Activities calendar

14 December 2015

ఏనుగును ఢీకొని పట్టాలు తప్పిన రైలు

కోల్ కతా : అభయారణ్యం నుంచి పొరపాటున పట్టాలపైకి వచ్చిన ఏనుగును ఢీకొన్న రైలు పట్టాలు తప్పింది. పశ్చిమబెంగాల్ లోని గుల్మా ప్రాంతంలో ఇవాళ సాయంత్రం ఈ సంఘటన జరిగింది. సిలిగురి నుంచి అలీపూర్ డెమూ ప్యాసింజర్ రైలు.. గుల్మా- సెవోక్ స్టేషన్ల మధ్య ఏనుగును ఢీకొట్టి పట్టాలు తప్పింది. చనిపోయిన ఏనుగు మహానంద అభయారణ్యానికి చెందిందని తెలిసింది. కాగా, ఈ సంఘటనలో ప్రయాణికులు గాయపడిందీ, లేనిదీ తెలియాల్సిఉంది.

 

గ్యాస్‌ లీక్‌.. ఆరుగురికి గాయాలు

విజయనగరం : జిల్లాలోని గరుగుబిల్లి మండలం వల్లరిగొడవలో ఓ ఇంట్లో గ్యాస్‌ లీక్‌ అయ్యింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

21:57 - December 14, 2015

హైదరాబాద్ నడిబొడ్డు లో చేతబడి భయం.. విజయవాడల ఇందు చేసుకున్న చంద్రులు.. చండీయాగానికి రమ్మని చంద్రాలుకు పిలుపు. జీహెచ్ఎంసీ మీద బావబామ్మర్దుల లెక్కలు... సర్వేల మీద కేటీఆర్... సత్తాను నమ్మిన హరీష్....ఓ ఎద్దు రాస్తారొకో చేసింది.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

21:51 - December 14, 2015

ఆర్థిక కష్టాల్లో ఉన్న వారిని గుర్తిస్తారు... అడగకపోయినా అప్పులిస్తారు. క్షణాల్లో మనీ అరెంజ్ చేస్తారు. అధిక వడ్డీలతో నడ్డివిరుస్తారు. బెదిరిస్తారు,... వేధిస్తారు... వియవాడలో జరిగిన కాల్ మనీ వ్యవహారం ఎపి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ లో చూద్దాం... మరిన్ని వీడియోలో చూద్దాం...

 

21:40 - December 14, 2015

ఢిల్లీ : అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచాలని తీసుకున్న నిర్ణయం భారత కరెన్సీ విలువపై తీవ్ర ప్రభావం చూపింది. యూఎస్‌ ఫెడ్‌ రిజర్వు నిర్ణయంతో డాలరుతో రూపాయి మారకపు విలువ భారీగా పతమయ్యింది. రెండేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. సోమవారం డాలరుతో రూపాయి మారకపు విలువ 67.09గా నమోదయ్యింది.
బుధవారం వడ్డీ రేట్లు పెంచనున్న అమెరికా ఫెడరల్‌ రిజర్వ్
మన కరెన్సీ రూపాయికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ పతనం దిశగా పయనిస్తోంది. అమెరికా ఫెడర్‌ రిజర్వు బుధవారం వడ్డీ రేట్లు పెంచనుంది. దీంతో విదేశీ సంస్థాగత మదుపర్లు మన స్టాక్‌ మార్కెట్‌ నుంచి భారీగా ఈక్విటీలను అమ్ముతున్నారు. ఈ ప్రభావం రూపాయి మారకు విలువపై పడింది.
డాలరుతో రూపాయి మారకపు విలువ 67.09
సోమవారం రూపాయి మారకపు విలువ భారీగా పతనం అయ్యింది. ఒక అమెరికా డాలరు కొనుగోలుకు చేయడానికి మన 67.09 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. 2013 సెప్టెంబర్‌ 4 తర్వాత రూపాయి మారకపు విలువ ఈ స్థాయిలో పతనం అవ్వడం ఇదే మొదటిసారి. ఈనెలలో తొమ్మిది ట్రేడింగ్‌ సెషన్లలో ఏడుసార్లు రూపాయి విలువ పతనం అయ్యింది. గత నెలలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 2.1 శాతం పడిపోయింది. ఆసియా కరెన్సీల్లో మన రూపాయే డోలాయమాన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది.
మంగళవారం అమెరికా ఫెడరల్‌ రిజర్వ్ భేటీ
దాదాపు పదేళ్ల తర్వాత అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేటు పెంచాలని నిర్ణయించింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఫెడరల్‌ రిజర్వు మంగళవారం సమావేశం కానుంది. ఈ నిర్ణయం తర్వాత విదేశీ సంస్థాగత మదుపర్లు గతనెల 1 నుంచి మన స్టాక్‌ మార్కెట్ల నుంచి 12 వేల కోట్ల రూపాయల ఈక్విటీలను అమ్మేశారు. రూపాయి విలువ పతనానికి ఇదే ప్రధాన కారణం. ఎఫ్‌ఐఐలు ఈక్విటీలను భారీగా అమ్మడం ద్వారా ఈనెలలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 4 శాతం నష్టపోయింది. ఈ నెలలో ఎక్కువ రోజులు 7,575 పాయింట్ల దగ్గరే నిఫ్టీ ట్రేడ్‌ అయ్యింది. డాలరుతో రూపాయి మారకపు విలువ పతనం మరికొన్ని రోజులు కొనగాసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
చైనా కరెన్సీ యెన్‌ విలువ పతనం
రూపాయల విలువ పతనానికి మరో కారణం కూడా లేకపోలేదు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా విస్తరించిన చైనా కరెన్సీ యెన్‌ విలువ కూడా పడిపోయింది. యెన్‌ విలువ నాలుగున్నరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. 2011 జులై తర్వాత యన్‌ విలువ భారీగా పతనం కావడం ఇదే మొదటిసారి. ఇది కూడా రూపాయి విలువ పతనంపై ప్రభావం చూపింది. యెన్‌ విలువ మరింత క్షీణించే అవకాశం ఉందని పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా సోమవారం ప్రకటించింది. చైనా తమ ద్రవ్య విలువను తగ్గిస్తే అది.... రూపాయి విలువ పతనంపై మరింత ప్రభావం చూపుతుందని అంచనావేస్తున్నారు.
బాండ్లపై పెట్టుబడులకు అధిక వడ్డీ
రూపాయిల విలువ క్షీణిస్తుండటంతో రిజర్వు బ్యాంకు ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది మరింత పతనం కాకుండా చర్యలు చేపట్టింది. రూపాయి మరింతి ఒడిదొడుకులకు లోనుకాకుండా బాండ్ల రూపంలో పెట్టుబడులు పెట్టిన వారికి మరింత వడ్డీ చెల్లిస్తామని ఆర్‌బీఐ అధికారులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్‌ నుంచి మరింత ఎక్కువగా బాండ్లు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

 

 

21:36 - December 14, 2015

ఢిల్లీ : మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జిఎస్‌టి బిల్లుకు మోక్షం దొరికేనా? శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో జిఎస్‌టి బిల్లు ఆమోదింపజేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ బిల్లు పాస్‌ కావాలంటే విపక్షాల సహకారం తప్పనిసరి. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకరిస్తాయా? లేదా?
జిఎస్‌టి బిల్లును ఆమోదింపజేసుకోవాలని మోడీ ప్రభుత్వం తహతహ
ప్రస్తుత పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో జిఎస్‌టి బిల్లును ఆమోదింపజేసుకోవాలని మోడీ ప్రభుత్వం తహతహ లాడుతోంది. ఇందుకోసం పట్టుదలకు పోకుండా ప్రతిపక్షాలను మచ్చిక చేసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు రాజ్యసభలో కాంగ్రెస్‌ నేతలు గులాంనబీ ఆజాద్, ఆనంద్‌శర్మలతో భేటి అయ్యారు. బిల్లు ఆమోదంపై వారితో చర్చించారు. మరోవైపు సుష్మాస్వరాజ్‌ లోక్‌సభలో కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌ జ్యోతిరాదిత్య సింధియాతో మంతనాలు జరిపారు. బిల్లు ఆమోదం కోసం చర్చలు కొనసాగుతూనే ఉంటాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వర్షార్పనం
వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వర్షార్పనం అయ్యాయని, శీతాకాల సమావేశాలు కూడా నిరర్ధకంగా ముగిసే పరిస్ధితి కనిపిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ప్రజల సమస్యలపై చర్చ జరగాలని దేశం ఎదురు చూస్తోందన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న వస్తు సేవల పన్ను-జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపాలని అంతా ఎదురుచూస్తున్నారని జైట్లీ తెలిపారు. 'మనం మనకోసం పని చేస్తున్నామా, దేశం కోసం పనిచేస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాల'ని జైట్లీ అన్నారు. పండిత్ జవహర్ లాల్ నెహ్రు వారసులమని చెప్పుకుంటున్నవారు.. తాము ఎటువంటి చరిత్ర లిఖిస్తున్నామోనని తమను తామును ప్రశ్నించుకోవాలని సూచించారు.
బిజెపి సభ్యులకు విప్‌ జారీ
జిఎస్‌టి బిల్లు సభలో వచ్చే అవకాశం ఉన్నందున నాలుగు రోజులపాటు తప్పనిసరిగా సభలో ఉండాలని రాజ్యసభలోని తమ పార్టీ సభ్యులకు బిజెపి విప్‌ జారీ చేసింది.
జిఎస్‌టి బిల్లుపై కాంగ్రెస్‌ అభ్యంతరాలు
జిఎస్‌టి బిల్లుపై కాంగ్రెస్‌ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బిల్లులోని మూడు అంశాలను తొలగించాలని కాంగ్రెస్‌ షరతు విధించింది. ఈ నేపథ్యంలో నేషనల్‌ హెరాల్డ్‌ కేసు తెరపైకి రావడంతో బిల్లుకు బ్రేక్‌ పడింది. ఈ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు కోర్టు సమన్లు జారీ చేయడంతో కాంగ్రెస్‌ అగ్గి మీద గుగ్గిలమైంది. సోనియా, రాహుల్ పట్ల ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ను స్తంభింపజేసింది.
ఈ సమావేశాల్లో ఆమోదం పొందడం తప్పనిసరి
వచ్చే ఏప్రిల్‌ నుంచి జిఎస్‌టి బిల్లు అమలులోకి రావాలంటే ఈ సమావేశాల్లో ఆమోదం పొందడం తప్పనిసరి. పార్లమెంట్‌ సజావుగా సాగితేనే బిల్లు సాధ్యమవుతుంది. లోక్‌సభలో బిజెపికి పూర్తి మెజారిటీ ఉన్నందున ఎలాంటి సమస్య లేదు. రాజ్యసభలో విపక్షాలదే మోజారిటీ కావడంతో బిల్లుకు బ్రేక్‌ పడుతోంది. శీతాకాల సమావేశాలకు మరో వారం రోజుల గడువు మాత్రమే ఉండడంతో బిజెపి విపక్షాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కరుణిస్తుందా...లేదా.. అన్నది వేచి చూడాలి.

 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మెదక్ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నర్సాపూర్‌ మండలం రెడ్డిపల్లి దగ్గర ఆటో, బైక్‌ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

కరీంనగర్ లో విద్యార్థినిపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం

కరీంనగర్ : ఓ కానిస్టేబుల్ విద్యార్థినిపై అత్యాచారయత్నానానికి పాల్పడ్డాడు. మేడిపల్లిలోని బీసీ సంక్షేమ బాలికల వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై భీమయ్య అనే కానిస్టేబుల్‌ అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భీమయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

21:07 - December 14, 2015

ఆధునిక మనిషి 30 సంవత్సరాలకే రకరకాల రోగాల బారిన పడుతున్నాడు. 40 కల్లా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేస్థితికి నెట్టబడుతున్నాడు. 50 ల కల్లా రోగాల పట్టుగా మారిపోతున్నాడు. కానీ ఈ ఆధునిక ప్రపంచంలోనూ.. 65 వసంతాల వయస్సులో చిరు నవ్వులు చిందిస్తూ... చిద్విలాసంగా బతికేస్తున్న వ్యక్తులు.. మన మధ్యనే ఉన్నారు. ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో కమలమ్మ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

20:55 - December 14, 2015

విశాఖ : జ్యోతిబసు స్మారక దేహదాన ప్రోత్సాహక సంస్థలో సభ్యులైన మహాలక్ష్మి మరణించారు. ఆవిడ మృతదేహాన్ని ఆంధ్ర మెడికల్‌ కాలేజీ అనాటమీ విభాగానికి పంపారు. దేహదానం చేసేందుకు సహకరించిన మహలక్ష్మి కుటుంబసభ్యులకు వైద్యులు, వైద్య విద్యార్ధులు అభినందనలు తెలియచేశారు.

20:52 - December 14, 2015

కరీంనగర్ : కళ్ల నుంచి రాళ్లు రావడం చూశాం.. కరీంనగర్‌లో ఓ బాలిక కళ్ల నుంచి విచిత్రంగా కట్టె పుల్లలు వస్తున్నాయి. తొమ్మిదవ తరగతి చదువుతున్న శ్రావణికి గత వారం రోజుల నుంచి కట్టె పుల్లల్లాంటి ఘన పదార్ధం కళ్ల నుంచి వస్తుంది. అవి వచ్చేటప్పుడు తీవ్రమైన నొప్పి పుడుతుందని ఆ బాలిక చెబుతోంది. వైద్యులు శ్రావణిని పరీక్షిస్తున్నారు.

 

20:50 - December 14, 2015

కాకినాడ : ఆంధప్రదేశ్‌ వ్యాప్తంగా గ్రామ రెవిన్యూ సహాయకులు కథం తొక్కారు. వేతన స్కేళ్లను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలను ముట్టడించారు. కార్యలాపాలను స్తంభింపజేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆందోళన చేస్తున్న వీఆర్‌ఏలు కాకినాడంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. 

20:48 - December 14, 2015

గుంటూరు : రాజధాని భూములను రక్షించాలని కోరుతూ సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట సీపీఐ నేతలు ఆందోళనకు దిగారు. ల్యాండ్‌ బ్యాంక్‌ నుంచి సింగపూర్‌ కంపెనీలకు భూమిని ధారాదత్తం చేసేందుకు బాబు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రాజధాని నిర్మాణంపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 

20:45 - December 14, 2015

ఢిల్లీ : అసోంలో తనను ఆలయంలోనికి వెళ్లకుండా ఆర్‌ఎస్‌ఎస్‌ అడ్డుకుందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. బర్‌పేట గుడిలోకి వెళ్లకుండా తనని ఆపడానికి వారెవరని మండిపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతోనే బిజెపి పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. ప్రధాని కేరళ పర్యటన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్‌చాందీని ఓ కార్యక్రమంలో పాల్గొనకుండా మోడీ అవమానించారని రాహుల్‌ అన్నారు. పంజాబ్‌ అబోహర్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో ఇద్దరు దళితుల కాళ్లు చేతులు నరికారని, ఇందులో అకాలిదళ్ నేత హస్తం ఉందన్నారు. ఈ రెండు ఘటనలకు నిరసనగా కాంగ్రెస్‌ సభ్యులు పార్లమెంటులో ఆందోళన చేశారు. ప్రజావ్యతిరేక విధానాలను ప్రధాని ఇప్పటికైనా మార్చుకోవాలని రాహుల్‌ సూచించారు.

 

20:42 - December 14, 2015

గుంటూరు : ఏపీ రాజధాని నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని కోనేరు హంపీ తెలియచేశారు. భాష్యం కాలేజీకి చెందిన 50 మంది విద్యార్ధులతో హంపీ ప్రత్యేకంగా చెస్‌ ఆడారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులను రాజధాని నిర్మాణానికి అందిస్తానని కోనేరు హంపీ చెప్పారు.

