Activities calendar

17 December 2015

21:32 - December 17, 2015

హైదరాబాద్ : అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు ప్రభావం మన స్టాక్‌ మార్కెట్లపై పడుతుందన్న విశ్లేషకుల అంచనాలు తలకిందులయ్యాయి. ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపుతో డాలరుతో మన రూపాయి మారకపు విలువ పడిపోంతుందన్న వాదనలకు భిన్నంగా భారత కరెన్సీ విలువ పెరిగింది. స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యే ప్రమాదం ఉందన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. అనూహ్యంగా మన రూపాయి మారకపు విలువ పెరగడంతోపాటు... స్టాక్‌ మార్కెట్లు లాభాలతో దూసుకుపోయాయి.

2007లో అమెరికాలో ఆర్ధిక సంక్షోభం ప్రారంభం .....

2008 ఆర్ధిక సంక్షోభం తర్వాత అమెరికా ఫెడరల్‌ రిజర్వు మొదటిసారిగా బుధవారం 25 బేసిస్‌ పాయింట్ల వడ్డీ రేట్లు పెంచింది. 2007 మధ్యలో ప్రారంభమైన సంక్షోభం 2008లో తీవ్రరూపం దాల్చి, 2009 వరకు కొనసాగింది. అప్పటి నుంచి వడ్డీరేట్ల పెంపుదలకు వెళ్లని అమెరికా ఫెడరల్‌ రిజర్వు... ఇప్పుడే పెంచింది. ఫెడ్‌ వడ్డీ రేట్లు పెంచడమంటే ఆర్ధిక గాడిన పడినట్టు లెక్క. ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం భారత్ సహా ఆసియా స్టాక్‌ మార్కెట్లతోపాటు, కరెన్సీ విలువపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషించిన తరుణంలో... అందరి అంచనాలు తలకిందులయ్యాయి.

సెన్సెక్స్‌ 3009 పాయింట్ల లాభం .....

ఫెడ్‌ వడ్డీ రేట్ల ప్రకటన తర్వాత మన స్టాక్‌ మార్కెట్లలో ర్యాలీ కొనసాగింది. ప్రారంభంలో కొంత ఊగిసలాట కొనసాగినా... ఆ తర్వాత తేరుకుని లాభాల దిశగా కొనసాగాయి. సెన్సెక్స్‌ 309 పాయింట్లు పెరిగి, 25,803 పాయింట్ల దగ్గర ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 93 పాయింట్లు లాభపడి 7,844 పాయింట్ల దగ్గర ముగిసింది. డాలరుతో రూపాయి మారకపు విలువ కూడా బలపడింది. ఇది 66.51 వద్ద కొనసాగింది. అప్పటికి ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపుదల ప్రకటన రాలేదు. వడ్డీ రేట్లు పెంచిన తర్వాత కూడా రూపాయి మారకపు విలువ మరింత బపడింది. ఈ వారంలో మిగిలివున్న ఒక రోజు కూడా రూపాయి మారకపు విలువ కొంతవరకు పెరిగే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. ఇది 67 కు చేరుకోవచ్చని భావిస్తున్నారు.

విదేశీ మారకద్రవ్య నిల్వలు 352 బిలియన్‌ డాలర్లు .....

అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్టు పెంచుతున్నందన్న సంకేతాలు అందగానే భారతీయ రిజర్వు బ్యాంకు అన్ని ముందుజాగ్రత్తలు తీసుకుంది. ఎదురయ్యే ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు మానసికంగా ముందునుంచే సిద్ధమయ్యింది. 352 బిలియన్‌ డాలర్ల మేర విదేశీ మారకద్రవ్య నిల్వలను చేతిలో పెట్టుకుంది. ఫెడ్‌ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందన్న వార్తలు రాగానే విదేశీ సంస్థాగత మదుపర్లు మన స్టాక్‌ మార్కెట్ల నుంచి 12 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఈక్విటీలను అమ్మేశారు. ఇదే సమయంలో స్వదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మార్కెట్‌కు మద్దతు పలకారు. ఈ చర్యలతో అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల ప్రభావం మన మార్కెట్లపై పడలేదని ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ విశ్లేషించారు.

21:18 - December 17, 2015

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి మరో జాతీయ అవార్డు దక్కింది. సీఎన్ బీసీ నెట్ వర్క్-18 పురస్కారం లభించింది. ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్‌ ది ఇయర్ 2015గా జ్యూరి సెలక్ట్ చేసింది. నిర్దేశించిన అన్ని ప్రమాణాల్లోనూ రాష్ట్రం ముందంజలో ఉందని జ్యూరి అభిప్రాయపడింది. జనవరి 13న ముంబైలో జరిగే సీఎన్ బీసీ నెట్ వర్క్-18 అవార్డుల ప్రదానోత్సవంలో పురస్కారం అందజేస్తారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఇప్పటికే ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుకు ఆహ్వానం పంపించారు. అవార్డు ప్రకటన పట్ల తెలంగాణ సర్కారు హర్షం వ్యక్తం చేసింది.

21:16 - December 17, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు విశేషంగా కృషి చేస్తున్నారంటూ ఆయన దార్శనికతను మెచ్చుకుంటూ అమెరికాకు చెందిన షికాగో యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించి చంద్రబాబుకు లేఖ రాసింది. 1867లో యూనివర్శిటీని ప్రారంభించిన దగ్గర్నుంచీ ఇంతవరకు ఏ ఇతర విదేశీ రాజకీయవేత్తకు గౌరవ డాక్టరేట్‌ను ఇవ్వలేదని షికాగో యూనివర్శిటీ తెలిపింది. మీరు రాష్ట్రానికి చేస్తున్న సేవ మహత్తరమైనదని బాబును కొనియాడింది.

21:14 - December 17, 2015

హైదరాబాద్: కాల్‌మనీ ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. వాదోపవాదాలతో సభ అట్టుడికింది. అధికార,ప్రతిపక్ష సభ్యుల మాటల యుద్ధంతో శీతాకాల సమావేశాలు మొదటిరోజే వేడెక్కాయి. విపక్ష ఎమ్మెల్యేల ఆందోళనలతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. కెమెరాలకు అడ్డు తగులుతున్నారంటూ ప్రతిపక్షానికి చెందిన ఇద్దరు సభ్యులను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. వైసీసీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో సబాధిపతి అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు.

అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం...

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మొదటి రోజే రగడ ప్రారంభమైంది. కాల్‌మనీ అంశం సభలో కల్లోలం సృష్టించింది. అధికార ప్రతిపక్షాల మధ్య జోరుగా సాగిన విమర్శల దాడిలో ఇతర కార్యకలాపాలు కొట్టుకుపోయాయి. ఉదయం 9.30 గంటలకు సభ ప్రారంభమైంది. సభ ఆరంభం కాగానే కాల్‌మనీపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించారు. అనంతరం ప్రశ్నోత్తరాలసమయాన్ని ప్రారంభించారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తీవ్ర గందరగోళం ఏర్పడడంతో స్పీకర్‌ సభను 10 నిమిషాలు పాటు వాయిదా వేశారు.

సభలో మళ్లీ అదే సీన్‌ రిపీట్‌...

వాయిదా అనంతరం 10.35 గంటలకు సభ ప్రారంభమైంది. సభలో మళ్లీ అదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగింది. కాల్‌మనీపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకం నినాదాలు చేశారు. స్పీకర్‌ పోడియం దగ్గర ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు. వాయిదా తీర్మానం తిరస్కరణ తరువాత చర్చకు పట్టుపట్టడం సరికాదని స్పీకర్ పదే పదే నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. అంబేడ్కర్‌ను అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయాల చేస్తోందని జగన్‌ విమర్శించారు. జగన్‌ వ్యాఖ్యలను యనమల ఖండించారు. జగన్‌కు చరిత్ర తెలియదని మండిపడ్డారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు....

మరోపక్క ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. కాల్‌మనీపై శుక్రవారం చర్చ జరుగుతుందని..సభ సజావుగా సాగేందుకు సహకరించాలని వైసీపీ ఎమ్మెల్యేలకు సబాధిపతి విజ్ఞప్తి చేశారు. ఐనా ప్రతిపక్ష సభ్యులు పట్టించుకోకపోవడంతో స్పీకర్‌ సభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు. రెండు సార్లు వాయిదా తరువాత సభ మధ్యాహ్నం 12.10 గంటలకు తిరిగి ప్రారంభమైంది. కాల్‌మనీపై ప్రతిపక్షాలు రగడ సృష్టిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో మాట్లాడారు. ఈ అంశంపై శుక్రవారం ప్రకటన చేస్తానని చెప్పారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు.

చంద్రబాబు ప్రకటన చేసినా....

చంద్రబాబు ప్రకటన చేసినా వైసీపీ ఎమ్మెల్యేలు శాంతించలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో కెమెరాలకు అడ్డు తగులుతున్న వైసీపీఎమ్మెల్యేలు శివప్రసాద్‌రెడ్డి, రామలింగేశ్వరరావులను సస్పెండ్‌ చేయాలని యనమల ప్రతిపాదించారు. యనమల ఒక రోజు సస్పెండ్‌ చేయాలని ప్రతిపాదిస్తే..స్పీకర్ వారిని రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారు.

వైసీపీ సభ్యుల సస్పెన్షన్‌తో ఆందోళన...

వైసీపీ సభ్యుల సస్పెన్షన్‌తో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానిక వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. స్పీకర్‌ విజ్ఞప్తి చేసినా ప్రతిపక్ష సభ్యులు పట్టించుకోలేదు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను సబాధిపతి శుక్రవారానికి వాయిదా వేశారు.

కంబాలపల్లిలో సైకో వీరంగం

వరంగల్ : మహబూబాబాద్ మండలంలో కంబాలపల్లిలో సైకో వీరంగం సృష్టించాడు. ఫారెస్టు ఉద్యోగి సహా ఇద్దరిని గొడ్డలితో గాయపరిచి పరారయ్యాడు. గాయపడ్డ క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉన్మాది కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.

యాగం ఏర్పాట్లను పరిశీలించిన సీఎం కేసీఆర్

మెదక్: అయుత మహాచండీ యాగం ఏర్పాట్లు సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి ఈ సాయంత్రం చేరుకున్న ముఖ్యమంత్రి యాగ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. యాగం కోసం దాదాపు 40 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. 101 హోమగుండాలతోపాటు చతుర్వేద యాగశాలలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అయుత మహా చండీయాగం కోసం ప్రత్యేక యాగశాల ఏర్పాటు. రాజశ్యామల యాగం, మహారుద్ర యాగానికి వేర్వేరు యాగశాల నిర్మాణం. మహిళలు కుంకుమార్చన చేసేందుకు ప్రత్యేక ప్రాంగణంను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అదేవిధంగా మధ్యాహ్నం 3.45 నుంచి రాత్రి 7 గంటల వరకు యాగాల జరపనున్నారు.

20:38 - December 17, 2015

అక్కడ తగ్గింది కొండత. ఇక్కడ తగ్గిస్తున్నది గోరంత. అంతర్జాతీయంగా ధరలు కొంచెం పెరిగితే.… ఇక్కడ ఆమాంతం పెంచేస్తారు. కానీ అవే ధరలు తగ్గినపుడు మాత్రం ఉలుకూ పలుకూ ఉండదు. ఆలాభమంతా సైలెంట్ గా సర్కారే మింగేస్తోందా? సామాజ్య ప్రజలు ఉన్నది కేవలం ప్రభుత్వ పన్నుల బాదుడు భరించడానికేనా? ఓ పక్క కార్పొరేట్ రంగాలకు లక్షల కోట్లు ఉదారంగా దోచి పెట్టే ప్రభుత్వం ప్రజల నుండి ముక్కు పిండి వసూలు చేయడానికి చాలా ఉత్సాహ పడుతోందా? పెట్రోలు ధరలు బావుల్లో తగ్గినా బంకుల్లో ఎందుకు తగ్గలేదు? ఇదే అంశం నేటి వైడాంగిల్ ప్రత్యేక కథనం. మరిన్ని పూర్తి వివరాలు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి తో ముగిసిన భన్వర్ లాల్ భేటీ

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి నసీం జైదీతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వరల్‌లాల్ జరిపిన భేటీ ముగిసింది. సమావేశం అనంతరం భన్వర్‌లాల్ వివరాలను వెల్లడిస్తూ.. అఖిల భారత విధానంపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చర్చించారు. రాబోయే ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించాం. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు, కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధం లేదు. చనిపోయిన వారి ఓట్లను మాత్రమే తొలగించాం. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఎలాంటి చర్చ జరగలేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల అంశం హైకోర్టులో ఉంది. హైకోర్టే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై స్పష్టతనిస్తుందని పేర్కొన్నారు.

 

20:11 - December 17, 2015

ఆంధ్ర అసెంబ్లీలో ఒడిసిపోయిన ఒక దినం.… వెంట్రుక మందం కూడా నడవని ముచ్చట. ఓదార్పు షురూ చేసిన కాల్ మనీ పార్టీలు..అఖిల పక్షం పార్టీల అసలైన నాటకం. కలబడతున్న కార్పోరేట్ లీడర్లు… నల్గొండ ఎమ్మెల్సీల కోట్ల జాతర. అంబాసిడర్ కారు నిండా కాంగ్రెస్ టీడీపీ… డబుల్ డెక్కటర్ ఆర్డర్ ఇచ్చిన టీఆర్ ఎస్. యాదాద్రి గుట్ట చుట్టూ నర్శింహులు ప్రదక్షణలు… ప్రత్యేక జిల్లా కోసం కేసీఆర్ కు మొక్కులు. ప్రధాన మంత్రి దవడ పగలకొట్టిన పోరగాడు.… స్పెయిన్ దేశంలో పరేషాన్ అయిన పీఎం. ఇత్యాది అంశాల పై మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న తన వాక్చాతుర్యంతో అదర గొట్టాడు. మరిమీరూ చూడానుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

టి.సర్కార్ కు సీఎన్ బీసీ నెట్ వర్క్ -18 అవార్డు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎన్ బీసీ నెట్ వర్క -18 అవార్డు లభించింది. ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్ 2015 గా తెలంగాణను జ్యూరీ ఎంపిక చేసింది. నిర్దేశించిన అన్ని పట్టణాల్లో రాష్ట్రం ముందుంజలో ఉందని జ్యూరీ పేర్కొంది. ముంబైలో జనవరి 13న సీఎన్ బసీ నెట్ వర్క్ -18 ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. ఈ ఆకార్యక్రమానికి రావాల్సింగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం పంపారు.

ప్రజల గుర్తింపే నాకు డాక్టరేట్లు : చంద్రబాబు

హైదరాబాద్ : ప్రజల గుర్తింపే తనకు గౌరవ డాక్టరేట్లు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. షికాగో విశ్వవిద్యాలయం తనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించడం పై ఆయన స్పందించారు. గతంలో ఎన్నో యూనివర్శిటీలు డాక్టరేట్ ఇచ్చేందుకు ముందుకొచ్చినా… వాటిని సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉండటమే తనకు ముఖ్యమన్నారు.

19:48 - December 17, 2015

హైదరాబాద్ : టీడీఎల్పీ సమావేశం ముగిసింది. ముందుగా అనుకున్నట్లే అంబేద్కర్‌ రాజ్యాంగ ఆమోద దినోత్సవంపై చర్చ జరిపాకే.. కాల్‌మనీపై చర్చను చేపట్టాలని అధికారపక్షం అభిప్రాయపడింది. ఈ విషయంలో రాజీ పడకూడదని.. అవసరమైతే ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఆరోపణలపై ధీటుగా స్పందించాలని ఎమ్మెల్యేలకు బాబు క్లాసు తీసుకున్నారు.

19:47 - December 17, 2015

హైదరాబాద్ : కాల్‌మనీపై చర్చ విషయంలో కాంప్రమైజ్‌ అవొద్దని.. పట్టుబట్టాలని వైసీపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. లోటస్‌పాండ్‌లో జగన్‌తో సమావేశమైన ఎమ్మెల్యేలు.. ఉదయం అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి అసెంబ్లీ హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. కాల్‌మనీ బాధితులంతా బడుగు, బలహీనవర్గాలేనని.. ఈ వ్యవహారం నుంచి తప్పించుకోవటానికే అంబేద్కర్‌ చర్చ పెడుతున్నారనే విషయాన్ని ఎక్స్‌పోజ్‌ చేయాలని వారు భావించారు.

హైకోర్టుకు అదనపు జడ్జీల నియామకం..

హైదరాబాద్ : హైకోర్టుకు అదనపు జడ్జీల నియామకం జరిగింది. అదనపు జడ్జీలుగా నియామకం అయినవారిలో రామలింగేశ్వరరావు, శివశంకర్ రావు, సీతారామమూర్తి, రవికుమార్, దుర్గా ప్రసాద్ రావు, సునీల్ చక్రవర్తి, సత్యనారాయణ మూర్తి, సునీల్ కిషోర్, శంకర్ నారాయణ, మతి అనీష్ ఉన్నారు.

19:38 - December 17, 2015

హైదరాబాద్ : ప్రేమ కావాలి, లవ్ లీ, సుకుమారుడు సినిమాలతో నటుడిగా నిరూపించుకున్న నటుడు ఆది తండ్రి అయ్యాడు. తనకు పాప పుట్టిందని, అందరి దీవెనలు కావాలని, తల్లీబిడ్డ క్షేమమని ఫేస్ బుక్ ద్వారా అభిమానులకు ఆది తెలిపాడు. కాగా, ఆదికి అరుణతో 2014 డిసెంబర్ లో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఆది ప్రముఖ నటుడు పీజే శర్మ మనుమడు కాగా, మరో ప్రముఖ నటుడు సాయికుమార్ కుమారుడు అన్న సంగతి తెలిసిందే. తమ ఇంట్లోకి వచ్చిన కొత్త వ్యక్తి ఆనందం మరింత పెంచిందని ఈ సందర్భంగా ఆది పేర్కొన్నాడు.

ఏపీ సీఎం చంద్రబాబుకు అరుదైన గౌరవం

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు అమెరికా ఇల్లినాయిస్ రాష్ట్రంలో షికాగో విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. విదేశీ రాజకీయ నేతకు షికాగో యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఏపీ అభివృద్ధికి చేస్తున్న కృషికిగాను ఈ అవార్డు ఇస్తున్నట్లు యూనివర్శిటీ ప్రకటించింది.

రేపు మెట్రో రైల్లో టి.మంత్రుల ప్రయాణం

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలులో రేపు రాష్ట్ర మంత్రులు ప్రయాణించనున్నారు. పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో సహా ఆరుగురు మంత్రులు మెట్రో రైలు ప్రయాణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మెట్రో మొదటిదశ మార్గమైన నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు మంత్రుల ప్రయాణం కొనసాగనుంది. ఈ ప్రయాణ మార్గంలో మెట్రో రైలు ఇప్పటికే విజయవంతంగా టెస్ట్ రైడ్‌లు చేస్తున్న విషయం తెలిసిందే.

19:15 - December 17, 2015

గతంలో ప్రేక్షకులు టైటిల్స్ చూసి ఆ సినిమా దర్శకుడెవరో చెప్పేవాళ్లు. సినిమా పై ఆ దర్శకుల ప్రభావం అంతాల ఉండేది. ప్రస్తుతం అలా చెప్పగలిగే ఒక దర్శకుడి పేరు పూరీ జగన్నాథ్. తను తీసే సినిమాల్లాగే.. పేరూ షార్ప్ గా ఉంటాయి. ముఖ్యంగా నెగిటివ్ టైటిల్స్ తో సక్సెస్ ఫుల్ సినిమాలు చేశాడీ దర్శకుడు. ఐతే అన్ని సార్లూ తిట్టిన పేర్లూ హిట్ కావాలనీ లేదు. లోఫర్ చూస్తే ఈ విషయం తెలిసి పోతుంది. పూర్తి వివరాల కోసం ఈవీడియోను క్లిక్ చేయండి

ప్లస్ పాయింట్స్
వరుణ్ తేజ్
రేవతి
సెంటిమెంట్ సీన్స్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
కథ
నాటకీయత లేని కథనం
డైలాగ్స్
వినోదం లేకపోవడం

రేపు నగరానికి రాష్ట్రపతి ప్రణబ్

హైదరాబాద్: రేపటి నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర ప్రతి ప్రణబ్ ముఖర్జి తన శీతాకాల విడిదిలో బస చేయనున్నారు. ఏటా శీతాకాలంలో కొద్ది రోజుల పాటు.. హైదరాబాద్ లోని రాష్ట్ర పతి నిలయంలో రాష్ట్రపతి బస చేయడం ఆనవాయితీ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 18 తేదీ ఉదయం రాష్ట్ర పతి సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు.

18:31 - December 17, 2015

విశాఖ : సాగర తీరంలో జరుగుతున్న బీచ్‌ కోతలు ప్రభుత్వాన్ని నగర ప్రజలను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీచ్‌ కోతలకు చెక్‌ పెట్టేందుకు విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌ దృష్టి పెట్టింది. తమ వంతుగా ప్రతి ఏటా నిర్వహించే డ్రెజింగ్‌లో భాగంగా ఈసారి బీచ్‌ కోతకు గురయ్యే ప్రాంతాల్లో సుమారు లక్ష క్యూబిక్‌ టన్నుల ఇసుకను తీరం వద్దకు చేర్చింది. మరో పది రోజుల్లో రెండు లక్షల క్యూబిక్‌ టన్నుల ఇసుకను తీరానికి చేర్చాలని అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా పోర్ట్ చైర్మన్‌ కృష్ణబాబు 'టెన్ టివి'తో మాట్లాడారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి...

