయింట్లు ముందంజలో ఉన్నారు. ఇటీవల కాలిఫోర్నియాలో ఐసిస్ ప్రేరణతో ఓ జంట 14 మందిని కాల్చి చంపిన సంఘటన తరువాత ట్రంప్ మాటలకు మరింత పదను పెట్టారు. పారిస్ లో తీవ్రవాదులు 130 మందిని కాల్చి చంపిన సంఘటనతో రిపబ్లికన్ వోటర్లలో ట్రంప్ పాపులారిటీ కొంత పెరిగిందని సర్వేలు సూచిస్తున్నాయి. అందుకే, పరిస్థితులు ఎంత దారుణంగా మారితే నేను అంత బలపడతాను, ప్రజలకు బలవంతుడైన నాయకుడు కావాలి అని ట్రంప్ రెచ్చిపోతున్నారు. అయితే, ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో నెగ్గుకు రావడం సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నేటి తరం అమెరికన్లు ఈ అతివాదాన్ని అసహ్యించుకుంటున్నారని రిపబ్లికన్లే కొందరు బాహాటంగా విమర్శిస్తున్నారు.

21:29 - December 9, 2015

ఇస్లామాబాద్ : భారత విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్‌ పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్‌తో సమావేశమయ్యారు. అంతకుముందు సుష్మా స్వరాజ్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో భేటి అయ్యారు. 'హార్ట్‌ ఆఫ్‌ ఆసియా' కార్యక్రమంలో పాల్గొనేందుకు సుష్మా ఇస్లామాబాద్‌ వెళ్లారు. ఇరుదేశాలు మరింత స్నేహ భావంతో మెలగుతూ వర్తక వాణిజ్యాలను పెంపొందించుకోవాలని సుష్మా ఆకాంక్షించారు. ఆఫ్గనిస్తాన్‌ నుంచి భారత్‌కు పాక్‌ భూభాగం మీదుగా వస్తువుల ఎగుమతికి సుష్మ ప్రతిపాదించే అవకాశం ఉంది. ఆఫ్గన్‌ సమ్మేళనంలో కూడా సుష్మా పాల్గొనున్నారు.

21:28 - December 9, 2015

ఢిల్లీ : సిపిఐ సీనియర్‌ నేత, జాతీయ మాజీ కార్యదర్శి ఎబి బర్దన్‌ను పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బర్దన్‌ ఢిల్లీలోని జిబి పంత్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ నేత నారాయణ, టిడిపి అధినేత చంద్రబాబు పరామర్శించారు. అనారోగ్య సమస్యల నుంచి బర్దన్‌ త్వరగా కోలుకోవాలని వారు అభిలషించారు. దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారని, తనతో సన్నిహిత సంబంధాలున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అనేక దశాబ్దాలుగా..మార్పు రావడానికి కృషి చేశారని సీపీఎం జాతీయ కార్యదర్శి ఏచూరి కొనియాడారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల మెరుగుపడడం లేదని, ఆయన మాట్లాడడం లేదని సీపీఐ జాతీయ నేత రామకృష్ణ పేర్కొన్నారు. 

21:24 - December 9, 2015

హైదరాబాద్ : ఓయూలో పెద్ద కూర ఉడుకుతుందా..ఉడకదా అనేది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. కర్రీపై వర్రీ ఇంకా కొనసాగుతూనే ఉంది. బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు హైకోర్టు నో చెప్పినా.. పెద్ద కూర పండుగను ఆపేది లేదని నిర్వాహకులు కుండ బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. మరోపక్క హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఓయూలో భారీగా బలగాలను మోహరించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికి కర్రీ ఇష్యూతో వర్శిటీ కుతకుతలాడుతోంది.

హైకోర్టు తీర్పు..
పెద్ద కూర పండుగ పెద్ద దుమారాన్నే రేపుతోంది. బీఫ్‌ పెస్టివల్‌ అంశం వర్శిటీని భయం గుప్పెట్లోకి నడిపిస్తోంది. గురువారం తలపెట్టిన బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు హైకోర్టు అనుమతి నిరాకరించినా...కర్రీని వండటానికే నిర్వాహకులు రెడీ అవుతున్నారు. మరోపక్క పోలీసులు కూడా ఓయూలో మోహరించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళన విద్యార్థుల్లో కనిపిస్తోంది. ఉస్మానియా యూనివర్శిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహణకు హైకోర్టు బుధవారం అనుమతి నిరాకరించింది.ఈ నెల 20వ తేదీ వరకు వర్సిటీలో ఎలాంటి ఫెస్టివల్స్ నిర్వహించ కూడదని, అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని... సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు పరచాల్సిందేనంటూ ఆదేశించింది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది.

యూనివర్సిటీలో పోలీసు బలగాలు..
కోర్టు ఆదేశాల నేపథ్యంలో యూనివర్శిటీలో బలగాలను మోహరించారు. ఎన్‌ఆర్‌ఎస్‌ హాస్టల్‌ను చుట్టుముట్టి.... ఫెస్టివల్‌ నిర్వాహకులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోపక్క ఏబీవీపీ కార్యకర్తలు వర్శిటీలో దూసుకెళ్లడం..పోలీసులు వారిని అడ్డుకోవడం తదితర ఘటనల వల్ల రోజంతా ఓయూ అట్టుడికింది. హైకోర్టు ఆదేశాల మేరకు.. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఫ్‌ ఫెస్టివల్‌ను అడ్డుకుంటామని పోలీసులు చెబుతున్నారు. శాంతి భద్రతల అంశం కావడంతో... కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు.

కొనసాగుతున్న ఉద్రిక్తత..
కోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూనే శాంతియుత వాతావరణంలో బీఫ్‌ పెస్టివల్‌ను జరిపి తీరుతామని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. తమకు కోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదని చెబుతున్నారు. అటు వర్శిటీ అధికారులు కూడా.. బీఫ్‌ పెస్టివల్‌కు అనుమతి లేదని ప్రకటించారు. బీఫ్‌, ఫోర్క్ ఫెస్టివల్‌కు అనుమతి లేదని, ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఓయూ రిజిస్ట్రార్‌ హెచ్చరించారు. మొత్తానికి పెద్దకూర పండుగ సానుకూల, వ్యతిరేక వర్గాల మోహరింపుతో ఓయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది. 

21:21 - December 9, 2015

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. సాయంత్రం ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్‌ను కలిశారు. అంతకుముందు కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ కుమార్తె వివాహా రిసెప్షన్‌కు కేసీఆర్‌ హాజరయ్యారు. రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్... గురువారం సాయంత్రం విజ్ఞాన్‌భవన్‌లో జరిగే ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ 75వ జన్మదిన వేడుకలకు హాజరవుతారు. 

21:19 - December 9, 2015

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌ ఘట్టం పూర్తియింది. ఈరోజు చివరి రోజు కావడంతో.. అన్ని పార్టీల అభ్యర్థులూ నామినేషన్లు దాఖలు చేశారు. పాలక టీఆర్ఎస్‌ మొత్తం 12 స్థానాలకు అభ్యర్థులను నిలపగా.. విపక్ష కాంగ్రెస్‌ నాలుగు చోట్ల, టీడీపీ ఐదు చోట్ల అభ్యర్థులను బరిలోకి దించాయి. ఖమ్మం ఒక్కచోట సీపీఐ, వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేశారు. వరంగల్‌ నుంచి కొండా మురళి, ఖమ్మం అభ్యర్థిగా బాలసాని లక్ష్మీనారాయణ, ఆదిలాబాద్‌ అభ్యర్థిగా పురాణం సతీశ్‌, నిజామాబాద్‌ అభ్యర్థి భూపతిరెడ్డి, మెదక్‌ అభ్యర్థి భూపాల్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్సీగా తేరా చిన్నపరెడ్డిలు నామినేషన్‌లు దాఖలు చేశారు. కరీంనగర్‌ జిల్లాలో లక్ష్మణదాసు, భానుప్రసాదరావులు నామినేషన్‌లను దాఖలు చేశారు. పాలమూరులో జగదీశ్వరరెడ్డి, నారాయణరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. పాలకపక్షం అభ్యర్థుల వెంట.. ఆయా జిల్లాల పార్టీల ఇంచార్జిలు, మంత్రులు తరలి వెళ్లారు. మెదక్‌లో హరీశ్‌రావు, కరీంనగర్‌లో ఈటల రాజేందర్‌, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు తదితరులు నామినేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. కేసీఆర్‌ పాలనకు ముగ్ధులైన ఓటర్లు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు.
ఇక కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాల నుంచే అభ్యర్థులను బరిలోకి దింపాలని నిర్ణయించింది. పాలమూరులో కాంగ్రెస్‌ అభ్యర్థి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లాలో మాజీమంత్రి చంద్రశేఖర్‌, మెదక్‌ నుంచి శివరాజ్‌పాటిల్‌, నల్లగొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, నిజామాబాద్‌ నుంచి వెంకట రమణారెడ్డిలు నామినేషన్‌ దాఖలు చేశారు. పాలమూరులో కాంగ్రెస్‌ రెబెల్‌గా కటకం శ్రీనివాసాచారి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఖమ్మంలో సీపీఐ అభ్యర్థికి మద్దతివ్వాలని పార్టీ నిర్ణయించింది. కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో సరిపడా బలం లేనందువల్ల.. పోటీ చేయడం లేదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి చెప్పారు.

ఖమ్మంలో సీపీఐకి టిడిపి మద్దతు..
సీపీఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావు మూడు రోజుల క్రితమే నామినేషన్‌ దాఖలు చేశారు. ఈరోజు.. ఆయనకు మద్దతుగా మరో సెట్‌ నామినేషన్‌లను దాఖలైంది. తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాల్లోనే అభ్యర్థులను నిలుపుతోంది. ఆ పార్టీ అభ్యర్థి కొత్తకోట దయాకరరెడ్డి మంగళవారమే నామినేషన్‌ దాఖలు చేశారు. ఆదిలాబాద్‌ నుంచి నారాయణరెడ్డి, రంగారెడ్డి నుంచి బుక్కా వేణుగోపాల్‌, కరీంనగర్‌ నుంచి కర్రు నాగయ్య, నల్లగొండ నుంచి సాదినేని శ్రీనివాసరావులు టీడీపీ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఖమ్మంలో సీపీఐకి మద్దతునివ్వాలని టీడీపీ నిర్ణయించింది.

ఎన్నికల సంఘం బిజీ..
ఇంకోవైపు.. నామినేషన్‌ల ఘట్టం పూర్తి కావడంతో.. తదుపరి పనుల్లో ఎన్నికల సంఘం అధికారులు బిజీ అయ్యారు. అభ్యర్థుల నామినేషన్‌లను రేపు స్క్రుటినీ చేస్తారు. 12వ తేదీ వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఈనెల 27న పోలింగ్‌ జరుగుతుంది. గతానికి భిన్నంగా ఈసారి ఆర్డీవో కార్యాలయాల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు.. ఎమ్మెల్సీ ఎన్నికలను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను.. హైకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైన దృష్ట్యా.. ఎన్నికలను ఆపలేమని తేల్చి చెప్పింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా.... ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారంటూ రంగారెడ్డి డీసీసీ వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది.  

21:16 - December 9, 2015

ఢిల్లీ : నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి రెండోరోజు కూడా పార్లమెంట్‌ సమావేశాలను కాంగ్రెస్‌ అడ్డుకుంది. ప్రభుత్వం విపక్షాల పట్ల ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. కోర్టు కేసులకు ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రభుత్వం ఎదురు దాడికి దిగింది. ప్రధాని కార్యాలయం కేంద్రంగానే రాజకీయ కక్ష కుట్ర జరుగుతోందని రాహుల్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ సభ్యుల నినాదాల మధ్యే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అక్రమ కేసులు పెట్టడం ద్వారా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే లోక్‌సభలో ధ్వజమెత్తారు. దేశంలో రెండు చట్టాలు అమలవుతున్నాయని... అధికార పక్షానికి ఓ చట్టం... విపక్షానికి మరో చట్టం అమలవుతుందని ఎద్దేవా చేశారు. హర్యానాలో కాంగ్రెస్ నేతలపై అక్రమంగా సీబీఐ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అయితే సీబీఐ, ఈడీ కేసులకు భయపడేది లేదని ఖర్గే స్పష్టం చేశారు. ముజఫర్‌నగర్‌లో ఓ కేంద్రమంత్రి జైలుకెళ్లి మరీ నిందితులను కలిశారని, వీకేసింగ్ దళితులను అవమానించేలా మాట్లాడారని ఖర్గే విమర్శించారు.

వెంకయ్య స్పందన..
ఖర్గే వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎదురు దాడికి దిగారు. కోర్టు కేసులను రాజకీయం చేయడం సరికాదని, కోర్టు కేసులకు... ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. యూపీఏ హయాంలో అమిత్ షాను జైలుకు పంపిన సంగతిని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. కరవుపై చర్చ జరగకుండా- కాంగ్రెస్ సభ్యులు దేశాభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు.