20:40 - December 14, 2015

హైదరాబాద్ : ఆశావర్కర్లపై ప్రభుత్వం దమనకాండను కొనసాగిస్తుందని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఈమేరకు వారు మీడియాతో మాట్లాడారు. నాగేశ్వర్‌ అరెస్ట్, ఆయన పట్ల పోలీసుల ప్రవర్తన దారుణమన్నారు.

 

ప్రేమజంట ఆత్మహత్య

పశ్చిమగోదావరి : జిల్లాలోని పాలకోడేరు మండలం గరగపర్రులో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదని తీవ్ర మనస్థాపానికి గురైన ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

 

20:15 - December 14, 2015

విశాఖ : పంటలన్నీ కనుమరుగవుతున్నాయి.. చెట్లన్నీ నాశనం అవుతున్నాయి.. మరోవైపు పల్లె జనం భయం గుప్పిట్లో గడుపుతోంది. అభివృద్ధి పేరిట సర్కారు సాగిస్తోన్న భూయాగం... పచ్చని పల్లెలను ఉద్రిక్తం చేస్తోంది. లాజిస్టిక్‌ హబ్‌ పేరిట సాగుతోన్న సర్కారీ భూదందాపై... ప్రజల వేదనపై 10టివి గ్రౌండ్‌ రిపోర్ట్..
లాజిస్టిక్‌ హబ్‌ పేరిట భూసేకరణ
అనకాపల్లికి చెందిన ఓ నాలుగు గ్రామాలు భయంతో బిక్కు బిక్కు మంటున్నాయి.. క్రూర జంతువులో వచ్చి పడతాయనో.. రౌడీమూకలు విరుచుకు పడతాయనో కాదు..!! అచ్చోసిన అదేదో జంతువులా... మీద పడుతోన్న సర్కారు గురించే వారి భయమల్లా. ఏరోజు వస్తారో... ఎక్కడ ఎవరి భూములు లాక్కుంటారో.. అని పల్లెజనం బెదిరి పోతున్నారు. లాజిస్టిక్‌ హబ్‌ కోసం.. వేలాది ఎకరాలను సమీకరించాలని భావిస్తున్న ప్రభుత్వం.. అడ్డు చెప్పిన వారికి పోలీసు దెబ్బలు రుచి చూపిస్తోంది. విశాఖ జిల్లాలో అభివృద్ధి పేరిట.. గ్రామీణులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న సర్కారీ నియంతృత్వంపై 10టీవీ స్పెషల్‌ రిపోర్ట్.
చేదెక్కుతున్న ప్రజల జీవితాలు
విశాఖ జిల్లా.. అనకాపల్లి మండలం.. తియ్యని బెల్లం పంచే ప్రాంతం. కానీ ఇక్కడి ప్రజల జీవితాలు చేదెక్కుతున్నాయి. అలా అని ఇది చెరకు రైతుల వ్యథ కాదు. భూమిని కోల్పోతున్న గిరిపుత్రుల దైన్యం.. సర్కారు దాష్టీకానికి నిలువెత్తు నిదర్శనం..
చంద్రబాబు సర్కారు పేరు వింటే ఉలిక్కి పడుతున్న ప్రజలు
విశాఖ జిల్లాలోని అనకాలపల్లి మండలంలోని నాలుగు గ్రామాల ప్రజలు.. ఇప్పుడు చంద్రబాబు సర్కారు పేరు వింటే చాలు ఉలిక్కి పడుతున్నారు... అశాంతితో రగిలిపోతున్నారు. కారణం.. చంద్రబాబు సర్కారు... ఈ ప్రాంతంలోని రాజుపాలెం, వల్లూరు, ఎరుకవానిపాలెం, గొర్లెవాని పాలెం గ్రామాలకు చెందిన భూములను లాజిస్టిక్‌ హబ్‌ పేరిట లాక్కోవాలని చూడ్డమే. వెయ్యి ఎకరాలను సేకరించాలని భావిస్తోన్న ప్రభుత్వం.. కొండ పొరంబోకు భూములపై తొలి పంజా విసిరింది. పులుల పంజాను కాచుకోగలిగిన గిరిజనులు.. సర్కారీ పంజా నుంచి మాత్రం తప్పించుకోలేక పోతున్నారు.
భయభ్రాంతులకు గురిచేస్తున్న సర్కార్
రైతుల నుంచి భూములు సేకరించాలంటే... 2013 భూసేరకణ చట్టం ప్రకారం ప్రభుత్వం తగినంత పరిహారం చెల్లించాలి. కొండ పొరంబోకు భూములైనా సరే.. ఆనేలపై ఆధారపడి జీవిస్తున్న రైతులు, రైతు కూలీలకు పరిహారం చెల్లించాలని చట్టంలో స్పష్టంగా ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోవడం లేదు. పైగా ఇదేమని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం.. ఆందోళన చేసిన వారిని అరెస్టు చేయడం ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తోంది.
అభ్యంతరాలను పట్టించుకోని సర్కార్
ఎవరి అభ్యంతరాలనూ ఖాతరు చేయకుండా ప్రభుత్వం.. సర్వే నంబర్‌ 159లో భూసేకరణ కార్యక్రమాలను చేపట్టింది. రైతులు ఎంతో కష్టపడి పెంచుకున్న జీడి చెట్లను నరికి పారేస్తున్నారు. దీంతో పచ్చందనాలు పంచిన గ్రామాలను ఇప్పుడు శ్మశానంలా మార్చేశారు. ఏపీఐఐసీ బోర్డులను పాతి.. అసలీ భూములు మీవి కానే కాదు పొండంటూ దబాయించేస్తున్నారు. ప్రభుత్వమే దౌర్జన్యానికి దిగితే.. ఎవరిని అడగాలో తెలియక గిరిజనులు అల్లాడి పోతున్నారు.
కష్టాలు అన్నీ ఇన్నీ కావు
ఏళ్ళ నాటి నుంచి పెంచుకున్న జీడి తోటలను వదులుకోలేక, న్యాయం అందక రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అక్కడికీ కాస్తంత పలుకుబడి ఉన్నవారి అండతో.. స్థానిక ఎమ్మెల్యేని కలిశారు. ఆయనా చేతులెత్తేయడంతో గిరిజనులు ఏమి చేయాలో దిక్కు తోచని స్థితిలో పడ్డారు.
పరిహారం చెల్లింపులోనూ తీరని అన్యాయం
భూమినైతే దౌర్జన్యంగా తీసేసుకున్నారు.. మరి నష్టపరిహార చెల్లించరా..? ఎందుకు చెల్లించలేదు..? ప్రభుత్వం ఎప్పుడో చెల్లించేసింది. కానీ ఆ పరిహారం అందుకున్నదెవరు..? ఇంకెవరూ.. తెలుగు తమ్ముళ్లే..! ఇలా పరిహారం చెల్లింపులోనూ స్థానికులకు తీరని అన్యాయం చేసింది సర్కారు. కాదు కాదు.. పాలక పక్షంలోని గద్దల్లాంటి పెద్దలు.
ఆ పరిహారం మొత్తం ఎక్కడికి వెళ్లినట్లు..?
ఏళ్ల తరబడి సాగు చేసే రైతే.. భూమి హక్కుదారుడు అవుతాడు. అతడి నుంచి భూమిని స్వాధీనం చేసుకోవాలంటే.. ప్రభుత్వం తప్పనిసరిగా పరిహారం చెల్లించాలి. జీవితానికి భరోసా కల్పించాలి. మంచి ప్యాకేజీ ప్రకటించాలి. అనకాపల్లి మండలంలోనూ స్వాధీనం చేసుకున్న భూములకు పరిహారం చెల్లించినట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే ఆ పరిహారం తమకు అందలేదని గిరిజనం ఆక్రోశిస్తోంది. మరి ఆ పరిహారం మొత్తం ఎక్కడికి వెళ్లినట్లు..?
తెలుగుదేశం పార్టీ బినామీల ఖాతాల్లోకి పరిహారం 
ప్రభుత్వం నుంచి గిరిజనులకు అందాల్సిన పరిహారం ఎక్కువగా తెలుగుదేశం పార్టీ బినామీల ఖాతాల్లోకి వెళ్లినట్లు ఆరోపణలున్నాయి. ఇక్కడి 65 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం మంజూరు చేసిన 20 కోట్ల రూపాయల పరిహారం.. పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. ఇలాంటి అకృత్యాలను అడ్డుకోవాల్సిన అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్‌.. తానూ ఓ 70 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాస్త నోరున్న వారు నిలదీస్తే.. ఎంతో కొంత ముట్టుచెబుతూ.. ఇచ్చిందే పరిహారం.. తీసుకోక పోతే మీ ఇష్టం.. అంటూ తెగేసి చెబుతున్నారు... పాలక పక్షం పెద్దలు. పరిహారం తీసుకున్నా లేకున్నా.. జాగాను మాత్రం ఖాళీ చేసి వెళ్లాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. తమ వేదనను పట్టించుకునే పాలక ప్రతినిధే కరవయ్యేసరికి.. గిరిజనులు వామపక్ష, ప్రజా సంఘాలను ఆశ్రయిస్తున్నాయి. ప్రతిరోజూ ఆందోళనలు, ఉద్యమాలతో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాయి.

 

19:40 - December 14, 2015

కృష్ణా : బెజవాడలో కాల్‌మనీ వ్యవహారం రగులుతోంది. కాల్‌ యముళ్ల భరతం పట్టాలని అందరూ డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఇది రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ నేతలే కాల్‌మనీని నడిపించారని తేలిపోయిందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే వైసీపీ నేతలు కూడా ఇందులో ఉన్నారంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కఠినంగా వ్యవహరిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అన్నీ తెలిసి ఇప్పుడు బాబు డ్రామాలేస్తున్నారంటూ జగన్‌ మండిపడ్డారు. బాబుకే జగన్‌ బహిరంగలేఖ రాశారు.

19:37 - December 14, 2015

నల్గొండ : చౌటుప్పల్‌లోని శ్రీని ఫార్మాసూటికల్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కెమికల్‌ రియాక్టర్‌ పేలడంతో మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ఘటనలో అనేకమంది కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డికి చెందిన శ్రీని ఫార్మాసూటికల్స్ లోని ప్రొడక్షన్ యూనిట్ నెంబర్ 3 లో భారీ విస్ఫోటనం జరిగింది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈఘటనలో పలువురు కార్మికులకు గాయాలైనట్లు సమాచారం. మూడు ఫైర్ ఇంచన్లతో సిబ్బంది మంటలార్పుతున్నారు. కార్మికుల కుటుంబ సభ్యులు, బంధవులను పోలీసులు లోపలికి రానిన్వవడం లేదు. లోపల ఉన్న కార్మికులను బయటికి రానివ్వడం లేదు. కాగా ఈ ఘటనలో ముగ్గురు నుంచి నలుగురు కార్మికుల వరకు చనిపోయారని... మరికొంతమంది గాయపడినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పర్మినెంట్ లేబర్స్ ను తొలగించి... కాంట్రాక్టు లేబర్స్ ను పనిలో చేర్చుకున్నారు. కొత్తగా వచ్చిన కార్మికులకు అవగాహన లేదని.. దీంతోనే ప్రమాదం జరిగిందని కార్మికులు భావిస్తున్నారు. ప్రమాదంపై ఫ్యాక్టరీ యాజమాన్యం, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ స్పందించ లేదు. ఘటనపై పోలీసులు మాత్రమే స్పందించారు.

 

చౌటుప్పల్‌లోని శ్రీని ఫార్మాసూటికల్స్ లో భారీ అగ్నిప్రమాదం

నల్గొండ : చౌటుప్పల్‌లోని శ్రీని ఫార్మాసూటికల్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కెమికల్‌ రియాక్టర్‌ పేలడంతో మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ఘటనలో అనేకమంది కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఫార్మా కంపెనీ టీఆర్‌ఎస్‌ నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డికి చెందింది.

చౌటుప్పల్ శివారులో భారీ అగ్నిప్రమాదం

నల్లగొండ : చౌటుప్పల్ శివారులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీని ఫార్మాస్యూటికల్స్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. పలువురు కార్మికులు గాయపడినట్లు సమాచారం. రియాక్టర్ పేలడంతో అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీని ఫార్మాస్యూటికల్స్ టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డికి చెందినదిగా గుర్తించారు.

 

18:34 - December 14, 2015

మహబూబ్ నగర్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో తుది అంకం మొదలైంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో ఉండేదెవరో తేలిపోయింది. పాలమూరు జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఐదుగురు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి ఇద్దరు బరిలో ఉండగా కాంగ్రెస్, టీడీపీ నుంచి ఒక్కో అభ్యర్థి..మరో స్వతంత్ర అభ్యర్థి సైతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈనెల 27న జరిగే ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
పాలమూరు జిల్లాలో ఇద్దరు అభ్యర్థుల ఉపసంహరణ
ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ శనివారం ముగియడంతో..పాలమూరు జిల్లాలో ఇద్దరు అభ్యర్థులు ఉపసంహరణ చేసుకున్నారు. ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోళ్ల కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి శ్రీనివాసచారి తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఏడుగురు అభ్యర్థుల్లో ఇద్దరు నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో బరిలో చివరకు ఐదుగురు మిగిలారు. వీరిలో టీఆర్ఎస్ తరఫున జగదీశ్వర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్ తరఫున కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, టీడీపీ తరఫున కొత్తకోట దయాకర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా జగదీశ్వర్ రెడ్డి పోటీలో ఉన్నారు. బరిలో ఉండేవాళ్లెవరో తేలిపోవడంతో ఎన్నికల కమిషన్ ఆ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో మొత్తం 1262 ఓట్లు
జిల్లాలో మొత్తం 1262 ఓట్లుండగా అభ్యర్థి గెలుపు కోసం 421 మొదటి ప్రాధాన్యత ఓట్లు రావాల్సి ఉంటుంది. అయితే మెజారిటీపై పార్టీలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా మారిన సమీకరణాల నేపథ్యంలో ఒక్క స్థానానికే పరిమితమై మాజీ జడ్పీ ఛైర్మన్ కూచుకుళ్ల దామోదర్ రెడ్డిని బరిలో నిలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అభ్యర్థులు విత్ డ్రా కావడంతో ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయోమోనని పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ ఎమ్మెల్యే డీకే అరుణ తెరవెనుక మంత్రాంగం నడుపుతూ అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక టీడీపీ కూడా మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డిని బరిలో దింపినప్పటికీ ఆ పార్టీ నేతలు ఓటింగ్ పై మీమాంసలో పడిపోయారు. మొదట కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామని చెప్పినప్పటికీ ఆ దిశగా రెండు పార్టీలు కూడా సైలెంట్‌గానే ఉన్నాయి.
జోరుగా అవగాహన శిబిరాలు
ఇక అధికార టీఆర్ఎస్ మాత్రం దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఆ పార్టీ తరఫున రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేస్తూ..ఓట్లను సమీకరించేపనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే రెండుసార్లు అవగాహన శిబిరాలు సైతం నిర్వహించి ఇతర పార్టీల వాళ్లను పెద్దఎత్తున ఆకర్షిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలకు అతీతంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు స్వచ్చందంగా టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నారని గులాబీ నేతలు చెప్తున్నారు. మొత్తానికి ఎన్నికలకు మరో 15 రోజులు మాత్రమే గడువుండటంతో ఓటర్లను కాపాడుకునే ప్రయత్నంలో అభ్యర్థులు తలమునకలవుతున్నారు.

