Activities calendar

12 December 2015

ఒంగోలు సూర్యవైన్స్ లో మద్యం తాగి వ్యక్తి మృతి

ప్రకాశం : ఒంగోలు సూర్యవైన్స్ లో మద్యం తాగి వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమయ్యారు.

 

22:20 - December 12, 2015

టీసర్కార్ 15 నెలల కాలంలో కొన్ని మంచి పనులున్నాయని.... మరికొన్ని పనులు మంచిగా లేవని ప్రొ.కోదండరాం తెలిపారు. టెన్ టివిలో నిర్వహించిన 'రచ్చబండ' కార్యక్రమంలో మల్లన్నతో ఆయన ముచ్చటించారు. ఆ విషయాలను ఆయన మాట్లోనే..
'తెలంగాణ వచ్చాక.. టీసర్కార్ వచ్చాక..మన విషయాలు మనం మాట్లాడుకునే అవకాశం దొరికింది. అయితే ఉద్యమకాలంలో గుర్తించిన విషయాలను ప్రభుత్వం గుర్తించాలి. బతుకుదెరువు విషయంలో ఇంకా అడుగులు పడుతలేవు. తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసే పరిస్థితి రావాలి. పండించిన పంటకు గిట్టుబాట ధర కల్పించాలి. ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రభుత్వంలో అవకాశం ఇవ్వాలి' అని చెప్పారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

22:04 - December 12, 2015

ఢిల్లీ : రాజధాని ఢిల్లీలో అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆరుగురు యువకులు 14 ఏళ్ల విద్యార్థిని కిడ్నాప్‌ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం నాడు ఉదయం ఏడున్నరకు ఇంటి నుంచి స్కూలుకు వెళ్తున్న విద్యార్థినిని ఆరుగురు యువకులు టాటా సుమోలో ఆమెను బలవంతంగా ఎక్కించారు. ఎదురు తిరిగితే చంపేస్తామని బెదిరించారు. ఢిల్లీలోని నజఫ్‌గర్‌ పరిధిలోని డిచావన్ గ్రామ సమీపంలోని నిర్మాణుష్య ప్రాంతంలో కారులోనే ఆ యువతిపై వారు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడ్డ వారిలో తన ఇంటి సమీపంలో ఉండే రాహుల్‌ను బాధితురాలు గుర్తించింది. అదే ప్రాంతంలో ఉండే మిగతావారిని బాలిక గుర్తించ లేదు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ రాహుల్, సూరజ్, సందీప్‌, రమేష్‌, నరేందర్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో యువకుడు అమన్‌ పరారీలో ఉన్నాడు.

 

22:01 - December 12, 2015

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం సిపిఎం ఏపీ శాఖ విస్తృత స్థాయి సమావేశాలకు వేదికైంది. పలువురు సిపిఎం ప్రముఖ నేతలు హాజరైన ఈ సమావేశం ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది. ప్రజా ఉద్యమాల యొక్క గొప్పతనాన్ని ఆవశ్యకతను నేతలు గుర్తుచేశారు.
అచ్చేదిన్‌ దేశంలో ఎక్కడా కన్పించడంలేదు : ఏచూరీ
కేంద్ర, రాష్ట్రాల్లో పార్టీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతూ ప్రజలను మభ్యపెడుతున్నాయని సిపిఎం విమర్శించింది. జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ ప్రపంచమంతటా పెట్రోల్‌ ధరలు తగ్గితే దేశంలో ఆయిల్‌ ధరలు పెరగడమేంటన్నారు. మోడీ ఎన్నికల టైంలో ప్రతిసారీ తాము అధికారంలోకొస్తే మంచి రోజులు వస్తాయన్నారు... ధరలు, ట్యాక్సులు పెరగడమే మంచి రోజులా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. మోదీ చెప్పిన అచ్చేదిన్‌ దేశంలో ఎక్కడా కన్పించడంలేదని ఏచూరి అన్నారు. రాజమండ్రిలో జరుగుతున్న సిపిఎం విస్తృత స్థాయి సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. ప్రజా ఉద్యమాలే తప్ప మరే రకంగానూ సామాన్యుడికి న్యాయం జరగదని రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు ఈ వేదిక నుంచి స్పష్టం చేశారు.
రైతుల రోడ్డున పడేస్తోన్న సర్కార్ : మధు
చంద్రబాబు సర్కార్‌ ఇష్టానుసారంగా రైతుల నుంచి భూములను లాక్కొంటూ వారిని రోడ్డున పడేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు.
పేదల డబ్బులు పెద్దలకు : గఫూర్
మోడీ ప్రభుత్వం పేదల నుంచి డబ్బులు వసూలు చేస్తూ పెద్దలకు పంచిపెడుతోందని సిపిఎం కేంద్ర నాయకులు గఫూర్‌ విమర్శించారు. ప్రజా ఉద్యమాలు నిర్వహించి కష్టాల నుంచి బయటపడదామని ఇందుకు సిపిఎంతో కలిసిరావాలని నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. పోరాటాలే ప్రపంచ గతిని మారుస్తాయని సామాన్యుడిని రక్షిస్తాయని అన్నారు.

 

21:56 - December 12, 2015

హైదరాబాద్ : రాష్ట్రం బంగారు తెలంగాణగా మారే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు.. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. రాష్ట్రం శరవేగంతో అభివృద్ధి చెందేందుకు రూపొందించిన అన్ని ప్రాజెక్టులు... 2019నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మిగులు విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల పూర్తితో పాటు.. ఎన్నికల్లో చేసిన హామీలన్ని అమలు చేస్తామన్నారు కేసీఆర్.
తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రమన్న కేసీఆర్ 
తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం కాదు... అభివృద్ధి చెందిన రాష్ట్రమన్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. హైదరాబాద్ ఏవీ కాలేజీలో జరిగిన కేవీ రంగారెడ్డి 125వ జయంతోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశంలోనే 12 శాతం అభివృద్ధి రేటు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని.. రెండేళ్లలో అభివృద్ధిలో సంపూర్ణ పరిపక్వత సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండేవని.. కానీ తమ ప్రభుత్వ చర్యలతో ప్రస్తుతం కరెంట్ కష్టాలు పోయాయని కేసీఆర్ తెలిపారు .
మిషన్ భగీరథ రాష్ట్రానికే తలమానికం 
మిషన్ భగీరథ రాష్ట్రానికే తలమానికం కాబోతుందన్నారు కేసీఆర్. ఈ పథకం ద్వారా తెలంగాణ ప్రజలకు త్వరలో మంచినీటి బాధ దూరం కాబోతోందని సీఎం ప్రకటించారు. ఇప్పుడీ ప్రాజెక్ట్ ఇతర రాష్ర్టాలకు కూడా ఆదర్శం అయిందన్నారు. బిహార్, యూపీ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు ఈ స్కీమ్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నట్టు తెలిపారు కేసీఆర్.
సమైక్య పాలనలో మన ప్రాజెక్టులు కాగితాలకే పరిమితం
సమైక్య పాలనలో మన ప్రాజెక్టులు కాగితాలకే పరిమితమై పోయాయని... ఇప్పుడు మళ్లీ వాటికి మోక్షం లభించిందని ప్రకటించారు. ఇంటింటికి ప్రభుత్వ ఖర్చుతోనే మంచినీటిని అందిస్తామని పేర్కొన్నారు. ఇందు కోసమే ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేస్తామని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధికి కృషిచేసిన కేవీ రంగారెడ్డి విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఏదైనా విశ్వవిద్యాలయానికి గానీ... విద్యా సంస్థకు కానీ ఆయన పేరు పెడతామని కూడా కేసీఆర్ ప్రకటించారు.

 

21:48 - December 12, 2015

విజయవాడ : కాల్ మనీ దందా నిర్వహించేవారు... రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. ఆపై... మహిళల కోసం సేవా కార్యక్రమాలు చేస్తామంటూ.. వారిని తమ అవసరాల కోసం వాడుకుంటూ అక్రమ వ్యాపారానికి శ్రీకారం చుడతారు. వీరి ఆగడాలు భరించలేక... ఇళ్లు ఖాళీ చేయాలంటూ కోరిన యజమాని పైనే కాల్ మనీ వ్యాపారులు దాడికి దిగారు. న్యాయం కావాలంటూ పోలీసులను ఆశ్రయిస్తే... మళ్లీ దాడి చేశారని కాల్ మనీ వ్యాపారులకు ఇళ్లు అద్దె కిచ్చిన యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.

 

21:42 - December 12, 2015

ప్రకాశం : ఒంగోలు సూర్యవైన్స్ లో మద్యం తాగి వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమయ్యారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి. 

 

21:37 - December 12, 2015

హైదరాబాద్ : రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు ఉండవు. నిజమే గులాబీ దళపతి కేసీఆర్‌కు ఒకప్పుడు ఆయనే విలన్‌.. ఆయన రాకతోనే తన సీటుకు ఎసరు వచ్చిందని పార్టీని వీడారు. సొంత కుంపటి పెట్టారు. ఉద్యమం రగిల్చారు. కట్‌ చేస్తే కొత్త రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఎవరి రాకతో పార్టీని వీడారో ఇప్పుడు ఆయనకే కండువా కప్పి సొంత పార్టీలోకి ఆహ్వానించే విచిత్ర పరిణామం చోటుచేసుకోనుంది.
టీడీపీకి విజయరామారావు గుడ్‌బై
తెలంగాణ టీడీపీలో ముఖ్య నేతగా పేరున్న మాజీ మంత్రి కె.విజయరామారావు టీడీపీకి గుడ్‌బై చెప్పారు.గత సార్వత్రిక ఎన్నికల నాటి నుంచే ఆయన పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. దీంతో టీడీపీ జాతీయ కమిటీలో కానీ, టీటీడీపీ రాష్ట్ర కమిటీలో కానీ ఆయనకు ఎలాంటి పదవీ దక్కలేదు.
టీఆర్‌ఎస్ లో చేరడానికి విజయరామారావు సిద్ధం..?
జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే ఆయన రెండు రోజులుగా ఖైరతాబాద్ నియోజకవర్గం నాయకులు, తన అనుచరులతో మాట్లాడి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వారికి వివరించారని సమాచారం. అన్నీ ఆలోచించుకునే, విజయ రామారావు శుక్రవారం టీడీపీకీ రాజీనామా చేస్తున్నట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. కాగా, విజయరామారావు అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు.
1999 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపు
సీబీఐ డెరైక్టర్ గా పనిచేసిన కె.విజయరామారావు 1999 ఎన్నికల్లో టీడీపీ తరపున ఖైరతాబాద్ నుంచి గెలిచారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. 2014 లో బీజేపీ పొత్తులో భాగంగా టీడీపీ ఆయనకు అవకాశమివ్వలేదు. అప్పటి నుంచి ఆయన టీడీపీ విషయంలో కొంత దూరంగా ఉంటూవస్తున్నారు.
విజయరామారావుపై టీఆర్ ఎస్ దృష్టి
ఇదిలా ఉంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్‌తో టీఆర్‌ఎస్ నేతలు సంప్రదింపులు జరిపారు. దానం నాగేందర్ వెనక్కి తగ్గడంతో మరో నాయకుడి వేటలో పడిన టీఆర్‌ఎస్ ఒక్కసారిగా దృష్టి విజయరామారావుపై పడింది. కేసీఆర్ ఆహ్వానంగా మంత్రి హరీష్‌రావు ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు సమాచారం.
బాబు కేబినేట్లో విజయరామారావు వల్లే కేసీఆర్‌కు మంత్రిపదవి దక్కలేదు
విచిత్రం ఏమిటంటే 1999లో చంద్రబాబు కేబినేట్లో విజయరామారావు వల్లే కేసీఆర్‌కు మంత్రిపదవి దక్కలేదు. సీబీఐ మాజీ డెరైక్టర్ కె.విజయరామారావును మంత్రిమండలిలోకి తీసుకొని కేసీఆర్‌కు డిప్యూటీ స్పీకర్ పదవిచ్చి సరిపెట్టారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి మంత్రిపదవులు కుదరవని అప్పట్లో బాబు ససేమిరా అన్నారు. దాంతో అసంతృప్తికి గురైన కేసీఆర్ ఏకంగా పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 ఎన్నికల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారం చేపట్టారు. టీడీపీలో చిచ్చు రగిల్చి టీఆర్‌ఎస్‌ ఆవిర్భావానికి పరోక్షంగా కారణమైన విజయరామారావు ప్రస్తుతం కేసీఆర్‌ గూటికే చేరడం రాజకీయ విచిత్రాలకు నిదర్శనం.

 

 

21:26 - December 12, 2015

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఆదాయపరంగా మళ్లీ సత్తా చాటాడు. ఈ ఏడాదికిగాను ఫోర్బ్స్ ఇండియా పత్రిక ప్రకటించిన 100 మంది అత్యధిక సంపాదనపరులైన సెలబ్రిటీల జాబితాలో తిరిగి తొలిస్థానాన్ని దక్కించుకున్నాడు. గతేడాది తొలి స్థానంలో నిలిచిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ఈసారి మాత్రం రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
బాద్‌షా ఈ ఏడాది సంపాదన రూ. 257.5 కోట్లు
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ ఈ ఏడాది సంపాదన రూ. 257.5 కోట్లుగా తేలింది. 2015కుగాను భారత్‌లో అత్యధిక సంపాదన కలిగిన వంద మంది సెలబ్రిటీల జాబితాను ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో అగ్రస్థానంలో షారుఖ్‌ఖాన్ నిలిచాడు. ఇక రెండో స్థానాన్ని కండలవీరుడు సల్మాన్‌ఖాన్ దక్కించుకున్నాడు. సల్మాన్ సంపాదన రూ. 202.75కోట్లుగా ఫోర్బ్స్ ప్రకటించింది.
మూడో స్థానంలో అమితాబ్ బచ్చన్  
గతేడాది రెండో స్థానంలో ఉన్న అమితాబ్ బచ్చన్ రూ. 112 కోట్ల ఆదాయంతో ఈ ఏడాది మూడో స్థానానికి పరిమితమయ్యాడు. టీం ఇండియా వన్డే క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రూ. 119.33 కోట్లతో నాలుగో స్థానం, ఆమిర్‌ఖాన్ రూ. 104.25 కోట్లతో ఐదో స్థానంలో నిలిచారు. ఇక వరుసగా 6, 7, 8, 9, 10 స్థానాల్లో సినీ నటుడు అక్షయ్‌కుమార్, క్రికెటర్ విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, దీపికా పదుకోనె, నటుడు హృతిక్ రోషన్ ఉన్నారు.
దక్షిణ భారత్‌లో ఏ ఆర్ రెహ్మాన్ మొదటిస్థానం
దక్షిణ భారత్‌లో అత్యధిక సంపాదన కలిగినవారి విషయానికి వస్తే సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ రూ. 43.97కోట్లతో మొదటిస్థానంలో నిలిచాడు. జాతీయస్థాయిలో ఈయనది 14వ ర్యాంక్. టాలీవుడ్‌లో ప్రిన్స్ మహేశ్‌బాబు 51.5 కోట్ల సంపాదనతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఫోర్బ్స్ జాతీయస్థాయి జాబితాలో మహేష్‌ 36వ స్థానంలో ఉన్నాడు.  ఇక 37.5కోట్ల సంపాదనతో అల్లు అర్జున్ టాలీవుడ్‌లో రెండోస్థానంలో, జాతీయస్థాయిలో 42వ స్థానంలో నిలిచాడు. ఇక, బాహుబలితో సత్తాచాటిన దర్శకుడు రాజమౌళి రూ. 26కోట్ల సంపాదనతో జాతీయస్థాయిలో 72వ ర్యాంక్‌ను, ఆ సినిమా కథానాయకుడు ప్రభాస్ రూ. 24కోట్ల సంపాదనతో 77వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. టాప్‌ 100 సెలబ్రిటీల మొత్తం సంపాదన రూ. 2,819కోట్లుగా ఫోర్బ్స్ ప్రకటించింది. ప్రతీ ఏటా ఫోర్బ్స్ ఈ జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది.

