Activities calendar

13 December 2015

పెళ్లి కొడుకైన రోహిత్‌ శర్మ

హైదరాబాద్‌ : ప్రముఖ భారత క్రికెటర్‌ రోహిత్‌ శర్మ వివాహం ఆదివారం జరగనున్న విషయం తెలిసిందే. ఆయన పెళ్లి కొడుకుగా ముస్తాబైన ఓ ఫొటోని తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల ముంబయిలో ముఖేశ్‌ అంబానీ ఇచ్చిన విందులో తన కాబోయే భార్య రితికతో కలిసి హాజరైన విషయం తెలిసిందే.

 

 

పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్లి...

ఉత్తరప్రదేశ్‌ : పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీసుకెళ్లి.. ఆపై స్నేహితులతో కలిసి ఓ వ్యక్తి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని కశ్మీరీ గేట్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు మీరట్‌లోని నకుల్‌ అనే వ్యక్తితో గత ఆరు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల క్రితం నకుల్‌ సదరు మహిళతో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే మహిళకు ఇదివరకే మరొకరితో వివాహం జరిగింది. భర్తతో సత్సంబంధాలు లేకపోవడంతో ఆ మహిళ నకుల్‌తో పెళ్లికి అంగీకరించి అతడిని కలిసేందుకు డెహ్రాడూన్‌ వెళ్లింది.

నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్టు

హైదరాబాద్ : నకిలీ సర్టిఫికెట్ల ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. హైదరాబాద్ నగరంలో నకిలీ సర్టిఫికెట్లతో పలువురిని మోసం చేసి వారి వద్ద నుంచి లక్షల రూపాయలను వసూలు చేసిన సత్యనారాయణ అనే ప్రధాన నిందితుడిని సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్) పోలీసులు ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు. ఇతని వద్ద నుంచి పోలీసులు మరింత సమాచారాన్ని రాబడుతున్నారు. ఈయన ఎవరెవరికి నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చాడు..., ఎవరెవరి వద్ద ఎంతెంత వసూలు చేవాడు, ఈయనకు ఎవరు సహకరించారన్న వివరాలను పోలీసులు తెలుసుకుంటున్నారు.

 

కాల్‌మనీ కేసులో డీఈ సత్యానందం సస్పెండ్‌

కృష్ణా : విజయవాడ కాల్‌మనీ కేసులో సంబంధం ఉన్న డీఈ సత్యానందంను సస్పెండ్‌ చేస్తూ ఏపీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ హెచ్‌జే దొర ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ సర్కిల్‌ ఆఫీసులో సత్యానందం టెక్నికల్‌ డీఈగా పనిచేస్తున్నారు. సత్యానందం కాల్‌మనీ కేసులో ఏ-4 నిందితుడుగా ఉన్నారు.

22:01 - December 13, 2015

గిరిజనుల బాక్సైట్ ఉద్యమానికి వైసిపి సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత బొత్సా సత్యనారాయణ తెలిపారు. టెన్ టివి నిర్వహించిన అంతరంగం కార్యక్రమంలో బొత్సా ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే.. 'ప్రజలు బాక్సైట్ తవ్వకాలు వద్దన్నారు....ప్రజాభీష్టంతో వైఎస్ వెనక్కి తగ్గారు.. మద్యం వ్యాపారంతో నాకు సంబంధాలు లేవు. ప్రభుత్వం ఏ విచారణ జరుపుకున్నా ఫర్వాలేదు. మాకు ఒకే నాయకుడు... నెంబర్ టు ప్రసక్తే లేదు. ఇసుకను ఈ ప్రభుత్వం 14 రెట్లు పెంచింది. క్యూబిక్ మీటర్ ఇసుక 40 రూపాయల నుంచి 550 రూపాయలకు పెంచింది. కాపు రిజర్వేషన్ల అములు టిడిపి ప్రభుత్వానిదే. రిజర్వేషన్ హామీని నుంచి తప్పుకుంటే ఊరు కోం. రాజధాని భారతదేశంలోనే పెద్ద కుంభకోణం కాబోతోంది. అమరావతి పేరుతో చంద్రబాబు కుటుంబం సొమ్ము చేసుకోవాలనుకుంటుంది' అని వివరించారు.

 

21:53 - December 13, 2015

మహారాష్ట్ర : ముంబైకి చెందిన ప్రముఖ కళాకారిణి హేమా ఉపాధ్యాయ్‌, ఆమె న్యాయవాది హర్ష్‌ భంబానీ హత్యకు గురయ్యారు. వీరి దేహాలను కండివలిలోని ఓ మురుగుకాల్వలో కనుగొన్నారు. హేమా ఉపాధ్యాయ్‌, హర్ష్‌ భంబాని దేహాలను ప్లాస్టిక్‌ షీట్లలో చుట్టి, అట్టపెట్టెల్లో పెట్టి డ్రెయిన్‌లో విడిచిపెట్టారు. ఈ కేసులో హేమ మాజీ భర్త చింతన్‌ ఉపాధ్యాయ్‌ ను ముంబై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హేమా, చింతన్‌ ఉపాధ్యాయ్‌ 1998లో పెళ్లి చేసుకున్నారు. 2010లో విడాకులకు కేసు దాఖలు చేశారు. 2012లో డైవోర్స్‌ తీసుకున్నారు. చిత్రలేఖనం, శిల్పకళల్లో హేమా ఉపాధ్యాయ్‌ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. చైనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, ఇజ్రాయిల్‌, జపాన్‌లో జరిగిన పలు అంతర్జాతీయ ప్రదర్శనల్లో హేమ తన కళాఖండాలను ప్రదర్శించిన అందరి ప్రశంసలు అందుకున్నారు.

 

21:50 - December 13, 2015

ఢిల్లీ : పశ్చిమ ఢిల్లీలోని షకూర్‌ బస్తీలో గుడిసెల కూల్చివేత అంశం పెను వివాదంగా మారుతోంది. బడుగుజీవులు రైలు పట్టాల వెంబడి వేసుకున్న గుడిసెలను రైల్వే అధికారులు కూల్చివేయడం పై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆగ్రహంతో ఉన్నారు. పేదలకు నిలువ నీడ లేకుండా చేసిన రైల్వే శాఖపై మండిపడుతున్నారు. ఇది ఢిల్లీ సర్కార్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య లడాయిగా మారింది. కూల్చివేతలతో నిర్వాసితులైన వారికి పునరవాసం కల్పించడంలో విఫలమైన ముగ్గురు అధికారులను ఢిల్లీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.
శనివారం అర్ధరాత్రి 1200 గుడిసెల కూల్చివేత
పశ్చిమ ఢిల్లీలోని షకూర్‌ బస్తీలో రైల్వే అధికారులు పేదల గుడిసెలను కూల్చివేసిన అంశంపై రగడ జరుగుతోంది. షకూర్‌ బస్తీలో రైల్వే ట్రాక్‌ వెంబడి 500 మురికివాడలు ఉన్నాయి. వీటిలోని 1200 గుడిసెలను శనివారం అర్ధరాత్రి కూల్చివేశారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి ఆరు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోయింది. దీంతో కోపోద్రిక్తులైన షకూర్‌ బస్తీ వాసులు.... రైల్వే అధికారులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
మందస్తు నోటీసులు లేకుండా గడిసెల కూల్చివేత
విషయం తెలుసుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌... ఘటనా స్థలానికి చేరుకని బాధితులను ఓదార్చారు. రైల్వే మంత్రి సురేష్‌ ప్రభుకు ఫోన్‌ చేసిన విషయం చెప్పారు. గుడిసెల కూల్చివేత అంశం తనకు తెలియదని చెప్పి, పసిబిడ్డ మరణంపై విచారం వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా షకూర్‌ బస్తీలో గుడిసెలను కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఏడాది మార్చి 14 నుంచి మూడుసార్లు నోటీసులు ఇచ్చినా ఖాళీ చేయకపోవడంతో కూల్చివేయాల్సి వచ్చిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. గుడిసెలు ఖాళీ చేసేందుకు ముందుగా సెప్టెంబర్‌ 30 వరకు, ఆర్వాత ఈనెల 12 వరకు గడవు ఇచ్చిన ఎవరూ స్పందించకపోవండో కూల్చివేతల పర్వాన్ని చేపట్టామన్నది రైల్వే అధికారుల వాదన.
ఇద్దరు ఆర్డీవోలు, మరో సీనియర్‌ అధికారి సస్పెండ్‌
రైల్వేల కూల్చివేతలతో ఆశ్రయం కోల్పోయిన షకూర్‌ బస్తీ వాసులకు ఢిల్లీ రెవిన్యూ అధికారులు ఎటువంటి పునరావాసం కల్పించలేదు. దీంతో గజగజ వణికే చలిలోనే గడపాల్సి వచ్చింది. బాధితులను సహాయ శిబిరాలకు తరలించి, ఆహారం, మంచీనీరు కూడా అందించని అధికారుల తీరుపై కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ఇద్దరు ఆర్డీవోలతోపాటు, మరో సీనియర్‌ అధికారి సస్పెన్షన్‌కు ఆదేశాలు జారీ చేశారు. కేజ్రీవాల్‌ ఆదేశాలను ఉన్నతాధికారులు అమలు చేశారు.
ట్రాక్‌ నుంచి 15 మీటర్ల వరకు సేఫ్టీ జోన్‌
కూల్చివేతలను రైల్వే అధికారులు సమర్ధించుకుంటున్నారు. పసిపాప మరణానికి గుడిసెల కూల్చివేతకు సంబంధంలేదన్న వాదాన్ని వినిపిస్తున్నారు. ట్రాక్‌ నుంచి 15 మీటర్ల వరకు సేఫ్టీ జోన్‌ ఉందని గుర్తు చేస్తున్నారు. ట్రాక్‌ వెంబడి ఉన్న ఆక్రమణలను తొలగించాలని జాతీయ పర్యావరణ న్యాయస్థానం కూడా ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. పశ్చిమ ఢిల్లీలో రైల్వేల విస్తరణ కార్యకలాపాలకు ఆటంకంగా ఉన్నందునే షుకూర్‌ బస్తీ గుడిసెలను తొలగించామన్నది రైల్వే అధికారుల వాదన.

 

21:46 - December 13, 2015

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఆశా వర్కర్ల పాదయాత్రపై పోలీసుల జులుం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25వేల మంది ఆశా కార్యకర్తలు తమ డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్‌ 2 నుంచి సమ్మె చేస్తున్నారు. డిసెంబర్‌ 10నాటికి ఆశాల సమ్మె 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా..సర్కార్‌లో ఏమాత్రం చలనం లేకపోవడంతో..ఆశాలు సమ్మెను మరింత ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలోనే పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో 10వ తేదీన సీఐటీయూ ఆధ్వర్యంలో 100మందితో చేపట్టిన 100 కిలోమీటర్ల పాదయాత్ర..షాద్‌నగర్‌కు చేరుకోవడంతో...టిడిపి, బీఎస్పీ వివిధ దళిత సంఘాలు స్వాగతం పలికి వారికి సంఘీభావం తెలిపారు. ఆశాలు న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నా...ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని వారు మండిపడ్డారు.
ఆశాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు
జిల్లాల నుంచి హైదరాబాద్‌కు తరలివస్తున్న ఆశాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మెదక్‌ జిల్లా సంగారెడ్డి వద్ద జాతీయరహదారిని దిగ్బంధించిన ఆశాలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో కొంత మంది ఆశా కార్యకర్తలు స్పృహ కోల్పోయారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజయ్యతో సహా పలువురికి గాయాలయ్యాయి. వీరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
150 మంది ఆశావర్కర్ల అరెస్ట్
మహాపాదయాత్రలో భాగంగా నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిద్రిస్తున్న 150 మంది ఆశావర్కర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని నారాయణపురం పీఎస్‌కు తరలించారు. అరెస్ట్‌ అయిన వారిలో పలువురు సీఐటీయూ నాయకులు ఉన్నారు. నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల నుంచి చేపట్టిన ఆశావర్కర్ల పాదయాత్ర మెదక్‌ జిల్లాకు చేరింది. మాసాయిపేట, కొండపాక స్కూళ్లలో బస చేసిన కార్యకర్తలనూ పోలీసులు నిర్బంధించారు. శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించిన ఆశాలపై ఖాకీలు బలప్రదర్శనకు దిగారు. దీంతో పలువురు ఆశా కార్యకర్తలకు గాయాలయ్యాయి.
మరింత ఉధృతం చేస్తాం : ఆశాలు
సమస్యల పరిష్కారం కోసం కెరిమెరి నుంచి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం వరకు వందమంది ఆశాలు చేపట్టిన పాదయాత్ర ఇంద్రవెల్లికి చేరుకుంది. సోమవారం రోజు జిల్లా కేంద్రానికి చేరుకునేలా ఆశాలు ప్రణాళిక సిద్ధం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో చేపట్టిన భారీ నిరసన కార్యక్రమాల తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే..ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆశాలు హెచ్చరిస్తున్నారు.
సానుకూల వాతావరణంలో పరిష్కరించాలన్న ఆశాలు
ప్రభుత్వం మొండి వైఖరిని వీడి.. తమ సమస్యలను సానుకూల వాతావరణంలో పరిష్కరించాలని ఆశాలు కోరుతున్నారు. లేకపోతే..ఈనెల 16న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభ ద్వారా.. ఉద్యమ ఉధృతికి ప్రణాళికలు రచిస్తామని హెచ్చరిస్తున్నారు.

 

21:39 - December 13, 2015

విజయవాడ : కాల్ మనీ కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపట్లో వీరిని మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ఈ కేసులో నిందితునిగా ఉన్న ట్రాన్స్ కో డీఈ సత్యానందంను సస్పెండ్ చేస్తూ విద్యుత్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

కాల్ మనీ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు..

కృష్ణా : విజయవాడ కాల్ మనీ కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. కాసేపట్లో నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. 

21:28 - December 13, 2015

మక్కా : సౌదీ అరేబియాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో తొలిసారిగా ఓ మహిళా అభ్యర్థి విజయం సాధించారు. మక్కాలోని మద్రాకా కౌన్సిల్‌లో సల్మా బింట్‌ హిజాబ్‌ అనే మహిళా అభ్యర్థి విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. ఈ స్థానంలో మొత్తం ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళలు పోటీపడగా.. సల్మా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 284 సీట్లకుగానూ.. 6వేల మంది పురుషులు, 900మంది మహిళలు పోటీపడ్డారు. సౌదీ చరిత్రలోనే తొలిసారిగా మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

21:24 - December 13, 2015

హైదరాబాద్ : ఆ టీమ్‌ పేరు చెబితే చాలు....ఈవ్‌ టీజర్ల వెన్నులో వణుకు పడుతుంది.ఆ టీమ్‌ పేరు వింటే చాలు.. జులాయిల గుండెల్లో గుబులు మొదలవుతుంది. రోడ్డు పక్కన కాపుకాచే కుర్రాళ్లకు ఆ బృందం..సింహస్వప్నంగా మారుతోంది. మహిళ భద్రతకు గట్టి భరోసా ఇస్తోంది. ఆకతాయిల అల్లరి పనులకు అడ్డుకట్ట వేస్తోంది. ఇలా అమ్మాయిల భద్రతను బాధ్యతగా తీసుకున్న ఆ బృందం...వన్‌ఇయర్‌ సెలబ్రేషన్స్‌ను భారీ స్థాయిలో జరుపుకుంటోంది.
ఎన్‌ కన్వెన్షన్స్‌లో ..వారికోత్సవ వేడుకలు
ఈవ్‌టీజర్ల ఆటకట్టించేందుకు ఏర్పాటైన షీటీమ్స్‌ ఏడాది పూర్తి చేసుకున్నాయి. అమ్మాయిల వెంటపడి అల్లరి చేసే..మూకలకు.. ముకుతాడు వేయాలనే ఉద్దేశంతో షీటీమ్స్‌ ఏర్పాటయ్యాయి. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో షీ టీమ్స్‌ పురుడుపోసుకుని సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా మాదాపూర్‌ ఎన్‌ కన్వెన్షన్స్‌లో ..వారికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్‌ ఎంపీ కవిత, సినీనటి జయసుధ, సైబరాబాద్‌ కమిషనర్‌ సివి ఆనంద్‌ ఈ సెల్‌బ్రేషన్స్‌లో పాల్గొన్నారు.
సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 832 మంది అరెస్ట్
సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో షీటీమ్స్‌ వందలమంది ఈవ్‌టీజర్లను పట్టుకున్నాయి. ఈ ఏడాది కాలంలో 832 మంది అరెస్టయ్యారు. బస్టాండ్లు..సినిమా థియేటర్లు..షాపింగ్స్‌ మాల్స్‌ దగ్గర షీ టీమ్‌ బృందాలు నిఘా వేసి..జులాయిల ఆటకట్టించాయి. ఎస్‌ఎంఎస్‌ పంపితే చాలు క్షణాల్లో షీటీమ్‌ బృందాలు వాలిపోతున్నాయి. వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసినా...ఆకతాయిలను పూర్తి ఆధారాలతో పట్టుకుంటున్నాయి. 
మహిళలు సంతోషంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యం : కవిత
మహిళలు సంతోషంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని షీటీమ్స్‌ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. మహిళల భద్రత కోసం చట్టాలను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
షీటీమ్స్‌ బాగా పనిచేస్తున్నాయని : జయసుధ
మహిళల భద్రత కోసం ఏర్పాటైన షీటీమ్స్‌ బాగా పనిచేస్తున్నాయని సినీనటి జయసుధ అన్నారు. ఈవ్‌ టీజర్ల మీద ఫిర్యాదు చేసేందుకు మహిళలు ధైర్యంగా ముందుకు వస్తున్నారన్నారు. వార్షికోత్సవ వేడుకల్లో మహిళల భద్రతకు సంబంధించి పలు నాటికలు ప్రదర్శించారు. ధైర్యంగా ముందుకొచ్చి..ఈవ్‌ టీజర్ల మీద ఫిర్యాదు చేసిన మహిళలను ఘనంగా సత్కరించారు.

 

 

బోరబండలో కిడ్నాప్ కు గురైన బాలుడు క్షేమం..

