Activities calendar

10 December 2015

22:11 - December 10, 2015

నగరానికి చేరుకున్న సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. 

చెన్నై వరదలు..రజనీ విరాళం రూ.10 కోట్లు..

చెన్నై : తమిళసూపర్‌స్టార్ రజనీకాంత్ చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. రజనీ వరదల్లో నిరాశ్రయులైన బాధితులకు భారీ మొత్తంలో రూ.10కోట్లు విరాళాన్ని ప్రకటించారు. 

రాజయ్య రిమాండ్ పొడగింపు...

వరంగల్: కోడలు మృతి కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ రాజయ్యకు వరంగల్ జిల్లా న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించింది. రాజయ్య సహా కుటుంబ సభ్యులకు బెయిల్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగించింది

21:28 - December 10, 2015

హైదరాబాద్ : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వంద రోజులు..! అవును ఆశా వర్కర్లు సాగిస్తున్న సమ్మె వందరోజులు పూర్తి చేసుకుంది. నిరవధికంగా మూడు నెలలకు పైబడి పోరాడుతున్నా.. పాలకలు పట్టించుకోక పోవడంతో.. రోజుకో తీరుగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. తమ సమ్మె వంద రోజులు పూర్తయిన సందర్భంగా.. వంద కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు.. ఆశాలు. ఆశా వర్కర్లు. సీఐటీయూ ఆధ్వర్యంలో.. రాష్ట్రం నలుమూలలా ర్యాలీలు.. పాదయాత్రలు చేపట్టారు. హైదరాబాద్‌లో బషీర్‌బాగ్‌ చౌరస్తా నుంచి సుందరయ్య పార్కువరకూ నిరసన ర్యాలీ చేశారు..

వరంగల్..మహబూబ్ నగర్ లో..
రంగల్‌ జిల్లాలోకూడా ఆశాల ఉద్యమం జోరుగా సాగుతోంది.. పాలకుర్తినుంచి నగరానికి పాదయాత్ర చేపట్టారు. కార్యకర్తలు.. ఈ కార్యక్రమంలో.. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి పాల్గొన్నారు.. మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో ఆశా వర్కర్ల పాదయాత్ర మొదలైంది.. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఇందులో పాల్గొన్నారు.. వందరోజులుగా దీక్ష చేస్తున్న కార్యకర్తల్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు రాఘవులు.. ఈ పాదయాత్ర జడ్చర్ల, షాద్ నగర్ మీదుగా ఈనెల 17న హైదరాబాద్ చేరుకుంటుంది..

మెదక్..కరీంనగర్ లో..
మెదక్‌ జిల్లా జహీరాబాద్‌లో వంద కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు.. కోట్ల బడ్జెట్‌ అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం... ఆశాలకు 5వేల రూపాయల జీతం ఇవ్వకపోవడం అన్యాయమని మండిపడ్డారు.. జహీరాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు ఎనిమిది రోజులపాటు ఈ యాత్ర చేయనున్నారు కార్యకర్తలు. కరీంనగర్‌ జిల్లాలో వంద రోజులు వంద కిలోమీటర్లంటూ ఆశాలు పాదయాత్ర చేపట్టారు.. సిరిసిల్లలో జరిగిన సభలో 4వందల మంది కార్యకర్తలు పాల్గొన్నారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. 

నిజామాబాద్..ఆదిలాబాద్ లో..
నిజామాబాద్‌ జిల్లాలోకూడా ఆశాలు నిరసన తెలిపారు.. పూలే విగ్రహానికి పూలమాలలు వేసిన సీఐటీయూ నేతలు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంనుంచి పాదయాత్ర మొదలుపెట్టారు..ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌, టీడీపీ పార్టీలు మద్దతు ప్రకటించాయి.. ఆదిలాబాద్‌ జిల్లాలోకూడా ఆశాల నిరసనలు కొనసాగుతున్నాయి.. కెరమెరినుంచి నగరంవరకూ వందమంది ఆశాలు వంద కిలోమీటర్ల పాదయాత్ర మొదలుపెట్టారు.. ఈ కార్యక్రమాన్ని సీపీఎం నేత సారంపల్లి మల్లారెడ్డి ప్రారంభించారు.

21:24 - December 10, 2015

మెదక్ : జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి జైలుశిక్ష పడింది. రెండున్నర ఏళ్ల జైలు శిక్ష, 8 వేల రూపాయల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్‌కోర్టు తీర్పు చెప్పింది. పటాన్‌చెరులోని ఓ కంపెనీ యాజమాన్యంపై దాడి చేశారని మహిపాల్‌రెడ్డిపై కేసు నమోదయ్యింది. ఈ కేసును విచారించిన కోర్టు..ఆయనకు రెండున్నర ఏళ్ల జైలు శిక్ష విధించింది. 

21:22 - December 10, 2015

ఢిల్లీ : కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన విహార యాత్రగా మారిందని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఎద్దేవా చేశారు. శీతాకాల సమావేశాలు నడుస్తున్న సమయంలో ఢిల్లీకి వచ్చిన కేసీఆర్‌.. వేడుకల్లో పాల్గొన్నారే తప్ప తెలంగాణలో వాస్తవ పరిస్థితులను కేంద్రానికి వివరించ లేదని ఆరోపించారు. మంచి జరిగితే పాలాభిషేకాలు చేయించుకున్న కేసీఆర్ నష్టం జరిగితే కేంద్రంపై మోపుతున్నారన్నారు. టీఆర్ఎస్ కు 12 మంది పార్లమెంట్ సభ్యులున్నా హైకోర్టు విభజన, ఉద్యోగుల విభజన తదితర సమస్యలపై పార్లమెంట్ ను స్తంభింప చేయడం లేదని తెలిపారు. 

21:21 - December 10, 2015

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ రెండు రోజుల్లో ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలపై చర్చించారు. తెలంగాణకు మరింత సాయం అందించాలని కోరారు. పనిలో పనిగా తాను నిర్వహిస్తున్న అయుత చండీ యాగానికి రావాలని ఇన్విటేషన్స్‌ కూడా అందించారు. ఐతే కేసీఆర్‌ టూర్‌పై ప్రతిపక్షాలు ఫైర్‌ అవుతున్నాయి. కేసీఆర్‌ గురువారం నాడు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను కలిశారు. 75వ జన్మదినాన్ని జరుపుకుంటున్న పవార్‌కు కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసీఆర్‌..తన పార్టీ ఎంపీలతో కలిసి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని కలిశారు. రాష్ట్రానికి మరిన్ని ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. సీఎం వినతికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి...ప్రతిపాదనలు పంపితే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విభజన చట్టంలోని అంశాలను ఇరువురూ చర్చించారు. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. అదే సమయంలో తాను నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి రావాలని కేసీఆర్‌ వెంకయ్యనాయుడిని ఆహ్వానించారు. దీనికీ వెంకయ్య సానుకూలంగా స్పందించారు. బుధవారం కేసీఆర్‌ జైట్లీ కుమార్తె వివాహ రిసెప్షన్‌లో పాల్గొన్నారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిని కలిసి..హైకోర్టు విభజనతో పాటు పలు అంశాలపై అరగంటసేపే చర్చించారు. గురువారం కూడా బిజి బిజిగా గడిపిన కేసీఆర్‌ సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ కు చేరుకున్నారు. 

21:18 - December 10, 2015

ఢిల్లీ : కృష్ణా జలాల కేటాయింపుల అంశంపై.. కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌ కాపీని క్షుణ్ణంగా అధ్యయనం చేశాకే తదుపరి కార్యాచరణను రూపొందిస్తామని తెలంగాణ ప్రభుత్వ నీటి పారుదల సలహాదారు విద్యాసాగర్‌ అన్నారు. ఈ అంశంపై కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ముందుకు వెళ్లాలని యోచిస్తున్నామన్నారు. 

21:17 - December 10, 2015

చిత్తూరు : కృష్ణా జలాల వివాదం రెండు రాష్ట్రాలకు సంబంధించినది కాదని...నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో నిర్వహించిన దిశా నిర్దేశ సదస్సులో సీఎం పాల్గొన్నారు. నీళ్లు రానప్పుడు ఉన్న నీళ్లనే దామాషా పద్ధతి ప్రకారం పంపిణీ చేయాలన్నారు. ఎగువున ఉన్న రాష్ట్రాలు కూడా మానవతా దృక్పథంలో వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. 

21:16 - December 10, 2015

హైదరాబాద్ : ఓపక్క ఉద్రిక్త పరిస్థితులు, ముందస్తు అరెస్ట్‌లు... మరోపక్క గోపూజలు, ఆందోళనకారుల నిరసనలు... ఉస్మానియా యూనివర్శిటీలో పోలీసుల పహారా, హైటెన్షన్‌ మధ్య బీఫ్‌ ఫెస్టివల్‌ కొనసాగింది. అనుకున్నంతగా పెద్దకూర పండుగ సక్సెస్‌ కాకపోయినా విద్యార్థులు మాత్రం ఫెస్టివల్‌ నిర్వహించడంలో పాక్షిక విజయం సాధించినట్లు.. ఆధారాలు నిరూపిస్తున్నాయి. పోలీసులు మాత్రం బీఫ్‌ ఫెస్టివల్‌ను విజయవంతంగా అడ్డుకున్నట్లు చెబుతున్నారు. గురువారం ఉదయం నుంచి పెద్ద కూర పండగ నిర్వహించేందుకు విద్యార్థులు విశ్వ ప్రయత్నాలు జరిపారు. అయితే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్న పోలీసులు బుధవారం రాత్రి నుంచే ఉస్మానియాలో భద్రతా చర్యలు మొదలుపెట్టారు. భారీగా పోలీసులను మోహరించిన ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే విద్యార్థులు నిరసనలు చేపట్టడం, ఫెస్టివల్‌ను అడ్డుకుంటామంటూ కొందరు రంగంలోకి దిగడంతో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. పలువురు బీఫ్‌ ఫెస్టివల్ నిర్వాహకులను పోలీసులు ముందస్తు చర్యగా అదుపులోకి తీసుకున్నారు.

రాజాసింగ్ అరెస్టు...
బీఫ్‌ ఫెస్టివల్‌ను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కాషాయ దళాలు తమ వ్యూహాలు తాము రచించుకున్నాయి. బిజెపి, శివసేన, భజరంగ్‌దళ్‌, గోరక్షక్‌దళ్ సమితి ప్రతిచర్యలకు దిగాయి. ఆయా సంఘాల కార్యకర్తలు యూనివర్శిటీలోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఓయూలోను, చుట్టుపక్కల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. యూనివర్శిటీలోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లతో గోడలు కట్టారు. విద్యార్థుల హాస్టళ్ల చుట్టూ రక్షకదళాలను మోహరించి ఎవరూ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

కొంతమేర సఫలం..
పెద్దకూర పండగ నిర్వహిస్తామంటూ శపథం చేసిన విద్యార్థులు ఆ దిశగా కొంతమేర సఫలమైనట్లే కనిపిస్తోంది. ఫెస్టివల్ చేశామంటూ కొన్ని ఫొటోలతోపాటు, వీడియోలు సోషల్‌ మీడియాలో ప్రవేశపెట్టారు. ఇదే సమయంలో కొందరు నిరసనకారులు శివం రోడ్డు వద్ద ఓ ఆర్టీసీ బస్‌పై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో సాయంత్రం వరకు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. బీఫ్‌ ఫెస్టివల్‌కు మద్దతు తెలపడానికి వచ్చిన ప్రొఫెసర్‌ పిఎల్‌ విశ్వేశ్వరరావు, పివోడబ్ల్యు సంధ్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎవరి ఆహారపు అలవాట్ల మేరకు వాళ్లు పండుగ చేసుకుంటే తప్పేంటని ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు ప్రశ్నించారు.

కొనసాగుతున్న పోలీసు పహారా..
అయితే యూనివర్శిటీ చాలా కూల్‌గా ఉందని విద్యార్థులు ఎవరి చదువులు వారు చదువుకున్నారని చెప్పారు. కాగా ఫెస్టివల్‌ నిర్వహించినట్లు నిర్వాహకులు ప్రసార మాధ్యమాల్లో విజువల్స్‌ అప్‌లోడ్‌ చేయగా వాటిని ఆధారంగా చేసుకుని పోలీసులు ఆయా వ్యక్తులు ఎవరో గుర్తించే పనిలోపడ్డారు. అవసరమైతే వారిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకే తాము నడుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా బీఫ్‌ ఫెస్టివల్‌ను అడ్డుకోవడంలో పోలీసులు సక్సెస్‌ అయ్యారు. ప్రస్తుతం ఓయూలో పోలీసులు పహారా కొనసాగుతోంది.  

అంబర్ పేట ఎమ్మార్వో నివాసంలో ఏసీబీ తనిఖీలు..

హైదరాబాద్ : అంబర్ పేట ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రూ.4లక్షలు తీసుకుంటున్న ఎమ్మార్వో సంధ్యారాణి సోదరుడిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వెంటనే సంధ్యారాణి ఇంట్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఎమ్మార్వో సంధ్యారాణి అందుబాటులో లేకుండా పోయారు.

 

 

రైల్వే ఎస్పీ జనార్ధన్ పై లైంగిక కేసు..

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ జనార్ధన్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మహిళా ఉద్యోగిని వేధిస్తున్నారని జనార్దన్ పై అభియోగం నమోదైంది. హైకోర్టు ఆదేశాలతో రైల్వే పోలీసులు ఐపీసీ 354, 506, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 

వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించింది - జయలిలిత..

చెన్నై : నగరంలో సంభవించిన భారీ వర్షాలు..వరదలను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిందని తమిళనాడు సీఎం జయలిత వెల్లడించారు. 

అప్రూవర్ గా మారుతానన్న హెడ్లీ..

ముంబై : 26/11 ముంబై పేలుళ్ల కేసులో హెడ్లీ అప్రూవర్ గా మారేందుకు సిద్ధమయ్యాడు. కోర్టు శిక్షను రద్దు చేస్తే అప్రూవర్ గా మారుతానని షరతు విధించాడు. పేలుళ్ల ఘటనకు సంబంధించిన వాస్తవాలు వెళ్లడిస్తానని తెలిపాడు.

 

20:35 - December 10, 2015

దాయాది దేశాల మధ్య మరో ప్రస్థానానికి నాంది పడుతోంది. దౌత్య బంధం మరో శిఖరానికి చేరుకొనేందుకు మార్గం సుగమమవుతోంది. సరిహద్దుల గొడవలు సద్దుమణిగేందుకు..తుపాకుల తూటాల ఘర్షణ చల్లపరిచేందుకు..ఉగ్ర భుజంగాల కోరలు పీకేందుకు ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహ మజిలికి అడుగు పడుతోంది. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పాక్ పర్యటనతో ఇరు దేశాల మధ్య నలుగుతున్న సమస్యల పరిష్కారానికి వేదిక సిద్ధమౌతోంది. సుష్మా పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధం బలపడుతుందా ? చర్చలే పరిష్కార దిశగా భారత్ - పాక్ పయనిస్తాయా ? అనే అంశంపై వైడాంగిల్ ప్రత్యేక కథనం..

20:30 - December 10, 2015

స్థానిక సంస్థల ఎన్నికల్లో కొండా మురళి ఏకగ్రీవ ఎన్నిక...లంకల పుట్టినోళ్లంత రాజులే..24 ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన..వంద రోజులకు చేరిన ఆశా వర్కర్ల ఆందోళన.. ఏపీ రాష్ట్రంలో నిబంధనపత్రాలు లేకుంటే గృహాలకు నో పర్మిషన్..తెలంగాణలో కాజీపేట రైల్వే వేగన్ ఫ్యాక్టరీకి రూ.వేయి కేటాయింపు..నాగార్జున సాగర్ కు షష్టిపూర్తి..ప్రధాని మోడీ ఫేస్ బుక్ లో మొదటి స్థానం..హర్యానా రాష్ట్రంలో చదువు లేకపోతే నో నామినేషన్..లపై తనదైన శైలిలో 'మల్లన్న' ముచ్చట్లు వినిపించారు. 

మల్లన్న ముచ్చట్లు Part-2 : 

అంబర్ పేట ఎమ్మార్వో ఆఫీసుపై ఏసీబీ దాడులు..

హైదరాబాద్ : అంబర్ పేట ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వివిధ విభాగాల రికార్డులను అధికారులు పరిశీలించారు. 

జౌళి శాఖ మంత్రితో దత్తాత్రేయ..

