Activities calendar

11 December 2015

జలమండలిలో సిబ్బంది మోసం..

హైదరాబాద్ : జలమండలిలో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇద్దరు వ్యక్తుల నుండి సిబ్బంది కోటి రూపాయలు వసూలు చేశారు. జలమండలి సంస్థ ఎండీకి బాధితులు ఫిర్యాదు చేశారు. సిబ్బందిపై సీసీఎస్ లో ఎండీ ఫిర్యాదు చేశారు. 

రేపు దక్షిణాది రాష్ట్రాల సీఎంల భేటీ..

విజయవాడ : దక్షిణాది రాష్ట్రాల సీఎంల భేటీ రేపు జరుగనుంది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ ఈ భేటీకి హాజరు కానున్నారు.

 

ప్రత్యేష కేసు..తండ్రికి బెయిల్..

హైదరాబాద్ : ప్రత్యూష కేసులో తండ్రికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సవతి తల్లికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. 

ఏపీ నెంబర్ వన్ చేయడమే ఆయన లక్ష్యం - పల్లె...

ఢిల్లీ : దేశంలో ఎపీని నెంబర్ వన్ చేయడమే చంద్రబాబు లక్ష్యమని, ఏ రాష్ట్రంలో లేవన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టం జరిగిందని ఏపీ మంత్రి పల్లె పేర్కొన్నారు. త్వరలో 13 లక్షల రేషన్ కార్డు, 20 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బెల్ట్ షాపుల నియంత్రణకు కట్టుబడి ఉన్నామని, బాక్సైట్ పై గిరిజనుల అభిప్రాయాల మేరకే అందచేస్తామన్నారు. 

కాబూల్ లో పేలుడు..

అప్ఘనిస్తాన్ : కాబూల్ లో శుక్రవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవరైనా మృతి చెందారా ? అనేది తెలియరాలేదు. గత మంగళవారం రాత్రి పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 50 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. 

సైనా పరాజయం..

దుబాయ్ : భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ రెండో ర్యాంకు క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన మహిళల గ్రూప్-బి మ్యాచ్ లో సైనా నెహ్వాల్ 21-16, 18-21, 14-21 తేడాతో తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలైంది. 

చంబరబాక్కం నీటి విడుదల వల్లే నష్టం - కరుణానిధి..

చెన్నై : చంబరబాక్కం చెరువు నుండి నీటిని విడుదల చేయడం వల్లే చెన్నైలో భారీ వరదలు సంభవించాయని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి పేర్కొన్నారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేయదు - సోమ్ నాథ్..

ఢిల్లీ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయదని ఆప్ దక్షిణ భారత ఇన్ ఛార్జీ సోమ్ నాథ్ భారతి ప్రకటించారు. 

పురాణం సతీష్ విజయోత్సవ ర్యాలీ..

ఆదిలాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న పురాణం సతీష్‌కుమార్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన వారంతా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో బరిలో సతీష్‌కుమార్ ఒక్కరే మిగిలారు. దీంతో ఆయన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టయింది. 

టీఎస్పీఎస్సీకి స్కొచ్ అవార్డు..

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కి స్కొచ్ అవార్డును ప్రదానం చేశారు. ఇవాళ న్యూఢిల్లీలో జరిగిన స్కొచ్ సమ్మిట్ సందర్భంగా ఈ అవార్డును కమిషన్ ఛైర్మన్ ఘంటా చక్రపాణి అందుకున్నారు.

 

సౌత్ జోన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్...

హైదరాబాద్: నగరంలోని సౌత్ జోన్ పరిధిలో పోలీసులు ఈవ్ టీజర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 30 బృందాలతో ఈ తనిఖీలు కొనసాగించారు. స్కూళ్లు, కాలేజీలు, ఆర్టీసీ బస్సుల్లో అమ్మాయిలను వేధిస్తోన్న 55 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. 

21:30 - December 11, 2015

ఛండీఘడ్ : విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి -వృద్ధ దంపతులపై దాడికి పాల్పడ్డ ఘటన ఛండీగడ్‌లోని మార్కెట్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన విజువల్స్‌ సిసిటీవీలో రికార్డ్‌ అయ్యాయి. సెల్‌ ఫోన్ కొనేందుకు వచ్చిన ఆ వ్యక్తి వృద్ధ దంపతుల కుమారుడితో బేరమాడుతున్నారు. వారి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఇంతలోనే అతడు పెద్ద వాళ్లన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వారిపై చేయి చేసుకున్నాడు. పెద్దావిడతో పాటు ఆమె భర్త చెంప ఛెళ్లు మనిపించాడు. తన ఫోర్‌ హెడ్‌తో ఆ వృద్ధిని తలపై బాదాడు. ఈ ఘటన జరిగినప్పుడు అతడు మద్యం తాగి ఉన్నాడు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

21:27 - December 11, 2015

ఢిల్లీ : భారత్‌లో మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబేకు ఢిల్లీలో ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోడీతో షింజో అబే రేపు సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ - జపాన్‌ ప్రధాని షింజో అబేతో కలిసి రేపు వారణాసిలో పర్యటించనున్నారు. ఇద్దరు ప్రధానులూ వారణాసిలో నిర్వహించే గంగా హారతిలో పాల్గోనున్నారు. షింజో భారత్‌కి మంచి మిత్రుడని.. భారత్-జపాన్ సంబంధాలపై షింజోకి ఉన్న ఆలోచనలు అద్భుతమైనవని మోడీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. షింజో పర్యటనలో ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్‌ ట్రెయిన్‌, పౌర అణు ఒప్పందంపై ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. 

21:25 - December 11, 2015

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నానాటికి కాలుష్యం పెరిగిపోవడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణకు పలు సూచనలు చేసింది. ఢిల్లీలో కొత్త డీజిల్ వాహనాలకు రిజిస్ట్రేషన్లు ఆపేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కేంద్రం, ఆప్‌ ప్రభుత్వాలు తమ ఉద్యోగుల కోసం కొత్తగా డీజిల్ వాహనాలు కొనొద్దని సూచించింది. ఇది కేవలం ప్రభుత్వ వాహనాలకే పరిమితం చేసింది. ప్రజలకు చెందిన ప్రయివేట్‌ డీజిల్‌ వాహనాలకు కూడా దీన్ని వర్తింప చేయాలని ఎన్‌జీటీ ప్రతిపాదించింది. కార్లతో పోలిస్తే ధూళి, ట్రక్కులు, ద్విచక్ర వాహనాల వల్లే ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోందని కాన్పూర్‌ ఐఐటి స్టడీలో తేలింది. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ఆప్‌ సర్కార్‌ తెస్తున్న సరి-భేసి సంఖ్యల నెంబర్‌ ప్లేట్‌ ఆధారంగా రోజు తప్పించి రోజు కార్లు నడపాలన్న పాలసీపై గ్రీన్‌ ట్రిబ్యునల్‌ సందిగ్దం వ్యక్తం చేసింది. ఈ విధానంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం మాట ఎలాగున్నా... ఒక్కొక్కరూ రెండేసి కార్లు కోనేందుకు పురికొల్పేలా పాలసీ ఉందని ట్రిబ్యునల్‌ వ్యాఖ్యానించింది.

మోటార్ వెహికల్ యాక్టులో మార్పులు..
ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు జనవరి 1 నుంచి సరి-బేసి నెంబర్ ప్లేట్ ఆధారంగా దినం తప్పించి దినం కార్లను రోడ్ల మీదకు అనుమతించాలని కేజ్రీవాల్ సర్కార్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రణాళిక పరిధిలోకి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులు కూడా రానున్నారు. తమ ప్రణాళికను అమలు చేయడానికి మోటార్‌ వెహికిల్‌ యాక్టులో మార్పులు తెస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించే వారికి 2 వేలు ఆ పై పెనాల్టీ వేసే దిశగా అడుగులు వేస్తోంది. అయితే కేంద్రమంత్రులు దీనిని అనుసరించాలా? లేదా? అన్నది కేంద్ర ప్రభుత్వ విచక్షణాధికారానికే రాష్ట్ర ప్రభుత్వం వదిలేసే అవకాశముందని అధికార వర్గాల సమాచారం. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రణాళికను సామాన్యులతోపాటు వీఐపీలకూ వర్తింపజేయాలని ఆప్‌ ప్రభుత్వం భావిస్తోంది.

21:21 - December 11, 2015

హైదరాబాద్ : టి కాంగ్రెస్ సీనియర్‌ నేత షబ్బీర్ అలీకి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లో బెదిరించారు. ఫోన్‌ నెంబర్‌ను పరిశీలించగా హైదరాబాద్‌ కోడ్‌ నుంచి వచ్చినట్లు తేలింది. ఇది నిజంగానే బెదిరింపు కాలా లేక ఆకతాయిల దుందుడుకు చర్యా అనేది తేలాల్సి ఉంది. ఈ ఫోన్‌ కాల్‌ వ్యవహారంపై షబ్బీర్ అలీ జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

21:18 - December 11, 2015

విజయవాడ : కాపు కార్పొరేషన్‌పై టీడీపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కార్పొరేషన్‌ విధి విధానాలను సర్కార్‌ ఖరారు చేసింది. కాపులకు ప్రత్యేక పోత్సహకాలు అందించేందుకు మార్గదర్శకాలను తయారుచేసింది. దీనికి సంబంధించి బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వంద కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. దీని కోసం ప్రస్తుతానికి 50 కోట్లు విడుదల చేసింది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారికి ఆర్థికపరమైన తోడ్పాడునివ్వడంతో పాటు ప్రోత్సాహకాలు అందించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో 60వేలు, పట్టణ ప్రాంతాల్లో 75 వేలు లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. వ్యవసాయం, పశుసంవర్థక, మైనర్‌ ఇరిగేషన్‌ రంగాల్లో కార్పొరేషన్‌ ద్వారా కాపులకు సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు బ్యాంకుల ద్వారా వ్యక్తిగత రుణాలు మంజూరు చేసే విధంగా విధి విధానాలు ఖరారు చేసింది. వ్యవసాయ రంగంలో బ్యాంకు రుణం 30 నుంచి 50 వేల వరకు..సబ్సిడీ మొత్తం 30 వేల నుంచి 50 వేల వరకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పశు సంవర్థక రంగంలోని స్కీంలకు యూనిట్‌ విలువ లక్ష ఉంటే..బ్యాంకు రుణం యాభై వేలు..సబ్సిడీగా మరో యాభై వేలు ఇవ్వాలని పేర్కొంది. ఇదే రంగంలో యూనిట్‌ విలువ అరవై వేలు ఉంటే రుణం కింద 30 వేలు..సబ్సిడీ కింద మరో 30 వేలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇక ఐఎస్‌బి, మైనర్‌ ఇరిగేషన్‌ రంగంలోనూ యూనిట్‌ విలువలో యాభై శాతం బ్యాంకు రుణం.. మరో యాభై శాతం సబ్సిడీ అందించాలని బీసీ సంక్షేమ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

21:15 - December 11, 2015

విజయవాడ : ఏపీలో కరువు, వరద పరిస్థితులను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందాల పర్యటన పూర్తయింది. మూడు టీములుగా విడిపోయిన కరువు పరిశీలక బృందం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. అనంతరం.. కేంద్రపరిశీలకులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చర్చించారు. అతివృష్టి, అనావృష్టితో రాష్ట్రం నష్టపోయిందని కేంద్రమే ఆదుకోవాలని బాబు కోరారు. ఖరీఫ్‌ సీజనంతా వర్షాలు లేక తీవ్ర కరువు పరిస్థితులు... కొన్ని జిల్లాల్లో బోర్లు నమ్ముకునో మరోరకంగానో రైతులు సాగు చేస్తే పంటలన్నిటినీ తుడిచిపెట్టేసిన వరదలు.. ఇవీ ఏపీలో అతివృష్టి అనావృష్టి మూలంగా ఏర్పడిన పరిస్థితులు. వర్షాలు లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 670 మండలాలకుగాను 399 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అంతర్‌ మంత్రిత్వశాఖల కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చి దుర్భిక్ష పరిస్థితులు, వరదల మూలంగా నష్టపోయిన ప్రాంతాల్లో పరిశీలన జరిపింది.

మూడు టీంలు...
కరువు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు వచ్చిన బృందం మూడు టీములుగా విడిపోయి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. పరిశీలకులు ఈ నెల 8,9 తేదీల్లో పర్యటనలు ముగించి కరువు పరిస్థితులపై ఒక అవగాహనకొచ్చారు. ఇక నెల్లూరు, చిత్తూరు, తదితర జిల్లాల్లో వరదల మూలంగా నష్టపోయిన ప్రాంతాల్లోనూ కేంద్ర వరద నష్టం అంచనా బృందం పర్యటించింది. ఎన్ని వేల ఎకరాల్లో పంట నష్టపోయారు.. ఆస్తి, పశు నష్టం ఎంత అనేదానిపై పరిశీలన జరిపారు. ఈ రెండు బృందాలు శుక్రవారం సిఎం చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యాయి.

కేంద్ర బృందాలతో బాబు భేటీ..
కేంద్ర బృందాలతో భేటీ అయిన చంద్రబాబు ... రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీని వరదలు, కరువు కోలుకోలేని దెబ్బతీశాయని అన్నారు. వరదల మూలంగా వివిధ రంగాలకు 3,759 కోట్ల రూపాయలమేర నష్టం వాటిల్లిందని, కేంద్రం ఇతోధికంగా సాయమందించి ఆదుకోవాలని అన్నారు. వర్షాలు, వరదల మూలంగా కేవలం వ్యవసాయ, ఉద్యానవన పంటలకే 762 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అన్నారు. కరువు పరిస్థితులపై మాట్లాడుతూ ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతం 168 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 71 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైందని తెలిపారు. తీవ్ర ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో 359 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించినట్లు సిఎం వివరించారు. అయితే వివిధ కార్యక్రమాల ద్వారా కరువును ఎదుర్కోవడానికి ప్రయత్నించామన్నారు.

మోడీ కరుణిస్తారా ? 
రాష్ట్రంలో ఏర్పడ్డ దుర్భర పరిస్థితులను ఎదుర్కోవడానికి 2వేల కోట్ల రూపాయల సాయం అందించాలని బాబు కేంద్రాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఙప్తి చేశారు. మొత్తంగా 5,759 కోట్ల రూపాయల సాయం అందించాలనేది ఏపీ ప్రభుత్వ అభ్యర్థన. మరి మోడీ ప్రభుత్వం ఏమేరకు ఏపీని కరుణిస్తుందో చూడాలి. 

21:13 - December 11, 2015

హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జీహెచ్ఎంసీ రిజర్వేషన్లను ప్రకటించారు. వచ్చే నెల మూడో వారంలో గ్రేటర్‌ ఎలక్షన్స్‌ నిర్వహించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 150 వార్డులుండగా వాటిల్లో 106 స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించారు. అన్నిట్లోనూ కలుపుకుని మహిళలకు 75 స్థానాలను రిజర్వ్‌ చేశారు. బీసీలకు 50 స్థానాలు నిర్ణయించగా వాటిల్లో మహిళలకు 25 స్థానాలను రిజర్వ్‌ చేశారు. ఉమెన్ జనరల్ స్థానాలు 44, అన్ రిజర్వుడు కింద 44 స్థానాలను కేటాయించారు. ఎస్సీలకు 10 స్థానాలు కేటాయించగా ఎస్టీలకు 2 స్థానాలను రిజర్వ్‌ చేశారు. మొత్తంగా గ్రేటర్‌ ఎన్నికల్లో 75 మంది మహిళలు పోటీచేసి కార్పొరేటర్లుగా ఎన్నికవనున్నారు.

20:29 - December 11, 2015

జనవరి 17న జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు..ఎమ్మెల్సీ ఎన్నికల్లో 'కారు' జోరు...సీఎం కేసీఆర్ మొక్కులు...తెలంగాణలో కొత్త బార్లు...బిస్కెట్ కోసం తిట్టుకున్న ఎమ్మెల్యే, సీఐ..రాజ్యసభలో 23 మంది సస్పెండ్...మహిళలపై అత్యాచారాలు..అఘాయిత్యాలు చేసే వారి పేర్లు బహిరంగ ప్రదర్శన...జ్యోతిష్కులపై కర్నాటక సర్కార్ గుస్సా..అబద్ధాలు చెబితే నిజం చెప్పే సాఫ్ట్ వేర్..అంశాలపై టెన్ టివిలో 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో తనదైన శైలిలో మల్లన్న విశ్లేషించాడు. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి..