హైదరాబాద్ : బోరబండలో కిడ్నాప్ కు గురైన బాలుడు క్షేమంగా ఉన్నాడు. పశ్చిమగోదావరి జిల్లాలో బాలుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు.

 

21:04 - December 13, 2015

ఢిల్లీ : ప్రపంచ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ ఫైనల్స్ మహిళల సింగిల్స్ టైటిల్ ను...జపాన్ సంచలనం నజోమీ ఒకుహరా తొలిసారిగా నెగ్గి చరిత్ర సృష్టించింది. దుబాయ్ హామ్ డాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియం వేదికగా ముగిసిన టైటిల్ సమరంలో చైనాకు చెందిన వాంగ్ ఈ హాన్ పై... నజోమీ 22-20, 21-18తో విజేతగా నిలిచింది. భారీప్రైజ్ మనీతో పాటు విజేతకు ఇచ్చే బంగారు పతకాన్ని అందుకొంది. ప్రపంచ నెంబర్ వన్ కారోలిన్ మారిన్, రెండోర్యాంకర్ సైనా నెహ్వాల్ ఫైనల్స్ చేరకుండానే ఈ సూపర్ టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

 

21:00 - December 13, 2015

వరంగల్ : ఇన్సూరెన్స్ రంగంలోనే కాకుండా ప్రజా సేవలో అగ్రభాగాన ఉన్న ఎల్‌ఐసీని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆల్‌ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్‌ యూనియన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కె వేణుగోపాల్‌ అన్నారు. వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని మయూర గార్డెన్‌లో ఏఐఐఈఏ వరంగల్ డివిజన్‌ 29వ మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభలో పాల్గొని, ఆయన మాట్లాడారు. ఎల్‌ఐసీ పరిరక్షణపై మహాసభల్లో సుధీర్ఘంగా చర్చించడం జరుగుతుందన్నారు. ఇన్సూరెన్స్ రంగంలో, ప్రజా సేవలో ఎల్‌ఐసీ అగ్రభాగాన నిలుస్తోందని తెలిపారు. అలాంటి ఎల్‌ఐసీని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ఇన్సూరెన్స్ రంగంలో కేంద్రం విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని విమర్శించారు. విదేశీ పెట్టుబడులతో ప్రజల సొమ్ముకు అభద్రతా భావం ఏర్పడుతుందని చెప్పారు. ప్రైవేటు ఇన్సూరెన్సులు ప్రజలకు సరైన సర్వీసులు చేయడంలో విఫలం అవుతున్నాయని పేర్కొన్నారు. ఎల్‌ఐసీ ఉద్యోగుల వేతన సవరణలో ప్రభుత్వం తాత్సారం చేస్తుందని వేణుగోపాల్ మండిపడ్డారు. ఈ సభలకు వరంగల్‌, ఖమ్మం జోన్‌ల నుండి ఎల్‌ఐసీ ఉద్యోగులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఉదయం ఎల్‌ఐసీ కార్యాలయం నుండి భారీ ర్యాలీ చేపట్టారు.

 

20:52 - December 13, 2015

హైదరాబాద్‌ : పాతనగరంలోని పురానాపూల్‌లో ఇవాళ సాయంత్రం ఓ బస్సు బీభత్సం సృష్టించింది. మెడికల్ షాప్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. గురునానక్ ఇంజినీరింగ్ కాలేజ్ కు చెందిన బస్సు... పురానాపూల్‌లో రోడ్డు పక్కనే ఉన్న మెడికల్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మరో నలుగురుకి గాయాలయ్యాయి. బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

 

20:40 - December 13, 2015

హైదరాబాద్‌ : పోలీసుల లాఠీచార్జీలను చేధించుకుంటూ ఎట్టకేలకు ఆశా వర్కర్ల పాదయత్ర హైదరాబాద్ నగరానికి చేరుకుంది. వారి సమ్మె 100 రోజులైన సందర్బంగా నగరానికి తెలంగాణల జిల్లాల నుంచి 8 పాదయాత్ర బృంధాలు ప్రారంభమయ్యాయి. వికారాబాద్‌ ఆశాల యాత్ర నగరానికి చేరుకోగా...వారికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని 104 రోజలుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వ పట్టించుకోవడం లేదని విమర్శించారు. సీఎం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అరెస్టులు చేసినా... జైలుకు పంపినా... సమ్మెను విరమించేది లేదని తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ ఇళ్లు, ఫాంహౌజ్ లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం మొండి వైఖరి విడానాడాలని హితవు పలికారు. తమ సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు.

 

20:32 - December 13, 2015

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు... వీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. సిలబస్ పూర్తికాకుండా పరీక్షలు నిర్వహిస్తే ఊరుకోబోమని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు షెడ్యూల్ లో ఎలాంటి మార్పు లేదని... పరీక్షలు వాయిదా వేసే ఛాన్స్ లేదని రిజిస్ట్రార్ ప్రకటించారు. 

పాతబస్తీలో ప్రైవేట్ కాలేజీ బస్సు బీభత్సం...

హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు బీభత్సం సృష్టించింది. గురునానక్ కాలేజీకి చెందిన బస్సు మెడికల్ షాప్ లోకి దూసుకెళ్లింది. దీంతో మహిళ మృతి చెందింది. మరో నలుగురు గాయపడ్డారు. 

ఓయూలో ఉద్రిక్తత..

హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు.. వీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. సిలబస్ పూర్తికాకుండా పరీక్షలు నిర్వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాగా రేపటి నుంచి పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే రిజస్ట్రార్ ప్రకటించారు. 

19:48 - December 13, 2015

నిజామాబాద్ : జిల్లాలో కరవు తాండవిస్తోంది. అన్నదాతను కాలం కాటేసింది. జిల్లాలో ఎటు చూసినా ఎండిన పంటలు, బీటలు వారిన పొలాలే దర్శనమిస్తున్నాయి. రెండేళ్ల నుండి వరుణుడు కరుణించకపోవడంతో.. 49 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. దీంతో సర్కార్‌ ఈ జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించింది.
కరవు రక్కసి
నిజామాబాద్‌ జిల్లాలోని మొత్తం 36 మండలాల్లో కరవు రాక్షసి తాండవం చేస్తోంది. జిల్లాలో వర్షాలు లేక భూగర్భ జలాలకు అడుగంటాయి. బోరుబావులు ప్రమాదం అంచున చేరాయి. ఏడాదిలోనే గణనీయంగా భూగర్భ జల మట్టాలు పడిపోయాయి. జిల్లాలో ప్రధాన జలాశయాలైన శ్రీరాంసాగర్‌, పోచంపాడ్‌ ప్రాజెక్టులు డెడ్‌ స్టోరేజికి చేరాయి.
979 మి.మీ వర్షానికి 494 మి.మీ వర్షపాతం నమోదు
నవంబర్‌ నెలలో 979 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా కేవలం 494 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. వరుసగా రెండేళ్లు వర్షపాతం పడిపోవడంతో భూగర్భజలాలు తగ్గుముఖం పట్టాయి. గతేడాది నవంబర్‌లో 10.23 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉంటే.. ఈ ఏడాది 10.96 మీటర్ల లోతుకు జలామట్టాలు పడిపోయాయి.
16.66 మీటర్ల లోతుకు పడిపోయిన నీటిమట్టం
ఇక నిజామాబాద్‌ రెవెన్యూ డివిజన్‌లో నీటిమట్టాల తగ్గుదల ఎక్కువగా ఉంది. గతేడాది నవంబర్‌లో 8.4 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా.. ఈ ఏడాది 16.66 మీటర్ల లోతుకు పడిపోయాయి. బోధన్‌ డివిజన్‌లో 8.26 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలాలు 12.80 మీటర్లకు పడిపోయాయి. కామారెడ్డి రెవెన్యూ డివిజన్‌లో గతేడాది 14.11 మీటర్ల లోతులో జలమట్టం ఉండగా.. ప్రస్తుతం 20.64 మీటర్లకు చేరుకున్నాయి.
వర్షాలు లేక ఎండిపోయిన పంటలు
జిల్లాలో వర్షాలు లేక ఖరీఫ్‌లో వేసిన పంటలు ఎండిపోయాయి. దీంతో రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. ఖరీఫ్‌లో సాధారణ పంట విస్తీర్ణం మూడు లక్షల 32 వేల 599 హెక్టార్లకు గాను.. మూడు లక్షల 11 వేల 68 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. 69.725 హెక్టార్లలో వరి పంట వేయగా.. 53 శాతం పంట దెబ్బతింది. 47.514 హెక్టార్లలో మొక్కజొన్న పంట వేయగా.. 53 శాతం పంట దెబ్బతిన్నది. లక్షా 32 వేల 789 ఎకరాల్లో సోయాబీన్‌ వేయగా.. 80 శాతం పంట నష్టపోయినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. పంటలు వేసిన 45 రోజుల వరకు వర్షాలు లేకపోవడంతో గింజలు మొలకెత్తని పరిస్థితి ఏర్పడింది.
రబీలో లక్షా 92 వేల హెక్టార్లలో పంటలు సాగు చేస్తారని అంచనా
ఇక రబీలో లక్షా 92 వేల హెక్టార్లలో పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు 41,432 హెక్టార్లలో మాత్రమే పంటలు వేశారు. సాధారణ విస్తీర్ణంతో పోల్చుకుంటే సరాసరి 20 శాతం కూడా పంటలను వేయలేదు. ఇక ప్రతి ఏడాది రబీలో సాధారణంగా 88 వేల హెక్టార్లలో వరి సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది ఇంకా వరి సాగు ప్రారంభం కాలేదు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో నారుమళ్లు పోయలేదు. తొలుత 45 వేల హెక్టార్లలో వరి సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎర్రజొన్న పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. ఇక 29,773 హెక్టార్లలో శనగపంట, 730 హెక్టార్లలో పెసర, 675 హెక్టార్లలో ఉల్లి, 38 హెక్టార్లలో మిర్చి, 387 హెక్టార్లలో వేరుశనగ, 1,142 హెక్టార్లలో పొద్దుతిరుగుడు, 897 హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేస్తున్నారు.
రైతులకు నిరాశ
గతేడాది వర్షాలు సరిగా లేక రైతులు పూర్తిస్థాయిలో వ్యవసాయం చేయలేదు. పోనీ ఈ ఏడాదైనా సమృద్ధిగా వర్షాలు పడతాయని భావించిన రైతులకు నిరాశే ఎదురైంది. జూన్‌ మొదటి వారంలో కొద్దిపాటి వర్షాలు కురిసినప్పటికీ తర్వాత.. వర్షాల జాడే లేదు. సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతులు నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తీవ్ర నీటి ఎద్దడి
మరోవైపు జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. నిజామబాద్‌కు తాగునీరు అందించే రఘునాధ చెరువు, మంచిప్ప మాసాని చెరువులు ఎండిపోయాయి. ప్రస్తుతం అలీసాగర్‌ నుండి తాగునీరు అందిస్తున్నారు. ఈ చెరువులో ఉన్న నీటినిల్వలు ఈ నెలకు మాత్రమే సరిపోతాయి. మరి జనవరి నుంచి ప్రభుత్వం నీటి సమస్యను ఎలా తీరుస్తుందోనన్న ఆందోళన ప్రజలను వెంటాడుతోంది.

 

19:42 - December 13, 2015

కరీంనగర్ : పిడికెడు మెతుకుల కోసం ఉన్న ఊరుని వదిలి వచ్చిన వలస కూలీల బతుకులు బుగ్గిపాలవుతున్నాయి. కార్మిక చట్టాలు కాగితాలకే పరిమితమవడంతో వారి బతుకులు ఛిద్రమవుతున్నాయి. కరీంనగర్‌ జిల్లాలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీలపై జరుగుతున్న దాష్టీకాలపై టెన్ టివి స్పెషల్‌ స్టోరీ....
యజమానుల వేధింపులు
వలస కూలీలకు బతుకు భారమవుతోంది. కరీంనగర్‌ జిల్లాలో యజమానుల వేధింపులు తట్టుకోలేక... వేరే దారిలేక... వారి వేధింపులు భరిస్తూనే పనిచేస్తున్నారు వలస కూలీలు. తాళలేని వారు.. తనువు చాలిస్తున్నారు. పొట్టకూటి కోసం ఒడిశాకు చెందిన గిరిజనులు కుటుంబాలతో సహా వలస వచ్చి అష్టకష్టాలు పడుతున్నారు. ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకున్నా... 24 గంటలు పనిచేస్తున్నారు.
ఒడిశాలో బ్రోకర్ల ద్వారా కూలీల దిగుమతి
కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాల్లో ఇటుక బట్టీల వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. ఒడిశాలో అతివృష్టి ఇక్కడి వ్యాపారులకు వరంగా మారింది. అక్కడి గ్రామాల్లోని పలువురు పెద్దమనుషులను బ్రోకర్లుగా ఏర్పాటుచేసుకొని... కూలీలను దిగుమతి చేసుకుంటున్నారు. బ్రోకర్ల మాటలు నమ్మి పని కోసం ఇక్కడికి వచ్చిన వారికి యాజమానులు చుక్కలు చూపిస్తున్నారు. పదహారు గంటలు పనిచేసినా వేతనాలు ఇవ్వడంలేదు. నిలదీస్తే అంతే సంగతులు. కాళ్లతో తన్నడం...కర్రలతో చితకబాదడం లాంటివి చేస్తున్నారు. యజమానుల వేధింపులు తట్టుకోలేక పారిపోయిన వారిని... పట్టుకువచ్చి సినిమా స్టైల్‌లో చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఇటుక బట్టీలు జనావాసాలకు దూరంగా ఉండడంతో... అసలు ఏం జరుగుతుందో కూడా ఎవరికీ తెలియడంలేదు.
మహిళా కూలీలకు నరకం చూపిస్తున్న యజమానులు
మహిళా కూలీలకైతే యజమానులు నరకం చూపిస్తున్నారు. లైంగిక వేధింపులు, భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. ఓ యువతిని లోబర్చుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకోవడంతో హత్యచేసినట్లు ఆరోపణలున్నాయి. దాన్ని అనుమానాస్పద మృతిగా చిత్రీకరించారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. తన పిల్లాడికి పాలు ఇస్తున్న ఓ మహిళను కడుపుపై తన్నడంతో... ఆమె చనిపోయిందని... యజమానిని ఎదిరించినందుకుగాను ఇద్దరు యువకులు కెనాల్‌లో శవాలుగా తేలారని బాధితులు అంటున్నారు. అయితే.. ఈ కేసును అడవిపంది వేటకు వెళ్లి చనిపోయారన్నట్లుగా క్లోజ్‌ చేశారని వారు ఆరోపిస్తున్నారు.
కాగితాలకే పరిమితమవుతున్న చట్టాలు
వలస కూలీల కోసం పాలకులు ఎన్ని చట్టాలు చేసినా... అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఒడిశాలో అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన సర్దార్‌లు ఉంటారు. వారు మాత్రమే కార్మికులను వివిధ రాష్ట్రాలకు పంపించాలి. ప్రయాణ ఖర్చులు కూడా వారే భరించాలి. కానీ సర్దార్‌లు ఇక్కడి యజమానులతో కుమ్మక్కై కార్మికుల పొట్ట కొడుతున్నారు. వెయ్యి ఇటుకలు తయారు చేసే వారికి రోజుకు 442 రూపాయలు ఇవ్వాల్సిఉండగా.. కేవలం 70 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. నిబంధనల ప్రకారం పనిచేసేందుకు వచ్చిన కూలీల మైగ్రేషన్ పత్రాలను.. బట్టీల యజమానులు ఇక్కడి కార్మిక శాఖ అధికారులకు అందజేయాలి. కానీ ఆ పత్రాలను తమ వద్దే ఉంచుకుని కార్మికులను వేధిస్తున్నారు. కార్మికుల సమస్యలపై అధికార, ప్రతిపక్షాలు స్పందించాలని పౌరహక్కుల సంఘం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.
అనుమతులు లేని ఇటుక బట్టీలు
మరోవైపు.. జిల్లాలోని చాలా ఇటుక బట్టీలకు కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ అనుమతులు లేనట్టు సమాచారం. ఇటుకల తయారీకి అవసరమైన మట్టిని... చెరువుల నుంచి తీసుకువస్తున్నారు. ఇటుకలను కాల్చడానికి అవసరమైన బొగ్గును సింగరేణి ఏరియా నుంచి దొంగతనంగా బట్టీలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఇటుకబట్టీల వ్యాపారుల ఆగడాలను అరికట్టి... కూలీలను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. 

19:11 - December 13, 2015

కరీంనగర్ : జిల్లాలోని రామగుండం మండలం సోమనపల్లిలో దారుణం జరిగింది. ఆటో, కారు ఢీకొన్నాయి. దీంతో కారులోని సిలిండర్ పేలి ఆరుగురు సజీవదహనం ఆయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బైక్ పై వస్తున్న మరో ఇద్దరు కూడా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థానికులు నీళ్లు చల్లి మంటలను ఆర్పేప్రయత్నం చేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న మృతులు బంధువుల రోదనలు మిన్నంటాయి. గుండెలవిసేలా రోధిస్తున్నారు. 

18:58 - December 13, 2015

ఖమ్మం : హిమాలయాల్లోని రనాక్‌ పర్వతాన్ని అధిరోహించి ఆదివారం ఖమ్మం జిల్లా భద్రాచలం చేరుకున్న గిరిజన బాలిక తుర్రం సుఖీప్రియకు ఘన స్వాగతం లభించింది. భద్రాచలం నుంచి ఆమెను ఊరేగింపుగా దుమ్ముగూడెం మండలంలోని పర్శంవారిగంపు గ్రామానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎవరెస్ట్ ను అధిరోహించాలన్న ఆకాంక్షను సుఖీప్రియ వ్యక్తం చేశారు.
సుఖీప్రియను అభినందించిన సున్నం రాజయ్య
రనాక్‌ పర్వతాన్ని అధిరోహించిన సుఖీప్రియను భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అభినందించారు. హిమాలయాల్లో 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న రనాక్‌ పర్వతాన్ని అధిరోహించడం ద్వారా సుఖ్రీప్రియ చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. సుఖీప్రియ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సున్నం రాజయ్య కోరారు.