ఢిల్లీ : కేంద్ర జౌళి శాఖ మంత్రిని కేంద్ర మంత్రి దత్తాత్రేయ కలిశారు. వరంగల్ టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని, రాష్ట్రం ప్రభుత్వం నుండి ప్రతిపాదనలు వస్తే మూడు వేల ఎకరాల్లో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ హామీనిచ్చినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పత్తి కొనుగోలు చేసేలా సీసీఐని ఆదేశించాలని కేంద్రమంత్రిని కోరినట్లు తెలిపారు. పత్తి క్వింటాల్ కు మద్దతు ధర రూ.4100 ఇవ్వాలని దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. పత్తి రైతులు ఎక్కువగా ఉన్న కొలనుపాక గ్రామంలో కో - ఆపరేటివ్ బిన్నింగ్ మిల్లును ఏర్పాటు చేస్తామన్నారు. 

కేసీఆర్ పర్యటన విహార యాత్రలా ఉంది - పొన్నం..

ఢిల్లీ : కేసీఆర్ పర్యటన విహార యాత్రలా ఉందని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేసీఆర్ రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను కేంద్రానికి వివరించకుండా వేడుకల్లో పాల్గొంటున్నారని, మంచి జరిగితే పాలాభిషేకాలు చేయించుకున్న కేసీఆర్ నష్టం జరిగితే కేంద్రంపై మోపుతున్నారన్నారు. టీఆర్ఎస్ కు 12 మంది పార్లమెంట్ సభ్యులున్నా హైకోర్టు విభజన, ఉద్యోగుల విభజన తదితర సమస్యలపై పార్లమెంట్ ను స్తంభింప చేయడం లేదని తెలిపారు. 

హుస్నాబాద్ లో ప్రేమ జంట ఆత్మహత్య...

కరీంనగర్ : హుస్నాబాద్ (మం) మహ్మదాపురంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పురుగులు మందు తాగి శ్రీధర్..ఉరి వేసుకుని సంధ్యలు ఆత్మహత్య చేసుకున్నారు. 

19:29 - December 10, 2015

విజయవాడ : చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఉద్యోగాలేవీ ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగులను పక్కకి తొలగించే ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు 7 వేల మంది గృహనిర్మాణ వర్క్‌ఇన్‌స్పెక్టర్లను తొలగించారు. 2 వేల మంది ఉపాధి హామీ కాంట్రాక్టు కార్మికులను తీసేశారు. 15 వేల మంది ఆదర్శ రైతులతోపాటు వైద్య ఆరోగ్య శాఖలోని 15 వందల మంది కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభుత్వం వేటు వేసింది. రాష్ట్రం విడిపోక ముందు 16 వేల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఏపీపీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎన్నికలు రావడం, రాష్ట్రం విడిపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. ఒక వైపు కరవు మరో వైపు ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో యువత కొట్టుమిట్టాడుతోంది.

సంతోషంగా లేని నిరుద్యోగులు..
ఇక డీఎస్సీ సంగతి చూస్తే అక్కడా నిరుద్యోగులకు సంతోషం లేకుండా పోయింది. చంద్రబాబు పవర్‌లోకొచ్చిన వెంటనే 10,313 పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఇక భర్తీయే ఆలస్యం అని ఆనందిస్తుంటే కీలో తప్పులు, కోర్టులో కేసులంటూ నాన్చుతున్నారు. అప్పుడప్పుడు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చూస్తున్నాం చేస్తున్నామంటూ ప్రకటనలిస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలై ఏడాది గడచిపోయింది. పరీక్ష జరిగి ఆరునెలలైంది. నెలలోపే మార్కులను ప్రకటించారు. కానీ ర్యాంకులు ఇవ్వలేదు. ఇంతవరకు భర్తీ జరగలేదు. టిడిపి అధికారంలోకొచ్చాక విడుదలైన ఈ ఒక్క నోటిఫికేషన్ తర్వాత మరేదీ విడుదలవ్వలేదు. ప్రక్రియ అంతా పూర్తైనా డీఎస్సీ ఎందుకు అలా నీరుగారిపోతోంది.? సమస్యను పరిష్కరించడానికి వీలున్నా ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోంది? ఇవీ అభ్యర్థుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు.

719 కేసులు...
డీఎస్సీ నిర్వహణలో చోటు చేసుకున్న లోపాలపై దాదాపు 719 కేసులు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, హైకోర్టుల్లో దాఖలయ్యాయి. జీవో 38పై హైకోర్టులో ఉన్న కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లోని కేసులను మినహాయించి తక్కిన పోస్టులను భర్తీ చేసుకోవడానికి దీంతో ఆస్కారమేర్పడింది. ట్రిబ్యునల్‌లో కేసులున్నా స్టే ఉత్తర్వులు లేనందున నియామకాలకు ఎలాంటి ఆటంకమూ లేదు. 5 కేసులు మినహా అన్ని కేసుల్లో విచారణ ముగిసింది. అయితే ఆ 5 కేసుల పరిష్కారానికి ప్రభుత్వం అనుకున్నంత స్థాయిలో ఆసక్తి కనబర్చడం లేదు. ఇదంతా ఇలా ఉంటే ఉద్యోగులకు షాకింగ్ చర్యలా 16 వేల టీచర్ పోస్టులను రేషనలైజేషన్ పేరుతో తొలగించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఆలస్యం చేసేందుకు ప్రయత్నాలు ?
టెట్‌ను, టెర్ట్‌ను కలిపి నిర్వహించే జీవో 38ని సవాల్ చేస్తూ అనంతపురానికి చెందిన ఓ అభ్యర్థి కోర్టుకెళ్లారు. ఈ విషయంలో కోర్టు తీర్పు ప్రభుత్వానికే అనుకూలంగా వచ్చింది. అయితే ఆ కాపీని ట్రిబ్యునల్‌లో సమర్పించి కేసును పరిష్కరింపచేయడానికి వీలున్నా ప్రభుత్వంలో స్పందన లేదు. విశాఖపట్నానికి చెందిన ఓ అభ్యర్థి ఫ్రెష్ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించలేదని డీఈవో ఆయన దరఖాస్తును తిరస్కరించడంపై ట్రిబ్యునల్‌లో కేసు దాఖలైంది. అనంతపురానికి చెందిన అభ్యర్థి ఆధార్, రేషన్‌కార్డు, రెసిడెన్స్ సర్టిఫికెట్ ద్వారా స్థానికతను క్లెయిమ్ చేయగా ఆ దరఖాస్తును డీఈవో తిరస్కరించారు. దీనిపైనా ట్రిబ్యునల్‌లో కేసు దాఖలైంది. దరఖాస్తును తిరస్కరించడంపై అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన అభ్యర్థులు కేసులు వేశారు. వీటిలో ఒకదాని తీర్పు డిసెంబర్‌ 8కి వాయిదా పడగా మిగతా రెండింటి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఇవికాక మరో రెండు కేసులూ పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం తమ న్యాయవాదుల ద్వారా వీటికి సత్వర పరిష్కారం చూపించే మార్గముంది. అయినా సర్కార్‌ తాత్సారం చేస్తూ వెళ్లడం వెనుక డీఎస్సీని సాధ్యమైనంతమేర ఆలస్యం చేయడానికే ప్రయత్నిస్తున్నారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

19:26 - December 10, 2015

విజయవాడ : మేమొస్తే మీకు జాబులే జాబులు.. ఇంటికో ఉద్యోగమిచ్చి మీ గృహాల్లో ఆనందం నింపుతాను... అంటూ ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు గారు మహత్తరమైన హామీ ఇచ్చారు. బాబొస్తే జాబొస్తుందన్న టీడీపీ నేతల వాగ్దానాలతో.. నిరుద్యోగులందరూ ఆపార్టీకే జై కొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క డీఎస్సీ మాత్రమే నిర్వహించి చేతులు దులిపేసుకున్నారు. కోర్టు కేసుల పేరు చెప్పి కాలయాపన చేస్తూ నిరుద్యోగుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. అసలు సర్కారీ కొలువుల్లో ఖాళీలే లేవంటూ దీర్ఘాలు తీస్తున్నారు. అసలు ఏపీలో సర్కార్‌ పోస్టుల పరిస్థితి ఏంటి.? టిడిపి
నైజమేంటి.?

నిరుద్యోగుల్లో అసహనం..
ప్రభుత్వ ఉద్యోగాల కంటే ప్రైవేటు ఉద్యోగాలే మేలు.. అవి లక్షల సంఖ్యలో ఉంటాయి.. శాలరీలూ ఎక్కువగా ఉంటాయి... ఇదీ ఏపీపీఎస్సి కొత్త ఛైర్మన్‌ ఉదయ్ భాస్కర్ ప్రకటన. ఇది చాలు.. సర్కారు మదిలో ఏముందో తెలియడానికి. వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం వాటిని చూపడం లేదు. మే 28న ఇన్‌ఛార్జ్ ఛైర్మన్ నేతృత్వంలో జరిగిన ఏపీపీఎస్సీ సమావేశపు నివేదికలోనూ సర్కారీ కొలువుల్లో ఒక్క ఖాళీ కూడా లేదన్నట్లుగా పొందుపరిచారు. స్టేట్‌ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీలో కొంత కదలికొచ్చింది. అదే ఏపీలో పదివేలకు పైగా పోస్టుల కోసం డీఎస్సీ నిర్వహించారు. కానీ కేసుల పేరుతో ప్రభుత్వం ఇప్పటి వరకు పోస్టులను భర్తీ చేయలేదు. కమల్‌నాథన్ కమిటీ లెక్కల ప్రకారమే వివిధ పరిధుల్లో ఖాళీలు ఒక లక్షా 42 వేల దాకా ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం పోస్టుల భర్తీకి చొరవ చూపకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తుంటే నిరుద్యోగుల్లో అసహనం పెరిగిపోతోంది.
 

జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వారీగా ఉద్యోగ ఖాళీలు..

స్టేట్ కేడర్  మంజూరైన పోస్టులు  ఖాళీలు
గ్రూప్ వన్  552 184
గెజిటెడ్   11,097 3,061
ఎన్జీవో  5,422 788
లాస్ట్ గ్రేడ్   34 25

 

మల్టీ జోనల్ కేడర్  మంజూరైన పోస్టులు ఖాళీలు
గ్రూప్ 1  187 61
గెజిటెడ్   2,496 699
ఎన్జీవో   1,210 424

 

జోనల్ కేడర్  మంజూరైన పోస్టులు ఖాళీలు
గెజిటెడ్   35,652 11,105
ఎన్జీవో   45,500 11,353
లాస్ట్ గ్రేడ్  4

 

జిల్లా స్థాయి కేడర్‌   మంజూరైన పోస్టులు ఖాళీలు
గ్రూప్ వన్   54 2
గెజిటెడ్   7,327 863
ఎన్జీవో   3,86,283 82,760
లాస్ట్ గ్రేడ్   1,75,186 22,519
ఎయిడెడ్   26,617 8,957

ఇదీ ఎపీలో సర్కార్ ఉద్యోగాల పరిస్థితి. రాష్ట్రానికి మొత్తం 6 లక్షల 97 వేల 621 ఉద్యోగాలు మంజూరుకాగా వాటిల్లో ఖాళీలే లక్షా 42 వేల 825 దాకా ఉన్నాయి. ఇన్ని ఖాళీలు ఉంచుకుని అసలు ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరమే లేదన్నట్లు బాబు సర్కార్‌ షో చేస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే వయో పరిమితి పెంచుతూ నిర్ణయం ప్రకటించడంతో నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేసింది. ఈ ఒక్కటి తప్ప మరే ప్రయోజనమూ కలగలేదు. పైగా ప్రభుత్వం వద్ద డబ్బు లేదంటూ దీనంగా ఫేస్ పెడుతున్నారు. 

బ్యాడ్మింటెన్ లో శ్రీకాంత్ పరాజయం..

దుబాయ్ : సూపర్ బ్యాడ్మింటెన్ లో శ్రీకాంత్ పరాజయం చెందాడు. లీగ్ రౌండ్ లో యాక్సెల్ సన్ చేతిలో 13-21, 18-21 తేడాతో శ్రీకాంత్ ఓటమి చెందాడు.

 

కడపలో సీఎం బాబు పర్యటన రద్దు..

కడప : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు జిల్లా పర్యటన రద్దైంది. అక్కడ నిర్వహించతలపెట్టిన జనచైతన్య యాత్రలో పాల్గొనాల్సి ఉంది. 

18:21 - December 10, 2015

చిత్తూరు : కరవు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కుప్పంలోని శాంతిపురంలో దిశా దశ నిర్ధేశ సభకు ఆయన హాజరయ్యారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో బాబు మాట్లాడారు. 300 గజాలతో మూడు లక్షలతో వ్యయంతో ఇళ్లను నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వెనుకంజ వేయడం లేదన్నారు. విద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎలాంటి అవినీతి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు బాబు చెప్పారు. 

18:20 - December 10, 2015

విశాఖపట్టణం : మన్యంలో ఎట్లాంటి పరిస్థితుల్లో బాక్సైట్ తవ్వకాలను జరుగనివ్వమని వైసీపీ అధ్యక్షుడు జగన్ వెల్లడించారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా వైసీపీ చింతపల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో జగన్ తో పాటు ఆ పార్టీకి చెందిన నేతలు పాల్గొన్నారు. అల్లూరి, వైఎస్ చిత్రపటాలకు పూలమాల వేసిన అనంతరం జగన్ ప్రసంగింంచారు. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు అవసరానికి ఒక మాట మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. పర్యావరణ ఆదేశాను సారం గిరిజన సలహా మండలిని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. గిరిజన ఎమ్మెల్యే స్థానాలకు కల్పించాలని ఉంటుందని, వైసీపీ ఎమ్మెల్యేలు అధికంగా ఉన్నందు వల్లే గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయడం లేదని తెలిపారు. బాక్సైట్ తవ్వకాలపై జారీ చేసిన జీవోపై బాబు పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.

 

17:40 - December 10, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్...రాష్ట్ర మంత్రి కేటీఆర్ లపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఎలా హామీలిస్తున్నారంటూ సీరియస్ అయ్యింది. ఏకంగా వారిద్దరికీ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిలంచారంటూ నోటీసుల్లో పేర్కొంది. ఎమ్మెల్యే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. బుధవారం నామినేషన్ ల పర్వం కూడా పూర్తయ్యింది. కానీ సీఎం క్యాంపు కార్యాలయం వేదికగా హామీలు గుప్పిస్తున్నారని, కేటీఆర్ ఏకంగా సచివాలయం కేంద్రంగా ఎంపీటీసీ, జడ్పీటీసీలను చేర్చుకుంటున్నారంటూ సీరియస్ అయ్యింది. ఇటీవలే ఖమ్మం జిల్లాకు చెందిన విపక్ష నేతలను సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారికి కేసీఆర్ పలు హామీలిచ్చినట్లు సమాచారం. ప్రాజెక్టులు పూర్తిచేస్తామని, తూర్పుగోదావరి జిల్లాకు ధీటుగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ పేర్కొనడంపై ఈసీ ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

లాభాల్లో స్టాక్ మార్కెట్..

ముంబై : స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 216 పాయింట్లు లాభపడి 25,252 పాయింట్లు లాభపడి ముగిసింది. నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 7,683 వద్ద ముగిసింది.

 

మహిపాల్ రెడ్డికి రెండున్నర ఏళ్ల జైలు శిక్ష..

మెదక్ :పటన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి రెండున్నర ఏళ్ల జైలు శిక్ష పడింది. అంతేగాకుండా రూ.8వేల జరిమాన విధిస్తున్నట్లు సెషన్స్ కోర్టు పేర్కొంది. పటన్ చెరులోని ఓ కంపెనీ యాజమాన్యంపై దాడి చేశారన్న అభియోగాలపై మహిపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. 