 

18:24 - December 14, 2015

ఖమ్మం : జిల్లాలోని అశ్వాపురం పోలీసులు ఓ గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 25 కేజీల గంజాయి, లక్షా అరవై వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. సీఐ సాంబరాజు తన సిబ్బందితో దాడి చేసి ఈ ముఠాను పట్టుకున్నారు. చింతూరు ప్రాంతం నుంచి గంజాయి సేకరించి.. మహారాష్ట్రలో అమ్ముకుంటున్నట్లు నిందితులు పోలీసుల విచారణలో బయటపెట్టారు. 

18:22 - December 14, 2015

మెదక్‌ : జిల్లాలోని రామచంద్రాపురం మండలం అమీన్‌పూర్‌లో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు చెరువులో పడి మృతి చెందారు. మృతులను మురళి, రాజీవ్‌ కుమార్‌గా గుర్తించారు. దీంతో వీరి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మురళి కుటుంబం బతుకుతెరువు కోసం వరంగల్‌ నుంచి అమీన్‌పూర్‌ వచ్చి స్థిరపడింది. రాజీవ్‌ కుమార్‌ కుటుంబం మధ్యప్రదేశ్‌ నుంచి ఈ గ్రామానికి వచ్చింది. ఆదివారం సాయంత్రం నుంచి మురళి, రాజీవ్‌ కుమార్‌ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతుకున్నారు. ఇవాళ అమీన్‌పూర్‌ చెరువులో ఇద్దరి మృత దేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చెరువులో ఈతకు వెళ్లి... ఈత రాకపోవడంతో మునిగి చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

శ్రీలంకపై కీవీస్ విజయం

హైదరాబాద్ : శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ లో అతిథ్య న్యూజిలాండ్‌ జట్టు సమిష్టి కృషితో 122 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో సౌథీ రెండు ఇన్నింగ్స్ ల్లో 6 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో న్యూజిలాండ్‌ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0తో అధిక్యం సాధించింది.

17:14 - December 14, 2015

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ధైర్యముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి సవాలు విసిరారు. ఓటమి భయంతోనే టిఆర్‌ఎస్‌ తలసాని రాజీనామాను అంగీకరింపజేయడం లేదని విమర్శించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం జిహెచ్‌ఎంసి పరిధిలో ఓట్ల తొలగింపుకు ప్రయత్నించిందని ఢిల్లీలో ఎలక్షన్‌ కమిషన్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.

 

'కాల్ మనీ'పై హెచ్ ఆర్సీలో పిటిషన్‌

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాల్‌మనీ వ్యవహారానికి సంబంధించి మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్‌ దాఖలైంది. నిందితులపై తగిన చర్యలు తీసుకుని బాధితులను కాపాడేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని లాయర్‌ అరుణ్‌కుమార్‌ పిటిషన్‌లో కోరారు.. 

17:06 - December 14, 2015

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాల్‌మనీ వ్యవహారానికి సంబంధించి మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్‌ దాఖలైంది. నిందితులపై తగిన చర్యలు తీసుకుని బాధితులను కాపాడేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని లాయర్‌ అరుణ్‌కుమార్‌ పిటిషన్‌లో కోరారు.. 

17:04 - December 14, 2015

హైదరాబాద్ : కాల్‌మనీ వ్యవహారంతో చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు రక్షణ ఇవ్వకపోగా.. ఆ పార్టీ నేతలే ప్రమాదకరంగా తయారయ్యారంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. ఎన్నికలకు ముందు బాబు వస్తే ఆడపిల్లలకు రక్షణ అంటూ ప్రచారం చేసి.. ఈ రోజు ఆ ఆడపిల్లలకు ఆ పార్టీ నేతలే రక్షణ లేకుండా చేసినా.. సీఎం వారిని కాపాడుతున్నారని వారు విరుచుకుపడ్డారు.

రేపు చెన్నైలో సత్యమూర్తి అంత్యక్రియలు

తమిళనాడు : 160 సినిమాలకు తన కలంతో ప్రాణం పోసిన రచయిత సత్యమూర్తి అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం మూడున్నరకు చెన్నైలో జరుగుతాయి. ఈ విషయాన్ని ఆయన కుమారుడు దేవీశ్రీప్రసాద్‌ తెలియచేశారు. తన తండ్రే తనకు స్ఫూర్తి అని ఈ సందర్భంగా దేవీ ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలంతూ సత్యమూర్తి భౌతికకాయాన్ని సందర్శించిన నివాళులు అర్పిస్తున్నారు.

17:01 - December 14, 2015

తమిళనాడు : 160 సినిమాలకు తన కలంతో ప్రాణం పోసిన రచయిత సత్యమూర్తి అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం మూడున్నరకు చెన్నైలో జరుగుతాయి. ఈ విషయాన్ని ఆయన కుమారుడు దేవీశ్రీప్రసాద్‌ తెలియచేశారు. తన తండ్రే తనకు స్ఫూర్తి అని ఈ సందర్భంగా దేవీ ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలంతూ సత్యమూర్తి భౌతికకాయాన్ని సందర్శించిన నివాళులు అర్పిస్తున్నారు.

 

16:51 - December 14, 2015

హైదరాబాద్ : మంత్రి అచ్చెన్నాయుడుపై వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు ఫైరయ్యారు. 'నువ్వెంత... నీ అనుభవమెంత?' అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం మెప్పు కోసం వజ్రపుకొత్తూరు బహిరంగ సభలో తనపై లేనిపోని ఆరోపణలు చేశారని ఆరోపించారు. దమ్ముంటే తన ప్రజా జీవితంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడు ఇరవై ఏళ్లుగా మద్యం సిండికేట్లను నడుపుతున్నారని విమర్శించారు. పోలీసుల బదిలీలకు భారీగా డబ్బు వసూలు చేశారని ఆరోపించారు. అచ్చెన్నాయుడు చరిత్ర అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.

 

అగ్రిగోల్డ్ కేసు విచారణ సోమవారానికి వాయిదా

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసు విచారణను హైకోర్ట్ సోమవారానికి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్‌ ఆస్తులను విక్రయించి బాధితులకు చెల్లించేందుకు కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. అయితే ఆయా కంపెనీల సామర్థ్యమేంటో తేల్చాలని అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలు పరిష్కరించడానికి వేసిన కమిటీకి సూచించింది.

 

16:47 - December 14, 2015

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసు విచారణను హైకోర్ట్ సోమవారానికి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్‌ ఆస్తులను విక్రయించి బాధితులకు చెల్లించేందుకు కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. అయితే ఆయా కంపెనీల సామర్థ్యమేంటో తేల్చాలని అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలు పరిష్కరించడానికి వేసిన కమిటీకి సూచించింది.

 

16:46 - December 14, 2015

హైదరాబాద్ : 'మీ వాళ్లను కాపాడుకుంటారా.. ఏమీ తెలియని మా వాళ్లను ఇరికిస్తారా.. ఇదేనా మీ అనుభవం.. ఇదేనా మీ రాజకీయం'. ఇవే సూటి మాటలతో కాల్‌మనీ వ్యవహారంపై బాబును జగన్‌ నిలదీశారు. కాల్‌మనీ వ్యవహారమేదో కొత్తగా తెలిసినట్లు బాబు నాటకమాడుతున్నారంటూ ఓ లేఖాస్త్రాన్ని జగన్‌ సంధించారు. టీడీపీ నేతల విహార యాత్రలకు సైతం స్పాన్సరింగ్‌ కాల్‌మనీవారే చేస్తున్నారంటే.. వారి అనుబంధం ఎంతలా ఉందో తెలిసిపోతుందని.. అయినా బాబు బీరాలు పలుకుతున్నారంటూ జగన్‌ మండిపడ్డారు.

 

16:43 - December 14, 2015

హైదరాబాద్ : బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు చెందిన కన్‌స్ట్రక్షన్స్ కార్యాలయం ఎదుట బ్యాంకు అధికారులు ఆందోళనకు దిగారు. 18 బ్యాంకుల అధికారులు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రోగ్రెసివ్‌ అడ్మినిస్ట్రేషన్స్‌ పేరుతో కావూరి కన్‌స్ర్టక్షన్‌ కంపెనీ నిర్వహిస్తున్నారు.

 

16:39 - December 14, 2015

జర్మనీ : ఫేస్ బుక్ కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. హాంబర్గ్ లోని సంస్థ కార్యాలయంపై దాదాపు 20 మంది దాడి చేసి అద్దాలు పగలగొట్టి, పెయింట్ చల్లారు. కార్యాలయం ప్రవేశద్వారం వద్ద 'ఫేస్బుక్ డిజ్లైక్' అని పెయింట్ తో రాశారు. దాడి చేసిన దుండగులు నల్లటి దుస్తులు, ముసుగులు ధరించినట్టు పోలీసులు చెప్పారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తున్న జాతి వివక్ష వ్యాఖ్యల వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని జర్మనీ నాయకులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

16:37 - December 14, 2015

మహారాష్ట్ర : క్రికెటర్‌ రోహిత్‌ శర్మ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. తన స్నేహితురాలు రితికను రోహిత్‌ వివాహమాడాడు. ముంబైలోని ఒక స్టార్‌ హోటల్‌లో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. భారత క్రికెటర్లు, సినీ తారలతో పాటు రోహిత్ మిత్రులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే,ఉమేశ్ యాదవ్, సురేశ్ రైనా,రవీంద్ర జడేజా, తదితరులు పెళ్లికి హాజరయ్యారు. యువరాజ్, సురేశ్ రైనా కూడా వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

16:35 - December 14, 2015

ఢిల్లీ : హస్తినలో గుడిసెల కూల్చివేతపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం రాత్రి పశ్చిమ ఢిల్లీలోని షకూర్‌ బస్తీలో కూల్చివేత ప్రాంతాన్ని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సందర్శించారు. రైల్వే అధికారులు.. ఎందుకు గుడిసెలు కూల్చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలకు కనీస వసతులు కల్పించడంలో ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ విఫలమయ్యాయని రాహుల్ ఆరోపించారు. 

16:34 - December 14, 2015

ఢిల్లీ : ప్రధానమంత్రి మోడీ వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ చెప్పారు. పాకిస్తాన్‌లో తన రెండు రోజుల పర్యటనకు సంబంధించి సుష్మాస్వరాజ్‌ రాజ్యసభలో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2016లో మోదీ పాకిస్తాన్‌ పర్యటన ఉంటుందని తెలిపారు. సుష్మాస్వరాజ్‌ పాకిస్తాన్‌ పర్యటనపై ప్రకటన చేస్తున్న సమయంలో విపక్షాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. పంజాబ్‌ శాంతి భద్రతల అంశంపై నినాదాలు చేశాయి. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది.

 

16:30 - December 14, 2015

తూర్పుగోదావరి : జిల్లాలో నిరుపేదల రేషన్‌ కష్టాలపై 10 టీవీ కథనాలకు అధికారులు స్పందించారు. ఛానల్‌ ప్రసారంచేసిన కథనాలపై రియాక్టయిన అధికారులు లబ్దిదారులకు రేషన్‌ సరుకులు అందేలా చర్యలు చేపట్టారు.
మొరాయిస్తోన్న ఐపోస్‌ విధానం
10టీవీ వరుస కథనాలు.. పదివేల మంది రేషన్‌ కష్టాలను తీర్చింది. తూర్పుగోదావరి జిల్లాలో రేషన్‌ పంపిణీలో అక్రమాలు అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఐపోస్‌ విధానం.. రెండు నెలలుగా మొరాయిస్తోంది. ఐపోస్‌ మిషన్‌ సమస్య వల్ల.. లబ్ధిదారుల వేలి ముద్రలు నమోదు కావడం లేదు. కొందరి వేలి ముద్రలను మ్యాచ్‌ చేస్తున్న మిషన్‌.. వేలాది లబ్దిదారుల వేలిముద్రలను మ్యాచ్‌ చేయడం లేదు. దీంతో.. పదివేల మందికి రేషన్‌ సరకులు అందని పరిస్థితి ఏర్పడింది. ఇందులో 3వేల మంది వృద్ధులు.. వికలాంగులూ ఉన్నారు.
అధికారుల ఉదాసీనత
ఐపోస్‌ విధానంలోని లోపాలను గుర్తించి సరిచేయడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. బాధితులంతా కలెక్టర్‌ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్‌‌కి వచ్చి తమ గోడు చెప్పుకున్నా ప్రయోజనం లేకపోయింది. కలెక్టరేట్‌ అధికారులు వీరిని సివిల్‌ సప్లయ్‌ అధికారుల దగ్గరకు పంపారు.. వాళ్లు మండల స్థాయి అధికారుల వద్దకు వెళ్లాలని చెప్పారు.. ఇలా అన్నిచోట్లా తిరిగి తిరిగి.. ఆఖరికి డీలర్‌ దగ్గరకు వెళ్లే సరికి రేషన్ గడువు అయిపోయింది.. ఇలా ఆ నెల సరుకులులేక లబ్దిదారులు పస్తులుండే పరిస్థితి వచ్చింది..
10 టీవీ కథనాలు ప్రసారం
రేషన్ సరుకులు అందక ఆకలితో అలమటిస్తున్న వారి కష్టంపై... 10 టీవీ కథనాలు ప్రసారం చేసింది.. ఈ కథనాలకు స్పందించిన అధికారులు వేలిముద్రలు పడనివారికి ఐరిస్‌ ద్వారా రేషన్‌ పంపిణీకోసం చర్యలు చేపట్టారు.. షాపుల్లో ఐరిస్‌ యంత్రాలు ఏర్పాటుచేశారు. రేషన్ సరుకులు అందకుంటే లబ్ధిదారులు వెంటనే వీఆర్ వోను సంప్రదించాలని పౌరసరఫరా అధికారులు సూచిస్తున్నారు. తమ గోడును కథనాలుగా ప్రసారం చేసి... మేలు చేసిన టెన్‌టీవీ.. ఎప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందన్న సత్యాన్ని మరోమారు నిరూపించిందని స్థానికులు ప్రశంసించారు.

 

16:21 - December 14, 2015

శ్రీకాకుళం : జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విచిత్రమైన వాతావరణం ఏర్పడింది.. సీతంపేట, భామిని, పాలకొండ, కొత్తూరు, పాతపట్నంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. సాయంత్రం ఐదునుంచి ఉదయం ఏడుగంటలవరకూ విపరీతంగా మంచు కురుస్తోంది... చలిగాలుల తీవ్రత పెరిగింది.. భారీగా కమ్ముకున్న మంచుతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.. మంచుతో జీడి, మామిడి, ఇతర పంటల పూత రాలిపోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు..

 

ఎసిబి కోర్టులో లొంగిపోయిన అంబర్‌పేట్‌ తహసిల్దార్‌

హైదరాబాద్ : లంచం తీసుకున్న కేసులో అంబర్‌పేట్‌ తహసిల్దార్‌ సంధ్యారాణి ఎసిబి న్యాయస్థానంలో లొంగిపోయారు. కోర్టు ఆమెకు 14రోజుల రిమాండ్‌ విధించింది. అధికారులు సంధ్యారాణిని చంచల్‌గూడా జైలుకు తరలించారు. 

15:57 - December 14, 2015

హైదరాబాద్‌ : మెట్రో కార్యాలయం ముందు కాంగ్రెస్‌ నేతలు ధర్నాకు దిగారు.. ఏదో ఒక వంకతో మెట్రో పనులు ఆపేస్తున్నారని ఆరోపించారు.. వెంటనే ఈ వర్క్ మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు.. ఉప్పల్ లో రైతుల నుంచి సేకరించిన భూమికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీధర్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.. వీరిని పోలీసులు అరెస్టు చేశారు..

