Activities calendar

18 December 2015

21:34 - December 18, 2015

ఢిల్లీ : మూడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న నిర్భయ అత్యాచారం కేసులో జువైనల్ నేరస్తుడికి ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి బాల నేరస్తుడి విడుదలపై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో నేరస్తుడు ఈ నెల 20న విడుదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.

తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడైనట్లు నిఘావర్గాలు....

బాల నేరస్థుడు జువెనైల్‌ హోంలో తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడైనట్లు నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ కేసులో నిందితుడికి శిక్షను పొడిగించాలని కేంద్రం కూడా హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది.

నిర్భయ కేసులో బాల నేరస్థుడే ప్రధాన నిందితుడు...

నిర్భయ కేసులో బాల నేరస్థుడే ప్రధాన నిందితుడని, మృగంలా ప్రవర్తించిన అతడిని విడుదల చేయడం సరికాదని బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి హైకోర్టుని అభ్యర్థించారు. ఇలాంటి తీవ్ర నేరాలకు తగిన శిక్ష పడేలా చట్టాన్ని రూపొందించాలని కోరారు. అయితే జువైనల్ నేరస్తుడి విడుదలను ఆపలేమని, ఇందుకు చట్టం సహకరించదని హైకోర్టు స్పష్టం చేసింది.

బాల నేరస్థుడి వయసు18 ఏళ్లు....

నిర్భయ కేసులో అరెస్ట్‌ అయిన సమయంలో బాల నేరస్థుడి వయసు18 ఏళ్లు. అతడు మైనర్ కావడంతో మూడేళ్లు జువెనైల్‌ హోంలో గడపాలని అప్పట్లో ట్రయల్‌ కోర్టు ఆదేశించింది. అయితే ఆ మైనర్‌ ఇపుడు 21 ఏళ్ల మేజర్ కావడంతో విడుదల కానున్నాడు.

నేరమే గొలుపొందింది....

నిర్భయ కేసులో నేరమే గొలుపొందిందని, తాము ఓటమి చెందామని నిర్భయ పేరెంట్స్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు తమను సంతృప్తి పరచలేదన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చట్టాన్ని మార్చాలని నిర్భయ పేరెంట్స్‌ ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. బాల నేరస్థుడు అతి కిరాతకుడని, అతడిని విడుదల చేయడం సమాజానికి ప్రమాదమని హెచ్చరించారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల్లో నలుగురు రేపిస్టులకు ట్రయల్‌ కోర్టు మరణశిక్ష విధించింది. వీరు చేసుకున్న అప్పీలు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. మరొకరు తీహార్‌ జైలులో మృతి చెందగా, బాల నేరస్థుడిని జువెనైల్‌ హోంకు పంపింది.

నిర్భయ పేరు.. జ్యోతిసింగ్‌. ...

కిరాతకుల పైశాచికత్వానికి బలి పశువైన నిర్భయ పేరు.. జ్యోతిసింగ్‌. తమ కూతురు పేరును తల్లిదండ్రులు రెండు రోజుల క్రితం వెల్లడించారు. 2012 డిసెంబరు 16న ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఓ పారా మెడికల్‌ విద్యార్థినిపై మైనర్‌ బాలుడితో పాటు ఆరుగురు వ్యక్తులు అతి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బస్సు నుంచి రోడ్డు మీదకి తోసివేసి వెళ్లిపోయారు. కొద్ది రోజులపాటు ప్రాణాలతో పోరాడిన బాధితురాలు జ్యోతిసింగ్‌ చికిత్స పొందుతూ మృతి చెందింది. 

21:30 - December 18, 2015

ఢిల్లీ : నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ రేపు పాటియాలా హౌజ్‌ కోర్టులో హాజరు కానున్నారు. ఈ విషయాన్ని సోనియా గాంధీ ధృవీకరించారు. దీనిపై రేపు విచారణ జరగనుంది. ఈ కేసులో వారు ఇంతవరకు బెయిలు బాండ్‌ నింపలేదు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కాంగ్రెస్‌ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కోర్టుకు నమ్మకం కలిగించేందుకే బెయిలు తీసుకోవడం లేదని సమాచారం. నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి సోనియా, రాహుల్ డిసెంబర్‌ 19న పాటియాలా కోర్టులో హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. సోనియా కోర్టుకు హాజరయ్యే రోజు కాంగ్రెస్‌ భారీ మార్చ్‌ నిర్వహించే యోచనలో ఉంది.

21:25 - December 18, 2015

హైదరాబాద్ :కాల్‌మనీ వ్యవహారం ఏపీ శాసనసభను కుదిపేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తుండగానే ప్రతిపక్ష సభ్యులు అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాల్‌మనీ వ్యవహారంపై అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కాల్‌మనీ వ్యవహారంలో ప్రతిపక్ష వైసిపి సభ్యుల గుట్టు రట్టు అవుతున్నందునే ఆ పార్టీ సభ్యులు సభ జరగకుండా అడ్డుపడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్‌మనీ వ్యవహారంలో నిందితులెవరైనా వారిపై కఠినచర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు సభలో ప్రకటించారు. అధిక వడ్డీ వ్యాపారాన్ని నియంత్రించడానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామన్నారు.

ముఖ్యమంత్రి చర్చ ప్రారంభించగానే....

కాల్‌మనీ వ్యవహారం ఏపీ శాసనసభలో ప్రకంపనలు సృష్టించింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చర్చ ప్రారంభించగానే ప్రతిపక్ష వైసిపి సభ్యులు ఆందోళన చేపట్టారు. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్‌ ఎంత విజ్ఞప్తి చేసినా ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గ లేదు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహా అధికార పార్టీ సభ్యులంతా వైసిపి వైఖరిపై తీవ్రంగా స్పందించారు.

మర్యాద కాదని స్పీకర్‌ కోడెల ప్రతిపక్ష సభ్యులకు సూచన...

సభా నాయకుడు మాట్లాడుతుండగా ప్రతిపక్షం అడ్డుపడటం సభా మర్యాద కాదని స్పీకర్‌ కోడెల ప్రతిపక్ష సభ్యులకు సూచించారు. సభా నాయకుడిపై దాడి చేసేందుకు వెళ్తారా అని సభ్యులను ప్రశ్నించారు.

బండారం బయటపడుతుందని...

కాల్‌మనీ వ్యవహారంపై చర్చ జరిగితే తమ బండారం బయటపడుతుందని వైకాపా సభ్యులు ఆందోళన చెందుతున్నారని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఇలాంటి ఎమ్మెల్యేలను ఎన్నుకున్నందుకు ఆయా నియోజకవర్గ ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు.

చర్చకు ప్రతిపక్షం సిద్ధంగా లేదు...

కాల్‌మనీపై చర్చకు ప్రతిపక్షం సిద్ధంగా లేదని తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సభలో గందరగోళం సృష్టించి చర్చను పక్కదోవ పట్టించేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాల్‌మనీపై చర్చను నీరుగార్చేందుకు ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నిస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే అనిత ఆరోపించారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజాను ఏడాది పాటు సస్పెండ్‌ చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

చంద్రబాబునాయుడే ప్రధాన నిందితుడు...

కాల్‌మనీ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ప్రధాన నిందితుడని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఆరోపించారు.తమకు అనుకూలంగా రూపొందించుకున్న నివేదికను ముఖ్యమంత్రి చదివితే తాము చూస్తూ వూరుకోవాలా? అని ప్రశ్నించారు.

ఏ పార్టీ వారు ఎంతమంది ఉన్నారో...

కాల్‌మనీ వ్యవహారంలో ఏ పార్టీ వారు ఎంతమంది ఉన్నారో లెక్కలను ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ప్రకటించారు. కాల్‌మనీ వ్యవహారంలో వైసిపి సభ్యుల గుట్టు రట్టు అవుతున్నందునే ఆ పార్టీ సభ్యులు సభ జరగకుండా అడ్డుపడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. కాల్‌మనీపై చర్చ సందర్బంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగడంతో స్పీకర్ సభను 10నిమిషాల పాటు వాయిదా వేశారు.  

21:21 - December 18, 2015

హైదరాబాద్: వైసిపి ఫైర్‌ బ్రాండ్‌గా పేరొందిన రోజాపై అసెంబ్లీలో వేటుపడింది. కాల్‌మనీ అంశంపై చర్చ నేపథ్యంలో అసెంబ్లీ దద్దరిల్లింది. ప్రతిపక్షాలు, అధికార పక్షం మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే సిఎం చంద్రబాబుపై అసభ్యకర పదజాలం వాడారని రోజాపై ప్రభుత్వ విప్‌లు అధ్యక్షునికి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ వ్యవహారాల మంత్రి సస్పెన్షన్ ప్రతిపాదన పెట్టడంతో స్పీకర్‌ ఓకే చేశారు.

అధికార పక్ష నేతలపై మాటల దాడి...

అదే స్వరం అదే గళం... అసెంబ్లీలో వైసిపి ఎమ్మెల్యే రోజా ఎప్పటిలానే ఫైర్‌ అయ్యారు. అధికార పక్ష నేతలపై మాటల దాడి కొనసాగించారు. ఏకంగా సిఎం చంద్రబాబును కాల్‌మనీ బాబు అని సంబోధించారని ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రోజా సభా గౌరవానికి భంగం వాటిల్లేలా ప్రవర్తించారని ప్రభుత్వ విప్‌లు స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.

తొలుత ప్రభుత్వ విప్‌ అనిత డిమాండ్....

రోజాను సస్పెండ్ చేయాలని తొలుత ప్రభుత్వ విప్‌ అనిత, ఆ తర్వాత చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. మరో విప్‌ ధూళిపాళ నరేంద్ర కూడా ఇదే డిమాండ్‌ చేయడంతో రోజాపై వేటు వేయడం ఖాయమనే వాతావరణం కనపడింది.

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని....

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అసభ్యకర పదజాలం వాడినందుకు రోజాను సంవత్సరంపాటు సస్పెండ్‌ చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదన పెట్టారు. ప్రతిపాదన మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు స్పీకర్‌ కోడెల ప్రకటించారు.

సంవత్సరం పాటు సస్పెండ్ చేయడం అన్యాయం...

తనను సంవత్సరం పాటు సస్పెండ్ చేయడం అన్యాయమని సభ వెలుపలికి వచ్చిన తర్వాత రోజా అన్నారు. యేడాదిపాటు సస్పెన్షన్‌ విధించడం నిబంధనల విరుద్ధమని ఆరోపించారు. రోజాను సస్పెండ్‌ చేసిన తర్వాత సభలో వైసిపి వ్యవహార విధానంలో కొంత మార్పు కనిపించింది. కాల్‌మనీ వ్యవహారంపై చర్చ కొంత సావధానంగా జరిగింది. 

రేపు స్పీకర్ కు వైసీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

హైదరాబాద్ : రేపు స్పీకర్ కు వైసీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వనుంది. స్పీకర్ సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని అభిప్రాయపడింది. అసెంబ్లీ నిబంధనలు న్యాయనిపుణులను సంప్రదించి ముందుకు వెళ్లాలని వైసీపీ నిర్ణయించినట్లు సమాచారం. ఓ ఎమ్మెల్యేను ఏడాది పాటు సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు లేదన్నారు. ఒక సెషన్స్ వరకే సస్పెండ్ చేసే అధికారం ఉంటుందని వైసీపీ అభిప్రాయపడింది.

జగన్ నాపై అసత్య ఆరోపణలు చేశారు : బుద్ధా వెంకన్న

హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా జగన్ నాపై అసత్య ఆరోపణలు చేశారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. మా అన్న నేను ఒకే ఇంట్లో ఉన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నేను సభలో ఉండుంటే సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ రెండు చెంపలు వాయించేవాడినని పేర్కొన్నారు. వైసీపీ నుంచి నాకు ప్రాణ హాని ఉందని 20 రోజుల క్రితమే పోలీసులు భద్రత కల్పించారని తెలిపారు. కృష్ణా జిల్లాలో వైసీపీ అరాచకాలకు అడ్డుపడుతున్నాననే నన్ను టార్గెట్ చేస్తున్నారని మండి పడ్డారు.

20:53 - December 18, 2015

హైదరాబాద్ : బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, కృతిసనన్ ప్రధాన పాత్రలుగా రూపొందిన చిత్రం దిల్ వాలే సినిమా ఈ రోజు విడుదలయ్యింది. షారుఖ్ ఖాన్ కు వ్యతిరేకంగా హిందూ మూక ఆందోళనకు దిగారు. ఢిల్లీ, ముంబై లో ఈ చిత్ర విడుదలైన థియేటర్ల వద్ద ఆందోళన చేస్తూ బ్యానర్లు, హోర్డింగ్ లును ధ్వసం చేశారు. సినిమాను ఎవరూ తిలకించవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ షారూఖ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా థియేటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న హార్దిక్

న్యూఢిల్లీ: పటేళ్ల ఉద్యమ కారుడు హార్దిక్ పటేల్ అహ్మదాబాద్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పటేల్ వర్గానికి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేసిన హార్దిక్ పటేల్ దేశ ద్రోహం కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. 
గతంలో హార్దిక్‌పటేల్ పై సూరత్‌లో కూడా దేశ ద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో ఈ నెల 11న అహ్మదాబాద్ సెషన్స్ కోర్టు హార్దిక్‌తోపాటు అనుచరులు చిరాగ్ పటేల్, దినేశ్ బంబానియాలకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో బెయిల్ కోసం హార్దిక్‌పటేల్ అహ్మదాబాద్ హైకోర్టులో దరఖాస్తు పెట్టుకున్నాడు.

పోలవరం ఎమ్మెల్యే కారులో మంటలు...

పశ్చిమగోదావరి : పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. హైదరాబాదులో శాసనసభ సమావేశాల్లో పాల్గొన్న ఆయన సభ వాయిదా అనంతరం కారులో వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఆయన వెంటనే కారుదిగేశారు. అనంతరం ఆ కారు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలార్పారు. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, తాను క్షేమమని ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలిపారు.

20:17 - December 18, 2015

ఆంధ్రా అసెంబ్లీలో అడుగుముంగటికి పడని ముచ్చట...గేట్లెక్కి గందరగోళం చేసినఎమ్మెల్యేలు.. చండీ యాగం కోసం చద్దరు సదరుండ్రీ...అందరినీ పిలుస్తున్న కేసీఆర్ సార్… అభివృద్ధిలో ఇరగదీస్తున్న చంద్రయ్యలు..మురిసి కిరీటాలు పెడుతున్న విదేశీయులు..హైదరాబాద్ లో అడుగు పెట్టిన ప్రణబ్ దాదా… 31 దాకా ఒకటే ప్రయాణం. హెల్మెట్ దందాకు ఊపు తెచ్చిన పోలీసులు...కరీంనగర్ ఉస్నాబాద్ కాడికి కథ.గజగజ వణుకుతున్న ఖానాపూరోళ్లు… కరుణించి కాపాడమంటూ వేడుకోలు...ఇత్యాది అంశాలపై మల్లన్న ముచ్చట్లలో మల్లన్న చెప్పిన చిత్ర… విచిత్ర విశేషాలను వినాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఏసీబీకి పట్టుబడ్డ డీఈ, ఈఈ

ఆదిలాబాద్: మంచిర్యాల సాగునీటిశాఖ కార్యాలయంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడులు చేశారు. మిషన్ కాకతీయ పనుల బిల్లుల చెల్లింపు నిమిత్తం లంచం తీసుకుంటూ ఇద్దరు ఇంజినీర్లు ఏసీబీకి ప్రత్యక్షంగా పట్టుబడ్డారు. రూ. 60 వేలు లంచం తీసుకుంటూ డీఈ రవీందర్‌రెడ్డి అదేవిధంగా రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఈఈ వినోద్‌కుమార్‌లు ఏసీబీకి పట్టుబడ్డారు. నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు ఇంజినీర్లిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

అనూప్ రూబెన్స్ కు మాతృవియోగం...

హైదరాబాద్ : టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌లో ఒకరిగా ఉన్న అనూప్ రూబెన్స్ ఇంట విషాదం నెలకొంది. యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తల్లి మనోహరమ్మ(65) బాత్ రూమ్‌లో కాలు జారిపడగా ఆ షాక్ తో ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో వెంటనే యశోదా ఆస్పత్రికి తరలించారు. అయితే డాక్టర్లు చేసిన ప్రయత్నం విఫలం కాగా మనోహరమ్మ ఈరోజు స్వర్గస్తులైనారు. అనూప్ తల్లి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు అనూప్‌ని ఓదార్చడమే కాక ఆమెకు తమ సంతాపాన్ని తెలియజేశారు.అనూప్ ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయన, సౌఖ్యం చిత్రాలతో బిజీగా ఉండగా సౌఖ్యం ఈ నెల 24న విడుదల కానుంది.

19:03 - December 18, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షానికి 30 నిమిషాలు, ప్రతిపక్షానికి 3 నిమిషాల అని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్ మనీ కేసుపై సభలో జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడుతూ...నేను లెక్కలు చెబుతుంటే చంద్రబాబు వెన్నులో వణుకుపడుతోందన్నారు. కాల్ మనీ పై సీఎం కు రెండు నెలల క్రితమే చెప్పినా స్పందన లేదని బాధిత మహిళ చెప్పినట్లు తెలిపారు. ఎమ్మెల్యేతో విదేశీ టూర్ కు వెళ్లిన నిందితుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. విదేశీల నుండి ఎమ్మెల్చే వచ్చారు.… నిందితుడు ఎందుకు రాలేదన్నారు.

టీఎస్ పీఎస్పీ పనితీరు భేష్ : జస్టిస్ సుభాషణ్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరు బాగుందని జస్టిస్ సుభాషణ్‌రెడ్డి అన్నారు. నేటితో టీఎస్‌పీఎస్సీ తొలి వసంతం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో మొదటి వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జస్టిస్ సుభాషణ్‌రెడ్డి మాట్లాడుతూ.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగ బద్దమైన సంస్థ. టీఎస్‌పీఎస్సీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడం అభినందనీయం. ఆదర్శవంతమైన టీఎస్‌పీఎస్సీని తీర్చిదిద్దినందుకు ఛైర్మన్, సభ్యులు, ఉద్యోగులకు అభినందనలు.

ఏసీబీ వలలో తలకొండపల్లి వీఆర్వో...

మహబూబ్‌నగర్: లంచం తీసుకుంటూ ఓ వీఆర్వో అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. తలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. రైతు నుంచి రూ. 4 వేలు లంచం తీసుకుంటుండగా వీఆర్వో నరసింహారెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు వీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు.

18:54 - December 18, 2015

హైదరాబాద్ : నేను నిజాయితీ గల కుటుంబం నుంచి వచ్చా… సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్యేగా గెలిచానని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. కాల్ మనీ వ్యవహారం పై జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడుతూ… కాల్ మనీ వ్యవహారంలో మిత్రులు ఉన్నంత మాత్రాన ఆ కేసుతో నాకు సంబంధం ఉంటుందా అని బోడే ప్రశ్నించారు. నేను భార్యా పిల్లతో విదేశాలకు వెళ్తే… ఇతర స్త్రీలతో జల్సాలు చేశానని తప్పు ప్రచారం చేశారు. గాలి జనార్థన్ రెడ్డి, గంగిరెడ్డి లాంటి ఆర్థిక తీవ్రవాదులతో జగన్ కు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. 

ఎమ్మెల్యేను ఏడాదిపాటు సస్పెండ్ చేసే అధికారం లేదు : జగన్

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు పై సభలో అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాను స్పీకర్ కోడెల శివప్రసాద్ ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ప్రతిపక్షనేత జగన్ మాట్లాడారు. ప్రివిలేజ్ మోషన్ ఇవ్వకుండా బాధ్యతగల ఎమ్మెల్యేను ఏడాదిపాటు సస్పెండ్ చేసే అధికారం లేదని అన్నారు. అనంతరం ఒక్క ఫోన్ చేస్తే చాలు, వచ్చి ఆడపిల్లలను ఆదుకుంటానని ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన చంద్రబాబు, విజయవాడలో అవసరానికి అప్పుతీసుకున్న మహిళలను వ్యభిచారంలోకి లాగుతుంటే చూస్తూ ఊరుకున్నారని ఆయన మండిపడ్డారు.

చర్చను తప్పుదోవ పట్టిస్తున్నారు : మాణిక్యాలరావు

హైదరాబాద్ : కాల్ మనీ వ్యవహరాంపై ఏపీ అసెంబ్లీలో చేపట్టిన చర్చ ను తప్పుదారి పట్టిందని ఏపీ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ప్రజల జీవితాలో సంబంధం వున్న ఈ అంశాన్ని రాజకీయ కోణం లో చూడకుండా మానవీయ కోణం చూడాలని కోరారు. ఆరోపణలతో సభా సమయం వృధా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకుని ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత సభ్యులందరిపైనా ఉందన్నారు.

