Activities calendar

16 December 2015

21:42 - December 16, 2015

హైదరాబాద్ : అయుత చండీయాగానికి రావాలంటూ కెసిఆర్‌ స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. మొన్న ఏపీ సిఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆహ్వానించిన గులాబీ అధినేత నేడు కర్ణాటకలోని శృంగేరి పీఠానికి వెళ్లారు. శృంగేరి పీఠాధిపతికి ఆహ్వాన పత్రిక అందించి శిష్య సమేతంగా యాగానికి తరలి రావాలని ఆహ్వానించారు. కెసిఆర్‌కు శృంగేరి పీఠ పండితులు మఠంలోకి సాదరంగా స్వాగతం పలికారు. 

21:40 - December 16, 2015

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు చలి కాలంలో కాక పుట్టించ‌నున్నాయి. గురువారం నుంచి 22 వరకూ జరిగే ఈ సమావేశాలకు అధికార, ప్రతిపక్షం తమదైన శైలితో అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. ఈసారి భేటీలో బాక్సైట్ తవ్వకం, కాల్ మనీ, కల్తీ మద్యంపై వాడీ వేడీ చర్చ జరిగే అవకాశం ఉంది. ఉదయం 8-45కు స్పీకర్ కోడెల అధ్యక్షతన జరిగే సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేయనున్నారు.

అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ....

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మరోమారు అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడీ చర్చకు వేదిక కానున్నాయి. విపక్షాలు అడిగే ఎలాంటి ప్రశ్నకైనా సిద్ధంగా ఉండేందుకు అధికార పక్షం సమాధానాలు సిద్ధం చేస్తుంటే.... అధికార పార్టీని అడుగడుగునా ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షం సమాయత్తమవుతోంది. ముఖ్యంగా మన్యంలో ఇప్పటికే బాకైట్స్ తవ్వకాలపై వివాదం రేపిన విపక్షం అటు కాల్ మనీ, కల్తీ మద్యం వ్యవహరాలను కీలక అంశంగా పరిగణిస్తున్నాయి. వీటికి తోడు రాజధాని రైతులు భూముల్లో జరుగుతున్న అక్రమాలు తదితర అంశాలపై దృష్టి సారించాలని యోచిస్తున్నాయి. ఈ అంశాలను లేవనెత్తడం ద్వారా అధికార పార్టీని ఇరకాటంలో పట్టాలనేది ప్రధాన ప్రతిపక్షం ఎత్తుగడ. బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అని చెప్పడంతో పాటు గిరిజనులకు ఎలాంటి నష్టం లేకుండా ప్రభుత్వ విధానం ఎలా ఉండనుందో వివరించేందుకు అధికార పక్షం సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనిపై విడుదల చేసిన శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో పెట్టి ప్రజలకు సభ ద్వారానే వాస్తవాలు తెలపాలని యోచిస్తోంది. ప్రతిపక్ష వ్యూహాన్ని తిప్పికొట్టేలా కల్తీ మద్యం, బాక్సైట్ తవ్వకాలు, కాల్ మనీ వ్యవహారాలపై తామే చర్చను ప్రతిపాదించాలనే భావనకు అధికార పక్షం వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశాల్లో అధికార పార్టీ పలు బిల్లులను సైతం ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు, మున్సిపల్ కార్పొరేషన్ లు పెంపు, స్వీస్ ఛాలెంజ్ విధానంలో రాజధాని నిర్మాణం, కమర్సియల్ టాక్సెస్ బిల్లులు సభముందు ఆమోదం కోసం ఉంచనుంది.

12అంశాలు చర్చ....

అసెంబ్లీలో మొత్తం 12అంశాలు చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేర 36పేజీలతో ఓ పుస్తకాన్ని కూడా రూపొందించింది. రాజధాని నిర్మాణం విషయంలో సింగపూర్ సంస్థలు పెట్టే షరతులకు తలొగ్గేదే లేదని స్పష్టం చేస్తూ..., రాజధాని విషయంలో ప్రధాన లబ్ధిదారు భూములిచ్చిన రైతు అన్నదే ప్రభుత్వ లక్ష్యమనే విషయాన్ని అసెంబ్లీ వేదికగానే చాటాలని ముఖ్యమంత్రి ఓ నిర్ణయానికి వచ్చారు. ఇసుక, బాక్సైట్, జలవనరులపై ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన మూడు శ్వేతపత్రాలను అసెంబ్లీ వేదికగా చర్చించాలని నిర్ణయించారు. వీటితో పాటు పారదర్శకంగా పరిశ్రమలకు భూముల కేటాయింపు, గీతం మెడికల్ కళాశాలకు అనుమతులు, తడిసిన, రంగుమారిన ధాన్యం కొనుగోళ్లు, అంగన్ వాడీల సమస్యలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం చేయూత-రాష్ట్ర ప్రభుత్వ కృషి, పెరిగిన నిత్యావరసాల ధరలు, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఏపీలో కరవు పరిస్థితులు, విజయవాడలో కల్తీ మద్యం వ్యవహారం ఇలా మొత్తం 12అంశాలను అసెంబ్లీ వేదికగా చర్చించాలని అధికార పక్షం నిర్ణయానికి వచ్చింది.

మండలిలోను పూర్తి స్థాయిలో బలం....

అటు మండలిలోను పూర్తి స్థాయిలో బలం పెంచుకున్న అధికార పక్షం ప్రతిపక్షం కంటే పైచేయి సాధించేందుకు సిద్ధమైంది. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్న బాక్సైట్, కల్తీ మద్యం తదితర అంశాలపై ప్రజలకు శాసనసభ ద్వారానే వాస్తవాలను సమాధానంగా చెపుదామని నేతలకు తెలిపారు. మరోవైపు అవసరమైతే.. సమావేశాలను ఒకరోజు పొడిగించే అవకాశం ఉంది. దీనిపై గురువారం ఉదయం BAC సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నారు.

సభను ఓరోజు పొడిగించే అవకాశం...

అసెంబ్లీ సమావేశం ప్రారంభానికి ముందు చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్టీఆర్ ఘాట్ లోని ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పించి అక్కడి నుంచి సభా ప్రాంగణానికి రానున్నారు. 

21:37 - December 16, 2015

హైదరాబాద్ : ఏపీ శీతాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి కేబినెట్ భేటీ అయింది. ఈ సమావేశాలు జరిగేది ఐదే రోజులు. కానీ అత్యంత కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. గతంకన్నా భిన్నంగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఐదే రోజులు నిర్వహిస్తుండడంతో ప్రతిపక్షాలను ఎలా ఫేస్ చేయాలి...ఏయే బిల్లులను ప్రవేశపెట్టాలనే అంశాలపై మంత్రులు చర్చించారు.

మనీ ల్యాండరింగ్‌కు సంబంధించిన బిల్లు...

మనీ ల్యాండరింగ్‌కు సంబంధించిన బిల్లునొకదాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఏపీ విభజన చట్టంలో మనీ ల్యాండరింగ్‌ ప్రస్తావన ఉన్నా కొంత క్లారిటీ మిస్‌ అయినందున దానిపై చట్టం చేయనున్నారు. ప్రైవేట్‌ యూనివర్శిటీ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేబినెట్‌ నిర్ణయించింది. అయితే ప్రైవేట్‌ వర్శిటీల ఏర్పాటుపట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత కూడా ఉంది. ఇక వ్యాట్‌కు సంబంధించి మరో బిల్లు చర్చకు రానుంది. దీంతోపాటు ఎక్సైజ్‌ అండ్ ప్రొహిబిషన్‌ బిల్లు, స్విస్‌ ఛాలెంజ్‌కు సంబంధించిన మరో బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

స్విస్‌ ఛాలెంజ్‌కు సంబంధించి....

స్విస్‌ ఛాలెంజ్‌కు సంబంధించి గతంలో ఆర్డినెన్స్ ఒకటి జారీ అయింది. అయితే లాంగ్‌ లీజ్‌కు ఇచ్చేందుకు కొన్ని అడ్డంకులున్నాయి. ఈ నేపథ్యంలో క్లాజ్‌లో చిన్న మార్పు చేసి 99 సంవత్సరాలకు లీజ్ ఇచ్చేందుకు చట్టబద్దత కల్పించనున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాల పెంపుపై సబ్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కేబినెట్‌ కమిటీ నిర్ణయించింది. కాల్‌మనీ వ్యవహారానికి సంబంధించీ కేబినెట్‌ చర్చించింది. ఈ కేసుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

21:35 - December 16, 2015

విజయవాడ : అడవిలో చిన్నచిన్న క్రూర మృగాలు ఎన్నున్నా మిగతా సాధుజంతువులకు పెద్దగా ప్రమాదముండదు. కానీ పులులు సింహాలు లాంటివి ఉంటేనే ప్రమాదం. అయితే చిన్నచిన్న క్రూరమృగాలే అడివంతటినీ నాశనం చేస్తున్నాయంటే అంతకు మించిన జోక్‌ మరొకటి ఉండదేమో. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్యవహారంలో కొన్ని లెక్కలు ఇలాగే ఉన్నాయి. ఆ తీరు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు..

వెలికి తీసేకొద్దీ హడలెత్తించే నిజాలు....

కాల్‌మనీ.. ఇప్పుడు ఏ నోట చూసినా ఇదే మాట. వెలికి తీసేకొద్దీ హడలెత్తించే నిజాలు, వేలాదిమంది దీన గాధలు వెలుగులోకి వస్తున్నాయి. కాలయముళ్లలాంటి వడ్డీ వ్యాపారుల ఆగడాలకు విలవిల్లాడిన మహిళల వెతలు మనసులను మెలిపెడుతున్నాయి. విజయవాడలో మొదలైన ఈ కాల్‌మనీ కీచక పర్వం రాష్ట్రమంతటా పాకింది. ఇప్పుడిప్పుడే మిగతా జిల్లాల్లోని బాధితులు బయటకొస్తున్నారు. తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. అయితే ఇంతకాలం కాల్‌మనీ నిర్వాహకులు ఏమాత్రం భయంలేకుండా ఎంతోమంది జీవితాలతో ఆడుకున్నారంటే కారణం వారి వెనక నాయకుల బలం, అండదండలు పుష్కలంగా ఉండడమే.

ఏపీ ప్రభుత్వానికి చిక్కులు....

కాల్‌మనీ వ్యాపారుల ఆగడాలతో ఏపీ ప్రభుత్వానికి చిక్కులొచ్చిపడ్డాయి. కారణం టిడిపి నేతలకూ ఆ వ్యవహారంలో ప్రమేయముండడమే. మిగిలిన పార్టీల నేతలూ యథేచ్చగా ఈ దందా నిర్వహించి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు. ఆయా నేతల సంఖ్యను ప్రభుత్వం విడుదలచేసింది. ఇదే సంఖ్య కొన్ని అనుమానాలకు తావిస్తోంది. నిజానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం వైసిపి నేతలే ఎక్కువ మంది ఉన్నారు. టిడిపి నాయకులు ఆరుగురు, వైఎస్సార్‌సిపి నేతలు 27 మంది, సిపిఐ నాయకులు ముగ్గురు, ఇతర పార్టీల నేతలు 44 మంది ఉన్నట్లు లెక్కతేల్చారు. ఇది రాష్ట్రవ్యాప్త లెక్కలని ప్రభుత్వం అంటోంది.

అసలు సిసలైన నాయకులు టిడిపి నేతలని టాక్.....

ఇతర పార్టీల నేతలను పెద్ద సంఖ్యలో చూపించినా వారంతా చోటామోటా నాయకులని సమాచారం. అసలు సిసలైన నాయకులు టిడిపి నేతలని టాక్. వారంతా ప్రభుత్వ పెద్దలు కావడంతోనే ఈ వ్యవహారం ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక టిడిపి తమ నేతల సంఖ్యను కావాలనే తగ్గించి చూపిస్తోందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.

ఎంతటి పెద్ద నాయకులున్నా వదలబోమని....

మరోవైపు కాల్‌మనీ వ్యవహారంలో ఎంతటి పెద్ద నాయకులున్నా వదలబోమని ఏపీ ప్రభుత్వం అంటోంది. తమ నేతల సంఖ్యను బయటపెట్టడంతోనే తమ నిజాయతీ ఏంటో తెలుస్తోందని టిడిపి అంటోంది. ఇక కేబినెట్‌ సమావేశంలో కాల్‌మనీ వ్యవహారంపై చర్చించారు. రిటైర్డ్‌ జడ్జితో జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని బాధితులకు న్యాయం జరిపించాలని నిర్ణయించారు. కలకలం సృష్టిస్తోన్న ఈ కాల్‌మనీ వ్యవహారంలో పోలీసులు కీలకపాత్ర పోషించనున్నారు. అసలు సిసలైన నేతలను రుజువులతో బయటకు తెస్తారా లేక ఒత్తిళ్లకు లొంగిపోతారా అన్నది చర్చనీయాంశమవుతోంది.  

21:32 - December 16, 2015

విజయవాడ : ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ విఆర్‌ఎ ఉద్యోగులు సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలిపారు. విజయవాడలోని రామవరప్పాడులో 10 మంది విఆర్‌ఎలు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన జరిపారు. రోడ్డుపై రాస్తారోకో జరపడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ స్తంభించింది. అర్ధనగ్నంగా డ్యాన్స్ చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. వేతనాల పెంపు విషయమై కొంతకాలంగా విఆర్ఎలు ఆందోళన జరుపుతున్నారు. కేబినెట్‌ సమావేశంలో తమ సమస్యలపట్ల చర్చ జరపలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.  

21:31 - December 16, 2015

ఢిల్లీ : మోదీ సర్కార్ చల్లగా మరో వాత పెట్టింది. నొప్పి తెలియకుండా పెట్రోలియం ఉత్పత్తులపై సుంకం పెట్టింది. పడిపోయిన ముడిచమురు లాభాన్ని వినియోగదారులకు లభించకుండా.. ధర తగ్గగానే... ఎక్సైజ్ సుంకం పెంచి ఖజానా నింపుకుంటోంది. LOOK

పెట్రోల్ పై లీటర్‌కు 30పైసలు, డీజిల్ పై రూపాయి 17 పైసల భారం...

కేంద్ర ప్రభుత్వం మరోసారి ఎక్సైజ్ సుంకం పెంచింది. అన్ బ్రాండెడ్ పెట్రోల్ పై లీటర్‌కు 30పైసలు, డీజిల్ పై రూపాయి 17 పైసల భారం విధించింది. దీనివల్ల కేంద్రానికి అదనంగా 2వేల 500కోట్ల ఆదాయం లభించనుంది. ఈ పెంపునతో లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ భారం 7రూపాయల 6పైసల నుంచి 7రూపాయల 36పైసలకు చేరింది. డీజిల్‌ పై భారం 5రూపాయల 83పైసలకు పెరిగింది. దీంతో ఓ లీటర్ పెట్రోల్‌పై పన్నుల పేరిట చెల్లిస్తున్న మొత్తం 19రూపాయల 36పైసలు. అటు డీజిల్ పై ఈ భారం 11రూపాయలు 83పైసలు.

2 నెలల కాలంలో ఎక్సైజ్ సుంకం పెంచడం ఇది రెండోసారి.....

2 నెలల కాలంలో ఎక్సైజ్ సుంకం పెంచడం ఇది రెండోసారి. నవంబర్ 7 కేంద్రం పెట్రోల్‌ పై రూపాయి 60పైసలు, డీజిల్‌ పై 30పైసలు పెంచింది. ఇలా 2 సార్లు పెంచడంతో కేంద్రానికి లభిస్తున్న ఆదాయం 5వేల 700కోట్లు. ఇలా సుంకాలు పెంచడాన్ని కేంద్రం సమర్థించుకుంటోంది. సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించేందుకు ఇందులో అధిక వాటి ఇస్తామని చెబుతోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం పేరుతో 99వేల 184కోట్లు రాబట్టింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఈ మొత్తం 33వేల 42కోట్లు. 

21:28 - December 16, 2015

ఢిల్లీ :సచివాలయంలో సిబిఐ దాడులు జరపడాన్ని ఆప్‌ సీరియస్‌గా తీసుకుంటోంది. డిడిసిఏ స్కాంలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి ప్రమేయం ఉందని ఆరోపిస్తోంది. అరుణ్‌ జైట్లీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఢిల్లీ క్రికెట్‌ స్కాంకు సంబంధించి ఫైళ్ల కోసమే తన కార్యాలయంలో సోదాలు నిర్వహించారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. దీనిపై స్పందించిన సిబిఐ తాము ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎలాంటి సోదాలు నిర్వహించలేదని, సిఎం ఆఫీస్‌కు సీల్‌ వేయలేదని స్పష్టం చేసింది. తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేశారని ఆప్‌పై సిబిఐ మండిపడింది.

21:27 - December 16, 2015

ఢిల్లీ : నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ జైలు వెళ్లేందుకే నిర్ణయించుకున్నట్టు సమాచారం.ఈ కేసులో వారు బెయిలుకు ప్రయత్నించడం లేదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే సోనియా, రాహుల్‌ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి సోనియా, రాహుల్ డిసెంబర్‌ 19న పాటియాలా కోర్టులో హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసింది. సోనియా కోర్టుకు హాజరయ్యే రోజు భారీ మార్చ్‌ చేపట్టాలన్న యోచనలో కాంగ్రెస్‌ ఉంది. కోర్టుకు హాజరు కాకుండా ఉండేలా చూడాలన్న కాంగ్రెస్‌ నేతల పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో తమ గెలుపు తథ్యమని కాంగ్రెస్‌ పార్టీ నేతలు, న్యాయవాదులు కపిల్‌ సిబ్బల్, అభిషేక్‌ మను సింఘ్వి ఇప్పటికే స్పష్టం చేశారు.