 

18:55 - December 13, 2015

నిజామాబాద్‌ : జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, మరో స్వతంత్ర అభ్యర్థి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ భూపతిరెడ్డి ఏకగ్రీవం అయ్యారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే కృషి చేస్తానని ఎమ్మెల్సీ భూపతిరెడ్డి అన్నారు. ఈమేరకు టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. డాక్టర్‌ వృత్తిని వదిలిపెట్టిన తాను ఇక నుంచి ప్రజా జీవితానికే అంకితమవుతాని చెప్పారు. జిల్లా టీఆర్‌ఎస్‌ పెద్దలతో సమన్వయం చేసుకుంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

 

18:50 - December 13, 2015

హైదరాబాద్ : ఆర్టీసీ నష్టాలకు అధికారులే కారణమని ఎన్ ఎంయూ నేతలు ఆరోపించారు. ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు చేపట్టాలని కార్మిక సంఘం ఎన్ ఎంయూ నిర్ణయించింది. సోమవారం నుంచి జిల్లాల వారీగా డిపోల దగ్గర ఆందోళన చెపడతారు. ఈనెల 21న హైదరాబాద్‌లో బస్ భవన్‌ ను ముట్టడించాలని ఎన్‌ఎంయూ నాయకులు నిర్ణయించారు. గుర్తింపు యూనియన్‌కు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. 

ఎగ్జామ్ షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు లేవు : రిజిస్ట్రార్

హైదరాబాద్ : రేపటి నుంచి పీజీ సెమిస్టర్ పరీక్షలు యధాతథంగా ఉంటాయని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఎగ్జామ్ షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు లేవని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేశ్ కుమార్ తెలిపారు. పరీక్షలకు హాజరు కానివారికి... తిరిగి నిర్వహించబోమని స్పష్టం చేశారు. పరీక్షలను అడ్డుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే, వారి అడ్మిషన్స్ రద్దు చేస్తామని రిజిస్ట్రార్ హెచ్చరించారు. తమ సిలబస్ పూర్తికానందున పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు 2రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

 

18:43 - December 13, 2015

హైదరాబాద్ : రేపటి నుంచి పీజీ సెమిస్టర్ పరీక్షలు యధాతథంగా ఉంటాయని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఎగ్జామ్ షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు లేవని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేశ్ కుమార్ తెలిపారు. పరీక్షలకు హాజరు కానివారికి... తిరిగి నిర్వహించబోమని స్పష్టం చేశారు. పరీక్షలను అడ్డుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే, వారి అడ్మిషన్స్ రద్దు చేస్తామని రిజిస్ట్రార్ హెచ్చరించారు. తమ సిలబస్ పూర్తికానందున పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు 2రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

 

18:40 - December 13, 2015

హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని మంత్రి హరీష్ రావు అన్నారు. టీసర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధిని చూసే ఇతర పార్టీల నేతలు టీఆర్ ఎస్ లో చేరుతున్నారు.. తప్ప ఎవరినీ ప్రలోభ పెట్టలేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ లోకి ఇతర పార్టీల నేతల చేరికను విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు... వైఎస్ హయాంలో టీఆర్ ఎస్ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

18:37 - December 13, 2015

ఢిల్లీ : పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేసి నేటికి 14 ఏళ్లు నిండాయి. 2001 డిసెంబర్‌ 13 జరిగిన దాడిలో మరణించిన వారికి ప్రముఖులు నివాళులు అర్పించారు. ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీతోపాటు లోక్‌సభ స్పీకర్‌ సమిత్రా మహాజన్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తదితరులు పార్లమెంటు ఆవరణలోని అమరవీరుల స్థూపం దగ్గర పుష్ఫగుచ్ఛాలు ఉందని నివాళులర్పించారు. మృతుల కుటుంబాలను ప్రధాని మోడీ కలుసుకున్నారు. 2001 డిసెంబర్‌ 13 న పార్లమెంటు ఆవరణలో ప్రవేశించిన ఐదుగురు సాయుధ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆనాటి ఘటనలో 9 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు ఢిల్లీ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌, ముగ్గురు పార్లమెంటు సిబ్బంది ఉన్నారు. 

18:20 - December 13, 2015

మహారాష్ట్ర : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన గోల్డ్ మానెటైజేషన్‌ స్కీముపై దేవాలయాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. దేశంలోని కొన్ని ప్రధాన దేవాలయాలు తమ దగ్గర ఉన్న బంగారం నిల్వలను ఈ పథకంలో డిపాజిట్‌ చేసేందుకు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ముంబయిలోని సిద్ధి వినాయక టెంపుల్‌ 40 కిలో బంగారాన్ని డిపాజిట్‌ చేయడానికి ముందుకురాగా, తాజాగా షిరిడి దేవస్థానం కూడా ఇదే బాటలో నడిచింది. దేవస్థానంలో పాలక మండలి ఆధీనంలో ఉన్న 380 కిలోల బంగారంలో 200 కిలోలను గోల్డ్‌ మానెటైజేషన్‌ స్కీములో డిపాజిట్‌ చేయాలని నిర్ణయించింది. దీనివలన ఏటా 1.2 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని లెక్క తేల్చారు. షిరిడి వార్షిక ఆదాయం 350 కోట్ల రూపాయలు. బంగారాన్ని కరిగించాలన్న ట్రస్ట్‌ బోర్డు నిర్ణయాన్ని బాంబే హైకోర్టు తప్పు పట్టడంతో ఇప్పుడు బంగారం నగదీకరణ పథకంలో డిపాజిట్‌ చేయాలని నిర్ణయించారు.

 

తెలంగాణ అభివృద్ధికోసమే రాజకీయ పునరేకీకరణ : హరీశ్ రావు

హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని మంత్రి హరీష్ రావు అన్నారు. టీసర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధిని చూసే ఇతర పార్టీల నేతలు టీఆర్ ఎస్ లో చేరుతున్నారు.. తప్ప ఎవరినీ ప్రలోభ పెట్టడడం లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ లోకి ఇతర పార్టీల నేతల చేరికను విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు... వైఎస్ హయాంలో టీఆర్ ఎస్ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకున్నప్పుడు.. ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.

రోడ్డు ప్రమాదంలో సిలిండర్ పేలి... నలుగురు సజీవ దహనం

కరీంనగర్ : రామగుండం మండలం సోమనపల్లిలో దారుణం జరిగింది. ఆటో, కారు ఢీకొన్నాయి. దీంతో కారులోని సిలిండర్ పేలి నలుగురు సజీవదహనం అయ్యారు.

 

17:53 - December 13, 2015

మహబూబ్ నగర్ : అంతర్జాతీయ వాణిజ్య సంస్థ మాయలో పడుతున్న పాలకులు వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని.... ఫలితంగానే రైతు ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. పాలమూరు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో 'పాలమూరు రైతు గోస' కవిగాయక సభ జరిగింది. ఈ సందర్భహంగా ఆయన మాట్లాడుతూ విద్యలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారని.. ఈ పరిణామాలు రాబోయే పదేళ్లలో విద్యార్థుల ఆత్మహత్యలకు దారితీసే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రాంచంద్రమూర్తితో పాటు పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు.

17:48 - December 13, 2015

మెదక్ : కార్మిక సమస్యల కంటే కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనాలే సీఎం కేసీఆర్‌ కు ముఖ్యమయ్యాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు విమర్శించారు. 104 రోజులుగా ఆశాలు సమ్మె చేస్తున్నా కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని రాములు మండిపడ్డారు. ఈమేరకు టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆశాల సమస్య కేంద్రం పరిధిలోనిదంటూ సీఎం తప్పించుకుంటున్నారని చెప్పారు. అంగన్‌వాడీలు కూడా కేంద్రం పరిధిలోనే ఉన్నా వారి సమస్యలను ఎలా పరిష్కరించారని ప్రశ్నించారు. ఈనెల 16న ఆశాల సమస్యలపై సభను నిర్వహిస్తున్నామని.. అప్పటివరకు ఆశాల సమస్యలను కేసీఆర్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

 

17:40 - December 13, 2015

రాజమండ్రి : విజయవాడ కాల్‌మనీ వ్యవహారంపై ప్రభుత్వం జ్యుడిషీయల్‌ విచారణ జరిపించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు డిమాండ్ చేశారు. కాల్‌మనీ ఘటనతో ఏపీ రాజధాని నీచ సంస్కృతికి కేంద్రం కాబోతుందన్న సంకేతాలు వచ్చాయన్నారు. మహిళల జీవితాలను చిధ్రం చేస్తున్న కాల్‌మనీ ఆస్తులను జప్తుచేసి బాధిత మహిళలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కాల్‌మనీ రాకెట్‌లో దోషులు ఎంతటి వారైనా విడిచిపెట్టొద్దని...రాజకీయ వత్తిళ్లకు తావులేకుండా నేరస్తులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

 

17:31 - December 13, 2015

ఢిల్లీ : అమెరికన్‌ ఐస్‌ స్కేటింగ్‌ స్పెషలిస్ట్....జెస్పర్‌ జాడర్‌ తన సొంత స్కేటింగ్‌ పార్క్ లో పెద్ద సాహసమే చేశాడు. స్లోప్‌స్టైల్‌లో ఇప్పటివరకూ ఎవరూ ప్రదర్శించని ట్రిక్స్ ప్రదర్శించి..అందరినీ ఆశ్చర్యపరచాడు. స్లోప్‌ స్టైల్‌లో 360 డిగ్రీల ఫ్లిప్‌, టోటల్‌ స్పిన్‌ , రివర్స్ స్పిన్‌ వంటి క్లిష్టమైన ఫీట్స్ ను సైతం సునాయాసంగా ప్రదర్శించి తనకు తాను మాత్రమే సాటి అనిపించుకున్నాడు. 

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

హైదరాబాద్‌ : అక్రమంగా తరలుతున్న 300 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. జిల్లాలోని దుర్గి మండలం అడిగొప్పుల శివారులో అక్రమంగా బియ్యంను తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు అక్కడకు చేరకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బియ్యాన్ని తరలిస్తున్న లారీని సీజ్ చేశారు.

 

పోలీసుల కన్నుగప్పి పీఎస్ నుంచి దుండగుడు పరార్

హైదరాబాద్‌ : పోలీసుల కన్నుగప్పి ఓ దుండగుడు పోలీస్‌స్టేషన్ నుంచి పరారయ్యాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో 9 నెలల బాలుడితో ఓ వ్యక్తి తిరుగుతూ పోలీసుల కంటపడ్డాడు. అయితే... అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా... అక్కడ పోలీసుల కన్నుగప్పి పరారయ్యాడు. దీంతో అతని జాడ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా... 9 నెలల బాలుడు ఆ వ్యక్తి కొడుకా... లేక బాలుడ్ని అతను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడా... అన్న వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు.

17:23 - December 13, 2015

నెల్లూరు : ప్రశాంత వాతావరణం.. చుట్టూ నీరు... మధ్యలో ద్వీపం.. అందులో పచ్చని చెట్లు, వాటిపై రంగు రంగుల పక్షులు.. అత్యంత సుందరమైన ఈ ప్రదేశం ఏపీలో ఉంది.. పర్యాటకులతో కళ కళలాడిపోతున్న ఈ ప్లేస్‌ను మనమూ చూసొద్దాం పదండి..
నేలపట్టులో పక్షుల ఆవాసానికి అనుకూలం
నెల్లూరు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో నేలపట్టు ప్రాంతం ఉంది. చలి కాలం వచ్చిదంటే చాలు.. అక్కడ అందమైన సందడి మొదలవుతుంది.. విదేశాల నుంచి ఎన్నో పక్షులు వచ్చేస్తాయి. సముద్రపు రామచిలుక, పెలికాన్, పెయింటెడ్ స్టార్క్, ఓపెన్ బిల్ స్టార్క్, తెల్ల కంకణాయి, నీటికాకిలాంటి పక్షులు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తాయి.. ప్రతి ఏడాది అక్టోబర్‌ నుంచి ఏప్రిల్‌వరకూ ఇక్కడే ఉంటాయి. సైబీరియా, ఆస్ట్రేలియా, గుజరాత్‌లోని రాణ్ ఆఫ్‌ కంచ్‌ నుంచి ఈ పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి చేరుకుంటాయి. నేలపట్టులో ఈ పక్షుల ఆవాసానికి అనుకూల పరిస్థితులున్నాయి.. చుట్టూ నీరు, మధ్యలోఉన్న చెట్లపై గూడు కట్టుకుంటాయి... ఎన్నోఏళ్లుగా ఈ పక్రియ కొనసాగుతోంది.
పక్షులు, పర్యాటకులతో కళకళలాడుతున్న నేలపట్టు
అక్టోబర్‌ వచ్చిందంటే చాలు ఈ ప్రాంతం పక్షులేకాదు... వాటిని చూసేందుకువచ్చే పర్యాటకులతో కళకళలాడిపోతుంది.. పచ్చని చెట్లమధ్య రంగు రంగుల రెక్కలతో ఆకట్టుకునే ఈ పక్షుల్ని చూసేందుకు చాలామంది ఇక్కడికి వస్తారు... వీరిసంఖ్యను మరింత పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది పర్యాటకశాఖ.. అటవీ, టూరిజం శాఖలు కలిసి ఈ ప్రదేశాన్ని విహారకేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.. దీంతో సెలవురోజుల్లో దాదాపు 2వేలమందికిపైగా పర్యాటకులు ఇక్కడివచ్చి పక్షుల్ని చూస్తున్నారు.
పక్షుల వచ్చే సమయాన్ని లక్కీ పీరియడ్‌గా భావిస్తున్న స్థానికులు
ఈ పక్షుల వచ్చే సమయాన్ని స్థానికులు లక్కీ పీరియడ్‌గా భావిస్తారు.. ఈ విహంగాల్ని దేవతాపక్షులుగా ఆరాధిస్తారు.. ఇవి వచ్చాకే వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు.. ఇక పక్షులు ఏదో ఆశామాషీగా ఇక్కడికి రావు... పరిస్థితులు అన్నీ సక్రమంగా ఉన్నాయని ధృవీకరించుకున్నాకే ప్రయాణం ప్రారంభిస్తాయి.. ముందు కొన్ని పైలట్‌ పక్షులు నేలపట్టుకువచ్చి అన్నీ పరిశీలిస్తాయి.. ఆ తర్వాత మిగతా పక్షుల్ని తెస్తాయి.. దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో నేలపట్టు చెరువు ఉంటుంది.. ఈ ప్రాంతం ఆసియాలోనే పక్షుల సంతానోత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.
ఆకట్టుకుంటున్న పెలికాన్, ఫ్లెమింగో పక్షులు
ముఖ్యంగా గోదుమరంగులో ఉండే పెలికాన్, ఫ్లెమింగో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. 12నుంచి 15కిలోలవరకూ బరువుండే ఈ విహంగాలు పులికాట్‌ సరస్సులో చేపల్నిపట్టి తమ పిల్లలకు పెడగాయి.. ఈ దృశ్యం చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది.. ఫ్లెమింగో పక్షులుమాత్రం పూర్తి శాఖాహారులు.. సరస్సులోని నాచును తిని బతుకుతాయి.
నేలపట్టులో సౌకర్యాల లేమి...
నేలపట్టుకు చూడాలని ఆసక్తిఉన్నా సరైన రోడ్డు, రవాణాసౌకర్యం లేక చాలామంది రాలేకపోతున్నారు. నాయుడుపేట దాటాక దొరవారిసత్రంనుంచి మట్టిరోడ్డు ఉంటుంది.. ఈ రోడ్డును అభివృద్ధి చేస్తామని నేతలు ఇచ్చిన హామీలన్నీ మాటలకే పరిమితమయ్యాయి.. ఇక పక్షులకేంద్రంలోకూడా సరైన వసతులు లేవు.. తాగేందుకు నీరు దొరకదు.. ప్రతి ఏడాది లక్షలు ఖర్చుపెట్టి పక్షుల పండుగను నిర్వహిస్తారు అధికారులు.. ఇక్కడివచ్చే పర్యాటకులకుమాత్రం ఎలాంటి సౌకర్యాలు కల్పించరు.
పులికాట్‌ సరస్సు విషయంలోనూ అధికారుల నిర్లక్ష్యం
అటు పులికాట్‌ సరస్సు విషయంలోనూ అధికారుల నిర్లక్ష్యం చూపుతున్నారు. ముఖద్వారాల పూడిక తీయడాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు.. దీంతో నీటి రాక తగ్గిపోతోంది. ఇది మత్స్యకారులపై కూడా ప్రభావం చూపుతోంది.. చేపలసంఖ్య జీవనభృతి కోల్పోతున్నారు.. నీరు పెద్దగా లేకపోవడంతో టూరిస్టులసంఖ్య తగ్గుతోంది.. మొత్తానికి సమస్యలున్నా కాస్త తీరికచేసుకొని వెళుతున్న ప్రకృతి ప్రేమికులకు మరచిపోలేని అనుభవాన్ని మిగులుస్తోంది నేలపట్టు.

 

17:00 - December 13, 2015

ఢిల్లీ : భారత ప్రభుత్వం డబ్ల్యుటివో గాట్స్ తో ఉన్నత విద్యారంగానికి సంబంధించి చేసుకున్న ఒప్పందాన్ని నిరసిస్తూ జంతర్‌మంతర్‌ వద్ద పిడిఎస్‌యు ఆందోళన చేపట్టింది. ధర్నాలో పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ప్రొఫెసర్లు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. గాట్స్ తో చేసుకున్న ఒప్పందాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భారత విద్యారంగాన్ని తాకట్టు పెట్టేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. స్థూల జాతీయోత్పత్తిలో 6 శాతం, కేంద్ర బడ్జెట్‌లో 10 శాతం నిధులను విద్యారంగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కెసిఆర్‌ కెజి టూ పిజి వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పి కార్పొరేట్‌ విద్యాసంస్థలను ప్రోత్సహించడం సరైంది కాదని విమర్శించారు.