18:28 - December 17, 2015

అనంతపురం : రోడ్డెక్కితే అరెస్ట్‌ చేసేశారు. జెండా కనపడితే చాలు ఎత్తుకుపోయారు. గుంపుగా కనపడినా సరే లాఠీలు రెచ్చిపోయాయి. అనంతపురం జిల్లా ఎన్‌పీకుంటలో ఈరోజంతా ఇదే పరిస్ధితి. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాష్‌కరత్‌ అక్కడ పర్యటనకు వచ్చారు. రైతులు బదులు పోలీసులే ఈ రోజు రాస్తారోకో నిర్వహించారని ప్రకాష్‌కరత్‌ కామెంట్‌ చేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. సోలార్‌ ప్లాంట్‌ కోసం వేల ఎకరాలు సేకరించి.. రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండానే ఫెన్సింగ్‌లు కూడా వేసి భూములు స్వాధీనం చేసేసుకుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా సీపీఎం రైతులతో కలిసి ఆందోళన నిర్వహిస్తోంది. పరిస్ధితిని పరిశీలించి.. వారి డిమాండ్లను కేంద్ర స్థాయిలో వినిపించడానికి సీపీఎం నేత ప్రకాష్‌కరత్‌ పర్యటించారు. అయితే పోలీసులు మాత్రం ఎక్కడా రైతులు ఆయనను కలవకుండా చేయడానికి శతవిధాలా ప్రయత్నించారు. అయినప్పటికీ వందలాది మంది రైతులతో సీపీఎం సభ నిర్వహించింది.

బెజవాడలో ఎమ్మెల్యే రోజా ఫ్లెక్సీ దగ్ధం.

కృష్ణా : విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ఫ్లెక్సీని టీడీపీ మహిళా విభాగం దగ్ధం చేసింది. ఏపీ సీఎం చంద్రబాబుపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే ఇలా చేసినట్టు కృష్ణాజిల్లా తెలుగు మహిళా సంఘం అధ్యక్షరాలు ఆచంట సునీత తెలిపారు. రాజకీయ భవిష్యత్తునిచ్చిన చంద్రబాబునే విమర్శించే స్థాయి ఆమెకు లేదని మండిపడ్డారు. రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని, ఆమె చేసిన వ్యాఖ్యలు సాటి మహిళలు అసహించుకునేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

 

17:45 - December 17, 2015

హైదరాబాద్ : మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ పై ప్రముఖ నటుడు రాంగోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇప్పుడే 'లోఫర్' సినిమా చూశానని, అద్భుతంగా ఉందని అన్నాడు. నెక్స్ట్ మెగాస్టార్ వరుణ్ తేజేనని వర్మ ప్రకటించాడు. ఇక మెగాస్టార్ హోదా కోసం మిగిలిన మెగా హీరోలు ఆశలు వదిలేసుకోవాలని పేర్కొన్నాడు. 'ముకుంద', 'కంచె', 'లోఫర్' సినిమాలతో వరుణ్ తేజ్ తనను తాను వినూత్నంగా ఆవిష్కరించుకున్నాడని వర్మ అభిప్రాయపడ్డాడు. మ్యూజిక్, డ్రామా, యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ సమపాళ్లలో ఉన్న సినిమా అని వర్మ ఆకాశానికెత్తాడు. రేవతి, పోసానిల నటన అద్భుతమని చెప్పాడు. చాలా ఏళ్ల తరువాత అద్భుతమైన హీరోయిన్ ను చూశానని పేర్కొన్నాడు. పూరీ జగన్, వరుణ్ తేజ్ పాత్రను చక్కగా తీర్చిదిద్దాడని వర్మ అభిప్రాయపడ్డాడు.

17:38 - December 17, 2015

హైదరాబాద్ : నగరంలో రోజు రోజుకి పెరిగిపోతున్నా కాలుష్యానికి చెక్‌పెట్టేందుకు సైబరాబాద్‌ పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఐటీ ఉద్యోగులంతా సైకిళ్లపై ఆఫీసులకు వెళ్లేలా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఐటీ కారిడార్‌లో కార్‌ ఫ్రీ థర్స్‌ డే కార్యక్రమాన్ని సైబరాబాద్‌ పోలీస్ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ప్రారంభించారు. కాలుష్యాన్ని నియంత్రించే బాధ్యత ప్రతిఒక్కరిపైన ఉందని..అందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కాలుష్యాన్ని నియంత్రించడానికి కార్‌ ఫ్రీ థర్స్‌ డే కార్యక్రమాన్ని నగరంలోని కొన్ని ఐటీ సంస్థలు శ్రీకారం చుట్టాయి.

20 వారాలుగా ఈ కార్యక్రమంపై అవగాహన...

ఐటీ కారిడార్‌తో పాటు..నగరంలో ఇతర ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు ఒక్కరోజు సైకిల్‌పైన ఆఫీసుకు వెళ్లేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 20 వారాలుగా ఈ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్న సంస్థలను సైబరాబాద్ కమిషనర్‌ సీవీ ఆనంద్ అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలతో కాలుష్య నియంత్రణే కాకుండా..ట్రాఫిక్‌ను కూడా నియంత్రించవచ్చని కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అన్నారు. ఐటీ కారిడార్‌లోని మైండ్‌ స్పేస్‌ నుంచి గచ్చిబౌలిలోని తన ఆఫీసుకు సైకిల్‌పై వెళ్లి కార్‌ఫ్రీ థర్స్‌డేపై అవగాహన కల్పించారు. పోలీసు సిబ్బందితో పాటు..ఐటీ ఉద్యోగులు, స్కూలు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఐటీ ఉద్యోగులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి...

కార్‌ఫ్రీ థర్స్‌డే ద్వారా దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కష్టసాధ్యమైనప్పటికీ..కాలుష్య నియంత్రణ, ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించాలంటే ఐటీ ఉద్యోగులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సీవీ ఆనంద్ సూచించారు. కార్‌ పూలింగ్‌ వ్యవస్థను పెంపొందించడానికి మొబైల్ యాప్‌ను కూడా రూపొందిస్తున్నట్లు కమిషనర్‌ ప్రకటించారు. ఐటీ కారిడార్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు..ఒక్కరోజు సొంతకారులో వెళ్లే బదులు ఒకే ఆఫీసులో పనిచేసే వాళ్లు ఒకే కారులో వెళ్తే బాగుంటుందని సూచించారు.

ఐటీ ఉద్యోగులు ఆనందం....

హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు చేపట్టిన కార్‌ ఫ్రీ థర్స్‌డే లాంటి కార్యక్రమంపై ఐటీ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలకు సహకరిస్తామన్నారు.

17:34 - December 17, 2015

హైదరాబాద్ :తెలంగాణలో 2019 తర్వాత అధికారంలోకొచ్చేది తామే అంటున్న బిజెపిలో అప్పుడే వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి. మొన్నీమధ్యనే జరిగిన ఉప ఎన్నికలో గెలుపు అటుంచి ఫలితాల్లో కనీసం పరువుకూడ దక్కక పోవడంతో.. బిజెపి పూర్తిగా డీలాపడింది. తెలంగాణ వ్యాప్తంగా 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే.. కనీసం పోటీ కూడా చేయలేకపోతోంది.

తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే రాజాసింగ్...

ఇలా రకరకాల సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కమలం పార్టీకి ఇప్పుడు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ మరింత తలనొప్పిగా మారారు. పార్టీ సాంప్రదాయాలను పక్కనబెట్టి.. పార్టీ ప్రెసిడెంట్ కిషన్‌రెడ్డిపైనే విమర్శలు చేస్తున్నారు. అధ్యక్షుడే పార్టీ ఎదుగుదలకు అడ్డంకిగా మారారంటు కిషన్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంతేకాదు కిషన్‌రెడ్డి వ్యవహారంపై హైకమాండ్‌కు ఫిర్యాదు కూడా చేశారు.

పార్టీలో తిరుగుబాటు బావుటాఎగరేస్తున్నారు....

ఫిర్యాదుతోనే ఆగక రాజాసింగ్ పార్టీలో తిరుగుబాటు బావుటాఎగరేస్తున్నారు. స్వంతంగా పార్టీ పెట్టి మాతృసంస్థకు రాం రాం చెప్పాలని చూస్తున్నట్లు సమాచారం. హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించే శివసేన పార్టీ బాధ్యతలు కూడా చేపట్టే ఆలోచలున్నట్లు చర్చ జరుగుతోంది. తనకు తాను కరుడుగట్టిన హిందుత్వ వాదిగా చెప్పుకునే రాజాసింగ్ ఇదే మూల సిద్ధాంతంగా ఉన్న అఖిల భారతీయ హిందూ మహాసభను పునరుద్ధరించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

అఖిల భారతీయ హిందు మహాసభతో గ్రేటర్ ఎన్నికల్లో పోటీ....

ఆర్ఎస్ఎస్‌కు మాతృసంస్థగా ఉన్న అఖిల భారతీయ హిందు మహాసభతో గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేయాలని రాజాసింగ్ భావిస్తున్నారని టాక్. దీంతో హిందుత్వ ఎజెండాతో గ్రేటర్లో హిందూ ఓటు బ్యాంక్‌కు గాలం వేయొచ్చని అంచనా. అదే జరిగితే తన ఓటు బ్యాంక్‌కు ఖచ్చితంగా గండిపడుతుందని బిజెపి కలవరపడుతోంది. ఇదంతా టిఆర్ఎస్‌ గ్రేటర్ వ్యూహమని, అదే తెరవెనక ఉండి కథ నడుపుతోందని కొందరు కాషాయనేతలు అనుమానిస్తున్నారు. రాజాసింగ్‌ను అడ్డంపెట్టుకుని గ్రేటర్‌లో బిజెపికి దక్కే ఓట్లను చీల్చేలా గులాబీపార్టీ పావులు కదుపుతోందని బిజెపి వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికలు అచ్చిరాకున్నా...

వరంగల్‌ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అచ్చిరాకున్నా గ్రేటర్‌లో గెలిచి సత్తా చాటుకోవాలని కాషాయ పార్టీ ఆశపడుతోంది. ఇలాంటి సమయంలో రాజాసింగ్ రూపంలో ఎదురవుతున్న ప్రతిఘటనను ఎలా ఎదుర్కోవాలా అని నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. ప్రస్తుతానికి రాజాసింగ్‌తో పరిస్థితి చెడకుండా జాగ్రత్త పడుతున్నా ఝలక్‌లిస్తూనే ఉన్నారు. మరి ఆయన దూకుడుకు బిజేపి ఎలా బ్రేకులేస్తుందో చూడాలి.

17:30 - December 17, 2015

హైదరాబాద్ : త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికలు యువనేతలకు సవాల్ విసురుతున్నాయి. సత్తా చాటాలని ఆ నేతలు అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను తనయులకు అప్పగించిన రెండు ప్రధాన పార్టీల అధినేతలు ప్రతిష్టాత్మక పోరులో ఇరగదీయాలని కర్తవ్యబోధ చేస్తున్నారు.

విపక్ష పార్టీలను బలహీనం చేయడంపై దృష్టి పెట్టిన టీఆర్ఎస్....

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను కొత్త జోష్ తో ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది తెలంగాణా రాష్ట్ర సమితి. అధికార పార్టీగా అన్ని అస్త్రశస్త్రాలను గులాబి దళం ప్రయోగించబోతోంది. ఇప్పటికే విపక్ష పార్టీలను బలహీనం చేయడంపై దృష్టి పెట్టింది. గ్రేటర్ పరిధిలోని ప్రధాన నేతలతో పాటు క్యాడర్ ను గులాబి గూటికి చేర్చుకుంటోంది.

ప్రజలను ఆకట్టుకునేందుకు వరాలు...

గ్రేటర్ లో అధికార పార్టీకి కేవలం రెండు శాసనసభా స్థానాలే దక్కినా ఇప్పుడు వలస నేతలతో ఆ సంఖ్య భారీగా పెరిగింది. దీంతో శాసనసభ్యులతో పాటు వారి క్యాడర్ కూడా కారెక్కింది. దీనికి తోడు అధికార పార్టీగా వరాలు కురిపిస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు చర్యలు చేపడుతోంది. నల్లా బిల్లులు రద్దు చేస్తూ డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మాణం చేస్తామంటూ పెద్ద ఎత్తున ప్రజలను ఆకట్టుకునే చర్యలు చేపట్టింది.

కేటిఆర్‌కు గ్రేటర్ ప్రచార బాధ్యతలు ....

గ్రేటర్ ప్రచార బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటిఆర్ కు అప్పగించారు కేసీఆర్. దీంతో అన్నీ తానై గ్రేటర్ పరిధిలో కేటీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు.

లోకేష్ కు గ్రేటర్ ఎలక్షన్ ప్రచార బాధ్యతలు ....

మరోపక్క తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గ్రేటర్ ఎలక్షన్ ప్రచార బాధ్యతలను తనయుడు లోకేష్‌ కు అప్పగించేందుకు ఊవ్విళ్లూరుతున్నారు. లోకేష్‌ సత్తా చాటేలా ప్రచార వ్యూహాన్ని సిద్దం చేస్తున్నారు. పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ క్యాంపెన్ స్ట్రాటజీకి పదును పెడుతున్నారు. గత ఎన్నికల్లో దాదాపు 40 స్థానాలు గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ వలసల గురించి క్యాడర్ పట్టించుకోవడం లేదనే సంకేతాలిస్తున్నారు.

లోకేష్‌ను గైడ్ చేయాలని గ్రేటర్ నేతలకు బాబు సూచన ....

గ్రేటర్లో గులాబి పార్టీ బలహీనంగా ఉందన్న ప్రచారాన్ని ఎన్నికలతో నిరూపించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు కృషి చేయాలని ఎప్పటికప్పుడు నేతల్లో ఉత్సాహం నింపే యత్నం చేస్తున్నారు బాబు. తెలుగు తమ్ముళ్లు వలస పోయినా ఆ ప్రభావం పార్టీపై లేదన్న సంకేతాలు ఇచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. లోకేష్‌ ను అన్ని విధాలా గైడ్ చేసేలా కొంతమంది గ్రేటర్ నేతలకు సూచనలిస్తున్నారు. మొత్తానికి గ్రేటర్ ఎన్నికలు ఇద్దరు యువ నాయకుల సత్తా తేల్చబోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

17:26 - December 17, 2015

హైదరాబాద్ : అవిభక్త కవలలు వీణా వాణిల శస్ర్త చికిత్సకు మరోమారు రంగం సిద్దమైంది. తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ మేరకు న్యూఢిల్లీ నుంచి ఎయిమ్స్‌ అధికారుల బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. నీలోఫర్‌లో చికిత్స పొందుతున్న వీణా వాణీలను ఈ బృందం పరిశీలించింది. వీణా వాణీలకు ఢిల్లీ ఎయిమ్స్‌లో శస్ర్త చికిత్స చేయించేందుకు ఉన్న అవకాశాలు, ప్రస్తుతం అవిభక్త కవలల ఆరోగ్య స్థితిని వైద్య బృందం పరిశీలించింది. 12 సంవత్సరాలుగా వీరిద్దరూ కలిసి ఉండటం వల్ల శస్త్ర చికిత్స చేస్తే వచ్చే సమస్యలపై డాక్టర్ల బృందం అధ్యయనం చేయనుంది. ఎయిమ్స్‌ నుంచి నలుగురు వైద్య బృందం ఈ శస్ర్త చికిత్సకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది.

17:23 - December 17, 2015

ఢిల్లీ : విద్యార్థులు రిస్క్‌ తీసుకోవడానికి వెనకాడొద్దని గూగుల్‌ సిఈఓ సుందర్‌ పిచాయ్‌ పిలుపునిచ్చారు. ఢిల్లీ యూనివర్సిటీ శ్రీరాం కళాశాలకు చెందిన కామర్స్‌ విద్యార్థులతో ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. రిస్క్‌ తీసుకుంటే ఇబ్బందులతో పాటు విజయం వరిస్తుందని విద్యార్థులకు సూచించారు. వచ్చే తరానికి క్రియేటివిటీ అన్నదే ప్రధాన అంశమని, చదువుల కన్నా సృజనాత్మకత అవసరమన్నారు. ఉద్యోగాలు చేయడం గురించి కాదు...ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగేలా ఆలోచనలు ఉండాలని పేర్కొన్నారు. గూగుల్‌లో తొలిసారి అడుగుపెట్టినపుడు మిఠాయి దుకాణంలో చిన్న పిల్లవాడు అడుగు పెట్టినట్టు అనిపించిందని తన అనుభవాన్ని విద్యార్థులతో పంచుకున్నారు.

17:21 - December 17, 2015

హైదరాబాద్ : ప్రముఖ రచయిత్రి ఓల్గా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. 2015కు గాను ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. విముక్త అనే కథా సంపుటికిగాను ఆమె ఈ అవార్డు దక్కించుకున్నారు. ఈ ఏడాది జనవరిలో లోక్‌నాయక్‌ అవార్డు, మార్చిలో కందుకూరి స్మారక పురస్కారం, నవంబర్‌లో ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. ఓల్గా అసలు పేరు పోపూరి లలిత కుమారి. గుంటూరులో జన్మించిన ఓల్గా ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. చలన చిత్రరంగంలోనూ ఓల్గాకు ప్రవేశముంది. మూడు సినిమాలకు రచయిత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు ప్రభుత్వం నంది అవార్డునిచ్చి సత్కరించింది.

17:19 - December 17, 2015

కడప : జిల్లాలోని ఓ గ్రామ ఆధిపత్యపోరు ఎఫెక్ట్‌తో బెంగళూరులో హత్యలు జరిగాయి. కొండూరు మండలం భద్రంపల్లెకు చెందిన చెన్నకేశవరెడ్డి, అరుణ్‌కుమార్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, చంద్రారెడ్డిలు బెంగళూరులో హత్య చేయబడ్డారు. ఆ గ్రామంలోని వెంకట్రామిరెడ్డి, రామిరెడ్డిల మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరులో భాగంగానే ఈ హత్యలు జరిగినట్లు అనుమానిస్తున్నారు.

17:18 - December 17, 2015

హైదరాబాద్ : దేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు కేంద్రం ఆర్ధిక సాయం చేయాలంటూ కేసీఆర్‌ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి లేఖ పంపారు. స్మార్ట్‌ సిటీ పథకంలో హైదరాబాద్‌ను ఎంపిక చేసి.. 100 కోట్లే కేటాయించితే సరిపోదని ఆయన స్పష్టం చేశారు. ముంబాయిలాగా హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతుందంటూ కేసీఆర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.

17:16 - December 17, 2015

హైదరాబాద్ : ఛత్తీస్‌గడ్‌లోని కాంఖేర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. బడేపీజోడీ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కూంబింగ్‌ చేస్తుండగా ఈ కాల్పులు జరిగినట్లు చెబుతున్నారు.

17:14 - December 17, 2015

హైదరాబాద్ : సభలో రణరంగం.. సభ వెలుపలా రణమే. చిట్‌చాట్‌లోనూ చిటపటలాడిస్తున్నారు అధికార, ప్రతిపక్ష నేతలు. సభకు కొత్తగా ఎన్నికైనవారు కాబట్టే జగన్‌తో సహా వైసీపీ ఎమ్మెల్యేలకు సభా పద్ధతులు తెలియటం లేదని బాబు కామెంట్‌ చేశారు. నాయకుడి ప్రవర్తన బట్టే ఎమ్మెల్యేల ప్రవర్తన ఉంటుందంటూ జగన్‌పై పరోక్షంగా మండిపడ్డారు. మొదటిరోజే చర్చ లేకుండా ముగిసిపోవడం దురదృష్టకరమన్నారు. ఇక జగన్‌ అయితే స్పీకర్‌పైనే ఫైర్‌ అయ్యారు. మంత్రి యనమల ఒక రోజు సస్పెన్షన్‌ అంటే.. రెండు రోజుల సస్పెన్షన్‌ అని స్పీకర్‌ ప్రకటించారని జగన్‌ విమర్శించారు. కాల్‌మనీ వ్యవహారాన్ని సాదాసీదా వడ్డీ వ్యాపారంలా చిత్రీకరించేసి.. మాఫియాను బాబు వెనకేసుకొస్తున్నారని ఆయన మండిపడ్డారు.

హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు...

హైదరాబాద్ : పాతబస్తీ ఫలక్‌నుమా ఏరియాలోని హుక్కా సెంటర్లపై గురువారం ఉదయం పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా 15 మంది కాలేజి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన విద్యార్థుల తల్లిదండ్రులను, వారు చదువుతున్న కళాశాలల యాజమాన్యాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు సౌత్‌జోన్ అడిషనల్ డీసీపీ బాబూరావు తెలిపారు.

ముగిసిన టీడీఎల్పీ సమావేశం

హైదరాబాద్ : టీడీఎల్పీ సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. నేడు అసెంబ్లీలో జరిగిన చర్చను రేపు కూడా కొనసాగించేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. రేపు సభలో జరిగే చర్చకు ప్రతిపక్షం అడ్డుతగిలితే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలపై ఆరోపణలు వచ్చినపుడు సభా వేదికగా గట్టిగా స్పందించాలని నిర్ణయించినట్లు సమాచారం.