 

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

హైదరాబాద్ : నగరంలోని నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. శనివారం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సమీపంలో హుస్సేన్‌సాగర్ నాలా వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి( సుమారు 50సంవత్సరాలు) పడి ఉన్నాడు. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు చూడగా అతను అప్పటికకే మృతి చెందాడు. శవ పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురికీ తరలించారు.

చెన్నై వరదబాధితులకు సమంత 30 లక్షల రూపాయల ఆర్థికసాయం

హైదరాబాద్‌ : భారీవర్షాలతో వరదలు ముంచెత్తి అతలాకుతలమైన చెన్నై వరద బాధితులని నటి సమంత అతలాకుతలమైన చెన్నై వరద బాధితులని అదుకునేందుకు నటి సమంత ముందుకొచ్చారు. ప్రత్యూష సపోర్ట్ అనే స్వచ్ఛంద సంస్థ తరపున సమంత రూ.30లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

21:05 - December 12, 2015

ఢిల్లీ : హస్తినలో వాయుకాలుష్య నియంత్రణకు నడుం బిగింజిన కేజ్రీవాల్‌ సర్కార్‌ ఆ దిశగా చర్యలు ముమ్మరం చేసింది. ఆ దిశగా తలపెట్టిన సరి-బేసి విధానాన్ని సీరియస్ గా తీసుకుంది. ఢిల్లీలో జనవరి 1 నుండి 15 వరకు సరి-బేసి విధానాన్ని ట్రయల్ రన్ చేపట్టనున్నారు. దీనిలో భాగంగా సరిసంఖ్య నెంబర్లు గల కార్లు, బేసి సంఖ్య నెంబర్లు గల కార్లను రోజు తప్పించి రోజు రోడ్ల మీదకు అనుమతిస్తారు. దీంతో 15 రోజుల్లో సగం కార్లు ఇంటికే పరిమితం కానున్నాయి. ప్రత్యామ్యాయ రవాణా సౌకర్యాలు కల్పించడం ఆప్‌ సర్కార్‌కు సవాల్‌గా మారింది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రయివేటు వాహనాలు, స్కూలు వాహనాలు వినియోగించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా జనవరి 1 నుంచి 15 వరకు ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సూత్రప్రాయంగా తెలిపారు.

 

20:58 - December 12, 2015

అగర్తా : త్రిపురలోని నగర పాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో సిపిఎం ఆధ్వర్యంలోని లెఫ్ట్ ఫ్రంట్‌ క్లీస్‌ స్వీప్‌ చేసింది. అగర్తాల మున్సిపల్‌ కార్పేరేషన్‌లో 49 సీట్లకు గాను 45 సీట్లను వామపక్షాలు కైవసం చేసుకున్నాయి. మొత్తం 13 మున్సిపాలిటీలతో పాటు 6 నగర పంచాయితీలను గెలుచుకోవడం ద్వారా లెఫ్ట్‌ ఫ్రంట్‌ అద్భుత విజయం సాధించింది. ఈ ఎన్నికలు త్రిపురలోని వామపక్ష ప్రభుత్వ పాలనకు అద్దం పడుతున్నాయి. గ్రామీణ ప్రజలే కాదు... పట్టణాల్లోని ప్రజలు కూడా మాణిక్‌ సర్కార్‌ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. త్రిపురలో వామపక్షాలు అద్భుత విజయం సాధించడంతో సిపిఎం పొలిట్‌ బ్యూరో ప్రజలకు, పార్టీ కేడర్‌కు శుభాకాంక్షలు తెలిపింది.

 

త్రిపురలో లెఫ్ట్ ఫ్రంట్‌ క్లీస్‌ స్వీప్‌

అగర్తా : త్రిపురలోని నగర పాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో సిపిఎం ఆధ్వర్యంలోని లెఫ్ట్ ఫ్రంట్‌ క్లీస్‌ స్వీప్‌ చేసింది. అగర్తాల మున్సిపల్‌ కార్పేరేషన్‌లో 49 సీట్లకు గాను 45 సీట్లను వామపక్షాలు కైవసం చేసుకున్నాయి. 

20:54 - December 12, 2015

ఢిల్లీ : హస్తినలోని హైదరాబాద్ హౌజ్‌లో ప్రధాని నరేంద్రమోడీ, జపాన్ ప్రధాని షింజో అబే భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భారత్-జపాన్ ల మధ్య నాలుగు కీలక ఒప్పందాలపై ఇరుదేశాల ప్రధానులు సంతకాలు చేశారు. పౌర అణు ఒప్పందంతోపాటు భారత్‌లో ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య తొలి బుల్లెట్ రైలు ట్రాక్ కోసం 98వేల కోట్ల డీల్, స్మార్ట్‌సిటీలకు సహకారం, పలు మౌలికవసతుల ప్రాజక్టులపై ఇరువురు ప్రధానులు ఒప్పందాలు చేసుకున్నారు. అనంతరం మోది, షింజో అబే సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. భద్రత, సహకారం దిశగా రెండు కీలక అడుగులు వేసినట్టు మోది పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియాకు జపాన్ ప్రభుత్వ, ప్రైవేటు సహకారం మరువలేనిదన్నారు. భారత్‌తో బుల్లెట్ రైలు ఒప్పందం కొత్త అధ్యాయానికి నాంది అని జపాన్ ప్రధాని షింజో అబే అన్నారు. భారత్‌లో మరిన్ని హైస్పీడ్ రైళ్ల ఏర్పాటుకు సహకరిస్తామని ఆయన తెలిపారు.

 

 

20:50 - December 12, 2015

హైదరాబాద్ : ప్రైవేట్ హాస్పిటల్స్ తీరుపై గవర్నర్‌ నరసింహన్ మండిపడ్డారు. అవసరమున్నా లేకున్నా వివిధ రకాల పరీక్షలు చేస్తూ రోగులను ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌లో జరిగిన 13వ ఆలిండియా క్యాన్సర్‌ కేర్‌ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. ఫీజుల పేరుతో పేషంట్లను వేధిస్తున్నారని... గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలపై అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోగులకు ప్రేమను పంచే బాధ్యత డాక్టర్లదేనని... విలువలతో కూడిన వైద్యం అందించాలని హితవు పలికారు.

 

20:46 - December 12, 2015

రాజమండ్రి : చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రైతులకు అన్నీ కష్టాలే అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. రాజమండ్రిలో జరుగుతున్న సిపిఎం విస్తృత స్థాయి సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఇష్టానుసారంగా రైతులనుంచి భూములను లాక్కొంటూ వాళ్ల కంట కన్నీరు పెట్టిస్తున్నారని ఆరోపించారు.

 

20:43 - December 12, 2015

రాజమండ్రి : ఎన్నికల వేళ నరేంద్ర మోడీ చెప్పిన అచ్చేదిన్‌ ఇప్పుడు దేశంలో ఎక్కడా కన్పించడం లేదని సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రాజమండ్రిలో ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విపరీతంగా పెరుగుతున్న ధరల మూలంగా ప్రజలు సతమతమవడాన్నే అచ్చేదిన్‌గా చెప్పుకోవాలా అని ప్రశ్నించారు. అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఎక్కడా మంచి రోజులు కన్పించడం లేదని పేర్కొన్నారు.

 

20:39 - December 12, 2015

హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయ సంక్షోభం నెలకొందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ప్రతిపక్ష సభ్యులపై టీఆర్ఎస్ బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు వామపక్షాలే గట్టిగా ఫిరాయింపులను ఎదుర్కొన్నాయని, ఖమ్మంలో పువ్వాడ గెలవబోతున్నారని తెలిపారు. జీహెచ్ ఎంసీలో అధికార దుర్వినియోగానికి పాల్పడడం వల్ల డబుల్ బెడ్ రూం గందరగోళంగా మారిందని ఎద్దేవా చేశారు.

 

 

20:34 - December 12, 2015

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. నేటితో చివరి అంకానికి తెరలేచింది. మొత్తం పన్నెండు స్థానాలకు గాను.. ఆరు స్థానాలు ఏకగ్రీవం కావడంతో.. ఇప్పుడు ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్‌ అనివార్యమైన జిల్లాల్లో ఏ ఏ పార్టీల పరిస్థితి ఏంటి..? వారు అనుసరిస్తున్న వ్యూహాలు ఏంటి..? వాచ్‌ దిస్‌ స్టోరీ.
ఖమ్మంలో 726 ఓట్లు
ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో ఖమ్మం, నల్లగొండ జిల్లాలు అత్యంత కీలకమైనవిగా మారాయి. ఖమ్మంలో.. టీఆర్ఎస్‌ అభ్యర్థిగా బాలసాని లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. ప్రత్యర్థిగా సీపీఐ సీనియర్‌ నేత పువ్వాడ నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్‌ అభ్యర్థి గెలుపు బాధ్యతను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భుజానికెత్తుకోగా.. పువ్వాడ నాగేశ్వరరావు విజయం కోసం... ఆయన తనయుడు, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ శ్రమిస్తున్నారు. సీపీఐ అభ్యర్థికి.. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం మద్దతు ప్రకటించాయి. టీఆర్ఎస్‌ నేతలు.. హైదరాబాద్‌ సమీపంలోని షామీర్‌పేటలో.. క్యాంపును నిర్వహిస్తున్నారు. విపక్ష నేతలు.. ఖమ్మంలోనే అభ్యర్థులను కాపాడుకుంటున్నారు. ఇక్కడ మొత్తం 726 మంది స్థానిక ప్రజా ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
నల్లగొండ జిల్లాలో 1112 మంది ఓటర్లు
నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈయన ప్రత్యర్థిగా టీఆర్ఎస్‌కు చెందిన తేరా చిన్నపరెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సాదినేని శ్రీనివాసరావు శనివారం నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో ఇక్కడ ముఖాముఖి పోటీ జరుగనుంది. మొత్తం వెయ్యీ నూట పన్నెండు మంది స్థానిక ప్రజా ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వలసల అనంతరం.. కాంగ్రెస్‌కు 429, టీఆర్ఎస్‌కు 455, టీడీపీకి 92, వామపక్షాలకు 74, బీజేపీకి 34 మంది ఓటర్లు ఉన్నట్లు ఓ అంచనా. ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలూ ఏకమై.. తమ ఓటర్లను గంపగుత్తగా ఓటు వేయించగలిగితే... కాంగ్రెస్‌ అభ్యర్థికి విజయావకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. వీరి ఐక్యత ఏమేరకు సాధ్యమన్నది అనుమానమే.
పాలమూరులో విపక్షాలు ఒక్కో స్థానానికే పరిమితమయ్యాయి.
పాలమూరులో ఓటర్లు 1260 మంది
ఇక పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లోని రెండేసి ఎమ్మెల్సీ స్థానాలకూ 27న ఎన్నికలు జరుగనున్నాయి. పాలమూరులో బ్రిలియంట్‌ విద్యా సంస్థల అధినేత జగదీశ్వరరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలు టీఆర్ఎస్‌ తరఫున, కూచుకుళ్ల దామోదరరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగాను, కొత్తకోట దయాకరరెడ్డి టీడీపీ నుంచి బరిలో నిలిచారు. ఈ జిల్లాల్లో విపక్షాలు ఒక్క స్థానానికే పోటీ చేస్తున్నాయి. పాలమూరు జిల్లాలో ఇటీవలి వలసలు.. గులాబీ పార్టీని బలం పుంజుకునేలా చేశాయి. మొత్తం 1260 మంది స్థానిక ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్‌, టీడీపీల మధ్య.. ఒప్పందాలేమీ లేవు కానీ.. దశలో అధికార పార్టీని నిలువరించేందుకు ఆఖరు క్షణాల్లో ఓ అవగాహనకు వచ్చే అవకాశమూ లేకపోలేదు. ఈ జిల్లాలోనూ క్యాంపు రాజకీయాలకు తెరలేసింది.
కాంగ్రెస్‌, టీడీపీలకు పార్టీ అభ్యర్థుల షాక్‌
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థులుగా బరిలోకి దిగిన వారే.. తమ పార్టీలకు షాక్‌నిస్తూ.. నామినేషన్‌లు ఉపసంహరించుకోవడం విశేషం. మెదక్‌లో కాంగ్రెస్‌, టీడీపీ అభ్యర్థులిద్దరూ నామినేషన్‌లు ఉపసంహరించుకున్నారు. ఇక్కడ మంత్రి హరీశ్‌రావు చక్రం తిప్పి.. పోటీ లేకుండా చేసుకున్నారు. ఇక నిజామాబాద్‌లో కాంగ్రెస్‌, నల్లగొండలో టీడీపీ అభ్యర్థులు బరిలోంచి వైదొలిగేలా.. ఆయా జిల్లాల మంత్రులు చక్రం తిప్పారు. కరీంనగర్‌లో రెండు స్థానాలూ ఏకగ్రీవం అయ్యేందుకు.. మంత్రి ఈటెల వేసిన వ్యూహం సఫలమైంది.

 

 

20:10 - December 12, 2015

కర్నూలు : జిల్లా కలెక్టరేట్ దగ్గర బుడగ జంగం సామాజిక వర్గం రిలే నిరాహార దీక్ష ప్రారంభించింది. తమనూ ఏ సామాజిక రిజర్వేషన్ లోనూ చేర్చకుండా, ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆ సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఎస్సీ,ఎస్టీ, బీసీ,ఓసీలో ఏదో ఒక వర్గానికి చెందుతారని...అయితే తమనూ ఇప్పటికీ ప్రభుత్వం ఏ రిజర్వేషన్ లోనూ చేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడగ జంగాలను ఎస్సీ వర్గంలో చేరుస్తామని పాదయాత్రలో చంద్రబాబు హామినిచ్చారని, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. చదువులు, ఉద్యోగాల్లో ప్రోత్సాహం లేక తమ పిల్లల భవిష్యత్తు అన్యాయమైపోతోందని మండిపడ్డారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు దీక్ష విరమించే ప్రసక్తే లేదని బుడగ జంగాల ప్రతినిధులు హెచ్చరించారు.

 

20:07 - December 12, 2015

నెల్లూరు : కుండపోత వర్షంతో అస్తవ్యస్తమైన చెన్నైని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు నెల్లూరు కార్పొరేషన్ కూడా సాయం అందిస్తోంది. చెన్నైలో అత్యంత వరద ప్రభావితమైన కొరట్టూరుపురంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీని శుభ్రపరిచేందుకు కార్పొరేషన్‌కు చెందిన వంద మంది పారిశుధ్య కార్మికులు వెళ్లారు. కాలనీలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి.. డ్రైనేజీ వ్యవస్థను శుభ్రపరుస్తున్నారు. అంటు వ్యాధులు సోకకుండా పది టన్నుల బ్లీచింగ్‌ పౌడర్‌ను కొరట్టూరుపురంలో చల్లారు. ఆహారం, నిత్యావసర వస్తువులు చాలా మంది అందిస్తున్నారని నెల్లూరు మేయర్ అబ్దుల్‌ అజీజ్ చెప్పారు. 