 

16:51 - December 13, 2015

తమిళనాడు : చెన్నై వరద బాధితులకు సాయమందించేందుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుటుంబం ముందుకు వచ్చింది. ఆయన కుమార్తె దీపా వెంకట్ నేతృత్వంలోని స్వర్ణభారతి ట్రస్ట్, విష్ణు మోటార్స్ ఆధ్వర్యంలో వేలాది మంది బాధితులకు ఆర్థికసాయం చేశారు. ఇకాట్టుతాంగల్, కొరట్టూరుపురంలోని వేలాది బాధిత కుటుంబాలను పరామర్శించిన వెంకయ్యనాయుడు.. బాధితులుగా సాయం అందించారు. వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, మహిళలకు చీరెలు వంటివి సుమారు 3వేల కుటుంబాలకు పంపిణీ చేశారు. వరద బాధితులకు ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛంధంగా ముందుకు రావాలని ఈ సందర్బంగా వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. అనంతరం ఆయన సచివాలయంలో ముఖ్యమంత్రి జయలలితతో సమావేశమై వరద నష్టంపై చర్చించారు. ఇప్పటికే కేంద్రం కొంత సాయం అందించిందని ఇంకా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు.

 

16:48 - December 13, 2015

హైదరాబాద్ : రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. ప్రజలకు అనుకూలమైన రాజధాని నిర్మించాలని, సింగపూర్‌ కంపెనీలకు అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలు మానుకోవాలని హితవుపలికారు. 5 కోట్ల మంది ఆంధ్రుల రాజధానిని సింగపూర్‌కు అమ్మకానికి పెడుతున్నారని రామకృష్ణ విమర్శించారు.

 

 

16:45 - December 13, 2015
16:45 - December 13, 2015

విజయవాడ : కాల్‌మనీ వ్యవహారం నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ అన్నారు. కాల్‌మనీ ముఠాతో సంబంధం ఉన్న టీడీపీ నేతల పేర్లు బయటపెట్టాలని నెహ్రూ డిమాండ్‌ చేశారు. ముఠా డబ్బుతో విదేశాల్లో జల్సా చేస్తున్న ఎమ్మెల్యేతో పాటు మిగతా నిందితులపై కఠిన చర్యలు తీసుకుని... చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు చంద్రబాబు.. పోలీసులపై ఒత్తిడి తెస్తే సహించేదిలేదని దేవినేని అన్నారు.

 

ప్రముఖ ఆర్టిస్టు హేమ ఉపాధ్యాయ్, ఆమె న్యాయవాది హత్య

మహారాష్ట్ర : ముంబైలో ప్రముఖ ఆర్టిస్టు హేమ ఉపాధ్యాయ్, ఆమె న్యాయవాది హరీష్ భాంబనీ హత్యకు గురయ్యారు. కందీవాలీలోని ఓ కాలువ వద్ద బాక్స్ లో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరి హత్యకు సంబంధించి పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు. హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే 2013లో హేమ తన భర్త చింతన్‌పై కేసు పెట్టింది. మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని, తన గదిలో అశ్లీల చిత్రాలు గీస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణ సమయంలో హేమ తరపున న్యాయవాది హరీష్ ప్రాతినిధ్యం వహించాడు. చింతన్ కూడా ఆర్టిస్టే.

 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

కడప : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రైల్వేకోడూరు సమీపంలోని టోల్‌ గేట్‌ దగ్గర ఆటో, లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

పాకిస్థాన్‌లో భారీ పేలుడు... 15 మంది మృతి

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పరిచినార్‌ ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసు బలగాలు చేరుకొని దర్యాప్తు ప్రారంభించాయి.

 

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ నరసింహన్, స్సీకర్ కోడెల

గుంటూరు : నర్సరావుపేట మండలం యల్లమందలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, స్సీకర్ కోడెల శివప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డుకు గవర్నర్ శంకుస్థాపన చేశారు. అనంతరం వ్యక్తిగత మరుగుదొడ్ల లబ్ధిదారులతో గవర్నర్ ముఖాముఖి నిర్వహించారు. 

14:57 - December 13, 2015

హైదరాబాద్ : చంద్రబాబు ప్రోద్బలంతోనే విజయవాడలో కాల్‌మనీ మాఫియా రెచ్చిపోతోందని వైసిపి అధికార ప్రతినిధి పార్థసారథి ఆరోపించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కాల్‌మనీ వ్యవహారంలో దర్యాప్తు వేగవంతం చేయకుండా పోలీసులపై అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు తెస్తున్నారని ఆయన మండిపడ్డారు. పేదలతో టిడిపి నేతలు ఆటలాడుకుంటున్నారని విమర్శించారు. 

14:50 - December 13, 2015

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు టీఆర్ ఎస్ లోకి వెళ్లడంపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఈమేరకు రేపు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్ పీ లీడర్ జానారెడ్డి, షబ్బీర్ లను ఢిల్లీ రావాలని ఆదేశించింది. వీరితోపాటు మెదక్ డీసీసీ సునితా లక్ష్మారెడ్డి, దానం నాగేందర్ లు ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ అభ్యర్థులు టీఆర్ఎస్ లోకి జంప్ కావడాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఈమేరకు రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్ పీ లీడర్ జానారెడ్డి, షబ్బీర్ లను ఢిల్లీ రావాలని అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. రేపు మధ్యాహ్నం దిగ్విజయ్ సింగ్ తో, సాయంత్రం రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 స్థానాల్లో పోటీ చేయాల్సివుండగా 6 స్థానాలకు పోటీ చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేసిన.. వారు టీఆర్ ఎస్ లో చేరడంపై అధిష్టానం ఆగ్రహంతో ఉంది. అభ్యర్థుల ఎంపిక సక్రమంగా లేదని హైకమాండ్ భావిస్తోంది. ఈ అంశాలపై చర్చించనున్నారు. ఆ పార్టీ నేతలకు చాలా సీరియస్ గానే క్లాస్ ఇచ్చే అవకాశం కన్పిస్తుంది.

 

'కాల్ మనీ'పై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి : బీవీ రాఘవులు

రాజమండ్రి : విజయవాడ కాల్ మనీ వ్యవహారంపై ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణ జరిపించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. కాల్ మనీ ఆస్తులను జప్తు చేసి బాధిత మహిళలకు పరిహారం ఇవ్వాలన్నారు. 

కాల్ మనీ కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి దేవినేని

విజయవాడ : కాల్ మనీ కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి దేవినేని ఉమ అన్నారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించమని తెలిపారు. కాల్ మనీ కేసు విచారణను వేగవంతం చేస్తామన్నారు. 

ఎమ్మెల్సీ అభ్యర్థులు టీఆర్ ఎస్ లోకి వెళ్లడంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్..

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు టీఆర్ ఎస్ లోకి వెళ్లడంపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఈమేరకు రేపు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్ పీ లీడర్ జానారెడ్డి, షబ్బీర్ లను ఢిల్లీ రావాలని ఆదేశించింది. వీరితోపాటు మెదక్ డీసీసీ సునితా లక్ష్మారెడ్డి, దానం నాగేందర్ లు ఢిల్లీ వెళ్లనున్నారు.

 

ఆశా వర్కర్ల పాదయాత్రపై పోలీసుల జులుం

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఆశా వర్కర్ల పాదయాత్రపై పోలీసుల జులుం కొనసాగుతోంది. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు తరలివస్తున్నఆశాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మెదక్‌ జిల్లా సంగారెడ్డి వద్ద జాతీయరహదారిని దిగ్బంధించిన ఆశాలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో కొంత మంది ఆశా కార్యకర్తలు స్పృహ కోల్పోయారు. సీఐటియు జిల్లా కార్యదర్శి రాజయ్యతో సహా పలువురికి గాయాలయ్యాయి. వీరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

13:48 - December 13, 2015

హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది మొదలు... ఇప్పటి వరకూ టీఆర్ఎస్‌ పార్టీ... ఆపరేషన్‌ ఆకర్ష్‌ను నిరాటంకంగా కొనసాగిస్తూ వస్తోంది. బంగారు తెలంగాణ పేరిట విపక్ష కీలక నేతలను కారెక్కించిన గులాబీ బాస్‌.. రాబోయే రోజుల్లోనూ ఆకర్షాస్త్రాన్ని నిరంతరాయంగా ప్రయోగిస్తూనే ఉండాలని యోచిస్తున్నట్లు సమాచారం.

టీఆర్ఎస్‌కు క్షేత్రస్థాయి క్యాడర్‌ కరవు.

రాష్ట్ర విభజనకు పూర్వం ఉద్యమ సెంటిమెంట్‌తో అన్ని ఎన్నికలనూ గెలిచినా.. తెలంగాణ రాష్ట్రంలో క్లీన్‌ స్వీప్‌ చేయలేక పోయారు. పార్టీకి క్షేత్రస్థాయిలో క్యాడర్‌ లేకపోవడమే కారణమని గుర్తించిన గులాబీ బాస్‌ ఆ లోపాన్ని రూపుమాపుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీని కోసం ఆపరేషన్‌ ఆకర్ష్‌ అస్త్రాన్ని ఎంచుకున్నారు. విపక్షాల్లో క్యాడర్‌ను కలిగి ఉన్న కీలక నాయకులను కారెక్కించే పనిలో పడ్డారు. గులాబీ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయని ఎవరి గురించి తెలిసినా.. అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగుతున్నారు. సామదానాది చతురోపాయాలతో వారికి గులాబీ కండువాలు కప్పేస్తున్నారు.

స్థానిక ప్రజా ప్రతినిధులపైనా ఆకర్ష్‌ అస్త్రం......

మొన్నటి వరకూ ఎమ్మెల్యే స్థాయి నాయకులనే టార్గెట్‌ చేసిన గులాబీదళం.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. స్థానిక ప్రజాప్రతినిధులపై ఆకర్ష్‌ అస్త్రం ప్రయోగిస్తోంది. క్షేత్రస్థాయి నేతలు రావడం ద్వారా.. పార్టీ నిర్మాణం బలోపేతం అవుతుందని టీఆర్ఎస్‌ నాయకత్వం భావిస్తోంది. విపక్షాలు గగ్గోలు పెడుతుంటే.. ఇప్పుడున్న అగ్ర నాయకులంతా పార్టీలు మారిన వారేనంటూ సమర్థించుకుంటున్నారు. పార్టీ ఫిరాయింపులపై మంత్రి కేటీఆర్‌ సమర్థింపు వ్యాఖ్యలు... రాబోయే రోజుల్లో కూడా ఆపరేషన్‌ ఆకర్ష్‌ కొనసాగుతుందన్న అభిప్రాయం కలిగిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

13:47 - December 13, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య రాజధాని విజయవాడలో రోజుకో షాపింగ్‌మాల్‌ వెలుస్తోంది. ప్రజలు కూడా వాటిని ఆహ్వానిస్తున్నారు. అయితే- భవన నిర్మాణంలోకనీస నిబంధనలు పాటించని వాటికి కూడా అధికారులు అనుమతులిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సినీ తారలతో ఓపెనింగ్‌...

కోట్లలో ఖర్చు... గాలి లోపలికి రాకుండా అద్దాలతో మేడలు... సినీ తారలతో ఓపెనింగ్‌... ఇలా విజయవాడలో రోజుకో షాపింగ్ మాల్ వెలుస్తోంది. అయితే... కనీస ప్రమాణాలు పాటించకుండా ఈ షాపింగ్‌మాల్స్‌ నిర్మిస్తున్నారు. అధికారులు ఇష్టారీతిన అనుమతులు జారీ చేస్తున్నారు.

చుట్టూ పైపులైన్లతో కూడిన హాజరీలు...

నిబంధనల ప్రకారం షాపింగ్‌మాల్‌ చుట్టూ పైపులైన్లతో కూడిన హాజరీలు అమర్చాలి. భవనం ముందు భాగాన్ని అద్దాలతో మూసివేయకూడదు. గాలి, వెలుతురు వచ్చేలా కిటికీలు ఏర్పాటుచేయాలి. షాపింగ్‌మాల్‌ చుట్టుపక్కల పెద్ద పెద్ద హోర్డింగ్‌లు పెట్టకూడదు. పది వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ ట్యాంక్‌ను ఏర్పాటుచేసుకోవాలి. ముఖ్యంగా ... ఈ మాల్స్‌లో కనిపించే చిన్న చిన్న బల్బులతో షార్ట్‌సర్క్యూట్‌ జరిగే ప్రమాదం ఉంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయేలా సర్క్యూట్ బ్రేకర్లు అమర్చుకోవాలి. మాల్స్‌లో పనిచేసే సిబ్బందికి ఆరు నెలలకోసారి అగ్నిప్రమాదాలపై శిక్షణనివ్వాలి. వీటిలో ఏ ఒక్క నిబంధనను కూడా వ్యాపారులు పాటించరు.

అనుమతుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి...

నిబంధనలకు విరుద్ధంగా భవనాలు ఎలా నిర్మిస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై మున్సిపల్ అధికారులు ఎలాంటి సమాధానం చెప్పడంలేదు. అయితే- 15 మీటర్ల కంటే ఎత్తు తక్కువ ఉన్న భవనాలకు తమ పర్మిషన్ అవసరం లేదని ఫైర్‌ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి షాపింగ్‌మాల్స్‌ త్వరలో మరిన్ని ప్రారంభంకాబోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు అనుమతుల విషయంలో కఠినంగా వ్యవహరించాలనిప్రజలు కోరుతున్నారు.  

13:44 - December 13, 2015

హైదరాబాద్ : రష్యాలో ఓ సైకియాట్రిక్‌ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి వేళ జరిగిన ఈ ప్రమాదంలో 37 మంది దుర్మరణం చెందారు. స్థానిక వోరోనేజ్‌ ప్రాంతంలోని సైకియాట్రిక్‌ ఆస్పత్రిలో ఈ ఘోరం జరిగింది. ఆస్పత్రిలో మొత్తం 74 మంది ఉండగా అందులో 37 మంది మృతిచెందారు. కొందరి ఆచూకీ తెలియకుండా పోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. షార్ట్‌ సర్క్యూట్ మూలంగా ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. 

13:43 - December 13, 2015

హైదరాబాద్ : టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ 2015 సంవత్సరానికి 104 కోట్ల రూపాయల సంపాదనతో...దేశంలో ఏడాదికి వందకోట్ల రూపాయలు ఆదాయం ఉన్న..మొదటి వందమంది సంపాదనపరుల జాబితాలో చేరాడు. ఫోర్బెస్‌ ఇండియా..2015 సంవత్సరానికి ప్రకటించిన స్పోర్ట్స్ సెలబ్రిటీల ఆర్జనపై 10 స్పోర్ట్స్ స్పెషల్ ఫోకస్......

వందల కోట్లరూపాయల సంపాదన...

క్రీడలు కూటికా..గుడ్డకా అనుకొనే రోజులు పోయాయి. క్రీడలంటే వందలకోట్ల రూపాయల సంపాదనకు మెట్లని నేటి నవతరం క్రీడాకారులు ..తమ అసాధారణ సంపాదనతో నిరూపిస్తున్నారు.

2015 సంవత్సరానికి ఫోర్బెస్ ఇండియా...

2015 సంవత్సరానికి ఫోర్బెస్ ఇండియా ప్రకటించిన మొదటి వందమంది సంపాదనపరుల జాబితాలో వివిధ క్రీడలకు చెందిన 20 మంది స్టార్ ప్లేయర్లు చోటు సంపాదించారు. మొదటి 100 మంది సెలబ్రిటీ సంపాదనపరుల జాబితాలో టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి నాలుగో ర్యాంక్ దక్కింది. వన్డే, టీ-20, ఐపీఎల్, ఇతర వ్యాపారాల ద్వారా..మహేంద్రసింగ్ ధోనీ 2015 సంవత్సరంలో 119 కోట్ల 33 లక్షల రూపాయలు ఆర్జించి...భారత క్రీడారంగంలో తానే నెంబర్ వన్ అని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ 104 కోట్ల 78 లక్షల రూపాయల సంపాదనతో 7వ ర్యాంక్ లో నిలిచాడు. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ 40 కోట్ల రూపాయల ఆర్జనతో 8వ ర్యాంక్ లో ఉన్నాడు. క్రికెట్ నుంచి రిటైరైనా సచిన్..ఫేమ్ ర్యాంకుల్లో 3వ స్థానం సంపాదించి తన ప్రత్యేకతను నిలబెట్టుకొన్నాడు. టీమిండియా యంగ్ గన్ రోహిత్ శర్మ 17 కోట్ల 71 రూపాయల సంపాదనతో 12వ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ టెస్ట్ ,వన్డే, టీ-20, ఐపీఎల్ క్రికెట్ల ద్వారా తన ఆర్జన గణనీయంగా మెరుగుపరచుకొన్నాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ 19 కోట్ల 17 లక్షల రూపాయలు, సురేశ్ రైనా 13 కోట్ల 40 లక్షల రూపాయలు, యువరాజ్ సింగ్ 20 కోట్ల 50 లక్షల రూపాయలు, అజింక్యా రహానే 9 కోట్ల 78 లక్షల రూపాయలు సంపాదనతో ఉన్నారు. టీమిండియా స్పాట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 8 కోట్ల 83 లక్షల రూపాయలతో 31వ ర్యాంకులోనూ, వీరేంద్రసెహ్వాగ్ 5 కోట్ల 60 లక్షల రూపాయల సంపాదనతో 35వ ర్యాంకులోనూ ఉన్నారు.

సానియా మీర్జాను అధిగమించిన సైనా...

ఇక..మహిళల విభాగంలో ప్రపంచ మహిళాటెన్నిస్ డబుల్స్ నెంబర్ వన్ ప్లేయర్ సానియా మీర్జాను...భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ సంపాదనలో తొలిసారిగా అధిగమించింది. మహిళా టెన్నిస్ డబుల్స్ కు మాత్రమే పరిమితమైన సానియా మీర్జా..2015 సీజన్లో 13 కోట్ల 25 లక్షలరూపాయలు సంపాదించి 38వ ర్యాంకులో ఉంది. సైనా నెహ్వాల్ గ్రాండ్ ప్రీ, సూపర్ సిరీస్ టోర్నీలు, ఎండార్స్ మెంట్ల ద్వారా...ప్రస్తుత ఏడాదిలో 16 కోట్ల 99 లక్షల రూపాయలు సంపాదించింది. పాపులారిటీ ర్యాంకింగ్స్ లో సానియా కు 38, సైనాకు 39 ర్యాంకులు లభించాయి.