21:24 - December 16, 2015

హైదరాబాద్ : బ్రిటీష్ బ్యూటీ అమీజాక్సన్ రోబోగా మారనుంది. సెస్సేషనల్ డైరెక్టర్ శంకర్ తీస్తున్న రోబో-2లో ఆమె రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం రోబో-2 ప్రీప్లానింగ్ లో బిజీగా ఉన్న ఈ స్టార్ డైరెక్టర్.. అమీ జాక్సన్ ను ఓకే చేసినట్టు సమాచారం. ఫస్ట్ పార్ట్‌లో ఐశ్వర్యను ఎంచుకున్న శంకర్.. ఈసారి ఆమెకు ఏమాత్రం తీసిపోవద్దని అమీజాక్సన్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. 

బీచ్ కు వెళ్లి ఇద్దరు మెడికోల మృతి

శ్రీకాకుళం : స్నేహితులతో కలిసి సరదాగ బీచ్‌కు వెళ్లిన ఇద్దరు మెడికోలు నీటి మునిగి మృతిచెందారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలోని మత్స్యలేసం వద్ద బుధవారం చోటుచేసుకుంది. రిమ్స్‌లో చదువుతున్న పది మంది మెడికోలు ఈ రోజు బీచ్‌లో సరదాగ గడుపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇద్దరు నీట మునిగి మృతిచెందగా మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు విశాఖపట్నానికి చెందిన అనిల్‌చంద్ర(21), సందీప్(21)లుగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

రిపబ్లిక్ డే వేడుకలకు హోలాండే

న్యూఢిల్లీ: 2016 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే భారత్‌కు రానున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. తమ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా భారత్‌కు వస్తున్న హోలాండేకు ఘనస్వాగతం పలుకనున్నట్టు ఆయన తెలిపారు. హోలాండే రాకతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

గుంటూరు - హైదరాబాద్ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్

హైదరాబాద్ : గుంటూరు - హైదరాబాద్ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. మేడికొండూరు వద్ద మూడు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. అక్కడి వంతెన ఇరుకుగా ఉండడంతో వాహనాలు వేగంగా ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది..

20:38 - December 16, 2015

హైదరాబాద్ : రాష్ట్రాల హక్కులు ప్రమాదంలో పడ్డట్టేనా? కేంద్రం బలవంతంగా తన పంతం నెగ్గించ్చుకునే ప్రయత్నం చేస్తోందా? ఫెడరల్ స్ఫూర్తి మంట గలిసినట్టేనా? ఒక రాష్ట్ర సెక్రటేరియట్ సమాచారం లేకుండా సోదాలు చేయడాన్ని ఎలా తీసుకోవాలి? ఇది ఏపరిణామాలకు సంకేతంగా నిలుస్తోంది? ఢిల్లీ సెక్రటేరియట్ లో సీబీఐ సోదాల పై నేటి వైడాంగిల్ లో విశ్లేషణ చేశారు. ఆ విశ్లేషణను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

20:13 - December 16, 2015

థర్టీ ఫస్ట్ న తాటతీయ బోతున్న పన్నులోళ్లు… ఎగిరి దుంకేటోళ్ల మీద పన్నుల ప్రతాపం, కోర్టు కేసుల మీద సర్కార్ అదాలత్, భూమి పంచాయతీలకు దగ్గర పడ్డ దినాలు, రక్షక భటుని అవతారంలో రాక్షసుడు, కరీంనగర్ భూమయ్య కథా..యవ్వారం, అయ్య, అవ్వను అవతలకు ఎల్లగొట్టిన కొడుకులు… ఉస్నాబాద్ పీఎస్ లో ముసలోళ్లు, ఆన్ లైన్లో పిడికలు అమ్ముతున్న అమేజాన్… అదే బాటలో నడుస్తున్న అవతల కంపెనీలు, నోరూజారి నాలుక కరుసుకున్న యూపీ డీజీపీ… రామరాజ్యానికి - పోలీసు పనితనానికి లంకె వంటి ఘరం ఘరం అంశాలతో ఈ రోజు మన ముందుకు వచ్చేశాడు 'మల్లన్న ముచ్చట్ల'తో మల్లన్న. ఏఏమి సంగతులు చెప్పారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:03 - December 16, 2015

హైదరాబాద్ : పిఎస్ ఎల్వీ -సీ 29 రాకెట్ ప్రయోగానికి కృషి చేసిన షార్ శాస్త్రవేత్తలకు హెడ్ లైన్ షోలో పాల్గొన్న నేతలు అభినందనలు తెలిపారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే ప్రైవేటు యూనివర్శిటీల బిల్లు తెచ్చేందుకు ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ప్రైవేటు యూనివర్శిటీల బిల్లుకు కేబినెట్ ఆమోదం విద్యారంగం నుండి ప్రభుత్వం క్రమంగా తప్పుకునే ప్రయత్నం చేస్తోందా? ప్రైవేటు యాజమాన్యానికి సిలబస్ రూపకల్పన, ఫీజుల నియంత్ర ఇస్తే...వర్శిటీలపై ప్రభుత్వ అజమాయిషీ కోల్పోయే అవకాశం లేదా? పరిశోధనలకు అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే లక్ష్యమని సర్కార్ వాదిస్తోంది… అందులో ఎంత నిజం ఉంది? ఏపీ లో వర్శిటీల్లో 60 శాతానికి పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు వర్శిటీల వల్ల 190 విద్యా సంస్థలపై ప్రభావం చూపనుందా? అస్సలు ప్రైవేటు యూనివర్శిటీల బిల్లు లాభమా? నష్టమా? అనే అంశం పై హెడ్ లైన్ షోలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో టిడిపి నేత చందు సాంబశివరావు, కాంగ్రెస్ నేత గౌతం, ఎస్ ఎఫ్ ఐ నేత నూర్ మహ్మద్, విద్యారంగ నిపుణులు కామేశ్వరరావు పాల్గొన్నారు. మరి ఆచర్చను మీరూ వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి…

19:49 - December 16, 2015

హైదరాబాద్ : వనస్థలీపరంలోని శాతవాహన నగర్ లో పాఠశాల బస్సు ఢీకొన్ని ఏడాదిన్నర చిన్నారి మహాలక్ష్మి మృతి చెందింది. ఈ ఘటనలో నిందితుడైన డ్రైవర్, బస్సులు పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.

19:42 - December 16, 2015

హైదరాబాద్ : ప్రైవేటు యూనివర్శిటీల బిల్లుపై ఏపీ సర్కారు పట్టుదలగా ఉంది. ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే బిల్లును తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇంతకీ ప్రభుత్వం ఈ బిల్లుపై ఎందుకింత పంతానికి పోతోంది..? సర్కారు వాదనలో చిత్తశుద్ధి ఎంత..? ప్రైవేటు వర్శిటీలకు ప్రత్యామ్నాయమే లేదా..? విద్యావేత్తలు.. నిపుణులు చేస్తున్న సూచనలను సర్కారు ఎందుకు బేఖాతరు చేస్తోంది..? వాచ్‌ దిస్‌ స్టోరీ..!

విద్యారంగం నుంచి క్రమంగా తప్పుకునేందుకు...

విద్యారంగం నుంచి క్రమంగా తప్పుకునే ప్రయత్నాలను ఏపీ సర్కారు ముమ్మరం చేస్తోంది. ఈ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయాలన్నదే సర్కారు యోచనగా కనిపిస్తోంది. తాజాగా యూనివర్శిటీలనూ కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టే కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్శిటీలను అనుమతించే బిల్లును అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తీసుకు వచ్చి తీరాలన్న లక్ష్యంతో సర్కారు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న వర్శిటీలలో.. పరిశోధనలు సవ్యంగా సాగడం లేదని.. ప్రైవేటు వర్శిటీలు వస్తే.. ఆ కొరత తీరుతుందన్నది ప్రభుత్వ వాదన. పైగా ఏపీని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్నా.. ప్రైవేటు వర్శిటీలు తప్పవని అంటోంది.

ఓ రిటైర్డ్‌ ఐఏఎస్‌, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌లతో ఏర్పాటైన కమిటీ..

ఆమధ్య ఓ రిటైర్డ్‌ ఐఏఎస్‌, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌లతో ఏర్పాటైన కమిటీ.. గత ఆగస్టులో ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించింది. విద్యారంగాన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డ కమిటీ.. కార్పొరేట్‌ సంస్థలకు ప్రైవేటు వర్శిటీల ఏర్పాటు అవకాశమివ్వడం... అవసరమైతే పీపీపీ విధానంలో నిర్వహించడం లాంటి చర్యలు చేపట్టవచ్చని సూచించింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న సర్కారు.. మూడు నెలల వ్యవధిలోనే ప్రైవేటు యూనివర్శిటీల బిల్లుకు రూపకల్పన చేసింది.

ప్రభుత్వం ప్రతిపాదిస్తోన్న బిల్లు ఆమోదం పొందితే..

ప్రభుత్వం ప్రతిపాదిస్తోన్న బిల్లు ఆమోదం పొందితే.. అంతర్జాతీయ ప్రమాణాలున్న జాతీయ, అంతర్జాతీయ సంస్థలు.. ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు వర్శిటీలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువగా విదేశీ సంస్థలు వస్తాయని.. తద్వారా విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయనీ ప్రభుత్వం ఆశిస్తోంది. కార్పొరేట్‌ సంస్థలకు అనుగుణంగాను, ప్రతి విద్యార్థికీ ఉపాధి లభించేలా కోర్సులను రూపొందించాలని సర్కారు సూచించబోతోంది. సర్కారీ నిబంధనలకు ఓకే చెప్పే సంస్థలకు సుమారు 40 ఎకరాల మేర భూమిని ప్రభుత్వం అప్పగిస్తుంది. దీనిపై విధివిధానాలు తయారవుతున్నాయి.

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విద్యావేత్తలు....

ప్రైవేటు యూనివర్శిటీల బిల్లును తేవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యావేత్తలు వ్యతిరేకిస్తున్నారు. ఈమేరకు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించారు. విశాఖలో నిర్వహించిన ఈ మేథోమధన సమావేశానికి, ఏయు, నాగార్జున, ద్రవిడ వర్శిటీల మాజీ వీసీలు, ప్రొఫెసర్‌లు హాజరయ్యారు. ప్రైవేటు యూనివర్శిటీల బిల్లు వల్ల.. ప్రస్తుతం క్రియాశీలకంగా సాగుతున్న యూనివర్శిటీలు మరింతగా దెబ్బతింటాయని వారు అభిప్రాయపడ్డారు.

వర్శిటీల్లో పరిశోధనలు సక్రమంగా జరగడం లేదన్న కారణంతో....

వర్శిటీల్లో పరిశోధనలు సక్రమంగా జరగడం లేదన్న ప్రభుత్వ భావన కొట్టివేయ తగింది కాదు. కానీ దీనికి కారకులెవరు..? పరిశోధనలు సవ్యంగా జరిగేలా సర్కారు ఎందుకు చర్యలు తీసుకోలేదు. వర్శిటీల్లోని 60శాతం అధ్యాపక పోస్టుల ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదు. ఇవేవీ చేయకుండా.. ఏవో ప్రైవేటు వర్శిటీలు వస్తాయి.. పరిశోధన రంగాన్ని పరుగులు పెట్టిస్తాయి అనడం ఎంతవరకు సమంజసం..? విద్యావేత్తలు ఈ ప్రశ్నల పరంపరను సంధిస్తున్నారు.

ప్రైవేటు వర్శిటీల్లో రిజర్వేషన్‌లు కూడా అమలయ్యే అవకాశం శూన్యం..

పైగా ప్రైవేటు వర్శిటీల నిర్వహణ, ఫీజుల నియంత్రణలపై ప్రభుత్వానికి గానీ, ఉన్నత విద్యామండలికి గానీ ఎలాంటి సంబంధమూ ఉండదు. పైగా ప్రైవేటు వర్శిటీల్లో రిజర్వేషన్‌లు కూడా అమలయ్యే అవకాశం ఉండదు. దీంతో ఉన్నత కులాల్లోని పేదలతో పాటు.. ఎస్సీ, ఎస్టీలు చదువుకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. కేవలం డబ్బున్నవారు మాత్రమే చదువుకునే అవకాశం ఉంటుంది. పైగా అంతర్జాతీయ సంస్థలు తమ అవసరాల మేరకే కోర్సులను రూపకల్పన చేస్తాయి. దీని వల్ల స్థానిక ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్న భావనా వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు వర్శిటీలు, విద్యా సంస్థలు.. ప్రభుత్వం నుంచి కారుచౌకంగా భూములు కొట్టేసి.. ఫీజుల విషయంలో విద్యార్థులను పిండేస్తున్నాయి. ఓ యూనివర్శిటీ నిర్మాణానికి ఎంపీ నిధులూ వాడారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు వర్శిటీల ఏర్పాటుకు ప్రభుత్వం జెండా ఊపితే.. మంత్రులు, వారి తాబేదార్లు.. వారి అనుయాయులుగా ఉన్న వ్యాపారులే వర్శిటీలను ఏర్పాటు చేస్తారని అంటున్నారు.

ప్రైవేటు వర్శిటీలను తీసుకు రాకుండా..

ప్రైవేటు వర్శిటీలను తీసుకు రాకుండా.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వర్శిటీలను.. ఇప్పటికే ఉన్న ప్రైవేటు వర్శిటీలను బలోపేతం చేస్తే.. వాటిల్లోనే పరిశోధనక విద్యార్థులను ప్రోత్సహిస్తే సరిపోతుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ప్రైవేటు బిల్లు పేరిట విలువైన భూములను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. 

విజయవాడలో సెల్ టవర్ ఎక్కిన వీఆర్ ఏలు...

కృష్ణా : విజయవాడలోని రామవరప్పాడు రింగు రోడ్డు దగ్గర ఏపీ వీఆర్ఏలు ఆందోళనకు దిగారు. కేబినెట్ భేటీలో తమ సమస్యలు పరిష్కరించలేదని పేర్కొంటూ 9 మంది వీఆర్ఏలు సెల్ టవర్ ఎక్కారు. 45 రోజులుగా తమ సమస్యలపై పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. 6,500 రూపాయల జీతం సరిపోవడం లేదంటూ తాము ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతిపత్రాలు సమర్పించామని, కానీ నేతలెవరూ పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. రోజుకు 200 వేతనానికి ఎవరూ పని చేయడంలేదని, తాము మాత్రం పని చేస్తున్నామని వారు చెబుతున్నారు. రామవరప్పాడు రింగు రోడ్డు దగ్గర ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.

నేపాల్ అధ్యక్షురాలి కాన్వాయ్ పై దాడి

హైదరాబాద్ : నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి కాన్వాయ్ పై బుధవారం దాడి జరిగింది.నూతన రాజ్యాంగాన్ని నిరసిస్తూ… అధ్యక్షురాలి కాన్వాయ్ పై రాళ్ల దాడికి దిగారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ… ఆందోలనలు చేపట్టారు. కొందరు కార్యకర్తలు అధ్యక్షురాలి కాన్వాయ్ పై రాళ్లతో దాడి చేశారు. జనక్ పూర్ ఆలయం వద్ద పెట్రోల్ బాంబు దాడులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన సిబ్బంది అధ్యక్షురాలిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం భాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.

ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని అభినందనలు...

ఢిల్లీ: పీఎస్‌ఎల్వీ-సీ29 రాకెట్ ప్రయోగం విజయవంతంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ప్రయోగం విజయంపై ప్రధాని స్పందిస్తూ మన శాస్త్రవేత్తలు మరొక చిరస్మరణీయ విజయాన్ని సాధించారన్నారు. సింగపూర్‌కు చెందిన ఆరు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినందుకు వారికి ప్రధాని అభినందనలు తెలియజేశారు. భారత్-సింగపూర్‌ల సంబంధాలు ఎంతో ప్రాముఖ్యమైనవన్న ప్రధాని సింగపూర్‌తో భారత్ బలోపేతమైన సంబంధాలను కొనసాగించాలనుకుంటున్నదని పేర్కొన్నారు.

18:54 - December 16, 2015

శ్రీహరి కోట : నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి 29 రాకెట్ విజయవంతం అయ్యింది. భూ పరిశీలన కోసం సింగపూర్ అంతరిక్ష సంస్థ ఉపగ్రహం టిలియోస్ తో సహా మరో ఐదు ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చడంతో పీఎస్ ఎల్వీ - సీ29 ప్రయోగం విజయవంతం అయ్యింది. బుధవారం సాయంత్రం 6.20 నిమిషాల సమయంలో చివరి ఉపగ్రహాన్ని కూడా లక్ష్యానికి చేర్చింది. ఒక్కో దానిని అర నిమిషం వ్యవధిలో కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది.

50వ ప్రయోగం విజయవంతం : షార్ డైరెక్టర్

భారత అంతరిక్ష చర్రితలో 50వ ప్రయోగం విజయవంతమైందని షార్ డైరెక్టర్ కున్హి కృష్ణన్ ప్రకటించారు. శ్రీహరి కోట నుంచి ఇది 50వ ప్రయోగం కాగా షార్ నుంచి ఇప్పటి వరకు 84 ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి పంపించది. ఇప్పటి వరకు 51 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టింది.

సబరాల్లో షార్..

పీఎస్ ఎల్ వీ - సీ29 రూపంలో 50వ ప్రయోగం విజయవంతం కావడంతో షార్ శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.

18:41 - December 16, 2015

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్‌ అడిగి 24 గంటలు కూడా కాలేదు. అలా అడగగానే ఇలా సాక్ష్యం వచ్చేసింది. తిరుపతి ఎయిర్‌పోర్టులో అధికారిపై తమ నేతలు దాడి చేయకపోయినా.. అక్రమంగా కేసులు పెట్టారని జగన్‌ ఆరోపించారు. ఇప్పుడు సీసీ టీవీ ఫుటేజ్‌ బయటకొచ్చింది. ఆ వీడియోలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు ఎంపీ మిథున్‌రెడ్డి కూడా దాడి చేసినట్లు కనపడుతోంది. ఇప్పటికే చెవిరెడ్డి అరెస్ట్‌ అయి బెయిల్‌పై ఉన్నారు. ఇప్పుడు మిథున్‌రెడ్డి అరెస్ట్‌కు కూడా అవకాశం కనపడుతోంది.