చిత్తూరు జిల్లాలో విషాదం...

చిత్తూరు : ఇద్దరు పిల్లలతో పాటు దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన దారుణ సంఘటన గురువారం చిత్తూరు జిల్లా ఎర్రాజివారిపాలెంలో చోటుచేసుకుంది. స్థానిక సీకల చెరువులో దూకి వారు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు ఐరాల మండలం దిగువనాగులవారిపల్లెకు చెందిన వారిగా గుర్తించామన్నారు. ఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని, పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

సోలార్ ప్లాంట్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం : కరత్

అనంతపురం : 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కరత్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా సోలార్ ప్లాంట్ కింద భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగే వరకు సీపీఎం పోరాడుతుందని తెలిపారు. అవసరమైతే రైతులకు దేశవ్యాప్త మద్దతు కూడగడుతామని తెలిపారు. సాధారణంగా ప్రజలు, రైతులు రాస్తారోకోలు చేస్తారు...కానీ కదిరి నుంచి ఎన్ పీ కుంటకు వచ్చే దారిలో అడుగడుగునా పోలీసులు రాస్తారోకోలు చేశారని ఎద్దేవా చేశారు.

వీణా-వాణిల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన ఎయిమ్స్ వైద్యులు..

హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా-వాణిల ఆరోగ్య పరిస్థితిని ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ వైద్యుల బృందం పరిశీలించింది. ఇవాళ నీలోఫర్ ఆసత్రికి చేరుకున్న ఎయిమ్స్ వైద్యులు వీణా-వాణిలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. వీణా-వాణిలు ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు. అయితే ఢిల్లీలో మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని ఆ పరీక్షల నిర్వహణ తర్వాతే శస్త్రచికిత్సపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. వీరి శస్త్ర చికిత్సపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి శస్త్ర చికిత్స చేయడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

కాల్ మనీ బాధితుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెల్ : సీపీ

విజయవాడ : కాల్ మనీ బాధితుల ఫిర్యాదుల కోసం పోలీస్ కమిషనరేట్ లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు.

ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోల మృతి

హైదరాబాద్ : ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కాంఖేర్ జిల్లాలోని అంబబేడ పీఎస్ పరిధి బడేపీజోడి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోలకు మధ్య ఎదురు కాల్పలు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురుమావోలు మృతి చెందినట్లు సమాచారం.

వెంకయ్యనాయుడుకు సీఎం కేసీఆర్ లేఖ

హైదరాబాద్: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ లేఖ రాశారు. అతివేగంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఆర్థికసాయం అందజేయాలని లేఖలో కోరారు. స్మార్ట్ సిటీ పథకంలో చేర్చిన హైదరాబాద్‌లో కేవలం రూ.100 కోట్లతో సరైన సదుపాయాలు కల్పించడం సాధ్యంకాదని తెలిపారు. రూ.5,500 కోట్లు వార్షిక బడ్జెట్ కలిగిన జీహెచ్‌ఎంసీకి ఏడాదికి కేవలం రూ.వంద కోట్లు ఇస్తే ఏ పనులు చేపట్టలేమన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రత్యేకంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు.

డీజిల్ కల్తీకి పాల్పడుతున్న ముఠా అరెస్ట్...

హైదరాబాద్: డీజిల్ కల్తీకి పాల్పడుతున్న ముఠా సభ్యులను పోలీసులు నేడు అదుపులోకి తీసుకున్నారు. ట్యాంకర్లలో డీజిల్ తీసి నీలి కిరోసిన్ కలుపుతున్న వ్యక్తులను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దుండిగల్, షామీర్‌పేట ప్రాంతాల్లో పోలీసులు ట్యాంకర్లను సీజ్ చేశారు.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 309 పాయింట్లు లాభపడి 25,803 వద్ద ముగియగా, నిఫ్టీ 90 పాయింట్లకు పైగా లాభపడి 7,844 వద్ద ముగిసింది.

16:00 - December 17, 2015

హైదరాబాద్ : సుప్రీంకోర్టు నిర్ణయం ఆటో కంపెనీలకు శరాఘాతమేనా..? సర్వోన్నత న్యాయస్థానంతో ఆటో కంపెనీలు నేలచూపులు చూడక తప్పదా..?, ఏయే కంపెనీల జోరుకు బ్రేక్ పడనుంది. ఏ సంస్థలకు లాభం... ఇప్పుడు మార్కెట్ నిపుణులు ఈ లెక్కలు వేసే పనిలోనే ఉన్నారు. మరి సుప్రీం నిర్ణయం ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.

92 పాయింట్లు పడిపోయిన ఆటో ఇండెక్స్.....

డీజిల్ వాహనాలపై సుప్రీం కొత్త నిబంధనలు దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలకు శరాఘాతంగానే మారుతున్నాయి. బుధవారం స్టాక్ మార్కెట్లో.. ఆటోమోబైల్ ఇండెక్స్ 92 పాయింట్లు నష్టపోయింది. ఇక కంపెనీల వారిగా చూస్తే... ఈ ఎఫెక్ట్ మహీంద్రా అండ్ మహీంద్రాపై భారీగానే ఉంది. ఈ సూచీ 5శాతం క్షీణించింది. వీటితో పాటు డీజిల్ ఇంజిన్స్ తయారు చేసే క్యుమిన్స్ సంస్థ షేర్ ఒకటిన్నర శాతం పడిపోయింది. అయితే ఓవరాల్‌గా.. బుధవారం ఆటో కంపెనీల షేర్లు కాస్త నిలకడగానే కనిపించాయి. మొత్తం ఇండెక్స్‌లో 5 సంస్థలు నష్టాలు చూశాయి.

ఢిల్లీలో ఏటా 26లక్షల డీజిల్ వాహనాల విక్రయం...

ఢిల్లీలో ఏటా 26లక్షల డీజిల్ వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు సుప్రీం నిర్ణయంతో వీటి అమ్మకాలకు బ్రేక్ పడటం ఖాయం. ముఖ్యంగా డీజిల్ కార్ల సేల్స్ ఎక్కువగా ఉన్న మహీంద్రాకు కోర్టు నిర్ణయం గట్టి దెబ్బ. ఈ సంస్థ సేల్స్‌లో డీజిల్ వాహనాల వాటా 98.6శాతం. సంస్థ ఎస్ యూవీ లు బొలేరో, స్కార్పియో, ఎస్ యూ వీ-500లన్నీ డీజిల్ వాహనాలే. ఇప్పుడు వీటి అమ్మకాలపై ప్రభావం భారీగానే ఉంటుంది. మహీంద్రా తరువాత భారీగా నష్టపోయే మరో సంస్థ టయోటా. సంస్థకు కీలకమైన ఇన్నోవా, ఫార్చునర్ కార్ల అమ్మకాలు పడిపోవచ్చు.

సుప్రీం నిర్ణయంతో దెబ్బతినేది లగ్జరీ కార్ల కంపెనీలే....

సుప్రీం నిర్ణయంతో బాగా దెబ్బతినే సంస్థలన్నీ లగ్జరీ కార్ల కంపెనీలే. దేశంలో జరిగే ఖరీదైన కార్ల అమ్మకాల్లో 20శాతం ఢిల్లీలోనే జరుగుతున్నాయి. మోడల్స్ పరంగా చూస్తే.. మెర్సిడెస్ బెంజ్, జెఎల్ ఆర్ కార్లలో చాలావరకు డీజిల్‌ కార్లే ఉన్నాయి. సుప్రీం నిర్ణయంతో ఈ 2 సంస్థల అమ్మకాలు 80శాతం వరకు పడిపోవచ్చు. మరోవైపు బీఎండబ్ల్యుఆడి కంపెనీపై ఈ ప్రభావం స్వల్పమే. ఢిల్లీలో బీఎండబ్ల్యు 20మోడల్స్ విక్రయిస్తుండగా అందులో 6 మాత్రమే డీజిల్ ఇంజిన్‌తో నడుస్తున్నాయి. మరో లగ్జరీ కార్ల కంపెనీ ఆడికి చెందిన 2 మోడల్స్ అమ్మకాలు మాత్రమే నిలిచిపోనున్నాయి.

మారుతీ సుజ్‌కీ సేఫ్...

మారుతీ సుజ్‌కీపై సుప్రీం నిర్ణయం పెద్దగా ఉండదనిపిస్తోంది. ఈ కంపెనీ అమ్మకాల్లో ఎక్కువగా పెట్రోల్ కార్లే ఉన్నాయి. డీజిల్ కార్ల కెపాసిటీ 2వేల సీసీ కంటే తక్కువే. అయితే ఆటోమొబైల్ నిపుణులు మాత్రం... సుప్రీం నిర్ణయం వల్ల పెద్ద ప్రభావం చూపే అవకాశం లేదంటున్నారు. ఢిల్లీలో డీజిల్ కార్ల అమ్మకాల వాటా దేశవ్యాప్తంగా చూస్తే 2 నుంచి 3శాతం. అమ్మకాల పరంగా ఇదేమీ పెద్ద సమస్య కాదంటున్నాయి స్టాక్ బ్రేకింగ్ సంస్థలు ఏంజెల్, రిలిగేర్. అయితే ఈ సమస్య ప్రస్తుతానికి ఢిల్లీకే పరిమితమైనా.. రాబోయే రోజుల్లో ఇతర ప్రధాన నగరాల్లోనూ ఇదే నిషేధం అమలు కాక తప్పదు. దీనివల్ల సెంటిమెంటల్‌గా వినియోగదారులు ఇప్పటి నుంచే డీజిల్ కార్ల కొనుగోళ్లకు దూరంగా ఉండవచ్చు. ఇది దీర్ఘకాలంపాటు ప్రభావం చూపించే అంశం. మరోవైపు సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం.. అశోక్ లేలాండ్ కు మాత్రం లాభం చేకూర్చుతోంది. 2005 కంటే ముందున్న కమర్షియల్ వాహనాల రిప్లేస్‌మెంట్ డిమాండ్ ఈ సంస్థకు ప్లస్ అవనుంది. అటు ఢిల్లీలో ఉన్న అన్ని డీజిల్ ట్యాక్సీలను నేచురల్ గ్యాస్‌కు మార్చుకోవాలన్న నిబంధన.. ఇంద్రప్రస్థ గ్యాస్ కంపెనీకి అక్షయపాత్రగా మారనుంది. ఢిల్లీ, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో ఈ సంస్థనే సీఎన్ జీ విక్రయిస్తోంది. దీంతో బుధవారం సంస్థ షేర్ 7శాతం పెరిగింది.

ప్రముఖ రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు...

హైదరాబాద్ : ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గాకు 2015 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆమె రాసిన 'విముక్త' కథా సంపుటికి ఈ పురస్కారం దక్కింది. త్వరలో ఈ అవార్డును ఓల్గాకు ప్రదానం చేయనున్నారు.

అంబేద్కర్, రాజ్యాంగం పై చర్చను వైసీపీ అడ్డుకుంది : చంద్రబాబు

హైదరాబాద్ : అంబేద్కర్, రాజ్యాంగం పై చర్చను వైసీపీ అడ్డుకుందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ హాల్ లో మీడియాతో చంద్రబాబు చిట్ చాట్ చేశారు. వైసీపీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తొలిసారి ఎన్నికవడంతో వారికి అసెంబ్లీ రూల్స్ తెలియవన్నారు. సభా సాంప్రదాయాలను మరిచి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రేపు కాల్ మనీ వ్యవహారంపై సభలో చర్చిస్తామని చెప్పినా తొలిరోజు చర్చలేకుండా ముగియడం దురదృష్టకరమన్నారు. సభను స్తంభింపచేసేందకు ప్రతిపక్ష సభ్యులు అలవాటు పడ్డారన్నారు. నాయకుడి ప్రవర్తన బట్టే ఎమ్మెల్యే తీరు ఉంటుందన్నారు.

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన జేఈవో

తిరుమల : వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను జేఈవో శ్రీనివాసరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకుంట ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నారాయణగిరి ఉద్యానవనంలో క్యూలైన్ల ఏర్పాట్లు చేశామన్నారు. భక్తుల కోసం అన్నప్రసాదాలు, షెల్టర్లు, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఏకాదశి, ద్వాదశి సందర్భంగా అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు ప్రకటించారు. భక్తులందరూ సర్వదర్శనంలో దర్శించుకోవాలని, సిఫార్సు ఉత్తరాలు రద్దు, సుపథం మార్గం మూసివేసినట్లు తెలిపారు.

15:43 - December 17, 2015

మహబూబ్‌నగర్‌ : జిల్లా కొత్తకోట మండలం రామన్‌పాడు గ్రామంలో అధికారులు బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. గ్రామస్తుల సమాచారం మేరకు రెవెన్యూ, పోలీస్‌, ఐసిడిఎస్‌ అధికారులు గ్రామానికి చేరుకుని వివాహాన్ని అడ్డుకున్నారు. రామన్‌పాడుకు చెందిన రామస్వామినాయక్‌, లక్ష్మిల పెద్ద కుమార్తెను పెద్దమందడి మండలం అంకాయపల్లికి చెందిన నిర్మలేష్‌ నాయక్‌కు ఇచ్చి 10 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. ఆమె అనారోగ్య కారణాల రీత్యా మృతిచెందింది. దీంతో ఆమె చెల్లెలును నిర్మలేష్‌ రెండో వివాహం చేసుకోవడానికి పూనుకున్నాడు. ప్రస్తుతం ఆమె స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. పెళ్లిని అడ్డుకున్న అధికారులు బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. నిర్మలేష్‌, కమలకు జన్మించిన నలుగురు పిల్లలను హాస్టల్‌లో చేర్పించి చదివిస్తామన్నారు.

15:41 - December 17, 2015

హైదరాబాద్ : నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు సిద్ధమవుతున్నారు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. వచ్చే శనివారం ట్రయల్ కోర్ట్ ముందు హాజరైనప్పుడు వీరు బెయిల్ కోసం అర్జీ పెట్టుకోకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి . తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అవసరమైతే జైలుకు కూడా వెళ్లేందుకు సోనియా, రాహుల్‌ సిద్ధపడుతారని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి.

నేషనల్ హెరాల్డ్ కేసు వివాదాన్ని కాంగ్రెస్‌ రాజకీయ అస్త్రంగా....

కాంగ్రెస్‌పై కక్ష తీర్చుకునేందుకే మోడీ ప్రభుత్వం నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో అధినేత్రి సోనియాను, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఇరికించి వేధిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో గందరగోళం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసు వివాదాన్ని కాంగ్రెస్‌ రాజకీయ అస్త్రంగా మార్చుకునేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా అధికార బీజేపీ తమ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేసులు బనాయించారని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారు.

బెయిల్ కోసం అర్జీ పెట్టం....

ఇదిలా ఉంటే కేసులో తమ నిర్దోషిత్వం నిరూపించుకునేందుకు ఉపాధ్యక్షుడు రాహుల్‌, అధినేత్రి సోనియా ఇరువురు ట్రయల్ కోర్ట్ ముందు హాజరైనప్పుడు బెయిల్ కోసం అర్జీ పెట్టుకోవడం లేదని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. న్యాయ పోరాటం చేసేందుకే సిద్ధమని సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా వచ్చే శనివారం కాంగ్రెస్ అధిష్టానం తమ బలాన్ని ప్రదర్శించుకునేందుకు పాటియాలా హౌజ్ కోర్ట్ ఎదుట యూత్ కాంగ్రెస్ కార్యకర్తలతో పెద్ద ఎత్తున ప్రదర్శన కూడా ఏర్పాటుచేయాలని యోచిస్తోంది.

కక్షపూరిత వైఖరిని ప్రజల్లోకి....

ఈ మేరకు మోడీ ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా పార్టీ అగ్రనేతలు, ఎంపీలు అందరికీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి హుటాహుటిన రమ్మని పిలుపు అందించింది. సోనియా, రాహుల్‌ కోర్టుకు హాజరయ్యే రోజు పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించాలని పార్టీ ప్లాన్‌ చేస్తోంది.

రాహుల్‌, సోనియా జైలుకు వెళ్లేందుకు సైతం....

మరోవైపు తమపై వచ్చిన అపవాదును చెరిపివేసుకోవడంతో పాటు, బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాహుల్‌, సోనియా జైలుకు వెళ్లేందుకు సైతం వెనుకాడే అవకాశం లేదని సన్నిహిత వర్గాల సమాచారం. కాగా 1977 సాధారణ ఎన్నికల్లో ఇందిరా ఘోరపరాజయం చవిచూసింది. అంతే కాదు జైలు పాలయ్యారు. ఇందిరాతో పాటు సంజయ్‌ గాంధీ సైతం జైలులో ఉండి పోరాటం చేశారు. సరిగ్గా రెండేళ్లయినా తిరగ్గ ముందే 1980లో వచ్చిన సాధారణ ఎన్నికల్లో ఇందిరా భారీ విజయం నమోదు చేసింది. సరిగ్గా ఇదే ఫార్ములాను సోనియా, రాహుల్‌లు వాడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

15:37 - December 17, 2015

హైదరాబాద్ : కాదేదీ వ్యాపారానికి అనర్హం అన్నట్టు.. నీళ్లలాగే గాలిని కూడా క్యాన్లలో ఒడిసి పట్టి అమ్మే రోజులు వచ్చేశాయి. అంతేకాదు స్వచ్ఛమైన గాలికి బ్రాండ్లు తగిలించి మరీ అమ్మేస్తున్నారు. ఈ విచిత్రం మరెక్కడో కాదు చైనాలో చోటుచేసుకుంది. కెనడాకు చెందిన ఓ కంపెనీ మంచు కొండల్లోని స్వచ్ఛమైన గాలిని ఎయిర్‌ క్యాన్లలో పట్టి మరీ అమ్మకానికి పెట్టింది. వాయు కాలుష్యంలో కూరుకుపోయిన చైనీయులు ఈ గాలిని పీల్చేందుకు గాలి క్యాన్లను కొనేందుకు ఎగబడతున్నారు.

చైనాలో రాజ్యమేలుతోన్న కాలుష్యం ...

మంచి నీళ్లను బాటిళ్లలో నింపి ఇప్పటికే చాలా కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయి. ఇప్పుడు వారి కన్ను `గాలి' మీద పడింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో కాలుష్యం రాజ్యమేలుతోంది. దీంతో అక్కడ స్వచ్ఛమైన గాలి దొరకడం లేదనేది స్ధానికుల అభిప్రాయం. దీనిని వ్యాపార సంస్థలు క్యాష్‌ చేసుకునేందుకు రంగంలోకి దిగాయి. స్వచ్ఛమైన గాలిని అమ్ముతామంటూ కెనడాకు చెందిన ఓ కంపెనీ రంగంలోకి దిగింది.

పర్వతాల నుంచి తాజా గాలిని సేకరించి....

కెనడాకు చెందిన కంపెనీ పర్వతాల నుంచి తాజా గాలిని సేకరించి, క్యాన్లలో నింపి దానిని చైనాలో అమ్ముతోంది. చైనాలో వాతావరణ కాలుష్యం తీవ్రంగా ఉంది. ఆ పరిస్థితిని కెనడాలోని ఓ స్టార్టప్ కంపెనీ సొమ్ము చేసుకుంటోంది. కెనడా కంపెనీ తమ దేశంలో పర్వత ప్రాంత నగరమైన బాన్ఫ్, లేక్ లూయిస్ పర్వతాల నుంచి తాజా గాలిని సేకరించి, దానిని చైనాకు ఎగుమతి చేస్తోంది. ఈ కంపెనీ పేరు విటాలిటీ ఎయిర్.

ఒక్కో క్యాన్‌ ధర 28 డాలర్లకు....

ఒక్కో క్యాన్‌ ధర 28 డాలర్లకు విక్రయిస్తోంది. అంటే మన కరెన్సీలో దాదాపు 1800 రూపాయలు. ఈ నెల ప్రారంభంలో ప్రభుత్వం బీజింగ్ కాలుష్యంపై రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీనిని కెనడాకు చెందిన విటాలిటీ ఎయిర్ కంపెనీ సొమ్ము చేసుకుంటోంది. ప్రీమియం, నార్మల్ పేరిట రెండు రకాల ఆక్సిజన్ క్యాన్లను విక్రయిస్తోంది. లేక్ లూయిస్‌లో నింపిన ప్రీమియం ఎయిర్ బాటిల్ ధరను 28 డాలర్లుగా, బాన్ఫ్ గాలి ధర 23.99 డాలర్లు నిర్ణయించింది. తొలి విడతగా తాము తెచ్చిన అయిదు వందల బాటిళ్లు నిమిషాల్లో అమ్ముడుపోయాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.

గోకుల్ చాట్ పేలుళ్ల నిందితులకు రిమాండ్ పొడగింపు..

హైదరాబాద్: భాగ్యనగరంలో 2007 ఆగస్టు 25న గోకుల్ చాట్, లుంబిని పార్క్‌లో జంట బాంబు పేలుళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆరెస్టయిన ముగ్గురు నిందితులకు నాంపల్లి కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈనెల 30 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కాగా, నిందితులను ఇవాళ చంచల్‌గూడ జైలు నుంచి భారీ బందోబస్తు మధ్య నాంపల్లి కోర్టుకు తరలించారు. ఆనాటి గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్ల ఘటనలో 42 మంది మృతిచెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.