వాటిపై నిర్భయ కేసులు : చంద్రబాబు

హైదరాబాద్ : మహిళలను వేధిస్తున్న కాల్ మనీ కేసులను నిర్భయ చట్టం కింద నమోదు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఏ పార్టీ వారైన చట్టం ప్రకారం శిక్షిస్తామని చెప్పారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి కేసుకు తాము స్పందిస్తున్నామని తెలిపారు. 'మీరు అడగకుండానే న్యాయవిచారణకు ఆదేశించామని ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి బాబు మాట్లాడారు.

 

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ప్రణబ్

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. ఈనెల 31 వరకు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. రేపు జరుగనున్న సికింద్రాబాద్ మిలిటరీ స్నాతకోత్సవానికి ప్రణబ్ హాజరవ్వనున్నారు. 

కాల్ మనీపై చర్చకు ప్రతిపక్షం వెనుకడుగు : కాల్వ

హైదరాబాద్ : కాల్ మనీపై చర్చకు ప్రతిపక్షం వెనుకడుగు వేస్తోందని టిడిపి ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. వైసిపి సభ్యులు సభలో రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షం అసత్యాలు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుందని ఎద్దేవా చేశారు.

 

17:59 - December 18, 2015

హైదరాబాద్ : కాల్ మనీ కేసులో ఎంతటి వారినైనా వదిలి పెట్టేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన కాల్ మనీ పై జరుగుతన్న చర్చలో ఆయన మాట్లాడుతూ ఏడు మంది ముద్దాయిల పై వివిధ రకాల సెక్షన్ల కింది కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా నిర్భయ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో 65 మంది వైసీపీవారు, 20 మంది టిడిపి, 12 మంది కాంగ్రెస్ వారు.. ఇంకా ఇతర పార్టీలు వారు ఉన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎందుర్కొంటున్న ఎమ్మెల్సీ సోదరుడిని కూడా అరెస్టు చేశామన్నారు. కాల్ మనీలో బలవంతంగా డబ్బులు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు. వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయని తెలిపారు. వాటిలో కాల్ మని, అగ్రీ గోల్డ్ లాంటి వ్యవహారాలు వచ్చాయి. వాటిపై తానే యాక్షన్ తీసుకున్నట్లు చెప్పారు. నూతన రాజధాని లో సవాలక్ష సమస్యలు ఉన్నాయి. ప్రపంచంలో నూతన రాజధానికి చెడ్డపేరు తెచ్చేందు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండి పడ్డారు. నేను ఎవ్వరికీ భయపడను. అన్యాయం చేసేవారిపట్ల… చట్టవ్యతిరేకుల పట్ల చండశాసననుడిగా ఉంటానన్నారు. నేను కూడా మనిషినే… మీరు తిట్టే తిట్లు, బాడీ ల్యాగ్వేజీ వల్ల నాకూ చాలా బాధ ఉందన్నారు. మీకు ఏదైనా సమాచారం ఉంటే ఇవ్వండి.. అది కూడా తీసుకుంటానన్నారు. న్యాయం, చట్టప్రకారం భవిష్యత్తులో నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు ఎక్కడా బయటకు రాకుండా శిక్షిస్తామన్నారు. ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా ప్రక్షాళన చేస్తానని హామీ ఇచ్చారు.

చంద్రబాబు మాటలు మోసపూరితం : గఫూర్, ఓబులేశం

విజయవాడ : సీఎం చంద్రబాబు మాటలు మోసపూరితమని సీఐటీయూ నేత గఫూర్, ఎఐటియూసి నేత ఓబులేశం విమర్శించారు. అంగన్ వాడీల పెంచిన వేతనాలను సెప్టెంబర్ నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

 

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీర్, మంత్రులు ప్రణబ్ కు ఘన స్వాగతం పలికారు.

17:47 - December 18, 2015

హైదరాబాద్ : శీతాల విడిది నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు గరవ్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తదితరలు ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర పత్రి 14 రోజుల పాటు హైదరాబాద్ లో బస చేయనున్నారు.

అంగన్ వాడీ వేతనాలపై సీఎం చంద్రబాబు ప్రకటన

హైదరాబాద్ : అంగన్ వాడీ వేతనాలపై ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేశారు. అంగన్ వాడీ వేతనాలు రూ.4,200 నుంచి 7000..., హెల్పర్ల వేతనాలను 2,200 నుంచి 4,500 వరకు పెంచుతున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెంచిన వేతనాలను అమలు చేస్తామని చెప్పారు.

 

17:43 - December 18, 2015

హైదరాబాద్ : వైసీపీ నేత జగన్ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆరోపించారు. ఆయన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ...జగన్ కు కాల్ మనీ గురించే మాట్లాడే నైతిక విలువ, అర్హత లేదన్నారు. తెలిసీ, తెలియని విధంగా ఎంతో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ రాష్ట్రంలో ఏ కుంభకోణం జరిగినా జగనే ప్రధాన నిందితుడని చెప్పారు. 

రోజా సస్పెన్షన్ పై వైసిపి సభ్యుల నిరసన

హైదరాబాద్ : ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై అసెంబ్లీలో వైసిపి సభ్యులు నిరసన తెలిపారు. రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ అప్రజాస్వామికమన్నారు. 

హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. రాష్ట్రపతికి గవర్నర్, సీఎం, మంత్రులు స్వాగతం పలికారు.

 

17:31 - December 18, 2015

హైదరాబాద్ : కాల్ మనీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడు పై అసభ్య పదజాలం ఉపయోగించిన నగరి ఎమ్మెల్యే రోజాను సంవత్సరం పాటు సస్పెండ్ చేయాలని స్పీకర్ ముందు ప్రతిపాదన చేశారు. దీంతో రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వెంటనే సభ నుంచి వెళ్లి పోవాలని స్పీకర్ ఆదేశించారు. మరో వైపు స్పీకర్ పోడియం చుట్టుముట్టిన వైసీపీ నేతలు రోజా పై సస్పెన్షన్ ఉపసంహరించుకోవాలని ఆందోళన చేపట్టారు. 

'కాల్ మనీ' ప్రకటనపై జగన్ అభ్యంతరం

హైదరాబాద్ : 'కాల్ మనీ' ప్రకటనపై వైసిపి అధినేత జగన్ అభ్యంతరం తెలిపారు. ఎక్కడైనా చర్చ జరిగిన తర్వాతే స్టేట్ మెంట్ ఇస్తారని ఆయన అన్నారు. స్టేట్ మెంట్ ఇచ్చిన తర్వాత చర్చ జరగదని పేర్కొన్నారు. స్టేట్ మెంట్ లో ఉన్నవి ఒకటి.. చంద్రబాబు చెప్పేవే మరోటని చెప్పారు. 

రోజా సంవత్సరం పాటు సస్పెండ్

హైదరాబాద్ : కాల్ మనీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడు పై అసభ్య పదజాలం ఉపయోగించిన నగరి ఎమ్మెల్యే రోజాను సభ నుండి సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

రోజాను సభ నుండి సస్పెండ్ చేయాలి : ధూళిపాళ్ల

హైదరాబాద్ : సభలో అసభ్య పదజాలం ఉపయోగించిన రోజాను సభ నుండి సస్పెండ్ చేయాలని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు.

17:18 - December 18, 2015

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని సీఎం చంద్రబాబునాడు అసెంబ్లీ సమావేశంలో అన్నారు. కాల్ మనీ వ్యవహరంపై అధికా, విపక్ష సభ్యుల మధ్యవాగువాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తాను వైఎస్ కు సమ ఉజ్జీనని… ఒక సంద్భంలో వైఎస్సే నాకు భయపడ్డారని చంద్రబాబు తెలిపారు. చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి లాంటి హేమా హేమీలు సీఎంలుగా ఉన్నపుడు మేం ప్రతిపోంగా ఉన్నామన్నారు. ఆ సమయంలో సభలో ఎక్కడా హుందాతనం మరిచిపోలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం చెప్పిన సమాధానంతో తృప్తి లేకపోతే తరువాత మీరు ప్రశ్నించాలి. దానికి సమాధానం లేకపోతే వాకౌట్ చేయండి. లేదా అనేక పద్దతులున్నాయి… అంతే కానీ ప్రతిపక్ష నేత నేను చెప్పిందే జరగాలని సభలో ఆందోళన చేపట్టడం హాస్యాస్పదమన్నారు. హేమాహేమీల మధ్య మేం ప్రతిపక్షంగా ఉన్నా ఎప్పుడూ హుందాతనం మరిచిపోలేదన్నారు. నేను ఐదు కోట్ల మంది ప్రజలకు జవాబుదారీ అని వ్యాఖ్యానించారు. కాల్ మనీతో సంబంధముండి నాతో ఫోటో దిగిన డీఈ సత్యానందంను అరెస్టు చేశామన్నారు. అవసరమైతే ఉద్యోగం నుండి తొలగిస్తామన్నారు. స్పీకర్, సీఎం కుర్చీలను వైసీపీ లెక్కచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నడూ హుందాతనం మరిచిపోలేదు : చంద్రబాబు

హైదరాబాద్ : తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సమఉజ్జీనని.. చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి హేమాహేమీలు సీఎంలుగా ఉన్నప్పుడు తాము ప్రతిపక్షంలో ఉన్నామని...ఎన్నడూ హుందాతనం మరిచిపోలేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. 'చాలా మంది మనతో ఫొటోలు తీసుకుంటారని... ఎవరితో ఫొటో దిగాలో కూడా వైసిపి చెప్పాలా'.. అని ప్రశ్నించారు. కాల్ మనీతో సంబంధముండి తనతో ఫొటో తీసుకున్న డీఈని అరెస్టు చేశామని.. అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పారు. సీఎం అన్నా... స్పీకర్ అన్నా వైసిపి లెక్కచేయడం లేదని వాపోయారు. సభ్యులు హుందాగా ప్రవర్తించాలని సూచించారు.

17:13 - December 18, 2015

హైదరాబాద్ : కాల్ మనీ వ్యవహారంలో సీఎం పైనే ఆరోపణలు చేస్తున్న వైసీపీ అధినేత జగన్ సైకోగాడని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఆయన మాట్లాడుతూ...హైదరాబాదులో జరుగుతున్న శాసనసభలో ఆయన మాట్లాడుతూ, ఓ ఫోటోను పట్టుకుని లేని పోని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్ సిగ్గుమాలినతనం చూడలేకపోతున్నానని అన్నారు. ముఖ్యమంత్రిని విమర్శించే స్ధాయి ఎవరికీ లేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రతి నేరం వెనుక జగన్ హస్తం ఉందని, లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దోపడీ చేసిన కేసులపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.

ఏం నేరము జరిగినా దాంతో జగన్ కు సంబంధం : జగన్

హైదరాబాద్ : రాష్ట్రంలో ఏం నేరము జరిగినా దానితో జగన్ కు సంబంధముందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కాల్ మనీ బాధితులపై జగన్ కు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. కాల్ మనీ వ్యవహారంలో సీఎంకు సంబంధముందనడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు.

 

జగన్ ఓ శాడిస్టు : గోరంట్ల

హైదరాబాద్ : జగన్ శాడిస్టు నాయకునిలా వ్యవహరిస్తున్నారని టిడిపి నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ సభ్యులను బూతులు తిడుతున్నా తాము.. సహనంతో ఉన్నామని చెప్పారు. ఇష్టారాజ్యంగా సీఎంపై దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. 

16:58 - December 18, 2015

హైదరాబాద్: వైసీపీ నేత జగన్ శాడిస్టు నాయకుడిలా వ్యవహరిస్తున్నారని మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో రాజకీయ హత్యలు ఎవరు చేశారో ఆలోచించాలన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు కాల్ మనీపై చర్చలో మరింత కాకపుట్టించాయి. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ, వైకాపా సభ్యులు పోడియంలోకి మరోసారి దూసుకొచ్చి నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. గోరంట్ల దూకుడును నియంత్రించాలన్న ఉద్దేశంతో కోడెల ఆ వెంటనే మైకును కట్ చేయాల్సి వచ్చింది. అంతకుముందు గోరంట్ల మాట్లాడుతూ, చంద్రబాబునాయుడిపై హత్యాయత్నం చేయించింది ఆనాటి వైఎస్ అనుచరులేనని, ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిందంతా, జగన్ అనుయాయులేనని ఆరోపించారు. పరిటాల రవి హత్య వెనుక ఏ పార్టీ వారున్నారో, ఆ పార్టీ వారంతా ఇప్పుడు ఎక్కడున్నారో అందరికీ తెలిసిందేనని గోరంట్ల వ్యాఖ్యానించారు. జగన్ కు మెంటలెక్కిందని, అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.

16:56 - December 18, 2015

హైదరాబాద్ : కాల్ మనీకి సంబంధించి ముఖ్యమంత్రి తన ప్రకటనను తాను చదువుకుంటూ వెళ్లిపోయారని...పాయింట్ ఆఫ్ ఆర్డర్ పాటించకుండా సభను నిర్వహించారని ప్రతిపక్ష నేత జగన్ మండిపడ్డారు. ఇలాంటి దారుణమైన శాసనసభను తాను ఇంతవరకు చూడలేదని చెప్పారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనేది సభ్యుల హక్కు అని అన్నారు. ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా కౌరవసభను నిర్వహిస్తుంటే... ప్రజా సమస్యలు ఎక్కడ చర్చకు వస్తాయని అసహనం వ్యక్తం చేశారు. కాల్ మనీ కేసులోని ముద్దాయిలు, నిందితులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలోనే ఉన్నారని... అయినా వారిని అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. విజయవాడలో అంగన్ వాడీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారంటూ సంబంధింత ఫొటోలను శాసనసభలో ప్రదర్శించారు.

16:55 - December 18, 2015

హైదరాబాద్ : కాల్ మనీ వ్యవహారంలో చంద్రబాబు, లోకేష్ ప్రమేయం ఉంది కాబట్టే సభలో చర్చకు అవకాశం ఇవ్వడం లేదని అని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్ మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కాల్ మనీ పేరుతో మహిళలను వ్యభిచార కూపంలోకి దించారన్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్తో సంబంధమున్న వారిని టిడిపి నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అంబేద్కర్ గురించి మాట్లాడటం హాస్యాస్పందం అన్నారు. విజయవాడలో అంగన్ వాడీలు సృహ కోల్పోయేలా ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. అంగన్ వాడీ కార్యకర్తలను మగ పోలీసులు కొడుతుంటే టిడిపి మహిళా మంత్రులు నిద్రపోతున్నారా అని మండిపడ్డారు. మహిళా తహశీల్దార్ వనజాక్షిని కొట్టిన చింతమనేనిపై ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. సైకిల్ పార్టీ - సైకోల పార్టీ అని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు వీధిరౌడీల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్టీఆర్ భవన్ లా తయారైందన్నారు.

పాయింట్ ఆఫ్ ఆర్డర్ పాటించకుండా సభను నిర్వహిస్తున్నారు : జగన్

హైదరాబాద్ : కాల్ మనీకి సంబంధించి ముఖ్యమంత్రి తన ప్రకటనను తాను చదువుకుంటూ వెళ్లిపోయారని...పాయింట్ ఆఫ్ ఆర్డర్ పాటించకుండా సభను నిర్వహించారని ప్రతిపక్ష నేత జగన్ మండిపడ్డారు. ఇలాంటి దారుణమైన శాసనసభను తాను ఇంతవరకు చూడలేదని చెప్పారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనేది సభ్యుల హక్కు అని అన్నారు. ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా కౌరవసభను నిర్వహిస్తుంటే... ప్రజా సమస్యలు ఎక్కడ చర్చకు వస్తాయని అసహనం వ్యక్తం చేశారు. కాల్ మనీ కేసులోని ముద్దాయిలు, నిందితులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలోనే ఉన్నారని... అయినా వారిని అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు.

కాల్ మనీ వ్యవహారంలో చంద్రబాబు, లోకేష్ ప్రమేయం: రోజా...

హైదరాబాద్ : కాల్ మనీ వ్యవహారంలో చంద్రబాబు, లోకేష్ ప్రమేయం ఉంది కాబట్టే సభలో చర్చకు అవకాశం ఇవ్వడం లేదని అని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్ మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కాల్ మనీ పేరుతో మహిళలను వ్యభిచార కూపంలోకి దించారన్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్తో సంబంధమున్న వారిని టిడిపి నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అంబేద్కర్ గురించి మాట్లాడటం హాస్యాస్పందం అన్నారు. విజయవాడలో అంగన్ వాడీలు సృహ కోల్పోయేలా ఎందుకు కొట్టారని ప్రశ్నించారు.

చంద్రబాబు మాటలు మోసపూరితం : ఎంఏ గఫూర్

విజయవాడ : అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాలు పెంచుతామని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాటలు మోసపూరితం సిఐటియు నేత ఎంఏ గఫూర్, ఏఐటీయూసి నేతఓబులేసు విమర్శించారు. అంగన్ వాడీలకు పెంచిన వేతనాలను సెప్టెంబర్ నెల నుంచి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఎరువుల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం...

నల్లగొండ : వేములపల్లి మండలం చౌటుచర్ల గ్రామంలోని ఓ ఎరువుల దుకాణంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీసాయి శ్రీనివాస ఫర్టిలైజర్స్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 లక్షల మేర ఆస్తి బుగ్గిపాలైంది. మిర్యాలగూడ నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

16:29 - December 18, 2015

హైదరాబాద్ : కాల్ మనీ వ్యవహారంపై వేగంగా స్పందించి.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు పైనే ఆరోపణలు చేయడం వైసీపీ కి తగదని టిడిపి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ… కాల్ మని వ్యవహారంపై ప్రతిపక్ష నేత కనీసం ఫిర్యాదు కూడా చేయలేదన్నారు. మిత్రుడితో కలిసి విదేశాలకు వెళ్తే…ఈ వ్యవహారంలో తనను కూడా ఇరికించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్థిక తీవ్రవాదులతో సంబంధాలున్న జగన్… కాల్ మనీ వ్యవహారంలో ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

బీజేపీ నగర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి వీరంగం

హైదరాబాద్ : బీజేపీ నగర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి ముసారాంబాగ్‌లో వీరంగం సృష్టించాడు. ముసారాంబాగ్‌లోని ఆర్టీఏ ఆఫీస్ వద్ద పలువురిపై ఇనుప కడ్డీతో విచక్షణా రహితంగా వెంకట్‌రెడ్డి దాడి చేశాడు. బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వెంకట్‌రెడ్డి దాడిలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

సీఎంకే సభలో రక్షణ లేకపోతే ఎలా : చంద్రబాబు

హైదరాబాద్ : అసెంబ్లీలో ముఖ్యమంత్రితో ఎలా వ్యవహరించాలో ప్రతిపక్ష సభ్యులకు తెలియపోవడం దురదృష్టకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేవారు. కాల్ మనీ పై సీఎం మాట్లాడుతున్న సమయంలో వారి స్థానాల్లో ఉండి అభ్యంతరం తెలపాలే తప్ప సీఎంపైకి దాడి చేసేలా దసూకురావడం సిగ్గుచేటన్నారు. సభా సంప్రదాయాల ప్రకారమే సభ నడుస్తుంది తప్ప… వారికిష్టం వచ్చినట్లు నడవదన్నారు. అసెంబ్లా వైసీపీ సభ్యుల తీరును ప్రజలు చూస్తున్నారని.. వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ప్రతిపక్ష సభ్యులు డౌన్ డౌన్ అన్నంత మాత్రాన తాను డౌన కానని ఎద్దేవా చేశారు.

యూపీలో పాలిథీన్ నిషేధం...

హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో పాలిథీన్ వాడకాన్ని నిషేధించాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మంత్రి వర్గ సమావేశ అనంతరం యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. పాలిథీన్‌పై నిషేధం విధిస్తున్నాం. పాలిథీన్‌తో పాటు దాని సంబంధిత వస్తువులను కూడా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అలహాబాద్ కోర్టు ఆదేశాల మేరకు పాలిథీన్‌ను నిషేధిస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 31 నాటికి యూపీలో పాలిథీన్ నిషేధానికి చర్యలు తీసుకోవాలని అలహాబాద్ కోర్టు నవంబర్ 18న ఆదేశాలు జారీ చేసింది.

రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయాలి

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ సభ్యుల ప్రకవర్తనా తీరుపై అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టిడిపి ఎమ్మెల్యే అని మాట్లాడుతూ సీఎంను కించపరుసూత్ అసభ్యకర రీతిలో నినాదాలు చేయడం దారుణమన్నారు. ఒక మహిళా సభ్యరాలిగా రోజా వ్యహరిస్తున్న తీరు హేయమని అని పేర్కొన్నారు. సీఎంను కించపరిచేలా మాట్లాడిన రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయాలని అనిత డిమాండ్ చేశారు.