19:52 - December 11, 2015

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులు పునరావాస పథకానికి స్వస్తి పలుకుతోంది. రైతు సమ్మతితో భూ సేకరణ జరిగితే పునరావాసం అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. జీవో 214 ఉత్వర్వులు జారీ చేసింది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జీవో 214 వర్తింపు చేసింది. ప్రత్యామ్నాయ కాలనీలు, మౌలిక వసతులు ఇక ఉండవు. పునరావాసం, నివాసం ఏర్పాటు చెల్లింపు నిబంధనలు తొలగించారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో బి.వెంకట్ (సీపీఎం), పాతూరి సుధాకర్ రెడ్డి (ఎమ్మెల్సీ), అద్దంకి దయాకర్ (కాంగ్రెస్), నైనాల గోవర్ధన్ (టి.జలసాధన సమితి నేత) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

షబ్బీర్ ఆలీకి బెదిరింపులు...

హైదరాబాద్ : టి.కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీకి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చంపుతామని బెదిరింపులు వచ్చాయని జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు నమోదైంది. 040-69542335 నుండి దుండగులు ఫోన్ చేశారు. 

కిదాంబి పరాజయం..

దుబాయి : ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్ మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి ఓటమి చవి చూశారు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన కిదాంబి శుక్రవారం జరిగిన నామాత్రపు మూడోపోరులో తైవాన్ క్రీడాకారుడు టిన్‌చెన్ చేతిలో పరాజయం పాలయ్యారు. 17-21, 13-21 స్కోర్ తేడాతో ఓడిపోయారు. 

తారా చౌదరిపై కేసు..

విజయవాడ : వివాదాస్పద నటి తారా చౌదరి నేరారోపణపై మరోసారి తెరపైకెక్కారు. నటి తారా చౌదరిపై ఏపీలోని విజయవాడలో నున్న పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. నిన్న రాత్రి ఆమె తన వదిన కవితపై దాడి చేశారనే ఆరోపణలున్నాయి.

 

గ్రేటర్ హైదరాబాద్ రిజర్వేషన్ల ఖరారు..

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బీసీ -50, ఉమెన్ జనరల్ - 44, అన్ రిజర్వ్డ్ - 44, ఎస్సీ -10, ఎస్టీ - 2 వార్డులు రిజర్వ్యు అయ్యాయి. వచ్చే నెల మూడో వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగున్నాయి. 

రెండు లారీల రేషన్ బియ్యం స్వాధీనం..

మహబూబ్ నగర్ : అడ్డాకుల టోల్ ప్లాజా వద్ద రెండు లారీల్లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెబ్బేరు నుండి హైదరాబాద్ కు తరలిస్తుండగా పట్టుకున్నారు. 

ఓయూ విద్యార్థుల అరెస్టును ఖండించిన సీపీఎం..

హైదరాబాద్ : ఓయూ విద్యార్థుల అక్రమ అరెస్టులను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండించింది. ఆహారపు అలవాట్లు పౌరుల వ్యక్తిగతమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. వాటికి భంగం కలుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలిదేనని విద్యార్థులపై అక్రమ కేసులను ఎత్తివేసి బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

లోయర్ జూరాల నాలుగో యూనిట్ లో లీకేజీ..

మహబూబ్ నగర్ : లోయర్ జూరాల నాలుగో యూనిట్ లో లీకేజీ ఏర్పడింది. 1,2 యూనిట్ల నుండి జెన్ కో అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వరద నీటిని కిందకు వదులుతున్నారు. 

18:58 - December 11, 2015

విజయవాడ : అమరావతి నిర్మాణం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి విమర్శలకు తావిస్తోంది. రాజధాని నిర్మాణం సొంతింటి వ్యవహారంగా ప్రభుత్వం భావిస్తోందన్న భావనా వ్యక్తమవుతోంది. రాజధాని నిర్మాణం తీరుతెన్నులపై శ్వేతపత్రం విడుదల చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఏపీ రాజధాని నిర్మాణం విషయంలో.. చంద్రబాబు సర్కారు తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అన్నింటా గోప్యత పాటిస్తూ.. పారదర్శకతకు పాతరేస్తోందని బాబు సర్కారుపై ప్రజలు, ప్రజా సంఘాలు విరుచుకు పడుతున్నాయి. సింగపూర్‌ సంస్థలు అలవిమాలిన కోరికలు కోరినట్లు వార్తలు వెలువడ్డ నేపథ్యంలో.. ఆ వివరాలన్నీ బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. సింగపూర్‌ సంస్థ ప్రతిపాదనలను ఆమోదించలేదని.. వీటిలో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయని ప్రభుత్వం ప్రకటిస్తోంది. ప్రజలకు మేలు చేసే నిర్ణయాన్నే తీసుకుంటామని చెబుతోంది. అయితే.. దీన్ని మెజారిటీ ప్రజలు విశ్వసించడం లేదు. వాస్తవాలు ప్రజలకు వివరించాలని సూచిస్తున్నాయి. మొత్తానికి నవ్యాంధ్ర నిర్మాణంపై.. తరచూ సింగపూర్‌ జపం చేస్తున్న చంద్రబాబు.. అక్కడి సంస్థల ప్రతిపాదనలతో అవాక్కయ్యారు. ఇక ఇప్పుడు కూడా అదే మంత్రం జపిస్తారో.. లేక చైనా జపాన్‌ అంటూ మాట మారుస్తారో చూడాలి.

18:56 - December 11, 2015

విజయవాడ : సింగపూర్‌ సంస్థల ప్రతిపాదనలతో చంద్రబాబు సర్కారు నెవ్వెర పోయింది. తమ షరతుల ప్రకారమే రాజధాని కట్టిచ్చి వెళతారని భావిస్తే.. తమకే షరతులు విధించడంతో.. సర్కారు అవాక్కయింది. ఈ షరతులు ఆమోదయోగ్యం కాదంటూ.. ప్రస్తుతానికి మాస్టర్‌ డెవలపర్స్‌ అంశాన్ని పక్కన పెట్టింది. వచ్చే మూడేళ్లలో అమరావతి కోర్‌ కేపిటల్‌ ఏరియాలో.. ప్రభుత్వ భవన నిర్మాణాలతో పాటు.. ప్రైవేట్ రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ వ్యవహారాల్లో వేగంగా పనులు చక్కబెట్టే సంస్థల కోసం అన్వేషిస్తోంది. దీనికి ప్రధాన అభివృద్ధిదారు అవసరం కావడంతో... ప్రైవేట్ సంస్థల నుంచి స్విస్ ఛాలెంజ్ విధానంలో ప్రతిపాదనల్ని ఆహ్వానించింది ఏపీ సర్కారు. మొదటి నుంచీ భావించినట్లుగానే సింగపూర్‌కి చెందిన అసెండాస్, సిన్‌బ్రిడ్జ్, సెంబ్‌కార్ప్ సంస్థలు ఒక బృందంగా ఏర్పడి ప్రధాన అభివృద్ధిదారు ఎంపికకు ప్రతిపాదన సమర్పించాయి. ఈ ప్రతిపాదనలపై సీఆర్‌డీఏ సొంతంగా అధ్యయనం చేసింది. అంతేకాదు... ప్రైజ్ వాటర్‌హౌస్ కూపర్స్‌తో సహా మరో రెండు కన్సల్‌టెన్సీలతో పరిశీలన చేయించింది. వీటిపై ఒక నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా కీలకమైన ఉన్నతాధికారులకు ప్రజంటేషన్ ఇచ్చింది.

మాస్టర్ డెవలపర్స్ ఎంపికపై వెనక్కి..
సింగపూర్‌ సంస్థలు చేసిన ప్రతిపాదనల్లో ఇబ్బందికరమైన అంశాలుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాస్టర్‌ డెవలపర్స్‌ ఎంపికపై వెనక్కి తగ్గింది. సింగపూర్ సంస్థలు బృందంగా ఏర్పడి ఇచ్చిన ప్రతిపాదనల్లో... భూములకు జీపీఏ కోరటం, భూమిని అభివృద్ధి చేశాక, దానికి ధర నిర్ణయించి విక్రయించుకునే అధికారం కావాలనటం ప్రభుత్వానికి నచ్చలేదు. పైగా రాజధాని ప్రాంతంలో 17 కోట్ల చదరపు అడుగుల భవన నిర్మాణాలు రావాలని, రూ.50 వేల కోట్ల పెట్టుబడులు రావాలని ప్రభుత్వం భావిస్తుంటే... వీటిపై ఆ బృందం నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేయలేదు.


సింగపూర్‌ సంస్థల ప్రతిపాదనల్లో అత్యంత కీలకమైనది. రాజధానికి భూములిచ్చిన రైతులకు.. కోర్‌ కేపిటల్‌కు దూరంగా భూమి ఇవ్వాలనడం. భూమి ఇచ్చిన రైతులకు వారి గ్రామాల పక్కనే అభివృద్ధి చేసిన స్థలం ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. మౌలిక వసతుల అభివృద్ధి తర్వాత కూడా కనీసం రెండు వేల ఎకరాల స్థలం మిగులుతుందని ఇంత భూమిని సింగపూర్‌ బృందానికి అప్పగించటం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలిసింది. సింగపూర్‌ బృందం ప్రతిపాదనలను ఒప్పుకుంటే.. విజయవాడ, మంగళగిరి సమీప ప్రాంతాల్లోని భూములపైనా ప్రభుత్వ అధికారాలు పరిమితమవుతాయి. అభివృద్ధి చేశాక విక్రయించే భూమి విలువలో కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతున్నా మిగిలిన పనులన్నింటిలోనూ ప్రభుత్వానిది దాదాపు ప్రేక్షక పాత్రే అవుతుంది. ఇవన్నీ ఆచరణ సాధ్యమయ్యే అంశాలే కావని ప్రభుత్వం భావించింది. ఇదే విషయాన్ని సీఆర్‌డీఏ ఆ సంస్థల బృందానికి తెలియజేస్తూ... తమకు అంగీకార యోగ్యమైన రీతిలో వాటిల్లో మార్పులు, చేర్పులు చేసి తిరిగి సమర్పించాలని కోరింది. ఆ బృందం తిరిగి ప్రతిపాదనలు సమర్పించాక తిరిగి సీఆర్‌డీఏ పాలక మండలి సమావేశమై చర్చిస్తుంది. 

18:51 - December 11, 2015

గుంటూరు : మాస్టర్‌ ప్లాన్‌ ఇచ్చారు.. తమ దేశం కన్నా అద్భుతంగా రాజధానిని నిర్మించి ఇస్తామన్నారు.. మీకెందుకు అన్నింటికీ మాదీ పూచీ అన్నారు. దీంతో చంద్రబాబు సర్కారు ఎగిరి గంతేసింది. సింగపూర్‌ సంస్థలనే కోర్‌ కేపిటల్‌ మాస్టర్‌ డెవలపర్స్‌గా ఫిక్స్‌ చేద్దామని నిర్ణయించేసుకుంది. ఇంతలో సీన్‌ రివర్స్‌ అయింది. ఇప్పుడా సింగపూర్‌ సంస్థలను చూస్తేనే సర్కారు బెదిరి పోతోంది... ఇంతకీ ఏం జరిగింది..?

సింగపూర్ ప్రతిపాదనలు..
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి... అతి తక్కువ కాలావధిలోనే మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసిచ్చిన సింగపూర్‌ సంస్థలు.. మాస్టర్‌ డెవలపర్స్‌గా కూడా ఉండేందుకు తయారయ్యాయి. సింగపూర్‌ మోజులో ఉన్న ఏపీ సిఎం చంద్రబాబు దీనికి తలూపారు కూడా. అంతా అయిపోయింది.. ఇక మాస్టర్‌ డెవలపర్స్‌ హోదాలో సింగపూర్‌ సంస్థలు.. అమరావతిని నిర్మించేస్తాయని అనుకుంటున్నంతలో.. సర్కారుకు దిమ్మతిరిగి బొమ్మ కనబడింది. మాస్టర్‌ డెవలపర్స్‌గా ఉండేందుకు.. సింగపూర్‌ సంస్థలు చేస్తున్న ప్రతిపాదనలు సర్కారుకు సినిమా చూపిస్తున్నాయి.

నాలుగు వేల ఎకరాలకు జీపీఏ ​కావాలంట..
ఇంతకీ సింగపూర్‌ సంస్థలు కోరుతున్నదేంటి..? ఈ ప్రశ్నకు ఎవరైనా దిగ్భ్రాంతికి గురయ్యే సమాధానమే వస్తోంది. కోర్‌ కేపిటల్‌ నిర్మాణానికి మూలధనంగా కేవలం 300 కోట్ల రూపాయలను పెట్టుబడి పెడతారట.. బదులుగా కేంద్ర రాజధాని ప్రాంతంలోని నాలుగు వేల ఎకరాలపై వారికి జనరల్ పవరాఫ్ అటార్నీఇవ్వాలట. ఆ జీపీఏని చూపి.. ప్రభుత్వం ఇచ్చిన భూములను బ్యాంకుల్లో కుదువ పెట్టి.. అప్పు తీసుకుని రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారట. అంతేనా ప్రభుత్వంతో కలిసి రాజధాని అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసినా.. పనులన్నింటినీ తాము కొత్త ఏర్పాటు చేసే సంస్థ ఆధ్వర్యంలోనే చేపడతారట.

25 కి.మీ.నిర్మాణాలు చేపట్టవద్దంట..
సింగపూర్‌ సంస్థల ప్రతిపాదనల ప్రకారం.. అమరావతి కోర్‌ కేపిటల్‌లో... మౌలిక వసతులు కల్పించి భూమిని అభివృద్ధి చేయటం, ఆపై ధర నిర్ణయించి విక్రయించటం మొదలైనవన్నీ వారే చేస్తారు. ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి పాత్రా ఉండదు. పైగా రాజధాని ప్రాంతంలో తాము చేపట్టే అభివృద్ధి తరహా పనులను 25 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా చేపట్టరాదనీ చంద్రబాబు సర్కారుకు ఆంక్షలు విధించాయి. అమరావతి ప్రాంతంలో భూములిచ్చిన రైతులకు కేంద్ర రాజధాని ప్రాంతం బయట మాత్రమే అభివృద్ధి చేసిన భూమిని ఇవ్వాలని సింగపూర్‌ సంస్థలు పట్టుబడుతున్నాయి. మరి దీనిని ఏపీ ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

18:46 - December 11, 2015

విజయవాడ : బెజవాడలో కాల్‌మనీ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సామాన్యుల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. పటమట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలింపు ముమ్మరం చేశారు. పోలీసుల దాడులతో అప్రమత్తమైన కాల్‌మనీ వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 

18:43 - December 11, 2015

గుంటూరు : విభజన వల్ల రాష్ట్రం నష్టపోయినా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 1915లో ఏర్పడిన నరసరావుపేట మున్సిపాల్టీ ఏడాదితో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో శతాబ్ధి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాబు హాజరై ప్రసంగించారు. అమరావతి నగరాన్ని తెలుగువారు గర్వపడేలా నిర్మిస్తామన్నారు. నరసరావుపేటను నగరంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఇదిలా ఉంటే

రగడ..
నర్సరావుపేట మున్సిపాలిటీ శతవసంతాల వేడుకల్లో టీడీపీ కార్యకర్తలు హంగామా చేశారు.. తమకు ఉద్యోగాలు కావాలంటూ ఈ కార్యక్రమంలో కొందరు డీఎస్సీ అభ్యర్థులు నిరసన తెలిపారు.. ప్లకార్డులు ప్రదర్శించారు.. దీంతో ఆగ్రహించిన తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చిపోయారు.. ఓ యువకుడిని రక్తాలుకారేలా కొట్టారు..

గుంటూరులో యువకుడిపై తెలుగు తమ్ముళ్ల దాడి..

గుంటూరు : నర్సారావుపేట మున్సిపాల్టీ శతవసంతాల వేడుకల్లో రగడ చెలరేగింది. తమకు ఉద్యోగాలు కావాలంటూ డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేశారు. ఆగ్రహంతో టిడిపి కార్యకర్తలు రెచ్చిపోయారు. ఓ యువకుడిపై దాడి చేశారు. దీనితో యువకుడి తలకు గాయమైంది. 

శ్రీవారిని దర్శించుకున్న రాజ్ నాథ్..

చిత్తూరు : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు మంత్రి నారాయణ కూడా ఉన్నారు. 

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఏకగ్రీవం..

నిజామాబాద్ : జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి భూపతిరెడ్డి ఏకగ్రీవం కావడానికి మార్గం సుగమమైంది. 

17:17 - December 11, 2015

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాగా వేయాలని చూస్తున్న టిటిడిపికి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ నేత విజయరామారావు రాజీనామా చేశారు. ఖైరతాబాద్ ఇన్ ఛార్జీగా విజయరామరావు ఉన్న సంగతి తెలిసిందే. రాజీనామాకు సంబంధించిన కారణాలు మాత్రం తెలియరాలేదు. కానీ ఆయన్ను తొలగించాలంటూ కొద్ది రోజులుగా కార్యకర్తలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 2009 సంవత్సరంలో విజయరామారావును ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఇన్ ఛార్జీగా నియమించారు. తరువాత కూడా ఆయన్నే ఇన్ ఛార్జీగా నియమించడంపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం..ఇతరులను ప్రోత్సాహిస్తున్నారని కార్యకర్తలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదని, అప్పుడప్పుడు హాజరవుతున్నారని కార్యకర్తలు పేర్కొనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్ర కమిటీలో గుర్తింపు లేదని, సీనియార్టీని లెక్కలోకి తీసుకోవడం లేదని విజయరామారావు గుర్రుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. రాజీనామా అనంతరం ఆయన ఏ పార్టీలో చేరుతారనేది తెలవడం లేదు. 