18:38 - December 16, 2015

హైదరాబాద్ : దాడులు చేసిన కొద్దీ టన్నుల కొద్దీ నకిలీ సరుకులు దొరుకుతూనే ఉన్నాయి. నూనె, నెయ్యి, పసుపు, కారం ఇలా అన్నిటిని కల్తీ చేసి నకిలీ మాఫియా రెచ్చిపోతోంది. తాజాగా హైదరాబాద్‌ పహాడీ షరీఫ్‌ దగ్గర పోలీసులు దాడుల్లో నకిలీ శెనగపిండి దొరికింది. దాదాపు 300 పైగా శనగపిండి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. 

18:37 - December 16, 2015

హైదరాబాద్ : పౌల్ట్రీ రంగానికి అగ్రికల్చర్‌ స్టేటస్ ఇవ్వాలని తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్‌ డిమాండ్ చేస్తోంది. పెరుగుతున్న ఫీడ్ ధరలకు తగ్గట్లు గుడ్లకు ధర పెరగడం లేదని పౌల్ట్రీ ఫెడరేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పౌల్ట్రీ రంగాన్ని ఆదుకునేందుకు సబ్సిడీలు కావాలని ఫెడరేషన్‌ కన్వీనర్ కసిరెడ్డి నారాయణరెడ్డి, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్‌ అధ్యక్షులు ప్రదీప్‌రావు డిమాండ్‌ చేశారు.  

18:35 - December 16, 2015

హైదరాబాద్ : వందరోజులపాటు అలుపెరగకుండా పోరాడిన ఆశావర్కర్లు తమ సమ్మెను ప్రస్తుతానికి వాయిదా వేశారు. వివిధ పార్టీలు, సంఘాల సూచన మేరకు వాయిదా వేస్తున్నట్లు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా ప్రకటించారు. మంత్రి లక్ష్మారెడ్డి సమ్మె విరమించాక సమస్యలను పరిష్కరిస్తామన్నారని సాయిబాబా తెలియచేశారు. రేపటి నుంచి ఆశాలు విధులకు హాజరవుతున్నారు. 

18:34 - December 16, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల నీటి పంపకాల అజెండాపై సమావేశమైన కృష్ణానదీ యాజమాన్య బోర్డు భేటీ ముగిసింది. సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని తెలంగాణకు 20 టీఎంసీలు, ఏపీకి 10 టీఎంసీలు కేటాయించాలని నిర్ణయించారు. అలాగే తాగునీటి కోసం ఏపీకి 4 టీఎంసీలు, హైదరాబాద్‌కు 1.2 టీఎంసీలు కేటాయించారు.  

పిఎస్ ఎల్వీ - సి29 రాకెట్ ప్రయోగం సక్సెస్

శ్రీహరి కోట : నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి 29 రాకెట్ విజయవంతం అయ్యింది. సింగపూర్ కు చెందిన ఆరు ఉపగ్రహాలను పీఎస్ ఎల్వీ సీ-29 నింగిలోకి మోసుకెళ్లింది ఆరు ఉప గ్రహాల బరువు 625 కిలోలు ఉంటుంది. భూ పరిశీలనకు పంపిస్తున్న 400 కిలోల టెలి మౌస్ ఉప గ్రహం.

18:11 - December 16, 2015

వైవాహిక జీవితంలో దంపతుల ఇద్దరి మధ్య వచ్చే సమస్యలు, మనస్పర్థలతోపాటు ఇతర కారణాలతో విడిపోతుంటారు. పిల్లలు పుట్టకముందైనా... పిల్లలు పుట్టాకైనా వారి మధ్య పొరపెచ్చులు వచ్చి.. అవి చిలికి చిలికి గాలివానై.. దంపతులు విడిపోవడానికి దారితీస్తాయి. అయితే పిల్లలు కౌమార దశలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో వారి ప్రేమాభిమానాలకు దూరమై చిన్నారులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఓ పరిశోధన వెల్లడించింది. అంతేకాక వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. ముఖ్యంగా ఆడపిల్లలపై ప్రతికూల పరిణామాలు జీవితకాలం పాటు ఉంటాయంది. ఇలా విడిపోయిన కుటుంబాల్లో ఎక్కువ శాతం మగపిల్లల కన్నా ఆడపిల్లల్లోనే మానసికంగా, శారీరకంగా వారి ఆరోగ్యంపై చెడు ప్రభావితం చూపిస్తున్నాయని చెబుతోంది. ఆడపిల్లల్లో కౌమారదశ వయస్సు 6 - 10 సంవత్సరాలు అతి ముఖ్యమైన జీవితకాలమని తెలిపింది.
ఆ వయస్సులో ఆడపిల్ల ఆరోగ్యం చాలా సున్నితం
ఆ వయస్సులో ఆడపిల్ల ఆరోగ్యం చాలా సున్నితంగా ఉంటుందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకురాలు అండ్రియా బెల్లర్ పేర్కొన్నారు. సంప్రదాయ కుటుంబాల్లో కంటే సహజీవనం సాగించే కుటుంబాల్లో పెరిగిన పిల్లల్లో మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని నివేదకలో రుజువైనట్టు బెల్లర్ తెలిపారు. 13 ఏళ్ల పాటు నాలుగు దశలుగా కౌమారదశలో ఉన్న 90 వేల చిన్నారులపై పరిశోధన చేసి సమాచారాన్ని సేకరించినట్టు జాతీయ కౌమార ఆరోగ్య పరిశోధన సంస్థ (ఏడీడీ హెల్త్) వెల్లడించింది. విడిపోయిన కుటుంబాల్లో కౌమారదశలో ఉన్న ఆడపిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే కోణంలో తమ పరిశోధన ఉద్దేశమని తెలిపింది.

 

నింగిలోకి దూసుకెళ్తున్న పిఎస్ ఎల్వీ - సి29

శ్రీహరి కోట : నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి29 రాకెట్ ప్రయోగించారు. సింగపూర్ కు చెందిన ఆరు ఉపగ్రహాలను పీఎస్ ఎల్వీ సీ-29 నింగిలోకి మోసుకెళ్లనుంది. ఆరు ఉప గ్రహాల బరువు 625 కిలోలు ఉంటుంది. భూ పరిశీలనకు పంపిస్తున్న 400 కిలోల టెలి మౌస్ ఉప గ్రహం.

18:00 - December 16, 2015

బీజింగ్ లో కాలుష్యం గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ప్రపంచంలో కాలుష్యంపై ఏ నివేదిక విడుదల చేసినా.. జీజింగ్ అత్యంత కాలుష్య కారకమైన నగరమని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో అక్కడ ఓ హోటల్ యాజమాన్యం తమ హోటల్ లో విచిత్రమైన సౌకర్యం కల్పించామని చెబుతూ డబ్బులు వసూలు చేస్తోంది. ఆ హోటల్ లో భోజనం ముగించిన తరువాత భోజనం బిల్లుతోపాటు వారున్న సమయాన్ని బట్టి అదనపు బిల్లును కూడా వడ్డిస్తున్నారు.

మండిపడిన వనియోగదారులు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఈ అదనపు ఏంటని నిలదీయండంతో తమ తమ హోటల్ లో స్వచ్ఛమైన గాలిని సరఫరా చేస్తున్నామని, ఎయిర్ ప్యూరిఫయర్లు పెట్టేందుకు చాలా ఖర్చు చేశామని వెల్లడించింది. అందుకే గంటకు ఒక యువాన్ (10.35రూపాయలు) వసూలు చేస్తున్నామని చెప్పింది. దీంతో మండిపడిన వినియోగదారులు హోటల్ పై అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు తక్షణం బిల్లు ఆపేయాలని ఆదేశించారు. దీంతో దిగివచ్చిన సదరు యాజమాన్యం తమ హోటల్ లో గాలి ఉచితమే అంటోంది.

 

 

రంగారెడ్డి జిల్లాలో మరో 5 మున్సిపాలిటీలు ఏర్పాటు...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో కొత్తగా మరో 5 మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జల్ పల్లి, మీర్ పేట, జిల్లెలగూడ, బోడుప్పల్, ఫిర్జాదిగూడలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే కొన్నిరోజుల్లో శాసనమండలి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం లేదు. దాంతో ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటనను నిలిపివేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయి కోడ్ ముగిసిన వెంటనే మున్సిపాలిటీల ఏర్పాటు ప్రకటన వెలువడే అవకాశముందని సమాచారం.

ఆశాల సమ్మె వాయిదా : సాయిబాబు

హైదరాబాద్ : గత 100 రోజుల సమ్మె చేస్తున్నా ఆశా వర్కర్లు వారి సమ్మెను వాయిదా వేస్తున్నట్లు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు తెలిపారు. ఈ రోజు ఉదయం మంత్రి లక్ష్మారెడ్డితో చర్చలు జరిపామని… ఆచర్చలో సమ్మె విమరణ తర్వాత ఆశాల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సాయిబాబు స్సష్టం చేశారు. రేపటి నుంచి ఆశాలు విధులకు హాజరవుతారని పేర్కొన్నారు.

ముగిసిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం

హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. తాగునీటి కేటాయింపుల్లో ఏపీకి 10 టీఎంసీలు కేటాయించారని... అత్యవసరంగా మరో నాలుగు టీఎంసీలు వాడుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. శ్రీశైలం డ్యాం పటిష్టతకు చర్యలు చేపట్టాలని బోర్డు ఆదేశించింది. తరుపరి సమావేశాన్ని విజయవాడలో నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది.

80 మందిని అరెస్టు చేశాం : మంత్రి పల్లె

హైదరాబాద్ : ఏపీ లో ప్రధాన రాజకీయ పార్టీలను కుదిపేస్తున్న కాల్ మనీ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 మందిని అరెస్టు చేసినట్లు ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. అరెస్టయిన వారిలో వైసీపీ కి చెందిన వారు 27 మంది, టిడిపి వారు 6గురు, సీపీఐకి చెందిన వారు 3 ఉన్నట్లు తెలిపారు. మిగతా 44 మంది ఏ పార్టీతోనూ సంబంధం లేని వారని స్పష్టం చేశారు.

16:37 - December 16, 2015

ప్రస్తుతం బీఫ్ తినడం, గోవధపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. బీఫ్ తినడాన్ని, గోవధను భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఆర్ ఎస్ ఎస్ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆవును గోమాతగా పూజిస్తున్నారు. అయితే బీజేపీ నేతల అసలు రంగు బయటపడింది. బీఫ్, గోవధను తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే వివాదాస్పదం చేస్తున్నారని తేటతెల్లమైంది. తెర వెనుక ఒక రాజకీయం, తెర ముందు మరో రాజకీయం ఆడుతున్నట్లు అర్థమవుతుంది. ఆ పార్టీ నేతల లోగుట్టు రట్టు అయినట్లు తెలుస్తోంది. కాషాయ పార్టీ భండారం బయటపడిందని చెప్పవచ్చు. బీఫ్ మాంసాన్ని ఎగుమతి చేసే సంస్థల నుంచి బీజేపీ కి భారీగానే విరాళాలు ముట్టాయి. ఈ విషయం స్వయంగా బీజేపీ ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదిక ద్వారా తెలిసింది. 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి బీజేపీకి విరాళాలిచ్చిన వారి నివేదికను గత నవంబర్ లో కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ సమర్పించిన ఫ్రిగోరిఫికో అల్లానా లిమిటెడ్, ఫ్రిగెరియో కన్వర్వా అల్లానా లిమిటెడ్, ఇందాగ్రో ఫుడ్స్ లిమిటెడ్ సంస్థలు రూ.2 కోట్లు ( 2014 లో జరిగిన లోక్ సభ ఎన్నికల వరకు) విరాళంగా ఇచ్చాయి. ఈ మూడు కంపెనీలు అల్లానా సన్స్ లిమిటెడ్ కు చెందినవే. అల్లానా హౌస్, అల్లానా రోడ్, కొలాబా, ముంబయి పేరిట ఈ సంస్థల చిరునామా రిజస్టర్ చేసి ఉంది. 2014-15 లో బీజేపీకి పార్టీ ఫండ్ గా ఫ్రిగోరిఫికో అల్లానా లిమిటెడ్ రూ.50 లక్షలు ఇచ్చింది. ఈ లావాదేవీలన్నీ విజయబ్యాంక్ ద్వారా జరిగాయి. బీఫ్ తినడంపై, గోవధపై నిత్యం గగ్గోలు పెట్టే బీజేపీ నేతలు.. ఈ వ్యవహారంతో వారి భాగోతం బయటపడిందని అంటున్నాయి ప్రజా సంఘాలు మండిపతున్నాయి.

16:32 - December 16, 2015

హైదరాబాద్ : గురువారం నుంచి ప్రారంభయయ్యే ఏపీ శాసనసభ శీతాకల సమావేశాలు ఒక్క రోజు పొడిగించే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై గురువారం జరిగే బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి యనమల తెలిపారు. గురువారం నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 వరకు జరగనున్నాయి.

16:28 - December 16, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపుతున్న కాల్ మనీ వ్యవహారంపై జ్యుడీషియల్ కమిషన్ వేసి, హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ తో ఈ కేసు విచారణ జరిపించాలని కేబినెట్ నిర్ణయించిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. విజయవాడలో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు, మనీ ల్యాండరింగ్ బిల్లు సహా ఆరు ప్రధాన బిల్లులు ప్రవేశపెట్టనున్నామని అన్నారు. అలాగే అంగన్ వాడీల జీతాలు పెంచడంపై కూడా నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన చెప్పారు. ఆరు రోజుల పాటు జరగనున్న శాసనసభ సమావేశాలలో ఎలాంటి కాలయాపన లేకుండా సమగ్ర చర్చ జరపాలని అధికార పక్షం భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కేసులో వివిధ పార్టీల నేతలకు సంబంధం ఉందని మంత్రి పల్లె రఘునాధరెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..

మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్....

హైదరాబాద్ : నగరంలో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన మయాంక్ కుమార్, పీయూష్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరి నుంచి 145 ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కొత్త సంవత్సరం వేడుకల తరుణంలో మాదక ద్రవ్యాల ముఠాలపై పోలీసులు నిఘా పెట్టారు.

బడ్జెట్ రూపకల్పనలో ప్రజల సహాలు కోరిన రైల్వే శాఖ

ఢిల్లీ : చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రైల్వే బడ్జెట్ కు సలహాలు స్వీకరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు 2016-17 సంవత్సరానికిగాను పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కు ముందుగా ఆన్ లైన్ లో సలహాలు స్వీకరించనుంది. జనవరి 15 వరకు ఆన్ లైన్ లో సలహాలు, సూచనలు స్వీకరిస్తుంది. ప్రజలు పంపే సలహాల ద్వారా రైల్వే బడ్జెట్ లో మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉంటుంది.

రాజ్యసభ రేపటికి వాయిదా

హైదరాబాద్ : రాజ్యసభ గురువారం నాటికి వాయిదా పడింది. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ పై కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ నిరసనలతో సభ నేడు పలుమార్లు వాయిదా పడింది. సభలో గందరగోళ పరిస్థితి తలెత్తడంతో సభను గురువారానికి వాయిదా వేశారు.

 

16:05 - December 16, 2015

సాధారణంగా ఇల్లు, దేవాలయాలు నిర్మించేటప్పుడు భూమిలో నుంచి ఫిల్లర్లను బలంగా వేస్తారు. ఆ స్థంభాలు గట్టిగా, స్థిరంగా ఉంటాయి. కానీ గాలిలో తేలియాడే ఆలయ స్తంభం గురించి మీకు తెలుసా...? అయితే మీరు వీరభద్ర ఆలయాన్ని ఒక్కసారి సందర్శించండి. అనంతపురం జిల్లాలో ఉన్న ఈ వీరభద్ర ఆలయాన్ని లేపాక్షి టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి మిస్టీరియస్ టెంపుల్ గా కూడా గుర్తింపు ఉంది. 16 వ శతాబ్ధానికి చెందిన ఈ టెంపుల్ అతి సుందరమైన శిల్పాలు, నాట్యకారుల ప్రతిమలతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 70 స్తంభాలతో ఆకట్టుకునే ఆకృతిలో నిర్మించిన ఈ ఆలయంలో ఒక స్తంభం మాత్రం నేలకు ఆనుకుని ఉండదు. గాలిలో వేలాడుతున్నట్లుగా ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించే వారు సన్నని క్లాత్ ను పిల్లర్ కింది నుంచి తీయడం చేస్తుంటారు. ఎంతో మంది ఇంజనీర్లు ఈ మిస్టరీని చేధించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఆలయం మొత్తం దేవతా ప్రతిమలు, నాట్యకారులు, సంగీతకారుల విగ్రహాలతో చెక్కబడి ఉంటుంది. ఈ ఆలయంలో అతి పెద్ద వీరభద్రుని విగ్రహం ఉంటుంది. 1583లో విరూపన్న, వీరన్న అనే సోదరులు ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయానికి మరో చరిత్ర కూడా ఉంది. రావణుని చేతిలో గాయపడిన జటాయువు అనే పక్షి ఈ ప్రాంతంలోనే పడిందట. రాముడు ఆ పక్షిని 'లే పక్షి' అని పిలిచాడట. అందుకే ఈ ప్రాంతానికి 'లేపాక్షి' అని పేరు స్థిరపడిందని కథనం. మీరు అనంతపురం జిల్లాకు వెళుతున్నట్లయితే మీ ట్రావెల్ ట్రిప్ లో ఈ ఆలయాన్ని కూడా చేర్చుకోండి.

 

 

కల్తీ శనగ పిండి.. ముగ్గురు అరెస్ట్...

హైదరాబాద్ : పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలోని పారిశ్రామికవాడలో కల్తీ శనగ పిండి తయారు చేస్తున్న మిల్లుపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. కల్తీ పిండి తయారు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మిల్లును సీజ్ చేశారు. రూ. 6 లక్షల విలువ చేసే కల్తీ శనగ పిండిని స్వాధీనం చేసుకున్నారు.