15:14 - December 17, 2015

ఢిల్లీ : భారత్‌పై వరాల జల్లు ప్రకటించింది గూగుల్‌ సంస్థ.. భారీ పెట్టుబడులతో పాటు... ఉద్యోగావకాశాల కల్పనపై దృష్టిపెట్టింది.. ప్రతి గ్రామానికి నెట్‌ అందించడమే తమ లక్ష్యమని ప్రకటించింది..

ఇంటర్‌నెట్‌ సేవల విస్తరణపై ప్రత్యేక దృష్టి....

భారత్‌లో ఇంటర్‌నెట్‌ సేవల విస్తరణపై ప్రత్యేక దృష్టిపెట్టింది గూగుల్‌ సంస్థ. దేశంలో భారీ పెట్టుబడులు పెడతామని... ఉద్యోగావకాశాల్ని కల్పిస్తామని ప్రకటించింది.. గూగుల్‌ కొత్త సీఈవో సుందర్‌ పిచాయ్‌ భారత సంతతికి చెందిన వారు.. బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి దేశపర్యటనకు వచ్చారు. గూగుల్‌ ఫర్ ఇండియా కార్యక్రమంలో సంస్థ ప్రణాళికల్ని వివరించారు..

భారత్‌, అభివృద్ధి చెందిన దేశాల మధ్య అనుసంధానం........

భారత్‌లో తమ ఉత్పత్తుల తయారీకోసం హైదరాబాద్‌లో కొత్త ప్రాంగణం ఏర్పాటుచేస్తామని పిచాయ్‌ తెలిపారు.. బెంగళూరులో నియామకాల్ని పెంచుతామని స్పష్టం చేశారు.. మెరుగైన అనుసంధానత, నాణ్యమైన సాఫ్ట్‌వేర్‌తో భారత్‌, ఇతర అభివృద్ధి చెందిన దేశాల ప్రజలకు అనుసంధానత కల్పించడమే తమ లక్ష్యమన్నారు.. తమ ప్రాధాన్య మార్కెట్లలో భారత్‌ ఒకటని చెప్పారు గూగుల్‌ సీఈవో.. దేశంలో ఇంజనీరింగ్‌, వాణిజ్య అభివృద్ధిలోకూడా పెట్టుబడులు పెడతామని వివరించారు.. రైల్‌టెల్‌ భాగస్వామ్యంతో ఈ నెలాఖరులోగా దేశంలోని 100 రైల్వేస్టేషన్లలో వైఫై కల్పిస్తామన్నారు. జనవరి నాటికి ముంబై సెంట్రల్‌ స్టేషన్‌లో సేవలు అందుబాటులోకి వస్తాయని హామీ ఇచ్చారు..

గ్రామాల్లో ఇంటర్‌నెట్‌ విస్తరణ.....

ఇక మహిళలకోసం కూడా చాలా కార్యక్రమాలు చేపట్టామన్నారు పిచాయ్‌.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ను విస్తరిస్తామని ప్రకటించారు.. ఇంటర్ నెట్ కు... ప్రాంతీయ భాషల్ని జోడించాల్సి ఉందని చెప్పుకొచ్చారు.. వచ్చే మూడేళ్లలో 20 లక్షల కొత్త ఆండ్రాయిడ్‌ డెవలపర్లకు శిక్షణ ఇస్తున్నామని స్పష్టం చేశారు.. జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా 30కిపైగా విశ్వవిద్యాలయాలతో కలిసి ఈ పని పూర్తిచేస్తామని తెలిపారు. మానిటర్‌ను కంప్యూటర్‌గా మార్చే ఉపకరణాన్ని రూపొందిస్తున్నామని గూగుల్‌ సంస్థ వివరించింది.. 2016లో ఎలాంటి అంశాన్నైనా వెంటనే అనువాదం చేసుకునే అవకాశం వస్తుందని వెల్లడించింది. మొత్తానికి తన తొలి పర్యటనలోనే భారత్‌పై ప్రత్యేక దృష్టిపెట్టారు సుందర్‌ పిచాయ్.

15:04 - December 17, 2015

హైదరాబాద్ : ఘనంగా ప్రారంభమైన గొప్ప కార్యక్రమం ఇప్పడు నత్తనడకన సాగుతోంది. బిన్‌ లెస్‌ సిటీ లక్ష్యం... అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. దేవుడు కరుణించినా పూజారి వరమివ్వని రీతిలో గ్రేటర్‌ అధికారులు వ్యవహరిస్తుండడంతో..అద్భుత పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. చివరికి లబ్ధిదారులకు అందాల్సిన ఫలాలు ఆమడ దూరంలోనే ఆగిపోతున్నాయి.

ముందుకు సాగని ఆటో ట్రాలీల పంపిణీ..

స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా జీహెచ్‌ఎమ్‌సీ చేపట్టిన ఆటో ట్రాలీల పంపణీ ముందుకు సాగడం లేదు. నగరంలో చెత్తను సేకరించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంఆశించిన రీతిలో జరగడం లేదు. మరోపక్క ఇంటివద్దే చెత్తను వేరుచేయడానికి తీసుకొచ్చిన ప్రతి ఇంటికీ రెండు డస్ట్‌ బిన్‌ల పంపిణీ పథకం కూడా నత్తనడకనే సాగుతోంది.

వెయ్యి ఆటో ట్రాలీలు సిద్ధం...

ఇంటింటి నుంచే చెత్తను సేకరించాలనే ప్రణాళిలో భాగంగా ఆటో ట్రాలీలు..బిన్‌లను సిద్ధం చేశారు. ఐతే వాటి పంపిణీ మాత్రం ముందుకు వెళ్లడం లేదు. వెయ్యికి పైగా ఆటో ట్రాలీలు నగరానికి చేరుకుని నెల రోజులవుతోంది. ఇప్పటికి 346 ఆటోలను మాత్రమే పంపిణీ చేశారు.

కార్పొరేషన్‌కు వాటా చెల్లించిన 2,500 లబ్ధిదారులు ......

ఆటో ట్రాలీల పథకానికి దాదాపు 2,500 మంది లబ్ధిదారులు తమ వాటా మొత్తాన్ని కార్పొరేషన్‌కు చెల్లించారు. ఎస్సీ,ఎస్టీలు 42 వేలు, ఇతరులు 80 వేల వరకు చెల్లించారు. ఇది ఇలా ఉంటే ఆటోల ద్వారా చెత్తను సేకరిస్తే..ఇప్పటికే పనిచేస్తున్న రిక్షా కార్మికులు ఉపాధి కోల్పోతారని..ఈ పథకంపై వ్యతిరేకత వచ్చింది. దీనికి స్పందించిన కమిషనర్‌ జనార్థన్‌ ముందుగా రిక్షా కార్మికులకే పంపిణీ చేసిన తరువాతే ఇతరులకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. కాని అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక మంచి పథకం ముందుకు సాగడం లేదు. మరి ఇప్పటికైనా జీహెచ్‌ఎమ్‌సీ స్పందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే..

15:01 - December 17, 2015

హైదరాబాద్ : తెలంగాణలోని ప్రధాన ఆలయాలపై దేవాదాయశాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇవాళ సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో యాదగిరిగుట్ట, వేములవాడ ఆలయాల అభివృద్ధి, సీజీఎఫ్‌పై రివ్యూ జరిపారు. ఆలయాల అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. యాదాద్రి పనులు వేగంగా జరుగుతున్నాయని.. ఎక్కడా నిధుల కొరత లేదని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

14:59 - December 17, 2015

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రి నర్సులు ఆందోళనబాటపట్టారు.. ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న తమను కాంట్రాక్టు పద్ధతిలో నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.. ఎన్నో ఏళ్లుగా ఈ వృత్తిలోఉన్నా తమను ఎవరూ గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. పదో పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు.. తమ సమస్యల పరిష్కారంకోసం రెండురోజులుగా నర్సులు విధులు బహిష్కరించి రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు.

14:57 - December 17, 2015

అనంతపురం : ఎన్‌పికుంటకు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ కాసేపట్లో చేరుకోనున్నారు. ఎస్‌పి కుంట సోలార్‌ ప్లాంట్‌ భూ నిర్వాసితులను పరామర్శించి వారికి మద్దతు ప్రకటించనున్నారు. కరత్‌ రాక సందర్భంగా కదిరిలో సీపీఎం కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నష్టపరిహారం అందక పోరుబాట పట్టిన నిర్వాసితులకు మద్దతు ప్రకటించేందుకు ఎన్‌కుంటకు వెళ్తున్నానని కరత్ చెప్పారు. మరో వైపు కరత్ సభను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

14:54 - December 17, 2015

హైదరాబాద్ : మహిళల జీవిత గమనంలో మెనోపాజ్ దశ ఎంతో కీలకమైనది. జీవక్రియలలో అనేక మార్పులు చోటు చేసుకునే ఈ దశలో ఎంతో మంది మహిళలు ఆస్టియో పోరోసిస్ బారిన పడుతున్నారు. మరి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో ఇవాళ్టి హెల్త్ కేర్ లో డాక్టర్ వివరించారు. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

14:52 - December 17, 2015

హైదరాబాద్ : కాల్ మనీ. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం. రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న అంశం. కాల్ మనీ పేరుతో జరుగుతున్న ఈ వడ్డీ వ్యాపారం ఎందుకు ఇంత చర్చనీయాంశమైందో తెలుసుకుంటే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయి. మహిళల్ని బాధితులుగా చేస్తున్న తీరు, అప్పు కోసం వారిని నిస్సహాయ స్థితిలోకి నెట్టడం చూస్తుంటే, డబ్బు వికృత రూపం మరోసారి బయటపడుతోంది. ఈ నేపథ్యంలో మానవి ప్రత్యేక కథనం.

సమయానికి డబ్బు అందించడమే కాల్ మనీ లక్షణం .....

అత్యవసర సమయానికి డబ్బు అందించడమే కాల్ మనీ లక్షణం . నిజానికి దీన్ని కేవలం ఇంటర్ బ్యాంకింగ్ వ్యవహారాల్లో మాత్రమే అనుసరిస్తారు. బ్యాంకింగ్ పరిభాషలో చెప్పాలంటే నగదు నిల్వలు మెంటైన్ చేయడానికి ఇతర బ్యాంకులను సర్దుబాటు చేసుకునే విధానం. ఇందులో 15 రోజుల్లోపు ఒకరు మరొకరికి ఇచ్చుకునే స్వల్పకాలిక రుణం. మన వాడుక భాషలో దీన్నే చేబదులు కూడా అనొచ్చు. ఇలా ఇచ్చిన రుణాలకు వడ్డీని వసూలు చేస్తారు. ఎక్కువగా ఈ కాల్ మనీ బ్యాంకుల మధ్య జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న కాల్ మనీ వ్యవహారం వేరు.

పాలకులు ఇకనైనా కళ్లు తెరవాలని.....

పాలకులు ఇకనైనా కళ్లు తెరవాలని మానవి కోరుకుంటోంది. పేద వారికి కాల్ మనీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న వారిని కాపాడాలని, ఆ కుటుంబాల్లోని మహిళల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడాలని , ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వం, పాలనా యంత్రాంగం బాధ్యతేనని డిమాండ్ చేస్తోంది.

విద్యుదాఘాతంతో రైతు మృతి

కరీంనగర్ : పొలంలో వన్యప్రాణుల కోసం వేసిన కరెంటు తీగ ఓ రైతు ప్రాణాన్ని బలి తీసింది. కరీంనగర్ జిల్లా వీణవంక గ్రామానికి చెందిన రైతు సంబాని(45) గురువారం ఉదయం చేనుకు వెళ్లాడు. పక్కనే ఉన్న మొక్కజొన్న చేను యజమాని ఎలుగుబంట్లు, అడవి పందుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు వేసిన కరెంటు తీగ అతడి కాలికి తాకింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురైన రైతు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. రైతు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

 

విద్యార్థులతో సుందర్ పిచాయ్ ముఖాముఖి

న్యూఢిల్లీ: దేశా రాజధాని ఢిల్లీ విద్యార్థులతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులతో చర్చిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా తనకు భారత్‌పై ప్రత్యేక అభిమానం ఉందన్నారు. తాను తొలిసారిగా గూగుల్‌లో అడుగు పెట్టినపుడు చిన్న పిల్లవాడు మిఠాయి దుకాణంలో అడుగు పెట్టినట్లు అనిపించిందన్నారు.

13:41 - December 17, 2015

అమెరికా : సుదీర్ఘ విరామం తరువాత అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచింది. 2008లో సబ్ ప్రైమ్ సంక్షోభం తరువాత పదేళ్లకు వడ్డీరేట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రారంభమైన మీటింగ్ లో వడ్డీరేటు పావుశాతం పెంచుతూ ఫెడరల్ రిజర్వ్ ఛైర్ పర్సన్ జానెట్ యెలెన్ ప్రకటించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిన పడటంతో... వడ్డీరేట్లు పెంచాలన్న డిమాండ్ కొద్దికాలంగా వినిపిస్తోంది. ఎట్టకేలకు రేట్లు పెంచుతూ.. యెలెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

13:39 - December 17, 2015

ఢిల్లీ : ఢిల్లీ క్రికెట్ బోర్డులో అక్రమాలు బయటపడతాయన్న భయంతోనే.. కేజ్రీవాల్ కార్యాలయంపై సీబీఐ దాడులు జరిగినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఈ కేసు విచారణ సక్రమంగా జరిగేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజీనామా చేయాలని ఆప్ నేతలు డిమాండ్ చేశారు. అరుణ్ జైట్లీ ఢిల్లీ క్రికెట్ బోర్డ్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో భారీగా అవకతవకలు జరిగాయని ఆప్ నేత కుమార్ బిశ్వాస్ ఆరోపించారు.

13:31 - December 17, 2015

అనంతపురం : జిల్లా ఎన్‌పి కుంటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీఎం నేతలపై పోలీసులు నిర్బంధ చర్యలకు దిగుతున్నారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కరత్‌ పర్యటనకు అనుమతి నిరాకరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శితో పాటు 22 మందికి బైండోవర్‌ సమన్లు జారీ చేశారు. ఎన్‌.పి.కుంట ప్లాంట్‌ భూ నిర్వాసితుల కోసం సీపీఎం పోరాటం చేస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ చర్యలకు దిగుతోంది. ఎస్‌.పి కుంట సోలార్‌ ఫ్లాంట్‌ భూ నిర్వాసితులను పరామర్శించడానికి ప్రకాశ్‌ కరత్‌ అనంతపురం జిల్లాకు వస్తున్నారు. ఇప్పటికే ఆయన కదిరికి చేరుకున్నారు. ఈసందర్భంగా కరత్ కు స్వాగతించేందుకు భారీ సంఖ్యలో సీపీఎం శ్రేణులు చేరుకున్నారు. అనంతరం ఎన్‌.పి కుంటలో బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే ప్రకాశ్‌ కరత్‌ సభను అడ్డుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. 

13:21 - December 17, 2015

హైదరాబాద్ : కాల్ మనీపై చర్చ చేపట్టాల్సిందేనని వైసీపీ ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే గందరగోళం నెలకొంది. ఇద్దరు వైసీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ సందర్భంగా రోజా టెన్ టివితో ముచ్చటించింది. సమగ్ర చర్చ జరిగినప్పుడే నిజ నిజాలు బయటకొచ్చే అవకాశం ఉందన్నారు. వెనిగళ్ల శ్రీకాంత్ ను వేరే దేశానికి పంపించి ఇక్కడకు వచ్చిన బోడే ప్రసాద్ ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కేసులు నమోదు చేయవద్దని బోండా ఉమ వత్తిడి తెస్తున్నాడని బాధితులు స్వయంగా పేర్కొంటున్నారని తెలిపారు. బోండా ఉమా విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మరోవైపు బుద్ధా వెంకన్న..అతని సోదరుడు ఒకే దగ్గర నివాసం ఉంటున్నారని, సోదరుడిని అరెస్టు చేసి బుద్ధా వెంకన్నను అరెస్టు చేయలేదన్నారు. మాన, ప్రాణలతో ఆటలాడుకుంటున్నా బాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సూటిగా ప్రశ్నించారు. తప్పించుకోవడానికి ఎవరు కాళ్లు పట్టుకోవడానికి బాబు వెనుకాడరని ఈ ఘటన నిరూపిస్తోందన్నారు. రిషితేశ్వరీ..వనజాక్షి ఘటనలపై జరుగుతున్న తీరు ఇందుకు నిదర్శనమన్నారు. బాబు క్షమాపణలు చెప్పేంత వరకు, ఏపీ పరువు పోకుండా పోరాడుతామని రోజా స్పష్టం చేశారు. 

13:16 - December 17, 2015

హైదరాబాద్ : వైసీపీ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని టిడిపి నేత రావెల కిశోర్ బాబు వ్యాఖ్యానించారు. గురువారం ప్రారంభమైన శాసనసభలో మొదటి రోజు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాల్ మనీ వ్యవహారంపై చర్చించాలని వైసీపీ...అంబేద్కర్ 125 జయంతి సందర్భంగా సభలో చర్చించాలని, శుక్రవారం కాల్ మనీ వ్యవహారంపై చర్చిద్దామని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కెమెరాలకు అడ్డుగా ఉన్నారని ఇద్దరు వైసీపీ సభ్యులను సస్పెండ్ కు గురయ్యారు. ఈ సందర్భంగా మీడియా పాయింట్ వద్ద రావెల మాట్లాడారు. వైసీపీ దొంగలపార్టీ అంటూ మండిపడ్డారు. అంబేద్కర్‌పై ఆ పార్టీకి ఏమాత్రం గౌరవం లేదని ఆరోపించారు. అనేక మాఫియాలతో వైసీపీకి సంబంధాలున్నాయని ఆరోపించారు. అంబేద్కర్ ప్రస్తావన తీసుకొచ్చిన వెంటనే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పోడియాన్ని చుట్టుముట్టడం దుర్దినమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పేదల పాలిట పెన్నిధి అంబేద్కర్ పేరును ఉచ్చరించగానే వైసీపీ ఆందోళన చేయడం వల్ల దళిత వ్యతిరేక పార్టీ అని స్పష్టమైందన్నారు. అంబేద్కర్ ను అవమాన పరిచే విధంగా దిగజారారని, ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ అభిమానులు తలదించుకొనేలా చేశారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ దళితుల నిధులను వైఎస్ పక్కదారి పట్టించారని, ఎస్సీ కార్పొరేషన్ మూసివేసిన చరిత్ర వైఎస్ దని ఆరోపించారు. 

13:12 - December 17, 2015

హైదరాబాద్ : బీసీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తారా అంటూ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రారంభమైన శాసనసభలో మొదటి రోజు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాల్ మనీ వ్యవహారంపై చర్చించాలని వైసీపీ పట్టుబట్టింది. అంబేద్కర్ 125 జయంతి సందర్భంగా సభలో చర్చించాలని, శుక్రవారం కాల్ మనీ వ్యవహారంపై చర్చిద్దామని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి వైసీపీ నిరాకరిస్తూ ఆందోళన చేపట్టింది. దీనితో స్పీకర్ కోడెల సభను రెండుసార్లు వాయిదా వేశారు. అనంతరం తిరిగి సభ ప్రారంభమైంది. కెమెరాలకు అడ్డు తగులుతున్నారని డి.రాజా, శివప్రసాద్ రెడ్డిలను ఒకరోజు పాటు సస్పెన్షన్ చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. దాడిశెట్టి రాజా ఏం తప్పు చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేను సస్పెండ్ చేయడం ద్వారా బీసీల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. బీసీలకు తమ పార్టీ అండగా ఉంటుందని చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పష్టం చేశారు. 

13:01 - December 17, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు మొదటి రోజే గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు ఇద్దరు సభ్యుల సస్పెన్షన్ కు దారి తీశాయి. గురువారం ప్రారంభమైన శాసనసభలో మొదటి రోజు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాల్ మనీ వ్యవహారంపై చర్చించాలని వైసీపీ పట్టుబట్టింది. అంబేద్కర్ 125 జయంతి సందర్భంగా సభలో చర్చించాలని, శుక్రవారం కాల్ మనీ వ్యవహారంపై చర్చిద్దామని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి వైసీపీ నిరాకరిస్తూ ఆందోళన చేపట్టింది. దీనితో స్పీకర్ కోడెల సభను రెండుసార్లు వాయిదా వేశారు. అనంతరం తిరిగి సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైసీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. మంత్రి యనమల దీనిపై ఒక ప్రకటన చేశారు. కెమెరాలకు అడ్డు తగులుతున్నారని డి.రాజా, శివప్రసాద్ రెడ్డిలను ఒకరోజు పాటు సస్పెన్షన్ చేయాలని మంత్రి యనమల తీర్మానం చేశారు. దీనితో స్పీకర్ కోడెల వారిపై ఒక రోజు పాటు సస్పెన్షన్ చేశారు. అయినా సభలో కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. వైసీపీ సభ్యుల నినాదాలతో సభ మారుమోగిపోయింది. చివరకు సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల వెల్లడించారు. 