రేపు కోర్టుకు వెళ్తున్నా : సోనియాగాంధీ

ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసుతో తాను రేపు పాటియాలా కోర్టుకు హాజరు కానున్నానని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టం చేశారు. తమకు భారత న్యాయస్థానాలపై నమ్మకముందని, కోర్టు ఆదేశాల మేరకు సహజంగానే తాను వెళ్లి తీరునానని, ఆపై ఏం జరుగుతుందో చూద్దామని కొద్ది సేపటి క్రితం తనను కలిసిన మీడియాతో ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి 2012లో వేసిన కేసు మేరకు ట్రయల్ కోర్టు సోనియా, రాహుల్ లకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సుమారు రూ.

వైసీపీ ఎమ్మెల్యే ఈశ్వరికి బెయిల్...

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విశాఖ మన్యంలో ఇటీవల వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఈశ్వరి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు తల నరికేస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆమెపై పలువురు టీడీపీ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తరువాత ఆమె కోర్టుకు వెళ్లడంతో బెయిల్ లభించింది. ఈ క్రమంలో రేపటి నుంచి తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని ఈశ్వరి తెలిపారు.

చంద్రబాబే ప్రధాన నిందితుడు : జగన్

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాల్ మనీ వ్యవహరాం పై దద్దరిల్లుతోంది. ప్రతిపక్షం, అధికార పక్షం మాటల యుద్ధం నడుస్తోంది. కాల్ మనీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడే ప్రధాన ముద్దాయని వైసీపీ నేత జగన్ ఆరోపించారు. ఇలాంటి సభను నేనెప్పుడూ చూడలేదని అన్నారు. మేం పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగినా లెక్క చేయకుండా సీఎం ప్రకటన ఎలా చేస్తారు అని జగన్ ప్రశ్నించారు.

ప్రతిపక్షంపై స్పీకర్ అసహనం..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసహనం వ్యక్తం చేశారు. మీకు రూల్స్ తెలియవు… చెప్పేవారూ లేరు అని వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి స్పీకర్ వ్యాఖ్యానించారు. సభా నాయకుడు మాట్లాడుతుంటే అడ్డుకోకూడదని సూచించారు. 

15:55 - December 18, 2015

ఓల్గా అరుదైన గౌరవం..

ప్రముఖ స్త్రీవాద రచయిత్రి వోల్గా అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. మూడు దశాబ్దాలుగా మహిళల సమస్యలను భిన్నమైన కోణంలో వ్యక్తీకరిస్తూ స్త్రీవాద రచయిత్రిగా ఆమె గుర్తింపు సాధించారు.

నిర్భయ నిందితులలో మైనర్ కు శిక్షాకాలం పూర్తి...

నిర్భయ నిందితులలో మైనర్ కు శిక్షాకాలం పూర్తయ్యింది. అబ్జర్వేషన్ హోంలో ఉంటున్న అతని విడుదల పై కేంద్రం అభ్యంతరం తెలుపుతూ హైకోర్టును విజ్ఞప్తి చేసింది.

మాతాశిశు సంరక్షణలో....

మాతాశిశు సంరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త సేవలను తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ప్రతిపాదిస్తోంది.

నిర్భయ ఘటన జరిగి మూడేళ్లు....

మహిళా లోకమంతా ఉలిక్కిపడిన నిర్భయ ఘటన జరిగి మూడేళ్లు గడిచాయి. ఈ సందర్భంగా దేశంలో పలుచోట్లు నిర్భయకు నివాళులర్పించారు.

మహిళలు అన్ని రంగాలలో...

మహిళలు అన్ని రంగాలలో తమ ప్రతిభాపాటవాలు చాటుతున్నప్పటికీ వారికి ఆర్థిక లావాదేవీలలో భాగస్వామ్యం అంతంత మాత్రమే. ఇదే విషయాన్ని నిర్ధారించింది ఇటీవలి యుఎన్ డిపి సర్వే.

ఆకతాయిల ఆగడాలను ఎదుర్కోవాలంటే...

హైదరాబాద్ : విద్య, ఉద్యోగావకాశాలను అందుకునే క్రమంలో మహిళలు ఎక్కడికైనా, ఏ సమయంలోనైనా ఒంటరిగా బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అడుగడుగునా పొంచి ఉన్న ఆకతాయిల ఆగడాలను ఎదుర్కోవాలంటే ఆత్మరక్షణా పద్ధతులను నేర్చుకోవటంతో పాటు చక్కటి డైట్ నూ అనుసరించాలి. దీనికి సంబంధించిన వివరాలను ఇవాళ్టి నిర్భయలో తెలుసుకుందాం.

15:51 - December 18, 2015

హైదరాబాద్ : విద్య, ఉద్యోగావకాశాలను అందుకునే క్రమంలో మహిళలు ఎక్కడికైనా, ఏ సమయంలోనైనా ఒంటరిగా బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అడుగడుగునా పొంచి ఉన్న ఆకతాయిల ఆగడాలను ఎదుర్కోవాలంటే ఆత్మరక్షణా పద్ధతులను నేర్చుకోవటంతో పాటు చక్కటి డైట్ నూ అనుసరించాలి. దీనికి సంబంధించిన వివరాలను ఇవాళ్టి నిర్భయలో తెలుసుకుందాం.

రోజాపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

హైదరాబాద్ : నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. కాల్ మనీ వ్యవహారంపై చంద్రబాబు ప్రకటన చేస్తున్న సందర్భంలో రోజా నినాదాలు చేస్తూ ఆందోళనకు నాయకత్వం వహించారు. దీంతో చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మహిళా? ఆమె మాట్లాడే మాటల్లో సభ్యత ఉందా? అసలు ఆమె ఆడదేనా? ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలేనా? సంస్కారం లేకుండా ఆమె చేస్తున్న నినాదాలు ఏంటి? అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. సభ్యత సంస్కారం నేర్చుకోవాలని ఆయన సూచించారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు.

 

15:47 - December 18, 2015

హైదరాబాద్ : ఆసక్తి, అభిరుచులకు రంగుల మేళవింపును జత చేస్తోంది ఒక అతివ. సింపుల్ టెక్నిక్స్ తో అందమైన పెయింటింగ్స్ ను ఆవిష్కరిస్తోంది. అవేంటో, ఎలా చేస్తోందో ఇవాళ్టి సొగసులో చూసి నేర్చుకుందాం. ఆ పెయింటింగ్స్ ను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

15:43 - December 18, 2015

హైదరాబాద్ : ఏపీలో సంచలనం సృష్టిస్తున్న కాల్ మనీ వ్యవహారంపై అసెంబ్లీ సీఎం చంద్రబాబు నివేదికను సభలో చదివి వినిపిస్తున్నారు. అధిక వడ్డీ వ్యాపారాలను అరికట్టేందుకు కఠినమైన చట్టం తీసుకువస్తామని తెలిపారు. కాల్ మనీ కేసులో యలమంచి శ్రీరామమూర్తి ప్రధాన నిందితుడు.. రెండో నిందితుడు శంకర్, మూడో నిందితుడు చెన్నుపాటి శ్రీనివాస్, సత్యానంద్, భాస్కర్, శ్రీకాంత్, దూడల రాజేశ్ నిందితులని చంద్రబాబు తెలిపారు. కాల్ మనీ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని.. కాల్ మనీ పై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కేసులో 65 మంది వైసీపీ కార్యకర్తలు వున్నారని, టిడిపి 20 మంది, కాంగ్రెస్ చెందిన వారు 10 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. కాల్ మనీకి పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలపెట్టమని చెప్పారు. కఠినమైన చట్టం తెచ్చి వడ్డీ వ్యాపారాన్ని నియంత్రిస్తామన్నారు. కేసుల పరిష్కారానికి విజయవాడలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కాల్ మనీ పై సీఎం చంద్రబాబు ప్రకటన చేస్తుండగా వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా టిడిపి నేత ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. కాల్ మనీ పై చర్చించే ధైర్యం వైసీపీకి లేదన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు అభ్యంతరం ఉంటే మీస్థానాల్లో నిలబడి నిరసన వ్యక్తం చేయాలి కానీ… సీఎం పైకి దూసుకు వచ్చి మాట్లాడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి కే అసెంబ్లీలో రక్షణ లేకపోతే మరి ఎవరికి రక్షణ వుంటుంది. ఈ మాదిరిగా రెచ్చగొట్టే పనులు చేస్తే ఎవరూ రెచ్చిపోరని ఆవేదన వ్యక్తం చేశారు.  ఆర్థిక మంత్రి యనమల మాట్లాడుతూ సీఎం కాల్ మనీ పై వివరణ పూర్తయిన తరువాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తాలని యనమల ప్రకటించారు. ప్రతిపక్ష సభ్యులు రూల్స్ తెలుసుని సభలో ప్రవర్తించాలని సూచించారు.

ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ఆందోళన

హైదరాబాద్ : కాల్ మనీ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తుండగా వైసీపీ సభ్యులు ఆందోలన చేపట్టారు.

15:24 - December 18, 2015

హైదరాబాద్ : ఆగస్టు నెలలో వేతనాలు పెంచుతున్నామని ప్రకటించి సెప్టెంబర్ 1 నుండి అమలు చేస్తామని సబ్ కమిటీ ప్రకటించింది. అంగన్ వాడీ లకు రూ.4,200 నుంచి రూ. 7వేలకు, హెల్పర్ల వేతనాలు రూ.2,200 నుంచి రూ.4,500 వరకు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెంచిన వేతనాలు అమలు అవుతాయని ప్రకటించారు. ఇంత వరకు సబ్ కమిటి ప్రకటించిన దాన్ని అమలు చేయకుండా మరో సారి చంద్రబాబు మోసపు మాటలు చెబుతున్నారని అంగన్ వాడీ వర్కర్లు మండి పడ్డారు. ఏపీ అసెంబ్లీ లో అంగన్ వాడీలకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అమలు చేస్తామని చెప్పారని దాన్ని మేము ఎలా నమ్మాలి? మరో సారి అబద్ధాలు చెప్పి పబ్బంగడుపుకోవాలని చూస్తున్నారని.… వెంటనే వేతనాల పెంపు జీఓను విడుదల చేయాలని… జీఓ విడుదల చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.

నిర్భయ కేసులో బాలనేరస్థుడి విడుదలకు మార్గం సుగమం..

ఢిల్లీ : నిర్భయ కేసులో బాలనేరస్థుడి విడుదలపై హై కోర్టు తీర్పు వెలువరించింది. బాల నేరస్థుడి విడుదలపై స్టేకు నిరాకరించింది. వచ్చే ఆదివారం జైలు నుంచి బాలనేరస్థుడు విడుదల కానున్నాడు.

అంగన్ వాడీలపై అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన

హైదరాబాద్ :అంగన్ వాడీల జీత భత్యాల గురించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. అంగన్ వాడీ లకు రూ.4,200 నుంచి రూ. 7వేలకు, హెల్పర్ల వేతనాలు రూ.2,200 నుంచి రూ.4,500 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెంచిన వేతనాలు అమలు అవుతాయని ప్రకటించారు.

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో గందరగోళం

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. సభ నుంచి సస్పెన్షన్ కు గురైన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లేందుకు యత్నించగా… వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు ఎమ్మెల్యేలు గేటు దూకి లోని ప్రవేశించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.

రెండు ఇసుక ట్రాక్టర్ల సీజ్

కరీంనగర్ : జిల్లాలో శుక్రవారం మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కత్లాపూర్ మండలం సిరికొండ శివారులోని అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు మైనింగ్ ఏడీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

 

14:48 - December 18, 2015

కర్నూలు : సోలార్ ఫ్లాంట్ నిర్వాసితుల కోసం పోరాటం చేస్తామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ అన్నారు. బాధితులకు న్యాయమైన నష్టపరిహారం అందే వరకు ఉద్యమం చేస్తామని తెలిపారు. వివిధ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం పేదల భూములను లాక్కొంటోందని మండిపడ్డారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం శకునాల గ్రామంలో సోలాల్‌ ఫ్లాంట్‌ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. తమకు నష్టపరిహారం ఇవ్వాలని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కరత్‌ పాల్గొన్నారు. నిర్వాసితులకు అండగా ఉంటామని, ప్రభుత్వం దిగివచ్చే పోరాటం చేస్తామని ప్రకటించారు. 

14:46 - December 18, 2015

హైదరాబాద్ : టిఆర్ ఎస్ లో చేరతానంటూ వస్తున్న వార్తలను మాజీమంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఖండించారు. ఆయన టెన్ టివితో మాట్లాడుతూ... తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు... పార్టీపై తాను అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమేనని అంగీకరించారు.. సీనియర్‌ నేతల బుజ్జగింపుతో నిర్ణయం మార్చుకున్నానని స్పష్టం చేశారు.. 

మెట్రో రైలులో ప్రయాణం అద్భుతం : కేటీఆర్

హైదరాబాద్: మహానగరంలో కలికితురాయిగా మారనున్న మెట్రో రైలులో మంత్రి కేటీఆర్ తొలిసారి ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన పొందిన అనుభవాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. నిజంగా మెట్రో రైలు ప్రయాణం తనకు చాలా అద్భుతంగా ఉందని ట్వీట్ లో పేర్కొన్నారు.
 

13:46 - December 18, 2015

రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పుతిన్ కు మరణమే లేదని, అతను అత్యంత శక్తిమంతుడని, పిశాచమని సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. కొందరు పుతిన్ ను దేవుడు అంటున్నారు. మరి కొందరు పుతిన్ ను డ్రాక్యులాగా భావిస్తున్నారు. లియొనార్డో డావిన్సీ పెయింటింగ్ మొనాలిసా అసలు రూపం పుతిన్ దే అని... ఆ పెయింటింగ్ వేసేముందు డావిన్సీ ముందు కూర్చున్నది పుతినే అంటూ మరి కొందరు చెబుతున్నారు. అసలు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది. దీనికి కారణం ఏమిటి అనే సందేహం అందర్లోనూ కలగడం సహజం. ఎస్... ఈ చర్చకు కారణం రెండు ఫొటోలు. ఆ రెండు ఫొటోలే పుతిన్ పై పెద్ద చర్చను లేవనెత్తాయి.

1920లో ఒక రష్యా సైనికుడు తీయించుకున్న ఫొటోలో అతని పోలికలు అచ్చుగుద్దినట్టు పుతిన్ నే పోలి ఉన్నాయి. అప్పుడు ఆ యువ సైనికుడి వయసు పాతికేళ్లు అనుకున్నా... ఇప్పుడు అతని వయసు 120 ఏళ్లు ఉంటుంది. ఇలాంటిదే మరో ఫొటో. 1941లో మరో రష్యా సైనికుడు తీయించుకున్న ఫొటో కూడా పుతిన్ నే కాక, 1920లో యువ సైనికుడిని కూడా పోలి ఉంది. ఫొటోలలోని ఆ ఇద్దరు సైనికులు, రష్యా ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ ఒకే పోలికలతో ఉండటంతో... పుతిన్ కు మరణమే లేదనే వాదన పుట్టుకొచ్చింది. పెద్ద చర్చను లేవనెత్తింది. పుతిన్ పురాణ పురుషుడని ఈ పోలికలను నమ్ముతున్న వారంతా అంటున్నారు. పుతిన్ దేవుడని, సర్వశక్తిమంతుడని చెబుతున్నారు.

లీసా ఘెరార్డిని కూడా పుతినే....?

మరికొంతమంది... సాక్ష్యాత్తూ 1431లో పుట్టిన డ్రాక్యులానే పుతిన్ (వ్లాద్ ది ఇంపేలర్) అని నమ్ముతున్నారు. గత జూన్ నెల నుంచి సోషల్ మీడియాలో మరో విషయం స్ప్రెడ్ అవుతోంది. లీసా ఘెరార్డిని కూడా పుతినే అని... ఆమె పెయింటింగ్ నే మొనాలిసాగా డావిన్సీ వేశాడనేదే ఆ విషయం. పుతిన్ డ్రాక్యులాగా బతికిన అనంతరం రహస్య ప్రాంతానికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత 1500 ప్రారంభంలో మొనాలిసాగా పుతిన్ పెయింటింగ్ వేశారనేది వీరి వాదన. లేదా ఈ పెయింటింగ్ కోసం కాలధర్మానికి విరుద్ధంగా అతను వెనక్కి వెళ్లి ఉండవచ్చని కూడా కొందరి భావన. అయితే, పుతిన్ పై ఇంత చర్చ జరుగుతున్నా... ఏ ఒక్కటీ కూడా శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు.

మనకు తెలిసిన పుతిన్ మాత్రం 63 ఏళ్ల రష్యా అధ్యక్షుడు. చొక్కా విప్పేసి వాయు వేగంతో హార్స్ రైడింగ్ చేయగలవాడు. స్పష్టమైన విధానాలతో, అద్భుతమైన వ్యూహరచనతో ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకడిగా గుర్తింపు పొందినవాడు.

 

13:44 - December 18, 2015

హైదరాబాద్ : తాను నిర్వహించే అయుత చండీయాగానికి అందరూ ఆహ్వానితులేనని సీఎం కేసీఆర్ వెల్లడించారు. జగదేవ్ పూర్ మండలం ఎర్రవల్లిలోని ఫాం హౌస్ లో ఈనెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు కేసీఆర్ అయుత చండీయాగం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. యాగానికి సంబంధించిన ఏర్పాట్లను మీడియాకు తెలియచేశారు. ఐదు రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగే ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వస్తున్నారని తెలిపారు. ప్రతి రోజు వెయ్యి మందితో మహిళలతో కుంకుమార్చన కార్యక్రమం ఉంటుందని, 50 వేల మందికి అన్న ప్రసాదం, తీర్థ ప్రసాదాలు ఉంటాయన్నారు. వీఐపీలు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతొక్కరూ యాగానికి రావచ్చని కానీ ఆంక్షలు అతిక్రమించవద్దని సూచించారు. యాగశాల లోనికి ఎవరినీ అనుమతించడం జరగదని, దీక్షా వస్త్రాలు ధరించే వారు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. వీరిని తాకితే వెయ్యి మంది మళ్లీ స్నానాలు చేయాల్సి వస్తుందని, 1500 మంది రుత్విక్కులు పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ వస్తే ఆయుత చండీయాగం చేస్తానని నాలుగేళ్ల కిందట సంకల్పం తీసుకోవడం జరిగిందన్నారు. శృంగేరి పీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని, తాను కూడా ఒక యజ్ఞ కార్యకర్తనే అని తెలిపారు. అయుత చండీయాగానికి రూ 6-7 కోట్లు ఖర్చు అవుతుందని, దీనికి సంబంధించిన ఖర్చు తాను, ఇతరులు పెట్టుకోవడం జరుగుతుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. 

13:39 - December 18, 2015

విజయవాడ : 'సీఎం డౌన్..డౌన్..వేతనాలు పెంచాలి...చంద్రబాబు దొంగ' అనే నినాదాలు విజయవాడలో మారుమోగాయి. ఎర్రజెండాలతో అంగన్ వాడీలు కదం తొక్కారు. బారికేడ్లు..పోలీసుల లాఠీ దెబ్బలు...నిర్భందాలు..ఆంక్షలు ఎదుర్కొని అంగన్ వాడీలు సీఎం కార్యాలయం వరకు చేరుకున్నారు. కార్యాలయం వరకు రాకుండా ఉండేందుకు ఖాకీలు కర్కశత్వాన్ని ప్రదర్శించారు. ఆడవాళ్లని చూడకుండా ఈడ్చుకెళ్లారు. లాఠీలతో బాదారు. దీనితో అంగన్ వాడీల శరీరాలు రక్తమోడాయి. పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. తమ ఆగ్రహానికి చంద్రబాబు బలి కాకతప్పదని కన్నెర్ర చేశారు. అంగన్ వాడీలు చేపట్టిన ఈ ఆందోళనకు వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నాయి.

తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి ర్యాలీ..
తమ సమస్యల పరిష్కారం కోసం..వేతనాలు పెంచాలని..ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఏపీ అంగన్ వాడీలు గత కొంతకాలంగా దశల వారీగా ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. పెరుగుతున్న నిత్యావసర ధరలతో తాము ఆ వేతనాలతో బతుకలేకపోతున్నామని, కొన్ని సందర్భాల్లో వేతనాలు ఇవ్వడం లేదని అంగన్ వాడీలు వాపోయారు. వేతనాలు పెంచాలని కోరారు. కానీ ఏపీ సర్కార్ వీరి మాటలను పెడచెవిన పెట్టింది. అంగన్ వాడీల జీతాలు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెప్పడంతో ఆందోళన విరమించారు. వేతనాలు పెంచుతున్నట్లు చెప్పి మోసగించింది. నెలలు గడుస్తున్నా పెంపు వేతనానికి సంబంధించిన జీవో విడుదల చేయకపోవడంపై అంగన్ వాడీలు కన్నెర్ర చేసి శుక్రవారం 'చలో బెజవాడ' కు పిలుపునిచ్చారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి సీఎం కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు.