17:16 - December 10, 2015

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత హోదాలో నిర్వహించే చండీయాగానికి హాజరవుతున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న కేసీఆర్..వెంకయ్య నాయుడిని కలిశారు. శాసనసభ సంఖ్యా స్థానాల పెంపు అంశం చర్చకు వచ్చింది. మరింత ఇళ్లను మంజూరు చేయాలని కేసీఆర్ కోరగా ప్రతిపాదనలు పంపిస్తే పరిశీలిస్తామని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. అనంతరం వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అసెంబ్లీలో సంఖ్యను పెంచుకొనేందుకు అవకాశం ఉందని, ఇందుకు చట్టం..రాజ్యాంగం మార్చాలనే దానిపై గందరగోళం నెలకొందన్నారు. న్యాయశాఖ కార్యదర్శితో మాట్లాడడం జరిగిందన్నారు. ఏపీ ప్రభుత్వం 175 నుండి 225 కు పెంచాలని..తెలంగాణలో 119 నుండి 153 చేయాలని ఆయా ప్రభుత్వాలు కోరుతున్నాయన్నారు. స్థానాలు పెంచే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. 

మార్కాపురంలో కేంద్ర కరవు బృందం..

ప్రకాశం : మార్కాపురంలో కేంద్ర కరవు బృందం పర్యటిస్తోంది. కరవు పరిస్థితులపై రైతుల నుండి వివరాలు కేంద్ర బృందం సేకరిస్తోంది. 

బాబుకు మధు లేఖ..

విజయవాడ : చంద్రబాబుకు సీపీఎం కార్యదర్శి మధు లేఖ రాశారు. 2014 డీఎస్సీ కోర్టు కేసును త్వరగా తేల్చి వెంటనే ఉద్యోగాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2014 డీఎస్సీ నోటిఫికేషన్ లో 10,313 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామకాలు జరుపుతామని ప్రకటించినా ఆ దిశగా అడుగులు పడడం లేదన్నారు. అభ్యర్థులంతా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నందునా ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని లేఖలో మధు డిమాండ్ చేశారు. 

అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి - సక్సేనా..

రాజమండ్రి : అటవీ హక్కుల చట్టం అమలుపై జరిగిన సదస్సులో భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి సక్సేనా పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ హక్కుల చట్టాన్ని సమగ్రంగా అమలు చేయాలని సూచించారు. అటవీ హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు కావడానికి రాష్ట్ర స్థాయిలో కమిషనర్ లను నియమించాలని తెలిపారు.

బాక్సైట్ తవ్వకాలపై టిడిపి మాటమార్చింది - జగన్..

విశాఖపట్టణం : బాక్సైట్ తవ్వకాలపై అధికారంలోకి వచ్చాక మాట మార్చారని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. విశాఖలోని చింతపల్లిలో బాక్సైట్ తవ్వకాలను నిరసిస్తూ ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్ ప్రసంగించారు. బాక్సైట్ శ్వేతపత్రంలో గ్రామ సభల అనుమతి వచ్చిందని పేర్కొన్నారని, అసలు తీర్మానాలేమీ చేయలేదని గిరిజనులు వాదిస్తున్నారని తెలిపారు. గ్రామ సభల అనుమతి లేకుండా తవ్వకాలు ఎలా జరుపుతారని ప్రశ్నించారు. 

నల్గొండ నుండి నగరానికి ఆశా వర్కర్ల పాదయాత్ర..

నల్గొండ : తమ సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్ కు ఆశా వర్కర్లు మహాపాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు పాల్గొన్నారు. 

సీతంపేటలో ఏనుగుల సంచారం..

శ్రీకాకుళం : సీతంపేట (మం) బిల్లుమడ గిరిజన తండాలో ఏనుగుల గుంపు అరటి తోటలు ధ్వంసం చేశాయి. దీనితో రైతులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. 

ములుగు వద్ద రోడ్డు ప్రమాదం..

మెదక్ : ములుగు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను క్వాలిస్ వాహనం ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. 

వెంకయ్యను కలిసిన కేసీఆర్..

ఢిల్లీ : కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణకు గృహ నిర్మాణ పథకం కింద రావాల్సిన నిధుల అంశంతోపాటు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.

చింతపల్లిలో వైసీపీ బహిరంగసభ..

విశాఖపట్టణం : బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖ జిల్లాలోని చింతపల్లిలో వైసీపీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు వైసీపీ అధ్యక్షుడు జగన్ హాజరయ్యారు. 

16:05 - December 10, 2015

మహిళల జీవన చక్రంలో, మెనోపాజ్ ఒక కీలక దశ. మానసిక, శారీరక ఆరోగ్యంపై కీలక ప్రభావాన్ని చూపే దశ. కాస్త జాగరూకతతో ఉంటే, ముందు నుండే తగిన జాగ్రత్తలు తీసుకుంటే, మెనోపాజ్ ని విజయవంతగా దాటే వీలుంది. ఆ వివారలేంటో, హెల్త్ కేర్ లో చూడండి..

16:03 - December 10, 2015

ప్రకృతి మహిళకు ఇచ్చిన అదనపు బాధ్యత బిడ్డలను కనడం.. ఆ ప్రక్రియ ఎంతటి వేదనతో నిండినదైనా స్త్రీ ఆనందంగా అందుకు సిద్ధపడుతుంది. మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించేందుకు చావు లాంటి ప్రసవ వేదనను అనుభవిస్తుంది.. పండంటి బిడ్డను పొత్తిళ్లలో దాచుకోవాలని తపన పడుతుంది.. కానీ, ఆ మాతృత్వపు భావన మన్యం మహిళల్లో విషాదాన్ని నింపుతోంది.. ఈ నేపథ్యంలో మన్యంలోని మహిళల ఆరోగ్య పరిస్థితిపై మానవి స్పెషల్ ఫోకస్..

ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలి..
సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్న మహిళలు ఆధునిక ప్రపంచంలో ఉన్నా, అడవి మధ్యలో నివసిస్తున్నా వారి ప్రసవం ఆరోగ్యకర పరిస్థితుల్లో, సురక్షిత పద్దతుల్లో జరగాలి. కానీ, స్వతంత్ర భారతావనిలో నేటికీ మన్యంలోని మహిళలకు ప్రసవమంటే మరోజన్మే.. ఆ తరువాత తల్లీబిడ్డలు క్షేమంగా ఉంటారా అంటే సందేహమే. ఆదివాసీలకోసం, అడవిబిడ్డలకోసం ఎన్నో ప్రత్యేక చట్టాలు చేసాం.. వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపట్టామని చెప్పే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, మన్యంలోని మహిళల ఆరోగ్యంపై ఏ పాటి శ్రద్ధ చూపుతున్నారో కనిపిస్తుంది.. తల్లీబిడ్డల క్షేమాన్ని ఎలా గాలికొదిలేసారో అర్థమవుతుంది.. ఇకనైనా అడవి బిడ్డల పట్ల, పుట్టబోయే శిశువుల పట్ల, వారి ఆరోగ్యం పట్ల ఇరు ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలని కోరుకుందాం.. మన్యంలోని మాతా శిశు సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం.

18-31 వరకు రాష్ట్రపతి బొల్లారంలో బస..

హైదరాబాద్ : ఈనెల 18వ తేదీ నుండి 31వ తేదీ వరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది కోసం బొల్లారంలో బస చేయనున్నారు. ఈనెల 18వ తేదీలోపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులకయు సీఎస్ రాజీవ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. పలు వర్సిటీల స్నాతకోత్సవాలతో పాటు చండీయాగానికి రాష్ట్రపతి హాజరు కానున్నారు. 

తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీ..

హైదరాబాద్ : రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గా డి.కృష్ణ భాస్కర్, మెదక్ సీఈవో గా అలగు వర్షిణి, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గా ఆర్. హనుమంతు, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ గా అద్వైజ్ కుమార్ సింగ్, జగిత్యాల సబ్ కలెక్టర్ గా శశాంక్, వికారాబాద్ సబ్ కలెక్టర్ గా శృతి ఓజాలు నియమితులయ్యారు. 

15:42 - December 10, 2015

హైదరాబాద్ : తెలంగాణలో ఆశా కార్మికుల సమ్మె వంద రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో పాదయాత్రలు చేపట్టారు. హైదరాబాద్‌లో బషీర్‌బాగ్‌ చౌరాస్తా నుంచి సుందరయ్య పార్కు వరకు పాదయాత్ర నిర్వహించారు. తమను కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 

15:41 - December 10, 2015

వరంగల్ : జిల్లాలో ఆశాలు సమ్మెను ఉదృతం చేశారు. ఆశా వర్కర్ల సమ్మెకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. ఆశా వర్కర్ల సమ్మె 100 రోజులకు చేరింది. ఆశా వర్కర్ల పట్ల కేసీఆర్ చిన్న చూపు చూస్తున్నారని, వారి న్యాయమైన కోరికలు, డిమాండ్లను తీర్చాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. 100 కిలోమీటర్ల పాదయాత్రకు తలపెట్టారని, ఆశా వర్కర్లకు అన్ని వర్గాల మద్దతు అవసరమన్నారు తమ్మినేని. మంత్రులకు ఆశా వర్కర్ల సమస్యలపై సమస్యా పత్రం ఇచ్చిన తీసుకునేం ఓపిక లేదని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

15:39 - December 10, 2015

ఖమ్మం : జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. గోదావరి నదిని తవ్విపోస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపెడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు వీరి ఆగడాలను ఏమాత్రం అడ్డుకోలేక పోతున్నాయి. వీరి అరాచకాలను భరించలేక... స్థానికులు.. తెగించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. దోషులపై చర్యల కోసం పట్టుబట్టి.. కేసులు కట్టిస్తున్నారు. ఖమ్మం జిల్లా మణుగూరు.. ఇసుకాసురుల దుర్గంగా మారింది. పదుల కొద్దీ ట్రాక్టర్లతో.. గోదావరి నుంచి ఇసుకను తవ్వి తరలించుకు పోతున్నారు. ట్రాక్టర్‌ యజమానులు.. కాంట్రాక్టర్‌లూ కలిసి పోయి.. గోదావరి ఇసుకను కొల్లగొట్టేస్తున్నారు. వీరికి అధికార గణమూ సహకరిస్తుండడంతో వీరి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.
ఆన్‌లైన్‌లో ఇసుక అమ్మకాలు సాగించాలన్న ప్రభుత్వ నిబంధన.. మణుగూరులో ఎక్కడా అమలు కావడం లేదు. గోదాట్లో ఇసుకను తవ్విన ఇసుకాసురులు.. అక్కడే రహస్య ప్రదేశంలో దాన్ని భద్ర పరుస్తున్నారు. ఇసుకను రాత్రిళ్లు దొంగచాటుగా పట్టణాలకు తరలిస్తున్నారు. లక్షలాది రూపాయలు సంపాదిస్తూ.. ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెడుతున్నారు. 

చర్యలు తీసుకోవాలి..
ఇసుక అక్రమార్కుల ఆగడాలు, అరాచకాలను భరించలేక స్థానికులు.. వీరి గుట్టును అధికారులకు చేర వేశారు. మైనింగ్‌ అధికారులు స్పందించక పోవడంతో.. రెవిన్యూ అధికారులకు.. పోలీసులకు.. ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన రెవిన్యూ అధికారులు.. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు వంద ట్రక్కుల మేర ఇసుక డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. గోదావరిలో ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వి తరలిస్తోన్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ప్రాంతంలోని అవినీతి అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

15:26 - December 10, 2015

వరంగల్ : తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు చేపడుతున్న ఆందోళన వంద రోజులకు చేరుకుంది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆశా వర్కర్లు పాదయాత్రలు నిర్వహించారు. జిల్లాలోని పాలకుర్తి వద్ద ఆశా వర్కర్లు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. అంతకుముందు చాకలి ఐలమ్మ విగ్రహానికి వారు పూలమాల వేశారు. ఈసందర్భంగా వారు టెన్ టివితో మాట్లాడారు.

ఆందోళన న్యాయమైంది - తమ్మినేని..
ఆశా వర్కర్లు చేపడుతున్న ఈ ఆందోళన న్యాయమైందని తమ్మినేని పేర్కొన్నారు. వంద రోజులుగా చేపడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. రెండు మాసాల్లో కాంట్రాక్టు వారిని పర్మినెంట్ చేస్తామని హామీనిచ్చారని, కనీస వేతనాలు చెల్లించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వానిదని చెప్పడం అన్యాయమని, రాష్ట్ర ప్రభుత్వం అనేక పనులు చేయించుకొంటోందన్నారు. వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బహుశా చరిత్రలో ఆశాలు ఇన్ని రోజులుగా ఆందోళన చేయడం ఇదే మొదటిసారి అని వెంటనే చర్చలు పిలిచి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని కోరారు.

అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతాం - ఎర్రబెల్లి..
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆశాల సమస్యలను లేవనెత్తుతామని, అన్ని రాజకీయ పార్టీలు ఏకమై అసెంబ్లీని నడువనిచ్చే పరిస్థితి లేదని ఎర్రబెల్లి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నెట్టివేస్తున్నారని, మేనిఫెస్టోలో పర్మినెంట్ చేస్తామని తదితర హామీలిచ్చారని గుర్తు చేశారు. 

15:21 - December 10, 2015

హైదరాబాద్ : ఓయూలో గురువారం ఉదయం నుండి నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం ప్రస్తుతం ప్రశాంత వాతవరణం నెలకొంటోంది. డిసెంబర్ 10వ తేదీన బీఫ్ ఫెస్టివల్ ను నిర్వహించేందుకు 26 సంఘాలకు చెందిన విద్యార్థులు ఏర్పాట్లు చేశారు. కానీ ఈ ఫెస్టివల్ ను నిర్వహించకూడదని కింది కోర్టు పేర్కొనడం..దీనిని హైకోర్టు సమర్థించడం తెలిసిందే. దీనితో ఓయూలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాము ఎలాగైనా ఫెస్టివల్ నిర్వహిస్తామని బీఫ్ నిర్వాహకులు ప్రకటించారు. ఉదయం నుండి ఓయూ రహదారులను మూసివేశారు. విద్యార్థులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. కానీ బీఫ్ ఫెస్టివల్ ను నిర్వహించుకున్నట్లు విద్యార్థులు ప్రకటించారు. అంబేద్కర్, ఎన్‌ఆర్‌ఎస్‌ హాస్టల్స్ లో బీఫ్ ను ఒకరినొకరు తినిపించుకున్నారు. ఈ దృశ్యాలన్నీ మీడియాకు పంపించారు. నిర్బంధం కారణంగా ప్రణాళికా బద్ధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక ప్రతినిధులు తెలిపారు. తమ హక్కులను కాలరాయొద్దని ఈ సందర్భంగా డీసీఎఫ్‌ పేర్కొంది.
ఇదిలా ఉంటే ఓయూలోకి మీడియాను అనుమతినివ్వడం లేదు. ప్రశాంత వాతావరణ భంగం కలుగుతుందనే ఉద్ధేశ్యంతో పలువురిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అంబర్ పేట పీఎస్ కు తరలించారు. పీడబ్ల్యూవో సంధ్య, ఆమాద్మీ పార్టీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం వీరిని అదుపులోకి తీసుకున్నారు. బీఫ్ ఫెస్టివల్ జరుగలేదని పోలీసులు..జరిగిందని నిర్వాహకులు ప్రకటించారు. 

14:58 - December 10, 2015

తెలుగులోనే కాదు ఏ భాషా సినిమాల్లోనైనా కొత్త కథలతో వచ్చేవి చాలా అరుదు. కథలు పాతవే ఐనా...స్క్రీన్ ప్లే, మాటలతో బండి లాగించేయొచ్చు. అది కన్విన్సింగ్ గా చేయగల్గితే సినిమా సక్సెస్ అయినట్లే. బెంగాల్ టైగర్ సినిమాతో దర్శకుడు సంపత్ నంది ఇదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. తెలిసిన స్టోరీనే మాటల చాతుర్యంతో చూపించి ఫర్వాలేదు అనిపించాడు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ సినిమా రిజల్ట్ చాలా రిలీఫ్ నిస్తుంది.