17:14 - December 11, 2015

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ వైద్య కళాశాలలో లైంగిక వేధింపులపై విచారణ మొదలైంది. డీఎంఈ రమణి నేతృత్వంలో ముగ్గురు సభ్యులు విచారణ చేపట్టారు. విద్యార్థుల వాంగ్మూలం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వాంగ్మూలాన్ని కమిటీ తీసుకోనుంది. గతంలో మంత్రి లక్ష్మారెడ్డి వైద్య కళాశాలలో పర్యటన సందర్భంగా లైంగిక వేధింపులపై విద్యార్థినిలు ఫిర్యాదు చేశారు. జూనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు బాబురావు, శ్రీధర్ లు లైంగికంగా వేధించడం..అసభ్యపదజాలంతో దూషించడం చేస్తున్నారంటూ విద్యార్థినిలు మంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రాథమికంగా విచారణ చేపట్టారు. తాజాగా పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని మంత్రి లక్ష్మారెడ్డి నిర్ణయించారు. 

ఉస్మానియా వైద్య కళాశాలలో లైంగిక వేధింపులు...

హైదరాబాద్ : ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు బాబురావు, శ్రీధర్ లు వేధిస్తున్నారని విద్యార్థినిలు మంత్రి లక్ష్మారెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి విచారణ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. డీఎంఈ రమణి నేతృత్వంలో ఇద్దరు సభ్యులు విచారణ చేపట్టారు. 

టిడిపికి కె.విజయరామరావు రాజీనామా..

హైదరాబాద్ : టిడిపికి కె.విజయరామారావు రాజీనామా చేశారు. ఖైరతాబాద్ ఇన్ ఛార్జీగా విజయరామారావు ఉన్న సంగతి తెలిసిందే. 

మల్లాది శ్రీనివాస్ అరెస్టు...

విజయవాడ : కల్తీ మద్యం కేసులో స్వర్ణబార్ యజమాని మల్లాది శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. బార్ లోనే మద్యం కల్తీ అయినట్లు, క్యాషియర్ తాతారావు కల్తీ చేశాడని శ్రీనివాస్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఊరట..

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది.

 

12 మంది విద్యార్థుల అరెస్టు..

హైదరాబాద్ : ఓయూలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించిన 12 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు వారిని అరెస్టు చేశారు. 

టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో కాల్ మనీ ముఠా..

విజయవాడ : టాస్క్ ఫోర్స్ పోలీసులు కాల్ మనీ ముఠాను అదుపులోకి తీసుకుంది. కాల్ మనీ పేరిట మహిళలను వ్యభిచార కూపంలోకి ముఠా సభ్యులు దించుతున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. 

నర్సారావుపేటలో బాబు..

గుంటూరు : నర్సారావు పేట మున్సిపాల్టీ శతాబ్ధి ఉత్సవాల చిహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించిన స్వర్ణపురి శశ్మాన వాటికను కూడా బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ కోడెల శివ ప్రసాద్ హాజరయ్యారు. 

ప్రపంచ బ్యాడ్మింటెన్ సూపర్ సిరీస్ ఫైనల్ లో మరో సంచలనం..

ప్రపంచ బ్యాడ్మింటెన్ సూపర్ సిరీస్ ఫైనల్ లో మరో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ సెమీస్ రేసు నుండి మారిస్ నిష్క్రమించింది. గ్రూప్ రెండో రౌండ్ లో మారిస్ పై 21-9, 21-15 తేడాతో నజోమీ విజయం సాధించింది. 

16:34 - December 11, 2015

హైదరాబాద్ : తెలంగాణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేయాలంటూ టీ న్యాయవాదులు మళ్లీ రోడ్డెక్కారు. హైకోర్టు గేటుముందు ఆందోళనకు దిగారు. రాష్ట్రం విడిపోయి ఏడాదిన్నర దాటినా ఇంతవరకూ ఆ దిశగా చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా టెన్ టివితో న్యాయవాదులు మాట్లాడారు. న్యాయవ్యవస్థలో చాలా అన్యాయం జరిగిందన్నారు. ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ న్యాయవాదులు చాలా నష్టపోయారని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందని, కానీ కేంద్రం కాలయాపన చేస్తోందన్నారు. జూనియర్ న్యాయవాదులకు చాలా అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. 

16:32 - December 11, 2015

నెల్లూరు : అధికారంలోకి వచ్చిన16 నెలల్లోనే 200 హామీలను అమలు చేసిన ఘనత ఒక్క తెలుగు దేశం ప్రభుత్వానికే దక్కుతుందని పురపాలకశాఖ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలో జరిగిన జన చైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. వరద బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. వరదల సమయంలో జీవనోపాధి కోల్పోయిన ప్రతి ఒక్కరికీ నిత్యావసరాలు పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. నెల్లూరు జిల్లాలో దాదాపు 8 లక్షల మందికి బియ్యం పంపిణీ చేశామని మంత్రి నారాయణ వివరించారు. 

16:30 - December 11, 2015

రాజమండ్రి : భూసేకరణ పేరుతో బలవంతంగా రైతులనుంచి భూమి సేకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు.. అభివృద్ధి ముసుగులో భోగాపురం ఎయిర్‌పోర్టు, బందరు పోర్టు, సోలార్‌ పార్కుల పేరుతో ఏపీ సర్కారు భూమిని లాక్కుంటోందని ఆరోపించారు.. ఆదాయంకోసం మద్యం అమ్మకాల్ని ప్రోత్సహిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని విమర్శించారు. 

16:29 - December 11, 2015

హైదరాబాద్ : తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీ జనార్ధన్‌ అన్నారు. తాను లైంగికంగా, వ్యక్తిగతంగా ఎలాంటి వేధింపులకు గానీ పాల్పడలేదన్నారు. తనపై ఆరోపణలు చేసిన మహిళ..తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగంలో జాయిన్‌ అయ్యిందన్నారు. దీనిపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని..ఈ విచారణను వేగవంతం చేసినందుకే తనపై ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు.

16:27 - December 11, 2015

హైదరాబాద్ : వర్షాలు, వరదలతో ఏపీలో 3వేల 760కోట్ల నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు కేంద్ర కరవు బృందాలకు వివరించారు. రాష్ట్రంలో కరవు, వరద ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు... ఇవాళ చంద్రబాబుతో వేర్వేరుగా భేటీ అయ్యాయి. అల్పపీడనం వల్ల నాలుగు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని తెలిపారు.. కరవు, వరద నష్టాలను అంచనావేసి రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని కోరారు.

15:51 - December 11, 2015

హైదరాబాద్ : త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలపై టిటిడిపి దృష్టి సారించింది. సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. గ్రేటర్ పీఠంపై టిడిపి జెండా ఎగురవేయాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఉదయం టిటిడిపి నేతలతో భేటీ అయ్యారు. రేవంత్, ఎర్రబెల్లి, ఎల్. రమణ, మాగంటిలతో పాటు ఇతర సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. 2014 జీహెచ్ఎంసీ పరిధిలో అధిక సంఖ్యలో సీట్లు వచ్చాయని, కష్టపడితే స్థానాలు పెరిగే అవకాశం ఉందని లోకేష్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. డివిజన్ ల వారీగా జెండాల పండగ నిర్వహించాలని, ఇన్ ఛార్జీలు లేని చోట్ల ఇన్ చార్జీలను నియమించుకోవాలన్నారు. 24వ తేదీన నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు, ఈ సభకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కావాలని కోరాలని నేతలు నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై టిటిడిపి నేతలతో సాయంత్రం లోకేష్ మరోసారి భేటీ కానున్నారు. 

లబ్ధిదారుల ఎంపిక లేకుండానే శంకుస్థాపన - దానం..

హైదరాబాద్ : లబ్ధిదారుల ఎంపిక జరుపకుండా 10 వేళ ఇళ్ల నిర్మాణాలకు ఎలా శంకుస్థాపన చేస్తారని టి.కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల కోసమే ప్రారంభోత్సవ డ్రామ చేస్తున్నారని, దీనిని హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని దానం కోరారు. 

హైకోర్టు ఎదుట టి.న్యాయవాదుల ఆందోళన..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల హైకోర్టు ఎదుట తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులు ఆందోళన జరిపారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

 

ముగిసిన టిటిడిపి నేతలు..లోకేష్ భేటీ..

హైదరాబాద్ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో టిటిడిపి నేతలు జరిపిన భేటీ ముగిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిడిపి జెండా ఎగురవేయాలని, డివిజన్ల వారీగా జెండా పండుగ, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ చార్జీలను నియమించాలని నారా లోకేష్ సూచించారు. 16,17వ తేదీల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై బాబు సమీక్ష చేయనున్నారని పేర్కొన్నారు. 24న హైదరాబాద్ లో చంద్రబాబు అధ్యక్షతన బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై టి.టిడిపి నేతలతో లోకేష్ మరోసారి భేటీ కానున్నారు.

15:28 - December 11, 2015

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలుంటే కేవలం ఐదు స్థానాల్లో టి.కాంగ్రెస్ అభ్యర్థులను బరిలో నిలిపింది. నామినేషన్ లు పూర్తయిన అనంతరం ఆ పార్టీకి షాక్ ల మీద షాక్ లు కలుగుతున్నాయి. ఊహించన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కేవలం 5 స్థానాల్లో అభ్యర్తులను నిలపడంపై ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో టి.పిసిసి కలవర పడుతోంది. మెదక్ జిల్లా అభ్యర్థి శివరాజ్ పాటిల్ ఏకంగా టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. ఇక్కడ బండారు శ్రీకాంత్ పోటీకి ఉత్సాహం చూపాడు. అన్యూహ్యంగా శివరాజ్ పాటిల్ ను అభ్యర్థిగా టిపిసిసి ప్రకటించింది. దీనితో ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తులు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం పాటిల్ టీఆర్ఎస్ గూటికి చేరడంపై జిల్లాకు చెందిన నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం ఐదు స్థానాల్లో పోటీకి పరిమితం కావడం తీవ్ర తప్పిదని పలువురు నేతలు పేర్కొంటున్నట్లు సమాచారం. పార్టీకి సంబంధించిన జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఎవరికి ఓటు వేయాలో తెలియని సందిగ్ధత నెలకొందని వారు వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ లో ఇదే పరిస్థితి పునరావృతమౌతుందని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. ఆ పార్టీ అభ్యర్థి టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం. 

డీజిల్ కార్లపై గ్రీన్ ప్యానెల్ ఆంక్షలు..

ఢిల్లీ : డీజిల్ కార్లపై గ్రీన్ ప్యానెల్ ఆంక్షలు విధించింది. కొత్త డీజిల్ కార్ల రిజిస్ట్రేన్లను నిలిపివేసింది. 

శంషాబాద్ లో ఉద్రిక్తత..

రంగారెడ్డి : శంషాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. అన్యాక్రాంతమైన దేవాదాయ భూములకు రెవెన్యూ శాఖ అధికారులు కంచె ఏర్పాటు చేశారు. అధికారులపై రియల్టర్లు దాడికి యత్నించారు. 

14:30 - December 11, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని స్కాంల రాష్ట్రంగా తయారు చేస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణ పనులు సింగపూర్ కంపెనీలకు ఏ విధంగా కట్టబెట్టారని, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. 

14:21 - December 11, 2015

హైదరాబద్ : మండలి ఎన్నికలను అధికార పక్షం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 12 స్థానాల్లో విజయం సాధిస్తామని గులాబీ నేతలు మొదటి నుండి ధీమాను వ్యక్త పరుస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఒక్కో స్థానంలో ఆ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. గురువారం వరంగల్ లో కొండా మురళి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో అభ్యర్థులు నామినేషన్ లు ఉపసంహరించుకోవడంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం కావడానికి మార్గం సుగమైంది. కొద్దిసేపట్లో అధికారికంగా అధికారులు ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన కొందరు నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారు. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

మెదక్ లో…
జిల్లాలో ఎమ్మెల్సీ బరిలో టీఆర్ఎస్ తరపున భూపాల్ రెడ్డి..టిడిపి నుండి బాల్ రెడ్డి..కాంగ్రెస్ నుండి శివరాజ్ పాటిల్ లు బరిలో నిలిచారు. వీరందరూ నామినేషన్ లు కూడా దాఖలు చేశారు. అనూహ్యంగా బాల్ రెడ్డి..శివరాజ్ పాటిల్ లు నామినేషన్ లు ఉపసంహరించుకున్నారు. శివరాజ్ పాటిల్ ఏకంగా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే రవీంద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. దీనితో బరిలో ఉన్న ఏకైక అభ్యర్థి భూపాల్ రెడ్డి ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఆదిలాబాద్ లో…
జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ తరపున పురాణం సతీష్, టిడిపి నుండి నారాయణ రెడ్డిలతో పాటు స్వతంత్ర అభ్యర్థి రిజాజుద్దీన్ నామినేషన్ లు దాఖలు చేశారు. శుక్రవారం టిడిపి, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ లు ఉపసంహరించుకున్నారు. దీనితో జిల్లా ఎమ్మెల్సీగా పురాణం సతీష్ ఏకగ్రీవం కానుంది. ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. టిడిపి పార్టీకి నారాయణ రెడ్డి రాజీనామా చేసినట్లు సమాచారం. 

14:09 - December 11, 2015

ముంబై : టీ-20 వరల్డ్ కప్ 2016 షెడ్యూల్ విడుదలైంది. భారత్ వేదికగా ఈ పోటీలు జరుగనున్నాయి. మార్చి 19 ఏప్రిల్ 3 వరకు టీ-20 వరల్డ్ కప్ జరుగనుంది. రెండు రౌండ్లలో మ్యాచ్ లు సాగుతాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బిలలో ర్యాంకుల పరంగా నాలుగేసి చిన్న దేశాలకు స్థానమిచ్చిన ఐసీసీ, వీటి మధ్య పోటీలు జరిపి రెండు దేశాలను సూపర్ 10 రౌండ్ కు ఎంపిక చేస్తుంది. ఒక్కో గ్రూప్ లో టాప్ లో నిలిచిన జట్టు సూపర్ 10 కు అర్హత పొందుతుంది. 

సూపర్ 10 గ్రూప్ లో 
 

గ్రూప్ 1 గ్రూప్ 2
శ్రీలంక భారత్
దక్షిణాఫ్రికా పాకిస్థాన్
వెస్టిండీస్ ఆస్ట్రేలియా
ఇంగ్లాండ్ న్యూజిలాండ్
గ్రూప్ - ఎ గ్రూప్ - బి
బంగ్లాదేశ్ జింబాబ్వే
నెదర్లాండ్స్ స్కాట్లాండ్
ఐర్లాండ్ హాంకాంగ్
ఒమాన్ అప్ఘనిస్తాన్

గ్రూప్ ఎ విజేత, గ్రూప్ బి విజేత సూపర్ 10 గ్రూప్ తో చేరుతారు. గ్రూప్ ఎ విజేత కింద రెండో రౌండ్ లోని గ్రూప్ -2 జట్లతో చేరుతుంది. అదే విధంగా గ్రూప్ - బి విజేత..గ్రూప్ -1 జట్లతో కలవనుంది.