15:44 - December 16, 2015

హైదరాబాద్ : పీఎస్ ఎల్వీ -సి29 ఇవాళ నింగిలోకి దూసుకెళ్లనుంది. నెల్లూరు జిల్లాలోని సతీస్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి సాయంత్రం ఆరుగంటలకు పీఎస్ ఎల్వీ ని ప్రయోగిస్తారు. ఈ వాహక నౌక సింగ్‌పూర్‌కు చెందిన ఆరు ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. రాకెట్‌ ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ ప్రయోగంతో షార్‌ ఆఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోనుంది. ప్రస్తుత ప్రయోగం షార్‌కు 50వది. 

15:40 - December 16, 2015

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో మంత్రి హరీష్ రావు నాలుగు జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మిషన్ కాకతీయ పనుల్లో తప్పులు జరిగితే ఉపేక్షించేది లేదని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను హెచ్చరించారు.  

నాలుగు జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

ఆదిలాబాద్ , కరీంనగర్ , మెదక్ , నిజామాబాద్ జిల్లాల అధికారులతో నీటి పారుదలశాఖ మంత్రి హరీష్ రావు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి మండలంలో జరుగుతున్న పనులపై అధికారులు దృష్టి సారించి పారదర్శకంగా పనిచేయాలని అవినీతికి తావు లేకుండా చూడాలని అన్నారు. కోటి రూపాయల కంటే తక్కువ విలువగల మిషన్ కాకతీయ పనులను మార్చి లోగా పూర్తి చేయాలని టార్గెట్ విధించారు. కోటి కంటే ఎక్కువ విలువగల ప్రాజెక్టులు జూన్ కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ పురోగతి పై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.

వారానికి ఒకసారి వీడియో కాన్ఫరెన్స్....

మిషన్ కాకతీయ రెండో దశ విజయవంతానికి ఇక నుంచి వారానికి ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని మంత్రి అధికారులకు తెలిపారు. మిషన్ కాకతీయ పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న ఏజెన్సీల ను బ్లాక్ లిస్టులో పెట్టాలని అవసరమైతే టర్మినేట్ చేయాలన్నారు. వెంటనే వారం రోజుల్లో తిరిగి టెండర్లను సైతం పిలవాలని అధికారులకు సూచించారు. రూల్స్‌ను ఎవరు అతిక్రమించరాదని అన్ని జిల్లాలు తమ నివేదికను పురోగతి వివరాలను తెలపాలని ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా గత 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న చెరువులను యుద్ధప్రాతిపదికన టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.

పకడ్భందీగా ఏర్పాట్లు...

మిషన్ కాకతీయ రెండో దశ పనులు చేసేందుకు సమయం ఎక్కువగా ఉన్నందువల్ల పకడ్భందీగా ఏర్పాట్లు చేయాలన్నారు మంత్రి హరీష్ రావు. ఇక నుంచి రెగ్యులర్ ఫీల్డ్‌ విజిట్ చేస్తానని చెప్పకుండా ఫీల్డ్ లో తిరిగి ఎక్కడ పనుల్లో అలసత్వం కనబడినా అధికారులపై గుత్తేదారులపై చర్చలు తీసుకుంటానని హెచ్చరించారు.

 

15:38 - December 16, 2015

విజయవాడ : అంగన్‌వాడీలకు వేతనాలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంకా ఆదేశాలివ్వకపోవడంపై సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో అంగన్‌వాడీల నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరాయి. దీక్షలను ప్రారంభించిన అనంతరం మధు మాట్లాడుతూ అంగన్‌వాడీలు చేస్తున్న దీక్షలు న్యాయబద్దమైనవని, వారిపట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీలకు తెలంగాణలో వేతనాలు పెంచినా ఏపీలో పెంచకపోవడం శోచనీయమన్నారు. 

15:36 - December 16, 2015

ప్రకాశం : కనిగిరిలో కాల్‌ మనీ వ్యాపారుల ఇళ్లపై రెండో రోజుల కూడా పోలీసులు దాడులు కొనసాగించారు. రెండు బృందాలుగా విడిపోయిన పోలీసులు పట్టణంలో వివిధ కాలనీల్లో ఉన్న ఫైనాన్స్‌ వ్యాపార సంస్థలు, వీటి యజమానులు ఇళ్లలో సోదాలు చేశారు. వీరి ఇళ్ల నుంచి భారీగా ప్రామిసరీ నోట్లు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించి వడ్డీ వ్యాపారులు అరాచకాలను వివరించారు. పోలీసుల దాడులకు భయపడి కొందరు వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇంటువంటి వారిపై నిఘా పెట్టారు. 

15:35 - December 16, 2015

విజయవాడ : కాల్‌మనీ కేసును దర్యాప్తు చేయిస్తున్న విజయవాడ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ సెలవును రద్దు చేసుకోవడంపట్ల వైఎస్సార్‌సిపి అభినందించింది. కేసు కీలక సమయంలో ఉండగా మీపై కొందరు ఒత్తిడులు తెస్తారని వాటికి తలొగ్గకూడదని వైసిపి నేత అంబటి రాంబాబు కమిషనర్‌కు సూచించారు. ఆయన విజయవాడలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

15:32 - December 16, 2015

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కల్తీమద్యం, కాల్ మనీపై ప్రధానంగా చర్చ జరిగినట్టు మంత్రి యనమల తెలిపారు. కాలమనీ కేసులో ఎవరిని వదిలేది లేదన్నారు. సమావేశానికి డీజీపీ, సీపీ వచ్చి... కాల్ మనీ కేసు దర్యాప్తును వివరించినట్టు తెలిపారు. మరోవైపు రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టే కీలక బిల్లులకు ఆమోదం తెలిపినట్టు వివరించారు. కీలకమైన ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుకు కూడా మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. 

'కాల్ మనీ'పై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ : యనమల

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపుతున్న కాల్ మనీ వ్యవహారంపై జ్యుడీషియల్ కమిషన్ వేసి, హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ తో ఈ కేసు విచారణ జరిపించాలని కేబినెట్ నిర్ణయించిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. విజయవాడలో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు, మనీ ల్యాండరింగ్ బిల్లు సహా ఆరు ప్రధాన బిల్లులు ప్రవేశపెట్టనున్నామని అన్నారు. అలాగే అంగన్ వాడీల జీతాలు పెంచడంపై కూడా నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన చెప్పారు.

బస్సు - బైక్ ఢీ : ముగ్గురు మృతి

కరీంనగర్ : ధర్మపురి మండలం స్తంభంపల్లి వద్ద బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. వివరాలు ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం కొత్తూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్‌పై కరీంనగర్‌లో జరిగే వివాహానికి వెళ్తున్నారు. స్తంభంపల్లి వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.

15:16 - December 16, 2015

ప్రస్తుతం ఫేస్ బుక్ ఉపయోగించే వారు అధికమయ్యారు. ఇంటర్నెట్ ప్రపంచంలో ఏది చూడాలన్నా వైఫై తప్పనిసరిగా ఉండాలి. ఫేస్ బుక్ వినియోగించే వారికి శుభవార్త. ఇక నుంచి ఇంటర్నెట్ లేకున్నా ఫేస్ బుక్ చూడొచ్చు. ఫేస్ బుక్ లోని పోస్టులపై కామెంట్లూ పెట్టొచ్చు. ఇలా చెయ్యడానికి ప్లాన్ చేస్తోంది సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్. ఇంటర్నెట్ కనెక్షన్ నెమ్మదిగా ఉన్నా న్యూస్ ఫీడ్ ను అందుబాటులో ఉంచేలా చూడనున్నట్లు తెలిపింది.
పెరిగిపోతున్న ఫేస్ బుక్ వినియోగదారులు 
దేశంలో మొబైల్ ద్వారా 2జీ నెట్ వర్క్ ను ఉపయోగించుకొని ఫేస్ బుక్ ను ఉపయోగించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ విషయాన్ని గుర్తించిన ఆ సంస్థ ఆ యూజర్లకు మరింత అందుబాటులో ఉండేలా కొత్త ఆప్ డేట్ ను ప్రస్తుతం పరీక్షిస్తుంది. దీని ప్రకారం ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నప్పుడు ఫోన్ లో డౌన్ లోడ్ అయిన ఫేస్ బుక్ స్టోరీలను తర్వాత కూడా చూడవచ్చు. అదేవిధంగా నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు రోజంతా ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు న్యూస్ ఫీడ్ లోకి వచ్చేలా ప్లాన్ చేస్తోంది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా ఫేస్ బుక్ లోని పోస్టులపై కామెంట్లు పెట్టడం ఇప్పుడు సాధ్యమేనని, నెట్ కనెక్షన్ అందుబాటులోకి రాగానే కామెంట్లు ఆటోమేటిక్ గా అప్ లోడ్ అవుతాయిని తెలిపింది. ఎప్పటికప్పుడు యూజర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేలా రూపొందించిన సరికొత్త న్యూస్ ఫీడ్ ఫీచర్స్ ఫేస్ బుక్ ప్రస్తుతం పరీక్షిస్తోంది. ఈ విషయం ఫేస్ బుక్ యూజర్లకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

 

రాష్ట్రపతి భవన్ కు సోనియా, మన్మోహన్ ర్యాలీ

ఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. ఈ అంశాన్ని ఆ పార్టీ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు ఇతర ఎంపీలు ఇవాళ పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ తీశారు. లోకసభలోనూ కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వ తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు కుట్ర పన్నినట్లు సోనియా గాంధీ ఆరోపించారు.

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం

విజయవాడ : ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, ఇతర ప్రధాన సమస్యలపై చర్చించినట్లు సమాచారం.

కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

రంగారెడ్డి : పూడూరు మండలం సాయిబాబా అగ్రోటెక్ కాటన్ జిన్నింగ్ మిల్లులో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ సహాయంతో పత్తిని ఒక్కచోటికి కుప్ప చేస్తుండగా ప్రమాదవశాత్తూ పొగగొట్టం నుంచి నిప్పు రవ్వలు ఎగిరిపడ్డాయి. ఫైరింజన్లు వచ్చేలోపే మంటలు మిల్లు అంతటా వ్యాపించాయి. ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపు చేశాయి. సుమారు 10 వేల క్వింటాళ్ల పత్తి బూడిద పాలయినట్లు అధికారులు అంచనావేశారు.

సాయంత్రం నింగిలోకి పీఎస్ ఎల్వీ-సి29

హైదరాబాద్ : పీఎస్ ఎల్వీ-సి29 ఇవాళ నింగిలోకి దూసుకెళ్లనుంది. నెల్లూరు జిల్లాలోని సతీస్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి సాయంత్రం ఆరుగంటలకు పీఎస్ ఎల్వీ ని ప్రయోగిస్తారు. ఈ వాహక నౌక సింగ్‌పూర్‌కు చెందిన ఆరు ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. రాకెట్‌ ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ ప్రయోగంతో షార్‌ ఆఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోనుంది. ప్రస్తుత ప్రయోగం షార్‌కు 50వది. 

14:47 - December 16, 2015

విశాఖ : ఏపీ డీఎస్సీ అభ్యర్థులు కదం తొక్కారు. వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డీఎస్సీ పరీక్ష నిర్వహించి..ఇప్పటికీ పోస్టులు భర్తీ చేయకపోవడంపై మండిపడ్డారు. విశాఖలో గాంధీ విగ్రహం దగ్గర డివైఎఫ్ ఐ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. ఇప్పటికైనా ఉపాధ్యాయ నియామకాలను పూర్తిచేయకపోతే విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామంటున్న డీఎస్సీ అభ్యర్థులు హెచ్చరించారు.

కాల్‌మనీపై వామపక్షాల నిరసనలు

విజయవాడ : కాల్‌మనీపై వామపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. విజయవాడలో లెఫ్ట్ పార్టీలు ఆందోళన చేశాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. కాల్‌మనీలో డబ్బులు పెట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తప్పించే ప్రయత్నం చేయొద్దని నినాదాలు చేశారు. 

14:44 - December 16, 2015

విజయవాడ : కాల్‌మనీ, కల్తీమద్యం, బాక్సైట్‌ అంశాలను శాసనసభ సమావేశాల్లో లేవనెత్తాలని వైసీపీ నిర్ణయించింది. ఆ పార్టీ అధినేత జగన్‌ అధ్యక్షతన వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. లోటస్‌పాండ్‌లో జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్యవహారాన్ని ప్రధానంగా లేవనెత్తాలని నిర్ణయించారు. వీటితో పాటు కల్తీమద్యం, బాక్సైట్‌, నిరుద్యోగం తదితర అంశాలనూ శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించాలని నిర్ణయించారు. 

కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ

విజయవాడ : ఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగుతోంది. ఆరు ప్రధాన బిల్లులపై మంత్రివర్గం చర్చిస్తోందని తెలుస్తోంది.రేపటి నుంచి ప్రారంభంకానున్న శాసనసభా సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా కేబినెట్‌లో చర్చిస్తున్నారు. కాల్‌మనీ, కల్తీ మద్యం, బాక్సైట్‌ అంశాలకు సంబంధించి ప్రతిపక్షాల ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇచ్చే అంశంపైనా చర్చ సాగుతోందని సమాచారం. 

శృంగేరికి బయలుదేరిన కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీ సమేతంగా శృంగేరికి బయల్దేరి వెళ్లారు. అయుత చండీయాగానికి రావాలంటూ శృంగేరి మఠాధిపతి భారతీ తీర్థస్వామిని ఆయన ఆహ్వానించనున్నారు. ప్రత్యేక విమానంలో మంగళూరుకు బయల్దేరిన ఆయన... అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా శృంగేరికి చేరుకోనున్నారు. 

ముగిసిన టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం

ఢిల్లీ : టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. నియోజకవర్గాల్లో సమస్యపై ప్రధాని, కేంద్రమంత్రులకు నివేదిస్తామన్నారు.

14:35 - December 16, 2015

హైదరాబాద్ : దేశ రాజధాని లో జరిగిన నిర్భయ ఘటనకు నేటితో నాలుగేళ్లు పూర్తయ్యింది. 2013లో వర్మ కమిటి అధ్యక్షతన నిర్భయ చట్టం వచ్చింది. అస్సలు నిర్భయ చట్టం అంటే ఏమిటి? దాని పూర్వాపరాలు ఏమిటి? న్యాయసలహాలు, సందేహాలు అందించే 'మైరైట్' కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పార్వతి వివరించారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలంటే ఈవీడియోను క్లిక్ చేయండి...

ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ అధ్యక్షురాలిగా అనురాధ

విజయవాడ : ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ అధ్యక్షురాలిగా టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ పాలకమండలి నియామకంపై మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రభుత్వం తరపున ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో డైరెక్టర్లుగా బి.లక్ష్మి, జి.మేఘలాదేవి, మసాల పద్మజ, చిత్రచేదు విశాలక్ష్మి, వైవి రాజేశ్వరిదేవిలను నియమించారు. వారంతా రెండు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 

ఏటీఎం దొంగల ముఠా అరెస్ట్....

హైదరాబాద్ : నిన్న నిజామాబాద్, నేడు మెదక్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగల ముఠాను నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్నది మహారాష్ట్రకు చెందిన వారేనని ఐజీ నవీన్ చంద్ తెలిపారు. ముగ్గురు దొంగలను అరెస్టు చేశామని, మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. దొంగలు గుర్తు పట్టకుండా మాస్క్ ధరించి దొంగతనాలు చేస్తున్నారని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో నిన్న రూ. 43 లక్షలు అపహరించిన విషయం విదితమే. ఇవాళ మెదక్ జిల్లాలోని ఆటోనగర్, కౌడిపల్లి ఎస్‌బీఐ ఏటీఎంలలో చోరీ చేసేందుకు దొంగలు యత్నించి విఫలమయ్యారు.

13:55 - December 16, 2015

హైదరాబాద్ : 'ఆరెంజ్ బౌల్' చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సంచలనం సృష్టించింది. బాలికల డబుల్స్ విభాగంలో తన భాగస్వామి తమారా జిదాన్‌సెక్ (స్లొవేనియా)తో కలిసి టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన డబుల్స్ ఫైనల్లో ప్రాంజల-తమారా ద్వయం 6-2, 6-2తో ఎలెని క్రిస్టోఫి (గ్రీస్)-అనస్తాసియా డెటియుక్ (మాల్దొవా) జంటపై గెలిచింది. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఆధ్వర్యంలో 1947 నుంచి జరుగుతున్న ఈ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ తరఫున అండర్-18 విభాగంలో యూకీ బాంబ్రీ (2008లో), అండర్-16 విభాగంలో శ్యామ్ మినోత్రా (1961లో) సింగిల్స్ టైటిల్స్ ను సాధించారు.

 

13:41 - December 16, 2015

మహబూబ్ నగర్ : తెలంగాణలో ఈ ఏడాది వరుణుడు కరుణించలేదు. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దాదాపు పంటలన్నీ ఎండిపోయాయి. మరీ ముఖ్యంగా వెనకబడ్డ జిల్లాగా ముద్రపడ్డ పాలమూరులో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. జిల్లాలో ఈసారి చుక్క నీరుకూడా కురవకపోవడంతో..ఖరీఫ్ సీజన్‌లో వేసిన మొక్కజొన్న పూర్తిగా దెబ్బతింది. అడపాదడపా కురిసిన వర్షాలతో పంట దిగుబడిలో నాణ్యత లోపించడంతో రైతుకు గిట్టుబాటు ధర లభించడంలేదు. జిల్లాలో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 3లక్షల 47వేల ఎకరాలు కాగా ఈ ఏడాది 3లక్షలు 45వేల ఎకరాలను రైతులు సాగు చేశారు. అయితే ఈ ఏడాది వర్షాలు కురవకపోవండంతో దాదాపు 3లక్షల 10వేల ఎకరాల్లో పంట పూర్తిగా నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గతేడాది ఇదే సీజన్‌లో 4లక్షల 40వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేయగా 23లక్షల 56వేల క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వచ్చింది. కానీ ఈ ఏడాది అందులో పదిశాతం కూడా వచ్చే పరిస్థితి కన్పించడంలేదు.