అంగన్ వాడీలకు గాయాలు..
ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల నుండి వేలాదిగా బెజవాడకు తరలివచ్చారు. వీరు రాకుండా ఉండేందుకు పోలీసులు శతవిధాల ప్రయత్నాలు చేపట్టారు. ఎక్కడికక్కడనే అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించారు. కానీ వీరి ప్రయత్నాలను అంగన్ వాడీలు ఎదుర్కొన్నారు. సీఎం కార్యాలయంకు వెళ్లేందుకు ప్రయత్నించే కార్యకర్తలపై ఖాకీలు తమ ప్రతాపం చూపెట్టారు. ఆడ..మగ..అనే తేడా లేకుండా లాగి పారేశారు. లాఠీలతో కుమ్మారు. దీనితో పలువురు అంగన్ వాడీలకు గాయాలయ్యాయి. రక్తాలు కారాయి. పోలీసులు వ్యవహార శైలిపై అంగన్ వాడీలు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడనే బైఠాయించారు.

ఏపీ సర్కార్ పై మధు ఆగ్రహం..
సీఎం కార్యాలయం వద్దకు వెళ్లేందుకు అంగన్ వాడీలు ఉత్సాహంతో ముందుకెళ్లారు. తమ నిరసన తెలియచేయాలని ప్రయత్నించారు. కానీ పోలీసులు బందర్ రోడ్డు..రైతు బజార్ల వద్ద నిర్భందాలు చేపట్టారు. ఎక్కడికక్కడ బారికేడ్లు..తాడ్లతో అడ్డుకున్నారు. సీపీఎం నేత మధు, బాబురావులను అడ్డుకున్నారు. దీనితో మధు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని, మరోసారి మోసం చేస్తున్నాడని విమర్శించారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, రూ. 1200 కోట్లు ఖర్చు అవుతాయంటూ అబద్ధం చెబుతోందన్నారు. కానీ కేవలం రూ.300 కోట్లు సరిపోతుందని తెలిపారు. ఆశా వర్కర్లు, వీఆర్ఏలు, మున్సిపల్ కార్మికులు..ఇతరులు అందరూ రోడ్డుపైకి వస్తారని చెప్పారు.

ఏం నేరం చేశారు - బాబురావు..
ఆడవాళ్లపై దౌర్జన్యం చేస్తున్నారుని, అరెస్టులు చేస్తున్నారని సీపీఎం నేత బాబురావు తెలిపారు. ఏం నేరం చేశారని ప్రశ్నించారు. వేతనాలు పెంచుతామని చెప్పి మోసం చేశారని, బాబు తప్పుకోలేడని హెచ్చరించారు. మూడు వేల వేతనంతో ఎలా బతుకుతారని, అప్పుల బారిన పడుతున్నారని తెలిపారు. అంగన్ వాడీల కడుపు కొడితే సహించేది లేదని బాబురావు స్పష్టం చేశారు. 

చండీయాగానికి రాష్ట్రపతి - కేసీఆర్..

హైదరాబాద్ : చండీయాగానికి అందరూ ఆహ్వానితులే అని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ఇది మహోన్నత యాగమని అభివర్ణించారు. ఈకార్యక్రమానికి రాష్ట్రపతి కూడా వస్తారని ఆయన తెలిపారు.  ప్రతి రోజు వెయ్యిమంది మహిళలతో కుంకుమార్చన ఉంటుందని చెప్పారు. 

13:20 - December 18, 2015

రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, ప్రముఖులకు తమ ప్రాణాలకు ముప్పు ఉన్నప్పుడు స్వీయ రక్షణార్థం... వారికి తుపాకులు వెంట తెచ్చుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. ఇప్పుడు ఈ కోవలో టీచర్స్ కూడా చేరారు. టీచర్లు కూడా ఆత్మరక్షణార్ధం, స్వీయరక్షణకు తుపాకులు వెంట తెచ్చుకునేందుకు అనుమతించారు. అయితే ఇది భారతదేశంలో కాదు లేండీ.. మరెక్కడా అనుకుంటున్నారా... అమెరికాలో...

ఇటీవలి కాలంలో అమెరికాలోని పలు పాఠశాలల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ పాఠశాల యాజమాన్యం స్వీయ రక్షణ చర్యలు చేపట్టింది. తమ చీచర్లు తమతో బాటు తుపాకులు తెచ్చుకునేందుకు అనుమతి తెలిసింది. టెక్సాస్ లోని జాన్సన్ కౌంటీ పరిధిలో ఉన్న 'కీనీ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్' ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. మొదట్లో చీచర్లు తుపాకులు తీసుకెళ్లడానికి వ్యతిరేకించిన పాఠశాల సూపరింటెండెంట్ రికీ స్టీఫెన్స్ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దుర్ఘటనల సమయంలో ఇతర విద్యార్థులను కాపాడటానికి, టీచర్ల ఆత్మరక్షణకు ఉద్దేశించిన తాజా నిర్ణయాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెల నుంచి అమలు చేస్తామని తెలిపారు. అయితే తుపాకులు తీసుకెళ్లడానికి ఏ టీచర్లు అర్హులో పాఠశాల ముందుగా ఎంపిక చేయనుంది. ఇదే పాఠశాలకు ఉన్న మరో నాలుగు క్యాంపస్ లోనూ ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తోంది.

 

సీఎం కార్యాలయం వద్ద అంగన్ వాడీలు..

విజయవాడ : తమ సమస్యల పరిష్కారించాలంటూ అంగన్ వాడీలు సీఎం క్యాంపు కార్యాలయాన్ని చుట్టుముట్టారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. 

టీఆర్ ఎస్ లో చేరడం లేదు - బి.ప్రసాద్ కుమార్..

హైదరాబాద్ : టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వార్తలను బి.ప్రసాద్ కుమార్ ఖండించారు. రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం చంద్రశేఖర్ కు టికెట్ ఇవ్వడం మనస్థాపం కలిగించిందని, దానికి సంబంధించి అధిష్టానంతో చర్చించడం జరిగిందన్నారు. కేటీఆర్ టీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన మాట వాస్తవమేనని, తమ పార్టీ నేతలతో చర్చించాక కాంగ్రెస్ లో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

 

మోడీపై మరోసారిపై కేటీఆర్ విమర్శలు..

హైదరాబాద్ : ప్రధాన మంత్రి మోడీకి తెలంగాణలో పర్యటించే సమయం లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ పై కేంద్రానికి ప్రేమ ఉంటే ఏడాదికి రూ.1000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

హామీలను నిలబెట్టుకున్నాం - పద్మారావు..

హైదరాబాద్ : ఎన్నికల హామీలను నిలబెట్టుకున్నామని మంత్రి పద్మారావు వ్యాఖ్యానించారు. పేదల ఇళ్ల కల సాకారం చేస్తున్నామని, సికింద్రాబాద్ నియోజకవర్గానికి జూనియర్, డిగ్రీ కాలేజీలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తుకారం గేటు వద్ద అండర్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతామని తెలిపారు. 

కర్నూలులో కరత్..

కర్నూలు : ఓర్వకల్లు (మం) శకునాలలో రైతుల సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కరత్ పాల్గొన్నారు. బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా సోలార్ ప్లాంట్ లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ రైతుల సదస్సు జరుగుతోంది. 

హైదరాబాద్ లో త్వరలో లక్ష ఇళ్లు - ఇంద్ర కిరణ్ రెడ్డి...

హైదరాబాద్ : రాబోయే కాలంలో హైదరాబాద్ లో లక్ష ఇళ్లు కట్టిస్తామని, డబుల్ బెడ్ పథకం కింద ఒక్కో ఇంటికి రూ. 7లక్షలు ఇవ్వనున్నట్లు మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి పేర్కొన్నారు. అడ్డగుట్టలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన జరిగింది. ఈసందర్భంగా మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి మాట్లాడారు. ఐడీ హెచ్ కాలనీ అందరీ ప్రశంసలు అందుకొంటోందని, ఇళ్ల నిర్మాణాన్ని గవర్నర్ కూడా మెచ్చుకున్నారని తెలిపారు. ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీరు సరఫరా చేస్తున్నామని, గోదావరి నీళ్లు తెచ్చిన ఘనత కేసీఆర్ దేనని తెలిపారు.

12:02 - December 18, 2015

విజయవాడ : పోరాటానికి మరో పేరు అంగన్ వాడీలని వామపక్ష నేతలు పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్ వాడీలు శుక్రవారం చలో బెజవాడకు భారీ ర్యాలీని చేపట్టారు. తుమ్మళ్లపల్లి కళాక్షేత్రం నుండి సీఎం క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మహాత్మగాంధీ రోడ్డు వరకు చేరుకోగానే ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. నేతలను ఇష్టమొచ్చినట్లు లాక్కొంటూ వ్యాన్ లలో పడేశారు. ఈ సందర్భంగా నేతలు టెన్ టివితో మాట్లాడారు. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, న్యాయంగా జారీ చేయాల్సిన జీవోను జారీ చేయాలని కోరుతున్నారన్నారు. ఏసీ గదుల్లో ఉండడం కాదు..వారి కోపాన్ని తట్టుకొనే శక్తి ఉందా అని బాబును ఉద్ధేశించి హెచ్చరించారు. వేతనాలు పెంచుతామని, పెన్షన్ బెనిఫిట్స్ కల్పిస్తామని చెప్పారని గుర్తు చేశారు. అనంతరం మొండిచేయి చూపారని, అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. సీఎం కార్యాలయం లోనికి వందలాది మంది కార్యకర్తలు వెళ్లిపోయారని, అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. 

అడ్డగుట్టలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన..

హైదరాబాద్ : అడ్డగుట్టలో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణానికి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాయినీ, కేటీఆర్, పద్మారావు, ఇంద్రకిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నంద్యాల రైల్వే స్టేషన్ ను తనిఖీ చేసిన జీఎం..

కర్నూలు : నంద్యాల రైల్వే స్టేషన్ ను దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీందర్ గుప్తా శుక్రవారం అకస్మిక తనిఖీ చేశారు. ప్రతి మూడేళ్లకొకసారి నిర్వహించే తనిఖీల్లో భాగంగా ఆయన ఉదయం ప్రత్యేక రైల్లో నంద్యాల చేసుకున్నారు. 

అంబేద్కర్ పై చర్చను అడ్డుకోవడం దారుణం - బాబు..

హైదరాబాద్ : అంబేద్కర్ పై చర్చిస్తున్నప్పుడు సభను అడ్డుకోవడం దారుణమని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. బీఏసీలో ప్రతిపాదించినప్పుడు ఒప్పుకున్న వారు సభలో వ్యతిరేకించారని తెలిపారు. అంబేద్కర్ పై చర్చ పూర్తయ్యాక కాల్ మనీపై చర్చిద్దామని చెప్పడం జరిగిందన్నారు.

11:31 - December 18, 2015

ఆరోగ్యంగా ఉండేందుకు, శరీర ధారుడ్యానికి, రోగాల బారిన పడకుండా ఉండడానికి చాలా మంది అనునిత్యం ఎక్సర్ సైజ్ చేస్తుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం ఎక్కువైన నేటి తరుణంలో మనలో అధిక శాతం మంది ఏదో ఒక విధంగా నిత్యం వ్యాయామం చేసేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అనేక మంది వాకింగ్, జాగింగ్ వంటివి చేస్తే ఇంకొందరు యోగా, జిమ్ వంటివి చేస్తున్నారు. అయితే వీటితోపాటు చక్కని శరీరాకృతి కావాలంటే నైక్ సంస్థ అందుబాటులోకి తెచ్చిన 'నైక్ ప్లస్ ట్రెయినింగ్ క్లబ్ (NIKE+ TRAINING CLUB)' ఆండ్రాయిడ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే.

మన శరీరంలో ఒక్కో భాగానికి అనుగుణంగా రూపొందించిన వర్కవుట్‌లు ఇందులో ఫొటోలు, వీడియోల రూపంలో లభ్యమవుతున్నాయి. వీటిని డౌన్‌లోడ్ చేసుకుని చూడడం ద్వారా ఆయా వర్కవుట్లను సాధన చేస్తూ మరింత సమర్థవంతంగా వ్యాయామం చేయవచ్చు. అవసరమైతే ఇందులో ఉండే ట్రైనర్స్ ద్వారా సలహాలు, సూచనలు పొందవచ్చు. మీరు చేసే వర్కవుట్లను సోషల్ నెట్‌వర్క్ సైట్ల ద్వారా ఇతరులతో షేర్ చేసుకునే వీలు కల్పించారు. దాదాపు 100కు పైగా వివిధ రకాల వర్కవుట్లు ఇందులో లభ్యమవుతున్నాయి. బరువు తగ్గాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా 'గోల్ సెట్టింగ్' ఫీచర్‌ను ఇందులో అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్షన్ కలిగిన యూజర్లు ఇప్పుడు దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

11:28 - December 18, 2015

విజయవాడ : ''ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం..మాకు వేతనాలు పెంచండి..ఎన్నో రోజులుగా ఆందోళన చేస్తున్నాం..కనికరించండి..ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చేస్తాం..ఇదేనా చేసేది..మేము ఏమి అడుగుతున్నాం..న్యాయంగా రావాల్సిందే అడుగుతున్నాం..మీరు ఇచ్చిన హామీని అమలు చేయమని అడుగుతున్నాం..అడుగుతే మాపై పోలీసులు దాడులు చేస్తారా ? న్యాయంగా శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే అడ్డుకుంటారా'' అంటూ అంగన్ వాడీలు ఏపీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు.
శుక్రవారం చలో విజయవాడ పిలుపు మేరకు పలు జిల్లాల నుండి అంగన్ వాడీలు బెజవాడకు చేరుకున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి సీఎం క్యాంపు కార్యాలయానికి ర్యాలీ నిర్వహించారు. మహాత్మాగాంధీ రోడ్డు వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీనితో ఆ ప్రాంతం మొత్తం రణరంగంగా మారిపోయింది. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని అంగన్ వాడీలు పేర్కొన్నా పోలీసులు వినిపించుకోలేదు. రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోయారు. దీనితో పోలీసులు, అంగన్ వాడీల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. కొంతమంది కార్యకర్తలకు గాయాలయ్యాయని తెలుస్తోంది. పోలీసుల తీరుపై అంగన్ వాడీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు మొదటి నుండి మద్దతు తెలుపుతున్న వామపక్ష పార్టీల నేతలు, కార్మిక సంఘాల నేతలపై కూడా పోలీసులు జులుం ప్రదర్శించారు. వారిని కూడా అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఎన్ని నిర్భందాలు చేసినా తాము ఉద్యమాన్ని ఆపమని అంగన్ వాడీలు స్పష్టం చేశారు.

విజయవాడలో అంగన్ వాడీల ర్యాలీ..

విజయవాడ : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్ వాడీలు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి సీఎం కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. మార్గమధ్యంలో పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

బాజీరావ్ మస్తానీ చిత్ర ప్రదర్శనపై నిరసనలు..

మహారాష్ట్ర : బాజీరావ్ మస్తానీ చిత్ర ప్రదర్శనపై బీజేపీ యువమోర్చా పూణె లో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. 

11:17 - December 18, 2015

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యులను సస్పెన్షన్ చేస్తున్నట్లు స్పీకర్ కోడెల వెల్లడించారు. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో ఎమ్మెల్యేలందరూ సస్పెన్షన్ కు గురయ్యారు. అంబేద్కర్ చర్చ జరిగింత వరకు సభ్యులను సస్పెన్షన్ చేశారు. శుక్రవారం రెండో రోజు ప్రారంభమైన సభలో కాల్ మనీ వ్యవహారంపై చర్చించాలని వైసీపీ పట్టుబట్టింది. దీనికి ప్రభుత్వం అంగీకరించలేదు. అంబేద్కర్ 125 జయంతి సందర్భంగా చర్చ చేపట్టాలని, కాల్ మనీపై మాత్రం సీఎం ప్రకటన చేస్తారని తరువాత చర్చ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. స్టేట్ మెంట్ తరువాత ఎలా చర్చిస్తారని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు. స్టేట్ మెంట్ అనంతరం ఎంత సమయమైనా చర్చకు అనుమతినిస్తామని స్పీకర్ సూచించినా వైసీపీ సభ్యులు వినిపించుకోలేదు. చివరకు స్పీకర్ కోడెల పది నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభమైనా సభలో ఎలాంటి మార్పు రాలేదు. అంబేద్కర్ పై చర్చ జరిగేంత వరకు ఆందోళన చేస్తున్న సభ్యులను సస్పెన్షన్ వేటు వేయాలని మంత్రి యనమల తీర్మానం చేశారు. దీనితో జగన్ తో సహా పార్టీ సభ్యులందరినీ సస్పెన్షన్ వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సస్పెన్షన్ వేటు పడిన సభ్యులు అందరూ బయటకు వెళ్లాలని స్పీకర్ సూచనలను సభ్యులు బేఖాతర్ చేశారు. చివరకు మార్షల్ రంగ ప్రవేశం చేసి వైసీపీ సభ్యులను బయటకు పంపారు. అనంతరం ప్రతిపక్షం లేకుండానే అంబేద్కర్ పై శాసనసభలో చర్చ జరిగింది. 

11:14 - December 18, 2015

అత్యాధునికయుగంలో ప్రతిదీ మార్పుకు గురవుతోంది. ప్రతి విషయంలోనూ కొత్తదనం వస్తుంది. వాడే వస్తువుల్లో మార్పు, కట్టే బట్టలో మార్పు, తినే తిండిలో మార్పు.. ప్రతి దాంట్లో మార్పును కోరుకుంటున్నారు. మనం తారు రోడ్లు, సీసీ రోడ్లు, మట్టిరోడ్లను చూశాము. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ రోడ్లు కూడా వచ్చేశాయి.

ప్లాస్టిక్ చెత్త నిర్మాణం.. 

జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ నగర రహదారులను ప్లాస్టిక్ చెత్త ద్వారా నిర్మించారు. ఆ వేస్ట్ ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసి ఇలా రోడ్ల కోసం ఉపయోగిస్తున్నారు. నగరంలోని చెత్త కేంద్రాల వద్ద ప్లాస్టిక్‌ను సేకరించి, వాటిని చిన్న చిన్న ముక్కలుగా 2 నుంచి 4 మి.మీ. లుగా కట్ చేస్తున్నారు. ఆ ప్లాస్టిక్‌కు బిట్యుమెన్(తారులాంటి) ఆయిల్ పదార్థాన్ని కలిపి రహదారి నిర్మాణం చేపడుతున్నారు. జంషెడ్‌పూర్ సేవా సంస్థతో కలిసి టాటా కంపెనీ ఈ రహదారుల నిర్మాణం చేస్తున్నది. ఇప్పటి వరకు 50 కిలోమీటర్ల వరకూ ప్లాస్టిక్ రోడ్డు నిర్మాణం జరిగింది. ప్లాస్టిక్‌తో పాటు కావాల్సిన బిట్యుమెన్‌ను మధురైలోని తిరెప్పాంకురంలో గల త్యాగరాజన్ ఇంజినీరింగ్ కాలేజ్ తయారు చేస్తుంది.

50 వేల రూపాయలు ఆదా

దీన్ని వాడటం వల్ల కిలోమీటర్‌కు ఒక టన్ను బిట్యుమెన్‌ను ఉపయోగించి 50 వేల రూపాయలు ఆదా చేస్తున్నారు. ఈ విధానాన్ని చూసి స్ఫూర్తి పొందిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అంబికాపూర్ నగర అధికారులు కూడా ప్లాస్టిక్ రహదారులను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

11:09 - December 18, 2015

ప్రకృతిలో రకరకాల చెట్లు ఉన్నాయి. వీటిలో మిస్టరీల చెట్టు కూడా ఉంది. ఈ పేరు వినాడానకి భలే గమ్మత్తుగా ఉంది కదూ..! మిస్టరీ ప్రదేశాలు.. మిస్టరీ ఆలయాల గురించి విన్నాంగానీ.. మిస్టరీల చెట్టుగురించి వినలేదు. చూడటానికి పెద్ద మర్రిచెట్టు వృక్షంలా కనిపించే ఈ చెట్టు ఒళ్లు జలదరించే విధంగా ఉంటుంది. అడవిలో అదీ నిర్మాణుష్య ప్రదేశంలో ఎలాంటి అరుపులు, ధ్వనులు లేని నిశ్శబ్ద ప్రదేశంలో ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఈ చెట్టును ముట్టుకోవడానికి సాహసించారనుకోండి ఆ భయం మాటున మనసు కకావికలం కాకమానదు! చాలామంది ఈ చెట్టు నిజం కాదని కొట్టిపడేస్తుంటారు. కానీ ఈ చెట్టు నిజమైనదనీ.. దమ్ముంటే ముట్టుకోండని సోషల్ మీడియాలో సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు నెటిజన్లు! ఇంతకీ ఈ అంతుపట్టని మిస్టరీ చెట్టు ఎక్కడుందో చెప్పలేదు కదూ! చివరి లైన్ వరకు సస్పెన్స్ గా ఉంచుదామని చెప్పలేదు. అయితే ఇప్పుడు చెప్తున్నాం చదవండి. ఈ మిస్టరీ చెట్టు నల్లగొండ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నదట..!!