రాజ్యసభలోనూ..
అటు రాజ్యసభలోనూ నేషనల్ హెరాల్డ్ కేసుపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. నేషనల్‌ హెరాల్డ్‌ కంపెనీ- నాన్‌ ప్రాఫిటబుల్‌ కంపెనీ అని, ఈ కంపెనీ ద్వారా ఎవరూ ఎలాంటి లాభాలు పొందడం లేదని, ఈడీ పేర్కొన్నట్టు రాజ్యసభ విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ ఈ కేసును ఆగస్టులో క్లోజ్‌ చేస్తే మోడీ ప్రభుత్వం 15 రోజుల లోపే ఆ డైరెక్టర్‌ను తొలగించి కొత్త డైరెక్టర్‌ను నియమించడం ద్వారా ఈ కేసును తిరగదోడిందని ధ్వజమెత్తారు. విపక్షాల పట్ల ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని ఆజాద్ ఆరోపించారు. కక్ష సాధింపు చర్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ అన్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసుపై తాము చర్చిస్తామని ఎప్పుడూ చెప్పలేదన్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసు వందశాతం రాజకీయ కక్ష పూరిత చర్యేనని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచే కుట్ర జరుగుతోందని రాహుల్‌ విమర్శించారు. కాంగ్రెస్‌, బిజెపిల మధ్య కొనసాగుతున్న పొలిటికల్‌ వార్‌ కారణంగా ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా పార్లమెంట్‌ సమయం వృథా అవుతోందని రాజకీయ పరిశీలకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

21:00 - December 9, 2015

సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులొచ్చిపడ్డాయి. ఎప్పుడో 1937 లో నెహ్రూ స్థాపించిన కంపెనీ, అది ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక అది మూతబడి చాలా కాలమైనా వాటి అవశేషాలు మాత్రం కాంగ్రెస్ కి గుదిబండలా మారాయి. పేరు మార్చి షేర్ హోల్డర్లను తారుమారు చేసి మొత్తం కంపెనీని తమ గుప్పెట్లో పెట్టుకున్న సోనియా అండ్ రాహుల్ ఇప్పుడు వివాదంలో ఇరుక్కున్నారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వేసిన కేసు వారిద్దరినీ బోనెక్కించబోతోంది. తప్పించుకోవడానికి లేదు.

నేషనల్ హెరాల్డ్ గొడవేంటీ ?
నెహ్రూ స్థాపించినంత మాత్రాన అది నెహ్రూ కుటుంబానిది అయిపోదు కదా. ఇందిరమ్మకు కోడలైనంత మాత్రాన సోనియా ఆ బంధుత్వాన్ని మెడలో వేసుకుని కేసు నుంచి తప్పించుకోలేరు కదా? నెహ్రూకి వారసుడైనంత మాత్రాన రాహుల్ దీన్ని రాజకీయమని తోసిపుచ్చలేరు కదా? అంతా కోర్టులో తేల్చుకోవాలి కదా? అబ్బే అదెలా కుదురుతుంది? అని సోనియా..రాహుల్ హైకోర్టుకి వెళ్ళారు. కాని ట్రయల్ కోర్టుకు హాజరై తీరాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఇంకేముంది? పార్లమెంటులో ఒకటే రగడ మొదలైంది. అసలు ఈ నేషనల్ హెరాల్డ్ గొడవేంటి...ఆస్తులు, వాటాల బదీలీ రభస ఏంటి...దీనిపై ఎందుకింత రగడ జరుగుతోంది...కాంగ్రెస్ అగ్రనేతలకు కంటి మీదు కునుకు ఎందుకు పట్టడం లేదు.? అసలు ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికను ఎప్పుడు, ఎవరు ప్రారంభించారు...దీనికి సారథ్యం వహించిన వారెవరు....నష్టాల బాట పట్టడానికి కారణాలేంటి...ఈ మొత్తం కేసులో ఎప్పుడేం జరిగింది.

నిజాయితీ నిరూపించుకుంటారా ? 
2 వేల కోట్ల విలువైన ఆస్తులను కేవలం 50 లక్షలకే కట్టబెట్టేసుకున్నారు. అది వేరు ఇది వేరు అంటూనే, రెండు తమవేనన్నట్టు వ్యవహరించారు. అయితే కొన్ని మౌలికమైన ప్రశ్నలకు మాత్రం ఖద్దరు నేతల దగ్గర సమాధానం లేదు....ఇంతకీ ఆ ప్రశ్నలేంటి....కాంగ్రెస్ పెద్దల వాదనలేంటి..? రాజకీయ కక్ష సాధింపు అంటుంది కాంగ్రెస్. న్యాయస్థానాల నిర్దేశంతో ప్రభుత్వానికేం సంబంధమని బీజేపీ సమాధానం. మొత్తానికి పార్లమెంటు స్తంభించిపోతోంది. నేషనల్ హెరాల్డ్ కేసు ఇంకా ఎలాంటి మలుపులు తిరిగే అవకాశముంది...తల్లీతనయుడు కోర్టు బోనెక్కక తప్పదా? మరి నిజాయితీ నిరూపించుకుంటారా?

ఎన్నో సంచలన మలుపులు..
ఒక కేసు. సంచలన మలుపులు. మరెన్నో ఆరోపణలు. కేసులో నిందితులు దేశంలోనే అతిపెద్ద పార్టీ అగ్రనేతలు. విచారణకు రమ్మని కోర్టు ఆదేశాలు. ఇప్పుడు సచ్చీలత, నిజాయితీ నిరూపించుకోవాల్సింది కాంగ్రెస్ అధి నాయకులే. ఒకవేళ కక్ష సాధింపు అని ఆరోపిస్తున్నా అది కూడా బహిర్గతం చేయాల్సింది ఖద్దరు నేతలే. మరి నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ పార్టీని ఎలాంటి పరిణామాలకు గురి చేస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.

20:54 - December 9, 2015

టిడిపి నేత జోస్యం...తెలంగాణ సీఎం కేసీఆర్ అమరావతికి పయనం...తెలంగాణ ఆబ్కారీ శాఖ ముందుచూపు...తెలంగాణ టిడిపి నేతల ముచ్చట్లపై సైటెర్లు...పాక్ లో సుష్మా పర్యటన...గాడిదలు మాయం...ఐరోపా ఖండం 2043 వరకు కనుమరుగు అంటూ ఓ బామ్మ జోస్యం..దోమలకు కు.ని.ఆపరేషన్ చేసేందుకు బ్రిటన్ శాస్త్రవేత్తల కృషి..శంషాబాద్ లో ఓ వైన్స్ లో ఓ దొంగ దొంగతనం ఎలా చేశాడు ? బర్ధన్ మృతి చెందాడని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ట్విట్టర్ లో ట్వీట్... తదితర అంశాలపై 'మల్లన్న' తనదైన శైలిలో విశ్లేషించారు. తదితర విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

19:44 - December 9, 2015

హైదరాబాద్ : ఓయూలోనే పోలీసులు మోహరించారు. బీఫ్ ఫెస్టివల్‌ నిర్వాహకులను అరెస్టుచేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. దీనితో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. డిసెంబర్ 10వ తేదీన పలు విద్యార్థి సంఘాలు బీఫ్ ఫెస్టివల్ నిర్వహించతలపెట్టిన సంగతి తెలిసిందే. కానీ కొంతమంది దీనిని అడ్డుకుంటామని..నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఓ నేత హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇందుకు సిటీ సివిల్ కోర్టు స్టే విధించింది. స్టే ఆధారంగా హైకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. తీర్పుకు అనుగుణంగా నడుచుకోవాలని కోర్టు పేర్కొంది. కోర్టు తీర్పుల్లో ప్రతివాదిగా పేర్కొన్న కృష్ణ అనే వ్యక్తి యూనివర్సిటీలో లేరని బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులు వెల్లడించారు. దీనితో పోలీసులు అప్రమత్తమయ్యారు. సాయంత్రం అంబేద్కర్ హాస్టల్ వద్దకు చేరుకున్నారు. వారిని అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. దీనితో విద్యార్థులు హాస్టల్ గదులకు తాళాలు వేసుకుని లోపలే ఉండిపోయారు. తమను అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. తమకు హైకోర్టు ఆదేశాలు అందనందున బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని విద్యార్థులు చెబుతున్నారు.

రిజిస్ట్రార్ హెచ్చరికలు..
మరోవైపు కోర్టు ఆదేశాల ప్రకారం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని ఓయూ రిజిస్ట్రార్ ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్, ఫోర్క్ ఫెస్టివల్‌కు అనుమతి లేదని ఓయూ రిజిస్ట్రార్ వెల్లడించారు. ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా ఒకవేళ ఫెస్టివల్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యూనివర్సిటీకే చెందిన విద్యార్థులైతే సదరు విద్యార్థుల అడ్మిషన్‌ను రద్దు చేస్తమని వెల్లడించారు. తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఓయూలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

19:36 - December 9, 2015

హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు చేపట్టిన మంచి కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు తెలంగాణ డీజీపీ అనురాగ్‌ శర్మ. టియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌కు డీజీపీ హాజరయ్యారు. సిబ్బంది కొరత ఉన్నా ఈ సమస్యను అధిగమిస్తూ మంచి ఫలితాలు పొందుతున్నామని ప్రకటించారు. హైదరాబాద్‌లో లక్ష కెమెరాలతో మానిటరింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

19:34 - December 9, 2015

విజయవాడ : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులను బెదిరిస్తూ సిఎం చంద్రబాబు ప్రకటనలు చేయడం అన్యాయమని సిపిఎం ఏపీ కార్యదర్శి మధు అన్నారు. ముంపు బాధితులు వెంటనే గ్రామాలు ఖాళీ చేయకపోతే ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలను రద్దు చేస్తామనడం బాధ్యతా రాహిత్యమని విమర్శించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అంగన్‌వాడీలపట్ల సిఎం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భూమికి భూమి ఇస్తామని, 2.20 కుటుంబాలకు 20వేల జనాభా కలిగిన వారికి ఒక సెంటు భూమి చూపించలేదన్నారు. గ్రామాలను ఖాళీ చేయాలని చెప్పడం చట్ట విరుద్ధమని మధు పేర్కొన్నారు. 

19:31 - December 9, 2015

హైదరాబాద్ : మద్యనిషేధంపై టీడీపీ తన వైఖరిని స్పష్టం చేయాలని వైసీపీ నేత పార్థసారథి డిమాండ్‌ చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వని రైతులపై దౌర్జన్యాలకు దిగి..భూములను లాక్కొనే ప్రయత్నం టీడీపీ నేతలు చేస్తున్నారని విమర్శించారు. 

19:29 - December 9, 2015

ఢిల్లీ : పర్యాటక రంగ అభివృద్ధి వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న బాబు... కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్‌శర్మతో భేటీ అయ్యారు. పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు.. టూరిజంను మౌళికవసతుల రంగంగా డిక్లేర్‌ చేయాలని కోరారు.. రాష్ట్రంలో అభివృద్ది చేయాల్సిన ప్రదేశాలు, ప్రాంతాలకు కేంద్ర సాయంపై చర్చించారు. టూరిజంద్వారా ఉద్యోగం, ఉపాది, సంపదతోపాటు.. ప్రజలకు మానసిక విశ్రాంతి లభిస్తుందని చంద్రబాబు చెప్పారు.

19:28 - December 9, 2015

తూర్పుగోదావరి : అమ్మాయి పుడితే మైనస్‌ అని పిలుచుకునే సమాజం మనది. ఆడశిశువు జన్మిస్తే.. చెత్తబుట్టల పాల్జేసే కర్కశులూ లేకపోలేదు. అట్లాంటి వారిలో మార్పు రావాలని.. అమ్మాయి కూడా అదృష్టం తెస్తుందని చాటేందుకు.. తూర్పు గోదావరి జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఏంటా కార్యక్రమం..? తెలుసుకోవాలంటే ఇది చదవండి..

గణనీయంగా తగ్గుతున్న ఆడపిల్లల శాతం..
సమాజంలో ఆడపిల్లల శాతం గణనీయంగా తగ్గిపోతోంది. చాలా చోట్ల వెయ్యి మంది పురుషులకు 985 మంది స్త్రీలే ఉంటున్నారు. గర్భస్థ శిశువు అమ్మాయి అని తెలియగానే.. భ్రూణ హత్యలకు పాల్పడిన కారణంగానే.. ఈ వ్యత్యాసం అన్నది సర్వేల్లో తేలిన వాస్తవం. ఇటీవలి కాలంలో కొందరు తల్లిదండ్రుల్లో మార్పు కనిపిస్తోంది. ఆడశిశువు అయినా.. అక్కున చేర్చుకుంటున్నారు. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో వివక్షత నేటికీ కొనసాగుతోంది. అమ్మాయి పుడితే చెత్తకుప్పల పాల్జేసే కర్కశులకూ కొదవలేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులు.. వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.

నారాయణరెడ్డి ఆసుపత్రి యాజమాన్యం...
తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని నారాయణరెడ్డి ఆస్పత్రి యాజమాన్యం.. తమ ఆసుపత్రిలో ఆడశిశువులకు జన్మనిచ్చే వారికి నజరానాలు ప్రకటించింది. తమ ఆస్పత్రిలో ఆడశిశువుకు జన్మనిచ్చే గర్భిణికి.. ఎలాంటి వైద్య రుసుము గానీ, ఆపరేషన్‌ చార్జీలు కానీ తీసుకోబోమని ప్రకటించింది. నార్మల్‌ డెలివరీ అయినా.... సిజేరియన్‌ అయినా ఉచితంగా చేస్తామని ఆసుపత్రి నిర్వాహకులు స్పష్టం చేశారు. రోజు రోజుకు బాలికల సంఖ్య తగ్గుతుండడం వల్ల తనలో కలిగిన ఆందోళన నుంచే ఈ వినూత్న ఆలోచన పురుడు పోసుకుందని ఆసుపత్రి నిర్వాహకుడు కర్రి నారాయణరెడ్డి చెప్పారు. మన్యంలో ఓ గర్భిణీపడ్డ వేదన తనను కదిలించిందని గుర్తుచేసుకున్నారు.. తెల్ల రేషన్‌ కార్డులున్న గర్భిణులందరికీ ఉచిత ఆపరేషన్‌లు చేస్తామని ప్రకటించారు. నారాయణరెడ్డి ప్రయత్నంపై జిల్లా వ్యాప్తంగా ప్రశంసలవర్షం కురుస్తోంది.. డబ్బే ధ్యేయంగా పనిచేస్తున్న ఆస్పత్రులకు భిన్నంగా సమాజ సేవకు ముందుకొచ్చిన నారాయణరెడ్డి ఆసుపత్రి యాజమాన్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.