20:04 - December 12, 2015

విశాఖ : మావోయిస్టు పార్టీ ఆర్మ్ డ్‌ మిలీషియా విభాగానికి చెందిన తొమ్మిది మంది సభ్యులు విశాఖ పోలీసులు ఎదుట లొంగిపోయారు. కాఫీ తోటల ధ్వంసం, మావోయిస్టులకు వంట సామాగ్రి అందజేయడం లాంటి పనులకు వీరు పాల్పడినట్టు ఎస్పీ కొయ్య ప్రవీణ్‌ తెలిపారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో కూంబింగ్ కొనసాగుతోందన్నారు. అరకు మండలం గిన్నెల పంచాయతీ పరిధిలో ఎదురు కాల్పుల సందర్భంగా మావోయిస్టుల మృతిచెందిన విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. సీఎం చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగాను... ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై... కేసులు నమోదుచేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఈశ్వరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ప్రవీణ్ స్పష్టంచేశారు. 

20:01 - December 12, 2015

విజయవాడ : దక్షిణాది రాష్ట్రాల మండలి 26వ సమావేశం విజయవంతంగా ముగిసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు వివిధ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న వివిధ అంశాలపై చర్చించారు. విజయవాడలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, సిఎం చంద్రబాబుతోపాటు కేంద్ర మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, మంత్రులు చినరాజప్ప, కె.ఇ కృష్ణమూర్తి, తెలంగాణ మంత్రి నాయని నర్సింహారెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం సాధించడం, వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యలను పరిష్కరించడం తదితర అంశాలపై చర్చించారు. గతంలో బెంగళూరులో జరిగిన సమావేశంలో నిర్ణయించిన అంశాల అమలుపై సదస్సులో చర్చించారు.

 

19:56 - December 12, 2015

హైదరాబాద్ : బంగారు తెలంగాణకోసం టీ సర్కారు సరికొత్త ప్రయోగాలు చేస్తోంది.. పట్టణాలసంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తోంది.. కొత్తగా ఐదు మున్సిపాలిటీల ఏర్పాటుకోసం కసరత్తు నడుస్తోంది.నెలరోజుల్లో ఈ పనిపూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం..
కొత్త మున్సిపాలిటీలు
తెలంగాణలో కొత్త మున్సిపాలిటీలకు రంగం సిద్ధమైంది.. ముందు గ్రామపంచాయితీలను విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.. ఆ తర్వాత జనసాంద్రత, జనాభా ప్రకారం ఐదు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటుకోసం ప్లాన్ చేస్తోంది.. ముందు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని గ్రామపంచాయితీలపై దృష్టిపెట్టింది.. ఇక్కడి వివరాలన్నీ సేకరించింది.. జల్‌పల్లి, మీర్‌పేట్‌, జిల్లెలగూడ, బోడుప్పల్‌, ఫీర్జాదిగూడను మున్సిపాలిటీలుగా చేసేందుకు ప్రయత్నిస్తోంది.. కొత్తపేట, పహాడీషరీఫ్, బాలాపూర్‌ గ్రామపంచాయితీలను జల్‌పల్లిలో కలిపి కొత్తగా జల్‌పల్లి మున్సిపాలిటీని చేయాలని చూస్తోంది... ఇలా చేయడంవల్ల దాదాపు 66వేల జనాభా జల్‌పల్లిలో చేరనుంది.. జనసాంద్రత 2వేల 360 కానుంది.. ప్రస్తుతం ఇక్కడ వ్యవసాయంకాకుండా కోటి 82లక్షల రెవెన్యూ వస్తోందని అధికారులు అంచనావేశారు..
జిల్లెల్‌గూడాలో 54వేల జనాభా
ఇక జిల్లెల్‌గూడాలో 54వేల జనాభా ఉంది.. జనసాంద్రత 2వేల 347గా నమోదైంది... ఇక్కడ వ్యవసాయంకాకుండా కోటి 16లక్షల ఆదాయం వస్తోందని అంచనా... మీర్‌పేట్‌లో 66వేల 982మందికాగా.... 1579 జనసాంద్రత ఉంది.. ఇక్కడకూడా వ్యవసాయం కాకుండా 3కోట్ల 78లక్షల ఇన్‌కం లభిస్తోంది.. బోడుప్పల్‌లో 48వేల 225మంది జనాభా ఉండగా...జనసాంద్రత 4వేల 47గా నమోదైంది.. ఈ గ్రామంలో వ్యవసాయంనుంచికాకుండా 10కోట్ల 2లక్షలు రెవెన్యూ వస్తోంది.. అటు మేడిపల్లి, పర్వతాపూర్‌, ఫీర్జాదిగూడ గ్రామపంచాయితీలను విలీనంచేసి ఫీర్జాదిగూడ మున్సిపాలిటీగా చేయాలని చూస్తున్నారు... ఇక్కడ 51వేల జనాభాకు జనసాంద్రత 6వేల 162గా ఉంది.. వ్యవసాయంద్వారాకాకుండా 9కోట్ల 17లక్షల ఆదాయం వస్తోంది..
ముందుగా అభ్యంతరాలు స్వీకరణ
ఈ కొత్త మున్సిపాలిటీల ఏర్పాటును నెలరోజుల్లో పూర్తిచేయాలని సర్కారు నిర్ణయించింది.. అంతకుముందు ప్రజలనుంచి అభ్యంతరాలు స్వీకరించాలని కలెక్టర్లను కోరనున్నారు... ఆ తర్వాత వీటిని పరిష్కరించి మున్సిపాలిటీల ప్రక్రియ చేపట్టనున్నారు.. మరోవైపు ఈ అంశంపై వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశంఉంది.. కోర్టులో పిటిషన్‌ దాఖలయ్యే ఛాన్స్ కూడా ఉంది.. కోర్టుల కేసులతో ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు ఆగిపోయాయి..
అభివృద్ధి మరింత వేగంగా
కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు ద్వారా అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని సర్కారు యోచిస్తోంది. అలాగే కేంద్రంనుంచి నిధులు పెరిగే అవకాశం ఉంటుంది.. ఈ డబ్బుతో ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన సాధ్యమవుతుంది... అందుకే టీ సర్కారు ఈ దిశగా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది.

 

 

19:51 - December 12, 2015

హైదరాబాద్ : టీఆర్ఎస్ తో కాంగ్రెస్ నేతలెవరు ఫిక్సింగ్ చేసుకోలేదన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మండలి ఎన్నికల్లో అభ్యర్థులను ఉపసంహరించుకున్న డీసీసీలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తోందని ఉత్తమ్ ఆరోపించారు.

 

19:48 - December 12, 2015

హైదరాబాద్‌ : నగరంలోని అల్వాల్‌లో ఓ ప్రేమ జంట అఘాయిత్యానికి పాల్పడింది. తమ ప్రేమకు అడ్డంకులు తలెత్తుతున్నాయన్న కారణంతో మనస్తాపానికి గురైన జంట రైలు కిందపడి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ దారుణ సంఘటనలో యువతి శిరీష మరణించింది. యువకుడు నర్సింగ్ పరిస్థితి విషమంగా ఉంది. మృతురాలు వెంకటాపురం వందనా కాలేజీలో బిటెక్‌ చదువుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

19:42 - December 12, 2015

హైదరాబాద్ : మండలి ఎన్నికల్లో ఏకగ్రీవమైన చోట ఎలక్షన్ కోడ్ లేదని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. పోటీ ఉన్న చోటనే కోడ్ అమలులో ఉంటుందన్నారు. ఇవాళ నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన అనంతరం... 6స్థానాలు ఏకగ్రీవమైనట్టు ఆయన ప్రకటించారు. మిగతా 6 స్థానాలకు ఈనెల 27న పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. కౌటింగ్ ఈనెల 30న జరగనుంది.

 

పోటీ ఉన్న చోటనే ఎలక్షన్ కోడ్ : భన్వర్ లాల్

హైదరాబాద్ : మండలి ఎన్నికల్లో ఏకగ్రీవమైన చోట ఎలక్షన్ కోడ్ లేదని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. పోటీ ఉన్న చోటనే కోడ్ అమలులో ఉంటుందన్నారు. 

19:30 - December 12, 2015

విశాఖ : ఆంధ్ర కాశ్మీర్‌ లంబసింగిలో చలి కేక పుట్టిస్తోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. చల్లని వాతావరణం, మంచుతెరలు పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగిస్తున్నాయి. జనవరి వరకు పర్యాటకులతో లంబసింగి కళకళలాడనుంది. లంబసింగి అందాలు చూసేందుకు పర్యాటకుల హడావుడి మొదలైంది. మనం కూడా ఆ అందాలు చూద్దామా...
ఆంధ్రా కాశ్మీర్‌గా లంబసింగి
చలికాలం వచ్చిందంటే చాలు అందరి దృష్టి లంబసింగిపై పడుతుంటుంది. ఆంధ్రా కాశ్మీర్‌గా పేరుగాంచిన ఇక్కడి అందాలను ఆస్వాదించేందుకు ఎన్నో ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. లంబసింగికి చేరుకోవాలంటే పర్యాటకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి 26 కిలోమీటర్లు ప్రయాణిస్తే లంబసింగికి చేరుకుంటాం. ఇదో చిన్న గ్రామం. రహదారులన్నీ మంచుతో కమ్ముకుంటాయి. చిమ్మచీకట్లు ముసురుకొని దారే కనిపించని పరిస్థితి నెలకొంటుంది. వాహనదారులు జాగ్రత్తగా లైట్‌ వెలుతురులోనే వాహనాలు నడపాల్సి ఉంటుంది. లేకపోతే ప్రమాదాలు నెలకొనే అవకాశం ఉంది. పర్యాటకులు రాత్రి సమయాల్లో కంటే వేకువ జామున ఇక్కడకు వస్తే ఆ ఎంజాయే వేరుగా ఉంటుంది. కాస్తా జాగ్రత్తగా వాహనాలు నడిపితే లంబసింగికి క్షేమంగా చేరుకుని పర్యాటకులు అందాలను ఆస్వాదించవచ్చు.
సముద్ర మట్టానికి 1350 మీటర్ల ఎత్తులో లంబసింగి
లంబసింగి.. సముద్ర మట్టానికి 1350 మీటర్ల ఎత్తులో ఉన్న చిన్న ఊరు. చింతపల్లి మండలంలోని ఈ ఊరిలో 200 కుటుంబాలున్నాయి. శీతాకాలంలో ఎక్కడాలేని విధంగా ఉష్ణోగ్రత మైనస్‌ డిగ్రీలకు చేరుకుంటుంది. దీంతో ఈ ప్రాంతం టూరిస్టులకు హాట్‌స్పాట్‌గా మారింది.
అందాలను చూసి కొత్త ఉత్సాహం
ఎంతో అలసటతో లంబసింగికి చేరుకున్న పర్యాటకులు.. ఇక్కడి అందాలను చూసి కొత్త ఉత్సాహం నింపుకుంటారు. మంచుమయమైన అందాలను ఒడిసిపట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. కాశ్మీర్‌లో కనిపించే అందాలు ఇక్కడ కనిపించడం తమ అదృష్టంగా భావిస్తున్నారు పర్యాటకులు. ఇక్కడ వాతావరణాన్ని పర్యాటకులు ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఉదయం వచ్చి పర్యాటకులు సాయంత్రం వరకు ఇక్కడే ఉండి అందాలను కెమెరాల్లో బంధిస్తున్నారు. అన్నీ మరిచిపోయి అందాలను ఆస్వాదిస్తున్నారు.
వసతులు కరవు
అయితే.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ ఎలాంటి వసతులు లేవని పర్యాటకులు అంటున్నారు. రాత్రి వేళల్లో ఇక్కడే ఉండాలనుకునేవారికి నిరాశే మిగులుతోంది. మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని పర్యాటకులంటున్నారు.
కన్నెత్తి చూడని ఎపి సర్కార్‌
దేశవ్యాప్తంగా టూరిస్టులు లంబసింగి వైపు చూస్తున్నారు. కానీ.. సర్కార్‌ మాత్రం ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని గ్రామస్తులంటున్నారు. లంబసింగిని దత్తత తీసుకుంటామన్న మంత్రి గంటా శ్రీనివాసరావు అడ్రస్సే లేరని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాటేజిలు కట్టిస్తే ఎంతో దూరం నుంచి వచ్చేవాళ్లు ఇక్కడ స్టే చేస్తారని.. దాంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని లంబసింగి గ్రామస్తులంటున్నారు. ప్రభుత్వం పర్యాటకరంగానికి పెద్ద పీట వేస్తుందని ప్రకటనలు గుప్పిస్తున్నా.. ఆచరణలో మాత్రం అది అందని ద్రాక్షగానే మిగిలిందని పలువురంటున్నారు.
లంబసింగిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ఇక లంబసింగిలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రస్తుతం 6 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో మైనస్‌ డిగ్రీలకు చేరనుంది. ఇక ఏజెన్సీలోని చింతపల్లిలో 9, మినుములూరులో 10, అరకులో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పర్యాటకుల తాకిడి పెరుగుతున్నా.. టూరిస్ట్‌ హబ్‌ కోసం ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనలు లంబసింగికి వర్తించడం లేదు. లంబసింగి టూరిస్ట్ స్పాట్ హాట్ స్పాట్ మారింది. అయితే.. లంబసింగి అందాలను చూసేందుకు పర్యాటకులు ఎన్నో వ్యయప్రయాలకోర్చి ఇక్కడకు చేరుకుంటున్నారు. జనవరి వరకు ఇక్కడ పర్యాటకుల తాకిడి పెరుగుతూనే ఉంటుంది. సైబీరియా నుంచి వచ్చే గాలులు మరింతగా పెరిగితే.. చలి తీవ్రత ఇంకా పెరుగుతుందంటున్నారు. ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేస్తే పర్యాటకులకు ఎంతో బాగుంటుందని పలువురంటున్నారు.
ఏజెన్సీ వాసులు కష్టాల
మరోవైపు రోజురోజుకు తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలతో ఏజెన్సీ వాసులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. చలితో అనారోగ్యానికి గురవుతున్నా పట్టించుకునే నాధుడే లేడని గిరిపుత్రులంటున్నారు. ఉదయం 10 గంటల వరకు బయటకు వెళ్లే పరిస్థితి లేదని.. ఎప్పటికీ చలిమంటల వద్దే ఉండాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. చలి తీవ్రతో వృద్దులు మృతి చెందుతున్నారని గ్రామస్తులంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించి.. లంబసింగిని మరింత అభివృద్ధి చేయాలని గ్రామస్తులు, పర్యాటకులు కోరుతున్నారు.

 

19:21 - December 12, 2015

విశాఖ : అయ్యప్ప భక్తుల యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. విశాఖ జిల్లా కసింకోట మండలం పేరంటాలపాలెంకు చెందిన 54 మంది అయ్యప్ప భక్తులు శబరి యాత్రకు వెళ్లారు. మార్గంమధ్యలో కన్యాకుమారి దాటిన తర్వాత మూడు కిలోమీటర్ల దూరంలో వారు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది. ఈప్రమాదంలో 35 మంది అయ్యప్ప భక్తులకు గాయాలయినట్లు సమాచారం. వారి బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

అయ్యప్ప భక్తుల యాత్రలో అపశృతి

విశాఖ : అయ్యప్ప భక్తుల యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. విశాఖ జిల్లా కసింకోట మండలం పేరంటాలపాలెంకు చెందిన 54 మంది అయ్యప్ప భక్తులు శబరి యాత్రకు వెళ్లారు. మార్గంమధ్యలో కన్యాకుమారికి దాటిన తర్వాత మూడు కిలోమీటర్ల దూరంలో వారు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది. ఈఘటనలో 35 మంది అయ్యప్ప భక్తులకు గాయాలయినట్లు సమాచారం. వారి బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

 

19:01 - December 12, 2015

హైదరాబాద్ : సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో షీ టీమ్స్ ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తైంది. ఈ సంవత్సర కాలంలో 820 మంది ఆకతాయిలను ఆయా బృందాలు అదుపులోకి తీసుకోగలిగాయి. మహిళలకు భద్రత కల్పించడంతో పాటు ఆకతాయిల ఆటకట్టించడంలో ఈ బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. షీటీమ్స్ ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సైబరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. షీటీమ్స్ ఏర్పాటు చేసి... మహిళలకు భద్రత కల్పించామని చెప్పారు. వారిలో అభద్రతాభావం తొలగించామని తెలిపారు. ఐటీ కారిడార్ లో 70 మంది సిబ్బంది ఉన్నారని.. వారి రక్షణకు పూర్తిగా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. జోన్ కు 10 చొప్పున మొత్తం 60 షీటీమ్ లను ఏర్పాటు చేశామన్నారు. నిందితులకు కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు.