కథ..
ఆకాష్ ఓ పల్లెటూరి కుర్రాడు. చదువుకున్నోడే ఐనా ఉద్యోగాలు లాంటివి చేయకుండా ఫ్రెండ్స్ తో తిరుగుతుంటాడు. ఇంట్లో వాళ్ల పోరు పడలేక పెళ్లి చూపులకు వెళ్తాడు. అక్కడ అమ్మాయి బాగా ఆస్తితో...చాలా అందంగా ఉంటుంది. హీరోకు నచ్చుతుంది. కానీ....మనోడు సెలబ్రిటీలా ఫేమస్ ఐతే తప్ప పెళ్లి చేసుకోనని తిరకాసు పెడుతుంది. దీంతో...త్వరగా ఫేమస్ కావాలని ఓ పబ్లిక్ మీటింగ్ లో మంత్రిపై రాయి విసురుతాడు ఆకాష్. దీంతో పోలీసులు లాకప్ లో వేసి కొడతారు. ఆకాశ్ ని చంపేద్దామని పోలీస్ స్టేషన్ వెళ్లిన మంత్రి...మన కథానాయకుడి గట్స్ నచ్చి తన దగ్గరే అసిస్టెంట్ గా పెట్టుకుంటాడు. ఈ మంత్రి దగ్గర ఆకాష్ స్పీడ్ చూసిన హోంమంత్రి సిద్దప్ప...తన దగ్గర పని చేయమని కోరతాడు. శత్రువుల దాడి నుంచి హోంమంత్రి కూతురిని కాపాడతాడు ఆకాష్. ఇలా మరికొన్ని సందర్భాల్లో హీరో ప్రవర్తన నచ్చిన మంత్రి కూతురు అతన్ని లవ్ చేయడం ప్రారంభిస్తుంది. ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లికి కూడా రెడీ అవుతుంది. ఆకాష్ తో తన కూతురు పెళ్లి గురించి హోంమంత్రి సిద్దప్ప ఫంక్షన్ పెట్టి అనౌన్స్ చేస్తాడు. ముఖ్యమంత్రిని కూడా ఆ కార్యక్రమానికి పిలుస్తాడు. తీరా పెళ్లి ప్రకటన చేశాక....తనకీ పెళ్లి ఇష్టం లేదని షాకింగ్ న్యూస్ చెప్తాడు ఆకాష్. ముఖ్యమంత్రి కూతురుని తాను ప్రేమిస్తున్నానని వేదికపై అంటాడు. ఆకాష్ ఇలా ఎందుకు చేశాడు...ఊళ్లో పనీ పాటా లేకుండా తిరిగే ఆకాష్ కు సీఎం కూతురితో ప్రేమ వ్యవహారం ఎంటి, ఈ మొత్తం కథకు వేరే రివేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉందా ? అన్నది బెంగాల్ టైగర్ సినిమా చూస్తే తెలుస్తుంది.

విశ్లేషణ..
రివేంజ్ స్టోరీని మూడొంతులు నవ్విస్తూ చెప్పడం ఓ సక్సెస్ ఫుల్ ఫార్మేట్. బెంగాల్ టైగర్ కు దీన్నే ఫాలో అయ్యాడు దర్శకుడు సంపత్ నంది. తెలిసిన కథనే ….ఒక్కో సన్నివేశాన్నీ చాలా క్లియర్ గా కన్విన్సింగ్ గా చూపిస్తూ...ఫస్టాఫ్ ను లాగించేశాడు. ఇంటర్వెల్ వచ్చే వరకు కథను చాలా స్పీడ్ గా నేరేట్ చేశాడు. కథలోని రివేంజ్ పార్ట్ పక్కన పెడితే...ఓ సాధారణ పల్లెటూరి కుర్రాడు హోం మినిస్టర్ కూతురును పెళ్లి చేసుకునే వరకు వచ్చాడంటే...ఆ సన్నివేశాలను చాలా నేర్పుగా రాసుకోవాలి. ప్రేక్షకులని ఒప్పించేలా రాసుకున్న మాటలు...ఈ సన్నివేశాలను పండించాయి. తద్వారా కథనూ మోశాయి. మొదటి అర్థ భాగంలో ఇంత స్పీడ్ గా వెళ్లిన కథ....సెకండాఫ్ లో నెమ్మదించింది. అనవసర సన్నివేశాలు, రొటీన్ క్లైమాక్స్ తో పెద్ద హిట్ కావాల్సిన బెంగాల్ టైగర్ మోస్తరు సక్సెస్ దగ్గరే ఆగిపోయింది.

నటీనటుల ప్రతిభ..
ఆకాష్ పాత్రలో రవితేజ ఎనర్జిటిక్ యాక్టింగ్ చూపించాడు. తన మార్క్ ఎంటర్ టైన్ మెంట్ , యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. ఏం చేసినా...ఈ మాస్ స్టార్ లో ఏదో వెలితి కనిపిస్తూనే ఉంది. తమన్నా, రాశి ఖన్నాలకు గ్లామర్, ఫెర్మార్మెన్స్ కు అవకాశమున్న పాత్రలు దొరికాయి. ఇద్దరూ తమ స్పేస్ కు జస్టిఫై చేశారు. సినిమాకు గ్లామర్ డోస్ ను అందించారు. ముఖ్యంగా ఫృథ్వీ ఫస్టాఫ్ ను నిలబెట్టాడు. ఈ థర్టీ ఇయర్స్ నటుడు తన పాత్రతో బెంగాల్ టైగర్ మొదటి అర్థ భాగాన్ని నవ్వులతో నింపేశాడు. హీరో తర్వాత అంతటి క్రెడిట్ ఫృథ్వీకే దక్కుతుంది. పోసాని, షాయాజీ షిండే, బొమన్ ఇరానీ, రావు రమేష్ పాత్రలు బలంగానే ఉన్నాయి. నటీనటుల ఫెర్మార్మెన్స్ ఈ సినిమాకు మైనస్ అయిన సందర్భాలు లేవు. సినిమా మేకింగ్ వ్యాల్యూస్ బాగున్నాయి. భీమ్స్ పాటల్లో ఒకట్రెండ్ హిట్ ట్యూన్స్ గా నిలిచిపోతాయి. ఆడియో ఇంకా క్వాలిటీ గా ఉంటే సినిమా రేంజ్ మరింత పెరిగేదే. సెకండాఫ్ లో ఎడిటింగ్ ప్రతిభ ఎక్కడా కనిపించలేదు. కొన్ని సీన్స్, ఫైట్స్ తీసేసినా నష్టం ఉండేది కాదు. పైగా ట్రిమ్ గా ఉన్న సినిమా ఎక్కువ ఆకట్టుకునేది. బీసీ సెంటర్స్ లో బెంగాల్ టైగర్ కు తిరుగుండదు. లాజిక్ లు వదిలేస్తే...కాసేపు ఎంటర్ టైన్ అయ్యే సినిమా ఇది.

ప్లస్ పాయింట్స్..
కథ, సంభాషణలు.
ఫస్టాఫ్.
రవితేజ.
ఫృథ్వీ కామెడీ.
మేకింగ్ గ్రాండియర్.
మైనస్ పాయింట్స్
సెకండాఫ్ స్లో నేరేషన్.
ఎడిటింగ్.
రొటీన్ క్లైమాక్స్.

పాలకుర్తిలో ఆశా వర్కర్ల పాదయాత్ర ప్రారంభం..

వరంగల్ : పాలకుర్తిలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఆశా వర్కర్ల పాదయాత్రను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టి.టిడిపి నేత ఎర్రబెల్లిలు ప్రారంభించారు. 

దేవుళ్ల మొక్కుల కోసం రూ.5.59 కోట్లు..

హైదరాబాద్ : దేవుళ్ల మొక్కుల చెల్లించేందుకు రూ.5.59 కోట్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభరణాలు తయారీ చేయించనుంది. నగల తయారీ పర్యవేక్షణ కోసం ప్రభుత్వ సలహాదారు రమణాచారి నేతృత్వంలో కమిటీని నియమించింది.

 

రాజ్ నాథ్ తో చిన్న రాజప్ప..

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఏపీ హోం మంత్రి చిన్న రాజప్ప కలిశారు. రాష్ట్రంలో కరవు, వరదల నష్టంపై నివేదిక అందచేశారు. రాష్ట్రానికి నిధులు విడుదల చేసి ఆదుకోవాలని, ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. 

ఇండో అమెరికన్ క్యాన్సర్ భవనంపై నుండి పడి మహిళ మృతి..

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఇండోఅమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి భవనం నాలుగో అంతస్తు పై నుండి పడి మహిళ మృతి చెందింది. 

ట్యాంక్ బండ్ వద్ద బీఫ్ ఫెస్టివల్..

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఫ్ పెస్టివల్ ను ఏఐఎస్ఎఫ్ నేతలు నిర్వహించారు. 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

 

ఆశాల పాదయాత్రను ప్రారంభించిన రాఘవులు..

మహబూబ్ నగర్ : ఆశాల పాదయాత్రను సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాఘవులు ప్రసంగించారు. ఆశా వర్కర్లు వంద రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్నా పాలకులు స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఆశాల వేతనాల పెంపుపై కేసీఆర్ హామీని విస్మరించారని, వారిచే వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని విమర్శించారు. ఆశాల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని రాఘవులు డిమాండ్ చేశారు. 

ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంటిపై ఏసీబీ దాడులు...

నెల్లూరు : మూలపేట బ్రాహ్మణవీధిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు వి.సురేష్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో సోదాలు నిర్వహించారు. సురేష్ సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. గొలగమూడి పాఠశాలలో సురేష్ పనిచేస్తున్నారు. 

శతదినోత్సవం జరుపుకుంటున్న సమ్మెలు - సీఐటీయూ..

మెదక్: టీఆర్ఎస్ పాలనలో సమ్మెలు కూడా శత దినోత్సవం జరుపుకుంటున్నాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఆశాలు వంద రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని, కేంద్రం సాకు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. 

త్వరలో నీళ్లు..కరెంటు బిల్లు బకాయిలు మాఫీ - తలసాని..

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత గ్రేటర్ హైదరాబాద్‌లోని నీళ్లు, కరెంట్ బిల్లుల బకాయిలను మాఫీ చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

 

ఇసుక మాఫియాపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..

హైదరాబాద్ : ఇసుక మాఫియాపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు రిటైర్డ్ హైకోర్టు జడ్జితో హై పవర్ కమిటీని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. 

తిరుపతి ఆర్డీఓ ఆఫీసులో కేంద్ర కరవు బృందం..

చిత్తూరు : తిరుపతి ఆర్డీవో ఆఫీసులో కేంద్ర కరవు బృందం సమావేశం జరిపారు. జిల్లాల్లో భారీ వర్షాలతో నష్టపోయిన అనేక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించామని, బాధితులను అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగిందని బృంద సభ్యులు పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా నివేదిక ఇస్తామన్నారు. 

పాలకుర్తిలో ఆశా వర్కర్ల బహిరంగ సభ..

వరంగల్ : పాలకుర్తిలో ఆశా వర్కర్ల బహిరంగ సభ జరుగుతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, టిటిడిపి నేత ఎర్రబెల్లి పాల్గొన్నారు. 

నారాయణపెడ్డిపేటలో కేంద్ర కరవు బృందం..

నెల్లూరు : నారాయణరెడ్డిపేటలో కేంద్ర కరవు బృందం పర్యటించింది. వరద నష్టాన్ని బృందానికి మంత్రి నారాయణ వివరించారు. 

ఎన్ సీసీ గేట్ వద్ద గో పూజ..చెదరగొట్టిన పోలీసులు...

హైదరాబాద్ : ఎన్ సీసీ గేటు వద్ద గోపూజ చేసేందుకు గో సంరక్షణ కార్యకర్తలు ప్రయత్నాలు చేశారు. వీరి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలను చెదరగొట్టారు.

13:22 - December 10, 2015

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ బోణీకొట్టినట్లు సమాచారం. వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి కొండా మురళీ ఏకగ్రీవానికి దారి సుగమం అయ్యింది. నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు అభ్యర్థుల్లో 5గురు ఇండిపెండెంట్లు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో మురళీ ఎన్నికలను ఈసీ లాంఛనంగా ప్రకటించమే మిగిలింది.

13:13 - December 10, 2015

ముంబై : కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను ఇంతకాలం వెంటాడిన 'హిట్ అండ్ రన్' కేసు నుంచి దాదాపు ఊరట లభించినట్టే. 2002 సంవత్సరంలో కారుతో ఢీకొట్టిన కేసులో సల్మాన్ ను దోషిగా తేల్చలేమని బాంబే హైకోర్టు కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఆయనపై అభియోగాల నిరూపణలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలమైందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. విచారణ దశలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, రక్త నమూనాల పరీక్షల్లో విభిన్నత ఉందని వెల్లడించింది. కాగా, ఈ కేసులో ట్రయల్ కోర్టు సల్మాన్ కు ఐదేళ్ల శిక్ష విధించగా, ఆయన దాన్ని హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు హైకోర్టు సల్మాన్ ను 'దోషి' అనలేమన్న భావనకు రావడం ఆయనకు పెద్ద ఊరటే!

హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ కు ఊరట

ముంబై : కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను ఇంతకాలం వెంటాడిన 'హిట్ అండ్ రన్' కేసు నుంచి దాదాపు విముక్తి లభించినట్టే. కారుతో ఢీకొట్టిన కేసులో సల్మాన్ ను దోషిగా తేల్చలేమని బాంబే హైకోర్టు కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఆయనపై అభియోగాల నిరూపణలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలమైందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. విచారణ దశలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, రక్త నమూనాల పరీక్షల్లో విభిన్నత ఉందని వెల్లడించింది. కాగా, ఈ కేసులో ట్రయల్ కోర్టు సల్మాన్ కు ఐదేళ్ల శిక్ష విధించగా, ఆయన దాన్ని హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.

13:05 - December 10, 2015

హైదరాబాద్ : కృష్ణానదీ జలాల పంపిణీ వివాదం కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేంద్రం సమర్పించిన అఫిడవిట్ వివరాలు కోరుతూ తెలంగాణ ప్రభుత్వం మధ్యంతర దరఖాస్తు సమర్పించింది. ధర్మాసనం అభ్యంతరంతో తెలంగాణ తరపు న్యాయవాది దరఖాస్తును ఉపసంహరించుకున్నారు. వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని తెలంగాణ తరపు న్యాయవాది కోర్టును కోరారు. తెలంగాణ సమయం కోరడంపై మహారాష్ట్ర, కర్ణాటక తరపున న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. తదుపరి విచారణను న్యాయస్థానం జనవరి 13కు వాయిదా వేసింది.

13:03 - December 10, 2015

హైదరాబాద్ : మహానగరంలో ముషీరాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూంల ఇళ్ల నిర్మాణాలకు మంత్రులు కేటీఆర్ , నాయిని , పద్మారావు శంకుస్థాపన చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్ రూంలను నిర్మిస్తోందన్నారు కేటీఆర్. నగరంలో కిరాయి గదులలో ఉన్న పేదలందరికి ఉచితంగా డబుల్ బెడ్ రూం పట్టాలు అందజేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదే అని కేటీఆర్ తెలిపారు. ఈ ఒక్కరోజే 12 చోట్ల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశామన్నారు కేటీఆర్.  

13:01 - December 10, 2015

హైదరాబాద్ : ఆశా వర్కర్లు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. తమను కూడా కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా పాదయాత్రలు ప్రారంభించారు. జిల్లాల్లో ప్రారంభమైన పాదయాత్రలు హైదరాబాద్‌కు చేరుకుంటాయి.

కేసీఆర్ రాజకీయాలను కలుషితం చేస్తున్నాడు : కోమటిరెడ్డి

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ రాజకీయాలను కలుషితం చేస్తున్నాడని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని వ్యక్తికి కేసీఆర్ ఎమ్మెల్సీ సీటు ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు. క్యాంపులు పెట్టకుండా ఎన్నికలకు వెళ్లి... ఎవరి సత్తా ఏంటో చూసుకుందామని కేసీఆర్ కు సవాల్ విసిరారు. జిల్లాలో మా అభ్యర్థి విజయం ఖాయం అని స్పష్టం చేశారు.

బార్ లోనే మద్యం కల్తీ

విజయవాడ : మిథైల్ ఆల్కాహాల్ వల్లే మద్యం కల్తీ జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. విజయవాడలోని స్వర్ణ బార్ లోనే మద్యం కల్తీ జరిగినట్లు రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ మీనా సీఎం, ఉన్నతాధికారులకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.

ప్రత్యేక రాయలసీమకు కాంగ్రెస్ వ్యతిరేకం : రఘువీరా

కర్నూలు: ప్రత్యేక రాయలసీమకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని ఏపీ సీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఎంపి ఎస్పీవైరెడ్డిని రఘువీరా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని రఘువీరా మండిపడ్డారు.

వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం!

వరంగల్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. బరిలో ఉన్న ఆరుగురిలో నలుగురు ఉపసంహరించుకున్నారు. మరొకరి నామినేషన్ తిరస్కరణకు గురి అయ్యింది. దీంతో టిఆర్ ఎస్ అభ్యర్థి కొండా మురళీ ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు మార్గం సుగమయ్యింది. మురళీ ఎన్నికను అధికారంగా ప్రకటించడమే లాంఛనంగా మిగిలింది.