మేరీకోమ్ 9 కోట్ల 75 లక్షల సంపాదనతో...

భారత మహిళా బాక్సింగ్ ఆల్ టైమ్ గ్రేట్ మేరీ కోమ్ 9 కోట్ల 75 లక్షల రూపాయల సంపాదనతో..వావ్ అనిపించింది. భారత సాకర్ కెప్టెన్ సునీల్ చెత్రీ కోటీ 20 లక్షలు, టెన్నిస్ వెటరన్ లియాండర్ పేస్ కోటీ 76 లక్షల రూపాయల సంపాదనతో 80 తర్వాత ర్యాంకుల్లో ఉన్నారు. మొత్తం మీద...సంపాదనలో తాము సైతం..సినీహీరోలకు ఏమాత్రం తీసిపోమని ధోనీ, విరాట్ కొహ్లీ, సానియా, సైనా లాంటి స్పోర్ట్స్ సెలబ్రిటీలు సైతం చాటుకొన్నారు.

13:31 - December 13, 2015

హైదరాబాద్ : అక్కినేని నాగార్జున చాలా ఏళ్ల తర్వాత ఓ పంచా పైజామాలో ఫుల్ మూవీలో కనిపించబోతున్నాడు. రమ్యకృష్ణ, జోడీగా, చాలా రోజుల తర్వాత నాగార్జున పల్లెటూరి యువకుడి పాత్రలో కనివిందు చేసేందుకు రెడీ అయ్యాడు. ఇద్దరు కుమారులున్న నాగార్జున ఇంకా నవ మన్మథుడే అనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా సొగ్గాడే చిన్నినాయనాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. అభిమానులకు కానుకగా సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది సినిమా యూనిట్ . 

13:28 - December 13, 2015

గుంటూరు : జిల్లా నర్సరావుపేట పురపాలక సంఘం శతాబ్ది ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. శనివారం అంతా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పట్టణంలో సందడి నెలకొంది. ప్రఖ్యాత డ్రమ్మర్‌ శివమణి వివిధ బీట్స్‌తో స్థానికులను అలరించారు. స్థానిక కళాకారులు శివమణితో పోటాపోటీగా డప్పులు వాయించి సందడి చేశారు. నేడు గవర్నర్‌ నరసింహన్‌ శతాబ్ది ఉత్సవాల వేడుకల్లో పాల్గొంటారు. పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. 

12:52 - December 13, 2015

హైదరాబాద్ : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు కాక రేపుతున్నాయి. నామినేష‌న్ నాటి నుంచే.. ట్విస్ట్ ల‌తో సాగుతున్న రాజ‌కీయంతో పార్టీలు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. ఐతే నామినేష‌న్ గ‌డువు ముగిసేనాటికే కొత్త చిత్రం సాక్షాత్కరించింది. 12 స్తానాల్లో ఐదు చోట్ల మాత్రమే పోటీ చేస్తున్న కాంగ్రెస్...ఆ గ‌డువు ముగిసేనాటికి బ‌రిలో ముగ్గురు మిగిలితే..ఏకంగా ఇద్దరు పార్టీ అభ్యర్థులు జ‌ల‌క్ ఇచ్చి టిఆర్ఎస్ గూటికి చేరిపోయారు. దీంతో గ్రౌండ్ లో ఎవ‌రి బ‌లాలు ఏంట‌న్నది ఇప్పడు చ‌ర్చనీయాంశంగా మారింది.

మహబూబ్ నగర్ జిల్లా......

మహబూబ్ నగర్ జిల్లాలోను ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కే అధిక బలం ఉంది. కాంగ్రెస్ కు 473 ఓట్లుండగా, టీఆర్ఎస్‌కు 371ఓట్లు, టీడీపీకి 201 ఓట్లు, బీజేపికి 103 ఓట్లున్నాయి. మహబూబ్ నగర్ లోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను, ఇక్కడి నుంచి ఒకే స్థానంలో కాంగ్రెస్ పోటీలో ఉంది. సంఖ్యాప‌రంగా చూస్తే ఒక ఎమ్మెల్సీ స్థానాన్నికాంగ్రెస్ సునాయాసంగా గెలిచే అవ‌కాశం ఉన్నా.. గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న టిఆర్ఎస్ ఆక‌ర్ష్ తో అది కూడా ద‌క్కుతుందా అన్నది అనుమానమే.

మెదక్ జిల్లా....

ఇక సీఎం సొంత జిల్లా మెద‌క్ లో కూడా సంఖ్యా బ‌లం ప్రకారం కాంగ్రెస్ దే మెజారిటి. కాంగ్రెస్ కు 373 మంది ఎంపీటీసీ, జ‌డ్పీటీసీలు ఉంటే, టిఆర్ఎస్ కు 272, టిడిపికి 134 స‌భ్యుల బ‌లం ఉంది. ఐతే గులాబి ఆక‌ర్ష్ తో స‌భ్యులే కాదు, ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థి శివ‌రాజ్ పాటిల్ కారెక్కారు.

ఖమ్మం జిల్లా.....

ఇక ఖమ్మం జిల్లాకు వచ్చే సరికి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ బలం ఉంది. టీడిపికి 295 ఓట్లుండగా.. కాంగ్రెస్ కు 136 ఓట్లు,వైసీపీ 121, సీపీయంకు 83, సీపీఐకి 55 ఓట్లు ఉన్నాయి. ఐతే అధికార టిఆర్ఎస్ కు మాత్రం కేవలం 4 మాత్రమే ఉన్నాయి. అయినా ఖమ్మంలో సైతం గెలుపు కోసం టిఆర్ఎస్ పావులు క‌దుపుతోంది. నాలుగు ఎంపీటీసీ, జ‌డ్పీటీసీల బ‌లం ఉన్న టిఆర్ఎస్ కు గెలుపుకు కావాల్సిన 344 ఓట్లను ఎక్కడి నుంచి తీసుకువ‌స్తార‌ని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్.

నల్గొండ జిల్లా.......

న‌ల్గొండ జిల్లాలో ఏకంగా జ‌డ్పీ ఛైర్మన్ పీఠ‌మే కాంగ్రెస్ ద‌క్కించుకుంది. కాంగ్రెస్ 544, టీఆర్ఎస్ 138, టీడీపీ 32, బీజేపి 35, సీపీఎం 61 స్థానాలు గెలుచుకున్నాయి. ఐతే కాంగ్రెస్ కు జ‌ల‌క్ ఇచ్చి జ‌డ్పీ ఛైర్మన్ బాలునాయ‌క్ తో పాటు చాలామంది స‌భ్యులు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఎమ్మల్సీ నోటిఫికేష‌న్ మొద‌లైన‌ నాటి నుంచి ఈ వ‌ల‌స‌లు మ‌రితం ఊపందుకున్నాయి. దీంతో ఇప్పుడు ఎవ‌రు ఎక్కడ ఉన్నార‌న్నది కూడా తెలియ‌ని ప‌రిస్థితి న‌ల్గొండ‌లో నెల‌కొంది.

నిజామాబాద్ జిల్లా...

ఇక నిజామాబాద్ లో మెజార్టీ కాంగ్రెస్ దే. కాంగ్రెస్ 301, టీఆర్ఎస్ 294 , టీడీపీ 32, బీజేపీకి 51 ఓట్లుండ‌గా...టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆపరేషన్ ఆక‌ర్ష్‌ పాలిట్రిక్స్ తో జ‌డ్పీ పీఠాన్ని ద‌క్కించుకుంది. దీనితో పాటు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెంక‌ట రమణారెడ్డి త‌న నామినేష‌న్ ను ఉప‌సంహరించుకోవడంతో ఈ స్థానం టిఆర్ఎస్ వ‌శ‌మైంది.

ఆదిలాబాద్ జిల్లా...........

ఆదిలాబాద్, క‌రీంన‌గ‌ర్ ల‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకే మెజారిటి ఉంది. ఆదిలాబాద్ లో టీఆర్ఎస్ కు 385, కాంగ్రెస్ కు 227 ఉండ‌గా క‌రీంన‌గ‌ర్ లో టిఆర్ఎస్ 507 , కాంగ్రెస్ కు 407 మంది స‌భ్యుల బ‌లం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ బ‌రిలోకి దిగ‌క‌పోవ‌డంతో ఈ రెండు చోట్ల టిఆర్ఎస్ ఏక‌గ్రీవంగా సొంతం చేసుకుంది.

రంగారెడ్డి జిల్లా.......

ఐతే రంగారెడ్డి జిల్లాల్లో గెలిచిన ఎంపీటీసీ , జ‌డ్పిటీసీల సంఖ్య ప‌రంగా కాంగ్రెస్ టాప్ లో ఉంది. కాంగ్రెస్ 280 ఓట్లు, టీఆర్ఎస్- 169 ఓట్లు, టీడీపీ 166 ఓట్లు, బీజేపికి 60 ఓట్లున్నాయి. ఇక వ‌రంగ‌ల్లో కూడా సేమ్ సీన్ . అక్కడా కాంగ్రెస్ దే సంఖ్యాబ‌లం. కాంగ్రెస్ కు 364, టిఆర్ఎస్ 277, టిడిపి 140, బీజేపీకి 21 ఉన్నప్పటికి గులాబీ ఆక‌ర్ష్ తో ఇప్పటికే రెండు జ‌డ్పీలు టిఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు వ‌రంగ‌ల్ లో ఎమ్మెల్సీని టిఆర్ఎస్ ఏక‌గ్రీవం చేసుకోగా, రంగారెడ్డిలో రెండు స్థానాల్లో త‌మ ఖాతాలో వేసుకునేందుకు పావులుక‌దుపుతోంది.

వరంగల్ జిల్లా..

ఇలా ఎన్నిక‌ల్లో వ‌చ్చిన లెక్కల ప్రకారం గ్రౌండ్ లో రెండింట్లో మాత్రమే టిఆర్ఎస్ కు బ‌లం ఉండ‌గా.. ఒక‌చోట టిడిపి,మిగ‌తా చోట్ల కాంగ్రెస్ దే ఆధిక్యం. ఐతే అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత టిఆర్ఎస్ దూకుడుతో .. ఇప్పడు సంఖ్యబ‌లాలు తారుమార‌య్యాయి.

12:47 - December 13, 2015

రంగారెడ్డి : శామీర్‌పేట హాలియాబాద్‌ వేద పాఠశాలలో విషాదం నెలకొంది. స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులకు విద్యుత్‌ షాక్‌ తగిలింది. ఈ ప్రమాదంలో నవీన్‌ అనే విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి సౌరబ్‌కు గాయాలయాయ్యి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

12:41 - December 13, 2015

హైదరాబాద్ : సాహిత్యం సమాజాన్ని సంస్కరిస్తుంది. మంచి చెడ్డలను విడమర్చి చెప్తుంది. మానవ జాతి పురోగమనానికి సూచీ అవుతోంది. ప్రజలకు విజ్ఞాన వినోదాన్ని అందిస్తుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన వారిలో వాహిద్ ఒకరు. గజల్ రచయిత 'వాహిద్' ప్రత్యేక కథనంతో పాటు... ప్రజా గేయ రచయిత గంగిరెడ్డి సన్యాసిరావు జనం పాట, యువ కవి డాక్టర్ కత్తిమళ్ల ప్రతాప్ యువ కథనాలతో.. వివిధ సాహితీ వేడుకల సమాహారంగా ఈ వారం మీ ముందుకు వచ్చింది టెన్ టివి అక్షరం. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

12:32 - December 13, 2015

విజయవాడ : కాల్ మనీ కేసుతో మాకు సంబంధం లేదని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రకటించారు. అంతేకాకుండా మా పార్టీకి చెందిన నేతలు ఉంటే వారిపై కటిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజకీయ కోణంలో కొందరు మాపై బుర జల్లాలని చూస్తురని ఆరోపించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

12:10 - December 13, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం... ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మించాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు వారం రోజుల్లో ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి తోమర్‌తో సమావేశమవుతారు. బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మించాల్సిందిగా సెయిల్‌ను ఆదేశించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఒక వేళ సెయిల్ ముందుకు రాకపోతే... ప్రైవేట్‌ కంపెనీలకు అవకాశమివ్వాలని కోరనున్నారు. అయితే సెయిల్ నేతృత్వంలోనే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

నాణ్యత గుర్తించే పని జీఐసీకి అప్పగింత....

మరోవైపు- బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని సెయిల్‌ పరిశీలిస్తోంది. ఇనుప ఖనిజం నాణ్యతను గుర్తించే పనిని జీఐసీకి అప్పగించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి జీఐసీ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. అయితే- ఇటీవల సీఎస్‌ రాజీవ్‌శర్మతో సమావేశమైన సెయిల్ అధికారులు... స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. 

12:05 - December 13, 2015

హైదరాబాద్ : ఏపిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువ‌చ్చేందుకు వైసీపి సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేష‌న్లు ఇవ్వాల‌నే డిమాండ్‌తో నిరుద్యోగులు, విద్యార్ధుల‌తో క‌లిసి ఆందోళ‌న‌లు చేసేందుకు ప్రణాళిక‌లు ర‌చిస్తుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భ‌ర్తీ చేయాల‌నే డిమాండ్‌తో అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల ప్రారంభం కంటే ముందే సంత‌కాల సేక‌ర‌ణ కార్యక్రమాన్ని చేప‌డ‌తామంటోంది వైసీపి.

ఇంటికో ఉద్యోగం...

ఇంటికో ఉద్యోగం...లేక‌పోతే ఉద్యోగం వ‌చ్చేంత వ‌ర‌కూ ప్రతీనెల‌ నిరుద్యోగ భృతి..ఇది ఏపీలో చంద్రబాబు ఎన్నిక‌ల ముందు నిరుద్యోగుల‌కు ఇచ్చిన హామీ. కానీ ఇప్పుడు ఆ హామిని చంద్రబాబు గాలికొదిలేశారు. రాష్ట్రంలో ల‌క్షా 42 వేల‌కు పైగా ఉద్యోగాలు కాళీగా ఉన్నా ఇంత వ‌ర‌కూ ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేష‌న్ వేయని ప‌రిస్థితి.అయితే ఏపీలో ఉద్యోగాల నోటిఫికేష‌న్ వేయాలంటూ ప్రతిప‌క్ష పార్టీ వైసిపి డిమాండ్ చేస్తోంది. ఉద్యోగాల నోటిఫికేష‌న్ల కోసం నిరుద్యోగులు, విద్యార్ధుల‌తో క‌లిసి పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు వైసిపి విద్యార్ధి, యువ‌జ‌న‌ విభాగ నేత‌లు.

బాబు వస్తే జాబు వస్తుందంటూ ప్రచారం ....

2014 ఎన్నిక‌ల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ చంద్రబాబు రాష్ట్రంలో నిరుద్యోగుల‌కు హామీ ఇచ్చారు. అంతే కాకుండా బాబు వ‌స్తే జాబు వ‌స్తుందంటూ టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రచారం చేశారు. కాని అధికారంలోకి వచ్చాక ఒక్క డీఎస్సీ మాత్రమే నిర్వహించి చేతులు దులుపుకుంది ప్రభుత్వం. దాన్ని కూడా కోర్టులు కేసుల పేరుతో ఉద్యోగాలు ఇవ్వకుండా కాలం గ‌డుపుతుంది. అంతేకాకుండా ఇప్పుడసలు ప్రభుత్వ శాఖ‌ల్లో ఖాళీలే లేవంటూ ఏపీపిఎస్పీకు ప్రభుత్వం తాజాగా నివేదికలు ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వం తీరుపై విద్యార్ధులు, నిరుద్యోగులు మండిప‌డుతున్నారు. అయితే విద్యార్ధుల‌కు మ‌ద్దతుగా ప్రతిప‌క్ష పార్టీ వైసిపి వైసీపి పోరాటం చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈ నెల 14 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో నిరుద్యోగులు, విద్యార్ధుల‌తో సంత‌కాలు సేక‌ర‌ణ కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సేక‌రించిన సంత‌కాల‌ను రాష్ట్ర ఎన్నిక‌ల కమిషనర్‌కు, గ‌వ‌ర్నర్‌కు ఫిర్యాదు చేస్తాన్నారు. అంతే కాకుండా అసెంబ్లీ స‌మావేశాల్లో ఉద్యోగాల నోటిఫికేష‌న్‌లపై ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తామంటున్నారు వైసీపి నేత‌లు

మ‌రో పోరాటాన్ని చేయాల‌నే ఆలోచనలో వైసీపీ....

మెత్తానికి ఉద్యోగాల నోటిఫికేష‌న్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కోసం మ‌రో పోరాటాన్ని చేయాల‌నే అలోచ‌న‌లో ఉంది వైసీపి. మ‌రి ఈ ప్రయత్నాల‌కి విద్యార్ధులు, నిరుద్యోగుల‌నుండి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి.

12:02 - December 13, 2015

చిత్తూరు: రామకుప్పం మండలంలో మరోసారి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. తల్లికుప్పం తండా, పండియాల మన్యం, హరిమానుపెంట, ననియాల పెద్దూరు శివారులలో పంటలపై ఏనుగులు దాడిచేశాయి. వరి, టమోటా, బీన్స్, మిరప, రాగి పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగుల దాడితో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 

12:00 - December 13, 2015

చిత్తూరు : జిల్లాలో ఓ కారు బీభత్సం సృష్టించింది.. వరదయ్యపాలెం మండలం తొండూరు సొసైటీ దగ్గర బైక్‌ను ఢీకొట్టింది.. ఈ ఘటనలో బైక్‌పైఉన్న ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి.. కారు నడిపినతీరుచూసిన బాధితుల కుటుంబసభ్యులు కోపంతో వాహనాన్ని తగలబెట్టారు. మరిన్ని వివరాలకు వీడియో చూడండి. 