 

18:55 - December 12, 2015

హైదరాబాద్ : టీడీపీకి రాజీనామా చేసిన మాజీమంత్రి విజయరామారావు టిఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు ఇవాళ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విజయరామారావు నివాసానికి వెళ్లి కలిశారు. రెండు రోజుల్లో తాను సీఎం కేసీఆర్‌ను కలుస్తానని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందన్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ తో కలిసి పనిచేస్తానని విజయరామారావు ప్రకటించారు. 

17:40 - December 12, 2015

మెదక్ : జిల్లాలో ఆశా వర్కర్లు చేపట్టిన పాదయాత్ర రసాభాసగా మారింది. పోలీసులు ఆశావర్కర్ల పాదయాత్రను అడ్డుకున్నారు. జహీరాబాద్ లో మూడు రోజుల క్రితం ఆశా వర్కర్ల పాదయాత్ర ప్రారంభం అయింది. అక్కడి నుంచి పాదయాత్రగా వస్తున్న ఆశావర్కర్లను ఆసదాశివపేటలోని పెద్దాపుర్ లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి తీవ్ర మధ్య తోపులాట జరిగింది. వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక ఆశావర్కరుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసనగా ఆశా వర్కర్లు రోడ్డుపై భైటాయించి.. ధర్నా చేపట్టారు. పాదయాత్రను అడ్డుకోవడంపై మహిళలు తీవ్రంగా మండిపడుతున్నారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే... పోలీసులు అడ్డుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల దుర్మార్గం వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని గత 100 రోజులుగా సమ్మె చేస్తుంటే... ప్రభుత్వం పట్టించుకోకుండా... తాము చేసే ఉద్యమాలను అణిచివేయాలని చూడడం దారుణమన్నారు. తమ ఇబ్బందులు, సమస్యలను ప్రభుత్వానికి తెలిపేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ఎంతవరకు కరెక్టు అని నిలదీశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాదయాత్రను కొనసాగిస్తామని చెప్పారు.

 

మెదక్ జిల్లాలో ఆశా వర్కర్ల పాదయాత్రలో రసాభాస

మెదక్ : జిల్లాలో ఆశా వర్కర్లు చేపట్టిన పాదయాత్ర రసాభాసగా మారింది. పోలీసులు ఆశావర్కర్ల పాదయాత్రను అడ్డుకున్నారు. జహీరాబాద్ లో మూడు రోజుల క్రితం ఆశా వర్కర్లు పాదయాత్ర ప్రారంభం అయింది. సదాశివపేటలోని పెద్దాపుర్ లో పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి తీవ్ర మధ్య తోపులాట జరిగింది. వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక ఆశావర్కర్ కు తీవ్ర గాయాలయ్యాయి.

సైఫాబాద్‌ సైన్స్ కాలేజీలో హాస్టల్ భవనం నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా సైఫాబాద్‌లో ఉన్న సైన్స్ కాలేజీలో మరో హాస్టల్ భవనం నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మయ్య తెలిపారు. కళాశాల పూర్వ విద్యార్థి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అందించనున్న రూ.8 కోట్ల నిధులకు తోడు యూనివర్సిటీ నుంచి రూ.2 కోట్లు రానున్నాయని ఆయన వివరించారు. ఈ మొత్తం రూ.10 కోట్లతో విద్యార్థులకు కొత్త హాస్టల్ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ లో భారీ చోరీ...

హైదరాబాద్ : నగరంలో భారీ చోరీ జరిగింది. డైమండ్ టూర్స్ అండ్ సర్వీసెస్ ఆఫీస్ లో నుంచి గుర్తు తెలియని దుండగులు రూ. 4 లక్షలను అపహరించుకుపోయారు. జరిగిన చోరీ ఘటనపై బాధితులు అఫ్జల్‌గంజ్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం... యువతి మృతి

హైదరాబాద్‌ : ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో యువతి మృతి చెందగా యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక వందన డిగ్రీ కాలేజిలో బీకాం సెకండియర్ చదువుతున్న శిరీష, నర్సింగ్ అనే యువకుడు ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ శనివారం మధ్యాహ్నం ఆల్వాల్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో శిరీష అక్కడికక్కడే మృతి చెందగా.... నర్సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా భూపాల్ రెడ్డి

మెదక్ : స్థానిక సంస్థల కోటాలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ దూసుకు పోతోంది. మెదక్ జిల్లా నంచి పోటీ చేస్తోన్న ఆ పార్టీ అభ్యర్థి భూపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈమేరకు ఇవాళ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి భూపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టు ధృవీకరణ పత్రం అందజేశారు.

 

 

16:44 - December 12, 2015

విజయవాడ : డబ్బు కావాలంటే క్షణాల్లో ఇచ్చేస్తారు.. అందుకు వారి నుంచి కావాల్సిన పత్రాలు తీసుకుంటారు.. ఆ తర్వాత కన్పించరు.. సరిగ్గా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రత్యక్షమవుతారు... ఇక అసలు కథ మొదలుపెడతారు.. డబ్బులివ్వాలి.. లేదంటే దారికి రావాలి... ఆ ఇంటి ఆడవాళ్లపై కన్నేసిన దుర్మార్గులు లొంగదీసుకుంటారు.. బెదిరిస్తారు.. బలవంతంగా రొంపిలోకి దించుతారు... ఇది జరుగుతున్న దందా.... ఇంతకాలం అరాచకాలకు పాల్పడ్డ కాల్‌మనీ దందా రాయుళ్ల వ్యవహారం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది.. ఓ బాధితురాలు చెప్పిన కన్నీటి కథతో కదిలిన బెజవాడ పోలీసులు పిడికిలి బిగించారు... కాల్‌మనీ దందాపై కన్నెర్ర చేశారు...
కాల్‌మనీ పేరు వింటే బెజవాడ వాసుల్లో వణుకు
కాల్‌మనీ.. ఈ పేరు వింటే బెజవాడ వాసుల్లో వణుకు పుడుతోంది. కంటిమీద కునుకు కూడా మాయమవుతుంది. అప్పు పేరుతో వడ్డీ వ్యాపారులు చేసే కిరాతకాలు అన్నీ ఇన్నీ కావు. తమ సొమ్ములు రాబట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు.. మహిళలపైనా అరాచకాలు కొనసాగిస్తున్నారు.
అప్పులిచ్చి ఆడాళ్లపై కన్ను...
డబ్బులు అధిక వడ్డీలకు ఇవ్వడమే కాదు.. ఇందులో ఎన్నో కిరాతకాలు కూడా దాగి ఉన్నాయి... మహిళలను టార్గెట్ చేసి అప్పులిచ్చే దందారాయుళ్లు ఆ తర్వాత అరాచకాలకు పాల్పడుతున్నారు... అప్పులిచ్చిన తర్వాత డబ్బుల వసూళ్లలో అమాయకురాళ్లను లొంగదీసుకుంటున్నారు.. వారిని బెదిరించి.. డబ్బు ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చి బలవంతంగా పంజా విసురుతున్నవారు వీడియోలు తీసి ఆ తర్వాత బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు.. ఇలా ఎందరో అమాయకురాళ్లు బెజవాడలోని కాల్‌ దందాలో చిక్కకున్నట్లు తెలుస్తోంది... ఓ బాధితురాలి ఫిర్యాదుతో వెలుగుచూసిన పచ్చినిజాలపై పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.
ఆడాళ్ల జీవితాలతో చెలగాటం
బెజవాడలో విస్తృతంగా కొనసాగుతున్న కాల్‌మనీ దందా ఎందరో సామాన్యుల పాలిట శాపంగా మారింది.. కాసుల కోసం ఎంతటి దుర్మార్గాలకైనా తెగబడతారు. మహిళలను లొంగదీసుకుని వారితో మరికొందరిని రొంపిలోకి దింపుతున్నారు.. ఇలా ఎందరో ఆడాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారు...
మురికివాడల్లో దుర్మార్గాలు
కాల్‌మనీ దందాలో ఎందరో సామాన్యులు సమిధలవుతున్నారు. మురికివాడల్లో కిరాతకాలు సృష్టిస్తున్నారు. చిరువ్యాపారుల అవసరాన్ని ఆసరా చేసుకుని.. కాల్‌మనీ వ్యాపారులు తమ దందా కొనసాగిస్తున్నారు. 5 నుంచి 15 రూపాయల వడ్డీకి అప్పులిస్తున్నారు. బాకీ చెల్లించనివారిపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. కిరాతకంగా దాడులు చేస్తున్నారు. ఎదురుతిరిగిన వారిపై అంగబలం, అర్థబలం ప్రయోగిస్తున్నారు.
తనఖా ఆస్తుల హస్తగతం
అవసరానికి అప్పు ఇచ్చిన కాల్‌మనీ వ్యాపారులు...ఆ తర్వాత ష్యూరిటీగా పెట్టిన ఆస్తులను తమ హస్తగతం చేసుకుంటున్నారు. సమయానికి డబ్బులు చెల్లించాలనుకున్నా..అప్పటికే గడువు దాటిపోయిందని దబాయిస్తారు. బాధితుల పేరిట ఉన్న స్థలాలను కబ్జా చేస్తారు. వీరి అరాచకాలపై దృష్టిసారించిన పోలీసులు...ఓ బాధిత మహిళ ఫిర్యాదుతో ముందుకు కదిలారు.

 

 

16:37 - December 12, 2015

రాజమండ్రి : పార్టీ పటిష్టత కోసం విస్తృతస్థాయి సమావేశంలో చర్చిస్తామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. రాజమండ్రిలో ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ మేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమాలు ఉధృతం చేయాల్సిన అవసరముందన్నారు. పార్టీ శక్తి సామర్ధ్యాలు పెంచే అంశంపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

 

16:23 - December 12, 2015

నెల్లూరు : గోల్డెన్‌ జూబ్లీహాల్‌లో ఐఏబీ సమావేశం రసాభాసగా మారింది. మంత్రి నారాయణ ఆక్రమించిన కాలువను తొలగించాలని ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ డిమాండ్ చేశారు. ఆ తర్వాతే కాలువకట్టపై పేదల ఇళ్లను తొలగించాలంటూ గొడవకు దిగారు. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పరస్పరం తిట్టుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

 

15:48 - December 12, 2015

హైదరాబాద్‌ : నగర శివారు షాపూర్‌లో దారుణం జరిగింది. ఓ ఆటోడ్రైవర్‌పై దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆటో పూర్తిగా దగ్ధమైంది. ఈ దారుణ విజువల్స్ వీడియోలో చూడండి.

 

హైదరాబాద్ జిల్లా షాపూర్ లో దారుణం

హైదరాబాద్ : నగర శివారులోని షాపూర్ లో దారుణం జరిగింది. దుండగులు ఓ ఆటో డ్రైవర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం పరారయ్యారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రున్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 

ముగిసిన మండలి నామినేషన్ల ఉపసంహరణ గడువు

హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. కరీంనగర్ లో రెండు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నల్గొండ జిలాల్లో టిడిపి అభ్యర్థి శ్రీనివాసరావు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఇప్పటి వరకు 6 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.

 

13:52 - December 12, 2015

హైదరాబాద్ : దేశంలో ఏరాష్ట్రం లేని విధంగా,.అత్యధిక మొత్తంలో ఆసరా పెన్షన్లను తెలంగాణ ప్రభుత్వం ఇస్తోంది. వృద్దులు, వితంతువులు, వికలాంగులకు ప్రతి నెలా ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్‌తో లబ్దిదారులకు కాస్తో కూస్తో ఆసరా అందుతుంది. కానీ తాజాగా ప్రభుత్వం తీసుకొస్తున్న ఓ కొత్త నిబంధన పెన్షన్ దారులకు ఇబ్బందులు తెచ్చి పెట్టేలా ఉంది. ఇంతకు ఆ కొత్త నిబంధన ఏంటి..?

వృద్దాప్య ఫించన్‌ దారులు-14 లక్షలు .....

వృద్దాప్య, వితంతు, వికలాంగులు, ఎయిడ్స్‌తో బాదపడే వాళ్లు, గీత-చేనేత కార్మికులు, బీడీ కార్మికులు ఇలా దాదాపు అన్ని వర్గాల వారికి తెలంగాణ ప్రభుత్వం చేయూత నిచ్చేందుకు ఆసరా పథకాన్ని తెచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో వృద్దాప్య ఫించెన్‌ దారులు 14 లక్షల వరకు ఉండగా..విక‌లాంగుల పెన్షన్‌ దారులు 4లక్షల, 38 వేలు ఉన్నారు. అలాగే వితంతు పెన్షన్ల కింద 13 లక్షలు, చేనేత కార్మికులు 33, 700, గీత కార్మికులు 55 వేలు, బీడీ వ‌ర్కర్ల భృతి 3లక్షల 54 వేలు, క‌ళాకారుల పెన్షన్లు 16 వేల వరకు అందిస్తుంది ప్రభుత్వం. ఇలా అన్ని వర్గాలకు కలిపి మొత్తం 35 లక్షల, 78 వేల, 637 మంది పెన్షన్‌దారులున్నారు.

ప్రతినెలా రూ. 200 కోట్లు...

అయితే ఇంత‌మంది పెన్షన్‌ దారుల‌కు ప్రతినెలా ప్రభుత్వం నెల‌కు దాదాపు 200 కోట్ల రూపాయ‌ల‌ను అందిస్తోంది. అయితే ఇంత పెద్దమొత్తంలో పెన్షన్లు ఇస్తున్నందున‌ అస‌లైన ల‌బ్ధిదారుల‌కు మాత్రమే పెన్షన్‌ అందేలా చ‌ర్యలు తీసుకుంటోంది. అందుకోసం ప్రభుత్వం ఓ కొత్త ఆలోచ‌న‌కు తెర‌తీసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్‌దారులు ఇస్తోన్న లైఫ్ స‌ర్టిఫికెట్‌ను ఇక్కడ కూడా ప్రవేశ‌పెట్టే యోచ‌న‌లో ఉంది సర్కార్‌. ఇప్పటికే దీనిపై ఓ ఆలోచ‌న‌కు వ‌చ్చని ప్రభుత్వం దీన్ని కార్యరూపంలోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. అయితే కేంద్ర, రాష్ట్ర పెన్షన్‌దారులకు ప్రతిసంవ‌త్సరం నవంబ‌ర్ నెల‌లో లైఫ్ స‌ర్టిఫికెట్ ఇస్తారు. కానీ ఇక్కడ‌ ప్రతి 3నెల‌లకోసారి లైఫ్ స‌ర్టిఫికెట్‌ను తప్పకుండా ఇవ్వాలి అని ప్రభుత్వం కొత్త నిబంధన తెచ్చింది. దగ్గర్లోని మీసేవ కేంద్రాల్లో కానీ, పెన్షన్‌ చెల్లింపుల కార్యాల‌యాల్లో కానీ వేలిముద్రలు, ఐరీస్‌తో లైఫ్ స‌ర్టిఫికెట్ ఇవ్వాలని డిసైడ్ అయింది. అయితే వచ్చే నెల జనవరి నుండే ఈ లైఫ్ సర్టిఫికెట్ త‌ప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఇందుకోసం 20రూపాయాలు కూడా చార్జ్‌ చేయ‌నుంది ప్రభుత్వం.