వైసీపీ సభ్యుల సస్పెన్షన్..

హైదరాబాద్ : ఏపీ శాసనసభ నుండి వైసీపీ సభ్యులను స్పీకర్ కోడెల సస్పెన్షన్ చేశారు. అంబేద్కర్ పై చర్చ ముగిసేంత వరకు వీరిని సస్పెండ్ చేశారు. 

వడ్డీ వ్యాపారుల వేధింపులు ఉంటే ఎస్పీని సంప్రదించాలి - విశాఖ డీఐజీ..

శ్రీకాకుళం : కాల్ మనీ, వడ్డీ వ్యాపారుల వేధింపులు ఉంటే జిల్లా ఎస్పీని సంప్రదించాలని విశాఖపట్టణం డీఐజీ రవిచంద్ర పేర్కొన్నారు. ఇప్పటికే ఎనిమిదిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 

మధ్యాహ్నం రాజ్యసభ అఖిలపక్ష సమావేశం..

ఢిల్లీ : మధ్యాహ్నం 2.30గంటలకు రాజ్యసభ అఖిలపక్ష సమావేశం జరుగనుంది. రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగనుంది. అన్ని పక్షాల నేతలను సమావేశానికి అన్సారీ ఆహ్వానించారు. 

మధ్యాహ్నం రాజ్యసభ అఖిలపక్ష సమావేశం..

ఢిల్లీ : మధ్యాహ్నం 2.30గంటలకు రాజ్యసభ అఖిలపక్ష సమావేశం జరుగనుంది. రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగనుంది. అన్ని పక్షాల నేతలను సమావేశానికి అన్సారీ ఆహ్వానించారు. 

అంగన్ వాడీ సమస్యలు త్వరలో పరిష్కారం - అచ్చెన్నాయుడు..

హైదరాబాద్ : అంగన్ వాడీ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. వీరి జీతాలు పెంచితే ప్రభుత్వంపై రూ. 1200 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు.

 

శాసనసమండలిలో అంగన్ వాడీ సమస్య..

హైదరాబాద్ : అంగన్ వాడీ సమస్యలపై చర్చకు ఎమ్మెల్సీల పట్టుబట్టారు. స్పీకర్ వెల్ లోకి దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. దీనితో సభ పదిహేను నిమిషాల పాటు వాయిదా పడింది. 

సభలో కొనసాగుతున్న వైసీపీ ఆందోళన..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఆందోళన కొనసాగుతోంది. కాల్ మనీ వ్యవహారంపై చర్చకు వైసీపీ పట్టుబడుతోంది. కాల్ మనీ కంటే ముఖ్యమైన అంశం ఏదీ లేదని ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి పేర్కొన్నారు. 

హుడా పార్కులోని చెరువులో బిడ్డతో సహా తల్లి ఆత్మహత్య..

హైదరాబాద్ : లంగర్ హౌజ్ పీఎస్ పరిధిలోని హుడా పార్కు చెరువులో బిడ్డతో సహా తల్లి దూకి ఆత్మహత్య చేసుకుంది. 

రైల్వే బిడ్జి కింద రూ. కోటి ఎర్రచందనం దుంగలు..

కడప : రైల్వే కోడూరు (మం) మాధవరంపోడులో రైల్వే బ్రిడ్జి కింద రూ. కోటి ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

10:41 - December 18, 2015

అంతర్జాలం కారణంగా ప్రపంచం అరచేతిలో ఇమిడిపోతోంది. ఈ జాలంలో చిక్కుకున్న వారంతా ఆరోగ్యాలను హరించే వస్తువును చేతిలో పెట్టుకుని తిరుగుతున్నట్టే. నేటి దైనందిన జీవితాలలో సెల్‌ ఫోన్లు ముఖ్యమైనవిగా మారాయి. మరుగుదొడ్డి లేని ఇల్లు ఉందేమో కానీ, సెల్‌ ఫోన్‌ లేని ఇల్లు లేదన్న విషయం తెలిసిందే. అయితే సెల్‌ వాడకం ద్వారా ప్రమాదకరమైన రేడియో ధార్మిక దుష్ప్రభావాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వీటి నుంచి ప్రసారమయ్యే సూక్ష్మతరంగాలు రోగాలని కలగచేస్తాయని అనేక అధ్యాయనాలు స్పష్టం చేస్తున్నాయి.

సెల్‌ ఫోన్ల వల్ల వచ్చే అనర్ధాల గురించి ఎవరూ పట్టించుకోక పోవడం విచారకరమని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. మితిమీరిన సెల్‌ ఫోన్‌ వాడకం అనేక సమస్యలకు కారణమవుతూ హెల్‌ (నరకం)కు దారి దగ్గర చేస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు. అత్యంత ముఖ్యమైన వస్తువుగా మారిన ఈ సెల్‌ వల్ల అనారోగ్య పరిస్థితులను తప్పించు కోవడానికి కొన్ని జాగ్రత్తలు అవసరం.

పిల్లలలో వచ్చే ఇబ్బందులు..

కాలిఫోర్నియాలో దాదాపు 30 వేల మంది చిన్నారులపై వివిధ రకాల పరీక్షలు జరిపి, శోధించగా వారిలో 50శాతం మందికి పైగా రేడియేషన్‌ ప్రభావానికి గురైనట్లు తేలిందని తేల్చి చెప్పారు. అందుకు కారణం ఆ బిడ్డల తల్లులు గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువగా సెల్‌ఫోన్‌ వాడటమే ప్రధానాంశంగా తేల్చి చెప్పారు.

సెల్‌ ఫోన్ల వాడకంతో పిల్లలు ఎక్కువగా అనారోగ్యం పాలు అవుతున్నారని. మూడు సంవత్సరాల లోపు పిల్లలకి సెల్‌ ఫోన్స్‌ ని దూరంగా ఉంచడం చాలా మంచిదని నిపుణులు, డాక్టర్లు చెబుతున్నారు. సెల్‌ ఫోన్‌ లు రిసీవ్‌ చేసుకునే సిగ్నల్స్‌ కారణంగా రేడియో ధార్మికత వల్ల చిన్న పిల్లల్లో మెదడుకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాలు ఎక్కువగా ఉన్నాయి. గేమ్స్‌, పాటలు, సినిమాలు చూడడంలో పిల్లలు సెల్‌ ఫోన్స్‌ ని ఎక్కువగా వాడుతున్నారు. బ్రిటన్‌ హెల్త్‌ ప్రొడక్షన్‌ ఏజన్సీకి చెందిన సర్‌ విలియం స్టీవార్డ్‌ ఫిన్క్ష్లన్ద్లొ జరిపిన పరిశోధనలో ఈ సెల్‌ ఫోన్ల్‌ వల్ల వస్తున్న అనర్థాల గురించి కొన్ని హెచ్చరికలు చేసారు. సెల్‌ ఫోన్‌ ల ప్రభావం వల్ల చిన్న పిల్లలు ఒత్తిడికి గురై సరిగ్గా చదవలేక పోతున్నారని, తలనొప్పితో బాధపడుతున్నట్లుగా కూడా గుర్తించారు. ఆకలి మందగించడం, ఎక్కువసేపు మెలకువగా ఉండడం, చదివింది గుర్తుంచుకోకపోవడం వంటి లక్షణాలు చిన్నారుల్లో కనిపించినట్లు స్టీవార్డ్‌ తన పరిశోధన ఫలితాలు వివరించారు. ఆస్ట్రేలియా, చైనా అమెరికాలోనూ చిన్నారుల్లో ఇలాంటి లక్షణాలు అధికంగా నమోదవుతున్నాయి. మనదేశంలో కూడా చిన్నారుల ఆరోగ్యాన్ని ఈ సెల్‌ ఫోన్‌ రేడియో ధార్మికత కబళించే ప్రమాదం ఉందని స్వచ్ఛంద సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ పరిశోధనలను గమనించిన అనంతరం ఆస్ట్రేలియా మెడికల్‌ అసోసియేషన్‌ పాఠశాలల్లో మ్యూజిక్‌ సిస్టమ్స్‌, సెల్‌ ఫోన్‌ వాడకాన్ని నిషేధించాలని సూచించింది.

టీనేజ్‌వారిలో, యువతలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి, చిరాకుకీ సెల్‌ఫోన్‌ వాడకమే కారణమని నిపుణుల బృందం గుర్తించింది. 14 నుంచి 20 ఏళ్ల విద్యార్ధులపై మొనష్‌ యూనివర్సిటీ బృందం పరిశోధనలు నిర్వహించి.. ఎక్కువగా సెల్‌ ఫోన్లు వాడేవారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోయి తప్పులు ఎక్కువగా చేస్తున్నట్లు గుర్తించింది.

పెద్దవారిలో అనారోగ్యాలు

అన్ని రకాల సమాచారాలను అందుబాటులోకి తీసుకువచ్చిందని భావిస్తున్న సెల్‌ఫోన్‌ అనారోగ్య సమస్యలను కూడా దరిదాపులోకి తీసుకువచ్చిందన్నది వాస్తవం. మితిమీరిన సెల్‌ఫోన్‌ వినియోగంపై ప్రజల్లో అవగాహన ఇంకా రాలేదు. సెల్‌ ఫోన్‌ వల్ల కలిగే హాని గురించి పూర్తిగా ఏ ఒక్కరికీ తెలియదు. దీని వల్ల పెద్దవారిలో హై బ్లడ్‌ ప్రెజర్‌, ఆల్జీమెర్‌, క్యాన్సర్‌, తలనొప్పులు, మెదడు వాపు వ్యాధి తదితర ఎక్కువ ఆరోగ్య సమస్యల్ని కలుగుతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

దాదాపు 13 దేశాలలో మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులపై పరిశోధనలు నిర్వహించి రోజులో 15 నిమిషాలు సెల్‌ ఫోన్‌లో మాట్లాడే వారిలో బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చే అవకాశా లున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. పది నిమిషాలు సెల్‌ ఫోన్‌ లో మాట్లాడితే మైక్రోవేవ్‌ లో ఒక సెకను పాటు తలపెట్టినటే అని నిర్ధారించారు శాస్త్రజ్ఞులు . మానసిక సమస్యల పెరుగుదలకు, పురుషులలో పెరుగుతున్న వంధ్యత్వానికి కూడా సెల్‌ ఫోన్‌ కారణమని వెల్లడిస్తున్నారు. గర్భిణులు సెల్‌ ఫోన్‌ వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంతమంచిది. సెల్‌ కాల్స్‌ ఆరు నిముషాలకు మించి వాడటం బిడ్డ ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

- ప్రతి రెండు నిమిషాల కాల్‌ మెదడు ఎలక్ట్రికల్‌ యాక్టివిటీపై ఒక గంటవరకు పనిచేస్తుందని నిపుణులు కనుగొన్నారు. అందుకే వీలైనంత వరకు చాలా తక్కువగా సెల్‌ఫోన్‌ లో మాట్లాడాలి.

- సెల్‌ ఫోన్‌ను శరీరానికి దూరంగా ఉంచాలి. సాధ్యమైనంత వరకు స్పీకర్‌ను ఉపయోగించి మాట్లాడాలి.

- హెడ్‌ ఫోన్స్‌ని ఉపయోగించాలని అనుకున్నట్లైతే, వైర్‌ హెడ్‌ సెట్ల కన్నా వైర్‌ లెస్‌ హెడ్‌ సెట్లని ఉపయోగించడం మంచిది.

- సెల్‌ ఫోన్‌ పనిచేస్తూ ఉండగా ప్యాంట్‌, షర్ట్‌ జేబులో పెట్టుకోవద్దు. సెల్‌ఫోన్‌ కోసం సపరేట్‌ లెదర్‌ ఫౌంచ్‌ను ఉపయోగించాలి. లేదా స్విచ్‌ ఆఫ్‌ చేయండి.

- సెల్‌ ఫోన్‌ ని అత్యవసర పరిస్థితులలో మాత్రమే పిల్లలు ఉపయోగించడాన్ని అనుమతించాలి.

- సెల్‌ ఫోన్‌ కొనే సమయంలో మ్యానువల్‌లో ఉన్న ఎస్‌ ఎ ఆర్‌ (నిర్దిష్టమైన విలీన రేటు) ఎంత ఉందో చూడాలి. ఎంత తక్కువ ఎస్‌ ఎ ఆర్‌ విలువ ఉంటే అంత తక్కువ రేడియేషన్‌ ఉంటుందని తెలుసుకోవాలి.

- ఎలివేటర్లు / లిఫ్టులు, వాహనాలు వంటి మూసివేసిన మెటల్‌ స్పేసులలో రేడియేషన్‌ ఉధృతంగా ఉంటుంది. సెల్‌ వాడకపోవడమే మంచిది.

- బ్రాండెడ్‌ సెల్‌ఫోన్లతో ఎక్కువసేపు మాట్లాడినా ఇబ్బందేమీ ఉండదు. అదే అన్‌బ్రాండెడ్‌ మొబైల్‌తో రెండు నిమిషాలు మాట్లాడినా.. చెవి దగ్గర వేడెక్కుతుంది. ఫోన్‌ నుంచి అధిక రేడియేషన్‌ వెలువడటమే ఇందుకు కారణం. సెల్‌ఫోన్‌ కొనేటప్పుడు కెమెరా, వీడియో ప్లేయర్‌, ఎంపీ 3, ఇంటర్నెట్‌ వంటి ఫీచర్లతో పాటు రేడియేషన్‌ ఎంత వెలువరిస్తుందో కూడా తెలుసుకోవాలి.

- అవసరమైన కాల్స్‌ మాత్రమే మాట్లాడి, మిగిలిన వాటికి టెక్ట్స్‌ మెసేజ్‌ (ఎస్‌ఎంఎస్‌) వినియోగించాలి.

- నెట్‌వర్క్‌ బలహీనంగా ఉన్నచోట, సిగ్నల్‌ కోసం ఫోన్లు అత్యధిక రేడియేషన్‌ను వెలువరించే అవకాశముంది. అలాంటి ప్రదేశాల్లో ఫోన్‌ వినియోగం తగ్గించాలి.

- నిద్రించేటప్పుడు తలగడ వద్ద ఫోన్‌ ఆన్‌చేసి ఉంచవద్దు.

- వి. గౌతమ్‌ శశాంక్‌,

హైదరాబాద్‌.

 

10:28 - December 18, 2015

వైద్యరంగంలో వస్తున్న అధునాతన పద్ధతులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ అంతర్జాతీయ స్థాయి వైద్యసేవలు నగరంలోనూ అందుబాటులోకి వచ్చాయి. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల చిన్నవయసులోనే ఎంతోమంది గుండెజబ్బుల బారిన పడుతున్నారు. వారికి ఉపశమనం కలిగించే వైద్యవిధానంలో ఒకటి క్రాస్‌బాస్‌ వైద్యవిధానం. అమెరికా వైద్యులు కనుగొన్న ఈ వైద్యవిధానం ఇప్పుడు హైదరాబాద్‌లోనూ అందుబాటులోకి వచ్చింది.

కొన్ని నెలలుగా హృదయ ధమని మూసుకుపోవడాన్ని క్రానిక్‌ టోటల్‌ ఆక్లూజన్‌ (సిటిఓ) అంటారు. దీర్ఘకాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్న వారిలో ఈ పరిస్ధితి సంభవిస్తుంది. సిటిఓ వల్ల తీవ్రమైన గుండెపోటు వస్తుంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వైద్యవిధానం లో సిటిఓ సంభవించినప్పుడు బైపాస్‌ సర్జరీ చేయడం జరుగుతుంది. అయితే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనల అనంతరం బైపాస్‌ సర్జరీ అవసరం లేకుండా క్రాస్‌ బాస్‌ విధానంలో స్ట్రింగ్‌ రే పరికరంతో సర్జరీ లేకుండా సిటిఓను నివారించే అత్యంత అధునాతన వైద్యవిధానం అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం వల్ల ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా స్టెంట్‌ అమర్చి చికిత్స అందిస్తారు.

గుండె రక్తనాళాంలో వందశాతం పూడిక ఏర్పడటం వల్ల గుండె బలహీన పడి గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో రక్తనాళంలోని పూడికను స్టంట్‌ అమర్చి రక్త సరఫరాను పునరుద్ధరించవచ్చు. అయితే స్టంట్‌ అమర్చే పద్ధతిలో అనేక నూతన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్రాస్‌ బాస్‌ అధునాతన పద్ధతి అమెరికా, జపాన్‌ తదితర దేశాల్లో అందుబాటులో ఉంది. మన దేశంలోనూ ఈ నూతన పద్ధతి ఇప్పుడిప్పుడే రోగులకు అందుబాటులోకి వస్తుంది.

లక్షణాలు..తీవ్రమైన గుండెనొప్పితో బాధపడుతారు. ఛాతీ భాగంలో తీవ్రమైన ఇబ్బంది ఉన్నట్లుగా గుర్తిస్తారు.

నిర్ధారణ.. ఇసిజి పరీక్షల్లో గుండె పోటును నిర్ధారిస్తారు. ఆంజియోప్లాస్టీ ద్వారా ధమని మూసుకుపోవడాన్ని గుర్తించి.. ఏ మేరకు రక్తనాళం మూసుకుపోయిందో తెలుసుకుంటారు. గుండె ప్రాంతంలో రక్త సరఫరా చేసే ప్రధాన రక్తనాళం మూసుకుపోవడంతో తీవ్రమైన గుండెపోటు వస్తుంది. ఇలాంటి సమయంలో బైపాస్‌ అవసరం అవుతుంది. అయితే అందుబాటులోకి వచ్చిన అధునిక వైద్యవిధానం వల్ల సర్జరీ అవసరం లేకుండా రక్తనాళంలో ఏర్పడిన బ్లాక్‌ను తొలగించవచ్చు.

చికిత్సా విధానం.. ప్రస్తుతం కార్డియాలజీ చికిత్సలో అందుబాటులోకి వచ్చిన క్రాస్‌ బాస్‌ వైద్యవిధానం వల్ల చాలా సులభంగా రక్తనాళంలోని అడ్డంకులను తొలగించవచ్చు. ఈ నూతన చికిత్సా విధానంలో సర్జరీతో అవసరం లేకుండా స్ట్రింగ్‌ రే పరికరం ద్వారా ధమనికి ఛానల్‌ ద్వారా బెలూన్‌ను అమర్చి డ్రగ్‌ ఎల్యూటింగ్‌ స్టెంట్‌తో అడ్డంకులను తొలగిస్తారు. ఈ పూర్తి చికిత్సను లోకల్‌ అనెస్థీషియాను ఉపయోగించి రెండు గంటల వ్యవధిలో పూర్తిచేయడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా ఈ విధానంలో చికిత్స పొందిన రోగి రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ కావచ్చు. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. సక్సెస్‌ రేటు కూడా ఎక్కువగా ఉంటుంది.

- డాక్టర్‌ జి. కొండల్‌ రావు,

సీనియర్‌ కార్డియాలజిస్ట్‌,

సన్‌షైన్‌ హాస్పిటల్‌,

హైదరాబాద్‌.

10:25 - December 18, 2015

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో అంగన్ వాడీలు మళ్లీ కదం తొక్కారు. హామీల అమలుపై ప్రభుత్వ నిర్ల్యక్ష్యంపై అంగన్ వాడీలు తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం చలో విజయవాడకు భారీగా అంగన్ వాడీలు తరలివస్తున్నారు. తుమ్మలపల్లి కళా క్షేత్రం నుండి సీఎం క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీని అడ్డుకొనేందుకు పోలీసులు శతవిధాల ప్రయత్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నేత గఫూర్, ఏఐటీయూసీ నేత ఓబులేషులు టెన్ టివితో మాట్లాడారు. టిడిపి ప్రభుత్వం కార్మికుల పట్ల వ్యతిరేకత ప్రవర్తిస్తోందని, తాము కొత్త డిమాండ్ లు ఏవీ కోరడం లేదన్నారు. మార్చి నెలలో అంగన్ వాడీ జీతాలు పెంచుతామని శాసనసభలో పేర్కొన్నారని, ఆగస్టు నెలలో యనమల నాయకత్వంలో సబ్ కమిటీ చర్చించదని గుర్తు చేశారు. సెప్టెంబర్ నుండి వేతనాలు పెంచుతామని చెప్పారని, డిసెంబర్ నెల గడుస్తున్నా ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. ప్రభుత్వం దాగుడుమూతలు ఆడడం మంచిది కాదని, వేతనాలు పెంచకపోతే ఆందోళన చేయకతప్పదన్నారు. రూ.1200 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేస్తోందని, వాస్తవానికి రూ.312 కోట్లు ఖర్చు అవుతాయన్నారు. ప్రభుత్వం శవాలు మీద రూకాలు ఏరుకొంటోందని, పనిచేసినా జీతాలివ్వడం లేదన్నారు. కార్మికులను ఏడిపించుకొంటున్నారని తెలిపారు. రూ.1200 కోట్లు అవుతాయని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని అంగన్ వాడీలు తెలిపారు. 