ఏపీలో దేవదాసి వ్యవస్థ నిషేధం..

విజయవాడ : రాష్ట్రమంతటా దేవదాసీ సంబంధిత వ్యవస్థలను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలను రక్షించేందుకు ప్రత్యేకంగా సెల్ ను ఏర్పాటు చేసింది. ఈసెల్ ను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో జిల్లా అదనపు మెజిస్ట్రేట్ అధ్యక్షతన పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేసింది. 

బర్ధన్ ను పరామర్శించిన బాబు..

ఢిల్లీ : సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్ధన్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. తీవ్ర అస్వస్థతకు గురైన బర్ధన్ ఢిల్లీలోని జి.బి.సంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. 

19:05 - December 9, 2015

పశ్చిమగోదావరి : అతివేగంగా ప్రయాణించవద్దని...నిర్లక్ష్యంగా నడుపవద్దని ఎన్నిహెచ్చరికలు చేస్తున్నా డ్రైవర్లు పెడచెవిన పెడుతున్నారు. స్కూల్ బస్సుల డ్రైవర్లు కూడా నిర్లక్ష్యంగా నడుపుతుండడంతో చిన్నారుల నిండు జీవితాలు బలైపోతున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందింది. మరికొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..సన్ షైన్ స్కూల్ కు చెందిన దాదాపు 30 మంది విద్యార్థులు సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు బస్సు (ఎపి05టిటి 0356)లో వెళుతున్నారు. వీరంతా 1-2వ తరగతికి చెందిన వారని తెలుస్తోంది. పాలకొల్లు వద్ద డివైడర్ ఢీకొనడం..వెంటనే రెండు పల్టీలు కొట్టడం జరిగిపోయాయి. బస్సులో ఉన్న విద్యార్థులు హాహాకారాలు చేశారు. ఒకటో తరగతికి చెందిన ఓ చిన్నారి తలకు బస్సు రాడ్ బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు నిలువలేదు. దీనితో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాయాలైన 15 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బస్సు డ్రైవర్ కు గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

18:25 - December 9, 2015

చిత్తూరు : జిల్లాలో నిర్వహించిన జనచైతన్య సదస్సులో టిడిపి జాతీయ కమిటీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. నగరి నియోజకవర్గంలోని జి.డి.నెల్లూరు పరిధిలోని వడమాల్ పేటలో జరిగిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడారు. వైసీపీ కేంద్రంతో తెగదెంపులు చేసుకోవాలని ప్రతిపక్షం వైసీపీ కోరుతోందని తెలిపారు. తెగదెంపులు చేసుకున్న అనంతరం రెండు మంత్రులు తీసుకోవాలని వైసీపీ ఆలోచిస్తోందన్నారు. దీనిని ప్రజలు గమనించాలని, ఏయే హామీలిచ్చారో ఒక పద్ధతి ప్రకారం ఆ హామీల కోసం కృషి చేయడం జరుగుతుందని హామీనిచ్చారు. హామీలు అమలు చేసేంతవరకు కేంద్రంతో టిడిపి పోరాడుతుందని స్పష్టం చేశారు. జనచైతన్య యాత్రలను సక్సెస్ చేయాల్సినవసరం ఉందని, ప్రతి గడప తొక్కాల్సినవసరం ఉందన్నారు. పిల్ల కాంగ్రెస్ కు దొంగ పేపర్..దొంగ ఛానెల్ ఉందని, కానీ తమకు 50లక్షల కార్యకర్తల సైన్యం ఉందన్నారు. ఈ కార్యకర్తలు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళుతారని ఆశిస్తున్నట్లు లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

18:16 - December 9, 2015

విజయవాడ : మద్యం అమ్మకాలపై రాష్ట్రంలో రూ.30వేల కోట్ల దోపిడి జరుగుతోందని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. విజయవాడలో కల్తీ మద్యం ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మరికొందరు ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం వారిని మధు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మద్యం సిండికేట్లు..మద్యం అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం తక్షణమే కమిషన్ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాల మొత్తం మీద ప్రజలకు తెలియచేయడానికి విచారణ కమిషన్ అవసరమన్నారు. రాష్ట్రంలో ఎవరెవరి పేర్లపై ఎన్ని దుకాణాలున్నాయి ? మద్యం అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి ? ఉత్పత్తి ఏ రకంగా జరుగుతుందనే ప్రక్రియ తెలియచేయాలని డిమాండ్ చేశారు. మద్యం వల్ల ఎంతో మంది అనారోగ్యానికి గురవుతూ కుటుంబాలకు కుటుంబాలు చిధ్రమౌతున్నాయన్నారు. దశల వారీగా తగ్గిస్తామని, బెల్టుషాపులను తగ్గిస్తామని గతంలో చెప్పారని మధు గుర్తు చేశారు. కల్తీ బాధితులను పరామర్శించిన వారిలో సీహెచ్ బాబు రావు, దోనేపూడి కాశీనాథ్ తదితరులున్నారు. 

ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా..

పశ్చిమగోదావరి : పాలకొల్లులో డివైడర్ ఢీకొని ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. 15 మంది విద్యార్థులకు గాయాలు కావడంతో వీరిని ఆసుపత్రికి తరలించారు. 

బీఫ్..పోర్క్ ఫెస్టివల్ కు అనుమతి లేదు - ఓయూ రిజిష్ట్రార్..

హైదరాబాద్ : ఓయూలో బీఫ్..పోర్క్ ఫెస్టివల్ కు అనుమతి లేదని ఓయూ రిజిష్టార్ పేర్కొన్నారు. ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఓయూ విద్యార్థులయితే అడ్మిషన్లను రద్దు చేస్తామని హెచ్చరించారు.

 

తెలంగాణలో 11 మంది డీఎస్పీల బదిలీ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 11 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీజీపీ అనురాగ్ శర్మ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎస్ ఏసీపీగా ఎస్.మనోహర్ రావు..డీఎస్పీ ఇంటెలిజెన్స్ గా మహ్మద్ అశ్వాక్..అదిలాబాద్ డీఎస్పీ ఎస్ బీగా ఎం.ఎ.రహ్మాన్..హైదరాబాద్ ఎసీపీ ఎస్ బీగా వి.సీతారాం..డీఎస్పీ టీఎస్ పీఏగా ఆర్.సుదర్శన్..సీసీఎస్ ఏసీపీగా బి.రాములు నాయక్..సీసీఎస్ ఏసీపీగా కె.రాంకుమార్..డీఎస్పీ ఇంటెలిజెన్స్ గా దక్షిణమూర్తి..డీఎస్పీ ఎస్పీఎఫ్ గా ఆర్.భాస్కర్..డీటీసీ డీఎస్పీగా పి.సంజీవ్ కుమార్..ఉట్నూరు ఎస్పీ డీవోగా ఎస్.మల్లారెడ్డిలు బదిలీ అయ్యారు.

17:19 - December 9, 2015

హైదరాబాద్ : ఓయూలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించతలపెట్టిన కార్యక్రమం ఉత్కంఠను కలుగచేస్తోంది. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఓయూలో డిసెంబర్ 10వ తేదీన బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సిటీ సివిల్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. స్టే ఆధారంగా హైకోర్టు మరో తీర్పు చెప్పింది. తీర్పుకు అనుగుణంగా నడుచుకోవాలని కోర్టు పేర్కొంది. కోర్టు తీర్పుల్లో ప్రతివాదిగా పేర్కొన్న కృష్ణ అనే వ్యక్తి యూనివర్సిటీలో లేరని బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులు వెల్లడించారు. దీనితో పోలీసులు అప్రమత్తమయ్యారు. సాయంత్రం అంబేద్కర్ హాస్టల్ వద్దకు చేరుకున్నారు. సీఐ అశోక్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాలు అక్కడకు చేరుకున్నాయి. వీరి రాకను తెలుసుకున్న విద్యార్థులు హాస్టల్ తలుపులకు తాళాలు వేసుకుని లోపలే ఉండిపోయారు. క్రియాశీలకంగా పనిచేసే 50 మంది విద్యార్థులు ఈ హాస్టల్ లో ఉంటారని తెలుస్తోంది. కోర్టులో హాజరు పరుస్తారా ? లేదా పీఎస్ కు తరలిస్తారా ? అనేది తెలియరాలేదు. ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నిస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. దీనితో ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు మూడు రోజుల కొనసాగుతున్న దీనికి తెర వేయాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అరెస్టు చేసే ఇతర విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఎక్కడ పట్టుకుంటే అక్కడే నిరసన తెలియచేస్తామని విద్యార్థులు పేర్కొంటున్నారు. తమను అరెస్టు చేసినంత మాత్రానా ఫెస్టివల్ ఆగిపోదని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. ఓయూలో ప్రశాంత వాతావరణం నెలకొనాలని..ఓయూలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని రిజిష్ట్రార్ పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో ఓయూలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. 

పర్యాటక మంత్రితో ముగిసిన బాబు భేటీ..

ఢిల్లీ : కేంద్ర పర్యాటక మంత్రితో సీఎం చంద్రబాబు నాయుడు జరిపిన భేటీ ముగిసింది. గంటపాటు ఈ సమావేశం కొనసాగింది. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధి పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించడం జరిగిందన్నారు. సుందరమైన బీచ్ లున్నాయని, కూచిపూడి నట్యాభివృద్ధికి అడిటోరియం ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. 

ఎన్ఆర్ఎస్ హాస్టల్ ను చుట్టుముట్టిన పోలీసులు..

హైదరాబాద్ : ఓయూలోని ఎన్ఆర్ఎస్ ను పోలీసులు చుట్టుముట్టారు. బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులను అదుపులోకి తీసుకొనేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. హాస్టల్ కు లోపలి నుండి విద్యార్థులు తాళాలు వేసుకున్నారు. 

16:57 - December 9, 2015

సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందుతున్న 'నాన్నకు ప్రేమతో' శరవేగంగా ముస్తాబవుతోంది. సంక్రాతికి విడుదల చేసేందుకు నిర్మాత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తమ ఫేస్ బుక్ ద్వారా కొత్త పోస్టర్ ను విడుదల చేసింది.
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, ఆర్య సుకుమార్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం నాన్నకు ప్రేమతో... ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి 13న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ స్పెయిన్‌లో జరుగుతోందని, డిసెంబర్‌ 15 వరకు స్పెయిన్‌ షెడ్యూల్‌ జరుగుతుందని నిర్మాత పేర్కొన్నారు. స్పెయిన్‌ షెడ్యూల్‌ చాలా బాగా జరుగుతోందని, 60 రోజులపాటు లండన్‌లో చేసిన షెడ్యూల్‌ కూడా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా జరిగిందన్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నట్లు, డిసెంబర్‌ చివరి వారంలో ఆడియోను రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 13న సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేసినట్లు నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ తెలిపారు. 

16:49 - December 9, 2015

రవితేజ, తమన్నా, రాశిఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన 'బెంగాల్ టైగర్' డిసెంబర్ 10వ తేదీన విడుదల కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్..పోస్టర్ లు ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం చిత్ర యూనిట్ మరో ట్రైలర్ ను విడుదల చేసింది. చిత్ర దర్శకుడు సంపత్ నంది తన ఫేస్ బుక్ ద్వారా ఈ ట్రైలర్ ను అభిమానులతో పంచుకున్నారు. 'నేను ఒక్కసారి కొట్టిన తరువాత మీ వాళ్లు కూడా నా ఫ్యాన్స్ అయిపోతారు' అనే డైలాగ్ ను రవితేజ పలికారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఏం చేస్తాడో ? 
మూడేళ్ల భారీ విరామం తర్వాత సంపత్ నంది నుంచి వస్తున్న సినిమా 'బెంగాల్‌టైగర్'. రచ్చ తర్వాత సంపత్ కెరీర్‌లో చాలా ట్విస్టులు వచ్చాయి. సింగిల్ సిట్టింగ్‌లో స్టోరీ ఓకే చేయించి.. ఆర్నెళ్లలోపే బెంగాల్ టైగర్‌ను సిద్ధం చేశాడు ఈ దర్శకుడు. గతంలో సంపత్‌నందితో 'ఏమైంది ఈ వేళ' చిత్రాన్ని నిర్మించిన రాధామోహన్ 'బెంగాల్ టైగర్‌'ని నిర్మించాడు. తమన్నా, రాశీఖన్నా అందాలు ఈ సినిమాకి ప్రధానాకర్షణ. ఇక రవితేజ డైలాగ్ డెలవరీ ఇందులో కొత్తగా ఉంది. కిక్ 2 లాంటి డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో మాస్‌రాజా ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. స్టార్స్ దృష్టిలో పడాలంటే సంపత్ 'బెంగాల్ టైగర్‌'తో గాండ్రిచాల్సిందే. పడిపోతున్న మార్కెట్‌ను పట్టుకోవాలంటే రవితేజకు ఈ సినిమా విజయం తప్పనిసరి. ఇక వరుస ఫ్లాపుల్లో ఉన్న రాశీకి బెంగాల్ టైగర్ కెరీర్ డిసైడర్‌గా మారింది. 10న ఈ బెంగాల్ పులి ఏం చేస్తాడో..?

తేరుకోని మార్కెట్..

ముంబై : భారత స్టాక్ మార్కెట్ లో నష్టాల పర్వం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లలో నెలకొన్న స్తబ్ధత ప్రభావం చూపడంతో పాటు ముడి చమురు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న భయాలు మరో సెషన్ లోనూ ఇన్వెస్టర్ల సంపదను హరించి వేశాయి. రెండు రోజుల వ్యవధిలో భారత్ మార్కెట్ ను నమ్ముకుని పెట్టుబడులు పెట్టిన వారి సంపద రూ.2.50 లక్షల కోట్లకు పైగా తగ్గినట్లైనట్లు తెలుస్తోంది. 