తీవ్ర ఇబ్బందులు ప‌డే అవ‌కాశం....

అయితే ఈ కొత్త నిబంధనతో వృద్ధులు, వితంతువులు, విక‌లాంగులు తీవ్ర ఇబ్బందులు ప‌డే అవ‌కాశం ఉంది. ఇప్పటికే ల‌బ్ధిదారు సక్రమంగా వ‌స్తేనే పెన్షన్‌ ఇస్తున్నారు అధికారులు. కానీ కొత్తగా లైఫ్ స‌ర్టిఫికెట్ ఉప‌యోగం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. నేను బ్రతికే ఉన్నాను అని లైఫ్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకోవడం ఏంటని లబ్దిదారులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఎలాగైతే పెన్షన్‌ ఇస్తున్నారో ఇకముందు కూడా అలాగే ఇవ్వాలని పెన్షన్‌దారులు డిమాండ్ చేస్తున్నారు. 

13:48 - December 12, 2015

హైదరాబాద్ : తెలంగాణలో కంటి జబ్బులకు మంచి చికిత్స ఎక్కడ దొరుకుతుందంటే ముందు సరోజినిదేవి ఆస్పత్రి పేరే వినిపిస్తుంది.. అంతటి పాపులర్‌ అయిన ఈ ఆస్పత్రి ఇప్పుడు పేషంట్లకు చుక్కలు చూపిస్తోంది.. డాక్టర్లు, పరికరాలు లేక కాదు.... నీటి కొరతతో ఇక్కడ మంగళవారంనుంచి ఆపరేషన్లు ఆగిపోయాయి..

అసీఫ్‌నగర్‌ ఫిల్టర్‌ బెడ్స్ నుంచి నీటిసరఫరా....

మెహదీపట్నంలో ఉన్న ఈ కంటి ఆస్పత్రికి అసీఫ్‌ నగర్‌లోని ఫిల్టర్‌ బెడ్స్ నుంచి నీటి సరఫరా జరుగుతుంది.. ఇందులో సాంకేతిక సమస్యతో నీరు రావడం ఆగిపోయింది.. ఈ విషయం తెలియక వైద్యులు ఆపరేషన్లకు అన్నీ సిద్ధం చేశారు.. ఆ తర్వాత అసలు విషయం బయటపెట్టారు.. ఇది తెలియని రోగులు ఆపరేషన్లకోసం ఇంకా ఆస్పత్రికి వస్తూనేఉన్నారు.. ముందునుంచి ఇక్కడ ఉన్నారు ఎప్పుడు ఆపరేషన్ చేస్తారో అంటూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.. ఆస్పత్రి లెక్కలప్రకారం దాదాపు 200 శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి.. చికిత్సలు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక పేషంట్లు డాక్టర్లచుట్టూ తిరుగుతూనేఉన్నారు..

రోజుకు 60 ఆపరేషన్లు జరుగుతాయి.....

ఈ ఆస్పత్రిలో రోజుకు దాదాపు 60 ఆపరేషన్లు జరుగుతాయి.. ఇందులో ఎక్కువగా శుక్లాలు, ఇతర కంటి ఆపరేషన్లు ఉంటాయి... ప్రభుత్వ ఆధీనంలోని ఈ ఆస్పత్రిలో నాణ్యమైన వైద్య సేవలు దొరుకుతాయని రాష్ట్రవ్యాప్తంగా పేరుంది.. పైగా ఉచిత వైద్య సేవలు కావడంతో పేదలు ఎక్కువగా ఈ ఆస్పత్రికి వస్తారు.. ఇప్పుడు ముఖ్యమైన వైద్యసేవలన్నీ ఆగిపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు..

జలమండలి నిర్లక్ష్యం వల్ల...

ఈ ఆస్పత్రికి నీటిసరఫరా విషయంలో జలమండలి నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. ఈ సమస్య పరిష్కారంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.. ఆస్పత్రిలో బోర్లు వేసుకుంటే సమస్యను కొంతవరకూ తగ్గించొచ్చని సూచిస్తున్నారు.. 

13:40 - December 12, 2015

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ దూసుకుపోతోంది.. రోజుకో స్థానాన్ని ఏకగ్రీవం చేసుకుంటూ ముందుకు సాగుతోంది... తాజాగా కరీంనగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికకూడా ఏకగ్రీవమైంది.. ఇక్కడినుంచి నామినేషన్‌వేసిన ఇద్దరు స్వతంత్ర్య అభ్యర్థులు వెనక్కితగ్గారు.. ఈ స్థానంనుంచి కాంగ్రెస్‌, టీడీపీ పోటీ చేయలేదు.. దీంతో గులాబీ పార్టీ అభ్యర్థులు నారదాసు, భాను ప్రసాదరావు ఎన్నిక ఏకగ్రీవమైంది.. ఇప్పటికే నిజామాబాద్, వరంగల్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ ఏకగ్రీవమయ్యాయి..

13:33 - December 12, 2015

హైదరాబాద్ : కాల్‌మనీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తన భర్తను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ యలమంచిలి రాము సతీమణి సెర్చ్‌ వారెంట్‌ దాఖలు చేశారు. అయితే రామును అరెస్ట్‌ చేయలేదని పోలీసులు తెలిపారు. ఇక టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సత్యానందం, చెన్నుపాటి శ్రీను ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇక ఈ వ్యవహారంలో టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసు నుంచి టీడీపీ ఎమ్మెల్సీ, అతని సోదరుడిని పోలీసులు తప్పించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా మరో టీడీపీ ఎమ్మెల్యేను కాల్‌మనీ ఏజెంట్‌ విదేశీ టూర్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. 

13:16 - December 12, 2015

హైదరాబాద్ : ప్రజాస్వామ్య విరుద్ధంగా నడుస్తున్న టిఆర్ ఎస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలని తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లిదయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. ఆయన శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ... ప్రపంచ పటంలో హైదరాబాద్ ను నిలబెట్టిన ఘన టిడిపిదేనన్నారు. కేసీఆర్ మోసం చేస్తున్నాడు... తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో విలువలు లేకుండా చేస్తున్న కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికల కోసం అబద్ధాలు చెప్పి ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేస్తున్నారని మండి పడ్డారు.

విజయరామారావుకు చంద్రబాబు ఫోన్...

హైదరాబాద్ : నిన్న పార్టీకి రాజీనామా చేసిన సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావు టీఆర్ఎస్ లో చేరేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. కొద్దసేపటి క్రితం విజయరామారావుకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేశారు. పార్టీ మారే విషయంలో తొందరపడొద్దని సూచించారు. నేరుగా చంద్రబాబు నుంచే ఫోన్ రావడంతో విజయరామారావు సిందిగ్ధంలో పడ్డారు. చంద్రబాబు చెప్పిన మాటలను సాంతం విన్న విజయరామారావు, ఆలోచించి నిర్ణయం చెబుతానని బదులిచ్చారు.

'యాహూ' మెయిల్లో ఇక నుంచి 'జీ మెయిల్' సౌకర్యం!

హైదరాబాద్ : యాహూ మెయిల్, జీ మెయిల్ రెండూ వేర్వేరు. అయితే ఇకపై యాహూలోనే జీ మెయిల్ ఖాతా తెరచి వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ విషయాన్ని యూహూ వెల్లడించింది. జీమెయిల్, గూగుల్ యాప్స్ కు సర్వర్ సైడ్ సపోర్టును విస్తృతం చేస్తున్నామని యాహూ ప్రతినిధులు వెల్లడించారు. ఈ నూతన ఫీచర్ యూజర్లను మరింత ఆకట్టుకుంటుందని తెలిపారు. ఔట్ లుక్, హాట్ మెయిల్, ఏవోఎల్ మెయిల్ వంటి వాటిని యాహూ మెయిల్ ఇప్పటికే సపోర్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జీమెయిల్ కూడా చేరింది. వినియోగదారులు మరింత సమర్థవంతంగా మెయిల్ సేవలను వినియోగించుకోవాలన్న లక్ష్యంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

భారత్, జపాన్ మధ్య అణు ఒప్పందం..

న్యూఢిల్లీ : జపాన్ ప్రధాని షింజో అబే, భారత్ ప్రధాని మోదీ ఇవాళ పౌర అణు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. భద్రత అంశంపైన కూడా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. శుద్ధ ఇంధనాన్ని వినియోగించేందుకు భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. జపాన్ పౌరులకు వీసా-ఆన్-అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. బెల్లెట్ రైళ్ల ఒప్పందం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. భారత్ తన స్వప్నాలను నిజం చేసుకునే అవకాశాన్ని జపాన్ కల్పించిందని ప్రధాని మోదీ అన్నారు.

12:48 - December 12, 2015

విజయవాడ : కాపు కార్పొరేషన్‌పై టీడీపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కార్పొరేషన్‌ విధి విధానాలను సర్కార్‌ ఖరారు చేసింది. కాపులకు ప్రత్యేక పోత్సహకాలు అందించేందుకు మార్గదర్శకాలను తయారుచేసింది. దీనికి సంబంధించి బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కాపు కార్పొరేషన్‌పై విధివిధానాలు.

ఎన్నికల హామీల్లో భాగంగా కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసిన టీడీపీ ప్రభుత్వం..తాజాగా విధి విధానాలను ఖరారు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వంద కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. దీని కోసం ప్రస్తుతానికి 50 కోట్లు విడుదల చేసింది.

కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు ఆర్థికపరమైన తోడ్పాటు...

కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారికి ఆర్థికపరమైన తోడ్పాడునివ్వడంతో పాటు ప్రోత్సాహకాలు అందించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో 60వేలు, పట్టణ ప్రాంతాల్లో 75 వేలు లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది.

వ్యవసాయం, పశుసంవర్థక, మైనర్‌ ఇరిగేషన్‌ రంగాల్లో సహాయం....

వ్యవసాయం, పశుసంవర్థక, మైనర్‌ ఇరిగేషన్‌ రంగాల్లో కార్పొరేషన్‌ ద్వారా కాపులకు సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు బ్యాంకుల ద్వారా వ్యక్తిగత రుణాలు మంజూరు చేసే విధంగా విధి విధానాలు ఖరారు చేసింది. వ్యవసాయ రంగంలో బ్యాంకు రుణం 30 నుంచి 50 వేల వరకు..సబ్సిడీ మొత్తం 30 వేల నుంచి 50 వేల వరకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పశు సంవర్థక రంగంలోని స్కీంలకు యూనిట్‌ విలువ లక్ష ఉంటే..బ్యాంకు రుణం యాభై వేలు..సబ్సిడీగా మరో యాభై వేలు ఇవ్వాలని పేర్కొంది. ఇదే రంగంలో యూనిట్‌ విలువ అరవై వేలు ఉంటే రుణం కింద 30 వేలు..సబ్సిడీ కింద మరో 30 వేలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇక ఐఎస్‌బి, మైనర్‌ ఇరిగేషన్‌ రంగంలోనూ యూనిట్‌ విలువలో యాభై శాతం బ్యాంకు రుణం.. మరో యాభై శాతం సబ్సిడీ అందించాలని బీసీ సంక్షేమ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

12:45 - December 12, 2015

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని సీఎల్పీ నేత జానారెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ....అంతేకాదు తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌పార్టీపై టీఆర్‌ఎస్‌ పగ తీర్చుకుంటోందా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ వ్యవహరిస్తోన్న తీరుపై జానా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

12:44 - December 12, 2015

విజయవాడ : అన్నావదినలపై దాడి చేసిన ఘటనలో తారాచౌదరిని పోలీసులు మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. తారాచౌదరికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో.. జిల్లా జైలుకు తరలించారు. 

12:42 - December 12, 2015

హైదరాబాద్ : మెహిదీపట్నంలోని ఎస్‌బీహెచ్‌ బ్యాంకులో 7 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు గల్లంతయ్యాయి. బ్యాంకు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరుసగా బ్యాంకులో డిపాజిట్లు గల్లంతవుతుండడంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము కష్టపడి ఆదా చేసుకున్న సొమ్ము గల్లంతవడంపై ఆవేదన చెందుతున్నారు. అయితే ఖాతాదారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని బ్యాంకు యాజమాన్యం తెలిపింది. 

ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులపై గవర్నర్ ఆగ్రహం

హైదరాబాద్: ప్రైపవేటు, కార్పొరేటు ఆసుపత్రుల వైద్యం పై రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహాన్ అన్నారు. 13వ అఖిల భారత క్యాన్సర్ సదస్సుకు హాజరైన గవర్నర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవసరం వున్నా లేకున్నా వైద్య పరీక్షలు చేయిస్తున్నారని... ఫీజుల పేరుతో పేషెంట్లను పట్టి పీడిస్తున్నారనిమండి పడ్డారు. చివరకు శవాలకూ పరీక్షలుచేసే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.డాక్టర్లు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కాన్నారు.. వైద్యరంగంలో నీతినియమాలు పాటించాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ ఆస్పత్రులు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు.

తారాచౌదరికి 14 రోజుల రిమాండ్...

విజయవాడ : సొంత వదిన కవితపై దాడి చేసిన ఘటనలో తారా చౌదరిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఘర్షణ వద్దని నచ్చజెప్పేందుకు వెళ్లిన మహిళా కానిస్టేబుల్ పై కూడా ఆమె దాడి చేసింది. ఈ నేపథ్యంలో, ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ రోజు విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన కోర్టు... తారా చౌదరికి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో, ఆమెను విజయవాడలోని సబ్ జైలుకు పోలీసులు తరలించారు.

12:18 - December 12, 2015

గుంటూరు : చరిత్ర తెలుసుకోనివాడు మానవుడే కాదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా నరసరావు పేట శతాబ్ధి ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసరావుపేట రాజకీయాలకు రాజధానిగా, పౌరుషాలకు ప్రతీకగా నరసరావు పేట వెలసిల్లిన విషయాన్ని గుర్తు చేశారు. చరిత్రను తెలుసుకునేందుకు ఈ ఉత్సవాలు ఉపయోగపడతున్నాయి. తన పూర్వికులను, తన సాంప్రదాయాన్ని, జన్మభూమి, కన్నతల్లిని మరిచినవాడు మానవుడు కాదు అని తెలిపారు.

 

12:15 - December 12, 2015

హైదరాబాద్ :  దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా మంత్రి కేటీ ఆర్అన్నారు. కవాడిగూడలోని బన్సీలాల పేటలో డబుల్ బెడ్‌రూం ఇళ్లకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, పద్మారావు తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాజరయ్యారు. కేటీఆర్ మాట్లాడుతూ...దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పేదలకు దాదాపు రూ.6లక్షలతో డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ప్రతి పేదవారికి ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం. పేదలందరికీ కళ్యాణలక్ష్మీ పథకం, షాదీముబారక్ అమలు చేస్తున్నామని, తొమ్మిదిన్నర లక్షల మంది ఆటో డ్రైవర్లకు రూ.5లక్షల ఉచిత ప్రమాద బీమా కల్పిస్తున్నాం. భవిష్యత్తులో రెప్పపాడు కూడా కరెంటు పోదు. జలాశయాలన్ని ఎండిపోయినా సీఎం కేసీఆర్ ముందు చూపుతో కృష్ణా, గోదావరి నీటితో హైదరాబాద్ దాహం తీరుస్తున్నామని తెలిపారు.