వాయిదా అనంతరం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైంది. ప్రారంభమైన సమయంలో వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో ఆ పార్టీకి సంబంధించిన సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనితో స్పీకర్ పది నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైనా కాల్ మనీ అంశంపై చర్చించాలని వైసీపీ పట్టుబడుతోంది. 

అంగన్ వాడీల చలో విజయవాడ..

విజయవాడ : చలో విజయవాడకు అంగన్ వాడీలు భారీగా తరలివస్తున్నారు. 13 జిల్లాల నుండి అంగన్ వాడీలు బెజవాడకు చేరుకుంటున్నారు. తుమ్మలకళా క్షేత్రం నుండి సీఎం కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగనుంది. 

పెట్రోల్, డీజిల్ సుంకం పెంపుపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం..

ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ సుంకం పెంపుపై కాంగ్రెస్ లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. 

తాడేపల్లిగూడెంలో స్కూల్ బస్సు దగ్ధం..

ప.గో : తాడేపల్లిగూడెంలో ఓ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. బస్సు పూర్తిగా దగ్థమైంది. బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులు సురక్షితంగా ఉన్నారు. 

సమయాన్ని వృధా చేయడం సరికాదు - కోడెల..

హైదరాబాద్ : కాల్ మనీ పై చర్చించాలని కోరుతూ ఏపీ శాసనసభలో వైసిపి సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేయడం పట్ల స్పీకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా సమయాన్ని వృదా చేయడం సరికాదన్నారు. 

శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ..

చిత్తూరు : తిరుమల శ్రీవారిని రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దర్శించుకున్నారు. అనంతరం అభిషేకం సేవలో పాల్గొన్నారు. 

09:38 - December 18, 2015

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు అదే సీన్స్ కొనసాగాయి. స్టేట్ మెంట్ అంశం అసెంబ్లీని కుదిపేసింది. ముందుగా సీఎం స్టేట్ మెంట్ ఇస్తారని తరువాత చర్చ చేపడుతామని ప్రభుత్వం వాదించింది. దీనిపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనితో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈసందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ సభలో మాట్లాడారు. స్టేట్ మెంట్ సీఎం చంద్రబాబు ఇస్తే క్లారిఫికేషన్ వరకు మాత్రమే ఇస్తాం అని చెబుతారని, అదొక పది నిమిషాలు ఇచ్చి చర్చ ముగిస్తారని తెలిపారు. కాల్ మనీపై చర్చ జరుగక ముందే సీఎం చంద్రబాబు నాయుడు స్టేట్ మెంట్ ఇవ్వడం ఎంత వరకు సమంజసమని సూటిగా ప్రశ్నించారు. అంబేద్కర్ ను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ఏప్రిల్ 14న గుర్తుకు రాలేదా ? అని జగన్ ప్రశ్నించారు.

స్టేట్ మెంట్ ఇచ్చిన అనంతరం చర్చ – యనమల..
సీఎం చంద్రబాబు నాయుడు స్టేట్ మెంట్ ఇచ్చిన అనంతరం చర్చ చేపట్టవచ్చని ఏపీ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల పేర్కొన్నారు. జగన్ మాట్లాడిన అనంతరం యనమల మాట్లాడారు. అంబేద్కర్ మహనీయుడని, అలాంటి వ్యక్తి గురించి పార్లమెంట్ లో చర్చ జరిగిందని గుర్తు చేశారు. పేదల గురించి..రాజ్యాంగం గురించి చర్చించే అవసరం వారికి లేదని వైసీపీని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. అంబేద్కర్ ఇష్యూ అయిపోయిన తరువాత కాల్ మనీ అంశంపై చర్చించే అవకాశం ఉందని యనమల తెలిపారు.

ఎంత సమయమైనా తీసుకోవచ్చు - కోడెల..
సీఎం చంద్రబాబు నాయుడు స్టేట్ మెంట్ ఇచ్చిన తరువాత మాట్లాడవచ్చని స్పీకర్ కోడెల పేర్కొన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ వెలుబుచ్చిన అభ్యంతారాలపై స్పీకర్ కోడెల సమాధానం ఇచ్చారు. కాల్ మనీ అంశంపై స్టేట్ మెంట్ ఇచ్చిన అనంతరం చర్చ జరుగుతుందని బీఏసీలో సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొనడం జరిగిందని, దీనికి ఒప్పుకున్నారని తెలిపారు. ఇన్ కంప్లీట్ గా చర్చ జరిగిన అనంతరం మరుసటి రోజు కూడా చర్చ వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతిపక్షం ఎంత సమయమైనా తీసుకోవచ్చని స్పీకర్ కోడెల సూచించారు.
సభలో పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో అసెంబ్లీని పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల వెల్లడించారు. 

09:31 - December 18, 2015

హైదరాబాద్ : కాల్ మనీ అంశంపై వైసీపీ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఏపీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల పేర్కొన్నారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. కాల్ మనీ అంశంపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో సభలో ఆ పార్టీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా యనమల మాట్లాడారు. బీఏసీలో ఏమైతే నిర్ణయించబడిందో ప్రభుత్వం ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. బిజినెస్ ప్రకారం అసెంబ్లీ నడుస్తుందని, అలా కాకపోతే చర్యలు తీసుకొనే హక్కు స్పీకర్ కు ఉందన్నారు. ఇలా సభను అడ్డుకోవడం సరికాదని, ఇప్పటికే ఒక రోజు మించిపోయిందన్నారు. మాట్లాడే హక్కు వీరికి లేదని యనమల పేర్కొన్నారు. 

09:29 - December 18, 2015

హైదరాబాద్ : కాల్ మనీపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. కాల్ మనీ అంశంపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో సభలో ఆ పార్టీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. గురువారం సమయం అంతా వృదా చేశారని, సీఎం చంద్రబాబు నాయుడు ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేశారని తెలిపారు. అంబేద్కర్ 125వ జయంతిపై చర్చిద్దామని, అంనతరం కాల్ మనీపై సీఎం ప్రకటన చేస్తారని తెలిపారు. ఏ ఆధారాలున్నా తమకు ఇవ్వాలని చెబుతున్నా కావాలని సభ సమయాన్ని వృదా చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై మాట్లాడే నైతిక హక్కు లేదని, అన్ని కుంభకోణాల్లో ఆ పార్టీకి సంబంధం ఉందన్నారు. వర్కింగ్ లంచ్ పెట్టుకుని ఎంతసేపైనా చర్చిద్దామని అచ్చెన్నాయుడు సూచించారు. 

ఏపీ అసెంబ్లీ వాయిదా..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ వాయిదా పడింది. శుక్రవారం రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం కాల్ మనీపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానం స్పీకర్ తిరస్కరించడంతో ఆ పార్టీ సభ్యులు ఆందోళన చేపట్టారు. అనంతరం స్పీకర్ కోడెల పది నిమిషాల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

09:21 - December 18, 2015

హైదరాబాద్ : కాల్ మనీపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరగాల్సిందేనని వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్ పట్టుబట్టారు. ఏపీ అసెంబ్లీలో రెండో రోజు సందర్భంగా జగన్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం హేయమైన పరిస్థితిలో నడుస్తోందని, రాష్ట్రం తలదించుకొనేలా విజయవాడలో సెక్స్ రాకెట్ నడుస్తోందన్నారు. ఎన్ని వీడియో టేపులు దొరికాయని, చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు భాగస్వాములై ఉన్నారని ఆరోపించారు. దీనిపై చర్చ జరగాల్సిందేనని, అప్పుడే వ్యవస్థ అనేది బాగుపడుతుందన్నారు. మొదటి సారి సభ వాయిదా పడిన అనంతరం అంబేద్కర్ అంశం గుర్తుకు రాలేదని, రెండోసారి వాయిదా పడిన అనంతరం అంబేద్కర్ అంశంపై చర్చించాలని అధికార పక్షం పేర్కొందన్నారు. వాళ్లను వాళ్లు రక్షించడం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ జయంతి ఎప్రిల్ 14వ తేదీ అని డిసెంబర్ 17న కాదన్నారు. అలాగే అంబేద్కర్ వర్ధంతి డిసెంబర్ ఆరో తేదీ అని డిసెంబర్ 15వ తేదీన కాదని జగన్ పేర్కొన్నారు. 

చర్చకు సిద్ధం - అచ్చెన్నాయుడు..

హైదరాబాద్ : కాల్ మనీపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కాల్ మనీపై వాయిదా తీర్మానం తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడారు. కాల్ మనీ అంశంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు. 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలను చేపడుదామని, తరువాత కాల్ మనీ అంశంపై చర్చిద్దామని స్పీకర్ కోడెల సూచించారు. కాల్ మనీపై విపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. 

కాల్ మనీపై వైసీపీ వాయిదా తీర్మానం..

హైదరాబాద్ : కొద్దిసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం కానున్నాయి. కాల్ మనీ పై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.  

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ఆత్మహత్య...

అనంతపురం : యాడికి (మం) కమలపాడులో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. పీఎస్ లో ప్రియుడు లొంగిపోయాడు.

 

నల్లమలలో మావోయిస్టు డంప్...

ప్రకాశం  : ఎర్రగొండపాలెం - నెక్కంటి నల్లమల అటవీ ప్రాంతంలో మావోయిస్టు డంప్ లభ్యమైంది. ఏకే 47 మాగజైన్, 8 రాకెట్ లాంచర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

08:31 - December 18, 2015

ఏపీ అసెంబ్లీ సమావేశాలు టీ - 20 మ్యాచ్ లా తలపిస్తున్నాయని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ తీరు…కాల్ మనీ..యూఎస్ వడ్డీ రేట్లు పెంచడం..తదితర అంశాలపై ఆయన విశ్లేషణ చేశారు. ప్రొ.నాగేశ్వర్ మాటల్లోనే..
''ఏ కాలమైనా అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా ఉంటాయి. తెలంగాణ, ఏపీ అసెంబ్లీలలో తేడా ఉంది. టి. అసెంబ్లీలో వివిధ పార్టీల సభ్యులున్నారు. ఏపీ అసెంబ్లీలో మాత్రం కేవలం టిడిపి, వైసిపి సభ్యులున్నారు. బీజేపీ ఉన్నా టిడిపికి అటాచ్ గా ఉంది. ఈ సమావేశాలను చూస్తుంటే టీ -20 మ్యాచ్ లా ఉంటున్నాయి. ఇద్దరు నాయకుల మధ్య వైరం ఉంది. పదేళ్లు అధికారంలోకి దూరం కావడంతో రెట్టించిన ఉత్సాహంతో పరిస్థితిలో టిడిపి ఉంది. రెండు శాతం ఓట్లతో వైసీపీ ఓడిపోయింది. ఓటమిని పూర్తిస్థాయిలో జీర్ణించుకోలేని పరిస్థితిలో వైసీపీ ఉంది. కాల్ మనీపై అసెంబ్లీలో కొత్తగా ప్రకటన చేసేది ఏముంది. అద్భుతాలు జరుగుతున్నట్లు ఒక ప్రకటన ఉంటుంది. విజయవాడకే పరిమితం కాదు..అంతా విస్తరించింది. అంటే ఒక డైల్యూట్ చేసే పరిస్థితి ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీల నేతలు ఉన్నారని అనడంలో లోపం ఉంది. టిడిపి నేతలు తక్కువగా ఉన్నారు..ప్రతిపక్షం వాళ్లు ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. ఇలా అనడానికి సిగ్గు పడాలి. ప్రతిపక్ష నేతలుంటే లోపల వేసేయొచ్చు కదా ? టిడిపి నేతలు ఉండడం వల్లే ఏమి మాట్లాడ లేకపోతున్నారు. ఈ విషయంలో రాజకీయ సంకల్పం కావాలి'' అని పేర్కొన్నారు. అంతేగాక యూఎస్ వడ్డీ రేట్లు పెంచడంపై కూడా ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. 

08:29 - December 18, 2015

హైదరాబాద్ : వయస్సు ఏమో 46..ఇతను కామ పిశాచిగా మారిపోయాడు. అభం..శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఆకృత్యం ప్రవర్తించాడు. సభ్య సమాజం తలదించుకొనేలా చేసిన ఈ దుర్మార్గుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఈ దారుణ ఘటన పాతబస్తీలో చోటు చేసుకుంది. శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహ్మద్ అక్రం ఖాన్ (46) చున్నికా బట్టి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇతను చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దారుణం చేసిన దుర్మార్గుడిని పోలీసులు పట్టుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చికిత్స నిమిత్తం చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.

ప్రకాశం : జరుగుమల్లిలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. నాలుగేళ్ల బాలికపై మైనర్ బాలుడు అత్యాచార యత్నం జరిపాడు. బాలికను వైద్య చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు. 

08:07 - December 18, 2015

చిత్తూరు : నిఘా కళ్లు...నిత్యం అధికారులు..పోలీసుల కూంబింగ్...ప్రాణాలు తీసే ఎన్ కౌంటర్లు...ఎన్ని చర్యలు తీసుకున్నా ఎర్రచందనం దుంగల స్మగ్లర్ల ఆగడాలు ఆగడం లేదు. పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది సంయుక్తంగా దాడులు చేస్తున్నా 'ఎర్ర' దొంగలు భయపడడం లేదు. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని జూ పార్కుకు కూత వేటు దూరంలోని అడవీలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. కొద్దిదూరం వెళ్లిన అనంతరం ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. లొంగిపోవాలని హెచ్చరించారు. కానీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది మాటలను పెడచెవిన పెట్టిన కూలీలు రాళ్లతో దాడికి దిగారు. దీనితో సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. వెంటనే అక్కడి నుండి కూలీలు కాళ్లకు పని చెప్పారు. దొంగలు వదిలి వెళ్లిన 150 దుంగలను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. 

సెల్ టవర్ ఎక్కిన బుడగజంగాలు...

కర్నూలు : కలెక్టరేట్ లో బుడగజంగాలు సెల్ టవర్ ఎక్కారు. 144 జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్టీ జాబితాలో కలపాలని ఆందోళన చేస్తున్నారు.

మధుపాడలో రెండు పూరిళ్లు దగ్ధం..వృద్ధురాలు సజీవదహనం..

విజయనగరం : గజపతి నగరం (మం) మధుపాడలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. వృద్ధురాలు అప్పల నర్సమ్మ అగ్నికి ఆహుతైంది. 

కుత్తావారిపాలెం వద్ద తుఫాన్ వాహనం బోల్తా..

ప్రకాశం : జిల్లాలోని సంతమాగులూరు (మం) కుత్తావారిపాలెం వద్ద ఓ తుఫాన్ జీపు అదుపుతప్పి బోల్తా పడింది. ఈఘటనలో ఓ మహిళ మృతి చెందింది. తుఫాన్ లో 19 మంది ప్రయాణీకులు ఉన్నారు. దొనకొండ నుండి విజయవాడ వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. 

07:37 - December 18, 2015

కాల్ మనీ అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. అంబేద్కర్ పై చర్చించాలని అధికార పక్షం పట్టుబట్టగా కాల్ మనీపై చర్చించాలని వైసీపీ పట్టుబట్టింది. దీనితో సభలో గందరగోళం చెలరేగింది. సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల వెల్లడించారు. మరోవైపు అనంతపురం జిల్లా నంబులపూలకంటలో సోలార్ పార్కు భూములను పరిశీలించేందుకు వచ్చిన సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ పర్యటనకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు విధించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చలో శ్రీరాములు (టిడిపి), కరణం ధర్మశ్రీ (వైసీపీ), గఫూర్ (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:31 - December 18, 2015

మంచు మనోజ్‌, రెజీనా హీరోహీరోయిన్లుగా దశరథ్‌ దర్శకత్వంలో బేబి త్రిష సమర్పణలో సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి.పతాకంపై మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్న చిత్రం 'శౌర్య'. ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ సాంగ్‌ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. మంచు మనోజ్‌, ఆయన సతీమణి ప్రణతి సంయుక్తంగా మోషన్‌ పోస్టర్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మనోజ్‌ మాట్లాడుతూ, 'ఈ కథ వినగానే బాగా నచ్చింది. దశరథ్‌ ప్రతి ఫ్రేమ్‌ను డిఫరెంట్‌గా తెరకెక్కించారు. నిర్మాత శివకుమార్‌ ప్రొడక్షన్‌ విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా బాగా నిర్మించారు. ఈ చిత్రంలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. త్వరలోనే ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. 'మా బ్యానర్‌లో వస్తున్న రెండో చిత్రమిది. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. సినిమా బాగా రావడానికి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంతగానో సహకరించారు. ఇది మా సంస్థకు డబ్బుతోపాటు మంచి పేరును తెచ్చే చిత్రమవుతుంది' అని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ, 'ఇదొక థ్రిల్లర్‌ లవ్‌ స్టోరీ. 95 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. రెండు మూడు రోజుల్లో దాదాపు సినిమా షూటింగ్‌ చేసి జనవరి 8 వరకు సినిమా తొలి కాపీ రెడీ చేయనున్నాం. ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా వేదాను పరిచయం చేస్తున్నాం' అని చెప్పారు.

07:30 - December 18, 2015

రణ్‌దీప్‌ హుడా, కాజల్‌ అగర్వాల్‌ జంటగా రూపొందుతున్న 'దో లఫ్‌జోం కి కహానీ' చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను గురువారం చిత్ర బృందం విడుదల చేసింది. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ సమర్పణలో దర్శకుడు దీపక్‌ తిజోరి రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రమిది. ఈ సందర్భంగా కాజల్ ట్విట్టర్ ద్వారా సినిమా విశేషాలను ట్వీట్స్ చేశారు. 'ఓ మంచి ప్రేమకథా చిత్రమిది. ఫస్ట్‌లుక్‌ రిలీజైంది. అతి త్వరలోనే ఈరోస్‌ ద్వారా ట్రైలర్‌ కూడా విడుదలవ్వనుంది. ఈ సినిమా తప్పకుండా విశేషాదరణ పొందుతుంది' అని కాజల్‌ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. దీంతోపాటు కాజల్‌ తెలుగులో పవన్‌కళ్యాణ్‌ సరసన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌', మహేష్‌బాబుతో 'బ్రహ్మోత్సవం' చిత్రాల్లో నటిస్తోంది.

07:28 - December 18, 2015

బాలీవుడ్‌లో బయోపిక్‌ల జోరు మరింత ఊపందుకుంది. ఇప్పటికే పలువురి జీవిత కథల ఆధారంగా ఎన్నో చిత్రాలు బాలీవుడ్‌లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిల్లో క్రీడాకారుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాలు కూడా ఉన్నాయి. భారత టెన్నీస్‌స్టార్‌ సానియా మిర్జా జీవిత కథతో ఇప్పటికే దర్శకురాలు ఫరాఖాన్‌ ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే కోవలోకి మరో క్రీడాకారిణి బయోపిక్‌గా రానుంది. భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు ఆమోల్‌ గుప్తె దర్శకత్వంలో రూపొందబోయే ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు అతిత్వరలోనే ప్రారంభం కానున్నాయి. 'నా జీవిత కథతో తెరకెక్కబోతున్న ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాన' అంటూ సైనా నెహ్వాల్‌ దర్శకుడు అమోల్‌గుప్తేతో కలిసి తీసుకున్న ఫొటోను ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

07:25 - December 18, 2015

రజనీకాంత్‌, శంకర్‌ కాంబినేషన్‌లో 'రోబో'కి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో '2.0' పేరుతో లైకా ప్రొడక్షన్స్‌ అధినేత సుభాష్‌ కరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం ఓ విశేషమైతే, బాలీవుడ్‌ హీరో అక్షయ్ కుమార్‌ ఓ కీలక పాత్రలో నటించడం మరో విశేషం. ఆస్కార్‌ విజేత ఏ.ఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని భారీ టెక్నీకల్‌ స్టాండర్డ్‌లో హాలీవుడ్‌ స్థాయిలో రూపొందించడానికి శంకర్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఎమీ జాక్సన్‌ ఇందులో రజనీ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. 'ఈ చిత్రాన్ని 3డి ఎఫెక్ట్స్‌లో ప్రపంచం లోనే టాప్‌ టెక్నీషియన్స్‌తో రూపొందిస్తున్నాం. ఎన్నో అద్భుతమైన సినిమాలను పనిచేసి ప్రపంచం లోనే నెం.1గా నిలిచిన ఏనిమా ట్రానిక్స్‌ కంపెనీ ఈ చిత్రం కోసం పనిచేస్తుంది. అలాగే 'ట్రాన్‌', 'వాచ్‌మేన్‌' వంటి అద్భుతమైన చిత్రాలకు కాస్ట్యూమ్స్‌ని డిజైన్‌ చేసిన మేరీ ఇ.వోట్‌ ఈ చిత్రానికి వర్క్‌ చేయడం, 'ట్రాన్స్‌ ఫార్మర్స్‌'కు యాక్షన్‌ సీక్వెన్స్‌లను కంపోజ్‌ చేసిన కెన్నీ బేట్స్‌, 'లైఫ్‌ ఆఫ్‌ పై' చిత్రానికి విఎఫ్‌ఎక్స్‌ చేసిన జాన్‌ హ్యూజ్స్‌ వంటి హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ ఈ చిత్రానికి పని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. చిత్ర ప్రారంభోత్సవాన్ని చాలా గ్రాండ్‌గా నిర్వహించాలని భావించాం. కాని ఇటీవల తమిళనాడులో సంభవించిన వరదల కారణంగా నిరాడంబరంగా ఈ చిత్రాన్ని మొదలు పెట్టాం' అని నిర్మాత తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రజనీకాంత్‌, శంకర్‌, ఏ.ఆర్‌ రెహ్మాన్‌, అక్షయ్ కుమార్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ముత్తురాజ్‌, విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాస్‌ మోహన్‌, సినిమాటోగ్రాఫర్‌ నిరవ్‌ షా తదితరులు పాల్గొన్నారు.