15:55 - December 14, 2015

హైదరాబాద్ : లంచం తీసుకున్న కేసులో అంబర్‌పేట్‌ తహసిల్దార్‌ సంధ్యారాణి ఎసిబి న్యాయస్థానంలో లొంగిపోయారు.. కోర్టు ఆమెకు 14రోజుల రిమాండ్‌ విధించింది.. సంధ్యారాణిని చంచల్‌గూడా జైలుకు తరలించారు అధికారులు.. ఓ వ్యక్తినుంచి లంచం తీసుకుంటూ ఆమె సోదరుడు మూడురోజులక్రితం ఏసీబీకి చిక్కాడు.. ఈకేసులో తనను అరెస్టు చేస్తారన్న భయంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు..

 

15:42 - December 14, 2015

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. అత్యుత్సాహం ప్రదర్శించారు. పాదయాత్ర చేస్తున్న ఆశాలపై విరుచుకుపడ్డారు. ఆశావర్కర్లకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తూరు వద్ద ఆశావర్కర్ల పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆశావర్కర్లకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్న నాగేశ్వర్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. శాంతియువతంగా పాదయాత్ర చేస్తున్న ఆశాలపై జులుం ప్రదర్శించారు. నాగేశ్వర్ తోపాటు పులువురు ఆశాలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఎత్తుకెళ్లి వ్యాన్ లో విసిరేశారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో నాగేశ్వర్‌తో సహా పలువురి ఆశాలకు గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పోలీసులు తీరుపై మండిపడిన నాగేశ్వర్
ఆశా వర్కర్ల పాదయాత్రలో పోలీసులు చేసిన హంగామాపై నాగేశ్వర్ మండిపడ్డారు. పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రపై పోలీసులు నిరంకుశత్వం ప్రదర్శించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య తెలంగాణ వస్తుందనుకున్నాము తప్ప.. నిర్బంధాల తెలంగాణగా ఉంటుందని అనుకోలేదని వాపోయారు. ఆశావర్కర్లు చేస్తున్న సమ్మె న్యాయమైందా... కాదా .. ప్రభుత్వం చెప్పాలన్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

 

14:58 - December 14, 2015

విజయవాడ : కాల్‌ మనీ కేటుగాళ్ల ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మీడియా ముందుకు వచ్చి బాధితులు తమ గోడును చెప్పుకుంటున్నారు. కాల్‌ మనీ ముఠాల దారుణాలను వెల్లడి చేస్తున్నారు. అప్పులిచ్చి..ఆ తరువాత వడ్డీ పేరుతో బలవంతంగా ఆస్తులను లాగేసుకున్న వైనాన్ని వివరిస్తున్నారు. మహిళలపై ముఠాలు జరిపిన ఆకృత్యాలను బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు.

 

మర్డర్‌ కేసు... కోర్టులో లొంగిపోయిన జేడీయూ ఎమ్మెల్యే

పాట్నా : బీహార్‌లో అధికార జేడీయూకి చెందిన ఎమ్మెల్యే రమేష్‌ సింగ్‌ కుష్వారా ఓ మర్డర్‌ కేసులో కోర్టులో లొంగిపోయారు. 18 సంవత్సరాల క్రితం నాటి ఈ కేసులో ఆయన సివాన్‌ కోర్టు ఎదుట సరెండర్‌ అయ్యారు. 1997లో జరిగిన ఈ హత్య కేసులో తన ప్రమేయం ఉన్నట్లు అంగీకరించిన ఆయన లొంగిపోయిన తర్వాత బెయిల్‌ పిటిషన్‌ పెట్టుకున్నారు. కుశ్వారా ప్రస్తుతం బీహార్‌లో జిరాదే అసెంబ్లీ నియోజక వర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 

రాహుల్ ఆరోపణలపై వాస్తవం లేదు - రాజ్ నాథ్ సింగ్..

న్యూఢిల్లీ : కేరళ సీఎం ఒమెన్ చాంఢీని ప్రధాని మోడీ అవమానించారని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. లోకసభలో ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. కేరళ మాజీ కాంగ్రెస్ నేత ఆర్. శంకర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఇవాళ ప్రధాని మోడీ పాల్గోనున్నారు. ఆ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం ఒమెన్ చాందీని దూరం పెట్టారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఒమెన్‌ను అడ్డుకునే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని రాజ్‌నాథ్ అన్నారు. రాహుల్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 

రాజ్యసభ వాయిదా..

ఢిల్లీ : రాజ్య‌స‌భ మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు వాయిదా ప‌డింది. ఈమేర‌కు డిప్యూటీ ఛైర్మ‌న్ ప్ర‌క‌టించారు. ఇవాళ స‌భ‌లో ఢిల్లీలో గుడిసెల కూల్చివేత‌ను నిర‌సిస్తూ ప్ర‌తిప‌క్షాలు స‌భ‌లో ఆందోళ‌న‌కు దిగాయి. నినాధాల‌తో స‌భ‌ను హోరెత్తించాయి

షాకూర్ బస్తీ ఘటనపై రైల్వే మంత్రి ప్రకటన..

ఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలోని షాకుర్ బ‌స్తీలో నిన్న పేద‌ల గుడిసెల‌ను రైల్వేశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు క‌లిసి కూల్చివేసిన ఘ‌ట‌నపై ఆ శాఖ మంత్రి ప్రకటించారు. ఈ మేరకు లోక్ సభలో ఆయన ప్రకటన చేశారు. అధికారులు స‌రియైన విధంగానే నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే వ్య‌వ‌హ‌రించార‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఒక చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే.

చెరువులో ఈతకు వెళ్లి చిన్నారుల మృతి..

మెదక్: జిల్లాలోని ఆర్‌సీ పురం పోలీస్‌స్టేషన్ పరిధిలో అమీన్‌పూర్ చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. 

వనస్థలిపురంలో అక్రమ కట్టడం కూల్చివేత..

హైదరాబాద్ : న‌గ‌రంలోని వ‌న‌స్థ‌లిపురంలో సాహెబ్‌న‌గ‌ర్ క‌ల్లు కంపౌండ్ ప్రాంతంలో స‌ర్వే నెంబ‌ర్ 233లో ఉన్న ప్ర‌భుత్వ స్థ‌లంలో అక్ర‌మంగా నిర్మిస్తోన్న షెడ్‌ను కూల్చివేశారు. 

13:44 - December 14, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రాలో అడుగుపెట్టారు. బేగంటపే విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో బెజవాడకు చేరుకున్నారు. అక్కడ దిగిన అనంతరం నేరుగా బాబు నివాసానికి వెళ్లారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ తో సతీమణి కాకుండా ఆర్థిక మంత్రి ఈటెల, ఎంపీ బాల్క సుమన్ లు వెళ్లారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు.. ముక్కుపుడకను కానుకగా సమర్పించాలని భావించారు. కానీ ఈ మొక్కును తరువాత సమర్పించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈనెల 23 నుంచి 27వరకూ తన ఫామ్‌ హౌజ్‌లో నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి ఆహ్వానిస్తారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రుల మధ్య ఇరు రాష్ట్రాల మధ్య తక్షణం పరిష్కరించుకోవాల్సిన అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏపీ పర్యటనలో భాగంగా.. కేసీఆర్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌తో పాటు.. కొందరు రాష్ట్ర మంత్రులనూ యాగానికి ఆహ్వానించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడం ఇది రెండో సారి. దసరా రోజున అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఏపీ నుంచి వచ్చాక.. కేసీఆర్‌ ఈనెల 16న కర్ణాటక వెళ్లనున్నారు. 

13:39 - December 14, 2015

చిత్తూరు : రాయలసీమకు ఎలాంటి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. అలాంటి ప్రయత్నాలను తాము అడ్డుకుంటామని, రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా భూములను స్వాధీనం చేసుకొంటోందని, టిడిపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వరా అని మధు ప్రశ్నించారు. 

13:35 - December 14, 2015

ఢిల్లీ : ఓట్ల తొలగింపుపై తాము సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు టిటిడిపి, బిజెపి నేతలు పేర్కొన్నారు. సోమవారం కేంద్ర ఎన్నికల కమిషనర్ తో టిటిడిపి, బిజెపి నేతలు భేటీ అయ్యారు. సుమారు గంట పాటు ఈ సమావేశం కొనసాగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు. భేటీ అనంతరం బిజేపి ఇంద్రసేనారెడ్డి, టి.టిడిపి నేత ఆర్.కృష్ణయ్య వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. 2015 సంవత్సరం ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని, మరోసారి 6 లక్షల 90 వేల ఓట్లపై రివ్యూ చేయాలని కోరినట్లు ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. అంతేగాకుండా పటన్ చెరువు ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని, నారాయణఖేడ్, పటన్ చెరు ఎన్నికలను నిర్వహించాలని పేర్కొన్నారు. ఇంటింటికి బీసీ జనాబా లెక్కలు తీయాలని, అనుకూలమైన డివిజన్ లలో ఓసీలను బీసీలగా చూపిస్తూ గబ్బు పట్టించారని ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉదహారణలతో సహా ఫిర్యాదు చేయడం జరిగిందని నేతలు తెలిపారు. 

13:28 - December 14, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం, కాల్ మనీ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. విజయవాడలో రెండు రోజుల పాటు జరిగే కలెక్టర్ల సమావేశంలో బాబు పాల్గొని ఈ అంశంపై మాట్లాడారు. కల్తీ మద్యం, కాల్ మనీ ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తుందని తెలిపారు. ఇలాంటి ఘటనలు రాజధాని అమరావతి ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉందని, మొదటిలోనే వీటిని అణిచివేసే చర్యలు తీసుకోవాలన్నారు. కాల్ మనీ ఘటన జరగడం దారుణమని, ఇందులో ఎవరూ డబ్బులు చెల్లించవద్దని సూచించారు. మహిళలపై ఇంకా వేధింపులు చేస్తే నిర్భయ చట్టం ప్రయోగిస్తామని బాబు హెచ్చరించారు. తప్పుడు పని చేసే వారు భయపడేలా చర్యలు తీసుకుంటామని, ఎంతటి పెద్దల హస్తం ఉన్నా ఊరుకోమని బాబు మరోసారి స్పష్టం చేశారు. 

టీఆర్ఎస్ పై రేవంత్ విమర్శలు..

హైదరాబాద్ : టిడిపికి కేడర్ లేదంటున్న టీఆర్ఎస్ నేతలు తమ కార్యకర్తల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని టిటిడిపి నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆనాడు వైఎస్ వలసలను ప్రోత్సాహించారని విమర్శించిన టీఆర్ఎస్ నేతలు ఈనాడు చేస్తున్నది ఏంటీ అని ప్రశ్నించారు. కేసీఆర్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఇంకో పార్టీ అధ్యక్షుడిని యాగానికి పిలవడానికి వెళ్లారని, కేసీఆర్ యాగాలు చేసి తను చేసిన తప్పులను కొంతైనా సరిచేసుకోవాలని చూస్తున్నారన్నారు. 

పాఠశాల విద్యాశాఖను ముట్టడించిన విద్యార్థులు..

హైదరాబాద్ : టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేయాలని పాఠశాల విద్యా శాఖ కమిషనరేట్ ను విద్యార్థులు ముట్టడించారు.

 

ఏసీబీ కోర్టులో లొంగిపోయిన అంబర్ పేట తహశీల్దార్..

హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అంబర్ పేట తహశీల్దార్ సంధ్య ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. భూ వివాదంలో లంచం డిమాండ్ చేసినట్లు సంధ్యపై సంధ్య సోదరుడు నాగేశ్వర్ డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంగతి తెలిసిందే. 

12:51 - December 14, 2015

ప్రముఖ సినీ రచయిత శ్రీనివాస చక్రవర్తి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా నగరంలోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చక్రవర్తి సోమవారం తుదిశ్వాస విడించారు. నటుడు చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో దర్శకుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' చిత్రానికి ఆయన మూలకథ అందించారు. ఇంకా పెళ్లి, పట్నం వచ్చిన పతివ్రతలు, అన్నదమ్ముల సవాల్ వంటి చిత్రాలకు ఆయన రచయితగా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

దేవిశ్రీ ప్రసాద్ కు పితృవియోగం..
ప్రముఖ సినీ రచయిత, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి (61) కన్నుమూశారు. సోమవారం తెల్లవారుఝామున చెన్నైలోని ఆయన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దాదాపు 90 సినిమాలకు పైగా రచయితగా పనిచేసిన సత్యమూర్తి మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు. 'దేవత', 'చంటి', 'ఛాలెంజ్', 'భలేదొంగ' వంటి సినిమాలకు సత్యమూర్తే రచయిత. తన కుమారుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా రాణించడానికి సత్యమూర్తి ప్రోత్సాహం ఎంతో వుంది. కొద్ది సంవత్సరాల క్రితం పక్షవాతానికి గురైన సత్యమూర్తిని అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. సత్యమూర్తి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. తన కుమారుడిని సినీ హీరోగా చూడాలన్నది సత్యమూర్తి కోరిక. ఆ కోరిక నెరవేరబోయే తరుణంలో సత్యమూర్తి కన్నుమూశారు. చెన్నైలోనే సత్యమూర్తి అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు దేవి శ్రీ ప్రసాద్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

12:46 - December 14, 2015

చిత్తూరు : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త టిడిపి కీలక నేత కఠారి మోహన్ దంపతుల హత్య కేసు వివరాలను ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ వెల్లడించారు. ఆరు నెలల క్రితం నుండే వారిని హత్య చేసేందుకు చింటూ ప్లాన్ వేశాడని, అప్పటికే రెండుసార్లు హత్య చేసేందుకు యత్నించి విఫలం చెందాడని పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం 23 మందికి ప్రమేయం ఉందని, ఇప్పటికే 23 మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. మేయర్ దంపతుల హత్యను తానే చేసినట్లు చింటూ అలియాస్ చంద్రశేఖర్ ఒప్పుకున్నాడని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. హత్యకు ఆర్థిక, కుటుంబ తగాదాలే ప్రధాన కారణమని తమ విచారణలో తేలిందని ఆయన చెప్పారు.

12:41 - December 14, 2015

ఢిల్లీ : ఓట్ల తొలగింపుపై టిడిపి, బిజెపి పోరాటం కొనసాగిస్తూనే ఉంది. గత కొన్ని రోజులుగా ఓట్ల తొలగింపుపై ఈసీ అధికారులకు ఆ పార్టీకి చెందిన నేతలు ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఓట్ల తొలగింపుపై ఈసీ ఓ బృందాన్ని హైదరాబాద్ కు పంపించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ఎన్నికల కమిషనర్ తో టిటిడిపి, బిజెపి నేతలు భేటీ అయ్యారు. సుమారు గంట పాటు ఈ సమావేశం కొనసాగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు. 2015 సంవత్సరం ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని, మరోసారి 6 లక్షల 90 వేల ఓట్లపై రివ్యూ చేయాలని నేతలు కోరారు. పారదర్శకంగా నిర్వహిస్తామని ఈసీ కమిషనర్ హామీనిచ్చారని నేతలు తెలిపారు. అంతేగాకుండా పటన్ చెరువు ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని, నారాయణఖేడ్, పటన్ చెరు ఎన్నికలను నిర్వహించాలని నేతలు ఈసీ కమిషనర్ ను కోరారు. 

12:37 - December 14, 2015

విజయవాడ : పాలనలో అవినీతికి చోటు లేకుండా చూడడమే తమ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలో రెండు రోజుల పాటు జరుగుతున్న కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా బాబు ప్రారంభోపన్యాసం చేశారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని నదుల అనుసంధానంతో రాయలసీమకు తాగు, సాగు నీరంందిస్తామని ప్రకటించారు. 2018 వరకు అమరావతి తొలి దశ నిర్మాణం చేయాలని, అమరావతి తాత్కాలిక అసెంబ్లీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఫించన్ దారుల ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వడం జరుగుతోందని, జూన్ లోపు ఉద్యోగులు ఏపీకి వచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ప్రధాన ఏజెండాగా ముందుకు సాగాలని, పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కలెక్టర్లను కోరారు. 