రెండు..మూడు క్వింటాళ్ల దిగుబడి...
ప్రస్తుతం ఎకరాకు గరిష్టంగా రెండు నుంచి మూడు క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వస్తోంది. ఎకరాకు రైతులు 15నుంచి 20వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేస్తే...తీరా పంటను అమ్ముకుంటే క్వింటాల్ కు రూ. 3 వేలు కూడా రావడం లేదు. సకాలంలో వర్షాలు కురవక పోవడంతో పంటలో ఎదుగుదల లోపించి దిగుబడి పూర్తిగా పడిపోయింది. తేమ12శాతం ఉంటే క్వింటాల్‌కు 1325 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ దళారులంతా కుమ్ముక్కై రైతులను నిలువునా దోచేస్తున్నారు. క్వింటాల్‌ మొక్కజొన్నకు వేయి నుంచి 1200 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ఇదేమని రైతులు అడిగితే...సమాధానం చెప్పే నాధుడే ఉండడు.

పౌల్ట్రీ రంగంపై ప్రభావం..
మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతినండంతో...ఆ ప్రభావం కాస్తా పౌల్ట్రీరంగంపై పండింది. పాలమూరు జిల్లాలో పౌల్ట్రీ రంగానికి అధిక ఆదరణ ఉంది. ముఖ్యంగా షాద్‌నగర్ నియోజకవర్గంలో పౌల్ట్రీ పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మంది జీవనం కొనసాగిస్తున్నారు. జిల్లాలో ప్రతి నెలా 30లక్షల వరకు బ్రాయిలర్ కోళ్లు, 35 లక్షల వరకు గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ఒక్కో యజమాని నెలకు 10టన్నుల మొక్కజొన్న దాణాను కొనుగోలు చేస్తారు. అయితే మొక్కజొన్న దిగుబడి పూర్తిగా తగ్గిపోవడంతో పౌల్ట్రీ రైతులు దాణా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మొక్కజొన్న పంటలు ఎండిపోయి రైతులు అప్పులపాలు కావడంతో తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అలాగే పౌల్టీ రంగానికి దాణా విషయంలో తగిన ప్రోత్సాహకాలు ఇస్తే..పౌల్ట్రీ రంగం కోలుకునే అవకాశం ఉంటుందని పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు.

13:36 - December 16, 2015

అనంతపురం : పేదరికం ఓశాపం.. ఆ శాపానికి అనారోగ్యం తోడైంది. ఇంకేముంది? జీవితమే ఓపరీక్షగా మారింది. ఈ జీవితం పగవాడికి కూడా వద్దు అనిపించే నరకయాతన ఆ కుటుంబం అనుభవిస్తోంది. తమ పిల్లవాడికి ప్రాణభిక్షపెట్టాలంటూ మనసున్న మారాజుల కోసం ఎదురుచూస్తోందీ కుటుంబం. తనకేమైందో తెలీదు ఆ చిన్నారికి..అమ్మానాన్న, తనను చూసి ఎందుకేడుస్తున్నారో కూడా తెలీదు. ఆడుకోవాల్సిన వయస్సులో తనకు నీరసమెందుకొస్తుందో తెలీదు. చాక్లెట్లు తినాల్సిన సమయంలో పిడికెళ్ళ మాత్రలెందుకు మింగాల్సి వస్తోందో కూడా తెలియదు. అమాయకంగా పడుకున్న ఈ పిల్లవాడి పేరు కుళ్ళాయిస్వామి. అనంతపురానికి చెందిన ఈ బాలుడి వయస్సు ఏడు సంవత్సరాలు. తనచుట్టూ ఏం జరుగుతోందో అర్థం కాని వయస్సు కుళాయిస్వామిది. ఆరునెలల వయస్సులో పిల్లాడి శరీరం నిమ్మపండు రంగులోకి మారడంతో తలసేమియా వ్యాధి బయటపడింది. కుళ్ళాయప్ప, షకీలా దంపతులది అనంతపురం జిల్లా ఉరవకొండ. ఏ రోజుకారోజు కూలికిపోతే తప్ప రోజు గడవని పరిస్థితి. తనకు వారసత్వంగా వచ్చిన పరుపులు కుట్టే వృత్తిని కుళ్ళాయప్ప కొనసాగిస్తున్నాడు. ఉదయం నుండీ రాత్రి వరకూ ఊరూరా తిరుగుతూ దూదివేసి పరుపులు కుట్టేపని. ఇకవర్షాలు పడినరోజుల్లో కుళ్ళాయప్పకు పని వుండదు.

రక్తమార్పిడి కోసం రూ.1500 ఖర్చు..
కుళాయప్ప దంపతుల చిన్నకొడుకు కుళ్ళాయిస్వామికి తలసేమియా మహమ్మారి ఆవహించింది. నెలకు రెండుసార్లు రక్తం ఎక్కించుకోవాల్సిన పరిస్థితి. ఒక్కసారి రక్తమార్పిడి కోసం 1,500 ఖర్చు అవుతుందని బాలుడి తండ్రి కుళాయప్ప ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాతలెవరైనా ఆదుకోవాలని కోరుతున్నాడు. ఈ బాలుడికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ఒక్క బోన్ మ్యారో సర్జరీ మాత్రమే మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. బోన్ మ్యారో ఆపరేషన్ కోసం 15లక్షల రూపాయలు అవసరమవుతాయి. ఈ నిరుపేద కుటుంబం నెలవారీ వైద్య ఖర్చులకే తల్లిడిల్లిపోతుంటే, ఇక 15లక్షల ఎక్కడి నుంచి తేవాలో దిక్కుతోచని పరిస్థితుల్లో అల్లాడిపోతోంది. గతనెల అక్టోబర్ 26న కుళ్ళాయిస్వామికి బెంగళూరులోని సెయింట్ జాన్స్ హాస్పిటల్ వైద్యులు సర్జరీ చేసి లివర్ పై ఏర్పడిన గడ్డను తొలగించారు. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చొరవతో, అనంతపురంలోని ఆర్డీటీ స్వచ్ఛందసంస్థ ఈ డబ్బుమొత్తాన్నీ సమకూర్చింది. అయినా బోన్ మ్యారో సర్జరీ కంపల్సరీ అయింది. 15 లక్షలు ఇచ్చే దాతలు ఉంటే తమ కొడుకును బతికించుకోవాలనేది ఆ దంపతుల తాపత్రయం. తన బబ్బు పేరేంటో కూడా తెలియని వయస్సులో కుళ్ళాయిస్వామిని తలసేమియా ఆవహించింది. బోన్‌మ్యారో సర్జరీ చేస్తే తప్ప బతకని కుళ్లాయిస్వామిని దాతలెవరైన ఆదుకోవాలని కుళ్లాయప్ప కుటుంబం కనపడ్డ వారినల్లా వేడుకుంటోంది. 

13:32 - December 16, 2015

ఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) లో కొత్త నిబంధన రానుంది. వచ్చే నెల 2 నుంచి ప్రారంభం కానున్న పీబీఎల్ లో కొత్తగా 'ట్రంప్ మ్యాచ్' నిబంధనను అమలు చేయనున్నారు. ఆట స్వరూపాన్ని మార్చే ఈ నిబంధన కారణంగా లీగ్‌లో పోటీతత్వం పెరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఒక రోజులో ఇరు జట్ల మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల్లో ఏదైనా ఒకదాన్ని ట్రంప్ మ్యాచ్‌గా పేర్కొనే అవకాశం జట్లకు ఉంటుంది. ఇలా పేర్కొన్న మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు బోనస్ పాయింట్‌ను ఇస్తారు.
ఓడితే మాత్రం నెగటివ్ పాయింట్
అయితే ఓడితే మాత్రం నెగటివ్ పాయింట్ (-1) పొందాల్సి ఉంటుంది. పోటీలకు గంట ముందు ఇరు జట్లు తమ ట్రంప్ మ్యాచ్ ను పేర్కొన డంతో పాటు అందులో ఆడే ఆటగాళ్ల పేర్లను నిర్వాహకులకు చెప్పాల్సి ఉంటుంది. రెండు జట్లు కూడా ఒకే మ్యాచ్‌ను ట్రంప్ మ్యాచ్‌గా పేర్కొనవచ్చు. రెండు పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి.

 

13:28 - December 16, 2015

మిర్పూర్: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) టైటిల్‌ను కొమిల్లా విక్టోరియన్స్ జట్టు సొంతం చేసుకుంది. మంగళవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో విక్టోరియన్స్ 3 వికెట్ల తేడాతో బారిసల్ బుల్స్ పై విజయం సాధించింది.
బారిసల్... 156/4
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బారిసల్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్ముదుల్లా (36 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్), షహ్‌రియార్ నఫీస్ (31 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ప్రసన్న (19 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
విక్టోరియన్స్...  157/7 
అనంతరం విక్టోరియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఓపెనర్ ఇమ్రుల్ కైస్ (37 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) శుభారంభం ఇవ్వగా, అహ్మద్ షహజాద్ (24 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. అయితే 10 ఓవర్లలో 80 పరుగులు చేయాల్సిన దశలో బరిలోకి దిగిన అలోక్ కపాలి (28 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు) చివర్లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా బౌండరీలు బాదిన అతను ఆఖరి బంతికి తమ జట్టును గెలిపించాడు.
టోర్నీ విజేతగా విక్టోరియన్స్
సమీ వేసిన ఆఖరి ఓవర్లో కొమిల్లా జట్టు 13 పరుగులు రాబట్టి టోర్నీ విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో 2012, 2013లలో ఢాకా గ్లాడియేటర్స్ టైటిల్ సాధించగా, గత ఏడాది ఈ టోర్నీ జరగలేదు. మూడు సార్లూ టైటిల్ గెలిచిన జట్టుకు సీనియర్ బౌలర్ మొర్తజానే కెప్టెన్ కావడం విశేషం.

 

 

12:55 - December 16, 2015

తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్, ఎంటర్ టైనర్ సినిమా ఖుషి.. అప్పట్లో సంచలన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ కెరీర్ ను మలుపు తిప్పిన సూపర్ హిట్ సినిమా ఖుషి. ఈ ఒక్క హిట్ తో పవన్ కళ్యాణ్ యూత్ ఐకాన్ గా టాప్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ పవన్ కెరీర్ కే కాదు.. డైరెక్టర్ సూర్య కెరీర్ కు కూడా చాలా ప్లస్ అయ్యింది.

ఖుషి సినిమా తరువాత కొమరం పులి సినిమా కోసం మరోసారి కలిసి పని చేసిన పవన్, ఎస్ జె సూర్యలు ఆకట్టుకోలేకపోయారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే బిగెస్ట్ డిజాస్టర్ అనిపించుకోవటంతో ఎస్ జె సూర్య పూర్తిగా తెలుగు సినిమాలకు దూరమయ్యాడు. ఈ సినిమా తరువాత సూర్య తమిళ్ లో చేసిన సినిమాలు కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో పడ్డ దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట పవర్ స్టార్.

బ్లాక్ బస్టర్ హిట్ తో తన కెరీర్ ను మలుపు తిప్పిన ఎస్ జె సూర్య దర్శకత్వంలో మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు పవర్ స్టార్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఖుషి సినిమాకు సీక్వల్ తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు కథా కథనాల విషయంలో క్లారిటీ లేకపోయినా ఖుషి కాంబినేషన్ రిపీట్ అవ్వటం మాత్రం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నారు.

 

12:46 - December 16, 2015

సాధారణంగా పాట కోసమో... ఫైట్ కోసమో.. ఓ సన్నివేశం కోసం భారీ సెటింగ్ వేస్తారు. కానీ ... ఇప్పుడు కామెడీ సీన్ కోసం కోసం కూడా సెటింగ్ వేశారు. ఆ.. సెటింగ్ ఖర్చు ఎంతో తెలుసా... 60 లక్షల రూపాయలంట. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్, శ్రీ జి ఫిలిమ్స్ సంయుక్త నిర్మాణంలో జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ. నాగసుశీల నిర్మిస్తున్న చిత్రం ‘ఆటాడుకుందాం.. రా’. సుశాంత్, సోనమ్‌ప్రీత్ బజ్వా జంటగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పాటలు మినహా పూర్తయ్యింది.

‘‘ఓ యువకుడు తన లక్ష్యం కోసం కొంతమందితో సీరియస్‌గా ఆటాడేస్తాడు. ఇంతకూ అతని లక్ష్యం ఏంటి? అతనాడిన గేమ్ ఏంటి? అనేది తెలియాలంటే ‘ఆటాడుకుందాం రా’ చూడాల్సిందే’’ అంటున్నారు హీరో సుశాంత్.

సుశాంత్ మాట్లాడుతూ - ‘‘మంచి కథ కోసం ఇన్నాళ్లు ఎదురుచూశా. ఈ కథ నచ్చింది’’ అని చెప్పారు. ‘‘ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కామెడీ సీన్ కోసం స్పెషల్‌గా 60 లక్షల ఖర్చుతో టైమ్ మెషీన్ సెట్ వేశాం. కామెడీ సీన్ కోసం ఇంత ఖర్చు పెట్టి, సెట్ వేయడం ఇదే ఫస్ట్ టైమ్’’ అని జి. నాగేశ్వరరెడ్డి తెలిపారు.

 

శృంగేరికి బయలుదేరిన కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శృంగేరికి బయలుదేరారు. ఆయుత చండీగాయానికి శ్రీభారతి తీర్థస్వామిని సీఎం ఆహ్వానించనున్నారు. 

వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో ఆకస్మిక తనిఖీలు..

విజయవాడ : నరసరావుపుటలో బుధవారం వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని పలువురు వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో పత్రాలు, విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. 

12:37 - December 16, 2015

ఎప్పుడెప్పుడా... అని ఎదురు చూస్తున్న 'రోబో-2' వచ్చేస్తోంది. ప్రముఖ దర్శకుడు శంకర్, సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ల కాంబినేషన్ లో కొత్త సినిమా 'రోబో-2' (తమిళంలో 'యంతిరన్-2') షూటింగ్ ప్రారంభం అయింది. చెన్నైలో తుపాను బీభత్సం దృష్ట్యా మొన్న డిసెంబర్ 12న రజనీకాంత్ తన పుట్టినరోజైతే జరుపుకోలేదు కానీ, రోబో సీక్వెల్ షూటింగ్ మాత్రం లాంఛనంగా మొదలుపెట్టేశారు. ఆ మధ్య విక్రమ్‌తో శంకర్ తీసిన 'ఐ' సినిమా ఫేమ్ ఎమీ జాక్సనే ఈ సినిమాకూ హీరోయిన్. ఆమె ఈ చిత్రంలో రోబోగా నటిస్తున్నారు. రోబో లాంటి కాస్ట్యూమ్స్ తో, ఆమె షూటింగ్‌లో పాల్గొన్నట్లు ఆంతరంగిక వర్గాలు తెలిపాయి. ''గతంలో వచ్చిన 'రోబో' సినిమాలో చిట్టి అనే మరమనిషి పాత్రను రజనీకాంత్ పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సీక్వెల్‌లో ఆ చిట్టికి జంటగా ఎమీ జాక్సన్ కనిపిస్తారు'' అని విశ్వసనీయ వర్గాల కథనం.
విలన్‌గా ఆర్నాల్డ్ ష్వార్జెనగర్ లేనట్టే..!
అన్నట్లు ఈ చిత్రంలో మరో కథానాయికా ఉంటుంది. ఆ పాత్రకి ఒక హిందీ నటితో చర్చలు జరుపుతున్నారు. ఇది ఇలా ఉండగా, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్‌ను 'రోబో-2'లో విలన్‌గా నటింపజేయాలని చేసిన ప్రయత్నం అటకెక్కినట్లే కనిపిస్తోంది. అనేక కారణాల వల్ల ఆర్నాల్డ్ తో ఈ సినిమాకు ఒప్పందం కుదరలేదట! ఆర్నాల్డ్ కు దాదాపు రూ. 120 కోట్ల మేర భారీ పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం కుదరకపోవడానికి ఇదే ప్రధాన కారణమని కోడంబాకమ్ వర్గాల కథనం. ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఇప్పటికే ఆలస్యమవుతుండడంతో, ఆర్నాల్డ్ వ్యవహారం ఇక పక్కనపెట్టి, విలన్ పాత్రకు ఒక హిందీ నటుణ్ణి ఎంచుకోవాలని దర్శకుడు శంకర్ బృందం నిర్ణయించుకుంది.
విలన్ గా నీల్ నితిన్ ముఖేశ్‌..!
కాగా, లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేశ్‌ను సంప్రదించారు. అతను ఓ.కె. చెప్పారట. అతనే విలన్ పాత్రధారి కావచ్చని భోగట్టా. షూటింగ్ మొదలైంది కాబట్టి, 'రోబో-2' గురించి రాగల కొన్ని నెలల పాటు బోలెడన్ని కబుర్లు ఖాయం!

 

12:31 - December 16, 2015

హైదరాబాద్ : పదేళ్లైనా నిండకుండానే పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాడో బుడతడు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో కలియతిరుగుతూ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఒక్కరోజు కమిషనర్‌గా పనిచేసిన ఆ బాలునికి పోలీసులంతా సెల్యూట్‌ చేశారు. ఈ బుడతడి పేరు రూప్ అరౌన్. వయస్సు 8 సంవత్సరాలు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో రెండవ తరగతి చదువుతున్నాడు. అరౌన్‌ కారు దిగగానే అక్కడి పోలీస్ సిబ్బంది సెల్యూట్ చేశారు. అంతా గంటల్లో హడావుడి చేసి కొత్త కమిషనర్‌కు కేసులను వివరించారు.