తేదీ  జట్టు ఏ జట్టుతో వేదిక
మార్చి 8    జింబాబ్వే హాంకాంగ్ నాగ్ పూర్
మార్చి 8   స్కాట్లాండ్ అప్ఘనిస్తాన్ నాగ్ పూర్
మార్చి 9   బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ ధర్మశాల
మార్చి 9  ఐర్లాండ్  ఒమన్ ధర్మశాల
మార్చి 10    స్కాట్లాండ్ జింబాబ్వే నాగపూర్
మార్చి 10 హాంకాంగ్ అప్ఘనిస్తాన్ నాగపూర్
మార్చి 11  నెదర్లాండ్స్ ఒమన్  ధర్మశాల
మార్చి 11 బంగ్లాదేశ్  ఐర్లాండ్  ధర్మశాల
మార్చి 12  జింబాబ్వే అప్ఘనిస్తాన్ నాగ్ పూర్
మార్చి 12   స్కాట్లాండ్ హాంకాంగ్ నాగపూర్
మార్చి 13  నెదర్లాండ్స్ ఐర్లాండ్  ధర్మశాల
మార్చి 13   బంగ్లాదేశ్ ఒమన్  ధర్మశాల
సూపర్ 10 రౌండ్...      
మార్చి 15  న్యూజిలాండ్  భారత్  నాగ్ పూర్
మార్చి 16  వెస్టిండీస్  ఇంగ్లాండ్  ముంబై
మార్చి 16   పాకిస్తాన్  Q1A కోల్ కతా
మార్చి 17    శ్రీలంక Q1B కోల్ కతా
మార్చి 18 ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ధర్మశాల
మార్చి 18    సౌతాఫ్రికా ఇంగ్లాండ్ ముంబై
మార్చి 19    ఇండియా పాకిస్థాన్ ధర్మశాల
మార్చి 20    సౌతాఫ్రికా Q1B ముంబై
మార్చి 20    శ్రీలంక వెస్టిండీస్ బెంగళూరు
మార్చి 21    ఆస్ట్రేలియా Q1A బెంగళూరు
మార్చి 22    న్యూజిలాండ్ పాకిస్థాన్ మోహాలీ
మార్చి 23    ఇంగ్లాండ్ Q1B న్యూఢిల్లీ
మార్చి 23    ఇండియా Q1A బెంగళూరు
మార్చి 25    పాకిస్థాన్ ఆస్ట్రేలియా మోహాలీ
మార్చి 25    సౌతాఫ్రికా వెస్టిండీస్ నాగ్ పూర్
మార్చి 26  Q1A  న్యూజిలాండ్ కోల్ కతా
మార్చి 26    ఇంగ్లాండ్ శ్రీలంక న్యూఢిల్లీ
మార్చి 27    ఇండియా ఆస్ట్రేలియా మోహాలీ
మార్చి 27    Q1B వెస్టిండీస్ నాగ్ పూర్
మార్చి 28   సౌతాఫ్రికా శ్రీలంక న్యూఢిల్లీ
నాక్ అవుట్ స్టేజస్..      
మార్చి 30 సెమీ ఫైనల్ 1   సూపర్ 10 గ్రూప్ 2 1st సూపర్ 10 గ్రూప్ 1 2nd  న్యూఢిల్లీ
మార్చి 31 సెమీ ఫైనల్  సూపర్ 10 గ్రూప్ 1 1st  సూపర్ 10 గ్రూప్ 2 2nd  ముంబై
ఏప్రిల్ 3  ఫైనల్    కోల్ కతా

మార్కెట్ లో భారీ పతనం..

ముంబై : స్టాక్ మార్కెట్ కుదేలైంది. సెన్సెక్స్ 250 పాయింట్ల పతనంతో 24,994 పాయింట్ల వద్ద, నిఫ్టీ 80 పాయింట్ల పతనంతో 7,599 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

టీ-20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల..

ముంబై : టీ-20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది భారత్ వేదికగా ఈ పోటీలు జరుగనున్నాయి. మార్చి 19 ఏప్రిల్ 3 వరకు టీ-20 వరల్డ్ కప్ జరుగనుంది. ముంబై, ఢిల్లీలో సెమీ ఫైనల్, ఏప్రిల్ -3వ తేదీన ఈడెన్ గార్డెన్ లో ఫైనల్ మ్యాచ్ లు జరుగున్నాయి. గ్రూప్ ఏ లో శ్రీలంక, వెస్టిండీస్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు ఉన్నాయి. గ్రూప్ బి లో భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. మార్చి 19న ధర్మశాలలో భారత్ - పాక్ జట్లు..మార్చి 27న ఆస్ట్రేలియా - భారత్ జట్లు పోటీ పడనున్నాయి. 

మెదక్ ఎమ్మెల్సీగా భూపాల్ రెడ్డి ?

మెదక్ : ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుండి టిడిపి, కాంగ్రెస్ సభ్యులు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీనితో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. 

మైనార్టీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్ల స్కాంలో ఇద్దరు అరెస్టు...

కర్నూలు : మైనార్టీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్ల స్కాంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మేనేజర్ రాఘవస్వామి, మున్సిపల్ టీపీఆర్వో సతీష్ ను పోలీసులు అరెస్టు చేశారు. 

రాజధానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి - బాబురావు..

విజయవాడ : రాజధానిపై సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఎం రాజధాని ప్రాంత కన్వీనర్ బాబురావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సింగపూర్ షరతులకు తలొగ్గి నగరాన్ని వారి చేతుల్లో పెడుతోందని విమర్శించారు. సింగపూర్ తో జరుగుతున్న ఒప్పందాలు బహిర్గతం చేయాలని, పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే రాజధాని నిర్మాణం చేపట్టాలన్నారు. జీపీఏ ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. 

తోటపల్లి రిజర్వాయర్ కు గౌతు లచ్చన్న పేరు..

విజయనగరం : జిల్లాలోని తోటపల్లి రిజర్వాయర్ కు సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టుగా నామకరణం చేశారు. 

పార్టీ ఫిరాయింపులపై పిటిషన్ పై సుప్రీంలో విచారణ..

ఢిల్లీ : పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొనేలా స్పీకర్ కు మార్గదర్శకాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంలో శుక్రవారం విచారణ జరిగింది. ఏడుగురు తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడి 14 నెలలు దాటినా స్పీకర్ ఇంతవరకు చర్యలు తీసుకోలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. పదో షెడ్యూల్ ప్రకారం స్పీకర్ రాజ్యాంగపరమైన న్యాయాధికారి అని, ఈ అంశం ప్రస్తుతం స్పీకర్ పరిధిలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని జస్టిస్ కలీపుల్లా, జస్టిస్ అమిత్ రాయ్ లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

13:44 - December 11, 2015

హైదరాబాద్ : గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బొల్లారం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించారంటూ.. ఐపీసీ సెక్షన్‌ 353, 506 కింద కేసులు నమోదు చేశారు. ఓయూలో బీఫ్‌ ఫెస్టివల్‌ నేపథ్యంలో రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకోగా.. ఆయన పోలీసులపై దురుసుగా ప్రవర్తించాని కేసులు నమోదు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:43 - December 11, 2015

కడప : అదిగో.. ఇదిగో అన్నారు. త్వరలోనే స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తామన్నారు. సర్వేలు, పర్యటనలు అన్ని పూర్తి చేశారు. చివరకు వచ్చేసరికి వీలు కాదని చెప్పేశారు. ఎన్నో ఏళ్లుగా ఆశలు పెట్టుకున్న యువతకు నిరాశే మిగిల్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం పోరుబాట పట్టబోతున్నారు.

నిత్యం కరవు కాటాకాలతో అల్లాడే జిల్లా.....

నిత్యం కరవు కాటాకాలతో అల్లాడే జిల్లా. రాష్ట్రాన్ని ఏలే నాయకులు ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో వెనకబడిన వైనం. చక్రం తిప్పే నేతలున్నా ప్రయోజనం శూన్యం. ఐరన్‌ ఓర్‌, ముగ్గురాళ్లు వంటి ఖనిజ సంపద, ఎర్రచందనం లాంటి వృక్షసంపద వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ''అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని''లా ఉంది కడప జిల్లావాసుల పరిస్థితి.

పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయం....

రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా బీజేపీ ఈ అంశాన్ని చేర్చింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబులు కూడా సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తామని వాగ్ధానం చేయడంతో కడప జిల్లావాసుల్లో ఎన్నో ఆశలు పెరిగాయి. ఉక్కు ఫ్యాక్టరీ వల్ల తమకు ఉపాధి లభిస్తుందని, జిల్లా అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావించారు.

ఐరన్‌ ఓర్‌ లో గ్రేడ్‌గా తేల్చిన సెయిల్‌ .....

తీరా చూస్తే.. పెండ్లిమర్రి మండలంలో లభించే ఐరన్‌ ఓర్‌ లోగ్రేడ్‌ అని, దీనివల్ల ఇక్కడ స్టీల్‌ ఫ్యాక్టరీ స్థాపించడం సాధ్యం కాదని సెయిల్‌ తేల్చి చెప్పింది. దీంతో కడప జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ ఆశలు అడియాశలు అయ్యాయని వాపోతున్నారు.

జిల్లాలో డోలమైట్‌, సున్నపురాయి ......

ఫ్యాక్టరీ నిర్మాణం, నిర్వాహణకు అనువైన వనరులున్నప్పటికీ సెయిల్‌ తిరస్కరించడం బాధాకరమని ప్రజలంటున్నారు. ఇక్కడ డోలమైట్‌, సున్నపురాయి వనరులు ఉన్నాయని, పక్కనే ఉన్న అనంతపురం జిల్లాలో మాగ్నటైట్‌ ఖనిజాలు విస్తృతంగా ఉన్నాయంటున్నారు. అంతేకాకుండా ఐరన్‌ ఓర్‌ను బళ్లారి నుంచి తెప్పించుకునేందుకు.. ఉత్పత్తిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు రైలు, రోడ్డు రవాణా మార్గాలున్నా ప్రభుత్వాలు వివక్ష చూపడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కడప జిల్లా అనువుగా ఉంటుంది....

ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించేందుకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే కడప జిల్లా అనువుగా ఉంటుందని ప్రజలంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే గతంలో రెండుసార్లు స్టీల్‌ ఫ్యాక్టరీలు నిర్మించేందుకు ప్రైవేట్‌ కంపెనీలు ముందుకొచ్చాయని పలువురు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ నిర్మించే ఉక్కు ఫ్యాక్టరీని కోస్తాకు తరలించే కుట్ర జరుగుతుందంటున్నారు. గతంలోనూ జిల్లాకు వచ్చిన అనేక ప్రాజెక్టులను ఇతర జిల్లాలకు తరలించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీ మేరకు కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

13:40 - December 11, 2015

హైదరాబాద్ : ఎమ్మెల్సీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలపై చర్చించేందుకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ టీటీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో టీటీడీపీ నేతలు రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాగంటి గోపీనాథ్‌, తదితరులతో సమావేశమయ్యారు. 

13:38 - December 11, 2015

హైదరాబాద్ : తెలంగాణాలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో సుమారు గంటపాటు విచారణ సాగింది. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌ నిర్ణయం తీసుకునేలా మార్గదర్శకాలు జారీ చేయాలని గతంలో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిని రెండు నెలలు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఇవాళ విచారణకు స్వీకరించింది. కాంగ్రెస్‌, టీడీపీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. స్పీకర్‌ నిర్ణయం కోసం రెండు నెలలు వేచి చూస్తామన్న సుప్రీం.. ఆ తరువాత కూడా నిర్ణయం తీసుకోకపోతే పరిశీలిస్తామని చెప్పింది.

13:37 - December 11, 2015

ఆదిలాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎత్తులు ఫలిస్తున్నాయి. నిన్న వరంగల్‌ అయితే ఇవాళ ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ ఏకగ్రీవమైంది. ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ బరి నుంచి టీడీపీ, సతంత్ర అభ్యర్థులు తప్పుకున్నారు. దీంతో ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పురాణం సతీష్‌ ఏకగ్రీవమయ్యారు.

మంత్రి కేటీఆర్ ప్రోటోకాల్ ఉల్లంఘించారు : షబ్బీర్ అలీ

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ ప్రోటోకాల్ ఉల్లంఘించారని షబ్బీర్ అలీ ఆరోపించారు. కేటీఆర్ ఏ హోదాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం ఉండగా మంత్రి కేటీఆర్ ఎలా శంకుస్థాపన చేశారని మండి పడ్డారు. గ్రేటర్ ఎన్నికల కోసమే డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం అని.. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

గ్రేటర్ ఎన్నికల కోసం ప్రారంభోత్సవాల డ్రామా : దానం...

హైదరాబాద్ : లబ్ధిదారుల ఎంపిక జరపకుండా 10 వేల ఇళ్ల నిర్మాణాలకు మంత్రి కేటీఆర్ ఎలా శంకుస్థాపన చేస్తారని గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల కోసం ప్రారంభోత్సవాల డ్రామా అని ఎద్దేవా చేశారు. దీన్ని హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ప్రత్యేక మేనిఫెస్టో : కేటీఆర్..

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించి విడుదల చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే దానిపై కసరత్తు చేశామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఐదు సర్వేలు చేశామని, ఆ సర్వేలన్నింటిలో తమ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని తెలిసిందని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి మేయర్ పీఠం దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామని వివరించారు.

చింటూ డ్రైవర్ అరెస్ట్...

చిత్తూరు : తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్యోదంతంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. చింటూ ప్రధాన అనుచరుడు, డ్రైవర్ వెంకటేష్ ను అరెస్టు చేసినట్లు నేడు చిత్తూరు డీఎస్సీ లక్ష్మీనాయుడు వెల్లడించారు. కేసులో వెంకటేష్ 5 ముద్దాయిగా ఉన్నాడని తెలిపారు. నిందితుడి నుంచి రివాల్వర్, తల్వార్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

12:54 - December 11, 2015

హైదరాబాద్ : మహిళాలోకానికి బాసటగా నిలుస్తూ...ఆర్థిక, ఆరోగ్య అంశాలపై వారిని తట్టిలేపుతూ నేస్తంగా నిలుస్తున్న 10 టీవీ మానవీని యునిసెఫ్‌ అవార్డు వరించింది. మాతా శిశు మరణాలపై మానవీ కార్యక్రమంలో ప్రసారమైన కార్యక్రమానికిగాను యూనిసెఫ్‌ హైలెటింగ్‌ ఏ క్రిటికల్‌ ఇష్యూ కింద స్పెషల్‌ జ్యూరీ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును మానవి ప్రొడ్యూసర్లు పద్మ, వాణి అందుకున్నారు.

12:53 - December 11, 2015

విజయవాడ : ఏపీలో గ్రామ తాగునీటి పథకాల నిర్వహణ రోజు రోజుకు అస్తవ్యస్తంగా మారుతోంది. కేంద్ర అర్ధిక సంఘం పెట్టిన మెలికతో రాష్ట్రంలోని 470 బహుళ గ్రామ ప్రయోజన తాగునీటి పథకాలకు గడచిన ఎనిమిది నెలలుగా నిధుల విడుదల కాలేదు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయితీల మధ్య తలెత్తిన సమస్య ఎటూ తేలకపోవటంతో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర మంచినీటి పథకాల నిర్వహణ ప్రశ్నార్థకమవుతోంది.

పంచాయితీలకు కేటాయించే నిధులను రాష్ట్ర ఖజానాకు...

ఏపీలో ప్రభుత్వ తాగునీటి పథకాల అమలు ప్రశ్నార్థకంగా మారుతోంది. గతంలో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి పంచాయితీలకు కేటాయించే నిధులను రాష్ట్ర ఖజానాకు నేరుగా ఇచ్చేది. అక్కడి నుంచి ఆ నిధులు జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయితీలకు వాటాల వారీగా వచ్చేవి. ఈ నిధుల్లో సమగ్ర రక్షిత మంచి నీటి పథకాల నిర్వహణ ఖర్చులను జిల్లా పరిషత్ మినహాయించుకుని చెల్లింపులు చేసేది. ఈ పథకాల ద్వారా ప్రతి జిల్లాలోను వంద వరకూ గ్రామాలకు నీటిని సరఫరా అయ్యేది.

కేంద్ర ఆర్థిక సంఘం పంచాయితీల వాటాగా.....

కాగా కేంద్ర ఆర్థిక సంఘం పంచాయితీల వాటాగా కేటాయించిన నిధుల నుంచి ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులను మినహాయించుకొని ఈ చెల్లింపులు చేసేవారు. ఈ పథకాలు వేర్వేరు పంచాయితీలు, మండలాల పరధిలో ఉన్నా, నిర్వహణ, విద్యుత్ బిల్లులు చెల్లింపు మాత్రం ఆర్‌డబ్ల్యూఎస్ చూసేది. ఒక్కో పథకం నిర్వహణ ఖర్చు గ్రామాలకు పంపిణీ సామర్థ్యాన్ని బట్టి 10లక్షల రూపాయల నుంచి రెండు కోట్ల రూపాయల పై బడే ఉండేది. ఇలా మొత్తం 470 పథకాల కింద దాదాపు కోటిన్నర మందికి రక్షిత మంచినీరు సరఫరా అవుతోంది.

పంచాయితీల ఖాతాలకే కేంద్ర ప్రభుత్వం జమ......

ఇటీవల 14వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులును నేరుగా పంచాయితీల ఖాతాలకే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది. దీంతో సమగ్ర రక్షిత మంచినీట పథకాల నిర్వహణ కోసం జిల్లా పరిషత్ ల వద్ద నిధులు లేకుండా పోయాయి. ఇప్పుడు తమ వద్ద నిధులు లేవంటూ ఈ మంచినీటి పథకాల నిర్వహణకు జిల్లా, మండల పరిషత్‌లు పంచాయితీల వైపు చూస్తున్నాయి. పథకం పరధిలోని పంచాయితీ సర్పంచులతో కమిటీ ఏర్పాటు చేసి వారి నుంచే వనూలు చేయాలని సూచిస్తున్నాయి. సర్పంచులు మాత్రం ఇందుకు ససేమిరా అంటుండంతో సమస్య పరిష్కారం కావటం లేదు.

ఒక్కో మనిషికి ఎంత చెల్లించాలనే లెక్కలు తయారు చేసి....