కాసేపట్లో హిట్ సల్మాన్ ఖాన్ అండ్ కేసులో తుది తీర్పు

ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో ఈరోజు బాంబే హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో సల్మాన్ కోర్టు హాలులో ఉండాలని అతని తరపు న్యాయవాదులకు న్యాయస్థానం తెలిపింది. దీంతో సల్మాన్ కోర్టుకు మధ్యాహ్నం ఒంటిగంట-ఒంటి గంటన్నర సమయంలో వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో కోర్టు బయట భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు సల్మాన్ సోదరి అల్విరా ఖాన్ కోర్టుకు వచ్చారు. ఈ సాయంత్రంలోగా ఈ కేసులో తీర్పు వెలువడే అవకాశాలున్నాయి. 2002లో జరిగిన హింట్ అండ్ రన్ ఘటనలో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఓ వ్యక్తి చనిపోగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 90 పాయింట్లు లాభంతో కొనసాగుతోంది. నిఫ్టీ 20 పాయింట్లు లాభంతో కొనసాగుతోంది. 

12:11 - December 10, 2015

వాషింగ్టన్: ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ముస్లింలకు బాసటగా నిలిచారు. అమెరికాలోకి రాకుండా ముస్లింలను బ్యాన్ చేయాలని రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో జుకర్ బర్గ్ ముస్లింలకు మద్దతు ప్రకటించాడు. ఎవరో పాల్పడిన చర్యలకు ముస్లింలు అందరు బాధపడాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పారిస్ దాడులు, ఇతర ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ముస్లింలపై వివక్ష చూపించడం సరికాదన్న జుకర్ బర్గ్ తన ఫేస్బుక్ పేజీలో 'ఒక జ్యూ మతస్తుడిగా నీ పైనే కాకుండా ఏ మతంపై దాడి జరిగినా ఎదురు నిలవాలని నా తల్లిదండ్రులు చెప్పారు' అని వెల్లడించాడు. అలాగే ఫేస్బుక్ అధినేతగా ముస్లింలను వారి హక్కుల కోసం, శాంతియుతమైన, వివక్ష రహిత వాతావరణం కోసం పోరాడటానికి ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు.

12:07 - December 10, 2015

హైదరాబాద్ : ఓయూలోని అన్ని హాస్టళ్లలో బీఫ్‌ ఫెస్టివల్‌ ప్రారంభమైంది. నిర్బంధం నడుమే విద్యార్థులు హాస్టల్‌ గదుల్లో పరస్పరం బీఫ్‌ తినిపించుకున్నారు. ఎన్‌ఆర్‌ఎస్‌ హాస్టల్లో విద్యార్ధులు పెద్ద ఎత్తు బీఫ్‌ ఫెస్టివల్‌లో పాల్గన్నారు. నిర్బంధం కారణంగా ప్రణాళికా బద్ధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక ప్రతినిధులు తెలిపారు. తమ హక్కులను కాలరాయొద్దని ఈ సందర్భంగా డీసీఎఫ్‌ పేర్కొంది. ఇదిలా ఉంటే బీఫ్‌ ఫెస్టివల్‌ను అడ్డుకునేందుకు వస్తున్న గోరక్షణ సమితి మహిళా కార్యకర్తలను పోలీసులు ఓయూ ప్రధాన ద్వారం వద్దే అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. 

12:05 - December 10, 2015

కడప : నగరంలో పట్టపగలే పాతకక్షలు భగ్గుమన్నాయి. కడపలోని అప్సర సర్కిల్‌ వద్ద మునిరెడ్డి అనే వ్యక్తిపై కార్పొరేటర్ రాజగోపాల్‌రెడ్డి, అతని అన్నరాంప్రసాద్రెడ్డిలు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ మునిరెడ్డిని తిరుమల ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. మునిరెడ్డికి కార్పొరేటర్‌ రాజగోపాల్‌రెడ్డికి మధ్య గతంలోనే విభేదాలున్నాయని చౌక్‌ సిఐ యుగంధర్ చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి అన్న రాంప్రసాద్‌డ్డి గురించి మునిరెడ్డి అవహేళనగా మాట్లాడినందుకే కత్తులతో దాడి చేశారని అన్నారు. ఇరు వర్గాల వారు వైసీపీకి చెందిన ముఖ్యకార్యకర్తలు కావడంతో మేయర్‌ సురేశ్‌బాబు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

12:03 - December 10, 2015

విజయవాడ : బీసీ రిజర్వేషన్ల కోసం కాపులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు. కాపు రిజర్వేషన్‌ ఉద్యమానికి మద్దతు ఇవ్వడంతోపాటు... వారితో కలిసి క్షేత్ర స్థాయిలో పోరాటం చేయాలని పార్టీ అధినేత జగన్‌ భావిస్తున్నారు. దీనిపై కార్యాచరణ రూపొందించేందుకు వైసీపీలోని కాపు నాయకులతో భేటీ కావాలని నిర్ణయం...

టీడీపీకి ఓట్లేసిన కాపుల్లో ఇప్పుడు కొంత అసంతృప్తి...

గత ఎన్నికల్లో  నెలకొంది. ఎన్నికల ముందు కాపుల కోసం వెయ్యికోట్ల రూపాయలతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని విస్మరించాలన్నది వారి వాదన. కేవలం వంద కోట్ల రూపాయలు కేటాయించి చేతులు దులుపుకున్నారని కాపు నేతలు విమర్శిస్తున్నారు. అయితే కాపుల అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసిపి ప్లాన్‌ చేస్తోంది. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధిలేదంటూ పార్టీని కాపు నేతలు బొత్స సత్యనారాయణ, జ్యోతుల నెహ్రూ, అంబటి రాంబాబు వంటి నేతలు విరుచుకుపడుతున్నారు.

రిజర్వేషన్లకు మద్దతిస్తే కాపులకు చేరువ .....

ఉభయగోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్న కాపులు గత ఎన్నికల్లో వైసీపీని దెబ్బతీశారు. పశ్చిమగోదావరిలో ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. ఇప్పుడు కాపు రిజర్వేషన్ల అంశానికి మద్దతు ఇవ్వడం ద్వారా బలమైన ఈ సామాజికి వర్గానికి చేరువకావచ్చని జగన్‌ భావిస్తున్నారు. కాపులకు చేరువయ్యేందుకు విజయవాడ దుర్గగడి దగ్గర నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌కు దివంగత వంగవీటి మోహనరంగారావు పేరు పెట్టాలన్న డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చే యోచన చేస్తున్నారు. ఈనెల 26న రంగా వర్ధంతి సందర్భంగా ఈ డిమాండ్‌ను బహిర్గతం చేయాలని భావిస్తున్నారు. దీనికి ప్రభుత్వం తలొగ్గకపోతే ఉద్యమం చేయాలన్న యోచనలో కూడా వైసీపీ నేతలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లు కొల్లగొట్టేందుకు, ఈ సామాజిక వర్గానికి చేరువయ్యేందుకు జగన్‌ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. 

ఇందిర కోడలైనా, రాజీవ్ భార్య అయినా చట్టానికి ఒక్కటే :రాయపాటి

ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ దోషి అని తేలితే చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే అని రాయపాటి చెప్పారు. ఇందిరాగాంధీ కోడలైనా, రాజీవ్ గాంధీ భార్య అయినా చట్టం ముందు ఒకటే అని అన్నారు. విభజన సమయంలోనే ప్రత్యేక హోదా అంశాన్ని చట్టబద్ధం చేసి ఉంటే, ఇప్పుడు మనకు ఈ ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదని మండిపడ్డారు. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు దత్తత తీసుకున్న ధర్మవరం గ్రామ అభివృద్ధికి గెయిల్ సంస్థ సాయం అందించింది. రూ. 8.95 కోట్లతో గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా, తొలి విడతగా రూ. 2 కోట్ల సాయం అందించింది.

'కృష్ణా నదీజలాల' విచారణ జనవరి 13కు వాయిదా

ఢిల్లీ : కృష్ణా నదీజలాల పంపిణీ వివాదంపై సుప్రీంలో విచారణ జరిగింది. కేంద్రం సమర్పించిన అఫడవిట్ వివరాలు కోరుతూ.. తెలంగాణ సర్కార్ మధ్యంతర దరఖాస్తు పిటిషన్ వేసింది. ధర్మాసనం అభ్యంతరంతో ఆ ధరఖాస్తున్న టి.సర్కార్ ఉపసంహరించుకుంది. వాదానలు వినిపించేందకు తెలంగాణ సర్కార్ సమయం కోరగా మహారాష్ట్ర, కర్ణాటక తరపు లాయర్లు అభ్యంతరం తెలిపారు. తదుపరి విచారణ జనవరి 13కు వాయిదా వేసినట్లు తెలిపింది.

11:45 - December 10, 2015

వాషింగ్టన్: 'మినీ బియాన్స్'గా పేరొందిన నాలుగేళ్ల చిచ్చరపిడుగు ఈ ఏడాది యూట్యూబ్‌ కిరీటాన్ని ఎగరేసుకుపోయింది. అదరిపోయే తన స్టెప్పులతో ఈ చిన్నారి పెట్టిన డ్యాన్స్ వీడియో 2015 సంవత్సరంలో అత్యధిక వ్యూస్‌ సాధించింది. ర్యాపర్ సైలెంటో పాడిన 'వాచ్‌ మి' పాటకు న్యూయార్క్ వీధుల్లో ఈ బుజ్జాయి వేసిన స్టెప్పులకు వీక్షకుల నుంచి అదరహో అనే రెస్పాన్స్ వచ్చింది. 'హేవన్‌ కింగ్‌'గా పేరొందిన ఈ చిన్నారి డ్యాన్స్ వీడియోను ఇప్పటివరకు 116 మిలియన్ల (16.6 కోట్ల) మంది చూశారని, ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన వీడియో ఇదేనని గూగుల్ నేతృత్వంలోని యూట్యూబ్‌ ప్రకటించింది.
రెండో స్థానంలో నటుడు లియాన్ నీసన్...
ఇక రెండోస్థానంలో నటుడు లియాన్ నీసన్ నటించిన 'క్లాష్ ఆఫ్ క్లాన్స్' వీడియో గేమ్‌ నిలిచింది. దీనిని 83 మిలియన్ల (8.3 కోట్ల) మంది చూశారు. 'హేవన్ కింగ్' చిన్నారి వీడియో పోల్చుకుంటే రెండోస్థానంలో ఉన్న వీడియోకు సగం వ్యూస్‌ కూడా రాకపోవడం గమనార్హం. యూట్యూబ్ ప్రముఖుడిగా పేరొందిన ప్రంక్‌స్టర్ రోమన్ అట్వూడ్ తీసిన 'క్రేజీ ప్లాస్టిక్ బాల్' వీడియో మూడోస్థానంలో నిలించింది. దీనిని 56 మిలియన్ల (5.6 కోట్ల) మంది వీక్షించారు. యాడ్ కౌన్సిల్ జారీచేసిన 'లవ్ హజ్ నో లేబుల్', జస్టిన్ బీబర్ వీడియో, డెలవేర్ పోలీసులు పెట్టిన 'కన్ఫెషనల్' వీడియో టాప్‌ వీడియోల్లో చోటుసంపాదించాయి. పదో పుట్టినరోజు జరుపుకుంటున్న యూట్యూబ్‌కు 2015 ఎంతో అద్భుతమైన సంవత్సరమని, యూట్యూబ్‌ అభిమానులు ఈ ఏడాది ఎన్నో వినూత్నమైన డ్యాన్సులు ప్రవేశపెట్టారని, జీవవైవిధ్యం, సమ్మిళిత అభివృద్ధి, ఆధునిక కార్లు వంటి ఎన్నో అంశాలపై యూట్యూబ్ వేదికగా చర్చించారని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

పోలీసు శిబిరంపై మావోయిస్టుల దాడి

హైదరాబాద్ : ఛత్తీగఢ్ లోని నారాయణ్ పూర్ జిల్లాలో పోలీసు శిబిరంపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో ఛత్తీస్ గఢ్ ఆర్మ్ డ్ ఫోర్స్ జవాను మృతి చెందాడు. మావోయిస్టుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

11:31 - December 10, 2015

హైదరాబాద్ :నగరంలోని లోయర్ ట్యాంక్ బండ్ లోని భాగ్యనగర్ గోశాలలో స్వామి పరిపూర్ణానంద పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి , ఎన్వీఎస్ ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. దేశంలో గోవధ నిషేధం ఉందని , ఏపీ తెలంగాణ లో గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలన్నారు పరిపూర్ణానంద.గోవును పూజించాలే తప్ప వధించకూడదన్నారు పరిపూర్ణానంద.

11:29 - December 10, 2015

కృష్ణా : విజయవాడ లో కల్తీ మద్యం కేసులో విచారణ వేగవంతం అయ్యింది. విచారణలో భాగంగా స్వర్ణ బార్‌ను సిట్‌ బృందం పరిశీలించి ఆధారాలు సేకరించింది. ఇదిలా ఉంటే ఎక్సైజ్‌ శాఖ సూపరిండెంట్‌ ఎన్‌వీ రమణ సస్పెన్షన్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరి కొంతమంది అధికారులపై వేటుకు రంగం సిద్ధమయ్యింది. 

కాంగ్రెస్ ఆందోళనలతో ఉభయసభలు వాయిదా

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత పై ఎంపీ వీరేంద్ర సింగ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనల నేపథ్యంలో రాజ్యసభ 11.30, లోక్ సభ 11.45 నిమిషాల వరకు వాయిదా పడ్డాయి.

ఓయూ హాస్టళ్లలో బీఫ్ ఫెస్టివల్ ప్రారంభం

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ హాస్టళ్లలో బీఫ్ ఫెస్టివల్ ప్రారంభమయ్యింది. ఎన్ ఆర్ ఎస్ హాస్టల్ లో బీఫ్ వంటకాలు వండి విద్యార్థులు ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.

పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం అయ్యాయి. సభలు ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. సోనియాగాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీరేంద్రసింగ్ క్షమాపణల చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రధాని పార్లమెంట్ జరుగుతున్న తీరు బాధాకరంగా ఉందన్నారు. జీఎస్టీ కాకుండా అనేక బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు.

మెదక్ జిల్లాలో రైతు ఆత్మహత్య

మెదక్ : కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో అప్పుల బాధతో రైతు కుమార్ (38) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుప్రారంభించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

రాజమండ్రిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్...

రాజమండ్రి : క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ సమీపంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానిక అపార్ట్‌మెంట్‌ను కేంద్రంగా చేసుకొని బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బెట్టింగ్ కు పాల్పడుతున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 3 లక్షల నగదుతో పాటు ఆరు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. బెట్టంగ్ కు సంబంధించి పూర్తి వివరాల కోసం పోలీసులు విచారణ చేపడుతున్నారు.

ఓఆర్ ఆర్ పై రోడ్డు ప్రమాదం : ఒకరి మృతి

హైదరాబాద్ : ఔటర్ రింగ్‌రోడ్డు పై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ సమీపంలో ఔటర్ లో ఆగి ఉన్న లారీని వెనక నుంచి వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. దీంతో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నల్లగొండ జిల్లా వాసిగా గుర్తించారు.

11:01 - December 10, 2015

హైదరాబాద్ : యం గ్ హీరో శర్వానంద్ హీరోగా మేర్లపాక్ గాంధీ దర్శకత్వం లో యువీ క్రియేషన్స్ నిర్మించిన సినిమా ఎక్స్ ప్రెస్ రాజా. ఇప్పటికే పోస్టర్స్, టీజర్స్ తో భారీ అంచనాలు అందుకున్న 'ఎక్స్ ప్రెస్ రాజా' సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ కావడానికి సన్నాహాల్లో ఉంది. షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ఈ సంక్రాంతికి నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయన వంటి పెద్ద సినిమాలు ఉన్నా.. ఈ సినిమా డిఫరెంట్ నేపద్యంతో సాగే కథ కావడంతో ఈ సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలని చిత్ర టీమ్ ప్లాన్ చేస్తున్నది. శర్వానంద్, సురభి జంటగా నటించిన ఈ సినిమాకు ప్రవీణ్ లక్కిరాజు సంగీతం అందించాడు.