నారాయణ మార్కెట్ యార్డులో రైతుల ఆందోళన..

మహబూబ్ నగర్ : జిల్లా నారాయణపేట మార్కెట్ యార్డులో రైతులు ఆందోళన చేపట్టారు. కందులకు సరైన మద్దతు ధర ఇవ్వట్లేదంటూ రైతులు ఆందోళన చేపట్టారు.

 

చెన్నైలో విద్యాసంస్థలకు 13వరకు సెలవు..

చెన్నై : భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన చెన్నై మహానగరంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఈనెల 13 వరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 

16:18 - December 9, 2015

హైదరాబాద్ : ఓయూలో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో తెలంగాణ ఉద్యమం..రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం నిరుద్యోగుల పోరాటంతో దద్దరిల్లిన ఓయూ మళ్లీ అట్టుడుకుతోంది. కేవలం బీఫ్ ఫెస్టివల్ నిర్వాహణే ఇందుకు కారణం. ఈ ఫెస్టివల్ నిర్వహించకూడదని కొంతమంది హెచ్చరికలు..మరికొందరు కోర్టును ఆశ్రయించడంతో బీఫ్ ఫెస్టివల్ పై ఉత్కంఠ నెలకొంది. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఓయూలో డిసెంబర్ 10వ తేదీన బీఫ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు విద్యార్థులు తలపెట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు సిటీ సివిల్ కోర్టు స్టే విధించింది. స్టే ఆధారంగా హైకోర్టు మరో తీర్పు చెప్పింది. తీర్పుకు అనుగుణంగా నడుచుకోవాలని కోర్టు పేర్కొంది. కోర్టు తీర్పుల్లో ప్రతివాదిగా పేర్కొన్న కృష్ణ అనే వ్యక్తి యూనివర్సిటీలో లేరని బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులు వెల్లడించారు. టెన్ టివితో వారు మాట్లాడారు. డిసెంబర్ 10వ తేదీన జరిగే ఈ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా రాజకీయ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించ తలపెట్టడం జరిగిందని కానీ యూనివర్సిటీ రిజిష్ట్రార్ అనుమతినివ్వకపోవడంతో బయటే నిర్వహించకున్నట్లు గుర్తు చేశారు. బీఫ్ తినే వారు బేఫకూబ్ అన్నా..కత్తులతో..దూసుకెళ్లండి అన్నా అడ్డంకులు ఉండవన్నారు. కానీ ఒక దశ..దిశ చేసే విధంగా శాంతి సామరస్యంతో నిర్వహించతలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ కు మాత్రం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని వాపోయారు. ఏదిమైనా ఫెస్టివల్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

ఓయూలో ఉద్రిక్తత పరిస్థితులు..
మరోవైపు ఓయూలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. బీఫ్ ఫెస్టివల్ నేపథ్యంలో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు. నిర్వాహకులను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. బుధవారం అంబేద్కర్ హాస్టల్ ను పోలీసులు చుట్టుముట్టారు. విద్యార్థులను అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కోర్టు ఆదేశాలు ఇంకా తమకు అందలేదని నిర్వాహకులు పేర్కొంటున్నట్లు సమాచారం. ఇంకోవైపు ఓయూలోకి ప్రవేశించేందుకు ఏబీవీపీ కార్యకర్తలు యత్నం చేశారు. ఎన్ సీసీ గేటు వద్ద కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాలకు తోపులాట జరిగింది. ఓయూ మార్గంలో రాకపోకలను పోలీసులు మూసివేశారు. 

బర్దన్ మృతి చెందారంట..మమత సంతాపం..

కోల్ కతా : సీపీఐ సీనియర్ నేత బర్ధన్ మృతి చెందడం పట్ల సంతాపం వ్యక్త పరుస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 'బర్దన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా..చాలాకాలం పాటు ఆయన రాజకీయాల్లో, కార్మిక సంఘాల్లో పనిచేశారు. ఆయన మరణం తీరనిలోటు. బర్ధన్ కుటుంబానికి..సన్నిహితులకు సంతాపం తెలుపుతున్నా'అంటూ మమత ట్వీట్స్ చేశారు. తరువాత బర్ధన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకుని వెంటనే ఆ ట్వీట్ ను తొలగించారు. అప్పటికే ఈ విషయం సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది.

రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోం శాఖ..

ఢిల్లీ : ఐఎస్ఐఎస్ దాడుల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ కార్యాలయం అప్రమత్తం చేసింది. 24గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. 

పర్యాటక శాఖ మంత్రితో బాబు..

ఢిల్లీ : కేంద్ర పర్యాటక శాఖ మంత్రితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో టూరిజం ప్రాజెక్టులపై బాబు చర్చించారు.  

జైట్లీ వివాహ విందుకు చంద్రబాబు..కేసీఆర్..

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూతురు వివాహ విందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

 

ఓయూలో బీఫ్ ఫెస్టివల్ జరుగుతుంది

హైదరాబాద్ : డిసెంబర్ 10వ తేదీన ఓయూలో నిర్వహించే బీఫ్ ఫెస్టివల్ జరిగి తీరుతుందని, కోర్టు తీర్పుల్లో ప్రతివాదిగా పేర్కొన్న వ్యక్తి యూనివర్సిటీలో లేరని బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులు వెల్లడించారు.

 

15:38 - December 9, 2015

ఖమ్మం : ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ ను ఓడించేందుకు పువ్వాడ నాగేశ్వరరావుకు మద్దతిస్తున్నట్లు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో వామపక్షాల అభ్యర్థిగా పోటీ చేస్తున్న పువ్వాడ కు మద్దతుగా కాంగ్రెస్ మరో నామినేషన్ దాఖలు చేసింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, వామపక్ష నేతలు పాల్గొన్నారు.

బాలసాని నారాయణ నామినేషన్..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విపక్షాల కలయిక అపవిత్ర కలయిక అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఖమ్మం స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి బాలసాని నారాయణ నామినేషన్ ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. 

15:30 - December 9, 2015

హైదరాబాద్ : ఏపీలో సంపూర్ణ మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నామని వైసీపీ ప్రకటించింది. విజయవాడలో కల్తీ మద్యం మృతులను పరామర్శించిన ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి బుధవారం మీడియాతో ఈ అంశంపై మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే ఈ హమీని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని వెల్లడించారు. అలాగే తమ పార్టీ నేతలు మద్యం వ్యాపారంలో ఉంటే వెంటనే తప్పుకోవాలని సూచించారు. 

15:26 - December 9, 2015

హైదరాబాద్ : కృష్ణా జలాల విషయంలో ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని వైసీపీ ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలియకుండానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు. ఆయన మోడీ ప్రభుత్వంతో రాజీ పడ్డారని, కృష్ణా మిగులు జలాలన్నీ ఏపీకే చెందాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాలల కోసం కొట్టుకొనే పరిస్థితి కేంద్రం కల్పించడం దారుణమని, ఒకప్పుడు దేవగౌడ ప్రధాని ఉన్నప్పుడు..బాబు భాగస్వామిగా ఉన్నప్పుడు అన్యాయం జరిగిందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

 

15:19 - December 9, 2015

ఢిల్లీ : అమరావతి పర్యావరణ అనుమతి కేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి సిఫార్సు చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై ట్రిబ్యునల్ లో వాదనలు జరిగాయి. పర్యావరణ అనుమతులు వచ్చాయని, పిటిషన్ పై విచారణ అవసరం లేదని ఏపీ న్యాయవాదులు వాదించారు. అయితే వీరి వాదనలతో ట్రిబ్యులన్ ఏకీభవించలేదు. పర్యావరణ అనుమతులను సవాల్ చేసేందుకు పిటిషనర్ కు అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. తరువాతి విచారణనను జనవరి 15వ తేదీకి వాయిదా వేసింది. 

ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ నామినేషన్లకు గడవు ముగిసింది. 12 స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తుండగా ఐదు స్థానాల్లో టీడీపీ, నాలుగు స్థానాల్లో కాంగ్రెస్, ఖమ్మం స్థానం నుండి వైసీపీ, సీపీఐ బరిలోకి దిగుతున్నాయి. ఈనెల 27న పోలింగ్ జరుగనుంది. 

వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి - జయలలిత..

చెన్నై : రాష్ట్రంలో వచ్చిన భారీ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి జయలలిత కోరారు. ఈమేరకు ప్రధాన మంత్రి మోడీకి జయ లేఖ రాశారు. ప్రకృతి విపత్తుతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

ఏడు గంగమ్మ జాతరలో అపశృతి..

తిరుపతి : శ్రీకాళహస్తి ఏడుగంగమ్మ జాతరలో అపశృతి చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో గంగమ్మ విగ్రహం ధగ్ధమైంది. మంటలను భక్తులు అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

మద్యపాన నిషేధం చేస్తామనడి హాస్యాస్పదం - సోమిరెడ్డి..

నెల్లూరు : మద్యపాన నిషేధం చేస్తామని జగన్ అనడం హాస్యాస్పదమని టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. మద్యం కేసుల్లో ఉన్న బొత్సను వైసీపీలో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. జగన్ మొసలి కన్నీరును ప్రజలు నమ్మరని తెలిపారు. 

ఓయూలో కొనసాగుతున్న ఉద్రిక్తత..

హైదరాబాద్ : ఓయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఓయూలోకి ప్రవేశించేందుకు ఏబీవీపీ కార్యకర్తలు యత్నం చేశారు. ఎన్ సీసీ గేటు వద్ద కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాలకు తోపులాట జరిగింది. ఓయూ మార్గంలో రాకపోకలను పోలీసులు మూసివేశారు.

 

14:41 - December 9, 2015

దేశంలో 1937 వరకు ఎలాంటి చట్టాలు లేవని, అప్పట్లో మహిళలంటే ఆలన..పాలన..పోషణ చూసే హక్కు కల్పించబడిందని లాయర్ పార్వతి పేర్కొన్నారు. ఒక విధంగా చెప్పాలంటే పురుష కుటుంబ దయదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవించే వారని పేర్కొన్నారు. మహిళలు..ఆస్తిలో హక్కు అనే అంశంపై టెన్ టివిలో 'మై రైట్' కార్యక్రమంలో లాయర్ పార్వతి విశ్లేషించారు. 1937 మొట్టమొదటగా మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించాలని తాత్కాలికంగా ఓ చట్టం తీసుకొచ్చారని అప్పట్లో బాల వితంతవులు ఉండేవారన్నారు. పుట్టింటి వారిపై భారం ఉన్నారు కాబట్టి భార్యలకు ఆస్తి ఇచ్చే అవకాశం కల్పించబడిందన్నారు. కానీ ఆమె మరణించిన అనంతరం తిరిగి భర్త వారసులకు తిరిగి ఆస్తి వెళుతుందని చెప్పడం జరిగిందన్నారు. అంతేగాకుండా దానాలు..ధర్మాలు..వీలునామా..అమ్మడం..ఇతరులకు ట్రాన్స్ ఫర్ చేయడం జరగదని యాక్ట్ లో చెప్పడం జరిగిందన్నారు. కానీ చట్టం రావడం నాందిగా చెప్పవచ్చన్నారు. అనంతరం 1956 హిందూ వారసత్వ చట్టం వచ్చిందని, మొట్టమొదటిసారిగా పరిమితమైన హక్కులను శాశ్వతంగా కల్పించే విధంగా చేశారు. మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే వీడియోలో చూడండి. అలాగే వివిధ ప్రాంతాల నుండి ప్రజలు వెలుబుచ్చిన న్యాయ సందేహాలను లాయర్ పార్వతి నివృత్తి చేశారు. 

14:26 - December 9, 2015

అనంతపురం : కేంద్ర కరవు బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటన ముగించుకుని ఏపీ రాష్ట్రంలో పర్యటిస్తోంది. కానీ తొలిరోజే బృందానికి సెగ తగలింది. బుధవారం ఉదయం హిందూపురంలో పర్యటిస్తున్న కేంద్ర కరవు బృందానికి నిరసనల సెగ తగిలింది. కరవుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకోవాలని రైతు సంఘం నేతలు కరవు బృందాన్ని అడ్డుకున్నారు. నీటి సమస్యను మున్సిపల్‌ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళన చేపట్టారు. నిరసనలు ఎదురుకావడంతో.. కేంద్ర కరవు బృందం ఎలాంటి హామీలు ఇవ్వకుండానే వెనుదిరిగింది. కేంద్ర కరవు బృందం మొక్కుబడిగా పర్యటిస్తుందని రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. 

14:22 - December 9, 2015

హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికల్లో టీటీడీపీ తరపున ఐదుగురిని పోటీలో నిలిపారు. మహబూబ్‌నగర్‌ నుంచి కొత్తకోట దయాకర్‌ రెడ్డి. ఆదిలాబాద్‌ జిల్లా నుంచి నారాయణరెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి బుక్కా వేణుగోపాల్‌, కరీంనగర్‌ నుంచి కర్రు నాగయ్య, నల్గొండ నుంచి సాదినేని శ్రీనివాసరావులు బరిలో నిలిచారు. కాగా ఖమ్మంలో సీపీఐకి టీడీపీ మద్దతు ఇవ్వనుంది. వరంగల్‌లో ఎంపీటీసీలు నిలబెట్టిన అభ్యర్థికి టీడీపీ మద్దతు ప్రకటించింది. 