తలసేమియా వ్యాధి..
చిన్నారి అరౌన్‌ పోలీసు కమిషనర్‌ ఏంటనుకుంటున్నారా..? తలసేమియా వ్యాధితో బాధపడుతున్నఅరౌన్‌ పోలీసు కమిషనర్‌ కావాలని కోరుకున్నాడు. విషయం తెలుసుకున్న మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు బాలుడి తల్లిదండ్రులను కలిసి అరౌన్‌ కోరిక తీర్చడం కోసం నేరుగా సిటీ సీపీ మహేందర్ రెడ్డికి తెలియజేశారు. మహేందర్‌రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో అరౌన్ కోరిక తీర్చేందుకు ఒక్కరోజు పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. తెలిసీ తెలియని వయసులో వ్యాధి బారిన పడిన అరౌన్ కోలుకోవాలని మహేందర్‌రెడ్డి ప్రార్థిస్తానన్నారు. పోలీసు కమిషనర్ కావాలనుకున్న తమ కుమారుడి కోరికను తీర్చినందుకు సీపీ మహేందర్ రెడ్డి తో పాటు మేక్‌ ఏ విష్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు అరౌన్ తల్లిదండ్రలు. తన కుమారుడికి 20 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించాలని ట్రాన్స్ మిషన్ చేయాలని బ్లడ్ ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలని బాలుడి తండ్రి విక్రమ్ కోరారు. నిజంగా కమిషనర్ అయితే ఏం చేస్తావని అడిగినవారికి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తానని, చైన్ స్నాచర్ల ఆగడాలకు చెక్ పెడతానని అరౌన్‌ తెలిపాడు. పుట్టిన ప్రతి వారికి ఏదో ఒక కోరిక ఉంటుంది. కానీ చాలామంది చిన్నారులు అలాంటి కోరికలు తీరకుండానే మృత్యేవాత పడుతున్నారు. చిన్నారుల కోరిక తీర్చుతున్న మేక్‌ ఏ విష్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయం. రూప్ అరౌన్ ఆరోగ్యం కోలుకోవాలని మనమూ కోరుకుందాం. 

12:25 - December 16, 2015

విజయవాడ : కాల్ మనీ కేసు ఇంకా ఓ కొలిక్కి రాకముందే సీపీ సెలవు పెట్టడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. రాజకీయ వత్తిళ్లు..ఇతరత్రా కారణాల వల్లే ఆయన సెలవుపై వెళుతున్నారని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సెలవును రద్దు చేసుకుంటున్నట్లు బుధవారం ఉదయం విజయవాడలో ప్రకటించారు. కాల్ మనీ కేసు తీవ్రత దృష్ట్యా సెలవులు రద్దు చేసుకున్నానని తెలిపారు. మంజూరు చేసిన సెలవులు రద్దు చేయాలని డీజీపీ రాముడుని కోరినట్లు, కాల్ మనీ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. వేధింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
విజయవాడలో కాల్ మనీ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. టిడిపి పార్టీకి చెందిన నేతలు ఉండడం వల్ల కేసు పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ సెలవు పెట్టుకోవడంపై తీవ్ర దుమారం రేగింది. అత్యంత ప్రాధాన్యత కలిగిన కేసు ఉండగా సెలవుపై వెళుతుండడంపై పలువురు విమర్శలు వ్యక్తం చేశారు. రాజకీయ కారణాల వత్తిళ్లు..అధికార పార్టీ నేతలు ఉండడంతోనే సెలవు పెట్టుకున్నారని రూమర్స్ వినిపించాయి. ఈ తరుణంలో తన సెలవు రద్దు చేయాలని గౌతమ్ సవాంగ్ డీజీపిని కోరారు.

12:21 - December 16, 2015

ఢిల్లీ : రాష్ట్రంలో పెరిగిపోతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు నిర్ణయాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సుప్రీంలో ఓ ప్రయా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. బుధవారం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా సుప్రీం సంచలన నిర్ణయాలు వెలువరించింది. వచ్చే నాలుగు నెలల పాటు ఢిలీ పరిధిలో డీజిల్ వాహనాలను నిషేధిస్తున్నట్లు తీర్పును వెలువరించింది. ఎన్ యూవీ, లగ్జరీ డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపి వేయాలని ఆదేశించింది. 2000 సీసీ కంటే ఎక్కువగా ఉన్న డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ల నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పది ఏళ్ల క్రితం నాటి వాహనాలను నగరంలోనికి అనుమతించవద్దని సుప్రీం ఆదేశించింది. అంతేగాక కాలుష్య నివారణకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ప్రశ్నించింది. ఢిల్లీలో సుమారు 23 శాతం డీజిల్ వాహనాలు తిరుగుతున్నాయి. దీనివల్ల కాలుష్యం అధికమౌతోంది. ముఖ్యంగా చలికాలంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొత్త డీజిల్ వాహనాలను అనుమతించవద్దని గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవలే తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. 

కృష్ణా నది బోర్డు సమావేశం ప్రారంభం..

హైదరాబాద్ : కృష్ణా నది బోర్డు సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. 

లగ్జరీ డీజిల్ వాహనాల వినియోగంపై సుప్రీం తీర్పు..

ఢిల్లీ : రాష్ట్రంలో లగ్జరీ డీజిల్ వాహనాల వినియోగంపై సుప్రీం తీర్పును వెలువరించింది. ఎన్ యూవీ, లగ్జరీ డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపి వేయాలని ఆదేశించింది. మార్చి 31 వరకు రిజిస్ట్రేషన్ లను నిలిపివేయాలని, 2000 సీసీ కంటే ఎక్కువగా ఉన్న డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ల నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పది ఏళ్ల క్రితం నాటి వాహనాలను నగరంలోనికి అనుమతించవద్దని సుప్రీం ఆదేశించింది.

 

పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకం పెంపు...

ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పెంచింది. లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 1.17 పైసలు పెంచారు. ఎక్సైజ్ సుంకం పెంపు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.2500 కోట్ల ఆదాయం సమకూరనుంది. 

కొలిజియం వ్యవస్థపై సుప్రీం నిర్ధేశకాలు..

ఢిల్లీ : కొలిజియం వ్యవస్థపై కేంద్రానికి సుప్రీంకోర్టు నిర్ధేశకాలు చేసింది. జడ్జీల నియామకాల చర్యలు చేపట్టాలని, సీజేఐ, సీనియర్ న్యాయమూర్తుల సలహా ప్రకారం జడ్జీల నియామకాల డ్రాఫ్టు తయారు చేయాలని సూచించింది. 

విజయనగరంలో కాల్ మనీ...

విజయనగరం : జిల్లాలో కాల్ మనీ నిర్వహిస్తున్న వ్యాపారస్తులపై పోలీసులు దాడులు నిర్వహించారు. పలు ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. 

కాల్ మనీ..పోలీసులపై వేటుకు రంగం సిద్ధం..

విజయవాడ : కాల్ మనీ కేసులో సంబంధాలున్న పలువురు పోలీసులపై వేటుకు రంగం సిద్ధమౌతోంది. ఒకరిద్దరు పోలీసులను సస్పెండ్ చేసే అవకాశం ఉంది.

 

11:38 - December 16, 2015

ప్రముఖ కథా నాయికలు ఒకప్పుడు యువ నటులతో నటించడానికి సంకోచించేవారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. వారితో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కారణం విజయాలే కావచ్చు. ఆ మధ్య శివకార్తికేయన్‌తో క్రేజీ నటి హన్సిక మాన్‌కరాటే చిత్రంలో నటించింది. ఆ చిత్రం సక్సెస్ అయ్యింది. ఇటీవల సంచలన నటి నయనతార వర్ధమాన నటుడు ఆరితో మాయ చిత్రంలోనూ, విజయ్‌సేతుపతికి జంటగా నానుమ్ రౌడీదాన్ చిత్రంలోనూ నటించింది. ఆ రెండు చిత్రాలు విజయం సాధించాయి.
ఇప్పుడా వరుసలో చేరిన తమన్న
ఇప్పుడా వరుసలో నటి తమన్న చేరింది. తొలి రోజుల్లో యువ హీరోలతో నటించినా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న తరువాత టాప్ కథానాయకులతోనే నటిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు యువ నటుడు విజయ్‌సేతుపతితో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతోంది. దీనికి శీనురామసామి దర్శకత్వం వహించనున్నారు. ధర్మదురై పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల ప్రారంభమయ్యాలు. నటి తమన్న ఈ చిత్రాన్ని అంగీకరించడానికి కారణం తన కథా పాత్రేనట.
చాలా ఇంప్రెస్ అయ్యి నటించడానికి అంగీకరించిదట
దర్శకుడు కథను వివరించగానే తన పాత్రకు ప్రాధాన్యతతో పాటు వైవిధ్యంగా ఉండడంతో చాలా ఇంప్రెస్ అయ్యి వెంటనే నటించడానికి అంగీకరించిదట. చిత్ర షూటింగ్ జనవరి నుంచి రెగ్యులర్‌గా జరగనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. దర్శకుడు శీనురామసామి, విజయ్‌సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం ధర్మదురై. మాయాండి కుటంబత్తార్ చిత్రం ద్వారా విజయ్‌సేతుపతికి దర్శకుడు శీనురామసామి అవకాశం ఇచ్చారు. ఆ తరువాత ఇదం పొరుల్ ఏవల్ చిత్రం చేశారు. ఈ చిత్రం విడుదల కావలసి ఉంది. తాజాగా ధర్మదురై చిత్రానికి సిద్ధం అయ్యారు..

 

11:37 - December 16, 2015

విజయవాడ : కాల్ మనీపై వామపక్షాలు కన్నెర్ర చేశాయి. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. బుధవారం ఉదయం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వెంటనే న్యాయ విచారణ జరిపించాలని నేతలు డిమాండ్ చేశారు. కాల్ మనీ కేసులో ప్రత్యక్ష సంబంధం ఉన్న నేతలను సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విచారణ నిష్పక్షపాతికంగా జరిపించాలని, కాల్ మనీపై నిందితులపై కఠిన చర్యలు తీసుకొనే వరకు పోరాటం కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేస్తున్నారు. పోలీసు కమిషనర్ నిష్పక్షపాతికంగా విచారణ జరుపుతున్నారని తెలిపారు. అధికారికంగా అనుమతి తీసుకున్నా ర్యాలీకి అడుగడుగునా ఆంక్షలు విధించడంపై నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

11:34 - December 16, 2015

నటుడు శింబు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆయన మహిళలను అగౌర పరచే విధంగా అసభ్య పదజాలాలతో కూడిన పాటను రాసి, పాడి దాన్ని వాట్స్ యాప్‌లో పోస్ట్ చేశారని మహిళా సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. కోవైకి చెందిన అఖిల భారత మాదర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాధిక నటుడు శింబు, సంగీత దర్శకుడు అనిరుద్‌లపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోవై పోలీస్ కమిషనర్ అమల్‌రాజ్‌కు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఆయన ఆదేశాల మేరకు కోవై రేస్ కోర్స్ పోలీసులు శింబు, అనిరుద్‌లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి రెండు రోజుల క్రితమే చెన్నై వచ్చారు.
అజ్ఞాతంలోకి శింబు
అయితే శింబు అజ్ఞాతంలోకి వెళ్లడం. అనిరుద్ కెనడాలో ఉండడంతో వారి ఇళ్లకు సమన్లు అంటించారు. కాగా శింబును అరెస్ట్ చేసే తిరిగి రావాలని పోలీస్ కమిషనర్ గట్టిగా ఆదేశాలు జారీ చేయడంతో కోవై రేస్ కోర్స్ పోలీసులు చెన్నైలోనే మకాం వేసి శింబు ఆచూకీ తెలియక నగరంలోని వీధులన్నీ తిరుగుతూ తీవ్రంగా జల్లెడేసి గాలిస్తున్నారు. మరో పక్క మాదర్ సంఘానికి చెందిన వారు శింబు ఇంటిని చుట్టు ముట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు.
ఉరి తీయాలని ట్విట్టర్ లో కామెంట్
కాగా సీనియర్ నటుడు వైజీమహేంద్రన్ మహిళల్ని కించపరచే విధంగా అశ్లీల పదజాలాలతో కూడిన పాటను రాసిన వారెవరైనా వెంటనే అరెస్ట్ చేసి ఉరి తీయాలని తన ట్విట్టర్‌లో పేర్కొనడం విశేషం.ఇక పోతే మంగళవారం కెనడా నుంచి చెన్నైకి తిరిగి రానున్న అనిరుద్‌ను పోలీసులు అరెస్ట్ చేయడానికి సిద్ధం అయినట్లు సమాచారం. కాగా శింబు తనకు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తునట్లు తెలిసంది. మొత్తం మీద ఒక్క పాట కోలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోందని చెప్పవచ్చు.

11:24 - December 16, 2015

మెదక్ : జిల్లాలో గుర్తు తెలియని ఏటీఎంలో చోరికి యత్నించారు. ఈ ఘటన ఆటోనగర్ లో చోటు చేసుకుంది. గ్యాస్ కట్టర్ తో తొలగించడానికి ప్రయత్నించడంతో మంటలు చెలరేగాయి. కొంత డబ్బు బయటకు రావడంతో ఆ డబ్బును తీసుకుని బొలెరో వాహనంలో పరారయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. దొంగల వాహనం నిజామాబాద్ వైపుగా పోతోందని పోలీసులు గ్రహించారు. వెంటనే విషయాన్ని నిజామబాద్ జిల్లా పోలీసులకు తెలియచేశారు. అప్రమత్తమైన నిజామాబాద్ పోలీసులు లింగంపేటలో వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించారు. కానీ దొంగలు వాహనం ఆపకపోవడంతో లింగంపేట పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు చేశారు. ప్రస్తుతం గాంధారి అటవీ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. వీరు మహారాష్ట్ర కు చెందిన దొంగలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

11:09 - December 16, 2015

ప్రకృతిలో మనం చాలా రకాల పూలను చూస్తాం. కొన్ని పూలు సువాసనలను వెదజల్లుతాయి. మరికొన్ని పూలు ఔషధాలుగా ఉపయోగిపడతాయి. సీజనల్‌ వారీగా వచ్చే పూలు ఎన్నో ఉన్నా.. డిసెంబర్‌ పూలది ఓ ప్రత్యేకత. గట్టువెంట సహజంగా విరబూసే ఈ పూలు శీతాకాలంలో వలసవచ్చే చిన్నచిన్న పక్షులకు మకరందాన్ని అందిస్తాయి.

ఊదారంగు, బంగారు వర్ణం, అరుదుగా తెలుపు, లేతగులాబీ వర్ణాలలో కనిపించే ఈ పూలు తెలియనివారు ఉండరు. నవంబర్‌ నెల చివరి నుంచే చిగురులు తొడిగి.. డిసెంబర్‌ నెల ప్రారంభం నుంచి ఫిబ్రవరి నెల చివరి వరకు విరబూస్తాయి. తక్కువ సూర్యకాంతిలో ఈ పూలు వికసిస్తాయి. అంతేకాదు.. ఈ మొక్కలో అనేక ఔషధగుణాలున్నాయి.

- ఈ మొక్క ఆకులను దగ్గు, న్యుమోనియా చికిత్సకు ఉపయోగిస్తారు.

- వేర్లు, ఆకులు జలుబు, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.

- హెపాటిక్‌ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.

- విత్తనాలు పాము కాటు విరుగుడుగా ఉపయోగిస్తారు.

- ఈ మొక్కను రక్తహీనతతో బాధపడేవారికి ఔషధంగా కూడా ఆయుర్వేదంలో సూచిస్తారు.

- డిసెంబర్‌ పూలమొక్కను రక్త శుద్ధి కోసం, మధుమేహం చికిత్సలో ఉపయోగిస్తారు.

- వేర్ల రసం అజీర్తీకి ఉపశమనంగా పనిచేస్తుంది.

 

11:07 - December 16, 2015

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో కాల్ మనీ వ్యవహారం ఖాకీలకు చుట్టుకొంటోంది. రాజకీయ నేతల ప్రమేయం ఉందని ఇప్పటికే ఆరోపణలు వస్తుండడం..కొందరు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పోలీసు అధికారులకు ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నాయనే వార్తలు వస్తున్నాయి. కాల్ మనీ కేసులో ఎస్ఐ, సీఐ స్థాయిలో సంబంధాలు ఉన్నాయని పోలీసు కమిషనర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వారిపై చర్యలు తీసుకొనేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా పటపట సీఐ దామోదర్ ట్రాఫిక్ కు బదిలీ చేసే అవకాశాలున్నాయి. మరో ఆరుగురిపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రత్యక్షంగా సహకరించిన వారిని వేటు వేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కాసేపట్లో వెలువడనున్నాయి. 

సీబీఐ కార్యాలయానికి రాజేంద్ర కుమార్..

ఢిల్లీ : రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రిన్స్ పల్ సెక్రటరీ రాజేంద్రకుమార్ సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్నారు. 

ఢిల్లీలో ఉగ్రవాదుల అరెస్టు..

ఢిల్లీ : ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో ఢిల్లీలో దాడులు చేసేందుకు కుట్రపన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

10:32 - December 16, 2015

హైదరాబాద్ : తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలని ఆశా వర్కర్లు కోరుతున్నారు. గత వంద రోజులుకు పైబడి ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఇందిరాపార్కు వద్ద భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. ఈసభలో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల నుండి పెద్ద ఎత్తున ఆశాలు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 2వ తేదీ నుండి ఆశాలు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో నిర్భందాలు..వత్తిడిలు..అరెస్టులు..పోలీసుల ఉక్కుపాదం..ఎంత చేసినా ఆశాలు వెనక్కి తగ్గలేదు. తమ సమస్యలు పరిష్కరించుకోవాలని ధృడనిశ్చయంతో ముందుకు కదిలారు.