10:48 - December 10, 2015

హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ కూడా వెక్కి వెక్కి ఏడ్చాడట. ఈవిషయం మీకు నమ్మాలని అనిపించడం లేదు కదా.. కానీ ఇది నిజం. ఈ విషయాన్ని వర్మే తన బయోగ్రఫీ బుక్ 'గన్స్ అండ్ థైస్' బుక్ లో వివరించారు. తాను దర్శకత్వం వహించిన నిశ్శబ్ద్ సినిమాలో హీరోయిన్ గా నటించిన జియాఖాన్ ఆత్మహత్య చేసుకున్న సంగతి విషయం విన్న నేను షాక్ కి గురయ్యాను. ఆ వార్త విన్న వెంటనే ఆపుకోలేనంత ఏడుపు వచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చాను అని తాను ఏడ్చిన సందర్భం ని వివరించారు.

పేదలందరికీ గూడు కల్పించాలని సీఎం కేసీఆర్ సంకల్పం: కేటీఆర్

హైదరాబాద్ : పేదలందరికీ గూడు కల్పించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని మంత్రి కేటీఆర్ తెలిపారు.బేగంపేట రూసూల్ పురా లో  డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని, కేటీఆర్, పద్మారావు, తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చేశామన్నారు. నగరానికి నీళ్లు ఇచ్చే జలాశయాలు ఎండిపోయాయని..మంచి నీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. గోదావరి, కృష్ణా జిలాలను పూర్తి స్థాయిలో తీసుకొచ్చి మార్చినాటికి నీళ్ల సమస్య లేకుండా చేస్తామన్నారు.

10:23 - December 10, 2015

హైదరాబాద్ : వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమిళనాడు ప్రజలకు కొత్త కొత్త భయాలు పుట్టుకు వస్తున్నాయి. యముడు దున్నపోతుపై వచ్చి ఇంటి యజమాని ప్రాణాలను లాక్కెళ్తాడన్న ప్రచారం తమిళనాట జోరుగా సాగుతోంది. ప్రధానంగా సేలం జిల్లా అంతటా యముడు వస్తున్నాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాంతో మాంగల్యం కాపాడుకునేందుకు జిల్లాలోని మహిళలు బుధవారం తెల్లవారుజామునే నిద్ర లేచి, తలస్నానం ఆచరించి, ఇంటిముందు ముగ్గులు వేసి దీపాలు వెలిగించారు. తమ తమ కుటుంబసభ్యులతో కలసి మహిళలు ఆంజనేయస్వామి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే బుధవారం రాత్రి దాకా యముడి జాడ ఎక్కడ కనిపించడపోవడంతో జిల్లా వాసులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఇక మహిళలు తమ పసుపు కుంకాలు కాపాడుకునేందుకు ప్రత్యేక పూజలు చేయాల్సి వుంటుందని చెబుతూ, అవి ఎలా ఉండాలో సూచిస్తున్న సమాచారమూ చక్కర్లు కొడుతోంది. వీటిని చూసిన మహిళలు అలాగే చేస్తూ, తెల్లవారుఝామునే నిద్ర లేచి, ఇంటి బయట ముగ్గులతో అలంకరించి, ప్రత్యేక దీపాలు పెడుతూ, ఆపై ఆంజనేయుని ఆలయాలకు భర్తలను తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు చేస్తూ కనిపిస్తున్నారు. ఇక ఇప్పటివరకూ యముడు మాత్రం ఎక్కడ కనబడలేదుగానీ, హడావుడి మాత్రం బాగానే ఉంది. ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మి భయపడవద్దని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.

20 మంది భజరంగ్ దళ్ కార్యకర్తల అరెస్ట్

హైదరాబాద్ : బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకోవడానికి వెళ్తున్న 20 మంది భజరంగ్ దళ్ కార్యకర్తలను కుషాయిగూడలో అరెస్ట్ చేశారు.

విశాఖ మన్యంలో పెరిగిన చలితీవ్రత

హైదరాబాద్ : విశాఖ మన్యంలో చలితీవ్రత పెరిగింది. ఒక్క రోజులేనే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. లంబసింగిలో 6, పాడేరు, చింతపల్లిలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

09:57 - December 10, 2015

హైదరాబాద్ : విశాఖ మన్యంలో చలితీవ్రత పెరిగింది. ఒక్క రోజులేనే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. లంబసింగిలో 6, పాడేరు, చింతపల్లిలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

09:56 - December 10, 2015

హైదరాబాద్ : బీఫ్‌ ఫెస్టివల్‌ సందర్భంగా జరుగుతున్న ముందస్తు అరెస్టుల్లో భాగంగా గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా రాజాసింగ్‌ ను ధూల్‌పేట్‌లో గృహనిర్బంధం చేసిన పోలీసులు, అనంతరం షాహినాయత్‌ గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తనను అక్రమంగా అరెస్టు చేశారని రాజాసింగ్‌ తెలిపారు. తాను గోపూజలో పాల్గొంటానని ఈ సందర్భంగా రాజాసింగ్‌ తెలిపారు. 

09:54 - December 10, 2015

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఫెస్టివల్‌ నిర్వాహకులైన ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక ప్రతినిధులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే, ఎలాగైనా అడ్డుకుంటామని హిందుత్వ సంస్థలు ప్రకటించడంతో అందరి చూపు ఓయూపైనే కేంద్రీకృతమైంది. మరోపక్క పోలీసుల మోహరింపుతో ఓయూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్దకూర పండుగ నిర్వహణకు పిలుపునిచ్చిన నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఓయూలోని ఎన్‌ఆర్‌ఎస్ హాస్టల్‌ను దిగ్భందించారు. పోలీసులు లోనికి రాకుండా విద్యార్థులు తలుపులు మూసి అడ్డుకున్నారు. డీసీఎఫ్ నేతల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అరెస్ట్ చేసేందుకు వ్యూహాలను అనుసరిస్తున్నారు. అర్ధరాత్రి సమయం నుంచే త్రివేణి హాస్టల్ వద్ద కోట శ్రీనివాస్‌గౌడ్, బద్రిలతోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఓయూ మాదిగ విద్యార్థి సమాఖ్య ఇన్‌చార్జి అలెగ్జాండర్, ఫెస్టివల్ నిర్వాహకులు సొలంకి శ్రీనివాస్, వీహెచ్‌పీ నేత శశిధర్‌లను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఉదయం 10 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ వద్ద బీఫ్‌ ఫెస్టివల్ నిర్వహిస్తామని డీసీఎఫ్ సభ్యులు స్పష్టం చేశారు. బీఫ్‌ వంటకాలతో ఓయూకు తరలిరావాలని డీసీఎఫ్‌ పిలుపునిచ్చింది. 

కల్తీ మద్యం కేసులో సిట్ విచారణ వేగవంతం...

విజయవాడ : కల్తీ మద్యం కేసు విచారణ ను వేగవంతం చేసే నేపథ్యంలో స్వర్ణ బార్ ను సిట్ బృందం పరిశీలించింది. ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఎస్ వీ రమణ సస్పెన్షన్ వేటు వేసింది. మరో కొంత మంది అధికారులపై వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.

ఆర్ ఎస్ ఎస్, గోసంరక్షణ కార్యకర్తల అరెస్ట్...

హైదరాబాద్ : ఓయూలో గోపూజలు నిర్వహించేందుకు ఆర్ ఎస్ ఎస్, గోసంరక్షణ సంరక్షణ కార్యకర్తలను చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

గోశాలలో పూజలు నిర్వహించిన పరిపూర్ణానంద స్వామి

హైదరాబాద్ : లోయర్ ట్యాంక్ బండ్ లోని భాగ్యనగర్ గోశాలలో స్వామి పరిపూర్ణానంద స్వామి పూజలు నిర్వహించారు. ఈ సంద్భంగా దేశంలో గోవధ నిషేధం ఉందన్నారు. ఏపీ, తెలంగాణ లో గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గోవును పూజించాలి తప్ప వధించకూడదని, మా మనోభావాలు కించపరిచేలా వ్యవహరించవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, ఎన్ వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు.

తెలంగాణ ఎక్స్ ప్రెస్ 16 గంటల ఆలస్యం

సికింద్రాబాద్ : ఢిల్లీకి వెళ్లాల్సిన తెలంగాణ ఎక్స్ ప్రెస్ 16 గంటల ఆలస్యంగా నడుస్తుంది. సికింద్రాబాద్ నుంచి తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఈ రోజు రాత్రి పది గంటలకు బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

వంద కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన ఆశా వర్కర్లు

హైదరాబాద్ : వంద రోజులుగా సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లు ఇవాళ్టి నుంచి వంద కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. వారం రోజుల పాటు పాదయాత్ర నిర్వహించి, ఈ నెల 17 హైదరాబాద్ లో బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ ఆశా వర్కర్ల సమ్మె వంద రోజులకు చేరుకుంది. కానీ, వీరి సమస్యకు ఇంకా పరిష్కారం లభించలేదు. ఇది కేంద్రం పథకం కాబట్టి, తాము జీతాలు పెంచేది లేదంటూ తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చే దానికి అదనంగా మరికొంత పారితోషికం ఇస్తున్న విషయాన్ని ఆశా వర్కర్లు గుర్తు చేస్తున్నారు. 

వందరోజులకు చేరుకున్న ఆశా వర్కర్ల సమ్మె

హైదరాబాద్ :తెలంగాణ ఆశా వర్కర్ల సమ్మె వంద రోజులకు చేరుకుంది. కానీ, వీరి సమస్యకు ఇంకా పరిష్కారం లభించలేదు. ఇది కేంద్రం పథకం కాబట్టి, తాము జీతాలు పెంచేది లేదంటూ తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చే దానికి అదనంగా మరికొంత పారితోషికం ఇస్తున్న విషయాన్ని ఆశా వర్కర్లు గుర్తు చేస్తున్నారు. 

08:40 - December 10, 2015

హైదరాబాద్ : నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవహారంలో వెలుగు చూసిన అవినీతిపై రాహుల్ గాంధీ తమకు సంబంధం వుందా? లేదా? అనే అంశాన్ని స్పష్టం చేయాలని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ది హన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ డిమాండ్ చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక అవకతవకలపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. నేషనల్ హెరాల్డ్ కేసు పీఎంఓ కార్యాలయం నుండే కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు? ఇది నిజమేనా? నేషల్ హెరాల్డ్ కుంభకోణం కంటే పెద్ద పెద్ద కుంభకోణాలు దేశంలో జరగలేదా? వాటిపై మోదీ సర్కార్ ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు? రాజకీయంగా సోనియా, రాహుల్ ను టార్గెట్ చేసినట్లేనా? వ్యవసాయ గణాంకాల ప్రకారం భారతదేశంలో 70 శాతం మంది పేద రైతులే వున్నారని తేలింది. ఇది వ్యవసాయ సంక్షోభానికి అద్దంపడుతోందా? వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు అనివార్యమా? ఇత్యాది అంశాలపై నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. పూర్తి విశ్లేషణను మీరు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఓయూ గేట్లు మూసివేసిన పోలీసులు..

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిగటీలో ఓ వర్గం విద్యార్థులు నేడు నిర్వహించతలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ హైదరాబాదులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. నిన్న రాత్రి నుంచే రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఓ వైపు ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ఓ వర్గం విద్యార్థులు చెబుతుండగా, దానిని అడ్డుకుని తీరతామని గోసంరక్షణ సమితి నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని గ్రహించిన పోలీసులు నిన్న సాయంత్రమే రంగంలోకి దిగారు.

ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్....

హైదరాబాద్ : గోసంరక్షణ సమితి నేతలకు మద్ధతుగా ప్రకటనలు గుప్పించిన బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. నేటి తెల్లవారుజాముననే ఆయనకు గృహనిర్బంధం విధించిన పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. పటిష్ట భద్రత మధ్య ఎమ్మెల్యేను షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

స్థిరంగా అల్పపీడన ద్రోణి

విశాఖ : ఉత్తర తమిళనాడు, కొమరిన్ తీరాలను ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణిస్థిరంగా కొనసాగుతుంది. ఇది బలపడకపోగా, ఆపై బలహీనపడకుండా నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడులో తీరానికి ఆనుకొని అటు, ఇటుగా గత మూడు రోజులుగా కొనసాగడంతో ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నేడు కూడా దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణమే కొనసాగవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.

07:33 - December 10, 2015

హైదరాబాద్ : ఓయూలో పెద్ద కూర ఉడుకుతుందా..ఉడకదా అనేది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. కర్రీపై వర్రీ ఇంకా కొనసాగుతూనే ఉంది. బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు హైకోర్టు నో చెప్పినా.. పెద్ద కూర పండుగను ఆపేది లేదని నిర్వాహకులు కుండ బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. మరోపక్క హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఓయూలో భారీగా బలగాలను మోహరించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికి కర్రీ ఇష్యూతో వర్శిటీ కుతకుతలాడుతోంది. బీఫ్ ఫెస్టివల్ పై విద్యార్థులను మతతత్వ వాదులు రెచ్చగొడుతున్నారా? హైకోర్టు ఉత్తర్వులు విద్యార్థులకు అందలేదా? ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో టిడిపి రాజారాం యాదవ్,టిఆర్ ఎస్ నేత రాకేష్, ఎస్ఎఫ్ఐ నేత ముసాఫిర్, బిజెపి నేత శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. మరి ఈ చర్చను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఓయూలో కోనసాగుతున్న అరెస్ట్ ల పర్వం...

హైదరాబాద్ : హక్కుల పరిరక్షణ పేరిట కొంతమంది విద్యార్థులు నిర్వహించతలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ నేపథ్యంలో వర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని విద్యార్థులు, అడ్డుకుని తీరతామని గోసంరక్షణ సమితి నేతలు పరస్పర ప్రకటనలు గుప్పించుకున్నారు. ఈ క్రమంలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహణకు వర్సిటీలో అనుమతి లేదని నిన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రంగప్రవేశం చేసిన పోలీసులు రాత్రి పొద్దుపోయిన తర్వాత వర్సిటీ హాస్టళ్లలో ముమ్మరంగా సోదాలు చేశారు.

07:25 - December 10, 2015

హైదరాబాద్ : తెలంగాణ ఆశా వర్కర్ల సమ్మె వంద రోజులకు చేరుకుంది. కానీ, వీరి సమస్యకు ఇంకా పరిష్కారం లభించలేదు. ఇది కేంద్రం పథకం కాబట్టి, తాము జీతాలు పెంచేది లేదంటూ తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చే దానికి అదనంగా మరికొంత పారితోషికం ఇస్తున్న విషయాన్ని ఆశా వర్కర్లు గుర్తు చేస్తున్నారు.

చిన్న విషయం కాదు. ....

వంద రోజుల పాటు సమ్మె కొనసాగించడం చిన్న విషయం కాదు. సాధారణ విషయం కాదు. దాదాపు పాతిక వేల మంది ఆశా వర్కర్లు ఒకే గొంతుక వినిపిస్తూ గత సెప్టెంబర్ 2 నుంచి సమ్మె చేస్తున్నారు. ఇంత సుదీర్ఘకాలం పాటు ఆశా వర్కర్లు సమ్మె చేస్తారని, ఇన్ని రోజుల పాటు ఇన్ని వేల మంది ఒకే మాట మీద నడుస్తారని ఎవరూ ఊహించివుండరు. ఇంతకాలమూ ఇన్ని వేల మంది ఆశా వర్కర్లతో అత్యంత శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న నాయకత్వం నిజంగా అభినందనలకు అర్హమైనదే.

ఆశా వర్కర్ల విషయంలో సర్కార్ నిర్లిప్తత...