నాంపల్లి కోర్టుకు గోకుల్ చాట్ బాంబు పేలుళ్ల నిందితులు..

హైదరాబాద్: భారీ బందోబస్తు మధ్య గోకుల్‌చాట్ బాంబు పేలుళ్ల కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు. ముగ్గురు నిందితులను చంచల్‌గూడ జైలు నుంచి కోర్టుకు తీసుకు వచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. 2007 ఆగస్టు 25న హైదరాబాద్ నగరంలో జరిగిన జంట బాంబు పేలుళ్ల ఘటనలో 42 మంది మృతిచెందగా మరో 50 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. 

కాకతీయ యూనివర్సిటీ పీజీ కోర్సుల పరీక్షలు..

వరంగల్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దూరవిద్యా కేంద్రం నిర్వహించే పీజీ కోర్సుల పరీక్షలను ఈ నెల 20 నుంచి నిర్వహిస్తున్నట్లు దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ దినేశ్‌కుమార్ తెలిపారు.

అల్ ఖైయిదా ఉగ్రవాద అనుమానితుడి అరెస్టు..

న్యూఢిల్లీ : అల్ ఖయిదా ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ అనుమానితున్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. సంభాల్‌లో జాఫర్ మసూద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ వారంలో ఇప్పటి వరకు ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. 

12:47 - December 17, 2015

హైదరాబాద్ : అంబేద్కర్ పేరు ఎత్తగానే వైసీపీ సభ్యులు ఎందుకు ఆందోళన చేస్తున్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల పేర్కొన్నారు. గురువారం ప్రారంభమైన శాసనసభలో మొదటి రోజు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాల్ మనీ వ్యవహారంపై చర్చించాలని వైసీపీ పట్టుబట్టింది. అంబేద్కర్ 125 జయంతి సందర్భంగా సభలో చర్చించాలని, శుక్రవారం కాల్ మనీ వ్యవహారంపై చర్చిద్దామని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి వైసీపీ నిరాకరిస్తూ ఆందోళన చేపట్టింది. దీనితో స్పీకర్ కోడెల సభను రెండుసార్లు వాయిదా వేశారు. సీఎం చంద్రబాబు నాయుడు అంబేద్కర్ పేరు ఎత్తగానే వైసీపీ అధినేత జగన్ తన సభ్యులను 'లేవండి' అంటూ చెబుతున్నారని యనమల తెలిపారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు ఎత్తడానికి కూడా వీలు లేదనే విధంగా జగన్ ప్రవర్తన ఉందన్నారు. ఆయన పేరు ఎత్తగానే ఆందోళన దిగడం దౌర్భగ్యామని యనమల వ్యాఖ్యానించారు. 

12:38 - December 17, 2015

హైదరాబాద్ : కాల్ మనీపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గురువారం ప్రారంభమైన శాసనసభలో మొదటి రోజు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాల్ మనీ వ్యవహారంపై చర్చించాలని వైసీపీ పట్టుబట్టింది. అంబేద్కర్ 125 జయంతి సందర్భంగా సభలో చర్చించాలని, శుక్రవారం కాల్ మనీ వ్యవహారంపై చర్చిద్దామని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి వైసీపీ నిరాకరిస్తూ ఆందోళన చేపట్టింది. దీనితో స్పీకర్ కోడెల సభను రెండుసార్లు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. రేపు ఉదయం తాను ప్రకటన చేయడం జరుగుతుందని అనంతరం చర్చ చేపట్టాలని సూచించారు. ఏవైనా సాక్ష్యాలు ఉంటే తమకు సమర్పించాలని, కాల్ మనీపై ఎవరూ తప్పు చేసినా, చట్టాన్ని ఉల్లంఘించినా తప్పించుకోలేరని తెలిపారు. అంబేద్కర్ సంవత్సరం సందర్భంగా చర్చ చేపట్టాల్సినవసరం ఉందని, సభను అడ్డుకోవడం సరికాదన్నారు. సభలో ప్రతిపక్ష సభ్యులు చేపట్టిన ఆందోళనతో సిగ్గుతో తలదించుకొనేలా ఉందని బాబు వ్యాఖ్యానించారు. 

వైసీపీ ఇద్దరు సభ్యుల సస్పెన్షన్..

హైదరాబాద్ : వైసీపీ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులను స్పీకర్ కోడెల సస్పెన్షన్ చేశారు. కెమెరాలకు అడ్డు తగులుతున్నారని డి.రాజా, శివప్రసాద్ రెడ్డిలను ఒకరోజు పాటు సస్పెన్షన్ చేయాలని మంత్రి యనమల పేర్కొన్నారు. దీనితో స్పీకర్ కోడెల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. 

12:27 - December 17, 2015

చిత్తూరు : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త టిడిపి కీలక నేత కఠారి మోహన్ హత్య కేసులో మరో సంచలన ఘటన నమోదైంది. మాజీ ఎమ్మెల్యే అనుచరుడు, 38వ డివిజన్ కార్పొరేటర్ శివ ప్రసాద్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శివ ప్రసాద్ రెడ్డి మృతి చెందాడు. దీనితో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. హత్య కేసులో 2 రోజులుగా పోలీసులు శివ ప్రసాద్ రెడ్డిని పోలీసులు మార్లు విచారించారు. 

సూసైడ్ లేఖ..
పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మేయర్ హత్య కేసులో గత కొన్ని రోజులుగా శివ ప్రసాద్ ను పోలీసులు విచారిస్తున్నారు. దీనిని అవమానంగా శివప్రసాద్ భావించాడు. తన కుటుంబ పరువు పోయిందని మేయర్ దంపతుల హత్యకు తనకు ఏమాత్రం సంబంధం లేదని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఈ కేసులో పోలీసులు తనను వదలరని, కేసులో ఇరికిస్తారని లేఖలో తెలిపాడు. గత నెల 17వ తేదీన మేయర్ దంపతుల హత్య కేసు జరిగిన సంగతి తెలిసిందే. తనను ఎలాగైనా కేసులో ఇరికిస్తామంటూ పోలీసులు బెదిరించినట్టు సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. తనకేం సంబంధం లేకపోయినా.. విచారణ పేరుతో నన్ను బెదిరించినట్టు ఆరోపించారు. ఈ మేరకు శివప్రసాద్ రెడ్డి రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కఠారి మోహన్ అల్లుడు చింటూ రాయల్ అలియాస్ చంద్రశేఖర్ లొంగిపోయిన సంగతి తెలిసిందే. 23 మందిని అరెస్టు చేయడమే కాక 30 మంది వ్యక్తులకుపైగా విచారణ చేశారు. తాజాగా జరిగిన ఈ ఘటనతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. 

12:17 - December 17, 2015

హైదరాబాద్ : టిడిపి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటు విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాల్ మనీ వ్యవహారంపై చర్చ చేపట్టాలని వైసీపీ..శుక్రవారం చర్చిద్దామని ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడారు. కాల్ మనీ దందాలో సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యేల డబ్బులున్నాయని ఆరోపించారు. బుద్ధా వెంకన్న, బోడే ప్రసాద్ లను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కాల్ మనీ ఘటనతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, 200 అశ్లీల వీడియోలు బయటకు వచ్చాయని ఇంకా ఎన్నో ఉన్నాయన్నారు. అంబేద్కర్ ను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని, కాల్ మనీ, సెక్స్ రాకెట్ లో పేదలు, ఎస్సీ, ఎస్టీలున్నారని తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే చర్చ చేపట్టి వారికి జరుగుతున్న అన్యాయాన్ని బయటపెట్టాలన్నారు. విదేశాల్లో బోడే ప్రసాద్, నిందితుడు వెళ్లారని, అనంతరం బోడే ప్రసాద్ ఒక్కరే తిరిగి వచ్చారని తెలిపారు. నిందితులను అరెస్టు చేస్తేనే బాధితులకు న్యాయం జరగుతుందన్నారు. 

కాల్ మనీపై శుక్రవారం ప్రకటన – బాబు..

హైదరాబాద్ :కాల్ మనీ పై శుక్రవారం తాను ఒక ప్రకటన చేయడం జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. కాల్ మనీపై ఎవరూ తప్పు చేసినా, చట్టాన్ని ఉల్లంఘించినా తప్పించుకోలేరని తెలిపారు. 

కాల్ మనీ కంటే ప్రధాన సమస్య ఏదీ లేదు - రాజా

హైదరాబాద్ : రాష్ట్రంలో కాల్ మనీ కంటే ప్రధాన సమస్య ఏదీ లేదని ఎమ్మెల్యే రాజా పేర్కొన్నారు. తక్షణమే కాల్ మనీ వ్యవహారంపై చర్చ జరగాలని, మహిళలపై జరుగుతున్న వేధింపులపై చర్చకు పట్టుబడుతామని స్పష్టం చేశారు. స్పీకర్ హెచ్చరికలను పట్టించుకోనన్నారు. 

పీడీఎఫ్ ఎమ్మెల్సీల వాకౌట్..

హైదరాబాద్ : బాక్సైట్ తవ్వకాలపై ఏపీ శాసనమండలి అట్టుడికింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుండి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. 

కార్పొరేటర్ శివప్రసాద్ రెడ్డి ఆత్మహత్య..

చిత్తూరు : 47వ వార్డు కార్పొరేటర్ శివప్రసాద్ రెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే ఇతడిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మేయర్ కటారి దంపతుల హత్య కేసులో శివ ప్రసాద్ ను పోలీసులు బుధవారం విచారించారు. 

వైసీపీ సభ్యులు పద్ధతి మార్చుకోవాలి - స్పీకర్ కోడెల..

హైదరాబాద్ : వైసీపీ సభ్యులు పద్దతి మార్చుకోవాలని స్పీకర్ కోడెల సూచించారు. అసెంబ్లీలో కెమెరాలకు అడ్డుగా నిలబడి నినాదాలు చేయడం నిబంధనలకు వ్యతిరేకమన్నారు.

 

ఇంద్రకీలాద్రిపై అధికార ప్రజాప్రతినిధి వ్యాపారం..

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అడ్డగోలు వ్యాపారం చేస్తున్న వ్యవహారం బయటకొచ్చింది. ఆలయ ప్రాంగణంలో షాపు చేసుకుని వ్యాపారం సాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు.

 

11:42 - December 17, 2015

గుంటూరు : జిల్లాలో ఓ వ్యక్తి యువతిపై దాడి చేశాడు. ఇతను ప్రేమోన్మాదా ? లేక సైకో నా తెలియరావడం లేదు. దాడి చేసిన వ్యక్తి తనకు తెలియదని యువతి పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. అనాథ అయిన ఓ యువతి గుంటూరులోని మహిళా కళాశాలలో బీఎస్సీ చదువుతోంది. గురువారం ఉదయం ఆ యువతి కళాశాలకు చేరుకుని సైకిల్ పార్కింగ్ చేస్తోంది. ఆ సమయంలో ఓ యువకుడు సుత్తితో ఆమెపై దాడి చేశాడు. అనంతరం సైకిల్ పై పరారయ్యాడు. గాయాలైన యువతిని సమగ్ర ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. తలకు రెండు చోట్ల గాయాలు కావడంతో వైద్యులు ఐదు కుట్లు వేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలుస్తోంది. కళాశాల ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీల నిరసన..

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైసీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదాపై లోక్ సభలో వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. 

11:32 - December 17, 2015

హైదరాబాద్ : కాల్ మనీ వ్యవహారంలో ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, ముస్తాఫా పేర్కొన్నారు. శాసనసభలో కాల్ మనీ వ్యవహారంపై చర్చ చేపట్టాలని వైసీపీ డిమాండ్ చేసింది. శుక్రవారం చర్చ చేపడుతామని ప్రభుత్వ ప్రతిపాదనను వైసీపీ తిరస్కరిచింది. దీనితో సభలో వైసీపీ తీవ్ర గందరగోళం ఏర్పడడంతో స్పీకర్ రెండుసార్లు సభను వాయిదా వేశారు. ఈసందర్భంగా టెన్ టివితో వారు మాట్లాడారు. బీఏసీలో చర్చకు ఒప్పుకున్నారని చెప్పడం సబబు కాదని, తాము చర్చకు ఒప్పుకోలేదని తెలిపారు. వడ్డీ వ్యాపారం అనేది 200 సంవత్సరాల నుండి వస్తోందని, దీనిని డై ల్యూట్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వడ్డీ వ్యాపారస్తులపై దాడి చేయించి, ఇందులో అందరూ భాగస్వాములేనని చెప్పడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఈ అంశంపై చర్చించిన తరువాత ఇతర అంశాలపై చర్చిద్దామని, ఆర్డర్ లేని సమయంలో అధికార పక్షానికి మైక్ ఇచ్చి తిట్టిస్తున్నారని తెలిపారు. దీనిని చూస్తూ ఊరుకోమని స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి తమ నిరసన తెలియచేస్తున్నామన్నారు. సమస్య అనేది చాలా పెద్దద్దని కావాలని, కావాలనే దీనిని పక్కదారిపట్టేందుకు చంద్రబాబు నాయుడు ప్లాన్ చేశారని తెలిపారు. 

11:13 - December 17, 2015

హైదరాబాద్ : కాల్ మనీ సమస్య ప్రజా సమస్య అని, ఏ పార్టీ నేత అయినా కఠిన చర్యలు తీసుకుంటామని టిడిపి నేత బోండా ఉమ స్పష్టం చేశారు. ఆయన శాసససభ ఆవరణలో టెన్ టివితో మాట్లాడారు. కాల్ మనీ వ్యవహారం టిడిపి వెలుగులోకి తీసుకొచ్చిందని, ముఖ్యమంత్రి స్పందించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విచారణలో అన్ని విషయాలు బయటకొస్తాయని తెలిపారు. కాల్ మనీలో వైసీపీ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు. దీనికి సంబంధించిన మూలాలు ఎక్కడి నుండి వచ్చాయని, 18 నెలల టిడిపి ప్రభుత్వం ప్రతి విషయంలో సీరియస్ గా వ్యవహరిస్తోందని బోండా ఉమ వ్యాఖ్యానించారు. 

11:11 - December 17, 2015

హైదరాబాద్ : ఎవరి పట్టు వారిదే..కాల్ మనీ వ్యవహారంపై చర్చించాలని వైసీపీ..శుక్రవారం చర్చిద్దామని ప్రభుత్వం..ఏపీ శాసనసభలో మొదటి రోజే గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికార..విపక్షసభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. దీనితో రెండు సార్లు సభను స్పీకర్ కోడెల వాయిదా వేశారు.

అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంది - జగన్..
చర్చను తప్పుదోవ పట్టించేందుకు అంబేద్కర్ పేరును కూడా వాడుకుంటున్నారని ప్రతిపక్ష నేత జగన్ పేర్కొన్నారు. కాల్ మనీ వ్యవహారంతో అంబేద్కర్ ఆత్మ కూడా క్షోభిస్తుందని, కాల్ మనీ నిందితుడు, ఎమ్మెల్యే విదేశాల్లో తిరుగుతున్నారని ఆరోపించారు. ఇందులో ఒక ఎమ్మెల్యే తిరిగి వస్తాడు...కానీ నిందితుడు తిరిగి రాడా ? అని సభలో జగన్ ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను సభలో ప్రదర్శించారు. ఆ ఎమ్మెల్యేను పోలీసులు విచారణ చేయడం దారుణమన్నారు. దీనితో స్పీకర్ జోక్యం చేసుకున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా చర్చ చేపడుతామని, ఇందులో మాట్లాడుతామని వైసీపీ పేర్కొందని స్పీకర్ గుర్తు చేశారు. కానీ సభకు వచ్చిన అనంతరం కాల్ మనీపై చర్చకు పట్టుబడడం సబబు కాదన్నారు. ప్రతిపక్షం సహకరించాలని సూచించారు.

వైసీపీకి చరిత్ర తెలియదు - యనమల..
సంప్రదాయలకు వ్యతిరేకంగా సభను అడ్డుకోవడం చూస్తున్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల పేర్కొన్నారు. జగన్ ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. అంబేద్కర్ విషయంపై పార్లమెంట్ లో రెండు రోజుల పాటు చర్చ జరిగిందని గుర్తు చేశారు. పార్లమెంట్ లో ఏం జరిగిందో వైసీపీకి తెలియదని, చరిత్ర తెలియదని విమర్శించారు. ఇలాంటి ప్రతిపక్ష నేత ఉండడం దురదృష్టకరమన్నారు. నిందితుడిగా ప్రతిపక్ష నేత జగన్ ఉన్నారని, 11 ఛార్జీషీట్ లున్న నేత ఇక్కడుండడం దురదృష్టకరమన్నారు. కాల్ మనీ కేసులో ప్రతిపక్ష నాయకుడే నిందితుడని తెలిపారు.

తుని శాసనసభ్యుడిపై స్పీకర్ ఆగ్రహం..
తుని శాసనసభ్యుడు రాజా కెమెరాలకు అడ్డుతగులుతూ సంప్రదాయాలకు అడ్డుతగులుతున్నారని టిడిపి సభ్యుడు కాల్వ శ్రీనివాసులు స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పీకర్ స్పందించారు. వెంటనే సదరు సభ్యుడు ప్రవర్తన మార్చుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని స్పీకర్ హెచ్చరించారు. కాల్ మనీ వ్యవహారంపై వెనుకడగు వేయడం లేదని, శుక్రవారం చర్చ చేపడుతామని ప్రభుత్వం ప్రకటించిందని కాల్వ శ్రీనివాసులు గుర్తు చేశారు. 

ఏపీ అసెంబ్లీ మళ్లీ వాయిదా..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజే గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాల్ మనీ వ్యవహారంపై చర్చించాలని వైసీపీ పట్టుబడింది. దీనితో సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 

సభలో కొనసాగుతున్న వైసీపీ ఆందోళన..

హైదరాబాద్ : ఏపీ శాసనసభ సమావేశాల్లో మొదటి రోజే గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాల్ మనీ కేసుపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. 

వైసీపీ లాంటి ప్రతిపక్షం చూడలేదు - బోండా..

హైదరాబాద్ : రాష్ట్ర చరిత్రలో వైసీపీ లాంటి ప్రతిపక్షాన్ని చూడలేదని బోండా ఉమ పేర్కొన్నారు. కాల్ మనీపై అసెంబ్లీలో శుక్రవారం సమగ్ర చర్చకు సిద్ధమని చెప్పినా వైసీపీ ఆందోళన చేస్తోందని, దూడల రాజేష్ ఎవరో జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాల్ మనీ కేసులో దూడల రాజేష్ ప్రధాన నిందితుడని ఆయన ఆరోపించారు. 

10:23 - December 17, 2015

హైదరాబాద్ : అనంతపురం జిల్లాలో పోలీసులు విధిస్తున్న ఆంక్షలు..సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కరత్ పర్యటనను నిరాకరించడంపై ఎమ్మెల్సీ గేయానంద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ప్రారంభమైన శాసనమండలిలో అనంతపురంలో సీపీఎం నేతలపై ఆంక్షలు..కరత్ పర్యటన నిరాకరణపై ఆయన శాసనమండలిలో లేవనెత్తారు. దీనికి ఛైర్మన్ చక్రపాణి నిరాకరించారు. రూల్ 70 కింద చర్చకు రావాలని సూచించారు. అనంతపురంలో అత్యవసర పరిస్థితి ఉందని, ఏడు వేల ఎకరాల భూమి తీసుకున్నారని పేర్కొన్నారు. జాతీయ నాయకుడైన కరత్ పర్యటనకు ఎందుకు నిరాకరించారని, ప్రభుత్వంచే సమాధానం ఇప్పించాలని డిమాండ్ చేశారు. బహిరంగసభ పెట్టడానికి ఏమి ఇబ్బందని, రాష్ట్రంలో పోలీసుల నిర్భందం కొనసాగుతోందన్నారు. రూల్స్ మాత్రం వారికి అవసరం లేదు కాని తమకు మాత్రం రూల్స్ పెడుతుండడం సమంజసమేనా అని గేయానంద్ ప్రశ్నించారు.

 

అనంతలో పోలీసుల ఆంక్షలపై గేయానంద్ ఆగ్రహం..

హైదరాబాద్ : అనంతపురంలో పోలీసులు ఆంక్షలు విధించడంపై ఎమ్మెల్సీ గేయానంద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కరత్ పర్యటనకు ఎందుకు అనుమతినివ్వడం లేదని ప్రశ్నించారు. ఏపీ శాసనమండలిలో ఆయన మాట్లాడారు. జాతీయ నాయకుడైన కరత్ పర్యటనకు అనుమతినివ్వకపోవడం ఆయనను అవమానించినట్లేనన్నారు. 

ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభం..

హైదరాబాద్ : ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతపురంలో సీపీఎం నేతలపై పోలీసుల ఆంక్షలు విధించడంపై సభ్యుడు గేయానంద్ ప్రశ్నించారు. 

10:00 - December 17, 2015

హైదరాబాద్ : శీతకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. గతంలో సభలో జరిగిన తీరే పునరావృతమైంది. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఇచ్చిన తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడం..సభ్యులు ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ అంశంపై రేపు చర్చిద్దామన్న ప్రభుత్వ అభిప్రాయాన్ని వైసీపీ తోసిపుచ్చింది. ఈ రోజే చర్చించాలని పట్టుబడుతూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేసింది. దీనితో సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల వెల్లడించారు. సభలో చంద్రబాబు, బోడే ప్రసాద్ కలిసి ఉన్న ఫొటోలను వైసీపీ సభ్యులు ప్రదర్శించారు.