14:20 - December 9, 2015

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమదే విజయం..అధికార పార్టీకి బలం లేకపోయినా బరిలోకి దింపుతోంది..ఎలాగైనా 12 స్థానాల్లో గెలుపు సాధిస్తామని బీరాలు పలికిన టి.కాంగ్రెస్ ప్లేటు ఫిరాయించింది. కేవలం నాలుగు స్థానాల్లో పోటీకి దిగింది. ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ లకు ఈ రోజు ఆఖరి రోజు కావడం తెలిసిందే. తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున బరిలోకి దిగేది నలుగురేనని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి బుధవారం తెలిపారు. ఖమ్మం ఎమ్మెల్సీ పోరులో సీపీఐకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కాగా కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పోటీ చేయట్లేదని ప్రకటించారు. సరిపడా బలం లేనందుకే పోటీకి వెనుకడుగు వేసినట్లు సమాచారం. టిపిసిసి తీసుకున్న నిర్ణయం వల్ల కాంగ్రెస్ లో గందరగోళం..విమర్శలు చెలరేగే అవకాశం ఉందని తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాలకు అవకాశం కల్పించాలని కొంతమంది అభ్యర్థులు కోరారు. కానీ అక్కడ బరిలోకి దిగకపోవడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెదక్ జిల్లా శివరాజ్ పాటిల్ ను ఎంపిక చేయడం పట్ల కూడా పలు విమర్శలు వస్తున్నాయి. 

జూ.సివిల్ జడ్జిల నియామకానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్..

ఢిల్లీ : జూనియర్ సివిల్ జడ్జిల నియామకాలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యథాతథ స్థితిని తొలగిస్తూ సుప్రీం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కింది కోర్టులలో జడ్జిల నియామకాలు, విభజనకు అడ్డంకులు తొలగాయి. హైకోర్టు విభజన జరుగకుండా జూనియర్ సివిల్ జడ్జిల నియామకాలు జరుపకూడదంటూ గతంలో సుప్రీంను సివిల్ జడ్జి డి.ధర్మారావు ఆశ్రయించారు. 

కెనడా ప్రతినిధులతో ఏపీ సీఎస్ భేటీ..

విజయవాడ : ఏపీ సచివాలయంలో సీఎస్ ఐవైఆర్ తో కెనడా ప్రతినిధులు భేటీ అయ్యారు. రాజధాని నిర్మాణం, పెట్టుబడులపై చర్చించారు. 

ఆ కేసులో రాజకీయ కుట్ర – రాహుల్..

ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో వంద శాతం రాజకీయ కుట్ర ఉందని ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. 

చోరీలకు పాల్పడే ఇద్దరు వ్యక్తులు అరెస్టు..

చిత్తూరు : పెళ్లి వేడుకల్లో చోరీలకు పాల్పడే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నవీన్ కుమార్, సురేష్ కుమార్ అనే ఇద్దరు దొంగల నుండి రూ.14 లక్షల విలువైన ఆభరణాలు...ల్యాప్ టాప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరీపై ఇప్పటి వరకు 22 కేసులు నమోదై ఉన్నాయి.

 

12 స్థానాల్లోనూ టీఆర్ఎస్ గెలుస్తుంది - హరీష్..

హైదరాబాద్ : 12 స్థానాల్లోనూ టీఆర్ఎస్ గెలుస్తుందని గెలిచే అవకాశం లేకపోయినా టిడిపి, కాంగ్రెస్ లు అభ్యర్థులను నిలబెడుతున్నాయని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. 

కంది దారిదోపిడీ కేసులో నలగురి అరెస్టు

మెదక్‌ : జిల్లాలోని కందిలో జరిగిన దారిదోపిడీని పోలీసులు ఛేదించారు. ఈకేసుకు సంబంధించి నలుగురుని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరు పరచనున్నారు.

 

వేములవాడలో ప్రమాదం..

కరీంనగర్ : వేములవాడ (మం) సంకేపల్లిలో బిన్నింగ్ మిల్లులో పత్తి తగులబడుతోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉన్నారు.

 

14:00 - December 9, 2015

ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ పై లోక్ సభలో గందరగోళం నెలకొంది. నేషనల్ హెరాల్డ్ కేసు వ్యవహారంపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. గందరగోళం మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి.

 

13:55 - December 9, 2015

హైదరాబాద్‌ : మహానగరం కాలుష్య కాసారంగా మారుతున్నది. జంటనగరాల్లో ఎక్కడ చూసినా వాయు కాలుష్యమే. వాహనాలు వెదజల్లే విషవాయువులు ఒకవైపు...దుమ్మురేగుతున్న రోడ్లు మరోవైపు..వీటిని పీల్చిన ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. వాహనాల రణగొణ ధ్వనులతో శబ్ధకాలుష్యం పెరిగిపోతోంది. ట్రాఫిక్‌ జంక్షన్లలు సిగ్నల్స్‌ పడినప్పుడు వాహనచోదకులు ఉపయోగించే ఎయిర్‌ హారన్స్‌తో చెవుల్లోని కర్ణభేరి పగలిపోయే పరిస్థితి ఉంది.
ప్రమాదకర స్థాయికి కాలుష్యం
భాగ్యనగరంలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. కోరలుచాస్తున్న కాలుష్యంతో ముప్పుగా మారిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుమ్ముదూళితోపాటు, వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న విషవాయువులతో జనం వ్యాధుల బారిన పడుతున్నారు.
కాలుష్యానికి ప్రధాన కారణం వాహనాలు
కాలుష్యానికి ప్రధాన కారణం వాహనాలు. జంటనరాలు, రంగారెడ్డి జిల్లాలో 40 లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. వీటిలో కాలం చెల్లిన వాహనాలు విపరీతంగా విషవాయువులు వెదజల్లుతున్నాయి. ప్రధాన కూడళ్ల ప్రాంతంలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పడినప్పుడు వాహనాలు ఇంజిన్లు ఆపకపోవడంతో కాలుష్యం పెరుగుతోంది. దెబ్బతిన్న రోడ్లుతో కూడా కాలుష్యం అధికమవుతోంది.
మొక్కుబడిగా నియంత్రణ చర్యలు
కాలుష్యం కోరలు చాస్తున్నా, ఈ భూతం ప్రజలను బయపెడుతున్నా పట్టించుకునే నాథులు లేరు. నియంత్రణ చర్యలు మొక్కుబడి తంతుగా మారాయన్న విమర్శలున్నాయి. కాలుష్య నియంత్రపై ప్రజలకు పెద్దగా అవగాహనలేదు. దీనిపై అవగాహన కల్పించాల్సిన కాలుష్య నియంత్రణ మండలి అధికారలు ఈ దిశతగా చర్యలు చేపట్టడంలేదన్న విమర్శలున్నాయి. దేశంలోని ఇతర మహానరాలతో పోలిస్తే జంటనగరాల్లో కాలుష్యం తక్కువంటూ... సరిపెట్టుకుంటున్న అధికారులు.. నియంత్రణకు విస్తృతంగా చర్యలు చేపట్టకపోతే.. ఢిల్లీ, ముంబై వంటి నగరాలను మించిపోయే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రజలకు అనేక ఇబ్బందులు
వాహనాల కాలుష్యంతో నగరంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకపక్క రోడ్లు సరిగ్గా లేకపోవడం.. మరోపక్క మెట్రో పనుల కారణంగా రోడ్ల మీదకు వచ్చేందుకు నగరవాసులు భయపడుతున్నారు. వాహనాల కాలుష్యంతో ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు.
వాహనదారుల ఇబ్బందులు
రోడ్లపై వచ్చే దుమ్ము దూళితో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిగ్నల్స్‌ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోవడంతో భారీగా కాలుష్యం వెలువడుతోంది. దీంతో నగరవాసులు కళ్ల మంటలు, గొంతునొప్పి, ఆస్తమా లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు.
మెట్రో పనులతో ఇబ్బందులు 
మెట్రో పనుల కారణంగా వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల తవ్వకాలతో వాహనాలు చాలా నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. దీంతో వాహనాల నుంచి భారీస్థాయిలో కాలుష్యం వెదజల్లుతోంది.

13:48 - December 9, 2015

ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసుపై పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో ప్రభుత్వ జోక్యం లేదని మంత్రులు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం చేటుచేసుకుంది. ఒకరిపైమరొకరు తీవ్ర వాదోపవాదాలు చేసుకున్నారు.

 

13:44 - December 9, 2015

మెదక్‌ : జిల్లాలోని కందిలో జరిగిన దారిదోపిడీని పోలీసులు ఛేదించారు. ఈకేసుకు సంబంధించి నలుగురుని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరు పరచనున్నారు.  

13:42 - December 9, 2015

హైదరాబాద్ : ఓయూలో బీఫ్‌ ఫెస్టివల్‌కు హైకోర్టు అనుమతి నిరాకరించింది. సిటీ సివిల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలని ఆదేశించింది. శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఈమేరకు పోలీసులు భారీగా మోహరించారు. బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. బీఫ్ ఫెస్టివల్, ఫోర్క్ ఫెస్టివల్, గోపూజ వంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని ఓయూ అధికారులు తెలిపారు. సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు తమకు సంబంధించని కావని.. అవి తమకు అందలేదని బీఫ్ ఫెస్టివల్ నిర్వహకులు అంటున్నారు. సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులతో తమకు ఎలాంటి సంబంధంల లేదని అంటున్నారు. తాము కూడా హైకోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు. అయితే హైకోర్టు తాము తినే ఆహారంపై నిషేధం, ఆంక్షలను పెట్టబోదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ లు ఫెస్టివల్ ను అడ్డుకునేందుకు కుట్ర పన్నాయని మండిపడ్డారు. అయితే ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని నిర్వహకులు చెప్పారు. కోర్టు నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదన్నారు. అవసరమైతే తీర్పుపై పై కోర్టుకు వెళ్తామని అంటున్నారు.
ఓయూలో ఉద్రిక్తత...
బీఫ్ ఫెస్టివల్ ప్రకటన, హైకోర్టు తీర్పులతో ఓయూలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్ ఆర్ ఎస్ హాస్టల్ వద్ద నిర్భందకాండ కొనసాగుతోంది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహకులను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. బయటి వ్యక్తులను క్యాంపస్ లోకి అనుమతించడం లేదు. ఐడీకార్డులను చూసి... ఓయూలోకి అనుమతిస్తున్నారు. ఇదిలావుంటే ఎబివిపి కార్యకర్తలు బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకుని.. గోమాత పూజ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో బయటి నుంచి క్యాంపస్ లోకి ఎబివిపి కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతారణం నెలకొంది.

 

ఓయూలో బీఫ్‌ ఫెస్టివల్‌కు హైకోర్టు అనుమతి నిరాకరణ

హైదరాబాద్ : ఓయూలో బీఫ్‌ ఫెస్టివల్‌కు హైకోర్టు అనుమతి నిరాకరించింది. సిటీ సివిల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలని ఆదేశించింది. శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది.

 

13:18 - December 9, 2015

హైదరాబాద్ : కృష్ణా జలాల పంపకాల్లో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విమర్శించారు. కృష్ణా నది జలాల పంపకాల్లో నాలుగవ రాష్ట్రంగా తెలంగాణను కేంద్రం పేర్కొనకపోవడం దారుణమని కడియం మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలే నదీ జలాలను పంచుకోవాలని కేంద్రం అనడం బాధ్యతారాహిత్యం అని కడియం అన్నారు.

 

కల్తీ మద్యం ఘటనపై విచారణకు సిట్‌ ఏర్పాటు

విజయవాడ : కల్తీ మద్యం ఘటనను ఎపి సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఘటనపై ఏపీ సర్కార్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఘటనపై సిట్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఈమేరకు ఘటనపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ రాముడు తెలిపారు. సీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆధ్వర్యంలో సిట్‌ ఏర్పాటు చేశారు. ఐపీఎస్‌ అధికారులు మహేష్‌చంద్ర లడ్డా, సెంథిల్‌కుమార్‌, డీఎస్పీలు కనకరాజు, వెంకటేశ్వరరావు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలతో సిట్‌ ఏర్పాటుచేశారు. 

13:10 - December 9, 2015

విజయవాడ : కల్తీ మద్యం ఘటనను ఎపి సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఘటనపై ఏపీ సర్కార్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఘటనపై సిట్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఈమేరకు ఘటనపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ రాముడు తెలిపారు. సీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆధ్వర్యంలో సిట్‌ ఏర్పాటు చేశారు. ఐపీఎస్‌ అధికారులు మహేష్‌చంద్ర లడ్డా, సెంథిల్‌కుమార్‌, డీఎస్పీలు కనకరాజు, వెంకటేశ్వరరావు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలతో సిట్‌ ఏర్పాటు చేశారు.

 

 

సీనియర్‌ అసిస్టెంట్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

శ్రీకాకుళం : భాకరసాయిబు పేటలో నీటిపారుదల శాఖ సీనియర్‌ అసిస్టెంట్‌ భారత లక్ష్మి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. భారత లక్ష్మి ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఏసీబీ సమాచారం అందుకున్న వెంటనే సోదాలు నిర్వహించారు. కాగా ఇప్పటివరకూ కోటి రూపాయల వరకూ విలువైన ఆస్తులను గుర్తించినట్లు సమాచారం

 

ఎమ్మెల్సీల ఎన్నికల్లో టీటీడీపీ తరపున ఐడుగురి పోటీ

హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికల్లో టీటీడీపీ తరపున ఐదుగురిని పోటీలో నిలిపారు. మహబూబ్‌నగర్‌ నుంచి కొత్తకోట దయాకర్‌ రెడ్డి. ఆదిలాబాద్‌ జిల్లా నుంచి నారాయణరెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి బుక్కా వేణుగోపాల్‌, కరీంనగర్‌ నుంచి కర్రు నాగయ్య, నల్గొండ నుంచి సాదినేని శ్రీనివాసరావులు బరిలో నిలిచారు. కాగా ఖమ్మంలో సీపీఐకి టీడీపీ మద్దతు ఇవ్వనుంది. వరంగల్‌లో ఎంపీటీసీలు నిలబెట్టిన అభ్యర్థికి టీడీపీ మద్దతు ప్రకటించింది.