నిందితులు ఎంతటి వారైనా శిక్షించాలి : దేవినేని నెహ్రూ

విజయవాడ : కాల్ మనీ కేసులో నిందితులు ఎంతటి వారైనా శిక్షించాలని కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ డిమాండ్ చేశారు. ఈ కేసులో ఉన్న ప్రజాప్రతినిధుల పేర్లు బయటపెట్టాలని, ఈ విషయంలో సీఎం చంద్రబాబు కఠినంగా వ్యవహరించాలని కోరారు. కాల్ మనీ వ్యవస్థని సమూలంగి నిర్మూలించలన్నారు.

హాలియాబాద్ వేద స్కూల్ లో విషాదం

రంగారెడ్డి : శామీర్ పేట హాలియాబాద్ వేద స్కూల్ లో విషాదం చోటు చేసుకుంది. స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలి నవీన్ అనే విద్యార్థి మృతి చెందగా.. సౌరభ్ అనేక విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దేవినేని నెహ్రూ, చల్లపల్లి సుబ్బారావుల మధ్య ఘర్షణ

విజయవాడ : కాంగ్రెస్ కార్యాలయంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. మీడియా సమావేశం ఏర్పాటు విషయంలో దేవినేని నెహ్రూ, చల్లపల్లి సుభ్బారావుల మధ్య గొడవ జరిగింది.

10:55 - December 13, 2015

పూరీ జగన్నాథ్.. టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరు. బద్రీతో మొదలైన ప్రస్థానం దాదాపు యంగ్ టాప్ హీరోలందరితో సాగింది. తాజాగా ఈ డైనమిక్ డైరక్టర్ కూడా పవన్ బాధితుల సంఘంలో చేరిపోయాడు. 
పవన్ బాధితుల సంఘం ఏమిటని ఆలోచిస్తున్నారా? ఈ మధ్య పవన్ ఫ్యాన్స్ ప్రతి ఫంక్షన్ లో 'ఫవర్ స్టార్.. ఫవర్ స్టార్' అంటూ గోళ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పూరీ దర్శకత్వం వహించిన 'లోఫర్' ఆడియో ఫంక్షన్ లోనూ పూరీకి ఈ అనుభవమే ఎదురైంది. దీనిపై స్పందిస్తూ.. 'పవన్ కళ్యాణ్ అభిమానులమనే పేరుతో ఇలాంటి పని కొంతమంది కావాలనే చేస్తున్నారు. ఇతర ఫంక్షన్లలో ఇలా చేయకూడదని పవన్ చెబితేనే వీళ్లు వింటారు. లేదంటే కళ్యాన్ కే చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉంది' అని పూరీ హెచ్చరించారు. 
కాగా ఇటీవల చిరంజీవి బర్త్ డే ఫంక్షన్ లో నాగబాబు కూడా పవన్ అభిమానులపై తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. మరి తన అభిమానులకు పవన్ ఈ విషయంపై సూచనలు చేస్తారోలేదో అని పూరీతో పాటూ.. మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎదురు చూస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. 

10:52 - December 13, 2015

విజయవాడ : కాల్‌మనీ నిర్వాహకుల్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అరెస్టుచేసిన ఏడుగురిపై నిర్భయ కేసు నమోదుచేశారు.. కేసులో ఏ 1 నిందితుడు యలమంచిలి రాముతోపాటు... మరో ఆరుగురిపై 354 ( ఏ), (1), (2), 420మోసం, 376 అత్యాచారం, 384 కిడ్నాప్‌, లైంగిక వేధింపులు, 509 కించపరచడం, 506 బెదిరించడం, రెడ్‌ విత్‌ 34 మూకుమ్మడి హాని, 120 బి, నేరపూరిత కుట్రకింద కేసులు నమోదు చేశారు.. విజయవాడతోపాటు కృష్ణా జిల్లా గుడివాడ, మచిలీపట్నం, జగ్గయ్యపేట, నూజివీడు, తిరువూరు ప్రాంతాల్లో కాల్‌మనీ వేధింపులున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి.. అటు కాల్‌ మనీ నిర్వాహకుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు..

10:51 - December 13, 2015

విజయవాడ : మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.. మల్లాది హైదరాబాద్‌లో ఉన్నారంటూ పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.. ఈ కేసు విచారిస్తున్న సిట్‌ బృందం విజయవాడనుంచి హైదరాబాద్‌ వెళ్లింది.. 

10:47 - December 13, 2015

హైదరాబాద్‌ : నగరంలో షీ టీముల మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా జరిపారు.. హైటెక్స్ నుంచి ఎన్‌ కన్వెన్షన్‌వరకూ భారీ ర్యాలీ చేపట్టారు.. ఈ ర్యాలీలో ఎంపీ కవిత, నటి జయసుధ, సైబరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ పాల్గొన్నారు.. 

10:44 - December 13, 2015

విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లతో భేటీ కావాలని నిర్ణయించారు. ఈనెల 14,15 తేదీల్లో విజయవాడలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్లలతో చంద్రబాబు మీటింగ్‌ ఏర్పాటు చేయడం ఈ ఏడాది ఇది రెండోసారి. గతేడాది సెప్టెంబర్‌లో కలెక్టర్ల స సమావేశం నిర్వహించారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష ....

సోమ, మంగళవారాల్లో చంద్రబాబు ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ సమావేశానికి భారీ అజెండా తయారు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏడాదిన్నర కాలంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎంతవరకు ప్రజలకు చేరుతున్నాయన్న అంశంపై సమీక్షిస్తారు. రాష్ట్ర వార్షికాభివృద్ధి రేటు పదిశాతం మించి సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటారు. ఈ అంశంపై ఆయన ఇప్పిటికే అన్ని శాఖల కార్యదర్శులకు దిశా, నిర్దేశం చేశారు. స్వచ్ఛ భారత్, నీరు-చెట్టు కార్యక్రమాలు అమలు తీరును సమీక్షిస్తారు.

వచ్చే నెల 1 నుంచి జన్మభూమి కార్యక్రమం ....

ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమల అమలును వేగవంతం చేయాలనుకుంటున్న చంద్రబాబు..వచ్చే నెల 1 నుంచి జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల స్పందన ఎలా ఉందో క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఇది దోహదం చేస్తుంది. జన్మభూమి ద్వారా ప్రజల భాగస్వామ్యంతో మరింత ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాల అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ-గవర్నెన్స్‌, ప్రభుత్వ రికార్డులు డిజిటలైజేషన్‌పై కలెక్టర్లకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు.

15 జిల్లా ఎస్పీలతో శాంతి భద్రతలపై సమీక్ష .....

సంక్షేమ, అభివృద్ధి పథకాలను వచ్చే బడ్జెట్‌లో నిధుల కేటాయింపు అంశంపై కూడా చర్చిస్తారు. ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించిన నిధుల ఖర్చును సమీక్షిస్తారు. కలెక్టర్ల సమావేశం రెండో రోజైన ఈనెల 15న జిల్లా ఎస్పీలు, కలెక్టర్లతో కలిసి శాంతి భద్రతలపై చంద్రబాబు సమీక్షిస్తారు. రాష్ట్రానికి చెందిన సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులందరూ ఈ సమావేశాలకు హాజరవుతారు. 

10:42 - December 13, 2015

విజయవాడ : ఏపీ రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాగే లావాదేవీలను ఇటీవలె కంప్యూటరీకరించారు. దీంతో పనులు వేగంగా పూర్తి చేయడంతోపాటు.. దస్తావేజుల్ని ఆన్ లైన్ లోకి తీసుకొచ్చారు. వాటికి తగిన భద్రత కల్పించేందుకు 2002 లో కార్డ్ ప్రాజెక్ట్ ను సర్కార్ అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం సేవలను బట్టి యాబై రూపాయల దాకా రుసుమును వసూలు చేసేవారు. పనులు త్వరగా జరుగుతుండడంతో ప్రజలు కూడా కొత్త విధానాన్ని స్వాగతించారు.

ప్రజల నుంచి రుసుము వసూలు చేస్తున్న సర్కార్...

ప్రజల నుంచి రుసుము వసూలు చేస్తున్న సర్కారు.. కార్డ్‌ ప్రాజెక్టుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయడం లేదు. దీని వల్ల.. దస్తావేజుల భద్రత జరగకపోవగా.. తాము చెల్లించిన రుసుము కూడా ఇతరుల ఖాతాలో పడుతోందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కార్డ్‌ ప్రాజెక్టు సేవలను వినియోగించుకునే వారి నుంచి వసూలు చేసే రుసుమును ఐదు రెట్లు పెంచారు. ఇది ప్రజల్లో ఆందోళనను మరింతగా పెంచింది.

కార్డ్ ప్రాజెక్ట్ కి మరింత ఆధునిక పరిజ్ఞానం....

కార్డ్ ప్రాజెక్ట్ కి మరింత ఆధునిక పరిజ్ఞానం జోడించాం కాబట్టి రుసుము పెంచక తప్పడం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాని క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. 2002 లో కార్డ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి సేవా రుసుము విధించారు. లీజులు మార్ట్ గేజ్ లు , సేల్ డీల్స్ , భాగపక్షాలు గిప్ట్ డీడ్ తదితర సేవలకు రుసుము నిర్ణయించారు. వసూలైన మొత్తాన్ని తొలుత రిజస్ట్రేషన్ శాఖ ఖాతాకే జమ చేయాలని నిర్ణయించారు. దీనితో పాటు శాఖాపరంగా అవసరమైన స్టేషనరి, సాఫ్ట్ వేర్ , హార్డ్ వేర్ ఏర్పాటుకు అవసరమైన కల్పన , ఇందుకయ్యే విద్యుత్ వ్యయం చెల్లింపులకు వినియోగించాలని అనుకున్నారు. కాని వాస్తవంలో అలా జరగడం లేదు .

పాత దస్తావేజుల డేటాను సంరక్షించడం....

పాత దస్తావేజుల డేటాను సంరక్షించడం, బ్యాకప్ నిర్వహణకు సేవా రుసుం ఉపయోగపడుతుందని భావించారు. కాని వసూలైన మొత్తాలు రిజిస్ట్రేషన్ శాఖ ఖాతాలో కాకుండా, ఆర్థిక శాఖ పద్దులో జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ల శాఖ వసూలు చేసిన మొత్తాలపై ఎలాంటి అధికారం ఆశాఖ కు లేకుండాపోయింది. సాఫ్ట్ వేర్... స్టేషనరీ.. విద్యుత్ బిల్లు ఇలా ఏం కావాలన్నా ఆర్థిక శాఖ నుంచి విడుదల కావాల్సిందే. అంతే కాకుండా తరచూ ఈ తరహా కొత్త సాఫ్ట్ వేర్ సేవలు స్తంభించిపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ సేవలకు ప్రత్యేకంగా....

ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ సేవలకు ప్రత్యేకంగా రుసుము వసూలు చేస్తున్నారు. వారు వసూలు చేసిన సొమ్ముకు ఆశాఖ ఐజీదే భాధ్యత. ఏపీలో మాత్రం ఇందుకు భిన్నంగా రిజిస్ట్రేషన్ చార్జీలపై ఆ శాఖకు అధికారం ఉండదు. పైగా ఉన్నదానికంటే ఐదు రెట్లు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులతో ఆ శాఖ కు లాభం ఉండకపోగా , శ్రమ అధికం అవుతుందన్నది నిపుణుల వాదన. ఇది ప్రజలకు మేలు చేకూర్చకపోగా ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు.  

కాజీపేట రైల్వే ట్రాక్ పై మహిళా మృతదేహం

వరంగల్ : కాజీపేట రైల్వేట్రాక్పై మహిళా మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణ చేపట్టారు. అందులోభాగంగా మృతురాలు సుబేదార్కు చెందిన స్వర్ణలతగా గుర్తించారు. ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. భర్త మహేందర్ వరకట్న వేధింపుల వల్లే చనిపోయిందంటూ స్వర్ణలత బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

నేడు నటుడు దిలీప్ కుమార్ కు పద్మవిభూషణ్ ప్రదానం

హైదరాబాద్ : నటుడు దిలీఫ్ కుమార్ కు నేడు పద్మవిభూషణ్ ప్రదానం చేయనున్నారు. ముంబైలోని దిలీప్ కుమార్ నివాసంలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పద్మవిభూషణ్ ప్రదానం చేయనున్నారు.

కాల్ మనీ కేసులో నిందితులపై నిర్భయ కేసు

విజయవాడ : కాల్ మనీ కేసులో నిందితులపై నిర్భయ కేసు నమోదయ్యింది. యలమంచి రాముతో సహా మరో ఆరుగురి పై నిర్భయ కేసు నమోదు అయ్యింది. మరో వైపు కాల్ మనీ నిర్వాహకుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

చెట్టుకు ఉరేసుకొని ప్రేమ జంట ఆత్మహత్య...

మహబూబ్‌నగర్: జిల్లాలోని దామరగిద్ద మండలం లింగారెడ్డిపల్లి గ్రామ స్టేజ్ దగ్గర విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రేమ జంట చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

10:25 - December 13, 2015

అందమైన వర్చస్సుతో పాటూ అంతకంటే అందమైన మనసున్న హీరోయిన్ సమంత. చెన్నై విపత్తు అపార ధన, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ఈ ప్రకృతి విపత్తుకు చలించిన ఎంతో మంది తమ వంతుగా ఓ చేయి వేశారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతోపాటూ సాధారణ ప్రజలు కూడా 'సేవ్ చెన్నై' నినాదంతో సాయం అందించారు.
ఈ జాబితాలో హీరోయిన్ సమంత చేరింది. చెన్నై బాదితులకు  30లక్షలు ఇస్తున్నట్లు సమంత ప్రకటించింది. ఈ సందర్భంగా చెన్నైతో తనకున్న అనుబంధాన్ని సమంత గుర్తు చేసుకుంది. తను స్వతహాగా మళయాళీయే కానీ పుట్టి పెరిగి గ్రాడ్యూయేషన్ పూర్తి చేసుకుంది మాత్రం చెన్నైలోనే. అంతేకాకుండా 'కోలీవుడ్' టాప్ హీరోయిన్ గా తనను ఎంతో ఎత్తుకు చేర్చింది. కాబట్టి చెన్నై రుణం తీర్చుకునేందుకు సమంత పెద్దమనుసుతో ఈ సహాయానికి ముందుకొచ్చింది. 
సమంత సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందే ఉంటుంది. 2012లోనే 'ప్రత్యూష ఫౌండేషన్' స్థాపించి ఎంతో మందికి సమంత చేయూతనందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మనసున్న అమ్మాయికి 'హ్యాట్సాప్' చెప్పకుండా ఎలా ఉండగలం.

హైదరాబాద్ లో షీ టీంల ర్యాలీ....

హైదరాబాద్: మహిళలకు రోన కోసం టిసర్కార్ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన షీటీంలు ఏర్పాటయి ఈ రోజుతో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా నగరంలో జరిగిన ర్యాలీలో ఎంపీ కవిత, సినీ నటి జయసుధ, విద్యార్థినిలు, యువతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

10:18 - December 13, 2015

హైదరాబాద్ : ఐపీటీఎల్‌ మనీలా లెగ్‌ పోటీల్లో బరిలోకి దిగి టెన్నిస్‌ అభిమానులను అలరించిన రష్యన్ సెన్సేషన్‌ మారియా షరపోవా...ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంది. ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ పోర్షేకు గ్లోబల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న షరపోవా..... ప్రమోషనల్‌ ఈవెంట్‌లో భాగంగా సరికొత్త పోర్షే 911 మోడల్‌ కారుతో లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లింది. ప్రస్తుతం క్రిస్మస్‌ సెలవుల కోసం లాస్స్ ఏంజిల్స్‌ ఉన్న షరపోవా....2015 సీజన్‌లో తన ప్రదర్శన సంతృప్తికరంగా ఉందని చెప్పింది. 

10:15 - December 13, 2015

హైదరాబాద్ : వాతావరణ మార్పులపై పారిస్‌లో జరిగిన సదస్సులో చారిత్రక ఒప్పందం కుదిరింది. భూతాపం 2 డిగ్రీల సెల్సియస్‌ తగ్గించే చర్యలు తీసుకోవాలని అన్ని దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు కుదిరిన ఒప్పందపై 196 దేశాలు సంతకాలు చేశాయి. భారత్‌ సహా అన్ని దేశాలు దీనిపై హర్షం వ్యక్తం చేశాయి.

రెండు వారాల సుధీర్ఘ చర్చలు, సంప్రదింపులు ..

వాతారవరణ మార్పులపై పారిస్‌ సదస్సు చారిత్రక విజయం సాధించింది. భూతాపానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు అన్ని దేశాలు అంగీకరించాయి. పారిస్ వేదికగా రెండు వారాల నుంచి జరుగుతున్న సుదీర్ఘ చర్చలు, సంప్రదింపుల తర్వాత గ్లోబల్‌ వార్మింగ్‌ నియంత్రణపై ఒప్పందం కుదిరింది. అన్ని దేశాలు దీనిని స్వాగతించాయి.

గ్లోబల్‌ వార్మింగ్‌ తగ్గింపుపై భిన్నాభిప్రాయాలు .....

ఏటేటా పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించకపోతే ప్రపంచ మానవాళికి ముప్పుతప్పదని పారిస్‌ వాతావరణ సదస్సుకు హాజరైన దేశాలు గ్రహించాయి. అయితే తొలుత గ్లోబల్‌ వార్మింగ్‌ను ఏ మేరకు తగ్గించాలన్న అంశంపై సభ్య దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కర్బన ఉద్గారాలు వెదజల్లుతూ ప్రకృతి సమతూకాన్ని దెబ్బతీస్తున్న పారిశ్రామిక సంపన్న దేశాలు భూతాపం తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముందుకురాలేదు. భూతాపానికి ఎక్కువ బలవుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాలు..అభివృద్ధి చెందిన దేశాలపై ఒత్తిడి తెచ్చాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సంపన్న దేశాలపైనే ఎక్కువగా ఉందని తేల్చి చెప్పాయి. దీంతో దిగొచ్చిన పారిశ్రామి దేశాలు వాతావరణ మార్పులు ఒప్పందాన్ని ఒప్పుకున్నాయి. దీనికి అందరూ చట్టబద్ధంగా కట్టుబడి ఉండాలి.