మారుమూల గ్రామాల్లోనూ, మురికివాడల్లోనూ కుటుంబ సంక్షేమ పథకాలు, వైద్య ఆరోగ్య సేవా కార్యక్రమాల్లో ముఖ్య పాత్ర పోషించే ఆశా వర్కర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇంత నిర్లప్తంగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వంద రోజులుగా సమ్మె నడుస్తున్నా, ఏదో ఒక స్థాయిలో వారిని సంత్రుప్తి పరిచేందుకు ప్రయత్నించకపోగా, ఒక దశలో కొందరు మంత్రులు ఘర్షణాత్మక వైఖరిని ప్రదర్శించడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఆశా వర్కర్లు కేంద్ర ప్రభుత్వ స్కీమ్ పరిధిలోకి వస్తారనడంలో సందేహం లేదు. అయితే, వంద రోజులుగా సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లు తెలంగాణ రాష్ట్రంలోనే పనిచేస్తున్నారన్న వాస్తవాన్ని, తెలంగాణలో కుటుంబ సంక్షేమానికి, వైద్య ఆరోగ్య సేవలు అందించడానికి క్రుషి చేస్తున్నారన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించకూడదు. ఆశా వర్కర్లు ప్రదర్శించే వ్రుత్తి నిబద్ధత వల్ల అంతిమంగా ప్రయోజనం పొందేది తెలంగాణ సమాజమే. ఈ లెక్కన చూసిన్నప్పుడు ఆశా వర్కర్లను ఉత్సాహపరిచేందుకు, వారి నుంచి మరింత సమర్ధవంతంగా సేవలను పొందేందుకు ప్రయత్నించాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వం మీద వుంటుంది. ఈ విషయాన్ని గుర్తించిన కేరళ, పశ్చిమబెంగాల్, కర్నాటక, హర్యానా, రాజస్థాన్ లాంటి కొన్ని రాష్ట్రాలు కేంద్రం ఇచ్చే పారితోషికాలకు అదనంగా గౌరవ భ్రుతి చెల్లిస్తున్నాయి. అదే తరహాలో మరికొంత గౌరవ భ్రుతి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వెనకాడాల్సిన అవసరం లేదు.

కేసీఆర్ ప్రభుత్వం నిర్ధయగా వ్యవహరించడం....

తాను కొంత గౌరవ భ్రుతి ఇచ్చి, మరికొంత రాబట్టేందుకు ఆశా వర్కర్ల తరపున కేంద్రం మీద ఒత్తిడి తెస్తే, తెలంగాణ సమాజంలో తమ రాష్ట్ర ప్రభుత్వం పట్ల గౌరవ భావం ఏర్పడడానికి ఆస్కారం వుంటుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించకపోవడమే బాధాకర పరిణామం. ఇంత సుదీర్ఘకాలంగా జరుగుతున్న ఈ సమ్మె విషయంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్ధయగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వం తమ కోరికల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న భావన ఆశా వర్కర్లలో ఏర్పడుతోంది. తమ ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యంగానూ, నిర్ధయగానూ వ్యవహరిస్తోందన్న భావన రెక్కల కష్టం మీద ఆధారపడే సెక్షన్ లలో కలిగించడం ఏ ప్రభుత్వానికీ మంచిది కాదు. క్షేమం కాదు. 

07:22 - December 10, 2015

ఆశా వర్కర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లప్తతహైదరాబాద్ : వంద రోజులుగా సమ్మె చేస్తునన ఆశా వర్కర్లు ఇవాళ్టి నుంచి వంద కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. వారం రోజుల పాటు పాదయాత్ర నిర్వహించి, ఈ నెల 17 హైదరాబాద్ లో బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆశా వర్కర్ల సమ్మె ఇంత సుదీర్ఘ కాలం కొనసాగడానికి కారణం ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వానికీ, ఆశా వర్కర్లకీ మధ్య ఏదో ఒక రాజీ కుదరకపోవడానికి కారణం ఏమిటి? ఈ సమస్య పరిష్కారం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం తీసుకోవాల్సిన చర్యలేమిటి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీఐటీయూ నేత భూపాల్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై మాట్లాడారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:18 - December 10, 2015

హైదరాబాద్ : ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లోనూ సత్తా చాటుతూ... ప్రత్యర్థులకు ఊపిరి సలపనివ్వని టీఆర్‌ఎస్‌... ఇప్పుడు మండలి ఎన్నికల్లో కాస్తంత టెన్షన్‌కు గురవుతోంది. 12 ఎమ్మెల్సీ స్థానాలనూ ఏకపక్షంగా గెలుచుకుంటామనే ధీమా అధికార పార్టీలో నిన్నమొన్నటి వరకూ కనిపించింది. కాని సగం స్థానాల్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయనే అనుమానాలు ఇప్పుడు గులాబి పార్టీని వెంటాడుతున్నాయి.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌కు పట్టు....

ఉత్తర తెలంగాణా జిల్లాల్లో టీఆర్‌ఎస్‌కు బలమైన నేతలతో పాటు స్థానికంగా కూడా పట్టు ఉంది. దీంతో ఆయా జిల్లాల్లో మండలి అభ్యర్థుల విజయానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆరు స్థానాలు సింపుల్‌గానే గులాబి పార్టీ ఖాతాలో చేరిపోనున్నాయి. కాని దక్షిణ తెలంగాణా జిల్లాలైన మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ తో పాటు ఖమ్మం జిల్లాల్లో పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఎదుర్కోక తప్పేలా కనిపించడం లేదు.

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌కు మెజార్టీ ఓటర్లు...

నల్గొండ జిల్లా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఉండడంతో.....ఆ జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థి గెలుపుపై నేతల్లోనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో రెండు మండలి స్థానాలున్నా.....ఒక్కో స్థానం విజయంపై ఎలాంటి అనుమానం లేదు. కాని మరో స్థానం దక్కించుకోవాలంటే ప్రతిపక్ష పార్టీల ఓటర్లపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కూడా ఆయా జిల్లాల్లో ఒక్కో అభ్యర్థిని రంగంలోకి దించడంతో పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయో అంతుచిక్కడం లేదు. గులాబి పార్టీకి ముందు నుంచి పెద్దగా పట్టులేని ఖమ్మం జిల్లాలోనూ అధికార పార్టీకి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.

క్యాంపు రాజకీయాలు ప్రారంభం.....

మరోపక్క క్యాంపు రాజకీయాల ఆనవాయితీని కూడా అధికార పార్టీ ఫాలో అవుతోంది. ఎప్పటికప్పుడు రాజకీయంగా సమీకరణాలు మారుతుండడంతో ఆ పార్టీ జాగ్రత్తపడుతోంది. 

07:16 - December 10, 2015

హైదరాబాద్ : నల్గొండ జిల్లాలో కృష్ణానదిపై నిర్మించిన నాగార్జనసాగర్‌ డ్యామ్‌ కు 60 ఏళ్లు నిండాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలకు ఈ ప్రాజెక్ట్‌ ద్వారా సాగునీరు అందుతోంది. నాగార్జనసాగర్‌ రాకతో బీడు భూములు సస్యశ్యమంగా మారాయి. 1955 డిసెంబర్‌ 10 న అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ ప్రాజెక్ట్‌ కు శంకుస్థాపన చేశారు. సాగర్‌ మహాయజ్ఞ నిర్మాణంలో 45 వేల మంది పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత మహాకట్టడం ఇది. 1964లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా నాగార్జునసాగర్‌ నుంచి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్‌ను జాతికి అంకింతం చేశారు. ఆ రోజుల్లో దీని నిర్మాణానికి 98 కోట్ల రూపాయల ఖర్చు అయ్యింది. సాగర్‌ కుడి, ఎడమ కాల్వల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఐదు జిల్లాల్లో 22 లక్షల ఎకరాల భూమి సాగువుతోంది. హైదరాబాద్‌ మహానగరంలోని లక్షలాది మంది దాహార్తిని తీరుస్తోంది. నల్గొండ జిల్లాలోని వందలాది గ్రామాలకు మంచినీరు అందుతోంది. నాగార్జునసాగర్‌ జల విద్యుత్‌ కేంద్రం వెలుగులు విరజిమ్ముతొంది. ఇది బహుళార్ధ సాధక ప్రాజెక్ట్‌.

ప్రాజెక్టును ప్రతిపాదించింది అలీ నవాబ్ జంగ్

బీదర్, ఔరంగాబాద్ తదితర ప్రాంతాలతో కూడినది హైదరాబాద్ రాష్ట్రం. తన సాగు , తాగు నీటి అవసరాలకు భారీ డ్యాం నిర్మించాలని సంకల్పించింది నెహ్రూ ప్రభుత్వం. కృష్ణ నదినీటిని వినియోగించుకునుందుకు మహోన్నత మైన మానవ ప్రయత్నానికి నిలువుటద్దం ఈ మహాకట్టడం. కరవు కాటకాలతో అల్లాడుతున్న ప్రజల అవసరాన్ని గుర్తించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగుతాగునీటి అవసరాన్ని గుర్తించింది కేంద్రప్రభుత్వం. నల్లగొండ జిల్లాలోని నందికొండ వద్ద ప్రాజెక్టు నిర్మించాలని అప్పటి హైదరాబాద్ రాష్ట్రం సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆంధ్రాలోని గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని గుర్తించిన అప్పటి ఇంజనీర్ అలీ నవాబ్ జంగ్ ఇరు రాష్ట్రాలకు కలిపి ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాధన ముందుకు తీసుకువచ్చిన నందికొండ ప్రాజెక్టు సూత్రధారి ఆయన.

ప్రాజెక్టులో పాల్గొన్న 45 వేలమంది కూలీలు

అప్పట్లోనే 45 వేల మంది ఈ మహా యజ్ఞంలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే మానవ నిర్మిత మహాకట్టడంగా ఆవిష్కరించారు. 1964లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేశారు. అప్పట్లో ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 98 కోట్లు మాత్రమే ఖర్చయింది. అదే ఇప్పుడయితే లక్షల కోట్లు ఖర్చు చూసినా దశాబ్దాల కాలం దాటినా ప్రాజెక్టు పూర్తి చేయడం అసాధ్యం. టెక్నాలజీ పెరిగినా ఎందరో మహామహులైన ఇంజనీర్లు ఉన్నాఏళ్లు పడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడంగా ఈ ప్రాజెక్టుకు పేరుంది. 11 కిలోమీటర్ల మేర విస్తీర్ణం కలిగిన జలాశయం ఉంది. గరిష్ట నీటి మట్టం 590 అడుగులు . పూర్తిస్థాయి సామర్థ్యం 408 టీఎంసీలు. డెడ్ స్టోరేజీ 168 టీఎంసీ డెడ్ స్టోరేజీ కెపాసిటీని సైతం కలిగి ఉండడం విశేషం

ప్రధాన డ్యాం 1.5 కిలోమీటర్లు....

ప్రాజెక్టు ఐదు కిలో మీటర్ల పొడవుఉండగా .. ప్రధాన డ్యాం 1.5 కిలోమీటర్ల, కుడి ఎర్త్ డ్యాం 1.5 కిలోమీటర్లు , ఎడమ ఎర్త్ డ్యాం 2.5 కిలో మీటర్లు మేర మొత్తం ప్రాజెక్టు నిర్మించారు. మొత్తం 26 క్రస్ట్ గేట్లతో అద్భుతంగా తీర్చదిద్దారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఏకైక కట్టడం నాగార్జున సాగరే . దాదాపు 22లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్న రైతన్నల అక్షయపాత్ర సాగర్ . నల్లగొండ జిల్లాలోని వందలాది గ్రామాలు, ఆంధ్రాలోని వందలాది గ్రామాలకు తాగు సాగు నీటిని అందిస్తున్న మహాద్భుత కట్టడం నాగార్జున సాగర్. అప్పట్లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయిన వ్యయంతో పోల్చుకుంటే నేడు అవుతున్న ఖర్చు మూడింతలు . నాగార్జున సాగర్ ని ప్రపంచ బ్యాంక్ నిధులతో ఆధునీకరిస్తామని ఇటీవల ప్రాజెక్ట్ ఏఈ , కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు 60 నుండి 70 శాతంఆధునికీకరణ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ఫీడర్ ఛానళ్లు , లింక్ కెనాల్స్ కు సంబంధించి పనులన్నింటిని పూర్తి చేసేలా పర్యవేక్షిస్తున్నామన్నారు.

నేటికి 60 వసంతాలు పూర్తి చేసుకుని 61 వడిలోకి....

ఆధునిక దేవాలయంగా కీర్తి ప్రతిష్టలందుకుంటోంది నాగార్జున సాగర్ . నేటికి 60 వసంతాలు పూర్తి చేసుకుని 61 వ వడిలోకి అడుగిడుతోందీ మహాకట్టడం. మొత్తం 26 క్రస్ట్ గేట్లను ఒక్కసారిగా తెరచినప్పుడు మహాద్భుతం తాండవిస్తుంది. చూడడానికి రెండు కళ్లు చాలవు. కోట్ల మందికి దాహార్తిని, సాగు నీటిని అందస్తున్న అపర భగీరద ప్రయత్నం.. మానవ నిర్మిత మహాద్భుతం మన నాగార్జున సాగరం.

07:14 - December 10, 2015

హైదరాబాద్ : గ్రేటర్‌లో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకం అమలులో వేగాన్ని పెంచింది ప్రభుత్వం. సికింద్రాబాద్‌ ఐడీహెచ్‌ కాలనీలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు సక్సెస్‌ కావడంతో..గ్రేటర్‌లోని మరిన్ని ప్రాంతాల్లో వీటిని నిర్మించేందుకు ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. అయితే ఈసారి బహుళ అంతస్థుల భవనాలను కట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం..ఇవాళ పలుచోట్ల శంకుస్థాపనలకు శ్రీకారం చుడుతోంది.

ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం .......

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ...ఓటర్లను ఆకట్టుకునేందుకు గ్రేటర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకంపై ఫోకస్‌ పెట్టింది ప్రభుత్వం. సికింద్రాబాద్‌ ఐడీహెచ్‌ కాలనీలో నిర్మించిన 396 ఇళ్లను ఇటీవలే లబ్దిదారులకు అందించిన సర్కార్‌..గ్రేటర్‌లోని మరిన్ని ప్రాంతాల్లో వీటిని నిర్మించేందుకు రంగం సిద్దం చేసింది.

22 నియోజకవర్గాల్లోని 47 ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం .....

గ్రేట‌ర్ ప‌రిధిలో టూబెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ఇవాళ పెద్ద ఎత్తున శంకుస్థాప‌న‌లు జ‌రుగ‌నున్నాయి. రాష్ర్ట ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ప‌లువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన‌నున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అనేక ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించిన జీహెచ్‌ఎంసీ..మరో 22 నియోజకవర్గాల్లోని 47 ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను చేపట్టాలని నిర్ణయించింది.కంటోన్మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోని ర‌సూల్‌పుర క్రాస్‌రోడ్ క‌ట్టమైస‌మ్మ సిల్వర్ కంపౌండ్‌, ముషీరాబాద్ లంబాడి తండా, శ్రీ‌సాయిచ‌ర‌ణ్ కాల‌నీలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించనున్నారు. అలాగే అంబ‌ర్‌పేట్ నియోజ‌క‌వ‌ర్గంలోని కాంగారిన‌గ‌ర్‌, మ‌ల‌క్‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోని పిల్లిగుడిసెలు, యాక‌త్‌పుర నియోజ‌క‌వ‌ర్గం స‌ర‌ళాదేవిన‌గ‌ర్‌, చాంద్రాయ‌ణ‌గుట్టలోని రియాస‌త్‌న‌గ‌ర్‌, జంగంమెట్‌, మైసారం, చార్మినార్ నియోజ‌క‌వ‌ర్గంలోని పార్థివాడ‌, ఎస్వీన‌గ‌ర్‌, నాంప‌ల్లిలోని మంగ‌డి బ‌స్తి, కార్వాన్ నియోజ‌క‌వ‌ర్గంలోని హ‌రిదాసుపురంలలో జరిగే శంకుస్థాప‌న‌ల కార్యక్రమానికి జీహెచ్ఎంసి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

ఇళ్ల నిర్మాణంపై అవగాహన లేకపోవడం....