 

12:54 - December 9, 2015

కడప : జిల్లా ప్రొద్దుటూరులోని అమృతానగర్ లో డీఎస్పీ నీలం పూజిత ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన ఆధారాలు లేని 30ఆటోలు, 50 మోటారు బైకులు 2 కార్లు, ట్రాక్టరును పోలీసులు సీజ్ చేశారు. ఈ తనిఖీలలో డీఎస్పీ పూజితతో పాటు సీఐ సత్యనారాయణ, ఎస్ ఐ పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

 

12:52 - December 9, 2015

శ్రీకాకుళం : భాకరసాయిబు పేటలో నీటిపారుదల శాఖ సీనియర్‌ అసిస్టెంట్‌ భారత లక్ష్మి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. భారత లక్ష్మి ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఏసీబీ సమాచారం అందుకున్న వెంటనే సోదాలు నిర్వహించారు. కాగా ఇప్పటివరకూ కోటి రూపాయల వరకూ విలువైన ఆస్తులను గుర్తించినట్లు సమాచారం

12:46 - December 9, 2015

విశాఖ : భారత్, రష్యా నేవీ సంయుక్త విన్యాసాలు విశాఖలో ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ విన్యాసాలకు తూర్పు నావికాదళం కేంద్రంగా ఉన్న విశాఖ అతిధ్యమిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న ఫ్లీట్ రివ్యూకు ఈ విన్యాసాలను భారత నావికాదళం వినియోగించుకోనుంది...
ఇంద్ర నేవీ 2015 పేరుతో
ఇంద్ర నేవీ 2015 పేరుతో భారత రష్యా నావికాదళాలు విశాఖ కేంద్రంగా సంయుక్త విన్యాసాలను నిర్వహించనున్నాయి. భారత నౌకాదళానికి తోడ్పాటు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న రష్యాతో విన్యాసాలు చేయడానికి భారత్ ఎప్పుడు సంసిద్దంగా ఉంటుందని నేవీ అధికారులు ప్రకటించారు. రెండు దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధనౌకలతో పాటు హెలికాప్టర్లు ఈ విన్యాసాల్లో ప్రదర్శించనున్నారు.
రష్యా నుంచి ఆరు అత్యాధునిక యుద్ధ నౌకలు
ఇప్పటికే ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు రష్యా నుంచి ఆరు అత్యాధునిక యుద్ధ నౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి. మరోవైపు భారత్ తరపున కూడా ఆరు అత్యాధునిక యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొననున్నాయి. భారత్ వినియోగిస్తున్న యుద్ధ నౌకల్లో ఎక్కువ భాగం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నవే. ఇప్పటికీ రష్యా నేవీ సిబ్బంది భారత్ కు నావికాదళ పరిజ్ఞానాన్ని అందిస్తుందని నేవీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల నేవీ అధికారులు ఐఎన్ఎస్ సహ్యాద్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ విన్యాసాలు ఇప్పటికే బంగాళాఖాతంలో ప్రారంభమయ్యాయని వారు వెల్లడించారు..
ఇప్పటికే భారత్ అస్ట్రేలియాతో సంయుక్త విన్యాసాలు
2016లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ఉన్న నేవథ్యంలో ఇప్పటికే భారత్ అస్ట్రేలియాతో సంయుక్త విన్యాసాలు నిర్వహించింది. అదే విధంగా ప్రస్తుతం రష్యాతో నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ మొదలయ్యే లోపు మరికొన్ని దేశాలతో విన్యాసాలను నిర్వహించాలని భారత నావికాదళం భావిస్తోంది. పలు దేశాలకు చెందిన నావికా దళ విన్యాసాలకు విశాఖ తీరం వేదిక కావడం నగర వాసులకు కనులవిందుగా మారింది.

 

 

12:38 - December 9, 2015

హైదరాబాద్ : ఉస్మానియాలో బీఫ్ ఫెస్టివల్ హై టెన్షన్ పుట్టిస్తోంది. ఫెస్టివల్‌ను నిర్వహిస్తామంటూ ఓ వర్గం దూకుడుగా వెళ్లుంటే...మరోవర్గం ఫెస్టివల్‌ను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో వర్సిటీలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా తయారైంది. మరోవైపు పోలీసులు కోర్టు అదేశాలతో నిర్వాహాకుల్ని ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. అయితే రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ బీఫ్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామని విద్యార్థి సంఘాలు శపథం చేస్తున్నాయి. దీంతో ఓయూలో ఎప్పుడేం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఈనెల 10న ఓయూలో బీఫ్‌ ఫెస్టివల్‌
ఈనెల 10న బీఫ్ ఫెస్టివల్‌ని ఖచ్చితంగా నిర్వహిస్తామని ఒక వర్గం..ఫోర్క్ ఫెస్టివల్‌ని కూడా నిర్వహిస్తామని మరో వర్గం పోటీ పడిపడుతున్నారు. ఒకవేళ బీఫ్ ఫెస్టివల్ జరిగితే గోవు పూజ చేయాల్సిందిగా మరి కొంత మంది విద్యార్ధులు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే మరోవైపు ఓయూలో ఎలాంటి పండుగలు, వేడుకలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అడ్వకేట్‌ జనార్ధన్ సిటి సివిల్ కోర్టులో ఇంజక్షన్ పిటిషన్ దాఖలు చేయగా..ఈనెల 20 వరకు ఓయూలో ఎలాంటి పండుగలు నిర్వహించవద్దని..యధాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అయితే విద్యార్ధులు తమకు ఎలాంటి కోర్టు అదేశాలు అందలేదని తాము ఫెస్టివల్ జరిపి తీరుతామని వంటకాల మెనూను విడుదల చేశారు.
బీఫ్‌ ఫెస్టివల్‌కు అనుమతుల్లేవన్న అధికారులు
ఇక గురువారం ఓయూలో విద్యార్ధులు బీఫ్‌ ఫెస్టివల్‌ను జరుపుకునేందుకు ఎలాంటి అనుమతులు లేవని వర్శిటీ అధికారులు చెప్తున్నారు. పీజీ విద్యార్ధులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఈనెల 7 నుంచి ప్రారంభమయ్యాయని..కొద్ది రోజుల్లోనే రాత పరీక్షలు కూడా ఉన్నాయని ఓయూ టీచర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేస్తోంది. బీఫ్‌ఫెస్టివల్‌, ఫోర్క్‌ ఫెస్టివల్‌ వల్ల వర్శిటీ విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న యూనివర్శిటీని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.
బీఫ్‌ ఫెస్టివల్‌కు పోటీగా ఫోర్క్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తాం: ఓయూ విద్యార్ధి జేఏసి
అయితే ఇవేమి బీఫ్ ఫెస్టెవల్ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. గురువారంనాడు ఎట్టిపరిస్థితుల్లోనూ బీఫ్‌ ఫెస్టివల్‌కు పోటీగా ఫోర్క్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామని ఓయూ విద్యార్ధి జేఏసి నాయకులు చెప్తున్నారు. వర్శిటీలో ఎలాంటి విఘాతాలకు తావులేకుండా ఫెస్టివల్‌ను నిర్వహిస్తామని చెప్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు బీఫ్‌ ఫెస్టివల్‌ను ఆపాలంటూ మంగళవారం కూడా హైకోర్టులో ఓ పిల్ దాఖలయింది. రాష్ట్రీయ గోసంరక్షణ సేన పేరుతో పిల్‌ను దాఖలు చేశారు. వర్శిటీ వైస్ ఛాన్స్‌లర్‌ను, ప్రిన్సిపల్ సెక్రెటరీ హోంను ప్రతివాదులుగా చేర్చారు. అయితే ఈ పిటిషన్ బుదవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్రీయ గోసంవరక్షణ పేరుతో పిల్‌
ఉస్మానియాలో ఏడాది కాలంగా ఎలాంటి ఉద్యమాలు లేవని అనుకుంటున్న సమయంలో ఇలాంటి వ్యవహారం పోలీసులకు మళ్లీ పని చెప్పుతున్నాయి. యూనివర్సీటీల్లోకి పోలీసులు రావద్దని సుప్రీంకోర్టు అదేశాలు ఉన్నా..పెద్ద కూర పండుగ వివాదం నేపథ్యంలో యూనివర్సిటీలోకి పెద్ద ఎత్తున బలగాలు మోహరించాయి. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తుండటంతో..ముందస్తు అరెస్ట్ చేసేందుకు పోలీసులు తనిఖీలు మొదలు పెట్టారు. దీంతో వర్శిటీలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

 

12:00 - December 9, 2015

ఖమ్మం : జిల్లాలో సైకో కలకలం సృష్టించాడు. చింతూరు మండలం వేగితోటలో ప్రజలపై బాణాలతో సైకో దాడి చేశాడు. ఈ ఘటనలో లాలమ్మ, దారయ్యలు గాయాలపాలయ్యారు. దారయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. 

11:38 - December 9, 2015

హైదరాబాద్ : రెండు రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, బాబు ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కుమార్తె పెండ్లి విందుకు సీఎం కేసీఆర్, సీఎం చంద్రబాబు హాజరవుతారు. విజ్ఞాన్‌భవన్‌లో జరిగే ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ 75వ జన్మదిన వేడుకలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కేటాయింపులనే ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు పంచుకోవాలనే సుప్రీం సూచనలపై ఇరు రాష్ట్రాల సీఎంలు కేంద్రానికి నివేదించే అవకాశం ఉంది. కేంద్ర వ్యవసాయ, పర్యాటకశాఖల మంత్రులతో బాబు వరదలకు కేంద్ర సాయంపై చర్చించనున్నారు.

 

11:34 - December 9, 2015

చిత్తూరు : మేయర్‌ కటారి అనురాధ దంపతుల హత్యకేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈకేసులో నిందితుడుగా భావిస్తున్న శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయ పాలకమండలి సభ్యుడు కాసరం రమేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్‌ శ్రీకాళహస్తి పట్టణ టీడీపీ యువజన అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. హత్యకేసులో ప్రధాన నిందితుడు చింటూకు రమేష్ ఆశ్రయం కల్పించి, వాహనం సమకూర్చి... సహకరించాడన్న ఆరోపణల నేపథ్యంలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 22 మందిని అరెస్ట్ చేశారు. రమేష్ ను చిత్తూరులో రహస్య ప్రాంతంలో ఉంచారు.

 

11:23 - December 9, 2015

శ్రీకాకుళం : జిల్లాలోని రాజాంలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస్‌ జూట్‌ మిల్‌ లాకౌట్‌ ప్రకటించింది. కార్మికులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కంపెనీ లాకౌట్‌ ప్రకటించింది. ఈ చర్యతో సుమారు 300 మంది కార్మికుల జీవితాలను యాజమాన్యం అగమ్య గోచరంగా మార్చింది. కంపెనీ లాకౌట్‌ పట్ల కార్మికులు ఆందోళన బాట పడుతున్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యక్షంగా 300 మంది, పరోక్షంగా 200 మంది కంపెనీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కంపెనీ లాకౌట్ ప్రకటించడంతో కార్మికులతోపాటు కుటుంబసభ్యులు కంపెనీ ఎదుట ఆందోళన చేపట్టారు. మిల్లును తెరవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

11:17 - December 9, 2015

విశాఖ : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మందికి గాయాలయ్యాయి. భీమిలి సమీపంలో మారికవలస వద్ద విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును వెనకవైపు నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించారు. 

11:10 - December 9, 2015

విశాఖ: వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో మంచు తుంపర్లతో రహదారులన్నీ తడిసిపోయాయి. లంబసింగి, మినుములూరులో 9 డిగ్రీలు, పాడేరులో 11, చింతపల్లిలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో ఒక్కరోజే మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది.

 