12:27 - December 14, 2015

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుండి నేరుగా విజయవాడకు పయనమయ్యారు. ఆయనతో పాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ సుమన్ ఉన్నారు. మధ్యాహ్నాం 12.45 గంటలకు నేరుగా సీఎం నివాసానికి చేరుకుని బాబుతో సమావేశం కానున్నారు. కొద్ది రోజుల్లో నిర్వహించే ఆయుత చండీయాగానికి రావాలని ఆహ్వానపత్రికను బాబుకు అందచేయనున్నారు. అనంతరం నేరుగా హైదరాబాద్ కు కేసీఆర్ రానున్నారు. అమ్మవారికి ముక్కుపుడక సమర్పించే కార్యక్రమం వాయిదా పడింది. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు ఆంధ్రా రుచులను సిద్ధం చేస్తున్నారు. పీతల ఇగురు, పలావు, నాటు కోటి కూర, ఉలవచారుతో భోజనం అందించనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు కనకదుర్గమ్మ ప్రసాదాలను అందచేయనున్నారు. 

కల్తీ మద్యం..కాల్ మనీ కేసుల్లో కఠినం - బాబు..

విజయవాడ : కల్తీ మద్యం..కాల్ మనీ కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వడ్డీల వారసత్వాన్ని పెంచకుండా ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవాలని, మనీ పేరిట మహిళలను వేధిస్తే నిర్భయ కేసు పెడుతామని హెచ్చరించారు. చట్టప్రకారం ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

కొత్తూరులో ఆశా వర్కర్ల పాదయాత్ర..

మహబూబ్ నగర్ : కొత్తూరులో ఆశా వర్కర్ల పాదయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో మాజీ ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వర్ పాల్గొన్నారు. కానీ ఈ యాత్రను పోలీసులు అడ్డుకుని నాగేశ్వర్ తో పాటు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా నాగేశ్వర్ కు స్వల్ప గాయాలయ్యాయి. నాగేశ్వర్ ను కొత్తూరు పీఎస్ కు తరలించారు. 

రేపు తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..

చిత్తూరు : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరగనుంది. ఈ నెల 21 న వైకుంఠ ఏకాదశిరి పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 6 నుంచి 11 గంటల వరకు దర్శనం నిలిపివేసి ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. 

హత్య చేసినట్లు చింటూ ఒప్పుకున్నాడు - ఎస్పీ

చిత్తూరు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ దంపతుల హత్యను తానే చేసినట్లు చింటూ అలియాస్ చంద్రశేఖర్ ఒప్పుకున్నాడని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. హత్యకు ఆర్థిక, కుటుంబ తగాదాలే ప్రధాన కారణమని తమ విచారణలో తేలిందని ఆయన చెప్పారు.

గ్రానెట్స్ కంపెనీలపై ఏసీబీ దాడులు..

విజయనగరం : జిల్లా భోగాపురం మండలంలోని సంజీవ, శ్రీనివాస్ గ్రానైట్స్ కంపెనీలపై విశాఖపట్టణానికి చెందిన ఏసీబీ అధికారులు ఉదయం దాడులు నిర్వహించారు. 

వచ్చే ఏడాది మోడీ పాక్ పర్యటన..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చే ఏడాది పాక్ లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో తన పాక్ పర్యటనపై సుష్మా ప్రకటన చేశారు. 2016లో పాక్ లో జరిగే అంతర్జాతీయ సదస్సుకు మోడీ హజరౌతారని తెలిపారు. 

దేశంలోనే అగ్ర రాష్ట్రంగా ఏపీ - బాబు..

విజయవాడ : 2029 లోగా ఏపీ దేశంలోనే అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలో రెండు రోజుల పాటు కలెకర్ట సమావేశం జరగుతోంది. ఈ సమావేశంలో బాబు ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ప్రధాన ఏజెండాగా ముందుకు సాగాలని, పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కలెక్టర్లను కోరారు. 

ఆర్ఎస్ఎస్ పై రాహుల్ ఆరోపణలు..

ఢిల్లీ : ఆర్ఎస్ఎస్ పై రాహుల్ గాంధీ పలు ఆరోపణలు చేశారు. కేరళలో ఆలయంలోకి వెళ్లకుండా ఆర్ఎస్ఎస్ నేతలు అడ్డుకున్నారని, ప్రధాని కేరళ ప్రజలను అవమానిస్తున్నారని విమర్శించారు. 

ఆప్ ధర్నా ఎందుకు - రాహుల్..

ఢిల్లీ : షాకూర్ బస్తీ ఘటనపై ఆప్ ధర్నా ఎందుకు నిర్వహిస్తోందని ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అధికారంలో ఆప్ ప్రభుత్వం ఉందని గుర్తు చేశారు. 

మల్లాది కోసం గాలింపు…

విజయవాడ : కల్తీ మద్యం కేసులో 9వ నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. విష్ణు ఒడిశాలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. 

కాల్ మనీ కేసు..ఇద్దరు కీలక నిందితుల అరెస్టు..

విజయవాడ : కాల్ మనీ కేసులో ఇద్దరు కీలక నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. కేసులో నిందితుడిగా ఉన్న డీ సత్యానందాన్ని పట్టుకోవడానికి హైదరాబాద్, ఒడిశా లకు పోలీసులు వెళ్లారు. 

శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచందనం..

చిత్తూరు : జిల్లాలోని చంద్రగిరి మండలం శేషాచలం అటవీ ప్రాంతంలో బొమ్మాజి కొండ వద్ద ఆటవీ శాఖ అధికారులు కూంబిగ్ చేపట్టారు. రూ.2 కోట్లు విలువ చేసే ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం..

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ ఈ సెన్సెక్స్ 100 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. 

విజయవాడలో కలెక్టర్ల సదస్సు ప్రారంభం..

విజయవాడ : రెండు రోజుల పాటు జరగనున్న ఏపీ జిల్లా కలెక్టర్ల సదస్సు విజయవాడలో ప్రారంభమైంది. నగరంలోని గేట్ వే హోటల్ లో ఈ సమావేశం జరుగుతోంది.

కాల్ మనీ వ్యాపారంతో సంబంధం లేదు - ఎమ్మెల్యే ప్రసాద్..

విజయవాడ : కాల్ మనీ వ్యాపారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పేర్కొన్నారు. వెనిగెళ్ల శ్రీకాంత్ తనకు స్నేహితుడు మాత్రమేనన్నారు. 

షాకూర్ బస్తీని సందర్శించనున్న రాహుల్..

ఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ షాకూర్ బస్తీని సందర్శించనున్నారు. ఆదివారం గుడిసెల తొలగింపులో ఓ చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. 

ఓయూలో పీజీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం..

హైదరాబాద్ : ఓయూలో పీజీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

షాకూర్ బస్తీ ఘటనపై రాజ్యసభలో వాయిదా తీర్మానం..

ఢిల్లీ : షాకూర్ బస్తీలో జరిగిన ఘటనపై జేడీయూ రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. షాకూర్‌ బస్తీ ప్రాంతంలో రైల్వే వర్గాలు ఆదివారం నిర్వహిస్తున్న గుడిసెల తొలగింపులో ఒక చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సిఎం కేజ్రీవాల్‌ రైల్వే ఆధికారులను నిందిస్తూ, నిర్వాసితులకు ఆహార సదుపాయాలను ఏర్పాటు చేయనందుకు ముగ్గురు అధికారులను సస్పెండ్‌ చేశారు. 

నర్సీపట్నంలో భారీగా గంజాయి పట్టివేత

విశాఖపట్టణం : నర్సీపట్నంలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.కోటి విలువైన 1600 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. వాహనాన్ని సీజ్ చేశారు. 

కుల్చారంలో రెండు చిరుతలు..

మెదక్ : కుల్చారం మండలంలో రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. కోనాపూర్, పైత్రాలలో లేగదూడ, రెండు మేకలను తినడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. 

ఏజెన్సీలో పెరిగిన ఉష్ణోగ్రతలు...

విశాఖపట్టణం : ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. చింతపల్లిలో 17, లమ్మసింగిలో 15 డిగ్రీలు, పాడేరులో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

 

09:27 - December 14, 2015

హైదరాబాద్ : ఓయూలో బీఫ్ ఫెస్టివల్ అనంతరం మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పీజీ సెమిస్టర్ పరీక్షల విషయంపై సందిగ్ధత నెలకొంది. పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు..పరీక్ష యథాతథంగా కొనసాగుతుందని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. దీనితో ఓయూలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నెలరోజుల గ్యాప్‌తో అకాడమిక్ ఇయర్‌ను ప్రారంభించారని , ఒక వారం రోజులు వాయిదా వేయాలని కోరిన తమపై పోలీసులను ఉసిగొల్పుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. నాలుగు రోజుల క్రితమే తమకు ప్రాక్టికల్స్ పూర్తయ్యాయని.. ఇంతలోనే పరీక్షలు నిర్వహిస్తే ప్రిపరేషన్‌ లేకుండా తాము ఎలా రాయగలమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రార్ విద్యార్థుల భవిష్యత్‌ను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని వెంటనే పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఆర్ట్స్ గ్రూప్ కు చెందిన కొంతమంది పరీక్షకు హాజరవుతుండగా సైన్స్ గ్రూప్ కు చెందిన కొంతమంది పరీక్ష రాయడానికి నిరాకరిస్తున్నారు.

బందోబస్తు - ఏసీపీ…
శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు తాము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఏసీపీ లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. ప్రాక్టికల్స్..ఎగ్జామ్ పరీక్షకు ఇబ్బందికరంగా ఉందని విద్యార్థులు పేర్కొన్నారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు తాము ముందస్తు అరెస్టులు చేయడం జరిగిందన్నారు. 

09:22 - December 14, 2015

విజయవాడ : కాల్ మనీ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగుతోంది. టిడిపి ప్రభుత్వానికి ఈ వ్యవహారం గుదిబండగా మారింది. పార్టీ నేతలు చాలా మంది ఈ కేసులో ఉన్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మీడియాలో పలు రకాల కథనాలు వస్తున్నాయి. మొత్తం నిందితులు 12 మంది ఉన్నట్లు సమాచారం. అందులో ఏడుగురిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఆదివారం రాత్రి కేవలం ఇద్దరిని మాత్రమే మీడియా ఎదుట ప్రవేశ పెట్టింది. ఇదిలా ఉంటే బాధితులు హైకోర్టును ఆశ్రయించనున్నారు. విలువైన ఆస్తులను తనఖా పెట్టుకున్నారని, డాక్యుమెంట్లు ఇవ్వకుండా బెదిరింపులకు చేస్తున్నారని బాధితులు పేర్కొంటున్నారు. తమకు న్యాయం విషయమై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, కాల్ మనీ వ్యవహారంలో ప్రజాప్రతినిధుల వ్యవహారంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.

ఓయూ సెమిస్టర్ పరీక్షలు యథాతథం..

హైదరాబాద్ : ఓయూ సెమిస్టర్ పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని, పరీక్షలను అడ్డుకోవాలని చూస్తే వారి అడ్మిషన్లు రద్దు చేస్తామని ఓయూ పీఆర్‌వో డాక్టర్ సుజాత హెచ్చరించారు. 

08:30 - December 14, 2015

కాలుష్య నివారణకు అన్ని దేశాలు కృషి చేయాలని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. పారిస్ లో కుదిరిన ఒప్పందంపై ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుండి సానుకూల స్పందనలు వస్తున్నాయి. పారిస్ వేదికగా గత రెండు వారాలుగా ఐక్య రాజ్యసమితి వాతావరణ సదస్సు చర్చలు జరిగాయి. ఈ అంశంపై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లోనే..
''పారిస్ సదస్సుపై చాలా ఎక్కువ చెప్పుకుంటున్నారు. వాస్తవంగా ఆ ఒప్పందంలోని లోటుపాట్లు ఏంటీ ? అనే అంశం పరిశీలించాలి. అలాగే ఒప్పందాన్ని స్వాగతించాలి. చేస్తామని ఆశ..నమ్మకం..ఒక విశ్వాసం చెప్పారు. వివిధ దేశాలు లక్ష్యాలు కూడా ఇచ్చాయి. భూతాపం 3 డిగ్రీల కన్నా పెరుగుతుంది. గతంలో పశ్చిమదేశాలు అంగీకరించనటు వంటి అంశాలు ఒప్పందంలో అంగీకరించాయి. కర్బన ఉద్గారాలకు అన్ని దేశాలు ఒకే కారణం కావు. బాధ్యత అందరిదీ అని అమెరికా చెప్పింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేస్తాం..నిధులను ఏర్పాటు చేస్తామన్నారు. తక్కువ కర్బన ఉద్గారాలను పశ్చిమాసియా దేశాలు వెదజల్లుతున్నాయి. ఖరీదైన టెక్నాలజీని అందుబాటులోకి రావాలని భారత దేశం..పేద దేశాలు కోరుతూ వస్తున్నాయి. దీనికి అంగీకరించాయి. 2020 ఒప్పందం అమల్లోకి వస్తుంది. ఎవరు కాలుష్యానికి కారకులయ్యారు ? 165 ఏళ్ల సంవత్సరం కింద పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందిన దేశాలే ఇందుకు కారణం. గతంలో చేసిన పాపానికి బాధ్యత లేదా ? అని అడుగుతూ వస్తున్నాం. ఒప్పందంలో ఈ అంశం లేదు. దేశంలో తలసరి ఇంధన వ్యయం తక్కువ. 2020 తరువాత భారత్ పై వత్తిడి పెరిగే అవకాశం ఉంది. కార్బన్ బడ్జెట్ లేదు. ఆచరణలో జరుగుతుందా ? అనుభవజ్ఞంలో తేలుతుంది. చట్టరీత్యా ఒప్పందం కూడా కాదు. ఏ చట్టబద్ధతమైంది ఉండదు. అమలు చేయాల్సి ఉంటుంది. ఈ బాధ్యతను నిర్వహిస్తారా ? లేదా ? అన్నది చూడాలి''. అని నాగేశ్వర్ పేర్కొన్నారు. 

08:06 - December 14, 2015

హైదరాబాద్ : ప్రముఖ సినీ రచయిత, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి (61) కన్నుమూశారు. సోమవారం తెల్లవారుఝామున చెన్నైలోని ఆయన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దాదాపు 90 సినిమాలకు పైగా రచయితగా పనిచేసిన సత్యమూర్తి మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు. 'దేవత', 'చంటి', 'ఛాలెంజ్', 'భలేదొంగ' వంటి సినిమాలకు సత్యమూర్తే రచయిత. తన కుమారుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా రాణించడానికి సత్యమూర్తి ప్రోత్సాహం ఎంతో వుంది. కొద్ది సంవత్సరాల క్రితం పక్షవాతానికి గురైన సత్యమూర్తిని అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. సత్యమూర్తి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. తన కుమారుడిని సినీ హీరోగా చూడాలన్నది సత్యమూర్తి కోరిక. ఆ కోరిక నెరవేరబోయే తరుణంలో సత్యమూర్తి కన్నుమూశారు. చెన్నైలోనే సత్యమూర్తి అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు దేవి శ్రీ ప్రసాద్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

07:43 - December 14, 2015

తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళన వంద రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా వర్కర్లు చేపట్టిన పాదయాత్రపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీనిని పలువురు ఖండించారు. మరోవైపు ఏపీలో కాల్ మనీ వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో మదన్ మోహన్ రెడ్డి (వైసీపీ), తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్), రామకృష్ణ ప్రసాద్ (టిడిపి), తెలకపల్లి రవి (విశ్లేషకులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

డిబేట్ పార్ట్ - 2 

దేవీ శ్రీ ప్రసాద్ కు పితృ వియోగం..

హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి, చిత్ర రచయిత సత్యమూర్తి (61) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో గుండెపోటుకు గురైన సత్యమూర్తి తుది శ్వాస విడిచారు. దాదాపు 90 సినిమాలకు పైగా రచయితగా పనిచేసిన సత్యమూర్తి మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు. చెన్నైలోనే సత్యమూర్తి అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు దేవి శ్రీ ప్రసాద్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 

07:37 - December 14, 2015

శీతాకాలం వచ్చిందంటే చర్మం పొడిబారిపోయి అసహనానికి గురిచేస్తుంది. కాబట్టి చర్మాన్ని కాపాడుకునే ప్రయత్నంలో చాలామంది పార్లర్లనో, క్రీములనో అన్వేషిస్తుంటారు. అయితే ఎన్ని వాడినా చర్మం రసాయనాలకు అలవాటు పడి పాడైపోతుందే కానీ సహజసిధ్ధంగా ఉండదు. అందుకే శీతా కాలంలో చర్మ సౌందర్యానికి ఇంట్లో వాడే చిట్కాలను మీకందిస్తున్నాం. అవేంటో ఒకసారి చదవండి..

  • పొడిచర్మం కలిగినవారు చర్మాన్ని శుభ్రపరచుకునేటప్పుడు పాలల్లో వెజిటెబుల్‌ ఆయిల్‌ను వేసి బాగా కలిపి కాటన్‌తో చర్మంపై రుద్దుకోవాలి.
  • మృదువైన చర్మం కలిగినవారైతే, ఆరెంజ్‌ జ్యూస్‌లో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో కడగాలి.
  • పెరుగు, పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మర్ధనా చేసి, పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
  • ఒకవేళ మీరు మాస్క్‌ వేసుకుంటే... పొడిచర్మం వారు తేనె, రోజ్‌వాటర్‌, పాలపొడి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. ఈ చర్మం గలవారు గుడ్డు సొనను కూడా ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా చేస్తే చర్మం పొడిగా ఉండదు.
  • అరటిపండు, యాపిల్‌, బొప్పాయి వంటి పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి నీటితో కడిగినా ఫలితం ఉంటుంది.
  • మసాజ్‌ ఆయిల్‌, గంధం పొడి, రోజ్‌ వాటర్‌, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్‌ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం పొడిబారకుండా, మృదువుగా ఉంటుంది.
  • కొంతమందికి చర్మం పగిలినట్టుగా ఉంటుంది. ఇలాంటివారు సబ్బుతో స్నానం చేయడం పూర్తిగా మానాలి. సున్నిపిండి ఉపయోగిస్తే మంచిది. ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత వెనిగర్‌ కలిపిన నీళ్ళను శరీరంపై పోసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.
  • కాళ్లూ, చేతులకు గ్లిజరిన్‌లో రోజ్‌వాటర్‌, తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేతులకు, కాళ్ళకు అప్లై చేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడగాలి. 
07:36 - December 14, 2015

ప్రతి రోజూ గ్రీన్‌ టీ సేవిస్తుంటే దంతవైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం లేదంటున్నారు పరిశోధకులు. గ్రీన్‌ టీ సేవించడం వలన అందులోనున్న యాంటీమైక్రోబైయాల్‌ మాలెక్యూల్స్‌ దంతాలను పరిరక్షిస్తాయని పరిశోధకులు తెలిపారు. అదికూడా పంచదార కలుపుకోకుండా మాత్రమే సేవించాలంటున్నారు. న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఆల్ఫ్రెడో మొరాబియా. తరచూ కాఫీ, టీలలో పంచదార కలుపుకుని సేవిస్తుంటారు. పంచదారలో హానికరమైన పదార్థాలుంటాయని, ఇవి దంతాలను పాడుచేస్తున్నాయని తమ పరిశోధనల్లో తేలినట్లు ఆయన తెలిపారు. పంచదార కలుపుకోకుండా కాఫీ, టీ, పాలు సేవిస్తే దంతాలకు ఎలాంటి హానీ కలగదని ఆయన తెలిపారు. తాము నిర్వహించిన పరిశోధనల్లో దాదాపు 25,000 మందిని భాగస్వాములను చేసామని, వీరిలో రోజుకు ఒకసారి గ్రీన్‌ టీ సేవించిన వారిలో దంతాలు సురక్షితంగా ఉన్నాయని, అదే గ్రీన్‌ టీ సేవించక సాధారణమైన టీలో పంచదార కలుపుకుని సేవించిన వారిలో మాత్రం దంతాలు పాడైపోయాయని ఆయన తెలిపారు.

07:35 - December 14, 2015

క్యాల్షియం అనగానే అందరికీ గుర్తొచ్చేది పాలు. అవును పాలల్లో క్యాల్షియం ఉంటుందని అందరికీ తెలిసిందే. అందుకే ప్రతిరోజూ పిల్లలతో పాటు పెద్దలు పాలు తీసుకుంటారు. మరి పాలు తాగని వాళ్ల పరిస్థితి ఏమిటి? క్యాల్షియం పొందాలంటే వారు ఏం తీసుకోవాలి. పాలల్లో కంటే ఎక్కువ పాళ్లలో క్యాల్షియం ఉండే కొన్ని ఆహార పదార్థాలున్నాయి.
వేయించిన నువ్వులు: ఒక ఔన్సు(28 గ్రాములకుపైగా) నువ్వుల్లో 277 మిల్లీగ్రామ్‌ల క్యాల్షియం ఉంటుంది. ఒక గ్లాసు పాలలోకంటే గుప్పెడు నువ్వుల్లో ఎక్కువ క్యాల్షియం ఉంటుంది. నువ్వుల్లో అధికంగా ఉన్న జింక్‌ ఎముకల మినరల్స్‌ సాంద్రతను పెంచుతుంది.
మొలకెత్తిన సోయా గింజలు: సగం కప్పు మొలకెత్తిన సోయా గింజల్లో 230 మి.గ్రాముల క్యాల్షియం ఉంటుంది. అది ఎముకల పటిష్టానికి తోడ్పడుతుంది.
సాల్మన్‌ చేప: మాంసాహారం తినని వాళ్లు కూడా ఇష్టపడే ఫుడ్‌ చేపలు. అందులోని సాల్మన్‌ చేపలు ఇంకా శ్రేష్టమైనవి. ఈ సాల్మన్‌ ఫిష్‌లో 212మి.గ్రాముల క్యాల్షియం ఉంటుంది.
టోఫు: సోయాపాలతో చేసిన పెరుగులాంటి పదార్థం ఇది. ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. సగం కప్పు టోఫులో 253 గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. ఇది సూపర్‌మార్కెట్స్‌లో దొరుకుతుంది. దీన్ని సూప్స్‌లో వాడొచ్చు. ఫ్రై చేసుకుని తినొచ్చు. కూరగా వండొచ్చు. పిల్లలు ఇష్టంగా తినాలంటే నూడుల్స్‌తోపాటు పెట్టొచ్చు.
గోబి ఆకులు: దీన్నే సూపర్‌ ఫుడ్‌ అని కూడా అంటారు. రెండు కప్పుల గోబి ఆకుల్లో 188 మి.గ్రాముల క్యాల్షియం ఉంటుంది. దీన్ని సలాడ్స్‌లో వాడొచ్చు. కూరగా వండొచ్చు.
బాదం గింజలు: పైవాటితో పోల్చితే బాదం గింజల్లో క్యాల్షియంపాళ్లు తక్కువే. పిడికెడు బాదం గింజలనుంచి 72 మి.గ్రాముల క్యాల్షియం లభిస్తుంది.

07:33 - December 14, 2015

రజనీకాంత్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని దర్శకుడు శంకర్‌ 'రోబో- 2' చిత్ర షూటింగ్‌ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ ప్రారంభమైన్నట్లు నిర్మాణ సంస్థ లైకా అధికారంగా ప్రకటించింది. చెన్నైలో వరదల కారణంగా రజనీకాంత్‌ తన పుట్టినరోజు వేడుకల్ని రద్దు చేసుకున్న విషయం విదితమే. అత్యధిక భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ చిత్రంలో రజనీకాంత్‌ సరసన ఎమీజాక్సన్‌ నటిస్తున్నట్టు సమాచారం. భారతీయ చలన చిత్ర చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుని ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సొంతం చేసుకున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పుట్టిన రోజు (శనివారం) సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రజనీ ఆదర్శ, నిరాడంబర వ్యక్తి అంటూ ప్రముఖులంతా కొనియాడారు. అమితాబ్‌ బచ్చన్‌, వెంకటేష్‌, అల్లుఅర్జున్‌, బోయపాటి శ్రీను, నారారోహిత్‌, సునీల్‌, బ్రహ్మాజీ, అనుష్క, మంచు లక్ష్మీ, ఎం.ఎం.శ్రీలేఖ, హీరో ధనుష్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

 

07:32 - December 14, 2015

'ఒక విచిత్రం' చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు ఆది పినిశెట్టి. తర్వాత 'వైశాలి', 'గుండెల్లో గోదారి' వంటి భిన్న చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. తాజాగా 'మలుపు' చిత్రంలో నటించిన ఆది పినిశెట్టి బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా పినిశెట్టి మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే...
'నటించిన మూడు చిత్రాలు నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. తమిళంలో కూడా మంచి ఆఫర్లొస్తున్నాయి. తాజాగా మా అన్నయ్య సత్య ప్రభాస్‌ పినిశెట్టి దర్శకత్వం వహించిన 'మలుపు' చిత్రంలో నటించాను. మా అన్నయ్య స్నేహితుడి జీవితంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. డిసెంబర్‌ 31 రాత్రి జరిగిన ఓ సంఘటన వల్ల నలుగురు స్నేహితుల జీవితాల్లో ఏం జరిగిందనే ఇతి వృత్తంతో ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. చెన్నై పరిసర ప్రాంతాలు, ముంబై, గోవా, పాండిచ్చేరి తదితర ప్రాంతాల్లోని 240 లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. కథ వినగానే నాన్నగారు రవిరాజా పినిశెట్టికి బాగా నచ్చింది. తొలి సినిమా డైరెక్టర్‌ అనగానే కొన్ని పరిమితు లుంటాయి. అలాంటి పరిమితులు ఉండకూడదని నాన్నగారే ఈ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యారు. ఇందులోని ఓ కీలక పాత్రలో మిథున్‌ చక్రవర్తిగారు నటించారు. దక్షిణాదిలో ఆయన తొలిసారి అంగీకరించిన చిత్రం మాదే కావడం విశేషం. మా సినిమా తర్వాత 'గోపాల గోపాల' చిత్రంలో నటించారు. ఈ సినిమాలో కాలేజీ కుర్రాడిగా కనిపించడానికి చాలా బరువు తగ్గాను. కాస్ట్యూమ్స్‌, మేకప్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఈ సినిమా తర్వాత కమర్షియల్‌ సినిమాలు చేస్తాను. ప్రస్తుతం అల్లుఅర్జున్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న 'సరైనోడు' చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాను. స్లీక్‌ విలన్‌గా సరికొత్తగా కనిపించే ప్రయత్నం చేశాను. భవిష్యత్‌లో కూడా కథలు నచ్చితే విలన్‌ పాత్రలు చేసేందుకు రెడీ. ప్రతి ఏడాది పుట్టినరోజుని స్నేహితులతో గ్రాండ్‌ గానే సెలబ్రేట్‌ చేసుకుంటాను. అయితే ఈసారి చెన్నైలో వరదల కారణంగా పుట్టినరోజు జరుపుకోవడం లేదు. వరద బాధితులకు స్నేహితులతోపాటు నేనూ సహాయం చేస్తున్నాను. ప్రస్తుతం తెలుగులో బన్నీ 'సరైనోడు', తమిళంలో మరో రెండు చిత్రాల్లో నటించేందుకు అంగీకరించాను' అని ఆది పినిశెట్టి చెప్పారు.

నేడు ఢిల్లీకి టిపిసిసి నేతలు..

హైదరాబాద్ : నేడు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై అధిష్టానంతో నేతలు చర్చించనున్నారు. 

డిఎడ్ మలివిడత కౌన్సెలింగ్..

హైదరాబాద్ : నేడు డిఎడ్‌ మలివిడత కౌన్సెలింగ్‌ జరుగనుంది. ఎల్లుండి వరకు కౌన్సెలింగ్‌ కొనసాగనుంది. 17వ తేదీన సీట్లను కేటాయించనున్నారు.

 

07:06 - December 14, 2015

దాదాపు మూడు లక్షల మంది మెడికల్ రిప్రజెంటేటీవ్ లు ఎల్లుండి దేశవ్యాప్తంగా సమ్మె చేయబోతున్నారు. ఈ సమ్మెకు కారణం ఏమిటి? పరిశ్రమ యాజమాన్యాల ముందు, ప్రభుత్వం ముందు వీరు ఏయే డిమాండ్స్ పెడుతున్నారు? ప్రస్తుతం భారత ఫార్మా రంగం ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? సవాళ్లేమిటి? వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం ఫార్మా రంగం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఈ అంశాలపై జనపథంలో తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటీవ్స్ అసోసియేషన్ నేత రాజుభట్ విశ్లేషించారు. 

07:04 - December 14, 2015

మన ఔషధ రంగం అత్యంత కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఫార్మా రంగం వ్రుద్ధి విషయంలో భవిష్యత్ కి సంబంధించిన అంచనాలు ఊరిస్తుంటే, ప్రభుత్వ విధానాలు జనాన్ని కలవరపెడుతున్నాయి. మనదేశంలో మందుల పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్ వుంది. రాబోయే ఐదేళ్ల కాలంలో ఏటా 20 శాతం వృద్ధి రేటు నమోదు చేయడం ఖాయం. ఇది మార్కెట్ నిపుణులు తరచూ వ్యక్తం చేస్తున్న విశ్వాసం. ఇందులో అతిశయోక్తి లేదు. గత ఆరేడేళ్లుగా మన ఫార్మా రంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. ప్రపంచ మార్కెట్ లో తన ముద్ర వేస్తోంది. ప్రపంచ మార్కెట్ పరిమాణంలో మూడో స్థానాన్ని మన ఔషధ పరిశ్రమ ఆక్రమించింది. 20 బిలియన్ డాలర్ల మైలురాయిని గత సంవత్సరమే దాటేసిన భారతీయ ఫార్మా రంగం రాబోయే పదేళ్లలో వంద బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరుతుందన్న అంచనాలున్నాయి.

ఉత్పత్తిలో టాప్ గేర్..
ఇక కారు చౌకగా లభించే జనరిక్ మందుల ఉత్పత్తిలో మనది టాప్ గేర్. మనదేశ ఉత్పత్తుల్లో 70 నుంచి 80శాతం జనరిక్ మందులే వుండడం విశేషం. ప్రపంచం మొత్తం మీద జనరిక్ మందుల ఎగుమతుల్లో 20శాతం వాటా మనదే. ఇలాంటి లెక్కలన్నీ చూసిన్నప్పుడు సహజంగానే మనకు సంతోషం కలుగుతుంది. ఎంత అభివృద్ధి సాధించినా, భవిష్యత్ కు సంబంధించిన అంచనాలు ఎంత అమోఘంగా వున్నా, మన ఔషధరంగాన్ని భయాలూ వెన్నాడుతున్నాయి. 40 ఏళ్ల క్రితం నాటి చరిత్ర పునరావృతం అవుతుందేమో నన్న దిగులు నిద్రపోనివ్వడం లేదు. ఓ వైపు మన దేశంలో ప్రయివేట్ రంగంలో ఫార్మా కంపెనీలు విస్తరిస్తున్నా, ప్రభుత్వరంగంలో వాటి వృద్ధి కుంటుపడింది. 1970ల నాటి స్పూర్తి కొరవడుతోంది. గత పది పదిహేనేళ్ల నుంచి వినాశనకర విధానాలు తెర మీదకొస్తున్నాయి.