07:21 - December 18, 2015

గోపీచంద్‌, రాశిఖన్నా జంటగా ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్న 'ఆక్సిజన్‌' చిత్రం షూటింగ్‌ గురువారం చెన్నరులోని శ్రీవిశ్వరూపా సాయిబాబా టెంపుల్‌లో ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమంలో హీరో గోపీచంద్‌, డైరెక్టర్‌ జోతికృష్ణ, నిర్మాణ పర్యవేక్షకులు ఎ.ఎం.రత్నం, నిర్మాత ఎస్‌.ఐశ్వర్య, సినిమాటోగ్రాఫర్‌ వెట్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు జోతికృష్ణ మాట్లాడుతూ, 'ఇది ఒక ఫాస్ట్‌ పేస్డ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌. నటుడు జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటించనున్నారు. జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది' అని అన్నారు. జగపతిబాబు, కిక్‌ శ్యామ్‌, అను ఇమ్మానుయేల్‌, ఆలీ తదితరులు నటిస్తున్నారు. 

07:19 - December 18, 2015

మహిళలకు పాతికేళ్లు దాటాయా...అయితే హెల్త్‌ టెస్ట్‌ తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పాతిక సంవత్సరాలు దాటిన తర్వాత ఆడవారు ఆరోగ్యపరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. అందులో ఒక పరీక్ష కంటి భాగానికి సంబంధించినది. దానితో పాటు స్తనాలు, మూత్ర, షుగర్‌ పరీక్షలు చేయించుకోవాలి. అప్పటి నుండి రెండు మూడు సంవత్సరాల కొకసారి పరీక్షలు చేయించుకోవడం మంచిది. 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదలు రక్తంలో కొవ్వు పరీక్ష తప్పని సరి. రక్తపోటు పరీక్ష రెండేళ్ళకొకసారి చేయించుకోవాలి. కాలేయ, కంటి పరీక్షలు పరిస్థితిని బట్టి చేయించుకోవాలి. పాతిక సంవత్సరాల తర్వాత శరీర రూపంలో తేడా రావడం మొదలవుతుంది. కాబట్టి శరీరపు ఎత్తు బరువును బట్టి చేసే బాడీమాస్‌ ఇండెక్స్‌ అంచనా వేయించుకుని వయసుకు తగిన బరువున్నదా లేదా అని డాక్టర్‌ని సంప్రదించి తెలుసుకోవాలి.

07:18 - December 18, 2015

మన శరీరం మీద మనకు కొంచెం శ్రద్ధ, ఆసక్తి ఉంటే ఆకర్షణీయమైన చర్మాన్ని మనం సొంతం చేసుకోవచ్చని చర్మ సౌందర్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా... వివిధ రకాల జ్యూస్‌లతో ముఖానికి తేజస్సు సమకూర్చుకోవచ్చని వారు సలహా ఇస్తున్నారు. ప్రతిరోజూ ఓ గ్లాసుడు యాపిల్‌ జ్యూస్‌ తాగగలిగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. అలాగే క్యారెట్‌ జ్యూస్‌ ఆరోగ్యానికి మహా మంచిదంటున్నారు. ఇది ముఖానికి తేజస్సును ఇవ్వడమే కాకుండా, కళ్ళకు ఎంతో మంచిదని చెపుతున్నారు. అసిడిటిని సైతం తగ్గిస్తుందట. క్యారెట్‌లో విటమిన్‌ ఏ, సీలు మాత్రమే కాకుండా మరెన్నో పోషక విలువలు ఉంటాయని వారు చెపుతున్నారు. ఇకపోతే, బీట్రూట్‌ జ్యూస్‌ సైతం చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పైగా ఇది లివర్‌కు కూడా మంచిది. కిడ్నీలను శుద్ధి చేస్తుంది. రక్తంలో ఏమైనా మలినాలు ఉంటే బీట్రూట్‌ రసం తీసుకుంటే బయటకు పోతాయట. అన్నింటికంటే ముఖ్యంగా ఎర్ర రక్తకణాల సమాఖ్య పెంచుతుందంటున్నారు. అలాగే, కడిగిన టమాటాలు నాలుగు మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసి, చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ముఖానికి మంచి గ్లో వస్తుందని చెపుతున్నారు.

నేటి నుండి హైదరాబాద్ బుక్ ఫెయిర్..

హైదరాబాద్ : హైదరాబాద్ బుక్ ఫెయిర్ నేటి నుండి ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హాజరు కానున్నారు. ఈ ప్రదర్శన రోజు రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు జరుగుతుందని, ప్రభుత్వ సెలవు రోజుల్లో 12 గంటల నుంచి రాత్రి 8.30 వరకు ఉంటుందని బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరీ గౌరీ శంకర్ పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రవేశ రుసుం లేదన్నారు.

టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై తమిళ కూలీల దాడి..

తిరుపతి : చంద్రగిరి (మం) శేషాచల అడవుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై తమిళ కూలీలు రాళ్లతో దాడి చేయడంతో సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. తమిళ కూలీలు పరారయ్యారు. 150 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. 

06:51 - December 18, 2015

కాల్ మనీ, ప్రయివేట్ ఫైనాన్స్ , వడ్డీ వ్యాపారాల వ్యవహారం ఇప్పుడు కుదిపేస్తోంది. అసలు ప్రజలు అధిక వడ్డీలను ఎందుకు ఆశ్రయించాల్సి వస్తోంది? ప్రయివేట్ వడ్డీ వ్యాపారులు ఇంతగా జనాన్ని పీడించడానికి కారణం ఏమిటి? వడ్డీ వ్యాపారాల విషయంలో చట్టాలు ఏం చెబుతున్నాయి? ప్రయివేట్ వడ్డీ వ్యాపారం నిర్వహించాలంటే పాటించాల్సిన నియమ నిబంధనలేమిటి? ప్రయివేట్ ఫైనాన్స్ వ్యాపారుల బారి నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి వుంటుంది? తదితర అంశాంలపై టెన్ టివిలో జనపథంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సీఏ విజయవాడ చాప్టర్ మాజీ చైర్మన్ సీ టీ చౌదరి విశ్లేషించారు. 

06:50 - December 18, 2015

తెలుగు నేల మీద వడ్డీ వ్యాపారం పడగ విప్పింది. ప్రయివేట్ ఫైనాన్స్ దందా ఇక ఏమాత్రం భరించలేని స్థాయికి చేరింది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? వివిధ వర్గాల ప్రజలు ప్రయివేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎందుకొస్తోంది? విజయవాడ కేంద్రంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం వెలుగచూడడంతో ఉభయ తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కాల్ మనీ వ్యాపారులు తమను ఎలా పీడిస్తున్నారో, తమను ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారో, స్త్రీల జీవితాలతో ఎలా ఆటలాడుకుంటున్నారో బాధితులు చెబుతుంటే వళ్లు జలదరిస్తోంది. బెజవాడ కాల్ మనీ గ్యాంగ్ ల గురించి వింటుంటే మనం నాగరిక సమాజంలోనే జీవిస్తున్నామా? అన్న దిగ్భ్రాంతి కలుగుతోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అనుచరులు, వివిధ పార్టీలకు చెందిన చోటా మోటా రాజకీయ నాయకులు, కొన్ని చోట్ల పోలీస్ అధికారులు నడుపుతున్న ఫైనాన్స్ దందాలు వింటున్నా కొద్ది విస్తు గొలుపుతున్నాయి. అవసరార్ధం వచ్చిన సాటి మనుషులతో మరింత ఇంత క్రూరంగా వ్యవహరిస్తారా? అన్న ఆగ్రహం కలుగుతోంది. బెజవాడ కేంద్రంగా కాల్ మనీ పాపాలు బద్దలవ్వడంతో ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు, అరెస్టులు సాగుతున్నాయి.

ఉక్కిరిబిక్కిరవుతున్న వివిధ పార్టీలు..
ఈ వ్యవహారంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఒకరినొకరు కార్నర్ చేసుకునేందుకు , ఈ వ్యవహారం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు, తమవారిని రక్షించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు అందరికీ అర్ధమవుతూనే వున్నాయి.
ఒకటి మాత్రం నిజం తెలుగు నేల మీద వడ్డీ వ్యాపారం పడగ విప్పింది. ప్రయివేట్ ఫైనాన్స్ దందా ఇక ఏమాత్రం భరించలేని స్థాయికి చేరింది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, పిల్లల చదువుల ఫీజులు, వైద్య ఖర్చులు అత్యవసరంగా కట్టాల్సినవారు, చిన్న రైతులు, కౌలు రైతులు ప్రయివేట్ ఫైనాన్స్ వ్యాపారుల విష కౌగిలిలో చిక్కుకుని విలవిలాడిపోతున్న దృశ్యాలే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ దర్శనమిస్తున్నాయి. ప్రయివేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర రూపాయి అప్పు తీసుకుంటే పది రూపాయలు కట్టాల్సిన దుస్థితి అన్ని చోట్లా తాండవిస్తోంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? ప్రజలు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకోవడానికి బాధ్యులెవరు? మళ్లీ మళ్లీ ఇలాంటి ఘోరాలు, నేరాలు జరగకుండా వుండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కొంతమంది వడ్డీ వ్యాపారుల మీద దాడులు చేసి, ఆ పూటకు చేతికి దొరికినవారిని అరెస్టులు చేసి, ఇక మీరెవ్వరూ డబ్బులు తిరిగికట్టొదంటూ మంత్రులు, ముఖ్యమంత్రులు ధర్మోపదేశాలు చేస్తే ఈ దురాగతాలు ఆగుతాయా? ఇవన్నీ సీరియస్ గా చర్చించాల్సిన అవసరం వుంది.

అప్పు పుట్టని పరిస్థితి..
సామాన్యులకు, చేతివృత్తిదారులకీ, చిరు వ్యాపారులకీ, చిరుద్యోగులకీ ఇవాళ ప్రభుత్వ బ్యాంకుల్లో అప్పు పుట్టని పరిస్థితి. రైతు రుణమాఫీని చిత్తశుద్ధితో అమలు చేయని కారణంగా గత రెండేళ్లుగా ఉభయ రాష్ట్రాల్లోని అన్నదాతలకు ప్రభుత్వ బ్యాంక్ ల్లో అప్పు పుట్టడం లేదు. ఉభయ రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో వున్న కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. ప్రయివేట్ అప్పులు తప్ప మరో దిక్కులేని దురావస్థ. వ్యవసాయ రంగానికి ఇచ్చే అరకొర రుణాల్లో అధికభాగం అసలు వ్యవసాయమే చేయని పట్టణ బాబులే తన్నుకుపోతున్న దుస్థితి. రైతులకు దక్కాల్సిన వ్యవసాయ రుణాలు రియల్ ఎస్టేట్ , వడ్డీ వ్యాపారుల చేతుల్లోకి తరలివెళ్తున్నా కట్టడి చేయలేని దుర్భలత్వం ప్రభుత్వాలది.

ప్రభుత్వాలు చక్కదిద్దాలి..
ఇక పట్టణాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నవారిది మరో గాధ. ఠంచన్ గా ఒకటో తారీఖు జీతాలు అందుకోవడం మహాభాగ్యం. నాలుగైదు రోజుల పాటు జీతం ఆలస్యమైతే ఎక్కడో ఒక చోట అప్పులు చేయక, వాటికి రోజువారీ వడ్డీ కట్టక తప్పని దౌర్భాగ్యం చిరుద్యోగులది. ఇక మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో పనిచేసే వర్కర్లకి ఎప్పుడు జీతాలిస్తారో తెలవదు. అంగన్ వాడీలు, ఆశా వర్కర్లు, ఉపాధి హామీ ఇలాంటి స్కీముల్లో పనిచేసేవారికి నెలల తరబడి బిల్లులు చెల్లించరు. ఇలాంటి వారంతా అనివార్యంగా అప్పులు చేయాల్సి వస్తోంది. తీసుకున్నదానికి రెండింతలు, నాలిగింతలు వడ్డీలు కక్కాల్సి వస్తోంది. వేతనాల మీదే ఆధారపడి బతుకులీడుస్తున్నవారికి సక్రమంగా జీతాలు ఇవ్వాలన్న సోయి ప్రభుత్వాలకే లేకపోతే, ఇక ప్రయివేట్ యాజమాన్యాలకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి అస్తవ్యస్థ పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించకపోతే, బెజవాడ సెక్స్ రాకెట్ తరహా పాపాలు మరిన్ని చూడాల్సి వస్తుంది. 

06:44 - December 18, 2015

ఢిల్లీ : సిబిఐ దాడుల నేపథ్యంలో ఆప్‌ అరుణ్‌ జైట్లీల మధ్య వార్‌ కొనసాగుతోంది. గత 15 ఏళ్లుగా డిడిసిఏలో జరుగుతున్న అక్రమాల్లో అరుణ్‌జైట్లీ పాత్ర ఉందని ఆప్‌ ఆరోపించింది. జైట్లీ కనుసన్నలలో డిడిసిఏ కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని ధ్వజమెత్తింది. ఆర్థికమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఆప్‌ తనపై అభాండాలు వేస్తోందని అరుణ్‌జైట్లీ ఎదురుదాడికి దిగారు. ఢిల్లీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజేంద్రకుమార్‌ కార్యాలయంలో సిబిఐ దాడుల పట్ల సీరియస్‌గా ఉన్న ఆప్‌- ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని టార్గెట్‌ చేసింది. ఢిల్లీలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అరుణ్‌జైట్లీ హయాంలో డిడిసిఏలో జరిగిన అవినీతిని ఏకరువు పెట్టింది. గత 15 ఏళ్లుగా డిడిసిఏలో జరుగుతున్న అక్రమాల్లో అరుణ్‌జైట్లీ పాత్ర ఉందని స్పష్టం చేసింది. జైట్లీ కనుసన్నల్లో డిడిసిఏలో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించింది.

24 కోట్లు కేటాయిస్తే 114 కోట్లు ఖర్చు..
జైట్లీ హయాంలో డిడిసిఏ స్టేడియం నిర్మాణానికి 24 కోట్లు బడ్జెట్‌లో కేటాయించగా 114 కోట్లు ఖర్చు చేశారని, మిగతా 90 కోట్ల రూపాయలు ఎక్కడికెళ్లాయని ప్రశ్నించింది. కోటి 55 లక్షలు మూడు కంపెనీలకు చెల్లించారని, ఎందుకిచ్చారన్నది లెక్కలు లేవని ఆప్‌ తెలిపింది. పని లేకుండానే కొన్ని కంపెనీలకు డబ్బు చెల్లించారని ఆరోపించింది. సెలెక్షన్‌ కమిటీ, ఆటగాళ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని, కేవలం సంపన్నులకే స్థానం కల్పించారని, డిడిసిఏలో ఒక్క సామాన్యుడు కూడా లేదన్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన వినోదపు పన్ను కూడా డిడిసిఏ ఎగ్గొట్టిందని ఆప్‌ గుర్తు చేసింది. డిడిసిఏలో జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించిన నేపథ్యంలోనే కేజ్రీవాల్‌ కార్యాలయంలో సిబిఐ దాడులు జరిపిందని, దీని వెనక ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ హస్తం ఉందని ఆప్‌ ఆరోపించింది. అరుణ్‌జైట్లీ మంత్రి పదవికి రాజీనామా చేయాలని, ఆయనపై విచారణ జరిపించాలని ఆప్‌ డిమాండ్‌ చేసింది.

ఆరోపణలను తిప్పి కొట్టిన జైట్లీ..
తనపై ఆప్‌ చేసిన అవినీతి ఆరోపణలను అరుణ్‌ జైట్లీ తిప్పికొట్టారు. డిడిసిఏలో ఎలాంటి అవినీతి జరగలేదని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆప్‌ సర్కార్‌ ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. 40 వేల కెపాసిటీ కలిగిన డిడిసిఏ స్టేడియాన్ని 114 కోట్లతో పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీ ఈపీఐఎల్‌ నిర్మించిందని స్పష్టం చేశారు. డిడిసిఏకు సంబంధించి తాను ప్రతిపక్షంలో ఉండగానే యుపిఏ ప్రభుత్వం విచారణ జరిపి 2013లో క్లీన్‌చిట్‌ ఇచ్చిందని గుర్తు చేశారు. జైట్లీకి బిజెపి అండగా నిలిచింది. ఆప్‌ ఆరోపణలను డిడిసిఏ ఖండించింది.13 ఏళ్లు డిడిసిఏ అధ్యక్షుడిగా కొనసాగిన అరుణ్‌జైట్లీ సమయంలో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేసింది. 

06:42 - December 18, 2015

అరుణాచల్ ప్రదేశ్ : రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. బీజేపీతో చేతులు కలిపిన కాంగ్రెస్ అస్మతి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నబమ్‌ తుకీ దిగిపోవాలని కోరుతున్నారు. అసెంబ్లీలో తమకే బలం ఉందని చెబుతున్నారు. తమ వర్గం నేతగా కలిఖో పుల్‌ను ఎన్నుకున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవికి తుకీ రాజీనామా చేయకపోతే... ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని హెచ్చరిస్తున్నారు. అయితే నబమ్‌ తుకీ మాత్రం అసెంబ్లీలో తనకే బలం ఉందని వాదిస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ సీఎం నబమ్‌ తుకీ పదవీచ్యుతుడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలోని 60 మంది ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్‌కు చెందిన 21 మంది అసమ్మతివాదులు నబమ్‌ తుకీకి వ్యతిరేకంగా అసమ్మతిగళం విప్పారు. వీరంతా పదకొండు మంది బీజేపీ, ఇద్దరు ఇండిపెండెట్లతో చేతులు కలిపారు. తమకే బలం ఉన్న దృష్ట్యా ముఖ్యమంత్రి దిగిపోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వర్గానికి డిప్యూటీ స్పీకర్ కలిఖో పుల్‌ నాయకత్వం వహిస్తున్నారు.

తనకే బలం ఉందన్న నబమ్ తుకీ..
అయితే నబమ్‌ తుకీ మాత్రం అసెంబ్లీలో ఇప్పటికీ తనకే బలం ఉందన్న వాదాన్ని వినిపిస్తున్నారు. కాంగ్రెస్‌ శాసనసభ్యుల్లో 26 మంది తనకు మద్దతు ఇస్తున్నారని చెబుతున్నారు. 14 మంది మాత్రం అసమ్మతివాదులున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగేదిలేదంటున్నారు. రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన తనవాదనలు వినిపించారు. వ్యతిరేకవర్గాన్ని గుర్తించవద్దని కోరుతున్నారు. మరోవైపు నబమ్‌ తుకీని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ అసమ్మతి ఎమ్మెల్యేలు.... బీజేపీ శాసనసభ్యులతో కలిసి రాష్ట్ర గవర్నర్‌ జ్యోతిప్రసాద్‌ రజ్‌ఖోవాను కలిసి తమ వాదనలు వినిపించారు. అసెంబ్లీలో తమకే బలం ఉందంటూ ఎమ్మెల్యేల పేర్లతో లేఖ అందజేశారు. తుకీ ఆదేశాలతో అసెంబ్లీ అధికారులు అసెంబ్లీ భవానికి వేసిన తాళాలను తీయించి సభను సమావేశపచాలని కోరుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇస్తే గవర్నర్‌ నిర్దేశించిన సమయంలోగా బలం నిరూపించుకుంటామని కలిఖో పుల్‌ వర్గం ఎమ్మెల్యేలు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై అరుణాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ జ్యోతి ప్రసాద్‌ రజ్‌ఖోవా... న్యాయ, రాజ్యాంగ నిపుణులను సంప్రదిస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌ పరిణామాలపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఫిర్యాదు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర గవర్నర్‌ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారన్నది వీరి వాదన.