12:01 - December 12, 2015

హైదరాబాద్ : ముంబైలో సంచలనం రేపిన బాలీవుడ్‌ నటి జియాఖాన్ ఆత్మహత్య వెనక నివ్వెరపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. జియాఖాన్ మృతిపై దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు చార్జ్‌షీట్ కోర్టుకు సమర్పించారు. జియాఖాన్‌కు ప్రియుడు సూరజ్‌ పంచోలి అబార్షన్ చేయించాడని సీబీఐ చార్జ్‌షీట్‌లో ప్రకటించింది. పంచోలీ తీరుతో మనస్తాపానికి గురైన జియాఖాన్ ఆత్మహత్య చేసుకున్నట్లు కోర్టుకు వివరించింది.

ఫేస్‌బుక్‌ ద్వారా ఫ్రెండ్‌షిప్‌ ...........

జియాఖాన్- సూరజ్ పంచోలి 2012లో ఫేస్‌బుక్ ద్వారా కలుసుకున్నారు. తర్వాత కొద్ది రోజులకే వీరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఇది కొంత కాలం కొనసాగిన తర్వాత జియా ఖాన్ గర్బవతి అయింది. మరణించే సమయానికి జియాఖాన్ నాలుగు నెలల గర్బవతి. ఈ విషయం ప్రియుడు సూరజ్‌ పంచోలికి చెప్పడంతో అబార్షన్‌ కోసం ప్రయత్నించాడు. రెండు మూడు సార్లు జియాఖాన్‌ను పలువురు వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాడు. ఓ గైనకాలజిస్ట్‌ స్ట్రాంగ్‌ డోస్‌ ఇవ్వడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది.

అబార్షన్‌ చేసిన ప్రియుడు .....

అబార్షన్ కోసం చేసిన ప్రయత్నం విఫలం కావడంతో... పంచోలి మళ్లీ మళ్లీ అదే ప్రయత్నం చేశాడు. తమ సంబంధం బయటపడుతుందేమోనన్న భయం అతడిని వెంటాడింది. మందులు పని చేయకపోవడంతో... తానే రిస్క్ తీసుకుని పిండాన్ని తొలగించాడు. ఆ తర్వాత పిండాన్ని టాయిలెట్‌లో పడేశాడు. సూరజ్ వ్యవహార శైలితో మనస్తాపానికి గురైన జియాఖాన్.. మూడు పేజీల లేఖ రాసి ఆత్మహత్యచేసుకున్నట్లు చార్జ్‌షీట్‌లో ఆరోపించింది సీబీఐ....

ఆత్మహత్యకు ప్రేరేపించిన పంచోలి...

జియాఖాన్‌ను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించాడని సూరజ్ పంచోలిపై అభియోగం మోపిన సీబీఐ.. ఐపీసీ 306 కింద కేసు పెట్టింది. ఈ కేసులో సూరజ్‌పంచోలీపై నేరం రుజువైతే.. పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కేసులో జూహూ పోలీసుల దర్యాప్తు నివేదికతో పాటు.. 11 మంది వైద్యుల నుంచి సీబీఐ సాక్ష్యాలను సేకరిచింది. సూరజ్ పంచోలీ ఇంట్లో సోదాలు నిర్వహించి... కొన్ని లేఖలు, పెన్‌ డ్రైవ్‌లు, మెమెరీ కార్డులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకుంది. 

11:50 - December 12, 2015

హైదరాబాద్ : ఇసుక.. అపురూపమై పోయింది. సామాన్యుడి నుంచి.. భారీ బిల్డర్‌ వరకు.. ప్రతి ఒక్కరికీ అందుబాటులో లేకుండా పోయింది. పైగా అక్రమార్కులు కృత్రిమ కొరత సృష్టించి.. ఇసుక ధరను ఆకాశానికి తీసుకు వెళ్లారు. ఇప్పుడా ధర దిగి రానంటోంది.. సామాన్యుడి అవసరం తీరకుండా ఉంది. ఇప్పుడేం చేయాలి.. ఇసుకకు ప్రత్యామ్నాయం ఏంటి..? ఇవే ఇప్పుడు ప్రభుత్వం మదిలో మెదలుతోన్న ప్రశ్నలు..

ఏపీలో ఇసుకకు ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు.....

ఏపీలో ఇసుకకు ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం నిర్మాణ రంగం డిమాండ్‌కు.. ఇసుక సరఫరాకు అస్సలు పొంతనే లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న నిర్మాణాల కోసం... సుమారు రెండు కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అవసరముంది. మున్ముందు ఈ డిమాండ్‌ రెండున్నర కోట్ల క్యూబిక్‌ మీటర్లకూ చేరే అవకాశముంది. అయితే.. ప్రస్తుతం లభ్యమవుతోన్న ఇసుక.. కేవలం కోటి క్యూబిక్‌ మీటర్లే. దీంతో ఇసుక బంగారం కన్నా విలువైనదిగా మారిపోయింది.

చెలరేగి పోతున్న అక్రమార్కులు...

ఇసుకకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా... అక్రమార్కులు చెలరేగి పోతున్నారు. ప్రభుత్వంలోని పెద్దల అండదండలతో.. ఇసుకను అందినకాడికి దోచేస్తున్నారు. ఇసుక అందుబాటులో ఉన్న చోట 'వాల్టా' చట్టాన్ని సైతం తుంగలో తొక్కి తవ్వేస్తున్నారు. కొన్ని అధికారిక రేవుల్లో కూడా నిబంధనలను ఉల్లంఘించి.. ఇసుకను తవ్వేస్తున్నారు.

ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తుండడం వల్ల...

ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తుండడం వల్ల ఆయా ప్రాంతాల్లోని వంతెనలు, తాగునీటి ఫిల్టర్‌ బావుల నిర్మాణాలు దెబ్బ తింటున్నాయి. కరకట్టలు బలహీనపడి వరదల సమయంలో పంట, ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి. నదుల్లో నీటి ప్రవాహం గతి తప్పి... తీరం కోతకు గురవుతోంది. ఇష్టానుసారంగా ఇసుకను తవ్వేస్తుండడంతో భూగర్భ జలాలూ గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఈ కారణాల వల్ల పర్యావరణం దెబ్బతిని.. చెంతనే నదులున్నా... కరవు పరిస్థితులు ఎదురవుతున్నాయి.

ఇసుకాసురుల ఆగడాలను నిలువరించేందుకు..

ఇసుకాసురుల ఆగడాలను నిలువరించేందుకు.. ర్యాంపులను మహిళలకు అప్పగిస్తే.. తవ్వకాలపై నియంత్రణ ఉంటుందని ప్రభుత్వం భావించింది. అందుకే దాదాపు అన్ని ఇసుక ర్యాంపులనూ డ్వాక్రా మహిళా సంఘాలకే అప్పగించింది. ఇసుక తవ్వకాలు, పర్మిట్‌లు ఇవ్వడం లాంటి బాధ్యతలను మహిళా సంఘాలకే కట్టబెట్టింది. దీంతోపాటే ఇసుకను తరలించే వాహనాలకు జీఎస్‌టీ పరికరం తప్పని సరి అనీ షరతు విధించింది. అయితే.. పరిస్థితిలో ఏమార్పూ రాక పోగా.. ఇసుక అక్రమ తవ్వకాలు మరింతగా పెరిగాయి. 

పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి అరెస్టుకు రంగం సిద్ధం!

విశాఖ : పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. చింతపల్లిలో జరిగిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పై ఈశ్వరి తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబు తల తెగనరుకుతామని అన్నారు. దీనిపై ఏపీ పోలీసులు న్యాయసలహాలు తీసుకుంటున్నారు.

మెహిదీపట్నం ఎస్ బీహెచ్ లో ఏడు కోట్లు మాయం...

హైదరాబాద్: మెహిదీపట్నం ఎస్‌బీహెచ్ బ్యాంకులో రూ. ఏడు కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు మాయం అయ్యాయి. బ్యాంకు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా బ్యాంకుల్లో డిపాజిట్లు గల్లంతు కావడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.

సీపీఎం ఏపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభం

తూ.గో : రాజమండ్రిలో సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిధులుగా సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి పి. మధు హాజరయ్యారు. ముందుగా అమరవీరులకు నివాళులర్పించారు.

కాసేపట్లో ప్రారంభంకానున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు

విజయవాడ : కాసేపట్లో విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు ప్రారంభం కానుంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. అయితే మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల తరపున ఆయా రాష్ట్రాల మంత్రులు సమావేశానికి రానున్నారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రణాళికలపై చర్చించనున్నారు. 

10:41 - December 12, 2015

విజయవాడ : బెజవాడలో కాల్‌ మనీ దందా వ్యవహారంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సామాన్యుల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న ఏడుగురిని పటమట పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ వ్యవహారంలో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతల అనుచరులు ఉన్నట్లుగా తెలుస్తోంది. నిందితులపై 420, 376, 385, 506.. రెడ్‌విత్‌ 34, 120 బి ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల దాడులతో ప్రముఖ నేతలు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 

10:39 - December 12, 2015

హైదరాబాద్ : కేంద్ర పాలితప్రాంతమైన యానాం నియోజకవర్గ పరిధిలోని దరియాలతిప్ప వద్ద ఏటిగట్టుపై నుంచి కారు అదుపుతప్పి గౌతమి గోదావరిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు పోలీసుల కథనం ప్రకారం.. శనివారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన స్థానికులు గోదావరిలో కారును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో నదిలో నుంచి కారును వెలికితీశారు. కారులో ఇద్దరు చిన్నారులు సహా ఐదు మృతదేహాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన ఇండికా వీ2 కారు నంబర్ ఏపీ 05 వి201గా గుర్తించారు. మృతులంతా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని తూరంగి డ్రైవర్ కాలనీకి చెందిన పొప్పిడి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

కాల్ మనీ అప్పులు చెల్లించవద్దు : ఎమ్మెల్యే బొండా

కృష్ణా : విజయవాడలో కాల్ మనీ అప్పులను చెల్లించవద్దని నగర ప్రజలకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. తీసుకున్న అప్పుల్లో చిల్లిగవ్వ కూడా చెల్లించవద్దని పేర్కొన్న ఆయన, కాల్ మనీ వ్యాపారుల బెదిరింపులకు ఏమాత్రం బెదరవద్దని కూడా ఆయన సూచించారు. కాల్ మనీ వ్యాపారుల పీచమణిచేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన ప్రకటించారు.

విజయవాడకు మంత్రి నాయిని, సీఎస్ రాజీవ్ శర్మ

హైదరాబాద్ : తెలంగాణ హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ విజయవాడకు బయలుదేరారు. నేడు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగే దక్షిణాది రాష్ట్రాల ప్రాంతాయ సదస్సులో పాల్గొనేందుకు వెళుతున్నట్లు నాయిని తెలిపారు.

గుంటూరు నగరంలో భారీ చోరీ

గుంటూరు : నగరంలోని ఆర్టీసీ కాలనీ సమీపంలోని రాఘవనగర్ లో అర్థరాత్రి భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో చొరబడిన దొంగలు 63 సవర్ల బంగారు నగలు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు గుంటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గోదావరిలోకి దూసుకెళ్లిన కారు :5గురుమృతి

హైదరాబాద్ : యానాంలో దడియాలతిప్ప ఏటిగట్టు నుంచి గత రాత్రి ఇండికా కారు గోదావరిలోకి దూసుకెళ్లింది. గోదావరిలో పడిన ఇండికా వీ2 కారు నంబర్ ఏపీ 05వీ201గా గుర్తించారు. కారుతో పాటు అందులో ఉన్న 5గురు మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

08:44 - December 12, 2015

రామ్ ఏమిటి? శైలజ ఏమిటి? ఈ కన్య్ఫూజన్ ఏంటని కన్య్ఫూజ్ అవుతున్నారా? ఒక్క నిమిషం ఆగి ఎనర్జిటిక్ స్టార్ రామ్, హీరోయిన్ కీర్తి సురేష్ ల ప్రేమ కథ 'నేను.. శైలజ' టీజర్ చూస్తే తికమక తీరిపోతుందేమో చూడండి.
సీన్ ఓపెన్ చేస్తే సముద్రపు అలలు.. హీరో పాదాల్ని తాకుతుండగా హీరో వాయిస్ ఓవర్ తో 'లవ్' గురించి ఓ డైలాగ్. ఆ తర్వాత నలుగురైదుగురు అమ్మాయిల చేత ప్రేమ తిరస్కరించబడి ఢీలా పడిపోతాడు మన హీరో. 'ఈ సమయం నుంచి నా లైఫ్ లో లవ్ అనే పదానికి ప్లేసే లేదు' అంటూ బీర్ బాటిల్ పట్టుకుని వైరాగ్యం నిండిన ఫేస్ తో హీరో రామ్ కథలో 'హరి' బాధపడుతుంటాడు. సీన్ కట్ చేస్తే సడెన్ గా కథానాయిక వచ్చి హీరోకు 'ఐ లవ్యూ' చెప్పింది. ఏం చెప్పాలో తెలియక కన్య్ఫూజన్ లో ఉన్న హీరోను మరింత కన్య్ఫూజ్ చేస్తూ.. 'బట్ ఐయామ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ' అని చెప్పేస్తుంది.  అసలే తికమకలో ఉన్న హీరో 'కన్ఫ్యూజన్' ఫేస్ పై కెమెరా క్లోజప్ తీసుకుంటుంది. టీజర్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. ముందుకెళితే..!? కథలో ఇంతకంటే ముందుకెళ్లాలంటే 'నేను.. శైలజ' విడుదలయ్యిన రోజు థియేటర్ వెళ్లాల్సిందే. 'హరి' శైలజ.. తో జనవరి ఒకటవ తేదీ థియేటర్లలోకి రాబోతున్నాడు. ఆ రోజు కన్య్ఫూజన్ కు క్లారిటీ వెతుక్కుందాం. 

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌...ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

హైదరాబాద్ : తెలంగాణలోని నిరుద్యోగ యువకులకు వచ్చే ఏడాది జనవరి 4నుంచి 13 వరకు కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరిగే ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనే యువతీ, యువకులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సెట్‌కం సీఈవో పరంధామరెడ్డి సూచించారు.

మావోయిస్టు నేత రాధక్క విడుదల

ఆదిలాబాద్: జిల్లా జైలు నుంచి మావోయిస్టు సభ్యురాలు రాధక్క విడుదలయ్యారు. ఆమె మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరిప్రసాదరావు భార్య. గతకొంత కాలంగా రాజకీయ ఖైదీగా రాధక్క జైల్లో ఉంది. రాధక్కపై ఉన్న కేసులు రుజువు కాకపోవడంతో జైలు నుంచి విడుదల చేస్తున్నారు. రాధక్క విడుదలకు విరసం నేత వరవరరావు హాజరయ్యారు.

కాల్ మనీ కేసులో ఏడుగురు అరెస్ట్

విజయవాడ : కాల్ మనీ కేసులో ఏడుగురు అరెస్ట్ అయ్యారు. వీరి పై 420,376,354(1),(2), 385,506 రెడ్ విత్ 34, 120బి ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్టయిన వారిలో టిడిపి, కాంగ్రెస్, వైసీపీ నేతల అనుచరులు ఉండగా ప్రధాన సూత్రదారులు, ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యం ఉన్నట్లు సమాచారం. వారంతా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారికోసం గాలిస్తున్నారు.