ఫార్మా కంపెనీలకు శాపాలు...
కారు చౌకగా పెన్సిలిన్ మందును అందించిన ప్రభుత్వరంగ పరిశ్రమకే మనుగడలేని దురావస్థ వచ్చింది. ప్రభుత్వరంగ పరిశ్రమలను ఎప్పటికప్పుడు ఆధునికరించకపోవడం, వాటి విస్తరణ మీద దృష్టి పెట్టకపోవడం, రీ సెర్చ్ అండ్ డవలప్ మెంట్ కి అవసరమైన ప్రోత్సాహకాలు అందించకపోవడం లాంటి కారణాలు ప్రభుత్వరంగంలోని ఫార్మా కంపెనీలకు శాపాలుగా మారాయి. ఆర్థిక సమస్యలతో కునారిల్లుతున్న ప్రభుత్వరంగ కంపెనీలకు చేయూత నివ్వకపోగా, వాటి ఆస్తులను తెగనమ్ముకుని, సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తుండడం ఆందోళనకర పరిణామం. ఇప్పటికే జనం ప్రాణాలను నిలబెట్టే మందుల వ్యాపారం పూర్తిగా ప్రయివేట్ రంగం చేతిలోకి వెళ్లింది. మనదేశంలో 5వేలకు పైగా ఫార్మా కంపెనీలున్నప్పటికీ, 250 నుంచి 300 కంపెనీలే 70శాతం మార్కెట్ ను శాసిస్తున్నాయి.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు..
ఇప్పుడు మన ఫార్మా కంపెనీలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్ద సవాలే విసురుతున్నాయి. ఫార్మా రంగంలోకి వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించేందుకు ప్రభుత్వం సై అనడంతో భవిష్యత్ లో సామాన్యులు అత్యవసర మందులు కొనగలరా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మాటకొస్తే అమెరికన్ ఫార్మా కంపెనీలు మన జనరిక్ మందుల ఉనికినే భరించలేకపోతున్నాయి. నిత్యం ఏదో ఒక కొర్రీలు పెట్టి, వాటి ఎగుమతులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు మన కంపెనీలను టేకోవర్ చేసి, దేశీయ మార్కెట్ మీద గుత్తాధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అదే జరిగితే, ఇక మందుల ధరలకు అడ్డుఅదుపు వుండదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఈ దేశ ప్రజలకు కారుచౌకగా మందులివ్వాలన్న ఆకాంక్షలుగానీ, ఆశయాలుగానీ విదేశీ కంపెనీలకుండవు. పేషెంట్ల రక్తం తాగైనా లాభాలు జుర్రుకునేందుకే అవి మనదేశంలో ప్రవేశిస్తాయనడంలో సందేహం లేదు.

అల్లాడుతున్న జనం..
నిజానికి ఇప్పటికే మనదేశంలో వైద్య ఖర్చుల ధాటికి తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. వైద్య ఖర్చుల కారణంగా ఏటా 5 కోట్ల మంది పేదరికంలోని వెళ్తున్నారంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థే ఆక్రోషించింది. మనదేశంలో బీపీ, షుగర్ లాంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. వీటి కంట్రోల్ కి ప్రతిరోజూ మందులు వాడడం తప్పనిసరి. ఇలాంటి నిత్యావసర మందుల ధరల మరింత ప్రియం అవుతాయన్న ఆందోళనలున్నాయి. జనరిక్ మందుల దుకాణాల సంఖ్యా పెంచుతామంటూ ప్రభుత్వాలు చేస్తున్న వాగ్ధానాలు క్షత్రస్థాయిలో కనిపించడం లేదు. మరోవైపు ఔషధరంగంలోకి కూడా ఆన్ లైన్ బిజినెస్ ప్రవేశించింది. ఇది మన వీధుల్లోని రిటైల్ వ్యాపారాన్ని దారుణంగా దెబ్బతీస్తుందన్న ఆందోళనలున్నాయి. ఫార్మారంగంలో ఆన్ లైన్ అమ్మకాలు విజృంభిస్తే అది ఎలాంటి విపత్కర పరిస్థితులను సృష్టిస్తుందోనన్న భయాలు వెన్నాడుతున్నాయి.

ఫార్మా కంపెనీలకు ప్రమాద ఘంటికలు..
ఇక ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ప్రధానంగా ఆధారపడేది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ ల మీదనే. కంపెనీల మధ్య పోటీ పెరగడంతో మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ ల మీద అదే స్థాయిలో ఒత్తిడి పెరుగుతోంది. నిర్ణీత పనిగంటలు, వేళాపాళా లేకుండా ఎప్పుడంటే అప్పుడు డాక్టర్ల చుట్టూ, డిస్ట్రిబ్యూటర్ల చుట్టూ , బాస్ ల చుట్టూ పరుగులు తీయాల్సి వస్తోంది. అదే స్థాయిలో వేతనాలు పెరగడం లేదన్న అసంతృప్తి వీరిని వెన్నాడుతోంది. మొత్తానికి ఇవాళ భారతీయ ఔషధ రంగం అత్యంత కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రభుత్వరంగంలో ఔషధ పరిశ్రమను ఏనాడో ముంచేసిన మన ప్రభుత్వాల విధానాలు ఇప్పుడు స్వదేశంలోని చిన్న చిన్న ఫార్మా కంపెనీలకు కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. 

06:45 - December 14, 2015

సౌదీ అరేబియా : అత్యంత కఠిన సంప్రదాయ రాచరిక పాలనలో శతాబ్దాల లింగ వివక్ష నడుమ ఓ ముందడుగు వేసింది. తొలిసారి ఆ దేశ చరిత్రలో జరుగుతున్న మున్సిపల్‌ కౌన్సిళ్ల ఎన్నికల్లో 21 మంది మహిళలు గెలిచారు. దీంతో సౌదీ చరిత్రలో నూతన చరిత్రకు శ్రీకారం చుట్టినట్లైంది. విచిత్రం ఏమిటంటే ఈ ఏడాదే మహిళలకు ఆ దేశంలో ఓటు హక్కు కల్పించారు.

21 మహిళా కౌన్సిలర్లు...
మహిళలకు ఎన్నికల్లో ఓటు వేసేందుకు, పోటీ చేసేందుకు సౌదీ సర్కార్ హక్కు కల్పించిన తర్వాత దేశంలోని మున్సిపల్ కౌన్సిళ్ల ఎన్నికలపై ప్రపంచం దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో 21 మంది మహిళలు కౌన్సిలర్లుగా గెలిచారు. దీంతో సౌదీ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. సౌదీ రాజరిక వ్యవస్థలో ఇప్పటి వరకూ కేవలం పురుషులకు మాత్రమే ఓటు హక్కు ఉంది. సౌదీచరిత్రలో ఇప్పటి వరకూ కేవలం 2005, 2011 సంవత్సరాల్లో మాత్రమే జరిగాయి.

900 మంది మహిళా అభ్యర్థులు..
ప్రస్తుతం 900 మందికిపైగా మహిళా అభ్యర్థులు సుమారు 6000 మంది పురుషులతో పోటీ పడ్డారు. మహిళలకు, పురుషులకు విడివిడిగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ వారు నేరుగా పురుషుల ఓట్లు అడగకుండా నిషేధాజ్ఞలు ఉన్నాయి. మహిళల పోటీకి పలు విఘ్నాలు ఎదురయ్యాయి. అధికార యంత్రాంగం అభ్యంతరాలు, అవగాహనా లేమి మధ్య సాగిన ఓటర్ల నమోదు ప్రక్రియలో 10 శాతానికి పైగా మహిళలు మాత్రమే తమ పేర్లు రిజిస్టర్ చేయించుకున్నారు.

25 శాతం పోలింగ్ నమోదు...
మరోవైపు ఈ ఎన్నికల్లో కేవలం 25 శాతం మాత్రమే పోలింగ్ శాతం నమోదైంది. మక్కా ప్రాంతానికి చెందిన "సల్మా బింట్‌ హజబ్‌ అల్‌ ఒతైబీ" మున్సిపల్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో గెలిచిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. రాజధాని రియాద్‌లో సైతం హుదా అల్‌ జరైసీ అనే మహిళ విజయం సాధించింది. సౌదీ అరేబియాలో పురుషులతో సమానంగా మహిళలకు ఎలాంటి హక్కులు లేవు. మహిళలు కార్లు డ్రైవింగ్‌ చేయడం సైతం సౌదీలో నేరం. అలాగే పురుషులకు అనుకూలంగానే అనేక చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇటీవలే మరణించిన కింగ్‌ అబ్దుల్లా ఈ ఏడాది నుంచి ప్రజా జీవితంలో మహిళల పాత్రను పెంచే దిశగా చర్యలు తీసుకున్నారు. అందుకు తొలి మెట్టుగానే మహిళలకు ఓటు హక్కు కల్పించారు.      

06:42 - December 14, 2015

పారిస్ : భూతాపోన్నతిని రెండు డిగ్రీల లోపునకు పరిమితం చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందం గొప్ప ముందడుగు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పారిస్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో 190 పైగా దేశాలు సానుకూల స్పందనలు తెలిపాయి. కర్బన ఉద్గారాలను తగ్గించాలని చేసిన ప్రాతిపాదనలపై సదస్సులో పాల్గొన్న దేశాలన్ని అంగీకారం తెలిపాయి. వాతావరణాన్ని కాపాడుకోవడంలో ఇది మొదటి విజయమన్నారు ప్రధాని మోదీ.
భూమిపై జరుగుతున్న విపరీత పరిణామాలకు ఎదుర్కొనేందుకు పారిస్‌లో వాతావరణ సదస్సు జరిగింది. ఈ సదస్సులో 190 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించాలని ఐక్యరాజ్యసమితి చేసిన సూచనలకు చైనా, భారత్ , రష్యా వంటి పలు దేశాలు నుండి సానుకూల స్పందనలు వచ్చాయి. ప్రధాని మోదీ ఒక అడుగు ముందుకేసి పారిస్ ఒప్పందం సవ్యంగా అమలు జరగాలంటే 100 బిలియన్ డాలర్లు ఇవ్వాలని మోదీ ట్వీట్ కూడా చేశారు. కాప్ 21 సదస్సులో కర్బన ఉద్గారాలపై నియంత్రణకు రెండు అంశాలను జోడించారు. మొదటిది ఉద్గారాల నియంత్రణకు చట్టబద్దత తీసుకురావడం, స్వచ్ఛందంగా ఉద్గారాలపై నియంత్రణ విధించడం. ఈ ప్రతిపాదనలకు సానుకూల పవనాలు వీచాయి. ప్రపంచ దేశాలు ఉద్గారాలను నియంత్రించలేకపోతే భవిష్యత్‌లో విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కాప్ 21 సదస్సు..
ప్రస్తుతం భూమి సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెల్సియస్ . ప్రపంచ దేశాలేవీ కర్భన ఉద్గారాలను నియంత్రించకపోతే 2100 సంవత్సరం భూమికి 19.6 డిగ్రీ సెల్సియస్ కు చేరుతుంది. భూమి సగటు ఉష్ణోగ్రత 16 డిగ్రీలకు చేరితేనే ఎల్ నినో తుఫానులు, భీకర తుఫాన్ లు రుతుపవనాల్లో మార్పుల వంటివి చోటుచేసుకుంటాయన్నది వాతావరణ శాఖ నిపుణుల వాదన. అలాంటిది 19.6 డిగ్రీ సెల్సియస్ ను చేరుకోవడమంటే మానవ మనుగడకు అంతిమ గడియలుగా భావించవచ్చు. విపరీత పరిణామాలు భూమిని చుట్టుముట్టక ముందే ప్రపంచ దేశాలు మేలుకోవాలంటూ ఐక్యరాజ్యసమితి సూచించింది. కాప్ 21 సదస్సులోనూ ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది.

తీర్మానాలకు కట్టుబడి ఉంటారా ? 
2100 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదల 2 డిగ్రీల సెల్సియస్‌కు మించరాదన్నది కాప్ 21 సదస్సులో చేసిన తీర్మానం. ప్రపంచ దేశాలు కర్భన ఉద్గారాల పై నియంత్రణ చేపడితేనే వాతావరణ మార్పులు జరగకుండా ఉంటాయి. కాని సంతకాలు చేసిన 190 దేశాలలో పర్యావరణ సాయం కోసమే సంతకాలు చేశాయా.. లేక మరేదైనానా అనే సందేహాలు తలెత్తే అవకాశాలు లేకపోలేవు. భవిష్యత్తులో ఎన్ని దేశాలు కాప్ 21 సదస్సు తీర్మానాలకు కట్టుబడి ఉంటాయన్నది చూడాలి మరి.  

06:37 - December 14, 2015

ఆగ్రా : మీరు చదువుతున్నది నిజమే. పరీక్ష రాసింది 12 వేల మంది అయితే పాసైంది 20 వేల మంది. ఎంతమంది పరీక్ష రాస్తారో అంత మంది పాస్ లేదా అందులో కొంతమంది ఫెయిల్ కావాలి అని అంటారు కదా..దీని గురించి తెలుసుకోవాలంటే ఇది చదవండి..

బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ...
ఆగ్రాలోని బీఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ. పెచ్చులూడి.. చెత్తగా కనిపిస్తున్న ఈ యూనివర్సిటీ అంతే చెత్త రికార్డును మూటకట్టుకుంది. బీఈడీ పరీక్షల ఫలితాలను ప్రకటించడానికి ఉపక్రమించిన అధికారులు తమ చేతిలో ఉన్న గణాంకాలను చూసి షాక్ కు గురయ్యారు. ఈ యూనివర్సిటీ తరపున మొత్తం పరీక్ష రాసిన విద్యార్థులు 12,800 మంది ఉన్నట్లు తొలుత తెలిపిన అధికారులు తీరా ఫలితాలను ప్రకటించే సమయానికి 20,089 మంది పాసైనట్లు గుర్తించారు. విద్యార్థుల సంఖ్యకంటే ఎక్కువమంది పాస్‌ కావడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

విచారణకు ఆదేశాలు...
దీనిపై యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ మహమ్మద్ ముజమ్ముల్ విచారణకు ఆదేశించి, చివరి నిమిషంలో ఫలితాలను వాయిదా వేశారు. యూనివర్సిటీ బీఈడీ పరీక్షల ఫలితాల లిస్టును తయారు చేయడానికి ఓ ప్రైవేట్ ఏజెన్సీని నియమించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలు నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ మంది విద్యార్థులను పరీక్షలు రాయడానికి అనుమతించడం వల్లనే ఈ గందరగోళం ఏర్పడిందని భావిస్తున్నారు. పరీక్షలు మొదలయ్యే రోజున కూడా కొన్ని కాలేజీలు విద్యార్థులను చేర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు కళాశాలలు తమకు కేటాయించిన సీట్లకు మించి విద్యార్థులను చేర్చుకున్నట్లు గుర్తించిన అధికారులు.. కళాశాలల యాజమాన్యాన్ని విద్యార్థుల లిస్టును తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. మొత్తానికి రికార్డుల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకంటే ఎక్కువ రిజల్ట్‌ సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పారు. అక్రమార్కులను గుర్తించి చర్యలు తీసుకుంటారో లేక సర్లే అంటూ సర్దుకుపోతారో వేచి చూడాలి.