దీంతో ఇటీవల గ్రామీణ నీటి సరఫరా విభాగం ఒక్కో తాగునీటి పథకం కింద ఎన్ని పంచాయితీలు ఉన్నాయి. అందులో ఒక్కో మనిషికి ఎంత చెల్లించాలనే లెక్కలు తయారు చేసి ఆ మేరకు చెల్లించాలని పంచాయితీలను కోరుతోంది. పంచాయితీలు మాత్రం ఇందుకు అంగీకరించటం లేదు. గ్రామాల్లో ఉండే బోర్లు, విద్యుత్ మోటార్ల నిర్వహణతో పాటు రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం, వీధి దీపాలకు తాము ఖర్చు చేయాల్సిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీంతో గ్రామ పంచాయితీలు, జిల్లా, మండల పరిషత్‌లు రక్షిత మంచినీట పథకాల నిర్వహణను పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలోని ఎన్నో గ్రామాలు త్రాగునీటి సమస్యతో అల్లాడే పరిస్థితి ఏర్పడింది.

12:48 - December 11, 2015

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేసే పనిలో పడ్డారు అధికారులు . హైకోర్టు ఇచ్చిన గడువులోగా ఎన్నికలు పూర్తి చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈనెల పదిహేను వరకు అన్ని పనులు పూర్తి చేయనుంది బల్దియా. ఇప్పటికే వార్డుల పునర్విభజన బీసీ ఓట్లు గణన పూర్తి చేసిన జీహెచ్ఎంసీ... రిజర్వేషన్ల పై దృష్టిసారించింది. అయితే సమైక్య రాష్ట్రంలో గ్రేటర్ మేయర్ పీఠం బీసీ జనరల్ కాగా ఇప్పుడు హైదరాబాద్ మేయర్ రిజర్వేషన్ ఎంపిక ఆసక్తి నెలకోంది.

వార్డుల డిలిమిటేష‌న్, బీసీ ఓటర్ల గణన జీహెచ్‌ఎంసీ పూర్తి....

గ్రేటర్ ఎన్నికలకు రెడీ అవుతోంది బ‌ల్దియా. ఇప్పటికే వార్డుల డిలిమిటేష‌న్, బీసీ ఓటర్ల గణన జీహెచ్‌ఎంసీ పూర్తి చేసింది. రిటర్నింగ్ ఆఫీసర్లకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ సైతం నిర్వహించింది. ఇక ఎన్నికల నిర్వహణకు అవసరం అయిన పోలీంగ్ సిబ్బంది పై దృష్టిపెట్టింది జిహెచ్ఎంసి. ఇదంతా ఒక ఎత్తయితే వార్డుల రిజర్వేషన్ల ఖరారు అధికారలుకు కత్తిమీద సాములా మారింది. బీసీ రిజర్వేషన్లు పై ఇప్పటికే రగడ సాగుతోంది. గ్రేటర్లో బీసీ ఓటర్ల శాతం 26.1 శాతం మాత్రమే ఉందని తేల్చేసారు అధికారులు. అయినా కూడా గ్రేటర్ మొత్తం వార్డుల మూడోవంతూ స్థానాలు దక్కుతాయని అధికారుల చెబుతున్నారు.

ఈ నెల 20 తరువాత షెడ్యుల్ .....

ఇక గత కొద్ది నెలలుగా నగరంలో ఆసక్తి రేపుతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు కు ఈ నెల 20 తరువాత షెడ్యుల్ రానున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లపై బల్దియా నివేదిక అనంతరం ఎన్నికల తేదీల పై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. అయితే 2016 జనవరి -15,16,17 తేదీల్లో ఏదో ఓ రోజు పాలక మండలి ఎన్నికల నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసే పనిలో ఉన్న జీహెచ్ఎంసీ అధికారులు ఆ నివేదికను ఈ నెల 15 న రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నారు.

ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు....

ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు వున్నాయి. 2011 జనాభాలెక్కల ప్రకారం నగరంలోని ఎస్సీ, ఎస్టీల జనాభాను లెక్కించి వాటి ప్రకారమే రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీలకు మూడు సీట్లు, ఎస్సీలకు 22 లేదా 23 సీట్లు, బీసీలకు 50 సీట్లు ఖరారు కానున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలతో పాటు జనరల్ మహిళలకు కలిపి మొత్తం మహిళలకు 50 శాతం స్థానాలు దక్కనున్నాయి. తొలిసారిగా 75 మంది మహిళా కార్పోరేటర్లతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ పురుషులతో సమానంగా నిండనుంది.

ప్రతి 1200 మంది ఓటర్లకు ఓ పోలింగ్ కేంద్రం....

ఇక బల్దియా ఎన్నికల కోసం ప్రతి 1200 మంది ఓటర్లకు ఓ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది జీహెచ్ఎంసీ. ప్రతి పోలింగ్ స్టేషన్ 5 గురు సిబ్బంది అవసరం అని తేల్చారు ఎన్నికల అధికారుల. దీంతో సిబ్బంది వేటలో పడ్డారు గ్రేటర్ అధికారులు. మొత్తం 50 వేల మంది సిబ్బంది అవసరమని కమిషనర్‌ జ‌నార్దన్ రెడ్డి తెలిపారు. దీంతో పాటు నగర వ్యాప్తంగా ఉన్న 7051 పోలింగ్ స్టేషన్లకు గాను, దాదాపు పది వేల ఈవిఎంలు సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో మరోసారి ఎన్నికల కోలాహలం నెలకొంది.

 

12:45 - December 11, 2015

కృష్ణా : విజయవాడ ఆంధ్రా ఆస్పత్రిలో కల్తీ మద్యం ఘటన బాధితులను ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు పరామర్శించారు. మద్యంలో మిథనాల్‌ కలవడం వల్లే ఈ దారుణం జరిగిందన్నారు. చికిత్స పొందుతున్నవారిలో వెంకట్రావు పరిస్థితి విషమంగా ఉందని.. మిగిలిన 27 మంది బాధితులు కోలుకుంటున్నారని కామినేని తెలిపారు. 

'పార్టీ ఫిరాయింపు' కేసు విచారణ వాయిదా

ఢిల్లీ : పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా స్పీకర్ ను ఆదేశించాలని సుప్రీం కోర్టు పిటిషన్ దాఖలైంది. దాని పై విచారించిన సుప్రీం కోర్టు విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది.

ఏకగ్రీవం దిశగా టిఆర్ ఎస్ అభ్యర్థి పురాణం సతీష్

హైదరాబాద్ : ఆదిలాబాద్ ఎమ్మెల్సీ బరి నుంచి టిడిపి అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో అధికార టిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి పురాణం సతీష్ ఎంపిక ఏకగ్రీవం కానుంది.

మాజీ ఎంపి మహ్మద్ షహబుద్దీన్ కు జీవిత ఖైదు

హైదరాబాద్ : ఆర్జేడీ మాజీ ఎంపి మహ్మద్ షహబుద్దీన్ కు జీవిత ఖైదు పడింది. 11 ఏళ్ల క్రితం జరిగిన ఇద్దరు సోదరుల హత్య కేసులో శివాన్ జిల్లా కోర్టు షహబుద్దీన్ కు జీవిత ఖైదు శిక్ష వేసింది.

డీజిల్ కార్లపై నిషేధించాలని సుప్రీంలో పిల్

ఢిల్లీ : డీజిల్ కార్లపై నిషేధం విధించాలని సుప్రీం కోర్టులో పిల్ దాఖలయ్యింది. ఈ పిల్ పై డిసెంబర్ 15న విచారణకు రానుంది.

సరోజినీ కంటి ఆసుపత్రిలో నీటి కటకట

హైదరాబాద్: మెదహదీపట్నం సరోజినీ కంటి ఆసుపత్రిలో గత మూడు రోజులు నీటి కొరత ఏర్పడింది. దీంతో ఆసుపత్రిలో 180 ఆపరేషన్లు నిలిచిపోయాయి. దీంతో రోగులు ఆందోళనకు దిగారు. స్పందించిన అధికారులు రేపటి లోగా సమస్య పరిష్కరిస్తామని చెబుతున్నారు.

జగన్ పై ఫైర్ అయిన డొక్కా మాణిక్యవరప్రసాద్

విజయవాడ: వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. ఏదైనా మాట్లాడే ముందు అధ్యయనం చేసి మాట్లాడాలని... నోటికి ఏది వస్తే అది మాట్లాడటం తగదని సూచించారు. వైకాపా అధికారంలోకి వస్తే మద్య నిషేధం విధిస్తామని... అంతకు ముందే టీడీపీ మద్య నిషేధాన్ని అమలు చేయాలని జగన్ డిమాండ్ చేసిన నేపథ్యంలో, డొక్కా ఈ విధంగా స్పందించారు. ఏపీకి చుట్టు పక్కల ఉన్న రాష్ట్రాల్లో మద్యం లభిస్తున్నప్పుడు... ఏపీలో నిషేధం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. గతంలో మద్య నిషేధం విధించినప్పుడు ఎదురైన అనుభవాలను అధ్యయనం చేయాలని, ఆ తర్వాత మాట్లాడాలని చెప్పారు.

టి.టిడిపి నేతల భేటీ

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టి.టిడిప నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీకి ఎర్రబెల్లి దాయకర్ రావు, రేవంత్ రెడ్డి, మాగంటి గోపీనాథ్ హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్ ఎంసీ ఎన్నికలపై చర్చంచనున్నట్లు సమాచారం.

11:48 - December 11, 2015

హైదరాబాద్ : 'యాహూ' సీఈవో మరిస్సా మేయర్ కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తనే 'టుంబ్లర్'లో వెల్లడించారు. కుటుంబ సభ్యులకు, తనకు సహకరించిన మిగతావారందరికి మరిస్సా ధన్యవాదాలు తెలిపారు. ఆమె భర్త బోగ్ కూడా 'డూయింగ్ గ్రేట్' అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పటికే ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. 2012, జులై నుంచి యాహులో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా పనిచేస్తున్న మరిస్సా... తదనంతర కాలంలో ఆ సంస్థలో సీఈవో స్థాయికి ఎదిగారు. తొలిసారి బాబు పుట్టిన సమయంలో 16 వారాలు ఉద్యోగానికి మెటర్నిటీ సెలవు పెట్టినప్పటికీ, కేవలం నాలుగు వారాల్లోనే ఆమె ఉద్యోగ బాధ్యతల్లో చేరారు. ఈసారి మరిస్సా కేవలం రెండు వారాలు మాత్రమే సెలవు తీసుకున్నారు.


 

మళ్లీ రాజ్యసభ వాయిదా

ఢిల్లీ : సభ్యుల సస్పెన్షన్ … సభ వాయిదా అనంతరం రాజ్యసభ ప్రారంభమైనా ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరగకుండా కాంగ్రెస్, వామపక్ష సభ్యులు స్పీకర్ పోడియంలోకి దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.

11:27 - December 11, 2015

ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు. శుక్రవారం రాజ్యసభ ప్రారంభమైన వెంటనే డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. వెంటనే కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి ప్రశోత్తరాలు జరగకుండా అడ్గుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి పై వామపక్ష సభ్యులు కూడా ఆందోళనకు దిగాయి. దీంతో 23 మంది కాంగ్రెస్, వామపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసినట్లు కురియన్ ప్రకటించారు. అనంతరం రాజ్యసభను 11.30 గంటల వరకు వాయిదా వేశారు.

రాజ్యసభ నుండి కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్

ఢిల్లీ :రాజ్యసభ సభ ప్రారంభమైన వెంటనే రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టు ముట్టి ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న 23 మంది సభ్యులను సభనుండి సస్పెండ్ చేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు. అనంతరం సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. సస్పెండ్ అయిన సభ్లుయ్లో వామపక్ష, కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు.

ప్రారంభమైన ఉభయ సభలు

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభ్యులు కొద్ది సేపటి క్రితం ప్రారంభమయ్యాయి. సభలు ప్రారంభమైన వెంటనే రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టు ముట్టి ఆందోళన చేస్తున్నారు.

విజయవాడలో 'కాల్ మనీ' ముఠా అరెస్ట్

విజయవాడ : బెజవాడలో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కాల్మనీ పేరుతో వేధింపులకు గురి చేస్తున్న 12 మందిని టాస్క్ఫోర్స్ పోలీసులు గతరాత్రి అరెస్ట్ చేశారు. ప్రతి రోజు నగరంలో కోట్ల రూపాయలతో కాల్మనీ వ్యాపారం చేయడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పక్కా సమాచారంతో గురువారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. కాల్ మనీ సభ్యులు... రోజు వారి వడ్డీగా 10 రూపాయల నుంచి 25 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా అధిక వడ్డీ రేట్లకు డబ్బులను ఇవ్వడమే కాక బాధితులపై లైంగిక వేధింపులకు దిగుతున్నారు.

కేటీపీపీ వద్ద కాంట్రాక్టు కార్మికుల ధర్నా

వరంగల్ : కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ) వద్ద కాంట్రాక్టు కార్మికులు ఈ రోజుధర్నా చేపట్టారు. తమను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ గత 10 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా టిడిపి అధ్యక్షుడు సత్యనారాయణ కార్మికులకు మద్దతు తెలిపారు. కార్మికుల సమస్య పరిష్కారమయ్యేంత వరకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

గుంటూరు జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య

బాపట్ల : సాగు చేసిన పంట ఎండిపోవటంతో తీవ్ర మనస్థాపానికి గురై కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండల పరిధిలోని గోపాపురంలో చోటు చేసుకుంది. విమలేశ్వర్ అనే రైతు 20 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేశాడు. సాగుకు చేసిన పంటకు నీరందక పోవటంతో పంట ఎండి పోయి సుమారు 4 లక్షలు అప్పు మిగిలింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కల్తీ మద్యం బాధితులను పరామర్శించిన మంత్రి కామినేని

విజయవాడ: కల్తీ మద్యం ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శుక్రవారం పరామర్శించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 27 మందిని డిశ్చార్జ్ చేశామని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు. మద్యంలో మిథైనాల్ కలపడం వల్లే ఘటన జరిగిందని కామినేని చెప్పారు.

10:45 - December 11, 2015

ఆదిలాబాద్ : మాదారం మదన పడుతోంది. 40 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకోలేక సతమతమై పోతోంది. ఇక్కడి 400 కుటుంబాలు అంధకారమైన తమ భవిష్యత్తుపై బెంగ పడుతున్నాయి. సింగరేణి సంస్థ నిర్ణయం.. మాదారం ప్రజల్లో అంతులేని ఆవేదనను కలిగిస్తోంది. ఇంతకీ సింగరేణి తీసుకున్న నిర్ణయం ఏంటి..? మాదారంపై దాని ప్రభావమేంటి..? వాచ్‌ దిస్‌ స్టోరీ.

శ్మశాన నిశ్శబ్దంతో.. భోరు మంటోంది. ...

మాదారం..! ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓ టౌన్‌షిప్‌. ప్రకృతి ఒడిలో పచ్చందనాల సోయగాల నడుమ వెలసిన ఆవాసాలతో.. ఉద్యోగ ఉపాధుల క్షేత్రంగా ఒకప్పుడు కళకళలాడింది. కానీ నేడు ఈ టౌన్‌షిప్‌ శ్మశాన నిశ్శబ్దంతో.. భోరు మంటోంది.

1970లో ఏర్పాటైన మాదారం టౌన్‌షిప్‌....

మాదారం టౌన్‌షిప్‌... 1970లో సింగరేణి కాలరీస్‌ సంస్థ నిర్వహించిన ఎంవీకే 1,2,3,4,6... గోలేటి 1, 2 భూగర్భ గనులపై ఆధారపడి ఏర్పడింది. కరీంనగర్ , వరంగల్ జిల్లాల నుంచి.. వివిధ వర్గాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. సుమారు పదివేల మంది కార్మికులు , ఐదు వేల మంది కార్మికేతరులతో మాదారం ఎప్పుడూ సందడిగా ఉండేది. ఇక్కడ దొరకనిదంటూ ఏదీ లేదన్న రీతిలో కళకళలాడింది. ఇది గతం. నేడు అక్కడ దయనీయ స్థితి నెలకొంది.

మాదారంలో ఎందరికో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి.....

కార్మిక కుటుంబాలకు అవసరమైన కుల వృత్తుల వారికి నేడు ఉపాధి కరవైంది. మాదారం పరిసరాల్లోని పది గ్రామాలకు చెందిన గ్రామాల ప్రజలు పాలు, కూరగాయలు అమ్మి.. పరోక్షంగా ఉపాధిని పొందేవారు. వారూ ఉపాధిని కోల్పోయారు. కుటుంబాలు వలస వెళుతుండడంతో.. మాదారం టౌన్‌షిప్‌ నిర్మానుష్యంగా.. బోరు మంటోంది.

కళావిహీనం అయిన మాదారం టౌన్‌షిప్‌.....