గతంతో పోలిస్తే 2.5 నుంచి 3.76 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు ...

వాతావరణ మార్పులపై పారిస్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం 2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను తగ్గించాల్సి ఉంది. పారిశ్రామిక విప్లంనాటికి ఉన్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే ప్రస్తుతం 2.5 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 3.76 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదవుతున్నాయి. రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు 2020 నాటికి కనీసం 100 బిలియన్‌ డాలర్ల నిధులు కావాల్సి ఉంటుందని అంచనావేశారు. వాతావరణ మార్పులపై పారిస్‌లో కుదిరిన ఒప్పందాన్ని భారత్‌, ఆమెరికా, బ్రిటన్‌ సహా అన్ని దేశాలు స్వాగతించాయి. ఈ ఒప్పందం అమలు అటు అభివృద్ధి చెందిన దేశాలతోపాటు, ఇటు అభివృద్ధి చెందుతున్న దేశాలు కట్టుబడి ఉండాలని మన పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్‌ జావదేకర్‌ చెప్పారు. పెరుగుతున్న భూతాపంపై ప్రధాని నరేంద్ర మోదీ... ప్రపంచ వేదికలపై దఫదఫాలు వ్యక్తం ఆందోళన, ప్రపంచ నాయకులతో జరిపిన సంప్రదింపుల ఫలితంగా ఈ ఒప్పందం కుదిరిందన్నారు.

పారిస్‌లో కుదిరిన ఒప్పందం చారిత్రాత్మకమైనదని....

వాతావరణ మార్పులపై పారిస్‌లో కుదిరిన ఒప్పందం చారిత్రాత్మకమైనదని అమెరికా అధ్యక్షడు ఒబామా ట్వీట్‌ చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాలు దీనిపై సంకాలు చేయడం శుభపరిణామమన్నారు. పెరుగుతున్న భూపాతం నుంచి భవిష్యత్‌ తరాలకు భద్రత కల్పించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ అన్నారు. 

10:12 - December 13, 2015

విజయవాడ : తెలంగాణ‌లో ఒక‌దాని త‌రువాత మ‌రోటి అన్నట్టు అధికార పార్టీ ఆప‌రేష‌న్ ఆకర్ష్ స‌జావుగా సాగుతుంటే ఏపీలో మాత్రం...ఆక‌ర్షకు అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి. తెలంగాణ‌లో టిడిపి నాయ‌కుల‌ను రోజుకోకరి చొప్పున టిఆర్ఎస్ ఎగ‌రేసుకుపోతుంటే ఏపీలో సైకిల్ ఆక‌ర్షకు సొంత పార్టీ నేత‌లే మొకాల‌డ్డుతున్నారు. దీంతో పార్టీలోకి వ‌స్తాన‌ని చెపుతున్న వారిని వ‌ద్దన‌లేక పార్టీ నేత‌ల‌ను స‌ముదాయించ‌లేక చంద్రబాబు తల పట్టుకుంటున్నాడు.

బ‌లంగా ఉన్న ఇత‌ర పార్టీ నేత‌ల‌ను ఆక‌ర్షించే ప్రయ‌త్నం ....

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ లో బ‌ల‌హీనంగా ఉన్న ప్రాంతాల్లో తిరిగి బ‌లం పుంజుకునేందుకు క‌స‌ర‌త్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఆయా ప్రాంతాల్లో బ‌లంగా ఉన్న ఇత‌ర పార్టీ నేత‌ల‌ను ఆక‌ర్షించే ప్రయ‌త్నం చేస్తోంది. ముఖ్యంగా పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న రాయ‌ల‌సీమ‌, ఉత్తరాంధ్ర గిరిజ‌న ప్రాంతాల్లో, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఆప‌రేషన్ ఆక‌ర్ష్ ప్రారంభించింది. అయితే దీనికి సొంత పార్టీ నేత‌ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటం ఇబ్బందిగా మారింది. నిన్న మెన్నటి వ‌ర‌కూ ప్రత్యర్ధి పార్టీల్లో ఉన్న నేత‌లు ఇప్పుడు ఒకే పార్టీలో క‌లిసి ఉండ‌టం ఎలా సాధ్యమవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.

టీడీపీలోకి రావడానికి వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డి ఆసక్తి ...........

ముఖ్యంగా క‌డ‌ప‌ జిల్లా జ‌మ్ముల‌మ‌డుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డి టిడిపిలోకి రావ‌డానికి సిద్దంగా ఉన్నా , పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అక్కడ ఉన్న మాజీ మంత్రి, ఇన్ఛార్జి రామ‌సుబ్బా రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదినారాయ‌ణ రెడ్డి పార్టీలోకి వ‌స్తే తాము మూకుమ్మడిగా రాజీనామా చేస్తామ‌ని అధినేత‌కు తెలియజేశారు. ఇన్జార్జి మంత్రి గంటా ద్వారా రాయ‌భారం పంపించినా వ‌ల‌స‌ల‌పై త‌మ వైఖ‌రి మార‌దంటున్నారు. అయితే అధిష్టానం మాత్రం వారిని ఒప్పించే ప్రయ‌త్నం కొన‌సాగిస్తోంది.

కొణతాల రాకను వ్యతిరేకిస్తున్న గంటా వర్గం......

అటు ఉత్తరాంధ్రలో కీల‌క నేత అయిన కొన‌తాల రావ‌డానికి సిద్ధంగా ఉన్నా ఆ జిల్లాలోని మంత్రి గంటా వ‌ర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వీరంద‌రూ కూడా ఇప్పటికే చంద్రబాబు ద‌గ్గర‌కు వెళ్ళి ఆయ‌నను పార్టీలో చేర్చుకోవద్దని మొరపెట్టుకుంటున్నారు. అయితే అధినేత చంద్రబాబు మాత్రం వీరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన‌ట్టు తెలిసింది. విశాఖ‌కు చెందిన మ‌రో మంత్రి అయ్యన్న పాత్రుడు ద్వారా ఇప్పటికే చంద్రబాబును క‌లిసిన‌ట్టు తెలుస్తోంది. త్వర‌లోనే ఆయ‌న పార్టీలో చేరుతున్నట్టు సమాచారం. నెల్లూరు జిల్లాలో ఆనం రాక‌ను చాలామంది అపోజ్ చేయగా, చంద్రబాబు మాత్రం వారికి న‌చ్చజెప్పి ఒప్పించి పార్టీలో చేర్చుకున్నారు. ఉత్తరాంధ్రలో కొంద‌రు ఎమ్మెల్యేలతో కూడా చ‌ర్చలు జ‌రుగుతున్నాయి. అయితే అక్కడి స్ధానిక నేత‌ల‌ను ఒప్పించాక వారిని ఆహ్వానించాలని అధినేత నిర్ణయించిన‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పార్టీకి అవ‌స‌రం అయిన చోట నాయ‌కులను చేర్చుకోవ‌డంలో చంద్రబాబు ముంద‌డుగే వేయాల‌ని నిర్ణయించారు. నియోజ‌క వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రుగుతుంద‌ని నాయ‌కులంద‌రికి పోటీ చేయ‌టానికి అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని అధిష్టానం హమీ ఇస్తోంది.

10:08 - December 13, 2015

మెదక్ : ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం పట్ల తెలంగాణ ప్రభుత్వం నిర్లక్షం ప్రదర్శిస్తోంది. దీనిని నిరసిస్తూ వంద రోజుల సమ్మె తర్వాత హైదరాబాద్‌కు పాదయాత్రగా బయలుదేరిన ఆశా వర్కర్లపై పోలీసులు అడుగడుగునా అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. రాష్ట్రాలోని అన్ని జిల్లాల నుంచి రాజధానికి బయలుదేరిన ఆశా వర్కర్లపై జులుం ప్రదర్శిస్తున్నారు. దీనిని నిరసిస్తూ ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు.

పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు...

మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ నుంచి ప్రారంభమైన ఆశా వర్కర్ల పాదయాత్రను సదాశిపేట మండలం పెద్దాపూర్‌ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసు వలయాన్ని ఛేదించి ముందుకుసాగుతున్న ఆశాలపై ఖాకీలు లాఠీ ఛార్జ్‌ చేశారు. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. పోలీసు జులుంను నిరసిస్తూ ఆశాలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.

ఆశాల అరెస్టులను ఖండించిన నేతలు...

ఆశా వర్కర్లకు కనీస వేతం కూడా అమలు చేయని ప్రభుత్వ తీరును అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హైమావతి తప్పుపట్టారు. ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని సీఐటీయూ మెదక్‌ జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌ విమర్శిస్తున్నారు. 

10:08 - December 13, 2015

ఫేస్ బుక్.. ఈ దశాబ్దంలో ఓ వండర్. ఇంటర్నెట్ అన్న మాట తెలిస్తే చాలు ఫేస్ బుక్ అకౌంట్ లేకుండా ఉన్నారంటే ఆశ్చర్యపోవాలేమో. ప్రపంచ వ్యాప్తంగా ఇంత ప్రాముఖ్యత కలిగిన ఫేసుబుక్ తాజాగా 'బాహుబలి'కి అరుదైన గౌరవం ఇచ్చింది. ప్రపంచమంతా సలాం కొట్టిన జక్కన్న చెక్కిన దృష్య కావ్యం బాహుబలికి ఫేస్ బుక్ గులాం అయ్యింది.  విషయంలోకి వెళితే ప్రతీ ఏడాదిలాగే ఈ యేడూ 'ఫేస్ బుక్ రివ్యూ- 2015' వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ఇండియా నుంచి చూపించిన ప్రముఖవాటిల్లో 'బాహుబలి'ని చేర్చారు. 
ఈ వీడియోలో 2015 సంవత్సరానికి సంబంధించిన ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఘటనలను మరోసారి నెమరువేసుకునేలా తయారు చేశారు. వియత్నాం 'గే'రైట్స్ ఫొటోతో మొదలైన వీడియో పారిస్ కాల్పులకు నివాళితో ముగుస్తుంది. అందులో బాగంగా రాజమౌళి 'బాహుబలి' సినిమాలోని కొండప్రక్కన నిల్చున్న తమన్నా ఫొటో ఫ్రేమ్ ను చేర్చారు. అయితే దీనిపై ఈ చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఎన్నో రికార్డులు బ్రేక్ చేసి, మరెన్నో అవార్డులు అందుకుని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన 'బాహుబలి' మరోసారి మరో మైలు రాయిని దక్కించుకుంది. 100 కోట్ల మంది కేంద్రీకృతమైన ఫేస్ బుక్ వీడియోలో చోటు దక్కించుకోవడం గ్రేటే కదా మరి. 

10:03 - December 13, 2015

హైదరాబాద్ : ఆకుపచ్చని విశాఖ మన్యంలోబాక్సైట్ చిచ్చు రగులుతోంది. బాక్సైట్ తవ్వకాలకు అనుమతి మంజూరు చేయకూడదని స్థానిక గిరిజనులు, వామపక్షాలు, విపక్షాలు మూకుమ్మడిగా నినదిస్తున్నా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోంది. అస్సలు బాక్సైట్ తవ్వకాల వల్ల ఎవరి లాభం చేకూరుతుంది? ఎందుకు ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది? ప్రజా ఉద్యమాలను ప్రభుత్వం ఎందుకు ఖాతరు చేయడం లేదు? ఈ అంశంపై 'ఫర్ ది పీపుల్' కార్యక్రమంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘువులు విశ్లేషణ చేశారు. ఆ విశ్లేషణను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

పోలీసులు, ఆశాల వర్కర్ల మధ్య తోపులాట

మెదక్ : ముంబై జాతీయ రహదారిని ఆశాల వర్కర్లు దిగ్బంధనం చేశారు. పోలీసులు, ఆశా వర్కర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈతోపులాటలో15 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో వైపు కంగిడిలో పలువురు ఆశా కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

రామకుప్పం మండలంలో ఏనుగులు బీభత్సం

చిత్తూరు : రామకుప్పం మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. తల్లికుప్పం తండా, పండియాల మన్యం, హరిమానుపెంట, నదియాల, పెద్దూరులలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. వరి, బీన్స్, మిరప, రాగి పంటలు ధ్వంసం చేస్తున్నాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.

ఆశాలను అరెస్టు చేయడం దుర్మార్గం : మల్లేష్

మెదక్ : ప్రజాస్వామ్యయుతంగా పాదయ్రాత చేస్తున్న ఆశాలను అరెస్ట్ చేయడం దుర్మార్గం అని మెదక్ జిల్లా సిఐటియు అధ్యఓఉడు మల్లేష్ ఆరోపించారు.

08:29 - December 13, 2015

హైదరాబాద్: ఎల్బీనగర్‌లోని ఎన్టీఆర్‌నగర్‌లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. డీసీపీ ఇక్బాల్ ఆధ్వర్యంలో 386 మంది పోలీసులు తనిఖీ జరుగుతోంది. తనిఖీలలో పత్రాలు సరిగా లేని 41 వాహనాలు, 11 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 11 సిలిండర్లు, రెండుగ్యాస్‌రీఫిల్లింగ్ యంత్రాలు, 12 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని 16 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎన్టీఆర్‌నగర్‌లో పోలీసులు కార్డన్ సెర్చ్

హైదరాబాద్: ఎల్బీనగర్‌లోని ఎన్టీఆర్‌నగర్‌లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. డీసీపీ ఇక్బాల్ ఆధ్వర్యంలో 386 మంది పోలీసులు తనిఖీ జరుగుతోంది. తనిఖీలలో పత్రాలు సరిగా లేని 41 వాహనాలు, 11 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 11 సిలిండర్లు, రెండుగ్యాస్‌రీఫిల్లింగ్ యంత్రాలు, 12 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని 16 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అగ్నిప్రమాదంలో 11 పూరిల్లు దగ్ధం...

విజయనగరం : పుసపాటిరేగ మండలం రోలుచొప్పడిలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 పూరిళ్లు దగ్ధమయ్యాయి. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూటే కారణమని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మునగాల వద్ద కారు బోల్తా : ఒకరి మృతి

నల్గొండ : ఇన్నోవా కారు బోల్తా పడి ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం ఉదయం నల్లగొండ జిల్లాలోని మునగాల మండలం ఆగుపాముల సమీపంలో చోటుచేసుకుంది. కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. 

నేడు క్రికెటర్ రోహిత్ శర్మ వివాహం

హైదరాబాద్ : నేడు ముంబై లో క్రికెటర్ రోహిత్ శర్మ వివాహం జరగనుంది. తన స్నేహితురాలు రితికాసజ్దేను రోహిత్ వివాహం చేసకునోన్నారు.

08:12 - December 13, 2015

హైదరాబాద్ : ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం పట్ల తెలంగాణ ప్రభుత్వం నిర్లక్షం ప్రదర్శిస్తోంది. దీనిని నిరసిస్తూ వంద రోజుల సమ్మె తర్వాత హైదరాబాద్‌కు పాదయాత్రగా బయలుదేరిన ఆశా వర్కర్లపై పోలీసులు అడుగడుగునా అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. రాష్ట్రాలోని అన్ని జిల్లాల నుంచి రాజధానికి బయలుదేరిన ఆశా వర్కర్లపై జులుం ప్రదర్శిస్తున్నారు. దీనిని నిరసిస్తూ ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు.

పెద్దాపూర్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు...

మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ నుంచి ప్రారంభమైన ఆశా వర్కర్ల పాదయాత్రను సదాశిపేట మండలం పెద్దాపూర్‌ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసు వలయాన్ని ఛేదించి ముందుకుసాగుతున్న ఆశాలపై ఖాకీలు లాఠీ ఛార్జ్‌ చేశారు. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. పోలీసు జులుంను నిరసిస్తూ ఆశాలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.

పోలీసుల తీరును తప్పుపడుతున్న నేతలు...

ఆశా వర్కర్లకు కనీస వేతం కూడా అమలు చేయని ప్రభుత్వ తీరును అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హైమావతి తప్పుపట్టారు. ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని సీఐటీయూ మెదక్‌ జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌ విమర్శిస్తున్నారు.

వివిధ ప్రాంతాల్లో అరెస్టులు..

వరంగల్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు పాదయాత్రంగా వస్తున్న ఆశా వర్కర్లపై నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. దీనిని నిరసిస్తూ ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ నుంచి బయలుదేరిన పాదయాత్ర హైదరాబాద్‌ వైపు సాగుతోంది. ఆశా వర్కర్లకు కనీస వేతనం 15 వేల రూపాయలు ఇవ్వాలని సీపీఎం నాయకుడు రామ్‌ నర్సింహారావు డిమాండ్‌ చేశారు.

16న ఇందిరాపార్క్‌ దగ్గర బహిరంగ సభ...

రాష్ట్రం నలు మూలల నుంచి హైదరాబాద్‌ చేరుకునే ఆశా వర్కర్లు ఈనెల 16న ఇందిరాపార్క్‌ దగ్గర బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రస్తుతం నెలకు 500 రూపాయలుగా ఉన్న వేతనాన్ని పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళన చేస్తున్నారు. 

ఓయూలో సెమిస్టర్ పరీక్షలు యథాతథం

హైదరాబాద్ : : ఉస్మానియా యూనివర్సిటీ సెమిస్టర్ పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని యూనివర్సిటీ పీఆర్‌ఓ డాక్టర్ సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు వాయిదా వేయాలని కొంతమంది విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ మిగతా విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ముందుగా చెప్పిన తేదీల ప్రకారం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. పరీక్షలు రాయలేని విద్యార్థులను తిరిగి పరీక్షలు నిర్వహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఓయూలో పరిస్థితి ఉద్రిక్తం

హైదరాబాద్ : నిన్నటిదాకా బీఫ్‌ ఫెస్టివల్‌ రగడతో వేడెక్కిన ఉస్మానియా యూనివర్శిటీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిలబస్ పూర్తికాకుండానే పరీక్ష నిర్వహిస్తున్నారంటూ వర్శిటీ అధికారుల చర్యల్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో అధికారులు పోలీసులను రంగంలోకి దింపారు. ఆందోళన చేస్తున్న విద్యార్థినులపైనా పోలీసులు చేయిచేసుకున్నారు. ఓ విద్యార్థినికి గాయాలవగా ఆస్పత్రికి తరలించారు. స్టూడెంట్స్‌ను బలవంతంగా అదుపులోకి తీసుకుని నిరసన కార్యక్రమాలను అడ్డుకున్నారు.  