వైసీపీపై కాల్వ..గోరంట్ల నిప్పులు..
ఈ సందర్భంగా అసెంబ్లీలో వైసీపీ పార్టీపై ప్రభుత్వ చీప్ విప్ కాల్వ శ్రీనివాసులు, టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సినవసరం ఉందని గోరంట్ల అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. దొంగల ముఠా నాయకుడు జగన్ అని, సీఎంలను దూషించే సాహసం చేయడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో జరిగిన అన్యాయాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ అని, ప్రతిపభ సభ్యులకు ఎవరూ మాట్లాడినా వినే ఓపిక లేదన్నారు.

అంబేద్కర్ ను అవమానపరుస్తున్నారు - రావుల..
అంబేద్కర్ ను వైసీపీ అవమానపరుస్తోందని రావుల చంద్రశేఖర్ పేర్కొన్నారు. సభలో గందరగోళం సృష్టించడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని దమ్ముంటే కాల్ మనీ చర్చకు రావాలని, చర్చించడానికి వైసీపీ సభ్యులు భయపడుతున్నారని తెలిపారు. నేరస్తులందరూ వైసీపీ నేతలని ఆరోపించారు. గనులను దోచుకున్నారని, ఇసుక మాఫియాను సర్వ నాశనం చేశారని రావుల ఆరోపించారు. 

ఏపీ శాసనసభ ప్రారంభం..వాయిదా..

హైదరాబాద్ : ఏపీ శాసనసభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో ఆ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు. దీనితో స్పీకర్ కోడెల పది నిమిషాల పాటు వాయిదా వేశారు. 

కాల్ మనీపై రేపు చర్చ – యనమల..

హైదరాబాద్ : కాల్ మనీ వ్యవహారంపై శాసనసభలో రేపు చర్చించాలని బీఏసీలో నిర్ణయించడం జరిగిందని ఏపీ మంత్రి యనమల పేర్కొన్నారు. రేపు ఈ అంశంపై చర్చిద్దామని, ప్రతిపక్షాలు సహకరించాలని యనమల కోరారు. 

వైసీపీ వాయిదా తీర్మానం తిరస్కారం..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీనితో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. 

09:24 - December 17, 2015

తూర్పుగోదావరి : జిల్లా వ్యాప్తంగా పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. కాల్ మనీ వ్యవహారం నేపథ్యంలో పలువురు వడ్డీ వ్యాపారస్థుల ఇళ్లపై పోలీసులు దాడులు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 38 మంది వడ్డీ వ్యాపారస్తులను అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలు కీలక పరిణామలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కాల్ మనీ వెనుక అధికార పక్షానికి చెందిన సభ్యుల ప్రమేయం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో సీపీ సెలవు వెళుతుండడంపై విమర్శలు రావడంతో నవాంగ్ వెనక్కితగ్గారు. ఈ కేసులో ఎంత మంది నేతల ప్రమేయం ఉందనే దానిపై మంత్రి యనమల గురువారం ఒక ప్రకటన చేశారు. 

09:15 - December 17, 2015

హైదరాబాద్ : శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం సహకరించాలని ప్రభుత్వ విప్, టిడిపి నేత యామిని బాల పేర్కొన్నారు. కొద్దిసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతకుముందు సీఎం చంద్రబాబునాయుడు, ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద యామిని బాల టెన్ టివితో మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యులు విమర్శలు విడనాడి..సమస్యలు తెలుసుకొనే సామాన్యుడిగా వ్యవహరించాలని సూచించారు. గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేయడం ద్వారా సమస్యలు వచ్చాయని, ఈ సమస్యలను సీఎం చంద్రబాబు ధీటుగా ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజా సమస్యలు చర్చించడానికి శీతాకాల సమావేశాలున్నాయని తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు సహకరిస్తే ఐదు రోజుల్లో సమస్యలపై చర్చించే అవకాశం ఉందని యామిని బాల తెలిపారు. 

బీఏసీ సమావేశం ప్రారంభం..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. అంతకుముందు బీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి వైసీపీ తరపున జ్యోతుల నెహ్రూ, శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ఒక రోజు పొడిగింపు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 

వైసీపీ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు..

హైదరాబాద్ : వైసీపీ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రవీంద్ర భారతి నుండి అసెంబ్లీకి జగన్..ఎమ్మెల్యేలు పాదయాత్ర చేపట్టారు. 

08:57 - December 17, 2015

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాబుతో పాటు ఎమ్మెల్యేలు కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఇక్కడి నుండి నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. స్పీకర్ కోడెల అధ్యక్షతనలో జరిగే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశానికి అధికార పక్షం తరపున సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటి సీఎం కేఈ, మంత్రి యనమల, ప్రభుత్వ చీప్ విప్ కాల్వ శ్రీనివాసులు పాల్గొననున్నారని తెలుస్తోంది. వైసీపీ తరపున జగన్ పాల్గొనడం లేదని సమాచారం. ఆ పార్టీ తరపున జ్యోతుల నెహ్రూ, శ్రీకాంత్ లు పాల్గొనున్నారు. మరోవైపు కాల్ మనీ వ్యవహారంపై సమగ్ర చర్చకు అనుమతించాలని ఏపీ అసెంబ్లీ విపక్ష వైసీపీ డిమాండ్ చేస్తోంది. తొలి రోజు వాయిదా తీర్మానాన్ని అందించింది. ప్రతిపక్షం ఏ అంశం లేవనెత్తినా దానిపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. కానీ రూల్స్ ప్రకారం చర్చకు వస్తే దానికి స్పీకర్ అనుమతినిస్తే అందుకు తాము సిద్ధమని ప్రభుత్వం పేర్కొంది. మొత్తం ఈ సమావేశాల్లో 12 ప్రాధాన్యత అంశాలున్నాయని వైసీపీ నిర్ణయించింది. ప్రస్తుతం వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరిస్తారా ? లేదా ? అన్నది వేచి చూడాలి. 

బాబు క్షమాపణలు చెప్పాలి - జగన్..

హైదరాబాద్ : కాల్ మనీ కేసులో సీఎం చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. కాల్ మనీ కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. 

వైసీపీ ఎమ్మెల్యేల పాదయాత్ర..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు రవీంద్రభారతి నుండి పాదయాత్రగా అసెంబ్లీకి వస్తున్నారు. 

వైసీపీ వాయిదా తీర్మానం..

హైదరాబాద్ : కాసేపటల్లో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కాల్ మనీ వ్యవహారంపై వైసీపీ తొలి వాయిదా తీర్మానం ఇచ్చింది.

08:31 - December 17, 2015

తినే ఆహారంలో టమాటా ఉపయోగిస్తాం. అయితే టమాటా ఆహారంగానే కాదు, చర్మసౌందర్యానికీ సహాయపడుతుంది. ఇందులో బోలెడు మేలు చేసే పోషకాలున్నాయి. జిడ్డు చర్మంతో బాధపడేవారికి టమాటాలు బాగా ఉపయోగపడతాయి. టమాటాని ముక్కలుగా కోసి, ముఖానికీ చేతులకీ రుద్ది పావు గంట తర్వాత కడిగేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకొని, బ్లాక్‌ హెడ్స్‌ తగ్గుతాయని బ్యూటీషియన్లు అంటున్నారు. అలాగే ఖరీదైన స్కిన్‌ టోనర్లకు బదులుగా చర్మానికి నిమ్మకాయ రసాన్ని వాడటం మంచిదని వారి సలహా. తద్వారా చర్మానికి ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవని అంటున్నారు. చర్మాన్ని శుభ్రపరిచి, మెరుపులాంటి ఛాయను ఇవ్వడానికి మాయిశ్చరైజింగ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్‌ చేసుకోవాలి. తాజా బొప్పాయిలో కొబ్బరిపాలు కలిపి, చర్మానికి రాసుకుంటే చర్మం మృదువుగా శాటిన్‌లా మెత్తగా మారుతుంది. దోమలు కుడితే నిమ్మరసానికి కొంచెం నీరు కలిపి దూదితో దోమ కుట్టిన చోట రుద్దితే మంట తగ్గిపోతుంది. చర్మం మృదువుగా మారేందుకు నారింజ రసం తీసుకుని, దానికి పాలు కలిపి ముఖానికి చేతులకు పట్టించాలి. నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఇలా చేస్తే మచ్చలు, చర్మ సంబంధ సమస్యల్ని దూరం చేయవచ్చు.

08:24 - December 17, 2015

చిత్తూరు : పంట పొలాలు నాశనమౌతున్నాయని..ఏనుగులు అడ్డుకొనేందుకు రైతులు వేస్తున్న విద్యుత్ కంచెలు విషాదాన్ని సృష్టిస్తున్నాయి. షాక్ లతో కొన్ని ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి. మూగజీవాలు మృతి చెందుతుండడం పట్ల విచారం వ్యక్తమౌతోంది. పల్లెకుప్పంలో ఏనుగులు దాడులు చేస్తుండడంతో పంట పొలాలకు రైతులు అనధికారికంగా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. ఒక మూడేళ్ల మగ ఏనుగు పంట పొలాల్లోకి ప్రవేశించింది. ఒక్కసారిగా విద్యుద్ఘాతం కలుగడంతో ఆ ఏనుగు అక్కడికక్కడనే మృత్యువాత పడింది. దీనితో అక్కడ విషాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. నారాయణ రెడ్డి అనే రైతుకు చెందిన పొలంగా భావిస్తున్నారు. ఈ అంశంపై అటవీ అధికారులు కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలాంటి కంచెలు ఏర్పాటు చేయడం వల్ల ఎనిమిది ఏనుగులు మృత్యువాత పడ్డాయి. లక్షలు పెట్టుబడులు పెట్టి పంటలు పండిస్తున్నామని, ఏనుగులు దాడులు చేయడంతో పంట పొలాలు నాశనమౌతున్నాయని రైతులు వాదిస్తున్నారు.

08:19 - December 17, 2015

అనంతపురం : సీపీఎం సీనియర్ నేత ప్రకాష్ కరత్ పర్యటనకు ఏపీ పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. సోలార్ ప్లాంట్ భూ నిర్వాసితులను పరామర్శించేందుకు పోలీసులు నో చెబుతున్నారు. దీనితో నంబులకుంటలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నంబులకుంటలోని సోలార్ ప్లాంట్ కు 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించింది. సీపీఎం నిర్వహించబోయే బహిరంగసభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. నవంబర్ 27న జిల్లాకార్యదర్శి రాంభూపాల్ సహా 22 మందికి పోలీసులు బైండోవర్ కేసులు పెట్టి, సమన్లు జారీ చేశారు. సోలార్ ప్లాంట్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకపోగా.. సమన్లు జారీ అయిన సీపీఎం నేతలపై నిఘా ఉంచారు.

పలు దఫాలుగా సీపీఎం ఆందోళన..
అనంతపురం జిల్లా నంబులకుంట సోలార్ ప్లాంట్ విషయంలో సీపీఎం పార్టీ పలు దఫాలుగా ఆందోళనలు చేస్తున్నా జిల్లా అధికార యంత్రాంగం, ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యహరిస్తోంది. సోలార్ ప్లాంట్ కోసం 7500 ఎకరాలు అవసరమవగా అందులో 300 ఎకరాలు పట్టాభూమి ఉంది. 2100 ఎకరాలు అసైన్డ్ భూమి వున్నట్టు అధికారులు గుర్తించారు. ఇందులో దాదాపు 4900 ఎకరాల వరకు సాగుదారులు సేద్యం చేస్తున్నదే. పట్టా ఉన్న వారికే పరిహారమన్నట్టుగా భూమిని సాగుచేస్తున్నవారికే నష్టపరిహారం అందించింది ప్రభుత్వం. 1156 మందికి ప్రభుత్వం మొండి చేయి చూపింది. రేషన్ కార్డుల ఆధారంగా లక్ష రూపాయల పరిహారం అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీనితో ఇతర జిల్లాలకు చెందిన కొంతమంది నకిలీ రేషన్ కార్డులతో పరిహారం జాబితాలోకి చేరిపోయారు. మరోవైపు పరిహారం అందించే వరకు నిర్మాణపనులు ఆపాలని చట్టం ఉన్నా అధికార టీడీపీ నిర్మాణాలను కొనసాగించడంపై సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోలార్ ప్లాంట్‌లో భూములు కోల్పోయిన రైతులకు 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది. కరత్ పర్యటన జరుగుతుందా ? లేదా ? అన్నది వేచి చూడాలి. 

యాదాద్రి గిరి ప్రదిక్షణను ప్రారంభించిన మోత్కుపల్లి..

నల్గొండ : యాదాద్రిని జిల్లా కేంద్రం చేయాలని టి.టిడిపి నేత మోత్కుపల్లి డిమాండ్ చేశారు. యాదాద్రి గిరి ప్రదిక్షణను మోత్కుపల్లి ప్రారంభించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. టిడిపి మహిళా అధ్యక్షురాలు శోభారాణి, టిడిపి, బిజెపి నేతలు హాజరయ్యారు. 

కాసేపట్లో ఎన్టీఆర్ ఘాట్ కు బాబు..ఎమ్మెల్యేలు..

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడు 8.15 ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళులు అర్పించనున్నారు. బాబుతో పాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా నివాళులర్పించనున్నారు. అనంతరం 8.45గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఒక రోజు పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. 

బోడుప్పల్ లో గుడిసెకు నిప్పు..వృద్ధుడు సజీవదహనం..

రంగారెడ్డి : మేడిపల్లి పీఎస్ పరిధిలోని బోడుప్పల్ లో విషాదం చోటు చేసుకుంది. గుడిసెకు నిప్పంటుకుని వృద్ధుడు ఆనందం సజీవదహనమయ్యాడు. 

చిత్తూరులో కాల్ మనీ అలజడి..

చిత్తూరు : జిల్లాలో కాల్ మనీ అలజడి సృష్టిస్తోంది. మదనపల్లిలో వడ్డీ వ్యాపారుల నివాసాలపై పోలీసులు దాడులు చేస్తున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

చిత్తూరులో పేలిన సిలిండర్..ఇద్దరు మృతి..

చిత్తూరు : ధర్మరాజులు గుడి వీధులోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. 

07:53 - December 17, 2015

కాల్ మనీ ఏపీని కుదిపేస్తోంది. ఇందులో పలువురు నేతల ప్రమోయం ఉందని పేర్కొంటూ నేతల పేర్లను ఏపీ మంత్రి యనమల బయటపెట్టారు. మరో వైపు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నగేష్ (విశ్లేషకులు), తులసిరెడ్డి (కాంగ్రెస్), శ్రీరాములు (టిడిపి), కరణం ధర్మశ్రీ (వైసిపి) అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:50 - December 17, 2015

సునీల్‌ హీరోగా వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి 'ఈడు గోల్డ్‌ ఎహే' టైటిల్‌ను ఖరారు చేశారు. ఏ.కే.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ''పూలరంగడు', 'మర్యాద రామన్న', 'భీమవరం బుల్లోడు', 'మిస్టర్‌ పెళ్ళి కొడుకు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన సునీల్‌ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. 'బిందాస్‌', 'దూసుకెళ్తా' వంటి వినోదాత్మక చిత్రాలను రూపొందించిన వీరు పోట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం గొప్ప విషయం. హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చిత్ర యూనిట్‌ తెలిపింది. సునీల్‌ ప్రస్తుతం 'కృష్ణాష్టమి' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

07:48 - December 17, 2015

'జబర్దస్త్‌' రేష్మి, ఆనంద్‌బాబు జంటగా డి.దివాకర్‌ దర్శకత్వంలో బాలాజీ నాగలింగం సమర్పణలో వి సినీ స్టూడియోస్‌ పతాకంపై వి.లీన నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన దర్శకుడు బి.గోపాల్‌ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నివ్వడంతోపాటు గౌరవ దర్శకత్వం వహించారు. కెమెరామెన్‌ జి.ప్రభాకర్‌రెడ్డి కెమెరా స్విచాన్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, 'ఇదొక డిఫరెంట్‌ హర్రర్‌ కామెడీ చిత్రం. ఆద్యంతం సస్పెన్స్‌గా సాగుతుంది. ఇందులో ఉండే ఒక ట్విస్ట్‌ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. 'అనగనగా ఒక చిత్రమ్‌' దర్శకుడు జి.ప్రభాకర్‌రెడ్డి ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ బుధవారం నుంచి ప్రారంభించి జనవరిలో పూర్తి చేయనున్నాం' అని అన్నారు. 'దర్శకుడు దివాకర్‌ ఏడాదిన్నరగా ఈ చిత్ర కథపై వర్కౌట్‌ చేశారు. ఫైనల్‌గా మంచి స్క్రిప్టు వచ్చింది. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తుంది' అని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. రేష్మి మాట్లాడుతూ, 'వైజాగ్‌కు చెందిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు చేస్తున్న చిత్రమిది. ఇందులో నటించే ఛాన్స్‌ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు' అని తెలిపారు. 'హర్రర్‌ కామెడీగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం' అని నిర్మాత లీన తెలిపారు. 

07:46 - December 17, 2015

వెంకటేష్‌ హీరోగా, నయనతార హీరోయిన్‌గా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న కొత్త చిత్రం బుధవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్‌ టెంపుల్‌లో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌నివ్వగా, సురేష్‌బాబు కెమెరా స్విచాన్‌ చేశారు. మొదటి షాట్‌కు వి.వి.వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మీడియాతో మాట్లాడారు. 'వెంకటేష్‌, మారుతి కాంబినేషన్‌లో రూపొందే సినిమాను నిర్మించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. 'ఉత్తమ విలన్‌', 'చీకటి రాజ్యం' వంటి విభిన్నమైన చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చిన జిబ్రాన్‌ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే మూడు అద్భుతమైన బాణీలు రెడీ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆదరించే విధంగా ఈ చిత్రాన్ని మారుతి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. నేటి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభి 2016 ప్రధమార్ధంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.

07:44 - December 17, 2015

జయసుధ.. భిన్న పాత్రల పోషణతో ప్రేక్షకుల్ని ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న నటి. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు వంటి అగ్ర హీరోలకు దీటుగా నటించి మెప్పించారంటే అతిశయోక్తి కాదు. సహజ నటనకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన జయసుధ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా జయసుధ సినీ ప్రస్థానంలోని కొన్ని విశేషాలు…
జయసుధ అసలు పేరు సుజాత. టీచర్‌, నర్స్‌ కావాలనుకున్న జయసుధ మేనత్త విజయ నిర్మల (నటి, దర్శకురాలు) స్ఫూర్తి, సపోర్ట్‌తో 1972లో వచ్చిన 'పండంటి కాపురం' చిత్రంతో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. అందులో అలనాటి నటి జమునకు కూతురిగా నటించారు. తర్వాత కె.బాలచందర్‌ దర్శ కత్వంలో రూపొందిన 'అరంగేట్రం', 'అపూర్వ రాగన్‌గల్‌' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

తొలి చిత్రం లక్ష్మణ రేఖ..
జయసుధ తెలుగులో నటించి తొలి చిత్రం 'లక్ష్మణ రేఖ'. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన 'జ్యోతి' చిత్రంతో టాలీవుడ్‌లో తొలి బ్రేక్‌ అందుకున్నారు. హీరోయిన్‌గా పీక్‌ టైమ్‌లో ఉన్నప్పుడు ఆమె నటించిన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళానికి చెందిన 24 సినిమాలు ఒక్క ఏడాదిలో విడుదలవ్వడం రికార్డ్‌. 43ఏళ్ళ సినీ కెరీర్‌లో ఐదు భాషల్లో 300లకు పైగా చిత్రాల్లో నటించారు. కె.రాఘవేంద్రరావు, దాసరి దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేశారు. 'ఇది కథ కాదు', 'ప్రేమ లేఖలు', 'అడవి రాముడు', 'శివరంజని', 'కటకటాల రుద్రయ్య', 'ప్రాణం ఖరీదు', 'ప్రేమాభిషేకం', 'నాదేశం', 'మేఘసందేశం', 'తాండ్ర పాపారాయుడు', 'ఆత్మ బంధువులు', 'ఒంటరి పోరాటం', 'కిరాయి దాదా', 'కలికాలం', 'రిక్షావోడు', 'కంటే కూతుర్నే కను' వంటి విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి అలరించారు.

2009లో ఎమ్మెల్యే..
నిర్మాతగా 'కాంచన సీత', 'కళికాలమ్‌', 'మేరా పతి సిర్ఫ్‌ మేరా హై', 'అదృష్టమ్‌', 'వింత కోడలు', 'హ్యాండ్స్‌ అప్‌' చిత్రాలను నిర్మించారు. ఉత్తమ నటిగా ఐదు నంది అవార్డులు, ఆరు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు, కళాసాగర్‌, లైఫ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు, ఏఎన్నార్‌ జాతీయ అవార్డు, ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా పురస్కారమందుకున్నారు. 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పటికీ కథాబలం ఉన్న చిత్రాల్లో విభిన్న క్యారెక్టర్స్‌తో నటిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు.