06:38 - December 18, 2015

మెదక్ : సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అయుత చండీ మహాయాగానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాగస్థలి అయిన కేసీఆర్‌ ఫాం హౌస్‌ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 40 ఎకరాల విస్తీర్ణంలో యాగశాల, హోమగుండాల నిర్మాణం పూర్తయింది. దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వేద బ్రాహ్మణులను ఆహ్వానించారు. అక్కడే వారందరికీ బస ఏర్పాట్లు చేశారు. అయుత చండీ యాగం ఏర్పాట్లపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. సీఎం కేసీఆర్‌ నిర్వహించనున్న ఆయుత చండీ మహాయాగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చండీయాగానికి, ఆయుత చండీయాగానికి తేడా ఏంటి అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. నిజానికి అయుతం అంటే పది వేలు. సహస్ర చండీయాగం కన్నా అయుత చండీయాగం పదిరెట్లు ఎక్కువగా చేసే మహా క్రతువు. సుమారు 12 టన్నుల పాయసంతో ఈ హోమం చేయాలి. 101 హోమగుండాలకు విడివిడిగా సంస్కారాలు చేసి ఒక్కో గుండం సమీపంలో 11 మంది రుత్వికులు కూర్చుని ఏకకాలంలో 1000 మంది రుత్వికులు ఈ దివ్యమైన సప్తశతి మంత్రాలను ఉచ్ఛరిస్తూ హోమం చేస్తుంటే, అన్ని హోమగుండాల్లో అగ్నిరూపాన్ని ధరించిన భగవతీ చండీదేవి పాయసాన్ని భక్షించి కరుణించి వరాలు కురిపిస్తుందని ప్రతీతి.

40 ఎకరాల్లో ఏర్పాట్లు...
ప్రస్తుతం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో 40 ఎకరాల విస్తీర్ణంలో అయుత చండీయాగం యాగస్థలిగా నిర్ణయించి ఏర్పాట్లు చేస్తున్నారు. 1500 మంది రుత్వికుల ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహించనున్నారు. శృంగేరీ పీఠం వేద పండితుల పర్యవేక్షణలో యాగం జరగనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కేసీఆర్ స్వయంగా ఆహ్వానించారు. అలాగే పలువురు ప్రముఖులతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఈ యాగానికి హాజరు అవుతారు. లోకకల్యాణం కోసం తలపెట్టిన ఈయాగం 23 నుంచి 27 వరకు శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీతీర్థ స్వామి, విధుశేఖరభారతీ మహాస్వామి మార్గదర్శనంలో జరగనుంది. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే 1500 మంది రుత్వికులతోపాటు ఒకేసారి నాలుగైదు వేల మంది బసచేసేలా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే భోజన ఏర్పాట్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక వంట సిబ్బందిని తీసుకువచ్చారు. ప్రముఖులు విచ్చేసేందుకు వ్యవసాయ క్షేత్రం సమీపంలోనే హెలిప్యాడ్ల నిర్మాణం కూడా జరిగింది. రోడ్ల నిర్మాణం సైతం పెద్ద ఎత్తున చేపట్టారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. యాగశాలకు సంబంధించిన నిర్మాణాలు సైతం పూర్తయ్యాయి. ప్రస్తుతం యాగశాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు.

06:33 - December 18, 2015

విజయవాడ : ఏపీలో కాల్ మనీ ముఠా మాయలో పడి ఎందరో బాధితులు మానప్రాణాలను కోల్పోతున్నారు. నాగరిక సమాజంలో మహిళలను, మద్య తరగతి కుటుంబాలను టార్గెట్ గా చేసుకుని సాగుతున్న కీచక దందాకు బలవుతున్న అమాయకులు ఇంకా ఎందరో ఉన్నారు. కాల్ మనీ ముఠాల కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఎందరో బాధితులు వారి నుంచి బయటపడలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ ఆటో డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

వ్యాపారిపై కేసు..
ఒంగోలు లోని కేశవరాజుకుంటకు చెందిన ఆటో డ్రైవర్ నాగరాజు సురేష్‌ అనే వ్యాపారి నుండి ఆటో కొనుగోలు చేశాడు. అయితే తీసుకున్న అప్పుకు కిస్తీ సరిగా కట్టడంలేదంటూ ఫైనాన్స్ వ్యాపారి దాడికి దిగాడు. బతుకుదెరువు అయిన ఆటోని లాక్కెళ్లడంతో మనస్థాపానికి గురైన నాగరాజు ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో సురేష్ బాధితులంతా రిమ్స్ కు చేరుకున్నారు. నాగరాజు కుటుంబసభ్యుల నుంచి పోలీసులు వివరాలు తెలుసుకుని సురేష్ పై కేసు నమోదు చేశారు.

ప్రజలపై శద్ధ లేదన్న బృందా కారత్..
మరోవైపు కర్నూలు జిల్లాలో వడ్డీవ్యాపారి బస్వరాజ్ కుమార్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. రాముడు అనే వ్యక్తి వద్ద నుంచి బలవంతంగా వసూలు చేసుకున్న పొలం కాగితాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ సోదాలలో 2 కోట్ల మేర విలువైన పత్రాలు అభ్యమయినట్లు ఎస్ ఐ శంకరయ్య తెలిపాడు. కాల్‌మనీ వ్యవహారంలో ఏపీ సర్కార్‌ ఏం చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ప్రశ్నించారు. తక్కువ వడ్డీలకు రుణాలు ఇవ్వకపోవడం వల్లే ప్రస్తుతం ఏపీలో కాల్ మనీ దందాలకు తెరదీసిందన్నారు. రాజధానిపై ఉన్న శ్రద్ద ప్రజలపై లేదని ఆమె ఎద్దేవా చేశారు. దందాలో టీడీపీ నేతలు సైతం ఉండడం సిగ్గుచేటన్నారు బృందా కరత్. రాష్ట్రంలో ఇప్పటి వరకు మనం చూసిన ఘటనలు ఉదాహరణలు మాత్రమే. కాల్ మనీ దందాలో వెలుగులోకి వచ్చిన ఘటనలు కొన్నైతే.. వెలుగులోకి రాక రాబందుల కబంద హస్తాల్లో చిక్కుకున్నవారు కోకొల్లలు. ఈ దందాలకు ప్రభుత్వం ఇప్పటికైనా బ్రేక్ వేయాలని జనం కోరుతున్నారు.

06:26 - December 18, 2015

విశాఖపట్టణం : కాల్ మనీలో ఇంతకాలంగా కోట్లకు పడగలెత్తిన రాబందుల డొంకలు ఒక్కొక్కటిగా కదులుతున్నాయి. ఇప్పటివరకు అత్యధికంగా విజయవాడ గుంటూరులో మాత్రమే చూసిన దందా విశాఖ జిల్లాలోనూ బయటపడింది. విశాఖ నగరంలో పోలీసులు ఇప్పటివరకు 20 మంది ఫైనాన్స్ వ్యాపారులపై దాడులు చేసి కేవలం ఐదుగురిని మాత్రమే అరెస్ట్ చేసారు. వారి వద్ద నుంచి 200 కు పైగా ప్రామిసరీ నోట్లు, బ్లాంక్‌ చెక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాధితులకోసం 1090 టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా విడుదల చేసింది ప్రభుత్వం. కాల్ మనీ ఉదంతంపై విశాఖలో పలు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. సొమ్మును రికవరీ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.

అనకాపల్లిలో కోట్ల వ్యాపారం..
ఫైనాన్స్ వ్యాపారమంటే పెట్టింది పేరు అనకాపల్లి. అనకాపల్లి కి చెందిన వందలాది మంది తెల్లారితే విశాఖ నగరానికి వచ్చి ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటారు. ఈ బిజినెస్ కోట్లలో జరుగుతోంది. టీడీపీ సహా అన్ని పార్టీల నేతలు ఇందులో భాగస్వాములే. అనకాపల్లి, ఆరిలోవ, గాజువాక ప్రాంతాలతోపాటు అనపర్తి, కాకినాడ నుంచి వచ్చిన ఫైనాన్స్ వ్యాపారుల దందాలపై పోలీసు చర్యలు శూన్యం అని పలు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరించడంలోనూ పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని వెంటనే మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ జిల్లాలో కాల్ మనీ దందాపై పోలీసులు దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా జిల్లాలోని కొన్ని ఏరియాల్లో దందా కొనసాగుతూనే ఉంది. పోలీసులు దాడులను ముమ్మరం చేసి కాల్‌మనీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని స్థానికులు కోరుతున్నారు. 

06:23 - December 18, 2015

విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సష్టిస్తున్నకాల్ మనీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అధికార పార్టీ నేతలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కాల్ మనీ వ్యాపారులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలుతోంది. మరో వైపు విపక్ష నేతలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేసి న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏసీపీ ప్రకాశ్ బాబు ఆధ్వర్యంలో ఫిర్యాదులు వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలో 50 మంది పైన కేసులు నమోదయ్యాయి. టీడీపీ ఎంఎల్సీ బుద్దా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వరరావు , ఎంఎల్ఏ బోడె ప్రసాద్ అనుచరుడు శ్రీకాంత్, మరో ఎంఎల్సీ యలమంచిలి రాజేంద్రప్రసాద్ అనుచరుడు నాగరాజుపై కేసులు నమోదయ్యాయి.

నేతల అనచరులు...
వీరే కాకుండా మాజీ ఎంఎల్ ఏ వంగవీటి రత్న కుమారి సోదరుడు చెన్నుపాటి శ్రీనివాసరావు, వంగవీటి శంతన్ కుమార్ అనుచరుడు గుడివాడ దాము, చంద్రబాబుకు ఆప్తుడుగా చెప్పుకుంటూ విచ్చలవిడిగా వడ్డీ వ్యాపారం నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగి ఎలక్ట్రికల్ డీఈ సత్యానందంపైనా కేసులు నమోదయ్యాయి. అలాగే కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీల నేతలు కాల్ మనీ కేసులో నిందితులుగా ఉన్నారని పోలీసులు లిస్టు విడుదల చేశారు. బాధిత కుటుంబాలను ముప్పు తిప్పలు పెడుతున్న కాల్ ముఠాల సభ్యుల కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ప్రత్యేక చట్టం తేవాలన్న ప్రతిపక్షాలు..
ప్రతిపక్ష నేతలు సీపీఐ , సీపీఎం పార్టీలు, ప్రజాసంఘాలు కాల్ మనీ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేస్తున్నాయి. పోలీసులు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. వడ్డీవ్యాపారుల బారినపడి ఆస్తులు కోల్పోయిన వారు పెద్ద ఎత్తున పోలీస్ సెల్ కు చేరుకుని కమిషనర్‌కు విజ్ఞాపనా పత్రాలు అందజేస్తున్నారు. అవనిగడ్డ , గుడివాడ , కైకలూరు నుంచి బాధితులు ఎక్కవగా వస్తుండడంతో ఆ ఏరియాల్లో పోలీసులు సోదాలు చేపట్టారు. ఇలా బాధితుల నుంచి వివరాలు సేకరించి వ్యూహం ప్రకారం కాల్ నాగులను పట్టుకునేందుకు పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసి వడ్డీ వ్యాపారులను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని వామపక్షాలు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. బాధితులకు పోలీసులు భరోసా కల్పిస్తుండడంతో కమినరేట్ కు వస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒకరిది 10 రూపాయల వడ్డీ అయితే మరోకరిది 20 రూపాయల వడ్డీ, వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్న కాల్‌మనీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

06:20 - December 18, 2015

హైదరాబాద్ : కాల్‌ మనీ వ్యవహారంపై నేడు అసెంబ్లీలో అనుసరించాలన్సిన వ్యూహాన్ని అధికార, ప్రతిపక్షాలు సిద్ధం చేసుకున్నాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభలో ప్రకటన చేయడానికి సిద్ధమైన తరుణంలో... దీనిపై సుదీర్ఘ చర్చకు వైసీపీ సిద్ధమయ్యింది. చర్చ సందర్భంగా వైసీపీ సభా కార్యక్రమాలను అడ్డుకుంటే.... ప్రతిపక్షాన్ని సస్పెండ్‌ చేసైనా సభా కార్యక్రమాలు నిర్వహించాలని టీడీఎల్‌పీ నిర్ణయించింది. కాల్‌ మనీ వ్యవహారం శుక్రవారం కూడా అసెంబ్లీని కుదిపేసే అవకాశం ఉంది. గురువారం అధికారపక్షం అంబేద్కర్‌పై చర్చకు సిద్ధమైన సమయంలో వైసీపీసభ్యులు కాల్‌ మనీ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై చర్చకు పట్టుపట్టడంతో సభా కార్యక్రమాలు స్తంభించి, వాయిదాల పర్వం కొనసాగింది. దీంతో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు వైసీపీ వ్యతిరేకమన్న ప్రచారాన్ని టీడీపీ ప్రారంభించింది. దీంతో తేరుకున్న వైసీపీ నాయకులు శుక్రవారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించింది. అంబేద్కర్‌కు అసెంబ్లీలో గంట సమయం కేటాయించిన అధికార పక్ష వైఖరి తప్పుపట్టిన వైసీపీ.. రెండు లేదా మూడు రోజులు చర్చ జరపాలన్న డిమాండ్‌ను ముందుకు తెల్చింది.

దిష్టిబొమ్మల దహనం..
మరోవైపు అంబేద్కర్‌పై చర్చించిన తర్వాతే కాల్‌ మనీ వ్యవహారాన్ని చర్చించాలని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్‌పీ నిర్ణయించింది. దీనికి వైసీపీ సభ్యులు అడ్డుపడి అసెంబ్లీ కార్యకలాపాలను స్తంభింపచేస్తే, ప్రతిపక్షాన్ని సస్పెండ్‌ చేసైనా .. అంబేద్కర్‌పై చర్చ కొనసాగించాలని తీర్మానించారు. ఏ అంశంపైననైనా ప్రతిపక్షం చేసే ఆరోపణలను తిప్పికొట్టేందుకు ధీటుగా స్పందించాలని టీడీపీఎల్‌పీ నిర్ణయించింది. వైసీపీ అంబేద్కర్‌పై చర్చను అడ్డుకోవడంతో ఆ పార్టీ రాజ్యాంగ నిర్మాతకు వ్యతిరేకన్న ప్రచారాన్ని ప్రారంభించిన టీడీపీ శుక్రవారం... జగన్ దిష్టిబొమ్మల దహానికి సిద్ధమయ్యింది. దీనికి ప్రతిగా వైసీపీ కూడా చంద్రబాబు దిష్టిబొమ్మల దహానికి పిలుపు ఇచ్చింది.  

06:18 - December 18, 2015

హైదరాబాద్ : రాష్ట్రప‌తి ప్రణబ్‌ ముఖ‌ర్జీ నేటి నుంచి ఈనెల 31వ తేదీ వ‌ర‌కు హైదరాబాద్‌లో గడపనున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ బస చేస్తారు. ఈ 14 రోజుల్లో ప్రణబ్‌ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. డిసెంబ‌ర్ 19న సికింద్రాబాద్‌లోని మిలిట‌రీ కాలేజ్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ మెకానిక‌ల్ ఇంజినీరింగ్ స్నాత‌కోత్సవంలో రాష్ట్రప‌తి పాల్గొంటారు. డిసెంబ‌ర్ 22-23 తేదీల‌లో కర్ణాటకలో పర్యటిస్తారు. డిసెంబర్ 22న క‌ర్ణాట‌క కేంద్రీయ విశ్వ విద్యాల‌యం రెండ‌వ స్నాత‌కోత్సవంలో ప్రణబ్‌ పాల్గొంటారు. అదే రోజు బెంగ‌ళూరులో ఆధునికీక‌రించిన నిమ్ హాన్స్ భ‌వంతిని ప్రారంభిస్తారు. అలాగే, నిమ్ హాన్స్‌ను జాతీయ ప్రాముఖ్యత గ‌ల సంస్థగా జాతికి అంకితం చేస్తారు. డిసెంబ‌ర్ 23వ తేదీన బిష‌ప్ కాట‌న్ బాలుర పాఠ‌శాల 150వ వార్షికోత్సవంలో రాష్ట్రప‌తి పాల్గొంటారు. అలాగే బెంగ‌ళూరులో కిద్వాయి మెమోరియ‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంకాల‌జీ ప్రాంగ‌ణంలో రాష్ట్ర క్యాన్సర్‌ సంస్థ నిర్మాణానికి శంకుస్థాప‌న చేస్తారు.

డిసెంబర్ 31న ఢిల్లీ ప్రయాణం..
డిసెంబ‌ర్ 25న ఆంధ్రప్రదేశ్‌లోని ఐ.భీమ‌వ‌రంలో తిరుమ‌ల‌-తిరుప‌తి దేవ‌స్థానం వేద పాఠ‌శాల‌ను ప్రణబ్‌ ప్రారంభిస్తారు. డిసెంబ‌ర్ 27వ తేదీన హైద‌రాబాద్‌లోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ రాష్ట్ర వ్యవ‌సాయ విశ్వవిద్యాల‌యంలో జ‌రిగే ఇండియ‌న్ ఎక‌నామిక్ అసోసియేష‌న్ వార్షిక స‌ద‌స్సులో ప్రారంభోప‌న్యాసం చేస్తారు. అదే రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెద‌క్ జిల్లా ఎర్రవ‌ల్లి గ్రామంలో నిర్వహించే అయుత చండీ మ‌హాయాగం పూర్ణాహుతి కార్యక్రమంలో ప్రణబ్‌ పాల్గొంటారు. రాష్ట్రప‌తి గౌర‌వార్థం డిసెంబ‌ర్ 29వ తేదీన తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల గ‌వ‌ర్నర్‌ ఈ.ఎస్‌.ఎల్‌.న‌ర‌సింహ‌న్ విందును ఏర్పాటుచేస్తారు. రాష్ట్రప‌తి డిసెంబ‌ర్ 30వ తేదీన రాష్ట్ర ప్రముఖులు, మంత్రులు, అధికారులు, జ‌ర్నస్టులు, తదితరుల కోసం రాష్ట్రప‌తి నిల‌యంలో విందును ఏర్పాటు చేస్తారు. డిసెంబర్‌ 31న రాష్ట్రపతి తిరిగి ఢిల్లీ ప్రయాణం అవుతారు.

ప్రభుత్వాసుపత్రిలో పసికందు తారుమారు వివాదం...

కర్నూలు : ప్రభుత్వాసుపత్రిలో పసికందు తారుమారైంది. మగశిశువు పుడితే ఆడశిశువు ఇచ్చారని ఆసుపత్రి వద్ద సరోజిని అనే మహిళ బంధువుల ఆందోళన చేశారు. సరోజకు ఆడశిశువు పుట్టిందని వైద్యులు పేర్కొంటున్నారు. ఆడశిశువుకు మగశిశువు ట్యాగ్ వేయడంతో గందరగోళం రేగింది. 

నేడు కర్నూలులో కారత్ పర్యటన..

కర్నూలు : సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ జిల్లాలో పర్యటించనున్నారు. ఓర్వకల్లు (మం) శెకునాల గ్రామంలో సోలార్ పవర్ ప్లాంటులో భూములు కోల్పోతున్న రైతులకు కారత్ పరామర్శించనున్నారు. మధ్యాహ్నం కర్నూలులో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను కారత్ కలువనున్నారు. 

నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి..

హైదరాబాద్ : దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ లో పన్నెండు రోజుల పాటు బస చేస్తారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుండి ఉదయం 11.30గంటలకు బయలుదేరి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు.

 

నేడు మెట్రోలో మంత్రుల ప్రయాణం..

హైదరాబాద్ : నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలులో శుక్రవారం మంత్రుల బృందం ప్రయాణించనుంది. ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ, పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మెట్టుగూడ నుండి ఉప్పల్ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణిస్తారు. 

నేడు హైదరాబాద్ కు కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి..

హైదరాబాద్ : కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి పీకే మల్హోత్ర శుక్రవారం హైదరాబాద్ కు రానున్నారు. రెండు రోజుల పర్యటన కోసం ఆయన శుక్రవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకుంటారు. 

నేటి నుండి గుజరాత్ లో డీజీపీ, ఐజీల మహాసభ..

అహ్మదాబాద్ : గుజరాత్ లోని కచ్ ల ఈ నెల 18 నుండి 20 వరకు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్వహిస్తున్న 50వ అఖిల భారత డీజీపీ, ఐజీల మహాసభలో ప్రధాని మోడీ పాల్గొనున్నారు. 

సరళీకృత అనుమతులపై నేడు సమావేశం..

హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త సంస్థళు, పరిశ్రమలను ఏర్పాటు చేసే క్రమంలో అనుమతుల్లో జాప్యాన్ని నివారించడం ఎలా అనే అంశంపై శుక్రవారం ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగనుంది. 

టీఎస్పీఎస్సీకి ఏడాది పూర్తి..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) విజయవంతంగా తొలి ఏడాదిని పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించనున్న సంబురాలకు ముఖ్యఅతిథిగా లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డి హాజరు కానున్నారు. 

Don't Miss