06:34 - December 14, 2015

నెల్లూరు : భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సర్వసన్నద్ధమైంది. ఈనెల 16న నింగిలోకి దూసుకుపోనున్న పీఎస్‌ఎల్వీ సీ-29 రాకెట్‌ ప్రయోగానికి.. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో కౌంట్‌డౌన్‌ మొదలు కానుంది. ఈ రాకెట్‌లో 6 విదేశీ ఉపగ్రహాలను నింగిలో ప్రవేశపెట్టనున్నారు. పీఎస్‌ఎల్వీ సీ-29 సింగపూర్‌కు చెందిన 6 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. మొత్తం రాకెట్‌ బరువు 227.6 టన్నులు. ఇందులో ప్రధాన ఉపగ్రహం బరువు 400 కిలోలు. ఈ రాకెట్‌ భూమి నుంచి 550 కిలోమీటర్లు ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకోనుంది. ఇక ఇప్పటికే పీఎస్‌ఎల్వీ సీ-29 రాకెట్‌ ప్రయోగానికి షార్‌ అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. 59 గంటల పాటు కౌంట్‌డౌన్‌ కొనసాగిన అనంతరం 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ-29 నింగిలోకి దూసుకెళ్లనుంది. 

06:32 - December 14, 2015

నిజామాబాద్ : అధికారపక్షం దెబ్బకు ప్రతిపక్షం కుదేలైంది. ఎమ్మెల్యేలను, సీనియర్ నేతలను చేర్చుకుంటూ తెలంగాణ తెలుగుదేశం పార్టీని చావు దెబ్బతీసిన అధికార పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్‌ను కకావికలం చేస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులనే పోటీ నుంచి ఉపసంహరింపజేసే చర్యలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వరంగల్‌ తరహాలోనే నిజామాబాద్‌లో జెడ్పీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి అనూహ్యంగా తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఏకగ్రీవం అయ్యింది.

నామినేషన్ల ఉపసంహరణ..
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థులకు డిపాజిట్లు దక్కకుండా చేసిన టీఆర్‌ఎస్.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందే ప్రతిపక్షాన్ని చిత్తు చేసింది. ఇప్పటికే వరంగల్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌లో రెండు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. మెదక్, నిజామాబాద్‌లో గట్టి పోటీ ఇస్తారని భావించిన కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్న పళంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ రెండు స్థానాలను టీఆర్‌ఎస్ ఏకగ్రీవం చేసుకుంది.

భూపతిరెడ్డి ఎన్నిక...
ప్రధానంగా కాంగ్రెస్‌కు షాక్‌ తగిలేలా నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి తో పాటు ఎంపీటీసీల తరపున ఇండిపెండెంట్‌ అభ్యర్థి జగదీష్‌ నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భూపతిరెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కసరత్తు చేసి అభ్యర్థిగా మాజీ జడ్పీ చైర్మన్ వెంకటరమణ రెడ్డిని పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. రెండు రోజుల నుండి సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు వెంకటరమణరెడ్డితో నేరుగా చర్చలు జరిపారని సమాచారం. దీంతో ఆయన పోటి నుండి తప్పుకున్నారని తెలిసింది. ఇక స్వతంత్ర అభ్యర్థి జగదీష్ సైతం మంత్రుల ఒత్తిడితో పోటీ నుంచి వైదొలిగారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ అభ్యర్థి భూపతి రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది.

గులాబీ హవా..
ఇదిలా ఉంటే నిజామాబాద్‌ జిల్లాలోని ఎమ్మెల్యే స్థానాలన్నీ టీఆర్‌ఎస్‌ వశంలోనే ఉన్నాయి. దానికి తోడు ఇటీవలే జిల్లాకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్‌ సైతం కారెక్కడంతో చిన్నా చితకా నాయకులు కూడ కొద్ది మంది డీఎస్‌తో కలిసి కారెక్కారు. దీంతో ప్రస్తుతం జిల్లా మొత్తం గులాబీ హవా బలంగా వీస్తోంది. మరోవైపు తమకు బలం లేదని గుర్తించిన టీడీపీ, బీజేపీలు పోటీ నుంచి ముందుగానే తప్పుకోవడంతో జిల్లాపై టీఆర్‌ఎస్‌ ఏస్థాయిలో పట్టు బిగించిందో అర్థం చేసుకోవచ్చు. 

06:27 - December 14, 2015

హైదరాబాద్ : ఓయూలో విద్యార్థులు మరోసారి రోడ్డెక్కారు. పీజీ సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేయాలంటూ రిజిస్ట్రార్‌ను కోరినప్పటికీ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఆయన ప్రకటించారు. దీంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. పోలీసులు బలవంతంగా విద్యార్థులను చెదరగొట్టినా మొక్కవోని దీక్షతో ఓయూ రహదారిపై బైటాయించారు. పరీక్షలను వాయిదా వేసేంతవరకు తమ నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించారు.

పరీక్షలు జరుగుతాయన్న రిజిస్ట్రార్..
నెలరోజుల గ్యాప్‌తో అకాడమిక్ ఇయర్‌ను ప్రారంభించారని , ఒక వారం రోజులు వాయిదా వేయాలని కోరిన తమపై పోలీసులను ఉసిగొల్పుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. నాలుగు రోజుల క్రితమే తమకు ప్రాక్టికల్స్ పూర్తయ్యాయని.. ఇంతలోనే పరీక్షలు నిర్వహిస్తే ప్రిపరేషన్‌ లేకుండా తాము ఎలా రాయగలమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రార్ విద్యార్థుల భవిష్యత్‌ను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని వెంటనే పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తామే స్వయంగా బహిష్కరిస్తామన్నారు. మరోవైపు రిజిస్ట్రార్ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయంటూ ప్రకటించారు.
విద్యార్థుల ధర్నాలు రిజిస్ట్రార్ నిర్ణయాలతో ఓయూ ఒక్కసారిగా వేడెక్కింది. సోమవారం జరగబోయే పరీక్షలను వాయిదా వేసేంత వరకు రోడ్డుపైనే బైటాయిస్తామంటూ విద్యార్థులు భీష్మించారు. మరి అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయా.. విద్యార్థుల ధర్నాలకు వాయిదా పడతాయా అన్నది సస్పెన్స్ గా మారింది.  

06:25 - December 14, 2015

హైదరాబాద్ : టి కాంగ్రెస్‌ నేతలకు హైకమాండ్‌ నుంచి పిలుపు వచ్చింది. వెంటనే ఢిల్లీకి రావాలనేది పిలుపు సారాంశం. టిపిసిసి ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌, జానారెడ్డి, షబ్బీర్‌లను రాజధానికి రమ్మని పెద్దలు కాల్‌ చేశారు. మెదక్‌ డీసీసీ అధ్యక్షులు సునీతా లక్ష్మారెడ్డి, గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దానం నాగేందర్‌ కూడా వారితో పాటు వెళుతున్నారు. టిపిసిసి నేతలను అధిష్టానం అర్జెంట్‌గా పిలవడం పొలిటికల్‌ సర్కిల్‌లో ప్రాధాన్యతను సంతరించుకుంది. హైకమాండ్‌ పిలుపు వెనుక కారణాలు ఏమిటని కాంగ్రెస్‌ నేతలు చర్చించుకుంటున్నారు. ఐతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు, దీర్ఘకాలంలో దీని ప్రభావం పార్టీపై ఏమేరకు పడుతుంది అన్న అంశాలను చర్చించడానికే హైకమాండ్‌ రాష్ట్ర నేతలను ఢిల్లీకి రమ్మందని తెలుస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికలు...
తెలంగాణలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ గట్టి కసరత్తే చేసింది. మొత్తం 12 స్థానాలకు గాను తమకు బలమున్నదనుకున్న కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం.. చివరికి 5 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను నిలుపగలిగింది. తీరా ఆ ఐదుగురులోనూ.. ఇద్దరు అభ్యర్థులు హ్యాండ్‌ ఇచ్చేశారు. మెదక్‌, నిజామాబాద్‌ అభ్యర్థులు నామినేషన్‌లు వేశాక.. చివరి క్షణాల్లో వాటిని ఉపసంహరించుకున్నారు. అంతేనా చేతికి గుడ్‌బై చెప్పి.. కారెక్కేశారు. అధికార పార్టీ కండువా కప్పేసుకున్నారు. ఇది టిపిసిసి నేతలను కంగు తినిపించింది.

నివేదికలతో నేతలు సిద్ధం..
పార్టీ ఫిరాయించే అవకాశం ఉన్న వారికి పార్టీ టికెట్ ఎలా ఇచ్చారు..? ఈ విషయాలను ఎలా పసిగట్టలేక పోయారు..? ఈ అభ్యర్థులను సిఫారసు చేసిన వారెవరు..? వారి ఇంటెన్షన్‌ ఏంటి.. ఇలాంటి ప్రశ్నలతో.. ఢిల్లీ నాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పైగా.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తమ పార్టీ.. అసలు పోటీ చేయలేని దుస్థితి ఎందుకు దాపురించిందన్న అంశంపైనా చర్చించే అవకాశం ఉందంటున్నారు. పార్టీని బతికించుకోలేక పోతున్న కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులకు క్లాస్‌ తీసుకోవడం.. వారికి దిశానిర్దేశం చేయడం.. ఈ భేటీ అజెండాలో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఢిల్లీ పిలుపుతో.. టిపిసిసి నాయకులు.. ఎవరి నివేదికను వారు సిద్ధం చేసుకొని.. హస్తినకు పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. 

06:22 - December 14, 2015

విజయవాడ : కాల్ మనీ దందా మోసాలు అందరినీ షాకింగ్‌కు గురి చేస్తున్నాయి. కాల్ మనీ దందాలో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖుల పాత్ర ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాల్ మనీ కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. విజయవాడ ఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. కేసు విచారణలో తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, దర్యాప్తు ముమ్మరంగా సాగుతుందని చెప్పారు.

ఒత్తిడి లేదన్న సవాంగ్..
కాల్‌మనీ కేసు వెనక ఎవరు ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదని విజయవాడ సీపీ గౌతమ్‌సవాంగ్‌ స్పష్టం చేశారు. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులైన యలమంచిలి శ్రీరామమూర్తి, దూడల రాజేశ్‌ను అరెస్టు చేశామన్నారు. వారిపై 420, 354ఎ(1)(2), 384, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. దర్యాప్తులో తమపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పారు. దర్యాప్తు కోసం రెండు టాస్క్‌ ఫోర్స్‌, స్థానిక పోలీసుల బృందాలు ఏర్పాటు చేశామన్నారు. విజయవాడలో కాల్‌మనీ వ్యవహారం చాలా రోజులుగా సాగుతోందని... బాధితుల్లో చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారున్నారన్నారు.

ఎమ్మెల్యే స్థాయి నేతలపై ఆరోపణలు..
ఇదిలా ఉంటే కాల్‌ మనీ వ్యవహారంలో ఎమ్మెల్యే స్థాయి నేతలపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా విదేశాల్లో విద్య పేరుతో సత్యానందం అనే వ్యక్తి కాల్‌ మనీ మోసానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. ట్రస్ట్ పేరుతో పలువురు యువతులను కూడా మోసం చేశాడని తెలుస్తోంది. కాల్ మనీ దందాపై టాస్క్ ఫోర్స్ ఇప్పటికే పలు సోదాలు నిర్వహించింది. ఇందులో 3 బస్తాల ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లు లభ్యమైనట్లుగా సమాచారం. విచారణలో భాగంగా నిందితుల నుంచి మూడు బస్తాల డాక్యుమెంట్లను స్వాధీనపరచుకున్న పోలీసులు వాటిని విశ్లేషిస్తున్నారు.

డీఈ సత్యానందం కోసం గాలింపు...
మరోవైపు, కాల్‌ మనీ పేరిట అప్పులిచ్చి, వాటిని తీర్చలేకపోయిన మహిళలను వ్యభిచార వృత్తిలోకి బలవంతంగా దించాలని చూసిన వారి ఆగడాలు ఆగలేదు. తాజాగా, అప్పు తీర్చకుంటే మహిళలపై అత్యాచారం చేస్తామంటూ పలువురి ఇళ్లకు రౌడీలు వెళ్లి బెదిరించినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు రౌడీల కోసం ప్రత్యేక గాలింపు చేపట్టారు. ఈ కేసులో చెన్నుపాటి శ్రీను, ట్రాన్స్ కో డీఈ సత్యానందం కోసం పోలీసులు గాలిస్తున్నారు. సత్యానందం ఒడిశా పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

నిఘా వర్గాల ఆరా..
కాల్ మనీ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యుడు బుద్ధా వెంకన్న స్పందించారు. తన అన్న బుద్ధా ప్రసాద్ పైన వచ్చిన ఆరోపణలతో సంబంధం లేదన్నారు. తన అన్నయ్యతో తనకు సంబంధం లేదని చెప్పారు. తాము ఎంతోకాలంగా విడిపోయి ఉంటున్నామన్నారు. ఆయన వ్యాపారాలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇదిలా ఉంటే కాల్ మనీ వ్యవహారంలో బాధితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. తమకు న్యాయం విషయమై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, కాల్ మనీ వ్యవహారంలో ప్రజాప్రతినిధుల వ్యవహారంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.

06:19 - December 14, 2015

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బెజవాడకు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో కేసీఆర్‌ దంపతులు విజయవాడ బయలుదేరతారు. అక్కడి ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు.. ముక్కుపుడకను కానుకగా సమర్పిస్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే.. దుర్గమ్మకు ముక్కుపుడక సమర్పిస్తానని కేసీఆర్‌ మొక్కుకున్నారు. బెజవాడ దుర్గమ్మ దర్శనానంతరం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు.. ఏపీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసాని చేరుకుంటారు. ఈనెల 23 నుంచి 27వరకూ తన ఫామ్‌ హౌజ్‌లో నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి ఆహ్వానిస్తారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రుల మధ్య ఇరు రాష్ట్రాల మధ్య తక్షణం పరిష్కరించుకోవాల్సిన అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏపీ పర్యటనలో భాగంగా.. కేసీఆర్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌తో పాటు.. కొందరు రాష్ట్ర మంత్రులనూ యాగానికి ఆహ్వానించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడం ఇది రెండో సారి. దసరా రోజున అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఏపీ నుంచి వచ్చాక.. కేసీఆర్‌ ఈనెల 16న కర్ణాటక వెళ్లనున్నారు. 

పీఎస్ ఎల్ విసి -29 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్..

నెల్లూరు : పీఎస్ ఎల్ వి సి-29 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ఉదయం 7గంటలకు జరిగే కౌంట్ డౌన్ 59 గంటల పాటు కొనసాగనుంది. 

నేటి నుండి పీజీ సెమిస్టర్ పరీక్షలు..

హైదరాబాద్ : నేటి నుండి పీజీ సెమిస్టర్ పరీక్షలు జరుగనున్నాయి. అడ్డుకోవాలని చూస్తే అడ్మిషన్లు రద్దు చేస్తామని ఓయూ రిజిస్ట్రార్ హెచ్చరించారు. 

గుంటూరులో పోలీసుల ఓవర్ యాక్షన్...

గుంటూరు: పోలీసుల ఓవర్ యాక్షన్ కారణంగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. పొన్నూరు మండలం చింతలపుడిలో పోలీసులు ఆదివారం చెకింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ ద్విచక్రవాహనదారున్ని అకస్మాత్తుగా ఏఎస్ఐ లాగడంతో వాహనదారుడు కిందపడిపోయాడు. తీవ్రగాయాలయిన అతన్ని గుంటూరు జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పాతబస్తీలో ప్రైవేటు కళాశాల బస్సు బీభత్సం..

హైదరాబాద్ : ఓ ప్రైవేటు కళాశాల బస్సు మందుల దుకాణంలోకి దూసుకెళ్లిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

కాల్ మనీ కేసులో ఎవరినీ వదిలిపెట్టం - సీపీ సవాంగ్..

విజయవాడ : కాల్ మనీ కేసులో వెనుక ఎవరున్నా విడిచిపెట్టమని విజయవాడ పోలీసు కమిషనర్ డి.గౌతం సవాంగ్ పేర్కొన్నారు. ఈ కేసులో పకడ్డందీగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Don't Miss