ప్రభుత్వం స్పందించాలి..
ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని సభకు వచ్చిన ఓ కార్యకర్త టెన్ టివితో తెలిపింది. వేతనాలు లేకుండానే పని చేస్తున్నామని, బంగారు తెలంగాణ పేరు పెట్టుకుని ఆడబిడ్డలను రోడ్డుపాలు చేయడం సమంజసం కాదన్నారు. తెలంగాణ వస్తే మాకు కూడా బంగారు భవిష్యత్ ఉంటుందని ఆశించామన్నారు. ఇప్పటికైనా దయ..జాలి చూపెట్టాలని, కనీస వేతనాలు పెంచేదాక పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు. నల్గొండ కొయిలగూడెం వద్ద పోలీసులు తోసేయడంతో కిందపడడంతో తలకు గాయమైందని ఓ కార్యకర్త పేర్కొంది. సిరిసిల్ల డివిజన్ లో ఆశాల వర్కర్ల పట్ల మగ పోలీసులు కర్కశంగా వ్యవహరించారని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఆశా కార్యకర్త తెలితపింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పని తాము చేస్తున్నామని, తాము కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నట్లు పేర్కొంది. వెంటనే సీఎం కేసీఆర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

10:13 - December 16, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాల్ మనీ పెను దుమారం రేపుతోంది. కాల్ మనీ దారుణాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తుండడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటన వెలిగిచూసినప్పటి నుండి కాల్ మనీ వ్యాపారుస్తులు, వడ్డీ వ్యాపారస్తుల నివాసాలపై సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో భారీగా డబ్బు..ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్ లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు పోలీసులు సోదాలు నిర్వహిస్తుండడంతో పలువురు వడ్డీ వ్యాపారస్తులు నివాసాలకు తాళాలు వేసి పరారవుతున్నారు.

శ్రీకాకుళంలో..
జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. పి.వి.రమణ, చంద్రశేఖర్ వ్యాపారస్తుల నివాసాలపై దాడులు చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇచ్చాపురంలో ఏడుగురు వడ్డీ వ్యాపారుల నివాసాలపై దాడులు నిర్వహించారు. నాలుగు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

విశాఖలో
జిల్లాలో కాల్ మనీ కలకలం సృష్టిస్తోంది. అనకాపల్లిలో ఎల్లపు నూకరాజు నివాసంలో పోలీసులు దాడులు చేశారు. పలు ప్రామసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

పశ్చిమగోదావరి..
చింతలపూడిలో వడ్డీ వ్యాపారి జగన్నాథం నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. 70 ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మరో వడ్డీ వ్యాపారి పరారీలో ఉన్నాడు.

గుంటూరులో..
కారంపూడిలో కాల్ మనీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడులు కొనసాగుతున్నాయి.

తూర్పుగోదావరి లో..
జిల్లాలో కాల్ మనీ పెను ప్రకంపనాలు సృష్టిస్తోంది. అమలాపురంలో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వడ్డీ పేరిట తన ఇళ్లు లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని ఆ మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో నాలుగు బృందాలతో దాడులు నిర్వహించారు. ప్రామిసరీ నోట్లు, సంతకాలతో ఉన్న చెక్ లు, దస్తావేజులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 25 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

3గంటలకు ఏపీ కేబినెట్ భేటీ..

విజయవాడ : సీఎం క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నాం మూడు గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇసుక విధానం, రాజధాని నిర్మాణం, కాల్ మనీ, ప్రైవేటు విశ్వ విద్యాలయాలు, స్విస్ పద్ధతులపై చర్చ జరగనుంది. 

నగరంలో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు..

హైదరాబాద్ : డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. 100 ఎల్ ఎస్ డీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. 

చింతలపూడిలో వడ్డీ వ్యాపారస్తులపై పోలీసుల దాడులు..

పశ్చిమగోదావరి : చింతలపూడిలో వడ్డీ వ్యాపారి జగన్నాథం నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. 70 ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మరో వడ్డీ వ్యాపారి పరారీలో ఉన్నాడు. 

లోక్ సభలో కాంగ్రెస్, ఆప్ వాయిదా తీర్మానాలు..

ఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ అంశంపై లోక్ సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఢిల్లీ సచివాలయంపై సీబీఐ దాడుల అంశంపై ఆప్ వాయిదా తీర్మానం ఇచ్చింది. 

09:26 - December 16, 2015

హైదరాబాద్ : వారం కాదు..రెండు..మూడు వారాలు కాదు..నెల కాదు..ఏకంగా వంద రోజులకు పైబడి ఆందోళన..తమ సమస్యలు తీర్చాలని..వేతనాలు..ఇతరత్రా సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వంపై మరింత వత్తిడి తీసుకొచ్చేందుకు నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం స్పందించింది. చర్చలకు రావాలని ఆహ్వానించింది.
ఆశాలు ఇన్ని రోజులుగా ఆందోళన చేపట్టినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. కొన్ని సందర్భాలల్లో మంత్రులు సైతం ఆశాలు..వారికి మద్దతిస్తున్న యూనియన్లపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆశాలు వివిధ జిల్లాల నుండి పాదయాత్రలు చేపట్టింది. ఈ పాదయాత్రలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. 17వ తేదీన ఇందిరాపార్కు వద్ద భారీ బహిరంగ సభ జరుగనుంది. ఈసభలో పాల్గొనడానికి భారీ సంఖ్యలో ఆశాలు తరలివస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఆశాలను పోలీసులు అడ్డుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. 106 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు. మాతృ, శిశు మరణాలు కలుగకుండా, గ్రామాల్లో రోగులకు చికిత్స అందించడంలాంటి ఎన్నో సేవలు చేస్తున్నామన్నారు. ఏది ఏమైనా ఆశాల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం మొండిపట్టు వీడాలనే సూచనలు వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం పరిష్కరిస్తుందా ? లేదా ? అన్నది చూడాలి. 

08:38 - December 16, 2015

గత వంద రోజులకు పైబడి ఆందోళన చేస్తున్న ఆశాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. ఆశాల సమ్మె పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలని..ప్రభుత్వానికి..ఆశాల యూనియన్ల మధ్యన చర్చలు జరిపేందుకు తాను..ఇతరులు సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఆశాల సమ్మె..ఏపీలో కాల్ మనీ అంశాలపై టెన్ టివి 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. ఆయన మాటల్లోనే..

పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నాం..
''వీరు ఆందోళన చేపట్టి 100 రోజులకు దాటింది. దీనితో ఆశాలు పాదయాత్రలు చేపట్టారు. కానీ ఈ పాదయాత్రలను అడ్డుకున్నారు. తెలంగాణ వచ్చిన తరువాత నడిచే హక్కు లేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఇందిరాపార్కు వద్ద భారీ బహిరంగసభ ఉంది. ఈ సభలో పాల్గొనేందుకు పదిహేను వేల మంది ఆశాలు నగరానికి చేరుకుంటున్నారు. దీనికి అనుమతి ఉంది. చర్చలు మొదలు కాబోతున్నాయి. ఆశా వర్కర్ల యూనియన్లతో మంత్రులు చర్చలు జరిపేందుకు సిద్ధమౌతున్నారు. న్యాయమైన ప్రతిపాదనతో ముందుకు రావాలి. ఆశాల సభ నిర్వహించడం వల్ల ప్రభుత్వంపై వత్తిడి పెరుగుతుంది. చర్చల్లో పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నాం.

ఆశాల సమస్య కాదు..తెలంగాణ ప్రజల సమస్య..
ఆశా వర్కర్ల సమస్య కాదు. తెలంగాణ ప్రజల సమస్య. ఆశాలు పనిచేయకపోతే కోట్లాది మంది పేదల ఆరోగ్యం దెబ్బతింటుంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆశా వర్కర్లపై చర్చలు జరిపింది. ఈ రకంగా చూడడం సరికాదని, వేతనాలు పెంచాలని..ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పేర్కొంది. నేషనల్ హెల్త్ మిషన్ పై కేంద్ర ప్రభుత్వం నియమించిన స్టీరింగ్ కమిటీ కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. వీరందరూ అడిగినా ఒప్పుకోరా ? కేవలం ఐదు వందలతో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటారు ? కేంద్ర ప్రభుత్వ పథకం అని వితండ వాదన చేస్తోంది. అంగన్ వాడీ..మధ్యాహ్న పథకం..ఉపాధి హామీ పథకం..ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలు కావా ? ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.50వేలు ఇస్తోంది. ఆశాలకు పశ్చిమ బెంగాల్ లో కేంద్రం ఇచ్చే డబ్బులకు అదనంగా రూ. 1400, రాజస్థాన్ రూ.1300, కేరళలో రూ.1000 ఇస్తోంది. అలాగే కర్నాటక రాష్ట్రం కేంద్రం ఇస్తే అంతే సమానంగా ఇస్తోంది. తెలంగాణ వచ్చిన తరువాత రూ.5వేలు ఇస్తామని చెప్పారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి కదా ? ప్రభుత్వ వైఖరిలో లోపం ఉంది. సమాజంలో అట్టడుగున్న వారు సమ్మె చేస్తే అణిచివేస్తున్నారు.

ఏపీలో కాల్ మనీ కేసు...
ఏపీలో కాల్ మనీ కేసులో సీపీ సవాంగ్ లీవ్ పై వెళుతున్నారు. అంత పెద్ద కుంభకోణం జరిగితే లీవ్ ఎందుకు ? అధికారుల పని నచ్చకపోతే లీవ్ లో వెళ్లమంటారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరోక్షంగా సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి. రాజకీయ నాయకులకు సంబంధం లేదని పోలీసు అధికారులు ఎలా పేర్కొంటున్నారు ? ఒక డీజీపీ రాజకీయ మాటలు మాట్లాడవద్దు. ఎవరిపైనా కూడా చర్యలు తీసుకోండి. చంద్రబాబు నాయుడులో వైఖరి మార్పు వచ్చింది. ప్రభుత్వానికి ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చారు. నేర మాఫియాను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. రాజకీయ సంకల్పం ఉంటేనే సాధ్యమౌతుంది''. అని నాగేశ్వర్ పేర్కొన్నారు. 

విశాఖలో కాల్ మనీ కలకలం..

విశాఖపట్టణం : జిల్లాలో కాల్ మనీ కలకలం సృష్టిస్తోంది. అనకాపల్లిలో ఎల్లపు నూకరాజు నివాసంలో పోలీసులు దాడులు చేశారు. పలు ప్రామసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. 

ఇచ్చాపురంలో ఫైనాన్సర్ల నివాసాలపై దాడులు..

శ్రీకాకుళం : ఇచ్చాపురంలో ఫైనాన్సర్ల నివాసాలపై పోలీసులు దాడులు చేశారు. ఓ ఇంట్లో రూ.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దాడుల నేపథ్యంలో పలువురు వడ్డీ వ్యాపారులు పరారయ్యారు. టెక్కలిలో వడ్డీ వ్యాపారి చంద్రశేఖర్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. 

అంకుషాఫూర్ వద్ద రోడ్డు ప్రమాదం...

రంగారెడ్డి : ఘట్ కేసర్ (మం) అంకుషాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ రహదారిపై ఆర్టీసీ బస్సు - మారుతీ వ్యాన్ ఢీకొన్నాయి. ఆరుగురికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 

మెదక్ లో లో ఏటీఎం చోరీకి యత్నం..

మెదక్ : ఆటోనగర్ లో ఎస్ బిఐ ఏటీఎం చోరీకి దుండగులు ప్రయత్నించారు. గ్యాస్ కట్టర్ తో తొలగించడానికి ప్రయత్నించడంతో మంటలు చెలరేగాయి. వెంటనే వారు బొలెరో వాహనంలో పరారయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. వెంటనే నిజామాబాద్ జిల్లా వాసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన నిజామాబాద్ పోలీసులు లింగంపేటలో వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించారు. కానీ దొంగలు వాహనం ఆపకపోవడంతో లింగంపేటలో పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు చేశారు

07:32 - December 16, 2015

కాల్ మనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదేపిస్తోంది. ఈ కేసులో పలు రాజకీయ పార్టీల నేతల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన పలువురు నేతలను కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే సీపీ సవాంగ్ సెలవులపై వెళ్లడం తీవ్ర దుమారం రేపింది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చ వేదికలో నడింపల్లి సీతారామరాజు (విశ్లేషకులు), పట్టాభిరామ్ (టిడిపి), లక్ష్మీ పార్వతి (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:26 - December 16, 2015

ఆరోగ్యాన్ని అందించడంలో కూరగాయల్ని, పండ్లనీ మించినవి మరొకటి లేవు. అలాంటి వాటిల్లో బీట్‌రూట్‌ ఒకటి. కానీ దీన్ని తీసుకోవాలంటే బాబోయ్ అనేవారే ఎక్కువ మంది ఉంటారు. కానీ ఇది ఎంతో మేలు చేస్తుంది. తరచూ నీరసంగా అనిపిస్తుంటే బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం అలవాటు చేసుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బీట్‌రూట్‌ రసం రుచికరంగా ఉండేందుకు అల్లం, పుదీనా, నిమ్మరసం, ఉప్పు లాంటివి కూడా కలుపుకోవచ్చు. రెండు మూడు రోజులకు ఒకసారి గ్లాసుడు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే చాలు కొన్ని రోజుల్లోనే సమస్య నుంచి బయటపడొచ్చు. దీనిని తాగడం వల్ల శరీరానికి కావాల్సిన చక్కెర సమపాళ్లలో అంది నీరసం తగ్గుతుంది. మహిళలు ఎదుర్కొనే మరో సమస్య ఐరన్‌ లోపం. ఒక కప్పు బీట్‌రూట్‌ తరుగులో 1.1 మి.గ్రా ఐరన్‌ ఉంటుంది. ఐరన్‌ హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచడంతోపాటు, శరీరానికి కావాల్సిన ఆక్సిజన్‌ను కూడా అందిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ దీన్ని తాసుకోవడం వల్ల ఐరన్‌తో పాటు, శరీరానికి కావాల్సిన అదనపు పోషకాలు అందుతాయి. బీట్‌రూట్‌ను జ్యూస్‌గా గానీ, పచ్చి ముక్కలుగా గానీ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్‌ బి, సి పుష్కలంగా అందుతాయి. అంతేకాదు, రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. ఎదిగే పిల్లలకు బీట్‌రూట్‌ తురుమును స్నాక్‌గా ఇస్తే పోషకాలు సంవృద్ధిగా అందుతాయి.

07:23 - December 16, 2015

ప్రతి వంటింట్లో ఎక్కువగా ఉపయోగించేవి నిమ్మకాయలు.. అయితే వాటిని వాడేశాక చెక్కల్ని పడేస్తుంటారు చాలామంది. కానీ వీటివల్ల ఉపయోగాలు తెలిస్తే ఎవరూ అలా చేయరు. ఆ ఉపయోగాలంటే మీరే చూడండి.

  • ఇంట్లో పురుగులు, చీమలు, ఇతర కీటకాలు ఎక్కువగా వస్తుంటే వంటింట్లో గోడలకున్న రంధ్రాల దగ్గర, కిటకీల వద్ద.. నిమ్మచెక్కలను ఉంచితే చాలు.. వాటి బెడద దూరమవుతుంది.
  • కిచెన్‌లో పాడైపోయిన కూరగాయలు, వంటల తాలూకు చెడు వాసన వస్తుంటే ఇలా చేయండి. గిన్నె నిండా నీళ్లు నింపి అందులో ఈ చెక్కలను వేసి పొయ్యి మీద పెట్టాలి. నీళ్లు మరిగాక వాటి నుంచి సువాసనలు వస్తాయి. ఇల్లంతా పరిమళభరితం అవుతుంది.
  • ఫ్రిజ్‌, ఓవెన్‌ నుంచి దుర్వాసనలు వస్తుంటే.. చిన్న కప్పులో నీళ్లు పోసి ఒక నిమ్మకాయ ముక్క ఉంచితే సమస్యలు తక్షణమే దూరమైపోతాయి.
  • పొయ్యి, బాణలి, పెనం వంటి వాటి మీద ఉప్పు చల్లి ఈ చెక్కతో రుద్ది కడగాలి. తరవాత పొడి వస్త్రంతో తుడిస్తే నూనె మరకలు వదిలిపోతాయి.

నేడు పీఎస్ ఎల్ వీ సీ -29 రాకెట్ ప్రయోగం..

నెల్లూరు : నేడు పీఎస్ ఎల్ వీ సీ -29 రాకెట్ ప్రయోగం జరగనుంది. సాయంత్రం ఆరు గంటలకు రాకెట్ దూసుకెళ్లనుంది. సింగపూర్ కు చెందిన ఆరు విదేశీ ఉప గ్రహాలను నింగిలోకి తీసుకెళ్లనుంది. 

నేడు ఏపీ కేబినెట్ భేటీ..

విజయవాడ : నేడు ఏపీ కేబినెట్ భేటీ జరుగనుంది. ఇసుక విధానం, రాజధాని నిర్మాణం, కాల్ మనీ, ప్రైవేటు విశ్వ విద్యాలయాలు, స్విస్ పద్ధతులపై చర్చ జరగనుంది. 

06:45 - December 16, 2015

మనకు చాలా ప్రాజెక్టులున్నాయి. భారీ, మధ్య తరహా, చిన్న తరహా ఇలా రకరకాల ప్రాజెక్టులున్నాయి. కానీ, అవన్నీ వట్టిపోతున్నాయి. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? ఒకట్రెండేళ్లు సక్రమంగా వర్షాలు పడకపోతే, నీళ్లో రామచంద్రా అంటూ పరుగులు తీయాల్సిన పరిస్థితి ఎందుకొస్తోందా? ఇది ప్రకృతి శాపమా? ప్రాజెక్టుల నిర్వహణా వైఫల్యమా? అసలు ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? వీటి నిర్వహణలో ఎక్కడెక్కడ ఏయే రూపాల్లో అశ్రద్ధ కనిపిస్తోంది? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో వివిధ ప్రాజెక్ట్‌లలో పనిచేసిన అనుభవం వున్న ఎంప్లాయీస్ వాయిస్ ఎడిటర్ కె.వి. విశ్లేషణ చేశారు.