సుమారు 1500 మంది విద్యార్థులతో కళకళలాడిన ప్రభుత్వ పాఠశాల కళా విహీనమైపోయింది. ఇక్కడి క్వార్టర్స్‌.. ఇతర భవనాలు శిథిలమై పోతున్నాయి. జనం ఖాళీ చేసి వెళుతుండడంతో వందలాది కొత్త క్వార్టర్‌లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వీటిని పట్టించుకునే నాథుడే లేక శిథిల దశకు చేరాయి. సింగరేణి పాఠశాల, ఆసుపత్రి కూడా కూలిపోయే స్థితికి చేరాయి. రిక్రియేషన్‌ క్లబ్ కూడా మూతబడింది.

మితిమీరిన లాభాపేక్షతో ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌....

సింగరేణి సంస్థ.. లాభాలే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. తొలినాళ్లలో భూగర్భ గనులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన సింగరేణి.. ఇటీవలి కాలంలో వేగవంతమైన బొగ్గు ఉత్పత్తి.. మితిమీరిన లాభాపేక్ష లక్ష్యాలతో ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌కు మొగ్గు చూపుతోంది. భూగర్భ గనులను ధ్వంసం చేసి.. ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌ ద్వారా... బొగ్గు నిక్షేపాలను అమాంతంగా ఎత్తుకెళ్లాలని యత్నిస్తోంది. ఇందులో భాగంగా... 1998 నుంచి భూగర్భ గనులను ఒక్కొక్కటిగా మూతేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా.. గోలేటి 1ఏ భూగర్భ గనినీ మూసేయాలని నిర్ణయించింది.

పదేళ్ల క్రితమే గోలేటీ 1ఏ భూగర్భ గని....

నిజానికి పదేళ్ల క్రితమే గోలేటీ 1ఏ భూగర్భ గనిని ప్రారంభించారు. ఇక్కడ పనిచేసే కార్మికుల కోసం మాదారం టౌన్‌షిప్‌ను సింగరేణి సంస్థే నిర్మించింది. అయితే.. ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌పై ప్రేమతో.. గోలేటీ 1ఏ గనినీ.. మాదారం టౌన్‌షిప్‌నూ మూసేయాలని నిర్ణయించింది. గోలేటి 1ఏ లో కార్మికులు అదనంగా ఉన్నారంటూ.. ఇప్పటికే కొంతమందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. మిగిలిన వారినీ తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు.

మాదారం టౌన్‌షిప్‌ ప్రాంతాన్ని అటవీశాఖకు తిరిగి ఇచ్చే యోచన....

మాదారం టౌన్‌షిప్‌ నిర్మాణానికి అటవీ శాఖ భూములను తీసుకున్న సింగరేణి.. ఇప్పుడు ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందిగా.. సదరు శాఖకు లేఖ రాసింది. అలాగే.. ఈ భూమిపై లీజునూ చెల్లించడం ఆపేసింది. అయితే.. తాము అప్పగించినప్పటి స్థితిలోనే భూమిని తిరిగి ఇవ్వాలంటూ అటవీశాఖ షరతు విధించడంతో.. ఇక్కడి క్వార్టర్స్‌ను, ఇతర కట్టడాలను పూర్తిగా కూల్చేసి.. మొక్కలను పెంచి.. అటవీశాఖకు అప్పగించేందుకు సింగరేణి నిర్ణయించింది.

మాదారం టౌన్‌షిప్‌ కూల్చివేత నిర్ణయం వెనుక కుట్ర?.....

ఇప్పటికిప్పుడు మాదారం టౌన్‌షిప్‌ను కూల్చేయాలన్న సింగరేణి నిర్ణయం వెనుక పెద్ద కుట్రే ఉందని కార్మికులు అనుమానిస్తున్నారు. తమకు అవసరం అనుకున్నప్పుడు మళ్లీ ఈ భూములను లీజుకు తీసుకుని ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌కు వినియోగంచుకుంటారని కార్మికులు భావిస్తున్నారు. ఒకేసారి టౌన్‌షిప్‌ను ఖాళీ చేయిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న కారణంతోనే... సింగరేణి యాజమా న్యం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని అంటున్నారు. ఈ ప్రాంతంలోనే తమకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ స్కీమ్‌ అమలు చేయాలని స్థానికులు ప్రభుత్వన్ని కోరుతున్నారు.

56 భూగర్భ గనుల నుంచి 20 మి.టన్నుల బొగ్గు ఉత్పత్తి....

గతంలో 56 గనుల నుంచి దాదాపు 20 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిన సింగరేణి.. ఇప్పుడు 13 ఓపెన్‌కాస్టు గనులు... 36 భూగర్భ గనులలో 54 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. భూగర్భ గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి వల్ల కోట్లాది రూపాయల నష్టం వస్తుందన్న కారణంతో.. 26 భూగర్భ గనులను ఇప్పటికే మూసేసింది. ప్రస్తుత ఓపెన్‌ కాస్ట్‌ గనులకు తోడు.. తాజాగా మరో 25 ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టులను చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

బెల్లంపల్లి ఏరియాలో విస్తారమైన బొగ్గు నిక్షేపాలు ....

ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టుల ద్వారా అధిక బొగ్గు ఉత్పత్తిని సాధించాలని తపిస్తోన్న సింగరేణి.. ఇటీవల శ్రీరాంపూర్‌ ఓపెన్‌కాస్టు 1, బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ 1, 2, కైరిగూడ ఓపెన్‌కాస్టులను, తాజాగా రామకృష్ణపూర్‌ ఓసీపీలను ప్రారంభించింది. బెల్లంపల్లి ఏరియా విస్తరించిన 60 కిలోమీటర్ల పరిధిలో అపార బొగ్గు నిక్షేపాలున్నాయి. ఆసిఫాబాద్‌ మండలం చింతగూడలో వందలాది మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలనూ సింగరేణి యాజమాన్యం గుర్తించింది. 50 నుంచి 100 మీటర్ల లోతులోనే అపార బొగ్గు నిక్షేపాలున్నాయని నిర్ధారణకు వచ్చింది. వీటిని భూగర్భ గనుల ద్వారా వెలికి తీసే అవకాశాలున్నా... సింగరేణి యాజమాన్యం ఓపెన్‌కాస్టు తవ్వకాలకే మొగ్గు చూపుతోంది.

జైపూర్‌ విద్యుదుత్పత్తి ప్లాంట్‌కు ఇక్కడి బొగ్గు...

ఇక్కడి భారీ ఓపెన్‌కాస్టుల్లో బొగ్గు నిక్షేపాలను తవ్వడం ద్వారా.. సంస్థకు లాభాలతో పాటు జై పూర్‌లో ఏర్పాటు చేస్తున్న విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా చేయవచ్చని సింగరేణి యాజమాన్యం భావిస్తోంది. అంతే కాకుండా తిర్యాణి, ఆసిఫాబాద్‌ మండలాల మధ్యనున్న వట్టివాగు ప్రాజెక్టు పరిధిలో మరో విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టును ప్రారంభించాలనీ యోచిస్తోంది. అయితే.. ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టుల వల్ల దుష్పరిణామాలను మాత్రం పట్టించుకోవడం లేదు.

భూగర్భ గనుల్లో 150 మీటర్ల లోతు వరకే బొగ్గు తవ్వకాలు....

ఓపెన్‌కాస్ట్ విధానంతో భూమి ఉపరితలం నుంచి 150 మీటర్ల లోతు వరకు మాత్రమే బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేవారు. కానీ అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పుడు సుమారు 400 మీటర్ల వరకు బొగ్గును వెలికితీస్తున్నారు. దీనివల్ల ఈ పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గనుల్లో టన్ను బొగ్గును వెలికితీయాలంటే 15 టన్నుల బరువుతో సమానమైన మట్టిని తొలగిస్తారు. సింగరేణి సంస్థ ఇప్పటి వరకు ఓపెన్‌కాస్ట్ విధానం ద్వారా సుమారు 30 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. అంటే 45 వేల కోట్ల టన్నుల బరువుతో సమానమైన మట్టిని భూమి ఉపరితలం నుంచి తొలచివేసిందన్న మాట.

ఓపెన్‌ కాస్ట్‌ వల్ల చిన్నపిల్లల్లో ఆరోగ్య సమస్యలు............

ఓపెన్ కాస్ట్ నిర్వహణ వల్ల పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న 11 ఏళ్లలోపు పిల్లల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలువరించిన అధ్యయన నివేదికలు వెల్లడించాయి. ఓపెన్ కాస్ట్ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థుల్లో ఏకాగ్రత తగ్గిపోతున్నదని, జ్ఞాపకశక్తి క్షీణిస్తున్నదని కూడా ఆ అధ్యయనంలో తెలిపారు. పిల్లల్లో శ్వాస కోశ,చర్మసంబంధమైన వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పష్టం చేసింది. ఓపెన్ కాస్ట్ గనులున్న ప్రాంతాల్లోని గర్భిణులు ఇబ్బందుల పాలవుతారని ఈ నివేదిక వెల్లడించింది.

ఓసీపీ పరిధిలో సాగు యోగ్యతను కోల్పోతున్న వ్యవసాయ భూములు....

ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు పరిధిలోని దాదాపు 10 కిలోమీటర్ల పరిధిలో వ్యవసాయ భూములు సాగు యోగ్యతను కోల్పోతాయి. ఓపెన్‌కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలు వినియోగించడం వల్ల శబ్ద కాలుష్యం, చమురు కాలుష్యం, పర్యావరణాన్ని ఎక్కువగా దెబ్బతీస్తాయి. జంతు జీవాలకూ ప్రాణాంతకంగా మారుతున్నది.ఓపెన్‌కాస్ట్ గనుల్లో నిర్వహించే పేలుళ్లతో శబ్ద కాలుష్యం, దుమ్ము ,ధూళితో పక్షులు, చిట్టడవుల్లో నివసించే జీవాలు పూర్తిగా కనుమరుగవుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. జీవ సమతుల్యత కూడా దెబ్బతింటోంది.

ప్రతి ఓపెన్ కాస్ట్ బొగ్గుగని నిర్వహణ ఫలితంగా....

ప్రతి ఓపెన్ కాస్ట్ బొగ్గుగని నిర్వహణ ఫలితంగా చుట్టూ కిలోమీటర్ల మేర ఈ దుష్ఫరిణామాలన్నీ సంభవిస్తున్నాయని అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు నిర్వహించిన శాస్త్రీయ పరిశీలనలో తేల్చి చెప్పాయి. అయినా సింగరేణి మాత్రం.. పంతంతో ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌కే మొగ్గు చూపుతుండడం విశేషం. అందుకే.. భూగర్భ గనులున్న ప్రాంతల ఆవాసాలను తొలగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా.. ఇప్పటికిప్పుడు మాదారం గ్రామాన్ని కూల్చేయాలని పట్టుదలగా ఉంది. 

10:38 - December 11, 2015

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీలో దొంగలు పడ్డారు అంటూ 10టీవీలో ప్రసారమైన కథనానికి జీహెచ్‌ఎంసీ అధికారుల్లో చలనం వచ్చింది. అసిస్టెంట్‌ మెడికల్‌ ఆఫీసర్ల ప్రక్షాళనపై కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి దృష్టి సారించారు. కాలపరిమితి పూర్తయినా సీటు వదలని డాక్టర్లను బదిలీ చేస్తున్నారు. సర్కిల్‌-14లో ఉన్న డాక్టర్‌ మురళీధర్‌గుప్తా స్థానంలో మరో డాక్టర్‌ను నియమించారు. మరికొందరు అధికారులను బదిలీ చేయనున్నారు కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఘనంగా తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు.

చిత్తూరు : తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనం జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 8.00 గంటలకు కల్పవృక్ష వాహనంపై అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. అలాగే రాత్రి 8.00 గంటలకు హనుమంతు వాహనంపై తిరువీధుల్లో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. అలాగే మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకృష్ణాస్వామి ముఖమండపంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం, సాయంత్రం 6.00 గంటలకు ఆస్థాన మండలంలో ఊంజల్ సేవ జరుగుతాయి. అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు నేడు నాలుగోరోజుకు చేరాయి.

హోటల్ లోకి దూసుకెళ్లిన లారీ

మెదక్ :నర్సాపూర్ బస్టాండ్ వద్ద వేగంగా వస్తున్న ఓ లారీ హోటల్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఏంజిల్ బ్రోకింగ్ సంస్థ ఎదుట ఖాతాదారుల ఆందోళన

హైదరాబాద్ : పంజాగుట్టలోని ఏంజిల్ బ్రోకింగ్ సంస్థ ఆఫీసు ఎదుట ఖాతాదారులు ఆందోళన చేవారు. షేర్ మార్కెట్పై అవగాహన లేని వ్యక్తులతో సంస్థ ఇన్వెస్ట్ చేయించింది. తమను సంప్రదించకుండానే లావాదేవీలు జరపారని ఖాతాదారులు ఆరోపించారు. అవగాహన లేకపోవడంతో వేలాది మంది ఖాతాదారులు భారీగా నష్టపోయారు. తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళనకు దిగారు.

ప్రణబ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

హైదరాబాద్ : నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 80వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ తన ట్విట్టర్ ద్వారా ప్రణబ్ కి శుభాకాంక్షలు తెలిపారు. 

09:59 - December 11, 2015

ఏపండయినా పండుగానే బాగుంటుంది. కానీ ఖర్జూరపండు ఎండినా రుచే. నట్ గా మారిన ఎండు ఖర్చూరంలోని నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తియ్యగా ఉంటుంది. ఈ పండులో ఔషధ గుణాలు కూడా ఎక్కువ. వీటిని రోజూ తింటే రోగ నిరోధకశక్తి ని పెంచే గుణం మెండుగా వుంటుందని వైద్య నిపులు చెప్తున్నారు.

ముస్లిం దేశాలనుంచి దిగుమతి....
ఖర్జూరాలు విస్తారంగా పండే సౌదీ అరేబియా, ఇరాన్‌, ఇరాక్‌, యుఏఈ, ఒమన్‌, ట్యునీసియా, జోర్డాన్‌ల నుంచి ప్రతి ఏటా రంజాన్‌ మాసంలో ఈ పళ్లు మన దేశానికి దిగుమతి అవుతూ ఉంటాయి. రంజాన్‌ మాసం వచ్చిందంటే చాలు, పరి పుష్టికరమైన ఆ పండుతోనే ముస్లింలకు ఉపవాస దీక్ష పూర్తవుతుంది. అందుకే వారికిది లేనిదే పొద్దు గడవదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, మహ మ్మద్‌ ప్రవక్తకు ఇది ఎంతో ఇష్టమైన ఆహారంగా పవిత్ర గ్రంథం, ఖోరాన్‌ పేర్కొంటోంది. ఆయన ఇం టికి కలపనిచ్చింది కూడా ఖర్జూర చెట్టేననీ చెబు తారు. ఇస్లామిక్‌ దేశాల్లో ఖర్జూర వృక్షాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వీటిని నేరుగా తినటంతోపాటు కుకీస్‌, పచ్చళ్లు, హల్వా, చాక్లెట్లు, సిరప్‌, పాయసం తయారీల్లో కూడా ఉపయోగిస్తారు.
వివిధ దశలలో పేర్లు.......
ఖర్జూరాలు 4 దశల్లో పండుతాయి. అరబిక్‌ భాషలో ఆ దశలకు వేర్వేరు పేర్లు న్నాయి. పండని పళ్లను కిమ్రి అని, పెద్దవిగా పెరిగి కరకరలాడే ఖర్జూరాలను ఖలాల్‌ అని, పక్వానికొచ్చి మెత్తబడినవాటిని రుతాబ్‌ అని, ఎండు ఖర్జూరాలను తరమ్‌ అని పిలుస్తారు. ఈ అరబిక్‌ పేర్లే ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్నాయి. ఖర్జూరం విత్తనానికి 2 వేల ఏళ్ల తర్వాత కూడా మొలకెత్తే సామర్థ్యం ఉంటుంది.

ఖర్జూరం - ఉపయోగాలు...

ఖర్జూర పండ్లు విటమిన్ ఎ, బిలను కలిగి ఉంటాయి ఈ రెండూ ఇందులో ఉండటం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచుటలో ఎంతగానో ఉపయోగపడతాయి.
ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే, ఖర్జూరపండు తరచుగా ఎక్కువగా తినాలి.

ఖర్జూరపండు శరీరంలో అధికంగా గల వాతమున్ని పోగొడుతుంది.

ఉదయాన్నే మలబద్దకముతో బాధపడే వారు, రాత్రి పాలల్లో4నుండి5ఎండు ఖర్జూర పండ్లు వేసి మరగబెట్టి, రాత్రి నిద్రించే ముందు తాగుతూ ఉంతే మలబద్దకము తగ్గుతుంది.

నీరసము, నిస్సత్తువతో బాధపడుతున్నవారు, కొన్ని నెలల పాటూ రోజుకు15నుండి 20 ఖర్జూర పండ్లు భోజనము తర్వాత తీసుకుంటూ ఉంటే నీరసము, నిస్సత్తువ పూర్తిగా పోయి మంచి బలానిస్తుంది.