07:53 - December 12, 2015

టాలీవుడ్ లో నంబర్ వన్ ఎవరు? అంటే చాలా పేర్లు వినిపిస్తాయి. కానీ సౌత్ లో టాప్ సెలబ్రిటీ ఎవరని 'ఫోర్బ్స్' మ్యాగజైన్  ని అడిగితే మాత్రం 'మహే..ష్' అంటూ సమాధానం ఇస్తోంది. ఫోర్బ్స్ 2015 సెలబ్రిటీస్ లిస్ట్ విడుదల చేసింది. ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సౌత్ లో'నంబర్ వన్' ప్లేస్ లో నిలిచాడు. ఈ ఏడాదికి 51.5 కోట్లు సంపాదించిన ప్రిన్స్.. సెలబ్రిటీల లిస్ట్ లో 36వ ర్యాంక్, సంపాదనలో 13 ర్యాంక్, ఖ్యాతిలో 78వ ర్యాంక్ తో మెరిసిపోయాడు. మహేష్ తర్వాత దక్షిణాదిలో ధనుష్ రెండో స్థానంలో ఉన్నాడు. కాగా మొత్తంగా 37వ ర్యాంక్ దక్కించుకున్నాడు. రజినీ అల్లుడి సంపాదన అక్షరాలా 42 కోట్లుగా ఉంది. కాగా విచిత్రంగా ధనుష్ మామ సూపర్ స్టార్ రజినీకాంత్ సంపాదన 25 కోట్లుగా ఉంది. అలాగే ఈ సూపర్ స్టార్ ర్యాంక్ కూడా 69 కి పడిపోయింది. ఇక టాలీవుడ్ హీరోల్లో మహేష్ తర్వాత వరుసలో అల్లు అర్జున్ నిలిచాడు. ఈ ఏడు 37.5 కోట్ల రూపాయలు సంపాదించిన బన్నీ.. టాప్ 42 సెలబ్రిటీగా నిలిచాడు. సంపాదనలో 22వ ర్యాంక్ తో ఉన్న ఈ అల్లువారి అబ్బాయి ఖ్యాతి విషయంలో మాత్రం మహేష్ ను దాటేశాడు. ప్రిన్స్ కంటే బన్నీ 11 ర్యాంకులు మెరుగుగా 67వ స్థానంలో ఉన్నాడు. 

07:52 - December 12, 2015

హైదరాబాద్ :  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నెక్స్‌ట్ ప్రాజెక్ట్ సూర్యతో చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టాడట. ఈ ఫిల్మ్ తెలుగు, తమిళ్ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న చిత్రంగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతానే తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు టాలీవుడ్ టాక్. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సమంతా 'అత్తారింటికి దారేది', 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలలో నటించింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వలో 'అ..ఆ' మూవీలో కూడా సమంతానే హీరోయిన్. ఇక ఈ డైరెక్టర్ నెక్స్‌ట్ ప్రాజెక్ట్‌లో కూడా సమంతే కావడంతో ఈ వార్త సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

07:42 - December 12, 2015

హైదరాబాద్ : దాదాపు ఓ దశబ్దం పైగా తెలుగు ప్రేక్షకులను అలరించిన రాశి పెళ్లి తరువాత వెండితెరకు దూరమైంది. ఇప్పుడు బుల్లితెర పై సందడి చేస్తున్న రాశి మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై మెరువనుంది. రాశి లాంగ్ గ్యాప్ తర్వాత లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తెరెక్కించే లేడీ ఓరియెంటెడ్ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. 'కళ్యాణ వైభోగమే' పేరుతో తెరక్కెతున్న సినిమాలో హీరోయిన్ మాళవిక నయ్యర్ కి తల్లి పాత్రలో రాశి కనిపించబోతుందని టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ టాక్.

07:33 - December 12, 2015

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ దూకుడు పెంచింది. అన్ని ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవం చేస్తామని ఘంటా పథంగా చెబుతోంది. అంతేకాదు....ఇప్పటికే మూడు స్థానాల్లో ఏకగ్రీవంగా ముందుకు దూసుకుపోతోంది. గ్రేటర్ ఎన్నికలు సంక్రాంతి పండుగ దినాల్లో పెట్టడం ఏం సూచిస్తోంది. లోక్ సభలో బ్యాంక్ ఎగవేతదారులను ప్రభుత్వం ప్రకటించింది. 64వేల కోట్లు ఎగవేతదారులపై కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించనుంది? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో బిజెపి నేత కుమార్, టిఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు...

హైదరాబాద్ : తక్కువ ధరకు ఎలక్ట్రానిక్ వస్తువులు విక్రయిస్తామంటూ ఇంటర్‌నెట్‌లో వెబ్‌సైట్‌ను పెట్టి దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న ఒక ముఠాలోని సభ్యురాలిని సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు నెలల క్రితం ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారి ఖాతాలోని సుమారు రూ. 19 లక్షలను సీజ్ చేశారు. అందులో మరో నిందితురాలిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడంతో, పీటీ వారెంట్‌పై సైబర్‌క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరులో పౌరహక్కుల సంఘం రాష్ట్ర మహాసభలు

గుంటూరు :నేడు, రేపు గుంటూరులోని ఏపీఎన్జీఓ కల్యాణ మండపంలో పౌర హక్కుల సంఘం(సీఎల్ సీ) 17వ రాష్ట్ర మహాసభలు జరగనున్నట్లు ఆ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శులు ఎం కోటేశ్వరరావు, వి.పేరయ్య తెలిపారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ సభల్లో ముఖ్య అతిధులుగా ఐఐటీ ఖరగ్ పూర్ ప్రొఫెసర్ ఆనంద్ తెల్ తుంబ్రే, కాకతీయ యూనివర్శిటీ ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు.

14 నుంచి విద్యుత్ పొదుపు వారోత్సవాలు..

హైదరాబాద్ : ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 14 నుంచి 20 వరకు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్, ఇంజినీర్ చంద్రమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వాడకం రోజురోజుకు పెరిగి పొతోందని, పొదుపు చేయడం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. గృహాల్లో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసుకుంటే ఇంధన వనరులను ఆదా చేసుకోవచ్చని అన్నారు. ఇంధనాల పొదుపుతోనే దేశ, రాష్ట్ర ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందన్నారు. అందుకే తమ సంస్థ ద్వార ఇంధన పొదుపుపై అవగాహన కల్పించడానికి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

సత్యం నిందితులకు జైలుశిక్ష పెంచాలని విజ్ఞప్తి

హైదరాబాద్ : సత్యం కుంభకోణం కేసులో దోషులకు శిక్ష పెంచాలంటూ నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్ కోర్టులో పిటిషన్‌ వేసింది సీబీఐ.. ఈ కుంభకోణంలో దోషులుగా తేలిన రామలింగరాజుతోపాటు మరో 10మందికి ప్రత్యేక న్యాయస్థానం ఇప్పటికే ఏడేళ్ల జైలు శిక్ష విధించింది... ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సీబీఐ అప్పీల్‌ దాఖలు చేసింది.. దోషులకు కనీసం 14ఏళ్ల జైలుశిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరింది..

మ్యాగీ నూడుల్స్‌కు వీడని కష్టాలు

హైదరాబాద్ : మ్యాగీ నూడుల్స్‌కు కష్టాలు వీడడం లేదు. నూడుల్స్ తయారీ సంస్థ నెస్లె ఇండియాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇన్‌స్టెంట్ నూడుల్స్‌గా ప్రజాదరణ పొందిన మ్యాగీలో సీసం, ఎంఎస్‌జీలు ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ నూడుల్స్‌ను బ్యాన్‌ చేసింది. దీనిని నెస్లె సంస్థ బొంబాయి హైకోర్టులో సవాలు చేసింది. తర్వాత కొన్ని ప్రయోగాలు నిర్వహించారు. ఇందులో మ్యాగీలో ప్రమాణాలకు అనుగుణంగానే ఉత్పత్తి కొనసాగుతోందని నిర్దారణ కావడంతో బొంబాయి హైకోర్టు మ్యాగీపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

నేడు మోదీ తో భేటీ కానున్న జపాన్ ప్రధాని

హైదరాబాద్ : భారత్‌లో మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబేకు ఢిల్లీలో ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదితో షింజో అబే శనివారం సమావేశం కానున్నారు. ఆ తర్వాత ప్రధాని మోది- జపాన్‌ ప్రధాని షింజో అబేతో కలిసి వారణాసిలో పర్యటించనున్నారు. ఇద్దరు ప్రధానులూ వారణాసిలో నిర్వహించే గంగా హారతిలో పాల్గొంటారు. షింజో భారత్‌కి మంచి మిత్రుడని.. భారత్-జపాన్ సంబంధాలపై షింజోకి ఉన్న ఆలోచనలు అద్భుతమైనవని మోదీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

07:07 - December 12, 2015

హైదరాబాద్ : మ్యాగీ నూడుల్స్‌కు కష్టాలు వీడడం లేదు. నూడుల్స్ తయారీ సంస్థ నెస్లె ఇండియాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇన్‌స్టెంట్ నూడుల్స్‌గా ప్రజాదరణ పొందిన మ్యాగీలో సీసం, ఎంఎస్‌జీలు ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ నూడుల్స్‌ను బ్యాన్‌ చేసింది. దీనిని నెస్లె సంస్థ బొంబాయి హైకోర్టులో సవాలు చేసింది. తర్వాత కొన్ని ప్రయోగాలు నిర్వహించారు. ఇందులో మ్యాగీలో ప్రమాణాలకు అనుగుణంగానే ఉత్పత్తి కొనసాగుతోందని నిర్దారణ కావడంతో బొంబాయి హైకోర్టు మ్యాగీపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బొంబాయి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది.

07:06 - December 12, 2015

హైదరాబాద్ : భారత్‌లో మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబేకు ఢిల్లీలో ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదితో షింజో అబే శనివారం సమావేశం కానున్నారు. ఆ తర్వాత ప్రధాని మోది- జపాన్‌ ప్రధాని షింజో అబేతో కలిసి వారణాసిలో పర్యటించనున్నారు. ఇద్దరు ప్రధానులూ వారణాసిలో నిర్వహించే గంగా హారతిలో పాల్గొంటారు. షింజో భారత్‌కి మంచి మిత్రుడని.. భారత్-జపాన్ సంబంధాలపై షింజోకి ఉన్న ఆలోచనలు అద్భుతమైనవని మోదీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. షింజో పర్యటనలో ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్‌ ట్రెయిన్‌, పౌర అణు ఒప్పందంపై ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. 

07:04 - December 12, 2015

హైదరాబాద్ : ఇటీవలే భారీ వర్షాలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న చెన్నైకి మరో ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే వాతావరణశాఖ ప్రకటనతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటీవల అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు రాజధాని చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలను అతలాకుతలం చేశాయి. చెన్నైలో వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో దాదాపు నగరమంతా వరదనీటిలో చిక్కుకుపోయింది. విమానాశ్రయం, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు అన్నీ వరదనీటిలో మునిగిపోవడంతో చెన్నైకి ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు మొత్తం నిలిచిపోయాయి. ప్రకృతి సృష్టించిన విలయ తాండవం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమిళనాడు ప్రజలను నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కలవరపెడుతోంది. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తూకుడి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో ఆ జిల్లాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

07:03 - December 12, 2015

హైదరాబాద్ : సత్యం కుంభకోణం కేసులో దోషులకు శిక్ష పెంచాలంటూ నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్ కోర్టులో పిటిషన్‌ వేసింది సీబీఐ.. ఈ కుంభకోణంలో దోషులుగా తేలిన రామలింగరాజుతోపాటు మరో 10మందికి ప్రత్యేక న్యాయస్థానం ఇప్పటికే ఏడేళ్ల జైలు శిక్ష విధించింది... ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సీబీఐ అప్పీల్‌ దాఖలు చేసింది.. దోషులకు కనీసం 14ఏళ్ల జైలుశిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరింది..

07:01 - December 12, 2015

హైదరాబాద్ : సుధీర్ఘ కాలంగా వాయిదా పడుతున్న ఆర్టీసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ కార్మికశాఖ ఎట్టకేలకు సిద్ధమమైంది. ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటన కూడా చేసింది. అయితే ఎన్నికలు జరిగేందుకు ఆర్టీసిలో ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? ఎన్నికల నిర్వాహణకు అడ్డంకిగా మారిన అంశాలేంటి అనే అంశాలపై టెన్ టీవి స్పెషల్ స్టోరీ..

తెలంగాణ ఆర్టీసిలో 55వేల మంది ఉద్యోగులు....

ప్రభుత్వరంగ కార్పొరేషన్లలో అత్యధిక ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థ ఆర్టీసి. తెలంగాణ ఆర్టీసిలో 55వేలకు పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రతి రెండేళ్లకోసారి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక కోసం ఎలక్షన్ నిర్వహిస్తారు. గతేడాది డిసెంబర్ నెలాఖరుతోనే అప్పటి గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసింది. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ కార్పొరేషన్ విభజన జరగక పోవడంతో ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది యాజమాన్యం. ప్రస్తుతం గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని ఓ కార్మిక సంఘం రాష్ట్ర కార్మిక శాఖను కోరింది. దీంతో లేబర్ అధికారులు ఆర్టీసి యాజమాన్య వివరణ కోరి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమని ప్రకటించారు. అయితే దీనిపై ఆర్టీసి అధికారులు, కార్మికశాఖ మధ్య చర్చలు జరిగే అవకాశం కన్పిస్తోంది.

45 రోజుల్లో ప్రక్రియ పూర్తి....

కార్మికశాఖ అధికారులు చెప్తున్న దాని ప్రకారం 45రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. ఆ లెక్కన చూస్తే ఆర్టీసికి లేబర్ డిపార్ట్‌మెంట్‌కు మధ్య తేదీల విషయంలో, ఓట్ల విషయంలో పలుసార్లు చర్చలు జరగాల్సి ఉంది. ఈ ప్రక్రియకు కనీసం 10రోజులు పట్టనుంది. ఆ తరువాత నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఎన్నికల ప్రచారం కోసం సమయం ఇవ్వడం..మొత్తంగా చూస్తే కనీసం నెల నుండి 45రోజులు పట్టే అవకాశం కన్పిస్తోంది. ఈ 45రోజుల వ్యవధిలోనే తెలంగాణ ఆర్టీసికి పండుగల సీజన్‌. సంక్రాంతి పండగకు జనవరి 5నుండే ఏర్పాట్లు మొదలవుతాయి. దీంతో సిబ్బంది, అధికారులందరూ అందులో తలమునకలవుతారు. ఆ తరువాత ఫిబ్రవరిలో మేడారం జాతర ఈ సమయంలో ఆర్టీసి సిబ్బందికి కంటిమీద కునుకే ఉండదు. రెండు నెలల కాలంలో రెండు సవాళ్లను ఎదుర్కొని ఎన్నికలు ఎలా నిర్వహిస్తారనేది కార్మికుల్లో ఉత్కంఠ రేపుతున్న అంశం.

సంవత్సర కాలంగా లేని ఎన్నికలు...

సంవత్సర కాలంగా తెలంగాణ ఆర్టీసికి గుర్తింపు సంఘం లేకపోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారం కావడంలేదు. కనీసం ఇప్పటికైనా గుర్తింపు ఎన్నికలు జరుగుతాయంటే పండగల సీజన్ ఆరంభం అవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు మార్చికి వాయిదా పడే అవకాశముంది. అయితే తెలంగాణ ఆర్టీసి యాజమాన్యం గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి. 

06:58 - December 12, 2015

హైదరాబాద్ : హైకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీ జనార్థన్‌పై నమోదయిన లైంగిక వేధింపుల కేసు...ఆసక్తికరంగా మారుతోంది. ఎస్పీకి.. ఆయన బాధితురాలిగా చెప్పుకుంటోన్న మహిళకు మధ్య ఆరోపణలు.. ప్రత్యారోపణలు సాగుతున్నాయి. తనపై కావాలనే ఆ మహిళ ఆరోపణలు చేస్తోందని ఎస్పీ ఆరోపిస్తుంటే... ఉద్యోగంలోకి తీసుకోకుండా వేధింపులకు గురిచేస్తున్నారని ఉద్యోగిని విమర్శిస్తున్నారు.