 

06:43 - December 16, 2015

ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలతో పోలుస్తారు. ధూప దీప నైవైద్యాలు లేని దేవాలయాలు గబ్బిలాలకు నిలయాలవుతాయి. ప్రాజెక్టుల నిర్వహణ సక్రమంగా లేకపోతే, వాటిలో చివరకు పిచ్చి మొక్కలే మిగులుతాయి. మన ప్రాజెక్టుల నిర్వహణా తీరు తెన్నులను సీరియస్ గా సమీక్షించుకుని, తక్షణ చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఏ ప్రాజెక్టులోనూ నీళ్లు లేవు. అన్నీ అడుగంటాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. వర్షాలు లేక నీళ్లు లేక చాలా ప్రాంతాల్లో ఖరీఫ్ సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. రబీ పరిస్థితి మరింత నిరాశాజనకంగా వుంది. నాగార్జునసాగర్ ఆయకట్టులో అత్యధికభాగం రబీపై ఆశలు వదిలేసుకుంటోంది. నాగార్జునసాగర్ లో నీటి మట్టం 508 అడుగులకు పడిపోయింది. ఈసారి చలికాలమే వేసవిని తలపిస్తోంది. డిసెంబర్ లో కూడా చన్నీళ్ల స్నానం చేయడం బహుశా ఇదే మొదటిసారేమో. గతంలో డిసెంబర్ లో ఎవరింట్లోనూ రాత్రి పూట ఫ్యాన్ లు తిరిగేవి కాదు. ఇప్పుడు ఫ్యాన్ వేసుకోవాల్సి వస్తోంది. ఈసారి ఎండలు మరింత మండిపోతాయంటున్నారు. అంటే విద్యుత్ వినియోగం, నీళ్ల వినియోగం పెరగబోతోంది. కానీ, ఇప్పుడు నీళ్లకే కరవొచ్చింది. హైదరాబాద్ లో అప్పుడే నీళ్లకు కటకట వచ్చింది. కొన్ని కాలనీలలో వారానికి ఒకసారి మాత్రమే మంచినీళ్లు సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్ట్ లలో నానాటికీ తరిగిపోతున్న నీటి నిల్వలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. శ్రీశైలంలో నీటి మట్టం 835 అడుగులకు పడిపోయింది. నాగార్జున సాగర్ లో 508 అడుగులకు పడిపోయింది. దాదాపు 12 టీఎంసీల నీళ్లను నిల్వ చేయగలిగే జూరాలలో నిండా 9 టీఎంసీల నీళ్లు కూడా లేవు. వంద టీఎంసీల సామర్థ్యమున్న తుంగభద్రలో 31 టీఎంసీలే వుంది. మొన్నటి వర్షాలకు సోమశిల కాస్త కళకళలాడుతోంది. అక్కడ 66 టీఎంసీలున్నాయి. కండలేరులో 35 టీఎంసీలే వున్నాయి. ఇక శ్రీరాంసాగర్ పరిస్థితి మరింత దయనీయం. 90 టీఎంసీలను నిల్వచేసే శ్రీరాంసాగర్ లో ఇప్పుడున్నది ఆరు టీఎంసీలే. రిజర్వాయర్ల పరిస్థితి ఇలా వుంటే ఇక ఎండాకాలంలో నీటి ఎద్దడిని తట్టుకునేదెలా? ఈ ప్రశ్నే ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

లోపం ఎక్కడుంది ?
నిరుడు, ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసిన మాట నిజమే అయినా, అంతకు ముందు కొన్నేళ్లపాటు సమ్రుద్ధిగానే వానలు పడ్డాయి. ప్రాజెక్టులు కళకళలాడాయి. ఒకానొక దశలో అన్ని గేట్లు వదిలి నీళ్లను సముద్రంలోకి పంపాల్సి వచ్చింది. ఇంతలోనే ఇంత దుర్భరమైన పరిస్థితి ఎందుకొచ్చింది? కేవలం ఒకట్రెండేళ్లు వర్షాలు పడకపోతే, తట్టుకోలేని, తాగే నీళ్లను సైతం వెదుక్కోవాల్సిన దుస్థితి ఎందుకొస్తోంది? అసలు భారీ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కట్టుకునేదే కరువు కాలంలో, కష్టకాలంలో అక్కరకొస్తాయన్న ఉద్దేశంతో. అంత ఖర్చు పెట్టి నిర్మించుకున్న ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కష్టకాలంలో మనలను ఎందుకు ఆదుకోలేకపోతున్నాయి? లోపం ఎక్కడుంది? వాటి నిర్వహణలోనా? ఇది ప్రకృతి శాపమా? ప్రాజెక్టుల నిర్వహణా వైఫల్యమా?

ప్రాజెక్టుల నిర్వాహణపై నిర్లక్ష్యం..
గత కొన్ని దశాబ్ధాలుగా ప్రాజెక్టుల నిర్వహణను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రాజెక్టులలో పూడిక పెరిగిపోతున్నా, గోడలకు నెర్రెలొస్తున్నా, గేట్ల దగ్గర లీకేజీలవుతున్నా, కాలువల నిండా పిచ్చిమొక్కలు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదు. వివిధ రూపాల్లో జరిగే నీటి వ్రుధాను అరికట్టాలన్న ధ్యాసే కొరవడింది. అసలు ప్రాజెక్టుల సమర్ధ నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకాల విషయంలోనూ అంతులేని అశ్రద్ధ చేస్తూ వచ్చాం. ఒక లక్ష్యంతో నిర్మించిన ప్రాజెక్టులను మరో రకం అవసరాలకు వినియోగించడమూ ఎక్కువైంది. నీటి మీటర్లు బిగించి, నీటి తీరువాలు పెంచి, పన్నులు పిండుకోవాలన్న ఆలోచనే తప్ప, ప్రాజెక్టుల సమర్ధ నిర్వహణ ధ్యాసే వుండడం లేదు. ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో జరుగుతున్న లోపాల మీద ఇప్పటికైనా ద్రుష్టిసారించాలి. వాతావరణంలో అనేక మార్పులొస్తున్నాయి. ఎప్పుడు వర్షాలు పడతాయో, ఎప్పుడు చలి దంచేస్తోందో, ఎప్పుడు నిప్పులు కురుస్తాయో అర్ధంకాని పరిస్థితి. ప్రతి నీటి బొట్టునీ జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన కాలమిది. 

06:38 - December 16, 2015

హైదరాబాద్ : సచివాలయంలో మంత్రి హరీష్ రావు నాలుగు జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మిషన్ కాకతీయ పనుల్లో తప్పులు జరిగితే ఉపేక్షించేది లేదని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను హెచ్చరించారు. ఆదిలాబాద్ , కరీంనగర్ , మెదక్ , నిజామాబాద్ జిల్లాల అధికారులతో నీటి పారుదలశాఖ మంత్రి హరీష్ రావు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి మండలంలో జరుగుతున్న పనులపై అధికారులు దృష్టి సారించి పారదర్శకంగా పనిచేయాలని అవినీతికి తావు లేకుండా చూడాలని అన్నారు. కోటి రూపాయల కంటే తక్కువ విలువగల మిషన్ కాకతీయ పనులను మార్చి లోగా పూర్తి చేయాలని టార్గెట్ విధించారు. కోటి కంటే ఎక్కువ విలువగల ప్రాజెక్టులు జూన్ కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ పురోగతి పై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.

వారానికి ఒకసారి వీడియో కాన్ఫరెన్స్...
మిషన్ కాకతీయ రెండో దశ విజయవంతానికి ఇక నుంచి వారానికి ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని మంత్రి అధికారులకు తెలిపారు. మిషన్ కాకతీయ పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న ఏజెన్సీల ను బ్లాక్ లిస్టులో పెట్టాలని అవసరమైతే టర్మినేట్ చేయాలన్నారు. వెంటనే వారం రోజుల్లో తిరిగి టెండర్లను సైతం పిలవాలని అధికారులకు సూచించారు. రూల్స్‌ను ఎవరు అతిక్రమించరాదని అన్ని జిల్లాలు తమ నివేదికను పురోగతి వివరాలను తెలపాలని ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా గత 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న చెరువులను యుద్ధప్రాతిపదికన టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. మిషన్ కాకతీయ రెండో దశ పనులు చేసేందుకు సమయం ఎక్కువగా ఉన్నందువల్ల పకడ్భందీగా ఏర్పాట్లు చేయాలన్నారు మంత్రి హరీష్ రావు. ఇక నుంచి రెగ్యులర్ ఫీల్డ్‌ విజిట్ చేస్తానని చెప్పకుండా ఫీల్డ్ లో తిరిగి ఎక్కడ పనుల్లో అలసత్వం కనబడినా అధికారులపై గుత్తేదారులపై చర్చలు తీసుకుంటానని హెచ్చరించారు.

06:36 - December 16, 2015

విజయవాడ : రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పెంచాల్సిన అవసరముందన్నారు. ముఖ్యంగా వృద్ధిరేటులో దూసుకుపోతున్న ఫిషరీస్‌ రంగంలో శిక్షణ ఇవ్వడంపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన 'లైఫ్‌' పథకాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవాలని,.. చదువుకోని వాళ్లకు కూడా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించాలన్నారు చంద్రబాబు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరముందని అధికారులకు సీఎం సూచించారు. లాజికల్‌ థింకింగ్‌, న్యుమరికల్‌ ఎబిలిటీలో యువత వెనకబడి ఉన్నట్లు అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. అయితే.. ఇంగ్లీష్‌, కంప్యూటర్‌ స్కిల్స్‌లో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో... రానున్న రెండేళ్లలో నైపుణ్యం కలిగినవారు 2 లక్షలకు పైగా అవసరముంటుందని చంద్రబాబు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని యువతలో నైపుణ్యం పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు బాబు సూచించారు. ఇక వందశాతం ప్లేస్‌మెంట్‌ కల్పించే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలకే చెల్లింపులు చేయాలని,.. శిక్షణ పొందినవారికి టాటా వంటి గుర్తింపు పొందిన సంస్థల నుంచి సర్టిఫికెట్లు ఇప్పించాలని సీఎం ఆదేశించారు. ప్రతి జిల్లాను దేశంలోనే నెంబర్‌ వన్‌ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్లు పట్టుదల, అంకితభావంతో పని చేయాలని చంద్రబాబు సూచించారు. 

06:34 - December 16, 2015

కర్నాటక : సీఎం కేసీఆర్‌ దంపతులు నేడు శృంగేరికి వెళ్లనున్నారు. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామిని ఈ నెల 23 నుంచి 27 వరకు నిర్వహించే అయుత చండీ మహా యాగానికి రావాలని ఆహ్వానించనున్నారు. ఉదయం 11 గంటలకు విమానంలో కేసీఆర్ దంపతులు మంగళూరుకు.. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శృంగేరి మఠానికి వెళతారు. మధ్యాహ్నం రెండు గంటలకు మఠాధిపతి భారతీ తీర్థస్వామి ఆశీర్వాదం తీసుకుంటారు. అయుత చండీయాగానికి రావాలని ఆహ్వానిస్తారు. సీఎం కేసీఆర్ వెంట కొందరు వేద పండితులు కూడా వెళ్లనున్నారు. శృంగేరి మఠంలో గతంలో భారతీ తీర్థ అయుత చండీ మహాయాగం నిర్వహించారు. యాగ నిర్వహణపై మఠాధిపతి సలహాలు, సూచనలు సీఎం స్వీకరించనున్నారు. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. చండీ యాగానికి హాజరై ఆశీర్వదించాలని ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్‌ను కేసీఆర్ ఆహ్వానించారు. షిల్లాంగ్‌లో ఉన్న రవిశంకర్‌తో కేసీఆర్‌ వీడియోకాల్‌ ద్వారా మాట్లాడారు. దీనిపై రవిశంకర్ సానుకూలంగా స్పందించారు.

 

06:31 - December 16, 2015

హైదరాబాద్ : ఖైరతాబాద్ లో అర్థరాత్రి వేళ ఏఐడబ్ల్యూసీ హాస్టల్ కలకలం రేగింది. హాస్టల్ లోకి ప్రవేశించేందుకు ఓ ఆకతాయి ప్రయత్నించాడు. భయంతో కేకలు వేయడంతో పోలీసులను చూసి పారిపోయాడు. ప్రక్కనే రైల్వే స్టేషన్ ఉండడంతో పోలీసులు పట్టుకోలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో ఇటువంటి ఘటనలు జరిగినా ఈవ్ టీచర్ల బెడద మాత్రం తప్పడం లేదని, దీనిపై హాస్టల్ యాజమాన్యం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని యువతులు ఆరోపించారు. తాము ఈ సమస్యను యాజమాన్యానికి తెలిపితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఓ యువతి పేర్కొంది. రేప్ చేయలేదు కదా.. ఎవరి కోసమో వస్తున్నాడు అంటున్నారని తెలిపింది. ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే లేదు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వాపోయింది. దీనితో తాము మహిళా మండలిని వారిని కలువడం జరిగిందని, పోలీసులు కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. 

06:27 - December 16, 2015

హైదరాబాద్ : ఓ పసికందును కిడ్నాప్ ను ఆటో డ్రైవర్లు చాకచక్యంగా అడ్డుకున్నారు. ఆ పసికందును ఆ తల్లి ఒడికి అందచేశారు. ఈఘటన గాంధీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన జ్యోతి, తేజ దంపతులు హైదరాబాద్ నివాసం ఉంటున్నారు. జ్యోతికి పురిటినొప్పులు రావడంతో గాంధీ ఆసుపత్రికి వచ్చారు. మంగళవారం రాత్రి మగ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం రక్తం అవసరం రావడంతో తేజ బయటకు వెళ్లాడు. ఆ సమయంలో మేరీ అనే మహిళ వచ్చి పసికందును ఎత్తుకొని బయటకు వచ్చింది. అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లతో మాట్లాడింది. ఆర్కే నగర్ కు వెళ్లాలని చెప్పింది. ఎందుకో అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్లు వెళుతామని చెప్పి ఆమెను నేరుగా పీఎస్ కు తీసుకొచ్చారు. అక్కడ పోలీసులు లేకపోవడంతో హెల్త్ ఆఫీసర్ కు విషయం చెప్పారు. పసికందును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిందని నిర్ధారణకు రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. పసికందును కిడ్నాప్ కాకుండా చూసిన ఆటో డ్రైవర్లను పలువురు అభినందించారు. 

06:23 - December 16, 2015

అనంతపురం : విజయవాడ కాల్ మనీ వ్యవహారంతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారస్తుల నివాసాలపై సోదాలు నిర్వహిస్తూ పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. అనంత, ఒంగోలు జిల్లాల్లో పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. నగరంలోని పలు వ్యాపారుల ఇళ్లపై అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపు నాలుగు కోట్లకు పైగా విలువైన రుణపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ద్వారకానగర్‌లోని వెంకట్రామి రెడ్డి అనే వ్యాపారి ఇంట్లో పోలీసులు అర్ధరాత్రి ఒంటి గంట వరకు సోదాలు చేశారు. అతని వద్ద నుండి మూడు కోట్ల తొంబై ఆరు లక్షల విలువ చేసే 116 ప్రాంసరీ నోట్లు, 18 చెక్కులు, అరవై వేల నగదు, నగదు కౌంటింగ్ మెషీన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రంగస్వామినగర్లో చింతకుంట నాగానంద వ్యాపారి ఇంట్లో 38 లక్షల విలువ చేసే ప్రామిసరీ నోట్లు, 38 ఎల్ఐసీ బాండ్లు, ఒక లక్షా పదిహేను వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుతోనే ఈ సోదాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. రాజకీయ నాయకులు అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలలుస్తోంది. ఏఆర్ కానిస్టేబుల్ సుధాకర్ వేధిస్తున్నాడని ఓ ప్రభుత్వ ఉద్యోగి మీడియాను ఆశ్రయించాడు. ఎవరూ కూడా అధిక వడ్డీతో వేధించకూడదని, వేధిస్తే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచనలు జారీ చేస్తున్నారు. 

ప్రకాశం..
ప్రకాశం జిల్లా కనిగిరిలోనూ ఫైనాన్స్‌ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వడ్డీ వ్యాపారులు ఆర్థికంగా పీడించినా.. దౌర్జన్యం చేసినా ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు. 

అనంతలో ఫైనాన్స్ వ్యాపారుల ఇళ్లపై పోలీసుల సోదాలు..

అనంతపురం : జిల్లాలో అధిక వడ్డీ చేస్తున్న వ్యాపారుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓ వ్యాపారి నుండి రూ. కోటి విలువైన ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. సదానందయ్య అనే వ్యాపారి నుండి రూ.36 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, రూ.6లక్షలు సీజ్ చేసినట్లు సమాచారం. పోలీసులు దాడులు చేస్తుండడంతో ఫైనానర్లు అప్రమత్తమయ్యారు. కార్యాలయాలకు తాళాలు వేసి పరారయ్యారు. 

గాంధీ ఆసుపత్రిలో మగ శిశువు అపహరణ..

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ నుండి మగ శిశువు అపహరణకు గురైంది. కిడ్నాపర్ మేరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

ప్రకాష్ కరత్ పర్యటనకు నో..

అనంతపురం : ఈనెల 17న నంబుల పూలకుంటలో సీపీఎం నేత ప్రకాష్ కరత్ పర్యటనకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాం భూపాల్ తో సహా 22 మందికి బైండోవర్ సమన్లు జారీ చేశారు. 

నేడు భారత్ కు గూగుల్ సీఈవో..

ఢిల్లీ : గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు రానున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. 

నేడు కర్నాటకకు సీఎం కేసీఆర్…

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కర్నాటకకు వెళ్లనున్నారు. ఆయుత చండీయాగానికి శృంగేరి పీఠాధిపతిని ఆహ్వానించనున్నారు.

 

Don't Miss