07:25 - December 13, 2015

హైదరాబాద్ : నిన్నటిదాకా బీఫ్‌ ఫెస్టివల్‌ రగడతో వేడెక్కిన ఉస్మానియా యూనివర్శిటీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిలబస్ పూర్తికాకుండానే పరీక్ష నిర్వహిస్తున్నారంటూ వర్శిటీ అధికారుల చర్యల్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో అధికారులు పోలీసులను రంగంలోకి దింపారు. ఆందోళన చేస్తున్న విద్యార్థినులపైనా పోలీసులు చేయిచేసుకున్నారు. ఓ విద్యార్థినికి గాయాలవగా ఆస్పత్రికి తరలించారు. స్టూడెంట్స్‌ను బలవంతంగా అదుపులోకి తీసుకుని నిరసన కార్యక్రమాలను అడ్డుకున్నారు.  

ఆశా కార్యకర్తలను నిర్భంధించిన పోలీసులు

మెదక్ : నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి కొనసాగుతున్న పాత్ర మూసాయిపేట, కొండపాకలో బస చేసిన ఆశా వర్కర్లను పోలీసులు నిర్బంధించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆశాలు డిమాండ్ చేస్తున్నారు.

నామినేషన్ల ఉపసంహరణపై విచారణ : భన్వర్ లాల్...

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న స్థానిక సంస్థల కోటా మండలి ఎలక్షన్స్ లో నామినేషన్లు వేసిన వారు ఉపసంహరించుకుంటున్న వారిపై ఒత్తిడి ఉన్నట్లు ఫిర్యాదులు వస్తే విచారణ జరిపిస్తామని ఈసీ భన్వర్ లాల్ వెల్లడించారు. అభ్యర్థులతో బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేయడం నేరమని అన్న ఆయన, ఐదు జిల్లాల్లో ఆరు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని వివరించారు. ఎన్నికలు జరిగే జిల్లాల్లో మాత్రమే ఎన్నికల కోడ్, నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. ఏకగ్రీవమైన జిల్లాల్లో కోడ్ తొలగినట్టేనని తెలిపారు. కాగా, ఎన్నికలు జరగాల్సిన ప్రాంతాల్లో 27న పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే.

ఖమ్మంలో టీఆర్ఎస్‌ గెలుపు బాధ్యత తీసుకున్న తుమ్మల

హైదరాబాద్ : ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో ఖమ్మం, నల్లగొండ జిల్లాలు అత్యంత కీలకమైనవిగా మారాయి. ఖమ్మంలో.. టీఆర్ఎస్‌ అభ్యర్థిగా బాలసాని లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. ప్రత్యర్థిగా సీపీఐ సీనియర్‌ నేత పువ్వాడ నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్‌ అభ్యర్థి గెలుపు బాధ్యతను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భుజానికెత్తుకోగా.. పువ్వాడ నాగేశ్వరరావు విజయం కోసం... ఆయన తనయుడు, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ శ్రమిస్తున్నారు. సీపీఐ అభ్యర్థికి.. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం మద్దతు ప్రకటించాయి. టీఆర్ఎస్‌ నేతలు.. హైదరాబాద్‌ సమీపంలోని షామీర్‌పేటలో.. క్యాంపును నిర్వహిస్తున్నారు.

ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. పాలక టీఆర్ఎస్‌ ప్రయోగిస్తోన్న ఆకర్షాస్త్రం బలంగానే పనిచేసింది. ఐదు జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్‌ ఏకగ్రీవం చేసుకుంది. మొన్న వరంగల్‌లో కొండామురళి ఏకగ్రీవాల పరంపర.. కరీంనగర్‌ దాకా సాగింది. శనివారం నామినేషన్‌ల ఉపసంహరణ గడువు ముగిసే సరికి.. వరంగల్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలూ టీఆర్ఎస్‌ పరమయ్యాయి. 

ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పై ఫైర్ అయిన చంద్రబాబు

విజయవాడ : 2019 పార్లమెంటు ఎన్నికల తరువాత నారా చంద్రబాబునాయుడు ప్రధాని అవుతారని, వెంకయ్య నాయుడు రాష్ట్రపతి అవుతారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబును అసహనానికి గురి చేశాయి. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు, రాజేంద్రప్రసాద్ ను మందలించారు. ఇటువంటి అనవసర వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులు పెట్టవద్దని టీడీపీ నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు హెచ్చరించారు. తాను కేంద్రంలోకి వెళ్లాలని గతంలో భావించలేదని, ఇప్పుడు కూడా అనుకోవడం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

06:48 - December 13, 2015

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీసమేతంగా సోమవారం విజయవాడ వెళ్లనున్నారు. మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఈనెల 23 నుంచి 27 వరకు నిర్వహించే ఆయుత చండీయాగం నిర్వహించనున్నారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు ఆయన విజయవాడ వెళతారు. క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిసి చండీయాగానికి రావాలని కోరుతూ ఆహ్వానపత్రం అందచేస్తారు. చండీయాగం జరిగే సమయంలో చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటారు. ఈనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. కేసీఆర్‌... ఏపీలో చంద్రబాబును కలవడం ఇది రెండోసారి అవుతుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్‌ హాజరయ్యారు. అప్పట్లో చంద్రబాబు స్వయంగా హైదరబాద్‌లో.. కేసీఆర్‌ నివాసానిఇ వెళ్లి ఆయన్ను కలిసి శంకుస్థాపనకు ఆహ్వానించారు. మూడు రోజుల క్రితం ఢిల్లీలో కూడా కేసీఆర్‌, చంద్రబాబు కలుసుకున్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ కుమార్తె వివాహ విందుకు హాజరై.... కేసీఆర్‌ తిరిగి వస్తుండగా... చంద్రబాబు ఎదురయ్యారు. దీంతో ఇద్దరు అభివాదం చేసుకున్నారు. కరచాలనం చేసుకుని కుశలప్రశ్నలు వేసుకున్నారు. విజయవాడలో చంద్రబాబును కలిసిన తర్వాత బెజవాడ కనకదుర్గ ఆలయానికి వెళతారు. దుర్గమ్మకు మొక్కులు తీర్చుకుంటారు. తెలంగాణ వస్తే కనకదుర్గమ్మకు ముక్కుపుడక చేయిస్తానని మొక్కకున్నారు. ఆ మొక్కును ఇప్పుడు తీర్చుకుంటారు. 

06:41 - December 13, 2015

విజయవాడ : రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే.. మంచి ఫలితాలు వస్తాయ అన్నారు. రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యలన్నీ.. కలిసి కూర్చుని మాట్లాడుకుంటే.. పరిష్కారమవుతాయనీ సూచించారు.

విజయవాడ కేంద్రంగా..

విజయవాడ కేంద్రంగా.. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం శనివారం జరిగింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన సాగిన సమావేశంలో... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం.. రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యల పరిష్కారం.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తదితర అంశాలను చర్చించారు. ట్రాన్స్‌పోర్ట్‌ బిల్లు, రోడ్డు భద్రత బిల్లు, పోలీసు వ్యవస్థను పరిపుష్టం చేసే అంశాలపైనా విస్తృత చర్చ సాగింది. రాష్ట్రాల అభివృద్ధికి.. సమస్యల పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉందని రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పారు.

ప్రాంతీయ మండలి భేటీని చక్కటి వేదికగా .....

దక్షిణాది రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి.. ప్రాంతీయ మండలి భేటీని చక్కటి వేదికగా అభివర్ణించారు ఏపీ సీఎం చంద్రబాబు. కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్రలో.. కనీసం సచివాలయం కూడా లేని విషయాన్ని, ఇతర ఇబ్బందుల గురించి ఆహూతులకు వివరించారు. కలిసికట్టుగా సాగితే ఏ సమస్యనైనా అధిగమించ వచ్చన్న చంద్రబాబు.. మోదీ టీమ్‌ ఇండియా స్పిరిట్‌ను గుర్తు చేసుకున్నారు.

తదుపరి సమావేశాన్ని కేరళలో .....

దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి తదుపరి సమావేశాన్ని కేరళలో నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీ సర్కారు ఎన్నో ఆశలతో ఈ సమావేశానికి ఆతిథ్యమిచ్చింది. అయితే ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులెవరూ రాకపోవడంతో.. కీలకమైన అంతర్రాష్ట్ర సమస్యల ఎలాంటి నిర్దిష్టమైన నిర్ణయాలూ లేకుండానే సమావేశం ముగిసింది. 

06:38 - December 13, 2015

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో తుది అంకం మొదలైంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో ఉండేదెవరో తేలిపోయింది. పాలమూరు జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఐదుగురు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి ఇద్దరు బరిలో ఉండగా కాంగ్రెస్, టీడీపీ నుంచి ఒక్కో అభ్యర్థి..మరో స్వతంత్ర అభ్యర్థి సైతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈనెల 27న జరిగే ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

పాలమూరు జిల్లాలో ఇద్దరు అభ్యర్థులు ఉపసంహరణ....

ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ శనివారం ముగియడంతో..పాలమూరు జిల్లాలో ఇద్దరు అభ్యర్థులు ఉపసంహరణ చేసుకున్నారు. ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోళ్ల కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి శ్రీనివాసచారి తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఏడుగురు అభ్యర్థుల్లో ఇద్దరు నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో బరిలో చివరకు ఐదుగురు మిగిలారు. వీరిలో టీఆర్ఎస్ తరఫున జగదీశ్వర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్ తరఫున కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, టీడీపీ తరఫున కొత్తకోట దయాకర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా జగదీశ్వర్ రెడ్డి పోటీలో ఉన్నారు. బరిలో ఉండేవాళ్లెవరో తేలిపోవడంతో ఎన్నికల కమిషన్ ఆ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాలో మొత్తం 1262 ఓట్లు...

జిల్లాలో మొత్తం 1262 ఓట్లుండగా అభ్యర్థి గెలుపు కోసం 421 మొదటి ప్రాధాన్యత ఓట్లు రావాల్సి ఉంటుంది. అయితే మెజారిటీపై పార్టీలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా మారిన సమీకరణాల నేపథ్యంలో ఒక్క స్థానానికే పరిమితమై మాజీ జడ్పీ ఛైర్మన్ కూచుకుళ్ల దామోదర్ రెడ్డిని బరిలో నిలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అభ్యర్థులు విత్ డ్రా కావడంతో ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయోమోనని పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ ఎమ్మెల్యే డీకే అరుణ తెరవెనుక మంత్రాంగం నడుపుతూ అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక టీడీపీ కూడా మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డిని బరిలో దింపినప్పటికీ ఆ పార్టీ నేతలు ఓటింగ్ పై మీమాంసలో పడిపోయారు. మొదట కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామని చెప్పినప్పటికీ ఆ దిశగా రెండు పార్టీలు కూడా సైలెంట్‌గానే ఉన్నాయి.

దూకుడు ప్రదర్శిస్తోన్న టిఆర్ ఎస్....

ఇక అధికార టీఆర్ఎస్ మాత్రం దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఆ పార్టీ తరఫున రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేస్తూ..ఓట్లను సమీకరించేపనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే రెండుసార్లు అవగాహన శిబిరాలు సైతం నిర్వహించి ఇతర పార్టీల వాళ్లను పెద్దఎత్తున ఆకర్షిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలకు అతీతంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు స్వచ్చందంగా టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నారని గులాబీ నేతలు చెప్తున్నారు. మొత్తానికి ఎన్నికలకు మరో 15 రోజులు మాత్రమే గడువుండటంతో ఓటర్లను కాపాడుకునే ప్రయత్నంలో అభ్యర్థులు తలమునకలవుతున్నారు.

06:34 - December 13, 2015

హైదరాబాద్ : ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో ఖమ్మం, నల్లగొండ జిల్లాలు అత్యంత కీలకమైనవిగా మారాయి. ఖమ్మంలో.. టీఆర్ఎస్‌ అభ్యర్థిగా బాలసాని లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. ప్రత్యర్థిగా సీపీఐ సీనియర్‌ నేత పువ్వాడ నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్‌ అభ్యర్థి గెలుపు బాధ్యతను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భుజానికెత్తుకోగా.. పువ్వాడ నాగేశ్వరరావు విజయం కోసం... ఆయన తనయుడు, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ శ్రమిస్తున్నారు. సీపీఐ అభ్యర్థికి.. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం మద్దతు ప్రకటించాయి. టీఆర్ఎస్‌ నేతలు.. హైదరాబాద్‌ సమీపంలోని షామీర్‌పేటలో.. క్యాంపును నిర్వహిస్తున్నారు. విపక్ష నేతలు.. ఖమ్మంలోనే అభ్యర్థులను కాపాడుకుంటున్నారు. ఇక్కడ మొత్తం 726 మంది స్థానిక ప్రజా ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

నల్లగొండ జిల్లాలో 1112 మంది ఓటర్లు....

నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈయన ప్రత్యర్థిగా టీఆర్ఎస్‌కు చెందిన తేరా చిన్నపరెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సాదినేని శ్రీనివాసరావు శనివారం నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో ఇక్కడ ముఖాముఖి పోటీ జరుగనుంది. మొత్తం వెయ్యీ నూట పన్నెండు మంది స్థానిక ప్రజా ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వలసల అనంతరం.. కాంగ్రెస్‌కు 429, టీఆర్ఎస్‌కు 455, టీడీపీకి 92, వామపక్షాలకు 74, బీజేపీకి 34 మంది ఓటర్లు ఉన్నట్లు ఓ అంచనా. ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలూ ఏకమై.. తమ ఓటర్లను గంపగుత్తగా ఓటు వేయించగలిగితే... కాంగ్రెస్‌ అభ్యర్థికి విజయావకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. వీరి ఐక్యత ఏమేరకు సాధ్యమన్నది అనుమానమే.

పాలమూరులో ఒక్కో స్థానానికే పరిమితమైన విపక్షాలు.....

ఇక పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లోని రెండేసి ఎమ్మెల్సీ స్థానాలకూ 27న ఎన్నికలు జరుగనున్నాయి. పాలమూరులో బ్రిలియంట్‌ విద్యా సంస్థల అధినేత జగదీశ్వరరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలు టీఆర్ఎస్‌ తరఫున, కూచుకుళ్ల దామోదరరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగాను, కొత్తకోట దయాకరరెడ్డి టీడీపీ నుంచి బరిలో నిలిచారు. ఈ జిల్లాల్లో విపక్షాలు ఒక్క స్థానానికే పోటీ చేస్తున్నాయి. పాలమూరు జిల్లాలో ఇటీవలి వలసలు.. గులాబీ పార్టీని బలం పుంజుకునేలా చేశాయి. మొత్తం 1260 మంది స్థానిక ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్‌, టీడీపీల మధ్య.. ఒప్పందాలేమీ లేవు కానీ.. దశలో అధికార పార్టీని నిలువరించేందుకు ఆఖరు క్షణాల్లో ఓ అవగాహనకు వచ్చే అవకాశమూ లేకపోలేదు. ఈ జిల్లాలోనూ క్యాంపు రాజకీయాలకు తెరలేసింది.

కాంగ్రెస్‌, టీడీపీలకు పార్టీ అభ్యర్థుల షాక్‌.....

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థులుగా బరిలోకి దిగిన వారే.. తమ పార్టీలకు షాక్‌నిస్తూ.. నామినేషన్‌లు ఉపసంహరించుకోవడం విశేషం. మెదక్‌లో కాంగ్రెస్‌, టీడీపీ అభ్యర్థులిద్దరూ నామినేషన్‌లు ఉపసంహరించుకున్నారు. ఇక్కడ మంత్రి హరీశ్‌రావు చక్రం తిప్పి.. పోటీ లేకుండా చేసుకున్నారు. ఇక నిజామాబాద్‌లో కాంగ్రెస్‌, నల్లగొండలో టీడీపీ అభ్యర్థులు బరిలోంచి వైదొలిగేలా.. ఆయా జిల్లాల మంత్రులు చక్రం తిప్పారు. కరీంనగర్‌లో రెండు స్థానాలూ ఏకగ్రీవం అయ్యేందుకు.. మంత్రి ఈటెల వేసిన వ్యూహం సఫలమైంది. 

రైతు నేత శరద్ జోషి కన్నుమూత

హైదరాబాద్  : ప్రముఖ రైతు నాయకుడు శరద్‌జోషి (81) కన్నుమూశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ ఆయన దేశవ్యాప్తంగా పలు ఆందోళనలకు నేతృత్వం వహించి ప్రఖ్యాతి పొందారు. శరద్‌జోషి శనివారం తన నివాసంలో మరణించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వయస్సుతో కూడిన ఆరోగ్య సమస్యలు వెంటాడినా రైతుల సంక్షేమానికి జోషి పాటుపడ్డారు. బీజేపీ, శివసేన మద్దతుతో 2004 - 10 మధ్య రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. మహారాష్ట్రలో అసంఘటిత రంగంలో ఉన్న రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం 1979లో షేత్కారీ సంఘటన స్థాపించిన శరద్‌జోషి పలు ఉద్యమాలు నడిపారు.

150 మంది ఆశా కార్యకర్తల అక్రమ అరెస్ట్....

నల్గొండ : ఆశా కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం వద్ద బస చేస్తున్న 150 మంది ఆశా కార్యకర్తలు, సిఐటియు నేతలను పోలీసులు అరెస్టు చేసి నారాయణ పురం పీఎస్ కు తరలించారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ గత 100 రోజులకు పైగా సమ్మె చేస్తూ పాదయాత్రలు చేపట్టిన విషయం తెలిసిందే.

Don't Miss