సికింద్రాబాద్‌ ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళ...

సికింద్రాబాద్‌ ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళ...తనపై ఎస్పీ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్పీపై కేసు నమోదయ్యింది. ఐతే తాను లైంగికంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని ఎస్పీ చెబుతున్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగంలోకి చేరిన సదరు మహిళపై.. శాఖాపరమైన విచారణను వేగవంతం చేసినందుకే తనపై ఆరోపణలు చేస్తోందని అంటున్నారు.

ఎస్పీ ఆరోపణలను ఖండిస్తున్న మహిళా ఉద్యోగి.....

ఐతే ఎస్పీ ఆరోపణలను మహిళా ఉద్యోగి ఖండిస్తున్నారు. తాను ఎలాంటి తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగం పొందలేదని చెబుతున్నారు. దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పారు. సెలవుల అనంతరం ఉద్యోగంలో జాయిన్‌ అవడానికి వస్తే..జాయిన్‌చేసుకోకుండా ఎస్పీతో పాటు మరో ఇద్దరు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు...

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తమ శాఖలో... ఏకంగా ఎస్పీ స్థాయి అధికారే లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడం.. రైల్వే పోలీసు విభాగంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. 

06:55 - December 12, 2015

విజయవాడ : ఏపీలో కరువు, వరద పరిస్థితులను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందాల పర్యటన పూర్తయింది. మూడు టీములుగా విడిపోయిన కరువు పరిశీలక బృందం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. అనంతరం.. కేంద్రపరిశీలకులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చర్చించారు. అతివృష్టి, అనావృష్టితో రాష్ట్రం నష్టపోయిందని... కేంద్రమే ఆదుకోవాలని బాబు కోరారు.

399 మండలాల్లో కరువు.....

ఖరీఫ్‌ సీజనంతా వర్షాలు లేక తీవ్ర కరువు పరిస్థితులు... కొన్ని జిల్లాల్లో బోర్లు నమ్ముకునో మరోరకంగానో రైతులు సాగు చేస్తే పంటలన్నిటినీ తుడిచిపెట్టేసిన వరదలు.. ఇవీ ఏపీలో అతివృష్టి అనావృష్టి మూలంగా ఏర్పడిన పరిస్థితులు. వర్షాలు లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 670 మండలాలకుగాను 399 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అంతర్‌ మంత్రిత్వశాఖల కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చి దుర్భిక్ష పరిస్థితులు, వరదల మూలంగా నష్టపోయిన ప్రాంతాల్లో పరిశీలన జరిపింది.

బృందం మూడు టీములుగా కరువు బృందం పర్యటన....

కరువు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు వచ్చిన బృందం మూడు టీములుగా విడిపోయి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. పరిశీలకులు ఈ నెల 8,9 తేదీల్లో పర్యటనలు ముగించి కరువు పరిస్థితులపై ఒక అవగాహనకొచ్చారు. ఇక నెల్లూరు, చిత్తూరు, తదితర జిల్లాల్లో వరదల మూలంగా నష్టపోయిన ప్రాంతాల్లోనూ కేంద్ర వరద నష్టం అంచనా బృందం పర్యటించింది. ఎన్ని వేల ఎకరాల్లో పంట నష్టపోయారు.. ఆస్తి, పశు నష్టం ఎంత అనేదానిపై పరిశీలన జరిపారు. ఈ రెండు బృందాలు శుక్రవారం సిఎం చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యాయి.

కేంద్ర బృందాలతో భేటీ అయిన చంద్రబాబు ..

కేంద్ర బృందాలతో భేటీ అయిన చంద్రబాబు ... రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీని వరదలు, కరువు కోలుకోలేని దెబ్బతీశాయని అన్నారు. వరదల మూలంగా వివిధ రంగాలకు 3,759 కోట్ల రూపాయలమేర నష్టం వాటిల్లిందని, కేంద్రం ఇతోధికంగా సాయమందించి ఆదుకోవాలని అన్నారు. వర్షాలు, వరదల మూలంగా కేవలం వ్యవసాయ, ఉద్యానవన పంటలకే 762 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అన్నారు. కరువు పరిస్థితులపై మాట్లాడుతూ ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతం 168 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 71 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైందని తెలిపారు. తీవ్ర ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో 359 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించినట్లు సిఎం వివరించారు. అయితే వివిధ కార్యక్రమాల ద్వారా కరువును ఎదుర్కోవడానికి ప్రయత్నించామన్నారు.

2వేల కోట్ల రూపాయల సాయం అందించాలి....

రాష్ట్రంలో ఏర్పడ్డ దుర్భర పరిస్థితులను ఎదుర్కోవడానికి 2వేల కోట్ల రూపాయల సాయం అందించాలని బాబు కేంద్రాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఙప్తి చేశారు. మొత్తంగా 5,759 కోట్ల రూపాయల సాయం అందించాలనేది ఏపీ ప్రభుత్వ అభ్యర్థన. మరి మోడీ ప్రభుత్వం ఏమేరకు ఏపీని కరుణిస్తుందో చూడాలి. 

06:52 - December 12, 2015

విజయవాడ : నేడు నగరంలో జరగబోయే ప్రాంతీయ మండలి సమావేశానికి విజయవాడ సిద్ధమైంది.. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షత వహించబోతున్నారు.. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్‌, నాయిని నరసింహరెడ్డి, పాండిచ్చేరినుంచి లెఫ్టినెంట్‌ గవర్నర్‌, తమిళనాడు, కర్నాటక, కేరళ మంత్రులు, దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరవుతున్నారు.. పేదరికం నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి, రోడ్డు రవాణా అభివృద్ధి, హౌజింగ్‌, రైల్వేలపై ఇందులో చర్చించబోతున్నారు.. అలాగే పవర్‌ ట్రాన్స్‌మిషన్‌, ఇండస్ట్రీయల్‌ కారిడార్‌, GST, టూరిజం అంశాలపై చర్చించే అవకాశముంది..

దక్షిణాది రాష్ట్రాల సమన్వయంపై చర్చ.....

దక్షిణాది రాష్ట్రాల సమన్వయంపైకూడా ఈ సమావేశంలో చర్చిస్తారు.. సమస్యల పరిష్కారంపై దృష్టిపెడతారు.. కేంద్రంనుంచి రాష్ట్రాలకు అందుతున్న సహకారంపై స్పష్టత ఇవ్వబోతున్నారు రాజ్‌నాథ్.. నీరు, విద్యుత్, ఇండస్ట్రియల్‌ కారిడార్‌లను చంద్రబాబు ఈ సదస్సులో ప్రస్తావించే అవకాశముంది.. అలాగే ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, పొరుగు రాష్ట్రాలు, కేంద్రంనుంచి కావాల్సిన సహాయంపై చంద్రబాబు చర్చిస్తారు.. ఏపీ, తమిళనాడులో వరదలు... తెలంగాణలో కరవుపై కేంద్రం సాయం అడిగే ఛాన్స్ ఉంది.. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తమకు వరాలు ప్రకటిస్తుందని దక్షిణాది రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి.. మరి కేంద్రం ఏం చేయబోతుందో కొద్దిగంటల్లో తేలిపోబోతోంది.. 

06:49 - December 12, 2015

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. నోటిఫికేషన్‌కు ముందు తెగ హడావుడి చేసి.. నోటిఫికేషన్‌ రావడంతోనే సగం నీరుగారి.. ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసే పరిస్థితికి చేరుకుంది. ఊహకు అందని రీతిలో కారు పార్టీ ఇస్తోన్న జలక్కులతో హస్తం నేతలు డంగై పోతున్నారు. మెదక్‌, నిజామాబాద్‌, స్థానాల కాంగ్రెస్‌ అభ్యర్థులు.. నామినేషన్‌లను ఉపసంహరించుకున్నారు. ఇలాబరిలో నిలిచిన పార్టీ అభ్యర్థులే... చేయిచ్చి.. కారెక్కేస్తుంటే.. ఇక క్లైమాక్స్‌కి వచ్చే సరికి పరిస్థితి ఎలా ఉంటుందోనని ఉత్కంఠకు గురవుతున్నారు.

కాంగ్రెస్‌కు చుక్కలు చూపుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు......

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపిస్తున్నాయి. వ‌రంగ‌ల్ ఓట‌మి భారాన్ని కొంతైనా... త‌గ్గించుకుందామ‌ని భావించిన కాంగ్రెస్‌కు... నోటిఫేకేషన్‌ నాటి నుండే క‌ష్టాలు మొదలయ్యాయి. అభ్యర్థుల ఎంపికలో తడబాట్లు.. టీఆర్ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌లు.. కాంగ్రెస్‌ నేతలను ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో పన్నెండు చోట్ల బరిలోకి దిగుతామని చెప్పీ.. ఐదు స్థానాలకే అభ్యర్థులను నిలిపారు. పోనీ వారైనా పోటీలో ఉన్నారా..? అదేం లేదు. మెదక్‌లో ఏరికోరి ఎంపిక చేసిన శివరాజ్‌పాటిల్‌... నామినేషన్‌ నాటికే టీఆర్ఎస్‌ గూటికి చేరిపోయి.. కాంగ్రెస్‌కు ఝలక్‌ ఇచ్చారు.

శివరాజ్‌పాటిల్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి.....

మెదక్‌ వ్యవహారం.. ఇప్పుడు కాంగ్రెస్‌లో అయోమయాన్ని రేపుతోంది. డీసీసీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి, దామోదర రాజనరసింహలు పాటిల్‌ను ఎంపిక చేస్తే.. ఆయన చేయివ్వడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పుడు నిజామాబాద్‌, రంగరెడ్డి జిల్లాల్లోనూ మెదక్‌ సీనే రిపీట్‌ అవుతుందేమోనని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇక్కడి అభ్యర్థులతో టీఆర్ఎస్‌ అగ్ర నేతలు టచ్‌లో ఉన్నారన్న సమాచారం.. పార్టీ నాయకులను మరింతగా కలవర పెడుతోంది.

నామినేషన్‌ ఉపసంహరణ నాటికే ఔట్‌ అవుతామన్న కలవరం.....

తాజా పరిణామాల నేపథ్యంలో.. కనీసం పోలింగ్‌ నాటి వరకైనా బరిలో ఉంటామా..? లేక నామినేషన్‌ ఉపసంహరణ నాటికే ఔటై పోతామా అన్న ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. పార్టీ నాయకత్వం అనుసరిస్తోన్న వైఖరి వల్లే.. పార్టీ అన్ని స్థానాలకూ పోటీ చేయలేక పోయిందని.. బరిలో నిలిచిన అభ్యర్థులనూ నిలుపుకోలేక పోయిందని కాంగ్రెస్‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమేరకు ఢిల్లీకి ఫిర్యాదులు పంపినట్లు సమచారం.

 

06:47 - December 12, 2015

హైదరాబాద్ : గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల‌ ప్రక్రియ షురు అయ్యింది. సామాజిక వర్గాల వారిగా రిజ‌ర్వేష‌న్లు ఖారారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వూలు జారీ చేసింది. మొత్తం 150 డివిజన్లలో మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు డివిజ‌న్ల‌లో రిజ‌ర్వేష‌న్లను ఖరారు చేశారు. మరోవైపు ఈనెల 21న లేదా 22న గ్రేటర్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.

వార్డుల రిజర్వేషన్లు ఖరారు....

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల కోసం వార్డుల రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 150 వార్డుల‌లో 75 వార్డుల‌ను మ‌హిళ‌ల‌కు కేటాయించి, 50 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించింది. జ‌న‌ర‌ల్ కేట‌గిరికి 50 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇచ్చి 75 సీట్లు క‌ల్పించింది. ఎస్టీల‌కు 2,ఎస్సీల‌కు 10, బీసీల‌కు 50, మ‌హిళ‌ల‌కు 44, జ‌న‌ర‌ల్ 44 సీట్లను కేటాయించింది.

మ‌హిళ‌ల ప్రాతినిధ్యం 50 స్థానాల నుంచి 75 స్థానాల‌కు.....

గ‌త ఎన్నిక‌లతో పోల్చితే ఈసారి గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల ప్రాతినిధ్యం 50 స్థానాల నుంచి 75 స్థానాల‌కు పెరిగింది. 2009 జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల‌కు కేవ‌లం 50 సీట్లు కేటాయించి వారి ప్రాతినిద్యాన్ని 33 శాతానికి ప‌రిమితం చేశారు. ఈసారి వారి రిజ‌ర్వేష‌న్‌ను 50 శాతానికి పెంచారు. ఎస్సీల రిజ‌ర్వేష‌న్ 12 శాతం నుంచి 10శాతానికి త‌గ్గింది. బీసీల రిజ‌ర్వేష‌న్ య‌ధావిధిగా గ‌తంలోనూ ఇప్పుడూ 50 శాతంగా ఉంది. అయితే గ‌త ఎన్నిక‌ల్లో బీసీ జ‌న‌ర‌ల్ కోటాను 33 స్థానాలు, మ‌హిళ‌ల కోటాను 17 స్థానాలుగా నిర్ణయిస్తే..ఈసారి బీసీ జ‌న‌ర‌ల్ 25 స్థానాలు, మ‌హిళ‌ల‌కు 25 స్థానాలు ల‌భించాయి. ఇక రిజ‌ర్వేష‌న్ కాని జ‌న‌ర‌ల్ కోటా గ‌త ఎన్నిక‌ల్లో 56 స్థానాలు ఉండ‌గా..ఈసారి ఈ కోటాను 44 స్థానాల‌కు ప‌రిమితం చేశారు.

ఈనెల 21 లేదా 22న గ్రేటర్‌ నోటిఫికేషన్‌ ! ....

మొత్తానికి ఈసారి జ‌న‌ర‌ల్ కేట‌గిరిని 100 స్థానాల నుంచి 75 స్థానాలకు త‌గ్గించి, మ‌హిళ‌ల ప్రాతినిధ్యాన్ని 50 స్థానాల నుంచి 75 స్థానాల‌కు పెంచుతూ వార్డుల రిజ‌ర్వేష‌న్‌ను ఖ‌రారు చేశారు. ద‌ళితుల‌కు రెండు సీట్లు, జ‌న‌ర‌ల్ కేట‌గిరిలో 14 స్థానాలు త‌గ్గాయి. గ్రేటర్‌లో వార్డుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఇక ఎన్నికలకు రెడీ అవుతుంది అధికార పార్టీ టీఆర్‌ఎస్‌. ఇదిలా ఉంటే మరోవైపు గ్రేటర్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈనెల 21న లేదంటే 22న విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. పోలింగ్‌ వరకు 28 రోజుల గడువు ఉండాలి కాబట్టి దానికి అనుగుణంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. గ్రేటర్‌ ఎన్నికల్లో పనిచేసేందుకు 1లక్షా 40మందితో కూడిన డేటాబేస్‌ను సిద్దంగా పెట్టుకుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. అయితే 2009 బల్దియా ఎన్నికల్లో 60వేల మంది సిబ్బంది పనిచేయడంతో..ఇప్పుడు కూడా 60వేల సిబ్బందిని రెడీ చేసింది.  

నేడు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు

విజయవాడ : నేడు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయసదస్సు విజయవాడలో జరగనుంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, మంత్రులు పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పాండిచ్చేరి రాష్ట్రాలు ఈ కౌన్సిల్‌లో భాగస్వాములుగా ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఏపీలోని రాజధాని ప్రాంతంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆయా రాష్ట్రాల తరపున ముఖ్యమంత్రులు రానిపక్షంలో వారి ప్రతినిధులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, మంత్రులు ఈ సమావేశాలకు హాజరవుతారు.

Don't Miss