11:05 - December 9, 2015

సంపూర్ణ మద్య నిషేధం చేస్తామనే జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ తెలిపారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. మద్యం విధానంపై జగన్ నిజాయితీని నిలుపుకోవాలంటే మద్యంతో సంబంధం ఉన్నవారిని తమ పార్టీ నుంచి తొలగించాలన్నారు. అంతేకాకుండా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అధికారంలోకి వచ్చాక తప్పకుండ ఆచరణలో పెట్టాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను అయన మాటల్లోనే..
జగన్ స్థాపించిన వైసిపి లోనే మద్యం అమ్ముకునే వారు ఉన్నారు. మద్యం అమ్ముతున్న, మద్యం టెండర్లు పాడుతున్న వారిని వైసిపి నుంచి తొలగించాలి. మద్యపానంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్నవారిని పార్టీని నుంచి తొలగించాలి. చట్ట విరుద్దంగా ఉన్న మద్యం షాపులను ధ్వంసం చేయాలి. రాజశేఖర్ రెడ్డి పాలనలో మద్యం ఏరులై పారింది. ముందు రాజశేఖర్ రెడ్డి పాలనను జగన్ వ్యతిరేకించాలి. కొనుగోలు చేస్తున్న ప్రతి నాలుగు బాటిళ్లల్లో రెండు బాటిళ్లు చట్ట విరుద్దంగా, మరో మధ్యం కల్తీ మద్యం నడుస్తుంది. మిగిలిన ఒక బాటిల్ ప్రభుత్వం నడుపుతోంది. తాగుబోతుల బడ్జెట్.. రాష్ట్ర ప్రజల బడ్జెట్ తో సమానంగా ఉంది. పాఠశాలలు, దేవాలయాలు, ఆస్పత్రులు, కాలనీలు, నివాస ప్రాంతాలు, రహదారుల పక్కన మద్యం అమ్మకాలను నిషేధించాలి. న్యాయసమ్మతమైన పనులు చేసేటప్పుడు చట్టాలను ఉల్లంఘించిన పర్వాలేదు.
మద్యాన్ని నియంత్రించాలి...
మద్యాన్ని నియంత్రించాలి. మద్యం విచ్చలవిడిగా దొరకకుండా కట్టడి చేయాలి. అక్రమ, కల్తీ మద్యం రాకుండా ప్రజలు జాగృత్తం చేయాలి.. కానీ దానికి విరుద్ధంగా ప్రభుత్వం.. విచ్చలవిడి మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తుంది. వితంతు ఫించన్ తీసుకుంటున్న వారిలో 25, 30 ఏళ్ల మహిళలే అధికంగా ఉంటున్నారు. ఎందుకంటే వారి భర్తలు మద్యం తాగే మృతి చెందుతున్నారు.
కేంద్ర కరవు బృందం పర్యటన
నిరంతరం కరవు పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వర్షపాతంలో గణనీయమైన తగ్గుదల, వ్యవసాయ ఉత్సతులు పడిపోవడం, దిగుబడులు తగ్గుదల, పశుగ్రాసం లేక పశువుల అమ్మకాలు, బంగారం, బంగారు ఆభరణాలు కుదవపెట్టడం, పాఠశాలలో పిల్లల డ్రాపవుట్స్, వలసలు పెరుగడం, భూములు పడావ్ పడడం, పశుగ్రాసం కొరత ఏర్పడడం, పాల ఉత్సత్తి దిగుబడి తగ్గడం వంటి పరిణామాలు కరువు వస్తుందని సూచిస్తాయి. కరువుపై అంచనాకు వచ్చి.. ప్రభుత్వాలు అప్రమత్తమవ్వాలి. కరువు వచ్చినప్పుడు వ్యవసాయేతర గ్రామీణ ఉపాధి కల్పించాలి. సమగ్రమైన కరువు విధానం రావాలి.
తెలుగు రాష్ట్రాలు నష్టపోయేలా ట్రిబ్యునల్ తీర్పు
తెలంగాణ, ఎపి రాష్ట్రాలు నష్టపోయేలా... ట్రిబ్యునల్ తీర్పు ఉంది. ట్రిబ్యునల్ కు రాష్ట్రమనేది ప్రాతిపదిక. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కేటాయింపులు ప్రాతిపదిక కాదు. కృషానదీ జలాల కేటాయింపు విషయంలో కేంద్రప్రభుత్వ నిర్ణయం అన్యాయం. తెలంగాణ ఉద్యమం జరిగిందే.. నీళ్లు, నిధులు, నియామకాలు' అని నాగేశ్వర్ గుర్తుచేశారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

తెలంగాణలో ముగియనున్న స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు

హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. 

టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎస్.శ్రీనివాస్ రావు నేడు నామినేషన్

నల్గొండ : జిల్లా టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎస్.శ్రీనివాస్ రావు నేడు నామినేషన్ వేయనున్నారు. 

10:24 - December 9, 2015

రాష్ట్రంలో విచ్చలవిడిగా విక్రయిస్తున్న మద్యం కొనుగోల్లను నియంత్రించాలని వక్తలు సూచించారు. ప్రభుత్వ విధానాల వల్లే మద్యం ఏరులైపారుతోందని విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో, విశ్లేషకుడు నడింపల్లి సీతారామరాజు, సీఐటీయూ నాయకురాలు పుణ్యవతి.. పుణ్యవతి, వైసిపి నేత మధు మోహన్ రెడ్డి, టిడిపి అధికార ప్రతినిధి శ్రీరాములు పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారడానికి చంద్రబాబు విధానాలే కారణమని ఆరోపించారు. విజయవాడలో కల్తీ మద్యం ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలిపారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని పేర్కొన్నారు..

 

 

 

10:13 - December 9, 2015

హైదరాబాద్ : ఏపీలో కరవు ప్రభావిత ప్రాంతాలతో పాటు.. వర్షాలు వరదలతో దెబ్బతిన్న మూడు జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తాయి. ఈ బృందాలు.. రెండుగా విడిపోయి.. బుధ, గురు, శుక్ర వారాల్లో కరవు, వర్ష పీడిత ప్రాంతాల్లో పర్యటిస్తాయి. శుక్రవారం నాడు విజయవాడలో ప్రభుత్వ అధికారులతో ఈ బృందాలు సమావేశమవుతాయి. అనంతరం సీఎం చంద్రబాబుతోనూ కమిటీ సభ్యులు భేటీ అవుతారు. 
వర్షాల కారణంగా రూ. 3,760 కోట్ల నష్టం
రాష్ట్రంలోని 359 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించిన ప్రభుత్వం.. ఇటీవలి వర్షాల కారణంగా 3,760 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని లెక్క గట్టింది. నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల్లో వరదల వల్ల భారీ నష్టం ఏర్పడిందని.. 54 మంది చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వం నివేదికను రూపొందించింది. తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ఇవ్వాలని ఏపీ సర్కారు.. కేంద్రాన్ని కోరుతోంది.
వరద నష్టం, కరవు పరిస్థితులపై నివేదిక 
కరవు బృందాలు రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటిస్తాయి. వరద నష్టం, కరవు పరిస్థితులపై ఈ బృందాలు అందించే నివేదిక ఆధారంగా.. ఏపీ సర్కారుకు కేంద్రం నుంచి ఎంత సాయం అందుతుందన్నది తేలనుంది.

 

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

చెన్నై : తమిళనాడులోని కొట్టివాక్కం వద్ద నీటి గుంటలో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తల్లి, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

నేడు పాక్ ప్రధానితో సుష్మాస్వరాజ్ భేటీ...

ఇస్లామాబాద్ : భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ నేడు పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. 

08:48 - December 9, 2015

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కొత్తకొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఆయారాం గయారాం కల్చర్ పెరుగుతోంది. మరోవైపు, మద్యం, ఇసుక వ్యాపారాలలో మునిగితేలుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది.
పార్లమెంటరీ వ్యవస్థలో రాజకీయ పార్టీలే కీలకం
పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థ ఔన్నత్యం రాజకీయ పార్టీల మీద ఆధారపడి వుంటుంది. రాజకీయ పార్టీలు, నాయకులు ఎంత ఉన్నతంగా ఆలోచించి, ఎంత హుందాగా ప్రవర్తిస్తే ప్రజాస్వామిక వ్యవస్థ అంతగా పరిఢవిల్లుతుంది. మన దేశంలో జాతీయోద్యమకాలంలోనూ, ఆ తర్వాత జరిగిన అనేక ప్రజాస్వామిక ఉద్యమాలలోనూ క్రియాశీల పాత్ర పోషించిన నాయకత్వం ఉన్నత విలువల ప్రతిష్టాపనకు క్రుషి చేసింది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసేవారు. అయితే, దురద్రుష్టవశాత్తు ఇవాళ రాజకీయాల్లో విలువలు, నీతి నియమాలు మాయమవుతున్నాయి. సిద్ధాంతాల పట్టింపు కనిపించడం లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం, గెలుపు కోసం విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, అన్ని రకాల అడ్డదారులు తొక్కడం, ఏదో రకంగా గెలవడం, గెలిచి నాలుగు చేతులా సంపాదించుకోవడమే నేటి రాజకీయంగా మారుతోంది. కొంతమంది నేతలు రాజకీయాలను వ్యాపారంగా మారుస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. నేరుగానో, చాటుగానో మద్యం, ఇసుక వ్యాపారాలతో అనుబంధాలు పెనవేసుకోవడమే కాకుండా వాటిని సమర్ధించుకునేందుకు కూడా కొంతమంది నేతలు వెనకాడడం లేదు. చివరకు కల్తీ మద్యం అమ్మే స్థాయికి రాజకీయ నేతలు దిగజారుతున్నారు.
పార్టీ ఫిరాయింపుల జోరు
గత కొంతకాలంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపుల జోరు పెరిగింది. ఒక పార్టీ టిక్కెట్ మీద గెలిచి, కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలుపుతున్న తీరును తెలుగు ప్రజలు చూస్తూనే వున్నారు. నిన్న మొన్నటి దాకా ప్రత్యర్థి పార్టీల అధినేతలను నోరారా తిట్టిపోసినవారే ఇప్పుడు అదే అధినేతల పంచన చేరి, జై కొడుతున్నారు.
పొలిటీషియన్స్ కప్పదాట్ల వ్యవహారం
ఎస్ పీ వై రెడ్డి, కొత్తపల్లి గీత, తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల క్రిష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, రెడ్యానాయక్, నేతి విద్యాసాగర్, యాదవరెడ్డి, రాజేశ్వరరావు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన ధర్మపురి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ఆనం బ్రదర్స్ లాంటివారు ప్రత్యర్థి పార్టీలలో ఒదిగిపోతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక హైదరాబాద్ లో దానం నాగేందర్ ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తీసిపోని రీతిలో సాగింది. వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న యావతో అధికార పార్టీలు, అధికార పార్టీ అండదండలతో వ్యవహారాలు చక్కదిద్దుకోవాలన్న కాంక్షతో మరికొందరు, తమ సంతానానికి చక్కటి కెరీర్ అందించాలన్న ముందుచూపుతో ఇంకొందరు పొలిటీషియన్స్ సాగిస్తున్న కప్పదాట్ల వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ముందు ముందు ఇంకెన్ని ఆశ్చర్యకర పరిణామాలను చూడాల్సి వస్తుందో చెప్పలేం. రాష్ట్రాభివృద్ధి కోసమంటూ ఇంకెందరు నాయకులు జంప్ చేస్తారో ఊహించలేం. అయితే, తాము అధికార పార్టీలలో వుండి కీలక పదవులు అనుభవించిన రోజుల్లో రాష్ట్రాభివృద్ధికీ, దేశాభివృద్ధికీ చేసిందేమిటన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది.
బలాన్నీ పెంచుకునేందుకు అధికార పార్టీలు వ్యూహరచన
నిజానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్లకుపైగా సమయముంది. ఎమ్మెల్సీ ఎన్నికలు, కొన్ని చోట్ల జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వాలను మార్చేవికావు. అయిన్నప్పటికీ, బలాన్నీ బలగాన్నీ పెంచుకునేందుకు రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు చేస్తున్న వ్యూహరచన వివాదస్పదమవుతోంది. ప్రత్యర్థి పార్టీలను ఖాళీ చేయించడం ద్వారా, స్థానికంగా బలమైనవారిని తమ వైపు తిప్పుకోవడం ద్వారా అధికారాన్ని సుస్థిరం చేసుకోవచ్చన్న అభిప్రాయమేదో అధికార పార్టీలలో వున్నట్టు కనిపిస్తోంది. అయితే, పార్టీలు, నేతలు చేస్తున్న విన్యాసాలు రాజకీయ వ్యవస్థ మీదే చులకన భావం కలిగిస్తున్నాయి. ఈ పరిణామం పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థకు ఏ మాత్రం మంచిదికాదు. రాజకీయ వ్యవస్థ , దాని నాయకత్వం పాదుకొల్పే విలువలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయన్న విషయాన్ని ఎవరూ విస్మరించకూడదు. 

08:35 - December 9, 2015

ప్రస్తుత ఎన్నికల విధానం మారాలని .. దామాషా పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎథిక్స్ కమిటీ చైర్మన్ శర్మ అన్నారు. పార్టీ పిరాయింపులు అనే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'రాజకీయాల్లో విలువలు మాయమవుతున్నాయి. ఒకప్పుడు హర్యానా లాంటి రాష్ట్రాల్లో రాజ్యమేలిన ఆయారాం గయారం సంస్కృతి ఇప్పుడు తెలుగు నేలను కూడా సోకింది. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో వుంటారో అర్థం కాని పరిస్థితి. మరోవైపు అనైతిక వ్యాపారాల్లో సైతం రాజకీయ నేతల ప్రాబల్యం పెరుగుతోంది. ఓట్ల కోసం బేరసారాలు సాగించే అనైతిక చర్యల్లో చిక్కుకుంటున్నారు? ఈ పరిస్థితికి కారణం ఏమిటి? రాజకీయాల్లో విలువలు ఎందుకు ఇంతగా దిగజారుతున్నాయి? రాజకీయాల్లో విలువల పతనం సమాజం మీద, ప్రజాస్వామిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?' ఇలాంటి అంశాలపై శర్మ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