07:41 - December 17, 2015

ఏదైన పండుగ వస్తుందంటే సినీ పరిశ్రమల్లో సందడి షురూ అయినట్టే. ఆయా పండుగలను పురస్కరించుకుని తమ సినిమాలను విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు రంగం సిద్ధం చేసుకుంటారు. సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, క్రిస్మస్‌, రంజాన్‌ వంటి పండుగలు సాధారణ ప్రజలకే కాదు దర్శక, నిర్మాతలకు కూడా పెద్ద పెద్ద పండగలే. ఇక సినిమా ప్రేక్షకులకు, హీరో అభిమానులకైతే డబుల్‌ ధమాకే.. ఓ వైపు పండగ, మరో సినిమాల పండగతో ప్రేక్షకులు, ఆయా సినిమా హీరోల అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. ఈ ఏడాది పెద్ద పండగలలో క్రిస్మస్‌ ఒక్కటే మిగిలి ఉంది. ఈ రాబోయే క్రిస్మస్‌ బోల్డెన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళ చిత్రాల విడుదలతో భారీ వినోదానికి కేరాఫ్‌ అడ్రస్‌ కానుంది. ఇటువంటి సీజన్‌లో సినిమాల్ని విడుదల చేసి కాసిన్ని కాసుల్ని వెనకేసుకునేందుకు దర్శక, నిర్మాతలు ఇప్పట్నుంచే భారీ పబ్లిసిటీతో హోరెత్తిస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా దక్షిణాది సినీ ఇండిస్టీలలో భారీ చిత్రాలతోపాటు చిన్న సినిమాలు సైతం పోటీ పడుతూ సందడి చేసేందుకు సై అంటున్నాయి.

టాలీవుడ్‌..
క్రిస్మస్‌ కానుకగా తెలుగులో విడుదలయ్యే చిత్రాల జాబితా భారీగానే ఉంది. దాదాపు అరడజను చిత్రాలు ఈ పండుగ సందర్భంగా పోటీ పడుతున్నాయి. వీటిలో మంచు మోహన్‌బాబు, అల్లరి నరేష్‌ నటించిన 'మామ మంచు అల్లుడు కంచు' చిత్రం ముందు వరుసలో ఉంది. శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రాన్ని డిసెంబర్‌ 25న విడుదల చేయనున్నట్లు నిర్మాత మంచు విష్ణు ఇటీవలే ప్రకటించారు. దీంతోపాటు గోపీచంద్‌ హీరోగా కుటుంబం అనుబంధాల నేపథ్యంలో రూపొందిన 'సౌఖ్యం' చిత్రాన్ని కూడా ఈ నెల 25న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. 'లౌక్యం', 'జిల్‌' వంటి వరుస హిట్లతో దూకుడు మీదున్న గోపీచంద్‌ ఏడాది చివర్లో 'సౌఖ్యం'తో హ్యాట్రిక్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారు. ఏ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో గోపీచంద్‌ సరసన రెజీనా నటించింది. వీటితో పాటు సుధీర్‌బాబు, వామిక జంటగా కార్తికేయ ప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్‌ చిత్రం 'భలే మంచి రోజు' కూడా 25వ తేదీనే విడుదలకు రంగం సిద్ధం చేసుకుంది. అలాగే నాగశౌర్య హీరోగా రూపొందిన 'అబ్బాయితో అమ్మాయి' చిత్రం కూడా క్రిస్మస్‌ కానుకగా రిలీజ్‌ అవుతోంది. తమిళ స్టార్‌ సూర్య కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమైన 'మేము' చిత్రం కూడా ఈనెల 24వ తేదీన విడుదలవుతోంది.

కోలీవుడ్..
ఇటీవల చెన్నైలో వరదల కారణంగా కోలీవుడ్‌ దాదాపు 500 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. డిసెంబర్‌ 4వ తేదీన విడుదల కావాల్సిన నాలుగు చిత్రాలు వరదల కారణంగా విడుదల కాలేక పోయాయి. అలాగే దాదాపు 40 సినిమాలకు సంబంధించి షూటింగ్‌ ఏకంగా పదిహేను రోజుల పాటు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. వరదల వల్ల దక్షిణ భారత సినీ కార్మికుల సంఘం (ఫెఫ్సీ), మరో 24 సినిమా విభాగాలకు చెందిన సుమారు 25 వేల మంది కార్మికులు ఉపాథి కోల్పోయారు. వరద పరిస్థితుల నుంచి చెన్నై ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వచ్చింది. దీంతో కోలీవుడ్‌లో సైతం క్రిస్మస్‌ సందడి ఊపందుకుంది. క్రిస్మస్‌ పండుగని పురస్కరించుకుని ధనుష్‌ నటించిన 'తంగ మగన్‌'తోపాటు 'విల్‌ అంబు', 'విశరాణై' వంటి చిత్రాలున్నాయి. ధనుష్‌ సరసన సమంత, ఎమీ జాక్సన్‌ హీరోయిన్లుగా నటించిన 'తంగ మగన్‌' (తెలుగులో 'నవమన్మథుడు') చిత్రాన్ని డిసెంబర్‌ 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో వేల్‌రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్‌, కె.ఎస్‌.రవికుమార్‌ ధనుష్‌కి తల్లిదండ్రులుగా నటించారు. 'విల్‌అంబు'లో శ్రీ నటించగా, 'విశరాణై'లో దినేష్‌, పి.సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. డిసెంబర్‌ 25 క్రిస్మస్‌ రోజున సందడి చేయడానికి సిద్ధార్థ్‌ హీరోగా నటించిన 'జిల్‌ జంగ్‌ జక్‌' సిద్ధమవుతోంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి దీరజ్‌ వైడీ దర్శకత్వం వహించారు. అలాగే విజయ్ సేతుపతి, నందిత జంటగా నటించిన 'ఇదమ్‌ పోరుల్‌ ఎవల్‌', 'రంగం' (కో) చిత్రానికి సీక్వెల్‌గా బాబీ సింహా హీరోగా పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కిన 'కో 2', ఆటకత్తి దినేష్‌, మియా జంటగా నెల్సన్‌ దర్శకత్వంలో రూపొందిన 'ఓరు నాల్‌ కొత్తు' వంటి చిత్రాలు సైతం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. వీటితోపాటు సిబిరాజ్‌, సత్యరాజ్‌ నటించిన 'జాక్సన్‌ దురై', సేతు, విశాఖ సింగ్‌ జంటగా నటించిన 'వలిబా రాజా', నకుల్‌, సంతానం నటించిన 'నారాతన్‌' వంటి చిత్రాలు కూడా ఈ నెలాఖరులోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

మాలీవుడ్‌..
కోలీవుడ్‌ని చెన్నై వరదలు అతలాకుతలం చేస్తే, మాలీవుడ్‌ని థియేటర్ల సమ్మె నానా తిప్పలు పెడుతోంది. ఈ క్రిస్మస్‌కి మాలీవుడ్‌ సైతం సందడి చేసేందుకు పలు చిత్రాల విడుదలతో సిద్ధమైంది. అయితే థియేటర్‌ ఓనర్లకు, ప్రభుత్వానికి మధ్య టిక్కెట్లపై చెల్లించే వెల్ఫేర్‌ ఫండ్‌ విషయంలో సమన్వయం కుదరకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా థియేటర్‌ ఫెడరేషన్‌ థియేటర్ల బంద్‌కి పిలుపు నిచ్చింది. దీంతో ఈ క్రిస్మస్‌కి విడుదలయ్యే చిత్రాలపై తీవ్ర ప్రభావం చూపనుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మాలీవుడ్‌ సినీ పెద్దలందరూ తీవ్రంగా కృషి చేస్తున్నారు. మాలీవుడ్‌లో సైతం క్రిస్మస్‌ కానుకగా దాదాపు పదికిపైగా చిత్రాలు విడుదలవుతున్నాయి. దీంతో ఈ నెలాఖరులో పెద్ద సినిమాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. వీటిలో నివిన్‌ పౌలీ హీరోగా నటించిన 'యాక్షన్‌ హీరో బిజు', దుల్కర్‌ సల్మాన్‌, పార్వతి మీనన్‌ జంటగా నటించిన 'ఛార్లీ', పృథ్వీరాజ్‌, శోభన ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన 'పావడ', బద్రి, స్వస్తికా జంటగా రూపొందిన 'ఎట్‌ వన్స్‌' వంటి చిత్రాలు డిసెంబర్‌ 18న ప్రేక్షకులను అలరించనున్నాయి. యంగ్‌ హీరోల నాలుగు చిత్రాలు క్రిస్మస్‌ పండుగను వారం రోజుల ముందే తెస్తుండగా, డిసెంబర్‌ 24న మమ్ముట్టి నటించిన 'పుతియా నియమమ్‌' విడుదల కానుంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఒక్క రోజు గ్యాప్‌తో దిలీప్‌, మమతా మోహన్‌దాస్‌ హీరోహీరోయిన్లుగా రూపొందిన 'టూ కంట్రీస్‌', రీమా కళింగల్‌ నటించిన 'ఒప్పనా' చిత్రాలు డిసెంబర్‌ 25న విడుదలకానున్నాయి. మరో రెండు రోజుల గ్యాప్‌తో మమ్ముట్టి నటించిన 'ద న్యూస్‌ మేకర్‌' చిత్రం ప్రేక్షకులను అలరించడానికి రాబోతుండగా, 'వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ దేర్‌ వాజ్‌ ఏ కల్లన్‌', 'ఎడ్యూకేషన్‌ లోన్‌' వంటి చిన్న బడ్జెట్‌ చిత్రాలు కూడా సందడి చేయబోతున్నాయి.

బాలీవుడ్‌..
ఈ నెల 18న షారూఖ్‌ ఖాన్‌ 'దిల్‌వాలే', రణ్‌వీర్‌ సింగ్‌ 'బాజీరావ్‌ మస్తానీ' వంటి భారీ చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి. బాలీవుడ్‌ హిట్‌ జోడీ షారూఖ్‌ ఖాన్‌, కాజోల్‌ కలిసి నటించిన 'దిల్‌ వాలే'లో వరుణ్‌ ధావన్‌, కృతి సనన్‌ మరో జంటగా నటించారు. ప్రముఖ దర్శక,నిర్మాత సంజరు లీలా భన్సాలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'బాజీరావ్‌ మస్తానీ' చిత్రం డిసెంబర్‌ 18నే విడుదల కానుంది. మరాఠా పేష్వా భాజీరావ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో బాజీరావ్‌గా రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నారు. కాశీబాయిగా ప్రియాంక చోప్రా, మస్తానీగా దీపికా పదుకొనె నటించడంతో ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా క్రేజ్‌ నెలకొని ఉంది. వీటితోపాటు కొన్ని చిన్న చిత్రాలు కూడా క్రిస్మస్‌ కానుకగా విడుదలై అలరించనున్నాయి.

07:32 - December 17, 2015

వాతావరణ కాలుష్యం, రకరకాల షాంపూల వాడకంతో చిన్నవారి నుండి పెద్దల వరకు అందరికీ తెల్ల జుట్టు సర్వసాధారణమైంది. దాంతో డై వేసుకోవడం తప్పని సరైపోయింది. చాలామంది ఇంట్లోనే తలకు రంగు (హెయిర్‌డై) వేసుకుంటూ ఉంటారు. అయితే జుట్టుకు రంగు వేసుకునే సమయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే చర్మసమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

  • జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు చర్మానికి తగలకూడదు.
  • ముందుగా ముఖానికి, చెవులకు మాయిశ్చరైజర్‌ లేదా నూనె రాసుకొని తర్వాత డై వేసుకోవాలి.
  • తలంటుకునేటప్పుడు కూడా డై చర్మానికి తగలకుండా జాగ్రత్తపడాలి.
  • డై ఎంపికలో, నాణ్యత విషయంలో రాజీ పడకూడదు.
  • జుట్టు మంచి స్మెల్‌ రావాలంటే హెయిర్‌ సీరమ్‌ లేదా హెయిర్‌ స్ప్రేలను వాడాలి. అయితే ఈ సీరమ్స్‌, స్ప్రేలు మాడుకు, జుట్టు కుదుళ్లకు తగలకుండా జాగ్రత్తపడాలి. లేదంటే వీటిలో ఉండే గాఢ రసాయనాలు వెంట్రుక కుదురును దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి.

అందుకే జుట్టుకు డై వేసుకునేటప్పుడు తప్పకుండా పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

కేంద్ర మంత్రి మండలికి మోడీ విందు..

ఢిల్లీ : నేడు కేంద్ర మంత్రి మండలికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విందు ఇవ్వనున్నారు. ఇందులో మంత్రిత్వశాఖల పనితీరుపై మోడీ సమీక్ష చేయనున్నారు. 

ఉదయం 8.45 కు బీఏసీ సమావేశం..

హైదరాబాద్ : గురువారం ఉదయం 8:45 గంటలకు బీఏసీ సమావేశం జరుగనుంది. అసెంబ్లీ ఒకరోజు పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఉదయం 10 గంటలకు శాసనమండలి సభ ప్రారంభం కానుంది.

నంబులపూలకుంటకు కరత్ రాక..

అనంతపురం : నేడు నంబుల పూలకుంటలో సీపీఎం సీనియర్ నేత ప్రకాష్ కరత్ పర్యటించనున్నారు. సోలార్ ప్లాంట్ భూ నిర్వాసితులను కరత్ పరామర్శించనున్నారు.

నేటి నుండి విధుల్లో ఆశా వర్కర్లు..

హైదరాబాద్ : నేటి నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు విధులకు హాజరు కానున్నారు. వివిధ పార్టీలు, ప్రజా సంఘాల సూచన మేరకు ఆశా వర్కర్లు సమ్మెను వాయిదా వేశారు. 

07:08 - December 17, 2015

డ్రైవర్‌ రాకపోతే, డ్రైవింగ్‌ చేయమంటారు. కంప్యూటర్‌ పని చూడమంటారు. భూమి కొలతలేయమంటారు. ఇంటింటికీ తిరిగి శిస్తులు వసూలు చేసుకురావాలంటారు. ఎక్కడైనా అనాధ శవాలుంటే వాటికి కాపాలాకాయాలంటారు. ఇలా ఏపనికైనా వీఆర్‌ఏలే గుర్తొస్తారు. మరి వీఆర్‌ఏలకు ప్రభుత్వం ఇస్తున్నదేమిటి? భూమి శిస్తుల వసూలు, బకాయిదారులకు డిమాండ్‌ నోటీసులు అందించడం, భూమి కొలతలు, పంటల లెక్కలేయడం, చెరువుల నుండి, కాలువల నుండి భూములకు నీరు విడుదల చేయడం, జనన మరణాల వివరాలు సేకరించడం, గ్రామాల్లో జరిగే అధికారుల పర్యటనలు, సభలు, సమావేశాలు, జాతరలకు బందోబస్తు నిర్వహించడం ఇలాంటి సవాలక్ష పనుల భారం మోస్తున్నదీ వీఆర్‌ఎలే. శవ పంచనామాలు, అనాధ మృతదేహాలకు కాపలాకాయడం లాంటి విధులు నిర్వర్తించేదీ వీరే. వీరితో పొద్దస్తమానం పనులు చేయించుకుంటున్న ప్రభుత్వం సంక్షేమాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు.

అంతంత వేతనాలు..
అసలే అంతంత మాత్రపు వేతనాలిచ్చే ప్రభుత్వాలు గత ఏడాదిన్నర కాలంగా మరీ ఇబ్బంది పెడుతున్నాయి. 2014 ఫిబ్రవరి వరకు వీరికి జీరో 10 పద్దు కింద జీతాలిచ్చేవారు. అయితే, దానిని బడ్జెట్‌ కంట్రోల్‌లోకి మార్చడంతో వీరికి వేతన కష్టాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఏ నెలా సక్రమంగా జీతాలు రావడం లేదు. మూడు నాలుగు నెలలకోసారి ఇస్తున్నారు. దీంతో వీరు అప్పుల మీద అప్పులు చేయాల్సి వస్తోంది. వీఆర్‌ఏల మీద రోజురోజుకీ పనిభారం పెరుగుతోంది. పేరుకు పార్ట్‌ టైమ్‌ ఉద్యోగమే అయినా ఫుల్‌ టైమ్‌ కష్టపడాల్సి వస్తోంది. అధికారులు ఎప్పుడు ఎక్కడకు రమ్మంటే అప్పుడు అక్కడకు పరుగులు తీయాలి. నిబంధనలకు విరుద్ధంగా వీరితో అనేక పనులు చేయిస్తుండడం ఓ వాస్తవం. అనేక గ్రామ పంచాయతీలలో అటెండర్లు, వాచ్‌మెన్‌లు లేరు. ఆ డ్యూటీ కూడా వీరి నెత్తినే పడుతోంది. డ్రైవర్లు లేని చోట వాహనాల డ్రైవింగ్ కూడా వీఆర్‌ఎలతోనే చేయిస్తున్నారు. ఇంటర్‌, డిగ్రీ, పీజీ చేసిన వీఆర్‌ఏలకు అదనంగా కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ పనులు కూడా అప్పగిస్తున్నారు. కానీ, అందుకుతగ్గ అలవెన్స్‌లు కానీ, వేతనాలు కానీ ఇవ్వడం లేదు. 

07:05 - December 17, 2015

రెవెన్యూ శాఖలో అనేక పనులు చక్కబెడుతున్న వీఆర్‌ఏలు రకరకాల సమస్యలతో సతమవుతున్నారు. డిగ్రీలు, పీజీలు చేసి, ఈ ఉద్యోగంలో చేరినవారు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. వీఆర్‌ఏలు నిర్వర్తిస్తున్న విధులేమిటి? వారి డ్యూటీ చార్ట్‌ ఎలా వుంటుంది? వారికి లభిస్తున్న వేతనాలు ఎలా వున్నాయి? వీఆర్‌ఏల సంక్షేమానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది? వీఆర్‌ఏలు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై టెన్ టివి జనపథంలో ఆంధ్రప్రదేశ్‌ వీఆర్‌ఏల సంఘం నేత బాలకాశి విశ్లేషణ చేశారు. 

06:40 - December 17, 2015

ఢిల్లీ : సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు కేంద్రానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రిన్సిపల్ కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంలో సిబిఐ నిర్వహించిన దాడులతో కేంద్రానికి, కేజ్రీవాల్‌కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ పనితీరుపై దర్యాప్తు జరుపుతుండటం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గుండెల్లో దడ పుట్టిస్తోందని.. కేజ్రీవాల్ ఆరోపించారు. డిడిసిఏ పై దర్యాఫ్తునకు జైట్లీ ఎందుకు భయపడుతున్నారని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. సిబిఐ దాడుల్లో తమ ప్రభుత్వ కేబినెట్ మీటింగ్‌కు సంబంధించిన పత్రాలను కూడా సీజ్ చేశారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. డిడిసిఏ ఫైళ్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇతర నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను కూడా సిబిఐ సీజ్ చేసిందని చెప్పారు. సిబిఐ తమకు అవసరం లేని పైళ్లను ఎందుకు స్వాధీనం చేసుకుందని ప్రశ్నించారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.

దాడులకు ఎవరి అనుమతి అక్కర్లేదన్న సిబిఐ..
మరోవైపు సిబిఐ దాడులు జరిపే ముందు సీఎం అనుమతి తీసుకోవాలనే వాదనను సిబిఐ ఉన్నతాధికారులు తోసిపుచ్చారు. సిబిఐ దాడులకు ఎవరి అనుమతీ అక్కరలేదని తేల్చిచెప్పారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వం రాకముందే రాజేంద్రకుమార్ అవినీతి చర్యలకు పాల్పడ్డారని, అందుకే ఆయన ఇల్లు, కార్యాలయంపై దాడులు జరిపినట్టు సిబిఐ తెలిపింది. ఆయన బ్యాంకులో 28 లక్షల నగదు దొరికిందని, అదేవిధంగా పరిమితికి మించి 14 మద్యం బాటిళ్లు ఆయన నివాసంలో లభించాయని, వీటిని స్వాధీనం చేసుకున్నామని సిబిఐ తెలిపింది. ఇదిలావుండగా ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు పునరుద్ఘాటించారు. కళంకిత నాయకులను, అధికారులను ఆప్‌ రక్షిస్తుందని బిజెపి ఆరోపించింది. అవినీతికి వ్యతిరేకం అని చెప్పుకునే ఆయనకు యుటర్న్‌ అవార్డును ప్రదానం చేయాలని వ్యాఖ్యానించింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న సామాజిక వేత్త అన్నా హజారే మాట్లాడుతూ, కేజ్రీవాల్‌ తన అధికారి రాజేంద్ర కుమార్‌ గత చరిత్రను ఒక్కసారి పరిశీలించాలని సూచించారు.

జైట్లీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు..
ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కార్యాలయంపై సిబిఐ దాడికి సంబంధించి పార్లమెంట్‌ను తప్పు దోవపట్టించిన ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వనున్నట్టు ఆప్‌ నాయకులు వెల్లడించారు. మరోవైపు జైట్లీపై ఆప్‌ చేస్తున్న ఆరోపణలు నిజమేకావచ్చని బీజేపీ ఎంపీ కీర్తీ ఆజాద్‌ వ్యాఖ్యానించారు. డీడీసీఏలో గత పదేండ్లలో రూ. 400 కోట్లకుపైన అక్రమాలు జరిగాయి. ఈ విషయాన్ని కేజ్రీవాల్‌ బయటకులాగడం గమనించాల్సిన అంశమని కీర్తీ ఆజాద్‌ చెప్పారు.