రకహీనతతో బాధపడుతున్నవారు, రక్తం బాగా పోయి ఉన్నవారు, నీరసముగా ఉండేవారు, ఖర్జూర పండ్లు, పాలు, మీగడ లేదా కొద్దిగా నెయ్యి కలిపి ఉదయాన్నే అల్పాహారం గా తీసుకుంటూ ఉంటే రక్తం వృద్ధి చెందును, పోగొట్టుకున్న శక్తి తిరిగి పొందవచ్చు..
ఎండా కాలం వడదెబ్బ తగులకుండా ఉండాలంటే, ఖర్జూరపండును రాత్రుళ్లు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే వడదెబ్బ నుండి రక్షించబడుతారు.
మూత్రం సాఫీగా కానివారికి ఖర్జూరపండు పెడితే మూత్రం సాఫీగా జారీ అవుతుంది.
పెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్‌ చక్కగా ఉపయోగపడుతుంది.
గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్‌ మంచి మందు.

డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురును వాడతారు. చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటినొప్పీ తగ్గుతుంది.

మూత్రపిండాలలో రాళ్లు కరగాలంటే ఖర్జూరపండు తరచుగా తినాలి.

09:45 - December 11, 2015

గుంటూరు : నర్సరావుపేట పురపాలక సంఘం శతాబ్ధి ఉత్సవాలకు ముస్తాబైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు అనేకమంది ప్రముఖులు రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ముగింపు ఉత్సవాలను గవర్నర్‌ నరసిహన్‌ హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల కోసం పట్టణాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. రోడ్లకు ఇరువైపులా పచ్చని తోరణాలు కట్టారు. డివైడర్లపై రంగు రంగుల పూల మొక్కలను ఏర్పాటు చేశారు. నరసరావుపేట చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోయేలా 30 అడుగల ఎత్తు ఉన్న పైలాన్‌ను నిర్మించారు. ఈ వేడుకల ఏర్పాట్లను అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక ఉత్సవాల సందర్భంగా కోడెల శివప్రసాదరావు స్టేడియంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

09:44 - December 11, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో మంత్రుల బృందం రెండు రోజుల పాటు మధ్యప్రదేశ్‌లో పర్యటించనుంది. మధ్యప్రదేశ్‌లోని ఎత్తిపోతల, సాగునీటి ప్రాజెక్టులలో కాల్వల ద్వారా కాకుండా పైప్‌లైన్లతో నీటిని సరఫరా చేస్తున్న పద్ధతిని రాష్ట్ర మంత్రుల బృందం అధ్యయనం చేయనుంది. ఓంకారేశ్వర్ నాలుగో దశ ప్రాజెక్టు, పునాస ఎత్తిపోతలను ఈ బృందం పరిశీలించనుంది. ఈ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న ఇంజినీర్లు, రైతులతో మంత్రుల బృందం మాట్లాడుతుంది. రెండో రోజు భోపాల్ చేరుకుని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశం కానుంది. బృందంలో మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సాగునీటి సలహాదారులు విద్యాసాగర్ పలువురు అధికారులు వెళ్లనున్నారు. 

09:41 - December 11, 2015

హైదరాబాద్ : ట్రాఫిక్‌ నిబంధనలు తప్పిన ప్రతిసారీ వాహన యజమానులకు పోలీసులు ఫైన్ విధిస్తుంటారు. ఆ ఫైన్‌ల తాలూకు డబ్బు చెల్లించేందుకు కోర్టు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 9వ తేదీన సుమారు మూడు వేల మందికి చలానాలను తగ్గిస్తూ జడ్జీలు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆ రుసుమును చెల్లించడానికి హైదరాబాద్‌ సిటీ పోలీసు కమిషనరేట్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వాహనదారులు తరలివచ్చారు.

గోషామహల్‌ పోలీసు స్టేడియంలో....

నగరంలోని గోషామహల్‌ పోలీసు స్టేడియంలో ఈ ట్రాఫిక్‌ చలానా అదాలత్‌ నిర్వహించారు. మూడు కంటే ఎక్కవ సంఖ్యలో ట్రాఫిక్‌ చలానాలు ఎదుర్కొన్నవారి కోసం ఈ అదాలత్‌ ఏర్పాటుచేశారు. చలానాల మొత్తం రుసుమును సగానికి పైగా తగ్గించడంతో వాహనదారుల్లో విశేష స్పందన కనిపించింది. అయితే వాహనదారులు భారీగా తరలిరావడంతో సౌకర్యాలను కల్పించలేక పోలీసులు చేతులెత్తేశారు.

మండుటెండలో గంటల తరబడి...

చలానా అదాలత్‌కు ఉదయం ఏడు గంటల నుంచి వాహనదారులు క్యూలు కట్టారు. అయితే తక్కువ కౌంటర్లు ఏర్పాటుచేయడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. సుమారు మూడు నుంచి నాలుగు గంటల వరకు లైన్లలో నిలబడాల్సి వచ్చింది. మండుటెండలో గంటల తరబడి నిలబడాల్సి రావడం, తాగునీరు అందుబాటులో లేకపోవడం.. వాహనదారుల సహనానికి పరీక్ష పెట్టినట్లైంది. ఉచితంగా అందించాల్సిన ఫారాలు లభించకపోవడంతో బయట 20 నుంచి 30 రూపాయలు ఖర్చుపెట్టి కొనాల్సొచ్చింది.

మరో రెండు రోజుల పాటు అదాలత్‌ కొనసాగించాలి...

లోక్‌అదాలత్‌ ముగించే సమయానికి పెద్ద సంఖ్యలో వాహనదారులు క్యూలలో ఉండిపోయారు. దీనితో మరో రెండు రోజుల పాటు అదాలత్‌ కొనసాగించాలని వారు కోరారు. మరి అధికారులు ఏం చేస్తారో చూడాలి. 

09:38 - December 11, 2015

హైదరాబాద్ : జపాన్ ప్రధాని షింజో అబే నేటి నుంచి మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. బుల్లెట్ రైలు వ్యవస్థ నిర్మాణానికి సంబంధించిన 98 వేల కోట్ల రూపాయల ఒప్పందంతో పాటు.. పలు అంశాలపై ఇరు దేశాలు చర్చించే అవకాశం కనిపిస్తోంది. రేపు ఇండో-జపాన్‌ శిఖరాగ్ర సదస్సులో వాణిజ్య అంశాలపై గతంలో తీసుకున్న నిర్ణయాలపై మోదీ, అబే సమీక్షించనున్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా అబే.. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కూడా కలవనున్నారు. 

08:34 - December 11, 2015

హైదరాబాద్ : పార్టీలు రాజకీయ అవసరాల కోసం నిర్ణయాలు చేయడం కాకుండా... ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు చేయాలని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ ' కార్యక్రమంలో ది హన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ సూచించారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై పోరాటం ప్రారంభించారు. అయితే గతంలో జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నపుడు ఇతర దేశాలకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు వ్యతిరేకంచాడు. ప్రతిపక్షంలో ఉన్నడు ఒకలా... అధికారంలో ఉన్న ఒక వైఖరి తీసుకోవడం రాజకీయ పార్టీలకు పరిపాటిగా మారింది. రాజకీయ అవసరాల కోసం నిర్ణయంతీసుకోవడం కాకుండా... ప్రజల అవసరాల మేరకు నిర్ణయాలు చేపట్టాలన్నారు. ముంబై - అహ్మదాబాద్ మధ్య వస్తున్న బుల్లెట్ ట్రైన్ నిర్మించేందుకు కేంద్రం అనుమతించింది. 520 కిలో మీటర్ల దూరంలో గంటకు 300 కి.మీ వేంగంతో ప్రయాణించే ట్రైన్ కు కేంద్రం అనుమతించింది. దీనికి కావాల్సిన నిధులు ఎక్కడ నుండి వస్తాయి. ప్రపంచ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉంది. అన్ని దేశాల్లో కొన్ని దేశాలపై ఎక్కువ బాధ్యత వుంది. పారిస్ సదస్సు లో అన్ని దేశాలు రెస్పాండ్ అయ్యాయి. గ్రేటర్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో టిసర్కార్ దూకుడు పెంచింది. మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇండ్ల నిర్మాణమే కాదు.. నాణ్యత పై కూడా దృష్టి పెట్టాలి. ప్రభుత్వాలు నిర్మించే ఇళ్లు పేదలకు అందుబాటులో వుండేలా చూడాలని నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. పూర్తి విశ్లేషణను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

08:09 - December 11, 2015

విశాఖ : విశాఖ జిల్లా అరకులోయ మండలం గన్నెల సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసు అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. గన్నెల, ఇరగాయి అటవీప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. మృతిచెందిన మావోయిస్టులు ఒడిశాకు చెందినవారుగా భావిస్తున్నారు. గత పదేళ్లలో అరకులోయ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరగడం ఇదే తొలిసారి. 

అరకు లోయలో ఎదురు కాల్పులు

విశాఖ : అరకు లోయ మండలం గన్నెల సమీపంలోని అటవీ ప్రాంతంలో అర్థరాత్రి దాటిన తరువాత పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించలేదు. మృతి చెందిన వారు ఒడిశాకు చెందిన వారుగా భావిస్తున్నారు. 

07:34 - December 11, 2015

హైదరాబాద్ : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వంద రోజులు..! అవును ఆశా వర్కర్లు సాగిస్తున్న సమ్మె వందరోజులు పూర్తి చేసుకుంది. నిరవధికంగా మూడు నెలలకు పైబడి పోరాడుతున్నా.. పాలకలు పట్టించుకోక పోవడంతో.. రోజుకో తీరుగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. తమ సమ్మె వంద రోజులు పూర్తయిన సందర్భంగా.. వంద కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు.. ఆశాలు. అస్సలు ఆశా వర్కర్ల వేతనాలతో తెలంగాణ సర్కార్ కు సంబంధం లేదా? కార్మిక సంఘాలంటేనే ఎందుకు కేసీఆర్ భయపడుతున్నాడా? ఆశా వర్కర్ల విషయంలో కేసీఆర్ ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నాడు? ఆశా వర్కర్ల సమ్మెను రాజకీయ పార్టీల కుట్ర అనడం సబబేనా? అంగన్ వాడీల జీతాలు పెంచి ఆశాలను ఎందుకు ఉద్యోగులగా గుర్తించడం లేదు? ఓయూ బీఫ్ ఫెస్టివల్ సక్సెస్ అయ్యిందా? కండల వీరుడు సల్మాన్ ఖాన్ కేసు విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు సామాన్యులకు న్యాయం జరుగుతోందా? న్యాయవ్యవస్థం పై సుప్రీం సీజే చేసిన వ్యాఖ్యలు సరైనవేనా? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చ జరిగింది. ఈ చర్చలో నవతెలంగాణ ఎడిటర్ వీరయ్య, టి.టిడిపి అధికారప్రతినిధి సతీష్ మాదిగ, టిఆర్ ఎస్ నేత రాకేష్, బిజెపి నేత ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వెలిబుచ్చారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 31 మందికి జైలు శిక్ష

హైదరాబాద్ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 31 మందికి జైలు శిక్ష పడింది. నవంబర్ 28వ తేదీ నుంచి ఈ నెల 4వ తేదీ వరకు నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 492 కేసులు నమోదయ్యాయి. వాహనదారుల నుంచి మొత్తం 7.91 లక్షల జరిమానా వసూలు చేశారు. ఈ కేసులపై ట్రాఫిక్ పోలీసులు చార్జిషీట్లు దాఖలు చేయడంతో 31 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఔటర్ రింగ్‌రోడ్డుపై నిబంధనలు ఉల్లంఘించినందుకు 351 వాహనదారులపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో ప్రమాదభరితంగా ఓఆర్‌ఆర్‌పై 81 పార్కింగ్, రాంగ్ రూట్లలో ప్రయాణించిన 270 మంది నుంచి రూ.

ఉధృతంగా ఆశా వర్కర్ల ఆందోళన...

హైదరాబాద్ : ఆశావర్కర్లు.. తెలంగాణ వ్యాప్తంగా అలుపెరుగని ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈరోజుతో వారి సమ్మె వంద రోజులు పూర్తి చేసుకుంది.. ఈ సందర్భంగా.. వంద కిలోమీటర్ల పాదయాత్రతో.. ప్రభుత్వానికి తమ నిరసనను వినూత్నంగా తెలిపారు.. ఆశా వర్కర్లు. సీఐటీయూ ఆధ్వర్యంలో.. రాష్ట్రం నలుమూలలా ర్యాలీలు.. పాదయాత్రలు చేపట్టారు. హైదరాబాద్‌లో బషీర్‌బాగ్‌ చౌరస్తా నుంచి సుందరయ్య పార్కువరకూ నిరసన ర్యాలీ చేశారు.. 

అటవీ హక్కుల చట్టం అమలు కోసం కథం తొక్కిన గిరిజనులు

రాజమండ్రి : అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో గిరిజనులు భారీ ప్రదర్శన నిర్వహించారు. సమగ్ర అటవీ హక్కుల చట్టం అమలు కోసం ఉద్యమించారు. గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. 

కారు-ఆటో ఢీ : పలువురికి గాయాలు

మహబూబ్ నగర్ : దేవరకద్ర జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనతో జాతీయర రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయ ఏర్పడింది.

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి.....

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్‌ పర్యటన ఖరారైంది.. శీతాకాల విడిది కోసం ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నారు ప్రణబ్... ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి హకీంపేట్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు.. 19న మిలటరీ కాలేజ్‌ ఆఫ్ ఇంజనీరింగ్‌ స్నాతకోత్సవానికి హాజరవుతారు.. 27న జయశంకర్‌ యూనివర్శిటీలో ఇండియన్‌ ఎకనమిక్‌ అసోసియేషన్‌ వార్షిక సమావేశంలో పాల్గొంటారు.. అదేరోజు ఎర్రవల్లిలో కేసీఆర్‌ నిర్వహించే చండీయాగానికి హాజరవుతారు.. మిగిలిన రోజుల్లో సందర్శకులను కలుసుకుంటారు.. ఈ నెల 31న తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారు..

06:56 - December 11, 2015

హైదరాబాద్ : దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్‌ ముఖర్జీ శీతాకాల విడిదికోసం హైదరాబాద్‌ రాబోతున్నారు.. ఆయన 15రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారు. ప్రణబ్‌ అధికారిక కార్యక్రమాలతో పాటు... ఎర్రవెల్లి చండీయాగానికీ హాజరవుతారు. రాష్ట్రపతి టూర్‌ షెడ్యూల్‌ ఖరారు కావడంతో.. అధికారులు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిపెట్టారు.

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి.....

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్‌ పర్యటన ఖరారైంది.. శీతాకాల విడిది కోసం ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నారు ప్రణబ్... ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి హకీంపేట్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు.. 19న మిలటరీ కాలేజ్‌ ఆఫ్ ఇంజనీరింగ్‌ స్నాతకోత్సవానికి హాజరవుతారు.. 27న జయశంకర్‌ యూనివర్శిటీలో ఇండియన్‌ ఎకనమిక్‌ అసోసియేషన్‌ వార్షిక సమావేశంలో పాల్గొంటారు.. అదేరోజు ఎర్రవల్లిలో కేసీఆర్‌ నిర్వహించే చండీయాగానికి హాజరవుతారు.. మిగిలిన రోజుల్లో సందర్శకులను కలుసుకుంటారు.. ఈ నెల 31న తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారు..

ఈ నెల 15లోపు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశం....

రాష్ట్రపతి రాక సందర్భంగా... ఏర్పాట్లపై సమన్వయ సమావేశం ఏర్పాటుచేశారు సీఎస్‌ రాజీవ్ శర్మ.. ఈ సమావేశంలో ఆర్మీ, పోలీస్, ఫైర్, రెవెన్యూ, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధికారులు పాల్గొన్నారు. ప్రణబ్‌ పర్యటకోసం ఈ నెల 15లోపు అన్ని కార్యక్రమాలు పూర్తిచేయాలని ఆదేశించారు.. తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని... ట్రాఫిక్ నియంత్రణపై దృష్టిపెట్టాలని సూచించారు.. ప్రణబ్ ప్రయాణించే మార్గాల్లో రోడ్లకు మరమ్మత్తులు చేయాలన్నారు.. అలాగే స్వాగత తోరణాలు, అవసరమైన హెలిపాడ్‌ సిద్ధం చేయాలని సూచించారు.. బారికేడ్ల నిర్మాణం, పరిసరాల శుభ్రత కోసం స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని కోరారు.. అన్ని శాఖలమధ్య సమన్వయంకోసం రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల డిఆర్వ్వోను నోడల్‌ ఆఫీసర్లుగా నియమించారు.. అటు బొల్లారం రాష్ట్రపతి భవన్‌ను అందంగా అలంకరించాలని ఆదేశించారు.. 15రోజులపాటు రాష్ట్రపతి పర్యటనతో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు.. ఎర్రవెల్లితోపాటు పలుచోట్ల ప్రత్యేక హెలిపాడ్‌లు ఏర్పాటుచేస్తున్నారు.. 