అయితే గ‌తంలో బ‌స్తీవాసుల అంగీకారం లేకుండా రాజీవ్ ఆవాస్ యోజ‌న, జేఎన్‌యూఆర్ఎం ప‌థ‌కాల్లో భాగంగా ఇళ్లను నిర్మించారు. అయితే ఇప్పటికీ అవి నిరుప‌యోగంగా ఉన్నాయని..వాటికి ప్రధాన కార‌ణం ఇళ్ల నిర్మాణంపై ల‌బ్దిదారుల‌కు స‌రైన అవ‌గాహ‌న లేకపోవడమే అని జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ గుర్తించారు. ప్రస్తుతం చేప‌ట్టే డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై ముందుగా లబ్దిదారులకు పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించి సంతృప్తి చెందిన తర్వాతే ఇళ్లను నిర్మించాల‌ని నిర్ణయించారు. అయితే గ్రేటర్‌లో తాజాగా జీహెచ్‌ఎంసీ చేపట్టే ఇళ్లనిర్మాణానికి 22 ప్రాంతాలకు చెందిన బ‌స్తీవాసులు లిఖిత‌పూర్వకంగా అంగీక‌రించారు. వీటిలో 17 ప్రాంతాల్లో 9అంత‌స్తులలో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి కూడా ఆయా బ‌స్తీవాసులు అంగీక‌రించారు. ఒక్కో ఇంటికి దాదాపు 6 లక్షల 81 వేల వ్యయంతో నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరంలో గ్రేటర్‌ పరిధిలో 8,650 ఇళ్లను నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో...ఇళ్లులేని నిరుపేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

07:09 - December 10, 2015

హైదరాబాద్ : ఏపీలో కరవు, వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. ఈ రెండు వైపరీత్యాలతో జరిగిన నష్టాన్ని అంచనావేస్తున్నాయి. మూడు రోజుల పాటు కేంద్ర బృందాల పర్యటన కొనసాగనుంది.

విభిన్న పరిస్థితులు...

ఆంధప్రదేశ్‌లో రెండు విభిన్న పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరికొన్నిజిల్లాల్లో అటు కరవుతోపాటు, ఇటు భారీ వర్షాలు, వరదలు నష్టాన్ని మిగిల్చాయి. రెండు విధాలుగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర అధికారుల బృందాలు రాష్ట్రంలో పర్యటిస్తున్నాయి.

అనంతపురం జిల్లాలో కేంద్ర బృందం....

రాయసీమలోని అనంతపురం జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. హిందూపురం ప్రాంతంలో కరవుతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ప్రధాన పంటైన వేరుసెనగ ఎండిపోవడంతో జరిగిన నష్టాన్ని రైతులు, రైతు సంఘం నాయకులు కేంద్ర బృందానికి వివరించారు.

మంచినీటి ఎద్దడిపై మహిళలు ఖాళీ బిందెలతో నిరసన....

హిందూపురంలో నెలకొన్న తీవ్ర మంచినీటి ఎద్దడిపై మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. సమస్య తీవ్రత గురించి మున్సిపల్‌ అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడంలేదని కేంద్ర బృందానికి వివరించారు. స్థానికంగా నెలకొన్న సమస్యకు కేంద్రం ఏమీ చేస్తుందంటూ కొంత అసహనం వ్యక్తం చేశారు.

తీవ్ర నిరసన....

అనంతపురం జిల్లాలో కేంద్ర బృందం పర్యటించిన తీరుపై రైతు సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కవరుతో ఎండిపోయిన పంటలను పరిశీలించకుండా... ఫోటో ప్రదర్శన తిలికించి వెళ్లిపోయాంటూ మండిపడ్డారు. కేంద బృంద అధికారుల మొక్కుబడి పర్యటనలో కరవు రైతులకు మేలు జరగదని ప్రజా సంఘాల నాయకులు పెదవి విరుస్తున్నారు.

మరో బృందం గంటూరు జిల్లాలో ....

కేంద ప్రభుత్వ అధికారులతో కూడిన మరో బృందం గంటూరు జిల్లాలో పర్యటించింది. నాదెండ్ల మండల సాతులూరుతోపాటు వివిధ గ్రామాల్లో పర్యటించి కరవు పరిస్థితిని పరిశీలించారు. ఎండిపోయిన పంటలను చూశారు. రైతులను అడిగి నష్టం వివరాలు తెలుసుకున్నారు. కరువ తీవ్రంగానే ఉందని, ఢిల్లీ వెళ్లిన తర్వాత నివేదిక అందచేస్తామని కేంద్ర బృందం సభ్యుడు బీసీ మెహ్రా చెబుతున్నారు.

కడప, కర్నూలు జిల్లాల్లో...

కడప, కర్నూలు జిల్లాల్లో కూడా కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. కడప జిల్లాలోని రాయచోటి, సంబేపల్లి, రామాపురం, లిక్కిరెడ్డిపల్లె మండలాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. అఖిలేష్‌ కమల్‌, గణేష్‌రామ్‌, సౌరస్‌సింగ్‌లతో కూడా కేంద్ర బృందం సభ్యులు రైతులు, రైతు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. కరవుపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. కర్నూలు జిల్లాలోని తుగ్గలి, మద్దికేర ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. కరవుతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. నష్టం వివరాలు తెలుసుకున్నారు. వర్షాభావంతో భూగర్భ జాలాలు అడుగంటి బోర్లు ఎండిపోవడంతో పంటలను కాపాడుకోలేక పోయామని అన్నదాతలు... కేంద్ర బృందానికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

కేంద్ర బృందం ముందు తన ఆవేదన.....

కవులు రైతులు... కేంద్ర బృందం ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. సహాయం ఏదైనా భూమిపై హక్కు కలిగివున్న రైతుకే అందుతుందికానీ, పంటలపై పెట్టుబడిపెట్టి నష్టపోయిన రైతులకు ఏ సాయం అందడంలేదని అధికారులు దృష్టికి తెచ్చారు. దీనిపై ఆలోచించాలని కోరారు. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో వరద నష్టాన్ని కేంద్ర బృందాలు ఇవాళ పరిశీలిస్తాయి. ఏపీలోని కరవు, వరద నష్టాన్ని అంచనా వేసిన కేంద్ర అధికారుల బృందాలు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అవుతాయి. 

07:04 - December 10, 2015

కృష్ణా : విజయవాడలో కల్తీ మద్యం ఘటనలు ఆగడంలేదు. ఒకదాని తర్వాత మరొకటి జరుతూనే ఉన్నాయి. స్వర్ణబార్‌లో కల్తీమద్యం కేసులో దర్యాప్తు కొసాగుతుండగా..ఇలాంటిదే మరో ఘనటన జరిగింది. కల్తీ మద్యం అమ్మకాలు నగర ప్రజలను కలవర పెడుతున్నాయి.

మరో కసు...

కల్తీమద్యం ఘటనలు విజయవాడను విడిచిపెట్టడంలేదు. స్వర్ణబార్‌ ఘటన నుంచి ప్రజలు ఇంకా తేరుకోక ముందే కల్తీ మద్యానికి సంబంధించిన మరో కేసు నమోదయ్యింది. వాంబే కాలనీ రోడ్‌లో ఉన్న ఒక బార్‌లో మద్యం సేవించిన ఒక వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్పృహతప్పి పడిపోయిన బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం....

కల్తీమద్యం విక్రయించి ఐదుగురి మృతికి కారణమైన స్వర్ణబార్‌ కేసులో దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఈ బృందం సభ్యులు స్వర్ణబార్‌ను సందర్శించి తనిఖీలు చేశారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న వారిని ప్రశ్నించారు. అందరూ కూడా స్వర్ణబార్‌పై ఫిర్యాదు చేశారు. వేళాపాళాలేకుండా ఎప్పుడు పడితే అప్పుడు మద్యం అమ్మినా పట్టించుకునే దిక్కులేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి కల్తీమద్యం ఐదుగురి ప్రాణాలు బలిగొన్న తర్వాత మంత్రులు, అధికారులు హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. చేసేదిలేక సిట్‌ బృందం కొంతమంది నుంచి సమాచారం సేకరించి అక్కడ నుంచి వెళ్లిపోయింది. కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురైన బాధితులు, మృతుల కుటుంబ సభ్యులు నుంచి కూడా సిట్‌ సభ్యులు సమాచారం సేకరించారు. సీనియన్‌ ఐపీఎస్‌ అధికారి మహేష్‌చంద్ర లడ్డా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో ఐపీఎస్‌ అధికారి సెంథిల్‌కుమార్‌తోపాటు డీఎస్‌పీలు, ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న వైన్‌ షాపుల్లో తనిఖీలు....

విజయవాడ కల్తీ మద్యం ఘటన తర్వాత కళ్లు తెరిచిన ఎక్సైజ్‌ అధికారులు... జిల్లా వ్యాప్తంగా ఉన్న వైన్‌ షాపుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. దివిసీమలోని ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో వైన్‌ షాపుల్లో సోదాలు నిర్వహించారు. నిల్వలను పరిశీలించారు. కల్తీలపై ఆరా తీశారు.

వైన్‌షాపులను మూసివేయడంతో....

ఎక్సైజ్‌ అధికారుల ఆదేశాలతో వైన్‌షాపులను మూసివేయడంతో చుక్కపడందే ఏ పనీచేయలేని మందుబాబుల నాలుకలు పిడచకట్టుకుపోయాయి. మద్యం కోసం షాపుల దగ్గర పడిగాపులు కాశారు. బాటిల్‌ కాకపోయినా పెగ్గైన దొరికే చాలనుకున్నారు. తనిఖీలు పూర్తైన తర్వాత వైన్‌ షాపులు తెరవడంతో మద్యం కోసం ఎగబడ్డారు. 

07:03 - December 10, 2015

హైదరాబాద్ : ఓయూలో పెద్ద కూర ఉడుకుతుందా..ఉడకదా అనేది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. కర్రీపై వర్రీ ఇంకా కొనసాగుతూనే ఉంది. బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు హైకోర్టు నో చెప్పినా.. పెద్ద కూర పండుగను ఆపేది లేదని నిర్వాహకులు కుండ బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. మరోపక్క హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఓయూలో భారీగా బలగాలను మోహరించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికి కర్రీ ఇష్యూతో వర్శిటీ కుతకుతలాడుతోంది.

భయం గుప్పెట్లో ఓయూ...

పెద్ద కూర పండుగ పెద్ద దుమారాన్నే రేపుతోంది. బీఫ్‌ పెస్టివల్‌ అంశం వర్శిటీని భయం గుప్పెట్లోకి నడిపిస్తోంది. గురువారం తలపెట్టిన బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు హైకోర్టు అనుమతి నిరాకరించినా...కర్రీని వండటానికే నిర్వాహకులు రెడీ అవుతున్నారు. మరోపక్క పోలీసులు కూడా ఓయూలో మోహరించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళన విద్యార్థుల్లో కనిపిస్తోంది.

హైకోర్టు బుధవారం అనుమతి నిరాకరణ....

ఉస్మానియా యూనివర్శిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహణకు హైకోర్టు బుధవారం అనుమతి నిరాకరించింది.ఈ నెల 20వ తేదీ వరకు వర్సిటీలో ఎలాంటి ఫెస్టివల్స్ నిర్వహించ కూడదని, అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని... సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు పరచాల్సిందేనంటూ ఆదేశించింది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది.

కోర్టు ఆదేశాల నేపథ్యంలో....

కోర్టు ఆదేశాల నేపథ్యంలో యూనివర్శిటీలో బలగాలను మోహరించారు. ఎన్‌ఆర్‌ఎస్‌ హాస్టల్‌ను చుట్టుముట్టి.... ఫెస్టివల్‌ నిర్వాహకులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోపక్క ఏబీవీపీ కార్యకర్తలు వర్శిటీలో దూసుకెళ్లడం..పోలీసులు వారిని అడ్డుకోవడం తదితర ఘటనల వల్ల రోజంతా ఓయూ అట్టుడికింది. హైకోర్టు ఆదేశాల మేరకు.. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఫ్‌ ఫెస్టివల్‌ను అడ్డుకుంటామని పోలీసులు చెబుతున్నారు. శాంతి భద్రతల అంశం కావడంతో... కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు.

శాంతియుత వాతావరణంలో బీఫ్‌ పెస్టివల్‌ను నిర్వహిస్తాం.....

కోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూనే శాంతియుత వాతావరణంలో బీఫ్‌ పెస్టివల్‌ను జరిపి తీరుతామని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. తమకు కోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదని చెబుతున్నారు. అటు వర్శిటీ అధికారులు కూడా.. బీఫ్‌ పెస్టివల్‌కు అనుమతి లేదని ప్రకటించారు. బీఫ్‌, ఫోర్క్ ఫెస్టివల్‌కు అనుమతి లేదని, ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఓయూ రిజిస్ట్రార్‌ హెచ్చరించారు. మొత్తానికి పెద్దకూర పండుగ సానుకూల, వ్యతిరేక వర్గాల మోహరింపుతో ఓయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది.

బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకుల అరెస్ట్....

బీఫ్‌ ఫెస్టివల్ నేపథ్యంలో ఓయూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులు ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అటు జేఎన్‌టీయూలో కూడా పలువురు విద్యార్థి సంఘ నాయకుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కఠిన చర్యలు తీసుకుంటాం: ఓయూ రిజిస్ట్రార్.........

ఓయూలో బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఓయూ రిజిస్ట్రార్‌ నిర్వాహకుల్ని సూచించారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తే...అడ్మిషన్స్‌ను క్యాన్సిల్‌ చేస్తామని రిజిస్ట్రార్‌ హెచ్చరించారు. బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహణపై నిషేధాజ్ఞలు ఉన్న నేపథ్యంలో ఓయూలో హై టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఓయూలో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు నిర్వహిస్తున్నారు. 

06:53 - December 10, 2015

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో ఉన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ కుమార్తె పెళ్లి విందుకు హాజరైన ఇద్దరు కలుసుకున్నారు. వధూవరులను ఆశ్వీర్వదించి కేసీఆర్‌ తిరిగివస్తుండా... చంద్రబాబు ఎదరయ్యారు. ఇద్దరూ పరస్పర అభివాదం చేసుకుని కుశల ప్రశ్నలు వేసుకున్నారు. గత నెలలో జరిగిన నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు మళ్లీ ఇప్పుడే కలుసుకున్నారు.

జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ను కలిసిన కేసీఆర్....

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ను కలిశారు. హైకోర్టు విభజనపై ఇద్దరూ చర్చించినట్టు సమాచారం. ఈ విషయంలో ఎదురవుతున్న అవరోధాలు సమాలోచనలు జరిపారని తెలుస్తోంది. ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉండే కేసీఆర్‌... పలువురు కంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. సాయంత్రం విజ్ఞాన్‌ భవన్‌లో జరిగే ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ 75వ జన్మదిన వేడుకల్లో పాల్గొంటారు.

వివిధ ప్రతినిధి బృందాలతో భేటీ అయిన సీఎం చంద్రబాబు....

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివిధ ప్రతినిధి బృందాలతో భేటీ అయ్యారు. ఏపీ భవన్‌లో ఫాక్స్‌కాన్‌ ప్రతినిధి బృందం..బాబును కలిసింది. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, సెల్‌ఫోన్ల తయారీ యూనిట్‌ ఏర్పాటుపై చర్చించారు. ఏపీ ప్రభుత్వం ఇందుకు అన్ని విధాల సహకరిస్తుందని..బాబు హామీ ఇచ్చారు. ఆ తర్వాత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేష్‌ శర్మతో భేటీ అయిన చంద్రబాబు..రాష్ట్రంలో టూరిజం అభివృద్ధిపై చర్చించారు. సముద్రతీరం వెంబడి బీచ్‌ టూరిజం, అటవీ ప్రాంతాల్లో పర్యావరణ టూరిజం అభివృద్ధి ప్రాజెక్ట్‌ల అభివృద్ధికి నిధుల కేటాయించాలని కోరారు. కృష్ణా జిల్లాలోని కూచిపూడిని సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఏబీ బర్ధన్‌ను పరామర్శించిన చంద్రబాబు....

ఢిల్లీలోని జేబీ పంత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ నేత ఏబీ బర్ధన్‌ను చంద్రబాబు పరామర్శించారు. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ భవన్‌లో టీడీపీ-బీజేపీ ఎంపీలతో కూడా భేటీ అయ్యారు. ఏపీ పునర్వస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై చర్చించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇవాళ కూడా చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. 

పోలవరం నుంచి మహారాష్ట్ర కు జలమార్గం...

హైదరాబాద్ : పోలవరం నుంచి మహారాష్ట్ర వరకు గోదావరి నదిపై జలమార్గం కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూజలమార్గంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరింతగా బీజం పడుతుందన్నారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులు జలమార్గానికి అనుకూలంగా ఉండేలా నిర్మాణం చేస్తామని చెప్పారు.

బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తే అడ్మిషన్లు రద్దు: రిజిస్ట్రార్

హైదరాబాద్ : ఓయూ లో గురువారం బీఫ్ ఫెస్టివల్ కు ఎలాంటి అనుమతులు లేవని ఓయూ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థుల అడ్మిషన్లు రద్దుకు చేస్తామని హెచ్చరించారు.

Don't Miss