06:37 - December 17, 2015

అనంతపురం : ఏపీలోని పలు జిల్లాల్లో మెడికల్ రిప్‌లు ఆందోళన బాట పట్టారు. బహుళజాతి కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు రిప్ లు. ధరలు తగ్గించి ప్రజలకు మందులను తక్కువ ధరకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఔషదాల తయారీలో బడా కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం నగరంలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ భారీ ర్యాలీ నిర్వహించారు. టవర్ క్లాక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ సప్తగిరి సర్కిల్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు సాగింది. మందుల ధరలు తగ్గించడంతో పాటు సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు మందుల విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. మెడికల్ విధానంలో చట్టం లేకపోవడంలో వల్ల మెడికల్ రెప్రజెంటేటివ్స్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

అన్ని జిల్లాల్లో ఆందోళన..
అటు కర్నూలు జిల్లాలోనూ ఔషధ ధరలపై ఎలాంటి పన్ను వేయరాదని డిమాండ్ చేస్తూ మెడికల్ రిప్స్ భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ రంగ మందుల కంపెనీలను పునఃరుద్దికరించాలని, పేటెంట్ చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు ఆరోగ్య విషయంలో ఆలసత్వం వహిస్తుందన్నారు. కడప జిల్లాలోనూ మెడికల్ రిప్ లు సేల్స్ ప్రమోటర్లు.. ఉద్యోగుల పని విధానాలను క్రమబద్దీకరించాలని, మహిళా రిప్ లకు ఆరు నెలలు ప్రసూతి సెలవులు నిర్ణయించాలంటూ ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు. తమ సమస్యలు ప్రభుత్వానికి విన్నవించడానికే ఈ తరహా నిర్ణయం తీసుకున్నామన్నారు ఎ.ఎం.ఆర్.ఐ. నాయకులు. మందుల ధరలు తగ్గించాలని, నేషనల్ డ్రగ్ పాలసీలో మార్పులు తీసుకురావాలని విశాఖ జిల్లాలోను మెడికల్ రిప్ లు డిమాండ్ చేసారు. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ మెడికల్ రిప్ లు ఆందోళన బాటపట్టారు. మందుల ధరలు తగ్గించాలని తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 

06:34 - December 17, 2015

హైదరాబాద్ : కృష్ణా నీటి పంపిణీపై ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చింది. పలు మార్లు జరిగిన బోర్డు సమావేశాల్లో ఎటూ తేలకుండా పోయిన సమస్యపై ఇరు రాష్ట్రాలు అవగాహనకు వచ్చాయి. ట్రిబ్యూనల్ ప్రకారం ఎవరెంత వాడుకోవాలో కృష్ణా నది యాజమాన్య బోర్డు స్పష్టత ఇచ్చింది. మరో కీలకమైన అంశమైన శ్రీశైలం డ్యాం మరమ్మత్తులపై ఓ కమిటీని వేసింది బోర్డు. అందుబాటులో ఉన్న కృష్ణా నీటి వాడకంపై ఇరు రాష్ట్రాల మధ్య కొంత కాలంగా సాగుతున్న వివాదానికి తెరపడింది. కృష్ణా బోర్డు చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ నీటి పారుదల సలహాదారు విద్యాసాగర్ రావుతో పాటు ఇరు రాష్ట్రాల సాగునీటి అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న 30 టిఎంసీల్లో ఎపి పది టిఎంసీలు, తెలంగాణ ఇరవై టిఎంసీలు వాడుకోవాలని సమావేశం నిర్ణయించింది. ఇందులో హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల కోసం 1.2 టిఎంసీలు విడుదల చేస్తారు. అయితే ఖరీఫ్ లో నీటి వాడకం ఆధారంగానే ఇప్పుడు నీటి కేటాయింపులు చేశారు. ఈసారి కృష్ణా ప్రాజెక్టుల్లో చేరిన నీటిని తమ వాటా కంటే ఏడు టిఎంసీలు ఎక్కువగా వాడుకున్నట్టు ఎపి అంగీకరించిందని, తెలంగాణ రాష్ట్రం తనకు రావాల్సిన నీటి కంటే తక్కువ వాడుకోవడంతో కోటా ప్రకారం కేటాయింపులు చేశారని తెలంగాణ సాగునీటి సలహాదారు విద్యాసాగరరావు తెలియచేశారు.

శ్రీశైలం డ్యాం పటిష్టత..
శ్రీశైలం డ్యాం పటిష్టత అంశాన్ని కూడా బోర్డు చర్చింది. గతంలో భారీగా వరదలు వచ్చిన సందర్భంలో డ్యాం ప్రమాదంలో పడిన ఉదంతాన్ని పరిగణలోకి తీసుకున్న బోర్డు తక్షణమే మరమ్మత్తులు చేయించాలని నిర్ణయించింది. ఇందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. రెండు రాష్ట్రాల సివోడీలతో ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ ఓ అధ్యయన సంస్థకు మరమ్మత్తు అంచనాల బాధ్యతను అప్పగిస్తుంది. కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు బోర్డు కేంద్ర జల సంఘానికి లేఖ రాసి మరమ్మత్తు కోసం చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టుల అంశంపై ఎపి తెలంగాణ ప్రభుత్వాల ప్రతినిధులు బోర్డుకు తమ వాదనలను వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న బోర్డు నిర్ణయాన్ని వాయిదా వేసింది. ప్రాజెక్టులను బోర్డు ఆధీనంలోకి తీసుకోవాలన్న అంశంపైనా చర్చలు వాయిదా పడ్డాయి.

06:28 - December 17, 2015

అనంతపురం : నేడు అనంతపురం జిల్లా నంబులకుంటలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కరత్‌ పర్యటించనున్నారు. సోలార్ ప్లాంట్ భూ నిర్వాసితులను ఆయన పరామర్శించనున్నారు. మరోవైపు ప్రకాశ్ కరత్ పర్యటనకు.. నంబులకుంటలో బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. నంబులకుంటలోని సోలార్ ప్లాంట్ కు 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించింది. అనంతపురం జిల్లా నంబులకుంట సోలార్ ప్లాంట్ విషయంలో సీపీఎం పార్టీ పలు దఫాలుగా ఆందోళనలు చేస్తున్నా జిల్లా అధికార యంత్రాంగం, ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యహరిస్తోంది. సోలార్ ప్లాంట్ కోసం 7500 ఎకరాలు అవసరమవగా అందులో 300 ఎకరాలు పట్టాభూమి ఉంది. 2100 ఎకరాలు అసైన్డ్ భూమి వున్నట్టు అధికారులు గుర్తించారు. ఇందులో దాదాపు 4900 ఎకరాల వరకు సాగుదారులు సేద్యం చేస్తున్నదే. పట్టా ఉన్న వారికే పరిహారమన్నట్టుగా భూమిని సాగుచేస్తున్నవారికే నష్టపరిహారం అందించింది ప్రభుత్వం. 1156 మందికి ప్రభుత్వం మొండి చేయి చూపింది. రేషన్ కార్డుల ఆధారంగా లక్ష రూపాయల పరిహారం అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

ప్రభుత్వం ఏకపక్షం పట్ల అనుమానాలు...
దీంతో ఇతర జిల్లాలకు చెందిన కొంతమంది నకిలీ రేషన్ కార్డులతో పరిహారం జాబితాలోకి చేరిపోయారు. మరోవైపు పరిహారం అందించే వరకు నిర్మాణపనులు ఆపాలని చట్టం ఉన్నా అధికార టీడీపీ నిర్మాణాలను కొనసాగించడంపై సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సీపీఎం పొలిట్‌ బ్యూర్ సభ్యులు ప్రకాష్ కరత్ నంబులకుంటలో పర్యటించనున్నారు. సీపీఎం నిర్వహించబోయే బహిరంగసభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అంతేకాకుండా నంబులకుంట సోలార్ ప్లాంట్‌కు 500 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ విధించారు. సోలార్ ప్లాంట్‌లో భూములు కోల్పోయిన రైతలకు 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది. నవంబర్ 27న జిల్లాకార్యదర్శి రాంభూపాల్ సహా 22 మందికి పోలీసులు బైండోవర్ కేసులు పెట్టి, సమన్లు జారీ చేశారు. సోలార్ ప్లాంట్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకపోగా.. సమన్లు జారీ అయిన సీపీఎం నేతలపై నిఘా ఉంచారు పోలీసులు. అవకతవకలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాల్సి ఉంది. అటు ప్లాంట్ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

06:25 - December 17, 2015

విజయవాడ : ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు డిమాండ్లతో రోడ్డెక్కిన వీఆర్‌ఏలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. విజయవాడలో ఆందోళనకు దిగిన వీఆర్‌ఏలను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. 43 రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వీఆర్‌ఏలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనను పట్టించుకోకపోవడంతో వీఆర్‌ఏలు బుధవారం రాత్రి సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలిపారు. రామవరప్పాడులో 9 మంది వీఆర్‌ఏలు తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో సెల్‌ టవర్‌ ఎక్కారు. వీరికి మద్దతుగా భారీసంఖ్యలో వచ్చిన వీఆర్‌ఏలు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ స్తంభించింది. అక్కడికి వచ్చిన పోలీసులు వీఆర్‌ఏలను బలవంతంగా ఈడ్చి పడేశారు. అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో వీఆర్‌ఏలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇందులో కొందరు వీఆర్‌ఏలు సృహతప్పి పడిపోయారు. ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు, హెల్త్‌ కార్డులు, తదితర డిమాండ్లతో 43 రోజులుగా ధర్నాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపడితే బలవంతంగా అరెస్ట్‌ చేస్తున్నారని వీఆర్‌ఏలు ప్రభుత్వంపై మండిపడ్డారు. కేబినెట్‌ సమావేశంలోనూ తమ సమస్యలపట్ల చర్చ జరపలేదని వీఆర్‌ఏలు ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వీఆర్‌ఏలు హెచ్చరించారు. 

06:22 - December 17, 2015

విజయవాడ : కాల్ మనీ వ్యవహారం అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ కేసులో టీడీపీ నేతలే ఎక్కువగా ఉన్నారన్న వార్తలు వస్తుండటంతో చంద్రబాబు ఈ కేసును మసకబరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయించడం చిన్నా చితకా వడ్డీ వ్యాపారులను స్టేషన్లకు పిలిచి నానా హైరానా చేస్తున్నారు అధికారులు. విషయాన్ని ఇంతటితో ముగించేందుకు అధికారపార్టీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాల్‌మనీ వ్యవహారంలో టీడీపీకి చెందిన బడానేతల పేర్లు ఉండడంతో చంద్రబాబు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేబినెట్ సమావేశంలోనూ కాల్ మనీపై సుదీర్ఘంగా చర్చించారు నేతలు. తీరా తేల్చిందేంటయ్యా అంటే కాల్ మనీలో అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఉన్నారంటూ మంత్రులు చెప్పుకొచ్చారు. మొత్తం మీద 80 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నామని అందులో 44 మంది వైఎస్ఆర్ పార్టీ నేతలు వారి అనుచరులు ఉన్నట్లు, 20 మంది తెలుగుదేశం పార్టీ , 13 మంది కాంగ్రెస్ ఉన్నట్లు యనమల తెలిపారు. కాల్ మనీ అరాచకాలపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామని, మనీలాండరింగ్ చట్టాన్ని కూడా కేబినెట్ సమావేశంలో ఆమోదించారు.

పక్కదారి పడుతున్న కేసు..
కాల్ మనీ కేసులో కనబడిన వడ్డీ వ్యాపారినల్లా తీసుకువచ్చి వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో వ్యవహారం పక్కదారిపడుతోంది. ప్రభుత్వ వ్యూహం కూడా అదే కావడంతో టీడీపీ నేతలు కాస్త కుదుటపడుతున్నారు. కాల్ మనీ కేసులో ఇప్పటి వరకు 123 మందిపై కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. అత్యధికంగా విజయవాడలో 42 కేసులు నమోదు అయ్యాయి. దీనిలో భాగంగా 118 మందిని అరెస్టు చేశారు. అటు తూర్పు గోదావరి జిల్లాలోను అధికారులు వడ్డీ వ్యాపారుల ఇళ్లపై సోదాలు తనిఖీలు మొదలుపెట్టారు. అయిదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 14 చెక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న లంకా ఆదినారయణ, చిల్ల జగన్నాథరావు, బుక్కా శ్రీనవాసరావును అరెస్టు చేసి వారి వద్ద నుంచి 177 ఖాళీ ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని పిఠాపురం సీఐ ఉమర్ తెలిపారు.

సెలవును రద్దు చేసుకున్న సీపీ..
అటు కర్నూలు జిల్లాలోను అక్రమ వడ్డీవ్యాపారులు, మోటారు ఫైనాన్స్ కార్యాలయాలపై పోలీసులు సోదాలు చేశారు. జోహరాపురానికి చెందిన ఆరుగురు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు చేసి ఎనిమిది లెడ్జర్ బుక్కులు , 50 బాండు పేపర్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నాలుగు మోటారు ఫైనాన్స్ కార్యాలయాల్లో జరిపిన దాడుల్లో ప్రాంసరీ నోట్లు సంతకాలు చేసిన ఖాళీ పత్రాలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ రవికృష్ణ తెలిపారు.
ఇది ఇలా ఉండగా కేసును నీరు గార్చేందుకే విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ నవాంగ్ ను సెలవుపై పంపిస్తున్నారన్న వాదనలు వెలువడ్డాయి. దీంతో సీపీ తన సెలవును రద్దు చేసుకుని మరీ.. విధుల్లో కొనసాగుతున్నారు. వాస్తావానికి కీలకమైన కేసులు నడుస్తున్నప్పుడు సెలవులు మంజూరు కావు. ఒక వేళ మంజూరు అయినా అవి రద్దవుతాయి. కాని సెలవులు కావాలనే ప్రభుత్వం ఇచ్చిందని.. ఇది ముమ్మాటికీ కేసును పక్కదారి పట్టించేందుకే అన్నది పలువురి వాదన.  

06:19 - December 17, 2015

మెదక్ : జీవితాన్ని నిలబెడుతుందనుకున్న చదువు ప్రాణాన్నే మింగేసింది..! భవిష్యత్‌ను తీర్చిదిద్దుతుందనుకున్న విద్య బతుకును చిదిమేసింది ! లెక్చరర్ల వేధింపులు తట్టుకోలేక ఓ విద్యా కుసుమం జీవితం అర్ధాంతరంగా ముగిసింది. మెదక్‌ జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమలలోని నారాయణ గ్రూప్స్‌కు చెందిన ఐఐటీ క్యాంపస్‌లో దారుణం జరిగింది. నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న హృతిక్‌ నందన్‌రెడ్డి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ ఫ్రెండ్‌ ఆత్మహత్యకు పాల్పడడంతో తోటి విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హృతిక్‌ మృతికి వైస్‌ ప్రిన్సిపాల్‌ వైఖరే కారణమంటూ క్యాంపస్‌ కార్యాలయ అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్ధుల ఆందోళనను అడ్డుకున్నారు.

వేధింపులే కారణం..
హృతిక్‌ ఆత్మహత్యకు వైస్‌ ప్రిన్సిపాల్‌ మధుసూదన్‌రెడ్డి వేధింపులే కారణమని తోటి విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. హృతిక్‌ సరిగా చదవడం లేదని.. తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పడంతో మనస్థాపానికి గురైన హృతిక్‌ ఈ దురాఘతానికి పాల్పడినట్లు ఫ్రెండ్స్‌ చెబుతున్నారు. అందరితో కలిసిమెలిసి ఉండే హృతిక్‌.. ఈ విషయాన్ని అవమానంగా భావించి మధ్యాహ్నం నుంచి రూమ్‌ నుంచి బయటకు రాలేదన్నారు. ఈ విషయాన్ని సాయంత్రం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా.. ఫ్యాన్‌కు ఉరేసుకున్న హృతిక్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు విద్యార్ధులు చెబుతున్నారు. 

సాయంత్రం వరకు సమాచారం లేదన్న కుటుంబసభ్యులు..
ఇదిలా ఉంటే.. ఈ ఘటన మధ్యాహ్నం జరిగినా సాయంత్రం వరకు తమకు సమాచారం అందించలేదని హృతిక్‌ తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. హృతిక్‌ మృతి చెందిన తర్వాత ఫోన్‌ చేసి.. మీ కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మాత్రమే చెప్పారని.. తర్వాత ఎన్నిసార్లు ఫోన్లు చేసినా కళాశాల యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. మరోవైపు క్యాంపస్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని పలువురు విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. తమను జైల్లో బంధించినట్లు బంధిస్తున్నారని.. కనీసం మంచినీళ్లకు సైతం వెళ్లనీయడం లేదంటున్నారు. ఈ క్యాంపస్‌లో 800 మంది విద్యార్ధులకు మాత్రమే సౌకర్యాలు ఉండగా.. 2500 మంది విద్యార్ధులను చేర్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ అనేకమంది విద్యార్ధులను కూడా వైస్‌ ప్రిన్సిపాల్‌ ఇలాగే వేధించారని విద్యార్ధులు చెబుతున్నారు. ఇంత జరిగినా ఇంతవరకు కళాశాల యాజమాన్యం స్పందించకపోవడం దారుణమని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

06:17 - December 17, 2015

మహబూబ్ నగర్ : మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది టీడీపీ పరిస్థితి. తెలంగాణలో అంతంతమాత్రంగానే ఉన్న పార్టీకి రోజుకో కొత్త చిక్కు వచ్చి పడుతోంది. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో పలువురు నేతలు అడ్డంగా బుక్‌ కాగా.. తాజాగా మరో ఎమ్మెల్యే ఇంటిపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. తనిఖీల్లో పలు ఆస్తులు బయటపడ్డాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఇంటిపై కర్నాటకకు చెందిన ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. తెలంగాణలో స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో.. ఈ దాడులు జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఏకకాలంలో దాడులు...
ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలతో రాజేందర్‌రెడ్డి నివాసంతో పాటు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. అదేవిధంగా కర్ణాటక రాయచూర్‌లో రాజేందర్‌రెడ్డికి చెందిన నవోదయ మెడికల్‌ కళాశాలలోనూ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 30 మంది అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో దాదాపు 18 కోట్ల రూపాయల నగదు, విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మెడికల్‌ కాలేజీకి సంబంధించిన నగదును బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయాల్సి ఉన్నప్పటికీ రాజేందర్‌రెడ్డి తన కార్యాలయంలోనే ఉంచుకున్నట్లు సమాచారం. మరోవైపు ఈ తనిఖీలు బుధవారం ఉదయం నుంచే జరుగుతున్నప్పటికీ రాత్రి వరకు సమాచారం బయటకు పొక్కలేదు. రాయచూర్‌లోని మెడికల్‌ కాలేజీ వద్ద పోలీసుల హడావుడి ఉండడంతో ఐటీ దాడుల విషయం బయటపడింది. ఇదిలా వుంటే మెడికల్‌ కాలేజీలోకి మీడియా ప్రతినిధులను పోలీసులు అనుమతించలేదు. స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. టీడీపీ ఎమ్మెల్యే ఇంటిపై ఐటీ శాఖ దాడులు నిర్వహించడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. గతంలో ఓటుకు నోటు కేసు వ్యవహారంతో ఎన్నో ఇబ్బందులు పడ్డ టీడీపీ.. ఈ అంశంతో ఎలాంటి పరిణామాలు ఫేస్‌ చేస్తుందో వేచి చూడాలి.  

నేటి నుండి ఏపీ అసెంబ్లీ..

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 22వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహప్రతివ్యూహాలతో అధికార ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. 

నేటి నుండి ఢిల్లీలో ఐసీఎస్ఐ కన్వెన్షన్..

హైదరాబాద్: కంపెనీ సెక్రటరీలకు సంబంధించిన అత్యున్నత సంస్థ ఐసీఎస్‌ఐ 43వ జాతీయ కన్వెన్షన్ గురువారం నుండి ప్రారంభం కానుంది. మేక్ ఇన్ ఇండియా థీమ్‌తో 3 రోజుల పాటు ఈ కన్వెన్షన్‌ను ఢిల్లీలో నిర్వహిస్తామని ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) ఒక ప్రకటనలో తెలిపింది.

నారాయణపూర్ ఎమ్మెల్యే ఇంటిపై ఐటీ దాడి..

మహబూబ్ నగర్ : నారాయణాపూర్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిపై ఐటీ అధికారులు దాడులు జరిపారు. రాయచూర్ లోని ఇళ్లు, కార్యాలయాలపై ఈ దాడులు జరిగాయి. రూ.18 కోట్ల నగదు, కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.

 

రాజమండ్రిలో వడ్డీ వ్యాపారి ఇంటిపై పోలీసుల సోదాలు..

రాజమండ్రి : రూరల్ (మం) కొంతమూరులో ఓ వడ్డీ వ్యాపారీ నివాసంలో ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. మూడు కేజీల బంగారం, 200 ప్రామిసరీ నోట్లు, రూ.5లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

విశాఖలో పోలీసులు దాడులు..

విశాఖపట్టణం : నగరంలో 20 ఫైనాన్స్ కార్యాలయాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఐదు కంపెనీలపై కేసు నమోదు చేశారు. 100కు పైగా ప్రామిసరీ నోట్లు, చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. 

Don't Miss