06:52 - December 11, 2015

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అధికారుల బృందాలు పర్యటించాయి. కేంద్రం నుంచి వచ్చిన అధికారులు రెండు బృందాలుగా విడిపోయారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో రెండు రోజులు పర్యటించాయి. కేంద్ర అధికారులు వరద నష్టాన్ని అంచనావేశారు. నెల్లూరు జిల్లాలోని కావలి, నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించారు. వరదలతో నెల్లూరు జిల్లాలకు 2,250 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఏపీ మున్సిపల్‌ మంత్రి నారాయణ చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలోని నగరి, పుత్తూరు, తిరుపతిలో కేంద్ర బృందం పర్యటించింది. భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని అంచనావేసింది. కడప జిల్లాల్లో కూడా కేంద్ర అధికారుల బృందం పర్యటించి, వదరనష్టాన్ని అంచనావేసింది. ఇవాళి విజయవాడలో చంద్రబాబుతో భేటీ అయ్యే కేంద్ర బృందాలు ఢిల్లీ వెళ్లిన తర్వాత హోం శాఖకు నివేదిక ఇస్తాయి.  

06:50 - December 11, 2015

హైదరాబాద్ : నెల్లూరులోని ఓ ఎయిడెడ్‌ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడగా పని చేస్తున్న విభూతి సురేష్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడిచేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. విభూతి సురేష్‌.. నీటిపారుదల శాఖ, గ్రామీణ మంచినీటి సరఫరా విభాగాల్లో పని చేస్తున్న కొంతమంది ఇంజినీర్లతో కలిసి బీనామీ పేర్లతో స్థిరాస్తి వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించాడు. సురేష్‌ నివాసంలో 400 గ్రాముల బంగారం కూడా ఉన్నట్టు గుర్తించారు. స్థిరాస్థి వ్యాపారులకు కోట్ల రూపాయలు వడ్డీకి ఇచ్చినట్టు కనుగొన్నారు. ఇతని బ్యాంకు లాకర్‌ను తెరవాల్సి ఉంది. విభూతి సురేష్‌తోపాటు, అతని కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదారు చేశారు. సురేష్‌తో కలిసి బీనామీ వ్యాపారాలు చేస్తున్న ఇంజినీర్ల ఇళ్లపై కూడా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 

06:48 - December 11, 2015

హైదరాబాద్ : ప్రతి నెలా 1వ తేదీన టంచనుగా జీతాలు తీసుకుంటున్న జీహెచ్‌ఎంసీ అధికారులు.... పారిశుధ్య కార్మికులకు వేతనాల చెల్లింపులో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. సకాలంలో పైసలు అందక కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందు ఎదుర్కొటున్నాయి.

అధికారులు మాత్రమం 1వ తేదీనే....

జీహెచ్‌ఎంపీలో పారిశుధ్య కార్మికులకు జీతాల చెల్లింపు అంశం అస్తవ్యస్తంగా మారింది. భారీ మొత్తంలో జీతాలు తీసుకునే అధికారులు, సిబ్బందికి ప్రతి నెలా 1వ తేదీనే బ్యాంకు అకౌంట్లలో జమ అవుతాయి. కానీ పారిశుధ్య కార్మికులు మాత్రం వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. వచ్చే వేతనం తక్కువ ఆపై సుదీర్ఘ జాప్యంతో కార్మిక కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులతో చితికిపోతున్నాయి.

గతంలో ప్రతి నెలా 3 తేదీలోగా వేతనాలు...

గతంలో ప్రతి నెలా 3 వ తేదీలోగా వేతనాలు అందేవి. కానీ ఇప్పుడాపరిస్థితిలేదు. ప్రతి నెలా 20 వ తేదీ తర్వాతే ఇస్తున్నారు. దీంతో ఆర్ధిక సమస్యలతో బతుకీడ్చాల్సి వస్తోందిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులకేకాదు...

జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులకేకాదు... పర్యవేక్షకులకు కూడా సకాలంలో వేతనాలు అందడంలేదు. కొన్ని డివిజన్లలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు, పర్యవేక్షకులు సకాలంలోనే వేతనాలు అందుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో పనిచేసే వారికి మాత్రం జాప్యం చేస్తున్నారు. తమ పట్ల ఎందుకీ వివక్ష అని ప్రశ్నిస్తున్నారు.

06:45 - December 11, 2015

హైదరాబాద్ : కాంగ్రెస్‌లో కొత్త గుబులు మొదలైంది.. సర్వేల రిపోర్టులు నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. చేదు గుళికల్లా ఉన్న సర్వేలను జీర్ణించుకోలేక నేతలు కిందామీదా పడుతున్నారు.. వీరి ఫోబియాను.. గులాబీ పార్టీ అస్త్రంగా మర్చుకోవడంతో... హస్తం నేతలు మరింత డీలా పడిపోతున్నారు.

12 స్థానాలకుగాను 5 స్థానాల్లోనే పోటీ............

పరాజయాలతో బెంబేలెత్తిపోతున్న కాంగ్రెస్‌లో మరో టెన్షన్ మొదలైంది... వరంగల్‌ ఉప ఎన్నిక ఓటమినుంచి తేరుకోకముందే మరో న్యూస్‌ నేతలకు షాక్ ఇస్తోంది.. ఎన్నికలకుముందు సొంతంగా చేపట్టిన సర్వేల ఫలితాలు బెంబేలెత్తిస్తున్నాయి.. రాష్ట్రంలోని 12 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకాగా... కేవలం ఐదు స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టింది పార్టీ.. ప్రధాన ప్రతిపక్షమే ఇలా కొన్ని స్థానాలకే పరిమితం కావడం పట్ల పార్టీ శ్రేణులూ మండిపడ్డాయి. కానీ దీనికి కారణం.. సర్వే నివేదికలే అని తెలుస్తోంది.

ఉప ఎన్నికకోసం వరుస సర్వేలు...

వరంగల్‌ ఉప ఎన్నికల వేళ...పీసీసీ, ఏఐసీసీ తోపాటు.. కొందరు పార్టీ నేతలు సర్వే చేశారు.. ఇందులో నెగటివ్‌గా రిపోర్టు వచ్చిందని సమాచారం.. సరిగ్గా ఫలితాలు కూడా సర్వేలో పేర్కొన్నట్లే రావడంతో నేతలు కంగుతిన్నారని తెలుస్తోంది.. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు... ఆ తర్వాత గ్రేటర్‌, నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో పోటీ చేయకతప్పని పరిస్థితి.. గెలుస్తామా? కనీసం పోటీ ఇస్తామా? అన్న అంశంపై క్లారిటీకోసం సర్వేల బాట పట్టింది కాంగ్రెస్‌.. ఫలితాలు.. పార్టీ నేతలను దిగ్భ్రమకు గురి చేశాయని సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ మినహా ఎక్కడా సర్వే ఫలితాలు అనుకూలంగా లేవు.. అక్కడకూడా విజయం సాధిస్తామన్న గ్యారంటీ లేదు.. అందుకే 5 స్థానాలకే పార్టీ పరిమితమైందని పార్టీలో టాక్‌ నడుస్తోంది..

11శాతంమాత్రమే ఓట్లు వస్తాయన్న రిపోర్టులు.....

విఓ : ఇక గ్రేటర్‌లో జనాల నాడి తెలుసుకునేందుకు చేపట్టిన సర్వేలు కూడా కాంగ్రెస్‌కు నామమాత్రపు సంతోషాన్నీ ఇవ్వడం లేదట. కొందరు నేతలు చేసిన సర్వేల ప్రకారం.. గ్రేటర్‌ ఎన్నికల్లో.. కాంగ్రెస్‌ పార్టీకి డబుల్‌ డిజిట్‌ దక్కడమూ కష్టమేనని తేలిందట. 11శాతం మాత్రమే ఓట్లు వస్తే మహా గొప్ప అన్నట్లుగా పరిస్థితి ఉందని సర్వే నివేదికలు తేల్చి చెప్పాయట. దీంతో కాంగ్రెస్‌ నేతలు మరింతగా డీలాపడిపోయారు.

టీఆర్‌ఎస్‌ ఈ ఫలితాల్ని తమకు అనుకూలంగా ....

ఈ విషయం పసిగట్టిన టీఆర్‌ఎస్‌ ఈ ఫలితాల్ని తమకు అనుకూలంగా మార్చుకుంటోంది.. హస్తం నేతలకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.. దీంతో త్వరలోనే గ్రేటర్‌ పరిధిలో.. కాంగ్రెస్‌ నుంచి వలసలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. మొత్తానికి ఈ సర్వేల ఫలితాలు కాంగ్రెస్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నాయి... నేతలంతా నిరాశలో మునిగేలా చేస్తున్నాయి.. ప్రతిపక్షంగా జోరు పెంచుదామనుకుంటే... ఇలా జరుగుతోందేంటంటూ నేతలు ఆవేదన చెందుతున్నారు.. 

06:43 - December 11, 2015

హైదరాబాద్ : మన తెలుగు రాష్ట్రాల్లో ఆహార పదార్ధాలు కల్తీ అవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట కల్తీ పదార్ధాలు పట్టుబడుతున్నాయి. వంటింట్లో నిత్యం వాడే పసుపు, కారం, టీపొడి, అల్లం పేస్ట్ ఇలా ప్రతిదీ కల్తీ అవుతోంది. ఆఖరికి పసిపిల్లలు తాగే పాలను కూడా కల్తీ భూతం పీడిస్తోంది. ఇక నెయ్యి ముట్టుకోవాలంటేనే భయం వేస్తోంది. కల్తీ చేసిన ఆహార పదార్ధాలను తినడం వల్ల మన ఆరోగ్యాలు నాశనమవుతున్నాయి. భయంకర వ్యాధులు మన నవనాడుల్నీ క్రుషింపచేస్తున్నాయి. మన ఆరోగ్యాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న కల్తీలను గుర్తించడం ఎలా? ఈ కల్తీల వల్ల మనకు జరుగుతున్న నష్టం ఏమిటి? కల్తీల నివారణలో పౌర సమాజం పాత్ర ఏమిటి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలంగాణ ఫుడ్స్ క్వాలిటీ కంట్రోల్ కెమిస్ట్ ఎం. ప్రఫుల్ కుమార్ పాల్గొన్నారు. వారు ఎలాంటి సూచనలు చేశారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:41 - December 11, 2015

హైదరాబాద్ : అంగడిలో ఏది కొనాలన్నా భయమేస్తోంది. ఏది తినాలన్నా భయమేస్తోంది. ధరలకు అదుపు లేదు. కల్తీలకు అడ్డులేదు. ఇదొక భయంకర వాస్తవం. ఎంత డబ్బు పోసినా నాణ్యమైన పదార్ధాలు దొరకడం లేదు. అసలు ఏది కల్తీయో, ఏది నాణ్యమైనదో అర్ధం కాని పరిస్థితి. కల్తీలు చేయడం శిక్షార్హమైన నేరం. కల్తీ పదార్ధాలు తినడం ఆరోగ్యానికి హానికరం. అయినా మన దేశంలో కల్తీల జోరు తగ్గడం లేదు. అప్పుడప్పుడు వివిధ శాఖల అధికారులు దాడులు చేయడం, కొన్ని కల్తీ పదార్ధాలు పట్టుకోవడం, ఒకరిద్దరి మీద కేసులు పెట్టడం, ఆ తర్వాత షరా మామూలుగా అదే వ్యక్తులు అంతకు పదింతలు స్థాయిలో కల్తీ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం మన దేశంలో సర్వసాధారణమైపోయింది.

ఆగని కల్తీలు...

ఆహార పదార్ధాలలో జరిగే కల్తీల కారణంగా ప్రపంచంలో ప్రతి ఏటా 22 లక్షల మంది చనిపోతున్నట్టు అప్పుడెప్పుడో ప్రపంచ ఆరోగ్య సంస్థ నెత్తీ నోరుబాదుకుని చెప్పింది. కానీ, ఏం లాభం? కల్తీలు ఆగడం లేదు. ధనాపేక్షతో కొద్దిమంది సాగిస్తున్న కల్తీల దందా మనందరి ప్రాణాలకే ముప్పు తెస్తోంది. ఆరోగ్యాలను గుల్ల చేస్తోంది. కల్తీల కారణంగా దాదాపు రెండు వందల రకాల వ్యాధులు జనం జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. చివరకు పాడె గేదెలకు, పుచ్చకాయలకు కూడా ఇంజెక్షన్ లు ఇచ్చే దుర్మార్గం రోజురోజుకీ ప్రబలుతోంది.

కల్తీ మాఫియా గుప్పెట్లో జనం ప్రాణాలు....

చివరకు పాలల్లో యూరియా కలిపి, మన చేత తాగించడం కల్తీ మాఫియా ఆగడాలకు పరాకాష్ట. కుళ్లి పోయిన పదార్దాలతో అత్యంత ప్రమాదకర రసాయనాలను కలగలిపి, అల్లం పేస్టులు తయారుచేస్తున్న తీరు కల్తీ మాఫియా వికృతత్వానికి ప్రతిరూపం. జంతువుల ఎముకలను మరిగించి, వాటిని నూనెల్లో కలిపి, పెద్దపెద్ద రెస్టారెంట్లకు సరఫరా చేసి, మన నోళ్లలో విషపు ముద్దలు కుక్కుతుంటే, వాటిని పోల్చుకోలేని దుర్భలత్వం మనది. ఇంకెంత కాలం మనం ఈ అరాచకాన్ని భరించాలి?

ప్రతి అయిదు శాంపిళ్లలో ఒకటి కల్తీదే....

పాలు, పప్పు, కారం, నూనె, పచ్చళ్లు, స్వీట్లు కల్తీలేని పదార్ధం అంటూ ఏదీ కనిపించడం లేదు. ఫుడ్ సేఫ్టీ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుడు 49 వేల 290 శాంపిళ్లను పరిశీలిస్తే, అందులో 8 వేల 469 కల్తీవేనని తేలింది. అంటే ప్రతి అయిదు శాంపిళ్లలో ఒకటి కల్తీదే. దేశంలో కల్తీ మాఫియా ఇంతగా పేట్రేగిపోతుంటే, ఇక మన ఆరోగ్యాలకు రక్షణ ఎక్కడ?

కల్తీల కారణంగా 200 రకాల వ్యాధులు.......

కల్తీలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరం గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. కల్తీల వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటాయి. కేన్సర్, ఉదరకోశ, నాడీ సంబంధ వ్యాధులు విజ్రుంభిస్తున్నాయి. పిల్లల్లో ఎదుగుదల లోపిస్తోంది. అందుకే కల్తీల నివారణకు అటు ప్రభుత్వ యంత్రాంగమూ, ఇటు పౌర సమాజమూ యుద్ధ ప్రాతిపదికన కదలాల్సిన సమయమొచ్చింది. లాబరేటరీలకే పరిమితమైన కల్తీలను గుర్తించే మెళుకవలను ప్రతి ఒక్కరం నేర్చుకోవాల్సిన సందర్భమిది. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 6 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

రికార్డు స్థాయిలో వేములవాడ రాజన్న ఆదాయం...

కరీంనగర్ : వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామివారికి కార్తీకమాసంలో రూ.6.80 కోట్ల ఆదాయం సమకూరింది. స్వామివారికి వివిధ ఆర్జిత సేవలతోపాటు హుండీ ద్వారా నెల రోజుల్లో ఈ ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో దూస రాజేశ్వర్ తెలిపారు. హుండీ ఆదాయం కూడా రికార్డుస్థాయిలో రూ.1,12,13,979 సమకూరిందన్నారు. గురువారం ఆలయ ఓపెన్‌స్లాబ్‌పై నిర్వహించిన హుండీ లెక్కింపులో బంగారం 233 గ్రాములు, వెండి 14.5 కిలోలు వచ్చినట్లు తెలిపారు. ఈ ఆదాయం కేవలం 19 రోజులది మాత్రమేనని ఈవో తెలిపారు. గత ఏడాది కార్తీక మాసంలో రాజన్నకు రూ.5.42 కోట్ల ఆదాయం సమకూరగా, ఈ ఏడాది రూ.1.38 కోట్లు అధికంగా వచ్చినట్లు ఈవో తెలిపారు.

మహానంది ఆలయ ఉద్యోగుల సస్సెన్షన్

కర్నూలు : బాధ్యతలను మరిచిన ఇద్దరు ఆలయ ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురయ్యారు. కర్నూలు జిల్లా మహానంది ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో విధులకు హాజరైన మద్దిలేటి అనే ఉద్యోగితోపాటు, విధుల్లో అలసత్వం వహించిన అర్జునశర్మను సస్పెండ్ చేస్తూ గురువారం ఆలయ ఈవో శంకరవరప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Don't Miss