08:11 - December 9, 2015

కృష్ణా : విజయవాడ కల్తీ మద్యం ఘటన తర్వాత ఏపీలో సంపూర్ణ మద్య నిషేధం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్రలో మద్యంతోపాటు, కల్తీమద్యం, ఛీప్‌ లిక్కర్‌ అమ్మకాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. అక్రమార్కుల వ్యాపారం మూడు పువ్వులు,..ఆరు కాయలు.. అన్న విధంగా సాగుతోంది. మద్యం మాఫియా స్వార్ధానికి అమాయకులు బలైపోతున్న తరుణంలో సంపూర్ణ మద్య నిషేధం డిమాండ్‌ను వైసీపీ ముందుకు తీసుకొస్తోంది.
కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం
విజయవాడ కల్తీ మద్యం ఘటన రాజకీయ పార్టీలను కొత్త ఆలోచనల్లోకి నెట్టింది. వైసీపీ ఈ విషయంలో ముందు ఉంది. మద్యాన్ని ఆదాయ వనరుగా భావిస్తున్న పాలకులు.. ఈ వ్యాపారాన్ని ఎప్పటికప్పడు మరింత ప్రోత్సహిస్తున్నారు. వైన్‌ షాపులను అనుబంధంగా బెల్ట్ షాపులు, పర్మిట్‌ రూములకు పర్మిషన్‌ ఇచ్చారు. ఛీప్‌లిక్కర్‌, కల్తీ మద్యంతో అక్రమార్కులు ప్రజల జీవితాలతో చెలగాటమాడతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ సంపూర్ణ మద్య నిషేధం డిమాండ్‌ను ముందుకు తెచ్చింది.
సారా నిషేధించిన కోట్ల విజయభాస్కర్‌రెడ్డి
ఏపీలో సంపూర్ణ మద్య నిషేధం డిమాండ్‌కు చాలా ఘన చరిత్ర ఉంది. కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో సారా నిషేధించారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి టీడీపీ అధినేత ఎన్టీఆర్‌ సంపూర్ణ మద్య నిషేధం అంశం ముందుకు తెచ్చారు. ఎన్టీఆర్‌ అధికారం కోల్పోయిన తర్వాత 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు... సంపూర్ణ మద్య నిషేధం అమలు చేశారు. అయితే ఇది ఆచరణ సాధ్యం కాకపోవడంతో దశల వారీగా తొలగించారు. మొదట ఆరోగ్య సమస్యలతో బాధపడున్న వారికోసం డాక్టర్ల సిఫారసుతో పర్మిట్ల రూపంలో మద్యం విక్రయించారు. అ తర్వాత అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వాలు మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా భావించడంతోనే సంపూర్ణ మద్య నిషేధం అమలు సాధ్యం కావడంలేదన్న విమర్శలున్నాయి.
సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలి : జగన్
తెలంగాణలో కల్తీ కల్లు కొంతమందిని కాటేస్తే, విజయవాడలో కల్తీ మద్యం ఐదుగుర్ని బలితీసుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ సంపూర్ణ మద్య నిషేధం అంశాన్ని లేవనెత్తింది. విజయవాడలో కల్తీ మద్యం బాధితులను, వారి కుటుంబాలకు పరామర్శించిన ఆ పార్టీ అధినేత జగన్‌... రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలని చంద్రబాబు సర్కార్‌ను డిమాండ్‌ చేశారు. ఈ ప్రభుత్వం చేయకపోతే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని ప్రకటించారు.
గుజరాత్ లో మద్య నిషేదం
గుజరాత్‌లో మద్య నిషేధం అమలవుతున్న విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. బీహార్‌లో కొత్తగా అధికారంలోని వచ్చిన మహాకూటమి ప్రభుత్వం వచ్చే ఏప్రిల్‌ నుంచి మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకోవాలని పార్టీ నేతలు కోరుతున్నారు. ఈనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. విజయవాడ కల్తీ మద్యం ఘనతోపాటు, సంపూర్ణ మద్య నిషేధం డిమాండ్‌ సాధన కోసం సమావేశాలను స్తంభింపచేయాలని వైసీపీ నిర్ణయించింది.

 

 

5 ఎమ్మెల్సీ స్థానాలకు టిఆర్ ఎస్ అభ్యర్థుల ప్రకటన

హైదరాబాద్‌ : 5 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో కసిరెడ్డి నారాయణరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి. రంగారెడ్డి జిల్లాలో పట్నం నరేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు. వరంగల్‌ జిల్లాలో కొండా మురళిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించింది.

కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్‌ సీఐ సస్పెన్షన్

కృష్ణా : విజయవాడ కల్తీ మద్యం ఘటనలో ఎక్సైజ్‌ సీఐపై వేటు పడింది. ఎక్సైజ్‌ సీఐ వెంకటరమణను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంకా మరికొందరిపై వేటుపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

07:57 - December 9, 2015

కృష్ణా : విజయవాడ కల్తీ మద్యం కేసులో పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాంగ్రెస్‌ నేత మల్లాది విష్ణు సహా 9 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేశారు. బార్లు, మద్యం దుకాణాల్లో ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.
కల్తీ మద్యం వల్లే మరణించారని ప్రాథమికం నిర్ధారణ 
కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి దేహాలకు శవపరీక్షలు పూర్తయ్యాయి. మద్యంలో కల్తీ వల్లే మరణించారని ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి స్థాయి నివేదిక కోసం కళ్లు, కాలేయం, మూత్ర పిండాలు, ఇతర కీలక భాగాలను తుదపరి పరీక్షలకు పంపారు. గురువారానికి పూర్తి స్థాయి నివేదిక అందే అవకాశం ఉందని భావిస్తున్నారు. మద్యంలో మిథైల్‌ ఆల్కహాల్‌ కలవడం వల్లే మరణాలు సంభవించాయని తేలింది. మిథైల్‌ ఆల్కహాల్‌ రక్తప్రసరణపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రక్తకణాలు పనిచేయకుండా చేస్తుంది. దీంతో కల్తీ మద్యం తాగిన కార్మికులు మరణించారని పోస్టుమార్టం చేసిన డాక్లర్టు చెబుతున్నారు. కల్తీ మద్యం తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 15 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని బాధితులకు వైద్యం చేస్తున్న డాక్టర్లు చెబుతున్నారు. మిథైల్‌ ఆల్కహాల్‌ పేగులు, నరాలు, ఇతర కీలక భాగాలపై ప్రభావం చూపడంతో కోలుకోవడానికి సమయం పడుతుందంటున్నారు.
ఎఫ్‌ఐఆర్‌లో ఏ-9 నిందితుడగా మల్లాది విష్ణు
మరోవైపు కల్తీ మద్యం కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఈ కేసులో ఏ-9 నిందితుడిగా చేర్చారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కోర్టుకు నివేదించారు. ఐదుగురి మృతికి కారణమైన స్వర్ణ బార్‌తో తనకు ఏ సంభంధంలేదని విష్ణు బుకాయిస్తున్నా..దీనిలో వాస్తవంలేదని దర్యాప్తులో తేలింది. మల్లాది విష్ణుకు ఈ బార్‌లో వాటా ఉందనడానికి సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన విష్ణు..2014లో ఇదే స్థానం నుంచి ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఆయన సమర్పించిన ఎన్నికల అఫడవిట్‌లో స్వర్ణబార్‌లో వాటా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. కల్తీ మద్యం కేసులో ఇది కీలక ఆధారంగా మారింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులు ఎంతటివారైనా విడిచిపెట్టబోమని డీజీపీ....జేవీ రాముడు చెబుతున్నారు. స్వర్ణ బార్‌లో మద్యం కార్మికులు తాగిన మద్యం బ్యాచ్‌కి సంబంధించి ఎక్కడా ఫిర్యాదులు రాలేదని ఎక్సైజ్‌ అధికారులు నిర్ధారించారు. దీంతో ఈ బార్‌లోనే కల్తీ జరిగిందన్న విషయంలో స్పష్ఠమవుతోందని ఎక్సైజ్‌ కమిషనర్‌ మీనా చెబుతున్నారు.
మామూళ్ల మత్తులో జోగుతూ విధి నిర్వహణలో అలసత్వం
విజయవాడ కల్తీ మద్యం ఘటన తర్వాత కళ్లు తెరిచికల్తీ మద్యం కేసులో కొత్త అంశాలున ఎక్సైజ్‌ అధికారులు... రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, వైన్‌ షాపుల్లో తనిఖీలు చేస్తూ, సోదాలు నిర్వహిస్తున్నారు. మద్యం నమూనాలు సేకరించి పరీక్షలకు పంపుతున్నారు. స్వర్ణబార్‌లో కల్తీ మద్యం తాగి ఐదుగురు మరణించిన తర్వాత ఎక్సైజ్‌ అధికారుల్లో హడావుడి ప్రారంభమయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌లో బార్‌ నడుస్తున్న విషయం తెలిసికూడా కళ్లుమూసుకున్న ఎక్సైజ్‌ అధికారులు... ఇప్పుడు హడావుడి చేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. మామూళ్ల మత్తులో జోగుతూ మొదటి నుంచి నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులు... ఇక నుంచైనా నిబంనధనలు పాటించని బార్లు, వైన్‌ షాపులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కల్తీ మద్యానికి ఇంకెవరు బలికాకుండా అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 

07:50 - December 9, 2015

హైదరాబాద్ : మండలి ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ సామాజిక న్యాయాన్ని పాటించలేదా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. గెలుపు గుర్రాలంటూ మండలికి పోటీ చేసే అభ్యర్థుల్లో సింహభాగం మాజీలకే గులాబీ బాస్ పెద్ద పీఠ వేశారు. మహిళలకు, ఎస్సీలకు పోటీ చేసేందుకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు.
ముగ్గురు బీసీ నేతలకు అవకాశం
తెలంగాణా శాసనమండలి ఎన్నికల్లో బీటీ బ్యాచ్‌కే పెద్ద పీఠ దక్కింది. పార్టీ తరపున పోటీ చేసేందుకు ప్రకటించిన నేతల్లో మెజార్టీ నేతలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి వలస వచ్చిన వారే ఉన్నారు. వీరిలో ఒక్కరిద్దరు తప్ప వలస నేతలకే మరోసారి ప్రాధాన్యం కల్పించారు గులాబీబాస్. రెండో జాబితాలో మహిళలు, దళితులకు స్థానం దక్కుతుందని అంచనా వేసినా..అది సాధ్యం కాలేదు. ముగ్గురు బీసీ నేతలకు మాత్రం పోటీ చేసేందుకు గులాబి అధినేత కేసీఆర్‌ అవకాశం కల్పించారు.
మరోసారి మండలి సభ్యులుగా అవకాశం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు తర్వాత భారీ ఎత్తున కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన మండలి సభ్యులను గులాబి పార్టీ చేర్చుకుంది. పార్టీలో చేరుతున్న సందర్భంగా మరోసారి మండలి సభ్యులుగా అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో..దాదాపు అందరికీ మండలికి ఎన్నికయ్యేందుకు ముఖ్యమంత్రి లైన్‌ క్లియర్ చేశారు. పార్టీలో పోటీ తీవ్రంగా ఉన్నా అన్ని జిల్లాల్లో మాజీలకే పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించారు.
అభ్యర్థుల జాబితాను ఓసారి పరిశీలిస్తే
టిఆర్ ఎస్ అభ్యర్థుల జాబితాను ఓసారి పరిశీలిస్తే గులాబీ బాస్ సామాజిక న్యాయం ఎంతలా పాటించారో అర్థమవుతుంది. మహబూబ్‌నగర్‌ నుంచి మాజీ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, మరో వ్యాపారవేత్త కసిరెడ్డి నారాయణరెడ్డిలకు అవకాశం కల్పించారు. ఇక రంగారెడ్డి నుంచి మాజీ టిడిపి ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, మెదక్‌-భూపాల్ రెడ్డి, నిజామాబాద్-డాక్టర్ భూపతి రెడ్డి, ఆదిలాబాద్- పురాణం సతీష్, వరంగల్- కొండా మురళి , కరీంనగర్- భానుప్రసాద్‌రావు, నారదాసు లక్ష్మణ్ రావ్, నల్గొండ- తేరా చిన్నపరెడ్డి, ఖమ్మం నుంచి మాజీ టిడిపి ఎమ్మెల్సీ చలసాని లక్ష్మినారాయణకు అవకాశం ఇచ్చారు.
రెడ్డి సామాజిక వర్గానికే పెద్ద పీట
అభ్యర్థుల కేటాయింపుల్లో సామాజిక వర్గాలను పరిశీలిస్తే మరోసారి రెడ్డి సామాజిక వర్గానికే పెద్ద పీట వేశారు కేసీఆర్‌. ముగ్గురు బీసీలకు పోటీ చేసే అవకాశం పార్టీ కల్పించారు. మొత్తం 12 స్థానాల్లో ఒక్క స్థానానికి కూడా దళితులకు, మహిళలలకు కేటాయించకపోవడం పార్టీలో చర్చనీయంశంగా మారింది. అయితే మొత్తం స్థానాలను గెలుచుకోవడం ఖాయమని ప్రభుత్వ సలహాదారు డి.శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. విపక్ష పార్టీలన్నీ ఏకమైనా తమ గెలుపును ఆపలేవన్నారు.
దళితులు, మహిళలకు చోటులేదు
అభ్యర్థుల ఎంపిక ఉత్కంఠ రేపినా ముందు నుంచి పార్టీలో ప్రచారంలో ఉన్న నేతలందరికీ పోటీ చేసేందుకు అవకాశం దక్కింది. వరంగల్‌లో పోటీ చేసేందుకు కొండా మురళి ఆసక్తి చూపలేదు. అయితే కొండా సురేఖకు మంత్రి పదవి కట్ట బెట్టే అవకాశాలు లేకపోవడంతో ఆయననే పోటీ చేసేందుకు గులాబీబాస్ ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు అవకాశం దక్కకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా..అధికార పార్టీ మాత్రం అవేమీ పట్టించుకోకుండా గెలుపు గుర్రాలకే అవకాశం కల్పిస్తోంది.

 

ఆర్టీసీ బస్సు బోల్తా

విశాఖ : జిల్లాలోని భీమిలీ మండలం మారికవలస వద్ద మంగళవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. తొలుత లారీని ఢీకొన్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మొత్తం 17 మంది గాయపడ్డారు.

కల్తీ మద్యం ఘటనలో తొమ్మిది మంది అరెస్టు

కృష్ణా : విజయవాడలో కల్తీ మద్యం కేసులో పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. స్వర్ణబార్‌ క్యాషియర్లు వెంకటేశ్వర్రావు, నాగేశ్వరరావు, మాలకొండా రెడ్డి ఇతర సిబ్బందిని అరెస్టు చేశారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

నేటి నుంచి బ్యాడ్మింటన్ ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్

ఢిల్లీ : నేటి నుంచి బ్యాడ్మింటన్ ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్ జరుగనున్నాయి. సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ లు బరిలో ఉన్నారు.  

నేడు కొల్లేటికోటలో కేంద్రబృందం పర్యటన

కృష్ణా : నేడు కృష్ణా, ప.గో జిల్లాల్లోని కొల్లేటికోటలో కేంద్ర బృందం పర్యటించనున్నారు. కొల్లేరు కాంటూరు కుదింపుపై అద్యయనం చేయనున్నారు. 

నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రి ఈటెల పర్యటన

కరీంనగర్ : మంత్రి ఈటెల రాజేందర్ నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గోనున్నారు. 

Don't Miss